Activities calendar

12 January 2016

21:36 - January 12, 2016

పెర్త్ : 2016 సీజన్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది.ఐదు వన్డేల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వరల్డ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను అధిగమించడంలో విఫలమైంది. కంగారూ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, మాజీ కెప్టెన్‌ జార్జ్‌ బెయిలీ సెంచరీలతో చెలరేగడంతో ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టు సునాయాస విజయాన్ని నమోదు చేసింది. డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ సూపర్‌ సెంచరీతో భారీ స్కోర్‌ చేసినా బౌలర్లు విఫలమవ్వడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. పెర్త్‌ వాకా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ విఫలమైనా మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ క్రీజ్‌లో పాతుకుపోయాడు. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్ కొహ్లీతో కలిసి డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్‌...భారీ స్కోర్‌కు పునాది వేశాడు. రోహిత్‌తో కలిసి రెండో వికెట్‌కు 227 బంతుల్లో 207 పరుగులు జోడించిన విరాట్‌ కొహ్లీ వ్యక్తిగత స్కోర్‌ 91 పరుగుల వద్ద ఔటై సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో ధోనీ కూడా దూకుడుగా ఆడటంతో భారత జట్టు స్కోర్‌ 300 పరుగులు దాటింది. 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన రోహిత్‌ 163 బంతుల్లో 7 సిక్స్‌లు 13 ఫోర్లతో 171 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 309 పరుగులు చేసి ఆతిధ్య జట్టుకు సవాల్‌ విసిరింది.

ఆరంభంలో తడబడిన ఆస్ట్రేలియా..
310 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలో తడబడింది. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న భారత నయా పేసర్‌ బరీందర్‌ శ్రన్‌ ధాటికి కంగారూ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ వెంటవెంటనే ఔటయ్యారు. కేవలం 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, జార్జ్‌ బెయిలీతో కలిసి ఆదుకున్నాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఇద్దరూ ఆ తర్వాత జోరు పెంచారు. రన్‌రేట్‌ పెరిగిపోతుండటంతో భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. స్మిత్‌ వన్డేల్లో 5వ సెంచరీ నమోదు చేయగా...బెయిలీ 4వ సెంచరీ నమోదు చేశాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు కేవలం 223 బంతుల్లోనే 242 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. దీంతో కంగారూ టీమ్‌ మరో నాలుగు బంతులు మిగిలుండగానే సునాయాస విజయాన్ని నమోదు చేసింది. 5 వికెట్లతో నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు 5 వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 135 బంతుల్లో 2 సిక్స్‌లు, 11 ఫోర్లతో 149 పరుగులతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన స్టీవ్‌ స్మిత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. ప్రస్తుత వన్డే సిరీస్‌లో వరల్డ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను ఓడించాలంటే ...ధోనీ సేన అంచనాలకు మించి రాణించాల్సిందే.2015 సీజన్‌ను ఓటమితో మొదలు పెట్టిన భారత జట్టు...2016 సీజన్‌ను సైతం ఓటమితోనే ఆరంభించడం విశేషం.

21:33 - January 12, 2016

తమిళనాడు : ఈ పొంగల్‌ పండక్కి జల్లికట్టు ఆటకి బ్రేక్‌ పడింది. జల్లికట్టుపై నిషేధాన్ని తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీనిపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత- జల్లికట్టుపై సత్వరమే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాయి. సాంప్రదాయం పేరుతో మూగ జీవాలను హింసించడం సరికాదని, జంతు సంరక్షణ చట్టం ప్రకారం ఇది నేరమని పేర్కొన్నాయి. పండగకు ఎక్కువ సమయం లేనందున దీన్ని ఆపేందుకు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని భారత జంతు సంరక్షణ బోర్డు, పెటా, బెంగళూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును అభ్యర్థించాయి. ఈ పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే విధించింది. కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సుప్రీం ఆదేశంతో తమిళనాడులో ఈ పొంగల్‌ పండక్కి జల్లికట్టు ఇక లేనట్టే.

ఇదివరకే నిషేధం..
విచారణ సందర్భంగా జల్లికట్టుపై విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్టు జస్టిస్‌ భానుమతి ప్రకటించారు. భానుమతి గతంలో మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడమే ఇందుకు కారణం. దీంతో జస్టిస్‌ దీపక్ మిశ్రా బెంచ్‌ కోర్టులో తన వాదన వినిపించింది. కేంద్రం తరపున అటార్ని జనరల్ ముకుల్‌ రస్తోగి తన వాదన వినిపించారు. జల్లికట్టు తమిళనాడులో అనాదిగా వస్తున్న సంప్రదాయమని, దీన్ని రూపుమాపడం సరికాదని వాదించారు. స్పెయిన్‌ తరహా ఎద్దుల పోరు కాదని, ఇది ఒక ఆట అని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జల్లికట్టుపై ఇదివరకే నిషేధం విధించింది. నాలుగేళ్లుగా నిషేధం ఉన్న జల్లికట్టుకు అనుమతులిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్‌ జారీ చేసింది. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జల్లికట్టుపై కేంద్రం నిషేధం ఎత్తివేయడంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధానమంత్రి నరేంద్ర మోదికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. జల్లికట్టుపై గత యుపిఏ ప్రభుత్వం నిషేధం విధించగా, ప్రస్తుతం నిషేధాన్ని తొలగించాలంటూ డిఎంకే డిమాండ్‌ చేయడం గమనార్హం.

21:30 - January 12, 2016

తమిళనాడు : తుతికోరిన్ సముద్ర తీరానికి గత రాత్రి నుంచి వంద తిమింగళాలు కొట్టుకువచ్చాయి. 45 తిమింగళాలు మృత్యువాత పడ్డాయి. భారీగా ఒడ్డుకు చేరుకున్న తిమింగళాలను చూసి స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వీటిలో కొన్నింటిని మత్స్యకారులు, ప్రభుత్వ సిబ్బంది సముద్రం లోపలికి తీసుకెళ్లి వదిలినా మళ్లీ ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. 36 తిమింగళాలను స్థానికులు కాపాడారు. ఇక్కడకు పెద్ద సంఖ్యలో తిమింగాలు కొట్టుకురావడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. ఇవన్నీ చిన్న మొప్పలు కలిగిన తిమింగళాలని తేల్చారు. 

21:28 - January 12, 2016

విశాఖపట్టణం : ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన.. సన్‌రైజ్‌ ఏపీ సమ్మిట్‌.. విజయవంతమైందని ప్రభుత్వం ప్రకటించింది. బాబొస్తే జాబొస్తుందన్న నినాదానికి ఈ సమ్మిట్‌ ఊతమిచ్చిందనీ వెల్లడించింది. సన్‌రైజ్‌ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఎంఓయూలన్నీ వచ్చే మూడేళ్లలో ఆచరణ సాధ్యమయ్యేలా చూస్తామని తెలిపింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట ప్రభుత్వం నిర్వహించిన సదస్సు మంగళవారం ముగిసింది. మూడు రోజుల పాటు విశాఖలో జరిగిన ఈ సదస్సులో.. ప్రభుత్వం 327 ఎంఓయూలు కుదుర్చుకుంది. విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు రెడ్‌కార్పెట్‌ పరిచిన ప్రభుత్వం.. ఈ సదస్సు ద్వారా ఆశించిన లక్ష్యాలు నెరవేరాయని హర్షం వ్యక్తం చేస్తోంది. నవ్యాంధ్రలో పెట్టుబడులకున్న అవకాశాలపై అనుమానంగా వచ్చిన పెట్టుబడిదారులను ఆకర్షించడంలో విజయవంతమైనట్లు ప్రభుత్వం భావిస్తోంది.

పారిశ్రామిక వేత్తల్లో భరోసా..
ఏపీ అభివృద్ధి, అమరావతి నిర్మాణంలో ఏపీ సర్కారు కృషి.. దానికి తాము అందించనున్న సాయం గురించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వివరించడం పారిశ్రామిక వేత్తల్లో భరోసాను నింపిందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అందుకే పెట్టుబడులు అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చాయని అంటున్నారు. ఈ సదస్సు వల్ల.. రాష్ట్ర నిరుద్యోగులకు ఎనలేని మేలు చేకూరుతుందని ప్రభుత్వ పెద్దలు ధీమాగా ఉన్నారు. సరళీకృత పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నామని.. పెట్టుబడులు పెట్టాలంటూ సీఎం పదే పదే చేసిన విజ్ఞప్తులు పారిశ్రామిక వేత్తలకు భరోసానిచ్చాయని పాలకులు విశ్వసిస్తున్నారు. అపారమైన సహజవనరులు, అతి పెద్ద సముద్ర తీరం గురించి డిటైల్డ్‌గా వివరించడం వల్ల మేలు జరిగిందని అంటున్నారు. మరోవైపు.. శాండ్‌మైనింగ్‌లో ఇటీవల వివాదాస్పదమైన ట్రైమాక్స్‌ సంస్థ.. 2001లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకుంది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద.. 3వేల కోట్ల రూపాయలతో మరో మైనింగ్‌ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలిపింది. విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు హాజరైన డెలిగేట్స్‌కు ఎక్కడా అసౌకర్యం కలగకుండా.. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. దీని నిర్వహణ కోసం దాదాపు 15 కోట్ల రూపాయలను వెచ్చించారు. ఇంత భారీ స్థాయిలో నిర్వహించిన సదస్సు రాష్ట్రానికి ఏమేరకు ఉపయోగ పడుతుందో.. ఎంఓయూల స్థాయిని దాటి ఎన్ని పరిశ్రమలు కార్యరూపం దాలుస్తాయో కాలమే తేల్చాలి. 

21:25 - January 12, 2016

హైదరాబాద్ : రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎంహెచ్ భవన్ లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి. ఈసందర్భంగా టెన్ టివితో ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, పార్టీ బలోపేతం, నిర్మాణంపై చర్చించడం జరిగిందని తెలిపారు. అన్నింటినీ కొనే బూర్జువా కార్పొరేట్ వాతావరణం ఏర్పడిందని, అందుకని. క్లీన్ హైదరాబాద్..క్లీన్ పాలిటిక్స్ నినాదంతో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. సీపీఎం, సీపీఐ, లోక్ సత్తా, ఆప్ కలిసి కూటమిగా పోటీ చేయడం జరుగుతోందన్నారు. 

21:22 - January 12, 2016

హైదరాబాద్ : దిగ్విజయ్‌సింగ్‌ సుడిగాలి పర్యటనలతో గ్రేటర్‌ ప్రచారాన్ని ప్రారంభించింది కాంగ్రెస్‌. ఒక్కరోజే నాలుగు సభల్లో పాల్గొన్న డిగ్గీరాజా.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెబుతూనే.. టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలపై విరుచుకుపడ్డారు. గ్రేటర్‌లో గెలుపుతో కేసీఆర్‌ పతనానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు డిగ్గీ.  నిన్నటిదాకా రిజర్వేషన్లు, ఎన్నికల ప్రక్రియ కుదింపుపై కోర్టులు, అధికారుల చుట్టూ తిరిగిన కాంగ్రెస్‌.. నామినేషన్‌ రోజు నుండే గ్రేటర్‌ ప్రచార బరిలోకి దిగింది. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ గ్రేటర్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. దిగ్విజయ్‌తో పాటు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, భట్టి, జానారెడ్డి, షబ్బీర్‌అలీతో పాటు ముఖ్యనేతలంతా డివిజన్లవారీగా ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొని ప్రచార భేరీ మ్రోగించారు. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలలో దిగ్విజయ్‌ ప్రసంగించారు. ఒకవైపు పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతూనే గ్రేటర్‌ అభివృద్ధిలో కాంగ్రెస్‌ పాత్రను చాటిచెప్పారు. మరోవైపు టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. గ్రేటర్‌ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ పతనానికి నాందికావాలని పిలుపునిచ్చారు దిగ్విజయ్‌.

