Activities calendar

03 January 2016

కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయాలి : ఉత్తమ్‌

హైదరాబాద్‌ : నగర అభివృద్ధి కోసం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అభ్యర్థించారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. నగరంలో కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాలతో ఈనెల 4, 5 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 5వ తేదీ మధ్యాహ్నం నుంచి నియోజకవర్గాల వారీగా పాదయాత్రలు, 6న అభ్యర్థుల ఎంపికపై చర్చ, 7 నుంచి ఇంటింటి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. డివిజన్‌ కమిటీల నిర్ణయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.

కొడుకు చేతిలో తల్లిదండ్రుల హతం

తూర్పుగోదావరి : జిల్లాలోని రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నంలో దారుణం జరిగింది. ఓ దుర్మార్గుడు ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను హత మార్చాడు. ఈ ఘటనలో స్థానికంగా తీవ్ర కలకలకం రేపింది.  

21:56 - January 3, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో వంద సీట్లు తమవేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యావద్ ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమకార్యక్రమాలు, చేయబోయ పనులను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. తన నియోజకవర్గంలో 395 డుబల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించామని తెలిపారు. వచ్చే ఏడాది వెయ్యి ఇళ్లు నిర్మిస్తామన్నారు. 4 నుంచి 6 కేజీల వరకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని చెప్పారు. ట్రాపిక్ సమస్య లేకుండా, సిగ్నల్స్ పడకుండా .. 25 కోట్ల రూపాయలతో స్కైవేల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెబుతూ ముందుకు వెళ్తామని చెప్పారు. 100 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఓట్ల తొలగింపుపై విపక్షాలు అవాస్తవాలు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 

21:42 - January 3, 2016

ఢిల్లీ : కమ్యూనిస్టు కురువృద్ధుడు ఏబీ బర్ధన్‌కు వివిధ పార్టీలు, నేతలు ఘనగా నివాళులు అర్పించాయి. వామపక్ష ఉద్యమానికి బర్దన్‌ మృతి తీరని లోటని లెఫ్ట్‌ పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి. బర్ధన్‌ అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఏబీ బర్దన్‌ సంతాప సభలు

సీనియర్‌ కమ్యూనిస్టు నాయకుడు, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్‌ మృతికి నివాళిగా ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లో సంతాప సభలు జరిగాయి. ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంతాప సభలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో పాటు వివిధ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు బర్దన్‌కు నివాళులు అర్పించారు. వామపక్ష ఉద్యమానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

హైదరాబాద్ లో సంతాప సభ

తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో బర్దన్‌ సంతాప సభ జరిగింది. బర్దన్ అందరికీ ఆదర్శప్రాయుడని... ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. విద్యార్థి నేతగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బర్దన్‌ సేవలు అభినందనీయమని పలువురు నేతలు కొనియాడారు. బర్దన్‌ మరణం వామపక్షాలకు తీరనిలోటని అన్నారు.

బర్ధన్‌ మృతిపట్ల సీపీఎం నేతల సంతాపం

బర్ధన్‌ మృతిపట్ల సీపీఎం ప్రధాన నాయకులు సీతారాం ఏచూరి, బి.వి. రాఘవులు, తమ్మినేని వీరభద్రం,పి.మధుతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లోని సీపీఐ కార్యాలయాల్లో సంతాప సభలు జరిగాయి.

రేపు బర్ధన్ అంత్యక్రియలు

మరోవైపు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్ బోధ్‌లో బర్ధన్ అంత్యక్రియలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం ఢిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయానికి బర్ధన్ పార్థివదేహాన్ని తరలిస్తారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఆయన పార్థివదేహాన్ని అక్కడే ఉంచుతారు.

 

21:37 - January 3, 2016

చెన్నై: 2016 చెన్నై ఇండియన్ ఓపెన్ టెన్నిస్ పోటీలకు రంగం సిద్ధమయ్యింది. ప్రపంచ టెన్నిస్ లోని పలువురు టాప్ ర్యాంక్ ప్లేయర్లు ఈ సమరంలో పాల్గొంటున్నారు. టోర్నీ మెయిన్ డ్రా పోటీలకు ముందు...క్వాలిఫైయింగ్ రౌండ్ మ్యాచ్ లను ప్రారంభించారు. భారత డేవిస్ కప్ స్టార్లు సోమ్ దేవ్ వర్మన్, సాకేత్ మైనేని సైతం క్వాలిఫైయింగ్ రౌండ్లో పోటీపడాల్సి వస్తోంది. జనవరి 4 నుంచి మెయిన్ డ్రా పోటీలు నిర్వహిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ వావరింకా, నికోలస్ అల్ మాగ్రో, గులెర్మో గార్షియా, గిల్స్ మ్యూలర్, మార్సెలో గ్రోనెలెర్స్, కెవిన్ యాండర్సన్ టైటిల్ వేటకు దిగుతున్నారు..

 

21:35 - January 3, 2016

నిజామాబాద్‌ : జిల్లాలోని రూరల్‌ మండలం బాడ్సి గ్రామ పెద్దలు.. ఓ మైనారిటీ కుటుంబానికి.. గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు. స్థానికంగా హోటల్‌ నడుపుకు జీవించే రేష్మ కుటుంబం.. పొదుపు చేసుకున్న మొత్తంతో కొంత స్థలాన్ని కొన్నారు. అందులో ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నించడంతో.. గ్రామ పెద్దలు వారికి అడ్డు తగిలారు. దీంతో బాధితులు పోలీసులను, రెవిన్యూ అధికారులనూ ఆశ్రయించారు.

ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇంటి నిర్మాణం

ఉన్నతాధికారుల సూచనల మేరకు.. రేష్మ దంపతులు.. ఇంటి నిర్మాణాన్ని కొనసాగించారు. దీంతో మండిపడ్డ విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ ఆ ఇంటిని కూల్చేశారని.. పైగా తమకే 50వేల రూపాయల జరిమానా విధించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదేశాలను ధిక్కరించినందుకు.. వీడిఏ సభ్యులు.. రేష్మ కుటుంబానికి సామాజిక బహిష్కరణ విధించారు.

రేష్మ కుటుంబం కళ్లనీళ్ల పర్యంతం

విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ సభ్యుల ఆదేశాలతో.. తమను గ్రామస్థులెవరూ పలుకరించడం లేదని.. తమ హోటల్‌కూ ఎవరూ రావడం లేదని రేష్మ కుటుంబం కళ్లనీళ్ల పర్యంతమవుతోంది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని మైనారిటీ కమిషన్‌, మానవ హక్కుల కమిషన్‌ల దృష్టికి తీసుకు వెళ్లారు రేష్మ దంపతులు. కమిషన్‌ల ఆదేశాల మేరకు నిజామాబాద్‌ రూరల్‌ పీఎస్‌ ఎస్‌ఐ ముని.. గ్రామాన్ని సందర్శించి.. విచారణ చేపట్టారు. బాధితులను బహిష్కరించినా.. వారిపట్ల కఠినంగా వ్యవహరించినా.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు గ్రామంలో దండోరా వేయించారు.

 

21:31 - January 3, 2016

హైదరాబాద్ : ఖైదీలలో పరివర్తన తేవడం.. వారిలో సమాజం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచడం లక్ష్యంగా.. జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. జైళ్లలో ఉన్నవారిలోనే కాదు.. శిక్ష అనుభవించి బయటకు వచ్చిన వారిలోనూ పరివర్తన కలిగేలా కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఆదివారంనాడు.. ఉస్మానియా ఆసుపత్రిలో జరిగిన స్వచ్ఛ అభియాన్‌ దీనికి నిదర్శనంగా నిలిచింది.

ఖైదీల్లో పరివర్తన 

తెలంగాణ జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. ఖైదీల్లో పరివర్తన తేవడంతో పాటు.. సమాజం పట్ల వారి బాధ్యతను గుర్తు చేసేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న వారే కాదు.. శిక్షలు పూర్తయి బయటికి వెళ్లినవారూ.. సమాజ హితానికి పాటుపడేలా చూస్తోంది. ఇందులో భాగంగా... ఇటీవలే జైలు నుంచి విడుదలైన 300 మందిని సమాజ సేవలో భాగస్వాములను చేయించారు జైళ్ల శాఖ అధికారులు. ఆదివారం నాడు వీరందరినీ ఉస్మానియా ఆసుపత్రికి రప్పించి.. పరిసరాలను శుభ్రం చేయించారు. స్వచ్ఛ అభియాన్‌ పేరిట.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ్ అభియాన్‌ కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డితోపాటు.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, వైద్య అధికారులు హాజరయ్యారు.. ప్రభుత్వ ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచేందుకు... వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు లక్ష్మారెడ్డి.

2015లో 26మంది ఖైదీల మరణాలు

ఖైదీల్లో పరివర్తనకోసం తమ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయని జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త సంస్కరణల వల్ల జైళ్లలో ఖైదీల మరణాలు తగ్గాయని, 2014లో 60మంది మరణించగా... 2015లో ఆ సంఖ్య 26 తగ్గిందని అంటున్నారు. ఇవేకాదు.. జైల్లో ఉన్న సమయంలో ఖైదీలకు వివిధ రకాల వృత్తి విద్యా కోర్సుల్లోనూ శిక్షణ ఇస్తున్నామని.. శిక్ష పూర్తికాగానే కంపెనీలతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెబుతున్నారు. జైళ్లశాఖ నిర్వహిస్తున్న పెట్రోల్‌బంక్‌.. ఏడాది టర్నోవర్‌ 50 కోట్లకు చేరిందని... త్వరలోనే ఈ మొత్తాన్ని వెయ్యికోట్లకు పెంచుతామంటున్నారు జైళ్ల బాసులు..

 

21:27 - January 3, 2016

మహబూబ్ నగర్ : జిల్లాలోని షాద్‌నగర్‌లో 10టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన టెన్ టీవీ యాజమాన్యానికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, టెన్ టీవీ ప్రేక్షకులకు అంజయ్య యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 

 

21:23 - January 3, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో టిఆర్ ఎస్ పాలనతీరును ఎండగడతామని టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో గ్రేటర్ కాంగ్రెస్‌ నేతల సమావేశం జరిగింది. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ నెల 5న పాదయాత్ర, 7నుంచి ఇంటింటికీ వెళ్లి ప్రచారం జరపుతామని ఉత్తమ్ ప్రకటించారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, జానారెడ్డి, ఇతర గ్రేటర్‌ నేతలు పాల్గొన్నారు..

 

21:18 - January 3, 2016

వరంగల్ : జిల్లాలోని కొత్తగూడెం గిరిజన గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థి విష ప్రయోగానికి పాల్పడింది. తినే ఆహారంలో విషపుగుళికలు కలిపింది. కొత్తగూడెం మండల కేంద్రంలోని గాంధీనగర్ లోని గిరిజన గురుకుల పాఠశాలలో సాయిదివ్య, అనూషలు ఆరో తరగతి చదువుతున్నారు. ఈనేపథ్యంలో అనూష అనే విద్యార్థిని సాయిదివ్య తినే ఆహారంలో విషపు గుళికలు కలిపింది. అది తెలియిన సాయిదివ్య ఆ ఆహారాన్ని తిన్నది. దాంతో ఆమె తీవ్ర అనార్యోగానికి గురైంది. చికిత్స నిమ్తితం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్సం అందించారు. అయితే సాయిదివ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. కాగా విషప్రయోగం వెనుకాల టీచర్ల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీచర్లు, విద్యార్థుల మధ్య వివాదాలే విష ప్రయోగానికి కారణమని విద్యార్థులు చెబుతున్నారు.

 

మరో కాల్‌మనీ-సెక్స్ రాకెట్ తరహా దందా..

హైదరాబాద్ : ఏపీలో మరో కాల్‌మనీ-సెక్స్ రాకెట్ తరహా దందా వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లాలో అప్పులు తీసుకున్న మహిళలు వాటిని తీర్చలేకపోతే... దుబాయిలో ఉద్యోగానికి వెళ్లాలని దళారులు బెదిరిస్తున్నారు. అలా వెళ్లిన వారిని.. దుబాయ్‌ లో వ్యభిచార ముఠాలకు అప్పగిస్తున్న వైనం వెలుగుచూసింది. ఇలా దుబాయ్ లో చిక్కుకొన్న ఓ మహిళ తప్పించుకొని భారత్‌కు రావడంతో విషయం వెలుగుచూసింది. విషయం తెలుసుకున్న ఏజెంట్లు... ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాధిత మహిళను చంపేస్తామని బెదిరిస్తున్నారు. 

