Activities calendar

29 December 2015

కోడి పందాల నిర్వహణకు బ్రేక్...

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల నిర్వహణకు ఎవ్వరికీ అనుమతినిచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందాలను నిర్వహించినా, జూదం ఆడినా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్‌పీలకు గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. 

21:28 - December 29, 2015

కోల్ కతా : సీపీఎం ప్లీనం సమావేశాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన ఇవాళ పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి రూపొందించిన ముసాయిదా నివేదికపై నేతలు చర్చించారు. ఈ చర్చలో 10 మంది నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సుదర్శన్‌ ఉన్నారు. కర్నాటక, బీహార్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, జార్కండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌ నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చలో పాల్గొన్నారు. ఈ ప్లీనం సమావేశాలు ఇంకా రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. 

వరంగల్ లో రోడ్డు ప్రమాదాలు..నలుగురి మృతి..

వరంగల్ : జిల్లాల్లో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మొగుళ్లపల్లి (మం) మొట్లపల్లిలో ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొనడంతో దంపతులు మృతి చెందగా హసన్ పర్తి (మం) ఎల్లాపూర్ లో రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 

నెల్లూరులో కూంబింగ్..ఎర్రచందనం స్వాధీనం..

నెల్లూరు : సీతారామపురం (మం) దేవమ్మ చెరువు అటవీ ప్రాంతంలో ఫారెస్టు అధికారుల, పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఇద్దరు తమిళల కూలీలను అరెస్టు చేసి వారి వద్ద 50 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

విందులో కేసీఆర్..బాబు ముచ్చట్లు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చిన విందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు పాల్గొన్నారు. చిరునవ్వుతో పలకరించుకున్న వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. 

ఆర్మీ మాజీ చీఫ్ కన్నుమూత..

ఢిల్లీ : భారత ఆర్మీ మాజీ చీఫ్ రిటైర్డ్ జనరల్ ఓపీ మల్హోత్రా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మల్హోత్రా మంగళవారం హర్యానాలోని గుడ్ గావ్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 

శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు..

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీల ప్రత్యేక దర్శనం సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 3వరకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో సాంబశివరావు వెల్లడించారు.

21:23 - December 29, 2015

హైదరాబాద్ : రేపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండేసి స్థానాలకు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం ఫలితాలు తేలనున్నాయి. కౌంటింగ్‌ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌ 6 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. బుధవారం వచ్చే ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

21:21 - December 29, 2015

హైదరాబాద్ : నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శిల్పారామంలో జరిగిన బ్రాండ్‌ హైదరాబాద్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రేటర్‌ను గ్లోబల్‌ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విశ్వనగరంగా రాజధానిని మలిచేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల ముందుంచారు. ఫ్యూచర్‌ హైదరాబాద్‌ను శిల్పారామంలో ప్రజెంట్‌ చేశారు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌. అనంతరం ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. వాళ్లు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

21:19 - December 29, 2015

హైదరాబాద్ : గ్రేటర్ లో టీఆర్ఎస్ జెండా పాతాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నేడో, రేపో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో నగరంలో అధికారపార్టీ తన యంత్రాంగాన్ని సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే డివిజన్‌లన్నింటిని ఒక రౌండ్‌ చుట్టేసిన టీఆర్ఎస్ ఇక నయాపంథా ను ఎంచుకుని హోర్డింగ్ ల కెక్కింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను హోర్డింగ్ ల రూపంలో ప్రదర్శిస్తోంది. అన్ని డివిజన్‌ల నేతల్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు మంత్రివర్గ, శాసన సభాపక్ష సమావేశాల్ని ఏర్పాటు చేశారు. జవనరి 2నమంత్రివర్గ, 3న తెలంగాణ భవన్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాలలో ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలపై చర్చించనున్నారు నేతలు. మొత్తం 150 డివిజన్లలో గెలుపుకోసం మంత్రులందరు కృషి చేయాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల ఇంఛార్జ్ గా కేటీఆర్...?
నగరంలోని పలుచోట్ల రాష్ట్రేతరులు ఉండడంతో వారిని మెప్పించేందుకు.. విపక్షాలను పక్కకు నెట్టి కదనరంగంలోకి దిగాలని పట్టుదలతో ఉంది. గ్రేటర్ ఎన్నికల ప్రభావం వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల పై పడనుండడంతో అందరూ కలిసికట్టుగా ఉండాలని నేతలకు సూచిస్తున్నారు కేసీఆర్. ఇందుకు అందరి ఆమోదంతో గ్రేటర్ ఎన్నికల ఇంఛార్జ్ గా మంత్రి కేటీఆర్ ను ప్రకటించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.ఇదే విషయాన్ని కేబినెట్ సమావేశంలో ప్రకటించనున్నారు కేసీఆర్. ఇక పార్టీ శాసనసభానపక్ష సమావేశంలోను గ్రేటర్ ఎన్నికలపై చర్చ సాగనుంది. ఈ సమావేశంలో ఎంఐఎం బలంగా ఉన్న 50 వార్డులు మినహా 100 వార్డులకు ఎంఎల్ లను , ఎంఎల్సీలకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించనున్నారు. లోతుగా వార్డులకు చొచ్చుకుపోయి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే విధంగా నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రణాళికలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే నేరుగా కేసీఆర్ ను కలిసేందుకు కేడర్ కు అవకాశం కల్పిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గులాబి జెండా ఎగరవేయాలని కృత నిశ్చయంతో ఉంది అధికారపార్టీ. ఇందుకు కేబినెట్, ఎల్పీ సమావేశాల్లో నేతలకు దిశా నిర్దేశం చేయాలని నిర్ణయించింది. దీంతో గ్రేటర్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. 

21:15 - December 29, 2015

హైదరాబాద్ : ఒకవైపు ఘుమఘుమలు.. మరోవైపు నేతల సరిగమలు.. ప్రథమ పౌరుడి నుంచి రాష్ట్రాధినేతల వరకు కబుర్లు.. అప్యాయంగా పలకరింపులు.. ఆ పై ముచ్చట్లు.. రాజ్‌భవన్‌ అంతా సందడి సందడిగా మారింది. రాజకీయ నేతలు, అధికారులు అంతా ఒకే చోట చేరారు. రాష్ట్రపతి ప్రణబ్‌ గౌరవార్ధం గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన విందుకు అతిరథమహారథులంతా హాజరయ్యారు. వారు ఆరగించే విందు ఎంత రుచిగా ఉందో తెలియదు గాని.. ప్రజలకు మాత్రం కనువిందు చేశారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు..కేసీఆర్ లు పలకరించుకుని మాట్లాడుకున్నారు. 

మెరుగైన మౌలిక సదుపాయాలు కావాలి - కేటీఆర్..

హైదరాబాద్ : నగరానికి తక్షణం మెరుగైన మౌలిక సదుపాయాలు కావాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శిల్పారామంలో బ్రాండ్ హైదరాబాద్ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. గతంలో నగరంలో ఎలాంటి ముందస్తు ప్రణాళికలు వేయడంతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయని, ప్రజలకు రక్షిత మంచినీరు అందించలేకపోయామన్నారు. విశాలమైన రోడ్లు, పాదాచారులకు సరైన సౌకర్యాలు కల్పించలేకపోయామన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నారని, అందుకోసం ఎన్నో ఆలోచనలున్నాయన్నారు.

20:39 - December 29, 2015

మరో వసంతం గడిచిపోతోంది. చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం చేస్తూ కాలం మరో మైలురాయిని దాటుతోంది. జ్ఞాపకాల వంతెనపై అనేక ఆనవాళ్లను మిగిల్చిన కాలం కొత్త ఉషోదయం వైపు పరుగెడుతోంది. ఎన్నో ఘటనలు దేశానికి కుదిపేశాయి. ఆనంద సందడి ముంచెత్తాయి. నిరాశ, నిర్వేదంలోకి నింపేశాయి. సంఘర్షణలతో అల్లకల్లోలం చేశాయి. అనంత కాల పయనంలో 365 రోజులు అంటే ఓ చిన్న శకలం మాత్రమే కావచ్చు. కానీ క్షణక్షణం..ప్రతిక్షణం అనేక మార్పులు కనిపించే వేగవంతమైన ప్రపంచంలో ఏడాది అంటే పెద్ద విషయమే. ఈ సంవత్సర కాలంలో భారతదేశాన్ని ప్రభావితం చేసిన ఘటనలపై ప్రత్యేక కథనం..

బీహార్ ఎన్నికలు...
నో డౌట్ !! హిఈజ్ ది జెయింట్ కిల్లర్..!! సింగిల్ హ్యాండ్ తో ఢిల్లీని ఊడ్చి పడేశాడు. మహామహులనే పాతాళంలోకి తొక్కేశాడు. ఊహించని ఫలితాలతో... ఢిల్లీ పీఠం రెండోసారి ఎక్కాడు. చరిత్ర సృష్టించాడు. మెజారిటీ మీడియాతో సహా, ఇతర పొలిటికల్ పార్టీలు ఎంత లైట్ తీస్కున్నాయో.. దానికి రివర్స్ లో క్లీన్ స్వీప్ చేసి సంచలనం క్రియేట్ చేసింది ఆప్. ఢిల్లీ ఎన్నికలు జరిగిన తొమ్మిదినెలలకు అధికార బీజెపీకి, బీహార్ రూపంలో మరో షాక్ తగిలింది. సర్వేలు బోల్తా కొట్టాయి... !! ప్రచారార్భాటాలు ఫెయిలయ్యాయి. బీహారీలెవరో బాహరీలెవరో తేల్చేశారు..!! అసహనం అవసరం లేదని ఓటు గుద్ది చెప్పేశారు.. ఫలితమే బీహార్ మహావిజయం. లంచం కుమ్మరిస్తే చాలు ఏ కాలేజ్ లో అయినా సీటు రెడీ..సరదాగా సినిమాలు చూస్తే చాలు డాక్టర్ సర్టిఫికెట్ చేతిలో పడుతుంది. పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు.. కానీ, ఒంటిపై తెల్లకోటు, మెళ్లో స్టెత స్కోపు వేసుకుని తిరగుతున్నారు. అమాయకుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. 2015లో బయటపడిన సంచలనాత్మక స్కామ్ ఇది.

పెరుగుతున్న అసహనం..
ఒక హత్యతో కొన్ని నిజాలు కప్పెట్టాలనుకున్నారు. కానీ, సరికొత్త సమస్యలను సృష్టించారు. ఒక హత్యతో ఉన్న సమస్యలనుండి బయటపడాలనుకున్నారు.. కానీ, సరికొత్త రహస్యాలను సృష్టించారు. చివరికి చట్టంముందు నేరస్తులుగా నిలిచారు. 2015లో సంచలనం రేకెత్తించిన క్రైమ్ స్టోరీ ఇది. 2015లో దేశంలో పెరుగుతున్న అసహనం అనేక విమర్శలకు తావిచ్చింది. ఇక ప్రధాని తాత్కాలిక పర్యటన కోసం మాత్రమే భారత్ వస్తున్నాడనేలా మోడీ విదేశీ టూర్లు విమర్శలకు తావిచ్చాయి. మరో వైపు కాంగ్రెస్ అధిష్టానం మెడకు నేషనల్ హెరాల్డ్ వివాదం చుట్టుకుంది.. ఇక బీజెపీ నాయకత్వంపై సీనియర్లలో లుకలుకలు మొదలయ్యాయి.

2015లో వెల్లడైన నిజాలు..
స్తంభించిన జనజీవనం.. అస్తవ్యవస్తమైన రవాణా వ్యవస్థ... కనీస సౌకర్యాలు కూడా కరువైన దృశ్యం.. ప్రజలంతా విలవిల్లాడుతున్న పరిస్థితి.. ఒక్కమాటలో చెప్పాలంటే, భారీ వర్షాలకు చెన్నై చిత్తయింది. ఎందుకీ పరిస్థితి ఏర్పడింది? మన నగరాలకు భారీ వర్షాలను తట్టుకునే శక్తి లేదా? ఇదే విపత్తు ఇతర నగరాలకూ పొంచి ఉందా..?? 2015మన నగరాలకు మిగిల్చిన పెద్ద ప్రశ్న ఇది. ఒక ఉరితాడు అనేక చిక్కుముడుల ప్రశ్నగా మారింది.అసలు కుట్రదారులు తప్పించుకున్నారు. మిగిలిన ఏకైక సాక్షి ఉరికంబం ఎక్కాడు.. కానీ, అతడితో మొదలు కాని నేరం అతనితో అంతమవుతుందా? యాకూబ్ మెమన్ ఉరిశిక్షతో సమస్య పరిష్కారమవుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు.. హిస్టరీ పేజీలు మిస్టరీగా మూసేశారు..!! అదృశ్యమో, అజ్ఞాతమో, వీరమరణమో...?? స్పష్టత లేదు.. కానీ, నిఘా కళ్లు ఇరవైయేళ్లు పాటు ఆయన కుటుంబాన్ని వెంటాడాయి...!! ఎందుకు? ఏ భయాలతో, ఏ ప్రయోజనాలకోసం ఈ చిక్కుముడిని కొనసాగిస్తున్నారు? నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాల్లో ఏముంది? 2015లో వెల్లడైన ఈ నిజాలు సంచలనం కలిగించాయి..

జువెనైల్ గురించి చర్చ..
18 కాదు.. 16ఏళ్ల నేరస్తులూ పెద్దవాళ్ల కిందే లెక్క. నిర్భయ కేసులో జువెనైల్ గురించి చర్చ వచ్చిన సందర్భంలో ఈ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.. కానీ, ఒక్క కేసు ఆధారంగా ఇలాంటి చట్ట సవరణ చేయడంపై అనేక విమర్శలు వచ్చాయి. 2015, ఒక్క ఏడాదిలో ఎన్నో ఘటనలు. విలయాలు, బీభత్సాలు , ప్రళయకాల ప్రకృతి దృశ్యాలు, కన్నీళ్లు, కడగండ్లు చితికిపోయిన సామాన్యుడి బతుకులు..అద్భుత క్షణాలు, అపురూప ఘటనలు, అంబరాన్నంటిన విజయాలు..పేట్రేగిన మతోన్మాద శక్తులు...., మానవత్వం మరచిన అరాచకవాదులు..ఎన్నో ఘటనలు, మరెన్నో గురుతులు...,ఇదీ చరిత్ర పుటల్లో కలుస్తున్న 2015లో జాతీయ ఘటనల సమాహారం. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

20:33 - December 29, 2015

జీహెచ్ఎంసీ ఎన్నికలకు మోగనున్న ఎన్నికల నగరా..తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ రేపు జరుగనుంది...చాలా రోజుల తరువాత మీడియా ఎదుట వచ్చిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి...దుబాయిలో ఇరుకున్న 80 మంది తెలంగాణ వాసులు..ఎల్సీజీ గ్యాస్ సబ్సిడీ కట్...తదితర అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న విశ్లేషించారు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

రాజ్ భవన్ కు చేరుకున్న రాష్ట్రపతి..

