Activities calendar

21 December 2015

ఏఈఈ పోస్టులకు 30న ఇంటర్వ్యూలు - టీఎస్పీఎస్సీ..

హైదరాబాద్ : ఏఈఈ పోస్టులకు ఈనెల 30న ఇంటర్వ్యూలు ఉంటాయని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో ఇంటర్వ్యూ అభ్యర్థుల జాబితా ఉండనుంది. 

కంపెనీలకు అనుమతి పత్రాలు ఇవ్వనున్న మంత్రి జూపల్లి..

హైదరాబాద్ : రేపు టీఎస్ ఐపాడ్ ద్వారా వచ్చిన 14 కంపెనీలకు అనుమతిపత్రాలను మంత్రి జూపల్లి అందచేయనున్నారు.

 

మమ్మల్ని బెదిరించలేరు - కేజ్రీవాల్..

ఢిల్లీ : కోర్టు కేసులతో అరుణ్ జైట్లీ మమ్మల్ని బెదిరించలేరని అవినీతిపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

త్వరలో యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ - గంటా..

హైదరాబాద్ : త్వరలో యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి గంటా వెల్లడించారు. తొలి దశలో వెయ్యి పోస్టులను భర్తీ చేస్తామని, పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలా ? లేక యూనవర్సిటీలే భర్తీ చేయాలా అనే దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. పాఠశాలల రేషనలైజేషన్ తరువాత ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

మాగంటి బాబు గన్ మెన్ ఆత్మహత్య..

పశ్చిమగోదావరి : ఎంపీ మాగంటి బాబు గన్ మెన్ ఆదాం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది రోజులుగా సెలవుల్లో ఉన్న గన్ మెన్ ఆదాం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

 

21:38 - December 21, 2015

అమెరికా : విజేతగా ప్రకటించారు... మిస్‌ యూనివర్స్‌ మీరే అన్నారు.. కిరీటం కూడా తొడిగేశారు.. విన్నర్‌ అన్న సంతోషం నుంచి తేరుకునేలోపే వి ఆర్‌ సారీ అంటూ కిరీటాన్ని లాగేసుకున్నారు. మిస్‌ యూనివర్స్ పోటీల్లో జరిగిన పొరపాటు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మిస్‌ యూనివర్స్ కిరీటం అందాల రాశుల కల. ఆ క్రౌన్‌ను తలపై ధరించాలని ప్రతి అందెగత్తే తపిస్తుంది. ఎప్పటిలాగే ఈసారీ యూఎస్‌లోని లాస్‌వెగాస్‌లో మిస్‌ యూనివర్స్‌ పోటీలు జరిగాయి.. వివిధ రకాల సెలక్షన్స్ తర్వాత అమెరికా, ఫిలిప్పైన్స్, కొలంబియా దేశాల యువతులు ఫైనల్‌కు చేరారు. ఈ ఏటి మిస్‌ యూనివర్స్‌ ఎవరు..? అన్న ఉత్కంఠ.. పార్టిసిపెంట్సే కాదు.. హాజరైన వారిలోనూ ఒకటే టెన్షన్.. జడ్జీలు నెమ్మదిగా పెదవి విప్పారు.. కొలంబియా ముద్దుగుమ్మ గుటిరేజ్‌ విజేతగా నిలిచిందని ప్రకటించారు.. ఈ అనౌన్స్‌మెంట్ విన్న గుటిరేజ్‌ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై పోయింది.. ఆమె ఆనందాన్ని రెట్టింపు చేస్తూ.. మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్నీ ఆమె తలపై ధరింప చేశారు.

అనూహ్య ట్విస్ట్..
ఇంతలో ఏమైందో ఏమో.. జడ్జిలు అనూహ్య ట్విస్ట్ నిచ్చారు. వి ఆర్‌ రియల్లీ సారీ అంటూ క్షమాపణ కోరి.. మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైంది మీరు కాదు.. ఫిలిప్పీన్స్ యువతి ఉర్జ్ బ్యాక్‌ దే ఆ క్రౌన్‌ అని తేల్చి చెప్పారు. దీంతో కొన్ని క్షణాలపాటు మిస్ యూనివర్స్‌గా ఉన్న మిస్‌ కొలంబియా షాక్‌కు గురైంది.. ఉర్జ్ బ్యాక్‌ ఏం జరుగుతుందో కాసేపు అర్థం చేసుకోలేకపోయింది.. వీళ్లు తేరుకోకముందే గుటిరేజ్‌నుంచి కిరీటాన్ని తీసుకొని ఉర్జ్‌ బ్యాక్‌కు ఇచ్చేశారు.. నిర్వాహకులు. ఇలా కొన్ని క్షణాల వ్యవధిలో విజేతలు మారిపోవడంతో ఆడియన్స్ కూడా విస్తుపోయారు.  జరిగిన పొరపాటుపై తాను బాధపడటంలేదని మిస్‌ కొలంబియా తేల్చేశారు. ఇది నిర్వాహకులు కావాలని చేసిందికాదని ఏదో అలా జరిగిపోయిందంటూ ఉత్కంఠ భరిత వాతావరణాన్ని తేలిక పరిచారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పోటీల్లో నిర్వాహకులు ఇలా క్షణాల వ్యవధిలోనే భిన్నమైన తీర్పు ఎలా ప్రకటించారో అర్థం కావడం లేదంటూ విమర్శకులు విరుచుకు పడుతున్నారు. 

21:36 - December 21, 2015

ఢిల్లీ : డీడీసీఏ కుంభకోణానికి సంబంధించి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీపై ట్విట్టర్ వార్‌ కొనసాగుతోంది. జైట్లీ తమపై పరువు నష్టం దావా వేయడంపై భయపడేది లేదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. దమ్ముంటే తనపై కూడా పరువు నష్టం దావా వేయాలని జైట్లీకి బిజెపి ఎంపి కీర్తి ఆజాద్‌ సవాల్‌ విసిరారు. ఆప్‌ చేసిన ఆరోపణలపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీ పాటియాల హౌస్‌ కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన సిఎం కేజ్రీవాల్, ఆప్‌ నేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్‌, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై జైట్లీ 10 కోట్ల రూపాయలకు వ్యక్తిగత హోదాలో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణను కోర్టు జనవరి 5కు వాయిదా వేసింది.

భయపడేది లేదన్న కేజ్రీ..
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కోర్టులో తమపై వేసిన కేసుకు భయపడేది లేదని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని కేజ్రీవాల్ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. డీడీసీఏలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోపాల్ సుబ్రమణ్యం విచారణ సంఘానికి సహకరించి జైట్లీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. అరుణ్‌జైట్లీపై సొంత పార్టీకే చెందిన ఎంపి, మాజీ క్రికెటర్‌ కీర్తీ ఆజాద్‌- తనపై కూడా పరువు నష్టం దావా వేయాలని ట్విట్టర్‌లో సవాల్‌ చేశారు. 'హాల్లో డియర్‌ అరుణ్‌జైట్లీ.. నాపై కూడా పరువునష్టం దావా వేస్తున్నావు కదా? ప్లీజ్‌ నామీద కూడా వేయ్‌. మినహాయింపు ఏమీ వద్దు. భావప్రకటనా స్వేచ్ఛను హరించకు' అని ట్వీట్‌ చేశారు. డీడీసీఏలో అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న జైట్లీకి బిజెపి బాసటగా నిలిచింది. పాటియాలా కోర్టుకు జైట్లీతో పాటు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీ, పియూష్‌ గోయల్‌, జెపి నడ్డా వెళ్లారు. అరుణ్‌జైట్లీ ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న 15 ఏళ్ల కాలంలో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ఆప్‌ ఆరోపించింది. తనపై ఆప్‌ నేతలు అసత్య ఆరోపణలు చేశారంటూ జైట్లీ పరువు నష్టం దావా వేశారు.

21:32 - December 21, 2015

ఢిల్లీ : నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలకు సంబంధించిన అంశంపై సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. దీనిపై కొందరు బాలనేరస్థుడి వయసు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనను ఏచూరి వ్యతిరేకించారు. ఒకవేళ 15 ఏళ్ల 9 నెలల బాలుడు నేరం చేస్తే అపుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఇక్కడ వయసు ప్రధానం కాదని, నేర తీవ్రతపై శిక్ష పడేలా చట్టాన్ని రూపొందించాలని ఏచూరి అభిప్రాయ పడ్డారు.

21:29 - December 21, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మే 8న ఎంసెట్‌,.. 9న ఈసెట్‌,.. 16న ఐసెట్‌,.. 23న ఎడ్‌సెట్‌,.. 26న పీజీసెట్‌,.. 28న లాసెట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక యూనివర్సిటీల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. తొలిదశలో భర్తీ చేయనున్న పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలా లేక.. వర్సిటీలే భర్తీ చేయాలా అనే అంశంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు గంటా. 

21:28 - December 21, 2015

హైదరాబాద్ : గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తకుండా మంత్రి హరీష్ రావు మహరాష్ట్రకు వెళ్తున్నారు. ఆయనతో పాటు సాగు నీటి సలహాదారులు విద్యాసాగర్ రావు, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ కే జోషి, ఇఎన్ సీ మురళీధర్ రావు ఇతర అధికారులు ఉన్నారు. మంత్రి హరీష్‌ బృందం తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజీ విషయమై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. తుమ్మిడిహట్టి వద్ద గత ప్రభుత్వం 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఎత్తుతో బ్యారేజి నిర్మాణాన్ని ప్రతిపాదించింది. మహారాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకుండ కాల్వ పనులను ప్రారంభించారు. అయితే ప్రాజెక్ట్ వల్ల తమ భూభాగం ముంపునకు గురైతే.. అనుమతించే ప్రశ్నే లేదని మహారాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు ప్రకటించింది. తుమ్మిడిహట్టి వద్ద నుండి నీటిని తరలించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే తమ భూభాగంలో ముంపుని అనుమతించబోమని మహరాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజిని 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో నిర్మించుకోవచ్చునని సూచించారు.

సానుకూలంగా స్పందిస్తుందన్న హరీష్..
148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద బ్యారేజీ నిర్మిస్తే 40 నుంచి 45 టీయంసీలకు మించి నీటి తరలింపు సాధ్యం కాని పరిస్ధితి ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అనివార్యంగా ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. అందులో భాగంగానే నీటి లభ్యత పుష్కలంగా ఉండి ముంపు సమస్యలేని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మంగళవారం జరగబోయే చర్చల్లో మహా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రి హరీష్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. పెన్‌గంగా బ్యారేజి విషయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన సానుకూల స్పందనే... ఈసారి కూడా వస్తుందని ఆయన భావిస్తున్నారు. 

21:26 - December 21, 2015

మెదక్ : జిల్లా ఎర్రవెల్లిలో చండీయాగం ఏర్పాట్లు చివరిదశకు చేరాయి.. ఈ నెల 23న ఈ యాగం జరగబోతోంది.. సమయం తక్కువగా ఉండడంతో వేగంగా పనులు పూర్తిచేయిస్తున్నారు.. యాగ పరిసరాల్లో తుదిమెరుగులు దిద్దుతున్నారు.. క్రిస్టమస్‌కు వరుసగా సెలవులు రావడంతో పెద్దసంఖ్యలో ప్రజలు వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు.. ఇందుకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు ప్రయత్నిస్తున్నారు. అటు ప్రధానయాగశాలతో పాటు... వీవీపీపీలు బస కుటీరాలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు.. యాగానికివచ్చే భక్తులను కేటగిరీలవారీగా విభజించి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.. అలాగే రోజుకు దాదాపు 50వేలమంది యాగానికి వస్తారని అంచనా వేస్తున్నారు.. వీరందరికీ తీర్థప్రసాదాలు, భోజనంకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.. అలాగే 2వేలమంది ఒకేసారి కుంకుమార్చన చేసేందుకు... అర్చన సామగ్రి ఉచితంగా ఇవ్వాలని కేసీఆర్‌ సూచించారు. మరోవైపు యాగానికిముందు పూజా కార్యక్రమాలను కేసీఆర్‌ దంపతులు మొదలు పెట్టారు.. యాగం ప్రాంగణంలో వీరితో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. యాగానికివచ్చే ప్రజలకోసం ప్రత్యేక సమాచారకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.. అంబులెన్సులు, అగ్నిమాపక దళాలు, రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచుతున్నారు.. పార్కింగ్‌కోసం 20 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు.

21:24 - December 21, 2015

హైదరాబాద్ : ఏపీ మంత్రుల ప‌నితీరు బాగాలేదు.. ఇది నిత్యం పార్టీలో జ‌ర‌గుతున్న ప్రచారం. ఇప్పుడు సిఎం కూడా దీనిపై ఫోక‌స్ పెట్టారు. అసెంబ్లీలో మంత్రుల పెర్ఫామెన్స్‌పై అసంతృప్తిగా ఉన్న సిఎం.... ఎమ్మెల్యేల‌ నుంచి వ‌స్తున్న ఫిర్యాదుల‌పైనా దృష్టిపెట్టారు. ఎమ్మెల్యేల‌ను ఇబ్బంది పెట్టవద్దన్న బాబు... ఎమ్మెల్యేలు, నేత‌లు తీసుకువ‌చ్చే ప‌నుల‌ను వెంట‌నే చెయ్యాల‌ని చెప్పారు. పార్టీ నేత‌ల ప‌నుల విష‌యంలో మంత్రులు వేగంగా నిర్ణయ‌ాలు తీసుకోవాల‌ని సూచించారు. కొంద‌రు మంత్రుల తీరు అసలు బాగాలేదని... తీరు మార్చుకోవాల‌ని బాబు హెచ్చరించారు. కార్యకర్తల నుండి నేరుగా త‌న‌కే ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని సియం అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు క‌లిసి ప‌నిచేసి పార్టీ బ‌లోపేతానికి ప‌నిచేయాల‌ని సూచించారు. ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో మంత్రులు త‌ల‌ దూర్చవద్దని సూచించారు.

రాజధాని అమరావతిలో అందుబాటలో ఉండాలన్న బాబు..
జిల్లాల పర్యటనకు మంత్రులు వెళ్ళిన‌ప్పుడు ఖ‌చ్చితంగా జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళ్ళాల‌ని, ఎమ్మెల్యేల‌ను క‌ల‌వాల‌ని సూచించారు. ఇక నుండి ప్రతి సోమ‌వారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు నూత‌న రాజ‌ధాని అమరావ‌తిలో అందుబాటులో ఉండాల‌ని ఆదేశించారు బాబు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బ‌లంగా తీసుకెళ్లడంలో అంతా ఫెయిల్ అవుతున్నార‌ని... ఇక నుండి అలా జ‌ర‌గ‌కూడ‌ద‌ని కూడా హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లోకి బ‌లంగా తీసుకెళ్ళాల‌ని సూచించారు. మంత్రులు ఎవ‌రు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తుంటే లిప్ట్ చేయ‌డం లేద‌ని సియం అస‌హ‌నం వ్యక్తం చేశారు.శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన సీనియ‌ర్ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుంద‌ర్ శివాజి ఇటీవ‌ల ఒక మంత్రికి కాల్ చేస్తే రిసివ్ చేసుకోలేద‌నే ఫిర్యాదు సియం కు చేరింది. దీనిపై సియం సీరియ‌స్ అయ్యారు. ఇక నుండి అంతా క‌లిసి ప‌నిచేయాల‌ని లేక‌పోతే క‌ఠిన నిర్ణయాలు ఉంటాయ‌ని హెచ్చరించారు. ఇటీవ‌ల కాల్‌మ‌నీ వ్యవహారంలో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు రావ‌డంతో సీఎం సీరియస్ అయ్యారు. ఇక మీద‌ట స్నేహాలు చేసేటప్పుడు జాగ్రత్త వ‌హించాలని కూడా సూచించారు. మంచి వారితో స్నేహం చేయ‌క‌పోతే.. ఆ ప్రభావం.. మీపై త‌ర్వాత పార్టీపై ఆ త‌ర్వాత ప్రభుత్వంపై ప‌డుతుంద‌ని వ్యాఖ్యానించారు. ఇకనుంచైనా... మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో స్నేహం చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు. సీరియ‌స్‌గా క్లాస్ తీసుకోవ‌డంతో సభ్యులంతా అవాక్కయ్యారు. ఈ స‌మావేశం ద్వారా ఎవ‌రికైతే హెచ్చరికలు పంపాలో.. వారికి చేరినట్టు తెలుస్తోంది. 

