Activities calendar

06 January 2016

ఎపిలో కపిల్‌ చిట్‌ఫండ్‌ మోసాలు

హైదరాబాద్ : ఏపీలో చిట్‌ఫండ్‌ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే శ్రీరామ్‌ ఫైనాన్స్‌ మోసాలు వెలుగులోకి రాగా..తాజాగా కపిల్‌ చిట్‌ఫండ్‌ మోసాలు బయటపడ్డాయి. గడువు తీరినా డబ్బులు చెల్లించకుండా తిప్పుతూ మోసం చేస్తున్నారని కపిల్ చిట్‌ఫండ్‌ ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కపిల్ చిట్‌ఫండ్‌ మోసాలపై ఇప్పటికే ఈడీకి ఫిర్యాదు చేశామన్నారు బాధితులు. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

22:03 - January 6, 2016

నల్గొండ : ఉప్పల్‌-యాదాద్రి మెట్రో రైలు లైన్‌పై క్షేత్రస్థాయి పరిశీలన మొదలైంది. మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి బృందం, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ రాయగిరిలో స్థలాన్ని పరిశీలించారు. రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..యాదాద్రికి రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా మెట్రోరైలు ఏర్పాటుకు సన్నహాలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిశీలిన జరిపామన్నారు. తాత్కాలికంగా, ధీర్ఘకాలిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని..త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.

 

21:59 - January 6, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యులు కమిషన్లు దండుకుంటున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కూకట్‌పల్లిలో జరిగిన టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన రేవంత్‌రెడ్డి... టీఆర్‌ఎస్‌ పాలకులపై నిప్పులు చెరిగారు. అధికారాన్ని అడ్డుంపెట్టుకుని కేసీఆర్‌ కుటుంబ సభ్యలు అడ్డుగోలుగా సంపాదిస్తున్నారని  ఆరోపించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ బోళాశంకరుడని  నిజామాబాద్‌ ఎంపీ కవిత చెప్పడంపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందీలేదంటున్నారు.

 

21:57 - January 6, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ కుయుక్తులు పన్నుతోందని టీడీపీ ఆరోపించింది. ఎన్నికల ప్రక్రియ కుందింపే ఇందుకు నిదర్శనమని టీడీపీ హైదరాబాద్‌ నగర కమిటీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌ చెప్పారు. ఈనెల 9న హైదరాబాద్‌ నిజాంకాలేజీ మైదానంలో టీడీపీ-బీజేపీ  కార్యకర్తల సమావేశం జరుగునుంది. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను గోపీనాథ్‌ పరిశీలించారు.  టీఆర్‌ఎస్‌ ఎన్ని కుయుక్తులు పన్నినా.. గ్రేటర్‌ మేయర్‌ పీఠం టీడీపీ-బీజేపీ కూటమికే దక్కుతుందని   గోపీనాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  ఎన్నికల ప్రక్రియ కుదింపు రాజ్యాంగ విరుద్ధమంటున్నారు.

 

21:44 - January 6, 2016

దంపతులు చిన్న చిన్న విషయాలకు విడాకులు తీసుకుంటున్నారని.. యువత ఎక్కువగా విడాకులు కోరుతున్నారని లాయర్ పార్వతి అన్నారు. మానవి మైరైట్ కార్యమక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆమె మాట్లోనే..
యూత్ అధిక మంది విడాకుల కోసం వస్తున్నారు. చిన్న చిన్ని విషయాలు, అసహనం, అపార్ధాలతో విడాకులకు వస్తునన్నారు. చిన్న అపర్ధాలు రాగానే.. పెద్దలకు, స్నేహితులకు చెప్పడం లేదు. దంపతుల ఇరువురిలో  
ప్రశ్నించేతత్వం పెరిగింది. భార్యభర్తలు కలిసివుండే టైమ్ తక్కువగా ఉంది. ఉమ్మడి కటుంబ వ్యవస్థ లేకపోవడంతో చిన్న చిన్న విషయాలకు విడాకుల కోసం వస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

 

21:39 - January 6, 2016

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గెలుపు తమదేనని టీఆర్ ఎస్ ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. అధికారలో ఉన్న లేకున్నా.. ఓకేలా ఉంటామని చెప్పారు. స్వచ్ఛ భారత్ పేరుతో వసూళ్లు చేస్తున్న నిధులను మోడీ ఫొటోలు ఏర్పాటు చేయడం కోసమే ఉపయోగిస్తున్నారనే అనుమానం కలుగుతుందని తెలిపారు. ప్రజల పక్షాన ఉండేది.. టీఆర్ ఎస్ అని తేల్చి చెప్పింది. టిఆర్ ఎస్ పై అనవసరపు విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.

21:31 - January 6, 2016


వరంగల్ మీద కేసీఆర్ వరాల జల్లు.. అప్పటి వరాలకు అదనంగా హరివిల్లు, మళ్ల ఉద్యోగులను గిచ్చుతున్న చంద్రాలు...తిట్టుకుంటనే భయపడుతున్న ఆఫీసర్లు, ప్రతిపక్షాలను కట్టేశి కొడ్తున్న టీఆర్ఎస్…  జీహెచ్ ఎంసీ ఓట్లళ్లల సర్కార్ వారి ఆట, కొత్తగూడెం ఎమ్మెల్యేగారి చెత్త పని, ఇండ్ల దరఖాస్తు కాడా ఇరుసుక పడ్డ జనం, ఆంధ్రల అప్పుడే సుర్వైన సంక్రాంతి... అందంగా ముస్తాబైన పల్లెటూర్లు, ఒల ఒల ఏడ్చిన ఒబామా సారు… గన్ కల్చర్ మీద అమెరికా కంటతడి.... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం…

21:13 - January 6, 2016

గతం నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. టీసర్కార్ ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. 'మల్లన్న రచ్చబండ' కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. సర్కార్.. కరువు మండలాలను ప్రకటించలేదన్నారు. రాష్ట్రం నుంచి కరువు మండలాలకు సంబంధించిన నివేదికను ఇప్పటి వరకు కేంద్రానికి ఇవ్వలేదని చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం మోనార్కిజంతో వెళ్తున్నారని విమర్శించారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...
నీతి, నిజాయితీగా ఉండాలి..
నీతి, నిజాయితీగా ఉండాలి. అవినీతికి పాల్పడినట్లు తనపై చిన్న దరఖాస్తు కూడా రాలేదు. 2019 లో కాంగ్రెస్ విజయం ఖాయం. నేను సీఎం లైన్ లో లేను. నాకు సీఎం కావాలనే కోరిక కూడా లేదు. పార్టీ అధికారంలోకి వస్తే చాలు. పార్టీకి, ప్రజలకు సేవ చేయడమే నాకు ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలాంటిది. 1981లో మంత్రి అయ్యాను. మంత్రిని అవుతానని అనుకోలేదు. 22 సంవత్సరాలకే మున్సిపల్ కౌన్సిలర్ అయ్యాను. మానాన్న రాజకీయాల్లో ఉన్నారు.
ప్రాణమున్నంత వరకు కాంగ్రెస్ లోనే...
టీఆర్ ఎస్ లోకి రమ్మని నన్ను సీఎం కేసీఆర్ ఎప్పుడూ పిలవలేదు... పిలిచినా... నేను వెళ్లను. నా శరీరంలో ప్రాణం ఉన్నంత కాలంలో కాంగ్రెస్ లోనే ఉంటాను. నన్ను ఉన్నతస్థాయికి తీసుకొచ్చింది కాంగ్రెస్.
మేము ఏడుగురం..
అమ్మనాన్నలకు ఏడుగురు సంతానం.. నలుగురు పురుషులు, ముగ్గురు స్ర్తీలు. నేను ఆరో వ్యక్తిని.
'బాహుబలి' చూశాను...
20 సంవత్సరాల తర్వాత.. బాహుబలి సినిమా చూశాను. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:09 - January 6, 2016

చంఢీఘర్ : పంజాబ్ లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడులకు సంబంధించి గురుదాస్‌పూర్‌ ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ను రహస్య ప్రాంతంలో ఎన్‌ఐఏ విచారిస్తోంది. సల్వీందర్‌ సింగ్‌ ఇచ్చిన వివరణకు ఆయనతో పాటు కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇచ్చిన వివరణకు పొంతన లేకపోవడంతో దీనిపై ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది. ఉగ్రవాదులు సల్వీందర్‌సింగ్‌ను విడిచిపెట్టడం, అంతకు ముందు ఉగ్రవాదులు డ్రైవర్‌ను చంపండంతో ఎస్పీ పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో ఆపరేషన్‌ కూంబింగ్‌ ఇవాళ కూడా కొనసాగింది.

21:05 - January 6, 2016

ముంబై : నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని బిజెపి మిత్రపక్షం శివసేన మరోసారి టార్గెట్‌ చేసింది. పఠాన్‌కోడ్‌ ఉగ్రదాడిపై కేంద్రం అనుసరించిన తీరు వల్ల కాంగ్రెస్‌కు కొత్త జీవితం లభించిందని విమర్శించింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఏ చేసిన తప్పులే బిజెపి చేస్తోందని, దీంతో  అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌కు పునరుజ్జీవనం కల్పించినట్టయిందని శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.  అయోధ్యలో రామమందిర నిర్మాణం, హిందుత్వ, అవినీతి, పాకిస్తాన్‌ తదితర విషయాల్లో బిజెపి పరిస్థితి నానాటికి దిగజారిపోతోందని తెలిపింది.

 

21:01 - January 6, 2016

మెదక్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియను కుదించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకే టీఆర్‌ఎస్‌ సర్కార్‌... జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. మెదక్‌ జిల్లా పటాన్‌చెరులో జరిగిన పార్టీ  కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన... టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై  విరుచుకుపడ్డారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సక్రమంగా సాయం అందించడంలేదంటూ పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేస్తున్న విమర్శలను కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు.

20:59 - January 6, 2016

పశ్చిమగోదావరి : పోలీసుల వేధింపులు తట్టుకోలేక పశ్చిమగోదావరి జిల్లాలో  ఓ వ్యక్తి పరుగుమందు తాగి  ఆత్మహత్య చేసుకున్నాడు. ఇరగవరం పోలీసు స్టేషన్‌ పరిధిలోని రేలంగి శివారు కేతేవారిపాలెంలో  ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీనివాసరావు మరికొందరితో కలిసి పేకాటాడుతూ  పోలీసులకు  పట్టుబడ్డాడు. కౌన్సెలింగ్‌ పేరుతో  పోలీసు స్టేషన్‌ తీసుకెళ్లి చితకబాదినట్టు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసరావు కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. శ్రీనివాసరావు ఆత్మహత్యకు ఇరగవరం ఎస్‌ఐ వీరభద్రరావు కారణమని మృతుడి సోదరుడు దొమ్మేటి వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు.

 

20:57 - January 6, 2016

లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. మొన్న లక్నోలో ఓ ఆటోవాలపై చేయి చేసుకున్న ఎస్‌పీ నేతలు.... నిన్న మీరట్‌లో  ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు ఓ పండ్ల వ్యాపారి గొంతు కోశాడు. మీరట్‌ సమీపంలోని సర్దానా అసెంబ్లీ నియోజవర్గ ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్న అనీష్‌ ఖురేషీ.... ఓ  వ్యాపారి  దగ్గర జామపండ్లు కొన్నాడు. జామపండ్లు అమ్మిన  17 ఏళ్ల బాలుడు డబ్బులు ఇవ్వాలని ఖురేషీని అడిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఖురేషీ... జామపండ్లు కోసే చాకు తీసుకుని వ్యాపారి గొంతు కోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన బాలుడిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖురేషీపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

 

20:53 - January 6, 2016

హైదరాబాద్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో రైతుల పరిస్థితి కడు దయనీయంగా మారిందని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్‌ పాలగుమ్మి సాయినాధ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా రైతుల బతుకు చిత్రం మాత్రం మారడంలేదన్నారు. హైదరాబాద్ లో టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 20 సంవత్సరాల్లో 3లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా..ప్రభుత్వాలు నివారణ చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో కూడా రైతులను పట్టించుకున్న నాథుడే లేడన్నారు. చండీ యాగాలతో రైతు సమస్యలు తీరవన్నారు. కౌలు రైతుల సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వాపోయారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను ఏ ప్రభుత్వమూ అమలు చేయడంలేదని విమర్శించారు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడంలేదని చెప్పారు. కౌలు రైతుల చట్టం ఇప్పటివరకు లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందుతున్నాయని విమర్శించారు. రైతు ఆత్మహత్యలను నివారించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని పేర్కొన్నారు.

 

20:44 - January 6, 2016

ఢిల్లీ : దేశంలోని కరవు ప్రభావిత ప్రాంతాలపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, రాధా మోహన్ సింగ్, జైట్లీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర కరవు సాయంగా 434 కోట్లు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. ఉత్తర ప్రదేశ్‌కు 1,034 కోట్లు, ఒడిశాకు 815 కోట్ల సాయం అందించేందుకు కేంద్రం రెడీ అయినట్లు సమాచారం

20:41 - January 6, 2016

గుంటూరు : నాగార్జున యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ఇంజినీరుగా పని చేస్తున్న సురేష్‌బాబు..ఏసీబీకి చిక్కాడు. బస్‌ షెల్టర్‌ నిర్మించిన  కాంట్రాక్టర్‌ వడ్లమూడి పెదసాంబయ్యకు బిల్లులు  చెల్లించేందుకు... సురేష్‌బాబు 20 వేల రూపాయల లంచం డిమాండ్‌ చేశాడు. చివరికి 10 వేల రూపాయలు ఇచ్చేందుకు సాంబయ్య ఒప్పుకున్నాడు. ఈ సమాచారాన్ని ఆయన ఏసీబీ అధికారులకు చేరవేశారు. బుధవారం సాంబయ్య.. నాగార్జునా యూనివర్సిటీ ఏఈ సురేష్‌బాబుకు  లంచం ఇస్తుండగా ఏసీబీ అదికారులు పట్టుకున్నారు.

 

20:38 - January 6, 2016

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి బృహత్‌ ప్రణాళికపై గుంటూరులో సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. అమరావతి బృహత్‌ ప్రణాళికపై వారం పది రోజుల్లో గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించనున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌ వెల్లడించారు. రాజధాని పరిధిలోని 29గ్రామాల రైతుల ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించి మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన కల్పించారు. అయితే మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఏ గ్రామం నుంచి రోడ్లు వెళతాయి? గ్రామస్తుల స్థలం ఎంత పోతుందో స్పష్టంగా చెప్పాలంటూ రైతులు అధికారులను నిలదీశారు. అయితే రాజధాని ముఖ్య నగర నిర్మాణంలో ఏ గ్రామాన్ని ఖాళీ చేయించమని శ్రీకాంత్‌ రైతులకు హామీఇచ్చారు. ప్రణాళికలోని అంశాలపై గ్రామా వారీగా అంశాల వారీగా చర్చించి సవరణలు చేస్తామన్నారు.

 

20:16 - January 6, 2016

హైదరాబాద్ : ఏపీలో ఎంసెట్‌ తేదీని ముందుకు జరిపారు. గతంలో ప్రకటించిన మే 5 తేదీకి బదులు...  ఏప్రిల్‌ 29 నే  ఎంసెట్‌ నిర్వహిస్తారు. మే 5న  కర్నాటకలో 'కె-సెట్‌' ఉండటంతో.. ఏపీ ఎంసెట్‌ తేదీని ముందుకు జరిపినట్టు రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు.

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ సమీపంలో అనుమానితుడు

పంజాబ్ : పఠాన్ కోట్ ఎయిర్ బేస్ సమీపంలో ఓ అనుమానితుడు తిరుగుతుండగా ఆర్మీ అతన్ని అదుపులోకి తీసుకుంది. అనుమానితుని నుంచి బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు.

 

19:55 - January 6, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇవాళ కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్ని అడ్డుకునేందుకే ఇవాళ కాంగ్రెస్‌ కోర్టులో కేసు వేస్తోందన్నారు. దమ్ముంటే ఎన్నికల్ని ఎదుర్కొవాలని సవాల్ విసిరారు.

 

19:53 - January 6, 2016

హైదరాబాద్‌ : నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో.... పోషకాహార లోపం, ఐసిడిఎస్ పట్ల ప్రభుత్వ వైఖరిపై సెమినార్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్, మాజీ ఐఏఎస్‌ వేణుగోపాల్‌, వివిధ రాష్ట్రాల అంగన్‌వాడీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఐసీడీఎస్‌ విభాగంలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిన నీటిని పరిశ్రమలకు, ఇతర రంగాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. అప్పుడు పంటలు ఎలా పండుతాయని.. ఏం తిని బతకాలని ప్రశ్నించారు.

19:46 - January 6, 2016

హైదరాబాద్ : పోయినచోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తుండడంతో... తెలంగాణపై దృష్టి సారించింది. బల్దియాలోని హస్తం శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు... డిగ్గీరాజా రెడీ అయ్యారు. జనవరి 9, 10 తేదీల్లో ఆయన హైదరాబాద్ రానున్నారు. రెండ్రోజుల పాటు భాగ్యనగరంలోనే మకాం వేయనున్నారు.

 

18:38 - January 6, 2016

కర్నూలు : పేదలు లేని సమాజమే తమ ప్రభుత్వ ధ్వేయమని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు నిర్వహించిన 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. రాజకీయాలకతీతంగా పరిపాలన చేస్తానని చెప్పారు. రాయలసీమలో కరువును తరమికొడతామని చెప్పారు. యువతలో నైపుణ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీపం పథకం కింద వంటగ్యాస్ కు కనెక్షన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమను ఇండస్ట్రియల్ జోన్ గా తయారు చేస్తామన్నారు. 18 నెలల్లో చాలా సమస్యలను పరిష్కరించామని తెలిపారు. రాయలసీమలో అపారమైన ఖనిజ సంపద ఉందన్నారు.
వైసిపి సభ్యులు తీరు దారుణం
అసెంబ్లీలో వైసిపి సభ్యులు దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. కాల్ మనీ విషయంలో అసెంబ్లీలో వైసిపి సభ్యులు తనను కాల్ మనీ ముఖ్యమంత్రని, కామా ముఖ్యమంత్రి అని అన్నారు... అయినా.. తాను సహనంతో ఉన్నానని తెలిపారు. తాను కూడా వారిలాగే ప్రవర్తిస్తే సభ సజావుగా జరిగివుండేది కాదన్నారు. మంచికి మంచి గానే ఉంటామని.. చట్టానికి వ్యతేరేకంగా పని చేస్తే.. కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. విశ్వసనీయతకు మారు పేరుగా బతికానని…  తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దివాళ కోరు, పనికిమాలిన రాజకీయాలు నడుస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది గ్రామసభలను చెడగొట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు.. సమస్యలపై అధికారులను నిలదీయడం సరైందని..  కానీ గ్రామాల్లోకి అధికారులను రానివ్వకపోవడం సరికాదన్నారు.  

 

18:16 - January 6, 2016

రాయ్ పూర్ : ఛత్తీస్‌గడ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి కుమారుడు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అమిత్‌ జోగిపై వేటు పడింది. అమిత్‌ జోగిని ప్రాథమిక సభ్యత్వం నుంచి  ఆరేళ్ల పాటు నిషేధం విధిస్తూ ఛత్తీస్‌గడ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది అంతాగడ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బిజెపితో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుని కాంగ్రెస్‌ ఓటమికి పాల్పడ్డారన్న కారణంతో కాంగ్రెస్‌- అమిత్‌ జోగిని బహిష్కరించింది. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశమున్నప్పటికీ బిజెపి గెలుపు కోసం జోగి ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. అజిత్‌జోగి, అమిత్‌ జోగి తన సహచరులు- ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ అల్లుడు పునీత్‌ గుప్తాతో కలిసి డీల్‌ చేసుకున్న ఫోన్‌ సంభాషణలను ఓ ఆంగ్ల దినపత్రిక బయటపెట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది.

