Activities calendar

28 December 2015

యూరప్ పర్యటనకు రాహుల్..

ఢిల్లీ : తాను యూరప్ పర్యటనకు వెళ్లనున్నట్లు ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియచేశారు. దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

 

మేధా టవర్స్ డీ నోటిఫైపై మంత్రి వివరణ..

విజయవాడ : గన్నవరం మేధా టవర్స్ డీ నోటిఫైపై మంత్రి పల్లె రఘునాథ రెడ్డి వివరణనిచ్చారు. డీ నోటిఫై అంశం కేంద్ర పరిధిలో ఉందని, డీ నోటిఫై చేయాలని ఐటీ శాఖ నుండి రాష్ట్ర పరిశ్రమ శాఖకు ఫైలు పంపడం జరిగిందన్నారు. ఆ ఫైలును సీఎం చంద్రబాబు ఆమోదించాక కేంద్రానికి పంపుతామన్నారు.

 

కడప జైలు నుండి నలుగురు జీవిత ఖైదీల పరారీ..

కడప : కేంద్ర కారాగారం నుంచి నలుగురు జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తులు సోమవారం సాయంత్రం పరారయ్యారు. కారాగారం వెనుక వైపు ఉన్న టవర్ వద్ద నిచ్చెన వేసుకుని పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. రవి, రామచంద్ర, దేవ, హనుమంతు అనే జీవిత ఖైదీలు పారిపోయినట్లు తెలిసింది.

 

21:32 - December 28, 2015

ఢిల్లీ : కాంగ్రెస్ 131వ వ్యవస్థాపక దినోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ జండా ఎగుర వేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, ఆనంద్ శర్మ, షీలా దీక్షిత్, గులాంనబీ ఆజాద్, మనీష్ తివారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండావిష్కరణ అనంతరం పార్టీ నేతలతో సోనియా గాంధీ భేటి అయ్యారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

21:31 - December 28, 2015

ఢిల్లీ : 'కాంగ్రెస్ దర్శన్' ఇది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అధికార పత్రిక, హిందీలో ప్రచురితమయ్యే ఈ పత్రికలో వచ్చిన వ్యాసాలు ఇపుడు పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఏకంగా భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని టార్గెట్‌ చేస్తూ రాసిన ఆర్టికల్స్ పార్టీలో కలకలం రేపింది. సోనియా గాంధీ ముఖచిత్రంతో వెలువడ్డ కాంగ్రెస్‌ దర్శన్ డిసెంబర్‌ సంచికలోని ఓ వ్యాసంలో ఆమె జీవితాన్ని ప్రస్తావించారు. సోనియా తండ్రి ఇటలీ ముస్సోలిని సేనానిగా పనిచేశారని, అతనో ఫాసిస్టని పేర్కొంది. అంతేకాదు... కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న 62 రోజులకే సోనియా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారని, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని తెలిపింది. రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న 16 ఏళ్ల తర్వాత సోనియాగాంధీకి భారతీయ పౌరసత్వం వచ్చిందని ఆ పత్రిక ప్రచురించింది.

నెహ్రూ..పటేల్ ఉప్పు..నిప్పు..
డిసెంబర్ 15న పటేల్ వర్ధంతి సందర్భంగా పటేల్‌కు నివాళులర్పిస్తూ ప్రచురించిన వ్యాసం వివాదాస్పదమైంది.1950లో పటేల్ రాసిన లేఖలను ఉటంకిస్తూ...కాంగ్రెస్‌ వర్గాల సమర్థన లభించినప్పటికీ, కేవలం గాంధీజీ కోరిక మేరకే పటేల్‌ ప్రధాని కాలేక పోయారని పేర్కొంది. గాంధీజీ చెప్పడం వల్లే పటేల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడకుండా దూరంగా ఉండాల్సొచ్చిందని రాశారు. చైనా, నేపాల్, కశ్మీర్‌ విషయంలో నెహ్రూ ధోరణిని పటేల్‌ తప్పుబట్టినట్టు, పటేల్‌ సలహా పాటించి ఉంటే ఇవాళ కాశ్మీర్‌ సమస్యే ఉత్పన్నమయ్యేది కాదని ఆ ఆర్టికల్‌ వెల్లడించింది. టిబెట్‌ అంశంపై భవిష్యత్తులో ఇండియాకు చైనా పెద్ద శత్రువుగా మారనుందని పటేల్ నెహ్రూను హెచ్చరించినట్టు తెలిపింది. నెహ్రూ, పటేల్ ఉప్పు నిప్పుగా వ్యవహరించేవారని, ఓ సమయంలో వారిద్దరూ రాజీనామా చేయడానికి కూడా వెనకాడలేదని వ్యాసంలో ప్రచురించారు. 

ఎడిటర్ విచారం..
కాంగ్రెస్‌ దర్శన్‌లో వచ్చిన వ్యాసాలపై ఆ పత్రిక ఎడిటర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ విచారం వ్యక్తం చేశారు. ఇందుకు తానే బాధ్యుడనని, దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ 131వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో అధికార పత్రికలో వచ్చిన వ్యాసాలు నేతలను కంగు తినిపించాయి. అయితే ఇది ఎవరు రాశారన్నది ఆసక్తిగా మారింది. 

21:28 - December 28, 2015

కోల్ కతా : దేశంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోతోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. అన్ని రంగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి ఇదేనన్నారు. 93 శాతం మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు బేరం చేసే పరిస్థితి లేదని తెలిపారు. కార్మిక సంఘాల్లో సభ్యత్వం పొందినవారు మాత్రం తగిన వేతనం పొందగలుగుతున్నారని తెలిపారు. సిపిఎం ప్లీనం సమావేశంలో ఏచూరి ఈ వ్యాఖ్యలు చేశారు.

21:27 - December 28, 2015

ఢిల్లీ : సంచలనం సృష్టించిన దాద్రీ ఘటనలో నిజాలు వెలుగు చూస్తున్నాయి. మృతుడు అఖ్లాక్‌ ఇంట్లో దొరికింది బీఫ్‌ కాదు... మేక మాంసమేనని యుపి పశు సంవర్ధక శాఖ స్పష్టం చేసింది. అఖ్లాక్‌పై దాడి జరిగిన రోజే ఆయన ఇంట్లోని ఫ్రిజ్‌లోని మాంసాన్ని సేకరించి పరీక్షలు జరపగా అది ఆవు మాంసం కాదని తేలింది. 2015 సెప్టెంబర్‌ 28న గోమాంసం తిన్నారని, ఇంట్లో నిలువ పెట్టుకున్నారన్న పుకార్లతో దాద్రీలోని బిసాడాలో 52 అఖ్లాక్‌పై సామూహిక దాడి చేసి కొట్టిచంపిన విషయం తెలిసిందే. దాద్రీ ఘటనపై గతవారం స్థానిక బిజెపి నేత సంజయ్‌ రాణా కుమారుడు విశాల్‌ రాణా, బంధువు శివంతో పాటు 15 మందిపై యుపి పోలీసులు చార్జీషీట్‌ నమోదు చేశారు. 

21:26 - December 28, 2015

ఢిల్లీ : ఉన్నత ఆదాయ వర్గాలకు ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీపై కేంద్రం కోత విధించింది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారికి గ్యాస్‌ సబ్సిడీ ఎత్తివేసింది. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. రాయితీ ఎత్తివేత జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఆదాయ వివరాలు ప్రకటించని వారికి పన్ను చెల్లింపుల ఆధారంగా సబ్సిడీని ఎత్తివేస్తామని కేంద్రం ప్రకటించింది. 

21:24 - December 28, 2015

విజయవాడ : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే జనవరి 1 నుంచి గర్భిణీ స్త్రీల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభిస్తోందని మంత్రి అధికారులకు తెలిపారు. తల్లీ బిడ్డలను ఇంటికి క్షేమంగా చేర్చేందుకు త్వరలో 102 వాహనాలను అన్ని ప్రభుత్వాసుపత్రులలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. దాంతో పాటు వచ్చే జన్మభూమి కార్యక్రమానికి అధికారులు సిద్దంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో మెడికల్ టీంలను అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు.

21:22 - December 28, 2015

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. వేములవాడ నుంచి తిరిగి వస్తూ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌లో ఉంటున్న రాష్ట్రపతిని కేసీఆర్‌ కుటుంబ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అయుత చండీయాగం గురించి వివరించినట్లు సమాచారం. 

21:21 - December 28, 2015

హైదరాబాద్ : గ్రేటర్‌ కాంగ్రెస్‌లో నేతల వర్గ పోరు బహిర్గతమైంది. పరిస్థితి పరస్పర దాడుల దాకా వెళ్లింది. ఇంతకాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న గ్రేటర్‌ కుమ్ములాటలు.. ఇప్పుడు నడిరోడ్డుపై బాహాబాహీకి దారితీశాయి. గ్రేటర్‌ ఎన్నికల వేళ.. ఈ తన్నులాట.. అగ్ర నాయకత్వాన్ని కలవర పరుస్తోంది. ముంగిట్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ఉన్నవేళ.. పార్టీలో కుమ్ములాటలు.. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని హడలెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావడం.. మొన్నటి ఓరుగల్లు ఉప ఎన్నికల్లో ధరావతు కూడా దక్కని పరాభవం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే వలసెళ్లిన వైనం.. కాంగ్రెస్‌ను ఊపిరి తీసుకోకుండా చేస్తోంది. ఈ పరిస్థితుల్లో.. గ్రేటర్‌లోనైనా కాస్తంత ఊపిరి పీల్చుకుందామనుకుంటే.. నేతల కుమ్ములాటలు ఆ ఆశలను కూడా ఆవిరి చేస్తున్నాయి.

గ్రేటర్ - రంగారెడ్డి నేతల  మధ్య అధిపత్య పోరు..
నేడో రేపో గ్రేటర్‌ ఎన్నికల నగారా మోగించేందుకు కేసీఆర్‌ సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆధిపత్యపోరుతో రోడ్డున పడ్డారు. పార్టీ అవిర్భావం రోజున.. ఉప్పల్‌లో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దానం నాగేందర్‌ వర్గంపై.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాలూ కర్రలు.. చెప్పులతో ఇరువర్గాలూ బాహాబాహీకి దిగాయి.  గ్రేటర్‌-రంగారెడ్డి జిల్లాల కాంగ్రెస్‌ నేతల మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. గ్రేటర్‌లోని 150 డివిజన్‌లకు సంబంధించిన హద్దుల పంచాయతీ నడుస్తోంది. గ్రేటర్‌ కిందికి వచ్చే ఓ 50 డివిజన్‌లు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటిపై గ్రేటర్‌ అధ్యక్షుడిగా దానం ఆధిపత్యాన్ని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతలు సహించడం లేదు. ఇప్పటికే దీన్ని పార్టీ హైకమాండ్‌ దృష్టికీ తీసుకు వెళ్లారు. దీంతో దానంను వంద డివిజన్‌లకే పరిమితం కావాలని.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సూచించినట్లు సమాచారం. అయినా దానం తమ జిల్లాలోని పార్టీ కార్యక్రమాలకు ఎలా హాజరవుతారంటూ.. రంగారెడ్డి నేతలు ప్రశ్నిస్తున్నారు. తనపై ఎలాంటి దాడీ జరగలేదని వెల్లడించిన దానం నాగేందర్‌.. గ్రేటర్‌లోని డివిజన్‌ల పరిధులకు సంబంధించి.. పార్టీ అధిష్ఠానం నిర్ణయానుసారమే నడచుకుంటానని తెలిపారు.

కూకట్ పల్లిలోనూ..
అటు కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోనూ కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జెండా ఎగరేసే విషయంలో స్థానికంగా బాలాజీ, హరీశ్‌రెడ్డిల మధ్య గొడవ జరిగింది. ఈ వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. మహిళా కార్యకర్తపై గాలి బాలాజీ దాడికి పాల్పడ్డట్లు హరీశ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి గ్రేటర్‌ పరిధిలో పార్టీ నేతల మధ్య రోడ్డుకెక్కిన వర్గ విభేదాలు.. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వాన్ని కంగు తినిపించింది. ఈ విభేదాలను ఏమేరకు పరిష్కరిస్తారో... శ్రేణులను గ్రేటర్‌ ఎన్నికలకు ఏమేరకు సమాయత్త పరుస్తారోనన్న చర్చ పార్టీలో జరుగుతోంది. 

21:18 - December 28, 2015

విజయవాడ : మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. సుమారు గంటన్నవరకు ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధికి గురించి ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌ మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. చంద్రబాబు, సత్యనాదెళ్ల సమక్షంలో ఏపీ ప్రభుత్వ అధికారులు, మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

కీలక ఒప్పందం..
సత్య నాదెళ్ల పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, మైక్రోసాఫ్ట్‌ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. విద్య, వైద్యం, వ్యవసాయం, పౌర సేవా రంగాల్లో ఐటీ ఆధారిత సాంకేతిక సహకారాన్ని మైక్రోసాఫ్ట్‌ ఏపీకి అందచేయాలన్నది ఈ ఒప్పందం ఉద్దేశం. మైక్రోసాఫ్ట్‌ సంస్థ తయారు చేసిన మెషిన్‌ లెర్నింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్రంలోని వివిధ శాఖలు వాడుకునే అవకాశం ఈ ఒప్పందం ద్వారా కలిగింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ-ప్రగతి ప్రాజెక్టులో భాగస్వామ్యం వహించేందుకు మైక్రోస్టాఫ్ట్ ముందుకొచ్చింది. సుమారు 2, 500 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడుతోంది.

విశాఖలో సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్...
విశాఖలో సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటుచేసేందుకు మైక్రోసాఫ్ట్‌ అంగీకరించింది. ఒప్పందంలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ అందిస్తున్న అజూర్‌ మిషన్‌ లెర్నింగ్‌ అండ్‌ అడ్వాన్స్ డ్‌ విజువలైజేషన్‌ను ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. విద్యా రంగంలో క్లౌడ్‌ టెక్నాలజీ వినియోగం..బడి మానేస్తున్న విద్యార్థుల సంఖ్యను నియంత్రించడం తదితర అంశాల్లో మైక్రోసాఫ్ట్‌ సహకారం అందిస్తుంది. వ్యవసాయ రంగంలోనూ ఆ సంస్థ సాంకేతిక సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇది ఇలా ఉంటే అనంతపురం జిల్లాలో పర్యటించాలని సత్యనాదెళ్లను ముఖ్యమంత్రి కోరారు. మళ్లీ వచ్చినప్పుడు తప్పకుండా అనంతపురం జిల్లాలో పర్యటిస్తానని ఈ సందర్భంగా సత్య నాదెళ్ల సీఎంకు హామీ ఇచ్చారు. 

21:15 - December 28, 2015

విజయవాడ : దేశంలో అత్యంత వేగంగా వృద్ధిరేటు సాధిస్తున్న రాష్ట్రాలలో ఏపీ ముందువరసలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అపార సహజ వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జపాన్‌ రాష్ట్రం టొయామాకు చెందిన ప్రతినిధి బృందంతో సీఎం సమావేశమయ్యారు. ఏపీలో జపాన్‌ ప్రతినిధి బృందం పర్యటించింది. టొయామా గవర్నర్‌ తకకాజు ఇషి నేతృత్వంలో 19 మంది సభ్యుల బృందం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. మత్స్యశాఖ, ఫార్మా, పర్యాటక రంగాల్లో జపాన్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో టొయామా గవర్నర్‌, ఏపీ సీఎం చంద్రబాబు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఏపీ సిలికాన్ గా మారుతుందన్న టొయామా గవర్నర్..
విశాఖ-చెన్నై కారిడార్‌ ఏర్పాటుకు జపాన్‌ ముందుకొచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఫార్మా స్యూటికల్‌ రంగంలో అ్రగగామిగా ఉన్న టొయామా ఏపీ ఫార్మా రంగంలోనూ అడుగుపెట్టాలని చంద్రబాబు ఆహ్వానించారు. టొయామా, ఏపీ మధ్య విద్యాపరమైన సంబంధాలను నిరంతరం కొనసాగించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య విద్యార్థుల రాకపోకలు సాగాలన్నారు. ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి సహాయకంగా యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని చంద్రబాబు అన్నారు. దీని కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేద్దామని ఈ భేటీలో ప్రతిపాదించారు. ఏపీ త్వరలోనే సిలికాన్‌ వ్యాలీగా మారుతుందని టొయామా గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. టొయామా, ఏపీ దీర్ఘకాలం స్నేహితులుగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 

20:36 - December 28, 2015

కాల చక్రం గిర్రున తిరిగింది. క్యాలెండర్ చివరి పేజీలో ఉన్నాం. గత సంవత్సర కాలంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు..ప్రమాదాలు..ప్రమోదాలు చూశాం. కుట్రలతో ప్రపంచాన్ని మభ్య పెట్టి తన ప్రయోజనాలను కాపాడే దౌర్భాగ్యం ఒకరిది. కాళ్ల కింద నేలను నిలబెట్టుకోవాలనే బతుకు పోరాటం మరొకరిది. ఎగిసిన నినాదాలు..బిగిసిన పిడికిళ్లు..రాజాకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు..ప్రకృతి శాపానికి విలయతాండవానికి పట్టు తప్పిన కూలిన లోహ విహాంగాలకు బలైన వేలాది మంది..ఇలా అనేక ఘటనలను దాటుకుని 2015 ముగింపుకు వచ్చింది.  ఇప్పుడు సిరియా నెత్తురోడుతున్న గాయం.. కొన్ని స్వార్ధపర శక్తుల కుయుక్తులకు గాయపడిన దేశం.. స్వదేశంలో ఉండలేక, పరాయి దేశంలో నానా ఇబ్బందులు పడుతున్న సిరియన్లు ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి ప్రశ్నగా నిలిచారు. 2015 సంవత్సరం సిరియాకు చేదు గుర్తులను మిగిల్చింది.

నేపాల్ భూకంపం..
ఊహించని ఉత్పాతమది.. కాళ్లకింద భూమి కదిలింది. గూడు చెదిరింది. బతుకు కకావికలమైంది. ప్రకృతి బీభత్సానికి బలైన వేలాదిమంది, ఆప్తులను కోల్పోయి, గాయాలపాలై, నిలువ నీడలేక.... విలవిల్లాడిపోయారు ఒకదాని తర్వాత మరొకటిగా వస్తున్నవరుస ఉత్పాతాలు మానవాళిని వణికిస్తున్నాయి. 2015లో వచ్చిన నేపాల్ భూకంపం సరికొత్త హెచ్చరికలను చేస్తోంది. ప్యారిస్ నుదుటిన నెత్తుటి మరక..గత నవంబర్ లో ప్యారిస్ నగరంలో విధ్వంస దృశ్యం ప్రపంచాన్ని వణికించింది. తుపాకులు గర్జించాయి.. నిమిషాల వ్యవధిలో ప్యారిస్ రక్తసిక్తమయింది. 8మంది ఐఎస్ ఐఎస్ జిహాదీలు.... 127మంది అమాయక పౌరులు మృతి చెందారు. 200మంది క్షతగాత్రులయ్యారు. చెప్పేదొకటి.., చేసేదొకటి. అంతిమంగా తన ప్రయోజనాలే ముఖ్యం. ఇదే అంకుల్ శామ్ ధోరణి. తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఎలాంటి పనికిమాలిన పనికైనా తెగబడటానికి వెనుకాడని నైజం. ఇదే ప్రపంచం ముందుకు ఉగ్రభూతాన్ని ఉసిగొల్పిందా? 2015ను రక్తసిక్తం చేయటంలో పెద్దన్నదే కీలకపాత్రగా భావించవచ్చా..? అది తన చిన్నారికోసం ప్రపంచానికి ప్రేమతో అందించిన కానుక.. అందమైన భవిష్యత్తు పట్ల ప్రగాఢమైన కోరిక.... మహోదయం కోసం ఓ సుందర స్వప్నం .. ఓ నిర్మాణాత్మక లక్ష్యం .. ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చి... అభద్రత లేని, అనారోగ్యం, ఆకలి లేని, అత్యంత నివాసయోగ్యమైనదిగా మార్చి భావితరాలకు అందించాలనే తపన ఉంది.. జుకర్ బర్గ్ స్వప్నం నెరవేరుతుందా.. ? జుకర్ బర్గ్ ప్రపంచానికి ఇచ్చిన కానుక 2015లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఘటన..

ఆహార భద్రతకు, ప్రజాపంపిణీ వ్యవస్థకు పెను ప్రమాదం ?
ఆహార భద్రతకు, ప్రజాపంపిణీ వ్యవస్థకు పెను ప్రమాదం పొంచి ఉందా?  ఇప్పటికే రైతాంగాన్ని విస్మరిస్తున్న సర్కారు ఇకముందు పూర్తిగా విస్మరించబోతోందా?  మొన్నటి నైరోబీ సమావేశం ఏ సంకేతాలిస్తోంది?  ఏ కుట్రలకు వర్ధమాన దేశాలు బలికాబోతున్నాయి? మయన్మార్‌లో 25 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగిన స్వేచ్ఛాయుత ఎన్నికల్లో ప్రతిపక్ష నేత అంగ్ సాన్ సూకీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ చేతిలో పరాజయాన్ని అధికార పార్టీ అంగీకరించింది. ఈ ఎన్నికలతో మయన్మార్ కల్లోల గతం నుంచి గట్టెక్కిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాక్, లిబియా, సిరియా, యెమెన్. అసలు అరబ్ దేశాల భవిష్యత్తేంటి? ఏ దాహానికి ఈ దేశాలు బలవుతున్నాయి? ఏ యుద్ధోన్మాదం లక్షలాది సామాన్యుల ఉసురు తీస్తోంది? యెమెన్ లో ఏం జరుగుతోంది? గల్ఫ్ కూటమిపై దాడులు చల్లారేదెపుడు? అప్పులిచ్చారు.. గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేశారు. అప్పు మీద అప్పు, అప్పు తీర్చటానికి కొత్త అప్పు, కొండలా పెరిగే వడ్డీ... అన్నీ కలిసి గ్రీసు దేశాన్ని పతనం అంచున నిలిపాయి. విమానం కూలిపోయింది. ప్రపంచం దిగ్భ్రమకు గురయింది. కొద్ది సేపట్లో గమ్యం చేరుతామనుకున్న ప్రయాణికులు తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. ఆప్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఏమై ఉంటుంది. ఏ కుట్రలకు 150 మంది బలయ్యారు? ఏ దారుణానికి ఆ లోహవిహంగం నేలకూలింది? ఇదీ వాల్డ్ రౌండప్.... మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి..

