Activities calendar

19 December 2015

21:32 - December 19, 2015

కృష్ణా : విజయవాడలో వీఆర్‌ఏలో ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. నిరాహారదీక్షలో ఉన్న ముగ్గురు వీఆర్‌ఏలను పోలీసులు అరెస్ట్‌ చేసి దీక్ష భగ్నం చేయడంతో.. అందరూ రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలియచేశారు. మోకాళ్లపైనే రోడ్డుపై ఆందోళన చేశారు. ప్రభుత్వానికి ఏ పని కావాలన్నా.. కిందిస్థాయిలో తిరగాల్సిందే తామేనని.. అలాంటిది తమపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు మండిపడుతున్నారు. జీతాలు పెంచేవరకు పోరాడతామని వారు స్పష్టం చేస్తున్నారు.

21:30 - December 19, 2015

ఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. సోనియా, రాహుల్‌కు పాటియాలా హౌజ్‌ కోర్టు బెయిలు మంజూరు చేసింది. చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, నిజాలు బయటకు వస్తాయన్న ధీమాను సోనియాగాంధీ వ్యక్తం చేశారు. ప్రత్యర్థులను కేంద్రం టార్గెట్‌ చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు సందర్భంగా పటియాలా హౌజ్‌ కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కోర్టుకు హాజరైన సోనియా, రాహుల్....

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో భాగంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టుకు మధ్యాహ్నం 3 గంటలకు హాజరయ్యారు.

బెయిలు మంజూరు....

సోనియా, రాహుల్‌కు పటియాలా హౌజ్‌ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో సోనియా, రాహుల్‌తో పాటు మోతిలాల్‌ వోరా, ఆస్కార్‌ ఫర్నాండెజ్‌, సుమన్‌ దూబేతో పాటు మొత్తం ఏడుగురికి 50 వేల పూచికత్తుపై కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. సోనియా గాంధీకి ఆంటోనీ, రాహుల్‌గాంధీకి ప్రియాంక పూచికత్తు ఇచ్చారు.

10 నిమిషాలు మాత్రమే...

సోనియా, రాహుల్‌ పటియాలా హౌజ్‌ కోర్టులో కేవలం 10 నిముషాలు మాత్రమే ఉన్నారు. కోర్టులో 5 నిముషాల పాటు వాదనలు కొనసాగిన అనంతరం న్యాయమూర్తి వారికి బెయిలు మంజూరు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 20 మధ్యాహ్నం 2 గంటలకి కోర్టు వాయిదా వేసింది. సోనియా, రాహుల్‌ తరపున కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబ్బల్‌ వాదించారు.

బెయిల్ ను వ్యతిరేకించిన సుబ్రమణ్యస్వామి...

సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు బెయిల్‌ ఇవ్వడాన్ని బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి వ్యతిరేకించారు. నేషనల్‌ హెరాల్డ్‌కు చెందిన ఐదు వేల కోట్ల ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ సుబ్రహ్మణ్యస్వామి సోనియా, రాహుల్‌ గాంధీతో పాటు ఏడుగురు కాంగ్రెస్‌ నేతలపై కేసు నమోదు చేశారు.

కేంద్రం పై ధ్వజమెత్తిన సోనియా...

కేంద్రం తమ ప్రత్యర్థులను టార్గెట్‌ చేయడానికి ప్రభుత్వ సంస్థలను ఉసిగొల్పుతోందని సోనియా ధ్వజమెత్తారు. ఇలాంటి బెదిరింపులకు తాము లొంగేది లేదని, తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టంపై తనకు పూర్తి నమ్మకముందని...ఈ కేసులో నిజాలు బయటకు వస్తాయన్న నమ్మకాన్ని సోనియా వ్యక్తం చేశారు.

తాను చట్టాన్ని గౌరవిస్తానని చెపుతూనే...

తాను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పిన రాహుల్‌ గాంధీ- తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్షాలను లొంగదీసుకోవాలని మోది భావిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరికి లొంగే ప్రసక్తే లేదని, పేదల కోసం కాంగ్రెస్‌ పనిచేస్తుందని, ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వహించడంలో ఒక్క ఇంచ్‌ కూడా వెనక్కి తగ్గేది లేదని రాహుల్‌ స్పష్టం చేశారు.

మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలు...

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణలో భాగంగా సోనియా, రాహుల్‌గాంధీలకు మద్దతుగా కాంగ్రెస్‌ నాయకగణం భారీగా తరలివచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, మల్లికార్జున ఖర్గే, సోనియా కుమార్తె ప్రియాంకగాంధీ, రాబర్ట్‌ వాద్రా సహా పలువురు నేతలు కోర్టుకు వచ్చారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణ సందర్భంగా పటియాలా హౌజ్‌ కోర్టు వద్ద 6 వందల మంది బలగాలతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

1938 సెప్టెంబర్‌ 9న లక్నోలో ప్రారంభం ...

మన దేశానికి తొలి ప్రధానిగా పని చేసిన నెహ్రూ మాసన పుత్రిక నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక. 1938 సెప్టెంబర్‌ 9న లక్నోలో ఏర్పాటయ్యింది. స్వాతంత్ర్యసమరోద్యమంలో అక్షరాన్ని ఆయుధంగా మలచిన పత్రిక ఇది. తెలుగువారైన కే రామారావు నుంచి మణికొండ చలపతిరావు వరకు ఎందరో మహామహులు ఈ పత్రికకు సంపాదకులుగా పని చేశారు. 1946 నుంచి 1978 వరకు చలపతిరావు ఆధ్వర్యంలోనే నేషనల్‌ హెరాల్డ్‌ నడిచింది. అసోసియేటెడ్‌ జర్నల్‌ లిమిటెడ్‌ ఈ పత్రికను చాలా కాలం నిర్వహించింది. ఏజేఎల్‌కు దేశవ్యాప్తంగాత ఖరీదైన ప్రాంతాల్లో భారీ ఆస్తులున్నాయి.

1977 నుంచి రెండేళ్లు మూత .....

అత్యవసర పరిస్థితి తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిగాంధీ ఓటమితో నేషనల్‌ హెరాల్డ్‌కు కష్టాలు మొదలయ్యాయి. రెండేళ్లు మూతపడింది. ఆ తర్వాత మళ్లీ పునఃప్రారంభమయ్యింది. 1986లో మళ్లీ మూతపడింది. రాజీవ్‌గాంధీ జోక్యంతో మళ్లీ 1987లో తెరుచుకుంది. అప్పులు పేరుకుపోయిన పత్రిక ఆస్తులు వేలంకు రావడంతో1988లో లక్నో మూతపడింది. మళ్లీ తెరుచుకుంది. 2008 జనవరిలో ఢిల్లీ ఎడిషన్‌ను మూతేయాలన్న ఆలోచన వచ్చింది. 2008 ఏప్రిల్‌ 1న మూతపడింది.

2010 నవంబర్‌లో యంగ్‌ ఇండియా .....

నేషనల్‌ హెరాల్డ్‌కు భారీగా ఆస్తులు ఉండటంతో కాంగ్రెస్‌ నాయకులు దీనిని పునఃరిద్ధరించాలనుకున్నారు. రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో 2010 నవంబర్‌లో యంగ్‌ ఇండియా కంపెనీ ఏర్పాటు చేశారు. 2011 నవంబర్‌ 14 నుంచి ప్రచురణ పునరుద్ధరించాలనుకున్నారు. కానీ వెలుగుచూడలేదు. పత్రిక ఆస్తులను కొట్టేసేందుకే కాంగ్రెస్‌ నాయకులు యంగ్‌ ఇండియా కంపెనీ ఏర్పాటు చేశార్నది బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వాదన. నేషనల్‌ హెరాల్డ్‌ పునరుద్ధరణకు 50 లక్షల రూపాయల రుణమిచ్చి, 90.25 కోట్ల రూపాయలకు ఆదాయపన్ను మినహాయింపు పొందడం వెనుక పెద్ద కుంభకోణం ఉందంటూ 2012 నవంబర్‌ 1న కేసు వేశారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ అధినాయకుల మెడకు చుట్టుకుంది.

ఆస్తుల విలువ రూ. 5 వేల కోట్లు .....

నేషనల్ హెరాల్డ్‌కు ఉన్న ఆస్తులపై భిన్న కథనాలు ఉన్నాయి. ఆస్తుల విలువ ఐదువేల కోట్ల రూపాయలని కొందరు, రెండు వేల కోట్ల రూపాయలని మరికొందరు వాదిస్తున్నారు. పదహారు వందల కోట్లని మరికొందరు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌తోపాటు ఇతర కాంగ్రెస్‌ నాయకులు శనివారం కోర్టు హాజరై బెయిల్‌ తీసుకున్నారు. కోర్టు హాజరీ నుంచి మినహాయింపు పొందేందుకు ముందుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇందుకు నిరాకరించడంతో కోర్టుకు హాజరుకాకతప్పలేదు. 

21:22 - December 19, 2015

హైదరాబాద్ : తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో మెప్పించి మురిపించిన విశిష్ట నటుడు రంగనాథ్ ఇక లేరు. 300పైగా సినిమాల్లో, పలు సీరియల్స్‌లో రకరకాల పాత్రలు పోషించిన రంగనాథ్‌ చరమాంకం విషాదంతోనే ముగిసింది. అద్వితీయ నటనతో విశిష్ట పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రంగనాథ్ 66 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఆయనది బలవన్మరణం అని తెలిశాక యావత్ సినీ రంగం ఉలిక్కిపడింది. హైదరాబాద్‌లోని కవాడిగూడలో నివాసముంటున్న రంగనాథ్‌ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చాలాకాలం క్రితమే భార్యను కోల్పోయిన ఈ నటధీరుడు ఒంటరితనంతో బాధపడుతున్నాడు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నా వారెవరూ ఆయన మదిలోయల్లో గూడుకట్టుకున్న బాధను దూరం చేయలేకపోయారు. బాధతో కుమిలిపోతున్న తనను వృద్ధాప్య దశలో అక్కున నిలిచి ఓదార్చేవారు లేకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. రంగనాథ్ మృతితో సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఒక అద్భుత నటుడిని కోల్పోయామని సహచరులు అన్నారు.

పాత్రను పోషించినా .....

ఓ గంభీర స్వరం మూగబోయింది. తెలుగు సినీ రంగం మరో తారను కోల్పోయింది. హీరోగా, తండ్రిగా, విలన్‌గా ఇలా ఏ పాత్రను పోషించినా అందులో తిరుగులేని నటనను కనబరిచి యావత్‌ సినీ ప్రేక్షకులను అలరించిన రంగనాథ్ మనకిక లేరు. 300లకు పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఖ్యాతిని లిఖించుకున్న విలక్షణ నటుడు రంగనాథ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

ప్రతిసినిమాలోనూ విలక్షణత చూపించిన....

కథానాయికల పక్కన స్టెప్పులు వేశాడు విలన్‌గా హీరోలతో సై అంటే సై అన్నాడు. వీరోచిత పోరాటాలు చేశాడు. వేసిన ప్రతి పాత్రలోనూ తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. నటించిన ప్రతిసినిమాలోనూ విలక్షణత చూపించిన రంగనాథ్‌ మనకికలేరు.

