Activities calendar

27 December 2015

'అనంత'లో దంపతుల ఆత్మహత్యాయత్నం..

అనంతపురం : జిల్లాలో పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ఈజిప్టులో బాంబు పేలుడు

కైరో : ఈజిప్టులోని అల్‌హరామ్‌ జిల్లాలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు గాయ పడ్డారు. ఉగ్రవాదులు విస్ఫోటనం కోసం ఎలాంటి పదార్థం వినియోగించారో తెలుసుకునేందుకు విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఈజిప్టులో ఇస్లామిక్‌ ఉగ్రవాదుల కార్యకలాపాలు హెచ్చుమీరిన విషయం తెలిసిందే.

21:37 - December 27, 2015

ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీ సీఎం.. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ జనవరి 14న పంజాబ్‌లోని ముక్తసర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. 2017లో ఆ రాష్ట్రంలో జరిగే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కేజ్రీవాల్‌ ప్రారంభించనున్నారు. కాంగ్రెస్‌, అకాలీదళ్‌కు వ్యతిరేకంగా ఆమ్‌ఆద్మీ ప్రచారం చేయనుంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ పంజాబ్‌లో 4 స్థానాలు గెలిచింది.

 

21:33 - December 27, 2015

ఢిల్లీ : డీడీసీఏ కుంభకోణానికి సంబంధించిన నివేదికలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ పేరు లేదు. ఆప్‌ ప్రభుత్వం చేతన్‌ సంఘీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. అయితే ఈ బృందం ఇందుకు సంబంధించిన విచారణను పూర్తి చేసి 237 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికలో కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. డీడీసీఏ నిర్లక్ష్య వైఖరి, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, క్రీడాకారుల వయసుకు సంబంధించి నకిలీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయటం తదితర అంశాలపై విచారణ కమిటీ ప్రధానంగా దృష్టిసారించింది. ఎక్కడా జైట్లీ పేరును మాత్రం తెలపలేదు. 

 

21:29 - December 27, 2015

హైదరాబాద్ : మత అసహనం ప్రజల్లో లేదని.. అది మతోన్మాదుల్లోనే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు బొబ్బా రాములమ్మ జీవితకథ ఆధారంగా వచ్చిన శ్రమజీవి పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. చుక్కారామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి పాల్గొని, మాట్లాడారు. ప్రజల ఆహారపు అలవాట్లపైనా, భావ ప్రకటనా స్వేచ్ఛపైనా కొంతమంది దాడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, మాజీ ఎంపి వినోద్, సీనియర్ జర్నలిస్టు వినయ్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

21:21 - December 27, 2015

కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం కరీంనగర్‌ జిల్లా పర్యటనకు వెళుతున్నారు. అయుత చండీయాగం ముగిసిన నేపథ్యంలో ఆయన వేములవాడ రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుంటారు. ఉదయం 10 గంటలకు వేములవాడ చేరుకుంటారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

 

21:15 - December 27, 2015

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ.. లే ఆఫ్‌ దశకు చేరింది. 70 ఏళ్లపాటు.. చక్కెర ఉత్పత్తిలో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న కర్మాగారం వెలుగులు వెలవెల పోయాయి. ప్రభుత్వం.. ప్రైవేటు యాజమాన్యాల నిర్వహణ లోపం.. వేలాదిగా కర్షక, కార్మికులను రోడ్డు పాల్జేసింది. ఉపాధి కరవై కార్మికులు.. పంటను ఏమి చేయాలో తోచక రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షల మంది నోళ్లకు తీపిని అందించిన చక్కెర ఫ్యాక్టరీలు మూతబడడంతో.. కర్షకుల జీవితాల్లో చేదెక్కాయి. 
మసకబారుతోన్న 70 ఏళ్ల చరిత్ర 
70 ఏళ్ల చరిత్ర మసకబారి పోతోంది. వేలాది మంది కార్మికులను అక్కున చేర్చుకున్న సంస్థ కాలగర్భంలో కలిసి పోతోంది. నిజాం ఏలికలు నెలకొల్పిన షుగర్‌ ఫ్యాక్టరీలు మూసివేత దిశగా సాగుతున్నాయి. ప్రైవేటు యాజమాన్యం సంస్థకు లేఆఫ్‌ ప్రకటించడంతో..  కర్షక, కార్మిక లోకం కలవర పడుతోంది. 
1938 డిసెంబర్‌లో నిజాం షుగర్స్ ప్రారంభం
నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లోని చెరకు రైతుల సంక్షేమం కోసం.. నిజాం ప్రభువులు చక్కెర కర్మాగారాలను నెలకొల్పారు. తొలుత.. 1938 డిసెంబర్‌లో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. సుమారు 16 వేల 500 ఎకరాల్లో పండించిన చెరకును ఈ ఫ్యాక్టరీలో క్రషింగ్‌ చేసేవారు. ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి పదివేల కుటుంబాలు జీవించేవి. అతి తక్కువ కాలంలోనే నిజాం దక్కన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ ఆసియాలోనే అతి పెద్ద చక్కెర కర్మాగారంగా ప్రసిద్ధి పొందింది. 
1951లో మరో ఫ్యాక్టరీ ప్రారంభం
నిజాం దక్కన్‌ షుగర్ ఫ్యాక్టరీ లాభాల బాట పట్టడంతో.. నిజాం ప్రభువులు 1951లో మరో ఫ్యాక్టరీని ప్రారంభించారు. దీంతోపాటే 35వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన డిస్టిలరీనీ స్థాపించారు. ఈ సంస్థల్లో సుమారు ఐదున్నరవేల మంది కార్మికులు పనిచేసేవారు. పరోక్షంగా మరిన్ని వేల మంది ఉపాధిని పొందేవారు. చెరకు దిగుబడులు ఎక్కువగా ఉండడం.. నిజాం సంస్థలకు లాభాలను తెచ్చిపెట్టుతుండటంతో.. 1981లో కరీంనగర్ జిల్లా మాల్లాపూర్ మండలం ముత్యంపేటలో నిజాం  షుగర్స్ పేరిట ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టారు.  మెదక్‌లోనూ  చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించారు. 
డిసెంబర్‌ 18న బోర్డు సమావేశంలో లే ఆఫ్‌ నిర్ణయం
మూసివేత దశకు నిజాం షుగర్స్ కర్మాగారాలు
సుమారు యాభై ఏళ్ల పాటు మహోజ్వలంగా సాగిన నిజాం షుగర్స్ కర్మాగారాలు మూసివేత దశకు చేరుకున్నాయి. నిజాం దక్కన్ షుగర్స్ కంపెనీ యాజమాన్యం డిసెంబర్‌ 18న జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే 20న లేఆఫ్ నోటిసును ప్రచురించింది. కార్మికులతో కాని, కార్మికసంఘాలతోకాని ప్రభుత్వంతో కాని ఏలాంటి సంప్రదింపులు జరపకుండానే దక్కన్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అన్ని వర్గాలనుండి ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. 
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీల దుస్థితికి కారకులెవరు..?
అసలు మహోజ్వలంగా వెలిగిన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీల దుస్థితికి కారకులెవరు..? ఈరోజు లేఆఫ్‌ ప్రకటించే దుర్గతి ఎందుకు పట్టింది..? ఈ ప్రశ్నలకు అందరి వేళ్లూ.. ఏపీ సీఎం చంద్రబాబునే చూపిస్తున్నాయి. 
1999 నుంచి ఫ్యాక్టరీకి గడ్డు పరిస్థితులు
 ప్రారంభించింది మొదలు 50 ఏళ్ల పాటు.. లాభాల బాటలో సాగిన ఎన్‌డిఎస్‌ ఫ్యాక్టరీకి 1999 నుంచి గడ్డు పరిస్థితులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న చంద్రబాబు.. నష్టాల్లో ఉన్నాయంటూ షుగర్ ఫ్యాక్టరీలను  ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా..  బోధన్‌ శక్కర్‌నగర్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, బోధన్‌ డిస్టిలరీ, మెట్‌పల్లి షుగర్‌ ఫ్యాక్టరీ, మెదక్‌ షుగర్‌ ఫ్యాక్టరీలను ఓ యూనిట్‌గా గుర్తించి.. వీటిని 72 కోట్ల మొత్తానికే గోకరాజు గంగరాజుకు కట్టబెట్టాయి. 500 కోట్ల విలువైన ఆస్తిని అంత చవకగా.. ఎలా కట్టబెడతారంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా చంద్రబాబు సర్కారు తన పంతాన్నే నెగ్గించుకుంది. కొత్త యాజమాన్యం కర్మాగారాలను స్వాధీనం చేసుకుంది మొదలు.. కర్షక, కార్మిక వ్యతిరేక విధానాలనే అవలంబిస్తోందన్న ఆరోపణలున్నాయి. దీనిపై హక్కులు దక్కించుకున్న వెంటనే సుమారు 12 వందల మంది కార్మికులను విధుల నుంచి తప్పించింది. 
తీవ్రంగా నష్టపోయిన రైతులు        
ప్రభుత్వం నుంచి లభించే సబ్సిడీ విత్తనాలు, తక్కువ వడ్డీకే రుణాలు లాంటి సౌకర్యాలు కోల్పోవడం.. కొత్త యాజమాన్యం గిట్టుబాటు ధర కల్పించక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు బిల్లులు సక్రమంగా చెల్లించక కోట్లాది రూపాయలు బకాయి పడింది. దీంతో ఈ ప్రాంత రైతులు చెరకు పంట వేసేందుకే భయపడిపోయారు. 
నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను ప్రభుత్వమే నిర్వహించాలి : స్థానికులు  
నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను ప్రభుత్వమే నిర్వహించాలన్నది స్థానికుల చిరకాల డిమాండ్‌. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను ప్రభుత్వమే నడిపేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌.. ఆయన కుటుంబ సభ్యులు పదే పదే ఎన్నికల సభల్లో ఊదరగొట్టారు. కానీ వర్తమానం అందుకు భిన్నంగా సాగుతోంది. ఇంతకీ ఎన్‌డిఎస్‌ ఫ్యాక్టరీల దురవస్థకు కారణమేంటి..? దీన్ని సర్కారే నిర్వహిస్తుందన్న హామీని ఏలికలు ఎందుకు నిలుపుకోవడం లేదు..? దీని వెనుక మతలబేంటి..? 
స్థానికుల్లో అంతులేని నిరాశ 
ప్రైవేటు భాగాస్వామ్యం లేకుండా ప్రభుత్వమే తెలంగాణలో ఉన్న సూగర్స్ ఫ్యాక్టరీలను నిర్వహిస్తామని టీఆర్ఎస్‌ అధినేత హోదాలో..  కేసిఆర్ ఎన్నికల సభల్లో హామీలిచ్చారు. అనంతరం కేసీఆర్‌ సీఎం కావడంతో.. స్థానిక కర్షక, కార్మికులు ఆయన హామీపై కోటి ఆశలు పెట్టుకున్నారు. సీఎం అయిన కొత్తలో ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించి చేతులు దులిపేసుకున్నారు..  కేసీఆర్‌. దీంతో స్థానికుల్లో అంతులేని నిరాశ నెలకొంది. 
2014-15 సీజన్‌లో క్రషింగ్‌ నిలిపివేత
ఫ్యాక్టరీని సర్కారు స్వాధీనం చేసుకోక పోగా.. 2014-15 సీజన్‌లో చెరకు క్రషింగ్‌ పనులనూ నిలిపేసింది. దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. మంత్రుల జోక్యంతో గత ఏడాది ఎన్డిసీఎల్ చెరకు క్రషింగ్ పనులను చేపట్టింది. 2015-16కు గాను డిసెంబర్ లోనే చెరకు రైతులు ఫ్యాక్టరీకి చెరకు తరలించి క్రషింగ్ చేస్తుంటారు. ఈ ఏడాది ఫ్యాక్టరీకి లాభాలు రాలేదని కనీసం వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితిలో మూత వేస్తున్నామని యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది. ఈ నిర్ణయం కర్షక, కార్మికులను హతాశులను చేసింది. 
సర్కారీ పెద్దల దురాలోచన...? 
షుగర్‌ ఫ్యాక్టరీలకు లేఆఫ్‌ ప్రకటించడం వెనుక సర్కారీ పెద్దల దురాలోచన ఉందన్న వాదన వినిపిస్తోంది. 2002లో గోకరాజు గంగరాజుకు ఈ ఫ్యాక్టరీలను అప్పజెప్పేటప్పుడు.. 51 శాతం ప్రైవేటు, 49 శాతం ప్రభుత్వ అజమాయిషీ ఉంటుందని చంద్రబాబు సర్కారు ప్రకటించింది. ఇప్పటివరకూ అందులో ఎలాంటి మార్పూ లేదు. అలాంటప్పుడు.. అంటే ప్రభుత్వానికి ఈ కర్మాగారాల్లో 49 శాతం వాటా ఉన్నప్పుడు.. సర్కారుకు చెప్పకుండా.. ఫ్యాక్టరీ యాజమాన్యం లే ఆఫ్‌ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటుంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఫ్యాక్టరీని ఆంధ్రా ప్రాంతానికి చెందిన యాజమాన్యం నుంచి తప్పించడం ఖాయమన్న భావన బలంగా రావడం వల్లే.. గోకరాజు గంగరాజు.. ఫ్యాక్టరీలకు లేఆఫ్‌ ప్రకటించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో.. ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా.. ప్రభుత్వ పెద్దల అనుయాయులకే ఈ ఫ్యాక్టరీని కట్టబెట్టే యోచన జరుగుతున్నట్లూ ప్రచారం జరుగుతోంది. 
లే ఆఫ్‌ ప్రకటించమేంటని ప్రశ్నిస్తున్న కార్మికులు 
నాలుగు నెలలుగా కార్మికులకు వేతనాలు, రైతులకు బకాయిలు చెల్లించకుండా.. లే ఆఫ్‌ ప్రకటించడం ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. పైగా రెండు నెలలుగా యాజమాన్యం పరిశ్రమను వదిలేసి వెళ్లినా.. నెల రోజులుగా కార్మికులు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడాన్ని తప్పుబడుతున్నారు. పైగా పరిశ్రమ పరిధిలోని చెరకును డైవర్ట్ చేయడాన్ని కర్షక, కార్మికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికైనా షుగర్‌ ఫ్యాక్టరీలను వెంటనే స్వాధీనం చేసుకొని.. ప్రభుత్వమే నిర్వహించాలని కర్షక, కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

20:58 - December 27, 2015

హైదరాబాద్ :  తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో రెండేసి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నల్లగొండ జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా.. అన్ని చోట్లా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఈ నెల 30న ఫలితాలు వెలువడుతాయి.
ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు 
తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. రంగారెడ్డి జిల్లాలో బరిలో నిలిచిన ఐదుగురిలో ఇద్దరిని ఎన్నుకునేందుకు.. 770 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ బరిలో నిలిచిన ఐదుగురిలోంచి ఇద్దరిని ఎన్నుకునేందుకు 1257 మంది ఓటర్లు హక్కును వినియోగించుకున్నారు. అటు ఖమ్మంలోనూ 725 మందికి గాను 692 మంది ఓటేశారు. నల్లగొండలో పది మంది తప్ప మిగిలిన పదకొండు వందల మందీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
సూర్యాపేటలో టీడీపీ-కాంగ్రెస్ కార్యకర్తల రాస్తారోకో
సూర్యాపేటలో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. మంత్రి జగదీష్‌రెడ్డి పోలింగ్ కేంద్రంలో కూర్చొని ఓటర్లను బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. గంటన్నరకు పైగా పోలింగ్ కేంద్రంలోనే ఉన్న జగదీష్ రెడ్డి ఓటర్లను బెదిరించారని వారు ఆరోపిస్తూ ఆందోళన నిర్వహించారు.
ఎన్నికలపై అధికారుల ప్రత్యేక దృష్టి 
మరోవైపు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు, వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేసి అనుక్షణం పర్యవేక్షించారు. ఫలితాలను ఈ నెల 30న ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం 
మొదటి నుంచీ అధికార టిఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వచ్చాయి. దీంతో పార్టీలు సర్వశక్తులూ ఒడ్డి ఎన్నికల బరిలో నిలిచాయి. మొత్తం 12 స్థానాలకు గాను.. ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమయ్యాయి. ఆ ఆరింటినీ టిఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన ఆరు స్థానాల్లో ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉండడంతో టిఆర్‌ఎస్‌ వ్యూహం ఫలించలేదు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే ఓటర్లపై విపక్షాలు ప్రలోభాల విసరకుండా.. దాదాపు అన్ని పార్టీల నేతలూ..  క్యాంపులు నిర్వహించి ఎన్నికల వేళకు ఓటర్లను పోలింగ్‌ ప్రదేశాలకు తీసుకొచ్చారు. 

 

 

ఐఎస్‌ ఏజెంట్‌గా అనుమానిస్తున్న వ్యక్తి అరెస్టు

జైపూర్ : ఐఎస్‌ ఏజెంట్‌గా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని ఏటీఎస్‌ పోలీస్‌లు రాజస్థాన్‌లోని పోక్రాన్‌ వద్ద అరెస్టు చేశారు. ఐఎస్‌ఐకి సమాచారం చేరవేస్తున్నాడనే అనుమానంతో పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ద్విచక్రవాహనాలు ఢీ... ముగ్గురి మృతి

మెదక్‌ : జిల్లాలోని ఆంథోల్‌ మండలం చింతకుంట శివారులో సంభవించిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

20:44 - December 27, 2015

బాలివుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ త్వరలోనే బాలివుడ్‌ అభిమానులకు షాక్‌ ఇవ్వనున్నారు. ఐదు దశాబ్దాల పాటు వెండితెరపై వెలుగులు విరజిమ్మిన ఈ సూపర్‌ స్టార్‌ నటనకు వీడ్కోలు పలుకనున్నారా... లాంటి సందేహాలు బాలివుడ్‌ను కుదిపేస్తున్నాయి. తరాలు మారినా.. ఎంతమంది కొత్త స్టార్లు వచ్చినా అమితాబ్‌ తన స్టామినా ఐదు దశాబ్దాల పాటు నిలబెట్టుకున్నారు. అలాంటి స్టార్‌ వెలుగులు ఇకపై చరిత్రగా మారనున్నాయా.. ఇలాంటి విషయాలు తెలుసుకోవాంటే వాచ్‌ దిస్ స్పెషల్‌ ఫోకస్‌..

