Activities calendar

23 December 2015

క్రిస్టియన్ భవన నిర్మాణానికి బాబు శంకుస్థాపన...

గుంటూరు : నగర శివారులోని అడవిచెక్కిళ్లపాడులో సుమారు రూ.10 కోట్లతో నిర్మించనున్న క్రిస్టియన్ భవన నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 

సుల్తానాబాద్ లో మహిళ ఆత్మహత్య..

కరీంనగర్ : సుల్తానాబాద్ లో బుధవారం సాయంత్రం మహిళ ఆత్మహత్య చేసుకుంది. భూ వివాదం పరిష్కార విషయంలో పోలీసులు సరిగ్గా స్పందించడం లేదని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

21:27 - December 23, 2015

మెదక్ : తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన అయుత మహా చండీయాగానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. గురుప్రార్థనతో ప్రారంభమైన యాగం.. గణపతి మహాపూజ, మహాసంకల్పంతో తొలి రోజు క్రతువు పూర్తయింది. యాగశాలలో 2 వేల మంది మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. అయుత చండీ మహాయాగంతో మెదక్ జిల్లా ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. బుధవారం ఉదయం గురు ప్రార్థనతో అయుత చండీ మహాయాగం ప్రారంభమైంది. నిర్ణయించిన ముహుర్తం 8 గంటల 30 నిమిషాలకు సీఎం కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు.

గవర్నర్ రాక..
రుత్వికులు, బ్రాహ్మణులు, నిర్వాహకులు సీఎంకు స్వాగతం పలికారు. యాగశాలకు వచ్చిన ఆయనకు వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రుత్వికులతో కలిసి సీఎం దంపతులు యాగశాలలో ప్రదక్షిణ చేశారు. యాగస్థలికి చేరుకున్న గవర్నర్‌ నరసింహన్‌ దంపతులకు సీఎం దంపతులు స్వాగతం పలికారు. గవర్నర్‌ దంపతులు, సీఎం దంపతులు పూజలో పాల్గొన్నారు. యాగశాలలో ఏకదశన్యాస పూర్వక సహస్ర చండీ పారాయణంతో పాటు రాజశ్యామల, మహారుద్ర పురశ్చరణ చతుర్వేద యాగం, మహాసౌరం, ఉక్తదేవతా జపములను నిర్వర్తించారు. 2 వేల మంది మహిళలు కుంకుమార్చన చేశారు. సీఎం సతీమణి శోభ, కుమార్తె కవిత కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

50వేల మందికి అన్నదానం..
అయుత మహాచండీయాగాన్ని తిలకించేందుకు ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు, భక్తులు రావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. యాగశాల వద్ద 4 వేల మంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. రోజూ 50వేల మందికి అన్నదానం చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల చుట్టూ 5 కిలోమీటర్ల వరకు సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు.

పలువురు ప్రముఖుల హాజరు...
తొలి రోజున గవర్నర్‌ దంపతులతో పాటు.. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్, రామోజీరావుతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సీఎస్‌ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఎంపీలు కవిత, కేశవరావు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

21:24 - December 23, 2015

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తక్కెళ్లపాడులో క్రిస్టియన్‌ భవన్‌కు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం నూజివీడు త్రిపుల్‌ ఐటీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులు సాంకేతికంగా వస్తున్న అవకాశాలు ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రైవేట్‌ వర్శిటీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రసిద్ధి చెందిన పది యూనివర్శిటీల శాఖలను రాష్ట్రంలో నెలకొల్పడమే ధ్యేయమన్న సీఎం ప్రైవేట్‌ వర్శిటీల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ఆలోచిస్తున్నామన్నారు.

ప్రపంచం నాలెడ్జ్ పై ఆధారపడి ఉంది..
నూజీవీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల్లో 55 శాతం విద్యార్థినులు ఉండడం మంచి పరిణామని చంద్రబాబు అన్నారు. ప్రపంచం మొత్తం నాలెడ్జ్‌పై ఆధారపడి ఉందని, పేదరిక నిర్మూలన జరగాలన్నా, సంపద సృష్టించాలన్నా నాలెడ్జ్‌ చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయడ్డారు. అంతకుముందు చంద్రబాబు కళాశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో బాబుతోపాటు మంత్రులు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

తక్కెళపాడులో క్రిస్టియన్ భవన్..
అంతకు ముందు సీఎం చంద్రబాబు అడవి తక్కెళ్లపాడులో క్రిస్టియన్‌భవన్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ సంస్థల ఆస్తులను పరిరక్షిస్తామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. 10కోట్ల రూపాయలతో నిర్మించే క్రిస్టియన్‌ భవన్‌.. క్రిస్మస్‌ సందర్భంగా పేద క్రైస్తవులకు ప్రత్యేక కానుక అని అన్నారు. దళిత క్రిస్టియన్ల సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచంలోని అరుదైన రాజధానుల్లో ఒకటిగా అమరావతి ప్రసిద్ధికెక్కాలని సీఎం ఆకాంక్షించారు.

చంద్రన్న కానుక..
ఇదిలా ఉంటే క్రిస్మస్ పండుగ సందర్బంగా పేద క్రైస్తవులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానుక ప్రకటించింది. చంద్రన్న కానుక పేరుతో పండుగ సరుకుల కిట్లను ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుపు రంగు కార్డు కలిగిన క్రైస్తవ సోదరులకే కానుక అందిచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 11 లక్షల కిట్లను సిద్దం చేసి రేషన్ డీలర్ల ద్వారా అందిస్తున్నారు. గోధుమపిండి, పప్పు, నూనె, పంచదార , బియ్యం , నెయ్యి లాంటి పదార్ధాలను అందజేస్తున్నారు.

21:21 - December 23, 2015

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటనకు కొద్ది సేపు ముందు సరిగ్గా ఇదే డిమాండ్ పై వేలాది అంగన్ వాడీలు విజయవాడలో ప్రదర్శన నిర్వహించారు. ఆ రోజు అంగన్ వాడీల పట్ల పోలీసులు ఎంతో కఠినంగా వ్యవహరించారో, వారిని ఏ విధంగా అరెస్టు చేశారో, ఎంత ఫోర్స్ గా పోలీస్ వ్యాన్ లలోకి తోసేశారో జనం టీవీలలో కళ్లారా చూశారు. ఓ వైపు తమ ఆకలి కేకలు వినిపిస్తూ రోడ్డు మీదకొచ్చిన అంగన్ వాడీలతో ఇంత కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వమే, అసెంబ్లీలో సానుకూలంగా స్పందించింది. వచ్చే బడ్జెట్ నుంచి పెంచిన వేతనాలు అమలు చేస్తామంటూ స్వయంగా ముఖ్యమంత్రి నిండు సభలో ప్రకటించిన తీరే అంగన్ వాడీల కోరికలు ఎంత న్యాయమైనవో చెబుతోంది.

సమర్థనీయం కాదు..
ఎంతో ఆవేదనతో విజయవాడ చేరుకున్న అంగన్ వాడీలు ముఖ్యమంత్రి ప్రకటనతో ఉపశమనం పొందారు. మరో నాలుగు నెలల్లో తమ జీవితాలు కాస్తంత ఒడ్డున పడతాయని ఆశించారు. కానీ, ఇంతలోనే ఆందోళన చేసినవారి మీద ప్రభుత్వం కన్నెర్ర చేయడం, విజయవాడ ఆందోళనలో పాల్గొన్నవారిని ఉద్యోగంలోంచి పీకేయాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడం ఏ రకంగానూ సమర్ధనీయం కాదు. నిజానికి ఆ రోజు అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు గొంతెమ్మ కోరికలేమీ కోరలేదు. పెంచిన జీతాలను అమలు చేయాలని మాత్రమే కోరారు. అందుకు సంబంధించిన జీవో విడుదల చేయాలన్నారు. ఆ రోజు అంగన్ వాడీ వర్కర్లు ఏ విధమైన హింసకూ, విధ్వంసానికీ పాల్పడలేదు. తమను పోలీసులు అరెస్టు చేస్తున్న సందర్భంలోనూ, వ్యాన్ లలోకి విసిరేస్తున్న సమయంలోనూ సంయమనమే ప్రదర్శించారు. అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో ఆందోళనలు చేయడాన్ని కూడా సహించలేకపోతే ఎలా? విభిన్న వర్గాల ప్రజలు తమ కోరికలు సాధించుకోవడానికి వున్న ఏకైక మార్గం సామూహికంగా ఆందోళనలు చేయడం. అందుల్లో పాల్గొన్నవారిని అరెస్టు చేయడమంటే ప్రజాస్వామిక హక్కును నిరాకరించడమే. ఇంతకు మించిన నియంత్రుత్వం మరొకటి వుండదు. 

21:14 - December 23, 2015

హైదరాబాద్ : అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ఆందోళన సీడీలను ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విడుదల చేశారు. స్పీకర్ అనుమతితో సీడీలను విడుదల చేసినట్లు తెలిపారు. ఇందులో వైసీపీ ఎమ్మెల్యేల దూషణలు, కామెంట్లు ఉన్నాయి. ప్రజలకు వివరాలు తెలియాలనే వీడియో రిలీజ్‌ చేసినట్లు కాల్వ శ్రీనివాసులు తెలిపారు. మనస్సు ఒప్పుకోకపోయినా సీడీలను విడుదల చేస్తున్నట్లు, రోజా వ్యాఖ్యలను ప్రజలు సహించరని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీక్షలో ఉండి కూడా అసభ్యకర పదాలు ఉపయోగించారని, రావణాసురుడు శూర్పణఖను వెనకేసుకొచ్చినట్లు రోజాను జగన్ వెనకేసుకొస్తున్నారని తెలిపారు. 

ముగిసిన తొలి రోజు అయిత చండీయాగం..

మెదక్ : జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అయుత చండీ మహాయాగం తొలిరోజు ముగిసింది. 

అచ్చే దిన్ కేవలం ప్రధానికే - రాహుల్..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెబుతున్న అచ్చేదిన్ కేవలం ప్రధానికి మాత్రమే వచ్చాయని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అమేథీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా నిగోహాలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను మరిచిపోయారిన ఎద్దేవా చేశారు. 

20:33 - December 23, 2015

రైతులకు కష్టకాలం దాపురించబోతోందా? ఆహార భద్రతకు, ప్రజాపంపిణీ వ్యవస్థకు పెను ప్రమాదం పొంచి ఉందా?  ఇప్పటికే రైతాంగాన్ని విస్మరిస్తున్న సర్కారు ఇకముందు పూర్తిగా విస్మరించబోతోందా?  నైరోబీ సమావేశం ఏ సంకేతాలిస్తోంది?  ఏ కుట్రలకు వర్ధమాన దేశాలు బలికాబోతున్నాయి? నైరోబీ డబ్ల్యూటీఓ సదస్సులో సాగిన అగ్రపెత్తనంపై కథనం..భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టేశారు..!!అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గారు..!!ఎమ్మెన్సీలకు భారత ప్రయోజనాలు ధారాదత్తం చేశారు..!!చివరికి నైరోబీలో నిరాశే మిగిలింది.. !! ఒక్కమాటలో చెప్పాలంటే వర్ధమాన దేశాల్లోని రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పరిణామాలివి. నైరోబిలో ముగిసిన డబ్ల్యూటీవో చర్చలు పేద దేశాల రైతుల భవిష్యత్తును తీవ్ర ప్రమాదంలోకి నెట్టాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను ఏమాత్రం గమనించకుండా, కేవలం పాశ్చాత్య దేశాల బాగు కోసమే ఏకపక్షంగా సాగిన సమావేశాలివి.

పేదలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి...
ఆ దేశాల్లో రాయితీలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. రైతాంగానికి అందుతున్న ప్రోత్సాహకాలు చూస్తే మతి పోతుంది. కానీ, వాళ్లకు లాభాలు పోగేయటానికి ఈ సంపన్న దేశాల ప్రభుత్వాలు వర్ధమాన దేశాల పొట్టగొట్టడానికి, ఆ దేశాల రైతుల బతుకులతో చెలగాటమాడటానికి సై అంటున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న వారు వంద కోట్ల వరకు ఉన్నారు.. వారంతా పేద దేశాల్లోనే ఉంటారని చెప్పనక్కర్లేదు.. మరి ఈ నైరోబీ సదస్సు ఫలితాలు ఈ పేదలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి?

దేశానికి క్షేమకరం కాదు..
రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలుసా? ఇలాంటి పరిస్థితుల మధ్య నైరోబీ ఒప్పందం అమలు జరిగితే ఎలాంటి ప్రమాదకర పరిణామాలు చూడాలో ఊహించటానికే వణుకుపుడుతుంది. కేంద్రం ఈ ప్రమాదాలన్నిటినీ విస్మరించి నైరోబీలో మన ప్రయోజనాలు తాకట్టు పెట్టివచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తును ఊహిస్తే గుండె ఝల్లుమంటుంది. మన బియ్యం, మన తిండి పరాయిదేశం నుండి దిగుమతి చేసుకునే పరిస్థితి దాపురించబోతోంది. ఆఖరికి మన బతుకులన్నీ వాడి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ఒప్పందమైనా, ఏ సదస్సైనా దేశ ప్రయోజనాలే అంతిమం కావాలి. కానీ, అగ్రరాజ్యాల అడుగులకు మడుగులొత్తే ప్రభుత్వాలు దేశ ప్రయోజనాలను గాలికొదిలేస్తున్నాయి. ఇది దేశానికి ఏ మాత్రం క్షేమకరం కాదు.. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి..

20:28 - December 23, 2015

అయిత చండీయాగం ప్రారంభం...ఏపీ స్పీకర్ పై కోడెలపై వైసీపీ అవిశ్వాస తీర్మానం…క్రిస్మస్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఏడాది...ఏపీలో క్రిస్మస్ భవన్ కు బాబు శంఖుస్థాపన..ఎస్ఎఫ్ఐ సీఎం కేసీఆర్ శవయాత్ర..తిరుపతిలో ఆనం...ఉత్తర్ ప్రదేశ్ లో బస్సు డ్రైవింగ్ చేసిన కోతి..కల్తీ సాస్ తయారీ..మోడీ 33వ విదేశీయాత్ర..17ఏళ్ల బాలికకు వివాహం..వంటి అంశాలపై 'టెన్ టివి'లో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో 'మల్లన్న' తనదైన శైలిలో విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

వైసీపీ సభ్యుల ఆందోళన సీడీల విడుదల..

హైదరాబాద్ : అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ఆందోళన సీడీలను ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విడుదల చేశారు. స్పీకర్ అనుమతితో సీడీలను విడుదల చేసినట్లు తెలిపారు. మనస్సు ఒప్పుకోకపోయినా సీడీలను విడుదల చేస్తున్నట్లు, రోజా వ్యాఖ్యలను ప్రజలు సహించరని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దీక్షలో ఉండి కూడా అసభ్యకర పదాలు ఉపయోగించారని, రావణాసురుడు శూర్పణఖను వెనకేసుకొచ్చినట్లు రోజాను జగన్ వెనకేసుకొస్తున్నారని తెలిపారు. 

కరీంనగర్ గృహ నిర్మాణం సమీక్షలో వాగ్వాదం..

కరీంనగర్ : కలెక్టరేట్ లో గృహ నిర్మాణంపై మంత్రి ఈటెల సమీక్ష నిర్వహించారు. అధికారులు..ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు సహకరించడం లేదంటూ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేయగా ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ మా పని మమ్మల్ని చేసుకోనివ్వరా అంటూ అధికారులు సీరియస్ అయ్యారు. సమావేశం నుండి బయటకు వెళ్లేందుకు అధికారులు యత్నం చేయగా అధికారులను కలెక్టర్ వారించారు. 

తెలంగాణ టెట్ మార్గదర్శకాలు..

హైదరాబాద్ : తెలంగాణ టెట్ మార్గదర్శకాలు విడుదలయ్యాయి. టెట్ నిర్వాహణకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ గా ఐదుగురితో కమిటీ ఏర్పాటు చేశారు. గైడ్ లైన్స్ లో టెట్ సెంటర్స్ ను పేర్కొంది. టెట్ అర్హత సర్టిఫికేట్ కు ఏడేళ్ల కాలపరిమితి విధించారు. సిలబస్ విడుదల పరీక్షల సమయం రెండున్నర గంటలుగా ఉండనుంది. టెట్ ల 150 మార్కుల చొప్పున పేపర్ -1, పేపర్ -2లుగా విభజించారు. 

