Activities calendar

02 January 2016

బియాస్ నది దుర్ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పు

హైదరాబాద్ : బియాస్ నది దుర్ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మృతుల కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆదేశించింది. పరిహారంలో 60శాతం డ్యామ్ బోర్డు, 30 శాతం కాలేజీ యాజమాన్యం, 10 శాతం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాలని తీర్పు చెప్పింది. పరిహారం పై 7.5శాతం వడ్డీ చెల్లించాలని కూడా ఆదేశించింది. 2014 జూన్ 8న బియాస్ నదిలో కొట్టుకుపోయిన 24 మంది విఎన్ ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు మృతుల్లో ఆరుగురు విద్యార్థినులు, 18 మంది విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.

బర్థన్ కు సంతాపం తెలిపిన మధు, తమ్మినేని

హైదరాబాద్ : కమ్యూనిస్టు యోథుడు, సీపీఐ అగ్రనేత ఏబీ బర్థన్ (92) మృతి పట్ల సీపీఎం ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు పి. మధు, తమ్మినేని వీరభద్రం సంతాపం తెలిపారు.

21:33 - January 2, 2016

ఢిల్లీ : కమ్యూనిస్టు యోధుడు, సీపీఐI అగ్రనేత ఏబీ బర్దన్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బర్థన్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 8.30 గంటలకు కన్నుమూశారు. 1924 సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్ లో జన్మించారు బర్థన్. 1996 నుండి 2012 వరకు సిపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.

బర్థన్ మృతి తీరని లోటు :నారాయణ

సీపీఐ అగ్రనేత ఏబీ బర్థన్ (92) మరణించడం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సీపీఐ నారాయణ తెలిపారు. ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ బర్థన్ బహుముఖ ప్రగ్నాశాలి అని కొనియాడారు. అనునిత్యం ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మించారని బిజెపికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు.

21:30 - January 2, 2016

విజయనగరం : వేరే ఏ శాఖపైనా లేనన్ని కంప్లైంట్‌లు రెవెన్యూ విభాగంపై వస్తున్నాయి.. అవకతవకలకు పాల్పడడంలో ఆ డిపార్ట్‌మెంట్ ముందుంటుంది.! ఈ వ్యాఖ్యలు చేసింది ఏ సామాన్యుడో కాదు కాదు.. సాక్షాత్తూ సిఎం చంద్రబాబే జన్మభూమి సభలో ఈ మాటలు అన్నారు. ఇందుకు తగ్గట్టే ఆ డిపార్ట్‌మెంట్ వారు తమది అవకతవకల విభాగమని బాబు ఎదుట నిరూపించుకున్నారు. భూముల డిజిటలైజేషన్‌కు సంబంధించిన వ్యవహారంలో సిఎంతోపాటు ప్రజలచేతా చీవాట్లు తిన్నారు. ఆ తీరేంటో చూడండి.

తగ్గట్టే రెవెన్యూ అధికారుల పనితీరు....

ఇందుకు తగ్గట్టే రెవెన్యూ అధికారుల పనితీరు కొనసాగుతోంది. భూముల డిజిటలైజేషన్‌లో ఏ తప్పూ దొర్లకూడదని సిఎం చంద్రబాబు పలుమార్లు ఆదేశించినా ఆయన మాటల్ని లెక్కచేయలేదు.

అధికారులకు డబ్బులు ఎరవేసి నకిలీ పత్రాలు.....

ఒకరి భూమి మరొకరి పేరు మీద ఉండడం, అధికారులకు డబ్బులు ఎరవేసి నకిలీ పత్రాలు సృష్టించుకుని బలహీనుల భూములు కాజేయడం లాంటి ఎన్నో అవకతవక పనులు రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇలాంటి అరాచకపర్వానికి చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ మీ ఇంటికి మీ భూమి పేరుతో భూముల డిజిటలైజేషన్ ప్రక్రియను చేపట్టింది. ఈ కార్యక్రమం కింద ప్రతి అసలైన భూ యజమానీ పలానా ల్యాండ్‌ తనదే అని ప్రభుత్వం ద్వారా పత్రం పొంది నిశ్చింతగా ఉండొచ్చు. అయితే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి చాలా నెలలే అవుతున్నా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ తన బుద్ధి పోనిచ్చుకోలేదు. ఇందుకు జన్మభూమి కార్యక్రమం జరిగిన బొండపల్లే ఉదాహరణ. అక్కడ 1209 మందికిగాను 1130 మందికి 1బి పత్రాలు ఇచ్చినట్లు ఏ సమస్యా లేకుండా డిజిటలైజేషన్‌ అయిపోయినట్లు అధికారులు చంద్రబాబుకు తెలిపారు. ఆ 1130 మందినుంచి ఏఆరోపణా లేదని చెప్పారు. అది నిజమేనా అని చంద్రబాబు గ్రామస్తులను అడగ్గా వారినుంచి భిన్నమైన స్పందనొచ్చింది. దీంతో అధికారులు ఖంగుతిన్నారు.

ఎమ్మార్వోపై చంద్రబాబు ఆగ్రహం....

దీంతో ఎమ్మార్వోపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. రైతులందరి లిస్టూ తెమ్మని రెవెన్యూ అధికారులను ముందే సిఎం ఆదేశించారు. తీరా సభలో అడగ్గా ఎమ్మార్వో నీళ్లు నమిలారు. బొండపల్లి గ్రామంలో 60 శాతం మంది భూమలు ఎవరికీ ట్యాలీ కాలేదని గ్రామస్తులు ఆవేశంగా చెప్పారు. అధికారుల పనితీరూ దారుణంగా ఉందని ముఖ్యమంత్రి ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. రకరకాల వంకలు చెప్పి పనులు పూర్తి చేయకుండా రెవెన్యూ అధికారులు సామాన్యులతో ఆడుకుంటారనేది ఎప్పటినుంచో ఉన్న ఆరోపణ. అది ఏకంగా సిఎం ఎదుటే నిరూపితమైంది. మరి ఈసారైనా వారి పనితీరులో మార్పు వస్తుందో లేక మరో జన్మభూమిలో ఇదే సీన్‌ రిపీటవుతుందో చూడాలి. 

21:26 - January 2, 2016

హైదరాబాద్ : ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ రెండో సీజన్‌ పోటీలు ముంబైలో ప్రారంభమయ్యాయి. సీజన్‌ ఆరంభం మ్యాచ్‌లో ఆతిధ్య ముంబై రాకెట్స్‌ జట్టుతో అవధే వారియర్స్‌ జట్లు పోటీకి దిగాయి. మొత్తం ఆరుకోట్లరూపాయల ప్రైజ్ మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు 65 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ గా ఇవ్వనున్నారు.

బర్థన్ మృతి తీరని లోటు :నారాయణ

హైదరాబాద్ : కమ్యూనిస్టు యోథుడు, సీపీఐ అగ్రనేత ఏబీ బర్థన్ (92) మరణించడం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సీపీఐ నారాయణ తెలిపారు. ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ బర్థన్ బహుముఖ ప్రగ్నాశాలి అని కొనియాడారు. అనునిత్యం ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. జాతీయ స్థాయిలో  ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని నిర్మించారని బిజెపికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు.

సీపీఐ అగ్రనేత బర్థన్ కన్నుమూత

ఢిల్లీ : సీపీఐ అగ్రనేత ఏబీ బర్థన్ (92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బర్థన్ శనివారం రాత్రి 8.30 గంటలకు బీజీ పంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1924 సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్ లో జన్మించారు బర్థన్. 1996 నుండి 2012 వరకు సిపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. బర్థన్ మృతికి పలువురు సంతాపం తెలియజేశారు.

20:47 - January 2, 2016

హైదరాబాద్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్‌లోని లాహోర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇటీవల మోదీ పాక్‌లో ఆకస్మికంగా పర్యటించడంపై మునీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. అధికారిక అనుమతి లేకుండా నరేంద్ర మోదీ డిసెంబరు 25న 120 మంది ప్రతినిధులతో కలిసి పాకిస్థాన్‌ వచ్చారని అతడు పిటిషన్‌ వేశారు. మోదీ డిసెంబరు 25న పాక్‌లో ఆకస్మికంగా పర్యటించారు. లాహోర్‌లోని పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నివాసంలో ఇద్దరు ప్రధానులు దాదాపు గంటన్నరసేపు సమావేశమయ్యారు.

20:39 - January 2, 2016

హైదరాబాద్నూ : నూతన సంవత్సర శుభాకాంక్షలతో నేటి క్రేజీ న్యూస్ ప్రారంభమైంది. ఈ రోజు మనం చూడబోయే అంశాలు.... గూగుల్ సంస్థ టాప్ టెన్ సెలబ్రెటీస్ ను విడుదల చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు గుర్రంపై ఆఫీసుకు వెళ్లాడు. ప్రతి ఏడాది చాలా మంది ఎన్నో ప్రతిజ్ఞలు చేస్తూ వుంటారు. కానీ రోహిత్ అనే వ్యక్తి మాత్రం బ్రేక్ చేశారట. రెజీనా కసాందాతో మాటా మంతి.. ఈ క్రేజీ క్రేజీ అంశాలను క్రేజీన్యూస్ లో చూద్దాం. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియో క్లిక్ చేసి పండగ చేస్కోండి. వీడియో చూసే ముందు ఒక్క నిమిషం...! ఈ కార్యక్రమానికి మీ ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వొచ్చండోయ్..

20:29 - January 2, 2016

హైదరాబాద్ : చలికాలం లేటుగా అయినా లేటెస్టుగా వచ్చింది. పట్నాల్లో కాస్త తక్కువగా ఉన్నా… వూర్లల్లో మాత్రం వణికిస్తోంది. ఆన్ లైన్లో కోళ్ల అమ్మకాలు... 20వేల రూపాయల కొట్లాడే కోడి....కర్జూర కల్లు… దానిమ్మ కల్లు, పోతులూరు బ్రహ్మంగారిని ఎందుకు అందరూ తలుచుకుంటున్నారు.… తల్లి ప్రేమను చాటుకున్న ఏనుగు, భారతదేశంలో సిగిరెట్లు తాగే ఆడోళ్లు ఎక్కువవుతున్నారట… లేటు వయసులో ఘాటు ప్రేమ, పెళ్లి...ఇంకా అనేక విశేషాలతో మల్లన్న ముచ్చట్ల కార్యక్రమంలో మల్లన్న ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

20:25 - January 2, 2016

హైదరాబాద్ : కారణం తెలీదు. మీ దేశానికి మీరు వెళ్లిపోండని పంపించేస్తున్నారు. ఉగ్రవాదులను అనుమానించినట్టుగా చెకింగ్ చేస్తున్నారు. అన్నీ పత్రాలు సక్రమంగా ఉన్నా..ఇండియాకు వెళ్లిపొమ్మంటుటున్నారు. ఏ దేశం విద్యార్థులనూ టచ్ చేయకుండా...కేవలం మనదేశం వారు, అందులోనూ తెలుగు విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారు. అవమానభారంతో తెలుగు విద్యార్థుల తిరుగుముఖం పడుతున్నారు. భవిష్యత్ పై ఎన్నో ఆశలతో అమెరికా ఫ్లైటెక్కిన తెలుగు విద్యార్థుల చేదు అనుభవమిది.

అమెరికాలో తెలుగు విద్యార్థుల కోసం వేట .......

వివిధ యూనివర్సిటీల్లో తెలుగు విద్యార్థుల కోసం వేట ముమ్మరం చేశారు. దొరికినవారిని దొరికినట్టుగా ప్రశ్నిస్తున్నారు. ఎయిర్‌పోర్టుల్లో ల్యాండైన స్టూడెంట్స్ ను అటు నుంచి అటే తిరిగి ఇండియా పంపించేస్తున్నారు.

ఇండియా వెళ్లిపోవాలని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారుల హుకుం.....

ఇదీ హయ్యర్ ఎడ్యుకేషన్‌ కోసం అమెరికా ఫ్లైటెక్కిన తెలుగు విద్యార్థుల అనుభవం. ఇండియన్ స్టూడెంట్స్ అందులోనూ తెలుగు విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే క్షుణ్ణంగా తనిఖీ చేసి, కారణాలు ఏవీ చెప్పకుండానే ఇండియా వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక గత కొన్ని రోజులుగా అమెరికా ఎయిర్‌పోర్టుల నుంచి పదుల సంఖ్యలో మన విద్యార్థులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నారు.

శనివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 15 మంది విద్యార్థులు ...........

అమెరికా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు శనివారం ఉదయం 15 మంది విద్యార్థులు తిరిగి వచ్చారు. వీరంతా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా అమెరికా అధికారులు తమను వెనక్కి పంపారని విద్యార్థులు ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. సియాటెల్‌ వర్సిటీలో తమను బంధించారని చెబుతున్నారు. అమెరికాలో తాము నరకం అనుభవించామని విద్యార్థులు ఆవేదనగా చెబుతున్నారు. అయితే, తమను ఎందుకు వెనక్కి పంపుతున్నారనే విషయాన్ని అధికారులు వెల్లడించడంలేదని విద్యార్థులంటున్నారు.

......................................

20:20 - January 2, 2016

గుంటూరు : రిషితేశ్వరి కేసులో కీలక నిందితుడు బాబూరావును.. కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? అతడికి ముందస్తు బెయిల్‌ను ఇప్పించేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారా..? దీనికి అవుననే సమాధానమే వస్తోంది. అనివార్య పరిస్థితుల్లో.. బాబూరావును ఏ4 ముద్దాయిగా చేర్చిన పోలీసులు.. అతణ్ణి అరెస్టు చేయడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లవల్లే.. బాబూరావును పోలీసులు అరెస్టు చేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

బాబూరావుకు బెయిల్‌ను తెప్పించేందుకు అవిశ్రాంతంగా....

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో.. ఆర్కిటెక్చర్‌ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును నీరు గార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు, అప్పటి ప్రిన్సిపాల్‌ బాబూరావును కాపాడుకునేందుకు.. కొందరు పెద్దలు కొందరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా.. బాబూరావుకు బెయిల్‌ను తెప్పించేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

సీనియర్‌ల ర్యాగింగ్‌ను తట్టుకోలేక.. క్యాంపస్‌లోనే ఆత్మహత్య...

రిషితేశ్వరి గత ఏడాది జూన్‌ నెలలో.. సీనియర్‌ల ర్యాగింగ్‌ను తట్టుకోలేక.. క్యాంపస్‌లోనే ఆత్మహత్య చేసుకుంది. ఈకేసులో సుమారు 70 మందిని విచారించిన పోలీసులు.. ర్యాగింగ్‌ విషయంలో బాబూరావు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించారు. ర్యాగింగ్‌ నేరాన్ని చూస్తూ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా.. నేరాన్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించాడని నిర్ధారించుకున్నారు. ఈమేరకు.. బాబూరావు పేరును చార్జిషీట్‌లో ఏ4గా చేర్చారు.

నిందితుడిగా చార్జిషీట్‌లో పేర్కొన్న పోలీసులు....

బాబూరావును నిందితుడిగా చార్జిషీట్‌లో పేర్కొన్న పోలీసులు.. అతణ్ణి అరెస్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాబూరావు అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఎన్నెన్నో కీలక కేసుల్లో కేవలం రోజుల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిషితేశ్వరి కేసులో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. వీరిపై ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు పనిచేయడమే దీనికి కారణమన్న భావనా వ్యక్తమవుతోంది.

ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ....

రిషితేశ్వరి కేసు ముందునుంచీ ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. తనపై ర్యాగింగ్‌ చేసిన వారి పేర్లను.. రిషితేశ్వరి తన డైరీలో పొందు పరిచింది. అయితే వాటిని ఎవరో కొట్టేశారు. పైగా కొట్టేసిన చోట రెడ్‌ ఇంక్‌తో మిస్టర్‌ ఎక్స్‌ అని రాశారు. తర్వాత పోలీసులు ర్యాగింగ్‌ చేసిన విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ అరెస్టయిన వారిలో.. ఇద్దరు విద్యార్థినులు ఫ్రెషర్స్‌ డేనాడు.. ప్రిన్సిపాల్‌.. ఏ4 నిందితుడు బాబూరావుతో ఆడిపాడినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటికి వచ్చింది. దీంతో పోలీసులు.. బాబూరావును ఏ4 నిందితుడిగా చేర్చారు. రిషితేశ్వరి కేసు విచారణ ఈనెల 4న జరుగనుంది. ఆలోపు పోలీసులు ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేస్తారా..? లేక బాబూరావు ముందస్తు బెయిల్‌తో బయటపడతారా..? వేచి చూడాలి. 

