Activities calendar

15 January 2016

పెట్రోల్, డీజిల్, ఎక్సైజ్ సుంకం పెంపు..

ఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. పెట్రోల్ పై 75 పైసలు, డీజిల్ పై రూ.1.83 పైసలు పెంచింది. 

21:22 - January 15, 2016

కేరళ : అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగాయి. పొన్నంబళ్ల మేడులో మకరజ్యోతి దర్శనమిచ్చింది. అయ్యప్పస్వామి మకర జ్యోతి రూపంలో మూడు సార్లు భక్తులకు దర్శనమిచ్చారు. మకరజ్యోతిని తిలకించి భక్తులు 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ పులకించిపోయారు. మకరజ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. 

21:21 - January 15, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల తొలి జాబితా విడుదల చేయగానే టీఆర్‌ఎస్‌లో అసంతృప్తులు భగ్గుమంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ తమను కాదని అనర్హులకు టిక్కెట్లు కేటాయంచారంటూ అసంతృప్తులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్‌ కాప్రా సర్కిల్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు భేతాళ బాలరాజు ఇంటిని కార్యకర్తలు ముట్టడించారు. అలాగే టీఆర్‌ఎస్‌ ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాలచారిని సైతం నిర్బంధించారు. డబ్బులకు ఆశపడి అనర్హులకు టిక్కెట్లు ఇచ్చారని కాప్రా నాయకులు షేర్‌ మణెమ్మ ఆరోపించింది. 

21:19 - January 15, 2016

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. 150 డివిజన్లకు గాను 60 డివిజన్ల అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన వాటిని వీలైనంత త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించింది. కార్యకర్తల అభిప్రాయాలతో పాటు సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ చెబుతోంది. అధికార పార్టీ గ్రేటర్ ఎన్నికల తొలి జాబితాపై ఉత్కంఠ తొలగింది. 30 నుంచి 40మంది అభ్యర్థులతో తొలి జాబితా ఉంటుందని కార్యకర్తలు అంచనా వేసినా.. 60 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధానంగా ఓల్డ్‌సిటీతో పాటు నగర శివారు ప్రాంతాల అభ్యర్థులకు తొలివిడతలో ప్రాధాన్యత దక్కింది. 150 స్థానాలకు అభ్యర్థులను రంగంలోకి దించుతామని ప్రకటించిన గులాబి దళం అందుకు అనుగుణంగా కసరత్తు చేస్తోంది.

తొలి జాబితాలో బీసీలు..మైనార్తీలకు ఛాన్స్...
తొలి జాబితాలో బీసీలు, మైనార్టీలకు పెద్దపీట దక్కింది. 24 మంది వెనకబడిన వర్గాలతో పాటు 16 మంది మైనార్టీలకు పోటీ చేసే అవకాశాన్ని అధికార పార్టీ కల్పిస్తోంది. ఎస్సీ రిజర్వేషన్ వార్డుల్లో 5 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. అగ్రవర్ణాలకు మొదటి జాబితాల్లో 15 స్థానాలు దక్కాయి. రిజర్వేషన్లకు తగ్గట్లు 50 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తామని నేతలు తెలిపారు. అభ్యర్ధుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించామని.. కార్యకర్తల అభిప్రాయాలతో పాటు పార్టీపరంగా మూడు సర్వేలు నిర్వహించి ఎంపిక పూర్తి చేసినట్లు అభ్యర్ధుల ఎంపిక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఎన్నికల్లో 100 స్థానాలకు పైగా గెలుస్తామని కేకే ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రేటర్‌ హైదరాబాద్‌పై ప్రత్యక్షంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నామని.. సోమవారం మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డీఎస్‌ వెల్లడించారు. ఓవైపు అన్ని స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేశామని నేతలు చెబుతున్నప్పటికీ.. కీలక స్థానాలపై ఇంకా అభ్యర్ధుల ఎంపిక కసరత్తు పూర్తి కాలేదని సమాచారం. 

పశ్చిమలో పోలీసుల దాడులు..

ప్రకాశం : జిల్లాలో జోరుగా కొడి పందేలు జరుగుతున్నాయి. పలు మండలాల్లో కోడి పందేలా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. బల్లికురవ (మం) మల్లాయపాలెంలో 11 మందిని అరెస్టు చేశారు. 11 కోళ్లు, రూ.2500 నగదును స్వాధీనం చేసుకున్నారు.

 

20:35 - January 15, 2016

బంగారం..డబ్బు..ఇతరత్రా వస్తువులు దొంగతనం జరుగుతుంటాయి. కానీ గిదేంది కొండచిలువను దొంగతనం చేసిండు ఏందీ అనుకుంటున్నరు కదా..అవును ఓ వ్యక్తి మాత్రం ఏకంగా కొండచిలువనే దొంగతనం చేసిండు. ఓ జంతువుల దుకాణంలోకి వచ్చిండు. ఎవరూ చూడడం లేదనుకుని అమాంతం కొండచిలువను ప్యాంట్ లో వేసుకున్నడు. కానీ సీసీ కెమెరా అంతా చూసి రికార్డు చేసేసేంది. ఇంకేముందు పోలీసులు అతడిని కటకటాల్లోకి నెట్టిండ్రు. అమెరికాలోని ఓ జంతువుల దుకాణంలో గిది చోటు చేసుకుంది. 

20:31 - January 15, 2016

ఏనుగు పాటలు పాడడం ఏందీ ? అసలు మాటలే రావు ఇంకా పాటలు పాడేదేంది అంటారా ? ఈ వీడయో చూస్తే మీకే తెలుస్తది. తమిళనాడులో ఉన్న ఓ ఏనుగు పాటలు పాడుతోంది. ఓ గుళ్లో ఇది ఇలా చేస్తుందంట. ఇక మరో ఏనుగైతే స్టెప్పులేస్తోందంట. మనుషులకే కాకుండా జంతువులకు కూడా సంగీతంపై మక్కువ ఉందని తెలుస్తోంది. మరి ఈ ఏనుగులు ఎలా చేస్తున్నాయో వీడియో చూడుండ్రి.

20:29 - January 15, 2016

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు అనేక అంశాలపై మస్తు మాట్లాడిండు. అనేక హామీలు కూడా ఇచ్చిండు గుర్తుండే ఉంటుంది కదా. అందులో ముఖ్యమైంది ప్రత్యేక హోదా. ఐదేండ్లు కాదు..పదేండ్లు ఇవ్వాలంటూ అప్పట్లో డిమాండ్ చేసిండు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏమన్నడో చూడండి.

20:27 - January 15, 2016

పెట్రోల్, డీజీల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంపు..తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న అమలు ఏమైంది ? గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని కూడా చెప్పిండు. కానీ ఇవన్నీ చేయలేదు. ప్రత్యేక హోదాపై సీఎం బాబు ఆనాడు ఏమన్నాడు. ఇప్పుడేమంటున్నాడు ? ఫోన్ కంపెనీల కుట్ర…ఫేస్ బుక్ జుకర్ బర్గ్ ఫ్రీ బేసిక్స్ అమలు..ఆర్టీఏ అధికారుల దోపిడి..పాటలు పాడే ఏనుగు. కొండచిలువ దొంగతనం..సంక్రాంతి పండుగ సందర్భంగా 'పతంగి' పాట..ఈ అంశాలపై మల్లన్న తనదైన శైలిలో విశ్లేషించాడు. వివరాలకు వీడియో చూడండి. 

20:19 - January 15, 2016

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు ఇచ్చిన హామీ యాదికి ఉందా ? అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ముస్లింలకు 12 రిజర్వేషన్ అమలు చేస్తనన్నడు. కానీ ఇప్పటికీ ఆ హామీ నీటి మూటగానే మిగిలింది. అంతేగాదు గిరిజనులకు కూడా ఇస్తనని చెప్పిండు. కానీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది. ఏమన్నా అమలయ్యాయ్యా ? దీనిపై ముస్లిం నేతలు ఏమంటున్నరో వీడియో చూడండి..

గాలి పటాలు ఎగురవేస్తూ..

హైదరాబాద్ : సంక్రాంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పతంగులు ఎగురవేస్తూ ముషిరాబాద్ లో భవనంపై నుండి జారిపడి 14 ఏళ్ల బాలుడు, గుడిమల్కాపూర్ లో అల్లూరి సీతరామరాజు నగర్ లో భవనంపై నుండి పడి మల్లేష్ అనే వ్యక్తి మృతి చెందారు.

ఎస్పీ సల్వీందర్ సింగ్ కు లైడిటెక్టర్ పరీక్షలు..

పంజాబ్ : పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్పీ సల్వీందర్ సింగ్ కు లైడిటెక్టర్ పరీక్షలను ఎన్ఐఏ నిర్వహించనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. 

స్వల్పంగా తగ్గిన చమురు ధరలు..

ముంబై : పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పై 32 పైసలు, డీజిల్ పై 85 పైసలు తగ్గింది. తగ్గిన ధరలు అర్ధరాత్రి నుండి అమలు కానున్నాయి.