అంగన్ వాడీల తొలగింపు - పి.మధు..

విజయవాడ : అంగన్ వాడీల తొలగింపు నిర్ణయం అమానుషమని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు పేర్కొన్నారు. హక్కుల కోసం పోరాటం చేయడం తప్పా అని ప్రశ్నించారు. అంగన్ వాడీలు ఉద్యమం చేస్తేనే జీతాలు పెంచారని గుర్తు చేశారు. ఉద్యమం చేసిన అంగన్ వాడీలను తొలగించడం అన్యాయమన్నారు. అంగన్ వాడీల తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. 

సైకో తల్లిదండ్రుల చికిత్స చేయడానికి నిరాకరించిన వైద్యులు..

కరీంనగర్ : ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. బల్వీందర్ సింగ్ దాడిలో గాయపడిన తల్లిదండ్రులకు చికిత్స చేసేందుకు వైద్యులు నిరాకరించారు. డబ్బులు కడితేనే ఆపరేషన్ చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ హామీ ఇచ్చినా వైద్యులు పట్టించుకోవడం లేదు. 

19:23 - December 23, 2015

విజయవాడ : ఏపీ ప్రభుత్వం అంగన్ వాడీలను తొలగింపు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీలు..ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీన విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్ వాడీలను తొలగించాలని జిల్లాల కలెక్టర్లకు స్పెషల్ కమిషనర్ చక్రవర్తి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు టెన్ టివితో మాట్లాడారు.

అమానుషం - ఎమ్మెల్సీ శర్మ..
అంగన్ వాడీలను తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం చాలా అమానుషమని ఎమ్మెల్సీ శర్మ పేర్కొన్నారు. శాసనమండలిలో జరిగిన చర్చలో మంత్రులు పాల్గొన్నారని, జీతాలు పెంచడానికి సుముఖంగా ఉన్నామన్నారు. అంగన్ వాడీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ రోజు తొలగిస్తామని చెప్పడం ఎమర్జెన్సీ కాలాన్ని తలపిస్తోందని తెలిపారు. ఆలోచన లేకుండా ఆదేశాలు ఇచ్చినట్లు ఉందని, పోరాటాలు..ఉద్యమాలు చేయడం హక్కు అని తెలిపారు. సీఎం కు వినతిపత్రం ఇచ్చేందుకు అక్కడకు అంగన్ వాడీలు వచ్చారని తెలిపారు. ఆడవాళ్లను ఏడిపించుకొని తింటే ఏడేళ్లు అధికారానికి దూరంగా ఉన్నారని గుర్తు చేయడం జరిగిందన్నారు.

శత్రువులుగా చూస్తోంది - ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం..
అంగన్ వాడీలను ఏపీ ప్రభుత్వం శత్రువులుగా చూడడం ప్రారంభించిందని ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. పోరాటాలు చేయడానికి వీలు లేదని పేర్కొనడం సరికాదన్నారు. అంగన్ వాడీలు కోరుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని, ఇచ్చిన హామీని అమలు చేయాలంటున్నారని పేర్కొన్నారు. టిడిపి ప్రభుత్వం గోరంత కొండంతలుగా చేస్తోందని, టిడిపికి గుణపాఠం చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. అంగన్ వాడీలు ఏ పోరాటం చేయడానికి ముందుకొస్తే వారికి మద్దతిస్తామన్నారు.

చట్ట వ్యతిరేకం - ఏవీ నాగేశ్వరరావు (కాంట్రాక్టు ఎంప్లాయిస్ నేత)..
ప్రజాస్వామ్యంలో నిరసన తెలియచేసే హక్కు అందరికీ ఉందని కాంట్రాక్టు ఎంప్లాయిస్ నేత ఏవీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు చట్ట వ్యతిరేకమన్నారు. దీనిని పూర్తిగా ఖండిస్తున్నట్లు, ఆలోచించి సక్రమంగా పనిచేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమ్మెలు కాలరాయాలని చూస్తే వారి ఆశలు అడియాశాలే అవుతాయని తెలిపారు. 

19:05 - December 23, 2015

ఢిల్లీ : డీడీసీఏ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం ఛైర్మన్ గా ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయంటూ ఆప్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాంలో జైట్లీపై సొంత పార్టీ ఎంపీ అయిన కీర్తి ఆజాద్ కూడా ఆరోపణలు చేయడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై బీజేపీ సీనియర్ నేతలు హెచ్చరించినా ఆయన వెనక్కి తగ్గలేదు. కీర్తి ఆజాద్ బీహార్ లోని దర్భాంగ లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుండి మూడు సార్లు గెలిచారు. ఆయన తండ్రి భగవత్ ఝూ ఆజాద్ బీహార్ మాజీ సీఎంగా వ్యవహరించారు. క్రికెటర్ గా మంచి పేరున్న ఆజాద్ 1983 ప్రపంచకప్ ను సాధించిన జట్టులో సభ్యుడుగా ఉన్నారు. 

ఏజెన్సీ ప్రాంతంలో ఖాకీల నిర్భందకాండ..

విశాఖ : ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు నిర్భద కాండను ప్రయోగిస్తున్నారు. అరకు ఉత్సవాలను అడ్డుకొంటే ఊరుకోమని ఎస్పీ ప్రవీణ్ హెచ్చరించారు. విధ్వంసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

అమెరికా వెళ్లే విద్యార్థులకు విదేశాంగ ప్రకటన..

ఢిల్లీ : అమెరికా వెళ్లే విద్యార్థులకు భారత విదేశాంగ ఓ ప్రకటన విడుదల చేసింది. సిలికాన్ వ్యాలీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించేందుకు వెళ్లవద్దని సూచించింది. ఈ రెండు యూనివర్సిటీలకు వెళుతున్న విద్యార్థుల వీసాలను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతించడం లేదని, ఇతర యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్థులు కూడా పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పాలని సూచించింది. 

అంగన్ వాడీలపై బాబు కక్ష గట్టారు - వైసీపీ..

విజయవాడ : అంగన్ వాడీలపై చంద్రబాబు కక్ష గట్టారని వైసీపీ అధికార ప్రతినిధి మండలి హనుమంతరావు పేర్కొన్నారు. చలో విజయవాడలో పాల్గొన్న అంగన్ వాడీలను తొలగించడం చంద్రబాబు నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. 

రోజాపై మంత్రి పీతల ధ్వజం..

హైదరాబాద్ : చంద్రబాబు..దళితుల జోలికి వస్తే రోజాకు తగిన బుద్ధి చెబుతామని మంత్రి పీతల పేర్కొన్నారు. వైసీపీ దళితులను అవమానించేలా వ్యవహరిస్తోందని, గిరిజనుల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. బాక్సైట్ జీవోను రద్దు చేయడమే అందుకు నిదర్శనమని, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇవ్వడం వైసీపీ దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు. 

టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది - గుత్తా..

నల్గొండ : టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. తమ క్యాంపులో మెజార్టీ సభ్యులున్నారని తప్పుడు ప్రచారం చేస్తోందని, యాగం తరువాత కేసీఆర్ కు సద్బుద్ధి కలగలన్నారు. 

గుత్తా ఇంట్లో మాజీ ఎంపీల భేటీ..

నల్గొండ : టి.కాంగ్రెస్ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో మాజీ ఎంపీలు భేటీ అయ్యారు. పొన్నం, వివేక్, కోమటిరెడ్డి, షెట్కర్, అంజన్ కుమార్ లు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు.

 

కీర్తి ఆజాద్ సస్పెన్షన్..

ఢిల్లీ : డీడీసీఏ వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం ఛైర్మన్ గా ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయంటూ ఆప్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాంలో జైట్లీపై సొంత పార్టీ ఎంపీ అయిన కీర్తి ఆజాద్ కూడా ఆరోపణలు చేయడంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. 

18:33 - December 23, 2015

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరు రహదారులు, భవనాల శాఖ డీఈ శంకర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డీఎస్పీ మహబూబ్ ఫాషా ఆధ్వర్యంలో ఆరు టీంలు ఒకేసారి దాడులు చేశాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగాయి. శంకర్ రెడ్డికి కోటి రూపాయల అక్రమ ఆస్తులున్నాయని తేల్చారు. అనంతరం శంకర్ రెడ్డిని అరెస్టు చేశారు. 

18:28 - December 23, 2015

హైదరాబాద్ : కర్నాటక సీఐటీయూ కార్యదర్శి ప్రసన్నకుమార్ మృతి పట్ల సీఐటీయూ తెలంగాణ కమిటీ సంతాపం తెలియచేసింది. హైదరాబాద్ లోని కార్యాలయంలో కార్మిక సంఘం నేతలు సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రసన్నకుమార్ మరణం కార్మిక ఉద్యమానికి తీరని లోటని సీఐటీయూ జాతీయ కార్యదర్శి సుధా భాస్కర్ తెలిపారు. కర్నాటకలోని కార్మికుల సమస్యల పరిష్కారం ప్రసన్నకుమార్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. 

18:24 - December 23, 2015

కృష్ణా : అధిక సముద్ర తీర ప్రాంతం కలిగి ఉండడం ఆంధ్రప్రదేశ్ అదృష్టమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీ దేశానికి తూర్పుముఖంగా ఉండడంతో అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు ఆవిష్కరించాలని సూచించారు. అంతకుముందు విద్యార్థులకు బాబు ధృవపత్రాలు అందచేశారు. 

18:20 - December 23, 2015

విజయవాడ : అంగన్ వాడీలను ఏపీ ప్రభుత్వం తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీన ఆందోళనలో పాల్గొన్న అంగన్ వాడీలను తొలగించాలంటూ జిల్లాల కలెక్టర్లకు స్పెషల్ కమిషనర్ చక్రవర్తి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై గఫూర్ టెన్ టివితో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలన బ్రిటీష్ వారి కంటే దుర్మార్గంగా కనిపిస్తోందన్నారు. ప్రజాస్వామ్య హక్కులున్నాయని, అంగన్ వాడీలు శాంతియుతంగా ఆందోళన చేశారని తెలిపారు. ఈ దృశ్యాలన్నీ సీడీలలో చూసి వారిని తొలగించాలని పేర్కొనడం దారుణమని, దీనిని ప్రతిఘటిస్తాం..పోరాటం చేస్తామన్నారు. 18వ తేదీన చలో సీఎం కార్యాలయం కార్యక్రమం చేస్తామని ముందే ప్రకటించారని, పోలీసులు జరిపిన లాఠీఛార్జీల్లో ఎంతో గాయపడ్డారని తెలిపారు. వారికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఈ విధంగా వ్యవహరించడం సరికాదని గఫూర్ వ్యాఖ్యానించారు. 

18:13 - December 23, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడీలపై కక్ష గట్టింది. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్ వాడీలను తొలగించాలంటూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ నిరంకుశ వైఖరి..నియంతలా ప్రదర్విస్తోందని దుయ్యబడుతున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా వేతనాలు..ఇతరత్రా సమస్యలపై అంగన్ వాడీలు ఆందోళన బాట పట్టారు. దీనిపై ప్రభుత్వం తలొగ్గినట్టే కనిపించింది. వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు దీనిపై నియమించబడిన ఉప సంఘం పేర్కొంది. కానీ ఈ హామీ అమలు చేయకపోవడం..జీవో అమలు చేయకపోవడం పట్ల అంగన్ వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఆరు నెలలుగా జీతాలు లేకపోవడం..తిండికి ఇబ్బందులు పడుతుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగన్ వాడీలు ఈ నెల 18వ తేదీన చలో బెజవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పెద్ద ఎత్తున్న అంగన్ వాడీలు పాల్గొన్నారు. వీరి ఆందోళనకు సీఐటీయూ, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. కానీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. నిర్భందం ప్రయోగించింది. లాఠీలతో కుళ్లబొడిచారు. దీనితో చాలా మంది అంగన్ వాడీలు గాయపడ్డారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో వారి వేతనాలు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు.
తాజాగా ఈ పోరాటంలో పాల్గొన్న అంగన్ వాడీలను తొలగిస్తున్నట్లు కలెక్టర్లకు స్పెషల్ కమిషనర్ చక్రవర్తి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వామపక్షాలు..ఇతర ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో మరో ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. 

17:56 - December 23, 2015

మెదక్ : జిల్లా జగ్ దేవ్ పూర్ మండలం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన అయిత మహా చండీయాగం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ యాగంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు, ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, తెలంగాణ అసెంబ్లీ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కేశవరావు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కడియం శ్రీహరి, నాయినీ నర్సింహ రెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తో సహా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇతర ప్రముఖులు తరలివచ్చారు. 

ఏపీ అంగన్ వాడీలపై ప్రభుత్వం కక్ష సాధింపు..

విజయవాడ : అంగన్ వాడీలపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. 18వ తేదీన చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్ వాడీలను విధుల నుండి ప్రభుత్వం తొలగించింది. ఆయా జిల్లల కలెక్టర్లకు స్పెషల్ కమిషనర్ చక్రవర్తి ఆదేశాలు జారీ చేశారు.

 

మన్మోహన్ సింగ్ కు ఊరట..

ఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఊరట లభించింది. బొగ్గు స్కాంలో మన్మోహన్ కు సమన్లు జారీ చేయాలన్న పిటిషన్ ను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. 

17:19 - December 23, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు విడుదల చేస్తోందని, తమవల్లే తెలంగాణలో 24గంటలు కరెంటు ఉంటోందని తెలిపారు. గ్రామ పంచాయతీలు నిధులు విడుదల చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి చేరనీవ్వడం లేదని ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తి..సరఫరా మెరుగుపర్చడం కోసం రూ. 45వేల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడానికి కేంద్రం ముందుకొస్తే నా గొప్పే అని పేర్కొంటున్నారని విమర్శించారు. తాజాగా బాసర పంచాయతీకి రూ.10.60 వేల రూపాయలు ఇచ్చారని తెలిపారు. శాఖల వారీగా కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నా అనవసర విమర్శలు చేస్తున్నారని, కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రధానిని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. 

17:13 - December 23, 2015

హైదరాబాద్ : ఇళ్లు కట్టాం..అప్పులు చేసి మరీ కట్టాం..తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం..డబ్బులు చెల్లించండి..అంటూ హౌసింగ్ కాంట్రాక్టర్స్ ఆవేదనను జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదు. దీనితో కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు బిల్లులు చెల్లిస్తారా ? లేదా ? అని నిలదీశారు. రాష్ట్రంలో జెఎన్ఎంయూఆర్ఎం, వాంబే ఇళ్లకు టెండర్ల ద్వారా కాంట్రాకర్లు వివిధ ప్రాంతాల్లో ఇళ్లు కట్టారు. సుమారు 49వేల ఇళ్లు కట్టారు. 90 శాతం పైగా పూర్తవడమే కాకుండా కొంతమంది లబ్ధిదారులకు ఇళ్లు కూడా కేటాయించారు. కానీ డబ్బులు చెల్లించకపోవడం అనే అంశం ఏళ్ల తరబడి నానుతూ వస్తోంది. సుమారు రూ.42 కోట్ల వరకు రావాల్సి ఉందని తెలుస్తోంది. తాము ఇప్పటికే అప్పులు చేయడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం అనుమతి రాకపోవడంతో బిల్లులు చెల్లించడం లేదని జీహెచ్ఎంసీ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. టెండర్ అప్పగించిన తరువాత కొన్నింటికీ శాంక్షన్ కావడం లేదని జీహెచ్ఎంసీ పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. లబ్ధిదారులకు కేటాయించినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటనీ కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.నాలుగు వారాల్లో బిల్లులు చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశించినా జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

హౌసింగ్ కాంట్రాక్టర్ల ఆందోళన…

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట హౌసింగ్ కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. బిల్లులు చెల్లించాలని కోర్టులు ఆదేశించినా పట్టించుకోవడం లేదని, ఇళ్ల నిర్మాణం పూర్తయి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. 

పార్లమెంట్ సమావేశాల జరిగిన తీరుపై వెంకయ్య విచారం..

ఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగిన తీరుపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. సమావేశాల తొలి నుండి అన్ని అంశాలపై తాము చర్చకు సిద్ధమని చెప్పినా కాంగ్రెస్ సభ్యులు సభను సజావుగా నడువనీయలేదని విమర్శించారు. లోక్ సభలో 14 బిల్లులు ఆమోదం పొందితే రాజ్యసభ లో 9 బిల్లులు మాత్రమే ఆమోదం పొందడం బాధాకరమన్నారు. 