1949లో మద్రాస్ లో జననం....

రంగనాథ్ 1949లో జన్మించారు. పూర్తిపేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. తిరుపతి వెంకటేశ్వరా యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం రైల్వే టిసిగా పనిచేశారు. ఈ క్రమంలోనే రంగనాథ్‌ తన ఇరవై ఏళ్ల వయసులో1969లో బుద్ధిమంతుడు మూవీతో సినీరంగంలోకి ఆరంగేట్రం చేశాడు. చందన సినిమాతో హీరో అయ్యాడు. జమిందార్‌గారి అమ్మాయి, దేవతలారా దీవించండి, పంతులమ్మ, ఇంటిటి రామాయణం, అమెరికా అమ్మాయి, అందమే ఆనందం తదితర చిత్రాల్లో చక్కటి నటన ప్రదర్శించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

సీరియల్స్‌లోనూ .....

సీరియల్స్‌లోనూ యాక్ట్‌ చేసి రంగనాథ్ బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. తొలుత హీరోగా నటించినా తర్వాతర్వాత కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ తన ప్రతిభను ప్రదర్శించారు. 300కు పైగా సినిమాల్లో అద్భుత నటనను ప్రదర్శించి ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇలాంటి విలక్షణ నటుడు నట జీవితానికి స్వస్తిపలికి ఇక వెళ్లొస్తానంటూ అందర్నీ విడిచి వెళ్లిపోయాడు.  రంగనాథ్ కన్నుమూయడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ విషాదఛాయలు అలుముకున్నాయి. టాలీవుడ్‌ గొప్ప నటుడిని కోల్పోయిందని పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. 

రహస్య ప్రదేశానికి నిర్భయ నేరస్ఢుడు

ఢిల్లీ: సభ్య సమాజం తలదించుకునేలా, యావత్ భారతదేశమే ఉలిక్కిపడేలా చేసిన ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటనలో నిందితుడు, బాలనేరస్థుడు జువైనల్ హోం నుంచి నేడు విడుదలైయ్యాడు. విడుదల అనంతరం అతడిని పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. 16డిసెంబర్, 2012న ఢిల్లీలో కదులుతున్న బస్సులో దారుణ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. జ్యోతిసింగ్ అనే మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం జరిపి అతిదారుణంగా హింసించి గాయపరిచారు. బాధితురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే.

ఉత్తరాఖండ్ లో స్వల్ప భూకంపం

హైదరాబాద్ : ఉత్తరాఖండ్ లోని కొన్ని జిల్లాల్లో శనివారం స్వల్ప భూకంపం సంభవించింది. భూకపం తీవ్రవ 5.4 గా నమోదైంది. భారత్ - నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భూకపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

20:36 - December 19, 2015

ప్రతీ వారంలాగే మల్లన్న 'రచ్చబండ' మీదికి వచ్చిండు. ఈ వారం మాత్రం ముచ్చట్లు పంచుకునేందుకు 'మల్లన్న రచ్చ బండ'కు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వచ్చారు.
పొన్నాల జీవితంలో జరిగిన విశేషాలు.. ఒడిదుడుకులు.. తన రాజకీయ ప్రస్థానంతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైనా విషయాల్ని వెల్లడించారు. తను గ్రంథాలయంలో రూపాయి జీతానికి పని చేసినప్పటి పరిస్థితులను చెప్పుకొచ్చారు.  1963లో ఉస్మానియా యూనివర్శిటీ తన ఇంజనీరింగ్ విద్య గురించి.. అమెరికాలో ఎంఎస్ (మెకానికల్ ఇంజనీరింగ్) విశేషాల్ని మల్లన్న రచ్చబండలో ప్రేక్షకులతో పంచుకున్నారు. అమెరికాలో ఎయిర్ ఫోర్స్ లో పని చేసిన గుర్తులను మరోసారి నెమరు వేసుకున్నారు. ఆ తర్వాత 9 సంవత్సరాలకు మరళా భారత్ కు వచ్చి రాజకీయాల్లో చేరిన పరిస్థితులను ఆసక్తిగా వివరించారు. తదనంతరం ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా పని చేస్తున్నప్పుడు రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడరు.
తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి గురించి.. సీఎం క్యాండేట్ల గురించి.. 1992లోనే తను ఇబ్బందులు పడి తెలంగాణ కోసం చేసిన కృషి గురించి.. ప్రొఫెసర్ జయశంకర్ తో తన సాన్నిహిత్యం గురించి విస్మయం కలిగించే విషయాల్ని వెల్లడించారు. ఇవన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియోలో చూడండి. 

5కిలోల బంగారం స్వాధీనం...

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుండి వచ్చిన రెండు విమానాల్లో 5 కిలోల బంగారాన్ని ప్రయాణీకులు వదిలి వెళ్లారు. 

నర్మదా ఆసుపత్రిలో రంగనాథ్ మృతదేహం

హైదరాబాద్ : ప్రముఖ సీనియర్ నటుడు రంగనాథ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. కవాడీగూడలో తన స్వగృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహం గాంధీనగర్ లోని నర్మదా ఆసుత్రిలో ఐసీయూలో ఉంచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను శోధిస్తున్నారు.

దళితులను ట్రాక్టర్ తో ఢీ కొట్టించిన భూస్వామి

నెల్లూరు : మనుబోలు మండలం కుడిపిపల్లిలో ప్రభుత్వ భూమిని వేమారెడ్డి శ్రీధర్ రెడ్డి అనే భూస్వామి ఆక్రమించుకున్నాడు. దాన్ని వ్యతిరేకించిన దళితులను ట్రాక్టర్ తో ఢీ కొట్టించాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయలు అయ్యాయి. క్షతగాత్రులును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిని సీపీఎం నేతలు చండ్రా రాజగోపాల్, జక్కావెంకయ్యలు పరామర్శించారు.

కరీంనగర్ జిల్లాను నంబర్ వన్ గా చేస్తాం: కేటీఆర్

 

కరీంనగర్ : 50 ఏళ్లలో చేయని అభివృద్ధిని… ఐదేళ్లలో చేసి చూపుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడ పరిధిలో లక్ష ఎకరాలకు నీరందిస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లాను నంబర్ వన్ గా తయారు చేస్తామన్నారు. త్వరలో రైతులకు పగటిపూట విద్యుత్ అందిస్తామన్నారు.

రంగనాథ్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.

19:22 - December 19, 2015

హైదరాబాద్: : ప్రముఖ నటుడు రంగనాథ్ అనుమానాస్పద(66) మృతి చెందారు. కవాడీగూడలోని ఆయన నివాసంలో రంగనాథ్ మరణించారు. రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రంగనాథ్ మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దాదాపు 300 లకు పైగా సినిమాల్లో రంగనాథ్ విభిన్న పాత్రలు పోషించి అందిరి అభిమానాన్ని చురగొన్నారు. 1949వ సంవత్సరంలో మద్రాస్ లో జన్మించారు. రంగనాథ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు రైల్వేలో టీసీగా పని చేశారు. రంగనాథ్ తొలి సినిమా 1969లో విడుదలైన బుద్ధిమంతుడుతో సినీ జీవితాన్ని ఆరంభించారు. 1974లో వచ్చిన చందన చిత్రంలో హీరోగా నటించారు. బుల్లి తెరపై వచ్చిన శాంతి నవాసం సహా పలు సీరియల్స్లో కూడా నటించారు.
 

19:05 - December 19, 2015

విశాఖ : కాల్ మనీ ప్రకంపనలు విశాఖ జిల్లాను కుదిపేస్తున్నాయి. పోలీసుల దాడులతో చాలా మంది వ్యాపారులు పరారవుతుంటే.. దొరికిన వారి నుంచి అధికారులు భారీ ఎత్తున ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకుంటున్నారు.

20 మంది ఫైనాన్స్ వ్యాపారులపై దాడులు ....

కాల్ మనీలో ఇంతకాలంగా కోట్లకు పడగలెత్తిన రాబందుల డొంకలు ఒక్కొక్కటిగా కదులుతున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా విజయవాడ గుంటూరులో మాత్రమే చూసిన దందా విశాఖ జిల్లాలోనూ బయటపడింది. విశాఖ నగరంలో పోలీసులు ఇప్పటివరకు 20 మంది ఫైనాన్స్ వ్యాపారులపై దాడులు చేసి కేవలం ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేసారు. వారి వద్ద నుంచి 200 కు పైగా ప్రామిసరీ నోట్లు, బ్లాంక్‌ చెక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాధితులకోసం 1090 టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. కాల్ మనీ ఉదంతంపై విశాఖలో పలు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. సొమ్మును రికవరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫైనాన్స్ వ్యాపారమంటే పెట్టింది పేరు అనకాపల్లి....

ఫైనాన్స్ వ్యాపారమంటే పెట్టింది పేరు అనకాపల్లి. అనకాపల్లి కి చెందిన వందలాది మంది తెల్లారితే విశాఖ నగరానికి వచ్చి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు. ఈ బిజినెస్ కోట్లలో జరుగుతోంది. టీడీపీ సహా అన్ని పార్టీల నేతలు ఇందులో భాగస్వాములే. అనకాపల్లి, ఆరిలోవ, గాజువాక ప్రాంతాలతోపాటు అనపర్తి, కాకినాడ నుంచి వచ్చిన ఫైనాన్స్ వ్యాపారుల దందాలపై పోలీసు చర్యలు శూన్యం అని పలు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించడంలోనూ పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని వెంటనే మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాల్ మనీ దందాపై పోలీసులు దాడులు...

విశాఖ జిల్లాలో కాల్ మనీ దందాపై పోలీసులు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా జిల్లాలోని కొన్ని ఏరియాల్లో దందా కొనసాగుతూనే ఉంది. పోలీసులు దాడులను ముమ్మరం చేసి కాల్‌మనీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు. 

19:01 - December 19, 2015

విశాఖ : పేరుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌. స్మార్ట్ సిటీ నిర్మాణానికి కేంద్రబిందువు. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన జివిఎంసి అవినీతి విమర్శలపాలవుతోంది. ఇందులో టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతిలో నెంబర్ వన్. నగరంలో రెండు హోటళ్ళకు దాసోహం అయింది టౌన్ ప్లానింగ్.

ఏపీలో అవినీతి పేరెత్తితే..

ఏపీలో అవినీతి పేరెత్తితే.. ముందుగా గుర్తుకొచ్చేది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌. జివిఎంసిలో టౌన్ ప్లానింగ్ విభాగం అమ్యామ్యాలకు నిలయం. ఏ పని కావాలన్నా డబ్బు కొడితే చాలు చిటికెలో పూర్తి చేస్తారు టౌన్ ప్లానింగ్ అధికారులు.

రెండు హోటళ్లకు పార్కింగ్‌ స్థలం లేకున్నా అనుమతులు....

