Activities calendar

16 January 2016

31 మంది తమిళ కూలీల అరెస్టు..

కడప : అక్రమంగా ఎర్ర చందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న 31 మంది తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కడప జిల్లా రైల్వేకోడూరు మండలం కుప్పలదొడ్డి సమీపంలో శనివారం చోటు చేసుకుంది.

లింగాయపాలెం వద్ద ముగ్గురు మృతదేహాలు..

గుంటూరు : జిల్లాలోని మండలం లింగాయపాలెం వద్ద దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు యువలకు మృతదేహాలను స్థానికులు గుర్ించారు. ఎక్కడో హతమార్చి ఇక్కడ మృతదేహలను పడేసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

21:30 - January 16, 2016

 

కోల్ కతా : ఈనెల 13న కోలకతాలో హిట్‌ అండ్‌ రన్‌కు సంబంధించిన ఆడికారును పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఎయిర్‌ఫోర్స్‌ అధికారి మృతి చెందారు. విమానయాన అధికారిని ఢీకొన్న సమయంలో ఆడి కారును తృణమూల్ కాంగ్రెస్‌ నేత కుమారుడు నడుపుతున్నట్టుగా సిసిటివిలో రికార్డైంది. టిఎంసి నేత మహమ్మద్‌ షోహ్రాబ్‌ కుమారుడు 26 ఏళ్ల అంబియా షోహ్రాబ్‌గా గుర్తించారు. ఈ ఘటన అనంతరం షోహ్రాబ్‌ కుమారులిద్దరూ పారిపోయారు. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్ నిర్వహిస్తుండగా ఆడి కారు ఢీకొనడంతో ఎయిర్‌ఫోర్స్‌ అధికారి 30 ఏళ్ల అభిమన్యుగౌడ్ ప్రాణాలు కోల్పోయారు. అంబియా రాంగ్‌ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమించాడు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కేసుపై దర్యాప్తుకు ఆదేశించారు. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రమాదానికి పాల్పడ్డవారు తప్పించుకున్నారని సిపిఎం విమర్శించింది.

21:29 - January 16, 2016

ఢిల్లీ : నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడమే స్టార్ట్‌ అప్‌ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో స్టార్టప్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే స్టార్ట్‌ అప్‌ ప్రధాన ఉద్దేశ్యమని మోడీ వివరించారు. స్వయం ఉపాధి, స్వావలంభన ప్రోత్సాహం దిశగా కేంద్రం అడుగు వేసిందని.. 35 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చేలా ఈ పథకానికి రూపకల్పన చేశామని ప్రధాని తెలిపారు. 

21:25 - January 16, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఒకపక్క సంక్రాంతి పండుగ ముగియడం.. మరోవైపు శనివారం శుభ ముహుర్తం కావడంతో.. ఆయా పార్టీలు ప్రకటించిన అభ్యర్ధులంతా నామినేషన్లు దాఖల చేశారు. నామినేషన్ల కోసం జీహెచ్‌ఎంసీ కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ రెండు విడతల్లో 80 మంది అభ్యర్ధులను, కాంగ్రెస్‌ 45 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించడంతో నామినేషన్ల పర్వం కోలాహలంగా జరిగింది. అన్ని డివిజన్లలో అభ్యర్ధులందరూ భారీ ఊరేగింపుతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో సీట్లు దక్కని అభ్యర్ధులు సైతం ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తున్నారు.

భారీ ఊరేగింపులు..
మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్దులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు భారీ ఊరేగింపులతో నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో గెలిచిన అభ్యర్ధులే పోటీకి దిగుతుండడంతో.. తమ బలగాలతో వచ్చి నామినేషన్లు వేశారు. ఇక టీడీపీ-బీజేపీ పొత్తుతో సీటు రాదని ముందే తెలిసిన ఆశావాహులు.. టీడీపీ, బీజేపీల నుంచి అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. ఇదిలావుంటే.. ఎన్నోఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్నా.. సీటు దక్కని అభ్యర్ధులు.. రెబల్స్‌గా రంగంలోకి దిగి పోటీకి సై అంటున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకే కేటాయించడంతో.. ఇక హంగామా అంతా వారి భర్తలదే నడుస్తోంది. ఇక సీట్లు రాని వారు బంధువర్గం తరపున నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.

1097 కు చేరిన నామినేషన్ లు..
ఇక మూడో రోజు దాదాపు 997 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 1097కు చేరింది. ఇందులో టీఆర్‌ఎస్‌-277, కాంగ్రెస్‌-200, టీడీపీ-181, బీజేపీ-93, ఎంఐఎం-27, సీపీఐ-14, లోక్‌సత్తా-12, సీపీఎం-8, స్వతంత్ర అభ్యర్ధులు 249 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక గ్రేటర్‌లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌. ఎట్టకేలకు గ్రేటర్‌లో ఓటర్ల లెక్కతేలింది. మొత్తం 74 లక్షల 23 వేల 980 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 39 లక్షల 69 వేల ఏడు మంది పురుషులు,.. 34 లక్షల 53 వేల 910 మంది మహిళా ఓటర్లు.. ఒక వెయ్యి 63 మంది ఇతరులు ఉన్నారు. 

21:21 - January 16, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ .. కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌నిస్తూ... తెలుగుదేశం పార్టీలో చేరారు. సాయంత్రం విజయవాడలో చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. 2009-14 మధ్య కాలంలో ఆమె సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడింది మొదలు.. ఆమె కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నారు. చివరికి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోనూ ఆమె యాక్టివ్‌గా లేరు. మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డితో విభేదాలే దీనికి కారణమని పార్టీ వర్గాల సమాచారం. పైగా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా కార్తీకరెడ్డికే ప్రాధాన్యతను ఇస్తుండడంతో.. జయసుధ టీడీపీ గూటికి చేరారని భావిస్తున్నారు.

జయసుధపై కేసీఆర్ ప్రశంసలు..
జయసుధ కాంగ్రెస్‌ను వీడతారంటూ కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. ఆమధ్యలో జయసుధ కుమారుడి సినిమా ఫంక్షన్‌కు హాజరైన కేసీఆర్‌.. ఆమెపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఆమె టీఆర్ఎస్‌లో చేరతారని వార్తలు వచ్చాయి. ఐతే అనూహ్యంగా ఆమె టీడీపీ గూటికి చేరారు. తెలంగాణలో.. అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ను కాదని.. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని టీడీపీలో చేరడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. గతంలో టీడీపీతో ఉన్న సంబంధాలకు తోడు.. జాతీయ స్థాయిలో నామినేటెడ్‌ పదవి ఇప్పిస్తారన్న హామీతోనే ఆమె టీడీపీలో చేరారని భావిస్తున్నారు.

కాంగ్రెస్ కు షాక్...
ఇప్పటికే టీఆర్ఎస్‌ ఆకర్ష్‌తో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గులాబీ గూటికి చేరారు. దాని ప్రభావం తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు గ్రేటర్‌ ఎన్నికల వేళ.. మాజీ కార్పొరేటర్‌లనూ పాలక పక్షం ఆకర్షిస్తోంది. ఈ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూనే తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు జయసుధ ఎపిసోడ్‌ షాక్‌నిచ్చింది.

ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్..
నిజానికి కాంగ్రెస్‌ పార్టీని చాలాకాలంగా.. సొంతింటి కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్‌ పరిధిలో పార్టీ పరిస్థితి నేతలకు మింగుడు పడకుండా చేస్తోంది. మొన్నటికి మొన్న.. దానం నాగేందర్‌పై జరిగిన దాడి... పార్టీలోని వర్గపోరును బట్టబయలు చేసింది. ఈ కుమ్ములాటల ఫలితంగానే... ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేక పోయింది. ఇలాగే ఉంటే గ్రేటర్‌ ఎన్నికల్లో ఎదురీదక తప్పదని కాంగ్రెస్‌ నాయకత్వం కలవరపడింది. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇంతలోనే.. ఇప్పుడు జయసుధ.. పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరడం.. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని షాక్‌కు గురి చేసింది. ప్రధాన ప్రతిపక్షంగా పరువు నిలుపు కోవాలంటే గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చూపక తప్పని పరిస్థితి. దీని కోసం కుస్తీ పడుతున్న కాంగ్రెస్‌ను.. టీఆర్ఎస్‌ వారి ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఇప్పటికే పరేషాన్‌ చేస్తోంది. దీనికి తోడు ఇప్పుడు టీడీపీ కూడా ఆకర్షాస్త్రం ప్రయోగిస్తుండడంతో.. కాంగ్రెస్‌ పార్టీ విలవిలలాడుతోంది.

21:19 - January 16, 2016

కర్నాటక : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బళ్లారి నగరపాలక సంస్థ కమిషనర్ రమేశ్ పై.. బహిరంగంగానే చేయి చేసుకున్నారు. బళ్లారి కౌల్ బజార్లోని వాల్మీకి భవన్ ప్రారంభోత్సవానికి హాజరైన సిద్ధరామయ్య.. తనకు అడ్డు వచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ రమేశ్ చెంప చెళ్లుమనిపించారు. ఈ దృశ్యాలు కన్నడ టీవీలన్నింటా ప్రసారమయ్యాయి. అయితే.. సీఎం తనను కొట్టలేదని.. పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు వచ్చిన తనను.. తోయవద్దంటూ భద్రతాసిబ్బందిని ఆదేశించారంటూ.. కమిషనర్ రమేశ్... ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇవ్వడం కొసమెరుపు. 

టిడిపి, బిజెపి నేతల భేటీ..

హైదరాబాద్ : అమీర్ పేటలోని ఆదిత్య హోటల్ లో టిడిపి, బిజెపి నేతలు సమావేశమయ్యారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రమణ, వివేక్ తదితరులు హాజరయ్యారు. కాసేపట్లో సీట్ల సర్దుబాటుపై వీరు ఓ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. 

21:03 - January 16, 2016

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అనంతపురం జిల్లా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2013 సంవత్సరంలో బిజినెస్ టుడే మేగజిన్ పై ధోని విష్ణుమూర్తి అవతారంలో ఫొటో పబ్లిష్ అయ్యింది. అయితే ఆ చిత్రంలో చేతుల్లో చెప్పు..షూతో కనిపించాడు. దీనిపై కేసు దాఖలైంది. 25 తేదీలోపు అరెస్టు చేసి తీసుకరావాలని ఆదేశాలు జారీ చేసింది.

స్త్రీ - పురుష సమానత్వం..
స్త్రీ - పురుష సమానత్వంలో భారతదేశం చాలా వెనుకబడి ఉంది. పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, పాక్ తో కూడా వెనుకబడి ఉందని ఓ అధ్యయన సంస్థల్లో వెల్లడైంది. ఇండియా ర్యాంకు 131లో ఉంది.

ఓఎల్ఎక్స్ లో పందెం కోళ్లు..
సంక్రాంతికి పందెం కోళ్లు సిద్ధమై పోటీలు కూడా మొదలై ముగిశాయి కూడా. పండుగకు నెల రోజుల ముందు నుంచే కోళ్ల విక్రయాలు మొదలయ్యాయి. వీటిపై నిఘా పెరగడంతో కోళ్ల విక్రేతలు సరికొత్త దారులు అన్వేషించారంట. ఓఎల్‌ఎక్స్‌ వంటి ఆనలైన్ షాపింగ్‌ వెబ్‌సైట్‌లో పందెం కోళ్లు కనిపిస్తున్నాయి. వీటి ధర కూడా ఎక్కువగానే ఉందంట. ఒక్కో పందెం కోడి ధర రూ.6 వేల నుంచి రూ.20 వేల వరకు ఉన్నాయంట.