ఏడు దశాబ్దాల మేరునగరధీరుడు

వయస్సు తన శరీరానికే కాని తన నటనకు కాదని బిగ్‌ బీ అనేక సార్లు నిరూపించారు. కానీ పెరుగుతున్న వయస్సుతన నటనపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని ఏడు పదులు దాటిన శరీరం అలసిందని అభిమానులకు చేదువార్త వినిపించారు.

వెండితెరకు సెలవు ప్రకటిస్తున్నట్లు అమితాబ్‌ ప్రకటన

మిలీనియం స్టార్‌ అమితాబ్‌ వెలుగులను ఇకపై వెండితెరపై చూడలేమని బాలివుడ్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ అమితాబ్‌ స్వయంగా తన బ్లాగ్‌లో ఇదే విషయమై ప్రకటించారు. తాను సినిమాల నుంచి రిటైర్‌ కావాలని అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు. అంతేకాదు తన శరీరం నటనకు సహకరించడం లేదని, మాట తడబడుతోందని బ్లాగ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం అనారోగ్యం బారిన పడకుండా మందులతో నెట్టుకొస్తున్నానని, సమీప భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం ముంచుకురాకపోయినా ప్రస్తుతం ముందు జాగ్రత్తగా సినిమాల నుంచి రిటైర్‌ కావాలనుకుంటున్నట్లు బ్లాగ్‌లో పేర్కొన్నారు.

అమితాబ్‌ నిర్ణయం అభిమానులకు చేదువార్త
అమితాబ్‌ ప్రకటించిన నిర్ణయం అభిమానులకు శరాఘాతమే. ఆయన స్వరంతో పరిచయం లేని భారతీయులు లేరంటే అతిశయోక్తి కాదు. అమితాబ్‌ నిర్ణయం అభిమానులను నిరాశ కల్పించేదే అయినప్పటికీ ఆయన కుటుంబసభ్యులకు మాత్రం ఊరట కలిగించేదే కావడం విశేషం. రెండేళ్ల క్రితం అమితాబ్‌ శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని కుటుంబసభ్యులు సూచించారు. కానీ అమితాబ్‌ మాత్రం తిరిగి పుంజుకొని నటనను కొనసాగించాడు. జూనియర్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌ ఇద్దరూ అమితాబ్‌ను విశ్రాంతి తీసుకోమని గత కొంత కాలంగా కోరుతున్నట్లు సమాచారం. అయితే ఇన్నాళ్లకు అమితాబ్‌ వారి కోరికను మన్నించినందుకు వారు సంతోషించే అవకాశం ఉంది.

మూడు తరాలపాటు ఏకఛత్రాధిపత్యం

అమితాబ్‌ బచ్చన్‌.. బాలివుడ్‌ను మూడు తరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన సూపర్‌ స్టార్‌. బిగ్ బి అమితాబ‌చ్చన్‌ ను చూస్తే నిజంగా 73 సంవ‌త్సరాల వ‌య‌సు పూర్తి చేసుకున్నారా అనిపిస్తుంది. న‌టుడిగా బాలీవుడ్ లో ఆయ‌న చేసిన‌న్ని ప్రయోగాలు ఎవ‌రు చేయ‌లేదంటే అతిశ‌యోక్తికాదు. కెరీర్ ప్రారంభంలో కొంగ‌లా వున్నాడు ఇత‌నొక హీరోనా.. అని ఎద్దేవా చేసినా వాళ్ల నోళ్లను.. త‌న టాలెంట్ తో త‌న స్టామినా ఏమిటో నిరూపించి మూయించాడు బిగ్‌బీ.

1969లో బాలివుడ్‌లో అమితాబ్‌ తొలి అడుగు

1969 సంవత్సరం ఫిబ్రవరి 15.... బాలీవుడ్ చరిత్రలో ఈ తేదీకి విశేష ప్రాధాన్యత ఉంది. ఓ లెజెండరీ యాక్టర్ కెరీర్‌కు నాంది పలికిన ముహూర్తం అది. అదే రోజున తొలి అడుగు వేసిన ఓ యువకుడు భవిష్యత్‌లో ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓ లెజెండరీ సూపర్‌స్టార్‌గా నిలిచిపోయాడు. అతనే.. బిగ్ బి అమితాబ్‌బచ్చన్. ముంబయ్‌లోని ఫిల్మ్‌మేకర్ కె.ఎ.అబ్బాస్ ఆఫీస్ మెట్లు ఎక్కి ఆయన్ని కలిసి తన తొలి చిత్రం 'సాత్ హిందుస్తానీ' చిత్రానికి సైన్ చేశాడు. ఆ తర్వాత కెరీర్‌లో ఒక్కొక్క సినిమా చేసుకుంటూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ.. బాలీవుడ్‌లో ఏ స్టార్ హీరోకి దక్కని రికార్డులను సొంతం చేసుకున్నాడు అమితాబ్.

అమితాబ్ తొలి పారితోషికం 300 రూపాయలు

ప్రపంచమంతా మెచ్చిన ఆయన గొంతు మొదట ఆలిండియా రేడియో లో వాయిస్ ఓవర్ ఉద్యోగానికి వెళ్లినప్పుడు తిరస్కరణకు గురైంది. మృణాల్ సేన్ సినిమాలో వాయిస్ ఓవర్ తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్ కు తొలి పారితోషికం మూడు వందల రూపాయలు. కోల్ కతాలో ఉద్యోగం వదిలేసి వచ్చిన అమితాబ్, ముంబై మెరైన్ డ్రైవ్ దగ్గర బెంచ్‌పై గడిపిన నిద్ర లేని రాత్రులన్నీ భవిష్యత్తు మీద ఆలోచనలతోనే.. ఓ ఎక్స్ ట్రా వేషం కోసం స్టూడియో లైన్లలో నుంచుని ఉంటే.. బాలివుడ్‌ స్టార్‌ శశి కపూర్ దగ్గరి నుంచి అతనికి దొరికిన సమాధానం..నువ్వు ఏదో ఒక పెద్ద విషయం సాధించడానికి వచ్చిన వాడివి. నీ ప్రయాణం ఇక్కడ మొదలు కాకూడదు అంటూ వెన్నుతట్టాడు.

ఊరటనిచ్చిన రిషికేశ్ ముఖర్జీ సినిమా..

అవకాశాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన తరుణంలో అమితాబ్ కు ఊరటనిచ్చింది రిషికేశ్ ముఖర్జీ సినిమా..ఆనంద్. రాజేష్‌ ఖన్నా లాంటి సూపర్‌ స్టార్‌ పక్కన అమితాబ్‌ ఓ డాక్టర్‌ పాత్ర వేసాడు... రాజేష్‌ ఖన్నా లాంటి స్టార్‌ పక్కన అమితాబ్‌ తేలిపోతాడు అని అనుకున్నా.. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశంలో అమితాబ్‌ రక్తి కట్టించాడు.

అమితాబ్‌ను మాస్‌ హీరోగా నిలబెట్టిన దీవార్‌

ఇక ఆ తర్వాత అమితాబ్‌ను సూపర్‌ స్టార్‌గా నిలబెట్టింది మాత్రం "దీవార్" చిత్రం . దీవార్‌ అమితాబ్ ని అమాంతం ఆకాశంలో కూర్చోబెట్టేసింది అంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రంలో అమితాబ్ వేసుకునే నీలిరంగు డెనిమ్ షర్టు.. ఖాకీ ప్యాంటు.. భుజం మీద వేలాడుతూ కనిపించే తాడు.. ఈ మూడింటితో అమితాబ్ బచ్చన్ కు ఎక్కడలేని యాంగ్రీ యంగ్ మాన్ లుక్ వచ్చేసింది. చొక్కాను కింది భాగంలో రెండు బటన్లు విప్పి.. కింద ముడేసి మాంచి రఫ్ గా బిగ్ బీ దీవార్ చిత్రంలో కనిపించడంతో అభిమానులు ఆ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు.

యువతను ఆకర్షించిన అమితాబ్‌ మాస్‌ లుక్‌

దీవార్‌లో అమితాబ్‌ కనిపించే వరకూ బాలివుడ్‌లో లవర్‌ బాయ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. దేవానంద్‌, సంజీవ్‌ కుమార్‌, రాజేష్‌ ఖన్నా లాంటి స్టార్లు ప్రేమ కథా చిత్రాలతో ప్రేమ రసం పండిస్తున్న సమయంలో అమితాబ్‌ ఆ ట్రెండ్‌ను బ్రేక్‌ చేశాడు. 70 వ దశకంలో దేశ వ్యాప్తంగా నెలకొన్న నిరుద్యోగం, పేదరికం లాంటి పరిస్థితులతో యువతలో అసహనం రేగింది. ఆ పరిస్థితులకు అద్దం పట్టేలాంటి సినిమాలు.. వాటిలోని పాత్రలకు తగ్గట్లుగా అమితాబ్‌ మాస్‌ లుక్‌ యువతను ఆకర్షించేసింది. అమితాబ్ మాస్‌ పాత్రల్లో పెట్టింది పేరుగా మారాడు.

రొమాంటిక్ రోల్స్ నుంచి యాంగ్రీ యంగ్ మ్యాన్

రొమాంటిక్ రోల్స్ నుంచి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా అమితాబ్ ట్రాన్స్ ఫార్మ్ అయిన తీరు ఆయన టైమింగ్ సెన్స్ ని తెలియచేస్తుంది. రెండు పరస్పర విభిన్నమైన షేడ్స్ లో పరకాయ ప్రవేశం చేయడం అమితాబ్ కు వెన్నతో పెట్టిన విద్య. యశ్ చోప్రా, ప్రకాష్ మెహ్రా, రమేశ్ సిప్పీ..ఇలాంటి దిగ్దర్శక నిర్మాతల కు అమితాబ్ ఒక వరమైపోయాడు. ఇక జంజీర్, షోలే, డాన్‌, షాన్‌, నమక్‌ హలాల్‌, సిల్‌ సిలా, అమర్‌ అక్బర్‌ ఆంథోనీ, షరాబీ చిత్రాలు అమితాబ్‌ను బాలివుడ్‌లో తిరుగులేని నటుడిగా నిలబెట్టాయి. అమితాబ్ ఫేవరేట్ స్క్రీన్ పేరు విజయ్. ఈ పేరుతో ఆయన 20కి పైగా సినిమాల్లో దర్శనమిస్తాడు.

మిలీనియం స్టార్ గా అమితాబ్‌

పురస్కారాలు తిరస్కారాలు ..అవమానాలు..అవహేళనలూ..అన్నీ ఎదుర్కుని నిలిచాడు. భారతీయ సినిమాకి మేరు పర్వతమంత కీర్తిని తెచ్చి పెట్టాడు అమితాబ్ బచ్చన్. 2000 సంవత్సరం మిలీనియం సందర్భంగా బీబీసీ నిర్వహించిన పోల్‌లో అమితాబ్‌ మిలీనియం స్టార్ గా నిలిచాడు.

'కూలీ' షూటింగ్ లో అమితాబ్ కు గాయాలు

1983లో మన్మోహన్ దేశాయ్ తెరకెక్కించిన సూపర్‌హిట్ మూవీ 'కూలీ' సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్‌బచ్చన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో అతనికి 17 బాటిళ్ల రక్తాన్ని ఎక్కించాల్సి వచ్చింది. ఆ తర్వాత అమితాబ్ ఎన్నోసార్లు స్వయంగా రక్తదానం చేస్తూ దీని ఆవశ్యకత గురించి ప్రజల్లో ఎంతో ప్రచారం చేశాడు.

డిజార్డర్‌తో బాధపడి చికిత్స

'కూలీ'కి ముందు ఓసారి ఈ సూపర్‌స్టార్ ఓ అరుదైన మస్కులర్ డిజార్డర్‌తో బాధపడి చికిత్సపొందాడు. 1983లో దీపావళి వేడుకలో బిగ్-బి తన ఎడమ చేతిని కాల్చుకున్నాడు. దీంతో 1984లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'షరాబీ' సినిమాలో అమితాబ్ ఎన్నో సీన్లలో తన ఎడమ చేతిని ప్యాంట్ ఎడమ జేబులో పెట్టుకొని కనిపిస్తాడు. సినిమా విడుదల తర్వాత అభిమానులు, ప్రేక్షకుల్లో ఇది ఓ స్టైల్‌గా మారింది.

అఫ్ఘనిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో సగాన్ని బచ్చన్‌ రక్షణకు

1992లో అఫ్ఘనిస్తాన్‌లో 'ఖుదా గవా' షూటింగ్ సమయంలో అమితాబ్ అభిమాని అయిన ఆ దేశ అధ్యక్షుడు నజీబుల్లా అఫ్ఘనిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో సగాన్ని బచ్చన్‌ రక్షణ కోసం ఏర్పాటు చేయడం విశేషం. ఈ సినిమాలో ఎక్కువ భాగం అఫ్ఘనిస్తాన్‌లోనే షూటింగ్ జరుపుకుంది. ఈ బాలీవుడ్ సూపర్‌స్టార్ భారతదేశ సినీ చరిత్రలోనే పొడవైన హీరోగా నిలిచిపోయాడు.

అమితాబ్‌ కౌన్‌ బనేగా క్రోర్‌పతి షోతో బుల్లితెరపై రంగప్రవేశం

బచ్చన్ జీవితంలో మరెన్నో కుదుపులు కూడా ఉన్నాయి. అమితాబ్ జీవితంలో ఇంకాస్త ముందుకెళితే అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు.. అది దివాళా తీయటం..! అదో కొత్త పాఠం ఆయనకి..! అయినా నిత్య విద్యార్ధిలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కౌన్ బనేగా కరోడ్ పతి తో తిరిగి నిలబడ్డాడు. 2000 సంవత్సరంలో అమితాబ్ 'కౌన్ బనేగా క్రోర్‌పతి' షోతో బుల్లితెర రంగ ప్రవేశం చేశాడు. ఈ షో ఇండియాలో రియాల్టీ, గేమ్ షోలకు నాంది పలికింది. ఇండియన్ టెలివిజన్ రంగంలో హయ్యస్ట్ టిఆర్‌పి రేటింగ్‌తో అప్పట్లో కెబిసి దూసుకుపోయింది. ఆ తర్వాత అమితాబ్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా మొహబ్బతే సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అమితాబ్‌ కనిపించారు. ఈ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అమితాబ్‌ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు.

పలు ఛాలెంజింగ్ పాత్రలు

బ్లాక్‌, పా, సర్కార్‌, షమితాబ్‌, ఇటీవల విడుదలైన పీకూ సహా అమితాబ్‌ ఏడు పదుల వయస్సులోనూ పలు ఛాలెంజింగ్ పాత్రలు పోషించారు. బ్లాక్‌ చిత్రానికి గానూ అమితాబ్‌ జాతీయ ఉత్తమనటుడు అవార్డును సైతం దక్కించుకున్నాడు. పా చిత్రం కోసం అమితాబ్‌ ప్రోజేరియా వ్యాధిగ్రస్తుడిగా ప్రోస్థెటిక్‌ మేకప్‌తో నటించి తనకు సాటిరాగల నటుడు మరెవరూ లేరని నిరూపించుకున్నాడు. పా చిత్రానికి సైతం అమితాబ్‌ ఉత్తమ జాతీయ నటుడు అవార్డును దక్కించుకున్నాడు. అమితాబ్‌ను దేశ విదేశాలు అవార్డులతో ముంచెత్తాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్రప్రభుత్వం సత్కరించింది. ఇక ఫ్రాన్స్‌ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారంతో అమితాబ్‌ను సన్మానించింది.

కెమెరా ముందు ఎంత భయపడతామో ప్రేక్షకులకు తెలియదు

తెరపై చూసే ప్రేక్షకులు తమని చాలా హ్యాపీ పర్సన్స్ అనుకుంటారనీ, కెమెరా ముందు తాము ఎంత భయపడతామో ప్రేక్షకులకు తెలియదంటారు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. పాత్ర కోసం పడే సంఘర్షణ, అంచనాల్ని అందుకోవాలనే తపనే తనను స్టార్‌ని చేసి, ఇన్నాళ్ళుగా ఆ స్టార్‌ డమ్‌ని నిలబెట్టిందని అమితాబ్‌ చెబుతారు. అమితాబ్‌ చెప్పింది అక్షర సత్యం. ఇప్పటికి కూడా అమితాబ్‌ బచ్చన్‌ బిగ్‌ స్టార్‌. సూపర్‌ స్టార్‌. అదే సమయంలో రిటైర్‌ కావాలన్న ఆయన నిర్ణయం అభిమానులకు శరాఘాతమే.