18:39 - January 15, 2016

సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలైతే...పండగ కళంతా ఒక సినిమాలోనే కనిపించింది. ఫెస్టివల్ ఫేవరేట్ అనుకున్న ఆ సినిమా...ఊహించినట్లుగానే ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. అదే నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన. పల్లె వాతావరణం, కలర్ ఫుల్ గా పాటల పిక్చరైజేషన్, పాత్రల చిత్రీకరణ, కామెడీ, కొంత సోషియో ఫాంటసీ అంశాలు...వెరసి సోగ్గాడిని పండగ హీరోను చేశాయి.                                                                                 

కథ..
సరసం, సందడి, సాయం ఈ మూడు లక్షణాలు ఉన్న జమీందారు బంగర్రాజు. అమ్మాయిలతో సరదాలు పడటం అతనికి అలవాటు. ఐతే ఎవరికి కష్టమొచ్చినా ఆదుకుంటూ...బడులు, గుడులు కట్టిస్తూ మంచి పేరు తెచ్చుకుంటాడు. సత్యభామ ఇతని భార్య. ఊరిమీద సరదాల నుంచి భర్తను కంట్రోల్ చేయాలని చూస్తుంటుంది. తన కొడుకు రాము తండ్రిలా తయారవకూడదని...పుస్తకాల పుట్టగా మార్చేస్తుంది. డాక్టర్ చదివిస్తుంది. బంగర్రాజు యాక్సిడెంట్ లో చనిపోతాడు. కొడుకు రాము పెళ్లై అమెరికాలో స్థిరపడతాడు. చిన్నప్పటి నుంచి చదువు తప్ప మరే ధ్యాస లేని రాము..భార్య సీతను సుఖపెట్టలేకపోతాడు. దీంతో విడాకులు కోరుతుంది సీత. అమ్మకు విషయం చెప్పాలని భార్య సీతను సొంతూరు తీసుకొస్తాడు రాము. ఈ లోగా ఓ భగత్ సంకల్పం మీద బంగర్రాజు ఆత్మను భూలోకానికి పంపిస్తాడు యమ ధర్మరాజు. కొడుకు భార్యను పట్టించుకోలేక పోవడం వల్లే కాపురం విడాకుల దాకా వచ్చిందని తెల్సుకున్న బంగర్రాజు...ఆత్మ రూపంలో కొడుకులో ప్రవేశించి ఇద్దరు కలిసేలా ప్రయత్నిస్తుంటాడు. బంగర్రాజు యాక్సిడెంట్ లో మరణించలేదని...హత్య చేశారన్నది కథలో ట్విస్ట్. ఊరి గుడిలో ఉన్న అపార సంపదకు బంగర్రాజు హత్యకు సంబంధం ఏంటి. బంగర్రాజు ఆత్మ భూమ్మీదకు రావడానికి గల భగవత్ సంకల్పం ఏంటనేది మిగిలిన కథ.

నటీ నటుల అభినయం..​
ఓవరాల్ గా సోగ్గాడే చిన్ని నాయన సినిమా బాగుండటానికి కథలోని ఆహ్లాదమే కారణం. ఊరి వాతావరణం, అందమైన లొకేషన్లు, అక్కడి నేటివిటీకి తగిన పాత్రలు, అమ్మాయిలతో బంగర్రాజు సరదాలు, రాము పాత్ర అమాయకంగా చేసే కామెడీ ఇవన్నీ...ప్రేక్షకులను సినిమా అలా చూస్తుండిపోయేలా చేస్తాయి. బంగర్రాజు పాత్రలో రొమాంటిక్ గా, రాము పాత్రలో ఇన్నోసెంట్ డాక్టర్ లా నాగార్జున బాగా నటించాడు. లావణ్య త్రిపాఠీ మరోసారి యాక్టింగ్ టాలెంట్ ఫ్రూవ్ చేసుకుంది. సత్యభామగా రమ్యకృష్ణ హుందాగా నటించింది. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం నవ్వించాడు. బంగర్రాజు, బ్రహ్మానందం మధ్య వచ్చే సీన్స్ సెకండాఫ్ ను నిలబెట్టాయి. దర్శకుడిగా కళ్యాణ్ కృష్ణ పాసయ్యాడు. అనూప్ సంగీతం ఫర్వాలేదు. మ్యూజిక్ బాగుంటే సినిమా మరో మెట్టుపై ఉండేది. మొత్తానికి సంక్రాంతి పండక్కి సందడంతా సోగ్గాడిదే అన్న ఎక్సెపెక్టేషన్స్ నిజమయ్యాయి.

ఫ్లస్ పాయింట్స్
నాగార్జున ద్విపాత్రాభినయం
బ్రహ్మానందం నాగార్జున కామెడీ
పాటల చిత్రీకరణ
ఆహ్లాదకరమైన పల్లె వాతావరణం
సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్
ఫస్టాప్ స్లో నెరేషన్
రిపీటెడ్ రొమాంటిక్ సీన్స్
సంగీతం

17:39 - January 15, 2016

బ్రిస్బేన్ : టీమిండియా రెండో వన్డేలో కూడా పరాజయం పాలైంది. రోహిత్ శర్మ సాధించిన సెంచరీ వృధా అయిపోయింది. బౌలర్లు రాణించకపోవడంతో ఆస్ర్రేలియా ఏడు వికెట్ల నష్టంతో విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్ లో ఆసీస్ 2-0 తో అధిక్యంలో ఉంది. రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వరించింది. 
భారత్ నిర్దేశంచిన 308 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 మూడు వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు ఫించ్, మార్స్ లు వచ్చి రాగానే బ్యాట్ ను జులిపించడం ప్రారంభించారు. వీరిద్దరూ కలిసి బాల్ ను బౌండరీలకు తరలించారు. వీరిని అవుట్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఈ దశలోనే వీరిద్దరూ అర్ధ సెంచరీ నమోదు చేశారు. 309 పరుగుల లక్ష్య చేధనలో దూకుడుగా ఆడిన ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ (78 : 81 బంతుల్లో 7x4, 1x6) జడేలా బౌలింగ్ లో ఫీల్డర్ రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లాంగాఫ్ దిశగా భారీ షాట్ కోసం ఫించ్ ప్రయత్నించగా..అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రహానే మెరుపు వేగంతో కదిలి డ్రైవ్ చేస్తూ బంతిని క్యాచ్ గా అందుకున్నాడు. అప్పటికీ జట్టు స్కోరు 145 పరుగులు. ఇన్నింగ్స్ 30 ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్ లో షాన్ మార్ష్ (71: 84 బంతుల్లో 5x4) షాట్ కోసం ప్రయత్నించగా..బంతి బ్యాట్ ఎడ్జ్ కు తగిలి సిల్లీ మిడాన్ గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ బంతిని సునాయసంగా అందుకున్నాడు. అంతకుముందు మార్ష్ ఇచ్చిన మూడు క్యాచ్ లను భారత్ క్రీడాకారులు నేలపాలు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ అవుట్ అయిన అనంతరం వచ్చిన స్మిత్, బెయిలీలు దూకుడుగానే ఆడారు. అర్ధ సెంచరీ వైపుకు దూసుకెళుతున్న స్మిత్ (46) ను యాదవ్ బౌల్డ్ చేశాడు. అనంతరం విజయానికి కావాల్సిన పరుగులు బెయిలీ 76, మాక్స్ వెల్ 26 లు సాధించారు. భారత బౌలర్లలో శర్మ, యాదవ్, జడేజాలు తలా ఒక వికెట్ తీశారు.

అదరగొట్టిన రోహిత్..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. తనదైన స్టైల్లో ఆడిన రోహిత్ సెంచరీ సాధించాడు. ఇతనికి ధావన్ ఏమాత్రం సహకరించలేకపోయాడు. జట్టు స్కోరు 9 పరుగుల వద్ద ఉండగానే ధావన్ (6) ను పారిస్ పెవిలియన్ పంపించాడు. అనంతరం వచ్చిన కోహ్లీ, రోహిత్ కు జత కలిశాడు. వీరిద్దరూ కలిసి ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొన్నారు. అడపదడపా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశారు. ఈ మధ్యలో రోహిత్ అర్ధ సెంచరీ నమోదు చేసి మంచి ఊపు మీదున్నాడు. ఇతడిని అవుట్ చేయడానికి ఆసీస్ బౌలర్లు శ్రమించారు. మరోవైపు కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. జట్టు స్కోరు 134 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీ (59) ఔటయ్యాడు. వికెట్లు పోతున్నా రోహిత్ తన పోరాటాన్ని రహానేతో కొనసాగించాడు. వీరిద్దరూ వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ దశలో రోహిత్ మరోమారు సెంచరీ నమోదు చేశాడు. తొలి వన్డేలో 171 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్ అదే జోరును తాజాగా బ్రిస్బేన్ లోనూ కొనసిగిస్తూ 111 బంతుల్లో 8 x 4, 3x6 సాయంతో 100 పరుగులు చేశాడు. తానేమి తక్కువ కాదనట్లుగా రహానే కూడా అర్ధ సెంచరీ సాధించి ఆస్ట్రేలియన్లకు చెమటలు పట్టించాడు. సమయోచితంగా ఆడిన రహానే 51 బంతుల్లో 4x4 సాయంతో 50 పరుగులు చేశాడు. ఈ దశలో జట్టు స్కోరు 255 వద్ద రోహిత్ శర్మ (124) పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన ధోని కూడా ఎక్కువ సేపు నిలబడలేదు. కేవలం 11 పరుగులు చేసిన ధోనిని బొలాండ్ అవుట్ చేశాడు. సెంచరీ వైపుకు దూసుకెళుతున్న రహానే (89)ను ఫాల్క్ నర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అప్పటికీ జట్టు స్కోరు 298 పరుగులు. మిగతా బ్యాట్స్ మెన్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాల్క్ నగర్ రెండు, పారిస్, హాస్టింగ్స్, బొలాండ్ తలా ఒక వికెట్ తీశారు.

