Activities calendar

22 December 2015

బాబు ఆఫీసు పరిసరాల్లో ఆంక్షలు...

విజయవాడ : సీఎం క్యాంపు ఆఫీసు పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి నుండి ఫిబ్రవరి 5 వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. కొద్దిరోజులుగా క్యాంపు ఆఫీసు ముట్టడీలు జరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. 

అర్బన్ హౌసింగ్ పై బాబు సమీక్ష..

హైదరాబాద్ : అర్బన్ హౌసింగ్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణ, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. రాష్ట్రంలో మంజూరైన 2 లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

బుక్ ఫెయిర్ ను సందర్శించిన గవర్నర్, మంత్రి ఈటెల..

హైదరాబాద్ : ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ ను గవర్నర్ నరసింహన్, మంత్రి ఈటెల సందర్శించారు.

 

కోల్ కతాలో షారుఖ్...కాజల్..

పశ్చిమబెంగాల్ : 'దిల్ వాలే' చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, కాజోల్ లు కోల్ కతాలో సందడి చేశారు. 

21:28 - December 22, 2015

ఢిల్లీ : నిర్భయ కేసులో జువెనైల్‌ నేరస్థుడి విడుదలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో రాజ్యసభలో జువెనైల్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు పాసైంది. దీంతో బాల నేరస్థుడి వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గనుంది. ఇకపై 16 ఏళ్లు దాటిన వారు నేరం చేస్తే పెద్దవాళ్లకు పడే శిక్ష అమలు కానుంది. హత్య, అత్యాచారం, యాసిడ్‌ దాడులు, ఉగ్రవాద చర్యలు లాంటి తీవ్ర నేరాలకు పాల్పడే వారికి ఈ చట్టం వర్తిస్తుంది.

సీపీఎం అభ్యంతరం..
జువెనైల్‌ చట్ట సవరణ బిల్లును ఆదర బాదరాగా ఆమోదం తెలపడంపై సీపీఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్భయ సెంటిమెంట్‌ ఆధారంగా చట్టంలో మార్పు తేవద్దని, సమగ్రమైన అవగాహన, చర్చల ద్వారా చట్టంలో మార్పు తేవాలని ఆ పార్టీ సభ్యుడు ఏచూరి సూచించారు. బాల నేరస్థుల సవరణ చట్టాన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని డిమాండ్‌ చేశారు. 14, 15 ఏళ్ల వయసు బాలుడు తీవ్రమైన నేరాలకు పాల్పడితే మళ్లీ చట్టాన్ని సవరిస్తారా అని ప్రశ్నించారు. నేరాల ఆధారంగా శిక్షలుండాలి కానీ, వయో పరిమితిని బట్టి కాదన్నారు. అయితే తాము సవరణ బిల్లుకు వ్యతిరేకం కాదని ఏచూరి తెలిపారు.

కాంగ్రెస్ పలు విమర్శలు..
అంతకుముందు జువెనైల్‌ చట్ట సవరణ బిల్లును కేంద్రమంత్రి మేనకా గాంధీ రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. దేశంలో జువెనైల్ నేరాలు చాలా వేగంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో పటిష్టమైన చట్టాన్ని తీసుకు రావలసిన అవసరం ఉందన్నారు. ఇవాళ 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. నిర్భయ కేసులో జువెనైల్‌ నేరస్థుడి విడుదలపై వ్యతిరేకత రావడంతో కేంద్రం హడావిడిగా బిల్లు పాస్‌ చేయాలని చూస్తోందని కాంగ్రెస్‌ విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. దేశంలో నిర్భయ లాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకే జ్యోతిసింగ్‌ తల్లి పోరాడుతున్నట్టు ఆజాద్‌ తెలిపారు. బాల నేరస్థులకు, తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి వేర్వేరు జైళ్లు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తీవ్ర నేరాలకు పాల్పడిన వారితో బాల నేరస్థులను కలిపి ఉంచినట్టయితే వారు పెద్ద నేరస్థుడిగా బయటకు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపడే విధంగా వారికి ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాలని ఆజాద్‌ సూచించారు.

2012లో నిర్భయ ఘటన..
చర్చలో భాగంగా తృణముల్ పార్టీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు నిర్భయ స్థానంలో ఒకవేళ తన కూతురు కనుక ఉండి ఉంటే.. నిందితులను అప్పుడే తుపాకితో కాల్చి చంపేవాడినని ఆగ్రహంతో అన్నారు. దేశ ప్రజలు కోరుకుంటున్న ఈ బిల్లు ఎంతో బాగుందని, ఎలాంటి నిరీక్షణ లేకుండా తక్షణమే పాస్‌ చేయాలన్నారు. వయసును తగ్గించాలన్ని అంశం ప్రధానం కాదని, ఈ నేరాల వెనక గల కారణాలను వెతకాలని, ఈ బిల్లుపై తొందరపాటు కుదరదని, సెలెక్ట్‌ కమిటికి పంపాలని మరికొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. 2012 డిసెంబర్‌లో జరిగిన నిర్భయ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజ్యసభలో చర్చ సందర్భంగా జ్యోతిసింగ్‌ పేరెంట్స్‌ సభలో ఉన్నారు. జువెనైల్‌ చట్టు సవరణ బిల్లు పాస్‌ కావడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 

21:26 - December 22, 2015

బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'జై గంగాజల్‌' చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ప్రియాంక తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ట్రైలర్‌ను విడుదల చేసింది. 2003లో అజయ్‌ దేవగన్ నటించిన గంగాజల్‌ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌గా వస్తోంది. ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2016 మార్చ్‌4న విడుదల కానుంది. ఈ మూవీలో ప్రియాంక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది.

21:21 - December 22, 2015

మహారాష్ట్ర : ప్రాణహిత బ్యారేజీలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు మంత్రి హరీశ్ రావు... డిసెంబర్‌ 29, 30న జరగబోయే ప్రాణహిత ఇంటర్‌స్టేట్‌ బోర్డ్ సమావేశంలో సాంకేతిక అంశాలు చర్చించాలంటూ నిర్ణయించారు.. తమ్మిడి హట్టి దగ్గర 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకరించిందని హరీశ్ రావు తెలిపారు.. మేడిగడ్డ బ్యారేజీ మార్పులపై బోర్డు మీటింగ్‌లో తమ నిర్ణయం తెలియజేస్తామని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్‌ చెప్పారని హరీశ్ రావు వివరించారు.

21:20 - December 22, 2015

హైదరాబాద్ : ఏపీ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. ఈ సెషన్‌లో మొత్తం 8 బిల్లులు ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్‌ చక్రపాణి తెలిపారు. 20 గంటల 36 నిమిషాలు సభలో చర్చ జరిగిందన్నారు. 49 ప్రశ్నలకు,.. 66 సప్లిమెంటరీ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పిందన్నారు. మూడు అంశాలపై మంత్రులు వివరణ ఇచ్చారన్నారు. ఈ సమావేశాల్లో మొత్తం 78 మంది సభ్యులు మాట్లాడారని మండలి ఛైర్మన్‌ తెలిపారు. 

21:19 - December 22, 2015

హైదరాబాద్ : వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిసైడయ్యింది. రేపు ఉదయం అసెంబ్లీ కార్యదర్శిని కలిసి అవిశ్వాస నోటీసులు ఇస్తామని నేతలంటున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఈసారి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగిన తీరుపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సభలో స్పీకర్‌ వ్యవహరించిన విధానంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభలో సమస్యలు చెప్పుకునేందుకు కూడా తమకు అవకాశం ఇవ్వకుండా.. స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

వైసీపీఎల్పీ భేటీ..
ఇక సమావేశాల తీరుపై ఆగ్రహంగా ఉన్న జగన్‌.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. దీనిపై వైసీపీఎల్పీ భేటీలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు జ్యోతుల నెహ్రూ తెలిపారు. బుధవారం ఉదయం అసెంబ్లీ కార్యదర్శిని కలిసి స్పీకర్‌పై అవిశ్వాసానికి సంబంధించిన నోటీసులు అందజేస్తామన్నారు. మరోవైపు రోజాను సస్పెండ్‌ చేసిన తీరుతో పాటు.. వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యులను ఒక్కరోజు సస్పెండ్‌ చేయాలని మంత్రి యనమల ప్రతిపాదిస్తే.. స్పీకర్‌ రెండు రోజుల సస్పెండ్‌ చేసిన విధానం కూడా సరిగ్గా లేదని వైసీపీ నేతలంటున్నారు.

రోజాకు అండగా నిలబడాలని నిర్ణయం..
అదేవిధంగా రోజాపై అధికార పార్టీ నేతలు వ్యవహరించిన తీరును వైసీపీఎల్పీ ఖండించింది. రోజాకు అండగా నిలబడాలని సమావేశంలో నిర్ణయించారు. సస్పెన్షన్‌పై న్యాయపోరాటానికి కూడా సిద్ధమన్నారు. అవసరమైతే ఢిల్లీస్థాయిలో న్యాయనిపుణులతో సంప్రదిస్తామన్నారు. రోజా సస్పెన్షన్‌ వ్యవహారానికి.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి సంబంధం లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా వైసీపీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావించింది కానీ.. చివరకు ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు. మరి ఈసారైనా స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తుందా ? లేదా వేచి చూడాలి. 

కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 

టిటిడి విజిలెన్స్ అదుపులో లడ్డూ దళారీ..

చిత్తూరు: టిటిడి విజిలెన్స్ అధికారులు ఓ లడ్డూ దళారిని అదుపులోకి తీసుకున్నారు. 144 టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు. 

20:49 - December 22, 2015

అతణ్ని చట్టాలు వదిలేయాలంటున్నాయి. శిక్షించాల్సిందేనని కొందరు పట్టుబడుతున్నారు. చేసింది క్రూర నేరం.. అందులో సందేహం లేదు. కానీ, శిక్షించటానికి కొన్ని అడ్డంకులు.. ఈ నేపథ్యంలో చట్టాలు మార్చాలంటూ డిమాండ్లు.. వచ్చాయి. కానీ, వయస్సును కాదు.. నేరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వాదనలు. .ఆఖరికి చట్టాన్ని సవరించారు. మరి ఈ సవరణతో సర్వం మారిపోతుందా..? నిర్భయ కేసులో జువెనైల్ విడుదలపై ప్రత్యేక కథనం..నిరసనలు, పిటిషన్లు అతడి విడుదలను ఆపలేకపోయాయి. నేరం చేశాడు …శిక్షపడాల్సిందే అంటూ గొంతుచించుకున్నా ఫలితం లేదు.. నిర్భయను బలితీసుకున్న జువెనైల్ బయటికొచ్చాడు.. చివరికి చట్టసవరణ చేశారు. దీనివల్ల నిర్భయ నేరస్తుడి విషయంలో వచ్చే మార్పేంటి?

విడుదలైన జువెనల్..
నిర్భయ నేరస్తుడు విడుదలయ్యే రోజుకి సర్కారుకు మెలకువొచ్చింది. బాలనేరస్తుల చట్టాన్ని సవరించాలని గుర్తొచ్చింది. ఈ లోగా సమయం దాటిపోయింది. జువెనైల్ విడుదలయ్యాడు. ఆఖరికి సుప్రీం కూడా చేతులెత్తేసింది. చివరికి ప్రభుత్వం వయస్సు తగ్గించింది. కానీ, దానివల్ల సమస్య పరిష్కారమవుతుందా? నిర్భయ కేసులో బాల నేరస్థుడి విషయంలో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? జువెనైల్ విడుదలకు కారణాలుగా ఏం చెప్తోంది? చాలా మంది ఆశిస్తున్నట్టు అతణ్ని జైల్లో ఎందుకు ఉంచలేకపోయారు.. జువెనైల్ యాక్ట్ ఏం చెప్తోంది? 

కన్నీటి గాథ..
ఇదొక ప్రత్యేకమైన సందర్భం.. ప్రత్యేకమైన కేసు.. దేశాన్ని కదిలించిన ఓ కన్నీటి గాథ ఇది. అత్యంత క్రూరంగా ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన.. ఈ కేసుకు ముందూ, తర్వాతా అనేక ఘటనలు జరిగాయి.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ, నిర్భయ ఘటన నేర్పిన పాఠాలు మాత్రం ప్రభుత్వాలు నేర్చుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. దానికి ఉదాహరణే జువెనైల్ విడుదల వివాదం. కానీ, మరో పక్క బాలల హక్కుల కార్యకర్తలతో పాటు జెడీయూ, ఏఐఏడీఎంకె పార్టీలు ఈ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ వచ్చారు. లైంగిక దాడులు చేసిన వారిని ఉరితీయడమో, లేక కఠినంగా శిక్షించడమో మాత్రమే పరిష్కారమా? అలాంటి ఘటనలు జరక్కుండా చేసే అవకాశమే లేదా? శిక్షలతో నేరాలు తగ్గుతాయా? నిత్యం దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు ఏ పాఠాలు నేర్పుతున్నాయి? ప్రభుత్వంపై ఎలాంటి బాధ్యత ఉంది?

ప్రజలను శాంతింప చేయడానికి సవరణ..
తాత్కాలిక ఆందోళనలు సద్దుమణిగేలా చేయటం తప్ప సర్కారు పద్ధతిలో మరేమీ కనిపించలేదు. సమస్య పరిష్కారానికి, అలాంటివి జరక్కుండా చేయటానికి ఏ చర్యలు తీసుకోకపోగా, ప్రజలను శాంతింపజేయటానికి సవరణ చేసింది. దానిపై ఎలాంటి చర్చను చేపట్టలేదు. వాస్తవానికి నేరాల ఆధారంగా విచక్షణతో తీసుకోవలసిన నిర్ణయాన్ని ఒక్క చట్టసవరణతో అందరుబాల నేరస్తులను పెద్దవాళ్ల సరసన నిలబెట్టారు. దీనిపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి..

20:40 - December 22, 2015

తెలంగాణకు కేంద్రం ఇళ్లు మంజూరు..నల్గొండ ఎమ్మెల్సీ పదవికి కోట్ల ఖర్చు..సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సైకో..పార్లమెంట్ సమావేశాల తీరు...ఆదిలాబాద్ లో తాగునీటికి గిరిజనుల దీనావస్థ..ఆన్ లైన్ లో కోళ్ల అమ్మకాలు..ఏటీఎం లూటికి దొంగ ప్రయత్నం..మిస్ యూనివర్స్ విజేత ఎంపికలో పొరపాటు..రైల్వే ఫ్లాట్ ఫాంపై ఐదేళ్ల బాలుడిని రక్షించిన ప్రయాణీకులు..వీటిపై టెన్ టివి 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో 'మల్లన్న' తనదైన శైలిలో విశ్లేషించారు. విశేషాల కోసం వీడియో చూడండి. 

శ్రీ మేథ విద్యా సంస్థల ఎదుట ఆందోళన..

హైదరాబాద్ : శ్రీ మేథా విద్యా సంస్థ నగరంలోని నాలుగు కోచింగ్ సెంటర్లను మూసివేసింది. దీనితో అమీర్ పేట కోచింగ్ సెంటర్ వద్ద విద్యార్థులు..వారి తల్లిందండ్రులు ఆందోళనకు దిగారు. 

మోడీ రాజీనామా చేయాలన్న కేజ్రీవాల్..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్రికెట్ సంఘం ఛైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన అవకతవకల గురించి కేజ్రీవాల్ ప్రత్యేక అసెంబ్లీ సెషన్ లో వివరించారు. 2014 లోక్ సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మోడీ నెరవేర్చుకోవడం లేదని, జైట్లీని డీడీసీఏ అవినీతి ఆరోపణల నుండి రక్షించడానికి సీబీఐ దాడులు చేయించి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు.

 

రూ.25,912 కోట్లు కావాలన్న జయలలిత..

హైదరాబాద్ : వరదల వల్ల నష్టపోయిన తమిళనాడును ఆదుకొనేందుకు రూ.25,912 కోట్ల రూపాయల సాయం కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కేంద్రాన్ని కోరారు.

19:59 - December 22, 2015

హైదరాబాద్ : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొత్తానికి ముగిశాయి. చలికాలంలో రాజకీయ వేడిని రగిలించాయి. ఐదు రోజుల పాటు సాగిన సమావేశాల్లో పాలక ప్రతిపక్షాలు దేనికదేగా పైచేయి సాధించేందుకు ప్రయత్నించాయి. సహజంగానే ప్రభుత్వానిదే పైచేయి అయింది. విపక్షం ఒకే అంశంపై సర్కారును నిలదీసేందుకు ప్రయత్నించి.. కొన్నిసార్లు సెల్ఫ్‌ డిఫెన్స్‌లో పడి.. చివరికి సభ ఇంకా రెండు రోజులు ఉందనగానే నమస్కారం పెట్టేసింది. స్థూలంగా చూస్తే.. ఈ సమావేశాల్లో రోజా సస్పెన్షన్‌ అంశమే కీలకమని చెప్పక తప్పదు.

తొలి రోజు..
శాసనసభ శీతాకాల సమావేశాలు రాజకీయ వాతావరణాన్ని బాగా వేడెక్కించాయి. సమావేశాలకు ముందు వెలుగులోకి వచ్చిన కాల్‌మనీ అంశం.. సమావేశాల తొలిరోజే సభను అట్టుడికించింది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఏకిపారేద్దామని విపక్షం గట్టి కసరత్తునే చేసుకొచ్చింది. ప్రభుత్వం పలాయనం చిత్తగిస్తుందని.. ఇక తమదే పైచేయి అన్నట్లుగా సన్నద్ధమైంది. బీఏసీ నిర్ణయాలను బేఖాతరు చేస్తూ.. కాల్‌మనీ అంశంపైనే చర్చ జరపాలంటూ విపక్షం పట్టుబట్టింది. రుణాలు-మానవ హక్కుల ఉల్లంఘన అన్న అంశంపై విపక్షం స్పీకర్‌కు వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. అయితే.. స్పీకర్‌ దాన్ని తోసిపుచ్చారు. తొలిరోజు తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతోటే.. విపక్ష సభ్యులు రెచ్చిపోయారు. కాల్‌మనీపై చర్చ జరిపి తీరాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలను పదేపదే అడ్డుకున్నారు. స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి తమ వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. జగన్‌ తప్ప మరెవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వరాదు అన్న స్థాయిలో అవాంతరాలు కలిగించారు. అంబేద్కర్‌పై చర్చ తరువాత ప్రభుత్వం కాల్‌మనీపై ప్రకటన చేస్తుందని.. రాజ్యాంగ నిర్మాతపై చర్చకు సహకరించాలంటూ స్పీకర్‌, ప్రభుత్వం పదే పదే అప్పీల్‌ చేశారు. అయినా విపక్షం ససేమిరా అంది. అంబేద్రర్‌ ముసుగులో.. కాల్‌మనీ వ్యవహారాన్ని మరుగున పరచాలని చూస్తున్నారంటూ విరుచుకు పడింది. కాల్‌మనీ నిందితులతో చంద్రబాబు దిగిన ఫోటోలను ప్రదర్శిస్తూ.. సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఇద్దరు సభ్యులైతే.. అసెంబ్లీ సమావేశాలను ప్రసారం చేస్తున్న టీవీ కెమెరాలకు అడ్డంగా నిలుచున్నారు. మైకునూ విరగ్గొట్టారు. దీంతో.. శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రతిపాదన మేరకు.. తొలిరోజే వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. కాల్‌మనీ వ్యవహారంపై చర్చించి తీరాల్సిందేనంటూ.. విపక్షం పట్టుబట్టింది. పదేపదే సభను వాయిదా వేసిన స్పీకర్‌.. అంబేద్కర్‌పై చర్చకు సహకరించాలంటూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా విపక్షం వినిపించుకోలేదు. దీంతో.. సమావేశాలు ప్రారంభమైన రెండున్నర గంటల్లోపే.. అసెంబ్లీ భేటీని మరుసటి రోజుకు వాయిదా వేశారు.