రాజకీయ పతంగులు..
సంక్రాంతి పండుగ సందర్భంగా రాజకీయ నేతల పతంగులు వచ్చాయి. ఎంఐఎం పార్టీ కూడా పతంగే కావడం విశేషం. ఇక్కడ కేసీఆర్ పతంగికి క్రేజ్ ఎక్కువగా ఉంది. గాలి ఎటు వైపునా ఎర్రవెల్లి ఫాం హౌస్ వైపు వెళుతుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయంట. మోడీ గాలిపటాలు అప్పట్లోనే వచ్చాయి. కానీ ప్రస్తుతం దీనికి క్రేజ్ తగ్గిందంట. ఎందుకంటే ఈ గాలిపటాలు విదేశాల్లో ఎగురుతున్నాయంట. పార్లమెంట్ చీరల గురించి చర్చిస్తామని శరద్ పవార్ కూతురు సుప్రీయా సూలే పేర్కొంది.

సోనియాకు బెయిల్ వస్తే వేలు కానుక..
ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తనయుడు రాహుల్ గాంధీకి నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ వస్తే శ్రీవారికి వేలు ఇస్తానని కర్నాటకు చెందిన ఓ భక్తుడు మొక్కుకున్నాడంట. వారికి బెయిల్ రాగానే వేలు కోసి శ్రీవారి హుండీలో వేశాడంట.కానీ పరకామణిలో వేలు రాలేదని, ఇలాంటి పనులు చేయకూడదని టిటిడి వారు చెబుతున్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

కటారి దంపతుల హత్య..23వ నిందితుడు లొంగుబాటు..

చిత్తూరు : మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో 23వ నిందితుడు బుల్లెట్ నరేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 

సుజనా కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : కేంద్ర మంత్రి సుజనా చౌదరి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. హిమాయత్ నగర్ డివిజన్ ను బీజేపీకి కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి కేటాయించవద్దంటూ నినాదాలు చేశారు. 

బీజేపీ..టిడిపి సీట్లు కొనసాగుతున్న ఉత్కంఠ..

హైదరాబాద్ : టిడిపి, బిజెపి సీట్ల కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరితో కేంద్ర మంత్రి దత్తాత్రేయ చర్చలు జరుపుతున్నారు. మరిన్ని సీట్లు ఇచ్చేది లేదని టిడిపి పేర్కొంటోందని తెలుస్తోంది. 

19:31 - January 16, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి తరపున అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. లింగోజిగూడ నుండి అభ్యర్థి సయ్యద్ జానీ వన్ హైదరాబాద్ కూటమి తరపున నామినేషన్ దాఖలు చేశారు. అలాగే చంపాపేట నుండి శ్రీనివాస్, మన్సూరాబాద్ నక్కా అంజయ్య లు కూడా నామినేషన్ లు దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వన్ హైదరాబాద్ కూటమిలో లోక్ సత్తా, సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ (యు) ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టెన్ టివితో మాజీ ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడారు. ఎన్ అంజయ్య 30 సంవత్సరాలుగా పేదలకు, మధ్య తరగతి వారి సమస్యలపై పోరాడుతున్నాడని జూలకంటి తెలిపారు. నిజాయితీగా పనిచేస్తున్న అంజయ్యను మన్సూరాబాద్ నుండి గెలిపించాలని కోరారు. లింగోజిగూడ జానీ భాయ్ పోటీ చేస్తున్నాడని, 35 సంవత్సరాలుగా సమస్యలపై పోరాటం చేస్తున్నాడని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా స్పందించే జానీ భాయ్ ను గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. చంపాపేట డివిజన్ నుండి శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడని, ఇతను సినిమా ఫీల్డ్ లో చాలాకాలం ఉన్నాడని తెలిపారు. వీరు ముగ్గురూ నిజాయితీ, పట్టుదలతో పనిచేసే నేతలని, వామపక్షాలు, లోక్ సత్తా, ఆమాద్మీ పార్టీలు మద్దతిస్తున్నాయని జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. 

యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా చేయడమే లక్ష్యం - మోడీ..

హైదరాబాద్ : యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా చేయడమే లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అంకుర భారత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యువ వ్యాపారవేత్తల్ని ప్రోత్సాహించడంపై యాక్షన్ ప్లాన్ విడుదల చేశారు. స్వయం ఉపాధి, స్వావలంబన ప్రోత్సాహం దిశగా కేంద్రం అడుగు వేసిందని, 35 లక్షల మంది యువతికి లబ్ధి చేకూర్చేలా పథకం రూపకల్పన చేశామని తెలిపారు. 

చైతన్యపురిలో పోలీసుల తనిఖీలు..

హైదరాబాద్ : చైతన్యపురి పీఎస్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 13 బైక్ లు, రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

స్టార్టప్ యాక్షన్ ప్లాన్ ను విడుదల చేసిన మోడీ..

ఢిల్లీ : స్టార్టప్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన యాక్షన్ ప్లాన్ ను విడుదల చేశారు. 

తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి టెండర్లు - ఏపీ మంత్రి నారాయణ..

విజయవాడ : తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు, టెండర్ల దాఖలుకు 21 రోజుల గడవు విధించినట్లు ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. గడవు పూర్తయిన ఐదు రోజుల్లో టెండర్లు ఖరారు చేస్తామన్నారు. నాలుగు నెలల్లోనే తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేయాలని యోచిస్తున్నట్లు, సీడ్ కేపిటల్ సమీపంలోనే రైతులకు భూములు అందచేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్ పై ఈనెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. 

టీఎంసీ నేత సొహ్రబ్ అరెస్టు..

కోల్ కతా : గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీఎంసీ నేత మహ్మద్ సొహ్రబ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
గణతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కోల్‌కతాలోని రెడ్ రోడ్ వద్ద ఎయిర్‌ఫోర్స్ దళాలు పరేడ్ నిర్వహిస్తుండగా ఆడి కారు ఢీకొట్టడంతో ఎయిర్‌ఫోర్స్ అధికారి అభిమాన్యు గౌడ్ మృతి చెందిన విషయం విదితమే. ఈ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు అంబియా సొహ్రబ్ అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత మహ్మద్ సొహ్రబ్ కుమారుడే అంబియా సొహ్రబ్.

18:30 - January 16, 2016

హైదరాబాద్ : తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు సినీనటి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జయసుధ ప్రకటించారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును జయసుధ కలిశారు. అనంతరం ఆమె టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో జయసుధ మాట్లాడారు. 1999 సంవత్సరంలో టిడిపి తరపున తాను క్యాంపెయిన్ చేయడం జరిగిందని, రాజకీయాల్లో కంటిన్యూ చేయాలని అనుకోలేదన్నారు. కానీ 2009లో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందని, రాజకీయాల్లో అదే విధంగా కంటిన్యూ చేయాలా ? వద్దా ? అనే మీమాంసలో ఉన్నానన్నారు. అప్పట్లో టిడిపిలో చేరుతారనే రూమర్స్ ఉన్నాయన్నారు. కానీ హైదరాబాద్ ను హైటెక్ సిటీ గా మార్చి యువతకు ఉపాధి అవకాశాలను బాబు కల్పించారని కొనియాడారు. నగరం ఉన్నతస్థానంలో నిలబడడానికి బాబే కారణమన్నారు. రెండు రాష్ట్రాలుగా విభజన అయిపోయిన తరువాత ఏపీకి సీఎంగా బాబు అవాలనేది దైవ నిర్ణయం కావచ్చన్నారు. బాబుకు సపోర్టు చేస్తూ తెలుగు మాట్లాడే వారికి టిడిపి తరపున సేవ చేయాలన్నదే తన ఆకాంక్ష అని జయసుధ ప్రకటించారు. 

పల్స్ పోలియో వేయించండి - కామినేని..

విజయవాడ : 1-5 పిల్లలకు పల్స్ పోలియో వ్యాక్సిన్ తప్పక వేయించాలని, ఆదివారం 52.13 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కామినేని పేర్కొన్నారు. ఫిబ్రవరి 21న మరోసారి పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 

ఎంపీ మల్లారెడ్డి సీటును అమ్ముకున్నారన్న నేతలు..

హైదరాబాద్ : మల్కాజ్ గిరి గౌతమ్ నగర్ సీటును ఎంపీ మల్లారెడ్డి అమ్ముకున్నారని ఆరోపిస్తూ తెలుగు తమ్ముళ్లు ఆందోళన నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఎదుట ఎంపీ మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికలు..1003 నామినేష్ పత్రాలు దాఖలు..

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నామినేషన్ పత్రాల దాఖలుకు రేపటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 1097 నామపత్రాలు దాఖలైనట్లు అధికారులు పేర్కొన్నారు. శనివారం ఒక్క రోజే 1003 నామపత్రాలు దాఖలు కావడం విశేషం. టీఆర్ఎస్ 277, బీజేపీ 93, టిడిపి 181, కాంగ్రెస్ 200, ఎంఐఎం 27, సీపీఎం 8, సీపీఐ 14, లోక్ సతా 12, 249 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. 

18:17 - January 16, 2016

చిత్తూరు : కోర్టు నిషేదాజ్ఞలు పట్టించుకోలేదు. పోలీసుల హెచ్చరికలను బేఖాతర్ చేశారు. జల్లికట్టు ఉత్సవాలను నిర్వహించకూడదని ఎన్ని ప్రయత్నాలు జరిగినా ఆ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. రంగంపేట, పుల్లయగారి పల్లెలో ఈ ఉత్సవాలు జరిగాయి. సుమారు గంటన్నరపాటు ఈ కార్యక్రమం జరిగింది. పశువులను చేజిక్కించుకొనేందుకు యువత పోటీ పడ్డారు. దీనితో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టుపై సుప్రీం నిషేధించడంతో ఇక్కడ జరిగే దీనిపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జల్లికట్టును నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశాయి. దీనిని గ్రామస్తులు కొట్టిపారేశారు.
తమిళనాడు రాష్ట్రంలో జరిగే జల్లికట్టుకు ఇక్కడ జరిగే ఈ క్రీడ ఒకే విధంగా కనిపిస్తుంటాయి. చిత్తూరు జిల్లాలో జరిగే ఈ జల్లికట్టులో పశువుల కొమ్ములకు బహుమానంతో ఉన్న పలకను రైతులు కడుతారు. ఈ పలకను చేజిక్కించుకోవడానికి పశువులను లొంగదీసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ దశలో పశువులు కొంత హింసకు గురవుతుంటాయి. కానీ గ్రామస్తులు మాత్రం దీనిని కొట్టిపారేశారు. తాము ప్రశాంతంగా..ఎలాంటి హింసకు గురి చేయకుండా జల్లికట్టును నిర్వహిస్తామని హామీనివ్వడంతో ఈ పోటీలు ప్రశాంతంగా ముగిశాయి. 

స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభం..

ఢిల్లీ : స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. 

మాగంటి గోపినాథ్ కు పవన్ కళ్యాణ్ ఫోన్..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శనివారం మాగంటి గోపినాథ్ కు పవన్ ఫోన్ చేశారు. జూబ్లిహిల్స్ డివిజన్ సీటు సురేష్ రెడ్డికి ఇవ్వాలని పవన్ సూచించారు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం జరిగిందని గోపినాథ్ చెప్పారు. 

బాబు అభివృద్ధి చూసే పార్టీలో చేరా - జయసుధ..

విజయవాడ : సీఎం చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధిని చూసే పార్టీలో చేరినట్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ పేర్కొన్నారు. ఆమె శనివారం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. యువతకు ఉపాధి కల్పించిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు.

 

టిడిపి గ్రేటర్ నేతలతో రమణ టెలీకాన్ఫరెన్స్..

హైదరాబాద్ : టిడిపి గ్రేటర్ నేతలతో ఎల్.రమణ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ గెలుపునకు పార్టీ నేతలందరూ కృషి చేయాలని సూచించారు. 

టిడిపిలోకి జయసుధ..

విజయవాడ : మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ టిడిపి కండువా కప్పుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో జయసుధ టిడిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

17:32 - January 16, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినిగించుకోవడం బాధ్యతగా తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌, హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ ఏర్పాటు చేసిన మీట్‌ ద మీడియా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రేటర్‌ ఎన్నికల కోసం 7,700 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది కొరత కారణంగా కొన్ని కేంద్రాల్లో 1200కు మించి ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఇది కొంచెం ఇబ్బందైనా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నాగిరెడ్డి కోరుతున్నారు. పోలింగ్ స్టేషన్ ల సంఖ్య కుదించాలని అనుకున్నామని, కొద్దిగా కష్టమైన పోలింగ్ స్టేషన్ కు రావాలని ఓటర్లకు సూచించారు. వీలైనంత సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని నాగిరెడ్డి పేర్కొన్నారు. 

