Activities calendar

04 January 2016

నల్గొండ జిల్లాలో చిరుత దాడి.. నాలుగు గొర్రెల మృతి

హైదరాబాద్ : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం జేత్యతండాలో సోమవారం తెల్లవారుజామున చిరుతపులి గొర్రెల మందపై దాడిచేయడంతో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. తండాకు చెందిన సపావట్ శంకర్ తండా పక్కనే గొర్రెల కోసం దొడ్డిని ఏర్పాటు చేసుకున్నాడు. తండాలోకి ప్రవేశించిన చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసింది. పులి దాడిలో నాలుగు గొర్రెలు మృతి చెందినట్లు బాధితుడు శంకర్ తెలిపాడు. 

రేపు వెస్ట్ బెంగాల్ కు రాష్ట్రపతి ప్రణబ్ పయనం

కోల్ కతా: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రెండు రోజుల పర్యటనకు గాను మంగళవారం తన సొంత రాష్ట్రమైన పశ్చిమబంగాకు వెళ్లనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రముఖ బెంగాలీ రచయిత పండిట్‌ తరకలంకర్‌ 200వ జయంతి వేడుకలకు గాను ప్రణబ్‌ అక్కడికి వెళ్లనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా జనవరి 6వ తేదీన అక్కడ ఓ కొత్త కళాశాల భవనాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు.

 

హెరాయిన్‌తో వెళ్తున్న వ్యక్తి అరెస్టు

ఉత్తరప్రదేశ్ : రూ.38 లక్షల విలువైన హెరాయిన్‌తో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 383 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

22:01 - January 4, 2016

మూడు రోజులు గడిచినా పరిస్థితి ఎందుకు అదుపులోకి రాలేదు..? ఎక్కడుంది లోపం..? భద్రతావ్యవస్థలు నిద్రమత్తులో ఉన్నాయా..?! 
అత్యంతకీలకమైన వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు అంత అవలీలగా ఎలా దాడి చేయగలిగారు..? మన రక్షణ వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ ఈ రేంజ్ లో బలహీనంగా ఉన్నాయా...? రాచమార్గంలో ఉగ్రవాదులు ఎంటరవుతుంటే.... రెడ్ కార్పెట్ పరిచేంత పరిస్థితి ఎందుకొచ్చింది..?! 
పఠాన్ కోట్ పై పట్టుబిగించిన ఉగ్రవాదుల తీరుపై ఈరోజు వైడ్ యాంగిల్ స్టోరీ... మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

21:57 - January 4, 2016

గుంటూరు : పట్టణ పేదలందరికీ సకల సౌకర్యాలతో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. స్థలాభావం దృష్ట్యా జీ ప్లస్‌ ఫైవ్‌ పద్ధతిలో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ పాలకులు గృహ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు.

 

21:55 - January 4, 2016

విజయవాడ : ఏపీ తాత్కాలిక రాజధాని నిర్మాణంపై మున్సిపల్‌ మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు. రాజధాని కోసం భూములు సమీకరించిన 29 గ్రామాల మధ్యలోనే తాత్కాలిక రాజధాని ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం భూసార పరీక్షలు జరుగుతున్నాయని, నివేదికలు అందిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని నారాయణ చెబుతున్నారు. 

 

21:53 - January 4, 2016

వరంగల్: తెలంగాణపై వరాల జల్లు కురిపించారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికోసం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.. అటు గడ్కరీని ప్రశంసలతో ముంచెత్తారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇలా ఇద్దరు ప్రముఖుల ప్రసంగాలు, హామీలతో ఓరుగల్లు సభ హోరెత్తిపోయింది..

సందడిగా వరంగల్‌

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం కేసీఆర్‌ రాకతో వరంగల్‌ జిల్లా సందడిగా మారింది.. మడికొండ దగ్గర నాలుగులైన్ల రోడ్డుకు ఇద్దరూ కలిసి శంకుస్థాపన చేశారు.. హైదరాబాద్ నుంచి భూపాలపట్నంవరకూ 1905 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు పనులు చేపట్టారు.. అలాగే 343 కోట్ల ఖర్చుతో గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు.

హైదరాబాద్‌నుంచి బెంగళూరుకు గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే

శంకుస్థాపన తర్వాత బహిరంగసభకు కేసీఆర్‌, గడ్కరీ హాజరయ్యారు.. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకోసం 16వేల 500కోట్లు కేటాయిస్తామన్నారు గడ్కరీ.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మిస్తామని ప్రకటించారు.. సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి ప్రకారం భద్రాచలం నుంచి కౌటాల వరకూ జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

వరంగల్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌ వరాలు

సీఎం కేసీఆర్‌ కూడా వరంగల్‌ జిల్లాకు వరాలు కురిపించారు. జిల్లాలో టెక్స్ టైల్‌ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణకు జాతీయ రహదారులు మంజూరు చేసినందుకు మంత్రి గడ్కరీకి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని రైల్వే బ్రిడ్జిలు నిర్మించాలని నితిన్‌ను కోరిన కేసీఆర్‌

తెలంగాణలో మరిన్ని రైల్వే బ్రిడ్జిలు నిర్మించాలని కేంద్రమంత్రి నితిన్‌ను కోరారు కేసీఆర్‌.. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మళ్లీ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.. మొత్తానికి బహిరంగసభతో టీసీఎం తొలిరోజు వరంగల్‌ టూర్‌ ముగిసింది.. మరో రెండురోజులపాటు జిల్లాలో కేసీఆర్‌ పర్యటించనున్నారు..

 

21:49 - January 4, 2016

ఢిల్లీ : పంజాబ్లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య చర్చలపై సందిగ్ధం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు జనవరి 14,15న ఇస్లామాబాద్‌లో జరగాల్సి ఉంది. అయితే పఠాన్‌కోట్‌లో దాడి జరిపిన ఉగ్రవాదుల మూలాలు పాక్‌లోనే ఉన్నాయని ఇప్పటికే భారత నిఘావర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి. పాక్ అధికార వర్గాలు ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరి పాటించకుండా ఓ వైపు చర్చలు అంటూ స్నేహహస్తం అందిస్తూనే.. మరో వైపు ఉగ్రమూకలకు సహకరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో భారత, పాక్‌ విదేశాంగ కార్యదర్శుల చర్చలు నిలిపివేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీనిపై కేంద్రం తన తుది నిర్ణయాన్ని వారం రోజుల్లో తీసుకునే అవకాశం ఉంది.

 

21:47 - January 4, 2016

పంజాబ్ : పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో చొరబడ్డ మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం 60 గంటల పాటు ఆర్మీ ఆపరేషన్‌ నిర్వహించింది. అయితే కూంబింగ్‌ ఇంకా కొనసాగుతోంది. ఎయిర్‌బేస్‌కు చెందిన ఆస్తులన్నీ సురక్షితంగా ఉన్నాయి.
మూడోరోజు ఆర్మీ ఆపరేషన్‌
పంజాబ్‌ పఠాన్‌ కోట్‌ వైమానిక స్థావరంలో మూడోరోజు కూడా ఆర్మీ ఆపరేషన్‌ కొనసాగింది. శనివారం నాడు నలుగురు పాక్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు ఎయిర్‌బేస్‌లోకి చొరబడ్డ మరో ఇద్దరు ఉగ్రవాదులను తుద ముట్టించాయి. ఎయిర్‌బేస్‌లో హెలికాప్టర్‌ సహాయంతో భద్రతా బలగాలు ఆపరేషన్‌ నిర్వహించాయి. ఎయిర్‌బేస్‌లో దాగి ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చేందుకు భద్రతా దళాలు భారీ ఆయుధాలతో రెండస్థుల బిల్డింగ్‌ను కూల్చేశాయి. ఉదయం నుంచి ఎయిర్‌బేస్‌లో భీకరంగా జరిగిన కాల్పుల్లో అయిదో ఉగ్రవాది మృతదేహం ముక్కలు కాగా, భవన శిథిలాల కింద ఆరో ఉగ్రవాది మృతదేహాన్ని వెలికి తీసినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కొనసాగుతున్న కూంబింగ్‌
పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో సుమారు 60 గంటల పాటు సాగిన ఆర్మీ ఆపరేషన్ దాదాపు ముగిసింది. అయితే కూంబింగ్‌ ఇంకా కొనసాగుతోంది. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో 15 వందల సైనిక కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడి కుటుంబాలన్ని క్షేమంగా ఉన్నాయని, ఉగ్రదాడిలో ఎయిర్‌ బేస్‌ ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ అధికారి తెలిపారు.
ఎయిర్‌బేస్‌ ను టార్గెట్‌ చేసిన ఉగ్రవాదులు
ఎయిర్‌బేస్‌ టార్గెట్‌గా ఉగ్రవాదులు పథకం ప్రకారం భారీ ఆయుధ సంపత్తితో వచ్చారని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి ఎకె 47, గ్రెనేడ్‌ లాంఛర్లు, 52 ఎంఎం మోర్టార్, జిపిఎస్‌ లొకేటర్స్‌ స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్‌ ఆధారంగా ఉగ్రవాదులు రెండు బృందాలుగా చీలిపోయి ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించినట్టు అనుమానిస్తున్నారు.
డిసెంబర్‌ 30,31న భారత్‌లోకి
పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు డిసెంబర్‌ 30,31న అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించారు. శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్‌లోకి చొరబడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వీరిని తుదముట్టించే క్రమంలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రదాడిపై ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం
పఠాన్‌కోట్‌ ఉగ్రదాడిపై ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, మనోహర్‌ పారీకర్, భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో భేటి అయిన వారం రోజులకే పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడి జరగడం గమనార్హం.

 

 

21:35 - January 4, 2016

సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు... స్వయం నిర్ణయాధికార శక్తి సన్నగిల్లుతుంది. సానుకూలంగా ఆలోచించే స్థితి నుంచి దూరమవుతాము. ఆ స్థితి నుంచి బయపడే మార్గం కోసం అన్వేషిస్తాము. సరిగ్గా ఇలాంటి స్థితిలోనే ఉన్నా.. సమస్యల వలయాన్ని చేధించుకుని.. తన లాంటివారికి సాయపడేందుకు సిద్ధమయ్యారు శ్యామలాదేవి. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఆమె జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

కృష్ణా జిల్లాలో అక్రమ మట్టితవ్వకాలు

 

కృష్ణా : జిల్లాలోని కంకిపాడు మండలం కుందేరులో భారీగా అక్రమ మట్టి తవ్వకాలు వెలుగు చూశాయి. అధికార పార్టీ నేత పేరు చెప్పి.. కొందరు అక్రమంగా తవ్వుకుంటూ.. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని గండికొడుతున్నారు. ప్రభుత్వ అధికారులు పట్టించులేదు. వివరణ కోరడానికి వెళ్లిన మీడియాపై దౌర్జన్యం మీడియాపై దౌర్జన్యానికి దిగారు.

21:12 - January 4, 2016

కృష్ణా : జిల్లాలోని కంకిపాడు మండలం కుందేరులో భారీగా అక్రమ మట్టి తవ్వకాలు వెలుగు చూశాయి.  అధికార పార్టీ నేత పేరు చెప్పి.. కొందరు అక్రమంగా తవ్వుకుంటూ.. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని గండికొడుతున్నారు. ప్రభుత్వ అధికారులు పట్టించులేదు. వివరణ కోరడానికి వెళ్లిన మీడియాపై దౌర్జన్యం మీడియాపై దౌర్జన్యానికి దిగారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల చట్టంలో సవరణలు

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల చట్టంలో సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీచేసింది. జీహెచ్‌ఎంసీ చట్టం 1955ను సవరించింది. ఎన్నికల ప్రక్రియను 15రోజులకు కుదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నామినేషన్ల దాఖలుకు 4రోజులు గడువు ఇచ్చింది. నామినేషన్‌ పరిశీలన, ఉపసంహరణకు ఒకరోజు గడువు విధించింది. నామినేషన్‌ విత్‌ డ్రా రోజు నుంచి 10రోజుల్లో ఎన్నికలు నిర్వహణకు సిద్ధమైంది. ఎన్నికల ప్రచారానికి 7రోజుల గడువు ఇచ్చింది. 

 

'గ్రేటర్'లో గృహ విద్యుత్ బకాయిలు మాఫీ..

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో గృహ విద్యుత్‌ బకాయిలను మాఫీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంద యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారి 52కోట్ల 42లక్షల బకాయిలు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. వందకు పైగా యూనిట్లు వినియోగించేవారు మార్చి 31లోపు బకాయిలు చెల్లిస్తే సర్‌ఛార్జీలు మాఫీ చేయనున్నారు. 

 

 

21:01 - January 4, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల చట్టంలో సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీచేసింది. జీహెచ్‌ఎంసీ చట్టం 1955ను సవరించింది. ఎన్నికల ప్రక్రియను 15రోజులకు కుదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నామినేషన్ల దాఖలుకు 4రోజులు గడువు ఇచ్చింది. నామినేషన్‌ పరిశీలన, ఉపసంహరణకు ఒకరోజు గడువు విధించింది. నామినేషన్‌ విత్‌ డ్రా రోజు నుంచి 10రోజుల్లో ఎన్నికలు నిర్వహణకు సిద్ధమైంది. ఎన్నికల ప్రచారానికి 7రోజుల గడువు ఇచ్చింది.

 

20:57 - January 4, 2016

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో గృహ విద్యుత్‌ బకాయిలను మాఫీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంద యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారి 52కోట్ల 42లక్షల బకాయిలు మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. వందకు పైగా యూనిట్లు వినియోగించేవారు మార్చి 31లోపు బకాయిలు చెల్లిస్తే సర్‌ఛార్జీలు మాఫీ చేయనున్నారు. 

 

 

20:54 - January 4, 2016

వరంగల్ వరాలకు సరిగ్గా ఏడాది.. ఈంచుగూడా ఇటటు జరగని అభివృద్ధి, హైదరాబాద్ లో ఉడుకుతున్న రాజకీయం.. ఓట్ల పన్లవడ్డ రాజకీయపార్టీలొళ్లు, పొగతాగడం ఆరోగ్యానికి ఆరోగ్యకరం.. కొత్తముచ్చటచెప్పిన బాలికకియ్య,  రౌడీ అవతారంలో దర్శనమిచ్చిన రాజాసింగ్... కార్యకర్తను ఆగంజేయమని దొంగనాటకం, భారతదేశం మీదుబాదుకు ఒనికిన భూమి.. కోట్ల రూపాయలు భూమి పాలుజేసిన భూకంపం, వెండితెరమీదికి రాబోతున్న రోజక్క జీవితం.. సినిమా కాదు సీరియలే కావాలంటున్న ఫ్యాన్స్... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

20:42 - January 4, 2016

బీసీ క్రీమీలేయర్ పై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఎంబిసి సిద్ధాంతవేత్త కోప్రా, మల్లన్న పాల్గొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

 

20:33 - January 4, 2016

పఠాన్‌కోట్‌పై ఉగ్రవాదుల దాడితో దేశం ఉలిక్కి పడింది. పొరుగు దేశం నుంచి.. చాటుగా వచ్చిన ముష్కరులు ఏకంగా ఆర్మీ ఎయిర్‌బేస్‌నే టార్గెట్‌ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న పఠాన్‌కోట్‌లోకి ఉగ్రవాదులు ఎలా ఎంటర్‌ అయ్యారు.... ఉగ్రవాదులకు అడుగడుగునా సహకరించిన అంశాలు ఏమిటి?

అతిపెద్ద వైమానిక స్థావరం పఠాన్‌ కోట్‌

దేశంలోనే అతిపెద్ద వైమానిక దళ స్థావరం పఠాన్‌ కోట్‌. రక్షణ పరంగా చాలా వ్యూహాత్మక ప్రాంతం. ఎప్పుడూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. 24 గంటలూ సాయుధ దళాలు పహారా కాస్తాయి. వైమానిక దళానికి చెందిన మిగ్‌ విమానాలు...ఇతర ఆయుధ సామాగ్రి పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లోనే ఉంది. ఎప్పుడూ పకడ్బందీ నిఘా కొనసాగుతుంది. చీమ చిటుక్కుమన్నా పసిగట్టే పటిష్ట వ్యవస్థ ఉంది. ఐనా ఉగ్రవాదులు డేర్‌గా.. ఎయిర్‌బేస్‌ డోర్లు తెరుచుకుని నేరుగా ఎంటర్‌ అయ్యారు. అడవుల్లో నక్కి...కాల్పులకు తెగ బడ్డారు. పటిష్ట భద్రత ఉన్న పఠాన్‌కోట్‌లోకి ఉగ్రవాదులు ఎలా వెళ్లగలిగారు... భద్రతా సిబ్బంది వైఫలం ఉందా... నిఘా వ్యవస్థ లోపం ఉందా... అసలు టెర్రరిస్టులు చొరబడేందుకు తోడ్పడిన అంశాలు ఏమిటి..

