Activities calendar

10 January 2016

21:55 - January 10, 2016

ఢిల్లీ : మూడేళ్ల క్రితం భారత్‌ సైన్యం కదలికపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీష్‌ తివారీ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. సైన్యం అనుమానాస్పద కదలికలపై వచ్చిన వార్తలు నిజమేనంటూ.. మనీష్ స్పందించారు. అయితే ఈ వ్యాఖ్యలను అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఖండించాయి. 
రాహుల్‌ కోటరీలో తివారీ ముఖ్యనేత
మనీష్‌ తివారీ..కాంగ్రెస్‌ సీనియర్‌ నేత. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కోటరీలో ముఖ్యనేత. యూపీఏ రెండోపర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పని చేశారు. అటువంటి నేత ఇప్పడు వివాదంలో చిక్కుకున్నారు. 2012 జనవరి 16-17 తేదీల్లో రెండు సైనిక పటాలాలు ఢిల్లీ వైపు కదలాయని ఇంటెలిజెన్స్ వర్గాల రికార్డుల్లో నమోదైందన్న కథనం  ఏప్రిల్‌ 4న  ఓ  ఆంగ్ల పత్రికలో ప్రచురితమయ్యింది. హర్యానాలోని హిసార్‌ నుంచి ఒక యూనిట్‌, యూపీలోని ఆగ్రా నుంచి మరో యూనిట్‌ ఢిల్లీకి దారితీశాయన్నది  కథనం. అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చనీయాంశమయ్యింది. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దీనిపై సీరియస్‌ అయ్యారన్న ప్రచారం జరిగింది. 
 కాంగ్రెస్‌ జోక్యం 
అప్పట్లో వచ్చిన ఈ వార్తను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీష్‌ తివారీ ఇప్పుడు సమర్ధించడం తాజా వివాదానికి దారితీసింది. అప్పట్లో తాను రక్షణ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యుడుగా ఉన్నట్టు  తివారీ చెప్పుకొచ్చారు. ఇది  దురదృష్టకరమనై ఘటన అయినప్పటికీ వాస్తవమన్నారు. దీనిప తీవ్ర దుమారం చెలరేగడంతో కాంగ్రెస్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తివారీ చేసిన వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం తప్పుపట్టింది. ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి మతీష్‌ తివారీ ప్రభుత్వఅధికార ప్రతినిధికానీ, రక్షణ వ్యవహారాల  కేబినెట్‌ కమిటీ సభ్యుడు కానీ కాదని... ఏఐసీసీ అధికార ప్రతినిధి  అభిషేక్‌ మను సింఘ్వి మండిపడ్డారు. అటువంటి అంశాలపై  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మనీష్‌ తివారీకి తగదని  వార్నింగ్‌ ఇచ్చారు. సైనిక కదలికపై  మనీష్‌ తివారీ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి  పీసీ చాకో కూడా తప్పుపట్టారు. ప్రభుత్వానికి తెలియకుండా, సర్కార్‌ ఆదేశాలు లేకుండా సైన్యం కదిలే అవకాశమేలేదన్నారు. తివారీ వివాదాస్పత వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పూర్తిగా తోసిపుచ్చుతన్న చాకో చెప్పారు. 
మనీష్‌ తివారీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు
మనీష్‌ తివారీ వ్యాఖ్యలపై బీజేపీతోపాటు, కేంద్ర మంత్రి వీకే సింగ్‌ మండిపడ్డారు. అప్పట్లో వీకే సింగ్‌ సైనికదళ ప్రధానాధికారిగా ఉన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తివారీ మాట్లాడటాన్ని తప్పుపట్టారు. అప్పటి ఘటనలు గురించి తాను రాసిన పుస్తకం చదవి తెలుసుకోవాలని కోరారు. ఈ విధంగా చేస్తే ఆయన సందేహాలన్నీ నివృత్తి అవుతాయని వీకే సింగ్‌ సూచించారు. తివారీ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్‌ హుస్సేన్‌ తప్పుపట్టారు. 

21:50 - January 10, 2016


శ్రీనగర్ : జమ్ము-కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై పీడీపీతో రాజకీయ పార్టీల నేతల మంతనాలు కొనసాగుతున్నాయి. నాలుగైదు రోజుల్లో పీడీపీ నేతృత్వంలో సర్కార్‌ కొలువుతీరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జమ్ము-కశ్మీర్‌ సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మృతితో ఆయన కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియగాంధీ మెహబూబాతో భేటీ అయ్యారు. 
ఆటమొదలైంది..
కశ్మీర్‌లో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన 
జమ్ము-కశ్మీర్‌ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మరణంతో ఖాళీ అయిన ముఖ్యమంత్రి స్థానాన్ని భర్తీ చేసేవరకు తాత్కాలిక  ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పటి వరకు పీడీపీ-బీజేపీ సంకీర్ణ మంత్రివర్గం కొసాగింది. పీడీపీ తరుపును ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ సీఎంగా బాధ్యతలు చేపడితే... బీజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ముఫ్తీ మరణం తర్వాత కశ్మీర్‌లో రాజకీయ పరిణామాలు రోజుకో ములుపు తిరుగుతున్నాయి.  
కమలనాథులకు షరతులు విధిస్తున్న పీడీపీ 
పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీకి మద్దతు ఇచ్చే విషయంలో బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మద్దుతు తీసుకునే విషయంలో పీడీపీ  అధినాయకత్వం కమలనాథులకు కొన్ని షరతులు విధిస్తోంది. బీజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోమని మొండికేస్తోంది. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. మంత్రి పదవులతోపాటు, మంత్రిత్వ శాఖ కేటాయింపులో తనకు స్వేచ్ఛ ఉండాలని మెహబూబా ముఫ్తీ కోరుతోంది. సున్నితమైన అంశాల జోలికి బీజేపీ నాయకులు వెళ్లరాదని పీడీపీ షరతు విధిస్తోంది. అయితే వీటికి తలొగ్గరాదని బీజేపీ నాయకులు నిర్ణయించుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. 
ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు 
ప్రభుత్వం ఏర్పాటుపై బీజేపీ నేతలు ఇప్పటికే మెహబూబా ముఫ్తీతో దఫదఫాలుగా చర్చలు జరిపారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌, జమ్ము-కశ్మీర్‌ ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన నిర్మల్‌సింగ్‌ ఇంతకు ముందే చర్చలు జరిపారు. ఆదివారం కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మెహబూబా ముఫ్తీని కలిసి ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరిపారు. అయితే తండ్రి చనిపోయిన దుఃఖంలో ఉన్న  పీడీపీ నాయకురాలు ముఫ్తీని పరామర్శించేందుకే ఆమెను కలిసినట్టు గడ్కరీ చెప్పారు. 
కాంగ్రెస్ బృందంతో మఫ్తీ భేటీ...
మరోవైపు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియగాంధీ నేతృత్వంలోని ఓ ప్రతినిధి బృందం కూడా శ్రీనగర్‌లో మెహబూబా ముఫ్తీతో భేటీ అయ్యింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌తోపాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ,  కశ్మీర్‌ పీపీసీ ఛీఫ్‌ జీఏ మీర్‌, పార్టీ నాయకుడు సైఫుద్దీన్‌ సోజ్‌..... పీడీపీ నాయకురాలు ముఫ్తీతో 20 నిమిషాలు పాటు సమావేశమయ్యారు. కేవలం పరామర్శ కోసమే ముఫ్తీని కలిసినట్టు కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నప్పటికీ... ఈ భేటీలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు భావిస్తున్నారు.  2002-2008 మధ్య కాంగ్రెస్‌-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వ జమ్ము-కశ్మీర్‌లో అధికారంలో ఉంది. గులాంనబీ ఆజాద్‌, మెహబూబా ముఫ్తీ ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2008లో రెండు పార్టీల మధ్య సంబంధాలు బెడిచికొట్టాయి. కాంగ్రెస్‌.... నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 
పీడీపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేస్థితిలో లేదు
జమ్ము-కశ్మీర్‌లో పీడీపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేస్థితిలో లేదు. పీడీపీ 28 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 12 స్థానాలుంటే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014 నవంబర్‌, డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఇండిపెండెంట్లు నెగ్గగా, సీపీఐ ఒక సీటు దక్కించుకుంది. మరోవైపు భవిష్యత్‌ కార్యాచరణ గురించి చర్చించేందుకు పీడీపీ ఎమ్మెల్యేలు శ్రీనగర్‌లో భేటీ జరిపారు. కశ్మీర్‌ పరిణామాలు  ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. 

21:41 - January 10, 2016

హైదరాబాద్: ఐసీడీఎస్ లను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు పోరుబాట పట్టాలని అంగన్‌వాడీలు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15న 'మార్చ్‌ టూ పార్లమెంట్‌' నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఆలిండియా అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ జాతీయ మహాసభల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.  
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఉషారాణి, సింధు
భాగ్యనగరంలో నాలుగు రోజుల పాటు ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ మహాసభలు జరిగాయి. ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మహాసభలో యూనియన్‌ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఉషారాణి, సింధులను ఎన్నుకున్నారు. 72 మంది సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. 
భారీ ర్యాలీ 
ఇక చివరిరోజున మహాప్రదర్శనలో భాగంగా అంగన్‌వాడీలు సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరాపార్క్‌ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఇందిరాపార్క్‌ దగ్గర నిర్వహించిన బహిరంగసభకు ఎద్దఎత్తున అంగన్‌వాడీలు తరలివచ్చారు. 
దేశవ్యాప్త పోరాటాలకు పిలుపు 
అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించాలని మహాసభ పిలుపునిచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టి.. ఐసీడీఎస్‌లను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 15న 'మార్చ్‌ టూ పార్లమెంట్‌' నిర్వహిస్తామని ప్రకటించారు. అంగన్‌వాడీలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామన్నారు అంగన్‌వాడీ వర్సర్స్‌, హెల్పర్స్‌ నూతన జాతీయ అధ్యక్షురాలు ఉషారాణి. లబ్ధిదారులతో కలిసి దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు : సాయిబాబు
 ఇక అంగన్‌వాడీల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు అన్నారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. 
అకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 
ఇక నాలుగురోజుల పాటు జరిగిన మహాసభలకు వివిధ రాష్ట్రాల నుంచి అంగన్‌వాడీలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. 