అవినీతి శృతిమించడంతో సిటీ ప్లానింగ్ కూడా అదుపు తప్పుతోంది. తాజాగా వీరి ప్లానింగ్ లో మరో ఫ్రాడ్ చోటు చేసుకుంది. రెండు హోటళ్లు బెజ్ కృష్ణా, డైమండ్ పెరల్‌లకు పార్కింగ్ స్ధలం లేకపోయినా అనుమతులిచ్చేసారు అధికారులు. ఇందుకోసం లక్షల్లో వసూలు చేసారు. పార్కింగ్ స్ధలాన్ని చూపించలేకపోయిన సదరు హోటళ్ల యాజమాన్యాలకు ఫుట్‌పాత్‌ అప్పగించారు అధికారులు.

విశాఖలో సెల్లార్ల ఆక్రమణ....

నగరంలో ఫుట్‌పాత్‌లపై పలు వ్యాపార సంస్ధలకు రేటు కట్టేసారు టౌన్ ప్లానింగ్ అధికారులు. సీతమ్మధార, డైమండ్ పార్క్, డాబాగార్డెన్స్ ప్రాంతాల్లో చాలా సెల్లార్లు ఆక్రమించారు. అందులో పలు వ్యాపారసంస్ధలు వెలిసాయి. దీంతో ట్రాఫిక్ వ్యవస్ధకు అంతరాయం కలుగుతోంది. టౌన్ ప్లానింగ్ దారితప్పితే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు జివిఎంసి కమిషనర్ ప్రవీణ్ కుమార్. హోటళ్ల ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవరు ఏం చెప్పినా టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం వసూళ్ల విషయంలో ఏ మాత్రం వెనక్కుతగ్గడంలేదు.

18:58 - December 19, 2015

విజయవాడ : దుర్గగుడిలో ఆక్రమణలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భక్తులను నిలువ దోపిడి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా షాపులు ఏర్పాటు చేసి భక్తులకు నడిచేందుకు దారిలేకుండా చేస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎక్కడ చూసినా ఆక్రమణల పర్వమే...

విజయవాడ దుర్గగుడిలో ఎక్కడ చూసినా ఆక్రమణల పర్వమే కన్పిస్తుంది. ఎక్కడ ఖాళీస్థలం కనిపించినా..రాత్రికి రాత్రే ఆక్రమించేస్తున్నారు. ఆలయ అధికారుల అండదండలతో వ్యాపారులు రెచ్చిపోతూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

రాజధానిగా విజయవాడను ప్రకటించిన తర్వాత....

ఏపీ రాజధానిగా విజయవాడను ప్రకటించిన తర్వాత కనకదుర్గమ్మ దేవస్ధానానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. నిత్యం అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు వస్తున్నారు. అయితే వారికి అవసరమైన అన్నిరకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత దుర్గగుడి ఆధికారులదే. కానీ భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలం అవుతున్నారు. అమ్మవారి సన్నిధిలో ఇటీవలే మహమండపాన్ని నిర్మించారు. కాని దానిని భక్తులకు అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బయటకు రావాలంటే సరైనమార్గంలేక ఇబ్బందులు పడుతున్నారు.

కొద్దిపాటి స్ధలంలో వ్యాపార లావాదేవిలే అధికం....

ఉన్న కొద్దిపాటి స్ధలంలో వ్యాపార లావాదేవిలే అధికంగా జరుగుతున్నాయి. కొన్ని షాపులను దేవస్ధానం అధికారులు కేటాయించగా..మరికొన్ని స్టాల్స్‌ను అధికారపార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు అనధికారికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న ఈ స్టాల్‌ అలా ఏర్పాటు చేసిందే. స్థానికంగా ఉన్న ఓ కార్పొరేటర్ ఇష్టానుసారంగా ఇక్కడ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఏమీ చేయలేని పరిస్ధితి. భక్తులు మాత్రం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై దేవస్థానం ఈవోను అడిగితే..సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే దోరణిని ప్రదర్శిస్తున్నారు.

భక్తులకు సౌకర్యలు కల్పించడంపై దృష్టి ....

ఇప్పటికైనా రాష్ట్ర దేవాదాయ,దర్మాదాయశాఖ ఉన్నతాధికారులు ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వ్యాపార లావాదేవీలపై కాకుండా భక్తులకు సౌకర్యలు కల్పించడంపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

18:55 - December 19, 2015

శ్రీకాకుళం : నీతి.. నిజాయితీ.. మంచి నడవడిక.. వీటిని పాఠశాల స్థాయి నుంచి నేర్పితేనే.. నేటి బాలలు రేపటి బాధ్యతగల పౌరులుగా తయారవుతారు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ... సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.. శ్రీకాకుళం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల. ఉపాధ్యాయులు చూపిన సన్మార్గంలో నడుస్తూ విద్యార్థులు చక్కటి విలువలు నేర్చుకుంటున్నారు. సరస్వతీ నిలయంలో చదువుతో పాటు సంస్కారాన్నీ నేర్చుకుంటున్నారు.

ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల..

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం.... గంగమ్మపేటలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల.. యావత్‌ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. వందలాదిమంది బలహీన వర్గాల పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్ధి దశలోనే వారికి నిజాయితీ గా బతకడం నేర్పాలన్న ఉపాధ్యాయిల ఆలోచన ఇపుడు ఈ పాఠశాలను జిల్లాలో ప్రత్యేకంగా నిలబెట్టింది.

సమాజానికి మార్గదర్శకంగా నిలిచే కార్యక్రమం...

సమాజానికి మార్గదర్శకంగా నిలిచే కార్యక్రమం చెయ్యాలనుకున్న ఉపాధ్యాయులు.. ఈ పాఠశాలలో జవాబుదారీ తనానికి పెద్దపీట వేశారు. విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచేలా వైవిధ్యమైన బోధనను అందిస్తున్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్ధి మాట, గాంధీ షాపు, ప్రత్యేక స్వచ్చ భారత్ లాంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడం నేర్పేందుకు విద్యార్ధి మాట కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు తమ సమస్యలను చీటీలలో రాసి విద్యార్థి మాట బాక్సులో వేస్తే సరి. ప్రతిరోజూ ఈ బాక్స్‌ను పరిశీలించే ప్రధానోపాధ్యాయుడు.. తక్షణమే ఆ సమస్యను పరిష్కరించేస్తారు.

ద్యార్థుల్లో నిజాయితీని పెంచేందుకు ....

అలాగే విద్యార్థుల్లో నిజాయితీని పెంచేందుకు గాంధీ షాప్‌ను ఏర్పాటు చేశారు. ఈ దుకాణంలో విక్రేతలు ఎవరూ ఉండరు. విద్యార్థులే తమకు కావాలసిన తినుబండారాలను కొని.. దానికి తగిన ధరను అక్కడి క్యాష్‌ బాక్సులో వేస్తారు. తమ విద్యార్థులు నిజాయితీపరులుగా తయారై.. భావి సమాజానికి ఎంతగానో ఉపయోగపడతారని పాఠశాల ఉపాధ్యాయులు అభిప్రాయపడుతుంటే.. ఇక్కడి విధానాలు తమకెంతో ఉపయుక్తంగా ఉన్నాయని విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల్లో నీతి, నిజాయితీలే కాదు..

విద్యార్థుల్లో నీతి, నిజాయితీలే కాదు.. పర్యావరణ పరిరక్షణపైనా అవగాహన కల్పిస్తున్నారు ఉపాధ్యాయులు. పాఠశాల ఆవరణలో రసాయనిక ఎరువులు వాడని కూరగాయలను పండించి వాటిని అమ్మగా వచ్చిన ఆదాయంతో ప్రతీ క్లాస్ రూమ్ లో డస్ట్ బిన్ లు, దోమల నివారణకు అల్ అవుట్ లాంటి పరికరాలు ఏర్పాటు చేశారు. నిత్యం క్లీన్ గా ఉండేందుకు తరగతి గదులలో అద్దం, దువ్వెన లాంటి వస్తువులను ఉంచారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు

విద్యార్ధుల నడవడికలో మార్పు తేవడంతో పాటు....

మార్పు మననుండే ప్రారంభం కావాలనే విషయాన్ని గుర్తించిన గంగమ్మపేట ఆశ్రమ పాఠశాల అధ్యాపకులు. విద్యార్ధుల నడవడికలో మార్పు తేవడంతో పాటు జిల్లాలోని మిగతా ప్రభుత్వచ ప్రైవేట్ విద్యాసంస్ధలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తోన్న గంగంపేట ఆశ్రమ పాఠశాల ఉపాధ్యా బృందానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. 

21న అసెంబ్లీలో ప్రైవేటు వర్శిటీల బిల్లు : గంటా

హైదరాబాద్ : ఈ నెల 21న ఏపీ శాసనసభలో ప్రవేటు యూనివర్సిటీల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఏపీ చాంబర్ ఆఫర్ కామర్స్ అధ్వర్యంలో జరిగిన రిటైర్డ్ వీసీల సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. అన్ని వర్సిటీల్లో ఒకే విధానం కోసం ఈ బిల్లును తీసుకురానున్నామని చెప్పారు. రాష్ట్రంలో న్యాయమైన సాంకేతిక విద్యను అందించేందుకే ప్రైవేటు వర్సిటీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ప్రముఖ నటుడు రంగనాథ్ అనుమానాస్పద మృతి

హైదరాబాద్: ప్రముఖ నటుడు రంగనాథ్ అనుమానాస్పద మృతి చెందారు. దాదాపు 300 లకు పైగా సినిమాల్లో రంగనాథ్ నటించారు. 1949వ సంవత్సరంలో మద్రాస్ లో జన్మించారు. రంగనాథ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు రైల్వేలో టీసీగా పని చేశారు. రంగనాథ్ తొలి సినిమా 1969లో విడుదలైన బుద్ధిమంతుడు.

పాతబస్తీలో భారీగా నకిలీ నూడుల్స్ స్వాధీనం

హైదరాబాద్ : పాతబస్తీలో భారీగా నకిలీ నూడుల్స్ స్వాధీనం చేసుకున్నారు. బహుదూర్ పురా పీఎస్ పరిధిలోని కిషన్ బాగ్ లో నకిలీ నూడుల్స్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 700 కిలోల నూడుల్స్, 300 కిలోల మైదా, 17 సిలిండర్లు, నిర్వాహకుడిని అరెస్టు చేశారు.

సిరిసిల్ల – వేములవాడ నాలుగు లైన్ల రోడ్డు ప్రారంభం..

కరీంనగర్ : సిరిసిల్ల – వేములవాడకు నాలుగు లైన్ల రోడ్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దేందుకు రూ.5.43 కోట్లతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. చర్చి ఫాస్టర్లకు గౌరవవేతనం ఇస్తామని తెలిపారు. ప్రతి నిరుపేదలకు దీపం పథకం వర్తించేలా కృషి చేస్తామన్నారు.