 

17:51 - January 6, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలవాలన్న తాపత్రయంలో రిజర్వేషన్ల అంశాన్ని ఆలస్యం చేస్తోందని టి టిడిపి నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. బెదిరించి, డబ్బులు వెదజల్లి గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోందని రావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాఫిక్స్‌ ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి నగర ప్రజలను టీఆర్‌ఎస్‌ మాయ చేస్తోందని విమర్శించారు.

 

ఏపీ ప్రభుత్వానికి దేవాలయ ఉద్యోగులు సమ్మె నోటీసు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ దేవాలయ ఉద్యోగులు సమ్మె సైరన్‌ మోగించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎస్‌కు ఉద్యోగుల సమాఖ్య సమ్మె నోటీసు ఇచ్చింది. దేవాలయాల్లో లడ్డూలపై పన్ను వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగుల సమాఖ్య తప్పుపట్టింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా పదవీ విరమణ  ఉండాలని డిమాండ్ చేశారు.

17:45 - January 6, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ దేవాలయ ఉద్యోగులు సమ్మె సైరన్‌ మోగించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీఎస్‌కు ఉద్యోగుల సమాఖ్య సమ్మె నోటీసు ఇచ్చింది. దేవాలయాల్లో లడ్డూలపై పన్ను వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగుల సమాఖ్య తప్పుపట్టింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా పదవీ విరమణ  ఉండాలని డిమాండ్ చేశారు.

 

17:39 - January 6, 2016

కడప : సినీనటి రెజీనా కడపంలో సందడి చేసింది. కోటిరెడ్డి సర్కిల్‌ దగ్గర షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించింది. అభిమానులను అలరించేందుకు కాసేపు డ్యాన్స్‌ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అటు రెజీనాను చూసేందుకు భారీగా జనాలు రావడంతో ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.

17:35 - January 6, 2016

ముంబై : ఎల్‌ఐసీ 2014-15 ఆర్ధిక సవంత్సరంలో 36,087 కోట్ల రూపాయల లాభం ఆర్జించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 10.4 శాతం ఎక్కువ. ఎల్‌ఐసీ చట్టం ప్రకారం మొత్తం లాభంలో పాలసీదారులకు  95 శాతం బోనస్‌ రూపంలో చెల్లిస్తారు.  దీని ప్రకారం 34,283 కోట్ల రూపాయలు  లక్షలాది మంది పాలసీదారులకు ఈ ఏడాది చెల్లిస్తారు. మిగిలిన 5 శాతం ప్రభుత్వానికి అందజేస్తారు.  ఈ మేరకు  1804 కోట్ల 35 లక్షల రూపాయల చెక్‌ను  ఎల్‌ఐసీ ఛైర్మన్‌ ఎస్‌కే రాయ్‌.... మంగళవారం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీకి అందజేశారు. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో ఎల్‌ఐసీ 32,697 కోట్ల రూపాయ లాభం ఆర్జించింది. ఈ మొత్తంలో 1634.89  కోట్ల రూపాయలను ప్రభుత్వానికి అందచేసింది.

 

17:29 - January 6, 2016

నల్లగొండ : నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి వృద్ధాప్యంలో కొడుకులకు భారమైంది.. కన్న పేగు బంధమనికూడా చూడకుండా ఇంట్లోంచి గెంటేశారు ఇద్దరు సుపుత్రులు.. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగింది.. కూరగాయల మార్కెట్ సమీపంలో నివసించే ముదుకు పూలమ్మ వయసు 78 ఏళ్లు.. భర్త చనిపోవడంతో అతను సంపాదించిన ఇంట్లోనే ఉంటోంది.. ఈ ఆస్తిపై కన్నేసిన ఇద్దరు కొడుకులు... నకిలీ దృవపత్రాలతో ఆ ఇల్లు తమ పేరుమీద రాయించుకున్నారు.. ఆ తర్వాత కన్నతల్లికి తిండిపెట్టడం దండగ అంటూ ఇంట్లోంచి బయటకు పంపారు.. దీంతో ఏం చేయాలో తెలియని ఆ వృద్ధురాలు కొడుకులు ఇంటిముందు ఆందోళనకు దిగింది..

'ఎంపీ ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపిస్తాం'

సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తాతో తెలంగాణ ప్రాంత పార్లమెంట్ సభ్యులు జరిపిన భేటీ ముగిసింది. సమావేశం అనంతరం రైల్వే జీఎం మాట్లాడుతూ కొత్త రైళ్లు, రైల్వే వంతెనలు నిర్మాంచాలని ఎంపీలు కోరారు. ఎంపీల ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపిస్తామని తెలిపారు. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు నిర్ణీత వ్యవధిలో పూర్తిచేస్తామని వెల్లడించారు.

17:18 - January 6, 2016

న్యూఢిల్లీ: హిందూస్థాన్ మెషీన్ టూల్స్ (హెచ్ఎంటీ) చెందిన మూడు కంపెనీలను మూసివేసేందుకు కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ(సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది. హెచ్ఎంటీ వాచెస్, హెచ్ఎంటీ చినార్ వాచెస్, హెచ్ఎంటీ బేరింగ్స్ కంపెనీలను మూసివేయనున్నారు. ఈ మూడు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు వీఆర్ఎస్, వీఎస్ఎస్ కింద చెల్లింపులు జరుపుతామని సీసీఈఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రూ.427.48 కోట్లు వెచ్చించనున్నట్టు వెల్లడించింది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులకు 2007 పే స్కేల్ కింద చెల్లింపులు జరుతామని తెలిపింది. ఈ మూడు హెచ్ఎంటీ కంపెనీలకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయిస్తామని ప్రకటించింది.

సీఆర్‌డీఏ సమావేశం రసాభాస

గుంటూరు : జిల్లాలో నిర్వహించిన సీఆర్‌డీఏ సమావేశం రసాభాసగా మారింది. అమరావతి నిర్మాణంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఆర్‌డీఏ అధికారులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వావాదం చోటుచేసుకుంది. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఏ గ్రామంలో ఎక్కడి నుంచి రోడ్లు వెళతాయి? గ్రామస్తుల స్థలం ఎంత పోతుందో స్పష్టంగా చెప్పాలంటూ రైతులు, గ్రామస్తుల అధికారులను నిలదీశారు. మ్యాప్‌ ప్రకారం నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాస్టర్‌ప్లాన్‌ వివరణ  తర్వాత చెప్తామని అధికారులు చెప్పారు.
 

 

17:13 - January 6, 2016

గుంటూరు : జిల్లాలో నిర్వహించిన సీఆర్‌డీఏ సమావేశం రసాభాసగా మారింది. అమరావతి నిర్మాణంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీఆర్‌డీఏ అధికారులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వావాదం చోటుచేసుకుంది. మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం ఏ గ్రామంలో ఎక్కడి నుంచి రోడ్లు వెళతాయి? గ్రామస్తుల స్థలం ఎంత పోతుందో స్పష్టంగా చెప్పాలంటూ రైతులు, గ్రామస్తుల అధికారులను నిలదీశారు. మ్యాప్‌ ప్రకారం నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాస్టర్‌ప్లాన్‌ వివరణ  తర్వాత చెప్తామని అధికారులు చెప్పారు.

 

17:06 - January 6, 2016


ప్రకాశం : జిల్లాలోని చినగంజాంలో దారుణం జరిగింది. అయిదేళ్ల బాలుడిని హింసించారు అతన్ని పెంచుకుంటున్న తల్లిదండ్రులు.. ఒంటిపై రక్తాలు కారేలా కొట్టారు.. ఈ చిన్నారిని రెండేళ్లక్రితం తమ ఇంటికి తెచ్చుకున్నారు కల్యాణి, రమణ దంపతులు... బాలుడిపై వాతలుచూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.. ప్రస్తుతం చిన్నారి శివ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు..

16:59 - January 6, 2016

హన్మకొండ : వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. గుడుంబాను అరికట్టేందుకు కృషి చేయాలని డ్వాక్రా సంఘాలకు ముఖ్యమంత్రి సూచించారు. మంచి ఫలితాలు సాధిస్తున్న డ్వాక్రా సంఘాలకు పోత్సాహకాలు అందించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కేసీఆర్‌ తమతో ముఖాముఖిగా మాట్లాడటంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

 

ఓటేస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం : ఎంపి కవిత

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం దూసుకుపోతుంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా ఉండి బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఏడాదిన్నర కాలంలోనే 1000కి పైగా కొత్త పరిశ్రమలు వచ్చాయి. పేదవాడి ఆకలి తీర్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. విద్య, వైద్యాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చేలా కృషిచేస్తున్నామని తెలిపారు. ఐదేళ్లు జీహెచ్‌ఎంసీని టీఆర్‌ఎస్ పార్టీ చేతుల్లో పెట్టండి. 60 ఏళ్లలో చేయని అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ నిర్వహణ తేదీలో మార్పులు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ నిర్వహణ తేదీలో మార్పులు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే5కు బదులుగా ఏప్రిల్ 29న ఎంసెట్ ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసెట్ ఎంట్రన్స్ మే 5వ తేదీన నిర్ణయించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్రంలో నిర్వహించనున్న ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ లు కూడా మే మొదటి వారంలో జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ లు రాసే విద్యార్థుల సౌకర్యార్థం ఆంధ్రాలో ఎంసెట్ ను ముందుగా నిర్వహించడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

16:44 - January 6, 2016

హైదరాబాద్ :నాగార్జున- రమ్యకృష్ణ- లావణ్యత్రిపాఠీల కలయిక వస్తోన్న మూవీ 'సోగ్గాడే చిన్నినాయన'. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై నాగార్జున ఈ ఫిల్మ్‌ని నిర్మిస్తున్నాడు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి కటింగులు లేకుండా సెన్సార్ అధికారులు U/A సర్టిఫికెట్ ఇవ్వడంతో యూనిట్ ఫుల్‌ఖుషీగా వుంది. జనవరి 15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్. ఇక సోగ్గాడు స్టోరీ విషయానికొస్తే.. గ్రామీణ నేపథ్యంలో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. ఇందులో నాగార్జున ఫాదర్ రోల్‌ఘోష్ట్‌గా కనిపిస్తుందని, చనిపోయిన తర్వాత కొడుక్కి మాత్రమే కనబడే పాత్రలో నాగ్ కనిపించబోతున్నాడు. ఎలా చూసినా నాగ్ డ్యూయల్ రోల్‌గా చాలామంది చెబుతున్నారు. దీనికితోడు ఓ వైపు లావణ్య, మరోసారి అనసూయ సినిమా బిగ్ ఎసెట్‌గా అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు

జీహెచ్ ఎంసీలో జెండా ఎగరేస్తాం: బాల్క సుమన్

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణమధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తాతో తెలంగాణ ప్రాంత పార్లమెంట్ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : నేడు స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 174 పాయింట్లు నష్టపోయి 25,406 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 7,741 వద్ద ముగిసింది.

15:55 - January 6, 2016

ఢిల్లీ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ అది. వందల ఏళ్ల పురాతన చరిత్ర గల అగ్రశ్రేణి విశ్వవిద్యాలయం అది. అలాంటి విశ్వవిఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విద్యాలయానికి తొలిసారిగా ఓ మహిళ వైస్‌ ఛాన్సలర్ అయింది. ఆమే  56 ఏళ్ల లూయిస్ రిచర్డ్‌సన్‌. అతిసామాన్య కుటుంబంలో పుట్టిన లూయిస్ తన ప్రతిభతో అత్యున్నత పదవిని అధిరోహించారు.

తొలి మహిళా వీసీగా లూయిస్‌

రాజసౌధాన్ని తలపించే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదవడం కాదు ఒక్కసారి కాలు పెడితే చాలు అనుకుంటారు విద్యావంతులు. అలాంటి వాల్డ్‌ టాప్‌ యూనివర్సిటీకి 900 ఏళ్లలో తొలిసారిగా ఓ మహిళా వైస్‌ చాన్సలర్‌గా నియమితురాలయ్యారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రతా అంశాల్లో ప్రపంచంలోనే సాధికారిత కలిగిన వ్యక్తిగా లూయిస్‌ రిచర్డ్స్‌సన్‌ సుపరిచితురాలు.

సేల్స్‌మెన్ కుటుంబంలో జన్మనించిన లూయిస్‌

ఐర్లాండ్‌లోని తీరప్రాంత పట్టణమైన ట్రాన్‌మోర్‌లో ఓ సేల్స్‌మెన్‌ కుటుంబంలో మొదటి సంతానంగా లూయిస్‌ జన్మించారు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన లూయిస్‌ తన చదువుకు కావల్సిన డబ్బును ఆమే సంపాదించుకున్నారు. డిగ్రీ చేసే సమయంలో లైబ్రరీలో సహాయకురాలిగా, బార్‌లో వెయిట్రెస్‌గా పనిచేస్తూ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. ప్రభుత్వ పాలన సబ్జెక్టుగా హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు. పీహెచ్‌డీ అనంతరం 1981 నుంచి 2001 దాకా 20 ఏళ్లపాటు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు లూయిస్‌.
2009లో ఆండ్రూస్ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు
బ్రిటన్‌లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీకి 2009లో వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. పూర్వ విద్యార్థులు, అభిమానుల నుంచి 500 కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించి యూనివర్సిటీలోని సదుపాయాలను ఆధునీకరించారు. ఆమె సారథ్యంలో సెయింట్ అండ్రూస్ యూనివర్సిటీ బ్రిటన్‌లో మూడో అత్యుత్తమ వర్సిటీగా నిలిచింది.

ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రతపై లూయిస్‌ దృష్టి  

ముఖ్యంగా ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రతపై ఎక్కువ దృష్టి సారించారు లూయిస్‌. అనేక వేదికలపై ఈ అంశాలపైనే గళం విప్పారు. అంతేకు వివిధ దేశాల్లో చట్టసభ సభ్యులకు ఈ అంశాలపై  అవవగాహన కూడా కల్పిస్తున్నారు లూయిస్ రిచర్డ్స్‌ సన్‌. అత్యంత ప్రతిభావంతురాలైన లూయిస్‌ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్‌గా నియమితురాలై ఈ ఘనత సాధించి తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.

 

15:48 - January 6, 2016

ఢిల్లీ : మానవ రక్తం మరిగిన క్రూరమృగం జిహాదీజాన్‌. బ్రిటన్‌ నుంచి పారిపోయి ఐఎస్‌ ఉగ్రవాదిగా మారి ఎన్నో మారణకాండలకు వ్యూహ రచన చేశాడు. ఫ్రాన్స్‌పై దాడి తర్వాత జరిగిన ఉగ్రవాద వ్యతిరేక దాడుల్లో మృతి చెందాడు. ఆహా ఒక క్రూరుడు మరణించాడని అనుకుంటుండగానే మరో జిహాదీజాన్‌ అవతరించాడు. మొదటి జాన్‌కు బ్రిటన్‌ పౌరసత్వం ఉంటే రెండో ఐసిస్‌ హీరోకు భారత మూలాలున్నాయి. అతనూ తనకు లైఫిచ్చిన ఇంగ్లాండ్‌నే టార్గెట్‌ చేశాడు.
ప్రపంచాన్ని ఒణికిస్తున్న ఐసిస్...
ప్రపంచాన్ని ఒణికిస్తున్న ఉగ్రకూటమి... ఐసిస్‌. ఇప్పుడు దీనికి మరో హీరో దొరికాడు. వరుస దాడులు, హత్యలతో అగ్రరాజ్యాలకు చుక్కలు చూపించి కరుడుగట్టిన ఉగ్రవాదిగా పేరొందిన జిహాదీ జాన్‌కు ఏమాత్రం తీసిపోని న్యూ జిహాదీ జాన్‌ ఇప్పుడు హిట్‌లిస్ట్‌లోకి చేరాడు. అన్నిటికన్నా అతను భారత మూలాలకు చెందినవాడు కావడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఇసిస్‌లో చేరిన సిద్ధార్థ్‌ధర్‌
బ్రిటన్‌కు చెందిన మొహమ్మద్‌ ఇమ్వాజీ... ఇసిస్‌ అనుయాయుడై ఆ కూటమిలో చేరాడు. తర్వాత ఎన్నో టెర్రరిస్ట్ ఎటాక్స్‌కు వ్యూహ రచన చేశాడు. ఈ మధ్యే జరిగిన ఫ్రాన్స్‌, రష్యా తదితర దేశాల సంయుక్త దాడుల్లో సిరియాలోని అల్‌ రఖాలో అంతమయ్యాడు. సేమ్‌ అతనిలానే బ్రిటన్‌ నుంచే ఇసిస్‌లో చేరాడు సిద్ధార్థ్‌ధర్‌. ఇంగ్లాండ్‌లో వ్యాపారిగా జీవితాన్ని కొనసాగిస్తూ పదేళ్ల క్రితం ఇస్లాం మతం పుచ్చుకుని అబూ రుమైష్‌గా పేరు మార్చుకున్నాడు. అయితే ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడనే కోణంలో 2014లో అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యాడు. వెనువెంటనే భార్యాపిల్లలతో సహా సిద్ధార్థ్‌ అలియాస్ అబూ సిరియాకు ఎస్కేప్‌ అయ్యాడు. తాజాగా బ్రిటన్‌ను బెదిరిస్తూ ఇసిస్‌ విడుదల చేసిన వీడియో ఫుటేజీ ద్వారా అతని వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఆ వీడియోలో ఉన్నది సిద్ధార్థ్‌ధరే..?
ఆ వీడియోలో ఉన్నది సిద్ధార్థ్‌ధరేనని బ్రిటన్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. అతని సోదరుడు కూడా వీడియోలోని స్వరాన్ని విని తన బ్రదరేనని అనుమానించాడు. అయితే వీడియో చూసిన తర్వాత తన సోదరుడే అన్న విషయాన్ని ధృవపరచలేకపోతున్నాడు. సిద్ధార్థ్‌ మిత్రులు, వ్యాపార భాగస్వాములు మాత్రం అతనేనని కన్‌ఫామ్‌ చేస్తున్నారు. మొహ్మద్ ఇమ్వాజీ ఇసిస్‌లో చేరాక అతని ఐఎస్ మిత్రులు ముద్దుగా జిహాదీ జాన్‌ అని పిలుచుకునేవారు. అతను బ్రిటన్‌ పౌరుడు కావడం సిద్ధార్థ్‌ కూడా బ్రిటన్‌కే చెందినవాడు కావడంతో సిద్ధార్థ్‌ను న్యూ జిహాదీ జాన్‌గా పిలుస్తున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్‌ అలియాస్‌ అబూ రుమైష్‌కు ఎలా చెక్‌ పెట్టాలా అని బ్రిటన్‌ ఇంటెలిజన్స్ వర్గాలు, పోలీసులు వ్యూహరచనలు చేస్తున్నారు.

