Activities calendar

09 January 2016

రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

హైదరాబాద్ : నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండెళ్ల బాలుడు మృతిచెందాడు. సూరారం రాజీవ్ గృహకల్ప వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో బాలుడు మృతిచెందాడు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

హైదరాబాద్: నగరంలోని కుషాయిగూడ వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తోన్న ఆటో ట్రాలీని పోలీసులు పట్టుకున్నారు. ట్రాలీలో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తుర్కపల్లికి తరలిస్తున్నట్టు గుర్తించారు. నిందితున్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

22:17 - January 9, 2016

పెట్టుబడులు, ఉపాధి కల్పన లక్ష్యంగా అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్టు చేస్తోంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొనబోతున్నారు. భారతపరిశ్రమల సమాఖ్య ఇందుకు సంబంధించి తన వంతు పాత్రను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో సీ.ఐ.ఐ.  ఏపీ చాప్టర్ ఛైర్మన్ సురేశ్ చిట్టూరి తో స్పెషల్ ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం.  ఆ వివరాలను వీడియోలో చూద్దాం…

 

22:07 - January 9, 2016

హైదరాబాద్ : వారంత గ‌తంలో చ‌క్రం  తిప్పారు. ఐదేళ్లు అన్నీవారై మ‌హాన‌గ‌ర‌ పాల‌క సంస్థను శాసించారు. మ‌రోసారి బ‌ల్దియాలో త‌మ హ‌వా కొన‌సాగించాల‌ని భావించారు. డామిట్. క‌థ అడ్డం తిరిగింది.  ఈసారి హవా కాదు క‌దా వారి ఉనికే లేకుండా  పోయింది. ఇంత‌కు ఎవ‌రు వారు..ఏంటా క‌థ..
కీలక నేతలకు హ్యాండిచ్చిన రిజర్వేషన్లు 
జీహెచ్ఎంసీ గ‌త పాల‌క మండ‌లిలో పెత్తనం చెలాయించిన కీల‌క నేత‌ల‌కు  రిజ‌ర్వేష‌న్ల రూపంలో నిరాశ ఎదురైంది. మ‌రోసారి గ్రేట‌ర్ లో చ‌క్రం తిప్పాల‌కున్న వారికి రిజ‌ర్వేష‌న్స్ హ్యాండిచ్చాయి. గ‌తంలో మేయ‌ర్లు, డిప్యూటి మేయ‌ర్లు, ఫ్లోర్ లీడ‌ర్లుగా ఉన్నవారికి వార్డుల విభ‌జ‌న‌, రిజ‌ర్వేష‌న్ల ఫైన‌లేజేష‌న్ తో పెద్ద షాక్ త‌గిలింది. ఈసారి కూడా కార్పొరేష‌న్లో అడుగుపెట్టి త‌మ హవా కొనసాగించాలని ఉవ్విళ్లూరిన నేతలకు త‌మ త‌మ వార్డుల్లో పోటీ చెయ్యడానికి వీలులేకుండా పోయింది. 
నాడు డిప్యూటి మేయ‌ర్‌గా గోల్కొండ‌ రాజ్‌కుమార్ 
గ‌తంలో కాంగ్రెస్, ఎంఐఎంల అల‌యిన్స్ తో పాల‌క మండ‌లిని పంచుకున్నాయి. మొద‌టి రెండేళ్లు కాంగ్రెస్, త‌రువాత మూడేళ్లు ఎంఐఎం  మేయ‌ర్ పీఠాన్ని అధీష్టించాయి. మొద‌ట బండ కార్తీకరెడ్డి మేయ‌ర్‌గా వ్యవ‌హ‌రించ‌గా,  డిప్యూటి మేయ‌ర్‌గా జాఫ‌ర్ హుస్సేన్‌లు ఉన్నారు. త‌రువాత మేయ‌ర్‌గా మాజీద్ హుస్సేన్ పగ్గాలు తీసుకోగా, డిప్యూటి మేయ‌ర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన గోల్కొండ‌ రాజ్ కుమార్ ఉన్నారు.
బీసీ ఉమెన్ కు అహమ్మద్ న‌గ‌ర్ రిజర్వ్ 
అయితే ఇప్పడు వీరంద‌రికి  రిజ‌ర్వేష‌న్లు హ్యాండిచ్చాయి. మాజీద్ హుస్సేన్ ప్రాతినిథ్యం వ‌హించిన అహమ్మద్ న‌గ‌ర్ ప్రస్తుతం బీసీ ఉమెన్‌కు రిజర్వ్ అయ్యింది. దాంతో మాజీద్‌కు స్థానం లేకుండా పోయింది. డిప్యూటి మేయ‌ర్ గోల్కొండ  రాజ్ కుమార్ క‌వాడిగూడా నుంచి ప్రాతినిథ్యం వ‌హించ‌గా ప్రస్తుతం ఆ డివిజ‌న్ ఎస్సీ మ‌హిళకు కేటాయించారు. మ‌రో డిప్యూటి మేయ‌ర్ జాఫ‌ర్ హుస్సేన్ టోలిచౌకి డివిజ‌న్ కూడా  బీసీ మ‌హిళతో భర్తీ కానుంది. ఇక కాంగ్రెస్ మేయ‌ర్‌గా ప‌నిచేసిన బండ కార్తికరెడ్డికి మాత్రం ఎలాంటి ఢోకా లేదు. ఆమె ప్రాతినిధ్యం వ‌హించిన‌ తార్నాక డివిజ‌న్ మాత్రమే జ‌నరల్ మ‌హిళకు రిజర్వ్  అయ్యింది. 
క‌నుమ‌రుగైన దిడ్డి రాంబాబు డివిజ‌న్ బ‌ర్కత్‌పుర
ఇక గ్రేట‌ర్ కార్పొరేష‌న్‌లో ఐదేళ్ల పాటు ఫ్లోర్‌ లీడర్లుగా ఉన్న వారికి కూడా  అవే ఇబ్బందులు త‌ప్పలేదు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడ‌ర్ గా ఉన్న దిడ్డి రాంబాబు డివిజ‌న్ బ‌ర్కత్‌పురా ఏకంగా క‌నుమ‌రుగైంది. దాని స్థానంలో  ఏర్పడ్డ కాచిగూడా  జ‌నరల్‌ ఉమెన్‌కు రిజ‌ర్వు అయ్యింది. తెలుగుదేశం ఫ్లోర్ లీడ‌ర్‌గా ఉండి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న  సింగిరెడ్డి ప్రాతినిథ్యం వ‌హించిన సైదాబాద్ ఇప్పడు జ‌నరల్‌ మ‌హిళకు కేటాయించారు.  మొద‌ట్లో కాంగ్రెస్ ఫ్లోర్‌ లీడ‌ర్‌గా ఉన్న కాలేరు వెంక‌టేష్ గోల్నాక డివిజ‌న్ ప్రస్తుతం బీసీ ఉమెన్ అయ్యింది.  ఇక బీజేపీ నుంచి ఫ్లోర్‌ లీడ‌ర్‌గా ఉన్న బంగారీ ప్రకాశ్ మాత్రం సేఫ్ గా ఉన్నారు.  గ‌తంలో ఉన్న  మెహ‌దీప‌ట్నం డివిజ‌న్ బిసి జనరల్‌ కాగా ఈసారి కూడా అదే రిజ‌ర్వేష‌న్ వ‌చ్చింది. గ‌త పాల‌క మండ‌లిలో అంతా  తామై న‌డిపిన ఇలాంటి కీల‌క నేత‌లకు ఈసారి ఎన్నిక‌ల్లో ఎక్కడి నుంచి పోటీ చెయ్యాలో అర్థంకాని ప‌రిస్థితి ఏర్పడింది. 

 

22:03 - January 9, 2016

హైదరాబాద్ : ఆకాశంలో సగం, అనంత కోటి నక్షత్రాల్లో సగం వారు. రాజకీయాల్లో మాత్రం భర్త చాటు భార్యలే. ఇదే ఇప్పుడు రాజకీయ పార్టీలను వేధిస్తున్న ప్రశ్న. గ్రేటర్ ఎన్నికల్లో అస్థిత్వం, పలుకుబడి కలిగిన మహిళ అభ్యర్థుల సెలెక్షన్ పార్టీలకు ఛాలెంజ్ గా మారింది.  50 శాతం వివిధ వర్గాల మహిళలకే రిజర్వేషన్ చేయడంతో మహిళా అభ్యర్థుల లభ్యత కత్తిమీద సాములా మారింది.  మరి కేటాయింపులకు అనుగుణంగా పార్టీలకు అభ్యర్థులు దొరుకుతారా...ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది..?
150 వార్డుల్లో 75 వార్డులు మహిళలకు
అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికలు అనగానే గుర్తుకు వచ్చేది గెలుపు గుర్రాలు. అభ్యర్థుల ఎంపిక పొలిటికల్ పార్టీలకు కత్తి మీదసాము. అభ్యర్థుల‌ను ఫైన‌ల్ చేస్తే సగం ప‌ని పూర్తయిన‌ట్లే.  అయితే గ్రేటర్ ఎన్నికల్లో మరో చిక్కు వచ్చిపడింది పార్టీలకు. సాధారణంగా అర్థబలం, అంగబలం ఉన్న అభ్యర్థులకే ప్రాధాన్యతనిస్తాయి పార్టీలు. గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలిలో  50శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సి రావడంతో జిహెచ్ఎంసిలోని 150 వార్డుల్లో 75 వార్డులు మహిళలకు కేటాయించింది ప్రభుత్వం. ఈ పరిస్థితులే ఇప్పడు గ్రేటర్‌లోని అన్ని రాజకీయ పార్టీలకు పెను సవాలుగా మారాయి. 
రిజర్వేషన్ల ప్రకారం మహిళా అభ్యర్థులు దొరుకుతారా? 
మహిళా అభ్యర్థుల కోసం వేట మొదలుపెట్టాయి పార్టీలు. కొందరు నాయకులు తమ ఫ్యామిలీలోని మహిళలను పోటీలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంటే, మరికొన్ని డివిజన్లలో మాత్రం ఆ పరిస్థితి లేదు. దీంతో మహిళా అభ్యర్థులను వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితి పార్టీలది. అందులోనూ రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను రంగంలోకి దించడం పార్టీలకు మరింత సవాల్‌గా మారింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఎస్టీ మహిళలు 1 , 5 స్థానాల్లో ఎస్సీ మహిళలు , 25 స్థానాల్లో బీసీ మహిళలు, జనరల్ మహిళలకు 44 స్థానాలు రిజ‌ర్వ్ అయ్యాయి. అయితే ఏ పార్టీలో చూసినా మహిళా అభ్యర్థులు తక్కువగానే ఉన్నారు. గ్రేటర్‌లో ఉన్న మహిళల్లో చాలా మంది విద్యావంతులు ఉన్నప్పటికీ  రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్న వారి సంఖ్య మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. గ్రేటర్ పరిధిలో ఏ పార్టీ కార్యక్రమం చూసినా వందల సంఖ్యలో పురుషులు హాజరైతే మహిళలు మాత్రం పదుల సంఖ్యలో మాత్రమే అటెండ్ అవుతుండటం బల్దియాలో మహిళల నాయకత్వ పరిస్థితులకు అద్దం పడుతుంది.
ఐదు కూటములకు 375 మంది మహిళ అభ్యర్థులు అవసరం 
ఇక బల్దియా ఎన్నికల్లో టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి బిజేపి కూటమి, ఎంఐఎంతోపాటు వామ‌ప‌క్షాల‌తో క‌లిసి  లోక్‌సత్తా  కూటమి రంగంలోకి దిగుతున్నాయి. దాంతో ఐదు కూటములు రిజర్వు స్థానాల్లో అభ్యర్థులను బరిలో దించడానికి 375 మంది మహిళా అభ్యర్థులు అవసరం అవుతారు. మరికొన్ని స్థానాల్లో మహిళలను బరిలో దింపాలంటే మరో 50మంది వరకు అవసరం అవుతారు. కానీ అంతమంది మహిళా నేతలు పార్టీల్లో లేరు.
భర్త చాటు కార్పొరేటర్లుగా మిగిలిపోతారా?
ఇప్పటేకే పార్టీలో మహిళా నేతలున్నా  వారికే ఎంతవరకు సీట్లు కేటాయిస్తారనేది అసలు ప్రశ్న. వారి పట్ల రాజకీయ పార్టీలు ఎంత ఉదారంగా స్పందిస్తాయన్నదీ సందేహమే. గత పాలకమండళ్లకు ఎంపికైన మహిళా కార్పొరేటర్లు కొద్దిమంది మినహా అందరూ నాయకుల భార్యలు లేదా కుటుంబ సభ్యులే. వీరిలో ఎక్కువ మంది పాలక మండలిలో నోరు విప్పి సమస్యపై విపులంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఇక ప్రజలతోనే కాదు అధికారులతోనూ తామే కార్పొరేటర్లగా చలామణి అయ్యే వారు కార్పొరేటర్ల భర్తలు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పురాలేదు. ఏదిఏమైనా 50శాతం సీట్లు మహిళలకు రిజర్వు కావడంతో పాలక మండలి మహిళా కార్పొరేటర్లతో నిండిపోనుంది. గతంలో మాదిరిగానే భర్త చాటు కార్పొరేటర్లుగా మిగిలిపోతారా, లేక తమ అస్థిత్వాన్ని నిలబెట్టుకుంటారా అనేది మరికొద్దిరోజుల్లో తేలిపోతుంది. 

