Activities calendar

07 January 2016

22:03 - January 7, 2016

ఢిల్లీ : జిఎస్‌టి బిల్లుపై కేంద్రం మళ్లీ పైరవీలు మొదలు పెట్టింది. ఈ బిల్లు ఆమోదం కోసం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. ఇందుకోసం బడ్జెట్‌ సమావేశాలను నిర్ణీత సమయం కన్నా ముందుగానే ప్రారంభించే విషయాన్ని ప్రస్తావించారు. ఆర్థిక సంస్కరణలకు ఊతంగా నిలిచే జిఎస్‌టి బిల్లును అమలులోకి తెచ్చేందుకు కేంద్రం పట్టుదలతో ఉంది. అయితే బిజెపికి రాజ్యసభలో తగినంత మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్లుకు మోక్షం లభించడం లేదు. శీతాకాల సమావేశాల్లో జిఎస్‌టి బిల్లును పాస్‌ చేసేందుకు కేంద్రం చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో బడ్జెట్‌ సమావేశాల్లోనైనా జిఎస్‌టి బిల్లును గట్టెక్కించేందుకు కేంద్రం మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. ఒకవేళ జిఎస్‌టి బిల్లును కాంగ్రెస్‌ సమర్థించాలని భావిస్తే బడ్జెట్‌ సమావేశాలను ముందుగానే ప్రారంభిద్దామని వెంకయ్య సోనియాకు సూచించినట్టు సమాచారం.
జిఎస్‌టి బిల్లు ఆమోదంపై కాంగ్రెస్‌ అభ్యంతరాలు 
కాంగ్రెస్‌ మాత్రం జిఎస్‌టి బిల్లు ఆమోదంపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. జిఎస్‌టి బిల్లులో మూడు అంశాల్లో మార్పులు చేయాలని కేంద్రానికి సూచిస్తోంది. మూడింటిలో రెండింటికైనా ఆమోదం తెలిపి కాంగ్రెస్‌ను సంతృప్తి పరచే పనిలో కేంద్రం ఉంది. తయారీరంగ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై విధించదలచిన అదనపు పన్నును తొలగించడానికి కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఫిబ్రవరిలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి ఆఖరు వారంలో జరగనున్నాయి. ఒకవేళ జిఎస్‌టి బిల్లుపై కాంగ్రెస్‌తో కేంద్రానికి అవగాహన కుదిరితే బడ్జెట్‌ సమావేశాలు ముందే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జిఎస్‌టితో పాటు మరికొన్ని కీలక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిజెపికి మెజారిటి ఉండడంతో లోక్‌సభలో బిల్లులు ఆమోదం పొందినా రాజ్యసభలో విపక్షాల ఆధిపత్యం కారణంగా పలు బిల్లులు పాస్‌ కాలేక పోతున్నాయి. జిఎస్‌టి బిల్లును ఏప్రిల్‌ నుంచి అమలులోకి తీసుకురావాల్సి నేపథ్యంలో కేంద్రం దీనిపై సీరియస్‌గా ఉంది.

22:00 - January 7, 2016

హైదరాబాద్ : ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే... కొందరు ముందే చనిపోతారు... మరికొందరు వెనక పోతారు... బెదిరింపులకు భయపడేది లేదు. భారత్‌..! మా జన్మభూమి. మా దేశాన్ని మేమే రక్షించుకుంటాం. ఉగ్రవాదంపై పోరుచేస్తామన్నారు హైదరాబాద్ ఎంపీ.  
'ఇక్కడే పుట్టాం… ఇక్కడే చస్తాం...బెదిరింపులకు భయపడం… హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మాటలివి. 
ఐసిస్‌ ఆలోచనలు సైతాన్‌లా ఉన్నాయి: ఓవైసీ 
ఐసిస్‌ ఆలోచనలు సైతాన్‌లా ఉన్నాయంటూ ఎంఐంఎం అధినేత మండిపడ్డారు. ఐస్ ఐఎస్ ఉగ్రభూతాన్ని తరిమికొట్టాలన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పాల్పడే శక్తులకు... తమ పార్టీ వ్యతిరేకమంటూ అసద్ స్పష్టం చేశారు.
శృతిమించిన ఐసిస్ ఆగడాలు 
ఇటీవల కాలంలో ఐసిస్ ఆగడాలు శృతిమించి పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. జీహాద్ పేరిట అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. నిత్యం నరమేధం సృష్టిస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది. సోషల్ మీడియా ద్వారా భారతీయుల్ని ఆకర్షించేందుకు సైతం కుట్రపన్నింది. అందులో భాగంగానే కొందరు యువకులు సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తూ పట్టుబట్టారు. ఈ విషయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద సంస్థల పట్ల ఆకర్షితులు కావొద్దంటూ యువతకు పిలుపు నిచ్చారు. 
అసద్ వ్యాఖ్యలపై ఐసిస్‌ ఘాటు స్పందన
మరోవైపు అసద్ వ్యాఖ్యలపై ఐసిస్‌ ఘాటుగానే స్పందించింది. ట్విట్టర్‌ ద్వారా ఆయనకు హెచ్చరికలు పంపింది. భారత్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ను ఏర్పాటుచేస్తామంటూ బెదిరించింది. ఈ విషయంపై ఎంఐఎం అధినేత కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. హెచ్చరికలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఐఎస్ ఐఎస్ చేపట్టే కార్యక్రమాలను దేశంలోని ఏ ఒక్క ముస్లిం కూడా సమర్ధించడం లేదన్నారు.
ముగ్గురు యువకుల అరెస్టు 
తాజాగా నాగపూర్‌ ఎయిర్‌ పోర్టు నుంచి శ్రీనగర్‌ వెళ్లి... అక్కడి నుంచి ఇరాక్‌ చేరుకునేందుకు వెళ్తున్న ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వీరిపై దేశ ద్రోహం కేసును నమోదు చేశారు. ఇదే బాటలో మరికొంత మంది ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఇలాంటి తరుణంలో ఐసిస్‌ సంస్థ నేరుగా పార్లమెంటు సభ్యుడు అసద్‌ను హెచ్చరించడం చర్చనీయంగా మారింది.  

 

21:45 - January 7, 2016

అది అగ్రరాజ్యానికి హెచ్చరికా..? లేదా మానవాలి మనుగడకు ప్రమాద ఘంటికా..? ఉత్తరకొరియా చెబుతున్న పాఠమేంటీ...? 
ప్రపంచదేశాల్లో ఆందోళన కలిగిస్తోన్న హైడ్రోజన్ బాంబు ప్రయోగం ఉద్ధేశమేంటీ..? ఇతర దేశాలను ఆయుధాలు తయారు చేయొద్దంటారు.. కానీ తమ దగ్గర మాత్రం కుప్పతెప్పలుగా మారణాయుధాలను పోగుపెట్టుకుంటాయి అగ్రరాజ్యాలు. ఈధోరణే జరుగుతున్న పరిణామాలకు కారణమా..?! ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షలు నేపథ్యంలో  జరుగుతున్న పరిణమాలపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

21:36 - January 7, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని.... కోర్టు చెప్పిన ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ కుదింపుపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో అధికారులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదనే 15 రోజుల్లో ఎన్నికలు ముగించాలని భావించినట్లు పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికలకు లక్షమంది ఉద్యోగులు అవసరమని తెలిపారు. నెల రోజులపాటు లక్షమంది ఉద్యోగులు ఎన్నికలో పాల్గొంటే.. పాలనలో అసౌకర్యం, అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే 21 రోజుల్లో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

21:23 - January 7, 2016

ఓట్ల నాటకం మొదలువెట్టిన ఏశకాల్లు...వస్తే సంగతిజెప్తమంటున్న బస్తీ జనం, చండీయాగం తర్వాత శరవేగమైన పనులు.. ఆగకుండ అభివృద్ధి చేస్తున్న చంద్రయ్యలు, సెంచల్ గూడ జైలుకు ఒన్నెతెచ్చిన నాయిని..ఈ జన్మల పాపం.. ఈ జన్మలనే పరిహారం, దొంగతనం చేసినప్పుడే దొరుకుతున్న దొంగలు.… ఏడుకొండల ఎంకన్నతో మజాక్ పని.. కొండ మీద కొలువుదీరిన కోటర్లు.. సింగం 4 సినిమాకు రెడీ అయిన ఆనం...డైరెక్టర్ల దృష్టికి నెల్లూరు పిలగాడు... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం.…
 

అంబర్ పేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్

హైదరాబాద్: అంబర్ పేటలోని బతుకమ్మకుంటలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 33 వాహనాలు, రెండు ఆటోలు, 8 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 

20:29 - January 7, 2016

గుంటూరు : పత్తి కొనుగోళ్లలో రూ. 15 కోట్లు టోపీ పెట్టిన కేసులో తమిళనాడు వ్యాపారి పాల్ రాజు, కంపెనీ డైరెక్టర్లు కోర్టుకు హాజరయ్యారు. విచారణ ముగించుకుని వెళ్తుండగా పాల్ రాజు వాహనాన్ని పత్తి వ్యాపారులు అడ్డుకున్నారు.  30 మంది వ్యాపారులు కారును అడ్డుకుని బైఠాయించారు. పాల్ రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనకు శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని వ్యాపారులు కోరారు. 

 

హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల కుదింపుపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో అధికారులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన భేటీ ముగిసింది. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. హైకోర్టు చెప్పిన ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదనే 15 రోజుల్లో ఎన్నికలు ముగించాలని భావించినట్లు పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికలకు లక్షమంది ఉద్యోగులు అవసరమని తెలిపారు. నెల రోజులపాటు లక్షమంది ఉద్యోగులు ఎన్నికలో పాల్గొంటే.. పాలనలో అసౌకర్యం, అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే 21 రోజుల్లో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

19:36 - January 7, 2016

విశాఖ : భారత తూర్పు నావికాదళ అంబుల పొదిలో మరో అస్త్రం చేరింది. శత్రు దేశాల జలాంతర్గాములకు సింహస్వప్నంగా నిలిచే అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ ఖాడ్మత్ భారత నావికాదళంలో భాగస్వామి అయింది. కోల్ కత్తా జీఆర్ ఎస్ ఈ సంస్ధ నిర్మించిన ఈ నౌకలో అత్యాధునిక సోనార్ ను అమర్చారు.  దీని సాయంతో శత్రుదేశాల సబ్ మెరైన్లను ధ్వంసం చేసే అవకాశముంది. 109 మీటర్ల పొడవు, 3వేల 500 టన్నుల బరువుతో గంటకు 25 కిమీటర్లు వేగంతో ఈ షిప్ ప్రయాణిస్తుంది. 

 

19:33 - January 7, 2016

హైదరాబాద్ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం పేదలకు పంచిన అసైన్డ్‌ భూములను టీడీపీ పెద్దలు, మంత్రుల చేతుల్లోకి వెళ్లాయని ఆ పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. పేదలను బెదరించి టీడీపీ నేతలు తక్కువ ధరలకు భూములు దక్కించుకున్నారని ఆమె మండిపడ్డారు. అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములను చట్టవిరుద్ధంగా క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  పద్మ విమర్శించారు. 

 

సంక్రాంతికి ఏపీకి ప్రత్యేక బస్సులు

హైదరాబాద్ : సంక్రాంతి రద్దీని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు ఏపీఎస్ ఆర్ టీసీ భారీ సన్నాహాలు చేసింది.
ఈ నెల 8 నుండి 14 వరకు ఈ బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ప్రత్యేక బస్సులను ఎల్బీనగర్, సీబీఎస్ హ్యంగర్ నుండి నడుపుతామన్నారు. ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్స్తామని సాంబశివరావు తెలిపారు. 

19:30 - January 7, 2016

హైదరాబాద్ : సంక్రాంతి రద్దీని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు ఏపీఎస్ ఆర్ టీసీ భారీ సన్నాహాలు చేసింది.
ఈ నెల 8 నుండి 14 వరకు ఈ బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ప్రత్యేక బస్సులను ఎల్బీనగర్, సీబీఎస్ హ్యంగర్ నుండి నడుపుతామన్నారు. ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తామని సాంబశివరావు తెలిపారు. 
 

19:02 - January 7, 2016

హైదరాబాద్ : అమెరికాలో చదవాలనుకునే విద్యార్ధులు భావవ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని యూఎస్‌ఏ ఎడ్యేకేషన్‌ కోర్డనేటర్‌ రేణుకా రాజారావు అన్నారు. రేణుకా రాజారావుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను వివరించారు. విద్యార్హత, వీసా, బ్యాంకు లోను, కుటుంబ ఆర్ధిక పరిస్థితులు, ఆస్తిపాస్తులకు సంబంధించిన సరైన అన్ని పత్రాలు ఉంటే ఏ ఇబ్బందులు ఉండవంటున్నారు. చదువు కోసం అమెరికావెళ్లి ... యూనివర్సీటీ అనుమతి లేకుండా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయాలనుకుంటే సమస్యలు తప్పవన్నారు. అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీలను ఎంచుకోవాలని సూచించారు. చదువుకు సంబంధించి అన్ని పత్రాలు సక్రమంగా ఉండాలన్నారు. యూనివర్సిటీల అనుమతి లేకుండా చదువుతూ.. ఉద్యోగం చేయరాదని చెప్పారు. 

18:51 - January 7, 2016

కరీంనగర్ : పోలీసుల వేధింపులతో మనస్తాపం చెందిన నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లాలోని చిగురుమామిడి మండలం నవాబుపేటలో చోటుచేసుకుంది. నవాబ్ పేటకు చెందిన రజినీ గత నెల 26 న మెదక్ జిల్లాలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అప్పటి నుంచి కనపడకుండా పోయింది. దీనికి సంబంధించి మెదక్ జిల్లా రామాయంపేట పీఎస్ లో రజినీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శంకర్ అనే యువకుడితో రజినీ వెళ్లిపోయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. శంకర్ స్నేహితులైన సాగర్, రఘు, శ్రీధర్, సురేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని యువతి అదృశ్యం కేసుకు సంబంధించి విచారించారు. అయితే విచారిస్తున్న సందర్భంగా పోలీసులు తమను వేధిస్తున్నారంటూ తీవ్రమనస్తాపంతో ఈ నలుగురు యువకులు ఇవాళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో రఘు, శ్రీధర్ అనే యువకుల పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈఘటనపై విచారణ చేపట్టారు. నిత్యం పీఎస్ కు రమ్మని పోలీసులు వేధిస్తున్నారని యువకుల తల్లిదండ్రులు వాపోయారు. తమ పిల్లల ఆత్మహత్యాయత్నానికి పోలీసుల వేధింపులే కారణమని వారు ఆరోపిస్తున్నారు. 