 

 

వరల్డ్ రౌండప్ పై విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:31 - December 28, 2015

వేముల వాడలో సీఎం కేసీఆర్ దంపతులు, 'చేయి' జన్మించి 131 ఏళ్లు..ఉప్పల్ లో కాంగ్రెస్ నేతల కొట్లాట..వణికిస్తున్న చలి..తిరుపతిలో ఓ సైకో వీరంగం..పులివెందులలో ఓ మంత్రగాడి నిర్వాకం..విజయనగరం గజరాజుల వీరంగం..భారతదేశంలో సిగరేట్లు సేవించే మహిళా సంఖ్య అధికం..ఆ వయస్సులో వివాహం...అమెరికాలో టోర్నడోల బీభత్సం..అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో తనదైన శైలిలో మల్లన్న విశ్లేషించారు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

కనకదుర్గ ఆలయ క్యాలెండర్ ఆవిష్కరణ..

విజయవాడ : కనకదుర్గ ఆలయ క్యాలెండర్ ను మంత్రి మాణిక్యాలరావు ఆవిష్కరించారు. జనవరి ఐదు నుండి భక్తులకు అమ్మవారి కుంకుమ ప్రసాదంగా ఇస్తామని, కృష్ణా పుష్కరాల లోపు అమ్మవారి ఆలయం చుట్టూ వన్ వే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీ. సర్కార్ తో మాట్లాడి కృష్ణా నీటిని విడుదల చేయిస్తామని మాణిక్యాలరావు పేర్కొన్నారు.

కాకతీయ వర్సిటీ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా..

వరంగల్ : కాకతీయ వర్సిటీ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుండి పీజీ సెమిస్టర్ పరీక్షలు జనవరి నాలుగో తేదీకి వాయిదా పడ్డాయి. 

కాకతీయ వర్సిటీ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా..

వరంగల్ : కాకతీయ వర్సిటీ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుండి పీజీ సెమిస్టర్ పరీక్షలు జనవరి నాలుగో తేదీకి వాయిదా పడ్డాయి. 

2004 నుండి శబరి దళంలో నగేష్ - ఎస్పీ రవి ప్రకాశ్..

తూర్పుగోదావరి : ఛత్తీస్ గడ్ కు చెందిన నగేష్ 2004 నుండి శబరి దళంలో పనిచేస్తున్నాడని, నగేష్ పై ఖమ్మం, తూర్పుగోదావరి, ఛత్తీస్ గడ్ లో పలు హత్య కేసులు ఉన్నాయని ఎస్పీ రవి ప్రకాశ్ పేర్కొన్నారు. ఇటీవల ఛత్తీస్ గడ్ లో జరిగిన ఐదు హత్య కేసుల్లో నగేష్ నిందితుడని, నగేష్ పై రూ. 5 లక్షల రివార్డు ఉందని, ఎదురు కాల్పుల్లో పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారని తెలిపారు. 

కాటేదాన్ లో ఎస్ వోటీ పోలీసుల దాడులు..

హైదరాబాద్ : కాటేదాన్ లో ఎస్ వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు వేల ప్యాకెట్ల కల్తీ శనగపిండిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడుని పోలీసులు అరెస్టు చేశారు. 

కలాం మెమోరియల్ నిర్మాణ పనులు ప్రారంభం..

హైదరాబాద్ : రేపటి నుండి కలాం మెమోరియల్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. రామేశ్వరంలో కలాం మెమోరియల్ నిర్మాణం కానున్న సంగతి తెలిసిందే. 

ప్రభుత్వ ఆసుపత్రిలో కాల్ మనీ నిందితుడు..

విజయవాడ : కాల్ మనీ కేసులో అరెస్టయిన శివకుమార్ ను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివకుమార్ కు వైద్య పరీక్షల అనంతరం పోలీసులకు వైద్యులు నివేదిక ఇవ్వనున్నారు. 

యూనివర్సిటీ అరకొర వసతులపై సుజనా అసహనం..

కాకినాడ : జేఎన్టీయూ వీసీ, డైరెక్టర్లతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. యూనివర్సిటీలో అరకొర వసతులపై కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వసతుల కల్పనకు తక్షణమే చర్యలు తీసుకోవాలని జేఎన్టీయూ అధికారులకు సుజనా చౌదరి ఆదేశాలు జారీ చేశారు. 

కాల్షియం కార్బైడ్ తో పళ్లను మగ్గబెట్టడంపై నిషేధం..

హైదరాబాద్ : కాల్షియం కార్బైడ్ తో పళ్లను మగ్గబెట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు.

18:55 - December 28, 2015

జాతీయ క్రీడ భారత హాకీ చరిత్రలో..2015 సంవత్సరానికి ఓ ప్రత్యేక స్థానమే ఉంటుంది. భారత హాకీ అస్థిత్వాన్ని కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడి..పునరుజ్జీవనం పొందిన సంవత్సరం ఇది. భారతహాకీకి చేదు అనుభవాల కంటే తీపిగుర్తులనే ఎక్కువగా మిగిల్చిన..2015 భారత హాకీ పై కథనం..

సంచలనాలు..
భారత్...జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం. ఫీల్డ్ హాకీని జాతీయక్రీడగా ఎంచుకొన్న దేశం. ప్రపంచ క్రీడల పండుగ ఒలింపిక్స్ లో భారత్ కు అత్యధికంగా ఎనిమిది బంగారు పతకాలు అందించిన ఏకైక క్రీడ హాకీ మాత్రమే. ఇంత ఘనచరిత్ర ఉన్న హాకీలో భారత్...ఆధునిక హంగులను సమకూర్చుకోలేక..అస్థిత్వాన్నే కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడిన సంవత్సరం 2015. 2016 ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్ పురుషుల, మహిళల రెండు విభాగాలలోనూ భారతజట్లు అర్హత సాధించి సంచలనం సృష్టించిన ఏడాది కూడా.. 2015 సంవత్సరమే. నెదర్లాండ్స్ మాజీ ఆటగాడు రోలెంట్ ఓల్ట్స్ మాన్ కోచ్ కమ్ టీమ్ డైరెక్టర్ గా, మిడ్ ఫీల్డర్ సర్దార్ సింగ్ కెప్టెన్ గా భారత హాకీ జట్టు గత ఏడాది కాలంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించడమే కాదు..ర్యాంకును సైతం గణనీయంగా మెరుగుపరచుకోగలిగింది. 2015 సంవత్సరాన్ని భారతహాకీజట్టు 14వ ర్యాంక్ తో మొదలుపెట్టి..ఏడాది చివరినాటికి 7వ ర్యాంక్ కు చేరుకోడం అపూర్వమనే చెప్పాలి.

మలేసియాలోని ఇపో వేదికగా ముగిసిన 2015 అజ్లాన్ షా కప్ ఆరుదేశాల హాకీటోర్నీలో...వాన్ యాస్ శిక్షకుడుగా పాల్గొన్న భారతహాకీజట్టు 3వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత యాంట్వార్ప్ లో ముగిసిన హాకీ ప్రపంచ లీగ్ సెమీస్ సమరంలో భారతజట్టు నాలుగోస్థానం మాత్రమే సాధించింది. హాకీ ఇండియాతో విభేదాల కారణంగా...చివరకు కోచ్ పదవినే.. వాన్ యాస్ చేజార్చుకోవాల్సి వచ్చింది. అప్పటి వరకూ భారత హాకీ హైపెర్ ఫామెన్స్ మేనేజర్ గా ఉన్న రోలెంట్ వోల్ట్స్ మాన్...వాన్ యాస్ స్థానంలో జట్టు శిక్షకుడిగా పగ్గాలు చేపట్టడంతో....ఒక్కసారిగా దశ తిరిగిపోయింది. ప్రతిభావంతులైన ఎక్కువమంది యువఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం ద్వారా భారత హాకీకి రోలెంట్ కొత్త ఊపిరిపోశారు. తనకంటే ఎన్నో రెట్లు మెరుగైన జట్లుగా పేరు పొందిన స్పెయిన్, న్యూజిలాండ్, ఫ్రాన్స్ జట్లతో జరిగిన టెస్ట్ సిరీస్ లను మన సర్దార్ సేన అలవోకగా నెగ్గి...రియో ఒలింపిక్స్ కు సన్నాహాలను జోరుగా ప్రారంభించింది. రాయ్ పూర్ వేదికగా 2015 ప్రపంచ హాకీ లీగ్ ఫైనల్స్ టోర్నీకి సన్నాహాకంగా..ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్ట్ సిరీస్ లో సైతం భారతజట్టు స్థాయికి తగ్గట్టుగా రాణించింది. హాకీ ప్రపంచలీగ్ గ్రూప్ పోటీల్లో దారుణంగా విఫలమైన భారతజట్టు...క్వార్టర్ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ పై సంచలన విజయం సాధించడం ద్వారా సెమీస్ కు అర్హత సంపాదించింది.

33 సంవత్సరాలు తరువాత..
బెల్జియంతో ముగిసిన సెమీస్ సమరంలో భారత్ కు ఓటమి ఎదురైనా...కాంస్య పతకం కోసం..నెదర్లాండ్స్ తో జరిగిన పోటీలో మాత్రం..పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతగా నిలిచింది. 33 సంవత్సరాల విరామం తర్వాత..ప్రపంచహాకీ టోర్నీలో పతకం సంపాదించగలిగింది. 1982 ఆమ్ స్టర్ డామ్ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ను ఓడించడం ద్వారా కాంస్య పతకం సాధించిన భారతజట్టు...మరో పతకం కోసం 2015 వరకూ వేచిచూడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్, గ్రేట్ బ్రిటన్ లాంటి ప్రపంచ మేటిజట్లను దీటుగా ఎదుర్కొనడమే కాదు...విజయాలు సాధించడం ద్వారా..భారత జట్టు సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకోగలిగింది.

2015 తీపి గుర్తు..
ఇక...మహిళల హాకీలో భారత్ కు 2015 తీపిగుర్తుగా మిలిగిపోయే సంవత్సరం. ఎందుకంటే..1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత..భారత జట్టు తొలిసారిగా 2016 ఒలింపిక్స్ కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. హాకీ ప్రపంచ లీగ్ ఫైనల్స్ లో 5వ స్థానం సాధించడం ద్వారా..భారత మహిళలు రియో ఒలింపిక్స్ లో పాల్గొనటానికి అర్హత సాధించగలిగారు. అంతేకాదు..36 ఏళ్ల సుదీర్గ విరామంత తర్వాత ఒలింపిక్స్ బెర్త్ సంపాదించి..తమ కష్టానికి తగ్గ ఫలితాన్ని దక్కించుకోగలిగారు. భారత హాకీ జట్లు 2016 రియో ఒలింపిక్స్ లో సాధించబోయే విజయాలకు ..2015 సంవత్సరంలో సాధించిన విజయాలు నాందిగా మిగిలిపోతాయి.

18:51 - December 28, 2015

భారత క్రీడారంగ చరిత్రలో మహిళలకు అత్యంత విజయవంతంగా ముగిసిన అతికొద్ది సంవత్సరాలలో..గత ఏడాది కాలాం ప్రముఖంగా కనిపిస్తుంది. జాతీయ క్రీడ హాకీ, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఆర్చరీ, చెస్ క్రీడల్లో భారత మహిళలు అసాధారణ విజయాలు సాధించి...లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది భారత క్రీడారంగం అనుకొనేలా చేశారు. 2015లో భారత మహిళా క్రీడాకారులు సాధించిన అపూర్వ విజయాలపై కథనం. జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్ లో సగభాగం ఉన్న మహిళలు....దేశాభివృద్ధిలో మాత్రమే కాదు, క్రీడారంగంలోనూ పురుషులతో సమానంగా రాణిస్తూ తమకు తామే సాటిగా నిలుస్తున్నారు. గత ఏడాదికాలంలో భారత మహిళలు..పలు రకాల క్రీడల్లో అద్భుతంగా రాణించి...దేశానికే గర్వకారణంగా నిలిచారు.

సానియా మీర్జా..
మహిళల టెన్నిస్ డబుల్స్ లో మన హైదరాబాదీ షాన్ సానియా మీర్జా...ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుతో పాటు..రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు మొత్తం 10 డబుల్స్ టైటిల్స్ నెగ్గి విశ్వరూపమే ప్రదర్శించింది. 2015 డబ్ల్యుటిఏ, గ్రాండ్ స్లామ్ సీజన్లో...స్విస్ మిస్ మార్టీనా హింగిస్ తో జంటగా మొత్తం 16 టోర్నీల్లో పాల్గొన్న సానియా 55 విజయాలు, 7 పరాజయాల రికార్డుతో..తొమ్మిది డబుల్స్ ట్రోఫీలు అందుకొంది. ఇందులో అమెరికన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, సీజన్ ముగింపు ప్రపంచ ఫైనల్ ట్రోఫీలు సైతం ఉన్నాయి. అంతేకాదు...ప్రపంచ మహిళా టెన్నిస్ సమాఖ్య...సానియా- హింగిస్ జంటను ప్రపంచ నెంబర్ వన్ జోడీగా కూడా అధికారికంగా ప్రకటించింది. టెన్నిస్ లో సానియా చెలరేగితే...బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో హైదరాబాదీ క్వీన్ సైనా నెహ్వాల్, తెలుగు తేజం పీవీ సింధూ..తామేమిటో నిరూపించుకొన్నారు. మహిళల సింగిల్స్ లో తొలిసారిగా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన సైనా...ఆ తర్వాత రెండోర్యాంక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలోనే టాప్ ర్యాంక్ సాధించిన తొలిభారత మహిళ సైనా మాత్రమే. ప్రపంచ బ్యాడ్మింటన్ లోనే అత్యంత ప్రధానమైన ఆల్ ఇంగ్లండ్ ఫైనల్స్ చేరిన తొలి భారత మహిళ గౌరవాన్ని సైనా దక్కించుకొంది. ఫైనల్లో ఓటమి ఎదురైనా...రజత పతకంతో సంచలనమే సృష్టించింది. దుబాయ్ లో ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్ టోర్నీ లో పాల్గొన్న ఒకే ఒక్క భారత క్రీడాకారిణి ఘనత సైతం సైనాకు మాత్రమే దక్కుతుంది. పీవీ సింధు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా మకావో ఓపెన్ టైటిల్ ను వరుసగా మూడోసారి నెగ్గి..హ్యాట్రిక్ పూర్తి చేయడం ద్వారా..12వ ర్యాంక్ సంపాదించింది. మహిళల డబుల్స్ లో భారత నెంబర్ వన్ జోడీ గుత్తా జ్వాల- అశ్వినీ సైతం...కెనేడియన్ గ్రాండ్ ప్రీ టైటిల్ సాధించడం ద్వారా తమ ఉనికిని కాపాడుకోగలిగారు.

రియో ఒలింపిక్స్...
మహిళల విలువిద్య రికర్వ్ టీమ్ విభాగంలో దీపిక కుమారి, లక్ష్మీరాణి మాజీ, రిమిల్ బురీలీ జట్టు...రజత పతకం సాధించి సంచలనమే సృష్టించింది. డెన్మార్క్ లోని కోపెన్ హాగెన్ లో ముగిసిన 2015 ప్రపంచ మహిళల ఆర్చరీ టీమ్ విభాగంలో జర్మనీ, కొలంబియా, జపాన్ లాంటి మేటి జట్లను భారతజట్టు ఓడించడం ద్వారా..రియో ఒలింపిక్స్ కు అర్హత సంపాదించింది. మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి రజత పతకంతో చరిత్ర సృష్టించింది. ప్రపంచ పోటీల్లో రజత పతకం సాధించడం దీపికకు ఇది నాలుగోసారి. ఈ విజయంతో...రియో ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో సైతం పాల్గొనటానికి దీపిక అర్హత దక్కించుకొంది.

2015 కళ్లు చెదిరే విజయవాలు..
చదరంగ క్రీడలో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక.. ప్రపంచ బ్రిడ్జ్, సాధారణ టోర్నీల్లో కాంస్య పతకాలు సాధించి..తెలుగురాష్ట్రాల ప్రజలకే గర్వకారణంగా నిలిచింది. మహిళా క్రికెట్లో హైదరాబాద్ కమ్ తెలంగాణా క్వీన్ మిథాలీరాజ్ ..వన్డే నెంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా నిలిచింది. ఇంగ్లండ్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల సిరీస్ లో మిథాలీ ఏకంగా 251 పరుగులు సాధించి, 83.66 సగటు నమోదు చేయడం ద్వారా అరుదైన ఘనత సొంతం చేసుకొంది. 2015 సీజన్లో కళ్ళు చెదిరేవిజయాలు సాధించిన భారత మహిళలు...2016 ఒలింపిక్ సంవత్సరంలో దేశానికి పతకాలు సాధించి పెట్టాలని కోరుకొందాం.

18:43 - December 28, 2015

బాయ్‌ఫ్రెండ్‌తో సినిమాలో రొమాన్స్ చేసే అవకాశం హీరోయిన్లకు రావడం అన్నది అరుదైన విషయమే. అలాంటి అవకాశాన్ని వర్ధమాన నటి అక్షరహాసన్ దక్కించుకున్నారు. శ్రుతీహాసన్, అక్షరహాసన్ విశ్వనటుడు కమలహాసన్ వారసులన్న విషయం తెలిసిందే. శ్రుతిహాసన్ నటిగా తన సినీ జీవితాన్ని లక్ అనే హిందీ చిత్రం ద్వారా ప్రారంభించారు. ఆ చిత్రం ఆమెకు అందాలారబోతలో శ్రుతి మించారనే విమర్శలను మిగిల్చింది మినహా విజయాన్ని మాత్రం అందించలేదు.


    అదే విధంగా తెలుగు, తమిళ భాషల్లో నటించిన తొలి చిత్రాలు శ్రుతిని నిరాశపరచాయి. అలాంటి శ్రుతిహాసన్ ప్రస్తుతం క్రేజీ స్టార్ దూసుకుపోతున్నారు. ఇక అక్షరహాసన్ కూడా అక్క బాటలోనే పయనించే విధంగా తన నట జీవితాన్ని బాలీవుడ్ నుంచే మొదలెట్టారు. షమితాబ్ అనే హిందీ చిత్రంలో ఏకంగా బిగ్‌బీతోనే నటించారు. అందులో కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ కూడా నటించారు. అయితే మంచి చిత్రం అంటూ విమర్శకుల ప్రశంసలు పొందింది గానీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు.

    దీంతో తన తొలి చిత్ర రిజల్ట్‌ను పెద్దగా ఆశించిన అక్షరకు నిరావనే మిగిలింది. మంచి చిత్రం కన్నా మంచి విజయమే పేరుకు, మరిన్ని అవకాశాలకు దోహదం చేస్తుందన్నది జీర్ణించుకోలేని నిజం. అక్షర విషయంలోనూ అదే జరిగింది. షమితాబ్ తరువాత మరో అవకాశం రాలేదు. తాజాగా ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అదీ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి యువ హిందీ నటుడు వివాన్‌షాకు,అక్షరహాసన్‌కు మధ్య ప్రేమాయణం నడుస్తోందన్న ప్రచారం హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

    వివాన్‌షా ప్రముఖ బాలీవుడ్ నటుడు నజీరుద్దీన్‌షా కొడుకు అన్నది గమనార్హం. ఆయన ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించారు. తాజాగా తన ప్రియురాలుగా ప్రచారంలో ఉన్న అక్షరతో కలిసి తెరపై రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ హిందీ దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి శిష్యుడు మనీష్ హరిశంకర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి లాలీ కీ షాదీమెన్ లట్టి దివాన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. తొలి చిత్రం నిరాశకు గురిచేసినా మలి చిత్రం అక్షర నట జీవితంలో ఆశలు చిగురింపజేయాలని కోరుకుందాం.

రాష్ట్రపతిని కలిసిన సీఎం కేసీఆర్..

~ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు కలిశారు. వేములవాడ నుండి సీఎం నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. 

18:42 - December 28, 2015

విజయవాడ : ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని చర్మా ట్రాన్స్ పోర్టు కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంపెనీకి సమీపంలోనే ఆయిల్ ఫిల్లింగ్..ఇతరత్రా కంపెనీలు ఉన్నాయి. మంటలు వీటికి కూడా వ్యాపిస్తుందని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అగ్నిప్రమాదం వల్ల లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడ – భద్రాచలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. 

18:39 - December 28, 2015

విజయవాడ : ఏపీ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు యాజమాన్యం నూతన సంవత్సరం సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. వారు వృత్తిలో భాగంగా నిర్వహించే డబుల్ డ్యూటీ మొత్తం పెంచుతూ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. డబుల్‌ డ్యూటీ చేసిన డ్రైవర్లకు 250 నుంచి 350 రూపాయల దాకా కండక్టర్లకు 200 నుంచి 300 దాకా పెంచుతున్నట్లు ఉత్తర్వులు చేశారు. 

18:38 - December 28, 2015

విజయవాడ : ఓ సైకో వీరంగం సృష్టించాడు. పాతబస్తీలోని బ్రాహ్మణవీధిలో తలుపులు తెరిచి ఉన్న ఇంట్లోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేసి మహిళలను భయభ్రాంతులకు గురిచేశాడు. బైక్‌లు, సైకిళ్లపై వెళ్తున్నవారిపై సైతం రాళ్లతో దాడి చేయడంతో స్థానికులు సైకోను బంధించి దేహశుద్ధి చేశారు. గత రెండు రోజులుగా సైకో పాతబస్తీలో ఇలాగే వ్యవహరిస్తున్నాడు. దిగంబరంగా తిరుగుతూ మహిళలు చిన్నపిల్లలను భయపెట్టడం, రోడ్డుపై నడుస్తున్న వారిపై రాళ్లు విసరుతూ హల్‌చల్‌ చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు సైకోను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేసారు. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి సైకోను అదుపులోకి తీసుకున్నారు. 

18:38 - December 28, 2015

సింగిల్ గా సంతోషంగా  ఉన్నానని, పెళ్లికి తొందరలేదని టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, విలక్షణ నటుడు దగ్గుబాటి రానా వ్యాఖ్యానించాడు. ఇంకా ఎవరితోనూ ప్రేమలో పడలేదని, ఒంటరిగా సంతోషంగానే ఉన్నానని పేర్కొన్నారు. అప్పుడే పెళ్లికి తొందరేముందంటూ వ్యాఖ్యానించాడు. 2015 సంవత్సరంలో చాలా ఉత్థాన పతనాలను చవిచూసిన బల్లాలదేవ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. 

ఈ ఏడాది బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ల్లో ఏకకాలంలో పనిచేయడంలో పెద్ద కష్టమనిపించలేదని రానా తెలిపాడు. ఈ సంవత్సరం తీవ్రమైన ఎత్తు పల్లాల మధ్య గడిచిందని, మంచి, చెడు రెండింటిని మిగిల్చిందని అతడు గుర్తు చేసుకున్నాడు. జీవితంలో 2015 సంవత్సరం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నాడు. ముఖ్యంగా తాతగారు రామానాయుడ్ని కోల్పోవడం చాలా బాధ కలిగించిందని తెలిపాడు. అలాగే రెండు సంవత్సరాల విరామం తరువాత వచ్చిన బాహుబలి, రుద్రమదేవి ఘన విజయం సాధించి తన కెరియర్ లో మైలురాళ్లుగా నిలిచాయని రానా పేర్కొన్నాడు.