2019 జాతీయ క్రీడల అతిథ్యమివ్వనున్న ఏపీ..

గౌహటి : 2019లో జరిగే జాతీయ క్రీడల అతిథ్య హక్కులను ఏపీ దక్కించుకుంది. గౌహటిలో జరిగిన భారత ఒలింపిక్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు శాప్ డైరెక్టర్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా మొగుళ్లపాలెంలో జాతీయ క్రీడలను నిర్వహించనున్నారు. దీని కోసం 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్టేడియాన్ని నిర్మించనున్నారు. 

16:47 - December 23, 2015

2015 సంవత్సరంలో ఎన్నో భారీ చిత్రాలొచ్చాయి. అందులో కొన్నే బాక్సాఫీస్ ను షేక్ చేసాయి. కానీ చాలా వరుకూ భారీ చిత్రాలు నిర్మాతలకు నష్టాల్నే తెచ్చిపెట్టాయి. అయితే కొన్ని చిన్న సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాల్ని తెచ్చిపెట్టాయి. మొత్తం మీద 2015 లో చిన్న సినిమాలు సత్తా చాటుకున్నాయి. అలా లాభాలార్జించిన చిన్న సినిమాలపై 2015 సినిమా డైరీ స్పెషల్ స్టోరీ.
ఎండ తగిలితే చనిపోయే చిత్రమైన వ్యాధి ఉన్న కథానాయకుడు ఒకమ్మాయి ప్రేమలో పడితే ఏమవుతుంది? ఐడియాలోనే బోలెడంత కొత్తదనం ఉంది కదూ. ఈ ఐడియాను ఘట్టమనేని కార్తిక్ అండ్ 'నిఖిల్' స్ర్కీన్ మీద వర్కౌట్ చేసిన చిత్రమే 'సూర్య VS సూర్య'. కాన్సెప్ట్ లో కొత్త దనం వల్లే ఈ చిన్న సినిమా పెద్ద రిజల్ట్ నే రాబట్టింది.

నిఖిల్ సూర్య వర్సెస్ సూర్య..
కొత్త రకం కథలు రావడం లేదనేది ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు . అయితే, ఎంచుకున్న ఇతివృత్తం, తీసుకున్న కథ కొత్తగా ఉంటే చాలా? వాటికి న్యాయం చేకూర్చేలా స్క్రిప్టును తీర్చిదిద్దుకొని, కథనాన్ని నడిపించకపోతే? అప్పుడూ మళ్ళీ నిరాశ తప్పదు. కానీ మూసను బద్దలుకొట్టుకొని, ఒక చిన్న వెరైటీ పాయింట్‌తో వచ్చిన సినిమా 'సూర్య వర్సెస్ సూర్య'. సూర్యరశ్మి పడని ఒక యువకుడి చుట్టూ తిరుగుతుందీ చిత్రకథ. డిఫరెంట్ కథలకు ఓటేసే నిఖిల్ ...ఈ వెరైటీ కాన్సెప్ట్ ను ఎంచుకోవడం పెద్ద విషయమేమీ కాదు కానీ... తెలుగు లో ఇలాంటి అరుదైన చిత్రం రావడమే విచిత్రం. అందుకే ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే పాస్ అయిపోయింది. 2015 సంవత్సరంలో 'సూర్య vS సూర్య' 'నిఖిల్' కు మంచి చిత్రంగా మిలిగిపోయింది.

కథనే నమ్ముకున్న నాని..
కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ రిస్క్ తీసుకోరు. కానీ హీరో 'నాని'..కేవలం కథనే నమ్ముకొని ఎంతో రిస్క్ చేసి అటెంమ్ట్ చేసిన మూవీ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. కొత్త దర్శకుడు నాగ్ అశ్విన్ మలిచిన ఈ ట్రావెల్ మూవీ అందరినీ ఆలోచింపచేస్తుంది. తక్కువ బట్జెట్ లో రూపుదిద్దుకొని... మంచి రిజల్ట్ రాబట్టిన మూవీ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. .2015 లో 'నాని' కి మంచి విజయాన్నే అందించింది. కొత్త కొత్త కాన్సెప్ట్స్ ను ఎన్నుకొనే అరుదైన హీరో 'నాని' ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో రక్తి కట్టించి .. సినిమాను సక్సెస్ చేయడంలో తన వంతు కృషి చేస్తుంటాడు ఈ హీరో. అలాంటి డెడికేటెడ్ హీరో .. 2015 లో చేసిన ట్రావెల్ మూవీ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. హిమాలయాల్లోని దూద్ కాశి ని బేస్ చేసుకొని సాగే ఈ సినిమా కథ . ప్రేక్షకులకి మంచి అనుభూతిని మిగిల్చింది. సాటి మనిషిని మనిషిగా గుర్తించు అనేది ఈ మూవీ మెయిన్ థీమ్. యాజ్ యూజువల్ గా 'నాని' తనదైన సహజశైలిలో నాని రెచ్చిపోయి నటించాడు. కొత్త దర్శకుడు నాగ్ అశ్విన్ పరిమిత బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందించి... మంచి మార్కులేయించుకున్నాడు. 2015 లో ఈ మూవీ చిన్న సినిమా గా రిలీజై.. పెద్ద పేరే తెచ్చుకుంది.

డిఫెరెంట్ చిత్రం కేరింత..
'ఫ్రెండ్స్‌, లవ్‌, ఆంబిషన్స్‌.. ఇవే లోకంగా బతికేసే కుర్రకారు స్టూడెంట్‌ లైఫ్‌, ఆ జ్ఞాపకాలు, ఆ అనుభూతులు, ఆ అనుభవాల నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కానీ 'కేరింత' చిత్రం మాత్రం చాలా డిఫరెంట్ . ముఖ్యంగా యూత్ మధ్య ఎమోషన్స్ ను కేరీ చేయడంలో దర్శకుడు అడవి సాయికిరణ్ తన పనితనం చూపించాడు. 2015 లో చిన్న సినిమా గా వచ్చిన ఈ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. యూత్‌ఫుల్‌ ఫీలింగ్స్‌కి ఎమోషనల్‌ డెప్త్‌ ఇచ్చి అన్ని వయసుల వారిని ఆకట్టుకోవడంలో 'దిల్‌ రాజు' గత సినిమాలైన 'బొమ్మరిల్లు', 'కొత్త బంగారు లోకం' సక్సెస్‌ అయ్యాయి. 'కేరింత' ఎమోషనల్‌ హై ఇవ్వడంలో సక్సెస్‌ అవడమే కాదు... ఎక్కడా ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవకుండా టార్గెట్‌ ఆడియన్స్‌నీ బాగా అలరించింది. అన్ని పాత్రల తీరు చూస్తే శేఖర్‌ కమ్ముల తీసిన హ్యాపీడేస్‌ సినిమా పదే పదే గుర్తుకొస్తుంటుంది. పాత్రల స్వభావాలు, వాటిలో వచ్చే పరివర్తన, చేరుకునే గమ్యం చూస్తే 'త్రీ ఇడియట్స్‌' స్ఫూర్తి తీసుకున్నట్టు అనిపిస్తుంది. లవబుల్‌ క్యారెక్టర్స్‌ తీర్చి దిద్దడంలో, ఆ పాత్రల నడుమ అందమైన అలరించే మధుర క్షణాలు సృష్టించడంలో, ఆ పాత్రలు సజీవంగా అనిపించేట్టు చేయడంలో 'కేరింత' సోల్‌ దాగుంది. అదే ఈ చిత్రానికి ప్లస్‌ అయింది . అందుకే 2015 లో రిలీజైన చిన్న సినిమాల్లో కెల్లా అందరికీ అనుభూతిచ్చిన చిత్రంగా 'కేరింత' నిలిచిపోయింది.

లాభాలార్జించిన టైగర్..
ఫస్ట్‌ హాఫ్‌లో కొత్తదనం ... సెకండ్‌ హాఫ్‌లో కమర్షియల్‌గా పాస్‌ అవడం ! ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని కొత్త దర్శకుడు ఆనంద్ రూపొందించిన చిత్రమే 'టైగర్'. 'సందీప్ కిషన్' హీరోగా నటించిన ఈ చిన్న మూవీ కమర్షియల్ గా బాగా సక్సెస్ అయి.. నిర్మాతలకి బాగానే లాభాలార్జించింది. 2015 లో 'టైగర్' చిత్రం 'సందీప్ కిషన్' ఎకౌంట్లో హిట్ గా కౌంట్ అయింది. హీరోగా మొదట్నుంచి సాఫ్ట్ క్యారెక్టర్లే వేసిన 'సందీప్ కిషన్' 'టైగర్' టైటిల్ తో మాస్ గా ఎలివేట్ అవడం ఇదే మొదటి సారి. ఒక స్టార్ మాస్ హీరో సినిమా కి పెట్టాల్సిన టైటిల్ 'సందీప్ కిషన్' సినిమా కు పెట్టడం జనానికి అంతగా మింగుడు పడకపోయినా కొత్త నెరేషన్ తో దర్శకుడు ఆనంద్ సినిమాను గ్రిపింగ్ నడిపించి హిట్ కొట్టాడు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే రివెంజ్ స్టోరీగా 'టైగర్' సినిమా సాగుతుంది. మాస్ హీరో గా 'సందీప్ కిషన్' బాగానే ఆకట్టుకున్నాడు. పరిమిత బడ్జెట్ లో నిర్మించ బడిన 'టైగర్' మూవీ 2015 లో మంచి కమర్షియల్ సక్సెస్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది. మొత్తం మీద 'టైగర్' ఓ చిన్న మాస్ సినిమాగా బాక్సాఫీస్ వద్ద బాగానే లాభాలార్జించింది.

నాని భలే భలే మగడివోయ్..
కొన్ని కథలు కొంతమంది కోసమే పుడతాయి. ఆ కథలు ఆ నటుల్ని వెతుక్కుంటూ వెళ్లిపోతాయి. 'భలే భలే మగాడివోయ్‌' కథ నాని కోసమే పుట్టిందా, ఈ పాత్ర చేయడానికే తాను నటుడయ్యాడా అన్నట్టుగా 'పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌' కుదిరింది. మారుతికి మాస్‌ పల్స్‌ బాగా తెలుసు. ఒక చిన్న క్యారెక్టరైజేషన్‌ లేదా కాన్‌ఫ్లిక్ట్‌ని పట్టుకుని జనాన్ని ఆకర్షించే కథనం రాసుకోగల సమర్థుడు. అందుకే 'భలే భలే మగాడివోయ్' అనే చిన్న సినిమా విదేశాల్లో సైతం దుమ్ము రేగ్గొట్టింది. 'భలే భలే మగాడివోయ్‌' ఆద్యంతం హాయిగొలిపే సన్నివేశాలతో ఎక్కడా విసిగించకుండా సాఫీగా, సరదాగా సాగిపోతుంది. మతిమరుపు వున్న వ్యక్తి ప్రేమలో పడితే ఎన్ని తిప్పలు పడతాడు అనే పాయింట్‌ని తీసుకుని 'మారుతి' దాని చుట్టూ చక్కని కథ అల్లాడు. కథ అనడం కంటే... సదరు మతిమరపు వ్యక్తికి ఎదురయ్యే సమస్యలు, వాటిని సమయస్ఫూర్తితో పరిష్కరించుకునే విధానాలు వగైరా సిట్యువేషన్స్‌ బాగా సెట్‌ చేశాడు. కొన్ని సందర్భాల్లో మారుతి చూపిన చాకచక్యం మెచుకోకుండా వుండలేం. ఉదాహరణకి ఒక సన్నివేశంలో సినిమాకి వస్తానని హీరోయిన్‌తో చెప్పి హీరో ఆ సంగతే మర్చిపోతాడు. ఇలాంటి సిల్లీ సన్నివేశాలన్నీ జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేసాయి. చిన్న బడ్జెట్ తో రూపొందించబడి..... 2015 లో హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చుకున్న సినిమాగా 'భలే భలే మగాడివోయ్' నిలిచిపోయింది.

ఒంకార్ రాజు గారి గది..
'జీనియస్'తో క్రియేటివ్ జీనియస్ అనిపించుకోవాలన్న 'ఓంకార్' ఆశలు అడియాశలు అయ్యాయి. కంటెంట్ కమర్షియల్ పరంగా ఆ సినిమా పెద్ద ప్లాప్. దర్శకుడిగా 'ఓంకార్' కూడా. ఈసారి ఎక్కువశాతం మంది దర్శకులకు హిట్.. సూపర్ హిట్ అందించిన హారర్ కథతో లిమిటెడ్ బడ్జెట్ లో 'రాజుగారి గది' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2015 సంవత్సరం ఓకాంర్ కి 'రాజు గారి గది' మంచి సక్సెస్ ను అందించింది. 'రాజు గారి గది' అనే పేరే ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ను తెచ్చింది. సినిమా చూసి వారాహి చలనచిత్రం, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు ప్రాజెక్టును కొనుగోలు చేసేశాయన్న విషయం మరింత ఓపెనింగ్స్ రావడానికి కారణమైంది. ఏదేమైనా ఈ ప్రచారాలన్నీ విని థియేటర్ కు చేరుకున్న ప్రేక్షకుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ 'రాజు గారి గది' నిరాశపరచలేదు. చిన్న బడ్జెట్ లో ఒకే లొకేషన్లో తీసిన 'రాజు గారి గది'.. ప్రేక్షకుల్ని భయపెట్టడంలో భలేగా సక్సెస్ అయింది. దర్శకుడిగా 'ఓంకార్' ను ఈ సినిమా మరో మెట్టుపై కూర్చోబెట్టింది. 'ఓంకార్' తమ్ముడు 'అశ్విన్' ఈ మూవీతో హీరోగా బాగానే ఎస్టాబ్లిష్ అయ్యాడు. అతి తక్కువ పెట్టుబడితో బాగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ 'ఓంకార్' కు మంచి మైలేజ్ ఇచ్చింది.