రెండో రోజు..
అసెంబ్లీలో మళ్లీ తొలి రోజు సీనే రిపీట్‌ అయింది. కాల్‌మనీపై సభ దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కాల్‌మనీపై చర్చించాల్సిందేనంటూ వైసీపీ.. రెండోరోజూ వాయిదా తీర్మానాన్నిచ్చింది. అంబేద్కర్‌పై చర్చ తరువాతే కాల్‌మనీపై చర్చిద్దామని ప్రభుత్వం సూచించింది. అయితే.. తొలిరోజు తరహాలోనే.. వైసీపీ సభ్యులు సభను స్తంభింప చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. చంద్రబాబు కాల్‌మనీ నిందితులతో ఉన్న ఫోటోలను ప్రదర్శిస్తూ ఉండిపోయారు. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల మండిపడ్డారు. కావాలనే సభా సమయాన్ని వృథా చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కాల్‌మనీ వ్యవహారంలో.. ముఖ్యమంత్రి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పాత్ర ఉందని జగన్‌ ఆరోపించారు. దీనిపై లోతైన చర్చ జరగాలన్నారు. ఆ తరువాత మాత్రమే సీఎం స్టేట్‌ మెంట్‌ ఇవ్వాలన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా తూతూ మంత్రంగా చర్చను ముగించే ప్రయత్నం చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. అంబేద్కర్‌పై చర్చ తరువాత కాల్‌మనీపై చర్చ ఉంటుందని స్పీకర్‌ స్పష్టం చేశారు. దీనిపై వెంటనే చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం ఏర్పడడంతో స్పీకర్‌ పది నిమిషాలు పాటు వాయిదా వేశారు. అసెంబ్లీ తిరిగి సమావేశమైనా.. మళ్లీ అదే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ సభ్యులు కాల్‌మనీపై పట్టుపడితే...అంబేద్కర్‌ జయంతి తరువాతే చర్చ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే అంబేద్కర్‌పై చర్చ సాగింది. వైసీపీ సభ్యులు నినాదాలను కొనసాగిస్తూనే ఉండడంతో ఆ పార్టీ సభ్యులందరినీ సస్పెండ్‌ చేయాలని యనమల ప్రతిపాదించారు. శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రతిపాదన మేరకు జగన్‌తో పాటు... వైసీపీ ఎమ్మెల్యేలందరినీ స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. స్పీకర్‌ మీదకు కాగితాలు చింపి విసిరేశారు. బయటకు వెళ్లకుండా స్పీకర్‌ పోడియం దగ్గర నినాదాలు చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్‌తో బలవంతంగా సభనుంచి బయటకు పంపించారు. వైసీపీ సభ్యుల సస్పెన్షన్‌ అనంతరం అంబేద్కర్‌పై చర్చ కొనసాగింది. అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తి దాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన నిర్మాణాత్మక పాత్ర పోషించారని సీఎం కొనియాడారు. అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా..ఆయన గురించి శాసనసభలో చర్చించడం పవిత్రమైన కార్యమని చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం అన్నారు. నూతన రాజధాని అమరావతిలో అంబేద్కర్‌ స్మారక నిర్మాణంతో పాటు మ్యూజియంను ఏర్పాటుచేస్తామని చెప్పారు. దీని కోసం నిర్మాణానికి 10 నుంచి 15 ఎకరాలు కేటాయిస్తామని తెలిపారు. అంబేద్కర్‌పై చర్చ అనంతరం.. కాల్‌మనీ వ్యవహారం మళ్లీ శాసనసభను అట్టుడికించింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తుండగానే ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాల్‌మనీ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కాల్‌మనీ వ్యవహారంలో ప్రతిపక్ష వైసీపీ సభ్యుల గుట్టు రట్టు అవుతున్నందునే ఆ పార్టీ సభ్యులు సభ జరగకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్‌మనీ వ్యవహారంలో నిందితులెవరైనా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు సభలో ప్రకటించారు. అధిక వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు. సభా నాయకుడు మాట్లాడుతుండగా ప్రతిపక్షం అడ్డుపడటం సభా మర్యాద కాదని స్పీకర్‌ కోడెల ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. సభా నాయకుడిపై దాడి చేసేందుకు వెళ్తారా అని సభ్యులను ప్రశ్నించారు. కాల్‌మనీ వ్యవహారంపై చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందని వైకాపా సభ్యులు ఆందోళన చెందుతున్నారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలను ఎన్నుకున్నందుకు ఆయా నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడుతున్నారనీ విమర్శించారు. సభలో గందరగోళం సృష్టించి చర్చను పక్కదోవ పట్టించేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాల్‌మనీ వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతెంత మంది వ్యాపారుల ప్రమేయం ఉందో తెలియజేసే జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు చదివి వినిపించారు. కాల్‌మనీ వ్యవహారంలో వైసిపి సభ్యుల గుట్టు రట్టు అవుతున్నందునే ఆ పార్టీ సభ్యులు సభ జరగకుండా అడ్డుపడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కాల్‌మనీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రధాన నిందితుడని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. తమకు అనుకూలంగా రూపొందించుకున్న నివేదికను ముఖ్యమంత్రి చదివితే తాము చూస్తూ వూరుకోవాలా? అంటూ నిలదీశారు. కాల్‌మనీపై చర్చ సందర్బంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగడంతో స్పీకర్ సభను దఫదఫాలుగా వాయిదా వేశారు.

మూడో రోజు...
కాల్‌మనీ వ్యవహారంపై సర్కారును ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన విపక్షం.. పాలక పక్షం వేసిన బౌన్సర్‌తో అవాక్కయింది. వైసీపీ ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొందిన నగరి ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్‌ విధించడంతో... దాన్ని రద్దు చేయించేందుకు సభను నిలదీసింది. సాక్షాత్తూ జగన్మోహన్‌రెడ్డే.. రోజాపై సస్పెన్షన్‌ ఎత్తివేయకుంటే.. సభను సాగనిచ్చేది లేదంటూ స్పీకర్‌కు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో.. పాలకపక్షంతో పాటు... స్పీకర్‌పైనా కొందరు వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాల్‌మనీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ.. పాలక పక్షం వేసిన అస్త్రంతో రెండో రోజే అవాక్కయింది. పార్టీ ఫైర్‌ బ్రాండ్‌గా పేరు పొందిన నగరి ఎమ్మెల్యే రోజా. ఏకంగా సీఎం చంద్రబాబు పట్ల అసభ్యకర పదజాలం ఉపయోగించారని.. మంత్రులు, ఇతర సభ్యులపైనా అదే తరహాలో విరుచుకు పడ్డారని పాలక పక్షం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. కాల్‌మనీపై చర్చిద్దామని పాలక పక్షం పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.. స్పీకర్‌ చర్చకు కావలసినంత సమయం ఇస్తామని చెప్పినా.. విపక్షం వినలేదు. సభను స్తంభింప చేస్తూనే వచ్చింది. ఈ దశలో.. పాలక సభ్యులు.. వైసీపీ సభ్యులపై ముఖ్యంగా రోజాపై వేటు వేయాలని ప్రతిపాదించారు. ఎమ్మెల్యే అనిత, చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులతో పాటు మాజీ విప్‌ ధూళిపాల నరేంద్ర కూడా ఇదే డిమాండ్‌ చేశారు. దీంతో... సీఎంపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేయాలంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించగా.. మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్‌ కోడెల ప్రకటించారు. రోజాను సస్పెండ్‌ చేసిన తర్వాత సభలో వైసీపీ వ్యవహార విధానంలో కొంత మార్పు కనిపించింది. రోజా సస్పెన్షన్‌ అంశాన్ని నిరసిస్తూనే..కాల్‌మనీ వ్యవహారంపై చర్చను కొనసాగించింది. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని.. ముఖ్యంగా సీఎం చంద్రబాబే.. నిందితులతో ఫోటోలు దిగారంటూ జగన్‌ విరుచుకు పడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ అంశంపై శనివారం శాసనసభ దద్ధరిల్లింది. ఉదయం సభ ప్రారంభం కాగానే.. విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి, రోజా సస్పెన్షన్‌ అంశాన్ని లేవనెత్తారు. అసెంబ్లీ నిబంధనల పుస్తకంలోని రూల్‌ 340ని ప్రస్తావించారు. తమ సభ్యురాలిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయకుంటే సభను నడవనీయబోమని పదే పదే స్పష్టం చేశారు. వైసీపీ పక్షం తీరును శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు. అసెంబ్లీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించజాలదని, రోజాపై సస్పెన్షన్‌ ఎత్తివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను కొనసాగించాలంటూ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు, మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు ససేమిరా అన్నారు. పాలక పక్ష నేతల ప్రసంగాలకు వైసీపీ సభ్యులు పదేపదే అడ్డు తగిలారు. దీంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. అనంతరం సమావేశం కాగానే.. వైసీపీ సభ్యులు మళ్లీ వెల్‌లోకి దూసుకు వచ్చి.. రోజా సస్పెన్షన్‌ ఎత్తి వేయాలంటూ నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యే ప్రభుత్వం ఆరు బిల్లులను ప్రవేశ పెట్టింది. బిల్లులను ప్రవేశపెట్టగానే.. స్పీకర్‌ పదిహేను నిమిషాల తేనీటి విరామం ప్రకటించారు. అనంతరం సభ సమావేశం కాగానే.. విపక్షం మళ్లీ రోజా సస్పెన్షన్‌ ఎత్తివేయాలని పట్టుబట్టింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో.. స్పీకర్‌ కోడెల సభను సోమవారానికి వాయిదా వేశారు.

నాలుగో రోజు..
అసెంబ్లీ సమావేశాల్లో నాలుగోరోజున... జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వం.. రోజా సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న ఆయన డిమాండ్‌ను మాత్రం ఆమోదించలేదు. రోజాపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తేనే తాము సభలో ఉండి చర్చలో పాల్గొంటామని లేకపోతే సభనుంచి వెళ్లిపోతామని ప్రతిపక్ష అధినేత వైఎస్‌ జగన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై టీడీపీ మిత్ర పక్షం బీజేపీ ఎమ్మెల్యే.. సస్పెన్షన్‌ కాలాన్ని తగ్గించే విషయమై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం తమ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటించింది. రోజాపై ఏడాది సస్పెన్షన్‌కు సంబంధించి ఎలాంటి పునరాలోచనా లేదని స్పష్టం చేశారు. తప్పుచేసిన వాళ్లు శిక్ష అనుభవించి తీరాల్సిందేనని కరాఖండిగా చెప్పారు. సభ్యురాలిని సస్పెండ్‌ చేసే అధికారం సభకు లేదని జగన్‌ వ్యాఖ్యానించడాన్ని స్పీకర్‌ తప్పుబట్టారు. సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కోరడానికి ఓ విధానం ఉంటుందని... నిబంధనలకు విరుద్ధమంటూ పదేపదే ఎలా ప్రస్తావిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో... వైసీపీ పక్షం.. శీతాకాల సమావేశాల్లో మిగిలిన రెండు రోజులూ అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేస్తున్నామని ప్రకటించి బయటికి వెళ్లిపోయింది. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేకుండానే.. పాలక పక్షం కీలక బిల్లులను ఆమోదింప చేసుకుంది. వైసీపీ సభ్యుల వాకౌట్‌ అనంతరం.. సీఎం చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై ప్రకటన చేశారు. పదేళ్లలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని... డబ్బులు ఖర్చుపెట్టి ఏ ప్రాజెక్టుకూ నీళ్లు ఇవ్వలేదని చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానం గురించీ ఆయన ప్రస్తావించారు.

చివరి రోజు...
ఏపీ శాసనసభ సమావేశాలు మంగళవారం నిబంధనల ప్రకారం సాగింది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. మంత్రి పీతల సుజాత బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించి ప్రకటన చేశారు. అల్యూమినా పరిశ్రమ స్థాపనపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రస్‌ అల్‌ఖైమాల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. బాక్సైట్‌ మైనింగ్‌కు సంబంధించిన అంశాల పరిశీలనకు రెండు విడతలుగా కమిటీ పర్యటించిందని.. సామాజిక నిర్వహణ, పునరావాస కమిటీని కలెక్టర్‌ అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిందనీ తెలిపారు. బాక్సైట్‌ తవ్వకాలపై విపక్ష వైసీపీ తీరును తెలుగుదేశం ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. గతంలో ఈ తవ్వకాల వల్ల 20వేల మంది గిరిజనులకు ఉద్యోగాలు వస్తాయని అసెంబ్లీలోనే వైఎస్‌ ప్రకటించారని.. అలాంటిది.. బాక్సైట్‌ తవ్వకాలను వైసీపీ వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నించారు. తమ బండారం బయట పడుతుందన్న కారణంతోనే.. జగన్‌ సమావేశాలను బహిష్కరించారని ఆరోపించారు. వైసీపీకి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా ప్రవర్తనపై ఇవాళ కూడా సభలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా.. టీడీపీ ఎమ్మెల్యే అనిత.. రోజా తనపై చేసిన వ్యాఖ్యలను తలచుకొని.. కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. రోజా మాట్లాడిన తీరుపై ఎలా స్పందించాలో తెలియక రెండ్రోజులు ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. మంత్రి పీతల సుజాత కూడా రోజా తీరును ఆక్షేపించారు. కుటుంబ విషయాలను సభలో ప్రస్తావించడం సబబు కాదన్నారు. రోజా తన పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించారని సభ దృష్టికి తెచ్చారు. రోజా మాట్లాడే భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని.. ఆమెను పూర్తికాలం సస్పెండ్‌ చేయాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. మొత్తానికి కాల్‌మనీ వ్యవహారంపై హాట్‌హాట్‌గా మొదలైన అసెంబ్లీ సమావేశాలు.. చివరికి వచ్చేసరికి పూర్తిగా చల్లబడి అత్యంత ప్రశాంతంగా ముగిశాయి. 

19:42 - December 22, 2015

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయుత చండీయాగానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే ఎర్రవెల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బుధవారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి రెండు రోజులు ముందుగానే కేసీఆర్‌ దంపతులు చేరుకున్నారు. ఇప్పటికే ఆరంభ పూజలు కూడా నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు రానున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాన్యులకు సైతం ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

మహాగణపతి పూజతో ప్రారంభం..
బుధవారం ఉదయం మహాగణపతి పూజతో అయుత చండీయాగం ప్రారంభం కానుంది. 27న జరిగే కలశ విసర్జన మహాదాశీర్వచన, ప్రసాద వితరణతో ఈ కార్యక్రమం ముగియనుంది. ఈ ఐదు రోజుల పాటు అయిత చండీ పురశ్చరణ మహా యాద వైదిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇక తొలి రోజు గురు ప్రార్ధన, గణపతి పూజ, గోపూజ, మహా మంటప స్థాపనలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. రెండోరోజు మహాధన్వంతరి యాగం, చతుర్వేద మహారుద్ర పురశ్చరణాలు కొనసాగుతాయి. మూడోరోజు నవ గ్రహ హోమం, మహారుద్ర పురశ్చరణాలు, మహామంగళ హారతి వంటి విశేష పూజా కార్యక్రమాలుంటాయి. నాలుగోరోజు సప్త ద్రవ్య మృత్యుంజయ హోమం జరగనుంది. ఇక చివరిరోజు గురు ప్రార్ధన, పుణ్యావహ వచనం, కుండ సంస్కారం, ప్రధాన కుండంలో అగ్నిప్రతిష్ట, అగ్ని విహరణం, సపరివార అయుత చండీయాగం జరగనుంది. ఇక మహా పుర్ణాహుతితో చండీయాగం ముగియనుంది.

శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో..
శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ యాగానికి ఆరేడు రాష్ట్రాల నుంచి రుత్విక్కులు, బ్రాహ్మణులు ఇప్పటికే ఫాంహౌస్ చేరుకున్నారు. 1100 మంది ఏకకంఠంతో పారాయణం చేస్తారు. యాగశాలలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగం నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల వరకు యాగం కొనసాగుతుంది. మిగతా సమయాల్లో భక్తులను భక్తి పారవశ్యంలో ఉంచేందుకు ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

పలువురు ప్రముఖుల రాక..
ఈ యాగం కోసం ప్రతిరోజు 50 వేల మంది ప్రజలు సందర్శించే అవకాశం ఉంది. సొంత వాహనాల్లో వచ్చేవారి కోసం 20 ఎకరాల్లో పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. యాగశాలలోకి ఎవరిని అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. 2200 మహిళలు కుంకుమార్చన చేసేందుకు సరిపడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందుకు అవసరమైన పూజా సామాగ్రిని ఉచితంగా అందించనున్నారు. యాగానికి పెద్ద ఎత్తున ప్రముఖులు రానున్న నేపథ్యంలో.. యాగస్థలికి సమీపంలో నాలుగు హెలీప్యాడ్‌లు సిద్ధం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చివరిరోజు పూర్ణాహుతికి హాజరుకానున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు కూడా హాజరు కానున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

19:40 - December 22, 2015

ఢిల్లీ : అమెరికాలో తెలుగు విద్యార్థులకు వీసా వివాదంపై కేంద్రమంత్రి అశోక గజపతి రాజు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి... విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ను కలిశారు. అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులను వెనక్కి పంపించిన అంశంపై చర్చించారు. వీలైనంత త్వరగా అమెరికాలో బ్లాక్ లిస్ట్‌లో ఉన్న

యూనివర్సిటీల వివరాలు తెప్పిస్తామని అశోక గజపతి రాజు హామీ ఇచ్చారు. విద్యార్థులు తొందరపడకుండా.. అనుమతులున్న యూనివర్సిటీలనే ఎన్నుకోవాలని కంభంపాటి సూచించారు. 

19:38 - December 22, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల నిష్పక్షపాతంగా వ్యవహరించనందుకు నిరసనగా ఆయనపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. ఈ విషయమై పార్టీ అధ్యక్షుడు జగన్ తమ ఎమ్మెల్యేలతో చర్చించారు. స్పీకర్ కు నోటీసులు ఇవ్వాలనే సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. రేపు ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందించనున్నారు. స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాన్ని అసలు విశ్వాసంలోకి తీసుకోలేదని జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. సెక్స్ రాకెట్ గురించి చంద్రబాబు ప్రకటన తర్వాత మాట్లాడాల్సింది రోజాయే కాబట్టి, ఆమె వాగ్ధాటిని తట్టుకోవడం సాధ్యం కాదనే.. నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారన్నారు. ఈ విషయంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని జ్యోతుల చెప్పారు. 

స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు - జ్యోతుల నెహ్రూ..

హైదరాబాద్ : స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. మంత్రి పదవి కోసమే స్పీకర్ కోడెల అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానంగా ఉందన్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు స్పీకర్ పై అవశ్వాస తీర్మానం ఇస్తామని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇస్తున్నట్లు తెలిపారు. అధికారపక్షం పిరికిపందాల వ్యవహారించిందని, రోజా సస్పెన్షన్ అసెంబ్లీ నిబందనలకు విరుద్ధంగా ఉందన్నారు. 

19:24 - December 22, 2015

ఈ సంవత్సరం ఆల్ మోస్ట్ అయిపోతోంది.. ఈ ఇయర్ ఎన్నో సినిమాలొచ్చాయి. సినిమాలంటే హీరో..పాటలు.. ఫైటింగులు.. అనే బోరింగ్ డేస్ పోయాయి. ఓన్లీ గ్లామర్ డాల్ గా ఉన్న హీరోయిన్ ఇప్పుడు మెయిన్ రోల్ ప్లే చేస్తోంది. సినిమాల్లో తనకంటూ ఓ డిఫరెంట్ పాత్ క్రియేట్ చేసుకుంటోంది. అలా టాలీవుడ్ .. బాలీవుడ్ లో అలా తమ హవా నడిపించిన లేడీ ఓరియంటెడ్ అండ్ విమెన్ సెంట్రిక్ మూవీస్ పై కథనం. టాలీవుడ్ సినిమా మేకింగ్ లో చాలా వరకూ ఛేంజెస్ వస్తున్నాయి. సినిమా పుట్టినప్పుడు హీరో .. హీరోయిన్ ఇద్దరికీ ఈ క్వల్ ఇంపార్టెన్స్ ఉండేది. బట్..ఆ మధ్య కాలంలో సినిమా అంటే హీరోనే. హీరోయిన్ కి పెద్దగా యాక్టింగ్ కి స్కోప్ ఇవ్వలేదు. మళ్లీ .. ఇన్నాళ్లకి హీరోయిన్ కే ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలు వస్తున్నాయి. అలా ఈ సంవత్సరం చిన్న సినిమాల దగ్గరనుంచి పెద్ద సినిమాలవరకూ చాలా సినిమాలు వచ్చాయి. వాటిని ఆడియన్స్ కూడా అదే రేంజ్ లో ఆదరించారు.

