Activities calendar

08 January 2016

బీసీ జనరల్ కు గ్రేటర్ మేయర్ పదవి

హైదరాబాద్: గ్రేటర్ మేయర్ రిజర్వేషన్ పై డైలామా తొలగింది. గ్రేటర్ మేయర్ పదవిని బీసీ జనరల్ కు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలోని జీవోనే అమలు చేయాలని టీసర్కార్ నిర్ణయించింది. 

జమ్మికుంట ఎస్సై జగన్ మోహన్ ఆత్మహత్య...

కరీంనగర్: జమ్మికుంట ఎస్సై జగన్ మోహన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దపల్లి పోలీస్ క్వార్టర్ లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే పెద్దపల్లి నుంచి జమ్మికుంటకు బదిలీ అయ్యారు. 

22:22 - January 8, 2016

పేరులో ఫ్రీ ఉంది కానీ.. జరిగేదీ నిలువునా మోసమే… ! ఫ్రీ బేసిక్స్ తో ఇంటర్నెట్ కు సంకెళ్లు వేసే ప్రయత్నాలు… !
నెట్ న్యూట్రాలిటీకి గండి కొట్టాలనే ఆరాటం..! ఇంటర్ నెట్ ను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు…! బేసిక్స్ ని నమ్మితే ఫేస్ బుక్కే…!!, ఇంటర్నెట్ కు అడ్డంకులు కల్పించే ఫ్రీబేసిక్స్ పై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. మరిన్ని వీడియోలో చూద్దాం…

22:08 - January 8, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ మేయర్‌ పీఠం ఎవరిని వరిస్తుంది? ఏ వర్గం వారికి ఆ అవకాశం దక్కుతుంది? బల్దియా ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించడంతో ఇప్పుడీ అంశం ఉత్కంఠ రేపుతోంది. రొటేషన్‌ విధానమైతే బీసీలకు దక్కాలి. కానీ విభజన లెక్కలతో కొత్త సమీకరణాలు మారబోతున్నాయా? 
అధికార పార్టీ...అంతు చిక్కని వ్యూహాలు 
గ్రేటర్ ఎన్నికలపై ముందు నుంచి విపక్ష పార్టీలకు అంతు చిక్కని వ్యూహాలను అధికార పార్టీ అమలు చేస్తోంది. గ్రేటర్‌లో పాగా వేసేందుకు ముందస్తు ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌తో ప్రతిపక్ష పార్టీలను ఇరకాటం పెడుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కారు పార్టీ..ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకెళ్తోంది.  
మేయర్‌ సీటుపై వీడని సస్పెన్స్‌
ఏడాది కాలంగా ఎన్నికలపై తీవ్ర కసరత్తు చేస్తున్న గులాబి దళపతి మేయర్‌ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 150 డివిజన్లకు జరిగిన వార్డుల విభజనపై  ప్రతిపక్ష పార్టీలు  తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసినా...మేయర్ స్థానం కేటాయింపుపై సస్పెన్స్‌ వీడటం లేదు. ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించడం చర్చనీయంశంగా మారుతోంది.
అగ్రవర్ణాలకా? బలహీన వర్గాలకా? 
వాస్తవానికి రొటేషన్ విధానం ప్రకారం మేయర్ స్థానం గత ఎన్నికల్లో..జనరల్ కావడంతో ఈసారి బిసిలకు దక్కుతుందని అంతా భావించారు. అయితే అధికార పార్టీ మాత్రం...మేయర్ పీఠాన్ని తమకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ నేతకు కట్టబెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దఫా జనరల్ స్థానంగా ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈసారి కూడా అగ్రవర్ణాలకే అగ్రతాంబూలం ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేతల కొత్త సమీకరణాలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. గతంలో ప్రకటించిన రిజర్వేషన్లు రాష్ట్ర విభజనతోనే ఉష్‌కాక్ అంటున్నారు. మేయర్‌ పీఠం ఏ వర్గాన్ని వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. 

 

22:04 - January 8, 2016

పశ్చిమగోదావరి:  కాపు రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఉభయ గోదావరి జిలాల్లో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 
జన్మభూమి మా ఊరు కార్యక్రమం 
జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. మొదట పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ తరువాత తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లారు. 
కాపుల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం : చంద్రబాబు
కాపుల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. కాపుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. బీసీలు ఎప్పడూ టీడీపీ వెంటే ఉంటారని చంద్రబాబు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆదాయం పెంచుకునేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని చెప్పారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులను పారదోలేందుకు కృషిచేస్తున్నామని సీఎం అన్నారు. పొలాల్లో కుంటలు తవ్వడం, చెరువుల్లో పూడిక తీయడం వంటి పనుల చేపడితే భూగర్భ జలాలను పెంచవచ్చని చంద్రబాబు సూచించారు. 
కాకినాడను అభివృద్ధి చేస్తా : చంద్రబాబు
పశ్చిమలో పర్యటన ముగించుకున్న తరువాత చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా వెళ్లారు. కాకినాడలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. పర్యటనలో భాగంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం పరిశీలించారు.నల్లజర్లలోని పంచాయతీ భవనాన్ని చంద్రబాబు ప్రారంభించారు. గ్రామంలోని ఎర్రచెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను  పరిశీలించారు. జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో గ్రంథాలయం, స్పోర్ట్స్‌మీట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.  

21:58 - January 8, 2016

హైదరాబాద్‌ : అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంకోసం జాతీయ మహాసభల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఐసీడీఎస్‌ పరిరక్షణకోసం పోరుబాట పట్టాలని సభలో నిర్ణయించారు.. ఈ కార్యక్రమంలో వాడి వేడి చర్చలతోపాటు... ఆట పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.. 
అంగన్‌వాడీ సమస్యలపై సుదీర్ఘ చర్చ 
హైదరాబాద్‌లో అంగన్ వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఎనిమిదవ జాతీయ మహాసభలు కొనసాగుతున్నాయి... ఐసీడీఎస్ పట్ల ప్రభుత్వ వైఖరి, అంగన్‌వాడీ సమస్యలపై సభల్లో సుదీర్ఘ చర్చ నడుస్తోంది.. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాలనుంచి 8వందలమంది ప్రతినిధులు హాజరయ్యారు.. అంగన్‌వాడీ కేంద్రాలను కేంద్రం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని... సిఐటియు నేత హేమలత ఆరోపించారు.. ఈ సెంటర్లను వేదాంత సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుతున్నాయని మండిపడ్డారు..
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు 
అంగన్‌వాడీలపై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సభలో నిర్ణయించారు.. ఫిబ్రవరి ఐదున భారీ ప్రదర్శన చేస్తామని ప్రకటించారు.. అదే నెల 15న పార్లమెంట్‌ ఎదుట ఆందోళన చేయాలని తీర్మానించారు.. త్రిపురలో అంగన్‌వాడీ వర్కర్లకు వామపక్ష ప్రభుత్వం ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ ఇస్తోందని ఆ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జర్మినా తెలిపారు.. మహాసభల్లో వాడి వేడి చర్చలతోపాటు.. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆలరించాయి..

 

21:55 - January 8, 2016

విజయవాడ : పచ్చని సంసారంలో చిచ్చుపెడుతూ... వందలాదిమంది ప్రాణాలు తీస్తున్న మద్యంపై కదం తొక్కారు మహిళా నేతలు.. మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు.. ఐద్వా జాతీయ నేత బృందాకరత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. ఐద్వా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
విజయవాడలో భారీ ర్యాలీ 
ఏపీలో మద్యం పాలసీని మార్చాలంటూ ఐద్వా పోరుబాటపట్టింది.. చలో విజయవాడ పేరుతో భారీ ర్యాలీ చేపట్టింది.. హనుమంతరాయ గ్రంథాలయంనుంచి లెనిన్‌ లెనిన్‌ సెంటర్‌వరకూ జరిగిన ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ నేత బృందాకరత్‌, మహిళా సమితి నేత యానీ రాజా, రాష్ట్ర మహిళా నేతలు పాల్గొన్నారు.. 
గ్రంథాలయంలో సదస్సు 
ర్యాలీ తర్వాత హనుమంతరాయ గ్రంథాలయంలో సదస్సు జరిగింది.. ప్రజల్ని సర్కారు మద్యానికి బానిస చేస్తోందన్నారు బృందాకరత్‌.. జన్మభూమి అంటూ రాష్ట్రాన్ని మద్యభూమిగా మారుస్తున్నారని ఆరోపించారు. మద్యం పాలసీని మార్చేవరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని మహిళా నేతలు స్పష్టం చేశారు.

 

21:51 - January 8, 2016

పంజాబ్ : గురుదాస్‌పూర్‌ ఎస్పీ సల్విందర్‌సింగ్‌కు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయనను విచారించేందుకు ఎన్‌ఐఏ సమన్లు జారీ చేసింది. లైడిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించడం కోసం సల్విందర్‌సింగ్‌ను ఢిల్లీకి తరలించనున్నట్టు సమాచారం. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడికి ముందు ఉగ్రవాదులు సల్విందర్‌సింగ్‌, ఆయన అనుచరులను నిర్బంధించారు. ఎస్పీ పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో సల్వీందర్‌సింగ్‌ పాత్రపై అనుమానాలు తలెత్తాయి.

 

21:50 - January 8, 2016

ఇస్లామాబాద్ : పఠాన్‌కోట్‌ ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్‌ విచారణ ప్రారంభించింది. ప్రధాని నవాజ్‌షరీఫ్‌ విచారణ బాధ్యతను ఐబి చీఫ్‌కు అప్పగించారు. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడికి సంబంధించిన ఆధారాలను భారత్‌ పాకిస్తాన్‌కు సమర్పించింది. ఈ ఆధారాలపై   పాకిస్తాన్‌ ఇంటిలిజెన్స్‌ బ్యూరో విచారణ జరపనుంది. బాల్‌ మీ కోర్టులోనే ఉంది.. దీనిపై సత్వరమే విచారణ జరపాలని భారత్‌ తన వైఖరిని పాక్‌కు స్పష్టం చేయడంతో- నవాజ్‌ షరీఫ్‌ విచారణ దిశగా అడుగులు వేసినట్టు కనిపిస్తోంది.  

 

21:45 - January 8, 2016

ఎక్కడియక్కడ బయటవడ్డ రిజర్వేషన్ల లెక్క.. వచ్చే నెల రెండు నాడు ఓట్లు… ఐదునాడు లెక్కిపు... పోరగాళ్లను పొర్కపొర్కగొట్టిన పోలీసోళ్లు..నడిమిట్లొళ్లకు చుట్టుకున్న లవర్స్ పంచాయతీ, జీహెచ్ ఎంసీని గెలికి ఆగమైన అంబాజిడర్… హైకోర్టు మాటలతోటి ప్రతిపక్షాలకు జోష్, పేరు మార్సుకున్న టీఆర్ ఎస్ పార్టీ.. భీమవరంల పోటీజేస్తంటున్న కేటీఆర్, చంద్రాలును చండాతున్న బైరెడ్డి… కాక్ బుల్స్ స్టోరీ సెపుతున్నడని ఫైర్,  గ్రాఫిక్స్ తోటి గారడి చేసిన రాజమౌళి… బాహుబలి దున్నపోతుకు బహుమేకప్. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం…

 

21:20 - January 8, 2016

గ్రేటర్ వార్... పబ్లిక్ పోల్స్ కు స్వాగతం.... జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ లో సమస్యలు.. ప్రజల స్పందన అనే అంశాలపై టెన్ టివి గ్రేటర్ వార్.. పబ్లిక్ పోల్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడీగూడలో టెన్ టివి పబ్లిక్ పోల్స్ ను నిర్వహించింది.  
అక్కడ నెలకొన్న సమస్యలపై నేతలు, స్థానికులు మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

'రిజర్వేషన్లలో పొరపాటు జరగకుండా చూడాలి :మర్రిశశీధర్ రెడ్డి

హైదరాబాద్: సీఎస్ రాజీవ్ శర్శను కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల వార్డులపై రీప్రజెంటేషన్ ఇచ్చామని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశీధర్ రెడ్డి తెలిపారు. రిజర్వేషన్లలో పొరపాటు జరగకుండా చూడాలని కోరామని చెప్పారు. గతంలో తప్పులు జరిగిన వార్డుల రిజర్వేషన్లను సరి చేయాలని సీఎస్ కు సూచించామని పేర్కొన్నారు. 

ఎపి స్కూళ్లకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

హైదరాబాద్ : ఎపిలోని పాఠశాలలకు రేపటి నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. 18న పాఠశాలల పున:ప్రారంభం అవుతుందన్నారు. 

20:17 - January 8, 2016

హైదరాబాద్ : బల్దియా ఎన్నికల కోసం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ తెలిపారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే 45 వేల మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని చెప్పారు. 

20:00 - January 8, 2016

విశాఖపట్నం : విశాఖ రైల్వే జోన్‌పై రాయపాటి సాంబశివరావు, దాడి వీరభద్రరావు మధ్య మాటల యుద్ధం హాట్‌టాపిక్‌గా మారింది. అమరావతిలోనే రైల్వేజోన్‌ ఏర్పాటుచేయాలన్న రాయపాటి వ్యాఖ్యలపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని దాడి హితవు పలికారు. 

 

19:56 - January 8, 2016

చిత్తూరు : జిల్లాలోని పుత్తూరులో దారుణం జరిగింది. 24 వార్డు సమీపంలో వ్యవసాయ బావిలో ఓ యువతి శవమై తేలింది. పుత్తూరుకు చెందిన దివ్య గురువారం సాయంత్రం ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి రాలేదు. యువతి కోసం తల్లిదండ్రులు వెతుకుతున్నారు. ఇంతలోనే ఆమె చనిపోయినట్లు పోలీసుల నుంచి సమాచారం వచ్చింది. ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు దివ్య మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు.

19:52 - January 8, 2016

కరీంనగర్ : బాలిక ప్రేమ వ్యవహారం గ్రామంలో చిచ్చుపెట్టింది.. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటకుచెందిన రజని డిగ్రీ చదువుతోంది.. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే శంకర్‌ను ప్రేమించింది.. ఈ విషయం పెద్దలకు తెలియడంతో గ్రామంలో పంచాయితీకూడా జరిగింది.. ఇంతలో తమ అమ్మమ్మ ఇంటికి వెళ్లిన రజనీ అక్కడ శంకర్‌తో కలిసి రహస్యంగా ఎటో వెళ్లిపోయింది.. వీరి వివాహానికి గ్రామంలోని నలుగురు యువకులు సహకరించారంటూ యువతి పేరెంట్స్ స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.. పోలీసులు ఈ యువకుల్ని విచారణ కోసం పిలిపించారు.. రజనీ, శంకర్‌ ఎక్కడికి వెళ్లారో చెప్పాలంటూ ప్రశ్నించారు.. ఈ వేధింపులు తట్టుకోలేక వారంతా పురుగులమందు తాగారు.. వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. అయితే మైనర్‌ అయిన తమ బిడ్డ కనిపించకుండా పోవడానికి ఈ నలుగురు యువకులే కారణమని రజనీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. అటు యువకుల పేరెంట్స్ మాత్రం ఈ విషయంలో తమ బిడ్డల ప్రమేయం లేదని స్పష్టం చేస్తున్నారు.. ఇలా ప్రేమ జంట అదృశ్యం గ్రామస్తులకు కంటిమీద కునుకులేకుండా చేసింది..  