గాజువాకలో 14 మంది కాల్ మనీ కేసులు

విశాఖ : గాజువాకలో 14 మంది కాల్ మనీ వ్యాపారులపై పీఎస్ లో టీడీపీ నేత పిల్లల మోహన్ రావు ఫిర్యాదు చేశారు. గాజువాక పోలీసులు కేసు నమోదుకు వెనకంజు వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ముగిసిన అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ సమావేశం

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలో అసెంబ్లీ స్ట్రాటజీ కమిటీ సమావేశం ముగిసింది. సభలో ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగిలిన వారు యాక్టీవ్ గా లేరని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ వెలుపల రోజా అరెస్టు పై సీఎం చంద్రబాబు వాకబు చేసినట్లు సమాచారం.

రోజాను డిశ్చార్జ్ చేసిన నిమ్స్ వైద్యులు

హైదరాబాద్ : నగరి ఎమ్మెల్యే రోజా ను నిమ్స్ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆరోగ్య పరిస్థితిని మెరుగుపడకుండానే డిశ్చార్జ్ చేశారంటూ రోజా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

17:51 - December 19, 2015

హైదరాబాద్ : ఉద్యోగం పురుష లక్షణం... ఇది ఒకప్పటిమాట... ఇప్పుడు ట్రెండ్‌ మారింది.. మేం ఏ విషయంలోనూ తక్కువకాదంటూ నారీమణులు కొటేషన్ లిఖించారు. మగవాళ్లతోసమానంగా కొలువులకోసం పరుగులు పెడుతున్నారు.. పోలీసు ఉద్యోగాలకోసం శారీరకంగా... మానసికంగా సిద్ధమవుతున్నారు..

పోలీసు శాఖలో 33శాతం రిజర్వేషన్‌....

పోలీసు ఉద్యోగాలకోసం మేముసైతం అంటూ ఇలా ముందుకు కదిలింది మహిళాలోకం.. పోలీసు శాఖలో 33శాతం రిజర్వేషన్‌ వీరిలో నమ్మకం పెంచింది.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలంటూ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు యువతులు.. లక్ష్యసాధనకోసం అలసట లేకుండా కఠోర సాధన చేస్తున్నారు.. ఉదయం ఐదునుంచి తొమ్మిదిగంటలవరకూ మైదానంలో... పదినుంచి సాయంత్రం ఐదువరకూ క్లాస్‌ రూంలో శ్రమిస్తున్నారు..

పోలీస్‌ ఉద్యోగంఅంటేనే మహిళలు భయపడిపోయేవారు....

ఒకప్పుడు పోలీస్‌ ఉద్యోగంఅంటేనే మహిళలు భయపడిపోయేవారు.... ఆ జాబ్‌ తమకూ సూట్‌కాదంటూ అటువైపే చూసేవారు కాదు.. పైగా శిక్షణాకేంద్రాలుకూడా ఎక్కువగా పెద్ద నగరాల్లోనే ఉండేవి... ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది.. తల్లిదండ్రుల ఆలోచనలూ మారిపోయాయి.. కొడుకులతోపాటు.. కూతుళ్లకూ కొలువులు కావాలని కోరుకుంటున్నారు.. తమ బిడ్డలను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తున్నారు.. పోలీసు కొలువులకోసం శిక్షణ ఇప్పిస్తున్నారు.. దీంతో ట్రైనింగ్‌కు డిమాండ్ మరింత పెరిగిపోతోంది..

యువకులకంటే మహిళలే ఎక్కువగా శిక్షణ...

కరీంనగర్‌ జిల్లాలో పోలీసు ఉద్యోగాలకోసం యువకులకంటే మహిళలే ఎక్కువగా శిక్షణ తీసుకుంటున్నారు.. జిల్లాలో జగిత్యాల, గోదావరిఖని, జమ్మికుంటలో శిక్షణాకేంద్రాలు ఈ యువతులకు మెరుగైన ట్రైనింగ్ ఇస్తున్నాయి.. శాంతిభద్రతలు కాపాడే ఉద్యోగమే తమ లక్ష్యమంటూ గ్రౌండ్‌మొత్తం రౌండ్లు కొడుతున్నారు నారీమణులు.. ప్రశ్నాపత్రాలతో కుస్తీపడుతూ బిజీ బిజీగాఉన్నారు యువతులు.. 

17:47 - December 19, 2015

హైదరాబాద్ : అందరికీ ఇళ్లు పథకం కింద.. తెలంగాణ రాష్ట్రానికి మ‌రిన్ని ఇళ్లను మంజూరు చేయాల‌ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. ఇటీవ‌ల కేంద్రం ప్రక‌టించిన జాబితాలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని.. సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మ‌రోసారి ప్రతిపాద‌న‌లు పంపాల‌ని కేంద్రం సూచించ‌డంతో మున్సిప‌ల్ శాఖ తాజాగా 62వేల ఇళ్లను మంజూరు చేయాలంటూ ప్రతిపాద‌న‌లు పంపింది.

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రతిపాదనలు....

అందరికీ ఇళ్ళ నిర్మాణం పేరుతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రతిపాదనలను పంపింది. ఈ పథకం కింద గతంలో తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం.. రాష్ట్రానికి 10,190 ఇళ్ళను కేంద్రం మంజూరు చేసింది. అయితే మిగ‌తా రాష్ట్రాల‌కంటే త‌మ రాష్ట్రానికే చాలా త‌క్కువ ఇళ్లను మంజూరు చేశార‌ని సీఎం కేసీఆర్‌ కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పేదలకు తాము ప్రతిష్టాత్మకంగా డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తుంటే..కేంద్రం స‌హ‌కరించ‌క‌డంలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు మ‌రిన్ని ఇళ్లు మంజూరు చేయాల‌ని ఇటీవ‌ల ఢిల్లీలో సీఎం కేసీఆర్ కేంద్ర ప‌ట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంక‌య్య నాయుడును కోరారు. దీంతో స్పందించిన వెంక‌య్య నాయుడు మ‌ళ్లీ ప్రతిపాద‌న‌లు పంపాలని కోర‌డంతో తాజాగా 62వేలు ఇళ్లను మంజూరు చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.

ఒక్కో ఇంటికి లక్షన్నర రూపాయలు....

అందరికి ఇళ్లు పథకం కింద కేంద్ర ప్రభుత్వం లక్షన్నర రూపాయలను ఒక్కో ఇంటికి ఇవ్వనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డబుల్ బెడ్ రూమ్ స్కీం కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. డబుల్‌ బెడ్‌రూం పథకం కింద 2లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం కింద డీపీఆర్‌ల తయారీ కోసం గృహ నిర్మాణశాఖ త్వరలోనే నోటిఫికేషన్‌ను ఇవ్వనుంది. హైదరాబాద్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 8 అంతస్థులు, వరంగల్‌లో గ్రౌండ్‌తో పాటు 3 ఫ్లోర్ లు, ఇతర మున్సిపాలిటీల్లో గ్రౌండ్‌తో పాటు 2 ఫ్లోర్‌లలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళను నిర్మించనున్నారు. స్థలాలను బట్టి అంతస్తులను ఎంచుకోవాలని గృహానిర్మాణ శాఖ ఉన్నతాధికారులు కలెక్టర్లకు సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి మరో 62వేల ఇళ్లను మంజూరు చేయాలన్న ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. 

17:43 - December 19, 2015

హైదరాబాద్ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసు సెగలు తెలుగు రాష్ట్రాలను తాకింది. కాంగ్రెస్‌ అధినాయకత్వంపై ప్రధాని మోదీ ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన ధర్నాలతో తెలంగాణ దద్దరిల్లింది. నిరసన ప్రదర్శనలతో హోరెత్తింది. జిల్లా కలెక్టరేట్లతోపాటు, బీజేపీ కార్యాలయాల దగ్గర మోదీ దిష్టిబొమ్మలను కాంగ్రెస్‌ నాయకులు దహనం చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ఐఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు...

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినాయకులు సోనియా, రాహుల్‌పై... ప్రధాని మోదీ ప్రభుత్వం కక్షసాధిస్తోందంటూ ఐఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు. నిరసన ప్రదర్శలు నిర్వహించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌ జంక్షన్‌లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర గ్రేటర్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలొ పాల్గొన్న నేతలు, కార్యకర్తలు ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

కాంగ్రెస్‌ నేతల నిరసనోద్యమంతో....

కాంగ్రెస్‌ నేతల నిరసనోద్యమంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో నిరసనకారునులు పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు రెండు వర్గాల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యర్తలను అరెస్టు చేసి, బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు.

ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు...

కాంగ్రెస్‌పై కక్షసాధిస్తున్న ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డానికి పార్టీ నాయకులు హెచ్చరించారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ దగ్గర.....

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ దగ్గర జరిగిన ధర్నాలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన వీరిని పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం జంక్షన్‌ దగ్గర ధర్నా నిర్వహించిన మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

మిగిలిన జిల్లాల్లో కూడా...

తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో కూడా ధర్నాలు, నిరసనలు నిర్వహించారు. ఖమ్మంలో జరిగిన ధర్నాలో సీఎల్‌పీ నేత జానారెడ్డి, పీసీసీ కార్యనిర్వహాక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, నిజామాబాద్‌లో షబ్బీర్‌ అలీ, కరీంనగర్‌లో మాజీ మంత్రి డీ శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయి. మెదక్‌లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే డీకే అరుణ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్‌ అధినాయకత్వానికి వ్యతిరేకంగా ఎన్డీయే చేస్తున్న కుట్రలను ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొంటామని నేతలు హెచ్చరించారు. 

చండీయాగం ప్రజల సంక్షేమం కోసం కాదు : మందకృష్ణ

హైదరాబాద్ : కేసీఆర్ చేయనున్న చండీయాగం ప్రజల సంక్షేమం కోసం కాదని... ఆయన చేసిన పాపాలను కడుక్కోవడానికే అని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఇప్పటి దాకా ఆయన చేసిన మోసాలు, పాపాలను యాగంతో కడుక్కోవాలనేది కేసీఆర్ ఆలోచన అని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని... ఈ విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ చేస్తున్న యాగంలో ఒక్క దళితుడు కూడా లేడని... అలాంటప్పుడు యాగఫలం ప్రజలందరికీ ఎలా చెందుతుందని ఆయన ప్రశ్నించారు.

 

16:49 - December 19, 2015

ఢిల్లీ : మోదీ మమ్మల్ని టార్గెట్ చేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని..అయినా వెనకడుగు వేయం అని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ తెలిపారు. పటియాలా హౌస్ కోర్టులో విచారణకు హాజరైన సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ, చట్టాలను గౌరవించే తాము న్యాయస్ధానానికి హాజరయ్యామని అన్నారు. చట్టం దృష్టిలో అంతా సమానమేనని, తమకు న్యాయం జరుగుతుందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్దత ఉందని, సిద్ధాంతాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ఆమె పేర్కొన్నారు. కోర్టులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపిన ఆమె, విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయని స్పష్టం చేశారు. అధికార పార్టీ తమను లక్ష్యం చేసుకుందని ఆరోపించిన ఆమె, తాము బెదిరేది లేదని, పోరాడుతామని తెలిపారు.