పంజాబ్‌ పోలీసుల వైఫల్యం

పంజాబ్‌ పోలీసుల వైఫల్యం, భద్రతా దళాల సమన్వయం లోపం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. శుక్రవారం పాకిస్థాన్‌ బోర్డర్‌లో ఎస్పీని అతని స్నేహితులను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేశారు. ఇన్నోవా డ్రైవర్‌ను హత్య చేశారు. ఆ తరువాత ఎస్పీతో పాటు అతని స్నేహితులను వదిలేశారు. ఈ కిడ్నాప్‌నే ఉగ్రవాదులు దాడికి దారిగా వాడుకున్నారు. ఎస్పీ వాహనాన్ని ఆయుధంగా ఉపయోగించుకున్నారు. ఆర్మీ దుస్తులు ధరించి పోలీసు అధికారి వాహనంలో వచ్చి శనివారం ఎయిర్‌బేస్‌పై దాడికి తెగబడ్డారు.

ఉగ్రవాదులు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకోని పోలీసులు

ఎస్పీ వాహనంలోనే ఉగ్రవాదులు వివిధ చెక్‌పోస్టులను దాటారు. వాహనంపై నీలం రంగు బుగ్గ ఉండడంతో పోలీసులు పొరపాటు బడ్డారు. తమ శాఖ ఉన్నతాధికారి అనుకుని తనిఖీలు చేయకుండానే వదిలేశారు. ఉగ్రవాదులను దగ్గరుండీ దర్జాగా సాగనంపారు. చెక్‌పోస్టుల దగ్గర సలాం కొడుతూ మర్యాద చేసి పంపించారు. ఇలా అన్నీ కలిసి వస్తుండడంతో ఉగ్రవాదులు తమ వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు. అడ్డుకోవాల్సినవారే అడుగడుగునా స్వాగతం పలుకుతుంటే పన్నాగం అమల్లో పెట్టేందుకు పఠాన్‌కోట్‌ వైపు తమ వాహనాన్ని పరుగులు పెట్టించారు.

భద్రతా దళాల సమన్వయ లోపం

పఠాన్‌కోట్‌పై ఉగ్రవాదుల దాడిలో భద్రతా దళాల సమన్వయ లోపం కూడా కనిపిస్తోంది. స్వయంగా ఎయిర్‌ఫోర్స్‌ అధికారులే ఈ విషయాన్ని అంగీకరించారు. ఉగ్ర దాడి జరుగుతుందని నిఘా వ్యవస్థలు ముందుగానే హెచ్చరించాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పఠాన్‌కోట్‌లో అదనంగా 250 మంది జవాన్లను నియమించారు. కాని దాడిని అడ్డుకోలేకపోయారు. ఆరుగురు ఉగ్రవాదులు ధైర్యంగా ఎయిర్‌బేస్‌లోకి ఎంటర్‌ అయ్యారు. కాల్పులకు తెగబడ్డారు. గ్రెనేడ్‌లను పేల్చారు. ఏడుగురు జవాన్లను పొట్టన పెట్టుకున్నారు.

ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారు?

అసలు ఎంత మంది ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించారన్నది స్పష్టత లేదు. ఎలా వచ్చారన్నదీ చెప్పలేకపోతున్నారు. ఎన్ని బృందాలుగా ముష్కరులు వచ్చారనే విషయమూ స్పష్టత లేదు. ఇలా అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపిస్తోంది.

పఠాన్‌ కోట్‌పై పాక్‌ పన్నాగం

పఠాన్‌ కోట్‌పై పాక్‌ మొదటి నుంచీ పన్నాగం పన్నుతోంది. ఎయిర్‌బేస్‌పై దాడి చేసి దేశ రక్షణ వ్యవస్థను దెబ్బ తీయాలని ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచిస్తోంది. గతంలో ఆ దేశ సైన్యం రెండు సార్లు దాడి చేసింది. ఇప్పుడు ఉగ్రవాదులు దాడి చేశారు.

పఠాన్‌కోట్‌ పాకిస్తాన్‌ టార్గెట్‌

భారత్‌లో పెద్దదయిన పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ను పాకిస్థాన్‌ మొదటి నుంచీ లక్ష్యంగా చేసుకుంది. అవకాశం చిక్కిన్నప్పుడల్లా దాడి చేయడానికి సిద్ధపడింది. పాకిస్థాన్‌ బోర్డర్‌లో ఉన్న ఈ ఎయిర్‌బేస్‌పై దాడి చేస్తే భారత్‌ను రక్షణ పరంగా దెబ్బ తీయవచ్చనే ప్లాన్‌ను ఆ దేశ సైన్యం రెండు సార్లు అమలు చేసింది. ఆ ప్రయత్నాలను భారత్‌ సైన్యం వమ్ము చేయడంతో పాకిస్థాన్‌ తోక ముడిచింది. మళ్లీ ఇప్పుడు పాకిస్థాన్‌ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు.

1965 సెప్టెంబర్‌ 6నపఠాన్‌కోట్‌పై పాక్‌ దాడి

1965 సెప్టెంబర్‌ 6 అర్ధరాత్రి పాకిస్థాన్‌ సైన్యం పఠాన్‌కోట్‌పై దాడికి దిగింది. ఎయిర్‌బేస్‌లో ఉన్న యుద్ధ విమానాలు, ఇతర ఆయుధ సామాగ్రిని ధ్వంసం చేయడానికి స్పెషల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌కి చెందిన పారా ట్రూపర్లను రంగంలోకి దించింది. అయితే ఆ ప్లాన్‌ ఫలించలేదు. పాక్‌ సైన్యం ప్రయత్నాలను ఇండియన్‌ ఆర్మీ తిప్పికొట్టింది. 136 మంది పాక్‌ కమెండోలను భారత్‌ యుద్ధ ఖైదీలుగా పట్టుకుంది. దీంతో పాకిస్థాన్‌ తోక ముడిచింది.

1971లో మరోసారి దాడి

1971లో పాకిస్థాన్‌ సైన్యం మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. ఇది మరో యుధ్దానికి దారి తీసింది. ఈ సందర్భంగా పఠాన్‌కోట్‌తో పాటు దేశంలోని 11 ఇతర వైమానిక స్థావరాలపైనా పాకిస్థాన్‌ దాడులకు తెగబడింది. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లోని రన్‌వేలో కొంతభాగాన్ని రాకెట్లతో ధ్వంసం చేసింది. ఐనా పాక్‌ దాడులను భారత్‌ దీటుగా ఎదుర్కొంది. చివరికి ఈ యుద్ధంలో పాకిస్థాన్‌ ఓడిపోయింది. ఈ యుద్ధంలో విజయంతోనే తూర్పు పాకిస్థాన్‌ బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది. ఈ సారి ఉగ్రవాదుల కన్ను పఠాన్‌కోట్‌పై పడింది. దేశ రక్షణ వ్యవస్థకు వ్యూహాత్మకమైన ఈ ఎయిర్‌బేస్‌పై దాడి చేయాలనే పన్నాగాన్ని ఉగ్రవాదులు పక్కగా అమలు చేశారు.

భారత్‌తో చర్చలను పాక్‌ సైన్యం జీర్ణించుకోలేకపోతోందా?

మోదీ పాక్‌ పర్యటనపై ప్రపంచం మొత్తం ఫిదా అయ్యింది. కొత్త చరిత్రకు నాంది అంటూ అంతర్జాతీయ మీడియా విశ్లేషణలు అందించింది. ఐతే ఉగ్రవాదులు పఠాన్‌కోట్‌పై దాడిచేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దాడి వెనుక పాకిస్తాన్‌కు చెందిన నిఘా వర్గాల పాత్ర ఉందనే వార్తలు పలు సందేహాలను తెర మీదకు తీసుకువస్తున్నాయి.

మోడీ అకస్మిక పాకిస్తాన్‌ పర్యటన

గత ఏడాది డిసెంబర్‌లో ప్రధాని మోడీ అకస్మాత్తుగా పాకిస్తాన్‌ వెళ్లారు. రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లిన ప్రధాని ఉన్నట్టుండి పాక్‌ పయనమయ్యారు. ప్రధాని ట్వీట్‌ చేసే వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. పాక్‌ వెళ్లిన ప్రధానికి అపూర్వ ఆహ్వానం లభించింది. ఆ దేశ పీఎమ్‌ నవాజ్‌ షరీప్‌ మోదీకి సాదర స్వాగతం పలికారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు పలు అంశాలను చర్చించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌పై అంతర్జాతీయంగా మంచి స్పందన వచ్చింది. భారత్‌-పాక్‌ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని కితాబు వచ్చింది. ఐతే ఈ పరిణామాన్ని పాకిస్తాన్‌ ఆర్మీ జీర్ణించుకోలేక పోతోందా..? పఠాన్‌కోట్‌ దాడికి ఆ దేశ సైన్యంతో పాటు నిఘా సంస్థ సహకరించిందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి.

ఉగ్రదాడిలో ఐఎస్‌ఐ హస్తం

పఠాన్‌కోట్‌పై ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉందని భారత నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఐఎస్‌ఐ సహకారంతోనే ఉగ్రవాదులు ఇండియా బోర్డర్‌ను క్రాస్‌ చేశారనే విషయాన్ని భారత్‌ అధికారులూ ధృవీకరిస్తున్నారు. ఐతే భారత్‌పై దాడిని పాకిస్తాన్‌ ప్రభుత్వం ఖండించింది. ఉగ్రవాదుల చర్యను తప్పుపట్టింది. మరి ఆ దేశ ఇంటిలిజెన్స్‌ వర్గాలు పఠాన్‌కోట్‌ దాడికి ఎందుకు సహకరించాయి..? దీనికి పాకిస్తాన్‌ సైన్యం ఎందుకు సపోర్టుగా నిలిచింది...?

భారత్‌తో చర్చలకు పాకిస్తాన్‌ ఆర్మీ ప్రతికూలం!

భారత్‌తో చర్చలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా.. ఆర్మీ మాత్రం ప్రతికూలంగా ఉందనే విశ్లేషణ కూడా తెర మీదకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే చర్చల ప్రక్రియను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మోదీ-షరీఫ్‌ భేటీతో వచ్చిన సానుకూల వాతావరణాన్ని దెబ్బ తీసే ఆలోచనతోనే పాక్‌ ఆర్మీ అడుగులు వేస్తోందన్న వాదనలూ ఉన్నాయి.

పాక్‌తో చర్చలపై భిన్నాభిప్రాయాలు

పఠాన్‌కోట్‌పై దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో చర్చలపై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ పాక్‌ పర్యటనను నిలదీసిన కాంగ్రెస్‌ ఇప్పుడు తన వాయిస్‌ను పెంచింది. మరోపక్క మిత్రపక్షమైన శివసేన కూడా బీజేపీపై విరుచుకుపడుతోంది.

బీజేపీపై కాంగ్రెస్‌ విమర్శలు

పఠాన్‌కోట్‌ దాడి నేపథ్యంలో భారత్‌-పాక్‌ చర్చలపై రాజకీయ పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్‌తో సంబంధాల విషయంలో మోదీ విధానాలను కాంగ్రెస్‌ ఎండగడుతోంది. ప్రధాని పర్యటన తర్వాత కూడా పాకిస్తాన్‌ ఉగ్రవాదులు దాడి చేయడం చాలా సీరియస్‌ విషయం అని ఆ పార్టీ పేర్కొంది. ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చలు వ్యక్తిగత సంబంధాలకే పరిమితమయ్యాయని... ఆ దేశంలో అన్ని వర్గాల ఆమోద ముద్ర లభించలేదని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది.

కాంగ్రెస్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

ఐతే కాంగ్రెస్‌ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దాడుల అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికింది. ప్రతి సమస్యకు చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడింది. పఠాన్‌కోట్‌ దాడితో చర్చల ప్రక్రియకు ఎటువంటి విఘాతం కలగదని బీజేపీ స్పష్టంచేసింది. ఐతే ఆ పార్టీ మిత్రపక్షమైన శివసేన మాత్రం పాకిస్తాన్‌తో చర్చలను తప్పుపట్టింది. పాక్‌కు వ్యతిరేకంగా శివసేన నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియను సమర్థించిన అకాళీదళ్‌

పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించడానికే పఠాన్‌కోట్‌ దాడి జరిగిందని పంజాబ్‌ ముఖ్యమంత్రి, అకాలీదళ్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ అన్నారు. పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియను ఆయన సమర్థించారు. ప్రతి సమస్యకూ చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని బాదల్‌ స్పష్టం చేశారు. బీజేపీ మరో మిత్రపక్షమైన ఎల్‌జేపీ కూడా చర్చల ప్రక్రియ కొనసాగించాలని అభిప్రాయపడింది.

 

విప్రో నూతన సీఈవోగా అబిద్ అలీ నీమచ్ నియామకం..

హైదరాబాద్‌ : విప్రో లిమిటెడ్ కంపెనీకి కొత్త సీఈవోగా అబిద్ అలీ నీమచ్ వాలా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఈ ఐటీ కంపెనీ గ్రూపు ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన నియామకానికి బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సీఈవోగా ఉన్న టీకే కురియన్ స్థానంలో అబిద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. టి.కె.కురియన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రెండు నియామకాలు ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.

 

ఉస్మానియాయూనివర్సిటీలో అన్ని డిగ్రీ పరీక్ష ఫీజు స్వీకరణ

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ వార్షిక పరీక్షలకు ఫీజును ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. రూ. 200 అపరాధ రుసుముతో ఈ నెల 23వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.

 

 

19:55 - January 4, 2016

కృష్ణా : విజయవాడ నిడమానూరు జంక్షన్‌ దరగ్గ మెట్రో కోచ్‌ డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం, సీపీఐలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు.. రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిడమానూరు నుంచి గన్నవరకు వరకు పాదయాత్ర నిర్వహించిన వామపక్ష నేతలు, రైతులు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెట్రో కోచ్‌ డిపో కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుంటే సహించబోమని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు హెచ్చరిస్తున్నారు. 

19:40 - January 4, 2016

ఢిల్లీ : వ్యవసాయరంగం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగ నిపుణులు హాజరయ్యారు.. ఏపీనుంచి మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ ఈ సమావేశానికి వెళ్లారు. రైతుల సమస్యల పరిష్కారంకోసం వివిధ రకాల సూచనలు అందజేశారు.

 

19:38 - January 4, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొసీడింగ్ సీడీలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభ ప్రొసీడింగ్ సీడీలు అధికార పక్షానికి ఒకలా.. ప్రతిపక్షానికి ఒకలా ఇచ్చారని వైసిపి అధికార ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. డిసెంబర్ 22 నాటి జీరో అవర్ అంశాలపై మాత్రమే కమిటీ వేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. స్పీకర్ నియమించిన కమిటీకి అసలు ఏ అంశాలపై చర్చించాలో ఇప్పటివరకూ నియమ నిబంధనలు ఇవ్వలేదని అన్నారు.

 

18:56 - January 4, 2016

హైదరాబాద్ : ఏపీలో భవనాల క్రమబద్ధీకరణ గడువును నెలరోజుల పాటు పొడిగిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీపీఎస్ కోసం ఈనెల 31వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది.

 

 

18:35 - January 4, 2016

మహబూబ్ నగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపట్ల అవలంభిస్తున్న విధానాలపై సీఐటీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది.. రాష్ట్రంలో ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్నారని సిఐటియు జాతీయ కార్యదర్శి సుధాభాస్కర్‌ మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే నిజాం షుగర్‌ పరిశ్రమను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చిందని... ఇంతవరకూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో జిల్లా సిఐటియు పదో మహాసభలు జరిగాయి. కృష్ణయ్యనగర్‌లో పార్టీ సీనియర్‌ నేత షేక్‌మహబూబ్‌ జెండా ఆవిష్కరణ తర్వాత మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండోరోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

 

18:28 - January 4, 2016

హైదరాబాద్ : ప్రముఖ గాయని పి.సుశీల తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఆమె క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం కుటుంబ సభ్యులను కలిశారు. ఐదు రోజులపాటు అయుత చండీ మహా యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు సుశీల అభినందనలు తెలిపారు. ప్రజల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆశీర్వదించారు. సుశీల దేశం గర్వించదగ్గ గాయని అని కేసీఆర్ కొనియాడారు. 