 

20:37 - January 3, 2016

చంఢీఘర్ : పంజాబ్‌ పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోంది. నిన్న నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు...ఇవాళ ఉదయం మరో ఇద్దరు ఉగ్రవాదులు ఇంకా ఎయిర్‌బేస్‌లోనే దాక్కున్నారని తెలుసుకుని వేట ముమ్మరం చేశాయి. ఉదయం నుంచి కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇవాళ మరో టెర్రరిస్ట్‌ను మట్టుబెట్టారు. మరొక ఉగ్రవాది కోసం వెతుకుతున్నారు. వివిధ విభాగాలు సమన్వయంతో ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. మరోవైపు ఉగ్రవాదుల దాడుల్లో ఏడుగురు జవాన్లు వీర మరణం పొందారని ప్రభుత్వం ప్రకటించింది. మరో 20 మంది సైనికులు గాయపడ్డారని తెలిపింది. వైమానిక స్థావరంలో ఆపరేషన్ దాదాపు ఆఖరి దశకు చేరిందని చెప్పింది. అయితే ఎయిర్‌బేస్‌లో ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారనే దానిపై క్లారిటీ రావడం లేదు.

 

20:35 - January 3, 2016

తూర్పుగోదావరి : విజయవాడలో జరిగిన కాల్ మనీ వ్యవహారం సద్దుమనుగకముందే... తూర్పుగోదావరి జిల్లాలో మరో 'కాల్‌మనీ-సెక్స్ రాకెట్' తరహా దందా వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లాలో అప్పులు తీసుకున్న మహిళలు వాటిని తీర్చలేకపోతే... దుబాయిలో ఉద్యోగానికి వెళ్లాలని దళారులు బెదిరిస్తున్నారు. అలా వెళ్లిన వారిని.. దుబాయ్‌ లో వ్యభిచార ముఠాలకు అప్పగిస్తున్న వైనం వెలుగుచూసింది. తూర్పుగోదావరి జిల్లా రాజంపేట మండలానికి చెందిన రాజేశ్వరి అనే మహిళకు పని ఇప్పిస్తామని చెప్పి.. అదే జిల్లాకు చెందిన ఏసురత్నం, రామకృష్ణలు ఆమెను దశలవారిగా అమ్ముతూ... చివరికి దుబాయ్‌ లో వ్యభిచార ముఠాలకు అప్పగించారు. అయితే దుబాయ్ లో చిక్కుకొన్న ఆమె తప్పించుకొని భారత్‌కు వచ్చి.. విజయవాడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఏజెంట్లు... ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాధిత మహిళ, ఆమె భర్తను చంపేస్తామని బెదిరించారు. తమకు రక్షణ కల్పించాలంటూ విజయవాడలోని డీజీపీ ఆఫీస్‌కు వెళ్లారు. అయితే అక్కడ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కాకినాడలోని పోలీసు కార్యాలయానికి వెళ్లారు.
బాధితురాలు... రాజేశ్వరి
'నిన్ను నీ భర్త వేధిస్తున్నాడు కదా.... నీకు.. నీ భర్తకు విడాకులు ఇప్పిస్తామని ఏజెంట్లు అన్నారు. నాకు వేరే పెళ్లి చేస్తామన్నారు. నన్ను దుబాయ్ సేట్లకు అమ్మేశారు. అక్కడ వారు నన్ను పాడు చేశారు. తీవ్ర లైంగికవేధింపులకు గురి చేశారు. వ్యభిచార గృహంలో ఉంచారు. నాకు బతుకుదామని లేదు. చావాలని ఉంది' అని రాజేశ్వరి కన్నీరుమున్నీరయ్యారు. 

 

20:21 - January 3, 2016

కృష్ణా : జిల్లాలోని నూజివీడు మండలం గొల్లపల్లి ఇండియన్ బ్యాంక్ లో గోల్ మాల్ జరిగింది. దాదాపు కోటి 75 లక్షలు స్వాహా అయ్యాయి. గతంలో బ్యాంక్ లో పని చేసిన వెంకట విజయ్ కృష్ణ అనే వ్యక్తి కాజేసినట్లుగా అధికారులు గుర్తించారు. వివిధ అకౌంట్ల నుండి తన అకౌంట్లోకి డబ్బులు వేసుకున్నట్లు అధికారులు గుర్తించి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

19:53 - January 3, 2016

విజయనగరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 12వ రాష్ట్ర మహాసభలు విజయనగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసభల సందర్భంగా మున్సిపల్ కార్మికులు పట్టణంలో భారీ ప్రదర్శన చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ నుంచి కోట జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం కోట జంక్షన్ లో బహిరంగ సభ జరిగింది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, పారిశుధ్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు... పట్టణాలను, పల్లెలను పరిశుభ్రం చేస్తున్న మున్సిపల్ కార్మికుల గురించి ఏనాడైనా పట్టించుకున్నారా అంటూ నిలదీశారు. కనీస వేతనాలు, పిఆర్ సి కోసం కార్మికులు చేసిన పోరాటాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు.

 

19:49 - January 3, 2016

ప్రకాశం : జిల్లాలో చీరాలలో విషాదం నెలకొంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం నుంచి చీరాల బీచ్‌కు వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ యువకుడు మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన యెలక్షన్ రెడ్డి ఆస్ట్రేలియాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. విహార యాత్ర కోసం స్నేహితులతో కలిసి ప్రకాశం జిల్లా చీరాల రామాపురం బీచ్‌కు వచ్చాడు. అయితే సముద్రంలో ఈతకు వెళ్లి ..ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. అయితే మృతుని బందువులు మాత్రం రిసార్ట్ నిర్వాహకులు సకాలంలో స్పందించని కారణంగానే యెలక్షన్ రెడ్డి మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. బీచ్ పరిసరాల్లో భద్రతాపరమైన చర్యలు చేపట్టడంలో బీచ్ రీసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

19:39 - January 3, 2016

నెల్లూరు : స్మార్ట్ టెక్నాలజీతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు..అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్థి చేస్తామన్నారు. ఏపీలో సాగునీటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని..దానికి వేల కోట్లు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. 

19:35 - January 3, 2016

ఖమ్మం : అమెరికా అమ్మాయి, ఇండియా అబ్బాయి వివాహంతో ఒక్కటయ్యారు. ఖమ్మంలో ఈ పెళ్లి ఘనంగా జరిగింది. నగరానికి చెందిన కృష్ణ చైతన్య యూఎస్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. అదే ఆస్పత్రిలో పనిచేసే మేఘనతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో ఈ ప్రేమికులు ఒక్కటయ్యారు. భారత సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది.

 

 

19:32 - January 3, 2016

నిజామాబాద్ : అంకాపూర్‌...! ఆదర్శ సేద్యానికి భాష్యం చెప్పిన గ్రామం..! సాగునీటిని పొదుపుగా వాడడం ఎలాగో సాటి రైతాంగానికి నేర్పిన గ్రామం. తక్కువ నీటితో... అతి తక్కువ ఖర్చుతో.. వాణిజ్య పంటలు సాగు చేసి.. అధిక దిగుబడులు సాధించిన ఆదర్శ గ్రామం. కానీ నేడా గ్రామం.. తీవ్రమైన సాగునీటి సమస్యతో సతమతమవుతోంది. 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా వర్షాభావం తీవ్రతను చవిచూస్తున్నారిక్కడి రైతులు. అంకాపూర్‌ రైతుల గోసపై 10tv కథనం.

విత్తన భాండాగారంపై వర్షాభావ ప్రభావం...

విత్తన భాండాగారంపై వర్షాభావ ప్రభావం... ఇంకిపోయిన భూగర్భ జలాలు.. ఒట్టిపోయిన వ్యవసాయ బోర్లు.. గ్రామ చరిత్రలోనే తొలిసారిగా ఎండిపోయిన పసుపు పంట..
దేశానికే తలమానికంగా అంకాపూర్‌ రైతు

నీటి పొదుపులోను.. వాణిజ్య పంటల సేద్యంలోనూ.. దేశానికే తలమానికంగా నిలిచిన అంకాపూర్‌ రైతు.. నేడు వర్షాభావం దెబ్బకు కుదేలైపోతున్నాడు. రెండేళ్లుగా వేధిస్తోన్న తీవ్ర వర్షాభావం వల్ల.. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయి.. పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. పసుపు, ఎర్రజొన్న పంటలు తలలు వాల్చేశాయి. పంటలు ఎండిపోతే ఎలా ఉంటుందో తొలిసారిగా అనుభవంలోకి రావడంతో.. అంకాపూర్‌ రైతులు తల్లడిల్లి పోతున్నారు.

విత్తన గ్రామానికే విత్తనాలు కరవయ్యే దుస్థితి
 

అంకాపూర్‌లో ఇప్పటికే పంట విస్తీర్ణం సగానికిపైగా పడిపోయింది. ఏటా 40వేల ఎకరాల వరకూ సాగు చేస్తారు. ఈసారి 18వేల ఎకరాల మేరకే సాగు చేశారు. ఫలితంగా విత్తన గ్రామంగా పేరున్న గ్రామానికే విత్తనాలు కరువయ్యే పరిస్థితి ఏర్పడింది. అంకాపూర్‌ ప్రధాన కేంద్రంగా.. ఎర్రజొన్నల వ్యాపారం జరుగుతుంది. నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 200 గ్రామాల రైతులు.. అంకాపూర్‌లో పండే జొన్న విత్తనాలనే కొని.. తమ పొలాల్లో విత్తుతారు. అంతేకాదు.. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌లలో ఇక్కడి విత్తనాలను గడ్డి విత్తులుగా వినియోగిస్తారు. అక్కడి నుంచి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లకు ఎగుమతి చేస్తుంటారు.

ఎండిపోయిన 1168 బోర్లు

రెండేళ్లుగా వేధిస్తోన్న తీవ్ర వర్షాభావం వల్ల భూగర్భజలాలు ఇంకిపోయాయి. దీంతో గ్రామంలోని 1168 బోర్లూ ఎండిపోయాయి. అటు గుత్ఫ ఎత్తిపోతల పథకం కూడా రైతులకు చేయిచ్చింది. దీనికి తోడు.. చలి తీవ్రత కూడా రైతులను నట్టేట ముంచింది. నవంబర్‌, డిసెంబర్‌లలో చలితీవ్రత ఎక్కువగా ఉంటే ఎర్రజొన్నలకు మేలు జరిగేది. కానీ చలి అంతంత మాత్రమే కావడంతో.. పసుపు, ఎర్రజొన్నలకు సాగునీరు అందకపోవడంతో.. పంటలు ఎండిపోయాయని రైతులు చెబుతున్నారు.

1500 ఎకరాలకు గాను 400 ఎకరాల్లోనే సేద్యం

గతంలో కరవు పరిస్థితులు తలెత్తినా.. ఎర్రజొన్న రైతులను ఆదుకునేది. అత్యల్ప నీటితో పండే ఎర్రజొన్నతో రైతులు లాభాలు పొందేవారు. అంకాపూర్‌లో ఏటా పదిహేను వందల ఎకరాల్లో సాగయ్యే ఎర్రజొన్న.. ఈసారి 400 ఎకరాలకు మించలేదు. ఎర్రజొన్న పంటపై ఆశలు పెట్టుకున్న రైతులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. విత్తన పంట కూడా ఎండిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్‌ ఎక్కడికి వెళ్లినా అంకాపూర్‌ గురించిన ప్రస్తావన తెస్తున్నారు. ఆయనే తమ గ్రామ ఘనత కొనసాగేలా.. ప్రస్తుత సీజన్‌లో తమను ఆదుకోవాలని అంకాపూర్‌ రైతులు కోరుతున్నారు.

 

 

19:24 - January 3, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ మంత్రి విజయరామారావు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో... సీఎం కేసీఆర్ విజయరామారావుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ హయాంలో విజయరామారావు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

 

18:55 - January 3, 2016

రంగారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నా.. డీఎస్సీ ప్రకటిండంలో ఏడాదిన్నర కాలంగా తాత్సారం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.

 

18:49 - January 3, 2016

ఆదిలాబాద్‌ : జిల్లాలో కదం తొక్కారు గిరిజనులు.. భారీ ర్యాలీగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం సభలకు వచ్చారు. ఈ కార్యక్రమానికి త్రిపుర మాజీమంత్రి జితిన్‌ చౌదరి, సీపీఎం నేతలు సున్నం రాజయ్యతోపాటు... పలువురు ప్రముఖులు హాజరయ్యారు.. గిరిజనుల సమస్యలపై చర్చించారు.. ఉట్నూర్‌లో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

 

18:46 - January 3, 2016

హైదరాబాద్ : టిఆర్ ఎస్ ప్రభుత్వం హైదరాబాదీలకు ఏం చేసిందని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి గ్రేటర్ పీఠం కైవసం చేసుకోవడానికి... మంత్రులంతా ఇక్కడే తిష్టవేశారని ఆయన ఆరోపించారు. అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆరా.. కేటీఆరా అర్థం కావడం లేదన్నారు.

 

జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు...

