Activities calendar

01 January 2016

21:35 - January 1, 2016

హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లో రెండు జెండాల వివాదం మరింత ముదురుతోంది. జాతీయ, రాష్ట్ర ఫ్లాగ్స్ పెట్టాలన్న హైకోర్టు ఏక సభ్య తీర్పును హైకోర్టు లార్జ్ బెంజ్ సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలపై జాతీయ జెండాతో పాటు జమ్మూకశ్మీర్ సొంత జెండాను పెట్టాలని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ గత నెల 27న తీర్పిచ్చింది. అయితే విస్తృత ధర్మాసనం ఈ తీర్పును కొట్టివేసింది. దీంతో ఇక గవర్నమెంట్ ఆఫీసులు, వాహనాల్లో మూడు రంగుల జాతీయ జెండానే ఎగురనుంది.

21:34 - January 1, 2016

హైదరాబాద్ : సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ల ధరను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెంచింది. ఒక్కో సిలిండర్ ధర దాదాపు 50 రూపాయల వరకు పెరిగింది. ఈ పెరుగుదల ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చింది. స్థానిక పన్నులతో కలుపుకొని 14.4 కిలోల సిలిండర్ ప్రస్తుత ధర ఢిల్లీలో 657 రూపాయల 50 పైసలు కాగా, కోల్‌కతాలో 686 రూపాయల 50 పైసలు, ముంబై, చెన్నైలో 671 రూపాయల చొప్పున ఉండనున్నాయి. గడిచిన రెండు నెలల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. ఇంతకుముందు సిలిండర్ ధరను 60 రూపాయల చొప్పున పెంచారు. వార్షిక ఆదాయం 10 లక్షల కంటే ఎక్కువ ఉన్నవాళ్లకు గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ ఇవ్వబోమని కేంద్రం చేసిన ప్రకటన ఇవాల్టి నుంచి అమలులోకి రానుంది. దీంతో దాదాపు 20 లక్షల మంది వినియోగదారులు సబ్సిడీ కోల్పోనున్నారు.

21:32 - January 1, 2016

హైదారాబాద్ : తెలంగాణ క్యాబినెట్ రేపు సమావేశం కానుంది. సంక్షేమ పథకాల అమలు తీరు, బడ్జెట్ రూపకల్పనపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా పలు వరాలు ప్రకటించనున్నారు. దీంతో పాటు క్యాబినెట్‌లో పలు వివాదాస్పద అంశాలపైనా చర్చించనున్నారు.

ఉదయం 11 గం.ల నుంచి సాయంత్రం 4.30 వరకు భేటి..

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మంత్రివర్గం శనివారం ఉదయం సచివాలయంలో సమావేశం అవుతుంది. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో అజెండా భారీగా ఉంది. అందుకే ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం సాయంత్రం దాదాపు నాలుగున్నర వరకు జరిగనుంది.

గ్రేటర్ ఎన్నికలపైనే కేబినెట్‌లో ప్రధాన చర్చ .......

మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలపైనే ప్రధాన చర్చ సాగనున్నట్లు సమాచారం. గ్రేటర్ ప్రజలపై ఇప్పటికే వరాల జల్లు కురించింది ప్రభుత్వం. మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశముంది. దాంతో పాటు గ్రేటర్ ఎన్నికల ఇంచార్జ్ గా మంత్రి కేటీఆర్ ను లాంఛనంగా ప్రకటించబోతోంది మంత్రిమండలి.

సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష .......

మరోవైపు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును కూడా సమీక్ష చేస్తారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిది. సకాలంలో ఆయా పనులు పూర్తి అయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాలను ఎంత మేర పెంచాలన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది. 15 నుంచి 20 వేల వరకు టీచర్ ఉద్యోగుల భర్తీకి సైతం ఆమోదం తెలపనుంది.

బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ.......

ఇక ఇదే నెల నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సైతం చర్చించనుంది మంత్రివర్గం. శాఖల పరంగా ప్రాధాన్యతలను సైతం సీఎం వివరించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో విపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చేలా మంత్రులు సొంత శాఖలపై పట్టు సాధించేలా సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

ఓమ్ సిటీకి 500 ఎకరాల స్థలం కేటాయించడంపై చర్చ .............

రామోజీ ఫిల్మ్ సిటీకి అనుకుని నిర్మించ తలపెట్టిన దేవనగరి...ఓమ్ సిటీకి 500 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించే అంశంపై చర్చజరగనుందని సమాచారం. శనివారం నాటి మంత్రిమండలి సమావేశంలో దీనికి పచ్చ జెండా ఊపనున్నారని సమాచారం. వీటితో పాటు మరిన్ని అంశాలపై కేబినెట్‌లో చర్చలు సాగనున్నాయి. 

21:28 - January 1, 2016

హైదరాబాద్‌ : నగరంలో నుమాయిష్ సందడి మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఎంతో కష్టపడి ఏర్పాట్లు చేసిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో... ప్రభుత్వ, ప్రైవేట్ స్టాళ్లు సహా పలు ఉత్పత్తులను ప్రదర్శించారు. 46 రోజులపాటు ఈ నుమాయిష్ జాతర కొనసాగనుంది.

21:27 - January 1, 2016

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కలిసి పోరాడారు. కానీ తెలంగాణలో మాత్రం సిగపట్లు పడుతున్నారు. బైపోల్‌, కౌన్సిల్ ఎన్నికల్లో సైలెంట్‌గా ఉన్నా... గ్రేటర్‌లో మాత్రం కమలదళం టార్గెట్‌గానే TRS అస్త్రాలను ప్రయోగిస్తోంది. బల్దియా ఫైట్‌... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య... దూరం పెంచేలా కనిపిస్తోంది. ప్రధాని మోదీతో పాటు కాషాయనేతలపై గులాబీ లీడర్లు మండిపడుతున్నారు. ఇక బీజేపీ సైతం అదే రేంజ్‌లో

మావల్లే ..కాదు..! మావల్లే అభివృద్ధి...

హైదరాబాద్ డెవలప్‌మెంట్‌పై టిఆర్ ఎస్, బీజేపీ లీడర్ల మాటలివి. కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వకున్నా... రాష్ట్రమే అభివృద్ధి చేస్తోందని గులాబీ సేన చెబుతుంటే... కేంద్ర నిధులతోనే భాగ్యనగర అభివృద్ధి జరుగుతోందంటూ... కమలదళం తెగేసి చెబుతోంది. గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా ఇరుపార్టీల నేతలు... ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకుంటున్నారు. ఎనీ సెంటర్‌, ఎనీ టైమ్ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసురుతున్నారు.

మండలి ఎన్నికలతో జోరుమీదున్న కారుపార్టీ..

ఇప్పటికే బైపోల్‌, మండలి ఎన్నికలతో జోరుమీదున్న కారుపార్టీ... బల్దియాలోనూ పాగా వేసేందుకు రెడీ అవుతోంది. ప్రత్యర్థులే లక్ష్యంగా గులాబీ నేతలు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్‌లో బీజేపీని బలహీనపరిచే విధంగా వ్యూహారచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఏకంగా మోడీనే టార్గెట్ చేశారు కేటీఆర్. తెలంగాణలో పర్యటించాలని ఆహ్వానించినా... ఇప్పటివరకు ప్రధాని రానే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిపై గులాబీ యువనేత నిప్పులు చెరిగారు. అంబర్‌పేట అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. గోల్నాక డివిజన్‌లో ఇరిగేషన్‌ నాలాను పరిశీలించిన కేటీఆర్‌ కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ అభివృద్ధి కోసం... కేంద్రం నుంచి లక్ష కోట్ల ప్యాకేజీ తేవాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

కమలనాథులు కారుపార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.....

కేటీఆర్ అలా విమర్శించారో లేదో కమలనాథులు కారుపార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. జీహెచ్ ఎంసీ లో గెలవడం కోసం టీఆర్‌ఎస్‌ నానా కుయుక్తులు పన్నుతుందన్నారు. డివిజన్ల మార్పులు, ఓట్ల తొలగింపులు, పార్టీ ఫిరాయింపులకు తాము బెదరబోమన్నారు. శిలా పలకాలపై డిప్యూటీ సీఎం పేరు కంటే పైన కేటీఆర్‌ పేరును ఎలా పెడుతున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటుతామని కిషన్‌రెడ్డి అన్నారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఇరుపార్టీల నేతలు సమన్వయంగా పనిచేస్తేనే... రాష్ట్రాభివృద్ధి సాధ్యం. కానీ ఇలా లీడర్లు నిధుల సేకరణపై కాకుండా... ఓట్ల కోసమే పంతాలకు పోవడం భాగ్యనగర వాసుల్ని విస్మయానికి గురిచేస్తోంది. 

20:57 - January 1, 2016

హైదరాబాద్ : కోట్లాది మంది మనసు దోచుకుంటున్న టీవీ షో, అప్రతిహాసంగా దూసుకుపోతున్న గేమ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీజన్ -3లో ఓ రికార్డు బ్రేక్ అయ్యింది. ఇప్పటి వరకు మీలో ఎవరు కోటీశ్వరుడులో గెలుచుకున్న అత్యధిక మొత్తం రూ.12లక్షల యాభై వేలు మాత్రమే. కానీ ఈ సీజన్ 3లో ఈ రికార్డును బ్రేక్ చేశారు రావణ శర్మ. ఎక్కడ చూసినా రావణ శర్మ పై చర్చ జరుగుతోంది. 'రావణ శర్మ' తో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

నాగావళి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు...

శ్రీకాకుళం : కొత్త సంవత్సరం సెలవు రోజు కావడంతో ఐదుగురు స్నేహితులు నాగావళి గోల్కొండ రేవులో స్నానానికి వెళ్లారు. ముందుగా ఇద్దరు నదిలోకి దిగగా.. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతూ కేకలు వేశారు. దీంతో ఒడ్డున ఉన్నవారిలో మరొకరు నదిలో వారిని కాపాడే ప్రయత్నంలో అతడు కూడా గల్లంతయ్యాడు. దీంతో మిగిలిన ఇద్దరు విద్యార్థులు భయంతో అక్కడ నుంచి పారిపోయారు. గల్లంతైన ముగ్గురిలో ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన సోదరులు లోకేష్(14), రాకేష్(13) తో పాటు ముంగవారితోటకు చెందిన హేమచంద్ర (14) ఉన్నారు. విద్యార్థుల గల్లంతుతో స్థానికంగా విషాదం నెలకొంది.

ఉద్యోగాల పేరిట వసూళ్లు : ఇద్దరి అరెస్ట్

నల్లగొండ: ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో చోటుచేసుకుంది. నిందితుల వద్ద నుంచి నకిలీ సంతకాలతో ఉన్న లెటర్‌ప్యాడ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

పార్క్ చేసిన కారులో మంటలు : ఒకరి మృతి

హైదరాబాద్ : ఇంటి ముందు పార్క్ చేసిన కారులో నుంచి మంటలు చెలరేగి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే సురేష్ రెడ్డి గత రాత్రి తన ఇంటి ముందు కారు పార్క్ చేశారు. సురేష్ రెడ్డి ఇద్దరు కుమారులు శుక్రవారం కారులో ఉన్న పెన్డ్రైవ్ తీసుకునేందుకు వెళ్లారు. కారు డోర్లు తెరిచి పెన్ డ్రైవ్ తీసుకుంటుండగా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు ముందు సీటులో ఉన్న సృజన్ కొద్దిపాటి గాయాలతో వెంటనే బయటకు రాగా, వెనక సీటులో ఉన్న శ్రేయన్ మంటల్లో చిక్కుకున్నాడు.