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజ్ భవన్ కు చేరుకున్నారు. శీతాకాల విడిది సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీ బస చేఃసిన సంగతి తెలిసిందే. గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి ప్రణబ్ కు తేనేటీ విందు ఇస్తున్నారు. 

రాజ్ భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ కు గవర్నర్ నరసింహన్ తేనేటీ విందు ఇస్తున్న సంగతి తెలిసిందే. 

శిల్పారామంలో ప్రసంగిస్తున్న కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ శిల్పారామంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. తొలుత పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. 

కోర్టు ప్రకారం సర్కార్ నడుకోవడం లేదు - మర్రి..

హైదరాబాద్ : ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని కోర్టు గడువు ప్రకారం ప్రభుత్వం నడుచుకోవడం లేదని తక్కువ సమయంలో ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం చూస్తోందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు ఈ సమయం సరిపోదని, రిజర్వేషన్లపై అభ్యంతరాలకు సమయం ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తీరుపై సీఈసీకి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళుతామని తెలిపారు. 

ఎన్నికలను పొడిగిస్తోంది - సీపీఎం..

హైదరాబాద్ : జనవరి 31 వరకు ఎన్నికలు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా పనిచేయడం లేదని సీపీఎం విమర్శించింది. రిజర్వేషన్లు ప్రకటించిన తరువాతే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఈసీ చెబుతోందని, టీఆర్ఎస్ తమకు అనుకూలంగా ఎన్నికలు మలచుకోవడానికి చివరి వరకు పొడగిస్తూ వస్తోందని సీపీఎం నేత శ్రీనివాస్ పేర్కొన్నారు. 

19:17 - December 29, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ శిల్పారామానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా టెన్ టివితో నిర్వాహకుడు రవిచందర్ మాట్లాడారు. నగరంలోని ఉన్న సమస్యలేంటీ ? ఎలా సమస్యలను పరిష్కరిస్తారు ? స్మార్ట్ సిటీ పేరిట అభివృద్ధి చేస్తారా ? తదితర అంశాలపై కేటీఆర్ వివరిస్తారని తెలిపారు. ఫేస్ బుక్ లో తాము కొన్ని ప్రశ్నలను అడగడం జరిగిందని, అందులో వచ్చిన ప్రశ్నలను మంత్రి కేటీఆర్ ఎదుట ఉంచుతామని, అనంతరం ప్రజలు పలు ప్రశ్నలు అడుగుతారని తెలిపారు. తమకు అందిన ప్రశ్నల్లో అధికంగా కాలుష్యం..తాగునీరు, హుస్సేన్ సాగర్, చెరువులు తదితర అంశాలున్నాయన్నారు. 

చంచల్ గూడ జైలును చర్లపల్లికి తరలించాలి - కేసీఆర్..

హైదరాబాద్ : చంచల్ గూడ జైలును చర్లపల్లికి తరలించాలని రేస్ కోర్సును నగర శివారు ప్రాంతాలకు తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ రెండు స్థలాలను రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ఉపయోగించాలని సూచించారు. 

త్వరలో 60 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు..

హైదరాబాద్ : 2016 జూన్ నుండి 60 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం మైనార్టీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. బాలికలకు 30, బాలురకు 30 పాఠశాలలు కేటాయించాలని, ఈ పాఠశాలల నిర్వాహణ బాధ్యతను మైనార్టీ వెల్ఫేర్, విద్యా శాఖ సంయుక్తంగా నిర్వహించాలని సూచించారు. తొలి ఏడాది 5,6,7 తరగతులలో ప్రవేశాలు కల్పించి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ 12వ తరగతి వరకు విద్యా బోధన జరపాలని కేసీఆర్ సూచించారు. ఈ స్కూళ్లలో అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు రావాలని సీఎం కేసీఆర్ సూచించారు. 

బడ్జెట్ పై ముగిసిన కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : 2016-17 బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ జరిపిన సమీక్ష ముగిసింది. ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉండేలా చూడాలని ఆర్థిక శాఖ అధికారును కేసీఆర్ ఆదేశించారు. గతంలో మాదిరిగా మూస పద్ధతిలో కాకుండా ప్రజల అవసరాలు, ప్రభుత్వ కర్తవ్యాలను గమనించి నిధుల కేటాయింపులు చేయాలని సూచించారు. 

18:40 - December 29, 2015

2015 సంవత్సరం. భారత రాజకీయాల్లో ఎన్నో సంచలనాత్మక ఘటనలకు సాక్షి. జనవరి మొదలుకుని డిసెంబర్ వరకు మరెన్నో పరిణామాలను తన జ్ఞాపకాల మదిలో దాచుకుంది. ఇండియాలో 2015 టాప్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి అవలోకన చేసుకుందాం.

నీతి ఆయోగ్ ఏర్పాటు..
నెహ్రూ కాలం నుంచి దేశాభివృద్దిని ప్రణాళిక బద్దంగా ముందుకు సాగించిన ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. దీని స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
అగ్ని-5 పరీక్ష విజయవంతం..
రక్షణ శాఖ అమ్ములపొదిలో పాశుపతాస్త్రం అగ్ని-5. శత్రు స్థావరాలపై అగ్నివర్షం కురిపించే అగ్ని-5 ప్రయోగ పరీక్ష విజయంతమైంది.
ఢిల్లీలో చీపురు పార్టీ సంచలనం..
హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్‌లను తుడిచిపెట్టేసి ఊహించని మెజారిటీ నమోదు చేసింది.
స్వైన్ ఫ్లూ మరణ మృదంగం..
దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ విజృంభించింది. రాజస్థాన్,గుజరాత్,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలో స్వైర విహారం చేసింది. ఫిబ్రవరి 15 నాటికి దేశంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 585.
గోవింద్ పన్సారే దారుణ హత్య..
సామాజిక ఉద్యమకారుడు, వామపక్ష నాయకుడు గోవింద్ పన్సారే దంపతులపై దారుణంగా కాల్పులు జరిపారు ఛాందసవాదులు. మహారాష్ట్ర కొల్హాపూర్‌ లో ఈ ఘటన జరిగింది. పన్సారే చికిత్స పొందుతూ ఫిబ్రవరి 20న చనిపోయారు.
అమరావతి ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును అమరావతిగా నామకరణం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. తుల్లూరు సమీప ప్రాంతాన్ని దేశం గర్వించేలా అభివృద్ది చేస్తామని ప్రకటించింది. జాతీయస్థాయిలో అమరావతి పేరు మార్మోగింది.
సెక్షన్ 66(A) రాజ్యాంగ విరుద్ధం..
భారత అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66 ఏ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
భారత రత్న వాజ్‌పేయి..
దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయిని వరించింది. అదే నెల 30న స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యాకు కూడా భారత రత్నను ప్రకటించింది కేంద్రం.
అడవిలో రక్త చందనం..
చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌ జాతీయ స్థాయిలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌ భద్రతా బలగాలు 20 మందిని కాల్చిచంపాయి. దీనిపై తమిళనాడుతో పాటు చాలా రాష్ట్రాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
భారత అమ్ములపొదిలో ఆకాశ్‌ అస్త్రం..
శత్రువు గుండెల్లో దడ పుట్టించగల ఆకాశ్‌ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించారు. అన్ని రకాల పరీక్షలు చేసి దీన్ని ఇండియన్ ఆర్మీకి అప్పగించారు. సుదూర తీరాల లక్ష్యాలను ఇది చేధించగలదని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
భారత్‌-ఇరాన్ ఒప్పందం..
ఇరాన్‌లోని ఛాబహార్ పోర్టు అభివృద్దిపై ఇరాన్‌, భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. పోర్టులు, రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఇరాన్ పర్యటనలో ఈ అగ్రిమెట్ కుదిరింది. ఛాబహార్ ఓడరేవులో భారత్ ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించింది.
బంగ్లాదేశ్‌తో భౌగోళిక సమస్యల పరిష్కారానికి చట్టం..
పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌తో ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న భౌగోళిక సమస్యల పరిష్కారానికి కీలక అడుగుపడిన సందర్భమది. ఇందుకోసం 119వ రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేశారు.
అక్రమాస్తుల కేసులో జయకు ఉపశమనం..
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు పెద్ద ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
మణిపూర్‌లో మిలిటెంట్ల ఘాతుకం..
నాగాలాండ్-కప్లాంగ్ NSC మిలిటెంట్లు మణిపూర్‌లో రక్తపుటేరులు పారించారు. 20 మంది భద్రతా సిబ్బందిని కాల్చి చంపారు.
మహారాష్ట్రలో కల్తీసారా మరణమృదంగం..
ముంబై మలాద్ ప్రాంతంలో కల్తీసారా తాగి 94 మంది చనిపోయారు. వందలాదిమంది ఆస్పత్రి పాలయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా తొలి యోగా డే..
ప్రపంచ దేశాలు తొలి యోగా డేను జరుపుకున్నాయి. కోట్లాదిమంది ఆసనాలు వేశారు.
డిజిటల్ ఇండియా ప్రారంభం..
బీజేపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు.
కల్లోలిత నాగాలాండ్ ..
కేంద్ర హోంశాఖ నాగాలాండ్‌పై సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ అధికారాల ప్రత్యేక చట్టం ద్వారా ఆ కేంద్ర పాలిత ప్రాంతాన్ని డిస్ట్రర్బ్ డ్ రీజియన్‌గా ప్రకటించింది.
రాజమండ్రిలో తొక్కిసలాట..
గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో దాదాపు 29 మంది భక్తులు చనిపోయారు. పుష్కరాల ఏర్పాట్లపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
సంతారా చట్ట విరుద్ధం..
జైనుల పండుగ సంతారాపై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సంతారా ఆచారం చట్టవిరుద్దమని ప్రకటించింది.
గుజరాత్‌లో పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమం..తమ సామాజికవర్గాన్నీ బీసీ కేటగిరిలో చేర్చాలంటూ పటేల్‌ యువత గుజరాత్‌లో భారీ ఉద్యమం చేపట్టింది. పటేళ్ల ఆందోళన చాలా చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. అనేక చోట్ల జరిగిన అల్లర్లలో దాదాపు 8 మంది చనిపోయారు.
జీశాట్ ప్రయోగం విజయవంతం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అఖండ విజయం జీశాట్‌-6. జీఎస్‌ఎల్‌వి డి-6 వాహక నౌక ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు.
కల్బుర్గి దారుణ హత్య..
సామాజిక ఉద్యమకారుడు, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం రగిలించిన రచయిత కల్బుర్గి కర్ణాటకలో హత్యకు గురయ్యాడు. మత ఛాందసవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కేంద్రం స్పదించకపోవడంతో దేశవ్యాప్తంగా రచయితలు తమ సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇచ్చేశారు.
నేపాల్‌లో భారత వ్యతిరేక ఆందోళనలు..
మాదేశీ, థారు గిరిజన తెగలు నేపాల్‌-భారత సరిహద్దుల్లోని దారులను మూసివేశాయి. నేపాల్ కొత్త రాజ్యాంగం తెరాయి ప్రాంతంలో నివసిస్తున్న తమకు వ్యతిరేకంగా ఉందని భగ్గుమన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య ఎగుమతులు, దిగుమతులు స్తంభించాయి.
దాద్రీలో దారుణం..
ఆవు మాంసం తిన్నాడన్న నెపంతో ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో దారుణానికి ఒడిగట్టారు ఛాందసవాదులు. ఓ ముస్లిం వ్యక్తిని అత్యంత అమానుషంగా చంపేశారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలన సృష్టించింది.
ఆస్ట్రోశాట్‌ లాంచింగ్..
భారత తొలి రోదసీ అబ్జర్వేటరి ఆస్ట్రోశాట్‌ను విజయవంతంగా ప్రయోగించింది ఇస్రో.
NJAC రాజ్యాంగ విరుద్ధం...
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ను భారత అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇది రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది.
కాల్ కట్‌ అయితే పైసా కట్టాల్సిందే..
టెలికం రెగ్యులేటరి అథారిటీ ఆఫ్‌ ఇండియా ట్రాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాంకేతిక కారణాలతో కాల్ కట్ అయితే సదరు వినియోగదారునికి పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. జనవరి 1, 2016 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
అమరావతికి శంకుస్థాపన..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రధాన నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ మీడియాను ఆకర్షించింది.
అతివల ఆత్మవిశ్వాసానికి ఆకాశమే హద్దు..
ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ లో మహిళల ప్రాతినిథ్యానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. కంబాట్ పైలట్స్ గా మహిళలను రిక్రూట్ చేయాలని రక్షణ శాఖ ఉత్తర్వులిచ్చింది.
దేశ రాజకీయాల్లో బీహార్‌ సంచలనం..
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లవో నితీష్‌-లాలూ సారథ్యంలోని మహాకూటమి అఖండ విజయం సాధించింది. బీజేపీ అలయన్స్ ఘోర పరాజయం చవిచూసింది. దేశ రాజకీయాల్లో బీహార్ ఫలితం ఓ కుదుపు.
కోర్టు మెట్లెక్కిన సోనియా, రాహుల్..
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ తొలిసారి కోర్టు మెట్లెక్కారు. పాటియాల కోర్టులో రెండు నిమిషాల్లోనే ముగిసిన ఈ విచారణలో సోనియా, రాహుల్‌కు బెయిల్‌ మంజూరైంది.
నిర్భయ దోషి జువైనెల్ విడుదల..
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు, బాలనేరస్థుడు విడుదలయ్యాడు. జువైనెల్‌ రిలీజ్ కు వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో మహిళా సంఘాలు ఆందోళన చేశాయి. తన కుమార్తె పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించిన బాలనేరస్థుడి విడుదల పట్ల బాధిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలనేరస్థుడి విడుదలను ఆపలేమన్న సుప్రీం కోర్టు..
నిర్భయ కేసులో దోషి అయిన బాలనేరస్థుడి విడుదలపై స్టే విధించాలన్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. చట్టం ప్రకారం అతను విడుదల కాక తప్పదని స్పష్టం చేసింది.
డిడిసీఏలో అవినీతి కలకలం..
ఢిల్లీ జిల్లా క్రికెట్‌ సంఘంలో అరుణ్‌ జైట్లీ అవినీతికి పాల్పడ్డాడని ఆమ్‌ ఆద్మీ సర్కారు ఆరోపణలు గుప్పించింది. దీనిపై న్యాయ విచారణకు కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆప్ ఆరోపణలపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు జైట్లీ .