17:30 - January 16, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ పార్టీ ఫిరాయింపుల పార్టీగా మారిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శ్రావణ్‌ కుమార్‌ విమర్శించారు. టీడీపి నుంచి ఫిరాయించి వచ్చిన కడియంశ్రీహరి, మైనంపల్లి. కాంగ్రెస్‌ నుంచి వలస వచ్చిన డీ శ్రీనివాస్‌ లాంటి వాళ్లు గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ మార్గనిర్దేశకత్వంలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తోందని తెలిపారు. 

17:28 - January 16, 2016

హైదరాబాద్ : 'పాపం...మా నాన్న (సీఎం కేసీఆర్) భోళాశంకరుడు..అడగకుండా చాలా చేశారు...ఏమడిగినా చేసేస్తారు' అంటూ ఎంపీ కవిత పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఎంపీ కవిత సమక్షంలో పలువురు వికలాంగులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపునకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వికలాంగుల సంఘాల నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడారు. వికలాంగుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని కవిత తెలిపారు. ఉద్యోగాలతో పాటు.. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రయత్నిస్తామన్నారు. వికలాంగుల సమస్యలను సీఎం కేసీఆర్‌ తీసుకువెళ్తానని హామీనిచ్చారు. 

17:24 - January 16, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీకి సీట్లు కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు కన్నెర్ర చేస్తున్నారు. జూబ్లిహిల్స్, అమీర్ పేట ప్రాంతానికి చెందిన నేతలు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అమీర్ పేట డివిజన్ ను బీజేపీకి కేటాయించడంపై డివిజన్ టిడిపి అధ్యక్షురాలు అనంజిత్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి క్యాడర్ లేని బీజేపీ ఎలా సీటు కేటాయిస్తారని ప్రశ్నించారు. ఎంపీ దత్తాత్రేయ అనుచరుడికి టికెట్ కేటాయిస్తున్నారని ఆరోపించారు.టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు రేపటితో సమయం ముగియనుంది. కానీ టిడిపి, బిజెపి అభ్యర్థుల జాబితాను ఇంతవరకు ప్రకటించలేదు. సాయంత్రం వరకు జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. టిడిపి, బిజెపి సీట్ల సర్దుబాటు జరిగిందని, ఎక్కడ ఎవరు పోటీ చేయాలనే దానిపై సందిగ్ధత నెలకొందని సమాచారం. నిరసనల నేపథ్యంలో పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు చేరుకోవడం లేదు. దీనిని టి.టిడిపి ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి. 

ఓటింగ్ వ్యవస్థ సులభతరం - నాగిరెడ్డి..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకొనేలా చూస్తామని, ఓటింగ్ వ్యవస్థను సులభతరం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఖర్చు విషయంలో అవినీతి ఎక్కువగా ఉందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఎన్నికల్లో అవినీతిని అంతమొందిస్తామన్నారు. 

మూడో రోజు ముగిసిన నామినేషన్ ల ప్రక్రియ..

హైదరాబాద్ : మూడో రోజు గ్రేటర్ హైదరాబాద్ నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసింది. రేపటితో నామినేషన్ ల దాఖలుకు గడవు ముగియనుంది. 

వన్ హైదరాబాద్ కూటమి అభ్యర్థుల నామినేషన్ లు దాఖలు..

హైదరాబాద్ : లింగోజిగూడ డివిజన్ అభ్యర్థి సయ్యద్ జానీ వన్ హైదరాబాద్ కూటమి తరపున నామినేషన్ దాఖలు చేశారు. అలాగే చంపాపేట నుండి శ్రీనివాస్, మన్సూరాబాద్ నక్కా అంజయ్య లు కూడా నామినేషన్ లు దాఖలు చేశారు. వన్ హైదరాబాద్ కూటమిలో లోక్ సత్తా, సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ (యు) ఉన్న సంగతి తెలిసిందే. 

నగరాభివృద్ధిని అరాచశక్తులు అడ్డుకుంటున్నాయి - జేసీ..

అనంతపురం : నగరాభివృద్ధిని అరాచకశక్తులు అడ్డుకుంటున్నాయని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో విబేధాలు లేవని, సారా లాగే కొళ్ల పందేలాను అరికట్టలేమన్నారు. 

నామినేషన్ ల ఉపసంహరణ రోజే టిడిపి బీఫామ్ లు ?

హైదరాబాద్ : 150 డివిజన్లలలో టిడిపి అభ్యర్థులు నామినేషన్ లు వేయనున్నారు. కీలక స్థానాల్లో ఇద్దరు అభ్యర్థులతో నామినేషన్ లు వేయనున్నట్లు సమాచారం. నామినేషన్ ల ఉపసంహరణ రోజే బీఫామ్ ఇవ్వాలని టిడిపి వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.

 

15:30 - January 16, 2016

విజయవాడ : స్మార్ట్ విలేజ్ కింద గ్రామాలను కూడా పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన స్వగ్రామమైన నారావారిపల్లెకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకొనేందుకు చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో ఆదాయం పెరిగితే పల్లెల నుండి పట్నాలకు వలసలు తగ్గుతాయన్నారు. గ్రామీణ ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు డెయిరీ ఫారాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పుకొచ్చారు. 

15:27 - January 16, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నామినేషన్ దాఖలు హడావుడి మొదలైంది. అటు అధికార, విపక్ష కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల లిస్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో శనివారం కొందరు అభ్యర్థులు ఊరేగింపుగా బయలుదేరి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రధానంగా ఉప్పల్, కుత్బుల్లాపూర్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేశారు. ఉప్పల్ పరిధిలోని హబ్సిగూడ, రామాంతాపూర్ లకు చెందిన అధికార పార్టీకి చెందిన బేబి స్వప్న, మేకల ఆనల, గంధం జోత్సలు నామినేషన్ లు వేశారు. కుత్బుల్లాపూర్ డివిజన్ లో పలువురు స్వతంత్ర అభ్యర్థులు, టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ఆశావాహులు సైతం నామినేషన్ లు సమర్పించారు. 

15:21 - January 16, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు పార్టీల్లో చిచ్చు రేపుతున్నాయి. పార్టీ అభ్యర్థుల ప్రకటనలపై అసంతృప్తులు వ్యక్తమౌతున్నాయి. తాజాగా గ్రేటర్ టిడిపిలో నేతలు ఆందోళనకు సిద్ధమౌతున్నారు. జూబ్లిహిల్స్ డివిజన్ బీజేపీకి కేటాయించడంపై నియోజకవర్గ అధ్యక్షుడు ఆకుల సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఎదుట తన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కైందని, అందులో భాగంగా డమ్మీ క్యాండెంట్ ను నిలబెడుతున్నారని విమర్శలు గుప్పించారు. తన కుటుంబాన్ని నడి రోడ్డుపై పడేశారని, ప్రస్తుతం ఒక్కడు కూడా తనను ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పనిచేస్తే గుర్తింపు కూడా ఇవ్వడం లేదని, గతంలో దానం నాగేందర్ తో కొట్లాడి పని చేస్తే ఏ బీజేపీ నాయకుడు సపోర్టు ఇవ్వలేదని తెలిపారు. న్యాయం జరగకపోతే ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళుతాని హెచ్చరించారు. అభ్యర్థిగా నియమించాలని అనుకుంటున్న మధుకు ఎలాంటి క్యాడర్ ఉంది ? అతని హిస్టరీ తీసుకోండని డిమాండ్ చేశారు. గెలుస్తాడని అనుకొంటే అతనికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని ఆకుల సత్యనారాయణ రావు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే టిడిపి, బిజెసి సీట్ల సర్దుబాటు జరిగింది. కానీ ఒక సర్దుబాటు మాత్రం జరగలేదని ప్రచారం జరుగుతోంది. నగరంలోని ఐదు సిట్టింగ్ స్థానాలూ కావాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ఆకుల ఆందోళనపై టిడిపి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

ఏకే 47లతో కానిస్టేబుల్ పరార్..

జమ్మూ కాశ్మీర్ : నాలుగు ఏకే 47 రైఫిళ్లతో కానిస్టేబుల్ షోపియాన్ పరారయ్యాడు. డీఎస్పీకి ఇతను సెక్యూర్టీగా ఉన్నాడు. ఉగ్రవాదులతో కానిస్టేబుల్ కు సంబంధాలున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

చిన్న వ్యాపార ప్రతినిధులకు అండగా ఉంటా - రాహుల్..

ముంబై : చిన్న వ్యాపార ప్రతినిధులకు అండగా ఉంటానని ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో చిన్న వ్యాపారస్తులను కలిసి వారితో మాట్లాడారు. 

ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు నామినేషన్..

హైదరాబాద్ : అల్వాల్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి నామినేషన్ దాఖలు చేశారు. 

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఎదుట టిడిపి అధ్యక్షుడు ఆందోళన..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఎదుట జూబ్లీహిల్స్ టిడిపి అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆందోళన నిర్వహించారు. జూబ్లిహిల్స్ డివిజన్ సీటు బిజెపికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

14:29 - January 16, 2016

సంజయ్‌ లీలాభన్సాలీ ఎత్తిన కత్తి చాలా షార్ప్‌గా దూసుకెళ్లింది. ఏడాది చివరాంతంలో భన్సాలీ విసిరిన బాజీరావ్‌ మస్తానీ భాణం నేరుగా ఫిల్మఫేర్‌ అవార్డులను తాకింది. దాదాపు అన్ని కేటగిరీల్లోను సత్తా చాటి అత్యధిక అవార్డులను తన ఖాతాలో వేసుకుంది సంజయ్‌ లీలా భన్సాలీ భాజీరావ్‌ మస్తానీ. బ్రిటానియా 61వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ 2016 అవార్డుల ప్రదానోత్సవం తారల నయగారాలు కళ్లు చెదిరే పెర్ఫార్మెన్స్‌ల మధ్య వైభవంగా జరిగింది.ఓ వీరుని ప్రేమ కథ ఆధారంగా సంజయ్‌లీలాభన్సాలీ తెరకెక్కించిన బాజీరావు మస్తానీ ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్ర కథానాయకుడు రణ్‌వీర్‌సింగ్‌ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకోగా సంజయ్‌లీలాభన్సాలీ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. కాశీబాయ్‌ పాత్ర పోషించిన ప్రియాంకా చోప్రా ఉత్తమ సహాయ నటి అవార్డును అందుకోగా పింగాగ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా శ్రేయా గోషల్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును అందుకున్నారు.'పీకూ' చిత్రానికి దీపికా పదుకొణె ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. క్రిటిక్స్‌ విభాగంలో ఉత్తమ చిత్రంగా పీకూ, ఉత్తమ నటుడుగా అమితాబ్‌ బచ్చన్‌, 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' చిత్రంలో నటనకు కంగనారనౌత్‌ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. భజరంగీ భాయీజాన్‌ సినిమాకు కథను అందించిన విజయేంద్రప్రసాద్‌ ఉత్తమ కథా రచయిత అవార్డు గెలుచుకున్నారు. దిల్‌ దడ్కనే దో మూవీలో నటనకు గాను అనిల్‌కపూర్‌ ఉత్తమ సహాయ నటుడు అవార్డును అందుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకునిగా అర్జిత్‌సింగ్‌ అవార్డును అందుకోగా జీవిత సాఫల్య పురస్కారాన్ని మౌషుమి ఛటర్జీ అందుకున్నారు.