 

21:59 - January 9, 2016

పంజాబ్ : ప్రధానమంత్రి నరేంద్రమోది పఠాన్‌కోట్‌ సందర్శించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న  సైనికులను ప్రధాని కలుసుకున్నారు. ఉగ్రదాడి అనంతరం భద్రతా దళాలు స్పందించిన తీరుపై మోది సంతృప్తి వ్యక్తం చేశారు.

పఠాన్‌కోట్‌ మరోసారి అలర్ట్‌

పఠాన్‌కోట్‌ మరోసారి అలర్ట్‌ అయింది. అయితే ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోది కోసం. జనవరి రెండున జరిగిన ఉగ్రదాడి అనంతరం ప్రధాని పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. టెర్రరిస్టులను ధైర్యంగా ఎదుర్కొన్న సైనికులను మోది కలుసుకున్నారు. ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను పరామర్శించారు.

ఆపరేషన్‌ నిర్వహించిన తీరును వివరించిన అధికారులు

ప్రధానిని కంట్రోల్‌ రూంకు తీసుకెళ్లిన అధికారులు పఠాన్‌కోట్‌లో ఆపరేషన్‌ నిర్వహించిన తీరును వివరించారు. ఆపరేషన్‌కు 80 గంటల సమయం పట్టడానికి గల కారణాలను ప్రధాని తెలుసుకున్నారు. మోదితో పాటు జాతీయ భద్రతా సలహాదురు అజిత్‌ దోవల్‌ కూడా ఉన్నారు.

భద్రతా దళాల అధికారులతో మోడీ

పఠాన్‌కోట్‌లో ప్రధాని దాదాపు రెండు గంటలపాటు భద్రతా దళాల అధికారులతో గడిపారు. ఉగ్రవాదులు భారత్‌లోకి ఎక్కడి నుంచి చొరబడ్డారన్నది ఏరియల్‌ సర్వే ద్వారా ప్రధానికి అధికారులు వివరించారు. ఎయిర్‌బేస్‌లో ఇద్దరు ఉగ్రవాదులు దాక్కున్న స్థలంతో పాటు, ఆపరేషన్‌ నిర్వహించిన ప్రాంతాలను మోది సందర్శించారు.

మోడీ పఠాన్‌కోట్‌ పర్యటనపై ప్రాధాన్యత

పఠాన్‌కోట్‌ ఆపరేషన్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతం కాగా, ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. ఆర్మీ ఆపరేషన్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని పఠాన్‌కోట్‌ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

21:57 - January 9, 2016

ముంబై : సెల్ఫీ మోజు ఓ యువతి ప్రాణం తీసింది. తాజాగా ముంబైలోని లవర్స్ పాయింట్ గా  చెప్పుకునే బ్యాండ్ స్టాండ్‌లో ఈ ఘటన జరిగింది. సముద్రం ఒడ్డుకు  వారాంతపు విహారానికి వెళ్లిన  ఓ ప్రేమ జంట ప్రమాదంలో చిక్కుకుంది. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ యువతి నీళ్లల్లో పడిపోయింది. ఆమెను రక్షించడం కోసం సముద్రంలోకి దూకిన యువకుడు కూడా కనిపించకుండా పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు  హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. 

 

21:54 - January 9, 2016

విజయవాడ : 'మన దేశ సంస్కృతి, సంప్రదాయాలపట్ల ప్రతిఒక్కరూ మక్కువ పెంచుకోవాలి' అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. విజయవాడలోని మధు మహాలక్ష్మి చాంబర్‌లో చిత్ర ప్రదర్శనను వెంకయ్య ప్రారంభించారు. పాశ్చాత్య సంస్కృతినుంచి నేటితరం బయటకు రావాలని కోరారు.. తెలుగు భాషకు చాలా ఆదరణ ఉందని గుర్తు చేశారు.

21:49 - January 9, 2016

కడప : నదుల అనుసంధానం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తా అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు. కడప జిల్లాలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు జిల్లాను అన్నివిధాల అభివృద్ధి చేస్తామని హామీఇచ్చారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 
కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన 
ఏపీలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమం జోరుగా సాగుతోంది. కడప జిల్లాలోని అలంఖాన్‌ పల్లెలో ఏపీ సీఎం పర్యటించారు. సీమ కష్టాల్ని తీరుస్తానంటూ ఆయన వరాల వర్షం కురిపించారు. 108 కోట్ల వ్యయంతో 50 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. చంద్రన్న సంక్రాంతి కానుక, డ్వాక్రా సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథరెడ్డి,  శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి సహా పలువురు అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.   
అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకోవాలి.. 
మనకు ఉండే వనరులు, అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని ఏపీ సీఎం సూచించారు. కష్టాలను సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలని కడప జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. 2050కు ప్రపంచంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తామని, నదుల అనుసంధానం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. అవరమైతే గోదావరి నీరు రాయలసీమకు తెప్పిస్తామన్నారు. బుగ్గవంక సుందరీకరణ, జిల్లాలో ఉద్యానవన పంటల అభివృద్ధి చేస్తామన్నారు. 
వైఎస్సార్‌సిపి తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం
ఇక ప్రతిపక్షం వైఎస్సార్‌సిపి వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 ఏళ్లుగా రాజకీయాల్లో మచ్చలేకుండా బ్రతుకున్న తనను..అసెంబ్లీలో ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా దుర్భాషలాడారని పరోక్షంగా ఎమ్మెల్యే రోజాపై విరుచుకుపడ్డారు. కొందరు కావాలని రాత్రిళ్లు కలలు కంటుంటారని ప్రతిపక్ష నేతలను ఎద్దేవా చేశారు. గతంలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.ఎస్‌ రాజశేఖర్ రెడ్డి జిల్లా ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. తన వాళ్లను మాత్రం కోటీశ్వరులను చేశాడని ఆరోపించారు. 
ఇడుపులపాయ ఎస్టేట్‌ను సందర్శించిన చంద్రబాబు
ఏపీ సీఎం తొలిసారిగా కడప జిల్లాలోని ఇడుపులపాయ ఎస్టేట్‌ను సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ సమాధి, పొలాలను వీక్షించారు. ఆ తర్వాత ఇడుపులపాయ ఎస్టేట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు..ఆ తర్వాత ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. బాబు కడప టూర్ సక్సెస్ కావడంతో తమ్ముళ్లు సంబరపడుతున్నారు. 

 

21:43 - January 9, 2016

న్యూఇయర్ స్టార్ట్ అయి పదిరోజులే అయినప్పటికీ చాలా విషయాలు జరిగిపోయాయి. ఈమధ్యే ముంబైలో క్రికెట్ ఆడుతూ ఓ పదిహేనేళ్ల అబ్బాయి 1009 పరగులు చేశాడంట. వరల్డ్ రికార్డంట. పఠాన్ కోట్ లో మన దేశ సైన్యం మీద పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు... వాళ్లని తిప్పికొట్టి నెక్స్ట్ వన్ ఇయర్ లో వారికి సరైన గుణపాఠం చెప్పేలా ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.. ఈశాన్య భారతదేశంలో భూకంపం వచ్చింది. అక్కడ కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. వాళ్లందరికీ మన ప్రేయర్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మెట్రో వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోయాయి, హోంవర్క్ వల్ల ఇబ్బందులు.. దానికి కారణాలు… పరిష్కారాలు ఈ క్రేజీ క్రేజీ అంశాలను క్రేజీన్యూస్ లో చూద్దాం. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియో క్లిక్ చేసి పండగ చేస్కోండి. వీడియో చూసే ముందు ఒక్క నిమిషం...! ఈ కార్యక్రమానికి మీ ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వొచ్చండోయ్..

 

పేదల సంక్షేమానికి అనేక పథకాలు : ఈటెల

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పేద బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్‌ ఎన్నికల్లో అత్యథిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

 

21:17 - January 9, 2016

హైదరాబాద్‌ : ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో ఓ సామాజిక వర్గం వారు మనోభావాలు దెబ్బతినేలా సినిమా పోస్టర్లు ఉన్నాయని తక్షణం ఆ పోస్టర్లను తొలగించి సినిమా నుంచి కూడా ఆ దృశ్యాలను తీసేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో యువకులు హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాదిగా ముస్లిం యువకులు బైక్ పై ర్యాలీ నిర్వహించడంతో.. బంజారాహిల్స్‌లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఈ పోస్టర్ లపై జీడిమెట్ల పోలీసు స్టేషన్ లో కేసు కుడా నమోదు అయింది. 'నాన్నకు ప్రేమతో' పోస్టర్‌లో ఎన్టీఆర్, రకుల్ డాన్స్ చేస్తున్న పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉర్దూ బాషలో కొన్ని అక్షరాలు ఉన్నాయి.

 

ఆర్మీ జవాను అరెస్టు...

హైదరాబాద్‌ : సరిహద్దు భద్రతా దళంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తిని పంజాబ్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దుల్లో స్మగ్లింగ్‌, మరికొన్ని అక్రమ కార్యకలాపాలతో అతడికి సంబంధం ఉందన్న ఆరోపణలతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

 

21:08 - January 9, 2016

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కోరారు. 'రచ్చబండ' కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఊహాల్లో బంగారు తెలంగాణ చూపించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కేసీఆర్ ది 'అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు' నైజం అన్నారు. తెలంగాణ ప్రజలకు ఓర్పు ఎక్కువని… కానీ తిరగబడితే.. బట్టలు చిరిగినంత వరకు కొడుతారని పేర్కొన్నారు. 
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. పలు విషయాలపై మాట్లాడారు. ఆ వివరాను వీడియోలో చూద్దాం…

 

20:46 - January 9, 2016

గ్రేటర్ వార్... పబ్లిక్ పల్స్ కు స్వాగతం.... జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ లో సమస్యలు.. ప్రజల స్పందన అనే అంశాలపై టెన్ టివి గ్రేటర్ వార్.. పబ్లిక్ పల్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్ మండిలో ప్రజల కష్టాలపై టెన్ టివి గ్రౌండ్ రిపోర్టు నిర్వహించింది. అక్కడ నెలకొన్న సమస్యలపై నేతలు, స్థానికులు మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:33 - January 9, 2016

ముంబై : గడిపింది జైలు జీవితం.. ఎదుర్కొంది మావోయిస్టుగా ముద్ర. బ్రిటిష్‌ కాలంనాటి దుర్మార్గాలను ఎత్తిచూపిన కాలాపాని చిత్రంలోని సంఘటనలను జైల్లో తనూ అనుభవించాడు. చివరకు ప్రిజన్‌ ఎంతటి ప్రమాదకరమైనదో ఎలుగెత్తిచాటాలనుకున్నాడు. తనలా వేదింపబడుతున్న అనేకమంది అమాయకుల శృంఖలాలు తెంచాలనుకున్నాడు. ఇప్పుడతనో సెలబ్రిటీ. అంతకుమించి న్యాయవాది..మానవ హక్కుల కార్యకర్త..

మహారాష్ట్ర జైళ్లలో నరకాన్ని చవిచూశాడు..

మావోయిస్టుగా మహారాష్ట్ర జైళ్లలో నరకాన్ని చవిచూశాడు.. ఇది అన్యాయం అని ఎదిరించినందుకు దారుణంగా హింసింపబడ్డాడు.. అయితే ఆ వేధింపులకు భయపడలేదు. ఏమాత్రం కుంగిపోలేదు.. చివరకు జైలునుంచి బయటపడి ఒక లక్ష్యం కోసం న్యాయవాదిగా ఆవిర్భవించాడు.

2007లో అరెస్టు అరుణ్‌ ఫెరీరా

అరుణ్‌ థామస్ ఫెరీరా... వయసు 42. ముంబాయిలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అరుణ్‌, బాంద్రా బాయ్స్‌ సెయింట్ గ్జేవియర్‌ కళాశాలలో ఉన్నతవిద్యనభ్యసించాడు. ఆ టైంలోనే నౌజవాన్‌ భారత్ సభ సంస్థతో సంబంధాలేర్పడ్డాయి. అందులో చేరి సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ అన్యాయాలకు ఎదురుతిరిగాడు. అయితే ఆ సంస్థకు మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరుణ్‌ ఫెరీరా 2007లో అరెస్టయ్యాడు. 
 