20:07 - January 1, 2016

హైదరాబాద్ : కొలువుల తలుపులు తెరిచిన సర్కారోళ్ళు… ఉత్తమాట చేయకంటున్న పోరాగాళ్ళు… పొగడ్త కోసం తిట్టుకున్న మంత్రి, ఎమ్మెల్యే, మైకు ఇరగ్గొట్టి మరీ వెళ్లిపోయిన గాంధీ, దుమ్ము లేచిపోయిన న్యూఇయర్ పండుగ - హైదరాబాద్ లో అదరగొట్టిన పడుచు పిల్లలు, పోలీసోళ్ల మీద వాలుతున్న పావురాళ్లు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు అల్లుతున్న అస్సలు కథ, తాగమని పైపులు పెడుతున్న ట్రాఫికోళ్ళు...కొత్త సంవత్సరం గాలిలో తూర్పార పని. కుతికల దాక తాగినా కుషీగా ఉండొచ్చు. తాగుబోతోళ్ల కోసం సర్కారోళ్ల సదురుడు. ఇత్యాది అంశాలతో మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న వచ్చేశారు. ఆ మల్లన్న వాక్చ్యాతుర్యాని చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్ : ఇద్దరు మావోల మృతి

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. నారాయణపూర్ జిల్లా కుబుల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మరో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పధార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

18:31 - January 1, 2016

విశాఖ : రంగురంగుల పువ్వులు... సుగంధాలు విరిసే సుమాలు.. ఎన్నెన్నో జాతులకు చెందిన చిట్టిపొట్టి మొక్కలు అన్నీ ఒకచోట చేరాయి. కనువిందు చేశాయి. ప్రతి యేటా సుందర విశాఖ తీరాన జరిగే విశాఖ ఉత్సవ్‌ నూతన సంవత్సర ప్రారంభాన ఈ యేడూ ఘనంగా ప్రారంభమైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

కనువిందు చేసే పుష్పరాజాలు..

కనువిందు చేసే పుష్పరాజాలు. సౌరభాలు విరజిమ్మే కోమల కుసుమాలు... మనోహరంగా అలంకరించి ఉన్న బోన్సాయ్‌ చెట్లు.. అన్నీ ఒకచోట చేరి విశాఖ తీరానికి రారమ్మంటూ స్వాగతం పలుకుతున్నాయి.

ప్రతియేటా మూడు రోజుల పాటు....

ప్రతి యేటా విశాఖ తీరాన మూడు రోజులపాటు విశాఖ ఉత్సవ్‌ను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ యేడాదీ ఘనంగా ప్రారంభమయ్యాయి. రకరకాల వేడుకలు జరగనున్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వీక్షకులు హాజరుకానున్నారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పుష్పాలను....

ఫ్లవర్‌ షో కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పుష్పాలను సేకరించి అలంకరించారు. నెమలి ఆర్ట్ వర్క్ అందరినీ ఆకట్టుకుంటోంది. 500 కేజీల కాప్సికమ్‌ను ఈ అలంకరణ కోసం ఉపయోగించారు. 30కి పైగా ప్రదర్శనలు చేసిన సంధ్య యాదవ్ పుష్ప ప్రదర్శనలో ముఖ్య పాత్ర పోషించారు. ఇన్ని పుష్ప జాతులు ఒక చోట చేరడం నిజంగా అద్భుతంగా ఉందని సందర్శకులు అంటున్నారు.

వీకెండ్స్‌ కావడంతో సందర్శకుల తాకిడి....

ఉత్సవాలు జరగనున్న మిగిలిన రెండు రోజులూ వీకెండ్స్‌ కావడంతో సందర్శకుల తాకిడి మరింత పెరగనుంది. దీంతో విశాఖ నగరాభివృద్ధి సంస్థ ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టింది. వుడా పార్క్‌లో కాకుండా ఎంజిఎం పార్క్‌లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా సౌలభ్యంగా ఉందని సందర్శకులు అంటున్నారు. 

18:24 - January 1, 2016

హైదరాబాద్ : నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సంవత్సరాదిని దైవ దర్శనంతో ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు ప్రముఖ ఆలయాలకు బారులు తీరారు. 31 రాత్రి నుంచే భక్తుల రాకపోకలు కొనసాగాయి. మినిస్టర్లు, అధికారులు, ప్రముఖులు వివిధ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో.....

నూతన సంవత్సరాదిన ఆలయాలన్నీ భక్తుల రాకపోకలతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం సంవత్సరాది ముందు రోజు నుంచే కిక్కిరిసిపోయింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 12గంటలపైనే సమయం పడుతోంది. భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

ఇంద్రకీలాద్రి....

విజయవాడ కనకదుర్గను ఎపి సిఎం చంద్రబాబునాయుడు దంపతులు దర్శించుకున్నారు. చంద్రబాబుకు దుర్గగుడి అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. చంద్రబాబుకు ఈవో నర్సింగరావు అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందచేశారు. భవానీ దీక్షాధారులతోపాటు సాధారణ భక్తులూ పోటెత్తడంతో ఇంద్రకీలాద్రి పర్వతం కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలలనుంచి పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. కొందరు భక్తులు కొండ చుట్టూ 7 కిలో మీటర్ల మేర గిరిప్రదక్షణ చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

తెలంగాణ తిరుపతి యాదాద్రికి....

తెలంగాణ తిరుపతిగా భావిస్తున్న నల్గొండ జిల్లా యాదాద్రికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల తాకిడితో పుష్కరిణి, కళ్యాణ, వ్రత మంటపాలు కిక్కిరిసిపోయాయి. రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాల రాకపోకలను అనుమతించడం లేదు.

శ్రీశైలం, వేములవాడ, భద్రాచలం, చిన్న తిరుమలలో...

శ్రీశైలం, వేములవాడ, భద్రాచలం, చిన్న తిరుమల, తదితర ప్రముఖ ఆలయాలన్నీ భక్తుల సందడితో బిజీబిజీగా మారిపోయాయి. యాత్రికులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం తీర్థ ప్రసాదాల కౌంటర్లు, ఘాట్‌లు, తదితర ప్రదేశాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

18:18 - January 1, 2016

విజయవాడ : కడప జిల్లా జమ్మలమడుగు వైసిపి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై ఆయన ప్రత్యర్థి, టిడిపి నేత రామసుబ్బారెడ్డి ఫైరయ్యారు. ఆదినారాయణ రెడ్డి ఓ సందర్భంలో మాట్లాడుతూ తాను టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని పెళ్లికూతురే రెడీగా లేదని వ్యాఖ్యానించారు. దీనిపై రామసుబ్బారెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.  

18:16 - January 1, 2016

ప.గో : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తల్లి బిడ్డల పథకాన్ని సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సెంట్రల్ ఆసుపత్రిలో ప్రారంభించారు. ఫిబ్రవరి 1 నుంచి వైద్యపరీక్షలన్నీ ఉచితంగా చేయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లీ-బిడ్డా ఎక్స్‌ప్రెస్‌ పథకం బాలింతలకు..శిశువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అలాగే 102 కాల్ సెంటర్, ఎన్టీఆర్‌ వైద్య పరీక్ష, టెలీ రేడియాలజీ పథకాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించించారు. 

18:12 - January 1, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌లో లెఫ్ట్‌, లోక్‌సత్తా కూటమి... కనీస ఉమ్మడి ప్రణాళికను విడుదల చేసింది. ప్రజా సమస్యలపై పోరాటం తప్పదని వామపక్ష, లోక్‌సత్తా నేతలు హెచ్చరించారు. తక్షణమే గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. మెరుగైన పారిశుద్ధ్యం, గ్రీన్ సిటీ, అందరికీ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా... పోరాటం చేస్తామని వామపక్ష, లోక్‌సత్తా నేతలు స్పష్టం చేశారు.

 

18:11 - January 1, 2016

ఆదిలాబాద్ : ముల్తానీలు..! ఈ పేరు వింటేనే ఆదిలాబాద్‌ జిల్లా ఉలికిపడుతుంది. ముఖ్యంగా అటవీ పరిసర ప్రాంతాలు ఆగమాగమై పోతాయి. ముల్తానీల కర్కశత్వాన్ని గురించి కథలు కథలుగా గుసగుసలు పోతాయి. అటవీ, పోలీసు అధికారుల ఫైళ్లు.. వారి నేరాల గురించి రికార్డు.. రికార్డులుగా చాటుతాయి. వారి వద్దకు వెళ్లడమే తప్ప తిరిగి వచ్చిన వారు లేరన్న ప్రచారమూ ఉంది. ఇంతకీ ఎవరీ ముల్తానీలు.. ఏమిటి వీరి కథ..? వీరి గురించి సాగుతున్న ప్రచారంలో వాస్తవమెంత..? వారి గోస ఏంటి.. వారెందుకిలా మారారు..? ఈ విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది.. టెన్ టివి.

ఇచ్చోడ మండలంలోని అటవీ పరిసర ప్రాంతాల్లో....

ముల్తానీ..! ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని అటవీ పరిసర ప్రాంతాల్లో నివసించే ఓ ముస్లిం తెగ. అడవుల్లో చెట్లను నరకడం.. కలపను దుంగలుగా మార్చి.. అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించడం.. వచ్చిన కాస్తో కూస్తో డబ్బుతో పొట్టపోసుకోవడం.. ఇదీ ఇక్కడి ముల్తానీల జీవన విధానంపై సమాజానికి ఉన్న దృక్కోణం. అడవిని హరించడమే కాదు.. హైవేలపై లారీలను హైజాక్‌ చేస్తారని.. ఆ లారీల్లో కలపను స్మగ్లింగ్‌ చేస్తారని.. అడ్డు చెప్పే వారిపై కర్కశ దాడులకు తెగబడతారన్నదీ ముల్తానీలపై ఉన్న ప్రచారం. అటవీ, పోలీసు అధికారులదీ ఇదే భావన.

బయటి ప్రాంతం వారికి పెద్దగా తెలియదు....కానీ...

ఇచ్చోడ మండలంలోని ఈ నాలుగైదు ముల్తానీ గ్రామాల గురించి బయటి ప్రాంతం వారికి పెద్దగా తెలియదు. కానీ.. జిల్లాలో ముఖ్యంగా అటవీ పరిసరాల ప్రజలకు మాత్రం వీరి గతం.. వర్తమానం.. చిరపరిచితం. అవిభక్త భారతదేశంలో.. పాకిస్థాన్‌ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు.. ఆదిలాబాద్‌ జిల్లాకు వలస వచ్చారు. ఆ తర్వాత దేశం రెండుగా విడిపోయినా వారు మాత్రం.. భారత్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు వారి వారసులు.. ఇక్కడే నాలుగైదు గ్రామాల్లో స్థిరపడిపోయారు.

ముల్తానీలు ఉండే గ్రామంలోకి వెళ్లేందుకు పోలీసులూ.....

ముల్తానీలు ఉండే గ్రామంలోకి వెళ్లేందుకు పోలీసులూ జంకుతారన్న ప్రచారం జిల్లాలో ఉంది. చెకింగ్స్‌లో దొరికినప్పుడు కేసులు పెట్టడం వరకే రక్షక భటులు పరిమితమయ్యారనీ అంటారు. ఇంతటి నేర చరిత్ర ఉందన్న ప్రచారం వల్ల... ఈ గ్రామంతో సత్సంబంధాలు పెట్టుకునేందుకు ఎవరూ సాహసించలేదు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేని.. భయంకరమైన పల్లెలుగా చెప్పుకునే ఈ ముల్తానీ గ్రామాల్లో వాస్తవ స్థితిగతులను తెలుసుకునేందుకు.. ఆ గ్రామాల్లో పర్యటించింది 10టీవీ.

ముల్తానీ కర్కశత్వం గురించి జిల్లాలో ఎన్నో కథలు ప్రచారంలో....

ముల్తానీ కర్కశత్వం గురించి జిల్లాలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో మీడియా కూడా ఇంతకాలం ఈ గ్రామాలకు వెళ్లిందే లేదు. అధికారులు చెప్పిన కథలనే కథనాలుగా ప్రచురించి, ప్రసారం చేసింది మీడియా. ఈ నేపథ్యంలో.. 10టీవీ బృందం.. ముల్తానీలు నివసించే గుండాల గ్రామాన్ని సందర్శించింది. స్థానికులను పలుకరించాక.. వారిపై బాహ్యప్రపంచంలో జరుగుతున్న ప్రచారానికీ.. వాస్తవానికి ఏమాత్రం పొంతన లేదని తేటతెల్లమైంది. నరకడం సంగతి అటుంచి.. ఎంతో గౌరవంగా తమ స్థితిగతులను చూపుతూ.. హృదయాంతరాళలోని వేదనను వ్యక్తీకరించారు.

పాకిస్థాన్‌లోని ముల్తానీ ప్రాంతం నుంచి వీరి పూర్వీకులు....