163వ జాతీయ రహదారికి శంకుస్థాపన

వరంగల్ : జిల్లాలోని మడికొండలో 163వ జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి... కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

 

18:11 - January 4, 2016

హైదరాబాద్ : తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన మరో 36 మందిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీరి కుటుంబాలకు 10లక్షల చొప్పున ఆర్థిక సాయం విడుదల చేస్తూ.. .ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కరీంనగర్ జిల్లాకు చెందిన 22 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఏడుగురు, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ఏడుగురు ఉన్నారు.

 

దలాల్ స్ట్రీట్‌పై సౌదీ-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం

ఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రారంభంలోనే నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. చైనా ఫ్యాక్టరీ ఉత్పత్తి గణాంకాలు మరింత దిగజారనున్నాయనే అంచనాలకు తోడు, సౌదీ-ఇరాన్ మధ్య టెన్షన్ వాతావరణం మార్కెట్ సెంటిమెంట్‌ను కరిగించింది. ఈ దెబ్బకు సెన్సెక్స్ 538 పాయింట్లు పతనమై 25వేల 623 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టి 171 పాయింట్లు క్షీణించి 7వేల 791 పాయింట్ల వద్ద క్లోజైంది. టెలికాం, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ షేర్లు భారీగా నష్టపోయాయి.

17:54 - January 4, 2016

ఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ప్రారంభంలోనే నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. చైనా ఫ్యాక్టరీ ఉత్పత్తి గణాంకాలు మరింత దిగజారనున్నాయనే అంచనాలకు తోడు, సౌదీ-ఇరాన్ మధ్య టెన్షన్ వాతావరణం మార్కెట్ సెంటిమెంట్‌ను కరిగించింది. ఈ దెబ్బకు సెన్సెక్స్ 538 పాయింట్లు పతనమై 25వేల 623 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టి 171 పాయింట్లు క్షీణించి 7వేల 791 పాయింట్ల వద్ద క్లోజైంది. టెలికాం, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీలో టాటా మోటార్స్, ఐడియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హిండాల్కో, పిఎన్ బి, ఎయిర్‌టెల్‌, ఎస్‌ బ్యాంక్, అదానీ పోర్ట్ 3 నుంచి 6శాతం వరకు క్షీణించాయి. నిఫ్టీలో 4 కంపెనీలకే లాభాలు వచ్చాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్ 7.3శాతం క్షీణించింది. చైనా మార్కెట్ పతనంతో దేశీయంగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది.

 

పట్టణప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం సులభతరం...

హైదరాబాద్ : పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణాలను టీసర్కార్ సులభతరం చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భవన కట్టడాలకు ఆన్ లైన్ లోనే అన్ని అనుమతులు లభించనున్నాయి. అనుమతులు ఇవ్వడం ఆలస్యమైతే అధికారులపై జరిమానా విధించనున్నారు. పెద్ద భవనాల నిర్మాణంలో కామన్ స్పేస్ ను తగ్గించింది. రోడ్డు వెడల్పులో భవనాలను కోల్పోయిన వారు.. అదనపు భవంతులు నిర్మించుకోవడానికి వెసులుబాలు కల్పించింది. భవంతి నిర్మాణంలో ఉన్నప్పుడు పన్ను కట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. 

 

17:41 - January 4, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని ఆర్టీవో కార్యాలయాల్లో ఎసిబి సోదాలు నిర్వహించింది. ఖమ్మం, నిజామాద్, కరీంనగర్ జిల్లాల ఆర్టీవో కార్యాలయాలపై అధికారులు దాడులు చేశారు. రికార్టులను తనిఖీ చేశారు.

 

ఆర్టీవో కార్యాలయాల్లో ఎసిబి సోదాలు..

హైదరాబాద్ : తెలంగాణలోని ఆర్టీవో కార్యాలయాల్లో ఎసిబి సోదాలు నిర్వహించింది. ఖమ్మం, నిజామాద్, కరీంనగర్ జిల్లాల ఆర్టీవో కార్యాలయాలపై అధికారులు దాడులు చేశారు. రికార్టులను తనిఖీ చేశారు.

 

భారత రాయబార కార్యాలయంపై 'ఉగ్ర'దాడి

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ లో భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాబూల్ లో కాల్పులు కొనసాగుతున్నాయి. 

16:57 - January 4, 2016

ఖమ్మం : జిల్లాలోని మణుగూరులో 10టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.. పినపాక నియోజకవర్గ క్యాలెండ్‌ను మణుగూరు డిఎస్ పి భల్లా రాజేశ్ ఆవిష్కరించారు. క్యాలెండర్ డిజైన్ అద్భుతంగా ఉందని డిఎస్ పి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

16:54 - January 4, 2016

ఢిల్లీ : దలాల్ స్ట్రీట్ భారీ పతనం పుత్తడికి డిమాండ్ పెరిగేలా చేసింది. స్టాక్ మార్కెట్లో అమ్మకాలకు దిగిన ఇన్వెస్టర్లు.. తమ పెట్టుబడులను బులియన్ మార్కెట్ వైపు మళ్లించారు. దీంతో 24క్యారెట్ బంగారం 10గ్రాముల ధర 210రూపాయలు పెరిగి 25వేల 700రూపాయలకు చేరింది. అటు వెండి ధర కూడా కిలోకు 200 రూపాయలు పెరిగింది. మార్కెట్ పతనం ఇలాగే ఉంటే.. పుత్తడికి రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

 

 

16:51 - January 4, 2016

విజయవాడ : అమరావతి ప్రాజెక్టులో భాగంగా నిడమానూరులో మెట్రో కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణంపై స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.. పచ్చటి పొలాలు, నివాస గృహాలున్న ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ కట్టొద్దంటూ వామపక్ష పార్టీలతో కలిసి రైతులు ఆందోళన చేస్తున్నారు.. కోచ్‌ నిర్మాణ స్థలంనుంచి గన్నవరం వరకూ పాదయాత్ర చేశారు.

 

మణిపూర్ లో మళ్లీ భూప్రకంపనలు

ఇంఫాల్ : మణిపూర్ లో మళ్లీ భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.4 శాతంగా నమోదు అయింది. మొదట సంభవించిన భూకంపానికి ఎనిమిది మంది మృతి చెందారు. 54 మంది గాయపడ్డారు. 

కరెంట్ కోతలు లేకుండా చేశాం : చంద్రబాబు

ప్రకాశం : రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. జిల్లాలోని మార్కాపురం మండలం రాయవరంలో నిర్వహించిన 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. వనరులను సక్రమంగా ఉపయోగించుకుంటే అభివృద్ధి సాధ్యమన్నారు. వరదనీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని సూచిచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు రావెల కిషోర్ బాబు, శిద్ధా రాఘవరావులు పాల్గొన్నారు.

 

ప్రభుత్వస్కూళ్లల్లో సౌకర్యాల లేమిపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాల లేమిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మారుమూల ప్రాంతాలకు ఉపాధ్యాయులు వెళ్లడం లేదని పేర్కొంది. విద్యావాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఉపాధ్యాయులు మారుమూల ప్రాంతాలకు వెళ్లడం లేదు. 

15:21 - January 4, 2016

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. భారత ఎంబసీ టార్గెట్‌గా కాల్పులు జరిపారు. ఆప్ఘన్ బలగాలు టెర్రరిస్టులను సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం అక్కడ హోరాహోరిగా కాల్పులు జరుగుతున్నాయి. మరోవైపు ఇండియన్‌ ఎంబసీలో ఉన్న భారతీయ ఉద్యోగులందరూ క్షేమంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వస్కూళ్లల్లో సౌకర్యాలలేమిపై అమేకస్ ప్యూరి హైకోర్టుకు నివేదిక

మహబూబ్ నగర్ : జిల్లాలోని ఐజా, గట్టు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల లేమిపై అమేకస్ ప్యూరి విజయ్ కుమార్ హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. ఐజా, గట్టు పాఠశాలల్లో ఇంగ్లీష్, హిందీ టీచర్లు లేరు. ప్రహరిగోడలు, బాత్ రూమ్ లు సరిగా లేవని నివేదికలో అమేకస్ ప్యూరి విజయ్ కుమార్ నివేదికలో పేర్కొన్నారు. 

రేపు గ్రేటర్ పరిధిలో షర్మిల పరామర్శ యాత్ర..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరుగనుంది. ఈ మేరకు తెలంగాణ వైఎస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 18 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారని తెలుస్తోంది. 

భూకంప సహాయక చర్యల్లో ఆర్మీ..ఎయిర్ ఫోర్స్ సిబ్బంది..

ఢిల్లీ : మణిపూర్ లో సంభవించిన భూకంప సహాయక చర్యల్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బృందాలు పాల్గొంటున్నాయి. గువహటి నుండి ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్ 32 విమానంలో 75 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇంఫాల్ కు బయలుదేరి వెళ్లాయి. 

క్రికెటర్ల కోసం సంఘం ఏర్పాటు చేయాలి - లోధా కమిటీ..

ఢిల్లీ : దేశంలో క్రికెటర్ల కోసం కూడా ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలని జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సూచించింది. బీసీసీఐ, ఐపీఎల్ కు ప్రత్యేక పరిపాలన సంఘాలు ఏర్పాటు చేయాలని, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కు పరిమితంగా స్వయం ప్రతిపత్తి ఉండాలని ప్రతిపాదించింది. బీసీసీఐ రాజ్యాంగం, పద్ధతులు, పనితీరుపై అధ్యయనం చేసిన లోధా కమిటీ ఈ మేరకు రూపొందించిన తుది నివేదికను సుప్రీంకోర్టుకు అందచేసింది. 

13:41 - January 4, 2016

బీహార్ : మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా సీఎం కావడానికి చట్టం అడ్డుపడింది. అయినా ఆయన డామినేషన్‌కి మాత్రం అది అడ్డం కాలేకపోతోంది. సీఎం సీటులో లేకున్నా లాలు స్టైల్‌లోని ఘాటు తగ్గలేదు. చేతిలో పవర్ లేకున్నా బీహార్‌ కా షేర్‌లో షోర్ తగ్గలేదు. సమోసాలో ఆలు ఉన్నా లేకపోయినా.. బీహార్‌లో లాలూ హవా మాత్రం తగ్గదని అర్ధమైపోతోంది. కొడుకేమో హెల్త్‌ మినిస్టర్‌. తనిఖీలు తాను చేస్తే ఏంటి కొడుకు చేస్తే ఏంటి అనుకున్నాడో ఏమో ఆర్జేడీ నేత లాలు ప్రసాద్‌యాదవ్‌ పాట్నాలోని హాస్పట్‌లో ఆకస్మిక తనిఖీలు చేసి హడలెత్తించాడు. పాట్నాలోని ఇందిరాగాంధీ మెడికల్ ఆస్పత్రికి ఆకస్మికంగా వెళ్లిన లాలు వార్డు వార్డును తనిఖీ చేశాడు. అంతేకాదు ప్రతీ పేషెంట్‌ను పలకరించి ఆస్పత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశాడు. ముందస్తు సమాచారం లేకుండా ఆస్పత్రికి వచ్చిన మాజీ సీఎంను చూసి ఆస్పత్రి వర్గాలు అవాక్కయ్యాయి.

ఇదే ఆసుపత్రిలో లాలూ అడ్మిట్...
1997లో లాలు ప్రసాద్‌యాదవ్ జ్యుడీషిల్ కస్టడీ నుంచి వచ్చిన తరువాత ఈ ఆస్పత్రిలోనే అడ్మిట్ అయ్యారు. ఇక్కడి వీఐపీ వార్డులో చికిత్స చేయించుకున్నారు. లాలు తాజాగా సీఎం హోదాలో ఉన్నంత హడావుడి చేసి ఆస్పత్రి అధికారులను పరుగులు పెట్టించారు. నితీష్‌ సర్కార్‌ పాలనలో రాష్ర్టంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఆటవిక రాజ్యం కొనసాగుతోందని వ్యాఖ్యలు చేసి ఆజ్యం పోసిన లాలు తాజాగా ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించడం తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికేనని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. జేడీయూ కంటే కొన్ని ఎక్కువస్థానాలు సాధించిన ఆర్జేడీ ఆధిక్యతను ప్రదర్శించడం సంకీర్ణ సర్కారుకు మింగుడుపడటం లేదు.

13:38 - January 4, 2016

ఢిల్లీ : కమ్యూనిస్టు పార్టీ యోధుడు, సీపీఐ అగ్రనేత ఏ.బీ.బర్ధన్‌కు వామపక్ష నేతలు, కార్యకర్తలు,వివిధ పార్టీల నాయకులు ఘన నివాళి అర్పించారు. ఢిల్లీ సీపీఐ ప్రధాన కార్యాలయంలో బర్ధన్ పార్థివదేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. వామపక్ష పార్టీల బలోపేతానికి ఆయన నిరూపమాన సేవ చేశారని కొనియాడారు. ప్రజాందోళనల్లో ముందుండి నడిపించారని గుర్తు చేసుకున్నారు. వామపక్ష పార్టీలకు ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు వామపక్ష నేతలు.

13:37 - January 4, 2016

పంజాబ్ : పఠాన్‌కోట్‌ ఇంకా హాట్‌గానే ఉంది. భద్రతాదళాల కూంబింగ్‌ కొనసాగుతుండగానే మళ్లీ కాల్పుల మోతతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. ఇద్దరు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం పఠాన్‌కోట్‌లోనే ఉండి పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు.

13:36 - January 4, 2016

ఢిల్లీ : పఠాన్‌కోట్‌ ఉగ్రవాదుల పోరులో వీరమరణం పొందిన జవాన్లకు జాతియావత్తు ఘన నివాళులు అర్పిస్తోంది. వారి ధైర్యసాహసాలను కొనియాడుతోంది. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని త్యాగాన్ని స్మరించుకుంటోంది. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో చనిపోయిన ఏడుగురు సైనికుల పార్థివదేహాలను వారివారి స్వస్థలాలకు తరలించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. కేంద్ర,రాష్ట్ర మంత్రులు, ఆర్మీ అధికారులు జవాన్లకు నివాళులు అర్పించారు. 

13:30 - January 4, 2016

హైదరాబాద్ : టీడీపీ..బీజేపీ నేతలపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇందిరా భవన్ లో విలేకరులతో రఘువీరా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులులుగా ఉంటారని అదే మోడీ దగ్గర పిల్లులుగా ఉంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏ రాష్ట్రానికి రాని మేలు ఏపీకి వచ్చిందన్నారు. రూ.5లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రయోజనాలు ఏపీకి వచ్చాయన్నారు. ఇవన్నీ ఇప్పటికే అమలు కావాల్సి ఉన్నాయని, కానీ అసమర్థత..చేతకానితనం వల్ల అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే అన్ని అమలయ్యేవని పేర్కొన్నారు. రెవెన్యూ లోటుకు సంబంధించి సెక్షన్ 46(2)లో రూ. 14,400 కోట్లు రావాలని ఉంటే రూ. 2,300 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రకు సెక్షన్ 46(3) ప్రకారం రూ. 24,350 కోట్లు రావాల్సి ఉంటే రూ. 700 కోట్లు వచ్చాయన్నారు. ఇదంతా ఎవరి అసమర్థత అని రఘువీరా ప్రశ్నించారు. 

13:26 - January 4, 2016

హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులు..అప్పులు..ఇతరత్రా సమస్యలతో కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇందులో చిన్నారులను కూడా తమతో పాటు తీసుకెళుతున్నారు. సీతారాంబాగ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు చంపేసి దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...రాజు, రాధిక దంపతులు గత పదేళ్లుగా సీతారాంబాగ్ లో నివాసం ఉంటున్నారు. వీరికి రెండు సంవత్సరాలు గల ఇద్దరు కవల పిల్లలున్నారు. రాజు ఎల్ బినగర్ లో స్ర్కాప్ బిజినెస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి కలివిడిగా తిరిగిన రాజు కుటుంబం సోమవారం ఉదయం లేవలేదు. అనుమానం వచ్చిన స్థానికులు ఇంటి కిటీకి తెరిచి చూడగా రాజు ఉరి వేసుకుని చనిపోవడం కనిపించాడు. వెంటనే స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు రాజు భార్య, ఇద్దరు పిల్లలు కూడా చనిపోయి ఉండడం గుర్తించారు. వీరి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వ్యాపారంలో నష్టం రావడం..అప్పులు పేరుకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడం కలిచివేస్తోందని స్థానికులు పేర్కొన్నారు. 