నాగ్‌పూర్‌ జైలులో నాలుగేళ్లు


జైల్లో ఒక్కొక్కరిని ఒక్కోరకంగా ట్రీట్‌ చేస్తారని తెలిసొచ్చింది. మావోయిస్ట్‌గా ముద్రపడిన అరుణ్‌ను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. నాగ్‌పూర్‌ జైలు అండా సెల్‌లో నాలుగేళ్లు మగ్గారు. హత్య, దొమ్మీ, అక్రమ ఆయుధాలు కలిగున్నాడనే ఆరోపణలతో పలు కేసులను ఎదుర్కొన్నాడు. అయితే సుదీర్ఘ పోరాటం చేసి తనపై మోపబడ్డ కేసులన్నిటినుంచీ నిర్దోషిగా బయపడ్డారు. ఇదే టైంలో జైలులో తాను అనుభవించిన దుర్భర జీవితాన్ని ఫోకస్ చేస్తూ కలర్స్‌ ఆఫ్‌ కేజెస్‌ పేరుతో పుస్తకాన్ని రాశాడు. చదువుకునే టైం నుంచే అరుణ్‌ మంచి కార్టూనిస్ట్‌గా కావడంతో ఇప్పుడూ సమాజంలోని చీకటి కోణాలను కార్టూన్స్ రూపంలో వెలికితెస్తున్నారు. అరుణ్‌ సామాజిక కార్యకర్తగా పనిచేస్తూనే సిద్ధార్థ్‌ లా కాలేజీలో చదివి రీసెంట్‌గా న్యాయవాద పట్టా తెచ్చుకున్నారు. 

న్యాయం కోసం పోరాడేవారిదే విజయం

మహారాష్ట్ర, గోవా బార్‌ కౌన్సిల్స్‌లో సభ్యత్వాన్ని కలిగున్న అరుణ్‌ ప్రస్తుతం సురేశ్‌ రాజేశ్వర్‌ అనే మరో లాయర్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు. తనలానే జైల్‌లో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను విడిపిస్తానని చెబుతున్నారు. కబీర్ కళామంచ్ కార్యకర్తలను విడిపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారంతా నక్సలైట్లుగా ముద్రపడినవారే. న్యాయం కోసం పోరాడేవారికి ఎప్పటికైనా విజయం దక్కుతుందని అరుణ్‌ అంటున్నారు.

20:16 - January 9, 2016

తొడ గొట్టడమే కాదు.. తనకు తన్మయపర్చడమూ తెలుసుంటున్నాడు. దమ్ము చూపించటమే కాదు.. హృదయాన్ని మీటగలనంటున్నాడు. పంచ్‌ డైలాగులతో దుమ్ము రేపడమే కాదు.. గాత్రంతో వీణను సైతం పలికించగలనంటున్నాడు. యూత్‌కు నచ్చే బీట్‌తో హస్కీ వాయిస్‌తో హుషారెత్తిస్తున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.  ఇతర హీరోలు కూడా తనను ఫాలో ఫాలో అంటున్నాడీ బుడ్డోడు.

విన్నారుగా.. చూశారుగా.. ఇప్పుడు యూట్యూబ్‌ నుంచి మొబైల్స్‌ దాకా అదరగొడుతున్న ఈ పాట పాడింది ఎన్టీఆరే. నాన్నకు ప్రేమతో సినిమా ఇప్పటికే క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది. దేవిశ్రీ మ్యూజిక్‌తో పాటలు కూడా అందరినీ ఊపేస్తున్నాయ్‌. ఫాలో ఫాలో అంటూ ఎన్టీఆర్‌ పాడిన పాట సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిపోయింది.

పాట పాడటమనేది ఎన్టీఆర్‌ కంత్రీతోనే మొదలెట్టాడు. నేనొక కంత్రీ అంటూ ఎన్టీఆర్‌ పాడిన ఆ పాట అప్పట్లో అదిరిపోయింది. మణిశర్మ సంగీతంలో వచ్చిన ఆ పాట బాగా హిట్టయింది.

ఇక వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్‌లో కూడా అదుర్స్‌ అనిపించే పాట పాడాడు ఎన్టీఆర్‌. వేరీజ్‌ ద పంచెకట్టు అంటూ వచ్చే ఆ సాంగ్‌ అందరి నోళ్లలో నానిపోయింది. చారి అంటూ సరదాగా సాగే ఆ సాంగ్‌ ఎన్టీఆర్‌కు బాగా ఆప్టయింది. ఇది కూడా దేవీశ్రీ పాటే.

ఇక ఆ తర్వాత మళ్లీ రభస చిత్రానికి జూనియర్‌ గాత్రమందించాడు. 
రాకాసి రాకాసి అంటూ పాడిన టీజింగ్‌ సాంగ్‌ మంచి బీట్‌తో కుర్రకారును స్టెప్పులేయించింది. ఈసారి జూనియర్‌తో పాడించిన ఘనత థమన్‌కు దక్కింది.

ఇలా అప్పుడప్పుడు పాడినా.. ఎప్పుడూ మెమరబుల్‌గా ఉండిపోయే సాంగ్స్‌ను అందిస్తూ యంగ్‌టైగర్‌ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన ఫాలో ఫాలో సాంగ్‌ అయితే ఎన్టీఆర్‌ పాటలన్నిటిని బీట్‌ చేసేంత బీట్‌తో ఫ్యాన్స్‌ను చిందులేయిస్తోంది. 
 

19:51 - January 9, 2016

హైదరాబాద్ : అంగన్ వాడీలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అంగాన్ వాడీ జాతీయ ప్రధాన కార్యదర్శి సింధు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆలిండియా అంగన్ వాడీ మహాసభలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సింధు మీడియాతో మాట్లాడారు. అంగన్ వాడీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని కోరారు. ఐసిడిఎస్   రక్షించుకోవాలన్నారు. బలోపేతం చేయాలని అందుకు పోరాడుతామని చెప్పారు. దేశంలో ప్రతి సంవత్సరం 80 లక్షల శిశుమరణాలు సంభవిస్తున్నాయని వాపోయారు. మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి.. పని తగిన వేతనాలు ఇవ్వడం లేదన్నారు. అంగన్ వాడీ సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. 
 

19:21 - January 9, 2016

వరంగల్ : గోకుల్‌చాట్‌ బాంబుపేలుళ్ల కేసులో నిందితులు జియాహుల్‌హక్‌, షకీల్‌ అహ్మద్‌లకు వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స చేయించారు.. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరిద్దరినీ భారీ బందోబస్తుమధ్య ఆస్పత్రికి తరలించారు.. చికిత్స తర్వాత తిరిగి వరంగల్‌ కేంద్ర కారాగారానికి పంపారు.. ఈ ఇద్దరు నిందితులు జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నారు..

 

19:20 - January 9, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని జిల్లెల్ల, తెర్లుమర్ది, మస్తాబాద్‌లో 144 సెక్షన్ విధించారు.. బీడీ వ్యాపారి శ్రీహరి హత్యతో పోలీసులు భద్రత పెంచారు.. మెదక్‌ జిల్లా సిద్ధపేట మండలం ఇబ్రహీంపూర్‌లో సర్పంచ్‌ లక్ష్మి కుమారులు ఈ హత్య  చేశారంటూ ఆరోపణలొచ్చాయి.. దీంతో శ్రీహరి మృతదేహాన్ని తీసుకొని సర్పంచ్‌ ఇంటిముందు మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.. సర్పంచ్‌ ఇంటికి నిప్పు పెట్టారు.. ఈ విషయం ఇబ్రహీంపూర్‌, జిల్లేల గ్రామస్తుల మధ్య చిచ్చుపెట్టింది.. రెండు గ్రామాలమధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.. ముందుజాగ్రత్త చర్యగా రెండు గ్రామాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు.. 

 

19:13 - January 9, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు  ప్రభుత్వం మొదటి నుంచి కూడా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని గాంధీభవన్‌లో జరిగిన ఎన్‌ఎస్‌యూఐ సమావేశంలో విమర్శించారు. ఓటర్ల తొలగింపు నుంచి ఎన్నికల ప్రక్రియ కుదింపు వరకు అన్ని  విషయాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన  టీఆర్‌ఎస్‌కు భంగపాటు ఎదురయ్యిందని మర్రి శశిధర్‌రెడ్డి మండిపడ్డారు. 

 

19:09 - January 9, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పాలనలోనే భాగ్యనగరం అభివృద్ధి చెందిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో జరిగిన ఎస్‌ఎస్‌యూఐ సమావేశంలో అయన పాల్గొని, మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌ గొప్పలు చెప్పుకుంటోదని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి జలాల తరలింపు ఘనత కాంగ్రెస్‌దేనేని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం తమ పార్టీ హయాంలోనే పూర్తియ్యిందన్నారు. 

 

18:49 - January 9, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ, పట్టణాభివృద్ధి శాఖలోని ఇంజినీర్ల పదోన్నతుల్లో జరిగిన అవకతవకలపై అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పదోన్నతుల జీవోను రెండు వారాలపాటు నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. సీనియారిటీ ప్రకారం కాకుండా అక్రమంగా పదోన్నతి పొందిన ఇంజినీర్ల వివరాలను ఇవ్వాలని కోర్టు జీహెచ్‌ఎంసీ, పట్టణాభివృద్ధిశాఖలను ఆదేశించింది.

18:41 - January 9, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంతో హైదరాబాద్‌కు ప్రమాదం పొంచివుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. కేసీఆర్‌ విశ్వనగరం నినాదం బూటకమని ఆయన విమర్శించారు. గాంధీభవన్‌లో జరిగిన ఎన్‌ఎస్‌యూఐ సమావేశంలో ఆయన టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఇతర ప్రాంతాల వారు పారిపోయే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరింస్తోందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ విషయాన్ని ఇంటింటింకి తీసుకెళ్లాని ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను మల్లు కోరారు. 

మరో విదేశీ పర్యటనకు ఏపీ సీఎం

హైదరాబాద్ : ఏపీ సీఎం మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు టూర్ సాగనుంది. జనవరి 19 నుంచి 24 వరకు ఆయన దావోస్‌లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా దావోస్ వెళ్లనున్నారు. 

18:31 - January 9, 2016

ఢిల్లీ : భారత్‌తో జరిగే చర్చల్లో ఉగ్రవాద సంస్థలను అనుమతించేది లేదని పాకిస్తాన్‌ రక్షణమంత్రి ఖ్వాజా మహ్మద్‌ ఆసిఫ్‌ స్పష్టం చేశారు. ఉగ్రవాద చర్యలతో సంబంధం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేడియో పాకిస్తాన్‌లో ఆయన పేర్కొన్నారు. భారత్‌-పాక్‌ల మధ్య జరిగే శాంతి చర్చలకు కొంతమంది అడ్డు పడుతున్నారని ఆసిఫ్‌ ఇదివరకే ప్రకటించారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన జర్బ్‌-ఎ-అజ్బ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదుల విషయంలో సైన్యానికి ప్రభుత్వానికి మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు.

 

18:27 - January 9, 2016

షిల్లాంగ్ : మేఘాలయలోని తూర్పు గారోహిల్స్‌లోని విలియమ్ నగర్ మార్కెట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాదులు పేలుడుకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

18:13 - January 9, 2016

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీలు రాజకీయాల్లో ఎదగకుండా కేసీఆర్‌ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు అతితక్కువగా స్థానాలు కేటాయించారని తెలిపారు. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాలను బట్టి చూస్తే కేసీఆర్‌ ప్రభుత్వం ఎంత మోసపూరితంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎందుకు తక్కువ స్థానాలు కేటాయించారో కేసీఆరే ప్రజలకు చెప్పాలన్నారు. 

 

18:05 - January 9, 2016

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కావాలనే తగ్గించారని మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ హయాంలోనే హైదరాబాద్‌ విశ్వనగరంగా మారిందని... టీఆర్‌ఎస్‌ ఇప్పుడు చేసిందేమీలేదని ఆ పార్టీ నేత రమేశ్ రాథోడ్ స్పష్టం చేశారు. గ్రేటర్లో పోటీ చేసే హక్కు టీఆర్‌ఎస్‌కు లేదని మరో నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డి ఆన్నారు. పెద్దపల్లి ఎస్‌ఐది ఆత్మహత్య కాదు, హత్యేనని ఆరోపించారు. 

 

17:47 - January 9, 2016

హైదరాబాద్ : ఏపీ సీఎం మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు టూర్ సాగనుంది. జనవరి 19 నుంచి 24 వరకు ఆయన స్విట్జర్టాండ్ లోని దావోస్‌లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా దావోస్ వెళ్లనున్నారు. 

 

17:42 - January 9, 2016

రంగారెడ్డి: జిల్లాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మేడ్చల్ కు చెందిన ఇద్దరు యువకులు బైక్ పై వెళ్తుండగా టాటా ఏస్ వాహనం బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. 