 

 

20:25 - December 27, 2015

భూమ్మీద పుట్టిన ప్రతి బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం పొందడం ఒక హక్కు. ఎవరు జన్మించినా లేదా చనిపోయినా ఆయా వ్యక్తుల వివరాలను తప్పని సరిగా నమోదు చేయడం ప్రభుత్వ బాధ్యత. హైదరాబాద్‌లో ఆ బాధ్యతను జిహెచ్‌ఎంసి చూస్తోంది. అయితే.. జీహెచ్‌ఎంసీ అధికారులు దీన్ని బాధ్యతగా కన్నా.. కాసులు కురిపించే కల్పతరువుగా మార్చేసుకున్నారు. వారి ధనదాహం దెబ్బకు గ్రేటర్‌లో చావు పుట్టుకలు కూడా గ్రేట్‌ బిజినెస్‌లా మారాయి. జననం.. మరణం.. కాదేదీ ధనార్జనకు అనర్హమన్నట్లుగా తయారైంది జిహెచ్‌ఎంసి అధికారుల తీరు. బర్త్ సర్టిఫికేట్‌.. డెత్‌ సర్టిఫికేట్‌.. ఏదైనా సరే.. జారీ చేయాలంటే.. అందినకాడికి దండుకోవడమే తమ విధి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ లంచగొండి తనంతో నగరవాసులకు చుక్కలుచూపిస్తున్నారు.

బర్త్ అండ్ డెత్ రిజిష్ట్రేష‌న్ యాక్ట్ 1969..

బర్త్ అండ్ డెత్ రిజిష్ట్రేష‌న్ యాక్ట్ 1969 ప్రకారం... దేశంలో జ‌న‌న మ‌ర‌ణాలు, నిర్జీవ జ‌ననాలు, అవి జ‌రుగుతున్న ప్రదేశాల వివరాలను త‌ప్పనిస‌రిగా న‌మోదు చేయాలి. ఇందు కోసం అన్ని స్థాయుల్లో.. అంటే జాతీయ‌, రాష్ట్ర, జిల్లా స్థాయి, స్థానిక స్థాయుల్లో అధికారులను నియ‌మించాలి. వారి ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలి. అనంతరం కుటుంబ సభ్యులకు జననమరణాలకు సంబంధించిన దృవపత్రాలను అందించాలి. ఇవీ 1969 యాక్ట్ చేసే సూచన.

58 వార్డుల్లో జనన మరణాల నమోదు

చట్టం ప్రకారమే.. గ్రేటర్ పరిధిలోనూ 24 సర్కిళ్లలోని 58 వార్డుల్లో జనన మరణాల వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి సర్కిల్ కు బర్త్ అండ్ డెత్ సర్టీఫికేట్స్ ఇవ్వడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ పరిధిలో హెల్త్ అసిస్టెంట్లు జనన, మరణ వివరాలు నమోదు.. ధ్రువ పత్రాలు జారీ చేస్తుంటారు. ఈ విభాగంలో పనిచేసే చేందుకు 34మంది ఔట్ సోర్సింగ్ , ముగ్గురు పర్మనెంట్ హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారు.

ప్రజలకు శాపంగా వ్యవస్థలు

అధికారులు నమోదు చేసే జనన మరణాల వివరాలను ప్రధాన కార్యాలయానికి పంపితే... వాటి ఆధారంగా నగర వాసులకు వైద్యపరంగా అందించాల్సిన సేవలపై దృష్టి సారిస్తుంది ప్రభుత్వం. ఏఏ వ్యాధుల ద్వారా ఎంత మంది చనిపోతున్నారు. వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను ఈ గణంకాల వారీగా నిర్ణయిస్తారు. కానీ పౌరుల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు బ్రోకర్ల బారిన పడి అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల పాలిట శాపంగా మారాయి.

రాజ్యమేలుతోన్న బ్రోకర్ల వ్యవస్థ

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు కార్ల్ మార్క్స్. దీన్ని చావు పుట్టుకలన్నీ ఆర్థిక వనరులే అన్న రీతిగా మార్చుకున్నారు.. జీహెచ్‌ఎంసీ అధికారులు. వీరికి అనుకూలంగా ప్రతి కార్యాలయం వద్దా... బ్రోకర్ల వ్యవస్థ రాజ్యమేలుతోంది. వీరు.. బర్త్‌ సర్టిఫికేట్‌ అయితే ఒక రేటు, డెత్ సర్టిఫికేట్ అయితే మరో రేటు ఫిక్స్‌ చేశారు. ధ్రువీకరణ పత్రాలను నేరుగా తెచ్చుకుందామనుకునే వారికి మాత్రం సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు.

దరఖాస్తు చేసుకున్న ఏడురోజులలోగా సర్టిఫికేట్లు

బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లను దరఖాస్తు చేసుకున్న ఏడురోజులలోగా అందించాలి. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో... నిర్ణీత గడువులోగా జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందిన వారే లేరంటే అతిశయోక్తి కాదు. ఎవరైనా సరే.. కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిందే. లేదంటే ఆ పత్రం లేదని, ఈ పత్రం సరిగ్గా లేదని వంకలు పెడతారు. ఇక మధ్యవర్తుల ద్వారా వెళితే మాత్రం పని ఇట్టే అయిపోతుంది. ఇక స్వంతంగా వెళ్లి ధృవపత్రాలు తెచ్చుకోవాలంటే మాత్రం చుక్కలు కనబడతాయి.

బ్రోకర్లదే హవా

గ్రేటర్ పరిధిలోని ప్రతి సర్కిల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, బర్త్ అండ్ డెత్, లైసెన్సింగ్, తదితర పనుల కోసం అధికారులకు సమాంతరంగా పెద్ద మధ్యవర్తి వ్యవస్థ నడుస్తోంది. పలు విభాగాల్లో బ్రోకర్లదే హవా. కొన్ని కార్యాలయాల వద్ద ఒంటరిగా ఎవరైనా కనిసిస్తే చాలు ఏం వర్క్, ఏం సర్టిఫికేట్ కావాలి మేం చేసిపెడతాం అంటూ వెంట పడతారు. ఒక్కొక్క ధృపత్రానికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తారు. ప్రతీ కార్యాలయం ముందుండే జిరాక్స్ సెంటర్, స్టేషనరీ సెంటర్లను బ్రోకర్లు అడ్డాలుగా మార్చుకున్నారు. సర్కిల్ కార్యాలయంలో దొరకని ప్రతి దరఖాస్తూ ఇక్కడ లభిస్తుంది. ఇక ఆన్‌లైన్‌ బర్త్ సర్టిఫికేట్స్ లో తప్పులను సరిచేయించుకోవాలన్నా ప్రజలకు నరకమే. కంప్యూటర్ అపరేటర్లు, అధికారులు చేసిన తప్పులకు తాము కార్యాలయాలను చుట్టూ తిరగాల్సి వస్తుందని గ్రేటర్ వాసులు వాపోతున్నారు.

సర్టిఫికెట్ల జారీలో జాప్యం

ప్రజలకు ధృవపత్రాల జారీకి సంబంధించిన జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం సిటిజన్‌ చార్టర్‌ను నెలకొల్పింది. నిర్దిష్ట కాలావధిలో సర్టిఫికెట్లు ఇవ్వకుంటే.. సదరు అధికారి జీతం నుంచి రోజుకు కొంత మొత్తం చొప్పున వసూలు చేసి వినియోగదారుడికి అప్పగించాలన్నది సిటిజన్‌ చార్టర్‌ రూల్‌. సిటిజన్ చార్టర్ నిబంధనల మేరకు పనిచేయని 17మంది మెడికల్ అధికారులకు 82వేల 650 రూపాయల ఫైన్ కూడా వేశారు. కానీ సర్టిఫికెట్ల జారీలో జాప్యాన్ని మాత్రం నివారించలేక పోతున్నారు.

భారత్‌కు వచ్చిన 60రోజుల్లోగా.. దరఖాస్తు

ఇక బయటి దేశాల్లో పుట్టిన పిల్లల జనన ధృవీకరణ పత్రాల కోసం.. భారత్‌కు వచ్చిన 60రోజుల్లోగా.. ప్రధాన కార్యాలయంలోని ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీఎంఓ కార్యాలయం నుంచి సదరు వివరాలు సర్కిల్ కార్యాలయానికి వస్తే.. అక్కడి అధికారులు దాన్ని సర్టిఫై చేయాల్సి ఉంటుంది. అప్పడు సిటిజన్ సర్వీస్ సెంటర్, మీసేవల్లో ఎక్కడైనా సర్టిఫికేట్ తీసుకోవచ్చు. కానీ ప్రధాన కార్యాలయంలోని ఒక స్టాటస్టికల్ అధికారి, డిప్యూటి స్టాటస్టికల్ అధికారితో పాటు మరికొందరు ఉద్యోగులు ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. వివిధ పేర్లతో ప్రధాన కార్యాలయానికి వచ్చే దరఖాస్తు దారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పాక్‌లో పుట్టిన వ్యక్తికి.. హైదరాబాద్ లో బర్త్ సర్టిఫికెట్‌

అందుగలదు ఇందు లేదన్నట్లుగా తయారైంది జిహెచ్‌ఎంసిలోని అవినీతి. డబ్బులు పారేస్తే పాక్‌ ఉగ్రవాదికైనా.. హైదరాబాద్‌ జనన ధ్రువీకరణ పత్రం మంజూరు చేసేస్తారు. ఉగ్రవాదుల డొంక లాగుతున్న క్రమంలో.. ఇటీవల.. పాక్‌లో పుట్టిన ఓ వ్యక్తికి.. జీహెచ్‌ఎంసీ అధికారులు బర్త్ సర్టిఫికెట్‌ జారీ చేసిన విషయం బయటపడింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. ఇక్కడ డబ్బులకు జరగని పనేమీ లేదని చెప్పడానికి.

జనన, మరణ ధృవీకరణపత్రాల మంజూరులో అవినీతి

గ్రేటర్‌ పరిధిలో జనన, మరణ ధృవీకరణ పత్రాల మంజూరులో అవినీతి విశ్వరూపం దాల్చింది. ఇక్కడ డబ్బులివ్వనిదే ఏ పని జరగదు.. డబ్బులిస్తే జరగని పని ఉండదు. పొరుగు దేశాల ఉగ్రవాదికైనా సరే.. స్థానికంగా జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేస్తారు. ఉగ్రవాదుల కోసం ఆరా తీస్తుండగా... పాకిస్థాన్ లో పుట్టిన వ్యక్తికి కూకట్‌ పల్లి అధికారులు బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ సర్కిల్లో అయితే.. బతికున్న వ్యక్తికే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ రెండు సంఘనల్లో మెడికల్ అసిస్టేంట్లు, కంపూటర్లు అపరేటర్లే ప్రధాన సూత్రధారులని ఉన్నతాధికారులు తేల్చారు.

ఏటా 2 లక్షల జననాలు..50వేల మరణాలు

గ్రేటర్ పరిధిలో ఏటా 2 లక్షల దాకా జననాలు నమోదవుతుంటే 50వేల వరకు మరణాలు సంభవిస్తున్నాయి. జీహెచ్‌ఎంసి వీరందరి వివరాలు నమోదు చేయడంతోపాటు ధృవపత్రాలు అందించాలి. అయితే ఈ సర్టిఫికేట్‌ జారీ ప్రక్రియలో అవినీతి పెరిగిపోయిందని గుర్తించిన ఉన్నతాధికారులు నేరుగా ఇంటికే బర్త్ సర్టిఫికేట్‌ను పంపించాలని 2013 జూన్‌లో నిర్ణయించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఈ విధానం గ్రేటర్ పరిధిలో అమల్లోకి వచ్చింది. ఇలాంటి పథకాలు ప్రవేశపెడితే తమ జేబులెలా నిండుతాయన్న ఆలోచనతో అధికార గణం కొద్ది నెలల్లోనే ఆ పథకాన్ని అటకెక్కించారు. అడ్రస్‌లు సక్రమంగా లేవనో, ఇళ్లకు పంపిన సర్టిఫికేట్స్ తిరిగొచ్చాయనో సాకులు చెప్పి.. వాటిని పంపడం మానేశారు. ఇక అర్హతలు లేని వ్యక్తులు కొందరు సర్టిఫికేట్స్ జారీ విభాగంలో ఉన్నారు. ఇక ఎస్ ఎఫ్ ఎ లు, శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా ఈ విభాగంలో పని చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎల్‌బీనగర్ సర్కిల్ కార్యాలయంలో శరణ్ జీత్‌ సింగ్‌ అనే ఒక ఎస్‌ఎఫ్‌ఏ హెల్త్‌ అసిస్టెంట్‌ చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా ఈ పనులు చేయడానికి మల్టీ పర్పస్ హెల్స్ అసిస్టేంట్ కోర్స్ చేసి ఉండాలి. ఆరు నెలల కాలానికి మాత్రమే పనిచేయడానికి అప్పటి కమిషనర్‌ ఆదేశాలివ్వగా, సదరు ఎస్‌ఎఫ్‌ఏ మళ్లీ ఎక్స్‌టెన్షన్‌ తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై అసిస్టెంట్ మెడికల్ అధికారి ఎజాజ్ కాసీంను వివరణ అడగగా వివరాలు ఇస్తానంటూ మొహం చాటేశారు. అయితే పొలిటికల్ ప్రోద్బలంతోనే శరణజిత్‌ సింగ్ ఇక్కడ చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.

ఉద్యోగులు సీటును వలడం లేదు

బర్త్ అండ్ డెత్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు సీటును వలడం లేదు. పని చేస్తున్న సర్కిల్స్ లోనే ఎళ్ల తరబడి పాతుకు పోతున్నారు . ఒక వేళ వెళ్లిన ప్రక్కనే ఉన్న సర్కిల్ కు వెళ్లి, కొద్ది రోజుల్లోనే తిరిగి పాత స్థానాలకు వస్తున్నారు. కనీసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా వెరోకచోటికి మార్చలేకపోతున్నామని ఉన్నతాధికారులే వాపోతున్నారు. కార్పొరేషన్‌ ప్రథమ కర్తవ్యం జనన మరణ ధ్రువపత్రాల జారీ. కాని దానిని అవినీతి అధికారులు మాత్రం వ్యాపారంగా మార్చేశారు. ఉన్నతాధికారులు ఇప్పటికైన ఈ అంశంపై దృష్టి సారించి.. తమకు మేలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని గ్రేటర్‌ ప్రజలు కోరుతున్నారు.

 

20:06 - December 27, 2015

పశ్చిమబెంగాల్ : కోల్‌కతా అరుణవర్ణమైంది. భారీ ర్యాలీతో కామ్రేడ్లు కదం తొక్కారు. సీపీఎం బ్రిగెడ్లతో కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నిండిపోయింది. లక్షలాదిమంది కార్యకర్తలు, ప్రజలతో బహిరంగ సభ విజయవంతమైంది. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో సీపీఎం ప్లీనం జరుగుతోంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్లీనంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సీపీఎం నేతలు పాల్గొంటున్నారు. ఆదివారం.. బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్, బృందాకరత్, మాణిక్‌ సర్కార్, బిమన్‌బసు, బీవీ రాఘవులు, తదితరులు ఈ బహిరంగ సభకు హాజరయ్యారు.
భారత్‌ను రక్షించాలంటే మోడీని తొలగించాలన్న ఏచూరీ
దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తున్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాక్‌ సింగర్‌ గులాం అలీని, పాకిస్తాన్‌ క్రికెట్‌ టీంను అడ్డుకున్నారని.. కాని మోడీ పాక్‌లో పర్యటించారనీ అన్నారు. భారత్‌ను రక్షించాలంటే మోడీని తొలగించాలని.. పశ్చిమ బెంగాల్‌ బాగు పడాలంటే తృణమూల్‌ కాంగ్రెస్‌ను గద్దె దించాలని ఏచూరి పిలుపునిచ్చారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు కోల్‌కతా మార్గదర్శనం చేస్తుందని అన్నారు.
ప్లీనానికి తెలుగు రాష్ట్రాల ప్రతినిధుల బృందం
తెలుగు రాష్ట్రాల సీపీఎం పార్టీ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, మధు ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం ప్లీనం సమావేశాల్లో పాల్గొంటోంది. ఐదు రోజుల పాటు జరిగే ప్లీనం సమావేశాల్లో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైనా ప్రధానంగా చర్చించనున్నారు. డిసెంబర్‌ 31 వరకు ప్లీనం కొనసాగుతుంది.
భారీ ర్యాలీ
బహిరంగ సభకు ముందు సీపీఎం కార్యకర్తుల భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాలతో నగరంలో కవాతు నిర్వహించారు. బహిరంగ సభ జరిగే బ్రిగేడ్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ వరకు ర్యాలీ చేపట్టారు. 
 

