Activities calendar

11 January 2016

రమణను కలిసిన మాజీ కార్పొరేటర్లు..

హైదరాబాద్ : టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణను మాజీ కార్పొరేటర్లు కలిశారు. సిట్టింగ్ స్థానాలను బీజేపీకి కేటాయించవద్దని విజ్ఞప్తి చేశారు. 

ఏడుపాయల జాతర కోసం రూ.కోటిన్నర మంజూరు..

హైదరాబాద్: ఏడుపాయల జాతర ఏర్పాట్ల కోసం రూ.కోటిన్నర మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలంలో మార్చిలో జరుగనున్న ఏడుపాయల జాతర జరగనున్న సంగతి తెలిసిందే.

21:33 - January 11, 2016

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్టించానికి మెహబూబా ముఫ్తీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? బీజేపీని కట్టడి చేసేందుకు ఆమె రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారా..? లేక నిజంగానే కశ్మీర్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..? సోనియాగాంధీ మెహబూబా ముఫ్తీతో భేటి కావడంతో కొత్త చర్చలు మొదలయ్యాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ మృతిపై నాలుగు రోజుల సంతాపం అనంతరం పీపుల్స్‌ డెమోక్రెటిక్‌ పార్టీకి శాసనసభ్యుల సమావేశం ఆదివారం జరిగింది. అయితే ఈ సమావేశంలో పిడిపి అధినేత్రి తండ్రి చనిపోయిన బాధలో కన్నీటి పర్యంతమయ్యారే తప్ప ప్రభుత్వ ఏర్పాటుపై ఆమె పెదవి విప్పలేదు. తమతమ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యేలకు సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

తాత్కాలికంగా గవర్నర్ పాలన..
తండ్రి మరణం తర్వాత తక్షణమే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి మెహబూబా ముఫ్తి ససేమిరా అనడంతో తాత్కాలికంగా గవర్నర్‌ పాలన కొనసాగుతోంది. బుధవారంతో ముఫ్తీ ఏడురోజుల సంతాప దినాలు ముగియనున్నాయి. అప్పటివరకు ఆమె ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనరని పిడిపి వర్గాలు చెబుతుండడం బీజేపీ-పీడీపీ పొత్తుపై అనుమానాలు రేకెత్తాయి. సయీద్‌ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మెహబూబా- బిజెపిని ఇరకాటంలో పెట్టేందుకే సాగదీస్తున్నట్టు సమాచారం. 2014 శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. ఆ సమయంలో పిడిపికి మద్దతిస్తామని బీజేపీ ముందుకొచ్చినా సయీద్ వేచిచూసే ధోరణి అవలంబించారు. మూడు నెలల తర్వాత పిడిపి షరతులకు బిజెపి అంగీకారం తెలపడంతో ప్రభుత్వం ఏర్పాటైందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

రంగంలోకి బిజెపి నేతలు..
కాశ్మీర్‌లో బిజెపి దూకుడుగా వ్యవహరించడంపై పిడిపి వర్గాలు మండిపడుతున్నాయి. ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై కేంద్రం జాప్యం చేస్తుండడంపై మెహబూబా ముఫ్తీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డిప్యూటి సిఎం పదవిని ఎత్తివేయాలని, ఉన్నత పదవులు పిడిపికే ఇవ్వాలని, సున్నితమైన అంశాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని బిజెపికి పిడిపి తాజాగా షరతులు విధించినట్లు తెలుస్తోంది. మెహబూబా ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బిజెపి రంగంలోకి దిగింది. ఇప్పటికే కేంద్ర మంత్రి గడ్కరి, బిజెపి సీనియర్‌ నేత రామ్‌మాధవ్‌ మెహబూబ ముఫ్తితో మంతనాలు జరిపారు. సయీద్‌ ఆశయాలు నెరవేరుస్తామని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమెను సముదాయించినట్టు సమాచారం. మరో వారం పది రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశముందని భావిస్తున్నారు.ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం మెహబూబా ముఫ్తీతో భేటీ కావడం.. కశ్మీర్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్న అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఎందుకంటే గతంలో పిడిపి-కాంగ్రెస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

ముఫ్తీ రాజకీయ పాచికలు..
జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 87 అసెంబ్లీ స్థానాలుండగా, పిడిపి 28 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికారానికి మరో 16 సీట్లు అవసరం ఉండగా 25 సీట్లను గెలుచుకున్న బిజెపి-పిడిపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు 12 , నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 15, నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు ఇతర పార్టీలకు చెందిన నేతలున్నారు. బిజెపికి తలొగ్గకుండా మెహబూబూ ముఫ్తీ రాజకీయ పాచికలు కదుపుతున్నారు. తన షరతులకు బిజెపి సరే అంటే ఓకే...లేదా కాంగ్రెస్‌ ఇతర పార్టీల సయోధ్యతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

21:30 - January 11, 2016

హైదరాబాద్ : ఇప్పటివరకు స్నాచర్లు తెగబడ్డారు...ఇక జనంలో ఓపిక నశించింది...దొంగ కన్పిస్తేచాలు పట్టుకునేందుకు తెగిస్తున్నారు..వెంటాడుతున్నారు.. హైదరాబాద్‌లో ఓ స్నాచర్‌ గొలుసు చేతికి చిక్కగానే అంతే స్పీడ్‌లో పరుగులు తీశాడు..అయినా వదల్లేదు జనం.. అదే స్పీడ్‌లో ఆ గొలుసు దొంగను వెంటాడారు...కానీ తప్పించుకోబోయి...చివరకు ప్రాణాలే పొగొట్టుకున్నాడు ఆ స్నాచర్...నగర వాసుల్లో చైతన్యం స్నాచర్లలో భయాన్ని పుట్టించింది.

బాపూఘాట్....
హైదరాబాద్‌ బాపూఘాట్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోన్న మహిళ మెడలోని బంగారు చైన్‌ను లాగేసిన స్నాచర్ జుబేర్‌.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి అరుపులతో అప్రమత్తమైన స్థానికులు దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. వాళ్లనుంచి తప్పించుకునే క్రమంలో గాంధీనగర్, ప్రశాంత్‌నగర్‌ల మీదుగా లక్ష్మీనగర్ వరకు పరుగులు తీశాడు. ప్రజలు వెంబడించడంతో.. అతడు జానకీనగర్‌లోని గోడ దూకడంతో నాలాలో పడ్డాడు. అయినా తరమడంతో ప్రశాంత్‌నగర్‌లోని ఓ భవనంపైకి ఎక్కాడు. కిందికి దూకే క్రమంలో ప్రహరీకి ఉన్న ఇనుప చువ్వలపై పడ్డాడు. చువ్వలు అతడి తొడలోకి దిగడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పోలీసులు జుబేర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.  

21:25 - January 11, 2016

హైదరాబాద్ : ఐక్యంగా కదులుదాం.. గ్రేటర్‌లో సత్తా చాటుదాం. ఇదే నినాదంతో కాంగ్రెస్‌ రంగంలోకి దిగుతోంది. సమన్వయకమిటీ సమావేశంలో చర్చ జరిపిన నేతలు.. సెటిలర్లపై కేసీఆర్‌ విద్వేష ప్రచారం చేశారని.. ఆ విషయం గుర్తు చేయాలని అభిప్రాయపడ్డారు. 13, 14, 15 తేదీల్లో విడతలవారీగా అభ్యర్థులను ప్రకటించడానికి రంగం సిద్ధం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మంగళవారం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌తో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే గెలుపు గుర్రాల కోసం వెతుకుతోంది. పోటీ చేసే అభ్యర్ధులను సమన్వయం చేసేందుకు డివిజన్లవారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. గాంధీభవన్‌ నుంచి గ్రౌండ్‌లోకి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పాదయాత్రలు, బహిరంగ సభలు, రోడ్‌ షోలతో ఎన్నికల ప్రచారాన్ని అదరగొట్టేందుకు వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్..
తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మేయర్‌ పీఠం సాధనే లక్ష్యంగా పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో పాలకపక్షంగా ఉన్న టీఆర్‌ఎస్‌తోటు, టీడీపీ, బీజేపీ కూటమి ప్రచార కథనరంగంలో దూకాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కూడా ప్రచారాన్ని హోరెత్తించేందుకు సన్నద్ధమయ్యింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మంగళవారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు అభ్యర్ధులు ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. టికెట్ల కోసం రెండువేల మంది ఆశావహులు దరఖాస్తు చేస్తున్నారు. వీటిపి వడపోస్తున్నారు. సీట్లు కోరుతున్న వారికి ప్రజలతో ఉన్న సంబంధం, ఆర్ధిక స్తోమత, పార్టీ నాయకులతో ఉన్న అనుంబంధం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. సమర్ధులైన అభ్యర్ధులను ఎంపిక చేస్తే గెలుపు పెద్ద సమస్య కాబోదన్న ధీమాతో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.

కాంగ్రెస్ ప్రచారం..
రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌, ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌లో మంగళవారం కాంగ్రెస్‌ ప్రచారానికి శ్రీకారం చుడతారు. రాజేంద్రనగర్‌, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌లో జరిగే బహిరంగ సభల్లో దిగ్విజయ్‌ పాల్గొంటారు. నామినేషన్ల నుంచి పోలింగ్‌ తేదీల మధ్య సమయం తక్కువగా ఉండటంతో.. ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించారు. ఈటెల్లాంటి మాటలతో టీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యర్ధి పార్టీలను తూర్పారపడుతున్న తరుణంలో .... ఈ విషయంలో తామేమీ తక్కువ కాదని నిరూపించేందుకు అస్త్రశస్త్రాలతో కాంగ్రెస్‌ నేతలు ప్రచార కథనరంగంలోకి దూకబోతున్నారు. గ్రేటర్‌ పీఠంపై కాంగ్రెస్‌ నేతలు పెంచుకున్న ఆశలు ఎంతవవరకు నెరవేరతాయో చూడాలి. 

21:22 - January 11, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌లో 100 సీట్లు గెలవకపోతే సీఎం కేసీఆర్, కొడుకు కేటీఆర్ (తండ్రి కొడుకు) లు రాజీనామా చేస్తారా ? అని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ విసిరారు. గతంలో ఒక్కసీటు గెలువలని పార్టీ ప్రస్తుతం వంద సీట్లు గెలుస్తుందా ? అని ఎద్దేవా చేశారు. గ్రేటర్ లో గులాబీ జెండా ఎగురకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దళిత ముఖ్యమంత్రిని చేస్తానని..లేకపోతే మెడ నరుక్కుంటానని గతంలో కేసీఆర్ పేర్కొనడం జరిగిందని, అలా చేయలేదని, నీ మాటలు నమ్ముతారా ? అని విమర్శించారు. మేయర్ పీఠాన్ని సొంతంగా దక్కించుకుంటామని పలు వ్యాఖ్యానాలు చేస్తున్నారని తెలిపారు. కానీ గెలిచిన వాళ్లను కొనడం..లేదా ఎంఐంఎంతో పొత్తు కుదుర్చుకొనడం వంటివి చేస్తారని ఎర్రబెల్లి ఆరోపించారు. 

21:18 - January 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడితే అనేక సమస్యలు తలెత్తుతాయని చెప్పిన అపోహలను తొలగిస్తూ ప్రభుత్వం పాలనలో దూసుకెళ్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో సోమాజిగూడలో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌లో కేటీఆర్‌ అనేక విషయాలను తెలిపారు. రాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్న గ్రేటర్‌ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామన్నారు. 50 ఏళ్లుగా అన్ని పార్టీలకు అవకాశమిచ్చిన ప్రజలు.. ఈ ఐదేళ్లు తమకు అవకాశం ఇస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు కేటీఆర్‌. ఈ ఎన్నికల్లో కనీసం 100 సీట్లు గెలుచుకుని.. బల్దియా పీఠంపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామన్నారు కేటీఆర్‌. లేకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.. ప్రతిపక్ష నేతలు ఓడిపోతే పదవుల నుండి తప్పుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.

రసవత్తరంగా ఎన్నికలు..
ఇప్పటివరకు ప్రధాని మోడీ ఒక్కసారైనా రాష్ట్రానికి రాకపోవడం వివక్ష కాదా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చని బీజేపీ ప్రజలను ఏ విధంగా ఓట్లు అడుగుతుందన్నారు. ఇక సీమాంధ్రలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అంతా రాష్ట్ర విభజనతోనే సాధ్యమయిందని కేటీఆర్‌ అన్నారు. దీన్ని ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలన్నారు. మరోవైపు పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వచ్చినవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. నగరాన్ని మరింత సేఫెస్ట్‌ ప్లేస్‌గా మార్చడమే తమ కర్తవ్యమన్నారు. ఏది ఏమైనా ఈసారి గ్రేటర్‌ ఎన్నికల్లో బల్దియా పీఠం గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో గ్రేటర్‌ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. 

21:16 - January 11, 2016

విశాఖపట్టణం : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సుకు భారీగా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని సీఎం చంద్రబాబు అన్నారు. రెండవరోజు 245 ఎంవోయూలు చేసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. దీంతో అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని బాబు అన్నారు. పలు కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వంతో ఆంధ్రా బ్యాంకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రేపటి వరకు సీఐఐ సదస్సు కొనసాగనుంది. 

సరూర్ నగర్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ నేతల ఆందోళన..

హైదరాబాద్ : సరూర్ నగర్ డివిజన్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో బ్యానర్లను ఆందోళన కారులు చింపేశారు. కార్పొరేటర్ టికెట్లను ఎమ్మెల్యే తీగల అమ్ముకుంటున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. 

సీఎం కేసీఆర్ ను కలిసిన డిప్యూటి స్పీకర్..

మెదక్: సీఎం కేసీఆర్‌ను డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కలిశారు. మార్చిలో జరుగనున్న ఏడుపాయల జాతర ఏర్పాట్లను ఆమె సీఎంకు వివరించారు.

20:39 - January 11, 2016

ఊరందరి పండుగలో కోళ్ల పందేలా ఎలా చేరాయి ? రంగవల్లుల..పిండివంటల వేడుకల్లో కాయ్ రాజా కాయ్ అరుపులు ఎలా వచ్చాయి ? పండుగంటే విచ్చలవిడి జూదమేనా ? పండగంతా పందెం రాయుళ్లదేనా ? సంతోషంగా గడపాల్సిన రోజుల్లో జూదం..మద్యం ప్రవాహం ఎలా కలిశాయి ? ఒళ్లు..ఇళ్లు గుల్ల చేసుకొంటే తప్ప పండుగ చేసుకొన్నట్టు కాదా ? సంక్రాంతి పండుగలో కోళ్ల పందేలా వివాదం గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:33 - January 11, 2016

గత కొద్ది రోజులుగా ' టెన్ టివి మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో ఇతరులతో ముచ్చట్లు చెబుతానన్న 'మల్లన్న' మాట నిలబెట్టుకున్నాడు. ఉప్పల్ కు చెందిన విజయ్ తో మల్లన్న ముచ్చట్లు పెట్టాడు. దుబ్బాక సర్కార్ లో తాను చదువుకున్న స్కూల్ నిర్మాణానికి ముగ్గు వేసిన సీఎం కేసీఆర్..మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న కేటీఆర్..జీహెచ్ఎంసీ ఎన్నికల సిత్రాలు...క్యాడెంట్ల కొంప ముంచిన రిజర్వేషన్లు...కరీంనగర్ లో ఖాకీల లీలలు…కరీంనగర్ సర్వసభ్య సమావేశం సత్రోలు..స్నాచింగ్ చేసి పరారైన మృతి చెందిన దొంగ..కర్నూలు చర్చీలో దారుణం..ఏపీలో భార్య బాధితుల సంఘం ఏర్పాటు..రష్యా దేశంలో నర్సును ముట్టుకున్న రోగిని చావబాదిన వైద్యుడు..ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో 'మల్లన్న' తనదైన శైలిలో విశ్లేషించారు. ఆ విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

పాతబస్తీలో నకిలీ ట్రావెల్ ఏజెంట్లపై దాడులు..