నిజాం ప్రభువుల కాలంలో... పాకిస్థాన్‌లోని ముల్తానీ ప్రాంతం నుంచి వీరి పూర్వీకులు ఆదిలాబాద్‌ జిల్లా వచ్చారు. పాక్‌లో వీరి ప్రాంతం పేరును బట్టే.. వీరిని ముల్తానీలుగా పిలుస్తున్నారు. వీరి సంతతి ఇచ్చోడ పరిసరాల్లోని సిరికొండ, వాయిపేట్‌, గుండాల, జోగిపేట్‌, కేశవపట్నం, ఎల్లమ్మగుట్లల్లో తప్పించి మరెక్కడా కనిపించదు. వీరు పూర్తిగా టేకు చెట్లను నరకడమే వృత్తిగా జీవిస్తున్నారని.. ఆ క్రమంలో ఎంతటి నేరానికైనా తెగిస్తారనీ ప్రచారంలో ఉంది. ముల్తానీలు చూడ్డానికి సన్నగా రివటలా కనిపిస్తారు. కానీ ఎంతపెద్ద టేకు దుంగనైనా ఇట్టే ఎత్తడమే కాకుండా, ఎంత దూరమైనా మోసుకుపోయే శక్తి కలిగి ఉంటారన్నది అటవీ అధికారుల కథనం.

అధికారుల వాదన పూర్తిగా సత్యదూరమని కొట్టిపారేయలేం. ...

అధికారుల వాదన పూర్తిగా సత్యదూరమని కొట్టిపారేయలేం. స్మగ్లింగ్‌తో పాటు ఆదాయం కోసం కొంత మంది ముల్తానీలు అడ్డదారులు తొక్కారు. ఆ చెడ్డపేరు ముల్తానీలందరిపైనా పడింది. కలప రవాణ కోసం లారీలను హైజాక్ చేయడం.. దారి దోపిడిలకు పాల్పడడం లాంటివి ముల్తానీలందరికీ మాయని మచ్చను తెచ్చిపెట్టాయి. తద్వారా సమాజానికి వీరిని దూరం చేశాయి.

. ప్రాథమిక విద్యకూ వీరు దూరం...

ముల్తానీల కర్కశత్వం గురించిన ప్రచారంతో.. అధికారులెవరూ ఈ గ్రామాల వైపు చూసిన దాఖలాలు లేవు. ప్రాథమిక విద్యకూ వీరు దూరమయ్యారు. పిల్లలను బయటి ప్రాంతాల్లో చదివిద్దామనుకున్నా.. వీరికి ఆర్థిక స్థోమత అడ్డుగా నిలుస్తోంది. ఒకవేళ బయటి ప్రాంతాలకు వెళ్లి ఏదైనా ఉపాధిని వెతుక్కుని... పిల్లలను చదివిద్దామన్నా.. ముల్తానీలు అని చెప్పగానే.. వీరికి ఎవరూ ఉపాధిని ఇవ్వడం లేదు. అటు ప్రభుత్వమూ వీరి గురించి ఆలోచించిన దాఖలా లేదు.

ముల్తానీల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని....

ముల్తానీల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని.. నిజామాబాద్‌ ప్రాంత కలప స్మగ్లర్లు వీరికి ఉపాధి కల్పిస్తామని ఆశ చూపుతూ.. కలపను అక్రమంగా కొట్టిస్తున్నారు. అడ్డుకున్న అటవీ అధికారులపై.. ముల్తానీలతోనే దాడులు చేయించేవారు. ఉపాధిని అడ్డుకుంటున్నారన్న కోపంతో.. ముల్తానీలూ ఒకేతాటిపైకి వచ్చి.. అటవీ, పోలీసు అధికారులపైనా దాడికి తెగబడేవారు. దీంతో ముల్తానీలు తరచూ కేసుల్లో ఇరుక్కోవడం.. జైలు పాలై శిక్ష అనుభవించడం రివాజుగా మారింది. అధికారులు కూడా ఏళ్ల తరబడి వీరిపై కసి పెంచుకున్నారే తప్ప.. సమస్య మూలాలను అన్వేషించే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా ముల్తానీలు తరతరాలుగా దుష్టులుగానే ముద్రపడిపోయారు.

అడవులను కాపాడ్డంపై ప్రత్యేక డ్రైవ్‌...

అడవులను కాపాడ్డంపై ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగించిన అటవీ అధికారులు.. కలప స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయడం ప్రారంభించారు. దీంతో.. స్మగ్లర్లకన్నా.. ముల్తానీలే ఎక్కువగా నష్టపోయారు. పైగా ఇళ్లల్లోకి పోలీసులు జొరబడి వేధిస్తుండడంతో మరింత వేదనకు గురవుతున్నారు. మారిన ముల్తానీల కుటుంబాల బాగోగుల కోసం.. ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని వీరి గురించి బాగా తెలుసుకున్న వారు అంటున్నారు. పొలాల్లో బోర్లు తవ్వడం.. వ్యవసాయ రుణాలు ఇప్పించడం లాంటి ప్రోత్సాహకాలు అందించాలనీ సూచిస్తున్నారు.

సర్కారు తరఫున సహాయం అందించేందుకు..

సర్కారు తరఫున సహాయం అందించేందుకు.. ఇప్పుడిప్పుడే కొందరు అధికారులు చొరవ తీసుకుంటున్నారు. ముల్తానీల కోసం ప్రత్యేకంగా ఆరు ఉర్దూ పాఠశాలలు ఏర్పాటు చేయాలని.. పూర్తిగా వర్షాధారితమైన వీరి వ్యవసాయ భూముల్లో బోర్లు వేయించాలని.. ప్రత్యామ్నాయ వృత్తివైపు వీరిని మళ్లించాలని.. రాయితీపై రుణాలు అందించాలంటూ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలూ కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వమే చొరవ తీసుకుంటే.. ముల్తానీల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. సమాజానికీ మేలు జరుగుతుంది.  

సత్యానందాన్ని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు

విజయవాడ : కాల్ మనీ కేసు లో నిందితుడు సత్యానందాన్ని కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఈ నెల 13 వరకు రిమాండ్ కు విధించి జిల్లా జైలుకు తరలించారు.

విద్యుత్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : విద్యుత్ శాఖ పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ నుంచి పగటి పూట 9 గంటల నిరంతర విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది 4,600 మె.వా అదనపు విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా విద్యుత్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని కేసీఆర్ తెలిపారు.

గ్యాస్ వినియోగదారులకు అత్యవసర కాల్ సెంటర్

న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుల సమస్యల నివారణపై కేంద్రం దృష్టి సారించింది. ఈమేరకు 1906 నెంబర్‌తో అత్యవసర కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఈ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ అత్యవసర సేవా కేంద్రం 24 గంటలపాటు అందుబాటులో ఉంటుంది.

హుస్సేన్‌సాగర్‌లో దూకి తల్లి, పిల్లల ఆత్మహత్యాయత్నం...

హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో దూకి తల్లి ముగ్గురు పిల్లలు ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. విషయాన్ని గమనించిన లేక్ వ్యూ పోలీసులు వారిని రక్షించారు. 

17:11 - January 1, 2016

తీవ్రమైన ఎండల తర్వాత నాలుగు చినుకులు పడితే వాతావరణం కొంత రిలీఫ్ నిస్తుంది. అలా అని ఆ నాలుగు చినుకులను వాన అనుకోవడానికి లేదు. రామ్ కొత్త సినిమా నేను శైలజా ఇలాంటి ఫలితాన్నే ఇచ్చింది. అతని గత చిత్రాల ఫ్లాపుల దెబ్బకు విసిగిపోయిన ప్రేక్షకులకు ….ఈ కొత్త సినిమా కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఐతే హిట్టయినట్లు కాదు. కొన్నేళ్లుగా కథల ఎంపికలో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు రామ్. నేను శైలజా కొత్త కథ కాకున్నా...తెలిసిన కథనే..కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు కిషోర్. ఈ క్వాలిటీ వల్ల సినిమా

ఇరుగు పొరుగు ఇళ్లలో నివసిస్తుంటాయి హరి, శైజలా ఫ్యామిలీలు. కనిపించిన ప్రతి అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయడం ప్రైమరీ స్కూల్ టైం నుంచే హరికి అలవాటు. అలాగే హీరోయిన్ కీ ప్రపోజ్ చేస్తాడు. కానీ హరి మనసుకి శైలజా ఎందుకో ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. జాబ్ ట్రాన్స్ ఫర్ తో హరి ఫ్యామిలీ వైజాగ్ వెళ్లిపోతుంది. దీంతో...హరి, శైలజా దూరమవుతారు. పెరిగి పెద్దయ్యాక కూడా..రామ్ ఇలాగే ఎదురైన అమ్మాయికల్లా లవ్ ఎక్స్ ప్రెస్ చేస్తుంటాడు. వైజాగ్ లో హరికి శైలజా ఎదురవుతుంది. మనోడిలో ఫస్ట్ క్రష్ మొదలైనా...అమ్మాయి రెస్పాండ్ అవదు. కానీ ఫ్రెండ్ షిప్ చేస్తుంటుంది. ఈ స్నేహాన్నే ప్రేమ అనుకుని శైలజా కు ప్రపోజ్ చేస్తాడు హరి. నువ్వంటే ఇష్టమే కానీ లవ్ చేసే ఇష్టం కాదు అంటూ ట్విస్ట్ ఇస్తుంది శైలజా. నిజానికి హరిని ప్రేమించినా ...ఎందుకు అతన్ని కాదనుకుంది. శైలజా జీవితంలో ఎదురైన సమస్యను హరి ఎలా పరిష్కరించాడు అన్నది మిగిలిన

నేను శైలజా రామ్ కు రిఫ్రెషింగ్ ఫిల్మ్ గా చెప్పొచ్చు. మూస కథలతో మసకబారిన అతని కెరీర్ కు కొంత రిలీఫ్ నిస్తుందీ ఫిల్మ్. హరి పాత్రలో రామ్ బిగినింగ్ నుంచీ బాగా నటించాడు. ఐతే ఇంకా అతని మాడ్యూలేషన్, ఫర్మార్మెన్స్ లో పవన్ ఆటిట్యూడ్ పోలేదు. శైలజా పాత్రలో కీర్తి సురేష్ సరిపోయింది. ఇంకాస్త ఎక్స్ ప్రెసివ్ గా ఉంటే బాగుండేది. కానీ ఎక్కువ శాతం మూడీగా ఉంటే శైలజా పాత్రకు ఆమె నటన కుదిరింది. ఈ రెండు పాత్రల మినహా...సత్యరాజ్, ప్రిన్స్, శ్రీముఖి లాంటి క్యారెక్టర్లన్నీ ఎస్టాబ్లిష్ కాలేదు.....

 

టెక్నీషియన్స్ విషయానికొస్తే....సమీర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం దర్శకుడిగా దేవీ మరోసారి తన బ్రాండ్ చూపించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా...పాటలతో ఆకట్టుకున్నాడు. కిషోర్ తిరుమల దర్శకుడిగా పాస్ అయ్యాడు. ఐతే ఫస్టాప్ ను కాన్ఫిడెండ్ గా డీల్ చేసిన ఈ డైరక్టర్...సెకండాఫ్ లో ఆ వేగాన్ని కోల్పోయాడు. ఇంటర్వెల్ తర్వాత స్లో నేరేషన్ తో సినిమాను సాగదీశాడు. ఫలితంగా హిట్ అవ్వాల్సిన సినిమా కాస్తా విజయానికి కాస్త దూరంలో ఆగిపోయింది. ల్యాగ్ స్క్రీన్ ప్లే, అనవసర ఫైట్లు సినిమాకు మైనస్ పాయింట్స్ గా చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల పాత్రలు అంతగా ఎలివేట్ కాలేదు. ఆ క్యారెక్టర్లు కనెక్ట్ అయి ఉంటే...సినిమాకు ఫలితం మరింత బాగుండేది. మొత్తానికి సినిమాలో ఓ ఫ్రెష్ ఫీలింగ్ ఉన్నా...అది ఫుల్ ఫిల్ కాలేదనిపిస్తుంది....…

ఫ్లస్ పాయింట్స్

 

  1. ఫ్లెజంట్ ఫస్ట్ హాఫ్

  2. నవ్వించే సంభాషణలు

  3. సంగీతం

  4. సినిమాటోగ్రఫీ

 

మైనస్ పాయింట్స్

 

  1. సెకండాఫ్

  2. స్లో నెరేషన్

  3. అనవసర ఫైట్లు

  4. స్క్రీన్ ప్లే లోపాలు 

ఏపీలో చేనేత కార్మికులకు రుణవిముక్తికి విధివిధానాలు ఖరారు

హైదరాబాద్ : ఏపీలో చేనేత కార్మికుల రుణ విముక్తి అమలుపై సర్కార్ విధి విధానాలు వెలువరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాని కోసం పరిశ్రమల శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఆరుగురితో రాష్ట్ర స్థాయి కమిటి ఏర్పాటు చేసింది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులో పేర్కొరింది.