20:16 - January 2, 2016

ఆదిలాబాద్ : తెలంగాణలో ఆదివాసీ గిరిజన సంఘం మొదటి మహాసభకు రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగే సభలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. టైగర్ జోన్ పేరుతో ఆదివాసీలను... అడవుల నుంచి తరిమికొట్టేందుకు కుట్ర చేస్తున్నారని టిఏజీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రమహాసభల్లో ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం... భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. 

20:12 - January 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో భాగంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు ప్రభుత్వం వరమిచ్చింది. సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజుల పాటు ఆ సమ్మె జరిగింది. ఆ కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించడంతో వేతనాలు చెల్లిస్తారు. ఈ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

'సర్వకళా సామ్రాట్' బిరుదుతో ఎస్పీ బాలుకు సత్కారం....

హైదరాబాద్ : విశాఖ ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలు ను సర్వకళా సామ్రాట్ బిరుదుతో సీఎం సత్కరించారు.

మినీ ట్యాంక్ బండ్ గా పహల్వాన్ చెరువు

రంగారెడ్డి :షాబాద్‌లోని పహిల్వాన్ చెరువు అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయి. పహిల్వాన్ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తయారు చేయనున్నారు. ఇందుకు రూ. 7.49 కోట్లు విడుదల అయ్యాయి. మెదక్ జిల్లాలోని 36 చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. రెండో దశ మిషన్ కాకతీయలో పునరుద్ధరణకు రూ. 8 కోట్లు విడుదలయ్యాయి. దుబ్బాకలోని రామసముద్రం చెరువు అభివృద్ధికి కూడా నిధులు కేటాయించారు. రామసముద్రం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు రూ. 4.86 కోట్లు మంజూరు అయ్యాయి.

కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్‌కు ప్రభుత్వం అనుమతి

హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖలో నమోదుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 100 కోట్ల మూలధనంతో కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. దేవాదుల మూడో దశ నాలుగో ప్యాకేజీని టపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు కుదింపు చేయడం జరిగింది.

19:34 - January 2, 2016

హైదరాబాద్: విశాల్, కేథరిన్ థెరిస్సా, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలలో పాండిరాజ్ తెరకెక్కించిన చిత్రం కథకళి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. గతంలో పసంగ2, ఇదు నమ్మ ఆళు లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన పాండిరాజ్ కథకళి చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడదల చేయనున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇందులో కేథరిన్ హావ భావాలు, ఫైటింగ్ సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంటతకు గురి చేస్తోండగా, ఈ చిత్రం యధార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్టు తెలుస్తోంది. కథకళి చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనుండగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్‌లో రెజీనా ఎక్కడ కనిపించలేదు. ఇంక ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతాన్ని అందించగా, ట్రైలర్‌లో బ్యాక్ గ్రైండ్ స్కోర్ చాలా అద్బుతంగా ఉందంటూ అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. మరి సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

సంక్రాంతికి 12 డబుల్ డెక్కర్ ప్రత్యేక రైళ్ళు...

హైదరాబాద్ : సంక్రాంతి రద్దీ దృష్ట్యా 12 డబుల్ డెక్కర్ ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రత్యేక రైళ్లు కాచిగూడ - గుంటూరు మధ్య కాజీపేట మీదుగా నడవనున్నాయి. ఈ నెల 8, 9, 10, 11, 12, 13న రాత్రి 11 గంటలకు కాచిగూడ నుంచి గుంటూరుకు ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. ఈ నెల 9, 10, 11, 12, 13, 14న ఉదయం 7 గంటలకు గుంటూరు నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. డబుల్ డెక్కర్ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉందని అధికారులు ప్రకటించారు.

జవాన్ల ధైర్యసాహసాలపై దేశం గర్విస్తోంది: రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీ : పఠాన్ కోట్ ఎయిర్బేస్ పై ఉగ్రవాదాడి ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. పఠాన్ కోట్ దాడిలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు తెలిపారు. ఉగ్ర ఆపరేషన్ ను విజయవంతం చేసిన జవాన్ల ధైర్యసాహసాలపై దేశం గర్విస్తోందని కీర్తించారు.

కాచిగూడ - తిరుపతి డబుల్ డెక్కర్ రైళ్లు రద్దు...

హైదరాబాద్ : ఈ నెల 12, 15 తేదీల్లో కాచిగూడ- గుంటూరు, అలాగే ఈ నెల 8, 12, 15 తేదీల్లో గుంటూరు- కాచిగూడ డబుల్‌ డెక్కర్‌ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 9, 13, 16 తేదీల్లో కాచిగూడ- తిరుపతి, ఈ నెల 10, 14, 17 తేదీల్లో తిరుపతి- కాచిగూడ డబుల్‌ డెక్కర్‌ రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

పఠాన్ కోట్ లో కొనసాగుతున్న కూబింగ్

పంజాబ్ : పఠాన్ కోట్ లో కొనసాగుతున్న కూబింగ్ కొనసాగుతోంది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో ఐదో ఉగ్రవాదిని సైతన్యం హత మార్చినట్లు సమాచారం. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు దాడి చేసినట్లు తెలుస్తోంది.

18:46 - January 2, 2016

విజయవాడ : ప్రస్తుత పరిస్థితులలో మిర్చిరైతు తీవ్రంగా నష్టపోతున్నారంటూ మిర్చి మొక్కలను తెచ్చి ప్రకాశం జిల్లా రైతు సంఘం నేతలు వ్యవసాయ శాఖ మంత్రికి పత్తిపాటిపుల్లారావును కలిశారు. 4 లక్షల ఎకరాల్లో ఉన్నమిర్చి పంటలో లక్ష ఎకరాలకు వైరస్ సోకి పంట పాడైందని వారు మంత్రికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. మిర్చిపంటకు సోకిన తెగులును నివారించడానికి పరిశోధకులను పంపి రైతులకు నష్టం జరగకుండా చర్యలు చేపడతామని మంత్రి పుల్లారావు తెలిపారు.

18:44 - January 2, 2016

విజయనగరం : అందర్నీ కలుపుకుంటూ రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో నడిపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లిలో మూడో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర విభజన మూలంగా తలెత్తిన సమస్యల నుంచి ఇంకా రాష్ట్రం బయటపడలేదని, ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టిపెట్టామని తెలిపారు.

మూడోవిడత జన్మభూమి-మా ఊరు....

మూడోవిడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమం విజయనగరం జిల్లా బొండపల్లి గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సిఎం మాట్లాడుతూ జిల్లా ఆర్థికంగా వెనకబడి ఉన్నందున వివిధ పథకాల ద్వారా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలోని అన్ని నదులనూ అనుసంధానం చేసి సాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో తోటపల్లి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి వచ్చే సీజన్‌కు నీరిస్తామన్నారు.

ఎన్టీఆర్ జలసిరి ద్వారా.....

ఎన్టీఆర్ జలసిరి ద్వారా పంపుసెట్లు ఇస్తామని, సోలార్‌ ఎనర్జీ ద్వారా నడిచే ఏర్పాట్లు చేస్తామని సిఎం తెలిపారు. ప్రాజెక్ట్‌ల విషయంలో పొరుగు రాష్ట్రాలతో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని, ఒక్క వ్యవసాయమేగాక దాని అనుబంధ రంగాలపైనా దృష్టిపెట్టి ఆర్థికంగా బలపడాలని రైతులకు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సంయుక్తంగా కష్టించి పనిచేస్తే దారిద్ర్యమనే ప్రసక్తే ఉండదని కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు.

ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు....

ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు అన్ని రకాల వైద్య పరీక్షలూ ఉచితంగా చేయిస్తున్న ఘనత ఒక్క టిడిపి ప్రభుత్వానికే చెల్లుతుందన్నారు. వ్యవసాయమేగాక పారిశ్రామికంగానూ జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఉపాధి కల్పనకు జన్మభూమి నాందికావాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. స్మార్ట్ విలేజ్‌ కార్యక్రమంలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకున్నవారిని సత్కరించారు. ప్రభుత్వం చేపట్టిన 5 క్యాంపెయిన్ల గురించి ప్రసంగించిన విద్యార్థిని కె.స్వాతిని సిఎం చంద్రబాబు అభినందించారు. సభలో ఇన్‌స్పైర్‌ నేషనల్ అవార్డ్‌ గ్రహీతలైన జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించారు. వారిని బాబు ప్రశంసించడంతోపాటు అవార్డులను అందజేశారు. 

18:40 - January 2, 2016

హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు హాస్టల్‌ రాకుండా అదృశ్యమై నిర్జీవమై కన్పించారు..ఈ ఘటనపై ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు... సంచలనం సృష్టించడమేగాక హాస్టల్స్‌లో చదువుకుంటున్న స్టూడెంట్స్‌ కన్నవారిలో ఆందోళన కలిగించింది... అలాంటి ఘటనే హైదరాబాద్‌ శివార్లలో జరిగింది... నెల రోజులు కావస్తున్నా ఇద్దరు అమ్మాయిల జాడ తెలియలేదు..ఏం జరిగిందో అర్థం కావడం లేదు... ఆ ఇద్దరు అమ్మాయిలు ఏమయ్యారు..? కిడ్నాపయ్యారా..? దుర్మార్గుల చేతికి చిక్కారా..??

వసతీగృహాల్లో ఏం జరుగుతోంది...

వసతీ గృహాలు... పిల్లలను చదివించే స్తోమతలేని బడుగు బలహీన వర్గాలకు చెందినవారంతా తమ కూతుళ్లను హాస్టల్స్‌లో చేర్పించి చదివిస్తుంటే భద్రత లేకుండా పోతుంది... ఇప్పటికే ఎన్నో హస్టల్స్‌ నుంచి అమ్మాయిలు మిస్సయిన ఘటనలున్నాయి.. తాజాగా హైదరాబాద్‌ శివార్లలోని సాంఘీక సంక్షేమ హాస్టల్‌ నుంచి అదృశ్యమయిన ఇద్దరమ్మాయిల ఘటనల ఆందోళన కలిగిస్తుంది...

సైదాబాద్‌ చెందిన ధరణి 8వ తరగతి......

రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ చెందిన మమత తొమ్మిదో తరగతి... హైదరాబాద్‌ సైదాబాద్‌ చెందిన ధరణి 8వ తరగతి...ఈ ఇద్దరు అమ్మాయిలు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని గౌలిదొడ్డి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు...ఇక్కడే హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్న స్టూడెంట్స్‌ డిసెంబర్‌ 7న అదృశ్యమయ్యారు..ఆ తర్వాత వారి కోసం గాలించినా ఎలాంటి జాడ దొరకలేదు....విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెందుతూ గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు....

వరంగల్‌ ఘటన నేపథ్యంలో భయం...

వరంగల్‌ జిల్లాలోని ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా ఇలానే మిస్సయిన కొన్ని రోజుల తర్వాత శవాలై కన్పించారు...ఈ దారుణం నేపథ్యంలో మమత, ధరణిలు అదృశ్యం కావడం కన్నవారిలో ఆందోళన కలిగిస్తుంది...

పోలీసు స్టేషన్ చుట్టూ కన్నవారి ప్రదిక్షణలు..

రోజులు గడుస్తున్న కొద్దీ కన్నవారిలో ఆందోళన కలుగుతోంది... మరోవైపు పోలీసులు మాత్రం ఎలాంటి సమాచారం దొరకడం లేదంటూ చెబుతున్నారు.. ప్రత్యేక శ్రద్ద తీసుకున్నామని చెబుతున్నా నెల రోజులవుతున్న ఎలాంటి క్లూ దొరకలేదు... మమత, ధరణిలు ఏమయినట్లు..? వారికేం జరిగింది..? కిడ్నాప్‌కు గురయ్యారా..? లేక దుర్మార్గుల చేతికి చిక్కారా..? అన్నీ అనుమానాలు..సందేహాలతో కన్నవారిలో కలవరం పెరుగుతోంది...

అదృశ్యానికి ముందు మమతకు అనారోగ్యం..

శివార్లలోని గౌలిదొడ్డిలో ఉన్న సాంఘీక సంక్షేమ గురుకుల వసతీ గృహం నుంచి డిసెంబర్ 7న అదృశ్యమయిన మమత, ధరణిలు నగరంలోనే ఉన్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి...డిసెంబర్‌ 4 నుంచి మమతకు ఆరోగ్యం బాగోలేదని తెలుస్తోంది... ఆ తర్వాత తన మిత్రురాలైన ధరణి కూడా సిక్‌ అయింది... వీరిద్దరికీ ఆరోగ్యం బాగోలేకపోతే వసతీ గృహంలో ఎందుకు పట్టించుకోలేదు..? ఆ స్టూడెంట్స్ చెప్పలేదా..? లేక నిర్లక్ష్యం వహించారా..? డిసెంబర్ 7న ఉదయాన్నే యోగా క్లాస్‌కు రావాల్సిన ఇద్దరూ మిస్సయ్యారు.. ఎక్కడని చూస్తే అప్పటికే హాస్టల్‌ నుంచి బయటపడ్డారు...

నగరంలోనే సంచరిస్తున్నట్లు సమాచారం..

హాస్టల్‌ నుంచి వెళ్లిపోయిన మమత, ధరణిలు రెండ్రోజుల తర్వాత లింగంపల్లిలో బస్సు ఎక్కి పాట్నీ టిక్కెట్టు తీసుకున్నారు.. కాని మధ్యలోనే మియాపూర్‌లో దిగిపోయారు..కండక్టర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు..ఆ తర్వాత అక్కడే ఉన్న కల్వరీ టెంపుల్‌ వెళ్లిన అమ్మాయిల జాడ దొరకలేదు...మళ్లీ టెంపుల్ వస్తారని క్రిస్మస్‌ రోజున పోలీసులు నిఘా పెట్టినా కన్పించలేదు...

నగరంలోనే ఎవరితో కలిసి ఉన్నారు...

9 రోజున లింగంపల్లిలో బస్సు ఎక్కి పాట్నీకి టిక్కెట్లు... మియాపూర్‌లో దిగారు...

మమత,ధరణిలు చిన్న వయస్సే అయినా ఎవరైనా వారిని ప్రేమ పేరుతో..స్నేహం ముసుగులో ట్రాప్ చేశారా..? 9 రోజున లింగంపల్లిలో బస్సు ఎక్కి పాట్నీకి టిక్కెట్లు... మియాపూర్‌లో దిగారు… నగరంలోనే ఉన్నట్లు సమాచారం ఉన్నా డిసెంబర్‌ 10 తర్వాత వారేమయ్యారు...? ఎక్కడున్నారు..? ఎన్నో అనుమానాలతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూనే ఉన్నారు...నగరంలోనే ఉన్నట్లయితే వారికేం జరిగింది..? ఆశ్రయం ఇచ్చినవారెవరు..? పోలీసులు.. పాఠశాల నుంచి పోస్టర్లు తయారు చేసి ప్రచారం చేస్తున్నా వారి ఆచూకీ దొరకడం లేదు... ఇంతకీ ఆ అమ్మాయిలు ఏమయినట్లు..???

18:33 - January 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల కోడ్‌ కూసే టైం దగ్గరపడ్డది. కోడ్ కూయకముందే చకచకా అన్ని ప్రారంభోత్సవాలను చేసేసి ఫుల్‌ మార్క్స్‌ కొట్టేయాలని అధికారపార్టీ, ముందస్తు వ్యూహాలు రచించి ప్రచార పర్వంలో దూకేయాలని మిగతా పార్టీలు హడావుడిపడుతున్నాయి. షెడ్యూల్‌, రిజర్వేషన్ల వివరాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఒకపక్క కోర్టు విధించిన గడువు దగ్గరపడుతోంది. ఇంతకి ఎన్నికల నగారా ఎప్పుడు మోగుతుంది.? గడువు లోపే ప్రక్రియ ముగుస్తుందా.?