14:25 - January 16, 2016

చిత్తూరు : సంక్రాంతి సెలవుల రద్దీతో తిరుమల కిటకిటలాడుతోంది. సర్వ దర్శనానికి 10గంటల సమయం, నడక దారి భక్తులకు 8గంటల సమయం పడుతోంది. సాధారణ భక్తులకుతోడు అయ్యప్ప భక్తులు కూడా రావడంతో రద్దీ మరింత పెరుగుతోంది. మరో రెండురోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

14:24 - January 16, 2016

చిత్తూరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం కూడా స్వగ్రామమైన నారావారిపల్లెలోనే గడుపుతున్నారు. సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల నుంచి ఆయన నారావారిపల్లెలోనే ఉంటున్నారు. చంద్రబాబును కలిసేందుకు స్థానికులు క్యూ కట్టారు. పలు వినతి పత్రాలు ఇచ్చారు. చంద్రబాబు ఇవాళ సాయంత్రం వరకు నారావారిపల్లెలోనే గడపనున్నారు. 

14:22 - January 16, 2016

విజయవాడ : ఏపీలో ఇసుకరేవుల వేలానికి రంగం సిద్ధమవుతోంది. మూడు దశల్లో ఇసుక రేవుల వేలం నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ వేలం ద్వారా ఏడాది కాలానికి ఇసుక రేవుల వేలం జరుగుతోంది. సాంకేతిక బిడ్లకు ఆహ్వానం, అర్హత, ఆన్‌లైన్‌ వేలం ద్వారా రేవులు అప్పగించనున్నారు. క్యూబిక్‌ మీటర్‌ 550 రూపాయలకు మించకుండా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధర లోపు విక్రయానికి అంగీకరించిన వారే వేలంలో పాల్గొనాలని ఆదేశించింది. మహిళా సంఘాల నిర్వాహణలోని రేవుల అప్పగింతకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1లోగా ఇసుక రేవులను ప్రభుత్వానికి అప్పగించాలని సూచించింది. ఏడాది కాలానికి ఇసుక రేవుల వేలం నిర్వహించనున్నారు.

14:21 - January 16, 2016

హైదరాబాద్ : రైతు సమస్యల్ని పరిష్కరించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌ నేత కోదండరెడ్డి పేర్కొన్నారు. పశువులకు మేత కూడా లేక అన్నదాతలు వలస పొతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంకూడా తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు.

క్షీరసాగర్ లో మంత్రి హరీష్ పర్యటన..

మెదక్ : జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. అనంతపద్మనాభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కోళ్ల పందేల్లో ఘర్షణ..

కృష్ణా : జిల్లాలోని అగిరిపల్లి మండలం కృష్ణవరంలో కోళ్ల పందేల్లో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

14:09 - January 16, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికలు కొద్ది రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకు టి.కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని..అందరూ కలిసికట్టుగా నడవాలని పార్టీ పెద్ద నేతలు పలు సూచనలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఓ షాక్ తగిలింది. సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు జయసుధ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలువనున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఉన్న బాబు ఈ సాయంత్రానికి విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడే బాబును జయసుధ కలువనున్నట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ నుండి గత ఎన్నికల్లో జయసుధ కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించారు. అనంతరం గత కొద్ది రోజులుగా పార్టీకి అంటీ ముట్టన్నట్లుగా వ్యవహరించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం నుండి మొదలుకొని ఏ కార్యక్రమం చేపట్టినా జయసుధ పాల్గొనలేదనే ప్రచారం జరిగింది. లోకల్ ఉన్న నేతలతో విబేధాలు ఉన్నట్లు కొన్ని పరిణామాలను చూస్తే తెలుస్తోంది. గతంలో జయసుధ కుమారుడు సినిమా ఫంక్షన్ కు సీఎం కేసీఆర్ హాజరు కావడం..జయసుధపై కేసీఆర్ ప్రశంసలు కురిపించడంతో ఆమె గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేశారు. తాజాగా ఆమె టిడిపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

చికిత్స పొందుతూ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి..

నెల్లూరు : చింతారెడ్డి పాలెం నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇంజినీరింగ్ విద్యార్థిని హరిప్రియ మృతి చెందింది. గత నెల 30న కావలి విట్స్ కాలేజీ బిల్డింగ్ పై నుండి హరిప్రియ దూకిన సంగతి తెలిసిందే. ఎగ్జామినర్ వేధిస్తున్నాడని హరిప్రియ ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

పశ్చిమలో మూడో రోజు కోళ్ల పందేలు..

పశ్చిమగోదావరి : జిల్లాలో మూడో రోజు కోళ్ల పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. భీమవరం, ఉండి, గుండుగొలను, చింతలపూడి, జంగారెడ్డి గూడెం, నిడదవోలు, పాలకొల్లులో భారీగా బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు. 

రేపటితో ముగియనున్న గ్రేటర్ నామినేషన్ లు..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రేపటితో నామినేషన్ ల గడవు ముగియనుంది. నామినేషన్ ల దాఖలు ప్రక్రియ ఊపందుకొంది. అన్ని పార్టీల నుండి భారీగా నామినేషన్ లు దాఖలవుతున్నాయి. 

సుజనా చౌదరితో టి.టిడిపి నేతల భేటీ..

హైదరాబాద్ : టిడిపి ఎంపీ సుజనా చౌదరితో టి.టిడిపి నేతలు భేటీ అయ్యారు. టిడిపి గ్రేటర్ అభ్యర్థుల జాబితాను కాసేపట్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. 50 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 

చిత్తూరులో జల్లికట్టు కోలాహాలం..

చిత్తూరు : జిల్లాలో జల్లికట్టు కోలాహాలం కనిపిస్తోంది. రంగంపేట, పుల్లయ్యగారిపల్లెలో జరుగుతున్న జలికట్టు ఉత్సవాలను చూసేందుకు భారీగా జనాలు తరలివస్తున్నారు. 

చాసిమూల్య సంఘం నేతను హత్య చేసిన మావోయిస్టులు..

విజయనగరం : ఎవోబీలో ఇన్ ఫార్మర్ నెపంతో చాసిమూల్య సంఘం నేతను మావోయిస్టులు హత్య చేశారు. బందుగాం బ్లాక్ కొండశిఖర గూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఏపీలో ఇసుక రేవుల వేలానికి రంగం సిద్ధం..

విజయవాడ : ఏపీలో మూడు దశల్లో ఇసుక రేవుల వేలానికి రంగం సిద్ధమైంది. ఆన్ లైన్ వేలం ద్వారా ఇసుక రేవులను అప్పగించనున్నారు. అవసరమైతే మరో ఏడాది పొడిగించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. క్యూబిక్ మీటర్ రూ. 550 మించకుండా అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. రూ.550 లోపు విక్రయానికి అంగీకరించిన వారే రేవుల వేలంలో పాల్గొనాలని, మహిళా సంఘాల నిర్వాహణలోని రేవుల అప్పగింతకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1లోగా ఇసుక రేవులను ప్రభుత్వానికి అప్పగించాలని సూచించింది. 

మేడారం జాతర ఏర్పాట్లపై ఎంపీ సీతారాం నాయక్ సమీక్ష..

వరంగల్ : మేడారం జాతర ఏర్పాట్లపై ఎంపీ సీతారాంనాయక్ సమీక్ష నిర్వహించారు. భద్రత విషయంలో పోలీసుల తీరుపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

13:28 - January 16, 2016

కరీంనగర్ : కబ్జా కామన్‌ అయిపోయింది...కబ్జాదారుడు అంతే దర్జాగా కంటికి కనిపించినంత భూమిని తన ఖాతాలో వేసేస్తున్నాడు. ప్రభుత్వాధికారులు యథావిథిగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పర్యవసానంగా విలువైన భూమి అమాంతం హాంఫట్ అవుతోంది. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న కబ్జా భాగోతంపై స్పెషల్‌ స్టోరీ.

అధికార పార్టీ నేతలు....

వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా ఒకటే అన్నట్టు అధికారం మనదే అయితే కబ్జాకు అడ్డూఅదుపు ఏముంటుంది. ఈ ఫార్ములానే పక్కాగా ఫాలో అయిపోతున్నారు కరీంనగర్ జిల్లా అధికార పార్టీ నేతలు .

1104 సర్వే నెంబర్‌లోని ప్రభుత్వ భూమి కబ్జా.....

కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న1104 సర్వే నెంబర్లో గల భూమిని అధికార పార్టీ నేత దర్జగా కబ్జా చేసి నిర్మాణం చేపట్టాడు. ఈ సర్వే నెంబర్లో గతంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇప్పటికే లెక్కకు తెలియనంతగా కభ్జాకు గురైంది. విలువైన భూములు కావడంతో పలుకుబడి కల్గిన నేతలతా ఈ భూమి మీదే పడ్డారు.

ప్రభుత్వ భూమిలో ప్రజాప్రతినిధి అక్రమ నిర్మాణాలు ...............

వాయిస్ 3 : ప్రజాప్రతినిధి ఏకంగా మహిళ భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపట్టాడు. గత ప్రభుత్వం వేసిన శిలాఫలకాన్ని తొలగించి తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇలా నగరంలో వందల నిర్మాణాలు కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల్లో కొసాగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.

ఇద్దరు కార్పొరేటర్ల ఇళ్ల నిర్మాణం అనుమతులపై వివాదం.........

అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతుంటే నగరపాలక సంస్థ సైతం నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదం అవుతోంది. అక్రమ నిర్మాణాలకు ప్రజాప్రతినిధులు పోటీపడి మరీ అనుమతులు ఇప్పిస్తున్నారు. ఇటీవల ఇద్దరు కార్పొరేటర్ల ఇళ్ల నిర్మాణం అనుమతులపై కౌన్సిల్ సమావేశంలో రచ్చరచ్చ అయింది. రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతోనే విలువైన ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని స్థానికులు అంటున్నారు. లేని భూములను ఉన్నట్లుగా పట్టా లేకున్నా పాసు పుస్తకాలను సృష్టించి ఇస్తుండడంతో ప్రభుత్వం పై ప్రజలకు విశ్వాసం పోతుందని సాక్షాత్తు ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు చేస్తున్న అవకతవకల కారణంగా భూములకు సంబంధించి ఆర్థికంగా 1700కోట్లు నష్టాపోయినట్లు చెప్పారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ప్రభుత్వ భూములను కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే కోట్ల విలువైన భూములు కంటికి కనిపించకుండా పోతాయానడంలో సందేహమే లేదు.

 

13:25 - January 16, 2016

పశ్చిమగోదావరి : భీమవరంలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి.. పందెం కోళ్ల పరుగులతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది.. ఈ పందాలను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు, పందెం రాయళ్ల కిటకిటలాడింది... కోడిపుంజులపై పందెంరాయుళ్లు భారీగా బెట్టింగ్‌లు కాశారు.. 

13:22 - January 16, 2016

హైదరాబాద్ : టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని… ఈ రోజు సాయంత్రానికల్లా అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేస్తామని 'టెన్ టివి' టి.టిడిపి సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ...జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపై టీడీపీ, బీజేపీ మధ్య జరుగుతున్న చర్చలు చివరి అంకానికి చేరుకున్నాయని ఇవాళ సాయంత్రానికి దాదాపు 80శాతంమంది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలో టిడిపి ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో టిడిపి కార్యకర్తల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. సమన్వయంతో సమిష్టిగా ముందుకు పయనిస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం నారా లోకేష్ సమక్షంలో జాబితాను ఫైనలైజ్ చేస్తామని స్పష్టం చేశారు.

13:15 - January 16, 2016

హైదరాబాద్ : వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలంలోని ఐనవోలు మల్లిఖార్జునస్వామి దేవాలయం భక్తులు శివసత్తులతో పులకరించింది. సంక్రాంతి పర్వదినాన వేలసంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవాలయం కిక్కిరిసిపోయింది. గత మూడురోజులుగా భక్తులతాకిడి పెరగడంతో దేవాలయంలోని స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది మేడారం జాతర ఉండడంతో ప్రతియేటా జరిగే ఐనవోలు మల్లన్న జాతరకు భక్తులు పోటెత్తారు.

గజ్జెలలాగులు, నెత్తిన బోనం, చేతిలో చర్నకోల.....