 

15:43 - January 6, 2016

హైదరాబాద్ :నాగార్జున- రమ్యకృష్ణ- లావణ్యత్రిపాఠీల కలయిక వస్తోన్న మూవీ 'సోగ్గాడే చిన్నినాయన'. ఇటీవల రిలీజైన ట్రైలర్‌తో చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై నాగార్జున ఈ ఫిల్మ్‌ని నిర్మిస్తున్నాడు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎలాంటి కటింగులు లేకుండా సెన్సార్ అధికారులు U/A సర్టిఫికెట్ ఇవ్వడంతో యూనిట్ ఫుల్‌ఖుషీగా వుంది. జనవరి 15న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్. ఇక సోగ్గాడు స్టోరీ విషయానికొస్తే.. గ్రామీణ నేపథ్యంలో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. ఇందులో నాగార్జున ఫాదర్ రోల్‌ఘోష్ట్‌గా కనిపిస్తుందని, చనిపోయిన తర్వాత కొడుక్కి మాత్రమే కనబడే పాత్రలో నాగ్ కనిపించబోతున్నాడు. ఎలా చూసినా నాగ్ డ్యూయల్ రోల్‌గా చాలామంది చెబుతున్నారు. దీనికితోడు ఓ వైపు లావణ్య, మరోసారి అనసూయ సినిమా బిగ్ ఎసెట్‌గా అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు

15:30 - January 6, 2016

తూర్పుగోదావరి : కోనసీమలో అప్పుడే సంక్రాంతి సందడి మొదలైంది. పల్లెలు పండగ శోభతో కళకళలాడుతున్నాయి. అమ్మ చేతి కమ్మని వంటలు.. అందాల పరికినీ వోణీలు..  కోడి పుంజుల రంకెలు.. ఊరేగింపు సందడులు ఇలా గ్రామాల్లో సంక్రాంతి సందడే వేరు. ముఖ్యంగా కోనసీమలో మూడురోజుల పాటు సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుగుతాయి. పల్లెటూళ్ళకు పట్టుకోమ్మలా ఉండే కోనసీమలో సంక్రాంతి ఏవిధంగా ఉంటుందో ఓ సారి మనమూ చూసొద్దాం.
పచ్చని పంట పొలాలు..
పచ్చని పంట పొలాలు.. పిల్ల కాలువల ఒంపు సొంపులు.. పొగమంచు తెరలను తొలగించుకుంటూ ఉదయించే సూర్యుడు..ఆహ్లాదకరమైన పల్లె వాతావరణం.. సాధారణ సమయంలోనే ఎంతో ఆహ్లదంగా కనిపించే కోనసీమ సంక్రాంతి వస్తుందంటే.. బాపు బొమ్మలా తయారవుతుంది. అమ్మాయిల పరికిణీ ఓణీలు.. ఆట పాటలు సంక్రాంతి సందడిని మరింతగా పెంచుతాయి.
ఇప్పటినుంచే ఏర్పాట్లు
కోనసీమలో సంక్రాంతి పండుగ చూడాలంటే రెండు కళ్ళు సరిపోవనడంలో అతిశయక్తి లేదు. సుందరమైన ప్రకృతికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండే కోనసీమలో అప్పుడే పండుగ సందడి మొదలైంది. పండుగ మూడురోజులు ఘనంగా నిర్వహించుకునేందుకు ఇప్పటినుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి జనం. ఏ ఇంట చూసినా ఘుమ ఘుమలాడే పిండి వంటలతో సిద్ధమై పోయారు. ఇక్కడ పండుగను చూసి తరించేందుకు దూరప్రాంతల నుంచి వచ్చే బంధువుల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు కోనసీమవాసులు.
హరిదాసుల కీర్తనలు
మరోవైపు తొలికోడి కూయకముందే హరిదాసుల కీర్తనలు పల్లెల్లో మారు మోగుతున్నాయి. హరిదాసుల కీర్తనలకు తోడు కోనసీమ ముద్దుగుమ్మల హరివిల్లులు పల్లెటూళ్లకు మరింత అందాలను తెచ్చిపెడుతున్నాయి. ఇక షాపింగ్‌ల సందండి అంతా ఇంతా కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమ సంక్రాంతి సందడి కళ్లముందు కదులుతుంది. సంక్రాంతి కోసం చిన్నారుల నుంచి ముసలివారి వరకు అంతా ఎదురు చూస్తుంటారు.
రైతు ఇంట సంక్రాంతి శోభ
ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి చేసుకుని... పంట చేతికోచ్చిన సమయం కావడంతో మనందరికి అన్నంపెట్టే రైతు ఇంట సంక్రాంతి శోభ విరభూయనుంది. పంటకు గిట్టుబాటు ధర లేకపోయినా ఉన్నంతలో పిల్లలకోసమైనా సరే సంక్రాంతికి ఆనందాన్ని తీసుకొచ్చేందుకు రైతన్న సిద్దమయ్యాడు. కొత్త అల్లుళ్ళ మాటయితే ఇక సరే సరి. కోనసీమలో సగం హడవిడి వీరిదే. కోనసీమలో ఈ ఏడాది పెళ్ళయిన వారిని అత్తవారింటికి ఆహ్వనించి... మహరాజులా చూసుకుంటారు అత్తమామలు. తమ కూతురు, అల్లుడికి సకల మర్యాదలు చేసి తమకున్నంతలో బట్లలు పెట్టడంతో పాటు బహుమానాలు ఇచ్చి సంతోషంగా సాగనంపుతారు. ఇక చిన్నారులైతే తమకిష్టమైన భోగిపండుగ కోసం వెయికన్నులతో ఎదురు చూస్తున్నారు. భోగి మంటలు వేసేందుకు దుంగలు, కట్టెలు సిద్దం చేస్తున్నారు.. మరోవైపు ఆభోగిమంటల్లో వేయడానికి భోగి పిడకలు తయారీలో యువతులు నిమగ్నమయిపోయారు.
సంక్రాంతి పండుగలో మరో హైలెట్ ప్రభలు
సంక్రాంతి పండుగలో మరో హైలెట్ ప్రభలు. వీరభద్రస్వామి ప్రతిరూపంగా చెప్పే ప్రభల తయారీ కోసం ఇప్పటి నుంచే తీవ్రంగా శ్రమిస్తున్నారు యువకులు. కోనసీమలో సంక్రాంతి శోభ తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం తరిలివస్తారు.
కోడి పందాలకు పందెంరాయుళ్లు సిద్ధం
ఇక కోడి పందాలకు పందెంరాయుళ్లు సిద్ధమయిపోతున్నారు. పందెం వేసి నాశనం అయిపోతున్నారని తెలిసినప్పటికీ ... సంప్రదాయం పేరుతో పందెలు నిర్వహిస్తారు. కోనసీమలోనే ఎక్కువగా కోడిపందాలు జరుగుతాయి. ఇందుకోసం కోడిపుంజులను సిద్ధం చేస్తున్నారు. బలమైన తిండితో పాటు పుంజులకు ప్రత్యేకమైన ఎక్సర్ సైజ్‌లు, ట్రైనింగ్ ఇస్తున్నారు. పందెం మాట పక్కన పెడితే పౌరుషంతో కాలుదువ్వుతూ ఒక దానిపై మరోకటి యుద్దం ప్రకటిస్తుంటే ఆ సీన్ చూసేందుకు పట్టణాల నుంచి కోనసీమ పల్లెలకు క్యూ కడుతుంటారు కోడిపందాల ప్రేమికులు. కోడిపందాలే కాదు గుండాటలు, పేకాట శిబిరాలు ఇలా ప్రతిచోట వినోదం కోసం జూదం ఆడుతుంటారు. ఎందుకివన్ని అని ఎవరైనా అడిగితే... సాలు...సాల్లేవయ్యా సెప్పోచ్చావ్... ఈ మాత్రం లేకపోతే పండగేటుంటదీ... ఎంత సేసినా పండగ మూడ్రోలే కదా... అంటారు కోనసీమొళ్ళు. మరి మనం కుడా పండుగ ఎంజాయ్ చేయాలంటే కోనసీమకు వెళ్ళాల్సిందే.

 

వరంగల్ జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

హన్మకొండ : వరంగల్ జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలువురు మంత్రులు , శాసనసభ్యులు , జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు , ప్రధాన సమస్యలపై చర్చించారు. ఇటీవల వరంగల్ నగరాన్ని అభివృద్ది పధంలో ఉంచుతామన్న హామీపై ఉన్నతాధికారులతో చర్చించారు. జిల్లాలో వ్యవసాయరంగం , ఫ్యాక్టరీల అభివృద్ధి, నూతన ప్రాజెక్టులపై సీఎం
చర్చించారు.

15:10 - January 6, 2016

హన్మకొండ : వరంగల్ జిల్లా అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలువురు మంత్రులు , శాసనసభ్యులు , జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు , ప్రధాన సమస్యలపై చర్చించారు. ఇటీవల వరంగల్ నగరాన్ని అభివృద్ది పధంలో ఉంచుతామన్న హామీపై ఉన్నతాధికారులతో చర్చించారు. జిల్లాలో వ్యవసాయరంగం , ఫ్యాక్టరీల అభివృద్ధి, నూతన ప్రాజెక్టులపై సీఎం చర్చించారు.

 

15:03 - January 6, 2016

అనంతరపురం : ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల ఆందోళనతో అనంతపురం సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ హాస్టల్‌లో కొంతకాలంగా నాసిరకం ఆహారం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డెక్కారు. వందలాదిమంది ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌ జామైంది. హాస్టల్‌లో ఏవిధమైన ఆహారం పెడుతున్నారో అందరికీ చూపించారు. ప్రతిరోజూ ఇదే నాసిరకమైన ఆహారాన్ని అందిస్తున్నారని అశుభ్రమైన నీటితో తమ ఆరోగ్యం చెడిపోతున్నదని అన్నారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను సంప్రదించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని విద్యార్థులు ఆరోపించారు.

 

వరంగల్ జిల్లా అభివృద్ధికి రూ.300 కోట్లు : సీఎం కేసీఆర్

హన్మకొండ : వరంగల్ జిల్లాకు 365 రోజులూ నీరందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వరంగల్ జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి రూ.300 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. భూపాలపల్లిలో మరికొన్ని ప్రాజెక్టులను పునరుద్ధిరిస్తామని చెప్పారు.

14:57 - January 6, 2016

హన్మకొండ : వరంగల్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌..జిల్లాకు అనేక వరాలు ప్రకటించారు. జిల్లాకు 365 రోజులూ నీరందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. వరంగల్ జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి ప్రతి ఏడాది బడ్జెట్ లో రూ.300 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. భూపాలపల్లిలో మరికొన్ని ప్రాజెక్టులను పునరుద్ధిరిస్తామని చెప్పారు. దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మల్టీపుల్ పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో అతి పెద్ద నగరమన్నారు.
నిరంతరాయంగా మంచినీరు
జిల్లాలోని జనగాం, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాలకు ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుంచి మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ 30 నుంచి ఈ మూడు నియోజకవర్గాలకు నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరుగుతుందన్నారు. అలాగే జిల్లాలోని లక్నవరం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.
50వేల జనాభాకు ఒక కమ్యూనిటీ హాల్‌
వరంగల్‌ నగరంలో ఉన్న ప్రతి 50వేల జనాభాకు ఒక కమ్యూనిటీ హాల్‌తో పాటు మల్టీ పర్పస్‌ వెజ్ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్లను నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక నగరంలో ఉన్న ఎంజీఎం ఆసుపత్రిని స్త్రీ, శిశు సంక్షేమ కేంద్రంగా మార్చడంతో పాటు నగరంలో ట్విన్‌ టవర్స్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. వరంగల్ సెంట్రల్‌ జైలును మమూనూరుకు తరలించి ఆ స్థలంలో ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. ఇక వరంగల్‌లో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌ భవనాన్ని కూల్చి అదే స్థలంలో అధునాతన కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మిస్తామన్నారు. అలాగే 12 అంతస్తుల కమిషనరేట్‌ భవనాన్ని కూడా నిర్మిస్తామన్నారు.

 

 

14:23 - January 6, 2016

సోగ్గాడే చిన్నినాయన మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో నాగార్జున. ఈ సందర్భంగా సినిమా విశేషాలు వివరిస్తూ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. సినిమా కథ, కథనం ఆర్టిస్టుల గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. తను సినిమా చేస్తున్నప్పుడు తన నాన్నగారు అక్కినేని నాగేశ్వర రావుగారి వస్తువులు వినియోగించుకున్న విషయాన్ని తెలియజేస్తూ ఎమోషన్ గా ఫీలయ్యారు. అంతేకాకుండా మనం తర్వాత సంవత్సరం పైగా సమయం తీసుకుని చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన అన్నారు. ఈ సినిమా షూటింగ్, మరియు హీరోయిన్స్, దర్శకుడి గురించి నాగార్జున చేసిన ఆసక్తికర కామెంట్లు వీడియోలో చూడచ్చు. 

జీహెచ్ఎంసీ నామినేషన్ పత్రాలలో స్వల్ప మార్పు..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలతో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నామినేషన్ పత్రాలలో 7, 8, 10 కాలమ్స్‌ను సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇకపై పోటీ చేసే అభ్యర్థి వార్డు నెంబరు, వార్డు పేరు, ఓటరు జాబితాలో సీరియల్ నెంబరును విధిగా నామినేషన్ పత్రాల్లో పేర్కొనాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తి కూడా ఓటర్ జాబితాలోని తన పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్‌ను పేర్కొనాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైసీపీ పోటీ..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. త్వరలో జీహెచ్‌ఎంసీలోని డివిజన్లవారిగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని బుధవారం ఆయన తెలిపారు.

 

13:44 - January 6, 2016

నాన్న పిజ్జా కొనివ్వలేదంటే స్కూల్లో పది తలలు లేచిపోతాయి. బాస్‌ సెలవు ఇవ్వలేదంటే కనీసం ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఇదీ ప్రస్తుతం అమెరికాలో గన్‌ కల్చర్‌ సృష్టిస్తున్న బీభత్సకాండకు ఓ ఉదాహరణ.. ఆ అగ్రరాజ్యంలో గత పదేళ్లలో లక్షమంది తుపాకీ గుండ్లకు ప్రాణాలు కోల్పోయారు. ఒక భయంకరమైన యుద్ధంలో జరిగే మారణకాండ అమెరికాలో సాధారణ ప్రజలు పిచ్చిపిచ్చి కారణాలతో జరిపిన కాల్పుల్లో జరిగిపోయింది. ఈ ప్రాణాంతక గన్‌ కల్చరే ఇప్పుడు అమెరికాకు అంతుబట్టని సమస్యలా మారింది.ఏ సమస్య వచ్చినా నయానో భయానో పరిష్కరించేస్తారు. పెట్రోల్‌ కావాలంటే ఒక దేశంలో యుద్ధం మొదలయ్యేలా చేస్తారు. ప్రభుత్వ ఆదాయం పడిపోయిందంటే వేరే దేశాల్లో యుద్ధ సామగ్రి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటారు.. ఇవన్నీ అమెరికా మనస్తత్వానికి ప్రతీకలు. ఇప్పుడు అదే అగ్రరాజ్యం దశాబ్దాలుగా విచ్చలవిడిగా పెరిగిపోయిన గన్‌ కల్చర్‌తో తెగ ఇబ్బందిపడిపోతోంది. ఆ సమస్యను పరిష్కరించడం ఇప్పుడు ప్రభుత్వానికి పెను సవాలులా మారింది.

అమెరికాలో కామన్...
ప్రతిరోజూ ఏదో ఒకచోట తుపాకీ పేలుడు ఇప్పుడు అమెరికాలో కామన్‌ అయిపోయింది. ఆ దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన 9/11 టెర్రరిస్ట్‌ ఎటాక్‌కన్నా తుపాకీ సంస్కృతే అక్కడ ప్రమాదకరంగా మారిపోయింది. ఇదే విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు బరాక్‌ ఒమామా ఉదాహరణగా చూపారు. 2001 నుంచి 2013 వరకు లక్షా 53,144 మంది తుపాకీ కాల్పుల మూలంగా నేలకొరిగారు. ఇదే సమయంలో ప్రపంచానికి సమస్యలా మారిన ఉగ్రవాదం మూలంగా 2001 నుంచి 2014 దాకా అమెరికాలో జరిగిన మరణాల సంఖ్య 12 వేలే. ఈ నేపథ్యంలోనే గన్‌ కల్చర్‌ను ఉగ్రవాదంకన్నా ప్రమాదకరమైనదిగా ఒబామా అన్నారు.
ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు జరగడానికి అక్కడ ఏ యుద్ధమూ జరగలేదు. బాంబు పేలుళ్లూ చోటుచేసుకోలేదు.

2013లో 357 తుపాకీ కాల్పులు..
ఒక్క 2013 సంవత్సరంలోనే అమెరికాలో 357 తుపాకీ కాల్పుల సంఘటనలు చోటుచేసుకున్నాయి. 2012లో శాండీ హుక్‌లో ఆడమ్‌ లాంజా జరిపిన కాల్పుల్లో 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 2007 వర్జిన్‌ టెక్‌ సంస్థలో 32 మంది తుపాకీ కాల్పుల్లో మృతిచెందారు. ఇలాంటి కాల్పులకు జడిసి మసాచుసెట్స్‌లోని ఒక స్కూల్‌ లక్ష డాలర్లు వెచ్చించి పాఠశాలలో బుల్లెట్ ప్రూఫ్‌ ఏర్పాట్లు చేసింది. ఇలాంటి ఏర్పాట్లు ఇప్పుడు మరెన్నో స్కూల్స్‌లో జరుగుతున్నాయి. పెద్దలేకాదు. చివరకు చిన్నపిల్లలకు తుపాకులు అందుబాటులో ఉండడంతో వాళ్లూ సహచర విద్యార్థులను ఇష్టమొచ్చినట్లుగా కాల్చిపారేస్తున్నారు. ఈ మారణకాండకు అడ్డుకట్టవేసేందుకు అనేక స్కూళ్లు, కంపెనీలు వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇలా జరిగే ఖర్చు తుపాకీ కంపెనీల మూలంగా ప్రభుత్వానికి వచ్చే లాభంకన్నా ఎక్కువ ఉంది. 

13:42 - January 6, 2016

మన దగ్గర లైసెన్స్‌ లేకుండా ఒక గన్ ఉందంటే అది పెద్ద కేసే. ఏదైనా ఊరిలో పోలీస్‌ చర్య కాకుండా రెండు బుల్లెట్లు పేలాయంటే అది సంచలనమే. అదే అమెరికాలో అయితే.? కోట్లలో తుపాకులు... జన సంఖ్యకు మించి గన్లు.. పెద్దవారి దగ్గరనుంచి పిల్లల దాకా సరదాగా తుపాకులతో ఆడుకుంటుంటారు. అఫ్‌కోర్స్‌ ప్రాణాలు కూడా పోతుంటాయి. ఇప్పుడు ఇదే కల్చర్‌ అమెరికా అధ్యక్షుడిని కంటతడి పెట్టించింది. శోకంలోంచే బుల్లెట్‌లాంటి డైలాగ్స్‌ దూసుకొచ్చాయి. అన్నిటిలోనూ అగ్రస్థానంలో ఉండాలన్నదే అమెరికా తపన. రీజన్‌ ఏదైనా ఇప్పుడు జనాల దగ్గర ఉండే తుపాకుల విషయంలో కూడా అమెరికా అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశ జనాభా 30 కోట్లు. కానీ వారిదగ్గరున్న తుపాకుల సంఖ్యమాత్రం 31 కోట్లు. అంటే సగటున ప్రతి ఒక్కరిదగ్గరా ఒక తుపాకీ ఉంటుంది. ఇప్పుడు అవే గన్లు ఇష్టానుసారంగా పేలిపోతున్నాయి. విలువైన ప్రాణాలను గాలిలో కలిపేస్తున్నాయి. ప్రస్తుతం ఇదే గన్‌ కల్చర్‌ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాని కంటతడిపెట్టించింది.