16:24 - December 19, 2015

హైదరాబాద్ : సినిమా షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పరిధిలోని సంఘీ నగర్‌లో శనివారం నాని హీరోగా నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో తిరుపతి అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో భయపడిపోయిన యూనిట్ సిబ్బంది షూటింగ్ నిలిపివేసి వెళ్లిపోయారు. తిరుపతి మృతదేహాన్ని కూడా అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

వరంగల్,ఖమ్మం కార్పొరేషన్ వార్డుల రిజర్వేషన్ ఖరారు

హైదరాబాద్ : వరంగల్,ఖమ్మం కార్పొరేషన్ వార్డుల రిజర్వేషన్ ఖరారు అయ్యింది. వరంగల్ 58 వార్డులకు గాను ఎస్టీ జనరల్ -1, ఎస్టీ మహిళ 61, ఎస్సీ మహిళ -4,జనరల్ -5, వెనుకబడిన కులాలు మహిళ 9, జనరల్ 10, జనరల్ మహిళ -15, ఓపెన్ కేటగిరి -13 కేటాయింపులు జరిగాయి.

ఖమ్మం 50 వార్డులకు గాను ఎస్టీ జనరల్ -1, ఎస్టీ మహిళ -1, ఎస్సీలు : మహిళలు -3, జనరల్ -3, వెనకబడి కులాలు : మహిళ -8, జనరల్ -9, జనరల్ మహిళా కేటగిరి 613, ఓపెన్ కేటగిరి -12 కేటాయించారు.

రాహుల్ కు కాంగ్రెస్ అండగా ఉంటుంది : మన్మోహన్

ఢిల్లీ : విలువలు, నిబద్దతకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరని రాహుల్ కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. పటియాల హౌస్ న్యాయస్థానంలో ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీకి బెయిల్ లభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ వేధింపులల్లో భాగంగానే ఈ కేసు నడుస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిబద్దతతో పోరాడే పార్టీ అని ఆయన చెప్పారు. విలువలు కలిగిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉందని, ఇలాంటి చర్యలు వారిని భయపెట్టలేవని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.

మోదీ మమ్మల్ని టార్గెట్ చేశారు… అయినా వెనకుడుగు వేయం : సోనియా

ఢిల్లీ : మోదీ మమ్మల్ని టార్గెట్ చేశారని..అయినా వెనకడుగు వేయం అని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ తెలిపారు. పటియాలా హౌస్ కోర్టులో విచారణకు హాజరైన సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ, చట్టాలను గౌరవించే తాము న్యాయస్ధానానికి హాజరయ్యామని అన్నారు. చట్టం దృష్టిలో అంతా సమానమేనని, తమకు న్యాయం జరుగుతుందని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్దత ఉందని, సిద్ధాంతాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని ఆమె పేర్కొన్నారు. కోర్టులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపిన ఆమె, విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయని స్పష్టం చేశారు.

డివైడర్ ను ఢీ కొట్టిన బైక్

నిజామాబాద్ : డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలానికి చెందిన ప్రతాని రాజు (21), పుట్టి ప్రశాంత్ (21) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.

రాహుల్ గాంధీ పై ఫైర్ అయిన రవిశంకర్ ప్రసాద్...

ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. అబద్ధాలు చెప్పడంలో రాహుల్ గాంధీ నిష్ణాతుడని అన్నారు. హైకోర్టులో అతనికి ఏమైనా ఇబ్బందులు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. ఈ నెల 9న రాహుల్ గాంధీ మాట్లాడుతూ, నేషనల్ హెరాల్డ్ కేసు వంద శాతం ప్రధాని కార్యాలయం చేపట్టిన రాజకీయ కక్ష సాధింపు చర్య అని విమర్శించారు. ఈ క్రమంలోనే రాహుల్ పై రవిశంకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రాజకీయ నాయకుడిగా కాక, ఒక సామాన్య పౌరుడిగానే పిటిషన్ దాఖలు చేశారని రవిశంకర్ చెప్పారు.

15:14 - December 19, 2015

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కి పాటియాలా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగతంగా చెరో రూ. 50వేల పూచికత్తు కట్టాలని కోర్టు ఆదేశించింది. ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేసినట్లు కపిల్ సిబల్ చెప్పారు.సోనియా, రాహుల్ తరపున కపిల్ సిబల్ కేసును వాదించారు. బెయిల్ మంజూరు చేయాల్సిందిగా న్యాయమూర్తిని కోరగా, చెరో రూ.50వేల పూచీకత్తు పై బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. మరో పక్క సోనియా, రాహుల్ గాంధీలకు బెయిల్ ఇవ్వడాన్ని బిజెపి నేత సుబ్రమణ్యస్వామి వ్యతిరేకంచారు. రాహుల్ కు ప్రియాంక గాంధీ, సోనియా కు ఏకే ఆంటోనీలు పూచీకత్తు ఇచ్చారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఫ్రిబవరి 20 మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. అనంతరం కోర్టు నుంచి సోనియా, రాహుల్ గాంధీలు వెనుదిరగారు. ఈ కేసులో మొత్తం ఏడుగురికి పటియాల కోర్టు బెయిల్ మంజూరుచేసింది.

సోనియా, రాహుల్ కు బెయిల్ మంజూరు

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కి పాటియాలా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50వేల పూచికత్తుతో షరతుతో బెయిల్ మంజూరు చేసింది.

పాటియాల కోర్టు సోనియా, రాహుల్

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో కలసి ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కుమార్తె ప్రియాంక వాద్రా, అల్లుడు రాబర్ట్ వాద్రా తోడుగా వచ్చారు. వీరితో పాటు, నేషనల్ హెరాల్డ్ కేసులో సహనిందితులైన కాంగ్రెస్ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ లు కూడా కోర్టుకు చేరుకున్నారు. మరోవైపు పిటిషన్ వేసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కూడా కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామికి భారీ భద్రతను కల్పించారు.

బెయిల్ బాండ్ ఫైల్ చేయనున్న మన్మోహన్

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో పిటీషన్ వేసిన బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు చేరుకున్నారు. కోర్టు ఆవరణలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా, రాహుల్ గాంధీలు మరికొన్ని క్షణాల్లో కోర్టు ముందు హాజరుకానున్నారు. హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని స్వామి అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బెయిల్ బాండ్‌ను ఫైల్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నివాసం నుంచి పాటియాలా కోర్టుకు బయలుదేరి వెళ్లాడు.

14:41 - December 19, 2015

హైదరాబాద్ : నేషనల్‌ హెరాల్డ్ కేసుకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిరసనకు దిగారు.. నెక్లెస్‌ రోడ్ దగ్గర ఆందోళన చేశారు.. మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.. రంగారెడ్డి కలెక్టరేట్‌నుంచి గన్‌పార్క్ వరకూ ర్యాలీగా వెళుతున్న నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ధర్నాలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, దానం, అంజన్‌ కుమార్‌, గీతారెడ్డి పాల్గొన్నారు.

14:39 - December 19, 2015

ఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్ కేసు వెనక ప్రధానిమోదీతోపాటు కేబినెట్‌ హస్తం ఉందన్నారు.. మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్... సోనియా, రాహుల్‌పై కేసు వేసినందుకు కేంద్రం సుబ్రమణ్యస్వామికి బంగ్లా బహుమతిగా ఇచ్చిందని ఆరోపించారు.. బిజెపి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని.... మోదీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి ఉందని చెప్పుకొచ్చారు.. 

కాసేపట్లో పాటియాల కోర్టు సోనియా, రాహుల్..

ఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్ కేసులో కాసేపట్లో పటియాలా హౌస్‌ కోర్టుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, యువనేత రాహుల్ గాంధీ హాజరుకాబోతున్నారు. కోర్టు పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.. చుట్టుపక్కల షాపులన్నీ మూయించారు.. మరోవైపు ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్‌ రెడీ అవుతోంది.. ఒకవేళ సోనియా, రాహుల్‌ను అరెస్ట్ చేస్తే జైల్‌ భరో చేపట్టాలని నిర్ణయించింది.. 

ఎస్సై మృతిపై సీబీసీఐడీ దర్యాప్తు...

రంగారెడ్డి : ఎస్సై అనుమానాస్పద మృతిపై సీబీ సీఐడీ అధికారులు శనివారం దర్యాప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్ మూడు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విషయం విదితమే. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సీబీసీఐడీ అధికారులు పోలీస్‌స్టేషన్ క్వార్టర్లలోని రమేశ్ గదిని పరిశీలించారు. కుటుంబసభ్యులు, పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో వారు గదిలోని వస్తువులను తనిఖీ చేశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది :ఆజాద్

హైదరాబాద్ : బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. ఢిల్లీ పాటియాలా కోర్టులో నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. 

ఏసీబీకి పట్టుబడిన వీఆర్ వో

మహబూబ్‌నగర్ : జిల్లాలోని తలకొండపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు నుంచి రూ. 4,000 లంచం తీసుకుంటుండగా వీఆర్‌వో నరసింహ్మారెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వీఆర్‌వో నివాసం, కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

వైద్య సేవలకు కేంద్రంగా అమరావతి: చంద్రబాబు

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి రానున్న రోజుల్లో వైద్య సేవలకు కేంద్రంగా మారబోతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేసిన అనంతరం... అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లలోనే ఎయిమ్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఏపీని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. పేదవారి ఆరోగ్య సంరక్షణే తమ ప్రథమ లక్ష్యమని చెప్పారు. నిపుణలైన వైద్యులు ఇక్కడ ఉండటం ఏపీకి లాభించే విషయమని అన్నారు. అంగన్ వాడీల జీతాలను పెంచాలని నిర్ణయించామని... దీనివల్ల ప్రభుత్వానికి రూ.

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ : కడియం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. 2016-17 విద్యా సంవత్సరం నాటికి అన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. కేజీ టు పీజీ విద్యా విధానంలో భాగంగా కొత్తగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తామని మీడియాకు తెలిపారు. విద్యా ప్రమాణాలు పెంచే విధంగా కేజీ టు పీజీ విద్యా విధానం రూపకల్పన చేస్తున్నామని కడియం వివరించారు.

14:01 - December 19, 2015

హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసిపి ఎమ్మెల్యే రోజాను ఆ పార్టీ అధినేత జగన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లకు చెప్పామన్నారు. కేసు హిస్టరీని పరిగణనలోకి తీసుకొని ట్రీట్ మెంట్ ఇవ్వాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇవాళ రోజా శాసనసభకు వస్తుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారని చెప్పారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి... అసెంబ్లీకి వచ్చే హక్కు లేదా అని ప్రశ్నించారు.

 

13:52 - December 19, 2015

ఢిల్లీ : మానవాతా మూర్తి మదర్ థెరిస్సా కు మరో అరుదైన గౌరవం దక్కింది. కాథలిక్ ల కు పవిత్రమైన సెయింట్ హోదాను మదర్ కు ప్రదానం చేస్తున్నట్టు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. సెయింట్ హోదాకు కావలసిన రెండు అధ్బుతాలు మదర్ కు లభించడంతో కాథలిక్ బిషప్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది సెప్టంబర్ లో పోప్ ఫ్రాన్సిస్ ఈ బిరుదును ప్రదానం చేయనున్నారు.