గజ్జెల లాగులు, నెత్తిన బోనం, చేతిలో చర్నకోల పట్టుకుని చేసిన శివతాండవంతో ఐనవోలు మల్లన్న జాతర అదిరిపోయింది. ఒగ్గుపూజారుల పాటలు , ఢమరుకం, డోలు వాయిద్యాలకు అనుగుణంగా తన్మయత్వంతో శివసత్తులు తాండవం చేశారు. పురుషులు సైతం మహిళా వేషధారణ వేసుకుని స్వామివారికి బోనం వండి.. దాన్ని అందంగా అలంకరించి నైవేద్యం సమర్పించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేలఏళ్ల చరిత్ర ఉన్న కాకతీయుల నృత్య మండపంలో.. శివసత్తులు బిందెళ్లలో పెరుగును పెట్టి కొరడాలతో నిర్వహించే సల్లమండపం భక్తి భావాన్ని తెలిపింది.

ప్రాదేశకాల పూజలతో ద్వారబంధనం...........

ఈ మల్లన్న జాతరకు తెలంగాణ పది జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక, మహరాష్ట్రకు చెందిన భక్తులుస్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ప్రాదేశకాల పూజలు చేసి ద్వార బంధనం చేశారు. స్వామివారికి నూతన వస్త్రాలంకరణ, తోరణబంధనం, విఘ్నేశ్వర పూజలు, పుణ్యాహవచనము ధ్వజారోహణ, ఏకాదశ రుద్రాభిషేకములు నిర్వహించారు. దీంతోపాటు గరుడసేవారథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.

శివమెత్తిన శివసత్తుల పూనకాలు.....

శివమెత్తిన శివసత్తుల పూనకాలు, ఢమరుకనాదాలతో ఐనవోలులోని మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తి పారవశ్యంతో స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. పట్నాలు వేసి, దండదీపాలు పెట్టి ,కోడెమొక్కులను చెల్లించుకున్నారు. పిల్లా జెల్లా సల్లంగా ఉండాలంటూ షావాలు తీస్తామంటూ ఐనవోలు మల్లన్నను మొక్కుకున్నారు. మొత్తంగా ఐనవోలు మల్లన్న జాతర జానపదుల ప్రాముఖ్యాన్ని చాటింది. స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఐనవోలు మల్లన్న తిర్నాల జనసంద్రమైంది.

13:11 - January 16, 2016

చిత్తూరు : కాసేపట్లో చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ప్రారంభం కానుంది. జిల్లాలోని చంద్రగిరి మండలం రంగంపేట, పుల్లయ్యగారిపల్లిలో జల్లికట్టు జరగనుంది. బహుమానంతో కూడిన పలకలను ఎద్దు కొమ్ములకు కట్టి ఊరిపై వదులుతారు. ఆ పలకలను చేజిక్కించుకునేందుకు యువకులు పోటీపడతారు. మరోవైపు జల్లికట్టు పేరుతో పశువులను హింసించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

గ్రేటర్ లో ప్రారంభమైన నామినేషన్ల పర్వం...

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల వేడి పుంజుకుంది. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రేపే నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్దమవుతున్నారు. కాగా, టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే తమ పార్టీ నుంచి పోటీ చేయనున్న 80 మంది అభ్యర్థుల పేర్లను రెండు దఫాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ గ్రేటర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నద్దమవుతున్నారు.

12:38 - January 16, 2016

విజయవాడ : ఏపీలో ఇసుక రేవుల వేలానికి రంగం సిద్ధమైంది. 3 దశల్లో ఇసుక రేవుల వేలం నిర్వహించాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. సాంకేతిక బిడ్లకు ఆహ్వానం, అర్హత, ఆన్‌లైన్‌ వేలం ద్వారా రేవులు అప్పగించనున్నారు. క్యూబిక్‌ మీటర్‌ రూ.550కు మించకుండా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.550కు లోపు విక్రయానికి అంగీకరించిన వారే వేలంలో పాల్గొనాలని ఆదేశించింది. ఏడాది కాలానికి ఇసుక రేవుల వేలం నిర్వహించనున్నారు. అవసరం అయితే మరో ఏడాది పొడిగించేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.

చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ప్రారంభం

చిత్తూరు : చంద్రగిరి మండలం రంగంపేట, పుల్లయ్యగారిపల్లిలో జల్లికట్టు ఆట ప్రారంభం అయ్యింది. బహుమానంతో కూడిన పలకను ఎద్దు కొమ్ములకు కట్టి...వాటిని గ్రామస్తులు ఊరిపై వదలనున్నారు. ఎద్దులను లొంగదీసుకొని పలకల కోసం యువకులు పోటీపడనున్నారు. యువకులు జల్లికట్టు పేరుతో పశువులను హింసించవద్దని పోలీసుల నోటీసులు పోలీస్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. రంగంపేటలో జల్లికట్టుకు ఏర్పాట్లు చేశారు.

ఆర్టీసీ బస్సు - ఆటో ఢీ : నలుగురికి గాయాలు..

రంగారెడ్డి : శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగింది.

తిరుమలలో లడ్డూ కౌంటర్ల దగ్గర భక్తులు ఆందోళన

తిరుమల: తిరుమలలోని లడ్డూ కౌంటర్ల దగ్గర భక్తులు ఆందోళనకు దిగారు. టోకెన్లు ఉన్నా లడ్డూలు ఇవ్వటం లేదని భక్తులు ఆరోపించారు. టోకెన్లు స్కాన్‌ కాలేదంటూ లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ సిబ్బంది నిరాకరించారు. తాము తీసుకున్న టోకెన్లకు లడ్డూలు ఇవ్వాలని భక్తులు డిమాండు చేశారు.

భద్రాద్రి రామునికి స్వర్ణ తులసి పూజ

ఖమ్మం: భద్రాద్రి రాముడు ఇవాళ స్వర్ణ తులసి పూజను అందుకున్నారు. శ్రీసీతారామచంద్రస్వామికి ఆలయంలో వేద పండితులు శాస్ర్తోక్తంగా ఈ పూజా తంతును చేపట్టారు. అనంతరం స్వామివారికి బేడా మండపంలో నిత్య కళ్యాణోత్సవం నిర్వహించారు. కాగా, సంక్రాంతి సెలవు దినాలు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో కిక్కిరిసి ఉంది.

ఏపీలో ఇసుక వేలానికి రంగం సిద్దం

హైదరాబాద్ : ఏపీలో ఇసుక రేవుల వేలానికి రంగం సిద్ధం అయ్యింది. ఆన్ లైన్ ద్వారా మూడు దశలో ఇసుక రేవుల అమ్మకం జరగనున్నట్లు తెలుస్తోంది. 

11:54 - January 16, 2016

చిత్తూరు : జిల్లాలో జల్లికట్టుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని చంద్రగిరి మండలం రంగంపేట, పుల్లయ్యగారిపల్లిలో జల్లికట్టు జరగనుంది. ఈ వేడుకలకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరవుతున్నారు. మరోవైపు పోలీసులు జల్లికట్టు వద్దంటూ.. పోస్టర్లు విడుదల చేశారు. పశువులను హింసించవద్దని సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

11:53 - January 16, 2016

హైదరాబాద్ : ఉభయ గోదావరి జిల్లాల్లో మూడో రోజు జోరుగా కోడిపందాలను నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మురమళ్ల, ముమ్మిడివరం, సఖినేటిపల్లి, కోరుకొండ తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డి గూడెం, నిడదవోలు, పూలవెల్లి ,గంప, కొప్పాక, గుండగొలనులలో జోరుగా బెట్టింగులు సాగిస్తున్నారు. కోర్టు ఆదేశాలను తుంగలోతొక్కి జోరుగా పందాలు సాగిస్తున్నారు. 

11:51 - January 16, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేతలు బిజీ బిజీగా ఉన్నారు.. గల్లి గల్లి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. కొండాపూర్‌లో ఆ పార్టీ అభ్యర్థి ఊట్ల కృష్ణ జోరుగా ప్రచారం చేస్తున్నారు.. 

11:50 - January 16, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీ బల్దియాపై జెండా ఎగురవేస్తుందని ధీమ వ్యక్తం చేస్తున్నారు గచ్చబౌలి టిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలే తమను విజయతీరాలకు చేరుస్తాయంటున్నారు. నియోజకవర్గంలోని వార్డులలో అభివృద్ది పనులు చేపట్టకపోతే గల్లీలో తిరగనివ్వందంటూ ప్రజలకు టిఆర్ ఎస్ అభ్యర్థి సాయిబాబా సవాల్ విసిరారు.

11:49 - January 16, 2016

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తులు కొనసాగుతున్నాయి.. కాప్రా సర్కిల్‌ మూడో డివిజన్‌ టికెట్‌ను అమ్ముకున్నారంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.. ఈసీఐఎల్ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నోటికి నల్ల బ్యాడ్జిలు కట్టుకొని ధర్నా చేశారు.. 12ఏళ్లుగా పార్టీలోఉంటూ ఉద్యమం చేస్తున్నవారికి టికెట్‌ ఇవ్వలేదని ఆరోపించారు.. అర్హులకు టికెట్‌ కేటాయించాలని డిమాండ్ చేశారు..   

11:46 - January 16, 2016

హైదరాబాద్ : అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోలు కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా మనం. తెలుగు తెర మీద సరికొత్త ప్రయోగంగా తెరకెక్కిన ఈ సినిమా, నటవారసత్వం కొనసాగిస్తున్న చాలా మంది హీరోలకు ఇన్సిప్రేషన్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత ఇండస్ట్రీలో కొనసాగుతున్న చాలా కుంటుబాల నుంచి ఆ తరహా సినిమాలను ఆశిస్తున్నారు అభిమానులు. అలా ఫ్యామిలీ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఘట్టమనేని అభిమానుల కోరిక తీరనుందన్న టాక్ వినిపిస్తోంది.

లాంగ్ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ కృష్ణ....
లాంగ్ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ కృష్ణ లీడ్రోల్లో నటిస్తున్న సినిమా శ్రీ శ్రీ. ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి, కృష్ణ సతీమణి విజయనిర్మల మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఈ తరం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు, మహేష్ తనయుడు గౌతమ్ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చిత్రయూనిట్ కన్ఫామ్ చేయకపోయినా శ్రీ శ్రీ సినిమాలో ఘట్టమనేని ఫ్యామిలీ మూడు తరాల నటులు కనిపించనున్నారని పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

షార్ట్‌సర్క్యూట్ తగలబడ్డ పత్తిగోదాం

ఖమ్మం : పత్తి గోదాము లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా సంభవించిన మంటలు చెలరేగి తగలబడింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైరింజన్ అక్కడికి చేరుకునేలోగానే మొత్తం పత్తి కాలిపోయిందని బాధితులు తెలిపారు. సుమారు రూ. కోటి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.

నేడు అంకుర భారత్ పథకం ప్రారంభం...

హైదరాబాద్ : ‘అంకుర భారత్‌’ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించడంపై మార్గ సూచీ విడుదల చేయనున్నారు. పదేళ్లలో లక్ష అంకురాలు ఏర్పటయ్యే అవకాశముందని, 50వేల కోట్ల డాలర్ల సంపద సమకూరుతుందని కేంద్రం అంచనావేస్తోంది. అంకురభారత్‌ ద్వారా 35లక్షల మందికి ఉపాధి మార్గాలు అభిస్తాయని భావిస్తున్నారు.

10:31 - January 16, 2016

హైదరాబాద్ : పశ్చిమ ఆఫ్రికాలోని భుర్కినాఫాసోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. రాజధాని వాగడూలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ల్లోకి మారణాయుధాయులతో చొరబడిన ఉగ్రవాదులు పలువురిని బందీలుగా చేసుకున్నారు. ముష్కరుల దాడిలో ఇప్పటి వరకు 20మంది ప్రాణాలు కోల్పోయారు. హోటల్‌ బయట రెండు కారుబాంబులను పేల్చారు. దాడి సమాచారంతో సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు ఎదురుకాల్పులు సాగుతున్నాయి. దాని వెనక ఐసిస్ హస్తముందని సమాచారం

10:30 - January 16, 2016

తిరుపతి: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి సర్వదర్శనానికి తొమ్మిది గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. 