రుద్రమదేవి అనుష్క..
విమెన్ సెంట్రిక్ మూవీస్ లో ఈ సంవత్సరం రుద్రమదేవి సినిమాని వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. కాకతీయ వీరనారి రుద్రమదేవి కథ ఆధారంగా తీసిన ఈ సినిమా విమెన్ సెంట్రిక్ మూవీగా మంచి మార్కులు కొట్టేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రుద్రమదేవి, రుద్రదేవుడిగా రెండు క్యారెక్టర్స్ లో అనుష్క ఆడియన్స్ ని అలరించింది. ఈ సినిమాలో అసమాన ధైర్య సాహసాలతో పాటు.. అంతే సున్నితమైన అభినయంతో అందరినీ ఎట్రాక్ట్ చేసింది స్వీటీ. అనుష్క చేసిన మరో విమెన్ ఓరియంటెడ్ మెసేజ్ మూవీ జీరోసైజ్. ఈ సినిమా కోసం తన బరువును విపరీతంగా పెంచుకుంది అనుష్క. ఓవర్ వెయిట్ తో ఇబ్బంది పడే క్యారెక్టర్ లో అనుష్క యాజ్ యూజువల్ గా సూపర్ అనిపించింది. ప్రకాష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా.. అనుష్క ను హైలెట్ చెయ్యడంతో పాటు మంచి సోషల్ మెసేజ్ ను కూడా ఇచ్చారు. ఈ సినిమాలో ఎంతమంది ఉన్నా అందరి ఎటెన్షన్ గ్రాబ్ చేసింది మాత్రం అనుష్కనే.
నిన్న కాక మొన్నిచ్చిన స్వాతి కూడా ఇలాంటి సినిమాలు చేసేస్తోంది. 'స్వామి రారా'.. 'కార్తికేయ' సినిమాల తర్వాత ఈ హీరోయిన్ 'త్రిపుర' అనే హార్రర్ సినిమా చేసింది. నవీన్, స్వాతి నటించిన ఈ సినిమా కామెడీ ధ్రిల్లర్ గా మంచి మార్కులే కొట్టేసింది. స్వాతి ఓన్లీ అల్లరి పిల్లగానే కాదు.. సెటిల్డ్ గా యాక్ట్ చేయడంతో సూపర్ అనిపించుకుంది.

జ్యోతి లక్ష్మిగా ఛార్మీ..
టాప్ స్టార్స్ తో పాటు మరికొంతమంది హీరోయిన్లు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తున్నారు. అంటే హీరోయిన్లుగా చెల్లనివాళ్లు.. హీరోయిన్లుగా ఫేడ్ అవుట్ అయిన వాళ్లు కూడా ఇప్పుడు ఈ విమెన్ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఉన్న మరో విమెన్ సెంట్రిక్ మూవీ 'జ్యోతిలక్ష్మి'. పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో 'ఛార్మి' హీరోయిన్ గా చేసిన ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో తీసి మంచి హిట్ తెచ్చుకున్న సినిమా. 'ఛార్మి' 'జ్యోతిలక్ష్మి' క్యారెక్టర్ లో తన సత్తా చాటింది. ప్రేమ కోసం ఎంతకైనా తెగించి ధైర్యంగా పోరాడే క్యారెక్టర్ లో 'ఛార్మి' వావ్ అనిపించింది. ఈ సినిమా చిన్న సినిమాలకు మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పుకోవాలి.

మంచు లక్ష్మి..నయన్..సుకుమార్..
ఈ స్టైల్ లోనే 'మంచు లక్ష్మి' చేసిన మరో సినిమా 'దొంగాట'. కామెడీఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మి కి జోడీగా 'అడ విశేష్' నటించాడు. ఈ సినిమాకి లక్ష్మి.. మగవాళ్లకు సెటైర్ వేస్తూ యాందిరో అంటూ పాట కూడా పాడింది. అంతేకాదు.. దాదాపు 15 మంది హీరో.. హీరోయిన్లతోకలిసి చేసిన పార్టీ సాంగ్ కూడా ఈ సినిమాకు హైలెట్. ఇక నాట్ బట్ నాట్ లీస్ట్ మరో మూవీ 'నయనతార' నటించిన 'మయూరి'. అడపాదడపా అరవ సినిమాలు తెలుగులోకి డబ్ అవుతున్నా.. తెలుగులో ఓ వెలుగు వెలుగింది ఈ హీరోయిన్. 'నయన్' కూడా హార్రర్ మూవీతో నే ఆడియన్స్ ని భయపెట్టింది. ఈ సినిమా అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి టాక్ సంపాదించుకుంది.  ఇక సుకుమార్ లేటెస్ట్ సెన్సేషన్ 'కుమారి 21 ఎఫ్'. ఈ జనరేషన్ లో అమ్మాయి మైండ్ సెట్ .. బిహేవియర్..వాళ్ల ఫెర్మామెన్స్ ఎలా ఉన్నాయో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు ఈ సినిమాలో. ఇది విమెన్ సెంట్రిక్ మూవీ కాకపోయినా.. హీరో తో పాటు.. హీరోయిన్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమా మొత్తం క్యారీ చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు. 

బాలీవుడ్..ఎన్ హెచ్ 10...
టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు పెద్దగా రాకపోయినా.. బాలీవుడ్ మాత్రం ఈ విషయంలో చాలా అడ్వాన్స్ గానే ఉంది. టాలీవుడ్ లో ఆ సినిమాలు ఎక్కడా అని వెతుక్కోవల్సి ఉంటే.. నార్త్ లో మాత్రం సూపర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిపై ఓ లుక్.. బాలీవుడ్ లో ఈ ఇయర్ లో వచ్చిన విమెన్ సెంట్రిక్ మూవీస్ లో ఫస్ట్ అండ్ ది బెస్ట్ ప్లేస్ 'ఎన్ హెచ్ 10'దే. ఈ సినిమాలో 'అనుష్క శర్మ' లీడ్ రోల్ ప్లేచేసింది. పరువు హత్యల బ్యాక్ డ్రాప్ గొడవలలో తన భర్తను పోగొట్టుకున్న ఈ జనరేషన్ అమ్మాయిగా.. రివేంజ్ తీర్చుకునే 'అనుష్క' నటనకు నూటికి నూరు మార్కులు పడ్డాయి. ఓ సెన్సిబుల్ ఇష్యూని తీసుకుని త్రూ ఔట్ సినిమా మొత్తం ఆడియన్స్ ని అద్భుతంగా డ్రైవ్ చేయించారు మేకర్స్. ఈ సంవత్సరం సినిమాల్లో వన్ఆఫ్ ది హిట్ మూవీగా ప్లేస్ కొట్టేసింది 'ఎన్ హెచ్ 10'.

మసాన్..
కమర్షియల్ సినిమాల హవాలో కొట్టుకుపోకుండా .. ఇంటర్నేషనల్ వైడ్ ఇండియన్ సినిమాకు అవార్డులు సంపాదించిన మూవీగా 'మసాన్' మూవీ రికార్డ్ కొట్టింది. రీచా లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా డిఫరెంట్ మూవీగా పేరు తెచ్చుకుంది. మిడిల్ క్లాస్ అమ్మాయి .. కాంటెంపరరీ ఎమోషన్స్ ను క్యారీ చేస్తూ లైఫ్ ని లీడ్ చేసే కధే ఈ సినిమా. రెండు డిఫరెంట్ స్టోరీలున్నా.. ఈ సినిమాలో 'రీచా' కే ఎక్కువ ఎటెన్షన్ పే చేశారు ఆడియన్స్

కంగనా రనౌత్..

విమెన్ సెంట్రిక్ మూవీస్ ట్రెండ్ స్టార్ట్ చేసిన లైమ్ లైట్ హీరోయిన్ 'కంగనా రనౌత్'. లాస్ట్ ఇయర్ 'తను వెడ్స్ మను' చేసిన ఈ హాట్ బ్యూటీ .. ఈ సంవత్సరం 'తను వెడ్స్ మను రిటర్న్స్' సినిమాతో మళ్లీ ఆడియన్స్ మనసు దోచింది. ఇండివిడ్యువల్ ..సింపుల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ లో 'కంగనా' యాక్టింగ్ సూపర్బ్. డ్యూయల్ రోల్ లో తన క్యారెక్టర్ ను న్యాయం చేసింది 'కంగనా'. 'తను వెడ్స్ మను' లానే రిటర్న్స్ కూడా మంచి హిట్ అయ్యింది

దీపికా పడుకొనే..

టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లు విమెన్ సెంట్రిక్ మూవీస్ చేస్తుంటే.. బాలీవుడ్ లో మాత్రం ఫామ్ లో ఉన్న హీరోయిన్లే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అందర్నీ సర్ ప్రైజ్ చేస్తున్నారు. క్యారెక్టర్ కోసం కత్తులు నూరుతున్నారు. పర్ ఫెక్షన్ కోసం లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు'దీపికా పడుకొనే'. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ అందరి సరసన యాక్ట్ చేస్తూ బిజీ గా ఉన్న స్టార్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే కాకుండా .. డిఫరెంట్ స్టోరీస్ కూడా చేస్తోందీ బ్యూటీ. ట్రెడిషనల్ వాల్యూస్ ఓన్ చేసుకున్న మోడరన్ అమ్మాయిగా 'దీపికా' యాక్టింగ్ సూపర్బ్. తండ్రి పట్ల బాధ్యత గల కూతురుగా 'దీపికా' క్యారెక్టర్ అమేజింగ్. ఈ సినిమాలో 'దీపికా' బెంగాలీని కూడా నేర్చుకుంది. ఈ సినిమాలో 'అమితాబ్', 'ఇర్ఫాన్ ఖాన్' లాంటి సీనియర్స్ ఉన్నా కూడా అందరి అటెన్షన్ మాత్రం 'దీపికా పైనే'.

ఐశ్వర్య రాయ్ సెకండ్ ఇన్నింగ్స్...

ఇక అందాలతార 'ఐశ్వర్యారాయ్' సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సినిమా 'జస్బా'. 'ఐశ్వర్య' కమ్ బ్యాక్ మూవీగా ఈ సినిమా యాప్ట్ అయ్యింది. కిడ్నాప్ అయిన కూతుర్ని రక్షించుకోవడానికి, ఆ నేరస్తులకు శిక్షించడానికి పరితపించే లాయర్ గా అగ్రెసివ్ రోల్ లో 'ఐశ్వర్య' నట విశ్వరూపం చూపించింది. అన్ని ఎమోషన్స్ క్యారీ చేస్తూ సినిమా మొత్తం సూపర్ అనిపించిందివిమెన్ సెంట్రిక్ మూవీస్ లో తన కంటూ డిఫరెంట్ మార్క్ క్రియేట్ చేసుకున్న 'మధుర్ భండార్కర్' చేసిన మరో మూవీ 'క్యాలెండర్ గర్ల్స్'. రియలిస్టిక్ స్టోరీస్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడం 'మధుర్' కి బాగా తెలుసు. ఈ రంగుల ప్రపంచంలో రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ.. మోసపోతున్న అమ్మాయిలపై చేసిన ఈ సినిమా కూడా విమెన్ సెంట్రిక్ మూవీగా ప్రశంసలు అందుకుంది. ఇక హిట్ .. ఫ్లాప్ లతో సంబందం లేకుండా తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేసుకుంటూ వస్తున్న స్టైల్ ఐకాన్.. 'సోనమ్ కపూర్'. ఈ హీరోయిన్ ఈ సంవత్సరం 'డాలీ కీ డోలీ' అనే మూవీ చేసింది. కామెడీ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ కాకపోయినా.. డిఫరెంట్ మూవీగా పేరు తెచ్చుకుందిపెళ్లిళ్లు చేసుకుని .. డబ్బు.. నగలు తీసుకుని పారిపోయే బబ్లీ దొంగ క్యారెక్టర్ లో 'సోనమ్' సూపర్.

విద్యాబాలన్..
'
విద్యాబాలన్'.. సెటిల్డ్ యాక్టింగ్ తో క్యారెక్టర్ కు తగినట్టు తనను తాను మౌల్డ్ చేసుకునే హీరోయిన్. ఈ బ్యూటీ కూడా 'హమారీ అధూరీ కహానీ' అంటూ ఓ విమెన్ సెంట్రిక్ మూవీ చేసింది. భర్త పెట్టే టార్చర్ భరించలేక .. ఇబ్బంది పడుతూ.. తనకు నచ్చిన వ్యక్తికి దగ్గరవ్వ లేక స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్ లో 'విద్యా' యాక్టింగ్ సూపర్ఎప్పుడూ హీరోతో పాటలు పాడి.. రెండు సీన్లు చేసే వెళ్లిపోయి..మళ్లీ ది ఎండ్ టైమ్ వచ్చే కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్స్ కి సెండాఫ్ చెప్పి.. తమకూ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ కి వెల్ కమ్ చెప్తున్నారు మన హీరోయిన్లు. నెక్ట్స్ ఇయర్ మరిన్ని మంచి సినిమాలతో మన ముందుకు రావాలని కోరుకుందాం.

19:17 - December 22, 2015

ఢిల్లీ : బాలల న్యాయ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిర్భయ ఘటన జరిగిన మూడేళ్ల అనంతరం జువైనల్ చట్టాన్ని సవరించింది. బాలల న్యాయ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. డిప్యూటి ఛైర్మన్ క్లాజుల వారీగా ఓటింగ్ ను నిర్వహించారు. ఓటింగ్ సమయంలో రాజ్యసభలోనే నిర్భయ తల్లిదండ్రులున్నారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపనందుకు నిరసనగా సభ నుండి సీపీఎం వాకౌట్ చేసింది. చట్టంలో సవరణలను ఎన్ సీపీ, సీపీఎం వ్యతిరేకించింది. చట్టం మరింత ప్రయోజనకరంగా ఉండాలని సీపీఎం పేర్కొంది. తీవ్రమైన నేరాల విషయంగా 16 నుండి 18 వయస్కులను వయోజనలుగా పరిగణించి విచారణ చేపట్టాన్న బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్ సభ గతంలోనే ఆమోదించగా రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కాంగ్రెస్ స్పీకర్ పోడియంలోకి వెళ్లి ఆందోళన చేశారు. 

బాలల న్యాయ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

ఢిల్లీ : బాలల న్యాయ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బాలల న్యాయ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. ఓటింగ్ సమయంలో రాజ్యసభలోనే నిర్భయ తల్లిదండ్రులున్నారు. 

18:38 - December 22, 2015

విజయవాడ : బందరు పోర్టుకు బలవంతపు భూ సేకరణపై న్యాయపోరాటం చేస్తామని బీజేపీ నేత వాకా వాసుదేవరావు వెల్లడించారు. ఇటీవలే ఈ సమస్యపై ఢిల్లీకి వెళ్లి అగ్రనేతలకు సమస్య తీవ్రతను తెలియచేశారు. అనంతరం ఆయన విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. టిడిపితో మిత్రపక్షంగా ఉన్నా భూ సేకరణ విషయంలో రైతుల పక్షానే బీజేపీ నిలబడుతుందని స్పష్టం చేశారు. బలవంతపు భూ సేకరణపై త్వరలో గవర్నర్ ను కలుస్తామని, బలవంతపు భూ సేకరణనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. 4500 ఎకరాల్లోనే పోర్టు నిర్మాణం చేపట్టాలని సూచించారు. 32 గ్రామాల ప్రజల ఇబ్బందులు పడుతున్న అంశం తమ దృష్టికి రాలేదని, దీనిపై తప్పకుండా న్యాయం చేస్తామని నేతలు హామీనిచ్చారని పేర్కొన్నారు. భూ సేకరణపై కూడా టిడిపికి చెందిన సర్పంచ్ లు ఇతరులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు వద్దని, ప్రజల పక్షాన ఉంటామని పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమని కొందరు పేర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. 

18:22 - December 22, 2015

హైదరాబాద్ : అంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. మంగళవారం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల వెల్లడించారు. చివరి రోజు పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. టిడిపి సభ్యురాలు అనితపై వైసిపి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపై అధికారపక్ష సభ్యులు స్పందించారు. చర్చ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే అనిత కంటతడి పెట్టారు. తరువాత బాక్సైట్ తవ్వకాలు, ఇసుక విధానంపై సభలో చర్చించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాద రావు ప్రకటించారు. మొత్తం ఐదు రోజుల పాటు సభలు జరిగాయని, 8 బిల్లులకు సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ తెలిపారు. 26 గంటల 8 నిమిషాలు జరిగిన సమావేశాల్లో 49 ప్రశ్నలపై సభలో చర్చ జరిగిందని పేర్కొన్నారు.

బాక్సైట్ తవ్వకాలపై బాబు ప్రకటన...
బాక్సైట్ తవ్వకాలపై ఏపీ ఎండీసీని డైరెక్ట్ చేస్తూ ప్రభుత్వం 30-10-2008 తేదీన జరిగిన ఒప్పందం, 222 జీవోను రద్దు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బాక్సైట్ లో వచ్చే ఆదాయంలో అధిక శాతం గిరిజనులకు ఇచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. దీనిపై అన్ని విషయాలు చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇసుక ధర నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మెరుగైన ఇసుక విధానానికి శ్రీకారం చుడుతామని, మంత్రివర్గంలో చర్చించి నూతన ఇసుక విధానం అమలు చేస్తామని తెలిపారు. 

అయిత చండీయాగానికి ఏర్పాట్లు పూర్తి...

మెదక్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రం ఎర్రవెల్లిలో నిర్వహించనున్న అయుత చండీ యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేద పండితులైన మహామహుల ఆధ్వర్యంలో యాగం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే యాగశాలకు శృంగేరి శంకర మఠంకు చెందిన రుత్విజులు, వేద పండితులు చేరుకున్నారు. ఈ యాగం రేపు ఉదయం 8.10 నిమిషాలకు ఘనంగా ప్రారంభంకానుంది. 

హాస్టళ్లన్నింటినీ ఆశ్రమ పాఠశాలలుగా మారుస్తాం -

వరంగల్ : వచ్చే ఏడాది నుంచి హాస్టళ్లన్నింటినీ ఆశ్రమ పాఠశాలలుగా మారుస్తామని మంత్రి చందూలాల్ తెలిపారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వసతి గృహాల స్థితిగతులపై మంత్రి మాట్లాడారు. వరంగల్ జిల్లా రెడ్యాలలోని గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను వచ్చే ఏడాది నుంచి కళాశాలగా మార్చనున్నట్లు ప్రకటించారు

బుధవారం రష్యాకు మోడీ..

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం రష్యా బయలుదేరి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో వార్షిక సమావేశంలో పాల్గొనున్నారు. 

బందరు పోర్టు భూ సేకరణపై న్యాయపోరాటం - బీజేపీ..

విజయవాడ : బందరు పోర్టుకు బలవంతపు భూ సేకరణపై న్యాయపోరాటం చేస్తామని బీజేపీ నేత వాకా వాసుదేవరావు వెల్లడించారు. టిడిపితో మిత్రపక్షంగా ఉన్నా భూ సేకరణ విషయంలో రైతుల పక్షానే బీజేపీ నిలబడుతుందని స్పష్టం చేశారు. బలవంతపు భూ సేకరణపై త్వరలో గవర్నర్ ను కలుస్తామని, బలవంతపు భూ సేకరణనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. 4500 ఎకరాల్లోనే పోర్టు నిర్మాణం చేపట్టాలని సూచించారు.

 

మహారాష్ట్ర ప్రభుత్వంతో మంత్రి హరీష్ చర్చలు..

ముంబై : ప్రాణహిత బ్యారేజీలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చర్చలు జరిపారు. తుమ్మడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకరించిందని హరీష్ పేర్కొన్నారు. డిసెంబర్ 29, 30వ తేదీల్లో హైదరాబాద్ లో జరిగే ప్రాణహిత ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశంలో సాంకేతిక అంశాలు చర్చించాలని నిర్ణయించారని తెలిపారు. మేడిగట్ట బ్యారేజీపై మార్పులు ఏం చేసినా బోర్డు మీటింగ్ లో నిర్ణయం తెలియచేస్తామని గిరీష్ మహాజన్ తెలిపారు. 

కొమరం భీమ్ స్మృతి చిహ్నం మ్యూజియం నిధుల విడుదల..

ఆదిలాబాద్ : బోడేఘాట్ లో కొమరం భీమ్ స్మృతి చిహ్నం మ్యూజియం నిర్మాణానికి రూ. 15 కోట్ల 70 లక్షలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. 

సైనిక సంక్షేమ బోర్డు అధ్యక్షుడిగా కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సైనిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది. 28 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటైంది. బోర్డు అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్, ఉపాధ్యక్షుడిగా సీఎస్ ఉండనున్నారు. 

సీఐఐ ప్రతినిధులతో బాబు భేటీ..

హైదరాబాద్: రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అసెంబ్లీలోని తన కార్యాలయంలో సీఐఐ ప్రతినిధులతో భేటీ అయ్యారు. వచ్చే నెల 10, 11, 12 తేదీల్లో విశాఖలో జరిగే పార్టనర్‌షిప్ సదస్సు ఏర్పాట్లపై చర్చించారు. 

టీఎస్ ఐపాస్ కింద 14 కంపెనీలకు అనుమతులు..

హైదరాబాద్ : టీఎస్ ఐపాస్ కింద 5వ విడత పారిశ్రామిక అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ సందర్భంగా 14 కంపెనీలకు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పారిశ్రామిక అనుమతి పత్రాలు అందించారు.

తరుణ్ గొగోయ్ పై 100 కోట్ల పరువు నష్టం దావా..

అసోం : రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పై ఆయన మాజీ మంత్రివర్గ సహచరుడు, ప్రస్తుత బీజేపీ నేత హిమంత విశ్వకర్మ 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఓ చిట్ ఫండ్, లూయీ బెర్జర్ కుంభకోణాల్లో సీఎం తరుణ్ గొగోయ్ తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. 