21:06 - December 21, 2015

తిట్ల పురాణం..అడుగడుగునా అసహనం..అసభ్యపదజాలం..నోరు జారుతున్నారు..విలువలకు నీళ్లు వదులుతున్నారు..చర్చను పక్కదారి పట్టిస్తూ మొత్తంగా సభ మర్యాదలను మంటగలుపుతున్నారు. ప్రజా సమస్యలను వదిలేసి పనికి మాలిన చెత్తంతా మాట్లాడుతూ టైం పాస్ చేస్తున్నారు. ఇది ఏపీ అసెంబ్లీ జరుగుతున్న తీరు. అసెంబ్లీలో అగ్లీ సీన్స్ గురించి..అపహాస్యం అవుతున్న ప్రజాస్వామ్యం గురించి కథనం. 

ఒకనాటి విలువలు ఏవీ ? 
ప్రజా ప్రతినిధులంతా ఒక్కచోట చేరే ప్రదేశం.. ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి ప్రదేశం. మరి ఇక్కడ జరగాల్సిందేమిటి? జరుగుతున్నదేమిటి? ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఎలాంటి సంకేతాలిస్తున్నాయి? ఏదీ ఒకనాటి సంప్రదాయం.. ఏవీ ఒకనాటి విలువలు.. గౌరవ సభ్యులు వాడుతున్న భాషను ఎలా అర్ధం చేసుకోవాలి? చట్టసభలను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తీరుకు ఎలా స్పందించాలి? సామాన్యుడి ముందున్న ప్రశ్నలివి..!! ప్రజా సమస్యలను శాసనసభలో చర్చించి పరిష్కరించలేకపోతున్నాం . అల్లరి మూకలకు శాసనసభ కేంద్రంగా మారిందని ప్రజలు భావిస్తున్నారని సాక్షాత్తూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలను ఎలా అర్ధం చేసుకోవాలి.

భిన్నంగా మండలి సమావేశాలు..
విభజన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. మ్యానిఫెస్టోలో హామీలు వెక్కిరిస్తున్నాయి. నిధుల కొరత, రాజధాని రభస, రైతుల సమస్యలతోపాటు, కాల్ మనీ, బాక్సైట్ సమస్య, లిక్కర్ మాఫియా ఇలా రాష్ట్రాన్ని సవాలక్ష సమస్యలు వెంటాడుతుంటే వాటిని పక్కదారి పట్టించేలా సభ జరుగుతున్న తీరుపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షం బాధ్యత. ప్రభుత్వ నిర్మాణాత్మక చర్యలకు ప్రతిపక్ష సూచనలు తీసుకోవటం అధికార పక్ష బాధ్యత. కానీ, ఇలాంటి పరిస్థితులేవీ ఏపీ అసెంబ్లీలో కనిపించవవు. ఆగర్భ శత్రువుల్లా కాట్లాడుకోవటం తప్ప మరే దృశ్యం ఇక్కడ కానరావటం లేదు. పక్కనే జరుగుతున్న మండలి సమావేశాల్లో దీనికి భిన్నంగా ఉండటం విశేషం.

ఏ మాత్రం క్షంతవ్యం కాదు..
ప్రతిపక్షం కావాలి. ప్రతిపక్షం బతికుండాలి. ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికీ, విపక్షానికీ రెండిటికీ ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే చట్టసభలో భిన్నవాదనలనుంచి, అనేక చర్చలనుంచి ప్రజానుకూల విధానాన్ని తేల్చాలి. అలాంటి సందర్భంలో ప్రశ్నించేవారు సభలో ఉండకూడదనే భావన, వారిపై కక్ష సాధింపు ధోరణి ప్రమాదకరం. పోతే పోనీ, జనం సొమ్మే కదా అని భావిస్తే, నాయకులు భంగపడక తప్పదు. ప్రజలు నాయకుల నడవడికని, చట్టసభల సాక్షిగా ప్రజాస్వామ్యానికి చేస్తున్న ద్రోహాన్ని గమనిస్తూనే ఉన్నారు. తమ ఓట్లతో గెలిచి, తమకు ప్రతినిధులుగా వ్యవహరించాల్సిన వారు.. ప్రజాధనాన్ని వృధా చేస్తూ చట్ట సభల సమావేశాలను వృధాగా మార్చటం ఏ మాత్రం క్షంతవ్యం కాదనే అంశాన్ని గుర్తించాలి. 

21:03 - December 21, 2015

క్రీమిలేయర్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వేతన జీవులకు, వ్యవసాయ ఆదాయాలకు వర్తించదని పేర్కొంది. ఉపయోగపడిన అంశమని కొందరు పేర్కొంటుంటే అసలు క్రీమిలేయర్ ఉండకూడదని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. క్రీమిలేయర్ వల్ల ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? అనే అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో పాతూరి సుధాకర్ రెడ్డి (టీఆర్ఎస్), ప్రొ.విశ్వేశ్వరరావు (సామాజిక విశ్లేషకులు), అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), శ్రీనివాస్ గౌడ్ (బిసి సంక్షేమ సంఘం) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో వీడియోలో చూడండి..

20:43 - December 21, 2015

కరీంనగర్ : కాంట్రాక్టర్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సాక్షిగా ఈ దాడులు జరిగాయి. మంథని డివిజన్ లో కొయ్యూరు, వల్లెంకుంట ఎత్తిపోతల పథకం కింద రోడ్ల పనులను రూ.3 కోట్లకు మురళి అనే కాంట్రాక్టర్ చేజిక్కించుకున్నాడు. అయితే ఈ కాంట్రాక్ట్ ను రాజమౌళికి సబ్ కాంట్రాక్టర్ కు ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ పనులను శంకర్, వెంకటరమణలు పూర్తి చేశారు. ఈ పనులకు డబ్బులు చెల్లించకపోవడంతో శంకర్, వెంకటరమణలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. డబ్బుల చెల్లింపులో మాట్లాడుకుందామని మురళి..రాజమౌళిలను ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు పిలిచారు. అనంతరం శంకర్, వెంకటరమణ అనే వ్యక్తులు వారితో ఘర్షణకు దిగారు. మధ్యలో పోలీసులు కలుగ చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. మంత్రి ఈటెల రాజేందర్ పంపించాడంటూ తమపై దాడికి దిగాడని గాయపడిన కాంట్రాక్టర్లు ఆరోపించారు. 

20:21 - December 21, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. బ్యాంకు రుణాలు రాక..పంటలు ఎండిపోతుండడం..మద్దతు ధర రాకపోతుండడం..ఇతరత్రా కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపై కోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో ఎలాంటి విచారణ జరిగింది తదితర అంశాలను న్యాయవాదులు టెన్ టివికి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని, రైతుల ఆత్మహత్యలు ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారని కోర్టు ప్రశ్నించినట్లు తెలిపారు. నిపుణులు..ఇతరులతో కమిటీ ఏర్పాటు చేసి వారి సూచనలను పరిగణలోకి తీసుకుని ఒక నివేదిక తయారు చేయాలని సూచించిందని పేర్కొన్నారు.

 

20:19 - December 21, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి శుభవార్త వినిపించారు. ఏప్రిల్ చివరి వారంలో డీఎస్పీ ప్రకటన..జూన్ రెండో వారంలో డీఎస్సీ ఉంటుందన్నారు. జూన్ చివరి వారంలో డీఎస్సీ ఫలితాలను వెల్లడిస్తామని, ఫలితాల అనంతరం జులై రెండో వారంలో అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే మార్చి తొలి వారంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ నొటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు, ఏప్రిల్ రెండవ వారంలో టెట్‌ పరీక్షను నిర్వహించనున్నట్టు తెలిపారు. జులై రెండో వారంలో అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానం ఉంటుందని కడియం వెల్లడించారు. 

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది. శాసనసభ ఐదు బిల్లులను ఆమోదించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కల్పిస్తూ సవరణ బిల్లును ఆమోదించింది. ఎలక్ట్రిసిటీ బిల్లు, సముద్ర తీర ప్రాంత బోర్డు బిల్లు, విలువ ఆధారిత బిల్లు..విదేశీ మద్యం వ్యాపార క్రమబద్ధీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 

ఏపీలో కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలు..

విజయవాడ : ఏపీలో కామన్ ఎంట్రెన్స్ టెస్టుల తేదీలను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మే 8న ఎంసెట్, మే 9న ఈసెట్, మే 16న ఐసెట్, మే 26న పీజీ సెట్, మే 28న లాసెట్ నిర్వహించనున్నారు. 

జనవరి 30 వరకు రైతులకు ప్లాట్లు - నారాయణ..

హైదరాబాద్ : జనవరి 30 వరకు రైతులకు ప్లాట్లు కేటాయిస్తామని, జూన్ లో రాజధాని నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులకు ప్లాట్లు కేటాయించే వరకు రాజధాని నిర్మాణంపై ఎలాంటి అడుగుపడదన్నారు. 

రాయదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి..

అనంతపురం : రాయదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. అనధికారికంగా ఉన్న రూ.55 వేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తో సహా మరో నలుగురు ఉద్యోగులపై కేసు నమోదు చేశారు. 

మార్చిలో టెట్ నోటిఫికేషన్ - కడియం..

హైదరాబాద్ : మార్చి తొలి వారంలో టెట్ నోటిఫికేషన్ ఉంటుందని ఏప్రిల్ రెండో వారంలో టెట్ ఉంటుందని మంత్రి కడియం ప్రకటించారు. ఏప్రిల్ చివరి వారంలో డీఎస్పీ ప్రకటన..జూన్ రెండో వారంలో డీఎస్సీ ఉంటుందన్నారు. చివరి వారంలో డీఎస్సీ ఫలితాలు ఉంటాయని వెల్లడించారు. జులై రెండో వారంలో అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానం ఉంటుందని కడియం వెల్లడించారు. 

తెలంగాణలో 45వేలకు పైగా గృహాలకు కేంద్రం అనుమతి..

ఢిల్లీ : ప్రధాన మంత్రి అవాజ్ కింద తెలంగాణ రాష్ట్రానికి 45,721 ఇళ్లను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేటాయించింది. ఇందుకు గాను రూ.678 కోట్లను కేంద్రం ఇవ్వనుంది. మరిన్ని ఇళ్లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిన ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. మొత్తం 55,507 ఇళ్లకు రూ.833 కోట్లను ఖర్చు చేయనుంది. 

ఐదు బిల్లును ఆమోదించిన ఏపీ శాసనసభ..

హైదరాబాద్ : ఏపీ శాసనసభ ఐదు బిల్లులను ఆమోదించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి వీలు కల్పిస్తూ సవరణ బిల్లును ఆమోదించింది. ఎలక్ట్రిసిటీ బిల్లు, సముద్ర తీర ప్రాంత బోర్డు బిల్లు, విలువ ఆధారిత బిల్లు..విదేశీ మద్యం వ్యాపార క్రమబద్ధీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. 

గెహ్లాట్ తో ముగిసిన జోగు రామన్న భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి గెహ్లాట్ తో మంత్రి జోగు రామన్న భేటీ ముగిసింది. ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని కోరినట్లు, బీసీ సంక్షేమం, ఉపకార వేతనాల పెంపుపై చర్చించినట్లు జోగు రామన్న తెలిపారు. 

కోదాడ మున్సిపాల్టీని ముట్టడించిన కార్మికులు...

నల్గొండ : సీఐటీయూ ఆధ్వర్యంలో కోదాడ మున్సిపాల్టీని కార్మికులు ముట్టడించారు. కమిషనర్ బాలాజీ నాయక్ ను గదిలో కార్మికులు బంధించారు. పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

కాల్ మనీని సీఎం రాజకీయ కోణంలో చూస్తున్నారు - వైసీపీ..

హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారాన్ని సీఎం రాజకీయ కోణంలో చూస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి పేర్కొన్నారు. టిడిపి వారిని రక్షించేందుకు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, కాల్ మనీ కేసులో ఇతర పార్టీలపై బురదచల్లడం సరికాదన్నారు. ఈ కేసులో ఏ పార్టీ వారున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

కేసీఆర్ యాగం ఖర్చుల వివరాలు బయటపెట్టాలి - మధుయాష్కి..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ చేస్తున్న యాగంలో భోజనాల ఖర్చంతా నారాయణ విద్యా సంస్థలే భరిస్తున్నాయని టి. కాంగ్రెస్ నేత మధుయాష్కిగౌడ్ ఆరోపించారు. యాగానికి విరాళాలు ఇచ్చిన వారి పేర్లను బయటపెట్టాలని, విరాళాలలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు నిబందనలు అతిక్రమించాయని, చదువు పేరిట కోట్లాది రూపాయలు లూఠి చేస్తున్నాయన్నారు. ఆ విద్యా సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

సీపీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా ఆరు బుక్ లెట్ లు..

హైదరాబాద్ : సీపీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా ఆరు బుక్ లెట్ లను జాతీయ కార్యదర్శి సురవరం విడుదల చేశారు. స్థానిక సమస్యలపై పోరాటం ద్వారా ప్రజల్లోకి వెళుతామని, న్యాయ వ్యవస్థ..సీబీఐలను కాంగ్రెస్, బీజేపీలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. 

గెహ్లాట్ ను కలిసి జోగు రామన్న..

ఢిల్లీ : కేంద్ర మంత్రి గెహ్లాట్ ను మంత్రి జోగు రామన్న కలిశారు. ఈ సమావేశంలతో పార్టీ ఎంపీలు కూడా పాల్గొన్నారు. బీసీ సంక్షేమం, కేంద్రం నిధులు, స్కాలర్ షిప్ ల పెంపు వంటి అంశాలపై చర్చించారు. 

ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. సమావేశం ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 4కు వాయిదా వేసింది.

 

18:08 - December 21, 2015

హైదరాబాద్ : ఏపీ టీడీఎల్పీ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు..ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల ఈ సమావేశం జరిగింది. నేతల మధ్య విబేధాలున్నట్లు బాబు గమనించారు. నియోజకవర్గాల్లో మంత్రులు వేలు పెడుతున్నారని కొంతమంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో బాబు ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఏ మంత్రి కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని శ్రీకాకుళానికి చెందిన ఎమ్మెల్యే బాబు దృష్టికి తీసుకెళ్లారు. శాసనసభ్యులతో కలిసి పనిచేయాలని, నేతలందరూ ఐక్యమత్యంతో పనిచేయాలని సూచించారు. అవినీతికి పాల్పడితే ఊరుకోనని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాబు హెచ్చరించారు. నియోజకవర్గాల్లో మంత్రులు జోక్యం చేసుకోవద్దని, ఎమ్మెల్యేలను కూడా బలోపేతం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. నీరు - చెట్టు అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. భూగర్భ జలాలను పెంచే బాధ్యత ఎమ్మెల్యేలేదనని స్పష్టం చేశారు. అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటున్నారని చంద్రబాబు విమర్శించారు. సభలో వైసీపీ అధికారపక్షంపైనే దాడి చేసేలా వ్యవహరించిందన్నారు. జగన్ చేస్తున్న ఆరోపణలు..ఇతరత్రా అంశాలపై గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నామని బాబు పేర్కొన్నారు. ప్రతిపక్షం చేస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు సూచించారు. 

ముగిసిన ఏపీ టీడీపీఎల్పీ భేటీ..