10:29 - January 16, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. తెలుగుదేశం 90 స్థానాల్లో, బీజేపీ 60 స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే ఏ పార్టీ ఎక్కడి నుంచి నామినేషన్లు వేయాలనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ పోటీచేయాలనుకుంటున్న స్థానాలనే బీజేపీ కోరుతుండటంతో.. చిక్కుముడి పడింది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు ఇరు పార్టీల నేతలు మధ్యాహ్నం భేటీ కానున్నారు. గ్రేటర్ నామినేషన్లకు రేపే ఆఖరు తేదీ కావడంతో...సాయంత్రానికి తొలి జాబితా విడుదల చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

10:27 - January 16, 2016

హైదరాబాద్: గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పుడు సెటిలర్ల జపం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సెటిలర్లను తిట్టిన నేతలే నేడు వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్రుల పేరు ఉచ్ఛరించేందుకే జంకిన నోళ్లు...ఇప్పడు వీరిపై అపార ప్రేమ ఒలకబోస్తున్నాయి. మేయర్‌ పీఠం కైవసం చేసుకోవాలంటే సెటిలర్ల ఓట్లే కీలకమని భావిస్తున్న పార్టీలు...ఎన్నికల్లో వీరిని తురుపు ముక్కలుగా ఉపయోగించేకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి.

గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో సీమాంధ్రలు……….

తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్లీ ఇప్పుడే రాజకీయ పార్టీల నేతల నోట సెటిలర్ల మాట వినిపిస్తోంది. గ్రేటర్‌లో సీమాంధ్రులు.. గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారని ప్రధాన పక్షాల నాయకులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వీరి ఓట్లను కొల్లగొట్టేందుకు గతంలో ఎన్నడూలేని విధంగా ప్రేమాభిమానాలు చూపుతున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సీమాంధ్రులను దోపిడీదారులుగా విమర్శలు వర్షం కురిపించిన నేతలు... ఇప్పుడు అన్ని ప్రాంతాల వారూ సమానమేనన్న నినాదాన్ని అందుకున్నారు.

ఆంధ్రావాలా బాగో నినాదంతో సెంటిమెంట్‌ ....

సెటిలర్లను మచ్చిక చేసుకునే విషయంలో అధికార టీఆర్‌ఎస్‌ అందికంటే ముందు ఉంది. ఉద్యమ సమయంలో ఆంధ్రావాలా బాగో అని తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చిన గులాబీ బాస్‌... గోంగూర, పుంటికూర నుంచి బిర్యానీ వరకు అన్నింటిని కలగలిపి తిట్టారు. అటువంటి టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు సీమాంధ్ర సెటిలర్లపై ప్రేమ పుట్టింది. టీఆర్‌ఎస్‌ను తెలుగు రాష్ట్ర సమితిగా మార్చి ఏకంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోటీ చేస్తామనే స్థాయికి వెళ్లింది. ఇక్కడ ఉండే అందరూ కూడా ఒక్కటేననే నినాదాన్ని అందుకున్నారు.

తమ వైఖరి మార్చుకున్న కాంగ్రెస్...

సెటిలర్ల విషయంలో ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు కూడా తమ వైఖరి మార్చుకున్నారు. వీరికి తమ పార్టీయే అండగా ఉంటుందని టీపీసీసీ నేతలు వల్లె వేస్తున్నారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీరికే సీట్లు ఇస్తామని ప్రకటించింది. వీరి ఓట్ల కోసం రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని ప్రచార రంగంలోకి దించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అవకాశంగా ఉపయోగించుకోవాలని....

మరోవైపు సెటిలర్లకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అవకాశంగా ఉపయోగించుకోవాలని టీడీపీ, బీజేపీ నేతలు నిర్ఱయించారు. తమను గెలిపిస్తే టీమాంధ్రులను డిప్యూటీ మేయర్‌ పదవి ఇస్తామని ఈ రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. మొత్తంమీద ఈసారి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సెటిలర్ల అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

09:46 - January 16, 2016

హైదరాబాద్ : చావలేదు... చంపేశారు. ఆత్మహత్య కాదు... హత్యే! సునందా పుష్కర్‌ మర్డర్ మిస్టరీలో... తవ్వేకొద్దీ నమ్మలేని నిజాలు బయట పడుతున్నాయి. ఎయిమ్స్ రిపోర్టులో కుట్రదారుల పాత్రలు వెలుగుచూస్తున్నాయి. ఓవర్‌డోస్‌తో సునందాపై విష ప్రయోగం చేశారంటూ FBI తేల్చి చెప్పింది. దీంతో శశిథరూర్‌ను మరోసారి విచారిస్తామంటున్నారు ఢిల్లీ పోలీసులు.

సునందా పుష్కర్ మృతి కేసు మరోసారి వార్తల్లోకి....

సునందా పుష్కర్ మృతి కేసు మరోసారి వార్తల్లోకెక్కింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీపై ఇప్పుడిప్పుడే అనుమాన మేఘాలు తొలగిపోతున్నాయి. ట్విస్ట్‌ల మీద ట్విస్టులతో థ్రిల్లర్ సినిమాను తలపించిన సునందా మృతి కేసు క్లైమాక్స్‌కు చేరినట్లే కనిపిస్తోంది. విష ప్రయోగం వల్లే ఆమె చనిపోయారని ఫోరెన్సిక్‌ నివేదికల్లో తేలింది.

ఢిల్లీ పోలీసులకు ఎఫ్ బీఐ రిపోర్ట్‌....

ఎఫ్ బీఐ రిపోర్ట్‌ను ఢిల్లీ పోలీసులకు అందజేశారు ఎయిమ్స్ అధికారులు. సునందా పుష్కర్‌ తీసుకున్న మెడిసిన్‌ ఓవర్‌డోస్‌ కావడం వల్లే ఆమె మృతి చెందారని తెలిపారు. ఆ ఓవర్‌డోసే విష ప్రయోగమన్నట్లుగా నివేదికల్లో పొందుపర్చారు ఫోరెన్సిక్ డాక్టర్లు. పుష్కర్ శరీరంలో రేడియోధార్మిక పొలోనియమ్ ఉన్నట్లు గుర్తించారు.

దూకుడు పెంచిన ఢిల్లీ పోలీసులు...

మరోవైపు ఎఫ్ ఐబీ రిపోర్టు అందడంతో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. దర్యాప్తును త్వరలోనే ముగించి కేసును తేలుస్తామని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ బస్సీ తెలిపారు. దీంతో సునందా భర్త, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్‌ కష్టాలు తప్పేట్లు లేవు. ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉందని హస్తిన పోలీసులు అంటున్నారు. త్వరలోనే ఈ కేసును చేధిస్తామంటున్నారు.

2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని లీలావతి హోటల్‌లో.....

నిజానికి 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని లీలావతి హోటల్‌లో సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అప్పటి నుంచి ఎన్నో మలుపులు తిరిగిన కేసుపై ఢిల్లీ పోలీసులు పలుమార్లు సునందా భర్త శశిథరూర్‌తో సహా పలువురిని విచారించారు. కానీ ఈ కేసును చేధించలేకపోయారు. మరి ఇప్పటికైనా అసలు నిందితుల్ని పట్టుకుంటారో..? లేదో చూడాలి. 

టిడిపి - బిజెపి మధ్య కుదరిన ఒప్పందం!

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై భాజపా, తెదేపా మధ్య చర్చలు కొలిక్కివచ్చినట్లుసమాచారం. 90 స్థానాల్లో తెదేపా, 60 స్థానాల్లో భాజపా పోటీచేసే అవకాశముంది. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నేతలు సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

జల్లికట్టు కు ముఖ్య అతిథిగా బాలకృష్ణ

తిరుపతి : జల్లికట్టు పోటీలకు సినీ హీరో బాలకృష్ణ ముఖ్య అతిథిగా వెళ్లనున్నారు.చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లె వాసులు జల్లికట్టు పోటీలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు.. సినీ హీరో, మదనపల్లి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఆహ్వానించారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం జరిగే పోటీలను ఆపాలని పోలీసులు నిర్వాహకులను ఇప్పటికే కోరారు. అయినప్పటికీ నిర్వహకులు పోటీలను జరపాలనే పట్టుదలతో ఉన్నారు.

నర్సాపురంలో యువకుడి దారుణ హత్య...

పశ్చిమగోదావరి : నర్సాపురం ప్రభుత్వాస్పత్రి సమీపంలో సయ్యద్‌ అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. దుండగులుగొంతుకోసి హత్యచేశారు. ఈ హత్య ఎందుకు చేశారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హుక్కా సెంటర్ల పై పోలీసుల దాడి...

హైదరాబాద్ : బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలోని హుక్కా సెంటర్లపై శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. హుక్కా సెంటర్లను పోలీసులు సీజ్ చేసినట్లు సమాచారం. కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

సంక్రాంతికి వెళ్లి తిరిగొచ్చేవారి కోసం 37 ప్రత్యేక రైళ్లు...

హైదరాబాద్: సంక్రాతికి వెళ్లి తిరిగివచ్చేవారి కోసం 37 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో ఉమాశంకర్‌ చెప్పారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జనసాధారణ్‌ రైళ్లు, అవసరమైతే మరికొన్ని రైళ్లను ఏర్పాటుచేస్తామని రైల్వే సీపీఆర్‌వో ఉమాశంకర్‌ వివరించారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 9గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటలు, కాలినడక భక్తులకు 6గంటల సమయంపడుతోంది. నిన్న శ్రీవారిని 65,028 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో నేడు గోదాదేవి పరిణయం, కనుమ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం జరగనుంది.

పంతంగులు ఎగరేస్తూ ఇద్దరు మృతి...

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేస్తూ వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. గుడిమల్కాపూర్‌లో కైట్ ఎగురవేస్తున్న ఓ బాలుడు భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ముషీరాబాద్‌లో పతంగ్ ఎగురవేస్తుండా విద్యుత్ షాక్ కొట్టి యువకుడు మృతి చెందాడు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ దరలు..

హైదరాబాద్ : వాహనదారులకు శుభవార్త. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్‌పై రూ. 32 పైసలు, లీటర్ డీజిల్‌పై రూ. 85 పైసలు తగ్గాయి. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.

07:19 - January 16, 2016

హైదరాబాద్: పఠాన్‌కోట్‌పై దాడి ప్రధాన సూత్రధారి అరెస్ట్‌ విషయంలో పాకిస్థాన్‌ డ్రామాలకు ఫుల్‌స్టాప్ పడడంలేదు. నిందితుల విషయమై భారత్‌ పలు ఆధారాలు చూపించినా అవి చాలవన్నట్లు నిన్నమొన్నటిదాకా చెప్పుకొచ్చింది. తీరా భారత్‌ కొంచెం కఠినంగా వ్యవహరించడంతో మసూద్ అరెస్ట్ విషయమై మరోమాట చెప్పింది. అయితే ఎప్పటిలానే క్లారిటీ మిస్ చేసింది. విచారణ మొదట్లోనే పాక్‌ ఇన్ని చుక్కలు చూపిస్తుంటే రేపు ఆ ప్రక్రియ ఎలా సాగుతుందనేది చర్చనీయాంశంగా మారింది.

పాకిస్థాన్‌ నుంచే ఈ ఎటాక్‌ వ్యవహారమంతా....

పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడి సూత్రధారి అరెస్టయ్యాడా.? లేదా? ఈ విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ పాకిస్థాన్‌ నుంచే ఈ ఎటాక్‌ వ్యవహారమంతా నడిపించాడని భారత్ ఆరోపిస్తూ ఆధారాలిచ్చింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ న్యాయ మంత్రి రానా సనౌల్లా ప్రకటించారు. ఇదేసమయంలో ఆ రాష్ట్ర కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన అధికారి మాట్లాడుతూ మసూద్ అరెస్ట్ కాలేదని అన్నారు.

మసూద్‌ అరెస్టుపై భిన్న వాదనలు ...