సినిమా చూపిస్త మావ..
'
ఉయ్యాల జంపాలా' తర్వాత 'రాజ్ తరుణ్', 'అవికా గోర్' హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'సినిమా చూపిస్త మావ'. త్రినాథరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ చాలా చిన్న బడ్జెట్ లో తెరకెక్కింది. 'రాజ్ తరుణ్' ఈ సంత్సరం వరసగా రెండో హిట్టు కొట్టిన మూవీగా 'సినిమా చూపిస్త మావ' నిలిచిపోయింది. గోదావరి యాస లో మరోసారి 'రాజ్ తరుణ్' చెలరేగిన ఈ మూవీ విడుదలకు ముందే అందరినీ ఆకట్టుకుంది. అల్రెడి 'ఉయ్యాలా జంపాలా' చిత్రం తో హిట్ పెయిర్ అనిపించుకున్న 'అవిక గోర్'..'రాజ త‌రుణ్' ను ఎంపిక చేసుకోవ‌డం .. యూత్ ఆడియ‌న్స్ ను టార్గెట్ చేసి క‌థ‌ను రాసుకుని విజ‌యవంతంగా స్క్రీన్ ప్లే చే్య‌డం ఈ సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్స్. జ‌బ‌ర్ధ‌స్థ్ లో క‌నిపించిన చాల మంది ఆర్టిస్ట్ ల్ని సంద‌ర్భోచితంగా ఉప‌యోగించుకుని స‌న్నివేశాలు పండించారు డైరెక్ట‌ర్ త్రినాధ్. యాక్టింగ్ ప‌రంగా 'రాజ్ త‌రుణ్' కు ఎక్కువ స్కోప్ ఇచ్చారు. వినోదం సెంట్రిక్ గా ఉండ‌టం తో ఆ డ‌ల్ సీన్స్ కూడా ..మ‌రీ బోర్ అనిపించ‌వు. అస‌లు స్టోరి మెయిన్ ప్లాట్ పాయింట్ రావు ర‌మేష్ చుట్టే తిరుగుతుంది. ఆయన తన‌ రోల్ ను అద్భుతంగా పోషించారు. మొత్తం మీద కామెడితో 'సినిమా చూపిస్త మావ'... జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేసింది.చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందించి.. మంచి హిట్టు కొట్టింది ఈ సినిమా.
సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసే దర్శకుల్లో సుకుమార్ ఒకడు. అతను తొలిసారి నిర్మాతగా మారి కథ - స్క్రీన్ ప్లే అందిస్తూ తన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తీసిన సినిమా 'కుమారి 21 ఎఫ్'. యూత్ లో విపరీతమైన క్యూరియాసిటీ పెంచిన ఈ చిన్న సినిమా భారీ లాభాల్నే ఆర్జించింది. అందరూ అంచనా వేసినట్లే 'కుమారి 21 ఎఫ్' ఒక బోల్డ్ ఫిలిం. ఇది యూత్ ఆడియన్స్ కి కనెక్టయ్యే సినిమా. అనుకున్నట్టుగానే వాళ్లను ఎంటర్టైన్ చేసింది, ఆలోచింపజేసింది. సుకుమార్ - సూర్యప్రతాప్ కలిసి ఒక హార్డ్ హిట్టింగ్ మెసేజ్ ని.. ఎంటర్ టైన్ మెంట్ పూత వేసి చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా మీద ఎలాంటి అంచనాతో వచ్చారో అలాగే ఉందీ సినిమా. తెలుగులో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అరుదుగా వస్తుంటాయి. 'కుమారి 21 ఎఫ్' అలాంటి అరుదైన సినిమానే. అయితే ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకుల్నీ మెప్పించే సినిమా కాదు. కానీ యూత్ కు సంబంధించిన కాన్సెప్ట్ ని యూత్ కు కనెక్టయ్యేలా ప్రెజెంట్ చేయడంలో మాత్రం సుకుమార్ అండ్ టీమ్ సక్సెస్ అయింది. అన్నట్టు చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన చిత్రం 'కుమారి 21ఎఫ్'. అంతేకాదు 2015 లో ఎక్కువ లాభాలార్జించిన చిన్న సినిమా కూడా ఇదే... ముఖ్యంగా రాజ్ తరుణ్ కు మంచి మైలేజ్ ఇచ్చే చిత్రం కూడా ఇదే.
కథ లో కొత్తదనం, కథనంలో వైవిధ్యత ఉంటే ఆ సినిమా ఎంత బడ్జెట్ లో తీసినా ప్రేక్షకులు ఏ మాత్రం పట్టించుకోరు. అందుకే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలార్జించి 2015 లో చిన్న సినిమాలన్నీ దుమ్మురేపేసాయి. కాన్సెప్ట్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల .. చిన్న సినిమాలు పెద్ద విజయాలు నమోదు చేసుకున్నాయి. వచ్చే సంవత్సరం టాలీవుడ్ లో మరిన్ని చిన్న సినిమాలు సత్తా చాటాలని ఆశిద్దాం. 

16:37 - December 23, 2015

ఢిల్లీ : రైతుల ఆత్మహత్యలు జరుగుతుండగా అయిత చండీయాగం నిర్వహించడం ఏంటనీ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మండిపడింది. దిగ్విజయ్ సింగ్ పాలించిన మధ్యప్రదేశ్ లోనే రైతుల ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయని ఆ పార్టీ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. ముందుగా అక్కడి పరిస్థితిని చూసుకోవాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ నిర్వహిస్తున్న అయిత చండీగాయానికి ప్రభుత్వానికి మధ్య సంబంధం లేదన్నారు. యాగానికి ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని ఎంపీ వినోద్ తెలిపారు.

16:30 - December 23, 2015

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. మాస్కోలో ద్వైపాక్షిక వార్షిక సదస్సులో మోడీ పాల్గొననున్నారు. అణు, హైడ్రో కార్బన్ లు, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మోడీ చర్చలు జరుపనున్నారు. రష్యా పర్యటన పట్ల తాను ఎంతో ఆశావాహకంగా ఉన్నట్లు మోడీ తెలిపారు. భారత్, రష్యా దేశాల మధ్య సంబంధాలు ఎంత గొప్పవో చరిత్ర చెబుతుందని, ప్రపంచంలోనే భారత్ కు రష్యా అత్యంత కీలక మిత్రదేశమని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు రష్యా వ్యాపారులను ఆహ్వానిస్తానని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

16:24 - December 23, 2015

ఢిల్లీ : దేశ రాజధానియైన ఢిల్లీలో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. దండగులు పది రౌండ్ల కాల్పులు జరపడంతో ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన కర్కర్ డుమా మెట్రోపాలిటన్ కోర్టు ఆవరణలో చోటు చేసుకుంది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు ఆవరణలో ప్రవేశించారు. అనంతరం 83వ గదికి చేరుకుని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో రామ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ కు మూడు బుల్లెట్లు దూసుకపోవడంతో అక్కడికక్కడనే దుర్మరణం చెందగా ఇర్ఫాన్ తో పాటు కోర్టులో పనిచేసే క్లర్క్ కి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జడ్జి సురక్షితంగా ఈ దాడి నుండి బయటపడ్డారు. అండర్ ట్రయల్ చెలు పహిల్వాన్ అలియాస్ ఇర్ఫాన్ టార్గెట్ గా ప్రత్యర్థి వర్గం కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. కాల్పులకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

16:17 - December 23, 2015

హైదరాబాద్ : లోక్ సభలో పది బిల్లులపై టీఆర్ఎస్ ఎంపీలు చర్చించినట్లు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. లోక్ సభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు ప్రైవేటు బిల్లులను ప్రవేశ పెట్టినట్లు, రాష్ట్రం విడిపోయిన అనంతరం శాసనసభలో సీట్ల సంఖ్యను పెంచుకొనే వెసులు బాటు ఇవ్వాలని బిల్లులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విభజన చట్టం చెప్పినా హైకోర్టు విభజన ఇంకా జరగలేదని, అంతేగాక సమయం పొందుపర్చలేదన్నారు. హైకోర్టు విభజన కోసం ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టడం జరిగిందని ఎంపీ వినోద్ పేర్కొన్నారు. 

16:10 - December 23, 2015

కరీంనగర్ : జిల్లాల్లో సైకోలు విజృంభిస్తున్నారు. బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి తల్వార్ తో దాడికి దిగడం..పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఘటన మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. సుల్తానాబాద్ లోని శాస్త్రీనగర్ లో అంజయ్య సైకో బుధవారం సాయంత్రం కర్రతో స్థానికులపై దాడులకు దిగాడు. హోటల్ పై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేశాడు. అనంతరం రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తిపై కర్రతో దాడికి దిగాడు. దీనితో అతని చేయి విరిగిపోయింది. అప్రమత్తమైన స్థానికులు అంజయ్యను పట్టుకుని చెట్టుకు కట్టిపడేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు అంజయ్యను అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా అంజయ్య మతిస్థిమితం కొల్పోయినట్లు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. సైకోలు వీరంగం సృష్టిస్తుండడం పట్ల జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. 

రోజాను సస్పెండ్ చేయడం సరికాదు - రఘువీరా..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ చేయడం సరికాదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. ఎథిక్స్ కమిటీ అభిప్రాయాలు తీసుకోవాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహి అని, అసెంబ్లీలో మర్యాదస్తులు, పెద్ద మనుషులు కరువయ్యారన్నారు. 

జనవరిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు - స్పీకర్..

హైదరాబాద్ : జనవరి నెలాఖరులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని స్పీకర్ మధుసూధానచారి వెల్లడించారు. 

హిట్ అండ్ రన్ కేసుపై సుప్రీంను ఆశ్రయించనున్న మహారాష్ట్ర..

ఢిల్లీ : హిట్ అండ్ రన్ కేసుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ దోషిగా నిర్ధారించేందుకు సరైన ఆధారాలు లేవంటూ ముంబై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.  

సుల్తానా బాద్ లో సైకో వీరంగం..

కరీంనగర్ : సుల్తానాబాద్ లోని శాస్త్రీనగర్ లో సైకో వీరంగం సృష్టించాడు. కనిపించిన వారిపై రాళ్లతో దాడికి దిగాడు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి సైకోను పట్టుకుని ఆసుపత్రికి తరలించారు. 

పార్లమెంట్ ఉభయసభలూ వాయిదా..

ఢిల్లీ : పార్లమెంట్ రాజ్యసభ, లోక్ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్ సభలో 11 బిల్లులు ఆమోదం పొందితే, రాజ్యసభలో కేవలం మూడు బిల్లులకు ఆమోదం లభించింది. రాజ్యసభలో ప్రతిష్టంభన వల్ల రూ.9.9 కోట్ల నష్టం వాటిల్లడమే కాకుండా 55 గంటల సమయం వృధా అయ్యింది. 

ఉద్యోగాల పేరిట 300 మందికి టోకరా..

అనంతపురం : ఉద్యోగాల పేరిట 300 మందికి దళారులు టోకరా వేశారు. రూ.3 కోట్ల మేర వసూలు చేసిన ఐదుగురు దళారులను పోలీసులు అరెస్టు చేశారు. 

రాహుల్ పర్యటనలో విషాదం..

ఢిల్లీ : అమేథీలో ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పర్యటనలో విషాదం చోటు చేసుకుంది. రాహుల్ సమక్షంలోనే రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందాడు.

15:20 - December 23, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో వ్యక్తిగత నిందారోపణలు చేసుకోవడం సరికాదని మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారశైలి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు. స్పీకర్ కోడెలపై జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టడం అనాలోచిత నిర్ణయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము చెప్పినట్టే సభ నడవాలని అనుకోవడం సరికాదని, సభను నడువనీవమని చెప్పడం కూడా కరెక్టు కాదని కామినేని శ్రీనివాస్ తెలిపారు. 

15:16 - December 23, 2015

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజాని ఏడాది పాటు సస్పెండ్ చేయడం చాలా చిన్న విషయమని ప్రభుత్వ చీప్ విప్ కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్..వైసీపీ స్పీకర్ పై అవినీతి తీర్మానం తదితర అంశాలపై టెన్ టివితో కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు. చట్టాలపట్ల వారికి గౌరవం లేదని, రోజా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. శాసనసభకు సభ్యుల మీద చర్యలు తీసుకొనే సర్వాధికారాలున్నాయని, అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు దారుణంగా ఉందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రవర్తించిన తీరు కొత్త కాదని, గత బడ్జెట్ సమావేశాల్లో కూడా అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ప్రవర్తించారని గుర్తు చేశారు. బేషరతుగా క్షమాపణ చెప్పిన తరువాత మారుతారని ఆలోచించించి స్పీకర్ పెద్ద మనస్సుతో వారికి క్షమాభిక్ష పెట్టారని తెలిపారు. గతంలో కూడా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చి బేషరతుగా ఉపసంహరించుకొన్నారని తెలిపారు. తప్పు మీద తప్పు చేయడం వైసీపీకి పరిపాటిగా మారిందని, ఎమ్మెల్యే అనిత బాధ పడుతుండడం చూస్తుంటే చాలా బాధగా ఉంటోందని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. 

15:14 - December 23, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలోని కొలేరులో రగడ మొదలైంది. చెరువులో అక్రమసాగు చేస్తున్నారంటూ అటవీ శాఖ అధికారులు పేర్కొనడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. పైడి చింతలపాడులు రొయ్యల సాగు చేస్తుంటారు. బుధవారం మధ్యాహ్నం అటవీశాఖాధికారులు వచ్చి సాగు చేయవద్దని, ఇది అక్రమమని పేర్కొన్నారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహంవ వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా తాము ఇక్కడ సాగు చేయడం జరుగుతోందని, అక్రమమని మీరు ఎలా చెబుతారంటూ వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం అధికారుల వాహనాలన్నింటిలో స్థానికులు గాలి తీసేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాలతో మాట్లాడారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో సమస్యను పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. 

14:53 - December 23, 2015

హైదరాబాద్ : గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భగీరథ ప్రయత్నానికి ముందడుగు పడింది. మహారాష్ట్ర ప్రభుత్వ జనవనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ తో హరీష్ రావు జరిపిన చర్చల్లో తుమ్మిడిహట్టికి సూత్రప్రాయంగా ఒకే చెప్పింది. ఏళ్ల తరబడి ఆలోచనలకే పరిమితమైన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఓకే చెప్పింది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మహారాష్ట్ర ప్రభుత్వానికి చేసిన విన్నపానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేసింది. దీనితో పాటు పనిలో పనిగా మేడిగడ్డ పైనా చర్చ జరిగింది. దీనిపై మరోసారి చర్చిద్దామని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ఈ నెల 29, 30 న జరిగే ప్రాణహిత బోర్డు సమావేశం కీలకంగా మారింది.

తుమ్మిడిహట్టి...
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులకు తుమ్మిడిహట్టిపై మహారాష్ట్ర అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గోదావరి నది నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి మహారాష్ట్ర అంగీకారం లేకుండానే తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో బ్యారేజీని ప్రతిపాదించింది. దానికనుగుణంగా కాలువలను కూడా తవ్వించింది సరిగ్గా ఇదే సమయంలో మహారాష్ట్ర నీటి లభ్యతపై జలవనరుల సంఘానికి ఫిర్యాదు చేసింది. ముంపు గ్రామాల విషయంలో మహారాష్ట్ర, కేంద్ర జలవనరుల సంఘం అనుమానాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయాలు అన్వేషించిందని హరీష్ రావు తెలిపారు.

ఆ జిల్లాలకు తీరనున్న నీటి కష్టాలు..
వ్యాప్కోస్ చేసిన అధ్యయనంలో గోదావరిపై కాళేశ్వరానికి దిగువన మేడిగడ్డ వద్ద 103 మీటర్ల బ్యారేజీని నిర్మించాలని ప్రతిపాదించారు. అత్యధిక వరద మట్టం వద్ద బ్యారేజీని నిర్మిస్తే ముంపు మొత్తం నదీ గర్భంలోనే ఉంటుందని అధ్యయనంలో తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్లుగా.. తగ్గించిన ఎఫ్ఆర్ఎల్ వద్ద బ్యారేజీని నిర్మించి.. ఆదిలాబాద్ జిల్లా అవసరాలకు మాత్రమే నీటిని వినయోగించాలని నిర్ణయించింది. మిగతా జిల్లాల నీటి అవసరాలకు మేడిగడ్డ నుండి లిఫ్ట్ చేసుకునేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రూపొందించింది. కాని వీటన్నింటికి మహారాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ముడిపడి ఉంది. తక్కువ సమయంలో ఏ రకంగా వెళితే తెలంగాణ ప్రాజెక్టులకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయన్న దానిపై కేసీఆర్, మంత్రులతో మంతనాలు చేశారు. కేసీఆర్ అనుకున్నట్లుగా మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టికి పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపితే ఆదిలాబాద్ , నిజామాబాద్ జిల్లాలకు నీటి కష్టాలు తీరనున్నాయి.

14:47 - December 23, 2015

దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన బాలల న్యాయ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఎగువ, దిగువ సభల ఆమోదం పొందిన కొత్త చట్టం ప్రకారం 16 నుండి 18 ఏండ్లలోపు బాలలు చేసిన హేయమైన నేరాలు ఇకపై బాలనేరస్తుల చట్ట పరిధిలోకి రావు. నిర్భయ ఘటన జరిగిన మూడేళ్ల అనంతరం ఈ చట్టంలో సవరణలు చేశారు. ఈ సందర్భంగా మానవి 'మై రైట్' కార్యక్రమంలో ఈ అంశంపై లాయర్ పార్వతి విశ్లేషించారు. అత్యంత హేయమైన నేరాలు చేసిన వారిని వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారని, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగానే చట్టం అమల్లోకి వస్తుందన్నారు. 1986 సంవత్సరంలో ఒక యాక్ట్ ఉండేదని, దీనికి కొన్ని సవరణలు చేస్తూ 2000 సంవత్సరంలో చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియో చూడండి. 

14:41 - December 23, 2015

మెదక్ : అన్నార్తుల ఆకలి తీర్చడం కోసం వెలసిన దేవాలయం అది. పరమత సహనాన్ని చాటుతూ శాంతికి...ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఆధ్యాత్మిక కట్టడం అది. తరాలు కాల గర్భంలో కలిసిపోతున్నా చెక్కుచెదరకుండా నిర్భయంగా...నిశ్చలంగా నిలబడ్డ ప్రార్థనా మదిరం అది. అదే ఆసియాలోనే అతిపెద్ద కట్టడం మెదక్‌ చర్చ్‌. అడుగుపెడితే చాలు ఆధ్యాత్మిక పరిమళాలు అల్లంత దూరాన నుంచి చూసినా నిండుగా గాంభీర్యంగా.. కనిపించే మినార్‌. కరుణామయుడే ప్రేమగా తన మందిరానికి పిలుస్తున్నాడని క్రైస్తవులు భావించే అత్యద్భుత ఆధ్యాత్మిక కట్టడం మెదక్‌ చర్చ్‌.