 

13:45 - December 19, 2015

హైదరరాబాద్ : వైసీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. రెండోసారి వాయిదా అనంతరము ప్రారంభమైన సభలోను వైసీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. పలుమార్లు వాయిదా పడినా పరిస్థితి మారకపోవడంతో సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

 

 

 

13:42 - December 19, 2015

నల్గొండ : జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. హైద్రాబాద్ నుండి నల్గొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పై విద్యుత్ స్తంభం విరిగిపడింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణికులు భయంతో బస్సునుండి పరుగులు తీసారు. స్తంభం విరిగిపడినపుడు విద్యుత్ ప్రసారం జరగకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా ధ్వంసమైంది.

13:41 - December 19, 2015

హైదరాబాద్ : అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విద్యార్థులకు సూచించారు. సికింద్రాబాద్‌లోని మిలటరీ ఇంజనీరింగ్‌ కాలేజీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరయ్యారు. చదువులో ప్రతిభచూపిన విద్యార్థులకు ఆయన మెడల్స్ అందజేశారు. మెడల్స్ అందుకున్న విద్యార్థులకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.
 

13:37 - December 19, 2015

హైదరాబాద్ : విపక్ష సభ్యుల నిరసన నినాదాల మధ్యే... ప్రభుత్వం ఈరోజు శాసనసభలో ఆరు బిల్లులను ప్రవేశపెట్టింది. ఏపీ మౌలిక సదుపాయాల బిల్లు, ఏపీ విద్యుచ్ఛక్తి సుంకం బిల్లు, ఏపీ సముద్ర తీర ప్రాంత బోర్డు బిల్లు, స్వదేశంలో తయారైన విదేశీ మద్యం, మద్య వ్యాపారాల క్రమబద్ధీకరణ బిల్లు, ఏపీ విలువ ఆధారిత పన్ను బిల్లు, ఏపీ మెట్రోపాలిటన్‌ రీజియన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ బిల్లులను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. వాయిదా అనంతరం సభ ప్రారంభం కాగానే.. విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి మళ్లీ రోజా సస్పెన్షన్‌ అంశాన్ని లేవనెత్తారు. సస్పెన్షన్‌ను ఎత్తివేసే వరకూ సభను నడవనీయబోమని పునరుద్ఘాటించారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలంటూ... స్పీకర్‌ కోడెల ప్రసాదరావు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా విపక్షం స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే స్పీకర్‌ అనుమతితో ప్రభుత్వం ఆరు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది.

 

13:27 - December 19, 2015

గుంటూరు : ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుంటే ఇండియా మాత్రం ఎపి వైపు చూస్తోందని దానికి కారణం సీఎం చంద్రబాబే అని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఎయిమ్స్ కు శంకుస్థాన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్యలో మంగళగిరిలో ఎయిమ్స్ వైద్యశాల ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు చంద్రబాబు ప్రశంసలు, పొగడ్తలతో ముంచెత్తారు. మోడీ నాయకత్వంలో దేశం, చంద్రబాబు నేతృత్వంలో ఎపి అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. దేశం కోసం మోడీ, ఎపి కోసం బాబు ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి విరామం లేకుండా పని చేస్తున్నారు. అనునిత్యం కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రం ప్రగతిపథంలో నడిచేందుకు చంద్రబాబు నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు మహా తెలివుందన్నారు. చంద్రబాబు పట్టుదలతో ఎయిమ్స్ ను మొదటి నుంచి కేంద్రానికి గుర్తు చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బాబు ఎనలేని అహర్నిశలు శ్రమిస్తున్నాడని కొనియాడారు. బాబు ఆయన సొంతం మానేసి చాలా రోజలు అయిందన్నారు.
తెలుగు నేలకు పోరాటపటిమ
తెలుగు నేలకు పోరాటపటిమ ఉందన్నారు. ఎపికి మంచి భవిష్యత్ ఉందని తెలిపారు. ప్రపంచానికి వెలుగు చూపించే తరం తెలంగాణ, ఎపిలో ఉందన్నారు.
హెల్తీ ఇండియా.. హెల్తీ ఎపి : జేపీ నడ్డా
అంతకమందు కేంద్రఆరోగ్యశాఖ మంత్రి జెపీ నడ్డా మాట్లాడుతూ.. ఆర్యోగ భారత్, ఆరోగ్య ఎపిలను తయారు చేస్తామని చెప్పారు. మోడీ నేతృత్వంలో హెల్తీ ఇండియా... చంద్రబాబు సహకారంతో హెల్తీ ఎపి తయారు చేస్తామని చెప్పారు. ఎపిలో కూడా కాన్సర్ నయం చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తుందన్నారు. వైద్య రంగంలో ఎపి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తుందని.. వాటిని స్వాగతిస్తూనే కేంద్రం కూడా ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఏడు రకాల టీకాలను శిశువులకు వేసేందుకు ఇంద్రధనస్సును ప్రారంభించామని తెలిపారు. ఏడు రకాల టీకాలకు అదనంగా 4 రకాల టీకాలను జోడించి... మొత్తం 11 టీకాలను శిశువులకు వేసి... వారిని కాపాడాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు.

 

12:59 - December 19, 2015

అంగన్ వాడీలపై ఎపి సర్కార్ తీరు అప్రజాస్వామికమని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకుడు వినయ్ కుమార్, టిడిపి నేత.. రామకృష్ణ ప్రసాద్, వైసిపి నేత మేరుగ నాగార్జున పాల్గొని, మాట్లాడారు. విజయవాడలో అంగన్ వాడీలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:55 - December 19, 2015

హైదరాబాద్ : సైఫాబాద్ పీఎస్ వద్ద వైసిపి ఎమ్మెల్యే రోజా స్పృహ తప్పిపడిపోయారు. ఎపి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఇవాళ ఎమ్మెల్యే రోజా యత్నించారు. మహిళా మార్షల్స్ రోజాను అడ్డుకున్నారు. సస్పెండ్ అయిన సభ్యులు సభలోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈనేపథ్యంలో పోలీసులు రోజాను బలవంతంగా అరెస్టు చేసి.... సైఫాబాద్ పీఎస్ కు తరలించారు. అక్కడ రోజా స్పృహ తప్పిపడిపోయారు. చికిత్స నిమిత్తం ఆమె నిమ్స్ కు తరలించారు. రోజాను పరామర్శించేందుకు వైసిపి ఎమ్మెల్యేలు, నేతులు, కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ స్పీకర్ రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

 

 

 

12:28 - December 19, 2015

ఢిల్లీ : టీమిండియాలో తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడి స్థానం ప్రమాదంలో పడింది. రెండు మూడేళ్లుగా భారత వన్డేజట్టులోనిలకడగా స్థానం సంపాదిస్తూ వచ్చిన రాయుడు.. వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనకు భారత సెలక్టర్లు నేడు జట్టును ఎంపిక చేయనున్నారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ అనంతరం వన్డే జట్టులో చోటు కోల్పోయిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పునరాగమనం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు యువరాజ్ సింగ్ ని ఎంపిక చేయొచ్చన్న వూహాగానాలు వినిపిస్తున్నాయి. యువరాజ్ టీం ఇండియాలో ఆడి సుమారు ఏడాదిన్నర అయ్యింది. బౌలర్లలో షమీ, ఇషాంత్‌ లను ఎంపిక చేసే అవకాశం ఉంది.

 

సభా సమయం దుర్వినియోగం- కాల్వ

హైదరాబాద్  : ప్రశ్నోత్తరాలను సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులకు కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. సభ్యులు చాలా అంశాలపై మాట్లాడేందుకు సభకు వచ్చారని గుర్తు చేశారు. ఇలా సభను అడ్డుకొని సభ్యుల హక్కుల్ని కాలరాస్తున్నారని ఆరోపించారు.

 

రోజాకు పడుతున్న గతే పడుతుంది: అచ్చెన్నాయుడు

హైదరాబాద్ : జగన్ ను నమ్ముకునే వాళ్లకు రోజాకు పడుతున్న గతే పడుతుందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ తొడుంటారానే రోజా సభలో దురుసుగా ప్రవర్తించారన్నారు. రోజా పై సస్పెన్షన్ తర్వాత కనీసం ప్రోటెస్ట్ చేయని జగన్ ఈ రోజు అదే సస్పెన్షన్ విషయం పై రాద్దాంతం చేస్తున్నారాయన. సభలో ప్రతిపక్ష సభ్యులు సంయమనంతొ వ్యవహరించాలని కోరారు.

రోజాను గేటు బయటే ఆపారు- జగన్‌

హైదరాబాద్ : రోజాను అసెంబ్లీ గేటు బయటే ఆపారని సభలో జగన్‌ ఆరోపించారు. రోజమ్మ కనీసం వైసీపీ సీఎల్పీలోకి రాకూడదా? అని ప్రశ్నించారు. రోజా ఎమ్మెల్యే కాకుండా పోయిందా? అంటూ నిలదీశారు. సస్పెన్షన్‌ సరికాదన్నారు.

 

రోజాను సస్పెండ్ చేయడం చట్టవిరుద్దం కాదు: యనమల

హైదరాబాద్ : అసెంబ్లీ సభ్యులను సస్పెండ్ చేసే అధికారం హౌజ్ కు మాత్రమే ఉంటుందని శాసన వ్యవహారాల మంత్రి యనమల స్పష్టం చేశారు. వైఎస్ ఆర్సీ సభ్యురాలు రోజా సస్పెన్షన్ పై ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి అసెంబ్లీలో క్రమశిక్షణ ఉల్లఘింస్తే ఎవరినైనా సస్పెండ్ చేసే అధికారం హౌజ్ కు మాత్రమే ఉందన్నారు. సుప్రీం కుడా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం లేదని యనమల అన్నారు.

 

నిబంధనలకు విరుద్ధంగా రోజా సస్పెన్షన్ : జగన్

హైదరాబాద్ : అసెంబ్లీలో రోజాపై ఏడాది సస్పెన్షన్‌పై వైసీపీ అధినేత జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. రోజమ్మ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తమపై టీడీపీ నేతలు బెదిరింపులకుదిగినప్పుడు... అభ్యంతరకరంగా మాట్లాడినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. 

మంగళగిరిలో ఎయిమ్స్ కు శంకుస్థాపన

గుంటూరు : జిల్లాలోని మంగళగిరిలో ఎయిమ్స్ కు శంకుస్థాపన జరిగింది. ఎపి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. 