హైదరాబాద్ : పాతబస్తీలో నకిలీ ట్రావెల్ ఏజెంట్లపై పోలీసులు దాడులు జరిపారు. భారీగా నకిలీ వీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సీఐఐ సదస్సులో వ్యక్తి హల్ చల్..

హైదరాబాద్ : సీఐఐ సదస్సులో వ్యక్తి హల్ చల్ సృష్టించాడు. అనుమతి లేకుండా సదస్సు ప్రాంగణంలోకి రమేష్ అనే వ్యక్తి వచ్చాడు. నిరుద్యోగులను మోసం చేసిన కేసులో రమేష్ నిందితుడు. 

రెండో రోజు సీఐఐ సదస్సు..

విశాఖపట్టణం : రెండో రోజు సీఐఐ సదస్సులో వందకు పైగా అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఇప్పటి వరకు రూ.1.70 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు అంగీకారం జరిగింది. పలు కంపెనీల్లో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వంతో ఆంధ్రా బ్యాంకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రేపటి వరకు సీఐఐ సదస్సు కొనసాగనుంది. 

గ్రేటర్ అభ్యర్థుల ఎంపికకు టీఆర్ఎస్ కమిటీ..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు టీఆర్ఎస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎంపీ కేకే అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో డీఎస్, కడియం శ్రీహరి, కేటీఆర్, ఇంద్రకిరణ్ రెడ్డిలను సభ్యులగా నియమించారు. 

రూ.5లక్షల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టవద్దు - జనార్దన్ రెడ్డి..

హైదరాబాద్ : నగర పాలక సంస్థ కార్యాలయంలో పలు పార్టీల నేతలతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖర్చు నియంత్రణపై పార్టీల నేతలతో చర్చించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ. 5లక్షలకు మించి ఖర్చు పెట్టవద్దని సూచించారు.

 

భాగస్వామ్య సదస్సు విజయవంతం - గంటా..

విశాఖపట్టణం : భాగస్వామ్య సదస్సు విజయవంతమైందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెట్టుబడుల కింద రూ.2లక్షల కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు తెలిపారు. సదస్సు ముగిసే నాటికి రూ.5 లక్షల కోట్లు వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. 

సత్యానందం అరెస్టు..

విజయవాడ : కాల్ మనీ కేసులో ప్రధాన నిందితుడు సత్యానందాన్ని సూర్యారావు పేట పోలీసులు అరెస్టు చేశారు. సత్యానందంపై ఓ కాంట్రాక్టర్ చీటింగ్ కేసు పెట్టాడు. ఈనెల 25వ తేదీ వరకు సత్యానందానికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. 

ఆదిలాబాద్ లో విహరయాత్రలో విషాదం..

ఆదిలాబాద్ : విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు విద్యార్థినిలు మృతి చెందారు. ఉట్నూరు (మం) కన్నాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన మజ్ఞు (15),రేష్మ (13), నసీమలుగా (16) గుర్తించారు.

 

18:29 - January 11, 2016

కర్నూలు : ఒకప్పుడు పగలు, ప్రతీకారాలతో రగిలిపోయిన ఫ్యాక్షన్‌ గడ్డ కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో ఇప్పుడు శాంతి సౌరభాలు వెల్లి విరుస్తున్నాయి. జిల్లా ఎస్‌పీ రవి కృష్ణ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత కప్పట్రాళ్ల ప్రజల్లో పూర్తిగా మార్పు వచ్చింది. గ్రామంలో ఇప్పుడు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, రైతులు, విద్యార్ధులకు ఆటల పోటీలు నిర్వహించారు. జిల్లా ఎస్‌పీ రవికృష్ణ... సతీమణి ఆర్‌కే పార్వతీదేవి విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో మెలుగుతూ అభివృద్ధిలో పోటీ పడాలని కోరారు. 

18:28 - January 11, 2016

నెల్లూరు : సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న 'చంద్రన్న కానుక' అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. పండుగ దగ్గర పడుతున్నా ఇంకా సరుకులు అందకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. సర్వర్లు పనిచేయకపోవడంతో ప్రజల గంటలకొద్ది క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కానుక రూపంలో అందిస్తున్న సరుకులు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి. సంక్రాంతి పండుగ కోసం ప్రభుత్వం అందిస్తున్న 'చంద్రన్న కానుక'పై నెల్లూరు జిల్లాలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతి దగ్గరకు వచ్చినా కానుక అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. 270 రూపాయల విలువైన 20 కిలోల బియ్యం, కిలో గోధుమపిండి, అరకిలో కందిపప్పు, అరలీటర్‌ పామాయిల్‌, అరకిలో శనగప్పు, అరకేజి బెల్లం, 100 గ్రాముల నెయ్యి ఇంతవరకు తమకు అందలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌ నెల నుంచే ఈ పంపిణీ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశించినా డీలర్లు ఆ ఆదేశాలను బేఖాతరు చేసి సరుకులను అందించడంలో జాప్యం చేశారంటున్నారు.

లబ్ధిదారుల కష్టాలు..
మరోవైపు ఈ కానుకను అందుకునేందుకు లబ్ధిదారులు తీవ్ర కష్టాలు పడాల్సి వస్తోంది. సర్వర్లు మొరాయించడంతో గంటలకొద్ది క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇక కార్డు నెంబర్‌ను ఈ-పాస్‌ మెషిన్‌లో నమోదు చేయగానే.. చంద్రన్న సంక్రాంతి కానుకలు డిస్‌ప్లే కావాలి. కానీ.. చాలా రేషన్‌షాపులలో సర్వర్లు మొరాయించడంతో లబ్ధిదారులు ఉట్టిచేతులతోనే వెనక్కి పోవాల్సి వస్తోంది. ఇక ఈ కానుక కింద అందించే వస్తువులు నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం వస్తువులు అందిస్తున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు. అంతేకాకుండా తూకంలో కూడా మోసం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.

నాణ్యమైన సరుకులందించాలి..
మరోవైపు చంద్రన్న కానుక కింద ఇచ్చే సరుకులన్నీ కాంట్రాక్టర్‌ దగ్గర నుంచి జిల్లా కేంద్రానికి చేరినా.. డీలర్లు మాత్రం కోటా ప్రకారం వస్తువులు అందలేదని చెబుతున్నారు. లబ్దిదారులకు సరుకులు ఇవ్వకుండా నొక్కేసే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. వాయిస్‌.. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చంద్రన్న కానుక అనేక విమర్శల పాలవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చంద్రన్న కానుకలో నాసిరకాన్ని తొలగించి.. ప్రతి పేదవాడికి నాణ్యమైన సరుకులు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 

18:25 - January 11, 2016

విశాఖపట్టణం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 1995-2004 మధ్య కాలంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన పొరపాట్లపై ఆయన ఒకింత పశ్చాతాపపడినట్లుగా మాట్లాడుతున్నారు. గతంలో వ్యసాయ, సంక్షేమరంగాలను విస్మరించడం వలన ఎదురైన పరిణామాలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. అలాంటి తప్పులు మరోసారి చేయబోమని విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా విశాఖలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సులో సోమవారం రెండోరోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన గతంలో చేసిన కొన్ని పొరపాట్లను పారిశ్రామివేత్తల ముందు ప్రస్తావించారు. అభివృద్ధిలో అన్ని రంగాలు కీలకపాత్ర వహిస్తాయని చెప్పుకొచ్చారు. ఏ రంగాన్ని విస్మరించినా.. ఆ ప్రభావం అటు అభివృద్ధితోటు, ఇటు ప్రభుత్వంపైనా పడుతుందన్నారు. తుపాన్లు, కరవు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని గుర్తు చేశారు. పారిశ్రామికాభివృద్ధితోపాటు వ్యవసాయ, సంక్షేమ రంగాలకు కూడా ప్రధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని చందబాబు గుర్తు చేస్తున్నారు. సదస్సులో ప్రసంగించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పెట్టుబడులకు ఏపీలో ఉన్న అవకాశాలను ప్రస్తావిస్తూ.. చంద్రబాబు దూరదృష్టి ఉన్న ముఖ్యమంత్రి అంటూ ప్రశంసించారు. సీఎం దార్శనిక దృక్పథంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటున్నారు. ఏపీలో ఉన్న వనరులను ఉపయోగించుకుని రాష్ట్రంలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని చంద్రబాబు, వెంకయ్యనాయుడు కోరారు. 

18:06 - January 11, 2016

చిత్తూరు : మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ త్రాచుపాము కలకలం సృష్టించింది. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నపిల్లల వార్డుకు ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలోకి పాము ప్రవేశించింది. అక్కడనే ఉన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలతో పరుగులు తీశారు. పాము ప్రవేశించిన వార్త తెలుసుకున్నా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరకు పాములు పట్టుకోవడంలో సిద్ధహస్తుడైన మదనపల్లె ప్రాంతానికి చెందిన రమేష్ ఆసుపత్రికి చేరుకున్నారు. పామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. సర్కారీ ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్ర వాతావరణం ఉండడం వల్లే విషనాగులు ప్రవేశిస్తున్నాయని, వెంటనే ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. 

మోడీ దృష్టంతా విదేశీ టూర్లపైనే - ఏచూరి..

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టంతా విదేశీ టూర్లపైనే ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. పఠాన్ కోట్ ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని, నిఘా వర్గాలు ముందే హెచ్చరించినా పట్టించుకోలేదని విమర్శించారు. పాక్ తో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమౌతాయని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతోందన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, సుప్రీం తీర్పు వచ్చే వరకు నిర్మాణం చేపట్టవద్దని ఆయన పేర్కొన్నారు.

టి.ఆర్థిక శాఖ అధికారులతో ముగిసిన సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో సీఎస్ జరిపిన సమావేశం ముగిసింది. నగర అభివృద్ధి కోసం బ్రిక్స్ బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కావాలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతిపాదనలు పూర్తయ్యాక బ్రిక్స్ బ్యాంకుకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. 

గవర్నర్ ను కలిసిన టి.టిడిపి నేతలు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ ని టి.టిడిపి నేతలు కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఫ్లెక్సీల ఏర్పాటుపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. 

17:55 - January 11, 2016

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు పట్టణాల్లో సంక్రాంతి ఫుట్ బాల్ హంగామా కొనసాగుతోంది. నర్సాపురం వైఎన్ కాలేజీ గ్రౌండ్స్ లో తాడేపల్లిగూడెం, తణుకు జట్లు ఢీకొన్నాయి. ఈ మ్యాచ్ లను తిలకించడానికి జిల్లాల సాకర్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ప్రొ.ఛైర్మన్ శ్రీధర్ కోటగిరి ఆధ్వర్యంలో జిల్లా లీగ్ ఫుట్ బాల్ పోటీలు జరుగుతున్నాయి. ఫ్లో ఫుట్ బాల్ తొమ్మిదో రోజు హైలెట్స్ చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

శాయంపేటలో యువతిపై టీఆర్ఎస్వీ నేత అత్యాచారం..

వరంగల్ : శాయంపేటలో ఓ యువతిపై టీఆర్ఎస్ వి మండల ఉపాధ్యక్షుడు వివాకర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

17:11 - January 11, 2016

కరీంనగర్ : తాము గెలవగానే అభివృద్ధి చేస్తాం..పేద ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం..అని ఎన్నికల ముందట నేతలు హామీల మీద హామీలు గుప్పిస్తుంటారు. గెలిచిన అనంతరం అభివృద్ధి మాట మరుస్తారు. ఇదే విషయం కరీంనగర్ జిల్లాకు చెందిన కొంతమంది కార్పొరేటర్లకు వర్తిస్తుంది. 9 నెలల తరువాత జరిగిన నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు మహిళా కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు దూషించుకోవడం సమావేశంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకరిపై ఒకరు చెప్పులు చూపించుకున్నారు. మేయర్ రవీంద్ర సింగ్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం జరిగింది. కాంగ్రెస్..టీఆర్ఎస్ సభ్యులు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. శానిటేషన్ పొడిగింపు, ఇందిరా గాంధీ విగ్రహాల ఏర్పాటు తదితర అంశాలపై కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. మరోవైపు 36వ డివిజన్ కు చెందిన తాటి ప్రభావతి, 5వ డివిజన్ కు చెందిన సరితలు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. ఇళ్ల నిర్మాణ విషయంలో అవతకవలు చోటు చేసుకుంటున్నాయని, వార్డుల్లో జోక్యం చేసకుంటున్నారని దూషించుకున్నారు. అభివృద్ధి విషయం పక్కన పెట్టి కార్పొరేటర్లు ఇలా వ్యవహరిస్తుండడంపై జిల్లా ప్రజలు నోరెళ్లబెట్టారు. 

క్లీన్ హైదరాబాద్ - క్లీన్ పాలిటిక్స్ - సీపీఎం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీపీఐ, లోక్ సత్తా, ఆప్ లతో కలిసి ఉమ్మడిగా వన్ హైదరాబాద్ పేరిట పోటీ చేస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నర్సింహరావు ప్రకటించారు. 13వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటిస్తామని, క్లీన్ హైదరాబాద్ - క్లీన్ పాలిటిక్స్ తమ నినాదమని వెల్లడించారు. 

పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటనపై పాక్ దర్యాప్తు - పీటీఐ..

ఢిల్లీ : పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటనపై పాక్ దర్యాప్తు ప్రారంభించినట్లు పీటీఐ వార్త సంస్థ పేర్కొంది. భారత్ ఇచ్చిన ఆధారాలతో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని పాక్ పోలీసులు ప్రశ్నించినట్లు వెల్లడించింది. 

నకిలీ ఎన్ఆర్ఐ కన్సల్టెన్సీలపై చర్యలు - పల్లె..

విశాఖపట్టణం : నకిలీ ఎన్ఆర్ఐ కన్సల్టెన్సీలపై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లి మోసపోయిన విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఐఐ సదస్సులో విద్యుత్ రంగానికి సంబంధించిన 32 ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలకు సంబంధించి 55 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.

 

16:37 - January 11, 2016

ఢిల్లీ : పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడిపై ఉన్నతస్థాయి సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు సైనిక జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఆరుగురు ఉగ్రవాదులను సైనికులు మట్టుబెట్టారు. వైమానిక స్థావరంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాక్ నుండి చొరబడ్డారనే ఆధారాలను భారత్ ఆ దేశానికి సమర్పించిన సంగతి తెలిసిందే. దీనిపై పాక్ ప్రభుత్వం తీసుకొనే చర్యలపై ఈనెల 15వ తేదీన జరిగే ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల చర్చలపై ఆధారపడి ఉంటాయని భారత్ వ్యాఖ్యానించింది. దీనితో పాక్ ప్రధాని పై విధంగా ఆదేశాలు జారీ చేశారు. సంయుక్త బృందంలో ఇంటిలెజిన్స్ బ్యూరో, ఇంటర్ సర్వీసెస్ ఇంటిలెజిన్స్, మిలట్రీ ఇంటిలెజెన్స్ కు చెందిన ఉన్నతస్థాయి అధికారులుంటారు. 

16:29 - January 11, 2016

విశాఖపట్టణం : మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారనే నెపంతో మన్యంలో అమాయక గిరిజనులు చిత్ర హింసలకు గురి చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం పేర్కొన్నారు. విచారణ పేరిట అక్రమంగా నిర్భందిస్తున్నారని తెలిపారు. జర్రెల మాజీ సర్పంచ్ సాగి వెంకటరమణనను మావోయిస్టులు హత్య చేసిన తరువాత పోలీసుల ఆకృత్యాలు ఎక్కువైపోయాయని, పోలీసుల నిర్భందకాండను ఆపకపోతే ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. 