క్యాచ్ లు మిస్...
ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన జడేజా బౌలింగ్ లో ఆసీస్ ఓపెనర్ షాన్ మార్ష్ లాంగాఫ్ దిశగా భారీ షాట్ కొట్టగా బంతి గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ ఇషాంత్ శర్మ బంతిని క్యాచ్ గా అందుకొనే ప్రయత్నంలో తడబడి నేలపాలు చేశాడు. తరువాత ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్ లో మార్ష్ బంతిని ప్లిక్ చేసేందుకు ప్రయత్నిచంగా బ్యాట్ ఎడ్జ్ కు తగిలి స్లిప్ లోని రహానె చేతులను తాకుతూ బౌండరీ లైన్ దాటింది. దీనితో వరుస ఓవర్లలో షాన్ మార్ష్ కు రెండు జీవదానాలు లభించినట్లైంది. 

17:26 - January 15, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ తొలి జాబితా విడుదలైంది. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ నేత కె. కేశవరావు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని తెలిపారు. డివిజన్ల వారీగా అభిప్రాయాలను సేకరించి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. బలాబలాల మీద రెండుసార్లు సర్వే జరిపించామని పేర్కొన్నారు. ఇక తొలి జాబితాలో 60 మందికి అవకాశం కల్పించారు. ఇందులో.. 24 మంది బీసీలు, 5 మంది ఎస్సీలు, 16 మంది మైనార్టీలు, 15 మంది జనరల్ అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 
 

డివిజన్ అభ్యర్థి పేరు

సనత్ నగర్

లక్ష్మీ బాల్ రెడ్డి

అమీర్ పేట్

శేషు కుమారి

భొలక్ పూర్

రామారావు

చైతన్యపురి 

జి.విఠల్ రెడ్డి

ముషీరాబాద్

భాగ్యలక్ష్మీ యాదవ్

గచ్చిబౌలి

సాయిబాబా

శేరిలింగంపల్లి

నాగేందర్ యాదవ్

ఉప్పుగూడ

శీనయ్య

కాచిగూడ

చైతన్య కన్నా యాదవ్

ఎర్రగడ్డ

అన్నపూర్ణ యాదవ్

అడ్డగుట్ట

విజయకుమారి

చవాని 

ఖలీం

ఓల్డ్ మలక్ పేట్ 

భువనేశ్వరి

జాహునుమా

గులాం నబీ

నవాబ్ షాహెబ్ కుంట

ఫర్హత్ సుల్తానా

రమ్నసపూరా

అజీమ్ పాషా

కిషన్ బాగ్

షకీల్ అహ్మద్

ఐఎస్సదన్

స్వప్న సుందర్ రెడ్డి

గౌలి పురా

మీనా

తలబ్ చంచలం

ఫాతిమా

చాంద్రయణగుట్ట

రాజేంద్ర కుమార్

పురానా పుల్

మల్లిఖార్జున యాదవ్

పత్తార్ ఘాట్

మిర్జా బకీర్ అలీ

మొఘల్ పూరా

వీరమణి

శాలి బండా

అన్వర్

మోండా మార్కెట్ 

ఆకుల రూప హరికృష్ణ

రైన్ బజార్ 

అజీజ్

సంతోష్ నగర్

మొహ్మద్ అక్రముద్దీన్

రియాసత్ నగర్ 

మొహ్మద్ యూసఫ్

డబీర్ పూరా

మొహ్మద్ అబ్దుల్ జీషన్

కుర్మాగూడ

పూజ అఖిల్ యాదవ్

ఘాన్సీ బజార్

మహాదేవి

గుడిమల్కాపూర్

బంగారు ప్రకాష్

హబ్సీగూడ

సుభాష్ రెడ్డి  

మీర్ పేట్

అంజయ్య

గాంధీనగర్ 

పద్మా నగేష్

సైదాబాద్ 

సింగిరెడ్డి స్వర్ణలత

జియాగూడ

ఎ కృష్ణ

కొండాపూర్

 హమీద పటేల్

జీడిమెట్ల

పద్మ ప్రతాప్ గౌడ్  

అల్వాల్

చింతల విజయశాంతి రెడ్డి

గోల్నాక

జయశ్రీ

మన్సురా బాద్

విఠల్ రెడ్డి
సోమాజిగూడ అట్లూరి విజయలక్ష్మి

బాలానగర్

నరేంద్ర చారి

కేపీహెచ్ బీ కాలనీ

అడుసుమిల్లి వెంకటేశ్వరరావు

కాప్రా

స్వర్ణరాజు శివమణి

ఎ.ఎస్.రావ్ నగర్

 పావని రెడ్డి

యూసుఫ్ గూడ

బి.సంజయ్ గౌడ్

తార్నాక

ఆలకుంట సర్వసతి హరి

బౌద్ధనగర్

బైరగోని ధనుంజయ దయానంద్ గౌడ్

అజంపురా

సిద్దా లక్ష్మి

బోరబండ

బాబా షంషుద్దీన్

రహమత్ నగర్

మహ్మద్ అబ్దుల్ షఫీ

అల్లాపూర్

సరియా బేగం

మూసారాంబాగ్

తీగల సునరితా రెడ్డి

ఉప్పల్

హన్మంత్ రెడ్డి

బన్సీలాల్ పేట

కుర్మ హేమలత

రాంగోపాల్ పేట

అత్తెల్లి అరుణ గౌడ్

సంతోష్ నగర్

మహ్మద్ అక్రముద్దీన్

రెయిన్ బజార్

మహ్మద్ ఐజాజ్

శాలిబండ

మహ్మద్ అన్వర్

 

గ్రేటర్ టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..

గ్రేటర్ టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..

హైదరాబాద్ : గ్రేటర్ టీఆర్ఎస్ అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. తొలుత 60 మందితో జాబితాను విడుదల చేసింది.

16:38 - January 15, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ తొలి జాబితా విడుదలైంది. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ నేత కె. కేశవరావు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని తెలిపారు. డివిజన్ల వారీగా అభిప్రాయాలను సేకరించి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. బలాబలాల మీద రెండుసార్లు సర్వే జరిపించామని పేర్కొన్నారు. ఇక తొలి జాబితాలో 60 మందికి అవకాశం కల్పించారు. ఇందులో.. 24 మంది బీసీలు, 5 మంది ఎస్సీలు, 16 మంది మైనార్టీలు, 15 మంది జనరల్ అభ్యర్థులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 

16:35 - January 15, 2016

నెల్లూరు : జిల్లా ముత్తుకూరు మండలంలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. కోడిపందాల పేరుతో దొరవారిపాలెం పంచాయతీ పరిధిలోని పొలాల్లో ఉన్న రైతులను చితకబాదడంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను రైతు అని.. తనకు కోడిపందాల విషయం తెలియదని ప్రాధేయపడినా పోలీసులు కనికరించలేదు. రాత్రంతా స్టేషన్‌లో ఉంచి.. కోర్టులో హాజరుపరుస్తాం.. పెద్దలను తీసుకురమ్మని పంపించారు. దీన్ని అవమానంగా భావించిన మస్తాన్‌.. పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న మస్తాన్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

16:31 - January 15, 2016

శ్రీకాకుళం : సంక్రాంతి పండుగ సందర్భంగా నాటుకోళ్లకు డిమాండ్‌ అమాంతంగా పెరిగిపోయింది. ఇంటికి వచ్చే అల్లుళ్లు, చుట్టాలకు నాటుకోడి కూర వండిపెట్టడం ఆనవాయితిగా వస్తోంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో నాటుకోడి విక్రయాలు జోరందుకున్నాయి. నాటుకోళ్లకు డిమాండ్‌ పెరగడంతో వీటి ధరలు భారీగా పెరిగి.. వ్యాపారస్తులకు కాసులు కురిపిస్తున్నాయి. మరోవైపు కోళ్ల రేట్లు భారీగా పెరిగినా.. ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం కాబట్టి.. కోడికూర చేయక తప్పదంటున్నారు ప్రజలు. 

16:29 - January 15, 2016

వరంగల్ : సంక్రాంతి ముగ్గులు చూసి విదేశీ వనితలు తెగ ముచ్చట పడుతున్నారు. వావ్‌.. వాటే కలర్‌ఫుల్‌ ఫెస్టివల్‌ అంటూ కేరింతలు కొడుతున్నారు. అంతేకాదు.. వారు కూడా వరంగల్‌లోని కాజిపేట బాలవికాస ప్రాంగణంలో ముగ్గులేసి.. గొబ్బెమ్మలు పెట్టి తెలుగు సాంప్రదాయానికి సలామ్‌ కొడుతున్నారు. పిండి వంటల రుచి చూసి ఫిదా అవుతున్నారు. అచ్చ తెలుగు అమ్మాయిల్లా సాంప్రదాయ నృత్యాలతో ఔరా అనిపించారు. 

ఆసీస్ విన్..

బ్రిస్బేన్ : భారత్ తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో కూడా ఆసీస్ విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో భారత్ ను మట్టికరిపించింది. భారత్ విసిరిన 308 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. 