 

18:15 - January 7, 2016

హైదరాబాద్ : టీఆర్ ఎస్ పై టీటీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు త్రీవస్థాయిలో ధ్వజమెత్తారు. గులాబీ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ ఎస్ టెంపరర్ పార్టీ అని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. ఈమేరకు ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. టీఆర్ ఎస్... సెంటిమెంట్ ఆధారంగా వచ్చిన పార్టీయని... మధ్యలోనే పోతుందన్నారు. టీసర్కార్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. 

 

18:07 - January 7, 2016

ఆధునిక మహిళలు ఇంటిపనితో పాటు, అనేక బాధ్యతలు తమ భుజానికెత్తుకుంటున్నారు. అదే సమయంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలనూ ఎదుర్కుంటున్నారు. సాధారణ సమస్యగా కనిపించే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు, పరిష్కార మార్గాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి హెల్త్ కేర్. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.…

18:05 - January 7, 2016

నేషనల్ మీడియా హల్ చల్  చేస్తుంటే, లోకల్ మీడియాలో పదుల కొద్దీ పత్రికలు, ఛానళ్లు పుట్టుకొస్తుంటే, గ్రామీణ మహిళల బాధలు, గాథలు ఎవరు వింటారు? వారి గొంతుకను ఎవరు వినిపిస్తారు? అన్న ప్రశ్నకు ఖబర్ లహరియా మేమంటూ సమాధానం చెప్తోంది. అనేక విషయాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ, ముందుకెళ్తోంది. 

సెన్సేషన్ తప్ప, సెన్సివిటీ లేకుండా పోతున్న మీడియా ప్రపంచంలో, మహిళలే పత్రిక నడపడం సాహసమే అవుతుంది. అన్ని రకాల అవరోధాలను అధిగమిస్తూ, సుధీర్ఘకాలంగా  పత్రిక నిర్వహించడం కత్తిమీద సామే అవుతుంది. 

అక్షరం, ఆత్మవిశ్వాసం, కలిసి పనిచేసే మనస్థత్వం, సమస్యలకు ఎదురీదే సాహసం, ఇవన్నీ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రంలోని మారుమూల పల్లె మహిళలను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. పురుషులతో సమానంగా ఎలా శ్రమించగలరో, అవరోధాలను ఎలా జయించగలరో,  విజయాలను ఎంత ఆత్మవిశ్వాసంతో సొంతం చేసుకోగలరో నిరూపిస్తున్నారు. అందుకే, జయహో ఖబర్ లహరియా అంటూ మానవి వారికి అభినందనలు తెలియచేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ మహిళలెందరికో స్ఫూర్తిగా నిలవాలని, ఇలాంటి పత్రికల వాణి ఎప్పటికీ రెపరెపలాడాలని ఆకాంక్షిస్తోంది. 

17:46 - January 7, 2016

ముంబై : స్టాక్ మార్కెట్ మరోసారి భారీగా పతనమైంది. చైనా దెబ్బకు... సెన్సెక్‌ 554 పాయింట్లు నష్టపోయి 25వేల కంటే దిగువకు పడిపోయింది. సోమవారం 538 పాయింట్లు నష్టపోయిన ఈ సూచి... ఇవాళ 554 పాయింట్ల నష్టంతో 24వేల 852 పాయింట్ల వద్ద నిలిచింది. చైనా గణాంకాలు బలహీనంగా ఉన్నాయన్న సమాచారంతో.. ఆ దేశంలోని షాంగ్ ఎక్సేంజ్‌ లో ట్రేడింగ్ నిలిపివేశారు. ఆ ఎఫెక్ట్‌ తో దేశీయంగా ఉదయం నుంచే సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ఉదయం 400 పాయింట్ల నష్టంతో మొదలైన ట్రేడింగ్.. చివరకు 554 పాయింట్లు కోల్పోయింది. అటు నిఫ్టి 173 పాయింట్లు కోల్పోయి 7వేల 568వద్ద క్లోజైంది. బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌ కేర్ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. నిఫ్టీలో వేదాంతా అత్యధికంగా 9శాతం నష్టపోయింది. వేదాంతా, కెయిర్న్ ఇండియా, భెల్, టాటా స్టీల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా మోటార్స్ 6శాతానికి పైగా క్షీణించాయి. ఈ సూచీలో ఎయిర్‌ టెల్ మాత్రమే స్వల్ప లాభంతో ముగిసింది. 

 

గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై టీడీపీ హర్షం

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీటీడీపీ హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పు టీసర్కార్ కు చెంపపెట్టులాంటిదని హైదరాబాద్ నగర ఆ పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ అన్నారు. 

 

17:40 - January 7, 2016

నెల్లూరు : జనవరి 17న తన అనుచర గణం టీడీపీలో చేరనుందని మాజీ ఎమ్మెల్యే వివేకానందారెడ్డి అన్నారు. తన ఆత్మీయులు, అనుచరులందరూ... టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన తెలిపారు. కార్యకర్తలను తరలించేందుకు... బస్సులు, స్పెషల్ ట్రయిన్‌ను ఏర్పాటు చేసినట్లు ఆనం చెప్పారు. 

17:36 - January 7, 2016

గుంటూరు : రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేంద్రం సాయం చేయడంలేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వడంలేదని విమర్శించారు. ఏపీ రాజధాని గుంటూరులోనే రైల్వే జోన్‌ ఉండాలని రైల్వే జీఎంను కోరినట్లు రాయపాటి తెలిపారు. 

17:32 - January 7, 2016

గుంటూరు : ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన చంద్రన్న కానుక పథకం గందరగోళంగా మారింది. చంద్రన్న కానుక.. చంద్రన్న కల్తీ కానుకగా మారింది. ఓవైపు సరుకురాక... వచ్చినా అవి నాసిరకంగా ఉండడంతో... జనాలకు ఇబ్బందులు తప్పడంలేదు.... మిషన్ల ద్వారా సంక్రాంతి కానుక అప్లికేషన్‌ సాయంతో ఈ సామాను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గుంటూరు జిల్లా గురజాలలో ఈ సరుకుల్ని తీసుకునేందుకువచ్చిన లబ్ధిదారులకు చుక్కలు కనపడుతున్నాయి. మిషన్‌లోని ఆప్షన్లో వివరాలన్నీ ఇచ్చాక సర్వర్‌నుంచి ఖాళీ రెస్పాన్స్ వస్తోంది. రెండురోజులనుంచి ఇలాగే రావడంతో సామాన్లు కావాలంటూ డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు జనాలు. డీలర్లు మాత్రం ఈ మిషిన్లకు సంబంధించి తమకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదంటున్నారు. మరోవైపు ఈ సంక్రాంతి సరుకుల్లో నాణ్యత నాసిరకంగా ఉందంటూ విమర్శలొస్తున్నాయి. గోదుమపిండి ప్యాకెట్‌లో రంపపు పొడి, తవుడు కలుస్తున్నాయి. నల్ల రంగుతో ముక్కిపోయిన బెల్లం దర్శనమిస్తోంది. అదికూడా 30గ్రాములు తక్కువ తూకంతో సరఫరా చేస్తున్నారు అని లబ్ధిదారులు వాపోయారు. 

 

టీసర్కార్ కు హైకోర్టు షాక్

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికలపై తెలంగాణ సర్కార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల గడువు కుదింపుపై వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 15 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలన్న జీవోను నిలుపుదల చేసింది. ఫిబ్రవరి 9 లోగా ఎన్నికలను పూర్తి చేయాలని కోర్టు సూచించింది. అయితే ఎన్నికలకు 31 రోజుల గడువు కావాలని ఎన్నికల కమిషనర్ కోర్టును కోరారు. ఫిబ్రవరి 9 లేదా 10 తేదీల్లోగా ఎన్నికలను పూర్తి చేస్తామని ఈసీ తెలిపింది. అయితే 33 చట్టం ప్రకారం పాత పద్ధతిలోనే జీహెచ్ ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. శాసనాలు చేసే అధికారం చట్ట సభలకే ఉందని.. అధికార గనానికి లేదని స్పష్టం చేసింది.

17:12 - January 7, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికలపై తెలంగాణ సర్కార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల గడువు కుదింపుపై వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 15 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలన్న జీవోను నిలుపుదల చేసింది. ఫిబ్రవరి 9 లోగా ఎన్నికలను పూర్తి చేయాలని కోర్టు సూచించింది. అయితే ఎన్నికలకు 31 రోజుల గడువు కావాలని ఎన్నికల కమిషనర్ కోర్టును కోరారు. అందుకు కోర్టు అంగీకరించలేదు. దాంతో ఫిబ్రవరి 9 లేదా 10 తేదీల్లోగా ఎన్నికలను పూర్తి చేస్తామని ఈసీ తెలిపింది. 33 చట్టం ప్రకారం పాత పద్ధతిలోనే జీహెచ్ ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు సూచించింది. శాసనాలు చేసే అధికారం చట్ట సభలకే ఉందని.. అధికార గనానికి లేదని స్పష్టం చేసింది. శనివారంలోగా రిజర్వేషన్లు ప్రకటిస్తామని ఏజీ తెలిపింది. 
గ్రేటర్ ఎన్నికల కుదింపుపై పిటీషన్ కొట్టివేత 
జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారం కుదింపు విషయంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ప్రతిపక్షాలకు గడువు లేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించిన టిఆర్‌ఎస్‌కు హైకోర్టు ఆదేశం షాక్‌ ఇచ్చింది. ఎన్నికల విషయంలో జారీ చేసిన జీవోను కొట్టివేయడమే కాకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారం అధికారులకు ఎక్కడిదని తప్పుపట్టింది. ఫిబ్రవరి 9, 10వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి గడువు ఇస్తూ హైకోర్టు నిర్ణయం వెలువడింది. 
అధికార పార్టీకి హైకోర్టు షాక్ 
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం గడువు కుదింపుపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. అయితే అధికార పార్టీకి ఊహించని షాకిచ్చింది న్యాయస్థానం. కేవలం వారం రోజులకు తగ్గిస్తూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది.   చట్టాన్ని సవరించే అధికారం శాసనసభకు తప్ప అధికారులు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాంగ్రెస్‌  నేత మర్రి శశిధర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు....ప్రభుత్వ తీరును ఘాటుగా విమర్శించింది. జనవరి 31వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మార్పు చేస్తూ ఫిబ్రవరి వరకు గడువు పెంచింది. ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీలోగా ఎన్నికల ప్ర్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.  దీనితో ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలకు మరింత అదనంగా సమయం లభించింది.
హైకోర్టు ఆదేశాలపై ప్రతిపక్షాల హర్షం 
రిజర్వేషన్ల ప్రక్రియను శనివారంలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనితో శనివారం ప్రకటిస్తే ఆదివారం గాని, సోమవారం కాని ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుంది. గతంలో మాదిరిగానే 31 రోజుల గడువులోగా ఎన్నికల ప్రక్రియ ముగియడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసింది. ఏ క్షణంలో ఎన్నికల నోటిఫికేసన్‌ వెలువడినా వెంటనే ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు సిద్దంగా ఉంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రచారానికి గడువు పెంచుతూ హైకోర్టు ఆదేశించడంతో ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల ప్రచారం గడువు తగ్గించడం ద్వారా ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టిన ప్రభుత్వానికి హైకోర్టు నిర్ణయం షాక్‌ ఇచ్చింది. ప్రచారానికి మరింత సమయం లభించడంతో క్యాంపెన్ స్ట్రాటజీలకు పార్టీలు పదుపు పెడుతున్నాయి.

 

16:44 - January 7, 2016

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలో 'జన్మభూమి మా ఊరు' కార్యక్రమం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఎంజీఎం గ్రౌండ్‌ సభలో అధికారులు, నేతలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజా సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు. లబ్ధిదారులకు రేషన్‌ కార్డులు అందజేశారు.

 

16:40 - January 7, 2016

అనంతపురం : నగరంలోని ఆర్ట్స్‌ కాలేజీ హాస్టల్‌లో సౌకర్యాలు మెరుగు పర్చాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా  ప్రయోజనం లేకపోవడంతో ... ఆగ్రహించిన విద్యార్ధులు ఇవాళ భోజనాన్ని బహిష్కరించి హాస్టల్‌ నుంచి క్లాక్‌టవర్‌ వరకు  నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమాచారం అందుకున్న జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మికాంతం హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఇక్కడ పరిస్థితులను చూసి.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

 

16:37 - January 7, 2016

హైదరాబాద్‌ : నగర అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు శంకుస్థాపనలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌ ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే కేటీఆర్‌ ఎక్కడ ఉండేవాడని ఎద్దేవా చేశారు.

 

16:34 - January 7, 2016

హైదరాబాద్ : తెలంగాణకు వెంటనే కరువు సాయం అందించాలని టీ కాంగ్రెస్‌ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో పలు మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ టీ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిశారు. కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను ఆదుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. 

 

నలుగురు యువకుల ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌ : జిల్లాలోని చిగురుమామిడి మండలం నవాబ్‌పేటలో నలుగురు యువకులు ఆత్మహత్యాయానికి పాల్పడ్డారు. ఓ యువతి అదృశ్యంకేసులో పోలీసులు వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగారు.. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు..

 

15:46 - January 7, 2016

మెదక్ : జిల్లాలోని ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అటవీ కళాశాల భవనాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 1300 ఎకరాలలో హార్టికల్చర్ వర్సిటీ ప్రారంభించినందుకు గజ్వేల్ ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. మరోసారి రాధామోహన్ సింగ్ తో సమావేశమై వర్సిటీ అభివృద్ధిపై సమీక్షిస్తామని చెప్పారు. ఒంటిమామిడి మార్కెట్ యార్డులో రూ.20 కోట్లతో కోల్డ్ స్టోరేజీలను మంజూరు చేశామని తెలిపారు. దేశంలో అతి తక్కువ ఫారెస్టు కాలేజీలున్నాయన్నారు. తెలంగాణను విత్తన కేంద్రంగా మారుస్తామని చెప్పారు. ఎప్రిల్ 30న ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈకార్యక్రమంలో కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్, దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 

 

15:12 - January 7, 2016

చిత్తూరు : తిరుపతిలో సీవరేజ్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో సీఎం   పాల్గొని, మాట్లాడారు. 'జన్మభూమి'లో రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంటు వస్తుందన్నారు. తిరుపతిని బ్రహ్మండమైన నరగంగా తయారు చేస్తామని పేర్కొన్నారు. పేదలకు అండగా ఉండాలని పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. మెడికల్ హెల్త్ హబ్ గా తిరుపతి ప్రాంతాన్ని తయారు చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్ లో తిరుపతి పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో ప్రజలు క్రమశిక్షణ, భక్తి భావంతో ఉండాలని... రౌడీయిజానికి తావుండకూడదని కోరారు. ప్రజలకు ఉపాధి కల్పన కోసం కృషి చేస్తున్నామన్నారు. 