 

17:35 - January 9, 2016

హైదరాబాద్ : ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు డబ్బుల మీద ఉన్న ధ్యాస.. వైద్యంపై లేదు. అత్యంత మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి కోట్లు, లక్షల రూపాయలను వసూళ్లు చేస్తారు. డబ్బులు దండుకోవడమే పరమావధిగా భావించి.. వైద్యంపై నిర్లక్ష్యం చేశారు. సంతానం కలగాలని ట్రీట్ మెంట్ కు వెళ్లిన మహిళను వైద్యులు కాటికి పంపారు. సంతానం కోసం వెళ్లి ప్రాణం మీదికి తెచ్చుకుంది ఓ మహిళ. పిల్లలు పుట్టాలని ఆశతో వైద్యం చేయించుకునేందుకు సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళ శవంగా మారింది. ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం, వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ బలి అయింది. వైద్యం వికటించి మృతి చెందింది. వరంగల్ కు చెందిన సుశీల (26) అనే మహిళ గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో నివాసముంటున్నారు. సంతానం కోసం ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు హైదరాబాద్ హబ్సిగూడలోని పద్మజ సాఫల్యం కేంద్రాంతో నడుపుతున్న ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. నెల రోజుల నుంచి ఆమెకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో నిన్న ఆపరేషన్ నిమ్తితం మహిళను ఆస్పత్రికి పిలిచారు. అయితే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వైద్యం వికటించి ఇవాళ ఉదయం 11 గంటలకు మహిళ మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం అందించారు.
ఆస్పత్రికి వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మహిళ మృతిపై ఆస్పత్రి సిబ్బందిని నిలదీయగా సరైన సమాధానం చెప్పలేదు. మృతురాలి కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. తీవ్ర శోకసంద్రంలో మునిగారు. మహిళ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ.. ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

16:52 - January 9, 2016

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ మేయర్ పీఠం తమదేనని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికల కోసం ప్రత్యేకంగా వ్యూహాలేమీ లేవని.. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నాలుగు సంస్థలు చేసిన సర్వేలు విజయం టిఆర్ ఎస్ దే అని చెప్పాయని పేర్కొన్నారు. 2014సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ లో తమకు 22 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు.

టీఆర్ ఎస్ 2/3 మెజారిటీతో గెలుపు 

సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత ప్రజల్లో ఉందన్నారు. ఎవరి మద్దతును తీసుకోవడం లేదని.. సొంతంగా గ్రేటర్ లో గులాబీ జెండా ఎగరేస్తామని పునరుద్ఘాటించారు. తనకున్న అవగాహన మేరకు టీఆర్ ఎస్.. 2/3 మెజారిటీతో గెలుస్తుందని… తర్వాత ఎంఐఎం, బిజెపి, టిడిపి.., చివరగా కాంగ్రెస్ ఉంటుందని జోస్యం చెప్పారు. 'సేఫ్, స్మార్ట్, క్లీన్ సిటీగా హైదరాబాద్ ఉండాలనే నినాదంతో ప్రచారంలో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రజలకనుకూలంగా మ్యానిపెస్టో ఉంటుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పారు. నగరంలోని ట్రాఫిక్, మంచినీరు, విద్యుత్ వంటి పలు సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ అందరికీ మంచి చేసిందన్నారు. తాము పాజిటివ్  ఓట్లు అడుగుతున్నామని… కానీ ప్రత్యర్థులు నెగెటివ్ ఓట్లు అడుగుతున్నారని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలను పటిష్టం చేశామని చెప్పారు.

అందరిపట్ల సమభావంతో ఉంటాం.. 

హైదరాబాద్ లో ఉండే తెలంగాణ, ఎపి ప్రజలందరి పట్ల సమభావంతో ఉన్నామని చెప్పారు. 'టీఆర్ ఎస్ ను తెలుగు రాష్ట్ర సమతిగా మారుస్తాం, నేను భీమవరం నుంచి పోటీ చేస్తాను' అని తాను సరదాగా అన్న మాటలనని చెప్పారు. వాటిని చిలువలు పలువలు చేసి.. పెద్దవిగా చూపిస్తున్నారని అది సరికాదన్నారు. తాము ఎక్కడికి వెళ్లమని... ఇక్కడే ఉంటామన్నారు. అయితే ఎపి కూడా బాగుండాలనే కోరుకుంటామని తెలిపారు. బిజెపి ఏ ముఖం పెట్టుకుని హైదరాబాద్ లో ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. మోడీ ఇంతవరకు తెలంగాణకు ముఖం చూపించలేదని… ఎలాంటి సహాయం అంద లేదని విమర్శించారు. 

 

బైక్-టాటా ఏస్ వాహనం ఢీ.. ఇద్దరి మృతి

రంగారెడ్డి: జిల్లాలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్ ను టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. 

 

వైద్యం వికటించి మహిళ మృతి

హైదరాబాద్ : నగరంలోని హబ్సిగూడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

16:26 - January 9, 2016

విజయవాడ : కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు అరెస్టును కాంగ్రెస్‌ ఖండించింది.. ఈ కేసులో విష్ణును కావాలనే ఇరికించారని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. స్వర్ణబార్‌లో నీళ్లు తాగినవారే చనిపోయారని.. ఈ వాటర్‌లో విషం కలపడంలో ప్రభుత్వ పాత్ర ఉందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఫోరెన్సిక్‌ నివేదిక ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు.

 

టిడిపి-బిజెపిలవి అవకాశవాద రాజకీయాలు : కవిత

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు రాజకీయంగా వేడెకుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిడిపి-బిజెపిలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఎంపీ కవిత అన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో టిడిపి-బిజెపిలు ప్రచారం చేపిస్తున్నాయట అని కవిత అన్నారు. పవన్ కళ్యాణ్ పై కవిత పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎన్నికలొచ్చినప్పుడు పవన్‌కళ్యాణ్‌ మేకప్‌ వేస్తారు..ఆ తర్వాత ప్యాకప్‌ చెప్తారని అన్నారు. ఎన్నికలొచ్చిప్పుడు కొందరు గంగిరెద్దుల్లా తల ఊపుతారని ఆరోపించారు. పవన్‌కళ్యాణ్‌కి కేసీఆర్‌ ఎప్పుడో చుక్కలు చూపించారని కామెంట్‌ చేశారు. 

 

16:11 - January 9, 2016

హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణం కళానికేతన్‌ ఎండీ లీలా కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లీలాకుమార్‌ తోపాటు ఆయన భార్య కృష్ణకుమారిని కూడా అరెస్టు చేశారు. ఫోర్జరీపత్రాలతో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వివిధ బ్యాంకుల నుంచి రూ. 300 కోట్ల రుణం తీసుకుని చెల్లించలేదని తెలుస్తోంది.

 

15:53 - January 9, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు రాజకీయంగా వేడెకుతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టిడిపి-బిజెపిలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఎంపీ కవిత అన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో టిడిపి-బిజెపిలు ప్రచారం చేపిస్తున్నాయట అని కవిత అన్నారు. పవన్ కళ్యాణ్ పై కవిత పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎన్నికలొచ్చినప్పుడు పవన్‌కళ్యాణ్‌ మేకప్‌ వేస్తారు..ఆ తర్వాత ప్యాకప్‌ చెప్తారని అన్నారు. ఎన్నికలొచ్చిప్పుడు కొందరు గంగిరెద్దుల్లా తల ఊపుతారని ఆరోపించారు. పవన్‌కళ్యాణ్‌కి కేసీఆర్‌ ఎప్పుడో చుక్కలు చూపించారని కామెంట్‌ చేశారు. 

 

15:43 - January 9, 2016

కడప: జిల్లాలోని ఏపీ సిఎం చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. చిన్నారులు కూచిపూడి నాట్యంచేసి ఆహూతులను అలరించారు. ఈ సందర్భంగా వారిని చంద్రబాబు ప్రశంసించారు. 

15:42 - January 9, 2016

అనంతపురం : జిల్లాలోని ఆత్మకూరు మండలం ముస్తూరులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 3 రోజుల క్రితం అదృశ్యమైన షబ్బీర్ బాషాను హత్య చేసి మృతదేహాన్ని మూడు భాగాలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశారు. ఈ హత్యకు ప్రేమ వివాదమే కారణమని బంధువులు అంటున్నారు. నిందితుడిగా భావిస్తున్న శేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

కళానికేతన్ ఎండీ లీలా కుమార్ అరెస్టు...

హైదరాబాద్ : కళానికేతన్ ఎండీ లీలాకుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. లీలాకుమార్ తోపాటు ఆయన భార్య లక్ష్మీశారదను కూడా అరెస్టు చేశారు. ఫోర్జరీ పత్రాలతో వివిధ బ్యాంకుల నుంచి రూ.300 కోట్ల మేర రుణం పొందారని లీలాకుమార్, లక్ష్మీశారదలపై అభియోగం ఉంది. ఈనేపథ్యంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు.  

 

కేసీఆర్ రాజకీయ ఉగ్రవాది : భట్టివిక్రమార్క

హైదరాబాద్ :  కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ రాజకీయ ఉగ్రవాది 
అని విమర్శించారు. పార్టీ పిరాయింపులకు పాల్పడుతూ రాజకీయ ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 

13:33 - January 9, 2016

తూర్పుగోదావరి : కోడి పందేల నిర్వహించొద్దని హైకోర్ట్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే కోడి పందేల నిర్వహణకోసం పందెం పుంజులను పెంపకందార్లు సిద్ధం చేస్తున్నారు. వాటిని పెంచే విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తామని వారు అంటున్నారు. విదేశాల నుంచి సైతం పందేల కోసం వస్తుంటారని పందెం కోళ్ల యజమానులు చెబుతున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోవాంటే వీడియో క్లిక్ చేయండి. 

13:30 - January 9, 2016

కోడి పందేలను అడ్డుకోండి. ఇదీ హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్‌. ప్రభుత్వం కూడా ఓ యస్‌.. అలాగే అడ్డుకుంటామంటోంది. కానీ కోడిపందాలు జరిగే కోనసీమలో సిచ్యుయేషన్‌ మరోలా ఉంది. సమరానికి కోళ్లను సిద్ధం చేస్తున్నారు. రకరకాలుగా పందే కోళ్లకు శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో కోర్టులు హెచ్చరించినా అసలు కార్యక్రమాలు బాగానే జరిగిపోయాయి. మరి ఈసారి సంక్రాంతి బరిలో ఎవరు గెలవబోతున్నారు..? కోడి పందేలు నిర్వహించి అమాయక జీవులను హింసిచ్చొద్దని అనేక సంవత్సరాలుగా వ్యతిరేక స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ సాంప్రదాయాలను ఎందుకు వదులుకోవాలని కొందరు డైరెక్ట్‌గానే ప్రశ్నిస్తున్నారు. ఒక్కోసారి కోర్టు ఆదేశాలను ధిక్కరించిన సందర్భాలూ ఉన్నాయి. ఈ ఏడాది కూడా పచ్చందనాల కోనసీమ కోళ్ల సమరానికి సిద్ధమవుతోంది.

మాకు ఒక మనసు ఉంటుంది..
పందేలకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్న తరుణంలో కోళ్లు తమ మనసులోని మాటలను మనతో పంచుకుంటే ఇలా ఉంటుంది. మాకు ఒక భాష ఉంటుంది. ఒక ఆలోచన ఉంటుంది. మనసు కూడా ఉంటుంది.. మమ్మల్ని పెంచే యజమాని, మమ్మల్ని నమ్మి కొనుక్కున్న యజమానిని గెలిపించడం కోసం మా ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాడతాం. మమ్మల్ని పెంచే యజమానులు పిల్లల స్థాయి నుండే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తారు. చిన్నప్పటినుంచే శిక్షణ ప్రారంభమై రెండేళ్ల వయసొచ్చేదాకా కొనసాగుతుంది. కోళ్ళన్నిటి వయసూ ఏడాది నుండి రెండేళ్ళుంటుంది. ఇక మేం బరిలోకి దిగామంటే గెలుపు కోసం ప్రాణం పోయేదాకా పోరాటం చేస్తూనే ఉంటాం. మమ్మల్ని మొదటినుంచీ ఎంత జాగ్రత్తగా పెంచారో ఓడిపోతే చివర్లో అంత హీనంగా చూస్తారు. ప్రతి రోజు గోరు వెచ్చని నూనెతో శుభ్రం చేస్తారు. రోజు రన్నింగ్ చేయిస్తారు. వారానికి ఒక రోజు ఈత కొట్టిస్తారు. రోజూ మాలో మాకే పోటీ పెట్టి గెలుపు కోసం అన్ని ట్రిక్సూ నేర్పిస్తారు. ఇలా తయారు చేసిన ఒక్కో పందెం కోడి 50 వేల నుండి లక్షన్నర రూపాయల దాకా ధర పలుకుతుంది.

ఆహారంలో జాగ్రత్తలు..
ఇంతకి మాలో చాలా రకాల జాతులున్నాయండీ. కాకిడేగ, అబ్రాస్, పర్ల, నెమలి, రసంగి, పచ్చబొట్ల కాకి, ఎర్రబొట్ల కాకి, ఇలా మేము 15 రకాల జాతులం ఉంటాం. మా కోసం ఈ చుట్టు పక్కల వాళ్ళే గాక రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పందెం రాయుళ్లు వచ్చి కొనుగోలు చేస్తారు. ఇక మా పందెం కోళ్ళ పెంపకంలో ఆహారంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మమ్మల్ని పెంచే యజమానులు కొవ్వు పట్టే ఆహారం జోలికిపోరు. బాదంపప్పు, కోడిగుడ్లు, జొన్నలతోపాటు ప్రత్యేకంగా మటన్‌తో తయారు చేసిన ఆహారాన్ని కూడా అందిస్తారు. మా యజమానులు పెట్టె ఆహారంతో కాళ్ళకు కట్టిన కత్తులతో శరీరంపై దాడి చేసినా పెద్దగా గాయాలు కావు. పందెం కోళ్ళను తయారు చేస్తున్న విధానం ఎంత కఠినంగా ఉంటుందో దీన్ని బట్టే అర్థమవుతుంది.

ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం..
చూశారుగా మీ అందరి కోసం మీ ఆనందం కోసం మేము ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాం. కానీ మాకూ ఒక ప్రాణం ఉంటుంది, కత్తులు కోసుకుంటుంటే బాధలు ఉంటాయి. మా జీవితాన్ని మీ ఆనందం కోసం, డబ్బుల కోసం ఎరగా వేస్తున్నారు. అలా చంపడం మీకు పాపం అనిపించడం లేదూ..! మా చేత ఇలా పందేలు కాయించొద్దని రాష్ట్ర హైకోర్ట్ ఆదేశించింది. కానీ ఇక్కడే ఓ ట్విస్టుంది. కోడిపందాలను అడ్డుకుంటామని ఏ పాలకమహాశయులు చెబుతుంటారో వాళ్లే మా ప్రాణాలతో ఆడుకోవడానికి వస్తుంటారు. పందేలు కాస్తుంటారు. గతంలోనూ సేమ్ ఇలాగే జరిగింది. కానీ మీరైనా చెప్పండి. అమాయకమైన మా కోళ్లతో పందేలు పెట్టి చంపేయడం అన్యాయం కాదూ..? అయినా మాతో పందేలు వేయడానికి మీరు కూడా వస్తారని నా అనుమానం. కోర్టులు ఆదేశించినా పాలకులు అమలు చేయాలిగా.? ఇదంతా నా ఆలోచనే. ఎవరూ ఏమీ అనుకోవద్దు. బై బై.. 

13:25 - January 9, 2016

తూర్పుగోదావరి : సంక్రాంతి పందాలకు మేము రెడీ అవుతున్నాం. కత్తులు కట్టుకుని కాళ్ళు దువ్వుతున్నాం.. కాయ్ రాజా కాయ్ అనే పందెం రాయుళ్ళ కూత కోసం గెలుపు గుర్రాల్లా ఎదురుచూస్తున్నాం.. మాతో పందేలు నిర్వహించొద్దంటూ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసినా పొలిటికల్‌ సార్ల సిఫార్సులు ఎలాగో ఉన్నాయి కాబట్టి పందేలు జరిగిపోతాయనుకుంటున్నాం. ఇంతకు మీరు రెడీయేగదా.? ఇలా అంటున్నది మరెవరోకాదు ప్రాణాలు పోతున్నా తరతరాలుగా జనాలకు వినోదం పంచుతున్న అమాయక కోడిపుంజులే. సంక్రాంతి పందాల సమరానికి సిద్ధమవుతున్న పందెం కోళ్ళపై 10టివి రిపోర్ట్ ... సాంప్రదాయాలకు పుట్టినిల్లు గోదావరి జిల్లాలు. సంక్రాంతి వచ్చిందంటే హరిదాసులు, హరివిల్లును తలపించే ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, ఇవ్వన్నీ గుర్తుకొస్తాయి. వీటిల్లోనూ కొన్నిటికి కళతప్పినా కోడి పందాలు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ సిద్ధమవుతోంది. ఈ ప్రాంతం పందెం కోళ్ల పెంపకానికి కూడా పెట్టింది పేరు. ఓ పక్కన పందేలకు అంతా సిద్ధమవుతుంటే మరోపక్క పెంపకందార్లు పందెం కోళ్ళను సమరానికి సిద్ధం చేస్తున్నారు. 

13:18 - January 9, 2016

జమ్మూ కాశ్మీర్ : సీఎం హోదా తనువు చాలించిన ముఫ్తీ మహమ్మద్ సయీద్ తర్వాత సీఎంగా ఆయన కూతురు మహబూబ్ ను నేతలు ఎన్నుకున్నారు. కాగా ప్రస్తుతం భాద్యతల స్వీకరణకు సుముఖంగా లేకపోవడంతో జమ్మూలో గవర్నర్ పాలనను విధించింది కేంద్రం. ముఫ్తీ మహ్మద్ మృతికి మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. వచ్చే వారంలో సీఎం గా ముఫ్తీ మహబూబ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

13:17 - January 9, 2016

హైదరాబాద్ : సెంట్రల్‌ యూనివర్శిటీ దళిత విద్యార్థుల అత్మహత్యల కేంద్రంగా మారిపోయిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. బిజేపి అధికారంలోకొచ్చినప్పటినుంచి దేశంలో అన్ని యునివర్సిటీల్లోనూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు రెచ్చగొడుతోందని విమర్శించారు. హైదరాబాద్‌ కేంద్రియ విశ్వవిద్యాలయం దళిత విద్యార్థుల సాంఘిక బహిష్కరణను వ్యతిరేకిస్తూ 13 సంఘాలు నిరసన తెలిపాయి. దళిత విద్యార్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించాయి. అనంతరం వైస్ ఛాన్సెలర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

13:14 - January 9, 2016

విజయవాడ : పీసీసీ అధ్యక్షుడు రఘువీరాకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే సెగ తగిలింది. మల్లాది విష్ణు అనుచరులు ఆఫీసులోనే ఆందోళన చేపట్టారు. విష్ణు అరెస్ట్‌పై మాట్లాడటం లేదని వారు మండిపడ్డారు. విష్ణును ఒకవేళ పార్టీ సస్పెండ్‌ చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు.
గత నెల 7వ తేదీన మల్లాది విష్ణుకు చెందిన స్వర్ణబార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు చనిపోగా.. 15 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ సర్కార్‌ విచారణకు ఆదేశించింది. ఈ ఘటన తర్వాత దాదాపు నెలరోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన మల్లాది విష్ణు బుధవారం సిట్‌ బృందం ముందు హాజరయ్యారు. రెండు రోజులుగా సిట్‌ బృందం విష్ణును విచారించింది. చివరకు సిట్‌ బృందం మల్లాది విష్ణును అతని సోదరుడు శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టు రిమాండ్ విధించింది. 

13:10 - January 9, 2016

కరీంనగర్ : జిల్లా ఎస్ ఐ జగన్మోహన్ ఆత్మహత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. హడావుడిగా పోస్టుమార్టం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు , పోలీసు అధికారుల వేధింపులే కారణమంటున్నారు పలువురు కుటుంబసభ్యులు. ఎస్ ఐ ఆత్మహత్యకు గల కారణాలు నోట్ లో ఉన్నా ఉన్నతాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు పోలీసుల అధికారులు..స్థానిక ప్రజాప్రతినిధి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సూసైడ్ నోట్ లో రాసుకున్నట్లు తెలుస్తోంది. రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేయకుండానే ఎలా బదిలీ చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఆయన రాసుకున్న సూసైడ్ నోట్ బయటపడితే మిస్టరీ వీడనుంది. 

సరదాగా అన్నా - కేటీఆర్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ ను తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామని..భీమవరం నుండి పోటీ చేస్తానని సరదాగా అన్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఏపీలో సీఎం కేసీఆర్ కు ఆదరణ ఉందని, ఈవిషయాలను రాద్ధాంతం చేయడం తగదన్నారు. 

12:54 - January 9, 2016

జనవరి మాసంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే టాలీవుడ్ కు పెద్ద పండుగ. కానీ బాలీవుడ్ లో సినిమాల సందడి కనిపించిందు. కానీ ఈ సంవత్సరం మాత్రం బాలీవుడ్ లో సినిమాల సందడి కనిపిస్తోంది. అగ్ర హీరోల చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. ఇప్పటికే 'వాజిర్', 'చౌరంగా' విడుదలైన సంగతి తెలిసిందే. ఏ సినిమాలు వస్తున్నాయో ఓ లుక్ వేద్దాం..

సన్నిడియోల్..
సన్నిడియోల్...ఆయన కెరీర్ లో 'ఘాయల్' మరుపురాని చిత్రంగా పేర్కొనవచ్చు. ఇప్పుడు రీ ఎంట్రీగా ఈ సినిమా రూపొందింది. 'ఘాయల్ వన్స్ ఎగైన్' అంటూ సన్నీ ముందుకొస్తున్నాడు. ఆయన నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతోంది.

జూహీ..
జూహీచావ్లా...దాదాపు రెండేళ్ల తరువాత వెండితెరపైకి రాబోతోంది. ఆ సినిమా పేరు 'చాక్ అండ్ డస్టర్'. ఈ సినిమాలో షబానా అజ్మీ, జరీనా వాహాబ్, దివ్య దత్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ముంబయిలోని ఓ పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయినీలు వృత్తి నిర్వహణలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే ప్రధాన ఇతివృత్తం ఆధారంగా కథ సాగుతుంది. ఈ సినిమా కూడా 15వ తేదీనే ప్రేక్షకుల ముందుకొస్తోంది.

అక్షయ్ కుమార్..
అక్షయ్ కుమార్...గత సంవత్సరం నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సంవత్సరం 'ఎయిర్ లిఫ్ట్' ద్వారా ముందుకొస్తున్నాడు. ఈ నెల 22న విడుదల కాబోతోంది. రాజా కృష్ణ మీనన్ డైరెక్షన్ చేస్తుండగా, అక్షయ్ సరసన నిమ్రత్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఇరాక్ కువైట్ యుద్ద నేపధ్యంగా తెరకెక్కుతోంది.

మాధవన్..
మాధవన్...రాజ్ కుమార్ హిరానీ నిర్మాణంలో 'సాలా ఖాదూస్' చిత్రంలో నటిస్తున్నాడు. తమిళం, హిందీలో ఈ చిత్రం రూపొందుతోంది. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో ఈ చిత్ర రూపొందుతోంది. ఇందులో మాధవన్ బాక్సింగ్ శిక్షకుడిగా కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఇండియన్ స్క్రీన్ మీద రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామాలుగా తెరకెక్కిన మేరీ కోమ్, భాగ్ మిల్కా భాగ్, పాన్ సింగ్ తోమర్ సినిమాలు మంచి విజయాలు సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో ఎన్నడు కనిపించనంత న్యూ లుక్ లో మాధవన్ కనిపిస్తున్న ఈ సినిమాలో రితికా సింగ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత మెజీషియన్ పీసీ సర్కార్ కూతురు ముంతాజ్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ చిత్రం 29న విడుదల కాబోతోంది.

అడల్ట్ సినిమాలు...
తుషార్ కపూర్, అఫ్తాబ్ శివదాని ప్రధాన పాత్ర ధారులు పోషించిన అడల్ట్ కామెడీ చిత్రం ' క్యా కూల్ హై హమ్ 3 చిత్రం కూడా జనవరి రేసులో నిలిచింది. 22న విడుదల కాబోతోంది. ఇప్పటికే క్యా కూల్..సిరీస్ లో రెండు సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే.
సన్నీ లియోన్…
బాలీవుడ శృంగార తార సన్నీలియోన్ నటిస్తున్న తాజా చిత్రం మస్తీజాదే. ఇది కూడా అడల్ట్ కామెడి చిత్రం. ఈ చిత్రంలో సన్ని ద్విపాత్రాభినయం చేస్తోంది. తుషార్‌కపూర్‌, రితేజ్‌దేశ్‌ముఖ్‌ ఇందులో నటించారు. ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మరి ఈ చిత్రాల్లో బాక్సాపీస్ ఎదుట ఘన విజయం సాధిస్తుందో..ఎదీ ఫెయిల్ అవుతుందో వేచి చూడాలి. 

మల్లాది అనుచరుల ఆందోళన..

విజయవాడ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు హల్ చల్ సృష్టించారు. విష్ణును అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినా పార్టీ నుండి మద్దతు లభించలేదని రఘువీరా ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి కేవీపీ, సీనియర్ నేతలు చేరుకున్నారు. 

కడపకు చేరుకున్న బాబు...

కడప : సీఎం చంద్రబాబు జిల్లాకు చేరుకున్నారు. అలంకాన్ పల్లిలో హౌజ్ హౌస్ ను సీఎం శంకుస్థాపన చేయనున్నారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో బాబు పాల్గొనున్నారు. 

బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా..

పెర్త్ : వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శుక్రవారం జరిగిన టీ20 వార్మప్ మ్యాచ్‌లో భారత్ 74 రన్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

 

బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా..

పెర్త్ : వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శుక్రవారం జరిగిన టీ20 వార్మప్ మ్యాచ్‌లో భారత్ 74 రన్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. 