18:28 - December 29, 2015

విశాఖపట్టణం : సెవెన్‌ హిల్స్ ఆస్పత్రి క్యాంటిన్‌లో కల్తీ కందిపప్పు వినియోగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జిఎ నారాయణ మండిపడ్డారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడినా ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళతామని ఆయన హెచ్చరించారు. 

18:27 - December 29, 2015

కడప : సెంట్రల్‌ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీల కోసం గాలింపు చేపట్టామని జైలు సూపరింటెండెంట్‌ గోవిందరాజులు తెలిపారు. గాలింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సోమవారం నలుగురు ఖైదీలు సెంట్రల్‌ జైలు గోడ దూకి పరారయ్యారు. సాయంకాలం ఖైదీలను బయటకు వదిలిన సమయంలో ఈ నలుగురూ సిబ్బంది కన్నుగప్పి పారిపోయారు. పారిపోయిన ఖైదీలు నలుగురూ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నవారే. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఖైదీలు పరారయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇటువంటి సంఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. 

18:25 - December 29, 2015

హైదరాబాద్ : కాల్‌మనీ కేసుపై ఏపీ ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తోందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు కేసును తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాల్‌మనీపై మావోయిస్టుల హెచ్చరికలు నిజం కావాలనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. 

18:25 - December 29, 2015

అనంతపురం : రాయలసీమకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పుకొచ్చారు. అనంతపురంలో నీరు ప్రగతి కార్యక్రమాన్ని గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలో నదులను అనుసంధానం చేసి కరువును పూర్తిగా అధిగమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం శ్రీనగర్‌ కాలనీలో ఏర్పాటుచేసిన నీరు ప్రగతి రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. గవర్నర్‌ నరసింహన్‌తో పాటు సీఎం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నీరు ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నీరు ప్రగతి ప్రదర్శన శాలను గవర్నర్‌, ముఖ్యమంత్రి పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి గవర్నర్‌, సీఎం పుట్టపర్తికి వచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో హంద్రీనీవా రెండో దశ పనులను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతపురంలో ఏర్పాటుచేసిన నీరు-ప్రగతి పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర సదస్సులో పాల్గొన్నారు. కరువును పారద్రోలే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని చెప్పారు.

చంద్రన్న కానుకలు...
అనంతపురం జిల్లాలో కరువును పారద్రోలేందుకు జిల్లాలో లక్ష ఫారం ఫాండ్స్‌ను పంట సంజీవినీ పేరుతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఫారం ఫాండ్స్ నిర్మాణానికి అయ్యే ఖర్చును ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో సెంట్రల్‌ యూనివర్శిటీ, శిల్పారామం ఏర్పాటుచేస్తామని సీఎం తెలిపారు. పంట సంజీవిని, నీరు ప్రగతి కార్యక్రమాలతో అనంతపురంను అనంత సంతోషపురంగా మార్చవచ్చని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చేందుకు 18 నెలలో 10వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. నీరు ప్రగతి సభా వేదికపై గవర్నర్‌ నరసింహన్‌ ఆద్యంతం తెలుగులోనే మాట్లాడి ప్రజలను ఆకర్షించారు. ఈ సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కానుకలను గవర్నర్‌ చేతులు మీదుగా మహిళలకు పంపిణీ చేశారు. 

కడప సెంట్రల్ జైలు అధికారులపై సస్పెన్షన్ వేటు..

కడప : కేంద్ర కారాగారం జైలు నుండి ఖైదీలు పారిపోయిన ఘటనపై ఆరుగురిని సస్పెండ్ చేసినట్లు జైళ్ల శాఖ డీజీ కృష్ణం రాజు పేర్కొన్నారు. డిప్యూటి సూపరిటెండెంట్ రామకృష్ణ, ఇద్దరు డిప్యూటి జైలర్లు బ్రహ్మానంద రెడ్డి, గోవిందరావు, ఇద్దరు జైలర్లు శేషయ్య, గుణశేఖర్రెడ్డి, చీఫ్ వార్డర్ గోపాల నాయక్ లను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. 

గుజరాత్ సాహితీ వేత్తకు జ్ఞాన్ పీఠ్ అవార్డు..

ఢిల్లీ : సాహిత్యంలో అత్యున్నత అవార్డు అయిన 51వ జ్ఞాన్ పీఠ్ అవార్డు గుజరాత్ సాహితీ వేత్త రఘువీర్ చౌదరిని వరించింది. 

కాల్ మనీ కేసు నిందితుడికి ముందస్తు బెయిల్..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసులో నిందితుడు సత్యానందంకు ముందస్తు బెయిల్ మంజూరైంది. 

తమది ఉద్యోగుల ప్రభుత్వం - కేటీఆర్..

హైదరాబాద్ : తమది ఉద్యోగుల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆంధ్రాలో పనిచేస్తున్న ఉద్యోగులను వెనక్కి రప్పిస్తామని, సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి ఉద్యోగులను వెనక్కి తీసుకొస్తామని పేర్కొన్నారు. పీఆర్సీపై జీవో త్వరలో వస్తుందని, హెల్త్ కార్డుల విషయంలో కార్పొరేట్ ఆసుపత్రులు కొంత ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. హెల్త్ కార్డుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

మధురవాడ సబ్ రిజిష్ట్రార్ ఇంటిపై ఏసీబీ దాడి..

విశాఖపట్టణం : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మధురవాడ సబ్ రిజిష్ట్రార్ ఆనంద్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. క్రిస్మస్ సెలవుల నిమిత్తం ఆనంద్ ఊరికెళ్లారు. ఆనంద్ ఇంటిని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. 

రామగుండం సింగరేణిలో అవినీతి అధికారి..

కరీంనగర్ : రామగుండం సింగరేణి సివిల్ డిపార్ట్ మెంట్ అధికారి మధుసూధన్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

 

ఎస్సీ కార్పొరేషన్ ఈడీలతో జూపూడి సమీక్ష..

విజయవాడ : అన్ని జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ల ఈడీలతో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును ఈడీలు వివరించారు.

 

కోటగిరి తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి అధికారి..

నిజామాబాద్ : కోటగిరి తహశీల్దార్ కార్యాలయంలో రూ. 2వేలు లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ సుశీలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

16:34 - December 29, 2015

పుణె : ఇన్ఫోసిస్ క్యాంపస్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా ఉద్యోగినిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన డిసెంబర్ 27న జరిగింది. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. క్యాంపస్ లో క్యాషియర్ గా పనిచేసే మహిళపై అక్కడే విధులు నిర్వహిస్తున్న ఇద్దరు యువకులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, క్యాంపస్ లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని ఇన్ఫోసిస్ వర్గాలు పేర్కొన్నాయి. 

16:29 - December 29, 2015

తమిళనాడు : డిఎండీకే అధినేత విజయకాంత్ పై రాష్ట్రంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జయలలితతో పాటు జర్నలిస్టులపై విజయకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పాత్రికేయులు విజయకాంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కడలూరు సభకు హాజరయ్యేందుకు పుదుచ్చేరి వచ్చిన విజయకాంత్ జర్నలిలస్టులు, అన్నాడీఎంకే కార్యకర్తలు నిరసన తెలిపారు. 

 

16:25 - December 29, 2015

పశ్చిమగోదావరి : జిల్లాలో చేపల చెరువు తవ్వకాలు రైతులను కష్టాల పాలు చేస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపల చెరువు తవ్వకాలకు అనుమతులను మంజూరు చేస్తున్నారు. చెరువుల మంజూరీ విషయంలో అవతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేపల చెరువుకు ఇష్టమొచ్చినట్లుగా అనుమతులు మంజూరు చేస్తున్నారని దీనివల్ల పక్కనే ఉండే వ్యవసాయ భూములు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని గణపవరం మండలం కేశవరం కొందరు చేపల చెరువును తవ్వడానికి ప్రయత్నాలు చేశారు. దీనిని రైతులు అడ్డుకున్నారు. వీరికి సీపీఎం నేతలు మద్దతు పలికారు. 12 ఎకరాలలో చెరువు తవ్వడం వల్ల రెండు పంటలు పండే భూములు పాడై పోతాయని రైతులు పేర్కొంటున్నారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను..సీపీఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. 

టి.సర్కార్ పై జానా విమర్శలు...

నిజామాబాద్ : కామారెడ్డిలో అఖిలపక్ష ఆధ్వర్యంలో బహిరంగసభ జరుగుతోంది. ఈ సందర్భంగా టి.కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రసంగించారు. బంగారు తెలంగాణ కాదు..భ్రష్టు తెలంగాణ చేస్తున్నారని జానా విమర్శించారు. అన్ని పార్టీల అభిప్రాయంతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, కేసీఆర్ వందేళ్లు పోరాటం చేసినా తెలంగాణ వచ్చేది కాదన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు. 

రాజకీయ పార్టీలతో నాగిరెడ్డి సమావేశం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ప్రణబ్ తో మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు కలిశారు. టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోందని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

 

 

కొండా లక్ష్మణ్ బాపూజీ వర్సిటీకి శంకుస్థాపన..

హైదరాబాద్ : జనవరి ఏడో తేదీన మెదక్ జిల్లా ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీ కల్చర్ యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ హాజరు కానున్నారు.

15:35 - December 29, 2015

తూర్పుగోదావరి : భారీ లడ్డూల తయారీతో రికార్డులు సృష్టిస్తున్న శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ మరో రికార్డు సృష్టించింది. వరుసగా ఐదు సార్లు గిన్నిస్ బుక్ రికార్డులను సాధించింది. తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన ఈ సంస్థ ఖైరతబాద్ గణేష్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని గణేష్ విగ్రహాలకు లడ్డూలను అందిస్తోంది. 2011-2015 వరకు అతి పెద్ద లడ్డూలను తయారీ చేసినందుకు శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ ఈ గిన్నిస్ బుక్ రికార్డ్సులను సాధించింది. సిబ్బంది సహాయ సహకారాల వల్లే ఈ రికార్డు సాధించామని అధినేత వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 

15:28 - December 29, 2015

ఢిల్లీ : మరో కొద్ది రోజుల్లో క్యాలెండర్ మారిపోతోంది. న్యూ ఇయర్ రానుంది. ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో నిఘా వర్గాలు పలు హెచ్చరికలు జారీ చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా లష్కరే తొయిబా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరికలో పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాలని హెచ్చరికల్లో పేర్కొంది. పాక్ నుండి 15-20 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని, ముంబాయి తరహా దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భద్రతను కట్టుదిట్టం చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. 

15:25 - December 29, 2015

విశాఖపట్టణం: సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహిస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. నగరంలో సూర్యకిరణ్ పేరిట ప్రారంభం కానున్న సోలార్ పవర్ ప్రాజెక్టు బ్రోచర్ ను మంత్రి గంటా ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. థర్మల్ పవర్ కు ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరగాల్సినవసరం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రలోని ఐదు ప్రాంతాల్లో మహితా ఇన్ ఫ్రా సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోందని సంస్థ ఛైర్మన్ స్వామి తెలిపారు. 

15:21 - December 29, 2015

మెదక్ : రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఎక్కోడో ఒక చోట రైతు బలవనర్మాణాలకు పాల్పడుతున్నాడు. అప్పులు పేరకపోవడం..పంట దిగుబాడి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన మెదక్ జిల్లా వర్గల్ మండలం ఇప్పలగూడెంలో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుచ్చిరెడి అనే రైతుకు ఒక ఎకరం పొలం ఉంది. దీనితో పాటు 12 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేశాడు. అయితే సరైన వర్షాలు కురవకపోవడంతో పంట ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి రాక..కౌలు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో బుచ్చిరెడ్డి పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు ఆరు లక్షల రూపాయల మేర అప్పులున్నట్లు మృతుడి కుమారుడు పేర్కొన్నాడు. బుచ్చిరెడ్డి మృతితో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

15:14 - December 29, 2015

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక బిజీ బిజీగా గడుపనున్నారు. నిన్నటి వరకు అధ్యాత్మిక కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. నేటి సాయంత్రం కేసీఆర్ సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం పలు శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మైనార్టీ సంక్షేమంపై రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి గవర్నర్ ఇచ్చే తేనేటీ విందులో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. జనవరి 2న కేబినెట్ మీటింగ్.. జనవరి 3న టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం.. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, గ్రేటర్ ఎన్నికలపై చర్చించనున్నారు. జనవరి 4, 5 తేదీల్లో వరంగల్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. 4న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఏటూరు నాగారం బ్రిడ్జ్‌ను ప్రారంభించనున్నారు. 5న భూపాలపల్లి కేటీపీసీ స్టేజ్ -2 విద్యుత్ కేంద్రాన్ని సీఎం జాతికి అంకితం చేయనున్నారు. 

ఉగ్రదాడి జరగవచ్చు - నిఘా వర్గాలు..

ఢిల్లీ : నూతన సంవత్సరం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి. 

సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయానికి చేరుకున్నారు. పలు శాఖలపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. 