13:21 - January 4, 2016

ప్రకాశం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని రాయవరంలో 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఆయన మాటల్లోనే...
''ప్రజలకు రేషన్ ఇస్తున్నాం. 6వేల కోట్ల రూపాయల ఫించన్ లకు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే 24 వేల కోట్ల రూపాయలు రుణమాఫి చేశాం. డ్వాక్రా సంఘాలకు పది వేల కోట్ల రూపాయాలు ఇచ్చాం. ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే ప్రజలే పన్నులు కట్టాలి. ఒక్క కుటుంబం ఎలాగో ప్రభుత్వం అలాగే. పేదవారి ఆదాయం పెరగకుండా చేస్తే సమాజానికి మంచిది కాదు. అంతేగాకుండా ఆడబిడ్డల ఆరోగ్యం చూస్తున్నాం. మరుగుదొడ్డి లేకపోవడం బాధాకరం. ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇంటికి పదిహేను వేల రూపాయలు ఇచ్చామని, మీలో కూడా మార్పు రావాలి. ఏ గ్రామం ముందుకొస్తుందో ఆ గ్రామంలో మరుగుదొడ్డి కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో కరెంటు వచ్చేది కాదు. 22.5 మిలియన్ పాయింట్ల కరెంటు కొరత ఉండేది. ఈ ప్రాంతంలో కరెంటు కొరత ఉండేది. ప్రస్తుతం కరెంటు కొరత లేకుండా చేస్తున్నాం. వ్యవసాయానికి ఏడు గంటల కరెంటు ఇస్తోంది. సంక్రాంతి లోపు ఉపాధి హామీలో కూలీ రేట్లు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ జిల్లాలో వనరులున్నాయి. 10 లక్షల హెక్టార్ల భూమి ఉంది. ఏ జిల్లాలో లేనంత భూమి ఉన్నా నీళ్లు లేవు. వెలిగొండ పూర్తి చేయడం వల్ల నాలుగైదు లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. ఈ సంవత్సరం వర్షం ఎక్కువగా కురవలేదు. వరద నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. 42 మిల్లీమీటర్ల నీరు తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి''. అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శిద్ధా రాఘవ రెడ్డి, రావెల పాల్గొన్నారు. 

లడ్డూ కౌంటర్లలో టిటిడి జేఈవో తనిఖీలు..

చిత్తూరు : తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్లలో టిటిడి జేఈవో శ్రీనివాసరాజు తనిఖీలు నిర్వహించారు. లడ్డూల కొరతకు ఆస్కారం లేదని, శ్రీవారిని దర్శించుకొనే ప్రతి భక్తుడికి ఐదు లడ్డూలను అందచేయడం జరుగుతోందన్నారు. లడ్డూ కౌంటర్ కాంప్లెక్సు మొదటి అంతస్తులోని కౌంటర్లను పూర్తిస్థాయిలో అందుబాటులో తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

ముగిసిన భవానీ దీక్షల విరమణ...

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో భవానీ దీక్షల విరమణ ముగిసింది. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో నర్సింగరావు దంపతులు పాల్గొన్నారు. చివరి రోజు కావడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది.

 

పఠాన్ కోట్ సైనిక చర్య కొనసాగుతోంది - ఎన్ఎస్ జీ..

ఢిల్లీ : పఠాన్ కోట్ లో సైనిక కార్యాచరణ కొనసాగుతోందని ఎన్ఎస్ జీ ప్రకటించింది. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లో ఉన్నారని, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా కార్యాచరణ కొనసాగుతోందని తెలిపింది. ఎయిర్ బేస్ కు అదనపు బలగాలు తరలివచ్చాయని, ఆర్మీ, ఎన్ఎస్ జీ సంయుక్తంగా కార్యచరణ జరుపుతోందని పేర్కొంది. ఎయిర్ బేస్ కు ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది.

 

12:36 - January 4, 2016

ఢిల్లీ : ఇరాన్‌, సౌదీ అరేబియా మధ్య విబేధాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రమాదంలో పడ్డాయి. సౌదీ అరేబియా 47 మందిని ఉరి తీసిన అంశం ఇరాన్‌లో ఆందోళనలకు కారణమయ్యింది. అది కాస్తా ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపింది. షీత్‌ల మత పెద్ద నిమ్రల్‌ నిమ్ర్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వం శనివారం ఉరి తీసింది. ఆ దేశం ఉరితీసిన 47 మందిలో నిమ్ర్ ఉన్నారు. నిమ్ర్‌ ఉరితీతపై ఇరాన్‌ భగ్గుమంది. సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిమ్ర్‌కు ఉరితీతను నిరసిస్తూ టెహ్రాన్‌లో సౌదీ అరేబియా దౌత్య కార్యాలయాన్ని ముట్టడించారు. మషాద్‌లో ఉన్న కాన్సులెట్‌ భవనంపైనా దాడి చేశారు. ఈ ఘటనతో సౌదీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశం..
ఇరాన్‌లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో సౌదీ అరేబియా ఆ దేశంతో దౌత్య సంబంధాలను తెంచుకుంటోంది. సౌదీలో ఉన్న ఇరాన్‌ రాయబారులను దేశం విడిచివెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ఆదేశించింది.48 గంటల్లో సౌదీని వదిలేయాలని అల్టిమేటం జారీ చేసింది. తమ దేశ దౌత్య కార్యాలయం దగ్గర భద్రత పెంచాలని కోరినా ఇరాన్‌ ప్రభుత్వం స్పందించలేదని సౌదీ ఆరోపించింది. ఐతే సౌదీ ఆరోపణలను ఇరాన్‌ ప్రభుత్వం ఖండించింది. దాడికి సంబంధించి ఇప్పటికే 44 మందిని అరెస్ట్ చేశామని ప్రకటించింది.

దెబ్బతింటున్న ఇరు దేశాల సంబంధాలు..
నిమ్ర్‌ను అన్యాయంగా ఉరితీశారని ఇరాన్‌ ఆరోపిస్తోంది. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మండిపడుతోంది. ఇరాన్‌ ఆరోపణలను సౌదీ ఖండించింది. 2011లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈశాన్య సౌదీలో జరిగిన ఆందోళన వెనుక నిమ్ర్‌ పాత్ర ఉందని ఆ దేశం స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా విచారణ జరిపి పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతే దోషులను ఉరితీశామని తెలిపింది. ఇరాన్‌, సౌదీ దౌత్య సంబంధాలు కొన్ని దశబ్దాలుగా ఒడిదుడుకులకు లోనవుతూనే ఉన్నాయి. తాజా పరిణామాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బ తీస్తున్నాయి. 

12:33 - January 4, 2016

వరంగల్ : కొమరెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల తొలిరోజున.. స్వామివారి కల్యాణానికి ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

లష్కర్‌ వారంగా రెండో ఆదివారం..
ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారంతో మొదలై.. ఫాల్గుణ మాసం చివరి ఆదివారం వరకు మూడు నెలలపాటు మల్లన్న జాతర సుదీర్ఘంగా జరుగుతుంది. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి వారాన్ని పట్నావారంగా.. రెండో ఆదివారాన్ని లష్కర్ వారంగా జరుపుకుంటారు. మహాశివరాత్రి లింగోద్భవ కాలంలో ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పెద్దపట్నం, చివరి ఆదివారం స్వామి వారికి అగ్ని గుండాలు నిర్వహిస్తారు. మల్లన్న క్షేత్రంలో పసుపును బండారుగా భావిస్తారు. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి శివలింగం రూపంలో దర్శనమిస్తుండగా.. ఇక్కడ మాత్రం పురుషాకృతిలో శివుడు దర్శనమిస్తాడు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం 800 ఏళ్ల క్రితానికి చెందినదని స్థానికులు నమ్ముతారు. 

12:31 - January 4, 2016

హైదరాబాద్ : కన్న కూతురిలా చూసుకోవాల్సిన అత్త సూర్యకాంతంలా మారిపోయింది.. దీనికి భర్త వేధింపులుకూడా తోడయ్యాయి.. దేశంకాని దేశంలో పోరాడలేక భారత్‌ వచ్చేసింది ఆ అభాగ్యురాలు.. అత్తవారింటిముందు కన్నీటి పర్యంతమైంది. వివరాల్లోకి వెళితే…
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోఉండే బాధితురాలు ఉన్నత చదువులకోసం 2006లో అమెరికా వెళ్లింది. అక్కడ రజనీకాంత్‌తో పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారింది. రెండు కుటుంబాలను ఒప్పించి 2013లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత యూఎస్‌ వెళ్లిపోయారు. వివాహం తర్వాత రజనీకాంత్‌, అతని తల్లిదండ్రులు తమ అసలు రూపం బయటపెట్టారు. ప్రతి చిన్న విషయానికి చిత్రహింసలు పెట్టారు. కొద్దిరోజులు గడిచేసరికి వేధింపులు మరింత పెరిగాయి. కట్నం సరిపోలేదంటూ అత్తగారు నరకం చూపడం మొదలుపెట్టింది. అటు రజనీకాంత్‌ కూడా చీటికిమాటికి గొడవలకు దిగాడు. ఇంటినుంచి వెళ్లిపోవాలంటూ పదే పదే బెదిరించేవాడు. అయినా ఆమె వెళ్లకపోవడంతో తనకు విడాకులు కావాలంటూ రెండేళ్లక్రితం యూఎస్‌ కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు వెంటనే ఇండియా వచ్చేసింది. తనకు న్యాయం చేయాలంటూ ఇక్కడి కోర్టులో పిటిషన్‌ వేసింది. కోర్టు నోటీసులు అందుకున్న రజనీకాంత్‌ తన సొంతింటికి తిరిగివచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు అతని ఇంటిముందు నిరసన చేపట్టింది. తాను భర్తతో కలిసి ఉంటానని విడాకులకు ఒప్పుకోనని కన్నీరు మున్నీరైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సమస్య పరిష్కారంకోసం కృషి చేస్తున్నారు.

చైనాలో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : చైనాలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఆసియా మార్కెట్లపై చైనా స్టాక్ పతనం ప్రభావం చూపించింది. పశ్చిమాసియా ఉద్రిక్తలతో స్టాక్ మార్కెట్ లలో అమ్మకాల వత్తిడి పెరిగింది. ఏడు శాతం వరకు చైనా మార్కెట్లు పడిపోయాయి. ట్రేడింగ్ నిలిపివేశారు. 

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 460, నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడవుతున్నాయి. చైనాలో పారిశ్రామికోత్పత్తి తగ్గింది. ఒక్కసారే 500 పాయంట్లకు స్టాక్ మార్కెట్ పడిపోయింది. 

12:13 - January 4, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఇప్పటికే ఈ విషయంపై కోర్టు పలుసార్లు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరు రైతు సంఘ నేతలతో సమావేశాలు జరిగాయి. తాజాగా జరిగిన విచారణలో హైకోర్టు పలు సూచనలు చేసింది. ఏపీలో రైతు ఆత్మహత్యల నివారణకు అమలు చేస్తున్న పాలసీలు వివరించకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణ రైతులను భాగస్వామ్యం చేసి స్టేట్ లెవల్ అగ్రికల్చర్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోగా నిర్ణయం చెప్పాలని కోర్టు సూచించింది.

కమిషన్ ఏర్పాటు చేయాలి...
ఈ సందర్భంగా పిటిషనర్లు టెన్ టివితో మాట్లాడారు. రైతు భాగస్వామ్యంతో కమిషన్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని, దీనిపై కోర్టు కూడా సంతోషం వ్యక్తం చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. రైతులకు సంబంధించి కమిషన్ రావడం సంతోషకరమన్నారు. కానీ వారం రోజులు గడువు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరడం జరిగిందన్నారు. ఎన్నో పాలసీలు ఉన్నాయని, కానీ ఈ పాలసీలు సరియైన విధంగా రైతులకు అందడం లేదని కోర్టుకు తెలపడం జరిగిందని తెలిపారు. అందుకని దీనిపై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరగిందన్నారు. అలాగే రైతులందరికీ సబ్సిడీ విత్తనాలు అందే విధంగా చూడాలని, ఎప్పుడు అవసరమైతే రైతులకు రుణాలు ఇచ్చే విధంగా చూడాలని అందుకు మైక్రో ఫైనాన్స్ అవసరమని తాము కోర్టుకు చెప్పడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. 

స్టేట్ లెవల్ అగ్రికల్చర్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీలో రైతు ఆత్మహత్యల నివారణకు అమలు చేస్తున్న పాలసీలు వివరించకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణ రైతులను భాగస్వామ్యం చేసి స్టేట్ లెవల్ అగ్రికల్చర్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోగా నిర్ణయం చెప్పాలని కోర్టు సూచించింది.

 

11:59 - January 4, 2016

చలికాలంలోనూ, వర్షాకాలంలో బాగా వేధించే సమస్య జలుబు, దగ్గు. అన్ని వయసుల వారు వీటి బారిన పడకత ప్పదు. ముఖ్యంగా వీటి కారణంగా పిల్లలు చాలా ఇబ్బంది పడతారు.దాదాపు రెండు వందల వైరస్‌లు కారణం. ఇన్నింటిలో ఏ ఒక్క వైరస్ వల్ల అయినా జలుబు రావచ్చు. అందుకని జలుబుకు సరైన మందు కనిపెట్టలేకపోయారు. విసిగించే జలుబు వల్ల మేలే ఎక్కువ ఉంది. వైరస్ శరీరంలోకి వెళ్లాక మనలోని వ్యాధి నిరోధక శక్తి వల్ల దానితో పోరాడటానికి యాంటీబాడీస్ తయారవుతాయి. ఇవి వ్యాధిని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని ఇస్తాయి. అందుకని జలుబు గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. సాధారణంగా పుట్టిన నెల రోజుల వయసు నుంచే పిల్లలకు జలుబు రావడం మొదలవుతుంటుంది. మందులు వాడినా వాడకపోయినా ఏడు రోజుల్లో తగ్గిపోయే జలుబుకు ఎన్నో ఇతర కారణాలు ఉన్నాయి

ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి...

జలుబు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. పెద్దవాళ్లకు జలుబు ఉండి, పిల్లలకు దగ్గరగా లేదంటే వారి మీదనే దగ్గడం, తుమ్మడం చేస్తే వెంటనే అది పిల్లలకు వస్తుంది. వైరస్‌తో పాటు శుభ్రత లోపించడం దుమ్ము వల్ల కూడా జలుబు వస్తుంటుంది.

ముక్కులో, గొంతులో .....

ముక్కులో అడినాయిడ్స్, గొంతులో టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పిల్లలకు జలుబు ఎక్కువసార్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరిలో జలుబు తగ్గడానికి కూడా ఎక్కువ రోజులు పట్టవచ్చు.

పెద్దలు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం వల్ల, అందులో ఉండే వైరస్ ఎక్కడైనా వ్యాపిస్తుంది. ఇలాంటి చోట ఉండే పిల్లలను జలుబు ఎక్కువగా వేధిస్తుంది. ఉమ్మి ద్వారా టి.బి., స్వైన్‌ఫ్లూ వంటి దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంటుంది. తల్లిపాలు తాగని పిల్లల్లో తరచూ జలుబే కాదు ఏ ఇన్ఫెక్షన్ అయినా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఎలాంటి నిబంధనలు లేవు......

జలుబుకి ఆహారం విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. అయితే ముక్కులు మూసుకుపోవడం వల్ల పిల్లలు సరిగా తినలేరు. అందుకని తక్కువ తక్కువ ఆహారాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు ఇస్తుండాలి. రెండు - మూడు గంటలకు ఓ సారి పాలిచ్చే తల్లులు పిల్లలకు జలుబు ఉన్నపుడు ఎక్కువ సార్లు ఇస్తుండాలి.

పిల్లలను జలుబు ఎక్కువగా వేధిస్తుంది.....