హైదరాబాద్ : ఏపీ టీడీఎల్పీ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు చురకలంటించారు. అవినీతికి పాల్పడితే ఊరుకోనని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాబు హెచ్చరించారు. నియోజకవర్గాల్లో మంత్రులు జోక్యం చేసుకోవద్దని, ఎమ్మెల్యేలను కూడా బలోపేతం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని, భూగర్భ జలాలను పెంచే బాధ్యత ఎమ్మెల్యేలేదనని స్పష్టం చేశారు. అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటున్నారని చంద్రబాబు విమర్శించారు. సభలో వైసీపీ అధికారపక్షంపైనే దాడి చేసేలా వ్యవహరించిందన్నారు. 

17:20 - December 21, 2015

నల్గొండ : బీబీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చిన ఓ తండ్రి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కేపాల్ లో వరంగల్ జిల్లాకు చెందిన రాంరెడ్డి కుటుంబం వలస వచ్చింది. కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాంరెడ్డికి 11 ఏళ్ల పాప, ఐదు సంవత్సరాల బాబు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నాం ఇద్దరు పిల్లలకు విషమిచ్చాడు. దీనితో పిల్లలు అక్కడికక్కడనే మృతి చెందారు. అనంతరం మద్యం బాటిల్ లో విషం కలుపుకుని రాంరెడ్డి తాగాడు. కొన ఊపిరితో ఉన్న రాంరెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇతను ఘట్ కేసర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారుల మృత దేహాలకు పంచనామా నిర్వహిస్తున్నారు. ఇతని భార్య మాత్రం వరంగల్ లోనే ఉందని తెలుస్తోంది. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

17:11 - December 21, 2015

హైదరాబాద్ : గత 60 సంవత్సరాల్లో ఏమి చేశారో చెప్పగలరా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నుద్ధేశించి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు కె.ఎం. ప్రతాప్, కట్టెల శ్రీనివాస్ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. 18 నెలల కాలంలో తాము ఏం చేశామో చెబుతామని పేర్కొన్నారు. కేసీఆర్ నాయత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ ను నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి ని తెలిపారు. 

16:42 - December 21, 2015

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వాకౌట్ పై ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు సెటైర్లు వేశారు. వాకౌట్ చేసింది పుట్టినరోజు జురుపుకొనేందుకా ఎద్దేవా చేశారు. రోజా సస్పెన్షన్ తరువాత ఆమెతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు బయటకు పొయిన సందర్భం లేదని, ఆమె బాధతో వెళ్లలేదని సంతోషంగా వెళ్లారని తెలిపారు. రాజధాని ఇమేజ్ ను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జగన్ అసత్యాలతో సభను తప్పుదోవ పటిస్తున్నారని, బాక్సైట్ పై చర్చ జగన్ కు ఇష్టం లేదన్నారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.

జైట్లీపై విచారణకు ఆదేశించాలి - ఏచూరి..

ఢిల్లీ : డీడీసీఏ కుంభకోణంలో అరుణ్ జైట్లీపై విచారణకు ఆదేశించాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ వర్సెస్ ఇండియా పేరిట ఆరు పుస్తకాలను ఏచూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ లౌకకత్వాన్ని ఆర్ఎస్ఎస్ నాశనం చేస్తున్న తీరును బుక్ లెట్ లో పొందుపరిచినట్లు, ఈ పుస్తకాలను త్వరలో అని భాషల్లోకి అనువదిస్తామన్నారు. భారత్ ను హిందూ దేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ చూస్తోందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ ఆలోచనలు, బీఫ్ రాజకీయాలకు బీజేపీ నయా ఉదారవాద విధానాలను వంటి అంశాలను ఆరు బుక్ లెట్ లలో పొందుపరిచినట్లు చెప్పారు.

టీడీఎల్సీ సమావేశం..

హైదరాబాద్ : అసెంబ్లీ కమిటీ హాల్ లో చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చ జరుగుతోంది. 

గురుకుల కాంట్రాక్టు టీచర్లకు వేతనాలు ఖరారు..

హైదరాబాద్ : గిరిజనాభివృద్ధి సంస్థకు చెందిన గురుకులాలలో కాంట్రాక్టు టీచర్లకు వేతనాలు ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 181 మంది జూనియర్ లెక్చరర్లకు రూ.8,500, 381 మంది టీజీపీ/టీబీటీ/బైపీడీ లకు రూ.7,100, 50 మంది పీఈటీ/క్రాఫ్ట్స్/మ్యూజికల్ టీచర్స్ కు రూ.6,500 లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

 

పహాడీషరీఫ్ లో నకిలీ నూడుల్స్ తయారీ కేంద్రంపై దాడి..

రంగారెడ్డి : పహాడిషరీఫ్ ఎర్రగుంటలో నకిలీ నూడుల్స్ తయారీ కేంద్రంపై ఎస్ వోటి పోలీసులు దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. 

ఇద్దరు కుమారులతో తండ్రి ఆత్మహత్య...

రంగారెడ్డి : ఘట్ కేసర్ (మం) కేపాల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కుమారులతో సహా విషం తాగి తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఉప్పలపాడులో మహిళ ఆత్మహత్యాయత్నం..

ప్రకాశం : ఉప్పలపాడులో రాఘవ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వడ్డీ వ్యాపారి శ్రీరాములు వేధిస్తున్నాడని ఆరోపించింది.

 

జగన్ వాకౌట్ పై కాల్వ విమర్శలు..

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వాకౌట్ చేసింది పుట్టినరోజు జురుపుకొనేందుకా అని ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. సభ నుండి రోజా సంతోషంగానే వెళ్లిపోయారని, రాజధాని ఇమేజ్ ను దెబ్బతీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జగన్ అసత్యాలతో సభను తప్పుదోవ పటిస్తున్నారని, బాక్సైట్ పై చర్చ జగన్ కు ఇష్టం లేదన్నారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. 

చీపురుపల్లి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

విజయనగరం : చీపురుపల్లి (మం) లక్ష్మీపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఏడు బోగీలు పక్కకు ఒరిగాయి. ట్రాక్ ధ్వంసమైంది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

గ్రేటర్ లో టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది - తలసాని..

హైదరాబాద్ : గ్రేటర్ లో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్ లో నగరంలో టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. ప్రభుత్వానికి సహకరించాలనే తపన ప్రజల్లో ఉందని, సంక్షేమ రంగంలో టీఆర్ఎస్ దూసుకపోతోందన్నారు. 

కేసీఆర్ పై ప్రజల్లో విశ్వాసం పెరిగింది - డీఎస్..

హైదరాబాద్ : కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం ముందంజలో ఉందని, పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్స్ కట్టించి ఇస్తామని హామీనిచ్చారు. ఐటీ రంగానికి సీఎం పెద్దపీఠ వేశారని, నగరానికి అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయని చెప్పుకొచ్చారు. సంక్షేమ ఫలాలు అందిరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

అందుకే టీఆర్ ఎస్ లో చేరుతున్నారు - కేటీఆర్…

హైదరాబాద్ : కేసీఆర్ నాయత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ ను నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని, 18 నెలల కాలంలో తాము ఏం చేశామో చెబుతామని పేర్కొన్నారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి అని తెలిపారు. 

15:28 - December 21, 2015

హైదరాబాద్ : గోల చేయడం తప్ప ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీలో చేసిందేమిటనీ టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన సోమవారం తనదైన శైలిలో మాట్లాడారు. రాజకీయాలు స్వచ్చంగా లేవని..అనవసరంగా రాద్ధాంతం చేయడం..గొడవ చేయడం తప్ప మరో పని లేదని విపక్షాన్ని జేసీ విమర్శించారు. అసెంబ్లీలో ఆ అరుపులు ఏంటనీ, శాసనసభకు వచ్చి ఏడాది అయినా ఎలా వ్యవమరించాలో జగన్ కు తెలియదన్నారు. 

15:17 - December 21, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్...రోజులు గడుస్తున్నా బాధితులకు న్యాయం జరగడం లేదు. దీనితో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అగ్రిగోల్డ్ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ సీఐడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణపై బాధితులు టెన్ టివితో మాట్లాడారు. గత నాలుగు నెలల కాలంగా సీఐడీ దర్యాప్తు సరిగ్గా సాగడం లేదని అగ్రిగోల్డ్ బాధితులు పేర్కొన్నారు. కాల్ మనీ అంశంపై బాబు ఒక ప్రకటన చేశారని, అంతకంటే పెద్ద స్కాం అగ్రిగోల్డ్ అని తెలిపారు. ఈ అంశంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రెండు నెలల కాలంలో కంపెనీ వ్యక్తులను ఎన్నిసార్లు విచారించారు ? అని కోర్టు ప్రశ్నించిందన్నారు. బినామీ ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్ముకుంటున్నారని కోర్టు దృష్టికి తాము తీసుకరావడం జరిగిందన్నారు. అగ్రిగోల్డ్ కస్టమర్లకు ఇవ్వకుండా ఆస్తులను అమ్ముకుంటున్నారని జడ్జి భావించారని, దీనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని కోర్టు పేర్కొందన్నారు. తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలని వారు కోరారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ బాధితులంతా ఒక సంఘంగా ఏర్పడిన సంగతి తెలిసిందే. 

15:16 - December 21, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో కరవు లేకుండా ఉన్నప్పుడు...రైతుల సమస్యలు తీరినప్పుడే తనకు ఆనందంగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో ప్రాజెక్టులపై సీఎం బాబు ప్రసంగించారు. కొత్త ప్రాజెక్టులతో 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, వీలైనంత త్వరలో పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. నదుల అనుసంధానం వేగవంతం చేస్తామని, అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. హంద్రీనీవా, గాలేరు - నగరి ద్వారా రాయలసీమకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సభకు తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలపై నిజం లేదన్నారు. 

15:15 - December 21, 2015

తీరిక వేళల్లో మహిళలు తమకు తాము ఏదో వ్యాపకం కల్పించుకుంటారు. ఇందులో భాగంగా అనేక వస్తువులతో ముచ్చటైన రూపాలనూ తయారు చేస్తుంటారు. అలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కటి అలంకార వస్తువులు తయారు చేయటం ఎలాగో వీడియోలో చూడండి. 

15:13 - December 21, 2015

మనమంతా వెలుగు కావాలనే కోరుకుంటాం. మనమంతా వెన్నెల కాంతుల్ని ఆస్వాదించాలనే అనుకుంటాం. మనమంతా ఈ సృష్టిలోని అందాలను అనుభవించాలనే ఆశపడతాం... కానీ మరి, ఆ వెలుగును, వెన్నెలను, అందాలను చూడలేని అంధుల మాటేమిటి? వారి చదువు సంగతేమిటి? వారికి అందాల్సిన విజ్ఞానం గురించి ఆలోచించి, ఎవరూ చేయని కృషి చేస్తూ, ముందుకు సాగుతున్న ఓ అతివ స్పూర్తిదాయక కథనం ఎలా సాగిందో తెలుసుకుందాం. చీకటి తప్ప జీవితంలో వెలుగును చూడలేని అంధులు అక్షరజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలంటే, వారికి బ్రెయిలీలో పుస్తకాలు కావాలి. ఆ లిపిలో పుస్తకాలు ముద్రించబడాలి. కానీ, ప్రభుత్వం నిజంగా, నిజాయితీగా అంధులకు అటువంటి పుస్తకాలను అందుబాటులో ఉంచుతోందా? వారి అవసరాలను తీరుస్తోందా? అంటే పెదవి విరుపే సమాధానమవుతుంది. ఇటువంటి స్థితిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న యాదేశ్వరి ప్రత్యేక కృషి చేస్తోంది.  నేను నా కోసం, నా వాళ్లు, నా కుటుంబం అనుకున్నప్పుడు మన ప్రపంచం చాలా చిన్నదవుతుంది. అలా కాదనుకుని మన చుట్టూ ఉన్నవారికోసం అనుకున్నప్పుడు మన జీవితం మరింత విశాలమవుతుంది.. యాదేశ్వరి విశాల ప్రపంచం తనదనుకుంది.. ఎందరి జీవితాల్లోనో వెలుగును నింపుతోంది.. ఆ స్పూర్తి ప్రదాతకు మానవి అభినందనలు తెలియచేస్తోంది.. 

ప్రాజెక్టులపై ఏపీ శాసనసభలో బాబు ప్రకటన..

హైదరాబాద్ : ప్రాజెక్టులపై ఏపీ శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. గత పదేళ్లలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమై పోయిందని, రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. హంద్రీనీవా, గాలేరు - నగరి ద్వారా రాయలసీమకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సభకు తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలపై నిజం లేదన్నారు. 

ప్రణబ్ ను కలిసిన టి.కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ లో బస చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం కలిశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. 

14:39 - December 21, 2015

కింగ్‌ఖాన్‌ పేరు మార్చేసుకుంటున్నాడు...క్యారెక్టరుకూ గుడ్‌బై చెప్పేస్తున్నాడు...రొటీన్‌గా వెళ్తే రీల్‌ రొటేట్ అవదనుకుంటున్నాడు. అందుకే రొటీన్‌కు భిన్నంగా నాన్‌స్టాప్‌గా ఉన్న పేరుకు ఫుల్‌స్టాప్ పెట్టేయాలని డిసైడయ్యాడు. 2016లో ప్రేక్షకులు కొత్త షారుక్‌ను చూస్తారంటున్నాడు. రాజ్‌ అంటే.. ప్రతీ దుల్హనియా ఇలాంటి దిల్‌వాలే కావాలనుకునే క్యారెక్టర్‌. షారుక్‌ అంటే రాహుల్‌, రాజ్‌. రాహుల్‌, రాజ్‌ అంటే షారూక్‌ ఖాన్‌. ఈ రెండు పాత్రలకు బాద్షా పెట్టింది పేరు. సెంటిమెంట్‌గాను కింగ్‌ఖాన్‌కు కలిసొచ్చిన పాత్రలు ఇవి. సెంటిమెంట్‌కు తగ్గట్టుగానే రాజ్‌ అండ్‌ రాహుల్‌ పాత్రలు సింపిల్‌ ఖాన్‌ను కింగ్‌ఖాన్‌ను చేశాయి. బాలీవుడ్‌ బాద్షాను చేశాయి. రాజ్‌ పాత్రలో నటించిన దిల్‌వాలే దుల్హనియా లేజేయేంగే, రాహుల్‌ పాత్రలో వచ్చిన కుచ్‌కుచ్‌హోతాహై, దిల్‌తో పాగల్‌హై, కభీ ఖుషి కభీ గమ్‌, చెన్నైఎక్స్‌ప్రెస్‌లాంటి చిత్రాలు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టాయి. నేటికీ షారూక్‌ఖాన్‌ను లవర్‌బాయ్‌గా ప్రేక్షకుల మదిలో ఫిక్స్‌చేసి భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తిరుగులోని బాద్షాను చేశాయి.

కొత్తగా చూస్తారంటున్న కింగ్ ఖాన్..
చక్‌దే ఇండియాలోనే కబీర్‌ పాత్ర మినహాయిస్తే మరే ఇతర పాత్రలూ రాజ్‌,రాహుల్‌ను బీట్‌ చేయలేకపోయాయి. అంతలా మెప్పించిన క్యారెక్టర్లకు బాద్షా ఇప్పుడు గుడ్‌బై చెప్పేస్తున్నాడు. రీసెంట్‌గా కాజోల్‌తో కలిసి నటించిన దిల్‌వాలే సినిమా తరువాత ఈ నిర్ణయానికి వచ్చేశాడట. ఇకపై ఏజ్‌లెస్‌ లవర్‌బాయ్‌లా కాకుండా స్ర్కీన్‌పై ఇంతవరకు ప్రేక్షకులు చూడని క్యారెక్టర్లను పోషించబోతున్నాడు. 2016 ఏప్రిల్‌లో రాబోతున్న కొత్త చిత్రంలో ఒక స్టార్‌కు ఫ్యాన్‌గా నటించబోతున్నాడు షారూక్‌ఖాన్‌. రియల్ లైఫ్‌లోనే కాదు రీల్‌లైఫ్‌లోను స్టార్‌ ఇమేజ్‌ క్యారెక్టర్లు చేసిన షారూక్ ఇకపై విభిన్న పాత్రలను పోషించబోతున్నాడు. అంతేకాదు తాను ఎంచుకోబోయే సినిమాల్లో ఖచ్చితంగా సామాజిక స్పృహ ఉండేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నాడని బాలీవుడ్‌ వర్గాల అంచనా. గుజరాత్‌లోని గోద్రా అల్లర్ల ఆధారంగా చిత్రీకరిస్తున్న సినిమాలోను షారూక్‌ నటించబోతున్నాడు. మొత్తానికి లీప్‌ ఇయర్‌లో తనను కొత్తగా చూడబోతున్నారంటున్నాడు ఈ కింగ్‌ ఖాన్‌.