19:36 - December 27, 2015

హైదరాబాద్ : ఏం సంస్థ అయినా నష్టాలబారిపడితే ఏం చేస్తారు? కారణం కనుక్కుంటారు... నిపుణులతో చర్చించి పరిష్కారం వెతుకుతారు. అయితే మన ఆర్టీసీ రూట్‌ మాత్రం సెపరేటు... ఇబ్బందుల పేరు చెప్పి సిబ్బందిని కుదించే ప్రయత్నం చేస్తోంది. 
ఆర్టీసీ సరికొత్త ప్లాన్‌ 
ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్న ఆర్టీసీ ఇప్పుడు సరికొత్త ప్లాన్‌ వేసింది.. బస్సుకు రెండు చక్రాల్లాంటి కండక్టర్‌, డ్రైవర్‌ పోస్టులను కుదించే పని మొదలుపెట్టింది.. నష్టాలను సాకుగా చూపుతూ సిబ్బందిని తగ్గిస్తోంది.. సంస్థను సమర్ధంగా నడపలేక వర్కర్లపై భారం వేస్తోంది. 
ఇప్పటికే టిమ్స్ యంత్రాలు
నష్టనివారణ చర్యల్లోభాగంగా ఇప్పటికే టిమ్స్ యంత్రాలు అమల్లోకి తెచ్చింది ఆర్టీసీ... కండక్టర్లు లేకుండా డ్రైవర్లద్వారా బస్సులను నడుపుతోంది.. ఈ విధానం వల్ల డ్రైవర్లపై ఒత్తిడి పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆందోళన చేశాయి.. హైకోర్టులో పిటిషన్‌కూడా వేశాయి.. కోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.. టిమ్స్  వినియోగం కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టంచేసింది... కార్మికులకు ఇష్టపడితేనే ఈ యంత్రాలను వాడాలని ఆదేశించింది.. అయినా ఆర్టీసీపట్టించుకోవడంలేదు.. 
ఏడాదికి రూ. 300కోట్లు ఆదా
ఇప్పటివరకూ సింగిల్‌ స్టాప్, నాన్‌స్టాప్‌ బస్సుల్లో టిమ్స్ ద్వారా డ్రైవర్లు టికెట్లు ఇస్తున్నారు.. ఇకనుంచి అన్ని బస్సుల్లో వీటిని వాడాలని అధికారులు నిర్ణయించారు.. దీనివల్ల ఏడాదికి 3వందల కోట్లవరకూ డబ్బు ఆదా అవుతుందని అంచనా.. అలాగే హైదరాబాద్‌లో బస్సులకోసం మరో కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది.. ఈ బస్సుల్లో కండక్టర్, డ్రైవర్‌ పోస్టులకు ఎసరుపెట్టింది.. అద్దె బస్సులను తెచ్చేందుకు ట్రై చేస్తోంది.. అలాగే కొత్త డ్రైవర్ పోస్టుల భర్తీకి బ్రేక్‌ వేసింది.. ఇక కండక్టర్లను నియమించకుండా స్మార్ట్ కార్డ్ విధానం తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.. 
సిబ్బంది తగ్గింపుపై విమర్శలు
సంస్థను బలోపేతం చేయాల్సిందిపోయి ఇలా సిబ్బందిని తగ్గించడంపై విమర్శలొస్తున్నాయి.. ఆర్టీసీ నిర్ణయం సరికాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కోట్ల రూపాయల ఖర్చుతో విదేశీ యాత్రలు చేస్తున్న అధికారులు అక్కడ అధ్యయనం చేసింది ఇదేనా అని ప్రశ్నిస్తున్నాయి. 

 

గ్యాస్ పైప్ లైన్ లీక్..

రంగారెడ్డి : జిల్లాలోని మేడ్చల్ మండలం కృష్ణాపూర్ లో భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. 

19:32 - December 27, 2015

రంగారెడ్డి : జిల్లాలోని మేడ్చల్ మండలం కృష్ణాపూర్ లో భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్కడి ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. రెండు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు.

 

కాల్ మనీ కేసులో దర్యాప్తు వేగవంతం

విజయవాడ : కాల్ మనీ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. కాల్ మనీ కేసులో మరో కీలక నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. మద్దంశెట్టి రవికుమార్ ను కృష్ణాలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు.
రవి నుంచి పోలీసులు సమచారం సేకరిస్తున్నారు. 

 

19:29 - December 27, 2015

విజయవాడ : కాల్ మనీ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో మరో కీలక నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. మద్దంశెట్టి రవికుమార్ ను కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నిందితుని నుంచి సమచారం సేకరిస్తున్నారు.

 

తెలంగాణ సంక్షేమం కోసమే అయుత చండీయాగం : కేసీఆర్

మెదక్ : తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి అయుత మహా చండీయాగం చేశానని సీఎం కేసీఆర్ అన్నారు. యాగానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చండీయాగం ముగింపు సంరద్భంగా ఆయన మాట్లాడారు. మన సంస్కృతి, సంప్రదాయాలు విశిష్టమైనవి, బలమైనవన్నారు. చనుబాలు ఇచ్చేటప్పుడే తల్లి పిల్లలకు సంస్కారం నేర్పుతుందని చెప్పారు. 

తెలంగాణ సంక్షేమం కోసమే అయుత చండీయాగం : కేసీఆర్

మెదక్ : తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి అయుత మహా చండీయాగం చేశానని సీఎం కేసీఆర్ అన్నారు. యాగానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చండీయాగం ముగింపు సంరద్భంగా ఆయన మాట్లాడారు. మన సంస్కృతి, సంప్రదాయాలు విశిష్టమైనవి, బలమైనవన్నారు. చనుబాలు ఇచ్చేటప్పుడే తల్లి పిల్లలకు సంస్కారం నేర్పుతుందని చెప్పారు. 

19:01 - December 27, 2015

మెదక్ : తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించి అయుత మహా చండీయాగం చేశానని సీఎం కేసీఆర్ అన్నారు. యాగానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చండీయాగం ముగింపు సంరద్భంగా ఆయన మాట్లాడారు. మన సంస్కృతి, సంప్రదాయాలు విశిష్టమైనవి, బలమైనవన్నారు. చనుబాలు ఇచ్చేటప్పుడే తల్లి పిల్లలకు సంస్కారం నేర్పుతుందని చెప్పారు. ధర్మం తప్పక జయిస్తుందని...అధర్మం ఎప్పటికైనా ఓడిపోతుందన్నారు. యాగాలు చేయడం తనకు కొత్తకాదని.. 25 ఏళ్లుగా యాగాలు చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే.. తప్పకుండా అయుత చండీయాగం నిర్వహిస్తానని 2011లోనే సంకల్పించానని గుర్తు చేశారు. అందరి సహకారంతో త్వరలో ప్రయుక్త చండీయాగం నిర్వహిస్తానని చెప్పారు. మిషన్ భగీరత ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలన్నదే తన కోరిక అన్నారు.

 

ముగిసిన అయుత చండీయాగం..

మెదక్ : సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలో నిర్వహించిన అయుత చండీ మహా యాగం ఇవాళ వేదోచ్చరణల మధ్య మహా పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసింది. సీఎం కేసీఆర్ దంపతులు పూర్ణాహుతి సామాగ్రిని యజ్ఞంలో వేసి పూర్ణాహుతి నిర్వహించారు. కాగా, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, యజ్ఞ నిర్వాహకులు ఇవాళ యాగశాలలోనే నిద్రించనున్నారు.

పాక్ స్పిన్నర్ పై తాత్కాలిక సస్పెన్షన్

హైదరాబాద్‌ : పాకిస్థాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షాను క్రికెట్‌ నుంచి తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది నవంబర్‌ 13న నిర్వహించిన డోపింగ్‌ పరీక్షల్లో అతను పట్టుబడ్డాడు. యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ నిషేధించిన మందులను వాడటం వల్ల అతనిని సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల శ్రీలంక క్రికెటర్‌ కుశాల్‌ పెరీరా కూడా డోపింగ్‌ పరీక్షల్లో పట్టుబడి నాలుగేళ్ల పాటు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే.

 

18:09 - December 27, 2015

హైదరాబాద్ : కల్లబొల్లి కబుర్లు చెబుతూ కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్‌ నేత అంజన్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్ లో ఆ పార్టీ నిర్వహించిన సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చేలా సిఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం నేతలు దానం నాగేందర్‌, మర్రిశశిధర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.

 

18:02 - December 27, 2015

మెదక్ : ఐదు రోజులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అయుత చండీయాగం... మహా పూర్ణాహుతి హోమంతో ముగిసింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమం పరిపూర్ణమైంది. రుత్విజుల వేద మంత్రాలతో యాగ స్థలి మారుమోగింది. మహాపూర్ణాహుతి హోమంలో కెసిఆర్‌ దంపతులతోపాటు గవర్నర్ నరసింహన్‌ దంపతులు కూడా పాల్గొన్నారు. పూర్ణాహుతికి జగద్గురు శృంగేరి పీఠాధిపతి హోమద్రవ్యాలు, వస్త్రాలు పంపించారు. దుర్గాచక్రం, మహంకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి సన్నిధి మధ్య కుండంలో పూర్ణాహుతి నిర్వహించారు. పువ్వులు, నవధాన్యాలు, సమిథలు, తదితర పూజాద్రవ్యాలతో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. ముగింపు సందర్భంగా పలువురు స్వామీజీలు, ప్రముఖులు పాల్గొన్నారు. చివరిగా కేసిఆర్‌ దంపతులు, గవర్నర్‌ నరసింహన్‌ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. యాగం చివరి రోజు కావడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు.

 

 

17:56 - December 27, 2015

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. మ్తొతం ఆరుస్థానాలకు ఎన్నికలు జరిగినట్లు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో మొత్తం 1110 ఓటర్లకు గానూ 1100 మంది ఓటు వేశారని.... పది మంది ఓటు వేయలేదని... అందులో ఒకరు యూఎస్ లో ఉన్నారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 726 మంది ఓటర్లకు గానూ 692 మంది ఓటు వేశారని.. 34 మంది ఓటు వేయలేదని... అందులో 32 మంది సీపీఎం సభ్యులున్నారని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఎలాంటి కేసు నమోదు కాలేదని స్పష్టం కేశారు. ఎన్నికలకు సంబంధించి.. మీడియా మంచి రిపోర్టు ఇచ్చిందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశామని... స్ట్రాంగ్ కు నాలుగు వైపుల కెమెరాలు ఏర్పాటు చేశామని.. అవసరమైతే.. ఇంటర్నెట్ లో కూడా స్ట్రాంగ్ రూంలను చూడొచ్చన్నారు. అవసరమనుకుంటే... అభ్యర్థులు తమ వారిని స్ట్రాంగ్ రూముల వద్ద ఉంచవచ్చని తెలిపారు. ఈనెల 30 న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్లులు, ఏజెంట్లను కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తామని చెప్పారు. అయితే సెల్ ఫోన్ లకు అనుమతి లేదని.. వాటిని తమ వెంట తీసుకురావద్దని సూచించారు.

 

17:24 - December 27, 2015

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాలకు, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోల్‌ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో 100 శాతం, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖ్మమం జిల్లాల్లో 99 శాతం పోలింగ్ నమోదు అయింది. ఈనెల 30న ఓట్ల లెక్కింపు జరుగనుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్ లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న మొత్తం 1260 ఓట్లకు 1257 ఓట్లు పోల్ అయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 725 ఓట్లకుగానూ... 692 ఓట్లు పోల్ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 771 ఓట్లుకు 769 ఓట్లు పోల్ అయ్యాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 1110 ఓట్లకు 1100 ఓట్లు పోల్ అయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో వామపక్షాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. 

 

ముగిసిన మహా పూర్ణహుతి క్రతువు

మెదక్ : అయుత చండీయాగంలో భాగంగా ఎర్రవల్లిలో నిర్వహించిన మహా పూర్ణహుతి క్రతువు ముగిసింది. దీంతో అయుత చండీయాగం పరిసమాప్తం అయింది.

 

16:48 - December 27, 2015

కరీంనగర్ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ ఐ దుర్మరణం చెందారు. మానుకొండూరు మండలం గట్టుదుద్దినపల్లె వద్ద బైక్‌ను తప్పించబోయిన టాటా ఏస్ వాహనం ఎస్‌ఐను, ఆటోను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఎస్ ఐ త్రీవంగా గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యారు. తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐను కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఎస్ఐ భార్య, కుమారుడు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. 

యాగశాలలో మంటలు అంటుకోవడం శుభసూచకమే -స్వరూపానంద

మెదక్ : యాగశాలలో మంటలు అంటుకోవడం శుభసూచకమే అని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద అన్నారు. యాగం తర్వాత యాగశాల పాకలను తగలబెట్టాలని శాస్త్రంలో ఉందని చెప్పారు. ముందుగానే అది తగలబడడం అరిష్టం కాదని తెలిపారు. అయుత చండీయాగం ఫలభరితమైందన్నారు. 

16:41 - December 27, 2015

మెదక్ : యాగశాలలో మంటలు అంటుకోవడం శుభసూచకమే అని శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద అన్నారు. యాగం తర్వాత యాగశాల పాకలను తగలబెట్టాలని శాస్త్రంలో ఉందని చెప్పారు. ముందుగానే అది తగలబడడం అరిష్టం కాదని తెలిపారు. అయుత చండీయాగం ఫలభరితమైందన్నారు.

 

16:36 - December 27, 2015

హైదరాబాద్ : అభూత కల్పనలతో టీసర్కార్ ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ విమర్శించారు. ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతోందని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ బండారం బయటపడుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ స్టోన్ ల వద్ద మీటింగ్ లు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను టీఆర్ ఎస్ అడ్డుకుందని గుర్తు చేశారు.

 

తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

16:16 - December 27, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ఆకాశం నుంచి చూడాలనుకుంటున్నారా? విమానాలు, హెలికాఫ్టర్లు, ఎయిర్‌ బెలూన్ల ద్వారా అందమైన భాగ్యనగరాన్ని చుట్టేయాలనుకుంటున్నారా? త్వరలోనే మీ కలలను నిజం చేసేందుకు తెలంగాణ టూరిజం శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 
భాగ్యనగరం విహంగ వీక్షణకు హెలి టూరిజం
హైదరాబాద్‌ నగరంలో త్వరలోనే నాగోల్ - మెట్టుగూడ మార్గంలో మెట్రోరైలు పరుగులు తీయనుంది. దీంతో పాటు స్కైవేలు, స్కై స్క్రాపర్స్ కూడా నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్‌ యోచిస్తోంది. నగరం రూపురేఖలు మారిపోతున్నాయి. దీంతో నగరాన్ని వీక్షించేందుకు వచ్చే వారి సంఖ్య పెరగనుంది. ఇందుకనుగుణంగా తెలంగాణ టూరిజం శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సుందర భాగ్యనగరాన్ని విహంగ వీక్షణకు హెలి టూరిజాన్ని డెవలప్‌ చేయబోతున్నారు అధికారులు. ఇందుకోసం నగరంలోని టూరిజం ఆపరేటర్లతో చర్చలు జరుపుతున్నారు.
నల్లమల అడవుల్లో ఎకో టూరిజం
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఎకో టూరిజం, ట్రైబల్‌ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవుల్లాంటి ప్రాంతాలను ఎకో టూరిజంగా..  వరంగల్‌లోని తాడ్వాయి, లక్కవరం, మల్లూరు, గట్టమ్మ దేవాలయాలను ట్రైబల్‌ టూరిజంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న బౌద్ధ, జైన, రామాయణ ప్రాంతాలను ప్రత్యేక సర్క్యూట్‌లుగా గుర్తించి పర్యాటక క్షేత్రాలుగా డెవలప్‌ చేయనున్నారు.
కేసీఆర్ ఆలోచనలు అమలు చేసేందుకు కసరత్తు
హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన ఆలోచనలను అమలు చేసేందుకు టూరిజం శాఖ కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే భవిష్యత్‌లో సైబర్‌ సిటీ కాస్తా టూరిస్ట్‌ సిటీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా సర్కార్‌ ఖజానా కూడా నిండుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇవి కార్యరూపం దాలిస్తే ప్రజలు తెలంగాణ అందాలను ఆకాశ మార్గాన వీక్షించే అవకాశం కలగనుంది. 

చండీయాగానికి హాజరైన గవర్నర్ దంపతులు

మెదక్‌ : జిల్లాలోని ఎర్రవల్లిలో  సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న చండీయాగానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు హాజరయ్యారు. చండీయాగం ముగింపు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న పూర్ణాహుతిలో వారు పాల్గొన్నారు.

15:53 - December 27, 2015

గుంటూరు : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను ఏపీ సర్కార్‌ విడుదల చేసింది. సింగపూర్‌ ప్రభుత్వం ఇచ్చిన మూడు ప్లాన్‌లలో పలు మార్పులు చేసి ఈ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో ఉంచిన ఈ ప్లాన్‌పై అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా తెలియజేయవచ్చని అధికారులు కోరుతున్నారు.
రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని నగరం, రాజధాని ప్రాంతాల మాస్టర్‌ ప్లాన్‌ను సీఆర్‌డీఏ విడుదల చేసింది. జులై 20న సింగపూర్‌ ప్రభుత్వం అందించిన మూడు ప్లాన్‌లపై వివిధ వర్గాలు, నిపుణుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించిన ప్రభుత్వం.. కొన్ని మార్పులు చేసి ఈ ప్లాన్‌ను రూపొందించింది. దీనిపై ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే 30 రోజుల్లోగా తెలియజేయవచ్చని సీఆర్‌డీఏ కమిషనర్‌ ప్రకటించారు.
ఎనిమిది జోన్లుగా రాజధాని ప్రాంతం
సహజ వనరులు, పర్యావరణం, చెరువులు, కాలువలు, నదీ ప్రవహాన్ని కాపాడుతూ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. 8,603 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న రాజధాని ప్రాంతాన్ని ఎనిమిది జోన్లుగా విభజించారు. రాజధాని నగరం చుట్టూ ప్రతి జోన్‌లో ఆర్ధిక కార్యకలాపాలు, లావాదేవీలు జరిగే విధంగా ప్రత్యేక నగరాలను అభివృద్ధి చేయనున్నారు. ఇంటర్నల్‌, ఔటర్‌ రింగురోడ్లు, ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌, స్పీడ్‌ రైలు, అంతర్గత జలమార్గాలు, సబర్బన్‌ రైళ్లు వంటి అంశాలను ఈ ప్లాన్‌లో పేర్కొన్నారు. అంతర్గత రింగురోడ్డు వెడల్పు 75 మీటర్లుగా.. ఔటర్‌ రింగురోడ్డు వెడల్పు 150 మీటర్లుగా నిర్ణయించారు. రవాణా వ్యవస్థలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయనున్నారు. ఈ అనుసంధానికి మల్టీమోడల్‌ ఇంటిగ్రేటెడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు.
రాజధాని నగర పరిధి 217 చ.కి.మీ
ఇక రాజధాని నగర పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు నివాస, వాణిజ్య అవసరాలకు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. నగరంలో గ్రిడ్‌ ఆధారిత రోడ్లను ప్రతిపాదించారు. రాజధాని నగరాన్ని ప్రభుత్వ, ఆర్ధిక, పర్యాటకం, విజ్ఞాన, ఆరోగ్య, ఎలక్ట్రానిక్స్‌, మీడియా, న్యాయ, క్రీడల నగరాల పేరిట తొమ్మిది నగరాలుగా విభజించారు. మరోవైపు కొండవీటి వాగు నుంచి వరదలు రాకుండా విపత్తు నిర్వహణ చర్యలు కూడా ఈ ప్లాన్‌లో సూచించారు. ఇక మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం రాజధాని ప్రాంత పరిధిలో కృష్ణాజిల్లాలోని 29 మండలాలు, గుంటూరు జిల్లాలో 25 మండలాలున్నాయి. ఇక గతేడాది డిసెంబర్‌ 30న ఏర్పాటైన సీఆర్‌డీఏ ఏడాదిలోగా మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాల్సివుండగా నాలుగు రోజుల ముందే దీన్ని రూపొందించింది.