కాంగ్రెస్ ఒకే చేస్తుందా ? 
అమెరికాలో విపరీతంగా పెరిగిపోతున్న గన్ కల్చర్‌కు బ్రేక్‌ వేయాలని అధ్యక్షుడు కంకణం కట్టుకున్నారు. తుపాకుల నియంత్రణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవసరమైతే ఆ దేశంలో ప్రభుత్వంతో సమానహోదా కలిగిన కాంగ్రెస్‌తో కూడా ఢీకొనాలని చూస్తున్నారు. అటార్నీ జనరల్‌, ఎఫ్‌బిఐ సిఫార్సులను అమలు చేయనున్నారు. గన్‌ కల్చర్‌కు అడ్డుకట్ట వేసే అధికారం తమ ప్రభుత్వ పరిధిలో ఉందని ఒబామా అన్నారు. తన నిర్ణయంతో అందరూ ఏకీభవిస్తారని అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే కాంగ్రెస్‌ను పక్కనబెడతానని ఒబామా పేర్కొనడం సంచలనమైంది. అక్కడ ప్రతిపక్షమైన రిపబ్లికన్‌ పార్టీ నియంత్రణలో ఉన్న కాంగ్రెస్... తుపాకుల కల్చర్‌ను అడ్డుకునేందుకు గతంలో తెచ్చిన బిల్‌ను తిరస్కరించింది. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్‌ దానికి ఓకే చేస్తుందా అన్నది ప్రశ్నార్థకమే.

త్వరలో ఎన్నికలు..
అమెరికాలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒబామా ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఒబామాకు మరోసారి అధ్యక్షుడిగా నిలిచే ఛాన్స్‌ లేదు. అయినా తమ డెమొక్రటిక్‌ పార్టీకి ఈ నిర్ణయం ఓట్లు కురిపిస్తుందనే ఉద్దేశం ఉండుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షపార్టీ వ్యతిరేకించే ఈ నిర్ణయాన్ని తుపాకుల తయారీ కంపెనీలూ సహజంగానే వ్యతిరేకిస్తాయి. అమెరికా ఆదాయంలో గన్‌ ఫ్యాక్టరీలనుంచి వచ్చే ఆదాయమూ భారీగానే ఉంటుంది. మరి చట్టసభలో ఒబామా శాంతి గన్‌ పేలుతుందో లేదో.? 

13:36 - January 6, 2016

చెన్నై : ఎన్నికల కూత వినిపిస్తోంది. పొత్తుల సమయం దగ్గరపడుతోంది. కాని సుప్రీంకోర్టు తీర్పు అడ్డం పడుతోంది. ఫ్రెండ్‌షిప్‌కి పోవాలంటే తీర్పు రావాలనే కాన్సెప్ట్‌ మెయిన్‌పాయింట్ అయ్యింది. ఆ తరువాతే దోస్తీలకు దారి వెతుక్కోవాలనే ప్లాన్‌ సిద్ధంగా ఉంది. మొత్తానికి తమిళనాడులో కమలనాథుల పొత్తుల ఆప్షన్‌ సుప్రీంకోర్టు తీర్పుతో లింకు పెట్టుకుని ఉంది.తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పొలిటికల్‌ పార్టీలు అల్రెడీ ప్రిపరేషన్స్‌ మొదలుపెట్టాయి. మరీ ముఖ్యంగా కమలనాథులు పొత్తులపై కన్నేశారు. వాళ్ల దగ్గర రెండు ఆప్షన్స్‌ ఉంచుకున్నారు. వాటిని అవసరం కొద్దీ వాడుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నా డీఎంకెతో పొత్తు పెట్టుకోవాలా లేక ప్రతిపక్షమైన డీఎంకేతో స్నేహం చేయాలా అనేది బీజేపీ ప్రధానమైన ఎన్నికల టాస్క్. ఏది ఏమైనా బీజేపీ పొత్తుల మ్యాటర్‌ అంతా సుప్రీంకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది.

ఎన్నికలకు ముందే తీర్పు..
ప్రస్తుతానికి కమలనాథులు జయలతితతో దోస్తీ కట్టాలని భావిస్తున్నారు. ఐతే జయలలిత ప్రస్తుతం సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసును ఫేస్‌ చేస్తున్నారు. వాస్తవానికి ఈ కేసులో కర్ణాటక హైకోర్టు జయకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. ప్రస్తుతం ఆ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సాగుతోంది. జయలలిత అక్రమాస్తుల కేసులో ఎన్నికలకు ముందే తీర్పు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రెండు మార్గాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జయకు ఫేవర్‌గా తీర్పు వస్తే అన్నా డీఎంకేతోనే ఫ్రెండ్‌షిప్‌ చేయాలనేది బీజేపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. ఒక వేళ తీర్పు జయకు ప్రతికూలంగా ఉంటే డీఎంకేతో జోడీ కట్టాలని కమలదళం ప్రణాళికలు రచిస్తోందని ప్రచారం జరుగుతోంది. పొత్తులపై ప్లాన్‌ చేస్తూనే.. పార్టీని బలోపేతం చేయాలని కమలదళం ఆలోచిస్తోంది. ప్రత్యేకంగా సినీ ప్రముఖులపై ఆ పార్టీ దృష్టిసారించింది. ఈ నేపథ్యంలోనే తమిళ హీరో అజిత్‌ బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. 

13:33 - January 6, 2016

ఢిల్లీ : కాలుష్యంపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలో భారీ డీజీల్‌ వాహనాల నిషేధంపై అత్యున్నత న్యాయస్థానం వెనక్కి తగ్గలేదు. వాహన తయారీ సంస్థల అభ్యర్థనను అడ్డంగా కొట్టేసింది. కారణాలు చెప్పండంటూ కడిగి పాడేసింది. నిషేధంపై మార్పు లేదని కుండబద్దలు కొట్టి చెప్పింది. మరోపక్క డీజిల్‌ వాహనాలపై మరింత కఠినంగా వ్యహరించేందుకు సుప్రీం కోర్టు సిద్ధమవుతోంది. మీ వాహనాలు కార్బన్‌ను విడుదల చేయవా..? మీరు తయారుచేసిన వెహికల్స్‌ నుంచి ఆక్సిజన్‌ విడుదల అవుతుందా...? ఇదీ సుప్రీంకోర్టు సూటిగా సంధించిన ప్రశ్న. ఆటోమోబైల్‌ కంపెనీల మైండ్‌ బ్యాంక్‌ అయ్యేలా అడిగిన ప్రశ్న. వాహన తయారీదారులు నీళ్లు నమిలేలా అత్యున్నత న్యాయం స్థానం నిలదీసిన వైనం ఇది.

పునసమీక్షించాలన్న పలు కంపెనీలు...
ఢిల్లీలో భారీ డీజీల్‌ వాహనాల నిషేధాన్ని పునసమీక్షించాలని మెర్సిడెస్‌, టయోటా, మహింద్రా అండ్‌ మహీంద్రా కంపెనీలు సుప్రీంకోర్టును కోరాయి. ఈ అంశం కోర్టులో విచారణకు వచ్చింది. తమ సంస్థకు చెందిన భారీ వాహనాలు తక్కువ స్థాయిలోనే ఉద్గారాలు వెదజల్లుతున్నాయని మెర్సిడెస్‌ వాదించింది. బొలారో, సుమో వంటి వాహనాలను గ్రామీణ ప్రాంతాల్లో సామాన్యులు కూడా అధిక సంఖ్యలో వినియోగిస్తున్నరంటూ చెప్పుకొచ్చింది. మెర్సిడెస్‌ వాదనపై కోర్టు మండిపడింది. పర్యావరణానికి ఏ విధంగా హానికరం కాదో డాక్యుమెంటరీ ఆధారాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. 2000 సి సి డీజీల్‌ వాహనాలను సామాన్యులు ఉపయోగిస్తారా అని ప్రశ్నించింది. ధనవంతులే వీటిని వినియోగిస్తారని తేల్చి చెప్పింది.

ఢిల్లీలో మార్చి 31 వరకు నిషేధం..
కాలుష్యంపై సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గానే వ్యవహరిస్తోంది. డీజిల్‌ వాహనాల వినియోగంపై కఠినంగా ఉంటోంది. ఢిల్లీలో 2000 సిసి ఇంజిన్‌ సామర్థ్యం మించిన డీజీల్‌ వాహనాలను, ఎస్‌యూవీ వెహికల్స్‌ వినియోగంపై కోర్టు ఇప్పటికే తాత్కాలికంగా నిషేధం విధించింది. గత ఏడాది డిసెంబర్‌ నెలలో ఈ ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలో మార్చి 31వ ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తోంది.

డీజిల్‌ వాహనాలపై గ్రీన్‌టాక్స్‌..
ఇది ఇలా ఉంటే భవిష్యత్తులో 2000సిసీ సామర్థ్యం దిగువున్న ఉన్న వాహనాలపైనా నిషేధం విధించాలని కోర్టు భావిస్తోంది. మరింత అధ్యయనం తర్వాత దీనిపై ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మరోపక్క అన్ని డీజీల్‌ వాహనాలపైనా గ్రీన్‌ టాక్స్‌ విధించాలని ఆలోచిస్తోంది. దీనిపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వంపైనా కోర్టు మండిపడింది. ఐదేళ్ల దాటిన డీజిల్‌ వాహనాలను ఎందుకు వినియోగిస్తున్నారంటూ ప్రశ్నించింది. మొత్తానికి డీజిల్‌ వాహనాల వినియోగంపై కోర్టు సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఢిల్లీలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ముందు ముందు దేశ అత్యున్నత న్యాయస్థానం మరింత కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. 

13:30 - January 6, 2016

ఉత్తర్ ప్రదేశ్ : దేశంలో మహిళలకు ఎక్కడ ఉంది భద్రత. స్నేహితుడి నుండి లేదు భద్రత. నమ్మినవారి నుండి లేని భద్రత. ఇంటి నుండి బయటకు వెళ్లిన యువతి తిరిగి వస్తుందన్న నమ్మకమే లేని భద్రత. అసలే సెక్యూరిటీ లేదని దేశమంతా టెన్షన్‌ పడుతున్నా.. కొంతమంది ఖాకీలు కళ్లు మూసుకుని జపం చేస్తున్నారనడానికి యూపీలోని ఓ దారుణ ఘటన ఉదాహరణగా కనపడుతోంది. గత సంవత్సరం నవంబర్ లో 23 ఏళ్ల యువతిని ఉత్తరప్రదేశ్ లోని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. తమ కూతురు కనిపించడంలేదని సుంగాధీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కాని పోలీసుల ప్రవర్తన భిన్నంగా ఉంది. అటు కిడ్నాప్ కేసు నమోదు చేసుకోలేదు. ఇటు మిస్సింగ్ కేసు నమోదు చేసుకోలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు ప్రజాసంఘాలు యువతి కిడ్నాప్ గురైందని ధర్నాలు చేశాయి.

కదిలిన పోలీసులు...
దీంతో బాధిత యువతి తల్లిదండ్రులు ఎస్పీని ఆశ్రయించారు. వెంటనే కేసు నమోదు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. దాంతో పాటుగా నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. కానిసీన్ కట్ చేస్తే పోలీసుల నుంచి ఎలాంటి యాక్షన్‌ లేదు. అమ్మాయి దొరకలేదు. కాని ఆ యువతిని రేప్ చేసిన విజువల్స్ ఎంఎంఎస్ ద్వారా విడుదల అయ్యాయి. వీడియో చూసి గుండెలవిసేలా ఏడ్చిన తల్లికి ఎవరు ఇవ్వగలరు భరోసా. వీడియో వచ్చాకగాని కదల్లేదు ఆ పోలీసులు.

నిందితులను పట్టుకుంటామంటున్న ఖాకీలు.,.
సుంగాధీ జిల్లా ఎస్పీ కున్ వా రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలను పంపించి కిడ్నాపైన యువతిని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఎంఎంఎస్ పంపించిన మొబైల్ నెంబర్ ఆధారంగా నిందితులను రెండు రోజుల్లో పట్టుకుంటామని తెలిపారు. సుంగాధీ పోలీసులు కేసు నమోదు చేసుకోకపోవడంపై ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సహాయంతో బృందాలను పంపించి తొందరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఇటువంటివి ఘటనలు భారత దేశంలో కొకొల్లలు. అయినా కొందరు అధికారుల తీరులో మార్పు రావటం లేదు. భద్రతను కల్పించడంలో కొన్ని చోట్ల పోలీసుల తీరులో మార్పు రాలేదు. మరి అబలకు ఎక్కడ దొరుకుంది రక్షణ. 

13:27 - January 6, 2016

హైదరాబాద్ : ఇచ్చింది కూసింత... అమలు చేసింది ఆవగింజంత...ఇప్పుడు ఇది కూడా భారమంటూ బారెడు కారణాలు చూపుతోంది తెలంగాణ ప్రభుత్వం. పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం అడ్మిషన్లు కల్పించలేమంటూ చేతులెత్తేసింది. పైగా దీని వల్ల ప్రభుత్వ స్కూళ్లకు ముప్పంటూ కొత్త వాదనను ముందుకు తీసుకొచ్చింది. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలున్న విద్యను ధనిక విద్యార్థులతో సమానంగా అందించాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన పథకానికి మంగళం పాడేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం అడ్మిషన్లు ఎత్తేసేందుకు కేంద్రం అనుమతి కోరింది. గ్రామీణ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం అడ్మిషన్లు కల్పిస్తోంది ప్రభుత్వం. ఇందుకు సరిపడా నిధులను సంబంధిత ప్రైవేటు స్కూళ్లకు మంజూరు చేస్తోంది. అయితే ఇప్పుడిది ప్రభుత్వానికి భారమే కాకుండా సర్కారు పాఠశాలలకు ముప్పని తేల్చి చెబుతోంది కేసీఆర్‌ సర్కార్‌.

విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని కేంద్రానికి నివేదిక..
నూతన విద్యా విధానం ముసాయిదాపై కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల అభిప్రాయాలను కోరింది. గ్రామ, మండల, జిల్లా రాష్ర్ట స్థాయిలో విద్యావేత్తలు, మేధావుల అభిప్రాయాలను తీసుకున్న రాష్ర్ట ప్రభుత్వం ఓ నివేదికను కేంద్రానికి పంపింది. ఇందులో ప్రధానంగా విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని సూచించింది. పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం అడ్మిషన్లు కల్పించి, రీయింబర్స్‌మెంట్‌ చేయటం ద్వారా ప్రభుత్వానికి ఆర్ధిక భారమని నివేదికలో పేర్కొంది. అంతే కాదు 25 శాతం అడ్మిషన్లు సర్కారు పాఠశాలల మూసివేతకు కారణమౌతావయని చెప్పింది.

బిన్నాభిప్రాయాలు..
ఈ 25 శాతం అడ్మిషన్లకు వెచ్చించే మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాలలకు కేటాయిస్తే మౌలిక వసతులు కల్పించొచ్చని ప్రభుత్వ నివేదికపై మేధావుల నుంచి భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. 25 శాతం అడ్మిషన్లకు వెచ్చిస్తున్న నిధులతో ప్రైవేటు స్కూల్స్‌ మెరుగుపడతాయని, ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమౌతాయని అంటున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచి ఆ తరువాత 25 శాతం అడ్మిషన్లను ఎత్తేసినా నష్టముండదని చెప్తున్నారు. సర్కారు పాఠశాలల బాగుకోరి తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసిందా లేక ఉన్న అడ్మిషన్లను ఎత్తేసి పేద విద్యార్థులను ఉన్నత ప్రమాణాల విద్యకు దూరం చేస్తుందా అన్నది వేచి చూడాలి.

13:11 - January 6, 2016

ఢిల్లీ : రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. గడిచిన ఆరు రోజుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ? కాలుష్యం ఎంత మేర తగ్గిందనే దానిపై నివేదిక సమర్పించాలని సూచించింది. జనవరి 1-15వ తేదీ వరకు రాష్ట్రంలో సరి - బేసి విధానాన్ని ఆప్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా విధానాన్ని అమలు చేపట్టింది. ఉదయం 8 నుండి రాత్రి 8గంటల వరకు ఈ విధానం అమలు చేస్తున్నారు. కానీ దీనిపై హైకోర్టులో పిల్ దాఖలైంది.
సరి - బేసి వాహన విధానంలో మహిళలకు, ద్విచక్రవాహనాలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారని కోర్టు ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అవగాహన లేకపోవడం వల్ల రోడ్డుపైకి వచ్చిన వేయి మంది వరకు జరిమానాలు కట్టిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి 8గంటల తరువాత వాహనాలు ఒక్కసారిగా రోడ్ల మీదకు రావడంతో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. నివేదిక అనంతరం నిర్ణయం తీసుకుంటామని కోర్టు పేర్కొంది. మరి కాలుష్యం తగ్గిందా ? అదే పరిస్థితి ఉందా ? అనేది నివేదిక బట్టి తెలుస్తుంది. 

13:09 - January 6, 2016
13:07 - January 6, 2016

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఫస్ట్ కాపీని చూసిన దుబాయ్ సెన్సార్ బోర్డు అధికారికంగా రివ్యూ రిపోర్ట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డ్ లో మెంబర్ అయిన కైరాసాంధు ఇలాంటి సినిమా ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాలేదని , చాలా మంచి సినిమా అని , ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని తేల్చి చెప్పేశారు. ఇప్పుడు ఆమె ట్వీట్ చేసిన పద్ధతిని బట్టి చూస్తే , ఖచ్చితంగా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సంక్రాంతికి బరిలో దిగే అన్ని సినిమాల్లో కెల్లా ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని, ఇక రిలీజయ్యి హిట్ రావడం లాంఛనమేనని అభిమానులు చెబుతున్నారు. సుకుమార్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుండగా , జగపతిబాబు , రాజేంద్రప్రసాద్ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ సంక్రాంతి పండుగ(13ద తేదీన)కు కానుకగా ప్రేక్షకులముందుకు రానున్న సంగతి తెలిసిందే.   

ఢిల్లీలో కాలుష్యం ఎలా ఉంది - హైకోర్టు..

ఢిల్లీ : రాష్ట్రంలో ప్రస్తుతం కాలుష్యం ఎలా ఉందో చెప్పాలని హైకోర్టు ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గత వారం రోజులుగా అమలు చేస్తున్న సరి - బేసి విధానంపై కోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కాలుష్యం ఎలా ఉందో తెలుపాలని కోర్టు సూచించింది.

 

13:01 - January 6, 2016

హైదరాబాద్: యంగ్ హీరో నిఖిల్ హీరో తన పెళ్ళి గురించి ఆసక్తికర విషయాన్నీ చెప్పాడు. మూడు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరోకు వాళ్ళ అమ్మ నాన్నలు చూసిన అమ్మాయినే చేసుకుంటాడట. ఈ విషయాన్నీ చెబుతూ తానూ సినిమాల్లో అమ్మాయిల వెనుక పడుతుంటాను కాని రీయల్ లైఫ్ లో మా అమ్మానాన్న లు చెప్పిన అమ్మాయినే పెళ్లాడుతా అని వివరించాడు. నన్ను అర్ధం చేసుకునే భార్య దొరికితే చాలు, నాకు తెలిసి నా కంటే మంచి మనసున్న అమ్మాయినే నాకు భార్య తెస్తారు మా అమ్మ నాన్నలు అని చెప్పేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరి కల్లా పెళ్లి పీటలు ఎక్కుతా అని సిగ్గుపడుతూ చెప్పాడు నిఖిల్.