 

కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ వర్సిటీకి శంకుస్థాపన

 మెదక్ : ములుగులో కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అటవీ కళాశాల భవనాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఎప్రిల్ 30న ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. ఈకార్యక్రమంలో కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్, దత్తాత్రేయ పాల్గొన్నారు.

 

తిరుపతిలో సీవరేజ్ ప్లాంటు ఏర్పాటు : చంద్రబాబు

చిత్తూరు : తిరుపతిలో నిర్వహించిన 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తిరుపతిలో సీవరేజ్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంటు వస్తుందన్నారు. తిరుపతిని 
బ్రహ్మండమైన నరగంగా తయారు చేస్తామని పేర్కొన్నారు.

టిడిపివి దొంగ రాజకీయాలు - ఎంపీ అవినాష్..

విజయవాడ : టిడిపివి దొంగ రాజకీయాలని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఏ ఏడాది నిధులు కేంద్రం ఆ ఏడాదే కేటాయించాలని, గతేడాదికి సంబంధించి రూ.18వేల కోట్లు కేంద్రం నుండి రావాల్సి ఉందన్నారు. ఇలాగే కొనసాగితే ప్రాజెక్టుల పూర్తికి 15ఏళ్లు పడుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. 

రైల్వే జీఎంతో ముగిసిన ఏపీ ఎంపీల భేటీ..

హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఏపీ ఎంపీలు జరిపిన భేటీ ముగిసింది. జూన్ కల్లా హామీలు నెరవేరుస్తామని జీఎం హామీనిచ్చినట్లు ఎంపీలు పేర్కొన్నారు. ఆర్ వోబీ, ఆర్ యూబీ త్వరలో పూర్తి చేస్తామని తెలిపినట్లు తెలిపారు. 

ములుగుకు కేసీఆర్..

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా ములుగుకు బయలుదేరారు. సీఎం వెంట కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఉన్నారు. 

ఇసుక అక్రమ రవాణా..గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం..

ఢిల్లీ : వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. జేసీబీ, క్రేన్లతో ఇసుక తవ్వకాలు ఎలా జరుపుతారని ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలను ట్రిబ్యునల్‌ ప్రశ్నించింది.

13:30 - January 7, 2016

ఢిల్లీ : వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. జేసీబీ, క్రేన్లతో ఇసుక తవ్వకాలు ఎలా జరుపుతారని ఏపీ, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలను ట్రిబ్యునల్‌ ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులు లేని తవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించింది. పిటిషన్‌పై స్పందించని మహారాష్ట్ర ప్రభుత్వంపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర రెసిడెన్స్‌ కమిషనర్‌కు అరెస్ట్‌కు గ్రీన్‌ట్రిబ్యునల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది. 

13:28 - January 7, 2016

విజయవాడ : రైల్వే జీఎంతో ఏపీ టీడీపీ ఎంపీల సమావేశం రసాబసగా మారింది. రైల్వే జీఎం దొంగ లెక్కలు చెబుతున్నారని టీడీపీ ఎంపీ లు ఆరోపించారు. సంవత్సరానికి 20 వేల కోట్లు ఆదాయం వస్తున్నా 200 కోట్లు ఖర్చు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రైల్వే శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని, రాష్ట్రానికి న్యాయంగా రావలసినవి వసూలు చేసుకుంటామన్నారు టీడీపీ ఎంపీలు. 

13:27 - January 7, 2016

హైదరాబాద్ : తమ హక్కుల సాధనకు అంగన్‌వాడీలు ఎంతవరకైనా పోరాడాలని సిఐటియు జాతీయ నాయకులు తపన్‌ సేన్ పిలుపునిచ్చారు. వారు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంగన్‌వాడీల జాతీయ మహాసభలో ఆయన ప్రసంగించారు. 
దేశవ్యాప్తంగా మహిళలకు, పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీలు జాతీయ మహాసభ జరుపుకుంటున్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఎనిమిదవ మహాసభలు ప్రారంభమయ్యాయి. సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు తపన్ సేన్ ప్రారంభించారు. సేవకులుగా ఉన్న తమను ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని.. ప్రతిక్షణం తమ డిమాండ్లపై పోరు చేయక తప్పటం లేదని వారంటున్నారు. ఈ జాతీయ మహాసభల్లో కేవలం తమ భవిష్యత్‌ గురించే కాకుండా.. ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ నిర్వీర్యం చేసే దిశగా సాగుతున్న ప్రభుత్వ యత్నాలను అడ్డుకునే అజెండాపైనా చర్చించనున్నారు.

13:25 - January 7, 2016

చిత్తూరు : తిరుపతిలో సీపీఎం నేతలు, కార్యకర్తలపై పోలీసులు విరుచుకుపడ్డారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రికి స్థానిక సమస్యలను తెలపడానికి వెళుతున్న సీపీఎం కార్యకర్తలు, నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కార్యకర్తలు రోడ్డుపైనే భైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎంను కలిసి తమ సమస్యలు విన్నవిస్తామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఆందోళన చేస్తున్న నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన నేతలను ఈడ్చుకెళ్లి వ్యాన్ లలో పడేశారు. ఈ సందర్భంగా నేతలు టెన్ టివితో మాట్లాడారు.
పోలీసులకు కూడా వేతనాలు ఇవ్వడం లేదని, డ్వాక్రా సంఘాలకు, రైతులకు రుణాలు మాఫీ చేయలేదని పేర్కొన్నారు. దీనిని ప్రశ్నించడానికి వెళితే తమను అడ్డుకోవడం కరెక్టు కాదన్నారు. కండలేరు ప్రాజెక్టును రద్దు చేసి బాబుకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలే కానీ ఇలా వ్యవహరించకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు పోలీసులు వింటే వారిపై గౌరవం పొతుందన్నారు. 

13:16 - January 7, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో.... మరీ ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటితే, అందులో కోడిపందాలదే అగ్రభాగం. అయితే పోలీసులకు ఇవి పెద్దతలనొప్పిగా మారాయి. చట్టం ఈ పందేలను నిషేధించింది. ఆ ప్రకారం కఠినంగా వ్యవహరిద్దామంటే, ప్రజాప్రతినిధులే పోటీలను ప్రోత్సహిస్తున్నారు. స్వయంగా పాల్గొంటున్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. చట్టంలో ఏముందో ప్రభుత్వం అమలు చేస్తుంది కదా అని పేర్కొంది. ఈసారి నిర్వహించడానికి అనుమతి లేదని కోర్టు స్పష్టం చేసింది. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది. కోళ్ల పందాలు సంప్రదాయ క్రీడ అని ఈ పందాలు కొనసాగించాలని బీజేపీ పార్టీకి చెందిన నేత రఘురామకృష్ణ ప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు.

అరికట్టలేని ఖాకీలు...
ప్రజలు..ప్రజాప్రతినిధులు కోడి పందాలను సంప్రదాయంగా చెబుతారు. చట్టం మాత్రం నేరంగానూ హింసాత్మక పోటీగానూ పరిగణిస్తోంది. సంక్రాంతి కోడిపందాలను ఎంత అరికట్టాలన్నా పోలీసుల వల్ల కావడంలేదు. సంక్రాంతి సమయంలో ఉభయగోదావరి జిల్లాలు ఇతర ప్రాంతాలన్నీ కోలాహాలంగా మారుతుంటాయి. మూడు రోజుల్లో ఉభయగోదావరి జిల్లాల్లో వందల కోట్లకు పైగా చేతులు మారతాయంటే అర్ధం చేసుకోవచ్చు. ఇటు కోనసీమలో.. అటు భీమవరంలో ఇప్పటికే సరంజామా సిద్ధమవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో అల్లవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు. నిరుటి నుంచి పెద్దాపురం, పిఠాపురం, గోకవరం, కోరుకొండ కాకినాడ రూరల్ లో సైతం పోటీలు ఎక్కువయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, అయిభీమవరం, వెంప, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డి గూడెం, కొయ్యలగూడెం వంటి ప్రాంతాల్లో కోడి పందాల కోసం ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కోళ్ల పందాలు ఆగుతాయా ? లేదా ? అనేది చూడాలి. 

జమ్మూలో ఏడు రోజుల సంతాప దినాలు..

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ఢిల్లీలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మరణంతో కాశ్మీర్ యూనివర్సిటీలోని అన్ని పరీక్షలను వాయిదా వేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ కూడా గురువారం నిర్వహించాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. 

జనవరి 26న 300 మంది ఖైదీల విడుదల -

హైదరాబాద్: సత్ప్రవర్తన కలిగిన 300 మంది ఖైదీలను జనవరి 26న విడుదల చేయాలని భావిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. చంచల్‌గూడ జైలులో వార్షిక సదస్సుకు హోంమంత్రి హాజరయ్యారు.

 

రైల్వే జీఎంతో సమావేశాన్ని బహిష్కరించిన ఏపీ ఎంపీలు..

విజయవాడ : దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తాతో సమావేశాన్ని ఏపీ ఎంపీలు బహిష్కరించారు. విజవయవాడలోని రైల్వే కల్యాణమండపంలో ఈ సమావేశం జరగనుంది. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించనప్పుడు సమావేశాలు ఎందుకని ఎంపీలు ప్రశ్నించారు. 

కోడి పందాలకే బ్రేక్..

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రంలో కోడిపందాల నిర్వహణకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. 

12:50 - January 7, 2016

చిత్తూరు : ఏదో ఒక భారీ నష్టం జరగాలి. పెద్ద ఎత్తున విమర్శలు రావాలి. అప్పటిదాకా తమ ఆటిట్యూడ్ మారనే మారదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు టిటిడి పాలకులు. ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయమొచ్చే ఆ సంస్థ భక్తుల ప్రాణాలను గాలికే వదిలేసిందో లేక తిరుమల శ్రీనివాసుడు చూసుకుంటాడనుకుందో ఘాట్‌ రోడ్డు సమస్యపై చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. తక్షణమే స్పందించండి అని నిపుణులు హెచ్చరించినా కాలయాపన చేస్తూనే ఉన్నారు. వేల కోట్ల రూపాయల ఆదాయం.. నిత్యకళ్యాణం పచ్చతోరణంలాంటి వాతావరణం ఇలాంటివెన్నో టిటిడికి ఆయువుపట్టులాంటి భక్తుల ద్వారానే సాధ్యమవుతున్నాయి. అయితే అదే భక్తుల ప్రాణాలు ఇప్పుడు ఘాట్‌ రోడ్డులో గాలిలో దీపాల్లా మారుతున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో గత నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో వెంటనే అధికారులు నానా హడావుడి చేసి ఢిల్లీ, చెన్నైల నుంచి ఐఐటీ నిపుణులను ఆహ్వానించారు. కొండలు విరిగిపడుతున్న కారణాలపై అన్వేషణ జరిపించారు. దీంతో నిపుణులు కూలేందుకు సిద్ధంగా ఉన్న 30కి పైగా ప్రాంతాల్లోని కొండరాళ్లను దశలవారీగా తొలగించాలని నివేదిక సమర్పించారు. రాక్ బౌల్టర్ ట్రాప్, బ్రెస్ట్ వాల్ రివిట్‌ మెంట్లు నిర్మించాలని సూచించారు. లేకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు.

నిపుణుల మేరకు సూచనలు...
నిపుణుల సూచన మేరకు పనులు కూడా మొదలుపెట్టారు. అయితే వారి చర్యలు మాత్రం ఆరంభ శూరత్వంగానే మిగిలాయి. పనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించటం లేదు. ప్రమాదకరంగా మారిన బండలను పేలుళ్లు జరిపి తొలగించాలని అందుకు కనీసం రెండువారాలైనా ఘాట్ రోడ్డును మూసివేయాలని నిపుణులు సూచించారు. ఏడో కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు భారీగా కొండచరియలు విరిగిపడడంతో ఆ ప్రాంతం మరింత ప్రమాదకరమైందని గుర్తించారు. నిజానికి నవంబరు నెలలో కురిసిన వర్షాలు టిటిడి ఇంజనీర్లను ముప్పతిప్పలు పెట్టాయి. ఇలాంటి పరిస్థితులు మరోసారి రిపీట్‌ అవ్వకూడదని టిటిడి ఈవో అధికారులను ఆదేశించారు. అయితే పనుల నిర్వహణ విషయంలో ఇంజినీరింగ్ అధికారులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు.

వర్షాకాలంలో పూర్తవుతాయా ?
ప్రస్తుతం 15వ కిలోమీటరు వద్ద మాత్రమే భూమి ఇంజినీరింగ్ సంస్థతో పనులు చేయిస్తున్నారు. 2004లో భాష్యకార్ల సన్నిధి వద్ద కొండ చరియలు విరిగిపడిన సందర్భంలోనే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. కానీ ఆ పనులు చేపట్టలేదు. రానున్న 40 నుండి 50 రోజులు తిరుమలలో రద్దీ తక్కువగా ఉంటుందని ఆరోజుల్లో పనులు చేపట్టాలని టిటిడి ఈవో సాంబశివరావు ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మరి రాబోయే వర్షాకాలంలోపైనా పనులు పూర్తవుతాయో లేదో చూడాలి.