14:59 - December 29, 2015

కాలం చాలా విలువైంది. గతాన్ని మరిచిపోయేలా చేస్తుంది. వర్తమానంలోని వాస్తవాల్ని వివరిస్తుంది. భవిష్యత్ మీద ఆశలు కలిగిస్తుంది. అలా కాలచక్రంలో మరో ఏడాది కరిగిపోయింది. ఈ సందర్భంగా సంవత్సర కాలంలో, మహిళా ప్రపంచంలో జరిగిన అనేక సంఘటలను, సంక్షోభాలను, పోరాటాలను, ఆరాటాలను సింహావలోకనం చేసుకొందాం..మహిళలపై అనేక ఆంక్షలు విధించే ఆఫ్గనిస్తాన్ లాంటి దేశంలో, అక్కడి మహిళలు ఆ ఆంక్షల చట్రంలోంచి బైటికొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ధైర్యం గా బ్యాట్ పట్టి ముందుకెళ్తోంది డయానా. అమెరికా ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక అవార్డును భారత సంతతికి చెందిన మహిళ అందుకుంది. ఆర్టిఫిషియల్ హ్యూమన్ మైక్రోలివర్ ను తయారు చేసి అరుదైన ఘనత సాధించింది. రోజు రోజుకీ మహిళలపై పెరుగుతున్న దాడులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విభాగాలను ఏర్పాటు చేసే దిశగా రంగం సిద్ధం చేసింది. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఇందులో భాగస్వాములను చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న పిఆర్సీ ఉద్యోగ సంఘాల డిమాండ్లను కొన్నింటిని ఆమోదించింది. వీటిలో మహిళలకు సంబంధించి పిల్లల సంరక్షణ కోసం కొంత వెసులుబాటు కల్పించింది. మహిళలను సెకండ్ జెండర్ గా పరిగణించే సౌదీ అరేబియాలో మహిళలకు కొత్త హక్కులు కల్పించాలని అక్కడి పాలకులు నిర్ణయించారు. మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కునే ఈ సమాజంలో మహిళలను స్థానిక పాలనలో భాగస్వామ్యులుగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మహిళల పట్ల వివక్షత..
భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపాలాహిరి అరుదైన ప్రత్యేకత సాధించింది. అమెరికాన్ అధ్యక్షుని చేతుల మీదుగా సన్మానం పొంది రచయిత్రిగా ఘన సన్మానం పొందింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ గా ఒక మహిళ నియమితులయ్యారు. విశ్వవిద్యాలయ చరిత్రలోనే ఒక మహిళ వైస్ ఛాన్స్ లర్ గా ఎంపిక కావటం ఇదే తొలిసారి. మహిళల పట్ల వివక్ష ప్రపంచమంతా కొనసాగుతందని చెప్పటానికి అనేక ఉదాహరణలు మన ముందు నిలుస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెరికా కరెన్సీపై ఇప్పటి వరకు పురుషుల చిత్రాలు మాత్రమే ఉండేవి. అయితే ఆ దేశ అధ్యక్షుడు ఒబామా నిర్ణయం మేరకు కరెన్సీ పై మహిళల ప్రాతినిధ్యం కూడా ఇక ముందు ఉండబోతోంది. మహిళలు అనేక రంగాల్లో తమ శక్తియుక్తులు చాటుతున్నప్పటికీ కొన్ని విభాగాలలో వారి ప్రవేశం ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. అందుకే జర్మనీ ప్రభుత్వం తగు చర్యలు చేపట్టే దిశగా కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది.

స్వచ్ఛ భారత్..
దేశ ప్రధాని పిలుపు మేరకు దేశమంతా మారుమోగుతున్న స్వచ్ఛ భారత్ పథకానికి తెలుగు రాష్ట్రాల నుండి అంబాసిడర్స్ ను నియమించింది. పలురంగాలకు చెందిన ప్రముఖులను కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ కారిడార్ లో పనిచేసే మహిళల భద్రత కోసం ప్రత్యేక సేవలతో ముందుకొచ్చింది. వారి సౌకర్యం కోసం కొత్త యాప్ లను కూడా ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఇంటి పనివారి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఉంది. వారికి గుర్తింపు కార్డులు జారీచేసి సామాజిక భద్రత కల్పించేందుకు అడుగులు వేయనుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం రిజర్వేషన్లను అమలు చేయనుంది. పోలీసు నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇస్తోంది.

ప్రత్యేకత చాటుతున్న మహిళలు...
అందాల పోటీల నిర్వహణ పై మద్రాస్ హైకోర్టు ఆసక్తికరమైన తీర్పును వెలువరించింది. చదువుకునే విద్యార్థులకు అందాల పోటీలు ఏవిధంగా ఉపయోగపడతాయని ప్రశ్నించింది.. తెలంగాణకు చెందిన విద్యార్థిని అరుదైన రికార్డు సాధించేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. ప్రపంచ రికార్డు నెలకొల్పి అరుదైన ఘనత సాధించింది. పలు విజయాలు సాధించి ప్రత్యేకత చాటుతోంది. ఇంటా బయటా అనేక ఒత్తిడులకు లోనవుతూ కూడా మహిళలు అనేక రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. అడుగుపెట్టిన రంగాలన్నింటిలో తమ ప్రత్యేకతనూ చాటుతున్నారు. ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి ప్రభుత్వ అధికారిక గణాంకాలు.

విలాస జీవితంలో విచారం ఉండదా ? 
విలాసవంతమైన జీవితంలో విచారం ఉండదా? సెలబ్రిటీల జీవితం సమస్యలకు అతీతమా? కాదంటోంది బాలీవుడ్ నటి. అన్నీ చెంతనే ఉన్నా కుంగుబాటు ఆమెను చుట్టుముట్టింది. ఈ సమస్యను జయిస్తూ శారీరక సమస్యల్లాగే మానసిక సమస్య అంటూ మన ముందుకొచ్చింది. లింగవివక్ష పెరిగిపోతున్న ప్రస్తుత నేపథ్యంలో రాజస్థాన్ లోని ఒక గ్రామం వినూత్న పద్ధతిని ఆచరిస్తోంది. ఆడపిల్లల మనుగడ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. మహిళల రక్షణ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యాసిడ్ దాడులకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. అనేక కారణాలతో డిప్రెషన్ తో బాధ పడుతున్న మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమంతో ప్రజల ముందుకొచ్చింది.  తెలంగాణ ప్రభుత్వం ఐటీ కారిడార్ లో పనిచేసే మహిళల భద్రత కోసం ప్రత్యేక సేవలతో ముందుకొచ్చింది. వారి సౌకర్యం కోసం కొత్త యాప్ లను కూడా ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు పార్లమెంటరీ కమిటీ కొత్త సిఫారసులను సూచించింది. క్లరికల్ విభాగంలోనే ఎక్కువ మంది పనిచేస్తున్న తీరును మారుస్తూ ఉన్నత పదవులలో వారి భాగస్వామ్యాన్ని పెంచాల్సింది ఈ కమిటీ అభిప్రాయపడింది.  

ఎలాంటి పనులైనా...
ట్రక్ లాంటి హెవీ వెహికిల్స్ ను సాధారణంగా పురుషులే నడపడం చూస్తుంటాం. అయితే అందుకు భిన్నంగా దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఒక మహిళ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. మహిళలు ఎలాంటి బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డీఆర్ డీవో కి తొలిసారి మహిళ ప్రాతినిధ్యం తో కృషి, పట్టుదలతో మహిళలు ఎంతటి పనులైనా విజయవంతంగా నిర్వహించగలరని మరోసారి రుజువైంది. ప్రతిష్టాత్మకమైన ఫార్చ్యూన్ జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. అనేక రంగాలలో విశిష్ట కృషి చేస్తున్న వీరికి ఈ జాబితాలో ప్రత్యేక స్థానం లభించింది. పోలీస్.. పోలీస్ స్టేషన్ అంటే ఇప్పటికీ సామాన్య ప్రజలకి, ముఖ్యంగా మహిళలకు ఒక లాంటి భయమే నెలకొంది. ఈ భయాలను తొలగించేందుకు, వారి నుండి తక్షణ సేవలు పొందేందుకు ఢిల్లీ పోలీస్ శాఖ సరికొత్త కార్యక్రమంతో ప్రజలలోకొస్తుంది.

14:24 - December 29, 2015

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 60 కిలోల వెండిని ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు చేపట్టగా.. బెంగళూరు నుంచి ఎలాంటి రశీదు లేకుండా తరలిస్తున్న 21 లక్షల రూపాయల విలువైన వెండిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది తమ పరిధిలోకి రాకపోవడంతో జడ్చర్ల కమర్షియల్‌ టాక్స్ అధికారులకు పోలీసులు వెండిని అప్పగించారు. 

14:22 - December 29, 2015

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ పోలీసులు మరో దొంగల ముఠాను పట్టుకున్నారు.. ఆరుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డ ఈ నిందితులు తాళాలు వేసిన షట్టర్లలో చోరీలు చేసేవారు.. రాత్రిపూట షాపులు తెరచి అందులోని నగదు దొంగిలించేవారు.. ఇలా దాదాపు 40 చోరీలు చేశారు.. ఈ డబ్బును జల్సాలకు ఖర్చుపెట్టేవారు.. ఆ తర్వాత ఫుట్‌పాత్‌లపై పడుకునేవారు.. ఈ కేసులపై దర్యాప్తుచేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు..  

14:21 - December 29, 2015

వరంగల్‌ : జిల్లా పోలీసుల ఎదుట మావోయిస్టు గాజర్ల అశోక్‌ లొంగిపోయాడు. అశోక్‌ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. దండకారణ్య కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్న అశోక్‌.. 2004లో అప్పటి ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. అశోక్‌ సోదరుడు గణేష్‌ మావోయిస్టు అగ్రనేతగా కొనసాగాడు. గణేష్‌ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. అశోక్‌ వరంగల్‌ జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామానికి చెందినవాడు. అనారోగ్య కారణాలతో అశోక్‌ లొంగిపోయినట్లు సమాచారం.

14:18 - December 29, 2015

హైదరాబాద్ : ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మేము రాజధానికి వ్యతిరేకం కాదని.. టీడీపీ దోపిడి విధానాన్నే ప్రశ్నిస్తున్నామన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోకుండా.. ప్రైవేట్‌ సంస్థలతో ఒప్పందం చేసుకుందని బొత్స అన్నారు. రాజధాని నిర్మాణంలో చేసుకున్న ఒప్పందాలన్నీ బహిర్గత చేయాలని బొత్స డిమాండ్‌ చేశారు. 

కేసీఆర్ సొంత వ్యాపకాలకు పరిమితమయ్యారు - భట్టి..

హైదరాబాద్ : కేసీఆర్ పాలనను, ప్రజాసమస్యలను పక్కన పెట్టి సొంత వ్యాపకాలకు పరిమితం కావడం దురదృష్టకరమని టిపిసిసి నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గైర్హాజరి సీఎంగా కేసీఆర్ మారారని, కుటుంబసభ్యుల ప్రయోజనాల కోసమే ప్రాణహితను పణంగా పెట్టారని విమర్శించారు. పోలవరం కోసం 7 మండలాలను కేసీఆర్ ధారదత్తం చేశారని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేకపోయారని పేర్కొన్నారు. బీజేపీకి భయపడే కేసీఆర్ మౌనంగా ఉన్నారని తెలిపారు. 

విజయకాంత్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం..

చెన్నై : సీఎం జయలతిత, పాత్రికేయులపై డీఎండీకే నేత విజయకాంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విజయకాంత్ ను పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమౌతున్నారు. ముందస్తు బెయిల్ కోసం కోరుతూ మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ లో విజయ్ కాంత్ పిటిషన్లు దాఖలు చేశారు. 

కరవు నివారణకు చర్యలు - చంద్రబాబు..

అనంతపురం : కరవు నివారణకు చర్యలు చేపట్టడం జరిగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నీరు చెట్టుతో కరవును తరిమికొడుతామని, రాయలసీమను మళ్లీ రతనాలసీమగా మారుస్తామన్నారు. 

ప్రాణహిత బోర్డు సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం..

హైదరాబాద్ : ప్రాణహిత బ్యారేజీల నిర్మాణంపై తెలంగాణ, మహారాష్ట్ర చీఫ్ ఇంజనీర్ల ప్రాణహిత బోర్డు సమన్వయ కమిటీ సమావేశం నగరంలో ప్రారంభమైంది. 

పార్లమెంట్ నూతన భవన నిర్మాణంపై శరద్ యాదవ్ విమర్శలు..

ఢిల్లీ : ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనాన్ని తొలగించి దాని స్థానంలో కొత్తగా భవనం నిర్మించాలన్న స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రతిపాదనపై జేడీయూ అధినేత శరద్ యాదవ్ స్పందించారు. భవన నిర్మాణ ఆలోచనను వ్యతిరేకించారు. పార్లమెంట్ భవనం కూల్చి కొత్తది నిర్మించాలని అనుకోవడం విడ్డూరమన్నారు. 

ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు : బొత్స

విజయవాడ : తాత్కాలిక సచివాలయం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… రాజధానికి మేం వ్యతిరేకం కాదని.. టిడిపి దోపిడీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సింగపూర్ ఒప్పందాల ముసుగు గురించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. సింగపూర్ ప్రభుత్వంతో కాకుండా ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటుందని పేర్కొన్నారు. కాల్ మనీ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లోకేష్ తీరుతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

ఇన్ఫోసిస్ క్యాంపస్ లో మహిళ పై అత్యాచారం..

పుణే: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ లో మహిళ అత్యాచారానికి గురైంది. పుణేలోని ఇన్ఫోసిస్ ఫేజ్-1 క్యాంపస్ లో ఆదివారం ఈ దారుణం జరిగింది. ఈ నెల 27న హౌస్ కీపింగ్ సిబ్బందిలో ఇద్దరు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. క్యాంటీన్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు అదే క్యాంటీన్ లో అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

13:39 - December 29, 2015

హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు తగ్గాయని సైబారాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఏడాదిలో జరిగిన నేరాలపై ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్రంలోనే అత్యధిక రికవరీలు సైబరాబాద్ పరిధిలోనే జరిగాయన్నారు. అతి తక్కువ మంది సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నా.. అన్ని రకాల సమస్యలు, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు.

 

13:37 - December 29, 2015

విజయవాడ : కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ నిందితులపై పోలీసులు రౌడీషీట్‌ నమోదు చేశారు. ఇంకా పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సెల్‌ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కాల్‌మనీ పేరుతో 500 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు, బంధువుల ఇళ్లపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. 

13:35 - December 29, 2015

అనంతపురం : మనల్ని చూసి కరువు భయపడాలి తప్ప కరువును చూసి మనం భయపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లాలో 'నీరు - ప్రగతి' పైలాన్ ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… కొత్త రాజధానిలో అనేక సమస్యలు ఉన్నాయని,… రాయలసీమలో భూగర్భజలాలు పెరిగాయని, రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యతను టిడిపి ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. రాయలసీమకు నీరు ఇవ్వాలననే ఉద్దేశంతో హంద్రీనీవా ప్రాజెక్టును ప్రారంభించిన ఘన ఎన్టీఆర్ దే అన్నారు. అనంతపురం జిల్లా కరువు జిల్లాగా మారిందని… నీరు చెట్టు కార్యక్రమంతో కరువును తరిమికొడదామని పిలుపునిచ్చారు. రాయలసీమలో కరువు నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భూగర్భ జలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటూ… నదుల అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రలు పల్లె, దేవినేని, ఎంపి జేసీ దివాకర్ , తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.