14:36 - December 21, 2015

ఢిల్లీ : సున్నితమైన రామ జన్మభూమి అంశాన్ని వీహెచ్‌పీ నాయకులు మళ్లీ ముందుకు తెచ్చారు. ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్న సంఘ్‌ పరివార్‌ శక్తులు... గుడి కడతామంటూ ఆయోధ్యకు ఇటుకలు తరలిస్తున్నారు. వీటికి శిలా పూజలు నిర్వహిస్తూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు సంఘ్‌ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయోధ్యలో అలజడి ప్రారంభమయ్యింది. రామాలయం నిర్మాణానికి ఇటుకలు సేకరించాలని ఈ ఏడాది జూన్‌లో వీహెచ్‌పీ ఇచ్చిన పిలుపును ఆధారంగా చేసుకుని సంఘ్‌ పరివార్‌ శక్తులు రెచ్చిపోతున్నాయి. సేకరించిన ఇటుకలను అయోధ్యకు తరలిస్తున్నారు. అయితే వీటిని వివాదాస్పద రామజన్మభూమి స్థలంలోకి కాకుండా.... వీహెచ్‌పీకి అయోధ్యలో ఉన్న ప్రైవేటు స్థలం రామ్‌ సేవక్‌ పురంలో ఉంచుతున్నారు. ఇప్పటికే రెండు ట్రక్కులు రాళ్లు చేర్చారు. ఇప్పటికే తరలించిన ఇటుకలను రామ్‌ జన్మభూమి శిలాన్యాస్‌ కమిటీ అధ్యక్షుడు మహంత్‌ నిత్యగోపాల్‌ దాస్‌ శిలాపూజ నిర్వహించారు. ఇది కొత్త ఉద్రిక్తతలకు కారణం అవుతోంది.

అయోధ్యకు ఇటుకలు..
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సమయం ఆసన్నమైదంటూ కొన్ని రోజులుగా బీజేపీ, సంఘ్‌ నేతలు చేస్తున్న ప్రకటనలను కార్యరూపంలోకి తెస్తున్నారనడానికి అయోధ్యకు ఇటుకులు చేర్చడమే నిదర్శనంగా నిలుస్తోంది. ఆలయ నిర్మాణం త్వరలో జరుగుతుందని, ప్రధాని మోడీ ప్రభుత్వం తమకు సంకేతాలు ఇచ్చిందని వీహెచ్‌పీ నాయకులు చెబుతున్నారు. మందిరం నిర్మాణానికి ఇటుకల తరలింపు కొనసాగుతూనే ఉంటుందని సంఘ్‌ ప్రకటించడంతో.... మళ్లీ ఎటువంటి గొడవలు జరుగుతాయోనని అయోధ్య వాసులు భయపడుతున్నారు. రామ మందిరాన్ని ఎక్కడ నిర్మిస్తారన్న విషయాన్ని సంఘ్‌ నేతలు చెప్పడంలేదు. వివాదాస్పద స్థలానికి పక్కనే ఉన్న 12 ఎకరాలను ఇందుకోసం కేటాయించాలని కోరుతున్నారు. నిర్మాణానికి 2.25 లక్షల క్యూబిక్‌ అడుగుల ఇటుకలు అవసరం అవుతాయని అంచనా వేశారు. గతంలోనే 1.25 లక్షల క్యూబిక్‌ అడుగుల గ్రానైట్‌ రాళ్లను ఆయోధ్య చేర్చారు. మిగిలిన లక్ష క్యూబిక్‌ అడుగులు ఇటుకలను ఇప్పుడు తరలిస్తున్నారు.

ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం..
అయోధ్యకు ఇటుకల తరలింపుతో యూపీలోని ఫైజాబాద్‌ జిల్లా యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఇది ఉద్రిక్తతలను దారి తీస్తుండటంతో అయోధ్యలో భద్రత పెంచారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో... అన్న భయంతో క్షణ క్షణం... పరిస్థితిని సమీక్షించడంతోటు, పర్యవేక్షిస్తున్నారు. వివాదాస్పద స్థలంలోకి ఇటుకలు తరలించి కుండా... వీహెచ్‌పీకి చెందిన రామ్‌ సేవక్‌పురంలోకి చేరుస్తున్నారు. వివాదాస్పద రామ జన్మభూమి స్థలంలోకి ఒక్క ఇటుక చేర్చినా... ఉపేక్షిచంబోమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మత సామరస్యానికి విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమంటున్నారు. అయితే అయోధ్యకు ఇటుకల తరలింపు తరలింపు ప్రారంభమైన తర్వాత... మైనారిటీల్లో ఒకింత అభద్రతాభావం ప్రబలింది. ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళనతో ఫైజాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం ఉంది. 

14:30 - December 21, 2015

ఢిల్లీ : నిర్భయ కేసులో మైనర్ బాలుడి విడుదలపై స్టే ఇవ్వాలంటూ మహిళా కమిషన్ వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. బాల నేరస్థుడి శిక్షాకాలం పొడిగింపుకు సుప్రీం కోర్టు వెసులు బాటు లేదని తేల్చింది. చట్టంలో ఎలాంటి వెసులుబాటు లేదని తేల్చి చెప్పింది. దీంతో నిరాశ చెందిన మహిళా సంఘాలు న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. నిర్భయ కేసులో బాల నేరస్థుడి శిక్షాకాలం పొడిగించాలని మహిళా సంఘాల పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఢిల్లీలోని ఓ ఎన్జీవో సంరక్షణలో ఇతన్ని ఉంచాలని పోలీసులు నిర్ణయించారు. అతని కదలికలను జువైనల్ బోర్డు జాగ్రత్తగా గమనించనుంది. అలాగే మైనర్‌కు పదివేల రూపాయల సహాయంతోపాటు... టైలర్‌ షాప్ నడుపుకునేందుకు ఓ మిషిన్‌ ఇవ్వాలని తీర్మానించారు. దీనిపై కోర్టు తరపు న్యాయవాది సుప్రీం తీర్పు శిరోధార్యమని చెప్పారు. 

నిర్భయ తల్లి ఆవేదన..
సుప్రీం కోర్టు తీర్పు తమను దిగ్ర్భాంతికి గురిచేసిందని.. యావత్ దేశం తలదించుకునే సమయమన్నారు నిర్భయ తల్లి. దేశం మొత్తం ఆవేశంతో ఊగిపోయిన ఘటన చట్టాలకు తలవంచిందని ఆవేదని వ్యక్తం చేశారు. ఈ నిందితుడి విడుదలతో సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కీలక నిందితుడి విడుదలతో కేసు నీరుగారిపోయిందని గుండెలవిసేలా విలపించారు. కేసులో న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు. మొత్తం మీద ఎంతో ఉత్కంఠగా అందరూ సుప్రీం తీర్పు కోసం ఎదురు చూశారు. అయితే సుప్రీంకోర్టు చట్టం చట్టమేనని తేల్చి చెప్పేయడంతో... బాల నేరస్థుడి భవిష్యత్‌పై ఉన్న అనుమానాలు తేలిపోయాయి. స్వచ్చంధ సంస్థ రక్షణలోనే అతడు కొనసాగనున్నాడు.

14:26 - December 21, 2015

ఢిల్లీ : డీడీసీఏపై వచ్చిన ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తిప్పికొట్టారు. ఆప్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్‌ సభ్యులు లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. దీనిపై జైట్లీ తీవ్రంగా స్పందించారు. తాను డీడీసీఏ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఫిరోజ్‌షా కోట్ల స్టేడియం అభివృద్ధికి 114 కోట్ల ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంతోపాటు, ఇతర స్టేడియంల అభివృద్ధికి వందల కోట్లు వెచ్చిరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజంలేదన్నారు. దీనిపై సభలో ఎటువంటి చర్చకైనా సిద్ధమని అరుణ్‌ జైట్లీ సవాల్‌ విసిరారు. 

14:23 - December 21, 2015

హైదరాబాద్ : ఆయన బీసీల ఉద్యమ నేత. గత ఎన్నికల్లో సైకిలెక్కారు. తెలంగాణకు కాబోయే సీఎం అని కూడా చెప్పారు. సీఎం కాకపోయినా ఎమ్మెల్యే మాత్రం అయ్యారు. సీఎం అంత సీను ఇచ్చిన పార్టీ ఆ తర్వాత ఆయనని పట్టించుకోలేదనే ఆరోపణ ఉంది. అందుకే ఆయన పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ పెడతానని చెప్పేశారు. అంటే సైకిల్‌ మీద ఉన్నా లేనట్లే అనుకోవాలా.. లేక సైకిల్‌ ఇప్పుడే దిగేస్తారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీసీల డిమాండ్లపై పోరు నడిపే ఆర్ కృష్ణయ్య అలియాస్ కృష్ణన్న బీసీల అభ్యున్నతే తన జీవిత ధ్యేయమంటూ మరోసారి ప్రకటించారు. ప్రజా సమస్యలు రాజకీయ పార్టీలకు పట్టడం లేదంటూ ఇటీవల అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదని, ప్రజలను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తున్నాయంటూ.. ఆర్ కృష్ణయ్య వచ్చే ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టి బీసీలకు పెద్ద పీట వేస్తానని ప్రకటించారు. సాధారణ పౌరుడి స్థాయి నుండి బీసీ సంఘం అధ్యక్షుడిగా ఎదిగిన ఆయన పార్టీ పెడితే ఎంత వరకు ప్రభావం ఉండనుంది అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కొత్త ఉద్యమం..
రాష్ట్ర ప్రజలకు 2014 ఎన్నికల ముందు వరకు కేవలం బీసీ సంఘం అధ్యక్షడిగా సుపరిచితుడయ్యారు ఆర్ కృష్ణయ్య. ఆనాడు రాష్ట్రంలో బీసీలను అధికార, విపక్షాలు చిన్న చూపు చూస్తున్నాయంటూ, టీడీపీ తరపున సీఎం అభ్యర్థిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నారు. ఎల్ బీ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాని కట్ చేస్తే సీన్ మారిపోయింది. ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా ప్రజలముందు కొచ్చిన టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారు. సీఎం క్యాండెట్ కాస్త ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ఆయన మళ్లీ గళమెత్తారు. తాజాగా బీసీలకు ఇప్పుడు కేటాయిస్తున్న 34 శాతం రిజర్వేషన్ సరిపోదంటూ సరికొత్త ఉద్యమాన్ని లేపేందుకు సిద్దమయ్యారు. వెనకబడిన తరగతికి చెందినవారికి తాజా రాజకీయాల్లోను 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. అధికార టీఆర్ఎస్ పార్టీ బీసీల సంక్షేమం పట్టనట్టు వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక హామీలను తుంగలో తొక్కారని విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలన్నా, బీసీలకు 100 శాతం న్యాయం జరగాలన్నా కొత్త పార్టీ ముందుకు రావాలని తన అంతర్మథనం బయటపెట్టారు. తెలంగాణలో తెలుగుదేశం ఎఫెక్ట్‌ తగ్గిపోయిందనే.. కృష్ణయ్య మళ్లీ రూటు మారుస్తున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకంటూ సొంత బలం పెంచుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బంది తప్పదనే.. కృష్ణయ్య సొంత పార్టీ ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

14:20 - December 21, 2015

హైదరాబాద్ : ఉద్యోగ నియామకాల్లో వెనుకబడిన తరగతుకు క్రీమీలేయర్ విధానాన్ని తీసుకొస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. క్రీమీలేయర్ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని..లేకపోతే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య డిమాండ్ చేశారు. క్రీమీలేయర్ విధానాన్ని అమలు చేస్తే భవిష్యత్‌లో ఏ ఒక్కరికీ రిజర్వేషన్లు దక్కవన్నారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని విమర్శించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు..విద్యుత్ సంస్థల్లో సీఎండి, డైరెక్టర్‌ పోస్టుల్లో బీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ జనవరి 5న హైదరాబాద్‌లో బీసీ విద్యుత్‌ ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. 

శాసనసమండలిలో చంద్రబాబు నాయుడు..

హైదరాబాద్ : శాసనమండలిలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కాల్ మనీ అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని, ఎవరి ప్రమేయమున్నా చర్యలు తీసుకుంటామని సభకు తెలిపారు. అక్రమ వడ్డీ వసూలు చేస్తే కట్టవద్దని చెప్పడం జరిగిందని, అన్యాయంగా ఆస్తులు రాయించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దోషులను శిక్షిస్తామని తెలిపారు. 

ఏపీ సీఐడీపై హైకోర్టు ఆగ్రహం..

హైదరాబాద్ : ఏపీ సీఐడీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసు కేసు నమోదైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఆస్తుల వేలాన్ని 15 రోజుల్లో ప్రారంభించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. తదుపరి విచారణనను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

 

వనజాక్షి ఘటనలో ఇరువురుదీ తప్పే - బాబు..

హైదరాబాద్ : తహశీల్దార్ వనజాక్షి దాడి ఘటనలో ఇరువురుదీ తప్పేనని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తహశీల్దార్ వనజాక్షి పరిధి దాటి వ్యవహరించారని, అధికారులు కూడా హద్దులో ఉండాలని సూచించారు. విచారణపై నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

13:34 - December 21, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం తీరును న్యాయమూర్తులు తప్పుబట్టారు. ఇంతవరకూ అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించిన హైకోర్టు... సీఐడీ తీరుపై మండిపడింది. ఈ మొత్తం వ్యవహారంలో తమకు కొన్ని అనుమానాలున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు డబ్బులను వెనక్కిప్పిస్తామని, ఆస్తుల వేలాన్ని రెండు వారాల్లోగా ప్రారంభించాలని ఆదేశిస్తూ, విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వేలం ప్రక్రియ మొదలు కాకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.

13:31 - December 21, 2015

హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాలంటూ గద్దెనెక్కిన టీఆర్‌ఎస్‌...... ఉద్యోగాల భర్తీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.. నోటిఫికేషన్ల విషయంలో మరింత ఆలస్యం చేస్తోంది... ఇదిగో అదిగో కాలం గడుపుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోంది..

కోచింగ్‌లకోసం క్యూ కడుతున్న నిరుద్యోగులు...

తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది.. పోటీ భారీగా ఉండే అవకాశం ఉందని చాలామంది ముందే కోచింగ్‌ సెంటర్లకు వెళ్లారు.. మరికొంతమంది ఇంకా కోచింగ్‌ తీసుకుంటున్నారు.. పుస్తకాలతో కుస్తీపడుతూ సీరియస్‌గా ప్రిపేర్‌ అవుతున్నారు.. భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలచేస్తామన్న కేసీఆర్‌ ప్రకటనతో మరింత కష్టపడుతున్నారు.. ప్రైవేట్ ఉద్యోగులైతే జాబ్స్ వదిలేసిమరీ ప్రిపేర్ అవుతున్నారు.. టీఎస్ పీఎస్సీ లో ఇప్పటికే ఆరున్నరలక్షలమంది పేర్లు నమోదు చేయించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..

15 వేల 522 పోస్టుల భర్తీకి ఆమోదముద్ర....