12:47 - January 7, 2016

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం నిమిత్తం రాష్ట్రంలోని ప్రతి విద్యార్థినుండి 10 రూపాయలు వసూలు చేయాలన్న దానిపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. బలవంతపు వసూళ్లు సరికాదని స్వచ్చందంగా విరాళాలు ఇస్తే మాత్రమే తీసుకోవాలని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. రాజధాని నిర్మాణం నిమిత్తం మై క్యాపిటల్ మై అమరావతి మై బ్రిక్ ద్వారా పది రూపాయలు వసూలు చేయాలని ఏపీ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలిచ్చింది. ఈనెల 4న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. దీనిపై పలు మార్లు విచారణ జరిపిన హైకోర్టు ఒత్తిడి చేసినట్లు తమ దృష్టికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8 కి వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు రియాక్షన్ చూసిన బాబు వెంటనే విద్యాశాఖ నుండి బలవంతపు వసూళ్లు చేయకూడదని ఆదేశాలు ఇప్పించేశారు. విద్యార్థులు స్వచ్చందంగా ఇస్తేనే తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.  

12:44 - January 7, 2016

కోల్ కతా : పశ్చిమబెంగాల్‌ మాల్దా సమీపంలోని కాలియాచక్‌లో ఆదివారం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై కేంద్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ఈ ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాలియాచక్‌ ఘటన క్రమంగా రాజకీయ రంగును పులుముకుంటోంది. హింసకు పాల్పడిన వారిని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం రక్షిస్తోందని బీజేపీ మండిపడుతోంది. కాలియాచక్‌ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు.

హింసాత్మకంగా మారిన ప్రదర్శన..
కాలియాచక్‌లో గత ఆదివారం మహమ్మద్‌ ప్రవక్తపై అఖిల భారత హిందూ మహాసభ నేత కమలేష్‌ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి నిరసనగా ఆ వర్గీయులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శన హింసాత్మకంగా మారింది. జాతీయ రహదారిపై ఓ బస్సును ఆందోళన కారులు ధ్వంసం చేశారు. ఆ తరువాత కొంతమంది అల్లరి మూకలు బీఎస్‌ఎఫ్‌ జీప్‌పై దాడి చేశారు. పోలీసులను కొట్టి జీపును తగులబెట్టారు. కలియాచక్‌ పోలీసుస్టేషన్‌కు అతి సమీపంలోనే ఘటన జరిగింది. దీంతో కలియాచక్‌ ప్రాంతంలో 144 సెక్షన్‌ను విధించారు. ఈ ఏడాది పశ్చిమబెంగాల్‌ ఎన్నికలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో కలియాచక్‌ అంశాన్ని తృణమూల్‌, బీజేపీలు రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. హింసకు పాల్పడిన వారిని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వమే కాపాడుతోందని బీజేపీ మండిపడుతోంది. ఆందోళనకారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తోంది. 

12:41 - January 7, 2016

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌ సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మృతదేహానికి రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరులు ముఫ్తీకి నివాళులర్పించారు. ఆయన కుమార్తె ముఫ్తీ మెహబూబాను పరామర్శించారు. కాసేపట్లో ఢిల్లీ విమానాశ్రయం నుంచి శ్రీనగర్‌కు ప్రత్యేక విమానంలో ముఫ్తీ మృతదేహాన్ని తరలించనున్నారు. అనారోగ్యంతో డిసెంబర్ 24వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. 1936 జనవరి 12వ తేదీన ముఫ్తీ జన్మించారు. 1989లో కేంద్ర హోం మంత్రిగా ముఫ్తీ పనిచేశారు.
79 సంవత్సరాల గల ముఫ్తీ మహ్మద్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 87 స్థానాలు గల జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం పీడీపీ, బీజేపీ మధ్య పొత్తులు కుదిరాయి. 2015 మార్చి 1వ తేదీన సీఎంగా ముఫ్తీ బాధ్యతలు స్వీకరించారు. 

12:39 - January 7, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కొలువుల జాతర మొదలవుతుంటే.. అదే స్థాయిలో పుట్టగొడుగుల్లా కోచింగ్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా సరైన ఫ్యాకల్టీ లేకుండానే కోచింగ్‌ సెంటర్లను నడిపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో అనుమతులు లేకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక కథనం..మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్ని కోచింగ్ సెంటర్లు నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణలో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేపధ్యంలో జిల్లాలో కోకొళ్లలుగా కోచింగ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. నిరుద్యోగులు ఉద్యోగం వస్తుందన్న ఆశతో కోచింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు సౌకర్యాలు లేని, క్వాలిఫైడ్ బోధనా సిబ్బంది లేని కోచింగ్ సెంటర్లు ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. మా కోచింగ్ సెంటర్‌లో చేరితే ఉద్యోగం గ్యారంటీ అని నిరుద్యోగులను మభ్యపెడుతున్నాయి. కోళ్ల పారంలో కోళ్లను కుక్కినట్లు విద్యార్థులను కోచింగ్‌ సెంటర్లలో కుక్కి విద్యాబోధన చేస్తున్నారు.

కొన్ని నిబంధనలు..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతో పాటు, వనపర్తి, గద్వాల, షాద్‌నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జడ్చర్ల వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కోచింగ్ సెంటర్లు భారీగా వెలిశాయి. ఆయా పట్టణాలకు దగ్గర్లో ఉన్న నిరుద్యోగులు వాటిలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉందా, లేదా అని చూడకుండానే చేరుతున్నారు. కోచింగ్ సెంటర్లను ప్రారంభించాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముందుగా కోచింగ్ కోసం పక్కా భవనం, బోధించడానికి క్వాలిఫైడ్ టీచర్స్, సరైన ఫర్నీచర్, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం వంటి మౌళిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. అంతేకాదు కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించే ముందు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పదివేల రూపాయల చలానా కట్టాలి. తమకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆధారాలు చూపాలి. అప్పుడు విద్యాశాఖాధికారులు పక్కా బిల్డింగ్‌ను పరిశీలిస్తారు. కోచింగ్‌ సెంటర్‌లో సరైన సౌకర్యాలు ఉన్నాయా, లేదా అని పరిశీలిస్తారు. అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారణ అయితే అప్పుడు కోచింగ్ సెంటర్ నడుపుకోవడానికి అనుమతి ఇస్తారు. అప్పటిదాకా కోచింగ్ సెంటర్‌ను నడపడం చట్టవిరుద్దం.

ఏడు కోచింగ్ సెంటర్లకు మాత్రమే అనుమతులు..
మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం ఏడు కోచింగ్ సెంటర్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ముందుగా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పర్మీషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అధికారుల నుంచి అనుమతి రాకుండానే కోచింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నారు. సరైనా క్వాలిఫికేషన్ లేని టీచర్లతో బోధిస్తున్నారు. మంచి క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లు బోధించాలంటే ఎక్కువ వేతనం తీసుకుంటారు కాబట్టి, అనర్హులతో కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఇలాంటి కోచింగ్ సెంటర్లు జిల్లాలో దాదాపు ముప్పై వరకు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ఆశ కల్పించి కోచింగ్‌ సెంటర్లు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విద్యార్ధిసంఘాలు మండిపడుతున్నాయి. అనుమతులు లేని కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థిసంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

12:35 - January 7, 2016

కరీంనగర్ : జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్ఎంపీలు , పీఎంపీలు వచ్చిరాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలే టార్గెట్ గా చేసుకుని ఆర్ ఎంపీలు వైద్యం చేస్తున్నారు. దీంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది పట్టణంలో.

చాలా కాలంగా జిల్లాలో నయాదందా..
చదివింది పదవతరగతి, ఇంటర్ అయినా హుస్నాబాద్ పట్టణంలో పెద్ద పెద్ద బోర్డులు, ప్రచారంతో యథేచ్చగా వ్యాపారం చేస్తున్నారు. కరీంనగర్ , వరంగల్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆసుపత్రులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. చాలాకాలంగా ఇలాంటి దోపిడీ జరుగుతున్న అధికారులు సైతం కమిషన్లు కక్కుర్తిపడ్డారని పలువురి వాదన. ఇటీవల హుస్నాబాద్ పట్టణ సీఐ భూమయ్య తన బృందంతో కొన్ని ఆసుపత్రులపై సోదాలు చేసి నకిలీడాక్టర్లను పట్టుకుని కటాలకటాలవెనక్కు పంపారు.

శ్రీకాంత్ పాలి క్లీనిక్ లను మూసేసిన పోలీసులు..
ఆర్ఎంపీలు, పీఎంపీలకు పలుమార్లు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసినప్పటికి వారిలో మార్పు రావడం లేదు. కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సిన వారు యథేచ్చగా ఇంజక్షన్లు, సెలైన్ లు సైతం ఎక్కిస్తున్నారు. ఉండాల్సిన అర్హతలు లేకున్నా తమను ఎవరు పట్టుకుంటారనే ధీమానో లేక అధికారులతో ఉన్న సంబంధాలతోనో జిల్లాలో వారు రెచ్చిపోతున్నారు. పట్టణంలోని మహాలక్ష్మి పాలి క్లీనిక్ , శ్వేత ప్రథమ చికిత్స కేంద్రం , శ్రీకాంత్ పాలి క్లీనిక్ లకు చెందిన నకిలీవైద్యులను అరెస్టు చేశారు. దీంతో పలు ఆసుపత్రులు బోర్డులు తిప్పేయడంతో వారి ఆసుపత్రులను మూసివేశారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ డాక్టర్ల బెడద భారీగా ఉందని, గతంలోను పలుమార్లు నకిలీ డాక్టర్లను అరెస్టులు చేశారంటున్నారు పట్టణవాసులు. అయినా వారిలో మార్పు రావడం లేదని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అర్హత లేనివారు వైద్యం పేరిట రోగులను జలగల్లా పీల్చిపిప్పి చేస్తున్నారు. 

12:21 - January 7, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను కుదించడంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. టి.కాంగ్రెస్ నేత కిషన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ 21 రోజుల నుండి 15 రోజులకు తగ్గించారు. డేట్ ను పొడిగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. కోర్టు ఆదేశాల ప్రకారం తాము గడవు తగ్గించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలిపారు. ఎన్నోసార్లు తేదీలు నిర్వహించాలని చెప్పినా అప్పుడు వినిపించుకోలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారో స్పష్టంగా చెప్పాలని కోర్టు తెలిపింది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఎత్తుగడల్లో భాగంగా ఈ విధంగా వ్యవహరిస్తోందని, ఇప్పటి వరకు డివిజన్ ల వారీగా రిజర్వేషన్ లు ప్రకటించలేదని పిటిషనర్ న్యాయవాదులు పేర్కొన్నారు. అభ్యర్థులను సెలక్ట్ చేసేందుకు తమకు 45 రోజుల సమయం కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై ఏదో ఒక నిర్ణయాన్ని హైకోర్టు మధ్యాహ్నం వెలువరించనుంది. 

12:14 - January 7, 2016

విజయవాడ : కల్తీ మద్యం కేసులో 9వ నిందితుడిగా ఉన్న మల్లాది విష్ణు కృష్ణలంక పీఎస్ లో సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. బుధవారం 12గంటల పాటు విచారించినా మల్లాది విష్ణు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. స్వర్ణ బార్ రెస్టారెంట్ తో తనకు సంబంధం లేదని విష్ణు చెప్పినట్లు తెలుస్తోంది. తనను రాజకీయం ఎదుర్కోలేక కుట్రపూరితంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విష్ణు ఆరోపిస్తున్నారు. ఎ-9గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బుధవారం ఉదయం 11 గంటలకు కృష్ణలంక పీఎస్‌కు ఆయన చేరుకున్నారు. సిట్‌ అధికారులు లడ్డా, సింధిల్‌లు విష్ణును 12 గంటలపాటు విచారించారు.

ఐదుగురు మృతి..
డిసెంబర్ ఏడో తేదీన కృష్ణలంకలో ఉన్న స్వర్ణ బార్ రెస్టారెంట్ సెల్లార్ లో ఉన్న బార్ లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా 35 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. మద్యం కల్తీ అవ్వడం వల్లే ఫోరెన్సిక్ నివేదిక కూడా పేర్కొంది. ఈ బార్ మల్లాది విష్ణుదని ప్రచారం జరిగింది. అనంతరం మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేసింది. మల్లాది విష్ణును 9వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేశారు. కానీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. అరెస్టు చేయమని, విచారణ మాత్రమే చేస్తామని పోలీసులు కోర్టుకు తెలిపారు. కల్తీ మద్యం కేసులో సహకరించాలని, సిట్ బృందం ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో నాటకీయఫక్కీలో మంగళవారం విజయవాడలో మల్లాది విష్ణు ప్రత్యక్షమయ్యారు. తాను ఎక్కడికి పారిపోలేదని, విచారణకు సహకరిస్తానని ఈ సందర్భంగా విష్ణు తెలిపారు.
ఇప్పటివరకు తమకు కావాల్సిన సమాచారమేది లభ్యం కాకపోవడంతో.. ఈ రోజు విచారణ ఎలా సాగుతుందోనన్న టెన్షన్‌ అందరిలోనూ నెలకొంది. 

జీహెచ్ఎంసీ ఎన్నికల గడవుపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల గడవుపై హైకోర్టులో విచారణ జరిగింది. జనవరి 31వ తేదీ లోపు ప్రక్రియ ముగించాలనే తగ్గించామని ప్రభుత్వం తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఎంత టైమ్ కావాలో చెప్పండి ఆలోచిస్తామని కోర్టు సూచించింది. తక్కువ రోజులు ఎందుకు పెట్టారని కోర్టు ప్రశ్నించింది. 

జనవరి లేదా ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు - స్వామిగౌడ్..

హైదరాబాద్ : శాసనమండలిలో సభ్యుల సంఖ్య పరిపూర్ణంగా ఉందని, జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయని మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ వెల్లడించారు. సమావేశాలు ఎన్ని రోజులు జరగాలో మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

ముఫ్తీ భౌతికకాయానికి మోడీ నివాళులు..

ఢిల్లీ : పాలం ఎయిర్ పోర్టులో జమ్మూకాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ మృతదేహానికి ప్రధాన మంత్రి మోడీ నివాళులర్పించారు. కాసేపట్లో శ్రీనగర్ కు ముఫ్తీ పార్థీవ దేహాన్ని తరలించనున్నారు. బిజ్ బెహరాలో రేపు ముఫ్తీ అంత్యక్రియలు జరగనున్నాయి.