ఏసీబీ వలలో వీఆర్ ఓ

హైదరాబాద్ : నగరంలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ వీఆర్‌వో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బర్త్ సర్టిఫికెట్ కోసం రూ. 3 వేలు లంచం తీసుకుంటుండగా వీఆర్‌వో మదన్‌రావును అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఆయన నివాసం, కార్యాలయంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

13:18 - December 29, 2015

విజయవాడ : అమరావతి టౌన్ షిప్ లో సచివాలయం నిర్మాణానికి సీఆర్ డీఏ చర్యలు చేపట్టేందుకు అనుమతిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల కార్యాలయ భవనా లనిర్మాణం చేపేట్టేందుకు టెండర్లు పిలవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. రూ. 180 కోట్ల వ్యం అవుతుందని అంచనా వేసింది. ఇందులో వడ్డీ లేని రుణం రూ. కోట్లు ప్రభుత్వ సీఆర్డీఏకి ఇస్తుంది. మరో రూ. 90 కోట్లు హడ్కోరుణం పొందాల్సిందిగా నిర్దేశించింది. వివిధ విభాగాలకు కేటాయించిన కార్యాలయ వసతి ఆధారంగా వారి సాధారణ బడ్జెట్ నుంచి అద్దెను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం వివరించింది. టెండర్ ప్రక్రియ ద్వారా జూన్ 30 లోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

అమరావతి టౌన్ షిప్ లో సచివాలయ నిర్మాణం

విజయవాడ : అమరావతి టౌన్ షిప్ లో సచివాలయం నిర్మాణానికి ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 20 ఎకరాల్లో రూ. 150 కోట్లతో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఉత్తర్వులుజారీ చేసింది.

మావోయిస్టు గాజర్ల అశోక్ లొంగుబాటు

హైదరాబాద్: వరంగల్ జిల్లా పోలీసుల ఎదుట మావోయిస్టు గాజర్ల అశోక్ లొంగిపోయాడు. అశోక్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. దండకారణ్య కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్న అశోక్ 2004లో అప్పటి ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.

12:52 - December 29, 2015

హైదరాబాద్ : ఢిల్లీలో దళిత, గిరిజన పారిశ్రామికవేత్తల జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సదస్సుకు 1200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. జనవరి 26న మన కర్తవ్యాలపై చర్చించాలని మన్‌కీ బాత్‌లో ప్రస్తావించానని మోదీ తెలిపారు. రాజ్యాంగ నిర్మాతగా మనకందరికీ తెలిసిన అంబేద్కర్‌.. గొప్ప ఆర్ధికవేత్త అని మోదీ అన్నారు. దేశ ఆర్ధిక సమస్యలకు అంబేద్కర్‌ ఆలోచనలు పరిష్కారం చూపుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. 

12:50 - December 29, 2015

హైదరాబాద్ :మేడ్‌ ఇన్‌ తెలంగాణ దిశగా కేసీఆర్‌ సర్కార్‌ దూసుకుపోతోంది. పెట్టుబడుల ఆకర్షణలో ఈ ఏడాది ప్రభుత్వానికి బాగా కలిసొచ్చింది. దాదాపు 26 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి... పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పైచేయి సాధించింది.

ఇబ్బండి ముబ్బడిగా...

తెలంగాణకు పారిశ్రామిక పెట్టబుడులు ఇబ్బండి ముబ్బడిగా తరలి వస్తున్నాయి. పరిశ్రమల స్థాపనకు రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఏర్పడింది. అన్ని విషయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉంది. పైగా సర్కార్‌ ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానంలో రాయితీలు ఆకర్షణీయంగా ఉంది. సింగిల్‌ విండో విధానం ద్వారా 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు సర్కార్‌ ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు.

రూ.26 వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్ట్‌లకు అనుమతి........

2015లో తెలంగాణకు భారీగా పెట్టుబడులు తరలివచ్చాయి. 26 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి... పలు ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనావేస్తున్నారు. పరిశ్రమలకు అనుమతి ఇస్తూనే... నిబంధనలు పాటించే విషయంలో రాజీలేకుండా వ్యవహరిస్తున్నారు. పర్యావరణ, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావంచూసే కాలుష్య నియంత్రణ చర్యలకు ప్రధాన్యత ఇస్తున్నారు.

విద్యుత్‌, పొగాకు, టెలికాం, ఫార్మా ....

పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయి. విద్యుత్‌, కోళ్లు, పొగాకు, టెలికాం, ఫార్మా రంగాలను చెందిన ఐటీసీ, న్యూజెన్‌, కోరస్‌ ఫార్మా, సన్‌ ఫార్మా, గ్లోబల్‌ కోల్‌ అండ్‌ మైనింగ్‌ కంపెనీ, న్యూకాన్‌ ఎయిరో స్పేస్‌ వంటి సంస్థులు రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. భవిష్యత్‌లో విభిన్న రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావంతో పాలకులు ఉన్నారు. 

12:47 - December 29, 2015

చిత్తూరు : తిరుమలలో లడ్డూదళారీల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కంచేచేను మేసిన చందంగా విజిలెన్సు అధికారులే లడ్లూలను బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ముచేసుకొంటున్నారు. తితిదే యాజమాన్యం అక్రమాలు నివారించడానికి పలు చర్యలు తీసుకుంటున్నా..దళారులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. వీరి వెనక ఇంటి దొంగలున్నట్లు తాజా ఘటనతో బయటపడింది. శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న అదనపు లడ్డూ టోకెన్ల జారీ కేంద్రం అక్రమార్కులకు అడ్డాగా మారింది.

బ్లాక్‌ మార్కెట్లో శ్రీవారి లడ్డూలు....

శ్రీవారి ఆలయం వెలుపల ఉన్న లడ్డూపడి టికెట్ కౌంటర్ టిటిడికి చెందిన సుబ్బు అనే హోంగార్డు ఇటీవల లడ్డూ టోకెన్లు జారీ కేంద్రంలో పని చేసే పొరుగుసేవల సిబ్బంది బాలాజీ, హరి నుంచి 63 లడ్డూ టోకెన్లు పొందారు. టోకెన్లు తీసుకునే సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పని చేస్తున్న ఏవీఎస్‌వో పేరును ప్రస్తావించగా పొరుగుసేవల సిబ్బంది అందజేసినట్లు తేలింది. వీటిని తిరుపతికి చెందిన దళారి ఎస్‌.రమేష్‌బాబు అలియాస్‌ కుమార్‌కు అప్పగిస్తుండగా తితిదే విజిలెన్స్‌ సిబ్బంది పట్టుకున్నారు. అయితే ఈ అక్రమానికి సంబంధించి దళారీపై చర్య తీసుకున్న విజిలెన్స్‌ అధికారులు..ఇతరులను వదిలిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

63 టోకెన్లు స్వాధీనం ..

టిటిడికి లడ్డూ ప్రసాదం ద్వారా ఏటా 150 కోట్ల నష్టం వస్తున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి అభిప్రాయ పడుతుంది. వాస్తవానికి శ్రీవారిని దర్శించుకునే భక్తులకు కంపార్ట్‌మెంట్లలోనే ప్రసాదం టోకెన్లు జారీ చేస్తున్నారు. కాలినడకన వచ్చే యాత్రికులకు 5, ధర్మదర్శనానికి 4, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 వంతున లడ్డూ టోకెన్లు లభిస్తున్నాయి. ఒకవేళ ఒక్కో కుటుంబంనుంచి ధర్మదర్శనానికి నలుగురు వచ్చినా వారికి 16లడ్డూలు, దివ్యదర్శనానికి 20 వరకు లడ్డూలు అందుతాయి. ఇంతకంటే భక్తులకు అవసరంలేదనే వాదన వినిపిస్తున్నా..టిటిడి మాత్రం ఆలయం వెలుపల నిత్యం కొన్ని వేల లడ్డూలు విక్రయిస్తోంది. ఇవన్నీ చాలా వరకు అక్రమార్కుల చేతిలోకి వెళుతున్నాయి. ఈఅదనపు టోకెన్ కౌంటర్‌లో భక్తులు వరుస క్రమంలో వస్తే ఒక్కో భక్తుడికి 50కి రెండు లడ్డూలు ఇస్తారు. అయితే అడ్డదారిలో కౌంటర్‌లో ప్రవేశించే దళారీలు టోకెన్లను కట్టలుకట్టలుగా వెలుపలకు తెచ్చి బ్లాక్ మార్కెట్‌లో అధికధరలకు విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమాలను అరికట్టాల్సిన విజిలెన్సు అధికారే స్వయంగా హోంగార్డు ద్వారా టికెట్లు వెలుపలకు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఏటా రూ. 150 కోట్ల నష్టం.....

కాలినడక యాత్రికులకు 5, ధర్మదర్శనానికి 4, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 లడ్డూలు ,ఆలయం వెలుపల అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా టిటిడి స్పందించి ఏవీఎస్‌ఓపై చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. సామాన్య భక్తులకు అందుబాటులో ఉండాల్సిన లడ్డూలు ఇలా అక్రమదారి పట్టడంపై విజిలెన్స్‌ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని భక్తులు కోరుతున్నారు. 

12:43 - December 29, 2015

హైదరాబాద్ : నేడు ఎక్కడ చూసినా నెట్‌ న్యూట్రాలిటీ మీదే చర్చ నడుస్తోంది. ఇంటర్నెట్‌ డాట్‌ ఆర్గ్‌లు తమ ఖాతాదారులకు ఉచితంగా సేవలందిచిన్నప్పటికీ, ఆయా యాప్‌లకు సంబంధించిన వెబ్‌ సంస్థల నుంచి ఫీజులు వసూలు చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తమకు భారీగా ఫీజులు ఇచ్చే వెబ్‌ సైట్లు వేగంగానూ, ఫీజులు ఇవ్వని వెబ్‌సైట్లు నెమ్మదిగానూ ఓపెన్‌ అయ్యేలా ప్రయత్నిస్తారు. ఈ భయంకర వాస్తవమే ఇప్పుడు ఇంటర్నెట్‌ వినియోగదారులను కలవరపెడుతోంది. ఇదే అంశంపై 'టెన్ టివి' చర్చను చేపట్టింది. ఈ చర్చ లో స్వేచ్చా ప్రతినిధి సిద్ధార్ధ్ తదితరు పాల్గొన్నారు. మరి ఈ చర్చను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

అంబేద్కర్ ఓ ఆర్థిక వేత్త : మోదీ

ఢిల్లీ : బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదని, ఆయనో గొప్ప ఆర్థిక వేత్త అని ప్రధాని మోదీ అన్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవ సంవత్సరం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ వ్యవస్థాపకుల జాతీయ సమ్మేళన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో దళిత పారిశ్రామిక వేత్తల పాత్ర మరింత పెరగాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. దళిత మహిళలు కూడా పారిశ్రామిక రంగంపై దృష్టి సారించాలన్నారు.

11:55 - December 29, 2015

వరంగల్ : గ్రేటర్‌ వరంగల్‌లో గ్రామసింహాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. నగరంలో ఇటీవలే ఓ కుక్క దాడి చేయడంతో ఓ బాలుడు మృతి చెందాడు. శునకాల కాట్లకు గురై.. ఎంజీఎంలో చేరుతున్న వారి సంఖ్య.. రోజురోజుకీ పెరిగి పోతోంది. పరిస్థితి ఇంత తీవ్ర రూపం దాల్చుతున్నా.. మున్సిపల్‌ అధికారులు ఈ అంశంపై నామమాత్రపు దృష్టినీ పెట్టడం లేదు. దీంతో ఓరుగల్లు పౌరులు కుక్కల భయంతో బెంబేలెత్తి పోతున్నారు.

వందలాది కుక్కలు రోడ్లపై స్వైర విహారం.....

మహానగరంగా ఎదుగుతున్న వరంగల్ పట్టణంలో ప్రజలను గ్రామసింహాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ట్రై సిటీగా పేరొందిన వరంగల్ హన్మకొండ కాజీపేటలో నిత్యం వందలాది కుక్కలు రోడ్లపై స్వైర విహారం చేస్తున్నాయి. అటువైపుగా వెళ్లే ప్రజలపై అకారణంగా దాడులు చేస్తున్నాయి. ఇటీవల కుక్కల కాటుకు శంకునిపేటకు చెందిన అఫ్సాన్ అనే విద్యార్థి చనిపోయాడు. అటు కుక్కల బారిన పడ్డ వారు.. ఎంజీఎం ఆసుపత్రికి ప్రతిరోజు వందల సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

పిల్లలు, మహిళలు, వృద్దులే లక్ష్యంగా....

నగరంలో వీధికుక్కలు పిల్లలు, మహిళలు, వృద్దులే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. 2013 వరకు గ్రామసింహాలకు ఆపరేషన్లు చేసిన మున్సిపల్ అధికారులు ఆతర్వాత చర్యలు తీసుకోలేదు. దీంతో నగరంలో ఎక్కడ పడితే అక్కడ కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ కుక్కల దాడులు పెరగడంతో ఇటీవల అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా వారు నామమాత్రంగా కూడా స్పందించలేదు. రోజూ ఎంజీఎంకు వచ్చే వందలాది మంది శునక బాధితులకు... వ్యాక్సిన్లూ అందుబాటులో ఉంచకపోవడంతో.. వారు ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కార్పోరేషన్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న కుక్కల కారణంగా బయటకు వెళ్లాలంటేనే వరంగల్ ప్రజలు వణుకుతున్నారు. వెంటాడుతున్న కుక్కల బారి నుంచి తమను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

11:51 - December 29, 2015

హైదరాబాద్ : కేరళ మద్యం పాలసీని సుప్రీంకోర్టు సమర్ధించింది. బార్లలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో మాత్రమే అమ్మకాలను అనుమతిచ్చారు. దీనిపై బార్ల నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

11:50 - December 29, 2015

శ్రీకాకుళం : జిల్లాపై చలి పంజా విసురుతోంది. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం.. మంచు వర్షంలా పడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం 10 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు గిరిజనులు జంకుతున్నారు. జిల్లా మొత్తం మంచు దుప్పటి పరుచుకోవడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైళ బయటకు వచ్చినా చలిమంటలను ఆశ్రయించాల్సి వస్తుందంటున్నారు ప్రజలు.