అందని ద్రాక్షగా ఊరిస్తున్న గ్రేటర్‌ మేయర్‌ పీఠాన్ని.....

గత కొన్నిరోజులుగా అన్ని పార్టీలూ దేనికోసమైతే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయో అది విడుదలయ్యే సమయం దగ్గరపడ్డది. ఎప్పటినుంచో అందని ద్రాక్షగా ఊరిస్తున్న గ్రేటర్‌ మేయర్‌ పీఠాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని టిఆర్‌ఎస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ హైదరాబాద్ ఎన్నికల్లోనైనా గులాబీ పార్టీకి గట్టి ఝలక్‌ ఇవ్వాలని మిగతా పార్టీలైన కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి తదితర పార్టీలు వ్యూహ రచనలు చేస్తున్నాయి.

వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదలు...

హైదరాబాద్‌లో వార్డుల పునర్విభజన ప్రక్రియ మొదలైనప్పటినుంచే ఎన్నికల వేడి షురూ అయింది. ఇక షెడ్యూల్‌ ఎప్పుడు విడుదలవుతుందా అని పార్టీలు ఎదురుచూస్తున్నాయి. సిటీలో ఇప్పటికే వార్డుల విభజన, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఫైనలైజేషన్, బీసీ ఓటర్ల లెక్కింపు, రిజర్వేషన్ల సంఖ్య పూర్తయింది. కానీ బీసీ ఓటర్ల జాబితాను జిహెచ్‌ఎంసి గోప్యంగా ఉంచుతోంది. ఇక వార్డుల వారీగా రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక జాబితాను ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుంది. ఇదే టైంలో తమ వార్డుల్లో రిజర్వేషన్లు తారుమారైతే పరిస్థితేంటని గతంలో ఎన్నికైన వార్డు మెంబర్లు వర్రీ అవుతున్నారు.

21 రోజుల్లో పూర్తిచేసేందుకు ఈసీ ప్లాన్‌....

జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రక్రియను 21 రోజుల్లో పూర్తిచేసేందుకు ఈసీ ప్లాన్‌ చేస్తోంది. నామినేషన్‌ దాఖలు చేయడానికి సాధారణంగా ఏడు రోజుల సమయం ఇస్తారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 4 రోజులు మాత్రమే అవకాశమిచ్చేలా ఎన్నికల అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మరో 3 రోజుల సమయమిస్తారు. ఈ రెండు ప్రక్రియల తర్వాత 12 రోజుల్లో పోలింగ్ నిర్వహించాల్సుంటుంది. కోర్టుకిచ్చిన అఫిడవిట్‌ ప్రకారం జనవరి 31లోగా నూతన పాలకమండలి ఏర్పాటుచేయాలి. ఈ ప్రకారం ఈ నెల 4న నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ విడుదల చేస్తే జనవరి 23, 24 తేదీల్లో పోలింగ్ ప్రక్రియ ముగించి 27న కౌంటింగ్‌ పూర్తిచేసేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదే రోజున సాయంత్రం మేయర్‌, డిప్యూటీ మేర్ల ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. దీంతో జనవరి 29లేదా 30 తేదీల్లో మేయర్‌ ఎన్నిక పూర్తవుతుంది.

ప్రస్తుతం షెడ్యూల్‌తోపాటే ఎన్నికల కోడ్‌.....

ప్రస్తుతం షెడ్యూల్‌తోపాటే ఎన్నికల కోడ్‌ కూడా వచ్చే అవకాశముండడంతో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారపార్టీ ఫోకస్ చేసింది. నగరంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు సమావేశాలతో మంత్రులు బిజీబిజీగా ఉన్నారు. ఇక సిఎం కెసిఆర్‌ మినహాయింపులు, వరాల జల్లు కురిపిస్తున్నారు. ప్రాపర్టీ టాక్స్‌ మినహాయింపు చేసిన సర్కార్‌ కరెంట్‌, వాటర్‌ బకాయిలను మాఫీ చేసేందుకు స్కెచ్‌ గీస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవ్వాలని మిగతా పార్టీలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. రిజర్వేషన్లను బట్టి గెలుపు గుర్రాల ఎంపిక చేయాలని ప్లాన్‌ చేస్తున్నాయి.

18:30 - January 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. ఉదయం పదకొండు గంటల కు ప్రారంభమైన సమావేశం ఇంకా కొనసాగుతోంది. మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అందరినీ క్యాబినేట్ సమావేశానికి ఆహ్వానించారు. 18 నెలల పాలనలో వచ్చిన మార్పులు..తీసుకున్న నిర్ణయాలు..అనుసరించాల్సిన వ్యుహాలుపై ఈ మంత్రివర్గంలో చర్చిస్తున్నారు.

ఉదయం సెషన్‌లో ఆర్థికశాఖపైనే ప్రధానంగా చర్చ..

ఉదయం నుంచి లంచ్ వరకు జరిగిన సమావేశంలో ఆర్ధిక శాఖపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్ కూర్పు...శాఖల వారీగా ఆర్ధిక శాఖకు అందిన ప్రతిపాదనల పై సమీక్షించారు. కేంద్రం నుంచి వివిధ మార్గాల్లో రాష్ట్రానికి అందాల్సిన గ్రాంట్లు....వాటి వినియోగం,కేంద్ర పథకాలతో ..రాష్ట్ర ప్రభుత్వపథకాలను అనుసంధానం చేయడం పై ముఖ్యమంత్రి అందరికీ దిశా నిర్దేశం చేశారని తెలుస్తోంది.

సాగునీటి రంగానికి నిధుల కేటాయింపుపై చర్చ....

రాబోయే బడ్జెట్‌లో సాగునీటి రంగానికి కేటాయించి నిధులపైనా కేబినెట్‌ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. ప్రతి ఏటా సాగునీటి రంగానికి 25 వేల కోట్ల రుపాయలు కేటాయించాలని సీఎం భావిస్తున్నారు. దీని సాధ్యసాధ్యాల పై సంబంధిత శాఖల అధికారులు, సలహాదారులతో సీఎం చర్చించినట్లు తెలిసింది.

కొనసాగుతున్న రెండో సెషన్‌

ఉదయం మొత్తం ఆర్థిక శాఖ, బడ్జెట్ కూర్పు పైనే చర్చించిన క్యాబినెట్‌..సెకండ్ సెషన్‌లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అంశాన్ని చర్చిస్తోందని తెలుస్తోంది.

18:27 - January 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగింది. గ్రేటర్ ఎన్నికల్లో ఎత్తుగడ, బడ్జెట్ రూపకల్పన, సంక్షేమపథకాల అమలే ఎజెండాగా సమావేశం జరిగింది. ఇప్పటికే పలు కీలక అంశాలపై మంత్రులు సమాలోచనలు చేశారు. వీధి వ్యాపారుల చట్టబద్దతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే వీధి వ్యాపారులకు రుణాలిచ్చేందుకు సర్కార్ ఆమోదం తెలిపింది. జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 60 మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయాలని మంత్రుల బృందం నిర్ణయించింది. అలాగే ట్రాఫిక్, ఇంటెలిజెన్స్‌ విభాగపు సిబ్బందికి జీతాలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా 92 అర్బన్‌ హెల్త్ సెంటర్లను అప్‌గ్రేడ్ చేయాలని టీఎస్ కేబినెట్ డిసైడ్ అయింది. 

18:25 - January 2, 2016

నిజామాబాద్ : కళ్లు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు... చూడగానే కొనాలనిపించేలా దుస్తులు... ఆ గ్రామంలో ప్రతి వస్తువు ఒక కళాకృతే... ఇంతటి అద్భుతమైన ఐటమ్స్ తయారుచేస్తున్నవారు స్వర్ణకారులు కాదు... టైలర్స్ అసలే కాదు.. ఓ తండావాసులు ఎంచుకున్న వెరైటీ వృత్తి ఆ ఊరిపేరే మార్చేసింది.. ఆ వివరాలపై స్పెషల్ రిపోర్ట్..

సంచార జీవితం గడుపుతూనే జీవనం....

అందమైన గిరిజనుల సంప్రదాయ వస్తువులను తయారుచేస్తూ ఔరా అనిపిస్తున్నారు ఈ గ్రామవాసులు.. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఔసులతండా గ్రామం ఇది.. సాధారణంగా గిరిజనులు బీడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూనో... సంచార జీవితం గడుపుతూనే జీవనం సాగిస్తారు.. ఇక్కడి ప్రాంతవాసులుమాత్రం ఓ కొత్త వృత్తిని ఎంచుకున్నారు.. వీరు చేస్తున్న పనితో ఊరిపేరే మారిపోయింది..

కొన్నేళ్లక్రితం ఇక్కడ స్థిరపడ్డ రూప్‌సింగ్‌.....

ఇక్కడ 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.. వీరంతా రక్త సంబంధీకులే... కొన్నేళ్లక్రితం రూప్‌సింగ్‌ అనే వ్యక్తి ఇక్కడ స్థిరపడ్డాడు.. ఆ తర్వాత ఆ కుటుంబం ఇలా పెరిగిపోయింది.. ఈ తండా వాసులంతా చిన్న పెద్ద తేడాలేకుండా అంతా గిరిజనుల సంప్రదాయ వస్తువులను తయారుచేస్తారు.. ఇవి కేవలం జిల్లానేకాదు.. జాతీయ స్థాయిలోనూ పేరు సంపాదించుకున్నాయి.. ఈ వస్తువులు ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే హిందీ సిరియళ్లలో నటీ నటులకోసం కాస్ట్యూమ్స్ కోసం డిజైనర్లు ఇక్కడికే క్యూ కడుతున్నారు.. జిల్లాలోని అన్ని తండాలవాసులు ఈ గ్రామంలోనే తమకు కావాల్సిన ప్రతి వస్తువు కొనుగోలు చేస్తారు.. అంత అద్భుతంగా ఉంటుంది వీరి పనితనం..

జర్మన్‌ సిల్వర్‌ మాత్రమే వాడతారు………..

ముఖ్యంగా గిరిజన లంబాడీలకోసం తయారు చేసే వస్తువులు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి.. ఎటువంటి యంత్రాలు వాడకుండా కేవలం చేతులతోనే ఈ తండావాసులు ప్రతి ఆభరణం తయారుచేస్తారు.. లంబాడి మహిళలు ధరించే దుస్తులు, పట్టీలవంటి వస్తువులను ఎంతో ఓర్పుతో తీర్చిదిద్దుతారు.. వీటన్నింటికీ జర్మన్ సిల్వర్‌ను మాత్రమే వాడతారు.. కుటంబసభ్యులంతా ఒక్కో పనిని పంచుకుంటూ తయారీ పూర్తి చేస్తారు.. స్వర్ణకారులకు ఏమాత్రం తీసిపోకుండా ఈ ఆభరణాలు ఉంటాయి..

ఒక్కో నగ తయారీకి వారంరోజులు….

ఇలా ఒక్కో నగ తయారు చేయడానికి వీరికి వారం రోజుల సమయం పడుతుంది.. ఇంత కష్టపడుతున్నా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.. సరైన మార్కెటింగ్‌ వ్యవస్థలేక ఈ వృత్తిద్వారా వచ్చే డబ్బు ఈ గిరిపుత్రులకు ఏమాత్రం సరిపోవడంలేదు.. వచ్చే మూడువేల రూపాయలతో కడుపు నింపుకోలేక పస్తులుంటున్నారు.. ఎంతో సున్నితమైన ఈ వృత్తితో కళ్లపై విపరీతమైన భారం పడుతుంది.. ఉదయంనుంచి సాయంత్రంవరకూ కూర్చొని పనిచేయడంతో ఇతర ఆరోగ్య సమస్యలుకూడా వస్తాయి... ఈ పనివదిలేసి వ్యవసాయం చేద్దామంటే గజం స్థలంకూడా లేదు... తప్పనిసరై వృత్తిపై ఆధారపడుతూ.

అష్టకష్టాలు పడుతున్నారు ఈ గ్రామస్తులు.. వీరి కష్టాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఓసారి ఈ గ్రామాన్ని సందర్శించారు.. సాయం చేస్తామని హామీ ఇచ్చారు.. అది ఇంతవరకూ నెరవేరలేదు. ప్రత్యేక మార్కెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటుచేస్తే ఈ గిరిజనుల కష్టాలు కొంతవరకూ తీరే అవకాశముంది.. అలాగే సబ్సిడీ ద్వారా రుణాలిప్పిస్తే పెట్టుబడికి ఇబ్బందులు తీరిపోతాయి.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఈ తండావాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు..  

సకలజనుల సమ్మె కాలాన్ని క్యాజువల్ లీవ్ గా

హైదరాబాద్ : సకలజనుల సమ్మె కాలాన్ని క్యాజువల్ లీవ్ గా ప్రకటిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేశారు.

బిజెపితో టిడిపి పొత్తు కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : బిజెపితో టిడిపి పొత్తు కొనసాగుతుందని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. టిడీపీ నిర్మించిన నగరంలో కనీసం డ్రైనేజీ వ్యవస్థను నిర్మించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని...కేసీఆర్, కేటీఆర్ లకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేస్తే వారు కూడా టీడీపీకే ఓటు వేస్తామంటారు అని రేవంత్ రెడ్డి తెలిపారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల కోసమే సీమాంధ్ర ప్రజల పట్ల టిఆర్ ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ లో టీఆర్ ఎస్ ఫ్లెక్లీలు హాస్యాస్పదం మరో నేత ఎర్రబెల్లి విమర్శించారు. ఈజవోలు ఇవ్వని పథకాలను ప్రచారంగా వాడుకుంటున్నారని ఆరోపించారు.

టి.కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు..

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశానికి మరోసారి విరామం ఇచ్చారు. డిప్యూటీ సీఎం మనవరాలి పెళ్లికి సీఎం కేసీఆర్, కేబినెట్ సహచరులు పాల్గొన్నారు. మొదటి సెషన్ లో తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీధి వ్యాపారులకు చట్టబద్ధత కల్పించడంతో పాటు, ప్రభుత్వమే రుణం ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బడ్జెట్ కూర్పు పై కేబినెట్ లో చర్చ జరిగినట్లు సమాచారం. జూన్ కల్లా 60 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ విభాగపు సిబ్బందికీ అలవెన్స్ల పెంపునకు కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం.

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు..

హైదరాబాద్ : పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచుతున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. లీటరు డీజిల్‌పై రూ.2, పెట్రోల్‌పై 37 పైసలు సుంకం పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమలు రానున్నాయి.

17:00 - January 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. దాదాపు 40 అంశాలపై మంత్రులు మంతనాలు చేస్తున్నారు. తొలి సెషన్‌లో బడ్జెట్ కూర్పుపైనే చర్చలు జరిగాయి. వివిధ శాఖలు ప్రతిపాదించిన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపైనే గులాబీ నేతలు చర్చించారు. రెండో సెషన్‌లో భవనాల, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఉద్యోగాల భర్తీపై చర్చిస్తున్నట్లు సమాచారం.

 

16:59 - January 2, 2016

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్ నుండి నామినేషన్ వేసి విత్ డ్రా చేయడానికి కారణం కాంగ్రెస్‌ నేతల ఒత్తిడేనని మాజీ జెడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డి చెప్పారు. తన దగ్గర నుంచి 2 కోట్లు తీసుకున్నారని.. మరో 2 కోట్లు అడగటంతోనే తాను విరమించుకున్నట్లు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాకు, రాహుల్‌కు ఆయన లేఖ రాసినట్లు తెలియచేశారు. తానిచ్చిన డబ్బును కూడా తిరిగివ్వమంటే.. తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

16:58 - January 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల కోసమే టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆంధ్రప్రాంత ప్రజలకు వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారని టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన హైదరాబాద్ లో శనివారం మీడియాతో మాట్లాడుతూ....సంక్రాంతి తరువాతే గ్రేటర్‌ ఎన్నికలు ఉంటాయని కేటీఆర్‌ ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. తేదీలను ప్రకటించే అధికారం కేసీఆర్‌, కేటీఆర్‌ చేతుల్లో లేదని మండిపడ్డారు. 