16:23 - January 11, 2016

విశాఖపట్టణం : చదువుకోవడానికి అమెరికాకు వెళ్లే వారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల వ్యవహారంలో ప్రభుత్వం విచారణ చేస్తోందని, ఆయా ప్రాంతాల్లోని అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. న్యాయం జరిగేలా చూస్తామని పల్లె హామీనిచ్చారు.

 

16:20 - January 11, 2016

హైదరాబాద్ : రేపు నిజాం కళాశాల మైదానంలో టిడిపి, బిజెపిలు నిర్వహించనున్న బహిరంగ సభలో ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో ఏర్పాట్లను పార్టీ నేతలు పరిశీలించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే డిప్యూటి మేయర్ పదవి సెటిలర్స్ కే ఇస్తామని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు టెన్ టివితో ముచ్చటించారు.

తమ హాయాంలో నగర అభివృద్ధి - రమణ..
టిడిపి, బిజెపి గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, మేయర్ పదవిని సాధించినట్లు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. తమ హాయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఒక మైండ్ సెట్ లో భాగంగా ఓట్లు కొల్లగొట్టుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. నగర ప్రజలు చైతన్యవంతులని, వారి ప్రయత్నాలు చెల్లవన్నారు.

ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉన్నారు - లక్ష్మణ్..
నగర ప్రజలు ఆత్మస్థైర్యంతో ఉన్నారని, పేద ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న పథకాలను ప్రజల్లో తీసుకెళుతామని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ నగరంలో చేసిందేమి లేదని, పారిశుధ్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. మాటలకు చేతలకు పొంతన లేదని, టీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎంఐఎంకు ఓటేసినట్లేనని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

తమపై తప్పుడు ప్రచారం - ఎర్రబెల్లి..
బాబు ప్రచారంలో పాల్గొనరని తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారని, కానీ నిజాం కళాశాలలో జరిగే సభలో బాబు పాల్గొంటారని టిడిపి నేత ఎర్రబెల్లి తెలిపారు. 18 నెలల కాలంలో సీమాంధ్ర వారిని నిర్లక్ష్యం చేశారని, ఆంధ్రా వాళ్లను తరిమికొడుతామని గతంలో ఎన్నో వ్యాఖ్యలు చేశారని తెలిపారు. సీమాంధ్ర వారికి రక్షణ కల్పిస్తామని, మేయర్ పదవి కైవసం చేసుకుంటామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. 

శింబుకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..

మ యాక్టర్ శింబుకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 29లోగా పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. బీప్ సాంగ్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. 

రాజ్ నాథ్ కలువనున్న సుష్మా..

ఢిల్లీ : కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను మంత్రి సుష్మా స్వరాజ్ కలువనున్నారు. భారత్ - పాక్ చర్చలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

ముంబై వెళ్లనున్న హరీష్..

హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి హరీష్ రావు ముంబైకు వెళ్లనున్నారు. తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజీలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో హరీష్ చర్చలు జరపనున్నారు. 

త్వరలో 500 ఆర్టీసీ బస్సుల కొనుగోలు - మహేందర్ రెడ్డి..

కరీంనగర్ : త్వరలో 500 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేస్తామని, బస్సు ఛార్జీలను పెంచే ఆలోచన లేదన్నారు. మేడారం జాతరకు 3,700 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. 

గ్రేటర్ ఎన్నికల్లో బాబు ప్రచారం..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రచారం చేయనున్నారు. ఈ నెల 27,28,29 తేదీల్లో బాబు ప్రచారం చేపట్టనున్నారు. గ్రేటర్ పరిధిలో అనేక చోట్ల బాబు రోడ్ షోలు, సభలు నిర్వహించనున్నారు. 

15:42 - January 11, 2016

హైదరాబాద్ : రానున్న కాలంలో మతోన్మాద రాజకీయాలు...ఘర్షణలు పెరుగుతాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమవేశంంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు వీళ్లందరూ ఏ విధమైన ప్రసంగాలు ఇస్తూ వస్తున్నారో వాళ్లకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ ఒక్క స్టెప్ తీసుకోలేదన్నారు. ఈ విషయంపై పార్లమెంట్ లో అనేక సార్లు మోడీని సూటిగా ప్రశ్నించడం జరిగిందని, ఏదైనా యాక్షన్ తీసుకుంటారా అని ప్రశ్నిస్తే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు. 56 అంగుళాల తన ఛాతి ఉందని మోడీ గతంలో వ్యాఖ్యానించారని, బీజేపీ ఎంపీలను ప్రధాని కట్టడి చేయలేకపోయారు. మోడీ ఎన్ని దేశాలు వెళ్లారో సంఖ్య సరిగ్గా తెలియడం లేదని, 38 దేశాలు తిరిగి ఉంటారని తెలిపారు. పఠాన్ కోట్ లో దాడి జరుగుతుందని ముందే ఇంలెలిజిన్స్ హెచ్చరించిందని ఈ సమాచారం ఉందన ప్రభుత్వమే స్వయంగా పేర్కొనడం జరిగిందన్నారు. మూడుసార్లు కమాండింగ్ ఆఫీసర్లను మార్చిందని, ఎవరు ఎటాక్ చేసింది ? ఎంటీ వారి ఉద్దేశ్యం అనే అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. టెర్రరిజం ఆపితే చర్చలు కొనసాగుతాయని భారత ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అప్ఘనిస్తాన్ నుండి తిరుగు ప్రయాణంలో పాక్ లో మోడీ పర్యటించారని అక్కడ చర్చలు కొనసాగుతాయని మోడీ చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా - పాక్ మధ్యనున్న వాతావరణం ఏమవుతుందని ప్రశ్నించారు. పఠాన్ కోట్ ఘటన అనంతరం వైఖరి ఏంటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఏచూరి పేర్కొన్నారు. 

15:32 - January 11, 2016

విశాఖపట్టణం : ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ రెండో రోజు సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధిలో భారత్ దూసుకపోతోందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం, ఏపీలు అభివృద్ధిలో దూసుకపోతోందని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. 

15:28 - January 11, 2016

మెదక్ : దుబ్బాకకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సోమవారం ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి శంకుస్థాపనలు చేశారు. కేసీఆర్ చదువుకున్న స్కూల్ పునర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ స్కూల్ తో పాటు జూనియర్ కళాశాలకు రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. టెండర్లు పిలిచి జూనియర్ కళాశాల, హై స్కూల్ కలిపి కట్టాలని సూచించారు. నగర పంచాయతీగా మారిన దుబ్బాక దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరుగుతుందని, ఆలయ ప్రతిష్టాపన చాలా ఘనంగా చేయడం జరుగుతుందన్నారు. ఇందుకు తాను ఒక రోజంతా ఇక్కడే ఉంటానని తెలిపారు. ఎప్రిల్ 30వ తేదీ లోపు మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇస్తుందని ప్రకటించారు. పంచాయతీలో చెత్త తరలింపుకు మినీ ట్రక్కులను ఏర్పాటు చేస్తామన్నారు. 

15:24 - January 11, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నాకొద్ది నేతల హామీలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అందులో భాగంగా సెటిలర్లపై ప్రేమ చూపుతున్నారు. వారిపై ఏదో ఒక విధంగా ఆకట్టుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిప్యూటి మేయర్ పదవి సీమాంధ్రులకే ఇవ్వబోతున్నట్లు టిడిపి నేత ఎర్రబెల్లి ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని తెలిపారు. నగరం అభివృద్ధి అంతా టిడిపి హాయంలోనే జరిగిందని, సెటిలర్లను అనేక విధాలుగా అవమానించారని, ఓట్ల కోసం అనేక హామీలు గుప్పిస్తోందని టీఆర్ఎస్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర వాళ్లు అభివృద్ధి చేయడం వల్లే నగరం అభివృద్ధి చెందిందన్నారు. వాళ్లను గౌరవిస్తామని ఎర్రబెల్లి తెలిపారు. 

రేపే ఎన్నికల శంఖారావం మోగిస్తాం - బీజేపీ..

హైదరాబాద్ : నిజాం కళాశాలలో జరిగే బహిరంగ సభతో ఎన్నికల శంఖారావం మోగిస్తామని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం రహస్య ఎజెండాతో పనిచేస్తున్నాయన్నారు. బీజేపీ, టీడీపీ కూటమిని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

 

సెటిలర్లను టీఆర్ఎస్ అవమానించింది - ఎర్రబెల్లి..

హైదరాబాద్ : టీఆర్ఎస్ సెటిలర్లను అవమానించిందని టిటిడిపి నేత ఎర్రబెల్లి పేర్కొన్నారు. సెటిలర్లను ఆదుకొనేది తామేనని, డిప్యూటి మేయర్ పదవి సీమాంధ్రులకే కేటాయిస్తామని ప్రకటించారు. సీమాంధ్రుల వల్లే నగరం అభివృద్ధి చెందిందని తెలిపారు. 

సవాల్ చేసే అర్హత కేటీఆర్ కు లేదు - శ్రవణ్..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఛాలెంజ్ చేసే అర్హత మంత్రి కేటీఆర్ కు లేదని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి సవాల్ పై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 

బ్రాండ్ ఇమేజ్ ను టీఆర్ఎస్ దెబ్బతీసింది - రమణ..

హైదరాబాద్ : బ్రాండ్ ఇమేజ్ ను టీఆర్ఎస్ దెబ్బతీసిందని, 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి గెలుపునకు జీహెచ్ఎంసీ ఎన్నికలు నాంది పలకబోతున్నాయని టిటిడిపి నేత ఎల్ రమణ వ్యాఖ్యానించారు. 

15:02 - January 11, 2016

వస్త్ర ప్రపంచంలో ఎన్ని కొత్త ఫ్యాషన్స్ వచ్చినా చేనేతలు ఎప్పటికీ ప్రత్యేకమే. అన్ని సందర్భాలకు తగిన కలెక్షన్ ను అందిస్తూ హుందాగా కనిపించే ప్రత్యేకత చేనేతలది. అలాంటి చేనేత ప్రదర్శనను మీ ముందుకు తెచ్చింది సొగసు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:01 - January 11, 2016

పిల్లలు, అమ్మ ఒడిలోనైనా ఆడుకోవాలి. లేదంటే, తరగతి గదిలోనైనా ఉండాలి. ఈ రెండు ప్రదేశాల్లో కాకుండా వారెక్కడున్నా, వారి బంగారు బాల్యం, చితికిపోయనట్టే.. వారి ఎదుగుదలలో పరిపక్వత లోపించినట్టే. ఇలాంటి చిన్నారులకు భద్రంగా బతికే చోటే లేదా? వారి బాల్యం ఎలాంటి పురోభివృద్ధి లేకుండా కరిగిపోవాల్సిందేనా? అంటే కాదంటున్న వారు, ఆ చిన్నారుల కోసం మేమున్నామనే భరోసా ఇస్తున్న వారు మన మధ్యే ఉన్నారు. జీవిత చరమాంకంలో, బిడ్డల ఆదరణ కరువై, బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పెద్దలకే పెద్ద దిక్కై నిలుస్తున్న వారు మన చుట్టూనే ఉన్నారు. అమ్మ అనే పిలుపుకు దూరమైన వారు.. నాన్నను భౌతికంగా కోల్పోయిన వారు.. ఆదరించే వారు కరువయిన వారు, ఎలాంటి ఆసరా లేని వారు.. ఎక్కడుండాలి? ఎవరు వారికి రక్షణ కల్పించాలి? అంటే మేమున్నామని భరోసా ఇస్తున్నారు వాత్సల్యం వాలంటరీ ఆర్గనైజేషన్ నిర్వాహకులు. మనిషికి సంతృప్తిని మించిన సంపద లేదు.. ఆనందానికి మించిన ప్రాణావాయువు లేదు. అలాంటి సంతృప్తితో కూడిన పనిలో నిమగ్నమై, చిన్నారుల జీవితాల్లో వెలుగులు పంచుతూ, పెద్దల మనసులకు సాంత్వన నిస్తూ, ముందుకు సాగుతున్న వాత్సల్యం వాలంటరీ ఆర్గనైజేషన్ వాలంటీర్స్ కి మానవి అభినందనలు తెలియచేస్తోంది. ఇలాంటి వారు ఎందరో ముందుకు రావాలని కోరుకుంటోంది. 

14:36 - January 11, 2016

ప్రపంచ మాజీ చాంపియన్ టీమిండియా కొత్త సంవత్సరంలో తొలి విదేశీ వన్డే కమ్ టీ-20 సిరీస్ కు సిద్ధమయ్యింది. పెర్త్ లోని వాకా స్టేడియం వేదికగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగే తొలివన్డే సవాలు విసురుతోంది. మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా యువఫాస్ట్ బౌలర్ బరీందర్ కు తుదిజట్టులో చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం 8 గంటల 50 నిముషాలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది. 2016 సీజన్ తొలి విదేశీ సిరీస్ కోసం ఆస్ట్రేలియా చేరుకొన్న టీమిండియా ఇప్పటి వరకూ సన్నాహాకంగా ఆడిన రెండువామప్ మ్యాచ్ ల్లోనూ అదరగొట్టింది. ప్రధాన ఆటగాళ్ళు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, అజింక్యా రహానే, మనీశ్ పాండే ఫామ్ లోకి రావడంతో ...ధోనీసేన రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. లెఫ్టామ్ యువ ఫాస్ట్ బౌలర్ బరీందర్, ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ గురుకీరత్ సింగ్ మాన్ తుదిజట్టులో చోటు కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. తొడకండరం గాయంతో...అర్థంతరంగా జట్టు నుంచి వైదొలిగిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్థానంలో స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు భారత టీమ్ మేనేజ్ మెంట్ చోటు కల్పించింది. మ్యాచ్ కు వేదికగా ఉన్న పెర్త్ వాకా స్టేడియం పిచ్..పేస్ తో పాటు బౌన్స్ కు మరో పేరుగా ఉండడంతో ...టీమిండియా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లకు తుదిజట్టులో చోటు కల్పించే అవకాశాలు లేకపోలేదు. ఇశాంత్ శర్మ, రిషి ధావన్, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, బరీందర్ భారతజట్టులో ఫాస్ట్ బౌలర్లు కాగా...అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, గురుకీరత్ సింగ్ మాన్, రవీంద్ర జడేజా స్పిన్ ఆల్ రౌండర్లుగా ఉన్నారు.

ఆస్ట్రేలియాలో ప్రమాదకర ఆటగాళ్లు..
మరోవైపు...స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టులో ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, బెయిలీ, మాథ్యూ వేడ్, గ్లేన్ మాక్స్ వెల్, మిషెల్ మార్ష్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ఆటగాళ్ళున్నారు. ఫాస్ట్ బౌలర్ల త్రయం హేజిల్ వుడ్, జేమ్స్ ఫాక్నర్, మిషెల్ మార్ష్....వాకా బౌన్సీ పిచ్ పై టీమిండియా టాపార్డర్ ను ఓ పట్టుపట్టాలన్న లక్ష్యంతో పోటీకి దిగుతున్నారు. 2004 తర్వాత..పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, టీమిండియాజట్లు తొలిసారిగా ఢీ కొనబోతున్నాయి. ఫాస్ట్ బౌలర్లతో పాటు...బౌన్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్న జట్టుకే ఈమ్యాచ్ లో విజయావకాశాలు ఉన్నాయి.