జువైనల్ జస్టిస్ బిల్లును ఆమోదించరాదన్న జెఠ్మలానీ..

హైదరాబాద్ : జువైనల్ జస్టిస్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించరాదని ప్రఖ్యాత న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి రామ్ జెఠ్మలానీ పేర్కొన్నారు.

 

ఛగన్ భుజబుల్ ఆస్తుల జప్తు..

మహారాష్ట్ర : కాంగ్రెస్ సీనియర్ నేత ఛగన్ భుజబుల్ ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఛగన్ భుజబుల్ పబ్లిక్ వర్క్స్ అండ్ స్పెషల్ అసిస్టెన్స్ శాఖ మంత్రిగా పనిచేశారు.

16:58 - December 22, 2015

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్..అధికార పార్టీ ఎమ్మెల్యే అనిత సభలో కన్నీటి పర్యంతం కావడం వంటి అంశాలు పెనుదుమారానే సృష్టిస్తున్నాయి. రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో కోరడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. కక్ష సాధింపు చర్యలకు దిగితే అంతు చూస్తానంటూ హెచ్చరించారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బాబు పాలనలో మహిళలందరూ కన్నీళ్లు పెడుతున్నారని, ఇది వారి కుటుంబానికి, వంశానికి మంచిది కాదన్నారు. అధికార బలంతో ఆడవారిని చెప్పుకింద వేసి తొక్కేయాలని అనుకుంటే వారి ఉసురు తాకుతుందని హెచ్చరించారు. అంబేద్కర్ మీత అంత ప్రేమ ఉంటే ఆయన రచించిచన రాజ్యాంగాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రుణాలు ఇవ్వకపోవడం వల్లే ప్రజలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, దీనితో ఆడ కూతుళ్లను వ్యభిచారంలోకి లాగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలను టిడిపి అవమానించేలా ప్రవర్తిస్తోందని తెలిపారు. కొత్త లోన్లు ఇవ్వకుండా..మహిళలు..రైతులు..వడ్డీ వ్యాపారస్తులు అవస్థలు పడుతూ వారు పెడుతున్న కన్నీళ్లు కనబడడం లేదా అని ప్రశ్నించారు. పదేళ్లు పార్టీలో పనిచేసినప్పుడు ఇదే భాషా..అదే హావభావాలున్నాయని, ఇప్పుడు వైసీపీలో ఉంటూ అలానే ప్రవర్తిస్తే ఎలా తప్పవుతుందని తెలిపారు.

ప్రభుత్వానికి రోజా ప్రశ్నలు..
రిషితేశ్వరీ, వనజాక్షి ఘటనలపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. హద్దులు దాటి పోయిందని కలెక్టర్ కు తెలియదా ? వనజాక్షి చేసింది తప్పు అని తేలితే ఆమెను సస్పెండ్ ఎందుకు చేయలేదని, నాన్ బెయిలబుల్ కేసు కింద చింతమనేని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. నారాయణ కళాశాలలో 14 మంది విద్యార్థినిలు చనిపోతే ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు ప్రభుత్వానికి పట్టదా ? నారాయణను డిస్మిస్ చేశారా, నేరస్తులకు శిక్ష వేశారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పదవిని లాక్కొని ఏడిపించి పంపించారని, ఎంత మానసిక క్షోభకు గురై చనిపోయారో చూస్తుంటే బాధేస్తోందన్నారు. మూడు రోజుల ముందు సస్పెండ్ చేసి, ఈ రోజు ఏడుపు కార్యక్రమం పెట్టారని ఎద్దేవా చేశారు. అంగన్ వాడీలను బట్టలూడదూసి కొడుతుంటే ఈ మహిళా ఎమ్మెల్యేలు ఏం చేశారని, పుష్కరాల్లో 25 మంది మహిళలు చనిపోవడం తదితర ఘటనపట్ల సిగ్గుతో వారంతా తలదించుకోవాలని రోజా పేర్కొన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపులకు దిగితే అంతు చూసేందుకు కూడా వెనుకాడేది లేదని రోజా స్పష్టం చేశారు. 

16:49 - December 22, 2015

హైదరాబాద్ : నగర శివారు శంషాబాద్ మండలంలో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు ఆందోళన చేశారు. అంబులెన్స్ అద్దాలను పగులగొట్టారు. పాలమాకుల గ్రామంలో వాటర్ ట్యాంకర్ నిర్మాణం చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నాం ఒక్కసారిగా వాటర్ ట్యాంకర్ కూలిపోయింది. దీనితో నరహరి, శ్రీహరి కూలీలు అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇతర కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. కొద్దిరోజుల క్రితం నిర్మించిన ఈ ట్యాంక్ లో నీరు నింపడంతో కుప్పకూలినట్లు తెలుస్తోంది. 

16:07 - December 22, 2015

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై న్యాయపోరాటం చేస్తానని టిడిపి ఎమ్మెల్యే అనిత పేర్కొన్నారు. ఎమ్మెల్యే రోజా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికారపక్ష సభ్యురాలు అనిత కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిత టెన్ టివితో మాట్లాడారు. తన మనోభావం దెబ్బతిన్నదని, అందుకే సభలో అలా వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. బాధను రెండు రోజులు దాచిపెట్టుకున్నానని, కానీ బయటపెట్టాల్సినవసరం ఉందని అందుకే అంతలా బాధ పడాల్సి వచ్చిందన్నారు. తనకు అందరూ సపోర్టు ఇచ్చారని, వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు చెప్పారు. అలా మాట్లాడకూడదని జగన్ చెప్పారా, చంద్రబాబు సమక్షంలో తాము అభ్యంతకరమైన మాటలు మాట్లాడితే వాటికి రుజువు ఉందా అని ప్రశ్నించారు. దళితుల గురించి మాట్లాడే హక్కు రోజాకు లేదని, దళితులను అడ్డుపెట్టుకుని తాను మాట్లాడడం లేదన్నారు. ముఖ్యమంత్రిపై అసభ్యకరంగా మాట్లాడినందుకు రోజాను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని, తనను దూషించినందుకు రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిత డిమాండ్ చేశారు. 

15:40 - December 22, 2015

ఢిల్లీ : జువెనల్ జస్టిస్ బిల్లుకు సంబంధించి రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. దేశంలో నిర్భయలాంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకే జ్యోతి సింగ్ తల్లి పోరాడుతోందని కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. గ్యాంగ్ రేప్, మర్డర్, ఉగ్రవాదం ఏ నేరం చేసినా బాల నేరస్తులపై విచారణ జరపాలన్నారు. అయితే బాలనేరస్తులకు ఇతర నేరస్తులతో ప్రభావితం కాకుండా ఉండేందుకు జువైనల్ హోంలో ప్రత్యేక సెల్ కేటాయించాలని సూచించారు. ఆ వయస్సులో ఉన్న వారు నేర ప్రపంచానికి త్వరగా ఆకర్షితులయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్లు బయటకు వెళితే సమాజానికి మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. రాజ్యసభకు జ్యోతి సింగ్ తల్లిదండ్రులు హాజరయ్యారు. 

అల్యూమినా ప్లాంట్ నిర్మాణంలో ఒప్పందాలు - మంత్రి సుజాత..

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో అల్యూమినా ప్లాంట్ నెలకొల్పేందుకు సర్ అల్ ఖైమా సంస్థ ముందుకొచ్చినట్లు మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. బాక్సైట్ అంశంపై శాసనసభలో నిర్వహించిన చర్చ సందర్భంగా మంత్రి ప్రకటన చేశారు. పరిశ్రమ స్థాపనపై ఏపీ, రస్ అల్ ఖైమాల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. 

జువైనల్ చట్ట సవరణపై రాజ్యసభలో చర్చ..

న్యూఢిల్లీ: జువైనల్ చట్ట సవరణపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ కొనసాగుతోంది. పలువురు సభ్యులు నిర్భయ ఘటన జరిగిన తర్వాత పరిణామాలపై చర్చిస్తున్నారు. 

మహారాష్ట్రలో మంత్రి హరీష్ రావు..

ముంబై : నాగపూర్ విధాన్ భవన్‌లో ప్రాణహిత బ్యారేజీలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గిరీష్ మహాజన్‌తో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. 

15:25 - December 22, 2015

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై చర్యలు తీసుకోవాలని మంత్రి పీతల సుజాత శాసనసభలో కోరారు. రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని ఎమ్మెల్యే అనిత కంటతడిపెట్టిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా మంత్రి పీతల మాట్లాడారు. దళితులను అవమానించే విధంగా రోజా మాట్లాడారని, గతంలోనూ రోజా ఇలాగే వ్యవహరించారన్నారు. నోటి దురుసుతనం ఏంటీ ? మహిళ అని మరిచిపోయి దారుణంగా రౌడీలా బిహేవ్ చేశారన్నారు. మహిళా జాతి సిగ్గుతో తలదించుకొంటోందని, వ్యక్తిత్వాన్ని కించపరిచే హక్కు రోజాకు ఎవరి ఇచ్చారని ప్రశ్నించారు. 

15:21 - December 22, 2015

విశాఖపట్టణం : ప్రముఖ తెలుగు సినీ, నాటక రచయిత చిలుకోటి కాశీ విశ్వనాథ్ (68) కన్నుమూశారు. సికింద్రాబాద్ నుండి విశాఖకు రైలులో వెళుతుండగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. వెంటనే విశ్వనాథ్ ను భౌతికకాయాన్ని రైల్వే అధికారులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాదాపు ఆయన 70 చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. దాసరి నారాయణరావు, విజయబాపినీడు, రేలింగి నరసింహరావు, రాజా చంద్ర వంటి పలు ప్రముఖ దర్శకుల చిత్రాలకు కాశీ విశ్వనాథ్ పనిచేశారు. ఆయన మరణం పట్ల పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

పెరిగిన బంగారం..వెండి ధరలు..

ముంబై : మంగళవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. రూ.150 పెరగడంతో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.25,750కి చేరింది. రూ.250 పెరగడంతో కేజీ వెండి ధర రూ.34,000కి చేరింది. 

రాజ్యసభలో నిర్భయ తల్లిదండ్రులు..

ఢిల్లీ : బాలల న్యాయచట్టం సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. బిల్లుపై చర్చ సందర్భంగా నిర్భయ తల్లిదండ్రులు రాజ్యసభకు హాజరయ్యారు. 

15:08 - December 22, 2015

2015 సంవత్సరం.... టాలీవుడ్ లో చాలా మంది దర్శకులకి మరపురాని సంవత్సరమైంది. కొంత మంది దర్శకులకు లక్కీ ఇయర్ అయింది. ...కొత్త దానాన్ని కోరుకొనే ప్రేక్షకులకు .. సరికొత్త ట్రీట్ ఇవ్వాలనే తపన కలిగిన మరి కొంత మంది దర్శకులు .. టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొత్తం మీద 2015 చాలా మంది దర్శకుల దశని, దిశని మార్చేసింది. ఈ సంవత్సరం దుమ్ముదులిపిన టాలీవుడ్ దర్శకులపై 2015 సినిమా డైరీ స్పెషల్ స్టోరీ.

సంపత్ నంది..
మెగా పవర్ స్టార్ తో రచ్చతీసి.. రికార్డుల మోత మోగించిన యాక్షన్ దర్శకుడు సంపత్ నంది...ఈ సంవత్సరం మాస్ మహారాజు 'రవితేజ'ని 'బెంగాల్ టైగర్' ను చేశాడు. పక్కా మాస్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ రాబట్టింది. మంచి కథ, టైట్ స్ర్కీన్ ప్లే తో తెరకెక్కిన ఈ రివెంజ్ యాక్షన్ స్టోరీ.. సంపత్ నందికి మంచి మైలేజ్ ఇచ్చే చిత్రంగా నిలిచిపోయింది.

సుకుమార్..
కాంప్లికేటెడ్ స్ర్కీన్ ప్లే తో కథల్ని నడిపించే 'సుకుమార్'. కథ, స్ర్కీన్ ప్లే తో తెరకెక్కిన యూత్ ఫుల్ మూవీ.. 'కుమారి 21f'. రాజ్ తరుణ్ హీరోగా, హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ... యూత్ ను బాగా ఆకట్టుకుని మంచి కలెక్షన్స్ తెచ్చుకుంది. దర్శకుడిగా పరిచయమైన పల్నాటి ప్రతాప్ కు ఈ సంవత్సరం కుమారి 21 లక్కును తెచ్చిపెట్టింది.

క్రిష్ 'కంచె'..
మెగా వారసుడు 'వరుణ్ సందేశ్' రెండో చిత్రంగా 'క్రిష్' మలిచిన సందేశాత్మక ప్రేమకథా చిత్రం 'కంచె'. రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు ఈ సంవత్సరం క్రిష్ కు మరుపురాని చిత్రంగా నిలిచిపోయిన చిత్రం 'కంచె'.

హరీష్ శంకర్..
'రామయ్యా వస్తావయ్యా' డిజాస్టర్ తో నిరాశ చెందిన 'హరీష్ శంకర్'... 'సాయిధరమ్ తేజ్' తో తెరక్కించిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' తో హిట్టు మెట్టెక్కాడు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' 'హరీష్ శంకర్' కు 2015 లో లక్కు ను తెచ్చిపెట్టింది.

రూటు మార్చిన మారుతి..
అడల్టరీ లవ్ స్టోరీస్ తీసే 'మారుతి'... రూట్ మార్చి... తన ట్యాగ్ కూడా మారుకునే క్రమంలో ఈ సంవత్సరం ఒక బ్లాక్ బస్టర్ కొట్టాడు. 'భలే భలే మగాడివోయ్' అంటూ.. ఆరోగ్యకరమైన హాస్య చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. మతిమరపు గల హీరో ప్రేమలో పడితే జరిగే పరిణామాలతో ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టాడు.

త్రివిక్రమ్..అల్లు అర్జున్..
మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్', స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' కాంబినేషన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'సన్నాఫ్ సత్యమూర్తి'. విలువలే ఆస్తి అనే ట్యాగ్ లైన్ తో ఆద్యంతం ఆకట్టుకునే సన్నివేశాలతో తెరకెక్కిన ఈ మూవీ త్రివిక్రమ్ కెరీర్ లోనే స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది.

రుద్రమదేవి..
'గుణశేఖర్' దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి'. రుద్రమదేవిగా అందాల 'అనుష్క' అద్భుతంగా నటించి.. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. టెక్నికల్ గా భారీ ఎత్తున నిర్మించిన ఈ మూవీ 2015 'గుణశేఖర్' కు మంచి అనుభూతిని అందించింది.

హిట్టు కొట్టిన పూరి..
ఎన్నాళ్ళనుంచో సరైన హిట్టు కోసం వెయిట్ చేసిన 'పూరీ జగన్నాథ్' ఎట్టకేలకు ఈ సంవత్సరం ఓ భారీ హిట్టు కొట్టేసాడు. 'యన్టీఆర్' కూ ఈ మధ్యకాలంలో భారీ హిట్టూ లేదు. ఈ ఇద్దరి కసిని 'టెంపర్' మూవీ తీర్చేసింది. 2015 పూరీకి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సంవత్సరంగా నిలిచిపోయింది.

కొరటాల శివ శ్రీమంతుడు..
'మిర్చి'తో డిఫరెంట్ చిత్రాల దర్శకుడు అనిపించుకున్న 'కొరటాల శివ'కు ఈ సంవత్సరం మరిచిపోలేని భారీ సంవత్సరంగా నిలిచిపోతుంది. సూపర్ స్టార్ 'మహేష్ బాబు' తో తీసిన 'శ్రీమంతుడు' .. గొప్ప ఫ్యామిలీ గా అందరి ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. రికార్డు కలెక్షన్లు సాధించింది.

రాజమౌళి బాహుబలి..
పరాజయం అంటే ఏంటో తెలియని 'రాజమౌళి' కి 2015 చాలా ప్రత్యేకం. ఎన్నో సంవత్సరాల పాటు అలుపన్నదే ఎరగకుండా.. వెండితెరమీద వండర్ఫుల్ విజువల్స్ ను అందించిన చిత్రం 'బాహుబలి'. భారీ నమ్మకంతో, భారీ అంచనాలతో 'ప్రభాస్' టైటిల్ రోల్ పోషించిన 'బాహుబలి'.. 'రాజమౌళి' ని 2015 కే టాప్ దర్శకుడిగా నిలిపింది.

కొంతమందికి చేదు జ్ఞాపకాలు..
2015 కొంత మంది దర్శకులకి చేదు జ్ఙాపకాల్ని మిగిలిస్తే మరికొంత మందికి మరిచిపోలేని విధంగా లక్కును తెచ్చిపెట్టింది. ముఖ్యంగా కథనే నమ్ముకొని .. సినిమాను తీసిన దర్శకులు ఈ సంవత్సరం కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకున్నారు. మిగిలిన దర్శకులు రొటీన్ ముద్ర వేయించుకొని డిజాస్టర్లను మూటగట్టుకున్నారు. ఎలా లేదన్నా... మొత్తం మీద 2015 టాలీవుడ్ లో ప్రతీ దర్శకుడికి ఓ విజయాన్ని అందించింది.  

శంషాబాద్ లో కూలిన వాటర్ ట్యాంకర్..

రంగారెడ్డి : శంషాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూలింది. ఇద్దరు కూలీలు మృతి చెందారు. నష్టపరిహారం చెల్లించాకే మృతదేహాలను తరలించాలని మృతుల తరపు బంధువులు ఆందోళన చేపట్టారు. 

14:56 - December 22, 2015

క్యాన్సర్ భయంతో ముందస్తు చికిత్సలు చేయించుకుంటున్నారని అన్ని సందర్భాల్లో అది అనవసరమని వైద్యులు, నిపుణులు పేర్కొంటున్నారు. క్యాన్సర్ భయంతో ముందస్తు చికిత్సలను ఎంజెలోనా జోలి చేయించుకుంది. దీనితో జోలి సిండ్రోమ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. అందం కోసం కూడా శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారని..ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను సోషల్ పాలసీ స్టడీస్ జర్నల్ వెల్లడించింది. ఈ అంశంపై మానవి 'వేదిక'లో డా.నళిని (అంకాలజిస్టు), డా.నర్మద (గైనకాలజిస్టు) అభిప్రాయాలు తెలిపారు. స్వీయ రక్షణా భయం అంతకంతకూ పెరుగుతోందని, రిస్క్ జోన్ లో ఉంటే క్రమం తప్పకుండా టెస్టులు చేయించుకోవడం మంచిదని సూచించారు. పోషకాహారానికి ప్రాధాన్యతనివ్వడం అవసరమని, క్రమం తప్పని వ్యాయామం జీవన విధానంలో భాగమవ్వాలన్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియోలో చూడండి. 

14:31 - December 22, 2015

హైదరాబాద్ : రాష్ట్రంలో పలు చోట్ల ఇళ్లలో, బ్యాంకుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానాదొంగ మురుగన్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇతడిపై కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దాదాపు ఎనిమిది నెలలు కష్టపడి బెంగుళూరులో పట్టుకున్నామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇతడి వద్ద నుండి కోటి 72 లక్షలు నగదును, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీవీ ఆనంద్ తెలిపారు. అంతేకాకుండా చైన్ స్నాచర్ ల ముఠాను పట్టుకునేందుకు యాంటీ చైన్ స్నాచర్ టీం ను ఏర్పాటు చేశామని సీవీ ఆనంద్ తెలిపారు. ఛేజ్ అండ్ టీంలను ఏర్పాటు చేశాక దొంగతనాలు తగ్గాయని తెలిపారు. 

14:29 - December 22, 2015

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న అయుత చండీయాగం లౌకిక రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మూఢ విశ్వాసాల వ్యాప్తికి యాగం చేస్తూ..ప్రజా సమస్యల దృష్టిని మళ్లించడానికే ఇలా చేస్తున్నారని విమర్శించారు. యాగం ఖర్చులపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయాలని తమ్మినేని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ప్రశ్నించే తత్వం పెంచాలని రాజ్యాంగం చెబుతోందని, రాజ్యాంగం మీద ఎలాంటి గౌరవమున్నా సరే మూఢ విశ్వాసాలను పెంచే ప్రయత్నం చేయరన్నారు. కానీ మూఢ విశ్వాసాలను పెంచే విధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ఆర్థిక..సామాజిక సమస్యలపై దృష్టి మళ్లించకుండా మూఢ విశ్వాసాల చుట్టూ దృష్టి మళ్లించడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారని తెలిపారు. 