 

గ్రామాలకు కొత్త శక్తి ఇవ్వాలి : రాజ్ నాథ్ సింగ్

కృష్ణా : జిల్లాలోని ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణభారత్ ట్రస్ట్ ను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. దేశంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయకపోతే భారత్‌ శక్తివంతంగా మారదన్నారు. గ్రామాలకు కొత్త శక్తి ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. మహాత్మా గాంధీ కన్న కలను స్వర్ణభారత్‌ ట్రస్ట్ నిజం చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధిపై మోడీ సర్కార్‌ ప్రత్యేక శ్రద్ధతో ఉందని ఆయన తెలిపారు.

లోకాయుక్త విచారణకు జగన్‌ సిద్ధం కావాలి : గాలిముద్దుకృష్ణమనాయుడు

హైదరాబాద్ : వైసిపి అధ్యక్షుడు జగన్‌పై టిడిపి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఫైర్ అయ్యాడు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో రూ. 10 లక్షల కోట్ల లూటీ జరిగిందని తెలిపారు. లోకాయుక్త విచారణకు డిమాండ్ చేస్తున్న జగన్‌ అందుకు సిద్ధం కావాలన్నారు. అవినీతిపై లోకాయుక్త విచారణ చేపట్టాలని జగన్ లేఖ రాయాలని ఆయన అన్నారు. వైఎస్‌ పాలనలో 14 వేలమంది కాంగ్రెస్‌ పాలనలో 26 వేలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనిఆయన ఆరోపించారు. చంద్రబాబు పాలనల్లో రుణమాఫీతో ఆత్మహత్యలు పూర్తిగా ఆగాయిని అన్నారు.

 

లారీ బోల్తా.. ఒకరి మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని మిడ్జిల్ మండలం ముచ్చర్లపల్లి దగ్గర బోర్‌వెల్‌ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. లారీలో ఇరుక్కున్న మరో ముగ్గురు వ్యక్తులు బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. 

21:09 - January 10, 2016

అమితాబ్‌ బచ్చన్‌, ఫర్హాన్‌ అక్తర్‌లు ప్రధాన పాత్రల్లో విడుదలైన వజీర్‌ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది. శుక్రవారం తొలిరోజు ఐదున్నర కోట్లు వసూలు చేసిన వజీర్‌... రెండో రోజు 28 శాతం వృద్ధి సాధించి 7కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం దేశీయంగా మొత్తం 12కోట్ల 73 లక్షలు వసూలు చేసింది. బిజయ్‌ నంబియార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ వికలాంగ్ చెస్ ప్లేయర్‌ గా ఫర్హాన్ అక్తర్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ అధికారిగా నటించారు. 

21:04 - January 10, 2016

హైదరాబాద్‌ : నగరంలో సంక్రాతి సంబరాలు మొదలయ్యాయి. మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొంటూ బిజీగా మారిపోతున్నారు. ఓ ప్రైవేటు ఎఫ్‌ఎం రేడియో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రముఖ నటి అంజలి న్యాయ నిర్ణేతగా విచ్చేసి.. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సెలబ్రేషన్స్ ను వీడియోలో చూడొచ్చు. 

 

21:00 - January 10, 2016

హైదరాబాద్‌ : బోడుప్పల్‌లో చిట్టీల పేరుతో మోసం చేసి డబ్బులతో ఉడాయించిన వ్యాపారి ఉపేందర్‌గౌడ్‌ ఇంటిని బాధితులు ముట్టడించారు. ఉపేందర్‌గౌడ్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు బోడుప్పల్ మారుతీనగర్‌ లో ఆందోళనకు దిగారు. 3కోట్లతో నిందితుడు పారిపోయినా.. పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 

 

20:31 - January 10, 2016

గుంటూరు : జిల్లాలో మూడు రోజులపాటు జరిగిన సిపిఐ జాతీయ సమితి సమావేశాలు ఘనంగా ముగిశాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కార్యదర్శులు పాల్గోన్న ఈ సమావేశాల్లో  అనేక కీలక అంశాలను చర్చించారు. మొత్తం 6 ప్రధాన తీర్మానాలు కేంద్ర కమిటీ ప్రతిపాదించినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో వామపక్షాలు బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్ లో గెలుపు, మిగతా రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించడం వంటి అంశాలను చర్చించామని సురవరం తెలిపారు.

 

లీలాకుమార్ కేసులో మరిన్ని మోసాలు..

హైదరాబాద్: కళానికేతన్ ఎండీ లీలాకుమార్ కేసులో మరిన్ని మోసాలు బయటపడుతున్నాయి. సీసీఎస్ లో లీలాకుమార్ పై మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. 

20:04 - January 10, 2016

వరంగల్ : అడవిలో కొలువుదీరిన వనదేవతల చెంతకు గంగమ్మ పరుగుపెట్టబోతోంది.. నీటి కొరతతో ఎండిపోయిన పొలాలు పచ్చని పైర్లతో కళకళలాడబోతున్నాయి.. అటవీగ్రామాలు, గిరిజన గూడాలు సస్యశ్యామలం కాబోతున్నాయి... జంపన్న వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణానికి సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది.. 
వనదేవతల జాతరకు ప్రతిసారీ నీటి గండం
తెలంగాణ వనదేవతల జాతరకు ప్రతిసారీ నీటి గండం వెంటాడుతోంది.. సమ్మక్క, సారలమ్మ జాతర ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి బుదవారంనుంచి మొదలవుతుంది... నాలుగురోజులపాటు సాగే ఈ జాతర సమయంలో ఆలయం చుట్టుపక్కల మొత్తం జనసంద్రమైపోతుంది.. ఈ స్థాయిలో జనాలు వస్తున్నా ధర్మగుండాలు లేకపోవడంతో స్నానాలకు ఇబ్బందులు తప్పడంలేదు.. జాతర సమయంలో లక్షలాదిసంఖ్యలో వచ్చే భక్తులకు జంపన్న వాగులో నీరు ఏ మాత్రం సరిపోవడంలేదు..  
లక్నవరం సరస్సునుంచి నీటి విడుదల
సాధారణంగా జంపన్నవాగుకు లక్నవరం సరస్సునుంచి నీటి విడుదల చేస్తారు. ఈ వాగులో నీటి ప్రవాహం లక్నవరం మత్తడి నుంచి మొదలవుతుంది... తిరుమళ్ల వాగుగా కొంతదూరం నీరు ప్రయాణిస్తుంది. గుండ్లవాగు, పులుసువాగు, పెద్దవాగుల కలయికతో జంపన్నవాగుగా మారుతుంది.. సుమారు 35కిలోమీటర్ల పొడవునా జంపన్న వాగు ప్రవహిస్తుంది... జాతర సమయంలో ఇలా నీటిని విడుదల చేయడంతో అప్పటి రబీసీజన్‌లో రైతులు భారీగా నష్టపోతున్నారు.. ఇలా జరగకుండా వాగు నీటి వినియోగించుకునే విధానంకోసం అధికారులు కసరత్త చేశారు..
2014లో జాతర ఏర్పాట్లలో నిధుల దుర్వినియోగం  
మరోవైపు 2014లో జాతర ఏర్పాట్లలో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ఆరోపణలొచ్చాయి.. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ కూడా ఇది నిజమేనని తేల్చింది.. ఈసారి మళ్లీ జాతర ఏర్పాట్లకోసం నిధులు కావాలంటూ ప్రభుత్వానికి మూడు శాఖలనుంచి ప్రతిపాదనలు వెళ్లాయి.. గతసారిలా ఈఏడాది జరగకుండా సర్కారు చర్యలు చేపట్టింది.. నిధుల కేటాయింపులో శాశ్వత పనులకు ప్రాధాన్యం ఇచ్చింది.. 
ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు కేటాయింపు 
గత జాతరవరకూ జంపన్నవాగులో స్నానఘట్టాల దగ్గర తాత్కాలికంగా ఇసుకతోకూడిన బస్తాలు అడ్డుగావేసి నీటిని నిల్వ చేస్తున్నారు అధికారులు.. ఇలా చేయడంవల్ల రెండేళ్లకోసారి కొంత డబ్బు వృధా అవుతోందని ప్రభుత్వం భావించింది... చెక్‌ డ్యాం నిర్మిస్తే ఈ ఖర్చు తగ్గుతుందని అంచనాకొచ్చింది.. సాగునీటి శాఖ ప్రతిపాదనలప్రకారం జంపన్నవాగుపై తాడ్వాయి మండలంలోని రెడ్డిగూడెం, ఊరట్టం, పడిగాపూర్‌, మేడారం దగ్గర ఈ డ్యాంలు కట్టాలని నిర్ణయించింది.. రెడ్డిగూడెం, ఊరట్టం దగ్గర ఆరుకోట్ల రూపాయలు, పడిగాపూర్ దగ్గర ఏడున్నరకోట్లు మేడారం దగ్గర మూడుకోట్లతో డ్యాంలు కట్టడానికి ఇరిగేషన్ ఇంజనీర్లు ప్లాన్‌ రూపొందించారు.. దీనికి ప్రభుత్వంనుంచి ఆమోదంకూడా లభించింది.. ఈ ప్రాంతం ఏజెన్సీ పరిధిలోకి రావడంతో ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. దీనిప్రకారం ఉన్నతస్థాయి ట్రైబల్ సబ్ ప్లాన్ కమిటీ సుమారు 17 కోట్ల రూపాయల మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.. పాలనపరమైన అనుమతులు రాగానే ఈ పనులు చేపట్టేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.. 
కొత్తగా సాగులోకి రానున్న 1071 ఎకరాల ఆయకట్టు
కొత్తగా నిర్మించబోయే ఈ డ్యాంల వల్ల జంపన్నవాగులో రెడ్డిగూడెం, ఊరట్టం, పడిగాపూర్, మేడారం దగ్గర నీరు నిలువ ఉండనుంది. జాతర జరిగే సమయంలో స్నానఘట్టాల నిర్వహణకు డ్యాంల దగ్గర నిల్వ ఉన్న నీరు ఉపయోగపడుతుంది.. కేవలం భక్తులకే కాదు.. ఈ డ్యాంలతో రైతులకూ చాలా మేలు కలుగుతుంది.. కొత్తగా వెయ్యి 71 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది.. రెడ్డిగూడెం చెక్‌డ్యాం ద్వారా 170, ఊరట్టం చెక్‌డ్యాం ద్వారా 358, పడిగాపూర్ చెక్‌డ్యాం ద్వారా 363, మేడారం చెక్‌డ్యాం ద్వారా 180 ఎకరాలు సాగులోకివస్తాయి. మొత్తానికి కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న డ్యాంల నిర్మాణానికి సర్కారు ఆమోదం తెలపడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. 