16:56 - January 2, 2016

హైదరాబాద్ : శ్రీకాకుళంలో సిఐటియు ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. పైడి భీమవరంలో ఇఎస్ఐ నిర్మాణాన్ని చేపట్టాలంటూ... ఏపీ కార్మికమంత్రి అచ్చెన్నాయుడు నివాసాన్ని ముట్టడించేందుకు... కార్మికులు ర్యాలీగా బయల్దేరారు. దీంతో ముందస్తుగానే పోలీసులు సిఐటియు కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ... పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే కార్మికులు నినాదాలు చేశారు. తక్షణమే తమ సమస్యలపై స్పందించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. 

16:55 - January 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాహనదారులకు బీమా కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా ఈ-వాహన్ బీమా అనే పథకాన్ని ప్రారంభించింది. దీంతో వాహనదారులకు అత్యంత సౌకర్యంగా ఉంటుందని తెలంగాణ ఐటి మంత్రి కేటిఆర్, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. త్వరలోనే డిజిటల్ ప్రక్రియలో ఆర్సీలు, లైసెన్స్‌లు ఇచ్చే యోచనలో ఉన్నామన్నారు. వాహనదారులకు అత్యంత ఉపయోగకరమైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 82 లక్షల వాహనదారులు వినియోగించుకోవాలన్నారు.

16:53 - January 2, 2016

విజయవాడ : భవానీ భక్తుల దీక్ష విరమణతో విజయవాడ ఇంద్రకీలాద్రి సందడిగామారింది.. భవానీల భక్తిగీతాలతో మార్మోగింది.. ఈ మూడురోజుల్లో దాదాపు నాలుగు లక్షలమంది అమ్మవారికి ఇరుముడులు సమర్పించారు.. మరో రెండురోజుల్లో మరో నాలుగున్నరలక్షలమంది భవానీలు వస్తారని అధికారులు అంచనావేస్తున్నారు.. వీరికోసం లడ్డూ ప్రసాదాలను ఇప్పటికే సిద్ధం చేసిఉంచారు... ప్రతిరోజూ పదివేలమందికి అమ్మవారి అన్న ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తున్నారు..

దాదాపు ముప్పై ఏళ్లక్రితం 8మందితో ....

దాదాపు ముప్పై ఏళ్లక్రితం 8మందితో ఈ దీక్షలు మొదలయ్యాయి... ప్రతి ఏడాది వీరి సంఖ్య పెరుగుతూ ఇప్పుడు లక్షల్లోకి చేరింది.. 41రోజులపాటు కఠోర ఉపవాసంచేసిన భక్తులు ఇంద్రకీలాద్రిపై దీక్షలు విరమిస్తున్నారు... అమ్మవారిని దర్శించుకొని పులకించిపోతున్నారు.. జైజై భవానీ అంటూ నినాదాలుచేస్తూ భక్తిభావంలో మునిగిపోతున్నారు.. అయితే దీక్షల విరమణ మొదటిరోజు భవానీలకు, అర్చకులకుమధ్య స్వల్ప వివాదం ఏర్పడింది.. వెంటనే అధికారులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించారు... ఆ తర్వాతనుంచి కార్యక్రమం ప్రశాంతంగా సాగుతోంది..

ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు.....

భవానీ భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామంటున్నారు దుర్గ గుడి అధికారులు.. .. కోటి 70 లక్షలతో అన్ని సౌకర్యాలు కల్పించామని చెబుతున్నారు.. దుర్గ గుడిలో ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. అయితే తలనీలాలు, ఇతర మొక్కుబడులు ఇచ్చే ప్రాంతాల్లో మాత్రం అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు.. దేవస్థానం ఏర్పాటుచేసినవారుకాకుండా బయటివారు ఈ పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు.. మొత్తానికి ప్రశాంతంగా దర్శనం జరగడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. 

16:51 - January 2, 2016

హైదరాబాద్ : పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను మట్టికరిపించారు. ఉగ్రదాడుల నేపథ్యంలో దేశమంతా హైఅలర్ట్‌ ప్రకటించారు. మరోవైపు ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశముందని ఐబీ హెచ్చరించడంతో దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

తెల్లవారు జామున రెచ్చిపోయిన ఉగ్రవాదులు...

పంజాబ్‌లో తెల్లవారుజామున ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లోకి చొరబడేందుకు విశ్వప్రయత్నం చేశారు. సైనిక దుస్తులతో వచ్చిన ఉగ్రవాదులు.. ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ముష్కరుల దాడిలో నలుగురు జవాన్లు వీర మరణం పొందారు. మరో ఆరుగురు ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి గాయాలయ్యాయి.

అప్రమత్తమైన కేంద్రం...

పఠాన్‌కోట్ దాడితో కేంద్రం అప్రమత్తమైంది. ఉత్తర భారత దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌బేస్ కేంద్రాల దగ్గర భద్రతను పెంచారు. ఉగ్రదాడిని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఖండించారు. ఉగ్రదాడులను భద్రతాదళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయన్నారు. పాకిస్తాన్‌తోపాటు ఇతర దేశాలతో సంబంధాలు కోరుకుంటున్నప్పటికీ జాతీయ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు రాజ్‌నాథ్‌సింగ్‌. ఇక ఉగ్రదాడిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

మరోసారి కాల్పుల మోత...

ఇక ఉగ్రవాదులతో కాల్పులు ముగిశాయని పంజాబ్‌ అడిషనల్‌ డీజీ హెచ్‌ఎస్‌ థిల్లాన్‌ ప్రకటించిన కాసేపటికే మరోసారి కాల్పుల మోత వినిపించింది. ఎయిర్‌బేస్‌ నుంచి భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయి. ఎయిర్‌బేస్‌లో ఒకరిద్దరు ఉగ్రవాదులు దాక్కున్నారనే అనుమానంతో భద్రతా బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ దాడులకు పాల్పడింది జైష్‌-ఎ-మహ్మద్‌ ఉగ్రవాదులుగా అధికారులు అనుమానిస్తున్నారు. వైమానిక స్థావరం ధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఎయిర్‌బేస్‌లో విమానాలను అన్నీ క్షేమంగా ఉన్నాయని.. హెలికాప్టర్లతో పాటు ఇతర సామాగ్రికి ఎటువంటి నష్టం కలగలేదన్నారు అధికారులు

కిడ్నాప్‌నకు గురైన గురుదాస్‌పూర్‌ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ .....

మరోవైపు పఠాన్‌కోట్‌లో నిన్న కిడ్నాప్‌నకు గురైన గురుదాస్‌పూర్‌ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ ఘటనతో ఈ ఉగ్రవాదులకు సంబంధం ఉండవచ్చుననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక దాడుల నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రమంతా హైఅలర్ట్‌ ప్రకటించింది. అడుగడుగున తనిఖీలు ముమ్మరం చేశారు. ఇక ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్‌లోకి ప్రవేశించకుండా ఉండేందుకు అన్ని ప్రాంతాల్లో ఆర్మీ ముమ్మర గస్తీ నిర్వహిస్తోంది. ఇదిలావుంటే ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశముందని ఐబీ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో భద్రతను పెంచి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

16:49 - January 2, 2016

హైదరాబాద్ : పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడిని పాకిస్తాన్‌ ఖండించింది. టెర్రరిజంపై భారత్‌తో కలిసి పోరాడతామని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల వెనక జైష్‌-ఎ-మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ హస్తముందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఐఎస్‌ఐఎస్‌, జైష్ ఎ మహ్మద్‌ రెండు కలిసి భారత్‌లో ఉగ్రవాద కుట్రకు పాల్పడినట్టు సమాచారం. ఉగ్రవాద దాడుల నేపథ్యంలో రక్షణమంత్రి పారీకర్, ఆర్మీ, ఎయిర్‌ చీఫ్‌ తదితర అధికారులు సమావేశమయ్యారు. 

16:48 - January 2, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ త్వరలోనే పార్టీ పగ్గాలను చేపట్టనున్నారు. యూరప్‌ టూర్‌ నుంచి తిరిగి రాగానే రాహుల్‌ అధ్యక్ష పదవిని చేపడతారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాల సమాచారం. జనవరి 8 తర్వాత యూరప్‌ నుంచి రాహుల్‌ తిరిగొచ్చాక కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం కానుంది. పార్టీ బాధ్యతను భుజానా వేసుకోవడానికి రాహుల్‌ సిద్ధంగా ఉన్నారని పార్టీ నేత ఒకరు తెలిపారు. అయితే పార్టీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుత కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుంది. అంతకు ముందే యువరాజుకు పట్టాభిషేకం చేసే అవకాశం ఉంది.

16:46 - January 2, 2016

హైదరాబాద్ : ప్రకృతి ప్రసాదించిన వరం ఐస్‌ల్యాండ్‌ ద్వీపం. ఉత్తర ధృవానికి సమీపంలో ఉన్న ఈ దేశం నిత్యం మంచుతో కప్పబడి ఉంటుంది. అంతేకాదు ఎన్నో ప్రకృతి రహస్యాలను తనలో ఇముడ్చుకున్న ఐస్‌ల్యాండ్‌ అద్భుతమైన సహజ మంచు గుహలకు ప్రసిద్ధి. స్వచ్ఛమైన మంచినీటితో ఏర్పడిన ఈ మంచు గుహలు అందమైన ఆకృతులను సంతరించుకొని ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తాయి.

ప్రకృతిలోని అద్భుతాలకు మరెన్నో రహస్యాలకు...

ఐస్‌ల్యాండ్‌.. పేరులో ఐస్‌ను కలిగి ఉన్న ఓ ద్వీప దేశం. ప్రకృతిలోని అద్భుతాలకు మరెన్నో రహస్యాలకు ఐస్‌ల్యాండ్‌ కేరాఫ్‌ అడ్రస్‌. ఇక్కడి రాజధాని రెక్‌జావిక్‌కు సమీపంలోని వాట్నజోకల్‌ ప్రాంతం ప్రపంచప్రసిద్ధి చెందిన సహజ మంచుగుహలకు ప్రసిద్ధి. ఈ గుహలు మంచి నీటితో ఏర్పడినవి. ఇక్కడి గుహల్లోకి సూర్యకిరణాలు చొరబడినప్పుడు మంచుస్ఫటికాలు రకరకాల రంగుల్లో కాంతిని ప్రదర్శిస్తాయి.

మంచు గుహల గుండా సూర్యకాంతి....

మంచు గుహల గుండా సూర్యకాంతి ప్రసరించినప్పుడు వింత రంగుల్లో కాంతి పుంజాలు వెలువడి పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సహజంగా ఏర్పడిన ఈ గుహలు వాతావరణంలో వస్తున్న మార్పుల రీత్యా ప్రభావితం అవుతుంటాయి. ఈ మంచుగుహలు నదులవల్ల, ఉపరితలానికి అడుగునున్న జలాలు రావడం వల్ల ఏర్పడినవి కావడం విశేషం.

ఈ మంచు గుహల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు.....

అతి పురాతనమైన ఈ మంచు గుహల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా భూగోళం తనలో దాచుకున్న రహస్యాలను పసిగట్టి బట్టబయలు చేయాలని శాస్త్రవేత్తల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

భూగోళానికి సంబంధించిన అనేకానేక విశేషాలను....

ఈ మంచు గుహలు భూగోళానికి సంబంధించిన అనేకానేక విశేషాలను వివరిస్తాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. భూమి వేడెక్కడానికి కారణాలు ఈ మంచుపొరలను పరిశీలించడం ద్వారా సాధ్యమవుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ గుహల్లోని మంచు స్ఫటికాల ఆకృతిని బట్టి వాతావరణంలో వస్తున్న అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతిలో వివిధ వాయువులు ముఖ్యంగా గ్రీన్‌హౌస్‌ గ్యాసెస్‌, ఏరోసోల్స్‌ అవశేషాలు మంచుపొరల్లో లభ్యం అవుతున్న దృష్ట్యా వాతావరణంలో వస్తున్న మార్పుల్ని అంచనా వేయడానికి వీలవుతుంది. అలాగే భూతాపాన్ని అంచనా వేయడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని సమాచారం.

10వేల సంవత్సరాలలో శీతోష్ణాల హెచ్చుతగ్గులను....

ఈ మంచు పొరల్లోని స్ఫటికాలపై అధ్యయనం చేయడం ద్వారా గడచిన 10వేల సంవత్సరాలలో శీతోష్ణాల హెచ్చుతగ్గులను గమనిస్తే, గత 50 సంవత్సరాలలో ఉష్ణోగ్రత పెరుగుదల రేటు అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

కేసీఆర్ కో బగావ్… హైదరాబాద్ కో బచావ్ :భట్టి

హైదరాబాద్ : సీఎ కేసీఆర్ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ కుటుంబం మాఫియాల తయారైందన్నారు. గ్రేటర్ లో బిజెపి, టిఆర్ ఎస్ లకు ఓటేస్తే నగరంలో అశాంతి నెలకొంటుందని ఆరోపించారు. కేసీఆర్ కో బగావ్… హైదరాబాద్ కో బచావ్ అని పిలుపునిచ్చారు.

ఉగ్రదాడిని ఖండించిన పాకిస్థాన్

పంజాబ్ : పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడిని పాకిస్థాన్ ఖండించింది. అమరులైన సైనికుల కుటుంబాలకు పాక్ సానుభూతి ప్రకటించారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాది ఘటనలోకి కీలక సమాచారాన్ని అధికారులు రాబట్టారు. ఉగ్రదాడికి పాకిస్థాన్ తో లింగ్ ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాదుల 4 ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేసిన భద్రతా అధికారులు తల్లితో ఫోన్ తో మాట్లాడినట్లు సమాచారం.

ఉగ్రదాడి... పారికర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం

ఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి నేపథ్యంలో రక్షణ మంత్రి పారికర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు, రా.ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు.

15:52 - January 2, 2016

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోది విదేశీ టూర్లలో సరికొత్త రికార్డ్‌ సృష్టించారు. గత ఏడాది 2015లో ఆయన 26 దేశాలను చుట్టివచ్చారు. మోది విదేశీ పర్యటనవపై విమర్శలు వెల్లువెత్తడంతో కొత్త సంవత్సరంలో కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది ప్రధాని పర్యటించే దేశాలను ఒకసారి పరిశీలిద్దాం.

మోది అధికారంలోకి వచ్చినప్పటినుంచి.....

ప్రధానమంత్రి నరేంద్రమోది అధికారంలోకి వచ్చినప్పటినుంచి విదేశీ పర్యటనలతోనే బిజి బిజీగా గడిపారు. 2015లో ఆయన మొత్తం 26 దేశాల్లో పర్యటించారు. 2016లో కూడా మోది విదేశీ పర్యటన బిజీ షెడ్యూలే ఉంది. అమెరికాతోనే ఆయన విదేశీ పర్యటన ప్రారంభం కానుంది. వాషింగ్టన్‌లో మార్చి 31 న ప్రారంభమయ్యే న్యూక్లియర్‌ సెక్యురిటీ సదస్సులో ప్రధాని పాల్గొంటారు. ఈ సందర్భంగా పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌తో మోది భేటి కానున్నారు.

జూలైలో లాటిన్‌ అమెరికాకు చెందిన....

జూలైలో లాటిన్‌ అమెరికాకు చెందిన ధనిక చమురు దేశం వెనిజులాలో జరిగే నామ్‌ సదస్సులో మోది పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధాని తొలిసారిగా భాగమవుతున్నారు. ఈ సందర్భంగా లాటిన్‌ అమెరికా దేశాలతోనూ, నామ్‌ నేతలతో మోది చర్చలు జరపనున్నారు. చైనాలో జరిగే జి-20 సదస్సులో పాల్గోనున్నారు. ఈ సమావేశం నవంబర్‌లో జరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాల నేతలతో సమావేశం కానున్నారు. మోది చైనాకు వెళ్లడం ఇది రెండోసారి అవుతుంది.

నవంబర్‌లో లావోస్‌లో జరిగే ....

నవంబర్‌లో లావోస్‌లో జరిగే ఇండియా-ఏసియన్‌, ఈస్ట్‌ ఏసియా సదస్సులో కూడా మోది పాల్గోనున్నారు. టోక్యోలో జరిగే ద ఇండో-జపాన్‌ సదస్సుకు మోది హాజరు కానున్నారు. ఈ సమావేశంలో జపాన్‌ ప్రధాని షింబో అబేతో రక్షణ, అణు విద్యుత్‌ వంటి కీలక రంగాల్లో మోది ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్‌లో జరిగే సార్క్‌ సమావేశానికి ప్రధాని హాజరు కానున్నారు. ఈ సమావేశం సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్య జరిగే అవకాశం ఉంది.ఇవి కాకుండా ఇరాన్, జులైలో జరిగే బ్రిక్స్‌, ఆఫ్గనిస్తాన్‌లో జరిగే ఆసియా సమావేశాల్లో మోది పాల్గోనున్నారు.