14:27 - December 22, 2015

విజయవాడ : నగరంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసుపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర ప్రకటన చేశారు. బెజవాడలో ఉన్న స్వర్ణబార్‌ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుదేనని మంత్రి ప్రకటించారు. కల్తీ మద్యం తాగి 39 మంది ఆసుపత్రి పాలవగా...అందులో ఐదుగురు చనిపోయారని తెలిపారు. మృతిచెందిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందచేసినట్లు మంత్రి ప్రకటించారు. స్వర్ణబార్‌లోని మొత్తం 9 మద్యం బాటిళ్ల శాంపిళ్లను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించగా ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కల్తీ మద్యం కేసు దర్యాప్తులో ఉందని త్వరలోనే మరిన్ని వివరాల్ని బయటపెడతామన్నారు. 

14:26 - December 22, 2015

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ లోపల, బయట బరితెగించి మాట్లాడతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. దళిత మహిళా ఎమ్మెల్యేల శీలాన్ని శంఖిస్తున్న రోజాకు... ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చే అర్హత లేదన్నారు. ఆమెను వెనకేసుకొస్తున్న వైసీపీ అధినేత జగన్‌తోపాటు, ఆ పార్టీ ఎమ్మెల్యేల చర్యను తప్పుపట్టారు. నానా దుర్భాషలాడుతున్న రోజాను ఇప్పటికే అరెస్టు చేయించి ఉండాల్సింవదన్నారు. మంత్రులను పందికొక్కులు..దున్నపోతా అన్నా.. రోజు చెప్పు తీసుకొని వచ్చినా క్షమించారని తెలిపారు. 

రోజా అమర్యాదగా ప్రవర్తించారు - సుజాత..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే తనపట్ల కూడా అమర్యాదంగానే ప్రవర్తించారని మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. తమకు పరువు నష్టం జరిగిందని, రోజా వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకొనేలా ఉన్నాయని, వ్యక్తిగత గత అంశాలను సభలో ప్రస్తావించడం సబబు కాదన్నారు. 

కాల్ మనీ బాధితురాలు ఆత్మహత్యాయత్నం..

కృష్ణా : మచిలీపట్నం ఈదేపల్లిలో కాల్ మనీ బాధితురాలు వెంకటకుమారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బందరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

గజదొంగ బాల మురుగన్ అరెస్టు..

హైదరాబాద్ : గజదొంగ బాల మురుగన్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదు రాష్ట్రాల్లో బ్యాంకు దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి నుండి రూ. 70 లక్షల నగదు, రూ. కోటి విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 

ఎమ్మెల్యే అనిత కంటతడి..

హైదరాబాద్ : టిడిపి ఎమ్మెల్యే అనిత ఎపి అసెంబ్లీలో కంటతడి పెట్టారు. రోజా తనపై వ్యక్తి గత దూషణలకు దిగారని చెప్పారు. అగ్రవర్ణాల సభ్యురాళ్లచే రోజా తనను తిట్టించారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేను అయినందున తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యేగా బాధపడుతున్నానని చెప్పారు. తనకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాంటి సభ్యురాలికి అండగా ఉండడం జగన్ కు న్యాయమా అని ఆమె ప్రశ్నించారు. 

బీసీలను అణిచివేయాలని చూస్తున్నారు - పొన్నం..

హైదరాబాద్ : బీసీ క్రిమిలేయర్ తో టీఆర్ఎస్ బీసీలను అణిచివేయాలని చూస్తోందని టి.కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీసీలపై కేసీఆర్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, బీసీ మంత్రులు మౌనం వీడకుంటే చరిత్ర హీనులవుతారని తెలిపారు. దేశంలతో ఎక్కడా లేని క్రీమిలేయర్ తో రాష్ట్రంలో ఎందుకు అని ప్రశ్నించారు. 

నగరానికి నీరు తీసుకొచ్చింది కాంగ్రెస్సే - మర్రి..

హైదరాబాద్ : నగరానికి తీసుకొచ్చింది కాంగ్రెస్ అని టి. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా నీళ్లు తీసుకొచ్చామని కేసీఆర్ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మోసపూరిత ప్రచారాన్ని తిప్పి కొడుతామన్నారు.

13:58 - December 22, 2015

హైదరాబాద్ : టిడిపి ఎమ్మెల్యే అనిత ఎపి అసెంబ్లీలో కంటతడి పెట్టారు. రోజా తనపై వ్యక్తి గత దూషణలకు దిగారని చెప్పారు. అగ్రవర్ణాల సభ్యురాళ్లచే రోజా తనను తిట్టించారని ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేను అయినందున తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యేగా బాధపడుతున్నానని చెప్పారు. రోజా వ్యాఖ్యలు తనను తీవ్ర మనస్థాపానికి గురి చేశాయని వాపోయారు. దళిత మహిళను కాబట్టే ఇవాళ రోజా తనపై అలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. దళిత మహిళకే రక్షణ లేకపోతే రాష్ట్ర మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాంటి సభ్యురాలికి అండగా ఉండడం జగన్ కు న్యాయమా అని ఆమె ప్రశ్నించారు.
రోజాను అరెస్టు చేయాలన్న గోరంట్ల....
గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రోజా వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. చాలా జుగుప్సాకరంగా రోజా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏడాదిపాటు సస్పెన్షన్ కాదు... రోజాను ఒకరోజు కూడా అసెంబ్లీకి అనుమతించవద్దని తెలిపారు. మంత్రులను పందికొక్కులని తిట్టిందని.. రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోజాను అరెస్టు చేసి.. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని సూచించారు. అనితకు రక్షణ కల్పించాలని కోరారు.
రోజా వ్యాఖ్యలు బాధాకరం : విష్ణుకుమార్ రాజు...
రోజాపై ఎడాది సస్పెన్షన్ విధించడాన్ని పునరాలోచన చేసి... సస్పెన్షన్ కాలాన్ని తగ్గించాలని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. అనితపై రోజా చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. అనిత వెనకాల తామకు కూడా ఉంటామని చెప్పారు. వ్యక్తిగత కామెంట్లు, దూషణలు చేయడం సరికాదని హితవుపలికారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే... ఊరుకోమని హెచ్చరించారు.
రోజాది నోటి దురుసుతనం : పీతల సుజాత...
అనితపై రోజా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. రోజా మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరమని చెప్పారు. రోజాకు నోటి దురుసుతనం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా వ్యాఖ్యలు సభ్యసమాజం.. తలదించుకునేలా ఉన్నాయన్నారు. వ్యక్తిగత అంశాలను సభలో ప్రస్తావించడం సబబు కాదన్నారు. తన పట్ల కూడా రోజా అమర్యాదగానే వ్యవహరించారని తెలిపారు.  గతంలో దళిత మంత్రి అయినా తనపై కూడా రోజా రౌడీలా ప్రవర్థించిందని గుర్తు చేశారు. తమకు పరువు నష్టం జరిగిందని.. స్పీకరే న్యాయం చేయాలని కోరారు. 

 

సినీ నటుడు, రచయిత కాశీ విశ్వనాథ్ కన్నుమూత..

విశాఖపట్టణం : సినీ నటుడు, రచయిత కాశీ విశ్వనాథ్ కన్నుమూశారు. హైదరాబాద్ నుండి విశాఖపట్టణానికి వెళుతుండగా రైల్లో మృతి చెందాడు. 

సుష్మాతో అశోక్ గజపతి రాజు..కంభపాటి భేటీ..

ఢిల్లీ : కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, కంభంపాటిలు భేటీ అయ్యారు. అమెరికా వెళ్లిన భారత విద్యార్థులను వెనక్కి పంపిన అంశంపై వీరు చర్చించారు. 

శేషాచలం అడవుల్లో కూంబింగ్..

చిత్తూరు : జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంద్యాలకోన అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా అటవీశాఖ అధికారులకు 80 మంది కూలీలు ఎదురు పడ్డారు. రాళ్లతో దాడి చేసి ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. తరువాత ఘటనాస్థలంలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2 కోట్లు ఉంటుందని అంచనా. 

మీ ఇంట్లో ఆడవారికి ఇలాగే జరిగితే జగన్ కు అనిత ప్రశ్న..

హైదరాబాద్ : తనపై రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనస్థాపాన్ని కలిగించాయని పాయకరావుపేట టిడిపి ఎమ్మెల్యే అనిత శాసనసభలో పేర్కొంటూ కన్నీరు పెట్టారు. ఓ దళిత మహిళా ఎమ్మెల్యేను నోటికొచ్చిన వఙదంగా మాట్లాడడం తగదని సూచించారు. సాటి మహిళలపట్ల గౌరవం లేని రోజా లాంటి వ్యక్తులను పక్కన పెట్టుకున్న వైసిపి అధినేత జగన్ ఏ విధంగా ప్రజల్లోకి వెళుతారని సూటిగా ప్రశ్నించారు. ఇదే ఘటన మీ ఇంట్లో ఉన్న ఆడవారికి జరిగితే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. 

రోజా సస్పెన్షన్..వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా - విష్ణుకుమార్..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సంవత్సరం పాటు విధించిన సస్పెన్షన్ తగ్గించాలంటూ కొన్ని రోజుల కిందట తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పేర్కొన్నారు. 

13:46 - December 22, 2015

కాకినాడ : కాల్‌మనీ...ఒక్కసారి అప్పుతీసుకుంటే ఇక అంతే. తీసుకున్న మొత్తంతో సంబంధం లేదు. వడ్డీ ఎంత చెల్లించినా లెక్కేలేదు. వారికి నిలువుదోపిడీ సమర్పించాల్సిందే. అప్పుడేవారు శాంతిస్తారు. వేలు ఇస్తే లక్షలు... లక్షలిస్తే కోట్లు ముట్టజెప్పాల్సిందే. కాదు కూడదంటే కత్తులతో బెదిరింపులు.. తుపాకులతో సెటిల్‌మెంట్‌ చేయిస్తారు...ఎక్కడికెళ్లినా తమ మనుషులతో నిఘా పెడతారు. తమ పవర్‌తో కేసులు నమోదు కాకుండా చూస్తారు.
లక్షల రుణాలు... కోట్లు వసూళ్లు
కాకినాడలో కాల్‌మనీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. లక్షల రుణమిచ్చి కోట్లు కొట్టేస్తున్నారు. పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నా... కాలాంతకుల కిరాతకాలు ఆగడం లేదు. అంగబలం అర్ధబలంతో కాల్‌నాగైన మాజీ ఎమ్మెల్యే బంధువు శ్రీనివాసరెడ్డి రెచ్చిపోతున్నారు.
4 కోట్ల ఆస్తులపై కన్ను
న్యాయం కోసం కాళ్ల చెప్పులు అరిగేలా ప్రదిక్షణలు చేస్తున్న ఇతనే ఆ బాధితుడు సంగాని నందకిషోర్...కాకినాడలోని గాంధీ నగర్‌లో నివాసం...పొలాలు, చెరువులు, వచ్చిపోయే వారితో ఇళ్లంతా సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు కాల్‌మనీ పెట్టిన చిచ్చుతో ఇళ్లంతా బోసిపోయింది...పెట్టుబడి కోసం మాజీ ఎమ్మెల్యే బంధువు మేడపాటి విఘ్నేశ్వర శ్రీనివాస రెడ్డి నుంచి నంద కిషోర్‌ తండ్రి ఆరున్నరలక్షలు అప్పు తీసుకున్నాడు...అదే వారు చేసిన పొరపాటని తెలుసుకోలేకపోయారు...వడ్డీతో కలిపి 15 లక్షలు చెల్లించాడు...అయినా వడ్డీ తీరలేదని వ్యాపారి కొత్త ఫిట్టింగ్‌ పెట్టాడు. అదనంగా కోటి 30 లక్షలు చెల్లించాలని లేదంటే 4 కోట్ల విలువైన ఆస్తులను వదలుకోవాలని భయ బ్రాంతులకు గురిచేశాడు. తన అనుచరులతో వచ్చి దాదాగిరి చెలాయించాడు. కుటుంబ సభ్యులకు మనశాంతిలేకుండా చేశాడు. మహిళలకు ఫోన్‌ చేసి లైగింక వేధింపులకు గురిచేశాడు. శ్రీనివాసరెడ్డి దురాగతంతో భయపడిపోయిన నందకిషోర్‌ భార్య... పిల్లలతో కలిసి జగ్గయ్యపేటలో తలదాచుకుంటుంది.
రెండేళ్లుగా బాధితుడి న్యాయపోరాటం
ఆరున్నర లక్షల అప్పు కోసం 4 కోట్ల ఆస్తులు పోగొట్టుకోలేక.. నందకిషోర్‌ ఓ లాయర్‌ సమక్షంలో సెటిల్‌మెంట్‌కు యత్నించాడు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంబాషణల వీడియో బయటపడింది. శ్రీనివాసరెడ్డి ప్రతిమాటలోనూ దౌర్జన్యం..గుండాయిజం. పలుకుబడి, పవర్‌ గురించి చెబుతూ భయపెట్టాడు. ఒకసారి సెటిల్‌మెంట్‌ చేసుకోకపోతే మరోసారి అవకాశం ఇవ్వనని దబాయించాడు.
పోలీసులను ఆశ్రయిస్తే స్పందన లేదు
సెటిల్‌మెంట్‌ ప్రయత్నం విఫలం కావడంతో... నందకిషోర్‌ పోలీసులను ఆశ్రయించాడు. శ్రీనివాసరెడ్డి తన పలుకుబడితో కేసు నీరుగార్చడంతో...డీజీపీ, గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. రెండు నెలల క్రితం సీఐడీ అధికారులు విచారణ కూడా చేపట్టారు. ఇలా ఎన్ని ఫిర్యాదులు చేసినా బాధితుడికి మాత్రం న్యాయం జరగలేదు. బెజవాడలో కాల్‌మనీ వ్యవహారం ప్రకంపనలు రేపడం...రాష్ట్రమంతా దాడులు, అరెస్టులతో పోలీసులు దడ పుట్టించడంతో... నందకిషోర్‌ మరోసారి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమంటున్నాడు. మరి ఈసారైనా పోలీసులు బాధితుడికి న్యాయం చేస్తారో... లేక శ్రీనివాసరెడ్డి అంగబలం, అర్థబలం చూసి లైట్‌ తీసుకుంటారో చూడాలి.

 

13:39 - December 22, 2015

హైదరాబాద్‌ : నగరంలో అక్రమ ఇళ్లు, స్థలాల క్రమబద్దీకరణకు బ్రేక్‌ పడింది. బీఆర్‌ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ల క్రమబద్దీకరణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు నగరంలో రెగ్యులరైజేషన్‌ చేయోద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2007లో అప్పటి ప్రభుత్వం క్రమబద్దీకరణ చేసిందని...ఆ తర్వాత నగరంలో అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగిపోయాయని ఫోరం ఫర్‌ గుడ్‌గవర్నెన్స్ కోర్టు దృష్టికి తెచ్చింది. చట్టసవరణలు చేయకుండానే నగరంలోఅక్రమ నిర్మాణాలను క్రమబద్దీకరించడాన్ని సవాల్ చేస్తూ ఫోరం ఫర్‌ గుడ్‌గవర్నెన్స్ హైకోర్టును ఆశ్రయించింది.

 

 

13:19 - December 22, 2015

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా దర్యాప్తు స్థాయి నివేదికను ఏపీ సీఐడీ కోర్టుకు సమర్పించింది. నివేదికపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్తుల అమ్మకాన్ని 2,3 రోజుల్లో ఖరారు చేస్తామని కమిటీ చెప్పింది. వేలం బాధ్యతలను 3 సంస్థలకు అప్పగిస్తామని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.

సీఎం కేజ్రీవాల్‌ సహా ఐదుగురు ఆప్‌ నేతలకు నోటీసులు

ఢిల్లీ : హస్తిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సహా ఐదుగురు ఆమ్‌ఆద్మీపార్టీ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించిన విషయంలో కోర్టు నోటీసులు జారీచేసింది. నోటీసులపై 3వారాల్లోగా సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.

 

13:14 - December 22, 2015

ఢిల్లీ : హస్తిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సహా ఐదుగురు ఆమ్‌ఆద్మీపార్టీ నేతలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించిన విషయంలో కోర్టు నోటీసులు జారీచేసింది. నోటీసులపై 3వారాల్లోగా సమాధానం చెప్పాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. 
ఆప్‌ చేసిన ఆరోపణలపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీ పాటియాల హౌస్‌ కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన సిఎం కేజ్రీవాల్, ఆప్‌ నేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్‌, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ వాజపేయిలపై జైట్లీ 10 కోట్ల రూపాయలకు వ్యక్తిగత హోదాలో పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణను కోర్టు జనవరి 5కు వాయిదా వేసింది. అరుణ్‌జైట్లీ ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న 15 ఏళ్ల కాలంలో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ఆప్‌ ఆరోపించింది. తనపై ఆప్‌ నేతలు అసత్య ఆరోపణలు చేశారంటూ జైట్లీ పరువు నష్టం దావా వేశారు.

12:58 - December 22, 2015

మెదక్‌ : జిల్లాలోని జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవల్లిలోని తన సొంత వ్యవసాయక్షేత్రంలో అయుత మహా చండీయాగం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు ఇవాళ త్రైలోక్య మోహన గౌరీ హోమంలో పాల్గొన్నారు. ఉదయం గౌరీహోమంతో పాటు గరు ప్రార్థన, గణపతిపూజ, గోపూజ, ఉదక శాంతి, ఆచార్యాది రుత్విగ్వరణం, మహా మంగళహారతి ఉంటాయని వేదపండితులు తెలిపారు. వీటిత పాటు మంత్ర పుష్పం, సాయంత్రం రుత్విగ్వరణం, దుర్గా దీప నమస్కార పూజ, రక్షా సుదర్శన హోమం కూడా ఉంటాయని నిర్వహణ ఆచార్యుల బృదం తెలిపింది. రేపటి నుంచి 27 వరకు నిర్వహించనున్న ఆయుత మహా చండీయాగానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

12:56 - December 22, 2015

ప్రపంచ క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చే వార్త. విధ్వంసకర బ్యాటింగ్ కు మారుపేరైన న్యూజిలాండ్ మేటి క్రికేటర్, ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ 'బ్రెండన్ మెక్ కల్లమ్' అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో తన సొంత నగరం క్రైస్ట్ చర్చ్ లో జరుగనున్న టెస్టే తనకు చివరి మ్యాచ్ అని కొద్దిసేపటి క్రితం ప్రకటించాడు. ఫిబ్రవరి 20వ తేదీన హెగ్గే ఓవల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ అతడికి 101వది.
డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా పేరున్న మెకల్లమ్‌....అన్ని ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. టెస్టులతో పాటు....ఇన్‌ స్టంట్‌ వన్డే, టీ 20 ఫార్మాట్లలో కివీస్ జట్టులో కీలక టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా, నాయకుడిగా, వికెట్‌ కీపర్‌గా రాణించిన మెకల్లమ్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. భారత్‌లో జరుగునున్న 2016 టీ 20 ప్రపంచకప్‌ తర్వాత మెకల్లమ్‌ రిటైరవుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఫిబ్రవరిలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్ట్‌ సిరీస్‌ తర్వాత రిటైరవ్వనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరచాడు.  ఇప్పటివరకూ 99 టెస్టులు ఆడిన మెకల్లమ్‌ 11 సెంచరీలు, 31 హాఫ్‌ సెంచరీలతో 6273 పరుగులు చేశాడు.254 వన్డేల్లో 5 సెంచరీలు, 31 హాఫ్‌ సెంచరీలతో 6273 పరుగులు నమోదు చేశాడు.71 టీ 20 మ్యాచ్‌లు ఆడిన బ్రెండన్‌ 2 సెంచరీలు, 13 హాఫ్‌ సెంచరీలతో 2140 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో రెండు నెలల్లో అంతర్జాతీయ కెరీర్‌గా ఫుల్‌ స్టాప్‌ పెట్టబోతున్న మెకల్లమ్‌.....టీ 20 లీగ్‌ల్లో మాత్రం కొనసాగుతాడు.

12:55 - December 22, 2015

చిత్తూరు : జిల్లాలో మేయర్ కటారి అనురాధ దంపతుల హత్యకేసులో విచారణ వేగవంతం అయింది. ఈ హత్యకేసులో 16 మంది నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే వాదనలు విన్న కోర్టు...జనవరి 4వరకు రిమాండ్ పొడిగించారు. వెంటనే నిందితులను భారీ బందోబస్తు మధ్య జైలుకు తరలించారు. 

12:48 - December 22, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ఏటీఎం దొంగతనానికి వచ్చిన ఓ దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు. జిల్లాలోని దేవరకద్రలో అర్ధరాత్రి ఓ దొంగ ఎస్‌బీహెచ్ ఏటీఎంలో దొంగతనానికి ప్రయత్నించాడు. రాడ్, సుత్తితో ఏటీఎంను పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. శబ్ధం రావడంతో గస్తీ పోలీసులు ఏటీఎం వద్దకు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన దొంగ ఏటీఎంలోని క్యాబిన్ లోకి వెళ్లి దాక్కున్నాడు. దీంతో గస్తీ పోలీసులు ఏటీఎం షటర్‌ను మూసేసి..ఎస్సైకి సమాచారమిచ్చారు. ఎస్సై సంఘటనాస్థలానికి చేరుకునేలోగా..ఏటీఎం లోపల ఉన్న దొంగ భయపడి ఇనుపరాడ్‌తో తలను పగులగొట్టుకున్నాడు. అపస్మారకస్థితిలోకి పడిపోయిన దొంగను పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆసుపత్రిలో నెమ్మదిగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. నిందితుడిని ఖమ్మంకు చెందిన శివనాగరాజుగా గుర్తించారు. 