 

19:48 - January 8, 2016

నల్గొండ : అత్యాధునికయుగంలోనూ మూఢనమ్మకాలు బలంగానే పరిఢవిల్లుతున్నాయి. శాష్ట్రసాంకేతి రంగాల్లో దేశం ఎంతో అభివృద్ధి చెందినా… మూఢనమ్మకాలు ప్రజలను పట్టిపీడిస్తూనే ఉన్నాయి. మూఢనమ్మకాలను గట్టిగా నమ్మే ఓ తండావాసులు దయ్యం భయంతో ఏకంగా పిల్లల్ని స్కూల్‌కు పంపడం మానేశారు.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం లచ్చమ్మకుంటక తండాలో ప్రభుత్వ పాఠశాల ఉంది.. ఇందులో 22మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. అయితే ఈ గ్రామంలో ఓ మహిళ అంతుచిక్కని జబ్బుతో అనారోగ్యం పాలైంది.. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా తగ్గలేదు... ఇంతలో మరో వ్యక్తి ఇలాంటి లక్షణాలతో కనిపించాడు.. వీరిద్దరికీ దయ్యం పట్టిందని.. అందువల్లే జబ్బు తగ్గడంలేదని ఊర్లో ప్రచారం జరిగింది.. అటు స్కూల్‌కు వెళ్లాలంటే విద్యార్థులు సమాధుల పక్కనుండి నడవాలి.. ఈ సమయంలో తమ చిన్నారులకు ఎక్కడ దయ్యం పడుతుందోనని గ్రామస్తులు భయపడ్డారు.. మొత్తం పిల్లల్ని పాఠశాలకు పంపడం మానేశారు.. ఈ విషయం తెలుసుకున్న ఎంఈవో గ్రామస్తులకు కౌన్సిలింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. 

 

19:42 - January 8, 2016

హైదరాబాద్ : జర్నలిస్టులకు శుభవార్త....ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న జర్నలిస్టు హెల్త్‌ కార్డులను ఎట్టకేలకు ప్రభుత్వం జారీ చేసింది. దీనికి సంబంధించిన హెల్త్‌ కార్డ్‌ వెబ్‌సైట్‌ను ఐటి మంత్రి కేటీఆర్‌ సచివాలయంలో ప్రారంభించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని కేటీఆర్‌ అన్నారు. కాస్త ఆలస్యమైనా ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల హామీలను నెరవేరుస్తామని తెలిపారు. నగదు రహిత ఆరోగ్య కార్డులను జారీ చేసిన ఘనత దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని ప్రెస్‌ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

 

18:51 - January 8, 2016

క్యాజువల్ వేర్ గా చీరలను ధరించేందుకు కొందరు అతివలు ఇష్టపడతారు. చీరలో హుందాగా కనిపించడంతో పాటు సౌకర్యంగా భావించే అలాంటి వారి కోసం లేటెస్ట్ క్యాజువల్ వేర్ సారీ కలెక్షన్ తో ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది.
పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.…

 

18:50 - January 8, 2016

ఇంటా, బయటా మహిళలకు రక్షణ కరువైన నేపథ్యంలో మహిళలు ఆత్మరక్షణ పద్ధతులపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆపద సమయంలో తమ దగ్గర ఉన్న వస్తువులనే ఆయుధాలుగా ఉపయోగించి తమను తాము రక్షించుకునే వీలుంటుంది. అలాంటి పద్ధతులేమిటో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.…

 

గ్రేటర్ లో ఎన్నికల కోడ్...

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. ఇవాళ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 2న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎక్కడైనా రీపోలింగ్ ఉంటే ఫిబ్రవరి 4న చేపడుతామని తెలిపారు.

ఆధునిక భారత నిర్మాణంలో బిల్డర్లు భాగస్వాములే: వెంకయ్య

హైదరాబాద్: ఆధునిక, శక్తివంతమైన భారత్ నిర్మాణంలో బిల్డర్లు భాగస్వాములేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇవాళ్టి నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తోన్న 27వ ఆలిండియా బిల్డర్స్ అసోసియేషన్ వేడుకలకు ఆయన గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సమావేశంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు 12 వందల మంది నంబర్ వన్ కాంట్రాక్టర్లు, టర్కీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తాను నిర్మాణదారుల బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్తానన్నారు.

18:40 - January 8, 2016

నేరస్థుడి వయసుతో ముడిపడి న్యాయస్థానం తీర్పు చెప్పాలా? లేక నేరానికి తగినట్టుగా శిక్షలుండాలా? ఏడాదిన్నరగా  జరుగుతున్న ఈ చర్చకు తెరపడి సవరించిన జువినైల్ జస్టిస్ చట్టం రాష్ట్రపతి ఆమోద ముద్రను వేసుకుంది.

బాలల న్యాయ చట్టం ఆమోదం పొందటంతో మహిళల రక్షణకు సంబంధించి జాతీయ మహిళా కమీషన్ కు కొన్ని కీలక అధికారాలు కల్పించేందుకు ప్రయత్నం జరుగుతోంది. 

మగవాళ్లతో పోల్చుకుంటే మహిళల్లో నిద్రలేమి సమస్య అధికమంటోంది ఒక పరిశోధన. అనేక దశలలో సంభవించే అంతర్గత మార్పులు ఈ సమస్యకు కారణమమని తేల్చింది.

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జర్మనీలో పలువురు మహిళలు లైంగిక దాడికి గురయ్యారు. వారికి భద్రత కరువైన పరిస్థితులను నిరసిస్తూ అక్కడి మహిళలు పెద్ద ఎత్తున నిరసన బాట పట్టారు.

నాలుగు రోజుల పాటు జరగనున్న ఎనిమిదవ అంగన్ వాడీ అఖిల భారత మహాసభలు ప్రారంభమయ్యాయి. పదో తేదీన బహిరంగ సభతో ముగియనున్న ఈ సభలు అంగన్ వాడీలకు సంబంధించి పలు అంశాలను చర్చించేందుకు వేదికయ్యింది.

పర్వతారోహణలో తనదైన ప్రత్యేకత చాటిన అతివ మరో అరుదైన ఘనత సాధించింది. అనుకోని ప్రమాదంలో వికలాంగురాలైన ఆమె పర్వతారోహణలో అద్భుతమైన ప్రతిభ కనుబరుస్తోంది.

భారత మహిళా యువ షూటర్ అరుదైన రికార్డు సాధించింది. స్వీడిష్ కప్ గ్రాండ్ ఫ్రీ షూటింగ్ లో సత్తా చాటి ప్రత్యేకత చాటింది.

18:00 - January 8, 2016

పశ్చిమగోదావరి : జిల్లాలోని భీమవరంలో నిర్మాణంలోఉన్న చర్చీ భవనం కూలిపోయింది. ఈ ఘనలో నలబైమందికి తీవ్ర గాయాలయ్యాయి. భీమవరంలోని గెస్టు హౌజ్ రోడ్డులో నిర్మాణంలోఉన్న చర్చీ భవనం శ్లాబు... ఒక్కసారిగా కూలింది. దీంతో అక్కడ పని చేస్తున్న నలభైమందికి గాయాలయ్యాయి. వీరిలో 5 మందికి తీవ్రగాయాలయ్యాయి. భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. 20 మంది లోపల పని చేస్తున్నారు.. మరో 15 మంది బయటున్నారు.

 

17:46 - January 8, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల షెడ్యూలు విడుదల అయింది. ఫిబ్రవరి 2 న గ్రేటర్ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈమేరకు  జనవరి 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల వెలువడనుంది. ఈనెల 12 వ తేదీ నుంచి 17 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 18న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 21 వరకు గడువు ఇచ్చారు. అవరసమైతే ఫిబ్రవరి 4న రీపోలింగ్ నిర్వహించనున్నారు. 

గ్రేటర్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు..

వచ్చే నెలలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు గానూ ఆయా వార్డుల రిజర్వేషన్లను అధికారులు వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం....
వార్డు నెం.46- ఎస్టీజనరల్‌, 16- ఎస్టీ(మహిళ),
ఎస్సీ జనరల్‌ : 1, 4, 62, 133, 135 వార్డులు.
ఎస్సీ మహిళ : 60, 90, 142, 144, 147 వార్డులు.
బీసీ జనరల్‌ : ‌3, 29, 39, 43, 48, 51, 58, 64, 69, 65 వార్డులు.
బీసీ మహిళ 9, 26, 34, 35, 37, 41, 42, 47, 49, 57, 61, 63 వార్డులు కేటాయించారు.

గ్రేటర్ ఎన్నికల షెడ్యూలు విడుదల

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికల నగారా మోగింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఫిబ్రవరి 2న జీహెచ్‌ఎంసీలో 150 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 12 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ, జనవరి 18న నామినేషన్ల పరిశీలన, జనవరి 21న నామినేషన్ల ఉపసంహరణ, ఫిబ్రవరి 2న ఎన్నికలు, ఫిబ్రవరి 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏదైనా వార్డులో అనివార్య కారణాలతో పోలింగ్‌ ఆగితే ఫిబ్రవరి 4న నిర్వహిస్తారు.
 

17:21 - January 8, 2016

విజయవాడ : మద్యం పాలసీని రద్దు చేయాలని ఐద్వా జాతీయ నేత బృందాకరత్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మోడీ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అటవీ హక్కుల రక్షణ వంటి చట్టాలు నిర్వీర్యమతున్నాయని వాపోయారు. రైతులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎపిలో బడి, గుడి అన్న తేడా లేదని...ఎక్కడ చూసినా మద్యం షాపులే కనిసస్తున్నాయన్నారు. చంద్రబాబు జన్మభూమి అంటూ ఎపిని మద్యభూమిని చేస్తున్నారని పేర్కొన్నారు. మద్యం పాలసీని రద్దు చేయాలని... ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని తెలిపారు. ఎపికి ప్రత్యేకహోదా, ప్యాకేజీ అవసరమన్నారు. ఎపికి ప్రత్యేకహోదా అంశంపై సీఎం చంద్రబాబు బీజేపీతో పోరాడాలని.. కానీ ఆ పని మానేసి చంద్రబాబు విపక్షాలతో పోరాడుతుతున్నారని ఎద్దేవా చేశారు. ల్యాండ్ పూలింగ్ లో భూములు కోల్పోయిన రైతులకు సరైన నష్టపరిహారం అందించలేదన్నారు.

 

భారత్ నిర్మాణంలో బిల్డర్లు భాగస్వాములే:వెంకయ్యనాయుడు..

హైదరాబాద్: ఆధునిక, శక్తివంతమైన భారత్ నిర్మాణంలో బిల్డర్లు భాగస్వాములేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఇవాళ్టి నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తోన్న 27వ ఆలిండియా బిల్డర్స్ అసోసియేషన్ వేడుకలకు ఆయన గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సమావేశంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు 12 వందల మంది నంబర్ వన్ కాంట్రాక్టర్లు, టర్కీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తాను నిర్మాణదారుల బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్తానన్నారు.

పాక్, ఆప్ఘానిస్తాన్ లో మరోసారి భూకంపం..

హైదరాబాద్ : పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ లలో మరోసారి మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 5గా నమోదైంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్, ఆఫ్ఘానిస్థాన్ లోని హిందూకుష్ ప్రాంతాల్లో పాటు జమ్ముకశ్మీర్ లోనూ స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘానిస్థాన్-తజకిస్థాన్ సరిహద్దులోని బదకస్థాన్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఆస్థి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

16:56 - January 8, 2016

ఖమ్మం : కిడ్నీ రాకెట్‌ ముఠా ఖమ్మంలోనూ కలకలం రేపింది. కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టురట్టు అయింది. కొలంబోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ  తీసుకెళ్లి కిడ్నీలను మాయం చేస్తున్న ఆ ముఠా దారుణాలు వెలుగులోకి వచ్చాయి. దమ్మపేట మండలం నాయుడిపేట్‌ గ్రామానికి చెందిన నరేష్‌ ఈ ముఠా బారిన పడ్డాడు. 
అయితే నరేష్ తన ఇష్ట ప్రకారమే కిడ్నీ ఇచ్చాడా.. లేదా అతన్ని మోసం చేసి కిడ్నీ మాయం చేశారా అన్న కోణంలో సత్తుపల్లి డీఎస్ పీ కవిత విచారణ చేపట్టారు.

గ్రేటర్‌ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వార్డుల వారీగా రిజర్వేషన్లపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ (జనరల్‌) 1, ఎస్టీ (మహిళలు) 1, ఎస్సీ(జనరల్‌) 5, ఎస్సీ (మహిళలు) 5, బీసీ (జనరల్‌) 25, బీసీ (మహిళలు) 25, మహిళలు(జనరల్‌) 44, అన్‌రిజర్వ్‌డ్‌ 44 గా రిజర్వేషన్లను ఖరారు చేశారు. 

16:42 - January 8, 2016

హైదరాబాద్ :వచ్చే నెలలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు గానూ ఆయా వార్డుల రిజర్వేషన్లను అధికారులు వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం....
వార్డు నెం.46- ఎస్టీజనరల్‌, 16- ఎస్టీ(మహిళ),
ఎస్సీ జనరల్‌ : 1, 4, 62, 133, 135 వార్డులు.
ఎస్సీ మహిళ : 60, 90, 142, 144, 147 వార్డులు.
బీసీ జనరల్‌ : ‌3, 29, 39, 43, 48, 51, 58, 64, 69, 65 వార్డులు.
బీసీ మహిళ 9, 26, 34, 35, 37, 41, 42, 47, 49, 57, 61, 63 వార్డులు కేటాయించారు.

16:34 - January 8, 2016

గుంటూరు : సర్వీస్ నిబంధనలు ఏకపక్షంగా మారుస్తూ, ద్వైపాక్షి సంబంధాలు నిర్వీరం చేయడాన్ని నిరసిస్తూ గుంటూరులో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేశారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా గుంటూరులోని లక్ష్మీపురం బ్యాంక్ ఎదుట ఉద్యోగులు సమ్మె చేశారు. ఈ సంధర్బంగా బ్యాంక్ ఉద్యోగుల సంఘం కిషోర్ కుమార్ మాట్లాడుతూ..బ్యాంక్ ఉద్యోగులు ఎంతో కష్టపడి సాధించిన హక్కులను తొలగించాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. పని దినాలు కుదించడం, కెరియర్ ఫోకస్ లాంటి కార్యక్రమాలు ప్రవేశ పెడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తును ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

 

16:21 - January 8, 2016

టాలీవుడ్ లో ఇప్పటివరకు ఆయన వివాదాలకు దూరం. అంతేకాదు ఎప్పుడూ కూల్ గా కనిపిస్తాడు. అలాంటి ఆ హీరో ఇప్పుడు కోపంతో ఊగిపోయాడట. ఎందుకు ? ఏవిషయంలో అని ఆలోచిస్తున్నారా.. అయితే మీకోసం.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బినామీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఎక్స్ ప్రెస్ రాజాసినిమాను తెరకెక్కించింది. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదల చేస్తోంది. ఈ విషయమే ప్రభాస్ కి కోపం తెప్పించిందట.ఓవైపు ఎన్టీఆర్  నాన్నకు ప్రేమతో మరోవైపు బాలయ్య డిక్టేటర్ థియేటర్లో సందడి చేస్తున్న సమయంలో ఇప్పుడు ఎక్స్ ప్రెస్ రాజా సినిమాను విడుదల చేయడం అవసరమా అంటూ కేకలేశాడట. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ లో ఉన్న ప్రభాస్ నిన్నటివరకు కేరళలో ఉన్నాడు. అయితే విషయం తెలుసుకున్న ప్రభాస్ ఇంత తొందరపడటం అవసరమా అని కేకలు వేశాడట. ఓ వారం రోజులు గ్యాప్ తీసుకొని సినిమాని విడుదల చేస్తే బాగుండేది కదా అని యూవీ క్రియేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడని ఫిలింనగర్ లో హాట్ న్యూస్ హడావుడి చేస్తోంది.