హైదరాబాద్ : నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జింక వేటతో మరోసారి వార్తల్లోకెక్కింది. గచ్చిబౌలిలోని హెచ్ సీయూలో జింక మాంసం కలకలం రేపింది. జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జింకను చంపింది ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

18:37 - January 3, 2016

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జింక వేటతో మరోసారి వార్తల్లోకెక్కింది. హెచ్ సీయూలో జింక వేట కలకలం సృష్టించింది. వర్శిటీలో జింకను వేటాడి చంపిన ఫైరింగ్‌ రేంజ్ ఆఫీసర్‌ గోవిందరావును పోలీసులు అరెస్టు చేశారు. ముందు కుక్కల దాడిలో జింక చనిపోయిందని గోవిందరావు పోలీసులకు చెప్పారు. అయితే అంతకుముందు గచ్చిబౌలి సమీపంలో జింక మాంసం అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని ద్వారా వివరాలు సేకరించారు. జింకవేటలో ఇంకా ఎవరి హస్తం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

18:25 - January 3, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. గ్రేటర్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నికల పర్యవేక్షణ కేటీఆర్, కవితలకు అప్పగించారు. నారాయణఖేఢ్‌ బైపోల్ బాధ్యత హరీష్‌కు అప్పగించారు. 110 స్థానాలపై పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గ్రేటర్ లో మెజార్టీ స్థానాలు టీఆర్ ఎస్ వే అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

 

ప్రతి నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీసు : తుమ్మల

హైదరాబాద్: రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసి బస్సు వెళ్లేలా 231 కోట్ల రూపాయలతో 147 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. అలాగే ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో కోటిన్నర రూపాయలతో ఎమ్మెల్యే క్యాంప్ నిర్మాణానికి రేపు టెండర్లను ఆహ్వానిస్తున్నామని తుమ్మల స్పష్టం చేశారు. క్యాంప్ ఆఫీసు నిర్మాణాలకు సోమవారం టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. యాదగిరిగుట్ట నుంచి వరంగల్‌ వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి రేపు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి శంకుస్థాపన చేస్తారని  తెలిపారు.

18:01 - January 3, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసి బస్సు వెళ్లేలా 231 కోట్ల రూపాయలతో 147 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. అలాగే ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో కోటిన్నర రూపాయలతో ఎమ్మెల్యే క్యాంప్ నిర్మాణానికి రేపు టెండర్లను ఆహ్వానిస్తున్నామని తుమ్మల స్పష్టం చేశారు. క్యాంప్ ఆఫీసు నిర్మాణాలకు సోమవారం టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. యాదగిరిగుట్ట నుంచి వరంగల్‌ వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి రేపు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కేంద్రమంత్రితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

 

17:53 - January 3, 2016

చంఢీఘర్ : పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. దీంతో నిన్నటి నుంచి ఐదుగురు తీవ్రవాదులు చనిపోయారు. ఎయిర్‌ బేస్‌లోనే ఉన్న మరో ఉగ్రవాది కోసం గాలిస్తున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారికి గాయాలయ్యాయి. 

 

17:46 - January 3, 2016

వరంగల్ : 'మేం ఇక్కడే ఉంటాం... ఇలానే ఉంటాం. ఇక్కడే పుట్టాం... ఇక్కడే చస్తాం. అభివృద్ధి పేరుతో మా ఇళ్లను కూల్చొద్దు. మా జీవితాల్ని ఆగం చేయోద్దు' వరంగల్‌లోని పేదల ఆక్రందనిది. గుడిసెల్ని ఖాళీచేయాలంటూ అధికారులు బెదిరిస్తున్నారు. రాజకీయ నాయకులేమో గోడు వినిపించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా అభివృద్ధి అంటూ ప్రశ్నిస్తున్నారు.

పేదలగూడుపై డబుల్ బెడ్ రూం ప్రభావం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పేదల గూడుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కొత్త ఇళ్లను నిర్మిస్తామంటున్న అధికారులు ఉన్న గుడిసెల్ని ఖాళీ చేయాలంటున్నా రు. లేకపోతే అధికారికంగా ఉన్న అన్ని సౌకర్యాలు రద్దు చేసి, రోడ్డున పడేస్తామని బెదిరిస్తున్నారు. ఇదే మురికి వాడలో పుట్టాం ఇక్కడే చస్తాం అంటున్నారు ఇదీ వరంగల్ జిల్లా ఎస్ ఆర్ నగర్ వాసుల గోడు.ఇళ్లు ఉన్నాయి , బడి, గుడి సకల సౌకర్యాలు ఉన్నాయి. మాకు జీ ప్లస్ వన్ వద్దంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఉన్న దాంతో సంతోషంగా ఉన్నాం

ఉన్న కొద్దిపాటి గుడిసెల్లో సంతోషంగా ఉన్నామని , తమలో చాలామంది గత ప్రభుత్వ పథకాలతో ఇళ్లు కట్టించుకున్నామని వాపోతున్నారు. ఎస్ ఆర్ నగర్ లో డబుల్ బెడ్ రూం లు కట్టిస్తాం ఉన్నపలంగా ఖాళీ చేయాలంటూ అధికారులు బెదిరిస్తున్నారని తెలుపుతున్నారు కాలనీ వాసులు ఇళ్లు లేని వారి కోసం నిర్మించాల్సినవి డబుల్ బెడ్ రూంలని కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసమే నిర్మిస్తోందని అధికారులు నచ్చచెబుతున్నా కాలనీ వాసులు ససేమిరా అంటున్నారు.

అభివృద్ది పేరుతో తమ ఇళ్లను కూల్చొద్దు

ఇప్పటికి ఎలాంటి వసతులు కల్పించకపోయినా కాలనీలో అందరం కలిసిమెలిసి ఉంటున్నామంటున్నారు ఎస్ ఆర్ నగర్ వాసులు. అందరం దాదాపు పూరి గుడిసెల్లోనే నివసిస్తున్నామని ఇన్నాళల్లు ఎవరూ పట్టించుకోకపోయినా తమే కష్టపడి రోడ్డు వేసుకున్నామని వాపోతున్నారు. అభివృద్దిపేరుతో తమ ఇళ్లను కూల్చేస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేస్తున్నారు ఎస్ ఆర్ నగర్ వాసులు.

పట్టించుకోని ఎమ్మెల్యే ఆరూరి రమేష్

దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని , ఎస్ ఆర్ నగర్ కాలనీ వాసుల అభీష్టం మేరకే పనులు జరుగుతాయని హామీ ఇచ్చారంటున్నారు. దీనిపై నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కి తమ గోడు విన్నవించామని అయినా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి ఖాళీ చేయాల్సిందే అంటూ ఒత్తిడితెస్తున్నారని ఎస్ ఆర్ నగర్ వాసులు బోరుమంటున్నారు.

వాస్తవానికి భిన్నంగా పరిస్థితులు

రాష్ట్రంలో ఇళ్లులేని వారు ఉండకూడదంటూ సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామంటూ ఊదరగొడుతున్నారు. కాని వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. 'ఉన్న ఇళ్లను కూల్చి అక్కడే ఇళ్లు కట్టిస్తామంటూ మా బత్రుకులను ఛిద్రం చేయొద్దంటూ వేడుకుంటున్నారు' ఎస్ ఆర్ నగర్ వాసులు. మరి కాలనీవాసులు మనసులు కేసీఆర్ గెలుచుకుంటారా లేక డబుల్ బెడ్ రూం లు నిర్మించి తీరుతారా అన్నది వేచిచూడాలి.

 

 

17:37 - January 3, 2016

ఢిల్లీ : సీనియర్‌ కమ్యూనిస్ట్ నేత ఏబీ బర్దన్‌ మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయంలో బర్దన్‌ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా నేతలు బర్దన్‌కు నివాళులు అర్పించారు. వామపక్ష ఉద్యమానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

 

17:27 - January 3, 2016

కడప : వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు బలి అయ్యాడు. జిల్లాలోని రాజంపేటలో వైద్యం వికటించి శిశువు ప్రాణాలు కోల్పోయాడు. పెనగలూరు మండలం ఒబిలి గ్రామానికి చెందిన కిశోర్‌, ఇందిరమ్మ దంపతులు. ఇందిరమ్మ నిన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారి జన్మించాడు. బాబు ఆరోగ్యం బాగాలేదంటూ వైద్యుల సలహాతో తల్లిదండ్రులు.. శిశువును చిన్న పిల్లల ఆస్పత్రిలో చేర్చారు. ఇవాళ చిన్నారికి నర్సులు ఒకేసారి 6 ఇంజక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికే చిన్నారి కాళ్లు చేతులు కొట్టుకుంటూ ఏడవడం మొదలుపెట్టాడు. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని వైద్యులు, నర్సులకు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇంతలో చిన్నారి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు చనిపోయాడంటూ తల్లిదండ్రులు ఆస్పత్రిముందు ఆందోళనకు దిగారు.

 

17:16 - January 3, 2016

తిరుమల : హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని టిటిడిపి నేత రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు టీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను ఇంతవరకూ అమలు చేయలేదని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి మొత్తం తెలుగుదేశం హయాంలో జరిగిందేనన్నారు.

 

 

'గ్రేటర్' లో కాంగ్రెస్ దే విజయం : వీహెచ్

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో టీఆర్ ఎస్ హవా ఎప్పటికీ ఉండదని చెప్పారు. కాంగ్రెస్ లో కొందరు కోవర్టులున్నారని...వారి వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయామని తెలిపారు. 

16:52 - January 3, 2016

గుజరాత్ : అమ్రేలి జిల్లా జఫ్రాబాద్ పట్టణంలో సింహం కలకలం రేపింది. పట్టణానికి సమీపంలోని సముద్ర తీరం దగ్గర సంచరించడంతో స్థానిక ప్రజలు భయంతో కేకలు వేశారు. దీంతో సింహం సముద్రంలోకి దూకి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది.స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి సింహాన్ని పట్టుకున్నారు. అనంతరం జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు.

 

16:49 - January 3, 2016

కర్నాటక : ఢిల్లీ విధానం అందరికీ దారి చూపుతోందా... పొల్యూషన్‌ను కంట్రోల్‌ చేయడానికి అదే పక్కా ఫార్మూలా కాబోతుందా..? ఇతర రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్‌ చేయాలని భావిస్తున్నాయా..? దేశంలో ప్రముఖ నగరాలూ ఇదే బాటలో పయనించబోతున్నాయా.. అటూఇటుగా అన్నిచోట్లా అవుననే సమాధానమే వస్తోంది. దేశ రాజదాని ఢిల్లీలో అమలు చేస్తున్న సరిబేసి విధానాన్ని బెంగళూరులోనూ అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది.
సరి, బేసి విధానంపై దేశవ్యాప్తంగా చర్చ.
రాజధానిలో చేయి దాటిపోయిన కాలుష్యాన్ని కంట్రోల్‌ చేయడానికి ఆప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన సరి బేసి విధానంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. జనవరి 1 నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ విధానంపై ఇతర రాష్ట్రాలూ ఇంట్రస్ట్ చూపుతున్నాయి. పొల్యూషన్‌కు సరి బేసి విధానమే సొల్యూషన్‌ అన్న భావనకు వస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం కూడా సరి బేసి విధానంపై లోతుగా ఆలోచిస్తోంది. బెంగళూరు నగరంలో దీన్ని అమలు చేయాలని భావిస్తోంది.
'సరి బేసి'పై కర్ణాటక సర్కార్‌ దృష్టి
బెంగళూరులో ఇప్పటికే కాలుష్యం కంట్రోల్‌ దాటిపోయింది. రోజు రోజుకూ ట్రాఫిక్‌ పెరిగిపోవడంతో నగరంలో పొల్యూషన్‌ పరిమితి మించిపోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అమలవుతున్న సరి బేసి విధానంపై కర్ణాటక సర్కార్‌ దృష్టి సారించిన కన్నడ సర్కారు.. సాధ్యాసాధ్యలపై వివిధ శాఖల అధికారులతో చర్చిస్తోంది.
కొన్ని రోజుల తర్వాత సరిబేసి పై ఆప్ సర్కార్ సమీక్ష
ఢిల్లీలో సరిబేస్‌ విధానాన్ని ప్రవేశపెట్టిన ఆప్‌ ప్రభుత్వం కొన్ని రోజుల తర్వాత దీన్ని సమీక్షించనుంది. అనంతరం పూర్తిస్థాయిలో యథాతథంగా అమలు చేయాలా..? లేక ఏవైనా సవరణలు చేయాలా అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని.. సరిబేసి విధానంపై నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకోనుంది. కర్ణాటక ప్రభుత్వం కూడా సరిబేసి విధానంపై... సంప్రదింపులు జరుపుతూనే.. ఢిల్లీ ప్రభుత్వ అనుభవాలనూ పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాని యోచిస్తోంది.