టీఆర్ఎస్ తొలి జాబితా విడుదల.

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసింది.60 డివిజన్ లకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 150 డివిజన్ లకు అభ్యర్థులను ఖరారు చేయడం  జరిగిందని, టైపింగ్ లో ఆలస్యం అవుతున్నందున వల్ల తొలుత 60 మందిని ప్రకటించడం జరిగిందని పార్టీ నేత కేకే పేర్కొన్నారు. 

 

ఆసీస్ 32 బాల్స్ 34 రన్స్..

బ్రిస్బేన్ : రెండో వన్డేలో కూడా విజయం సాధించాలని ఆసీస్ భావిస్తోంది. అందుకనుగుణంగా ఆసీస్ బ్యాట్స్ మెన్స్ బ్యాట్ జులిపిస్తున్నారు. బెయిలీ, మాక్స్ వెల్ లు స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్నారు. ప్రస్తుతం 32 బాల్స్ లో 34 రన్స్ చేయాల్సి ఉంది. బెయిలీ 63, మాక్స్ వెల్ 11 పరుగులతో క్రీజులో ఆడుతున్నారు.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై : స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. 318 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్ 24,455 వద్ద ముగిసింది. 99 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 7,437 వద్ద ముగిసింది.

 

15:36 - January 15, 2016

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో ఎయిమ్స్ నివేదిక వెలువడింది. ఆమె విష ప్రయోగం వల్లే చనిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. అయితే పుష్కర్ తీసుకున్న మెడిసన్ ఓవర్ డోస్ కావడం వల్ల మృతి చెందారని, ఓవర్ డోస్ విష ప్రయోగం అన్నట్లుగా నివేదికలో ఎయిమ్స్ పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మాజీ మంత్రి శశిథరూర్ పై ఎలాంటి అభియోగాలు మోపే అవకాశం లేదని సమాచారం. దీనిపై ఢిల్లీ పోలీసు కమిషనర్ బాసి మీడియాతో మాట్లాడారు. నివేదికను పరిశీలిస్తున్నామని, అసహజ మరణమని చెప్పుకొచ్చారు.
2014లో సునందా ఢిల్లీలోని లీలావతి హోటల్‌లో చనిపోయింది. డ్రగ్స్ మితిమీరడం వల్ల సునందా మృతిచెందినట్లు అప్పట్లో ఎయిమ్స్ వైద్యులు అటాప్సీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కానీ పోలీసులు మాత్రం ఆమె విషప్రయోగానికి గురైనట్లు తెలిపారు. రెండు నివేదికలు వేర్వేరుగా ఉండడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్‌బీఐ సహాయం తీసుకున్నారు. సునందా ఉదర భాగం నుంచి తీసిన విసెరా శ్యాంపిళ్లను పరీక్ష కోసం ఎఫ్‌బీఐకి పంపారు.

ఆసీస్ 200 పరుగులు..

బ్రిస్బేన్ : భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ 35.2 ఓవర్లలో 200 పరుగుల మైలురాయిని చేరుకుంది. 308 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం స్మిత్ 27, బెయిలీ 17 క్రీజులో ఉన్నారు. 

మార్ష్ అవుట్..

బ్రిస్బేన్ : భారత్ తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. శర్మ బౌలింగ్ లో మార్ష్ (71) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 29.5 ఓవర్లలో 166 పరుగులు చేసింది. 

14:58 - January 15, 2016

సంక్రాంతి అంటే ఆడపిల్లలకు సంబరం. సంక్రాంతి అంటే అమ్మాయిలకు సంతోషం. ఈ పండుగ వేళ ఆడపిల్లలంతా సంప్రదాయ లంగా, వోణిలతో మెరుస్తారు. తెలుగింటి లోగిళ్లకు హరివిల్లుల రంగులను అద్దుతారు. మరి అంత ప్రత్యేకమైన సంప్రదాయమై ఈ లంగా ఓణిలను ఆధునిక అభిరుచిలకు అనుగుణంగా ఎలా వేసుకోవచ్చో వీడియోలో చూడండి. 

సురేంద్ర పుష్కర్ అసహజ మరణం - బాసీ..

ఢిల్లీ : సురేంద్ర పుష్కర్ ది అసహజ మరణమని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బాసి పేర్కొన్నారు. ఎయిమ్స్ నివేదికను అధ్యయనం చేస్తున్నామన్నారు. 

మోడీ కుచ్ బీ బిగాఢ్ నహీ సక్తే - కేజ్రీ..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పలు విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'మోడీ జీ ఆప్ కుచ్ బీ కర్లో..సచ్చాయ్ హమారే సాథ్ హై..భగవాన్ హామారే సాథ్ హై..' అంటూ ట్వీట్స్ చేశారు. డీడీసీఏ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీఎం కేజ్రీవాల్, ఎంపీ కీర్తీ ఆజాద్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఫించ్ అవుట్..

బ్రిస్బేన్ : కొరకరాని కొయ్యగా మారిన ఫించ్ ను భారత్ ఔట్ చేసింది. జడేజా బౌలింగ్ లో జడేజా క్యాచ్ పట్టడంతో ఫించ్ (71) అవుట్ అయ్యాడు. 24.5 ఓవర్లలో ఆసీస్ 145 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. మార్ష్ 62 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

14:42 - January 15, 2016

చదువు కోసమో..ఉద్యోగం కోసమో..ఉపాధి కోసమో..మరో పని కోసమో..పల్లెను వదిలి పట్నం చేరిన మనిషికి లేలేత కిరణాల వెచ్చదనం..పైరగాలి చల్లదనం..మట్టి పరిమళం..ఎక్కడ దొరుకుతుంది ? కాంక్రీట్ జంగిల్ లో ఆకాశా హర్మ్యాల మధ్య ప్లాస్టిక్ వనాలలో తిరిగి తిరిగి అలసిపోయి వడలిపోతున్న మనిషికి మళ్లీ జవసత్వాన్ని జీవాన్ని ఇచ్చేది ఆ పల్లె పరిమళమే. ఆ మట్టి గంధమే. అక్కడి నీటి చెలిమలే. అందుకనే ఏమో ఈ ఆధునిక పోటీ ప్రపంచంలో యాంత్రీకంగా మారుతున్న మనిషి పండుగ పేరిట బలహీనమవుతున్న తన మూలాలను వెతుక్కుంటున్నాడు. చివరి అంచుల మీదున్న బంధాలను బలోపేతం చేసుకోవడానికి పరుగులు పెడుతున్నాడు. పల్లెకు పోదాం అంటూ పరుగులు తీస్తున్నాడు. 'సంక్రాంతి' పండుగ సందర్భంగా 'మానవి' ప్రత్యేక కథనం. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఆసీస్ ఓపెనర్ల హాఫ్ సెంచరీలు..

బ్రిస్బెన్ : భారత్ విసిరిన 308 పరుగులను చేధించడానికి ఆసీస్ ధీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు ఫించ్, మార్ష్ లు వీర విహారం చేస్తున్నారు. ఇరువురు హఫ్ సెంచరీలు పూర్తి చేయడంతో 22 ఓవర్లలో 125 పరుగులు చేసింది. ప్రస్తుతం ఫించ్ 59, మార్ష్ 56 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

తెలంగాణపై మోడీకి వివక్ష లేదు - వెంకయ్య..

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివక్ష చూపుతున్నారనడంలో అర్థ: లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రధాని ప్రచారం చేయాల్సినవసరం లేదని, మత శక్తులను అడ్డుకొనే వారికి..అభివృద్ధి చేసే వారికి జీహెచ్ఎంసీలో ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాలను సంస్కరించుకుంటూ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళుతున్నారని పేర్కొన్నారు. సంక్రాంతి పండగకు రైల్వే ముందస్తు ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేదని, తిరిగి హైదరాబాద్ వచ్చే వారి కోసం అదనపు రైళ్లను ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్ ను కోరడం జరిగిందన్నారు. 

సవాల్ ను స్వీకరించే పరిస్థితి లేదు - కేటీఆర్..

హైదరాబాద్ : తన సవాల్ ను విపక్షాలు స్వీకరించే పరిస్థితి లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ వంద సీట్లు గెలవాలని షరతులు పెడుతున్నారని, గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ దేనని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు విపక్షాలు తెలుసని, టిడిపి ఏపీ, తెలంగాణ కలిసుంటే సహించే పరిస్థితి లేదన్నారు. బీజేపీ మతం పేరిట రాజకీయాలు చేస్తోందని, హైదరాబాద్ ఒక మినీ ఇండియా అని తెలిపారు. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని, 50 ఏళ్లలో చేయని అభివృద్ధి ఐదేళ్లలో చేస్తామన్నారు. 

కేజ్రీ..కీర్తీ ఆజాద్ కు హైకోర్టు నోటీసులు..

ఢిల్లీ : డీడీసీఏ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీఎం కేజ్రీవాల్, ఎంపీ కీర్తీ ఆజాద్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

ధీటుగా ఆడుతున్న ఆసీస్..