12:45 - December 22, 2015

బీజింగ్‌: తన జిమ్నాస్టిక్‌ విన్యాసాలను ఓ పులి ముందు ప్రదర్శించేందుకు ప్రయత్నించాడో కుర్రాడు. జూ సందర్శిం చేందుకు వెళ్ళిన పర్యాటకుల్లోని ఓ కుర్రాడు కేబుల్‌ కార్‌ లో కూచుని తొలుత శ్రద్ధగానే తిలకించాడు. తీరా పులులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌పైకి వచ్చేప్పటికి సాహసం చేయాలనిపించింది. తన ప్రతిభను ప్రదర్శిద్దామని ప్రయత్నించాడు. ఉన్నట్టుండి పులులు ఉండే ఎన్‌ క్లోజర్‌ నెట్‌ పైకి దూకేశాడు. చైనా జంతు ప్రదర్శన శాలలో పులులకు ప్రత్యేక ఎన్‌ క్లోజర్‌ ఉంటుంది. వన్యప్రాణులను తిలకించాలనుకున్నవారిని ప్రత్యేకంగా పకడ్బందీగా ఉన్న వాహనాల్లో లోపలికి పంపుతుంటారు. సందర్శకులకు కనిపించే విధంగా.. ఎన్‌ క్లోజర్‌ పైభాగాన్ని కూడ వలతో పూర్తిగా కప్పేశారు. పులులను చూడాలనుకునేవారు కేబుల్‌ కార్‌ ద్వారా (రోప్‌వే) వెళ్ళాల్సిందే. ఈ నేపథ్యంలో రోప్‌ వే ఛైర్‌ లో నుంచి చూస్తున్నట్టుగా చూస్తూ ఆ కుర్రాడు... ఉన్నట్లుండి వలపైకి దూకేశాడు. జరిగిన సంఘటనకు తోటి పర్యాటకులు షాకైపోయారు. వెంటనే తేరుకుని పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. ఈ గందరగోళం గమనిం చిన్న పులులు ఆకతాయిని నోటికి కరచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఆ కుర్రాడి అదృష్టం కలసి రావడంతో జూ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వలపై పడిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూసిన పర్యాటకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తిని పబ్లిక్‌ న్యూసెన్స్‌ గా పోలీసులు అరెస్టు చేశారు. ఇంతా చేస్తే. ఇదంతా థ్రిల్‌ కోసం చేశానని అతడు చెప్పడం విశేషం. పులుల ఎన్‌క్లోజర్‌లో వ్యక్తులు పడటం ఇది మొదటిసారి కాదు. ఇండియాలోని గ్వాలియర్‌ జూ లో 2014 లో ఓ విద్యార్థి 20 అడుగుల గోడ ఎక్కి మరీ పులులను చూసేందుకు ప్రయత్నించి ఎన్‌ క్లోజర్‌ లో పడ్డాడు. షర్టు విప్పేసి డ్యాన్స్‌ చేస్తూ నానా హంగామా చేశాడు. పులుల మూడ్‌ ఎలా ఉందో ఏమో జూ సిబ్బంది వచ్చే వరకూ అవి పట్టించుకోపోవడంతో బతికిపోయాడు. అదే సంవత్సరంలో ఢిల్లీ జూలో రెండు తెల్ల పులులున్న ఎన్‌క్లోజర్‌లో పడ్డ విద్యార్థి... వాటి నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. 

12:42 - December 22, 2015

ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ నటించిన దిల్‌వాలే సినిమాకు 'అసహనం' సెగ తాకింది. ఇటీవల అసహనంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో తాజాగా విడుదలైన 'దిల్‌వాలే' ప్రదర్శనను కర్నాటకలోని మంగళూరులో వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో మంగళూరు, సమీప ప్రాంతాల్లో శనివారం నుండి చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది. చిత్ర ప్రదర్శన నడుస్తున్న మంగళూరులోని మల్టీ ప్లెక్స్‌, సూరత్‌కాల్‌, ఇతర థియేటర్లవద్ద వీహెచ్‌పీ బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేస్తుండటంతో భద్రతా కారణాల రీత్యా థియేటర్ల యజమానులు సినిమా ప్రదర్శన ఆపేశారు. అయితే, చిత్రాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగి వెళ్లడం గమనార్హం. 'దేశంలో అసహనం ఉందంటూ షారూఖ్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు విస్మయానికి గురయ్యారు. ఇప్పుడు నిజమైన అసహనం ఏమిటో ఆయనకు మేము చూపిస్తాం. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మేము ఈ ఆందోళన చేస్తున్నాం' అని వీహెచ్‌పీ కర్నాటక రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్‌ షెనావా వ్యాఖ్యానించారు. షారూఖ్‌, అమీర్‌ సినిమాలేవీ ప్రదర్శించవద్దని తాము థియేటర్‌ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశామని భజరంగ్‌ దళ్‌ నేత శరణ్‌ పంప్‌వెల్‌ చెప్పారు. సినిమా ప్రదర్శనను నిలిపివేయాల్సిందిగా ఆదివారం తమ థియేటర్ల వద్ద కొందరు ప్రదర్శనలు చేపట్టారని, సోమవారం కూడా చిత్ర ప్రదర్శన చేయరాదని వారు హెచ్చరించారని థియేటర్‌ యజమానులు చెప్పారు. అయితే ఈ విషయంలో శాంతి నెలకొనేందుకు తాము వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌ నాయకులతో చర్చలు జరుపుతున్నామన్నారు. 

12:40 - December 22, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుస్తున్నాయి. రోజా సస్పెన్షన్‌ వ్యవహారం, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు మధ్యాహ్నం 12గంటలకు వైసిపి శాసనసభా పక్షం సమావేశం అవుతుంది. మరోవైపు 344 నిబంధన కింద రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో జరిగిన నష్టంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. దీంతో పాటు బాక్సైట్‌, ఇసుక విధానంపై మంత్రి పీతల సుజాత ప్రకటన చేయనున్నారు. ఇక విజయవాడలో కల్తీమద్యం అంశం, విశాఖలో కొండచరియలు విరిగిపడి జరిగిన ప్రాణ, ఆస్తినష్టంపై కూడా చర్చ జరగనుంది.

 

12:40 - December 22, 2015

మూకీ చిత్రంగా రూపొంది భారతీయ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన చిత్రం 'పుష్పక విమానం'. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా సీనియర్‌ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ప్రయోగాత్మక చిత్రమిది. 1987లో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డుతోపాటు, ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలోను, కేన్స్‌ చలన చిత్రోత్సవంలో కూడా ప్రదర్శితమై ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించింది. ఇదే చిత్రంలో గాల్లో ఎగురుతున్న విమానాల్ని విచిత్రంగా చూసే ఓ క్యారెక్టర్‌లో నటుడు రమేష్‌ అరవింద్‌ కూడా నటించారు. ఇటీవల ఆయన కమల్‌హాసన్‌ హీరోగా రూపొందిన 'ఉత్తమవిలన్‌' చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. రమేష్‌ అరవింద్‌ తదుపరి చిత్రంగా 'పుష్పకవిమానం' చిత్రాన్ని చేస్తున్నట్లు వార్త లొచ్చాయి. వీటిపై స్పందిస్తూ మీడియాతో రమేష్‌ అరవింద్‌ మాట్లాడారు. 'నెక్ట్స్‌ చిత్రానికి 'పుష్పకవిమానం' టైటిల్‌ అనుకున్న విషయం వాస్తవమే. అయితే ఇందులో కమల్‌ నటిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి ఫైనల్‌ కాలేదు. కమల్‌ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ విషయమై ఆయనతో నేనింకా చర్చించలేదు. కాని ఆయనతో తప్పకుండా దీనిపై చర్చిస్తాను. అంతేకాకుండా ఈ కథలో ఆయన పాత్ర తీరు తెన్నులు ఎలా ఉంటాయో కూడా వివరిస్తాను. కొత్తగా చేయబోయే ఈ చిత్రానికి పాత టైటిల్‌ని ఎందుకు ఎంచుకున్నారని చాలా మంది అడుగుతున్నారు.. కథకి యాప్ట్‌ అవడంతో పాటు, సెంటిమెంట్‌గా పాత టైటిల్‌ పెట్టడం వల్ల మంచి జరుగుతుందనే గట్టి నమ్మకం. అందుకే పాత టైటిల్‌ని పెట్టాలని నిర్ణయించాను. కమల్‌తో చర్చించిన తర్వాత ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియజేస్తాను' అని చెప్పారు.

12:38 - December 22, 2015

ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారిణిగా ప్రకాశ్‌ ఝా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జై గంగాజల్‌'. 'గంగాజల్‌' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 4న విడుదల చేస్తున్నట్టు బాలీవుడ్‌ చిత్రాల వాణిజ్య విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలియజేశారు. విడుదల తేదీని ప్రకటిస్తూ ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ని సైతం సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. అలాగే ఈచిత్రం ట్రైలర్‌ను నేడు(మంగళవారం) ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తరణ్‌ పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు, వారి తీరు తెన్నుల మీద ప్రకాశ్‌ ఝా సంధిస్తున్న అస్త్రమే 'జై గంగాజల్‌' అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

12:38 - December 22, 2015

హైదరాబాద్ : భారత్‌ దర్శన్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఐఏఎస్‌ల బృందం జీహెచ్‌ఎమ్‌సీని సందర్శించింది. కార్పొరేషన్‌ అనుసరిస్తున్న పలు విధానాలను అధ్యయనం చేసింది. గ్రేటర్‌లో అమలు చేస్తున్న పథకాలను బృందానికి కమిషనర్‌ వివరించారు.
దేశవ్యాప్తంగా ఐఏఎస్‌ అధికారుల బృందం పర్యటన
51 మంది ఐఏఎస్‌ల బృందం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని సందర్శించింది. భారత్‌ దర్శన్‌లో భాగంగా ఈ ఐఏఎస్‌ అధికారుల బృందం దేశ వ్యాప్తంగా పర్యటిస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులు..పథకాలపై ఈ బృందం పరిశీలన చేస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం జీహెచ్‌ఎమ్‌సీ కార్యాలయానికి వచ్చిన ఐఏఎస్‌ అధికారుల టీమ్‌..ఆ తరువాత నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించింది.
జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డితో ఐఏఎస్‌ల భేటీ
జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డితో ఐఏఎస్‌లు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో అమలవుతున్న పలు పథకాలను కమిషనర్‌ వారికి వివరించారు. హైదరాబాద్‌లో తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఐఏఎస్‌ల బృందానికి తెలియజేశారు. భారత్‌ దర్శన్‌లో భాగంగా నగరంలో పర్యటించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఐఏఎస్‌ల బృందానికి నాయకత్వం వహిస్తున్న రతన్‌ లహోటీ అన్నారు. ఈ పర్యటన తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. 

12:36 - December 22, 2015

ప్రస్తుతం 'శౌర్య' చిత్రంలో నటిస్తున్న మంచు మనోజ్‌ తాజాగా ఎల్లో ప్లవర్స్‌ బ్యానర్‌పై రమేష్‌ పుప్పాల నిర్మాతగా నిర్మించే ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. సాగర్‌ పసల దర్శకుడు. త్వరలో ఈ చిత్రం పట్టాలెక్కనున్న నేపథ్యంలో నిర్మాత మాట్లాడుతూ, 'మా బ్యానర్‌లో ఇప్పటి వరకు 'మిరపకాయ్', 'శ్రీమన్నారాయణ', 'పైసా' వంటి డిఫరెంట్‌ చిత్రాలను నిర్మించాం. రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌తో చేయబోయే చిత్రాన్ని పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నాం. మనోజ్‌తో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీతమందిస్తున్నారు. మనోజ్‌, తమన్‌ కాంబినేషన్‌లో రాబోతున్న తొలి చిత్రమిది. గిరి ఈ చిత్రానికి కథ అందిస్తుండగా, కిషోర్‌ రచన, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్‌ పసల దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్‌ ఫార్మాట్‌లో మనోజ్‌ను సరికొత్తగా ఈ చిత్రంలో చూపించబోతున్నాం. బడ్జెట్‌ విషయంలో ఏ మాత్రం వెనకాడకుండా ఈ సినిమాను అన్ని హంగులతో తెరకెక్కిస్తాం' అని అన్నారు.

 

12:34 - December 22, 2015

వారానికోసారి మౌనవ్రతం చేసేవారిని చూస్తుంటాం. కానీ, మౌనం ఆయువును పెంచుతుందని తాజా పరిశోధనల్లో స్పష్టమైంది. ఎప్పుడూ వాగుతూ ఉండేవారి కన్నా తక్కువ మాట్లాడేవారు ఎక్కువకాలం జీవిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిశ్శబ్దంగా ఉంటే కొన్ని రకాల జీన్స్‌ ఉత్తేజితం అవుతాయని ఇవి ఆయువును పెంచడానికి ఉపయోగపడుతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ కి చెందిన బక్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఏజింగ్‌ సంస్థ వెల్లడించిన ఫలితాలలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పదేళ్ళపాటు వందలాది మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు తెలిసాయి. నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకునే వారిలో ఈస్ట్‌ కణాలు ఎక్కువకాలం జీవించి ఉంటాయట. దీనివల్ల ముసలితనం త్వరగా రాదట. అందుకే అవసరానికి మించి మాట్లాడవద్దని సూచిస్తున్నారు. కొంత మంది అదే పనిగా మాట్లాడుకునే వారికి మాట మాట పెరగడం, ఆపై గొడవలకు దారితీయడం మామూలే. అందుకే వాగుడుకాయలా మాట్లాడకుండా మౌనంగా ఉంటే అనేక సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయంట.

12:33 - December 22, 2015

కొందరి చర్మం మృదువుగా ఉన్నా.. మోచేతులు, మోకాళ్ల దగ్గర మాత్రం నల్లగా, బరకగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని నియమాలు పాటించాలి.

  • తులసి ఆకులను మెత్తగా చేసి అందులో అరచెంచా పాలమీగడ, చిటికెడు పసుపు కలిపి రాత్రిపూట మోచేతులూ, మోకాళ్లకూ మర్దన చేసుకోవాలి. మర్నాడు చల్లటి నీళ్లతో శుభ్రపరచుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
  • రెండు మూడు రోజులకోసారి సగానికి కోసిన నిమ్మచెక్కలతో మోచేతులకు మర్దన చేస్తే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. అలాగే తేనెలో పంచదార కలిపి నల్లగా ఉన్న చోట రుద్దుకోవాలి.
  • గోరువెచ్చటి కొబ్బరి నూనెలో చెంచా నిమ్మరసం కలిపి చేతులకు రాసుకోవాలి. తరువాత వేడినీళ్లలో తడిపిన టవల్‌ని చుట్టుకోవాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల సమస్య క్రమంగా తగ్గుతుంది.
  • మూడు చెంచాల శనగపిండిలో కాస్త పెరుగు కలిపి పూతలా వేసుకోవాలి. ఆరాక నీళ్లతో కడిగేసుకోవాలి. అలానే కలబంద గుజ్జు రాసుకున్నా సమస్య దూరమవుతుంది.
  • రెండు టీ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, టీ స్పూన్‌ పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు, గరుకుదనం తగ్గిపోతాయి.
  • బాదం రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి మోచేతులపై మసాజ్‌ చేయాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకఁంటే మంచి ఫలితం ఉంటుంది.
  • టొమాటో రసం, తేనె లేదా కొబ్బరి నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి.. బాగా మసాజ్‌ చేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్‌ చేసుకోవాలి. ఈ చిట్కాతో నలుపుదనం త్వరగా పోతుంది. 

సీపీఎం ఆఫీస్ పై బీజేపీ సర్కార్ దాడి...

రాజస్థాన్ : బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో హిందుత్వ శక్తుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయి. సిఎం వసుంధర రాజే నేతృత్వంలో అటు బీజేపీ కార్యకర్తలు.. ఇటు పోలీసులు కూడా రెచ్చిపోతున్నారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న సికర్‌ జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి సుభాష్‌ జకర్‌పై ఆరెస్సెస్‌, ఎబివిపి కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. సుభాష్‌పై దాడిన ఖండించిన సీపీఐ(ఎం) సికర్‌ జిల్లా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయ తలుపులు విరగ్గొట్టి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

12:31 - December 22, 2015

కొన్ని కూరగాయలు ఎన్నో పోషకాలను అందిస్తాయి. కానీ వండే విధానాన్ని బట్టి కొన్నిసార్లు వాటిని కోల్పోవాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
క్యారెట్‌ లాంటి వాటిని ఉడికించి ముక్కలు కోయడం కన్నా.. ముందు ముక్కలు తరిగి తరవాత వేయించాలి. అప్పుడు వాటి నుంచి కెరొటినాయిడ్లనే యాంటీఆక్సిడెంట్లు విడుదల అవుతాయి. అవి క్యాన్సర్‌ కణాలను నశింపచేస్తాయి.
ఆకు కూరల్ని వండేప్పుడు కొద్దిగా ఆలివ్‌నూనెను వేస్తే, అవి ఉడుకుతున్నప్పుడు అవసరమైన పోషకాలు పోవు.
వెల్లుల్లిని తరిగి వెంటనే పోపులో వేయడం, పదార్థంలో వాడటం కాకుండా... ఐదు నిమిషాలు అలాగే ఉంచండి. కాసేపు గాలికి ఉంచడం వల్ల వాటిల్లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు పెరుగుతాయి.
కొందరు బంగాళాదుంపల చెక్కు తీసేసి ఉడికిస్తుంటారు. అలా కాకుండా పొట్టుతో సహా ఉడికించడం వల్ల 'సి' విటమిన్‌ స్థాయి పెరుగుతుంది. అలాగే ఉడికించేప్పుడు ఆ గిన్నెపై మూత పెట్టాలి. దానివల్ల పోషకాలు తగ్గకుండా ఉంటాయి.

రాజ్యసభను కుదేపిసిన డీడీసీఏ అవినీతి భాగోతం

ఢిల్లీ: డీడీసీఏలో జరిగిన అవినీతి అంశం రాజ్యసభను కుదిపేస్తోంది. ఈ స్కామ్‌లో తీవ్రిమైన ఆరోపణలు ఎదుర్కొంటుంన్న ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ సభ్యులు పట్టుబడుతున్నారు . సభలో జైట్లీ వ్యతిరేక నినాదాలు చేశారు.. దీంతో సభాపతి రాజ్యసభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. కాంగ్రెస్‌ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో సభాపతి మరోసారి సభను వాయిదా వేశారు. 12.35 నిమిషాలకు సభ తిరిగి ప్రారంభం కానుంది.

 

అగ్రిగోల్డ్ పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ పై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా దర్యాప్తు స్థాయి నివేదికను ఏపీ సీఐడీ కోర్టుకు సమర్పించింది. నివేదికపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆస్తుల అమ్మకాన్ని 2,3 రోజుల్లో ఖరారు చేస్తామని కమిటీ చెప్పింది. వేలం బాధ్యతలను 3 సంస్థలకు అప్పగిస్తామని తెలిపింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది.