మసూద్‌ అరెస్టుపై పాక్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌ అధికార వర్గాల నుంచే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అజహర్‌ను అరెస్టు చేయలేదని, ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని ఒకసారి, గృహనిర్బంధం చేసామని మరోసారి భిన్న ప్రకటనలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే పాక్‌ కౌంటర్‌ టెర్రరిజం విభాగం ఇండియాకు దగ్గర్లోని సియాల్‌ కోట్‌లో జైషేమహ్మద్‌ నిర్వహించిన ఓ సమావేశానికి అనుమతి రద్దు చేసింది. ఇలా మసూద్ డ్రామా కొనసాగుతుండగానే విదేశాంగ కార్యదర్శుల సమావేశం కొత్త తేదీల ప్రకటనపై భారత్‌ పనిచేస్తోందని పాక్‌ విదేశాంగ శాఖ తెలిపింది.

మొదటినుంచీ మసూద్‌ అరెస్ట్‌పై అనుమానాలు...

మొదటినుంచీ మసూద్‌ అరెస్ట్‌కు పాక్‌కు మనసొప్పడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ఇచ్చిన ఆధారాలను బట్టి పాక్‌ అతన్ని అదుపులోకి తీసుకోవాల్సొచ్చింది. తొలుత మసూద్ అరెస్టయ్యాడనే వార్త వెలువడడంతో విదేశాంగశాఖ సహాయ మంత్రి వికాస్‌ స్వరూప్‌ గురువారం ఓ ప్రకటన చేశారు.

అరెస్ట్ వార్తను అధికారికంగా పేర్కొనలేదని అసంతృప్తి.....

పాక్ తీసుకున్న తొలి చర్యకు సంతోషమే కానీ అతడి అరెస్ట్ వార్తను అధికారికంగా పేర్కొనలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పంజాబ్‌ ప్రావిన్స్‌ మంత్రి రానా సనౌల్లా మాట్లాడుతూ మసూద్‌ ప్రొటెక్టివ్‌ కస్టడీలో ఉన్నాడని కానీ అరెస్ట్ కాలేదని అన్నారు. ఇలా నిందితులను అరెస్ట్ చేసేదగ్గరే పాక్ ఇన్ని నాటకాలు ఆడుతుంటే రేపు విచారణ సవ్యంగా సాగుతుందా నిజాలు వెల్లడవుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

పశ్చిమ ఆఫ్రికాలో ఉగ్రదాడి : 20 మంది మృతి

హైదరాబాద్‌: పశ్చిమ ఆఫ్రికాలోని భుర్కినాఫాసోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. రాజధాని వాగడూలోని ఫైవ్ స్టార్ హోటల్‌ల్లోకి మారణాయుధాయులతో చొరబడిన ఉగ్రవాదులు పలువురిని బందీలుగా చేసుకున్నారు. ముష్కరుల దాడిలో ఇప్పటి వరకు 20మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. హోటల్‌ బయట రెండు కారుబాంబులను పేల్చారు. ఉగ్రదాడి సమాచారంతో సైన్యం రంగంలోకి దిగింది. సైన్యం, ఉగ్రవాదుల మధ్య హోరా హోరీగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల చెరలో ఎంతమంది బందీలుగా ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

06:59 - January 16, 2016

హైదరాబాద్: అభ్యర్థులెవరో తేలిపోయింది. కాంగ్రెస్‌లో కాబోయే కార్పొరేటర్ల జాబితా రిలీజైంది. జీహెచ్ ఎంసీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను హస్తం పార్టీ విడుదల చేసింది. 45 మంది రేసుగుర్రాల్ని టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తొలి జాబితాలో జనరల్ అభ్యర్థులకు పెద్దపీట వేశారు. 15 మంది జనరల్‌, 15 మంది జనరల్ మహిళ అభ్యర్థుల్ని ఎంపిక చేశారు.

జనరల్ అభ్యర్థుల్లో.....

జనరల్ అభ్యర్థుల్లో హయత్‌నగర్‌ నుంచి చంద్రశేఖర్‌రావు, చైతన్యపురి నుంచి గూడూరు నరేందర్‌రెడ్డి, జాంబాగ్‌ నుంచి మూల విక్రమ్‌గౌడ్‌, షేక్‌పేట్‌ నుంచి ఆత్మకూరి సుధాకర్‌, యూసుఫ్‌గూడ నుంచి అప్పల సురేందర్‌యాదవ్‌, రహ్మత్‌నగర్‌ నుంచి బండ చంద్రమ్మ, వెంగళ్‌రావునగర్‌ నుంచి దేవిరెడ్డి నాగార్జునరెడ్డి, కొండాపూర్‌ నుంచి ఉట్ల కృష్ణ, శేరిలింగంపల్లి నుంచి K. ఎల్లయ్య, మాదాపూర్‌ నుంచి G. నర్సింహ యాదవ్‌, కూకట్‌పల్లి నుంచి కూన అమరేష్‌గౌడ్‌, హైదర్‌నగర్‌ నుంచి N. శ్రీనివాస్‌, ఆల్విన్‌కాలనీ నుంచి D.నర్సింగ్‌రావు, సూరారం నుంచి అబ్దుల్‌ అరీఫ్‌, మల్కాజ్‌గిరి నుంచి GD శ్రీనివాస్‌గౌడ్‌ను ఎంపిక చేశారు.

15 మంది జనరల్ మహిళా అభ్యర్థుల్లో....

15 మంది జనరల్ మహిళా అభ్యర్థుల్లో తార్నాక నుంచి బండ కార్తీకరెడ్డి, హబ్సిగూడ నుంచి పసుల మంజూల, నాగోల్‌ నుంచి పోలేపల్లి వనజ, సైదాబాద్‌ నుంచి అరుణారెడ్డి వెంకటేశ్వరకాలనీ నుంచి భారతీనాయక్‌ పోటీ చేయనున్నారు. హఫీజ్‌పేట్‌ నుంచి లక్ష్మీగౌడ్‌, చందానగర్‌ నుంచి గంపల అనిత, బాలజీనగర్‌ నుంచి కె.శృతిరెడ్డి వివేకానందనగర్‌ కాలనీ నుంచి విద్యాకల్పనకు తొలి జాబితాలో స్థానం దక్కింది. సుభాష్‌నగర్‌ నుంచి లక్ష్మీదేవి, కుత్బుల్లాపూర్‌ నుంచి సూర్యప్రభ, జీడిమెట్ల నుంచి పల్లవి, నేరేడ్‌మెట్‌ నుంచి మరియమ్మ, వినాయక్‌నగర్‌ నుంచి కృష్ణవేణి, మౌలాలి నుంచి పద్మావతి యాదవ్‌ పోటీ చేయనున్నారు.

3 స్థానాల్లో ఎస్సీ జనరల్ అభ్యర్థులు....

ఇక 3 స్థానాల్లో ఎస్సీ జనరల్ అభ్యర్థుల్ని ప్రకటించింది. అందులో కాప్రా నుంచి గూడ ఇంద్రయ్య, మీర్‌పేట్‌ హెచ్ బి కాలనీ నుంచి పోలెపాక అంజయ్య, మచ్చ బొల్లారం నుంచి ఎంవీ సూర్యకిరణ్‌ ఉన్నారు. అలాగే 8 స్థానాల్లో బీసీ జనరల్ అభ్యర్థుల్ని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. దూద్‌బౌలి నుంచి మీరజ్‌మహ్మద్‌, దత్తాత్రేయ నగర్‌ నుంచి రమేష్‌కుమార్‌, భోలక్‌పూర్‌ నుంచి వాజీద్‌ హుస్సేన్‌, బోరబండ నుంచి పోచయ్యగౌడ్‌ పోటీ చేయనున్నారు. పటాన్‌చెరు నుంచి మెట్టు శంకర్‌యాదవ్‌, గాజులరామారం నుంచి సాయిప్రతాప్‌, జగద్గిరిగుట్ట నుంచి ఎ.మారయ్య, రంగారెడ్డినగర్‌ నుంచి వి.కృష్ణ బరిలో దిగనున్నారు.

మరో 4 స్థానాల్లో బీసీ మహిళా అభ్యర్థులు...

మరో 4 స్థానాల్లో బీసీ మహిళా అభ్యర్థులు... మంగళ్‌హాట్‌ నుంచి సుబేదార్‌ అంజూరాణి, ఎర్రగడ్డ నుంచి నాషీన్‌ బేగం, చింతల్‌- బండి సుగుణ, బౌద్ధనగర్‌-ఎ. ఉమాదేవి పోటీ చేయనున్నారు. మొత్తానికి తొలిజాబితాలో పేర్లు రావడంతో అభ్యర్థుల్లో కోలాహలం మొదలైంది. ఇక మరికొన్ని వార్డుల్లోని ఆశావహులు మాత్రం తర్వాతి జాబితాల కోసం ఎదురుచూస్తున్నారు. 

06:55 - January 16, 2016

హైదరాబాద్: గ్రేటర్‌ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన టిడిపి-బిజెపి కూటమికి పెద్ద పజిల్‌లా మారింది. అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు తొలి, మలి జాబితాలు విడుదల చేసి దూసుకుపోతున్నాయి. పసుపు-కాషాయ కూటమి మాత్రం సీట్ల సర్దుబాటు దగ్గరే ఉంది.

టిడిపి-బిజెపి మధ్య సుదీర్ఘంగా చర్చలు....

ఏయే పార్టీ ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయమై టిడిపి-బిజెపి మధ్య సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. చివరకు టిడిపి 87, బిజెపి 63 స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఎవరు ఎక్కడ పోటీచేయాలన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. బహుశా శనివారం ఇరు పార్టీలు ఈ అంశంపై ప్రకటన చేసే అవకాశముంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో మాదిరికాక ఈసారి కొంత సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినట్లు టాక్‌. అయితే సీట్ల పంపకం విషయంలో బిజెపి గొంతెమ్మ కోర్కెలు కోరుతోందని టిడిపి నేతలు లోలోపలే రగిలిపోతున్నారు.

బిజెపికి ఇవ్వొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శన...

టిడిపి కార్యకర్తలు కొందరు పార్టీ కార్యాలయానికి వచ్చి తమ డివిజన్‌ సీటును బిజెపికి ఇవ్వొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. చివరకు నాయకులు కలగజేసుకుని సర్దిచెబుతుండడంతో పరిస్థితి అదుపులోకి వస్తోంది. బిజెపి మాత్రం పాతబస్తీలోకంటే టిడిపి బలంగా ఉండే శివారు ప్రాంతాల్లో తమకు ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. తమకు సీట్ల కేటాయింపు తక్కువగానే జరిగింది కాబట్టి కనీసం వాటినన్నా శివారు ఏరియాల్లో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా 150 డివిజన్లకుగాను కాషాయపార్టీ 63 స్థానాల్లో పోటీ చేసే అవకాశముంది. అయితే తమ మధ్య ఏ ఇబ్బందులూ లేవనీ సరైన అభ్యర్థులు ఏ పార్టీ వారైనా వారికే సీట్లు కేటాయిస్తామని నేతలు అంటున్నారు.

మరింత టెన్షన్‌ పడుతున్న ఆశావహులు...

ప్రస్తుతం సీట్ల పంపకం ఓ కొలిక్కి రావడంతో ఎవరెక్కడ పోటీ చేయాలన్నది తేలాల్సి ఉంది. ఎవరెక్కడ బలంగా ఉన్నారు.? ఎవరికి సీటిస్తే మేలు జరుగుతుందన్న విషయంపై ఇరు పార్టీల అగ్రనేతలు దృష్టిపెట్టారు. అయితే ఆలస్యం ఆశావహులను మరింత టెన్షన్‌కు గురిచేస్తోంది. 

నేడు టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థుల జాబితా

హైదరాబాద్ : ఒకపక్క జిహెచ్‌ఎంసి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ముగింపు గడువు దగ్గరపడుతోంది. మరోపక్క ప్రధాన ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తూ దూకుడుమీదున్నాయి. కానీ టిడిపి, బిజెపి కూటమి మాత్రం ఇంకా అభ్యర్థుల పేర్లు ఖరారు చేయలేదు. అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలన్నదానిపై మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

06:51 - January 16, 2016

హైదరాబాద్: కోర్టులు వద్దన్నా..! ప్రభుత్వం ఆంక్షలు విధించినా..! పోలీసులు హెచ్చరించినా కోడి పందాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ఉభయ గోదారి జిల్లాల్లో జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి. పందెం కోళ్లు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే... లక్షల్లో సొమ్ము చేతులు మారుతోంది.