బ్రిస్బేన్ : భారత్ విసిరిన 308 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆసీస్ ధీటుగా బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు ఫించ్, మార్ష్ లు భారత్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఆసీస్ 7 ఓవర్లలో 36 పరుగులు చేసింది. ఫించ్ 16, మార్ష్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

13:34 - January 15, 2016

కరీంనగర్ : పొట్టకూటి కోసం ఇతర జిల్లాలు..రాష్ట్రాల నుండి వలస వస్తుంటారు. కూలీలుగా మారి జీవనం సాగిస్తుంటారు. వీరిని అక్కున చేర్చుకుని చేసిన కష్టానికి తగిన వేతనం..రక్షణ ఇవ్వాల్సిన వారు వేధింపులకు దిగుతున్నారు. ఇలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కార్మిక శాఖ అధికారులు లేకపోవడంతో ఏకంగా 45 కిలోమీటర్లు నడిచి తమ సమస్యను కలెక్టర్ కు విన్నవించుకున్నారు. వివరాల్లోకి వెళితే…ఒడిశా రాష్ట్రానికి చెందిన కొందరు పెద్దపల్లి మండలం రంగాపూర్ లో ఇటుక బట్టీల్లో పనులు చేస్తున్నారు. పద్మావతి ఇటుక బట్టీ యజమాని వెంకటేశ్వరావు తమపై దాడి చేశాడని, తమకు న్యాయం చేయాలని కూలీలు రోడ్డెక్కారు. కార్మికశాఖ అధికారులు పెద్దపల్లిలో అందుబాటులో లేకపోవడంతో కాలినడకన 42కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ కలెక్టరేట్‌కు గురువారం అర్థరాత్రి చేరుకున్నారు. ఉదయం కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, లేబర్ ఆఫీసర్ నీలిమా, ఎమ్మార్వో జయచంద్రారెడ్డి కూలీలతో మాట్లాడి కలెక్టర్ దగ్గరికి కార్మికులను తీసుకెళ్లారు. కలెక్టర్ వారితో మాట్లాడి ఒడిశాకు పంపే ఏర్పాట్లు చేస్తామని హామి ఇచ్చారు. ఒరిస్సా కూలీలకు పౌరహక్కులసంఘం, సీపీఎం పార్టీ మద్దతిచ్చాయి.

13:28 - January 15, 2016

చిత్తూరు : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నోట కేబినెట్ మాట వినిపించింది. గడిచిన ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టిన బాలయ్య బాబు హిందూపురం నుండి గెలుపొందారు. టిడిపి అధికారంంలోకి రావడంతో బాలకృష్ణకు మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ సీఎం చంద్రబాబు ఆ వైపుగా అడుగు వేయలేదు. తాజాగా కేంద్రం కేబినెట్ లో మార్పులు చేర్పులు చేస్తారని వార్తలు వస్తుండడంతో ఈసారి బాలకృష్ణకు తప్పకుండా కేబినెట్ లో స్థానం వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై బాలకృష్ణ నోరు మెదిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లెకు బాలకృష్ణ ఫ్యామిలీ చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు బాలకృష్ణ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కేబినెట్‌ పదవిని ఆశిస్తున్నారా అని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదన్నారు. తన వందో సినిమాలో కుమారుడు నటిస్తారా లేదా అన్నది త్వరలో ప్రకటిస్తానన్నాడు. అనంతపురంలోని తన నియోజకవర్గం హిందూపురంలో చాలా సమస్యలున్నాయని..వాటన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. 

13:22 - January 15, 2016

ఛత్తీస్‌గఢ్‌ : బీజాపూర్‌ జిల్లా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. బీజాపూర్ అడవుల్లో ప్రత్యేక బలగాలు కూంబింగ్ జరుపుతుండగా.. మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి పంపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం భారీగా కూంబింగ్ ప్రారంభించారు. 

ఆసీస్ 19/0..

బ్రిస్బెన్ : భారత్ తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో ఆసీస్ 3 మూడు ఓవర్లలో 19 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. 

13:14 - January 15, 2016

తూర్పుగోదావరి : పండుగ..అందులో సంక్రాంతి..ఈ పండుగకు ఎక్కడో నివాసం ఉంటున్న వారందరూ తమ తమ స్వగ్రాలకు చేరుకుంటుంటారు. మూడు రోజుల కొనసాగే ఈ పండుగలో అన్నీ మరిచిపోయి సంతోషంగా ఉంటారు. ఇలా అమలాపురంలో కూడా ఓ ఉమ్మడి కుటుంబం సంక్రాంతిని ఘనంగా జరుపుకొంటోంది. ఈ కుటుంబంలో నాలుగు తరాలకు చెందిన వారున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వీరందరూ ఒకే ఇంటికి చేరుకుని సంబరాలు చేసుకుంటుంటారు. పండుగలొస్తే కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లతో ఒక్కటైపోతారని, చిన్నారుల అల్లరితో.. పిల్లల ఆటలతో..పెద్దల హడావిడితో సందడిగా మారిపోతుందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఉద్యోగాల నిమిత్తం వీరి పిల్లలు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినా ఈ సంక్రాంతి పండుగ సమయాల్లో మాత్రం అంతా ఒక్కచోటికి చేరి కలుసుకుంటారని తెలిపారు. చాలా సంతోషంగా ఉంటుందని, కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు ఇంటి పెద్దావిడ పేర్కొన్నారు. 

బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్..

బ్రిస్బేన్ : ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆరంభించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. 

కొలిక్కి రాని టిడిపి, బిజెపి సీట్ల సర్దుబాటు..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల అంశంపై టిడిపి, బిజెపి మధ్య సందిగ్ధత కొనసాగుతోంది. బిజెపికి 63 డివిజన్లు కేటాయించామని టిడిపి పేర్కొంటోంది. బిజెపికి కేటాయించే స్థానాలపై టిడిపి స్పష్టత ఇవ్వడం లేదని తెలుస్తోంది. సాయంత్రం లోకేష్ తో టి.టిడిపి నేతలు భేటీ కానున్నారు. రేపు టిడిపి గ్రేటర్ అభ్యర్థులను ప్రకటించనుంది. 

గ్రేటర్ ఎన్నికలు..ఆచితూచి వ్యవహరిస్తున్న టి.కాంగ్రెస్..

హైదరాబాద్ : గ్రేటర్ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ వ్యూహానికి ధీటుగా టి.పిసిసి జాగ్రత్తలు తీసుకొంటోంది. చివరి క్షణంలో అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 35 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. రేపు అధికారికంగా కాంగ్రెస్ జాబితాను ప్రకటించనుంది. 

నారావారిపల్లిలో బాబు..బాలయ్య కుటుంబం..

చిత్తూరు : నారావారిపల్లిలో నారా, నందమూరి కుటుంబాలు సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు, బాలకృష్ణ పాల్గొన్నారు. నాగాలమ్మ పుట్టకు సీఎం బాబు సతీమణి భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజల నుండి బాబు వినతిపత్రాలు స్వీకరించారు. 

హోం శాఖ, రక్షణ శాఖ మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష..

ఢిల్లీ : కేంద్ర హోం శాఖ, రక్షణ శాఖ మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. సరిహద్దులో భద్రతను బలోపేతం చేయడం..పఠాన్ కోట్ ఘటనపై చర్చించారు.

 

అజహర్ అరెస్టుపై పాక్ ప్రకటన..

ఢిల్లీ : మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ అరెస్టుపై పాక్ ఓ ప్రకటన విడుదల చేసింది. మసూద్ ను గృహ నిర్భందంలో ఉంచినట్లు ప్రకటించింది.

 

ఆస్ట్రేలియా టార్గెట్ 309 పరుగులు

బ్రిస్బేన్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ నిర్ణీత 50 వోవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పగురులు చేసింది.  ఆస్ట్రేలియా టార్గెట్ 309 పరుగులుగా ఉంది. 

12:19 - January 15, 2016

మహబూబ్‌నగర్‌ : జిల్లా కొల్లాపూర్‌ మండలం అమరగిరి చెంచుపల్లిలో దారుణం జరిగింది. చెంచుల ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ నేపథ్యంలో వీరన్న అనే చెంచు పొట్టలోకి బాణం దిగింది. దీంతో వెంటనే అతన్ని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అమరగిరిచెంచుపల్లెలో వీరన్న అతని భార్యతో ఘర్షణపడ్డాడు. అయితే ఇంటిపక్కన ఉన్న బయ్యన్న అనే వ్యక్తి కల్పించుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం తీవ్రస్థాయికి చేరింది. వీరన్నకు, బయ్యన్నకు మధ్య పాతకక్షలు ఉండడంతో వీరన్నపై బయ్యన్న బాణంతో దాడిచేశాడు. దీంతో బాణం వీరన్న పొట్టలోకి దూసుకెళ్లింది. వెంటనే చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించగా..పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించారు. వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. 

11:52 - January 15, 2016

హైదరాబాద్ : ముందస్తు బడ్జెట్‌పై ఎన్నికలు నీల్లు చల్లాయి. ఎంఎల్ ఎ, ఎంఎల్ సీలు గ్రేటర్‌ ప్రచారంలో బీజీగా ఉండటంతో సభ నడిపే పరిస్థితి లేదు. మరోవైపు బడ్జెట్ కసరత్తులు కూడా పూర్తి కాలేదు. దీంతో గతంలో మాదిరే ఫిబ్రవరి- మార్చి నెలల్లో బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు సర్కార్ సమాయాత్తమవుతోంది.

జనవరిలో బడ్జెట్ సమావేశాలు...?