1924 నిర్మాణం పూర్తి..
మెదక్‌ పట్టణంలో ఉన్న ఈ పురాతన చర్చ్‌ ఆసియాఖండంలోనే ప్రఖ్యాతి గాంచింది. గోతిక్ పునరుజ్జీవన తరహాలో కట్టిన ఈ చర్చికి 1914లో పునాదిరాయి పడితే 1924కు నిర్మాణం పూర్తయింది. లండన్‌కు చెందిన రెవరాండ్ చార్లెస్ వాకర్ ప్రోస్నేట్ అనే మతగురువు మెదక్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో, అనారోగ్యాలు ఆకలితో అలమటిస్తోంది. ఇక్కడి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పస్నేట్‌ చర్చ్‌ నిర్మాణానికి పూనుకున్నాడు. పనికి ఆహార పథకంలాంటి దానిని ప్రవేశపెట్టి చర్చ్‌ నిర్మాణంలో అందరూ పాలపంచుకునేలా పని కల్పించాడు. 12 వేల మంది కార్మికులు 10 సంవత్సరాల పాటు శ్రమించి అత్యద్భుత కట్టడాన్ని నిర్మించారు. ఇందుకావలసిన నిధులను పస్నేట్‌ ఇంగ్లాండ్‌ నుంచే విరాళాలుగా సేకరించాడు. అప్పటిలో చర్చ్‌ నిర్మాణానికి ఖర్చయినది కేవలం 14 లక్షల రూపాయలు మాత్రమే. అలా మహోన్నత ఉద్దేశంతో, శ్రమజీవుల చెమట నుంచి పుట్టినదే మెదక్‌ చర్చ్.

5000 మంది ప్రార్థన...
ఇటలీ దేశస్తులతో పాటు భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు, కళాకారులు చర్చిని అత్యంతసుందరంగా రూపుదిద్దారు. ఈ చర్చికి 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో ఉన్న కేథడ్రాల్ ఉంది. అతి పెద్దగా ఉండే ఈ కేథడ్రాల్‌లో ఒకేసారి 5,000 మంది ప్రార్ధన చేసుకోవొచ్చు. బ్రిటన్ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసిన ఆరు వేర్వేరు రంగుల మొసాయిక్ టైల్స్ ఈ చర్చిలో ఉన్నాయి. ఈ చర్చికి చెందిన గచ్చు పనిని ఇటలీ తాపీ వారు చేశారు. ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అద్దాలపై యేసు ప్రతిమ.. క్రీస్తు జీవన విధానం తెలియజేసే అందమైన అక్షరాలతో దేవుడి చరిత్ర ముద్రించి ఉంటుంది. కుడి వైపు క్రీస్తు జననం.. ఎడమ వైపు శిలువ వేసిన దృశ్యం.. ముందు భాగంలో యేసు పునఃరుద్దరణం చిత్రాలు అద్భుతంగా దర్శనమిస్తాయి. సూర్యకిరణాలు తాకగానే ఈ చిత్రాలు
మరింత ప్రకాశవంతంగా వెలుగుతుండటం ఈ చర్చ్‌ ప్రత్యేకత.

మిగతా మతాల వారు ప్రార్థనలు..
పూర్తిగా రాళ్లు, దంగుసున్నాన్ని ఉపయోగించి నిర్మించిన ఈ చర్చ్‌లో ప్రతీ అడుగు ఒక కళాఖండమే. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని, 175 అడుగుల ఎత్తేన శిఖరాన్ని నిర్మించడంతో నాటి పనితనానికి నిదర్శనం. చారిత్రక కట్టడంగాను, ఆధ్యాత్మిక కేంద్రంగాను ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ చర్చ్‌ను చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. క్రిస్మస్‌ పర్వదినాల్లో పర్యాటకుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. క్రిస్మస్‌ సందర్భంగా ఈ చర్చ్ విద్యుత్‌కాంతులతో మరింత శోభాయమానంగా ఉంటుంది. ఒక్క క్రైస్తవులే కాదు మిగతా మతాలవారు క్రిస్మస్‌ పర్వదినాల్లో ఈచర్చ్‌కు వచ్చి ప్రార్థనల్లో పాల్గొనడం పరమతసహనానికి ఓ నిదర్శనం.

14:35 - December 23, 2015

విజయవాడ : ఎనీ సెంటర్‌.. ఎనీ టైమ్‌.. ఎనీ లీడర్‌.. తీసుకోవటానికి నేను రెడీ.. మీరూ రెడీగా ఉండండని బాబు తమ్ముళ్లకు పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటివరకు వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న వలస నేతలు ఒక్కొక్కరికీ బెర్త్‌లు కన్‌ఫర్మ్‌ చేసేస్తున్నారు. ఎవరు ఎప్పుడు సైకిల్‌ ఎక్కాలో షెడ్యూల్‌ ఫిక్స్‌ చేస్తున్నారు. వ్యవహారం నానబెట్టి నానబెట్టి.. అవతలివాళ్ల మైండ్‌ ఫిక్స్‌ చేయడంతో ఎక్స్‌పెర్ట్‌ అయిన చంద్రబాబు.. తెలుగు తమ్ముళ్లకు కూడా అదే ఫార్ములా అమలు చేశారు. వలసలకు ఒప్పుకోవాల్సిందేనంటూ అల్టిమేటం ఇచ్చి.. ఆపరేషన్‌ ఆకర్ష్‌ స్పీడు పెంచేశారు.

ఆనం..కొణతాల చేరిక..
ఏపీలో చంద్రబాబు ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఎప్పుడో మొదలెట్టారు. కాని ఇప్పుడు స్పీడు పెంచారు. ఎవరు అడ్డం పడినా కుదరదని పార్టీ నేతలకు చెప్పేశారు. పలువురు నేతలు కొంత కాలంగా టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నా నెమ్మదిగా ఆచితూచి వ్యవహరించారు బాబు. ఇటీవలే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నా అన్ని ఆలోచించి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కొణతాల రామకృష్ణ గండిబాబ్జీలు కూడా సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నారు.కాని మంత్రి గంటాను కొంత కాలంగా ఇబ్బందులకు గురి చేసిన కొణతాలను చేర్చుకోవడంపై పునరాలోచించుకోవాలని బాబుకు సూచించినట్లు తెలుస్తుంది. అయినా సరే పార్టీ అభివృద్దికి కొత్త నీరు అవసరమని నేతలకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.

విశాఖలో పార్టీ జెండా ఎగురవేయాలని బాబు వ్యూహం..
నేతలకు సర్థి చెబుతూ కొణతాలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీ జెండా దింపి టీడీపీ జెండా ఎగరవేయాలనేది బాబు అభిమతం. ఇక కడప జిల్లాలో కూడా ఒక వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలోకి రావడానికి ఉవ్విల్లూరుతున్నారని త్వరలోనే బాబు సిగ్నల్ ఇస్తారని టాక్ . ఇన్నాళ్లు జిల్లాలోని కొందరు నేతలు వ్యతిరేకించడంతోనే జాప్యం జరిగిందని ఇక ఆకర్ష్ లో భాగంగా రెడ్ కార్పెట్ వేసేందుకు.. జిల్లా ఇంఛార్జ్ ను ఒప్పించేందుకు చంద్రబాబే రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.

సమన్వయంతో ముందుకెళుతారా ?
ఇలా పార్టీలోకి వస్తున్న నేతల ద్వారా బలహీనంగా ఉన్న జిల్లాలో టీడీపీ పాగా వేయాలని చూస్తోంది. దీంతో కిందస్థాయి నేతలు అధినేత నిర్ణయాలకు అడ్డు చెప్పలేక వారిలో వారే మదన పడుతున్నారు. కొణతాల , బాబ్జీలను చేర్చుకోవడం ద్వారా విశాఖ ఏజెన్సీలోకి సైకిల్ ను పంపించాలని చూస్తున్నారు బాబు. కొత్తనీరు పార్టీలోకి చేరడం ద్వారా పాత నీరు చెడిపోకుండా నేతలు సమన్వయంతో ముందుకు వెళతారా లేదా అన్నది వేచి చూడాలి.

14:32 - December 23, 2015

హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలకు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో ఉన్న పీవీ ఘాట్‌ దగ్గర ఆయన చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పీవీ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. పీవీ వర్ధంతి సందర్భంగా సర్వ మత ప్రార్ధనలు నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

14:16 - December 23, 2015

ఢిల్లీ : హస్తిలో ఆప్‌ కార్యకర్తలు  కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ నివాసం దగ్గర  నిరసన వ్యక్తం చేశారు. డీడీసీఏ వ్యవహారంలో జైట్లీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  బ్యారికేడ్లను చేధించుకుని ఆయన  నివాసం వైపు చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించిన ఆప్‌ కార్యకర్తలపై పోలీసులు జల ఫిరంగులు  ప్రయోగించారు. అరుణ్‌ జైట్లీ 1999-2013 మధ్య డీడీసీఏ అధ్యక్షుడుగా పని చేశారు.  ఆయన హయాంలో ఆర్ధిక అవకతవకలు జరిగాయని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై కేజ్రీవాల్‌ సర్కార్‌  న్యాయ విచారణకు కూడా ఆదేశించారు. దీనికి ప్రతిగా అరుణ్‌ జైట్లీ...  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాలతోపాటు, ఆ పార్టీకి చెందిన ఐదుగురు నేతలపై 10 కోట్ల రూపాయలకు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. పటియాల హౌస్‌ కోర్టులో క్రిమిల్‌ కేసు దాఖలు చేశారు. 

14:14 - December 23, 2015

హైదరాబాద్ : బాక్సైట్ అంశంలో సీఎం చంద్రబాబు చెవిలో పూలు పెడుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. అసెంబ్లీ జరిగి తీరు..సభలను బహిష్కరణ అంశాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. కాల్ మనీపై చర్చ జరగకుండా అడ్డుకున్నారని, రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరినా పట్టించుకోనుందుకే బహిష్కరించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు జరగడం అన్యాయమని, ఉదయం 9 గంటలకు మొదలై మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే ఈ సమావేశాలు కొనసాగుతాయని పేర్కొనడం జరిగిందన్నారు. సమావేశాలు పొడిగించాలని కోరినా పట్టించుకోలేదని, సమస్యలపై చర్చించడానికి వీలు లేకుండా అసెంబ్లీ షెడ్యూల్ రూపొందించారని విమర్శించారు. సీఎం అండతోనే కాల్ మనీ ఆగడాలు సాగుతున్నాయని, విజయవాడ కేంద్రంగా కాల్ మనీ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేశారని జగన్ విమర్శించారు. కాల్ మనీని కేవలం వడ్డీ వ్యాపారుల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. 

14:14 - December 23, 2015

టి.సుబ్బిరామిరెడ్డి జీవిత సాఫల్య పురస్కారానికి అలనాటి బాలీవుడ్‌ అందాల తార రేఖ ఎంపికయ్యారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలకుగానూ ఈ పురస్కారం అందించనున్నారు. బాలీవుడ్‌ యష్‌రాజ్‌ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ దిగ్గజం యష్‌చోప్రా స్మారకార్ధం టీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఈ అవార్డును ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బంగారు పతకం, రూ.10లక్షల నగదుతో రేఖను ఘనంగా సత్కరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ కార్యక్రమం జరగనుందని టీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌, ఎంపి డా.సుబ్బిరామిరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

 

14:10 - December 23, 2015

ఆషికి-2కి సీక్వెల్ గా ఆషికి-3 రాబోతుంది. 1990లో రాహుల్‌రారు, అను అగర్వాల్‌ జంటగా తెరకెక్కిన 'ఆషికి' చిత్రంలోని 'ధీరే ధీరే సే' పాట రీమిక్స్ లో నటించి హృతిక్‌రోషన్‌, సోనమ్‌కపూర్‌ హిట్‌ పెయిర్‌గా నిలిచారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఆషికి 2' చిత్రానికి సీక్వెల్‌గా 'ఆషికి3' చిత్రం రూపొంద నుందని సమాచారం. ఈ చిత్రానికి అమిత్‌శర్మ దర్శకత్వం వహించనున్నారట. 2013లో విడుదలైన 'ఆషికి2'లో సిద్ధార్థ్‌ రారు కపూర్‌, శ్రద్ధాకపూర్‌లు జంటగా నటించిన సంగతి విదితమే. హృతిక్‌రోషన్‌ ప్రస్తుతం అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్‌ చిత్రం 'మొహెంజో దారో' చిత్రంలో నటిస్తుంటే, సోనమ్‌ కపూర్‌ 'నీరజ' బయోపిక్‌లో నటిస్తున్నారు. దాదాపు 300 మందికి పైగా ప్రయాణీకుల్ని ఉగ్రవాదుల బారి నుండి కాపాడే ప్రయత్నంలో ప్రాణాల్ని కోల్పోయిన ఎయిర్‌ హోస్టెస్‌ నీరజా భానోత్‌ జీవిత కథ ఆధారంగా 'నీరజ' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే.

 

సీఎం అండతోనే కాల్ మనీ ఆగడాలు - జగన్..

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు జరగడం అన్యాయమని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. సమావేశాలు పొడిగించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. సీఎం అండతోనే కాల్ మనీ ఆగడాలు సాగుతున్నాయని, విజయవాడ కేంద్రంగా కాల్ మనీ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేశారని జగన్ విమర్శించారు. 

రష్యాకు మోడీ..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యాకు బయలుదేరి వెళ్లారు. రష్యాలో మోడీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తో మోడీ భేటీ కానున్నారు. అణు విద్యుత్, రక్షణ, వాణిజ్యం సహా ద్వైపాక్షిక అంశాలపై మోడీ చర్చించనున్నారు. 

14:07 - December 23, 2015

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌, కాజోల్‌ జంటగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'దిల్‌వాలే' చిత్రం భారీ కలెక్షన్ల దిశగా పయనిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 121కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. భారత్‌లో రూ.65కోట్లు కలెక్ట్‌ చేయగా, ఓవర్సీస్‌లో 56కోట్లను రాబట్టినట్లు చిత్ర బృందం తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. దీంతో ఈ ఏడాదిలో అత్యధిక తొలి రోజు వసూళ్లు సాధించిన ఇండియన్‌ సినిమాల్లో 'దిల్‌వాలే' మూడో స్థానంలో నిలిచింది. షారూఖ్‌ఖాన్‌, కాజోల్‌, వరుణ్‌ ధావన్‌, కృతి సనన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే.

 

 

ఇరిగేషన్ శాఖ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి..

కడప : బనగాపల్లి ఇరిగేషన్ శాఖ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. ప్రొద్దుటూరులో గోపాల్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.

 

తెలంగాణ కేసీఆర్ ప్రైవేటు లిమిటెడ్ - కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రైవేటు లిమిటెడ్ గా మార్చారని, గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ నేత కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 67,794 ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని, మోడీని విమర్శించే స్థాయి టీఆర్ఎస్ కు లేదన్నారు. 

14:02 - December 23, 2015

రంగారెడ్డి : జిల్లాలోని పేట్‌ బషీరాబాద్‌లో విషాదం జరిగింది. పందేం కోసం ఓ విద్యార్థి వెళ్లి ప్రాణం తీసుకున్నాడు. విద్యార్ధి హాస్టల్‌ భవనంపై నుంచి కిండపడి మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన సాయికిరణ్ బీటెక్ చదువుతున్నాడు. పేట్‌ బషీరాబాద్‌లోని హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈనేపథ్యంలో అవినాష్, సాయికిరణ్ లు సరదాగా పందెం కట్టారు. తమ హాస్టల్ మూడో అంతస్తు పై నుంచి పక్కనే ఉన్న మరో హాస్టల్ భవనంపైకి వెళ్లాలని పందెం కట్టుకున్నారు. మొదటగా అవినాష్ క్షేమంగానే దాటాడు. అనంతరం సాయికిరణ్ దాటుతుండగా పట్టుతప్పి... కింద పడిపోయాడు. సీసీ కెమెరా విజువల్స్ లో మొదట ఓ విద్యార్ధి దూకగా.. తర్వాత సాయికుమార్‌ దిగటానికి ప్రయత్నించి పడిపోయినట్లు ఉంది. అతని తలకు బలమైన గావడంతో కోమాలోకి వెళ్లాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

 

 

రేణిగుంటలో మూడు బస్తాల ప్రామిసరీ నోట్ల దగ్ధం..