16:10 - January 8, 2016

న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రిజయలలితకు మరో ఎదురుదెబ్బ తగలింది. అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు సీఎంను నిర్దోషిగా ప్రకటించిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల కేసులో జయలలితను నిర్దోషిగా నిర్ణయిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ఫిబ్రవరి 2 నుంచి విచారణ జరపాలని నిర్ణయించింది. జయ అక్రమ ఆస్తుల కేసులో సుదీర్ఘకాలం పాటు విచారణ ఎదుర్కొని ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డారు. కర్ణాటక హైకోర్టు జయలలితకు అనుకూలంగా తీర్పు వెలువరించడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. కాగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీం నిర్ణయం పురుచ్చిత్తలైవికి ఒకింత ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉంది.


 

15:46 - January 8, 2016

పశ్చిమగోదావరి : రాష్ట్రంలో నీతివంతమైన పాలన అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలోని నల్లజర్లలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని, మాట్లాడారు. పేదవాడికి అనుకూలమైన పాలన ఇవ్వాలని యోచిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకతీతంగా
ఎపిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. జన్మభూమి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలకు అధికారులు సమాధానం చెబుతారని పేర్కొన్నారు. సమస్యలపై జన్మభూమి కమిటీ కూర్చుని ఆలోచించాలని సూచించారు. 
గ్రామంలోని మౌలిక సదుపాయాలు తీరిన తర్వాత డబ్బులు సంపాదించే మార్గాలపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కుటుంబం వ్యవస్థ భారత దేశానికి ఒక సంపద లాంటిదని వివరించారు. అమెరికాలో భార్యభర్తలు ఎల్లకాలం కలిసి ఉండరని.. అందరూ ఏకాంతం జీవితం గడుపుతారని పేర్కొన్నారు.

 

'జన్మభూమి'లో పాల్గొన్న చంద్రబాబు

 పశ్చిమగోదావరి : జిల్లాలోని నల్లజర్లలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతివంతమైన పాలనందిస్తామని చెప్పారు. 

 

15:32 - January 8, 2016

విశాఖ : 'నేను.. శైలజ' సినిమా విజయం తనలో జోష్‌ పెంచిందంటున్నాడు హీరో రామ్. సినిమా ప్రమోషన్‌లో భాగంగా వైజాగ్‌ వచ్చిన హీరో రామ్, హీరోయిన్‌, రేడియో సిటీలో శ్రోతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్ తో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. వైజాగ్‌లో షూటింగ్‌ జరిగితే సినిమా హిట్ అవుతుందన్న నమ్మకాన్ని ఈ చిత్రం నిజం చేసిందని అన్నారు. పెళ్లి ఎప్పుడని విలేకరి అడిగిన ప్రశ్నకు ఇప్పట్లో లేదని సమాధానం చెప్పారు. 

 

15:27 - January 8, 2016

అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో కల్తీ కల్లు కాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. తాడిపత్రిలో నాగరాజు అనే వ్యక్తి కూలీపని చేసుకుంటూ జీవిస్తున్నాడు. కూలీ పని చేసుకుంటున్న నాగరాజు ఎప్పటిలాగే కల్లుతాగడంతో నురగలు  కక్కుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు కల్లుదుకాణం ఎదుట ఆందోళనకు దిగారు. కల్లుదుకాణం యాజమానులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  
 

15:07 - January 8, 2016

విజయవాడ : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. విద్యుత్ షాక్ తో ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు. విద్యుత్ స్తంభాలు ఎక్కి ఇద్దరు కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తుండగా ఎర్త్‌ వైర్‌నుంచి వచ్చిన షాక్‌తో దుర్మరణం పాలయ్యారు. విజయవాడ నగరంలోని మొగల్రాజపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది. రామకోటి, శ్రీను కొంతకాలంగా కాంట్రాక్ట్ బేసిక్‌పై విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. కాగా రవీంద్రభారతి స్కూల్ పక్కనున్న పోల్స్‌కు వైరు అమర్చే నిమిత్తం ఇద్దరూ చెరో స్తంభాన్ని ఎక్కారు. అయితే విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ సేఫ్టీ తొడుగులు ధరించకుండా ఎక్కడంతో ఒక్కసారిగా ఎర్త్ వైర్‌ నుంచి షాక్ తగిలింది. దాంతో స్తంభాలపైనే ప్రాణాలు కోల్పోయారు. వారిని కాపాడ్డానికి స్థానికులు ఎంతగా శ్రమించినా ఫలితం లేకపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కిందకు దించారు. అయితే ఒక్కసారిగా పవర్ రావడంతో ఇరువురూ చనిపోయారని ఏఈ రాంబాబు తెలిపారు. స్తంభాలపైకి కార్మికుల ఎక్కినప్పుడు అధికారులు ఆ వైర్ల గుండా విద్యుత్ ను ఎలా సరఫరా చేస్తారని స్థానికులు మండిపడ్డారు. 

 

14:56 - January 8, 2016

విజయవాడ : మోడీ ప్రభుత్వం వచ్చాక అటవీ హక్కుల రక్షణ వంటి పలు పథకాలు నిర్వీర్యం అవుతున్నాయని ఐద్వా జాతీయ నాయకురాలు బృందా కరత్ అసహనం వ్యక్తం చేశారు. మద్యం పాలసీని మార్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఐద్వా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బృందా కరత్‌ హాజరై, మాట్లాడారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి తలొగ్గి ప్రత్యేక ప్యాకేజీపై శ్రద్ధ చూపకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.  కేవలం ప్రజావ్యతిరేక విధానాలనే సిఎం చంద్రబాబు ఫాలో అవుతున్నారని ఆరోపించారు. రాజధాని లేని ఎపికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. 
  

14:52 - January 8, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీపై  టీడీపీ నేత రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ఆంధ్రాలో పోటీ చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. 
టీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు తన సొంత మాటలా, కావా అన్నదానిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'ఎన్నికల మేనిఫేస్టోలో ఆంధ్రావారిపై దూకుడుగా ప్రవర్తించిన టీఆర్ ఎస్ ఇప్పుడు ఆంధ్రావారు మా అన్నదమ్ములంటూ మాట్లాడడం వెనక అర్థం ఏంటో కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలి' అని అన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడే మాటలన్ని గ్రేటర్ ఎన్నికలకోసమేనని ఎద్దేవా చేశారు. టీఆర్ ఎస్.. తెలుగు రాష్ట్రసమితిగా పేరు మార్చుకున్నాకే ఏపీ వారిని ఓట్లు అడగాలని సూచించారు. 

 

ఖమ్మం జిల్లాలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు

ఖమ్మం : కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. ఉద్యోగాలిప్సిస్తామని కొలంబో తీసుకెళ్లి కిడ్నాలను ముఠా మాయం చేస్తున్నారు. 

డీడీసీఏ స్కాం విచారణకు చట్టబద్ధత లేదన్న కేంద్రం..

ఢిల్లీ : డీడీసీఏలో జరిగిన అవినీతి వ్యవహారంపై చేపట్టిన విచారణకు ఎలాంటి చట్టబద్ధత లేదని, అది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

విశాఖ విమానాశ్రయానికి వ్యతిరేకంగా పిటిషన్ కొట్టివేత..

ఢిల్లీ : విశాఖలోని విమానాశ్రయం విస్తరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీం కొట్టివేసింది. విస్తరణకు వ్యతిరేకంగా కాకుండా భూ సేకరణలో లోపాలుంటే కోర్టుకు రావాలని పిటిషన్ దారుడికి సూచించింది. 

13:36 - January 8, 2016

ముంబై : ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా అంటే ఉజ్వల భారత్‌ ప్రచార కర్తగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు అతిథిదేవోభవ ప్రచారకర్తగా ఉన్న బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను తొలగిస్తున్నట్లు బుధవారం కేంద్రం ప్రకటించిది. అమీర్‌ఖాన్‌ ఒప్పంద కాలపరిమితి ముగియడంతో ఆయనను తొలగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఉజ్వల భారత్‌ ప్రచారకర్తగా నియమించేందుకు ఆ స్థానాన్ని తొలిప్రాధాన్యంగా అమితాబ్‌ బచ్చన్‌తో భర్తీ చేసినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి అమితాబ్‌ తర్వాతి వరుసలో బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్‌, దీపికా పదుకోణే, ప్రియాంక చోప్రా ఉన్నారని సమాచారం. గుజరాత్‌ పర్యాటక రంగ ప్రచార కర్తగా వివాదాలకతీతమైన వ్యక్తిగా అమితాబ్‌కు గుర్తింపు ఉందన్నారు.

అసహనంపై అమీర్ వ్యాఖ్యలు...
గతేడాది నవంబర్‌లో బాలీవుట్ నటుడు అమీర్‌ అసహనంపై తీవ్ర వాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఉజ్వల భారత్‌ ప్రచారకర్తగా ఉన్న అమీర్‌ ఖాన్‌ను తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే గత ప్రభుత్వమే అతిథి దేవోభవ ప్రచార బాధ్యతను మెకాన్‌ సంస్థకు అప్పగించిందని..ప్రస్తుతం ఆ ఏజెన్సీ కాంట్రాక్ట్ గడువు పూర్తికావడంతో..అమీర్‌ఖాన్‌ బాధ్యత పూర్తయినట్లేనని కేంద్ర పర్యాటకశాఖ తెలిపింది. మరోవైపు ఉజ్వల భారత్‌ ప్రచారకర్తగా తనను తప్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ తెలిపారు. 

13:33 - January 8, 2016

ముంబై : బాలీవుడ్ నటులు షారూఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ కు ముంబై పోలీస్ విభాగం భద్రత కుదించింది. వీరితో పాటు మరో 40మందికి కూడా సెక్యూరిటీ తగ్గించారు. భద్రత కుదించడమనేది కొత్తేమి కాదని.. నటుల వ్యక్తిగత జీవితంపై ఏటా సమీక్షచేసి నిర్ణయం తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. వీరికి భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేన్నందువల్లే సెక్యూరిటీ తగ్గించామని స్పష్టం చేశారు. అయితే ఇటీవల అసహనంపై వీరిద్దరు నటులు చేసిన వ్యాఖ్యల ఫలితంగానే భద్రతలో కోత విధించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 

13:29 - January 8, 2016

హైదరాబాద్ : భారతీయ స్టేట్ బ్యాంకు దాని అనుబంధ బ్యాంకు ఉద్యోగుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న విధాలనాలను నిరసిస్తూ కర్నూలులో అన్ని బ్యాంకులు ఒక్క రోజు బంద్‌కు పిలుపునిచ్చారు. నగరంలోని ఎస్బీహెచ్ బ్యాంకు వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమానికి చేపట్టారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు అనుబంధంగా దేశ వ్యాప్తంగా 5 బ్యాంకులున్నాయని, ఎస్బీఐ తమ విధానాలను బలవంతంగా వీటిపై రుద్దుతూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఇలాంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మరిన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. 

13:28 - January 8, 2016

ఉత్తరభారతదేశంలో పుట్టినా దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు వేరునుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే..ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మాంసపుకృతులు దొరుకుతాయి. ఇవి ఆహారంగానే కాకుండా అనేక రుగ్మతలకు దివ్యౌషధంగా పనికొస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

శరీరానికి మేలు చేసే ఆకులు...
ఆహారపు విలువలు ఎక్కువగా ఉండే ఆకు కూరల్లో మునగాకు శరీరానికి మేలు చేసేదిగా చెప్పవచ్చును. తోటల్లో మునగ చెట్లు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది పెరట్లో కూడా ఈ మొక్కను పెంచుతారు. మునగఆకులు చూడటానికి తేలిగ్గా ఉంటాయి. కానీ ఎన్నో పోషక విలువ లు కలిగిఉం టాయి. కూరగా వండుకుంటారుగాని, దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. దీనిలో అధికంగా ఉండే ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. శరీరానికి బలాన్నిస్తాయి. మునగాకులో విటమిను - ఎ, విటమిన్‌ సి, కాల్షియం ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా మాసంకృతులు కూడా ఉన్నాయి.
ఔషద గుణాలు ...
ముగన ఆకు రంసం, నిమ్మరంసం కలిపి ముఖానికి ప్రతి రోజూ ఉదయం రాసుకొంటే వయస్సులో వచ్చే మొటిమలు నివారించబడతాయి. అందం పెరుగుతుంది. మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి ఆరోగ్యాన్ని పెంచుతుంది.
మునగాకు కాడ నుంచి తీసిన రసాన్ని గాయాలకు రాస్తే యాంటి సెప్టిక్‌గా గాయాలను నయం చేస్తుంది.మునగాకు నూరి ఆ ముద్దను కురుపులపై కడితే అవి నయం అవుతాయి. చిన్న దెబ్బలకు, బెణుకులకు కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మునగాకు రసం, ఉప్పు కలిపిన రసం కొద్దిగా సేవిస్తూ ఉంటే అజీర్ణం తగ్గిపోతుంది. ఒక చెంచా మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి, రోజూ నిద్రపోయే సమయంలో తాగితే రేచీకటి తగ్గిపోతుంది. ఒక చెంచా మునగాకు రసంలో కొంచెం తేనె కలిపి, దానిని ఒక గ్లాసు లేత కొబ్బరి నీరును కలిపి తీసుకుంటే కలరా, విరేచనాలు తగ్గుతాయి. మునగాకును పాలలో కాసి కాగపెట్టి, ఆ పాలను తాగుతూ ఉంటే వీర్యవృద్ధి కలుగుతుంది. మునగాకు రసం ప్రతిరోజూ కొద్దిగా తాగితే అలసట పోయి ఉత్తేజం కలుగుతుంది. మునగాకు రసంలో కొంచెం నిమ్మరసం వేసి తాగితే ఆకలి పుడుతుంది.

13:25 - January 8, 2016

చెన్నై : తమిళనాడు జనం 'అమ్మ'గా ఆరాధించే అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు సర్వోన్నత న్యాయస్థానం గడప తొక్కింది. అక్రమాస్తుల కేసులో జయలలితను కష్టాలు వీడేలా లేవు. ఈ విషయంలో బెంగళూరు హైకోర్టు తీర్పుపై కర్నాటక ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో జయను దోషిగా తేల్చిన పరప్పణ అగ్రహార ప్రత్యేక కోర్టు ఆమెకు రూ. 100 కోట్ల జరిమాన, నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై జయలలిత కర్నాటక హైకోర్టుకు వెళ్లింది. ఎలాంటి ఆధారాలు లేవని కేసును కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై షాక్ తిన్న కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2వ తేదీ నుండి కేసు విచారణనను ప్రారంభించనున్నట్లు సుప్రీం ప్రకటించింది. 