'కాలం కరిగిపోయే క్షణాల సమూహమైతే, సినిమా అన్నది కలకాలం నిలబడే శిల్పం' అని తాతగారు ఎపుడూ చెప్పే మాటలను గుర్తు చేసుకుంటూ వుంటానని రానా పేర్కొన్నాడు. విలక్షణమైన, విభిన్నమైన క్యారెక్టర్లను చేయడమే తనకిష్టమని సింగిల్ ఫార్ములా పాత్రలంటే తనకు పడదని తెలిపాడు. పాత్ర నచ్చితే దాని ప్రాధాన్యాన్ని బట్టి నిడివితో సంబంధం లేకుండా క్యారెక్టర్ ను ఎంచుకుంటానని చెప్పాడు. కథ నచ్చితే రెండో ఆలోచనల లేకుండా విలన్ పాత్ర చేయడానికైనా సిద్ధమని, రుద్రమదేవి, బాహుబలి సినిమాల్లో నటించేందుకు అదే కారణమని తెలిపాడు. సినిమాల్లో నటించే పాత్రల ద్వారా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవచ్చని ఈ కండలవీరుడు చెప్పుకొచ్చాడు. బెంగళూరు డేస్ సినిమా తనకు మంచి అనుభవాన్ని మిగిల్చిందని రానా తెలిపాడు.

సినిమాల్లో డ్యాన్సులు చేయాల్సిన అవసరం తనకు కనిపించలేదని, అందరూ హీరోలు చేసే పనే అని..మళ్లీ కొత్తగా తనెందుకు చేయాలని ప్రశ్నించారు. వాస్తవానికి అనవసరమైన పాటలు, డ్యాన్సులు తనకు నచ్చవన్నారు. 'నా ఇష్టం' లాంటి సినిమాలు తనకు సరిపడవని, అసలు ఆ సినిమా తాను చేసి ఉండాల్సింది కాదని  వ్యాఖ్యానించాడు. చెన్నై వరద బాధితులకు సహాయ పనులతోనూ తన సోదరి మాళవిక కూతురు అయిరాతో ఈ సంవత్సరాంతం గడిచిందని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేకమైన, బెంచ్ మార్క్ గా నిలిచే సినిమాల్లో నటించాలని ఉందని తెలిపాడు.

18:37 - December 28, 2015

విజయవాడ : కాల్‌ మనీ, సెక్స్‌ రాకెట్‌ వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వానికి మావోయిస్టులు బహిరంగ లేఖ రాశారు. కాల్‌మనీ నిందితులను ప్రజాకోర్టులో హతమారుస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. కాల్‌మనీ నిందితుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులున్నా వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మావోయిస్టులు లేఖలో ఆరోపించారు. కాల్‌మనీ నుంచి మహిళా సంఘాల దృష్టి మరల్చేందుకే అంగన్‌వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించారని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు అధికార ప్రతినిధి శ్యాం పేరుతో ఈ లేఖ విడుదల అయ్యింది. 

18:35 - December 28, 2015

హైదరాబాద్ : కర్నూల్, కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు గత 5 సంవత్సరాలు పెండింగ్‌లో ఉన్నాయన్న పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాష్ట్రానికి ఎన్నికల సంఘం లేనందున ఎన్నికలు జరపడం లేదని ఏపి ప్రభుత్వం తరపు న్యాయవాది అన్నారు. ఏపి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేయాలని గవర్నర్‌కు విన్నవించినట్లు ధర్మాసనానికి తెలిపారు. దీంతో తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తర్వాత చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది. 

విజయవాడలో అగ్నిప్రమాదం..

విజయవాడ : చర్మా ట్రాన్స్ పోర్టు కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. 

18:14 - December 28, 2015

తూర్పుగోదావరి : ఛత్తీస్ గఢ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. సోమవారం సాయంత్రం మావోయిస్టులు..పోలీసులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈఘటనలో శబరి ఏరియా దళ కమాండర్ నగేష్ మృతి చెందాడు. ఇతని మృతిని ఎస్పీ రవి ప్రకాష్ ధృవీకరించారు. చింతూరు మండలం మల్లంపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ నగేష్ ను మూడు రోజుల క్రితమే పట్టుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత కొద్దికాలంగా ఉనికిని చాటుకోవడానికి మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నపాటి విధ్వంసాలకు పాల్పడ్డారు. బాక్సైట్ తవ్వకాలపై మావోయిస్టులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఈనెల 26వరకు వారోత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ లు నిర్వహిస్తున్నారు. 

చింతూరు ఏజెన్సీలో ఎన్ కౌంటర్...

తూర్పుగోదావరి : చింతూరు ఏజెన్సీలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. శబరి ఏరియా దళ కమాండర్ గణేష్ మృతి చెందాడు. ఇతని మృతిని ఎస్పీ రవి ప్రకాష్ ధృవీకరించారు. 

స్పెస్ జెట్ కొత్త ఆఫర్..

ఢిల్లీ : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని స్పెస్ జెట్ కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ. 716కే విమాన ప్రయాణాన్ని కల్పించనున్నట్లు, జనవరి 15 నుండి ఎప్రిల్ 12 వరకు వర్తింపు ఉంటుందని ప్రకటించింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు బుకింగ్ గడువుగా విధించింది. 

17:50 - December 28, 2015

భాష ఏదైనప్పటికీ 'ప్రేమ' ఇతివృత్తంతో ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో సినిమాలొచ్చాయంటే అతిశయోక్తి లేదు. అందులోనూ మనసు పొరల్ని తడిమే ప్రేమకథా చిత్రాలకైతే ప్రేక్షకులు దాసోహమై పోతారంతే. ప్రేక్షకుల్ని ఫిదా చేసి సంచలన విజయం సాధించిన కొన్ని ప్రేమకథా చిత్రాల గురించి 'నవచిత్రం' పాఠకులకు ఈ వారం స్పెషల్‌ షో...
టైటానిక్‌
   1912లో జరిగిన టైటానిక్‌ షిప్‌ ప్రమాదం నేపథ్యంలో దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ 1997లో 'టైటానిక్‌'గా తెరకెక్కించారు. విషాదభరిత ప్రేమకథా చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. కథ విషయానికొస్తే, ఓ ప్రిన్స్‌తో పెళ్ళి ఫిక్స్‌ అయిన హీరోయిన్‌ను చూసి లక్కీ డ్రా ద్వారా టైటానిక్‌లో ప్రయాణించే ఛాన్స్‌ కొట్టేసిన హీరో ప్రేమలో పడతాడు. ప్రిన్స్‌తో పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని హీరోయిన్‌ కూడా హీరో అంటే ఇష్టపడుతుంది. వీరి పరిచయం గాఢమైన ప్రేమగా మారిన క్రమంలో ఒక భారీ ఐస్‌మౌంటెన్‌ని ఢీ కొట్టి టైటానిక్‌ షిప్‌ సముద్రంలో మునిగిపోతుంది. అందులో ప్రయాణి స్తున్న వారంతా ప్రాణాల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే, హీరోయిన్‌ని కాపాడి హీరో చనిపోతాడు. యావత్‌ ప్రపంచాన్ని కలచివేసిన ఈ సంఘటన నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం యూత్‌ ఆడియెన్స్ నే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను, సినీ విమర్శకులను సైతం మెప్పించి ప్రశంసలందుకుంది. చరిత్రలో నిలిచిపోయే రొమాంటిక్‌ చిత్రంగా పాపులర్‌ అయ్యింది. ఇందులో హీరో హీరోయిన్లుగా లియోనార్డో డికాప్రియో, కేట్‌ విన్‌స్లేట్‌ నటించారు. వీరిద్దరి భావోద్వేగాలు ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. దాదాపు 220 కోట్ల డాలర్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అంతేకాదు ఏకంగా 11 విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకుని ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకున్న రెండో చిత్రంగా నిలిచింది. 
రొమియో జూలియెట్‌
   షేక్‌స్పియర్‌ రాసిన 'రొమియో జూలియెట్‌' విషాద భరిత నాటకం ఆధారంగా 1968లో వచ్చిన బ్రిటీష్‌ ఇటాలియన్‌ రొమాంటిక్‌ చిత్రమిది. ఫ్రాంకో జిఫ్పిరెల్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇద్దరు టీనేజ్‌ యువతీ యువకుల మధ్య ప్రేమ అనే ఇతివృత్తంతో సాగుతుంది. ఇటలీలోని వెరోనా నగరంలో మాంటేగ్‌, కాపులెట్‌ అనే రెండు వంశాల మధ్య తరచు గొడవల వుతుండేవి. ఈ రెండు కుటుంబాలకు చెందిన రొమియో అనే కుర్రాడు, జూలియట్‌ అనే అమ్మాయి రహస్యంగా ప్రేమించుకుంటారు. ఇంట్లో గొడవల జరుగుతున్న క్రమంలో ఓ రోజు ఇంటి నుంచి పారి పోతారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు ఇద్దరిని కనిపెట్టి కొట్టి ఇంట్లో బందీలుగా మారుస్తారు. అయినప్పటికీ ఎలాగైనా ఒక్కటవ్వాలనుకున్న ఈ భగప్రేమికుల జీవితాలు ఎంత విషాదంగా ముగిశాయనేదే సినిమా. భగ ప్రేమలోని లోతును తెలిపి యువ హృదయాలను కొల్లగొట్టింది.రొమి యోగా లియో నార్డ్‌ వైటింగ్‌, జూలియట్‌గా ఒలివియాహస్సీల నటన సినిమాకు ప్రాణం పోసిందని చెప్పవచ్చు. ఈ చిత్రం ప్రేక్షకాదరణతో పాటు కలెక్షన్ల హంగామా సృష్టించింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ విభాగాల్లో ఆస్కార్స్ సొంతం చేసుకుంది. 
ద నోట్‌ బుక్‌
   ఒక పేద కుటుంబానికి చెందిన కుర్రాడు, సంపన్న ఫ్యామిలీకి చెందిన అమ్మాయి మధ్య ప్రేమ నేపథ్యంలో రూపొందిన చిత్రం 'ద నోట్‌ బుక్‌'. 1996లో నికోలస్‌ స్పార్క్స్ రాసిన 'ద నోట్‌బుక్‌' అనే పాపులర్‌ నవల ఆధారంగా దర్శకుడు నిక్‌ కాన్సవేటేస్‌ 2004లో తెరకెక్కించిన అమెరికన్‌ రొమాంటిక్‌ డ్రామా చిత్రమిది. నోవా అనే కుర్రాడు అనుకోకుండా ధనవంతురాలైన అల్లీ ప్రేమలో పడతాడు. స్వేచ్ఛలేకుండా జీవిస్తున్న ఆమెకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు. దీంతో ఇద్దరు ప్రేమలో పడతారు. ఈ విషయం తెలుసుకున్న అల్లీ తల్లిదండ్రులు ఆమెను దూరంగా పంపిస్తారు. ఆ తర్వాత మూడేళ్లకు నోవా ఆర్మీలో జాయిన్‌ అవుతాడు. యుద్ధం చేసే క్రమంలో గాయ పడ్డప్పుడు ట్రీట్‌మెంట్‌ చేయడానికి అల్లీ వస్తుంది. అక్కడ వీళ్ళిద్దరు కలుసుకుని తమ ప్రేమను ఎలా నిజం చేసుకున్నారనేది చిత్ర నేపథ్యం. ఈ చిత్రంలో నోవా పాత్రలో ర్యాన్‌ గోస్లింగ్‌, అల్లీ పాత్రలో రాచెల్‌ మెక్‌ ఆడమ్స్ ల నటన మనల్ని మైమరపిస్తుంది. 
విశేష ప్రేక్షకాదరణ పొంది 11కోట్ల డాలర్లకుపైగా కలెక్షన్లను సాధించిందీ చిత్రం. 
రివల్యూషనరీ రోడ్‌
   ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఓ యువ జంట మధ్య సంఘర్షణ నేపథ్యంలో రూపొందిన బ్రిటీష్‌ అమెరికన్‌ డ్రామా రొమాంటిక్‌ చిత్రం 'రివల్యూషనరీ రోడ్‌'. రిచర్డ్ యేట్స్ రాసిన 'రివల్యూషనరీ రోడ్‌' అనే నవల ఆధారంగా అదే పేరుతో దర్శకుడు సామ్‌ మెండిస్‌ 2008లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పెళ్ళయిన తర్వాత తమ తమ లక్ష్యాల నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగే గొడవలు దుమారం రేపుతాయి. ఓ పక్క చచ్చేంత ప్రేమ ఉన్నప్పటికీ మరోవైపు అదే స్థాయిలో ఇద్దరికీ ఒకటరంటే మరొకరికి ద్వేషం. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి జీవనం ఎలా సాగిందనేదే ఈచిత్రం. టైటానిక్‌ తర్వాత మరోసారి ఇందులో లియోనార్డ్‌ డికాప్రియో, కేట్‌ విన్‌స్లేట్‌ కలిసి నటించారు. అద్భుతమైన నటనతో కేట్స్‌ ఉత్తమ నటిగా గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డునందుకుంది. 
పి.ఎస్‌.ఐ లవ్‌ యూ
   భర్త చనిపోయిన మహిళ కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించిందనే ఇతివృత్తంతో దర్శకుడు రిచర్డ్ ల గ్రావెనిసె రూపొందించిన అమెరికన్‌ రొమాంటిక్‌ డ్రామా చిత్రం 'పి.ఎస్‌. ఐ లవ్‌ యూ'. గెరీ, హోలీ ప్రేమించి పెళ్ళి చేసుకుని హ్యాపీగా జీవితాన్ని లీడ్‌ చేస్తున్న సమయంలో అనుకోకుండా గెరీ చనిపోతాడు. భర్తపోయిన బాధలో కుమిలిపోతున్న సమయంలో పది లెటర్స్ హోలీ జీవితాన్ని మార్చేసి, కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేస్తాయి. గెర్రీ పాగ్రలో గెరార్డ్ బట్లర్‌, హోలీ పాత్రలో హిల్లరీ స్వాంక్‌ నటించారు. ముఖ్యంగా హిల్లరీ నటన మైమరపిస్తుంది. ఈ చిత్రం విశ్వ వ్యాప్తంగా మంచి ఆదరణతోపాటు సుమారు 16కోట్ల డాలర్లు వసూలు చేసింది. 
ద టైమ్‌ ట్రావెలర్స్ వైఫ్‌
   కొన్ని సమయాల్లో మాయమవుతూ, మరికొన్ని సమయాల్లో తన ఆలోచనలు మారుతూ జన్యు పరమైన రుగ్మతతో బాధపడుతున్న ఒక లైబ్రేరియన్‌కి స్థిరమైన జీవితం ఇవ్వాలనుకునే అందమైన అమ్మాయి ప్రేమ నేపథ్యంలో రూపొందిన చిత్రం 'ద టైమ్‌ ట్రావెలర్స్ వైఫ్‌'. ఆండ్రే నిఫ్ఫీ నెగ్గర్‌ 2003లో రాసిన 'ద టైమ్‌ ట్రావెలర్స్ వైఫ్‌' అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాబర్ట్‌ స్వేంట్కే 2009లో రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కించారు. కాలంతో మారిపోతున్న భర్తను మాములు మనిషిని చేసేందుకు భార్య పడే తపనే ఈ చిత్రం. ఇందులో లైబ్రేరియన్‌గా ఎరిక్‌ బన, అతని ప్రియురాలిగా రాచెల్‌ మెక్‌ ఆడమ్స్‌ నటించి మెప్పించారు. ముఖ్యంగా రాచెల్‌ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. పది కోట్ల డాలర్లకుపైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. 
వీటితోపాటు 'ఏ వాక్‌ టు రిమిమ్‌బర్‌', 'బ్రౌన్‌ షుగర్‌', 'ఓన్లీ యు', 'గాన్‌ విత్‌ ద విండ్‌', 'వెన్‌ ఎ మ్యాన్‌ లవ్స్ ఎ ఉమెన్‌', 'ఎవర్‌ ఆఫ్టర్‌: ఎ సిండ్రెల్లా స్టోరీ', 'ట్రిస్టాన్‌ ప్లస్‌ ఐసోల్డ్', 'వాట్‌ డ్రీమ్స్‌ మే కమ్‌', 'సిటి ఆఫ్‌ ఏంజెల్స్', 'అవతార్‌', 'ఇయర్‌ ఆన్‌ ఎర్త్', 'ప్రెట్టీ ఉమెన్‌', 'బ్యూటీ అండ్‌ ద బీస్ట్', 'సెరెండిపిటీ', 'అన్‌టేమ్డ్ హార్ట్', 'ఎ వాక్‌ ఇన్‌ ద క్లౌడ్స్', 'ద మిర్రర్‌ యాస్‌ టూ ఫేసెస్‌', 'ద బ్రిడ్జెస్‌ ఆఫ్‌ మడిసన్‌ కౌంటీ', 'ద బాడీగార్డ్', 'రిమెంబర్‌ మి', 'కాసాబ్లాంకా', 'డర్టీ డాన్సింగ్‌', 'సే ఎనిథింగ్‌', 'ద వే విరు వర్‌' వంటి ప్రేమకథా చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసి అలరించాయి. అనేక అవార్డులతోపాటు కలెక్షన్లలోనూ రికార్డులు సృష్టించి ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని నిరూపించాయి. 

 

 

బాబు..నాదేళ్ల భేటీ చారిత్రాత్మకమైంది - పల్లె..

విజయవాడ : సీఎం చంద్రబాబు, సత్యనాదెళ్ల భేటీ చారిత్రాత్మకమైందని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ఐటీ అభివృద్ధికి సహకారం అందిస్తామని సత్య నాదెళ్ల చెప్పారని తెలిపారు. త్వరలో విశాఖపట్టణంలో సెంటర్ ఫర్ ఎక్స్ లెన్సీ, ఈ - ప్రగతి ఏర్పాటు చేయనున్నట్లు, గన్నవరంలో మేధా టవర్స్ ను ఐటీ సెజ్ గా నోటిఫైడ్ చేయడం జరిగిందన్నారు. అక్కడున్న ఐటీ కంపెనీలకు వేరే వసతి కల్పించడం జరుగుతుందని, ఏపీ అభివృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లో మైక్రో సాఫ్ట్ సహకారం ఉంటుందని సత్యనాదెళ్ల పేర్కొనడం జరిగిందని తెలిపారు. 

రూ.10లక్షల ఆదాయ వర్గాలకు ఎల్పీజీ సబ్సిడీ కట్..

ఢిల్లీ : రూ. 10 లక్షల ఆదాయ వర్గాలకు ఎల్పీజీ సబ్సిడీ ఎత్తివేతకు ప్రభుత్వం నిర్ణయించింది. పెట్రోలియం శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 16.35 కోట్ల ఎల్పీజీ వినియోగదారులున్నారని పేర్కొంది. 

17:15 - December 28, 2015

మెదక్ : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన భిన్నంగా సాగింది. సోమవారం సిద్ధిపేటలో రూ.2 కోట్ల 10 లక్షలతో నిర్మించిన స్టేడియాన్ని ప్రారంభించేందుకు అక్కడకు చేరుకున్నారు. కానీ పనులు నాసిరకంగా ఉండడాన్ని హరీష్ గమనించారు. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు మెమో జారీ చేసి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడనే ఆదేశాలు జారీ చేశారు. మరో 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసి ప్రారంభం చేయకుండానే మంత్రి హరీష్ వెనుదిరిగారు. అంతకుముందు పట్టణంలో జరుగుతున్న ఫుట్ పాత్, స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం చినకోడూరు మండలంలోని పలు గ్రామాల్లో మహిళా భవనాలను, గ్రామ పంచాయతీ భవనాలను ఆయన ప్రారంభించారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికలకు మూడు నెలలుగా ప్రణాళికలు - నాగిరెడ్డి..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలకు మూడు నెలలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి పేర్కొన్నారు. రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి పంపడం జరిగిందని, రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించిన వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఎన్నికల కోసం 12 వేల ఈవీఎంలు, 50 వేల సిబ్బందిని సిద్ధం చేస్తున్నట్లు నాగిరెడ్డి పేర్కొన్నారు. 

16:40 - December 28, 2015

సినీ పరిశ్రమలో దర్శకులు అనేక చిత్రాలు తీస్తుంటారు. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రేమ, ఫ్యామిలీ సెంటిమెంట్, పగలు.. ప్రతీకారాలు, అనుబంధ బాంధవ్యాలు, వినోద భరితం, హర్రర్, హర్రర్ కామెడీ వంటి పలు రకాలు చిత్రాలను తీస్తుంటారు. రొటీన్‌ బిజీ వర్క్ తో క్షణం తీరిక లేకుండా నాలుగు గోడల మధ్య బందీగా ఉంటున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో మనదీ ఒక జీవితమేనా..? అసలైన జీవితమంటే ఇది కాదు కదా అని రిలీఫ్‌ కోసం ఓ నాల్రోజులు బయటి ప్రపంచాన్ని చూడాలని తపిస్తారు. సరిగ్గా ఇటువంటి ఆలోచనలకు ప్రతీకగా జర్నీ నేపథ్యంలో దర్శక, నిర్మాతలు బోల్డన్ని చిత్రాల్ని నిర్మించారు. సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూ జీవిత గొప్పతనమేంటో చాటిన చిత్రాల గురించి 'నవచిత్రం' పాఠకులకు ఈ వారం అందిస్తున్న స్పెషల్‌ షో...