జనవరిలో బడ్జెట్ సమావేశాలు మొదలు పెట్టాలని తెలంగాణ సర్కార్ భావించింది. ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాలని డిసైడైయ్యింది. గతానికి భిన్నంగా మార్చిలో కాకుండా ఫిబ్రవరిలోనే బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశ పెట్టి ఆమోదిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు. దీనిపై వెనక్కు తగ్గేది లేదని సీఎం సైతం ప్రకటించారు. అనుగుణంగా బడ్జెట్ కసరత్తులను సైతం మొదలు పెట్టారు. శాఖల వారిగా, జిల్లాల వారిగా ప్రతిపాధనలను సైతం సేకరిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆశలపై గ్రేటర్ ఎన్నికలు నీల్లు చల్లాయి.

జోరుగా నామినేషన్ల  పర్వం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యి నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 2న ఓటింగ్... 5న కౌటింగ్ జరిపి ఫలితాలను ప్రకటించనున్నారు. సో అప్పటి లోపు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం లేదు. ఎన్నికల కోసం కనీసం లక్ష మంది సిబ్బంది అవసరం ఉంటుంది. పోలీసులు బందోబస్తులో బిజీగా ఉండటం.. ఎంఎల్ ఎ, ఎంఎల్ సీలు కూడా ప్రచార కార్యక్రమాలను నెత్తి కెత్తుకోవడంతో.. సభకు వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో అసెంబ్లీ నిర్వహణ సాధ్యం అయ్యే పని కాదు. అందుకే ముందస్తు బడ్జెట్ ఐడియాను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎప్పటి లానే ఫిబ్రవరి రెండవ వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించింది. అప్పటిలోపు నారాయణఖేడ్ ఉప ఎన్నికలు కూడా పూర్తి అవుతున్న నేపధ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలను మార్చి చివరి వారం వరకు కోనసాగించాలని యోచిస్తోంది. 

బడ్జెట్ కసరత్తులు వేగవంతం 

అందు కోసం బడ్జెట్ కసరత్తులను వేగవంతం చేసింది. జిల్లాలు, శాఖల వారిగా వచ్చిన ప్రతిపాధనలను పరిశీలిస్తోంది ఆర్ధిక శాఖ. వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలించడంతో పాటు... నిధుల లభ్యత, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి కేటాయింపులు చేయనుంది. మరోవైపు బడ్జెట్ సమావేశాల లోపు వీలైనంత ఎక్కువ నిధులను సమీకరించే పనిలో పడింది ఆర్ధిక శాఖ. సొంత రెవిన్యూ మార్గాలతో పాటు రిజర్వు బ్యాంక్ వద్ద బాండ్లను కుదువ పెడుతోంది. తాజాగా 8 శాతం వడ్డీ చెల్లించేలా మరో వెయ్యి కోట్ల రుణాలను ఆర్ బిఐ నుంచి సేకరించింది.

లక్షా 30 వేల కోట్లతో బడ్జెట్ 

జనవరి చివరిలోపున భూములు, ఇండ్ల క్రమబద్దీకరణపై వచ్చే నిధుల విషయంలో కూడా మరింత స్పష్టత రానుంది. దీంతో మార్చి రెండో వారంలో లక్షా 30 వేల కోట్లతో... 2016- 2017 బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

11:45 - January 15, 2016

కాకినాడ : ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల జోరు ఊపందుకుంది. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడు, గొమ్మంపాడు, ఉండ్రాజవరం మండలం తాడిపర్రు, వడ్లూరు, వేలివెన్ను, పెరవలి మండలం ఖండవల్లి, ఉసుమొర్రుతో పాటు తణుకు, తేతలి, మండపాకల, దువ్వ, వేల్పూరు తదితర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మురమళ్ల, ముమ్మిడివరం, సఖినేటిపల్లి, కోరుకొండ తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించి నిన్నటి నుంచి గోదావరి జిల్లాల్లో కోడి పందేలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎన్ని ప్రకటనలు చేసినా, ముందస్తు అరెస్టులు, కేసులు పెట్టినా కోడిపందేలు మాత్రం నేతల అండదండలతో యథావిధిగా సాగుతున్నాయి. ఈ పందేల ద్వారా ఈ మూడురోజుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి. 

 


 

 

ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్..

ఛత్తీస్ ఘడ్ : బీజాపూర్  మండలం గంగూరులో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి నుంచి డంపులను స్వాధీనం చేసుకున్నారు.  

11:30 - January 15, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీకాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే 35మంది అభ్యర్థులను ఎంపిక చేసిన టీపీసీసీ... జాబితా విడుదల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. టీఆర్ఎస్ వ్యూహానికి ధీటుగా పీసీసీ జాగ్రత్తలు తీసుకుంటోంది. రేపు మధ్యాహ్నం జాబితా విడుదల చేసే అవకాశముంది. 

 

రోహిత్ సెంచరీ..

బ్రిస్బేన్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 111 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు ఎనిమిది బౌండరీలతో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇది రోహిత్ కు ఈ సిరీస్ లో వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. మరోవైపు రహానే 38 సహకారంతో శర్మ భారీ ఇన్నింగ్స్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం భారత్ 38 ఓవర్లకు 213/2 పరుగులతో ఆడుతోంది. 

10:44 - January 15, 2016

హైదరాబాద్: శంషాబ్ బాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుపబడింది. ఎయిర్ పోర్టులో డీఆర్ ఐ అధికారులు తనిఖీలు చేపపట్టారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు సిగరెట్ బాక్సులో బంగారం తరలిస్తుండగా పట్టుకున్నారు. అతని నుంచి 4.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి హైదరాబాద్ వాసిగా గుర్తించారు.

 

10:39 - January 15, 2016

హైదరాబాద్ : రానున్న మూడెండ్లలో వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికి మంచి నీళ్లు అందిస్తామని తెలంగాణ ప్రజలకు హమి ఇచ్చింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. నల్లా ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించకపోతే వచ్చే సాదరణ ఎన్నికల్లో ఓట్లు అడగమంటూ ప్రజలకు తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్‌. దీంతో మిషన్ భగీరథ పథకాన్ని అనుకున్న సమయాన్ని పూర్తి చేసేందుకు భగీరథ ప్రయత్నమే చేస్తోంది ప్రభుత్వం.

లక్షకు పైగా కిలోమీటర్ల పైపులైన్ 

మిషన్‌ భగీరథ పూర్తి చేసేందుకు కేసీఆర్‌ సర్కారుకు మూడేళ్ల సమయం మాత్రమే మిగిలి ఉంది. లక్షకు పైగా కిలోమీటర్ల పైపులైన్ సుమారు 40 వేల కోట్ల నిధులు ,నగరంలో రోజుకు 150 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు, గ్రామాల్లో 100 లీటర్లు. ఇలా ప్రతి ఇంటికి పైప్‌లైన్‌ ద్వారా మంచినీళ్లు అందించడం. ఇది కేసీఆర్‌ సర్కార్‌ టార్గెట్‌. అయితే ఈ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు కేసీఆర్‌ సర్కార్‌ ప్రయత్నాలు మొదలు పెట్టింది. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందించేందుకు ఇప్పుడిప్పుడే అధికార యంత్రాంగం పనులు మొదలు పెట్టింది. 

ఏప్రిల్ 30 నాటికి ఇంటింటికి నల్లా నీరు 

వాటర్‌ గ్రిడ్‌ మొదటి దశలో భాగంగా నీరు అందించాల్సిన 9 నియోజకవర్గాల్లో ఎస్పి. సింగ్, స్మితా సభర్వాల్ పర్యటించి పనులను పర్యవేక్షించారు. పైపు లైన్ నిర్మాణ పనులు. ఎక్కడెక్కడ పంపు హౌజ్ లు నిర్మించాలి. ఏఏ నియోజకవర్గాలకు మంచినీరు అందించాలి అనే పనులు పర్యవేక్షించారు. ముఖ్యంగా పైపులైన్ వెళ్లే మార్గంలో అటవీ, రైల్వే, ట్రాన్స్ కో శాఖలకు సంబంధించిన అనుమతుల పై అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నారు. మొదటి దశలో 9 నియోజకవర్గాలకు మాత్రం ఏప్రిల్ 30 నాటికి ఇంటింటికి నల్లా ద్వారా నీరందించేందుకు పనులను వేగవంతం అవుతున్నాయి. 

తొమ్మిది నియోజకవర్గాలకు నీరు 

రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్, మెదక్ జిల్లాలో సిద్ధిపేట,గజ్వేల్ ,దుబ్బాక. వరంగల్ జిల్లాలోని జనగాం, పాలకుర్తి, నల్లగొండ జిలాలో భువనగిరి,ఆలేరు, తుంగతుర్తి లోని ఒక మండలానికి ఏప్రిల్‌ 30 నాటికి మంచినీళ్లు అందించేందుకు పనులు చేస్తున్నారు. గోదావరి నుండి హైద్రాబాద్ కు తాగునీరందించే పైపు లైన్ కు రెండు చోట్ల ట్యాపింగ్ పాయింట్ లు ఏర్పాటు చేస్తున్నారు. మేడ్చల్ దగ్గరలోని ఘన్‌పూర్ గుట్ట, మెదక్ జిల్లాలోని కొండపాక లో మరో ట్యాపింగ్ పాయింట్ ను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారానే తొమ్మిది నియోజకవర్గాలకు నీళ్లందించనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మంచినీళ్లు అందించే మిషన్ భగీరథ పథకానికి రైతులందరూ సహకరించాలని సిఎం కోరారు. మిగత అన్ని జిల్లాల్లో మిషన్ భగీరథ పనులు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వచ్చాయి. 