11:59 - January 7, 2016

గ్రేటర్ ఎన్నికలు కొద్ది రోజుల్లో రానున్నాయి. పార్టీల హాడావుడి ప్రారంభమై పోయింది. అన్ని పార్టీల నేతలు డివిజన్ లను చుట్టేస్తున్నారు. ప్రచారానికి పదును పెడుతున్నారు. అలాగే పార్టీలు కూడా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. గ్రేటర్ సమరంతో గ్రేటర్ లో ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహాలమే కనిపిస్తోంది. అయితే ప్రజలు ఎమి కోరుకుంటున్నారు ? ఎలాంటి నాయకుడు రావాలని అనుకుంటున్నారు ? ఈ అంశంపై తెలుసుకోవడానికి టెన్ టివి 'గ్రేటర్ వార్ పబ్లిక్ పల్స్' పేరిట కార్యక్రమం రూపొందించింది. అంబర్ పేటలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలు..నేతలు ఏమన్నారో వీడియోలో చూడండి. 

11:27 - January 7, 2016

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా మహిళలకు, పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీలు జాతీయ మహాసభ జరుపుకుంటున్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఎనిమిదవ మహాసభలు ప్రారంభమయ్యాయి. సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు తపన్ సేన్ ప్రారంభించారు. సేవకులుగా ఉన్న తమను ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని.. ప్రతిక్షణం తమ డిమాండ్లపై పోరు చేయక తప్పటం లేదని వారంటున్నారు. ఈ జాతీయ మహాసభల్లో కేవలం తమ భవిష్యత్‌ గురించే కాకుండా.. ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ నిర్వీర్యం చేసే దిశగా సాగుతున్న ప్రభుత్వ యత్నాలను అడ్డుకునే అజెండాపైనా చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ అంగన్ వాడీలు టెన్ టివితో మాట్లాడారు. ఏపీలో అంగన్ వాడీల జీతాలను పెంచుతామని ప్రకటించారని, అయితే మంత్రివర్గ ఉపసంఘాన్ని విస్మరించి ఎప్రిల్ నెల నుండి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారని తెలిపారు. ఇటీవల ఏపీలో జరిగిన ఉద్యమంలో పాల్గొన్న అంగన్ వాడీలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసిందని, నిర్భందాలపై మహాసభలో చర్చించి నివేదికను తయారు చేస్తామన్నారు.

 

11:24 - January 7, 2016

హైదరాబాద్ : కన్నకొడుకు..ఆపై మూడేళ్ల బాలుడు...అపురూపంగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు కర్కోటకులుగా మారారు. చిత్రహింసలు పెట్టారు. అసలే చలికాలం..ఆ బాధలు తట్టుకోలేని ఆ చిన్నారి మూలుగుతున్నాడు. పటన్ చెరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలో ఇదే విధంగా చిన్నారిని తల్లిదండ్రులు చిత్ర హింసలకు గురి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే...రాధా, శివ కుమార్ ఇంట్లో మూడేళ్ల బాలుడు మమనోహర్ ఉన్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో నుండి మనోహర్ ఏడుపులు వినిపించడంతో స్థానికులు వచ్చి చూశారు. రాధా, శివకుమార్ లు ఇష్టమొచ్చినట్లుగా కొట్టడం చూసిన స్థానికులు తీవ్రంగా మందలించారు. క్షమించాలని చెప్పడంతో వారిని వదిలిపెట్టారు. తిరిగి గురువారం ఉదయం కూడా అదే పరిస్థితి ఎదురు కావడంతో రాధా, శివకుమార్ ఇంటికి స్థానికులు వచ్చారు. అప్పటికే బాలుడు ఏడుపులు వినిపించకుండా డ్రమ్ లో దాచిపెట్టారు. స్థానికులు వెంటనే మనోహర్ ను రక్షించారు. బాలుడి కంటికి, చేతికి తీవ్రగాయమైంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు రాధను అరెస్టు చేసి శివకుమార్ కోసం గాలిస్తున్నారు. మనోహర్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అసలు వారు తల్లిదండ్రులేనా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. స్థానికులు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు. లేక పిల్లవాడిని పెంచుకున్నారా ? లేదా అన్నది తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ జాతీయ మహాసభలు..

హైదరాబాద్ : ఆర్టీసీ కళ్యాణ మండపంలో అంగన్ వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఎనిమిదవ మహాసభలు ప్రారంభమయ్యాయి. జాతీయ అధ్యక్షురాలు తపన్ సేన్ పతాకావిష్కరణ చేశారు. సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ కె.వేణుగోపాల్ లు సభలను ప్రారంభించారు. వెయి మంది ప్రతినిధులు సభలకు హాజరయ్యారు. 

సోనియాతో వెంకయ్య భేటీ..

ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కలిశారు. జీఎస్టీ బిల్లుకు సహకరించాలని సోనియాను వెంకయ్య కోరారు.

 

బాబుతో అశోక్ బాబు భేటీ..

కర్నూలు : ఏపీ సీఎం చంద్రబాబుతో ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు భేటీ అయ్యారు. డీఏ, హెల్త్ కార్డులపై సీఎంతో చర్చించడం జరిగిందని అశోక్ బాబు పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో డీఏ ప్రకటిస్తామని బాబు తెలిపారని, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ పై సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. హెల్త్ కార్డులపై 13వ తేదీన విజయవాడలో చర్చిస్తామని పేర్కొన్నారు. 

కాసేపట్లో సిట్ ఎదుట మల్లాది విష్ణు..

విజయవాడ : కృష్ణలంక పీఎస్ లో సిట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరు కానున్నారు. బుధవారం 12 గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే.

 

ఎఫ్ టీటీఐ ఎదుట విద్యార్థుల ఆందోళన..

పూణె : ఎఫ్ టీటీఐ ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గజేంద్ర చౌహాన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన 20 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

10:48 - January 7, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం సమస్యకు పరిష్కారానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన సరి-బేసి కార్ల విధానానికి ఢిల్లీ హైకోర్టు నుంచి ఊహించని విధంగా చుక్కెదురైంది. ఈ ట్రయల్‌రన్‌ ప్రారంభించి ఇప్పటికే ఆరు రోజులు పూర్తయిందని దీనివల్ల అనేక ఇబ్బందులు తలెత్తాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందినట్టు హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా రవాణాకు సరైన ఏర్పాట్లు చేయకుండా సరి-బేసి విధానాన్ని 15 రోజులు పాటించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.ఈ ట్రయల్ రన్‌ను 15 రోజులకు బదులు వారం రోజులకే ఎందుకు పరిమితం చేయకూడదని కేజ్రీవాల్‌ సర్కార్‌ను కోర్టు ప్రశ్నించింది. కొంతమంది న్యాయమూర్తులు కార్‌ పూల్‌ చేసుకుని వస్తున్నారని, మరికొందరు కోర్టుకు నడచి రావడం మంచిదే...కానీ వారి ఫైళ్లు ఎలా వస్తాయి ? ఎవరు తీసుకొస్తారన్నది ప్రాక్టికల్‌గా ఆలోచించాల్సిన విషయమని కోర్టు పేర్కొంది.

8వ తేదీన నివేదిక సమర్పించాలన్న కోర్టు..
ఆప్‌ సర్కార్‌ దీన్నో ప్రాజెక్ట్‌ పైలెట్‌గా తీసుకున్నందున మరో రెండు రోజులు అవకాశం ఇస్తామని హైకోర్టు పేర్కొంది. కొత్త ట్రాఫిక్‌ రూల్‌ వల్ల ఎంతవరకు ప్రయోజనం ఒనగూరిందన్నదానిపై జనవరి 1 నుంచి నగరంలో నమోదైన కాలుష్యం వివరాలను జనవరి 8 శుక్రవారంలోగా కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నివేదికని బట్టి సరి-బేసి విధానం ఏ మాత్రం సానుకూల ప్రభావం చూపిందో తెలుస్తుందని న్యాయస్థానం పేర్కొంది. ఆడ్‌ ఈవెన్‌ ట్రాఫిక్‌ రూల్‌ వల్ల నగరంలోని గాలిలో ఇంప్రూవ్‌మెంట్‌ ఉందని, దీనికి సంబంధించిన అన్ని వివరాలను శుక్రవారం కోర్టుకు సమర్పిస్తామని ఆప్‌ ప్రభుత్వం తెలిపింది.

10:46 - January 7, 2016

ఢిల్లీ : పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య జనవరి 15న ఇస్లామాబాద్‌లో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శుల చర్చలపై సందిగ్ధం నెలకొంది. పఠాన్‌కోట్‌ దాడులకు సంబంధించిన ఆధారాలను భారత్‌ పాకిస్తాన్‌కు అందజేసినట్లు ఉన్నత వర్గాల సమాచారం. ఉగ్రవాద దాడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ విచారణ చేపడితేనే ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతాయని భారత్‌ స్పష్టం చేసింది. భారత్‌-పాక్‌ల మధ్య చర్చల్ని కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని పాక్‌ రక్షణ శాఖ మంత్రి మహ్మద్‌ ఆసిఫ్‌ ఆరోపించారు. ఉగ్రదాడుల ద్వారా ఆ శక్తులు శాంతి చర్చలు జరగకుండా అడ్డుకుంటున్నాయని తెలిపారు. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి తర్వాత పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, భారత ప్రధాని మోదిల ఫోన్‌ సంభాషణే ఇరు దేశాల మధ్య సహృద్భావ వాతావరణానికి నిదర్శమన్నారు. పాకిస్తాన్‌ కూడా ఉగ్రవాద పీడిత దేశమేనని ఆయన పేర్కొన్నారు.

మసూద్ హస్తం..?
పఠాన్‌కోట్‌ దాడుల వెనక మాస్టర్‌ మైండ్‌ మసూద్‌ అజహర్‌ హస్తం ఉందని ఉన్నత వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్‌ నుంచే పఠాన్‌కోట్‌లోని ఉగ్రవాదులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి కోసం టెర్రరిస్టులకు పాకిస్తాన్‌లోని చక్‌లాలా, లాయర్‌పూర్‌ ఎయిర్‌బేస్‌కు తీసుకెళ్లి ప్రత్యేక శిక్షణనిచ్చినట్టు అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్ర దాడుల ద్వారా భారత్‌-పాక్‌ల మధ్య చర్చలు స్తంభింపజేయడమే వీరి వ్యూహమని తెలుస్తోంది.

తిప్పికొట్టిన భదత్రా దళాలు...
పక్కా ప్రణాళిక ప్రకారం ఉగ్రవాదులను భద్రతా దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని అధికారవర్గాలు తెలిపాయి. ఎన్‌ఎస్‌జి ఐజి మేజర్‌ జనరల్ దుష్యంత్‌ సింగ్‌ ఆదేశాలతో భద్రతా బలగాలు ఆపరేషన్‌ నిర్వహించాయి. టెర్రరిస్టులను ఎదుర్కోవడంలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌కు ప్రత్యేక శిక్షణ నిచ్చినట్టు పేర్కొన్నాయి. ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు ఉగ్రవాదులను సజీవంగా పట్టుకునేందుకు యత్నించాయి. జనవరి 2 తెల్లవారుజామున ఆపరేషన్‌ ప్రారంభం కాగా జనవరి 3 మధ్యాహ్నం ఒకటిన్నరకు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఎయిర్‌బేస్‌కు చెందిన ఫైటర్‌ జెట్, ఎమ్యునిషన్‌ డిపోకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జవాన్లు కాపాడగలిగారు. ఉగ్రవాదులు హతమయ్యాక 29 సార్లు పేలుళ్లు సంభవించాయి. ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. తాజాగా పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ ముందు సైన్యం ఓ అనుమానస్పద బ్యాగుతో తిరుగుతున్న ఓ వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 

10:44 - January 7, 2016

ఢిల్లీ : ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా ప్రచారం నుంచి అమీర్‌ఖాన్‌ను తప్పించారు. కేంద్ర పర్యాటక శాఖ తరుపున నిర్వహిస్తున్న అతిథిదేవోభవ ప్రచారం నుంచి ఆయనను తప్పించారు. గత నవంబర్‌లో అసహనంపై అమీర్‌ వాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అమీర్‌ తొలగింపుపై విమర్శలు వస్తున్నాయి. ఖాన్‌ కాంట్రాక్ట్‌ ముగియడంతోనే ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా అంబాసిడర్‌ బాధ్యత నుంచి తప్పించారని కేంద్రం చెప్పుకొస్తోంది. ఇంక్రెడిబుల్‌ ఇండియా ప్రచార కర్తగా ఉన్న బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ను తొలగించడం మరో వివాదానికి దారితీసింది.

కేంద్రం వివరణ..
అమీర్‌ఖాన్‌ తొలగింపుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గత ప్రభుత్వమే అతిథి దేవోభవ ప్రచార బాధ్యతను మెకాన్‌ సంస్థకు అప్పగించిందని ప్రస్తుతం ఆ ఏజెన్సీ కాంట్రాక్ట్ గడువు ముగిసిందని కేంద్ర పర్యాటక శాఖ వివరణ ఇచ్చింది. ఆ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ టైమ్‌ అయిపోవడంతో అమీర్‌ఖాన్‌ బాధ్యత కూడా ముగిసినట్లేనని తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టంచేసింది. టూరిజం శాఖ అంబాసిడర్‌గా అమీర్‌ కొనసాగే అవకాశం లేదని తెలిపింది. అమీర్‌ఖాన్‌ తొలగింపుపై విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో అసహనంపై ఖాన్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంక్రెడిబుల్‌ ఇండియా కాంట్రాక్ట్‌ ముగిసినా..పర్యాటక శాఖ ప్రచారకర్తగా కొనసాగించకపోవడం వెనుక కేంద ప్రభుత్వం దురుద్దేశం కనబడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

10:24 - January 7, 2016

చిత్తూరు : జిల్లాలో మాజీ మండలాధ్యక్షుడు, టిడిపి నేత కిడ్నాప్ కలకలం రేపింది. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. యాదమర్రి మండలానికి మాజీ మండలాధ్యక్షుడు, టిడిపి నేత భజలింగం గ్రానైట్ వ్యాపారం చేస్తుంటాడు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు భజలింగంను కిడ్నాప్ చేశారు. అనంతరం దుండగులు అతని ఇంటికి ఫోన్ చేశారు. భజలింగంను వదిలిపెట్టాలంటే రూ. 2 కోట్లు ఇవ్వాలని కిడ్నాపర్లు హెచ్చరించారు. తాము అంత ఇచ్చుకోలేమని, ఇప్పటికప్పుడు రూ. 50 లక్షలు సర్దగలమని భజలింగం కుమారుడు కిడ్నాపర్లకు తెలిపాడు. ఈ డబ్బును పూతపట్ల హైవే వద్ద వదిలిపెట్టి వెళ్లిపోవాలని, అనంతరం భజలింగంను వదిలిపెడుతామని కిడ్నాపర్లు బదులిచ్చారు. వెంటనే రూ.50లక్షలు తీసుకుని కిడ్నాపర్లు సూచించిన ప్రాంతంలో పెట్టాడు. అక్కడకు చేరుకున్న కిడ్నాపర్లు డబ్బును తీసుకుని భజలింగంను హైవేపై వదిలిపెట్టి పరారయ్యారు. భజలింగం కన్ను, భుజంపై తీవ్రగాయాలున్నాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు భజలింగంను వివరాలు అడిగారు. కిడ్నాపర్లు ముసుగులు ధరించి ఉన్నారని భజలింగం పేర్కొన్నారు. రాజేష్ కిడ్నాప్ ముఠా ఈ పని చేసి ఉండవచ్చునని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. 