అటు ఎన్నో జాబులొస్తాయని ఊరించిన టీ సర్కారు కంటితుడుపుగా కొన్ని నోటిఫికేషన్లకే పరిమితమైంది.. దాదాపు 25వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినా... 15 వేల 522 పోస్టుల భర్తీకి 4 నెలలక్రితం ఆమోద ముద్ర వేశారు కేసీఆర్‌.. . ఇందులో TSPSC ద్వారా మూడువేల పోస్టులకు గ్రీన్ సిగ్నల్‌ లభించింది.. ఇందులో 2వేలవరకూ ఇంజనీర్... 52 గ్రూప్‌ 1 పోస్టులు... గ్రూప్‌ 2 పోస్టులు 434 ఉన్నాయి.. గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులే లేవు. డీఎస్సీ దిశగా చర్యలుకూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.. అలాగే జూనియర్, డిగ్రీ లెక్చరర్స్ రిక్రూట్ మెంట్‌పైకూడా సర్కారు దృష్టిపెట్టలేదంటున్నారు నిరుద్యోగులు..

కానిస్టేబుళ్లు, ఎస్ఐ లు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్లో భారీగా ఖాళీలు....

పోలీస్‌ శాఖలోనూ పరిస్థితి ఇలాగే ఉంది.. కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, ఫైర్‌ డిపార్ట్‌మెంట్లోకూడా భారీ ఖాళీలున్నాయి.. ఈ ఉద్యోగాలకోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు.. హైదరాబాద్‌వచ్చి మరీ భారీగా ఫీజులు కట్టి కోచింగ్‌ తీసుకుంటున్నారు.. ఇదే అదనుగా భావించిన కోచింగ్‌ సెంటర్లు ఇష్టారాజ్యంగా నిరుద్యోగులనుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి.. ఇలా నిరుద్యోగులు సవాలక్ష సమస్యలతో సతమతమవుతుంటే.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రాష్ట్రవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి..

 

13:27 - December 21, 2015

హైదరాబాద్ : ఎమ్మెల్యే చింతమనేని, వనజాక్షి కేసుల్లో ఇద్దరిదీ తప్పే అని సీఎం తెలిపారు. ఏపీ శాసనమండలి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తహశీల్దార్ వనజాక్షి పరిధి దాటి వ్యవమరించారని, అధికారులు కూడా హద్దుల్లో ఉండాలని సూచించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని... నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

13:23 - December 21, 2015

హైదరాబాద్ :కాల్ మనీ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని టిడిపి ఎంపి జేసీ దివకార్ రెడ్డి మండి పడ్డారు. ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ...నాలో కాంగ్రెస్ రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉంది. చంద్రబాబు సమర్థవంతమైన వ్యక్తి కాబట్టే టిడిపిలో చేరానన్నారు. చంద్రబాబు కూడా సీఎం గా కాస్త తగ్గారన్నారని తెలిపారు. చంద్రబాబు మొత్తటి స్వభావాన్ని అవలంభిస్తుండడం వల్ల అధికారులకు, ప్రజాప్రతినిధులకు భయం లేకుండా పోయిందన్నారు. కాల్ మనీ కొత్తగా వచ్చింది కాదని నేను పుట్టక ముందు నుంచే ఉందని, జగన్ వాళ్ల వూరిలో కూడా జగన్ పుట్టక ముందు ఉందన్నారు. కాల్ మనీ పై ప్రభుత్వం ఎక్కడా సపోర్ట్ చేయడం లేదన్నారు. 

యనమలను కలిసిన జేసీ దివాకర్ రెడ్డి

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి యనమలను ఎంపి జేసీ దివాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తి కరమైన చర్చ జరిగింది. జగన్ ను అసెంబ్లీలో ఉంచారా ... పంపించారా అని జేసీ అడగ్గా...జగనే వెళ్లిపోయారని యనమల సమాధానం ఇచ్చారు. పుట్టిన రోజు వేడుకలుజరుపుకోవడానికే వెళ్లినట్లు ఉన్నారని జేసీ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలన్న జగన్ సమయాన్ని ఉపయోగించుకోకుండా వెళ్లిపోయారన్నారు.

వెంకయ్యనాయుడు ఇల్లు ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం...

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇల్లు ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు యత్నించారు. సుబ్రహ్మణ్యస్వామికి టైప్ -7 బంగ్లా కేటాయింపు పై నిరసన తెలిపుతూ ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

విజయనగరం : చీపురుపల్లి మండలం లక్ష్మీపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 7బోగీలు పక్కకు ఒరగగా, ట్రాక్ ధ్వంసం అయ్యింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నాగోల్ లో చైన్ స్నాచింగ్

హైదరాబాద్ : చైతన్యపురి నాగోల్ లో చైన్ స్నాచింగ్ కేసు నమోదు అయ్యింది. ఆలయానికి వచ్చిన తులసి అనే మహిళ మెడలో నుంచి 6 తులాల బంగారు గొలుసు ను దుండగుడు ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

జైట్లీ రాజీనామా చేయాలి : విపక్షాల పట్టు...

హైదరాబాద్ : ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో అక్రమాలు జరిగాయన్న అంశం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. సభలు ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. డీడీసీఏ కుంభకోణంలో పాత్రధారి అయిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని విపక్ష నేతలు పట్టుబట్టారు. అయితే, ఈ అంశంపై చర్చించలేమని లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ చెప్పడంతో... విపక్ష సభ్యలు నిరసన వ్యక్తం చేశారు.
రాజ్యసభలో కూడా .....

జువెనైల్ చట్ట సవరణకు విపక్షాల డిమాండ్

న్యూఢిల్లీ : జువెనైల్ చట్టంలో సవరణ చేపట్టాలని నేడు రాజ్యసభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. జువెనైల్ శిక్షపై చర్చ నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. నిర్భయ కేసులో బాల నేరస్థుడిని విడుదల చేయడంతో ప్రజాప్రతినిధులు ఈ అంశంపై చట్ట సవరణకు సూచించారు. బాల నేరస్థుడిని జైల్లో పెట్టే చట్టపరమైన హక్కులు లేవంటూ ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొనడంతో ఆ అంశం మరింత జఠిలంగా మారింది. జువెనైల్ చట్టంలో మార్పులు చేస్తే తప్ప బాల నేరస్థుడిని మళ్లీ జైలుకి తీసకెళ్లే మార్గం లేదు. అయితే జువెనైల్ బిల్లును ఇవాళ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

చింతమనేని, వనజాక్షి కేసులో ఇద్దరిదీ తప్పే: సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : ఎమ్మెల్యే చింతమనేని, వనజాక్షి కేసుల్లో ఇద్దరిదీ తప్పే అని సీఎం తెలిపారు. ఏపీ శాసనమండలి సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. తహశీల్దార్ వనజాక్షి పరిధి దాటి వ్యవహరించారని, అధికారులు కూడా హద్దుల్లో ఉండాలని సూచించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని... నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

12:25 - December 21, 2015

హైదరాబాద్ :శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని, కాల్ మనీ అంశంపై దర్యాప్తు కొనసాగుతుందని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. శాసమండలిలో కాల్ మనీ పై జరుగుతున్న చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాల్ మనీ లో ఎవరి ప్రమేయమున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. సమాజంలో కొన్ని రుగ్మతలు ఉన్న మాట వాస్తవమేనన్నారు. అక్రమ వడ్డీలు వసూలు చేస్తే తిరగబడమని చెప్పామన్నారు. అన్యాయంగా ఆస్తులు రాయించుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పుడు పనులు ఎవరు చేసినా వదిలి పెట్టేది లేదన్నారు. రాజధాని పై ప్రాంతంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... రాజధాని రావడం కొందరికి ఇష్టం లేకనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండి పడ్డారు. కాల్ మనీ కేసులో అవసరమైతే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దోషులను శిక్షిస్తామన్నారు. ఎమ్మెల్యే చింతమనేని, వనజాక్షి కేసుల్లో ఇద్దరిదీ తప్పే అని సీఎం తెలిపారు. తహశీల్దార్ వనజాక్షి పరిధి దాటి వ్యవమరించారని, అధికారులు కూడా హద్దుల్లో ఉండాలని సూచించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని... నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇన్ ఫార్మర్ నెపంతో వ్యక్తిని హతమార్చిన మావోలు

విశాఖ : జి. మాడుగుల మండలం మడపకొండలో పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తి మావోయిస్టులు హత్య చేశారు.

11:49 - December 21, 2015

హైదరాబాద్ : ప్రైవేటు యూనివర్శిటీల బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు రోడ్డెక్కాయి. ఈ రోజు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడుతున్నందుకు నిరసనగా వారు ఆందోళన బాట పట్టారు. అసెంబ్లీని ముట్టడించే యత్నం చేశారు. ముట్టడికి ప్రయత్నించిన విద్యార్ధులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిలో ఎస్ ఎఫ్ఐ, పీడీఎస్ యూ, ఎన్ ఎస్ యూఐ తదితర విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు.

11:48 - December 21, 2015

విజయవాడ: కాల్ మనీ వ్యవహారంలో సీపీఎం నేతలు ఉన్నట్లు సీఎం చేసిన ప్రకటనపై ఏపీ రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ నేతలు అధికార దాహంతో చేస్తున్న కాలమనీ దందాను కావాలనే సీపీఎం నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేకపోతే చంద్రబాబుపై చీటింగ్ కేసు వేస్తామన్నారు మధు. అసెంబ్లీలో రోజాపై వేటు వేయడం అప్రజాస్వామికం అన్నారాయన. ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని దీనినిమధు ఖండిస్తున్నామన్నారు.  

11:45 - December 21, 2015

ఢిల్లీ: డీడీసీఏ ఆరోపణపై కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌ జైట్లీ... ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. మరో ఐదుగురు ఆప్‌ నేతలను కూడా దీనిలో చేర్చారు. కుమార్ విశ్వాస్‌, అశుతోష్‌, 1999-2013 మధ్య అరుణ్‌ జైట్లీ డీడీఏసీ అధ్యక్షుడుగా పని చేశారు. హయాంలో డీడీసీఏలో భారీగా ఆర్ధిక అవకతవకలు జరిగాయన్నది ఏఏపీ నేతల ఆరోపణ. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ... జైట్లీ రాజీనామా చేయాలని ఆప్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏపీపీ నాయకులు ఆరోపణలతో తనతోపాటు, కుటుంబ సభ్యులు పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిందని ఆరోపిస్తూ... జైట్లీ కేసు వేశారు. 

11:44 - December 21, 2015

హైదరాబాద్ : బీహార్‌లో మద్యం దుకాణాలు పాల షాపులుగా మారనున్నాయి. వైన్‌ షాపుల్లో బ్రాందీ, విస్కీ, బీరు, రమ్ము, జిన్‌లకు బదులు పాలు, పాల పదార్ధాలు విక్రయించనున్నారు. బీహార్‌ సర్కార్‌ మద్యం వ్యాపారులను ఇందుకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నంది.

వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి దశలవారీగా మద్యం నిషేధం ....

నితీష్‌ కుమార్‌ నేతృత్వంలో బీహార్‌లో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు పూర్తయ్యింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి దశలవారీగా మద్యం నిషేధం అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మద్యం వ్యాపారులను ముందు నుంచే మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ వ్యాపారాలపై దృష్టి మరల్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మద్యం వ్యాపారులను పాల అమ్మకాలు దశగా ప్రోత్సహిస్తున్నారు.

బీహార్‌ పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ...............

మద్యం షాపుల్లో పాలు, పాల పదార్ధాలు విక్రయించేందుకు వీలుగా బీహార్‌ పాల ఉత్పత్తదారుల సహకార సమాఖ్యతో ప్రభుత్వం చర్చలు జరుతున్నది. ఈ రాష్ట్రంలో సుధా పాలు, స్వీట్స్‌ బాగా ఫేమస్‌. బీహార్‌లోని ఆరు వేల మద్యం దుకాణాల్లో వీటిని అమ్మించే విధంగా ముందునుంచే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వైన్‌ షాపుల యజమానులు మద్యం అమ్మకాలతో కోల్పోయే నష్టాన్ని ఈ రూపంలో కొంతవరకైనా భర్తీ చేయొచ్చన్నది మహాకూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ షాపుల్లో పని చేస్తున్న సిబ్బంది ఉపాధి కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నారు.

సామాజిక ఉద్యమంగా మద్య నిషేధ ప్రచారం ...............

మద్య నిషేధం అమల్లోకి తెచ్చినా... బీహార్‌లో అక్రమ మద్యం ఏరైపారే అవకాశంలేకపోదన్న భయం నితీష్‌ ప్రభుత్వానికి ఉంది. దీంతో మద్య నిషేధ ప్రచారాన్ని సామాజిక ఉద్యమంగా చేట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న 5.5 లక్షల మహిళా స్వయం సహాయ సంఘాల్లో 50 లక్షల మంది సభ్యులు ఉన్నారు. మద్యం నిషేధం అమలుతోపాటు, అక్రమ మద్యం అరికట్టడంతో వీరిని భాగస్వాములను చేస్తారు. అక్రమ మద్యం వ్యాపాలు, తయారీదారులపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలను బీహార్‌ సర్కార్‌ ఆదేశించింది.

మున్సిపల్‌ పట్టణాలు, నగరాల్లో మద్యం అమ్మకాలు ....

అయితే మద్య నిషేధం అమలుపై బీహార్‌ ప్రభుత్వం ఓ మెలిక పెట్టింది. సంపూర్ణ మద్య నిషేధం గ్రామాల్లోనే అమలు చేస్తారు. మున్సిపల్‌ పట్టణాలు, నగరాల్లో మాత్రం వైన్‌ అమ్మకాలు జరుపుతారు. ఇదేంటని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ను ప్రశ్నిస్తే... రాష్ట్రంలో ఉన్నది 40 నుంచి 45 పట్టణాలు, నగరాలే కదా...అన్నది ఆయన సమాధానం. బీహార్‌ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా ఈ ప్రాంతాల్లో మద్యం అమ్మిస్తారు. మద్యం నిషేధంతో బీహార్‌ ప్రభుత్వం ఏటా 3,500 కోట్ల ఆదాయం కోల్పోతుంది. మున్సిపల్‌, పట్టణాలు నగరాల్లో మద్యం విక్రయిస్తే వచ్చే ఆదాయం స్వల్పంగానే ఉంటుందని అంచనావేస్తున్నారు.

పాల అమ్మకంపై విముఖ.....

అయితే మద్యం అమ్మకాల ద్వారా లక్షలు గడించే వ్యాపారులు... పాల అమ్మకంపై విముఖ చూపుతున్నారు. సుధా పాలు, స్వీట్లు అమ్మితే చిల్లర పైసలు, పది రూపాయల నోట్లు లెక్కిస్తూ వందలు కళ్ల చూడాల్సి వస్తుంది మినహా... వేలు, లక్షలు వచ్చే పరిస్థితిలేదంటూ ఇప్పటి నుంచే నిట్టూరుస్తున్నారు. బీహార్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మద్య నిషేధం ఏ విధంగా అమలు జరుగుతుందో చూడాలి. 

ఎర్రవెల్లిలో కేసీఆర్ గణపతి యాత్రం...

మెదక్: ఎర్రవెల్లిలో ఆయుత చండీయాగం సందర్భంగా గణపతి యాగం నిర్వహించారు. గణపతి యాగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దంపతులు, బంధువులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్లుండి నుంచి ఈ నెల 27 వరకు ఆయుత మహాచండియాగం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సబబే : కేఈ

హైదరాబాద్ : నగరి ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సబబే అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో రెండేళ్లు సస్పెండ్ చేసిన సందర్భాలున్నాయన్నారు. ఈ రోజు అసెంబ్లీలో బాక్సైట్ తవ్వకాలపై చర్చ ఉందని... బాక్సైట్ తవ్వకాలపై చర్చ జరిగితే వైఎస్ హయాంలో జరిగిన విజయవాలు బయటపడతాయనే వైసీపీ సభ నుండి బాయ్ కాట్ చేసిందని ఆరోపించారు.