14:32 - January 11, 2016

తూర్పుగోదావరి : జిల్లాలో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. కోనసీమలోని కాలేజీల్లో వేడుకలు జోరుగా సాగుతున్నాయి. అమలాపురంలోని ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థినిలు సంక్రాంతి పిండివంటలపై పోటీలు పెట్టుకున్నారు. వివిధ రకాల వంటలతో అదరగొట్టారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

14:29 - January 11, 2016

గుంటూరు : ట్రాక్టర్‌ అదుపుతప్పి ఇంట్లో దూసుకురావడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మహానాడులో ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్‌ను వెనక్కి తీస్తుండగా అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. అక్కడి గోడ విరిగి ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై పడింది. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, నలుగురు పిల్లలున్నారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

14:26 - January 11, 2016

విజయవాడ : గులాబీ తోటలోని శ్రీకృష్ణ ప్రార్థనా మందిరాన్ని తొలగించవద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. రన్నింగ్‌ ట్రాక్‌పై ఉన్న శ్రీ కృష్ణమందిరం సుందరీకరణకు అడ్డంలేకున్నా కార్పొరేషన్‌ అధికారులు తొలగించడాన్ని స్థానిక టిడిపి కార్పొరేటర్‌ కాకు మల్లిఖార్జున యాదవ్ అడ్డుకున్నారు. అయితే కార్పొరేషన్‌ అధికారుల వైఖరికి నిరసనగా కార్పొరేటర్‌తో పాటు స్థానికులు మందిరం వద్దే బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుందరీకరణకు అడ్డుగా ఉంటే తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. కృష్ణ మందిరాన్ని తొలగిస్తే ఊరుకునే ప్రసక్తేలేదని, ప్రజల తరపున పోరాటం చేస్తామని మల్లిఖార్జున యాదవ్ హెచ్చరించారు.

 

14:23 - January 11, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ పై ప్రగల్భాలు పేలుతున్న కిషన్ రెడ్డి మాటలు చూస్తే బీజేపీ భారతీయ జోక్ పార్టీ అన్నారు కేటీఆర్. మతాన్ని పట్టుకుని తిరుగుతూ ప్రజలను పట్టించుకోని పార్టీ బీజేపీ అని ఎద్దేవా చేశారు. పాతబస్తీ అభివృద్ది చెందకపోవడానికి మజ్లిస్ పార్టీనే కారణమంన్నారు. గతంలో గ్రేటర్ పీఠాన్ని ఏలిన మజ్లీస్... ఏం చేసిందని ప్రశ్నించారు కేటీఆర్. కేసీఆర్ లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరమని, ఇంకో 15 ఏళ్లు సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఎంతమంది సినిమా యాక్టర్లు వచ్చినా తమకు పోయేదేమి లేదని, కేసీఆర్ గ్లామర్ తమకు ఉందన్నారు. ఆ రోజు తమాషాగా అన్న మాటలను చిలువలు వలువలు చేశారని కేటీఆర్ విమర్శించారు. 

సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక బస్సులు - మహేందర్ రెడ్డి..

కరీంనగర్ : సమ్మక్క సారక్క జాతరకు 3,700 ప్రత్యేక బస్సులు నడుపుతామని మంత్రి మహేందర్ రెడ్డి వెల్లడించారు. రూ.2 కోట్లతో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, జాతరకు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 

రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశం..

ఢిల్లీ : ఎన్ఎన్ఏ, ఇంటెలిజెన్స్ చీఫ్, రా అధికారులతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. 

ఆ ప్రాజెక్టుల వల్ల ఏపీకి నష్టం - రఘువీరా…

విజయవాడ : టీఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు - రంగారెడ్డి నక్కలగండి లిఫ్ట్ ప్రాజెక్టులు పూర్తయితే ఏపీకి నష్టం జరుగుతుందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా డెల్టా ప్రాజెక్టులు నిరుపయోగమవుతాయని, సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదన్నారు. చట్టం ఉల్లంఘించి తెలంగాణలో ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు మౌనంగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, కేసీఆర్ తో లాలూచీ పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. 

మదనపల్లి సర్కారీ ఆసుపత్రిలో త్రాచుపాము..

చిత్తూరు : మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో త్రాచు పాము కలకలం సృష్టించింది. చిన్న పిల్లల వార్డులోకి పాము రావడంతో రోగులు బయటకు పరుగులు తీశారు. 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమవేశం ప్రారంభం..

హైదరాబాద్ : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం ప్రారంభమైంది. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, తమ్మినేని హాజరయ్యారు. 

కేటీఆర్ సవాల్..

హైదరాబాద్ : గ్రేటర్ టీఆర్ఎస్ జెండా ఎగురకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ మీట్ ద ప్రెస్ లో సవాల్ విసిరారు. లేదంటే ఉత్తమ్, కిషన్ రెడ్డి, టిడిపి నేతలు రాజీనామా చేస్తారా ? అని ప్రశ్నించారు. బీజేపీ అంటే భారతీయ జోక్ పార్టీ అని అభివర్ణించారు. నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని కేసీఆర్ పాలనపై ప్రజలకు నమ్మకం ఉందని, గత ప్రభుత్వాలు గ్రేటర్ ప్రజల అవసరాలు తీర్చలేదన్నారు. 18 నెలల పాలనలో టీఆర్ఎస్ ఏం చేసింది ? భవిష్యత్ లో ఏం చేస్తుందో ? చెప్పే బాధ్యత తమపై ఉందన్నారు. నగరం మినీ ఇండియా అని, అన్ని ప్రాంతాల వారు హైదరాబాద్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు.

షానీ సింగపూర్ ట్రస్టు అధ్యక్షురాలుగా మహిళ...

ముంబై : షానీ సింగపూర్ ట్రస్టు అధ్యక్షురాలుగా మహిళ ఎంపికైంది. ట్రస్టులో మరో ఇద్దరు మహిళలకు సభ్యులుగా అవకాశం లభించింది. గతంలో షానీ సింగపూర్ కు మహిళలపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. 

తెలుగు ప్రజల భద్రతను గాలికొదిలేశాయి - వైసీపీ

హైదరాబాద్ : రెండు ప్రభుత్వాలు తెలుగు ప్రజల భద్రతను గాలికొదిలేశాయని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగు భాషకు, విద్యార్థులకు ఇబ్బందులు వస్తే ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఏపీలో భాగస్వామ్య సమ్మిట్ ద్వారా ఒక్క రోజులోనే రూ.1.90 కోట్లు వచ్చినట్లు సర్కార్ చెబుతోందని, గతంలో ఇలాంటి ఆరు సమ్మిట్ లను నిర్వహించిన బాబు ఎంతమందికి ఉపాధి కల్పించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక వేత్తలతో బాబు చీకటి ఒప్పందం చేసుకున్నారనే అనుమానం ఉందని విమర్శించారు.

 

రైతుల పక్షాన సీపీఎం - మధు..

ప్రకాశం : భూ సేకరణలో భూములు కోల్పోతున్న బాధితులకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. సేకరించిన భూముల్లో ఏ పరిశ్రమలు నెలకొల్పుతున్నారో ప్రజలకు ముందుగా చెప్పాలని సూచించారు. రైతుల పక్షాన సీపీఎం నిలబడుతుందన్నారు.

 

మెదక్ లో సీఎం శంకుస్థాపనలు..

మెదక్ : జగదేవ్ పూర్ (మం) నర్సన్నపేటలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఎర్రవెల్లిలో రూ.28.80 కోట్లతో కూడవెళ్లి వాగుపై చెక్ డ్యాంల నిర్మాణానికి, దుబ్బాకలో రూ.42.54 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్...దుబ్బాకలో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు మిషన్ కాకతీయ రెండో దశలో భాగంగా రామసముద్రంలో మినీ ట్యాంక్ బండ్ కు శంకుస్థాపన చేశారు. ఎర్రవెల్లి, నర్సన్నపేటలో చెరువుల కోసం రూ. 6 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు వేల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు, ప్రతి రైతుకు సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు అందచేస్తామని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీకి రూ.

13:31 - January 11, 2016

హైదరాబాద్ : ఆకాశంలో చందమామను దూరంనుంచి చూడటమే కాదు... అక్కడ ఏకంగా నివాసం ఉండేలా గ్రామాల నిర్మాణానికి శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు.. వ్యోమగాములు, రోబోటిక్‌ వ్యవస్థల సహకారంద్వారా 2030కి ఇది పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. అంగారకుడితోపాటు... ఇతర సుదూర ప్రదేశాలపైకి వెళ్లేందుకు ఈ గ్రామాలను వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు..

ఐరోపాలో మూన్‌ 2020, 2030 పేరిట .....

ఐరోపాలో మూన్‌ 2020, 2030 పేరిట ఐరోపా అంతరిక్ష సంస్థ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో గ్రామాల నిర్మాణంపై నిపుణులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాల్గొన్నారు... ముందు జాబిల్లిపై గ్రామాల కల సాకారం కావాలంటే అక్కడున్న వనరుల గురించి తెలుసుకోవాలి.. వాటివల్ల కలిగే ప్రయోజనాన్ని అంచనావేయాలి.. ఆ తర్వాత వనరులను ఉపయోగకడే వస్తువులుగా మార్చాలి... ఇవన్నీ పూర్తయితే సౌరకుటుంబం అన్వేషణలో చందమామే క్రీయాశీలపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు వివరించారు..

అంతరిక్షంనుంచి ల్యాండింగ్‌, రోబోటిక్‌ పద్ధతిలో నమూనాలు.....

అయితే అంతరిక్షంనుంచి ల్యాండింగ్‌, రోబోటిక్‌ పద్ధతిలో నమూనాలు సేకరించి భూమిని తిరిగి తీసుకువచ్చే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకివచ్చింది.. ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని జాబిల్లిపై పరిశోధనలు మరింత పెంచారు శాస్త్రవేత్తలు.. ఇవి విజయవంతమైతే 2030 నాటికి చందమామపై గ్రామాలు, అందులో మనుషులు జీవనం లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది..

13:29 - January 11, 2016

హైదరాబాద్ : పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని సందేహం వ్యక్తం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి.. ఒక్కరోజూ లక్షా తొంభైవేల కోట్ల విలువైన అగ్రిమెంట్లు జరిగాయంటూ ఆర్భాటంగా ప్రకటించడం ప్రజలను మోసం చేయడమే అన్నారు.. గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఆరు సమ్మిట్‌లు ఏర్పాటుచేశామన్న చంద్రబాబు.. రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు..

13:27 - January 11, 2016

హైదరాబాద్ :గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా నామినేషన్లకు సిద్ధమైంది కాప్రా సర్కిల్‌ కార్యాలయం.. రేపటినుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి.. ఈ డివిజన్‌లో నామినేషన్లకోసం ఆరు కార్యాలయాలు ఏర్పాటు చేశారు.. నామినేషన్‌వేసే వ్యక్తితోపాటు మరొకరిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని కాప్రా ఉప కమిషనర్‌ తెలిపారు..

13:26 - January 11, 2016

హైదరాబాద్ : ఐటీ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీని గ్రేటర్ ఎన్నికల్లో నిలపలేకపోతే మంత్రి పదివికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రతిపక్షాలు ఓడిపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు హైదరాబాద్ లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ....కేటీఆర్. గెలిచే సత్తా ఉన్న పార్టీలే బరిలో నిలవాలంటూ సవాల్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ జెండా గ్రేటర్ పీటంపై ఎగరకపోతే రాజీనామా చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.

13:23 - January 11, 2016

హైదరాబాద్ : హైకోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలతో పశ్చిమాన పందెం కోళ్ల ముచ్చట ఎలా ఉన్నా సినిమా బరిలో మాత్రం నందమూరి హీరోలు ఢీ అంటే ఢీ అంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాబాయ్ నందమూరి బాలకృష్ణ, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్‌ల సినిమాలు కేవలం ఒక్కరోజు వ్యవధిలో విడుదల కానుండటంతో టీడీపీ నేతలు వర్గ రాజకీయాలకు తెరలేపారు.

12:42 - January 11, 2016

విశాఖ : ప్రపంచం మొత్తం భారత్‌ వైపే చూస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ రెండోరోజు సదస్సులో పాల్గొన్న వెంకయ్యనాయుడు... అభివృద్ధిలో భారత్‌ దూసుకుపోతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అటు దేశంలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నాయన్నారు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. 

12:40 - January 11, 2016

విశాఖ : ప్రధాని నరేంద్ర మోడి సారధ్యంలో భారత్‌ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ రెండో సదస్సులో పాల్గొన్న చంద్రబాబు...ఏపీ అభివృద్ధికి అద్బుతమైన ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. 900 కిలోమీటర్లకు పైగా ఉన్న కోస్తాతీరం ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని సీఎం అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

12:38 - January 11, 2016

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ 20వ వర్దంతిని సందర్బంగా ఈనెల 18న లెజెండరీ బ్లడ్ డొనేషన్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని దివంగత ఎన్టీఆర్‌ కుమార్తె భువనేశ్వరి తెలిపారు. జనవరి 18న నిర్వహించే ఈ బ్లడ్ క్యాంప్‌కు దాతలు ముందుకొచ్చి రక్తాన్ని దానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్‌ కుమార్తెగా పుట్టడం తాను చేసుకున్న అదృష్టం అన్నారు. 

12:37 - January 11, 2016

మెదక్ : దుబ్బాకలో పాఠశాల నూతన భవనానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. మిషన్ కాకతీయ రెండో దశలో రామసముద్రం చెరువు సుందరీకరణ, ఆధునీకరణ పనులకు , 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. ప్రతి రైతుకు బిందు సేద్యం పరికరాలు రాయితీపై అందిస్తామని కుండ్లేరుపై చెక్‌డ్యాం నిర్మాణం కోసం మరో రూ.28.80కోట్లు మంజూరు కాగా ఆ పనులను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 

12:35 - January 11, 2016

హైదరాబాద్ : ఢిల్లీలో ఈ నెల 15వరకూ సరి, బేసి సంఖ్య వాహనాల నిబంధనను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతించింది.. ఈ విధానాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టులో విచారణ కొనసాగింది.. రోడ్లపై వాహనాల సంఖ్యను నియంత్రించిన ఢిల్లీ ప్రభుత్వం.... ప్రజలకు సరిపోయే సంఖ్యలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును ఏర్పాటు చేయలేదని అసంతృప్తి వ్యక్తంచేసింది.. అయితే సరి, బేసి విధానంతో కాలుష్యం 50 శాతం తగ్గిందని ఢిల్లీ సర్కారు స్పష్టం చేసింది... ఢిల్లీ పొల్యూషన్‌ కమిటీ ఈ విషయం నిర్ధారించిందని తెలిపింది. దీంతో ఈనెల 15వరకు అనుమతిస్తూ.. న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మరోసారి గాలినుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తామని వివరించింది.. 

12:34 - January 11, 2016

ఢిల్లీ : తమిళనాట సంప్రదాయ జల్లికట్టు క్రీడకు అనుమతినిస్తూ 3రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ పై సుప్రీంలో వన్యప్రాణి స్వచ్ఛంద సంస్థలు 6 పిటిషన్ లు దాఖలు చేశాయి. 2014లో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు నోటిఫికేషన్ విరుద్ధంగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్ల పై రేపు విచారణ రానున్నాయి.

12:32 - January 11, 2016

ఢిల్లీ : డ్రోన్లు..ఉగ్ర కదలికలను, దొంగల జాడను ఇట్టే పసిగడతాయి. ఇంకా చెప్పాలంటే వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల డెలివరీలోనూ డ్రోన్ల వినియోగం తప్పనిసరి. ఎన్నో అవసరాలకు ఉపయోగపడే డ్రోన్లు తర్వలో...పంటనష్టం అంచనాలు కూడా వేయనున్నాయి. అన్ని అనుమతులు లభిస్తే.. త్వరలో వచ్చే పంటల బీమా పథకానికి డ్రోన్లే కీలకం కానున్నాయి.

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు ....

ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా తుఫాను, వరదల ధాటికి ఒక్క ఉదూటున కొట్టుకుపోతుంది. దీంతో పంటసాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక..రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కష్టపడి పండించిన పంటంతా కళ్లముందే నీటిలో మునిగిపోవడంతో రైతు పరిస్థితి మాటల్లో వర్ణించలేం. పంట నష్టపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతు..ప్రభుత్వ సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తాడు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు ఇచ్చే పంట నష్టపరిహారం అరకొరనే చెప్పాలి. లక్షల్లో నష్టపోతే ఎకరాకు పదివేలో, 12వేలో ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. అయితే ఇలాంటి పరిస్థితికి చెక్‌పెట్టాలనుకుంటుంది మోదీ ప్రభుత్వం. పంట నష్టపోయిన రైతుకు అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో పూర్తిస్థాయిలో పంట బీమాను అందించాలని నిర్ణయించింది.