పెద్దలు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం వల్ల, అందులో ఉండే వైరస్ ఎక్కడైనా వ్యాపిస్తుంది. ఇలాంటి చోట ఉండే పిల్లలను జలుబు ఎక్కువగా వేధిస్తుంది. ఉమ్మి ద్వారా టి.బి., స్వైన్‌ఫ్లూ వంటి దీర్ఘకాలిక జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంటుంది.

పిల్లి కూతలు....

చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. జలుబు తగ్గకపోగా పిల్లలు గాలి తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు పిల్లికూతలుగా వినిపిస్తుంటాయి. ఎన్నో కారణాల వల్ల వచ్చే ఈ సమస్య నియంత్రణకు బ్రాంకోడయలేటర్ మందులు, నెబులైజేషన్లు అవసరం పడతాయి.

డాక్టర్ని ఎపుడు సంప్రదించాలి...

పిల్లల్లో సాధారణంగా రెండు నెలలకోసారి జలుబు వస్తూనే ఉంటుంది. ఎదుగుదలలో ఎలాంటి సమస్యలు లేనప్పుడు ఎక్కువ సార్లు జలుబు చేసినా భయపడాల్సిన అవసరం లేదు.

ప్రత్యేకించి మందులు అక్కరలేదు...

జలుబుకు ప్రత్యేకించి మందులు వాడాల్సి అవసరం లేదు. ముక్కులు మూసుకుపోయినప్పుడు మాత్రం సెలైన్ డ్రాప్స్, జ్వరంగా ఉంటే పారాసిటమాల్ సిరప్ వైద్యుల సలహా మేరకు వాడాలి. జలుబు ఏడు రోజులకు కూడా తగ్గక ఇంకా కొనసాగుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. యాంటీబయాటిక్స్ వాడనవసరం లేదు. అయితే డాక్టర్ సలహా మేరకు ఇవ్వాల్సి ఉంటుంది. జలుబుకు ప్రత్యేకించి వ్యాక్సిన్లు ఏమీ లేవు. అయితే పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి, ఇతర వ్యాధులు రాకుండా ఉండటానికి సమయానుకూలంగా వ్యాక్సిన్లు ఇప్పించడం నిర్లక్ష్యం చేయకూడదు.

వంటింటి చిట్కాలు...
వెల్లుల్లిని బాగా నలగొట్టి గంటకొకసారి బాగా వాసన పీలుస్తూ, అప్పుడప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగాలి. ఇలా చేస్తూ ఉంటే కూడా జలుబు తగ్గుతుంది.
ఒక టేబుల్ స్పూన్ తేనెలో హాఫ్ టేబుల్ స్ఫూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి పడుకునేటప్పుడు తాగితే జలుబు ,దగ్గు నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.
2 లేదా 3 తులసి ఆకులను వాటర్ తో కలిపి చిన్న మంటపై కొంత సేపు ఉడక బెట్టి.. నీళ్లు చల్లారాక పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు..
తులసి, మిరియాలతో చేసే కషాయం జలుబు సమస్యను అదుపులో ఉంచుతుంది.
జలుబు, ముక్కుదిబ్బడ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ ను చేతి రుమాలు పై వేసి వాసన పీలుస్తూ ఉంటే ముక్కుదిబ్బడ తగ్గుతుంది.

సీతారాంబాగ్ లో విషాదం..

హైదరాబాద్ : సీతారాంబాగ్ లో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడాదిన్నర పిల్లలు మేఘ, మేఘనకు ఉరివేసిన రాజీవ్, రాధిక దంపతులు అనంతరం వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

భూకంపంపై హోం మంత్రిత్వ శాఖ సమీక్ష..

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపపై హోం మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించింది. భూకంపం కారణంగా పలు భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇంఫాల్ లో ఆరు అంతస్తుల భవనం కుప్పకూలిందని, గువహటి నుండి ఇంఫాల్ కు 45 మంది గల రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలించడం జరిగిందని తెలిపింది. 

ఇసుక మాఫియా..హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : ఇసుక మాఫియాపై హైకోర్టులో విచారణ జరిగింది. హై పవర్ కమిటీ నియామకంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణలో కమిటీ వివరాలను వెల్లడించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

అజయ్ భవన్ లో ఏబీ బర్ధన్ భౌతికకాయం..

ఢిల్లీ : అజయ్ భవన్ లో సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్ధన్ భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, సీపీఎం నేతలు సీతారం ఏచూరి, ప్రకాష్ కరత్, బృందాకరత్, ఏకే పద్మనాభవన్ లు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. బర్ధన్ అంత్యక్రియలు మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్నాయి.  

10 కే రన్ లో భారీ మోసం..

విశాఖపట్టణం : 10 కే రన్ తో భారీ మోసం బయటపడింది. గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. రన్ అనంతరం అడ్రస్ లేకుండా నిర్వాహకులు పరారయ్యారు. కలెక్టరేట్ ఎదుట క్రీడాకారులు ధర్నా నిర్వహిస్తున్నారు. 

11:32 - January 4, 2016

హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఛార్జిషీట్‌ ఇప్పటివరకు ఎందుకు దాఖలు చేయలేదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎన్నిరోజుల సమయం కావాలని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ను అరెస్టు చేసి నిర్మల్ కు తరలించి జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. 25 ప్రాంతాల్లో ఆయనపై కేసు నమోదైంది. కానీ ఎలాంటి ఛార్జిషీట్ దాఖలు కాకపోవడంపై హైకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. మూడు సంవత్సరాలు దాటిన తరువాత ఛార్జీషీట్ దాఖలు చేయకపోతే స్వ్కాష్ పిటిషన్ వేసుకుని కేసు నుండి విముక్తి పొందే అవకాశం ఉంటుందని, ఈ విషయంలో ఎందుకు అలసత్వం చేస్తున్నారని పిల్ లో పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై కోర్టు పై విధంగా స్పందించింది. అయితే దర్యాప్తు పూర్తయినా.. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు స్పెషల్ పిపి శరత్ కుమార్ పేర్కొన్నారు. 

11:22 - January 4, 2016

ఢిల్లీ : పంజాబ్‌ పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన జవాన్ల మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. బాంబును నిర్వీర్యం చేయబోయి మరణించిన లెఫ్టినెంట్ కల్నల్‌ నిరంజన్‌కుమార్‌ భౌతికకాయాన్ని బెంగుళూరుకు అక్కడి నుంచి కేరళలోని పాలక్కడ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్ లో ఉంచిన నిరంజన్ భౌతికకాయానికి సీఎం సిద్ధరామయ్య ఇతర ఉన్నతాధికారులు ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన జవాన్‌ గురుసేవక్ సింగ్ మృతదేహాన్ని స్వగ్రామమైన హర్యానాలోని అంబాలకు తరలించారు. 45 రోజుల క్రితమే గురుసేవక్‌సింగ్ వివాహమైంది. ఇంతలోనే ఉగ్రదాడిలో గురుసేవక్‌సింగ్‌ వీరమరణం పొందారు. వీరజవాన్‌ భౌతికకాయాన్ని చూసి అంబాల గ్రామం విలపిస్తోంది. దేశం కోసం తన కుమారుడు చనిపోవడం గర్వంగా ఉందని గద్గద స్వరంతో గురు సేవక్ సింగ్ తండ్రి పేర్కొన్నారు.
పఠాన్‌కోట్‌ ఇంకా హాట్‌గానే ఉంది. భద్రతాదళాల కూంబింగ్‌ కొనసాగుతుండగానే మళ్లీ కాల్పుల మోతతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. ఇద్దరు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం పఠాన్‌కోట్‌లోనే ఉండి పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉగ్రవాదులను సజీవంగా పట్టుకోవాలనే ఉద్ధేశ్యంతో భద్రతా దళాలున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. 

11:13 - January 4, 2016

హైదరాబాద్: సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి మలయాళ సూపర్ స్టార్ ముమ్ముటి సరసన నటించనుంది. త్వరలో తమిళ్ లో రామ్ దర్శకత్వంలో పెరనాబు అనే చిత్రం సెట్స్ కు వెళ్లనుంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో మమ్ముటి పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తండ్రి పాత్ర. కానీ అంజలి మాత్రం తల్లి పాత్ర కాదు. ఈ నేపథ్యంలో ఆమెది సెకెండ్ లీడ్ అని తెలుస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ మమ్ముటి తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన చివరిసారిగా నటించిన తమిళ్ సనిమా వందే మాతరం. ఈ సినిమా వచ్చే వారం కొడైకెనాల్ తోమొదటి షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. మొత్తానికి 2016 లో అంజలి కెరీర్ మెరుపు వేగంతో దూసుకుపోతుంది. కొత్త ఏడాదంతా ఇప్పటికే కాల్షీట్లు నిండిపోయాయి. తెలుగు - తమిళ్ భాషల్లో ఒకటే కమిట్ మెంట్లు. ప్రస్తుతం చేతిలో ఇరు భాషల్లోనూ అరడజనకు పైగా సినిమాలున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ సరసన డిక్టేటర్ లో నటిస్తోంది. అటు మంచు కాంపౌండ్ లోనూ సరదా అనే సినిమాలో నటిస్తోంది. 

సుప్రీం చేతికి లోధా కమిటీ నివేదిక..

ఢిల్లీ : బీసీసీఐ రాజ్యాంగం, పద్ధతులు, పనితీరుపై అధ్యయనం చేస్తున్న మాజీ చీఫ్ జస్టిస్ ఆర్.ఎం.లోధా కమిటీ తన తుది నివేదికను జనవరి 4న సుప్రీంకోర్టుకు అందచేసింది. 

11:01 - January 4, 2016

హైదరాబాద్: డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి ఓ ప్రాజెక్టు చేయబోతున్నారు. గత ఏడాదే వీళ్ళ కాంబోలో ఈ సినిమాకు ముహూర్తం కుదిరినా అది వాయిదా పడింది. చివరికి తాజాగా నైజామ్ ఏరియా టాప్ డిస్ట్రిబ్యూటర్లలో ఒకటైన అభిషేక్ పిక్చర్స్ మొదటిసారిగా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఈ సంస్థను నిర్వహిస్తున్న ప్రొడ్యూసర్ కాళి సుధీర్ ఈ విషయాన్ని ప్రకటించారు. బోయపాటి, సాయి శ్రీనివాస్‌ల మూవీకోసం తాము రిలయెన్స్‌తో టై అప్ అవుతున్నామని, అల్లు అర్జున్‌తో బోయపాటి చేస్తున్న చిత్రం షూటింగ్ పూర్తి కాగానే వచ్చే ఏప్రిల్ నుంచి ఈ మూవీ షెడ్యూల్ ప్రారంభం కావచ్చునని ఆయన చెప్పారు. కాగా తమిళ మూవీ ‘సుందర పాండ్యన్’ తెలుగు రీమేక్‌లో సాయి శ్రీనివాస్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని భీమనేని శ్రీనివాస రావు డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

చీలాపూర్ లో కారు బోల్తా...

రంగారెడ్డి : జిల్లాలోని పోడూరు మండలం చీలాపూర్ లో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.

 

మెట్రో కోచ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నాం - సీపీఎం…

విజయవాడ : మెట్రో కోచ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలతిపారు. నిడమానూరులో రైతుల భూములు లాక్కొవద్దని, టిడిపి అధికారంలోకి వచ్చాక రైతులను విస్మరిస్తోందన్నారు. రాజధాని ఎందుకు కోరుకున్నామా అనే అయోయమస్థితిలో రైతులున్నారని తెలిపారు. రాజధాని అభివృద్ధి పేరుతో పేదల భూములను కార్పొరేట్లకు కట్టుబెడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల సయమంలో భారీ సభ నిర్వహిస్తామని, ప్రభుత్వ ఆగడాలను ఎండగడుతామని పేర్కొన్నారు. 

మెట్రో కోచ్ నిర్మాణం వ్యతిరేకిస్తూ పాదయాత్ర...

విజయవాడ : మెట్రో కోచ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పాదయాత్ర జరుగుతోంది. నిడమానూరు నుండి గన్నవరం వరకు సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతోంది. 

ప్రకాశంలో ముందస్తు అరెస్టులు..

ప్రకాశం : జిల్లాలోని మార్కాపురంలో సీపీఎం, సీపీఐ, ఎమ్మార్పీఎస్ నేతలను, అంగన్ వాడీల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. 

10:28 - January 4, 2016

హైదరాబాద్ : గోకులంలో సీత ఫేమ్ రాశి రీఎంట్రీ ఇవ్వబోతోందట. నాగ శౌర్య - మాళవికా నాయర్ జంట గా నటిస్తున్న తాజా సినిమా కల్యాణ వైభోగమే. నందిని రెడ్డి దర్శకత్వంలో ఎల్.దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో రాశి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
బొద్దుగా వుండే రాశి సడెన్ గా నాజూకుగా జనిపించేసరికి ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారట. ఈ సినిమా కోసం చాల మంది వెటరన్ యాక్టర్లను రంగంలోకి దింపిన నందిని రెడ్డి రాశిని ఈ సినిమాలో మరో సారి హీరోయిన్ గా చూపించిందా? లేక తల్లి పాత్రకే పరిమితం చేసిందా అన్న అనుమానం అందరిలో మొదలైంది. అయితే ఈ అనుమానాలకు తెరదీస్తూ రాశీ అసలు విషయాన్ని బయటపెట్టేసి౦ది. సినిమాలో తను హీరోయిన్ మాళవికా నాయర్ కు తల్లిగా కనిపించబోతున్నానని చెప్పేసింది. 11 ఏళ్ళ తరువాత రాశి నటిస్తున్న సినిమా ఇది. రాశి మరింత నాజూగా తయారైతే ప్రజెంట్ వున్న హీరోయిన్ లకు పోటీనివ్వడం ఖాయమని ఆమెను చూసిన వాళ్ళంతా చెబుతుండటం విశేషం. తల్లిగా రాశి రీ ఎంట్రీ ఇస్తుండటంతో కల్యాణ వైభోగమే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.

బాబుతో మంత్రులు..టిడిపి నేతల భేటీ..

నెల్లూరు : కావలి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో సీఎం చంద్రబాబు నాయుడిని మంత్రి నారాయణ, టిడిపి నేతలు కలిశారు. పదిన్నర గంటలకు బాబు ప్రకాశం జిల్లాకు బయలుదేరనున్నారు. 

జన్మభూమిని బహిష్కరించిన గ్రామస్తులు...

గుంటూరు : మంగళగిరి (మం) కృష్ణాయపాలెంలో జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. జన్మభూమి కోసం టెంట్లను గ్రామస్తులు తొలగించారు. తమ గ్రామ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

జాతీయ విపత్తు నిర్వహణా బృందం కమిటీ భేటీ..

ఢిల్లీ : భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణా బృందం కమిటీ ఇవాళ ఉదయం 10.30గంటలకు సమావేశం కానుంది.మణిపూర్ లో భూప్రకంపనలు, సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై చర్చించనున్నారు

10:16 - January 4, 2016

వాషింగ్టన్‌: రోజుకు మీరు ఎంత నీరు తాగాలో చెప్పే సరికొత్త ‘స్మార్ట్’ వాటర్‌ బాటల్‌ ఇది. సౌండ్ చేస్తే వెలిగే లైట్లు, టచ్ స్క్రీన్ ఫోన్లు, గూగుల్‌గ్లాస్ లు మనం విన్నాం. ఇప్పుడో కొత్త వాటర్ బాటిల్ వచ్చింది. మీ బాడీకి వాటర్ కావాలనీ, మీరు కావలసిన దానికంటే ఎక్కువ నీళ్లు తాగుతున్నారనీ, లేదా మీరు తాగే నీళ్లు ఫ్రెష్షా ? కాదా? ఆ నీటి జాతకం చెప్పే స్మార్ట్ వాటర్ బాటిల్ ప్రపంచ మార్కెట్లోకి వచ్చింది. మీపక్కనే ఉండే పర్సనల్ డాక్టర్‌‌లా పని చేసే ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌‌కు చాలా స్పెషాలిటీలున్నాయట. మన ఒంట్లో కాలరీలను ఖర్చుచేసేందుకు ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్ లు , జాగింగ్ లాంటి‌‌వి చేస్తామే కానీ, ఒంటికి ఎంత నీరు అవసరమో చెప్పే టెక్నాలజీ ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ సొంతమట.

టచ్ చేస్తే చాలు...