 

16:44 - January 3, 2016

వరంగల్ : హోంవర్క్ చేయలేదంటే బట్టలూడదీసి చితకబాదుతారు. టీచర్లకు ఏమాత్రం చిరాకొచ్చినా కేవలం ఆ 25 మందినే టార్గెట్‌ చేసి కొడతారు. ప్రాజెక్ట్ వర్క్ చేయకపోయినా ఆ 25మందిపైనే ప్రతాపం చూపిస్తారు. ఇంతకు వారు చేసిన తప్పేంటి.? ముక్కుపచ్చలారని ఆ చిన్నారులు ఎందుకు వేధింపబడుతున్నారు.? వీరేం చేసినా స్కూల్ దృష్టిలో అది మహాపాపమే.. ఆడపిల్లలైనా సరే అందరిముందరా వీరిపట్ల అమానవీయంగా వ్యవహరిస్తారు. వీరు చేసిన తప్పల్లా ఒకటే. విద్యాహక్కు చట్టం ప్రకారం ఈ ప్రైవేట్ పాఠశాలలో చేరడమే.
హోంవర్క్, ప్రాజెక్ట్ వర్క్ ల పేరిట విద్యార్థులకు చుక్కలు
వరంగల్‌ జిల్లా పరకాల పట్టణ శివారులోని జ్యోతి కాన్వెంట్‌ స్కూల్‌లో హోం వర్క్, ప్రాజెక్ట్ వర్క్ ల పేరిట విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నారు. తాము చెప్పినట్లుగా ప్రవర్తించడం లేదని స్టూడెంట్స్‌పై ప్రతాపం చూపిస్తున్నారు. డిసెంబర్‌ 31న ఒకే తరగతికి చెందిన 25 మంది బాలుర వస్త్రాలు ఊడదీసిమరీ చితకబాదారు. విషయం తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలిసింది. చిన్నారులను కొట్టడంపై వాళ్ల తల్లిదండ్రులు స్కూల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వాళ్లు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. తమ స్కూల్‌లో హోంవర్క్ లు, ప్రాజెక్ట్ వర్క్ లు చేయకపోతే పనిష్మెంట్‌ ఇలాగే ఉంటుందని బుకాయించారు. నిజానికి కారణం వేరే ఉంది.
ఫీజు మినహాయింపుతో విద్యార్థులపై చులక
బాధితులైన 25 మంది విద్యార్థులు విద్యాహక్కు చట్టం ద్వారా ఈ పాఠశాలలో చేరారు. వారికి ఫీజుల్లో మినహాయింపు ఉండడంతో యాజమాన్యం చులకనగా చూస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకపక్క ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, చట్టాన్ని నీరుగార్చే పాఠశాలలపై చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రైవేట్‌ పాఠశాలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. హోం వర్క్‌ చేయలేదనే ఆరోపణలతో విద్యార్థినుల జుట్టు కత్తిరించేందుకు సైతం టీచర్లు తెగబడుతున్నారు. విద్యార్థులపై వేధింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదులందగా హెరాష్‌మెంట్ నిజమేనని తేలింది.
యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి : విద్యార్థి సంఘాలు
పేద విద్యార్థులపట్ల అమానుషంగా వ్యవహరిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యా హక్కు చట్టం కింద ఫ్రీ అడ్మిషన్ పొందే విద్యార్థులపట్ల పాఠశాల యాజమాన్యాలు చులకనగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న జ్యోతి కాన్వెంట్‌లాంటి సంస్థలు తెలంగాణలో ఇంకెన్ని ఉన్నాయో.! ఇంకెంతమంది విద్యార్థులు వేధింపులకు గురవుతున్నారో.!

 

నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

నెల్లూరు : జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోలనకు గురయ్యారు. 

గులాబీ గూటికి విజయరామారావు

హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేతచ మాజీ మంత్రి విజయరామారావు గులాబీ గూటికి చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఇవాళ ఆయన టీఆర్ ఎస్ పార్టీలో చేశారు. ఆ పార్టీ కండువా కప్పి కేసీఆర్ విజయరామారావును పార్టీలోకి ఆహ్వానించారు. 

టీఆర్ ఎస్ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం

హైదరాబాద్ : టీఆర్ ఎస్ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం అయింది. జీహెచ్ ఎంసీ ఎన్నికలతోపాటు పలు విషయాలపై నేతలు చర్చించనున్నారు. 

భద్రతాదళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం...

చంఢీఘర్ : పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో మళ్లీ కాల్పులు జరిగాయి. ఎయిర్ బేస్ లో మరో ఇద్దరు ఉగ్రవాదులున్నారు. ఇండియన్ ఆర్మీ, జవాన్లపై ఉగ్రవాదులు మరోసారి కాల్పులు ప్రారంభించారు. దానికి ప్రతిగా భద్రతాదళాలు ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవానుకు గాయాలయ్యాయి. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

పఠాన్ కోట్ లో మళ్లీ కాల్పులు..

చంఢీఘర్ : పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో మళ్లీ కాల్పులు జరిగాయి. ఎయిర్ బేస్ లో మరో ఇద్దరు ఉగ్రవాదులున్నారు. ఇండియన్ ఆర్మీ, జవాన్లపై ఉగ్రవాదులు మరోసారి కాల్పులు ప్రారంభించారు. దానికి ప్రతిగా భద్రతాదళాలు ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్నారు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

15:23 - January 3, 2016

చంఢీఘర్ : పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో మళ్లీ కాల్పులు జరిగాయి. ఎయిర్ బేస్ లో మరో ఇద్దరు ఉగ్రవాదులున్నారు. ఇండియన్ ఆర్మీ, జవాన్లపై ఉగ్రవాదులు మరోసారి కాల్పులు ప్రారంభించారు. దానికి ప్రతిగా భద్రతాదళాలు ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్నారు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పఠాన్ కోట్ లో మళ్లీ కాల్పులు జరుగడంతో కేంద్ర హోంశాఖ, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్ స్క్వాడ్లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఐఎస్ ఐఎస్ సంస్థ ఒక మీటింగ్ నిర్వహించినట్లు సమాచారం. ఢిల్లీలో బాంబు పేలుడు జరపాలని ఉగ్రవాదులు భావించినట్లు నిఘా వర్గాలు తెలిపారు. ఈనేపథ్యంలో ఢిల్లీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాంబు పేలుడు.... జవాను మృతి
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో తాజాగా బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒక జవాను మృతి చెందాడు. ఆర్మీ జవాన్లు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఐతే పేలుడుకు సంబంధించి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా… వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోపక్క ఉగ్రదాడిపై దర్యాప్తుకు సంబంధించి ఎనిమిది మంది సభ్యుల ఎన్ఐఏ బృందం పఠాన్‌కోట్‌కు చేరింది.

 

14:56 - January 3, 2016

హైదరాబాద్ : బర్దన్ అందరికీ ఆదర్శప్రాయుడని... ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తెలిపారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బర్దన్‌ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడడారు. విద్యార్థి నేతగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బర్దన్‌ సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు. బర్దన్‌ మరణం వామపక్షాలకు తీరనిలోటని నేతలు అన్నారు.

 

14:53 - January 3, 2016

హైదరాబాద్: విద్యా, ఉద్యోగ రంగాల్లో ఏబీసీడీ వర్గీకరణ ఉన్నట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోను వర్గీకరణలు ఉండాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని క్రమబద్ధీ కరించాలన్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో కండ బలం ఉన్న నేతలే గెలిచేందుకు ముందుకు వస్తున్నారని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నాణ్యమైన, స్వచ్చమైన ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్లీన్ పాలిటిక్స్ నినాదంతో ఎన్నికల్లో పాల్గొంటామని తమ్మినేని స్పష్టం చేశారు.

 

కేంద్రంపై సీఎం చంద్రబాబు ప్రసంశలు

హైదరాబాద్ : ఎపికి కేంద్రం ఇచ్చిన సహాయం తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే సహాయానికి ధన్యావాదాలు తెలిపారు. తెలంగాణలోని ఏడు మండలాలను కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎపిలో కలిపారని చెప్పారు. ఆ మండలాలను ఎపిలో విలీనం చేయకపోతే పోలవరం ప్రాజెక్టు వచ్చేది కాదని... నదుల అనుసంధానం జరిగివుండేది కాదన్నారు. 

14:48 - January 3, 2016

నెల్లూరు : ఎపికి కేంద్రం ఇచ్చిన సహాయం తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే సహాయానికి ధన్యావాదాలు తెలిపారు. తెలంగాణలోని ఏడు మండలాలను కేంద్రప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎపిలో కలిపారని చెప్పారు. ఆ మండలాలను ఎపిలో విలీనం చేయకపోతే పోలవరం ప్రాజెక్టు వచ్చేది కాదని... నదుల అనుసంధానం జరిగివుండేది కాదన్నారు. ఎపిలో ఏడు మండలాల విలీనం, పోలవరం ప్రాజెక్టుతోపాటు నదుల అనుసంధానం ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఘనతే అన్నారు. సమయస్ఫూర్తిగా కేంద్రం సహాయం చేశారు. హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అప్పటి ప్రధాని వాజ్ పేయి పూర్తిగా సహకరించారని గుర్తు చేశారు. ఈసందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిపై చంద్రబాబు ప్రశంసల జల్లుకురిపించారు. లక్షా 93 వేల ఇళ్లు ఒక్క ఎపికే ఇచ్చారని.. ఇందులో వెంకయ్య కృషి ఉందన్నారు. వెంకయ్యనాయుడు ఎప్పుడూ అభివృద్ధి గురించే మాట్లాడతారని పేర్కొన్నారు. ఎపి అభివృద్ధికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించడంలో ఎంతగానో కృషి చేస్తున్నారని వివరించారు. 

14:32 - January 3, 2016

ఢిలీ : దేశ రాజదానికి మరోసారి ఉగ్రముప్పు పొంచిఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జైష్ ఎ అహ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడినట్లు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన పోలీసు కమిషనర్ పారా మిలటరీ బలగాలను పంపించాలని కేంద్రానిని కోరారు. కాగా ఉగ్రవాదులు బారీ దాడికి పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడందో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో క్షణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 

14:31 - January 3, 2016

హైదరాబాద్  : నగరంలోని బంజారాహిల్స్ లో జపనీస్ పార్క్ ను మంత్రి కేటీఆర్  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు విచ్చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 వేల కోట్ల రూపాయలతో మల్టీ ఫ్లై ఓవర్ నిర్మించాలని తలపెట్టినందుకు ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ రహిత నగరాన్ని నిర్మించాలనే ధృడనిశ్చయంతో కేసీఆర్ ఉన్నారని తెలిపారు. 

14:30 - January 3, 2016

హైదరాబాద్ : నీటిపారుదల రంగంపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్‌ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ప్రాజెక్టుల పనుల్ల వేగం పెంచాలని ఆధికారులకు సూచించారు హరీశ్ రావు. మిషన్‌ కాకతీయ రెండో దశ పనుల ప్రతిపాదనలు పంపాలని కోరారు. తెలంగాణ జల వనరుల వినియోగంపై కసరత్తులు నిర్వహిస్తున్నారు.

పంజాబ్ లో బాంబు పేలి కమాండో మృతి

పంజాబ్ : పఠాన్ కోట్  ఎయిర్ బేస్ లో మళ్లీ కాల్పులు జరిగాయి. పఠాన్ కోట్ వైమానిక స్థావరంలో భద్రతాదళాలు తనిఖీలు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఐఈడీ బాంబు పేలి ఎన్ ఎస్ జీ కమాండో మృతి చెందాడు. 

బర్దన్ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు : తమ్మినేని

హైదరాబాద్ : సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. క్లీన్ పాలిటిక్స్ నినాదంతో జీహెచ్ ఎంసీ ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలపై వస్తున్న సర్వేల్లో వాస్తవం లేదన్నారు. నిజాయితీగా పని చేసే వారినే ఓటర్లు ఎన్నుకోవాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. 

13:21 - January 3, 2016

వనితా కవితా లత మనలేవు లేక జత అన్నాడో సినీ కవి. నిజమే సాహితీరంగంలో కృషిచేసే కవులకు కళాకారులకు ప్రోత్సాహం అవసరం. అలాంటి సాహితీ వేదికలు, సాంస్కృతిక సంస్థలు చాలా తక్కువగానే కనిపిస్తాయి. అలాంటి సంస్థల్లో ఖమ్మంజిల్లాకు చెందిన మువ్వా రంగయ్య పద్మావతీ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి. ఈ సంస్థ ప్రతి యేటా సుప్రసిద్ద కవులకు, కళాకారులకు  అవార్డులు ప్రదానం చేస్తోంది. ప్రముఖులు రాసిన పుస్తకాలను ఆవిష్కరిస్తోంది. సాహితీ మూర్తులను పురస్కారాలతో గౌరవిస్తుంది. ఈ ఏడాదికూడా ప్రముఖ వాగ్గేయకారుడు గోరటి వెంన్నకు సాహితీపురస్కారం అందచేసింది. ప్రముఖ కవి అరుణ్ సాగర్ రాసినమ్యూజిక్ డైరి కవితా సంకలనాన్ని,కె.శ్రీనివాస్ రాసిన తెలంగాణా సాహిత్య చరిత్ర గ్రంథాన్ని ఆవిష్కరిస్తూ సాహితీ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఆ విశేషాలేంటో వీడియోలో చూద్దాం....