  • 1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్న సమయంలో రూ.66 కోట్ల మేర అక్రమాస్తులు సంపాదించినట్లు 1997లో డీఎంకే కేసు పెట్టింది.
  • తదనంతరం జరిగిన పరిణామాల మధ్య ఈ కేసును కర్నాటక స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు.
  • జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమాన విధించిన స్పెషల్ కోర్టు తీర్పును కర్నాటక హైకోర్టు కొట్టివేసింది.
  • దీనితో ఎనిమిది నెలల జైలు శిక్ష తరువాత జయలలిత నిర్దోషిగా బయటపడింది.
  • అనంతరం సీఎంగా జయలలిత బాధ్యతలు స్వీకరించింది.
  • తరువాత ఆర్కే నగర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 
13:22 - January 8, 2016

విజయవాడ : రాజధాని అమరావతిని మహోన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మంచి అవకాశాలు దక్కబోతున్నాయని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో క్రెడాయ్‌ విజయవాడ విభాగం ఏర్పాటు చేసిన రియల్ ఇండస్ట్రీ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌లో విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన కంపెనీలు, బ్యాంకులు స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి. అపారమైన అవకాశాలున్నాయని వాటిని అందిపుచ్చుకుని పనిచేస్తే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చంద్రబాబు సూచించారు. 

13:18 - January 8, 2016

హైదరాబాద్ : ప్రజలకు మతిమరుపు ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించారు. కొన్ని విషయాలు వాళ్లు మరిచిపోతుంటారని, మళ్లీ గుర్తు చేయాల్సినవసరం ఉందని తెలిపారు. ఇదంతా వీహెచ్ ఎందుకు చెప్పారంటే టీఆర్ఎస్ నేతలు ఆంధ్రా నేతల గురించి ఏమి మాట్లాడారో ? ప్రస్తుతం ఏమి మాట్లాడుతున్నారో ఈ వీడియోలను కలిపి ప్రజలకు చూపించాలని టిపిసిసి చీఫ్ ను కోరుతున్నట్లు తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. భీమవరం నుండి పోటీ చేస్తా..వాళ్ల ప్రేమ మంచిదని..కోళ్ల పందాలు రెగ్యులరైజ్ చేస్తే స్వీప్ చేస్తానని మంత్రి కేటీఆర్ అంటున్నాడని గుర్తు చేశారు. కోళ్ల పందాలు ఆపేయాలని కోర్టు ఆదేశాలు ఇస్తుంటే ఒక మంత్రి ఇలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి, ఆంధ్ర ప్రజలను మెప్పు పెంపొందించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఏ నాయకుడు ప్రసంగించారు...ఆంధ్రా వారిని భయపెట్టారో..హింసించారో అలాంటి వీడియోలు..ఇప్పుడు మాట్లాడిన మాటల వీడియోలు జోడించాలని కోరుతున్నట్లు తెలిపారు. టివీలు..స్లైడ్ షో..సోషల్ మీడియాలో రిలీజ్ చేయాలని తాను ఉత్తమ్ ను కోరుతున్నట్లు చెప్పారు. ఎన్నికల విషయంలో ఇంత పబ్లిషిటీ చేయడం ఎక్కడా చూడలేదని, తాము ఒక్క బ్యానర్ వేయలేదన్నారు. ఇన్ని ప్రాంతాల్లో మెట్రో రైలు వస్తుందని..కృష్ణా మూడో ఫేజ్..గోదావరి నీళ్ల ప్రయత్నం..ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా తాము ఎక్కడా చెప్పుకోలేదన్నారు. 

13:14 - January 8, 2016

ఎరుపు వర్ణంలో ఉండే ఈ రూట్ అనేక మంది భారతీయులకు రక్తహీనత, అధిక రక్తపోటు కు విరుగుడుగా బాగా తెలుసు. మనకు సహజంగా లభించే పండ్లూ కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార నిపుణులు. అలాంటి వాటిలో బీట్‌రూట్‌ ఒకటి. శక్తినిచ్చే శాకాహారదుంపల్లో బీట్‌రూట్‌ది మొదటి స్థానం.. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బీట్‌ రూట్‌ లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌ లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.

ఆరోగ్యరక్షణకు..

కేవలం ఆరోగ్యానికే కాకుండా సౌందర్య పరిరక్షణకు కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. చర్మం మిల మిల మెరవాలన్నా, తాజాగా ఉండాలన్నా, నిగనిగలాడే కేశసంపద సొంతం కావాలన్నా అది బీట్‌రూట్‌తోనే సాధ్యం. శరీరంలో ఐరన్ లెవెల్స్ తగినంత ఉండాలన్నా, బరువు పెరగకుండా ఫిట్‌గా ఉండాలనుకున్నా బీట్‌రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో అసలు కొవ్వు ఉండదు. చాలా తక్కువ మొత్తంలో కెలొరీలు ఉంటాయి. అలాగే సంవత్సరం పొడవునా లభించే దుంపల్లో ఇది కూడా ఒకటి. ఫోలేట్, ఫైబర్, ఇనుము, మాంగనీస్, పొటాషియం, విటమిన్-సి.. ఇలా వివిధ రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. వీటి ద్వారా శరీరానికి అవసరమయ్యే శక్తి లభిస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే ఫైబర్ ఆకలి తక్కువ వేసేలా చేసి, బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరకుండా కాపాడుతుంది. రక్తపోటుని అదుపులో ఉంచడంలో కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అలాగే ట్యూమర్స్ తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. జీర్ణవ్యవస్థలో ఉండే టాక్సిన్లను తొలగిస్తుంది. ఇవన్నీ ఆరోగ్య పరంగా కలిగే లాభాలైతే..

వృద్ధాప్య ఛాయలు దరిచేరనీయకుండా.....

బీట్‌రూట్‌లో ఉండే శక్తివంతమైన లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ వృద్ధాప్య ఛాయలు దరిచేరనీయకుండా కాపాడుతుంది. ఆక్సిడేషన్ కారణంగా చర్మంపై ఏర్పడే ఫ్రీ రాడికల్స్‌ను కూడా తొలగించి చర్మం బిగుతుగా, తాజాగా ఉండేలా చేస్తుంది. బీట్‌రూట్ తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుభ్రమవుతుంది. దీని వల్ల చర్మం మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే శరీరంలో ఉన్న టాక్సిన్స్, అదనంగా ఉన్న నీటిని కూడా తొలగిస్తుంది. బీట్‌రూట్‌లో విరివిగా లభించే కెరోటినాయిడ్స్ కళ్లను ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. అందంగా కనిపించేలా కూడా చేస్తాయి.
ఎండబారిన పడకుండా..
బీట్‌రూట్‌లో ఉండే బీటాకెరోటిన్ చర్మం అతినీలలోహిత కిరణాల బారినపడకుండా, ఛాయ తగ్గకుండా రక్షణనిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. మొటిమలు, మచ్చలు.. అన్నీ తొలగిపోయి చంద్రబింబంలాంటి ముఖం మన సొంతమవుతుంది.
బీట్‌రూట్ జ్యూస్ తీసుకుని అందులో కాటన్ బాల్‌ని నానబెట్టండి. దాంతో ముఖం మీద రుద్దుకుని కాసేపు అలానే వదిలేయాలి. కొంత సమయం తర్వాత ముఖం నీటితో శుభ్రపరుచుకుంటే చాలు.. ప్రకాశవంతమైన చర్మం మన సొంతం.
బీట్‌రూట్ ముక్క చిన్నది కట్ చేసి దాంతో ముఖమంతా రుద్దుకోవాలి. కాసేపు అలాగే వదిలేసి, నీళ్లతో శుభ్రపరుచుకుంటే చర్మం రంగు కాస్త గులాబీ రంగులోకి మారడం గమనించవచ్చు.
అలాగే తరచూ వేసుకునే మడ్ లేదా ఫ్రూట్ ప్యాక్స్‌లో కూడా కాస్త బీట్‌రూట్ జ్యూస్ కలపడం వల్ల మంచి ఫలితాలు చేకూరతాయి.
అధిక రక్తపోటు తో బాధపడేవారు...

అధిక రక్తపోటు ఉన్నవారిలో కొందరికి మాత్రలకు బదులుగా 200 మి.లీ బీట్‌రూట్‌ రసాన్ని ఇచ్చి 24 గంటలపాటు పరిశీలనలో ఉంచారు. ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. పైగా ఆ రసం ప్రభావంతో అధిక రక్తపోటు 24 గంటల దాకా నియంత్రణలోనే ఉంది. అందువల్ల అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు నైట్రేట్‌ సమృద్దిగా ఉన్న కూరగాయలు ఆకుకూరలు తరుచుగా తీసుకోవడం ద్వారా తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలుస్తోంది.

కాకపోతే కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు, అలాగే రక్తపోటు తక్కువగా ఉన్నవాళ్లు మాత్రం వైద్యుల సలహా మేరకే తీసుకోవడం మంచిది.

తమ పార్టీ ఎమ్మెల్యేలు మారుతున్నారన్నది అవాస్తవం - భూమా..

కర్నూలు : తమ పార్టీ ఎమ్మెల్యే మారుతున్నారన్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, తమ ఎమ్మెల్యేలు టిడిపిలోకి చేరుతున్నారని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనతో ఒరిగిందేమి లేదని విమర్శించారు. 

కల్తీ నెయ్యి స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు..

విజయవాడ : కల్తీ నెయ్యి స్థావరాలపై టాస్క్ ఫోర్స్ దాడులు జరిపింది. వన్ టౌన్, సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 

ప్రభుత్వాసుపత్రిలో మల్లాది విష్ణు..

విజయవాడ : వైద్య పరీక్షల నిమిత్తం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును, అతని సోదరుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. 

నెల రోజుల్లో టిటిడి న్యూ జనరేషన్ వైబ్ సైట్ - ఈవో..

చిత్తూరు : నెల రోజుల్లో టిటిడి న్యూ జనరేషన్ వెబ్ సైట్ ను అందుబాటులోకి తెస్తామని టిటిడి ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. ఆన్ లైన్ వ్యవస్థను టీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తామని, సంక్రాంతి, కనుమ పండుగ రోజున ఇరు రాష్ట్రాల్లో గోపూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

 

నగరంలో పది మంది దొంగల అరెస్టు..

హైదరాబాద్ : చోరీలకు పాల్పడుతున్న పది మంది దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 3.9 లక్షలు, 15 కిలోల బంగారం, 11 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. 

నల్లబజర్లలో జన్మభూమి..

పశ్చిమగోదావరి : నల్లబజర్లలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన బాబు స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. 2018లో జాతీయ క్రీడలకు అతిథ్యం ఇస్తున్నామని, ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించే స్థాయికి దేశం ఎదగాలని ఆకాక్షించారు. 

జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పంపిణీ..

హైదరాబాద్ : జర్నలిస్టులకు మంత్రి కేటీఆర్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. హెల్త్ కార్డులు మంజూరు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు అల్లం నారాయణ పేర్కొన్నారు. అక్రిడేషన్ తో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ కార్డులు అందచేస్తున్నట్లు చెప్పారు. మూడో దఫా అక్రిడేషన్స్ త్వరలో జారీ చేస్తామన్నారు. రూ.5 లక్షల బీమా పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

12:46 - January 8, 2016

ప్రకాశం : అంగన్ వాడీ వర్కర్లపై తమకు కోపం లేదని, వారు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే ఎలాంటి కేసులు పెట్టడం లేదని ఏపీ డీజీపీ రాముడు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో 'ఐ-క్లిక్' కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టెన్ టివితో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఐ క్లిక్ లను ప్రారంభించినట్లు చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలియచేయకుండా డ్యూటిలపై ఉన్న వారిని తన్నడం..కొట్లాడడం ఇది శాంతియుతమా అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేసే వారిపై ఎలాంటి కేసులు ఉండవన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోళ్ల పందాలు నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సిబ్బంది పెంచుకోవడంలో చాలా సమస్యలున్నాయని, ఇది కూడా ఖర్చుతో కూడిన వ్యవహారమన్నారు. కానీ మరొక కారణం ఉందని, త్వరలో రిక్రూట్ మెంట్ నిర్వహిస్తామన్నారు.

12:42 - January 8, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో పోట్లగిత్తలు పరుగెట్టనున్నాయి. గిత్తల కొమ్ములు పట్టుకుని వంచేస్తూ ఈ ఆట జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు ఆట జరుగుతుంది. ఈ ఆటకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పొంగల్ సందర్భంగా జల్లికట్టు ఆటపై ఉన్న నిషేధాన్ని యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఎత్తివేసింది. ఈ ఆట తమిళుల సంప్రదాయంలో భాగమని పేర్కొంది. ఇందుకు జల్లికట్టును జరుపుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తనకు ఫోన్‌ చేసి తెలిపారని కేంద్ర మంత్రి పన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. ఈ సందర్భంగా జల్లికట్టు నిర్వహణకు మద్దతిచ్చిన ప్రధానమంత్రి మోదీ తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాధాకృష్ణన్‌ ట్వీట్‌ చేశారు. నిషేధం ఎత్తివేతపై డీఎంకే అధినేత కరుణానిధి, ఎండీఎంకే అధినేత వైగో తదితరులు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. జల్లికట్టు విధానంపై గతంలో సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే సంప్రదాయానికి తగినట్లుగా ఆటను నిర్వహించేందుకు చట్టంలో సవరణలు తీసుకరావాలని తమిళనాడు సర్కార్ కేంద్రాన్ని కోరింది. 

12:36 - January 8, 2016

మెదక్ : జిల్లాలోని సిద్ధిపేట మండలం ఇబ్రహీంపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి మృతికి సర్పంచ్ కుమారులే కారణమని గ్రామస్తులు ఆమె ఇంటికి నిప్పు పెట్టారు. దీనితో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సిరిసిల్ల గ్రామానికి చెందిన జిల్లెల గ్రామ నివాశి శ్రీహరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇబ్రహీంపూర్ సర్పంచ్ లక్ష్మి వాహనాన్ని ఢీకొట్టడంతో కుమారులు ఎల్లారెడ్డి, నాగిరెడ్డిలు శ్రీహరిని ఇష్టమొచ్చినట్లుగా కొట్టారని, దీనితో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని జిల్లెల గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనితో శుక్రవారం ఉదయం ఇబ్రహీంపూర్ కు భారీగా గ్రామస్తులు చేరుకుని లక్ష్మి ఇంటికి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈపరిస్థితిల్లో పోలీసులు లాఠీఛార్జీ కూడా చేసినట్లు సమాచారం. శ్రీహరి ఢీకొట్టలేదని, వేరే వారు ఢీకొట్టారని జిల్లెల గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

12:28 - January 8, 2016

హైదరాబాద్ : అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అఖిల భారత సమాఖ్య (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌) 8వ మహాసభలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ కళ్యాణ మండపంలో నాలుగు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాల నుండి 1000 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరయ్యారు. రెండో రోజు ఐసీడీఎస్ పరిరక్షణ..కనీస వేతనం..ఉద్యోగ భద్రత..రిటైర్ మెంట్ బెనిఫిట్స్..తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్ర అధ్యక్షురాలు టెన్ టివితో మాట్లాడారు. దేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఫుడ్ సెక్యూర్టీ, ఎడ్యుకేషన్ హక్కుగా ఉండేదని, దీనిని కాలరాయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. సమాజంలో ఐసీడీఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని, 50 శాతం నిధులు తక్కువ చేశారని తెలిపారు. ఐసీడీఎస్ లో పోషకాహార ఆహార పదార్థాలు అందించడం లేదన్నారు. 