డ్రోన్ల సహాయంతో పరిహారం చెల్లింపు ....

డ్రోన్ల సహాయంతో పంట నష్టపోయిన రైతులకు ఖచ్చితమైన పరిహారాన్ని అందించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. శాటిలైట్‌ సహాయంతో డ్రోన్లు తీసే పంట విజువల్స్, ఫోటోల ఆధారంగా ఖచ్చితమైన పరిహారాన్ని రైతుకు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త తరహా పంటల బీమా పథకానికి ఈనెల 13వ తేదిన జరిగే కేబినెట్‌ భేటీలో ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. సంక్రాంతి కానుకగా ప్రకటించబోతున్న ఈ పథకంలో నిర్థుష్ట కాలపరిమితి ప్రకారం బీమా మొత్తాలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి భారతీయ కృషి బీమా యోజన అనే పేరును ఖరారు చేశారు.

బీమా మొత్తంలో 1.5శాతం నుంచి 5శాతం.....

పంట రకాలను బట్టి బీమా చేసే మొత్తంలో 1.5శాతం నుంచి 5శాతం వరకు ప్రీమియం రూపంలో చెల్లించాలని నిర్ణయించారు. వాణిజ్య పంటలకు 5శాతం, వరి, పప్పుధాన్యాలకు 2.5శాతం, నూనె గింజల పంటలకు 2శాతం, గోధుమలకు 1.5శాతం చొప్పున ప్రీమియాలను నిర్ణయించారు. ప్రీమియం మొత్తంలో 95శాతం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే బీమా మొత్తంలో కనీసం 25శాతాన్ని వెంటనే పరిహారంగా చెల్లిస్తారు. మిగత 75శాతాన్ని 45రోజుల్లోగా చెల్లిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పంటల బీమా పథకం ద్వారా కనీసం 50శాతం మంది రైతులు ఈ ప్రయోజనాన్ని పొందుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటివరకు దేశంలో 3 వేర్వేరు రకాల పంటల బీమా పథకాలు అమల్లో ఉన్న 14 కోట్ల మంది రైతుల్లో 23శాతం మందే వాటిని వినియోగించుకుంటున్నారు. కేంద్రం తెస్తున్న కొత్త పంటల బీమా పథకంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

'జల్లికట్టు'అనుమతి పై సుప్రీంలో పిటిషన్

హైదరాబాద్ : తమిళనాట సంప్రదాయ జల్లికట్టు క్రీడకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ పై సుప్రీంలో వన్యప్రాణి స్వచ్ఛంద సంస్థలు పిటిషన్ లు దాఖలు చేశాయి. 2014లో సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు నోటిఫికేషన్ విరుద్ధంగా ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్ రేపు విచారణ రానున్నాయి.

12:21 - January 11, 2016

హైదరాబాద్ : హైదరాబాద్ అంటే మినీ ఇండియా అని… నగరంలో అన్ని భాషలు.. అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్ లో సోమవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. హైదరాబాద్ లో 33 శాతం భూభాగం ఉంటే 30 శాతం జనాభా ఉన్నారు. నగర అవసరాలకు దగ్గ విధంగా కనీస అవసరాలు తీర్చడంలో గత పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. టిఆర్ ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రాంతీయేతరులందరిని తరిమి వేస్తారని విషప్రచారం చేశారు. అలాంటి విషప్రచారానికి తిప్పి కొట్టి.. అందరూ ఐక్యంగా ఉండగలిగారన్నారు. ఉమ్మడి ఏపీ రాజధానికి ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా ఉన్న హైదరాబాద్ నగరం ఉందని.. రాష్ట్ర విభజన అనంతరం భవిష్యత్ లో కూడా హైదరాబాద్ ప్రధాన ఆర్థిక వనరుగా ఉండబోతోందని తేల్చిచెప్పారు. అన్నీ హంగులు కలిగిన నగరంగా 18 మాసాల్లో తీర్చి దిద్దామన్నారు. తెలంగాణ కు కరెంటు ఎక్కడ నుంచి వస్తుందని గత పాలకులు అపహాస్యం చేశారు. వాటన్నింటిని పటాపంచలు చేసి పవర్ కట్ లేకుండా చేశం. సీఎం కేసీఆర్ స్వీయం పర్యవేక్ష ణలో పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడం, ప్లాన్ ప్రకారం వెళ్లడం వల్ల పవర్ కట్ లేని విద్యుత్ ను అందించగలిగామని తెలిపారు.

పెట్టుబడులకు భారత్ అనుకూలం : చంద్రబాబు

విశాఖ : ప్రపంచంలోనే పెట్టుబడులకు భారత్ అత్యంత అనుకూల దేశం కాగా.. ఏపీ ఇన్వెస్ట్ మెంట్ కు స్వర్గధామంగా నిలిచిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో రెండోరోజు ఆయన పాల్గొన్నారు. ‘సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌- విజన్‌ 2029’ అంశంపై చర్చల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో 41 దేశాలు పాల్గొన్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు తాము నిబద్ధతతో పని చేస్తామన్నారు. అత్యధిక తీర ప్రాంతమున్న ఏపీ భవిష్యత్ లో దేశానికే మార్గదర్శిగా నిలువనుందని..

నిరంతర విద్యుత్ అందిస్తా: సీఎంకేసీఆర్

మెదక్ : ఎర్రవల్లి, నర్సన్నపేటకు రెండు రోజుల్లో త్రీ ఫేజ్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలో పర్యటించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఎర్రవల్లి, నర్సన్నపేటలో 3 వేల ఎకరాల్లో బిందు సేద్యం ద్వారా సాగు చేస్తామన్నారు. ప్రతి రైతుకు బిందు సేద్యం పరికరాలు రాయితీపై అందిస్తామని చెప్పారు. ఈ రెండు గ్రామాల్లోని చెరువుల అభివృద్ధికి రూ. 6 కోట్లు మంజూరు చేస్తామన్నారు. ఏప్రిల్ 30 నాటికి ప్రతి ఇంటికి గోదావరి జలాలు సరఫరా చేస్తామని వెల్లడించారు.

11:48 - January 11, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ ఎస్ గెలుపు ఖాయమంటున్నారు ఆ పార్టీ నేతలు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ది చేయ్యడానికి అవసరం అయిన అన్ని చర్యలను టీఆర్ ఎస్ ప్రభుత్వం చేపడుతుందంటున్నారు నల్లకుంట టిఆర్ ఎస్ నేత పసుపులేటి రమేష్. గ్రేటర్ ప్రజల సంక్షేమం కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నామని, పేదల ఆకలి తీర్చడానికి 5రూపాయలకే అన్నం పెడుతున్నామని పసుపులేటి రమేష్ పేర్కొన్నారు.

11:46 - January 11, 2016

హైదరాబాద్ : ఈ విడత గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో మహిళా ప్రాతినిద్యం పెరగనుంది. స్థానిక సంస్థల్లో 50 శాతం సీట్లు మహిళలకు కేటాయించడంతో జీహెచ్ ఎంసీ లో 75 మంది మహిళా కార్పొరేటర్లు రానున్నారు. మరోవైపు యువకులు కూడా గ్రేటర్ కార్పొరేషన్లో అడుగుపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నల్లకుంటకు చెందిన టిఆర్ ఎస్ నాయకులు దూసరి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

11:43 - January 11, 2016

హైదరాబాద్ : గ్రేటర్ అభివృద్దికి టిఆర్ ఎస్ పెద్దగా చేసిందేం లేదంటున్నారు హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు. తమ పార్టీ చేసిన అనేక కార్యక్రమాలను తామే అభివృద్ది చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో అంబర్ పేట్ నియోజకవర్గంలోని 4 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుందని, ఈసారి కూడా అదే ఫలితాలు పునారావృతం అవుతాయంటున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని, గ్రేటర్ లో మతసామరస్యం కాపాడాలి అంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమంటున్న నల్లకుంట కాంగ్రెస్ కార్యదర్శి యాదగిరిగౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా రక్తదాన శిబిరం : భువనేశ్వరి

హైదరాబాద్ : స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా ఈనెల 18న లెజెండరీ బ్లెడ్ డొనేషన్ డ్రైవ్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు. సోమవారం ఎన్టీఆర్‌ట్రస్ట్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ తెలుగు జాతికి కీర్తి, ప్రతిష్టలు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆ మహానుభావుడికి కూతురుగా పుట్టడం తన అదృష్టమన్నారు. రక్తదానంపై ప్రతీ ఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని కోరారు. ఈనెల 18న నిర్వహించనున్న మెగా రక్తదానంలో ఎన్టీఆర్ అభిమానులంతా పాల్గొనాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు.

విదేశీ పెట్టుబడిదారుల చూపు భారత్ పైనే : వెంకయ్య

విశాఖ : విదేశీ పెట్టుబడిదారుల చూపు భారత్ పైనే ఉదంని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో రెండోరోజు ఆయన పాల్గొన్నారు. ‘సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌- విజన్‌ 2029’ అంశంపై చర్చల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సులో 41 దేశాలు పాల్గొన్నాయి.అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇండియాను బలీయమైన ఆర్థిక శక్తిగా గుర్తించాయన్నారు. ఏపీలో విశాఖ, కాకినాడ, తిరుపతి నగరలను ఆకర్షణీయ నగరాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 28 పట్టణాలను అమృత్, ఒక నగరాన్ని వరాసత్వ నగరంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. పెట్టుబడుల విషయంలో ఏపీ కి సహకరిస్తామని స్పష్టం చేశారు. 

'కూడవెల్లి'చెక్‌డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపనచేసిన కేసీఆర్

మెదక్ : సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఎర్రవెల్లిలో రూ. 28.80 కోట్లతో కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సీఎం దత్తత గ్రామం ఎర్రవల్లిలో వంద శాతం సబ్సిడీతో రూ. 42.54 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్‌కు సీఎం శంకుస్థాపన చేశారు.

ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మహిళపై అఘాయిత్యం…

హైదరాబాద్ : అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్న మహిళపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ అవమానంతో యువతి ఆత్మహత్యాయత్నం...

నల్గొండ : వేములపల్లి మండలం రావుల సెంటర్లో యువతిపై అంజి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి అవమానం భరించలేక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన స్థానికులు ఆమెను హుఠాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

10:50 - January 11, 2016

హైదరాబాద్: పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటనలో ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు. ఇప్పటికే పఠాన్ కోట్ లో కీలక ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధికారులు... ఇవాళ ఈ కేసులో... టెర్రరిస్టుల చేతికి చిక్కిన ఎస్పీ సల్విందర్ సింగ్‌ ను విచారించనున్నారు. ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ఆయనకు సమన్లు జారీచేసింది. గతంలో కూడా సల్విందర్ ను విచారించారు. అయితే ఆయన పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో.. లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.  

సల్విందర్‌కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించే చాన్స్

హైదరాబాద్: పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటనలో ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు. ఇప్పటికే పఠాన్ కోట్ లో కీలక ఆధారాలు సేకరించిన దర్యాప్తు అధికారులు... ఇవాళ ఈ కేసులో... టెర్రరిస్టుల చేతికి చిక్కిన ఎస్పీ సల్విందర్ సింగ్‌ ను విచారించనున్నారు. ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ఆయనకు సమన్లు జారీచేసింది. గతంలో కూడా సల్విందర్ ను విచారించారు. అయితే ఆయన పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో.. లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.

 

10:47 - January 11, 2016

వరంగల్ : తెలంగాణలో తొలిసారిగా అంతర్జాతీయ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను తొలిసారిగా వరంగల్ లో ఘనంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన షాట్ ఫిల్మ్‌ ఫెస్టివల్ లో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన షాట్ ఫిలిమ్స్ తో పాటు.. 20 దేశాల నుండి వచ్చిన 144 షాట్ ఫాల్మ్స్ ను నగరంలోని కేయూ ఆడిటోరియంలో ప్రదర్శించారు. వరంగల్ లో ఇంటర్ నేషనల్ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ నిర్వహించినందుకు సంతోషంగా ఉందన్నారు మంత్రి చందూలాల్. తెలంగాణ ప్రభుత్వం ప్రతి నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసేందుకు సిద్దంగా ఉందన్నారు మంత్రి.

రుద్రమదేవి చిత్రాన్ని నిర్మించినందుకు....

కాకతీయ వీరనారి రుద్రమదేవి చిత్రాన్ని నిర్మించినందుకు తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుద్రమదేవి నిర్మించానని ఈ సినిమా తర్వాత రుద్రమదేవిని, వరంగల్ నగరం గురించి గూగుల్ లో సెర్చ్ చేసే వారి సంఖ్య పెరిగిందన్నారు. అటువంటి వరంగల్ నగరవిశేషాలు చరిత్ర తెలుసుకునేందుకు అంతర్జాతీయ షార్ట్‌ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతగానో తోడ్పతాయన్నారు.

ఇరాన్, ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ , ఫ్రాన్స్ , బెల్జియం .....

ఇరాన్, ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ , ఫ్రాన్స్ , బెల్జియం , దక్షిణాఫ్రికా , ఇండోనేషియా, మలేషియా , సింగపూర్ , థాయ్ లాండ్ , జపాన్ తదితర దేశాలు ఫెస్టివల్ లో పాల్గొన్నాయి. దాదాపు ఇరవై దేశాలకు చెందిన 144 షార్ట్ ఫిల్మ్స్ ను ప్రదర్శించనున్నారు నిర్వాహకులు. తెలంగాణ చరిత్ర , కోటలకు సంబంధించి, ప్రొఫెసర్ జయశంకర్ జీవిత చరిత్ర పై షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు నిర్వాహకులు. దీంతో విదేశీ ప్రతినిధులు సైతం సంతోషం వ్యక్తం చేశారన్నారు.

తెలంగాణ జాతిపిత జీవిత విశేషాలు ప్రదర్శనలో ....

జాతీయ, అంతర్జాతీయ షార్ట్‌ ఫిల్మ్స్ ప్రదర్శనకు రావడంతోనే తెలంగాణ కీర్తి ఎల్లలు దాటింది. తెలంగాణ జాతిపిత జీవిత విశేషాలు ప్రదర్శనలో ఉంచడం, అంతర్జాతీయ సినిమాలు ప్రదర్శించడం ద్వారా దేశంలోనే అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.

10:42 - January 11, 2016

కడప : అక్కడ మగవాళ్లే గరిట పట్టాలి. నలభీములై వంట చేయాలి. కట్టెల పొయ్యిని ఊదాలన్నా మంట మండించాలన్నా ఆడవారి సాయం తీసుకోకూడదు. అఫ్‌కోర్స్‌ అసలు మహిళలు ఆ ప్రాంగణంలోనే అడుగుపెట్టకూడదు. అడుగు పెట్టినా దూరం నుంచే చూసి వెళ్లాలి. ఆ నియమాలను ఏమాత్రం అతిక్రమించినా ఏదో జరిగిపోతుందనే భయం. అన్నిటిలో మహిళలకు సమ ప్రాధాన్యత కల్పిస్తున్నా అక్కడ మాత్రం వివక్ష కొనసాగుతోంది. మరి ఆ ఊరు అక్కడి క్షేత్రానికి ఉన్న నిబంధనలేంటో మీరూ చూడండి..

సంజీవరాయస్వామి ఆలయం....

అలవాటు లేకపోయినా మగవారే వంట చేయాలి. మహిళలు దూరంగా నిలుచుని అవసరమైతే సలహాలు ఇస్తారు. ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తూ వస్తున్న ఈ విధానం కడప జిల్లా పుల్లంపేట మండలంలోని తిప్పాయిపల్లెలో మాత్రమే కనిపిస్తుంది. గ్రామంలోని సంజీవరాయస్వామి ఆలయం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయానికి వేదికగా నిలుస్తోంది.