ద మోటర్‌ సైకిల్‌ డైరీస్‌...
   క్యూబా విప్లవ వీరుడు చెగువేరా మెడిసిన్‌ చదువుతున్న సమయంలో తనను తాను తెలుసుకోవడం కోసం స్నేహితుడు అల్బర్టో గ్రానడోతో కలిసి దక్షిణ అమెరికా మొత్తం చుట్టేస్తాడు. నాలుగు నెలల పాటు దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్లు మోటర్‌ సైకిల్‌పై ప్రయాణిస్తారు. ఈ క్రమంలో అక్కడి ప్రజల జీవన విధానం ఎంత దుర్భరంగా ఉందో తెలుసుకుంటారు. చెగువేరా విప్లవ వీరుడుగా మారడానికి ఈ జర్నీ నాందిగా నిలిచిన కథాంశమిది. చెగువేరా రాసుకున్న డైరీ ఆధారంగా దర్శకుడు వాల్టర్‌ సల్లేస్‌ 'ద మోటర్‌ సైకిల్‌ డైరీస్‌' చిత్రాన్ని 2004లో తెరకెక్కించారు. ప్రపంచాన్ని మార్చే మనిషిగా చెగువేరాను తయారు చేయడంలో జర్నీ ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఈ చిత్రంలో చెగువేరా పాత్రలో గేల్‌ గార్సియా బెర్నాల్‌, స్నేహితుడు అల్బెర్టో పాత్రలో రోడ్రిగో డి లసేర్న నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విశేషప్రేక్షకాదరణ పొంది కలెక్షన్ల వర్షం కురిపించింది.
'ద వే'...
  కంటి వైద్యుడికి ఉన్న ఒక్కగానొక్క కొడుకు తుఫాన్‌ కారణంగా చనిపోతాడు. కొడుకు మళ్ళీ బతికి రావాలని తపిస్తుంటాడు. ఎంత తపించిన ఫలితం లేకపోయే సరికి కొడుకు ఆస్తికలను తీసుకుని కాలి నడకన ఓ యాత్రకు బయలు దేరాలని నిర్ణయించుకుంటాడు. ఈ కాలి నడక ప్రయాణంలో ఆయన ఎన్నో కొత్త విషయాలతోపాటు జీవితపు గొప్పతనాన్ని తెలుసుకోవడమనే ఇతివృత్తంతో దర్శకుడు ఏమిలియో ఎస్తేవేజ్‌ 2010లో రూపొందించిన అమెరికన్‌ చిత్రం 'ద వే'. తోటి వారితో వైరుధ్యంగా కాకుండా సాధ్యమైనంత వరకు మంచిగా మెలిగితే ఏదైనా సాధించవచ్చనే సందేశమించే ఈ చిత్రంలో కంటి వైద్యుడి పాత్రలో మార్టిన్‌ షీన్‌ నటించారు. ఆయన నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతోపాటు భారీ కలెక్షన్లను రాబట్టింది. 
'180 డిగ్రీ సౌత్‌'..
   యోన్‌ చౌనార్డ్, డౌ టాంప్కిన్స్, జెఫ్‌, టిమ్మీ వంటి హాలీవుడ్‌ హీరోలు 1968లో పటగోనియా వరకు చేసిన సాహస యాత్ర ఆధారంగా జెఫ్‌ జాన్సన్‌ రాసిన కథతో క్రిస్‌ మాల్లోవ్‌ 2011లో రూపొందించిన చిత్రం '180 డిగ్రీ సౌత్‌'. నిజజీవితంలో చేసిన జర్నీ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిండంతోపాటు ఆయా పాత్రల్లోనూ వారే నటించడం విశేషం. మన జీవితం ఎక్కడ నుంచి ప్రారంభమవుతుందో చివరికి అక్కడికే చేరుకుంటుందనే స్ఫూర్తి నింపే సందేశంతో రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది.
'వైల్డ్'...
   తన జీవితంలో చోటు చేసుకున్న విషాదం నుంచి బయటపడడం కోసం ఓ అమ్మాయి దాదాపు 1100 మైళ్ళు ఒంటరిగా ప్రయాణం సాగించడమే ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు జీన్‌ మార్క్‌ వల్లీ తెరకెక్కిం చిన అమెరికన్‌ బయోగ్రాఫికల్‌ చిత్రమిది. అమ్మాయి పాత్రలో రీస్‌ విథర్స్పూన్‌ నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంలనందుకుని కలెక్షన్లలో సత్తా చాటింది. 
'వన్‌ వీక్‌'..
  టొరొంటోలో నివసిస్తున్న ఓ యువ స్కూల్‌ టీచర్‌ తన జీవితానికి అర్థం, పరమార్థం తెలుసుకోవడం కోసం చేసే అన్వేషణ నేపథ్యంలో దర్శకుడు మైఖేల్‌ మెక్‌ రూపొందిం చిన కెనడియన్‌ చిత్రమిది. 2008లో విడుదలైన ఈ చిత్రంలోని టీచర్‌ పాత్రలో జాషువా జాక్సన్‌ నటించారు. ఆద్యంతం నాటకీయ పరిణామాల సన్నివేశాల సమాహారంగా సాగే ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. 
'ట్రాక్స్'..
   తన జీవితం గురించి తెలుసుకోవడానికి రాబిన్‌ డేవిడ్‌సన్‌ అనే మహిళ 1977లో నాలుగు ఒంటెలు, పెంపుడు కుక్కతో కలిసి ఒంటరిగా ఆస్ట్రేలియాలో దాదాపు 2700 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రయాణం చేయడమనే యదార్థ కథ ఆధారంగా దర్శకుడు జాన్‌ కుర్రన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 
  2013లో విడుదలైన ఈ చిత్రంలోని రాబిన్‌ డేవిడ్సన్‌ పాత్రలో మియా వాసికో వస్కా నటించారు. ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అవార్డులను సైతం గెలుచుకుంది. 
'ద సీక్రెట్‌ లైఫ్‌ ఆఫ్‌ వాల్టర్‌ మిట్టీ'...
  వాల్టర్‌ మిట్టీ అనే రిపోర్టర్‌ 'లైఫ్‌ మెగజీన్‌'లో 16ఏళ్ళుగా పనిచేస్తుంటాడు. ఇంకా పెళ్ళి కాని వాల్టర్‌ తన తోటి ఫొటోజర్నలిస్ట్‌ అయిన చెర్రీని చూసి ఇష్టపడతాడు. కాని ధైర్యంగా తన భావాలను వ్యక్తం చేయలేని వాల్టర్‌ కలలు కంటూ, ఆ కలల్లో ప్రపంచాన్ని అంతా చుట్టేయడమనే ఇతివృత్తంతో దర్శకుడు బెన్‌ స్టిల్లర్స్‌ రూపొం దించిన రొమాంటిక్‌ కామెడీ, డ్రామా చిత్రమిది. వాల్టర్‌ పాత్రలో కూడా దర్శకుడే నటించి అలరించారు. ఈ చిత్రం 19 కోట్ల డాలర్లను వసూలు చేసింది.
'ఔట్‌ ఆఫ్‌ ఆఫ్రికా'...
   తోటల యజమాని అయిన కరెన్‌ బ్లిక్సెన్‌ అనే మహిళ అడవిలో వేటగాడిని చూసి ఇష్టపడుతుంది. అతనితో కలిసి ఆఫ్రికా మొత్తం తిరుగుతుంది. ఈ క్రమంలో వారెలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు? తెలుసుకున్న కొత్త విషయాలేంటనే అంశంతో 'ఔట్‌ ఆఫ్‌ ఆఫ్రికా' అనే పుస్తకం ఆధారంగా దర్శకుడు సిడ్ని పోలాక్‌ రూపొందించిన అమెరికన్‌ ఎపిక్‌ రొమాంటిక్‌ డ్రామా చిత్రం. ఇందులో కరెన్‌ పాత్రలో మెర్రీ స్ట్రీప్‌, వేటగాడి పాత్రలో రాబర్ట్‌ రెడ్‌ఫోర్డ్‌ నటించారు. ఈ చిత్రం సుమారు 13 కోట్ల డాలర్లు వసూలు చేసింది. జర్నీ ఎంత అందంగా ఉంటుందో తెలియజేసే చిత్రమిది.
'ద వే బ్యాక్‌'... 
  టిబెట్‌ దేశానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పారిపోయి దాదాపు 4వేల మైళ్లు నడిచి ఇండియాకు వస్తారు. ఈ క్రమంలో ఇంట్లో పలు ఇబ్బందుల్ని ఎదుర్కొని తమలాగే పారిపోయి వచ్చిన మరి కొంత మంది వ్యక్తులు కలుస్తారు. వారంతా కలిసి ఇండియాకు చేసే జర్నీలో చూసిన సంఘటనలు, ఎదురైన అనుభవాల నేపథ్యంలో రూపొందించిన సర్వైవల్‌ డ్రామా చిత్రమిది. ఈ చిత్రాన్ని 2010లో దర్శకుడు పీటర్‌ వెయిర్‌ రూపొందించారు.
'లిటిల్‌ మిస్‌ సన్‌షైన్‌'...
  మెక్సికోలోని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన టీనేజ్‌ యువతి అందాల పోటీల్లో పాల్గొనాలని తాపత్రయపడుతుంది. ఆ పోటీలో పాల్గొనేందుకు తమ వి డబ్ల్యూ బస్‌లో కుటుంబమంతా కలిసి వెళ్తుంటారు. దారి తెలియక వారంతా దేశమంతా తిరగడమనే ఇతివృత్తంతో భార్యాభర్తలైన దర్శకులు జోనాథన్‌ డేటన్‌, వాలెరీ ఫారిస్‌ తొలి ప్రయత్నంగా రూపొందించిన అమెరికన్‌ కామెడీ డ్రామా రోడ్‌ జర్నీ చిత్రమిది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ నవ్వించడంతోపాటు రెండు విభాగాల్లో ఆస్కార్‌ అవార్డులనందుకుంది. పదికోట్ల డాలర్లకుపైగా వసూళ్లను రాబట్టింది. 
'ఉన నోచ్‌'...
   హవానాలో కొంత మంది నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న రౌల్‌ సముద్రం ద్వారా మియామికి పారిపోతాడు. ఓ రాత్రి తీవ్ర ఒత్తిడి, ఉద్రిక్తతల నడుమ స్నేహితుడితో కలిసి ప్రయాణం చేస్తూ ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నాడనే ఇతివృత్తంతో లూసీ ముల్లోరు రూపొందించిన థ్రిల్లర్‌ చిత్రం 'ఉననోచ్‌'. రౌల్‌ పాత్రలో దారియేల్‌ అర్రెచడ అద్భుతంగా నటించారు. ఈ చిత్రం విశేషప్రేక్షకాదరణతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులందుకుంది. 
'ద రోడ్‌ వితిన్‌'... 
  ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్న కుర్రాడు, అదే వ్యాధితో మరణించిన తన తల్లి అస్తికలను సముద్రంలో కలపడానికి ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రయాణిస్తాడు. ఈ జర్నీలో ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ, ఈ జర్నీ ఆ కుర్రాడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయనే ఇతివృత్తంతో దర్శకుడు గ్రీన్‌ వెల్స్ రూపొందించిన అమెరికన్‌ చిత్రం 'ద రోడ్‌ వితిన్‌'. 
     'ద బెస్ట్ ఎక్సోటిక్‌ మారిగోల్డ్ హోటెల్‌', 'క్యూ టాన్‌ లెజోస్‌', 'థేల్మా లౌసే', 'లాంగ్‌ వే రౌండ్‌', 'ప్రిస్కిల్లా', 'ద ఆర్ట్ ఆఫ్‌ ట్రావెల్‌', 'ఈజీ రైడర్‌', 'సిన్‌ నోహ బ్రే', 'ట్రిప్‌ టు ఇటలి', 'ఎన్‌కౌంటర్స్' వంటి చిత్రాలు సైతం సరికొత్త జీవితాన్ని పరిచయం చేస్తాయి.

16:36 - December 28, 2015

ఢిల్లీ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్ లో కేంద్రంపై వార్ కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విషయంలో తనకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ అడుక్కొంటోందని ఎద్దేవా చేశారు. అయితే తాను మాత్రం క్షమాపణలు చెప్పే పరిస్థితి లేదని కుండబద్ధలు కొట్టారు. జైట్ల పరువు నష్టం కేసు సందర్భంలో నిజాలు బయటకొస్తాయని, డీసీసీఏపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. నివేదికలో ఎవరీ పేరు ప్రస్తావించలేదని కానీ పలు అవినీతి కార్యకలాపాలు జరిగినట్లు విచారణ కమిటీ పేర్కొందని తెలిపారు. డీసీసీఏ అవినీతికి సంబంధించి జైట్లీని కూడా ప్రశ్నించాల్సినవసరం ఉందని కేజ్రీవాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

16:31 - December 28, 2015

నిజామాబాద్ : నిజాం షుగర్ ఫ్యాక్టరీని అక్రమంగా మూసివేసే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్..కార్మికులకు సమాచారం అందించకుండా ఇలా చేయడం దారుణమని కార్మికులు పేర్కొన్నారు. నిజాం షుగర్స్ ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొంటూ కార్మిక సంఘం నేత పాలడుగు భాస్కర్ అదనపు లేబర్ కమిషనర్ కు మెమోరాండం సమర్పించారు. కార్మికుల జీవితాలతో కంపెనీలు చెలగాట ఆడుతున్నాయని, కార్మికులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. 

16:25 - December 28, 2015

హైదరాబాద్ : తనపై దాడి జరిగిందన్న వార్తలను గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ స్పష్టం చేశారు.. సోమవారం ఉప్పల్ కాంగ్రెస్ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా దానం నాగేందర్ పై దాడి జరిగిందని..దీనిపై ఇరువర్గాలు పీఎస్ లో ఫిర్యాదు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై దానం మీడియాతో మాట్లాడారు. స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన లక్ష్మారెడ్డికి మధ్య విబేధాలున్నాయన్నారు. గతంలో తాను ఇరువురికి సర్ది చెప్పడం జరిగిందన్నారు. సోమవారం అక్కడకు వెళ్లిన తరువాత ఇద్దరి మధ్య తగదాలున్నాయని తెలుస్తోందన్నారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగితే కొట్లాడడం తగదని సర్ది చెప్పడం జరిగిందన్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జెండా ఎగురవేశారని, మధ్యలో ఉండడం వల్ల జెండాను తాను ఎగురవేయడం జరిగిందన్నారు. తప్పు జరిగితే సరిదిద్దుకుంటానని దానం పేర్కొన్నారు. ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని తెలిపారు. 

16:20 - December 28, 2015

మహబూబ్ నగర్ : అధికంగా డబ్బులు సంపాదించాలనే తపన పెరిగిపోతోంది. అక్రమమార్గంలో..ఇతరులను మోసం చేస్తూ డబ్బులను కొంతమంది సంపాదిస్తున్నారు. ఓ వ్యక్తి మాత్రం సేవా మహిళ పొదుపు రూపంలో కుంభకోణానికి పాల్పడ్డాడు. ఈఘటన జిల్లాలోని గద్వాలలో చోటు చేసుకుంది. విజయ్ కుమార్ అనే వ్యక్తి గద్వాలలో ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు. సమైక్య మహిళా సంఘం అంటూ ఒకటి ఏర్పాటు చేశాడు. చాలా గ్రామాల్లో పొదుపు సంఘాలు ఏర్పాటు చేశాడు. అందులో కొందరు మహిళలను లీడర్లుగా నియమించుకున్నాడు. ఒక్కో మహిళా సంఘంలో 10-15 మంది మహిళా సభ్యులుగా ఉన్నారు. ఇలా 200 సంఘాలు ఏర్పాటయ్యాయి. వీరి నుండి ఇతర మహిళల ద్వారా డబ్బులు సేకరించాడు. వడ్డీ ఇస్తామని..రుణాలు ఇస్తామని నమ్మబలికాడు. ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే డబుల్ అమౌంట్ ఇస్తామని నమ్మబలికాడు. దీనితో కొంతమంది నమ్మి ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. మరికొంతమంది పొదుపు చేస్తున్నారు. వీరికందరికీ విజయ్ కుమార్ కాల పరిమితి చెక్కులు ఇచ్చాడు. సోమవారం ఈ చెక్కులు బౌన్స్ అయ్యాయి. విషయం తెలుసుకున్న మహిళా సంఘం సభ్యులు గద్వాల కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడున్న వారిని నిలదీశారు. బ్యాంకులో డబ్బులు లేవని..తరువాత ఇస్తామని చెప్పారు. దీనికి మహిళా సంఘ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకురన్నారు. తమ దగ్గరి నుండి కొంతమంది రుణాలు తీసుకున్నారని విజయ్ కుమార్ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. రూ. 8 కోట్ల డబ్బుల వరకు డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ వడ్డీ ఆశ చూపి తమతో డబ్బులను డిపాజిట్ చేయించుకున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ఒక్కో సంఘం సభ్యురాలికి రూ. 3 లక్షల నుండి ఆరు లక్షల వరకు మోసం చేసినట్లు తెలుస్తోంది. రూ. 8 కోట్ల నుండి రూ. 10 కోట్ల వరకు మహిళలకు టోకరా పెట్టినట్లు సమాచారం. ఇతని వెనుక ఎవరున్నారు ? ఎంత కుంభకోణానికి పాల్పడ్డాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సేవా మహిళా సంఘాల పొదుపు పేరిట భారీ స్కాం..

మహబూబ్ నగర్ : జిల్లాలోని గద్వాలలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. సేవా మహిళా సంఘాల పొదుపు రూపంలో కుంభకోణం జరిగింది. పొదుపు సంఘాల పేరిట 25 సంవత్సరాలుగా డబ్బు వసూలు చేశారు. 200 సంఘాల నుండి డిపాజిట్ రూపంలో రూ. 25 వేలు వసూలు చేశారు. ఎనిమిది సంవత్సరాల్లో రూ.50వేలు చెల్లిస్తానంటూ నమ్మబలికారు. డిపాజిట్ దారులకు చెక్కుల పంపిణీ చేశారు. కానీ చెక్కులు బౌన్స్ అయ్యాయి. బ్యాంకులో నగదు లేదంటూ బాధితులను తిప్పి పంపారు. ఒక్కో సంఘం సభ్యురాలికి రూ. 3 లక్షల నుండి ఆరు లక్షల వరకు మోసం చేసినట్లు తెలుస్తోంది. రూ. 8 కోట్ల నుండి రూ. 10 కోట్ల వరకు మహిళలకు టోకరా పెట్టినట్లు సమాచారం.

రేవంత్ రెడ్డిపై పీఎస్ లో ఫిర్యాదు..

హైదరాబాద్ : టి.టిడిపి నేత రేవంత్ రెడ్డిపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. అయిత చండీయాగంపై విమర్శలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. 273 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

త్రినేత్ర కన్సల్టెన్సీ ఘరానా మోసం..

హైదరాబాద్ : పంజాగుట్టలో త్రినేత్ర కన్సల్టెన్నీ ఘరానా మోసానికి పాల్పడింది. విదేశాలకు పంపిస్తామని 250 మందికి కుచ్చుటోపి వేసింది. ఒక్కొక్కరి నుండి కన్సల్టెన్సీ రూ. 75వేలు వసూలు చేసింది. పంజాగుట్ట పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. 

దాడి జరగలేదు - దానం..

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిని నిర్ణయించేది అధిష్టానమని, అధిష్టానం నిర్ణయం మేరకు నడచుకుంటానని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ పేర్కొన్నారు. స్పష్టం చేశారు. తనపై దాడి జరగలేదని స్థానిక నేతల మధ్య తోపులాట చోటు చేసుకుందని, ఉప్పల్ లో రంగారెడ్డి జిల్లా నేతలు తనకంటే ముందే జెండా ఎగరవేశారనే విషయం తెలియదన్నారు. తప్పు సరిదిద్దుకోవడానికి తాను సిద్ధమని దానం తెలిపారు. 

నీరు - ప్రగతిపై రేపు వర్క్ షాప్ - రావెల..

హైదరాబాద్ : నీరు - ప్రగతిపై మంగళవారం వర్క్ షాప్ ఉంటుందని మంత్రి రావెల పేర్కొన్నారు. నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం, నదుల అనుసంధానం..భూగర్భ జలాల వంటి అంశాలపై వర్క్ షాప్ ఉంటుందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల వేతనం రూ.1500 మేర పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఢిల్లీలో ఏపీ డీజీపీ రాముడు..

ఢిల్లీ : ఏపీ డీజీపీ రాముడు ఢిల్లీలో పర్యటించారు. ఐజీ చీఫ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శులతో భేటీ అయ్యారు. ఏపీకి అదనంగా 25 మంది ఐపీఎస్ లను కేటాయించాలని, పోలీసు శిక్షణా సంస్థల ఏర్పాటుకు నిధులు..అదనపు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలను కేటాయించాలని హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షిని డీజీపీ రాముడు కోరారు. 

రాజీవ్ శర్మతో ప్రణాళిక..ఆర్థిక ఆరోగ్య శాఖ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో ప్రణాళిక, ఆర్థిక, ఆరోగ్య శాఖ కార్యదర్శులు భేటీ అయ్యారు. హెల్త్ కార్డుల అమలు తీరు, లోటుపాట్లపై చర్చించారు. 

వేముల వాడ సన్నిధిలో కేసీఆర్ దంపతులు..

కరీంనగర్ : వేములవాడ రాజన్న సన్నిధికి సీఎం కేసీఆర్ దంపతులు చేరుకున్నారు. కేసీఆర్ కు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

గుడివాడ ఆంధ్రాబ్యాంకులో పోలీసులు..

కృష్ణా : గుడివాడ ఆంధ్రా బ్యాంకులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రుణాల గోల్ మాల్ వ్యవహారంలో రికార్డులను పరిశీలించారు. బినామీల పేరిట రూ. 4 కోట్ల వరకు రుణాలు పొందారని వారం క్రితం బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేశారు. 

15:54 - December 28, 2015

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తున్నారంటే... మెగా అభిమానులకు పండగే. మెగా  ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు కేవలం హీరోలు మాత్రమే వచ్చారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి హీరోయిన్ కూడా రాబోతుంది. ఆమె ఎవరనుకుంటున్నారా...? మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదెల నీహారిక. 

 'మల్లెల తీరంలో సిరి మల్లెపువ్వు' చిత్రంతో మెప్పించిన దర్శకుడు రామరాజు దర్శకత్వంలో 'ఒక్కమనసు' అనే చిత్రంలో నీహారిక నటిస్తోంది. ఆమెకు జోడీగా యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ లో భాగంగా నీహారిక చీరకట్టి తళుక్కున్నమెరిసింది. 

చిత్ర యూనిట్ తో ఆమె కలిసి దిగిన ఫోటో ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది. రొమాంటిక్, ప్రేమ తరహాలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు మెగా ఫ్యాన్స్. 

15:34 - December 28, 2015

ఆసక్తికి పదును పెడుతూ వ్యర్థాలతో చక్కని వస్తువులు తయారు చేసే కళ కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి కళతో ముచ్చటైన రూపాలను ఓ అతివ తయారు చేస్తోంది. ఎలాంటి వస్తువులు తయారు చేశారో వీడియోలో చూడండి..