12:14 - January 8, 2016

వరంల్ : ఎంజీఎం నర్సింగ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం సృష్టించింది. సుమారు 30 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎంజీఎం యాజమాన్యం నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఫుడ్ పాయిజన్ జరుగుతోందని విద్యార్థినిలు వార్డెన్, ప్రిన్స్ పల్ కు తెలియచేసినా పట్టించుకోలేదని సమాచారం. గురువారం రాత్రి ఆహారం తిన్న ఆరుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో శుక్రవారం 30 మంది విద్యార్థినిలు కడుపునొప్పి, వాంతులతో అవస్థలకు గురయ్యారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఎలాగో విషయం బయటకు పొక్కింది. నాణ్యత లేని అన్నం, సాంబారులో పప్పు కల్తీ అయినట్లు వైద్యులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఘటనపై వైద్యులు పెదవి విప్పడం లేదు. ఈ ఘటనపై విచారణ చేసిన అనంతరం మీడియాకు వివరాలు తెలియచేస్తామని వైద్యులు పేర్కొంటున్నారు. 

బెంగాల్ లో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్..

కోల్ కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం మమత బెనర్జీ కూడా పాల్గొన్నారు. 

జల్లికట్టుకు అనుమతి విరుద్ధం - పెటా..

ఢిల్లీ : జల్లికట్టుకు అనుమతినివ్వడం విరుద్ధమని, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని దేశ జంతు హక్కుల సంస్థ నేత డా.చైతన్య కోడూరి ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. 

జల్లికట్టుకు కేంద్రం అనుమతి..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో సంప్రదాయ బద్ధంగా నిర్వహించే జల్లికట్టుకు కేంద్రం అనుమతినిచ్చింది. ఈ మేరకు జల్లికట్టు నిర్వాహణకు కేంద్రం అనుమతినిచ్చిందని, ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తనకు ఫొన్ చేసి తెలిపారని కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 

బాలీవుడ్ ప్రముఖులకు భద్రత కుదింపు..

ముంబై: బాలీవుడ్ ప్రముఖులకు ముంబై పోలీసులు భద్రతను తగ్గించారు. పోలీసులు షారుఖ్ ఖాన్, అమీర్‌ఖాన్‌లకు భద్రతను కుదించారు. వీరితో పాటు మరో 25 మంది బాలీవుడ్ ప్రముఖులకు పోలీస్ భద్రతను పూర్తిగా తీసేశారు. భద్రతను పూర్తిగా తీసేసిన వారిలో వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీ, ఫరాఖాన్ తదితరులు ఉన్నారు. కాగా అక్షయ్ కుమార్, ముఖేష్ అండ్ మహేశ్ భట్, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, లతా మంగేష్కర్‌లకు పోలీసులు 24 గంటల పాటు భద్రతను కల్పించనున్నారు.

11:53 - January 8, 2016

అందరూ ఎపుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో నయన తార నటించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. సీనియర్ కథానాయికలు మొదలుకొని, పలువురి వర్థమాన నాయికల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో నయనతార, అనుష్క పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం నయనతారను కథానాయికగా ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయని సమాచారం. గతంలో వినాయక్ దర్శకత్వంలో తులసి అదుర్స్ చిత్రాల్లో నయనతార నటించిన విషయం తెలిసిందే. దీంతో నయనతార వైపే చిత్ర బృందం మొగ్గుచూపుతోందని చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ విషయంపై స్పష్టత వస్తుందని అంటున్నారు.వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తమిళ చిత్రం కత్తి రీమేక్ ఆధారంగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు రామ్‌చరణ్ నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్నారు. ఫిబ్రవరిలో సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణపనుల్లో చిత్ర బృందం బిజీగా వుంది. 

11:34 - January 8, 2016

అనంతపురం : టీమిండియా క్రికెటరర్ ధోనిని అరెస్టు చేయాలని అనంతపురం న్యాయస్థానం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 25న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. దేవతలను అనుమానించేలా ప్రకటనలు ఇచ్చారంటూ గతంలో ధోనీపై పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. 2013 సంవత్సరంలో బిజినెస్ టుడే పత్రిక ముఖచిత్రంపై ధోనిని విష్ణుమూర్తిగా పోల్చడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ధోని చేతిలో షూ, చిరుతిండ్లతో ఫొటో ప్రచురితమైంది. దీనితో అనంతపురం జిల్లా కోర్టులో విశ్వహిందు పరిషత్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి నుండి కేసు విచారణ కొనసాగుతోంది. నవంబర్ 7, 2016 జనవరి 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ధోనీకి ఆదేశాలు జారీ చేసింది. కానీ ధోని కోర్టుకు హాజరు కాలేదు. ప్రస్తుతం కోర్టు చేసిన ఆదేశాలతో ధోని అరెస్టు అవుతాడా ? కోర్టుకు హాజరౌతాడా ? అనేది వేచి చూడాలి. 

11:30 - January 8, 2016

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వద్దకు టి.కాంగ్రెస్, టి. బిజెపి నేతలు క్యూ కట్టారు. రాజ్ భవన్ వద్దకు వేర్వేరుగా చేరుకున్న ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై పలు ఫిర్యాదులు చేశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అనైతికంగా ప్రవర్తిస్తోందని వారు ఫిర్యాదు చేశారు. విపక్షాల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొంటోందని, 450 కోట్లతో హోర్డింగ్స్ పెట్టారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు. కోర్టు ఆదేశాలు పాటించకుండా ఎన్నికలపై ఆర్డినెన్స్ తీసుకరావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇరు పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన అనంతరం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నుండి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసనసభా పక్షనేత జానారెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలున్నారు. బీజేపీ నుండి ఎమ్మెల్యే లక్ష్మణ్, పార్టీ నేతలున్నారు.

ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలి - ఉత్తమ్..
గ్రేటర్ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. 5వేల కోట్ల బడ్జెట్ ఉన్న నగరంలో కోటి జనాభా, 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇల్లీగల్ గా వ్యవహరిస్తోందని అంతేగాకుండా లక్షలాది ఓట్లు తొలగించడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వార్డుల విభజన శాస్త్రీయంగా చేయలేదని, 150 డివిజన్ల రిజర్వేషన్ లో ఇష్టమొచ్చినట్లుగా చేస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్ ల కెటాయింపుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగినట్లు తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

గవర్నర్ జోక్యం చేసుకోవాలి - బీజేపీ..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందులో భాగంగా డివిజన్ల సంఖ్య తగ్గించడం, అనుకూలంగా మలుచుకోవడంలో అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాల్లో జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు. 

ధోనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

అనంతపురం : క్రికెటర్ ధోనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఫిబ్రవరి 25వ తేదీలోపు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. బిజినెస్ టుడే పత్రిక ముఖచిత్రంపై ధోనిని విష్ణుమూర్తిగా పోల్చడంపై అభ్యంతరం వ్యక్తమయ్యాయి.

కడపలో సదానంద గౌడ పర్యటన..

కడప : జిల్లాలో రెండో రోజు కేంద్ర మంత్రి సదానందగౌడ పర్యటించారు. ప్రధాని సూచనల మేరకు ప్రతి నెలా రెండు పార్లమెంట్ నియోజకవర్గాలను సందర్శిస్తున్నట్లు, మహిళలు, యువత, కార్మికులు, కూలీలను కలవడం జరిగిందన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, విభజన చట్టంలోని అన్ని అంశాలను కేంద్రం నెరవేరస్తోందన్నారు. పఠాన్ కోట్ వ్యవహారంలో తమ వైఫల్యం లేదని, ఈ ఘటనలో ప్రాణనష్టాన్ని తగ్గించామన్నారు. 

ఎంజీఎం నర్సింగ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్..

వరంగల్ : ఎంజీఎం నర్సింగ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 13 మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. ఎంజీఎంలో విద్యార్థులకు చికిత్స అందించారు.

జమ్మూ కాశ్మీర్ సీఎం నియామకంపై నిర్ణయం - బీజేపీ..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర సీఎంగా ఎవరుండాలనే దానిపై శాసనసభాపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ఎంపీ జుగల్ కిశోర్ పేర్కొన్నారు. 

సిద్ధిపేటలో ఉద్రిక్తత...

మెదక్ : సిద్ధిపేట (మం) ఇబ్రహింపూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ లక్ష్మి ఇంటిని జిల్లెల గ్రామస్తులు తగులబెట్టారు. సర్పంచ్ కుమారులు సిరిసిల్లకు చెందిన శ్రీహరి అనే వ్యక్తిని హత్య చేయించారని ఆరోపిస్తూ జిల్లెల గ్రామస్తులు ఈ ఘటనకు పూనుకున్నారు. 

10:28 - January 8, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అధికార, విపక్షాల మధ్య పోటా పోటీ నెలకొంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి ప్రయత్నాలు చేపట్టాయి. గ్రేటర్ ఎన్నికల కుదింపు విషయంపై తీసుకున్న నిర్ణయంపై టి.కాంగ్రెస్ కోర్టుకెకిక్కింది. జీహెచ్ఎంసీ చట్టసవరణను కోర్టు తప్పుబట్టింది. ఎన్నికల షెడ్యూల్ కుదింపు జీఓపై స్టే విధించింది. వచ్చే నెల 9వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో టి.సర్కార్ ఆర్డినెన్స్ తీసుకరావాలని యోచిస్తోంది. దీనితో అప్రమత్తమైన టి.కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ తో భేటీ కావాలని యోచించింది. శుక్రవారం ఉదయం టిపిసిసి చీఫ్ ఉత్తమ్, సీనియర్ నేత జానారెడ్డితో పాటు పలువురు నేతలు రాజ్ భవన్ కు వెళ్లారు. గ్రేటర్ ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ తీరుపై ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్ లు ప్రకటించిన తరువాత వారం రోజుల పాటు గడవు ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. మరి దీనిపై గవర్నర్ నరసింహన్ స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

పశ్చిమబెంగాల్ లో పరిస్థితిపై చింతిస్తున్నాం - బీజేపీ..

ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులపై చింతిస్తున్నట్లు బీజేపీ నేత నలిన్ కోహ్లీ ఓ జాతీయ ఛానెల్ తో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. 

10:19 - January 8, 2016

పవన్ కళ్యాణ్ బుల్లి తెరపై సెన్సేషనల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. పవన్ ఇపుడు స్టార్ మాత్రమే కాదు.. పవర్ ఫుల్ పొలిటీషియన్ కూడా. ప్రస్తుతం తన కాన్సన్ ట్రేషన్ మొత్తాన్ని సర్దార్ గబ్బర్ సింగ్ పై పెట్టిన పవన్ కళ్యాణ్.. త్వరలో కొత్త పాత్రలోకి ఎంటర్ కానున్నాడని తెలుస్తోంది. బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న సర్దార్ షూటింగ్ కంప్లీట్ కాగానే.. బుల్లితెరపై యాంకర్ గా ప్రత్యక్షం కానున్నాడట పవన్. నాగార్జున తప్ప ఇప్పటిదాకా టాప్‌లో ఉన్న తెలుగు నటులు ఎవరూ బుల్లితెర జోలికి రాలేదు. అప్పుడప్పుడూ సినిమా ప్రమోషన్లకోసం టీవీల్లో కనిపించడం తప్ప పెద్ద రేంజ్ హీరోలెవరూ ఆ పక్కకు పోలేదు. రాజకీయాల్లోకి రావాలంటే ఈ ‘టీవీ క్వాలిఫికేషన్’ తప్పదనుకున్నారో ఏమోగానీ ఇప్పుడు పవర్‌స్టార్ తన తదుపరి పొలిటికల్ కెరీర్‌కోసం ఈ బాట పట్టారనిపిస్తోంది.
సత్యమేవ జయతే కార్యక్రమానికి.....
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన సత్యమేవ జయతే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంత స్పందన వచ్చిందో చూశాం. దీన్ని డబ్బింగ్ చేసి దాదాపు దేశంలోని అన్ని భాషల్లోనూ టెలికాస్ట్ చేశారంటే.. ఈ ప్రోగ్రాంకి వచ్చిన రెస్పాన్స్ అర్ధమవుతుంది. ఇప్పుడు పవన్ కూడా ఇలాంటి ఒక సామాజిక కోణానికి చెందిన ప్రోగ్రాంనే చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇలా టీవీ ద్వారా ప్రజలకు నిత్యం టచ్ లో ఉండడం ద్వారా.. తన రాజకీయ ఇమేజ్ ను కూడా పెంచుకోవచ్చనే ఆలోచిస్తున్నాడట పవన్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ గ్రూప్ ప్రసారం చేయనుందని సమాచారం. ఇప్పటికీ ఈనాడు గ్రూప్ కి పవన్ కి సన్నిహిత సంబంధాలు బాగానే ఉన్నాయి. అసలు పవన్ చంద్రబాబుల కలయికలో కూడా ఈనాడు గ్రూప్ అధినేత రామోజీ రావు నడిపిన మంత్రాంగమే కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ తర్వాత.. పవన్ టీవీ ఎంట్రీ కూడా ఈనాడు గ్రూప్ ద్వారానే జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రస్తుతం టీవీలో యాంకర్ గా సందడి చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఒక్కడే. గతంలో రాజమౌళి కూడా సత్యమేవజయతే కార్యక్రమాన్ని ప్రారంభించినా.. ఆ తర్వాత కొనసాగించలేదు. ఇప్పుడు పవన్ కూడా బుల్లితెర క్లబ్ లో జాయిన్ కానున్నాడు.

10:15 - January 8, 2016

చిత్తూరు : జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వివిధ మార్గాల ద్వారా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. అంతర్జాతీయ స్మగ్లర్లను కూడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజా ఓ మిల్క్ వ్యాన్ లో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గొల్లపల్లి చెక్ పోస్టు వద్ద అటవీ శాఖాధికారులు శుక్రవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో మిల్క్ వ్యాన్ వచ్చింది. వ్యాన్ లో ఉన్న వ్యక్తి ప్రవర్తనపై అధికారులకు అనుమానం కలిగింది. దీనితో వ్యాన్ లో తనిఖీలు చేపట్టారు. అందులో ఎర్రచందనం దుంగలున్నట్లు గుర్తించారు. వెంటనే స్మగ్లర్లు వ్యాన్ దిగి పరారయ్యారు. సుమారు 20-30 దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 30-40 లక్షలున్నట్లు తెలుస్తోంది. 

గవర్నర్ ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిశారు. గ్రేటర్ ఎన్నికలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గవర్నర్ కు నేతలు ఫిర్యాదు చేశారు. 

పుత్తూరు మండలంలో ఎర్రచందనం దుంగలు..

చిత్తూరు : పుత్తూరు మండలంలో అటవీ శాఖ వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. 20-30 దుంగలున్నట్లు తెలుస్తోంది. వాహనాన్ని వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. 