మోది విదేశీ పర్యటనలతో ఒరిగిందేమీ లేదని ప్రతిపక్షాలు....

మోది విదేశీ పర్యటనలతో ఒరిగిందేమీ లేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండంతో ప్రధాని ఈసారి విదేశీ టూర్లను తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడానికే ప్రధాని విదేశీ టూర్లకు వెళ్తున్నారని బిజెపి సమర్థించుకుంటోంది. 

15:49 - January 2, 2016

హైదరాబాద్ : ఢిల్లీ ప్రొఫెసర్‌ సాయిబాబాపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆయనను బేషరుతుగా విడుదల చేయాలని కోరాయి. సాయిబాబాకు మద్దతుగా హైదరాబాద్‌ లిబర్టీలోని అంబేద్కర్‌ విగ్రహాం దగ్గర ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. సాయిబాబా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనను వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సాయిబాబాకి బెయిల్‌ పొందే హక్కు ఉందంటూ పత్రికలో వ్యాసం రాసినందుకు అరుంధతీరాయ్‌కు కోర్టు ధిక్కారణ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. 

15:47 - January 2, 2016

హైదరాబాద్ : రానున్న బడ్జెట్‌లో ప్రజాసంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతానికి రాష్ట్రంలో ఆదాయ లోటు అధికంగా ఉందని చెప్పారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో యనమల సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాబడి, వ్యయం, రాబోయే బడ్జెట్‌కు సంబంధించిన అంశాలను అధికారులతో చర్చించారు. 

15:45 - January 2, 2016

హైదరాబాద్ : అన్ని పార్టీలూ తెలంగాణ అభివృద్ధి విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని టి కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే నని స్పష్టం చేవారు. అన్నీ కూల్చాలనే ఆలోచనలు చేసే టిఆర్‌ఎస్‌ అధినేత హైదరాబాద్‌ను ఏ విధంగా అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నించారు.  

15:43 - January 2, 2016

నల్గొండ : విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై దారుణం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుణ్ని నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి దగ్గర కారు ఢీకొట్టింది. మృతదేహం కారు టాప్‌పై పడినా కారు యాజమాని పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. కారుపై మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంబడించి కట్టంగూర్‌ మండలం ఐటిపాముల సమీపంలో పట్టుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు యాజమానిని అదుపులోకి తీసుకున్నారు. నార్కట్‌పల్లి సమీపంలో తాను ఆ వ్యక్తిని ఢీకొట్టానని కారు యజమాని అంగీకరించాడు. 

దక్షిణ ఢిల్లీలో ఖైదీల మధ్య ఘర్షణ :ఒకరి మృతి

హైదరాబాద్ : దక్షిణ ఢిల్లీలో ఖైదీ మధ్య ఘర్షణ జరిగి ఒకరు మృతి చెందారు. సాకేత్ కోర్టు నుంచి ఖైదీలను తీహార్ తీసుకెళ్తుండగా జైలు వ్యానులోనే ఖైదీలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ మనోజ్ అనే ఖైదీ మృతి చెందాడు.

అఫ్గానిస్థాన్‌లో భూప్రకంపనలు.

హైదరాబాద్ : అఫ్గానిస్థాన్‌లో శనివారం భూప్రకంపనలు సంభవించాయి. భూకంప లేఖనిపై తీవ్రత 5.3గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

14:42 - January 2, 2016

హైదరాబాద్ : ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 2015 సీజన్ కు రంగం సిద్ధమయ్యింది. ముంబైలో నేటినుంచి ప్రారంభంకానున్న లీగ్ ప్రారంభమ్యాచ్ లో ముంబై, లక్నోజట్లు తలపడతాయి. రాత్రి 7 గంటలకు ఈటోర్నీ ప్రారంభమవుతుంది. భారత బ్యాడ్మింటన్ సమాఖ్య అధికారికంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో హైదరాబాద్ అంచె సమరం జనవరి 9 నుంచి 11 వరకూ జరుగుతుంది.....

దేశంలోని ఎనిమిది నగరాలలో.....

దేశంలోని ఎనిమిది నగరాలలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ సాకర్ లీగ్, ఆరు నగరాలలో జరుగుతున్న ప్రొఫెషనల్ కుస్తీలీగ్ పోటీలు ముగింపు దశకు చేరుకోడంతో.. ఇప్పుడు తాజాగా...భారత బ్యాడ్మింటన్ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ టోర్నీకి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

2014 సీజన్లో తొలిసారిగా....

2014 సీజన్లో తొలిసారిగా బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ప్రారంభమైన ఈ లీగ్ తొలిసీజన్ అంతగా విజయవతం కాకపోడంతో..2015 సీజన్ పోటీలు ప్రారంభంకాలేదు. అయితే...భారత బ్యాడ్మింటన్ సమాఖ్య ముందుకు వచ్చే లీగ్ నిర్వహణ కు సమ్మతించడంతో....2016 సీజన్ పోటీలకు రంగం సిద్ధమయ్యింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ -2015 పేరుతో జనవరి 2 నుంచి 17 వరకూ..మొత్తం ఆరునగరాలకు చెందిన ఫ్రాంచైజీ జట్ల మధ్య పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

జనవరి 2నుంచి 4 వరకూ ముంబైలో.....

ముంబై రాకెట్స్, హైదరాబాద్ హంటర్స్, అవథి వారియర్స్, చెన్నై స్మాషర్స్, బెంగలూరు టాప్ గన్స్, ఢిల్లీ ఏసర్స్ జట్లు రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ తరహాలో ఢీ కొనబోతున్నాయి. జనవరి 2నుంచి 4 వరకూ ముంబైలో జరిగే తొలిఅంచె పోటీల్లో ముంబై రాకెట్స్ తో అవధి వారియర్స్, హైదరాబాద్ హంటర్స్ తో బెంగళూరు టాప్ గన్స్, చెన్నై స్మాషర్స్ తోముంబై రాకెట్స్ జట్లు తలపడతాయి.

జనవరి 9న జరిగే పోటీల్లో అవథి వారియర్స్ తో....

హైదరాబాద్ వేదికగా జనవరి 9న జరిగే పోటీల్లో అవథి వారియర్స్ తో హైదరాబాద్ హంటర్స్, జనవరి 10న జరిగే పోటీలో హైదరాబాద్ హంటర్స్ తో చెన్నై స్మాషర్స్, జనవరి 11 న జరిగే పోటీల్లో ముంబై రాకెట్స్ తో హైదరాబాద్ హంటర్స్, అవథి వారియర్స్ తో చెన్నై స్మాషర్స్ పోటీపడతాయి. డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ హంటర్స్ జట్టుకు ప్రపంచ రెండోర్యాంకర్ సైనా నెహ్వాల్ నాయకత్వం వహిస్తుంది. జనవరి 5నుంచి లక్నోఅంచె పోటీలు, జనవరి 7 నుంచి న్యూఢిల్లీ, జనవరి 9 నుంచి హైదరాబాద్, 13 నుంచి బెంగళూరు అంచె పోటీలు నిర్వహిస్తారు. జనవరి 14న జరిగే తొలిసెమీఫైనల్స్ కు బెంగళూరు, 15న జరిగే రెండో సెమీఫైనల్స్ కు హైదరాబాద్ నగరాలు ఆతిథ్యమిస్తాయి. జనవరి 17న జరిగే ఫైనల్స్ ను న్యూఢిల్లీలోని తలక్ తోరా ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తారు. వివిధ దేశాలకు చెందిన అగ్రశ్రేణి షట్లర్లు..వివిధ ఫ్రాంచైజీలజట్లలో సభ్యులుగా పోటీకి దిగుతున్నారు.

14:38 - January 2, 2016

కృష్ణా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై మూడోరోజు భవానీ భక్తుల రద్దీ కొనసాగుతోంది.... రాష్ట్రం నలుమూలలనుంచి లక్షలాదిమంది భవానీ భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.. 41రోజులపాటు కఠోర ఉపవాసదీక్షలతో... కొండ చుట్టూ గిరి ప్రదక్షిణచేసి అమ్మను దర్శించుకుంటున్నారు.. భక్తుల దుర్గమ నామస్మరణ చేస్తూ భక్తిభావంలో మునిగిపోతున్నారు.. ఈ మూడు రోజుల్లో దాదాపు మూడున్నరలక్షలమంది భవానీలు దుర్గమ్మను దర్శించుకున్నారు.. ప్రత్యేక పూజలు చేసి దీక్షలు విరమిస్తున్నారు..  

14:37 - January 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మ‌ల్టీలెవ‌ల్ ప్లై ఓవ‌ర్ల ప్రాజెక్టు పట్టాలెక్కేలా కనిపించడం లేదు. బిడ్లు దాఖలు చేసే దిక్కు లేక టెండర్ల దశలోనే ప్రాజెక్టు ఆగిపోయింది. కానీ విచిత్రంగా మల్టీ లెవల్ ఫ్లై ఓవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపనకు ముహూర్తం పెట్టేశారు బల్దియా అధికారులు. ఇంతకీ మల్టీ లెవల్‌ ఫై ఓవర్‌ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులేంటి.. బిడ్‌ లు వేసేందుకు ఏజెన్సీలు ఎందుకు ఆసక్తి చూపడం లేదు. లాంటి సందేహాలు నెలకొన్నాయి.

కేవలం మూడు ఎజెన్సీలే....

హైదరాబాద్‌ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన మ‌ల్టీ లెవ‌ల్ ప్లై ఓవ‌ర్ల నిర్మాణానికి ఎజేన్సీల నుంచి రెస్పాన్స్ క‌రువైంది. గ్లోబ‌ల్ టెండ‌ర్లు ఆహ్వానించినప్పటికీ కేవలం మూడు ఎజెన్సీలే ముందుకురావ‌డంతో ప్రభుత్వానికి పెద్ద షాక్ త‌గిలింద‌నే చెప్పాలి. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా మల్టీ లెవల్‌ ఫై ఓవర్‌ ప్రాజెక్టుకి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 22వేల 331కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టుకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఈపిసి విధానంలో నగరంలోని....

ఈపిసి విధానంలో నగరంలోని 18 జంక్షన్లలో చేసే పనులను ఐదు ప్యాకేజీలగా విభజించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఐదు ప్యాకేజిలకు కేవలం మూడు సంస్థలు మాత్రమే టెండర్లు వచ్చాయి. ఎం.వెంకట్‌రావు, సింప్లెక్స్‌,సీనయ్య అనే ఏజెన్సీలు మాత్రమే బిడ్‌లు దాఖలు చేశాయి. ఈ భారీ ప్రాజెక్టుల‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో టెండ‌ర్లు వ‌స్తాయ‌నుకున్న జిహెచ్ఎంసికి నిరాశే ఎదురైంది.

వాస్తవానికి నవంబర్ 9నే బిడ్స్ ఓపెన్ చేసి.....

వాస్తవానికి నవంబర్ 9నే బిడ్స్ ఓపెన్ చేసి స‌ద‌రు కంప‌నీల‌తో టెండ‌ర్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. టెండర్లు వచ్చి రెండు నెలలు పూర్తవుతున్న ప్రాజెక్టు టెండర్ల దశ ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగా ఉంది. ఇదిలా ఉంటే కేబిఆర్ పార్క్ వద్ద పనులు ప్రారంభించడానికి అధికారులు సిద్దమౌతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆదివారం ఉదయం శంకుస్థాపనకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. గ్రేటర్ ఎన్నికల్లో లబ్దిపొందడానికే ప్రభుత్వం శంకుస్థాపన చేస్తుందని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు.

ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది...

ఈపీసీ విధానంలో పనులు పూర్తవగానే ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే గ్రేటర్ లో మొదటిదశ పనులన్ని ప్రారంభమైతే దాదాపు 4వేల కోట్లు అవసరం అవుతాయి. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ ఏటా 5వేల కోట్లు మాత్రమే. అయితే ఈ ప్రాజెక్టుకి డబ్బులు ఎలా సమకుర్చుతారనే అంశమే ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. అయితే అధికారులు, ప్రభుత్వం ఆగమేఘాలపై పనులు చేపట్టాలని నిర్ణయించడంతోనే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. భారీ ప్రాజెక్టులను ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని ఆత్రుతగా చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి. 

14:34 - January 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు వ్యవస్థ మరింత టెక్నాలజీని ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఇప్పటికే పెట్రోలింగ్‌లో జీపీఎస్‌, వీడియో కాన్ఫరెన్స్‌ వంటి సౌకర్యాలు కలిగిన అధునాతన వాహనాలు సమకూర్చుకుంది. పోలీసు స్టేషన్లలో వైఫై, ఫేస్‌బుక్‌లతో పాటు కొత్తకొత్త యాప్స్‌ను ప్రజలకు ఉపయోగపడే విధంగా రూపొందించారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లను డిజిటలైజేషన్‌ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే కేసీఆర్‌..

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే కేసీఆర్‌.. పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. అన్ని స్టేషన్లకు జీపీఎస్‌ సౌకర్యంతో కొత్త వాహనాలను సమకూర్చడంతో పాటు ఏ ప్రాంతం నుంచి అయినా పెట్రోలింగ్‌ సిబ్బంది నేరుగా తమ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ హైదరాబాద్‌లో అందుబాటులోకి రాగా దీనిని రాష్ట్రంలోని పది జిల్లాలకు వర్తింపచేసేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనివల్ల డీజీపీ కార్యాలయం నుంచి ఏదైనా అత్యవసర ఆదేశాలు జారీచేస్తే ఒకేసారి అన్ని జిల్లాల్లో పోలీసు స్టేషన్‌ స్థాయికి వెంటనే అందుతాయి.

అన్ని పోలీసు స్టేషన్లు డిజిటలైజేషన్‌కు....

రాష్ట్రంలో అన్ని పోలీసు స్టేషన్లు డిజిటలైజేషన్‌కు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే మోడల్‌ జిల్లాగా కరీంనగర్‌లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది విజయవంతం కావడంతో అన్ని జిల్లాల్లో అమలుచేసేందుకు నిర్ణయించారు. డిజిటలైజేషన్‌ వల్ల నేరాల విషయాలతో పాటు శాంతిభద్రతలు, వీవీఐపీల రక్షణ వంటి అనేక విషయాలపై క్షణాల్లో స్పష్టత వస్తుంది. హైదరాబాద్‌లోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో వైఫై అందుబాటులోకి తీసుకువచ్చి ఫేస్‌బుక్‌ సౌకర్యాన్ని కల్పించారు. ఆయా స్టేషన్ల పరిధిలో ఉన్న ప్రజలు ఫేస్‌బుక్‌ ద్వారా తమ సలహాలు, ఫిర్యాదులు అందించే అవకాశం ఏర్పడింది. వైఫై సౌకర్యం వల్ల పెట్రోలింగ్‌ వాహనాల పరిస్థితిని తెలుసుకోవచ్చు.

దేశంలోని పోలీసు వ్యవస్థకే తలమానికంగా....

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నెం 12లో నిర్మిస్తున్న సెంట్రల్‌ కమాండ్‌కంట్రోల్‌ వ్యవస్థ దేశంలోని పోలీసు వ్యవస్థకే తలమానికంగా మారనుంది. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలను ఇందులో కల్పించడంతో పాటు ఒకే ప్రాంతం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సెంటర్‌ నిర్మాణం ఈ ఏడాది నుంచే దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. కానిస్టేబుళ్ల కొరత తీర్చేందుకు సుమారు 9 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. త్వరలోనే మరో వెయ్యి వరకు ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. దీంతో ఈ సంవత్సరం చివరి నాటికి కొత్త సిబ్బంది విధుల్లో చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో వివిధ కేడర్లలో కేవలం 67 వేల మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. వరంగల్‌ను కమిషనరేట్‌ హోదాకు పెంచారు. ఇదే స్థాయిలో మరిన్ని చర్యలు తీసుకోవడం, డిజిటలైజేషన్‌ ద్వారా మరింత సమర్థవంతమైన పోలిసింగ్‌ను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

14:31 - January 2, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌లో గ్రేటర్ వార్‌ హీటెక్కిస్తోంది. బల్దియా బరిలో నిలిచే... రేసుగుర్రాల వేటలో పడింది హస్తం పార్టీ. అభ్యర్థి ఎంపిక నుంచి బూత్ కమిటీల వరకు... ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేష‌న్ రాగానే... డోర్ టు డోర్ ప్రచారంతో హోరెత్తించాల‌ని డిసైడ్ అయ్యింది. మేయర్‌ అభ్యర్థిని సైతం ప్రకటించే దిశగా కాంగ్రెస్ లీడర్లు సమాలోచనలు చేస్తున్నారు.