15:31 - December 28, 2015

నాన్న మాటలు ఆమె భవిష్యత్ ను నిర్ధేశించాయి. చిన్ననాటి ఆలోచనలను ఆమెలో సేవానిరతిని పెంచాయి. కష్టాలను చూసి చలించిపోయే ఆమె మనస్థత్వం ఎంతోమంది చిన్నారులకు చక్కటి భవిష్యత్ ను అందిస్తోంది. సేవా భావం కొందరికి మాత్రమే సొంతం. తమకు లేకపోయినా పక్కవారి సంతోషమే లక్ష్యంగా పనిచేయాలని తపన పడడం అరుదైన లక్షణం. అలాంటి అరుదైన లక్షణానికి ప్రతీక నిలుస్తోంది ఓ అతివ. అలా వేలాది మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న అతివ రోశి పై కథనం..ఎంతో మంది పిల్లల జీవితాలకు మార్గదర్శకాన్నిస్తూ, బాధ్యాతాయుతమైన పౌరులను తీర్చిదిద్దుతున్న రోజీ కృషి స్పూర్తిదాయకం. తమ గూటికి చేరిన ప్రతి చిన్నారి జీవితంలో వెలుగులు నింపేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. అలాంటి సేవలు భవిష్యత్ లో మరెంతో మంది చిన్నారులకు చేరాలని మానవి ఆకాంక్షిస్తోంది. వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:26 - December 28, 2015

హైదరాబాద్ : సవతి తల్లి..తండ్రి చేతిలో దారుణమైన వేధింపులకు గురైన ప్రత్యూష కేసు హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తండ్రి ఆస్తులను ప్రత్యూష పేరిట మార్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెంటర్ అగ్రిమెంటూ ప్రత్యూష పేరు మీదే ఉండాలని కోర్టు సూచించింది. గతంలో ప్రత్యూషను గదిలో బంధించి మానసికంగా, శారీరకంగా సవతి తల్లి, తండ్రి వేధింపులకు పాల్పడ్డారు. దీనిని కోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించిది. ప్రత్యూష సంరక్షణను స్వయంగా తీసుకుంటానని సీఎం కేసీఆర్ ముందుకొచ్చారు. అనంతరం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం కోర్టులో ప్రత్యూష హాజరైంది. రక్షించే బాధ్యతను స్వచ్ఛంద సంస్థకు అప్పగించింది. ఆమె సంరక్షణ కోసం తీసుకున్న చర్యలపై ధర్మాసనం ఆరా తీసింది. ప్రభుత్వం ఇచ్చే 5లక్షలను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి దానిపై వచ్చే వడ్డీని ఖర్చులకు అందేలా చూడాలని అప్పట్లో కోర్టు ఆదేశించింది. ఇక పద్మారావు నగర్‌లోని ఫ్లాట్‌ అద్దెను ప్రత్యూష బ్యాంక్‌ అకౌంట్‌లో వేయాలని, ఆమె సంరక్షణ కోసం తన తరపున ఏమిస్తారో తండ్రితో మాట్లాడాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో జైల్లో ఉన్న తండ్రికి మాత్రమే బెయిల్ మంజూరు చేసిన కోర్టు సవతి తల్లికి బెయిల్ మంజూరు చేయలేదు. 

15:13 - December 28, 2015

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ నేత దానంపై ఉప్పల్ కు చెందిన కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. దానంపై కోడిగుడ్లు..టమాటలు విసరడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన ఉప్పల్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఉప్పల్ కాంగ్రెస్ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సభకు రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను వారు ఆవిష్కరించారు. అనంతరం గ్రేటర్ కాంగ్రెస్ నేత దానం..అతని అనచరులు ఉప్పల్ ప్రాంతానికి చేరుకున్నారు. పార్టీ నేతలు ఆవిష్కరించిన జెండాలను తొలగించి మళ్లీ జెండాలను దానం వర్గీయులు ఆవిష్కరించారు. దీనికి తీవ్ర ఆగ్రహానికి గురైన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు దానం వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. పార్టీకి చెందిన కర్రలతో..గుడ్లు..టమాటలతో దాడి చేశారు. అక్కడనే పోలీసులు రంగ ప్రవేశం చేసి దానంను సురక్షితంగా బయటకు పంపించి వేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. దానం గ్రేటర్ హైదరాబాద్ కు మాత్రమే అధ్యక్షుడని శివారు ప్రాంతాలకు రావొద్దని కార్యకర్తలు నినాదాలు చేశారు. దీనితో ఆప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

ఛండీఘడ్ లో కూలిన భవనం..ఆరుగురు మృతి..

ఛండీఘడ్ : ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

 

వేముల వాడకు చేరుకున్న సీఎం కేసీఆర్...

కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా వేములవాడకు చేరుకున్నారు. మరికాసేపట్లో వేములవాడ రాజన్నను సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకోనున్నారు.

 

హైకోర్టులో ప్రత్యూష కేసు విచారణ..

హైదరాబాద్ : హైకోర్టులో ప్రత్యూష కేసు విచారణ జరిగింది. తండ్రి ఆస్తులను ప్రత్యూష పేరిట మార్చాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెంటర్ అగ్రిమెంటూ ప్రత్యూష పేరు మీదే ఉండాలని కోర్టు సూచించింది. 

దానంపై దాడి..

హైదరాబాద్ : ఉప్పల్ కాంగ్రెస్ ఆవిర్భావ సభలో రసాభాస చోటు చేసుకుంది. దానంపై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. దానం గ్రేటర్ హైదరాబాద్ కు మాత్రమే అధ్యక్షుడని శివారు ప్రాంతాలకు రావొద్దని కార్యకర్తలు నినాదాలు చేశారు. 

మైక్రోసాఫ్ట్..ఇన్ఫోసిస్ సీఈవోలతో కేటీఆర్ సమావేశం..

హైదరాబాద్ : మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, ఇన్ఫోసిస్ సీఈవోతో కీలక అంశాలు చర్చించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల్లో విద్యారంగం అభివృద్ధికి సహకరిస్తామని, క్లౌడ్ టెక్నాలజీకి సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీనిచ్చారని తెలిపారు. ఇన్ఫోసిస్ క్యాంపస్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ను ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ ఆహ్వానించినట్లు చెప్పారు.

 

పాతబస్తీలో సైకో వీరంగం..

విజయవాడ : పాతబస్తీ బ్రాహ్మణ వీధిలో సైకో వీరంగం సృష్టించాడు. ఇళ్లలోకి చొరబడి సామాన్లను ధ్వంసం చేశాడు. బైక్ లపై వెళుతున్న వారిపై కూడా సైకో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  

14:38 - December 28, 2015

ఢిల్లీ : ఎనిమిది దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రలో 2015 సంవత్సరానికి ఓ ప్రత్యేక స్థానమే ఉంటుంది. ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన సంవత్సరం ఇది. భారత క్రికెట్ బోర్డుకు మాత్రమే కాదు...మొత్తం మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుత ఏడాదికాలం భారతజట్లకు మిశ్రమ అనుభూతులను మిగిల్చింది. మరికొద్దిరోజుల్లో చరిత్ర పుటల్లో చేరిపోనున్న 2015 సంవత్సరంలో భారత క్రికెట్ హైలైట్స్ పై కథనం..

మిశ్రమ అనుభూతులు...
2015 సంవత్సరం భారత క్రికెట్ అభిమానులకు కొంచె ఇష్టం, కొంచెం కష్టంగా మిగిలిపోతుంది. కాలగమనంలో సంవత్సరాల వస్తూ,పోతూ ఉంటాయి. అయితే భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా గుర్తుండి పోయే సంవత్సరాలలో ఒకటిగా 2015 మిగిలిపోతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలిక మాత్రమే కాదు...టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్లకు మిశ్రమ అనుభూతులు మిగిల్చిన సంవత్సరంగా 2015 గుర్తుండిపోతుంది.

మ్యాచ్ ఫిక్సింగ్..స్పాట్ ఫిక్సింగ్...
ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల దెబ్బతో బోర్డు అధ్యక్షుడి పదవికి శ్రీనివాసన్ దూరమైతే సరికొత్త అధ్యక్షుడుగా శశాంక్ మనోహర్ పగ్గాలు చేపట్టారు. భారత క్రికెట్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. పారదర్శకంగా పనిచేస్తానంటూ శపథం చేసి మరీ..ఆ దిశగా చర్యలు చేపట్టారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు తెరదించడంతో...గవాస్కర్, రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ, అనీల్ కుంబ్లే లాంటి దిగ్గజ క్రికెటర్లు కేవలం ఒక్క పదవికి మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. రెండుచేతులా ఆర్జించడానికి శశాంక్ మనోహర్ చెక్ చెప్పారు. ఐపీఎల్ అవినీతిలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న చెన్నై, జైపూర్ ఫ్రాంచైజీలపైన బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించడంతో...ఆ రెండు ఫ్రాంచైజీల స్థానంలో...పూణే, రాజ్ కోట్ ఫ్రాంచైజీలు సరికొత్తగా ఐపీఎల్ తెరమీదకు వచ్చాయి. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 9వ సీజన్ సైతం ఎనిమిదిజట్లతోనే నిర్వహించడానికి మార్గం సుగమమయ్యింది.

పరాజయాలే ఎక్కువ..
ఇక..భారత క్రికెట్ జట్ల జయాపజయాలను చూస్తే...విజయాలకంటే పరాజయాలనే ఎక్కువగా మిగిల్చిన సంవత్సరం ఇది. ప్రపంచ చాంపియన్ టీమిండియా...బంగ్లాదేశ్ చేతిలో మొట్టమొదటిసారిగా వన్డే సిరీస్ ను కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు..సౌతాఫ్రికా చేతిలో సైతం టీమిండియాకు టీ-20, వన్డే సిరీస్ ల్లో పరాజయాలు తప్పలేదు. అయితే విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత టెస్ట్ జట్టు మాత్రం చెప్పుకోదగ్గ విజయాలు నమోదు చేసింది. శ్రీలంక గడ్డపై శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ ను రెండుదశాబ్దాల విరామం తర్వాత భారత్ నెగ్గి సంచలనం సృష్టించింది. భారత ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా రాణించి..విదేశీ గడ్డపైన సైతం తనకు ఎదురేలేదని నిరూపించుకొన్నాడు. అంతేకాదు..ప్రపంచనెంబర్ వన్ సౌతాఫ్రికాతో ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను టీమిండియా 3-0తో నెగ్గి సంచలనమే సృష్టించింది. అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రాలతో కూడిన ముగ్గురు స్పిన్నర్ల ఎటాక్ తో పవర్ ఫుల్ సఫారీ బ్యాటింగ్ ఆర్డర్ ను టీమిండియా కకావికలు చేసి భారీ విజయాలు నమోదు చేసింది. మొహాలీ, నాగపూర్, న్యూఢిల్లీ వేదికలుగా ముగిసిన టెస్ట్ మ్యాచ్ ల్లో భారత స్పిన్నర్లు విశ్వరూపమే ప్రదర్శించారు. ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకొని టెస్ట్ క్రికెట్ ఆల్ రౌండర్లలోనే నెంబర్ వన్ గా నిలిచాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు ముందు వరకూ 5వ ర్యాంక్ లో ఉన్న భారత్...సఫారీలపై సిరీస్ విజయం తర్వాత..రెండోర్యాంక్ కు చేరుకోగలిగింది. సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సెహ్వాగ్ లాంటి సీనియర్ క్రికెటర్ల రిటైర్మెంట్ తో ఏర్పడిన లోటును ..యువక్రికెటర్లు మురళీ విజయ్, అజింక్యా రహానే, రోహిత్ శర్మ విజయవంతంగా భర్తీ చేయగలిగారు. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని నవతరం భారత టెస్టు జట్టు రెండు ప్రధాన సిరీస్ లు గెలుచుకోడం ద్వారా తన సత్తా చాటుకోగలిగింది.

క్రికెటర్ల వివాహాలు..
ఇక...భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, యంగ్ గన్ రోహిత్ శర్మ..తమతమ స్నేహితురాళ్లను జీవితభాగస్వాములుగా చేసుకోడం ద్వారా..ఓ ఇంటివారు కాగలిగారు. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ సైతం తన స్నేహితురాలు హేజిల్ కీచ్ తో నిశ్చితార్థం ద్వారా వెడ్డింగ్ బెల్స్ మోగించాలని నిర్ణయించాడు. భారత ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, స్వింగ్ బౌలర్ జహీర్ ఖాన్ సైతం..క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకొంటున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద..2015 సంవత్సరం భారత క్రికెట్ అభిమానులకు కొంచె ఇష్టం, కొంచెం కష్టంగా మిగిలిపోతుంది.

14:33 - December 28, 2015

హైదరాబాద్ : లలిత కళా స్రవంతి 13వ వార్షికోత్సవం సందర్బంగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉత్తమ మహిళా యాంకర్లను అవార్డులతో సత్కరించింది. టెన్ టీవికి చెందిన న్యూస్ ప్రజెంటర్ సంధ్యాభవానిని సంస్థ ప్రతినిధులు అవార్డు మెమెంటోతో సత్కరించారు. తన కెరీర్ ఉన్నతికి తన కుటుంబం, టెన్ టీవీ మేనేజ్‌మెంట్ సహకారం మరువలేనిదని సంధ్యాభవానీ సంతోషం వ్యక్తం చేశారు.. 

14:29 - December 28, 2015

హైదరాబాద్ : మాకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలంటూ పేదలు గళమెత్తారు. నగరంలోని కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున పేదలు పాల్గొన్నారు. ఈసందర్భంగా పార్టీ నేత వి.శ్రీనివాస్ టెన్ టివితో మాట్లాడారు. గతంలో రెండు లక్షల మందికి ఇళ్లు నిర్మాణం చేస్తామని గతంలో కేసీఆర్ హామీనిచ్చారని, కానీ కేవలం 396 ఇళ్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ఇంతవరకు స్థలాల సేకరణ, అర్హుల పేర్లు ఇంతవరకు ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. మాకు మాత్రం ఇళ్లు రావడం లేదని ప్రతి సోమవారం కలెక్టరేట్ వస్తున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఇళ్లు తాము ఎక్కడి నుండి ఇస్తామని..ప్రభుత్వం చేతుల్లో ఉందని అధికారులు పేర్కొంటు వారిని వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు. భూముల సేకరణ చేయాలని..ఆ సేకరణ ఎక్కడ చేస్తారో చెప్పాలని, రెండు లక్షల ఇళ్లు ఎవరికీ కేటాయిస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. 

14:25 - December 28, 2015

హైదరాబాద్ : వాహనదారులు హెల్మెట్లు వాడకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వారిపై హెల్మెట్ ధర కన్నా ఎక్కువ జరిమానా విధించాలని ఆదేశించింది. హెల్మెట్ ధరించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని టీఎస్ అడ్వకేట్ చేసిన వాదనలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి స్టేట్ మెంట్ వింటే జనాలు నవ్వుకుంటారని మండిపడింది.. అయితే ఈ హెల్మెట్‌కు సంబంధించిన బాధ్యతల్ని ఆర్టీఏ అధికారులకు అప్పగించాలని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.. అటు తమకు సిబ్బంది కొరత ఉందని ఆర్టీఏ అధికారులు చెప్పారు.. ఈ రెండు డిపార్ట్‌మెంట్ల అధికారులు చర్చించి నివేదిక సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.. తదుపరి విచారణ సంక్రాంతి తర్వాతకు వాయిదావేసింది..

14:23 - December 28, 2015

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక మాఫియా నియంత్రణపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. ఇసుక మాఫియా నియంత్రణపై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో హైపవర్ కమిటీ నియామకాల్లో... ఎందుకు ఆలస్యం జరిగిందని... ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రతినిధులు చెప్పిన సమాధానం నచ్చని ధర్మాసనం వెంటనే హైపవర్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గత నెల పదిహేను రోజుల క్రితం కోర్టు దీనిపై పలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి ఎలాంటి నియంత్రణ చేస్తున్నారో చెప్పాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. కానీ హై పవర్ కమిటీ ఏర్పాటు చేయకపోవడంపై కోర్టు ఈ రోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ మైనింగ్ చేయడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. అక్రమ రవాణా..అక్రమ తవ్వకాలను నియంత్రించడంలో కమిటీ పనిచేయాలని సూచించింది. మరి ఇప్పటికైనా కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. 

ఇసుక మాఫియాపై హైకోర్టు ఆగ్రహం..

హైదరాబాద్ : ఇసుక మాఫియాపై నియంత్రణ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

చండీయాగానికి హాజరు కావడం వ్యక్తిగతం - పొంగులేటి..

హైదరాబాద్ : చండీయాగానికి హాజరు కావడం వ్యక్తిగతమని టి.కాంగ్రెస్ నేత పొంగులేటి పేర్కొన్నారు. యాగానికి వెళ్లవద్దని పార్టీ ఎక్కడా చెప్పలేదని, పార్టీ బలోపేతానికి నేతలందరూ కలిసికట్లుగా పనిచేయాల్సినవసరం ఉందన్నారు.

 

'మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు'...

హైదరాబాద్ : ప్రధాని మోడీ మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. దీనిని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీన పరచాలని టీఆర్ఎస్ చూస్తోందని, టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. 

కోల్ కతాలో రెండో రోజు సీపీఎం ప్లీనం..

కోల్ కతా : రెండో రోజు సీపీఎం పార్టీ ప్లీనం కొనసాగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణ నివేదిక ముసాయిదాపై చర్చ జరిగింది. సీపీఎం ప్లీనం సమావేశాలకు వివిధ రాష్ట్రాల నుండి 436 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుండి 26 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

 

కొణతాల రాకను వ్యతిరేకిస్తున్న ప్రజాప్రతినిధులు..

విశాఖపట్టణం : కొణతాల రాకను ఎంపీటీసీలు, సర్పంచ్ లు వ్యతిరేకిస్తున్నారు. కొణతాల పార్టీలో చేరితే మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి యోచిస్తున్నారు. 

హెల్మెట్ల వాడకంపై హైకోర్టులో విచారణ...

హైదరాబాద్ : హెల్మెట్ల వాడకంపై హైకోర్టులో విచారణ జరిగింది. హెల్మెట్లు వాడకపోవడంపై కోర్టు సీరియస్ అయ్యింది. హెల్మెట్ ధరకన్నా ఎక్కువ జరిమాన విధించాలని ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధరించి ఛైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్నారని టిఎస్ అడ్వకేట్ వాదనలు వినిపించారు. టిఎస్ అడ్వకేట్ వాదనలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి స్టేట్ మెంట్ల వింటే జనాలు నవ్వుకుంటారని కోర్టు పేర్కొంది.

 

'భూ సేకరణ చేసుకుంటే ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు సిద్ధం'..

హైదరాబాద్ : రాష్ట్రాలు భూ సేకరణ చేసుకుంటే ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు సిద్ధమని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ప్రకటించారు. అమెరికా వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఆపుతున్నామన్నారు. సమస్య పరిష్కారానికి విదేశాంగ చర్యలు చేపడుతోందన్నారు. 

విజయ్ హజారే వన్డే ట్రోఫీలో టైటిల్ సమరం

హైదరాబాద్ : జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ సమరానికి ఢిల్లీ, గుజరాత్ జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో..మరికాసేపట్లో డే-నైట్ గా జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాలకు ప్రారంభమవుతుంది...

13:40 - December 28, 2015

హైదరాబాద్‌ : నగరంలోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ 131వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌, జానారెడ్డి, వీహెచ్‌, జైపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ పార్టీ జెండా ఆవిష్కరించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ సర్కార్‌ చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్‌ అడ్డుకొని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

13:38 - December 28, 2015

హైదరాబాద్ : దేశంలోనే తొలిసారిగా ఈ-బోర్డింగ్‌ సౌకర్యం శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రారంభమైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఈ సేవలను ప్రారంభించారు. దేశీయ ప్రయాణికులకు మాత్రమే ఈ సర్వీస్ అందించనున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ-బోర్డింగ్‌తో వీలైనంత త్వరగా సేవలు అందించే అవకాశం కలిగింది. 

13:37 - December 28, 2015

శ్రీకాకుళం : జిల్లాలో మరో అధికారి ఏసీబీ వలకు చిక్కాడు... ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్లో పనిచేస్తున్న ఎస్‌ఐ, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ముగ్గురు ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. వీరు ప్రతి నెలా వైన్‌ షాపులనుంచి నెలకు నాలుగువేలనుంచి ఆరువేలరూపాయల వరకూ మామూళ్లు తీసుకుంటున్నారని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి.. పెద్దపాడు జాతీయ రహదారి దగ్గర వసూలుచేసిన డబ్బుతో వెళుతున్న ఈ సిబ్బందిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ సిబ్బందినుంచి సొమ్ముతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.. 

13:36 - December 28, 2015

హైదరాబాద్ : ఎంఐఎం పార్టీపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు చనిపోతే, వారి శవయాత్రల్లో ఎంఐఎం నేతలు పాల్గొంటున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఎంఐఎం నేతలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఐసీస్‌ శిక్షణ పొందిన ముస్లిం యువకులు హైదరాబాదులో చాలా మంది ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు. నగరంలో ఉద్రవాద కార్యకలాపాలను నిరోధించాల్సిన కౌంటర్ ఇంటెలిజెన్స్ నిర్వీర్యంగా మారిపోయిందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

13:35 - December 28, 2015

హైదరాబాద్‌ : ఏపీసీఎం చంద్రబాబును కలిసిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల... బాబు కుటుంబసభ్యులను కూడా కలుసుకున్నారు.. చంద్రబాబు మనవడిని ఎత్తుకున్నారు.. ఏపీ సీఎం సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేశ్, మనువడు దేవాన్ష్‌తో కలిసి ఫొటోలు దిగారు.. 

13:33 - December 28, 2015

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబుతో జపాన్‌ బృందం భేటీ అయింది.. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.. ఫార్మా, పర్యాటకం, మత్స్యశాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.. ఈ భేటీలో జపాన్‌లోని తయోమో గవర్నర్‌ తక కసుయికీతో పాటు.. ఏపీ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.. 

13:32 - December 28, 2015

హైదరాబాద్ : హెల్మెట్లు వాడకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వారిపై హెల్మెట్ ధర కన్నా ఎక్కువ జరిమానా విధించాలని ఆదేశించింది. హెల్మెట్ ధరించి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని టీఎస్ అడ్వకేట్ చేసిన వాదనలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి స్టేట్ మెంట్ వింటే జనాలు నవ్వుకుంటారన్న కోర్టు...హైల్మెట్ వాడకం ఆర్టీఏ అధికారులకు అప్పగించాలని సూచించింది. 

13:30 - December 28, 2015

హైదరాబాద్ : డీడీసీఏ విచారణ కమిటీ నివేదిక లోపభూయిష్టంగా ఉందన్నారు బీజేపీ నుంచి సస్పెండైన ఎంపీ కీర్తి ఆజాద్. అయితే తానెప్పుడు ఈ స్కాంలో అరుణ్ జైట్లీ పేరు ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. డీడీసీఏ లో అవినీతి జరిగిందని దానిపై విచారణ జరగాలని మాత్రమే కోరినట్టు తెలిపారు. విచారణ కమిటీ నివేదికలో అసలు లబ్ధి పొందిన కంపెనీల పేర్లనే ప్రస్తావించలేదని కీర్తి ఆజాద్ ఆరోపించారు.

