Activities calendar

20 December 2015

రాష్ట్ర అభివృద్ధిలో క్రైస్తవులు భాగస్వామ్యం కావాలి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : క్రైస్తవుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లోని నిజాంకాలేజీ మైదానంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. జెరూసలెం వెళ్లేందుకు ఆర్థిక సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. క్రైస్తవుల సమాధుల కోసం స్థలాలు కేటాయిస్తామన్నారు. జనవరి మొదటివారంలో బిషప్ లతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో క్రైస్తవులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దళిత్ క్రిస్టియన్ల సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని వివరించారు.

21:54 - December 20, 2015

నవమన్మథుడు సినిమా హీరోహీరోయిన్స్ ధనుష్, సమంతలు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ఆ సినిమాకు సంబంధించిన విషయాలను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

21:51 - December 20, 2015

హైదరాబాద్ : క్రైస్తవుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లోని నిజాంకాలేజీ మైదానంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. జెరూసలెం వెళ్లేందుకు ఆర్థిక సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. క్రైస్తవుల సమాధుల కోసం స్థలాలు కేటాయిస్తామన్నారు. జనవరి మొదటివారంలో బిషప్ లతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో క్రైస్తవులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దళిత్ క్రిస్టియన్ల సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని వివరించారు.

 

21:43 - December 20, 2015

హైదరాబాద్ : పేదరిక నిర్మూలనలో కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు కెకె.శైలజ విమర్శించారు. హైదరాబాద్ లోని ఈసీఐఎస్ లో సీపీఎం గ్రేటర్‌ కమిటీ నిర్వహించిన మలయాళీయుల సమావేశానికి ఆమె హాజరై, మాట్లాటడారు. సామాన్యులకు గాలికి వదిలేసి ఈ పార్టీలు.. కార్పొరేట్లకు జాతి సంపదను కట్టబెడుతున్నాయని శైలజ మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మలయాళీలందరూ ఐక్యంగా అభివృద్ధి చెందాలన్నారు

 

 

21:28 - December 20, 2015

విజయవాడ : ఎపి ప్రభుత్వం బలవంతపు భూసేకరణ ఆపాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. విజయవాడలో జరిగిన ఆ పార్టీ పట్టణప్రాంత బాధ్యుల రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొని, మాట్లాడారు. భోగాపురం భూముల విషయంలో సీపీఎం నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. భూసేకరణపై పాదయాత్ర చేపట్టిన నేతలను అన్యాయంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు.

 

21:20 - December 20, 2015

ఢిల్లీ : బిగ్ బాష్ టీ-20 లీగ్ లో మెల్బోర్న్ స్టార్స్ పై సిడ్నీథండర్ ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. సూపర్ హిట్టర్ కెవిన్ పీటర్సన్ సిక్సర్ల మోతతో...మెల్బోర్న్ స్టేడియం హోరెత్తిపోయింది. ఐదు బౌండ్రీలు, ఆరు సూపర్ సిక్సర్లతో 76 పరుగుల స్కోరు సాధించినా తనజట్టుకు విజయం అందించ లేకపోయాడు. అంతకుముందు ఓపెనర్ ఉస్మాన్ క్వాజా అన్ బీటెన్ సెంచరీతో సిడ్నీ థండర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు సాధించింది. సమాధానంగా మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు175 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగింది.

21:18 - December 20, 2015

ఢిల్లీ : మాజీ క్రికెటర్‌, ప్రస్తుత బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌ తన సొంత పార్టీకే షాక్‌ ఇచ్చారు. ఢిల్లీ క్రికెట్‌ ఆసోసియేషన్‌లో అవినీతికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశాలను బేఖాతరు చేస్తూ కీర్తి ఆజాద్‌ ప్రెస్ మీట్‌ నిర్వహించారు. వీకీలీక్స్‌ ఫోర్‌ ఇండియా అనే సంస్థ నిర్వహించిన ఓ స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోను కీర్తి ఆజాద్‌ బయటపెట్టారు. స్టింగ్‌ ఆపరేషన్‌లో డీడీసీఎ పలు కాంట్రాక్టులను 14 నకిలీ కంపెనీలకు అందజేసినట్లు ఆరోపించారు. డీడీసీఏ పలు కాంట్రాక్టులను టెండర్లు పిలవకుండానే నకిలీ కంపెనీలకు కట్టబట్టిందని ఆరోపించారు. అంతేకాదు ఈ వ్యవహారంపై ఈడీ, డైరక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

 

21:13 - December 20, 2015

కరీంనగర్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో 56 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. స్వామి క్షేత్రంలో మూలవాగుపై బ్రిడ్జీల నిర్మాణానికి 28 కోట్లు, ఊరు చుట్టూ బైపాస్‌ ఫోర్‌వే రోడ్లకు 38 కోట్ల పనులకు భూమిపూజ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇంటింటికి మరుగుదొడ్ల కార్యక్రమం వేములవాడ నియోజకవర్గంలో 100శాతం పూర్తికావడం హర్షించదగ్గ విషయమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 59 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి రాబోయే 5ఏళ్లలో చేసిచూపిస్తామన్నారు.  

21:09 - December 20, 2015

హైదరాబాద్ : నీటి పారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీష్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావులు పాల్గొన్నారు. గోదావరిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల పనులను జనవరిలో ప్రారంభింని సీఎం ఆదేశించారు. అదేవిధంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. ప్రాజెక్టులపై సీఎంల స్థాయి ఒప్పందానికి కేసీఆర్‌ ప్రతిపాదన చేశారు. తుమ్మిడిహట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులతో మహారాష్ట్రలో ముంపు ఉండదని కేసీఆర్‌ తెలిపారు. కేసీఆర్‌ ప్రతిపాదనపై ఫడ్నవీస్‌ సానుకూలంగా స్పందించారు. ఇక త్వరలో మంత్రి హరీష్‌రావు బృందం మహారాష్ట్రలో పర్యటించనుంది. ప్రాజెక్టుల పూర్తిస్థాయి వివరాలను హరీష్‌రావు మహారాష్ట్ర అధికారులకు అందించనున్నారు.

 

నీటి పారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్ : నీటి పారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీష్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావులు పాల్గొన్నారు. గోదావరిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల పనులను జనవరిలో ప్రారంభింని సీఎం ఆదేశించారు. 

20:50 - December 20, 2015

కార్మికుల పోరాటం ఫలించింది... ఎర్రజెండా చేతబట్టి చేసిన ఉద్యమాలు, ఆందోళనలకు తెలంగాణ సర్కారు దిగివచ్చింది... 300 రోజులకు పైగా సాగించిన దీక్షలకు ముగింపు తరుణం వచ్చేసింది. వేలాది మంది కార్మికులు ఎదురుచూస్తున్న శుభ పరిణామం ఆసన్నమైంది.. రెండు సంవత్సరాలుగా మూతబడ్డ బిల్ట్‌ పరిశ్రమ తలుపులు తెరుచుకోనున్నాయి.
ప్రసిద్ధి చెందిన ఆజంజాహి, బిల్ట్‌ పరిశ్రమలు 
ఉత్తర తెలంగాణకు గుండెకాయలాంటి వరంగల్‌ జిల్లాలో ఆజంజాహి, బిల్ట్‌ పరిశ్రమలు ప్రసిద్ధమైనవి. ఆజంజాహీ మిల్లు కనుమరుగై పోగా.. మిగిలిన ఏకైక అతిపెద్ద బిల్ట్‌ ఫ్యాక్టరీ కూడా రెండేళ్ల క్రితం మూతబడింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కొద్ది రోజుల ముందే బిల్ట్‌ యాజమాన్యం పరిశ్రమను మూసివేసింది.
బిల్ట్ పరిశ్రమకు పాతికేళ్ల చరిత్ర
బిల్ట్ పరిశ్రమకు పాతికేళ్ల చరిత్ర ఉంది. వరంగల్‌ జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్‌ గ్రామం వద్ద.. 1975లో ఈ సంస్థ శ్రీకారం చుట్టుకుంది. థాపర్‌ యాజమాన్యం.. రేయాన్స్‌ పేరిట ఫ్యాక్టరీ పనులను మొదలు పెట్టింది. ప్రభుత్వం నుంచి 610 ఎకరాల భూమిని పొందిన థాపర్‌ యాజమాన్యం... 1981నాటికి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించింది.
రేయాన్స్ ఫ్యాక్టరీలో.. కలప గుజ్జును తయారీ
రేయాన్స్ ఫ్యాక్టరీలో.. కలప గుజ్జును తయారు చేసేవారు. ఏటా 90వేల మెట్రిక్‌ టన్నుల గుజ్జును ఉత్పత్తి చేసేవారు. ఫ్యాక్టరీలో 705 మంది రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు.. 450 మంది నాన్‌పీఎఫ్‌, 320 మంది పీఎఫ్‌ కార్మికులు పనిచేసేవారు. కాంట్రాక్ట్‌ కార్మికులతో పాటు మరో 5వేల మంది కార్మికులూ పని చేసేవారు. కాలక్రమంలో రేయాన్స్‌ ఫ్యాక్టరీ కాస్త బిల్ట్ గా రూపాంతరం చెందింది.
ఒక్కసారిగా డిమాండ్‌ తగ్గిపోయింది...ఎందుకిలా..?
బిల్ట్ ఫ్యాక్టరీ 2013వ సంవత్సరం చివరి వరకూ బ్రహ్మాండంగా నడిచింది. అయితే.. 2014 జనవరి నెల నుంచి సంస్థకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఫ్యాక్టరీ ఉత్పత్తి చేసే పేపర్‌ గుజ్జుకు ఒక్కసారిగా డిమాండ్‌ తగ్గిపోయింది. ఎందుకిలా..?
టన్ను గుజ్జును రూ 6వేలకు కొన్న గ్రాసిం సంస్థ
బిల్ట్ ఫ్యాక్టరీలో 2013 వరకూ ఉత్పత్తి జోరుగా సాగేది. ఇక్కడి ఉత్పాదనను మధ్యప్రదేశ్‌లోని గ్రాసిం సంస్థ కొనుగోలు చేసేది. బిల్ట్‌ ఉత్పత్తి చేసే నాణ్యమైన పేపర్‌ గుజ్జును.. గ్రాసిం సంస్థ.. టన్నుకు ఆరువేల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడంతో.. మంచి లాభాలు వచ్చేవి. అయితే.. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకునే క్రమంలో.. గ్రాసిం సంస్థ.. కెనెడాలో స్వయంగా ఓ పల్ప్‌ ఉత్పత్తి ఫ్యాక్టరీని ప్రారంభించింది.
బిల్ట్ కు ఆర్డర్‌లు నిలిపివేసిన గ్రాసిం సంస్థ
తమ సంస్థకు అవసరమైన పల్ప్ ను స్వయంగా ఉత్పత్తి చేసుకుంటున్న గ్రాసిం సంస్థ.. బిల్ట్ కు ఆర్డర్‌లను ఆపేసింది. పైగా విదేశీ గుజ్జు టన్ను 4వేలకే దిగుమతి అవుతుండడమూ.. బిల్ట్‌ సంస్థ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. తమ ఉత్పత్తికి మార్కెట్‌ లేకపోవడంతో.. 2014 ఏప్రిల్‌ నెల్లో గుజ్జు ఉత్పత్తిని నిలిపేసింది బిల్ట్‌ యాజమాన్యం. ఏప్రిల్‌ ఐదు నుంచి పీఎఫ్‌, నాన్‌ పీఎఫ్‌ కార్మికులను విధులకు రావద్దని, పర్మనెంట్‌ కార్మికులకు మాత్రం నెలనెలా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఏప్రిల్‌ 6 నుంచి సంస్థను మూసేశారు.
కర్మాగారంలోనే 6వేల టన్నుట గుజ్జు నిల్వలు
సంస్థను మూసేసేనాటికి.. ఉత్పత్తి చేసిన 6వేల టన్నుల గుజ్జు కర్మాగారంలోనే ఉండిపోయింది. దీనికి తోడు గ్రాసిం కంపెనీలో మరో 18వేల టన్నుల గుజ్జు నిల్వలు పేరుకు పోయాయి. మొత్తం 24 వేల టన్నుల గుజ్జు అమ్ముడవక పోవడంతో.. పర్మనెంట్‌ కార్మికులకూ వేతనాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. దీంతో.. బిల్ట్‌ యాజమాన్యం జూన్‌ 21న లేఆఫ్‌కు దరఖాస్తు చేసింది.
మూతబడిన బిల్ట్ ఫ్యాక్టరీ
తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న తరుణంలో బిల్ట్ ఫ్యాక్టరీ మూతబడింది. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఈ సంస్థను తెరిపించే ప్రయత్నాలేవీ చేయలేదు. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ అంశం సీఎం కేసీఆర్‌ దృష్టికి రావడంతో.. ఆయన పలు దఫాలుగా సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపి పరిస్థితిని సానుకూల పరిచారు. వరంగల్‌లో దాదాపు రెండేళ్లుగా మూతబడ్డ బిల్ట్‌ ఫ్యాక్టరీ అంశాన్ని జిల్లా ప్రజా ప్రతినిధులు... సీఎం కేసీఆర్‌ దృష్టికి తెచ్చారు. ఆయన చొరవతో... రాష్ట్ర ప్రభుత్వం బిల్ట్‌ యాజమాన్యంతో చర్చలు జరిపింది. అయితే ప్రభుత్వం చొరవ చూపినా సరిగా స్పందించని బిల్ట్‌ యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా ఈఏడాది ఫిబ్రవరి 9 నుంచి రిలే నిరాహార దీక్షలూ చేపట్టారు
ఏప్రిల్‌ 22న బిల్ట్ యాజమాన్యంతో సీఎం కేసీఆర్‌ చర్చలు
కార్మికుల ఆందోళనలు ఉధృత రూపం దాల్చడంతో... ఈఏడాది ఏప్రిల్‌ 22న సీఎం కేసీఆర్‌ బిల్ట్‌ యాజమాన్యంతో చర్చలు జరిపారు. ముడి సరుకులకు రాయితీలు ఇస్తామన్నారు. కానీ వారు స్పందించలేదు. మళ్లీ ప్రభుత్వమే చొరవ తీసుకొని బిల్ట్‌ యాజమాన్యాన్ని సంప్రదించింది. ఈఏడాది సెప్టెంబరు 22న హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఉన్నత యాజమాన్యం బిల్టు పునఃప్రారంభానికి సుముఖత చూపడంతో కర్మాగారంపై మళ్లీ ఆశలు చిగురించాయి. ఏజెన్సీ ప్రాంతంలోని 5వ షెడ్యూల్‌లో కర్మాగారం ఉండడంతో.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ... ఎంత ఖర్చయినా సరే తెరిపించాలని సీఎం దృఢసంకల్పంతో ఉండడం వల్లే.. పునఃప్రారంభానికి బాటలు పడ్డాయి.
కలప ఇబ్బంది తొలగించేందుకు ఏపీ సర్కారుతో చర్చ