విజయవాడలో డీఎస్సీ అభ్యర్థులు ర్యాలీ.. అరెస్ట్

విజయవాడ : సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి డీఎస్సీ అభ్యర్థులు ర్యాలీగా బయలు దేరారు. అప్రమత్తమైన పోలీసులు బందర్ రోడ్డులో అడ్డుకుని అరెస్టులు చేశారు. 2014 డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

11:29 - December 21, 2015

ఢిల్లీ : 'నిర్భయ' కేసులో బాల నేరస్థుడికి ఊరట లభించింది. ఈ కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ కేసులో మైనర్ బాలుడు విడుదలను వ్యతిరేకిస్తూ, అతడిని జైలులోని ఉంచాలంటూ దాఖలైన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో బాల నేరస్తుడిని మూడు సంవత్సరాల పాటు జువనైల్ బోర్డులో ఉంచిన తరువాత నిన్న(ఆదివారం) విడుదల చేశారు. అతనికి విముక్తి కల్పించడాన్ని పలువురి నుంచి వ్యతిరేకతలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు 'నిర్భయ' తల్లిదండ్రులు కూడా మైనర్ బాలుడి విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాల నేరస్తుడికి ప్రయాదం ఉందన్న కారణాలతో స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో ఉంచారు.

నిర్భయ కేసులో బాల నేరస్థుడికి ఊరట

ఢిల్లీ : నిర్భయ కేసులో బాల నేరస్థుడికి ఊరట లభించింది. ఢిల్లీ మహిళా కమిషన్ వేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎంతో ఆశతో ఎదురు చూసిన మహిళా సంఘాలు నిరాశ తప్పలేదు.

మలక్ పేట వద్ద వాహనాల దారి మళ్లింపు...

హైదరాబాద్: మెట్రో పనుల కారణంగా మలక్‌పేట్‌లో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఎల్బీనగర్, దిల్‌షుక్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను మళ్లిస్తున్నారు. తిలక్‌నగర్, గోల్నాక, అంబర్‌పేట ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఐఎస్ సదన్, సైదాబాద్ నుంచి వచ్చే వాహనాలను చంచల్‌గూడ జైలు మీదుగా దారి మళ్లిస్తున్నారు. మూడు నెలల వరకు భారీ వాహనాలు, బస్సులు, లారీలు మలక్‌పేట్ వైపు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

10:48 - December 21, 2015

హైదరాబాద్: జబర్దస్త్ ఫేం షేకింగ్ శేషుకు సినిమా షూటింగ్‌లో గాయాలైనట్లు సమాచారం. దిల్‌రాజు డైరెక్షన్‌లో నిర్మిస్తున్న సుప్రీం చిత్రం షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతోంది. ఛేసింగ్ సీన్ షూట్ చేస్తుండగా జిప్సీ వాహనం బోల్తా పడి శేషుకు గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం శేషు అమీర్‌పేటలోని ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

10:45 - December 21, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ నిర్ణయించింది. సమావేశాలను బాయ్ కాట్ చేసి బయటకు వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణ పై చర్చిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కానీ.. లేదా రేపు ఉదయం కానీ స్పీకర్ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సీఎం కేజ్రీవాల్ పై పురువునష్టం దావా వేసిన జైట్లీ

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ హై కోర్టులో పురువునష్టం దావా వేశారు. డీడీసీఏ లో అక్రమాల్లో తనపై అసత్య ఆరోపణలు చేస్తేన్నారంటూ దావా వేశారు.

ఎస్ ఎఫ్ఐ నేతల అరెస్ట్

హైదరాబాద్ : ప్రైవేట్ యూనివర్శిటీ బిల్లును వ్యతిరేకిస్తూ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యం ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎస్ ఎఫ్ ఐ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.

10:35 - December 21, 2015

ఢిల్లీ : బీహార్‌కు చెందిన మాజీ క్రికెటర్‌, ప్రస్తుత బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌ సొంత పార్టీకే షాక్‌ ఇచ్చారు. ఢిల్లీ క్రికెట్‌ ఆసోసియేషన్‌లో అవినీతికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశాలను బేఖాతరు చేస్తూ కీర్తి ఆజాద్‌ ప్రెస్ మీట్‌ పెట్టి మరీ అక్రమాల గురించి వివరించారు. ఇప్పటికే బిజెపిని ఇరకాటంలో ప్రయత్నిస్తున్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు కీర్తి అందించిన వివరాలు అర్జునుడికి గాండీవంలా ఉపయోగపడబోతున్నాయి.

బయట పడుతున్న అక్రమాలు...

ఢిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవినీతికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతున్నాయి. షాకింగ్‌ న్యూస్‌ ఇస్తానంటూ ట్వీట్‌ చేసిన కీర్తీ ఆజాద్‌.. అన్నంత పనీ చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వద్దని వారించినా వినకుండా స్వపక్ష నేత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని డీడీసీఏ అక్రమాల్లో ఇరికించారు.

డీడీసీఏ అక్రమాలపై వీకీలీక్స్‌ ఫోర్‌ ఇండియా....

డీడీసీఏ అక్రమాలపై వీకీలీక్స్‌ ఫోర్‌ ఇండియా అనే సంస్థ నిర్వహించిన ఓ స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోను కీర్తి ఆజాద్‌ ఢిల్లీలో బయటపెట్టారు. స్టింగ్‌ ఆపరేషన్‌లో డీడీసీఎ పలు కాంట్రాక్టులను 14 నకిలీ కంపెనీలకు అందజేసినట్లు ఆరోపించారు. డీడీసీఏ పలు కాంట్రాక్టులను టెండర్లు పిలవకుండానే నకిలీ కంపెనీలకు కట్టబట్టిందని ఆరోపించారు. అంతేకాదు ఈ వ్యవహారంపై ఈడీ, డైరక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు.

కార్పొరేట్‌ బాక్సుల విషయంలో అక్రమాలు....

ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో నిర్మించిన కార్పొరేట్‌ బాక్సుల విషయంలో అక్రమాలు జరిగాయంటూ కీర్తి ఆజాద్‌ ప్రధాన ఆరోపణ. కాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కార్యదర్శి రాజేంద్రకుమార్‌ కార్యాలయంపై సీబీఐ నిర్వహించిన సోదాలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ సోదాలు అరుణ్‌ జైట్లీని కాపాడే ఉద్దేశంతో డీడీసీఏ ఫైళ్ల కోసమే సీబీఐ హడావుడి చేసిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆ సందర్భంగా ఆరోపించారు.

సొంతపార్టీ సభ్యుడే ఇరుకున పెట్టినా..

సొంతపార్టీ సభ్యుడే ఇరుకున పెట్టినా.. జైట్లీకి ఢిల్లీ క్రికెటర్లు మాత్రం అండగా నిలిచారు. వీరేందర్‌ సెహ్వాగ్‌, గౌతమ్‌గంభీర్‌, ఇషాంత్‌ శర్మ లు ఈ వ్యవహారంలో జైట్లీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. మరోవైపు అరుణ్‌ జైట్లీ సైతం తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. 2013లో కాంగ్రెస్‌ హయాంలోనే ఒకానొక ఎంపీ తనను కేసులో ఇరికిస్తానని కాంగ్రెస్‌ అధినేత్రికి మాటిచ్చారంటూ, కీర్తి ఆజాద్‌ పేరెత్తకుండా పరోక్షంగా విమర్శించారు. ఈ వ్యవహారానికి సంబంధించి 2013లోనే దర్యాప్తు జరిగిందని కానీ ఎలాంటి అవకతవకలు జరగలేదని నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని జైట్లీ అన్నారు.

ఖర్చులు విపరీతంగా చూపి కోట్ల రూపాయలు బదిలీ....

ఇదిలా ఉండగా ఈ స్కాంకు సంబంధించి వెలుగులోకి వచ్చిన నిజాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఖర్చులు విపరీతంగా చూపి కోట్ల రూపాయలు బదిలీ చేసినట్లు ఆధారాలు నిరూపిస్తున్నాయి. ఒక్కో ల్యాప్‌టాప్‌కు రోజువారీ అద్దె 16వేలు, ప్రింటర్‌కు 3వేలు, పూజా సామగ్రికి 5 వేల చొప్పున చెల్లించారు. నిజానికి ల్యాప్‌టాప్‌కు ఒకరోజుకు పెట్టిన అద్దెకు మరికొంత కలిపితే కొత్తదే వస్తుంది. ఈ అవినీతి దందాపై విచారణ జరిపేందుకు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ఏకసభ్య కమిషన్‌ను నియమించాలని నిర్ణయించారు. కమిషన్‌ బాధ్యతలు స్వీకరించాల్సిందిగా మాజీ సొలిసిటర్‌ జనరల్‌ గోపాల్‌ సుబ్రహ్మణ్యంకు లేఖ రాసినట్లు కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఢిల్లీలోని స్టేడియంలో ఒక భాగాన్ని నిర్మించడానికి 114 కోట్లు ఖర్చైనట్లు అరుణ్‌ జైట్లీ చెబుతుండగా అందులో 57 కోట్లు మాత్రమే కాంట్రాక్టర్లకిచ్చారని మిగతా 57 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ఆమాద్మీపార్టీ ప్రశ్నిస్తోంది. 2006లో 23 కోట్లున్న జైట్లీ ఆస్తులు 2012 నాటికి 120 కోట్లకు ఎలా చేరాయని కొశ్చన్‌ చేస్తోంది. మొత్తమ్మీద కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని వదిలేది లేదని ఆప్‌ కరాఖండిగా చెప్తోంది. 

10:31 - December 21, 2015

హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి రోజున చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. దేవాలయాలకు వచ్చిన మహిళల మెడలోని గొలుసులను తెంపుకుపోయారు. శ్రీకాకుళంలో ఆరుచోట్ల, హైదరాబాద్‌లో ఒక చోట చెన్‌ స్నాచింగ్‌ ఘటనలు జరిగాయి.

10:29 - December 21, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలుకాగానే ప్రతిపక్ష నేత జగన్‌కు చంద్రబాబుతో సహా సభ్యులంతా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. చంద్రబాబు స్వయంగా జగన్‌కు కరచాలనం ఇచ్చి శుభాకాంక్షలు తెలియచేశారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా జగన్‌కు విషెస్‌ చెప్పారు. 

10:28 - December 21, 2015

హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యే రోజాపై విధించిన ఏడాది సస్పెన్పన్‌పై పునరాలోచించాలని ఎమ్మెల్యే విష్ణు స్పీకర్‌ను కోరారు. ఏడాది పాటు సస్పెన్షన్‌ అంటే తమకు కూడా బాధగా ఉందని..దాన్ని తగ్గిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. 

10:26 - December 21, 2015

హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యే రోజాపై విధించిన ఏడాదిపాటు సస్పెన్షన్‌పై ఎలాంటి పునరాలోచన చేసే ప్రసక్తేలేదని శానసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సభలో ప్రకటించారు. సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకుంది ఒక్క స్పీకరే కాదనీ..హౌస్‌ మొత్తం తీసుకున్న నిర్ణయమన్నారు. ఒకవేళ దీనిపై ప్రతిపక్షం కోర్టుకెళ్తానంటే తమకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. 

స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ నిర్ణయించింది. సమావేశాలను బాయ్ కాట్ చేసి బయటకు వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణ పై చర్చిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కానీ.. లేదా రేపు ఉదయం కానీ స్పీకర్ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

హుజూరాబాద్ లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..

నల్లగొండ : హుజూర్‌నగర్ టీచర్స్ కాలనీలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో దొంగలు వరుసగా చోరీలకు పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడిళ్లలోకి ప్రవేశించిన దొంగలు బంగారు ఆభరణాలు, ఇతర సొత్తును అపహరించుకుపోయారు. సోమవారం ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. 

సస్పెన్షన్ ఎత్తివేయాలనే కోరే పద్ధతి ఇదేనా: స్పీకర్

హైదరాబాద్: ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ గురైన ఎమ్మెల్యే రోజా విషయమై ఈ ఉదయం అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరుగగా, స్పీకర్ కల్పించుకున్నారు. రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయమని వైకాపా కోరుతున్న పద్ధతి సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. "తప్పు జరిగింది, మరోసారి ఇలా జరగనివ్వబోము. సస్పెన్షన్ ఎత్తివేయండని కోరితే పరిస్థితి మరోలా ఉండేది. అలా చేయకుండా, సభ తప్పు చేసింది. తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారని ఆరోపించడం సరికాదు" అన్నారు. అంతకుముందు రోజాపై ఎట్టి పరిస్థితుల్లో సస్పెన్షన్ తొలగించే పరిస్థితే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రోజా సస్పెన్షన్ పై తాము కోర్టుకు వెళతాం: జగన్

హైదరాబాద్ :నేటి సమావేశాల్లో భాగంగా రోజాపై సస్పెన్షన్ ను ఎత్తివేయాల్సిందేనని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు అధికార పక్షం ససేమిరా అనడంతో వైసీపీ ఏకంగా శీతాకాల సమావేశాలనే బాయ్ కాట్ చేసింది. రోజా సస్పెన్షన్ పై తాము కోర్టుకు వెళ్లనున్నట్లు ఆ తర్వాత జగన్ ప్రకటించారు. దీంతో రోజా సస్పెన్షన్ వ్యవహారం అసెంబ్లీ నుంచి కోర్టు గడప తొక్కనుంది.

09:24 - December 21, 2015

హైదరాబాద్ : ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. రోజాపై సస్పెన్షన్‌ ఎత్తివేయనందుకు, అలాగే కాల్‌మనీపై చర్చ కొనసాగించనందుకు నిరసనగా సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు జగన్‌ సభలో ప్రకటించారు. సభ నుంచి వాకౌట్‌ చేశాక.. ఎమ్మెల్యేలతో జగన్‌ సమావేశమయ్యారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రతిపాదనపై చర్చిస్తున్నారు.

టీడీపీ కుటిలయత్నమే రోజాపై వేటు

అసెంబ్లీలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కుటిల ప్రయత్నం చేస్తోందని వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. అందులో భాగంగానే రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారన్నారు జగన్ . వెంటనే రోజాపై వేసిన వేటును ఎత్తివేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సభ నుంచి బైకాట్ చేస్తామని ప్రకటించారు జగన్ .  

సభ నుంచి వైసీపీ బాయ్ కట్

హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ అంశంపై పునరాలోచించే అవకాశం లేదని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. దీంతో వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు జగన్ ప్రకటించి బయటకు వెళ్లిపోయారు.

రివ్యూ చేసే ప్రసక్తే లేదు: యనమల

హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ అంశంపై పునరాలోచించే అవకాశం లేదని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

రోజా సస్పెన్షన్ ను పునరాలోచించాలి : జగన్

హైదరాబాద్ : నగరి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ ను పునరాలోచించాలని వైసీపీ నేత జగన్ స్పీకర్ ను కోరారు. లేదంటే సభ నుంచి వాకౌట్ చేస్తామని తెలిపారు. అంతక ముందు సీఎం చంద్రబాబు నాయుడు, సభ్యులు జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.,

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోజా పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. 

08:30 - December 21, 2015

విజయవాడ : కాల్‌మనీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే అరెస్టై గన్నవరం సబ్‌జైలులో ఉన్న నిందితులకు లైంగిక పటుత్వ పరీక్షల్ని నిర్వహించేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఏ-1 నిందితుడు యలమంచిలి రాము, ఏ-7 నిందితుడు దూడల రాజేష్‌కు ఇవాళ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు పరారీలో ఉన్న కాల్‌మనీ నిర్వాహకులు పోలీసులు ముందు లొంగిపోయేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 10 రోజులుగా పరారీలో ఉన్న ట్రాన్స్‌కో డీఈ సత్యానందం, చెన్నుపాటి శ్రీను, వెనిగళ్ల శ్రీకాంత్‌, పెండ్యాల శ్రీకాంత్‌ లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో వీళ్లంతా పోలీసుల ముందు లొంగిపోయేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. 

08:29 - December 21, 2015

ఖమ్మం : పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఖమ్మం జిల్లాలోని భద్రాచల పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. సీతారాముల వారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం దర్శనం సందర్బంగా ప్రత్యేక దర్శనాలన్నింటిని ఆలయ అధికారులు రద్దు చేశారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా అధికారులు విస్త్రత ఏర్పాట్లు చేశారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివస్తుండడంతో భద్రాద్రి ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. 