 

12:05 - December 22, 2015

జువైనల్ చట్టంలో మౌలికంగానే తప్పులున్నాయని దిహన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కల్పించాలనే హక్కు ఉందన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'అత్యంత అరుదైన కేసులో మరణశిక్ష సమంజసమే' అని సుప్రీంకోర్టు చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. నిర్భయ కేసులో బాలనేరస్తుడు కాబట్టి... మరణశిక్ష కాకపోయినా.. కాస్త ఎక్కువకాలం శిక్ష ఉండేలా తీర్పు చెప్పవచ్చు కదా.. అని అభిప్రాయపడ్డారు. అత్యంత అరుదైన నేరాల్లో కూడా శిక్షలు.. బాలనేరస్థుడి శిక్షలుగా ఉండాల్సిన అసవరం లేదన్నారు. బాలనేరస్థుడు... వయోజనుడు కాదు కాబట్టి.. పదేళ్లు అయినా శిక్ష వేయాల్సిందని చెప్పారు. నేర తీవ్రతను బట్టి శిక్ష ఉండాలని సుప్రీంకోర్టు చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ వివరాలను ఆయన మాటల్లోనే....
'నేరాలు కేవలం చట్టాలపై ఆధారపడి ఆగుతాయిని ఎప్పుడు ప్రశ్నించుకుని చట్టం చేయరు. వరకట్న నిషేధం చట్టం వచ్చింది.. వరకట్న దురాచారం ఆగిపోయిందా...? వితంతు వివాహ చట్టం వచ్చింది.. వితంతువులకు పెళ్లిళ్లు అవుతున్నాయా..? గృహ హింస నిషేధ చట్టం వచ్చింది.. కానీ హింస ఆగిపోయిందా... అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని.. జువైనల్ చట్టాన్ని వద్దనడం సరికాదు. 18 లోపు వయసున్న పిల్లలకు జువనైల్ అనే ప్రత్యేక చట్టం ఉంది. తెలిసీతెలియ కుండా కొన్ని నేరాలు చేసినా.. వారిపట్ల పెద్దలు చేసిన నేరాల పట్ల వ్యవహరించిన విధంగా వ్యవహరించవద్దని అని చట్టం చెబుతుంది. వారి పట్ల కొంత సానుభూతితో వ్యవహరించాలి. వారు మారడానికి అనువైన పరిస్థితులు మనం కల్పించాలి. వారిని సంస్కరించడానికి ప్రయత్నం చేయాలి. అనేవి బాల్య నేరస్తుడి చట్టంలో ఉన్న అంశాలు. వారిని మార్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చిన్నవయస్సులో ఉన్నారు కాబట్టి. చిన్నచిన్నపొరపాట్లు చేయొచ్చు.. దానికి మనం పెద్దపెద్ద శిక్షలు వేయొద్దు.. అని చట్టం బెబుతుంది.
జువైనల్ చట్టం... మ్యాగ్జిమ్ పనిష్ మెంట్ మూడేళ్లు 
జువైనల్ చట్టం ప్రకారం... మ్యాగ్జిమ్ పనిష్ మెంట్ మూడేళ్లు. కానీ నిర్భయ కేసులో ఆమెను రేప్ ఆండ్ మర్డర్ భయంకరమైన నేరాలతో బాలనేరస్థుడికి ప్రత్యక్ష సంబంధం ఉండడమే కాదు.... ఇతర వ్యక్తులతో చూస్తే... అతడు ఎక్కువ పాత్ర ఉన్నకూడా... 18 సంవత్సరాలకు మూడు నెలల తక్కువ ఉండడంతో అతను మూడు సంవత్సరాల జైలు శిక్షతో బయటపడినాడు. మేం ఏం చేయగలం. చట్టం అలా ఉందని.. ఢిల్లీ హైకోర్టు చెప్పింది. టెక్నికల్ గా చూస్తే... కోర్టు తీర్పు కరెక్టు.. అయితే చట్టాలను చేసే అధికారం కోర్టులకు లేదు. ఉన్న చట్టాలను అన్వయించి.. విశ్లేషించి.. చెప్పే అధికారమే కోర్టులకు ఉంది. అయితే కోర్టులు సాంకేతికంగా తీర్పు చెప్పాలనే లేదు. భారత న్యాయ చరిత్ర చూస్తే... చాలా చోట్ల కోర్టులు సృజనాత్మకంగా తీర్పులు చెప్పాయి. ఆర్టికల్ 356 చట్టంలో కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి ఇచ్చే సలహా.. న్యాయసమీక్షకు అతీతమని ఉంది. కేంద్ర కేబినెట్ రాష్ట్రపతికి ఇచ్చే సలహాపై సమీక్షించమని చెప్పారు. అయితే...సమీక్షించే ప్రాతిపదిక రాజ్యాంగబద్ధంగా ఉండాలని సూచించారు. అలాగే 9వ షెడ్యూలో ఓ చట్టం పెడితే....సమీక్షించగూడదని చెప్పాయి. రాజ్యాంగ మౌళిక స్వరూపానికి విరుద్ధమైతే సమీక్షిస్తామని కోర్టులు అన్నాయి.
కోర్టులు.. క్రియేటివ్ తీర్పులు
పలు సందర్భాల్లో కోర్టులు చాలా క్రియేటివ్ గా తీర్పులు ఇచ్చాయి. చట్ట విరుద్ధమైన సమ్మెలు కూడా న్యాయసమ్మతమైన సమ్మెలు కావొచ్చని తీర్పులు ఇచ్చాయి. అందువల్ల నిర్భయ కేసులో కూడా బాలనేరస్థుడి తీర్పు విషయంలో సృజనాత్మక భాష్యం చెప్పివుంటే బావుండేది. నిర్భయ ఘటన జరిగిన తర్వాత జువైనల్ చట్టంపై చర్చించాలని పార్లమెంట్ సభ్యులు భావిస్తున్నారు. మౌళికంగానే ఈ చట్టంలో తప్పుంది. చట్టం ప్రకారం.. ఒక పద్ధతి... చట్టాన్ని కోర్టులో ప్రశ్నించే అధికారం ఉంది. ఆ చట్టం కనుక రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే... ఆ చట్టాన్ని ప్రశ్నించవచ్చు. నేరస్తునికి జీవించే హక్కు ఉందంటున్నాము.. అలాంటప్పుడు బాధితురాలికి జీవించే హక్కు లేదా..? బాధితురాలని చంపే హక్కు నేరస్తుడికి ఎవరిచ్చారు. అత్యంత అరుదైన సందర్భంలో మరణశిక్ష సమంజసమే అని సుప్రీకోర్టు చెప్పింది. బాలనేరస్తుడు కాబట్టి... మరణశిక్ష కాకపోయినా.. కాస్త ఎక్కువకాలం శిక్ష ఉండేలా తీర్పు చెప్పవచ్చు కదా.. బలాత్కారాలు, హత్యలు తెలిసీతెలియని వయసులో చేస్తారా...? బాల నేరస్థుడు.. క్రూరంగా, జంతువులాగా వ్యవరించాడు. వయస్సులో తక్కువైనా.. అతను స్పృహలో ఉండిచేసిన నేరమే. అందువల్ల అత్యంత అరుదైన నేరాల్లో కూడా శిక్షలు బాలనేరస్థుడి శిక్షలుగా ఉండాల్సిన అసవరం లేదు. వయోజనుడు కాదు కాబట్టి.. పదేళ్లు అయినా శిక్ష వేయాల్సింది. నేర తీవ్రతను బట్టి శిక్ష ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది.
నేరస్తుడు విడుదల... బాధితులు అరెస్టు...
నేరస్తులకు శిక్షలు వేయడంపై బాధితురాలు సంతృప్తి చెందాలి.. బాలనేరస్తుడి విడుదలకు వ్యతిరేకంగా బాధితురాలి తల్లిండ్రులు, మహిళా సంఘాలు ఆందోళన చేపట్టగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వైపు నేరస్తుడు విడుదల అయ్యాడు. ఇది చాలా దుర్మార్గం... అన్యాయం. జువైనల్ చట్టంలో మౌలికంగానే తప్పులున్నాయి. రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కల్పించాలనే హక్కు ఉంది అని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

11:12 - December 22, 2015

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదిమంది జవాన్లు మృతి చెందారు. 15 మందితో వెళ్తున్న బీఎస్ ఎఫ్ చార్టర్ విమానం సాంకేతిక లోపంతో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే దక్షిణ ఢిల్లీ సమీపంలో ద్వారక వద్ద కుప్పకూలింది. విమానంలో ప్రయాణిస్తున్న పదిమంది జవాన్లు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు.  

ఢిల్లీలో విమాన ప్రమాదం..

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. 15 మందితో వెళ్తున్న బీఎస్ ఎఫ్ చార్టర్ విమానం దక్షిణ ఢిల్లీ సమీపంలో ద్వారక వద్ద కుప్పకూలింది

హైదరాబాద్ టోలీచౌకీలో దారుణం

హైదరాబాద్ : నిర్భయలాంటి చట్టాలోచ్చినా.. అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ టోలిచౌకిలో దారుణం జరిగింది. ఓ యువతిని తోటిఉద్యోగి ఇమాద్ కిడ్నాప్ చేసి మూడు రోజుల ఇంట్లో బంధించి ఆమెఉ లైంగికంగా వేధించాడు. తన ఫోన్ ద్వారా ఉద్యోగిని సోదరుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో.. షీ టీమ్ సహాయంతో ఇమాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

 

10:59 - December 22, 2015

హైదరాబాద్ : నిర్భయలాంటి చట్టాలొచ్చినా.. అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ టోలిచౌకిలో దారుణం జరిగింది. ఓ యువతిని తోటిఉద్యోగి ఇమాద్ కిడ్నాప్ చేసి మూడు రోజుల ఇంట్లో బంధించి ఆమెను లైంగికంగా వేధించాడు. తన ఫోన్ ద్వారా ఉద్యోగిని సోదరుడికి సమాచారం ఇవ్వడంతో.. షీ టీమ్ సహాయంతో ఇమాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

టిడిపిలో చేరిన కొణతాల, బాబ్జీ

హైదరాబాద్ : వైసిపికి కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీ గుడ్ బై చెప్పారు. టిడిపికి గూటికి చేరారు. కళా వెంకట్రావు, మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో వారు సీఎం చంద్రబాబును కలిశారు. అనంతరం టిడిపిలో చేరారు. 

పోలీస్ కాల్పుల్లో సైకో మృతి

కరీంనగర్ : జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. తల్లిదండ్రులతోపాటు రోడ్డుపై వెళ్తున్న వారిపై తల్వార్ తో దాడి చేశాడు. అతన్ని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అతను మృతి చెందాడు.

10:49 - December 22, 2015

హైదరాబాద్ : వైసిపికి కొణతాల రామకృష్ణ, గండి బాబ్జీ గుడ్ బై చెప్పారు. టిడిపికి గూటికి చేరారు. కళా వెంకట్రావు, మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో వారు సీఎం చంద్రబాబును కలిశారు. అనంతరం టిడిపిలో చేరారు. చంద్రబాబు రామకృష్ణ, బాబ్జీలకు కండువాలు కప్పి... పార్టీలో చేర్చుకున్నారు. కాగా కొణతాల, బాబ్జి.. రాకను మంత్రి గంటా శ్రీనివాస్ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఎవరూ వ్యతిరేకించ వద్దని... పార్టీ బలోపేతం కావాలంటే.. ఇతరులను పార్టీలో చేర్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

 

 

10:42 - December 22, 2015

కరీంనగర్ : జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. కన్న తల్లిదండ్రులతో పాటు రోడ్డుపై వెళ్తున్న వారిపై తల్వార్ తో దాడి చేశాడు. అతన్ని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అతను మృతి చెందాడు. జిల్లాలోని లక్ష్మీనగర్ లో బల్వీందర్ సింగ్ నివాసముంటున్నాడు. బెంగళూరులోని ఒరాకిల్ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. అయితే అతను సెలెక్టు కాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బల్వీందర్ సింగ్ తీవ్ర ఒత్తిడితో సైకోగా మారాడు. ఉన్నట్టుండి.. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులపై దాడి చేసి.. తీవ్రంగా గాయపరిచాడు. ఇంటి నుంచి బయటికి వచ్చి.... రోడ్డుపై వెళ్తున్న స్థానికులపై తల్వార్ తో దాడి చేశాడు. ఈ దాడిలో 20 మంది గాయపడ్డారు. వీరిలో 6 మందికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడి చేశారు. హెడ్ కానిస్టేబుల్ అలీపై కూర్చొని.. తల్వార్ తో నరకడానికి ప్రయత్నించాడు. అతని వేలు నరికేశాడు. ఈక్రమంలో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు వన్ టౌన్ సీఐ సైకో కాళ్లపై కాల్పులు జరిపారు. ఈక్రమంలో అతని ఉదర భాగంలో కూడా బుల్లెట్ దూసుకెళ్లడంతో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం... బల్వీందర్ ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. 

 

నేటితో ముగియనున్న ఎపి అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. బెజవాడ కల్తీ మద్యంతోపాటు పలు అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 12 గం.లకు వైసీపీ శాసనసభా పక్షం సమావేశం జరుగనుంది. కాల్ మేనీ, రోజా సస్పెన్షన్ వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

 

08:58 - December 22, 2015

ప్రైవేట్ యూనివర్సీటీల బిల్లు సరికాదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకులు నాగేశ్ కుమార్, టిడిపి నేత శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, బీజేపీ నేత వెంకటేశ్వర్లు, వైసిపి గౌతంరెడ్డి లు పాల్గొని, మాట్లాడారు. పలు విషయాలను చర్చించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

నేడు మహారాష్ట్రకు హరీష్ రావు బృందం..

హైదరాబాద్‌ : మంత్రి హరీశ్‌రావు బృందం నేడు మహారాష్ట్రకు వెళ్లనుంది. తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజీలపై అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. నాగ్‌పూర్‌లోని విధానభవన్‌లో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్‌ మహాజన్‌తో ఆయన భేటీ అవుతారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ముగ్గురు చీఫ్‌ ఇంజినీర్లు హరిరామ్‌, భగవంత్‌రావు, ఎస్‌.వెంకటేశ్వర్లు, ప్రత్యేకాధికారి శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు ఉంటారు.

08:47 - December 22, 2015

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 214ను తక్షణమే ఉపసంహరించుకోవాలని రైతు సంఘం నేత నంద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశాపై నిర్వహించిన జనపథంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 214 జీవో కలకలం రేపుతోంది. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోయేవారి మీద ఈ జీవో ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఈ జీవో వల్ల ఎవరెవరు ఎలా నష్టపోతారు? నిర్వాసితులకు జరిగే అన్యాయాలేమిటి?' వంటి పలు అంశాలపై నంద్యాల మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:39 - December 22, 2015

'మీరు నివసించే ప్రాంతంలో ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ కోసం మీ ఇంటినో, మీ భూమినో ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులిస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు? నష్టపరిహారం అడుగుతారు. పునరావాసం చూపించమంటారు. మీ కోరిక న్యాయమైనదే'. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి న్యాయమైన కోరికలు కోరుకోవద్దంటోంది. పునరావాసం బాధ్యత తనది కాదంటోంది. ఆ భూమికి కొంత రేటు ఇస్తాం. తీసుకుని వెళ్లిపోండి అంటోంది. అదిగో అదే 214 జీవో.
పారిశ్రామికాభివృద్ధికీ, ప్రాజెక్ట్ ల నిర్మాణానికీ భూమి కీలకం
పారిశ్రామికాభివృద్ధికీ, ప్రాజెక్ట్ ల నిర్మాణానికీ భూమి కీలకం. వ్యవసాయానికీ భూమే ఆధారం. ప్రాజెక్ట్ ల నిర్మాణం జరగకపోతే, వ్యవసాయరంగం పురోగమించదు. పారిశ్రామికాభివ్రుద్ధి సాధించకపోతే, ఆధునిక సౌకర్యాలను అందిపుచ్చుకోలేము. అన్ని రంగాల్లో సమగ్రాభివ్రుద్ధి సాధించడమే కాదు దాని ఫలాలు అందరికీ సమానంగా అందినప్పుడే ఏ సమాజంలోనైనా సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి.
ప్రజల నుంచి భూ సేకరణ
ప్రాజెక్ట్ లు, రోడ్లు, మెట్రో రైళ్లు, ఎయిర్ పోర్టులు, పరిశ్రమలు ఇలా విభిన్న అవసరాల పేరుతో ప్రభుత్వాలు ప్రజల నుంచి భూములు సేకరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు భారీ టార్గెట్లు పెట్టుకున్నాయి. ఒక్క ఏపీ ప్రభుత్వమే 15 లక్షల ఎకరాలు సేకరించేందుకు వ్యూహరచన చేస్తోంది. తెలంగాణలో చేపట్టబోతున్న ప్రాజెక్ట్ లకు భారీగానే భూమి కావాలి. దీంతో అప్పటిదాకా ఆయా భూముల మీద ఆధారపడి జీవించినవారు ఉపాధి కోల్పోయి నిర్వాసితులుగా మారాల్సి వస్తుంది. మనం ప్రాజెక్ట్ లు, రోడ్లు, రైలు మార్గాలు, ఎయిర్ పోర్టులు నిర్మించుకునేదీ, పరిశ్రమలు స్థాపించుకునేదీ అందరి సుఖ సంతోషాల కోసమే. అయితే, ఈ నిర్మాణాలు మరికొందరిని నిర్వాసితులుగా మారుస్తున్నాయి. పుట్టి పెరిగిన చోటే నిలువ నీడలేని పరిస్థితిని స్రుష్టిస్తున్నాయి. దేశాభివ్రద్ధికి సహకరించిన పాపానికి తాము అంతులేని దు:ఖాన్ని అనుభవించాల్సి వస్తోంది.
ఇప్పటికీ అందని పరిహారం
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మొన్ననే 60 వసంతాల పండుగ చేసుకుంది. కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కోసం భూమిలిచ్చినవారిలో కొందరికి ఇప్పటికీ పరిహారం అందలేదు. వారి జీవితాలకో దారి దొరకలేదు. మన దేశం సాధించిన అద్భుత ప్రగతికి సంకేతంగా నిలిచే ప్రతి ప్రాజెక్ట్ వెనకా, ప్రతి నిర్మాణం వెనక వాటికి భూమిలిచ్చి, అందుకు తగిన పరిహారం లభించక, అంతులేని దు:ఖాన్ని దిగమింగుతున్నవారి జీవితాలున్నాయి. ఇలాంటి నిర్వాసితుల పోరాటాల ఫలితంగా మనదేశంలో భూ సేకరణ చట్టాలొచ్చాయి. సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకొచ్చిన జీవో 68, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆఖరి సంవత్సరంలో రూపొందించిన భూ సేకరణ చట్టం నిర్వాసితులకు గతం కంటే మెరుగైన మేళ్లు చేసి పెట్టాయి.
భూ సేకరణ చట్టం...నాలుగు రెట్ల భూమివ్వాలి..
వివిధ ప్రాజెక్ట్ ల కోసం భూమినీ, ఇంటినీ కోల్పోయేవారికి వారి సంస్కృతి సంప్రదాయాలు కాపాడేవిధంగా కాలనీలు ఇళ్లు నిర్మించి, విద్య వైద్య సౌకర్యాలు రక్షిత మంచినీరు కల్పించాలన్నది జీవో 68 సారాంశం. ఇక భూ సేకరణ చట్టం ప్రకారం నాలుగు రెట్ల భూమిని ఇవ్వాల్సి వుంటుంది.
చట్టాల స్ఫూర్తికి తూట్లు
అయితే, ఇప్పుడు ఈ చట్టాల స్ఫూర్తికి తూట్లు పడుతున్నాయి. నిర్వాసితులకు మరిన్ని మేలైన ప్యాకేజీల గురించి ఆలోచించడం మానేసి, ఉన్న వాటికే ఎగనామం పెట్టేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
నిర్వాసితులకు తీవ్ర అన్యాయం
అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భ్రమలు కల్పించి, భూ సమీకరణ అనే కొత్త విధానం తీసుకుచ్చి లాఘవంగా భూములు సంపాదించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు భూములిచ్చిన తరం అభివృద్ధి ఫలాలు చూస్తుందో లేదో చెప్పలేం. ఇక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ధోరణి మరో రకంగా వుంది. ప్రభుత్వానికి ఎక్కడ భూమి అవసరం వచ్చినా, భూ సేకరణ చట్టం ద్వారా కాకుండా మార్కెట్ రేటు కట్టి భూములు కొంటామంటోంది. ఇందుకోసం 214 జీవో తీసుకొచ్చింది. ఇది నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేసే జీవో.
నిర్వాసితులకు దిక్కెవరు?
ప్రభుత్వం అడిగిన రేటుకి భూమిని అమ్మేసి ఇక అక్కడ నుంచి వెళ్లిపోవాలి. భూమి అప్పగించినవారి సంక్షేమం గురించి ప్రభుత్వం పట్టించుకోదు. వారికి పునరావాసం చూపించదు. అంటే ఇక నుంచి ప్రభుత్వం ఎక్కడ పరిశ్రమలు పెడతామన్నా, సెజ్ లు పెడతామన్నా, ప్రాజెక్ట్ లు కడతామన్నా అక్కడ నివసించేవారంతా మారుమాట్లాడకుండా, నష్టపరిహారాలు, పునరావాసాల గురించి అడగకుండా, ప్రభుత్వం దయతో చేతిలో పెట్టింది తీసుకుని కట్టుబట్టలతో అక్కడ నుంచి వలసపోవాలన్నమాట. ప్రజా సంక్షేమానికి పాటుపడాల్సిన ప్రభుత్వాలే ఇంత దుర్మార్గంగా, ఇంత నిర్ధయగా, ఇంత అన్యాయంగా వ్యవహరిస్తే, ఇక నిర్వాసితులకు దిక్కెవరు?