తెలంగాణ సర్కారు... బిల్ట్‌ యాజమాన్యంతో అనేకమార్లు చర్చలు జరిపింది. రాయితీలతో కలప, విద్యుత్‌, బొగ్గును సరఫరా చేస్తే తెరుస్తామని సంస్థ ప్రకటించింది. దీంతో ఏడాదికి 30 కోట్లు చొప్పున ఏడేళ్లపాటు 210 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కలప సరఫరా ఇబ్బందులు తొలగించేందుకు ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడతామని తెలిపింది. సీఎం హామీతో ఖాయిలాపడిన బిల్ట్‌ పరిశ్రమను ప్రారంభించేందుకు యాజమాన్యం అంగీకరించింది.
టెన్‌టీవీ, సీపీఎం, సీఐటీయూల పాత్ర
బిల్ట్ ఫ్యాక్టరీ పునః ప్రారంభంలో.. టెన్‌టీవీ, సీపీఎం, సీఐటీయూల పాత్ర విస్మరించరానిది. కార్మికుల ఆందోళనలకు సీపీఎం దాని అనుబంధ కార్మిక సంఘం అడుగడుగునా అండగా నిలిచాయి. కంపెనీని తెరిపించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైనా.. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంపైనా ఒత్తిళ్లు పెంచాయి. గమ్యాన్ని ముద్దాడే వరకూ.. బిల్ట్‌ కార్మికులకు, ప్రభుత్వాలకు.. సీపీఎం, సీఐటీయూ.. టెన్‌టీవీలు వారధులుగా నిలిచాయి. నిరుడు ఏప్రిల్‌లో బిల్ట్‌ ఫ్యాక్టరీ మూతబడింది మొదలు.. ఇందులో పనిచేసిన కార్మికులు.. ఆందోళనబాట పట్టారు. వీరికి సీపీఎం, సీఐటీయూలు అండగా నిలిచాయి. తినడానికి తిండి కరవై.. పిల్లలను చదివించుకోలేని దుస్థితిలో.. చాలామంది కార్మికులు వలసలు వెళ్లారు. అయినా.. మిగిలిన కార్మికులు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు మొక్కవోని ధైర్యంతో శాంతియుత పోరాటాలు సాగించారు. ర్యాలీలు, ధర్నాలతో దద్ధరిల్లజేశారు. పాదయాత్రలు కొనసాగించారు. చివరకు పోలీసుల చేతిలో లాఠీదెబ్బలూ తిన్నారు.
బిల్ట్ కార్మికుల వెతలపై కథనాలు ప్రసారం చేసిన 10 టివి
బిల్ట్ పరిశ్రమ ఆవిర్భావం మొదలు.. కార్మికుల చెమట చుక్కలను.. యాజమాన్యం లాభాలుగా మలచుకున్న వైనాన్ని టెన్‌టీవీ కథనాలు ప్రసారం చేసింది. రోడ్డుపాలైన కార్మిక కుటుంబాల వెతలు.. వలసలు.. తదితర దైన్య కథనాలను ప్రసారం చేసింది. ఇటీవల జరిగిన వరంగల్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని ప్రధాన ప్రజా అజెండాగా మార్చింది.. టెన్‌టీవీ. కార్మిక సంఘాలన్నీ ఏకమై కార్మిక ఐకాసగా ఏర్పడి ఉద్యమించడం.. టెన్‌టీవీ వరుస కథనాల ప్రసారంతో.. హామీని నిలుపుకొని తీరాల్సిన అగత్యం ప్రభుత్వానికి ఏర్పడింది.
టెన్‌టీవీ వరుస కథనాలు.. ప్రభుత్వంపై ఒత్తిడి
టెన్‌టీవీ వరుస కథనాలు.. సీపీఎం, సీఐటీయూల ఉద్యమాలు.. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి. చివరికి ఈ ఫ్యాక్టరీని తెరిపించేందుకు దోహదపడ్డాయి. ఫ్యాక్టరీ మళ్లీ తెరుచుకుంటుందన్న వార్తలు విని వీరంతా సంబురాల్లో మునిగిపోయారు. తమకు దన్నుగా నిలిచిన సీపీఎం, టెన్‌టీవీలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. సమస్యను సానుభూతితో పరిష్కరించి తమ జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌కు క్షీరాభిషేకాలతో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

 

నిజాంకాలేజీ మైదానంలో క్రిస్మస్ వేడుకలు

హైదరాబాద్ : నిజాంకాలేజీ మైదానంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, కేకేతోపాటు పలువురు హాజరయ్యారు. 

రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

ఉత్తరప్రదేశ్ : మీర్జాపూర్‌ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక లాల్‌గంజ్‌ ప్రాంతంలోని ఖియారహి గ్రామంలో ఓ ట్రక్కు ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను తప్పించబోయి ఆటోను ఢీకొంది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

ఎంపీ కవిత ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ : నిజామాబాద్ ఎంపీ కవిత ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని సారంగాపూర్ మండలం పోతారంలో జరిగింది. అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తనపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

 

19:30 - December 20, 2015

తిరుపతి : వైకుంఠ ఏకాదశి దర్శనానికి తిరుమలలో భక్తులు పోటెత్తారు. క్యూకాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్‌లన్నీ నిండి.. క్యూలైన్లు బయటకు వచ్చాయి. ఇక బయట ఉన్న భక్తులందరూ టీటీడీ నారాయణగిరి ఉద్యానవనంలో సేద తీరుతున్నారు. వీరిని రేపు ఉదయం నాలుగు గంటలకు క్యూలైన్‌లోకి అనుమతిస్తారు. దాదాపు 60 వేల మంది భక్తులు వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం క్యూలైన్లలో వేచివున్నారు. ఇక ఏర్పాట్లను టీటీడీ ఈవో, జేఈవోలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 

19:07 - December 20, 2015

ఢిల్లీ : నిర్భయ కేసులో బాల నేరస్థుడు విడుదలయ్యాడు. ఢిల్లీలోని ఓ ఎన్జీవో సంరక్షణలో బాల నేరస్థుడు ఉండనున్నాడు. బాల నేరస్థుడి విడుదలను వ్యతిరేకిస్తూ నిర్భయ తల్లిదండ్రులు, మహిళా సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. తమ కూతురిని అత్యాచారం చేసిన దోషిని విడుదల చేయవద్దంటూ నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ మహిళా కమిషన్‌ శనివారం హైకోర్టుకు అప్పీల్‌ చేశాయి. చట్ట ప్రకారం పిన్న వయస్కుడైన దోషి విడుదలను ఆపడం కుదరదని హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివల్‌.. దోషి విడుదలపై స్టే విధించాలని అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఏకే గోయెల్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌ల ధర్మాసనం విచారించి విడుదలపై స్టే విధించడానికి నిరాకరించింది. ఈ అంశంపై తదుపరి విచారణ సోమవారం చేపడతామని ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో తెలిపింది.

 

19:00 - December 20, 2015

హైదరాబాద్ : ప్రముఖ నటుడు రంగనాథ్‌ అంత్యక్రియలు బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో ముగిశాయి. రంగనాథ్‌ బౌతికకాయానికి తనయుడు నాగేంద్ర చితిపెట్టారు. అంత్యక్రియలకు భారీగా అభిమానులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ రంగనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కడసారి కన్నీటి నివాళులర్పించారు. రంగనాథ్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
షాక్ కు గురయ్యా - చిరంజీవి..
రంగనాథ్‌తో తనకు 35ఏళ్లకుపైగా అనుబంధం ఉందని నటుడు, కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులు చిరంజీవి అన్నారు. ఫిల్మ్‌చాంబర్లో ఉన్న రంగనాధ్ పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చిరంజీవి...వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. రిటైర్‌మెంట్‌ లైఫ్‌ని ఎంతో ఉల్లాసంగా గడుపుతున్నానని చెప్పిన రంగనాథ్‌ ఇవాళ ఇలా అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం తనను షాక్‌కు గురి చేసిందన్నారు.
తీరని లోటు - మంత్రి తలసాని..
రంగనాథ్‌లాంటి సీనియర్ నటుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం సినిపరిశ్రమకు తీరని లోటని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వారం రోజుల క్రితమే తనదగ్గరకు వచ్చి...ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషికి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కట్టించాలని తనను అడిగారని మంత్రి గుర్తు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా వరుస సంఘటనలు జరగడం పరిశ్రమ వర్గాలను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు.
తీవ్రంగా కలిచి వేస్తోంది - పరుచూరి..
రంగనాథ్‌లాంటి గొప్ప జ్ఞాని ఇలా ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని ఎండ్‌ చేసుకోవడం చిత్రపరిశ్రమను తీవ్రంగా కలిచివేస్తోందని సినీ రచయిత పరచూరి వెంకటేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1973లో సినీరంగంలోకి తనతో పాటు రంగనాథ్‌ ఇంకా అనేకమంది వచ్చామని సీనియర్ నటుడు మురళీమోహన్‌ అన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు రంగనాథ్‌తో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించామని ..కానీ ఇవాళ అందరిని వదిలిపెట్టి ఆయన వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంచి మనస్సున్న వ్యక్తి - రాజేంద్రప్రసాద్...
రంగనాథ్‌లాంటి ఒక మంచి మనుసున్న వ్యక్తిని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయిందని మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. తనకు, తన కుటుంబానికి రంగనాథ్‌తో ఉన్న సాన్నిహిత్యం మాటల్లో చెప్పలేనిదన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకొని సినీ ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మా తరపున రంగనాధ్‌గారికి , వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నామని తెలిపారు. మా తరపున రంగనాధ్ అంత్యక్రియల్ని నిర్వహిస్తామని రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.
స్నేహబంధం - గిరిబాబు..చలపతిరావు..
సీనియర్ నటుడు రంగనాథ్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని తోటి నటులైన గిరిబాబు, చలపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు. నటుడిగా కంటే తమ మధ్య స్నేహబంధమే ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మాతో చెప్పుకునేవాడని..కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని కలలో కూడా ఊహించలేదన్నారు. ఏది ఏమైనా రంగనాథ్‌ చనిపోవడం చిత్రపరిశ్రమకు తీరని లోటని..ఆ లోటును ఎవరూ పూడ్చలేరన్నారు.

 

18:51 - December 20, 2015

హైదరాబాద్ : ఎపిలో బార్ ఆండ్ రెస్టారెంట్లకు కొత్త పాలసీ ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం... బార్లు పెరుగనున్నాయి. ఈనెల 31తో ప్రస్తుత బార్ ల లైసెన్సులు ముగియనున్నాయి. జనవరి 1 నుంచి కొత్త పాలసీ అమలు కానుంది. 

18:50 - December 20, 2015

హైదరాబాద్ : ఎపి నూతన రాజధానిపై కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని భూములను ఇతరులెవ్వరికీ ఇవ్వలేదన్నారు. భూములిచ్చినవారందరికీ ఉద్యగాలివ్వాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఈనెల 23న డిగ్రీ, నాన్ డిగ్రీ హోల్డర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

18:47 - December 20, 2015

గుంటూరు : 'నేను ఎవరికీ వ్యతిరేకిని కాను' అని ఎపి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ అల్లరికి మారుపేరుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన అవకాశాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు. సభను రాజకీయపార్టీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సభ నిర్వహణ కత్తిమీద సములాంటిందని పేర్కొన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నామని తెలిపారు. అయితే సభనే నడవనీయమనే ఉద్దేశంతో వస్తే వారికే నష్టం కలుగుతుందని చెప్పారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలకు పోకుండా సభ సజావుగా నడిచేట్లు చూడాలని కోరారు. ప్రజా సమస్యలపై చర్చిస్తే ఉపయోగమన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించేందుకు అవసరమైతే సమావేశాలను కూడా పొడిగించుకోవచ్చన్నారు. ఎజెండాపై మాట్లాడితే మంచిదన్నారు.

18:21 - December 20, 2015

హైదరాబాద్ : ఉద్యోగ నియామకాల్లో బీసీలకు క్రిమిలేయర్ విధానం అమలు చేయడం సరికాదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్ కు ఆయన ఒక లేఖ రాశారు. క్రిమిలేయర్ పై విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల్లో కొన్ని వర్గాలు అభివృద్ధి చెందినంత మాత్రాన... అందరూ అభివృద్ధి చెందినట్లు భావించడం సరికాదన్నారు. టీడీపీకి బీసీలు అండగా ఉంటున్నారనే అక్కసుతోనే టీఆర్ ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

 

సీఎం కేసీఆర్ కు రేవంత్ లేఖ...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఉద్యోగ నియామకాల్లో బీసీలకు క్రిమిలేయర్ విధానం అమలు చేయడం సరికాదన్నారు. క్రిమిలేయర్ పై విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల్లో కొన్ని వర్గాలు అభివృద్ధి చెందినంత మాత్రాన... అందరూ అభివృద్ధి చెందినట్లు భావించడం సరికాదన్నారు. టీడీపీకి బీసీలు అండగా ఉంటున్నారనే అక్కసుతోనే టీఆర్ ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

 

ఎపిలో బార్ ఆండ్ రెస్టారెంట్లకు కొత్త పాలసీ

హైదరాబాద్ : ఎపిలో బార్ ఆండ్ రెస్టారెంట్లకు కొత్త పాలసీ ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం... బార్లు పెరుగనున్నాయి. ఈనెల 31తో ప్రస్తుత బార్ ల లైసెన్సులు ముగియనున్నాయి. జనవరి 1 నుంచి కొత్త పాలసీ అమలు కానుంది.