ఎయిమ్స్ కు చేరుకున్న ముఫ్తీ మెహబూబా..

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కున్నమూశారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సమచారం తెలుసుకున్న ఆయన కూతురు, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబ ఆసుపత్రికి చేరుకున్నారు. 

ముఫ్తీ మృతిపై ఏచూరి సంతాపం..

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ మృతి పట్ల సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి సంతాపం వ్యక్తం చేశారు. వీపీ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి ముఫ్తీతో తనకు పరిచయం ఉందని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ముఫ్తీ కుటుంబసభ్యులకు సంతాపం తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. 

సిరిసిల్లలోని స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం..

కరీంనగర్ : సిరిసిల్ల (మం) మందేపల్లి శివారులోని స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రూ.కోటి వరకు ఆస్తినష్టం వాటిల్లింది. 

బాలుడిని చిత్రహింసలకు గురి చేసిన తల్లిదండ్రులు..

మెదక్ : పటన్ చెరులోని శాంతినగర్ లో అల్లరి చేస్తున్నాడని ఓ బాలుడిని తల్లిదండ్రులు చిత్రహింసలకు గురి చేశారు. బాలుడి శరీరమంతా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తల్లిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న తండ్రి కోసం గాలిస్తున్నారు.

 

నష్టాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం..

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయి ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి. 

09:50 - January 7, 2016

హైదరాబాద్ : ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఐసీసీ హెచ్చరికలు చేసింది. షటప్ యువర్ మౌత్ అంటూ తీవ్రంగా హెచ్చరించింది. ఈమేరకు ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేసింది. ట్విట్టర్ లోనే ఓవైసీ కూడా స్పందించారు. ఇటీవల నగరంలో ఐసీసీ పట్ల యువత ఆకర్షితులవడం పట్ల ఓవైసీ స్పందించిన సంగతి తెలిసిందే. ముస్లిం యువత ఆకర్షితులు కావద్దని, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ముస్లిం జిహాదీకి అంగీకరించాలని, భారతదేశంలో ఐసీసీన్ ఏర్పాటు చేస్తామని ఐసీస్ ప్రకటించింది. 

ఎంపీ ఓవైసీకి ఐసీసీ హెచ్చరికలు..

హైదరాబాద్ : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఐసీసీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ట్విట్టర్ పలు ట్వీట్స్ చేసింది. దీనిపై ఎవైసీ ట్విట్టర్ లోనే కౌంటర్ ఇచ్చారు. ఇస్లామిక్ స్టేట్ కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని హుకుం జారీ చేశారు. 

09:15 - January 7, 2016

హైదరాబాద్‌ : దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఫుడ్‌పాండా ప్రముఖ బిర్యానీ హౌస్‌ ప్యారడైజ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో తమ హైదరాబాదీ బిర్యానీని ఆన్‌లైన్‌లో పొందవచ్చని ప్యారడైజ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ సంస్థకు హైదరాబాద్‌లో 9, బెంగళూరులో 3 చొప్పున అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. ఫుడ్‌పాండతో ఒప్పందం మరింత మంది వినియోగదారులకు చేరువ కావడానికి దోహదం చేస్తుందని ప్యారడైజ్‌ సిఒఒ సమీర్‌ భాసిన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

09:13 - January 7, 2016

ఢిల్లీ : జమ్మూకాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థతతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో డిసెంబర్ 24వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయన మృతి చెందడం పట్ల భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. పేద ప్రజలు అంటే ఆయనకు ఇష్టమని ఆయన మృతి కలిచి వేసిందని హోం మంత్రి రాజ్ నాత్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయని తెలుస్తోంది. ఈ అంత్యక్రియలకు భారత ప్రధాని మోడీ హాజరౌతారని సమాచారం. 1936 జనవరి 12వ తేదీన ముఫ్తీ జన్మించారు. 1989లో కేంద్ర హోం మంత్రిగా ముఫ్తీ పనిచేశారు.
79 సంవత్సరాల గల ముఫ్తీ మహ్మద్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 87 స్థానాలు గల జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం పీడీపీ, బీజేపీ మధ్య పొత్తులు కుదిరాయి. 2015 మార్చి 1వ తేదీన సీఎంగా ముఫ్తీ బాధ్యతలు స్వీకరించారు.
తన ఆరోగ్యం సరిగ్గా లేనందు వల్ల సీఎం పగ్గాలు తన కూతురైన మెహబూబాకు అప్పగించాలని భావిస్తున్నట్లు ముఫ్తీ మహ్మద్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. 

ముఫ్తీ మృతికి రాష్ట్రపతి సంతాపం..

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ కన్నుమూశారు. ఆయన మృతి చెందడం పట్ల భారత రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

ముఫ్తీ మృతిపై మోడీ సంతాపం.

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ కన్నుమూశారు. ఆయన మృతి చెందడం పట్ల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. పేద ప్రజలు అంటే ఆయనకు ఇష్టమని ఆయన మృతి కలిచి వేసిందని హోం మంత్రి రాజ్ నాత్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

జమ్మూ కాశ్మీర్ సీఎం మృతి..

ఢిల్లీ : జమ్మూకాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ సయీద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అస్వస్థతతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో డిసెంబర్ 24వ తేదీన ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. 1936 జనవరి 12వ తేదీన ముఫ్తీ జన్మించారు. 1989లో కేంద్ర హోం మంత్రిగా ముఫ్తీ పనిచేశారు. 79 సంవత్సరాల గల ముఫ్తీ మహ్మద్ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 87 స్థానాలు గల జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాలు, బీజేపీ 25 స్థానాలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

దామిని ఏజెన్సీ ప్రాంతంలో జన్మభూమి మా ఊరు..

శ్రీకాకుళం : దామిని ఏజెన్సీ ప్రాంతంలో నేడు జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కూన రవికుమార్ హాజరు కానున్నారు. 

గుడిపూడిలో దంపతుల దారుణ హత్య..

గుంటూరు : క్రోసూరు (మం) గుడిపూడిలో దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చిల్లర వ్యాపారి రామారావు, భార్య వెంకాయమ్మను బుధవారం రాత్రి కత్తులతో పొడిచి చంపేశారు. పిడుగురాళ్లలో ఇదే తరహాలో వృద్ధ దంపతులను హత్య చేశారు. హత్యలు సైకో చేస్తున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

08:12 - January 7, 2016

హైదరాబాద్ : పాతబస్తీలో నిత్య పెళ్లికొడుకు బండారం బయటపడింది. యువతికి మాయమాటలు చెప్పి రెండో పెళ్లి చేసుకున్న యువకుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పాతబస్తీ ప్రాంతానికి చెందిన అహ్మద్ ఆలీ నగరానికి చెందిన ఓ యువతితో పరిచయం చేసుకున్నాడు. నగరంలో తనకు చాలా ఆస్తులున్నాయని నమ్మబలికాడు. అంతేగాకుండా కోటీశ్వరుడిలా నటించాడు. దీనితో ఆ యువతి అతని ట్రాప్ లో పడిపోయింది. రెండు రోజుల క్రితం యువతిని ఆలీ వివాహం చేసుకున్నాడు. ఇంతకుముందే ఆలీకి వివాహమైందని యువతి బంధువులు గుర్తించారు. 8ఏళ్ల క్రితమే పెళ్లి జరిగిందని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. తమ దగ్గరి నుండి రూ. 35 లక్షల వరకు తీసుకున్నారని యువతి ఆరోపించింది. పోలీసులు అహ్మద్ ఆలీపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

08:03 - January 7, 2016

రోజులో తక్కువ సమయంతో నిద్రపోతున్నారా? అయితే మీకు మతిమరువు గ్యారంటీ. నిద్రకు, జ్ఞాపకశక్తి మధ్య సంబంధమేంటని అనుకుంటున్నారా? జ్ఞాపకశక్తి పెరగాలంటే సరిగ్గా రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాల్సిందేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఎనిమిది గంటల పాటు నిద్రపోయిన వారిలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందని అధ్యయనం తేల్చింది. బ్రిగామ్‌ అండ్‌ ఉమెన్‌ ఆసుపత్రిలో జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్లు జెన్‌ ఎఫ్‌ డఫీ ప్రకటించారు. ఇందుకోసం చేసిన పరిశోధనల్లో రాత్రి ఎనిమిది గంటలు పడుకున్నవారిపై పరీక్షలు నిర్వహించారు. సుమారు 20 మంది వ్యక్తుల (అడల్ట్స్‌) కలర్‌ ఫొటోలను, వారి పేర్లను వారికి చూపించారు. ఆ ఫోటోల్లో ఉన్న వారి రంగులు, పేర్లను సరిగ్గా ఎనిమిది గంటల పాటు నిద్రించిన వారు సులభంగా కనిపెట్టగలిగారని పరిశోధనలో తేలింది. ఎనిమిది గంటల పాటు నిద్రించిన వారిలో 12 శాతం మంది జ్ఞాపకశక్తి కలిగి, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగారు. సరిపడా నిద్ర తర్వాత, నేర్చుకునే కొత్త విషయాల ద్వారా మెరుగైన జ్ఞాపకశక్తిని పొందవచ్చని డఫీ పేర్కొన్నారు. అయితే ఆరు, ఏడు గంటలు నిద్రపోయిన వారిలో జ్ఞాపకశక్తి తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. తక్కువగా నిద్రించిన వారు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయారన్నమాట. పూర్తిస్థాయి ఫలితాల కోసం ఇంకొన్ని పరిశోధనలు అవసరమని వారు అంటున్నారు.

08:01 - January 7, 2016

రజనీకాంత్‌ నటిస్తున్న 'కబాలి' సినిమాలో ప్రతినాయకులుగా విదేశీ నటుల్ని ఎంపికచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో జరుగుతోన్న షూటింగ్‌లో ఈ ఇద్దరూ ప్రవేశించన్నుట్లు తెలుస్తోంది. 'కబాలి'లో ఇద్దరు విలన్స్‌ అవసరం కావడంతో వారిలో ఒకరిగా 'జెట్‌ లీ'ని తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయనని సంప్రదించలేదని దర్శకుడు రంజిత్‌ చెప్పాడు. తాజాగా ఈ సినిమా కోసం తైవాన్‌ నటుడు 'విన్‌స్టన్‌ చవో'ను .. మలేసియన్‌ నటుడు 'రోస్యం నోర్‌'ను విలన్లుగా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరితో రజనీ తలపడే యాక్షన్‌ దృశ్యాలను చెన్నైలో ప్లాన్‌ చేస్తున్నారని టాక్. రజనీకాంత్‌కి చైనా, జపాన్‌, మలేసియాలలో కూడా మంచి క్రేజ్‌ వుంది. అందువలన అక్కడి స్టార్స్‌ తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమా అక్కడ కూడా భారీస్థాయిలో విడుదల కానుంది.

07:56 - January 7, 2016

తెలుగులో పాటలు పాడడం వేరు. ఇతర దక్షిణాది భాషల్లో పాటలు పాడాలంటే చాలా మంది వెనకడుగువేస్తారు. కానీ ఇందుకు కాజల్‌ మినహాయింపు అని చెప్పాలి. ఏభాష అయినా తను పాడేస్తానని సంగీత దర్శకులకి భరోసా ఇస్తుంది. తాజాగా కన్నడ చిత్రంలో పాడుతుంది. అప్పటికే ఎన్‌టిఆర్‌... తన స్నేహితుల కోరిక మేరకు కన్నడ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌ 'చక్రవ్యూహ'లో ఓ పాట పాడాడు. ఇప్పుడు ఇదే సినిమాలో ఓ పాటను కాజల్‌ అగర్వల్‌ అడగడం. ఆమె అంగీకరించడం జరిగింది. సంక్రాంతి నాడు ఈ పాటను రికార్డ్‌ చేయనున్నారు. 'చక్రవ్యూహ' సినిమాని 'జర్నీ' ఫేం తమిళ డైరెక్టర్‌ శరవణన్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు.