 

08:07 - December 22, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 45వేలకు పైగా గృహాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని ఇళ్లను కేంద్రం మంజూరు చేయటం విశేషం. ఈ నేపథ్యంలో మరికొన్ని ఇళ్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గతంలో తెలంగాణ రాష్ట్రానికి 10వేల ఇళ్లు మంజూరు చేయగా ప్రస్తుత కేటాయింపుతో 55 వేల గృహాలకు పైగా తెలంగాణ రాష్ట్రానికి మంజూరు అయ్యాయి.
గృహనిర్మాణ పథకం కింద రూ.833 కోట్ల సాయం
అందరికీ ఇళ్లు అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మరో 45 వేల గృహాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గృహనిర్మాణ పథకం కింద తెలంగాణకు రూ.833 కోట్ల రూపాయలు సాయం చేసినట్టు పేర్కొంది. రెండు దశల్లో ఇప్పటి వరకు 55 వేల 507 గృహాలు కేంద్రం మంజూరు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకే ఇళ్ల మంజూరు : బండారు
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకే కేంద్రం ఇళ్లను మంజూరు చేసిందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. మరో 31 పట్టణాలను అందరికీ ఇళ్ల పథకంలో చేర్చాలని కోరామని తెలిపారు. రాష్ట్రం ప్రతిపాదనలు పంపిస్తే ఆమోదిస్తామని వెంకయ్య చెప్పిన మేరకు రాష్ర్టానికి కేంద్రం 2విడతల్లో 55,507 ఇళ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు.
గతంలో 10 వేల ఇళ్ల మంజూరు
కేంద్ర గృహా నిర్మాణ శాఖ తెలంగాణకు గతంలో రాష్ర్టానికి 10 వేల ఇళ్లను మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. ప్రస్తుతం కేటాయించిన 45 వేల గృహాల అనుమతులపై త్వరలో కేంద్ర గృహ నిర్మాణ శాఖ అధికారిక ప్రకటన చేయనుంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వంలోని పట్టణాబివృద్ది శాఖ గతంలో ఐదు రాష్ట్రాలకు 2 లక్షల 28వేల 204 ఇళ్లను మంజూరు చేయగా ,అందులో ఎనభై ఐదు శాతం అంటే ఒక లక్షా 93వేల 147 ఇళ్లను ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించింది. కాగా తెలంగాణకు కేవలం పది వేల ఇళ్లను మాత్రమే మంజూరు చేశారు.
జిల్లాల వారిగి కేటాయింపులు...
తాజా కేటాయింపుతో కేటాయించిన గృహాల సంఖ్య 55 తెలంగాణ రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు పట్టణాల వారీగా చూస్తే హైదరాబాద్ కు 29వేల531 గృహాలు, కరీంనగర్ 1038 గృహాలు, గజ్వేల్ 1842, నాగర్ కర్నూలు 250, మెదక్ 2353, పాల్వంచ 1903, వికారాబాద్ 291, వనపర్తి 592, నల్లగొండ 405, సిరిసిల్ల 1680, అచ్చంపేట 500, మెట్పల్లి 1250, మహబుబాబాద్ 800, నిర్మల్ 500, ఆర్మూర్ 500 గృహాలు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

07:59 - December 22, 2015

హైదరాబాద్ : విద్యార్థుల ఆందోళనతో సంబంధంలేదు. భవిష్యత్‌లో సమస్యలు తలెత్తుతాయన్న విద్యావేత్తల హెచ్చరికలను పట్టించుకోలేదు. విద్యను పూర్తిస్థాయిలో కమర్షియల్‌ చేసే లక్ష్యంతో అన్ని అంశాలను పక్కనబెట్టేశారు. ఎప్పటినుంచో అనుకుంటున్నట్లుగానే ప్రయివేట్‌ విశ్వవిద్యాలయాల బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టారు. సంఖ్యాబలం ఉందికాబట్టి బిల్లుకు పచ్చ జెండా ఊపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యారంగంలో నాణ్యత పెంపొందించుతామంటూ కొంతకాలంగా ఏపీ గవర్నమెంట్‌ సందర్భం చిక్కినప్పుడల్లా చెప్పుకొచ్చింది. ఆ క్రమంలోనే రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా బిల్లును ఏపీ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనిని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సభలో ప్రవేశపెట్టారు. అధికార పక్షం బలం పుష్కలంగా ఉండడంతో బిల్లుకు ఆమోదం లభించింది.
విద్యాప్రమాణాలను పెంపొందించేందుకు ప్రైవేట్ వర్సిటీలు : మంత్రి గంటా
రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్శిటీలను నెలకొల్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందో మంత్రి గంటా వివరించారు. విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉపయోగపడతాయని అన్నారు. ఆ బిల్లులో పొందుపరిచిన అంశాలిలా ఉన్నాయి. యూనివర్శిటీలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం ఐదేళ్లపాటు రాయితీలిస్తుంది. స్థలాలను లీజు పద్ధతిలో ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఏదైనా సంస్థ విశ్వవిద్యాలయం స్థాపనకు ఉత్సాహం చూపిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తుదారు సంస్థ విశ్వసనీయత, ఆర్థిక సామర్థ్యం, దానికున్న పేరుప్రఖ్యాతులు తదితర అంశాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది. ఆయా యూనివర్శిటీలు అందించే కోర్సులకు సంబంధించిన ఫీజు వివరాలు, వెనకబడిన వర్గాలకు అందించే రాయితీలు, తదితర అంశాలను పరిశీలించి నిపుణుల కమిటీ 60 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. అనంతరం 30 రోజులలోపు ఆ ప్రతిపాదనను పరిశీలించి ప్రభుత్వం అంగీకరించడమో లేదా నిరాకరించడమో చేస్తుంది.
ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటుకు కొన్ని నిబంధలు
ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటుకు ప్రభుత్వం కొన్ని నిబంధలను పెట్టింది. అన్ని మౌలిక వసతులు కలిగిన పూర్తిస్థాయి గ్రీన్‌ ఫీల్డ్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలి. ఆయా వర్శిటీలు ఎటువంటి అనుబంధ సంస్థలనూ కలిగి ఉండకూడదు. అయిదేళ్ల పరిశీలన అనంతరం దూరవిద్య కోర్సులు అందించేందుకు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం అనుమతిస్తుంది. తొలుత ఒక క్యాంపస్‌, ఒకవేళ పారిశ్రామిక క్లస్టర్లకు సన్నిహితంగా ఉంటూ పలు కోర్సులు అందిస్తే దానికనుకూలంగా రెండు క్యాంపస్‌లు నెలకొల్పొచ్చు.
సెర్చ్ కమిటీ నేతృత్వంలో చాన్సెలర్ల నియామకాలు 
చాన్సెలర్ల నియామకాలు ప్రైవేట్‌ సంస్థతో ఏర్పాటైన సెర్చ్ కమిటీ చేస్తుంది. ప్రొఫెసర్ల నియామకం ఆసాంతం ఛాన్సెలర్‌ల నేతృత్వంలోనే కొనసాగుతుంది. ఒకవేళ యూనివర్శిటీ ప్రమాణాలు పాటించకపోతే విచారణ జరిపి ప్రభుత్వం దాని గుర్తింపు రద్దు చేసే అవకాశముంటుంది. అయితే ఫీజులు, వెనుకబడిన వర్గాలవారికి ఇచ్చే రాయితీల మీద స్పష్టత లేదు. అయితే ప్రైవేట్ యూనివర్శిటీలు వెల్లువెత్తితే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పనైపోతుంది. క్రమంగా ప్రభుత్వం కూడా ఆ బాధ్యతలనుంచి తప్పుకుంటుంది. ఫలితంగా లక్షలు కుమ్మరిస్తేనే ఉన్నత చదువుల పట్టాలు లభిస్తాయి. ఇలాంటి అనేక సమస్యల దృష్ట్యా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే ప్రైవేట్‌కు పెద్దపీట వేయడంలో చంద్రబాబు సర్కార్‌ ఎప్పుడూ ముందుంటుందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకెలాంటి బిల్లులను ప్రవేశపెడుతుందోనన్న భయం ప్రజల్లో వెల్లువెత్తుతోంది.

 

07:52 - December 22, 2015

హైదరాబాద్ : ప్రభుత్వం చేపడుతున్న నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కోరారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతిని చంద్రబాబు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పథకాల గురించి ఈ సందర్భంగా ప్రెసిడెంట్‌కు వివరించారు.
రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ను కలిసి..ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతంగా మార్చేందుకు చేపట్టిన నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ఈ నెలాఖారున అనంతపురంలో ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఆరంభించేందుకు రావాల్సిందిగా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కోరారు.
సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు : చంద్రబాబు
సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, రాష్ట్రంలో రెండు జీవ నదులను అనుసంధానం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చంద్రబాబు రాష్ట్రపతితో అన్నారు. ఈ సందర్భంగా పట్టిసీమ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న 7 మిషన్లలో మొదటిదైన ప్రాథమిక రంగంలో జల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని సీఎం పేర్కొన్నారు.
రాయలసీమను ఉద్యాన కేంద్రంగా చేస్తాం : చంద్రబాబు
నీరు-చెట్టు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని చంద్రబాబు అన్నారు. రాయలసీమను ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రాష్ట్రపతికి వివరించారు. అనంతపురం జిల్లాలో నీరు-చెట్టు సబ్‌ మిషన్‌లో భాగంగా లక్ష ఫామాయిల్‌ మొక్కలను నాటాలని సంకల్పించామని తెలిపారు. జిల్లాలో భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రపతితో చంద్రబాబు అన్నారు.

 

07:46 - December 22, 2015

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. రోజా సస్పెన్షన్‌, కాల్‌మనీ వ్యవహారాలపై హీటెక్కిన శాసనసభ మరింత వేడెక్కనుంది. రోజా సస్పెన్షన్‌ వ్యవహారంపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష వైసిపి బాయ్‌కాట్‌ చేసింది. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో అపోజిషన్‌ లేకుండానే అధికార పక్షం కీలక బిల్లుల్ని ఓకే చేసుకుంది. మరో పక్క స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైసీపీ యోచిస్తోంది.
రోజా సస్పెన్షన్‌ పై హాట్‌హాట్‌ చర్చ
ఏపీ శాసన సభ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ అంశంపై ఈరోజూ హాట్‌హాట్‌ చర్చ సాగింది. సస్పెన్షన్‌ వేటుపై పాలక ప్రతిపక్షాలు మెట్టు దిగడం లేదు. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత జగన్‌... రోజాపై సస్పెన్షన్‌ అంశాన్ని ప్రస్తావించారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాల్సిందేనని లేకుంటే తాము సభలో ఉండలేమని అన్నారు. ఈ అంశంపై సమావేశాలను బాయ్ కాట్ చేసేందుకు సైతం వెనుకాడబోమని ప్రకటించారు.
జగన్‌ వ్యాఖ్యలను ఆక్షేపించిన మంత్రి యనమల
జగన్‌ వ్యాఖ్యలను శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల ఆక్షేపించారు. రోజాపై విధించిన సస్పెన్షన్‌ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రోజాను సస్పెండ్‌ చేసే అధికారం స్పీకర్‌కు లేదనడం జగన్‌ అవివేకానికి నిదర్శనమన్నారు. రోజా వ్యాఖ్యలు అభ్యంతరకంగా ఉన్నాయని... అందువల్ల ఆమె సస్పెన్షన్‌ను ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు.
జగన్ పై కోడెల ఆగ్రహం 
సభ్యురాలిని సస్పెండ్‌ చేసే అధికారం సభకు లేదని ఏ విధంగా చెబుతారని వైకాపా అధినేతను ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రశ్నించారు. సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కోరడానికి ఓ విధానం ఉంటుందని... నిబంధనలకు విరుద్ధమంటూ పదేపదే ఎలా ప్రస్తావిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ
మరోవైపు.. తమ సభ్యులను ఉద్దేశించి జగన్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. తాము టిడిపి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఎన్నడూ పచ్చ కండువాలు కప్పుకోలేదని, తమది జాతీయ పార్టీ అని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు చెప్పారు.
బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన జగన్‌ 
రోజా సస్పెన్షన్‌పై ప్రభుత్వం మెట్టుదిగక పోవడం... కాల్‌మనీపై పూర్తిస్థాయి చర్చ జరపక పోవడాన్ని నిరసిస్తూ.. సమావేశాలను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు.
స్పీకర్‌ కోడెలపై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో వైసీపీ
సభను బహిష్కరించిన వైసీపీ.. శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. వైసీపీ ఎల్‌పీ కార్యాలయంలో భవిష్యత్‌ కార్యాచరణపై ఆపార్టీ ఎమ్మెల్యేలు చర్చించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై రేపు సమావేశమై చర్చించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు ప్రకటన
వైసీపీ సభ్యుల వాకౌట్‌ అనంతరం.. సీఎం చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై ప్రకటన చేశారు. పదేళ్లలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని... డబ్బులు ఖర్చుపెట్టి ఏ ప్రాజెక్టుకూ నీళ్లు ఇవ్వలేదని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని... వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. చరిత్రలో తొలిసారి రెండు నదుల అనుసంధానం జరిగినట్లు చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ద్వారా గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కొత్త ప్రాజెక్టుల వల్ల 36 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు సాధ్యపడుతుందని తెలిపారు.
జగన్‌ కు సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్ 
సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో... ప్రతిపక్షం సభను బాయ్‌కాట్‌ చేయడం ఒక విశేషమైతే.. జగన్‌ పుట్టినరోజు సందర్భంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా.. మంత్రులు, ఎమ్మెల్యేలు జగన్‌ స్థానం వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలపడం మరో హైలెట్‌గా నిలిచింది.

 

 

07:29 - December 22, 2015

హైదరాబాద్ : అమెరికాలోని యూనివర్సీటీ వీసాల గొడవ తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు శాపంగా మారింది. కొంత మంది అమెరికా వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరి కొంత మందిని ఎయిర్ ఇండియా మనోవేధనకు గురి చేస్తోంది. దీంతో విద్యార్థులు ఎయిర్ ఇండియా కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారు. ఇది ఇలా ఉంటే వర్సిటీల వ్యవహారంపై విదేశాంగశాఖ మంత్రితో చర్చిస్తామని కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు తెలిపారు. అమెరికాలోని యూనివర్శిటీలకు వెళ్లే విద్యార్థులను వారి శ్రేయస్సు కోసమే ఆపుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అయోమయం
అమెరికా స్టడీ వీసాలు తెలుగు రాష్ట్రాల విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నాయి. శాన్‌ప్రాన్సిస్కోలోని సిలికాన్‌ వ్యాలీ యూనివర్శిటీ, నార్త్‌ వెస్టర్న్‌ పాలిటెక్నిక్‌ యూనివర్శిటీల్లో ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రెండు యూనివర్శిటీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారనే కారణంతో అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు విద్యార్థులను తిరిగి పంపించేస్తున్నారు.
హైదరాబాద్‌లో విద్యార్థుల ఆందోళన
సిలికాన్‌ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్‌ వెస్టర్న్ పాలిటెక్నిక్‌ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లి వచ్చిన విద్యార్థులు మోసపోవడంతో హైదరాబాద్‌లో ఆందోళనలకు దిగుతున్నారు. ఆ యూనివర్శిటీలకు గుర్తింపు లేదని తెలిసి కూడా ఎయిర్‌ ఇండియా యాజమాన్యం తమకు ఎలా బోర్డింగ్‌ పాస్‌ ఎలా ఇచ్చిందని నిలదీస్తున్నారు. తక్షణమే తమ డబ్బులు తమకు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ.. సైఫాబాద్‌ ఆదర్శ్ నగర్‌లోని ఎయిర్‌ ఇండియా కార్యాలయం ముందు విద్యార్థులు ధర్నాలు చేపడుతున్నారు.
తిరిగి ఇండియాకు విద్యార్థులు
ఇది ఇలా ఉంటే అమెరికాలోని కాలిఫోర్నియా సిలికాన్ యూనివర్శిటీలో ఉన్నత చదువు కోసం వెళ్లిన 15 మంది విద్యార్థులను దుబాయి విమానాశ్రయంలో అడ్డుకున్న అధికారులు తిరిగి ఇండియాకు పంపించేశారు. సోమవారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్న ఈ విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విమానాశ్రయం దగ్గర ఆందోళన చేశారు.
వారి శ్రేయస్సు కోసమే ఆపుతున్నాం : ఆశోక్ గజపతిరాజు
ఐతే అమెరికాలోని యూనివర్శిటీలకు వెళ్లే విద్యార్థులను వారి శ్రేయస్సు కోసమే ఆపుతున్నామని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు తెలిపారు. కొన్ని యూనివర్శిటీలకు గుర్తింపు సమస్యలున్నాయని..ఈ నేపథ్యంలోనే ఇమ్మిగ్రేషన్‌ అధికారుల విద్యార్థులను అనుమతించడం లేదని చెప్పారు. వర్సిటీల వ్యవహారంపై విదేశాంగశాఖ మంత్రితో చర్చిస్తామని తెలిపారు. మరోపక్క విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిసి విద్యార్థుల ఇబ్బందులపై చర్చిస్తామని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు చెప్పారు.
ఇప్పటికీ టికెట్లు బుక్
ఇది ఇలా ఉంటే బ్రిటిష్ ఎయిర్ లైన్స్ తో పాటు పలు ఎయిర్ లైన్స్ లలో విద్యార్థులు ఇప్పటికీ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈ నెల 23, 24, 25 తేదిల్లో మరో 50 మంది అమెరికా వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ నెలకొంది.

 

 

నేడు పబ్లిక్ గార్డెన్స్ లో 'హరిత పందిరి'పై మేళా

హైదరాబాద్ : నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ లో 'హరిత పందిరి'పై నేడు మేళా నిర్వహించనున్నారు. 

నేడు వైసిపి ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం

హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యేలతో నేడు ఆ పార్టీ అధినేత జగన్ సమావేశం కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

06:34 - December 22, 2015

ఢిల్లీ : డిడిసిఏ అక్రమాలపై పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే.. డిడిసిఏ కుంభకోణంలో పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలంటూ విపక్షాలు హంగామా చేశాయి. డీడీసీఏపై చర్చకు వీలులేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పడంతో విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది.
జైట్లీ రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టు
వరుస వాయిదాల అనంతరం పన్నెండున్నరకు లోక్ సభ తిరిగి ప్రారంభమైంది. డిడిసిఏలో జరిగిన అక్రమాలపై ఆదివారం కీర్తీ ఆజాద్‌ మీడియా సమావేశంలో వెల్లడించిన అంశాలను కాంగ్రెస్‌ సభ్యుడు కెసి వేణుగోపాల్‌ ప్రస్తావించారు. జైట్లీ రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ఉద్యుక్తులు కాగా, విపక్ష ఎంపీలు ఆయనకు అడ్డుతగిలారు. ఓ సందర్భంలో ఆగ్రహానికి లోనైన జైట్లీ 'కూర్చొని వినండి' అంటూ గట్టిగా అరిచారు. దీనికి ప్రతిగా విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేశారు.
కుంభకోణం అవాస్తమని జైట్లీ స్పష్టం
ఢిల్లీ స్టేడియంను 114 కోట్లతో పునర్నించామని, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీకి కాంట్రాక్ట్‌ ఇచ్చామని, ఇందులో కుంభకోణం జరిగిందనడం అవాస్తమని జైట్లీ స్పష్టం చేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియానికి బీసీసీఐ 4కోట్లు మాత్రమే ఇచ్చిందని... కాంగ్రెస్‌ హయాంలో ఆ మైదానం పునర్నిర్మాణానికి 9 వందల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. నిజాలెప్పుడూ ప్రతికూలంగానే ఉంటాయని కాంగ్రెస్‌నుద్దేశించి జైట్లీ వ్యాఖ్యానించారు.
సిబిఐతో విచారణ జరిపించాలన్న కీర్తి ఆజాద్
డిడిసిఏలో జరిగిన అక్రమాలపై ఆదివారం మీడియా సమావేశంలో ఆరోపణలు చేసిన బిజెపి ఎంపి కీర్తీ ఆజాద్‌, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సభలో ఎదురుపడడం ఆసక్తి రేపింది. బిజెపి ప్రభుత్వం అవినీతికీ వ్యతిరేకంగా పనిచేస్తోందని పేర్కొన్న కీర్తి ఆజాద్- డిడిసిఏ వ్యవహారంలో సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. దీంతో నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.
రాజ్యసభలోనూ డిడిసిఏపై దుమారం
అటు రాజ్యసభలోనూ డిడిసిఏపై దుమారం చెలరేగింది. సభ ప్రారంభానికి ముందే విపక్ష కాంగ్రెస్ డీడీసీఏపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. చైర్మన్ తీర్మానాన్ని అంగీకరించకపోవడంతో అరుణ్ జైట్లీ రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. ప్రస్తుత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ డీడీసీఏ అధ్యక్షునిగా ఉన్న 13ఏళ్ల కాలంలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆప్ ఆరోపించిన విషయం తెలిసిందే.

 

 

Don't Miss