తీవ్ర కరువుతో జనజీవనం అస్తవ్యస్తం.............

ఎక్కడా కనిపించని ఈ విధానం ఇక్కడే నెలకొనడం వెనక పెద్ద కథుంది. పూర్వం గ్రామంలో కరువు ఏర్పడి జనజీవనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారట. ఆ సమయంలో గ్రామానికి వచ్చిన ఓ వృద్ధుడు కరువుతో అంతా బాధపడుతుండడాన్ని చూసి ఓ ఏర్పాటు చేశాడు. ఓ రాత్రి వేళ పల్లెకు నైరుతి దిశలో రాతి మీద బీజాక్షరాలు చెక్కి దానికి సంజీవరాయస్వామి అని పేరు పెట్టాడు. ఆలయ సరిహద్దులు కూడా నిర్దేశించి కొన్ని నిబంధనలు చెప్పాడు.

సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజున....

సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం రోజున మగవారు మాత్రమే ఉమ్మడిగా పొంగళ్లు వండాలి. వారే తీసుకెళ్లి నైవేద్యం పెట్టాలి. కేవలం మగవారు పదేళ్ల లోపుబాలబాలికలు మాత్రమే ఆ ప్రసాదం తినాలని నిర్దేశించాడు. ఇలా నిబంధనలు చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అంతర్ధానమయ్యాడని గ్రామస్తులు చెబుతుంటారు.

నాటి నుంచి కరువు సమస్య దూరం....

నాటి నుంచి నేటివరకు గ్రామస్తులు ఆ నియమాలను పాటిస్తూ వస్తున్నారు. కరువు లాంటి సమస్యలు ఇప్పటివరకైతే ఏర్పడలేదంటున్నారు. మహిళలు గుడికి వచ్చినా దూరం నుంచే దర్శనం చేసుకుని వెళ్తుంటారు. సంక్రాంతి ఉగాదికన్నా ఈ పొంగళ్లు వండే కార్యక్రమాన్నే వీళ్లు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ నిబంధనలను కొందరు వ్యతిరేకిస్తున్నారు. గ్రామస్తులు మాత్రం ఈ ఆచారాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామంటున్నారు. 

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్ : గతవారం భారీ నష్టాలను చూసిన స్టాక్ మార్కెట్ ఈవారం కూడా నెగిటివ్ గానే స్పందించింది. శుక్రవారం లాభాలతో సంబంధం లేకుండా... సెన్సెక్స్ ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలోనే 300 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఆటో షేర్లలో అమ్మకాలు సాగుతున్నాయి. నిఫ్టిలో వేదాంతా షేర్ 4శాతం నష్టపోయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కోల్ ఇండియా, టాటా స్టీల్, బెల్ 3శాతం వరకు క్షీణించాయి. ఎన్టీపీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్ మాత్రమే లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

10:38 - January 11, 2016

హైదరాబాద్ : కర్ణాటక చీఫ్ సెక్రటరీ అరవింద్‌ జాదవ్‌ కాసేపు పీటీ ఉషాలా మారిపోయారు.. గ్రౌండ్‌ ఫ్లోర్‌నుంచి మూడో అంతస్తువరకూ పరుగుతీశారు.. ఈ పరుగు ఇది ఏ రన్నింగ్‌ రేస్‌కోసమో... ఏ మారథాన్‌ కోసమో కాదు.. మీడియానుంచి తప్పించుకునేందుకు.. అసలు విషయం ఏంటంటే... సచివాలయంలో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై అధ్యక్షతన సమావేశం ఏర్పాటైంది.. దీనికి 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు అరవింద్‌.. కారునుంచి దిగగానే వెంటనే మూడో ఫ్లోర్‌కు రన్నింగ్‌ చేశారు.. లోపలికి వెళ్లాక ఎవ్వరూ రాకుండా డోర్‌ లాక్ చేసుకున్నారు.. ఎందుకిలా చేశారంటూ ఆరాతీసినవారు.. అసలు సంగతి తెలుసుకొని ఆశ్చర్యపోయారు.. లేట్‌గా వచ్చారంటూ మీడియా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందని ఇలా చేశారట ఆ సీఎస్‌గారు... ఇదీ ఆ ఫ్లోర్‌ రన్‌ వెనకున్న అసలు విషయం...

రెండో రోజు ప్రారంభమైన భాగస్వామ్య సదస్సు

విశాఖ :ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కేంద్ర సర్కారు, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు రెండోరోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జయంత్‌ సిన్హా, పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఆదివారం ప్రారంభమైన ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ తొలిరేజే 32 సంస్థలతో రూ.1,95,457 కోట్లఒప్పందాలను కుదుర్చుకుంది. రెండోరోజైన సోమవారం 49 ఐటీ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోనుంది. 'సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ' పై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రసంగించనున్నట్లు సమాచారం.

10:26 - January 11, 2016

మిల్లెట్ లేదా రాగులు లేదా తైదలు, చోళ్ళు అని సాధారణంగా రెగ్యులర్ గా పిలుస్తుంటారు. వీటిని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. రాగులు దక్షిణ భారతదేశం అంతటా అనేక గ్రామాలలో ఒక ప్రధానమైన ఆహారం. రాగులు ఇతర ధాన్యాల కంటే బలవర్ధకమైనవి.
రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ ధాన్యంలో లోఫ్యాట్ శాతాన్ని కలిగి ఉంటుంది మరియు ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉంటుంది .
ఉపయోగాలు...
రాగుల వల్ల జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది.మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుం ది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. వృద్దాప్యంలో వున్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.
మధుమేహానికి చెక్…
మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ఫింగర్ మిల్లెట్ యొక్క ఫైటోకెమికల్స్ జీర్ణప్రక్రియ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మధుమేహగ్రస్తుల్లో చక్కరస్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.
ప్రోటీన్/అమైనో ఆమ్లాల కోసం రాగులు:
రాగుల్లో అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో సాధారణ కార్యాచరణకు కీలకం మరియు శరీర కణజాలముల బాగు కోసం ఇవి చాలా అవసరం. ఇది శరీరంలో నైట్రోజన్ సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
తగిన మోతాదులో లభించే మెగ్నీషియం.....
రాగుల్లో తగిన మోతాదులో లభించే మెగ్నీషియం మైగ్రెయిన్‌ తలనొప్పీ, గుండె సంబంధిత వ్యాధులకు చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. విటమిన్‌ బీ3 శరీరంలోని కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తుంది. వీటిల్లో అధిక మోతాదులో లభించే యాంటీ ఆక్సిడెంట్లూ, క్యాన్సర్‌ కారకాలైన ఫ్రీరాడికళ్లను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ట్రిప్టోఫాన్‌గా పిలిచే అమినో యాసిడ్‌ రాగిలో తగు మోతాదులో లభిస్తుంది. ఇది ఆకలిని తగ్గించి వూబకాయం రాకుండా కాపాడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని ఫైటో కెమికల్స్‌ జీర్ణ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి.

10:07 - January 11, 2016

రేగిపళ్ళు అనగానే చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయా? రేగిపళ్లులో చిట్టిరేగి, పెద్దరేగి, గంగిరేగి ఇలా అనేక రకాల జాతులు ఉన్నాయి. ఇప్పుడు చెట్లు లేవు, ఆ ఉత్సాహము లేదు కాని ఈ పుల్లని రేగిపళ్ళు మాత్రం తినాలని అన్పిస్తుందా? అస్సలు అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా? అవేంటో చూద్దాం.. రేగిపండ్ల జ్యూస్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి అధికం. రేగిపండ్లను జ్యూస్ రూపంలో తీసుకున్నా.. అలాగే తీసుకున్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రేగిపండ్లను రోజుకు 3-6 తినడం వల్ల శరీరంలో బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. ఈ పండ్ల జ్యూస్ త్రాగడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో గుండెపోటు, హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అలాగే బరువు తగ్గాలనుకుంటే.. రేగిపండ్ల జ్యూస్ తాగండి. ఫ్రూనే జ్యూస్‌లో ఉండే సోలబుల్ ఫైబర్ ఆకలి అనిపించకుండా వేరే ఇతర ఆహారాల జోలికి పోకుండా చేస్తుంది. అనీమియాతో బాధపడుతున్నట్లైతే, రేగిపండ్ల జ్యూస్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే పొటాషియం ఉంది. రోజూ రెగ్యులర్‌గా వంద గ్రాములు తీసుకుంటే మహిళల్లో మోనోపాజ్ దశలొ ఓస్టిరియో ఫోసిస్ తగ్గిస్తుంది. కాబట్టి ఒక గ్లాసు రేగి పండ్ల జ్యూస్ త్రాగడం వల్ల, ఇది చర్మానికి మాత్రమే కాదు. శరీరానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చిన్నారులకు బోగిపళ్లు...

తెలుగు పండుగలలో సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు. భోగి ... సంక్రాంతి ... కనుమ అంటూ మూడు రోజులపాటు జరిగే పండుగ ఇది. 'భోగి' రోజున చిన్న పిల్లలకు భోగిపండ్లు పోయడమనే ఆచారం వుంది. ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచి, చిన్న రేగిపళ్ళు ... శనగలు ... చిల్లర డబ్బులు ... పూలరేకులు కలిపి భోగిపండ్లు పోస్తుంటారు. రేగుపండ్లలో ఎన్నో దివ్య మైన ఔషధ గుణాలు వున్నాయి. రేగుపండ్లు తలపై నుంచి పోయడం వలన, అవి శరీరమంతా తాకుతూ కిందపడతాయి కనుక, చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఇక రేగుపండ్లు తినడం వలన రక్తకణాల సంఖ్య పెరుగుతుంది ... మానసిక పరమైన ఒత్తిడి తగ్గుతుంది. రేగుపండు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఆకలినీ ... ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రముఖపాత్ర వహిస్తుందని పెద్దలు చెపుతుంటారు.

09:43 - January 11, 2016

హైదరాబాద్ : నగరంలోని షాపింగ్ మాల్ లలో సిబ్బంది ఘరానా మోసానికి అడ్డు అదుపూలేకుండా పోతోంది. ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీమార్ట్ లో మోసం వెలుగుచూసింది. కేజీ పల్లీలు, పప్పులను తూకం వేయగా 700 గ్రాములు ఉండడంతో బాధితులు తూనికల కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తనిఖీలు చేపట్టిన అధికారులు మోసం జరిగిందని నిర్థారించారు. డీమార్టు సిబ్బందికి , బాధితులకు మద్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. 

09:41 - January 11, 2016

హైదరాబాద్ : నర్సులు రోగులను తాకుతారు. ఇంజక్షన్లు చేస్తారు. పట్టుకుని నడిపిస్తారు. అయితే ఏంటి.? ఇదేమన్నా కొత్త విషయమా అని అంటారా.! కానీ అక్కడ జరిగింది చూస్తే అంతా షాకవుతారు. ఇదెక్కడి ఘోరమంటూ ముక్కున వేలేసుకుంటారు. ఓ రోగి నర్సును తాకినందుకు ఓ వైద్య మహాశయుడు శివమెత్తాడు. క్షణికావేశంలో రెచ్చిపోయి ప్రవర్తించాడు. తీరా ఉద్రేకం నుంచి తేరుకున్నాక ఆ వైద్య రత్నానికి తన వృత్తేంటో గుర్తొచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది..

యమకింకరుడి అవతారమెత్తిన డాక్టర్...

ఏంట్రా ఏం చేశావురా అంటూ చెలరేగిపోయాడు. రోగి అని..! అందులోనూ వయసులో పెద్దవాడని కూడా చూడకుండా పిడిగుద్దులు గుద్దాడు. అడ్డమొచ్చినోడిపైనా తన ప్రతాపం చూపాడు. నర్సు చూస్తున్నదికదాని మరింత యాంగ్జైటీ అయి ఇద్దరినీ ఎగిరెగిరి తన్నాడు. ఈ సన్నివేశంలో కనిపిస్తున్నది ఏ ఫైట్ మాస్టరో లేక ఏ రౌడీఫెలోనో కాదు. ప్రాణాలు పోయాల్సిన డాక్టరే ఇలా యమకింకరుడి అవతారమెత్తాడు.

రష్యాలోని బెల్గొగ్రాడ్‌ సిటీ ఆస్పత్రి లో...

ఈ సీన్‌కు రష్యాలోని బెల్గొగ్రాడ్‌ సిటీ ఆస్పత్రి వేదికైంది. ఈ ఫైటర్‌ కమ్‌ డాక్టర్‌ని తీసుకొచ్చిన నర్స్‌తో రోగి కొద్దిసేపటి క్రితం అసభ్యకరంగా ప్రవర్తించాడట. దీంతో ఆమె డాక్టర్‌కు చెప్పడంతో అతను ఉద్రేకంతో ఊగిపోయాడు. రోగినీ అతనికి సంబంధించిన వ్యక్తిపైనా పిడిగుద్దులు గుద్ది తన ప్రతాపం చూపాడు. అయితే రోగికి బలమైన దెబ్బలు తగలడంతో స్పృహకోల్పోయాడు. బాధితుడు ఎంతకీ లేవకపోవడంతో రౌడీ డాక్టర్‌కు ఆవేశం తగ్గిపోయి అసలు టెన్షన్‌ మొదలైంది. పేషెంట్‌ చలనం లేకుండా పడిపోవడంతో చావగొట్టిన డాక్టరే అత్యవసర చికిత్స మొదలుపెట్టాడు. తిరిగి శ్వాస ఆడేలా తెగ ప్రయత్నించాడు. అయితే బాధితుడు అప్పటికే మృతిచెందాడు.. విషయం తెలుసుకున్న అధికారులు ముందు ఖంగుతిన్నా తర్వాత పోలీసులకు కబురు చేశారు. వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సైకో డాక్టర్‌ను సస్పెండ్ చేశారు. ఈ వీడియోను ఎవరో నెట్‌లోకి అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుతమిది సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

09:37 - January 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ వనదేవతల జాతరకు ప్రతిసారీ నీటి గండం వెంటాడుతోంది.. సమ్మక్క, సారలమ్మ జాతర ప్రతి రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి బుదవారంనుంచి మొదలవుతుంది... నాలుగురోజులపాటు సాగే ఈ జాతర సమయంలో ఆలయం చుట్టుపక్కల మొత్తం జనసంద్రమైపోతుంది.. ఈ స్థాయిలో జనాలు వస్తున్నా ధర్మగుండాలు లేకపోవడంతో స్నానాలకు ఇబ్బందులు తప్పడంలేదు..

లక్నవరం సరస్సునుంచి నీటి విడుదల.......

జాతర సమయంలో లక్షలాదిసంఖ్యలో వచ్చే భక్తులకు జంపన్న వాగులో నీరు ఏ మాత్రం సరిపోవడంలేదు.. లక్నవరం సరస్సునుంచి నీటి విడుదల.మరోవైపు 2014లో జాతర ఏర్పాట్లలో నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ఆరోపణలొచ్చాయి.. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ కూడా ఇది నిజమేనని తేల్చింది.. ఈసారి మళ్లీ జాతర ఏర్పాట్లకోసం నిధులు కావాలంటూ ప్రభుత్వానికి మూడు శాఖలనుంచి ప్రతిపాదనలు వెళ్లాయి.. గతసారిలా ఈఏడాది జరగకుండా సర్కారు చర్యలు చేపట్టింది.. నిధుల కేటాయింపులో శాశ్వత పనులకు ప్రాధాన్యం ఇచ్చింది..

రెడ్డిగూడెం, ఊరట్టం, పడిగాపూర్‌, మేడారం వద్ద డ్యాంల నిర్మాణం.......