 

నిర్భయ కేసులో బాలనేరస్థుడి విడుదల

ఢిల్లీ : నిర్భయ కేసులో బాలనేరస్థుడిని విడుదల చేశారు. బాలనేరస్థుడి విడుదలను వ్యతిరేకిస్తూ.. ఇండియా గేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. నిర్భయ తల్లిదండ్రులు ఆందోళనలో పాల్గొన్నారు. బాల నేరస్థుడికి ఉరిశిక్ష వేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. 

నిర్భయ కేసులో బాలనేరస్థున్ని విడుదల చేయొద్దు : పురందేశ్వరి

హైదరాబాద్ : నిర్భయ కేసులో బాలనేరస్థుడిని జైలు నుంచి విడుదల చేయొద్దని కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆమె విలేకరులతో మాట్లాడారు. బాలనేరస్థుడిని విడుదల చేస్తే సమాజంలోకి మృగాన్ని వదిలినట్టేనని వ్యాఖ్యానించారు. 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణాల పేరుతో మహిళలను లైంగికంగా వేధించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులపై నిర్భయ కేసులు పెట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

 

17:14 - December 20, 2015

ఖమ్మం : జిల్లాలో కోట్లు విలువ చేసే ఖనిజాలను కొల్లగొడుతున్నారు. రాజకీయ పలుకుబడితో అధికారులను లొంగదీసుకొంటూ కోట్ల విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టుకుపోతున్నారు. గిరిజన ప్రాంతంలోని ఓన్‌ఆఫ్‌ సెవెంటీ చట్టాన్ని అపహస్యం చేస్తూ ఈ తతంగం సాగుతున్నా..పట్టించుకునే నాథుడే లేరు. ఖనిజ దోపిడిపై పలు పార్టీలు, గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
ఏజెన్సీ ప్రాంతం ఖనిజాలకు నిలయం
ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం ఖనిజాలకు నిలయం. దశాబ్దాల నుంచి ఇక్కడ మైనింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే బినామీల పేరుతో ఖనిజాన్ని కొందరు కొల్లగొట్టుకు పోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. దీంతో జిల్లాలోని గార్ల మండలం పోచారం వద్ద వందలాది ఎకరాల అటవీ భూముల్లో కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపద దోపిడికి గురవుతోంది.
గిరిజనేతరుల కనుసన్నల్లో మైనింగ్
జిల్లాలోని పలు ప్రాంతాల్లో బైరటీస్, డోలమైట్ నిక్షేపాలను వెలికి తీసేందుకు కొన్ని సంస్థలు గిరిజన సొసైటీల పేరుతో లీజులు పొందారు. ఇలా గార్ల ప్రాంతంలో ఐదు సంస్థలు లీజులు పొందాయి. పేరుకే గిరిజనులు కానీ..గిరిజనేతరుల కనుసన్నల్లోనే మైనింగ్ కొనసాగుతోంది. దశాబ్దాల క్రితం పోచారం, శేరిపురం గ్రామాల మధ్య ఉన్న 57, 58, 76 సర్వే నెంబర్లలో 812 ఎకరాలను గిరిజనుల ముసుగులో కొందరు బడాబాబులు మైనింగ్ తవ్వకాలకు అనుమతులు పొందారు. అయితే అనుమతులు పొందిన విశ్వభారతి మైనింగ్ కార్పోరేషన్, గిరిజనుల పేరుతో ఉన్న లక్ష్మి ఎస్టీ మైనింగ్ సంస్థలు..ఒకరి భూముల్లోకి మరొకరు అక్రమంగా తవ్వకాలకు దిగుతుండటం వివాదాస్పదంగా మారింది.
అధికారులకు భారీగా నజరానాలు
అధికారులకు భారీగా నజరానాలు ముట్టడంతో క్వారీల్లో భారీ ఎత్తున పొక్లైన్లతో ఖనిజాన్ని తవ్వి తరలిస్తున్నారు. నిత్యం లారీల కొద్దీ బెరైటీఎస్ ఖనిజం కడపకు తరలిపోతుంది. అయినా అధికారులు నోరుమెదపడంలేదు. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల లావాదేవీలు వన్ ఆఫ్ సెవెంటీ, పీసా చట్టం ప్రకారం నేరం. అయినా..రాజకీయ పలుకుపడితో కోట్ల విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టుకు పోతున్నారు. దీనిపై పలు పార్టీలు, గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
కోట్ల విలువైన ఖనిజం తరలింపు
ప్రపంచంలో చైనా తర్వాత బెరైటీస్ ఎక్కువగా లభించేది మన దేశంలోనే. ఈ ఖనిజాన్ని రంగులు, ప్లాస్టిక్, పేపర్, దుస్తులు, పెట్రో ఉత్పత్తుల వెలికితీత సమయంలో ఉపయోగిస్తారు. దీంతో మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. టన్ను 3 వేల వరకు ధర పలికడంతో..కోట్ల విలువైన ఖనిజాన్ని గిరిజన ప్రాంతం నుంచి యథేచ్చగా తరలిస్తున్నారు.

 

16:58 - December 20, 2015

ఆదిలాబాద్‌ : జిల్లాలోని బెజ్జూరు మండలం నులుగుపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు విద్యార్ధినులు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు బెజ్జూరు మండలం జైహింద్‌పూర్‌కు చెందినవారు కాగా.. మిగతా ఇద్దరు దహేగాం మండలం కొంచెవెల్లికి చెందినవారు. వీరంతా బంధువులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

కరీంనగర్ లో తాగుబోతు హల్ చల్...

కరీంనగర్ : జిల్లాలో తాగుబోతు హల్‌చల్ చేశాడు. ఫుళ్లుగా మందేసిన ఓ తాగుబోతు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో ఈ ఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వెళుతున్న ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్‌ కిందకు దిగాడు. ఇంతలో అక్కడే ఉన్న ఓ మందుబాబు వెంటనే డ్రైవర్‌ సీట్లో కూర్చొని డ్రైవర్‌లేని సమయంచూసి బస్సు స్టార్ట్ చేశాడు. ఈ విషయం గమనించిన ప్రయాణికులు గట్టిగా అరిచారు. ఇతర వాహనాల డ్రైవర్లు, స్థానికులు వెంటనే బస్సును ఆపి తాగుబోతును కిందకి దించారు. బస్సులోని ప్రయాణికులు అతన్ని చితకబాదారు.

16:50 - December 20, 2015

గుంటూరు : జిల్లాలోని వినుకొండలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. అనేక ప్రాంతాల్లో పలువురు కుక్క కాటు బారిన పడ్డారు. గ్రామం మొత్తం పరిస్థితి ఇదే విధంగా ఉండడంతో.. బాధితులతో ప్రభుత్వాస్పత్రి నిండిపోయింది. అయితే ఆస్పత్రిలో బాధితులకు కావాల్సినంత వాక్సిన్‌ ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్‌ సిబ్బంది కుక్కలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

16:47 - December 20, 2015

కరీంనగర్ : జిల్లాలో తాగుబోతు హల్‌చల్ చేశాడు. ఫుళ్లుగా మందేసిన ఓ తాగుబోతు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో ఈ ఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వెళుతున్న ఆర్టీసీ బస్సును ఆపి డ్రైవర్‌ కిందకు దిగాడు. ఇంతలో అక్కడే ఉన్న ఓ మందుబాబు వెంటనే డ్రైవర్‌ సీట్లో కూర్చొని డ్రైవర్‌లేని సమయంచూసి బస్సు స్టార్ట్ చేశాడు. ఈ విషయం గమనించిన ప్రయాణికులు గట్టిగా అరిచారు. ఇతర వాహనాల డ్రైవర్లు, స్థానికులు వెంటనే బస్సును ఆపి తాగుబోతును కిందకి దించారు. బస్సులోని ప్రయాణికులు అతన్ని చితకబాదారు.

 

16:34 - December 20, 2015

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నేతలతో కలసి బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ను కలిశారు. వైఎస్ జగన్ ముఖ్యంగా నాలుగు విషయాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. కాల్ మనీ కేసు, ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం, ఏపీ ప్రభుత్వం ట్రైబల్ అడ్వైయిజరీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయాల గురించి వైఎస్ జగన్ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. 

థాయ్‌ల్యాండ్‌లో బస్సు ప్రమాదం... 10 మంది మృతి

 

బ్యాంకాక్ : థాయ్‌ల్యాండ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. స్థానిక షియాంగ్‌ మాయ్‌ ప్రావిన్స్ లో ఓ బస్సు అదుపుతప్పి గుంతలో బోల్తాపడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 10 మంది మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక 

16:20 - December 20, 2015

గుంటూరు : నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పట్లో ప్లాట్లు అందే అవకాశం కనిపించడంలేదు. మరో ఆరు నెలలలోపు కూడా ఇవి అందుతాయన్న నమ్మకం కూడా లేదు. భూ యజమానులకు ప్లాట్లు ఇచ్చిన తర్వాత కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఏడాది కాలం పడుతుంది. పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు మూడేళ్లు తీసుకుంటారు. సీఆర్‌డీఏ చట్టంలోనే ఈ విషయాలను పొందుపరిచారు. దీంతో ప్లాట్ల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న రైతు ఆశలు ఇప్పట్లో ఫలించే అవకాశం కనిపించడంలేదు.
సింగపూర్‌ తరహాలో అమరావతి
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని సింగపూర్‌ తరహాలో నిర్మించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గుంటూరు జిల్లా మంగళగిరి పరిసరాల్లో 29 గ్రామాల రైతులు నుంచి 33 వేల ఎకరాలు సమీకరించారు. భూసమీకరణకు వ్యతిరేకత వ్యక్తమైనా... ప్రభుత్వం బలవంతంగా రైతులను ఒప్పించో... నయానో భయానో బెదిరించే సమీకరణ పూర్తి చేసింది.
అభివృద్ధి చేసిన ప్లాట్ల కోసం రైతులు ఎదురు చూపులు
సమీకరణ పూర్తి చేసినప్పుడు రైతులకు పరిహారం ఇవ్వడంతోపాటు అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య స్థలాలు ఇస్తామని చెప్పింది. ఇదే అంశాన్ని సీఆర్‌డీఏ చట్టంలో చేర్చింది. భూములు తీసుకున్నప్పుడు ఏడాదిలోగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పింది. చట్టంలోని విషయాలు తెలియని రైతులు సర్కార్‌ చెప్పిన మాటలు నమ్మారు. అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తారు కదా... అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే ఇప్పుట్లో నవ్యాంధ్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల ఆశలు ఇప్పట్లో నెలవేరే అవకాశం కనిపించడంలేదు.
15 రోజుల్లో ముసాయిదా నోటిఫికేషన్‌
రాజధాని బృహత్‌ ప్రణాళిక ముసాయిదా నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ఇందుకు 15 రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు. దీనిపై అభ్యంతరాలు స్వకరించేందుకు 30 రోజుల గడువు ఇస్తారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి పరిష్కరించడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత లాటరీ పద్ధలితో ప్లాట్లు కేటాయిస్తారు. నివాస, వాణిజ్య స్థలాలు ఇచ్చిన తర్వాత యాజమాన్య హక్కుల పత్రాలు జారీ చేయడానికి నెల రోజులు తీసుకుంటారు. ఆతర్వాత రోడ్ల నిర్మాణానికి ఏడాది కాలం, పూర్తి స్థాయి మౌలికసదుపాయాల కల్పనకు మూడేళ్లు పడుతుంది. ఇవన్నీ ఎవరో చెబుతున్న విషయాలు కావు. ప్రభుత్వం చెబుతున్నవే.
నిర్ధిష్ట సమయంలో స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు నిర్ధిష్ట సమయంలో స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు. స్థలాల కేటాయింపుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చారు.
చెప్పిందొకటి... .చేస్తున్నది మరొకటి
భూములిచ్చిన రైతులకు స్థలాలిచ్చే విషయంలో ప్రభుత్వం చెప్పింది ఒకటి... .చేస్తున్నది మరొకటి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్కారు తీరుపై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నమ్మకంగా భూములిస్తే నివాస, వాణిజ్య స్థలాల కేటాయింపులో జాప్యం చేస్తోందని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 

 