డైలాగ్స్ వార్..
గ్రేటర్‌ పీఠం గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. దీనిపై కాంగ్రెస్‌ నేతలు స్పందించాలన్న కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మేయర్‌ పీఠం కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్‌.. కేటీఆర్‌ బచ్చా అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటిపై టీఆర్‌ఎస్‌ తన ముద్ర వేసుకుంటోందని గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దానం ఆరోపించారు. తెలంగాణ అంటే టీఆర్‌ఎస్‌కు జోక్‌లా మారిందన్నారు. మేకప్‌ ప్యాకప్‌ అన్న కవిత.. సెటిలర్స్‌ను హేళన చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ కనుసన్నల్లో ఎంఐఎం నడుస్తోందని కాంగ్రెస్‌ నేతలు విరుచుకు పడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దండుకునేందుకు టీఆర్‌ఎస్‌తో ఎంఐఎం జతకట్టిందని షబ్బీర్‌అలీ ఆరోపించారు. ఆ రెండు పార్టీలను గెలిపిస్తే గ్రేటర్‌లో ప్రజలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. 12 శాతం రిజర్వేషన్లపై ఎంఐఎం.. టీఆర్‌ఎస్‌ను ఎందుకు ప్రశ్నించడలేదన్నారు.  మొత్తానికి టీఆర్‌ఎస్‌ కంటే ఆలస్యంగా ప్రచారంలోకి దిగినా.. తొలిరోజు నుండే గులాబీ పార్టీపై విమర్శలతో విరుచుకుపడింది కాంగ్రెస్‌. సుడిగాలి పర్యటనలు.. పదునైన విమర్శలతో డైలాగ్‌వార్‌ను ఆరంభంలోనే తారాస్థాయికి చేర్చారు హస్తం నేతలు. 

21:17 - January 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ పై టి.టిడిపి నేత రేవంత్ స్పందించారు. తాను సవాల్ కు సిద్ధమని ప్రకటించారు. నిజాం కాలేజీ మైదానంలో టిడిపి, బిజెపి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ 100 సీట్లు గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. 

21:07 - January 12, 2016

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండు కళ్లులాంటివని మరోమారు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాం కాలేజీ మైదానాంలో టిడిపి, బిజెపి పార్టీలు చేపట్టిన బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రేటర్ హైదరాబాద్ పై టిడిపి, బిజెపి జెండా ఎగురాలని 2019 ఎన్నికలకు నాంది పలకాలని ఆకాంక్షించారు. ఆయన మాటల్లోనే...

నగరాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ఆలోచించాలి..
''నగర వాసులు ఒక్కసారిగా ఆలోచించాలి. ప్రపంచ పటంలో ఎవరు పెట్టారో మనస్సాక్షిగా ఆలోచించాలని కోరుతున్నా. నగరంలో సీఎం అయ్యే సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. తెలుగు జాతికి నగరం ఉండాలి..అభివృద్ధి జరగాలి..ఉద్యోగాలు రావాలి..ఆదాయం పెరగాలి..పేదలకు మెరుగైన సేవలందించాల అనే దానిపై ప్రయత్నాలు చేశాను. అకస్మిక తనిఖీలు చేపట్టాను. ప్రపంచం అంతా తిరిగాను. బిల్ గేట్స్ లాంటి వారిని నగరానికి తీసుకొచ్చాను. ఐటీ కంపెనీలు రావాలి..జీవితాలు మారాలని ప్రయత్నాలు చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాం. ఇదంతా టిడిపి, బిజెపి వల్లే సాధ్యమైంది. గతంలో మంత్రిగా ఉన్న దత్తాత్రేయ సహకరించారు. దీనివల్ల ఎన్నో ఉద్యోగాలు, ఆసుపత్రులు, హోటల్స్, షాపింగ్ మాల్స్ ఎన్నో వచ్చాయి. ఎక్కువ కాలేజీలు తెలంగాణకు వచ్చాయి. నగరం శాశ్వతంగా తనకు గుర్తు ఉంటుంది. అభివృద్ధిలో రాజీ పడేది లేదు.

అన్యాయం జరగకుండా విభజన చేయాలి..
తెలుగు జాతికి అన్యాయం జరగకుండా విభజన చేయాలని ఆనాడు చెప్పడం జరిగింది. రెండు రాష్ట్రాలు ఉన్నా అభివృద్ధి సాధించాలి. రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అంటే ఎగతాళి చేశారు. విభజన జరిగింది. ఇబ్బందులున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలున్నాయి. కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందామని చెబుతూ వస్తున్నాను. రెండు ప్రభుత్వాలు సహకరించుకుంటాయి.

కార్యకర్తలకు అండగా ఉంటా..
కేంద్రంలో ఎన్డీయే..ఏపీలో టిడిపి, బిజెపి ప్రభుత్వం..తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. కార్యకర్తలకు అండగా ఉంటాను. ఎన్నో త్యాగాలు చేసి కార్యకర్తలు టిడిపి వెన్నంటి నిలిచారు. వారి త్యాగాలు, ఆదరణ మరువలేను. దేశంలో సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి నందమూరి తారకరామారావు. విశాఖపట్టణంలో జరిగిన సదస్సులో ఐదు లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. భారత దేశానికి మోడీ గుర్తింపు తీసుకొచ్చారు. ఇద్దరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంది. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేయాలి''. అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

20:58 - January 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నగరానికి చేసేందేమి లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పేర్కొన్నారు. నిజాం కాలేజీలో టిడిపి, బిజెపి నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
''మాయమాటలు చెప్పేది ఒక నాయకుడు..చేతలు చూపించేది చంద్రబాబు..హైదరాబాద్ నిర్మాణం చేయడానికి నిజాంకు 200 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబుకు సైబరాబాద్ ఏర్పాటు చేయడానికి పది సంవత్సరాలు పట్టింది. ఏపీలో 16వేల కోట్ల బడ్జెట్ లోటు ఉందనే విషయం ఆలోచించాలి. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎస్సీ సోదరుడిని సీఎంగా చేస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన తల అలానే ఉంది. 50 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 30 శాతం ఇవ్వలేదు. కేసీఆర్ ఏమి చేయలేదు అని తనలాంటి వారికి అనిపిస్తోంది. ఇదే విషయం కేసీఆర్ కు అనిపించింది ఏమో..అందుకే కేటీఆర్ ను పంపించారు. రూ.50 వేల కోట్లు పెట్టి స్కై వే మొదలు పెడుతామని చెప్పారు కానీ ఇంతవరకు చేయలేదు. జీహెచ్ఎంసీలో ఉన్న పేద వాళ్లకు ఇళ్లు కావాలన్నా..మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి కావాలన్నా టిడిపి, బిజెపి పార్టీల వల్లే సాధ్యమన్నారు. టిడిపి, బిజెపి కార్పొరేటర్లను గెలిపించాలి. రోడ్లూ వేస్తూ పోస్తున్నారు..వెనుక నుండి పోతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ నిధులను అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి. ఆర్టీసీ సంస్థ కు ఖర్చు పెట్టడం కాదు. తాము కార్యకర్తలకు అండగా ఉంటాం''. అని లోకేష్ పేర్కొన్నారు. 

తన కృషిని ఎవరూ మరిచిపోలేరు - బాబు..

హైదరాబాద్ : నగరానికి తాను చేసిన కృషిని ఎవరూ మరిచిపోలేరని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిజాం కాలేజీ మైదానంలో టిడిపి, బిజెపి నిర్వహించిన సభలో బాబు పాల్గొని ప్రసంగించారు. 

20:41 - January 12, 2016

ఓ ఎలుక ఎంత పని చేసిందో తెలుసా..? ఎయిరిండియా విమానయాన సిబ్బందికి చుక్కల్ చూపించింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని లండన్ వెళ్తున్న ఓ ఎయిరిండియా విమానంలోకి దూరింది. విషయం తెలిసిన విమానయాన సిబ్బంది.. ఏం చేశారు? విమానాన్ని ఎలా వెనక్కి రప్పించారనే విషయాన్ని వీడియోలో చూస్తేనే బాగుంటుంది.
మరిన్ని క్రేజీ క్రేజీ న్యూస్ కోసం ఈ లింక్ ద్వారా ఫుల్ ఎపిసోడ్ చూడండి.. : https://youtu.be/DNG2pFkRXsY

20:32 - January 12, 2016

నారాయణఖేడ్ ఉప ఎన్నిక..జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్లు ఆశా వాహులు..సంక్రాంతి పండుగ సందర్భంగా అదనపు ఛార్జీల వసూలు..ఏపీలో చంద్రన్న కానుకలో చమత్కారం..దొంగోడికి కీర్తి..పోలీసుల ఇజ్జత్ పోయింది..గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో సైకో వీరంగం..గెలుపు గుర్రాలను ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెడుతామన్న ఉత్తమ్... అత్తను చంపుదామని చూసిన కోడలమ్మ..సంక్రాంతి పసందైన పాట..దొంగోడికి అరటిపండ్లు తినిపించిన ముంబై ఖాకీలు..పలు అంశాలపై 'టెన్ టివి మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో 'మల్లన్న' తనదైన శైలిలో ముచ్చటించాడు. ఈ రోజు నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామానికి చెందిన చంద్రారెడ్డి 'మల్లన్న'తో ముచ్చట్లు పెట్టాడు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

నిజాం కాలేజీలో సభలో కేంద్ర మంత్రి నడ్డా..

హైదరాబాద్ : టిడిపి, బిజెపి నిర్వహించిన బహిరంగసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించారు. మహానగర అభివృద్ధిలో భారత మాజీ ప్రధాని వాజ్ పేయి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. నగర అభివృద్ధిపై బాబు ఎప్పుడు కలలు కనేవారని, వాజ్ పేయీ సహకారంతో చంద్రబాబు ఐటీ నగరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. 

తెలంగాణ భవన్ లో సీఎంఓ అధికారినంటూ హల్ చల్..

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో సీఎంఓ అధికారినంటూ ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. సీఎం పొలిటికల్ సెక్రటరీ సుభాష్ రెడ్డికి కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని బేరానికి దిగాడు. అలాగే కొంతమంది మహిళలు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి టోకరా పెట్టేందుకు యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

గజ్వేల్ లో మిషన్ భగీరథ పనులు వేగవంతం..

మెదక్ : సీఎం కేసీఆర్ నియోజవర్గమైన గజ్వేల్ లో మిషన్ భగీరథ పనులు వేగవంతమయ్యాయి. కేసీఆర్ వ్యవసాయక్షత్రమైన మిషన్ భగీరథ పనుల కోసం పైప్ లైన్ వేస్తున్నట్లు, 300 మీటర్ల మేర పైపులైన్ లు వేయడం జరుగుతోందని సీఎం కేసీఆర్ కు అధికారులు సమాచారం అందించారు. చట్టాలకు తాను అతీతుడిని కానని, ప్రజలు మిషన్ భగీరథకు సహకరించాలని సూచించారు. పది నియోజకవర్గాలకు ఏప్రిల్ 30లోగా ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు.

 

నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో టిడిపి, బిజెపి సభ..

హైదరాబాద్ : నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో టిడిపి, బిజెపి పార్టీలు నిర్వహిస్తున్న సభ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎల్.రమణ, కిషన్ రెడ్డి, ఇతర టిడిపి, బిజెపి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. 