 

 

15:30 - December 27, 2015

చిత్తూరు : తిరుమలలోని యాత్రీసదన్‌లో ఉదయం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి భక్తులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పలువురు యాత్రికుల వస్తువులు ధ్వంసం కావడంతో పాటు.. భక్తులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఓ గదిలో దాక్కున్న సైకోను అదుపులోకి తీసుకున్నారు.

 

 

15:26 - December 27, 2015

వరంగల్ : జిల్లాలోని చెన్నారావుపేట మండలం ఖాదర్‌ గుట్ట వద్ద దారుణం జరిగింది. అటవీ ప్రాంతంలో ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేగింది. వారిద్దరిని అతికిరాతంగా నరికి చంపినట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రాంతంలో దుర్వాసన రావడంతో గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతులు ఇరువురు నల్లబెల్లి మండలం చెక్కలపల్లి గిరిజన వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న భూమిక, ప్రియాంకగా గుర్తించారు. ఈ ఇద్దరు హాస్టల్‌ నుంచి అదృశ్యమైనట్లు గత నెల 23న పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇద్దరు హాస్టల్‌ విద్యార్థినుల హత్య ఘటన సంచలనంగా మారింది.

 

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

హైదరాబాద్ : మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు వరకు పోలింగ్ జరుగనుంది. 

14:54 - December 27, 2015

నల్గొండ : జిల్లాలోని సూర్యాపేటలో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల రాస్తారోకోకు దిగారు. మంత్రి జగదీష్‌ రెడ్డి పోలింగ్ కేంద్రంలో కూర్చొని ఓటర్లను బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. గంటన్నరకు పైగా పోలింగ్ కేంద్రంలోనే ఉన్న జగదీష్ రెడ్డి... ఓటర్లను బెదిరించాలని వారు ఆరోపిస్తూ.. ఆందోళనకు దిగారు.

 

పుత్తూరులో ఎర్రచందనం దుంగల స్వాధీనం..

తిరుపతి : పుత్తూరు (మం) గొల్లపల్లి చెక్ పోస్టు వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో ఎర్రచందనం బయటపడింది. అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న రెండు వాహనాలను సీజ్ చేశారు. రూ.9లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

దేశం అభివృద్ధిలో దూసుకపోతోంది - మోడీ..

ఢిల్లీ : దేశం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశంలో గ్రామాలన్నింటినీ విద్యుదీకరించాలని, పర్యాటక ప్రాంతాల్లో స్వచ్చతకు అధికా ప్రాధాన్యతనివ్వాలన్నారు. నగదు బదిలీ పథకానికి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం లభించిందన్నారు. 

13:40 - December 27, 2015

మెదక్ : ఎర్రవెల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న అయిత చండీయాగంలో చివరి రోజున అపశృతి చోటు చేసుకుంది. యాగ శాలలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యాగ విరామం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటపంపై పై భాగంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీనితో రుత్విక్కులు బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. భక్తులు ఎలాంటి భయాందోళనలకు చెందవద్దని నిర్వాహకులు పేర్కొన్నారు.

భారీగా పొగ..
101 హోమ గుండాలతో యాగశాల మొత్తం పొగ చూరుకపోయింది. దీనితో ఊపిరి ఆడకపోవడం..కళ్లు మంటలు చెలరేగడంతో రుత్విక్కులు బయటకు వెళ్లిపోయారు. దీనితో చండీయాగానికి స్వల్ప ఆటంకం ఎదురైంది. ఆ వెంటనే రుత్విక్కులను యాగశాల బయటకు వెళ్లనీయవద్దని నిర్వాహకులు మైక్ లో సూచనలు చేశారు. లోపలకు రావాలని..అరగంటలో హోమం పూర్తవుతుందని రుత్విక్కులకు నిర్వాహకులు సూచించారు. కానీ యాగశాల లోనికి వెళ్లేందుకు రుత్విక్కులు సాహసించలేదు. పొగ మొత్తం బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని మైక్ లో మంత్రి హరీష్ రావు పలు సూచనలు చేశారు. చివరకు యాగం తిరిగి మొదలైంది.

చండీయాగంలో పాల్గొన్న బాబు...
ఏపీ సీఎం చంద్రబాబు పసుపు వర్ణం దుస్తులు ధరించి చండీయాగంలో పాల్గొన్నారు. రుత్విక్కుల మంత్రోచ్ఛరణాల మధ్య యాగం జరిగింది. విజయవాడ కనకదుర్గమ్మ నుంచి తీసుకువచ్చిన పట్టు వస్ర్తాలు, పసుపు, కుంకుమ, ప్రసాదాన్ని యాగశాలలో చంద్రబాబు సమర్పించారు. అంతకుముందు యాగశాల చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేశారు. ఇక యాగం గురించి చంద్రబాబుకు సీఎం కేసీఆర్ వివరించారు. 

13:37 - December 27, 2015

కోల్ కతా : ప్రతి అడుగూ ప్రజాఉద్యమాల వైపే...ప్రతీ నినాదం ప్రజల పక్షమే.. మిత్రపక్షమైనా..ప్రతిపక్షమైనా ప్రజాసమస్యల విషయానికొస్తే పాలకులపై సమరశంఖమే. ప్రజాపోరాటాలే ఊపిరిగా నిత్యం ప్రజలతోనే మమేకమైన కామ్రేడ్లు ఇప్పుడు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. కోల్‌కతాలో ఆదివారం నుండి 31వ తేదీ వరకు జరగనున్న సీపీఎం నిర్మాణ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
ప్లీనరీ సమావేశాలకు ముందు కోల్‌కతా నగరంలో సీపీఎం భారీ ర్యాలీ నిర్వహించింది. అరుణ పతాకాలతో ఎర్రసైన్యం కోల్‌కతా నగరంలో కదం తొక్కింది. వివిధ రాష్ర్టాల నుంచి తరలొచ్చిన సీపీఎం కార్యకర్తలు కోల్‌కతా నగరంలో కవాతు నిర్వహించారు. నగరంలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగింది. అంతకంటే ముందు పార్టీ జెండాను బెంగల్ లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్ బిమన్ బసు ఆవిష్కరించారు. బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కరత్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ తదితరులు పాల్గొన్నారు. 

ఎర్రవల్లి యాగశాలలో అగ్నిప్రమాదం..

మెదక్ : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న అయిత చండీయాగంలో చివరి రోజున అపశృతి చోటు చేసుకుంది. యాగశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 

సూర్యాపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

నల్గొండ : సూర్యాపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గంటన్నరకు పైగా పోలింగ్ కేంద్రంలో మంత్రి జగదీష్ ఉన్నాడని, ఓటర్లను బెదిరిస్తున్నాడని పేర్కొంటూ టిడిపి, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు.

 

ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 98వ వార్షికోత్సవం..

హైదరాబాద్ : రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 98వ వార్షికోత్సవం జరిగింది. ఈ వార్షికోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. 

12:37 - December 27, 2015

కోల్‌కతా : నగరం అరుణారుణమైంది. ఇవాళ ప్రారంభం కానున్న సీపీఎం 3వ ప్లీనరీ సమావేశాలకు ముందు కోల్‌కతా నగరంలో సీపీఎం భారీ ర్యాలీ నిర్వహించింది. అరుణ పతాకాలతో ఎర్రసైన్యం కోల్‌కతా నగరంలో కదం తొక్కింది. వివిధ రాష్ర్టాల నుంచి తరలొచ్చిన సీపీఎం కార్యకర్తలు కోల్‌కతా నగరంలో కవాతు నిర్వహించారు. నగరంలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగింది. మరికాసేపట్లో బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ ప్రారంభం కానుంది.
సీపీఎం 3వ ప్లీనరీ సమావేశాలకు ముందుకు పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించారు. నేటి నుంచి ఐదు రోజుల పాటు జరిగే ప్లీనరీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై మరోసారి నిర్ణయం తీసుకున్నారు. చరిత్రాత్మక ఈ ప్లీనరీ సమావేశాల్లో పార్టీ బలోపేతంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ప్లీనరీ సమావేశాలకు పశ్చిమ బెంగాల్‌ సీపీఎం పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది.  

12:35 - December 27, 2015

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభమైంది. రెండు స్థానాలకు గానూ ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌, టీడీపీ నుంచి చెరో అభ్యర్థి చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ మందకోడిగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీ జితేందర్‌ రెడ్డి తొలి ఓటును వినియోగించుకున్నారు. ఇక గద్వాల డివిజన్లో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఎమ్మెల్యే డీకే అరుణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఖమ్మంలో...
ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్‌ కొనసాగుతోంది. జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో 726 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ స్థానానికి ప్రధానంగా అధికార, విపక్ష అభ్యర్ధుల మధ్యే పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. 

12:21 - December 27, 2015

నల్గొండ : జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము విజయం సాధించడం ఖాయమని టి.కాంగ్రెస్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికను ప్రధాన ప్రతిపక్షం, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సందర్భంగా టెన్ టివితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. జిల్లాలో కేవలం 1110 ఓట్లు మాత్రమే ఉన్నాయని, 560 స్థానాలు టి.కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. టీఆర్ఎస్ కేవలం 136 స్థానాలకు పరిమితమైందని అందువల్ల పోటీ చేయడం కరెక్టు కాదన్నారు. తప్పకుండా మెజార్టీతో గెలవడంతో పాటు అనైతిక చర్యలను ఖండించడానికి తాము పోటీ చేయడి జరిగిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. 

గిరిజన బాలిక హాస్టల్ లో మంత్రి రావెల తనిఖీలు..

విజయవాడ : గిరిజన బాలికల హాస్టల్ లో మంత్రి రావెల తనిఖీలు నిర్వహించారు. హాస్టల్ వాతావరణం పిల్లలకు అనుకూలంగా ఉందని రావెల పేర్కొన్నారు. రెసిడెన్షియల్ తరహాలో హాస్టళ్లను అభివృద్ధి చేస్తామని, తగు సదుపాయాలను సమకూర్చుతామన్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్ విద్యార్థులకు స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు ప్రవేశ పెడుతామని, యూనివర్సిటీల్లోనూ స్కిల్ డెవలప్ మెంట్ కోర్సులు ఉంటాయన్నారు. 

రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు..

నల్గొండ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి, ఎన్నికల ఏజెంట్ వెంకట నారాయణ గౌడ్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినందుకు నోటీసులు జారీ చేసింది. 

భద్రాచలంలో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్...

ఖమ్మం : ఉదయం 11గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైంది. భద్రాచలం డివిజన్ లో పోలింగ్ పూర్తయ్యింది. 59 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

11:35 - December 27, 2015

మెదక్ : సీఎం కేసీఆర్ తలపెట్టిన అయుత చండీ మహాయాగం చివరి రోజు ఆటంకం ఎదురైంది. 101 హోమ గుండాలతో యాగశాల మొత్తం పొగ చూరుకపోయింది. దీనితో ఊపిరి ఆడకపోవడం..కళ్లు మంటలు చెలరేగడంతో రుత్విక్కులు బయటకు వెళ్లిపోయారు. దీనితో చండీయాగానికి స్వల్ప ఆటంకం ఎదురైంది. ఆ వెంటనే రుత్విక్కులను యాగశాల బయటకు వెళ్లనీయవద్దని నిర్వాహకులు మైక్ లో సూచనలు చేశారు. లోపలకు రావాలని..అరగంటలో హోమం పూర్తవుతుందని రుత్విక్కులకు నిర్వాహకులు సూచించారు. కానీ యాగశాల లోనికి వెళ్లేందుకు రుత్విక్కులు సాహసించలేదు. పొగ మొత్తం బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని మైక్ లో మంత్రి హరీష్ రావు పలు సూచనలు చేశారు. చివరకు యాగం తిరిగి మొదలైంది.
ఏపీ సీఎం చంద్రబాబు పసుపు వర్ణం దుస్తులు ధరించి చండీయాగంలో పాల్గొన్నారు. రుత్విక్కుల మంత్రోచ్ఛరణాల మధ్య యాగం జరిగింది. విజయవాడ కనకదుర్గమ్మ నుంచి తీసుకువచ్చిన పట్టు వస్ర్తాలు, పసుపు, కుంకుమ, ప్రసాదాన్ని యాగశాలలో చంద్రబాబు సమర్పించారు. అంతకుముందు యాగశాల చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేశారు. ఇక యాగం గురించి చంద్రబాబుకు సీఎం కేసీఆర్ వివరించారు. 

చంద్రబాబును సన్మానించిన కేసీఆర్..

మెదక్ : అయిత చండీయాగంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సన్మానించారు. అమ్మవారి ప్రతిమను అందించారు. వారితో పాటు డిప్యూటి సీఎం కేఈ, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సుజనా చౌదరీలను కూడా సన్మానించారు. 

11:16 - December 27, 2015

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎర్రవెల్లికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయిత చండీయాగం చివరి రోజున ఆయన పాల్గొన్నారు. బాబుకు మంత్రి హరీష్ రావు స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. యాగస్థలం వద్ద బాబుకు కేసీఆర్ పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుండి చీర, పసుపు, కుంకుమను బాబు తీసుకెళ్లారు. అనంతరం బాబు యాగస్థలి చుట్టూ ప్రదిక్షణలు చేశారు. చంద్రబాబు వెంట డిప్యూటి సీఎం కేఈ, ఎంపీ సుజనా చౌదరి, మంత్రి గంటా శ్రీనివాసరావులున్నారు.
మరోవైపు యాగస్థలంలో హోమ గుండాల నుండి పొగ రావడంతో రుత్విజ్జులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగకు తాళలేక రుత్విజ్జులు బయటకు వెళ్లిపోయారు. దీనితో పొగ వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు సూచనలు చేశారు. స్వయంగా మంత్రి హరీష్ రావు మైక్ లో పలు సూచనలు చేశారు. 

జనవరి 16న స్టార్ట్ అప్ ఇండియా..స్టాండప్ ఇండియా - మోడీ..

ఢిల్లీ : వచ్చే నెల జనవరి 16న స్టార్ట్ అప్ ఇండియా..స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. నరేంద్ర మోడీ మొబైల్ ఆప్ ద్వారా ప్రజలు పలు విషయాలు వెల్లడించవచ్చన్నారు. 

బాబుకు స్వాగతం పలికిన కేసీఆర్..

మెదక్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎర్రవెల్లికి చేరుకున్నారు. యాగస్థలం వద్ద బాబుకు సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట డిప్యూటి సీఎం కేఈ, ఎంపీ సుజనా చౌదరి, మంత్రి గంటా శ్రీనివాసరావులున్నారు. 

డీకే అరుణ..జడ్పీ ఛైర్మన్ మధ్య వాగ్వాదం..

మహబూబ్ నగర్ : గద్వాల పోలింగ్ కేంద్రం వద్ద డీకే అరుణ, జడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

నకిలీ పాస్ పుస్తకాల కేసు సీఐడీకి అప్పగించడం లేదు - డీజీపీ..

అనంతపురం : నకిలీ పాసుపుస్తకాల కేసు సీఐడీకి అప్పగించడం లేదని పోలీసు శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని డీజీపీ రాముడు పేర్కొన్నారు. 

ఎర్రవెల్లికి చేరుకున్న బాబు..

మెదక్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు ఎర్రవెల్లికి చేరుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుండి చీర, పసుపు, కుంకుమను బాబు తీసుకెళ్లారు. బాబు వెంట డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి కూడా ఉన్నారు. 

10:33 - December 27, 2015

దేశంలో ఇంటర్నెట్ వాడకం పెరుగుతోంది. 2019 నాటికి ప్రతొక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుందని అంచనా. ఇప్పుడు దేశంలో ఒక కొత్త ఉద్యమం సాగుతున్నది. ఇంటర్నెట్ స్వేచ్ఛను ఆ ఉద్యమం కాంక్షిస్తున్నది. సర్వీస్ ప్రొవైడర్లకు లాభం కల్గిస్తూ.. వినియోగదారులకు నష్టం కల్గించే నెట్ న్యూట్రాలిటీ తొలగింపు పై లక్షల సంఖ్యలో మెయిల్స్ కేంద్ర ప్రభుత్వ ఐటీ విభాగాన్ని ముంచెత్తుతున్నాయి! నెట్ న్యూట్రాలిటీ చట్టం కావాలని కాంగ్రెస్ పేర్కొంది. నెట్ ప్రోవైడర్లు సమానత్వం పాటించడం లేదనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇంతకీ ఈ నెట్ న్యూట్రాలిటీ అంటే ఏమిటి? అనే అంశంపై సిద్దార్థ్ (ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఆఫ్ స్వేచ్ఛ) విశ్లేషించారు. ఎలాంటి విశేషాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి. 