చిత్తూరు : రేణిగుంటలో మూడు బస్తాల ప్రామిసరీ నోట్లు బాండ్ పేపర్లను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. జిల్లాలో పోలీసుల దాడులకు భయపడి ప్రామిసరీ నోట్లు, బాండ్లను దగ్ధం చేసినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తిరుపతి, తిరుమల, రేణిగుంట ప్రాంతాలకు చెందిన వ్యక్తుల అప్పులకు సంబంధించిన బాండ్లని పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని రేణిగుంట తహశీల్దార్ పరిశీలించారు. 

ఢిల్లీలో కాల్పులు..

ఢిల్లీ : కర్కర్ డుమా మెట్రోపాలిటన్ కోర్టు ఆవరణలో దుండగులు కాల్పలకు తెగబడ్డారు. పది రౌండ్ల కాల్పులు జరపడంతో కోర్టు ఉద్యోగితో సహా ఇద్దరు మృతి చెందారు. 

స్పీకర్ పై తమకు విశ్వాసం పోయింది - వైసీపీ..

హైదరాబాద్ : ఏపీ స్పీకర్ కోడెలపై తమకు విశ్వాసం పోయిందని వైసీపీ వ్యాఖ్యానించింది. తొలి సమావేశాల నుండే స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సభాపతి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పేర్కొంది. 

ఏపీ అసెంబ్లీ సెక్రటరీని కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీని వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం నోటిసు ఇచ్చింది. ఆర్టికల్ 179 క్లాజ్ (సి), అసెంబ్లీ ప్రొసిజర్ 71 సబ్ క్లాజ్ (1) కింద స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. 18న సభలో జరిగిన ప్రొసిడింగ్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

 

గుంటూరులో బాబు పర్యటన..

గుంటూరు : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అడవి తక్కెళ్లపాడులో క్రిస్టియన్ భవన్ కు బాబు శంకుస్థాపన చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకల్లో బాబు పాల్గొననున్నారు. 

13:51 - December 23, 2015

హైదరాబాద్ : అయుత మహాచండీయాగం వైభవంగా జరుగుతోంది. వేదఘోషతో ఎర్రవల్లి వ్యవసాయక్షేతం ప్రతిధ్వనిస్తోంది. 108 హోమగుండాలతో పాటు చతుర్వేద యాగశాలలో యాగం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ దంపతులతో పాటు గవర్నర్‌ దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు. మొత్తం రెండు వేల రుత్విజుల పర్యవేక్షణలో చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. వీరికి సహాయకులుగా 400 మంది రుత్విజులు ఉన్నారు. శృంగేరి శారదాపీఠం నుంచి తీసుకొచ్చిన కుంకుమతో రెండు వేల మంది మహిళలు కుంకుమార్చన చేస్తున్నారు. యాగానికి తరలివస్తున్న ప్రముఖులతో ఎర్రవల్లి ప్రాంతం శోభాయమానంగా మారింది. రోజు 50వేల మందికి అన్నదానం చేయనున్నారు.

 

 

13:47 - December 23, 2015

హైదరాబాద్ :  ఎపి సర్కార్, సీఎం చంద్రబాబుపై వైసిపి అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు దీవెనలతోనే 'సెక్స్ రాకెట్' ఘటన చేసుకుందని ఆరోపించారు. సీఎం అండదండలతోనే కాల్ మనీ ఆగడాలు పెచ్చుమీరాయని విమర్శించారు. 'కామ' సీఎం అంటే తప్పేంటని ప్రశ్నించారు. కా.. అంటే కాల్ అని మ.. అంటే మనీ అని... దీంతో 'కామ సీఎం' అని అన్నట్లు భాష్యం తెలిపారు. కాల్ మనీ వ్యవహారంలో చంద్రబాబుతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కాపాడడం సీఎం కోసం అంబేద్కర్ అంశాన్ని ఉపయోగించుకోవడం దారుణన్నారు. విజయవాడలో జరిగిన కాల్ మనీ వ్యవహారాన్ని రాష్ట్ర వ్యాప్త సమస్యగా టిడిపి సర్కార్ చిత్రీకరించిందని పేర్కొన్నారు. సమావేశాల్లో కాల్ మనీ అంశాన్ని లేవనెత్తితే... దాన్ని నుంచి తప్పించుకోవడానికి బిజినెస్ ఎజెండాలో లేని అంబేద్కర్ అంశంపై చర్చకు తెరలేపారని పేర్కొన్నారు. కాల్ మనీ అంశంపై చర్చ జరుగకుండా..చేసేందుకే ఎజెండాలో లేని అంబేద్కర్ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారని తెలిపారు. అంబేద్కర్ జయంతి, వర్థంతి రోజులు బాబుకు గుర్తుకు రాకుండా..కేవలం సభలోనే సీఎంకు అంబేద్కర్ గుర్తుకు రావడం శోచనీయమని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ జయంతి, వర్థంతి రోజుల్లో చంద్రబాబు ఎలాంటి కార్యక్రమాలు చేయలేదని గుర్తు చేశారు. అధికారపక్షం సభా సమయాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు జరిగితే.... సమావేశాలకు ఎమైనా అర్థం ఉందా..? నిలదీశారు. కాల్ మనీ నిందితులకు సీఎం ఆశీస్సులున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు, పోలీసుల కుమారుల భాగస్వామ్యం ఉందన్నారు. నిందితుడు ఇంటెలిజెన్స్ డీజీతో ఫొటో దిగారని పేర్కొన్నారు. వీడియో టేపులు కూడా... పట్టుబడ్డాయి... రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి రకరకాల విషయాలు వెలుగలోకి వస్తున్న తరుణంలో అసెంబ్లీ... సమావేశాలు జరిగాయని తెలిపారు. ఈనేపథ్యంలో సభలో కాల్ మనీ వ్యవహారంపై తాము చర్చకు పట్టుబట్టామని తెలిపారు. కానీ దానిపై చర్చించడానికి స్పీకర్ అవకాశం ఇవ్వలేదన్నారు.

రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్దం 
నిబంధలనలకు విరుద్ధంగా రోజాను ఏదాడిపాటు స్పీకర్ సస్పెండ్ చేసిన విషయాన్ని తెలిపారు. రూల్ 340 ప్రకారం... సస్పెండ్ చేస్తున్నామంటూ... స్పీకర్ చెప్పారు. కానీ స్పీకర్ కు ఏడాది పాటు సస్పెండ్ చేసే అధికారం లేదన్నారు. రూల్స్ కు వ్యతిరేకంగా స్పీకర్ రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని మండిపడ్డారు.

 

13:22 - December 23, 2015

హైదరాబాద్‌ :  సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. హైదర్‌గూడలో లక్ష్మిబాయి అనే మహిళ మెడలో ఆరు తులాల పుస్తెల తాడు తెంపుకెళ్లారు. లక్ష్మి బాయ్‌ ఇంటి దగ్గర పూలు కోస్తుండగా బైక్‌ వచ్చిన ఇద్దురు దొంగలు ఆమె మెడలోని గొలుసు తెంపుకుపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుని... విచారిస్తున్నారు. 

13:10 - December 23, 2015

విజయవాడ : కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం వేధింపులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. కాలేజీ యాజమాన్యం వేధింపులకు మరో విద్యాకుసుమం నేలరాలింది. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్.జాన్ అనే విద్యార్థి విజయవాడ తాడిగడప నలంద కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఎస్.జాన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు హాస్టల్‌ వార్డెన్‌ వేధింపులే కారణమని తోటి విద్యార్థులు అంటున్నారు. విద్యార్థి మృతితో అతని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు యాజమాన్యమే కారణమంటున్నారు.
విద్యార్థి తండ్రి...
నా కొడును మాయ చేశారు. నా కొడును చంపేశారు. 500 మందిలో పురుగుమందు తాగే దాక ఏం చేశారు. సద్ది అన్నం తిని 50 వేల ఫీజు కట్టాను. కాలేజీ యాజమాన్యం మరణంపై ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు.
విద్యార్థి బంధువు...
జాన్ మృతికి కాలేజీ యాజమాన్యమే కారణం. నన్ను తిట్టారని... కొడుతున్నారని జాన్ మాకు చెప్పాడు. నన్ను వేధిస్తున్నారని చెప్పాడు. జాన్ ను కొట్టిచంపారు. అతన్ని కొట్టినట్లు దెబ్బలు కూడా ఉన్నాయి. విద్యార్థి మృతికి యాజమాన్యం వేధింపులే కారణం. ఇప్పటి వరకు యాజమాన్యం రాలేదు' అని ఆరోపిస్తున్నారు.

 

పడవ ప్రమాదం... పదిమంది మృతి

హైదరాబాద్ : గ్రీస్‌ సమీపంలోని ఏజియన్‌ సముద్రంలో మరోసారి పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు చిన్నారులు సహా 10 మంది మృతిచెందారు. ఏజియన్‌ సముద్రం గుండా గ్రీస్‌ ద్వీపమైన ఫార్మాకొనిస్సీకి వలదారులతో వెళ్తున్న పడవ మునిగి 10 మంది మరణించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

 

 

స్పీకర్ కోడెలపై వైసిపి అవిశ్వాస తీర్మానం..

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై వైసిపి అవిశ్వాస తీర్మాణం అస్త్రాన్ని ప్రయోగించింది. ఈమేరకు వైసిపి సభ్యులు.. అసెంబ్లీ సెక్రటరీకి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు అందచేశారు. స్పీకర్‌ కోడెల తమ పట్ల పక్షపాత వైఖరి అనుసరిస్తున్నారంటూ సభ్యులు ఆరోపించారు. 

12:05 - December 23, 2015

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై వైసిపి అవిశ్వాస తీర్మాణం అస్త్రాన్ని ప్రయోగించింది. ఈమేరకు వైసిపి సభ్యులు.. అసెంబ్లీ సెక్రటరీకి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు అందచేశారు. స్పీకర్‌ కోడెల తమ పట్ల పక్షపాత వైఖరి అనుసరిస్తున్నారంటూ సభ్యులు ఆరోపించారు. కోడెల తమపై పక్షపాతధోరణి ప్రదర్శించారని వివరించారు. అనంతరం ఆ పార్టీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. సభ ప్రారంభం నుంచి..కూడా సభా సజావుగా జరిగేందుకు జగన్ అందించారని తెలిపారు. జగన్ హుందాగా నడుచుకున్నప్పటికీ ఆ విషయాన్ని గుర్తించకుండా... స్పీకర్ పార్టీలకతీతంగా వ్యవహరించారని మండిపడ్డారు. స్పీకర్ మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించారని ఆరోపించారు. జగన్ పై మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక అవాస్తవాలు మాట్లాడారని పేర్కొన్నారు. అప్పుడు వారిని స్పీకర్ ఏమాత్రం వారించలేదని చెప్పారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిపై చర్చించడానికి స్పీకర్ అవకాశం ఇవ్వలేదని వాపోయారు. అసెంబ్లీలో టెలీకాస్ట్ కానీ వీడియోలను బయటికి మీడియాకు ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా రోజాను సస్పెండ్ చేశారన్నారు. టిడిపి ముఖ్యంగా రోజాను టార్గెట్ చేసిందని చెప్పారు. స్పీకర్ పై తమకు నమ్మకం పోయిందని.. సమావేశాలు ఏకపక్షంగా నడిచాయన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని తెలిపారు.

 

11:50 - December 23, 2015

ఢిల్లీ : ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఇవాళ రష్యా వెళుతున్నారు. అణువిద్యుత్తు, రక్షణ ఒప్పందాలే కీలక ఎజెండాలుగా ఆయన రష్యాలో పర్యటిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రష్యా పర్యటనకు వెళుతున్నారు. బుధ,గురువారాల్లో ఆయన రష్యాలో పర్యటిస్తారు. బుధవారం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మోదీ మాస్కాలో సమావేశమవుతారు. ఈ సమావేశం అనంతరం రక్షణ, అణుశక్తికి సంబంధించి పలు ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేసే అవకాశముంది.
ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా ప్రధాని పర్యటన
దశాబ్ధన్నర కాలంగా, భారత్‌, రష్యాల మధ్య సహాయ సహకారాలకు సంబంధించి జరుగుతున్న ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగానే ప్రధాని ఈ పర్యటన చేస్తున్నారు. రక్షణ, అణుశక్తి రంగాలకు సంబంధించిన పలు అంశాలను ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు.
వాణిజ్య సహకారంపైనా చర్చ
భారత్‌, రష్యాల మధ్య వాణిజ్య సహకారంపైనా మోదీ, పుతిన్‌ చర్చించనున్నారు. ఇరు దేశాలకు చెందిన పలు కంపెనీల సీఈవోలతో వీరు భేటీ అవుతారు.ప్రస్తుతం 10 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాబోయే పదేళ్లలో 30 బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇరుదేశాల లీడర్లు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.ఇది ఇలా ఉంటే పాకిస్తాన్‌కు రక్షణ హెలికాప్టర్లను సరఫరా చేయాలని రష్యా భావిస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతర్జాతీయ పరిణామాలపై సమాలోచనలు!
అంతర్జాతీయ పరిణామాలపైనా మోదీ, పుతిన్‌ చర్చిస్తారు. సిరియాలో తాజా పరిస్థితితో పాటు తీవ్రవాదానికి అడ్డుకట్టవేయడంపైనా రెండు దేశాల నేతలు సమాలోచనలు జరిపే అవకాశముంది. ఈ భేటీ అనంతరం రష్యా అధ్యక్షుడు ఇచ్చే విందు కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. గురువారం జరిగే మరో కార్యక్రమంలో మాస్కోలో ఉంటున్న భారతీయులతో మోడీ ముచ్చటిస్తారు.

 

 

11:45 - December 23, 2015

హైదరాబాద్ : శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 700 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు తమ శరీర భాగాల్లో బంగారం దాచుకుని వచ్చారు. కస్టమ్స్ అధికారుల స్కానింగ్‌లో దొరికిపోయారు. వీరి నుంచి 700 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇద్దరూ హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు.

 

11:44 - December 23, 2015

కృష్ణా : విజయవాడలో కాల్‌మనీ కేసుల సంఖ్య 480కు చేరింది. అయినా ఇప్పటికీ ప్రధాన నిందితులు సత్యానందం, చెన్నుపాటి శ్రీను, వెనిగళ్ల శ్రీకాంత్‌, పెండ్యాల శ్రీకాంత్‌లు ఇంకా పోలీసులకు చిక్కలేదు. లొంగిపోతారంటూ వార్తలొచ్చినా.. ఇప్పటివరకు ఆ సంకేతాలు కనపడటం లేదు. కాల్‌మనీ ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో అధికారులు వాటి కోసం మరో కౌంటర్‌ ఓపెన్‌ చేశారు.

 

11:30 - December 23, 2015

'నిర్భయ' కేసులో బాలనేరస్తుడికి మ్యాగ్జిమమ్ శిక్ష మూడేళ్లు కాకుండా.. కనీసం ఎనిమిదేళ్లు జైలు శిక్ష విధించి ఉండాల్సిందని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. అలాగే తాజాగా చేసిన చేసిన జువైనల్ చట్టంపై ఆలోచించాల్సిన అవసరముందని తెలిపారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై నిర్వహించిన గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ విశ్లేషణ కార్యక్రమంలో ఆయన పాల్గొని, పలు ఆసక్తిరమైన విషయాలను వివరించారు. కొత్తగా పార్లమెంట్ ఆమోదించిన జువైనల్ చట్టం ప్రకారం... 16 నుంచి 18 మధ్య వయసున్న పిల్లలు అత్యంత హేయమైన, క్రూరమైన, నిర్భయ లాంటి నేరాలకు పాల్పడితే.. వారిని కూడా వయోజనులుగానే పరిగణించాలని.. వారికి కూడా వయోజనకు విధించి శిక్షలను విధించాలని వెల్లడించినట్లు పేర్కొన్నారు. అయితే 16 నుంచి 18 మధ్య వయసులో నేరం చేశాడు... 18 సంవత్సరాల తర్వాత దొరికాడు... అప్పుడు కూడా వయోజనులకు వేసే శిక్షనే విధించాలని వెల్లడించినట్లు తెలిపారు. అయితే ఈ చట్టం నిర్భయ కేసుకు వర్తించదని.,.. ఇక ముందు జరగబోయే ఘోర, క్రూరమైన... నిర్భయ లాంటి నేరాలకు వర్తిస్తుందని చెప్పారు. కానీ కొత్త చట్టం పర్యవసనాలను ఆలోచించాలనే మరో వాదన ఉంది. భావోద్వేగాలతో చట్టాలు చేస్తే..దాని పర్యవసానాలపై ఆలోచన చేయాలని చట్టాన్ని ప్రశ్నిస్తున్నవారు సూచిస్తున్నారు.
మరిన్ని వివరాలను ఆయన మాటల్లో చూద్దాం.....