రేపు మెదక్‌ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట నియోజకవర్గం దుబ్బాకలో తాను చదివిన పాఠశాల నూతన భవన నిర్మాణానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. అనతరం సిద్ధిపేట నియోజకవర్గం అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

 

ప్రతొక్కరికీ చంద్రన్న కానుక : పరిటాల సునీత

హైదరాబాద్ : పౌరసరఫరాలశాఖ అధికారులతో మంత్రి పరిటాల సునీత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్రాంతిలోగా ప్రతి ఒక్కరికీ చంద్రన్న కానుక అందేలా చర్యలు తీసుకోవాలని సునీత అధికారులను ఆదేశించింది. సంక్రాంతి చంద్రన్న కానుక 60 లక్షల మందికి అందాలన్నారు.

 

సీఐఐ సదస్సు తొలిరోజు విజయవంతం : పరకాల

విశాఖ : సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజు విజయవంతం అయిందని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. వచ్చే సారి కూడా సీఐఐ సదస్సును విశాఖలోనే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో లక్షలాది నిరుద్యోగులకు పని దొరకుందన్నారు. 

19:18 - January 10, 2016

విశాఖ : ఏపీలో వ్యాపార అనుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. విభజన తరువాత ఏపీ స్వరూపం మారిందని.. ఇక్కడ వ్యాపార అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. వ్యాపార అవకాశాలు పెరిగితే పెట్టుబడులు వస్తాయని జైట్లీ గుర్తు చేశారు. రెవెన్యూ లోటు ఉన్న ఏపీ 11 శాతం వృద్ధి సాధించిందని చెప్పారు. 

 

ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

నల్గొండ : జిల్లాలోని చివ్వెమ్ల మండలం ఐలాపురం వద్ద రోడ్డు దాటుతున్న ఓ మహిళను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

18:21 - January 10, 2016

హైదరాబాద్ : గ్రేటర్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. వివిధ డివిజన్లకు మంత్రులను, ఎమ్మెల్యేలను, జడ్పీ చైర్మన్‌లను ఇంచార్జీగా నియమించారు. గులాబీ నేతలు ఆల్వాల్‌ డివిజన్‌ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. గ్రేటర్ లో గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు టీఆర్ ఎస్ ను విమర్శించడం తగదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మంచినీరు వంటి హామీలు కొత్తగా ఇచ్చిన హామీలు కాదని.. ఎన్నికల ముందే ఇచ్చామని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 

18:08 - January 10, 2016

హైదరాబాద్ : అంగన్‌వాడీలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం యత్నిస్తుందని ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ నూతన జాతీయ అధ్యక్షురాలు ఉషారాణి అన్నారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ భవిష్యత్‌లో భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. లబ్ధిదారులతో కలిసి పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు ఉషారాణి. 

 

18:01 - January 10, 2016

హైదరాబాద్ : అంగన్‌వాడీల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు అన్నారు. ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేసిన అంగన్ వాడీల బహిరంగసభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని సాయిబాబు హెచ్చరించారు. 

 

17:56 - January 10, 2016

విశాఖ : ఎపిలో అపారమైన సహజ వనరులున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఎపి ప్రభుత్వ సీఐఐ పార్ట్నర్ షిప్ సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని వనరులున్నాయన్నారు. ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయమని పేర్కొన్నారు. పరిశ్రమలకు 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తామని పెట్టుబడిదారులకు మాటిస్తున్నామని పేర్కొన్నారు. దక్షిణాదిలో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రం ఎపియే అని తెలిపారు. 2022 కల్లా అగ్ర రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా నిలుపుతామని హామీ ఇచ్చారు. ఆర్థికంగానే కాదు, ఆనందమయ జీవనానికి కేంద్రంగా రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుతామని పునరుద్ఘాటించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విశాఖ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సీఐఐతో ప్రభుత్వానికి సత్సంబంధాలున్నాయని తెలిపారు.
 

17:45 - January 10, 2016

హైదరాబాద్: ఐసీడీఎస్‌లను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని సీఐటీయూ జాతీయ కార్యదర్శి హేమలత అన్నారు. అంగన్‌వాడీల 8వ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా భవిష్యత్‌లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఈ ఉద్యమంలో లబ్ధిదారులను కూడా కలుపుకుపోతామన్నారు. 

 

17:41 - January 10, 2016

హైదరాబాద్ : సమాజంలో వెనకబడిన వాళ్ల అభివృద్ధి కోసం అంబేద్కర్‌ రిజర్వేషన్లను పొందుపరిచారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. 'ప్రైవేట్‌, ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లు' అనే అంశంపై హైదరాబాద్‌లో జాతీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దత్తాత్రేయ హాజరై మాట్లాడారు. మరోవైపు ప్రైవేట్‌ రంగంలో కూడా రిజర్వేషన్లు తప్పకుండా ఉండాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలను సీఎం దగ్గరకు తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ హామీ ఇచ్చారు. 

17:29 - January 10, 2016

విశాఖపట్నం : విశాఖలో భాగస్వామ్య సదస్సు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఈ సదస్సును ప్రారంభించారు. అనంతరం ఏపీ పెవిలియన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి జైట్లీ పరిశీలించారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సదస్సుకు హాజరయ్యారు. నేటి నుంచి ఈ నెల 12 వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన 1500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.

 

17:02 - January 10, 2016

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ఆడిట్ అండ్‌ అకౌంట్స్ ఉద్యోగ సంఘాల జాతీయ సదస్సు హైదరాబాద్‌లో జరిగింది. ఏడో  పే కమిషన్ సిఫార్సులను సవరించి మూలవేతనం ఇవ్వాలని, ఇంక్రిమెంట్లు పెంచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై కార్యాచరణకు సిద్ధమవుతున్నమని ఉద్యోగులు తెలిపారు. ఈ జాతీయ సెమినార్ లో ప్రధాన వక్తగా ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె. వేణుగోపాల్ పాల్గొన్నారు.

16:51 - January 10, 2016

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 3 కిలోల 450 గ్రామల బంగారాన్ని  అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొంత బంగారం విమానం సీట్ కింద ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. 

 

16:43 - January 10, 2016

వరంగల్ : ఏటూరునాగారం ఏజెన్సీ అడవుల్లో పోలీసులు కూంబంగ్ నిర్వహించారు. గాలింపులో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించడం లేదు. 

 

16:35 - January 10, 2016

కృష్ణా : విజయవాడలో 10 టీవీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బుద్దా నాగేశ్వరరావు, బీజేపీ కార్పొరేటర్‌ ఉత్తమ్‌చంద్‌ బండారీ ఆవిష్కరించారు. సమాజంలో జరిగే అవినీతి, అక్రమాలను వెలికితీయడంలో 10టీవీ ప్రధాన పాత్ర పోషిస్తుందని పలువురు కొనియాడారు. 10టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు. 

మంత్రి నారాయణకు సీపీఎం ఎపి రాష్ట్ర కమిటీ లేఖ

విజయవాడ : ఎపి మంత్రి నారాయణకు సీపీఎం ఎపి రాష్ట్ర కమిటీ లేఖ రాసింది. నగరపాలక సంస్థల్లో పారిశుద్ధ్య కార్మికులను తొలగించేందుకు జారీ చేసిన జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థల్లో దళితులు, మహిళలలే అధికంగా ఉన్నారని.. వారి ఉపాధిని దెబ్బతీయడం తగదని హితవుపలికారు. అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు... వచ్చాక ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

 

ఏటూరునాగారంల్లో పోలీసుల కూంబంగ్

వరంగల్ : ఏటూరునాగారం ఏజెన్సీ అడవుల్లో పోలీసులు కూంబంగ్ నిర్వహించారు. గాలింపులో ఇద్దరు మావోయిస్టులను పట్టుకున్నారు. వీరి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. 

అంగన్ వాడీల బహిరంగసభ ప్రారంభం

హైదరాబాద్: నగరంలోని ఇందిరాపార్క్ వద్ద అంగన్ వాడీల బహిరంగసభ ప్రారంభం అయింది. ఈ సభలో సీఐటీయూ, అంగన్ వాడీ నేతలు హేమలత, సిందు, సాయిబాబు పాల్గొన్నారు.  

ఎపి ప్రభుత్వ పార్ట్‌ నర్ షిప్ సమిట్ ప్రారంభం

విశాఖ : విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పార్ట్‌ నర్ షిప్ సమిట్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు.

 

15:49 - January 10, 2016

హైదరాబాద్ : చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోవడంతో ఓ యువకుడు అపార్ట్‌మెంట్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. కూకట్‌పల్లిలోని ఇమావి స్వాన్‌ అపార్ట్‌మెంట్స్‌లో శ్రీనివాస్‌ అనే వ్యక్తి కాంట్రాక్ట్‌ పద్ధతిపై పనులు చేశాడు. చేసిన పనులకు లక్షా యాభైవేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే పనులు చేయించుకున్న అపార్ట్‌మెంట్‌ యాజమాన్యం డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఇమామి టవర్స్‌ ఎక్కి డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. 