12:55 - January 6, 2016

ఈ రోజుల్లో గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య లేనివారు అతి తక్కువ మంది. దీనికి గల ముఖ్య కారణం మారిన జీవనశైలి విధానమే అని చెప్పవచ్చు. క్షణం తీరిక లేక యంత్రాలతో పరిగెడుతూ వేళకు ఆహారం తీసుకోక, ఒక వేళ అహారం తీసుకున్నా క్షణాలలో హడావిడిగా ముగించటం, దీనితో పాటుగా తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టక పోవడం, ఆలోచనలతో మనసు నిలకడ లేకుండా పరిగెత్తడం, కారణం లేకుండానే కోపం రావటం వంటి మానసిక సమస్యలతో బాటు సరైన అహారం తీసుకోక పోవటంతో ఈ సమస్య తీవ్రరూపం దాల్చి అందరిని వేధిస్తోంది. మరి మన వంటగదిలో దొరికే వస్తవులతో కొన్ని చిట్కాలు మీ కోసం...

~ ఒక చెంచా వామువేయించి పొడిగా గానీ, కషాయంగా గానీ తీసుకోవాలి

~ త్రిఫలా పొడి తేనెతో తీసుకోవాలి

~ ఒక చెంచా జీలకర్ర పొడి చేసి పంచదారతో గానీ, పటికబెల్లంతో గానీ తీసుకోవాలి.

~ సోంపు, పటిక బెల్ల కలిపి పొడి చేసుకొని తినాలి.

~ వందగ్రాముల వాము శుభ్రం చేసి ఎర్రగా వేయించి మొత్తగా పొడి చేసి డబ్బాలో నిల్వ వుంచుకొని గ్యాస్ ట్రబుల్ ఉన్నపుడు ఒక చెంచా పొడిని నీళ్లల్లోగాని.. విడిగా      గానీ తీసుకోవాలి.

~ జీలకర్ర దంచి పొడి చేసి అంతే పాళ్ళు పంచదార గాని.. లేకపోతే మిశ్రి(నవ్వోతు)ని గాని కలిపి తినాలి.

~ చిటికెడు వామ్, ఒకస్పూన్ తేనె, అరగ్లాసు గోరు వెచ్చని కలిపి తీసుకోవడం వలన కొంత ఉపసమనం కలుగుతుంది.

   అంతే కాకుండా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా పండ్లు, ఆకుకూరలు ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఉపసమనం కలుగుఉంది. 

 

రాజధాని నిర్మాణం డబ్బులు వసూలు చేయడంపై పిటిషన్..

గుంటూరు : ఏపీ రాజధాని నిర్మాణం కోసం విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రూ. 10 వసూలు చేసే విధానాన్ని సవాల్ చేస్తూ వైసీపీ నేత రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం పిటిషన్ విచారణకు రానుంది. 

సీఎం స్వాగత ఆర్చీ కూలింది..కార్యకర్తలకు గాయాలు..

కర్నూలు : నంద్యాల సంజీవనగర్ లో ప్రమాదం జరిగింది. సీఎం స్వాగత ఆర్చి కూలి ఐదుగురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. 

నగర అభివృద్ధిపై కేసీఆర్ సమీక్ష..

వరంగల్ : నగర అభివృద్ధిపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం వరంగల్ అభివృద్ధి ప్రణాళికపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

12:37 - January 6, 2016

చుండ్రు ... చిరకాల సమస్య! ఎంతో మంది నిత్యం దీనితో చికాకు పడటమే కాదు.. పైకి చెప్పుకోలేని న్యూనత కూడా అనుభవిస్తుంటారు. చుండ్రు చాలా మందిలో ఉంటుంది. కానీ ఇది ఎక్కువగా యువతీ యువకుల్లో 50 నుండి 70శాతం మంది కనపడుతుంది. చుండ్రు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని నానుడి ఉంది. కానీ అది అపోహ మాత్రమే అని వైద్యులు చెప్తున్నారు.

అస్సలు చండ్రు ఎందుకు వస్తుంది....

సాధారణంగా మన శరీరంలో చర్మకణాలు పాతవి పోతూ... కింది నుంచి కొత్తవి స్తుంటాయి. ఇది నిరంతరాయంగా జరుగుతూ ఉండే ప్రక్రియ. తల మీద కూడా చర్మం కణాలు కొత్తవి వస్తూ, పాతవి పోతూనే ఉంటాయి. ఈ ప్రక్రియ 3-4 వారాలు పడుతుంది. మనం స్నానం చేసినపుడు పాతవి రాలిపోతుంటాయి. కాబట్టి వీటి గురించి మనం అంతగా పట్టించుకో కూడా. కానీ కొన్నిసార్లు రకరకాల సమస్యల వల్ల తల మీద కణాలు త్వరత్వరగా పాతవైపోతూ... కొత్తవి వచ్చేస్తుంటాయి. దీంతో అక్కడ మృతకణాలు పేరుకుపోయి, అవి పొట్టు పొట్టుగా వూడి వస్తుంటాయి. ఇదే 'చుండ్రు' తల మీద వెంట్రుకలు, చమురు గ్రంథులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పొట్టుకు చమురు కూడా తోడై తలంతా మరింత చికాకుగా తయారవుతుంది. అందుకే చుండ్రులో ప్రధానంగా రెండు రకాలుంటాయి. అవి 1.పొడి రకం. వీరికి పొడి పొడిగా వపొట్టు రాలుతుంది. 2. చమురు రకం.... పొట్టుకు చమురుకూడా తోడై తల త్వరగా జిడ్డుగా తయారవుతుంది.

స్త్రీలలో కంటే పురుషుల్లో చుండ్రు సమస్య ఎక్కువ....

స్త్రీలలో కంటే పురుషుల్లో చుండ్రు సమస్య ఎక్కువ. చమురు గ్రంథులుపురుషులకు ఎక్కువ, తల మీద గ్రంథులపై హార్మోన్ ప్రభావం కూడా పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. యుక్త వయస్సులో మన ఒంట్లో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావంతో తల మీది చమురు గ్రంథులుఎక్కువ పని చేసి చమురును ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. కొంత మందిలో జన్యుపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తి ఎక్కువైనపుడు చమురు గ్రంధులు ఎక్కువగా పని చేసి చండ్రు సమస్యకు ఆజ్యం పోస్తాయి. షాంపూలు అధికంగా వాడటం, వాటిని సరిగా కడుక్కోకపోవటం, బలంగా ఒత్తిపెట్టి దువ్వటం, జుట్టు షేప్ చేసుకోవడానికి డ్రైయర్లు వాడటం, నూనె, మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారికి కూడా చుండ్రు ఎక్కువగా వస్తుందని కొంత మంది వాదిస్తున్నారు.

నివారణ ఎలా?

చండ్రు అనేది మన శారీరక సహ ప్రక్రియల్లో భాగంగా వచ్చే సమస్య కాబట్టి అందరికీ దీన్ని పూర్తిగా పోగొట్టటం సాధ్యపడకపోవచ్చు. కాకపోతే ఒకప్పటి కంటే ఇపుడు చండ్రు తగ్గించుకునేందుకు మార్కెట్ లో మంచి మెడికేటెడ్ షాంపూలు, చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. రోజు విడిచి రోజు యాంటీ డాండ్రఫ్ షాంపూలతో తలస్నానం చేస్తూ ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి, గాఢమైన షాంపూలు, క్రీములకు దూరంగా ఉండాలి. తలకు అపుడపుడు సూర్య రశ్మి తగలటం మంచింది. తాజా పండ్లు, మంచి పోషకాహారం తీసుకోవాలి. పొడి రకం చుండ్రు ఉన్న వాళ్లు చలికాంలో, మిగతా సీజన్లలో కూడా తలకు నూనె రాసుకోవచ్చు.

ఆనియన్ ట్రీట్ మెంట్...

ఉల్లిపాయలో వుండే పోషకాలు చుండ్రు సమస్యను తగ్గించి.. జుట్టును సంరక్షిస్తుంది. అయితే నేరుగా ఆనియన్ కాకుండా అందులో కొన్ని ఇతర పదర్థాలతో కలిపి రెమెడీస్ తయారుచేసుకొని పట్టించుకోవాలి. మరెలా తయారుచేస్తారో తెలుసుకుందాం…

ఉల్లిపాయ రసం : ఇందులో ఆర్ధోడాక్స్ అనే పదార్ధం వుంటుంది. ఇది జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. అలాగే తలలో వున్న బ్యాక్టీరియాను నివారించి.. తెల్లగా రాలే పొట్టు సమస్య నుంచి దూరంగా వుంచుతుంది. తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయను కట్ చేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. తలకు పట్టించి 30నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.
మెంతులు : మెంతులను నీళ్లలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉల్లిపాయ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
అలోవెర : కలబంద రసానికి కొద్ది ఉల్లిపాయ రసం మిక్స్ చేసి తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమం వల్ల తలను చాలా కూల్ గా చేస్తుంది. దురదను నివారిస్తుంది.
బీట్ రూట్ : దుంపలను నీటిలో వేసి బాగా మరిగించుకోవాలి. ఆ నీటిలో కొద్దిగా ఉల్లిపాయ రసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి వేళ్ళతో బాగా మసాజ్ చేయాలి.
నిమ్మరసం : ఉల్లిపాయ రసంలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించుకోవాలి. ఇలా చేస్తే తలలో దుర్వాసన నివారించబడుతుంది. తలలో దురద దూరమవుతుంది.
తేనె : ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనె మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించుకోవాలి. అనంతరం 10నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.
కొబ్బరి నూనె : ఒక చెంచా నిమ్మరసం, 5చెంచాల కొబ్బరినూనె, 3చెంచాల ఉల్లిపాయరసం తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు బాగా పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.
గుడ్డు : 1 లేదా 2 గుడ్లను తీసుకొని, అందులో కొద్దిగా నిమ్మ, ఉల్లిపాయ రసాలు మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. గుడ్డు జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.
ఆపిల్ జ్యూస్ : రెండు చెంచాల ఆపిల్ జ్యుస్ లో 2చెంచాల ఉల్లిపాయ రసం మిక్స్ చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.
వెనిగర్ : ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. అది చుండ్రును నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, తర్వాత తలకు మసాజ్ చేయాలి.

అంతే కాదు.. అందుబాటు లో ఉండే పుదీనా రసంతో కూడా చుండ్రు నివారణకు ఉపయోగపడుతుంది.

12:29 - January 6, 2016

చిత్తూరు : సీమ అభివృద్ధికి సీపీఎం నడుం బిగించింది. అందులో భాగంగా ఉద్యమాలకు సీపీఎం శ్రీకారం చుట్టినట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఆయన తిరుపతిలో టెన్ టివితో మాట్లాడారు. రాయలసీలమ అభివృద్ధి నినాదంతో వచ్చే నెలలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఫ్రిబవరి రెండో వారంలో రాయలసీమ జిల్లాల నుండి బస్సు, పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీని ముట్టడిస్తామని, రాయలసీమలోని సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేక రాయలసీమ అన్నది వ్యర్థమైన డిమాండ్ అని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాయలసీమకు అదనంగా నిధులు కేటాయించాలన్నారు. మంచినీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. టిటిడి నిధులను రాయలసీమ జిల్లాల నీటి సదుపాయానికి వినియోగించాలని, జన్మభూమి పేరిట జరుగుతున్నది ప్రచార ఆర్భాటమే తప్ప సమస్యల పరిష్కారానికి కాదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి వచ్చినా ఈ ప్రాంతానికి న్యాయం జరగలేదనే అభిప్రాయం ఉందని, దీనికి ప్రత్యేక రాయలసీమ అడగడం సరికాదన్నారు. రాయలసీమ ప్రాంతంలో పరిస్థితులు మెరుగుపడాలంటే ప్రత్యేక నిధులు కావాలని, పరిశ్రమలు ఏర్పాటు కావాలని సూచించారు. తాము చేపట్టబోయే కార్యక్రమాలకు అందరూ సహకరించాలని మధు పేర్కొన్నారు. 

12:26 - January 6, 2016

విజయవాడ : కల్తీ మద్యం కేసులో 9వ నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో కీలక సమాచారాన్ని రాబట్టాలని సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. విచారణకు హాజరయ్యే ముందు మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. అన్ని విషయాలు వారితో మాట్లాడుతానని, పూర్తి వివరాలు తరువాత చెబుతానని పేర్కొన్నారు.
డిసెంబర్ ఏడో తేదీన కృష్ణలంకలో ఉన్న స్వర్ణ బార్ రెస్టారెంట్ సెల్లార్ లో ఉన్న బార్ లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా 35 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మద్యం కల్తీ అవ్వడం వల్లే మృతి చెందారని ఫోరెన్సిక్ నివేదిక కూడా పేర్కొంది. ఈ బార్ మల్లాది విష్ణుదని ప్రచారం జరిగింది. అనంతరం మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనలో 19 మందిని నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. అందులో 9మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 8 మంది కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. మల్లాది విష్ణును 9వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేశారు. కానీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. అరెస్టు చేయమని, విచారణ మాత్రమే చేస్తామని పోలీసులు కోర్టుకు తెలిపారు. కల్తీ మద్యం కేసులో సహకరించాలని, సిట్ బృందం ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో నాటకీయఫక్కీలో మంగళవారం విజయవాడలో మల్లాది విష్ణు ప్రత్యక్షమయ్యారు. అదే రోజు రాత్రి విష్ణును అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా కోర్టు ఉత్వర్వులను ఆయన చూపారు. ప్రస్తుతం ఆయన ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనే ఉత్కంఠ నెలకొంది. 

12:21 - January 6, 2016

ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రిలీఫ్ దొరికింది. అక్టోబర్ వరకు జైలులో ఉండాల్సి ఉన్నా ముందే విడుదల కానున్నారు. మంచి ప్రవర్తన నేపథ్యంలో కోర్టు విడుదలకు ఒకే చెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. దీనితో ఫిబ్రవరి27వ తేదీన పుణెలోని ఎరవాడ జైలు నుండి రిలీజ్ కానున్నారు. జైలులో బుద్ధిమంతుడిగా ఉంటూ తోటి ఖైదీలతో స్నేహంగా మెలుగుతున్న మున్నాభాయ్ కి నెలకు ఏడు రోజులు, సంవత్సరానికి 30 రోజుల చొప్పున తన ఐదేళ్ల శిక్షాకాలంలో మొత్తం 114 రోజుల సెలవు దొరికింది. దీంతో శిక్షాకాలం నిర్ణీత గడువు కన్నా దాదాపు ఆరు నెలలముందే సంజయ్ విడుదలవుతున్నారు.
1998 ముంబై పేలుళ్ల జరిగిన సమయంలో సంజయ్ దత్ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 1993 మార్చి 12న ముంబయిలో రెండు గంటల వ్యవధిలో 12చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ మారణహోమంలో 257 మంది దుర్మరణం చెందగా, 713 మంది గాయాల పాలయ్యారు. రూ.27 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. దీనిపై విచారణ జరిపిన టాడా కోర్టు 2007లో 12 మంది నిందితులకు మరణశిక్ష, 22 మందికి జీవితఖైదు విధించింది.దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సంజయ్ కు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని సుప్రీం కోర్టు శిక్షను ఐదేళ్లకు కుదించింది. దాదాపు 18 నెలల పాటు శిక్ష అనుభవించిన దత్ బెయిల్ పై బయటకు వచ్చారు. తిరిగి 2013 పుణెలోని ఎరవాడ జైలుకు వెళ్లారు. శిక్షా కాలంలో చాలా కాలం పాటు పెరోల్ పై సంజయ్ బయటే ఉన్నారు. పదేపదే సంజయ్ కు పెరోల్ ఇవ్వడంపై గతంలో ముంబై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఫిబ్రవరి 27న సంజయ్ దత్ విడుదల..

ముంబై : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు మహారాష్ట్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. దీనితో ఫిబ్రవరి 27వ తేదీన సంజయ్ జైలు నుండి విడుదల కానున్నాడు.

టి.ఎంపీలతో రైల్వే జీఎం భేటీ..

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్ నిలయంలో రాష్ట్ర ఎంపీలతో రైల్వే జీఎం రవీంద్ర గుప్తా భేటీ అయ్యారు. రైల్వే బడ్జెట్ కు సంబంధించి ఎంపీ లనుండి జీఎం ప్రతిపాదనలు తీసుకున్నారు.

 

నగరంలో ఎక్కడ చూసినా చెత్త చెదారం - కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : నగరంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారమే కనిపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి విమర్శించారు. నల్లకుంటలో బీజేపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 

11న ఏపీ అసెంబ్లీ విచారణ కమిటీ భేటీ..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో ఈనెల 11వ తేదీన విచారణ కమిటీ భేటీ కానుంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా, ఇతర వైసీపీ సభ్యుల ప్రవర్తనపై విచారణ జరపనుంది. 

11:34 - January 6, 2016
11:32 - January 6, 2016
11:30 - January 6, 2016

ఎట్టకేలకు సిట్ ఎదుట విచారణ మల్లాది విష్ణు

విజయవాడ : రాజకీయాలను ఓ కుదుపు కుదిపిన కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్‌నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బుధవారం కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కృష్ణలంకలోని స్వర్ణబార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఇటీవల కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న మల్లాది విష్ణు నిన్న ఉదయం విజయవాడ చేరుకున్నారు. మల్లాది విష్ణు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించడంతో ఎట్టకేలకు సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

లద్నాపూర్ లో సింగరేణి భూ నిర్వాసితుల ఆందోళన...

కరీంనగర్ : ముత్తారం (మం) లద్నాపూర్ లో సింగరేణి భూ నిర్వాసితులు ఆందోళన నిర్వహించారు. ఓసీపీ -2 ప్రాజెక్టు పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

సిట్ ఎదుట మల్లాది విష్ణు..

విజయవాడ : కల్తీ మద్యం కేసులో సిట్ ఎదుట కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు విష్ణును 9వ నిందితుడిగా పేర్కొన్న సంగతి తెలిసిందే. 

వచ్చే నెలలో భారీ ఉద్యమం - ఏపీ సీపీఎం..

తిరుపతి : రాయలసీలమ అభివృద్ధి నినాదంతో వచ్చే నెలలో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఫ్రిబవరి రెండో వారంలో రాయలసీమ జిల్లాల నుండి బస్సు, పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి మొదటి వారంలో అసెంబ్లీని ముట్టడిస్తామని, రాయలసీమలోని సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేక రాయలసీమ అన్నది వ్యర్థమైన డిమాండ్ అని తెలిపారు. టిటిడి నిధులను రాయలసీమ జిల్లాల నీటి సదుపాయానికి వినియోగించాలని, జన్మభూమి పేరిట జరుగుతున్నది ప్రచార ఆర్భాటమే తప్ప సమస్యల పరిష్కారానికి కాదని విమర్శించారు. 

ఎయిర్ విమానం టైర్ పేలింది..

మధ్యప్రదేశ్ : ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండై సమయంలో విమానం టైర్ పేలింది. విమానంలో 95 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.

కేంద్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభం..

ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పఠాన్ కోట్ ఉగ్రవాదుల దాడి, తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

 

11:25 - January 6, 2016

హైదరాబాద్ :విశాఖ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. చింతపల్లి (మం) జీకే వీధి మండలం జెర్రిలలో మాజీ సర్పంచి, మార్కెట్‌యార్డు డైరెక్టర్‌ సాగిన వెంకటరమణను హత్య చేశారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ నిన్న రాత్రి వెంకటరమణను ఆయన ఇంటి వద్ద నుంచి మావోయిస్టులు అపహరించారు. వెంకటరమణను హత్యచేసినట్లు ఈరోజు తెల్లవారుజామున గ్రామస్థులకు సమాచారమందించారు. ఇన్‌ఫార్మర్‌ నెపంతో నిన్న మంచంగిపుట్టు మండలం సరియాపల్లిలో గిరిజనుడు శివయ్యను మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు.

బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు ఊరట

హైదరాబాద్ : బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు ఊరట లభించింది. ఫిబ్రవరి 27న సంజయ్‌దత్ విడుదల కానున్నారు. సంజయ్‌దత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం శిక్ష తగ్గించింది. మహారాష్ట్ర ప్రభుత్వ సిఫారసును హోంశాఖ అంగీకరించింది. 1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్‌కు కోర్టు ఐదు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో దత్‌కు టాడా కోర్టు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను ఐదేళ్లకు తగ్గించింది.

10:46 - January 6, 2016

హైదరాబాద్ : చెక్‌ బౌన్స్‌ కేసును చెక్‌ జారీ చేసిన చోట పెట్టాలా లేదంటే బౌన్స్‌ అయిన ప్రాంతంలోనా పెట్టాలా అనే దానిపై సందిగ్ధత వీడింది. ఏ బ్యాంకులో అయితే చెక్ బౌన్స్ అయిందో ఇక నుంచి అక్కడే కేసును నమోదు చేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇటీవలి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన నెగోషబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ బిల్లు సవరణలను కేంద్ర నోటిఫై చేయడంతో, చెక్ బౌన్స్ విషయంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇందులో భాగంగా, ఎవరో ఇచ్చిన చెక్కు తీసుకుని, అది బౌన్స్ అయితే, చెక్కు జారీ చేసిన బ్యాంకు లేదా చెక్కిచ్చిన వ్యక్తి ఉన్న ప్రాంతంలోని కోర్టుల్లోనే ఫిర్యాదు చేయాల్సిన అవసరం తప్పుతుంది. ఇకపై చెక్కును జమ చేసిన బ్యాంకు ఉన్న ప్రాంతంలోనే, కేసు పెట్టవచ్చు. కాగా, ప్రస్తుతం దేశంలోని వివిధ కోర్టుల్లో 18 లక్షలకు పైగా చెక్ బౌన్స్ కేసులు విచారణ దశలో ఉన్నాయి. వీటిల్లో 38 వేల కేసులు హైకోర్టు స్థాయిలో పెండింగ్ లో ఉన్నాయి. అత్యధిక కేసుల్లో ఫిర్యాదిదారులు వాయిదాల నిమిత్తం ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త సవరణలు అమల్లోకి రావడంతో ఇకపై చెక్ బౌన్స్ కేసుల్లో సులువుగానే కేసులు పెట్టే అవకాశం ఏర్పడింది.

10:44 - January 6, 2016

గతంలోరామజన్మభూమి,శిలాన్యాస్, కశ్మీర్ సమస్య వంటి సమస్యలు చుట్టూచర్చలుపెట్టిమత కలహాలు సృష్టించిన కాషాయకూటమి దాని అనుబంధ సంస్థలు తాజాగా రామజన్మభూమి రగడను ప్రారంభించాయి. ఢిల్లీ యూనివర్శిటీలో రామ జన్మభూమిపై సదస్సును నిర్వహించుకునేందుకు వర్శిటీ అధికారులు ఆమోదం తెలపడం వివాదాస్పదమైంది. విశ్వహిందూ పరిషత్ అనుబంధ సంస్థ ఒకటి, ఈ సదస్సును నిర్వహించాలని తలపెట్టగా, అధికారులు కూడా అంగీకరించారు. క్యాంపస్ లో విద్యార్థుల మధ్య మతపరమైన విభేదాలు పెంచే ఈ తరహా చర్చలు తగవని అధ్యాపకులు, విద్యార్థులు విమర్శిస్తున్నారు. రెండు రోజుల పాటు 'శ్రీరామ్ జన్మభూమి టెంపుల్ : ఎమర్జింగ్ సినారియో' పేరిట 9వ తేదీ నుంచి సదస్సును, వీహెచ్పీ నేత, దివంగత అశోక్ సింఘాల్ స్థాపించిన అరుంధతీ వశిష్ఠ అనుసంధాన పీఠ్ తలపెట్టింది. ప్రస్తుతం ఈ పీఠానికి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చైర్మన్ గా ఉన్నారు. సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేయాలని సంకల్పించారు. రాముని విలువలు, గుణగణాలు, భారత సంస్కృతిపై రామాయణ ప్రభావం, రాముని చరిత్రపై జరిగిన పరిశోధనల ఫలితాలు, రామమందిరంపై వివాదం, దాని భవిష్యత్తు తదితరాలపై సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సదస్సు జరపవద్దని వద్దని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, వర్శిటీకి చెందిన విభాగాలు సదస్సును నిర్వహించడం లేదని, యూనివర్శిటీ ప్రాంగణంలోని వేదికను ఎవరైనా బుక్ చేసుకోవచ్చని అధికారులు చెబుతుండటం గమనార్హం.

10:26 - January 6, 2016

చిత్తూరు : చంద్రబాబు ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ విధానాన్ని విరమించుకోనట్లేతే తీవ్ర ప్రతిపఘటన తప్పదని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. కరవు కోరల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సింది పోయి భూ సేకరణ పేరిట ఉన్న భూమిని లాక్కొంటున్నారని విమర్శించారు. రాయలసీమలో అధికంగా భూ సేకరణ చేస్తున్నారని తెలిపారు. చిత్తూరులో 2 లక్షల ఎకరాలు సేకరిస్తున్నారని, కడపలో 30వేల ఎకరాల భూమి సేకరిస్తున్నారని తెలిపారు. అలాగే అనంతపురం, కర్నూలులో కూడా భూ సేకరణ చేస్తున్నారని, ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే భూములు సేకరిస్తున్నారని విమర్శించారు. నాలుగు జిల్లాల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వారికి అప్పచెప్పడానికి అంగీకారం చేసిందని, విద్య, వైద్య రంగాలను ప్రైవేటుకరం చేయడం అంటే ప్రజలపై భారం మోపడమేనని మధు పేర్కొన్నారు.

10:24 - January 6, 2016

విజయవాడ : కల్తీ మద్యం కేసులో 9వ నిందితుడిగా పేర్కొన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును సిట్ బృందం విచారించనుంది. ఇప్పటికే కృష్ణలంక పీఎస్ కు సిట్ బృందం చేరుకుంది. డిసెంబర్ ఏడో తేదీన కృష్ణలంకలో ఉన్న స్వర్ణ బార్ రెస్టారెంట్ సెల్లార్ లో ఉన్న బార్ లో కల్తీ మద్యం సేవించి ఏడుగురు మృతి చెందగా 35 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మద్యం కల్తీ అవ్వడం వల్లే ఫోరెన్సిక్ నివేదిక కూడా పేర్కొంది. ఈ బార్ మల్లాది విష్ణుదని ప్రచారం జరిగింది. అనంతరం మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేసింది. మల్లాది విష్ణును 9వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేశారు. కానీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. అరెస్టు చేయమని, విచారణ మాత్రమే చేస్తామని పోలీసులు కోర్టుకు తెలిపారు. కల్తీ మద్యం కేసులో సహకరించాలని, సిట్ బృందం ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో నాటకీయఫక్కీలో మంగళవారం విజయవాడలో మల్లాది విష్ణు ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికి పారిపోలేదని, విచారణకు సహకరిస్తానని ఈ సందర్భంగా విష్ణు తెలిపారు. 41 ఎ కింద సిట్ నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం మల్లాదిని అరెస్టు చేస్తారా ? లేదా ? విచారణలో మల్లాది విష్ణు ఎలాంటి అంశాలు తెలియచేస్తారనేది ఉత్కంఠ నెలకొంది. 

కృష్ణలంక పీఎస్ కు సిట్ బృందం..

విజయవాడ : కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సిట్ బృందం చేరుకుంది. కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును సిట్ విచారించనుంది. 

కొద్దిసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం..

ఢిల్లీ : ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పఠాన్ కోట్ దాడి ఘటనపై చర్చించనున్నారు. 

పంజాబ్ లో ఆరు ప్యాకెట్ల హెరాయిన్ స్వాధీనం..

పంజాబ్ : కేమ్ కరన్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ ఆరు ప్యాకెట్ల హెరాయిన్ ను స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. ఒక పాక్ దేశానికి చెందిన సిమ్ కార్డు ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

09:58 - January 6, 2016

హైదరాబాద్: అందరూ భయపడుతున్నట్లే అయింది. ప్రపంచ దేశాల హితోక్తులూ, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మొట్టమొదటిసారిగా ఉత్తర కొరియా దేశం హైడ్రోజన్‌ బాంబు పరీక్ష నిర్వహించింది. ఈరోజు ఉదయం నిర్వహించిన పరీక్ష విజయవంతమైనట్లు ఆ దేశ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ హైడ్రోజన్‌ బాంబు ప్రయోగం కారణంగా ఈశాన్య ప్రాంతంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 10గంటల సమయంలో ఈశాన్య ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు. కిల్జూ పట్టణానికి 50కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని కూడా గుర్తించారు. అయితే ఈ భూకంపం హైడ్రోజన్‌ బాంబు పరీక్ష కారణంగా వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అణుబాంబు కన్నా ఇది ఎంతో శక్తివంతమైనదిగా ఉత్తర కొరియా ప్రకటించింది. దీంతో ఉత్తర కొరియా తన అణ్వస్త్ర పాటవాన్ని మరింత పెంచుకున్నట్లైంది. ''మా దేశ తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష 2016, జనవరి 6(బుధవారం)న విజయవంతమైంది. అధికార వర్కర్స్ పార్టీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం మేరకే ఈ పరీక్ష దిగ్విజయంగా నిర్వహించాం'' అని ఆ దేశ అధికారిక టీవీ చానెల్ న్యూస్ రీడర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు.

మరో టిడిపి నేత హత్య..

విశాఖపట్టణం : చింతపల్లి (మం) జెర్రెల మాజీ సర్పంచ్ వెంకటరమణను మావోయిస్టులు హత్య చేశారు. ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు గిరిజన టిడిపి నేతలు హత్యకు గురయ్యారు. 

ఉత్తర కొరియాలో హై డ్రోజన్ బాంబు పరీక్ష..

ఢిల్లీ : హై డ్రోజన్ బాంబు పరీక్ష సఫలమైనట్లు ఉత్తర కొరియా ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరకొరియా అణుపరీక్షలు నిర్వహించిన స్థలం వద్ద కృత్రిమ భూకంపం వచ్చినట్లు పలు దేశాలకు చెందిన వాతావరణ కేంద్రాలు, భూకంప కేంద్రాలు తెలిపాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైంది.

09:07 - January 6, 2016

అమలాపురం : మరోసారి కల్తీ మద్యం ఒకరి ప్రాణాలు తీసింది. ఇటీవలే విశాఖపట్టణంలో స్వర్ణ బార్ రెస్టారెంట్ సెల్లార్ లో ఉన్న బార్ లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఐనవెల్లి (మం) వీరవల్లిపాలెంలో కల్తీ మద్యం సేవించి సత్తిబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. సత్తిబాబు ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, పిల్లలున్నారు. మంగళవారం రాత్రి ఓ బెల్ట్ షాపులో ఉన్న మద్యం సేవించాడు. అనంతరం నురగలు కక్కుతూ కిందపడిపోయాడు. వెంటనే సత్తిబాబును ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెద్దదిక్కుగా ఉన్న సత్తిబాబు మృతి చెందడంతో కుటుంబసభ్యులు వీధిన పడ్డారు. మద్యం కల్తీ అయ్యిందని వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 
జిల్లాలో బెల్ట్ షాప్ లు ఉన్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని టెన్ టివిలో పలుమార్లు కథనాలు ప్రసారమయ్యాయి. కానీ ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల బెల్ట్ షాపులు అధికమౌతున్నాయని ఆరోపణలున్నాయి. ఘటన జరిగినా కూడా ఎక్సైజ్ అధికారులు స్పందించ లేదని తెలుస్తోంది. 

08:37 - January 6, 2016

పేదలకు ఉన్నతమైన ప్రమాణ విద్య అందాలని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆయన టెన్ టివి 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో విశ్లేషించారు. ఆయన మాటల్లోనే…
''పిల్లలు ఇంజినీరింగ్..డాక్టర్ కావాలి అని తల్లిదండ్రులు ప్రస్తుతం ఆలోచిస్తున్నారు. ఇక భవిష్యత్ లేదు అనే వ్యూ విద్యార్థుల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ధోరణి అధికంగా ఉంది. మెడిసన్ లో సీటు వచ్చిన తరువాత డాక్టర్ కావాలి..పీజీ తెచ్చుకోవాలి. ప్రపంచంలో వేరే జీవితం లేదు అనే ధోరణిలోకి వెళుతున్నారు. 994 ర్యాంకు తెచ్చుకున్నా తనకు ఇంజినీరింగ్ సీటు రాలేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఆశలు పడడలో తప్పు లేదు. పిల్లల తెలివితేటలతో సంబంధం లేకుండా చేయడం కరెక్టు కాదు. వారి కెపాసిటీ తగ్గట్టుగా మోటీవేషన్ ఇవ్వాలి. నిరుత్సాహ పడకుండా ఇతర మార్గాల్లో ఎంకరేజ్ చేయాలి. తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడం లేదు అనే వత్తిడిలో విద్యార్థులు ఉంటారు. కార్పొరేట్ కాలేజీలు పిల్లలను వస్తువులుగా చూస్తుంటారు. అనాలోచితమైన శిక్షలు చేస్తున్నారు. ఇష్టమైన దానిలో ఆనందపడాలి. చదువులో మాధుర్యం గుర్తించకపోతే యాంత్రీకమవుతతుంటారు. విద్యారంగంలో తీవ్రమైన అసమనాతలున్నాయి. పేదలకు ఉన్నత ప్రమాణ విద్య ఉండాలి. పేదవాడి కష్టాన్ని థనికులు అర్థం చేసుకుంటారు. నాణ్యతతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి''. అని నాగేశ్వర్ పేర్కొన్నారు. 

ఇల్లందు విజయవిజ్ఞేశ్వర ఆలయంలో చోరీ..

ఖమ్మం : ఇల్లందు విజయవిజ్ఞేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. పంచలోహ విగ్రహంతో పాటు రూ. 60వేల విలువైన బంగారు, వెండి ఆభరణాల అహరించారు. 

07:52 - January 6, 2016

ఇప్పటి వరకు పలు రకాల డ్రోన్‌లను మనం చూశాం. కాని మరీ 1.5 అంగుళాలున్న బుల్లి డ్రోన్‌ని ఎప్పుడైనా చూశారా..? లేదు కదూ. యాక్సిస్‌ అనే సంస్థ తాజాగా విడియన్‌ పేరుతో ఓ చిట్టి రోబోని తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే అతి చిన్నదైన రోబో కావడం విశేషం. దీని ధర 75 డాలర్లు. జనవరి 7వ తేదీ వరకు ప్రీ ఆర్డర్లు ఇవ్వవచ్చు. జనవరి 29 నుంచి షిప్పింగ్‌ ప్రారంభిస్తామని సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి. దీనిసైజు 1.5 అంగుళాలు బరువు.. దాదాపుగా 240 గ్రాములు. చిన్న కెమేరా ఇందులో అమర్చారు. 420 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ చి 360 డిగ్రీల కోణంలో ఫొటోలు, వీడియోలు తీయ్యవచ్చు. యూఎస్‌బీ ద్వారా 20 నిమిషాలు ఛార్జింగ్‌ చేస్తే ఏడు నిమిషాల పాటు గాల్లో ఎగురుతుంది. రాత్రిళ్లు ఎగురుతున్నప్పుడు కావాలంటే ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతాయి. దీనితోపాటు 2.4 గిగాహెడ్జ్‌ కంట్రోలర్‌ వస్తుంది. దాంతో దీన్ని నియంత్రించవచ్చు.

07:49 - January 6, 2016

ఏదైనా కొత్తగా అలవాటు చేసుకోవాలంటే కనీసం పదిహేను రోజులు క్రమం తప్పక చేయాలి. కొత్త సంవత్సరంలో అనేక నిర్ణయాలు తీసుకునేవారు, మొదట కనీసం రెండు వారాల పాటు చేపట్టిన పనిని ప్రతిరోజు కచ్చితమైన సమయానికి చేయాలి.

  • వ్యాయామం చేయాలన్నా, పొద్దునే లేచి నడవాలని నిర్ణయించుకున్నా 15 రోజులు క్రమం తప్పక ఈ అలవాటుని కొనసాగించండి.
  • గతంలో డైరీ రాయడం అలవాటు ఉండి, కొన్నేళ్ళుగా మానేసిన అలవాటును మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నారా? అయితే కనీసం పదిహేను రోజులు వరసగా రాయండి. నాలుగు వాక్యాలు అయినా ప్రతిరోజు డైరీలో రాయాలి.
  • మీ ఆహారంలో కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నారా? రెండు మూడు వారాల పాటు నిర్ణీత సమయానికి ఈరకమైన ఆహారం తీసుకోండి.
  • రోజూ రాత్రి ఎనిమిది గంటల లోపు భోజనం చేయాలనే నిర్ణయాన్ని రెండువారాల పాటు అమలు చేయండి. ఇది మీ దినచర్యలో భాగమవుతుంది.
  • ఎవరికయితే ఫోన్లు చేయాలనుకుంటున్నారో ఆ జాబితా రాసుకోండి. రాత్రి ఇంటికి చేరుకున్నాక ఆ పని సరిగా చేశామో లేదో సరిచూసుకోండి.
07:48 - January 6, 2016

లక్నో: తెలుగు తేజం పి.వి సింధు మరోమారు సత్తా చాటడంతో ఢిల్లీ ఏసర్స్‌పై చెన్నై స్మాషర్స్‌ ఘన విజయం సాధించింది. వుమెన్స్‌ సింగిల్స్‌లో ఏసర్స్‌ షట్లర్‌ పి.సి తులసిపై 15-5, 15-4తో వరుస సెట్లలో గెలుపొందిన సింధు చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించింది. ట్రంప్‌ మ్యాచ్‌ సహా మూడింట విజయం సాధించిన చెన్నై స్మాషర్స్‌ 4-3తో ఢిల్లీపై గెలుపొందింది.

సింధు జోరు : టాప్‌ షట్లర్‌ పి.వి సింధు ముందుండి నడిపించటంతో చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో అక్షయ్, అడ్‌కాక్‌ 15-14, 13-15, 15-5తో గుణవన్‌, మనీశా జోడిపై విజయం సాధించి చెన్నైకి శుభారంభం అందించారు. అడ్‌కాక్‌..ప్రణయ్ చోప్రాతో కలిసి 15-12, 15-14తో మెన్స్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో కీన్‌, హియోంగ్‌ జోడిపై విజయం సాధించాడు. కానీ ఢిల్లీ ఏసర్స్‌ షట్లర్‌ అజయ్ జయరాం 15-6, 15-9తో శాంటసోపై నెగ్గి ఆ జట్టుకు తొలి విజయం అందించాడు. వుమెన్స్‌ సింగిల్స్‌లో సింధు ఎప్పట్లాగే దుమ్మురేపింది. 4-1 ఆధిక్యంతో విజయం ఖరారు చేసుకున్న చెన్నైకి ఆఖరి మ్యాచ్‌లో మాత్రం చుక్కెదురైంది. ఢిల్లీ ఏసర్స్‌ స్టార్‌ షట్లర్‌ టామీ సుగియార్టో 15-4, 15-11తో ట్రంప్‌ మ్యాచ్‌లో బ్రిస్‌ లావెండెజ్‌పై గెలుపొంది ఆజట్టుకు రెండు పాయింట్లు తీసుకొచ్చాడు. దీంతో ఢిల్లీ 3-4తో మెరుగైన స్థితిలో మ్యాచ్‌ను ముగించింది. అవాదే వారియర్స్‌పై మ్యాచ్‌లోనూ సుగియార్టో ట్రంప్‌ మ్యాచ్‌ నెగ్గిన విషయం తెలిసిందే.