ఇబ్బందులు పడుతున్న వాకర్స్‌ ....

ఇక మంచు భారీగా కురుస్తుండడంతో వాకింగ్‌కు వెళ్లేవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ఉదయం ఐదు గంటలకే వాకింగ్‌కు వెళ్లేవాళ్లమని.. ఇప్పుడు చలికి భయపడి ఆలస్యంగా బయటకు వస్తున్నామంటున్నారు.

ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు .........

ఇక రోడ్లన్నీ మంచుతో కప్పుకుపోయాయి. దట్టమైన పొగమంచుతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఉదయం 10 గంటల వరకు లైట్ల వెలుతురులో వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఉంది.

ఆందోళన చెందుతున్న రైతులు .......

అదేవిధంగా జిల్లావ్యాప్తంగా మంచు వర్షంలా కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాతపట్నం, మెళియాపుట్టి, భామిని, సీతంపేట, పాలకొండ, మందస తదిరత ఏజెన్సీ ప్రాంతాలతో పాటు.. ఉద్దాన ప్రాంతంలోని పలు మండలాల్లో తేనెమంచు ప్రభావంతో మామిడి, జీడి మామిడి పూత రాలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలతో పంట చేతికందలేదని.. ఈ ఏడాదైనా పంట అందుతుందని భావిస్తే.. మంచుతో తీవ్ర నష్టం ఏర్పడేటట్లు ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ నెలలోనే చలి, మంచు ఈ విధంగా ఉంటే.. ముందుముందు వాతావరణం ఎలా ఉంటుందోనని జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

11:47 - December 29, 2015

హైదరాబాద్ : జనవరి 3న తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ప్రభుత్వ పథకాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. 

11:46 - December 29, 2015

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో 5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుంచి 5 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

పుట్టపర్తి చేరుకున్న గవర్నర్, సీఎం చంద్రబాబు

హైదరాబాద్ :ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నీరు - ప్రగతి' కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల గరవ్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు పట్టుపర్తికి చేరుకున్నారు.

అంబర్ పేట లో మంత్రులు నాయిని, కేటీఆర్ పర్యటన

హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట నియోజకవర్గంలో మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, కేటీఆర్ పర్యటిస్తున్నారు. గోల్నాక గంగానగర్‌లో టీఆర్‌ఎస్ జెండాను మంత్రులు ఆవిష్కరించారు. గోల్నాకలో ఇరిగేషన్ నాలాను మంత్రులు పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు, అంబర్‌పేట ఇన్‌ఛార్జీ ఎడ్ల సుధాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

పాల్వంచ కేటీపీఎస్ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం : పాల్వంచ కేటీపీఎస్ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపంతో 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పదో యూనిట్ లో అధికారులు మరమ్మతులు చేపట్టారు.

10:48 - December 29, 2015

ఢిల్లీ: ఫోన్‌కాల్ ద్వారా రైలు టికెట్టు రద్దు చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ కల్పించింది. 139 నంబరుకు ఫోన్ చేసి రైలు టికెట్టును రద్దు చేసుకోవచ్చు. జనవరి 26 నుంచి ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. టికెట్లు రద్దు తరువాత రైల్వే కౌంటర్ వద్ద డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించారు.

 

జనవరి 3న టిఆర్ ఎస్ ఎల్పీ సమావేశం

హైదరాబాద్: జనవరి 3న టిఆర్ ఎస్ భవన్ లో మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. సమావేశానికి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మంత్రులు హాజరుకానున్నారు. పార్లమెంట్ సభ్యులు సమావేశానికి హాజరుకావాలని ప్రత్యేక ఆహ్వానం పంపారు. జనవరి 2న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది.

5కేజీల బంగారం స్వాధీనం...

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో 5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుంచి 5 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బళ్లారిలో గాలి జనార్థన్ రెడ్డి నివాసం, ఆఫీసులో సోదాలు

హైదరాబాద్ : ఘనులు మింగిన గాలి జనార్థన్ రెడ్డి నివాసం, కార్యాలయంలో లోకాయుక్త అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లోకాయుక్త డీఎస్పీ రవిశంకర్ నేతృత్వంలో 20 మంది అధికారుల బృందం సోదాల్లో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.

10:13 - December 29, 2015

హైదరాబాద్ : టాలీవుడ్లో విషాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈశ్వర్ సినిమాతో కామెడియన్గా పరిచయం అయిన నటుడు పొట్టి రాంబాబు(35) ఈ రోజు(మంగళవారం) ఉదయం మరణించారు. రాంబాబుకు భార్య ఓ కొడుకు, ఓ కుమార్తె ఉన్నారు. రాజమండ్రి దగ్గర బూరుగుపూడి ఆయన స్వగ్రామం. దాదాపు 40కి పైగా సినిమాలో నటించిన రాంబాబు ఈశ్వర్, క్లాస్రూమ్, చంటిగాడు, కథానాయకుడు, దొంగా దొంగది, అస్త్రం, ప్రేమతో నువ్వు వస్తావని సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది కామెడియన్ లు హీరోలుగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నేపధ్యంలో ఇటీవల పులిరాజా ఐపియస్ పేరుతో హీరోగా మారే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మెదడులో రక్తం గడ్డకట్టి స్ట్రోక్ రావటంతో మంగళవారం ఉదయం మృతి చెందారు. 

10:06 - December 29, 2015

హైదరాబాద్‌ : నగరంలోని పాతబస్తీ, బహదూర్‌పుర, కిషన్‌బాగ్‌లో కార్డన్‌ సెర్చ్ నిర్వహించారు పోలీసులు.. సౌత్‌జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.. 400మంది పోలీసులతో ఇంటింటి తనిఖీలు జరిపారు.. ఈ కార్డన్‌ సెర్చ్‌లో ఐదుగురు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 46మంది ఎస్సైలు పాల్గొన్నారు.. 28మంది బర్మా దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు.. 65బైక్‌లు, 28 ఆటోలు, 200 గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.. అలాగే ఓ చాక్లెట్‌ కంపెనీని సీజ్ చేశారు.. 

10:04 - December 29, 2015

కృష్ణా : విజయవాడలో ఏపీ డబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర తృతీయ మహాసభలు ఘనంగా జరిగాయి. జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్న వారిలో 70శాతం మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని... త్వరలోనే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని.. వక్తలు హామీ ఇచ్చారు. గడచిన పదేళ్లలో మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని.. సోషల్ మీడియా విస్తృతంగా చొచ్చుకు వచ్చిందని అన్నారు. ప్రభుత్వానికి జర్నలిస్టులకు వారధిగా జర్నలిస్టు కమిషన్ ఉండాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

జర్నలిజంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన....

జర్నలిజంపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెరిగిందని, హెల్త్త్ కార్డులు , ఇండ్ల స్థలాల జారీ అమలు జరపాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు జర్నలిస్టులు ఆర్థికంగా చితికిపోయారని , పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మీడియా రంగంలోని వారికి వేతనాలు పెరగడం లేదన్నారు పలువురు వక్తలు. మీడియాను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ప్రజాశక్తి ఎడిటర్ వెంకట్రావు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నేతలంతా రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని సూచించారు.

అందరికి అవకాశం ఇచ్చినట్లే జర్నలిస్టులకూ.....

ఏపీ రాజధాని అమరావతిలో అందరికి అవకాశం ఇచ్చినట్లే జర్నలిస్టులకూ అవకాశం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వక్తలు ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలపై సమిష్టి పోరుకు సహకారం అందించేందుకు రాజకీయనేతల అండగా నిలవాలన్నారు.  

10:01 - December 29, 2015

హైదరాబాద్ : విజయవాడ నుంచి పూర్తి స్థాయి పాలన అందించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. ఈ విషయంలో పాలకులు ఒకటి తలుస్తుంటే... ఉద్యోగులు మరొకటి తలపెడుతున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వ్యవహారం సర్కార్‌కు తలనొప్పిగా మారింది.

సీఎంతో చర్చించి చెబుతామన్న ఉద్యోగ సంఘ నేతలు.....

బెజవాడకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై ఉద్యోగుల నుంచి సానుకూల స్పందన రావడంలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావుతో చర్చించి నిర్ణయం చెబుతామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించి నెల రోజులు కావస్తున్నా... ఈ దిశగా అడుగులు ముందుకు వేయడంలేదు. పాలన అంతా తాత్కాలిక రాజధాని విజయవాడ నుంచే సాగాలనుకుంటున్న చంద్రబాబుకు ఉద్యోగుల నుంచి ప్రతిబంధకాలు ఎదురువుతున్నాయి. తరలివెళడానికి సిద్ధమంటూనే... కొన్ని సమస్యలు ఉన్నాయన్న వాదాన్ని ఉద్యోగులు లేవనెత్తున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, ఇక్కడే చదువుతున్న పిల్లల స్థానికత అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వలేకపోతోంది. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ఉద్యోగులందరూ విజయవాడ తరలిరావడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినా... సిబ్బంది వైఖరిలో మార్పు కనిపించడంలేదు.

విజయవాడ, గుంటూరుల్లో కొన్ని భవనాల పరిశీలన...

ఏపీ మున్సిపల్‌ మంత్రి నారాయణ అధ్యక్షత కార్యాలయాల తరలింపు కమిటీ ఏర్పాటు చేశారు. విజయవాడ, గుంటూరుల్లో కొన్ని భవనాలను పరిశీలించారు. వీటిపై నివేదిక కూడా తయారు చేశారు. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరిలో తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్‌ రెడీ అయ్యింది. ఆరు లక్షల అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు ప్రారంభించబోతోంది. ఈ ప్రకటన చేసిన తర్వాత కూడా ఉద్యోగులు నుంచి సానుకూలత వ్యక్తం కావడంలేదు. పాలకులు తలచుకుంటే నాలుగు నెలల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణం పూర్తవుతుంది. పిల్లల చదువులు, పరీక్షల ఒత్తిడితో ఉన్న ఉద్యోగులు... ఇవి పూర్తైన తర్వాత విజవాడ తరలివెళ్లే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

09:59 - December 29, 2015

మరికొద్దిరోజుల్లో ముగిసిపోనున్న 2015 సంవత్సరం..భారత బ్యాడ్మింటన్ కు మిశ్రమఫలితాలను మాత్రమే మిగిల్చింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ రన్నరప్ స్థానం సాధించడం మినహా..మిగిలిన స్టార్ ప్లేయర్ల పరిస్థితి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యింది. 2015 సీజన్లో భారత బ్యాడ్మింటన్ హిట్టూ,ఫ్లాపులు ఏంటో ఓసారి చూద్దాం......

భారత బ్యాడ్మింటన్ 2015లో సైతం సైనా నెహ్వాల్ షోగానే మిగిలిపోయింది.

గుర్తింపు తీసుకువస్తున్న క్రీడల్లో..క్రికెట్, హాకీలతో పాటు బ్యాడ్మింటన్ …...

మనదేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువస్తున్న క్రీడల్లో..క్రికెట్, హాకీలతో పాటు బ్యాడ్మింటన్ సైతం ముందువరుసలో ఉంటుంది. అత్యాధునిక శిక్షణ సదుపాయాలు, క్రీడాకారులకు మితిమీరిన ప్రోత్సాహం ఉన్నా..ఫలితాల తీరు మాత్రం రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా తయారయ్యింది.

విజయాల కంటే పరాజయాలనే ఎక్కువ…..

మరికొద్దిగంటల్లో మననుంచి వీడ్కోలు తీసుకోడానికి సిద్ధమవుతున్న 2015 సంవత్సరం ..భారత బ్యాడ్మింటన్ కు మాత్రం విజయాల కంటే పరాజయాలనే ఎక్కువ మిగిల్చిన ఏడాదిగా మిగిలిపోతుంది. భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ ..మహిళల సింగిల్స్ రెండో ర్యాంక్ నిలుపుకోడంతో పాటు...తన కెరియర్ లోనే మొట్టమొదటిసారిగా ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ సింగిల్స్ రన్నరప్ స్థానం సంపాదించి..సరికొత్త చరిత్ర సృష్టించింది.

మహిళల సింగిల్స్ చరిత్రలో….

భారత బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలిప్లేయర్ గా సైనా రికార్డుల్లో చేరింది. గత ఏడాది కాలంలో భారత్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సాధించిన అతిపెద్ద విజయం సానియాదే కావడం విశేషం.

అయితే...గ్రాండ్ ప్రీ, మాస్టర్స్ టోర్నీల్లో అంతంత మాత్రంగానే రాణించిన సైనా....దుబాయ్ లో ముగిసిన 2015 బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ ఫైనల్స్..సెమీస్ చేరుకోడంలో విఫలమయ్యింది.గ్రూప్ లీగ్ లో...ప్రపంచ నెంబర్ వన్ కారోలిన్ మారిన్ ను ఓడించినా..నాకౌట్ రౌండ్ చేరలేకపోయింది. ఫిట్ నెస్ సమస్యలతో చాలాటోర్నీలకు దూరంగా ఉన్న తెలుగుతేజం పీవీ సింధు సైతం...ఆశించినస్థాయిలో రాణించలేకపోయింది. మకావో గ్రాండ్ ప్రీ టోర్నీ టైటిల్ ను వరుసగా మూడోసారి గెలుచుకోడం ద్వారా...హ్యాట్రిక్ పూర్తి చేసింది. మిగిలిన టోర్నీల్లో మాత్రం సింధు ప్రారంభరౌండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.

గుత్తా జ్వాల-అశ్వినీల జోడీ...

మహిళల డబుల్స్ లో గుత్తా జ్వాల-అశ్వినీల జోడీ... 2015 సీజన్లో ఒకే ఒక్క టైటిల్ సాధించగలిగింది. మిగిలిన టోర్నీల్లో..జ్వాలజోడీ మొదటి రెండురౌండ్ల పోటీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక...పురుషుల సింగిల్స్ లో...పారుపల్లి కశ్యప్ గాయంతో పోటీలకు దూరమయ్యాడు. కిడాంబీ శ్రీకాంత్ సీజన్లో ఒక్క టైటిల్ సాధించినా...సీజన్ ముగింపు ఫైనల్స్ టోర్నీకి అర్హత సంపాదించగలిగాడు. దుబాయ్ లో ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్ టోర్నీ ఫైనల్స్ గ్రూప్ దశలో శ్రీకాంత్ మూడుకు మూడురౌండ్లూ ఓడి...2015 సీజన్ ను ముగించాడు. మరో ఆటగాడు అజయ్ జయరామ్ ..డచ్ ఓపెన్ టైటిల్ ను విజయవంతంగా నిలుపుకొన్నాడు. అయితే సీజన్లోని మిగిలిన టోర్నీల్లో నిలకడగా రాణించలేకపోయాడు.