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 43 పాయింట్లు లాభపడి 26,161 వద్ద ముగిసింది. నిఫ్టీ 16 పాయింట్లు లాభంతో 7,963 వద్ద ముగిసింది. 

16:49 - January 1, 2016

తిరువంతపురం: మ్యూజిక్ మేస్ట్రో, పద్మభూషణ్ ఇళయరాజా(72) కు కేరళ ప్రభుత్వం నుంచి అత్యున్నత పురస్కారం లభించింది. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను రాష్ట్రప్రభుత్వ నిషగంధి పురస్కారం ఆయనను వరించింది. ఈనెల 20 జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారంతో పాటు లక్షన్నర రూపాయల నగదు, ఓ జ్ఞాపికను ఇసైజ్ఞాని అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిషగంధి పురస్కారానికి ఇళయరాజాను ఎంపికచేసినట్లు కేరళ పర్యాటక శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. భారత చలన చిత్ర పరిశ్రమకు ఇళయరాజా చేసిన సేవలకు గాను ఈ అవార్డుతో సత్కరించినున్నామని వెల్లడించారు. 

16:43 - January 1, 2016

హైదరాబాద్ : సోషల్ సైట్స్ ద్వారా అభిమానులతో ఎక్కువగా టచ్‌లో ఉండే రేణూ దేశాయ్ తాజాగా న్యూ ఇయర్‌డేకు సంబంధించిన ఓ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపింది. న్యూ ఇయర్ డే రోజు తమిళ స్టార్ డైరెక్టర్ ఎస్ జె సూర్యతో కలిసి లంచ్ చేసిన రేణూ, ఆ ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, ఈ ఫోటోను తీసింది తన కొడుకు, కూతురు ఆద్యలు అంటూ పవన్ మాజీ భార్య పేర్కొంది. ఈ సందర్బంగా అభిమానులందరికి హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. ఎస్.జె సూర్య గతంలో పవన్‌తో ఖుషి చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ చిత్రం పవన్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ తర్వాత కొమరం పులి చిత్రం కూడా వీరిద్దరి కాంబినేషన్‌లో రాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. అయితే ప్రస్తుతం పవన్ ఎస్.జె.సూర్యతో మరో చిత్రాన్ని తీయాలని భావిస్తున్నాడని వార్తలు వస్తుండగా, ఈ చిత్రం ఖుషీ చిత్రానికి సీక్వెల్‌గా ఉంటుందని సమాచారం.

'ఎన్టీఆర్ వైద్య సేవ' పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు

ఏలూరు : నిరుపేదలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిచాలన్న లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ఎన్టీఆర్‌ వైద్య సేవ’ పథకానికి శ్రీకారం చుట్టింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ పథకం కింద అన్ని జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల్లో 60 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకంపై అధ్యయనం చేసి అవసరమైన సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది.

16:28 - January 1, 2016

హైదరాబాద్ : బీహార్‌ సంకీర్ణ సర్కారులో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పార్టీలైన జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు భగ్గుమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నితీష్‌ కుమార్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆర్జేడీ సీనియర్ నేత, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రఘువంశ్‌ ప్రసాద్ సింగ్ ఆరోపించారు. క్రైమ్ రేటు రోజురోజుకు పెరుగుతోందని విమర్శించారు. గతవారంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒక వ్యాపారి హత్యకు గురైన నేపథ్యంలో రఘువంశ్‌ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పెరుగుతున్న నేరాలకు నితీషే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు రఘువంశ్‌ వ్యాఖ్యలను జేడీయూ నేతలు ఖండించారు.

 

16:18 - January 1, 2016

హైదరాబాద్ : కోడి కొండెక్కేసింది. వంద నోట్లు మూడు చూపిస్తే గాని ముక్కకూడా రాల్చనంటోంది. ఐదు సెంచరీలు దాటేసిన మేకను వదిలేసిన మాంసప్రియులు కోడితో సరిపెట్టేసుకుంటున్నారు. ఇప్పుడా కోడి కూడా డబుల్ సెంచరీ దాటడంతో అరకోడితో సర్దుకుంటున్నారు.

కరుస్తోన్న కందిపప్పు...

కందిపప్పు సామాన్య జనాన్ని కసురుకుంది. టమాట మాట వింటేనే మంట పుట్టేలా మండిపోతోంది. ఉల్లిపాయ ఊసెత్తితేనే కూరకూడా ఉడకనంటోంది. ఇప్పుడు ఈ కోవలోకి కోడి కూడా వచ్చి చేరింది.

రూ.250 చేరువలో కిలో చికెన్‌

పది రోజుల క్రితం వరకు సామాన్యులకు కాస్తోకూస్తో అందుబాటులో ఉన్న చికెన్ ధరలు ఇప్పుడు అమాంతం పెరిగిపోయాయి. పండుగ వేళ్ల ముక్క నోట్లోకి వెళ్లాలంటే వంద నోట్లు మూడు ఉంటేనేగాని వెళ్లడం లేదు. కిలో చికెన్‌ 250 రూపాయలకు చేరువలో ఉండటంతో సామాన్యులు నోరెళ్లబెట్టి కోడివంక ధీనంగా చూస్తున్నారు.

45-60 చేరిన డజన్‌ కోడిగుడ్ల ధర

తాజాగా పెరిగిన ధరలు కోడినే కాదు కోడిగుడ్డును కూడా సామాన్యులకు దూరం చేస్తున్నాయి. కోడిగుడ్డు రేటు కూడా భారీగా పెరిగింది. సరిగ్గా పదిరోజుల క్రితం డజన్‌ 45 రూపాయలున్న కోడిగుడ్లు ఇప్పుడు ఒకేసారి 60రూపాయలు దాటిపోయాయి. చికెన్‌, కోడిగుడ్డు ధరలు పెరగడంతో కస్టమర్లు లేక షాపులు బోసిపోతున్నాయి. వరుసగా వస్తున్న వేడుకల నేపథ్యంలో పెరిగిన చికెన్‌ ధరలు సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెగ్యులర్‌ కస్టమర్లు కూడా దుకాణాలకు రావడంలేదని చికెన్‌ వ్యాపారులు అంటున్నారు.

కోడితో పాటు కూరగాయలు కూడా...

ఓ వైపు కోడి..మరో వైపు కూరగాయల ధరలు మండిపోతుండటంతో సామాన్యులు కిలో దగ్గర అరకిలోనే కొనుక్కొని సర్దుకుంటున్నారు. మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు సామాన్యులకు ముద్ద దిగనివ్వడం లేదు.

16:08 - January 1, 2016

గుంటూరు : నాగార్జున యూనివర్శిటీ రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఎట్టకేలకు మాజీ ప్రిన్సిపాల్‌ బాబూరావుపై కేసు నమోదైంది. పోలీసులు ఛార్జిషీట్‌లో బాబూరావును 4వ నిందితుడిగా పేర్కొన్నారు. బాబూరావుపై కేసు నమోదు చేయాలని మొదటి నుంచి రిషితేశ్వరి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రస్తావించారు. 

16:07 - January 1, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్‌ సర్కార్‌పై టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌, కేటీఆర్ మాయమాటలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ ఎంసీ మేయర్ ఎన్నికను... ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నిర్వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల కోసమే టీఆర్ఎస్‌ నేతలు... ఆంధ్రా సోదరులంటూ జపం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్‌ ఆంధ్రావారిపై ద్వేషభావం ప్రదర్శించలేదా..? అని రేవంత్ ప్రశ్నించారు.

16:04 - January 1, 2016

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతిని దేశంలోనే ఉన్నత స్థాయి వైద్య విజ్ఞాన కేంద్రంగా నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అమరావతి లో సుమారు తొమ్మిది వేల ఎకరాలలో వైద్య విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనికి నమూనాగా నోయిడాలోని విద్యా నగరాలను ఆదర్శంగా తీసుకోనుంది ప్రభుత్వం.

భూమిలో అధిక మొత్తాన్ని వైద్యా విజ్ఞానరంగానికి....

ఏపీని దేశంలోనే ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. ఆ దిశగా అడుగులు వేసేందుకు రాజధాని ప్రాంతంలోని రైతుల నుండి సేకరించిన భూమిలో అధిక మొత్తాన్ని వైద్యా విజ్ఞానరంగానికి కేటాయించనున్నారు. అమరావతిలో ఉన్న 9 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం వైద్యవిజ్ఞాన రంగానికి ప్రతిపాదించింది. ఇందులో పలు యూనివర్శిటీలు , విద్యా సంస్థకు ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ . హార్వర్డ్ యూనివర్శిటీ సైతం అమరావతిలో ఓపెన్ చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు గత నెలలోనే ఒప్పందాలు కుదిరాయి.

ప్రతిష్టాత్మక ఎడ్యుకేషనల్ హబ్ స్థాపన కోసం....

ఈ యూనివర్శిటీతో పాటు ప్రతిష్టాత్మక ఎడ్యుకేషనల్ హబ్ స్థాపన కోసం దేశ విదేశాల్లోని పలు ఉన్నతస్థాయి నాలడ్జి పార్క్ లను యూనివర్శిటీలను పరిగణలోకి తీసుకున్నారు.దీని కోసం ప్రదానంగా దోహలోని విద్యానగరాన్ని ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా వద్ద నాలెడ్జి పార్కును సందర్శించనుంది రాష్ట్ర ప్రభుత్వం. దోహలో 900 ఎకరాలను విద్యానగరం ఉండగా రాష్ట్రంలో 9వేల ఎకరాల భూమిలో 3500 ఎకరాలలో నిర్మించేందుకు సిద్దమైంది సర్కార్.

3500 ఎకరాలలో ఎడ్యుకేషనల్ హబ్ ....

రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్లు 3500 ఎకరాలలో ఎడ్యుకేషనల్ హబ్ వృద్ది చెందితే ఆరు లక్షల మంది నగరంలో ఉంటారని అంచనా వేస్తోంది. వాటితో పాటు వివిధ నగరాల్లో అత్యున్నత విద్యా వ్యవస్థలను అమరావతిలో పథకరచనలు చేస్తోంది. కాని ఇన్ని వేల ఎకరాల్లో ఎడ్యుకేషనల్ హబ్ కంటే 1000 ఎకరాల్లో హబ్ ఏర్పాటు చేయడం మంచిదని పలువురు విద్యావేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. 

16:01 - January 1, 2016

హైదరాబాద్ : డబ్బావాలాలు మరో అడుగు ముందుకేశారు. ఇప్పటివరకు ఇళ్ల నుంచి క్యారియర్లు సేకరించి ఆఫీసుల్లో ఉండే ఉద్యోగులకు అందించే వీరు.. ఇకనుంచి పసందైన భోజనాన్ని అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన ఈ ప్రక్రియ భవిష్యత్‌లో మరింత ఆదరణ పొందుతుందని డబ్బావాలాలు ఆశిస్తున్నారు.

125 ఏళ్ల క్రితం బ్రిటీష్‌ హయాంలో ప్రారంభం ....

ముంబై మహానగరంలో డబ్బావాలాల గురించి తెలియదంటే ఆశ్చర్యపోక తప్పదు. వీరికి ఎంతో చరిత్ర ఉంది. 125 ఏళ్ల క్రితం బ్రిటీష్‌ పాలకుల హయాంలో ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇంకా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది.

ఇంటి నుంచి లంచ్‌ బాక్స్‌లు తెప్పించుకునేవారు....

బ్రిటీష్‌ హయాంలో బిజీగా ఉండే అధికారులు భోజనం కోసం నానా అవస్థలు పడేవారు. హోటల్‌ భోజనం పడక.. ఇంటి భోజనం కోసం ఆరాటపడేవారు. అందుకోసం ఇళ్ల నుంచి లంచ్‌బాక్స్‌లు తెప్పించుకునేవారు. అందుకోసం ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకున్నారు. ఆ విధంగానే డబ్బావాలాల వ్యవస్థ ఏర్పడింది. కాలం మారినా ఈ విధానం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాలక్రమేణ ముంబై నగరం అభివృద్ధి చెందడం.. ఉపాధి కోసం నగరానికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ఈ విధానం కూడా అభివృద్ధి చెందింది.