13:07 - December 28, 2015

డిక్టేటర్ సినిమా ఎప్పుడెప్పుడా... అని ఎదురుచూస్తున్న బాలయ్య అభిమానులకు శుభవార్త. జనవరి 14న డిక్టేటర్ రిలీజ్ కానుంది. సినిమా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. నందమూరి బాలకృష్ణ స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ తన అభిమానులు మెచ్చుకునేలానే చేసిన మాస్ మసాలా ఎంటర్టైనర్ 'డిక్టేటర్'. బాలయ్య 99వ సినిమాగా వస్తున్న ఈ సినిమాని బాలయ్యకి బాగా కలిసి వచ్చి సూపర్ హిట్స్ అందించిన సంక్రాంతి సీజన్ లోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలని ముందు నుంచే ఈ చిత్ర టీం అఫిక్స్ అయ్యింది. కానీ ఇప్పటిదాకా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు.

దాంతో సోషల్ మీడియాలో పలు మీడియా వర్గాల్లో డిక్టేటర్ సినిమా సంక్రాంతికి రావడం లేదని, వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు తెలిసిన వెంటనే డైరెక్టర్ శ్రీవాస్ ఈ రూమర్స్ ని ఖండించాడు. 'డిక్టేటర్ సినిమా కచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. వాయిదా పడదు. కచ్చితంగా జనవరి 14న థియేటర్స్ లో సందడి చేస్తుందని' శ్రీవాస్ తెలిపాడు. ఈ వార్త తెలుసుకున్న బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

12:51 - December 28, 2015

సినీనటి కాజల్ అగర్వాల్ ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది. రజనీకాంత్ వంటి సౌత్ సూపర్ స్టార్ ను అధిగమించి ముందుకు వెళ్లిపోయింది. ఈ ఏడాది అధిక ఆదాయం, పాప్యులారిటీ పొందిన సినిమా వారి వివరాలను ఓ అంతర్జాతీయ పత్రిక వెలువరించింది. ఆ వివరాల ప్రకారం రజనీకాంత్, అభిషేక్ బచ్చన్, రాజమౌళి వంటి సెలెబ్రిటీలను కాజల్ అధిగమించింది. ఈ సందర్భంగా అమ్మడు చాలా ఖుషీగా వుంది.
'ఆదాయం, ప్రాచుర్యం ఆధారంగా సక్సెస్'
 "ఆదాయం, ప్రాచుర్యం ఆధారంగా సక్సెస్ ను కొలుస్తున్నారు. ఆ విధంగా చూస్తే నేను ఎప్పుడూ కష్టపడతాను. మన కష్టం సరైన రీతిలో ఉన్నప్పుడు ఇవి రెండూ మన సొంతమవుతాయి. ఒక సినిమాకు ఎన్ని రోజులు పనిచేస్తున్నామన్న దానిపై ఆధారపడి మన పారితోషికం వుంటుంది" అని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. 

 

12:42 - December 28, 2015

'అ .. ఆ' సినిమాలో పవన్ కల్యాణ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. 'సర్దార్ గబ్బర్ సింగ్'తో బిజీగా వున్న పవన్, కాస్తంత తీరిక చేసుకుని ఈ అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నాడని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అ .. ఆ' సినిమా రూపొందుతోంది. నితిన్ సరసన కథానాయికలుగా సమంతా .. అనుపమ పరమేశ్వరన్ అలరించనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇప్పటివరకూ 80 శాతం చిత్రీకరణను పూర్తిచేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన అతిథి పాత్రను పవన్ తో చేయించాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. అలా చేయడం వలన ఈ సినిమాకి మరింత హైప్ వస్తుందని ఆయన భావిస్తున్నాడని అంటున్నారు. త్రివిక్రమ్ కి పవన్ తో మంచి స్నేహం వుంది. ఇక ఈ సినిమా హీరో నితిన్ కి కూడా పవన్ తో చనువు వుంది. అందువలన ఈ సినిమాలో గెస్టుగా కనిపించడానికి పవన్ ఓకే చెప్పవచ్చని అనుకుంటున్నారు. అదే జరిగితే 'సర్దార్' కంటే ముందే వెండితెరపై పవన్ సందడి చేస్తాడన్న మాట. 

ఉద్యాన వర్శిటీ ఉద్యోగుల రిలీవ్ పై విచారణ

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 33 మంది ఉద్యాన వర్సిటీ ఉద్యోగులను ఇటీవలే రిలీవ్ చేసింది. ఉద్యాన వర్సిటీ ఉద్యోగుల రిలీవ్ వివాదంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. 8 వారాల్లోగా ఉద్యాన వర్సిటీ ఉద్యోగుల విభజనపై విధివిధానాలు రూపొందించాలని ఏపీ సర్కార్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఉద్యోగులను కొనసాగించాలని కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల వేతనాలు 52:48 ప్రకారం చెల్లించాలని తెలంగాణ, ఏపీ రాష్ర్టాలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు జనవరి 20కి వాయిదా వేసింది.

12:31 - December 28, 2015

హైదరాబాద్  : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ గురువారానికి వాయిదా పడింది. ఆస్తుల విక్రయంపై బుధవారం ఏజెన్సీలతో చర్చించి... గురువారం నివేదికను సమర్పిస్తామని త్రిసభ్య కమిటీ తెలిపింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.  

వెనుకబడిన జిల్లాల్లో సాంకేతిక అభివృద్ధికి కృషి : నాదేళ్ల

హైదరాబాద్‌: తెలంగాణ లో వెనుకబడిన జిల్లాల్లో సాంకేతిక అభివృద్ధికి కృషి చేస్తామని నాదెళ్ల చెప్పారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్లతో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నగరంలో త్వరలో మెక్రోసాఫ్ట్ వెంచర్స్ ఏర్పాటు జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టెక్నాలజీ అభివృద్ధికి వైట్‌పే టెక్నాలజీ ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. స్టార్టప్‌ల అభివృద్ధికి సహకారమందిస్తామని చెప్పినట్లు తెలిపారు. క్లౌడ్ టెక్నాలజీతో చిన్నతరహా పరిశ్రమల ఉన్నతి పెరుగుతుందని పేర్కొన్నారు.

మలక్ పేట ఎస్ బీహెచ్ లో చోరీకి యత్నం...

హైదరాబాద్ : మలక్‌పేట శాలివహన నగర్ ఎస్‌బీహెచ్‌లో చోరీకి దుండగులు యత్నించారు. బ్యాంకు వెనకాల ఉన్న ఫ్లైవుడ్ ను తొలగించి లోపలికి వెళ్లారు. బ్యాంకు లోపల ఇనుపడోర్ తెరుచుకోకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. బ్యాంకు సిబ్బంది ఉదయం వచ్చి చూడగా.. ఫ్లైవుడ్ తొలగించిన దృశ్యాలు కనిపించాయి. ఈ క్రమంలో బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు వద్దకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

12:06 - December 28, 2015

హైదరాబాద్ : నగరంలో క్రైం రేటు క్రమంగా తగ్గిందని సైబరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నగరంలో నేరాలపై పోలీసులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ…గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 14 శాతం నేరాలు తగ్గాయని, చైన్ స్నాచింగ్ లు 50 శాతం తగ్గాయని.. గత ఏడాది 523 జరిగితే ఈ ఏడాది 263 జరిగాయన్నారు. మరోవైపు రేప్ కేసులు తగ్గాయన్నారు. హైదరాబాద్ లో 263 మంది పై పీడీయాక్ట్ నమోదు చేశామని, షీటీమ్స్ కు 1100 ఫిర్యాదులు, 14 నిర్భయ కేసులు వచ్చాయన్నారు. ప్రజల భాగసామవ్యం, టెక్నాలజీతో క్రైమ్ తగ్గిందన్నారు. నగరంలో క్రైం తగ్గడం మంచి పరిణామమన్నారు.

11:55 - December 28, 2015

మెంతులలో అనేక ఔషధగుణాలు దాగున్నాయి. ఆరోగ్యానికి మెంతులు ఎంతగానో ఉపకరిస్తాయి. శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయితే మెంతులు మనందరికీ తెలిసినవే. ఔషధ దినుసుగానూ ఆయుర్వేదంలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. ఇవి శరీరంలో వేడిని ఉత్పన్నం చేసే మనకు అందుబాటులో ఉండే దినుసు. ఇటీవల కాలంలో మెంతులను మధుమేహన్ని అదుపులో ఉంచేందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మెంతులలో ఉండే ఔషధగుణాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకమైన వాసన, శరీరాన్ని పోషించే తత్వం తదితర లక్షణాల వల్ల ఇది అతి ప్రభావవం తమైన ఔషధంగా వాడుకలో ఉంది. విత్తనాలు మాత్రమే కాదు మెంతి ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివి. 
పెరటి మొక్కగానూ పెంచుకుంటూ రోజువారీగా వంటల్లో వాడుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. 
- అనేక రోగాలకు కారణమయ్యే కఫాన్ని, వాతాన్ని మెంతుల వాడకంతో తగ్గించవచ్చు. 
- మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇది దివ్వౌషదం. 
- అధిక కొలెస్టరాల్‌ తగ్గించడానికి, శరీరంలో ఎక్కువగా ఉండే చెడు కొలెస్ట్రాల్‌ నిల్వలను నియంత్రిస్తుంది. 
- అధిక బరువు సమస్యలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. 
- షుగర్‌ వ్యాధితో బాధపడేవారిలో మెంతుల వాడకం మంచి ఫలితాన్ని ఇస్తాయి. శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించడంలో మెంతులు పనితీరు అమోఘం. రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నవారు రోజూ ఉదయం అరస్పూన్‌ మెంతిపొడి తీసుకుంటే చాలావరకు సమస్య తీరుతుంది. మెంతులు టైప్‌ 1, టైప్‌ 2 మధుమేహాలు రెండింటిలోనూ ఔషధంగా పని చేస్తుంది. మెంతుల్లో ఉండే ట్రైగోనెల్లిన్‌, కౌమారిన్‌ అనే తత్వాలు మధుమేహం మీద పని చేస్తాయి.
- ఇవి జీర్ణ వ్యవస్థను శక్తివంతం చేసి.. ఆకలిని పెంచుతాయి. 
- చెమటను పుట్టించి శరీరాన్ని చల్లబరిచే గుణం మెంతుల్లో ఉంది. 
- నీళ్ల విరేచనాలను అరికట్టడంలో బాగా పనిచేస్తాయి. 
- మెంతుల్లోని జిగురు తత్వం పేగుల్లో అల్సర్లని తగ్గించడంతో పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది. 
- ఇందులోని చేదుగుణం కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి. 
- పునరుత్పత్తి సమస్యల్లోనూ మెంతులు ఔషధం గా పని చేసినట్లు అధ్యయనాల్లో తేలింది. మెంతుల్లో ఉండే సపోనిన్స్‌లో ఫైటో ఈస్ట్రోజన్స్‌ తయారీకి ఉపయోగపడు తాయి. ప్రికర్సార్లు - డోయోస్‌ జెనిన్స్‌ మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి.
- ప్రసవం తర్వాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవడమే కాకుండా గర్భాశయం లోని చెడు రక్తం వెలుపలకి వచ్చేసి గర్భాశయ శుద్ధి జరుగుతుంది. తల్లిపాల తయారీకి ఇది సహాయపడుతుంది.
- మెంతులు నడుము నొప్పి, సయాటికా, కీళ్లనొప్పి, వాపులు, కండరాల నొప్పి నివారణలోనూ ఉపయోగించవచ్చు. ఎముకలను శక్తివంతం చేయటం వల్ల ఆస్టియోపోరోసిస్‌, నడుము నొప్పి, జుట్టు రాలటం, ఎముకల బలహీనత వంటి సమస్యల్లో ఇది ఔషధంగా పని చేస్తుంది.
- మెంతులను నీళ్లతో కలిపి పై పూతగా లేదా పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్లు, చీము పొక్కులు, ఎముకలు విరగటం, కీళ్లవాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి.

హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. ఆస్తుల విక్రయం పై బుధవారం ఏజెన్సీలతో చర్చించి గురువారం నివేదికను సమర్పిస్తామని త్రిసభ్య కమిటీ తెలిపింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : స్పీకర్ కోడెల

విజయవాడ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ హామీ ఇచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసలు ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలను కోడెల శివప్రసాద్ ప్రారంభించి.. మాట్లాడుతూ...మీడియాలో సమూల మార్పులు వచ్చాయన్నారు. సోషల్ మీడియా విస్తృతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జర్నలిస్టుల సమస్యలు తనకు తెలుసునని...70 శాతం మంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

14 శాతం నేరాలు తగ్గాయి : సీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్ : గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 14 శాతం నేరాలు తగ్గాయని సైబరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. నగరంలో నేరాలపై పోలీసులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ…ఈఏడాది చైన్ స్నాచింగ్ లు 50 శాతం తగ్గాయని.. గత ఏడాది 523 జరిగితే ఈ ఏడాది 263 జరిగాయన్నారు. ఈ ఏడాది రేప్ కేసులు తగ్గాయన్నారు.

 

శంషాబాద్ ఎయిర్ పోర్టు లో ఈ-బోర్డింగ్ ప్రారంభం...

రంగారెడ్డి : శంషాబాద్ విమానాశ్రయంలో ఈ-బోర్డింగ్ ను కేంద్రమంతి అశోక్ గజపతి రాజు ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా శంషాబాద్ లో ఈ -బోర్డింగ్ సౌకర్యంప్రారంభించామని.. ఇది దేశీయ విమాన ప్రయాణీకులకు మాత్రమే అని తెలిపారు.

11:33 - December 28, 2015

హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల టీహబ్‌ను సందర్శించారు. టీహబ్ వద్ద సత్యనాదెళ్లకు ఘన స్వాగతం పలికి మంత్రి కేటీఆర్... టీహబ్ విశిష్టత, ఏర్పాట్లపై వివరించారు. అనంతరం స్టార్టప్ కంపెనీలతో నాదెళ్ల భేటీ అయ్యారు. టీ హబ్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ పనిచేస్తుందని ప్రకటించారు.. యాక్సిలేటర్లు, స్టార్టప్‌ల అభివృద్ధిలో భాగస్వాములమవుతామని స్పష్టం చేశారు.. 

11:30 - December 28, 2015

హైదరాబాద్ : విజయనగరం ఏజెన్సీలో ఆపరేషన్‌ గజ మొదలైంది.. బీభత్సం సృష్టిస్తున్న ఏనుగుల్ని తరిమికొట్టేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు నుంచి నిపుణులను రప్పించారు.. విశాఖ ఐఎఫ్ ఎస్ అధికారి ప్రదీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.. ఈ ఏనుగుల్ని శ్రీకాకుళం అడవుల్లోకి పంపేందుకు చర్యలు చేపట్టారు.. కురుపాం మండలంలోని తిత్తిరి పంచాయితీ పరిధిలో వారంరోజులుగా నాలుగు ఆడ ఏనుగులు తిష్టవేశాయి.. రెండు గిరిజన గ్రామాల్లో 15ఇళ్లను... అరటి, వరి పంటలు, ధాన్యం బస్తాలను ధ్వసం చేశాయి.. దీంతో గిరిజనులు వణికిపోతున్నారు.. 

11:28 - December 28, 2015

కృష్ణా : విజయవాడలో మురుగునీటి కాలువల వ్యవస్థపై మున్సిపల్‌ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు.. ప్రతి ఇంటిని అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీకి అనుసంధానం చేయాలని సూచించారు... మంచినీటి కాలువల్లో ఈ మురుగునీరు కలవకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.. నగరంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలన్నారు నారాయణ..

11:27 - December 28, 2015

హైదరాబాద్‌ : శనివారం సరూర్ నగర్లో చైన్ స్నాచింగ్ ఘటనలో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు. ఇంటిముందు నిల్చున్న మహిళను అడ్రస్ అడుగుతూ... 4తులాల బంగారు ఆభరణాన్ని తెంచుకెళ్లారు. స్థానికంగా ఉన్న ఓ సీసీ టీవీలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యారు. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

11:17 - December 28, 2015

ఔషధాలకు నయం కాని ఆరోగ్య సమస్యలకు శస్త్రచికిత్సలు తప్పనిసరి అసవరం అవుతున్నాయి. శస్త్రచికిత్సల ద్వారా దీర్ఘ కాలిక రోగాలను నయం చేస్తున్నారు. ఆధునిక వైద్యవిధానం అందుబాటులోకి రావడంతో అటు సర్జన్స్ కు, ఇటు రోగులకు సౌలభ్యమైన సర్జరీ పద్ధతులు ఎన్నో వచ్చాయి. పెద్దపెద్ద అనారోగ్య సమస్యలకు కూడా చిన్న శస్త్రచికిత్సలతో వైద్యం అందిస్తున్నారు. తక్కువ కోతల శస్త్రచికిత్సలు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. భయపెట్టే కేన్సర్‌ వ్యాధి చికిత్సకు ఆశాదీపంగా తక్కువ కోతల శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఎండో స్కోపిక్‌, కీహౌల్‌ సర్జరీల ద్వారా వైద్యచికిత్స అందేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన తక్కువ కోతల శస్త్రచికిత్స (minimally invasive surgery symposium(MISS) కేన్సర్‌ కణజాలాన్ని సమర్థవంతంగా తొలగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. 
కేన్సర్‌కు చికిత్స జరుగుతున్న సమయంలో కణజాలం దెబ్బ తింటుంది. నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. ఇదిలా ఉండగా తక్కువ కోతల శస్త్రచికిత్స ఈ చికిత్స విధానాలకు ప్రత్యామ్నాయంగా నిలిచింది. మిస్‌ ఎందుకు అవసరం? కేన్సర్‌ నిర్మూలనకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు తెలుసుకోవాలి. 
మిస్‌ అంటే..
సంప్రదాయ శస్త్రచికిత్సలో శరీరంలో ఎక్కువభాగం కోతకు గురవుతుంది. సర్జన్స్ కు ఇటువంటి శస్త్రచికిత్సలు చేయడం కత్తిమీద సాము మాదిరిగా మారుతుంది. అదే మిస్‌లో అలాకాదు. తక్కువ సర్జన్స్ తో దీన్ని పూర్తి చేయవచ్చు. శరీరం మీద అతి చిన్న రంధ్రాలు వేస్తారు. తక్కువలో తక్కువ అంటే అర అంగుళం మేరకు రంద్రం చేసి అవసరమైన సర్జరీ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన పరికరాలను ఉపయోగిస్తారు. శరీరంలోకి పంపించే అత్యాధునికమైన పరికరానికి వీడియోరికార్డర్‌ అమర్చుతారు. 
లాప్రోస్కోపిక్‌ సర్జరీ...
ఈ విధానంలో పొత్తికడుపు మీద చిన్న రంద్రం చేసి సర్జరీ నిర్వహిస్తారు. గ్యాస్ట్రోఇన్‌టెస్టినల్‌, యుటెరైన్‌, సెర్వికల్‌, కిడ్నీ, యురీనరి బ్లాడర్‌ కేన్సర్‌లకు ఈ సర్జరీ ఉపయోగపడుతుంది. 
థోరోస్కోపిక్‌ సర్జరీ..
వీడియోసహాయంతో చేసే ఈ సర్జరీలో ఛాతి మీద రంధ్రం చేస్తారు. ఈ విధానంలో ఊపిరితిత్తుల, ఆహారనాళం కేన్సర్‌లకు చికిత్స చేస్తారు. 
ఉపయోగాలు..
ప్రతీశస్త్రచికిత్సలో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. అయితే మిస్‌ పద్ధతి లో జరిగే శస్త్రచికిత్సలో ఎన్నో రెట్లు విజయవంతమయ్యాయి. 
కేన్సర్‌లో మిస్‌..
ప్రారంభరోజుల్లో మిస్‌ కేవలం గైనకాలజిస్ట్‌లు, కొద్దిమంది సర్జన్స్ మాత్రమే చేసేవారు. క్రమక్రమంగా ఈ చికిత్సకు ఆదరణ పెరగడంతో ఎక్కువగా సర్జన్స్, రోగులు మిస్‌ విధానానికే ఆసక్తి చూపిస్తున్నారు. అతి సాధారణ పద్ధతులతో, నైపుణ్యంతో దీన్ని పూర్తిచేస్తున్నారు. శరీరం లోపలి భాగాలు స్పష్టంగా కనిపించేలా నాణ్యమైన కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. కేన్సర్‌ కణజాలం పూర్తిగా తొలగించడం సాధ్యమవుతోంది. ఆరోగ్య వంతమైన దెబ్బతినే శాతం బాగా తగ్గింది. శస్త్రచికిత్స సమయంలో రక్తనాళాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రస్తుతం మిస్‌ విధానాన్ని ఎంచుకునే సర్జన్స్ సంఖ్య, రోగుల సంఖ్య పెరుగుతోంది. 
ప్రయోజనాలు..
రోగులు, సర్జన్స్ కోరే ఈ చికిత్స విధానంలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. 
- శస్త్రచికిత్స తర్వాత తక్కువ నొప్పి ఉంటుంది. 
- నొప్పి నివాహణ మాత్రలు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. 
- శరీరం మీద పెద్దపెద్ద గాట్లు కనిపించవు.
- సర్జరీ సమయంలో రక్తస్రావాన్ని నివారించవచ్చు.
- హాస్పిటల్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. 
- శస్త్రచికిత్స కారణంగా రక్తనాళాలు దెబ్బతినడం నివారించవచ్చు.
- హాస్పిటల్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేకపోవడంతో ఖర్చు తగ్గుతుంది. 
- ఉద్యోగులు కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం ఆఫీస్‌కు వెళ్లవచ్చు. 
- అత్యాధునిక కెమెరాలు ఉపయోగించడం వల్ల సర్జరీ చేయడం సులభం అవుతోంది. 
- అంతర్గత అవయవాలు సురక్షితంగా ఉంటాయి.
-రోగులు త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
- డాక్టర్‌ రవి చందర్‌ వెలిగేటి
కన్సల్టెంట్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్,
కాంటినెంటల్‌ హాస్పిటల్‌,
హైదరాబాద్‌.

 

గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్ : గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పీసీసీచీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి షబ్బీర్ అలీ, వీహెచ్, దానం, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లాలో 60 ఎర్రచందనం దుంగల స్వాధీనం...

నెల్లూరు : ఉదయగిరి మండలం కుర్రపల్లి అటవీ ప్రాంతంలో 60 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకు ఐదుగురు తమిళ కూలీలను కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 12 వేల నకిలీ కరెన్సీ, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు.