19:40 - January 12, 2016

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ లో సమస్యలు.. ప్రజల స్పందన అనే అంశాలపై టెన్ టివి గ్రేటర్ వార్.. పబ్లిక్ పల్స్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని వినాయక్ నగర్ ప్రజల కష్టాలపై టెన్ టివి గ్రౌండ్ రిపోర్టు నిర్వహించింది. అక్కడ నెలకొన్న సమస్యలపై నేతలు, స్థానికులు మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

19:35 - January 12, 2016

జూనియర్ ఎన్టీఆర్..సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్..జగపతి బాబుతో స్పెషల్ ఇంటర్వ్యూ. ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

19:30 - January 12, 2016

పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు పట్టణాల్లో సంక్రాంతి ఫుట్ బాల్ హంగామా కొనసాగుతోంది. ఇక ఈ పోటీల్లో నాకౌట్ వార్ కొనసాగనుంది. 15 మ్యాచ్ ల లీగ్ సమరానికి తెరపడనుంది. రెండు మ్యాచ్ ల నాకౌట్ కు భీమవరం రెడీ అయ్యింది. తొలి సెమీ ఫైనల్ లో నర్సాపురంతో భీమవరం ఢీకొననుంది. రెండో సెమీ ఫైనల్ లో ఏలూరు - తాడేపల్లిగూడెం ఢీకొనబోతున్నాయి. లూథరన్ హై స్కూల్ గ్రౌండ్స్ వేదికగా సెమీస్ సమరం జరగనుంది. జంగారెడ్డి గూడెం, తణుకు జట్ల కథ లీగ్ రౌండ్ లోనే ముగిశాయి. ఈ మ్యాచ్ లను తిలకించడానికి జిల్లాల సాకర్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ప్రొ.ఛైర్మన్ శ్రీధర్ కోటగిరి ఆధ్వర్యంలో జిల్లా లీగ్ ఫుట్ బాల్ పోటీలు జరుగుతున్నాయి. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:25 - January 12, 2016

పశ్చిమగోదావరి : సంక్రాంతి సందర్భంగా పందెం కోళ్లు నిర్వహించవద్దంటూ కోర్టు చెప్పినా ప్రజాప్రతినిధులు వినిపించుకోవడం లేదు. పలు ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఉండిలో ఎమ్మెల్యే శివరామరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏకంగా ఎంపీ మాగంటి బాబు పందెం కోళ్లు పోటీని నిర్వహించారు. సాంప్రదాయ కోడిపందాలు జరుగుతాయని ఎంపీ మాగంటి బాబు తెలిపారు. ఆటలు, కోడిపందాలు, పొట్టేలు పోటీలు, చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనేకమంది ప్రజాప్రతినిధులు సంబరాల్లో పాల్గొని ఆటపాటల్లో మునిగితేలారు. నోరూరించే పిండి వంటలను వచ్చిన వారందరికీ రుచి చూపించారు.

 

19:21 - January 12, 2016

నెల్లూరు : జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో గొంతుకోసి పరారయ్యాడో దుర్మార్గుడు. ఒరిస్సాకు చెందిన పుష్పలత, ఆత్మకూరు మండలం ఆరవీడు జంగాలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్య పై అనుమానంతో తరచూ వేధిస్తూ..చిత్ర హింసలకు గురిచేసిన వెంకటేశ్వర్లు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పుష్పలత గొంతుకోసి పరారయ్యాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

19:18 - January 12, 2016

పశ్చిమగోదావరి : జిల్లా యలమంచిలి మండలం చించినాడలో ఓ ప్రేమజంట గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. శివకోడు గ్రామానికి చెందిన ప్రేమజంట కడలి నరేష్‌, గుబ్బల కుమారి చించినాడ వంతెన మీద నుంచి నదిలో దూకినట్టు ఒక వ్యక్తి గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో ప్రేమజంట బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని గోదావరి నదిలో మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. స్పీడు బోట్లతోనాటు పడవలతో నదిలో విస్తృతంగా గాలిస్తున్నారు.

 

19:16 - January 12, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరకు సలహా ధరను వెంటనే ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. చెరకు కొనుగోలు పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని.. కేవలం పన్ను తొలగిస్తే రైతులకు లాభాలు రావని... సలహాధరను అమలు చేయాలని రైతుసంఘాల నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2వేల 300 రూపాయల సలహాధర ప్రకటించినప్పటకీ అది గిట్టుబాటు కావడం లేదన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. చెరకు పంట వేసేందుకు రైతులు సిద్ధంగా లేరని, రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుందని హెచ్చరించారు.

19:14 - January 12, 2016

ప్రకాశం : నిమ్జ్‌ పేరుతో ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఈ సంస్థ పేరుతో ప్రభుత్వం 13వేల 500 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని రైతు నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం పాబోలువారిపల్లెలో జరిగిన భూ హక్కుల పరిరక్షణ సదస్సులో మధు పాల్గొన్నారు. నిమ్జ్‌ పేరుతో నష్టపోతున్న రైతులకు ఎకరాకు 10లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 

19:13 - January 12, 2016

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎస్ ప్రసాద్‌పై హీరో పవన్ కల్యాణ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. 'అత్తారింటికి దారేది' సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ విషయంలో ఆయన మాట తప్పారని పవన్‌ ఆరోపించారు. సినిమా సమయంలో కొంత రెమ్యునరేషన్ ఇచ్చారని, ఇంకా 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందన్నారు. 'నాన్నకు ప్రేమతో' సినిమా విడుదల సమయంలో ఇస్తానని చెప్పారని పవన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తనకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకపోవడంతో పవన్‌ 'మా'ను ఆశ్రయించినట్లు సమాచారం.
బీవీఎస్ఎస్ ప్రసాద్...పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో 'అత్తారింటికి దారేది' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 'నాన్నకు ప్రేమతో' బుధవారం రిలీజ్ కావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ ఫిర్యాదు నమోదు కావడంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా ? లేదా ? అనేది తెలియ రాలేదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుండి క్లియరెన్స్ అనుమతి వస్తేనే సినిమా రిలీజ్ కావాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు బీవీఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

19:09 - January 12, 2016

హైదరాబాద్ : అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ లేఖ రాశారు. రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్‌ రాజ్యాంగ విరుద్ధమని జగన్‌ లేఖలో పేర్కొన్నారు. రూల్‌ 340 (2) కింద రోజాను ఏడాది పాటు సస్పెన్షన్‌ చేయడానికి వీలులేదని జగన్‌ పేర్కొన్నారు. సస్పెన్షన్‌ విషయంలో రూల్స్‌ ఏం చెబుతున్నాయో జగన్‌ లేఖలో వివరించారు. గతంలో లోక్‌సభ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా జగన్‌ లేఖలో ప్రస్తావించారు. 

19:08 - January 12, 2016

విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖను సిటీ ఆఫ్ బీచ్‌గా, తిరుపతిని సిటీ ఆఫ్‌ లేక్స్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ ముగింపు సదస్సులో పాల్గొన్న చంద్రబాబు..ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

19:07 - January 12, 2016

విశాఖపట్టణం : సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌ సందర్భంగా ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మూడు రోజులపాటు జరిగిన సదస్సులో మొత్తం 13 సెక్టార్లలో 328 ఎంఓయులు కుదుర్చుకున్నారు. అత్యధికంగా పారిశ్రామిక రంగంలో 115 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల ద్వారా దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వస్తాయని... తద్వారా సుమారు పది లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 

గ్రేటర్ పరిధిలో పెరిగిన ఓటర్ల సంఖ్య..

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఓటర్ల సంఖ్య 74,36,247 మంది ఉండగా కొత్తగా 3,83,530 మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. 15,217 తొలగించిన ఓట్లు ఉండగా 41,011 ఓట్లు మార్పులు చేర్పులు చేసినవిగా ఉన్నాయి. 

బీజేపీ, పీడీపీ పొత్తు కొనసాగుతుంది - మెహబూబ్ బేగ్..

జమ్మూ కాశ్మీర్ : బీజేపీ, పీడీపీ పొత్తు కొనసాగుతుందని, ఎలాంటి విబేధాలు లేవ పీడీపీ పేత మెహబూబ్ బేగ్ పేర్కొన్నారు. ముఫ్తీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇతర పార్టీలతో పొత్తులుండవని స్పష్టం చేశారు. 

ప్రధాని మోడీకి జయలలిత లేఖ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఈ క్రీడపై ఆర్డినెన్స్ తేవాలని లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

కేశవరెడ్డి విద్యాసంస్థలపై ఫిర్యాదుల వెల్లువ...

కడప: కేశవరెడ్డి విద్యాసంస్థలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చౌక్ పీఎస్ కు బాధితులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు. 

కేసీఆర్ సంజాయిషీ ఇవ్వాలి - ఉత్తమ్..

హైదరాబాద్ : ముస్లింలను మోసం చేసినందుకు కేసీఆర్ సంజాయిషీ ఇవ్వాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. ఎంఐఎం, మోడీతో టీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని, గతంలో కేసీఆర్ ఏమన్నారో సెటిలర్స్ మరిచిపోవద్దని సూచించారు. పార్టీ ఫిరాయింపులు, హోర్డింగ్ లు పెట్టడం తప్పించి టీఆర్ఎస్ చేసేందేమి లేదని, కేటీఆర్ ఓ బచ్చా అని కేసీఆర్ సవాల్ విసిరితే చూస్తామన్నారు. గ్రేటర్ లో టీఆర్ఎస్ వంద సీట్లు గెలిస్తే దేనికైనా సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు. 

ఖైరతాబాద్ లో కాంగ్రెస్ బహిరంగ సభ..

హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్ లో కాంగ్రెస్ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభలో దిగ్విజయ్, ఉత్తమ్, భట్టి, జానా, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు. 

ఏపీ స్పీకర్ కు జగన్ లేఖ..

హైదరాబాద్ : ఏపీ స్పీకర్ కోడెలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ లేఖ రాశారు. ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని, రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని లేఖలో కోరారు. 

సీఐఐ సదస్సులో 331 అవగాహన ఒప్పందాలు - బాబు..

విశాఖపట్టణం : సీఐఐ సదస్సులో మొత్తం 331 అవగాహన ఒప్పందాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మూడు రోజుల్లో రూ.4,67,577 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. భాగస్వామ్య సదస్సుకు 41 దేశాల నుండి ప్రతినిధులు రావడం సంతోషం కలిగించిందన్నారు. వచ్చే ఏడాది తదుపరి భాగస్వామ్య సదస్సులో ఇప్పటి ఒప్పందాలపై పున:సమీక్షించుకుంటామని, పేదరికాన్ని ప్రారదోలడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంపద సృష్టించడమే కాదని, సంతోషదాయకమైన సమాజం ఉండాలని తెలిపారు. ఎప్పటికీ ఏపీ సన్ రైజ్ స్టేట్ గా ఉండాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. 

బాబు అభినవ భగీరథుడు - అనంతకుమార్..

విశాఖపట్టణం : కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంతో సీఎం చంద్రబాబు అభినవ భగీరథునిగా నిలిచారని కేంద్ర మంత్రి అనంతకుమార్ పేర్కొన్నారు. చంద్రబాబు సన్ రైజ్ చీఫ్ మినిస్టర్ అంటూ కొనియాడారు. ఏపీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సదస్సు నిర్వహించారని, అటు మోడీ, ఇటు చంద్రబాబు నాయకత్వంలో భారత్ ఏపీలకు స్వర్ణయుగమన్నారు. విశాఖలో రూ.600 కోట్లతో ఎన్ఐఎఫ్ఈఆర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, విజయవాడలో సీఐపీఈటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే గుజరాత్, ఏపీలలో మెడికల్ డివైసెస్ పార్కులు, విశాఖలో హెచ్పీసీఎల్ రిఫైనరీ విస్తరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

రంగారెడ్డి అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే - ఉత్తమ్...