12:13 - January 9, 2016

సమాజం దూరంగా పెడుతుంది. ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తాయి. సామర్థ్యం ఉన్నా ఉద్యోగం రానంటోంది. చదువుకుంటామన్నా స్కూళ్లు కుదరదంటున్నాయి. ఏ ఆధారం దొరక్కపోయినా బతుకు పోరాటం చేస్తున్నారు. ఎక్కడో కొందరు ఆదరించిన చోట ప్రతిభను ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. వేధింపులు..ఛీత్కారాలు భరిస్తూనే జీవితంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. వాళ్లే 'హిజ్రా'లు. తాము ఎలాంటి బాధలు..ఆవేదన..నిర్లక్ష్యం చేస్తున్నారో టెన్ టివికి లైలా, గౌతమ్ లు వెల్లడించారు. బతకడానికి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కన్నతల్లిదండ్రులు తమని వెలివేస్తారని వాపోయారు. మీరు మంచివారు కాదని సమాజం చీదరించుకొంటోందని, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది మాత్రం సానుభూతి చూపిస్తారని తెలిపారు. మేము కూడా మనుషులమే అని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తమ వారిలో చాలా బీద వారున్నారని, ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల కొంచెం ప్రయోజనం ఉంటుందని తెలిపారు. తమ వారిలో కూడా చదువుకున్న వారున్నారని పేర్కొన్నారు. ఆడపిల్లలు చేసే పనులు, మగ వారు చేసే ధృడమైన పనులు కూడా చేయగలుగుతామన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏలాంటి విషయాలు వివరించారో వీడియో క్లిక్ చేయండి. 

జమ్మూ కాశ్మీర్ లో గవర్నర్ పాలన..

జమ్మూ కాశ్మీర్ : మూడు రోజుల పాటు సంతాప దినాలు ఉండడంతో సీఎంగా బాధ్యతల స్వీకరణకు మెహబూబా ముఫ్తీ నిరాకరించింది. వచ్చే వారంలోగా సీఎంగా మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రోజుల పాటు రాష్ట్రంలో గవర్నర్ పాలన అమలు కానుంది. 

ఎస్ఐ జగన్మోహన్ సూసైడ్ మిస్టరీ..

కరీంనగర్ : ఎస్ ఐ జగన్మోహన్ ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్ ను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

పఠాన్ కోట్ లో నరేంద్ర మోడీ..

పంజాబ్ : పఠాన్ కోట్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. 

టి.టిడిపి, టి. బిజెపి సమన్వయ కమిటీ భేటీ..

హైదరాబాద్ : హోటల్ తాజ్ కృష్ణాలో తెలంగాణ టిడిపి, బిజెపి సమన్వయ కమిటీ భేటీ జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు..ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. 

పాతబస్తీలో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : పాతబస్తీలోని భవానీనగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. 

భీమవరం కూలిన చర్చీ ప్రాంతాన్ని పరిశీలించిన పీతల..

పశ్చిమగోదావరి : భీమవరంలో చర్చీ కూలిన ప్రాంతాన్ని మంత్రి పీతల సుజాత పరిశీలించారు. క్షతగాత్రులను ఆమె పరామర్శించారు. నిర్మాణంలో నాణ్యత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు..

గుంటూరు : నర్సారావు పేట (మం) కాకాని వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

రామ్ జన్మభూమి సెమినార్ వద్ద ఎన్ఎస్ యూఐ ధర్నా..

ఢిల్లీ : రామ జన్మభూమి,శిలాన్యాస్, కాశ్మీర్ సమస్య వంటి సమస్యలు చుట్టూ చర్చలు పెట్టి మత కలహాలు సృష్టించిన కాషాయకూటమి దాని అనుబంధ సంస్థలు తాజాగా రామజన్మభూమి రగడను ప్రారంభించాయి. ఢిల్లీ యూనివర్శిటీలో రామ జన్మభూమిపై సదస్సును నిర్వహించుకునేందుకు వర్శిటీ అధికారులు ఆమోదం తెలపడం వివాదాస్పదమైంది. విశ్వహిందూ పరిషత్ అనుబంధ సంస్థ ఒకటి, ఈ సదస్సును నిర్వహించాలని తలపెట్టగా, అధికారులు కూడా అంగీకరించారు. దీనిపై ఎన్ఎస్ యూఐ నేతలు సెమినార్ ప్రాంగణం వద్ద ఆందోళన నిర్వహించాయి. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. 

10:14 - January 9, 2016

గుంటూరు : కోళ్ల పందేలు జరుగుతాయా ? కోర్టు ఆదేశాలతో పందేలు జరగనీవ్వమని ఏపీ పోలీసులు చెబుతున్నారు. కానీ కోళ్ల పందేలు జరుగుతాయని తెలుస్తోంది. ఇప్పటికే పలు ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన చూస్తే ఇది నిజం అని తెలుస్తోంది. జిల్లాలో ఏకంగా 80 కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్యనగర్ లో కోళ్లు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఈ కోళ్లను ఉంచారు. ఈ ఘటనలో వినయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డెల్టా ప్రాంతంలో ఓ ప్రజాప్రతినిధి కోళ్ల పందేలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ పలుకుబడి, అధికార పార్టీకి చెందిన వారు ఉండడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ముఖ్యంగా గుంటూరు రూరల్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మొహాలీలో బీఎస్ఎఫ్ జవాన్ అరెస్టు..

పంజాబ్ : మొహాలీలో బీఎస్ఎఫ్ జవాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసం కక్కుర్తిపడే చొరబాటుదారులు భారత్ లోకి ప్రవేశించేందుకు సహకరించాడని జవాన్ పై ఆరోపణలున్నాయి.

టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు..

తూర్పుగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాకినాడ ఆర్అండ్ బి అతిథి గృహం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమంపై ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకేసారి 8వేల మందితో కాన్ఫరెన్స్ నిర్వహించడం విశేషం.

జాతీయ గ్రామీణ క్రీడలను ప్రారంభించిన వెంకయ్య..

కృష్ణా : గుడివాడలో జాతీయ గ్రామీణ క్రీడలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 27 రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. 

09:24 - January 9, 2016

ఢిల్లీ : పఠాన్‌కోట్‌ ఘటనపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాకిస్తాన్ దిగొచ్చింది. భారత్ అందించిన ఆధారాలపై దర్యాప్తు చేయాలని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తమ అధికారులను ఆదేశించారు. మరోవైపు దర్యాప్తు పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం డెడ్‌లైన్ విధించినట్లు సమాచారం. పఠాన్‌కోట్ భారత వైమానిక దళ స్థావరంపై ఉగ్ర దాడికి సంబంధించి భారత్ అందించిన సాక్ష్యాధారాలపై పాకిస్తాన్‌ దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. పఠాన్‌ కోట్ దాడులపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్మీ చీఫ్‌ రహీల్‌ షరీఫ్‌, జాతీయ భద్రతా సలహాదారు నసీర్‌ జంజువా, ఐఎస్‌ఐ అధికారులు, కొందరు మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాక్‌ భూభాగం నుంచి ఉగ్రవాదాన్ని పారద్రోలేందుకు కట్టుబడి ఉన్నామని నవాజ్‌ షరీఫ్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించినట్లు భేటీ అనంతరం పాక్ పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాలు స్నేహ సంబంధాలు కొనసాగించాలని పాక్‌ నేతలు కోరారు.

మరిన్ని వివరాలు కోరే అవకాశం..
అయితే ఆరుగురు ఉగ్రవాదుల ఫోన్ కాల్స్‌ వివరాలతో దర్యాప్తు ముందుకు సాగడం కష్టమని పాక్‌ ఇంటిలిజెన్స్ బ్యూరో భావిస్తోంది. దాని ఆధారంగా కేసు పెడితే నిందితులు బెయిల్‌ పొందే అవకాశం ఉన్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలు భారత్‌ను కోరే అవకాశం ఉంది. దీంతో త్వరలో అధికారుల స్థాయి చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. మరోవైపు పఠాన్‌కోట్‌లో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల వద్ద పాకిస్తాన్‌లోని లాహోర్‌, కరాచీలో తయారైన మందులు, తినుబండారాలు లభించాయి. వీటిని కూడా పాక్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ఎయిర్ బస్ ను సందర్శించనున్న మోడీ..
ఇదిలా ఉంటే పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో కూంబింగ్ ముగిసింది. అక్కడి విశాల ఆవరణాన్నిమూడు రోజులుగా ఆర్మీ, ఎన్‌ఎస్‌జీ, వైమానికదళానికి చెందిన గరుడ కమెండోలు జల్లెడబట్టారు. ఉగ్రవాదులెవరూ దాగిలేరని, ఆయుధాలు, మందుగుండు.. తదితరాలేవీ లేవని నిర్ధారించుకున్నారు. మరోపక్క.. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండొచ్చని వారి మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు. అలాగే పఠాన్‌కోట్ దాడి విషయంలో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న, వివాదాస్పద పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్‌కు ఎన్‌ఐఏ సమన్లు జారీ చేసింది. సమగ్ర విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీ సల్వీందర్‌సింగ్‌, అతని మిత్రుడు రాజేష్‌కు లైడిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా ప్రధాని నరేంద్ర మోడీ నేడు పఠాన్‌కోఠ్ ఎయిర్‌బేస్‌ను సందర్శించనున్నారు. 

బాబు పర్యటన..నేతల అరెస్టులు..

కడప : సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరలేపారు. కొత్త కలెక్టరేట్ లో అంబేద్కర్ విగ్రహం పునర్ ప్రతిష్ట కోసం పోరాటం చేస్తున్న సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

విశాఖలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజురోజూకి పెరిగిపోతుంది. విశాఖ ఏజెన్సీలో సముద్రమట్టానికి మూడు వేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు.

08:07 - January 9, 2016

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 45లో పెద్దమ్మగుడి కమాన్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో నాలుగు కార్లు, రెండు బైక్ లు, ఆటోలను సీజ్ చేశారు. ఈ డ్రైవ్ లో మాజీ మంత్రి పురంధేశ్వరీ తనయుడు పట్టుబట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సందర్భంగా పోలీసు అధికారి మీడియాతో మాట్లాడారు. మొత్తం ఏడు కేసులు బుక్ అయ్యాయని, కౌన్సెలింగ్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. మాజీ మంత్రి కారు పట్టుకున్నారా ? అని విలేకరులు ప్రశ్నకు కారు హితేష్ దగ్గుబాటి పేరిట ఉందని, కారు ఎవరిదో విచారణలో తేలుతుందన్నారు. 

కడపలో నేడు బాబు పర్యటన...

కడప : నేడు సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. అలంకాన్ పల్లిలో హౌజ్ హౌస్ ను సీఎం శంకుస్థాపన చేయనున్నారు. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో బాబు పాల్గొనున్నారు. 

నేడు గుడివాడలో జాతీయ గ్రామీణ క్రీడలు..

కృష్ణా : నేడు గుడివాడలో జాతీయ గ్రామీణ క్రీడలు ప్రారంభం కానున్నాయి. 27 రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. ఈ క్రీడలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించనున్నారు.

 

సూళ్లూరుపేటలో నేటి నుండి పక్షుల పండుగ..

నెల్లూరు : సూళ్లూరు పేటలో నేటి నుండి పక్షుల పండుగ జరగనుంది. రెండు రోజుల పాటు ఫ్లెమింగో పక్షుల పండుగ జరగనుంది. మంత్రులు శిద్ధా, నారాయణలు ప్రారంభించనున్నారు. 

07:35 - January 9, 2016

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 12న వార్డు స్థాయిలో నోటిఫికేషన్ జారీ కానుంది. వచ్చే నెల 2న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదిలా ఉంటే రిజర్వేషన్ల గురించి విపక్షాలు పలు విమర్శలు చేస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా కార్యక్రమంలో వినయ్ కుమార్ (విశ్లేషకులు), చిలకమర్రి నర్సింహ (టీఆర్ఎస్), సతీష్ మాదిగ (టి.టిడిపి) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. 

07:21 - January 9, 2016

ఆధునిక జీవన శైలి కారణంగా చాలామందికి ఒత్తుగా ఉండే జుట్టు ఊడిపోయి, మాడు పల్చబడిపోతోంది. దానికి తోడు కొన్ని అపోహల కారణంగా ఉన్న జుట్టును కాస్తా పోగొట్టుకొని బట్టతలతో దర్శనమిస్తుంటారు. జుట్టుకు సంబంధించిన కొన్ని అపోహలు ఏమిటో ఒకసారి చూద్దాం..
చన్నీటి స్నానం చేస్తే జుట్టు మెరుస్తుందని కొందరు రోజూ చన్నీటి స్నానం చేస్తుంటారు. కానీ తరచూ చన్నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే మంచిది.
జట్టు దృఢంగా ఉండాలంటే ఎప్పుడూ ఒకే షాంపూ వాడకూడదని చాలామంది అనుకుంటుంటారు. నెలకోసారి షాంపూలను మార్చుతుంటారు. కానీ ఇందులో నిజం లేదు. జుట్టు ఆరోగ్యానికి ఇలా షాంపూలను మార్చుకోవడంతో ఎలాంటి సంబంధం ఉండదు. నిజానికి జుట్టు తత్వాన్ని బట్టి ఒకే షాంపూను వాడితే సరిపోతుంది.
ఎంత నురుగ వస్తే అంత మంచిదని, తలకు కనీసం రెండుసార్లు షాంపూ వాడాలని కొందరు అపోహపడుతుంటారు. ఇందులోనూ నిజం లేదు. జుట్టుకున్న మురికి ఒదిలిపోయిందని అనుకుంటే ఒక్కసారి షాంపూను వాడేసి, వదిలేస్తే సరిపోతుంది. నురగ బాగా రావాలని ఎక్కువ సార్లు షాంపూను తలకు పట్టిస్తే జుట్టుకు సమస్య తెచ్చిపెడుతుంది. షాంపూల్లో రసాయనాలు ఉండటం వల్ల జుట్టు పాడయ్యే అవకాశాలు లేకపోలేదు. అవకాశం ఉన్నంత వరకూ షాంపూలకు దూరంగా ఉండాలి.
ప్రకృతిలో దొరికే సహజమైన కుంకుడు, శీకాకాయ రసం తలస్నానానికి వాడటం ఉత్తమం.