'మే నెలలో లోక్ సభలో జువైనల్ జస్టిస్ చట్టం ఆమోదం పొందిందది. ఈ చట్టం రాజ్యసభలో పెండింగ్ లో ఉంది. రాజ్యసభలో ఉన్న గందరగోళ పరిస్థితుల వల్ల చట్టం ఆమోదం పొంది.. చట్టం కాలేదు. దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన ఘటనలు ఆందోళన రేకిత్తించాయి. మూడేళ్ల క్రితం ఫిజియోథెరపీ విద్యార్థిని అతి దారుణంగా, అత్యచారానికి గురై...హత్య చేయబడింది. ఆ ఘటన భారతదేశాన్ని కుదేపిసింది. భారత సమాజం రోడ్డు మీదకు వచ్చింది. వేలాది యువతరం తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు జరిగిన నేపథ్యంలో భారత్ లో ఓ చర్చ మొదలైంది. ఆ నేరస్తుల్లో ఒకడు 18 సంవత్సరాల వయుసున్న వాడు ఉన్నాడు.

18 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు మూడేళ్ల శిక్ష

జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు ఎలాంటి నేరం చేసినా మూడేళ్ల శిక్ష ఉంటుంది. వయోజనులైతే.. మరణశిక్ష, అయితే కండీషన్లను పెట్టింది. అత్యాచారం, హత్య, దేశ సమైక్యత, సమగ్రత దెబ్బతీసే విధంగా తీవ్రవాద కార్యకలాపాలు, క్రూరమైన, దుర్మార్గమైన నేరాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించాలని చెప్పింది. అంత్యంత అరుదైన కేసు అయి ఉండాలి.. అధికూడా కోర్టులు నిర్ధారించాలి... అప్పుడు మరణశిక్ష వేస్తారు. కానీ పిల్లల విషయానికొస్తే... ఇలాంటి నిబంధన లేదు. మ్యాగ్జిమమ్ శిక్ష మూడేళ్లు. నిర్భయ కేసులో ఒకడు దుర్మార్గంగా, క్రూరంగా కేసులో భాగం పంచుకున్నాడు. ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఇతనికి మూడేళ్లు శిక్షపడింది. మిగిలిన వారికి మరణ శిక్ష పడింది. ఇప్పటికీ కూడా ఆ మరణశిక్ష అమలు కాలేదు. బాలనేరస్తుడు మూడేళ్ల శిక్షతో తప్పించుకుని.. ఇటీవల విడుదలయ్యాడు. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. పిల్లలు ఇలా నేరాలు చేయొచ్చా... ఇలా చేస్తే.. భవిష్యత్ ఇలాంటి నేరాలు పెరుగువా... వాటిని అరికట్టేది ఎలా...? అంటూ దేశవ్యాప్తంగా అందోళనలు చెలరేగడంతో భావోద్వేగాల మధ్య పార్లమెంట్ ఈ చట్టాన్ని తెచ్చింది. అయితే భావోద్వేగాలతో చట్టం చేద్దామా... అని దీనిపై భిన్నాభిప్రాయం ఉన్నవారు.. అంటున్నారు. 14 నుంచి 15 సంవత్సరాల పిల్లలను ఐఎస్ ఐఎస్ లో చేర్పించుకుంటున్నారు. తీవ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇలాంటి వారిపై ఉరిశిక్ష విధించుదామా.. ? అనే విషయాలను ఆలోలించాల్సిన అవసరముందని చెబుతున్నారు.
 

క్రూరమైన నేరాలకు పాల్పడితే వారికి కూడా వయోజనులకు పడే శిక్షే...

అయితే కొత్తగా పార్లమెంట్ ఆమోదించిన జువైనల్ చట్టం ప్రకారం... 16 నుంచి 18 మధ్య వయసున్న పిల్లలు అత్యంత హేయమైన, క్రూరమైన నేరాలకు పాల్పడితే, నిర్భయ లాంటి నేరాలకు పాల్పడితే.. వారికి కూడా వయోజనులుగానే పరిగణించాలని.. వారికిపడే శిక్ష కూడా వీరికి పడుతుందని.. వయోజనులు విచారించినట్లే విచారించాలని పేర్కొన్నారు. అయితే 16 నుంచి 18 మధ్య వయసులో నేరం చేశాడు... 18 సంవత్సరాల తర్వాత దొరికాడు... అప్పుడు కూడా వయోజనులకు వేసే శిక్షనే విధించాలని వెల్లడించినట్లు తెలిపారు.

కొత్త చట్టం 'నిర్భయ'కు వర్తించదు...

అయితే కొత్త చట్టం నిర్భయ కేసుకు వర్తించదు. ఇక ముందు జరగబోయే ఘోర, క్రూరమైన నేరాలకు వర్తిస్తుంది. భావోద్వేగాలతో చట్టాలు చేస్తే..దాని పర్యవసానాలపై ఆలోచన చేయాలని కానీ చట్టాన్ని ప్రశ్నిస్తున్నవారు... సూచిస్తున్నారు. పర్యవసనాలను ఆలోచించాలని ఒక వాదన ఉంది. అయితే నిర్భయ లాంటి క్రూరమైన, దుర్మార్గమైన నేరాలనికి పాల్పడిన బాలనేరస్తుడికి మూడేళ్ల శిక్ష కాకుండా.. కనీసం ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించి వుండాల్సిందని అభిప్రాయపడ్డారు. తాజాగా చేసిన చేసిన జువైనల్ చట్టంపై ఆలోచించాల్సిన అవసరముందని తెలిపారు. ఇప్పుడు మనం చేసిన చట్టం అమెరికా, బ్రిటన్ లో ఎప్పటి నుంచో ఉంది. అయితే జువైనల్ చట్టం బోర్డు శిక్షను నిర్దారిస్తుంది.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఈనెల 28 నుంచి కేయూ దూరవిద్య జర్నలిజం ఎగ్జామ్స్

హన్మకొండ : వరంగల్ కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని దూరవిద్య కేంద్రం నిర్వహించే జర్నలిజం పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నట్లు దూర విద్యకేంద్రం డైరక్టర్ ప్రొఫెసర్ చింతకాయల దినేశ్ కుమార్ తెలిపారు. బీసీజే పరీక్షలను ఈ నెల 28, 31,జనవరి 2, 4, 6, 8, 9 తేదీల్లో, ఎంసీజే ఒక సంవత్సరం కోర్సు పరీక్షలను ఈ నెల 29, 31, జనవరి 2, 4, 6, 8, 10 తేదీల్లో, ఎంసీజే ప్రథమ సంవత్సరం కోర్సు పరీక్షలను 28, 30,జనవరి 1, 3, 5, 7, 9 ద్వీతీయ సంవత్సరం పరీక్షలను 29, 31, జనవరి 2, 4, 6, 8, 10 తేదీల్లో దూర విద్య కేంద్రంలో సాయంత్రం 2గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ లో చైన్‌స్నాచింగ్

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌లో దండగులు చైన్‌స్నాచింగ్ కు పాల్పడ్డారు. ఆలయానికి వెళ్తున్న లక్ష్మిభాయ్ అనే మహిళ మెడలో నుంచి 6 తులాల బంగారు గొలుసును దొంగలు అపహరించారు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

09:43 - December 23, 2015

మెదక్ : జిల్లాలోని ఎర్రవెల్లిలో అయుత చండీయాగం ప్రారంభం అయింది. సీఎం కేసీఆర్ దంపతులు యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యాగశాలకు చేరుకున్నారు. వేదఘోషోతో యాగస్థలి ప్రతిధ్వనిస్తోంది. ఈనెల 27 వరకు యాగం జరుగనుంది. 1100 మంది రుత్వికులతో మహాచండీయాగం జరుగనుంది. ప్రధాన రుత్వికులకు సహాయకులుగా 400 మంది రుత్వికులు ఉంటారు. యాగానికి ప్రముఖులు రానున్నారు. భారీగా భక్తులు యాగస్థలికి తరలొస్తున్నారు. 

 

విజయవాడ స్వర్ణబార్ లైసెన్సు రద్దు

కృష్ణా : ఎపిలో సంచలనం కలిగించిన విజయవాడ కల్తీ మద్యం కేసులో ఫోరెన్సిక్ నివేదిక పోలీసుల చేతికి చిక్కింది. స్వర్ణ బార్ లోనే మద్యం కల్తీ జరిగిందని నిర్ధారణ అయినట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో స్వర్ణబార్ లైసెన్సును అధికారులు శాశ్వతంగా రద్దు చేశారు. 

 

09:33 - December 23, 2015

కృష్ణా : ఎపిలో సంచలనం కలిగించిన విజయవాడ కల్తీ మద్యం కేసులో ఫోరెన్సిక్ నివేదిక పోలీసుల చేతికి చిక్కింది. స్వర్ణ బార్ లోనే మద్యం కల్తీ జరిగిందని నిర్ధారణ అయినట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో స్వర్ణబార్ లైసెన్సును అధికారులు శాశ్వతంగా రద్దు చేశారు. కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులను సిట్ బృందం విచారించనుంది. సెంట్రల్ ల్యాబ్ నుంచి మరో నివేదిక రావాల్సివుంది. కల్తీ మద్యం ఘటనలో పలువురు మృతి చెందిన విషయం తెలిసింది. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా చేశాయి. ఘటన వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వానికి విచారణకు ఆదేశించింది.

 

అయుత చండీయాగం ప్రారంభం..

మెదక్ : జిల్లాలోని ఎర్రవెల్లిలో అయుత చండీయాగం ప్రారంభం అయింది. ఈ యాగంలో సీఎం కేసీఆర్ దంపతులు, గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.

 

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బంగారంతో పట్టుబడిన వ్యక్తులు.. హైదరాబాద్, ముంబైకి చెందిన వారు. వీరిద్దరూ బంగారాన్ని శరీరంలో పెట్టుకుని వస్తుండగా స్కానింగ్ చేయడంతో దొరికిపోయారు.

కాసేపట్లో అయుత చండీయాగం..

మెదక్ : అయుత చండీయాగం కాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ దంపతులు యాగస్థలికి చేరుకున్నారు. శృంగేరీ పీఠాధిపతుల ఆధ్వర్యలో యాగం జరుగనుంది. 

08:40 - December 23, 2015

ఎపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగిన తీరు బాధాకరమని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, టిడిపి నేత ఆనంద్ రావు, వైసిపి నేత గిడ్డి ఈశ్వరీ పాల్గొని, మాట్లాడారు. స్పీకర్ పై వైసిపి అవిశ్వాసం.. తీర్మాణం ప్రవేశపెట్టే పరిస్థితి రావడం దురదృష్టకమన్నారు. అధికార, ప్రతిపక్షాన్ని ఒక చోటే చేర్చే మరో పార్టీల సభలో లేకపోవడం గందరగోళానికి కారణమన్నారు. అధికారం, ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు. అవిశ్వాసం ఇచ్చే హక్కు ప్రతిపక్షానికి ఉంటుందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

07:58 - December 23, 2015

గత వారం నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చలు మన దేశ రైతాంగాన్ని మరింత ప్రమాదంలోకి ఈడ్చుకెళ్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపాలాంటి దేశాల్లోని వ్యవసాయ కంపెనీల ప్రయోజనాలే లక్ష్యంగా సాగిన ఈ సమావేశాలు కొన్ని కోట్ల మంది అన్నదాతలకు కన్నీళ్లే మిగల్చబోతున్నాయి.
అర్ధాకలితో 81 కోట్ల మంది
మన దేశ జనాభా 130 కోట్లు దాటింది. వీరిలో దాదాపు 19 కోట్ల మంది కడుపు నిండా తిండి దొరక్క అలమటిస్తున్నారు. అంటే ప్రతి ఏడుగురు భారతీయుల్లో ఒకరు అర్ధాకలితో జీవిస్తున్న దుస్థితి. ఇప్రి అనే అంతర్జాతీయ సంస్థ చెప్పిన లెక్క ఇది. ప్రపంచంలో 81 కోట్ల మంది అర్ధాకలితో బతుకులీడుస్తున్న ఈ సంస్థ చెబుతోంది. ప్రపంచంలో అర్ధాకలితో జీవిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులే కావడం మనం మరింత ఆందోళన చెందాల్సిన అవసరం. రోజురోజుకీ నిత్యావసరాల ధరలు పెరుగుతుండడం, వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా పప్పుదినుసుల ఉత్పత్తులు పడిపోతుండడం సామాన్యులకు శాపంగా మారుతోంది. మరోవైపు కొంతమంది బడా వ్యాపారులు కూడబలుక్కుని నిత్యావసరాలను బ్లాక్ చేస్తుండడంతో ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇలాంటి సందర్భాలలో సామాన్యులను ఆదుకునేది ప్రజా పంపిణీ వ్యవస్థే. దానిని మరింత పటిష్టం చేసి ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో రెండేళ్ల క్రితం ఆహార భద్రతా చట్టాన్ని మన దేశ పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు ఈ చట్టం అమలు ప్రశ్నార్ధకంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం నైరోబీలో జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ వెలువరించిన డిక్లరేషనే ఇలాంటి భయానికి కారణం.
డబ్ల్యుటీవో సదస్సు.. ఆంక్షలు
చాలీ చాలని వేతనాలతో, కడుపు నిండా తిండి లేక, పౌష్టికాహారం భుజించలేక అలమటించే అసంఖ్యాక ప్రజలకు ఎంతో కొంత స్వాంతన కలిగించేది ప్రజా పంపిణీ వ్యవస్థ. రైతులు పండించే ఆహార ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించి, ఎఫ్ సీఐ ద్వారా కొనుగోలు చేసి, వాటిని భద్రపరచి, ప్రజావసరాలకు తగ్గట్టుగా పంపిణీ చేసే విధానం ఇప్పటి దాకా మనదేశంలో అమలవుతోంది. అయితే, అన్నదాతకు ఇచ్చే సబ్సిడీలు, మద్దతు ధరల విషయంలో తాజాగా ముగిసిన డబ్ల్యుటీవో సదస్సు అనేక ఆంక్షలు పెట్టింది. మనలాంటి వర్ధమాన దేశాలు రైతుల నుంచి కొనుగోలు చేసే ధాన్యానికి 1986 88 నాటి మద్దతు ధరకు పది శాతానికి మించి ఇవ్వకూడదన్నది ఈ ఆంక్షల్లో ఒకటి. ఒకవేళ ఏ వర్ధమాన దేశమైనా అంతకు మించి కొనుగోలు చేస్తే, ఆయా దేశాలు అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుందన్నది డబ్ల్యుటీవో హెచ్చరిక. ఈ నిబంధనలే అమలైతే, మన అన్నదాతకు మరిన్ని కష్టాలు, నష్టాలు తప్పవు.
అమెరికా ఇచ్చే రాయితీలు ఎక్కువ
నిజానికి వ్యవసాయరంగానికి మన దేశంలో ఇస్తున్న రాయితీలతో పోల్చుకుంటే అమెరికా ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు ఎక్కువ. మన ప్రభుత్వం రూపాయి సబ్సిడీ ఇస్తే, అమెరికా ప్రభుత్వం 5 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. 2012లో మన దేశం 12వేల కోట్ల రూపాయల ఆహార సబ్సిడీ ఇస్తే, అదే కాలంలో అమెరికా ఆరు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చింది. ఎక్కడ 12 వేల కోట్లు. ఎక్కడ ఆరు లక్షల కోట్లు. అమెరికా ఇచ్చే సబ్సిడీలలో 80 శాతం వాటాను నాలుగైదు వ్యవసాయ కంపెనీలు చేజిక్కించుకుంటున్నాయి.
ఉత్పత్తుల ధరలను శాసిస్తున్న నాలుగైదు కంపెనీలు
అమెరికా ప్రభుత్వం ఇచ్చే రాయితీల దన్నుతో మొక్కజొన్న, సోయా, పత్తి, పౌల్ట్రీ ఉత్పత్తుల ధరలను ఈ నాలుగైదు కంపెనీలు శాసిస్తున్నట్టు కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనం తేల్చింది. ఈ రాయితీల దన్నుతో అమెరికాకు అవసరమైన దానికంటే అధికంగా ఉత్పత్తి చేస్తున్న ఈ కంపెనీలు తమ సరుకును అమ్ముకోవడానికి భారత్ లాంటి వర్ధమాన దేశాల మీద తీవ్ర ఒత్తిడి ప్రయోగిస్తున్నాయి. లాబీయింగ్ లు చేస్తున్నాయి. భారత్ పాటు వివిధ వర్ధమాన దేశాలు తమ దేశ అవసరాలకు తగ్గట్టుగా అన్నదాతకు రాయితీలిచ్చి, ప్రోత్సాహకాలు అందిస్తే అమెరికాలోని బడా కంపెనీలకు మార్కెట్ వుండదు. వారి ఉత్పత్తులు కొనే దిక్కు వుండదు. ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ పెడుతున్న నిబంధనలు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, కొన్ని యూరప్ దేశాల్లోని బడా కంపెనీలకు మేళ్లు చేసే విధంగానూ, భారత్ లాంటి వర్ధమాన దేశాల్లోని రైతులకు కీడు చేసే విధంగానూ వున్నాయన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం.  