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ నని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ శిలాఫకాలకే పరిమితమైందని, కార్యకర్తలు ఇంటింటి ప్రచారానికి వెళ్లాలని పిలుపునిచ్చారు.

 

ప్రజలకు విశ్వాసం కల్పించలేకపోయాం - దిగ్విజయ్...

హైదరాబాద్ : సోనియా తెలంగాణ ఇచ్చినా ప్రజలకు విశ్వాసం కల్పించలేకపోయామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. అందువల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని, నగరాన్ని కాంగ్రెస్ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిందన్నారు. గ్రేటర్ ఎన్నికలు కేసీఆర్ పతనానికి నాంది కావాలని, టిడిపి, బిజెపికి ఓటు వేస్తే ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. 2019 కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వచ్చిన ఆరు నెలల్లో 12 శాతం మైనార్టీ రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీనిచ్చారు. 

కోర్టుకు హాజరైన సీఎం కేజ్రీవాల్...

ఢిల్లీ : పరువు నష్టం కేసులో కోర్టుకు సీఎం కేజ్రీవాల్, రాఘవ్ చడ్డా హాజరై సమాధానం ఇచ్చారు. రెండు వేల పేజీలతో కూడిన సమాధానంతో పాటు మూడు సీడీలను కోర్టుకు కేజ్రీవాల్ సమర్పించారు.

 

బీవీఎస్ఎస్ ప్రసాద్ పై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు..

హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎస్ ప్రసాద్ పై హీరో పవన్ కళ్యాణ్ 'మా'కు ఫిర్యాదు చేశారు. 'అత్తారింటికి దారేది' సినిమాకు సంబంధించి బకాయిపడిన రెమ్యూనరేషన్ డబ్బులు 'నాన్నకు ప్రేమ'తో సినిమా విడుదల సందర్భంగా ఇస్తానని చెప్పి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ముగిసిన సీఐఐ సదస్సు..

విశాఖపట్టణం : సీఐఐ సదస్సు ముగిసింది. ముగింపు రోజున పలు స్టాళ్లను గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు సందర్శించారు. గిరిజన కార్పొరేషన్ ఉత్పత్తి చేసిన కాఫీని గవర్నర్ రుచి చూశారు. 

టీఆర్ఎస్ లో సునామీ వస్తుంది - వీహెచ్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో ఏదో ఒక రోజు సునామీ వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని, కరీంనగర్, మెదక్ జిల్లాల నుండి వచ్చిన వారు నగరంలో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. 

కేటీఆర్ సవాల్ స్వీకరించే దమ్ము లేదు - టీఆర్ఎస్..

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ ను స్వీకరించే దమ్ము లేదని ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు పేర్కొన్నారు. ఇప్పటికీ కేటీఆర్ సవాల్ కు కట్టుబడి ఉన్నామని, గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ దేనని తెలిపారు. రాష్ట్రంలో అతి పెద్ద బ్రోకర్ రేవంత్ రెడ్డినేనని విమర్శించారు. 

ఓట్ల కోసం కేసీఆర్ మాయమాటలు...

హైదరాబాద్ : ఓట్ల కోసం సీఎం కేసీఆర్ మాటమాటలు చెబుతున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ వ్యాఖ్యానించారు. మైనార్టీ రిజర్వేషన్ లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించని ఎంఐఎం నేతలను చెప్పులతో కొట్టాలని తీవ్ర విమర్శలు చేశారు. 

భారత్ పరాజయం..

పెర్త్ : వన్డేలో భారత్ పరాజయం పాలైంది. ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మూడు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసి గెలుపొందింది. ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది.

ఇండియా ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ 171(నాటౌట్), ధావన్ 9, కోహ్లీ 91, ధోనీ 18, జడేజా 10(నాటౌట్) ఫాల్క్‌నర్ 2, హజ్లేవుడ్ ఒక వికెట్ తీసుకున్నారు.

14:02 - January 12, 2016

ఢిల్లీ: స్వదేశంలో రాక్షసుల్లాంటి టెర్రరిస్టులు. ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో ఎటునుంచి ఏ బుల్లెట్ దూసుకొస్తుందో తెలియక నిత్యం భయంభయం. కళ్లముందే అయినవారిని కోల్పోతుంటే భరించలేని గుండెకోత. స్వంత దేశంలో బతకలేక విదేశాలకు వెళ్తే అక్కడా మరో భయంకరమైన సమస్య కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. సమస్యలన్నీ చుట్టుముడుతుంటే ఎందుకు తమకే ఇలా జరుగుతుందో తెలియక ఆ శరణార్థులు విలవిల్లాడిపోతున్నారు.  
ఉగ్రవాద భూతం
తాము పెంచిపోషించిన ఉగ్రవాద భూతం ఎంతటి విపత్తును సృష్టిస్తున్నదో ఇప్పుడిప్పుడే అగ్రరాజ్యాలకు తెలిసొస్తున్నది. అయితే నిప్పు ముట్టించింది ఒకరైతే తగలబడిపోతున్నది మాత్రం మధ్య ప్రాచ్య దేశాలే. 
యూరప్ దేశాలకు వలసవెళ్తున్నారు 
ఇరాక్‌, సిరియా, ఆఫ్ఘనిస్తాన్‌ తదితర దేశాల్లో ఉగ్రవాద చర్యలకు తాళలేక ఆ దేశస్తులు కొన్ని నెలలుగా యూరప్ దేశాలకు వలసవెళ్తున్నారు. మొదట్లో వారికి పలు ఆయా దేశాలు స్నేహహస్తం అందించినా ఇప్పుడు అక్కడా వారికి రక్షణ లేకుండా పోతున్నది. మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చినా, వారిలా కనబడినా చితకబాదాలన్న లక్ష్యంతో జర్మనీ దేశస్తులు ఊగిపోతున్నారు. కొద్ది రోజులుగా ఆదేశ మహిళలు, వ్యక్తులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. పలువురు జర్మనీ మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ఈ ఘోరాలకు పాల్పడుతున్నది శరణార్థులే అన్న ప్రచారం మొదలవడంతో వారిపై జర్మనీ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. డిసెంబర్‌ 31న పలు నైట్‌ క్లబ్‌ల వద్ద మహిళలపై దాడులు జరగ్గా వారు పోలీసులను ఆశ్రయించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా వారిలో ఎక్కువమంది శరణార్థులే ఉన్నారు. 
మహిళలపై అత్యాచారాలు 
ఒక్క జర్మనీలోనేగాక ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, స్వీడన్, ఫిన్‌లాండ్ తదితర దేశాల్లో కూడా గతంలో ఎన్నడూలేని విధంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికీ శరణార్థులే కారణమన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి కొందరు దుండగులు ముఠాలుగా ఏర్పడి ఈ అకృత్యాలకు పాల్పడుతూ తప్పును శరణార్థులపై నెడుతున్నారు. దీంతో మధ్య ప్రాచ్య దేశాలనుంచి వలసొచ్చినవారు అక్కడ విలన్లవుతున్నారు. తాము తలదాచుకునేందుకు ఆశ్రయం కల్పించిన విదేశీయులపట్ల తామెందుకు అమానుషంగా ప్రవర్తిస్తామని శరణార్థులు బావురుమంటున్నారు. మరోపక్క జర్మనీ చాన్సెలర్‌ ఏంజెలా మెర్కెల్‌పై విమర్శలు పెరిగిపోతున్నాయి. శరణార్థులను దేశంలోకి రానివ్వడం మూలంగానే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా శరణార్థులకు ఇంటాబయట రక్షణ లేకపోగా వారిపై దాడులు పెరిగిపోతున్నాయి. 

14:00 - January 12, 2016

టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లుంగీ డ్యాన్స్ చేశాడు. ఎవరితో అనుకుంటున్నారు. ఇండియన్ మైకెల్ జాన్సన్ గా పేరు పొందిన 'ప్రభుదేవ'తో కలిసి స్టెప్పులు వేశాడు. ఎందుకోసం అని తెలుసుకోవాలంటే ఇది చదవండి. ధోని నటించిన వీడియో ఇంటర్నెట్‌లో హాల్ చల్ సృష్టిస్తోంది. మైదానంలో 'కెప్టెన్ కూల్' గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని 'ధోతీ' తో యాడ్‌లో మాత్రం ఇరగదీశాడు. పలు తెలుగు సినిమాల్లో నటించిన హీరో, డైరెక్టర్ ప్రభుదేవాతో ధోని టీవీ యాడ్‌లో ధోతీలో అదిరిపోయే స్టెప్పులేశాడు. ధోనీ టీవీఎస్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్వవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 'టీవీఎస్ స్టార్' బైక్స్ కోసం రూపొందించిన యాడ్‌లో కెప్టెన్ ధోనీ, ప్రభుదేవాతో కలిసి ధోతీని ధరించి డ్యాన్స్ చేశాడు. 

13:58 - January 12, 2016

గుంటూరు : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం ఉన్మాది వీరంగం సృష్టించాడు. అత్యవసర వార్డులోకి ప్రవేశించి ముగ్గురు సిబ్బందిపై దాడి చేశాడు. సెలైన్‌ స్టాండ్‌తో చితకబాదాడు. ప్రతిఘటించిన సమయంలో మరింతగా రెచ్చిపోయాడు. ఉన్మాది వీరంగాన్ని చూసిన రోగుల బంధువులు, ఆస్పత్రి సిబ్బంది అతడిని పట్టుకున్నారు. ఆటోకు కట్టేసి దేహశుద్ధి చేశారు.

 

13:56 - January 12, 2016

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ ముగింపు సదస్సులో పాల్గొన్న చంద్రబాబు..ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విశాఖను సిటీ ఆఫ్ బీచ్‌గా, తిరుపతిని సిటీ ఆఫ్‌ లేక్స్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. 

13:53 - January 12, 2016

హైదరాబాద్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న తెలుగు విద్యార్థులను వెనక్కి పంపిస్తున్న అమెరికా తీరును నిరసిస్తూ సీపీఐ ఆందోళన బాట పట్టింది. హైదరాబాద్‌లోని అమెరికా ఎంబసి కార్యాలయం ముందు ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అమెరికా వెళ్తున్న తెలుగు విద్యార్థులకు న్యాయం చేయాలని సీపీఐ జాతీయ నేత నారాయణ డిమాండ్ చేశారు. వందలాది మంది విద్యార్థులు వెనక్కి వస్తున్నా అటు మోడీ సర్కార్ కానీ.. ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ స్పందించడం లేదని మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు తమ పోరాటం ఆగదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. ఆందోళన ఉధృతం కావడంతో.. పోలీసులు వీరిని అరెస్ట్‌ చేసి సమీప పీఎస్‌కు తరలించారు. 