09:51 - January 15, 2016

పశ్చిమగోదావరి : ఏలూరులో పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ ఆందోళనకు దిగారు. పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం సర్దార్‌సింగ్‌ పోస్టర్‌ను టిడిపికి చెందిన కొందరు వ్యక్తులు చింపేశారంటూ అర్ధరాత్రి పవన్ ఫ్యాన్స్‌ అత్తిలి పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. పవన్‌కళ్యాణ్‌ పోస్టర్‌ను చింపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ను ఎవరైనా కామెంట్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

09:46 - January 15, 2016

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. తెలుగింటి పల్లె పడుచులు అందంగా  ముస్తాబై సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. గంగిరెద్దుల ఆటలు ఆకట్టుకుంటున్నాయి. ఇంటింటికి తిరుగుతూ ఇంటిల్లిపాదిని దీవిస్తూ డూడూ బసవన్న సంక్రాంతి వేడుకల్లో సందడి చేస్తున్నాడు. 

కుటుంబసభ్యులతో సంక్రాంతి జరుపుకుంటున్న సీఎం కేసీఆర్

మెదక్: ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్ లో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. 

ఇన్ ఫార్మర్ నెపంతో గిరిజనుడిని హత మార్చిన మావోయిస్టులు

విజయనగరం : నారాయణపట్నం బ్లాకు వద్ద ఇన్ ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చారు. 

09:33 - January 15, 2016

బ్రిస్బేన్ : టీమిండియాకు ఆదిలోనే హంసపాదు కలిగింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగుల వద్ద శిఖర్ ధావన్ (6) ఔట్ అయ్యాడు. అంతకముందు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ వచ్చారు. అయితే ధావన్ 6 పరుగుల వ్యక్తి స్కోర్ వద్ద వెనుదిరిగాడు. ఐదు వన్డే సీరీస్ లో ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్ లో నెగ్గి… 1-0 ఆధిక్యంలో ఉంది. 

శంషాబ్ బాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

హైదరాబాద్: శంషాబ్ బాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుపబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 4.5 కిలో బంగారాన్ని డీఆర్ ఐ అధికారులు స్వాధీనం చేసుసుకున్నారు. 

 

తొలి వికెట్ కోల్పోయిన భారత్

బ్రిస్బేన్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగుల వద్ద శిఖర్ ధావన్ (6) ఔట్ అయ్యాడు. అంతకముందు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

08:50 - January 15, 2016

సోగ్గాడే చిన్న నాయన సినిమా నేడు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగార్జున 10టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబందించిన చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. 'సినిమాను ఎంజాయ్ చేశాను. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని సినిమా యూనిట్ అంతా నమ్మకంగా ఉంది. మనం తర్వాత నేను ప్రేక్షకులకు దూరంగా లేను. మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తున్నాను. ఈ సినిమాకు ముందుగా టైటిల్  పెట్టుకున్నాము. తర్వాత సోగ్గేడే పాటను ఇందులోకి లాగాము. యముడికి నా పాత్రకు ఉండే రిలేషన్ షిప్ గురించి చెప్పమంటే ఎట్లా అదే కదా సినిమాకు కీ పాయింట్.' అంటూ నాగ్ చాలా ముచ్చట్లు చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో పాత్రల తీరు, షూటింగ్ విశేషాలు, బ్రహ్మానందం కామెడీ మొదలైన అంశాలను గురించి నాగార్జున ఆసక్తిగా వివరించారు. చివరగా సినిమాలోని ఓ డైలాగ్ ప్రేక్షకులకోసం చెప్పాడు నాగ్. ఈ విశేషాలని వీడియోలో చూడొచ్చు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

బ్రిస్బేన్ : భారత్, ఆస్ట్రేలియా రెండో వన్ డే మ్యాచ్ కాసేపట్లో జరుగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

 

ప్రజలకు గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు..

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు మేలు జరగాలని, ప్రేమ, అనురాగం, స్నేహబంధం, సోదర భావానికి ఈ పండుగ స్ఫూర్తిదాయకంగా మారాలని ఆయన ఆకాంక్షించారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ...

చిత్తూరు : సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. 

07:43 - January 15, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రంగురంగుల రంగవల్లులు కొత్త శోభను తీసుకొస్తున్నాయి. డూడూ బసవన్న విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి.హరిదాసు కీర్తనలు అలరిస్తున్నాయి. తప్పెటగుళ్లు, కర్రసాము, పులివేషాలు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇక సంక్రాంతి పిండివంటకాలతో తెలుగు లోగిళ్లు..ఘుమఘుమలాడుతున్నాయి. 
లోగిళ్లలో రంగుల హరివిల్లు
ఊరూవాడా సంక్రాంతి సందడి..తెలుగు లోగిళ్లులో రంగుల హరివిల్లు..ఎటుచూసినా సంబరమే... అతిపెద్ద పండగ సంక్రాంతి కొత్త కళను తెచ్చిపెట్టింది. పట్నమంతా పల్లెబాట పట్టడంతో గ్రామాలు పిల్లాపాపలు, బంధుమిత్రులతో కళకళలాడుతున్నాయి.
పండగ విశిష్ఠతను వివరిస్తున్న హరిదాసులు 
పండగ సమయంలోనే కనపడే హరిదాసులు పండగ విశిష్ఠతను లయబద్దంగా వివరిస్తున్నారు. సంక్రాంతి శోభతో ప్రతి ఇళ్లూ కళకళలాడుతోంది. ఇంటిముందు రంగవల్లులు ఇంద్రధనస్సులను తలపిస్తున్నాయి. సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతున్నారు. గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. పంట చేతికి వచ్చిన సమయం కావడంతో రైతన్నలు ఆనందంతో పండగను ఘనంగా జరుపుకుంటున్నారు.ఇక పిండి వంటలతో తెలుగు వాకిళ్లు ఘుమఘుమలాడాయి. 
గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు
సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. పరుగు పందేలు, మ్యూజికల్‌ చైర్స్‌, పలు రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీలు హైలెట్‌గా నిలుస్తున్నాయి. 
ఆకాశంలో సందడి చేస్తున్న పతంగులు 
సంక్రాంతి అనగానే పంతంగుల పండుగ గుర్తుకు వస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ పతంగులు ఎగరవేస్తూ.. పండుగను ఎంజాయ్‌ చేస్తున్నారు. రంగు రంగుల పతంగులు ఆకాశంలో సందడి చేస్తున్నాయి. మేఘాలను తాకుతున్నట్లుగా సొగసైన నాట్యంతో చూపురులను కట్టిపడేస్తున్నాయి.యువకులు పోటీపడి మరీ పతంగులు ఎగరవేశారు 

 

07:34 - January 15, 2016

విజయనగరం : జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఇందిరానగర్ సమీపంలో రైల్వేట్రాక్ పై స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్ఐ చిన్నికృష్ణ మృతదేహం లభించింది. జిల్లాలోని సీతానగరానికి చెందిన చిన్నికృష్ణ  స్పెషల్ బ్రాంచ్ లో గత ఏడాది నుంచి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. 1993లో కానిస్టేబుల్ గా చేరిన చిన్నికృష్ణ వివిధ ఆపరేషన్లలో క్రీయాశీలకంగా వ్యవహరించారు. అయితే, రైల్వే ట్రాక్ దాటుతుండగానే ప్రమాదశాత్తు ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎస్సై చిన్నికృష్ణ మృతికి గల కారణాలపై ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

 

07:26 - January 15, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ కాపు కమిషన్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ మంజునాథ నియమితులయ్యారు. మంజునాథ నియామక దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు సంతకం చేశారు. మంజునాథ్‌ గతంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

 