టెక్నికల్ సీల్ తో ఉండే ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ ను టచ్ చేస్తే చాలు. బాటిల్ లో ఉన్న నీళ్లు ఎన్ని డిగ్రీల హీట్ లో ఉన్నాయనేది మూత మీద కనిపిస్తుందట. మీరు నీళ్లు తాగి చాలాసేపు అయి ఉండొచ్చు.. ఒక వీ బాడీకి నీటి అవసరం ఉండొచ్చు.లేదా మీరు పని హడావుడిలో మర్చిపోయి ఉండొచ్చు..అయినా బేఫికర్.. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ ఒక విధమైన వైబ్రేటింగ్ సౌండ్ చేసి వాటర్ తాగే టైమ్ అయిందని వార్నింగ్ ఇస్తుందట.అంతే కాదు . ఆ బాటిల్ లో వాటర్ తాగడానికి పనికిరాకపోతే తాగొద్దని చెప్పే టెక్నాలజీ కూడా ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ కు ఉంది.అంతే కాకుండా శరీరానికి సరిపదేంత నీరు తాగగానే ఇక చాలని కూడా చెబుతుందట. అందుబాటులోకి వచ్చిన టెక్నికల్ నాలెడ్జ్ తో తయారైన ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ ఖరీదు 54 నుంచి 94 యూఎస్ డాలర్స్ దాకా పలుకుతోందట. దీనికి సంబంధించిన అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు, ఐఫోన్‌ వంటి స్మార్‌‌టఫోన్‌లలో ఇన్‌స్టాల్‌ చేసుకుని వివరాలు పొందుపరిస్తే సరి.. బ్లూటూత్‌ సాయంతో సీసా సమాచారం పంపుతుంది. అవసరాలను బట్టి ఎంత నీరు, ఎప్పుడెప్పుడు తాగాలో నిర్ణయించుకుని దీనిలో సెట్‌ చేసుకునే అవకాశముంది.

10:07 - January 4, 2016

చిత్తూరు : ఎర్రచందనం మళ్లీ కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా ఎర్రచందనం తరలిస్తున్న దుంగలను టాస్క్ ఫోర్స్, పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. తాజాగా ఎస్వీ జూ పార్కు వెనుకాల ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. వీరిని చూసిన 50-60 మంది ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. అక్కడి నుండి తరలించడానికి సిద్ధంగా ఉన్న 38 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇది జరుగుతుండగానే ఎమ్మార్ పల్లిలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 53 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

09:59 - January 4, 2016

హైదరాబాద్ : పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో వరుసగా మూడో రోజు కాల్పులు కొనసాగుతున్నాయి. ఆరుగురు ఉగ్రవాదులు హతమైనా ఇంకా ఇద్దరు ఉగ్రవాదులు ఎయిర్ బేస్ లో దాక్కున్నారట. సమయం చూసి విరుచుకుపడేందుకు వారు యత్నిస్తున్నారు. ఉగ్రవాదులు తప్పించుకునే వీల్లేకుండా అష్టదిగ్బంధం చేశాయి. ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ ఉగ్రవాదుల్లో ఆదివారం సాయంత్రానికే ఆరుగురు హతమయ్యారు. చొరబడిన ఉగ్రవాదులు ఆరుగురేనన్న వాదన కూడా తప్పని తేలిపోయింది. ఉగ్రవాదుల పనిబట్టే క్రమంలో ఏడుగురు భారత సైనికులు కూడా వీరమరణం పొందారు. శనివారం తెల్లవారుజామున పఠాన్ కోట్ లో మొదలైన కాల్పులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. విడతలవారీగా కొనసాగుతున్న కాల్పులతో పఠాన్ కోట్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి.

మణిపూర్ లో మళ్లీ భూ ప్రకంపనాలు..

ఇంఫాల్ : మణిపూర్ లో మళ్లీ భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయని పీటీఐ వార్తా సంస్థ ప్రకటించింది. రిక్టర్ స్కేల్ పై 3.6గా నమోదైందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలు సహా బంగ్లాదేశ్, మయన్మార్ పలు ప్రాంతాలు భూ ప్రకంపనాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 

ఎస్వీనగర్ వద్ద టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్...

తిరుపతి : ఎస్వీనగర్ వద్ద శేషాచలం అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 38 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూలీలు పరారయ్యారు. 

నేటితో ముగియనున్న భవానీల దీక్షల విరమణలు..

విజయవాడ : నేటితో భవానీల దీక్షల విరమణలు ముగియనున్నాయి. ఇంద్రకీలాద్రికి భవానీలు, భక్తులు పోటెత్తారు. 

కల్నల్ నిరంజన్ భౌతికకాయానికి సిద్ధరామయ్య నివాళులు..

బెంగళూరు : వీరమరణం పొందిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ భౌతికకాయానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ పరంగా నిరంజన్ కుటుంబానికి పరిహారం అందిస్తామని వెల్లడించారు. పఠాన్ కోట్ లో జరిగిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నిరంజన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. 

మణిపూర్ లో ఒకరు మృతి - రాజ్ నాథ్ సింగ్...

ఢిల్లీ : భూకంప తాకిడికి మణిపూర్ లో ఓ భవంతి కూలడంతో ఒకరు మృతి చెందడం జరిగిందని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అలాగే భూప్రకంపాలకు 40-45 మందికి గాయాలయ్యాయని తెలిపారు. 

రిమ్స్ కు వెళ్లనున్న మణిపూర్ సీఎం..

ఇంఫాల్ : మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రిమ్స్ కు వెళ్లనున్నారు. భూకంప తాకిడికి గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించనున్నారు. ఈశాన్య రాష్ట్రాలు సహా బంగ్లాదేశ్, మయన్మార్ పలు ప్రాంతాలు కంపించిపోయిన సంగతి తెలిసిందే. 

09:21 - January 4, 2016

కడప : రైల్వే స్టేషన్ లో సిగ్నల్ రూమ్ లో వాచ్ మెన్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. బోయ మస్తానయ్య అనే వ్యక్తి వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఇతను ఆదివారం రాత్రికి డ్యూటికి వచ్చాడు. ట్రాలీ మీద పడుకున్న మస్తానయ్య సోమవారం తెల్లవారుజామున సజీవదహనమై కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అనుమానస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అగ్నిప్రమాదం కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెగ్యులర్ గా డ్రింక్ అలవాటు ఉందని కుటుంబసభ్యులు పేర్కొన్నారని పోలీసు అధికారి పేర్కొన్నారు. ట్రాలీకి పక్కనే చలి మంటలు వేసుకుని ఉన్నాడని, దీనివల్లే మృతి చెంది ఉంటాడా ? అనే అనుమానాలున్నాయని తెలిపారు. 

09:14 - January 4, 2016

ప్రకాశం : గూడూరు - విజయవాడ ప్యాసింజర్ రైలులో ఓ బాలుడు తప్పిపోయాడు. ట్రైన్ లో తిరుగుతున్న బాలుడిని చూసిన ఇతర ప్రయాణికులు గమనించారు. అనంతరం బాలుడిని గార్డ్ కు అప్పగించారు. ట్రైన్ లో ఉన్న ప్రయాణికులను గార్డ్ విచారించారు. వివరాలకు తెలియకపోవడంతో చివరకు చీరాల రైల్వే పోలీసులకు గార్డు అప్పచెప్పాడు. తన పేరు చింటూ అని తల్లిదండ్రుల పేర్లు రాధా, వెంకటేశ్వరరావు అని..తన ఊరు పోకూరు అని బాలుడు పేర్కొంటున్నాడు. బాలుడిని రైల్వే పోలీసులు ఒంగోలులోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. 

09:08 - January 4, 2016

ఢిల్లీ : భారత్‌ - మయన్మార్‌ సరిహద్దులో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.8 గా నమోదయింది. మణిపూర్‌ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో భూ ప్రకంపనలు తీవ్రంగా సంభవించాయి. భూకంపం తెల్లవారుఝామున 4 గంటల 35 నిమిషాలకు సంభవించింది. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు పరిస్థితిని సమీక్షించారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం సీఎంలతో ప్రధాన మంత్రి మోడీ నేరుగా ఫోన్ చేసి సంభాషించారు. కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతి చెందిన వారికి..గాయపడిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చేరుకొనేందుకు పయనమయ్యారు.
భూకంప తీవ్రతకి ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్‌, కోల్‌కతాలో సైతం భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం ఇంఫాల్‌కు 33 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. భూ కంప తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఇంకా ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే సిలిగురిలో బస చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భూకంపం సంభవించినట్లు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ప్రజలు భయాందోళనలతో రోడ్లపైకి పరుగులు తీశారు. 

08:34 - January 4, 2016

చలి..చలి..ఈ వాతావరణంతో శరీరంలో కూడా అనేక మార్పులకు చోటుచేసుకుంటాయి. అయితే ఈ మార్పులు పెద్దలపై మాత్రమే కాదు... పిల్లల పట్ల కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ కాలంలో పిల్లలకు సమస్య పొద్దున్నే నిద్రలేవడం దగ్గర్నుంచి మొదలవుతుంది. పొద్దున్న ఎనిమిదవుతున్నా ఇంకా ముసుగులోని వెచ్చదనాన్ని విడిచిపెట్టి బయటకు రావడానికి ఇష్టపడని పిల్లలు వాళ్లను తిరిగి రొటీన్‌ లోకి తీసుకురావడానికి తల్లి దండ్రులు పడే అవస్థలు...ఈ కాలంలో ప్రతి ఇంట్లోనూ సాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇలా పొద్దున్నే లేవడమే కాదు... చలికాలంలో పిల్లలకు మరెన్నో ఆరోగ్య సమస్యలు. అందుకే పిల్లల గురించి ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చలికాలం తీవ్రమైన చలితో పాటు జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాల్ని కూడా వెంట మోసుకొస్తుంది. పిల్లల విషయంలోనైతే ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. స్వెట్టర్లు, క్యాప్‌లు సరిగ్గా ధరించకపోవడం కూడా ఇందుకు ఓ కారణం. కాబట్టి ఇంట్లోఉన్నా, బయటికి వెళ్లినా పిల్లలకు ఉన్ని దుస్తులు వేయడం మాత్రం మరిచిపో కూడదు. అసలే తీవ్రమైన చలి అంటే...కొందరు వాళ్ళ పిల్లలకు అడిగిన వెంటనే ఐస్‌ క్రీమ్‌లు, కూల్‌ డ్రింక్స్‌ వంటివి కొనిచ్చేస్తుంటారు. ఇవి తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కనీసం చలికాలం అయిపో యేంత వరకైనా పిల్లల్ని వీటి జోలికి పోకుండా చూసుకోవాలి.
స్కూలుకు వెళ్ళే పిల్లలకు యూనిఫాంతో పాటు స్వెట్టర్‌, తలను కప్పి ఉండేలా క్యాప్‌ లాంటివి కూడా వేసి పంపించాలి.
చలికాలంలో పిల్లల బట్టల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసు కుంటామో...అలాగే పాదరక్షల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. చలికి పాదాలు పగలకుండా సాక్సులు, బూట్లు లాంటివి వేయాలి.
పిల్లలకు సూప్స్‌, స్నాక్స్‌, భోజనం...ఇలా అన్నీ ఇంట్లోనే వేడి వేడిగా వండిపెట్టాలి. సాధ్యమైనంత వరకు బయటి ఆహారం తినకుండా అదుపు చేయాలి.
ఫ్లూ రాకుండా ఉండేందుకు బీటా కెరోటిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభించే క్యారెట్లు, లైకోపిన్‌ ఉండే టమోటో, క్యాప్సికం లాంటి వాటితో కూరలు లేదా సూప్స్‌ చేసి పెట్టడం వల్ల వాటిలోని పోషకాలు పిల్లలకు అంది ఆరోగ్యంగా ఉంటారు.
ఈ సీజన్‌లో వేధించే మరో సమస్య చర్మం పొడిబారడం. చల్లగా వీచే గాలుల వల్ల శరీరంలోని తేమ శాతం తగ్గిపోయి చర్మం పొడిబారుతుంది. దీని వల్ల చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందులోనూ సుకుమారంగా ఉండే పిల్లల చర్మం మీద చలి ప్రభావం మరింత ఎక్కువగానే ఉంటుంది. ఈ సమస్య నుంచి పిల్లల లేత చర్మాన్ని సంరక్షించుకోవాలంటే రోజూ మాయిశ్చరైజర్‌ లేదా పెట్రోలియం జెల్లీ వంటివి రాయడం మర్చిపోవద్దు.
ఈ కాలంలో పిల్లలకు ఉదయం పూట స్నానం చేయించి.. సాయంత్రం కాళ్లు, చేతులు శుభ్రంగా కడగాలి. లేదంటే చర్మంపై పడిన దుమ్మ ధూళి అలాగే ఉండిపోయి నిర్జీవంగా మారిపోతుంది.
చదివారు కదా.. చలికాలంలో పిల్లల్ని కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో...! మరి మీ పిల్లల విషయంలో కూడా ఇవన్నీ పాటిస్తారు కదూ!

08:31 - January 4, 2016

విశాఖపట్టణం : ఆర్కేబీచ్‌లో విశాఖ ఉత్సవ్‌ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరై ప్రేక్షకులకు అలరించారు. బాలయ్యను చూసేందుకు వచ్చినవారితో ఆర్కే బీచ్‌ జనసంద్రమైంది. బాలకృష్ణ చెప్పిన డిక్టేటర్‌ డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

జనాన్ని ఆకట్టుకున్న బాలయ్య...
సీఎం చంద్రబాబు విశాఖను పర్యాటక, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు . అదేవిధంగా గిరిజనుల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ తనదైన శైలిలో డైలాగులు చెబుతూ జనాన్ని ఆకట్టుకున్నారు. డిక్టేటర్‌ లోని పలు డైలాగులకు ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. బాలయ్య చెప్పిన డైలాగులకు ఆర్కే బీచ్‌ అభిమానుల ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది. విశాఖ ఉత్సవ్‌లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, శివారెడ్డి మిమిక్రీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. జనం తండోపతండాలుగా రావడంతో విశాఖలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. మొత్తానికి విశాఖ ఉత్సవ్‌ ముగింపు వేడుకలు బాణాసంచా వెలుగుజిలుగుల మధ్య, భారీ జనసందోహం మధ్య ఘనంగా ముగిశాయి. 

08:27 - January 4, 2016

భారత్ - పాక్ దేశాల మధ్య చర్చలు కొనసాగాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం..సహృద్భావ వాతావరణం ఉన్న సందర్భంల్లో ఇలాంటి చర్యలు కనుబడుతాయని తెలిపారు. పఠాన్ కోట్ లో ఉగ్రదాడి..తెలంగాణలో రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే…

పాక్ లో శక్తులు...
''భారత్ - పాక్ సంబంధాలు మెరుగవుతుంటే సహించలేని శక్తులు ఈ చర్యలకు పూనుకుంటుంటారు. చొరబాటు దారులు ప్రవేశిస్తారు..దాడులు పెరుగుతాయి..కుట్రలు పెరుగుతాయి..అయినా చర్చల ప్రక్రియలో ముందుకెళ్లాలని ఆనాడే చెప్పాను. భారత్ - పాక్ సంబంధాలు చర్చలు మొదలైనా అనివార్యంగా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. పాక్ లో ప్రభుత్వం...సైన్యం మధ్య తేడా చాలా తక్కువ. సైన్యంలో ఛాందస వాద శక్తులు సైన్యాన్ని నడిపిస్తుంటారు. భారతదేశంలో సైన్యం రాజకీయ పరిణామాల్లో జోక్యం చేసుకోలేదు. పాక్ లో నాలుగైదు రకాల శక్తులున్నాయి. బయట సైన్యంతో సంబంధం లేకుండా కొన్ని శక్తులున్నాయి. పాక్ లో ఉన్న రాజకీయ అవకాశ వాదులున్నాయి. పాక్ లోనే ఉంటూ సరిహద్దుల అవతల సీమాంతర ఉగ్రవాదులు..ఇలాంటి ఎన్నో శక్తులు పాక్ లో ఉన్నాయి. దీనికి భయపడి చర్చల నుండి వైదొలగితే తీవ్రవాదం ఏం కోరుకుందో అదే నెరవేరినట్లు అవుతుంది. ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటూనే చర్చించుకుంటూనే ఉండాలి.

అప్ఘన్ లో భారత కార్యాలయంపై దాడి..