 

13:51 - January 12, 2016

హైదరాబాద్ : రాష్ట్ర విభజన జరగకుంటే... ఆంధ్రాలో అమరావతి వచ్చేదా ... జపాన్ పెట్టుబడులు వచ్చేవా అంటూ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ క్లబ్ లో టియుడబ్ల్యుజె-2016 క్యాలెండర్, డైరీని మంత్రి ఆవిష్కరించారు. హైదరాబాద్ మహానగరం దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికే అభివృద్ధి చెందిందని అన్నారు. అన్నివైపులా విస్తరించే నగరం హైదరాబాద్ అన్నారు. తెలంగాణ కొత్తగా సర్ ప్లస్ స్టేట్ కాదని తెలిపారు. అభివృద్ధికి అనుకూలంగా ఉన్న ఏకైక రాష్ట్రం  తెలంగాణ అని పేర్కొన్నారు.

 

రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగింది - సీపీఎం..

హైదరాబాద్ : రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఎంహెచ్ భవన్ లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరుగుతోంది. పార్టీ బలోపేతం, నిర్మాణంపై చర్చించడం జరిగిందని, క్లీన్ హైదరాబాద్..క్లీన్ పాలిటిక్స్ నినాదంతో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. సీపీఎం, సీపీఐ, లోక్ సత్తా, ఆప్ కలిసి కూటమిగా పోటీ చేయడం జరుగుతోందన్నారు. 

రేపు బాబుతో టి.టిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో రేపు టి.టిడిపి నేతలు భేటీ కానున్నారు. గ్రేటర్ ఎన్నికలు, బీజేపీతో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు.

 

జల్టికట్టుపై సుప్రీం స్టే..

ఢిల్లీ : జల్లికట్టుపై కేంద్రం ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్రం, తమిళనాడు ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 

13:45 - January 12, 2016

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ హైదరాబాద్ పై వరాల జల్లు కురిపించారు. నగరంలో నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తామని చెప్పారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో మంచినీరు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రూ.50 వేల కోట్లతో ప్రణాళికలను తయారు చేశామని చెప్పారు. 11 వేల కోట్లతో స్కైవేలను నిర్మించనున్నట్లు తెలిపారు. నగరంలో 56 జంక్షన్లను నిర్మించనున్నట్లు తెలిపారు. 36 మోడల్ మార్కెట్లు, 36 గ్రేవియార్డులు, పిల్లలకు ఆట స్థలాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాస్తారని చెప్పారు. ఐదు నుంచి పదేళ్ల కాలంలో అన్ని పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 

 

13:36 - January 12, 2016

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న 'సుల్తాన్‌' చిత్రంలో నటించే ఛాన్స్‌ అనుష్క శర్మ అందిపుచ్చుకుంది. సల్మాన్‌ సరసన హీరోయిన్‌గా అనుష్కశర్మను ఫైనల్‌ చేస్తూ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 2008లో షారూఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన 'రబ్‌ దే బనా దీ జోడీ' సినిమాతో తెరంగేట్రం చేసిన అనుష్క తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. 2014లో అమీర్‌ ఖాన్‌ సరసన 'పీకే' చిత్రంలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గతేడాది 'ఎన్‌హెచ్‌10' చిత్రంతో నిర్మాతగా కూడా మారింది. ఆ చిత్రం ఘన విజయం సాధించి అనుష్కకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. సల్మాన్‌తో నటించే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంటూ ఆయనతో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఓ కుస్తీ యోధుడు జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈద్‌ పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అనుష్క ఈ చిత్రంతోపాటు ప్రస్తుతం 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా నిర్మాతగా సొంత బ్యానర్‌లో మూడు చిత్రాల్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

13:35 - January 12, 2016

మెదక్ : నారాయణఖేడ్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. ఫిబ్రవరి 13న పోలింగ్ జరుగనుంది. 16న ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. ఈనెల 20న నోటిఫికేషన్ విడుదల కానుంది. 27 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 28న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. 30న ఉపసంహరణకు గడువు.

13:34 - January 12, 2016

వైవిధ్యమైన చిత్రాలకు, భిన్నమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిత్యమీనన్‌ నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', 'సన్నాఫ్‌ సత్యమూర్తి', 'రుద్రమదేవి', 'ఓకే బంగారం', 'కాంచన2' వంటి చిత్రాలతో గతేడాది ప్రేక్షకుల్ని మెప్పించిన నిత్యమీనన్‌ తాజాగా ఎన్టీఆర్‌ సరసన నటించేందుకు అంగీకరించారట. కొరటాలశివ దర్శకత్వంలో రూపొందబోయే 'జనతా గ్యారేజ్‌' చిత్రంలో నిత్య నటిస్తోందని తెలుస్తోంది. తొలుత శ్రుతిహాసన్‌, సమంత పేర్లు వినిపించినప్పటికీ చివరిగా నిత్యనే చిత్ర యూనిట్‌ ఫైనలైజ్‌ చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, నిత్య ఈ చిత్రంతోపాటు నాగచైతన్య కథానాయకుడిగా రూపొందు తున్న చిత్రంలోనూ నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఓ పక్క ఆఫ్‌బీట్‌ సినిమాలు, మరోపక్క కమర్షియల్‌ సినిమాలు చేస్తూ నిత్య అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

13:31 - January 12, 2016

గతేడాది 'రుద్రమదేవి', 'బాహుబలి', 'సైజ్‌ జీరో' చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన అనుష్క ఈ సంవత్సరం కూడా అదే రీతిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 'బాహుబలి 2', 'ఎస్‌3' (సింగం3) చిత్రాల్లో నటిస్తోంది. దీంతోపాటు తాజాగా తమిళ దర్శకుడు బాలా రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 'సేతు', 'నంద', 'పితామగన్‌', 'అవన్‌ ఇవన్‌' వంటి వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా బాల పేరొందిన సంగతి తెలిసిందే. విశాల్‌, అధర్వ, ఆర్య, అరవిందస్వామి తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్కతోపాటు మనీషాకొయిరాలా కూడా నటిస్తోందని సమాచారం.

నారాయణఖేడ్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల…

హైదరాబాద్ : నారాయణఖేడ్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. ఫిబ్రవరి 13న పోలింగ్ జరుగనుంది. 16న ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. ఈనెల 20న నోటిఫికేషన్ విడుదల కానుంది. 27 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 28న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. 30న ఉపసంహరణకు గడువు.

13:27 - January 12, 2016

ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తరచూ తొలగించుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఇందుకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చెంచా ముల్తానీ మట్టికి సరిపడా నీళ్లు కలిపి మెత్తగా చేయాలి. దీన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట పూతలా వేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. అలాగే చెంచా చొప్పున తేనె, పాలు కలిపి సన్నని మంటపై ఐదు సెకన్లు ఉంచాలి. దీన్ని సమస్య ఉన్న చోట రాయాలి. దానిపై శుభ్రమైన దూదిని ఉంచి కాసేపయ్యాక తీసేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.
ఒక చెంచా దాల్చినచెక్క పొడి, తేనె కలిపి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాసి, ఆ ప్రాంతంపై దూది ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ దూదిని తొలగించి గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ఫలితం ఉంటుంది. చెంచా వంటసోడా, అరచెంచా నీళ్లూ కలిపి, ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాసి వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే మంచిది.
ఓట్స్ మృతకణాలను తొలగించడంలో సాయపడతాయి. చెంచా ఓట్స్ ను రెండు చెంచా నీళ్లలో ఉడికించాలి. చల్లారాక ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే బ్లాక్‌హెడ్స్ తొలగిపోయి ముఖం శుభ్రపడుతుంది. చిటికెడు పసుపుని కాసిని నీళ్లలో లేదా కొబ్బరి నూనెలో వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ పై రాసి పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.
గ్రీన్‌టీలో ఉండే విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ చర్మంలో ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగిస్తాయి. ఐదు చెంచాల నీళ్లలో రెండు చెంచాల గ్రీన్‌టీ పొడిని కలిపి పావుగంట వేడిచేయాలి. ఈ నీళ్లు గోరువెచ్చగా మారాక ముఖాన్ని శుభ్రం చేసుకుని వలయాకారంగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.

13:19 - January 12, 2016

మీరు సన్నగా ఉండి, సహజంగా బరువు పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారా.. ఏదిఏమైన బరువు పెరగటం వలన ఫిట్నెస్‌తో పాటూ, ఆరోగ్యం కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే సహజంగా బరువు పెరగటం వలన శరీరానికి కలిగే దుష్ప్రభావాల నుండి కాపాడుకోవచ్చు.తక్కువ బరువు ఉన్నవారు, బరువు పెరగాలని ఎక్కువగా ఏది పడితే అది తింటూ ఉంటారు. దీని వలన ఆరోగ్యకరమైన బరువు కాకుండా శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరుగుతాయి. బరువు పెరగాలి అనుకునే వారు బయట లభించే జంక్‌ ఆహారాలకు బదులుగా ఆరోగ్యకరమైన ఆహరాన్ని తీసుకోవాలి.

క్యాలరీల సంఖ్యను లెక్కించండి..
రోజూ తీసుకునే క్యాలరీల సంఖ్య, ఖర్చు చేసే క్యాలరీల సంఖ్యపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. తీసుకునే క్యాలరీల సంఖ్య కన్నా ఖర్చు చేసే క్యాలరీల సంఖ్యను తగ్గించండి. మీ జీవక్రియ రేటు, రోజూ చేసే పనులలో ఎన్ని క్యాలరీలను వినియోగిస్తున్నారో లేక్కించండి. బిఎంఆర్‌ ప్రకారం శరీర బరువును నిర్వహిస్తూ, క్యాలరీల ఖర్చును సరి చూసుకోండి. బరువు పెరగాలి అనుకుంటే రోజులో ఖర్చు చేసే దాని కంటే 125 క్యాలరీలను అధికంగా తీసుకోండి. ఒక పౌండ్‌ బరువు పెరుగుటకు ఖర్చు చేసే వాటి కన్నా దాదాపు 3,500 క్యాలరీలను తీసుకోండి.

తరచుగా తినండి..
మూడు నుండి నాలుగు గంటలకు ఒకసారి తినటం వలన శరీరంలో కొవ్వు పెరగకుండా బరువు మాత్రమే పెరుగుతుంది. ఇలా మూడు సార్లు తీసుకునే ఆహరాన్ని ఆరు దఫాలుగా తీసుకోవటం వలన చర్మ కణాలలో కొవ్వు పదార్థాల చేరిక తగ్గి బరువు పెరుగుతుంది. 

13:13 - January 12, 2016

విశాఖ : యువత గర్వించే నాయకుడు వివేకానంద అని, ఆయన సిద్ధాంతాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలోని ఏయూలో జాతీయ యువజన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు చంద్రబాబు హాజరై, మాట్లాడారు. 'లేవండి.. మేల్కోండి.. చదవండి'.. అనే స్వామి వివేకానంద సూక్తులు యువత అలవర్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. 

13:08 - January 12, 2016

పెర్త్ : ఆస్ట్రేలియాతో తొలివన్డేలో టీమిండియా టాపార్డర్ అదరగొట్టింది. డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ స్ట్రోక్ ఫుల్ సెంచరీతో...వాకా స్టేడియం పిచ్ పై కేక పుట్టించాడు. ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని ఈ తొలివన్డేలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియా 50 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్, వన్ డౌన్ విరాట్ కొహ్లీ రెండో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో భారీస్కోరులో ప్రధానపాత్ర వహించారు. ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా రోహిత్ శర్మ నాలుగో సెంచరీ సాధించాడు. అంతేకాదు కంగారూలపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కూడా రోహిత్ నిలిచాడు. మరోవైపు..విరాట్ కొహ్లీ97 బాల్స్ లో 9 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో91 పరుగులు చేసి ..సెంచరీకి 9 పరుగుల దూరంలో అవుటయ్యాడు. రోహిత్ 160 బాల్స్ లో 13 బౌండ్రీలు, ఆరు సిక్సర్లతో 171పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 9, కెప్టెన్ ధోనీ 18 స్కోర్లకు వెనుదిరిగారు. కంగారూ బౌలర్లలో ఫాక్నర్ 2 వికెట్లు, హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టారు. కంగారూ టీమ్ మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 310 పరుగులు చేయాల్సి ఉంది.