07:44 - January 6, 2016

ముంబయి : క్రికెట్‌ నుంచి తప్పుకోవటంపై సరైన సమయంలో ఆలోచిస్తానని టీమ్‌ ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని పేర్కొన్నాడు. ' వాస్తవికంగా జీవించే వ్యక్తుల్లో నేను ఒకడిని. ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌, టీ20 వరల్డ్‌కప్‌లో జట్టును నడిపించటంపైనే నా దృష్టి. రిటైర్మెంట్‌పై సరైన సమయంలో ఆలోచిస్తాను' అని ధోని అన్నాడు. 2015 వరల్డ్‌కప్‌ సెమీస్‌ ఓటమి తర్వాతా ఇదే ప్రశ్న ఎదుర్కొన్న మహి.. రిటైర్మెంట్‌ ఆలోచన లేదని చెప్పటం గమనార్హం. టెస్టు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి మెరుగైన విజయాలు సాధిస్తున్న సమయంలో.. అన్ని ఫార్మాట్లలో సారథ్య పగ్గాలు కోహ్లికే అప్పగించాలనే డిమాండ్‌ చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు గత ఏడాది కాలంగా ధోని బ్యాట్స్‌మన్‌ నామమాత్రమైన ఇన్నింగ్స్‌ మాత్రమే ఆడాడు. టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత కెప్టెన్‌గా ధోని భవితవ్యంపై సెలక్టర్లు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని కొన్నాండ్లుగా వార్తలొస్తున్న నేపథ్యంలో మహి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కంగారూలతో టీ20, వన్డే సిరీస్‌ నిమిత్తం జట్టు ఆస్ట్రేలియా బయల్దేరే ముందు ధోని మీడియాతో మాట్లాడాడు.

మనీశ్‌, గుర్‌కీరత్‌లకు అవకాశం : వన్డేల్లో సురేశ్‌ రైనా లేకపోవటంతో అతని స్థానంలో ఎవరిని ఆడనించాలనే విషయంపై కెప్టెన్‌ ధోని స్పష్టతనిచ్చాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 5,6,7 స్థానాల్లో ఆడటం ఎల్లప్పుడూ క్లిష్టమే. టాప్‌ ఆర్డర్‌లో శిఖర్‌, రోహిత్‌, కోహ్లి, రహానే రూపంలో అద్భుత బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. కానీ ఎంతటి బ్యాట్స్‌మన్‌కు ఐనా లోయర్‌ ఆర్డర్‌లో ఆడటం కష్టసాధ్యమే. మనీశ్‌ పాండే, గుర్‌కీరత్‌ మన్‌ సింగ్‌లలో ఒకరికి రైనా స్థానం దక్కనుంది. ఎవరికి అవకాశం దక్కినా ఐదో స్థానంలో ఆడించేందుకే మొగ్గుచూపుతాం అని ధోని అన్నాడు. 2015 వరల్డ్‌కప్‌ భారత్‌కు మంచి టోర్నీ. టోర్నీలో సెమీస్‌ మినహా అద్భుతంగా ఆడాం. బలమైన ప్రత్యర్థి స్ట్రేలియాతో ఆడటం ఎప్పుడూ సవాలే. కొత్త ఆటగాళ్లకు ఇదో అవకాశం. దేశవాళీ ప్రదర్శనను అంతర్జాతీయ వేదికపై ఎలా చూపగల్గుతారనే దానిపై భవిష్యత్‌ ఆధారపడి వుంటుంది' అని మహి పేర్కొన్నాడు.

07:42 - January 6, 2016

ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారిణిగా నటించిన 'జై గంగాజల్‌' చిత్రం సెన్సార్‌ వివాదంలో చిక్కుకుంది. ఇటీవల దర్శక, నిర్మాత ప్రకాష్‌ ఝా ఈ చిత్రాన్ని సెన్సార్‌ కోసం పంపారు. సెన్సార్‌ సభ్యులు సినిమాని చూసి 'సాలా' అని ఉపయోగించిన ప్రతి చోట మ్యూట్‌ చేయాలని, అలాగే అభ్యంతరకర పలు సన్నివేశాల్లో 11 కట్స్‌ ఇస్తూ 'యు/ఎ' సర్టిఫికెట్‌ని జారీ చేసింది. అయితే ఈ సర్టిఫికెట్‌ తీసుకునేందుకు దర్శక, నిర్మాత ప్రకాష్‌ ఝా నిరాకరించారు. దీనిపై ఆయన స్పందించారు. ''సాలా' అనే పదం జనం వాడుక భాషలో ఓ భాగమైంది. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జాతికి వ్యతిరేకంగా ఉండే పదాలను నేను ఉపయోగించలేదు. ప్రజలు మాట్లాడుతున్న భాషలో మమేకమైన పదాల్నే ఎంచుకున్నాను. వీటిపై సెన్సార్‌ సభ్యులు అభ్యంతరం తెలపడం హాస్యాస్పదం. సమాజంలో నేనూ ఒక బాధ్యతగల దర్శకుడినే. సెన్సార్‌ కోసం ఈచిత్రాన్ని పంపినప్పుడు ఎగ్జామింగ్‌ కమిటీలోని ఇద్దరు సభ్యులు లెక్కకు మించిన కట్స్‌తో 'ఎ' సర్టిఫికెట్‌ వస్తుందని చెప్పగా, మరో ఇద్దరు 'సాలా' అనే పదం ఉపయోగించిన చోట మ్యూట్‌ చేస్తూ 11 కట్స్‌తో 'యు/ఎ ' సర్టిఫికెట్‌ వస్తుందని తెలిపారు. వీరి అభిప్రాయాల్లో తేడా ఉండటం వల్ల ఈ చిత్రాన్ని సెంట్రల్‌ సెన్సార్‌బోర్డ్‌ చైర్మన్‌ పహ్లాజ్‌ నిహలానీ దృష్టికి తీసుకెళ్ళగా, ఆయన రివైజింగ్‌ కమిటికి పంపారు. ఆ రివైజింగ్‌ కమిటి తుదిగా 11 కట్స్‌తో 'యు/ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు సుముఖత చూపింది. 2003లో 'గంగాజల్‌' చిత్రాన్ని రూపొందించాను. అందులో అతి హింసతోపాటు 'సాలా' లాంటి ఎన్నో పదాల్ని ఉపయోగించాను. అప్పడు సెన్సార్‌వాళ్ళు కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా 'యు/ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఆ సినిమా వివిధ టెలివిజన్‌ ఛానెళ్ళలో దాదాపు 300 సార్లు ప్రదర్శితమైంది. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు కొత్తగా సెన్సార్‌ వాళ్ళకి రావడం ఆశ్చర్యకరంగా ఉంది. బిజెపి ప్రభుత్వం వచ్చాకే ఇటువంటి సమస్యల్ని దర్శక, నిర్మాతలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రసారశాఖ మంత్రిగా రవిశంకర్‌ ప్రసాద్‌ పదవిలోకి వచ్చాక దర్శక, నిర్మాతలకు సెన్సార్‌ సమస్యలు మరింత ఎక్కువగా వస్తున్నాయి' అని తీవ్ర స్వరంతో అన్నారు.

07:38 - January 6, 2016

'నిక్కి గాల్రాని' 'సునీల్' హీరో హీరోయిన్లుగా వాసు వర్మ దర్శకత్వంలో 'దిల్‌' రాజు నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణాష్టమి'. త్వరలో ఆడియో విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత 'దిల్‌' రాజు మాట్లాడుతూ, 'మా బ్యానర్‌లో వస్తోన్న మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం. రాజమండ్రిలో 9న ఆడియోను, ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాను రిలీజ్‌ చేస్తున్నాం' అని అన్నారు. 'అమెరికా నుంచి వచ్చిన ఓ కుర్రాడు ఇండియాలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనేది చిత్ర కథాంశం. ఉన్నతమైన సాంకేతిక విలువలతో కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రంగా 'కృష్ణాష్టమి'ని తెరకెక్కించాం' అని దర్శకుడు తెలిపారు.

07:37 - January 6, 2016

ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ,'జనవరి 4తో ఈ చిత్రానికి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ పూర్తయ్యింది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా చాలా లావిష్‌గా నిర్మించాం. దర్శకుడు సుకుమార్‌ టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కించిన ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ లెవెల్లో విడుదల చేస్తున్నాం' అని చెప్పారు.

 

07:35 - January 6, 2016

టీడీపీకి వ్యతిరేకంగా కాపులు సమైక్యమవుతున్నారా..? కాపుల మద్దతును కూడగట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారా..? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌హాట్‌గా జరుగుతున్న చర్చ ఇది. కొంతకాలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా కాపులు నిరసన గళం వినిపిస్తుండడం.. దాసరి నారాయణరావు ఇంటికి జగనే స్వయంగా వెళ్లి మంతనాలు సాగించడం.. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే సంభవించే కీలక మార్పులకు సంకేతమన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో నడింపల్లి సీతారామరాజు (విశ్లేషకులు), కరణం ధర్మశ్రీ (వైసీపీ), రామానాయుడు (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

07:33 - January 6, 2016

పనిలో పడి నీళ్లు తాగడం మరిచిపోతున్నారా? అయితే జాగ్రత్త పడండి లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నీళ్లు సరిగ్గా తాగకపోతే తలనొప్పి, అలసట, శరీరంలో శక్తిలేకపోవడం వంటి రుగ్మతలు తప్పవు. అందుకే దాహంగా ఉన్నా.. లేకపోయినా, ఎంత పనిలో ఉన్నా సరే.. కనీసం గంటకు ఒకసారి గ్లాసు నీళ్లు తాగండి.ఆదివారం వచ్చిందంటే... చాలా మంది మహిళలు ఇంటిని సర్దుకునే పనిలో మునిగిపో తుంటారు. అలా చేయకుండా కాసేపు నడుం వాల్చండి. లేకుంటే ఉద్యోగం చేసే మహిళలకు కష్టమే. వారానికి ఓ సారైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటేనే అది తర్వాతి వారానికి రీచార్జిలా పనిచేస్తుంది.రోజంతా చురుగ్గా పనులు చక్కబెట్టాలంటే వ్యాయామాన్ని మించిన పరిష్కారం లేదు. ఇది తల్లులకు చాలా అవసరం. వ్యాయామం చేసేందుకు సమయం లేకపోతే ఇంటి పనుల్లో భాగంగానే మెట్లు ఎక్కి దిగండి. ఇది కూడా ఒక వ్యాయామమే.ఇంట్లో వారికి రుచికరమైన ఆహారం, టిఫిన్లు చేసిపెడుతూ ఆనందించడం ఒక్కటే కాదు. మీరు కూడా వేళకు భోజనం చేయడం మంచిదంటున్నారు నిపుణులు. ఎంత హడావుడిలో ఉన్నా రోజూ పొద్దున్నే టిఫిన్‌ మాత్రం మానేయకండి. రోజంతా చురుగ్గా ఉండేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

07:30 - January 6, 2016

చలి.. రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో పిల్లలకు, పెద్దలకు చర్మం పొడిబారడం, తెల్లగీతలు ఏర్పరడం లాంటివి ఏర్పడతాయి. ఈ చలిపులి నుంచి చర్మాన్ని ఇలా రక్షించుకుందాం. పొడి చర్మం ఉన్నవారు ప్రతిరోజు స్నానం చేసే ముందు ఒంటికి నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. స్నానానికి వాడే సబ్బులో గాఢత ఎక్కువ ఉన్న రసాయనాలు ఉండడం వల్ల అది చర్మాన్ని మరింత పాడుచేస్తుంది. అందుకే రెగ్యులర్‌ సబ్బును కాకుండా సున్నిపిండి వాడటం ఉత్తమం. అంతేకాదు, నీటి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. మరీ వేన్నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటిని మాత్రమే స్నానానికి ఉపయోగించాలి. స్నానం పూర్తైన వెంటనే అంటే తడి మీదనే బాడీలోషన్‌ను చర్మానికి రాయలి. అప్పుడే చర్మం పొలుసులుగా రాకుండా నివారించవచ్చు. చర్మంపై దురదలాగా అనిపించడం, ముడతలు పడి కోసుకున్నట్లు ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

నేటి నుండి పీడీఎస్ యూ రాష్ట్ర తొలి మహాసభలు..

హైదరాబాద్ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ) తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు పలు రాష్ట్రాల నుండి విద్యార్థి సంఘం నాయకులు పాల్గొననున్నారు. 

వరంగల్ లో మూడో రోజు కేసీఆర్ పర్యటన..

వరంగల్ : సీఎం కేసీఆర్ జిల్లాలో మూడో రోజు పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు స్వయం సహాయక బృందాలతో భేటీ కానున్నారు. 11గంటలకు నగర అభివృద్ధి పై అధికారులతో సమావేశం కానున్నారు. 

పల్నాడులో మావోయిస్టుల లేఖల కలకలం..

గుంటూరు : పల్నాడులో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టించాయి. చంద్రన్న దళం పేరిట పిడుగురాళ్లలో పలువురు వ్యాపారులకు లేఖలు అందాయి. ఆయుధాల కొనుగోలుకు ఆర్థిక సహకారాన్ని లేఖలో మావోలు కోరారు. పోలీసులు, రాజకీయ నేతల దృష్టికి తీసుకెళ్లి ఇబ్బంది పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని లేఖలో హెచ్చరించారు. 

నీతి అయోగ్ ఛైర్మన్ తో సీఎస్, డీజీపీ భేటీ..

హైదరాబాద్ : నీతి అయోగ్ ఛైర్మన్ తో సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై చర్చ జరగనుంది.

 

 

06:47 - January 6, 2016

అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మహాసభలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ మహాసభలకు దేశం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. ఐసీడీఎస్ ఎదుర్కొంటున్న సమస్యలు సవాళ్లపై ఈ సమావేశాల్లో చర్చించబోతున్నారు. ఈ మహాసభల లక్ష్యం ఏమిటి? ఏయే అంశాలను చర్చించబోతున్నారు? అంగన్ వాడీ కేంద్రాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? మన దేశంలో ఐసీడీఎస్ పోషిస్తున్న పాత్ర ఏమిటి? ఐసీడీఎస్ ను మరింత పరిపుష్టం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇందుకు అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రభుత్వానికి ఇస్తున్న సూచనలు, సలహాలేమిటి? ఈ అంశంపై టెన్ టివిలో జనపథంలో అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేత జయలక్ష్మి విశ్లేషించారు. 

06:45 - January 6, 2016

మన దేశంలో 40 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఐసీడీఎస్ ఇప్పుడు పెను సవాళ్లు ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వ పోకడలు చూస్తుంటే పసిపిల్లలకు పోషకాహారం అందించే ఈ పథకాన్ని కుదిస్తారేమోనన్న అనుమానం కలుగుతోంది. బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోతుండడం, ప్రయివేట్ సంస్థలకు అప్పగిస్తుండడమే ఇలాంటి భయాలకు కారణం. మన దేశంలో ఐసీడీఎస్ లేదా అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పడి నలభై ఏళ్లయ్యింది. గర్భిణీలకు, ఐదేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయించి, పోషకాహారం అందించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. శిశు మరణాల సంఖ్యను తగ్గించడం ఈ పథకం ముఖ్యోద్దేశం. 1975లో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభమైన ఈ పథకం ఎన్ని ప్రశంసలు అందుకున్నదో, అన్ని నిర్వహణా వైఫల్యాలను కూడా మూటగట్టుకుంది.

తూర్పారబట్టిన కాగ్ నివేదిక...
భారతదేశంలో ఐసీడీఎస్ సాధించిన ఫలితాలను అంచనా వేసేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో ఆపరేషన్ అండ్ చైల్డ్ డవలప్ మెంట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చి, యునిసెఫ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఈ పథకం వల్ల గర్భిణీలకు, పసిపిల్లలకు జరుగుతున్న మేలును ప్రశంసించాయి. మరోవైపు నిర్వహణా లోపాలను కాగ్ తూర్పాబట్టింది. కాగ్ నివేదిక ప్రకారం 61శాతం అంగన్ వాడీలకు భవనాలు లేవు. 25శాతం శిథిలావస్థలో వున్నాయి. 40 నుంచి 65 శాతం కేంద్రాలలో వంటకు, వంట సామగ్రి స్టోరేజీకి, పిల్లలను ఆడించడానికి వసతులు లేవు. 52శాతం అంగన్ వాడీ కేంద్రాలకు మరుగుదొడ్లు లేవు. 32శాతం కేంద్రాలకు తాగునీటి వసతి లేదు. 26శాతం కేంద్రాలలో బరువు తూచే యంత్రాలు లేవు. 58 శాతం కేంద్రాలలో పెద్దలకు వెయింగ్ మిషన్ లు లేవు. 33 నుంచి 49 శాతం కేంద్రాలలో మెడిసిన్ కిట్లు లేవు. ఈ లోపాలన్ని సరిదిద్దితే గర్భిణీలకూ, పసిపిల్లలకు మరింత మేలు జరుగుతుంది.

పథకాన్ని విస్తరింప చేయాలన్న సుప్రీం..
అటు సుప్రీంకోర్టు కూడా ఈ పథకాన్ని మరింత విస్తరింపచేసి, పిల్లలందరికీ వర్తించేలా సార్వజనీనం చేయాలంటూ 15 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2001లోనే సుప్రీంకోర్టు ఈ పథకాన్ని విస్తరింపచేయాలని సూచిస్తే 2005 దాకా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో సుప్రీంకోర్టు ఒకింత ఆగ్రహమూ వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో 2005 తర్వాత అంగన్ వాడీ కేంద్రాల సంఖ్యను పెంచి దాదాపు 14 లక్షల నివాసత ప్రాంతాలకు, బస్తీలకు విస్తరింపచేశారు. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం, ఇప్పుడు నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వమూ ఈ స్కీమ్ స్పూర్తికే తూట్లు పొడిచే నిర్ణయాలు తీసుకున్నాయి.

అంతంత ఆర్థిక వనరులు...
ఐసీడీఎస్ నిర్వహణను ప్రయివేట్, కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలదీ అదే తీరు. ఇప్పటికే వేదాంత, అక్షయపాత్ర, అన్నపూర్ణ ఫౌండేషన్, నాంది ఫౌండేషన్, ఇస్కాన్ లాంటి సంస్థలకు కొన్ని అంగన్ వాడీ కేంద్రాలను అప్పగించారు. ఎన్జీవో సంస్థలకు పదిశాతం, గ్రామ పంచాయితీలకు పది శాతం అంగన్ వాడీలను అప్పగించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90శాతం నిధులు కేటాయించగా, నరేంద్ర మోడీ ప్రభుత్వం వాటిల్లో కోత విధిస్తోంది. ఈ పథకం నిర్వహణ భారాన్ని రాష్ట్రాల మీద మోపేందుకు ప్రయత్నిస్తోంది. అంతంత మాత్రపు ఆర్థిక వనరులున్న రాష్ట్రాలు గుడ్లు తేలేస్తున్న పరిస్థితి. దీంతో కొన్ని కోట్ల మంది పసిపిల్లల ప్రాణాలను నిలబెట్టే ఈ పథకం భవిష్యత్తే ప్రమాదంలో పడుతోంది.