అప్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనాన్ని ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. పార్లమెంట్ నిర్మాణంలో భారత్ పాలుపంచుకొంది. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు కూడా చేపడుతోంది. భారత్ - అప్ఘనిస్తాన్ దేశాలకు మధ్య మంచి సంబంధాలున్నాయి. ఇది ప్రమాదకర శక్తులకు నచ్చదు. ఈనేపథ్యంలోనే అప్ఘనిస్తాన్ భారత దౌత్యకార్యాలయంపై దాడి జరిగింది. కానీ ఇందులో అనేక అనుమానాలున్నాయి. అప్ఘన్ పునర్ నిర్మాణంలో సహించలేని శక్తులు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారు.

తెలంగాణలో రాజకీయాలు..
ఎంఐఎం తో ప్రత్యక్షంగా పొత్తులు ఉండవు. రహస్య ఒడంబిడకలుంటాయి. సొంతంగా మెజార్టీ వస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు. అది కాకపోతే ఎంఐఎంతో సహజీవనం చేస్తారు. అధికారంలో ఉన్నవారికి సన్నిహితంగా ఉండడం ద్వారా ఎంఐఎం సమాంతర రాజ్యం నడుపుతుంటూ ఉంటుంది. అధికారంలో ఎవరు ఉంటే వారితో ఉంటుంటారు. పైకి చెప్పినా ఇరు పార్టీల మధ్య వ్యూహాత్మక ఒడంబడిక ఉంటుంది. టీఆర్ఎస్ బలహీనంగా ఉంది. కానీ అప్పటికీ..ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. నగరంలో టీఆర్ఎస్ ఓటింగ్ గణనీయంగా సాధించింది. ఎక్కడైతే బలంగా లేని సందర్భల్లో ఇతరులను లాక్కుంటున్నారు. క్షేత్రస్థాయి వరకు టీఆర్ఎస్ ఎంటర్ అయ్యింది. అధికారంలో టీఆర్ఎస్ ఉంది కనుక కొన్ని పథకాలు అమల్లోకి వస్తాయని పేదలు భావిస్తుంటుంటారు''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

08:21 - January 4, 2016

పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. మాటలు రావు కాబట్టి బాధ ఏమిటో చెప్పలేరు... ఎందుకేడుస్తున్నారో తల్లిదండ్రులకు తెలియిదు. ప్రత్యేకించి తల్లులకు ఇదే ఫ్రస్టేటింగ్‌ టాస్క్‌. 'నా పెంపకంలో ఏమైనా లోపం జరుగుతోందా?' అని ప్రతి తల్లి ప్రశ్నించుకునే పరిస్థితి. సాంకేతికత తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఇలాంటి తల్లులకూ ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇలాంటి వారి కోసం ఓ యాప్‌ రూపొందించారు. పిల్లలు ఎందుకేడుస్తున్నారో చెప్పే ఈ యాప్‌ని డెవలప్‌ చేసింది నేషనల్‌ తైవాన్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌. శిశువుల ఏడుపును డీకోడ్‌ చేసి... వారి ఏడుపునకు కారణాన్ని వివరిస్తుంది.
దీనికోసం... 100 మంది శిశువుల 20 లక్షల రకాల ఏడుపులను రికార్డు చేశారు పరిశోధకులు. ఏడ్వడానికి 9 రకాల కారణాలు కనుగొన్నారు. ఆకలేసినప్పుడు... డైపర్‌ తడిసిపోయినప్పుడు, నిద్రవస్తున్నప్పుడు.. లేదా పొట్టలో బాధగా ఉన్నప్పుడు... ఇలా ఒక్కో సమయంలో ఏడ్పు ఒక్కోరకంగా ఉంటుంది. ఈ యాప్‌ ఓపెన్‌ చేసి... మీ పిల్లాడు లేదా పాప ఏడుస్తున్న సౌండ్‌ను రికార్డ్‌ చేయాలి. 15 సెకన్లలో ప్రాసెస్‌ను కంప్లీట్‌ చేసిన మొబైల్‌ ఫోన్‌... ఏడుపు సౌండ్‌ను అనలైజ్‌ చేసి బేబీ ఏడ్వడానికి కారణమేంటో చెబుతుంది. రెండు వారాల వయసున్న పిల్లలకోసం దీన్ని వాడి చూసినప్పుడు 92 శాతం మంచి ఫలితాలేవచ్చాయి. అయితే బేబీ వయసు పెరిగే కొద్దీ ఈ ఫలితాల్లో తేడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరు నెలలలోపు పిల్లలకే ఈ యాప్‌ సరైనదని చెబుతున్నారు పరిశోధకులు. ఇంకెందుకాలస్యం... ఈ యాప్‌ ఎపిపిస్టోర్‌తోపాటు గూగుల్‌ప్లేలో కూడా అందుబాటులో ఉంది. వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రయత్నించండి !

భూకంపం.. నలుగురి మృతి..

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల్లో సంభవించిన భూకంపం కారణంగా నలుగురు మృతి చెందారు. మరో 100 మందికి గాయాలయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలు సహా బంగ్లాదేశ్, మయన్మార్ పలు ప్రాంతాలు కంపించిపోయిన సంగతి తెలిసిందే. 

07:59 - January 4, 2016

కీరదోస మామూలు దోస రెండూ మనకు మేలు చేస్తాయి. చాలా మంది చలికాలం కదా అని వీటిని దూరం పెడతారు. రక్తపోటులో తేడా ఏర్పడిన వారు దోసకాయ తినడం మంచిది. అందులోని పొటా షియం రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. దోసకాయలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి. కళ్లకింద నల్లటి చారలను కీరదోస కాయ ముక్కలు తొలగిస్తాయి. కీర దోసకాయని తీసుకొని అరకప్పు పెరుగులో కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఎన్నో సత్ఫలితాలు పొందవచ్చు.
దోసకాయ రసం కడుపులో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీర బాగా పని చేస్తుంది. కీర దోసకాయను గుజ్జుగా గ్రైండ్‌ చేసి, రసం తీసి, దానికి చెంచాడు గ్లూకోజ్‌ లేదా తేనె, రెండు చెంచాల నిమ్మరసం కలిపి తీసుకుంటే మూత్రం సాఫీగా వస్తుంది.
కీరదోసను ముక్కలుగా తరిగి కళ్లమీద పెట్టుకుంటే కళ్ల మంటలు తగ్గుతాయి. కళ్ళు ఉబ్బినట్లు అనిపిస్తే వాటి మీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్‌ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితాన్ని ఇస్తుంది.
శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే. అందులో సల్ఫర్‌, సిలికాన్‌ శిరోజాలకు ఆరోగ్యాన్నిస్తాయి. దోసకాయను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్‌ 'కె' సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోసకాయ తొక్కులో ఉంది.

కొనసాగుతున్న పఠాన్ కోట్ ఆపరేషన్..

పంజాబ్ : పఠాన్ కోట్ ఎయిర్ బస్ లోకి చొరబడిన ఉగ్రవాదులను ఏరివేయడానికి భద్రతాదళాలు జరుపుతున్న ఆపరేషన్ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి ఆరుగురు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. ఏడుగురు భారత సైనికులు వీరమరణం పొందారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇంఫాల్ లో 35 మందికి గాయాలు..

ఢిల్లీ : భూకంప తాకిడికి ఇంఫాల్ లో 35 మందికి గాయాలయ్యాయి. భూకంప కారణంగా ఈశాన్య రాష్ట్రాలు సహా బంగ్లాదేశ్, మయన్మార్ పలు ప్రాంతాలు కంపించిపోయిన సంగతి తెలిసిందే. 

అరుణాచల్ ప్రదేశ్ సీఎంకు ప్రధాని మోడీ ఫోన్..

ఢిల్లీ : అరుణాల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి నబమ్ కు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. భూకంప కారణంగా ఈశాన్య రాష్ట్రాలు సహా బంగ్లాదేశ్, మయన్మార్ పలు ప్రాంతాలు కంపించిపోయిన సంగతి తెలిసిందే. 

నేడు జీహెచ్ఎంసీ డివిజన్ల రిజర్వేషన్ నోటిఫికేషన్..

హైదరాబాద్: నేడు జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్ల రిజర్వేషన్ నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు, లేదా 7వ తేదీన ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

బెంగళూరుకు లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ మృతదేహం..

బెంగళూర్ : పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ మృతదేహాన్ని బెంగళూరులోని ఆయన స్వగృహానికి తరలించారు. 

07:34 - January 4, 2016

'మహేష్‌బాబు' హీరోగా తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందబోయే చిత్రానికి 'ఎనిమీ' అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు సమాచారం. దాదాపు 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మాత తిరుపతి ప్రసాద్‌ నిర్మించనున్నారట. ఈ చిత్రంలో 'మహేష్‌బాబు' సరసన బాలీవుడ్‌ నటి 'శ్రద్ధాకపూర్‌'ని ఎంపిక చేశారు. ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'బ్రహ్మోత్సవం'లో మహేష్‌బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత 'ఎనిమీ' చిత్ర షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నూతన సంవత్సరం కానుకగా 'బ్రహ్మోత్సవం' చిత్రానికి సంబంధించి టీజర్‌ను విడుదల చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు మురుగదాస్‌ తమిళం, హిందీ భాషల్లో 'అకిర' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా నటిస్తున్నారు.

07:33 - January 4, 2016

ప్రముఖ పాప్‌ గాయని 'నథాలీ కోలె' గురించి తెలియని సంగీతానుభిమానులుండరంటే అతిశయోక్తి లేదు. బహుళ ప్రజాదరణ పొందిన దాదాపు 25 ఆల్బమ్స్‌కి నథాలీ తనదైన శైలిలో పాటలు పాడారు. వీటిల్లో 'అన్‌ఫర్‌గెటబుల్‌' ఆల్బమ్‌లో పాడిన పాటలకు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు నథాలీ సొంతమైంది. కొన్ని దశాబ్దాలుగా పాప్‌ గాయనిగా శ్రోతల్ని అలరిస్తున్న నథాలీ (65) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్‌ 31వ తేదీన కన్నుమూశారు. గాయనిగా.. పాటల రచయితగా నథాలీ బాగా పాపులరయ్యారు. 'ఇన్‌సఫరబుల్‌', 'ఐ లవ్‌ యు సో', 'క్రిస్మస్‌ విత్‌ యు', 'స్నోఫాల్‌ ఆన్‌ ద సహారా' వంటి ఆల్బమ్స్‌ నథాలీ గాన ప్రతిభని అందరికీ తెలిసేలా చేశాయి. ఆమె పాడిన 'అన్‌ఫర్‌గెటబుల్‌' ఆల్బమ్‌ మంచి గుర్తింపునివ్వడమే కాకుండా ఎన్నో అవార్డుల్ని తెచ్చిపెట్టింది.

07:31 - January 4, 2016

'విశాల్‌' హీరోగా నటిస్తూ పాండిరాజ్‌ దర్శకత్వంలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'కథకళి'. 'రెజీనా', 'కేథరిన్‌ త్రెస' హీరోయిన్లు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత విశాల్‌ మాట్లాడుతూ,'నా కెరీర్‌లో మరో డిఫరెంట్‌ కమర్షియల్‌ మూవీ 'కథకళి'. డైరెక్టర్‌ పాండిరాజ్‌ ఈ కథను చాలా అద్భుతంగా డీల్‌ చేశారు. ఫుల్‌ లెంగ్త్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగునాట నాకు మరో హిట్‌ సినిమా అవుతుంది. జనవరి 14న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం'అని అన్నారు. నాజర్‌, కరుణాస్‌, శత్రు, సూరి, శ్రీజిత్‌ రవి, పవన్‌, మైమ్‌ గోపీ, మధుసూదన్‌రావు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణ్యం, సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, ఎడిటింగ్‌: ప్రదీప్‌ ఇ.రాఘవ్‌.

07:30 - January 4, 2016

అర్జున్‌కపూర్‌, కరీనాకపూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'కి అండ్‌ కా' చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను న్యూ ఇయర్‌ సందర్భంగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఆర్‌.బల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి ఇళయరాజా స్వరాల్ని సమకూరుస్తున్నారు. అమితాబ్‌బచ్చన్‌, జయాబచ్చన్‌లు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తొలిసారిగా అర్జున్‌, కరీనాలు జంటగా నటిస్తున్నారు. ఏకధాటిగా షూటింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. కరీనా కపూర్‌ ఈ చిత్రంతోపాటు డ్రగ్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న 'ఉడ్తా పంజాబ్‌' చిత్రంలోనూ నటిస్తోంది.

 

07:29 - January 4, 2016

సూర్య, శ్రుతిహాసన్‌, అనుష్క నాయకానాయికలుగా హరి దర్శకత్వంలో రూపొందనున్న 'సింగం3' చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. గతంలో హరి దర్శకత్వంలో రూపొందిన 'సింగం', 'సింగం2' చిత్రాలు విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. 'సింగం2' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కే 'సింగం3' చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు గత నెలలో చెన్నైలో ప్రారంభం కావాల్సి ఉంది. వరదల కారణంగా చిత్ర ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమయ్యే 'సింగం3' చిత్ర షూటింగ్‌ కార్యక్రమాలు వచ్చే వారంలో వైజాగ్‌లో స్టార్ట్‌ కానున్నాయి. ఈ విషయాన్ని కథానాయకుడు సూర్య మీడియాకి స్వయంగా తెలియజేశారు. సూర్య ప్రస్తుతం '24' అనే థ్రిల్లర్‌ మూవీలో నటిస్తున్నారు. 'మనం' దర్శకుడు విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యమీనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

వెస్ట్ బెంగాల్ లో భూకంపానికి పలువురికి గాయాలు..

పశ్చిమ బెంగాల్ : సోమవారం తెల్లవారుజామున వచ్చిన భూకంపానికి పలువురికి గాయాలయ్యాయి. సిలిగురి ప్రాంతంలోని ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

రంగంపేటలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్...

తిరుపతి : రంగంపేట సమీపంలోని శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒక కూలీని అరెస్టు చేశారు. 

రేపటితో ముగియనున్న ఫీజు రీయింబర్స్ గడువు..

హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేందుకున్న గడువు మంగళవారంతో ముగియనున్నది. ఇప్పటికే నాలుగుసార్లు గడువు పొడిగించిన అధికారులు జనవరి 5వ తేదీ తుది గడువని ప్రకటించారు. 

06:50 - January 4, 2016

2016 సంవత్సరం అపరాల సాగును ఎజెండా మీదకు తెస్తోంది. గత సంవత్సరం పప్పుల ధరలు చుక్కలు చూపించిన నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ అపరాల సంవత్సరంగా ప్రకటించింది. గతించి పోయిన 2015 సంవత్సరం పప్పుల ధరల విషయంలో విశ్వరూపం చూపించింది. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, సెనగపప్పు ఇలా ఏదీ కొనలేని దురావస్థను సామాన్యులు చవిచూశారు. గత ఉగాది నుంచి విజృంభించి, దసరా, దీపావళి నాటికి చుక్కలు చూపించిన పప్పుల ధరలు ఇప్పటికీ సాధారణ స్థాయికి రాలేదు. మన దేశంలో పప్పుల ధరలు విపరీతంగా పెరగడానికి వాటి సాగు విస్తీర్ణం పడిపోవడం , మార్కెట్ శక్తులు స్వైర విహారం చేస్తున్న ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తుండడం కారణమయ్యాయి.

పడిపోతున్న దిగుబడి...
మన దేశంలో శాఖాహారులకీ, పేదలకీ పప్పులు ప్రధాన పోషకాహారం. పప్పులు ప్రోటీనులు ఎక్కువగా వున్న పదార్ధం. రోజువారీ భోజనంలో భాగం. అయితే, దురదృష్టవశాత్తు పప్పు దినుసుల సాగుకి మనదేశంలో ప్రోత్సాహం లభించడం లేదు. దీంతో అపరాల సాగు దిగుబడి ఏయేటికాయేడు పడిపోతోంది. మన దేశంలో 2011లో 6 కోట్ల 49 లక్షల ఎకరాల్లో అపరాలు సాగుచేస్తే, 2014లో 6 కోట్ల 22 లక్షల ఎకరాలకే పరిమితమైంది. తెలంగాణలో 11 లక్షల ఎకరాల నుంచి ఏడున్నర లక్షల ఎకరాలకు అపరాల సాగు విస్తీర్ణం పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో 6 లక్షల 42వేల ఎకరాల నుంచి లక్షా 24 వేల ఎకరాలకు దిగజారింది. దీంతో సామాన్యులకు పప్పులు అందుబాటులో లేని పరిస్థితి వస్తోంది.