16:09 - December 20, 2015

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో వడ్డీవ్యాపారులు రెచ్చిపోతున్నారు. కాల్‌మనీ దందా నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఓవైపు దాడులు చేస్తున్నా..వడ్డీ వ్యాపారస్తులు మాత్రం తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. వడ్డీ కట్టలేని సామాన్యులను చిత్రహింసలకు గురిచేస్తూ తమ కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఆగని కాల్‌మనీ ఆగడాలు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు ఫుల్‌స్టాప్‌ పడడంలేదు. పోలీసులు దాడులు చేసి..అరెస్టులు చేస్తున్నా కాల్‌మనీ దందాను కొనసాగిస్తూనేఉన్నారు. వడ్డీ కట్టకపోతే బాధితుల మాన, ప్రాణాలను దోచేస్తూ తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈయన వడ్డీ వ్యాపారస్తులు చేతిలో చావుదెబ్బలు తిని చివరకు ఇలా ఆసుపత్రి పాలయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పూలవ్యాపారం చేసుకుంటున్న ఈయన వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరకు 30వేలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న మొత్తానికి నెలకు 5 రూపాయలచొప్పున వడ్డీ కడుతున్నా..అసలివ్వాలంటూ తమ భర్తపై కత్తితో దాడికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. 6నెలలుగా నెలనెలా వడ్డీ కడుతున్నా..ఇప్పటికిప్పుడు అసలు ఇవ్వమంటే ఎక్కడినుంచి తేవాలని వాపోతున్నారు.
రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారస్తులు..
ఒక్క ఏలూరు, విజయవాడ, కర్నూలులోనే కాదు... రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి. లక్షలకు లక్షలు అధిక వడ్డీలకు ఇస్తూ సామాన్యులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సమయానికి వడ్డీ కట్టకపోతే..బాధిత మహిళలను లొంగదీసుకొని వ్యభిచార వృత్తిలోకి దింపుతూ మానవత్వానికే మచ్చతెస్తున్నారు. విశాఖ గాజువాకలో 14మంది కాల్‌మనీ వ్యాపారులపై టిడిపి నేత పిల్లల మోహన్‌రావు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ నేతలు కావడంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకంజ వేస్తున్నారు.
వడ్డీ పేరుతో చిత్రహింసలు..
భర్త చనిపోయిన మహిళల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. భర్త తీసుకున్న అప్పుల్ని తీర్చలేక బాధిత మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. ఒకవేళ తీసుకున్న అప్పును తీర్చినా..ఇంకా వడ్డీకట్టాలంటూ కుంటిసాకులు చెప్తూ మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. కడప జిల్లా రాయచోటి కొత్తపల్లికి చెందిన ఓ మహిళ వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్పు పేరుతో తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది.
కాల్‌మనీ కేసు దర్యాప్తు వేగవంతం.. 
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృస్టించిన కాల్‌మనీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితులిద్దర్ని ఆరు రోజులపాటు పోలీసు కస్టడికి అప్పగిస్తూ ఒకటో అదనపు చీఫ్‌ జస్టిస్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఆస్తులను లాక్కుంటూ, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపుతున్న కేసులో యలమంచిలి శ్రీరామమూర్తి, అలియాస్ రాము, దూడల రాజేష్‌లను మాచవరం పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరిద్దరికి లైంగిక పటుత్వ పరీక్షలతో పాటు విలువైన సమాచారం రాబట్టేందుకు 10రోజుల కస్టడి ఇవ్వాలని కోరుతూ పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే 3రోజులు పటుత్వ పరీక్షల కోసం, మరో 3రోజులు సమాచారం రాబట్టేందుకు కోర్టు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇక ఈ కేసులో రెండో నిందితుడు భవానీశంకర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. భవానీశంకర్‌ను తమ కస్టడి కోరుతూ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు.
వడ్డీ వ్యాపరస్తులపై ముమ్మర దాడులు..
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసుపై దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు వడ్డీ వ్యాపరస్తులపై ముమ్మర దాడులు చేస్తున్నారు. వడ్డీ పేరుతో సామాన్యులను చిత్రహింసలకు గురిచేస్తున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తిలేదని సీఎం ప్రకటించడంతో..కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

15:59 - December 20, 2015

హైదరాబాద్ : సింగపూర్‌ కంపెనీకి ఏపీ రాజధానిని తాకట్టు పెడుతున్నారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. రాజధాని నిర్మాణం అంతా ఓ గందరగోళంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం సింగపూర్‌ కంపెనీతో మిలాఖత్ అయి రాజధాని నిర్మాణంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సింగపూర్‌ కంపెనీ అనేక షరతులు పెట్టినట్లు తెలుస్తోందని చెప్పారు. రాజధాని నిర్మాణంపై ఉన్న అపోహలన్నింటిని లెటర్‌ రూపంలో ప్రధాని నరేంద్రమోడీకి సమర్పించానన్నారు. దీనిపై అత్యున్నత స్థాయిలో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శంకుస్థాపన పూర్తైనా ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభం కాలేదని..ఎప్పటికి ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

 

 

15:52 - December 20, 2015

హైదరాబాద్ : టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి.. వైసీపీపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వారిష్టమొచ్చినట్లు నడవాలంటే ఎలా అని మండిపడ్డారు. రోజా లేడీ డాన్ లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రోజాపై రౌడీషీట్‌ తెరవాల్సిన అవసరముందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే జగన్ సమర్థిస్తారా.. అని ప్రశ్నించారు. ప్రజలపై జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జగన్‌ ప్రవర్తన మార్చుకోవాలని హితవుపలికారు.

ప్రలోభాలతో ఎమ్మెల్సీ ఎన్నికలు : రావుల చంద్రశేఖర్ రెడ్డి

హైదరాబాద్ : ప్రలోభాలతో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఏ అర్ధరాత్రి తలుపుకొట్టినా టీఆర్ ఎస్ నాయకులేనని ప్రజలు అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయ సంతలో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. క్యాంపుల పేరుతో ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు.

రోజాపై రౌడీషీట్ ఓపెన్ చేయాలి : సోమిరెడ్డి

హైదరాబాద్ : రోజా లేడీ డాన్ లా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ పోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. రోజాపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని అన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే జగన్ సమర్థిస్తారా.. అని ప్రశ్నించారు. ప్రజలపై జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

13:43 - December 20, 2015

రోబో, బాహుబలి. ప్రపంచవ్యాప్తంగా క్రేజీ క్రియేట్ చేసిన ఆ చిత్రాల సీక్వెల్స్...ఒకేసారి సెట్స్ మీదికి వెళ్లాయి. అంతేకాదు ఒకేసారి, ఒకే డేట్‌ లో విడుదలయ్యేందుకు పోటీపడుతున్నాయి. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పుడు ఆ రెండు మేటి చిత్రాలు సీక్వెల్స్ సెట్స్ మీదికి వెళ్లాయి. ఒకే రోజు అటు చెన్నైలో రోబో టు పాయింట్ జీరో, ఇటు హైదరాబాద్‌ లో బాహుబలి కన్ క్లూజన్ షూటింగ్స్ మొదలయ్యాయి. ఇండియన్ స్పీల్ బర్గ్ శంకర్, సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ మాయాజాలం రోబో. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇటు దక్షిణాదిలోనూ, అటు ఉత్తరాదిలోనూ కలెక్షన్ల రికార్డును తిరగరాశారు. దాదాపు 130 కోట్లతో భారీ బడ్జెట్‌ తో నిర్మాణమైన రోబో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. 2010 అక్టోబర్ 1న విడుదలై కోట్లాదిమంది ప్రేక్షకులను మైమరపించింది.

260 కోట్ల అతి భారీ బడ్జెట్..
రెండున్నరేళ్ల సుదీర్ఘ షూటింగ్...260 కోట్ల అతిభారీ బడ్జెట్...వందలాదిమంది ఆర్టిస్టులు...హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్...అదిరిపోయే సెట్టింగులు...వెరసి జక్కన్న మలిచిన అద్భుతమైన, అపురూపమైన శిల్పం..బాహుబలి. ద బిగినింగ్. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. అంచనాలకు మించిన సినిమాను నిర్మించి శభాష్‌ అనిపించుకున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో అనువాదమై బాహుబలిని ఓ సంచలనం చిత్రం చేశాడు. మొన్నటి వరకు 100 కోట్లు రూపాయల బిజినెస్ చేసే తెలుగు సినిమా కోసం అందరూ ఎదురు చూశారు. అలాంటిది ఓ తెలుగు చిత్రం వేరే భాషలోకి డబ్ అయి 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి చిత్రం ఈ అరుదైన రికార్డు సృష్టించింది. బాలీవుడ్ లో బాహుబలి హిందీ వెర్షన్ నాలుగు వారాల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇలా రెండు దక్షిణాది చిత్రాలు ప్రపంచస్థాయి చిత్రాలుగా మన్నన పొందాయి. సౌత్ సినిమా సత్తా ఏంటో నిరూపించాయి. ఇప్పుడు వాటి సీక్వెల్స్ షూటింగ్స్ మొదలయ్యాయి. రోబో టు, బాహుబలి కన్ క్లూజన్ సెట్స్ మీదికి వెళ్లాయి. మొదటి చిత్రాల కంటే ఇవి మరింత పవర్ ప్యాక్డ్ గా ఉంటాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రోబో 2.0
రోబో. టు పాయింట్ జీరో. మరోసారి రజినీకాంత్‌తో కలిసి శంకర్ విశ్వరూపం ప్రదర్శించబోతున్న సినిమా. అంతేకాదు మరో బాలీవుడ్ స్టార్ హీరో ఇందులో విలన్ గా నటించబోతున్నారు. రోబో సీక్వెల్ పై అంచనాలు రెట్టింపవుతున్నాయి. ఇండియన్ సెల్యూలాయిడ్ పై మరో విజువల్ వండర్ ఆవిష్కృతం కాబోతోందన్న ఎక్స్ ప్టెక్టేషన్స్ పెరుగుతున్నాయి. హాలీవుడ్ స్థాయి సినిమాను భారతీయ ప్రేక్షకులకు అర్థమయ్యేలా తీర్చిదిద్దారు శంకర్. ఇప్పుడు రోబో సీక్వెల్ తో మరోసారి రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఓ మంచి కథకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ని ఫుల్ ప్లెడ్జ్ గా వాడుకుంటే సినిమా ఏ రేంజ్‌ లో హిట్టవుతుందో నిరూపించారు శంకర్. రజినీకాంత్ ద్విపాత్రిభినయం, రోమాలు నిక్కబొడిచేలా యాక్షన్ సీక్వెన్స్, ఐశ్వర్య అందచందాలు, రెహమాన్ మ్యూజిక్, అన్నింటికీ మించి శంకర్ తరహా టేకింగ్ రోబోను టాప్‌ లెవల్లో నిలిపాయి. 2010లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతుందని ఎన్నాళ్లనుంచో ఆడియన్స్ లో ఉత్కంఠ కలిగిస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమాకు 2.0గా నామకరణం చేశారు. సీక్వెల్‌ ఆఫ్‌ రోబో అనేది సబ్ టైటిల్. చెన్నై శివార్లలో ఏర్పాటు చేసిన రోబో సెట్‌ లో ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.

విలన్ గా అక్షయ్ కుమార్..
రోబో టు లో ప్రతినాయకుడి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే మొదట్లో విలన్ క్యారెక్టర్ కు హాలీవుడ్ మేటి హీరో ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ అనుకున్నారని వార్తలొచ్చాయి. అంతేకాదు ఆ రోల్ కోసం హృతిక్‌ రోషన్‌, నీల్‌నితిన్‌ ముఖేష్‌ పేర్లూ చక్కర్లు కొట్టాయి. అయితే చివరకు ఈ క్యారెక్టర్ కు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సెట్ అయ్యాడు. అక్షయ్ లాంటి హీరో విలన్ గా నటిస్తుండటంతో బాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ రోబో టుపై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. రోబోలో విలన్ క్యారెక్టర్ వచ్చినందుకు అక్షయ్ చాలా ఎగ్జయిట్ అయ్యాడు. ఈ ఏడాది పోతూపోతూ తనకొక శుభవార్త ఇచ్చిందని ఉప్పొంగిపోయాడు. వన్ అండ్ ఓన్లీ సూపర్‌స్టార్‌ రజనీసార్‌తో కలసి నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు అక్షయ్. ఇక ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే ప్రతినాయిక షేడ్స్ ఉన్న పాత్రలో హీరోయిన్ అమీజాక్సన్ నటిస్తోంది.

లెగసీ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్...
రోబో టులోనూ గ్రాఫిక్స్ దే కీలక పాత్ర. ప్రముఖ హాలీవుడ్‌ సంస్థ లెగసీ ఎఫెక్ట్స్‌ ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్‌ అందిస్తోది. అవతార్‌, జురాసిక్‌ పార్క్‌, ఐరన్‌ మేన్‌, జురాసిక్‌ వరల్డ్‌, అవెంజర్స్‌ వంటి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ ను అందించింది లెగసీ. రోబో కోసం సరికొత్త ఆలోచనలను లెగసీ సంస్థతో కలిసి ఆవిష్కరించబోతున్నాడు శంకర్. రోబో వన్ కు మించిన బడ్జెట్ తో తెరకెక్కబోతోంది సీక్వెల్. సుమారు రూ.400 కోట్లతో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ బ్యానర్ పై సుభాష్‌ కరణ్‌ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతేకాదు దీన్ని పూర్తిస్థాయి త్రీడీ చిత్రంగా మలుస్తున్నారు శంకర్‌. స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌తో ఉత్తమ సౌండ్‌ ఇంజినీర్‌గా ఆస్కార్‌ పురస్కారం అందుకున్న రసూల్‌ పుకుట్టి ఈ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. మెన్‌ ఇన్‌ బ్లాక్‌, మెన్‌ ఇన్‌ బ్లాక్‌ 2, ట్రాన్‌, ఖబ్యాట్‌ మెన్‌ రిటర్న్స్‌ లాంటి హాలీవుడ్‌ చిత్రాలకు వర్క్ చేసిన మేరీ ఇ వోగ్‌ ఈ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌. రోబోలో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సీక్వెల్ కోసం కూడా మంచి ట్యూన్స్ సిద్దం చేశాడు. విజువల్స్ ఎఫెక్ట్స్ లో హాలీవుడ్‌ లో మంచి పేరున్న జాన్ హ్యూజెస్‌తో పాటు మరో హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ టౌగ ఫిలిమ్స్‌కు చెందిన వాల్ట్స్‌ రోబోలో పని చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్స్‌ కు యాక్షన్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కెన్నే బేట్స్‌ 2.0కు యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇండియన్ సినిమా లెజెండరీ టీమ్ తో పాటు హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ రోబో 2.0కి వర్క్ చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు. ?
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు...దేవసేనను గొలుసులతో ఎందుకు బంధించారు...ఈ ప్రశ్నలు బాహుబలి వన్ చూసిన ప్రతి ఒక్కర్నీ ఇంకా వెంటాడుతున్నాయి. ఎవరికి తోచిన సమాధానాలు వారు ఊహించుకుంటున్నారు. ఇలాంటి ఉత్కంఠ కలిగించే అంశాలతో ఎండైన బాహుబలి బిగినింగ్....కన్ క్లూజన్ లో ఆన్సర్లివ్వబోతోంది. అంతేకాదు తెలుగు చిత్రసీమ గర్వించేలా, భారతీయ సినీ పరిశ్రమ ముచ్చటపడేలా సెకండ్ పార్ట్ ను రూపొందిస్తున్నారు రాజమౌళి. వాస్తవానికి ఈ ట్రైలర్ బాహుబలి రిలీజ్‌ కు ముందే రిలీజ్ చేశారు. కానీ సినిమాలో వీటికి సంబంధించిన సన్నివేశాలేవీ కనపడవు. ట్రైలర్ లో చూపిన అనుష్క విన్యాసాలు ఎప్పుడొస్తాయా అని సగటు ప్రేక్షకుడు ఎదురుచూస్తాడు. కానీ అవన్నీ లేకుండా ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసి...ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని సజీవంగా ఉంచడంలో రాజమౌళి సక్సెస్ అయ్యాడు. ఇలాంటి పబ్లిసిటీ స్ట్రాటజీతో కలెక్షన్స్ వరద పారించాడు రాజమౌళి. బాహుబలి అనగానే ఓ గొప్ప చారిత్రాత్మక చిత్రమని, యుద్ధాలు, గుర్రాలు, సెట్టింగులు, గ్రాఫిక్స్, మోషన్ గ్రాఫిక్స్, మూడేళ్ల కఠోర పరిశ్రమ, భారీ తారాగణం.. వీటన్నింటి గురించి జనం తెగ చెప్పేసుకున్నారు. ఇవన్నీ నిజం కూడా. అయితే బాహుబలి సక్సెస్ వెనుక వీటి పాత్ర 50 శాతం మాత్రమే. బాహుబలి గ్రాఫిక్స్ కంటే... కథ కంటే , దర్శకత్వం కంటే బాహుబలి మార్కెటింగ్ స్ట్రాటజీ అమోఘం, అనితర సాధ్యం, అనన్య సామాన్యం.