గత జాతరవరకూ జంపన్నవాగులో స్నానఘట్టాల దగ్గర తాత్కాలికంగా ఇసుకతోకూడిన బస్తాలు అడ్డుగావేసి నీటిని నిల్వ చేస్తున్నారు అధికారులు.. ఇలా చేయడంవల్ల రెండేళ్లకోసారి కొంత డబ్బు వృధా అవుతోందని ప్రభుత్వం భావించింది... చెక్‌ డ్యాం నిర్మిస్తే ఈ ఖర్చు తగ్గుతుందని అంచనాకొచ్చింది.. సాగునీటి శాఖ ప్రతిపాదనలప్రకారం జంపన్నవాగుపై తాడ్వాయి మండలంలోని రెడ్డిగూడెం, ఊరట్టం, పడిగాపూర్‌, మేడారం దగ్గర ఈ డ్యాంలు కట్టాలని నిర్ణయించింది.. రెడ్డిగూడెం, ఊరట్టం దగ్గర ఆరుకోట్ల రూపాయలు, పడిగాపూర్ దగ్గర ఏడున్నరకోట్లు మేడారం దగ్గర మూడుకోట్లతో డ్యాంలు కట్టడానికి ఇరిగేషన్ ఇంజనీర్లు ప్లాన్‌ రూపొందించారు.. దీనికి ప్రభుత్వంనుంచి ఆమోదంకూడా లభించింది.. ఈ ప్రాంతం ఏజెన్సీ పరిధిలోకి రావడంతో ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. దీనిప్రకారం ఉన్నతస్థాయి ట్రైబల్ సబ్ ప్లాన్ కమిటీ సుమారు 17 కోట్ల రూపాయల మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.. పాలనపరమైన అనుమతులు రాగానే ఈ పనులు చేపట్టేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు..

రెడ్డిగూడెం, ఊరట్టం, పడిగాపూర్, మేడారం దగ్గర నీరు నిల్వ.......

కొత్తగా నిర్మించబోయే ఈ డ్యాంల వల్ల జంపన్నవాగులో రెడ్డిగూడెం, ఊరట్టం, పడిగాపూర్, మేడారం దగ్గర నీరు నిలువ ఉండనుంది. జాతర జరిగే సమయంలో స్నానఘట్టాల నిర్వహణకు డ్యాంల దగ్గర నిల్వ ఉన్న నీరు ఉపయోగపడుతుంది.. కేవలం భక్తులకే కాదు.. ఈ డ్యాంలతో రైతులకూ చాలా మేలు కలుగుతుంది.. కొత్తగా వెయ్యి 71 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది.. రెడ్డిగూడెం చెక్‌డ్యాం ద్వారా 170, ఊరట్టం చెక్‌డ్యాం ద్వారా 358, పడిగాపూర్ చెక్‌డ్యాం ద్వారా 363, మేడారం చెక్‌డ్యాం ద్వారా 180 ఎకరాలు సాగులోకివస్తాయి.. మొత్తానికి కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న డ్యాంల నిర్మాణానికి సర్కారు ఆమోదం తెలపడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. 

09:34 - January 11, 2016

తూ.గో : కాకినాడలో బీచ్‌ ఫెస్టివల్‌ చివరిరోజు అదిరిపోయింది... డ్యాన్సులు, పాటలతో హోరెత్తిపోయింది.. బాబా సైగల్‌ స్పెషల్‌ కుర్రకారును ఉర్రూతలూగించింది.. చివరిరోజు ఈ వేడుకల్ని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.. దీంతో బీచ్‌కు వెళ్లేదారుల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది.. 

విశాఖ ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

హైదరాబాద్ : విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. లంబసింగిలో 5 డిగ్రీలు, చింతపల్లిలో 8, అరకులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. చలిపులి ప్రభావం పెరగడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు వణుకుతున్నారు.

రేపటి నుంచి 'గ్రేటర్' నామినేషన్ల స్వీకరణ

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగనుంది.దీంతో పలు రాజకీయ పార్టీలు సోమవారం అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. టికెట్లు ఆశిస్తున్నవారితో పలు పార్టీ ఆఫీసుల్లో సందడి నెలకొంది. ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ పత్రాలు తీసుకోవచ్చునని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో క్రిమినల్‌ కేసులున్నవారి జాబితాను పోలీసులు తయారుచేస్తున్నారు.

పాక్ తో చర్చలు రద్దు...

న్యూఢిల్లీ : భారత్ - పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి స్థాయి చర్చలు రద్దు చేసినట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రకటించారు. ఈ నెల 15న జరగాల్సిన చర్చలను భారత్ రద్దు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పఠాన్‌కోట్ దాడి సూత్రదారులపై చర్యలు తీసుకునే వరకు చర్చలు జరగవు అని పేర్కొన్నారు. పాక్ చర్యలపై భారత్ సంతృప్తి చెందినప్పుడే చర్చలపై ఆలోచిస్తామని తెలిపారు.

08:47 - January 11, 2016

హైదరాబాద్ : ఈనెల 23 పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్ అసిన్ మైక్రోమాక్స్ కో ఫౌండర్ రాహుల్ శర్మలు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పెళ్లి శుభలేఖలు పంచుతూ బిజీగా ఉన్న ఈ జంట వారి మొదటి ఆహ్వాన పత్రికను ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు అందజేశారు. డార్క్ బ్రౌన్ మరియు బంగారు రంగుల కలయికలో ఉన్న శుభలేఖను అక్షయ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ...రాహుల్, అసిన్‌ల ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ నేను అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అసిన్, రాహుల్ మధ్య బంధం బలపడటానికి కారణం అక్షయ్ కుమారే అని అసిన్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే రాహుల్, అక్షయ్ కూడా మంచి స్నేహితులు కావడంతోనే వీరి మొదటి శుభలేఖను అక్షయ్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... అసిన్, రాహుల్‌ల వివాహం ఢిల్లీలో జరగనుండగా... ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులకు వెడ్డింగ్ ఇన్విటేషన్స్‌ ఇస్తూ అసిన్, రాహుల్ బిజీగా ఉన్నారు.

ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. మహిళ మృతి..

గుంటూరు : తాడేపల్లిలోని మహానాడు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు వేకువజామున ఓ ట్రాక్టర్ అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

08:02 - January 11, 2016

టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో అఖిల్ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో.. నెక్ట్స్ మూవీ ఎంతవరకు వచ్చింది? ఇలా రకరకాల ప్రశ్నలు ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న నేపథ్యంలో ఓ విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈసారి లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో రావాలన్నది ప్లాన్. లవర్‌బోయ్‌ ఇమేజ్‌ కోసం ఆ తరహా స్టోరీస్ వుంటే చెప్పమని డైరెక్టర్స్‌ని అఖిల్‌ అడుగుతున్నాడట. ఇదిలావుండగా రెండేళ్ల కిందట బాలీవుడ్‌లో హిట్ కొట్టిన ‘యే జవానీ హై దివానీ’ పై అఖిల్‌ మనసు పడ్డాడని, దాన్ని రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇన్‌సైడ్ సమాచారం. ధర్మా ప్రొడక్షన్స్- అన్నపూర్ణ స్టూడియోస్ దీన్ని కంబైన్డ్‌గా తెరకెక్కించాలని స్కెచ్ వేశారట. దీన్ని వంశీపైడిపల్లి డైరెక్ట్ చేసే ఛాన్స్ వుంది. ఇందులో అఖిల్ పక్కన అలియా హీరోయిన్ అని, ఎట్ ప్రజెంట్.. తెలుగులో ట్రెండ్‌కు తగ్గ స్టోరీ అవుతుందని అంటున్నాడట. ఆ ఫిల్మ్‌ని రీమేక్ చేస్తాడా లేదా అనేది పక్కనబెడితే.. ఈసారి మాత్రం మాస్ కన్నా.. లవ్ స్టోరీపైనే ఈ హీరో ఫోకస్ పెట్టినట్టు టాలీవుడ్ వర్గాల టాక్...

07:52 - January 11, 2016

గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ ను రాజకీయం గా ఎలా ఎదుర్కోవాలో ఆలోచించకుండా… ప్రతిపక్షాలు తెలంగాణ, ఆంధ్రా అని విభేదాలు సృష్టించడం సమంజసం కాదని, తెలుగు ప్రజల రాజధాని హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలని ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు 'న్యూస్ మార్నింగ్' చర్చలో తెలకపల్లి రవి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు వ్యూహాలను పక్కన పెట్టి తెలంగాణ, ఆంధ్ర అంటూ చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నాయా? గ్రేటర్ లో సెటిలర్స్ కు పెద్ద పీట వేసేందుకు టిఆర్ ఎస్ ప్రయత్నిస్తోందా? గ్రేటర్ లో సెటిలర్స్ ఓట్లు కీలకం కానున్నాయా? గ్రేటర్ ఎన్నికల సందర్భంగా సెటిలర్స్ విషయంలో యూటర్న్ తీసుకుందా? గ్రేటర్ ఎన్నికల నగారా మోగకముందే యంత్రాంగం అంతా మోహరించిందా? కాంగ్రెస్, బిజెపి, టిడిపి పార్టీ ప్రచారాస్ర్తంగా సెటిలర్సేనా? విశాఖ లో జరుగుతున్న పెట్టుబడుల భారీ వస్తున్నాయా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో తెలకపల్లి రవితో పాటు టిఆర్ ఎస్ నేత పాతూరి సుధాకర్ రెడ్డి, టిడిపి నేత విజయ్ కుమార్, కాంగ్రెస్ నేతమల్లు రవి పాల్గొన్నారు. వీరి మధ్య జరిగిన ఆసక్తికరమైన చర్చను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.…

07:49 - January 11, 2016

డిఫరెంట్ రోల్స్ తో తమిళ, తెలుగు సినీ అభిమానులతోపాటు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్త్రీలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు విక్రమ్. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, 'నాన్న', ‘ఐ’ వంటి సినిమాలతో తానేంటో నిరూపించిన విక్రమ్, తాజాగా మరో విభిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడు. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందనున్న లేటెస్ట్ మూవీలో విక్రమ్ హీరో పాత్రతో పాటు నెగిటివ్ రోల్‌లో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోతోపాటు, విలన్ రోల్ కూడా చేయబోతున్నాడు విక్రమ్. నపుంశకుడు (హిజ్రా)గా కూడా విక్రమ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. నయనతార, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోంది. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ డైరెక్షన్. హ్యారిస్ జయరాజ్ సంగీతం. ఇదిలాఉంటే, ఇటీవల వచ్చిన విక్రమ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఐ' అనుకున్నంత సక్సెస్ సాధించకపోగా, తక్కువ బడ్జెట్‌లో విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ '10 ఎంద్రాకుల్ల' కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. సుమారు 85 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ లేటెస్ట్ మూవీ ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి.

నేడు దుబ్బాకకు సీఎం కేసీఆర్

హైదరాబాద్: నేడు సీఎం కేసీఆర్ దుబ్బాకలో పర్యటించనున్నారు.ఉదయం 10 గంటలకు ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి సీఎం కేసీఆర్ బయలుదేరనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

యూజీసీ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానం...

హైదరాబాద్ : అమెరికాలోని మిస్సోరీ స్టేట్ హెల్త్‌యూనివర్సిటీ పలు రకాల యూజీసీ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హెల్త్ కమ్యూనికేషన్, ఎథిలిక్ లీడర్‌షిప్, ఇంటర్‌కల్చర్ కమ్యూనికేషన్స్-డైవర్సిటీ, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్, రెటోరిక్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరడానికి భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్‌ఎస్‌యూ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కల్నల్ కెంట్ డి.థామస్ సూచించారు.

సింగరేణిలో మోగనున్న సమ్మె సైరన్!

హైదరాబాద్ : సింగరేణి కాలరీ్‌సలో చాలా రోజుల తరువాత సమ్మె సైరన్‌ మోగనుంది. సకల జనుల సమ్మె కాలానికి సంబంధించి వేతనం చెల్లింపు, వారసత్వ ఉద్యోగాల సాధన లక్ష్యంగా ఉద్యమానికి కార్మికులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు సమ్మె నోటీసు ఇచ్చేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం చెల్లించేందుకు జీవో జారీచేసిన సర్కారు.. సింగరేణి ఉద్యోగుల విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు 2 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 2 గంటలు పడుతుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు గంట సమయం పడుతోంది.

06:57 - January 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ లో విద్యార్థుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. నిరుద్యోగుల కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. నేటి నుంచి తెలంగాణ పోలీసు శాఖలో కొలువుల సందడి షురూ కానుంది. కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

WWW.TSLPRB.IN సైట్‌లో దరఖాస్తులు....

కోటి ఆశలతో కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ పోలీసుశాఖలో ఉద్యోగాల జాతర మొదలైంది. కొద్దిరోజులుగా ఊరిస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటికే పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో 9,281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. నేటి నుంచి అభ్యర్థులు WWW.TSLPRB.IN సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఒక అభ్యర్థి ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసేందుకు అవకాశం.....

ఒక అభ్యర్థి ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆన్‌లైనలో ఒకసారి సబ్‌మిట్‌ చేసిన వివరాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చేందుకు అవకాశం ఉండదు. అన్ని విషయాల్ని జాగ్రత్తగా చదివి, అర్థం చేసుకున్న తర్వాతే నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు తుది గడువును ఫిబ్రవరి 4 వరకు విధించారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు 400, ఎస్సీ,ఎస్టీలకు 200గా రిజిస్ట్రేషన్ ఫీజులు నిర్ణయించారు. మీ సేవా కేంద్రాల్లో నగదు, క్రెడిట్‌ కార్డు, డెట్‌ కార్డు లేదా నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చు.

ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో.....

ఇక ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరగనుంది. ఏప్రిల్‌ 3న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించినవారికి దశలవారీగా ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, ఆ తర్వాత ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. చివరిగా ఫైనల్ రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. నాలుగు దశల్లో ఎంపికైన మెరిట్ అభ్యర్థుల్ని కానిస్టేబుల్‌ శిక్షణకు పంపించనున్నారు. 

06:54 - January 11, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మహా నగరంలో ఎన్నికల రణరంగం మొదలైంది. లీడర్ల పాదయాత్రలు జోరందుకున్నాయి. నాయకుల ప్రచార హోరు ఊపందుకుంది. బల్దియాలో గెలుపు కోసం రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

వ్యూహ ప్రతి వ్యూహాల్లో పార్టీలు..

జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రలు మొదలుపెట్టాయి. ఓటరు నాడి పట్టేందుకు రాజకీయ నేతలు బస్తీల బాట పట్టారు. మరోపక్క అధికార పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ను కంటిన్యూ చేస్తూనే ఉంది.

అధికార పార్టీ గట్టిగా ప్రయత్నం.....

గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగరేసేందుకు అధికార పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ నేతలు తమకు కేటాయించిన డివిజన్లలో ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. కుత్బుల్లాపూర్‌లోని దేవేందర్‌నగర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బాలయ్య నగర్‌లో ఏర్పాటుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. నాచారంలో టీఆర్‌ఎస్‌ నేతలు పాదయాత్ర నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య నేతృత్వంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 200 మంది టీఆర్ఎస్‌లో చేరారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తమదే విజయం అని టీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎన్నికల ప్రచారానికి తెర.....

మరోపక్క కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎన్నికల ప్రచారానికి తెర లేపింది. గ్రేటర్‌ ఎలక్షన్ల కోసం నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జీలను నియమించింది. ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలు అప్పగించారు. జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలకు సంబంధించి మహిళా నేతలు, కార్యకర్తలతో టీ పీసీసీ సమావేశం నిర్వహించింది.

కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌ పార్టీ.....

కూకట్‌పల్లిలో కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ స్థాయి నాయకుల సమావేశం నిర్వహించింది. గ్రేటర్‌ ఎన్నికల్లో డివిజన్‌ పరిధిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. మొత్తానికి గ్రేటర్‌పై పట్టుసాధించేందుకు పొలిటికల్‌ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని షురూ చేశాయి.