07:16 - January 9, 2016

బాలీవుడ్‌లో తక్కువ టైంలోనే ఎక్కువ ఫేమ్‌ సంపాదించుకున్న నటీమణుల్లో శ్రద్ధాకపూర్‌ పేరు టాప్‌లిస్ట్‌లో ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. 'ఆషికి2', 'ఏక్‌ విలన్‌', 'హైదర్‌', 'ఎబిసిడి2' వంటి సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌ని చేరుకున్న శ్రద్ధా ఈ ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. వీటిల్లో 2008లో విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో ఘనవిజయం సాధించిన 'రాక్‌ ఆన్‌' చిత్రానికి సీక్వెల్‌గా షుజాత్‌ సౌదాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాక్‌ఆన్‌2' చిత్రంలో నటిస్తోంది. సంగీత నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్‌ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రద్ధాతోపాటు ఫర్హాన్‌ అక్తర్‌, అర్జున్‌ రాంపాల్‌ తదితరులు ఈ చిత్రంలో నటించడంతో ప్రాజెక్ట్‌ మీద ప్రేక్షకుల్లో మరింత హైప్‌ పెరిగింది. దీంతోపాటు టైగర్‌ షరాఫ్‌ సరసన 'బాగీ' (ఏ రెబల్‌ ఫర్‌ లవ్‌) చిత్రంలోను, ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ నవల 'హాఫ్‌గర్ల్‌ఫ్రెండ్‌' ఆధారంగా అదే పేరుతో మోహిత్‌ సూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే, సిల్వర్‌స్క్రీన్‌ మీద కాకుండా రియల్‌లైఫ్‌లోనూ శ్రద్ధా సాహస విన్యాసాలు చేస్తోంది. ఇటీవల ముంబైలోని 34 అంతస్తుల భవనాన్ని అవలీలగా ఎక్కేసింది. భవనం ఎక్కుతున్న ఫొటోల్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

07:12 - January 9, 2016

'భలే భలే మగాడివోయ్' చిత్రం తర్వాత నాని నటిస్తున్న చిత్రానికి 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' టైటిల్‌ని ఖరారు చేశారు. హను రాఘవపూడి దర్శకత్వలో 14 రీల్స్‌ పతాకంపై రామ్‌ అచంట, గోపీ అచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'నమో వెంకటేశ', 'దూకుడు', 'వన్‌ నేనొక్కడినే', 'లెజెండ్‌', 'ఆగడు' వంటి చిత్రాల తర్వాత మా బ్యానర్‌లో వస్తున్న మరో చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'. ఈ చిత్రం ద్వారా మెహరీన్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. 'అందాల రాక్షసి' వంటి డిఫరెంట్‌ లవ్‌స్టోరీతో మెప్పించిన దర్శకుడు హని రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి రత్నవేలు వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన యువరాజ్‌ కెమెరామెన్‌గా పనిచేస్తుండగా, ఎఆర్‌.రెహ్మాన్‌ మ్యూజిక్‌ స్కూల్‌లో పని చేసిన విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతమందిస్తున్నారు. ఒక సాంగ్‌ మినహా షూటింగ్‌ అంతా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియోను సంక్రాంతి సందర్భంగా ఘనంగా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం' అని అన్నారు. 

07:10 - January 9, 2016

సిద్ధార్థ్‌, హన్సిక, త్రిష, పూనమ్‌ బజ్వా హీరోహీరోయిన్లుగా సుందర్‌.సి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం 'అరణ్మనై 2'. తెలుగులో అనువాదితమైన 'చంద్రకళ' చిత్రానికిది సీక్వెల్‌. ఈ చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సర్వంత్రాయ్ క్రియేషన్స్‌, గుడ్‌ సినిమా గ్రూప్‌ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'చంద్రకళ' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సుందర్‌ సి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం హర్రర్‌ కామెడీగా బాక్సాఫీసును షేక్‌ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు సుందర్‌ సి తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో అనువదిస్తునందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. సిద్ధార్థ్‌, త్రిష, హన్సికల నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే హిప్‌ హాప్‌ మ్యూజిక్‌, రీరికార్డింగ్‌ సినిమాకు అదనపు ఆకర్షణలు' అని చెప్పారు.

 

07:08 - January 9, 2016

గోపీచంద్‌ తాజా చిత్రానికి 'జగన్మోహన్‌ ఐపిఎస్‌' టైటిల్‌ బదులు 'బల్లెం' అనే టైటిల్‌ని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బి.గోపాల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే 90 శాతం పూర్తయ్యింది. కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్‌ మధ్యలో వాయిదా పడింది. చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేస్తోంది. ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన నయనతార నటిస్తున్న విషయం విదితమే. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

07:05 - January 9, 2016

ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా, సుకుమార్‌ దర్శకత్వంలో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన 'నాన్నకు ప్రేమతో..'. చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదల సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ, 'ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారధ్యంలో కంపోజ్‌ చేసిన పాటలు ఇటీవల విడుదలై పెద్ద హిట్‌ అయ్యాయి. అన్ని ఏరియాల నుంచి ఆడియోకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఎన్టీఆర్‌, సుకుమార్‌ వంటి క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది' అని అన్నారు.

07:04 - January 9, 2016

ఇతర భాషా చిత్ర పరిశ్రమల్లో సైతం తెలుగు సినిమా మార్కెట్‌ పరిధిని విస్తృతం చేసేందుకు గత యేడాది మన కథానాయకులు విశేష కృషి చేశారు. దీంట్లో భాగంగా మన తెలుగు హీరోల సినిమాలు ఇతర భాషల్లో అనువాదమయ్యాయి కూడా. ఈ క్రమంలో తెలుగు నాట ఘనవిజయం సాధించిన 'శ్రీమంతుడు' చిత్రం తమిళంలో అనువాదమై, ప్రేక్షకుల ఆదరణతో సూపర్‌హిట్‌ కొట్టింది. అంతేకాకుండా తమిళనాట మహేష్‌బాబు మార్కెట్‌ రేంజ్‌ని కూడా పెంచింది. దీని తర్వాత తాజాగా మహేష్‌బాబు 'బ్రహ్మోత్సవం'తో మళ్ళీ తమిళ ప్రేక్షకుల ముందుకెళ్ళబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో 'బ్రహ్మోత్సవం' రూపొందుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం తమిళ వర్షెన్‌కి సంబంధించి షూటింగ్‌ వచ్చే వారం నుండి చెన్నైలో జరగబోతోంది. చెన్నైలోని అంబత్తూర్‌ ఇండిస్టియల్‌ ఎస్టేట్‌లో జరిపే షూటింగ్‌లో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను మహేష్‌బాబు, సత్యరాజ్‌పై చిత్రీకరించనున్నారు. అలాగే మహేష్‌బాబు, సమంత, కాజల్‌ నటించే మరికొన్ని సన్నివేశాల్ని కూడా షూట్‌ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి నిర్మిస్తోంది.

07:02 - January 9, 2016

సాధారణంగా ఎండకు భయపడి చాలామంది బయటకెళ్ళాలంటే గొడుగుని తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. అది ఏ కాలమైనా సరే. కొద్దిగా ఎండను కూడా తమ శరీరంపై పడనివ్వరు. దాంతో వారి శరీరానికి విటమిన్‌ డి లోపిస్తుంది. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైనా సూర్యరశ్మి శరీరానికి తగిలేట్లు చూసుకోవాలి. అలా చేయకపోతే శరీరానికి అవసరమైన డి విటమిన్‌ అందదు. మన శరీరానికి విటమిన్‌ డి చాలా ముఖ్యం. మన దేశంలో 90 శాతం మందికి డి విటమిన్‌ లోపం ఉంది. దాంతో ఎముకల బలానికి విటమిన్‌ డి ఆహారాలు వాడుతుంటారు. డి విటమిన్‌ అనేది శరీరానికి కాల్షియం గ్రహించే శక్తినిస్తుంది. సూర్యకాంతి పడక, డి విటమిన్‌ తయారుకాక పోతే శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది. శరీరంలో కాల్షియంకీ భారీకాయానికీ సంబంధముంది. భారీకాయం కలవారు కాల్షియం లోపం కలిగి ఉంటారు. ఏసీ ఉన్న ఆఫీసుల్లో పనిచేసే వారు ఊబకాయం బారినపడటానికి, వివిధ రకాల అనారోగ్యాల బారిన పడటానికి కారణం వారికి ఎండ తగలక పోవడమే. శరీరం మీద ఎంతగా ఎండ పడితే ఆరోగ్యాన్ని అంతగా పొందవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు జీవశక్తికి నిధినిక్షేపం. అందుకే సూర్యకాంతికి దూరమైనవారు తేజో హీనులు, రోగగ్రస్తులవుతారు. మరి శరీరం మీద తగినంత ఎండ పడటం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
సూర్యరశ్మి వల్ల మరో ఆరోగ్య ప్రయోజనం.. ఉదయం సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యరశ్మిలో ఉండటం వల్ల శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో సరిపడా విటమిన్‌ డి ఉన్నట్లైతే అది కొన్ని ప్రమాదకరమైన జబ్బులు అంటే హార్ట్‌ డిసీజ్‌, క్యాన్సర్‌ వంటి వాటిని రక్షణ కలిగిస్తుంది. కాబట్టి ఈ నేచురల్‌ విటమిన్‌ డి ని సన్‌లైట్‌ నుండి పొందవచ్చు.
విటమిన్‌ డి లోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, ప్రొస్టేటు గ్రంధి క్యాన్సర్‌, క్లోమం క్యాన్సర్ల ముప్పు పెరుగుతోందని అధ్యయనాల్లో కూడా నిరూపణ అయ్యింది. కాబట్టి శరీరంలో విటమిన్‌ డి స్థాయిలు సంపూర్ణంగా ఉండేలా చూసుకోవాలి. 

బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్..

హైదరాబాద్ : బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 45లో పెద్దమ్మగుడి కమాన్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నాలుగు కార్లు, రెండు బైక్ లు, ఆటో సీజ్ చేశారు. 

మొగల్రాజపురంలో విరసం రాష్ట్ర మహాసభలు..

విజయవాడ : మొగల్రాజపురంలో నేటి నుండి విరసం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. రైతులు, విద్యార్థులు, బలవన్మరణాలు, మతతత్వంపై చర్చ జరగనుంది. 

06:36 - January 9, 2016

 

విజయవాడ : బెజవాడ కల్తీ నెయ్యికి అడ్డాగా మారింది. అధికారులు దాడులు చేస్తున్నా.. కల్తీ మాఫియాకు కల్లెం పడటం లేదు. గతంలో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యిని పట్టుకున్న పోలీసులు మరోసారి దాడులు చేసి కొన్ని కేంద్రాలను సీజ్‌ చేశారు. సింగినగర్‌, నున్న ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ నెయ్యి తయారు కేంద్రాలపై విజిలెన్స్‌, ఫుడ్‌ కంట్రోల్‌ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దాదాపు 20 కేంద్రాలపై అకస్మిక దాడులు చేశారు. ఒక కంపెనీ అనుమతి తీసుకుని ఇతర కంపెనీ లేబుల్స్‌తో నెయ్యిని విక్రయిస్తుండటాన్ని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. అదేవిధంగా కల్తీ జరిగినట్లు అనుమానమున్న నెయ్యి షాంపిళ్లను సేకరించారు. అక్రమాలకు పాల్పడుతున్న కొన్ని కేంద్రాలను అధికారులు సీజ్‌ చేశారు. డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన నెయ్యిని సైతం సీజ్‌ చేశారు. షాంపిల్స్‌ రిపోర్ట్స్‌ వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయన్న అధికారులు.. నిబంధనలను ఎవరు అతిక్రమించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

06:34 - January 9, 2016

నల్గొండ : రాష్ట్రంలో కిడ్నీ రాకెట్‌ వణుకు పుట్టిస్తోంది. ఉద్యోగం పేరుతో ఓ యువకుడిని విదేశాలకు తీసుకెళ్లి కిడ్నీ అపహరించారు దుండగులు. బాధితుడిని అక్కడే వదిలేసి వచ్చారు. ఎలాగోలా స్వదేశానికి చేరుకున్న అతడు.. బతకుదెరువు కోసం ఓ ఉద్యోగంలో చేరాడు. తన కిడ్నీ పోయిందని తెలుసుకున్న బాధితుడు ఏజెంట్‌ను నిలదీయగా.. మళ్లీ కిడ్నీ అమరుస్తామని బుకాయించాడు. ఆ తర్వాత బాధితుడిని బంధించి డబ్బులు డిమాండ్‌ చేశారు. తీరా తల్లిదండ్రులు, బంధువులు విషయం తెలుసుకొని పోలీసులను ఆశ్రయించడంతో.. నిందితులు పరారయ్యారు. నల్లగొండ జిల్లాను కుదిపేసిన కిడ్నీ రాకెట్‌ ముఠా ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనూ కలకలం రేపింది. దమ్మపేట మండలానికి చెందిన మువ్వా నరేష్‌కుమార్‌కు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొలంబో తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి కిడ్నీ కాజేశారు. బాధితుడిని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఎలాగోలా అక్కడినుంచి వచ్చిన బాధితుడు స్వగ్రామానికి చేరుకోవడంతో కిడ్నీ వ్యవహారం బయటపడింది.