07:48 - January 7, 2016

తెలుగులో 'డిక్టేటర్‌', 'సోగ్గాడే చిన్ని నాయన', 'నాన్నకు ప్రేమతో', 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' వంటి చిత్రాలు సంక్రాంతికి పోటీ పడుతుంటే కోలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఒకే రోజు నాలుగు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వాటిలో బాల దర్శకత్వంలో తెరకెక్కిన 'తారై తప్పట్టై' చిత్రం ఒకటి. శశికుమార్‌ హీరోగా, శరత్‌ కుమార్‌ తనయురాలు వరలక్ష్మీ శరత్‌కుమార్‌ హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రానికి ఇళయ రాజా సంగీతమందించడం విశేషం. అలాగే శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన కామెడీ డ్రామా చిత్రం 'రజనీ మురుగన్‌' కూడా జనవరి 14నే విడుదలకు సిద్ధమవుతోంది. పోన్‌రామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ సరసన కీర్తిసురేష్‌ నటిస్తుంది. దీంతోపాటు ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా తెరకెక్కిన 'గీతూ' చిత్రం కూడా సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదల కానుంది. తిరుకుమార్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇక సిద్ధార్థ్‌ హీరోగా సుందర్‌. సి దర్శకత్వంలో రూపొందిన 'అరణ్మన్నై 2' చిత్రం సంక్రాంతి బరిలో ఉంది. హర్రర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హన్సిక, త్రిష, పూనమ్‌ బజ్వా హీరోయిన్లుగా నటించారు. ఈ నాలుగు చిత్రాలతోపాటు మాధవన్‌ నటించిన 'ఇరుధి సుట్రూ', శింబు హీరోగా తెరకెక్కిన 'ఇదు నమ్మ ఆలు' చిత్రాలు కూడా సంక్రాంతి పండుగ నేపథ్యంలో విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

07:46 - January 7, 2016

ముగ్గురు బాలీవుడ్‌ అగ్ర కథానాయికలు ఒకేసారి తెరపై కనిపిస్తే వారి అభిమానులకు పండగే. అలాంటి పండగ వాతావరణం త్వరలోనే రానుంది. ముగ్గురు స్టార్‌ హీరోయిన్లు ఐశ్వర్య రాయ్‌, కత్రినా కైఫ్‌, సోనమ్‌ కపూర్‌ కలిసి ఓ సౌందర్య ఉత్పత్తి సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఒకేసారి ముగ్గురూ కలిసి ఒక ప్రకటనలో కూడా కన్పించలేదు. ఇప్పుడు లోరియల్‌ నుంచి వస్తున్న ఓ కొత్త అడ్వాన్స్‌డ్‌ హెయిర్‌ కేర్‌ ప్రోడక్ట్‌ ప్రకటనలో ఐశ్వర్య, కత్రినా, సోనమ్‌ కలిసి ప్రేక్షకులకు, వారి అభిమానులకు కనువిందు చేయనున్నారు. ఈ ప్రకటనపై సోనమ్‌ కపూర్‌ స్పందిస్తూ, 'ఈ ప్రకటన ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందా అని ఎదురుచూస్తున్నాను. ఐశ్వర్య, కత్రినా కైఫ్‌ లాంటి అగ్ర తారలతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది' అని తెలిపింది. ప్రస్తుతం సోనమ్‌ నీరజ భానోత్‌ జీవితం ఆధారంగా దర్శకుడు రామ్‌ మద్వాని రూపొందిస్తున్న 'నీరజ'లో నటిస్తోంది. అలాగే ఐశ్వర్యరాయ్‌ యదార్థ సంఘటనల ఆధారంగా ఓమంగ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సరబ్‌జిత్‌' చిత్రంలో, కరణ్‌ జోహర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వంలో 'ఫితూర్‌', అనురాగ్‌ బసు దర్శకత్వంలో 'జగ్గా జాసూస్‌', నిత్యా మెహ్రా దర్శకత్వంలో 'బార్‌ బార్‌ దేఖో' వంటి చిత్రాల్లో కత్రినా కైఫ్‌ నటిస్తోంది.

07:42 - January 7, 2016

'మున్నాభాయ్‌ ఎం.బి.బి.ఎస్‌', 'త్రీ ఇడియట్స్‌', 'పీకే' వంటి చిత్రాలతో యావత్‌ భారతీయ సినీ ప్రేక్షకులకు దర్శకుడు, రచయిత, నిర్మాతగా రాజ్‌కుమార్‌ హిరానీ సుపరిచితుడు. బాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా పేరొందిన రాజ్‌కుమార్‌ హిరానీ, తమిళ అగ్ర నటుడు సూర్య కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుందని సమాచారం. మాధవన్‌ నటించిన తమిళ చిత్రం 'ఇరుధి సుత్రు' ఆడియో ఆవిష్కరణ వేడుకకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజ్‌కుమార్‌ హిరానీ మాట్లాడుతూ,'ఏదో ఒక రోజు సూర్యతో సినిమా తప్పకుండా చేస్తాను. సూర్యకి సంబంధించి ఇంప్రెసివ్‌ వర్క్‌ చూశాను. మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే కొన్నేళ్ళుగా మాధవన్‌ నాకు సుపరిచితుడు. ఆయన నటించిన 'ఇరుధి సుత్రు' చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

07:40 - January 7, 2016

భారత క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోని జీవిత కథ ఆధారంగా 'ఎం.ఎస్‌.ధోని -ద అన్‌టోల్డ్‌ స్టోరీ' పేరుతో బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. ధోని పాత్రలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, భార్య సాక్షి పాత్రలో కైరా అద్వానీలు నటిస్తుండగా, ధోని మాజీ ప్రేయసిగా నటి దిశా పాట్నీ నటిస్తున్నట్లు సమాచారం. తొలుత ఈ పాత్ర కోసం పలువురు హీరోయిన్లను అనుకున్నప్పటికీ చివరిగా దిశాని ఎంపిక చేశారని తెలుస్తోంది. నీరజ్‌పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

07:36 - January 7, 2016

రాజధాని నిర్మాణం కోసం విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి రూ.10 చొప్పున వసూలు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో బుధవారం చుక్కెదురయింది. ఏపీ విద్యాశాఖ నిర్ణయం పైన హైకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ రెండు రోజుల క్రితం ఓ నిర్ణయం తీసుకుంది. ప్రతి విద్యార్థి నుంచి రూ.10 వసూలు చేయాలని, తద్వారా రాజధాని నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కూడా ఉండేలా అవకాశం కల్పించాలని భావించింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో శ్రీరాములు (టిడిపి), వీరయ్య (నవ తెలంగాణ దినపత్రిక సంపాదకులు), కొండా రాఘవరెడ్డి (వైసీపీ) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

07:29 - January 7, 2016

'సునీల్‌' హీరోగా వీరు పోట్ల దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా నిర్మిస్తున్న 'ఈడు గోల్డ్‌ ఎహే' చిత్రం మంగళవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో 'బిందాస్‌' వంటి సూపర్‌ హిట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని నిర్మించాం. మరోసారి ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో 'సునీల్‌' సరసన 'సుష్మా రాజ్‌', 'రిచా పనై'లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేటి నుంచి (జనవరి 7) నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి సమ్మర్‌ స్పెషల్‌ గా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు. జయసుధ, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, బాబ్‌ అంథోని, ప్రబాస్‌ శ్రీను, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, నల్ల వేణు, సుదర్శన్‌, గిరి తదితరులు నటిస్తున్నారు. 

07:25 - January 7, 2016

కోమలమైన చర్మం పొడిబారడం, గరుకుగా తయారవడం, మృతకణాలు పెరగడం ఈ చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మకణాలు నిస్తేజంగా కనిపిస్తాయి. ఫలితంగా మేనికాంతి తగ్గుతుంది. దీనికి చక్కని పరిష్కారం దానిమ్మ గింజలు. కొబ్బరినూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌, గోధుమ రంగు పంచదార, తేనె రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. వాటితో పాటు చిదిమిన దానిమ్మ గింజల గుజ్జు, నారింజ తొక్కల గుజ్జు, రోజ్‌వాటర్‌లను టీ స్పూన్‌ చొప్పున తీసుకొని బాగా కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ మిశ్రమం చర్మానికి మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. దానిమ్మ నూనెలో ఉండే కెరటినోసైట్స్‌ చర్మ కణాలను ఉత్తేజితం చేసి మృతకణాలను తొలగిస్తాయి. ముడతలను నివారిస్తాయి.కొన్ని చుక్కల దానిమ్మ గింజ్ల రసంలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి పొడిబారిన, చిట్లిన పెదాలకు రాసుకుంటే చర్మం పొడిబారడం, చిట్లడం తగ్గుతుంది.

07:21 - January 7, 2016

ప్రతి వారి ముఖం ఆకర్షణీయంగా కనపడాలంటే వారి కండ్లు బాగుండాలి. వారి కండ్లను బట్టే వారి అందం ఇనుమడిస్తుంది. అందానికే కాదు మనిషి ఆరోగ్యానికి కూడా కండ్లే చిహ్నం. అందుకే జీవం లేకుండా మారే కండ్లు ఉంటే వారి ముఖం చాలా జీవరహితంగా ఉండటం సహజమే. అయితే కండ్లను చక్కగా కాపాడుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. అందుకే చాలా మంది కండ్ల గురించి ఆలోచిస్తుంటారు. అయితే ఏమేమి వాడాలో.. ఎలా వాడాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ గృహ చిట్కాలు.

  • కండ్లు చాలా సున్నితమైనవి కాబట్టి బజారునలో దొరికే ఏ క్రీం పడితే ఆ క్రీం రాయటం మంచిది కాదు. ఇలా చేస్తే మీ కండ్లు ఇన్‌ ఫెక్షన్‌ బారిన పడే ప్రమాదం ఉంది. అదీకాక మన కండ్లకు పడే క్రీములు కాకపోతే కండ్లు పోయే ప్రమాదమూ ఉంది. అందుకే వైద్యుని సలహాతోనే వాడాలి.
  • అర టీస్పూన్‌ కీరా రసంలో కొద్దిగా రోజ్‌ వాటర్‌ కలిపి ఈ మిశ్రమాన్ని కండ్లకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కండ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
  • కండ్లకు విశ్రాంతి ఎంతైనా అవసరం. తగినంత ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల కండ్లకు రెస్ట్‌ దొరికి తాజాగా కనపడతాయి.
  • గ్లాస్‌ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కండ్లను కడుక్కుంటే తాజా మెరుస్తాయి. ఉసిరి అన్ని విధాలా ప్రయోజనకారే.
  • కండ్ల చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాల మీగడతో మసాజ్‌ చేసుకుంటే ముడతల నుండి విముక్తి పొందవచ్చు .
  • కొందరికి నిద్రలేమి, అలసట, ఇతర సమస్యల కారణంగా కండ్లు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు గుడ్డులోని తెల్ల సొనను కండ్ల అడుగున రాసుకోవాలి. పది నిమిషాల తరువాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపులోకి చేస్తుంది.

అనంతపురంలో జగన్ పర్యటన..

అనంతపురం : నేడు వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లాలో రెండో రోజు రైతు భరోసా యాత్రలో పాల్గొనున్నారు. కొత్తపేట, శాంతినగర్, ధర్మవరం, శివనగర్ లో యాత్ర జరగనుంది. 

తిరుపతిలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు..

చిత్తూరు : తిరుపతిలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు దామోదర్, సాయిబాలాజీ, మునిస్వామి, శ్రీనివాసులను పోలీసులు అరెస్టు చేశారు.  

07:00 - January 7, 2016

హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రాజుకొంటోంది. పొత్తులు, కూటమిల ఏర్పాటులు ఖరారవుతున్నాయి. తమ ఏజెండాలను ప్రకటిస్తున్నాయి. మేనిఫెస్టోలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే లోక్ సత్తా, సీపీఐ, సీపీఎం పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. 'వన్ హైదరాబాద్' కూటమి పేరిట జట్టు కట్టిన ఈ మూడు పార్టీలు పది పాయింట్ల ఏజెండాను ప్రకటించాయి. ఈ కూటమి ఎన్నికల్లో గెలిస్తే ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తారు ? జీహెచ్ఎంసీ పాలనలో ఎలాంటి మార్పు తీసుకొస్తుంది ? ఈ అంశంపై టెన్ టివి 'జనపథం'లో వన్ హైదరాబాద్ కూటమి వ్యూహకర్తలో ఒకరైన శ్రీనివాస్ విశ్లేషించారు. 

06:39 - January 7, 2016

పంజాబ్ : పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై జరిగిన దాడితో భద్రతా వైఫల్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉగ్రవాదులపై కమాండో ఆపరేషన్‌ జరిపేందుకు ఆలస్యం ఎందుకు చేశారని విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పఠాన్‌ కోట్‌ పరిణామాలు దేశ భద్రతకు సవాల్‌ గా పరిణమించాయి. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంలోకి ఉగ్రవాదులు చొచ్చుకువచ్చిన సమయంలో వేలాదిమంది సైనికులు అందుబాటులో ఉండగా, ఆపరేషన్‌ వెంటనే ఎందుకు ప్రారంభించలేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ నుంచి ఎన్‌ఎస్‌జీ కమెండోలను రప్పించడం కోసం కాలయాపన ఎందుకు చేశారంటూ కొందరు ప్రస్తుత, మాజీ సైనికాధికారులు మండిపడుతున్నారు.

సమయం వృథా...
ఇన్‌ఫ్యాంట్రీ దళాలు, బ్రిగేడ్‌ దళాలుసహా మూడు రకాల సైనిక విభాగాల హెడ్‌క్వార్టర్స్‌ రెండు గంటల వ్యవధిలో వైమానిక స్థావరానికి చేరుకునేంత దూరంలోనే ఉన్నాయని స్థానిక బ్రిగేడియర్‌ ఒకరు తెలిపారు. వీరంతా ఉగ్రవాదుల ఏరివేతలో శిక్షణ పొందినవారేనని ఆయన అన్నారు. కొన్ని డజన్ల ఎన్‌ఎస్‌జీ కమెండోల కోసం సమయం వృథా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌జీ, సైన్యం ఇలా ఒకరి తరువాత మరో బలగాన్ని ప్రయోగించడం సరైన పద్ధతి కాదని రక్షణ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇక శస్త్ర చికిత్స నిర్వహించినట్టే ఉగ్రవాదుల ఏరివేత దశలవారీగా పూర్తి చేశామని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంలోని కీలక యుద్ధ సామగ్రితోపాటు అక్కడ నివాసముంటున్న వైమానిక సిబ్బంది కుటుంబాలకు నష్టం జరగకుండా పకడ్బందీ ప్రణాళికతో ఐదు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేశామని సైనికాధికారులు తెలిపారు.


కొనసాగుతున్న కూంబింగ్...
ఇదిలా ఉంటే ఉగ్రవాదుల బృందంలోని నలుగురు సభ్యులు వైమానిక స్థావరానికి చేరుకోవడానికి ఓ రోజు ముందు ఎస్పీ సల్వీందర్‌సింగ్‌తో పాటు ఆయన స్నేహితుడు, వంటమనిషిని కిడ్నాప్‌ చేశారు. సల్వీందర్‌తోపాటు వంట మనిషిని వెంటనే వదిలేసిన ఉగ్రవాదులు ఆయన స్నేహితుణ్ని కొంత దూరం తమ వెంట తీసు కెళ్లారు. అయితే సల్వీందర్‌, ఆయన వంట మనిషి పంజాబ్‌ పోలీసులకిచ్చిన సమాచారాన్ని నిర్లక్ష్యం చేశారన్న విమర్శలున్నాయి. వెంటనే అలర్ట్‌ అయి ఉంటే ఉగ్రవాదుల బృందం వైమానిక స్థావరానికి చేరుకోకముందే నిలువరించి ఉండేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు గురుదాస్‌ పూర్‌లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో ఐదుగురు ఉగ్రవాదులు సరిహద్దుల్లో తలదాచుకున్నారనే సమాచారం రావడంతో కూంబింగ్‌ కొనసాగుతోంది. 