10:09 - January 8, 2016

ఇటీవల ముంబై వెళ్లిన డైరెక్టర్ ఎస్.జె. సూర్యని.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నిర్మాత, నటి రేణుదేశాయ్ లంచ్‌కి ఆహ్వానించింది. ఈక్రమంలో దిగిన ఓ ఫోటోని రేణు తన అభిమానులతో సోషల్ నెట్‌వర్క్ ద్వారా షేర్ చేసుకుంది. వున్నట్లుండి డైరెక్టర్ సూర్యతో రేణు ఎందుకు భేటీ అయ్యింది? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడాయి. చివరకు సీక్వెల్ మూవీ అంశం తెరపైకి వచ్చిందట. సూర్య డైరెక్షన్‌లో రేణు దేశాయ్ నిర్మాతగా ఖుషి-2 పట్టాలెక్కే అవకాశాలున్నట్లు అటు పవన్ కాంపౌండ్ నుంచి తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ రెడీ అవుతున్నట్లు టాక్. ఓ సందర్భంలో పవన్‌ను కలిసిన సూర్య, ఈ చిత్రం గురించి చెప్పాడట. అదే విషయాన్ని రేణు వద్ద కూడా సూర్య ప్రస్తావించినట్టు ఇన్‌సైడ్ న్యూస్. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతోకలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందట రేణు. మరి ఇందులో పవన్ తో కలిసి రేణు కూడా నటిస్తోందా? అన్న విషయం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి...

10:07 - January 8, 2016

ఢిల్లీ : దేశ రాజధానిని పొగ మంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీని కారణంగా పలు విమానాలు, రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. 130 రైళ్లు రద్దయ్యాయి. ఉత్తరాదిలో చలి తీవ్రత అధికమౌతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైళ్లు రద్దు కావడం..ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణీకులు పలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం 22.5 ఉష్ణోగ్రత నమోదైంది. ఒక్కసారిగా రాత్రి పది డిగ్రీలకు పడిపోవడంతో ఢిల్లీ ప్రజలు వణికిపోయారు. ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పొగ మంచు భారీగా కమ్ముకుంది. 

బెంగళూరులో మద్రాసా టీచర్ అరెస్టు..

బెంగళూరు : ఆల్ ఖైదాతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో బెంగళూరు మద్రాసా టీచర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 20 వరకు పోలీసు కస్టడీ విధించారు. 

అమెరికాలో తెలుగు విద్యార్థి సూసైడ్..

హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్థి శివ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీలో ఫస్టియర్ చదువుతున్న శివ కిరణ్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శివ కిరణ్ రామంతాపూర్ లోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్నాడు. 

ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్..

ఢిల్లీ : ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా అమితాబ్ ను కేంద్రం నియమించింది. నటుడు అమీర్ ఖాన్ ను తొలగించిన సంగతి తెలిసిందే. నేడు కేంద్ర పర్యాటక శాఖ అమితాబ్ కు లేఖ రాయనుంది. 

బాన్సువాడ వరుణ్ మోటార్స్ లో చోరీ..

నిజామాబాద్ : బాన్సువాడ వరుణ్ మోటార్స్ షోరూంలో చోరీ జరిగింది. రూ.14 లక్షలు విలువ చేసే రెండు కార్లను దుండగులు అపహరించారు. 

జెన్టీయూ విద్యార్థిని ఆత్మహత్య..

హైదరాబాద్ : కేపీ హెచ్ బీ ధర్మారెడ్డి కాలనీలోని ఓ హాస్టల్ లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ విద్యార్థిని అపర్ణ ఆత్మహత్య చేసుకుంది. అపర్ణ గుంతకల్లు నివాసి.

 

09:34 - January 8, 2016

అమెరికా : అగ్రరాజ్యంలో తెలుగు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీలో శివ కిరణ్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామంతపూర్ లో నివాసం ఉండే శివ కిరణ్ నగరంలో ఐఐటీ పూర్తి చేశాడు. నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీలో ఎంఎస్ అభ్యసిస్తున్నాడు. ఇటీవల జరిగిన పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడంతో శివకిరణ్ మనోవ్యేధనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలసుకున్న అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 

09:31 - January 8, 2016

గుంటూరు : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ, కార్పొరేట్ విధానాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో నేటి నుండి సీపీఐ జాతీయ సమితి సమావేశాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. గత కొద్ది నెలల్లో జరిగిన రాజకీయ పరిణామాలపై సమీక్ష ఉంటుందన్నారు. అలాగే బీహార్ ఎన్నికలు దాటి వల్ల వచ్చిన గుణపాఠాలు..హిందూత్వ శక్తులు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఏర్పడిన పరిస్థితి..ధరల పెరుగుదుల, రైతుల ఆత్మహత్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. నూతన రాజకీయ పరిణామాలు..వచ్చే మూడు నాలుగు నెలల్లో ఐదారు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఐ, వామపక్ష రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన ఎన్నికల ఎత్తుగడలపై చర్చించడం జరుగుతుందన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై వారు ఇచ్చే నివేదికపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి ఆందోళన చేయాలనే దానిపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర పార్టీలపై వదిలిపెడుతామన్నారు. వామపక్షాలు శక్తివంతంగా ఉంటే ఇతర శక్తులను కూడకొట్టవచ్చన్నారు. స్థానిక తక్షణ సమస్యలపై ఆందోళన చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు.

09:27 - January 8, 2016

కర్నూలు : సీఎం చంద్రబాబు మాటలు అరిగిపోయిన రికార్డు అని, జిల్లాలో చంద్రబాబు పర్యటన ఆయారాం..గయారం అనే చందంగా ఉందని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. 11 సంవత్సరలుగా సీఎంగా చేసిన బాబు అరిగిపోయిన రికార్డు జిల్లాకు తెచ్చారని విమర్శించారు. అవే మాటలు..అవే వాగ్ధానాలు..గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారో రికార్డు చూస్తే తెలుస్తుందన్నారు. రాయలసీమ బిడ్డంటూ చెబుతున్న బాబు రతనాలసీమను కరవు సీమగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. సీమ వాసులకు కల్లబొల్లి మాటలు చెప్పి అమరావతిని తరలించారని, విద్యార్థులను అదే అమరావతికి రూ. 10 ఇవ్వాలన అడగడం దారుణమన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

09:14 - January 8, 2016

రంగారెడ్డి : జిల్లాలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశారు. శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 83 నకిలీ రూ.వెయ్యి నోట్లు, 50 గ్రామాల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మహేష్ ను అరెస్టు చేశారు. అంతేగాకుండా 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుండి వచ్చాయనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. మహేష్ రెండు కేసుల్లో నిందితుడన్నది తెలుస్తోంది. గతంలో శామిర్ పేటలో  నకిలీ నోట్లు మారుతున్నాయనే సమాచారం అందుకున్న పోలీసులపై దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈఘటనలో కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ముఠాతో మహేష్ కు సంబంధం ఉందా అనే దానిపై పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

09:07 - January 8, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరునెల్వెల్లి వద్ద ఓమ్నీ బస్సు బోల్తా పడడంతో పది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు చిదంబరం నుండి నాగర్ కోయిల్ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం ఎలా జరిగిందో తెలియరాలేదు. 

షిమ్లాలో అగ్నిప్రమాదం..

హిమాచల్ ప్రదేశ్ : షిమ్లాలో లోయర్ బజార్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆరు షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

08:41 - January 8, 2016

గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నికల సమయాన్ని తగ్గించడంలో అర్థం లేదని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణను హైకోర్టు తప్పుబట్టింది. ఎన్నికల కుదింపు జీఓపై స్టే విధించింది. ఈ అంశంతో పాటు ఉభయ రాష్ట్రాల ఎంపీలతో రైల్వే జీఎం భేటీ కావడం అంశంపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే

ప్రతిపక్షాలకు కూడా ప్రచారం చేసే అవకాశం ఇవ్వాలి.
'గ్రేటర్ ఎన్నికల్లో లక్ష మంది ఉద్యోగులు కావాలని, అలా ఉంటే పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్థమవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చండీయాగంలో ప్రభుత్వ అధికారులు పని చేయాల్సి వచ్చింది కదా. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికలను రుద్దడంలో టీఆర్ఎస్ మొదటిస్థానంలో ఉంటుంది. వరంగల్ ఉప ఎన్నిక అవసరం ఉందా ? రాష్ట్ర మంత్రిగా చేర్చడం వల్ల అక్కడ ఎన్నిక వచ్చింది. సనత్ నగర్ ఉపఎన్నిక ఎందుకు వస్తుంది. వారికి ఎమ్మెల్యేల కొరత లేదు కదా. ఇదంతా ప్రజాస్వామ్యాన్ని ఖరీదు కట్టడమే. నగరంలో రూ. 4 వేల కోట్ల బడ్జెట్ ఎలా ఖర్చు పెట్టాలో 150 మంది కార్పొరేటర్లు నిర్ణయిస్తుంటారు. ఈ ఎన్నికలు ఒక విధంగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తుంది. తక్కువ సమయం ఇవ్వాలి అనేది సూత్రం. ఇప్పుడు కుదించింది అందుకని కాదు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం..ప్రచారం చేయకుండా ఉండడం కోసం చేశారు. అధికారంలో ఉన్న పార్టీకి ఏ రిజర్వేషన్ వస్తుందో తెలుసు. ప్రస్తుతం రిజర్వేషన్ లో గందరగోళ పరిస్థితి ఉంది. ముస్లీంల్లో అనేక కులాలు కూడా బీసీలో ఉన్నాయి. పాతబస్తీలో ఒక్క బీసీ లేనంటుగా చూపారు. ప్రస్తుతం ఏ వార్డు బీసీ రిజర్వేషన్ తెలియదు. సమయాన్ని కుదించడం సరైందేనా ? సమాన అవకాశాలు ఉన్నప్పుడే సమాన పోటీ ఉంటుంది. అధికారం ఉంది కనుక విద్యుత్ బకాయిలు, మంచినీటి బిల్లులు, ఆస్తి పన్ను తగ్గించారు. ఎన్నికలు అయిపోయిన తరువాత ఇవన్నీ పెరుగుతాయి. మంత్రి కేటీఆర్ ఎలా తిరుగుతున్నారో చూస్తున్నాం కదా. ఇదంతా నగర ప్రజలపై ఒక విధంగా ప్రచారం చేయడమే. ప్రతిపక్షాలకు కూడా ప్రచారం చేసే అవకాశం ఇవ్వాలి.

ఉభయ రాష్ట్రాల ఎంపీలతో రైల్వే జీఎం భేటీ..
రైల్వే కనెక్టవిటీని పెంచడానికి అవసరమైన అని చర్యలు తీసుకుంటామని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో చెప్పారు కదా. రెండు రాష్ట్రాల అవసరాలు గుర్తించి చర్యలు తీసుకుంటామని రైల్వే మంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. రైల్వే అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఉభయ రాష్ట్రాల అవసరాల ఏంటీ అనే దానిపై దృష్టి పెట్టారా ? రైల్వే జీఎంతో సమావేశాలు పెట్టడం ఏంటీ ? ఇక్కడ సచివాలయంలో రైల్వేకు ఒక విభాగం లేదు''. అని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. 

08:14 - January 8, 2016

హైదరాబాద్‌ : పెరూ రాజధాని లీమా నగరంలో 'గ్రాఫిక్‌ హ్యూమర్‌' అనే సంస్థ ఇటీవల ఏర్పాటు చేసిన 8వ అంతర్జాతీయ కార్టూన్‌ ఎగ్జిబిషన్‌లో 'నవ తెలంగాణ' పత్రికలో కార్టూనిస్ట్‌గా పని చేస్తున్న 'జక్కుల వెంకటేశ్‌' గీసిన రెండు కార్టూన్లు ఎంపికయ్యాయి. ఈ ప్రదర్శన కోసం ప్రపంచవ్యాప్తంగా కార్టూన్లను ఆహ్వానించారు. వాటిలోంచి 500 మంది ప్రఖ్యాత కార్టూనిస్టులు గీసిన ఉత్తమ కార్టూన్లను ఎంపిక చేశారు. భారత్‌ నుంచి నలుగురు కార్టూనిస్టులు గీసిన కార్టూన్లు ఎంపిక కాగా, వారిలో ఒకరు వెంకటేశ్‌. ఈ సందర్భంగా, పెరూ విదేశాంగ మంత్రిత్వశాఖ సహకారంతో 'గ్రాఫిక్‌ హ్యూమర్‌' ప్రదర్శనకు ఎంపికైన కార్టూన్లతో ఒక సావనీర్‌ కూడా ప్రచురించింది. వెంకటేశ్‌ గత 16 ఏండ్లుగా కార్టూనిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా, 'నవతెలంగాణ' సంపాదకులు ఎస్‌ వీరయ్య, సహోద్యోగులు వెంకటేశ్‌కు అభినందనలు తెలిపారు.

తొండుపల్లి వద్ద పోలీసుల తనిఖీలు..

రంగారెడ్డి : శంషాబాద్ (మం) తొండుపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 83 నకిలీ రూ.వెయ్యి నోట్లు, 50 గ్రామాల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. 

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరునెల్వెల్లి వద్ద ఓమ్నీ బస్సు బోల్తా పడడంతో పది మంది మృతి చెందారు. 

తెలంగాణలో కాలేజీల బంద్ కు ఏబీవీపీ పిలుపు…

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ ల విడుదలకు ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. 

07:34 - January 8, 2016

మెల్‌బోర్న్‌ : మహిళా జర్నలిస్ట్‌లతో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో తీవ్ర విమర్శల పాలవుతున్న విండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ తాజాగా ఓ ఆసీస్‌ మీడియా సంస్థపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వరల్డ్‌కప్‌ సందర్భంగా ఉద్దేశ్య పూర్వకంగా ఓ మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఫెయిర్‌ఫ్యాక్స్‌ మీడియాలో కథనం వెలువడిన విషయం తెలిసిందే. తొలుత దీనిని ఖండించిన గేల్‌.. ఇప్పుడు పరువు నష్టం దావా వేసేందుకు మొగ్గుచూపుతున్నాడు. బిగ్‌బాష్‌ లీగ్‌ మ్యాచ్‌ సందర్భంగా టెన్‌ స్పోర్ట్స్‌ రిపోర్టర్‌ మెక్‌లాలిన్‌తో గేల్‌ ప్రవర్తన వివాదస్పదమైన విషయం తెలిసిందే. మెక్‌లాలిన్‌కు గేల్‌ క్షమాపణ చెప్పటంతో ఇది సద్దుమణిగినా.. గతంలో గేల్‌ కారణంగా ఇబ్బంది పడిన మహిళా జర్నలిస్టులు ఇప్పుడు ముందుకొచ్చి అతని ప్రవర్తను గురించి చెబుతుండటంతో విండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ చిక్కుల్లో పడ్డాడు. రెనెగడెస్‌ జట్టు తొలుత గేల్‌కు పది వేల డాలర్ల జరిమానా విధించినా.. ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్‌ నుంచి ఉద్వాసనకు సైతం గురయ్యే ప్రమాదంలో పడ్డాడు. ఇదిలావుండగా ఫెయిర్‌ఫ్యాక్స్‌ సంస్థపై పరువు నష్టం దావా వేసేందుకు ఆస్ట్రేలియాలోని ప్రముఖ న్యాయవాది మార్క్‌ ఓబ్రైన్‌తో గేల్‌ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.