ప్రోత్సాహం ఎక్కడ ?
మన ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, గుజరాత్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో అపరాల సాగుకు అనువైన భూములున్నప్పటికీ రైతులకు తగిన ప్రోత్సాహం లభించడంలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అపరాల సాగు మీద ప్రభుత్వాలు దృష్టి సారించలేదు. 1955లో 11.04 మిలియన్ టన్నుల అపరాలు పండితే, గత సంవత్సరం 17.3 మిలియన్ టన్నులకే పరిమితమైంది. అంటే అరవై ఏళ్ల కాలంలో పెరిగిన ఉత్పాదకత కేవలం ఆరు మిలియన్ టన్నులే. మన దేశంలో ప్రస్తుతం ఏటా 22 మిలియన్ టన్నుల పప్పుదినుసులు వినియోగిస్తున్నారు. దీంతో 40 నుంచి 50 లక్షల టన్నుల పప్పులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. 2030 నాటికి మన దేశంలో పప్పుల వినియోగం 30 మిలియన్ టన్నులకు పెరుగుతుందన్న అంచనాలున్నాయి. అంటే రాబోయే పదిహేనేళ్ల కాలంలో అపరాల సాగును గణనీయంగా ప్రోత్సహించాల్సి వుంటుంది.

ఇన్నాళ్లూ విదేశీ దిగుమతుల మీద ఆధారపడుతూ, దేశీయంగా రైతులను ప్రోత్సహించకపోవడంతో అపరాల సాగులో మనం స్వయం సమృద్ధి సాధించలేకపోతున్నాం. దీంతో పప్పుదినుసుల దిగుమతుల కోసం 2.3 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తోంది. మన దేశీయ అవసరాల్లో పాతిక శాతం పప్పును విదేశాల నుంచే కొనుక్కోవాల్సి వస్తోంది. కెనెడా, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ నుంచి ప్రధానంగా పప్పులు దిగుమతి చేసుకుంటుండగా, పెసరపప్పును మయన్మార్ నుంచి కొనుకుంటున్నాం. ఇప్పటికైనా మన ప్రభుత్వాలు అపరాల సాగు అవసరాలను గుర్తించి, రైతులను ప్రోత్సహించకపోతే మరింత మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సిన దురావస్థ ఏర్పడుతుంది.

పరిశోధనలు ప్రోత్సాహించాలి..
మన దేశంలో వరి, గోధుమ జరిగినట్టుగా అపరాల విషయంలో పరిశోధనలు జరగడం లేదు. నూతన వంగడాలను సృష్టించడం లేదు. అపరాలపై జరిగే పరిశోధనలకు అవసరమైనన్ని నిధులు కేటాయించడం లేదు. వర్షాల మీద ఆధారపడి అపరాలు సాగు చేస్తున్నారు. ప్రతి నెలా కనీసం మూడుసార్లు , అదును ప్రకారం వర్షాలు కురిస్తే తప్ప అపరాలు పుష్కలంగా పండవు. కానీ, గత కొన్నేళ్లుగా 2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పెరగడం, సకాలంలో వర్షాలు కురవకపోవడంతో అపరాల సాగు విస్తీర్ణం పడిపోయింది.  వరి, గోధుమకు మాదిరిగానే అపరాలు పండించే రైతులకు కూడా సాగునీటి వసతి కల్పిస్తే, దిగుబడులు భారీగా పెరిగే అవకాశం వుంది. మనదేశంలో గోధుమ సాగు విస్తీర్ణంలో 93 శాతానికి, వరి సాగు విస్తీర్ణంలో 59శాతానికి సాగునీటి సదుపాయం వుండగా, అపరాలు సాగు విస్తీర్ణంలో కేవలం 16 శాతానికే సాగునీటి సదుపాయం వుంది. నీటి సదుపాయం కల్పిస్తే హెక్టార్ కి ఆరు నుంచి ఏడు టన్నుల ఉత్పాదకత సాధించే వీలుంది. కానీ ప్రస్తుతం మన దేశంలో ఉత్పాదకత మూడు నుంచి నాలుగు టన్నులకు మించడం లేదు. చీడపీడలను తట్టుకునే శక్తి వుండి, స్వల్పకాలంలో దిగుబడి ఇవ్వగలిగే విత్తనాలు లేకపోవడం మరో లోపం. ఆ దిశగా పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరం వుంది.

దళారీల రాజ్యమే..
అపరాలు సాగు చేసే రైతులను వెక్కిరించే మరో ప్రధాన సమస్య మార్కెటింగ్. పప్పుదినుసుల విషయంలో పూర్తిగా దళారీల రాజ్యమే నడుస్తోంది. క్వింటా అపరాలకు కనీసం 5500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్ వుంది. అపరాలపై పరిశోధనలను ప్రోత్సహించడం, స్వల్పకాలంలో చేతికొచ్చే వంగడాలను స్రుష్టించుకోవడం, చీడపీడలను, నీటి ఎద్దడిని తట్టుకునే విత్తనాలను తయారు చేసుకోవడం మన ముందున్న సవాళ్లు. వీటితో పాటు సాగునీటి వసతి కల్పించడం, రైతులకు మద్దతు ధర ఇచ్చి , ప్రభుత్వమే ఎఫ్ సీఐ ద్వారా కొనుగోళ్లు చేయించడం, అతివృష్టి, అనావృష్టి, కారణంగా దెబ్బతినే పంటకు బీమా సదుపాయాలు కల్పించడం ద్వారా అపరాల సాగుబడిని ప్రోత్సహించే అవకాశం వుంది.  

06:46 - January 4, 2016

2016కి ఓ ప్రత్యేకత వుంది. ఈ ఏడాది అంతర్జాతీయ అపరాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మరి మన నిత్య జీవితంలో పప్పుదినుసులకున్న ప్రాధాన్యత ఏమిటి? మన దేశంలో అపరాల సాగు ఎలా వుంది? పప్పు దినుసులు సాగు చేసే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? సవాళ్లేమిటి? పప్పుదినుసుల కొరతను నివారించాలన్నా, 2015లో చుక్కలు చూపించిన పప్పుల ధరలను అదుపు పెట్టాలన్నా ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఆంద్రప్రదేశ్ రైతు సంఘం నేత కేశవరావు విశ్లేషించారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:43 - January 4, 2016

శ్రీకాకుళం : జిల్లాలోని రాజాం మండలం గడిముడిదాం గ్రామం. ఇక్కడ సెల్‌ఫోన్‌ టవర్ల రేడియేషన్‌ గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గడచిన రెండు నెలల్లో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ వాసుతో పాటు, ఎరుకునాయుడు, ఏగిరెడ్డి రామదాసు అనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వీరి వయస్సు నలభై అయిదు సంవత్సరాల లోపే. ముగ్గురి మృతికీ రేడియేషన్‌ ప్రభావమే కారణమని వైద్యులు తేల్చారు. అదేవిధంగా గ్రామానికి చెందిన హరిబాబు పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో ఎనిమిదవ తరగతి చదువుతున్న గౌతమి, ఏడవ తరగతి చదువుతున్న వసంతరావు.. ఆరవ తరగతి చదువుతున్న హరిబాబు అనే చిన్నారులు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నారు. వీటన్నింటికీ సెల్ టవర్ల రేడియేషన్ ప్రభావమేనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమీపంలో సెల్‌ఫోన్‌ టవర్లను తిసేయించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.  గ్రామంలో చాలామందికి బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి సోకడం.. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకూ వివిధ రకాల రోగాలతో బాధపడుతుండటం.. దీంతో పాటుగా ఇప్పటికే రేడియేషన్ ప్రభావంతో ముగ్గురు చనిపోవడం.. గ్రామస్తుల భయాందోళనకు కారణంగా మారింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

06:41 - January 4, 2016

నెల్లూరు : ఇద్దరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పర్యటనలతో నెల్లూరు జిల్లాలో ఆదివారం రాజకీయ సందడి నెలకొంది. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అటు కేంద్ర మంత్రులు కూడా జిల్లాలో పర్యటించడంతో ఒక్కసారిగా హడావిడి నెలకొంది. తొలుత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్వర్ణభారత్ ట్రస్టులో జరిగిన కిమ్స్ వైద్యుల క్యాన్సర్ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. అనంతరం వెంకటాచలం మండలంలోని చవటపాళెం పంచాయతీ పరిధిలోని అనుపల్లిపాడులో 17 కోట్ల రూపాయిలలో మానసిక, వికలాంగుల జాతీయ సంస్థ భవన సముదాయాల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రావాల్సి ఉన్నా.. అనివార్య కారణాల వల్ల రాలేక పోవడంతో.. కేంద్ర మంత్రులిద్దరే రిహాబిలిటేషన్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. దేశంలో అభివృద్ధికి అడ్డంకులు సృష్టించొద్దని ఈ సందర్బంగా వెంకయ్యనాయుడు విపక్షాలను కోరారు.

ఐఐటీటీఎం భవనం ప్రారంభం..
వెంకటాచలం మండలం గొలగమూడిలొ ఐఐటీటీఎం భవనాన్ని కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, తెహర్ చంద్ గెహ్లాట్ ప్రారంబించారు. అనంతరం నెల్లూరు నగరంలోని పాత జూబ్లీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రాంతీయ మానసిక వికలాంగుల కేంద్రాన్ని ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రారంబించారు. అనంతరం వీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చంద్రబాబు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ నెల్లూరు మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించి కోస్టల్ టూరిజం సర్య్కూట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు సాధించుకున్నామన్నారు. వికలాంగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.

ఉదయగిరిలో బాబు పర్యటన...
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయగిరి నియోజకవర్గం కనిగిరి మండలం పెదకొండూరులో జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.ఓ వైపు కేంద్ర మంత్రుల పర్యటనలు,..మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాలతో ప్రభుత్వాధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. 

06:35 - January 4, 2016

ప్రకాశం : నేడు సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. మార్కాపురం మండలం రాయవరంలో 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో నేతలు, అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. టీడీపీ నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో సభా ప్రాంగణం పసుపుమయంగా మారింది. ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలించేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాలపై అధికారులు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేశారు. సభ అనంతరం రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

06:31 - January 4, 2016

వరంగల్ : కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ లు నేడు వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి వరంగల్‌కు బయల్దేరుతారు. 3 గంటల 55 నిమిషాలకు మడికొండలో గడ్కరీ చేతుల మీదుగా యాదాద్రి-వరంగల్‌ జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 99.10 కిలోమీటర్లు ఉండే ఈ రోడ్డుకు 1,905 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. అదే విధంగా తెలంగాణ-చత్తీస్‌గడ్‌ మధ్య దూరం తగ్గించేందుకు నిర్మించిన ముల్లకట్ట బ్రిడ్జిని ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. కేసీఆర్‌, గడ్కరీ ఈబ్రిడ్జిని ప్రారంభిస్తారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం సమీపంలోని ముల్లకట్ట, ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం పూసూరు మధ్య గోదావరి నదిపై 2.8 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రూ.335 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జిపై ఆరు నెలలుగా రాకపోకలు సాగుతున్నాయి. ఇక ఈ బ్రిడ్జి నిర్మాణంతో తమ చిరకాల వాంఛ తీరిందని ఖమ్మం, వరంగల్‌ జిల్లాల ప్రజలంటున్నారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో గడ్కరి..
వరంగల్‌లో పర్యటన పూర్తయిన తర్వాత గడ్కరీ హైదరాబాద్‌కు చేరుకుని గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇక కేసీఆర్‌ మాజీమంత్రి కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు ఇంటి వద్ద బస చేస్తారు. మంగళవారం ఉదయం వరంగల్‌ నుంచి హెలికాప్టర్‌లో భూపాలపల్లి వెళ్తారు. గణపురం మండలం చెల్పూరు వద్ద నిర్మించిన కేటీపీపీ రెండవ దశ 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్‌కు చేరుకుని కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇక బుధవారం వరంగల్‌లో బీడీ కార్మికులకు గుర్తింపు కార్డుల జారీ కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్‌ ప్రారంభిస్తారు. కేసీఆర్‌ మూడు రోజుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

06:29 - January 4, 2016

అప్ఘనిస్తాన్ : పంజాబ్‌లో ఉగ్రదాడులు ఇంకా కొనసాగుతుండగానే ఆఫ్ఘానిస్థాన్‌లోని భారత దౌత్య కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. అప్రమత్తమైన సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరి కోసం కాల్పులు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘానిస్తాన్‌ మజార్‌-ఇ-షరీఫ్‌లోని భారత దౌత్య కార్యాలయంపై ఆదివారం రాత్రి నలుగురు ఉగ్రవాదులు దాడికి దిగారు. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పులతో కార్యాలయ భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే.. దౌత్య కార్యాలయంలో ఉన్న ముగ్గురు సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు భారత కాన్సుల్‌ జనరల్‌ బి.సర్కార్‌ తెలిపారు. ఇక తప్పించుకుని పక్కనే ఉన్న భవనంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన ఆఫ్ఘాన్‌ దళాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి. ఒకవైపు పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో ఇంకా ఉగ్రవాదుల కోసం కాల్పులు కొనసాగుతుండగానే.. ఆఫ్గాన్‌లో దౌత్య కార్యాలయంపై దాడికి యత్నించడం అందరినీ నిర్ఘాంతపరుస్తోంది. మరోవైపు ప్రధాని మోడీ పాకిస్తాన్‌, ఆఫ్ఘాన్‌లో పర్యటించి వచ్చిన వారం రోజులకే ఈ దాడులు జరగడం సంచలనం రేకెత్తిస్తోంది. 

06:25 - January 4, 2016

ఢిల్లీ : భారత్‌ - మయన్మార్‌ సరిహద్దులో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.8 గా నమోదయింది. మణిపూర్‌ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో భూ ప్రకంపనలు తీవ్రంగా సంభవించాయి. భూకంపం తెల్లవారుఝామున 4 గంటల 35 నిమిషాలకు సంభవించింది. భూకంప తీవ్రతకి ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్‌, కోల్‌కతాలో సైతం భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం ఇంఫాల్‌కు 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. భూ కంప తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఇంకా ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలాఉంటే సిలిగురిలో బస చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భూకంపం సంభవించినట్లు తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ప్రజలు భయాందోళనలతో రోడ్లపైకి వచ్చినట్లు సమాచారం. 

రేపు ఎన్జీరంగా వర్సిటీ స్నాతకోత్సవం..

రాజమండ్రి: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 47వ స్నాతకోత్సవం సోమవారం రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో నిర్వహించనున్నట్టు వైస్ చాన్సలర్ అల్లూరి పద్మరాజు తెలిపారు.

ఈనెల 8న ఇసుక రీచ్ లకు టెండర్లు..

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక పాలసీపై సబ్‌కమిటీ మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. విశాఖ కలెక్టరేట్‌లో సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు వెల్లడించారు. 1.5 లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను వేలంలో ఉంచనున్నట్టు, క్యూబిక్ మీటర్ ధరను రూ.500 గా నిర్ణయించామన్నారు. ఈ నెల 8న ఇసుక రీచ్‌లకు టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

నేడు బర్ధన్ కు తుది వీడ్కోలు..

న్యూఢిల్లీ: సీపీఐ సీనియర్‌నేత ఏబీ బర్ధన్ అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం ఇక్కడి నిగమ్‌బోధ్ ఘాట్ జరగనున్నాయి. 92 ఏళ్ల బర్ధన్ అనారోగ్యంతో శనివారం కన్నుమూయడం తెలిసిందే. 

అప్ఘనిస్తాన్ భారత దౌత్య కార్యాలయంపై దాడి..

అప్ణనిస్తాన్ : ఉత్తర అప్ఘనిస్తాన్ మజార్ - ఐ - షరీఫ్ నగరంలో భారత దౌత్య కార్యాలయంలో ఆదివారం రాత్రి దాడి జరిగింది. దౌత్య సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు భారత దౌత్య అధికారి వెల్లడించారు. 

నేడు వరంగల్ లో కేసీఆర్, గడ్కరి పర్యటన..

హైదరాబాద్ : నేడు వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి గడ్కరి పర్యటించనున్నారు. ఆయనతో పాటు సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. 

భారత్ - మయన్మార్ సరిహద్దులో భూకంపం..

ఢిల్లీ : భారత్ - మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రానికి 35 కిలోమీటర్ల లోతులో ప్రకంపనాలు వచ్చాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు 33 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదైంది. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో కూడా భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. 

Don't Miss