లంచ్‌ టైమ్‌కు కారియర్లు అందించనున్న డబ్బావాలాలు....

ప్రతిరోజు ఉదయం పూటే ఆఫీసులకు వెళ్లేవారికి మధ్యాహ్నానానికి ఠంచన్‌గా లంచ్‌ తీసుకువచ్చి అందిస్తారు ఈ డబ్బావాలాలు. ఒకప్పుడు సైకిళ్లపై లంచ్‌బాక్స్‌లు సేకరించి.. స్వయంగా అందించిన డబ్బావాలాలు.. ఆ తర్వాత ఈ సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోవడంతో ఇది చైన్‌ సిస్టమ్‌గా మారిపోయింది. ఇందులో లంచ్‌ బాక్స్‌లు సేకరించేవారు ఒకరుంటే.. అవి కార్యాలయాలకు అందజేసే వారు మరొకరు ఉంటారు. అయితే డబ్బావాలాలు చేసే ఈ విధానంలో ఇప్పటివరకు ఎలాంటి పొరపాట్లు జరగకపోవడం విశేషం. వీరి క్రమశిక్షణను గుర్తించిన పలు దేశాలు సైతం డబ్బావాలాల విధానంపై అధ్యయనం చేశాయి.

మరో అడుగు ముందుకేసిన డబ్బావాలాలు ....

ఎంతో పేరు, ప్రఖ్యాతులున్న డబ్బావాలాలు ఇప్పుడు మరో అడుగు ముందుకువేశారు. ఇప్పటివరకు ఇళ్ల నుంచి లంచ్‌బాక్స్‌లు సేకరించి అందించే వీళ్లు ఇప్పుడు భోజనాలు కూడా ప్రిపేర్‌ చేస్తూ.. అందిస్తున్నారు. ఇంటి భోజనం ఆస్వాదించే వారి కోసం శాకాహార, మాంసాహారాలతో లంచ్‌ను అందిస్తున్నారు. వంటకాల కోసం ఇప్పటివరకు 25 మంది మహిళలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. వీరు అందించే భోజనానికి 95 నుంచి 110 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.

డబ్బావాలాల మహిళలకు ఉపాధి అవకాశం..........

ఇప్పటివరకు లంచ్‌ బాక్స్‌లు మాత్రమే సరఫరా చేస్తున్న డబ్బావాలాలకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. దీంతో డబ్బావాలాలకే కాకుండా వారి ఇంటి మహిళలకు కూడా ఉపాధి పెరుగుతుందంటున్నారు. ఇప్పటికే 25 కుటుంబాలతో ఒప్పందం కుదిరిందని.. ముందుముందు ఇది మరింత విస్తరిస్తుందని డబ్బావాలాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యంగ్‌ కపుల్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విధానాన్ని ప్రారంభించామని.. తాము చేస్తున్న పనితో పాటే ఈ విధానాన్ని కొనసాగిస్తామని డబ్బావాలాలు అంటున్నారు. ఎంతో చరిత్ర ఉన్న డబ్బావాలాలు.. ఇకపై చక్కనైన భోజనాన్ని అందించడంలో మరో చరిత్ర సృష్టిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదేమో ! 

ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు పదోన్నతి

చండీగఢ్: సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు హర్యానా ప్రభుత్వం నూతన సంవత్సరం కానుకగా పదోన్నతిని కల్పించింది. ఈమేరకు ఆయనకు ప్రభుత్వ కార్యదర్శి స్థాయి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీగా పదోన్నతి కల్పించింది. ఈమేరకు చీఫ్ సెక్రటరీ డీఎస్ దేశీ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమర్పించిన నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంది.

లారీ-బైకు ఢీ : ఒకరి మృతి

నల్లగొండ: చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-బైకు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.

ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

కరీంనగర్ :అభం శుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన బిజిలి నరేష్ (25) తన సమీప బంధువైన ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో నరేష్ను బాలిక తల్లిదండ్రులు పట్టుకుని... దేహశుద్ధి చేసి... పోలీసులకు అప్పగించారు. పోలీసులు నరేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆటోబోల్తా: 15 మందికి గాయాలు..

ఆదిలాబాద్ : బెల్లంపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం ఓ ఆటో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలు కాగా..అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారంతా రెబ్బన మండలం పులికుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బెల్లంపల్లిలోని బుగ్గదేవాలయానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

విశాఖ ఉత్సవాల్లో బోన్సాయ్ మొక్కల ప్రదర్శన

హైదరాబాద్ : విశాఖ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన బోన్సాయ్ ప్రదర్శన విశాఖ నగర వాసులను ఆలోచింపజేస్తుంది. నగరమంతా కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న తరుణంలో బోన్సాయ్ మొక్కల ప్రేమికులు ఏళ్లనాటి మొక్కలను నప్రదర్శనలో ఉంచారు. వృక్షాలు నరికేస్తున్న ఈ కాలంలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే బోన్సాయ్ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం చంద్రబాబు జన్మభూమి పర్యటన షెడ్యూల్ ఖరారు..

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. రేపు విజయనగరం జిల్లాలో మూడవ విడుత జన్మభూమి కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈనెల 3న తిరుపతి, 4న ప్రకాశం, 5న కృష్ణా, 6న కర్నూలు, 7న చిత్తూరు, 8న గోదావరి జిల్లాలు, 9న కడప, 10, 11, 12న విశాఖ, 13, 14న సొంత గ్రామమైన నారావారిపల్లెలో 15న విజయవాడలో జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

14:39 - January 1, 2016

విజయవాడ : రేపటినుంచి 'జన్మభూమి' కార్యక్రమాన్ని ఏపీ సర్కార్‌ నిర్వహించబోతోంది. పుట్టిన గడ్డతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. ఆర్ధికంగా కష్టాలలో ఉన్నప్పటికీ.. కేంద్ర సహకారంతో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామంటున్నారు చంద్రబాబు.

గ్రామాలలో సకల సదుపాయాల కల్పనే లక్ష్యం ..

నూతన సంవత్సరంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏపీ సర్కార్‌ యత్నిస్తోంది. గ్రామాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా శనివారం నుంచి 'జన్మభూమి' కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు గ్రామాలలో సకల సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆర్ధికలోటు ఉన్నప్పటికీ అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని.. కేంద్ర సహకారంతో అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు జరిగేలా చూస్తామంటున్నారు.

జన్మభూమిలో కొత్త రేషన్‌కార్డులు ........

ఇక దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫొటో లేకుండా కొత్తకార్డులు వచ్చినా 'సంక్రాంతి కానుక' అందించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ జన్మభూమి కార్యక్రమంలో ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు సరిగా అందుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించనున్నారు.

గ్రామం లేదా వార్డును దత్తత తీసుకోవాలి .............

ఇక పుట్టినగడ్డతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామాన్ని లేదా వార్డును దత్తత తీసుకుని నవ్యాంధ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని బాబు కోరారు. ఇప్పటికే దత్తత తీసుకున్న ప్రముఖులను గ్రామసభలలో పరిచయం చేస్తామన్నారు. అదేవిధంగా వారు చేపట్టిన, చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను సభాముఖంగా వివరించనున్నారు. దీంతో మరెంతోమంది గ్రామాభివృద్ధి కోసం ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఏది ఏమైనా శనివారం నుంచి నిర్వహించబోతున్న జన్మభూమి కార్యక్రమంతో తమ కష్టాలు కొంతమేరకైనా తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు. 

14:35 - January 1, 2016

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం కొనసాగుతోంది. దీక్షల విరమణ కోసం లక్షలాదిగా భక్తులు బెజవాడకు తరలివస్తున్నారు. తొలిరోజు అర్చకులు, గురు భవానీల మధ్య నెలకొన్న వివాదాన్ని అధికారులు పరిష్కరించడంతో భవానీల దీక్ష విరమణ కార్యక్రమం అంతా సవ్యంగా కొనసాగుతోంది. మరోవైపు నూతన సంవత్సరం నేపథ్యంలో కొండపై భక్తుల రద్దీ పెరిగింది. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

14:34 - January 1, 2016

హైదరాబాద్ : విశాఖ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన బోన్సాయ్ ప్రదర్శన విశాఖ నగర వాసులను ఆలోచింపజేస్తుంది. నగరమంతా కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న తరుణంలో బోన్సాయ్ మొక్కల ప్రేమికులు ఏళ్లనాటి మొక్కలను నప్రదర్శనలో ఉంచారు. వృక్షాలు నరికేస్తున్న ఈ కాలంలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే బోన్సాయ్ మొక్కల ప్రదర్శనపై నగర వాసులు ఉత్సాహం చూపిస్తున్నారు.

14:32 - January 1, 2016

నల్గొండ :యాదాద్రి జిల్లా అయ్యే విధంగా కరుణించాలని కోరుతూ.. యాదగిరి నరసింహునికి టి.టిడిపి నేత మోత్కుపల్లి నరసింహులు వినతిపత్రం సమర్పించారు. యాదాద్రిని జిల్లాగా ప్రకటించేలా సీఎం కేసీఆర్‌కు సద్బుద్ధి ప్రకటించాలని నరసింహుని కోరినట్టు ఆయన తెలిపారు. అంతకు ముందు ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

13:31 - January 1, 2016

ఎపి నూతన రాజధాని అమరావతి ప్రజా రాజధానిగా ఉండాలని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకుడు నడింపల్లి సీతారామరాజు, టీడీపీ నేత రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. 2015- అంశాలు, విషాదాలు, వివాదాలతోపాటు రాజకీయ పరిస్థితులపై వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం

తూర్పుగోదావరి : జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా తమ అభిమాన హీరోలకు ఫ్లెక్సీలు కట్టడానికి రెండు మండలాల్లో కొందరు అభిమానులు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురయ్యారు. రెండు మండలాల్లో జరిగిన ఈ సంఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో 7 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే రంగంపేట మండలం వడిశలేరులో ఇద్దరు మృతిచెందారు. మండపేట మండలం మారేడుబాకలో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

నిలిపి ఉన్న కారులో షార్ట్ సర్క్యూట్

హైదరాబాద్ : నిలిపి ఉంచిన కారులో షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్‌లో చోటు చేసుకుంది. గాయాలపాలైన ఆ ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారిని శ్రయన్(9), సృజన్(16)గా గుర్తించారు.

13:11 - January 1, 2016

పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌ హీరోగా కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్, నార్త్ స్టార్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్ పతాకాలపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బసింగ్‌'. ఈ చిత్రానికి సంబంధించి తాజా షెడ్యూల్‌ జనవరి 4వ తేదీ నుంచి నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరుగనుంది. చిత్రంలోని ప్రధాన తారాగణమంతా పాల్గొనే ఈ షెడ్యూల్‌తో 70శాతం షూటింగ్‌ పూర్తవుతుందని, ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ నెలలో విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రంలో పవన్‌కళ్యాన్‌ సరసన కాజల్‌ నటిస్తున్న సంగతి విధితమే.

13:05 - January 1, 2016

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని జడ్చర్లలో 10టీవీ క్యాలెండర్‌ను సీఐ జంగయ్య ఆవిష్కరించారు. అర్ధరాత్రి కేక్‌ కట్‌ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. క్యాలెండర్‌ డిజైన్‌ చాలా బాగుందని.. క్యాలెండర్‌ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని జంగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పీఆర్‌టీయూ నేతలు, 10టీవీ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

13:02 - January 1, 2016

విజయవాడ : నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. చంద్రబాబుకు ఆలయ అధికారులు, అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు చంద్రబాబును ఆశీర్వదించారు.

 

12:59 - January 1, 2016

హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భనన్ కు చేరుకుని పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పలు పార్టీల నేతలు, ఉన్నతాధికారులు గవర్నర్ దంపతులకు న్యూఇయర్ సందర్భంగా విష్ చేశారు. గవర్నర్ దంపతులకు చిన్నారులు పుష్పగుచ్చాలు అందజేశారు. దీంతో రాజ్ భవన్ చిన్నారులతో సందడిగా మారింది.