 

13:05 - January 12, 2016

నల్లగొండ : జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిట్టీలు, ఇతర వ్యాపారాల పేరుతో సాయి స్టీల్స్ యజమాని పోతరాజు నర్సింహా... కస్టమర్ల నుంచి 30కోట్ల రూపాయల మేర వసూలు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితులు.. ప్రకాశం బజార్‌లోని సాయి స్టీల్స్ ఎదుట ఆందోళనకు దిగారు. 

నల్లగొండలో ఘరానా మోసం

నల్లగొండ : జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. చిట్టీలు, ఇతర వ్యాపారాల పేరుతో సాయి స్టీల్స్ యజమాని పోతరాజు నర్సింహా... కస్టమర్ల నుంచి 30కోట్ల రూపాయల మేర వసూలు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితులు.. ప్రకాశం బజార్‌లోని సాయి స్టీల్స్ ఎదుట ఆందోళనకు దిగారు. 

12:59 - January 12, 2016

గుంటూరు : స్వామి వివేకానంద 153 వ జయంతిని  వీవీఐటీ ఇంజనీరింగ్ కళాశాల వారు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దర్గా టు దర్గా పేరుతో 33 కిలో మీటర్ల సమైక్యత నడక పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ వాక్ ను గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే , వీవీఐటీ విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సాగర్ లు ప్రారంభించారు. ఈ పోటీల్లో పలువురు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 

12:56 - January 12, 2016

నెల్లూరు : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ప్రకాశం జిల్లా కందుకూరు వాసులు కందుకూరు నుంచి తిరుమలకు మినీ బస్‌లో వెళ్తున్నారు. మార్గంమధ్యలో చింతారెడ్డిపాళెం జాతీయరహదారిపై వేకువజామున జాతీయ రహదారిపై మినీ బస్ ను లారీ... ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరికి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

 

12:50 - January 12, 2016

అనంతపురం: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శ్రీనివాస్, మీనాక్షిలు మూడు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగు నెలల బాబు ఉన్నాడు. ఈనేపథ్యంలో మీనాక్షి అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే గత కొంతకాలంగా తమ మధ్య ఉన్న విభేదాల వల్లే తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త శ్రీనివాస్ తెలిపాడు. అయితే భార్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వకుండా... తెల్లవారుజామున ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. తమ కూతురి మృతికి శ్రీనివాస్ కారణమని.. మీనాక్షి తల్లిదండ్రులు ఆరోపించారు. 

 

ఆసీస్ టార్గెట్ 310 పరుగులు

పెర్తు : భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. భారత్ నిర్ణీత వోవర్లలో మూడు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా టార్గెట్ 310 పరుగులుగా ఉంది. రోహిత్ శర్మ 171 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కోహ్లీ 91 పరుగులు చేశాడు. 

12:31 - January 12, 2016

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. నేటి నుంచి 17 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జనవరి 18న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. 21న నామిషనేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నామినేషన్ల ను స్వీకరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ ఐదు జోన్లు, 24 సిర్కళ్లు, 150 వార్డులున్నాయి. గ్రేటర్ లోని ప్రతివార్డుకు ఒక రిటర్నింగ్ అధికారిని కేటాయించారు.   
అడిక్ మెట్ రిటర్నింగ్ అధికారి..
అభ్యర్థితోపాటు ఇద్దరు వ్యక్తుల కార్యాలయంలోకి రావాలి. నామినేషన్ ఫామ్ తోపాటు ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఎన్నికల ఖర్చులకు సంబంధించి కొత్తగా ఓపెన్ చేసిన అకౌంట్ పత్రాను సమర్పించాలి. జనరల్ అభ్యర్థులకు 5 వేల రూపాయలు, రిజర్వేషన్ అభ్యర్థులు 2500 ఇవ్వాలి. అయితే రిజర్వేషన్ అభ్యర్థులు డిక్లరేషన్ ఇవ్వాలి.  డబ్బులను చలాన రూపంలోనైనా నేరుగా అయినా ఇవ్వవచ్చు. అడిక్ మెట్, రాంనగర్, బోలక్ పూర్, కావాడీగూడలో రిటర్నింగ్ అధికారులను కేటాయించామని.. అన్ని ఏర్పాట్లు చేశామని డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి తెలిపారు. 
ముషీరాబాద్ రిటర్నింగ్ అధికారిణి 
ముషీరాబాద్ ను బిసి జనరల్ కు కేటాయించారు. అభ్యర్థి అఫిడవిట్ సబ్ మిట్ చేయాలి. ఎలాంటి కేసులు లేవని డిక్లరేషన్ ఇవ్వాలి. అభ్యర్థితోపాటు ఇద్దరికి అనుమతి ఉంటుంది. 

11:36 - January 12, 2016

మహబూబ్ నగర్ : ప్రకృతి సంపదను, చారిత్రక ప్రదేశాలను పరిరక్షిస్తూ పర్యాటక రంగాన్ని తెలంగాణ సర్కార్ విస్తరిస్తోందన్నారు మంత్రులు చందూలాల్‌, జూపల్లి కృష్ణారావు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల వద్ద కృష్ణానదిలో శ్రీశైలం వరకు ఫాంటూన్‌ బోట్‌ను మంత్రులు ప్రారంభించారు. కొల్లాపూర్‌ మండలం సోమశిల నుంచి శ్రీశైలం వరకు 110 నాటికల్ మైళ్ల దూరం బోట్‌ లో జర్నీ చేయవచ్చు. అంతకుముందు వీపనగండ్ల మండలం జటప్రోల్‌, కొల్లాపూర్‌ మండలం సోమశిల వద్ద టూరిజం హోటళ్లను మంత్రులు ప్రారంభించారు. 

11:27 - January 12, 2016

హైదరాబాద్ : దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్నా, క్లిష్టసమస్యలకు మార్గాలు వెతకాలన్నా చట్టసభలు కీలకపాత్ర పోషిస్తాయని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ శాసనసభ ప్రసంగాలు పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న గవర్నర్ రోశయ్య..చట్టసభల్లో ఎమ్మెల్యేలు హుందాతనంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభలు అనేవి రాష్ట్ర ప్రజలకు జవాబుదారి తనంగా ఉండే ఓ మహావేదిక అని మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌ అన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, స్పీకర్ మధుసుధనాచారి, ఏపీ శాసన మండలి చైర్మన్‌ చక్రపాణి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. 

 

గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ను జారీ చేశారు. ఇవాళ్టి నుంచి 17 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లన స్వీకరిస్తారు. జనవరి 18న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 21న నామిషనేషన్ల ఉపసంహరణ గడువు. 

 

రోహిత్ సెంచరీ.. కోహ్లీ అర్థ సెంచరీ...

పెర్త్ : టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధోని సేన శుభారంభాన్ని సాధించింది. రోహిత్ సెంచరీ, కోహ్లీ అర్థ సెంచరీలతో రెచ్చిపోయారు. 122 బంతులు ఎదుర్కున్న శర్మ 7 బౌండరీలు, మూడు భారీ సిక్సర్లతో సెంచరీ చేశాడు. మరోవైపు కోహ్లీ (70) రోహిత్ కు జతగా నిలిచాడు. ఈ జంట పోటీ పడుతూ బౌండరీల హోరు సాగించారు. వీరిరువు క్రీజులో నిల్చుని పరుగుల వరద పారిస్తున్న వేళ ఆసీస్ బౌలర్లు ఎక్కడ బంతులు వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. భారత్ 37 ఓవర్లలో 191/1 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. 

11:02 - January 12, 2016

ఉత్తరప్రదేశ్‌ : బిజ్‌నూర్‌లో దారుణం వెలుగుచూసింది. వృద్ధాప్యంలో ఉన్న అత్తపై..కోడలు హత్యాయత్నం చేసింది. అనారోగ్యంతో మంచంపై ఉన్న అత్తను..ఉరివేసి చంపేందుకు ప్రయత్నించింది. ఇలా ఒకరోజు కాకుండా రోజుకో తీరున హింసించింది. హీటర్‌ను వేడిచేసి ఒంటిపై వాతలు పెట్టింది. ఇనుప ముక్కతో తలపై ఇష్టమొచ్చినట్లు బాదింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో.. కోడలి దుర్మార్గం బయటపడింది. కొద్దిరోజుల క్రితం భర్తపై తప్పుడు కేసు బనాయించి జైలుకు పంపించిన ఈ మహిళ..అప్పటి నుంచి అత్తపై తన దాష్టికం ప్రదర్శించింది. అయితే అత్తను దారుణంగా హింసించిన ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.  

 

కోహ్లీ అర్థ సెంచరీ..

పెర్త్ : ఇండియా ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్మెన్లు అర్థ సెంచరీలతో విజృంబిస్తున్నారు. వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థ సెంచరీతో అలరించాడు. 62 బంతులు ఎదర్కున్న కోహ్లీ ఐదు బౌండరీలు కొట్టాడు. అద్భుతమైన సిక్సర్ తో హాఫ్ సెంచరీ చేశాడు. కాగా మరో వైపు ఓపెనర్ రోహిత్ 89 శతకం వైపు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం భారత్ 32 ఓవర్లకు 163/1 పరుగులతో ఆడుతోంది. 

'అనంత' జిల్లా వైద్యశాఖ అధికారి ప్రభుదాస్ మృతి

అనంతపురం : జిల్లా వైద్యశాఖ అధికారి ప్రభుదాస్ గుండె పోటుతో మృతి చెందాడు. అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

ట్రూజెట్ విమానంలో సాంకేతిక లోపం...

హైదరాబాద్ : ట్రూజెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం నిలిచిపోయింది. విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సివుంది. 70 మంది ప్రయాణికులు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రయాణికులను అధికారలు పట్టింకుకోవడం లేదు.

 

రోహిత్ హాఫ్ సెంచరీ..

పెర్త్ : ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 63 బంతులు ఎదుర్కున్న రోహిత్ 4 బౌండరీలు ఒక భారీ సిక్సర్ తో అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 36 పరుగుల వద్ద దావన్ (9) వికెట్ కోల్పోయినా, తదనంతరం రోహిత్, కోహ్లీల జంట అద్భుత భాగస్వామ్యంతో దూసుకెళ్తోంది. 