10:24 - December 27, 2015

రంగారెడ్డి : రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మొత్తం 48 మంది ఓట్లు ఉంటే కేవలం ఉదయం పది గంటల వరకు కేవలం ఆరుగురు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట్లు కొనుగోలు చేసేందుకు పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటు రూ.6 లక్షలు పలుకుతున్నట్లు సమాచారం.
జిల్లాలో జరుగుతున్న రెండు సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. డాక్టర్ ఎ.చంద్రశేఖర్ (కాంగ్రెస్), పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్), బుక్క వేణుగోపాల్ (టిడిపి), సుంకరి రాజు (టీఆర్ఎస్), అశోక్ కొత్త (స్వతంత్ర). జిల్లాల్లో మొత్తం 771 మంది స్థానిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 347 మంది ఉండగా, మహిళా ఓటర్లు 424 మంది ఉన్నారు. దీనితో మహిళా ఓటర్ల తీర్పే కీలకం కానుంది. 

10:20 - December 27, 2015

ఖమ్మం : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు బారులు తీరారు. ఐడీ కార్డు చూపించిన అనంతరం పోలింగ్ కేంద్రంలోకి అనుమతినిస్తున్నారు. ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 726 సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికార పార్టీ తరపున బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఐ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు, వైసీపీ అభ్యర్థిగా లింగాల కమల్ రాజ్ పోటీలో ఉండడంతో ఎన్నిక తప్పనిసరిగా మారింది. మంత్రిగా సేవలందిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు పార్టీ అభ్యర్థి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు సీపీఐ అభ్యర్థిగా బరిలో ఉన్న పువ్వాడకు సీపీఎం, కాంగ్రెస్, టి.టిడిపి మద్దతిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓటర్లను కాపాడుకోవడం కోసం పార్టీలు క్యాంపులు నిర్వహించారు. గత 20 రోజులుగా ఉంచిన శిబిరాల్లో ఉంచిన ఓటర్లను నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఒక్కో ఎంపీటీసీ రూ. లక్ష నుండి ఐదు లక్షల వరకు బేరసారాలు సాగినట్లు తెలుస్తోంది. 

కర్నాటకలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్..

కర్నాటక : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

నెక్లెస్ రోడ్డులో పోలీసుల తనిఖీలు..

హైదరాబాద్ : ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులో రాంగోపాల్ పేట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వేగంగా ద్విచక్రవాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. 250 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. 

ఎర్రవెల్లికి బయలుదేరిన బాబు..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎర్రవెల్లికి బయలుదేరారు. మెదక్ జిల్లాలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయిత చండీయాగంలో బాబు పాల్గొననున్నారు. 

నల్గొండలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్..

నల్గొండ : పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ పరిశీలించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలు..ఓటు వేసిన ప్రముఖులు..

హైదరాబాద్ : తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో, ఖమ్మం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయయ్య కొత్తగూడెంలో..చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికారాబాద్ లో..ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

శేషాద్రినగర్ లో ఉన్మాది వీరంగం..

చిత్తూరు : తిరుమల శేషాద్రినగర్ కాటేజీల వద్ద ఓ ఉన్మాది గదిలోకి దూరి భక్తులపై దాడికి యత్నించారు. పోలీసుల రాకతో చనిపోతానని బెదిరించాడు. అనంతరం పోలీసులు ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారు. 

ఓటు వేసిన ఎంపీ జితేందర్ రెడ్డి..

ఖమ్మం : కొత్తగూడెంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ లో ఎంపీ జితేందర్ రెడ్డి ఓటు వేశారు.

08:35 - December 27, 2015

ఖమ్మం : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అధికార పార్టీ తరపున బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఐ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు, వైసీపీ అభ్యర్థిగా లింగాల కమల్ రాజ్ లు పోటీలో ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. సీపీఐ అభ్యర్థిగా పోటీలో ఉన్న పువ్వాడ సీనియర్ నేత. పెద్దల సభకు మరోసారి అడుగుపెట్టాలన్న భావనతో సీపీఎం, కాంగ్రెస్, టి.టిడిపి ఆయనకు మద్దతినిస్తున్నాయి. జిల్లాలో ఎమ్మెల్సీ గెలుపు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో పార్టీల అధినేతల స్థాయిలోనూ చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 726 మంది ఓటర్లున్నారు. జిల్లా వ్యాప్తంగా 4 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 30వ తేదీన ఖమ్మంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. 

08:31 - December 27, 2015

రంగారెడ్డి : జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 26 మంది పోలింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి వచ్చిన జిల్లా ఎన్నికల పరిశీలకులు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.~ జిల్లాల్లో జరుగుతున్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. డాక్టర్ ఎ.చంద్రశేఖర్ (కాంగ్రెస్), పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్), బుక్క వేణుగోపాల్ (టిడిపి), సుంకరి రాజు (టీఆర్ఎస్), అశోక్ కొత్త (స్వతంత్ర). జిల్లాల్లో మొత్తం 771 మంది స్థానిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 347 మంది ఉండగా, మహిళా ఓటర్లు 424 మంది ఉన్నారు. దీనితో మహిళా ఓటర్ల తీర్పే కీలకం కానుంది. 

08:26 - December 27, 2015

మహబూబ్ నగర్ : ఓటర్లు 1,260 మంది..అభ్యర్థులు ఐదుగురు..స్థానాలు రెండు..ఇదీ ఎమ్మెల్సీ ఎన్నికల సూక్ష్మరూపం. ఒకటో ఓటుతో అధిక్యత సాధిస్తే ఒక అభ్యర్థి..అదే ఓటుతో అధిక్యత సాధించినా మరో అభ్యర్థి ఎన్నికకానున్నారు. అధిక్యత తగ్గితే ద్వితీయ ప్రాధాన్యత ఓటు పరిగణలోకి వస్తుంది. అందుకే ఓటర్లు తెలివిగా ఓటు వేయాల్సినవసరం ఉంది. పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను గెలిపించుకొనేందుకు ఓటర్లకు తర్ఫీదునిచ్చి మరీ రంగంలోకి దింపుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ఉండేందుకు పోలింగ్ సిబ్బందికి తగు శిక్షణనిచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాల ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
రెండు స్థానాల్లో ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో అన్ని పార్టీలు నిశితంగా దృష్టి సారించాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, పుర వార్డు సభ్యుల ఓట్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లను సక్రమంగా వినియోగించుకొనేందుకు ప్రణాళికలు వేసుకున్నాయి. రెండు స్థానాల్లో జగదీశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలను గెలిపించుకొనేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తమ పార్టీ ఓట్లతో పాటు టిడిపి, బీజేపీ ఓటర్లు కూడా ప్రాధాన్య ఓటు వేస్తారని పేర్కొంటున్నారు. టిడిపి అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డి సైతం కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి సహకారం లభిస్తుందని బీజేపీ ఓటు తోడై గెలిపిస్తుందని భావిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి కూడా రంగంలో ఉన్నారు.

 

08:25 - December 27, 2015

నల్గొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా కీలకంగా మారింది. ఇక్కడ తామే గెలుస్తామని అధికారపక్షం, కాంగ్రెస్ పక్షం పేర్కొంటోంది. ఆదివారం ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఓటర్ ఎవరూ కేంద్రానికి రాలేదు. మధ్యాహ్నం తరువాత ఓటు హక్కు వినిగించుకోవడానికి ఓటర్లు రానున్నారని తెలుస్తోంది. ఎన్నికకు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఏడుగురు డీఎస్పీలతో కేంద్ర సాయుధ బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. వంద కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేశారు. ఓటర్లకు పాస్ లు ఉంటేనే ఓటర్లను పోలింగ్ కేంద్రం లోపలికి పంపిస్తున్నారు. మొత్తం జిల్లాలో 800 పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 1110 ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఐదు రెవెన్యూ డివిజన్ లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌పై అవగాహన లేని వారు సహాయకులను నియమించుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఈమేరకు నల్లగొండలో 65 మందికి సహాయకులను అనుమతించారు. వీరందరూ నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఓటు హక్కును వినియోంచుకోవాల్సి ఉంటుంది. నల్లగొండలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు వ్యూహ ప్రతివ్యూహాలతో తలపడుతున్నారు.

ప్రారంభమైన తెలంగాణ మండలి ఎన్నికలు..

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రంగారెడ్డిలో రెండు స్థానాలకు ఐదుగురు బరిలో ఉండగా మహబూబ్ నగర్ లో రెండు స్థానాలకు ఐదుగురు, ఖమ్మంలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు, నల్గొండలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 30 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 11గంటలు..కాలినడకన భక్తులకు ఏడు గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. 

వాయువ్య గాలులతో పెరగనున్న చలి తీవ్రత..

విశాఖపట్టణం : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరికొద్ది రోజులు కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాయువ్య దిశ నుండి వీస్తున్న గాలుల ఫలితంగా చలి పెరిగిందని, దీని ప్రభావం మరో వారం రోజుల వరకు ఉంటుందని వెల్లడించారు. 

ఎర్రవెల్లికి బారులు తీరిన ప్రజలు..

మెదక్ : జిల్లా ఎర్రవల్లికి తెల్లవారుజామునుండే భక్తులు బారులు తీరారు. అయిత చండీయాగం ఇవాళ పూర్ణాహుతితో సంపూర్ణం కానుంది. చివరి రోజు యాగశాలను దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తారు. 

07:39 - December 27, 2015

చర్మం తరచూ పొడిబారుతుంటే... ఒక టీ స్పూన్‌ తేనె, అంతే మోతాదులో నిమ్మరసం, వెజిటేబుల్‌ ఆయిల్‌లను కలిపి ముఖానికి, మెడకు పూసి పది నిమిషాలపాటు అలాగే ఉంచేయాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వెజిటేబుల్‌ ఆయిల్‌ అంటే... కొబ్బరి, వేరుశెనగ, నువ్వులు, సన్‌ ఫ్లవర్‌, సోయా... ఇలా ఏవైనా సరే, అందుబాటులో ఉన్న ఆయిల్‌ను పొడి చర్మంగలవారు తయారు చేసుకున్న ఫేస్‌ ప్యాక్‌లో వాడుకోవచ్చు. అలాగే ఒక స్పూన్‌ తేనెలో అంతే మోతాదులో పాలు కలిపి ముఖానికి అప్లయి చేసి పది నిమిషాలపాటు అలాగే ఉంచేయాలి. ఆ తరువాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తున్నట్లయితే...పొడి చర్మం కాంతి వంతంగా తయారవుతుంది.

07:37 - December 27, 2015

కాలీఫ్లవర్స్‌ ఎక్కువగా దొరికే సీజన్‌ ఇదే. దీనిలో ఆరోగ్యాన్ని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కాలీఫ్లవర్‌ను గోబీ అని కూడా అంటారు. ఇందులో రక్తాన్ని పెంచే గుణం వుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఈ ఆకులను పచ్చివిగా సలాడ్‌ రూపంలో ఆహారంగా తీసుకుంటారు. రోగులకు జబ్బుపడ్డ తర్వాత వైద్యులు గోబీ ఆకులు తినమని సూచిస్తున్నారు. కాలీఫ్లవర్‌ను లాటిన్‌ భాషలో బ్రాసికా ఓలేరేసియా వార్‌ కేపిటేటా అని అంటారు. ఇందులో విశేష గుణాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.అయితే ఈ గోబీ పువ్వులో ఇంకా ఎంతటి గుణాలు ఉన్నాయో మీరే చదవండి...

 • కాలీఫ్లవర్‌ పచ్చి ఆకులు (50 గ్రాములు) నిత్యం తీసుకుంటే దంత సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
 • ప్రతిరోజు 50 గ్రాములు పచ్చి ఆకులు తీసుకుంటే రాలిపోయిన వెంట్రుకలు తిరిగి మొలకెత్తడం ప్రారంభిస్తాయి.
 • ఉదయం పరకడుపున అరకప్పు గోబీ రసాన్ని ప్రతిరోజు తీసుకుంటే క్యాన్సర్‌ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు.అలాగే పెద్ద ప్రేవులు శుభ్రమవుతాయని వైద్యులు తెలిపారు.
 • గోబీ పచ్చి ఆకుల రసం అర గ్లాసు చొప్పున రోజుకు ఐదుసార్లు తాగితే గాయాలు నయమౌతాయి. దీని రసాన్ని గాయాలపై పూసి కట్టు కట్టడంతో గాయాలు మానుతాయని వైద్యలు చెబుతున్నారు.
 • దీనిని నెయ్యితో కలిపి ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు పేర్కొన్నారు.
 • కొలైటిస్‌ జబ్బువల్ల ప్రేగుల్లో వాపు కనపడుతుంది. ఈ జబ్బు ప్రారంభంలో రోగి తనకు ఆకలి మందగించినట్లు భ్రమపడతాడు. అనవసరంగా నిరాశలకు లోనయ్యేవారు ఈ జబ్బుకు గురౌతారని వైద్యులు పేర్కొన్నారు. వీరికి గోబీ పువ్వు బాగా పని చేస్తుంది. కాలీఫ్లవర్‌కు ఒక గ్లాసు మజ్జిగలో 1/4వ వంతు పాలాకు రసం, ఒకగ్లాసు గోబీ ఆకు రసాన్ని ప్రతి రోజు రెండు పూటలా తీసుకుంటే కొద్దిరోజుల్లోనే ఈ జబ్బు నయమౌతుందని పరిశోధకులు తెలిపారు. 
07:34 - December 27, 2015

మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నో రకాల పండ్లను తింటుంటాం. కొన్ని పండ్లు ఆయా సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. కాని అన్ని సీజన్‌లలో దొరికేపండు అరటి పండు. అందరిదకీ అందుబాటు ధరలో ఉంటుంది. చిన్నవారి నుండి పెద్ద వారికి నచ్చిన పండు. అరటిపండు సులువుగా జీర్ణమవుతుంది. అరటిపండులో చాలా రకాలున్నాయి. అరటిపండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అరటిపండుతో కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం...

 • అరటి పండులోని పొటాషియం మూత్ర పిండవ్యాధి గల వారికి ప్రమాదం ఎక్కువ చేస్తుంది.
 • ప్రతిరోజూ రాత్రి పూట అరటిపండును తినటం వల్ల మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
 • కడుపులో పుండ్లకు అరటిపండు మంచి ఔషదంలా పనిచేస్తుంది.
 • అరటిపండులో ఎక్కువగా ఐరన్‌ ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుండి విముక్తి కలుగుతుంది.
 • ఉదయం అరటిపండును తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
 • అరటి పండులో ఎక్కువగా పీచుపదార్ధం వుండటం వల్ల మలబద్దకాన్ని లేకుండా చేస్తుంది. గుండెలో మంటకీ ఈ పండు మంచి మందుగా పనిచేస్తుంది.
 • అరటి పండు గుజ్జులో కొద్దిగా తేనె కలిపి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
07:31 - December 27, 2015

అలనాటి అగ్ర నటులు ఎన్టీఆర్‌, కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ల ఫ్రెండ్‌షిప్‌ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి లేదు. వారిద్దరి స్నేహాబంధాన్ని వారి వారసులైన ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌, రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌లు కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరు వారసులు తమ తమ 25వ చిత్రాల్లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 25వ చిత్రంగా 'నాన్నకు ప్రేమతో' లో నటిస్తుండగా, పునీత్‌ రాజ్‌ కుమార్‌ 25వ చిత్రంగా 'చక్రవ్యూహ'లో నటిస్తున్నాడు. స్నేహితుడు రాజ్‌ కుమార్‌ కోరిక మేరకు కన్నడ చిత్రం 'చక్రవ్యూహ'లో ఎన్టీఆర్‌ ఓ పాట పాడటం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ సంగీత దర్శకుడు థమన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఎన్టీఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. దీంతోపాటు పునీత్‌ రాజ్‌కుమార్‌, ఎన్టీఆర్‌లతో కలిసి దిగిన ఫొటోలను 'ఇద్దరు గొప్ప నటులు కలిసి వేళ..' అంటూ పోస్ట్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు. పునీత్‌ 25వ చిత్రానికి థమన్‌ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటను సంగీత దర్శకుడు థమన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ కేవలం రెండే రెండు గంటల్లో పాటను పాడారు. 'యాదృచ్చికంగా మా ఇద్దరివి 25వ చిత్రాలే. రాజ్‌కుమార్‌ చిత్రంలో పాట పాడ్డం సంతోషంగా ఉంది' అని ఎన్టీఆర్‌ సైతం ట్వీట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

07:30 - December 27, 2015

ఏడాదంతా వరుస సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన శ్రుతిహాసన్‌ కాస్తంత రిలీఫ్‌ కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఇంగ్లాండ్‌ వెళ్ళారు. ఇంగ్లాండ్‌ ట్రిప్‌లో సీ ఫుడ్‌ని ఎక్కువగా లాగించేస్తున్నానని, మిషన్‌ డెస్ట్రాయ్ సీ ఫుడ్‌ ఏజెంట్‌ హాసన్‌ అండ్‌ హాసన్‌ రిపోర్టింగ్‌ ఫర్‌ డ్యూటీ' అంటూ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా శ్రుతిహాసన్‌ తెలిపారు. అంతేకాకుండా అక్కడ బాగా లభించే చేపలు, పీతలు, రొయ్యల్ని కడుపారా లాగించేస్తున్నానంటూ అక్కడ భోజనం చేస్తున్న సమయంలో తీసుకున్న పలు ఫొటోలను అభిమానులతో శ్రుతి పంచుకున్నారు. అక్కయ్య అను హాసన్‌తో ఈ ఇంగ్లాండ్‌ ట్రిప్‌ భలే మజానిచ్చిందని శ్రుతి చెప్పారు.