15:35 - January 10, 2016

చిత్తూరు: తిరుమల రెండో ఘాట్‌ రోడ్డుపై ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. బస్సును కార్‌ డ్రైవర్‌ ఓవర్‌టేక్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. బస్సు, కారు రెండూ రోడ్డుకు అడ్డుగా నిలిచిపోవడంతో అక్కడ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగింది. గంటసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

 

15:32 - January 10, 2016

ప్రకాశం : ఎస్‌ఐ చిత్ర హింసలతో ఓ అమాయకుడు గాయాలపాలయ్యాడు. ఎస్‌ఐతీరుతో ఆగ్రహించిన సీపీఎం కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పొంగులూరు మండలం రేలంగివరంలో జరిగింది. కోటపాడుకుచెందిన ఎస్సీ కాలనీలో ఇద్దరు యువకులు గొడవపడ్డారు. ఇద్దరూ ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పెద్దలదగ్గర రాజీ కుదుర్చుకొని ఈ విషయాన్ని పోలీసులకు చెప్పేందుకు వెళ్లారు. అయితే ఈ కేసులో రాజీ లేదంటూ ఓ యువకున్ని పోలీసులు తీసుకువెళ్లారు. రెండో యువకున్ని చితకబాదారు. ఈ విషయంపై ప్రశ్నించిన తిరుపాల్‌ను కొట్టారు. పేపర్‌పై సంతకం తీసుకొని అతన్ని వదిలేశారు. తీవ్ర గాయాలపాలైన తిరుపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

 

15:24 - January 10, 2016

ఖమ్మం : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పులబాధ భరించలేక ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చింతకాని మండలం కొదుమూరు గ్రామానికి చెందిన అన్నంగారు శ్రీనివాసరావు తన మూడెకరాల్లో పత్తి వేశాడు.. పంట పూర్తిగా నష్టపోవడంతో మళ్లీ మిర్చి పంట వేశాడు.. ఆ పంటకు కూడా పురుగు రావడంతో ఆర్థికంగా చితికిపోయాడు.. అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందాడు... ఇవాళ తన పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు..

15:14 - January 10, 2016

హైదరాబాద్ : అంగన్ వాడీల జాతీయ మహాసభలు ముగిశాయి. సుందరయ్యపార్కు నుంచి ఇందిరాపార్క్ వరకు అంగన్ వాడీలు భారీ ప్రదర్శనగా వెళ్తున్నారు. ప్రదర్శన అగ్రభాగాన జాతీయ ప్రధాన కార్యదర్శి సింధు, జాతీయ నేతలు ఉన్నారు. అంగన్ వాడీల నినాదాలు హోరెత్తాయి. కాపేపట్లో ఇందిరాపార్కు వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. సింధుతోపాటు పలువురు జాతీయ నేతలు ప్రసంగించనున్నారు. ఈనెల 7 నుంచి 10 వరకు హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో అంగన్ వాడీల 8 జాతీయ మహాసభలు జరిగాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అంగన్ వాడీ కార్యకర్తలు మహాసభలకు హాజరయ్యారు. పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. 

 

ముగిసిన అంగన్ వాడీల జాతీయ మహాసభలు

హైదరాబాద్ : అంగన్ వాడీల జాతీయ మహాసభలు ముగిశాయి. సుందరయ్యపార్కు నుంచి ఇందిరాపార్క్ వరకు అంగన్ వాడీ కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. కాపేపట్లో ఇందిరాపార్కు వద్ద బహిరంగ సభ జరుగనుంది. ఈనెల 7 నుంచి 10 వరకు హైదరాబాద్ లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో నాలుగు రోజులపాటు అంగన్ వాడీల మహాసభలు జరిగాయి. 

ఢిల్లీలో ముగ్గురి హత్య...

 ఢిల్లీ: హస్తినలో ఒకే కుటుంబంలో ముగ్గురు హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇంటి పనిమనిషి  ఇంట్లోకి  వెళ్లి చూసేసరికి యజమానురాలు, ఆమె కుమారుడు నిర్జీవంగా పడి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా సంజీవ్‌ మృతదేహం కప్‌బోర్డులో లభ్యమైంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

కూకట్ పల్లిలో ఓ వ్యక్తి హల్ చల్

హైదరాబాద్ : కూకట్ పల్లిలో వ్యక్తి హల్ చల్ చేశాడు. కాంట్రాక్టర్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈమామి టవర్స్ పైకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. ఈమామి యాజమాన్యం బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తున్నాడు.

13:30 - January 10, 2016

హైదరాబాద్ : గుంటూరులో సీపీఐ నేతలకు ఎంపీ రాయపాటి అల్పాహార విందు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుథాకర్ రెడ్డి, నారాయణ పాల్గొన్నారు. సురవరం తనకు చిరకాల మిత్రుడని సీపీఐ నేతలు రాష్ట్ర అభివృద్దిలో భాగంకావాలని, భవిష్యత్ లో టీడీపీ తో కలిసి పనిచేయాలని వారినికోరానని ఎంపీ రాయపాటి తెలిపారు. సీపీఐ సీపీఎం నేతలు తక్కువగా ఉన్నా.. ఒక్కో నేతల 100 మందితో సమానమన్నారు రాయపాటి. 

13:28 - January 10, 2016

హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న పరిపాలన దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు మంత్రి తలసాని . గత ప్రభుత్వాలు కరెంట్ విషయంలో అన్యాయం చేశాయని. రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు ఉండవని, కోతలులేని కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అన్నారు మంత్రి తలసాని. ఎన్నికల సమీపిస్తుండడంతోనే అధికార పార్టీ అభివృద్ది పనులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అంటున్న నేతలు వారిపాలనలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ముమ్మాటికి రాష్ట్ర అభివృద్ది టీఆర్ఎస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.    

అంగన్ వాడీల జాతీయ కార్యదర్శిగా ఏఆర్ సింధు ఎన్నిక

హైదరాబాద్ : అంగన్ వాడీ జాతీయ మహాసభల్లో 72 మందితో నూతన కమిటీ ఎన్నిక అయ్యింది. అధ్యక్షురాలుగా ఉషారాణి, ప్రధాన కార్యదర్శిగా ఏఆర్ సింధు ఎన్నికయ్యారు.

హైదరాబాద్ అభివృద్ధికి సీఎం కృషి : తలసాని

హైదరాబాద్ : నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విద్యుత్, మంచినీటికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామన్నారు.

విశాఖకు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు

విశాఖ : సమ్మిట్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనేందుకు విశాఖకు చేరుకున్నారు. ఈ సదస్సు 41 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. పెట్టుబడులే ప్రధాన అంశంగా సిఐఐ, ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది.

12:56 - January 10, 2016

అనంతపురం : మడకశిర ఎమ్మార్వో కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది.. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ఆఫీసులోని కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, ఫర్నిచర్‌, జన్మభూమి కార్యక్రమానికి సంబంధించిన పత్రాలన్ని కాలి బూడిదయ్యాయి.. రాత్రి వాచ్‌మెన్‌ విధుల్లోకి రాకపోవడంతో మంటలను ఎవ్వరూ గుర్తించలేదు.. 

12:55 - January 10, 2016

హైదరాబాద్ : టీడీపీ యువనేత లోకేశ్ ట్విట్టర్‌ వేదికగా మరోసారి టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత గులాబీ పార్టీ అసలురూపం బయటకొచ్చిందని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.. సెటిలర్ల విషయంలో ఆ పార్టీ అవలంభిస్తున్న రెండు నాల్కల ధోరణి తేటతెల్లమైందని స్పష్టం చేశారు.. గతంలో సెటిలర్ల ఓట్ల విషయంలో రాద్ధాంతంచేసే గులాబీదళం... ఇప్పుడు ఓట్లు రాబట్టుకునేందుకు సానుభూతి ప్రదర్శిస్తోందని ట్వీట్ చేశారు.. దీనికి హైదరాబాద్‌ బర్బాద్‌ అన్న ట్యాగ్‌ జోడించారు.. 

12:53 - January 10, 2016

విజయవాడ :జియో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసం అవసరమని, ఉల్లాసంగా మారథాన్ లో గేమ్స్ లో పాల్గొనే వారికి ఆయుష్షు పెరుగుతుందని ఉత్సాహపరిచారు. పలువురు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ మారథాన్ లో యువకులతో పాటు 60 ఏళ్ల వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి రోజు ఏపీలో ఏదో ఒక చోట మారథాన్ నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రోత్సాహం అందిస్తామని సీఎం బాబు తెలిపారు.   

12:52 - January 10, 2016

ఏలూరు : ఏపీలో కోడి పందాలు ఆడడంపై హైకోర్టు నిషేధం విధించింది. దీనిపై పశ్చిమగోదావరి జిల్లా నేతలు, ఎంపీలు కోడి పందాలు సాంప్రదాయమైన పండుగలో భాగమేనని కోర్టు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లా ఎంపీ మాగంటి బాబు, మంత్రి పీతల సుజాత కోడి పందాలు కోర్టు పరిధి ఆదేశాలకు అనుగుణంగానే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు 

12:50 - January 10, 2016

హైదరాబాద్ : కర్నూలు సీఎస్‌ఐ చర్చిలోసైకో భీభత్సం సృష్టించాడు.. మహిళపై సుత్తితో దాడిచేశాడు.. ఈ దాడిలో గాయపడ్డ హిమబిందు పరిస్థితి విషమంగా ఉంది.. 