కాన్సెప్ట్, క్యాపబులిటీ అంశాలపై సక్సెస్ :సత్య నాదేళ్ల

హైదరాబాద్ : స్టార్టప్ ప్రతినిధులను కలవడం నాలొ కొత్త ఉత్సాహాన్ని నింపిందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. కాన్సెప్ట్, క్యాపబులిటీ అంశాలపై సక్సెస్ ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

10:45 - December 28, 2015

మనలో ప్రతీ ఒక్కరం ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము. నిత్యం ఆరోగ్యంగా మెలగాలంటే.. రోజూ జాగింగ్‌ చేస్తే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జాగింగ్‌ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వు చెమట రూపంలో బయటకు విసర్జన చేయబడుతుందని.. తద్వారా గుండె ఆరోగ్యంగా వుంటుందని చెబుతున్నారు. జాగింగ్‌ చేయడం వల్ల గుండెపై భారం పడుతుంది. దీనివల్ల గుండె మరింత ఆరోగ్యవంతంగా ఎక్కువకాలం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే.. జాగింగ్‌ చేసే సమయంలో గాలిని ఎక్కువగా పీల్చుకుంటాం. అలా గాలిని లోనికి ఎక్కువగా పీల్చుకోవడం వల్ల శరీరంలోని శక్తి వినియోగమవడమే కాదు.. అంతకుమించిన శక్తి ఉద్భవిస్తుంది.
నిజానికి జాగింగ్‌ చేసే అలవాటు లేనివారు పరుగెత్తాల్సి వచ్చినప్పుడు విపరీతమైన ఆయాసం వస్తుంది. అప్పుడు దాహం ఎక్కువగా వేయడంతోపాటు కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో కాస్త రెస్ట్‌ తీసుకుని, తిరిగి మళ్ళీ జాగింగ్‌ చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలా క్రమం తప్పకుండా జాగింగ్‌ చేయడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడమేకాదు.. పరుగెత్తినప్పుడు ఆయాసం రావడం వంటివి తగ్గుముఖం పడుతాయని వారు సూచిస్తున్నారు. జాగింగ్‌ అనేది శరీరాన్ని అలసట లేదా ఒత్తిడి తట్టుకుని నిలిచేలా చేయగలిగే ప్రక్రియగా చెబుతారు. జాగింగ్‌ను ఆరుబయట ప్రదేశాల్లో చేయడం వల్ల మనలోని మానసిక అలజడి తగ్గి, ప్రశాంతతను కలిగిస్తుంది. శరీరం కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటుంది. అందుకే.. రోజూ ఉదయాన్నే జాగింగ్‌ చేస్తే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
జాగింగ్‌ చేయడానికి ప్రత్యేకమైన వస్తువులు, సౌకర్యాలు కూడా అవసరం లేదు. బాగా సౌకర్యవంతంగా ఉండే బూట్లను వేసుకుంటే చాలు. కాబట్టి మంచి షూ తీసుకుని, వాతావరణానికి అనుగుణంగా చెమటను పీల్చుకునేలా ఉండే బట్టలను వేసుకుని చక్కగా జాగింగ్‌ ప్రారంభించండి. మీ గుండెను పదిలం చేసుకోండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

 

10:44 - December 28, 2015

హైదరాబాద్ : పలు రంగాల్లో సాంకేతిక సహకారంపై సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. చంద్రబాబు తన నివాసంలో నాదెళ్లకు అల్పాహార విందు ఇచ్చారు. సుమారు గంట పాటు వీరిరువురు పలు అంశాలపై చర్చించారు. అనంతరం పౌరసేవలు, విద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి, సమాచార సేకరణ, విశ్లేషణ ముందస్తు అంచనాల కోసం మైక్రోసాఫ్ట్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా మార్చడంతో పాటు... రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్‌ కార్యాలయం ఏర్పాటుపై చంద్రబాబు... సత్య నాదెళ్లతో చర్చించినట్లు తెలుస్తోంది.

10:43 - December 28, 2015

హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల టీహబ్‌ను సందర్శించారు. టీహబ్ వద్ద సత్యనాదెళ్లకు ఘన స్వాగతం పలికి మంత్రి కేటీఆర్... టీహబ్ విశిష్టత, ఏర్పాట్లపై వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో స్టార్టప్ కంపెనీలతో నాదెళ్ల భేటీ అయ్యారు. అనంతరం టీ హబ్‌లోని స్టార్టప్‌ ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఐటీలో భారతీయుల నైపుణ్యాలు క్రమంగా పెరుగుతున్నాయని.. భారతీయులు త్వరలోనే ఐటీలో ఆధిపత్యం వహించే స్థాయికి చేరుకుంటారన్నారు. భారత్‌లో యాక్సిలేటర్లు, స్టార్టప్‌ల అభివృద్ధిలో భాగస్వాములమవుతామని సత్యనాదెళ్ల ప్రకటించారు.

10:41 - December 28, 2015

హైదరాబాద్ : అనంతపురం శివార్లలోని ఉప్పరపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. బస్సులో స్టీరింగ్‌ విరిగిపోవడంవల్లే బస్సు అదుపు తప్పిందని కండక్టర్‌ చెప్పారు.. ప్రమాద సమయంలో బస్సులో 29మంది ప్రయాణికులున్నారు.. 

10:39 - December 28, 2015

హైదరాబాద్ : నగరంలో స్కైఫెస్ట్ వేడుకలు ముగిశాయి... ఉరుకులు పరుగుల జీవితంలో అలసిపోయిన నగరవాసులను ఈ ఫెస్ట్ రీచార్జ్ చేసింది.. వివిధ రకాల ప్రోగ్రాముల్లో ప్రేక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.. ఇక గేమ్స్‌ అయితే కేక పెట్టించాయి.. చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ తెగ ఎంజాయ్ చేశారు..

ఆటా, పాట ఉర్రూతలూ....

చివరిరోజు ఆటా, పాట ఉర్రూతలూగించింది.. ఆర్పీ టీం పాటలకు ఆడియన్స్ హ్యాపీగా స్టెప్పులేశారు.. తీన్‌మార్‌ పాటలతో ఊగిపోయారు. తన అద్భుతమైన పాటలతో అదరగొట్టాడు ఆర్పీ... రాను రానంటూ చిన్నదో అంటూ జనాలను ఊపేశారు. గాయని కౌసల్యతోపాటు టీం సభ్యులు హిందీపాటలు పాడి... కార్యక్రమానికి మరింత ఊపుతెచ్చారు. ఎందుకే రమణమ్మ, గోపాల గోపాల మూవీలోని సాంగ్‌ ఆహుతుల్లో జోష్ నింపింది.

పాప్‌ సింగర్స్ కూడా...

తెలుగు సాంగ్స్‌తో పాటు పాప్‌ సింగర్స్ కూడా ఈ ఫెస్ట్‌లో సందడినింపారు.. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో ఐదురోజులపాటు ఈ వేడుకలు కొనసాగాయి.. ఈ స్కై ఫెస్ట్ ద్వారా వచ్చిన డబ్బును క్యాన్సర్‌ బాధితులకు అందించనుంది స్పర్శ్ హాస్సైస్‌ సంస్థ... 

10:37 - December 28, 2015

ఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు నేతృత్వంలోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు నిన్న లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓ లేఖ రాశారు. పార్లమెంటుకు కొత్త భవనాన్ని నిర్మిద్దామని ప్రతిపాదించిన మహాజన్, తన లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఎప్పుడో 88 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రస్తుత పార్లమెంటు భవనానికి కాలం చెల్లిపోయిందని, మరింత కాలం ఇదే భవనంలో కొనసాగడం కాస్త ఇబ్బందేనని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త భవనాన్ని నిర్మిద్దామని ఆమె ప్రతిపాదించారు. 1927లో నాటి అవసరాల మేరకు నిర్మించిన పార్లమెంటు భవనం, ప్రస్తుత అవసరాలకు అంతగా సరిపోయే పరిస్థితి లేదని తెలిపారు. 
2026 తర్వాత పెరగనున్న లోక్ సభ స్థానాలు
లోక్ సభ స్థానాలు 2026 తర్వాత పెరగనున్నాయని, హెరిటేజ్ గ్రేడ్-1 నిర్మాణంగా ప్రస్తుత భవనాన్ని ప్రకటించినందుకు దానికి మార్పులు చేర్పులు చేయడం కుదరదని పేర్కొన్నారు. అంతేకాక అందివచ్చిన ఆధునిక సాంకేతిక పరికరాలను ఎంపీలు వినియోగించుకునే విషయంలో ప్రస్తుత భవనంలో ఏర్పాట్లు లేవని తెలిపారు. దీంతో కొత్త భవనం కడితేనే బాగుంటుందని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రస్తుత పార్లమెంటు భవనం ఆవరణలోనే కొత్త భవనం నిర్మించవచ్చని, అలా కుదరని పక్షంలో రాజ్ పథ్ లోని ప్రభుత్వ స్థలమైనా ఫరవాలేదని కూడా మహాజన్ పేర్కొన్నారు. తన లేఖను పరిశీలించి తగిన రీతిలో చర్యలు చేపట్టాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

 

 

ఢిల్లీ లో అంతర్జాతీయ స్మగ్లర్ల పట్టివేత...

హైదరాబాద్ :ఢిల్లీలో నేపాల్‌కు చెందిన ముగ్గురు అంతర్జాతీయ స్మగ్లర్లను కడప పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.కోటి విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రదొంగల కోసం కడప జిల్లా పోలీసుల ఆపరేషన్‌ సాగుతోంది.

గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత

తూర్పుగోదావరి : రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీలోని గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఎడమవైపు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న నలుగురు విద్యార్థినులను పాఠశాల సిబ్బంది రాజవొమ్మంగి ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల క్రితం ఇలాంటి లక్షణాలతోనే 7వ తరగతి విద్యార్థిని దుర్గాజ్యోతి (13) మృతి చెందింది. తాజా పరిణామంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు.

ఏసీబీ వలలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది

శ్రీకాకుళం : ఏసీబీ వలలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది పడ్డారు. పలాస నుంచి పెదపాడు వైపు వెళ్తున్న ఎక్సైజ్ శాఖ వాహనాన్ని తనిఖీ చేయగా రూ. 85 వేలు నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఎస్సై, నలుగురు సిబ్బందిని అధికారులు అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 70 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.

టిహబ్ సందర్శించిన సత్య నాదేళ్ల

హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల టీహబ్‌ను సందర్శించారు. టీహబ్ వద్ద సత్యనాదెళ్లకు ఘన స్వాగతం పలికి మంతి కేటీఆర్ టీహబ్ విశిష్టత, ఏర్పాట్లపై సత్యనాదెళ్లకు వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో స్టార్టప్ కంపెనీల ఏర్పాటుపై చర్చ జరిగింది. అంతకు ముందు ఏపీ సీఎం చంద్రబాబుతో సత్యనాదెళ్ల సమావేశమయ్యారు. విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనపై మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంవోయూ కుదుర్చుకుంది.

ఏపీ సీఎం ఐటీ సలహాదారుగా జేఏ చౌదరి

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి ఐటీ సలహాదారుగా జేఏ చౌదరి నియమించబడ్డారు. గతంలో సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ గా పని చౌదరి పని చేశారు.

09:42 - December 28, 2015

విశాఖ : గత రెండు రోజులుగా... విశాఖ జిల్లా పాడేరు మన్యంలో చలి విపరీతంగా పెరిగింది. మినుములూరు, లంబసింగిలో టెంపరేచర్ 6డిగ్రీలకు పడిపోయింది. పాడేరు, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరిగిన చలి కారణంగా మన్యంలో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. దట్టంగా అలుముకున్న మంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తెలిపింది. 

09:40 - December 28, 2015

హైదరాబాద్ : ఉత్తర భారతం మంచు గుప్పిట్లో చిక్కుకుపోయింది. హిమాలయాల మీదుగా వీస్తున్న చలిగాలులతో...కశ్మీర్, సిమ్లాతో ఉష్టోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. భారీగా కురుస్తున్న మంచుతో.. రహదారులు నిండిపోయాయి. కశ్మీర్ లో దాల్ సరస్సు గడ్డకట్టుకు పోయింది. అటు సిమ్లాలో మంచు కురుస్తుండటంతో... పర్యాటకుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. నీరు గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఉన్నా.. మంచు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. 

09:39 - December 28, 2015

హైదరాబాద్ : లంగర్‌హౌజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉదయాన్నే చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళ తన ఇంటి ముందు ఉండగా బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్రస్ అడుగుతూనే ఆమె మెడలోని ఆరు తులాల బంగారు గొలుసును లాక్కుని క్షణాల్లో మాయమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 

09:38 - December 28, 2015

వరంగల్ : పాఠశాల విద్యార్ధుల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతోంది. చిన్నపటి నుంచే పరిశోధనలపై దృఫ్టి పెడుతున్నారు. కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు చేపడుతూ శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకుంటున్నారు. వరంగల్‌ జిల్లాలో జరుగుతున్న బాలల సైన్స్‌ కాంగ్రెస్‌పై ప్రత్యేక కథనం.

బాలల ప్రతిభకు పదును పెడుతున్న నైన్స్ ఎగ్జిబిషన్లు....

బాలల్లో నిబిడీకృతంగా దాగివున్న సృతనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్‌ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ప్రతిభకు పదును పెట్టేందుకు ఉపయోగపడుతున్నాయి. వరంగల్‌లో నిర్వహిస్తున్న బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో పాఠశాల విద్యార్ధులు అద్భుతాలను ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, ప్రజారోగ్యం, గుండె కవాటాలు, శరీర భాగాలు పనితీరును వివరించే ప్రాజెక్ట్‌లను బాలలు తయారు చేశారు. ఇవి విద్యార్ధులను ఎంతగానో ఆకట్టుకంటున్నాయి.

2013-14లో 198 ప్రాజెక్ట్‌లు ......

అలాగే నీటి సంరక్షణ, విద్యుత్‌ పొదుపు వంటి అంశాలపై బాలలు తాము తయారు చేసిన ప్రాజెక్ట్‌లను ప్రదర్శిస్తున్నారు. 2013-14 విద్యా సంవత్సరంలో బాలల సైన్స్‌ కాంగ్రెస్‌కు 198 ప్రాజెక్ట్‌లు రాగా, 2015-16లో ఈ సంఖ్య 211కు పెరిగింది. విద్యార్ధుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్‌ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బాలల్లో చిన్నప్పటి నుంచి పరిశోధనల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు సైన్స్‌ కాంగ్రెస్‌ దోహదం చేస్తుందంటున్నారు.

జాతీయ సైన్స్ ఎగ్జబిషన్‌కు ఎంపిక....

వరంగల్‌ జిల్లా విద్యార్ధులు తయారు చేసిన రెండు ప్రాజెక్ట్‌లు పంజాబ్‌ రాజధాని చండీగఢ్‌లో జరిగే జాతీయ సైన్స్ ఎగ్జబిషన్‌కు ఎంపికయ్యాయి. రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన డీ భరత్‌ తయారు చేసిన పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే ఇళ్లలో సాధారణ విద్యుత్‌ బల్బులు, సీఎఫ్‌ఎల్‌ లైట్లకు బదులుగా ఎల్‌ఈడీ లైట్లు వాడితే విద్యుత్‌ ఏ విధంగా పొదపుచేయవచ్చే నిరూపించే ప్రాజెక్ట్‌ అందరి మన్ననలు అందుకుంటోంది. పట్టణీకరణ, నగరీకరణ ప్రభావం, అపార్ట్‌మెంల్లో నివసించే ప్రజలు జీవనశైలిపై తయారు చేసిన ప్రాజెక్ట్‌లు ఆసక్తి కలిగిస్తున్నాయి. 

09:34 - December 28, 2015

హైదరాబాద్ : బ్రిటన్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఉత్తర బ్రిటన్‌లోని మాంచెస్టర్‌, లీడ్స్‌, యార్క్‌ ప్రాంతాలన్ని వరదనీటిలో చిక్కుకుపోయాయి. ప్రజలు తమ ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇంగ్లాండ్‌, వేల్స్‌ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీచేశారు. గ్రేటర్‌ మాంచెస్టర్‌ లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు నేలమట్టం కావడంతో.. సరఫరా నిలిచిపోయింది.

లంగర్‌హౌస్ వద్ద చైన్ స్నాచింగ్...

హైదరాబాద్ : లంగర్‌హౌస్ గాంధీనగర్‌లో చైన్‌స్నాచింగ్ జరిగింది. మహిళ మెడలోంచి గుర్తు తెలియని దుండగులు బంగారం ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలంలోని సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలో చైన్ స్నాచర్లను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

08:32 - December 28, 2015

హైదరాబాద్ : భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయకూడదని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె. నాగేశ్వర్ సూచించారు. అఖండ భారత్ కు ఏకం కావాలని బిజెపి నేత రాంమాధవ్ పిలుపు ఇచ్చారు. అఖండ భారత్ అంటే భారత్ లో బంగ్లా, పాకిస్థాన్ విలీనం కావాల్సిన అవసరం ఉంది. అఖండ భారత్ గురించి ఐక్యరాజ్య సమితిలో ఎందుకు చర్చించడంలేదు? అఖండ భారత్ ప్రకటిస్తే అన్ని దేశాలు యుద్ధం ప్రకటిస్తాయి. ఎన్నికల కొరకు భావోద్వేగాలను రెచ్చగొట్టడం కాదా? అఖండ భారత్ అంటే భారత్ ను అప్రదిష్టపాలు చేయడం కాదా? అయుత చండా యాగం సక్సెస్ అయితే మరో యాగం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇది ఎంత వరకు సమంజసం? 2030 సంవత్సరాని కల్లా ప్రపంచంలో భారత్ రెండో ఆర్థిక వ్యవస్థగా మారుతుందని బ్రిటన్ ప్రకటించింది. ఇది సాధ్యమేనా? చైనాలో సింగిల్ చైల్డ్ విధానాన్ని ఎందుకు రద్దు చేసింది. ఇత్యాది అంశాలపై నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. నాగేశ్వర్ పూర్తి విశ్లేషణను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఏపీ సీఎం చంద్రబాబు తో సత్య నాదేళ్ల భేటీ

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తో సాఫ్ట్ వేర్ దిగ్గజం, తెలుగుతేజం, మైక్రోసాఫ్ట్ సీఈవో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా విద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి, సమాచార సేకరణ, విశ్లేషణ, ముందస్తు అంచనాల కోసం మైక్రోసాఫ్ట్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం.

08:00 - December 28, 2015

హైదరాబాద్ : పారదర్శకంగా ఉన్న కంపెనీలకు ప్రభుత్వాలు కాంట్రాక్టులు అప్పగించాలని 'న్యూస్ మార్నింగ్' చర్చలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. బిజెపికి ఫీడ్, లేక షేడ్ ఆర్ ఎస్ ఎస్సేనా? విశ్వహిందూ పరిషత్ సూత్రాలను బిజెపి అనుసరిస్తోందా? దేశంలో ఉగ్రవాదులు చొరబడకుండా ఉండాలన్నా, దేశంలో ఉగ్రదాడులు జరగకుండా ఉండాలన్నా రామమందిర నిర్మాణమే మార్గం అని ఆర్ ఎస్ ఎస్ వ్యాఖ్యానిస్తోంది. ఇది ఎంత వరకు సమంజసం? రామమందిర నిర్మాణానికి బిజెపి కట్టుబడి ఉందా? భారత్ లో మతసామరస్యాన్ని బిజెపి కాపాడుతుందా? మోదీ అధికారంలోకి వచ్చాక మత ఘర్షణలు జరగలేదా? బీహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఆర్ ఎన్డీ ల్యాబ్ గా వాడుకున్నాయా? బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీలకు ఎందుకు కాంట్రాక్టులు అప్పగిస్తున్నారు? 38 సంవత్సరాల తరువాత సీపీఎం ప్లీనం కలకత్తా లో జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారా? విధానపరమైన ప్రత్యామ్నాయం తో ముందుకు వస్తుందా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో వైసీపీ నేత కరణం ధర్మశ్రీ, బిజెపి నేతరాజేక్ రెడ్డి, టిడిపి నేత సూర్యప్రకాష్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి పాల్గొన్నారు. వారు ఇంకా ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

కాసేపట్లో చంద్రబాబు తో భేటీ కానున్న సత్య నాదేళ్ల

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తో సాఫ్ట్ వేర్ దిగ్గజం, తెలుగుతేజం, మైక్రోసాఫ్ట్ సీఈవో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా విద్య, వ్యవసాయ రంగాల్లో మెరుగైన అభివృద్ధి, సమాచార సేకరణ, విశ్లేషణ, ముందస్తు అంచనాల కోసం మైక్రోసాఫ్ట్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 17 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో 99.74 శాతం పోలింగ్‌ నమోదైంది. జిల్లాలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు మొత్తం 771 మంది ఉన్నారు. వీరిలో 347 మంది పురుషు లు, 424 మంది మహిళలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 769మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

హైదరాబాద్ : తెలంగాణలో పలు జిల్లాలో చలి తీవ్రత అధికమయ్యింది. చలికి తోడు చలిగాలుల తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం వాకర్స్‌తో సందడిగా కనిపించే పార్కులు రెండురోజులుగా పెరిగిన చలితో బోసిపోయాయి. కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణశాఖ ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలో హెచ్చరికలు జారీచేసింది. శనివారం కనిష్ఠ ఉష్ణోగ్రతగా 12.5డిగ్రీలు నమోదైంది. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు మాస్క్‌లులేకుండా బయట తిరగొద్దని, తగుజాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

నేడు వేములవాడకు సీఎం కేసీఆర్

కరీంనగర్ : మెదక్ జిల్లా ఎర్రవల్లిలో అయుత చండీ మహాయాగాన్ని ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్, వేద పండితుల సూచన మేరకు నేడు రాజన్న దర్శనానికి కుటుంబసమేతంగా రానున్నారు. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఎర్రవల్లి నుంచి బయలుదేరి నేరుగా వేములవాడ చేరుకోనున్నారు. ముందుగా రెండో బైపాస్ రహదారి నుంచి ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు నివాసానికి వెళ్లి, అక్కడి నుంచి తూర్పు ద్వారం నుంచి ఉద యం11.30 గంటలకు ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సంగీత నిలయంలో భోజనం ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రైవేటు బస్సు బోల్తా :15మందికి గాయాలు

అనంతపురం : ఉప్పరపల్లి వద్ద ఈ రోజు తెల్లవారు జామున ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులు గాయపడ్డారు.

07:08 - December 28, 2015

హైదరాబాద్ : తెలంగాణను మంచు దుప్పట్టి కప్పేసింది. చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మంచులో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.

కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7-8 డిగ్రీల సెల్సియస్‌ ......

తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 7-8 డిగ్రీల సెల్సియస్‌ నమోదువుతున్నాయి. దీంతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. పొగమంచు కమ్ముకుంటోంది. జిల్లాల్లో ఎక్కడ చూసినా మంచుదుప్పటి పరుచుకున్నట్టు కనపిస్తోంది. వణికిస్తున్న చలిపులి దెబ్బకు ప్రజలు భయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.

రాత్రి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గడం సహజం ....