బాహుబలి..వ్యూహాలు...
ప్రభాస్ వంద కిలోలు పెరిగాడని ఓసారి వార్తవస్తే... 20వేల మంది ట్రైనింగ్ ఇస్తున్నారని ఒకసారి లీక్ చేశారు. క్రమంగా జనానికి బాహుబలి పిచ్చిఎక్కేసింది. గ్రాఫిక్స్, కాస్ట్యూమ్స్‌పై చర్చ. ఓ పాజిటివ్ ఒపీనియ్ సృష్టించారు. అన్నింటి కన్నా ముఖ్యమైంది ఈ సినిమా తెలుగు ప్రైడ్ అని చెప్పడం. సినిమాలో ఎన్ని కళాత్మక విలువలు ఉన్నా అది వ్యాపారమే. జనానికి థియేటర్లలో ఊరికే చూపించరు. సినిమా అంటేనే కోట్లు పెట్టి కోట్లు సంపాదిస్తారు. కానీ ఆ ఫీలింగ్ రాకుండా క్యాంపెన్ చేశారు. రూ.250కోట్ల వ్యయంతో మొదటి పార్ట్ ను నిర్మించి, అంచనాలు మించిన ఆదాయాన్నిచ్చాడు.
బాహుబలికి తెలుగు వాళ్ల టాలెంట్‌ కి కూడా లింక్ పెట్టారు. దీంతో ప్రతి తెలుగు వాడి గుండెలు పొంగిపోయాయి. ఒక్కసారైనా బాహుబలి చూడాల్సిందే. హాలీవుడ్ వాడికి అమ్మ మొగుడు లాంటి సినిమా మనది అనుకునేలా వ్యూహం అమలైంది. కచ్చితంగా ఈ విషయంలో రాజమౌళి బృందాన్ని అభినందించాలి. మంచి సినిమా తీయడం ఎంత అవసరమో దానికి వ్యూహాత్మక ప్రచారమూ అవసరమే. ఇప్పుడు బాహుబలి సెకండ్ పార్ట్ కోసమూ ఇలాంటి స్ట్రాటజీ అమలు చేయబోతోంది రాజమౌళి అండ్ టీం.

కట్టప్ప కన్ క్లూజన్ పై ఉత్కంఠ..
ఏమాత్రం కథ చెప్పకుండా, తెలియనివ్వకుండా బాహుబలి వన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించాడు రాజమౌళి. అయితే బాహుబలికి అత్యంత విశ్వసనీయుడైన కట్టప్పతో కన్ క్లూజన్ పై ఉత్కంఠ పెంచుతున్నాడు. రాజ్యం కోసం ప్రాణాలకు తెగించే కట్టప్ప...బాహుబలిని ఎందుకు చంపాడన్నది సీక్వెల్ లో చూపబోతున్నాడు.విజువల్ ఎఫెక్ట్స్ తో బాహుబలికి ప్రాణం పోశాడు శ్రీనివాసన్ మోహన్. ఏకంగా 600 మంది గ్రాఫిక్స్ నిపుణులు ఈ సినిమాకు పని చేశారు. అయితే బాహుబలి టులో శ్రీనివాస్ మోహన్ ను తప్పించాడు రాజమౌళి. ఆయన స్థానంలో మగధీరకు వండర్ అనిపించే గ్రాఫిక్స్ అందించి, జాతీయ అవార్డు పొందిన ఆర్.సి.కమల్ ను తీసుకున్నారు. ఇప్పటికే ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, రానా సినిమాకు తగ్గట్టుగా బాడీ పెంచే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనుంది. అందుకే తిరిగి సన్నబడటానికి ఎక్సర్ సైజులు మొదలుపెట్టింది.

విజయ్ సినిమాలో విలన్ కు నో అన్న సత్యరాజ్..
బాహుబలి సినిమాలో తన విలక్షణ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న తమిళ నటుడు సత్యరాజ్. బాహుబలి 2 కోసం.. తమిళంలో అగ్రకథానాయకుడు విజయ్ సినిమాలో విలన్ గా నటించే అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడట. బాహుబలి 2 షూటింగ్ కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉండడంతోనే ఈ ఛాన్స్ మిస్ అయినట్టు తెలుస్తోంది. అంచనాలు భారీగా పెరిగిపోవటంతో అందుకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. అందుకే ముందు అనుకున్నట్టుగా 2016 చివర్లో కాకుండా 2017 మొదట్లో బాహుబలి 2ను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. బాహుబలి సినిమాలో తన విలక్షణ నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న తమిళ నటుడు సత్యరాజ్. బాహుబలి 2 కోసం.. తమిళంలో అగ్రకథానాయకుడు విజయ్ సినిమాలో విలన్గా నటించే అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించాడట.బాహుబలి 2 షూటింగ్ కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉండడంతోనే ఈ ఛాన్స్ మిస్ అయినట్టు తెలుస్తోంది.

ఒకే సమయంలో రెండు సినిమాలు రిలీజ్ ?
అంచనాలు భారీగా పెరిగిపోవటంతో అందుకు తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. అందుకే ముందు అనుకున్నట్టుగా 2016 చివర్లో కాకుండా 2017 మొదట్లో బాహుబలి 2ను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. మొత్తానికి మొదటి పార్ట్ కు మించిన అంచనాలతో వస్తున్న సెకండ్ పార్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో మరో ఏడాది ఆగాల్సిందే. ఇద్దరు దక్షిణాది దిగ్గజ దర్శకులు. ఒక ప్రాంతీయ సినిమాను ప్రపంచస్థాయికి చేర్చిన మేటి డైరెక్టర్స్. సౌతిండియా సత్తా చాటి చెప్పిన మార్గదర్శకులు. కానీ రోబో, బాహుబలితో ఇద్దరూ ఒకరి మీద ఒకరు కసి మీదున్నారా...పోటాపోటీగా నిర్మించబోతున్నారా...ఒకే సమయంలో సినిమాలను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారా ? రోబో 2.0 షూటింగ్ మొదలైంది. 2017లో సినిమా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు శంకర్. ఇటు తెలుగు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ చేస్తున్న బాహుబలి-2 కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే తొలుత 2016లో సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ 2017లోనే ఈ సినిమాను కూడా విడుదల చెయ్యాలని తాజా నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండు భారీ సినిమాలను ఒకే సమయంలో ఎందుకు రిలీజ్ చేయబోతున్నారు...ఓపెనింగ్ కలెక్షన్స్ లో ఎవరి సత్తా ఏంటో నిరూపించుకోవడానికా ?

ఒకేసారి పోటీ చేస్తే ఎలా ? 
గతంలో శంకర్ ను పరోక్షంగా రాజమౌళి విమర్శించాడని, దీంతో శంకర్ నొచ్చుకున్నాడని కూడా సినీ పరిశ్రమలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు ఒకేసారి పోటీగా విడుదలచేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. అయితే రెండు భారీ సినిమాలు ఒకేసారి విడుదల కావడం పరిశ్రమకు మంచిది కాదని సినీ పెద్దలు భావిస్తారు. దీంతో యథావిధిగా వీరు రంగంలోకి దిగి సినిమాల విడుదల తేదీలు మార్చివేస్తుంటారు. అందుకు అవకాశం ఇవ్వకుండా శంకర్ తన సినిమా విడుదల డేట్ ను కూడా త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక సాంకేతికంగా కూడా చాలా వ్యాల్యూ యాడెడ్ తో శంకర్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. అటు రాజమౌళి కూడా పకడ్బందీగా సినిమా రూపొందిస్తున్నాడు.

ఎవరు గొప్పా..
జెంటిల్మన్ నుంచి మొదలైన శంకర్ సినీ ప్రయాణం ఎన్నో గొప్ప సినిమాలతో ముందుకు సాగింది. ఎన్నో టెక్నికల్ చిత్రాలను తెరకెక్కించాడు. సౌత్ లో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇటు టాలీవుడ్ లో అపజయం ఎరుగని డైరెక్టరుగా, ఎలాంటి సినిమా అయినా అత్యంత ప్రతిభావంతంగా తెరకెక్కించడంలో మేటి యువ దర్శకుడిగా దూసుకువచ్చాడు రాజమౌళి. ఇప్పుడు హోల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటే చర్చ. సౌత్ లో శంకర్ గొప్పా, రాజమౌళి గొప్పా. ఇద్దరూ దిగ్గజ దర్శకులే. ఒక ప్రాంతీయ సినిమాను ప్రపంచ స్థాయికి చేర్చిన డైరెక్టర్లే. సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో హాలీవుడ్ దర్శకులతో పోటీగా అన్నట్టుగా సినీ ప్రయాణం సాగిస్తున్నవారే. ఇప్పుడు వారిద్దరూ సీక్వెల్స్ తో మరోసారి రీజినల్ సినిమాను మరో స్థాయికి పెంచబోతున్నారు. మొత్తంమీద అటు బాహుబలి, రోబో-2 సినిమాలు 2017లో భారత చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి ముద్ర వేస్తాయో వేచి చూడాల్సిందే.

13:30 - December 20, 2015

 

ఢిల్లీ : ఇంత జరిగినా కాంగ్రెస్‌ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. బెయిల్‌ వస్తేనే సంబరాలెందుకో అర్ధం కావటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. తప్పు చేసి కేసులను ఎదుర్కొంటూ వాటి కోసం పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. హాజరు కావాలని న్యాయ స్థానం ఆదేశిస్తే హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, అంతేగాని ఊరేగింపులు..ప్రదర్శనలు ఇవ్వడం తగునా అని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి దిష్టిబొమ్మలను తగులబెడుతూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నామో గమనించాలని సూచించారు. ఇది న్యాయవ్యవస్థపై పరోక్షంగా వత్తిడి కలిగించడం కాదా అని ప్రశ్నించారు.

13:26 - December 20, 2015

కృష్ణా : జిల్లా కూనవరం గ్రామాన్ని దత్తత తీసుకున్న టిడిపి ఎంపీ సుజనాచౌదరి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తన అమ్మగారి గ్రామమైన కూనవరంలో నందమూరి తారకరామారావు విగ్రహ ఆవిష్కరణతో పాటు..సీసీరోడ్లు, వాటర్‌క్యూరిఫైయర్‌, సీవరేజ్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కూనవరం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఈ సందర్బంగా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. గ్రామాలను దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేస్తే గ్రామప్రజలు ఎంతో సంతోషిస్తారని మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని అన్నారు.

13:25 - December 20, 2015

విజయనగరం : భోగాపురం మళ్లీ భగ్గుమంది. ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా భూపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేడు పాదయాత్ర చేపట్టింది. అయితే రాత్రి నుంచే సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉదయం పాదయాత్రకు ప్రయత్నించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నరసింగరావును కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీపీఎం విజయనగరం జిల్లా కార్యదర్శితో సహా పలువురు నేతలను ఇప్పటికే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిర్బంధాన్ని భూపరిరక్షణ కమిటీ నేతలు తీవ్రంగా నిరసిస్తున్నారు.

 

13:23 - December 20, 2015

హైదరాబాద్ : నట జీవితాన్ని గెలిచిన రంగనాథ్‌.. ఒంటరితనాన్ని ఓడించలేకపోయారు. జీవితంలో ఎదుర్కొన్న అనేక మలుపులతో.. చివరికి ఒంటరిగా మిగిలిన రంగనాథ్‌.. తనకు తానే ముగింపు పలికారు. తోడు లేక అల్లాడిపోయిన ఆ ప్రాణం అవసరం లేదనుకున్నారు. తన జీవితానికి క్లైమాక్స్‌ రాకముందే.. తానే సృష్టించుకుని.. తన కథకు క్లైమాక్స్‌ను తానే రచించుకున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రంగనాథ్‌ మృతదేహానికి కాసేపట్లో గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. ఆ తర్వాత ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలించారు. సినీ ప్రముఖులంతా రంగనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. నివాళులు అర్పించారు. సాయంత్రం బన్సీలాల్‌పేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

షాక్ కు గురయ్యా - చిరంజీవి..
రంగనాథ్‌తో తనకు 35ఏళ్లకుపైగా అనుబంధం ఉందని నటుడు, కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులు చిరంజీవి అన్నారు. ఫిల్మ్‌చాంబర్లో ఉన్న రంగనాధ్ పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చిరంజీవి...వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. రిటైర్‌మెంట్‌ లైఫ్‌ని ఎంతో ఉల్లాసంగా గడుపుతున్నానని చెప్పిన రంగనాథ్‌ ఇవాళ ఇలా అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం తనను షాక్‌కు గురి చేసిందన్నారు.

తీరని లోటు - మంత్రి తలసాని..
రంగనాథ్‌లాంటి సీనియర్ నటుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం సినిపరిశ్రమకు తీరని లోటని సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వారం రోజుల క్రితమే తనదగ్గరకు వచ్చి...ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషికి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కట్టించాలని తనను అడిగారని మంత్రి గుర్తు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా వరుస సంఘటనలు జరగడం పరిశ్రమ వర్గాలను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు.