07:27 - December 27, 2015

నందమూరి బాలకృష్ణ, అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోహీరోయిన్లుగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న 'డిక్టేటర్‌' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'తమన్‌ సంగీతమందించిన ఈ చిత్రంలోని పాటలు ఇటీవల విడుదలై శ్రోతల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి. థియేట్రికల్‌ ట్రైలర్‌కు స్పందన బాగుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నందమూరి అభిమానులు బాలయ్య నుంచి ఎలాంటి సినిమాను కోరుకుంటారో ఆ అంశాలతో రూపొందిన ఈ చిత్రం కచ్చితంగా వారిని ఎంటర్‌టైన్‌ చేస్తుందని ఆశిస్తున్నాను' అని తెలిపారు.

 

07:25 - December 27, 2015

నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరోహీరోయిన్లుగా కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందించిన పాటలను అతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేసి తొలి సిడీని నాగార్జునకు అందించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ''మనం' సినిమా వచ్చిన రెండేళ్ళ తర్వాత మా అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో వస్తున్న చిత్రమిది. 'మనం' సినిమా తర్వాత నాన్నగారు మాకు దూరమైనా ఆ చిత్రంలో నటించి అందరికీ దగ్గరయ్యారు. ఆ చిత్రం పరువు నిలబెడుతుంది. అనురాగం, ఆత్మీయత, పల్లెటూరి అనుబంధాలతో నాన్నగారు సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాంటి సినిమాలకు 'హలో బ్రదర్‌' లాంటి వినోదాన్ని మిళితం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రమే ఇది. నాన్న ధరించిన పంచ, వాచి ఈ చిత్రంలో వాడాను. తెలుగు వారికి ఇష్టమైన సంక్రాంతి పండుగలా పచ్చదనం, తియ్యదనం రెండూ ఈ చిత్రంలో ఉంటాయి. అన్నపూర్ణ సంస్థ ఎప్పుడూ కొత్తవాళ్లని ప్రోత్సహిస్తుంది. మంచి కథతో నా దగ్గరకు వచ్చిన వారికి అండగా ఉంటాను. రామ్మోహన్‌ ఇచ్చిన కథను డెవలప్‌ చేసి దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఈ సినిమాను బాగా డైరెక్ట్‌ చేశాడు. అనూప్‌ అందించిన నాలుగు పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సంక్రాంతికి వస్తున్నాం, హిట్‌ కొట్టేస్తున్నాం' అని అన్నారు. 'నాగార్జునను పంచెకట్టులో చూస్తుంటే 'దసరాబుల్లోడు' చిత్రంలో నాగేశ్వరరావు గుర్తుకు వస్తున్నారు. ఆ చిత్రం కంటే ఈ సినిమా డబుల్‌ హిట్‌ కావాలి' అని రాఘవేంద్రరావు తెలిపారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ, 'ఈ చిత్రంలోని బంగార్రాజుతోపాటు నా పాత్ర అందరికీ నచ్చుతుంది. డైలాగ్స్‌ చాలా వినోదాత్మకంగా ఉంటాయి. కళ్యాణ్‌ కృష్ణ భవిష్యత్‌లో మంచి డైరెక్టర్‌ అవుతాడు' అని చెప్పారు. 'ఏఎన్నార్‌ వల్లే ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. దేవుడు నాకు నాగార్జున రూపంలో కనపడ్డారు. ఆయన అందించిన ప్రోత్సాహం మరువ లేనిది' అని కళ్యాణ్‌ కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో నాగ సుశీల, అనూప్‌ రూబెన్స్‌, నాగచైతన్య, అఖిల్‌, సుశాంత్‌, సమంత్‌, లావణ్య త్రిపాఠి, హంసానందిని, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

07:14 - December 27, 2015

హైదరాబాద్ : తెలంగాణలో అన్ని శాఖలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఆర్థికశాఖ... భారీ స్థాయిలో నిధులు అడగొద్దని సూచించింది.. అధికారులు నానా కష్టాలుపడి... కసరత్తుచేసిన కొత్త ప్రతిపాదనల్ని పక్కనబెట్టాలని కోరింది.... గత ఏడాది ప్రతిపాదనల్నే మళ్లీ సమర్పించాలని ఆదేశించింది. కొత్త బడ్జెట్‌కోసం కసరత్తు చేస్తున్న తెలంగాణ ఆర్థిక శాఖ... ఆచి తూచి అడుగులు వేస్తోంది.. భారీ కేటాయింపులు లేకుండా జాగ్రత్త పడుతోంది.. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌కోసం నెలరోజులుగా వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.. ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్‌ చంద్రతో భేటీలో ఈ వివరాలను అందించబోతున్నారు.. ఇక్కడే అధికారులకు చుక్కెదురవుతోంది.

పాత ప్రతిపాదనల్నే సమర్పించాలని ఆదేశం..
2016-17 బడ్జెట్‌లో నీటి పారుదల రంగానికి 25 వేల కోట్లు నేరుగా కేటాయించాలని గతంలో ఆదేశించారు సీఎం కేసీఆర్‌.. మిగతా శాఖల లెక్కలుకూడా కలుపుకున్న ఆర్థిక శాఖ... కొత్త ప్రతిపాదనలు అవసరం లేదని తేల్చింది. గత ఏడాది ప్రతిపాదనల్ని పంపితే సరిపోతుందని క్లారిటీ ఇచ్చింది. తప్పనిసరైతే గతసారికంటే ఈసారి నిధులు తగ్గించి ఇస్తామని చావు కబురు చల్లగా చెప్పింది. బడ్జెట్‌ కసరత్తులోభాగంగా రోజుకు కొన్ని శాఖలచొప్పున దాదాపు అన్నివిభాగాల అధికారులు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శితో భేటీ అయ్యారు.. వీరందరికీ పాత ప్రతిపాదనల్నే సమర్పించాలని ప్రదీప్‌ చంద్ర సూచించినట్లు సమాచారం.

ఆశించిన స్థాయిలో ఆదాయం లేదు..
కొన్ని ఇబ్బందులవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. అలాగే ఈసారి మిషన్ కాకతీయ, మిషన్ భగీరధతో పాటు గృహ నిర్మాణ శాఖకు భారీగా నిధులు కేటాయించాల్సిఉంది. సంక్షేమ, మున్సిపల్ శాఖకు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని ఇప్పటికే సీఎం స్పష్టం చేసారు. మరోవైపు రుణమాఫీ కోసం 4 వేల 250 కోట్ల నిధులు కావాలి. వీటికిపోను మిగిలిన డబ్బును అన్ని శాఖలకు సర్దాల్సిఉంటుంది.. అటు ఆశించిన స్థాయిలో ఆదాయం లేదు.. భూముల అమ్మకం, క్రమబద్దీకరణ అంతంతమాత్రంగా ఉంది.. కేంద్ర నిధుల్లోకూడా కోత పడింది.. కేంద్ర పథకాల అమలు భారంగా మారింది.. అప్పుల పరిమితి పెంచేందుకు కేంద్రం ఒప్పుకోలేదు. ఇలా సమస్యలన్నీ ఒకేసారి రావడంతో నిధులకు కష్టమైపోయింది. ఉన్నదాంట్లోనే సర్దితేతప్ప ఈసారి బడ్జెట్‌ గట్టెక్కేలాలేదని ఆర్ధిక శాఖ అధికారులు అంచనావేశారు. అందుకే ఈ కొత్త ప్లాన్‌ అమల్లోకి తెచ్చారని సమాచారం. నిధులు తగ్గించడమేకాదు రెవెన్యూ పెంచుకోవడంపైకూడా వివిధ శాఖలకు టార్గెట్లు విధిస్తోంది ప్రభుత్వం. పన్నుల వసూలుతోపాటు. చెక్‌పోస్టులను బలోపేతం చేయాలని.. బకాయిదారులపై కఠిన చర్యలకు రెడీ అవుతోంది. మొత్తానికి ఇప్పుడు ఆర్థికశాఖ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యలా మారింది.. ఇలా అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్న ఈ బడ్జెట్‌ ఎంతమందిని సంతృప్తి పరుస్తుందో వేచి చూడాలి.

07:07 - December 27, 2015

చినిగిన చొక్కా అయినా తొడుక్కో ఒక్క మంచి పుస్తకం కొనుక్కో ..అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ కంప్యూటర్ యుగంలో ఇంటర్ నెట్ లు, బ్లాగులు, ఫేస్ బుక్ లు ఎన్నో అందుబాటులోకొచ్చాయి. అయినా పుస్తకాలకున్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇదే విషయాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిరూపించింది. తెలంగాణా కళాభవన్ లో ఈ నెల 18 నుండి 27 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరిగింది. సమీక్షా కథనం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:05 - December 27, 2015

దళిత అస్తిత్వవాదం తెలుగులో డ్రైవింగ్ ఫోర్సుతో ప్రవేశించింది. ఎందరో దళిత కవులు రచయితలు తమ కలాలకు పదును పెట్టారు. బలమైన అభివ్యక్తితో కవితా సంపుటాలు వెలువరించారు. అలాంటి వారిలో ఖడ్గచాలనం, శబ్దధనువు లాంటి కవితా సంకలనాలు వెలువరించిన ధనుంజయ ఒకరు. అన్వేషి పేరుతో దళిత స్పృహతో అద్భుత కవిత్వం రాస్తున్న ధనుంజయ పరిచయ కథనం నేటి కొత్తకెరటాల్లో. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.
 

07:03 - December 27, 2015

ప్రజలకు విజ్ఞానాన్ని వినోదాన్ని పంచేది సాహిత్యం. పశుత్వం కలిగిన హృదయాలను సంస్కరించి మానవత్వం వైపు నడిపించేది సాహిత్యం. ఒక్కమాటలో చెప్పాలంటే... హితం చేకూర్చేది సాహిత్యం. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారిలో ప్రముఖ నటుడు, కవి, సాహితీ సహృదయుడు, స్నేహశీలి రంగనాథ్ ఒకరు. ఇటీవల కన్నుమూసిన రంగనాథ్ ప్రత్యేక కథనం. రంగనాథ్..ఈ పేరువింటేనే పంతులమ్మ, అమెరికా అమ్మాయిలాంటి సినిమాలే గుర్తొస్తాయి. 70 వదశకంలో చలన చిత్రరంగంలో హీరోగా ఒక వెలుగు వెలిగిన ఆయన తర్వాతకాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చివరికి కవిగా ఒక తాత్వికునిగా మిగిలిపోయారు. భార్య మరణంతో ఒంటరితనంతో పోరాటం చేస్తూ తీవ్ర మానసిన వేదన అనుభవించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. 

06:59 - December 27, 2015

ఢిల్లీ : పకడ్బందీగా ప్లాన్, ఉన్నతాధికారుల చర్చలు, వ్యూహాలతో చివరకు తయారయ్యే షెడ్యూల్‌.. ఇలాంటివన్నీ ఒక దేశ అధినేత, లేదా ప్రధాని విదేశాల్లో పర్యటించేవేళ తయారవుతాయి. భారత్‌లాంటి పెద్ద దేశ ప్రధాని ఏ దేశానికి వెళ్లేముందైనా ఉన్నతస్థాయి అధికారులు రకరకాల చర్యలు తీసుకుంటారు. కానీ ఇవేవీ లేకుండా ప్రధాని మోడీ దాయాది దేశం పాక్‌లో షడన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ దేశ ప్రధానితో సమావేశమై ఇండియాకు తిరిగొచ్చారు. ఈ హఠాత్‌ పర్యటనపై ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా చర్చ జరుగుతోంది.

మోడీ టూర్‌పై పాక్‌ ప్రతిపక్షాల ప్రశంసలు..
మోడీ పాక్‌కు వెళ్లి చర్చలు జరపడం వెనక కొందరు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు చేకూర్చే దురుద్దేశముందంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తోంది. అయితే పాక్‌ ప్రతిపక్షాలు మోడీ చర్యను ప్రశంసిస్తున్నాయి. ఇది ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన ఆరంభమని ఇరు దేశాల సంబంధాల మెరుగుదలకు సాయపడతాయని అభిప్రాయపడ్డాయి. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ మోడీ పర్యటనను సమర్థించింది. పాక్‌ ప్రతిపక్ష నేత సయ్యద్‌ ఖుర్షీద్‌షా హర్షం వ్యక్తం చేశారు. తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ కూడా ప్రధాని పర్యటనను సమర్ధించారు. ఇరు దేశాల సంబంధాలు బలపడేందుకు ఇదో ఆరంభమని అవామీ నేషనల్‌ పార్టీ నాయకుడు జహీద్‌ ఖాన్‌ అన్నారు.

మోడీపై బాన్‌కీమూన్‌ ప్రశంసలు..
అగ్రదేశాలైన అమెరికా, చైనా, బ్రిటన్‌ దేశాలు పాక్‌లో మోడీ పర్యటనను స్వాగతించాయి. ఇరుదేశాల ప్రధానుల సమావేశం శాంతికి, అభివృద్ధికి బాటలు వేస్తాయని ప్రశంసించాయి. అంతేగాక ఆసియాకూ లాభం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డాయి. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌ కీమూన్‌ కూడా మోడీ చర్యపై ప్రశంసలు కురిపించారు. దక్షిణాసియాలో శాంతికి, ఇతర అనేక ప్రయోజనాలకు భారత్‌ పాక్‌ దేశాల సమావేశం సహకరిస్తుందని ఆసియాలోని అగ్రదేశం చైనా అభిప్రాయపడింది. ఇక భారత్‌, పాక్‌ల మధ్య ఎప్పటినుంచో నలుగుతున్న కాశ్మీర్‌లోనూ వివిధ పార్టీలు మోడీ టూర్‌పట్ల సానుకూలంగా స్పందించాయి. ఇరు దేశాలు సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లడాన్ని స్వాగతిస్తున్నామని, ఇప్పటివరకూ జరిగిన ద్వైపాక్షిక సంబంధాల్లో కొంత క్లారిటీ లోపించినా దాన్ని సరిచేసుకోవాలని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా అన్నారు. మొత్తమ్మీద భారత్‌ పాక్‌ స్నేహపూర్వక చర్చల పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

సోమవారం వేమువల వాడకు సీఎం కేసీఆర్..

మెదక్ : అయిత చండీయాగం ముగిసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేముల వాడ పర్యటనకు వెళ్లనున్నారు. రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. 

06:42 - December 27, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలపై చలి ఒక్కసారిగా పంజా విసిరింది. ఇరు రాష్ర్టాల్లో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు చలికి గజగజా వణికిపోతున్నారు. కొన్ని జిల్లాలో కేవలం ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదుకావడంతో..ఇళ్లల్లోంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఉత్తర, ఈశాన్య భారత్ నుంచి వీస్తున్న చలిగాలులే కారణమని వాతావరణ నిపుణులంటున్నారు. ఇరు రాష్ర్టాల్లో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు చలికి గజగజా వణికిపోతున్నారు. కొన్ని జిల్లాలో కేవలం ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదుకావడంతో..ఇళ్లల్లోంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఉత్తర, ఈశాన్య భారత్ నుంచి వీస్తున్న చలిగాలులే కారణమని వాతావరణ నిపుణులంటున్నారు. యింది. చలి పులి పంజావిసరడంతో తెలుగు రాష్ట్రాలు గజగజా వణికిపోతున్నాయి. ఉత్తర దిశనుంచి వీస్తున్న శీతల గాలులతో ప్రజలు గజగజలాడుతున్నారు.

నగరంపై చలి పంజా..
హైదరాబాద్ నగరంపై చలిపులి పంజా పంజా విసిరింది. నగర శివారు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధానమార్గంతో పాటు..హైదరాబాద్-బెంగళూరు హైవే, ఔటర్ రింగ్ రోడ్‌ను సైతం మంచు దుప్పటి కమ్మేసింది. ఊటీని తలపించేలా కమ్ముకున్న తెల్లని మంచు తెరలను చూసి ప్రకృతి ప్రేమికులు ఏంజాయ్ చేస్తుంటే..వాహనదారులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.

ఆదిలాబాద్..ఖమ్మంలో..
ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క సారిగా ఉష్ణోగ్రత లు పడిపోయాయి. ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండడంతో..జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 6.3 డిగ్రీలకు పడిపోయింది. దీంతో జిల్లాలోని వృద్దులు, పిల్లలు చలిదెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. ఎముకలు కొరికేలా వీస్తున్న చల్లటిగాలులతో గజగజా వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉట్నూర్, ఇంద్రవెల్లి, జైనూరు, నార్నూర్ మండలాల్లో నమోదవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలతో గిరిజనులు ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. ఉదయం 11 గంటలు దాటితేగాని ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇక ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి ఆలయం మంచుతెరల మధ్య సరికొత్త సోయగాన్ని సంతరించుకుంది. సూర్యకిరణాలతో గలగలా పారే గోదావరి నదీతీరం, బాపు బొమ్మలు మంచు సోయగాలతో ప్రకృతిని మరింతగా రంజింపచేస్తుంది. మంచుతెరల మధ్య గోదావరి అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. భద్రాచలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో చలి తీవ్రతకు భక్తులు, స్థానికులు వణికిపోతున్నారు. చలినుంచి కాపాడుకునేందుకు చలిమంటలతో కాస్తా ఉపశమనం పొందినా..ఆ తర్వాత మళ్లీ చలిగాలులు వీస్తుండడంతో ఇళ్లనుంచి బయటకురాలేకపోతున్నారు.

మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు..
అటు విశాఖ మన్యంలో చలిగాలుల తీవ్రత పెరగడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరులో 8, చింతపల్లిలో 9, మినుములూరులో 6, లంబసింగిలో 7, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు ఏజెన్సీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాగల 48 గంటల్లో మరింత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. శీతల గాలులతో పాటు చలి మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. మరోవైపు ఒక్కసారిగా చలిగాలులు పెరగడంతో అస్తమా రోగులు, వృద్దులు, చిన్నపిల్లలు , గర్బిణీలు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వెట్టర్లు, జర్కిన్లు, మఫ్లర్‌లు, మంకీక్యాప్‌లకు గిరాకి పెరగడంతో దాకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. 

06:40 - December 27, 2015

హైదరాబాద్ : సోషల్‌ నెట్ వర్కింగ్‌ సైట్ల ద్వారా ఐసీస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు పెట్టుకున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా దేశ సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు నాగ్‌పూర్‌లో పట్టుకున్నారు. పట్టుబడ్డ యువకులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. వీరి ద్వారా హైదరాబాద్‌లో ఇంకెవరైనా ఐసిస్‌ మద్దతుదారులు ఉంటే వారిపై పోలీసులు ఫోకస్‌ చేసే అవకాశముంది. హైదరాబాద్‌ నుంచి నాగపూర్‌ వెళ్లి అక్కడి నుంచి శ్రీనగర్‌ మీదుగా సరిహద్దులు దాటేందుకు వీరు ప్రయత్నించారు. సకాలంలో ఈ సమాచారం అందడంతో హైదరాబాద్‌ పోలీసులు నాగపూర్‌లోని యాంటీ టెర్రరిస్ట్‌ స్వాడ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పక్కా సమాచారంతో నాగపూర్‌ విమానాశ్రయంలో మాటు వేసిన నాగపూర్‌ ఎటిఎస్‌ పోలీసులకు ముగ్గురు యువకులు చిక్కారు. వారిని హైదరాబాద్‌కు తీసుకురావడానికి పోలీసుల బృందం వెళ్లింది.

అకర్షితులవుతున్న యువకులు..
హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ వాసిం, ఒమర్‌ హాసిన్‌ ఫారుఖీ, మజ్‌ హాసన్‌లు ఐసీస్‌ పట్ల ఆకర్షితులైనట్లు సమాచారం. వీరంతా సిరియాలోని ఐసీస్‌ ఉగ్రవాద సంస్థలో చేరాలని నిర్ణయించుకున్నారు. గతంలో సల్మాన్‌ మెయినుద్దీన్‌, నిక్కీ జోసఫ్‌లు పట్టుపడిన తరువాత పోలీసులు వీరి నుంచి కీలక సమాచారం సేకరించారు. ఇందులో భాగంగానే వీరిపై నిఘా ఉంచారు. కొంతకాలంగా కనిపించకుండా పోవడంతో గాలింపు చేపట్టారు.

కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు..
ముగ్గురు యువకుల తల్లిదండ్రులకు వీరు ఐసీస్‌లో చేరేందుకు వెళుతున్నట్లు సమాచారం ఇవ్వలేదు. మూడు వేర్వేరు పోలీసు స్టేషన్లలో యువకుల మిస్సింగ్‌ కేసులు నమోదు అయ్యాయి. గతంలో కూడా దేశ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించిన ఇంజనీరింగ్‌ విద్యార్థులను పోలీసులు అదుపులో తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థలు హైదరాబాద్‌ యువతపై దృష్టి సారించడంతో ఎక్కువ మంది ఇక్కడి నుంచి సిరియా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

06:37 - December 27, 2015

విజయవాడ : ఒకప్పుడు అక్కడ రౌడీయిజం రంకెలేసింది. రౌడీయిజానికి రాజకీయం తోడయ్యాక.. కలర్‌ మార్చింది. అయినా కాలరెగరేయడం మాత్రం మానలేదు. ఫ్లాష్‌బ్యాక్‌ గుర్తొచ్చినప్పుడల్లా అటాకింగ్‌ మూడ్‌ వస్తూనే ఉంది. ఆవేశాన్ని రాజకీయం కవర్‌ చేస్తూ వస్తోంది. ఇప్పుడు పాలిటిక్స్‌ వాటంగా ఉండటంతో పగకు పగ్గాలు లేకుండా పోతోంది. మాటలు మండుతున్నాయి. చూపులతోనే తూటాలు పేల్చేస్తున్నారు. వార్‌ మూడ్‌కొచ్చిన లీడర్స్‌ను చూసి జనం మాత్రం టెన్షన్‌ పడుతున్నారు. డిసెంబర్‌ 26. ఓ ఎమ్మెల్యే హత్య రాష్ట్రాన్ని కుదిపేసింది. కోస్తా జిల్లాలను అల్లకల్లోలం చేసింది. ఆ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు. ఆయన ఓ సామాజికవర్గానికి నేతగా ఎదగటంతో.. ఆయన హత్య తర్వాత కూడా అవే ప్రకంపనలు పుట్టాయి. అల్లర్లు చెలరేగాయి. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలైతే అట్టుడికిపోయాయి. దాదాపు నెలకు పైనే కర్ఫ్యూలో బతకాల్సి వచ్చింది. అందుకే ఈ తేదీ రాగానే బెజవాడవాసులు నాటి ఉద్రిక్త పరిస్ధితులను గుర్తు చేసుకుంటారు. రంగా కేసులో నిందితుడుగా నెహ్రూ ఉన్నారు. అప్పటికే ఆ రెండు వర్గాల మధ్య ఏళ్ల తరబడి కక్షలు చెలరేగాయి.

మారిన రాజకీయం..
రంగా హత్య తర్వాత రాజకీయం మారింది. ఆయన భార్య రత్నకుమారి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచినా.. తర్వాత టీడీపీలోకి వెళ్లటం.. ఎన్టీఆర్‌ చనిపోయాక నెహ్రూ బాబుతో చేరకుండా కాంగ్రెస్‌లోకి వెళ్లటం జరిగింది. రంగా కుమారుడు వంగవీటి రాధా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకే పార్టీలోనే ఈ రెండు కత్తులు ఇమిడిపోయాయి. ఇప్పుడు మళ్లీ రాజకీయం మారింది. రాధాకృష్ణ వైసీపీలోకి వెళితే.. నెహ్రూ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. నెహ్రూ కూడా వైసీపీ ఎంట్రీకి ప్రయత్నించారనే వార్తలు కూడా వచ్చాయి. కేవలం రాధాకృష్ణ వ్యతిరేకతతోనే అది ఆగిపోయిందని కొందరు.. ఆగలేదు త్వరలో అది జరుగుతుందని మరికొందరు చెప్పుకుంటున్నారు.

రెచ్చిపోయిన నెహ్రూ..
కాల్‌మనీ మళ్లీ వీరిద్దరి మధ్య పగను రెచ్చగొట్టినట్లయింది. కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు నిందితుడిగా ఉండటం.. టీడీపీ నేతలనేకమంది కాల్‌మనీ కేసులో నిందితులుగా ఉండటంతో.. నెహ్రూ వారందరిపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. అదే టైమ్‌లో ఆయన రంగా హత్య కేసులో నిందితుడని టీడీపీవారు గుర్తు చేయడం.. రంగా గురించి నెగెటివ్‌గా నెహ్రూ మాట్లాడటం జరిగిపోయింది. ఇప్పుడదే వివాదం అయింది. డిసెంబర్‌ 26 రంగా వర్ధంతి సందర్భంగా రాధా నెహ్రూకు కౌంటర్‌ ఇచ్చారు. అది కూడా చాలా ఎమోషనల్‌గా. మరి ఇప్పుడు బెజవాడను మళ్లీ ఆ పాత పగలు చుట్టుముట్టి రక్తసిక్తం చేస్తాయో.. రాజకీయ అవసరాలు ఆ పగలను కప్పేస్తాయో.. వేచి చూడాల్సిందే.

06:34 - December 27, 2015


హైదరాబాద్‌ : బేగంపేటలో రాత్రివేళ ఓ యువకుడి హత్య కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగా ముగ్గురు దుండగులు యువకుడిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి హత్యచేశారు. హైదరాబాద్‌లో ప్రకాష్‌నగర్‌కు చెందిన రియల్టర్‌ రియాజ్‌ఖాన్‌ బైక్‌పై వస్తుండగా వెనకనుంచి దుండగులు మరో బైక్‌పై అనుసరించారు. తన స్నేహితుడికి చెందిన డయాగ్నోస్టిక్‌ ఎదుట బైక్‌ దిగుతుండగా వారు కత్తులతో దాడి చేశారు. అడ్డుకోబోయిన స్థానికులను బెదిరించి బైక్‌లపై పరారయ్యారు. అయితే నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. కామత్‌ లింగపూర్‌లోని అత్యంత విలువైన ఎకరం భూమికి సంబంధించి ఈ హత్య జరిగినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్‌ టీమ్స్‌ ఆధారాలు సేకరించాయి.

06:32 - December 27, 2015

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాల మాస్టర్‌ ప్లాన్‌ను మార్పు చేర్పుల అనంతరం సిఆర్‌డిఎ రిలీజ్‌ చేసింది. దీనికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే వాటిని 30 రోజుల్లోపల వెల్లడించవచ్చు. దీనికి సంబంధించి శనివారం రాత్రి పబ్లిక్‌ ప్రకటన జారీ చేసింది. జులై 20న సింగపూర్‌ అందించిన మాస్టర్‌ ప్లాన్‌ను సవరించాలంటూ కొన్ని సవరణలు, సూచనలు అందాయి. ప్రభుత్వం కూడా కొన్ని మార్పు చేర్పులు చేసింది. వాటన్నిటినీ దృష్టిలోపెట్టుకుని మాస్టర్‌ ప్లాన్‌లో సిఆర్‌డిఎ సవరణలు చేసింది. సవరణల అనంతరం ఆ ప్లాన్‌పై అభ్యంతరాలు కోరుతూ వెబ్‌సైట్‌లో ఉంచారు. రాజధాని పరిధిలోని సహజ వనరులు, పర్యావరణం, చెరువులు, తదితరాలన్నిటినీ రక్షిస్తూ అమరావతి నగర నిర్మాణం జరగనుంది. మొత్తం నగర పరిధిని 8 జోన్లుగా విభజించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వెడల్పు 75 మీటర్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు 150 మీటర్ల వెడల్పు ఉంటుంది. మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌ ఏర్పాటులాంటి ఎన్నో అంశాలు నూతన రాజధాని నగరంలో ఉండబోతున్నాయి. 

06:31 - December 27, 2015

హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నాలుగు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్‌ జరగనుంది. అధికారులు ఇప్పటికే ఎన్నికల సరంజామాను పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఓటర్లకు గుర్తింపు కార్డులనూ పంపిణీ చేసేశారు. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. జెడ్పీ కార్యాలయంలో పోలింగ్‌ జరిపే గత సంప్రదాయానికి భిన్నంగా... ఈసారి ఆర్డీవో కార్యాలయాలను పోలింగ్‌ కేంద్రాలుగా వినియోగించుకోనున్నారు. నాలుగు జిల్లాల్లోని పోలింగ్‌ కేంద్రాలకు.. బ్యాలెట్‌ పేపర్లు, బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీని అధికారులు ఇప్పటికే ముగించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

144 సెక్షన్..
పోలింగ్‌ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లూ జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ప్రతి ఓటూ ఎంతో కీలకం కావడంతో.. పోలింగ్‌ విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సమగ్ర శిక్షణనిచ్చారు. ఇప్పటికే రెండు సార్లు మాక్ పోలింగ్, కౌంటింగ్ నిర్వహించారు. పోలింగ్‌ సరళిని అనుక్షణం పర్యవేక్షించేందుకు వీలుగా.. వెబ్‌ కెమరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు.. ఇద్దరేసి ప్రైవేటు వీడియోగ్రాఫర్లను నియమించారు. సెల్‌ఫోన్‌లు, పెన్నులు, పెన్సిళ్లనూ అనుమతించడం లేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా.. పోలింగ్‌ ఆగకుండా.. పోలీసు యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంది. పోలింగ్ జరిగే జిల్లాల్లో ఇప్పటికే 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద.. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రం వద్ద డీఎస్పీలతో పాటు ఇద్దరి నుంచి నలుగురు వరకూ సీఐలు.. ఎస్సైలు, అదనపు పోలీసులు భద్రత విధుల్లో పాల్గొంటారు.

కీలకంగా మారిన ఖమ్మం, నల్గొండ..
పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పాలమూరులోని రెండు స్థానాలకూ టీఆర్ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌, టీడీపీలు చెరో స్థానానికి పోటీ పడుతున్నాయి. ఇక్కడ మొత్తం 1262 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అటు రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు పాలక, ప్రతిపక్షాలకు చెందిన నలుగురు, ఓ ఇండిపెండెంటు అభ్యర్థీ బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తం 771 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం, నల్లగొండ జిల్లాలు అత్యంత కీలకంగా మారాయి. ఖమ్మం జిల్లాలో 726 మంది, నల్లగొండ జిల్లాలో 11 వందల పది మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రెండు స్థానాల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్ర బలగాలనూ రంగంలోకి దించారు. ఇంకోవైపు.. పోలింగ్‌పై అవగాహన లేని వారు సహాయకులను నియమించుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఈమేరకు, పాలమూరులో 58 మందికి, నల్లగొండలో 65 మందికీ సహాయకులను అనుమతించారు. వీరందరూ నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది.
కీలక స్థానాలకు సంబంధించిన ఓటర్లను ఆయా పార్టీలు ఇప్పటికీ క్యాంపుల్లోనే ఉంచాయి. వీరందరినీ ఆదివారం నాడు నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కౌంటింగ్‌ ఈ నెల 30న చేపట్టి.. అదే రోజు ఫలితాలను వెలువరించనున్నారు. 

06:26 - December 27, 2015

మెదక్ : ఆద్యంతం అద్భుతంగా ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తున్న అయుత చండీయాగం చివరి రోజుకు చేరుకుంది. 23న ప్రారంభమైన ఈ యాగానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారిలో మంత్రులు, గవర్నర్లు, స్పీకర్లు తదితరులు ఎందరో ఉన్నారు. చివరి రోజున భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, తదితరులు హాజరుకానున్నారు.

భక్తులకు అన్నదానం..
గురు ప్రార్థన, గణపతి పూజ, చండీ పారాయణాలు, జగన్మాత జపహోమాలు ఇలా ఏరోజుకారోజు ప్రత్యేక కార్యక్రమాలతో చండీయాగ స్థలి వేదమంత్రాల మధ్య హోరెత్తిపోతున్నది. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి సైతం ఈ బృహత్తర కార్యక్రమానికి వేలాది మంది తరలివస్తున్నారు. యాగం చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో భక్తుల రాక మరింత పెరిగే అవకాశముంది. వచ్చిన ప్రతిఒక్కరికీ అన్నదానం చేస్తుండడం, భక్తులకు ఏ లోటూ లేకుండా చూడడంలో నిర్వాహకులు సక్సెస్‌ అయ్యారు. ఇంత అద్భుతంగా జరుపుతున్న ఈ యాగాన్ని చూసేందుకు తమకు రెండు కళ్లూ చాలడం లేదని భక్తులు అంటున్నారు.

కట్టుదిట్ట భద్రత..
యాగం జరిగినన్ని రోజులూ రుత్విజులు వివిధ రంగుల వస్త్రాల్లో పూజలు నిర్వహించారు. నాలుగో రోజున ఎరుపు వస్త్రాలు ధరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో అయుత చండీయాగశాల రక్తవర్ణమై శోభిల్లింది. తొలి రోజున పసుపు, రెండో రోజున గులాబీ, మూడో రోజున తెలుపు వస్త్రాలు ధరించి రుత్విజులు యాగంలో పాల్గొన్నారు. నాలుగో రోజున ఏకాదశ న్యాసపూర్వక చతుస్సహస్ర చండీ పారాయణం చేశారు. ఆయా వేదమంత్రాలతో యాగస్థలి మార్మోగిపోయింది. ఇక యాగానికి అతిరథ మహారథులు అంతా వస్తుండడంతో అత్యున్నత స్థాయి పోలీసు అధికారులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. చివరి రోజున ఏ ఆటంకమూ లేకుండా యాగాన్ని ముగించేందుకు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.

ఎర్రవెల్లిలోనే కేసీఆర్..
అయుత చండీయాగంలో భాగంగా నిర్వహించే క్షేత్ర పర్యటనకుగాను ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుటుంబ సమేతంగా సోమవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఐదు రోజుల యాగం తర్వాత యాగస్థలిలోనే నిద్ర చేయాలన్న నియమం మేరకు సిఎం కేసిఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, నిర్వాహకులు ఆదివారం రాత్రి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోనే నిద్ర చేస్తారు.  

తెలంగాణలో నేడు స్థానిక సంస్థల ఎన్నికలు..

హైదరాబాద్ : నేడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు జిల్లాల్లో ఆరు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రంగారెడ్డిలో రెండు స్థానాలకు ఐదుగురు బరిలో ఉండగా మహబూబ్ నగర్ లో రెండు స్థానాలకు ఐదుగురు, ఖమ్మంలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు అభ్యర్థులు, నల్గొండలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

ఎర్రవెల్లికి ఏపీ సీఎం బాబు..

మెదక్ : నేడు ఉదయం పది గంటలకు అయిత చండీయాగంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. విజయవాడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఎర్రవెల్లికి చేరుకోనున్నారు. 

అనంతపురంలో జేఎన్టీయూ స్నాతకోత్సవం..

అనంతపురం : నేడు జేఎన్టీయూ ఏడో స్నాతకోత్సవం జరగనుంది. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ డా.శేఖర్ బసు హాజరు కానున్నారు.

 

Don't Miss