13:18 - January 3, 2016

జూపాక సుభద్ర .. ఈ పేరు వింటేనే ఒక దళిత ధిక్కార స్వరం కంచుకంఠంతో ధ్వనిస్తుంది. తెలంగాణా దళిత వాడల విషాద జీవనకథనాలు కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. దళిత స్త్రీల గుండె ఘోషలు వినిపిస్తాయి. తెలంగాణా దళిత స్త్రీల వేదనలను విషాద జీవితాలను కథలుగా కవితలుగా అక్షరబద్ధం చేసిన ప్రముఖ కవయిత్రి కథనశిల్పి జూపాక సుభద్ర సాహిత్యాన్ని విశ్లేషిస్తారు ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య.. నేటి ధిక్కార స్వరంలో ...

13:16 - January 3, 2016

సాహిత్యం సామాజిక మార్పుకు దోహదపడుతుంది.మానసిక వికాసానికి వేదిక అవుతుంది.భావోద్వేగాలతో రసానుభూతికి గురిచేస్తుంది.అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన సృజనకారులెందరో దేశంలో ఉన్నారు.అలాంటి వారిలో 2015 జ్ఞానపీఠపురస్కారం పొందిన  గుజరాత్ కవి రఘువీర్ చౌదరి ఒకరు. ఒక కవిగా నవలాకారునిగా నాటక కర్తగా, సాహితీ విమర్శకునిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన గుజరాత్ సాహితీ మూర్తి రఘువీర్ చౌదరిని 2015 జ్ఞానపీఠం వరించింది.గుజరాత్ సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించిన నిత్య సాహితీ కృషీవలుడాయన. కాలానికి ఎదురీది సాహితీ కృషిచేసి  జ్ఞానపీఠ పురస్కారం పొందిన రఘువీర్ చౌదరి పై ప్రత్యేక కథనం మీకోసం...

13:13 - January 3, 2016

ఆమె పేరు వినబడితే కోటానుకోట్ల శాంతి కపోతాలు రెక్కలు విప్పార్చి ఆకాశంలోకి ఎగిరిపోతున్న అనుభూతి కలుగుతుంది. ఆమె స్మృతి మదిలో మెదిలితే సంకెళ్ళు తెగుతున్న స్వేచ్చారాగం ఒక అమృతగానమై వినిపిస్తుంది. ఆమె చిత్తరువు ముందు నిలబడితే సగం ఆకాశం నేల మీదికి వంగి భూమి  చుబుకాన్ని ముద్దాడినట్లు, భూమి బంధనాలను తెగతెంచుకుని ఆకాశంలోకి జెండాలా ఎగిరినట్లు, ఒక విముక్తి దృశ్యం కనులముందు కదులాడుతుంది. ఆమే సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా టెన్ టివి ప్రత్యేక కథనం, 'నేనూ... సావిత్రి బాయిని'
తొలి అడుగులు... ముళ్లబాట..
తొలి అడుగులు వేసే వారిదెప్పుడూ ముళ్ల బాటే.. సమాజ మార్పుకోసం  ప్రయత్నం చేసే వారికెప్పుడూ ఎదురయ్యేవి ఛీత్కారాలే. అటువంటి ముళ్లబాటను దాటుకుని, ఛీత్కారాలను ఎదుర్కుని తమ జీవితాలను ప్రజల కోసం, అణచివేతకు గురవుతున్న వారి హక్కుల కోసం అంకితం చేసిన దంపతులు  జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయి పూలే.. 
అవమానాల్ని వేధింపులను ఎదుర్కుంటూ..
సావిత్రీ బాయి పూలే పాఠశాలలకు వెళ్ళేటప్పుడు ఒక చీర సంచిలో పెట్టుకుని వెళ్ళేది. మురికి నీళ్ళుపడ్డ బట్టలు మార్చుకుని పిల్లలకు పాఠాలు చెప్పేది. తర్వాత రోజుల్లో కర్రలు పట్టుకుని ఎవరో ఒకరు ఆమెకు తోడుగా వెంట వెళ్ళేవారు. దారి పొడుగునా సంప్రదాయవాదులు ఆమెను అడ్డగిస్తూనే ఉండేవారు. నిందించేవారు- అసభ్యంగా ప్రవర్తించేవారు. సావిత్రీబాయి అన్నింటినీ మౌనంగా సహించేది. ఒకసారి ఎవరో అతిగా ప్రవర్తించినప్పుడు కోపంతో చెంపదెబ్బవేసిందట. అప్పటినుంచీ వారి వేధింపులు, ఆగడాలు తగ్గాయట. ఆ విధంగా ఆత్మరక్షణ పద్ధతులూ ఆమె నేర్చుకున్నది. నేర్పించింది.
పూలే మరణం తర్వాత కూడా..
మహాత్మ పూలే  మరణానంతరం కూడా  సావిత్రీభాయి బాధ్యతనే  పనిచేసింది.1897 లో  ప్లేగు వ్యాధి, పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది.  జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి  పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే  కొడుకు యశ్వంత్ తో కల్సి  వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.  చివరికి ఆ ప్లేగు వ్యాధే  ఆమెను మార్చి 10, 1897 లో కబలించింది. 
స్త్రీ విద్య కోసం..
స్త్రీలకు విద్యే అనవసరం అనే భావన బలంగా ఉన్న  సమాజంలో  స్వయంగా చదువుకోవటమే కాదు, మరెంతో మంది మహిళల జీవితాల్లో వెలుగులను నింపారు సావిత్రిబాయిపూలే.  మహిళాభివృద్ధి కోసం కృషి చేస్తున్న తర్వాతి తరాలకు మార్గదర్శకంగా నిలిచారు. ఆ ఉత్తమ గురువుకి , తొలి మహిళా ఉపాధ్యాయురాలికి  టెన్ టివి వినమ్రంగా  జోహార్లు తెలుపుతోంది. 

ఢిల్లీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు..

ఢిల్లీ : దేశ రాజదానికి మరోసారి ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జైష్ ఎ అహ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలోకి చొరబడినట్లు నిఘావర్గాలు సూచించాయి. దీంతో పారా మిలటరీ బలగాలను పంపించాలని ఢిల్లీ పోలీసులు కేంద్రానిని కోరారు. కాగా ఉగ్రవాదులు బారీ దాడికి పాల్పడే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడందో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

బర్దన్ అందరికీ ఆదర్శప్రాయుడడు: చాట వెంకటరెడ్డి

హైదరాబాద్ : సీపీఐ కార్యాలయంలో బర్దన్‌ సంతాప సభ ఎర్పాటు చేశారు. బర్దన్ అందరికీ ఆదర్శప్రాయుడని చాట వెంకటరెడ్డి తెలిపారు. విద్యార్థి నేతగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బర్దన్‌ సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు. బర్దన్‌ మరణం సీపీఐకి తీరనిలోటని చాడ వెంకటరెడ్డి అన్నారు.

11:36 - January 3, 2016

వరంగల్‌ : చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి కళ్యాణం ప్రారంభమైంది. కళ్యాణం రోజు నుంచే స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ఆరంభమవుతాయి. ఏప్రిల్‌ 4 వరకు ఈ జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ రోజున జరిగే అగ్నిగుండాలతో జాతర ముగుస్తుంది. స్వామి వారి కళ్యాణానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

11:34 - January 3, 2016

చిత్తూరు : శేషాచలం అడవుల్లో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని నెలలుగా కూంబింగ్ జరుగుతున్నా ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జిల్లాలోని వాకిలగట్టు అటవీప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు పెద్ద సంఖ్యలో కూలీలు ఎదురుపడ్డారు. పోలీసులను చూసి ఎర్రచందనం దుంగలు వదిలేసి కూలీలు పరారయ్యారు.  

11:33 - January 3, 2016

హైదరాబాద్ : శనివారం ఉగ్రవాదులు దాడికి పాల్పడిన పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో తాజాగా బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒక జవాను గాయాల పాలయ్యాడు. ఆర్మీ జవాన్లు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఐతే పేలుడుకు సంబంధించి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా… వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోపక్క ఉగ్రదాడిపై దర్యాప్తుకు సంబంధించి ఎనిమిది మంది సభ్యుల ఎన్ఐఏ బృందం పఠాన్‌కోట్‌కు చేరింది. 

11:31 - January 3, 2016

హైదరాబాద్ : నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద స్కైవే, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి తెలంగాణ మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, నాయిని నర్శింహారెడ్డి, కేటీఆర్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...నాణ్యమైన విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ కు దక్కిందన్నారు. ప్రజల కనీస అవసరాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారని తెలిపారు. నగరంలో రోడ్ల అభివృద్ధిలో భారీ ప్రణాళికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగరంలో 54 నాలుగు జంక్షన్లలో స్కైవేలు, ఫ్లై ఓర్లు రాబోయే మూడేళ్లలో చూస్తామని చెప్పారు. హైదరాబాద్ ఇన్నర్ రోడ్లతో పాటు ఔటర్11స్కైవేలు నిర్మాణంలో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. వీటికి కావాల్సిన నిధులకు కేంద్రం సహకరించాలని విజ్ఞిప్తి చేశారు. వెనకబడ్డ తెలంగాణకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ నిధులు వచ్చేలా ప్రయత్నం చేయాలి సూచించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేయాలని విపక్షాలకు సూచించారు.

11:27 - January 3, 2016

హైదరాబాద్ : భవిష్యత్ అంతా సైన్స్ మీదే ఆధారపడి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన కర్ణాటకలోని మైసూర్ లో ఏర్పాటు చేసిన 103 భారతీయ విజ్ఞాన సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ.. భారత్ లో సైన్స్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఏడాది మొదట్లో విజ్ఞాన సదస్సు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గొప్పనేతలంతా మైసూర్ యూనిర్శిటీలో చదువుకున్న వారేనన్నారు. ప్రజాసంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా శాస్త్రవేత్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన రంగ లక్ష్యం కేవలం పరిశోధనలే కాదు, శాస్త్రీయ దృక్పథం కూడా పెంపొందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టెక్నాలజీ విజన్ -2035 డాక్యుమెంట్ ను ప్రధాని ఆవిష్కరించారు. 30 మంది శాస్త్రవేత్తలకు ప్రధాని చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, దేశ విదేశాలకు చెందిన 10 వేల మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అంతక ముందు కేంద్రమంత్రి  హర్షవర్థన్ మాట్లాడుతూ… ఆస్ట్రోశాట్ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిందన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి అన్ని ప్రభుత్వ విభాగాలతో కలిసి పని చేస్తామన్నారు. డెంగీ, మలేరియా వ్యాక్సిన్ తయారీ పురోగతిలో ఉందన్నారు.

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం

హైదరాబాద్ : మైసూర్ లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. నేటి నుండి 7వ తేదీ వరకు జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు దేశ విదేశాల నుండి 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.

జపనీస్ పార్క్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : నగరంలో బంజారా హిల్స్ రోడ్ నెం 2 లో జపనీస్ పార్క్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్శింహారెడ్డి,  డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, బిజెపి ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో పేలిన గ్రనేడ్

హైదరాబాద్ : పంజాబ్ లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో నిన్న జరిగిన ఉగ్రదాడి మరువక ముందే అదే చోట ఓ గ్రనేడ్ పేలింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఈ రోజు సెక్యూరిటీ సిబ్బంది భద్రతా దళాలతో కలిసి ఎయిర్ బేస్ లో తనిఖీలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రవాదులు వదిలిన ఓ గ్రనేడ్ పేలినట్లు తెలుస్తోంది. పఠాన్ కోట్ ప్రాంతంలో సోదాలు కొనసాగిస్తున్నారు.

ఉచిత కేన్సర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన వెంకయ్య నాయుడు

నెల్లూరు : వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఉచిత కేన్సర్ వైద్య శిబిరాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కేన్సర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.

అధికారులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : మిషన్ కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టుల పై మంత్రి హరీష్ రావు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పఠాన్‌కోట్‌' జల్లెడ పడుతున్న భద్రతా దళాలు..

హైదరాబాద్ : పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై నిన్న ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా దళాలు తనిఖీలు కొనసాగిస్తున్నాయి. నిన్న ఉదయం వైమానిక స్థావరంపై దాడికి దిగిన ముష్కరులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. కాల్పుల్లో ఐదుగురు ముష్కరులతో పాటు ముగ్గురు సైనికులు కూడా మృతిచెందారు. దాడిలో ఆరుగురు ముష్కరులు పాల్గొన్నారన్న అనుమానంతో పోలీసులు ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం 7.30గంటల నుంచి ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బలగాలు పఠాన్‌కోట్‌ ప్రాంతాన్ని జల్లెడుతున్నాయి.