12:49 - January 10, 2016

హైదరాబాద్ : అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. పుట్టపర్తి మండలం కంబాలపల్లిలో వరుసగా మూడోసారి ఆడపిల్ల పుట్టిందనే నేపంతో ఏడాది చిన్నారిని చెరువులో పడేసింది తల్లి. దీంతో చిన్నారి మృతి చెందింది.ఇది ఇలా ఉండగా బిడ్డకు అనారోగ్యం ఉండడంతోనే పడేశానంటోంది తల్లి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. 

12:47 - January 10, 2016

హైదరాబాద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర భారత సంగ్రామంలో ముందుండి నడిచిన వ్యక్తి కాదు అతీత శక్తి. ఈయన మరణం వెనక రహస్యం ఇదే అంటూ బ్రిటన్ వెబ్ సైట్ చెప్పే ప్రయత్నం చేసింది. విమాన ప్రమాదం సంభవించినప్పుడు ప్రత్యక్షంగా ఉన్న వారి సంభాషణలు తదితర వివరాలను వెబ్ సైట్ లో ఉంచింది.

మొదటగా వియత్నాంలోని టౌరేన్ లో నేతాజీ

మొదటగా వియత్నాంలోని టౌరేన్ నుంచి నేతాజీ తో పాటు 12 , 13 మంది ఇతర ప్రయాణికులు సిబ్బందితో జపాన్ కు చెందిన విమానం బయలుదేరిందని తెలిపారు. జపాన్ సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ సునమస షిదే కూడా అందులో ప్రయాణిస్తున్నారు. సాయంత్రం లోగా తైపీకి చేరుకోవాలని పైలట్ భావించాడని నేతాజీపై భారత్ నియమించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ తెలిపారని వెబ్ సైట్ తెలిపింది.

పనిచేయని విమానం ఎడమ ఇంజిన్..

అదే సమయంలో విమానం ఎడమ ఇంజిన్ సరిగా పనిచేయడం లేదని గమనించిన ఎయిర్ పోర్టు అధికారులు..బాగానే ఉందని దృవీకరించి సిగ్నల్ ఇచ్చారని జపాన్ ఎయిర్ స్టాఫ్ అధికారి మేజర్ టరొ కొనొ తెలిపారని పేర్కొంది వెబ్ సైట్ . విమానం బయలు దేరిన కొద్ది సేపటికే పెద్ద శబ్దంతో ఎడమ ఇంజన్ విమానం నుండి ఊడిపోయి మంటలు చెలరేగాయని విమానాశ్రయ నిర్వహణ ఇంజనీరు కెప్టెన్ నకమురా అలియాస్ యమమోటో తెలిపినట్లు పేర్కొంది.

విమానం వెనక నుండి మంటలు …………….

నేతాజీ తనవైపు వచ్చి.. విమానం వెనక నుండి వెళ్లలేమని అక్కడ అంతా సామాగ్రితో నిండిపోయిందని చెప్పానని అంతలోనే మంటలు నేతాజీకి అంటుకున్నాయని తెలిపాడు బోస్ అనుచరుడు. నావి ఉన్ని దుస్తులు కనుక తనకు మంటలు అంటుకోలేదని నేతాజీవి ఖాదీ దుస్తులు కనుక మంటలు అంటుకుని నేతాజీ వెంట్రుకలు ముఖం బాగా కాలిపోయాయని నేతాజీ అనుచరుడు హబిబ్ ఉర్ రెహమాన్ తెలిపినట్లు వెబ్ సైట్ తెలిపింది. బాగా గాయపడిన నేతాజీని నాన్ మన్ సైనిక ఆసుపత్రికి తరలించామని , ఈ ఘటనపై ఆరా తీయడానికి ఇద్దరు బ్రిటీష్ అధికారులు వచ్చారని రెహమాన్ తెలిపినట్లు వెబ్ సైట్ తెలిపింది. ఇందులో ఎంత వైరుద్యం ఉన్నప్పటికి నిజం ఎంత అంత తేలాల్సి ఉంది.

బోస్ కాలిపోతూనే చివరిగా ….

బోస్ కాలిపోతూనే చివరిగా నువ్వు భారత్ వెళ్లినప్పుడు దేశంకోసం చివరి వరకు పోరాడానని చెప్పమని, నా దేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పారని తెలిపింది. భారత్ ను ఎవరూ బంధీగా ఉంచలేరని అన్నట్లుగా తన స్వాతంత్రకాంక్షను వెలిబుచ్చారని తెలిపింది బ్రిటీష్ వెబ్ సైట్. మరి అ తర్వాత బోస్ ఏమయ్యారు అనేది తెలుపలేదు. మరి ఇదంతా నిజంగా జరిగిందా అనే దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

12:44 - January 10, 2016

హైదరాబాద్ : భారతీయ సాహిత్యంలో ఎంతో వైవిద్యం, వైరుధ్యం ఉంది. అయితే అస్థితత్వ ఉద్యమాల నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి కవులు, రచయితలు వచ్చారు. ప్రపంచ సాహితీ పరిచయంతో వస్తు శిల్పాల్లో ఊహించని మార్పులు వచ్చాయి. రచయితలు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుని గుర్తింపు పొందారు. అలాంటి వారిలో బుకర్ ప్రైజ్ అందుకున్న అరవింద్ అడిగా ఒకరు. 2008లో బుకర్ ప్రైజ్ అందుకున్న అరవింద్ అడిగా పై ప్రత్యేక కథనంతో పాటు స్ర్తీ వాద కవయిత్రి మంజరపు హైమావతి ప్రత్యేకథనం, విజయవాడ పుస్తక మహోత్సవ వివరాలు, వివిధ సాహితీ వేడుకల విశేషాలతో ఈ వారం మీ ముందుకు వచ్చింది 'టెన్ టివి' అక్షరం. ఆ వివరాలను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:16 - January 10, 2016

హైదరాబాద్ : గ్లామర్ ఇండస్ర్టీకి చిరంజీవి సెకండ్ డాటర్ శ్రీజ వస్తోందా? అవుననే అంటున్నారు సినీ లవర్స్. శ్రీజ అంతా ప్లాన్ ప్రకారమే వెళ్తోందని, నిన్న ఫారెన్ యూనివర్సిటీ మాస్టర్ డిగ్రీ పట్టా పుచ్చుకోగా, ఇప్పుడేమో బెల్లీ డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటోందని చెబుతున్నారు. ఏదో కాలక్షేపం కోసమైతే ఎవరో ఒకరి దగ్గర ఈ డాన్స్ ప్రాక్టీస్ చేసేదని, టాలెంట్ షో, ఫేమస్ కొరియోగ్రాఫర్ మెహర్ మాలిక్ వద్ద శ్రీజ ట్రైనింగ్ తీసుకుంటోందట. దీంతో ఈ విషయం హాట్‌ టాపిక్ అయింది. దీంతో శ్రీజ.. బుల్లితెర లేదా వెండితెరపైనే స్కెచ్ వేసి వుండవచ్చనని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే నాగబాబు కూతురు నిహారిక సినిమాల్లో నటిస్తోంది. ఆ దారిలోనే చిరంజీవి సెకండ్ డాటర్ శ్రీజ వెళ్లవచ్చని అంటున్నారు. ఈ వ్యవహారంపై ఇటు మెగాక్యాంప్ నుంచిగానీ, అటు చిరు అభిమానుల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.

12:09 - January 10, 2016

హైదరాబాద్ : జనవరి 13న విడుదల కానున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో 'మా మనోభావాలను కించపరిచే కొన్ని సన్నివేశాలున్నాయని, అవి తొలగించకపోతే మా ఆందోళన మరింత ఉదృతం చేస్తామని ఓ మతానికి చెందిన వారు భారీ ర్యాలీ నిర్వహించి, పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశారు'. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ వెంటనే స్పందించి వారికి తమ క్షమాపణలు తెలిపారు. అంతేకాదు ఆ పోస్టర్‌ను పూర్తిగా మార్చి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చిత్రంలో కూడా అలాంటి సన్నివేశాలేమి లేకుండా చేసాము అంటూ యూనిట్ తెలిపింది. మేము ఏ మతాన్ని కించపరచాలనుకోలేదని, అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు మా క్షమాపణలు తెలియజేస్తున్నామంటూ చిత్ర బృందం పేర్కొంది.

సిపిఐ నేతలకు రాయపాటి విందు..

గుంటూరు :సీపీఐ పార్టీ ముఖ్య నేతలకు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆదివారం అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్బంగా రాయపాటి మాట్లాడుతూ... భవిష్యత్‌లో సీపీఐతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని, కలిసి పనిచేయడంపై సీపీఐ నేతలు ఆలోచించి చెబుతామన్నారన్నారు. సీపీఐకి క్యాడర్‌ బాగానే ఉందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదన్నారు. కాగా... సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... రాయపాటి కాలేజీ మిత్రుడు, పార్లమెంట్‌ సహచరుడన్నారు. అయితే... బీజేపీతో కలిసి ఉన్నంత కాలం టీడీపీతో కలిసే ప్రసక్తే లేదన్నారు.

లక్కవరంలో ఏటీఎంలో చోరికి విఫలయత్నం...

తూ.గో :ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో ఏటీఎంలో ఉన్న సీసీ కెమరాలతోపాటు పరికరాలు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా లక్కవరం సెంటర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బెల్లంపల్లిలో 60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత...

ఆదిలాబాద్ : అక్రమంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్న 60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. కాజిపేట నుంచి బల్లార్షా వెళ్తున్న రైలులో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, రైల్వే పోలీసులు.. 60 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సంక్రాంతి సంబరాలకు జిల్లాకు కోటి రూపాయలు..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలకు ప్రతి జిల్లాకు కోటి రూపాయలు చొప్పున విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆదివారం ఉదయం ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు.. అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలకు విడుదల చేసే కోటి రూపాయల నిధులను జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సంక్రాంతి సంబరాలకు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.

జన్మభూమి పై ఏపీ సీఎం టెలీకాన్ఫరెన్స్

హైదరాబాద్ : జన్మభూమి- మావూరు కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...కడప జిల్లాలో జన్మభూమి పర్యటన అనుభవాలను సీఎం వివరించారు. గ్రామం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో ప్రజలు జన్మభూమికి వస్తున్నారన్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని, ప్రజల్లో ఉన్న ఆకాంక్షను అధికారులు, ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు.