06:34 - January 7, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ పొలిటికల్‌ స్కెచ్‌తో రగిలిపోతున్న కాంగ్రెస్‌.. అంతే దూకుడుగా గులాబీ సర్కారుపై ఎటాక్‌ చేస్తోంది.. ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూనే... న్యాయపోరాటంతో అధికారులపై ఒత్తిడి పెంచుతోంది.. ఓవైపు క్యాడర్‌... మరోవైపు లీడర్లను ఏకం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగబోతున్నా డిగ్గీరాజా. గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే హైదరాబాద్‌లో వాతావరణం వేడెక్కింది.. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.. రెండు పార్టీల డైలాగ్‌ వార్ ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది.. గ్రేటర్‌ ఎన్నికల ప్రక్రియను కుదిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. ఈ అంశంపై సీరియస్‌ స్పందిస్తోంది హస్తం పార్టీ.... ఆర్డినెన్స్‌ ద్వారాగానీ.. అసెంబ్లీలోగానీ చట్టం ద్వారాగానీ ప్రక్రియను మార్చాల్సిందిపోయి. ఇలా జీవో తేవడం సరికాదని మండిపడుతోంది. ఎన్నికలను హైజాక్‌ చేసేందుకు గులాబీ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు.. మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డిలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లేఖాస్త్రాన్ని సంధించారు. ప్రభుత్వ అడ్డగోలు తనానికి అధికారులు వంతపాడుతున్నారని లేఖలో ఆరోపించారు.

విమర్శల వర్షం..
టీఆర్‌ఎస్‌ పనితీరుపైకూడా కాంగ్రెస్‌ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఎన్నికల హామీల్లో ఒక్కటికూడా అమలు చేయలేదని మండిపడుతున్నారు హస్తం నేతలు. టీఆర్‌ఎస్‌ మాటల పార్టీ - కాంగ్రెస్‌ చేతల పార్టీ అన్న పోస్టర్‌ను విడుదల చేశారు. గులాబీ దళం తప్పులను ప్రజల్లోకి తీసుకువెళతామని నేతలు చెబుతున్నారు. లోకల్‌గా పార్టీ ఇలా దూసుకుపోతుంటే... ఈ స్పీడ్‌ను మరింతపెంచేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్‌ ఈ నెల 9న రంగంలోకి దిగబోతున్నారు. రెండు రోజులపాటు నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇలా ఒక్కో విషయంపై దూకుడు పెంచుతూ గులాబీదళంపై ఒత్తిడి పెంచుతున్నారు హస్తం నేతలు.

06:31 - January 7, 2016

హైదరాబాద్ : ఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛ హైదరాబాద్‌ను కొనసాగించాలని తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలతో పాటు గ్రేటర్ పరిధిలో ఉన్న ఉద్యోగ, కార్మిక వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి టీఆర్‌ఎస్‌ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్‌ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ కారు జోరు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్లో జీహెచ్‌ఎంసీ అవ‌లంభిస్తున్న శాస్త్రీయ ప‌ద్ధతులు దేశానికే ఆద‌ర్శవంతంగా నిలుస్తోందని రాష్ర్ట మంత్రి కేటీఆర్ అన్నారు. జిహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో కేటీఆర్‌.. గ్రేటర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చెత్త బుట్టలపై శిక్షణ..
ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ పారిశుధ్య కార్మికుల యూనిఫాంను ధరించి కార్మికులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేసారు. విశ్వనగ‌రంగా హైద‌రాబాద్ న‌గ‌రాన్ని మార్చే దిశ‌గా దేశంలో ఏ న‌గ‌రంలోలేని విధంగా ఇంటింటికి రెండు డ‌స్ట్‌బిన్‌ల చొప్పున 44 ల‌క్షల బిన్‌ల‌ను, చెత్త సేక‌ర‌ణ‌కు 2వేల ఆటోటిప్పర్‌లను పంపిణీ చేస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో గ్రేటర్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భారీగా వేత‌నాలు పెరగనున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దీంతో బల్దియాలోని 1872మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు లబ్ది చేకురుతుందని గుర్తు చేశారు మంత్రి కేటిఆర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు పారిశుధ్య కార్మికులకు తడిపొడి చెత్త కోసం పంపిణీ చేసిన చెత్త బుట్టల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. పారిశుధ్య కార్మికుల సేవల వల్లే హైదరాబాద్ నగరానికి క్లీన్ అండ్ గ్రీన్ సీటి అవార్డులు వచ్చాయని భవిష్యత్తులో దేశానికి ఆదర్శ నగరంగా నిలుపాలని గ్రేటర్‌ కమిషనర్‌ తెలిపారు. 

06:28 - January 7, 2016

హైదరాబాద్ : తెలంగాణపై కేంద్రం మరోసారి శీతకన్ను వేసింది. కరవు పీడిత రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసినా.. ఆ జాబితాలో తెలంగాణను చేర్చకపోవడంపై గులాబీ సర్కార్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కరవు మండలాలపై నివేదికలు ఇచ్చి రెండు నెలలైనా కేంద్రం స్పందించకపోవడం దారుణమంటున్నారు. కరవు పీడిత రాష్ట్రాలకు 2,553 కోట్ల రూపాయలు సాయం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో కరవు ప్రభావిత ప్రాంతాలపై జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 434 కోట్లు, ఒడిశాకు 815 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు 1,304 కోట్లు మంజూరు చేశారు. అయితే నిధుల కేటాయింపులో కేంద్రం తెలంగాణను విస్మరించినట్లుగా తెలుస్తోంది.

సాయం అందించాలన్న సీఎస్...
తెలంగాణలోని కరవు ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదికలు రాలేదని.. అవి వచ్చిన తర్వాత కేంద్ర బృందంచే అధ్యయనం చేయించి ఆర్ధికసాయం చేస్తామని ఇప్పటివరకు బీజేపీ నేతలు చెప్పారు. అయితే రాష్ట్రం కరవు మండలాలను ప్రకటించి నివేదికలు పంపిన తర్వాత కూడా నిధులు మంజూరు చేయకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎస్‌ రాజీవ్‌శర్మ నేతృత్వంలో రాష్ట్ర బృందం కరవు ప్రాంతాలకు తక్షణ సాయం అందించాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సిరాజ్‌ హుస్సేన్‌కు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలోని రైతుల దయనీయ స్థితి, కరవు పరిస్థితులపై మరోసారి నివేదిక ఇచ్చారు. అయితే ఇప్పటికే కేంద్ర బృందాలు కేంద్రానికి నివేదికలు అందజేశాయని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాజీవ్‌శర్మ తెలిపారు.

రైతులు..ప్రజలు ఇబ్బందులు..​
ఇప్పటికే కరవు ప్రాంతాలకు నిధుల విడుదలపై రెండుసార్లు సమావేశమైన ఉన్నతస్థాయి కమిటీ.. తెలంగాణను ఉద్దేశపూర్వకంగానే పరిగణనలోకి తీసుకోవడం లేదని రాష్ట్ర పాలకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేంద్రం మాత్రం మరో వారం రోజుల్లో సమావేశమై తెలంగాణకు నిధులు కేటాయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కేంద్రం, తెలంగాణ రాష్ట్రం మధ్య జరుగుతున్న ఈ కోల్డ్‌వార్‌తో రైతులు, ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. 

06:25 - January 7, 2016

కర్నూలు : జిల్లాలో మూడు హామీలు, ఆరు విమర్శలతో సాగింది ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం.. ప్రజలను ఉత్సాహపరుస్తూనే... ప్రతిపక్షంపై ఫైర్‌ అయ్యారు ఏపీసీఎం.. నేర చరిత్ర ఉన్నవారు చెబితే తాము వినాలా? అని ప్రశ్నించారు.. అసెంబ్లీలో వైసీపీ తీరు సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. గొస్పాడు మండలం దీబగుంట్లలో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు చంద్రబాబు.. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా తాము పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు.. వచ్చే నెలనుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు ఉచితమని ప్రకటించారు. వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ సీఎం.. నేర చరిత్ర ఉన్నవారు చెబితే తాము వినాలా? అని ప్రశ్నించారు... అసెంబ్లీలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు సిగ్గుపడేలా ఉందని మండిపడ్డారు. ప్రజలకు హామీలిస్తూనే... ప్రతిపక్షంపై విమర్శల వర్షం కురిపించారు చంద్రబాబు జనాలను ప్రశ్నిస్తూ ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు.. 

06:23 - January 7, 2016

వరంగల్ : జిల్లాలో మూడు రోజుల కేసీఆర్‌ పర్యటన ముగిసింది. తొలిరోజు 4లైన్ల జాతీయ రహదారి, గోదావరిపై బ్రిడ్జిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇక రెండోరోజు..చెల్పూర్లోని 600 మెగావాట్ల కేటీపీపీ రెండో యూనిట్‌ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అదేరోజు రాత్రి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మూడోరోజు..మహిళా సంఘాల సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. జిల్లాలో 3రోజులు పర్యటించిన సీఎం కేసీఆర్‌..జిల్లాకు వరాల జల్లు కురిపించారు. జిల్లా అభివృద్ధి సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌..పలు కీలకనిర్ణయాలను అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ 30 నుంచి నాలుగు జిల్లాల్లోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుంచి నిరంతరంగా త్రాగునీరు అందించనున్నట్లు ప్రకటించారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రతీ సంవత్సరం బడ్జెట్లో 300 కోట్ల రూపాయల్ని కేటాయిస్తామన్నారు సీఎం కేసీఆర్‌. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే నెంబర్‌ వన్‌ మల్టిపుల్ టెక్స్‌టైల్ పార్క్‌ను నగరంలో ఏర్పాటు చేస్తామన్నారు. వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం కేసిఆర్. వరంగల్‌కు హెల్త్‌ యూనివర్శిటీతో పాటు వెటర్నరీ కళాశాల, అగ్రికల్చరల్ కళాశాల, ట్రైబల్ వర్శిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

హామీలు నెరవేరుతాయా ?
ఇక వరంగల్ నగరాన్ని మూడేళ్లలో స్లమ్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు 30వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 250 ఎకరాల్లో థీమ్ పార్క్, 20 వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, 20 కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తామన్నారు. అలాగే ఎంజిఎం ఆస్పత్రిని మాతా, శిశువు కేంద్రంగా మార్చి..కేఎంసిలో మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. వరంగల్ కలెక్టరేట్ భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మిస్తామన్నారు. 12 అంతస్థుల్లో అత్యాధునిక పోలీస్‌ కమిషనరేట్, గ్రేటర్ వరంగల్‌కు కొత్త భవనాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మొత్తానికి మూడు రోజులపాటు జిల్లాలో బిజీబిజీగా గడిపిన సీఎం కేసిఆర్..జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. జిల్లా అభివృద్ధిపై ప్రజలకు ఆశలు రేకెత్తించారు. మరి సీఎం ఇచ్చిన హామీలు ఎప్పటికి అమలువుతాయో చాడాలంటున్నారు నగర ప్రజలు. 

06:20 - January 7, 2016

విజయవాడ : కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎట్టకేలకు సిట్‌ ముందు విచారణకు హాజరయ్యారు. పన్నెండున్నర గంటలపాటు విచారించిన అధికారులకు ఎలాంటి సమాచారం లభించలేదని తెలుస్తోంది. మరోవైపు తనను రాజకీయం ఎదుర్కోలేక కుట్రపూరితంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విష్ణు ఆరోపిస్తున్నారు. నేడు కూడా విష్ణును సిట్‌ బృందం విచారించనుంది. నెల రోజులకు ఎ-9గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉదయం 11 గంటలకు కృష్ణలంక పీఎస్‌కు ఆయన చేరుకున్నారు. సిట్‌ అధికారులు లడ్డా, సింధిల్‌లు విష్ణును 12 గంటలపాటు విచారించారు.

సహకరించని విష్ణు ?
విచారణలో మల్లాది విష్ణు అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది. తనకు ఏ పాపం తెలియదని.. బార్‌ లైసెన్స్‌ కూడా తన పేరు మీద లేదని.. రాజకీయంగా ఎదుర్కోలేక తనను కుట్రపూరితంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సిట్‌ అధికారులకు విష్ణు తెలిపినట్లు సమాచారం. అధికారులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా విష్ణు నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు. దీంతో విచారణ సుదీర్ఘంగా అర్ధరాత్రి వరకు కొనసాగింది.

విష్ణు అనుచరుల ఆందోళన..
ఇక సిట్‌ బృందం అర్ధరాత్రి కావడంతో విష్ణును ఇంటికి పంపించారు. గురువారం మరోసారి విచారణకు హాజరుకావాలని చెప్పారు. అయితే బయటకు వచ్చిన విష్ణు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మరోవైపు కృష్ణలంక పీఎస్‌ ఎదుట హైడ్రామా కొనసాగింది. విష్ణును విచారణకు తీసుకెళ్లి 12 గంటలు కావస్తున్నా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని.. ఆయనను అరెస్ట్‌ చేశారా ? ఇంకా ఎంతసేపు విచారిస్తారని విష్ణు తరపు న్యాయవాదులు, కార్యకర్తలు కొంతసేపు హడావుడి చేశారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ స్టేషన్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు సర్దిచెప్పి చెప్పడంతో ఆందోళన విరమించారు. నిన్న సిట్‌ విచారణకు హాజరైన విష్ణు నేడు కూడా హాజరుకానున్నారు. ఇప్పటివరకు తమకు కావాల్సిన సమాచారమేది లభ్యం కాకపోవడంతో.. ఈరోజు విచారణ ఎలా సాగుతుందోనన్న టెన్షన్‌ అందరిలోనూ నెలకొంది. 

06:18 - January 7, 2016

హైదరాబాద్‌ : నగరంలోని పేరు పొందిన గుడిమల్కాపూర్‌లోని పూల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ షాపులో మంటలు చెలరేగాయి. దీనితో సమీపంలో ఉన్న 20 షాపులు దగ్ధమయ్యాయి. భయంతో వ్యాపారులు పరుగులు తీశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. 

గుడి మల్కాపురంలో అగ్నిప్రమాదం..

రంగారెడ్డి : గుడిమల్కాపురం పూల మార్కెట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 18 దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు.

నేటి నుండి అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జాతీయ మహాసభలు...

హైదరాబాద్ : నేటి నుండి ఆర్టీసీ కళ్యాణ మంటపంలో అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జాతీయ మహాసభలు జరగనున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. సుమారు వేయి మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. 

Don't Miss