07:24 - January 15, 2016

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల తరలింపు విషయంలో వెనక్కు తగ్గినట్టే అనిపిస్తోంది. జూన్ 2 నాటికి రాజధానికి వచ్చేయాలన్న ప్రభుత్వం ఇప్పుడు వారి తరలింపునకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులు రావాలంటే ఒక సచివాలయం కావాలి కాబట్టి ప్రభుత్వం ఆగమేఘాలపై సచివాలయ నిర్మణాన్ని పూర్తిచేయాలని సంకల్పించింది. కాని తాత్కాలిక సచివాలయం జూన్ కల్లా పూర్తవుతుందా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
వెలగపూడిలో తాత్కాలిక రాజధాని 
ఏపీ ప్రభుత్వం తాత్కాలిక రాజధానిగా వెలగపూడి గ్రామాన్ని ఎంపిక చేసింది. ఇప్పటికే పలు మార్లు తాత్కాలిక రాజధాని పేరిట పలు మార్పులు జరిగాయి. అయితే ఈ సారి వెలగపూడి గ్రామమే తాత్కాలిక రాజధాని అంటూ తేల్చేసింది ప్రభుత్వం. ఉద్యోగుల కోసం నిర్మించే తాత్కాలిక సెక్రెటేరియట్ కూడ వెలగపూడి లోనే అని ప్రకటించారు. సచివాలయ నిర్మాణానికి సంభందించి టెండర్లు సైతం పిలిచారు.
180 కోట్లతో తాత్కాలిక భవనాలు అవసరమా..? ప్రతిపక్షాలు 
అయితే ప్రభుత్వం కొద్ది రోజులపాటు మేధా టవర్స్, అమరావతీ టౌన్‌ షిప్‌ పేరిట సచివాలయం మార్పులు చేస్తే ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటుందని సీపీఎం కార్యదర్శి బాబూరావు అన్నారు. గతంలో మేధా టవర్స్ డీనోటిఫై చేస్తామని ప్రచారం చేసిన ప్రభుత్వం ఇపుడు వెలగపూడిలో తాత్కాలిక భవనం నిర్మిస్తామంటూ టెండర్లకు పిలిచింది. నిధులు లేవంటూనే 180 కోట్లతో తాత్కాలిక భవనాలు నిర్మించాల్సిన అవసరం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 
ఉద్యోగుల తరలింపునకు కట్టుబడి ఉన్నాం : మంత్రి నారాయణ 
ఇదిలా ఉంటే మంత్రి నారాయణ ఉద్యోగుల తరలింపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 6 నెలల్లోగా వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మించి ఉద్యోగులను తరలిస్తామంటున్నారు. ఉద్యోగుల తరలింపు విషయంలో ప్రభుత్వం పట్టుదలతో ఉంది. తాత్కాలిక సచివాలయ నిర్మాణ టెండర్ల ప్రక్రియను 21 రోజుల్లోగా పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
 సచివాలయం తరలింపుపై సందిగ్ధత 
మరో వైపు సచివాలయంతో పాటు ఇతర కార్యాలయాల తరలింపు అంశంలోనూ సందిగ్ధత నెలకొని ఉంది. వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు, ఉద్యోగులకు నివాస వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. మరో వైపు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ మరో ఎనిమిదేళ్ల పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఏర్పాట్లపై కూడా ఉద్యోగుల నుంచి అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది. 

 

07:14 - January 15, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు సెటిలర్ల జపం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సెటిలర్లను తిట్టిన నేతలే నేడు వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్రుల పేరు ఉచ్ఛరించేందుకే జంకిన నోళ్లు...ఇప్పడు వీరిపై అపార ప్రేమ ఒలకబోస్తున్నాయి. మేయర్‌ పీఠం కైవసం చేసుకోవాలంటే  సెటిలర్ల ఓట్లే కీలకమని భావిస్తున్న పార్టీలు...ఎన్నికల్లో వీరిని తురుపు ముక్కలుగా ఉపయోగించేకునేందుకు  వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. 
సీమాంధ్రుల పట్ల పార్టీల ప్రేమాభిమానాలు 
తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్లీ ఇప్పుడే రాజకీయ పార్టీల నేతల నోట సెటిలర్ల మాట వినిపిస్తోంది. గ్రేటర్‌లో సీమాంధ్రులు.. గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని ప్రధాన పక్షాల నాయకులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వీరి ఓట్లను కొల్లగొట్టేందుకు గతంలో ఎన్నడూలేని విధంగా ప్రేమాభిమానాలు చూపుతున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సీమాంధ్రులను దోపిడీదారులుగా విమర్శలు వర్షం  కురిపించిన నేతలు... ఇప్పుడు  అన్ని  ప్రాంతాల వారూ సమానమేనన్న నినాదాన్ని అందుకున్నారు.  
సీమాంధ్ర సెటిలర్లపై టిఆర్ ఎస్ ప్రేమ
సెటిలర్లను మచ్చిక చేసుకునే విషయంలో అధికార టీఆర్‌ఎస్‌ అందికంటే ముందు ఉంది. ఉద్యమ సమయంలో ఆంధ్రావాలా బాగో అని తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చిన గులాబీ బాస్‌... గోంగూర, పుంటికూర నుంచి బిర్యానీ వరకు అన్నింటిని కలగలిపి తిట్టారు. అటువంటి టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు సీమాంధ్ర సెటిలర్లపై ప్రేమ పుట్టింది. టీఆర్‌ఎస్‌ను తెలుగు రాష్ట్ర సమితిగా మార్చి ఏకంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోటీ చేస్తామనే స్థాయికి వెళ్లింది. ఇక్కడ ఉండే అందరూ  కూడా ఒక్కటేననే నినాదాన్ని అందుకున్నారు. 
సెటిలర్ల విషయంలో వైఖరి మార్చుకున్న కాంగ్రెస్‌
సెటిలర్ల విషయంలో ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు కూడా తమ వైఖరి మార్చుకున్నారు. వీరికి తమ పార్టీయే అండగా ఉంటుందని టీపీసీసీ నేతలు వల్లె వేస్తున్నారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీరికే సీట్లు ఇస్తామని ప్రకటించింది. వీరి ఓట్ల కోసం రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని ప్రచార రంగంలోకి దించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. 
సీమాంధ్రులకు డిప్యూటీ మేయర్‌ : టీడీపీ-బీజేపీ
మరోవైపు సెటిలర్లకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అవకాశంగా ఉపయోగించుకోవాలని టీడీపీ, బీజేపీ నేతలు నిర్ణయించారు. తమను గెలిపిస్తే సీమాంధ్రులను డిప్యూటీ మేయర్‌ పదవి ఇస్తామని ఈ రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. మొత్తంమీద ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సెటిలర్ల అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

 

07:06 - January 15, 2016

హైదరాబాద్ : రాజకీయంగా చిన్న విమర్శనైనా... తిప్పికొట్టేందుకు ప్రాధాన్యతనిచ్చే గులాబీ దళం... ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తోంది. విపక్ష పార్టీలపై విమర్శలు  చేసేందుకు కూడా గతంలో మాదిరిగా దూకుడుగా వ్యవహరించడం లేదు. పార్టీలో ఈ స్థాయిలో మార్పు ఎందుకనే అంశం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

అధికార పార్టీ కొత్త వ్యూహాలు 

గ్రేటర్ ఎన్నికలతో పొలిటికల్ హీట్ పెరుగుతున్నా అధికార పార్టీ మాత్రం కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళుతున్న గులాబీ దళం... ప్రతిపక్షపార్టీలను పెద్దగా టార్గెట్ చేయడం లేదు. దాదాపు  రెండు నెలలుగా గ్రేటర్ పరిధిలో సుడిగాలి పర్యటనలు చేస్తూ... ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధ చేసుకున్న అధికార పార్టీ... హైదరాబాద్‌లో తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రజలకు వివరించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.

గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ ఎస్ దృష్టి

మూడు జిల్లాల పరిధిలో 24 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 17 నియోజకవర్గాలపై అధికార పార్టీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఏడు నియోజకవర్గాలు ఎంఐఎం శాసనసభ్యులుండడంతో... ఆ నియోజకవర్గాల్లో  ప్రచారానికి కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. గ్రేటర్ పరిధిలో సాధారణ ఎన్నికల సమయంలో... కేవలం మూడు స్థానాలకు పరిమితమైన అధికార పార్టీ...ఆ తర్వాత జరిపిన ఆపరేషన్ ఆకర్ష్‌తో శాసనసభ్యుల సంఖ్యను భారీగా పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో శివారు ఓటర్లతో పాటు అందది మద్దతు కూడ గట్టేందుకు గులాబీ దళం  దూకుడు  పెంచుకుండా ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది.

బిజెపిని టార్గెట్ చేసిన టిఆర్ ఎస్

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ ఎస్ నిన్నమొన్నటి వరకు టిడిపిని తమ ప్రత్యర్థిగా భావిస్తూ ప్రణాళికలను అమలు చేసింది. ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయకుండా దాని మిత్ర పక్షమైన బిజెపిని టార్గెట్ గా మార్చుకుంది. బిజెపిపై తీవ్ర విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. బిజెపి కూడా టిఆర్ ఎస్ ను ఎంఐఎం పార్టీతో ముడి పెడుతోంది. టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తే... ఎంఐఎంకు మద్దతు నిస్తున్నట్లే అన్న ప్రచారాన్ని విస్తృతంగా చేస్తోంది. ఎంఐఎం నేతలు కూడా బిజెపి ఈ వ్యాఖ్యలకు బలం చేకూరేలా   కారు స్టీరింగ్ మా చేతిలోనే ఉంటుందంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసేందుకు కూడా సాహసం చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు టిఆర్ ఎస్ ప్రభుత్వంపై పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడం దేనికి సంకేతమో అంతు చిక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో టిడిపిని టార్గెట్ చేస్తే నగర శివారు ప్రాంతాల్లో ఉన్న సీమాంధ్రుల మద్దతు తమకు లభించదనే అంచనాను అధికార పార్టీ నేతలు వేస్తున్నారు.

 

నేడు, రేపు శ్రీకాలహస్తీశ్వరాలయంలో ఆర్జిత, అభిషేక సేవలు రద్దు

తిరుపతి : శ్రీకాలహస్తీశ్వర ఆలయంలో నేడు, రేపు ఆర్జిత, అభిషేక సేవలను రద్దు చేశారు.

నేడు భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే

ఆస్ట్రేలియా : భారత్, ఆస్ట్రేలియాల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. బ్రిస్బేన్ గబ్బ స్టేడియంలో ఉదయం 8.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

Don't Miss