ఉచిత వైఫై సేవలను ప్రారంభించిన ఏపీ సీఎం

కృష్ణా : విజయవాడలోని ఎంజీరోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జియో హైస్పీడ్‌ ఉచిత వైఫై సేవలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

చిత్రకారుడు పిఆర్ రాజు కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు పీఆర్ రాజు ఇకలేరు. ఆయన ఇవాళ కన్నుమూశారు. రాజు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాజు అంత్యక్రియలను రేపు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

10:28 - January 10, 2016

చెన్నై: మధురైలో మంత్రి సెల్వరాజ్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో మంత్రి కార్యాలయం దగ్ధం అయ్యింది. దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రాజకీయ కక్ష ల వల్లే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది.

10:25 - January 10, 2016

సికింద్రాబాద్‌ : చిలకలగూడ ప్రాంతంలో గత అర్థరాత్రి పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ ఇన్ సర్చ్ నిర్వహించారు. దూద్‌బావి ప్రాంతంలో నిర్వహించిన ఈ తనిఖీల ద్వారా సరైన పత్రాలు లేని ఏడు వాహనాలు స్వాధీనం చేసుకుని నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 250 మంది పోలీసులు ప్రతి ఇంటిని తనిఖీ చేసి గృహ యజమానులకు సంబంధించిన సమాచారంపై ఆరాతీశారు. ఈ ప్రాంతంలో ఇటీవల సెల్‌ఫోన్‌ దుకాణంలో భారీ దొంగతనం జరిగిన దృష్ట్యా... బిహార్‌ ముఠా హస్తం ఉందన్న ముందస్తు సమాచారం మేరకు ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించినట్లు ఉత్తర మండలం డీసీపీ కార్తికేయరెడ్డి తెలిపారు.

10:24 - January 10, 2016

తిరుపతి : తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీనటుడు సాయికుమార్‌, సినీ గాయకులు మనో, సునీత, వందేమాతరం శ్రీనివాస్‌ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులకు తితిదే అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

10:23 - January 10, 2016

హైదరాబాద్ : బల్దియాలో ఎన్నికల నగారా మోగింది. అధికార, ప్రతిపక్షాలు పరస్పర విమర్శనాస్త్రాలతో ఎన్నికల రణరంగంలోకి దూకుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ ఎంసీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? ఈ ఎన్నికల్లో ఏఏ అంశాలపై దృష్టి సారించాలి ? వివిధ రాజకీయ పక్షాలు ఈ ఎన్నికల సందర్భంగా ఏఏ అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది? ఈ ఎన్నికలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది ఇత్యాది అంశాలపై 'ఫర్ ది పీపుల్' కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘువులు విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

09:22 - January 10, 2016

విజయవాడ : నగరంలో అమరావతి మారధాన్ రన్‌ ఘనంగా ప్రారంభమైంది. ఈ రన్‌ను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానం నుంచి రన్‌ ప్రారంభమైంది. ఈ రన్ వల్ల విజయవాడ బెంజ్‌సర్కిల్‌ నుంచి ప్రకాశం బ్యారేజ్‌ వరకు ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. అలాగే పశువుల ఆస్పత్రి, కంట్రోల్‌ వరకు పూర్తిగా వాహనాల రాకపోకలను నిషేధించారు. కాగా... నగరంలో ఉదయం 10 గంటల వరకు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఈ రన్ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, డీజీపీ రాముడు, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, గాయని స్మిత తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు..

తిరుపతి : తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సినీనటుడు సాయికుమార్‌, సినీ గాయకులు మనో, సునీత, వందేమాతరం శ్రీనివాస్‌ తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులకు తితిదే అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆర్జేడీ చీఫ్ గా లాలూ ఏకగ్రీవం

హైదరాబాద్: వరుసగా తొమ్మిదో సారి ఆర్జేడీ చీఫ్ గా లాలూ ప్రసాద్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 17న లాంఛనంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టి 2019 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. 

ఎంపీ కవితకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం..

హైదరాబాద్ :నిజామాబాద్ ఎంపీ కవితకు రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్‌ప్రూఫ్ వాహనం సమకూర్చింది. భద్రతా కారణాల రీత్యానే కవితకు ఈ వాహనం కేటాయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో నక్సల్స్ కదలికలు ఎక్కువకావడం, పైగా ఆమెకు వారి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలనుంచి సమాచారం రావడంతో ఆమె భద్రతను అధికారులు సమీక్షించారు. కవిత సీఎం కుమార్తె.., పార్లమెంటు సభ్యురాలు కూడా కావడంతో సెక్యూరిటీ విభాగం భద్రతను కట్టుదిట్టం చేసింది.

శేషాచలం అడవుల్లో పోలీసులు కూబింగ్...

తిరుపతి : శేషాచలం అడవుల్లో పోలీసులు పెద్దఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధమే లక్ష్యంగా ఈ కూంబింగ్ జరుగుతోంది. సమీపంలోగల తమిళనాడుకు చెందిన పలువురు కూలీలు ఇప్పటికే పెద్దఎతున ఎర్రచందనాన్ని స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు. ఇంకా... స్మగ్లింగ్ జరుగుతూనే ఉండగా పోలీసులు దీనిపై దృష్టిసారించి కూంబింగ్ లు నిర్వహిస్తున్నారు. కాగా... ఆదివారం ఉదయం జరిపిన కూంబింగ్‌లో 40 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నామని, ఈ సందర్బంగా ఓ లారీ, కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని అర్బన్ ఎస్పీ గోపినాథ్ తెలిపారు.

మధురైలో మంత్రి సెల్వరాజ్ కార్యాలయలంపై పెట్రోల్ బాంబు దాడి

చెన్నై: మధురైలో మంత్రి సెల్వరాజ్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో మంత్రి కార్యాలయం దగ్ధం అయ్యింది. దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

08:24 - January 10, 2016

హైదరాబాద్ : అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 22 మంది తెలుగు విద్యార్థులు ఆదివారం ఉదయం చేరుకున్నారు. ఈ సందర్బంగా న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో బేడీలు వేసి తమను బంధించారని విద్యార్థులు తెలిపారు. అంతేగాక శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా యాజమాన్యం కూడా తమను 8 గంటల పాటు నిర్బంధించిందని విద్యార్థులు వాపోయారు. కాగా... అదే సమయంలో ఎయిర్‌పోర్టుకు వచ్చిన తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీని విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. అనంతరం మహమూద్‌ అలీ చొరవ తీసుకుని ఎయిర్ ఇండియా యాజమాన్యంతో మాట్లాడడంతో విద్యార్థులను విడిచిపెట్టారు.

08:22 - January 10, 2016

కృష్ణా : విజయవాడ కల్తీ మద్యం కేసు మల్లాది విష్ణు అరెస్ట్ వ్యవహారం కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టింది.. పీసీసీ అధ్యక్షుడు రఘువీరాకు చేదు అనుభవం ఎదురయ్యేలా చేసింది.. విజయవాడ ఆంధ్రభవన్‌కువచ్చిన రఘువీరా, రామచంద్రయ్యను పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.. విష్ణు అరెస్ట్‌పై ఎందుకు మాట్లాడటంలేదని వారిని నిలదీశారు.. విష్ణును పార్టీనుంచి సస్పెండ్ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.. ఈ అంశంపై పార్టీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.. పార్టీ కార్యాలయానికి తలుపులువేసి నిరసన తెలిపారు.. మల్లాది విష్ణును జైలులో పరామర్శించాక.. ఈ విషయంపై స్పష్టత ఇస్తానని పీసీసీ చీఫ్ హామీ ఇవ్వడంతో శాంతించారు..

మల్లాది విష్ణును పరామర్శించిన రఘువీరా, కేవీపీ, ఎమ్మెల్సీ రామచంద్రయ్య.....

ఆ తర్వాత బెజవాడ జిల్లా జైలులోఉన్న మల్లాది విష్ణును... రఘువీరా, కేవీపీ, ఎమ్మెల్సీ రామచంద్రయ్య పరామర్శించారు.. విష్ణుకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.. అక్కడినుంచి ఆంధ్రభవన్‌కువచ్చిన రఘువీరా... మల్లాది విష్ణు అరెస్ట్‌ను ఖండిస్తున్నామని ప్రకటించారు.. ఈ కేసుతో విష్ణుకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పారు.. స్వర్ణబార్‌లో నీళ్లు తాగినవారే చనిపోయారని.. ఆ వాటర్‌లో ప్రభుత్వం విషం కలిపిందని ఆరోపించారు.. కల్తీ మద్యం కేసులో ప్రభుత్వానికి దమ్ముంటే నివేదికలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు రఘువీరారెడ్డి.. 

డ్రంక్ అండ్ డ్రైవ్ లో 21 మంది పై కేసులు...

హైదరాబాద్ : బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 21 మందిపై కేసులు నమోదు చేశారు. ఆరు కార్లు, 15 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చిలకలగూడలో కార్డన్ సర్చ్

సికింద్రాబాద్‌ : చిలకలగూడ ప్రాంతంలో గత అర్థరాత్రి పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ ఇన్ సర్చ్ నిర్వహించారు. దూద్‌బావి ప్రాంతంలో నిర్వహించిన ఈ తనిఖీల ద్వారా సరైన పత్రాలు లేని ఏడు వాహనాలు స్వాధీనం చేసుకుని నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 250 మంది పోలీసులు ప్రతి ఇంటిని తనిఖీ చేసి గృహ యజమానులకు సంబంధించిన సమాచారంపై ఆరాతీశారు. ఈ ప్రాంతంలో ఇటీవల సెల్‌ఫోన్‌ దుకాణంలో భారీ దొంగతనం జరిగిన దృష్ట్యా... బిహార్‌ ముఠా హస్తం ఉందన్న ముందస్తు సమాచారం మేరకు ఈ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించినట్లు ఉత్తర మండలం డీసీపీ కార్తికేయరెడ్డి తెలిపారు.