2015 సీజన్ ముగిసే సమయానికి…..

2015 సీజన్ ముగిసే సమయానికి మహిళల సింగిల్స్ లో సైనా రెండోర్యాంక్, పీవీ సింధు 12వ ర్యాంక్ నిలుపుకోగా...కిడాంబీ శ్రీకాంత్ తొమ్మిది, పారుపల్లి కశ్యప్ 15 ర్యాంకులకు పడిపోయారు. ఇక..గతేడాది నిలిచిపోయిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ను..2016 సీజన్ నుంచి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ పేరుతో నిర్వహించాలని భారత బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్ణయించింది.

మొత్తం మీద...భారత బ్యాడ్మింటన్ 2015లో సైతం సైనా నెహ్వాల్ షోగానే మిగిలిపోయింది.

09:44 - December 29, 2015

హైదరాబాద్ : కొన్నేళ్లుగా ప్రముఖ టీవీ ఛానల్ లో టెలీకాస్ట్ అవుతున్న ‘జబర్దస్త్’ కామెడీ షో కార్యక్రమంలో జడ్జిగా వున్న రోజా ప్లేస్ లో మంచు లక్ష్మి ని తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసెంబ్లీ నుంచి రోజా ఏడాది పాటు సస్పెండ్ కావడం ..ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రోజాకు నెగెటివ్ గా ఉండటంతో ‘జబర్దస్త్’ నిర్వాహకులు కూడా ఆమెకు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘జబర్దస్త్’ కామెడీ షో కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు-రోజా జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా రోజా స్ధానంలో మంచు లక్ష్మి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే రోజాను తప్పించడం అనే వార్త నిజం కాకపోవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ ఆమె బిజీగా ఉండటంతో ఆమె స్ధానంలో కొన్ని ఎపిసోడ్స్ కి మంచు లక్ష్మిని తీసుకుని ఉండవచ్చని అనుకుంటున్నారు. రోజా ప్లేస్ మంచు లక్ష్మితో రీ ప్లేస్ చేశారా? లేదా? అనేది సస్పెన్స్ గా ఉన్నా.. వాస్తవం తెలియాలంటే మాత్రం మరికొన్ని ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే !!

ఖైదీల పరారీపై విచారణకు హోం మంత్రి ఆదేశం

హైదరాబాద్ : కడప సెంట్రల్ జైలు నుంచి ఖైదీల పరారీపై ఏపీ హోం మంత్రి చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైదీల పరారీపై విచారణకు ఆదేశించారు. పరారైన ఖైదీ లకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం కడప జైలు నుంచి 20 అడుగుల ఎత్తు ఉన్న గోడ దూకి నలుగురు ఖైదీలు పరారైన విషయం తెలిసిందే.

ఢిల్లీలో ఆప్ నేత దారుణ హత్య....

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత ధీరేంద్ర ఈశ్వర్‌ను దారుణంగా హత్య చేశారు. ఢిల్లీలోని బేగంపూర్ ప్రాంతంలో ఆప్ నేత మృతదేహాం లభ్యమైంది. ఈశ్వర్ శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. పురుషాంగాలను తొలిగించారు. ముఖంపై ఓ భారీ వస్తువుతో కొట్టినట్లు ఉందని పోలీస్ అధికారి తెలిపారు. పూర్వాంచల్ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఈశ్వర్ ఈ మధ్యే ఓ యోగా కేంద్రాన్ని ప్రారంభించాడు. అయితే ప్రాపర్టీ తగాదా వల్ల దాన్ని మూసివేశారు. ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన ఆ తర్వాత శవమై తేలాడు. ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న మురికి కాలువలో ఈశ్వర్ మృతదేహాం లభించింది.

హాస్య నటుడు పొట్టి రాంబాబు మృతి

హైదరాబాద్ : టాలీవుడ్లో విషాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈశ్వర్ సినిమాతో కామెడియన్గా పరిచయం అయిన నటుడు పొట్టి రాంబాబు ఈ రోజు(మంగళవారం) ఉదయం మరణించారు. దాదాపు 40కి పైగా సినిమాలో నటించిన రాంబాబు ఈశ్వర్, క్లాస్రూమ్, చంటిగాడు, ప్రేమతో నువ్వు వస్తావని సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కారును ఢీకొన్న ఆటో : 8 మంది కూలీలకు గాయాలు

నల్గొండ : కోదాడ మండలం నల్లబండగూడెం జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

08:34 - December 29, 2015

విశాఖ : గత రెండు రోజులుగా... విశాఖ జిల్లా పాడేరు మన్యంలో చలి విపరీతంగా పెరిగింది. మినుములూరు, లంబసింగిలో టెంపరేచర్ 6డిగ్రీలకు పడిపోయింది. పాడేరు, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెరిగిన చలి కారణంగా మన్యంలో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. దట్టంగా అలుముకున్న మంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తెలిపింది. 

08:33 - December 29, 2015

ఢిల్లీ : బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వార్‌ కొనసాగుతోంది. అరుణ్ జైట్లీ విషయంలో తనను క్షమాపణలు చెప్పాలని బీజేపీ అడుక్కుంటోందని ఎద్దేవా చేశారు. అయితే తాను మాత్రం క్షమాపణలు చెప్పనని కేజ్రీవాల్‌ అన్నారు. జైట్లీ పరువునష్టం కేసులో విచారణ సందర్భంగా నిజాలు బయటకు వస్తాయన్నారు. డిడిసిఏపై ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ ఎవరికీ క్లీన్చిట్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఎవరి పేరూ ప్రస్తావించలేదు కానీ పలు అవినీతి కార్యకలాపాలు జరిగినట్లు పేర్కొందని కేజ్రీవాల్ గుర్తుచేశారు. అయితే డిడిసిఎ అవినీతికి సంబంధించి అరుణ్‌ జైట్లీని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.

తనిఖీల్లో 150 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్ : విశాఖ జిల్లా దేవరాపల్లి - పినకోట రోడ్డు మార్గంలో అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, మహారష్ట్రకు చెందిన నలుగురిని పోలీసులకు అప్పగించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు..

చెట్టును ఢీ కొన్న కారు : ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌ : తిమ్మాజీపేట మండలం ఇందిరానగర్‌ తండా వద్ద నేటి తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతులు బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందినవారుగా పోలీసులు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

07:32 - December 29, 2015

హైదరాబాద్ : ఉన్నత ఆదాయ వర్గాలకు ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీపై కేంద్రం కోత విధించింది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారికి గ్యాస్‌ సబ్సిడీ ఎత్తివేసింది. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. రాయితీ ఎత్తివేత జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఆదాయ వివరాలు ప్రకటించని వారికి పన్ను చెల్లింపుల ఆధారంగా సబ్సిడీని ఎత్తివేస్తామని కేంద్రం ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు తన్నుకున్నారు. ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, రంగారెడ్డి జిల్లా టిఆర్ ఎస్ నేత నరేంద్ర గౌడ్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చిన భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. 

ఏపీ, మైక్రోసాఫ్ట్ మధ్య ఎంఓయూ

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఈ-ప్రగతి ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు మైక్రోసాఫ్ట్‌ ఆసక్తిచూపుతోంది. వివిధ రంగాల్లో ఐటీ ఆధారిత సహకారం అందించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మైక్రోసాఫ్ట్ సీఈవో సమావేశం సందర్భంగా.. ఈ ఎంఓయూ కుదిరింది. 

07:11 - December 29, 2015

హైదరాబాద్ : ఉన్నత ఆదాయ వర్గాలకు ఎల్‌పీజీ గ్యాస్‌ సబ్సిడీపై కేంద్రం కోత విధించింది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారికి గ్యాస్‌ సబ్సిడీ ఎత్తివేసింది. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. రాయితీ ఎత్తివేత జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఆదాయ వివరాలు ప్రకటించని వారికి పన్ను చెల్లింపుల ఆధారంగా సబ్సిడీని ఎత్తివేస్తామని కేంద్రం ప్రకటించింది. 

07:10 - December 29, 2015

హైదరాబాద్ : వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి తెలంగాణ సర్కార్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ గుడిని మహాలయంగా తీర్చిదిద్దేందుకు శృంగేరి వేద పడండితులు సూచనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అయుత చండీయాగం మహాక్రతువును ద్విగ్విజయంగా పూర్తి చేసిన కేసీఆర్‌..కుటుంబ సమేతంగా రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఎర్రవల్లిలో నరసింహ యాగం ....

ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఈనెల 23 నుంచి 27 వరకు మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో అయుత చండీయాన్ని నిర్విగ్నంగా నిర్వహించారు. యాగం తర్వాత తీర్ధయాత్రలు చేయాలన్న వేదపండితులు సూచన మేరకు కరీంనగర్‌ జిల్లాలోని మేములవాడ దేవాలయానికి వచ్చారు. ఇక్కడకు రావడానికి ముందు కేసీఆర్‌...ఎర్రవల్లి వ్యవసాయం క్షేత్రంలో నరసింహయాగం చేశారు. ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి విచ్చేశారు. ఆలయ పండితులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం గణపతిపూజ, అన్నపూజ...

రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులు ముందుగా కోడె మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత గణపతి పూజ, అన్నపూజ, రుద్రాభిషేకం, కుంకుమార్చన చేశారు. రాజరాజేశ్వరునికి కేసీఆర్‌ దంపతులు ఒడిబియ్యం సమర్పించారు. ఆలయప్రాంగణంలో ఉన్న పరివార దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అభివృద్ధిపైఔ సమీక్ష ..........

పూజల తర్వాత దేవాలయంలోని ధర్మగుండం, గుడి చెరువులను కేసీఆర్‌ పరిశీలించారు. రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, అర్చకులు, ఆగమశాస్త్ర పండితులుతో సమీక్ష నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించి.. హైదరాబాద్‌ తిరుగు ప్రయాణమయ్యారు.

ప్రణబ్‌ దృష్టికి చండీయాగం విశేషాలు .....

కేసీఆర్‌ కుటుంబ సభ్యులు వేములవాడ నుంచి తిరిగొస్తూ.. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అయుత చండీయాగం విశేషాలు, యాగం జరిగిన తీరును ఆయన ప్రణబ్‌కు వివరించారు. చండీయాగాన్ని దిగ్విజయంగా పూర్తిచేసిన కేసీఆర్‌ను..ప్రణబ్‌ ముఖర్జీ అభినందించారు. 

07:07 - December 29, 2015

విజయవాడ :ఏపీలో జపాన్‌ ప్రతినిధి బృందం పర్యటించింది. టొయామా గవర్నర్‌ తకకాజు ఇషి నేతృత్వంలో 19 మంది సభ్యుల బృందం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. మత్స్యశాఖ, ఫార్మా, పర్యాటక రంగాల్లో జపాన్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో టొయామా గవర్నర్‌, ఏపీ సీఎం చంద్రబాబు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

విశాఖ-చెన్నై కారిడార్‌ ఏర్పాటుకు...

విశాఖ-చెన్నై కారిడార్‌ ఏర్పాటుకు జపాన్‌ ముందుకొచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఫార్మా స్యూటికల్‌ రంగంలో అ్రగగామిగా ఉన్న టొయామా ఏపీ ఫార్మా రంగంలోనూ అడుగుపెట్టాలని చంద్రబాబు ఆహ్వానించారు.

టొయామా, ఏపీ మధ్య విద్యాపరమైన సంబంధాలను....

టొయామా, ఏపీ మధ్య విద్యాపరమైన సంబంధాలను నిరంతరం కొనసాగించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య విద్యార్థుల రాకపోకలు సాగాలన్నారు. ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి సహాయకంగా యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయాలని చంద్రబాబు అన్నారు. దీని కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేద్దామని ఈ భేటీలో ప్రతిపాదించారు.

ఏపీ త్వరలోనే సిలికాన్‌ వ్యాలీగా ...

ఏపీ త్వరలోనే సిలికాన్‌ వ్యాలీగా మారుతుందని టొయామా గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. టొయామా, ఏపీ దీర్ఘకాలం స్నేహితులుగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 

07:04 - December 29, 2015

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో త్వరలో జ‌రుగ‌నున్న జీహెచ్ఎంసి ఎన్నిక‌లకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అయింది. రిజర్వేషన్లు ప్రకటించగానే రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల సంఘం..ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు దాదాపు 50వేల మంది సిబ్బందిని ఉపయోగిస్తోంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు....

తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం..డిసెంబర్‌ 31లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు వార్డుల పునర్విభజన, వార్డులవారీగా ఓటర్ల జాబితా , పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు మాత్రమే పూర్తయ్యాయి. వార్డుల వారీగా రిజర్వేషన్ల అంశం ప్రభుత్వం వద్ద ఉంది. అయితే వార్డుల రిజర్వేషన్‌ వెలువడగానే..ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం నియమించిన సాధారణ, వ్యయ పరిశీలకులతో సోమవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు

70 లక్షల మంది ఓటర్లు....

గ్రేటర్‌ ఎన్నికల్లో 70లక్షల మందిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 7,750 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే ఈ ఎన్నికలకు 80వేల ఎన్నికల సిబ్బంది, 26వేలకుపైగా పోలీసు సిబ్బందిని నియమించామని కమిషనర్ తెలిపారు. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు అవసరమయ్యే 12వేల ఈవీఎంలను ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్ధం చేసింది. అయితే రాష్ర్టంలో సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పోల్చి చూస్తే జీహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో ఓటింగ్ శాతం అతిత‌క్కువ‌గా న‌మోదు అవుతుంద‌ని,.ఈ సారి ఓటింగ్ న‌మోదును పెంచడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. తప్పనిసరిగా ప్రతిఒక్కరూ ఓటు వేయాలని కమిషనర్ సూచించారు.

3,91,369 క్లైయిమ్‌లు....