12:12 - December 19, 2015

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ అంశంపై ఈరోజు శాసనసభ దద్ధరిల్లింది. ఉదయం సభ ప్రారంభం కాగానే.. విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి, రోజా సస్పెన్షన్‌ అంశాన్ని లేవనెత్తారు. అసెంబ్లీ నిబంధనల పుస్తకంలోని రూల్‌ 340ని ప్రస్తావించారు. అయితే దీన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. అసెంబ్లీయే సుప్రీం అని.. అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలపై సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. గతంలో పార్లమెంటులో జెఎంఎం ఎంపీల సస్పెన్షన్‌., రాష్ట్ర శాసనసభలో కరణం బలరాం సస్పెన్షన్‌ల అంశాన్ని యనమల ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే.. జగన్మోహన్‌రెడ్డి ఈ వాదనను అంగీకరించకుండా.. తమ సభ్యురాలిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయకుంటే సభను నడవనీయబోమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. పాలక పక్షం సభ్యులతో పాటు.. బీజేపీ సభ్యుడూ విపక్షం తీరుపై అభ్యంతరం తెలిపారు. విపక్షాలు అనుసరిస్తున్న తీరుపట్ల స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభా నిబంధనలు, సంప్రదాయాల గురించి సభ్యులకు వివరించారు. తనపైనా, చైర్‌పైనా కామెంట్స్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు.. ప్రతిపక్ష నాయకుడి తీరుపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలకు అడ్డుతగులుతూ.. వైసీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకు వచ్చి.. నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ కోడెల సభను పది నిమిషాలు వాయిదా వేశారు.
నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారన్న జగన్
అసెంబ్లీలో రోజాపై ఏడాది సస్పెన్షన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్‌.. నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. రోజమ్మ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తమపై టీడీపీ నేతలు బెదిరింపులకుదిగినప్పుడు... అభ్యంతరకరంగా మాట్లాడినప్పుడు ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు.
రోజాను సస్పెండ్ చేయడం చట్టవిరుద్దం కాదు: యనమల
అసెంబ్లీ సభ్యులను సస్పెండ్ చేసే అధికారం హౌజ్ కు మాత్రమే ఉంటుందని శాసన వ్యవహారాల మంత్రి యనమల స్పష్టం చేశారు. వైఎస్ ఆర్సీ సభ్యురాలు రోజా సస్పెన్షన్ పై ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి అసెంబ్లీలో క్రమశిక్షణ ఉల్లఘింస్తే ఎవరినైనా సస్పెండ్ చేసే అధికారం హౌజ్ కు మాత్రమే ఉందన్నారు. సుప్రీం కుడా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అధికారం లేదని యనమల అన్నారు.
రోజాను గేటు బయటే ఆపారు- జగన్‌
రోజాను అసెంబ్లీ గేటు బయటే ఆపారని సభలో జగన్‌ ఆరోపించారు. రోజమ్మ కనీసం వైసీపీ సీఎల్పీలోకి రాకూడదా? అని ప్రశ్నించారు. రోజా ఎమ్మెల్యే కాకుండా పోయిందా? అంటూ నిలదీశారు. సస్పెన్షన్‌ సరికాదన్నారు.
రోజాకు పడుతున్న గతే పడుతుంది: అచ్చెన్నాయుడు
జగన్ ను నమ్ముకునే వాళ్లకు రోజాకు పడుతున్న గతే పడుతుందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ తొడుంటారానే రోజా సభలో దురుసుగా ప్రవర్తించారన్నారు. రోజా పై సస్పెన్షన్ తర్వాత కనీసం ప్రోటెస్ట్ చేయని జగన్ ఈ రోజు అదే సస్పెన్షన్ విషయం పై రాద్దాంతం చేస్తున్నారాయన. సభలో ప్రతిపక్ష సభ్యులు సంయమనంతొ వ్యవహరించాలని కోరారు.
సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు- కాల్వ
ప్రశ్నోత్తరాలను సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులకు కాల్వ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. సభ్యులు చాలా అంశాలపై మాట్లాడేందుకు సభకు వచ్చారని గుర్తు చేశారు. ఇలా సభను అడ్డుకొని సభ్యుల హక్కుల్ని కాలరాస్తున్నారని ఆరోపించారు.

 

 

ఎపి అసెంబ్లీ సోమవారానికి వాయిదా...

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగింది. సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. 

11:37 - December 19, 2015

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో హైటెన్షన్ ప్రదర్శనలు..నిరసనలు..ర్యాలీలు..నినాదాలతో హోరెత్తబోతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాటియాల కోర్ట్‌కు హాజరవుతున్న నేపధ్యంలో..రాజధాని ప్రాంతంలో హై టెన్షన్ కన్పిస్తోంది. దీనికి తోడు, అవసరమైతే జైలుకు వెళ్తాం గానీ, బెయిల్‌ను మాత్రం కోరే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో పాటు , ఆ పార్టీ లీడర్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో, ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగే అవకాశం కన్పిస్తోంది.
భారత న్యాయస్థానాలపై నమ్మకముందన్న సోనియా
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాటియాలా కోర్టుకు హాజరు అవుతున్నట్లు స్పష్టం చేశారు. తమకు భారత న్యాయస్థానాలపై నమ్మకముందని, కోర్టు ఆదేశాల మేరకు సహజంగానే తాను వెళ్లి తీరుతానని, ఆపై ఏం జరుగుతుందో చూద్దామని ఆమె వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్‌లు హాజరు కావాల్సిందేనని పాటియాలా కోర్టు ఇప్పటికే ఆదేశించింది.
మధ్యాహ్నం ఒంటిగంటకు పాటియాలా కోర్టులో విచారణ
నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కేసు పాటియాలా కోర్టులో విచారణకు రానుంది. విచారణకు సోనియా, రాహుల్‌తో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు సమూహంగా వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలంతా నేడు అందుబాటులో ఉండాలంటూ సూచించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కోశాధికారి మోతీలాల్‌ వోరా, ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌, సుమన్‌ దూబే, శ్యాం పిట్రోడా తదితరులు ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన నిధులను పక్కదారి పట్టించారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2012లో పిటిషన్ దాఖలు చేశారు.
సోనియా ఫైర్ బ్రాండ్ కామెంట్స్...
ఇలాంటి కేసులకు భయపడబోనంటూ,ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన సోనియా గాంధీ...తాను ఇందిరా గాంధీ కోడలినంటూ ఫైర్ బ్రాండ్ కామెంట్స్ చేసి...వ్యవహారాన్ని మరింత ముదిరేలా చేశారు. ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీ నిరసన దేశం దృష్టిని ఆకర్షించింది. అధికార పార్టీ తమపై కక్ష సాధిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. దీనిపై ఇతర పక్షాల నుంచి ఎన్ని విమర్శలొచ్చినా, కాంగ్రెస్ ఒకే స్టాండ్‌ మీదుంది. ఇప్పుడే పరిస్ధితి ఇలా ఉంటే...కోర్ట్ తీర్పు వచ్చాక, మరింత దిగజారడం ఖాయంగా కన్పిస్తోంది.
సుబ్రహ్మణ్యస్వామికి భద్రత పెంపు
నేషనల్‌ హెరాల్డ్ కేసు పిటిషన్ దారుడు సుబ్రహ్మణ్య స్వామి భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే జడ్‌ కేటగిరీ భద్రత కలిగి ఉన్న స్వామికి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ నివాస గృహాన్ని కేటాయించింది. కేబినేట్‌ కమిటీ సిఫార్సుల మేరకే స్వామికి ప్రభుత్వ వసతి గృహాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. సోనియా,రాహుల్ కోర్ట్‌కు హాజరయ్యే సమయంలో, పాటియాల కోర్ట్‌ బైట కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున ప్రదర్శనలకు దిగబోతున్నారు... అటు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగే అవకాశముంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు స్వచ్ఛందంగా బంద్‌లు పాటించబోతున్నాయి.

 

11:15 - December 19, 2015

హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యే రోజాను పోలీసులు అరెస్టు చేశారు. ఎపి అసెంబ్లీ స్పీకర్ రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇవాళ ఎపి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యే రోజా యత్నించారు. మహిళా మార్షల్స్ ఆమెను అడ్డుకున్నారు. సస్పెండ్ అయిన సభ్యులు సభలోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. కానీ రోజాలో లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈనేపథ్యంలో పోలీసులు రోజాను బలవంతంగా అరెస్టు చేసి.... సైఫాబాద్ పీఎస్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  

ఎపి అసెంబ్లీ మళ్లీ వాయిదా...

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ మళ్లీ వాయిదా పడింది. సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

 

ఎపి అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా...

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా పడింది. సమావేశాల ప్రారంభం నుంచే వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై వాడివేడీ చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు వాదోపవాదాలు చేసుకున్నారు. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని జగన్ పట్టుబట్టారు. సస్పెన్షన్ ఎత్తివేసే వరకు సభ జరగనివ్వమని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలో సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

 

09:42 - December 19, 2015

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీలోకి వెళ్లేందుకు వైసిపి ఎమ్మెల్యే రోజా యత్నించారు. మహిళా మార్షల్స్ రోజాను అడ్డుకున్నారు. సస్పెండ్ అయిన సభ్యులు సభలోకి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. 

09:40 - December 19, 2015

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. వైసిపి ఎమ్మెల్యే సస్పెన్షన్ పై వాడివేడీ చర్చ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా రోజాను ఎలా సస్పెండ్ చేస్తారని స్పీకర్ ను జగన్ ప్రశ్నించారు. రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమన్నారు. రోజా మాటల్లో ఎలాంటి తప్పులేకున్నా.. ఆమెను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు మారినా రూల్స్ మారవని తెలిపారు. కాల్ మనీ వ్యవహారాన్ని టీడీపీ రాష్ట్రవ్యాప్త సమస్యగా చేసిందని పేర్కొన్నారు. సభా హక్కులను ఉల్లంఘించే అధికారం కోర్టులకు లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాల్ మనీతో వందల కోట్లు సంపాదించారని ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు అన్నారు. కెమెరాలకు అడ్డుగా నిలబడి సభను జరుగనీయకపోవడం సరికాదని హితవు పలికారు. సస్పెండ్ అయిన సభ్యులు సభా ఆవరణలోకి కూడా రాకూడదన్నారు.
రోజాకు పట్టిన గతే మీకు పడుతుంది... అచ్చెన్నాయుడు
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 'జగన్ మాటలు విని... వైసిపి సభ్యులు సభలో అప్రజాస్వామ్యంగా ప్రవర్తిస్తే... రోజాకు పట్టిన గతే మీకు పడుతుంది' అని హెచ్చరించారు. సభలో తాము ఎప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. 

 

 

 

 

 

ప్రారంభమైన ఎపి అసెంబ్లీ సమావేశాలు...

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు.

 

09:11 - December 19, 2015

హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై నేడు ఎపి అసెంబ్లీ దద్దరిళ్లనుంది. నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేశారని వైసిపి సభ్యులు పేర్కొంటున్నారు. సస్పెన్షన్ పై అసెంబ్లీలో నిరసన తెలపాలని నిర్ణయించారు. ఇవాళ శాసనసభముందుకు 5 బిల్లులు రానున్నాయి. ఎపి ఎలక్ట్రిసిటి డ్యూటీ బిల్లు, మౌలిక సదుపాయాల సవరణ బిల్లు, దేశీయంగా తయారయ్యే విదేశీమద్యం సవరణ బిల్లు, సముద్ర ప్రాంతాల అభివృద్ధి మండలి బిల్లులు అసెంబ్లీ ముందుకు రానున్నాయి.