మసీదులో ఇద్దరు బీహారీల హల్ చల్

హైదరాబాద్ : మసీదులో ఇద్దరు బీహారీలు హల్ చల్ సృష్టించారు. హైదరాబాద్ నగరంలోని హుమయున్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మసీదులోకి వెళ్లిన బీహారీలు నేనే ప్రవక్తనంటూ కేకలు వేస్తూ అక్కడకున్న పలువురిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు మసీదు వద్దకు చేరకుని బీహారీలను అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

విద్యార్థులను నిర్బంధించిన ఎయిర్ ఇండియా సిబ్బంది..

హైదరాబాద్ : అమెరికా నుండి 22 మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్ కు చేరుకున్నారు. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో విద్యార్థును చేతులకు సంకెళ్లు వేసి నీళ్లు కూడా ఇవ్వకుండా అధికారులు వేధింపులకు గురి చేశారని వాపోయారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విద్యార్థులను ఎయిర్ ఇండియా యాజమాన్యం 8 గంటలు ఓ గదిలో బంధించారు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బందితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో ఎయిర్ పోర్టుకు వచ్చిన తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూదద్ అలీని తల్లిదండ్రులు అడ్డుకుని తమ ఆవేదనను విన్నవించారు.

విజయవాడలో జియో మారథన్ రన్ ప్రారంభం..

విజయవాడ : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి 21 కి.మీ జియో మారథన్ ను సీపీ, సింగర్ స్మిత, ప్రారంభించారు. 10 కి.మీ రన్ ను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు 2 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 2 గంటలు పడుతుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

07:05 - January 10, 2016

హైదరాబాద్ గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ అన్ని పార్టీల్లో హీట్‌ పెంచింది.. తెలంగాణలోని మూడు జిల్లాలతో కలిసిఉన్న గ్రేటర్‌ కావడంతో పార్టీలకు ఈ ఎలక్షన్లు ప్రతిష్టాత్మకంగా మారాయి.. ఎలాగైనా గెలవా లని పార్టీలన్నీ వ్యూహాలమీద వ్యూహాలు రచిస్తున్నాయి.. మొన్నటి సాధారణ ఎన్నికలవరకూ డీలాపడ్డ కాంగ్రెస్... ఎమ్మెల్సీ గెలుపుతో కాస్త తేరుకున్నా.. అంతర్గతంగా కలవరపడుతోంది.. ఇప్పటికే గులాబీదళాన్ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్‌... గ్రేటర్‌లో పాగాకోసం పడరాని పాట్లు పడుతోంది...

గత గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు.....

అయితే గులాబీ పార్టీ స్పీడ్‌కు హస్తం ఉక్కిరిబిక్కిరైపోతోంది.. మేయర్‌ పీఠం దక్కించుకోవాలంటే గులాబీ దండుకు తగు పోటీ ఇవ్వడం ఇప్పుడు కాంగ్రెస్‌ముందున్న పెద్ద సవాల్‌.. గత గ్రేటర్‌ ఎన్నికల్లో హస్తానికి 50 సీట్లొచ్చాయి.. ఆ స్థానాల్లో విజయం సాధించినా పైచేయి సాధించినట్లవుతుందని నేతలు భావిస్తున్నారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమా? అన్న సందేహాలుకూడా పార్టీలో వ్యక్తమవుతున్నాయి.. పైకిమాత్రం విజయం తమదేనని చెబుతున్నా... లోపలమాత్రం భయం నేతలను వెంటాడుతోంది..

దూకుడు చూపలేకపోతున్నామంటూ నేతల అసంతృప్తి........

టీఆర్‌ఎస్‌కు ధీటుగా సమాధానమిస్తున్నా పూర్తిస్థాయిలో దూకుడు చూపలేకపోతున్నామన్న అసంతృప్తి నేతల్లో వ్యక్తమవుతోంది.. గులాబీ దళం ప్రచారంలో దూసుకుపోతుంటే... హస్తం నేతలు గాంధీ భవన్‌ గేటు దాటని పరిస్థితి.. సమీక్షలు, సమావేశాలంటూ సమయమంతా వృధా చేస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది.. టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలపై కాంగ్రెస్‌ నేతల విమర్శలు గులాబీ దండుకు మరింత కలిసి వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా కారు స్పీడ్‌కు హస్తం బ్రేకులు వేస్తుందా? లేదా అన్నది ఎన్నికల తర్వాతే తేలనుంది...

07:01 - January 10, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కంటే ఓ అడుగు ముందున్న గులాబీ దళం విమర్శల్లో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో..ఎక్కడా విపక్ష పార్టీలకు ఛాన్స్ ఇవ్వరాదనే యోచనలో అధికార పార్టీ నేతలున్నారు. విమర్శలను తిప్పికొడుతూనే తమదైన శైలిలో పార్టీ కీలక నేతలు ప్రతిపక్ష పార్టీల నేతలను ఇరుకున పెట్టేందుకు పావులు కదుపుతున్నారు.

పోటీ త్రిముఖమే...

ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తమ పనులను మొదలు పెట్టగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్ననేతలు మాత్రం మాటలతో గ్రేటర్ ఎన్నికల్లో హీట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో ప్రధానంగా నాలుగు పార్టీలు రంగంలో ఉన్నా..పోటీ మాత్రం త్రిముఖమే. టిఆర్ ఎస్, ఎంఐఎం లు అవగాహనతో ఎన్నికలకు సిద్ధమవుతుండగా..అధికార పార్టీతో పోటీ పడేందుకు తెలుగుదేశం, బిజెపి, కాంగ్రెస్ లు సిద్ధమవుతున్నాయి. అయితే గ్రేటర్ పరిధిలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి అంతంత మాత్రంగానే అధికార పార్టీ అంచనా వేస్తోంది.

టిడిపి-బిజేపిలను టార్గెట్‌ చేసిన గులాబీపార్టీ ....

దీంతో...తెలుగుదేశం మిత్రపక్షాలకు స్టార్ క్యాంపేయినర్ గా రంగంలోకి దిగే అవకాశం ఉన్న పవన్ కళ్యాన్ ను గులాబి నేతలు టార్గెట్ చేస్తున్నారు. పవన్ ప్రచారంతోనే గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం లబ్ది పొందిందన్న అంచనాను అధికార పార్టీ వేస్తోంది. గ్రేటర్ పరిధిలోని నగర శివారుల్లో పెద్ద ఎత్తున సీమాంధ్ర ప్రజలు ఉండడంతో జనసేన అధినేత ప్రచారం చేస్తే..ఆ ప్రభావం ఉంటుందనే గులాబీ దళం అంచనా వేస్తోంది. దీంతో పవన్ పై ఇప్పుడే విమర్శలు మొదలు పెట్టింది టిఆర్ఎస్‌. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందుకు మేకప్ వేసుకుంటూ....అనంతరం ప్యాకప్ చెబుతాడని ఎంపీ కవిత ఎద్దేవ చేశారు. అయితే...ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న TRS కనీసం వంద స్థానాలను గెలుచుకుంటామన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.

06:58 - January 10, 2016

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేస్తోంది.

తెలంగాణలో 82 లక్షల వాహనాలు ....

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల వాహనాలున్నాయి. ఇందులో ఎక్కువ ప్రమాదాలు ద్విచక్రవాహనాలు, లారీల వల్లే జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, మితిమీరిన స్పీడ్‌, నిర్లక్ష్యంగా నడపడం, హెల్మెట్‌ ధరించకపోవడం, సీట్‌ బెల్టు పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో ఏడాదికి 8 వేల మంది మరణిస్తున్నారు. 30 వేల మంది గాయాలపాలవుతుండగా.. 20 వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో అనేకమంది రోడ్డునపడుతున్నారు.

రోడ్డు నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు....

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. రోడ్డు భద్రత నిబంధనలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించేలా చర్యలు తీసుకోబోతుంది. కార్లు, ఇతర వాహనదారులు సీట్‌ బెల్టులు ధరించేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకోసం మొదట అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. గతంలో కార్లకు నల్లటి అద్దాలు తొలగించిన తీరుగానే నెలవారీగా ట్రాఫిక్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు.

హైవేలపై ఉన్న మద్యం దుకాణాలపై దృష్టి.......

మరోవైపు హైవేలపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు.. హైవేలపై మద్యం దుకాణాల నిర్వహణపై కూడా దృష్టి సారించనున్నారు అధికారులు. అర్ధరాత్రి వరకు అమ్మకాలు జరపకుండా కఠిన వైఖరి అవలంబించాలని భావిస్తున్నారు. ఇక నగరాల్లో నిర్వహిస్తున్న విధంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. అంతేకాకుండా ప్రమాదాల నివారణ కోసం పోలీసు, ఆర్‌అండ్‌బీ, ఎక్సైజ్‌, రవాణా, విద్యాశాఖ, కమర్షియల్‌ టాక్స్‌ వంటి శాఖలను సమన్వయం చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ప్రమాదాల నివారణ కోసం ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు రవాణాశాఖ అధికారులు పర్యటన చేయనున్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

06:52 - January 10, 2016

విజయవాడ : నవ్యాంధ్ర ప్రదేశ్‌లోని తీర ప్రాంతాలను కలుపుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకి గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ సైతం సిద్ధం అయ్యింది. కోస్తాతీరం వెంబడి రూపొందించనున్న ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారనుంది.

కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం ....

శ్రీకాకుళం నుంచి శ్రీహరి కోట వరకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఏర్పాటుకు రంగం సిద్ధమయ్యింది. ఈ మేరకు కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. దీనికి డీపీఆర్‌ను ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ రూపొందించనుంది.

కోస్తాలోని తీరప్రాంతాల మధ్య పెరగనున్న కనెక్టివిటీ....

ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే ద్వారా కోస్తాలోని తీరప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే చెన్నై నుంచి కోల్‌కతా మధ్య జరిగే రవాణా వ్యవస్థకు కీలకంగా మారనుంది. అలాగే తీరప్రాంతాల్లో రవాణా వ్యవస్థ వేగవంతం అయి పారిశ్రామిక వృద్ధి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం ద్వారా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దోహదపడే అవకాశం ఉంది.

974 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌ హైవేస్...

ముఖ్యంగా కోస్తా తీరంలో 974 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌ హైవేను నిర్మించనున్నట్లు తెలిసింది. దీనికి రూ. 19 వేల 700 కోట్ల రుణాన్ని ఏషియన్ డెవలెప్‌మెంట్ బ్యాంక్ ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఈ ప్రాజెక్టు ద్వారా నూతనంగా నిర్మించనున్న నౌకాశ్రయాల అభివృద్ధికి కూడా దోహదపడే అవకాశం ఉంది. 

06:49 - January 10, 2016

హైదరాబాద్ : అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వచ్చే నెల 15న ఛలో పార్లమెంటు కార్యక్రమం చేపట్టాలని హైదరాబాద్‌లో జరుగుతున్న అంగన్‌వాడీ మహాసభల్లో నిర్ణయించారు. ఐసీడీఎస్‌ పథకానికి బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని మహాసభలు డిమాండ్‌ చేశాయి. నేడు ఇందిరాపార్క్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి అంగన్‌వాడీలు నగరానికి చేరుకుంటున్నారు.

కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలి .........

హైదరాబాద్‌లో జరుగుతున్న అంగన్‌వాడీ మహాసభల్లో శనివారం మూడో రోజు పలు కీలక నిర్ణయిలు తీసుకున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఐసీడీఎస్‌ కేంద్రాల పరిరక్షణే ధ్యేయంగా పోరాటాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. అంగన్‌వాడీలకు కనీస వేతనం చెల్లించడంతోపాటు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ మహాసభల్లో ప్రసంగించిన వ్యక్తలు డిమాండ్‌ చేశారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలని కోరారు. ఈ సమస్య పరిష్కారం కోసం వచ్చే నెల 15న ఛలో పార్లమెంటుకు పిలుపు ఇచ్చారు.

ఈనెల, వచ్చే నెలలో 300 జిల్లాల్లో ఆందోళన..........

కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు 50 శాతం నిధులు కోత విధించడాన్ని మహాసభలు తప్పుపట్టాయి. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమయ్యింది. అంగన్‌వాడీల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈనెల, వచ్చే నెలలో దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో ఆందోళన చెపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులను వినతిపత్రాలు సమర్పిస్తారు. అంగన్‌వాడీ మహాసభల సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అంగన్‌వాడీ మహాసభల్లో భాగంగా ఆదివారం సుందరయ్య పార్క్‌ నుంచి ఇందిరా పార్క్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, బహిరంగ సభ జరుపుతారు. 

06:47 - January 10, 2016

విశాఖ : ప్రతిష్టాత్మకమైన పెట్టుబడుల సదస్సుకు విశాఖ వేదిక కానుంది. నేటి నుంచి మూడు రోజులపాటు ఎపి ఇన్వెస్ట్ మెంట్ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని పరిశ్రమలశాఖ పేర్కొంది. 2లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు సర్కారు అంచనా వేస్తోంది. విశాఖలో జరిగే సదస్సుకు విదేశీ పారిశ్రామికధిపతులు, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, సహ బడా పెట్టుబడిదారులు హాజరు కానున్నారు.

నేటి నుంచి మూడు రోజులపాటు ....

ఆంధ్ర ప్రదేశ్ కు దిశా నిర్దేశం చేసే ముఖ్యమైన పెట్టుబడుల సదస్సు విశాఖలో జరుగుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేత్రుత్వంలో జరుగుతున్న అతిపెద్ద సమ్మిట్ సన్ రైజ్ ఆంద్రప్రదేశ్ కు వెన్నుదన్నుగా నిలుస్తుందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సదస్సుకు 41 దేశాలకు చెందిన ప్రతినిధులు....

ఈ సదస్సు ద్వారా ఏపి ప్రభుత్వం ఎంత వరకు పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందనేది తేలాల్సిఉంది. 41 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. పలు ఎంవోయులు సదస్సు జరిగే మూడురోజులు ఉంటాయని ఎపి పరిశ్రమల శాఖ ముఖ్య కారదర్సి ఎస్ ఎస్ రావత్ వివరించారు. 2లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా కార్యాచరణ చేసామన్నారు. ఎపి అభివృద్ధిలో ఈ సదస్సు కీలకంగా మారుతుందని వివరించారు.

 కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభోపన్యాసం....

తొలిరోజు సదస్సుకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఉపన్యాసం చేస్తారు. రిలయన్స్ ఎడిఎ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ జిఎం రావు సహ పలువురు పారిశ్రామికవేత్తలు సదస్సులో ప్రసంగించనున్నారు.

సదస్సు దృష్ట్యా భారీ భద్రత ఏర్పాట్లు...

ఇదిలా ఉంటే పెట్టుబడుల సదస్సుకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మీడియాకు కూడా ఆంక్షలు విధించారు. రోజూ సాయింత్రం ఎపి సిఎం మీడియాకు ఆ రోజు జరిగిన విశేషాలను తెలియజేయనున్నారు. ఇక మంత్రులకు వివిధ సదస్సుకు సంబంధించిన పలు బాధ్యతలను అప్పగించారు. 8మంది కేంద్ర మంత్రులు, 8మంది విదేశీ మంత్రులు కాూడా హాజరవుతున్నారు. ఇన్ ఫ్రా, ఐటీ, ఎనర్జీ, లాజిస్టిక్స్, రిటైల్, హౌసింగ్, తయారీ రంగాలు సహ మరెన్నో రంగాలకు సంబంధించి పెట్టుబడులను ఆకర్షించడానికి ఏపి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

కళానికేతన్‌పై చీటింగ్‌ కేసు నమోదు

హైదరాబాద్ : వస్త్ర వ్యాపారంలో దూసుకుపోతున్న ఓ సంస్థ యాజమాన్యంపై చీటింగ్‌ కేసు నమోదైంది. వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటానని నమ్మించి కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టాడని ఓ బాధితుడు సీసీఎస్‌ను ఆశ్రయించడంతో మోసం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు కళానికేతన్‌ ఎండీ లీలాకుమార్‌, అతని భార్య శారదలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

జమ్మూకాశ్మీర్‌లో గవర్నర్‌ పాలన.........

హైదరాబాద్ : జమ్ముకాశ్మీర్‌లో మరోసారి గవర్నర్‌ పాలన విధించారు. ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మరణంతో ఖాళీ అయిన సీఎం పీఠాన్ని అధిష్టించేందుకు ఆయన కుమార్తె, పీడీపీ అధ్యక్షురాలు మెహబుబా ముఫ్తీ మరికొంత సమయం కావాలని కోరడంతో తాజా పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఆమెకు మద్దతిచ్చే అంశంపై తర్జనభర్జనలు పడ్డ బీజేపీ ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

06:40 - January 10, 2016

హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌ సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ అకాల మరణంతో రాష్ట్రంలో గవర్నర్‌ పాలన చోటు చేసుకుంది. మూడు రోజులపాటు సంతాప దినాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సీఎం పగ్గాలు చేపట్టేందుకు పీడీపీ అధ్యక్షురాలు, ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కుమార్తె మెహబుబా ముఫ్తీ నిరాకరించారు. దీంతో జమ్మూలో గవర్నర్‌ పాలన విధించారు.

మెహబుబాకు మద్దతుపై బీజేపీ తర్జనభర్జనలు ........

అయితే.. మెహబుబా ముఫ్తీకి మద్దతివ్వాలా.. వద్దా అనే అంశంపై బీజేపీ నేతలు తర్జనభర్జనలు పడినట్లు తెలిసింది. అందుకే ఆమె సీఎం పగ్గాలు చేపట్టేందుకు ఆలస్యమయ్యిందనే వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు అధికారాన్ని చేపట్టేందుకు గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా.. బీజేపీ, పీడీపీకి లేఖలు రాసినా ఎవరూ ముందుకు రాకపోవడంతో తాజా పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది.

బాధ నుంచి మెహబుబా తేరుకోలేదంటున్న పార్టీ వర్గాలు ........

మరోవైపు తండ్రిని కోల్పోయిన బాధ నుంచి ఆమె ఇంకా తేరుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విషాదం నుంచి తేరుకునేందుకు మరికొంత సమయం పట్టవచ్చంటున్నారు. అప్పటివరకు గవర్నర్‌ పాలన కొనసాగనుందని.. ఇందులో రాజ్యాంగ సంక్షోభం ఏమీ ఉండదంటున్నారు పీడీపీ నేతలు.

మెహబుబాతో బీజేపీ నేత రాంమాధవ్‌ భేటీ......

ఇక ఇప్పటికే మెహబుబాతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ భేటీ అయ్యారు. ఆమె సీఎం పదవి చేపట్టేందుకు అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఆమె రేపో, ఎల్లుండో పదవీబాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. ఈమె పదవీ చేపడితే జమ్మూ కాశ్మీర్‌ తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. ఇక మెహబుబాను పరామర్శించేందుకు సోనియాగాంధీ నేడు శ్రీనగర్‌ వెళ్లనున్నారు. 

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

కరీంనగర్‌ : జగిత్యాల మండలం బాలపెల్లి గ్రామానికి చెందిన రైతు భూమల్ల చందు అప్పుల బాధతో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. చందు తనకున్న మూడెకరాల్లో వరి, మొక్కజొన్న సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో అప్పు చేసి బావిలో పూడిక తీయించాడు. అయినప్పటికీ పంటలకు నీరందక ఎండిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. పంట దిగుబడి తగ్గడంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Don't Miss