ఇక న‌గ‌రంలో ఓట‌ర్ల న‌మోదు, పున‌ర్‌ప‌రిశీల‌నకు సంబంధించి 3,91,369 క్లైయిమ్‌లు రాగా 2లక్షల 90వేల 942 ధ‌ర‌ఖాస్తుల‌ను ఆమోదించామ‌న్నారు జీహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ బి.జ‌నార్ధన్‌రెడ్డి. 46,612 ద‌ర‌ఖాస్తుల‌ను తిర‌స్కరించగా..మ‌రో 54,365 క్లయిమ్‌లను ప‌రిశీలించాల్సి ఉంద‌న్నారు . ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ అయ్యేంత వ‌ర‌కు ఓట‌ర్ల న‌మోదు, స‌వ‌ర‌ణ‌ల‌ను చేప‌ట్టడం జ‌రుగుతుంద‌ని,..అయితే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ అయిన వారం రోజుల ముందు వ‌ర‌కు వ‌చ్చిన క్లయిమ్‌లను మాత్రమే ప‌రిశీలిస్తామన్నారు.

ఇప్పటికే వార్డుల పున‌ర్‌వ్యవస్థీకరణ..

ఇప్పటికే వార్డుల పున‌ర్‌వ్యవస్థీకరణ, ఓటర్ల జాబితా త‌యారీ, పోలింగ్ కేంద్రాల నిర్థార‌ణ పూర్తయినా..వార్డుల రిజ‌ర్వేష‌న్ల జాబితా విడుదల కాలేదు. అయితే రిజర్వేషన్లు వెలువడిన వెంట‌నే ఎన్నిక‌ల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధంగా ఉంది. కోర్టుకు విన్నవించిన గడువు ప్రకారం జ‌న‌వ‌రి 31వ తేదీలోగా జీహెచ్ఎంసి ఎన్నిక‌ల ప్రక్రియను పూర్తి చేస్తామంటోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌. 

06:59 - December 29, 2015

హైదరాబాద్ : ముంగిట్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు ఉన్నవేళ.. పార్టీలో కుమ్ములాటలు.. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వాన్ని హడలెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితం కావడం.. మొన్నటి ఓరుగల్లు ఉప ఎన్నికల్లో ధరావతు కూడా దక్కని పరాభవం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే వలసెళ్లిన వైనం.. కాంగ్రెస్‌ను ఊపిరి తీసుకోకుండా చేస్తోంది. ఈ పరిస్థితుల్లో.. గ్రేటర్‌లోనైనా కాస్తంత ఊపిరి పీల్చుకుందామనుకుంటే.. నేతల కుమ్ములాటలు ఆ ఆశలను కూడా ఆవిరి చేస్తున్నాయి.

నేడో రేపో గ్రేటర్‌ ఎన్నికల నగారా....

నేడో రేపో గ్రేటర్‌ ఎన్నికల నగారా మోగించేందుకు కేసీఆర్‌ సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆధిపత్యపోరుతో రోడ్డున పడ్డారు. పార్టీ అవిర్భావం రోజున.. ఉప్పల్‌లో పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దానం నాగేందర్‌ వర్గంపై.. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాలూ కర్రలు.. చెప్పులతో ఇరువర్గాలూ బాహాబాహీకి దిగాయి.

గ్రేటర్‌-రంగారెడ్డి జిల్లాల కాంగ్రెస్‌ నేతల మధ్య.....

గ్రేటర్‌-రంగారెడ్డి జిల్లాల కాంగ్రెస్‌ నేతల మధ్య చాలాకాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. గ్రేటర్‌లోని 150 డివిజన్‌లకు సంబంధించిన హద్దుల పంచాయతీ నడుస్తోంది. గ్రేటర్‌ కిందికి వచ్చే ఓ 50 డివిజన్‌లు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటిపై గ్రేటర్‌ అధ్యక్షుడిగా దానం ఆధిపత్యాన్ని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతలు సహించడం లేదు. ఇప్పటికే దీన్ని పార్టీ హైకమాండ్‌ దృష్టికీ తీసుకు వెళ్లారు. దీంతో దానంను వంద డివిజన్‌లకే పరిమితం కావాలని.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సూచించినట్లు సమాచారం. అయినా దానం తమ జిల్లాలోని పార్టీ కార్యక్రమాలకు ఎలా హాజరవుతారంటూ.. రంగారెడ్డి నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఎలాంటి దాడి జరగలేదు....

తనపై ఎలాంటి దాడీ జరగలేదని వెల్లడించిన దానం నాగేందర్‌.. గ్రేటర్‌లోని డివిజన్‌ల పరిధులకు సంబంధించి.. పార్టీ అధిష్ఠానం నిర్ణయానుసారమే నడచుకుంటానని తెలిపారు.

కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోనూ ....

అటు కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోనూ కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జెండా ఎగరేసే విషయంలో స్థానికంగా బాలాజీ, హరీశ్‌రెడ్డిల మధ్య గొడవ జరిగింది. ఈ వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. మహిళా కార్యకర్తపై గాలి బాలాజీ దాడికి పాల్పడ్డట్లు హరీశ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి గ్రేటర్‌ పరిధిలో పార్టీ నేతల మధ్య రోడ్డుకెక్కిన వర్గ విభేదాలు.. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వాన్ని కంగు తినిపించింది. ఈ విభేదాలను ఏమేరకు పరిష్కరిస్తారో... శ్రేణులను గ్రేటర్‌ ఎన్నికలకు ఏమేరకు సమాయత్త పరుస్తారోనన్న చర్చ పార్టీలో జరుగుతోంది. 

06:56 - December 29, 2015

హైదరాబాద్ : ఆంధప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన కాల్‌ మనీ వ్యవహారంలో నిందితులుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే కొంత మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు..మరో నిందితుడు, మాజీ రౌడీ షీటర్‌ మాదంసెట్టి శివకుమార్‌ను కటకటాల వెనక్కి నెట్టారు. ప్రజలకు అప్పులిచ్చి అధిక వడ్డీ ల కోసం వేధిస్తున్నాడని బాధితులు ఫిర్యాదు చేయడంతో... కృష్ణలంక పోలీసులు శివకుమార్‌ను అరెస్టు చేశారు. ఇతనిపై గతంలో మూసేసిన రౌటీషీట్‌ను తిరిగి తెరిచారు.

ఆరోగ్యం బాగోలేదంటూ కోర్టుకు వెళ్లిన శివకుమార్‌ ...........

అయితే మాదంసెట్టి శివకుమార్‌ తనకున్న అర్ధబలం, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి... కటకటాల నుంచి బయటకు వచ్చాడు.ఆరోగ్యం బాగోలేదంటూ కోర్టును ఆశ్రయించాడు. మెరుగైన చిక్సిత్స కావాలని కోర్టుకు విన్నవించడంతో న్యాయస్థానం ఇందుకు అంగీకరించింది. కాల్‌ మనీ వ్యవహారంలో నిందితులందర్నీ ఒకేగాటన కట్టలేమని... ప్రతి కేసును విభిన్న కోణాల్లో దర్యాప్తు చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పోలీసులు చెబుతన్నారు. అందరిపైనా రౌడీషీటు తెరవలేమంటున్నారు.

కాల్‌ మనీ పోరాట వేదిక ఆధ్వర్యంలో విజయవాడంలో ర్యాలీ....

మరోవైపు కాల్‌ మనీ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేయలాని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ.... కాల్‌ మనీ పోరాట వేదిక ఆధ్వర్యంలో విజయవాడంలో ర్యాలీ జరిగింది. రాఘవయ్య పార్క్‌ దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాల్‌ మనీ కేసులో చోటా, మోటా నిందితలను అరెస్టు చేస్తున్న పోలీసులు.... బడా రాజకీయ నాయకులను అరెస్టు చేయకపోవడాన్ని అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం...ఐద్వా నగర కార్యదర్శి శ్రీదేవి తప్పుపడుతున్నారు. 

06:54 - December 29, 2015

విజయవాడ : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే జనవరి 1 నుంచి గర్భిణీ స్త్రీల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభిస్తోందని మంత్రి అధికారులకు తెలిపారు. తల్లీ బిడ్డలను ఇంటికి క్షేమంగా చేర్చేందుకు త్వరలో 102 వాహనాలను అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 

06:52 - December 29, 2015

హైదరాబాద్ : తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 7-8 డిగ్రీల సెల్సియస్‌ నమోదువుతున్నాయి. దీంతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. పొగమంచు కమ్ముకుంటోంది. జిల్లాల్లో ఎక్కడ చూసినా మంచుదుప్పటి పరుచుకున్నట్టు కనపిస్తోంది. వణికిస్తున్న చలిపులి దెబ్బకు ప్రజలు భయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.

రాత్రి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గడం సహజం .......

నాలుగు రోజులు క్రితం వరకు శీతాకాలంలో కూడా ఎండలు మండిపోయాయి. ఉక్కపోతతో ఉక్కరి బిక్కిరిబిక్కిరైన ప్రజలు... ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగత్రలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికాలంలో సాధారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గడం సహజం. కానీ ఈసారి అసాధారణంగా 5 డిగ్రీలకు పడిపోయాయి. ఉత్తర భారతం నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావం తెలంగాణ జిల్లాలపై ఎక్కువగా ఉంది.

పగటి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు .............

త్రి ఉష్ణోగ్రతలేకాదు... పగటి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోయాయి. వరంగల్‌లో పగటి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డులవుతున్నాయి. దీంతో స్వట్టర్లు, శాలువాలు, స్కార్ఫ్‌లు, మంకీ క్యాప్‌లు ధరించకుండా బయటకురాలేని పరిస్థితి వచ్చింది. వాహనాలు నడపడం కష్టంగా ఉంది. పొగమంచు ఆవహించడంతో దగ్గరి వాహనాలు కూడా కనిపంచి వాతావరణం నెలకొంది. చలిగాలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చలితో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వేళల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్ధుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చలికాలంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. చలి తీవ్రత మరో నాలుగైదు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో జనం ఆందోళన చెందుతున్నారు. 

06:49 - December 29, 2015

ఢిల్లీ : 'కాంగ్రెస్ దర్శన్' ఇది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అధికార పత్రిక, హిందీలో ప్రచురితమయ్యే ఈ పత్రికలో వచ్చిన వ్యాసాలు ఇపుడు పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఏకంగా భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని టార్గెట్‌ చేస్తూ రాసిన ఆర్టికల్స్ పార్టీలో కలకలం రేపింది.

ముస్సోలిని సేనానిగా పనిచేసిన సోనియా తండ్రి ఓ ఫాసిస్టు....

సోనియా గాంధీ ముఖచిత్రంతో వెలువడ్డ కాంగ్రెస్‌ దర్శన్ డిసెంబర్‌ సంచికలోని ఓ వ్యాసంలో ఆమె జీవితాన్ని ప్రస్తావించారు. సోనియా తండ్రి ఇటలీ ముస్సోలిని సేనానిగా పనిచేశారని, అతనో ఫాసిస్టని పేర్కొంది. అంతేకాదు... కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న 62 రోజులకే సోనియా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారని, అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని తెలిపింది. రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న 16 ఏళ్ల తర్వాత సోనియాగాంధీకి భారతీయ పౌరసత్వం వచ్చిందని ఆ పత్రిక ప్రచురించింది.

1950లో పటేల్ రాసిన లేఖలను ఉటంకిస్తూ..

డిసెంబర్ 15న పటేల్ వర్ధంతి సందర్భంగా పటేల్‌కు నివాళులర్పిస్తూ ప్రచురించిన వ్యాసం వివాదాస్పదమైంది.1950లో పటేల్ రాసిన లేఖలను ఉటంకిస్తూ...కాంగ్రెస్‌ వర్గాల సమర్థన లభించినప్పటికీ, కేవలం గాంధీజీ కోరిక మేరకే పటేల్‌ ప్రధాని కాలేక పోయారని పేర్కొంది. గాంధీజీ చెప్పడం వల్లే పటేల్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడకుండా దూరంగా ఉండాల్సొచ్చిందని రాశారు.

చైనా, నేపాల్, కశ్మీర్‌ విషయంలో నెహ్రూ ధోరణిని.....

చైనా, నేపాల్, కశ్మీర్‌ విషయంలో నెహ్రూ ధోరణిని పటేల్‌ తప్పుబట్టినట్టు, పటేల్‌ సలహా పాటించి ఉంటే ఇవాళ కశ్మీర్‌ సమస్యే ఉత్పన్నమయ్యేది కాదని ఆ ఆర్టికల్‌ వెల్లడించింది. టిబెట్‌ అంశంపై భవిష్యత్తులో ఇండియాకు చైనా పెద్ద శత్రువుగా మారనుందని పటేల్ నెహ్రూను హెచ్చరించినట్టు తెలిపింది. నెహ్రూ, పటేల్ ఉప్పు నిప్పుగా వ్యవహరించేవారని, ఓ సమయంలో వారిద్దరూ రాజీనామా చేయడానికి కూడా వెనకాడలేదని వ్యాసంలో ప్రచురించారు.

కాంగ్రెస్‌ దర్శన్‌లో వచ్చిన వ్యాసాలపై .....

కాంగ్రెస్‌ దర్శన్‌లో వచ్చిన వ్యాసాలపై ఆ పత్రిక ఎడిటర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంజయ్‌ నిరుపమ్‌ విచారం వ్యక్తం చేశారు. ఇందుకు తానే బాధ్యుడనని, దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ 131వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో అధికార పత్రికలో వచ్చిన వ్యాసాలు నేతలను కంగు తినిపించాయి. అయితే ఇది ఎవరు రాశారన్నది ఆసక్తిగా మారింది. 

06:43 - December 29, 2015

హైదరాబాద్ : బాల నేరస్తుల వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించే బిల్లును కొద్ది రోజుల క్రితమే రాజ్యసభ ఆమోదించింది. అయితే, బాల నేరస్తుల వయస్సును రెండేళ్లు కుదించిన ప్రభుత్వం కోటానుకోట్ల మంది పిల్లల రక్షణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటోందన్న చర్చ కూడా ఎజెండా మీదకు వస్తోంది. మన దేశంలో బాల్యం పరిస్థితి ఏమిటి? బాలలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వారి మీద ఏయే రూపాల్లో హింస జరుగుతోంది? పిల్లల మీద జరిగే హింసను అరికట్టేందుకు వున్న మార్గాలేమిటి? పిల్లలకు భద్రతకు కల్పించడంలో సమాజం బాధ్యత ఎంత? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సాధన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మురళి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

పాతబస్తీలో పోలీసుల కార్డన్ సర్చ్

హైదరాబాద్ : పాతబస్తీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Don't Miss