తీవ్రంగా కలిచి వేస్తోంది - పరుచూరి..
రంగనాథ్‌లాంటి గొప్ప జ్ఞాని ఇలా ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని ఎండ్‌ చేసుకోవడం చిత్రపరిశ్రమను తీవ్రంగా కలిచివేస్తోందని సినీ రచయిత పరచూరి వెంకటేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1973లో సినీరంగంలోకి తనతో పాటు రంగనాథ్‌ ఇంకా అనేకమంది వచ్చామని సీనియర్ నటుడు మురళీమోహన్‌ అన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు రంగనాథ్‌తో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించామని ..కానీ ఇవాళ అందరిని వదిలిపెట్టి ఆయన వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

మంచి మనస్సున్న వ్యక్తి - రాజేంద్రప్రసాద్...
రంగనాథ్‌లాంటి ఒక మంచి మనుసున్న వ్యక్తిని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయిందని మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. తనకు, తన కుటుంబానికి రంగనాథ్‌తో ఉన్న సాన్నిహిత్యం మాటల్లో చెప్పలేనిదన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకొని సినీ ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మా తరపున రంగనాధ్‌గారికి , వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నామని తెలిపారు. మా తరపున రంగనాధ్ అంత్యక్రియల్ని నిర్వహిస్తామని రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.

స్నేహబంధం - గిరిబాబు..చలపతిరావు..
సీనియర్ నటుడు రంగనాథ్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని తోటి నటులైన గిరిబాబు, చలపతిరావు ఆవేదన వ్యక్తం చేశారు. నటుడిగా కంటే తమ మధ్య స్నేహబంధమే ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా మాతో చెప్పుకునేవాడని..కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని కలలో కూడా ఊహించలేదన్నారు. ఏది ఏమైనా రంగనాథ్‌ చనిపోవడం చిత్రపరిశ్రమకు తీరని లోటని..ఆ లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. 

13:18 - December 20, 2015

ప్రకాశం : కాల్‌మనీపై ఇంత రచ్చ జరుగుతున్నా.. వడ్డీ వ్యాపారుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రకాశం జిల్లా కందుకూరులో అప్పు కట్టలేదంటూ.. ఇంట్లోంచి కుటుంబం మొత్తాన్ని గెంటేశాడో రాక్షసుడు. మూడు రూపాయల వడ్డీకి డబ్బులిచ్చి.. ఇప్పుడు పది రూపాయలు కట్టాలని డిమాండ్‌ చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సామానుతో సహా బయట పడేటయంతో.. చంటిబిడ్డతో నడిరోడ్డుపై బాధిత మహిళ దిక్కులేని అనాథలా నిలబడాల్సి వచ్చింది. వడ్డీ వ్యాపారి వద్ద మూడు రూపాయల వడ్డీతో ఆ మహిళ లక్షా 50వేల రూపాయలు తీసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే వడ్డీ కింద రూ.80వేలు చెల్లించిందని, మిగతా డబ్బుకు రూ. పది చొప్పున వడ్డీ చెల్లించాలంటూ వడ్డీ వ్యాపారి బెదిరిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వడ్డీవ్యాపారిపై పోలీసులకు మహిళ ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. 

13:15 - December 20, 2015

హైదరాబాద్ : డాన్స్‌ మాస్టర్‌ భరత్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీ తెలుగులో వచ్చిన ఆట ప్రోగ్రామ్‌తో ఫేమస్‌ అయిన భరత్.. హైదరాబాద్‌ మోతీనగర్‌లోని తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయారు. భరత్‌ ఆత్మహత్యకు కారణాలేంటని ఇంకా తెలియలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 

కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరొకరి మృతి..

విశాఖపట్టణం : కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరొకరు మృతి చెందారు. దీనితో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. 

12:32 - December 20, 2015

హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. 2014 సంవత్సరానికి గాను ప్రముఖ దళిత కవి విల్సన్ సుధాకర్ రాసిన మాకూ ఒక భాష కావాలి కవితా సంపుటికి, 2015 సంవత్సరానికి ప్రముఖ కవి డా.ప్రసాదమూర్తి రాసిన పూలండోయ్ పూలు కవితా సంపుటికి 2015 ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డులను అందజేశారు. 

డ్యాన్స్ మాస్టర్ భరత్ ఆత్మహత్య..

హైదరాబాద్ : మోతీనగర్ లో డ్యాన్స్ మాస్టర్ భరత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని భరత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలు టీవీ సీరియల్స్ సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ గా భరత్ వ్యవహరించాడు. 

ఎయిర్ ఫ్రాన్స్ విమానానికి బాంబు బెదిరింపు..

కెన్యా : ఎయిర్ ఫ్రాన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో కెన్యాలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. మారిషస్ నుండి పారిస్ విమానం వెళుతోంది. 

నేషనల్ హెరాల్డ్ కేసు..కేంద్రానికి సంబంధం లేదు - వెంకయ్య..

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులతో కేంద్రానికి సంబంధం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని కాంగ్రెస్ చూస్తోందని, ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ ను స్పూర్తిగా తీసుకుని ఆమ్ ఆద్మీ ఆరోపణలు చేస్తోందన్నారు. జైట్లీపై ఆమ్ ఆద్మీ ఆరోపణలు అవాస్తవమన్నారు.

 

ఇరిగేషన్ ప్రాజెక్టులపై హరీష్..తుమ్మల సమీక్ష..

హైదరాబాద్ : ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావులు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు.

జైలు నుండి విడుదలైన మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ..

మధ్యప్రదేశ్ : వ్యాపం కుంభకోణంలో అరెస్టయి జైలులో ఉన్న మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ భోపాల్ సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. 

భోగాపురంలో ఆందోళన..

విజయనగరం : అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రజాసంఘాలు ఆదివారం ఆందోళన చేపట్టాయి. అందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బాధిత గ్రామాల్లో ప్రజా సంఘాల నాయకులు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలను పోలీసులు మందుస్తుగా అరెస్టులు చేస్తున్నారు. 

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు..

చిత్తూరు : శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి వస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లు నిండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలిక కంపార్ట్ మెంట్లు నిర్మించారు. 

11:58 - December 20, 2015

సంక్రాంతి అనగానే కోళ్ల పందాలు గుర్తుకొస్తాయి. కోడి పందాలు అనగానే పశ్చిమగోదావరి జిల్లా తొలుత గుర్తుకు వస్తుంది. కానీ అలాంటి జిల్లా పుట్ బాల్ లీగ్ చిరునామాగా మారనుందా ? మాజీ మంత్రి, దివంగత నేత కోటగిరి విద్యాధరరావు తెలియని వారు ఎవరు ఉండరు. ఆయనకు ఫుట్ బాల్ మీదున్న మక్కువ తీసుకుని ఆ స్పూర్తిని వంటపట్టించుకుని యూఎస్ లో ఉంటూ కూడా తన సొంత జిల్లా అయిన వెస్ట్ గోదావరి లో 'ఫుట్ బాల్' లీగ్ ను నిర్వహించబోతున్నారు. ఆయనే కోటగిరి విద్యాధరరావు తనయుడు, ఫుట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ వెస్ట్ గోదావరి అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ రావు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మ్యాచ్ విశేషాలను తెలియచేశారు.
తణుకు, భీమవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నర్సాపురం, తాడేపల్లిగూడెం జట్ల మధ్య పోటీలు జరుగనున్నాయి. జనవరి 2 నుండి 14వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఆరు సూపర్ టీమ్ లతో 18 మ్యాచ్ లు జరుగనున్నాయి. మరిన్ని విశేషాలు తెలియాలంటే వీడియో చూడండి. 

11:26 - December 20, 2015

గుంటూరు : ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధ కలిగిస్తున్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల పేర్కొన్నారు. జిల్లాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎవరికీ వ్యతిరేకం కానని, అసభ్యపదజాలం ఉపయోగించినందుకే చర్యలు తీసుకోవడం జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభా నిర్వాహణ కత్తిమీద సాములాంటిదని, సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, కాల్ మనీ, వరదల, కరవు, శాంతిభద్రతలు, ఎర్రచందనం అనేక అంశాలున్నాయన్నారు. ఐదు రోజులు ఈ అంశాలపై చర్చ జరిగితే బాగుంటుందని, కానీ అల్లరికి మారు పేరుగా ఏపీ అసెంబ్లీ ఉందని ప్రజలు భావిస్తుండడం చాలా బాధేస్తోందన్నారు. నిబంధనలు..సంప్రదాయలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుందని, విలువైన అవకాశం పొగొట్టుకోవద్దన్నారు. సభ నడువనీయం అనే ఉద్దేశ్యంతో సభకు వస్తే ప్రజలతో పాటు ఏ పార్టీలకైనా నష్టమేనని స్పీకర్ కోడెల పేర్కొన్నారు. 

ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం..ఐదుగురు మహిళల మృతి..

అదిలాబాద్ : జిల్లాలోని బెజ్జూరు మండలం సులుగుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఐదుగురు మహిళలు మృతి చెందారు.

 

11:11 - December 20, 2015

ఖమ్మం : జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పాము కాటుతో మృతి చెందాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ విషాహారమే దీనికి కారణమని మరో వాదన వినిపిస్తోంది. వార్డెన్ సురేష్ ను అధికారులు సస్పెండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే...అశ్వాపురం మండలం గొందిగూడెం పాఠశాలలో శనివారం రాత్రి ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అరవింద్ అనే విద్యార్థి మృతి చెందాడు. వాంతులు..కడుపునొప్పి లక్షణాలతో విద్యార్థులను తీసుకరావడం జరిగిందని వైద్యుడు పేర్కొన్నారు. పాము కాటు అని అనుకున్నామని, కానీ పాము కాటుకు గురైనట్లు ఆధారాలు లభ్యం కాలేదన్నారు. పాము కాటు లక్షణాలతో చికిత్స చేయడం జరుగుతోందని, ప్రవీణ్ అనే బాలుడిని ఖమ్మం ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. మరొక బాలుడు చికిత్స పొందుతున్నాడని తెలిపారు. సమాచారం తెలుసుకున్న అరవింద్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతి చెందిన అరవింద్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం పాము కాటుతో మృతి చెందాడా ? లేక ఇతరత్రా కారణాలున్నాయా అనేది తేలుతుంది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. 

రంగనాథ్ మృతదేహానికి పరీక్ష పూర్తి..

హైదరాబాద్ : అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సీనియర్ నటుడు రంగనాత్ భౌతికకాయానికి గాంధీ ఆసుపత్రిలో శవపరీక్ష పూర్తయ్యింది. అనంతరం ఆయన మృతదేహాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. 

10:52 - December 20, 2015

సాహిత్యం సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా అస్తిత్వ సాహిత్య ఉద్యమాల ద్వారా స్త్రీలు దళితులు చైతన్యవంతులయ్యారు. దాని వెనుక ఎందరో సృజనకారులు రచయితల కృషి ఉంది. అలాంటి వారిలో తెలుగు స్త్రీవాద సాహిత్యానికి ఒకదశను దిశను నిర్దేశించిన ప్రముఖ రచయిత్రి ఓల్గా ఒకరు. ఆమెను ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఓల్గా రాసిన విముక్త కథల సంపుటికి ఈ అవార్డు లభించింది. తెలుగు స్త్రీవాద రచయిత్రుల్లో ఒల్గా ఒక అగ్రశ్రేణి రచయిత్రి. ఆమె స్వేచ్ఛలాంటి నవలలతో పాటు ఎన్నో కథా సంపుటాలు వ్యాసాలు రాశారు. స్త్రీల ఇతివృత్తంతో ఎన్నో డాక్యుమెంటరీలు తీశారు. అస్మిత సంస్థ ద్వారా మహిళల కోసం ఎంతో సేవ చేశారు. సాహిత్య, సామాజిక రంగాలలో ఆమె చేసిన కృషి కి గుర్తింపుగా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా పై ప్రత్యేక కథనం.

ఎవరికీ వ్యతిరేకం కాదు - ఏపీ స్పీకర్..

గుంటూరు : తాను ఎవరికీ వ్యతిరేకం కానని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేర్కొన్నారు. అసభ్యపదజాలం ఉపయోగించినందుకే చర్యలు తీసుకోవడం జరిగిందని, అల్లరికి మారుపేరుగా ఏపీ అసెంబ్లీ నిలవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. సభా నిర్వాహణ కత్తిమీద సాములాంటిదని, సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

ఖమ్మంలో ఆశ్రమ విద్యార్థి మృతి..

ఖమ్మం : అశ్వాపురం (మం) గొందిగూడెం ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న అధికారులు వార్డెన్ సురేష్ ను సస్పెండ్ చేశారు. 

కొండచరియల బాధితులను ఆదుకుంటాం - నారాయణ..

విశాఖపట్టణం : కొండచరియలు విరిగిపడి ముగ్గురు చనిపోవడం బాధాకరమని మంత్రి నారాయణ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు. 

భోగాపురం ఎయిర్ పోర్టు..సీపీఎం పాదయాత్ర..

విజయనగరం : భోగాపురం ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా నేడు సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగనుంది. శనివారం అర్ధరాత్రి జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యానారాయణతో సహా 10 మంది సీపీఎం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. 

నల్గొండలో దట్టమైన పొగమంచు..

నల్గొండ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కుమ్ముకుంది. అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

10:39 - December 20, 2015

చిత్తూరు : వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గతేడాది కంటే ఎక్కువమంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఏడాదిలో ఒక్కసారి వచ్చే ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని వీలైనంత ఎక్కువగా సామాన్యులకే కల్పించాలని టీటీడీ భావిస్తోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లను ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు పరిశీలించారు.

ఆదివారం అర్ధరాత్రి..
ఆదివారం అర్ధరాత్రే శ్రీవారి ఆలయం వైకుంఠ ఉత్తర ద్వారం తెరుచుకోనుంది. తిరుప్పావై, శాస్త్రోక్త కార్యక్రమాల అనంతరం ఈ ద్వారం గుండా భక్తులను అనుమతిస్తారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి వరకు వైకుంఠ వాకిలిని తెరిచి ఉంచనున్నారు. ఇందుకోసం శ్రీవారి ఆలయంతో పాటు వైకుంఠ వాకిలిని సుందరంగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు, విద్యుద్దీపాలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ మహాద్వారం నుంచి గర్భాలయం వరకు ఐదు టన్నుల విరులతో పుష్పాలంకరణ చేస్తున్నారు.