ఎలా జరిగింది ? 
అసలు నరేష్‌కుమార్‌ కిడ్నీ రాకెట్‌ ముఠాలో ఎలా చిక్కుకున్నాడో తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. బీటెక్‌ చేసిన నరేష్‌కుమార్‌ హైదరాబాద్‌లో ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నాడు. తనకు పరిచయమైన ఓ వ్యక్తి కొలంబోలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపాడు. తనకు పాస్‌పోర్ట్‌ లేదని నరేష్‌కుమార్‌ చెప్పడంతో దానికి అన్ని ఏర్పాటు చేస్తానని వెంటనే చెన్నై వెళ్దామని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన నరేష్‌.. చెన్నై వెళ్లాడు. అక్కడినుంచి కొలంబో వెళ్లేందుకు విమానం ఎక్కగానే ముఠా సభ్యులు నరేష్‌కు మత్తుమందు ఇచ్చారు. ఇక నరేష్‌కు స్పృహ వచ్చేసరికి నవంబర్‌ 22న కొలంబోలో ఉన్నాడు. తన శరీరాన్ని చూసుకునేసరికి ఎడమవైపు కిందిభాగంలో ఆపరేషన్‌ జరిగినట్లు.. గమనించాడు. తిరిగి వచ్చేందుకు డబ్బులు లేక అక్కడే కొన్ని రోజులు ఉన్నాడు. తర్వాత డబ్బులు సమకూర్చుకొని చెన్నైకు చేరుకున్నాడు. ఆ తర్వాత మోసపోయానని గమనించిన నరేష్‌.. చేసేదేమీ లేక చెన్నైలో ఓ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా ఉద్యోగంలో చేరాడు. తన పరిస్థితిని అక్కడి వైద్యుడికి చూపించగా ఒక కిడ్నీ లేనట్లుగా గుర్తించారు. ఇదిలావుండగా నరేష్‌కు ఓ రోజు తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి కనిపించాడు. తనకు జరిగిన విషయంపై నిలదీశాడు. పోలీసులకు చెబుతానని చెప్పడంతో.. పొరపాటు జరిగిందని మళ్లీ కిడ్నీ అమరుస్తామని నరేష్‌ను విజయవాడకు తీసుకువచ్చాడు ఏజెంట్‌. ఓ లాడ్జీలో ఉన్న నరేష్‌ను ఏజెంట్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి తమకు లక్ష రూపాయలు కావాలని బెదిరించారు. దీంతో నరేష్‌.. ఈనెల 4న తన తండ్రికి ఫోన్‌ చేశాడు. తనను ఎవరో కిడ్నాప్‌ చేశారని తన అకౌంట్‌లో లక్ష రూపాయలు వేయాలని చెప్పాడు. దీంతో నరేష్‌ తండ్రి సుబ్బారావు అకౌంట్‌లో డబ్బులు వేశాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బులు కావాలని ఏజెంట్‌ బెదిరించాడు. మళ్లీ నరేష్‌ ఫోన్‌ చేయడంతో.. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టారు. బెజవాడలోని వన్‌టౌన్‌లో ఓ లాడ్జీలో నరేష్‌ను గుర్తించారు. విషయం తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. ఏం జరిగిందనే విషయంపై పోలీసులు నరేష్‌ను విచారిస్తున్నారు.మరోవైపు నల్లగొండ జిల్లాలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్‌తో దీనికి ఏమైనా సంబంధాలున్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

06:30 - January 9, 2016

కరీంనగర్ : జిల్లా పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్‌ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌లో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవలే పెద్దపల్లి నుంచి జమ్మికుంటకు ఎస్సై జగన్మోహన్‌ బదిలీ అయ్యారు. అకారణంగా బదిలీ చేశారని మనస్థాపం చెంది జగన్మోహన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. 

06:29 - January 9, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌ భగీరథ పనులను వేగవంతం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్‌ భగీరథ పనులపై ఉన్నతాధికారులు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతం చేసేందుకు విద్యుత్‌, అటవీ, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. కోట్లాది మందికి సురక్షితమైన తాగునీటిని అందించడం గొప్ప అవకాశమని పంచాయితీరాజ్‌ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ అభిప్రాయపడ్డారు. అన్ని జిల్లాల మిషన్‌ భగీరథ ప్రాజెక్టు అధికారులు, అలాగే జిల్లా అటవీ అధికారి, జిల్లా పంచాయితీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

అటవీ అనుమతులపై చర్చ...
ముఖ్యంగా మిషన్‌ భగీరథ పనులకు సంబంధించి అటవీ అనుమతులపై సమావేశంలో విస్తృతమైన చర్చ జరిగింది. అటవీ అనుమతులు సులభంగా పొందడం, ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్న విషయాలపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా తొమ్మిది జిల్లాల్లోని అటవీ అనుమతుల పురోగతిని డీఎఫ్‌ఓలను అడిగి తెలుసుకున్నారు ఎస్పీ సింగ్‌. ప్రధానంగా ఏప్రిల్‌ 30 నాటికి నీళ్లు అందించాల్సిన 9 నియోజక వర్గాల్లోని అటవీ అనుమతుల ప్రస్తుత స్థితిపై ఆరా తీశారు. ఈ నియోజకవర్గాలకు అటవీ అనుమతులు తొందరగా ఇప్పించేందుకు డీఎఫ్‌ఓలు సహకరించాలని కోరారు.

12న సీఎం సమీక్షా సమావేశం..
సమీక్షలో ప్రధానంగా మహబూబ్‌ నగర్ జిల్లాను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ సింగ్‌ సూచించారు. ముందుగా హైదరాబాద్‌ మెట్రో పరిధిలోని 9 నియోజకవర్గాల అటవీ అనుమతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అడిషనల్‌ అటవీ సంరక్షణాధికారిని కోరారు. మరోవైపు ఈ నెల 12వ తేదీన సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం నిర్వహించే సమావేశానికి డిజైన్ల పురోగతిపై పూర్తి స్థాయి నివేదికలు తయారుచేయాలని ఎస్పీ సింగ్‌ ఆదేశించారు. ఇదిలా ఉంటే సీఎం ఆదేశం మేరకు ఏప్రిల్‌ 30 నాటికి హైదరాబాద్‌ మెట్రో పరిధిలో 9 నియోజకవర్గాలకు నీళ్లు అందిస్తామని, ఆ తర్వాత మిగతా ప్రాంతాల్లోనూ క్రమక్రమంగా సురక్షిత మంచినీరు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. 

06:26 - January 9, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల వేళ కేటీఆర్‌ ఆంధ్రావాళ్ల మనసుల్లోకి ప్రేమ తూటాలు వదులుతున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర సమితి ఏపీలోనూ పోటీ చేయొచ్చని.. తానైతే భీమవరం నియోజకవర్గాన్ని ఇప్పటికే సెలెక్ట్‌ చేసుకున్నానంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రేటర్‌లో ఆంధ్రావాళ్ల ఓట్ల కోసమే కేటీఆర్‌ గిమ్మిక్కులకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి, వీహెచ్‌ విమర్శించారు. గ్రేటర్‌ టార్గెట్‌గా పార్టీలన్నీ చెమటోడుస్తున్నాయి. ప్రచారంలో దూకుడును ప్రదర్శిస్తున్న టీఆర్‌ఎస్‌ సభలు సమావేశాలతో హోరెత్తిస్తోంది. గ్రేటర్‌లో గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఆంధ్రావారి ఓట్లను చేజారకుండా జాగ్రత్తపడున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని తెలుగురాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని ఆంధ్రాలోనూ పోటీ చేస్తామని కేటీఆర్‌ ఓ సభలో సరదాగా వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితే వస్తే తాను భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు. భీమవరంలో గెలవడం కూడా చాలా సులభం అన్న కేటీఆర్‌ అక్కడ కోడి పందేలను చట్టబద్దం చేస్తే చాలంటూ సభలో నవ్వులు పూయించారు.

రేవంత్, వీహెచ్ విమర్శలు...
కేటీఆర్‌ వ్యాఖ్యలకు టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిని తెలుగు రాష్ట్ర సమితిగా మార్చుకుంటే తమకు అభ్యంతరం లేదన్న ఆయన.. ముందుగా తెలంగాణ భవన్‌ను తెలుగు భవన్‌గా మార్చుకోవాలని సూచించారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేటీఆర్‌ జిమ్ముక్కులకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. గ్రేటర్‌లో సెటిలర్ల ఓట్ల కోసమే కేటీఆర్‌ ఆంధ్రావారిపై కపట ప్రేమ కురిపిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యుడు వీహెచ్‌ విమర్శించారు. గతంలో టీఆర్‌ఎస్‌ నేతలు సీమాంధ్రులపై రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వీహెచ్‌ అన్నారు. మొత్తానికి కేటీఆర్‌ సరదాగా చేసిన వ్యాఖ్యలు విపక్షాల సెటైర్లతో హీట్‌ను పెంచాయి. ఇది ఎందాకా వెళ్తుందో చూడాలి.

06:24 - January 9, 2016

హైదరాబాద్ : అసలు సిసలైన సమయం ఆసన్నమయ్యింది. గ్రేటర్‌లో ఎన్నికల వేడి ఆరంభమైంది. జీహెచ్‌ఎంసీ ఎలక్షన్ల నగారా మోగింది. ఇక పొలిటికల్‌ పార్టీల పరుగులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వేడెక్కిన రాజకీయ వాతావరణం ఇక మరింత హీటెక్కనుంది. 50 శాతం రిజర్వేషన్లతో కార్పొరేషన్‌లో మహిళామణులే కీలకపాత్ర పోషించనున్నారు. ఇక రొటేషన్‌లో భాగంగా ఈసారి మేయర్‌ పీఠాన్ని కూడా బీసీ జనరల్‌కే కేటాయించారు.

రిజర్వేషన్ల ఖరారు..
మొదట డివిజన్లు వారీగా ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ (జనరల్‌) 1, ఎస్టీ (మహిళలు) 1, ఎస్సీ(జనరల్‌) 5,ఎస్సీ మహిళలకు 5 డివిజన్లను కేటాయించారు. ఇక 25 డివిజన్లు బీసీ జనరల్‌కు, మరో 25 డివిజన్లు బీసీ మహిళలకు, 44 డివిజన్లు మహిళా జనరల్‌కు కేటాయించారు. మొత్తం డివిజన్లో 44 డివిజన్లు అన్‌రిజర్వ్‌డ్ అయ్యాయి. మొదటి సారిగా గ్రేటర్‌ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

ఫిబ్రవరి 2న ఎన్నికలు...
ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. ఫిబ్రవరి 2న జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నెల 12 నుంచి 17 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జనవరి 18న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 21ని గడువుగా నిర్దేశించారు. ఏదైనా వార్డులో అనివార్య కారణాలతో పోలింగ్‌ ఆగిపోతే ఫిబ్రవరి 4న నిర్వహిస్తారు.

ప్రణాళికలు సిద్ధం..
ఇక జీహెచ్‌ఎంసీ మేయర్ పదవికి రిజర్వేషన్ ఖరారైంది. మేయర్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. ముందు నిర్ణయించినట్టుగానే మేయర్‌ పదవి బీసీ జనరల్‌గానే కొనసాగుతుందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేదుకు ఎలక్షన్‌ కమిషన్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. 

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా నేటి నుండి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక రైళ్లు తిరగనున్నాయి. నేటి నుండి 17వ తేదీ వరకు సికింద్రాబాద్ - కాకినాడ మధ్య రైళ్లు తిరగనున్నాయి. 

మావో భారీ విగ్రహం కూల్చివేత..

చైనా : హెనాన్ ప్రావిన్స్ లో గల టాంగ్జూ కౌంటీలో ఇటీవల చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ రూపంతో 37 మీటర్ల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ భారీ విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ అధికారులు దీనిని కూల్చివేశారు. 

నేటి నుండి టెక్స్ టైల్ పార్క్ కోసం భూ సేకరణ..

హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో ప్రభుత్వం చేపట్టనున్న అతిపెద్ద టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు కోసం శనివారం భూ సేకరణ ప్రారంభించనున్నట్లు ఆర్డీఓ వెంకటమాధవరావు వెల్లడించారు. 

Don't Miss