రైలు కిందపడి మహిళ మృతి

గుంటూరు : పెదవడ్లపూడి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ ప్లాట్‌ఫాం దాటేందుకు గూడ్స్‌ రైలు కింద నుంచి దూరి వెళ్తుండగా రైలు ఉన్నట్టుండి కదిలింది. ఈ ప్రమాదంలో పెదవడ్లపూడి గ్రామానికి చెందిన మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

10:01 - January 3, 2016

హైదరాబాద్ : ఇటీవలే కోల్ కతాలో సీపీఎం జాతీయ ప్లీనం జరిగింది. ఈ ప్లీనంలో పార్టీ నిర్మాణం పై ఏఏ అంశాలను చర్చించారు? పార్టీ నిర్మాణంపై నేతలు అంతర్మథనం, ఆత్మపరిశోధన చేసుకున్నారా? భవిష్యత్ లో పార్టీ పెరుగుదలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థికపరమైన పోరాటాల్లో ఛాంపియన్‌గా నిలిచిన సీపీఐ(ఎం)ను, సామాజిక పోరాటాల్లోనూ అదేస్థాయిలో నిలపాలని భావిస్తోందా? 'వామపక్ష ప్రజాతంత్ర కూటమి' నిర్మాణం సాధ్యం అవుతుందా? ఈ అంశాలపై 'ఫర్ ది పీపుల్' కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘువులు విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

09:59 - January 3, 2016

ఢిల్లీ: ఢిల్లీ-లక్నో శాతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉన్నట్లు ముంబయి ఏటీఎస్ పోలీసులకు మెయిల్ వచ్చింది. ఈ సమాచారంతో ఢిల్లీ పోలీసులు బాంబ్ స్క్యాడ్ సిబ్బందితో ఘజియాబాద్ దగ్గర రైలును ఆపి తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోనూ విస్తృత తనిఖీలను చేపట్టారు. రైలులో క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పోలీసులు బాంబు లేదని తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో పలు రాళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

09:57 - January 3, 2016

హైదరాబాద్ :పాకిస్తాన్‌ పర్యటన నేపథ్యంలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉగ్ర దాడులు జరగడం ప్రధాని మోదికి అతిపెద్ద సవాల్‌ లాంటిదని జమ్ముకశ్మీర్‌ మాజీ సిఎం ఒమర్‌ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌ విషయంలో ప్రధాని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం పెను సవాల్‌గా మారిందని ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఓ వైపు ఉగ్రవాదం... మరోవైపు చర్చలు జరపాలన్న పాత నీతికి బిజెపి స్వస్తి పలకాలని, ఈ దాడుల నుంచి భారత్‌-పాక్‌లను కాపాడే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

09:51 - January 3, 2016

 

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. నెల్లూరు, వెంకటాచలం, కలిగిరి మండలాల్లో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి పర్యటన సాగుతుంది. వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో మానసిక వికలాంగుల పునరావాస కేంద్రానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం వీఆర్సీ మైదానంలో ఏర్పాటుచేస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తరువాత కలిగిరి, పెద్దకొండూరులో జన్మభూమి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇవాళ రాత్రికి కావలిలో సీఎం బస చేస్తారు. సోమవారం ఉదయం ఆయన ప్రకాశం జిల్లా పర్యటనకు వెళతారు. 

09:50 - January 3, 2016

విశాఖ : ఆంధ్ర కాశ్మీర్‌లో చలి చంపేస్తోంది. లంబసింగిలో 6 డిగ్రీలు నమోదైంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు వణికిపోతున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత బాగా పెరిగింది. చింతపల్లి ,పాడేరు 9, అరకులో 10 డిగ్రీలు , పొదులమ్మవారి పాదాలు 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుపతి: తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

09:18 - January 3, 2016

నేటి ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం. శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియలో మలవిసర్జన. కొందరిలో రోజుకు రెండు సార్లు జరిగితే, కొందరిలో రెండు-మూడు రోజులకొకసారి అవుతుంది. ఎవరిలోనైనా వారికి సహజమైన పద్ధతిలో మార్పు సంభవించి, జరగాల్సిన సమయంలో మల విసర్జన జరగనట్లయితే దానిని మలబద్దకం (Constipation) గా భావించాలి. సాధారణంగ మూడు రోజులకు మించి మలవిసర్జన కాకుండ ఉంటే దానికి కారణం తెలుసుకోవడం మంచిది. నేటి ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. దీనికి ప్రధాన కారణం- మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండా పోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం- వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతుంది. మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే.. మానవునికి వచ్చే చాలా రకాల వ్యాధులకు 'మలబద్ధకమే' మూల కారణంగా ఉంటుంది. మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం కలదు. ఒక సర్వే ప్రకారం యునైటెడ్ స్టేట్స్ లో మలబద్దకం అత్యంత సాధారణ జీర్ణ సమస్య. ఇది జనాభాలో 2 % నుండి 20 % సంభవిస్తుంది. ఇది మహిళల్లో ఎక్కువగా పెద్దలు మరియు పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇది పెద్దవారిలో వ్యాయామము చేయకపోవడము వలన మరియు వయసుతో పాటు వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల వలన తరచుగా సంభవిస్తుంది.

ఆహారం జీర్ణమైన తర్వాత.....

జీర్ణాశయంలో ఆహారం జీర్ణమైన తర్వాత అది చిన్న ప్రేగులలోకి వెళుతుంది. చిన్న ప్రేగులు ఆహారములోని ఆవస్యక తత్వాలను పీల్చుకొన్న తర్వాత మిగిలినది పెద్ద ప్రేగులలోనికి చేరుతుంది. ఇంకా మిగిలి వున్న శక్తితత్వాలను గ్రహించి వ్యర్ధ పదార్ధమును మలరూపంలో నెట్టివేస్తుంది. సహజంగా జరగవలసిన ఈ కార్యములో అవరోధము కలుగుటయే మలబద్ధకముగా పరిణమిస్తుంది. మలబద్ధకం వలన శరీరం సోమరితనము ఆవరించుకుంటుంది. పొట్ట, తల బరువుగా వుంటాయి. వళ్ళంతా పొడిబారి పెళుసుగా తయారవుతుంది.నిద్ర సరిగా పట్టదు. మెదడు మొద్దు బారినట్లంటుంది. ఆకలి కూడా మందగిస్తుంది. అంతే కాదు ఈ లక్షణాలతోపాటు అనేక రోగాలు తలెత్తడానికి అవకాశం కలుగుతుంది. మలబద్ధకం వలన అది బయటకు పోనట్లయిన మలము అక్కడే వుండి కుళ్ళడం మొదలు పెడుతుంది. పురుగులు పుడతాయి. దుర్వాసనతో కూడిన గ్యాస్(అపాన వాయువు) ఉత్పన్నమవుతుంది. గ్యాస్ పైకి లేవడం వ్యాపించడం దాని సహజ గుణం. ఆ గ్యాస్ శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించి రక్తమును విషపూరితము చేస్తుంది. ఇది వ్యాధులకు నాంది అన్నమాట.

తినే ఆహారంలో పీచులేనపుడు.....

తినే ఆహారంలో పీచులేనపుడు కూడా సమస్యగానే వుంటుంది. పీచు లేనందువలన తగినంత కదలికలు లేకుంటే, మలం బయటకు జారదు. పిల్లలు సాధారణంగా కొవ్వులు అధికంగా వుండే ఫాస్ట్ ఫుడ్స్ తింటారు (బర్జర్లు, పిజ్జాలు, మిల్క్ షేక్ లు, ఫ్రైలు )వీటిలో పీచు వుండదు. ప్రోసెస్ చేసిన కేండీలు, కుక్కీలు, కూల్ డ్రింక్ లు కూడా పీచు లేక హానికరంగా వుంటాయి. కొన్ని మార్లు పిల్లలలో ఐరన్ లోపం కొరకు వేసే మందులు కూడా మలబద్ధకం కలిగిస్తాయి. పిల్లలు తల్లిపాలనుండి గేదె పాలకు మారేముందు లేదా ఒక ఆహారంనుండి మరో ఆహారంకు మారే సమయంలో కూడా పిల్లలకు మలబద్ధకం ఏర్పడుతుంది.

జంతువుల సైతం...

జంతువులు పైకి అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ వాటి లోపలి శరీరం మాత్రం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. చివరకు మాంసాహారాన్ని తిని జీవించే జీవుల శరీరమూ అంతే. అదే మనిషి శరీరమైతే పైకి చాలా శుభ్రంగా, మంచి వాసనతో ఉన్నప్పటికీ లోపలి శరీరం మాత్రం భూమి మీద ఏ జంతువు శరీరంలో లేనంత అపరిశుభ్రత ఉంటుంది. మనలో పేరుకున్న కంపునకు మనమే బాధ్యులం కాబట్టి దాన్ని వదిలించుకొని శుభ్రం చేసుకునే బాధ్యత కూడా మనదే కావాలి. మన అలవాట్లు మంచిగా ఉంటే చాలు అదే శుభ్రం అయిపోతుంది.

నివారణకు....

ద్రవపదార్థాలు మరియు నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మలం మృదువుగా, స్నిగ్థంగా, ఎక్కువగా తయారవుతుంది.

పీచుపదార్థాలుఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, అరటిపండ్లు, జామకా మంచివి.

పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన త్వరలోగా సాఫీగా జరుగుతుంది. ముఖ్యం మెంతి కూర రోజూ తినాలి.

ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాలు మానివేయాలి.

నిలువ పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు మానివేయాలి.

నీరు సరిపడినంతగా తాగాలి. రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తీసుకోవాలి.

ఒక పద్ధతిలో వ్యాయామం చేయడం వలన మలబద్దకం కలుగదు.

మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి.

మలవిసర్జన చేసేటప్పుడు బలవంతంగా ముక్కకూడదు. ఇందువలన అర్శమొలలు తయారయి, తిరిగి మలబద్దకాన్ని కలుగజేస్తాయి.

ప్రతి రోజూ ఓ చిన్నగ్లాసుడు క్యారట్ జ్యూస్ లేదా క్యాబేజీ రసం, ద్రాక్షరసం లాంటివి , బీట్ రూట్ రసం, అరటి పండ్లు తీసుకోవాలి.

టొమాటో రసంలో కాసింత ఉప్పు, మిరియాల పొడి కలిపి ప్రతిరోజూ ఉదయం సేవిస్తే... మలబద్ధకం, అజీర్తితో పాటు గ్యాస్ వల్ల కలిగే మంట కూడా తగ్గుతుంది.
బాగా వేడిచేసి ఇబ్బంది పడుతుంటే... తమలపాకులో కాసింత పచ్చ కర్పూరం, కొంచెం మంచి గంధం, కొద్దిగా వెన్న వేసి చుట్టి నమిలి, ఆ రసాన్ని మింగితే మంచి ఫలితముంటుంది.

రాత్రి పడుకునే ముందు ఒక చెంచా త్రిఫలా చూర్ణం నీళ్లలో కలుపుకుని తాగాలి.

అల్లం, స్వచ్ఛమైన బెల్లం ఒక్కోటి 5 గ్రాములు తీసుకుని రెండూ కలిపి ర్రాతి పడుకోబోయే ముందు నమిలి తినాలి.

క్రౌంచాసనం సాధన చేస్తే మేలు.....
అజీర్తి, గ్యాస్ సమస్యలు, మలబద్ధకం తగ్గడానికి మందులు వాడేకన్నా క్రౌంచాసనం సాధన చేస్తే మేలు. క్రౌంచాసనం ఎలా వేయాలంటే...రెండు కాళ్లను ముందుకు చాపి రెండు అరచేతులను రెండు తొడల మీద బోర్లించి సమస్థితిలో కూర్చోవాలి.ఎడమకాలును మోకాలి దగ్గర మడిచి కూర్చోవాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని రెండు చేతులతో కుడికాలిని పట్టుకుని (వీలైనంత వరకు మాత్రమే) నిటారుగా పైకి లేపాలి. ఈ స్థితిలో మోకాలుని వంచకుండా గడ్డాన్ని మోకాలికి తాకించాలి.ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. అలాగే రెండవ కాలితోనూ చేయాలి. ఇలా రోజుకు పది నిమిషాల సేపు చేస్తే పైన చెప్పుకున్న సమస్యలతోపాటు బీజ కోశం, గర్భకోశాలకు శక్తి చేకూరడం, రుతుక్రమ సమస్యలు తొలగిపోవడం, ఏకాగ్రత పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.

రెండు తరాల ముందువరకు మనవాళ్ళు 90 ఏళ్ళ వరకూ బట్టతల లేకుండా , జుట్టు నేరవకుండా , కంటిచూపు దెబ్బతినకుండా , నడుం వంగకుండా , పళ్ళు వూడకుండా ఏ కార్పొరేటు హాస్పిటళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు ? ఇంత వైద్య సదుపాయం వుండి కుడా ఇప్పటి తరం అందుకు వ్యతిరేకంగా ఎందుకు ఇలా వున్నారో ఎప్పుడైనా ఆలోచించామా ? అలా ఆలోచించి వుంటే ఇలా పరిస్థితులు దాపురించేవి కాదేమో… ఇప్పటికైనా మించిపోయింది లేదు.. అప్రమత్తం అవ్వాల్సిన రోజులు వచ్చేశాయ్....

లక్నో శతాబ్ధి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు - తనిఖీలు..