నిధుల తగ్గింపు...
ఈ పథకాన్ని సార్వజనీనం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, అందుకు విరుద్ధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బడ్జెట్ లో నిధుల కేటాయింపులు తగ్గించింది. 2014 15 బడ్జెట్ లో 18, 391 కోట్లు కేటాయించగా 2015 16 బడ్జెట్ లో కేవలం 8,754 కోట్లు మాత్రమే కేటాయించారు. పసిపిల్లలకు పోషకాహారం అందించే ఈ పథకానికి సగానికి సగం నిధులు తగ్గించిన కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు 5 లక్షల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. మన దేశంలో ఇప్పటికీ 19 కోట్ల మందికి పైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నటట్టు ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ తన నివేదికలో ఆవేదన వ్యక్తం చేసింది. ఇన్ని కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నప్పుడు ఐసీడీఎస్ లు పరిపుష్టం చేయకుండా వాటి సంఖ్యను తగ్గించుకోవాలనుకోవడం, లాభాపేక్షతో పనిచేసే కార్పొరేట్ సంస్థలకు అప్పగించుకోవాలనుకోవడం ఏరకంగానూ సమర్ధనీయం కాదు. 

06:41 - January 6, 2016

పంజాబ్ : పఠాన్‌కోట్‌లో ఆర్మీ ఆపరేషన్‌ నేటితో ముగియనుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సైన్యం ఉగ్రవాదులను ఎదుర్కోవడం సాహసోపేతమైన చర్యగా కేంద్రం కొనియాడింది. మరోవైపు ఉగ్రవాద దాడి కేసులో భారత్‌కు సహకరిస్తామని పాకిస్తాన్‌ తెలిపింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్.. మోదీకి ఫోన్ లో హామీఇచ్చారు. ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరుపై ఆయన ఓ ప్రకటన చేశారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం పాకిస్తాన్‌ సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎయిర్‌బేస్‌ 2 వేల ఎకరాల విశాల స్థలంలో ఉండడం వల్ల ఆపరేషన్‌కు చాలా సమయం పట్టింది. ఎన్‌కౌంటర్‌ జరిగింది మాత్రం 36 నుంచి 38 గంటలు మాత్రమే.. 3 వేల కుటుంబాలు నివసిస్తున్న ఎయిర్‌బేస్‌లో మరో ఐదారు దేశాలకు చెందినవారు శిక్షణ పొందుతున్నారు. ఉగ్ర దాడుల నుంచి వీరందరిని కాపాడడం కోసం భద్రతా దళాలు తీవ్రంగా శ్రమించాయని పారికర్‌ కొనియాడారు.

అమరులైన ఏడుగురు సైనికులు...
పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. కాగా ఏడుగురు సైనికులు అమరులయ్యారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ఇకపై ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లను నిర్వీర్యం చేయకుండా అక్కడే పేల్చేయాలని కేంద్రం నిర్ణయించింది. గ్రెనేడ్లు నిర్వీర్యం చేస్తూ ఇప్పటికే ఒక అధికారిని కోల్పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనోహర్ పారీకర్ వెల్లడించారు. ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో నాలుగోరోజు కూడా కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగింది. మంగళవారం మధ్యాహ్న సమయంలో భారీ పేలుళ్ల శబ్దాలు కలకలం రేపాయి. కూంబింగ్‌ ఆపరేషన్ బుధవారంతో పూర్తి కానుంది. ఉగ్రవాదదాడులపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది. ఉగ్రవాదులు పాకిస్తాన్‌ నుంచి చొరబడ్డారనడానికి కొన్ని ఆధారాలు లభించాయి. ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న సామాగ్రి పాకిస్తాన్‌కు చెందినవిగా సంకేతాలున్నాయి. మరోవైపు పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి కేసు దర్యాప్తులో సహకరిస్తామని పాకిస్తాన్‌ పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌షరీఫ్‌ ప్రధాని మోదీకి ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

06:38 - January 6, 2016

పంజాబ్ : పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి వెనక కుట్ర దాగి ఉందా ? పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో ఉగ్రవాదులు ఎలా సరిహద్దు దాటారు ? వీరికి ఎవరైనా సాయం చేసి ఉంటారా ? ఇవే అనుమానాలు ఇప్పుడు ఎన్‌ఐఏ బృందానికి తలెత్తుతున్నాయి. ఉగ్రదాడికి.. గురుదాస్‌పూర్‌ ఎస్పీ కిడ్నాప్‌నకు ఏమైనా సంబంధం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడిలో అసలైన ద్రోహి ఎస్పీ సల్వీందర్‌సింగేనా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదులు తమను కిడ్నాప్‌ చేశారని.. సల్వీందర్‌సింగ్‌, అతని మిత్రుడు రాజేష్‌, వంటమనిషి మదన్‌గోపాల్‌ చెబుతున్న మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇవే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భారీ విధ్వంసమే లక్ష్యంగా దేశంలోకి అడుగుపెట్టిన ఉగ్రవాదులు.. పోలీసు అధికారి అని తెలిసిన తర్వాత కూడా సల్వీందర్‌సింగ్‌ను వదిలిపెట్టడమేంటి ? ఎస్పీ, వంటమనిషి విప్పుకునేలా కట్టుకట్టి రోడ్డు పక్కన వదిలేయడమేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఎస్పీ స్నేహితుడు రాజేష్‌ను కొంత దూరం తీసుకువెళ్లిన తర్వాత గొంతు గోసి వదిలేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రంగంలోకి ఎన్ఐఏ....
ఇక రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ బృందం ఎస్పీ సల్వీందర్‌సింగ్‌పై దృష్టి సారించాయి. త్వరలోనే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పాక్‌ ఐఎస్‌ఐతో పాటు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులతో ఆయనకు సంబంధాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దాడుల వెనుక ఎస్పీ అత్యంత కీలక సమాచారం ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎస్పీ వ్యవహారంగా అనుమానాస్పదంగా ఉందని.. మాటలు పొంతన లేకుండా ఉన్నాయని ఎన్‌ఐఏ డీజీ శరద్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఎస్పీని ప్రత్యక్షసాక్షిగానే భావిస్తున్నామని.. పరిస్థితులను బట్టి ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్నారు.

ఎన్నో అనుమానాలు...
మరోవైపు ఎస్పీ గన్‌మెన్‌ను తీసుకెళ్లకుండా ఎందుకు వెళ్లారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా చెక్‌పోస్టులలో ఎస్పీ వాహనాన్ని ఎందుకు తనిఖీ చేయలేదో కూడా పరిశీలిస్తామని పంజాబ్‌ డీజీపీ సురేష్‌ చెప్పారు. ఇక 'నేను ఎస్పీనని, పోలీసు అధికారినని ఉగ్రవాదులకు తెలియదని సల్వీందర్‌సింగ్‌ చెబుతున్నారు. గన్‌మెన్‌ ఫోన్‌ చేసిన తర్వాతే పోలీసును కిడ్నాప్‌ చేసినట్లు ఉగ్రవాదులు గుర్తించారన్నారు. ఆ తర్వాతే 'నువ్వు మమ్మల్ని మోసం చేశావు.. ఇందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని రాజేష్‌ను ఉగ్రవాదులు హెచ్చరించారని సల్వీందర్‌సింగ్‌ చెబుతున్నారు. మరోవైపు నీతో ఉన్న ఎస్పీ, ఆయన వంటవాడు తమను మోసం చేశారని.. అందుకు నీకు బుద్ది చెబుతామని ఉగ్రవాదులు తనను హెచ్చరించారని ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ రాజేష్‌ చెబుతున్నాడు. వీరి మాటలు పొంతన లేకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఎవరో ఒకరి సహకారం ఉంటుందంటున్న అధికారులు...
ఎస్పీ స్థాయి వ్యక్తి ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారో కనిపెట్టకపోవడంపై ఎన్ఐఏ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో సల్వీందర్‌సింగ్‌ గురుదాస్‌పూర్‌లో ఉన్నప్పుడే ఉగ్రదాడులు జరగడం వీటన్నింటికీ బలం చేకూరుస్తున్నాయి. ఉగ్రవాదులు 40-50 కిలోల బుల్లెట్లు, లాంచర్లు, ఏకే-47 తుపాకులతో భారత్‌లోకి ప్రవేశించారంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి సహకారం ఉంటుందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ వాహనంలోనే నలుగురు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులంతా ఎయిర్‌బేస్‌లో దాక్కున్న తర్వాతే ఎస్పీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా సల్వీందర్‌సింగే ఉగ్రవాదులకు సహకారం అందించారనే అనుమానాలు బలపడుతున్నాయి.  

06:33 - January 6, 2016

హైదరాబాద్ : టైమ్ టేబుల్ ఖరారైంది. ఎగ్జామ్ డేట్ ఫిక్స్‌అయింది. తెలంగాణలో విద్యాక్యాలెండర్ విడుదలైంది. అర్హతా పరీక్షలకు సంబంధించిన తేదీలు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్‌ నుంచి పీసెట్‌ వరకూ అన్ని ఎంట్రెన్స్‌ టెస్టుల తేదీలు సర్కార్‌ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సెట్ల తేదీలను ప్రకటించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశం కోసం మే 2న ఎంసెట్ జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు ఇంజినీరింగ్ రాతపరీక్ష, మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అగ్రికల్చర్‌ అండ్ మెడిసిన్‌ రాతపరీక్ష నిర్వహించనున్నారు. అలాగే మే 12న ఈ సెట్ పరీక్ష జరగనుంది. ఈ రెండింటీ పరీక్షల నిర్వహణ బాధ్యత జేఎన్టీయూ హైదరాబాద్‌కు దక్కింది.

నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలపై కొరడా...
ఇక మేనేజ్‌మెంట్‌, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేసే విద్యార్థుల కోసం నిర్వహించే ఐసెట్‌ను కేయూ నిర్వహించనుంది. మే 19న ఐసెట్ పరీక్ష జరగనుంది. ఈసారి మే 27న ఎడ్‌సెట్‌, మే 29న పీజీఈసెట్‌లను ఉస్మానియా విశ్వవిద్యాలయం కండక్ట్ చేయనుంది. మే 24న లాసెట్‌ను కాకతీయ విశ్వవిద్యాలయం, మే 11న పీజీసెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించనున్నట్లు పాపిరెడ్డి తెలిపారు. అలాగే నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలపై కొరడా తప్పదని ఆయన హెచ్చరించారు. కాలేజీల్లో తనిఖీలు చేస్తామన్నారు. మరోవైపు ఓపెన్ కేటాగిరీలో పదిహేను శాతం సీట్లు ఉంటాయని పాపిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఎంసెట్, ఐసెట్ లాంటి పరీక్షలు రాసేందుకు అర్హులేనన్నారు. అయితే ఏపీలో పరీక్ష కేంద్రాలు ఉండవని, తెలంగాణకు వచ్చే పరీక్ష రాయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు తెలంగాణలోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలన్నారు. 

06:30 - January 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ మూడవసారి కూడా ప్రతిపక్షానికే పరిమితమైంది. అయితే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధికారంలోకి రావడం... కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండటంతో.... టీటీడీపీ నేతలు నామినేటెడ్ పదవులపై భారీ అశలే పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు సైతం తెలంగాణలో తమ పార్టీ బలపడేందుకు అటు కేంద్ర సహకారంతోనూ ఇటు అధికారంలోఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ నామినేటెడ్ పదవుల భర్తీలో తెలంగాణ నేతలకు అవకాశమిస్తామనీ గతంలోనే ప్రకటించారు. తెలంగాణ నేతలెవ్వరూ అధైర్యపడొద్దనీ అవకాశమున్నచోట నామినేటెడ్ పదువుల్లో చోటు కల్పిస్తామనీ భరోసా ఇచ్చారు. దీంతో పదవులపై తెలంగాణ తమ్ముళ్ళు భారీ అశలనే పెట్టుకున్నారు.

పలువురికి బాధ్యతలు..
బాబు ఇచ్చిన హామీ మేరకు.. వరంగల్ జిల్లాకు చెందిన నేత ఎల్ వీఆర్ఎస్ కే ప్రసాద్‌కు... రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్‌గా.. ఖమ్మం జిల్లాకు చెందిన రావులపాటి సీతా రామరాజును ఏపీ పొలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు కట్టబెట్టారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, సాయన్నలకు టీటీడీ బోర్డ్ మెంబర్లుగా నియమించారు. అనంతరం సాయన్న పార్టీ మారడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. అలాగే పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇచ్చేందుకు, తెలుగు యువత నాయకులు లంకల దీపక్‌రెడ్డికి జాతీయ స్ధాయిలో నామినేటెడ్ పదవి ఇవ్వాలని కేంద్రానికి సిఫార్స్ చేసారు. అయితే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకొవాల్సి ఉంది.

ఏపీలో నామినెటేడ్ పదవులు లేవు..
ఇదిలా ఉంటే... తమకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సీఎంను కలిసిన నేతలకు బాబు ఝలక్ ఇచ్చారట. ఈ మధ్య కాలంలో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రాజ్యసభలో అవకాశం కల్పించాలని బాబును కలవగా....ఇక తెలంగాణ నేతలకు ఏపీలో పదవులు ఇచ్చే అవకాశంలేదని ఖరాకండీగా చెప్పేశారట చంద్రబాబు. ఏపీలోనే చాలా మంది నేతలున్నారనీ... తెలంగాణ నాయకులకు ఏపీలో చోటు కల్పిస్తే ఆంధ్రలో వ్యతిరేఖత వస్తుదనీ బాబు భావించారట. భవిష్యత్తులో తెలంగాణ నేతలెవ్వరూ ఏపీలో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకోవద్దనీ తేల్చి చెప్పేసారు చంద్రబాబు.

నేతల నిరాశ..
కాగా కేంద్రం నుండి వచ్చే పదవులలో తెలంగాణ వారికి చోటు కల్పిస్తామనీ బాబు చెప్పారు. బాబు చెప్పనైతే చెప్పారు గానీ... సర్కార్ ప్రారంభంలోనే నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ పెట్టిన ప్రపోజల్ ఇంకా లైన్ క్లియర్ కాలేదు... ఇక ఇప్పుడు కొత్తగా మరికొన్ని పదవులంటే.... అదికాని పని అని నేతలు వాపోతున్నారు ... ఇక తమకు నామినేటెడ్ పదవులు రానట్లేననీ నిరాశ చెదుతున్నారు.

06:26 - January 6, 2016

కర్నూలు : జిల్లా తుగ్గలి మండలం రాతన గ్రామంలో నేడు జరిగే జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు, పార్టీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేశారు. రాతన గ్రామంలో పంట సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని నేతలు తెలిపారు. అనంతరం బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారని చెప్పారు. రాతన గ్రామానికి సీఎం రానుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

06:25 - January 6, 2016

వరంగల్ : వచ్చే రెండేళ్ల తర్వాత..తెలంగాణ రాష్ట్రంలో 24గంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. వరంగల్‌ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటుచేసిన 600 మెగావాట్ల కేటీపీపీ రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా వరంగల్‌ జిల్లాకు పలు వరాలు కురిపించారు. రాష్ట్రంలోనే రెండో పెద్ద పట్టణంగా విరాజిల్లుతున్న వరంగల్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్‌ మథుసుధనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు హాజరయ్యారు.

ఇరిగేషన్ కు రూ. 25వేల కోట్లు..
వచ్చే రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో 24 గంటలపాటు విద్యుత్ అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి.. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటిలో ఉంటుందని లేనిపోని మాటలు చెప్పారని విమర్శించారు. భూపాల్‌పల్లి నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. పోలీసు బెటాలియన్ మంజూరు చేయడంతో పాటు నియోజకవర్గానికి రెండువేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కేటాయిస్తున్నామన్నారు. ఇక జిల్లాలోని ములుగు, భూపాల్‌పల్లి, పరకాల చెరువుల ద్వారా రైతులు రెండు పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు. గణపురం, లక్కవరం, రామప్ప చెరువుల కింద రెండు పంటలు పండించి చూపిస్తామన్నారు. డీజీఎం-38తోపాటు కాకతీయ కెనాల్ కింద ఉండే డిస్టిబ్యూషన్ సిస్టమ్‌ను మెరుగు పరుస్తామన్నారు. కాకతీయ కెనాల్‌ను అన్ని రకాలుగా పునరుద్దరిస్తామన్నారు. కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించి గోదావరి నీటిని తరలిస్తామన్న
కేసీఆర్.. ప్రతీ సంవత్సరం 25 వేల కోట్లు ఇరిగేషన్‌కు కేటాయిస్తున్నామన్నారు.

నేడు వరంగల్ లోనే...
దుబ్బపల్లిలో బహిరంగ సభ అనంతరం సీఎం కేసీఆర్‌..వరంగల్‌లోని నందన గార్డెన్‌లో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా అభివృద్ధికి ఇప్పటికే చేపట్టిన పనుల్ని వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వచ్చేనెలలో ప్రారంభం కానున్న సమ్మక్క-సారలమ్మ జాతరకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక జిల్లాలో త్వరలోనే హెల్త్‌యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు. నిమ్స్‌ తరహాలో మరో కొత్త ఆసుపత్రిని నిర్మించడంతో పాటు..జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారుచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. బుధవారం కూడా వరంగల్‌ నగరంలోనే పర్యటించనున్న కేసీఆర్‌ జిల్లా అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటిస్తారని సమాచారం. 

06:23 - January 6, 2016

అనంతపురం : వైసీపీ అధినేత మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. రైతు భరోసా యాత్రతో జనంలోకి వెళ్లేందుకు జగన్ బృందం సమాయత్తం అవుతోంది. జనవరి 6 నుంచి 12 వరకు రైతు భరోసా యాత్ర చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను జగన్‌ పరామర్శించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా అన్నదాత ఆత్మహత్యలపై గళం విప్పిన వైసీపీ... తొలుత అనంతపురం జిల్లాలో యాత్రను ప్రారంభించింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా యాత్రకు బ్రేకులు పడ్డాయి. దీంతో అక్కడి నుంచే రైతు భరోసా యాత్ర చేపట్టాలని ఫ్యాన్ పార్టీ నిర్ణయించింది. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల మీదుగా జగన్ పర్యటన సాగనుంది.

ఫలిస్తాయా ?
అనంతపురం తర్వాత కర్నూలు మీదుగా రాయసీమ జిల్లాలను చుట్టిరావాలని వైసీపీ శ్రేణులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఒక్క సీమలోనే కాకుండా కోస్తాంధ్రలోనూ రైతు భరోసా యాత్రకు రూట్‌మ్యాప్ వేస్తున్నాయి. ఈ యాత్ర ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ కార్యకర్తల్లోనూ ఆత్మస్తైర్యం నింపాలని జగన్‌ వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం. ప్రతి నియోజక వర్గంలో పర్యటించి, అక్కడి పరిస్థితులను సమీక్షించడంతో పాటు క్యాడర్‌ బాగోగులు సైతం తెలుసుకోనున్నారు వైసీపీ అధినేత. మొత్తానికి రైతు భరోసా యాత్ర పేరుతో బాబు ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్రతిపక్షం వ్యూహరచన చేస్తోంది. మరి వైసీపీ వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి. 

నేటి నుండి వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర..

అనంతపురం : అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు, చేనేత కుటుంబాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుంచి చేపట్టనున్న నాలుగో విడత 'రైతు భరోసా యాత్ర'లో పరామర్శించనున్నారు.

నేడు మనసు చెప్పిన కథలు ఆవిష్కరణ..

హైదరాబాద్ : రసమయి ఆధ్వర్యంలో డీఆర్‌ఎల్ రాజేశ్వరి చంద్రజ రచించిన మనసు చెప్పిన కథలు ఆవిష్కరణ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతీలో జరగనుంది. 

నేడు పారిశుధ్య కార్మికుల సదస్సు...

హైదరాబాద్ : స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయడంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు పోషించిన పాత్రపై బుధవారం అధికారులు మెహిదీపట్నంలోని గుడిమల్కాపూర్ సమీపంలోని పల్లవి గార్డెన్‌లో విస్తృతస్థాయి సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతోపాటు మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి తదితరులు సదస్సుకు హాజరుకానున్నారు. 

Don't Miss