09:52 - January 12, 2016

గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేస్తారా… చేయరా.. అనే సందిగ్ధం ఉందని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. ప్రస్తుత జాతీయ, రాష్ట్రీయ పరిస్థితులు, గ్రేటర్ ఎన్నికలతోపాటు పలు అంశాలపై గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే... 
చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య ఒప్పందం..?
'మెదక్ ఉప ఎన్నికల వరకు, అనంతరం చంద్రబాబు, కేసీఆర్ లు పోటాపోటీగా ఒకరిపైమరొకరు విమర్శలు చేసుకున్నారు. ఇరువురు సవాల్ చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల మంత్రులు సైతం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. చంద్రబాబు పవర్ క్యాంపెయినర్ గా ఉన్నారు. టిడిపి శ్రేణులకు ఉత్సాహం ఇచ్చాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆ ఉత్సాహం చూపడం లేదు. అయితే ఈ మధ్య కాలంలో కేసీఆర్, చంద్రబాబు పరస్పర విమర్శలు చేసుకోవడం లేదు. చంద్రబాబు, కేసీఆర్ లు వెనక్కి తగ్గారు… చంద్రబాబు తీరుపై టీటీడీపీ లో అసహనం మొదలైంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో క్యాంపెయిన్ లో చంద్రబాబు లేడు. దీన్ని బట్టి చూస్తే.. ఓటుకు నోటు విషయంలో చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య ఒప్పందం కుదిరిందా… అన్న అనుమానం కలుగుతుందన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మకంగానే చంద్రబాబును విమర్శించడంలో వెనక్కి తగ్గారు. రాజకీయ నేతలు ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. రాజకీయ చదరంగంలో నాటకాలు ఆడుతున్నారు. పార్టీల మధ్య ఎత్తుగడలకు, ఎమోషన్లకు ప్రజలు లోనుకాకూడదు. అయితే హైదరాబాద్ లో చంద్రబాబుకు సానుకూలత ఉంది. సీమాంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్ ల్ ఉన్నవారికి చంద్రబాబుపై అభిమానం ఉంది. సీమాంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన వారు హైదరాబాదీలే. చంద్రబాబు వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్న మాట వాస్తవం. హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు రావడంలో చంద్రబాబుది కీలక పాత్ర ఉంది' అని నాగేశ్వర్ అన్నారు. గ్రేటర్ లో టిఆర్ ఎస్, బిజెపి ఎన్నికల ప్రచారం, విశాఖ సీఐఐ సదస్సు, భారత్ -పాక్ చర్చలతోపాటు పలు అంశాలపై వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

 

తొలి వికెట్ కోల్పోయిన భారత్

పెర్తు : భారత్, ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 36 పరుగుల వద్ద దావన్ (9) హజిల్ వుడ్ బౌలింగ్ లో మార్ష్ కు క్యాచ్ ఇచ్చి ఫెవిలియన్ కు చేరాడు. 

09:07 - January 12, 2016

పెర్తు : భారత్, ఆస్ట్రేలియాల మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం అయింది. పెర్తు వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వాకా పిచ్ బౌలింగ్ అనుకూలంగా ఉంది. 

08:44 - January 12, 2016

టీఆర్ ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందని వక్తలు అన్నారు. 'గ్రేటర్ ఎన్నికలు.. పార్టీల ప్రచారం, కేటీఆర్ వ్యాఖ్యలు'… అనే అంశంపై  నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో టిడిపి అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి రాకేష్, ది హిందూ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ లు పాల్గొని, మాట్లాడారు. టీఆర్ ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. టీఆర్ ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని ఘాటుగా విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

పెర్తు : భారత్, ఆస్ట్రేలియాల మధ్య కాసేపట్లో తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. పెర్తు వేదికగా ప్రారంభం కానుంది. భారత్ 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

 

08:11 - January 12, 2016

రజకుల సమస్యలను పరిష్కరించాలని రజక వృత్తిదారుల సంఘం నేత ఆశయ్య డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'కాలం మారింది. ఆధునికీకరణ పెరిగింది. రజకుల బతుకులు దుర్భరంగా ఉన్నాయని వాపోయారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. 'కానీ, ఆధునికీకరణ ఫలాలు అన్ని వృత్తులవారికి చేరడం లేదు. ఇందుకు చక్కటి ఉదాహరణ రజకులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మంది రజకులున్నారు. వీరి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వృత్తిలో ఆధునికతను ప్రవేశపెట్టడానికి ఎలాంటి సహకారం అందించాలి? సామాజికంగా వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులేమిటి? వృత్తి నిర్వహణకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసే సందర్భాలలో ప్రభుత్వాల నుంచి బ్యాంక్‌ల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తోంది?' ఇలాంటి అంశాలపై ఆశయ్య మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…
 

07:57 - January 12, 2016

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మంది రజకులున్నారు. వీరిలో అత్యధికులు సెంటు భూమిలేని నిరుపేదలు. వృత్తే వీరికి జీవనాధారం. అయితే, ఇప్పుడు ఈ వృత్తి నిర్వహణ అత్యంత కష్టంగా మారుతోంది. ఆధునిక సాంకేతిక ఫలాలు అందక, రుణ సదుపాయం లభించక అనేక అవస్థలు పడుతున్నారు. 
దోభీ ఘాట్ల కొరత
ఇది హైటెక్‌ యుగం. ఆధునిక యంత్రాలు ఈ యుగ లక్షణం. పట్టణాల్లో చాలా ఇళ్లలో వాషింగ్‌ మెషన్లొచ్చాయి.  బట్టలు ఉతికే పనిని శులభతరం చేసిన ఈ ఆధునిక యంత్రాలు , అదే వృత్తిని నమ్ముకుని జీవనయానం సాగిస్తున్నవారికి అందుబాటులో  వుండడం లేదు.   రజకులు ప్రతిరోజూ  పెద్ద పెద్ద మూటలను నెత్తిన పెట్టుకుని, మూడు నాలుగు కిలోమీటర్ల దూరం  వెళ్లాల్సిన దయనీయ స్థితి అనేక ప్రాంతాల్లో వుంది. పొద్దస్తమానం రెక్కలు ముక్కలు చేసుకున్నా వీరికి దక్కే ప్రతిఫలం అంతంత మాత్రమే. ఇప్పటికీ అనేక గ్రామాల్లో మెరా పద్ధతే అమలవుతోంది. ఏడాదికోసారి యజమానులు ఇచ్చే ధాన్యంతోనే మున్నూట అరవై రోజులూ బతుకుబండిని లాగించాలి. 
రజకుల జీవితాలు దుర్భరం
గ్రామాలలోనే కాదు పట్టణాలలో సైతం రజకుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి.  ఆధునిక అభివృద్ధికి చిరునామాగా, విశ్వనగరంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్‌లో కనీసం దోబీఘాట్‌లు కూడా లేని దుస్థితి. రజకుల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడో 1982లోనే వాషర్‌మెన్‌ ఫెడరేషన్ ఏర్పాటు చేసిన్నప్పటికీ ఈ వృత్తిదారులకు ప్రభుత్వాల నుంచి అందిన సాయం ఆవగింజంత కూడా లేదు.  నిధులు సక్రమంగా కేటాయించకపోవడంతో అది నిరుపయోగంగా వెక్కిరిస్తోంది. రజకులకు దోబీఘాట్లు నిర్మించడం, బోరుబావులు, హౌజ్‌లు ఏర్పాటు చేయడం, స్థలాలివ్వడం  ఈ ఫెడరేషన్‌ లక్ష్యాలు. కానీ, ఆచరణలో సాధించింది శూన్యం.  రజక  సొసైటీలకు రుణాలు మంజూరు విషయంలో బ్యాంకర్లను ఒప్పించేందుకు ప్రభుత్వం  చొరవ తీసుకోకపోవడంతో రజకుల కష్టాలు తీరడం లేదు. 
అమలుకు నోచుకోని హామీలు 
దోబిఘాట్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోవడం లేదు. కాగితాల మీద నిధులు కేటాయిస్తున్నప్పటికీ, ఆచరణలో అలసత్వమే కనిపిస్తోంది. ఓవైపు దోబిఘాట్ల నిర్మాణంలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం మరోవైపు తన ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థల  దోభీ పనులను బడా కాంట్రాక్టర్లకు అప్పగిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహాలు,  టూరిజం, ప్రభుత్వ ఆస్పత్రులు, పోలీస్‌ శాఖ, స్పెషల్‌ బెటాలియన్‌లు, జైళ్లు, గురుకుల పాఠశాలలు, ట్రిపుల్‌ ఐటీఐలు వంటి వాటిల్లో దోభీ పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్న వైనంపై రజకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విమానయానం, రైల్వే శాఖల్లోనూ ఇదే పరిస్థితి. ఈ రంగాలలో దోభీ పోస్టులను పునరుద్ధరించి, రజక వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు పెంచాలనే డిమాండ్‌ అరణ్యరోదనగానే మిగిలిపోతోంది.  రజకుల సంక్షేమానికి పాటుపడాల్సిన ప్రభుత్వాలే ప్రభుత్వరంగ సంస్థల్లో సైతం వారికి నిలువ లేకుండా చేయడానికి మించిన అన్యాయం మరొకటి వుండదు. 
ప్రధాన సమస్య బొగ్గు
ఇక రజకులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య బొగ్గు. దీని ధర విపరీతంగా పెరిగిపోవడంతో ఇస్త్రీ చేసేవారికి గిట్టుబాటుకాని పరిస్థితి. ఇస్త్రీకి వాడే కర్రబొగ్గు తెచ్చుకోవడానికీ, నిల్వ చేసుకోవడానికి డిపో పర్మిషన్‌ ఇవ్వాలనే రజకుల డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు.  పోనీ కరెంట్‌ ఐరన్‌ బాక్స్‌లు వాడదామంటే విద్యుత్‌ చార్జీల భారం భరించడం మరీ కష్టం. 
రజకులపై సాంఘిక బహిష్కరణలు 
ఓ వైపు దోభీ ఘాట్లు లేక, మరోవైపు ప్రభుత్వ సహకారం అందక, నానాటికీ ఉపాధి అవకాశాలు మూసుకుపోతున్న వేళ రజకులు సామాజికంగానూ తీవ్ర ఆవేదనాభరిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.  రజకుల మీద దాడులు, సాంఘిక బహిష్కరణలు కొనసాగుతుండడం అత్యంత బాధాకరం. 

 

నేడు బీజేపీ-టీడీపీ కార్యకర్తల సన్మాహక సమావేశం

హైదరాబాద్ : గ్రేట‌ర్‌ స‌మ‌రానికి టీడీపీ- బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా ఇవాళ గ్రేట‌ర్ ప‌రిధిలోని కార్యక‌ర్తల‌తో స‌న్నాహ‌క స‌మావేశాన్ని నిర్వహించ‌నున్నారు. ఈ స‌మావేశం ద్వారా అధికార పార్టీ అస‌త్య ప్రచారాల‌ను తిప్పి కొడుతూ గ్రేట‌ర్‌లో గెలుపే ల‌క్ష్యంగా వీరు స‌మ‌ర శంఖం పూరించ‌నున్నారు. ఈ స‌మావేశానికి  కేంద్రమంత్రుల‌తో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొంటున్నారు. అటు ఈనెల 27, 28, 29 తేదీల్లో చంద్రబాబుతో స‌హా బీజేపీకి చెందిన కీల‌క నేత‌లు గ్రేటర్‌ పరిదిలో రోడ్ షోల‌తో ప్రచారం నిర్వహించనున్నారు. 

నేడు గ్రేటర్ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్ : బల్దియా ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. దీంతో  గ్రేటర్‌లో నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. 