ఆదివారం ఉదయం నుండే క్యూ లైన్లు..
ఇక వైకుంఠ ద్వార దర్శనానికి మొదటి ప్రాధాన్యం ఉన్న వీఐపీలను సుపథం ద్వారా ఆలయంలోకి అనుమతిస్తారు. రెండో ప్రాధాన్యం ఉన్న వారికి మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, మూడో ప్రాధాన్యం ఉన్న వీఐపీలను ఏటీసీ జనరేటర్‌ ద్వారా అనుమతిస్తారు. గుర్తింపుకార్డులు, సంప్రదాయ వస్త్రధారణతో వస్తేనే అనుమతించనున్నారు. ఇక సర్వదర్శనం భక్తులను ఆదివారం ఉదయం నుంచే క్యూలైన్‌లోకి అనుమతించి కంపార్ట్‌మెంట్లకు పంపిస్తారు. వైకుంఠ ఏకాదశికి గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 

10:37 - December 20, 2015

గుంటూరు : నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పట్లో ప్లాట్లు అందే అవకాశం కనిపించడంలేదు. మరో ఆరు నెలలలోపు కూడా ఇవి అందుతాయన్న నమ్మకం కూడా లేదు. భూ యజమానులకు ప్లాట్లు ఇచ్చిన తర్వాత కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఏడాది కాలం పడుతుంది. పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు మూడేళ్లు తీసుకుంటారు. సీఆర్‌డీఏ చట్టంలోనే ఈ విషయాలను పొందుపరిచారు. దీంతో ప్లాట్ల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న రైతు ఆశలు ఇప్పట్లో ఫలించే అవకాశం కనిపించడంలేదు. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని సింగపూర్‌ తరహాలో నిర్మించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గుంటూరు జిల్లా మంగళగిరి పరిసరాల్లో 29 గ్రామాల రైతులు నుంచి 33 వేల ఎకరాలు సమీకరించారు. భూసమీకరణకు వ్యతిరేకత వ్యక్తమైనా... ప్రభుత్వం బలవంతంగా రైతులను ఒప్పించో నయానో భయానో బెదిరించి సమీకరణ పూర్తి చేసింది. సమీకరణ పూర్తి చేసినప్పుడు రైతులకు పరిహారం ఇవ్వడంతోపాటు అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య స్థలాలు ఇస్తామని చెప్పింది. ఇదే అంశాన్ని సీఆర్‌డీఏ చట్టంలో చేర్చింది. భూములు తీసుకున్నప్పుడు ఏడాదిలోగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పింది. చట్టంలోని విషయాలు తెలియని రైతులు సర్కార్‌ చెప్పిన మాటలు నమ్మారు. అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తారు కదా... అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే ఇప్పుట్లో నవ్యాంధ్ర ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల ఆశలు ఇప్పట్లో నెలవేరే అవకాశం కనిపించడంలేదు.

నమ్మకంగా భూమలిస్తే...
రాజధాని బృహత్‌ ప్రణాళిక ముసాయిదా నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ఇందుకు 15 రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు. దీనిపై అభ్యంతరాలు స్వకరించేందుకు 30 రోజుల గడువు ఇస్తారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి పరిష్కరించడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత లాటరీ పద్ధలితో ప్లాట్లు కేటాయిస్తారు. నివాస, వాణిజ్య స్థలాలు ఇచ్చిన తర్వాత యాజమాన్య హక్కుల పత్రాలు జారీ చేయడానికి నెల రోజులు తీసుకుంటారు. ఆతర్వాత రోడ్ల నిర్మాణానికి ఏడాది కాలం, పూర్తి స్థాయి మౌలికసదుపాయాల కల్పనకు మూడేళ్లు పడుతుంది. ఇవన్నీ ఎవరో చెబుతున్న విషయాలు కావు. ప్రభుత్వం చెబుతున్నవే. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు నిర్ధిష్ట సమయంలో స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు. స్థలాల కేటాయింపుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. భూములిచ్చిన రైతులకు స్థలాలిచ్చే విషయంలో ప్రభుత్వం చెప్పింది ఒకటి... .చేస్తున్నది మరొకటి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్కారు తీరుపై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నమ్మకంగా భూములిస్తే నివాస, వాణిజ్య స్థలాల కేటాయింపులో జాప్యం చేస్తోందని నిరసనవ్యక్తం చేస్తున్నారు. 

10:33 - December 20, 2015

ఢిల్లీ : నిర్భయపై జరిగిన సమూహిక అత్యాచారం, హత్య కేసులో శిక్ష పూర్తి చేసుకున్న బాల నేరస్థుడి విడుదలకు రంగం సిద్ధమయ్యింది. బాల నేరస్థుల న్యాయాలయం విధించిన మూడేళ్ల శిక్షాకాలం నేటితో పూర్తి అయ్యింది. దీంతో ఈ సాయంత్రం 5 గంటలకు ఇతన్ని విడుదల చేయనున్నారు. ఇందుకు వీలుగా రహస్య ప్రాంతానికి తరలించారు. నిర్భయపై 2012 డిసెంబర్‌ 16 వ తేదీ రాత్రి ఢిల్లీలో ఆమె ప్రయాణిస్తున్న బస్‌లోనే సామూహిక అత్యాచారం జరిగింది. కేసులోని ఆరుగురు నిందితుల్లో బాల నేరస్థుడు కూడా ఉన్నాడు. ఘటన జరిగిన నాటికి బాలుడికి 18 ఏళ్లు నిండకపోవడంతో బాలనేరస్థుడుగా పరిగణించి జువనైల్‌ హోంకు తరలించారు. అక్కడే మూడేళ్లు శిక్ష అనుభవించాడు. బాల నేరస్థుడిని విడుదల చేయకుండా స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు శక్రవారం తోసిపుచ్చింది. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్‌ శనివారం రాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ నివాసానికి వెళ్లి బాల నేరస్థుడిని విడుదల చేయొద్దని కోరారు. ఈ కేసుపై సోమవారం విచారణ జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి హామీ ఇవ్వడంతో ఢిల్లీ మహిళా కమిషన్‌ సభ్యులు వెనుతిరిగారు.

వినుకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం

గుంటూరు : జిల్లా వినుకొండ పట్టణంలో ఉదయం పిచ్చికుక్క స్వైరివిహారం చేసింది. పిచ్చికుక్క దాడిలో 10 మందికిపైగా గాయపడ్డారు. 

నేడు మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ విడుదల..

మధ్యప్రదేశ్ : వ్యాపం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ భోపాల్ సెంట్రల్ జైలు నుండి విడుదల కానున్నారు. 2014 జూన్ 15వ తేదీన ఆయన అరెస్టు అయ్యారు.

 

బీహార్ లో రైలు ప్రమాదం..

బీహార్: ఖగారియాలోని పస్రాహా స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం సంభవించింది. కతిహార్ - అమృత్‌సర్ ఆమ్రాపాలి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 5 స్లీపర్, 2 ఏసీ బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు సిబ్బందిని తీసుకుని సహాయ చర్యల కోసం ఘటనాస్థలికి మరోరైలులో బయలుదేరారు. ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను కతిహార్ - మాల్దా - జమల్దాహ మీదుగా పాట్నాకు మళ్లించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. 

10:15 - December 20, 2015

విశాఖపట్టణం : సంజీవయ్య నగర్ కాలనీలో చోటు చేసుకున్న ప్రమాదం దురదృష్టకరమని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడడంతో ముగ్గురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మరో నలుగురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న గంటా శ్రీనివాసరావు ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. ఈసందర్భంగా గంటా టెన్ టివితో మాట్లాడారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారని, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. తిరుపతి ఘాట్ రోడ్డులో తీసుకున్న చర్యలు ఇక్కడ అమలు చేయాలా ? ఇతరత్రా అంశాలపై కమిటీ రిపోర్టు నివేదిక అందిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో 30 కుటుంబాలున్నాయని, ప్రభుత్వం అందరికీ ఇళ్లు కల్పించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో చికిత్స అందించడం జరుగుతుందని, ఆపద్బందు, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద బాధితులను ఆదుకుంటామని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

10:13 - December 20, 2015

హైదరాబాద్ : ఉన్నత విద్య అభ్యసించడానికి కాలిఫోర్నియా వెళ్లడానికి పయనమైన విద్యార్థులకు షాక్ తగిలింది. కాలిఫోర్నియా వెళ్లడానికి అనుమతి లేదని చెప్పడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలపై నిషేధం ఉందని, అందుకే నిలిపివేసినట్లు చెప్పడంతో విద్యార్థులు హతాశులయ్యారు. తగిన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని రెండు యూనివర్సిటీలను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టింది. అందులో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. జనవరి 10వ తేదీన ప్రారంభమయ్యే క్లాసులకు జనవరి 4వ తేదీన విద్యార్థులు రావాల్సి ఉంటుంది. దీనితో విద్యార్థులు ప్రతి రోజు కాలిఫోర్నియాకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టు కాక ఇతర విమానాశ్రయాలకు వస్తుంటారు. తాజాగా వచ్చిన ఈ వార్తలతో విద్యార్థులు..వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. తమ భవిష్యత్ విద్యపై వీరంతా ఆందోళనగా ఉన్నారు. ఇదే వర్సిటీల్లో ప్రవేశం పొంది, అమెరికాకు చేరిన పలువురు విద్యార్తుళు ఇప్పుడు వెనక్కు రాక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. 

10:12 - December 20, 2015

హైదరాబాద్ : సినీ నటుడు బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'డిక్టేటర్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమాన్ని ఏపీ రాజధాని 'అమరావతి'లో అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆడియో కార్యక్రమంలో పాల్గొనేందుకు అభిమానులు భారీగా అమరావతికి తరలివెళుతున్నారు. చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంతం నుండి రెండు బస్సుల్లో ఆ ప్రాంతానికి వెళుతున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య అభిమానులు 99 కారుల్లో రాజధాని ప్రాంతానికి పయనమవుతున్నారు. వీరితో పాటు నటుడు బాలయ్య కూడా బస్సులో వెళుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్‌. 'లౌక్యం'వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ అందించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

10:11 - December 20, 2015

విశాఖపట్టణం : కొండచరియలు విరిగిపడడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఏడేళ్ల బాలుడు ఉన్నాడు. తాటిచెట్లపాలెం సమీపంలోని సంజీవయ్య నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండచరియలు సమీపంలో రేకుల షెడ్డులో నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత శనివారం రాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. దీనితో అర్ధరాత్రి కొండచరియలు రేకుల షెడ్డులపై పడి పోయాయి. అర్ధరాత్రి కావడం..గాఢ నిద్రలో ఉండడంతో ప్రమాదాన్ని పసిగట్ట లేకపోయారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జీవీఎంసీ అధికారులు బండరాళ్లను తొలగించారు. సూర్యానారాయణ, మహాలక్ష్మి దంపతుల మృతదేహాలు శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు గమనించారు. వారి మనువడిగా భావిస్తున్న ఆది నారాయణ (7) మృతదేహాన్ని బయటకు తీశారు. మరో నలుగురు క్షతగాత్రులను రక్షించడం జరిగింది. బండరాళ్ల కింద చిక్కుకున్న నలుగురిలో ఒకరి రెండు కాళ్లు తీసి ప్రాణాలు రక్షించారు. అతని పరిస్థితి బాగానే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. కొండచరియలకు ఆనుకుని నిర్మాణాలు సాగించడంతో ప్రాణనష్టం సంభవిస్తుందని,ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

10:10 - December 20, 2015

విశాఖపట్టణం : కొండ వాసాల ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. శనివారం అర్ధరాత్రి సంజీవయ్యనగర్ కాలనీలో కొండచరియలు విరిగిపడడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. వీరిలో ఆది నారాయణ (7) బాలుడున్నాడు. సూర్యానారాయణ, మహాలక్ష్మి దంపతుల మృతదేహాల వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. ఈసందర్భంగా టెన్ టివితో మాట్లాడారు. ఇతరత్రా కారణాలతో ఈ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు దుర్బర జీవితం గడుపుతున్నారని ఇలాంటి నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి ? ఒక కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేపడుతామన్నారు. ఇక్కడి నుండి వెళ్లాలని చెప్పడం జరుగుతుందని, కొండవాలు ప్రాంతంలో సర్వే చేసి డేంజర్ జోన్ పరిధిలో ఉన్న వారిని తరలిస్తామన్నారు.

భారీ వర్షం..
శనివారం రాత్రి భారీ వర్షం పడిందని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టెన్ టివితో మాట్లాడారు. కొండచరియలు పడడంతో ఈప్రమాదం చోటు చేసుకుందని, దాదాపు 55 ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారన్నారు. ఏ ప్రాంతంలో ఏమి జరుగుతుందో తెలియదని, ఇలాంటి ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై అధ్యయనం చేస్తామన్నారు. సొంత స్థలం ఉంటే ఎలా వెళ్లాలని కొందరు పేర్కొంటున్నారని, క్రమబద్దీకరణకు దరఖాస్తుకు పెట్టుకోవడం జరిగిందన్నారు.

ఎంతో మంది పేదవారు...
గాజువాకలో అప్పన్నకాలనీ, దశమికొండ, శ్రీనగర్‌, సుందరయ్య కాలనీ తదితర కొండలపై చాలామంది పేదలు ఆవాసాలు ఏర్పాటుచేసుకొని నివసిస్తున్నారు. వీరంతా రోజు కూలి చేసుకొని జీవనం సాగిస్తున్నవారే. వర్షం వస్తే భయం భయంతో నివసిస్తున్నారు. ఏ సమయంలో ఏ ఇంటిపైన కొండ చరియ విరిగిపడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. గత ఏడాది అప్పన్న కాలనీలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు దుర్మరణం చెందారు. 50వ వార్డు సంజీవయ్య కాలనీలో కూడ ఒక వృద్ధుడు ఇలానే మృతిచెందాడు. ఇటీవలే సింహగిరికాలనీ కొండపై భార్యా భర్తలిద్దరు దుర్మరణం చెందారు.