 

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. రాత్రి 12గంటలకు హైదరాబాద్‌ నుంచి కోల్‌కతాకు బయల్దేరాల్సిన స్పైస్‌జెట్‌ విమానం రద్దు కావడంతో 150 మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆలస్యం అని చెప్పిన విమానాశ్రయ అధికారులు, ఆ తర్వాత ఫ్టైల్ ను రద్దు చేసినట్లు స్పైస్‌జెట్‌ అధికారులు చెప్పడంతో ప్రయాణికులకు దిక్కుతోచలేదు. శనివారం సాయంత్రం వరకు మరో విమానం లేదని స్పైస్‌జెట్‌ ప్రతినిధులు స్పష్టం చేయడంతో ప్రయాణికులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. అత్యవసర పరిస్థితుల నిమిత్తం వెళ్లేందుకు టికెట్లు తీసుకున్న వారు ఆవేదనకు గురయ్యారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌.. 440 మందిపై కేసులు

హైదరాబాద్ : మద్యం మత్తులో వాహనాలు నడిపిన పలువురిపై కేసులు నమోదు అయ్యాయి. ఈనెల 9 నుంచి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన 440 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరందర్నీ కోర్టులో హాజరు పరిచారు. 138 మందికి శిక్ష పడింది. వీరిలో ఇద్దరికి 10 రోజులు, ముగ్గురుకి ఏడు రోజులు, నలుగురికి ఐదు , ఎనిమిది మందికి మూడు , 15 మందికి రెండు, 20 మంది ఒకరోజు, 86 మందికి జరిమానాతో పాటు కోర్టు సమయం ముగిసేంత వరకు హాల్‌లోనే ఉండాలంటూ న్యాయస్థానం ఆదేశించింది.

లారీ బోల్తా... ముగ్గురికి గాయాలు

నల్గొండ : నార్కట్‌పల్లిశివారులోని జాతీయ రహదారిపై ఓ లారీ బోల్తా పడింది. ఈప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై లారీ బోల్తాపడటంతో ట్రాఫిక్ జామ్ అయింది. 

08:28 - December 19, 2015

విజయవాడ : అంగన్‌వాడీల చలో విజయవాడ కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. అంగన్‌వాడీల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడంతో పలువురు స్పృహ కోల్పోయారు. వారి ఆందోళన జరుగుతున్న వేళే అసెంబ్లీలో చంద్రబాబు వేతనాలపై ప్రకటన చేశారు. దీనిపై అంగన్‌వాడీలు, సిఐటియు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మరో బూటకపు ప్రకటన అంటూ ఆరోపించారు.
20 మంది అంగన్‌వాడీలకు అస్వస్థత
అంగన్‌వాడీల చలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. అంగన్‌వాడీల ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సిఎం క్యాంపు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో 20 మంది అంగన్‌వాడీలు అస్వస్థతకు గురయ్యారు. ర్యాలీకి మద్దతు తెలిపిన సిపిఎం, సిఐటియు నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
సిఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నం
వేతనాల పెంపు, తదితర డిమాండ్లతో అంగన్‌వాడీలు కొంతకాలంగా విజయవాడలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అంగన్‌వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సిఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు.
వేతనాల పెంపుకు సంబంధించి సిఎం ప్రకటన
అయితే అంగన్ వాడీల ఆందోళన నేపథ్యంలోనే అసెంబ్లీలో వేతనాల పెంపుకు సంబంధించి సిఎం ప్రకటన చేశారు. అంగన్‌వాడీల వేతనాలు 4,200 నుంచి 7వేలకు, మినీ అంగన్‌వాడీల వేతనాలు 2,950 నుంచి 4,500కు పెంచుతున్నట్లు, హెల్పర్ల జీతాలు 2200 నుంచి 4,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ఇది 2016 బడ్జెట్‌ సమావేశాల తర్వాత నుంచి అమల్లోకి వస్తుందన్నారు. వేతనాల పెంపు ఆర్థిక వ్యవస్థపై భారమైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
చంద్రబాబు ప్రకటనపై ప్రజాసంఘాలు అభ్యంతరం
చంద్రబాబు ప్రకటనపై అంగన్‌వాడీ నేతలు, సిఐటియు, ఎఐటియుసి, సిపిఎం అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది మరోసారి తప్పించుకోవడానికి బాబు చేసిన బూటకపు ప్రకటన అని విమర్శించారు. చంద్రబాబు మాటలు మోసపూరితమైనవని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ అన్నారు.
వేతనాల పెంపుపై జీవో విడుదల చేయాలన్న అంగన్ వాడీ నేతలు
వేతనాల పెంపుపై సిఎం చేసిన ప్రకటన నమ్మశక్యంగా లేదని వేతనాలు పెంచుతూ వెంటనే జీవో విడుదల చేయాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్‌ హెల్పర్స్ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బేబీరాణి, సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. వేతనాల పెంపుపై జీవో వచ్చినదాకా చంద్రబాబు హామీలను నమ్మబోమని సిఐటియు స్పష్టం చేసింది. జీవో రాకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది.

 

08:11 - December 19, 2015

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల తొలగింపు వివాదానికి హైకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టింది. 6 లక్షల 30 వేల ఓట్ల తొలగింపులో ఎలాంటి రాజకీయ కోణం లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం నివేదికను సమర్ధించింది. మరో లక్ష 60 వేల ఓట్లు అదనంగా తొలగిస్తున్నారని పిటిషనర్ వాదనలకు ఏకీభవించని ఉన్నత న్యాయస్థానం..ఇంకా ఎలాంటి విచారణ అవసరం లేదని కేసును క్లోజ్‌ చేసింది.
ఓట్ల తొలగింపుపై దుమారం
జీహెచ్ ఎంసీ ఎన్నికల ముందు ఓట్ల తొలగింపు అంశం పెద్ద దుమారే రేగింది. 6 లక్షల 30 వేల ఓట్లు తొలగించారని అప్పటి కమిషనర్ సోమేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై సీ.ఈ.సీ. ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు ఫిర్యాదులు స్వీకరించి నివేదికను సమర్పించింది. అయితే ఇదే ఇష్యూలో సోమేష్‌ పై బదిలీ వేటు పడిందనే చర్చ జరిగింది. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి టిఆర్ ఎస్ అధికార దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. పలు మార్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత నగేష్ ముదిరాజ్, అడ్వకేట్ జంద్యాల రవిశంకర్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్లను అక్రమంగా తొలగించారని ఎన్నికల పక్రియను ఆపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పక్రియపై పూర్తి నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.
ఓట్ల తొలగింపులో రాజకీయ దురుద్దేశం లేదన్న సీఈసీ నివేదిక
ఓట్ల తొలగింపులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని సీఈసీ నివేదికలో తెలిపింది. 6 లక్షల 30 వేల మందిలో చనిపోయిన వారు, ఇంటికి లాక్ వేసినవారు, ప్రస్తుతం ఆ అడ్రస్‌లో లేని వారు ఉన్నారని.. వారి పేర్లనే తొలగించామని తెలిపారు. దీనికి పై అభ్యంతరాలు స్వీకరించి దరఖాస్తు చేసుకున్న వారికి మళ్లీ ఓటు హక్కు కల్పించారని స్పష్టం చేశారు. అయితే మరో లక్ష 60 వేల ఓట్లను తొలగించేందకు జీహెచ్ ఎంసీ సిద్ధంగా ఉందని అడ్వకేట్ జంద్యాల రవిశంకర్ తెలిపారు. దీనిపై ఎలాంటి ఆధారాలు లేకపోవడం.. రెండు ఓట్లు ఉన్న వారి లెక్కలు తీసిన సమయంలో లక్షా 50 వేల మంది ఉన్నట్లు గుర్తించామని జీహెచ్ ఎంసీ తరుపు న్యాయవాధి వాదనలు వినిపించారు. ఇరు వాదనలను, సీ.ఈ.సీ. నివేదికను క్షుణంగా పరిశీలించిన జస్టిస్ నాగార్జున రెడ్డి ఎన్నికలు అయిపోయేంత వరకు ఎలాంటి ఓటర్లను ఇక తొలగించరాదని జీహెచ్ ఎంసీకి ఆదేశాలు జారీచేశారు. తదుపరి విచారణలో ఎలాంటి వాదనలు వినాల్సిన అవసరం లేదంటూ పిటిషన్‌ను డిస్పోజ్ చేశారు.
ఓటర్ల తొలగింపు పక్రియపై హైకోర్టు స్పష్టమైన తీర్పు
ఓటర్ల తొలగింపు పక్రియపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మరోవైపు రిజర్వేషన్ల జాబితా విడుదల అయితే ఉన్నత న్యాయస్థానానికి మరికొన్ని పిటిషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కుల వర్గీకరణపై సమగ్ర సర్వే లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జనవరి మొదటి వారంలోపు నోటిఫికేషన్ విడుదల చేసి హైకోర్టు ఆదేశాల మేరకు జనవరి 31 వరకు ఎన్నికల ప్రకియ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

 

07:44 - December 19, 2015

గుంటూరు : ఏపీ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ ఆస్పత్రి నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరుగనుంది. సుమారు 193 ఎకరాల్లో 1618 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆస్పత్రిని మంగళగిరిలో నిర్మిస్తున్నారు. దీన్ని ఉదయం 11 గంటలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, అశోక గజపతిరాజు పలువురు నేతలు పాల్గొంటారు. ఈ ఆస్పత్రికి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరును ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

 

07:41 - December 19, 2015

హైదరాబాద్‌ : నగరంలోని వెస్ట్ జోన్‌ పరిధిలోని జియాగూడ సంజయ్‌నగర్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. 13 మంది రౌడీషీటర్లు.. ఎనిమిది మంది అనుమానితులు,.. ఇద్దరు నేర చరిత్ర కలిగిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా పత్రాలు లేని 60 ద్విచక్రవాహనాలను.. మూడు ఆటోలను సీజ్‌ చేశారు.

 

ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌ : ప్రయాణికుల సౌకర్యం కోసం మూడు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ -యశ్వంతపూర్ సువిధ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు లింగం పల్లి, తాండూర్, యాద్‌గిరి, రాయచూర్, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యెలహంకలలో హాల్టింగ్ కలదు. సికింద్రాబాద్ - తిరుపతి సూపర్ ఫాస్ట్ రైలుకు ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తారు. ఈ రైలుకు కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోల్, నెల్లూర్, గూడూర్, రేణిగుంటలలో హాల్టింగ్ ఉంది. ఈ రైళ్లకు నేటినుంచి బుకింగ్ ప్రారంభమవుతుంది.

నేడు మంగళగిరిలో ఎయిమ్స్ కు శంకుస్థాపన

గుంటూరు : జిల్లాలోని మంగళగిరిలో ఎయిమ్స్ కు నేడు శంకుస్థాపన జరుగనుంది. సీఎం చంద్రబాబు, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 

నేడు స్పీకర్ కు వైసిపి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు...

హైదరాబాద్ : ఎపి స్పీకర్ కోడెల శివప్రసాద్ కు నేడు వైసిపి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనుంది.  

హైదరాబాద్ కుల్సుంపురాలో పోలీసుల కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : కుల్సుంపురా పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్టు జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 13 మంది రౌడీ షీటర్లను అరెస్టు చేశారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 60 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. 

Don't Miss