07:45 - January 12, 2016

హైదరాబాద్ : మైనింగ్‌ మాఫియాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుంది. సంక్రాంతి తర్వాత నూతన మైనింగ్‌ విధానాన్ని ప్రకటించేందుకు ప్లాన్‌ చేస్తేంది. ఇప్పటికే ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా మైనింగ్‌ పాలసీ తీసుకొచ్చేందుకు  టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చర్యలు చేపట్టింది. 
కోట్లు గడిస్తున్న మాఫియా 
సర్కార్‌ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుక అక్రమ రవాణ ఆగడంలేదు. విలువైన ఖనిజ సంపద తరలిపోతూనే ఉంది. అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా.... మాఫియా ముఠాలు మాత్రం కోట్ల రూపాయలు గడిస్తున్నాయి. దీంతో దీనికి చెక్‌ పెట్టేందుకు కొత్త మైనింగ్‌ విధానం తీసుకురావాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించింది. 
అపార ఖనిజ సంపద 
తెలంగాణలో అపార ఖనిజ సంపద ఉంది. బొగ్గు తవ్వకాలను సింగరేణి సంస్థ చేపడుతోంది. బాక్సైట్‌, మాంగనీస్‌, క్వార్జ్‌ వంటి ఖనిజాల తవ్వకానికి కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. తర్వాత అటు మాఫియాను నియంత్రించడంతోపాటు ఇటు సర్కారు  ఖజానాకు కాసులు దండిగా వస్తాయని అంచనా వేస్తున్నారు. మైనింగ్‌ ద్వారా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇంతవరకు 1700 కోట్ల రూపాయలు మాత్రమే సమకూరింది. కొత్త పాలసీ తీసుకొస్తే లక్ష్యాన్ని  సాధించొచ్చని పాలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తరుణంలో ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకోవాలన్నది సర్కారు ఉద్దేశం. 
పారిశ్రామిక యాజమాన్యాలకే మైనింగ్‌ లీజులు 
రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేసిన యాజమాన్యాలకే మైనింగ్‌ లీజులు ఇచ్చే విధంగా కొత్త  విధానం  తీసుకొస్తారు. గనులు లీజు గలీజుగా మారకుండా ఉండేందుకు వీలుగా పాలసీ రూపకల్పనలో  ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  న్యూ ఇండస్ట్రియ్‌ పాలసీకి పారిశ్రామివేత్తల నుంచి వచ్చిన స్పందనే... నూతన మైనింగ్‌ విధానానికి కూడా వస్తుందన్న ఆశాభావంతో తెలంగాణ సర్కార్‌ ఉంది. 

 

07:40 - January 12, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్‌ స‌మ‌రానికి టీడీపీ- బీజేపీలు సన్నద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా ఇవాళ గ్రేట‌ర్ ప‌రిధిలోని కార్యక‌ర్తల‌తో స‌న్నాహ‌క స‌మావేశాన్ని నిర్వహించ‌నున్నారు. ఈ స‌మావేశం ద్వారా అధికార పార్టీ అస‌త్య ప్రచారాల‌ను తిప్పి కొడుతూ గ్రేట‌ర్‌లో గెలుపే ల‌క్ష్యంగా వీరు స‌మ‌ర శంఖం పూరించ‌నున్నారు. ఈ స‌మావేశానికి  కేంద్రమంత్రుల‌తో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొంటున్నారు. అటు ఈనెల 27, 28, 29 తేదీల్లో చంద్రబాబుతో స‌హా బీజేపీకి చెందిన కీల‌క నేత‌లు గ్రేటర్‌ పరిదిలో రోడ్ షోల‌తో ప్రచారం నిర్వహించనున్నారు. 
నిజాంక‌ళాశాల మైదానంలో భారీ బహిరంగ 
గ్రేట‌ర్ పీఠంపై టీడీపీ, బీజేపీలు త‌మ‌ జెండాను ఎగుర‌వేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. దీనిలో భాగంగా మంగళవారం నిజాం క‌ళాశాల మైదానంలో భారీ బహిరంగ స‌భతో ప్రత్యర్థుల‌కు స‌వాల్ విస‌ర‌డానికి పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. గ్రేట‌ర్‌పై త‌మ‌కున్న ప‌ట్టును మ‌రోసారి నిరూపించ‌డ‌మే ధ్యేయంగా స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి ఇరు పార్టీలు స‌మాయ‌త్తమ‌వుతున్నాయి. ఈ స‌మావేశానికి  క‌నీసం యాభై వేల నుంచి డెబ్పై వేల మంది వ‌స్తార‌ని నేత‌లు అచ‌నా వేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, కో ఆర్డినేట‌ర్లు, డివిజ‌న్ల ఇన్ఛార్జీలకు  బాధ్యత‌ల‌ను అప్పగించిన మిత్రప‌క్షాలు ఆ దిశ‌గా రంగాన్ని సిద్ధం చేస్తున్నాయి. 
స‌భ‌కు టీడీపీ అధినేత చంద్రబాబుబ హాజరు 
ప్రతి డివిజ‌న్‌ నుంచి ర్యాలీగా రెండు పార్టీల కార్యక‌ర్తలు నిజాం క‌ళాశాల మైదానానికి చేరుకోనున్నారు. సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే స‌భ‌కు టీడీపీ అధినేత చంద్రబాబు స‌హా కేంద్ర మంత్రులు జె.పి న‌డ్డా, సుజ‌నా చౌద‌రి, బండారు ద‌త్తాత్రేయ‌ ముఖ్య అతిధులుగా పాల్గొన‌నున్నారు. గ్రేట‌ర్‌లో అధినేత రాక‌తో ప‌రిస్థితి పూర్తిగా మారిపోతుంద‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ప్రధానంగా హైద‌రాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంద‌న్నది తెలుగు త‌మ్ముళ్ల న‌మ్మకం. టీడీపీ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి ప్రస్తావించ‌డంతో పాటు గ‌త 18 నెల‌ల టీఆర్ఎస్‌ పాల‌న‌లోని లోపాల‌ను ఎత్తిచూపాల‌ని నిర్ణయించారు. అటు గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను త‌మ అధినేత చంద్రబాబు కూడా సీరియ‌స్‌గా తీసుకున్నార‌టున్నారు టీడీపీ నేత‌లు. ఈనెల 27నుండి 29 వ‌ర‌కు చంద్రబాబు బీజేపీ నేత‌ల‌తో క‌లిసి బ‌స్సుయాత్ర చేస్తారని.. 150 డివిజ‌న్లలో ప్రచారం నిర్వహిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 
నిజాం క‌ళాశాల‌లో ఏర్పాట్లు
మ‌రోవైపు టీడీపీ బీజేపీల శంఖారావానికి నిజాం క‌ళాశాల‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్య నేత‌ల కోసం భారీ వేదిక‌ను సిద్ధం చేశారు. క‌నీసం ముప్పైవేల మంది కూర్చునేలా మైదానంలో కుర్చీల‌ను సిద్ధం చేశారు. బ‌హిరంగ స‌భ నేప‌థ్యంలో న‌గ‌రం మొత్తం ప‌సుపుమ‌యం చేస్తున్నారు. పార్టీ జెండాలు, బ్యాన‌ర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ కూడా బ‌హిరంగ స‌భ‌ విజ‌య‌వంతం కోసం ప్రయ‌త్నాలు చేస్తోంది. న‌గ‌ర‌వ్యాప్తంగా ఉన్న కాషాయ కార్యక‌ర్తలు పెద్ద సంఖ్యలో స‌భకు త‌ర‌లివస్తార‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. నిజాం క‌ళాశాల బ‌హిరంగ స‌భతో న‌గ‌రంలో రాజ‌కీయ వేడి పెరుగుతుంద‌ని టీడీపీ, బీజేపీ అంచ‌నా వేస్తున్నాయి. టీఆర్ఎస్ పైన విరుచుకుప‌డటం ద్వారా త‌మ కార్యక‌ర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింప‌డానికి రెండు పార్టీల నేత‌లు మాట‌ల‌తూటాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు.      

 

07:32 - January 12, 2016

ఇరాక్‌ : బాగ్దాద్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నగరంలోని అల్‌ జవహరా  షాపింగ్‌ మాల్‌పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. 50 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు. తీవ్రవాదులు మొదట షాపింగ్‌ మాల్ దగ్గర కారు బాంబును పేల్చారు. అనంతరంలో మాల్‌ లోపలికి ప్రవేశించి కాల్పులు జరిపి 100 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఉగ్రవాదులు దాడి చేసిన షాపింగ్‌ మాల్‌ను ఇరాక్‌ బలగాలు చుట్టుముట్టాయి.
తీవ్రవాదులను కాల్చి చంపాయి. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మహుతికి చేసుకున్నారు. బందీలను భద్రతా దళాలు విడిపించినట్లు తెలుస్తోంది. దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ తీవ్రవాద సంస్థ ప్రకటించింది. 

 

07:26 - January 12, 2016

హైదరాబాద్ : బల్దియా ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. దీంతో  గ్రేటర్‌లో నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. 
రిటర్నింగ్‌ ఆఫీసర్‌ స్థాయిలోనే నోటిఫికేషన్‌ జారీ 
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవాళ విడుదల కానుంది. 150 వార్డుల్లో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ స్థాయిలోనే ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఇది ఇలా ఉంటే నోటిఫికేషన్‌ విడుదల నాటి నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. 
స్థానికంగానే నామినేషన్ల స్వీకరణ
గ్రేటర్‌ పరిధిలో ఐదు జోన్లు, 24 సర్కిళ్లు, 150 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డులకు ఒక్కో రిటర్నింగ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను నియమించారు. స్థానికంగానే నామినేషన్లను స్వీకరించే విధంగా వార్డుల్లోనే కార్యాలయాలు ఏర్పాటుచేశారు.
ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ
ఇవాళ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.  సంక్రాంతి పండుగ సందర్భంగా 14, 15 తేదీల్లో సెలవులు ఉన్నాయి. ఈనెల 17 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.  జనవరి 18న  పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 21 చివరి రోజు.  ఆ రోజు సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్ధుల తుది జాబితా ప్రకటిస్తారు. నామినేషన్ల దాఖలు నుంచి పోలింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటించే వరకు అన్ని కార్యక్రమాలు సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి చెప్పారు
7,757 పోలింగ్‌ బూతులు ఏర్పాటు
బల్దియా ఎలక్షన్ల  కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. 150 వార్డుల్లో 7,757 పోలింగ్‌ బూతులను ఏర్పాటుచేశారు. గ్రేటర్‌ పరిధిలో మొత్తం 70 లక్షల 67 వేల 934 మంది ఓటర్లు ఉన్నారు. 

 

07:22 - January 12, 2016

హైదరాబాద్‌ : నగరంలో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించారు. ఎల్‌బినగర్‌, వనస్థలిపురం ప్రాంతంల్లో ప్రైవేటు బస్సుల్లో తనఖీలు నిర్వహించారు. సౌత్‌జోన్‌ ఆర్టీవో లక్ష్మీ ఆధ్వర్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 38 బస్సులపై కేసులు నమోదు చేశారు. 

 

హైదరాబాద్‌లో ఆర్టీఏ అధికారుల దాడులు

హైదరాబాద్‌ : నగరంలో ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించారు. ఎల్‌బినగర్‌, వనస్థలిపురం ప్రాంతంల్లో ప్రైవేటు బస్సుల్లో తనఖీలు నిర్వహించారు. సౌత్‌జోన్‌ ఆర్టీవో లక్ష్మీ ఆధ్వర్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 38 బస్సులపై కేసులు నమోదు చేశారు. 

నేడు సీసీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం

హైదరాబాద్ : నేడు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం జరుగనుంది. పార్టీ నిర్మాణంపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొననున్నారు. 
 

నేడు హరీష్ రావు ముంబై పయనం

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి హరీష్ రావు నేడు ముంబై వెళ్లనున్నారు. తుమ్మిడిహట్టి, మేడిగట్టి చెరువులపై మహారాష్ట్ర ప్రభుత్వంలో చర్చలు జరుపునున్నారు.

 

 

నేడు భారత్, ఆస్ట్రేలియా తొలి మ్యాచ్

ఢిల్లీ: నేడు భారత్, ఆస్ట్రేలియా ల మధ్య క్రికెట్ తొలి మ్యాచ్ జరుగనుంది. పెర్తు వేదికగా ఉదయం 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 
 

 

06:33 - January 12, 2016

Don't Miss