 

06:45 - December 20, 2015

గుంటూరు : అమరావతి బృహత్‌ ప్రణాళిక రూపకల్పన తుది దశకు చేరుకుంది. మరో ఐదు రోజుల్లో దీనిని ఖరారు చేసేందుకు వీలుగా సర్కార్‌ చర్చలు చేపట్టింది. ప్రణాళికను ఆమోదించడంతోపాటు... మాస్టర్‌ డెవలపర్, మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ను కూడా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కార్‌ భావిస్తోంది. సింగపూర్ సంస్థ సర్బానా రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో చంద్రబాబునాయుడు సూచలు, సలహాల మేరకు స్వల్పమార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధమైన జోనల్‌ ప్రతిపాదనలను సీఆర్‌డీఏ అధికారులకు అందజేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత చంద్రబాబు.. వీటిని పరిశీలిస్తారు. రాజధానిని తొమ్మిది జోన్లుగా విభజిస్తున్నారని రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి నారాయణ చెప్పారు.
రాజధాని బృహత్‌ ప్రణాళిక ఖరారు చేసిన తర్వాత మౌలికసదుపాయాల కల్పనను వేగవంతం చేస్తారు. దీనికి ఆరు నెలల నుంచి ఏడాది కాలం పట్టొచ్చని భావిస్తున్నారు. నిర్మాణ పనులు 2017 లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మంత్రి నారాయణతో పాటు సీఆర్‌డీఏ అధికారులు మూడు రోజులపాటు చైనాలోలని గుయాంగ్‌ ను సందర్శించివచ్చారు. అమరావతికి రెండింతలు... 400 చదరపు కి.మీ.పరిధిలో చేపట్టని గుయాంగ్‌ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేశారు. గుయాంగ్‌ తరహాలో అమరావతి కూడా చేపట్టాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. 

06:43 - December 20, 2015

మెదక్ : విశ్వశాంతి, ప్రజా క్షేమంకోసం అయుత చండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌..ఈ యాగానికి అతిరథ మహారథులను ఆహ్వనించారు. అత్యంత నిష్ఠతో చేస్తున్న ఈ యాగాన్ని శృంగేరి పీఠం నిర్వహిస్తున్నదన్న సీఎం దీనికి అందరూ ఆహ్వానితులేనని ప్రకటించారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ వద్ద జరుగనున్న అయుత చండీ మహాయాగానికి ప్రముఖులు తరలివస్తుండడంతో ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు.

రాష్ట్రపతి రాక..
మహాయాగంలో చివరి రోజు నిర్వహించే మహా పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. దీంతో ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.  ప్రణబ్‌ముఖర్జీతో పాటు..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రమణ, జాస్తి చలమేశ్వర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భోసలే, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అనేకమంది ప్రముఖులు హాజరవుతున్నారు. వీరితో పాటు పత్రికల యాజమానులు, ఎడిటర్లు, ప్రముఖ జర్నలిస్టులు, ఆసక్తి గల సెలబ్రిటీలు, కవులు, రచయితలు, పారిశ్రామికవేత్తలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 40వేల మంది సర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు అందరిని ఆహ్వానించారు. వీరితో పాటు జగద్గురు శంకరాచార్యులు, చినజీయర్ స్వామి, స్వరూపానంద స్వామి, మాధవానందస్వామి, మంత్రాలయ పీఠాధిపతి,ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆర్ట్‌ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు రవిశంకర్‌లను కూడా ఆహ్వానించారు.

పలు కార్యక్రమాలు..
ఇక ఈ మహా యాగానికి ఆరేడు రాష్ర్టాల నుంచి దాదాపు 15మంది రుత్విక్కులు, ఉపాసకులు వస్తున్నారు. 1500 మంది రుత్వికుల్లో 1100 మంది రుత్వికులు ఏకకంఠంతో పారాయణం చేయనున్నారు. ఉదయం ఏడు గంటలకు యాగశాలలోకి ప్రవేశించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. ఒక ప్రతిరోజు వచ్చే 50వేల మందికి భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారి ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను ఇవ్వనున్నారు. యాగశాలలో కేవలం 8-10వేల మంది మాత్రమే కూర్చునే అవకాశం ఉంటుంది. మహిళలు పెద్దఎత్తున రానున్నారు. రోజుకు వెయ్యి మంది మహిళలు లలిత సహస్రనామం, కుంకుమార్చన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు, హరికథలు, భజనలు, వాగ్గేయకారుల గీతాలాపన ఉంటాయి.

06:40 - December 20, 2015

హైదరాబాద్ : శీతాకాల విడిదిలో భాగంగా 13 రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తున్నారు ప్రణబ్ ముఖర్జీ. రెండోరోజు హైదరాబాద్ లోని మిలటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ లో 96 స్నాతకోత్సవంలో పాల్గొన్నారు రాష్ట్రపతి. కొత్తగా వచ్చిన టెక్నాలజీని సైనిక శక్తిని సుసంపన్నం చేసుకోవాలని.. నవీన ఆవిష్కరణలకు నాంది పలకాలని యువ ఇంజనీర్లకు పిలుపునిచ్చారు ప్రణబ్. మిలిటరీలో యువ ఇంజినీర్లు సృజనాత్మకతతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రత్యర్థి దేశాలపై ఆధిపత్యం సాధించేలా పురోగమించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. మున్ముందు ఎదురయ్యే పెను సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పరిజ్ఞానమే ప్రస్తుతం సర్వస్వమని, అది కరెన్సీ వంటిదన్నారు ప్రణబ్. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నవీన ఆవిష్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారాయన. గతంలోనూ నూతన ఆవిష్కరణలకు సైన్యం ముందుండి నిలిచిన విషయాన్ని యువ ఇంజినీర్లు గమనంలోకి తీసుకోవాలన్నారు. మిలిటరీ ఆవిష్కరించిన సాంకేతిక పరిశోధనలు పౌర సమాజానికి ఎంతో ఉపయోగపడ్డాయని ప్రణబ్ గుర్తు చేశారు. బలమైన ప్రత్యర్థులపై సైనికపరంగా పైచేయి సాధించేందుకు నిరంతరం సాంకేతికంగా కొత్త ప్రయోగాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానమే సైనిక యుద్ధాల్లో కీలక భూమిక పోషిస్తుందని చరిత్రను చూస్తే స్పష్టమవుతుందని ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. బయో మెట్రిక్ సోలార్ సిస్టంతోపాటు ఎంసీఈఎంఈలో మిలిటరీ కళాశాల విద్యార్థులు చేస్తున్న పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.

ఆలోచింప చేసిన ఆవిష్కరణలు..
మిలటరీ ఇంజినీరింగ్, ఐటీ విద్యార్థులు ప్రదర్శించిన కొన్ని కొత్త ఆవిష్కరణలు అలోచింపచేశాయి. సెన్సార్లతో పని చేసే సోలార్ యూనిట్లు, తాగిన మత్తులో ఉన్న వారు బండిని నడిపితే ఆటోమేటిక్‌గా ఇగ్నిషన్ ఆగిపోయే విధంగా సెన్సార్ బ్రీతింగ్ అనలైజర్లు తయారు చేసి అబ్బురపరిచారు. వివిధ పరిశోధనలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి మెడల్స్‌ను ప్రధానం చేశారు. శాస్త్ర సాంకేతికను అందిపుచ్చుకుని ప్రత్యర్థులకు భారత్ ముందుకు వెళ్తుందన్న సంకేతాలివ్వాలని సూచించారు ప్రణబ్. ఇంజనీర్ల మేధస్సు ఆర్మీకే కాక ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు రాష్ట్రపతి. ఆద్యంతం రాష్ట్రపతి ప్రసంగంలో భారత్ కు యువ ఇంజనీర్ల శక్తి కావాలని, భారత ప్రజల నమ్మకమే ఇంజనీర్లకు శక్తి అనడంలో నిగూడార్థం ప్రత్యర్థులకు మేం శక్తి వంతులమని తెలియజేయడమే అన్నది పలువురి వాదన.

06:36 - December 20, 2015

హైదరాబాద్ : వీకెండ్‌లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ఆపరేషన్‌ చేస్తూనే ఉన్నారు.. తాగి కార్లు డ్రైవింగ్‌ చేసేవారు దొరుకుతూనే ఉన్నారు. ప్రతి వారం ఎవరో ఒకరు హల్‌చల్‌ చేస్తూనే ఉన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్‌ 45లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఎపి 09 సిపి 3940 నెంబర్ గల కారులో ఓ మహిళ వచ్చింది. ఆ మహిళ మొదట పరీక్షకు నిరాకరించింది. అయినా పోలీసులు వదిలిపెట్టలేదు. చివరకు టెస్ట్‌ చేయగా ఆల్కహాల్‌ సేవించినట్లు రుజువైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో ఇద్దరు యువకులు బైక్‌పై తాగి వెళుతూ రోడ్డుపై పడిపోయారు. మొత్తం 13 కేసులు బుక్ చేయడం జరిగిందని, పలు వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ డ్రైవింగ్ వల్ల పబ్లిక్ లో అవగాహన వచ్చిందని, దీనివల్ల కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు ప్రధాన మార్గంలోనే కాక ఇతర మార్గాల్లో చెక్ చేయడం జరుగుతుందన్నారు. 

06:35 - December 20, 2015

హైదరాబాద్ : ప్రముఖ నటుడు రంగనాథ్‌ ఆత్మహత్య చేసుకొని అర్థాంతరంగా తనువు చాలించారు. ఆయన హైదరాబాదులో కవాడిగుడాలో ఉన్న తన నివాస గృహంలోని వంటగదిలో ఉరి వేసుకున్నారు. దీంతో యావత్‌ తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. గత కొంత కాలంగా ఒంటరిగానే జీవిస్తున్న రంగనాథ్‌ ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా రంగనాథ్‌ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ అనంతరమే అసలు విషయం బయట పడే అవకాశం ఉంది.

సన్మానానికి రాలేనంటూ మెసేజ్..
వంటగదిలో destiny అని రాసి ఉంది. దాన్ని బట్టి కూడా రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. తలుపులు పగులగొట్టి రంగనాథ్‌ను స్థానికులు ఆస్పత్రికి చేర్చారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు తెలుస్తోంది. రంగనాథ్ ఉంటున్నది తన పెద్ద కూతురు నివాసమని సమాచారం. ఆయన ఒంటరిగానే ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆయన సంతానం బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయన మృతికి సంబంధించిన సమాచారాన్ని వారికి చేరవేసారు. బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నారు. రంగనాథ్ గత కొంతకాలంగా ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడం లేదని కూడా చెబుతున్నారు. రంగనాథ్ చివరిసారిగా గుడ్‌బై సార్ అంటూ ఓ మిత్రుడికి మేసేజ్ చేశారు. చనిపోయే ముందు రంగనాథ్‌ ఓ సన్మాన కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. కార్యక్రమానికి రాలేనంటూ నిర్వాహకులకు రంగనాథ్‌ ఎస్సెమ్మెస్‌ పంపించారు. ఇదిలా ఉంటే ఒంటరితనం భరించలేకనే తన తండ్రి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆయన కూతురు చెప్పారు. తమ తల్లి చనిపోయినప్పటి నుంచి ఆయన ఒంటరిగా ఫీలవుతున్నాడని...ఒంటరితనం నుంచి బయటకు తెచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. రంగనాథ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

06:15 - December 20, 2015

విశాఖపట్టణం : నగరంలో విషాదం చోటు చేసుకుంది. నివాసాలపై కొండ చరియలు విరిగిపడడంతో ఓ ఏడేళ్ల బాలుడు మృతి చెందగా మరికొందరు తీవ్రగాయాల పాలయ్యారు. శిథిలాల కింద మరికొందరు ఉంటారని భావిస్తున్నారు. శనివారం రాత్రి ఏడు గంటల నుండి విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. తాటిచెట్లపాలెం సమీపంలోని సంజీవయ్య కాలనీలోని రెండు కుటుంబాలకు చెందిన వారిపై శనివారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. గాఢ నిద్రలో ఉండడంతో ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. ఏడేళ్ల బాలుడు అక్కడికక్కడ మృతి చెందాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అర్ధరాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటకం కలిగింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరో ముగ్గురు శిథిలాల కింద ఇరుక్కుంటారని భావిస్తున్నారు. 

ఇళ్లపై విరిగిపడిన కొండచరియలు..

విశాఖపట్టణం : తాటిచెట్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఇళ్లపై కొండచరియలు విరిగిపడడంతో బాలుడు మృతి చెందాడు. శిథిలాల కింద కుటుంబసభ్యులు చిక్కుకున్నారు. 

నేడు గోదావరిలో సీతారాముల జలవిహారం..

ఖమ్మం : ముక్కోటి ఉత్సవాలకు భద్రాచలం ముస్తాబైంది. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం పవిత్ర పావన గౌతమీ నది తీరంలో స్వామి వారి తెప్పోత్సవం వేడుకగా నిర్వహించనున్నారు. 

నేడు సీఎం కేసీఆర్ క్రిస్మస్ విందు..

హైదరాబాద్ : నిజాం కాలేజీ మైదానంలో సీఎం కేసీఆర్ క్రిస్మస్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు. వీరిలో పలువురు క్రైస్తవ మత పెద్దలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులున్నారు. 

నేడు రాష్ట్రపతితో జగన్ భేటీ..

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైసీపీ అధ్యక్షుడు జగన్ కలువనున్నారు. ఆదివారం మధ్యాహ్నాం రెండు గంటలకు ఈ భేటీ జరుగనుంది. జగన్ వెంట పలువురు పార్టీ ఎమ్మెల్యేలు నేతలు కలువనున్నారు. 

విజయవాడలో వీఆర్ఏల ఆమరణ దీక్షలు భగ్నం..

గుంటూరు : తమ హక్కుల సాధన కోసం విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో నాలుగురోజులుగా కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్షలు శనివారం ఉద్రిక్తతకు దారితీశాయి. దీక్షల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు బలవంతంగా వైద్యశాలకు తరలించారు.

Don't Miss