 

12:53 - January 1, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సరి-బేసి సంఖ్య విధానం అమల్లోకి వచ్చింది. నిన్న ట్రయల్‌ రన్‌ నిర్వహించిన అధికారులు.. నేటినుంచి ఈ విధానాన్ని అమలుచేస్తున్నారు. ఇప్పటికే వాహనదారులకు ఈ విధానంపై పూర్తి అవగాహన కల్పించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ సాఫీగా కొనసాగుతోంది. ఇక ప్రజల కోసం ఢిల్లీ సర్కార్‌ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

 

12:52 - January 1, 2016

తూర్పుగోదావరి : జిల్లాలోని అమలాపురంలో దారుణం జరిగింది. కార్మికనగర్ లోని ఆశానగర్ వంతెన వద్ద కొప్పుల ప్రసన్నకుమార్ ను దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఘటన జరుగుతుండగా అడ్డుకున్న మరో ఇద్దరు వ్యక్తులపై కూడా దుండగులు దాడి చేశారు. దీంతో వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

12:45 - January 1, 2016

న్యూఇయర్‌ సెలబ్రేషన్స్ సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తారల విషయంలో వేరే చెప్పక్కర్లేదు. హిట్లకి, ఫట్లకి గుడ్‌బై చెప్పి తారలంతా నూతనోత్సాహంతో న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతున్నారు. 2016 న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ని కొంతమంది తారలు ఎవరితో ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారో ఓసారి చూద్దాం...

మా బాబుతోనే సెలబ్రేషన్‌ : గోపీచంద్‌
నూతన సంవత్సర వేడుకలను నేనెప్పుడూ మా కుటుంబంతోనే జరుపుకుంటాను. ఆ రోజు బయటికెళ్ళి ఎంజారు చేయడం నాకిష్టముండదు. మా బాబు, ఫ్యామిలీతోనే ఈ ఏడాది సెలబ్రేషన్‌. కెరీర్‌లో సినిమాల పరంగా చూసుకుంటే కమర్షియల్‌ సినిమాలే చేస్తాను. నిర్మాతలకు డబ్బులు తెచ్చే చిత్రాలనే చేస్తాను. ఈ ఏడాది మంచి హిట్లు రావాలని ఆశిస్తున్నా.

ఈసారి సందడంతా ఇంట్లోనే : రామ్‌
గతేడాది నుంచి న్యూ ఇయర్‌కి అబ్రాడ్‌ వెళ్తున్నాను. ఈ ఏడాది కూడా అక్కడే సెలబ్రేట్‌ చేసుకుందామనుకున్నా. కాని ఈ రోజే నా సినిమా 'నేను.. శైలజ' రిలీజ్‌ అవుతుంది. ప్రమోషన్‌లో భాగంగా ఇక్కడే ఇరుక్కుపోయాను. గతేడాది ఎలాంటి ప్లాన్‌ చేసుకోకుండా వెళ్ళి పోయాను. ఈ ఏడాది బాగా సెలబ్రేట్‌ చేసుకోవాలని ముందుగానే ప్లాన్‌ చేసుకున్నాను. సినిమా రిలీజ్‌ పెట్టి బ్రేకులు వేశారు. ఇక సందడంతా ఇంట్లోనే. కెరీర్‌ పరంగా ఇలాంటి సినిమాలు చేయాలనే ప్లానింగ్‌ అంటూ ఏం లేదు. నచ్చిన స్క్రిప్ట్‌ చేసుకుంటూ వెళ్ళిపోతాను.

గ్రాండ్‌గా న్యూఇయర్‌ సెలబ్రేషన్‌ : కాజల్‌
ఈసారి నా న్యూయర్‌ సెలబ్రేషన్స్‌ వారం రోజులు ముందుగానే స్టార్ట్‌ అయ్యాయి. ఫ్రెండ్స్‌తో ఇండోనేషియాకి వచ్చాను. ఇక్కడ రకరకాల రెస్టారెంట్లలో ఉన్న ఫుడ్‌ని టేస్ట్‌ చేస్తున్నా. ఫారెన్‌ ట్రిప్‌ని అనుక్షణం ఆస్వాదిస్తున్నా. ఇక న్యూయర్‌ సెలబ్రేషన్‌ని మాత్రం ఫ్రెండ్స్‌తో గ్రాండ్‌ లెవెల్లో అదిరిపోయేలా బాలిలో చేసేందుకు ప్లాన్‌ రెడీగా ఉంది. కెరీర్‌ పరంగా ఈ నూతన సంవత్సరం సూపర్‌గా ఉంటుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం తెలుగులో పవన్‌కళ్యాణ్‌తో 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', మహేష్‌బాబు 'బ్రహోత్సవం' చిత్రాల్లో నటిస్తున్నా. వీటితోపాటు బాలీవుడ్‌లో 'దో లఫ్‌జోమ్‌ కీ కహానీ' చిత్రంలోను, తమిళంలో 'కవాలై వేందమ్‌', 'భైరవ' చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
 

ఫ్యామిలీతో ఫారెన్‌లో వేడుకలు : అల్లరి నరేష్‌
జనరల్‌గా ప్రతి ఏడాది వారం రోజుల ముందే ఫారెన్‌కి వెళ్ళి అక్కడే సెలబ్రేట్‌ చేసుకునే వాళ్ళం. కాని ఈ ఏడాది చివర్లో నేను నటించిన 'మామ మంచు అల్లుడు కంచు' సినిమా విడుదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీతో కలిసి బాలి వెళ్తున్నాను. అక్కడే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటాం. తొలిసారి ఫ్యామిలీతో వెళ్తుండడంతో చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. నా సినీకెరీర్‌ పరంగా చూస్తే ఇప్పటి వరకు 50 సినిమాలు చేశాను. ఆ అనుభవాలతో ఈ ఏడాది నుంచి కొత్తగా కెరీర్‌ను ప్రారంభిస్తాను. కమర్షియల్‌ చిత్రాలు చేసినప్పటికీ కామెడీ మాత్రం మిస్‌ అవ్వకుండా చూసుకుంటాను.

'భలే మంచి రోజు' టీమ్‌తో ఫారెన్‌ టూర్‌ : సుధీర్‌బాబు

ఇండిస్టీ మారుతుంది. రొటీన్‌ కమర్షియల్‌ సినిమాలు ఆడడం లేదు. ఇటీవల వస్తున్న సినిమాల ఫలితాలే అందుకు నిదర్శనం. డిఫరెంట్‌ కథలు రావాల్సిన అవసరముంది. గతేడాది కూడా డిఫరెంట్‌ సినిమాలు చేయడానికే ప్రయత్నించాను. ఈ ఏడాది కూడా భిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తాను. ఇక కొత్త సంవత్సరం వేడుకల విషయానికి వస్తే ఎక్కువగా ఫ్యామిలీతోనే గడుపుతాను. అంతా బాగుంటే 'భలే మంచి రోజు' టీమ్‌తో యుఎస్‌లో సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటున్నాను.

ఫ్యామిలీతోనే గడిపేస్తా: వరుణ్‌ తేజ్‌
గతంలో న్యూ ఇయర్‌ సందర్భంగా కొత్తగా ఏదైనా చేయాలని చాలా ప్లాన్స్‌ చేసుకున్నాను. కాని ఏది చేయలేకపోయాను. దీంతో ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్లాన్స్‌ లాంటివేమి పెట్టుకోవడం లేదు. ఫ్యామిలీతోనే ఎంజారు చేయాలనుకుంటున్నాను. కుటుంబంతోనే గడిపితే ఏడాదంతా హ్యాపీగా ఉంటాం.

ఫ్రెండ్‌ పెళ్ళిలోనే కొత్త సంవత్సరం వేడుక: రెజీనా
జనరల్‌గా న్యూ ఇయర్‌ సెలబ్రేషన్‌ పెద్దగా జరుపుకోను. ఏడాది నాకు రెండు పెద్ద హిట్లు వచ్చాయి. న్యూ ఇయర్‌ చాలా గ్రాండ్‌ జరుపుకోవాలనుంది. కాని న్యూ ఇయర్‌ రోజే చెన్నైలో మా ఫ్రెండ్‌ పెళ్ళి ఉంది. అక్కడే సెలబ్రేట్‌ చేసుకుంటాను.

మా మహాలక్ష్మితోనే సెలబ్రేషన్‌ : ఆది
కొత్త సంవత్సరమొచ్చిందంటే నా ఫ్రెండ్స్‌తోనే సెలబ్రేట్‌ చేసుకుంటాను. గతేడాది సింగపూర్‌లో జరుపుకున్నాం. అప్పుడు మా ఫ్యామిలీ కూడా సింగపూర్‌లోనే ఉండడంతో చాలా బాగా ఎంజారు చేశాం. ఈ ఏడాది మాత్రం ఇక్కడే జరుపుకోబోతున్నా. ఇటీవలే మాకు పాప పుట్టడంతో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లయ్యింది. మా మహాలక్ష్మితో మా ఊర్లోనే ఫ్రెండ్స్‌తోపాటు, కుటుంబ సభ్యులతోనే ఈ ఏడాది సెలబ్రేట్‌ చేసుకోవాలను కుంటున్నా. చాలా రోజులుగా మంచి హిట్‌ కోసం చూస్తున్నాను. 'గరం' సినిమాతో ఈ ఏడాది ఆ హిట్‌ వస్తుందని ఆశిస్తున్నాను. మంచి హిట్‌ వస్తే ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుంది.

సెట్‌లోనే వేడుకలు: నాగశౌర్య
ప్రస్తుతం నా తదుపరి చిత్రం 'ఒక్క మనసు' షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతుంది. సెట్లోనే న్యూ ఇయర్‌ సంబరాలు. ప్రతి ఏడాది ఫ్యామిలీతోనే జరుపుకుంటాం. నాకు కుక్కలంటే ఇష్టం. ఆ డాగ్స్‌తోనే రోజంతా గడుపుతాను. వాటితో ఉన్నంత హ్యాపీనెస్‌ నాకింకా ఏక్కడా దొరకదు. నా కెరీర్‌ వైజ్‌గా చూసుకుంటే ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశాను. వాటి ఫలితాలు ఎలా ఉన్నా ఈ ఏడాది నుంచే ఫ్రెష్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేయబోతున్నాను. రెండు మూడు సంవత్సరాల పాటు ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీలే చేస్తా.

 

 

12:40 - January 1, 2016

టాలీవుడ్ ప్రేక్షకులకు నూతన సంవత్సర కానుకగా ప్రిన్స్ మహేష్ బాబు తన లేటెస్ట్ సినిమా  'బ్రహ్మోత్సవం' టీజర్ విడుదల అయింది. వెరైటీగా పాటతో టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరో మహేష్  ఎప్పటిలాగానే చాలా అందంగా కనిపించాడు. అలాగే తోట తరణి వేసిన కలర్ ఫుల్ సెట్టింగ్ లో అందమైన తారాగణంతో మహేష్ ఆడిపాడిన సీన్ నిజంగా బ్రహోత్సవం లాగా కనిపించింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

రాజ్ భవన్ లో ప్రజాదర్బార్

హైదరాబాద్ : న్యూ ఇయర్ సందర్భంగా రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎసిబి డీజీ ఎకె.ఖాన్, జైళ్ల శాఖ కార్యదర్శి పాల్గొన్నారు.

 

11:48 - January 1, 2016

నల్గొండ : భారతదేశాన్ని భారతమాతగా సంభోదిస్తాము. మాతృభూమిగా కొలుస్తాము. దేవతలను పూజిస్తాము. అన్నీ బాగానేవున్నా.. ఆడపిల్లలపై చిన్నచూపు, వివక్ష పోలేదు.. ఇప్పటికీ మహిళల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఒకవైపు న్యూ ఇయిర్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో మరోవైపు ఆడపిల్ల పుట్టిందన్న కారణంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఈఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం కోమటికుంటలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన ఆడశిశువును తల్లిదండ్రులు రోడ్డుపై పడేసి వెళ్లారు. స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించ లేదు. పోలీసుల చొరవతో శిశువును ఆస్పత్రికి తరలించారు. 

11:28 - January 1, 2016

మెదక్ : విద్యార్ధులు తమ లక్ష్యాన్ని నిర్ణయించుకొని అది సాధించినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందమని మంత్రి హరీష్‌రావు అన్నారు. మెదక్‌ జల్లా సిద్ధిపేటలోని ఎస్ ఎంహెచ్ హాస్టల్‌లో విద్యార్ధుల మధ్య హరీష్‌రావు నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. విద్యార్ధులు హాస్టల్‌లో ఉండి చదువుతున్నామనే భావనలో ఉండకుండా.. లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని విద్యార్ధులకు హరీష్‌రావు సూచించారు.