ఢిల్లీ : లక్నో శతాబ్ధి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు వచ్చింది. ఫజియాబాద్ లో రైలును ఆపి అధికారులు బాంబు స్వ్కాడ్స్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఫజియాబాద్ లో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు.

08:19 - January 3, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నేతలు గ్రేటర్ సమరానికి సిద్దమవుతున్నారు. ఈ ఎన్నికలను అటు టీడీపీ ఇటు అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.ఎవరికి వారు తమదైన శైలిలో అస్ర్తాలు సిద్దం చేసుకుంటున్నారు.

నేతల్లో గుబులు...

గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల్లో గుబులు మొదలైంది. దీంతో ఎవరికి వారు తమ పార్టీని బలోపేతం చేయడంలో నిమగ్నమయ్యారు. అధికార పార్టీ నేతలు కిందిస్థాయి నేతలతో చర్చిస్తుంటే ఇటు టీడీపీ నేతలు కూడా నగరంలో ఉన్న టీడీపీ నేతలందరిని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు నేతలతో మంతనాలు మొదలెట్టారు. ఇందులో భాగంగా టీడీపీ కేడర్ తో కీలక సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల్లో గులాభి పార్టీ పై దందయాత్ర చేసేందుకు సిద్దంగా ఉండాలని, అటు నుండి కేసీఆర్ వస్తే , ఇటు నుండి నేను ముందుడి నడుస్తానంటూ రేవంత్ రెడ్డి అన్న మాటలు కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయి. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా పని చేయాలంటూనే సెంటిమెంటు తో టీఆర్ఎస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను అస్త్రాలుగా మలుచుకోవాలని నేతలకు సూచించారు.

గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరు....

ఈ గ్రేటర్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరు ప్రాణాలను పణంగా పెట్టాలని టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇన్నాళ్లు ఎదురవుతున్న అవమానాలకు ఈ ఎన్నికలతో చెక్ పెట్టాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. అటు ప్రత్యర్థులు అనేక రకాలుగా మభ్య పెట్టేందుకు సిద్దంగా కాచుకుని ఉన్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు పెద్దిరెడ్డి. అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను డివిజన్ అధ్యక్షులకు అప్పగించారు.

నేతలకు దిశానిర్దేశం చేసిన టీడీపీ...

గ్రేటర్ ఎన్నికల్లో దృష్టి సారించాల్సిన అంశాలు , అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేయడంపైనే నేతలకు దిశానిర్దేశం చేసింది టీడీపీ. మొత్తంగా గ్రేటర్ లో బలాబలాలు నిరూపించుకునేందుకు బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. అయినా కాని టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ రాకపోవడంతో లుకలుకలు మొదలయ్యాయనే భావన అందరిలోను మొదలైంది.  

08:16 - January 3, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార విపక్షాల మద్య మాటల యుద్దం రాజుకుంటోంది. గ్రేటర్ ఎన్నికలషెడ్యూల్ రాకముందే లీడర్ల దూకుడుతో ఎన్నికలు యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన ఊపుతో టీఆర్ఎస్ పార్టీ నోటికి పని చేప్తోంది. ఇటీవల కేసీఆర్ కాంగ్రెస్ దుకాణం మూసుకోవల్సిందే అన్న కామెంట్ తో మాటల యుద్దానికి ఆజ్యం పోసినట్లయింది.

కేసీఆర్ మాటలతో ఉడికి పోతున్న కాంగ్రెస్.....

ఇప్పటికే కేసీఆర్ మాటలతో ఉడికి పోతున్న కాంగ్రెస్ పార్టీపై తాజాగా హస్తం నేతలు సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్ కు ధీటుగా కాంగ్రెస్ పార్టీ రివర్స్ అటాక్ చేస్తోంది. గ్రేటర్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ప్రజలతో డ్రామాలాడుతోందంటూ హస్తం పార్టీ ఒక అడుగు ముందుకేసి విమర్శిస్తోంది. హైద్రాబాద్ ను ప్రపంచపటంలో తాము నిలిపితే అధికారంలోకి రాగానే కారు పార్టీ నగర ప్రతిష్టను మంటగలుపుతుందని ఎద్దేవా చేస్తున్నారు.

కేసీఆర్ పై పదునైన సెటైర్ లు వేస్తున్న కాంగ్రెస్.........

తాజ్ మహల్ ముందు ఫోటో దిగి తామే తాజ్ ను కట్టించామని కూడా కేసీఆర్ చెబుతారంటూ పదునైన సెటైర్ లు వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తాము నగరానికి గోదావరి కృష్ణాజలాలను తీసుకువస్తే అది కూడా తన ఘనతే అంటూ కేసీఆర్ ఫ్యామిలీ చెప్పుకుంటున్నారని విరుచుకుపడ్డారు. ఆపరేషన్ ఆకర్ష్ తో నేతలను మభ్యపెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేతలు. గ్రేటర్ లో ఎన్నికల సెటిలర్ల జపం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు నేతలు.

టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ లో గెలవలేకనే.....

టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ లో గెలవలేకనే నోటికి పనిచేప్తోందంటున్నారు కాంగ్రెస్ నేతలు. దేనికి భయపడేది లేదని గ్రేటర్ లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బరిలో దిగుతుందని స్పష్టం చేస్తున్నారు హస్తం నేతలు. మొత్తంగా గ్రేటర్ నోటిఫికేషన్ రాకముందే సెటైర్‌ల సమరం మొదలైంది.

07:39 - January 3, 2016

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చరణ్ ని భయపెడుతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఎన్టీఆర్ తాజా చిత్రం నాన్నకు ప్రేమతో లో ఎన్టీఆర్-జగపతి మధ్య సాగే మైండ్ గేమ్ ఎత్తులు పైఎత్తులే సినిమాకు హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది. జగపతి పాత్ర జనాల్ని బాగా ఆకర్షిస్తోంది. ఆసక్తి రేపుతోంది. హీరో-విలన్ మధ్య వార్ ఎలా ఉంటుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నవాళ్లలో రామ్ చరణ్ కూడా ఉన్నాడంటున్నారు ఇండస్ట్రీ జనాలు. దీనికి కారణం లేకపోలేదు. చరణ్ 'తనీ ఒరువన్' అనే తమిళ సినిమా రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇది కూడా హీరో-విలన్ మైండ్ గేమ్ మీద నడిచే సినిమానే. పెద్దగా రక్తపాతాలేమీ ఉండవు. ఎత్తులు పై ఎత్తులతో ఉత్కంఠగా సాగుతుంది. విలన్ పాత్ర స్మార్ట్ గా కనిపిస్తూ చాలా కన్నింగ్ గా ప్రవర్తిస్తుంది. ఆ క్యారెక్టర్ సినిమాకు హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో 'నాన్నకు ప్రేమతో' కూడా ఆ తరహాలోనే ఉంటే.. తాను చేయబోయే సినిమాకు ఇబ్బందవుతుందేమో అని చరణ్ కొంచెం టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు. అందుకే 'నాన్నకు ప్రేమతో' చూశాక స్క్రిప్టులో ఏమైనా మార్పులు చేయాలా అని వెయిట్ చేస్తున్నాడట.

07:32 - January 3, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌పై కారు పార్టీ కన్నేసింది. రాజధాని రోడ్లపై దుమ్ము రేపడానికి రెడీ అవుతోంది. ప్రభుత్వ పరంగా వరసపెట్టి వరాలు కురిపిస్తోంది. పార్టీ పరంగా ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. గ్రేటర్‌లో అనుసరించాల్సిన స్ట్రాటజీపై ఆదివారం టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం సమావేశమవుతోంది.

గ్రేటర్‌పై అధికార పార్టీ దృష్టి.........

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత అన్ని ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తున్న అధికార పార్టీ గ్రేటర్‌పైనా దృష్టిసారించింది. ఇప్పటికే ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. హైదరాబాద్‌ వాసులను ఆకట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయ్నతిస్తోంది. ఇక అసలు వ్యూహంలోకి దిగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఆదివారం ఈ సమావేశం జరుగుతుంది.

జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై...

జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. గ్రేటర్‌ బాధ్యతను కేటీఆర్‌ అప్పగించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ హైదరాబాద్‌లో విస్తారంగా పర్యటిస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో బస్తీల బాట పట్టారు. బ్రాండ్‌ హైదరాబాద్‌ వంటి కార్యక్రమాలతో గ్రేటర్‌ వాసులతో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. ఐతే ఆదివారం జరగబోయే సమావేశంలో కేటీఆర్‌కు గ్రేటర్‌ ఇంఛార్జి బాధ్యతలు అధికారకంగా అప్పగించనున్నారని తెలుస్తోంది.

అత్యధిక సీట్లను కైవసం చేసుకోవాలని.......

గ్రేటర్‌ పరిధిలో అత్యధిక సీట్లను కైవసం చేసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. సీమాంధ్ర ప్రాంత ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వారినే రంగంలోకి దింపాలని టీఆర్‌ఎస్‌ ఆలోచిస్తోంది. డివిజన్లు వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు బాధ్యతలు అప్పగించాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగే సమావేశంలో ఈ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. 

07:29 - January 3, 2016

హైదరాబాద్ : డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి మీడియాలోకెక్కారు. వివాదాలతో సావాసం చేసే... ఆయన మరో బాంబ్ పేల్చారు. ఇప్పటికే అనంతపురం ఫ్యాక్షన్ గొడవలను 'రక్త చరిత్ర' సినిమాగా... వీరప్పన్ జీవిత కథను తెరకెక్కించిన వర్మ.. ఇప్పడు మరో రాజకీయ నాయకుడి కథను వెండితెరకెక్కించనున్నారు. దివంగత వంగవీటి మోహన రంగా జీవితాన్ని... సినిమాగా తీసుకురానున్నట్టు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు.

07:22 - January 3, 2016

హైదరాబాద్ : బాలానగర్ పరిధిలోని సూరారం కాలనీలో నేటి తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. 45 మంది పాత నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాక 3 బెల్ట్ సాపులు, 25 బైక్ లు, ఒక కారు సీజ్ చేశారు.

07:20 - January 3, 2016

విజయవాడ : పథకాలు చూడబోతే బోలెడన్ని ఉన్నాయి. అన్నీ వేల కోట్ల రూపాయలను హాంఫట్‌ చేసేవే. అవి అలా ఉండగా సరికొత్తగా మరికొన్ని లాంచ్‌ అవుతున్నాయి. బొక్కసం చూడబోతే బేర్‌ మంటోంది. ఎలా డబ్బులు సమకూర్చాలో తెలీక ఆర్థిక శాఖ దిక్కులు చూస్తోంది. గల్లాపెట్టె నింపుకునేందుకు ఎన్ని వేషాలు వేస్తున్నా పైసలు మాత్రం రాలడం లేదు. మూడో త్రైమాసికం ముగిసినా కాసుల గలగలలు లేకపోవడంతో చంద్రన్న సర్కార్ ఓ కమిటీ వేసింది.

ఎంత ఖర్చైనా మీకోసం పథకాలు...

తమ్ముళ్లూ మనం ఆర్థిక కష్టాల్లో ఉన్నాం.. అయినా పర్వాలేదు. ఎంత ఖర్చైనా మీకోసం పథకాలు కొనసాగిస్తాం. ఇదీ ప్రతి సమావేశాల్లోనూ సిఎం చంద్రబాబు కొట్టే డైలాగ్. కానీ ఖజానా చూస్తే దివాలా తీసిన సంస్థను మరిపిస్తోంది.

కొత్త సంవ‌త్సరం వివిధ శాఖ‌ల‌కు షాక్....

అనుకున్నమేర డబ్బు వసూలు కాకపోవడంతో ఏపీ ప్రభుత్వం కొత్త సంవ‌త్సరం వివిధ శాఖ‌ల‌కు షాకిచ్చింది. లోటు బ‌డ్జెట్‌ కారణంగా కొత్త నిధులు అడగొద్దని తేల్చి చెప్పింది. ఆర్థిక శాఖ‌ మూడు త్రైమాసికాలు ముగిసే స‌మ‌యానికి రెవెన్యూ వ‌సూళ్లు అనుకున్నదానికన్నా సుమారు 9 వేల కోట్లు త‌గ్గాయి. ఈ ఆర్థిక సంవ‌త్సరం ముగిసే నాటికి లోటు 18 వేల కోట్లు ఉండే అవ‌కాశం ఉంది. రాబ‌డి, ఖ‌ర్చులపై ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడు తన శాఖ అధికారులతో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రెవెన్యూ వసూళ్లు తగ్గడంతో ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు......