07:30 - January 8, 2016

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. జీహెచ్ఎంసీ చట్టసవరణను కోర్టు తప్పుబట్టింది. ఎన్నికల షెడ్యూల్ కుదింపు జీఓపై స్టే విధించింది. వచ్చే నెల 9వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని నాలుగు రాష్ట్రాలకు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాకేష్ (టీఆర్ఎస్), అద్దంకి దయాకర్ (టి.కాంగ్రెస్), శ్రీనివాస్ (గ్రేటర్ హైదరాబాద్ రెసిడెన్షియల్ ఫోరం) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

07:28 - January 8, 2016

చర్మం మరీ పొడిబారీ ఇబ్బంది పెడుతుంటే కొద్దిగా ఆలివ్‌ నూనెను రాయడం మంచిది. ఇది చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి పోషణనందిస్తుంది. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే చర్మంలో మార్పు కనిపిస్తుంది. దాంతోపాటు అలివ్‌ నూనె ఉన్న సబ్బుల్ని వాడటం వల్ల కూడా పీహెచ్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగించాలంటే ఆలివ్‌ నూనెలో కొద్దిగా చక్కెర వేసి రాసుకుని మర్ధన చేసుకోవాలి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. ఆలివ్‌ నూనెలో ఉండే స్క్వాలీన్‌ అనే పదార్ధం చర్మంలోని సాగే గుణాన్ని పెంచుతుంది. అలాగే, ఇది జుట్టుకు కూడా మంచిది. జుట్టు ఎండిపోయినట్లు అనిపిస్తే.. గుడ్డుసొనలో కొద్దిగా ఆలివ్‌నూనె కలిపి తలకు రాసుకోవాలి. అరగంట తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. కండీషనర్‌లో కొద్దిగా ఆలివ్‌ నూనె వేసుకున్నా మంచిదే.

07:26 - January 8, 2016

సపోటా అద్భుతమైన రుచిని అందించే పండ్లలో ఇదీ ఒకటి. దీనిలో ఉండే గుజ్జుకు త్వరగా జీర్ణం చేసే గుణం ఉంటుంది. సపోటాలో శక్తిని ఇచ్చే గ్లూకోజ్‌ లభిస్తుంది. క్రీడాకారులకు సపోటా తినమని నిపుణులు సలహా ఇస్తుంటారు. సపోటా కంటికి చాలా మంచిది. దీనిలో విటమిన్‌ ఎ అధికంగా ఉండి, వృద్ధాప్యంలో కూడా కంటి చూపు బాగుండడానికి సహాయపడుతుంది. కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల సపోటా పండు ఎముకల గట్టితనానికి, పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. పిండిపదార్థాలు, అవసరమైన ఇతర పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భిణీలకు, పాలు ఇచ్చే తల్లులకు చాలా ఉపయోగకరం. సపోటా పండు శక్తివంతమైన ఉపశమనకారి కావడం వల్ల నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమితో, అందోళనతో బాధపడుతున్న వ్యక్తులకు సపోటా చాలా మంచిది. ఇది జలుబు, దగ్గు తగ్గడానికి దోహదం చేస్తుంది. మూత్ర పిండాల్లో రాళ్లు తొలగిపోవడానికి సపోటా సహాయపడుతుంది. స్థూలకాయ సమస్యకు కూడా విరుగుడు సపోటా. ఈ పండులో ఉండే విటమిన్‌ ఇ చర్మాన్ని తేమగా ఉంచి అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టును మృదువుగా చేస్తుంది. సపోటా విత్తనాల నుంచి తీసిన నూనెను జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. చుండ్రును నియంత్రిస్తుంది. మొహం మీద ముడతలను తగ్గిస్తుంది. సపోటాలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

07:24 - January 8, 2016
అల్లం తింటే ఎక్కిళ్లు తగ్గుతాయి.
కరివేపాకు రక్త హీనతను తగ్గిస్తుంది.
నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిస్‌ అనే గ్లూకోసైట్‌, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవి తరచూ తింటే మలబద్ధకం పోతుంది.
జామపండ్లు హార్మోన్ల హెచ్చు తగ్గులను నివారిస్తాయి.
బ్లాక్‌ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.
సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్‌ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.
మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లు కరిగించే శక్తి ఉంది.
బీపీని బీట్‌ రూట్‌ క్రమబద్ధీకరిస్తుంది.
మునగాకు తింటే గ్యాస్ట్రిక్‌ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.
ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్‌ వృద్ధి చెందుతుంది.
కడుపు ఉబ్బరాన్ని అల్లం తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది.
కీరదోసలో ఉండే సిలికాన్‌, సల్ఫర్‌లు శిరోజాలకు మేలు చేస్తాయి.
క్యారెట్‌ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
మూత్రపిండ వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం.
శ్వాసకోశ సమస్యలను ఉల్లిపాయ తగ్గిస్తుంది.
అనాసపళ్లలో బ్రొమిలిస్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది వాపుల్ని తగ్గిస్తుంది.
పుచ్చకాయలో ఉండే లైకొపీస్‌ గుండె, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.
ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి.

 

07:17 - January 8, 2016

'నువ్వే కావాలి', 'నువ్వు లేక నేను లేను', 'నువ్వే నువ్వే' వంటి ప్రేమ కథా చిత్రాలతో లవర్‌ బాయ్ గా పేరు తెచ్చుకున్న 'తరుణ్‌' చాలా గ్యాప్‌తో మరో ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రమేష్‌ గోపీ దర్శకత్వంలో రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత ఎస్‌.వి.ప్రకాష్‌ ఈ ప్రేమ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓవియా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌.వి.ప్రకాష్‌ మాట్లాడుతూ,'ఒక అమ్మాయిని ఎంత కాలం ప్రేమించామన్నది కాదు, ఎంత బాగా ప్రేమించామన్నదే ముఖ్యమనే ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. నేడు(శుక్రవారం) తరుణ్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. మంచి ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో తరుణ్‌ మళ్ళీ ఆల్‌ రౌండర్‌గా నిరూపించుకుంటారడనంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు' అని అన్నారు.

 

07:15 - January 8, 2016

పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభాస్‌ ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించారని సమాచారం. ప్రస్తుతం 'బాహుబలి ద కన్‌క్ల్యూజన్‌' చిత్రంలో ఆయన నటిస్తున్నారు. 'రన్‌ రాజా రన్‌' వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన సుజీత్‌ దర్శకత్వంలో రూపొందే ఈచిత్రాన్ని యువి క్రియేషన్స్‌ నిర్మిస్తోందట. కెరీర్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్‌ రోల్స్‌ చేసిన ప్రభాస్‌, తన 13 ఏళ్ళ కెరీర్‌లో 19 చిత్రాల్లో నటించారు. ఫస్ట్‌టైమ్‌ ఆయన సిల్వర్‌స్క్రీన్‌పై పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనుండటంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాలో సీఎం బాబు పర్యటన..

విజయవాడ : తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కాకినాడ, నల్లజర్లలో జన్మభూమి కార్యక్రమాలకు బాబు హాజరు కానున్నారు. 

నేడు గవర్నర్ ను కలువనున్న పీసీసీ కో ఆర్డినేషన్ కమిటీ..

హైదరాబాద్ : నేడు గవర్నర్ నరసింహన్ ను పీసీసీ కో ఆర్డినేషన్ కమిటీ భేటీ కానుంది. గ్రేటర్ ఎన్నికలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కమిటీ ఫిర్యాదు చేయనుంది.

 

నేటి నుండి సీపీఐ జాతీయ సమితి సమావేశాలు..

గుంటూరు : నేటి నుండి సీపీఐ జాతీయ సమితి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. పార్టీ బలోపేతం, రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మోడీ మతతత్వ కార్పొరేట్ విధానాలపై చర్చిస్తామన్నారు. 

06:49 - January 8, 2016

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గత కొన్ని దశాబ్ధాలుగా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లకు కష్టకాలమొచ్చింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడుస్తున్న స్కీమ్ లకు ఎదురవుతున్న సవాళ్లేమిటి ? ఈ స్కీమ్ లను పరిరక్షించుకోకపోతే ఏమవుతుంది ? విభిన్న స్కీమ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి ? స్కీమ్ వర్కర్ల కోరికలు, డిమాండ్ల విషయంలో ప్రభుత్వాల వైఖరి ఎలా వుంటోంది? యూనియన్లలో తిరుగుతున్న స్కీమ్ వర్కర్లకు ఎదురవుతున్న అనుభవాలేమిటి ? ఈ అంశాలపై టెన్ టివి జనపథంలో సీఐటీయూ నేత సాయిబాబు విశ్లేషించారు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:48 - January 8, 2016

ఆకలి కేకలు లేని భారతదేశాన్ని నిర్మించుకోవాలన్న సదాశయం నేటి నాయకత్వంలో కొరవడుతోంది. ఎన్నో మహోన్నత ఆశయాలతో ప్రారంభమై, ఉత్తమ ఫలితాలు అందించిన స్కీమ్ లకే ఎసరు పెడుతున్న రోజులొచ్చాయి. కేంద్రం స్కీమ్ లకు కత్తెరలు వేస్తుంటే, వాటి పరిరక్షణకు ఉద్యమించేవారిపై రాష్ట్ర ప్రభుత్వాలు అసహనం ప్రదర్శిస్తున్నాయి. ఆకలితో, అర్ధాకలితో అలమటిస్తున్నవారి సంఖ్య భారత్ లో అత్యధికంగా వున్నట్టు ప్రపంచ బ్యాంక్ 2015 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికలో వెల్లడించింది. మన దేశంలో దాదాపు 22శాతం మంది దారిద్ర్య రేఖ కంటే దిగువున దుర్భర జీవితాలు గడుపుతున్న వైనాన్ని మూడేళ్ల క్రితమే ప్రపంచబ్యాంక్ కళ్లకు కట్టింది. ఈ మూడేళ్లలో సామాన్యుల వేతనాల్లో చెప్పుకోదగ్గ వ్రుద్ధి ఏమీ లేకపోగా, నిత్యావసరాల ధరలు, నీరు, విద్యుత్, రవాణా, ఇంధన చార్జీలు, విద్య, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కేవలం వైద్య ఖర్చులు భరించలేక ఏటా 5 కోట్ల మంది ఆర్థికంగా చితికిపోయి, పేదరికంలోకి దిగజారుతున్నట్టు కేంద్ర ప్రభుత్వమే లెక్క చెబుతోంది. దేశంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులున్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలకీ పెద్ద పీట వేయక తప్పదు.

రక్త హీనత...
స్వాతంత్య్రానంతరం తొలితరం నాయకత్వం అభివ్రుద్ధి ఎజెండాతో పాటు ప్రజాసంక్షేమానికీ బడ్జెట్ ప్రాధాన్యతలిచ్చాయి. అభివృద్ధి, సంక్షేమం ఇవి రెండూ మన దేశానికి రెండు కళ్లల్లాంటివి. అయితే 1990ల తర్వాత సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వాల వైఖరుల ఎలా మారుతున్నాయో, కార్పొరేట్, ప్రయివేట్ రంగాల పట్ల ఎలాంటి మక్కువ ప్రదర్శిస్తున్నాయో మనం గమనిస్తూనే వున్నాం. రక్తహీనతతో బాధపడుతూ అనారోగ్యాల పాలవుతున్న స్త్రీల సంఖ్య మనదేశంలో చాలా ఎక్కువ. గర్భీణీల మరణాలూ, శిశుమరణాలు అధికంగా వున్న దేశం మనది. దాదాపు 20 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. కాలేకడుపుకి గుక్కెడు పాలు దొరక్క పసికూనలు చనిపోతున్న విషాదాన్ని ప్రతిరోజూ దిగమింగుతున్న దేశం మనది. ఈ పరిస్థితిని నివారించే లక్ష్యంతో, పోషకాహారలోపంతో బాధపడుతున్న కోటానుకోట్ల మంది పసిపిల్లలకు పిడికెడు మెతుకులైనా అందించాలన్న లక్ష్యంతో, సుప్రీంకోర్టు కూడా తీర్పులు వెలువరించి, కర్తవ్య బోధ చేసిన నేపథ్యంలో గత ప్రభుత్వాలు కొన్ని స్కీమ్ లు ప్రారంభించాయి. ఇలాంటివాటిలో మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్ చెప్పుకోదగ్గవి. గ్రామీణ నిరుపేదలకు కనీసం వంద రోజుల పని కల్పించాలన్న లక్ష్యంతో వచ్చిందే గ్రామీణ ఉపాధి హామీ పథకం.

నిధుల వాటా తగ్గింపు...
వీటితో పాటు ప్రాథమిక మాధ్యమిక విద్యారంగంలో సైతం అనేక స్కీమ్ లొచ్చాయి. విభిన్న రంగాల్లో 63 రకాల పథకాలకు కేంద్రం నిధులు సమకూర్చింది. వీటిలో కొన్ని పథకాలకు 90 శాతం, 75శాతం, 50శాతం చొప్పున కేంద్రం నిధులిస్తే, మిగిలిన వాటాను రాష్ట్రాలు భరించేవి. అయితే, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి స్కీమ్ లకు బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోతున్నాయి. తన వంతు వాటాను కేంద్రం తగ్గిస్తోంది. రాష్ట్రాల మీద ఆర్థిక భారం మోపుతోంది. దీంతో ఈ పథకాల మనుగడే ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇప్పటికే గత బడ్జెట్ లో 8 పథకాలను కేంద్రం రద్దు చేసింది. 24 స్కీమ్ ల్లో తానివ్వాల్సిన నిధుల వాటాను తగ్గించింది. ఇప్పుడు మరికొన్నింటికి కత్తెర వేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

పోరాటాలు...
మరోవైపు, చాలీచాలని గౌరవ వేతనాలతో పనిచేస్తున్న వివిధ స్కీమ్ ల వర్కర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, రాజకీయ జోక్యాన్ని నివారించాలనీ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని పోరాటాలు సాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడుస్తున్న స్కీమ్ లను మరింత పరిపుష్టం చేయాలంటూ చక్కటి సూచనలిస్తున్నాయి. ఇలాంటి సందర్భాలలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అసహనం ప్రదర్శిస్తున్నాయి. ఆందోళనలకు వెళ్లేవారిని ముందస్తుగా అరెస్టులు చేయడం, నిర్బంధించడం, ఉద్యోగాలు తొలగించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ వర్కర్ల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాయో, వారి పట్ల ఎంత కాఠిన్యం ప్రదర్శించాయో టీవీలలో దృశ్యమానమైంది. మరోవైపు యూనియన్లు పెట్టవద్దంటూ ఫలానా కార్మిక సంఘాల వెంట తిరగవద్దంటూ మంత్రులు ఓపెన్ గానే హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ లకు కత్తెరలు వేస్తూ, రాష్ట్రాల మీద భారం మోపుతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల, వర్కర్ల ప్రజాస్వామిక హక్కుల మీదనే అసహనం ప్రదర్శిస్తున్నాయి. ఇది అవాంఛనీయ పరిణామం.  

06:41 - January 8, 2016

ప్రపంచ చాంపియన్ టీమిండియా 2016 సీజన్లో తొలి విదేశీటూర్ ను కంగారూ ల్యాండ్ నుంచి ప్రారంభించనుంది. టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాకంగా...మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని భారతజట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది. జనవరి 12 నుంచి 31 వరకూ ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే, మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం...వన్డేల్లో టీమిండియా రెండు, ఆస్ట్రేలియా మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే టీ-20 ర్యాంకింగ్స్ లో మాత్రం ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంటే టీమిండియా మాత్రం 8వ ర్యాంక్ కు పడిపోయింది. మూడోర్యాంకర్ ఆస్ట్రేలియాతో జరిగే ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ కు జనవరి 12న పెర్త్ వాకా క్రికెట్ స్టేడియంలో తెరలేవనుంది. సిరీస్ లోని రెండో వన్డే బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జనవరి 15న జరుగుతుంది. జనవరి 17న జరిగే మూడో వన్డేకి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తుంది. సిరీస్ లోని నాలుగో వన్డే జనవరి 20న కాన్ బెర్రా మనూకా ఓవల్ గ్రౌండ్స్ లో జరుగుతుంది. జనవరి 23న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా జరిగే ఆఖరి డే-నైట్ వన్డే మ్యాచ్ తో సిరీస్ కు తెరపడుతుంది. ఆ తర్వాత..రెండు రోజుల విరామం తర్వాత..మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్... జనవరి 26న అడిలైడ్ ఓవల్ గ్రౌండ్స్ లో ప్రారంభంకానుంది. జనవరి 26న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో రెండో టీ-20 సమరం నిర్వహిస్తారు. జనవరి 31న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగే ఆఖరి టీ-20 మ్యాచ్ తో...సిరీస్ తో పాటు..ఆస్ట్రేలియాలో భారత పర్యటన సైతం ముగుస్తుంది. వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొనే భారతజట్లకు జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వం వహిస్తాడు. 2016 టీ-20 ప్రపంచకప్ భారత్ వేదికగా మార్చి8 నుంచి ఏప్రిల్ 3 వరకూ జరుగనున్న సంగతి తెలిసిందే.