 

 

11:22 - January 1, 2016

చిత్తూరు : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు భారీగా తరలిరావడంతో... అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. భక్తులు భారీగా తరలిరావడంతో నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల క్యూలైన్లను తితిదే ఈవో సాంబశివరావు పరిశీలించారు. మరోవైపు శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, గజల్‌ శ్రీనివాస్‌ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. 

 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు : నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు భారీగా తరలిరావడంతో... అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. భక్తులు భారీగా తరలిరావడంతో నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల క్యూలైన్లను తితిదే ఈవో సాంబశివరావు పరిశీలించారు. మరోవైపు శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, గజల్‌ శ్రీనివాస్‌ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

 

10:10 - January 1, 2016

ఢిల్లీ : కేజ్రీవాల్‌ సర్కార్‌- కేంద్రానికి మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఇద్దరు కార్యదర్శి స్థాయి అధికారులను ఆప్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేయడాన్ని కేంద్ హోంశాఖ తప్పు పట్టింది. ఇద్దరు అధికారుల సస్పెన్షన్‌కు నిరసనగా 2 వందల మంది అధికారులు మూకుమ్మడిగా సెలవు పెట్టారు. సరి-బేసి ప్లాన్‌ అమలుకు ఆటంకాలు కల్పించేందుకే కేంద్రం అధికారులతో సెలవు పెట్టించిందని డిప్యూటి సిఎం మనీష్‌ సిసోడియా ఆరోపించారు.

నేటి నుంచి విజయవాడలో పుస్తకమహోత్సవం

విజయవాడ : నేటి నుంచి విజయవాడలో పుస్తకమహోత్సవం నిర్వహించనున్నారు. ఈనెల 11 వరకు పుస్తకమహోత్సవం కొనసాగనుంది. 

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మహబూబ్ నగర్ : జిల్లాలోని వంగూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. 

 

 

09:53 - January 1, 2016

ఢిల్లీ : ఈ ఏడాది బీసీసీఐ అత్యుత్తమ క్రికెటర్ అవార్డును భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గెలుచుకున్నాడు. ఇక మహిళల విభాగంలో హైదరాబాద్ బ్యాట్స్ ఉమెన్‌ మిథాలీ రాజ్‌కు ఈ పురస్కారం దక్కింది. ముంబైలో జనవరి 5న జరగనున్న వేడుకలో వీళ్లిద్దరికి బీసీసీఐ ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీకి కల్నల్ సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. ఉత్తమ అసోసియేషన్‌గా కర్ణాటక స్టేట్ క్రికెట్ సంఘానికి అవార్డు లభించింది. 2014-15 సీజన్‌లో రంజీ, ఇరానీ, విజయ్ హజారే ట్రోఫీలను కర్ణాటక గెలుచుకుంది.  

 

 

09:50 - January 1, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ వార్‌ కొనసాగుతోంది. ఢిల్లీ, అండమాన్‌ నికోబార్‌ దీవుల సివిల్‌ సర్వీసెస్‌, ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ అసోసియేషన్స్‌ బిజెపికి బి టీమ్స్‌గా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఐఏఎస్‌ అధికారులు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ భుజాలపై మోది తుపాకి పెట్టి బెదిరిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్‌ చేస్తూ ఆప్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. ఆప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2 వందల మంది అధికారులు మూకుమ్మడి సెలవు పెట్టారు. దీనిపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ- ఈ అధికారులు దీర్ఘకాలం సెలవులో వెళ్తే ప్రజలు సంతోషిస్తారని, దీంతో ప్రభుత్వ పనితీరు మరింత మెరుగు పడుతుందని మరో ట్వీట్‌ చేశారు.

09:46 - January 1, 2016

హైదరాబాద్ : ఆలస్యంగానైనా వీసీల నియామకాలకు తెలంగాణ సర్కార్‌ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కొంతకాలంగా తెలంగాణలోని పలు విశ్వవిద్యాలయాల్లో వైస్‌ ఛాన్సెలర్లు లేకుండానే నిర్వహణ బాధ్యతలను నెట్టుకొస్తున్నారు. దీంతో చదువుల ప్రక్రియ అంతంత మాత్రంగానే నడుస్తోంది. ఈ నేపథ్యంలో వీసీల నియామకం కోసం కెసిఆర్ ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీల ఏర్పాటు, వాటికి సంబంధించిన సూచనలతో జీవో జారీచేసింది.
గాడితప్పిన యూనివర్శిటీ విద్యావ్యవస్థ
కొంతకాలంగా తెలంగాణలో యూనివర్శిటీ విద్యావ్యవస్థ గాడితప్పి నడుస్తోంది. ప్రొఫెసర్లను, ఇతర విభాగాలను సమన్వయ పరిచే నాథుడు లేక పలు విశ్వవిద్యాలయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలా వర్శిటీలకు వైస్‌ ఛాన్సెలర్లు లేకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు ఐఎఎస్‌ ఆఫీసర్లే ఇన్‌ఛార్జ్ లుగా వ్యవహరిస్తుండడంతో విధానపరమైన నిర్ణయాలు లేవు.
వీసీల ఏర్పాటుకు సెర్చ్ కమిటీల ఏర్పాటు
ఈ నేపథ్యంలో వీసీల ఏర్పాటుకు టి సర్కార్ సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో సెర్చ్ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. ఆయా వర్శిటీల పాలక మండళ్ల నుంచి ఒకరు, యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్‌ తరపున నామినీ సభ్యుడొకరు, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మరొకరు సభ్యులుగా ఉంటారు. దీనితోపాటు వీసీల నియామకాలకు అడ్డంకులుగా ఉన్నాయంటూ యూనివర్శిటీల చట్టాన్ని ప్రభుత్వం సవరించింది. గతంలో 10 సంవత్సరాల టీచింగ్‌ లేదా రీసెర్చ్‌ అనుభవం ఉన్నవారినే వీసీలుగా నియమించేవారు. ఆ నిబంధనను 5 సంవత్సరాలకు కుదించింది. దీనికి గల కారణాన్ని చెబుతూ 10 సంవత్సరాల అనుభవం అంటే బలహీన వర్గాలకు చెందిన అధ్యాపకులకు అన్యాయం చేసినట్టవుతుందని ప్రభుత్వం చెబుతోంది. బలహీన వర్గాలకు చెందిన ప్రొఫెసర్లు అతి తక్కువ సంఖ్యలో ఉండడం, వారి అనుభవమూ తక్కువగా ఉన్నందున నిబంధనను సడలిస్తున్నట్లు కెసిఆర్ సర్కార్ చెప్పుకొచ్చింది.
మొత్తం 8 యూనివర్శిటీలకు సెర్చ్ కమిటీలు
మొత్తం 8 యూనివర్శిటీలకు సెర్చ్ కమిటీలను నియమించారు. ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మాగాంధి, తెలంగాణ, జెఎన్‌టియు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీలకు సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఓయు వర్శిటీ మాజీ విసి సిద్దిఖీ, యుజిసి నామినీగా దీక్షిత్‌, ప్రభుత్వం తరపున రామకృష్ణరావును ఓయు వర్శిటీ సెర్చ్ కమిటీగా నియమించింది. కాకతీయ మాజీ విసి ప్రసాద్, యుజిసి నుంచి శివాజీరావు, ప్రభుత్వం నుంచి రాజీవ్‌ ఆచార్యలతో కాకతీయ వర్శిటీ సెర్చ్ కమిటీని నియమించారు. ఇలాగే మిగిలిన వర్శిటీల సెర్చ్‌ కమిటీల నియామకం జరిగింది. ప్రతి సెర్చ్ కమిటీ తన పరిశీలన పూర్తిచేశాక ముగ్గురి పేర్లతో కూడిన నివేదిక అందించాల్సి ఉంటుంది. వారిలోంచి వీసీని ప్రభుత్వం ఎన్నిక చేస్తుంది. ఈ మేరకు జీవో జారీ అయింది.

 

 

09:40 - January 1, 2016

హైదరాబాద్ : వైఎస్‌ ప్రవేశపెట్టిన పథకాల్లో గొప్పదేదంటే అందరూ ఠక్కున చెప్పేది రాజీవ్‌ ఆరోగ్యశ్రీ గురించే. ఆ పథకం తెచ్చిన ఇమేజ్‌ వైఎస్‌ తిరిగి ఎన్నికల్లో గెలుపొందేందుకు కారణమైంది. అలాంటి ప్రతిష్టే తానూ పొందాలనుకుంటున్నారేమో టిడిపి అధినేత వైద్య రంగంపై ఫోకస్ చేశారు. ఎప్పుడూ ప్రైవేట్‌ జపం చేసే బాబు వైద్య పరంగా కొన్ని ఆఫర్లను అందుబాటులోకి తెస్తున్నారు. వాటికి ఇవాల్టి నుంచి రిబ్బన్‌ కట్‌ చేయబోతున్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీకి బదులుగా ఎన్ టిఆర్ ఆరోగ్యసేవ
రాజీవ్ ఆరోగ్య శ్రీ.. ఆ పేరు ఇక కన్పించదు, వినిపించదు. దానిబదులు ఎన్టీఆర్ ఆరోగ్యసేవ పేరును అంతా స్మరించాలి. ఈ కోణంలోనే ఏపీ ప్రభుత్వం ఖరీదైన వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెచ్చే ప్లాన్‌ చేసింది. నూతన సంవత్సరం ప్రారంభం రోజున ఎన్టీఆర్ వైద్య సేవల పేరుతో సరికొత్త సేవలను అందుబాటులోకి తెస్తోంది. మొత్తం 5 రకాల సేవలను ప్రారంభించబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో ఈ సేవలను ప్రారంభించనున్నారు. 
జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో వైద్యపరీక్షలు 
ఎన్టీఆర్ ఆరోగ్య సేవల ద్వారా భారీ ఖర్చుతో కూడిన వైద్య పరీక్షలను ఇక నుంచి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో అందిస్తారు. స్కానింగ్‌ వంటి పరీక్షలతోపాటు అన్ని రకాల పరీక్షలకు ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంతో అందించనున్నారు. టెలీ రేడియాలజీ-స్కానింగ్‌, అన్ని రకాల డయాగ్నస్టిక్‌, ఎక్స్‌రే సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవల ద్వారా మొత్తంగా 60 రకాల వైద్య సేవలను అందించనున్నారు. సరికొత్తగా గర్భిణీ స్త్రీలు, శిశువుల కోసం 102 కాల్‌ సెంటర్లను వినియోగంలోకి తేబోతున్నారు. గర్భిణీ స్త్రీలు, తల్లులకు ఏ వైద్య సహాయం అవసరమైనా 102కు ఫోన్‌ చేస్తే అన్ని వివరాలు తెలపుతారు. అవసరమైతే 108 వాహనాన్ని పంపిస్తారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణీ స్ర్తీలను తల్లి-బిడ్డ ఎక్స్  ప్రెస్ ద్వారా వారి గమ్యస్థానాలకు చేరుస్తారు. ఆస్పత్రి పరికరాల నిర్వహణపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. దాదాపు 500 కోట్ల రూపాయల విలువైన పరికరాలు నిరుపయోగంగా ఉన్నాయని వాటిని పూర్తిస్థాయిలో మార్పుచేయాలని ప్రభుత్వం డిసైడైంది.
ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు
ఇక కొత్త సేవలను వినియోగించుకునేవారికి ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు అందుతాయి. రోగ నిర్ధారణ పరీక్షలు, ఎక్స్ రేల వివరాలను మెయిల్‌ ద్వారా అందించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించబోతోంది. ప్రభుత్వం నూతన సంవత్సరం ప్రారంభదినోత్సవాన ప్రారంభించబోతున్న ఈ సేవలు వైద్య రంగంలో మార్పులతోపాటు తమ ప్రభుత్వ ఇమేజ్‌ను మరింత పెంచుకోవాలని టిడిపి సర్కార్‌ భావిస్తోంది. 