రెవెన్యూ వసూళ్లు తగ్గడంతో ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారీగా డబ్బు వసూలు చేస్తాయనుకున్న రెవెన్యూ, ఎక్సైజ్, ర‌వాణా, వాణిజ్య ప‌న్నులు తదితర శాఖలు చేతులెత్తేశాయి. ఒక్క అట‌వీ, మైనింగ్‌ శాఖ‌లు మాత్రమే లక్ష్యాలు రీచ్‌ అయ్యాయి. దీంతో ఆదాయం, వ్యయం నిర్వహ‌ణ కోసం ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన ద్రవ్య యాజ‌మాన్య క‌మిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రిటైర్డ్ ఐఏయ‌స్ ఆఫీసర్‌ సియ‌స్‌.రావు ఛైర్మన్‌గా ఆర్థిక మంత్రితోపాటు ఆర్థిక రంగ నిపుణులు న‌ర్సింహ‌మూర్తి, కుటుంబ‌రావు, ఆర్థిక శాఖ అధికారి సభ్యులుగా ఈ క‌మిటీ ఏర్పాటైంది.

ఆదాయం పెంపు కోసం పలు సూచనలు....

ఆదాయం పెంపు కోసం ఈ క‌మిటీ ప్రభుత్వానికి పలు సూచ‌న‌లు చేయ‌నుంది. పన్నులు పెంచ‌కుండా..ప‌న్నేతర ఆదాయంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రోజురోజుకూ పెరుగుతున్న ఖ‌ర్చు నియంత్రణపైనా ఫోకస్‌ చేయనుంది. రాబోయే బ‌డ్జెట్ వాస్తవాల‌కు అనుగుణంగా ఉంటుంద‌ని ఆర్థికశాఖ‌ చెబుతోంది. అయినా వ‌చ్చే ఏడాది దాదాపు ల‌క్షా 30వేల కోట్ల వ‌రకు బ‌డ్జెట్ ఉండే అవ‌కాశం ఉంది. శాఖ‌ల‌కు కొత్త కేటాయింపులు అడ‌గొద్దని చెబుతున్న ప్రభుత్వం ప్రజ‌ల‌పై అదన‌పు భారం వేయనంటోంది. మరి ఆదాయ మార్గాలు, ఖ‌ర్చులు త‌గ్గింపుపై ప్రభుత్వం వేసిన క‌మిటీ.. ఆర్థిక శాఖను ఏమేరకు కొత్తపుంతలు తొక్కిస్తుందో చూడాలి. 

నేడు కొమురవెల్లి మల్లన్న కల్యాణం...

వరంగల్ :చేర్యాల మండలం కొమురవెల్లిలోని మల్లన్న క్షేత్రం సందడిగా మారింది. ఆదివారం మల్లికార్జునుడి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో ఆలయాన్ని అధికారులు సుందరంగా అలంకరించారు. ఆదివారం వైభవోపేతంగా నిర్వహించే వే డుకకు పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సం ఖ్యలో హాజరుకానున్నారు.

సూరారం కాలనీలో కార్డన్ సర్చ్

హైదరాబాద్ : బాలానగర్ పరిధిలోని సూరారం కాలనీలో నేటి తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. డీసీపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. 45 మంది పాత నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతే కాక 3 బెల్ట్ సాపులు, 25 బైక్ లు, ఒక కారు సీజ్ చేశారు.

06:42 - January 3, 2016

విశాఖ : సాగర తీరాన్న న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌, ఉర్రూతలూగించిన విశాఖ ఉత్సవం..కళ్లకు కట్టిన నగర చారిత్రక వైభవం..లేజర్‌ షోతో ప్రముఖుల రూపం… ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. ఇలా విశాఖ ఉత్సవం 2016 వైభవంగా జరిగింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. నగర వాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, సినీ సంగీత దర్శకుడు కీరవాణి విశాఖ ఉత్సవంలో పాల్గొన్నారు.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంను ఘనంగా సత్కరం...

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం తరుపున స్వర కళా సామ్రాట్‌ బిరుదును అందజేశారు. ఈ సందర్భంగా బాలును చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. తెలుగు జాతికి కీర్తి తెచ్చిన వ్యక్తి బాల సుబ్రహ్మమణ్యం అని చంద్రబాబు అన్నారు.

విశాఖ వాసులది ఉక్కు సంకల్పమని....

విశాఖ వాసులది ఉక్కు సంకల్పమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హుద్‌ హుద్‌ తుపాను విధ్వంసం నుంచి ఉక్కుసిటీ త్వరగా కోలుకుందన్నారు. విశాఖ సుందరమైన, పరిశుభ్రమైన నగరమన్న చంద్రబాబు... సిటీని దేశంలోనే ప్రముఖ నగరంగా తీర్చుదిద్దుతామని చెప్పారు. తనను రాష్ట్ర ప్రభుత్వం తరపున బిరుదుతో సత్కరించడం సంతోషంగా ఉందని బాల సుబ్రహ్మణ్యం అన్నారు. తెలుగు కళామ తల్లికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు. విశాఖ ఉత్సవంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నగర వాసులు విశాఖ ఫెస్టివల్‌ను ఎంజాయ్‌ చేశారు. 

06:39 - January 3, 2016

హైదరాబాద్ : భారత దేశం ఓ మహోన్నత నేతను కోల్పోయింది. రాజకీయాల్లో విశిష్ట ఖ్యాతిని ఆర్జించిన సిపిఐ సీనియర్‌ నేత ఏబీ బర్దన్‌ మనకిక లేరు. కమ్యూనిస్ట్‌ నేతగా ఉంటూనే ఎంతోమంది ఇతర పార్టీల నాయకులకు ఆయన మార్గదర్శకుడిగా మెలిగారు. బర్దన్‌ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. న్యూఢిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఆయన చాలాకాలం పనిచేశారు. బర్దన్‌ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢసానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

నేడు టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశం

హైదరాబాద్ : గ్రేటర్‌పై కారు పార్టీ కన్నేసింది. రాజధాని రోడ్లపై దుమ్ము రేపడానికి రెడీ అవుతోంది. ప్రభుత్వ పరంగా వరసపెట్టి వరాలు కురిపిస్తోంది. పార్టీ పరంగా ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. గ్రేటర్‌లో అనుసరించాల్సిన స్ట్రాటజీపై ఆదివారం టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం సమావేశమవుతోంది. 

06:36 - January 3, 2016

హైదరాబాద్ : ఏడాదిన్నర క్రితం బియాస్‌ నదిలో కొట్టుకుపోయి 24 మంది విద్యార్థులు మృత్యువాత పడిన ఘటనపై హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బియాస్‌ ఘటనలో మృతుల ఒక్కో కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇచ్చే ఆ పరిహారంలో తలాకొంత నష్టపరిహారం భరించాలని హిమాచల్ సర్కారు, విద్యుత్‌బోర్డు, వీఎన్ కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది.

మృతుల కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ......

హిమాచల్‌ప్రదేశ్‌ బియాస్‌ నది దుర్ఘటన విషాదంపై ఆరాష్ట్ర హైకోర్టు శనివారం తుది తీర్పును వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించి ఆ రాష్ట్ర హైకోర్టులో నమోదైన వ్యాఖ్యంపై..గతంలో తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం శనివారం 40 పేజీల తుదితీర్పును వెలువరించింది. బియాస్‌ ఘటనలో మృతుల కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పరిహారంలో 60 శాతం హిమాచల్ ప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ డ్యామ్‌ బోర్డు..10 శాతం హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం భరించాలని ఆదేశించింది. మరో 30 శాతం హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్‌ విజ్ఞాన జ్యోతి కాలేజీ యాజమాన్యం భరించాలని పేర్కొంది. ప్రమాదం జరిగిననాటి నుంచి పరిహారం చెల్లించేనాటికి ఒక్కొక్కరికి 20 లక్షల మొత్తానికి 7.5శాతం వడ్డీ కూడా జత కలిపి అందచేయాలని ఆదేశించింది. వచ్చే 8వారాల్లోగా నష్ట పరిహారాన్ని న్యాయస్థానంలో డిపాజిట్‌ చేయాలని కోర్టు ఆదేశించింది.

హిమాచల్ ప్రభుత్వం, విద్యుత్‌ బోర్డు, కాలేజీ యాజమాన్యమే కారణం ....

2014 జూన్‌ 8న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది వద్ద జరిగిన ఘోర దుర్ఘటనకు ఆ రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ బోర్డు, వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణమని, ఈ ఘటనకు వీరేబాధ్యులని ఆ రాష్ట్ర హైకోర్టు తుదితీర్పులో స్పష్టంచేసింది. 2014 జూన్ 8న లార్జీడ్యామ్ గేట్లను నిర్లక్ష్యంగా తెరవడంతో హైదరాబాద్‌కు చెందిన 24 మంది వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు చెందిన విద్యార్థులు బియాస్ నదిలో కొట్టుకుపోయి చనిపోయారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు చివరకు మృత్యువు ఒడిలో చేరిపోవడంతో కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కన్నవాళ్ల కడుపుకోతను ఎవరూ తీర్చలేకపోయారు.

క్షణాల్లోనే 24 మంది విద్యార్థులను మృత్యువాత......

బియాస్ ఘటనలో తప్పెవరిదైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రకృతి అందాల నడుమ ఎలాగైనా కలిసి ఫోటో దిగాలన్న ఆశే అంతులేని విషాదాన్ని మిగిల్చింది. జలరక్కసి రూపంలో మృత్యువు విరుచుపడింది. క్షణాల్లోనే 24 మంది విద్యార్థులను బియాస్ నది ఆమాంతం మింగేసింది. ఈ ఘటన ఇప్పటికీ..ఎప్పటికీ మర్చిపోలేని..మరపురానిదిగా అందరి మదిలో నిలిచిపోయింది. 

06:31 - January 3, 2016

హైదరాబాద్ : ఒకవైపు గ్రేటర్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. దీంతో అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు గులాబీ దళపతి. గ్రేటర్లో గులాబీ జెండాను ఎగరేయడమే లక్ష్యంగా తెలంగాణ మంత్రివర్గ భేటీ కొనసాగింది. గ్రేటర్‌ ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక వరాలు కురిపించారు.

బడ్జెట్‌పైనే ప్రధానంగా చర్చ ....

గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ కేబినెట్ మీటింగ్‌ జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా..రెండు పూటలా మంత్రివర్గ సమావేశం సాగింది. సుమారు 40 అంశాలపై ఆమాత్యులు మంతనాలు జరిపారు. బడ్జెట్ ప్రతిపాదనలపైనే ప్రధానంగా మంత్రులు చర్చించారు. శాఖలవారీగా ప్రతిపాదనలను సమీక్షించారు. గత బడ్జెట్‌లకంటే భిన్నంగా బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వ ప్రాధాన్యాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రణాళికా వ్యయం ఎక్కువ ఉండేలా బడ్జెట్ రూపొందించాలని మంత్రివర్గానికి సూచించారు. గత బడ్జెట్‌ కంటే ఈసారి బడ్జెట్‌ 15శాతం అదనంగా ఉంటుందని కేసీఆర్ స్పష్టంచేశారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చ ...........

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం 6700 వచ్చే వారికి 12వేలు, 8400 వచ్చే వారికి 15వేలు, 10,900 వేతనం వచ్చేవారికి 17వేలకు వేతనం పెంచాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ఖజానాపై 400 కోట్ల భారం పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అలాగే ట్రాఫిక్ పోలీసులకు మెడికల్ అలవెన్స్‌ కింద 30శాతం పెంచాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. దాంతో పాటు బల్దియా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను, విద్యుత్ బకాయిలపై తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1989 నుండి బకాయి పడ్డ 457 కోట్ల రూపాయల నల్లా బకాయిలను రద్దు చేస్తున్నట్లు కేబినెట్‌ నిర్ణయించింది. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే హేయిర్‌ కటింగ్‌ సెలూన్ల దుకాణాలకు కమర్షియల్‌ కాకుండా డొమెస్టిక్‌ కిందనే విద్యుత్ చార్జీలు వసూలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే స్ట్రీట్‌ వెండర్ల చట్టబద్దతకు టీఎస్‌ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాదికి 1200 చెల్లించే వారికి 101 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా వీధి వ్యాపారులకు రుణాలిచ్చేందుకు సైతం సర్కార్ ఆమోదం తెలిపింది.

పలు శాఖల్లోని కీలక పోస్టుల భర్తీకి....

ఇక పలు శాఖల్లోని కీలక పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇరిగేషన్‌ శాఖలో 108 పోస్టులతో పాటు రాష్ట్రంలోని 15,628 టీచర్‌ పోస్టులను మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా 92 అర్బన్‌ హెల్త్ సెంటర్లను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు..మహబూబ్‌నగర్‌లో వైద్య కళాశాలకు 462 పోస్టులు, వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో 147 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జూన్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 60 మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయాలని మంత్రుల బృందం నిర్ణయించింది.

సాగునీటి రంగానికి రూ. 25వేల కోట్లు....

ఇక రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై చర్చించిన క్యాబినెట్‌ సాగునీటి రంగానికి 25వేల కోట్ల రూపాయల్ని కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది. మిషన్‌ కాకతీయ, మిషన్ భగీరథపై కూడా క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. మొత్తానికి గ్రేటర్‌ ఎన్నికలు దగ్గర పడడంతో..ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. గ్రేటర్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కూడా కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 

Don't Miss