06:38 - January 8, 2016

జమ్మూ కాశ్మీర్‌ : సీఎం ముఫ్తీ మహమ్మద్ సయిూద్ ఆకస్మిక మృతితో సీఎం రేసు మొదలైంది. అయితే ఇప్పటికే ముఫ్తీ మహమ్మద్ సయిూద్ కుమార్తె మహబూబానే తమ నాయకురాలని సంకీర్ణ పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో మహబూబా సీఎం పీఠానికి ఎదురు లేదని తేలిపోయింది. అయితే ఇప్పటికే సీఎం అభ్యర్థిత్వంపై నిర్ణయం జరిగిన నేపథ్యంలో మహబూబా ప్రమాణ స్వీకారం లాంఛనమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే చాలాకాలం నుంచి ముఫ్తీ మహమ్మద్ సయిూద్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అలాగే అనారోగ్యం నుంచి కోలుకున్నా సయీద్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించే స్థాయిలో లేరని ఒక దశలో చర్చ జరిగింది. ఆ సందర్భంలోనే పీడీపీ, బీజేపీ నాయకులు చర్చించి నెమ్మదిగా సీఎం పగ్గాలను మహబూబాకు అప్పగించాలని నిర్ణయించారు. ఇక మహబూబా నాయకత్వం విషయంలో పీడీపీ నాయకులలో వేరే ఆలోచనే లేదు. మహబూబా ముఫ్తీనే తమ నాయకురాలు అని అంటున్నారు. .

అంత్యక్రియల అనంతరం చర్చలు...
అలాగే మహబూబాను సీఎం చెయ్యడానికి బీజేపీకి సైతం ఎలాంటి అభ్యంతరం లేదు. మరోవైపు జనవరి 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగవలసి ఉంది. ఇదే సమయంలో ముఫ్తీ మహమ్మద్ సయిూద్ మరణించారు. పీడీపీ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. గతంలో జరిగిన కొన్ని సమావేశాలలో ముఫ్తీ మహమ్మద్ సయిూద్ మాట్లాడుతూ తాను ప్రజలతో, పార్టీ నాయకులతో ఎక్కువ సమయం గడపడానికి వీలుకావడం లేదని అన్నారు. మహబూబా ముఫ్తీకి ప్రజలతో, పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆమె ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ముఫ్తీ మహమ్మద్ సయిూద్ స్వయంగా చెప్పారు. ముఫ్తీ మహమ్మద్ అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత పీడీపీ, బీజేపీ నాయకులు సమావేశం అయ్యి తుది నిర్ణయం తీసుకుంటారని జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయిూం అఖ్తర్ తెలిపారు.

06:35 - January 8, 2016

హైదరాబాద్ : పర్యాటక రంగంలో నూతన విధానాలు తీసుకువచ్చేందుకు టీఎస్‌ సర్కార్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హెలికాప్టర్‌లో నుంచి సిటీ అందాలను చూపాలని డిసైడైన సర్కారు... మరో ముందడుగు వేసింది. హుస్సేన్‌ సాగర్‌ నీటి రిజర్వాయర్‌ నుంచి విమానాలను బోర్డింగ్‌ ల్యాండింగ్‌ చేయాలని నిర్ణయించింది. ఇలాంటి వినూత్న విధానానికి ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే కేరళకు చెందిన సీప్లెయిన్స్‌ బృందం నగరానికి చేరుకొని అనువైన ప్రదేశాల కోసం అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శితో సీ ప్లెయిన్స్‌ బృందం భేటీ అయ్యింది. నగరంలో ప్రధానంగా హుస్సేన్‌ సాగర్‌ ఇందుకు అనువైనదిగా తేల్చారు. ముఖ్యంగా సీ ప్లెయిన్స్‌ నడిపేందుకు భారీ జలాశయాలు అయితే అనువుగా ఉంటుంది. ఇదిలా ఉంటే హుస్సేన్‌ సాగర్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లోని మిడ్‌ మానేరు, రామప్ప, పాకాల, లక్నవరం లాంటి భారీ చెరువులు, నాగార్జున్‌ సాగర్‌, శ్రీశైలం వంటి భారీ జలాశయాల్లో కూడా సీ ప్లెయిన్స్‌ నడిపేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. అయితే దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ సీ ప్లెయిన్స్‌ దోహదపడుతాయని పర్యాటక శాఖ అభిప్రాయ పడుతోంది. మరో నెల రోజుల్లో సీ ప్లెయిన్స్‌ ను హుస్సేన్‌ సాగర్‌లో నిర్వహించేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది.

06:30 - January 8, 2016

విజయవాడ : సమయం చూసి శత్రువును దెబ్బకొట్టాలి. అప్పుడే విజయంలో కిక్కుంటుంది. ఎవరొచ్చినా..? ఎంతమంది వచ్చినా..? ఓకే. గ్రాండ్ వెల్‌కమ్‌. రండిబాబు రండి. మా పార్టీలో చేరండి. మా కండువా కప్పుకోండి. ఏపీలో టీడీపీ, వైసీపీ అధినేతల మాటలివి. బంపర్ ఆఫర్లతో పక్కపార్టీల నేతలకు వలేస్తున్నారు. వలస పక్షులను రారమ్మంటూ ఆహ్వానిస్తున్నారు. రెడ్ కార్పెట్ పరుస్తూ ద్వారాలు తెరుస్తున్నారు. పవర్‌తో అధికార పక్షం పటాయిస్తుంటే, పట్టుకోసం ప్రతిపక్షం ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో వలసల వ్యవహారం సలసల వేడెక్కిస్తోంది.

టీడీపీకి జంప్ జిలానీలు..
టీడీపీకి జంప్ జిలానీల తాకిడి పెరిగిపోతోంది. పసుపు కండువా క‌ప్పుకునేందుకు నేతలు తెగ పోటీ ప‌డుతున్నారు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేల వ‌ల‌స‌లు ఉంటాయ‌ని ఎన్టీఆర్‌భవన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం నేరుగా చంద్రబాబే తెర‌వెనక పావులు క‌దుపుతున్నట్లు స‌మాచారం. ఇప్పటికే మాజీమంత్రి కొణ‌తాలను టీడీపీ ఆహ్వానించింది. అంతేకాకుండా క‌ర్నూలు, క‌డ‌ప‌, విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల‌కు చెందిన... వైసీపీ ఎమ్మెల్యేల‌కు చంద్రబాబు ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత వలసలు ఉంటాయని తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హీటెక్కిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్...
మరోవైపు అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్ష నేత వ్యూహరచన చేస్తున్నారు. పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు వ‌ల‌స‌ల‌ను ప్రోత్సహిస్తున్నారు జగన్‌. రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్‌ కోసం... ప్రయత్నాలు చేస్తున్న పలువురు సీనియర్లను ఆహ్వానిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు వైసీపీ అధినేత ప్రయత్నాలు చేస్తున్నారు. బొత్స ద్వారా ఆయన రాయ‌బారం న‌డిపిస్తున్నారు. తాజాగా మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావును జగన్‌ కలిశారు. అలాగే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకునేందుకు పావులు క‌దుపుతున్నారు. దీంతో సంక్రాంతి తర్వాత వైసీపీలోకి జోరుగా వ‌ల‌సలుంటాయని లోట‌స్‌పాండ్‌లో ప్రచారం జ‌రుగుతోంది. ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌ హీటెక్కిస్తోంది. పార్టీల‌ బ‌లోపేతం కోసం వ‌ల‌స‌ల‌ను ప్రోత్సహించ‌డం త‌ప్పద‌ని... ఇరు పార్టీలు భావిస్తున్నాయి. మరి జగన్ పార్టీలో ఎందరు ఉంటారో..? ఎంతమంది సైకిల్ ఎక్కుతారో చూడాలి.

06:27 - January 8, 2016

చిత్తూరు : 2050 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ప్రముఖ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుపతి ఎస్పీజేఎన్‌ఎం హైస్కూల్‌లో జరిగిన జన్మభూమి-మాఊరులో ఆయన పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తిరుపతిని సిటీ ఆఫ్‌ లేక్స్‌గా తయారుచేస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అమరావతి, విశాఖ, తిరుపతిలను... రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ మహానగరాలుగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే బెంగళూరు-చెన్నై నగరాల్ని చిత్తూరు జిల్లాకు కలుపుతూ పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు. ఇక జూన్‌లోగా కుప్పం నియోజకవర్గానికి... హంద్రీనీవా ద్వారా నీటిని అందిస్తామన్నారు. అలాగే బాలాజీ రిజర్వాయర్ ద్వారా సోమశిల జలాలను చిత్తూరు జిల్లాకు తరలిస్తామని సీఎం స్పష్టం చేశారు.

బాబు ఫైర్...
మరోవైపు వైసీపీపై బాబు పరోక్షంగా ఫైర్‌ అయ్యారు. జన్మభూమి కార్యక్రమాన్ని చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. అందుకే సభలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో రౌడీయిజాన్ని ఏమాత్రం సహించేది లేదన్నారు ఏపీ సీఎం. అసెంబ్లీలో కొందరు వాడుతున్న భాష వినటానికే కర్ణకఠోరంగా ఉందన్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం తమ్ముళ్లతో సమావేశమయ్యారు బాబు. తిరుపతి నగర కార్పొరేషన్‌ ఎన్నికలు, స్మార్ట్‌సిటీ వంటి అంశాలపై చర్చించారు. 

06:25 - January 8, 2016

మెదక్ : తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు పాల్గొన్నారు. ఉద్యాన వర్శిటీతో పాటు కళాశాలకు కూడా సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.

50 కోట్లతో అటవీ కళాశాల..
అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌..1300 ఎకరాల్లో మూడు ఇనిస్టిట్యూట్స్ ప్రారంభించుకున్నందుకు గజ్వేల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్‌లో 50 కోట్లతో అటవీ కళాశాలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అలాగే ఏప్రిల్ 30న ఇంటింటికి నల్లా పథకాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. ఒంటిమామిడి మార్కెట్‌లో 20 కోట్లతో కోల్డ్‌స్టోరేజీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో మరోసారి సమావేశం అయి యూనివర్సిటీ అభివృద్ధిపై చర్చిస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రంలో అద్భుతమైన ప్రయోగశాలలు రాబోతున్నాయని..ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో విత్తనాల తయారీ జరుగుతోందన్నారు. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.

ఉద్యాన వర్సిటీతో పాటు కళాశాల ఏర్పాటు..
నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక రైతు సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టారని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధాసింగ్‌ మోహన్‌ అన్నారు. కొండా లక్ష్మణ్‌ తెలంగాణ గాంధీ లాంటివారని.. ఉద్యాన వర్శిటీకి ఆయన పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు. భూసార కార్డులు ప్రవేశ పెట్టామని, తక్కున నీరు -ఎక్కువ సాగు నినాదంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులో ఉద్యాన వర్శిటీతో పాటు కళాశాల ఏర్పాటు చేస్తామని ఆరు నెలల కిందటే కేసీఆర్‌ చెప్పారు. ఉద్యాన వర్శిటీ ఏర్పాటుతో తమ ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

06:21 - January 8, 2016

హైదరాబాద్ : బెజవాడ కల్తీమద్యం కేసులో ఎ-9 నిందితునిగా ఉన్న కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఆయన సోదరుడు శ్రీనివాసును కృష్ణలంక పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం, గురువారం సిట్‌ బృందం మల్లాది విష్ణును సుదీర్ఘంగా విచారించింది. అర్థరాత్రి సమయంలో పోలీసులు విష్ణును ఆయన సోదరున్ని అరెస్ట్‌ చేశారు. గత నెల 7వ తేదీన మల్లాది విష్ణుకు చెందిన స్వర్ణబార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు చనిపోగా.. 15 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ సర్కార్‌ విచారణకు ఆదేశించింది. ఈ ఘటన తర్వాత దాదాపు నెలరోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన మల్లాది విష్ణు బుధవారం సిట్‌ బృందం ముందు హాజరయ్యారు. రెండు రోజులుగా సిట్‌ బృందం విష్ణును విచారించింది. చివరకు సిట్‌ బృందం మల్లాది విష్ణును అతని సోదరుడు శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేశారు. మరోవైపు తమ నేతను రాజకీయంగా ఎదుర్కోలేకనే అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. అర్థరాత్రి వరకు మహిళలను కూడా విచారించడం ఏంటని ప్రశ్నించారు. మల్లాది విష్ణును అరెస్ట్‌ చేయమని చెప్పిన సిట్‌ అధికారులు అర్థరాత్రిపూట అరెస్ట్‌ చేయడం దారణమన్నారు. మల్లాది విష్ణును విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు.

మల్లాది, అతని సోదరుడు అరెస్టు..

విజయవాడ : కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును అతని సోదరుడు శ్రీనివాస్ లను పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజులుగా సిట్ అధికారులు మల్లాది విష్ణును విచారించిన సంగతి తెలిసిందే. 

రూ.50 లక్షల హవాలా నగదు స్వాధీనం..

హైదరాబాద్ : షాహిథ్ గంజ్ పీఎస్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల వద్ద రూ.50 లక్షల హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఓం ప్రకాష్, శ్యాంసుందర్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

నేటి నుండి ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్..

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నిర్మాణరంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కారాలను కనుగొనేందుకు ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్ జరగనుంది. నేటి నుండి పదో తేదీ వరకు రామోజీ ఫిలిం సిటీలో ఈ కన్వెన్షన్ జరగనుంది. 

నేడు ప్రభుత్వ బ్యాంకుల సిబ్బంది సమ్మె..

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే కొంతమంది సిబ్బంది శుక్రవారం దేశ వ్యాప్త సమ్మె చేయనున్నారు. అనుబంధ బ్యాంకులతో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఎస్ బీఐ ఉల్లంఘించిందంటూ ఆల్ ఇండియా ఎంప్లాయిర్స్ అసోసియేషన్ ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చింది.

 

నేడు జర్నలిస్టులకు హెల్త్ కార్డులు..

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు హెల్త్ కార్డులకు పంపిణీ చేయనున్నారు. ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా శుక్రవారం సచివాలయం డీ బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జర్నలిస్టులకు హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్నారు. 

నేడు శ్రీనగర్ కు డిప్యూటి సీఎం..

హైదరాబాద్ : దివంగత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ శ్రీనగర్ కు వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. 

Don't Miss