 

09:36 - January 1, 2016

హైదరాబాద్‌ : 2015 సంవత్సరానికి గుడ్‌బై చెప్తూ..2016 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత మద్యం మత్తులో యమ జోష్‌ మీదుంటే...పోలీసులు మాత్రం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పేరుతో తమపని కానించారు. మద్యం తాగి ఫుల్‌జోష్‌ మీద వాహనాలను నడిపిన పలువురిని పోలీసులు పట్టుకున్నారు. హైటెక్‌సిటీ, జూబ్లీహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ని నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లకుండా జీగ్ జాగ్‌ బారికేడ్‌లను పోలీసులు ఏర్పాటు చేశారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న వ్యక్తులపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులను నమోదు చేసి..వారివద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

09:33 - January 1, 2016

హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్‌ పోస్టులకు పోలీస్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. త్వరలో 9 వేలా 281 పోస్టులను భర్తీ చేయనున్నారు. బెటాలియన్ కానిస్టేబుల్‌ 4,065 పోస్టులు, పోలీస్‌ కానిస్టేబుల్ సివిల్‌ విభాగంలో 1,880 పోస్టులు, ఏ ఆర్‌ కానిస్టేబుల్ ఉద్యోగాలు 2,760, ఎస్పీఎఫ్‌ పోస్టులు 174, ఫైర్‌మెన్‌ విభాగంలో 416 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బిసీలకు 400, ఎస్సీ, ఎస్టీలకు 200 ఫీజుగా నిర్ధారించారు. రాత పరీక్షలో ఓసీలకు కనీసం 40 శాతం మార్కులు, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం మార్కులు రావాలి.  పెద్ద సంఖ్యలో పోస్టుల ప్రకటన రావడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రేడ్‌-2 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ అయింది.  

09:11 - January 1, 2016

కడప : జిల్లాలోని జమ్మలమడుగులో అగ్నిప్రమాదం జరిగింది. బ్యాట్ కో ట్రాన్స్ పోర్టు బట్టల గోడౌన్ లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. కోటి రూపాయలకుపైగా ఉన్న రెడీ మేడ్ దస్తులు దగ్ధం అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. అగ్నిప్రమాదానికి విద్యుత్ షాక్ కే కారణమని అనుమానిస్తున్నారు.

 

 

08:55 - January 1, 2016

దుబాయ్‌ : న్యూ ఇయర్‌ వేడుకల్లో అపశృతి దొర్లింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనం బూర్జ్ ఖలీఫా సమీపంలో ఉన్న అడ్రస్ డౌన్ టౌన్ని ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 63 అంతస్తులున్న హోటళ్లో 20వ అంతస్థులో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. కొత్త సంవత్సర వేడుకల సందర్బంగా బాణాసంచా పేల్చుతుండగా..ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాణాకాల్చ కాల్చుతుండగా...ఒక్కసారిగా మంటలంటున్నాయి. అయితే తొలుత 20వ అంతస్థులో ప్రారంభమైన మంటలు ఒకే సారి పెద్ద ఎత్తున భవనం మొత్తానికి వ్యాపించడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటల్ని అదుపుచేసే ప్రయత్నం చేశారు. కానీ మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో..ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో 16మందికి గాయాలయినట్లుగా సమాచారం. అయితే ఎంత మేర ఆస్థినష్టం జరిగిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

 

08:51 - January 1, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్‌ వేడుకులు జరుపుకున్నారు. కేరింతలు, తుళ్లింతల మధ్య 2015 సంవత్సరానికి గుడ్‌బై చెప్తూ 2016 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. కేక్‌లు కట్‌ చేసి ఆనందోత్సాహంతో సంబరాలు చేసుకున్నారు.
ఆనందడోలికల్లో యువత
తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. అన్ని ప్రాంతాల్లో ఎక్కడ చూసినా జోష్‌ కనిపించింది. యువతీ యువకులు ఆనందడోలికల్లో తేలియాడారు. డాన్స్ లు చేస్తూ మైమరిచిపోయారు.
హైదరాబాద్‌ లో
హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ దగ్గర జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డితోపాటు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహేందర్‌రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. ఈసందర్భంగా మహేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి ప్రశాంతంగా న్యూ ఇయర్‌ వేడుకులు జరిగాయంటున్నారు. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నూతన సంవత్సరానికి ఆహ్వానం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంలో చిన్నారులు ఆటపాటలతో అలరించారు. యువతీ యువకులు చైతన్య గీతాలు ఆలపించారు.
గుంటూరులో
నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణమవుతున్న గుంటూరు జిల్లాలో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ హోరెత్తాయి. యువతీ, యువకుల డాన్స్ లతో సంబరాలు అంబారాన్నంటాయి. జిల్లాలో ఎక్కడ చూసినా జోష్‌ కనిపించింది. డాన్స్ లు, కేరింతలతో ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. ఆటపాటలతో అలరించారు. కేక్‌లు కట్‌చేసి న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పారు. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుతూ స్వాగతం పలికారు.
తిరుపతిలో
తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీ, యూనివర్సిటీలో ఎక్కడ చూసినా న్యూ ఇయర్‌ వేడుకల సందడి కనిపించింది. తిరుపతిలో విద్యార్ధినులు జోష్‌గా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఆట, పాటలతో అలరించారు.
వియజవాడలో
నవ్యాంధప్రదేశ్‌ తాత్కాలిక రాజధాని వియజవాడలో యువతీ యువకులు బైక్‌లపై స్వారీ చేస్తూ న్యూ ఇయర్‌ వేడుకులు జరుపుకున్నారు. నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.
2016కు స్వాగతం
మొత్తంమీద ఈసారి వినూత్న రీతిలో ఇన్యూ ఇయర్‌ సెలబ్రేట్‌ చేసుకున్నారు. కొందరు యువతీ, యువకులు ముఖానికి మువ్వన్నెల జెండా రంగలు వేసుకుని 2015 కు వీడ్కోలు చెప్పి, 2016కు స్వాగతం పలికారు. ఇళ్లముందు గులాబి రేకులు, రంగు రంగులు రంగవల్లికలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు.

 

08:47 - January 1, 2016

ఢిల్లీ : మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో న్యూ ఇయర్‌ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆట పాటలు, ఆనందోత్సాహాల మధ్య ప్రజలు కొత్త సంవత్సరం 2016కు స్వాగతం పలికారు. మ్యూజికల్‌ నైట్స్‌లో యువత డ్యాన్సులతో హోరెత్తించగా..లేజర్‌ కాంతుల మధ్య న్యూ ఇయర్‌ వేడుకలు అంబరాన్నంటాయి.  
జోష్‌గా న్యూఇయర్‌ సెలబ్రేషన్స్   
దేశ రాజధాని న్యూ ఢిల్లీలో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ జోష్‌గా జరిగాయి. యువతీ, యువకులు డాన్స్‌లు చేస్తూ ఆనందడోలికల్లో తేలియాడారు. ఆటపాటలతో ఉర్రూతలూగించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, పబ్‌లు... ఇలా అన్ని చోట్ల కొత్త సంవత్సరం సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించారు. 
ముంబైలో
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. గానా, భజానాలతో సంబరాలను హోరెత్తించారు. యువతీ, యువకులు డాన్స్‌లతో ఆనందోత్సాహాల మధ్య  కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. 
గుజరాత్‌ లో 
గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని ఓ అనాధాశ్రమంలో న్యూ ఇయర్‌ వేడుకులు నిర్వహించారు. డాన్స్‌లతో బాలలు అలరించారు. 
పంజాబ్‌లో
పంజాబ్‌లోని చండీగఢ్‌,  జలంధర్‌, అమృత్‌సర్‌ తదితర ప్రాంతాల్లో నూతన సంవత్సన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
కేరళ, తమిళనాడులో 
కేరళ, తమిళనాడులో కూడా కొత్త సంవత్సర వేడులకు పెద్ద ఎత్తున నిర్వహించారు. బెంగళూరు, తిరువనంతపురం, గోవా, పుణే.... ఇలా అన్ని నగరాలు, పట్టణాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబారాన్ని అంటాయి. 

 

08:42 - January 1, 2016

ఢిల్లీ : ప్రపంచ ప్రజలు కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటాయి. రంగు రంగుల బాణాసంచా వెలుగులతో ఆకాశం సప్తవర్ణ శోభితంగా మారింది. యువత కేరింతలతో ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 
ఇయర్‌ వేడుకుల జోష్‌
ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్‌ వేడుకులు జోష్‌గా జరిగాయి.  ఆయా దేశాల్లో ఉన్న ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సంబరాలు చేసుకున్నారు. ఆయా దేశాల్లో ఉన్న స్థానిక కాలమానం ప్రకారం న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు. 
న్యూజిలాండ్‌లో
ముందుగా న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో సంబరాలు ప్రారంభమయ్యాయి.  భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.30 గంటలకే ఆక్లాండ్‌లో వేడుకలు జరిగాయి. 
రష్యాలో
రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఐఎస్‌టీ ప్రకారం ఐదున్నర గంటలకు న్యూ ఇయర్‌ ప్రవేశించింది. అక్కడ నుంచి వరుసగా ఒక్కో దేశంలో స్థానిక కాలమానం ప్రకారం కొత్త సంవత్సరం ప్రవేశించడంతో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆస్ట్రేలియాలోని కాన్‌బెరా, మెల్‌బోర్న్‌, అడిలైడ్‌, పెర్త్‌, క్వీన్స్‌లాండ్‌, బ్రిస్బేన్‌, డార్విన్‌, అలైన్‌ స్ర్పింగ్‌ తదితర ప్రాంతాల్లో న్యూ ఇయర్‌కు స్వాగత పలికారు. బాణాసంచా వెలుగులతో సిడ్నీలోని ఒపేరా హౌస్‌ ధగధగ మెరిసిపోయింది. 
దుబాయ్‌లో 
దుబాయ్‌లో భారీ ఎత్తున బాణాసంచా కాల్చి కొత్త సంత్సరానికి స్వాగతం పలికారు. బాణాసంచా వెలుగుల మధ్య దుబాయ్‌ కొత్త కాంతులీనింది. 
చైనాలో
చైనాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హాకాంగ్‌లో న్యూ ఇయర్‌ వేడుకులను ఘనంగా నిర్వహించారు. ఆకాశహార్మియాలకు ప్రసిద్ధి చెందిన హాంకాంగ్‌లో అదే రీతిలో ఆదేరీతిలో సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారుపెద్దుతున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మైమరిపించే సంగీతం హోరు, కళ్లు మిరుమిట్లుగొలిపే విద్యుత్‌ కాంతులల వెలుగు మధ్య సంబరాలు జరుపుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా  ఆయా దేశాల్లోని ప్రార్ధనా మందిరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా రద్దీ కనిపించింది. కొత్త సవవత్సరంలో ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రార్ధనలు చేశారు. 

 

జమ్మలమడుగులో అగ్నిప్రమాదం..

కడప : జిల్లాలోని జమ్మలమడుగులో అగ్నిప్రమాదం జరిగింది. బ్యాట్ కో ట్రాన్స్ పోర్టు బట్టల గోడౌన్ లోఅర్ధరాత్రి మంటలు చెలరేగాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. 

 

నేటి నుంచి కాలుష్య నియంత్రణ..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి కాలుష్య నియంత్రణ పథకం ప్రవేశపెట్టనున్నారు. ఆడ్-ఈవెన్ స్కీమ్ నేటి నుంచి అమలులోకి రానుంది. ఈ నిబంధన ప్రకారం ఒక రోజు బేసి సంఖ్యల నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు రోడ్లపైకి వస్తే, మరో రోజు సరి సంఖ్య నంబర్ ప్లేట్ తో ఉన్న వాహనాలు రోడ్లపైకి రావాలి. కాగా దీని అమలుపై పలు విమర్శలు వస్తున్నాయి. పైగా హైకోర్టు కూడా దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన విషయం తెలిసిందే. కాగా గురువారం జరిగిన ట్రైల్ రన్ కు అంతగా స్పందన రాలేదు. 

నేడు ఎన్టీఆర్ పథకం ప్రారంభం

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ఎన్టీఆర్ హెల్త్ పథకాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరులో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆరోగ్య శ్రీ తరహాలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా పథకం పనిచేయనుంది. 

ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు..

హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కోటి ఆశలతో ప్రజలు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ఆనందోత్సాహాలతో, డ్యాన్సులు, కేరింతలతో నూతన సంవత్సర వేడుకల్లో అన్ని ప్రాంతాల ప్రజలు మునిగితేలారు.

కొత్త సంవత్సర వేడుకల్లో అపశృతి

దుబాయ్ : కొత్త సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. దుబాయ్ లోని డౌన్ టౌన్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది.

Don't Miss