జోరు మీద హస్తం పార్టీ...

తెలంగాణలో హస్తం పార్టీ జోరుమీదుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని విజయం ఆ పార్టీలో జోష్ నింపుతోంది. ఇక రేపో, మాపో జరగనున్న... గ్రేట‌ర్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉవ్విళ్లూరుతున్నారు. మండలి విజయాల్ని బూస్ట్‌గా చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. ప‌క్కా ప్రణాళిక, సరైన వ్యూహంతో, గెలుపునకు కావల్సిన స‌రంజామాను సిద్ధం చేసుకుంటున్నారు.

ఎన్నికల నోటిఫికేష‌న్ వ‌చ్చేనాటికే...

జీహెచ్ ఎంసీ ఎన్నికల నోటిఫికేష‌న్ వ‌చ్చేనాటికే... డివిజ‌న్ల వారీగా పార్టీ ప‌రిశీల‌కుల‌ను నియమించాల‌ని తెలంగాణ-పీసీసీ డిసైడైంది. ఆదివారం గాంధీభవన్‌లో జరిగే సమావేశంలో పరిశీల‌కుల‌ను ప్రక‌టించేందుకు రెడీ అవుతోంది. జనవరి నాలుగో తేదీ నుంచి ఆశావాహుల‌ నుంచి... దర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని నిర్ణయించింది. ఇక బ‌ల‌మైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఒకవైపు స‌ర్వేలను చేయిస్తూనే... మరోవైపు సెలెక్ట్‌ అండ్‌ ఎల‌క్ట్ ప‌ద్ధతిలో గెలుపు గుర్రాల‌ను వెతికిప‌ట్టుకోనుంది హ‌స్తం పార్టీ. అంతేకాకుండా జనవరి 7 నుంచి గ్రేటర్‌ పరిధిలో డోర్ టు డోర్ ప్రచారంతో దూసుకుపోవాల‌ని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసేలా కాంగ్రెస్ స్కెచ్....

టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసేలా కాంగ్రెస్ స్కెచ్ గీస్తోంది. గులాబీ దళంపై పట్టుసాధించేందుకు సన్నద్ధమవుతోంది. సెటిలర్లపై టీఆర్ఎస్‌లో మారుతున్న స్వరాన్ని గుర్తించిన కాంగ్రెస్... అంత‌కంటే బ‌లంగా సెటిల‌ర్‌ కార్డును ప్రయోగించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న డివిజ‌న్లలో సెటిల‌ర్లకు టికెట్ ఇస్తామని ప్రకటించింది. మేయర్ అభ్యర్థిని సైతం ప్రకటించే యోచనలో టీ-పీసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తమతో కలిసొచ్చే పార్టీల‌తో పొత్తులు కుదుర్చుకోవ‌డంపై కూడా హ‌స్తం నేత‌లు దృష్టిపెట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రేటర్‌లో జెండాను ఎగ‌రేయాల‌ని కాంగ్రెస్ లీడర్లు ఆశపడుతున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటి నుండే ప‌క్కా ప్రణాళిక‌తో గ్రౌండ్ లోకి దిగేందుకు రెడీ అవుతోంది.

14:28 - January 2, 2016

హైదరాబాద్ : అమెరికా నుంచి హైదరాబాదులోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 15 మంది విద్యార్థులు తిరిగి వచ్చారు. 15మంది తెలుగు విద్యార్థులు ఉన్నతచదువుల కోసం అమెరికా వెళ్లారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా అమెరికా అధికారులు వారిని వెనక్కి పంపారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సియాటెల్‌ వర్సిటీలో తమను బంధించారంటూ విద్యార్థులు ఆరోపించారు. అమెరికాలో తాము నరకం అనుభవించామని విద్యార్థులు ఆవేదనగా చెప్పారు. న్యూయార్క్ నుంచి 22 మంది భారత విద్యార్థులను వెనక్కి పంపగా, 15 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. న్యూయార్క్ విమానాశ్రయం నుంచే వారిని వెనక్కి పంపించారు. అయితే, తమను ఎందుకు వెనక్కి పంపుతున్నారనే విషయాన్ని అధికారులు వెల్లడించ లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. తమను భయపెట్టే విధంగా అధికారులు వ్యవహరించారని అన్నారు. 

ఉగ్రవాదుల దాడిని ఖండించిన కేంద్ర హోంమంత్రి

హైదరాబాద్ : పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో దేశంలో హైఅలర్ట్‌ నెలకొంది. ప్రధాన నగరాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు ఉగ్రవాదుల దాడిని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఖండించారు. ఉగ్రవాదుల దాడులను భద్రతా దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయన్నారు. ఇక పటాన్‌కోట్‌లో జాతీయ భద్రతా సలహాదారు ఆధ్వర్యంలో ఉగ్రదాడిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఉగ్రవాదులతో కాల్పులు ముగిసినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

14:25 - January 2, 2016

హైదరాబాద్ : పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. నలుగురు ఉగ్రవాదులను హతం చేశామని అధికారులు ప్రకటించిన కాసేపటికే మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. రెండు సార్లు భారీ ఎత్తున పేలుడు శబ్ధాలు వినిపించాయి. ఎయిర్‌బేస్‌లో ఉగ్రవాదులు దాక్కున్నారనే అనుమానంతో భద్రతాదళాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. దాడుల నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. ఉగ్రవాదులు ఇతర ప్రాంతాలకు పారిపోకుండా భారీ ఎత్తున భద్రత పెంచారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో కేంద్ర హోం, రక్షణ శాఖ మంత్రులు సమావేశమయ్యారు. దాడిని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఖండించారు. ఉగ్రదాడులను భద్రతాదళాలు తిప్పికొట్టాయని రాజ్‌నాథ్‌ అన్నారు. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ వ్యవహారంపై జాతీయ భద్రతా సలహాదారు సమీక్ష నిర్వహించారు. ఇదిలావుంటే ఇలాంటి దాడులు జరిగే అవకాశముందని ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అప్రమత్తం చేశారు. 

తహశీల్దార్ కార్యాలయానికి టిడిపి నేతల తాళం

శ్రీకాకుళం : ఎల్లన్ మండలం తహశీల్దార్ కార్యాలయానికి టీడీపీ నేతలు తాళం వేశారు. రేషన్‌కార్డుల జారీలో అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. జెడ్పీటీసీ వెలమల గోవిందరావు, ఇతర టీడీపీ మండలస్థాయి నేతలు తహశీల్దార్‌ను కార్యాలయం లోపలే ఉంచి తాళం వేశారు.

ఢీకొట్టి… మృతదేహంతోనే వెళ్లిన కారు...

నల్లగొండ : చౌటుప్పల్ దారుణం చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం చౌటుప్పల్ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యక్తి కారు టాప్ పై పడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగినా .. కారు ఓనర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. ఇది గమనించిన స్థానికులు కారును నకిరేకల్ వరకు వెంబడించి ఐటిపాముల వద్ద వారిని పట్టుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

కృష్ణ జింకను చంపిన ఇద్దరు అరెస్ట్

చిత్తూరు:శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీ అధికారులు రాష్ట్ర జంతువును హతమార్చి ఎత్తుకె ళ్తున్న ఇద్దరు 'ఎర్ర' కూలీలను అరెస్ట్ చేశారు. శ్రీవారి మెట్ల సమీపంలోని పారివేత మండపం వద్ద శనివారం ఇద్దరు కూలీలు కృష్ణజింకను ఎత్తుకె ళ్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

 

కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ పై వాహనదారుల దాడి

హైదరాబాద్: నగరంలోని కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంపై వాహనదారులు దాడి చేశారు. ఆర్టీఏ కార్యాలయంలో సిబ్బంది లేకపోవడంతో పనుల నిమిత్తం ఆఫీస్‌కు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది పనితీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ పలువురు వాహనదారులు కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు.

చంద్రబాబుది తుగ్లక్ పాలన : రోజా

హైదరాబాద్ : రాజన్న రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం అయితే.. చంద్రన్న రాజ్యం ఇంటింటా దౌర్భాగ్యంగా ఉందని వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చంద్రబాబు పాలన తుగ్లక్ కు పాలనను గుర్తుచేస్తుందని ఎద్దేవా చేశారు. టిడిపి పాలనలో మహిళకు రక్షణ లేదని వాపోయారు. ప్రతొక్కరు కష్టాల్లో ఉన్నారని, బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఓటుకు నోటు వ్యవహారంతో చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయిందన్నారు. దాంతో బాబు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. గెలిచిన వారిని పక్కనపెట్టి... ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి నేతల పేర్ల మీద నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు.

రోజా సస్పెన్షన్ పై కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేశారు. శీతాకాల ఎపి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రోజా సస్పెన్షన్ పై డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో శ్రవణ్ కుమార్ (టిడిపి), విష్ణుకుమార్ రాజు (బిజెపి), శ్రీకాంత్ రెడ్డి (వైసిపి)లు సభ్యులుగా ఉన్నారు. 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. సస్పెన్షన్ వ్యవహారం, భవిష్యత్ లో తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక ఇవ్వనుంది. 

13:48 - January 2, 2016

హైదరాబాద్ : రాజన్న రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం అయితే.. చంద్రన్న రాజ్యం ఇంటింటా దౌర్భాగ్యంగా ఉందని వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చంద్రబాబు పాలన తుగ్లక్ కు పాలనను గుర్తుచేస్తుందని ఎద్దేవా చేశారు. టిడిపి పాలనలో మహిళకు రక్షణ లేదని వాపోయారు. ప్రతొక్కరు కష్టాల్లో ఉన్నారని, బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఓటుకు నోటు వ్యవహారంతో చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయిందన్నారు. దాంతో బాబు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. గెలిచిన వారిని పక్కనపెట్టి... ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి నేతల పేర్ల మీద నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. సెక్స్ రాకెట్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న బోడేప్రసాద్ కు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఎపిలో ప్రజాస్వామ్యం ఉందా..? అని ఆమె ప్రశ్నించారు.

 

13:39 - January 2, 2016

హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ కమిటీ ఏర్పాటు చేశారు. శీతాకాల ఎపి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రభుత్వం రోజా సస్పెన్షన్ పై డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో శ్రవణ్ కుమార్ (టిడిపి), విష్ణుకుమార్ రాజు (బిజెపి), శ్రీకాంత్ రెడ్డి (వైసిపి)లు సభ్యులుగా ఉన్నారు. 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. సస్పెన్షన్ వ్యవహారం, భవిష్యత్ లో తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదిక ఇవ్వనుంది.

 

పఠాన్‌కోట్‌లో కొనసాగుతున్న కూంబింగ్

పాట్నా: బీహార్లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాల కూంబింగ్‌ కొనసాగుతోంది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా.. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లో ఉన్నారనే అనుమానంతో భద్రతాదళాలు గాలింపు చేపట్టింది. అయితే తాజాగా ఎయిర్‌బేస్‌ నుంచి భారీగా కాల్పుల శబ్ధాలు వెలువడినట్లు స్థానికులు చెబతున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాసేపట్లో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, పారికర్‌, ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 

 

12:59 - January 2, 2016

చండీఘర్ : పంజాబ్ లోని పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాల కూంబింగ్‌ కొనసాగుతోంది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా.. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లో ఉన్నారనే అనుమానంతో భద్రతాదళాలు గాలింపు చేపట్టింది. అయితే తాజాగా ఎయిర్‌బేస్‌ నుంచి భారీగా కాల్పుల శబ్ధాలు వెలువడినట్లు స్థానికులు చెబతున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాసేపట్లో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, పారికర్‌, ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

 

 

12:50 - January 2, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ రేపు సాయంత్రం వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం... జీహెచ్‌ఎంసీ వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23న పోలింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే సమాచారంతో అన్ని పక్షాల నేతలు ఎన్నికలకు సమాయత్తమయ్యారు.

 

12:42 - January 2, 2016

పాట్నా : బీహార్‌ సర్కారు కొత్త కాపురంలో అప్పుడే కలహాలు మొదలయ్యాయా..? ఆర్జేడీ, జేడీయూ మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయ్యిందా.? నితీష్‌ పాలనపై ఆర్జేడీ నేత చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ చిత్రాన్ని సాక్షాత్కారింపజేస్తోందా?

ఆర్జేడీ, జేడీయూ మధ్య లుకలుకలు

మహాకూటమిగా జట్టుకట్టి బీహార్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆర్జేడీ, జేడీయూ మధ్య లుకలుకలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పార్టీలైన జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు భగ్గుమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నితీష్‌ కుమార్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆర్జేడీ కీలక నేత వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది.

నేరాలకు నితీషే బాధ్యత వహించాలి-రఘువంశ్
 

ఈ వ్యాఖ్యలు చేసింది రఘువంశ్‌ ప్రసాద్ సింగ్. ఈయన ఆర్జేడీలో సీనియర్ నేత, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కూడా. నితీష్‌ పాలనలో క్రైమ్ రేటు రోజురోజుకు పెరుగుతోందని ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించారు. గతవారంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒక వ్యాపారి హత్యకు గురైన నేపథ్యంలో రఘువంశ్‌ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పెరుగుతున్న నేరాలకు నితీషే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రథసారథి అయిన నితీష్.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు చొరవ చూపాలన్నారు. పొగడ్తలకు పొంగిపోవడం జేడీయూకు అలవాటుగా మారిపోయిందన్న రఘువంశ్...ఇకనైనా ఇలాంటి వైఖరిని వీడాలని సూచించారు.

నితీష్‌కు అండగా కాంగ్రెస్ నేతలు

రఘువంశ్‌ వ్యాఖ్యలపై జేడీయూ ధీటుగానే స్పందించింది. అస్తవ్యస్త పాలనతో బీహార్‌ను ఆటవిక రాజ్యంగా మార్చిన ఆ పార్టీ నేతలు తమకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి శ్యాం రాజక్ తిప్పికొట్టారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం నితీష్‌కు అండగా నిలిచారు. శాంతి భద్రతల విషయంలో నితీష్ వైఖరి గతంలో దేశవ్యాప్తంగా ప్రశంసలందుకొందని చెప్పారు. అయితే ఈ మధ్య కొన్నిఅవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయని, అయితే వీటిని నియంత్రించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మొత్తానికి జేడీయూ కంటే కొన్ని ఎక్కువస్థానాలు సాధించిన ఆర్జేడీ...అప్పుడే తన ఆధిక్యతను ప్రదర్శించడం మొదలెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మాటల యుద్ధం సంకీర్ణ సర్కారును ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.

 

 

12:36 - January 2, 2016

న్యూ ఇయర్ సందర్భంగా నటసింహ బాలకృష్ణ ఇంటర్వ్యూ ఇచ్చారు. త్వరలో ఆయన నటించిన డిక్టేటర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా విశేషాలు, అనుభవాలను వివరించారు. మరిన్ని విషయాలను ఆయన మాటల్లోనే...

'కథ, కథలో ఉండే పాత్రలను బట్టి డిక్టేటర్ టైటిల్ వచ్చింది. టైటిల్ కు, కథకు దగ్గరిసంబంధం ఉంది. టైటిల్ తగ్గట్టుగా సినిమా ఉంది. షూటింగ్, టైమింగ్.. విషయంలో నేను కూడా నియంతనే.