08:27 - December 21, 2015

నల్గొండ : పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లాలోని యాదాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. లక్ష్మీనరసింహస్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో యాదగిరి గుట్ట ప్రాంతం అంతా భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామునుంఏ భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించారు. మొత్తం క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోవడంతో స్వామివారిని దర్శనానికి చాలా సమయం పడుతోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక దర్శనాలన్నింటిని అధికారులు రద్దు చేశారు.  

08:25 - December 21, 2015

తిరుమల : పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తకోటి తరలొచ్చింది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులతో తిరుమల వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. వైకుంఠం-1, 2 కాంప్లెక్స్‌ల్లోని 64 కంపార్టమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో భక్తుల క్యూలైన్లను పశ్చిమ, ఉత్తర మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి తితిదే అధికారులు మళ్లించారు. మరోవైపు తితిదే సామాన్యభక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ వీఐపీల సంఖ్యను పరిమితం చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని తితిదే ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భోస్‌లే, తితిదే ధర్మకర్తల మండలి సభ్యులు రాఘవేంద్రరావు, సండ్ర వెంకట వీరయ్య, మంత్రులు సిద్ధారాఘవరావు, మృణాళిని, ఎంపీలు సీఎం రమేష్‌, శివప్రసాద్‌, సినీనటులు మోహన్‌బాబు, అంబరీష్‌,దానం నాగేందర్‌, స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలకరించారు. విద్యుద్దీప కాంతుల్లో పుణ్యక్షేత్రం సరికొత్త శోభను సంతరించుకుంది. సామాన్య భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈసారి ఏర్పాట్లు చేశామని తిరుమల జేఈవో సాంబశివరావు తెలిపారు. 

08:00 - December 21, 2015

హైదరాబాద్ : కాల్ మనీ కేసులో అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వమే అర్థవంతమైన చర్చను చేపట్టాలని 'న్యూస్ మార్నింగ్' చర్చలో సీనీయర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ప్రతిపక్షంలో అనుభవ రాహిత్యం కన్నా...వ్యూహాత్మక రాహిత్యం ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీలో రాజకీయ వ్యూహాలే తప్ప...ప్రజా సమస్యలపై చర్చను చేపడుతోందా? కాల్ మనీ కేసులో శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేల ప్రమోయం ఉందా? ఎంక్వయిరీ చేయడంలో ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందా? కాల్ మనీ వ్యవహారం పై వైసీపీ రాష్ట్రపతికి మెమోరాండం ఇవ్వడం ఏం సూచిస్తోంది? విజయవాడ క్రైం సిటీగా మారుతోందా? కాల్ మనీ అంశం సామాజికా, రాజకీయ అంశంగా మారుతోందా? దేశ చరిత్రలో సీఎం కార్యాలయంపై సీబీఐ దాడి చేసిన చరిత్ర లేదు. కానీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యాలయంపై సీబీఐ ఏ ఉద్దేశ్యంతో దాడి చేసింది? నిర్భయ దోషి విడుదలపై లోతుగా చర్చ జరపాల్సిన అవసరం లేదా? ఇదే అంశంపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో రవితో పాటు టిడిపినేత విజయకుమార్, వైసీపీ నేత మెరుగు నాగార్జు పాల్గొన్నారు. మరి ఈ చర్చను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

కాల్ మనీ నిందితులు లొంగుబాటుకు ప్రయత్నాలు

విజయవాడ : కాల్ మనీ నిందితులు లొంగుబాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాన్స్కో డీఈ సత్యానందం, చెన్నుపాటి శ్రీను, వెలిగళ్ల శ్రీకాంత్, పెండ్యాల శ్రీకాంత్ లొంగిపోవడటానికి సిద్ధమైనట్లు సమాచారం. రెండు రోజుల్లో లొంగిపయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు కాల్ మనీ నిందితులకు నేడు పటుత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. కాల్ మనీ కేసులో ఏ-1 నిందితుడు యలమంచిలి రాము, ఏ-7నిందితుడు డి. రాజేష్ కు జీజీహెచ్ లో పటుత్వ పరీక్షలు నిర్వహించనున్నారు.

07:04 - December 21, 2015

హైదరాబాద్ : ఆధునిక యుగ ఆవిష్కరణలో యూనివర్సిటీలదే కీలకపాత్ర. దేశ ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి బాటలు వేసేదీ విశ్వవిద్యాలయాలే. అయితే, యూనివర్సిటీ విద్యను మన ప్రభుత్వాలు ఆది నుంచీ నిర్లక్ష్యం చేస్తున్నాయి. నిధుల కేటాయింపులో ఎప్పుడూ చిట్టచివరి స్థానమే ఇస్తున్నాయి. యూనివర్సిటీ విద్యకు పెట్టే ఖర్చును దండగమారి వ్యవహారంగా భావిస్తున్నాయి. అవును. విద్యారంగంపై పెట్టే ఖర్చు ఏ ప్రభుత్వానికీ ఓటు బ్యాంక్‌లను సృష్టించి పెట్టదు. ఓట్లు రాల్చని ఏ కార్యక్రమానికైనా నిధులు సమకూర్చడం ప్రభుత్వాలకు ఇష్టం వుండదు.

మన దేశంలో 650కి పైగా యూనివర్శిటీలు...

మన దేశంలో 650కి పైగా యూనివర్సిటీలున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండేసి జిల్లాలకో యూనివర్సిటీ వుంది. అయితే, అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడుతున్న యూనివర్సిటీలు చాలా స్వల్పం. నిధులు కేటాయించకుండా, పరిశోధనలను ప్రోత్సహించకుండా ఇంతకాలమూ ఉన్నత విద్యను, విశ్వవిద్యాలయాల నిర్వహణను తీవ్ర నిర్లక్ష్యం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు వాటిని ప్రయివేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రయివేట్ యూనివర్సిటీ బిల్లు సిద్ధం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నాల్లో వుంది. ప్రయివేట్‌ యూనివర్సిటీలు ప్రవేశించిన తర్వాత ప్రభుత్వ యూనివర్సిటీల నిర్వహణను మరింత నిర్లక్ష్యం చేస్తారేమోనన్న అనుమానాలున్నాయి.

యూనివర్సిటీలలో నిధుల కొరతతో....

యూనివర్సిటీలలో నిధుల కొరత, విద్యాబోధనలో ప్రమాణాలు పడిపోవడం, పరిశోధనలు కొందరికి కాలక్షేపంగా మారిపోవడం, కేవలం పట్టాల కోసమే పరిశోధనలు సాగిస్తుండడం, కొంతమంది అధ్యాపకుల్లో వృత్తి నిబద్ధత లోపించడం, దీనికి తోడు అడ్డమైన రాజకీయాలు తిష్టవేయడం, వైస్‌ చాన్స్‌లర్‌ లాంటి కీలక పదవుల నియామకాల్లోనూ గబ్బు రాజకీయాలు ప్రవేశించడం లాంటి దృశ్యాలను కళ్లారా చూస్తున్నవారు ప్రయివేటీకరణ వైపు మొగ్గుచూపడంలో ఆశ్చర్యంలేదు. ఒక్రటెండు ఎకరాలు భూమి వున్నవారికైనా బ్యాంక్ లు ఎడ్యుకేషన్ లోన్లు ఇస్తుండడం, పేరొందిన ప్రయివేట్ యూనివర్సిటీలలో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా వెంటనే మంచి ఉద్యోగాలు దొరుకుతుండడం చూసినవారు వాటికి ఆకర్షితులవ్వడంలో వింతేమీ లేదు. ఏ కారణం చేతనైనా యూనివర్సిటీలలోకి ప్రయివేట్ పెట్టుబడులను ఆహ్వానించడం అనివార్యమైతే, ప్రభుత్వ యూనివర్సిటీల మనుగడకు దెబ్బ తగలకుండా చూడాలన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రయివేట్ యూనివర్సిటీలకు అనుమతులిచ్చినా, అవి వ్యాపార కేంద్రాలుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలూ వస్తున్నాయి.

ఎవరి అభిప్రాయాలు ఎలా వున్నా....

ఎవరి అభిప్రాయాలు ఎలా వున్నా- స్కూళ్లను, కాలేజీలను ప్రయివేట్‌, కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టిన ఫలితాన్ని మనం అనుభవిస్తూనే వున్నాం. ఫీజుల భారం మోయలేక , పరుగు పందెం నుంచి తప్పుకోలేక అమ్మానాన్నలుపడుతున్న అవస్థ, అక్కడ ప్రయోగించే ఒత్తిడి భరించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు చూస్తుంటే గుండె కలుక్కుమంటుంది. ఇక ప్రయివేట్ ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల బాగోతాల గురించి, వాటిలోని నాణ్యత ప్రమాణాల గురించి మాట్లాడుకుంటే బీపీ పెరిగి, గుండెల్లో దడ పుడుతుంది. ఇప్పుడు యూనివర్సిటీలను కూడా ఇలాంటి యాజమాన్యాలకే అప్పగిస్తే ఫలితాలు ఎంత ఘోరంగా వుంటాయో ఊహించుకోవచ్చు..

ఏపీ, తెలంగాణలలో చక్కటి యూనివర్శిటీలు...

నిజానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల లో చక్కటి యూనివర్సిటీలున్నాయి. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీకి దేశంలోనే మంచిపేరుండేదిజ నాగార్జున యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయవర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీలు ఎందరినో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నాయి. ఇక హైదరాబాద్ లోని ఉస్మానియా , సెంట్రల్ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులనూ ఆకర్షిస్తున్నాయి. దేశంలో తొలిసారిగా మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడిపిన పీవీ నరసింహారావు చదువుకున్నదీ ఉస్మానియాలో యూనివర్సిటీలోనే కదా. వీటికి తోడు వైఎస్‌ హయాంలో దాదాపు జిల్లాకో కొత్త యూనివర్సిటీ ప్రాణం పోసుకున్నాయి. కాకపోతే ఇవన్నీ నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సాగాల్సిన పరిశోధనలు కుంటుపడుతున్నాయి. వివిధ పరిశ్రమలకు, వ్యవసాయానికీ, శాస్త్ర సాంకేతిక రంగాలకు అవసరమైన పరిశోధనలు సాగించేలా ప్రోత్సహిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించే సత్తా మన యూనివర్సిటీలకు వుంది. వివిధ ఉత్పత్తుల మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యూనివర్సిటీల పరిశోధనలు సాగితే, వాటికి నిధుల కొరత తీరే అవకాశమూ లేకపోలేదు. అలాంటి ప్రయత్నాలేవీ చేయకుండా తొందరపడి ప్రయివేట్ రంగాన్ని ఆహ్వానించడం సముచితం కాదన్న వాదనలనూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు అవలోకించాలి. 

07:00 - December 21, 2015

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఇవాళ ప్రయివేట్‌ యూనివర్సిటీల బిల్లు ప్రవేశపెడుతున్నారు. తెలంగాణలోనూ రంగం సిద్ధమవుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రయివేట్‌ యూనివర్సిటీలు ఉన్నత విద్యారంగాన్ని ఏ మలుపు తిప్పుతాయి? వీటివల్ల ఉభయ తెలుగు రాష్ట్రాలకు జరిగే మంచి చెడులేమిటి? ఇప్పటికే దాదాపు జిల్లాకో యూనివర్సిటీ వున్న నేపథ్యంలో ఇంకా కొత్తగా ప్రయివేట్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందా? అసలు సమాజాభివృద్ధిలో యూనివర్సిటీల పాత్ర ఏమిటి? యూనివర్సిటీ విద్యను ప్రయివేటీకరిస్తే సమాజాభివృద్ధిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఖమ్మం జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్‌ సమీక్ష

ఖ‌మ్మం : నీటి ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌ని అధికారుల‌ను అదేశించింది తెలంగాణ ప్రభుత్వం. ఏడాది కాలంగా జిల్లాలో సాగునీటి రంగంలో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నులపై మంత్రులు స‌మీక్షించారు. మిష‌న్ కాక‌తీయ రెండో దశ మొదలవుతున్న స‌మ‌యంలో మొదటి దశ పనులన్నింటిని త‌క్షణ‌మే పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఇక జిల్లాలోని పాలెం వాగు కింద 10 వేల ఎక‌రాల‌కు పైగా సాగు నీరందించేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేయాల‌ని మంత్రులు సూచించారు.

 

పార్లమెంట్ సందర్శకులపై నిబంధనలు..!

ఢిల్లీ :పార్లమెంట్ సందర్శకులపై లోక్ సభ సచివాలయం కొన్ని నిబంధనలు విధించింది. సందర్శనార్థం వచ్చే వారు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రసార మాధ్యమాలతో మాట్లాడవద్దని, మొబైల్ ఫోన్లు, కెమెరాలు తీసుకు రావద్దని తెలిపింది. కాగా, డిసెంబర్ 23 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.

గరుడు వాహనంపై భదాద్రి రాముడు

ఖమ్మం: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలంయలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం వైభవంగా జరిగింది. భద్రాద్ది రాముడు గరుడు వాహనంపై భక్తులకు దర్శనమించారు. స్వామి వారిని దర్శించుకునేందకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

06:44 - December 21, 2015

ఢిల్లీ : నిర్భయ కేసులో మైనర్‌ బాలుడి విడుదలపై ఢిల్లీలో మరోసారి వేడెక్కింది. నిందితున్ని విడుదల చేయొద్దంటూ ఇండియాగేట్‌ వద్ద మహిళా సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగాయి. మరోవైపు ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరుపుతుంది.

ఢిల్లీలోని ఓ ఎన్జీవో సంరక్షణలో....

దేశం మొత్తాన్ని కుదిపేసిన నిర్భయ కేసులో బాల నేరస్థుడు విడుదలయ్యాడు. ఢిల్లీలోని ఓ ఎన్జీవో సంరక్షణలో ఇతన్ని ఉంచాలని పోలీసులు నిర్ణయించారు. అతని కదలికలను జువినైల్ బోర్డు జాగ్రత్తగా గమనించనుంది. అలాగే మైనర్‌కు పదివేల రూపాయల సహాయంతోపాటు... టైలర్‌ షాప్ నడుపుకునేందుకు ఓ మిషిన్‌ ఇవ్వాలని తీర్మానించారు..

విడుదలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనలు ....

అటు మైనర్‌ విడుదలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళనలు మిన్నంటాయి. నిర్భయ తల్లిదండ్రులు, మహిళా సంఘాలు, యువతీయువకులు ఢిల్లీ గేట్‌ముందు నిరసనకు దిగారు... వీరికి ఢిల్లీ మహిళా కమిషన్‌కూడా అండగా నిలిచింది.. ఈ నిందితుడి విడుదలతో సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

విడుదలపై ఈ నెల 21న సుప్రీంకోర్టులో విచారణ...

మరోవైపు మైనర్‌ నిందితుడి విడుదలపై ఈ నెల 21న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. నిందితుడి విడుదలను వ్యతిరేకిస్తూ శనివారం అర్ధరాత్రి నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ మహిళా కమిషన్‌ హైకోర్టును ఆశ్రయించారు.. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం... విడుదలపై స్టే విధించడానికి నిరాకరించింది..

మూడేళ్లక్రితం ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ బస్సులో.....

మూడేళ్లక్రితం ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ బస్సులో నిర్భయపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగింది.. ఆరుగురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా... మైనర్‌కాకుండా.. మిగతావారికి ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు ఉరిశిక్ష విధించింది.. ఈ శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది.. అయితే మైనర్‌కు మూడేళ్ల శిక్ష విధింపుపై విమర్శలొచ్చాయి.. 

06:41 - December 21, 2015

విజయనగరం : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్వాసితుల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పలువురు నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ పోరాటం ఆగదని బాధిత గ్రామాల ప్రజల స్పష్టం చేస్తున్నారు.