నాలుగు రోజులు క్రితం వరకు శీతాకాలంలో కూడా ఎండలు మండిపోయాయి. ఉక్కపోతతో ఉక్కరి బిక్కిరిబిక్కిరైన ప్రజలు... ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగత్రలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలంలో సాధారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గడం సహజం. కానీ ఈసారి అసాధారణంగా 5 డిగ్రీలకు పడిపోయాయి. ఉత్తర భారతం నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావం తెలంగాణ జిల్లాలపై ఎక్కువగా ఉంది.

పగటి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు ....

రాత్రి ఉష్ణోగ్రతలేకాదు... పగటి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోయాయి. వరంగల్‌లో పగటి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డులవుతున్నాయి. దీంతో స్వట్టర్లు, శాలువాలు, స్కార్ఫ్‌లు, మంకీ క్యాప్‌లు ధరించకుండా బయటకురాలేని పరిస్థితి వచ్చింది. వాహనాలు నడపడం కష్టంగా ఉంది. పొగమంచు ఆవహించడంతో దగ్గరి వాహనాలు కూడా కనిపంచి వాతావరణం నెలకొంది. చలిగాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చలితో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చలికాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు.....

ఉదయం వేళల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్ధుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చలికాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. చలి తీవ్రత మరో నాలుగైదు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో జనం ఆందోళన చెందుతున్నారు. 

07:04 - December 28, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ఆకాశం నుంచి చూడాలనుకుంటున్నారా? విమానాలు, హెలికాఫ్టర్లు, ఎయిర్‌ బెలూన్ల ద్వారా అందమైన భాగ్యనగరాన్ని చుట్టేయాలనుకుంటున్నారా? త్వరలోనే మీ కలలను నిజం చేసేందుకు తెలంగాణ టూరిజం శాఖ ప్రణాళికలను సిద్దం చేస్తోంది.

త్వరలో నాగోల్‌-మెట్టుగూడ మార్గంలో మెట్రో రైలు .........

హైదరాబాద్‌ నగరంలో త్వరలోనే నాగోల్ - మెట్టుగూడ మార్గంలో మెట్రోరైలు పరుగులు తీయనుంది. దీంతో పాటు స్కైవేలు, స్కై స్క్రాపర్స్ కూడా నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని సర్కార్‌ యోచిస్తోంది. నగరం రూపురేఖలు మారిపోతున్నాయి. దీంతో నగరాన్ని వీక్షించేందుకు వచ్చే వారి సంఖ్య పెరగనుంది. ఇందుకనుగుణంగా తెలంగాణ టూరిజం శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సుందర భాగ్యనగరాన్ని విహంగ వీక్షణకు హెలి టూరిజాన్ని డెవలప్‌ చేయబోతున్నారు అధికారులు. ఇందుకోసం నగరంలోని టూరిజం ఆపరేటర్లతో చర్చలు జరుపుతున్నారు.

గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎకో, ట్రైబల్‌ టూరిజం అభివృద్ధి.....

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఎకో టూరిజం, ట్రైబల్‌ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవుల్లాంటి ప్రాంతాలను ఎకో టూరిజంగా.. వరంగల్‌లోని తాడ్వాయి, లక్కవరం, మల్లూరు, గట్టమ్మ దేవాలయాలను ట్రైబల్‌ టూరిజంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న బౌద్ధ, జైన, రామాయణ ప్రాంతాలను ప్రత్యేక సర్క్యూట్‌లుగా గుర్తించి పర్యాటక క్షేత్రాలుగా డెవలప్‌ చేయనున్నారు.

టూరిజం శాఖ కసరత్తు....

హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన ఆలోచనలను అమలు చేసేందుకు టూరిజం శాఖ కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే భవిష్యత్‌లో సైబర్‌ సిటీ కాస్తా టూరిస్ట్‌ సిటీగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా సర్కార్‌ ఖజానా కూడా నిండుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇవి కార్యరూపం దాలిస్తే ప్రజలు తెలంగాణ అందాలను ఆకాశ మార్గాన వీక్షించే అవకాశం కలగనుంది. 

07:00 - December 28, 2015

హైదరాబాద్ : ఏపీ టిడిపి ఇప్పుడు వలసనేతలకు షెల్టర్‌లా మారుతోంది. నేతలు అయిన పార్టీకి వీడ్కోలు పలికి పసుపు తీర్థం పుచ్చుకుంటున్నారు. అలా వచ్చే నాయకుల్లో ఎక్కువమంది కాంగ్రెస్‌ వాళ్లే. కానీ బాబుకు బలమైన ప్రత్యర్థి అయిన వైసిపి నుంచి గోడదూకే నేతలు అంతంత మాత్రంగానే ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచీ ఓ బలమైన నేత ప్లీజ్‌ నాకు చోటివ్వాలంటూ పట్టుబడుతున్నారు. పాత మిత్రుడు పార్టీకి ఇచ్చిన షాక్‌కు ట్రీట్‌మెంట్‌ ఎలా చేయాలా అని జగన్‌ వ్యూహరచన చేస్తున్నారు.

మొన్న ఆనం రాంనారాయణరెడ్డి...

మొన్న ఆనం రాంనారాయణరెడ్డి తన తమ్ముడు, కేడర్‌తో సహా టిడిపిలోకి జంపయ్యారు. అంతకుముందు మరికొంతమంది ప్రతిపక్ష నేతలు అలా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. అయితే వైసిపి నుంచి వలసొచ్చే నేతలు మాత్రం అంతంతమాత్రమే. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తనను పార్టీలోకి తీసుకోవాలంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే, వైసిపిలో మంచి నేమున్న నేత ఆదినారాయణరెడ్డి చంద్రబాబును అభ్యర్థించారు. తప్పనిసరి స్థితిలో సరే అనేశారు చంద్రబాబు. ఇదే సమయంలో ఆదినారాయణరెడ్డి వ్యవహారం జగన్‌కు మింగుడుపడడం లేదు. అయితే టిడిపికి కూడా ఈ అనుకోని అతిథి మూలంగా కొన్ని చిక్కులు ఉన్నా వాటిని సరిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలో....

జమ్మలమడుగు నియోజకవర్గంలో గత 22 ఏళ్లుగా టిడిపి ఇన్‌ఛార్జ్‌ రామసుబ్బారెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య వైరం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరినీ ఒకే చోటకు చేర్చడం కొంతవరకు చంద్రబాబుకు ఇబ్బందికరమే. అయినా ఒకే ఒరలో రెండు కత్తులను ఇమిడ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్‌ను ఆయన సొంత జిల్లాలోనే దారుణంగా దెబ్బతీయాలనేది టిడిపి ప్లాన్. ఆదినారాయణరెడ్డికి జగన్‌కు కొంతకాలంగా పొసగట్లేదని టాక్. దీంతో ఆదినారాయణరెడ్డి ఇచ్చిన షాక్ నుంచి తేరుకుంటూనే జమ్మలమడుగులో తన బలం ఎంతో అంచనా వేసేందుకు జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆదినారాయణరెడ్డి, అయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, వారి బంధువులకు ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా నియోజకవర్గంలో పర్యటించారు. జగన్ వెంట మేమున్నామంటూ వైసిపి నేతలు అల్లె ప్రభావతి, ఆమె బావ చెన్నారెడ్డి పర్యటనలో పాల్గొన్నారు.

ఆదినారాయణ ఎపిసోడ్‌తో జమ్మలమడుగు....

ఆదినారాయణ ఎపిసోడ్‌తో జమ్మలమడుగు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గత ఎన్నికల్లో టికెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించి నిరుత్సాహానికి గురైన అల్లె ప్రభావతి ఈ అవకాశం సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టిడిపిలోకి వెళ్లగానే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు భుజాన వేసుకునేందుకు ముందుకొచ్చారు. ఎప్పటినుంచో ఆదినారాయణరెడ్డికి అల్లె ప్రభావతికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇక జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏసి చెన్నారెడ్డికి మంచిపేరు ఉంది. ప్రజలతోనూ మంచి సంబంధాలు మెయింటెయిన్‌ చేస్తున్నారు. ప్రభావతి, ఏసి చెన్నారెడ్డి తాము ముందుండి నియోజకవర్గంలో వైసిపిని నడిపిస్తామని జగన్‌కు హామీ ఇచ్చారు. అయితే ఇదేసమయంలో ఆదినారాయణరెడ్డి రాజీనామా చేస్తే జరుగబోయే ఎన్నికల్లో సీటివ్వడంపై జగన్ ఇంకా వారికి హామీ ఇవ్వలేదు.

లోకేష్ బాబు వద్ద ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి....

చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు వద్ద ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి భీకరమైన ప్రతిజ్ఞలు చేసినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. జగన్ తన తల్లి వై.ఎస్. విజయమ్మను నిలబెట్టినా పది వేల ఓట్ల మెజార్టీతో గెలిచి చూపిస్తానని లోకేష్‌కు ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆదినారాయణరెడ్డికి చెక్‌ పెట్టేందుకు జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆదినారాయణకు ధీటైన ప్రత్యర్థి తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిపై ఫోకస్‌ చేశారు. అయితే రామసుబ్బారెడ్డి వై.సి.పిలోకి వెళ్లేందుకు ఇంతవరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అలాగని ఆగర్భ శత్రువు అయిన ఆదినారాయణరెడ్డితో చేతులు కలుపలేని పరిస్థితి నెలకొంది.

జగన్‌తో అంటీ ముట్టనట్లు....

ఆదినారాయణరెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి జగన్ పర్యటనలో కొంతసేపు పాల్గొన్నా జగన్‌తో అంటీ ముట్టనట్లు వ్యవహరించారు. ఒక సందర్భంలో జగన్ దగ్గరకు నారాయణరెడ్డి రావటంపై జగన్ అభిమానులు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంకా వీరిని నమ్ముతున్నావా? అంటూ ఓ నాయకుడు జగన్‌ను ప్రశ్నించాడు. అయితే సమన్వయం పాటించమని జగన్ వారించటంతో అతను ఊరకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇంకా అక్కడ ఉండటం సరికాదని భావించిన నారాయణరెడ్డి నిష్క్రమించాడు.

బహిరంగంగా వ్యతిరేకించినప్పుడే.....

ఒకవేళ ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీకి దిగితే జగన్ ప్రతిగ్రామంలో కేడర్‌ను కూడగట్టుకోవాల్సుంటుంది. దీనికి చాలా సమయమే పట్టొచ్చు. అంతేగాక డబ్బూ పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక బలం పుష్కలంగా ఉన్న అల్లె ప్రభావతి, ఏసి చెన్నారెడ్డికి ఇదేమంత సమస్య కాదు. ఇప్పుడు చేయాల్సిందల్లా నియోజకవర్గంలో బలాన్ని మెరుగుపరుచుకోవడమే. నిజానికి ఆదినారాయణరెడ్డి తనను బహిరంగంగా వ్యతిరేకించినప్పుడే జగన్ జాగ్రత్త పడి ఉంటే ఈ సమస్య వచ్చుండేది కాదని పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదేమైనా సొంత జిల్లాలో జగన్‌కు ఆదినారాయణ వ్యవహారం పెద్ద షాకే. 

06:54 - December 28, 2015

హైదరాబాద్ : ఏపీ సిఎం చంద్రబాబుతో మైక్రోసాఫ్ట్ సిఇవో సత్య నాదెళ్ల సోమవారం ఉదయం భేటీకానున్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఈ గవర్నెన్స్‌, రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి తదితర అంశాలపై చంద్రబాబుతో సత్యనాదెళ్ల చర్చించనున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. 

టీ హబ్‌ను సందర్శించనున్న మైక్రోసాఫ్ట్‌ సీఈవో

హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇవాళ టీ హబ్‌ను సందర్శించనున్నారు. ఉదయం తొమ్మిదర గంటలకు... తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తో కలిసి ఆయన గచ్చిబౌలి ట్రిపుట్‌ ఐటీలో ఉన్న టీ హబ్‌కు వెళతారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. టెక్నాలజీ హబ్‌లో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న వారితో సత్య నాదెళ్ల, కేటీఆర్‌ భేటీ అవుతారు. 

06:53 - December 28, 2015

హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇవాళ టీ హబ్‌ను సందర్శించనున్నారు. ఉదయం తొమ్మిదర గంటలకు... తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తో కలిసి ఆయన గచ్చిబౌలి ట్రిపుట్‌ ఐటీలో ఉన్న టీ హబ్‌కు వెళతారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు దీనిని ఏర్పాటు చేశారు. టెక్నాలజీ హబ్‌లో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న వారితో సత్య నాదెళ్ల, కేటీఆర్‌ భేటీ అవుతారు. 

06:51 - December 28, 2015

హైదరాబాద్ : ప్రభుత్వ భూముల వేలం తెలంగాణ సర్కార్‌ ఖజానాకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత మొదటిసారి ఈ ఏడాది అక్టోబర్‌లో మొదటి విడత భూములు వేలం వేశారు. పారిశ్రామిక సంస్థల నుంచి మంచి స్పదన లభించింది. రాయదుర్గం, గచ్చిబౌలి, మణికొండల్లో వేలం వేసిన భూములను అనూహ్యంగా ఎకరానికి 18 కోట్ల నుంచి 29 కోట్ల రూపాయల రేటు పలికింది. దీంతో సర్కార్‌ మోములో సంతోషం నిండింది.

మొత్తం 7,911 ఎకరాల భూమిని వేలం వేయాలనినిర్ణయం...

మొదటి విడత భూముల వేలానికి వచ్చిన స్పందనలో తెలంగాణ పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ రెండో దఫా వేలానికి సిద్ధమయ్యింది. ఇందుకు జిల్లా వారీగా భూములు కూడా గుర్తించారు. మొత్తం 7,911 ఎకరాల భూమిని వేలం వేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో 9.5 ఎకరాలు, మెదక్‌లో 3,922, రంగారెడ్డిలో 930 ఎకరాలకు వేలం నిర్వహించాలని టీఎస్‌ఐఐసీ నిర్ణయించింది. అలాగే కరీంనగర్‌లో 1141 ఎకరాలు, వరంగల్‌లో 305, మహబూబ్‌నగర్‌లో 924 ఎకరాలు గుర్తించారు. ఆదిలాబాద్‌లో 294 ఎకరాలు, ఖమ్మంలో 53, నల్గొండలో 27 ఎకరాల భూమిని వేలానికి సిద్ధం చేశారు. మొదటి విడత వేలం ద్వారా 10,456 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. రెండో దఫా వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో భూముల క్రమబద్ధీకరణ ద్వారా 500 కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు జమ అయ్యిందని సమాచారం.

కేసీఆర్‌ అనుమతి కోసం భూముల వేలం ఫైలు.....

భూముల వేలానికి సర్వంసిద్ధం చేసిన అధికారులు... ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతి కోసం పంపారు. కానీ ఇంతవరకు అనుమతి రాకపోవడంతో అధికారుల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఈ ఆర్ధిక సంవత్సంరలో మరో మూడు నెలలు మాత్రమే మిగిలివుంది. ప్రస్తుత ఏడాదిలో అనుమతి ఇస్తారా? లేక వచ్చే ఆర్ధిక సంవత్సంర ప్రారంభంతో ఓకే చేస్తారా? అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం భూముల పరిరక్షణ సర్కార్‌కు కష్టమవుతోంది. కబ్జాలను అరికట్టలేకపోతున్న సమయంలో వేలం ద్వారా భూములు అమ్మాలని నిర్ణయించుకుంది.

వైఎస్‌ఆర్‌ హయాంలో 2007-2008లో వేలం ...........

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ హయాంలో 2007-2008లో సర్కార్‌ భూముల వేలం నిర్వహించారు. అప్పట్లో రాయదుర్గంలో ఎకరానికి 18 కోట్ల రూపాయల ధర పలికింది ఇప్పుడు ఇంకా భారీగా రేటు వస్తోంది. ప్రత్యేక రాష్ట్రం వస్తే పెట్టుబడులు రావంటూ జరిగిన దుష్ప్రచారానికి ఇదో సమాధానమని తెలంగాణ సర్కార్‌ ప్రకటించింది. అయితే... ఉమ్మడి రాష్ట్రంలో భూముల వేలను వ్యతిరేకించడంతో పాటు, కొన్ని సార్లు అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు... ఇప్పుడు అధికారంలో కి వచ్చిన తర్వాత పాత ఒరవడినే కొనసాగిస్తున్నారన్న విమర్శలున్నాయి. తన దాకా వస్తే కానీ తత్వం తలకెక్కదన్న విషయం టీఆర్‌ఎస్‌ పాలకులకు ఇప్పుడు అర్ధం అవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

06:46 - December 28, 2015

హైదరాబాద్ : చెరకు క్రషింగ్ సీజన్ ఆరంభమైంది. సరిగ్గా టైమ్ కి నిజాం షుగర్ ఫ్యాక్టరీ లే ఆఫ్ ప్రకటించింది. దీంతో తెలంగాణలోని చెరకు రైతుల కష్టాలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? చెరకు రైతుల దుస్థితికి బాధ్యులెవరు? తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోకి వస్తుందనుకున్న నిజాం షుగర్స్ మూతపడడానికి దారితీసిన కారణాలేమిటి? అసలు దేశవ్యాప్తంగా చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీటికి పరిష్కారాలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో రైతు సంఘం నేత సాగర్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

06:45 - December 28, 2015

హైదరాబాద్ : పంచదార, బెల్లం ప్రతి ఇంటిలోనే నిత్యం వినియోగిస్తాం. మనకు రుచికరమైన, మధురమైన పంచదార, బెల్లం దొరకాలంటే చెరకు పండించే రైతుల జీవితాలు బాగుండాలి. కానీ దురద్రుష్టవశాత్తు మన దేశంలో చెరకు రైతులకు చేదే మిగులుతోంది.

 రెండో స్థానంలో భారత్....

ప్రపంచవ్యాప్తంగా చక్కెర ఉత్పత్తిలో మన దేశానిది రెండో స్థానం. బ్రెజిల్ 22శాతం చక్కెర ఉత్పత్తి చేస్తుంటే, 14 శాతం మన దేశంలో ఉత్పత్తి అవుతోంది. మన దేశంలో 500కి పైగా ఉన్న షుగర్ ఫ్యాక్టరీలలో దాదాపు మూడు లక్షల మంది పనిచేస్తున్నారు. సుమారు 50 లక్షల ఎకరాల్లో చెరకు సాగవుతుండగా దాదాపు రెండున్నర కోట్ల మంది జీవనోపాధి పొందుతున్నారు. మన దేశంలో పత్తి తర్వాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న రంగమిది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్న చెరకు సాగును, చక్కెర పరిశ్రమను ఏమాత్రం అలక్ష్యం చేయడానికి వీలులేదు. మన దేశంలో పారిశ్రామికాభివ్రుద్ధి ఎక్కువ భాగం పెద్దపెద్ద నగరాలకే పరిమితమైతే, చక్కెర పరిశ్రమ గ్రామీణ ప్రాంతాలకు చేరువలో వుండడం విశేషం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, బీహార్, కర్నాటక రాష్ట్రాల్లో చెరకు విస్తారంగా సాగవుతోంది. ఒకప్పుడు చక్కెర ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో వుండగా, ఇప్పుడు మహారాష్ట్ర ఆ స్థానాన్ని ఆక్రమించింది.

క్రమంగా పెరుగుతోన్న చక్కెర వినియోగం...

మన దేశంలో చక్కెర వినియోగం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 24. 8 మిలియన్ టన్నుల చక్కెరను వినియోగిస్తుండగా, మరో రెండేళ్లలో 28.5 మిలియన్ టన్నులకు పెరుగుతుందన్న అంచనాలున్నాయి. మరో పదిహేనేళ్లలో మన దేశంలో చక్కెర వినియోగం 52 మిలియన్ టన్నులు దాటుతుందన్న అంచనాలున్నాయి. కానీ మన దేశంలో గత సీజన్ లో 24.72 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అయ్యింది. ప్రస్తుతం మన దేశ అవసరాలకు బొటాబొటీగా చక్కెర ఉత్పత్తి అవుతోంది. రాబోయే కాలంలో మన దేశీయ అవసరాలు తీరాలంటే అందుకు తగ్గట్టుగా చెరకు దిగుబడులు పెంచుకోవాల్సి వస్తుంది.

బేకరీ, కాండీ, స్వీట్స్, కూల్ డ్రింక్స్ తయారీదారీలో...

బేకరీ, కాండీ, స్వీట్స్, కూల్ డ్రింక్స్ తయారీదారులు 60శాతం చక్కెర కొనుగోలు చేస్తుండగా, బిస్కెట్, ఫుడ్ ప్రొడక్షన్, ఫార్మా స్యూటికల్ కంపెనీలు కూడా ప్రధాన వినియోగదారులుగా వున్నాయి. చెరకు రైతులు మన జిహ్వ చాపల్యానికి తగ్గట్టుగా వంటింటి అవసరాలు తీర్చడంలోనే కాకుండా ఇంకా అనేక పరిశ్రమలకు ఊపిరి పోస్తున్నారు. ఈ లెక్కన చూస్తే మనదేశ ఆర్థికాభివ్రుద్ధిలో చెరకు రైతులు పోషిస్తున్న పాత్ర అనన్యసామాన్యమైనది.

చెరకు రైతుల సంక్షేమం విషయంలో......

దేశాభివృద్ధికి ఇంతగాపాటు పడుతున్న చెరకు రైతుల సంక్షేమం విషయంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం బాధాకరం. పొలం నుంచి, షుగర్ ఫ్యాక్టరీకి తాము పండించిన చెరకును రవాణా చేయడం రైతులకు పెద్ద సమస్యగా మారుతోంది. ట్రాన్స్ పోర్టు చార్జీలు భారంగా మారుతున్నాయి. గ్రామీణ రోడ్లు సరిగా లేకపోవడం మరో శాపం. ఇన్ని కష్టాలు పడి ఫ్యాక్టరీ తరలిస్తే, అక్కడ దానిని అప్పగించడానికి రాత్రింబవళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి. యాజమాన్యాలు సకాలంలో బిల్లులు చెల్లించవు. దేశవ్యాప్తంగా వివిధ ఫ్యాక్టరీలు రైతులకు 20 వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డాయంటే చెల్లింపుల్లో ఎంత తీవ్ర జాప్యం జరుగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యాల కారణంగా, తాము తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు పెరిగి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.

ఒక్క చెరకు గడ నుంచి 24 రకాల బై ప్రొడక్ట్స్....

నిజానికి చెరకులో వ్యర్థంగా పోయేదేమీ లేదు. రసం తీయగా మిగిలిన పిప్పికి కూడా కరెంట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్క చెరకు గడ నుంచి 24 రకాల బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఒక టన్ను చెరకు నుంచి క్వింటా షుగర్, 150 యూనిట్ల కరెంట్, 35 లీటర్ల ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. కానీ, చెరకు పండించే రైతుకి చివరకు మిగులుతున్నదేమిటి? ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు రైతులను ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయో అర్ధం చేసుకోవడానికి నిజాం షుగర్స్ తాజా ఉదాహరణ. 

Don't Miss