 

నేడు మోడీ రష్యా పర్యటన

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోడీ ఇవాళ రష్యా వెళుతున్నారు. అణువిద్యుత్తు, రక్షణ ఒప్పందాలే కీలక ఎజెండాలుగా ఆయన రష్యాలో పర్యటిస్తున్నారు.

 

07:46 - December 23, 2015

హైదరాబాద్ : ఒక్క దెబ్బకు రెండు పిట్టలంటూ కొత్త ఐడియాను అమల్లోకితెచ్చిన టీ సర్కారుకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది.. అక్రమ భవనాల క్రమబద్ధీకరణ నిలిపివేయాలని ఆదేశించింది.. కోర్టు ఆదేశాలతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయింది ప్రభుత్వం..
అక్రమ భవనాల క్రమబద్ధీకరణ నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ
గ్రేటర్‌లో కోట్ల రూపాయల ఆదాయంకోసం ప్లాన్‌చేసిన జీహెచ్ ఎంసీ ఆశలపై హైకోర్టు నీళ్లు చల్లింది.. బీఆర్ ఎస్, ఎల్ ఆర్ ఎస్ ద్వారా ప్రజలను ఆకర్శించి ఓట్లు సాధించాలనుకున్న టీ సర్కార్‌ స్పీడ్‌కు కళ్లెం వేసింది... అక్రమ భవనాల క్రమబద్ధీకరణ నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీచేసింది.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అక్రమ భవనాల క్రమబద్ధీకరణకోసం ప్రభుత్వం నవంబర్‌ 2న GO జారీచేసింది.. 2007లో వచ్చిన జీవోలకు పొడిగింపుగా 151, 152 జీవోలను రిలీజ్ చేసింది.. అలాగే జీహెచ్ ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 455ఏ, 455ఏఏను సవరిస్తూ అక్టోబర్‌ 31న తెలంగాణ పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది..
జీహెచ్ ఎంసీలో 2లక్షలకుపైగా అక్రమ భవనాలు
జీహెచ్ ఎంసీ పరిధిలో 2లక్షలకుపైగా అక్రమ భవనాలున్నాయని అధికారులు గుర్తించారు.. వీటి క్రమబద్ధీకరణకోసం డిసెంబర్‌ 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రజలను కోరింది.. ఇప్పటివరకూ 25వేలమంది క్రమబద్ధీకరణకోసం దరఖాస్తు చేసుకున్నారు.. అయితే భవనాల క్రమబద్ధీకరణను కొన్ని ప్రజాసంఘాలు వ్యతిరేకించాయి. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్‌ వేసింది ఫోరం ఫర్ గుడ్‌ గవర్నెన్స్ సంస్థ... అక్రమ నిర్మాణాలను కూల్చివేసేలా ఆదేశాలివ్వాలని అందులో కోర్టును కోరింది. అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తూ పోతే సీటి మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది.. దీంతో చాలా సమస్యలు వస్తాయని.. చిన్న వర్షంపడినా నాలాలు పొంగి రోడ్లు చెరువుల్లా మారతాయని న్యాయస్థానం దృష్టికితెచ్చింది.
దరఖాస్తులు మాత్రం తీసుకోవచ్చని వెసులుబాటు 
అలాగే క్రమబద్ధీకరణతో ప్రజల్లోకి తప్పుడు మెసేజ్‌ వెళుతుందని కోర్టుకు తెలిపింది.. తాము అక్రమ నిర్మాణాలుచేసినా ప్రభుత్వం సక్రమం చేస్తుందంటూ ప్రజలు భావిస్తారని తెలిపింది.. పిటిషనర్‌ వాదనలు విన్న కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ క్రమబద్ధీకరణ నిలిపివేయాలని జీహెచ్ ఎంసీని ఆదేశించింది.. అయితే క్రమబద్ధీకరణకోసం దరఖాస్తులుమాత్రం తీసుకోవచ్చని కోర్టు వెసులుబాటు కల్పించింది... సంక్రాంతి సెలవులతర్వాత తదుపరి విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో జీహెచ్‌ఎంసీతోపాటు... టీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.. కోర్టు ఆదేశాలపై అప్పీలుకోసం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది..

 

 

 

07:39 - December 23, 2015

విశాఖ : మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బాక్సైట్‌ తవ్వకాల జీవోను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. తవ్వకాలపై పూర్తిస్థాయి చర్చ జరిగిన తరువాతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బాక్సైట్‌ తవ్వకాలపై ప్రభుత్వం వెనక్కి
గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బాక్సైట్‌ తవ్వకాలపై ప్రభుత్వం వెనక్కితగ్గింది. తవ్వకాలకు వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజా సంఘాలు..గిరిజనుల చేసిన ఉద్యమాలకు తలొగ్గిన టీడీపీ సర్కార్‌..బాక్సైట్‌ జీవోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
జీవోను రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన
బాక్సైట్‌ జీవో అమలును నిలిపివేయాలని గతంలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాక్సైట్‌ అంశంపై అసెంబ్లీలో మాట్లాడారు. బాక్సైట్‌ జీవోను రద్దు చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. 2008లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన బాక్సైట్‌ ఒప్పందం జీవో 222ను రద్దు చేస్తున్నామని తెలిపారు. బాక్సైట్‌ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని, గిరిజనుల అభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. బాక్సైట్‌పై వచ్చే ఆదాయంలో అధిక శాతం గిరిజనులకు అందేలా ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు.
ఇసుక విధానంపై సుజాత ప్రకటన
అంతకుముందు బాక్సైట్‌ తవ్వకాలు, ఇసుక విధానంపై మైనింగ్‌ శాఖ మంత్రి పీతల సుజాత అసెంబ్లీలో ప్రకటన చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసమే బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇచ్చినా..అక్కడి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వెనక్కి తగ్గినట్లు తెలిపారు.
బాక్సైట్‌ తవ్వకాలను ఉపసంహరించుకోవాలి: బీజేపీ 
మిత్రపక్షమైన బీజేపీ కూడా బాక్సైట్‌ తవ్వకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇదే అంశంపై సభలో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే విష్టుకుమార్‌ రాజు..గిరిజనుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.మొత్తానికి అన్ని వైపులా ఒత్తిళ్లు రావడంతో బాక్సైట్‌ తవ్వకాలపై పునరాలోచనలో పడిన ప్రభుత్వం చివరికి జీవోను రద్దుచేస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించింది.

 

 

 

07:29 - December 23, 2015

మెదక్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయుత చండీయాగానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే ఎర్రవెల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు రానున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాన్యులకు సైతం ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
చండీయాగానికి ఏర్పాట్లు పూర్తి
మెదక్‌ జిల్లా ఎర్రవెల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి రెండు రోజులు ముందుగానే కేసీఆర్‌ దంపతులు చేరుకున్నారు. ఇప్పటికే ఆరంభ పూజలు కూడా నిర్వహించారు.
మహాగణపతి పూజతో చండీయాగం ప్రారంభం
ఇవాళ ఉదయం మహాగణపతి పూజతో అయుత చండీయాగం ప్రారంభం కానుంది. 27న జరిగే కలశ విసర్జన మహాదాశీర్వచన, ప్రసాద వితరణతో ఈ కార్యక్రమం ముగియనుంది. ఈ ఐదు రోజుల పాటు అయిత చండీ పురశ్చరణ మహా యాద వైదిక కార్యక్రమాలు జరుగుతాయి.
తొలిరోజు గురు ప్రార్ధన, గణపతి, గోపూజ
ఇక తొలి రోజు గురు ప్రార్ధన, గణపతి పూజ, గోపూజ, మహా మంటప స్థాపనలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. రెండోరోజు మహాధన్వంతరి యాగం, చతుర్వేద మహారుద్ర పురశ్చరణాలు కొనసాగుతాయి. మూడోరోజు నవ గ్రహ హోమం, మహారుద్ర పురశ్చరణాలు, మహామంగళ హారతి వంటి విశేష పూజా కార్యక్రమాలుంటాయి. నాలుగోరోజు సప్త ద్రవ్య మృత్యుంజయ హోమం జరగనుంది. ఇక చివరిరోజు గురు ప్రార్ధన, పుణ్యావహ వచనం, కుండ సంస్కారం, ప్రధాన కుండంలో అగ్నిప్రతిష్ట, అగ్ని విహరణం, సపరివార అయుత చండీయాగం జరగనుంది. ఇక మహా పుర్ణాహుతితో చండీయాగం ముగియనుంది.
శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో యాగం
శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో జరిగే ఈ యాగానికి ఆరేడు రాష్ట్రాల నుంచి రుత్విజులు, బ్రాహ్మణులు ఇప్పటికే ఫాంహౌస్ చేరుకున్నారు. 1100 మంది ఏకకంఠంతో పారాయణం చేస్తారు. యాగశాలలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగం నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల వరకు యాగం కొనసాగుతుంది. మిగతా సమయాల్లో భక్తులను భక్తి పారవశ్యంలో ఉంచేందుకు ప్రవచనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రతిరోజు సందర్శించనున్న 50 వేల మంది ప్రజలు
ఈ యాగం కోసం ప్రతిరోజు 50 వేల మంది ప్రజలు సందర్శించే అవకాశం ఉంది. సొంత వాహనాల్లో వచ్చేవారి కోసం 20 ఎకరాల్లో పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. యాగశాలలోకి ఎవరిని అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. 2200 మహిళలు కుంకుమార్చన చేసేందుకు సరిపడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందుకు అవసరమైన పూజా సామాగ్రిని ఉచితంగా అందించనున్నారు.
యాగానికి ప్రముఖుల రాక
యాగానికి పెద్ద ఎత్తున ప్రముఖులు రానున్న నేపథ్యంలో.. యాగస్థలికి సమీపంలో నాలుగు హెలీప్యాడ్‌లు సిద్ధం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చివరిరోజు పూర్ణాహుతికి హాజరుకానున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు కూడా హాజరు కానున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

07:24 - December 23, 2015

హైదరాబాద్ : ఏపీ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్షాలు పలు మార్లు వాకౌట్‌ చేశాయి. చివరి రెండు రోజుల సమావేశాలను వైసీపీ బహిష్కరించింది.మొత్తంగా చూసుకుంటే పెద్దల సభ పద్ధతిగానే కొనసాగింది. పలు అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగింది.
ఐదు రోజులపాటు సమావేశాలు
ఏపీ శాసనమండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఐదు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు 20 గంటల 36 నిమిషాలు పాటు సాగాయి. మొత్తం 78 మంది సభ్యులు సభలో మాట్లాడారు.
నిత్యావసరవస్తువుల ధరలపై లఘు చర్చ
నిత్యావసర వస్తువుల ధరలపై మండలిలో లఘు చర్చ జరిగింది. కాల్‌మనీ, కరువు పరిస్థితులు, నీరు-ప్రగతిపై మంత్రులు ప్రకటనలు చేయగా...చివరి రోజు 8 బిల్లులను మండలి ఆమోదించింది. సభ జరిగిన ప్రతిసారీ.. ప్రజా సమస్యలపై పీడీఎఫ్‌ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఛైర్మన్‌ తిరస్కరించారు. దీంతో పలు అంశాలపై చర్చ జరగకుండా పోయింది.
కృష్ణా జలాల పంపకాలపై చర్చకు కాంగ్రెస్‌ పట్టు
చివరి రోజు కృష్ణా జలాల పంపకాలపై కాంగ్రెస్‌ సభ్యులు చర్చకు పట్టుపట్టారు. దానికి ఛైర్మన్‌ చక్రపాణి ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది. పీడీఎఫ్‌ సభ్యులు ఉద్యోగాల భర్తీ..ప్రైవేటు యూనివర్శిటీలు..మారిటైం బోర్డు ఏర్పాటుకు సంబంధించి పలు ప్రశ్నలను సంధించారు. ఇక వైసీపీ మొదటి మూడు రోజులు తమ వాయిస్‌ను గట్టిగానే వినిపించినా...రోజా సస్పెన్షన్‌ వ్యవహారంతో చివరి రెండు రోజులను బహిష్కరించింది. ఇది ఇలా ఉంటే టీటీడీ అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో మండలి డిప్యూటీ చైర్మన్‌ సతీష్‌రెడ్డికి వసతి కల్పన ఆలస్యంపై కౌన్సిల్‌లో దుమారం చెలరేగింది.
పలు వాయిదా తీర్మానాల తిరస్కరణ
ఈ సమావేశాల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయనుకున్న పలు వాయిదా తీర్మానాలను ఛైర్మన్‌ చక్రపాణి తిరస్కరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైసీపీ,కాంగ్రెస్‌, పీడీఎఫ్‌ సభ్యులు వాకౌట్‌ చేసిన సందర్భాలు ఉన్నా...మొత్తంగా చూసుకుంటే మండలి సమావేశాలు అర్థవంతంగానే జరిగాయి.

 

 

07:18 - December 23, 2015

హైదరాబాద్‌ : నగరంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు. నగర శివారులో మూడు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. బెంగుళూరు, సాగర్‌, విజయవాడ రూట్లలో పలు ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 50 బస్సులపై కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 20 బస్సులకు జరిమానా విధించారు. రవాణా శాఖ మంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఈ తనిఖీలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. 

06:46 - December 23, 2015

తూర్పుగోదావరి : జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రూ.40 లక్షల ఆస్తినష్టం జరిగింది. ముమ్మిడివరంలోని వెంకటభూలక్ష్మీ వస్త్ర దుకాణంలో ఇవాళ తెల్లవారుజాము 3 గంట ప్రాంతంలో విద్యుత్ షాక్ తో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అందులోని స్టాక్ మొత్తం కాలిపోయింది. ఫైరింజన్లతో మంటలార్పే లోపే దుకాణం పూర్తిగా దగ్ధం అయింది. రూ.40 లక్షల ఆస్తినష్టం జరిగిటన్లు భావిస్తున్నారు.

 

06:39 - December 23, 2015

నెల్లూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కోట మండలం విద్యానగర్, చెందూరుకు చెందిన ఎనిమిది మంది ఆటోలో ప్రయాణిస్తున్నారు. మార్గంమధ్యలో నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం కమ్మవారిపాలెంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పాపమ్మ, రామజ్మ, రమణమ్మతోపాటు ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గూడూరుకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించారు. అయితే ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. 

 

 

మెదక్ జిల్లాలో నేటి నుంచి చండీయాగం

మెదక్ : జిల్లాలోని ఎర్రవెల్లిలో నేటి నుంచి చండీయాగం జరుగనుంది. ఉదయం 8.10 గంటలకు యాగం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరుకానున్నారు.  

తూర్పుగోదావరి జిల్లాలో అగ్నిప్రమాదం...

తూర్పుగోదావరి : జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ.40 ఆస్తినష్టం జరిగింది. విద్యుత్ షాక్ తో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Don't Miss