చిత్రం షూటింగ్ ముందు నాకు కొంత టెన్షన్ గానే ఉన్నది. ఆర్థిక వ్యవస్థను మనిషి ఏ విధంగా శాసిస్తున్నాడో సినిమాలో చూపించారు. ప్రతిరోజు ఉదయం గంటన్నర వ్యాయామం చేస్తాను. ఆ తర్వాత పూజ చేస్తాను. సినిమా షూటింగ్ కు వెళ్లకముందు.. కుటుంబానికి, బసవతారకం ఆస్పత్రికి, నా స్వంత పనులకు సమయాన్ని కేటాయిస్తాను.

మేము నిత్యావసర వస్తువుల్లాంటి వాళ్లం. ఇకపోతే నా సినిమాలు థియేటర్ కు వచ్చి చూస్తూనే మజా ఉంటుంది. థియేటర్లల్లో కేకలు, అరుపులు, డబ్బులు, పేపర్లు ఎగరేయడం మా సినిమాల నుంచే వచ్చింది. బాలయ్య తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:00 - January 2, 2016

విశాఖ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డ విశాఖ మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌.. ఆనంద్‌కుమార్‌ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డుగోలుగా సంపాదించిన డబ్బుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశాడు. దీనితోపాటు మారణాయుధాలు కూడా సమకూర్చుకున్నాడు. తుపాకి, తూటాలు, కత్తి, గొడ్డలి... ఇలా రకరకాల ఆయుధాలు అతని నివాసంలో పట్టుబడ్డాయి. దీంతో ఇతడికి నేర సామ్రాజ్యంతో సంబంధాలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.
నేర సామ్రాజ్యంతో సంబంధాలపై అనుమానం
విశాఖ మధురవాడ సబ్‌ రిస్ట్రార్‌ ఆనందకుమార్‌కు ఘన చరిత్ర ఉంది. ఆయన ఇంట్లో మారణాయుధాలు బయటపడినప్పుడు ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇతనికి నేర సామ్రాజ్యంతో సంబంధాలు ఉన్నాయా..? అన్న అనుమానం వచ్చింది. విశాఖలో వేళ్లూలుకున్న రియల్‌ మాఫియాతో చేతులు కలిపాడా...? అన్న సందేహం కలిగింది. ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఆనందకుమార్‌ను..మారణాయుధాలు గురించి ప్రశ్నించిన్నడు..సిల్లీగా సమాధానాలు చెప్పాడు. గొడ్డలి ఎందుకని ప్రశ్నిస్తే మాసం నరకడానికని సమాధానం వచ్చింది. కత్తి ఎందుకని అడిగితే బొప్పాయి కోసుకోవడానికని జవాబిచ్చాడు. ఆత్మరక్షణ కోసం తుపాకి లైసెన్స్‌ పొందినట్టు చెప్పుకొచ్చాడు.
త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో హత్యాయత్నం కేసులు
ఆనందకుమార్‌ నివాసంలో మరణాయుధాలు స్వాధీనంచేసుకున్న ఏసీబీ అధికారులు..ఇతనిపై త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో హత్యాయత్నం కేసులు ఉన్నట్టు గుర్తించారు. ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ చదివే రోజుల్లో... తోటి విద్యార్ధులతో గొడవలుపడినట్టు కేసులు ఉన్నట్టు తేలింది. మధురవాడ సబ్‌ రిస్ట్రార్‌గా ఆనందకుమార్‌కు స్తిరాస్థి వ్యాపారులు, రౌడీషీటర్లతో గొడవలు ఉన్నట్లు ఏసీబీకి సమాచారం ఉంది. వీరిలో కొందరితో సన్నిహిత సంబంధాలు కలిగివున్నట్టు ఏసీబీకి సమాచారం ఉంది. దీంతో వ్యతిరేక వర్గం నుంచి ప్రాణహాని ఉందనే ఉద్దేశంతో తుపాకి లైసెన్స్‌ పొందినట్టు భావిస్తున్నారు. ఈ కోణంలో కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా కత్తి, గొడ్డ్డలి, కర్రలు ఇంట్లో పెట్టుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు బయటకు వెళ్లినా కారులో కర్రలు తీసుకెళతారని చెబుతున్నారు.
నాలుగు అంతస్థుల్లో 20 సీసీటీవీ కెమెరాలు
ఆనందకుమార్‌కు విశాఖ లాసన్స్‌ బే కాలనీలో అన్ని హంగులతో కూడిన ఖరీదైన నాలుగు అంతస్తుల భవనం ఉంది. ఆవరణలోకి ఎవరు ప్రవేశించినా... ఇట్టే తెలుసుకునేలా సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు అంతస్థుల్లో 20 కమెరాలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ భవనాన్ని రెండు వాటాలుగా విభజించి తనతోపాటు, భార్య పేరు మీద రిజిస్టర్‌ చేశాడు. ఆనందకుమార్‌కు భీమిలిలో ఫామ్‌హౌస్‌, సొంతగ్రామం కొప్పర్లలో 5 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. ఇంకా చాలా భూములు ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు.
విలువైన వస్తువులు బయటకు తరలిపోయాన్న అనుమానం
అయితే దాడులకు సంబంధించి ఆందనకుమార్‌కు ముందుగానే సమాచారం అందటంతో విలువైన కొన్ని వస్తువులను బయటకు తరలించి ఉంటారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. సోదాలకు ఒక రోజు ముందుగానే ఇంటికి తాళంవేసి వేరే చోటుకు మకాం మర్చి ఉంటాడని భావిస్తున్నారు. ఆ సమయంలో దస్తావేజులు, ఖరీదైన వస్తువులు వెంటతీసుకెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

 

11:54 - January 2, 2016

విశాఖ : ఏపీలో ప్రకంపనలు సృష్టించిన కాల్‌ మనీ కేసులో ఏ-4 నిందితుడుగా ఉన్న విద్యుత్‌ శాఖ డీఈ సత్యానందం మెడకు ఉచ్చు బిగుస్తోంది. కాల్‌ మనీ, చీటింగ్‌, సెక్స్‌ రాకెట్‌ వంటి నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యానందంను నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
డీఈ సత్యానందం అరెస్టు
కాల్‌ మనీ కేసులో విద్యుత్‌ శాఖ డీఈ సత్యానందంకు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నా... ఆ సంతోషం ఆయనకు ఎన్నో రోజులు నిలువలేదు. కాల్‌ మనీ బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి పరారీలో ఉన్న సత్యానందం.... హైకోర్టు నుంచి బెయిల్‌ తెచ్చుకున్నారు. అయితే మరో మహిళ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు.
సత్యానందం అవినీతిపై నివేదిక
మరోవైపు సత్యానందం అవినీతి బాగోతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డుగోలుగా సంపాదించిన సొమ్ముతో ప్రకాశం జిల్లాలో విలువైన భూములు కొనుగోలు చేశాడు. వ్యవసాయ భూములకు బోర్లు వేయించుకుని... తాను పని చేస్తున్న విద్యుత్‌ శాఖను అడ్డుపెట్టుకుని... పైసా ఖర్చు లేకుండా కరెంట్‌ కనెక్షన్లు తీసుకున్నారు. దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపణీ సంస్థ నిఘా విభాగం అధికారులు... సత్యానందం అవినీతిపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. సత్యానందంకు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో 49.75 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తంలో 31 ఎకరాల భూమిని భార్య, సోదరులు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేశారు. మిగిలిన మొత్తం బినామీ పేర్లు మీద ఉన్నాయని సమాచారం.
ఏ-1 నిందితుడుగా ఉన్న రాజేష్‌ అరెస్ట్
కాల్‌ మనీ వ్యవహారంపై గత నెల 11న విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టడంతో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అవాక్కైన పోలీసులు... కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. A1 నిందితుడుగా ఉన్న రాజేష్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. A3 గా ఉన్న చెన్నుపాటి శ్రీను, A5 గా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్‌ పరారీలో ఉన్నారు. సత్యానందాన్ని ఇప్పుడు అరెస్టు చేశారు. కాల్‌ మనీ వ్యవహారంపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 600లకు పైగా ఫిర్యాదులు అందాయి.
పరారీలో ఉన్న నిందితులు కుటుంబసభ్యులపై నిఘా
ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుకుంటామన్న ఆశాభావంతో ముందుకున్నారు. పరారీలో ఉన్న నిందితులు, వారి కుటుంబ సభ్యులతోపాటు, సెల్‌ఫోన్లపై నిఘా పెట్టారు. వారి కదలికలను గమనిస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న వెళిగళ్ల శ్రీకాంత్‌, చెన్నుపాటి శ్రీను దొరికితే కాల్‌ మీన కేసు డొంకంతా కదిలే అవకాశ ఉందని భావిస్తున్నారు. అప్పుడు కేసు దర్యాప్తు కూడా ఒక కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

 

11:49 - January 2, 2016

చండీఘర్: పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో దేశంలో హైఅలర్ట్ నెలకొంది. ప్రధాన నగరాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు ఉగ్రవాదుల దాడిని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఖండించారు. ఉగ్రవాదుల దాడులను భద్రతా దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయన్నారు. ఇక పటాన్‌కోట్‌లో జాతీయ భద్రతా సలహాదారు ఆధ్వర్యంలో ఉగ్రదాడిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఉగ్రవాదులతో కాల్పులు ముగిసినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇక ఉగ్రవాదుల దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో నలుగురు జవాన్లు వీర మరణం పొందాడు. మరో ఆరుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక దాడులకు పాల్పడింది జైష్‌-ఏ-మహ్మద్‌ ఉగ్రవాదులుగా అధికారులు భావిస్తున్నారు.

 

తెలంగాణ క్యాబినెట్ ప్రారంభం...

హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. సాయంత్రం నాలుగున్నరవరకూ ఈ భేటీ కొనసాగనుంది. గ్రేటర్‌ ఎన్నికలపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. అలాగే సంక్షేమపథకాల అమలు, రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కొనుగోలుపైకూడా చర్చ జరిగే అవకాశముంది.

11:22 - January 2, 2016

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌కి చెందిన తారలు ప్రేక్షకులకు, అభిమానులకు ట్విట్టర్‌ ద్వారా న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 'గతేడాది గడించిన అనుభవాలతో నూతన సంవత్సరంలోకి నూతనోత్సహంతో అడుగుపెట్టాం. ఈ ఏడాది మరిన్ని మంచి సినిమాలు చేయాలని, ఇండిస్టీతోపాటు ప్రేక్షకులు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నామ'ని బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, అక్షరు కుమార్‌, బోమన్‌ ఇరానీ, అలీయా భట్‌, కరణ్‌జోహర్‌, లారా దత్తా, ప్రియాంక చోప్రా, రవీన్‌ టండన్‌, షాహిద్‌ కపూర్‌, శిల్పా శెట్టి, సిద్దార్థ్‌ మల్హోత్రా, సోఫీ చౌదరి, సుస్మితా సేన్‌, వరుణ్‌ ధావన్‌, వివేక్‌ ఒబేరారు, మినీషా లంబా, నీల్‌ నితిన్‌ తదితరులు ట్వీర్‌ ద్వారా తెలిపారు. వీరితో పాటు మన తెలుగు తారలు న్యూ ఇయర్‌ని బాగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. తల్లిదండ్రులతో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, స్నేహితులతో ఛార్మి హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకోగా, రాధిక, శరత్‌ కుమార్‌ చెన్నైలో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ను ఘనంగా జరుపుకున్నారు.

 

కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గం సమావేశం

హైదరాబాద్ : కాసేపట్లో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఉదయం 11నుంచి సాయంత్రం నాలుగున్నరవరకూ ఈ భేటీ జరగబోతోంది. గ్రేటర్‌ ఎన్నికలపై ఈ కేబినెట్‌లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. అలాగే సంక్షేమపథకాల అమలు, రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కొనుగోలుపైకూడా చర్చ జరిగే అవకాశముంది.

 

 

 

11:11 - January 2, 2016

నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ రామ్‌ నటించిన 'నేను..శైలజ', నాగశౌర్య నటించిన 'అబ్బాయితో అమ్మాయి' చిత్రాలు విడుదలైన విషయం విదితమే. వీటిల్లో రామ్‌ నటించిన 'నేను.. శైలజ' నూతన సంవత్సరం 2016కు శుభారంభాన్ని ఇచ్చిందం టున్నారు సినీ విశ్లేషకులు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్రేక్షకులు, హీరోల అభిమానుల ఆత్రుత అంతా సంక్రాంతి బరిలో విడుదలయ్యే చిత్రాల గురించే. గత సంవత్సరం సంక్రాంతి పోటీలో పెద్దగా విజయాలు సాధించిన చిత్రాలేవీ లేవు. ఈసారి అమితుమీ తేల్చు కునేందుకు నాలుగు చిత్రాలు పోటీ పడుతున్నాయి. వాటిల్లో బాబారు, అబ్బారులు బాలకృష్ణ, ఎన్టీఆర్‌ చిత్రాలు కూడా ఉండటం విశేషం. 'డిక్టేటర్‌'గా బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకొస్తుంటే, ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో..' అంటున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు అక్కి నేని నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'సోగ్గాడే చిన్ని నాయన', శర్వానంద్‌ 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి.

బాలకృష్ణ 'డిక్టేటర్‌'

'లయన్‌' చిత్రం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా 'డిక్టేటర్‌'. 'లౌక్యం'తో మంచి హిట్‌ను అందుకున్న శ్రీవాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో దర్శకుడు శ్రీవాస్‌ కూడా నిర్మాణంలో భాగస్వామి కావడం విశేషం. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలవుతుంది.

నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయన'

నూతన దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ డైరెక్షన్‌లో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రాన్ని సంక్రాంతి రోజున విడుదల చేస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్‌పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ నటిస్తుండడం విశేషం. గతేడాది నాగార్జున నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఈ చిత్రాన్ని ఆయన అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో..'

గతేడాది 'టెంపర్‌' హిట్‌తో మంచి దూకుడుమీదున్న ఎన్టీఆర్‌, సుకుమార్‌ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో నటించారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తొలిసారి నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తు న్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని సుకుమార్‌ తెరకెక్కిం చిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతూ సంక్రాంతి బరిలో ఉంది.

శర్వానంద్‌ 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'

ఈసారి శర్వానంద్‌ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. గతేడాది 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' వంటి ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ సినిమా తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. సురభి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్‌ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 14వ తేదీనే విడుదల కానుంది. దీంతో ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులకు కావల్సినంత వినోదాన్ని పంచబోతున్నాయి.

 

 

10:57 - January 2, 2016

గుంటూరు : ఇంజనీరింగ్‌ విద్యార్ధిని రిషితేశ్వరీ ఆత్మహత్య కేసులో మాజీ ప్రిన్సిపాల్‌ బాబూరావు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే బాబూరావు పరారీలో ఉన్నాడు. బాబూరావు కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

 

 

 

 

10:54 - January 2, 2016

హైదరాబాద్ : అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు తిరుగుముఖం పట్టారు. సుమారు 15 మంది తెలుగు విద్యార్థులు ఈ రోజు ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. గత కొద్ది కాలంగా ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన విద్యార్థులను అక్కడి అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. అయితే అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా అధికారులు తిప్పిపంపిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

 

10:45 - January 2, 2016

ఎపి ప్రభుత్వం చేపడుతున్న 'జన్మభూమి-మీ ఊరు' కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి, పాదూరు కరుణ, టీడీపీ నేత పట్టాభీ రామ్, వైసిపి అధికార ప్రతినిధి వైసిపి మధన్ మోహర్ రెడ్డి, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి తాడూరు శ్రీనివాసరావు పాల్గొని, మాట్లాడారు. పేదుల, నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై కూడా మాట్లాడారు. మరిన్ని వివరాను వీడియోలో చూద్దాం...