06:50 - January 11, 2016

హైదరాబాద్ : విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీకి పెట్టుబడుల వరద పారింది. తొలిరోజే 32 ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇక వచ్చే ఏడాది సీఐఐ భాగస్వామ్య సదస్సుకూ విశాఖే వేదిక కానుంది. ముఖ్యమంత్రి వినతికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అంగీకరించారు.

సదస్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ.....

విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలి రోజు పలు ఒప్పందాలు జరిగాయి. దేశ, విదేశాలకు చెందిన వివిధ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సిఐఐ సదస్సును కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించారు. అనంతరం ఏపీ పెవిలియన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి జైట్లీ పరిశీలించారు.

అగ్రగామిగా ఎదిగేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది.....

విభజన కారణంగా నష్టపోయినా అగ్రగామిగా ఎదిగేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని జైట్లీ అన్నారు. అలాగే పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అనుకూలమైన ప్రదేశమని అన్నారు. రాష్ట్ర పునర్‌నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు అధికారం కట్టబెట్టారని చెప్పారు. రెవెన్యూ లోటు ఉన్నా... ఏపీ 11శాతం వృద్ధి రేటు సాధించడం విశేషమని అరుణ్‌జైట్లీ కొనియాడారు.

సీఐఐ, ఏపీ మధ్య మంచి సంబంధాలు .....

సీఐఐ, ఏపీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని.. సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఓడరేవులు, విమానాశ్రయాలు, రహదారులు, జల రవాణా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అభివృద్ధిలో దేశ సగటుతో పోటీ పడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గల అపార అవకాశాలను కంపెనీలు అందిపుచ్చుకుని పెట్టుబడులు పెట్టాలని కోరారు.

నవ్యాంధ్రలో అనేక సమస్యలున్నా...

ఇక నవ్యాంధ్రలో అనేక సమస్యలున్నా... వనరులకు కొదవలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. నదులు, ఖనిజ సంపద, నైపుణ్యానికి కొదవలేదన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టి... అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తొలిరోజు 32 ఒప్పందాలు .....

విశాఖ భాగస్వామ్య సదస్సులో తొలిరోజు 32 ఒప్పందాలు ఖరారయ్యాయి. వీటి విలువ 1.95 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇంధన రంగంలో 22, పరిశ్రమల రంగంలో 9, గనుల రంగంలో ఒక ఒప్పందం కుదిరింది. వీటి ద్వారా 94 వేల మందికి ఉపాధి లభించనుందని సర్కార్‌ ప్రకటించింది.

పలువురు హాజరు..

సీఐఐ భాగస్వామ్య సదస్సుకు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి, పీయూష్‌ గోయెల్‌, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, ఆది గోద్రెజ్, గ్రంథి మల్లికార్జున రావు, అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇది ఇలా ఉంటే సీఐఐ 23వ భాగస్వామ్య సదస్సు కూడా విశాఖలోనే జరుగనుంది. వచ్చే ఏడాది నిర్వహించే ఈ సదస్సును స్టీల్‌సిటీలోనే జరపాలని ముఖ్యమంత్రి కోరడంతో అందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అంగీకరించారు.

06:42 - January 11, 2016

హైదరాబాద్ : బడ్జెట్‌ సీజన్‌ మొదలైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ మీద కసరత్తు చేస్తున్నాయి. విభిన్నవర్గాల ప్రతినిధులు ఆర్థికమంత్రులను కలిసి తమ కోరికలు వినిపిస్తున్నారు. తమ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకల గొర్రెల పెంపకందారులు కూడా తమ సమస్యలను ఎజెండా మీదకు తీసుకొస్తున్నారు. గొర్రెల మేకల పెంపకందారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీరికి అందుబాటులో వున్న స్కీమ్‌ లేమిటి? అవి ఎలా అమలవుతున్నాయి? మార్కెటింగ్‌ సౌకర్యాలు ఎలా వున్నాయి? వీరి సంక్షేమానికి బడ్జెట్‌ లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం తీసుకోవాల్సిన చర్యలేమిటి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలంగాణ మేకల గొర్రెల పెంపకందారుల సంఘం నేత నాగరాజు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

 

06:39 - January 11, 2016

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాల్లో గొర్రెలు మేకల పెంపకందారుల సంఖ్య ఎక్కువ. మేకల, గొర్రెల పెంపకానికి తెలుగు నేల అత్యంత అనువైన ప్రాంతం. పట్టణాలు, నగరాలలో మేక మాంసానికి గిరాకీ పెరుగుతోంది. ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకి 8వేలకు పైగా గొర్రెలు, మేకలు అమ్ముడుపోతుండడం వీటికున్న డిమాండ్‌కు నిదర్శనం. అయితే, మారుతున్న కాలంలో వీటిని పెంచడం, కాపాడడం పెద్ద సవాలవుతోంది.

ప్రభుత్వ, పోరంబోకు భూములను కబ్జాకోరల్లో....

ప్రభుత్వ, పోరంబోకు భూములను కబ్జాకోరులు ఆక్రమించడం, శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారుతుండడంతో వీరిని కష్టాలు చుట్టుముట్టాయి. మేకలను, గొర్రెలను నిల్చోబెట్టడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఎదురవుతోంది. తెలంగాణలో మిషన్‌ కాకతీయలో భాగంగా చాలాచోట్ల చెరువు గట్ల వెంట వున్న తుమ్మ చెట్లను నరికివేయడంతో వీరు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిజానికి తుమ్మచెట్లపై మేకల గొర్రెల పెంపకందారులకు హక్కులు కల్పించే 1016 జీవోను అమలు చేయకపోగా, అసలు చెట్లనే తొలగించడం మరీ అన్యాయం. ఒకవైపు గ్రామాల్లో తుమ్మ చెట్లు నరికేస్తున్నారు. మరోవైపు అడవుల్లోకి ఫారెస్ట్‌ అధికారులు రానివ్వడం లేదు. ఇంకోవైపు వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం జరుపుతున్న భూసేకరణ, ఆయా భూముల్లో విధిస్తున్న ఆంక్షలు మూగజీవులకు గ్రాసం దొరకని పరిస్థితిని సృష్టిస్తున్నాయి. సొంత వూళ్లో వనరులు లేకపోవడంతో ఇంటికి, కుటుంబాలకు దూరంగా రోజుల తరబడి , వారాల తరబడి సంచార జీవితం గడపాల్సి వస్తోంది. ఇన్నిన్ని రోజుల పాటు సొంత మనుషులకు, కుటుంబ సభ్యుల అనురాగాలకు, ఆప్యాయతలకు దూరంగా ఎక్కడెక్కడో చెట్ల పుట్ల వెంట తిరగడానికి మించిన వేదన మరొకటి వుంటుందా? మేకల గొర్రెల పెంపకందారులకు ఇలాంటి వేదనలూ, బాధలూ జీవితంలో భాగమైపోయాయి.

ప్రభుత్వం వైపు సరైన ప్రోత్సాహం లభించడం లేదు......

అష్టకష్టాలుపడి ఈ వృత్తిని సాగిస్తున్నవారికి ప్రభుత్వం వైపు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. పశువైద్య శాలలు విస్తరించడం లేదు. వైద్యసిబ్బంది పోస్టులు ఖాళీగా వుండడంతో మేకల గొర్రెలకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. మరోవైపు పశువుల మందుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పశువుల మందుల ధరలపై గతంలో వున్న నియంత్రణ చట్టాన్ని ఎత్తివేయడంతో వీటి ధరలు అనూహ్యంగా పెరిగాయి. ప్రభుత్వ మందులు అందుబాటులో లేకపోవడం, ప్రయివేట్‌ మందుల కంపెనీల ధరలు పెరగడంతో ఒక్కొక్క మేకకు ఏటా వెయ్యి రూపాయలకు పైగా వైద్యానికే ధారపోయాల్సి వస్తోంది. మరోవైపు కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు అమలైన భేడ్‌ పాలక్‌ భీమా యోజన పథకాన్ని రద్దు చేశారు. నాబార్డు సబ్సిడీతో నడిచే సన్నజీవాల అభివృద్ధి పథకాన్ని ఎత్తేశారు.

మేకల గొర్రెల కాపరులకు రక్షణచట్టం లేకపోవడం....

మేకల గొర్రెల కాపరులకు రక్షణచట్టం లేకపోవడం ఓ లోపం. దొంగల బెడద వీరిని పీడిస్తోంది. మార్కెట్‌లో ధరలు నిలకడగా లేకపోవడం, తూకం పద్ధతి లేకపోవడం, ప్రభుత్వ మార్కెట్‌లు లేకపోవడం సంతల్లో దళారీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తోంది. సంతలో ఏదో ఒక ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.పాలు, మాంసం, ఊలు ఉత్పత్తుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో తమ వంతు పాత్ర పోషిస్తున్న తమను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమన్నది వీరి ఆవేదన. మేకల గొర్రెల పెంపకందార్ల సొసైటీలకు మూడు ఎకరాల భూమి ఇవ్వడం, ప్రభుత్వమే మార్కెట్లు నిర్వహించడం, మందుల ధరల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడం, పశు వైద్య సేవల విస్తరణకు బడ్జెట్‌‌ కేటాయింపులు పెంచడం ద్వారా వీరి సమస్యలు కొంతవరకు పరిష్కారమయ్యే అవకాశం వుంది. 

06:36 - January 11, 2016

హైదరాబాద్ : నోటికొచ్చినట్లు మాట్లాడ్డమే కాదు అందుకు తగ్గట్టే వ్యవహరిస్తున్నాడు అమెరికన్‌ రిపబ్లిక్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్. ముస్లిమ్స్‌ను అమెరికాలోకి రానీయకూడదంటూ గత నెలలో తీవ్ర వ్యాఖ్యలు చేసి స్వదేశంలోనే తీవ్రవిమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా అతని వ్యవహార ధోరణిలో మార్పురాకపోగా మరింత దుందుడుకుగా వ్యవహరిస్తున్నాడు. యుఎస్‌లో జరిగిన ఓ ర్యాలీలో ముస్లిం మహిళను గెంటేయించి మళ్లీ విమర్శలపాలవుతున్నాడు.

చేతిలో మైక్‌ ఉందన్నా చుట్టూ జనాలున్నా.....

చేతిలో మైక్‌ ఉందన్నా చుట్టూ జనాలున్నా ఈ ట్రంప్ మహాశయుడికి పూనకమొచ్చేస్తుంది. అంతే... తీవ్రస్థాయిలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తాడు. కొద్ది రోజుల క్రితం ముస్లిమ్స్‌ ప్రమాదకరమైనవారు.. వాళ్లు మంచోళ్లో కాదో ఒక స్పష్టత వచ్చాకే అమెరికాలోకి రానివ్వాలంటూ కామెంట్స్‌ చేసి అందరిచేతా అక్షింతలు వేయించుకున్నాడు. ట్రంప్ నీకేమైనా మతి చెడిందా అంటూ అమెరికా యూత్‌ ఫైరైంది. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా తన తోక వంకరే అని నిరూపించుకున్నాడు ట్రంప్.

దక్షిణ కరోలినాలోని విన్‌థ్రోప్‌ యూనివర్శిటీలో......

దక్షిణ కరోలినాలోని విన్‌థ్రోప్‌ యూనివర్శిటీలో ఓ ర్యాలీ జరిగింది. అమెరికా అధ్యక్ష పదవిపై కన్నేసిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌ వేదికపైకొచ్చి ప్రసంగం అందుకున్నాడు. కాగా ముస్లిమ్స్‌ను వ్యతిరేకిస్తూ అతను గతంలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రోసే హమీద్ అనే మహిళ మరికొందరు లేని నిల్చున్నారు. ఐ కమ్‌ ఇన్ పీస్ అని రాసి ఉన్న టీ షర్ట్‌, ముస్లిమ్స్‌ అనే బ్యాడ్జీ ధరించింది. వాళ్లు ఏ ఆందోళనా చేయకుండా శాంతియుతంగా నిలుచుని ఉన్నారు. ఇది గమనించిన ట్రంప్‌... పోలీసుల చేత వారిని గెంటేయించారు. పైగా వారు నీ వద్ద బాంబు ఉంది కదా అందా గద్దిస్తూ బయటకు వెళ్లగొట్టారు. దీనిపై ద కౌన్సిల్‌ ఆఫ్‌ అమెరికా-ఇస్లామిక్ రిలేషన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డొనాల్డ్‌ ట్రంప్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

గతంలో ముస్లింలపై చేసిన వ్యాఖ్యల్ని సమర్థణ....

తనను గెంటేయడంపట్ల రోసే హమీద్ స్పందిస్తూ ఇప్పటివరకు ట్రంప్ చేసిన జాతి విద్వేష వ్యాఖ్యలు కేవలం ముస్లిములను మాత్రమే ఉద్దేశించి చేసినవి కాదని అందర్నీ ఉద్దేశించి చేసినవని విమర్శించారు. దీనిపై ఆయన తర్వాత ర్యాలీలో ఎలా స్పందిస్తారో చూడాలని అన్నారు. అయితే ట్రంప్‌ మాత్రం గతంలో ముస్లింలపై చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. 

06:33 - January 11, 2016

హైదరాబాద్ : అమీర్‌ఖాన్‌కు మరో ఉద్వాసన సిద్ధంగా ఉందా...? రోడ్‌ సేఫ్టీ ప్రచారం నుంచి అమీర్‌ను తప్పించబోతున్నారా..? కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి.

అసహనంపై వ్యాఖ్యలకు సంబంధించి.....

అసహనంపై వ్యాఖ్యలకు సంబంధించి వివాదం ముగిసినా...దాని ప్రభావం మాత్రం అమీర్‌ను వెంటాడుతూనే ఉంది. ఇంక్రెడిబుల్‌ ఇండియా నుంచి అమీర్‌ను ఇప్పటికే సాగనంపిన కేంద్రప్రభుత్వం మరో ఉద్వాసనకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అమీర్‌ఖాన్‌ను తప్పించే యోచనలో కేంద్రం...

రోడ్డు భద్రత క్యాంపెయిన్‌ నుంచి అమీర్‌ఖాన్‌ను తప్పించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందనే ప్రచారం జరుగుతోంది. రోడ్‌ సేఫ్టీ ప్రచారం రాయబారిగా అమీర్‌ 2014 డిసెంబర్‌లో సంతకం చేశారు. కేంద్ర ఉపరితల రవాణా, హైవేల శాఖ మంత్రి గడ్కరీ స్వయంగా కోరడంతో అమీర్‌ఖాన్‌ రోడ్‌సేఫ్టీ ప్రచార కర్తగా ఉండేందుకు అంగీకరించారు. రోడ్ల భద్రతకు సంబంధించిన ప్రకటనలో ఉచితంగానే నటించేందుకు సిద్ధమయ్యారు.

కేంద్ర పర్యాటక శాఖ అమీర్‌ను తొలగింపు.....

తాజాగా రోడ్‌సేఫ్టీ ప్రచారకర్త బాధ్యతల నుంచి అమీర్‌ను తప్పిస్తున్నారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పటికే ఇంక్రెడిబుల్‌ ఇండియా నుంచి కేంద్ర పర్యాటక శాఖ అమీర్‌ను తొలగించింది. అసహనంపై కామెంట్లు చేసిన నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు దిగిందనే విమర్శలు కూడా వచ్చాయి. అతిథి దేవోభవ ప్రకటన నిర్వహిస్తున్న ఏజెన్సీ గడువు ముగియడంతోనే అమీర్‌ను తప్పించారని కేంద్ర పర్యటక శాఖ ఆ తరువాత ప్రకటన చేసింది. ఏజెన్సీ కాంట్రాక్ట్‌ టైమ్‌ అయిపోవడంతో అమీర్‌ పని కూడా పూర్తి అయినట్లేనని క్లారిటీ ఇచ్చింది. కాని పర్యాటక శాఖ రాయబారిగా అమీర్‌ను కొనసాగించేదిలేదని స్పష్టం చేసింది. 

Don't Miss