బాధిత గ్రామాల్లో కర్ఫ్యూ వాతావరణం....

భోగాపురం ఎయిర్‌పోర్టు బాధిత గ్రామాల్లో కర్ఫ్యూ వాతావరణం తలపించింది. భూ హక్కుల పరిరక్షణ కమిటీ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు. జిల్లావ్యాప్తంగా వేకువజాము నుంచే ముందస్తు, అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా సీపీఎం కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు.

ఉద్రిక్తలకు దారి తీసిన పాదయాత్ర...

ప్రభుత్వ తీరును నిరసిస్తూ తలపెట్టిన పాదయాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. భూహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ దడాల సుబ్బారావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్‌ నర్సింగరావు సహా మొత్తం 41 మందిని అరెస్ట్‌ చేసి జిల్లాలోని వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించారు. ఎయిర్‌పోర్ట్‌ బాధిత గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడమే కాకుండా గ్రామాల్లోకి వెళ్లే రహదారుల్లో ఎక్కడిక్కడే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కర్ఫ్యూను తలిపింపజేశారు.

పోలీసుల తీరుతో ప్రజలంతా వీధుల్లోకి....

పోలీసుల తీరుతో ప్రజలంతా వీధుల్లోకి వచ్చారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. అరెస్టులు చేసినా పాదయాత్ర ఆగదని హెచ్చరిస్తూ గూడెపువలస, రెల్లిపేట గ్రామాల్లో స్థానికులు పాదయాత్ర చేశారు.

ఖండించిన సీపీఎం నేత మధు...

సీపీఎం నేతల అక్రమ అరెస్టులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రంగా ఖండించారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణను ఆపాలని మధు డిమాండ్‌ చేశారు. మొత్తానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కోసం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాలను ఉధృతం చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. 

06:38 - December 21, 2015

విజయవాడ : నూతన బార్ పాలసి విధానాన్ని విడుదల చేసింది ఎపీ సర్కార్. ఆరు నెలలు సుదీర్గ కసరత్తు అనంతరం నూతన బార్ పాలసీని ఖరారు చేసింది.. దీని ప్రకారం నూతన లైసెన్స్ లను 2016 డిసెంబర్ వరకు జారీ చేయనున్నారు.

అనేక అంశాలపై కసరత్తు చేసిన ప్రభుత్వం...

నూతన బార్ పాలసీని ఎట్టకేలకు ఖరారు చేసింది ఏపీ సర్కార్. గత ఆరు నెలులుగా అనేక అంశాలపై కసరత్తు చేసిన ప్రభుత్వం దీనికి సంబందించిన పాలసీని విడుదల చేసింది. బార్‌ పాలసీపై ఇప్పటికే జిల్లాలకు మార్గదర్శకాలను పంపింది ఆబ్కారీ శాఖ. 2016 జనవరి నుంచి డిసెంబర్ వరకు లైసెన్స్ లను జారీచేయనున్నారు.

దరఖాస్తులకు ఆహ్వానం....

ఈ నూతన పాలసీకి సంబంధించి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్స్‌లో దరఖాస్తులకు ఆహ్వానించారు. ఈ నూతన బార్ లైసెన్స్ లు కావాలనుకోనే వారు ముందుగా ప్రిమియర్ క్లియరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ముందస్తు దరఖాస్తు రుసుం 5వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత ప్రిమియర్ క్లియరెన్స్ ను కమిషనర్ జారీ చేస్తారు. దాని ఆధారంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిఫ్యూటి కమిషనర్లు పరీశీలించి లైసెన్స్ జారీ చేస్తారు. ఈ ప్రిమియర్ క్లియరెన్స్ వచ్చిన దరఖాస్తు దారులు 2లక్షలతో లైసెన్స్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారు పేర్కోన్న చిరునామాలో ఉన్న బార్, రెస్టారెంట్ వసతిని సూపరిండెంట్, డిఫ్యూటి కమిషనర్లు పరిశీలిస్తారు.

2011 జనాభా ఆధారంగా ....

ఈ సారి ఆబ్కారీ శాఖ బార్ అండ్ రెస్టారెంట్స్ సంఖ్య 2011 జనాభా ఆధారంగా పెంచడమే కాకుండా అవి పెట్టే ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీనుకుంటోంది. దీనికి సంబంధించి బార్ అండ్ రెస్టారెంట్స్ పెట్టే పరిసర ప్రాంతాల ఫోటోలను, వీడియోలను తీసి ఉంచాలని ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు దరఖాస్తు దారులు ఖచ్చితంగా వాణిజ్య లైసెన్స్ లను కలిగి ఉండాలనీ సూచించింది. లైసెన్స్ ఫీజులను 50 వేల జనాభాకు 25లక్షలు, 50వేల నుండి 5లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాలలో 40లక్షలు, 5లక్షల జనాభా దాటిన ప్రాంతాలలో 50లక్షలుగా నూతన ఫీజును నిర్ణయించారు.

ముగింపు గడువుపై స్పష్టత ఇవ్వలేదు....

నూతన పాలసీకి విధానాన్ని విడుదల చేసిన ఆబ్కారీ శాఖ తాజా పాలసీలో మాత్రం ప్రారంభ, ముగింపు గడువుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో శనివారం సాయంత్రానికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు హైదరాబాద్ లోని ఆబ్కారీ శాఖ కార్యాలయానికి వచ్చాయి.

06:34 - December 21, 2015

హైదరాబాద్ : నల్లగొండ జిల్లా టీడీపీలో విబేధాలు ముదురుతున్నాయి. నేతల మధ్య అంతర్గత విబేధాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సీనియర్లు వర్గాలుగా విడిపోయి.. ఆధిపత్య పోరుకు ఆజ్యం పోయడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి దిగజారుతోంది.

జిల్లా కమిటీ నియామకం వివాదం....

ప్రతి చిన్నవిషయంలోనూ ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి వర్గాల మధ్య విబేధాలు వస్తుండడంతో పార్టీ క్యాడర్‌ కలవరపడుతోంది. తాజాగా జిల్లా కమిటీ నియామకం ఈ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. మోత్కుపల్లి వర్గానికి చెందిన బిల్యానాయక్‌కు జిల్లా అధ్యక్షునిగా మరోసారి అవకాశం కల్పించడం ఉమామాధవరెడ్డి వర్గానికి మింగుడు పడలేదు. దీంతో ఉమామాధవరెడ్డి పార్టీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి కమిటీని రద్దు చేయించారు.

కమిటీని రద్దుచేయడంపై బిల్యానాయక్‌ ఆగ్రహం....

జిల్లా కమిటీని రద్దుచేయడంపై బిల్యానాయక్‌ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజాగా జిల్లా కమిటీని రద్దు చేయడంతో బిల్యానాయక్‌ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకపక్క టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు అల్లాడిపోతున్న టీడీపీ..మరోపక్క సీనియర్‌ నేతల విబేధాలతో మరింత నష్టపోయే ప్రమాదముందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. 

06:32 - December 21, 2015

హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటాలో సగం స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న అధికార పార్టీ.....మరో ఆరు స్థానాల్లో విజయం కోసం పావులు కదుపుతోంది. అయితే రెండు,మూడు జిల్లాలు అధికార పార్టీకి గుబులు రేపుతున్నాయి. ఆ జిల్లాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ను కొనసాగిస్తూ...విపక్షాలపై పైచేయి సాధించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏకగ్రీవం...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సగం స్థానాలను ఏకగ్రీవంగా కైవశం చేసుకున్న టీఆర్‌ఎస్‌కు.....మిగిలిన స్థానాలు మాత్రం ఉత్కంఠ రేపుతున్నాయి.ఉత్తర తెలంగాణాలో బలంగా ఉన్న అధికార పార్టీ ఆ జిల్లాల్లో మండలి ఎన్నికలను ఏకగ్రీవంగా చేసుకుంది. దక్షిణ తెలంగాణా జిల్లాల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ...

రంగారెడ్డి జిల్లాల్లో పైచేయి సాధించే అవకాశం ఉన్నా....ఇతర జిల్లాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ గట్టి పోటీ ఎదుర్కోక తప్పేలా లేదు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆ పార్టీ గెలుపు అంత ఈజీగా దక్కే అవకాశాలు కనిపించడం లేదు.

పువ్వాడకు కాంగ్రెస్‌, టీడీపీ మద్దతు....

ఖమ్మం జిల్లాల్లో వామపక్ష పార్టీ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వర్ రావుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపగా జిల్లాలో YSRCP పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది. ఆ పార్టీ మద్దతు ఎవరికి ఉంటుందన్న ప్రశ్న ఆసక్తి రేపుతోంది. YCPకి విజయం సాధించే అవకాశం లేకపోయినా.....పోటీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చివరి నిమిషంలో ఆ పార్టీ మద్దతుదారులు ఎలా వ్యవహరిస్తారనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. మొదటి ప్రాధాన్యత ఓటు వైసీపీ కి వేసినా.....రెండో ప్రాధాన్యతా ఓటు తమకే ఉంటుందని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా స్థానికంగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌, టీడీపీల దోస్తీ....

మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టిడిపిలు చేతులు కలిపాయి. కాంగ్రెస్ పార్టీ సభ్యులు మొదటి ప్రాధాన్యత వారి పార్టీ నేతకు వేసుకుంటూ రెండో ప్రాధాన్యత ఓటు టిడిపికి వేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మొదటి ప్రాధాన్యతా ఓటు టిడిపికి వేసి రెండోది కాంగ్రెస్ అభ్యర్థికి వేయాలనే అవగాహనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

నల్లగొండ జిల్లాలో హోరాహోరీ పోరు....

నల్గొండ జిల్లాలో హోరాహోరీ పోరు తప్పేలా లేదు. స్థానిక సంస్థల్లో గులాబిపార్టీకి బలం అంతంతమాత్రమే ఉండడంతో.....ఆ జిల్లాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలను కారెక్కించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రణాళికలను రచిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి దూరంగా ఉండాలని వామపక్ష పార్టీలు నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు వామపక్ష పార్టీల మద్దతు తీసుకునేందుకు ప్రయత్నాలు మరమ్మరం చేస్తున్నారు.

06:29 - December 21, 2015

తిరుమల : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని.. అన్ని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల భక్తజన సంద్రమైంది. ఉత్తర ద్వార దర్శనం కోసం.. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్‌లతో పాటు.. నారాయణగిరి ఉద్యానవనంలోని తాత్కాలిక క్యూలైన్‌లలోనూ భక్తులు నిండిపోయారు.

వైకుంఠద్వార దర్శనానికి భక్తుల పడిగాపులు.....

వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. ఉత్తర ద్వార దర్శనం కోసం.. భక్తులు తిరుమలకు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి ఉత్తరద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. దీంతో ఆదివారం ఉదయం నుంచే భక్తులు క్యూలైన్‌లలోకి ప్రవేశించారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యూలైన్‌ షెడ్లూ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

భక్తులతో నిండిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్ట్‌మెంట్‌లు....

కంపార్ట్‌మెంట్‌లలోని భక్తులను అర్ధరాత్రి దాటాక.. వేంకటేశుని దర్శనానికి.. ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తారు. వెలుపల వేచి ఉన్న భక్తులు... రేపు వేకువజామున నాలుగు గంటలకు గానీ క్యూకాంప్లెక్సులో ప్రవేశించే అవకాశం లేదు. ఆదివారం సాయంత్రానికి సుమారు 70వేల మంది భక్తులు వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. టిటిడి డి.సాంబశివరావు, జేఈఓ శ్రీనివాసరాజులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమాక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.

సామాన్య భక్తులకే ప్రాధాన్యతనివ్వాలని టీటీడీ నిర్ణయం...

శ్రీనివాసుడి దర్శనానికి.. సామాన్య భక్తులకే ప్రాధాన్యతనివ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఆమేరకు విఐపీ పాసులను గణనీయంగా తగ్గించింది. నారాయణగిరి ఉద్యానవనంలో వేచి ఉన్న భక్తులకు టిటిడి అన్నధానం విభాగం ఎప్పటికపుడు అన్నప్రసాదాలు, టీ,కాఫీలు అందజేస్తోంది. మరోవైపు.. పోటెత్తిన భక్తుల కారణంగా ఎక్కడా తొక్కిసలాటలు జరగకుండా టీటీడీ భద్రతాధికారులు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 

06:26 - December 21, 2015

హైదరాబాద్ : తెలంగాణ స్థానిక అవసరాల దృష్ట్యా కెసిఆర్‌ మరో రివ్యూ నిర్వహించారు. ప్రతి నీటిబొట్టునూ సద్వినియోగం చేసేందుకు, ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఇప్పటికే ఆయన పలుమార్లు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జలవనరుల శాఖకు చెందిన నిపుణులు, అధికారులు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో కలిసి మరో సమీక్ష జరిపారు. మహారాష్ట్ర సిఎంతో ఫోన్‌ సంభాషణలు జరిపారు.

సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమనే కెసిఆర్‌....

తెలంగాణను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమనే కెసిఆర్‌ ఆ దిశగా పలు సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి వాటిని త్వరితగతిన నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా తమ్మిడిహట్టి వద్ద, కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు ఏకకాలంలో ప్రారంభమై వేగంగా పూర్తిచేసేలా అధికారులను ఆదేశించారు. కేసిఆర్‌ తన క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి, వ్యాప్కోస్ ఎండి శంభు ఆజాద్ తదితరులతో రివ్యూ నిర్వహించారు.

కనిష్ట ముంపు, గరిష్ట నీటి వినియోగం అనే పద్ధతిలో.....

ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో కనిష్ట ముంపు, గరిష్ట నీటి వినియోగం అనే పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలని దీనివల్ల అంతర్రాష్ట్ర వివాదాలు, భూసేకరణ సమస్యలు ఎక్కువగా ఉండవని ముఖ్యమంత్రి అన్నారు. తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులోనే బ్యారేజీ నిర్మించాలని ఆదిలాబాద్‌ జిల్లాకు నీరు పారించడానికి అనువుగా మూడు రిజర్వాయర్లకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజీని కూడా వీలైనంత తక్కువ ముంపు ఉండేట్లు డిజైన్ చేసినందున వీటికి సంబంధించిన తుది ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభించాలన్నారు. ఈ నెలాఖరు వరకు అన్ని రకాల ప్లాన్లు సిద్ధం చేసి కార్యాచరణ రూపొందించాలని జనవరిలో పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సిఎం కెసిఆర్ ఫోన్‌లో....

తుమ్మిడిహట్టి, కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించి మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సిఎం కెసిఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుత రీడిజైన్‌ వల్ల మహారాష్ట్రలో భూముల ముంపు సమస్య ఉండదని గడ్చిరౌలి జిల్లా సరిహద్దులో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని దాని వల్లా ముంపు ఉండబోదని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలోని బృందం త్వరలో మహారాష్ట్రలో పర్యటించి అక్కడి మంత్రులు, అధికారులతో సమావేశమవుతారని కెసిఆర్ తెలిపారు.ఆ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రతిపాదించారు. దీనికి ఫడ్నవీస్‌ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్ట్‌ల రీడిజైన్లతో అన్ని ప్రాబ్లమ్స్‌ తొలగిపోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. మరి ప్రతిపాదిత ప్రాజెక్ట్‌లు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో చూడాలి. 

నగరంలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్ : పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా నగరంలోని పలు ఆలయాలు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే ఆలయాల్లో బారు తీరారు. వనస్థలిపురంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం, హిమాయత్ నగరంలోని టిటిడి ఆలయం, చిక్కడపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు పోటెత్తారు.

భక్తులతో కిటకిటలాడుతోన్న తిరుమల

హైదరాబాద్ : పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్త కోటితో తిరుమల కిటకిటలాడుతోంది. స్వామి వారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చిన సామాన్య భక్తులతో తిరుమల వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. మరోవైపు టిటిడి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ ప్రముఖుల సంఖ్యను పరిమితం చేసింది.

Don't Miss