 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో హైఅలర్ట్

హైదరాబాద్ : పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్ లను అధికారులు అప్రమత్తం చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు భద్రత పెంచారు. శంషాబాద్‌కు చేరుకుంటున్న ప్రయాణికులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

 

 

10:20 - January 2, 2016

ప్రకాశం : నూతన సంవత్సరం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో ఎడ్ల పందేలు నిర్వహించారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 33 ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయి. బరువులు లాగి సత్తా చాటాయి. పందెంలో గెలుపొందిన ఎడ్ల జతల యజమానులకు నగదు బహుమతులు అందచేశారు. బోయినవారిపాలెం శ్రీకృష్ణయాదవ్‌ యూత్‌ ఆధ్వర్యంలో పాతికేళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 

రిషితేశ్వరి కేసులో బాబురావు అరెస్టుకు రంగంసిద్ధం

గుంటూరు: రిషితేశ్వరీ కేసులో నాల్గో ముద్దాయిగా ఉన్న యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపల్ బాబురావును అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. బాబురావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

09:43 - January 2, 2016

హైదరాబాద్ : పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్ లను అధికారులు అప్రమత్తం చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు భద్రత పెంచారు. శంషాబాద్‌కు చేరుకుంటున్న ప్రయాణికులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

 

ఉగ్రవాదులు-భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు

పాట్నా : పంజాబ్ లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇరువురి మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.  

తెలుగు విద్యార్థులను తిప్పి పంపిన అమెరికా

హైదరాబాద్ : అమెరికా నుంచి 15 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఉన్నత చదువుల కోసం తెలుగు విద్యార్థులు అమెరికా వెళ్లారు. అన్ని పత్రాలు ఉన్నా.. విద్యార్థులను అమెరికా అధికారులు భారత్ కు తిప్పి పంపారు. 

08:56 - January 2, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌ను సందర్శించారు. అనంతరం బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేసిన 15 అమరావతి బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతి బస్‌స్టేషన్‌నూ ఆధునీకరించాల్సి ఉందన్నారు. సామాన్య ప్రజానీకం సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మెరుగైన వసతులు ఏర్పాటుచేసేలా చర్యలు చేపడతామన్నారు.

 

08:53 - January 2, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు వ్యూహాత్మకంగా సిద్ధమ‌వుతున్న గులాబీ పార్టీ...బల్దియా కోటపై జెండా ఎగరేసేందుకు దూకుడుగా ముందుకెళుతోంది. ఇప్పటి వ‌ర‌కు నిర్వహించిన స‌ర్వేల‌లో ఫ‌లితాల‌న్నీ త‌మ‌కు అనుకూలంగా ఉన్నాయన్న స‌మాచారం వ‌స్తోంద‌ని అధికార పార్టీ అంటోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేసుకున్న గులాబి ద‌ళ‌ప‌తి వాటిని అధిగ‌మించేందుకు అన్నిర‌కాల వ్యూహాల‌ను ర‌చించారు. ఓవైపు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ అంటూ విప‌క్ష పార్టీల నేత‌ల‌ను కారెక్కించడం, మ‌రోవైపు అభివృద్ధి మంత్రంతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సామాన్య ప్రజ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎన్నో వ‌రాలు కురిపిస్తున్నారు.
కేటీఆర్‌కు గ్రేటర్‌ ఎన్నికల ఇంచార్జ్ బాధ్యత‌లు?
గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు పార్టీని సిద్ధం చేస్తున్న గులాబీ ద‌ళ‌ప‌తి...యువ‌నేత కేటీఆర్‌కు ఇంచార్జ్ బాధ్యత‌ల‌ను అప్పగించే అవ‌కాశం ఉంది. దీంతో గ‌తకొన్ని రోజులుగా గ్రేట‌ర్ లో సుడిగాలి ప‌ర్యట‌న‌లు చేస్తున్న కేటీఆర్ గ్రేట‌ర్ పై త‌న అభిప్రాయాల‌ను మీడియాకు వెల్లడించారు. త్వర‌లో జ‌రుగ‌బోయే గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో త‌మ‌దే విజ‌యం అన్న ధీమాను అధికార పార్టీ వ్యక్తం చేస్తోంది. ఒంట‌రిగానే బ‌ల్దియాపై గులాబి జెండా ఎగుర‌వేస్తామ‌ని యువ‌నేత కెటిఆర్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. తెలంగాణా భ‌వ‌న్ లో మీడియాతో చిట్ చాట్ తో మాట్లాడిన ఆయ‌న విప‌క్ష పార్టీల‌పై మండిప‌డ్డారు.
టిడిపి, బిజెపిలు పూర్తిగా బ‌ల‌హీనం : కేటీఆర్ 
స్థానికంగా ప‌ట్టున్న తెలుగుదేశం, బిజెపిలు పూర్తిగా బ‌ల‌హీన ప‌డ్డాయ‌న్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. తెలుగు ప్రజ‌ల సంక్షేమం అంటూ మాట్లాడే చంద్రబాబు తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాల‌న్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నా తెలుగు రాష్ట్రాల‌కు కొత్తగా అద‌న‌పు నిధులు ఎందుకు కేటాయించ‌డం లేద‌ని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల‌కు ప్రజ‌ల్లోకి వెళ్లి ఓట్లు అడిగే హ‌క్కు లేద‌ని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గ్రేట‌ర్ ప‌రిధిలో సింగిల్ డిజిట్ కు పైగా సీట్లు సాధించ‌లేద‌ని స్పష్టం చేశారు.
గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఫీల్‌గుడ్ వాతావ‌ర‌ణం
గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ప్రస్తుతం ఫీల్ గుడ్ వాతావ‌ర‌ణం ఉంద‌ని, తమకు సెటిల‌ర్ల మ‌ద్దతు లేదంటూ విప‌క్ష పార్టీలు త‌ప్పుడు ప్రచారం చేయ‌డం త‌గ‌ద‌న్నారు కేటీఆర్. సెటిల‌ర్లు ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి చెందిన నేత‌లు ఎంతో మంది పోటీ చేసేందుకు ముందుకు వ‌స్తున్నార‌ని, వారికే తమ పార్టీ పెద్దపీట వేస్తుంద‌ని ప్రక‌టించారు. ఓల్డ్ సిటీలో కూడా కొన్ని స్థానాల్లో త‌మ పార్టీ అభ్యర్థులు విజ‌యం సాధిస్తార‌న్న ధీమాను కెటిఆర్ వ్యక్తం చేశారు. తెలంగాణా అభివృద్ధి కోసం ఎవ‌రితోనైనా పోట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని, అయితే కేంద్రంతో మంచి సంబంధాలు కొన‌సాగించేందుకు తాము ప్రాధాన్యత‌నిస్తామ‌ని కేటీఆర్ అన్నారు.

 

 

08:35 - January 2, 2016

హైదరాబాద్ : నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యుత్ శాఖపై తొలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ప్రాజెక్టు డైరెక్టర్ రాధాకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్లో రైతులకు ఎట్టపరిస్థితుల్లో పగటిపూట 9 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఇతర వర్గాలకు నిరంతరంగా విద్యుత్‌ సరఫరా కోసం అవసరమైన చర్యల్ని యుద్ధప్రాతిపదికన తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,445 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఉందని..ఈ ఏడాది చివరికల్లా అదనంగా మరో 4,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించే లక్ష్యంతో పనులు చేపట్టాలన్నారు. వరంగల్ జిల్లా భూపాల్‌పల్లిలో 600 మెగావాట్ల విద్యుత్‌ యూనిట్‌ను ఈనెల 5వ తేదీన ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు.
ఏప్రిల్‌ నాటికి జైపూర్‌లో 1200 మెగావాట్ల విద్యుత్‌
ఇక సింగరేణి సంస్థ ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌లో నిర్మిస్తున్న 1200 మెగావాట్ల విద్యుత్‌ ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని సీఎం అన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి రావాల్సిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ కూడా ఈయేడాది చివరినాటికి అందుతుందన్నారు. అంతేకాకుండా ఏప్రిల్ నాటిటి 800 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. అయితే ఈయేడాది చివరి నాటికి మరో 2వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తుందని..ఈ ఏడాది చివరినాటికి మొత్తంగా 4,600 మెగావాట్ల విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. బీహెచ్‌ఈఎల్ ద్వారా నిర్మించే పవర్ ప్రాజెక్టు పనుల్ని మరింత వేగవంతం చేయాలని..2018 నాటికి 25వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధనే లక్ష్యంగా రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారం అధికారులు పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 24గంటలపాటు విద్యుత్ వెలుగులు విరజిమ్మేలా సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారు. మరో రెండేళ్లలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేకుండా చేస్తామని చెప్పిన కేసీఆర్‌..ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు.

 

 

 

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

07:57 - January 2, 2016

విజయనగరం : ఎపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూడోవిడత 'జన్మభూమి-మాఊరు' కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. జన్మభూమి కార్యక్రమంతో రాష్ట్రంలోని గ్రామాలు, వార్డుల్లో మౌళిక వసతులు, పౌర సేవలు పెంపొందించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుని వేగంగా సమ్మిళిత అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కార్యక్రమాల పరిశీలన
ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఎంతమేర అమలవుతున్నదీ జన్మభూమి-మాఊరులో పరిశీలిస్తారు. ఇప్పుడున్న దాదాపు 44 లక్షల సామాజిక ఫించన్లు పంపిణీ చేస్తారు. కొత్త కార్డుల పంపిణీ కోసం 6 దశల్లో పరిశీలన జరుపుతారు. అర్హులైన లబ్ధిదారుల పేర్లను జన్మభూమి కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. ఇప్పుడు అమలవుతున్న ఈపాస్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు లబ్ధిదారుల వేలిముద్రలు స్వీకరిస్తారు. గ్రామస్థాయిలో ముందస్తు పరిశీలన తర్వాత 12.43 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.
కంప్యూటరీకరణ బహిర్గతం
'మీ భూమి' కార్యక్రమం కింద ఇప్పటికే పూర్తైన కంప్యూటరీకరణను ఈ 'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో బహిర్గతం చేయనున్నారు. గ్రామాల్లో భూగర్భ జలాలు ఏ స్థాయిలో ఉన్నదీ అంచనా వేస్తారు. అన్ని చోట్లా వైద్య, పశువైద్య శిబిరాలు నిర్వహిస్తారు. గత జన్మభూమి కార్యక్రమం సందర్భంగా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కార్యాచరణ రూపొందించటంతో పాటు కొత్త ఫిర్యాదులు స్వీకరిస్తారు.
విజయనగరం జిల్లాలో ప్రారంభం
ఇవాళ సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లాలో మూడోవిడత జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 3వ తేదీన నెల్లూరు జిల్లాలో, 4వ తేదీన ప్రకాశం జిల్లాలో, 5వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. 6న కర్నూలు, 7వ తేదీన చిత్తూరు, 8న ఉభయగోదావరి, 9వ తేదీన కడప జిల్లాలో 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10, 11, 12తేదీల్లో విశాఖలో ఉండనున్న సీఎం జన్మభూమి ముగింపు కార్యక్రమాన్ని అక్కడే నిర్వహిస్తారు. అనంతరం సంక్రాంతి పండుగ సందర్భంగా 13, 14 తేదీల్లో స్వగ్రామం నారా వారిపల్లెకు చంద్రబాబు కుటుంబ సభ్యులు వెళ్లనున్నారు.

 

నేడు మూడోవిడత జన్మభూమి కార్యక్రమం...

విజయనగరం : ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూడోవిడత జన్మభూమి కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. జన్మభూమి కార్యక్రమంతో రాష్ట్రంలోని గ్రామాలు, వార్డుల్లో మౌళిక వసతులు, పౌర సేవలు పెంపొందించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 

07:47 - January 2, 2016

హైదరాబాద్ : తెలంగాణ క్యాబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉదయం సచివాలయంలో సమావేశం అవుతుంది. సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో అజెండా భారీగా ఉంది. అందుకే ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం సాయంత్రం దాదాపు నాలుగున్నర వరకు జరిగనుంది.
గ్రేటర్ ఎన్నికలపైనే ప్రధాన చర్చ
మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలపైనే ప్రధాన చర్చ సాగనున్నట్లు సమాచారం. గ్రేటర్ ప్రజలపై ఇప్పటికే వరాల జల్లు కురించింది ప్రభుత్వం. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశముంది. దాంతో పాటు గ్రేటర్ ఎన్నికల ఇంచార్జ్ గా మంత్రి కేటీఆర్ ను లాంఛనంగా ప్రకటించబోతోంది మంత్రిమండలి.
సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష
మరోవైపు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును కూడా సమీక్ష చేస్తారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిది. సకాలంలో ఆయా పనులు పూర్తి అయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్దీకరణతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాలను ఎంత మేర పెంచాలన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది. 15 నుంచి 20 వేల వరకు టీచర్ ఉద్యోగుల భర్తీకి సైతం ఆమోదం తెలపనుంది.
బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ
ఇక ఇదే నెల నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సైతం చర్చించనుంది మంత్రివర్గం. శాఖల పరంగా ప్రాధాన్యతలను సైతం సీఎం వివరించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో విపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చేలా మంత్రులు సొంత శాఖలపై పట్టు సాధించేలా సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.
ఓమ్ సిటీకి 500 ఎకరాల స్థలం కేటాయించడంపై చర్చ
రామోజీ ఫిల్మ్ సిటీకి అనుకుని నిర్మించ తలపెట్టిన దేవనగరి...ఓమ్ సిటీకి 500 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించే అంశంపై చర్చ జరగనుందని సమాచారం. ఇవాళ జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనికి పచ్చ జెండా ఊపనున్నారని సమాచారం. వీటితో పాటు మరిన్ని అంశాలపై కేబినెట్‌లో చర్చలు సాగనున్నాయి.

 

 

07:39 - January 2, 2016

చండీఘర్ : పంజాబ్ లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తెల్లవారు జామున 3.30 నుంచి 4 గంటల ప్రాంతంలో పఠాన్ కోట్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోకి మిలిటరీ దుస్తులతో ఆరుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇద్దరు జవాను మృతి చెందాడు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. స్టేషన్ లో ఇంకా ఒక ఉగ్రవాది ఉన్నాడు. ఇరువురి మధ్య జరిపిన ఎదురు కాల్పుల ఘటన సమయంలో ఆరుగురు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులకు గాయాలయ్యాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. జైష్ ఏ మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులగా భావిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ మీదుగా ఉగ్రవాదులు పంజాబ్ లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అయితే నిన్న పంజాబ్ లోని హైవేపై ఓ ఎస్పిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఎస్పిని కిడ్నాప్ చేసిన వారే ఇవాళ కాల్పులకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మిలిటరీ, ప్రత్యేక బలగాలతోపాటు పంజాబ్ పోలీసులు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. భారీ మారణాయుధాలతో కాల్పులు జరుపుతున్నారు. 
దేశంలో హైఅలర్ట్
పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో దేశంలో హైఅలర్ట్ నెలకొంది. ప్రధాన నగరాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. మరోవైపు ఉగ్రవాదుల దాడిని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఖండించారు. ఉగ్రవాదుల దాడులను భద్రతా దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయన్నారు. ఇక పటాన్‌కోట్‌లో జాతీయ భద్రతా సలహాదారు ఆధ్వర్యంలో ఉగ్రదాడిపై సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇక ఉగ్రవాదుల దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో నలుగురు జవాన్లు వీర మరణం పొందాడు. మరో ఆరుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక దాడులకు పాల్పడింది జైష్‌-ఏ-మహ్మద్‌ ఉగ్రవాదులుగా అధికారులు భావిస్తున్నారు.
పఠాన్ కోట్ లో మళ్లీ కాల్పులు
పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాల కూంబింగ్‌ కొనసాగుతోంది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా.. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లో ఉన్నారనే అనుమానంతో భద్రతాదళాలు గాలింపు చేపట్టింది. అయితే తాజాగా ఎయిర్‌బేస్‌ నుంచి భారీగా కాల్పుల శబ్ధాలు వెలువడినట్లు స్థానికులు చెబతున్నారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాసేపట్లో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, పారికర్‌, ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

 

నేడు టీక్యాబినెట్ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ క్యాబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సంక్షేమ పథకాల అమలు తీరు, బడ్జెట్ రూపకల్పనపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా పలు వరాలు ప్రకటించనున్నారు. దీంతో పాటు క్యాబినెట్‌లో పలు వివాదాస్పద అంశాలపైనా చర్చించనున్నారు. 

పంజాబ్ లో ఉగ్రవాదుల కాల్పులు

పాట్నా: పంజాబ్ లోని పటాన్ కోటి ఎయిర్ ఫోర్స్ కేంద్రంపై ఉగ్రవాదులు దాడి చేశారు. భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. 

Don't Miss