చేతులు మారిన కోట్ల రూపాయలు...

ఏపీలో కోడి పందేల జోరు కొనసాగుతోంది. కోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలను తోసేసి సంక్రాంతి సంబరాల్లో పందెం కోడి బరిలో గెలిచింది. పందెంరాయుళ్లకు మజా తెచ్చింది. కోట్ల రూపాయలను చేతులు మార్చింది. సంప్రదాయక్రీడ హోదాతో ఈ ఏడాదీ కోడి పందేలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. కత్తులు దూసుకున్న కోళ్లు కదనరంగంలో రక్తమోడే వరకు పోరాడి నేలకూలుతున్నాయి. ఓడిన వారు బేల ముఖాలతో ఇంటి దారి పడుతుండగా గెలిచిన వారంతా హుషారుగా ఉరకలేస్తున్నారు.

భారీ ఎత్తున కోడి పందేలు....

పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన కోడి పందేల విలువ సుమారు 100 కోట్ల రూపాయలరి అంచనా వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ భారీ ఎత్తున కోడి పందేలు జరుగుతున్నాయి. వాటికితోడు... పక్కనే పేకాట, గుండాట యధేచ్చగా కొనసాగుతున్నాయి. ఈ తంతులో మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. రాష్ట్రం నుంచే కాదు... విదేశాల నుంచి కూడా వచ్చిన వాళ్లు పందేల్లో పాల్గొంటుండటం విశేషం.

సినీ ప్రముఖులు, రాజకీయ నేతల రాకతో...

సినీ ప్రముఖులు, రాజకీయ నేతల రాకతో... బరులన్నీ కళకళ లాడుతున్నాయి. పందేల్లో చనిపోయిన పుంజులకు కూడా గిరాకీ ఎక్కువగా ఉంటోంది. వాటిని కొనేందుకు కూడా వేలం వేస్తున్నారు. పోలీసులు చేతులెత్తేయడంతో... కోడి పందేలు విపరీతంగా జరుగుతున్నాయి. పండగ సంబరాల్లో ఉన్న యువత ఈ పందేల్ని చూసేందుకు తరలివస్తున్నారు.

పలు ప్రాంతాల్లో .....

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడు, గొమ్మంపాడు, ఉండ్రాజవరం మండలం తాడిపర్రు, వడ్లూరు, వేలివెన్ను, పెరవలి మండలం ఖండవల్లి, ఉసుమొర్రుతో పాటు తణుకు, తేతలి, మండపాకల, దువ్వ, వేల్పూరు తదితర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలో మురమళ్ల, ముమ్మిడివరం, సఖినేటిపల్లి, కోరుకొండ తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తున్నారు.

పల్లెల్లో ప్రైవేట్‌ సైన్యాల రక్షణలో జోరుగా కోడి పందాలు....

పందాలను ఎట్టిపరిస్థితుల్లో సాగనివ్వమని అధికారులన్నా... ఆచరణలో అది సాధ్యం కాలేదు. పల్లెల్లో ప్రైవేట్‌ సైన్యాల రక్షణలో జోరుగా కోడి పందాలు సాగుతుంటే... పట్టణాల్లో శివారు ప్రాంతాల్లో అక్కడక్కడా పందాలు ఆడుతున్నారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీని కోళ్ల పందాలు జోరుగా సాగుతున్నాయి.

మూడురోజుల్లో వందల కోట్ల రూపాయలు....

కోర్డు ఆదేశాలు ధిక్కరించి నిన్నటి నుంచి గోదావరి జిల్లాల్లో కోడి పందేలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. పోలీసులు ఎన్ని ప్రకటనలు చేసినా, ముందస్తు అరెస్టులు, కేసులు పెట్టినా కోడిపందేలు మాత్రం నేతల అండదండలతో యథావిధిగా సాగుతున్నాయి. ఈ పందేల ద్వారా ఈ మూడురోజుల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి. 

06:47 - January 16, 2016

విజయవాడ : ఏపీ రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను అర్ధం చేసుకుని పైన చెప్పిన గడువులోపల తమ అభ్యంతరాలను, అభిప్రాయాలను, సూచనలను ఇవ్వాలంటూ సీఆర్డీఏ వెబ్ సైట్‌లో ఇలా పెట్టారు. గత నెల డిసెంబర్‌ 26నుండి ఈ నెల 25 వరకు అభ్యంతరాలు తీసుకోవడానికి సీఆర్డీఏ వెసులుబాటు కల్పించింది. అయితే వెబ్‌సైట్‌లో మాస్టర్‌ప్లాన్ పెట్టింది మొదలు.. రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్లాన్‌ అంతా ఇంగ్లీష్ మయం కావడంతో ఒక్క ముక్క అర్ధం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా ప్రభుత్వం జారీ చేసే జీవోలను అర్ధం చేసుకోవాలంటే..చదువుకున్న వాళ్లకే అర్ధంకాదు. అలాంటిది పొలం దున్నుకునే రైతులకు ఈ ఇంగ్లీష్‌ ఎలా అర్థం అవుతుందో ప్రభుత్వమే చెప్పాలని రైతులు నిలదీస్తున్నారు.

ప్లాన్‌ను అర్ధం చేసుకోలేకపోతున్న రైతులు...

గ్రామాల్లో నుండి రోడ్లు వెళ్లడం, భవనాలు, పార్కులు ఎలా ఉంటాయో అనే గుర్తులు తప్ప,.. ప్లాన్‌ను అర్ధం చేసుకోవడం రైతుల వల్ల కావడంలేదు. ఒకవేళ ప్లాన్ అర్ధం చేసుకుని సూచనలు, అభ్యంతరాలు చెప్పాలనుకున్నా... వివరాల ఎంట్రీ ప్రక్రియ మరింత గందరగోళ పరుస్తోంది. ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్లు, పూర్తి చిరునామా వంటి వాటిల్లో ఏ ఒక్కటి మిస్ అయినా రైతులు పంపే అభ్యంతరాలు సీఆర్డీఏ వారికి చేరవు. ఆన్‌లైన్ లేకపోతే అభ్యంతరాలను విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి ఉత్తరాల ద్వారా పంపొచ్చని అధికారుల చెప్తున్నారు. అయితే ప్లాన్ పై పూర్తి అవగాహన కల్పించకుండా రాజధాని నిర్మాణం ఎలా ప్రారంభిస్తారని రైతులు మండిపడుతున్నారు.

ప్రభుత్వం గ్రామాల్లో గ్రామ సభలు....

15 రోజులుగా ప్లాన్ పై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం గ్రామాల్లో గ్రామ సభలు పెడుతోంది. స్క్రీన్‌ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు ప్లాన్ వివరాలు అధికారులు తెలియజేస్తున్నారు..అయితే ప్లాన్ వివరాలు తెలిపే సమయంలో మధ్యలో రైతులు అడిగే ప్రశ్రలకు అధికారులు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఉదాహరణకు రోడ్లు గ్రామాల మధ్యగా వెళుతున్నట్లు ప్లాన్ ఉండడంపై రైతులు అధికారులను నిలదీస్తున్నారు. అదేవిధంగా ప్లాట్ కేటాయింపులపై కూడా రైతులు నిలదీస్తున్నారు. ఏదో మసి పూసి మారేడు కాయ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని రైతులు మండిపడుతున్నారు. ఈ గందరగోళంపై మంత్రులు, సీఆర్డీఏ కమిషనర్ ఎలా స్పందిస్తారో..గ్రామాలకు వెళ్లి రైతులకు ఏం సమాధానం చెబుతారో చూడాలి. 

06:45 - January 16, 2016

హైదరాబాద్ : ప్రజలకు ఉపయోగపడకుండా నామమాత్రంగా ఉన్న పథకాలకు గుడ్‌బై చెప్పాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. కార్యకలాపాలు నిర్వహించకున్నా నామమాత్రంగా వందల నుంచి వేల రూపాయల కేటాయింపులు చేస్తున్న పథకాలు వేయి వరకు ఉంటాయని ఆర్ధిక శాఖ అంచనా వేసింది. ఆయా పథకాల్లో 40 శాతం పనికిరానివని సమాచారం. అందుకే గత కొన్ని సంవత్సరాలుగా నిధులు కూడా కేటాయించడం లేదు. నామమంత్రంగా ఉపయోగపడే వాటిని...ఇతర పథకాల్లో విలీనం చేయనున్నారు.

ఆర్థిక వృథాను అరికట్టేందుకు....

నిరుపయోగ పథకాల వల్ల జరుగుతున్న ఆర్థిక వృథాను అరికట్టేందుకు మార్గాలను సైతం ఆన్వేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా పేరుకుపోయిన పథకాలను సంస్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర.. ఇప్పటికే అన్నిశాఖల అధిపతులు, ముఖ్య కార్యదర్శులతో ప్రాథమికంగా సమీక్షించారు. వాటిని మూడు క్యాటగిరీలుగా గుర్తించారు. ముఖ్యమైన పథకాలు, తప్పనిసరి కేటాయించాల్సినవి, ప్రభావితం చేయనివి, పునరాలోచించాల్సిన పథకాలు అని విభజించారు. ఉదాహరణకు గిరిజన సంక్షేమశాఖ పరిధిలో సంక్షేమం, ఆశ్రమ పాఠశాలలు, కార్పొరేషన్ పేర పలు విభాగాలు ఉన్నాయి.

పథకాలన్నీ అటకెక్కించే దిశగా ఉన్నతాధికారులు కసరత్తు.....

అక్కడ ఒకరిద్దరు సిబ్బంది..వారు కూడా అవుట్ సోర్సింగ్ పద్దతిల్లో పనిచేస్తున్నారు. అక్కడ ట్రాన్స్ పోర్టు కోసం రెండు వేలు కేటాయించడాన్ని ప్రత్యేక పథకంగా పరిగణిస్తున్నారు. ఇటువంటి పథకాలన్నీ అటకెక్కించే దిశగా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. అదే అక్కడ పనిచేసే సిబ్బందిని ఇతర డిపార్టమెంట్లకు కేటాయిస్తే..వారి జీతాలు మిగులుతాయి..ఖర్చులు కూడా తగ్గుతాయన్నది ఉన్నతాధికారుల వ్యూహం.

ఆర్థిక వృథాకు అడ్డుకట్ట వేసినట్లేనని.....

ఇక గతేడాది ప్రణాళికేతర వ్యయం 63 వేల కోట్లు కాగా, వాటిలో ఉద్యోగుల జీతభత్యాలకు 50 వేల కోట్లపైనే ఖర్చైంది. తాజా కసరత్తు ప్రకారం పనికిరాని పథకాలు తొలగిస్తే ప్రణాళికేతర వ్యయంలో ఆర్థిక వృథాకు అడ్డుకట్ట వేసినట్లేనని అధికారులు భావిస్తున్నారు. మొత్తమ్మీద నామమత్రంగా మిగిలిన పథకాల్లో కోత విధించేందుకు రంగం సిద్ధమైంది. అయితే ప్రభుత్వ ప్రయత్నం ఎన్ని కోట్ల నిధులను ఆదా చేస్తుందో చూడాలి. 

బడ్జెట్‌పై టీఎస్ సర్కార్ కసరత్తు

హైదరాబాద్: బడ్జెట్ కసరత్తులను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఓ వైపు రాబడిని పెంచుకునే దిశలో ప్రణాళికలు రచిస్తూ మరోవైపు దుబారాను కట్టడి చేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. నామ మాత్రంగా ఉన్న పథకాలను కుదించి నిధులను ఆదా చేయాలని భావిస్తుంది. తద్వారా నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడంతో పాటు సంక్షేమ పథకాలను బలోపేతం చేయాలని నిర్ణయించింది.

బాలీవుడ్ దర్శకుడు అనిల్ గంగూలీ కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, రచయిత అనిల్‌ గంగూలీ(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ మధ్యాహ్నం ముంబయిలో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్‌ చలనచిత్ర రంగంలో 70వ దశకం నుంచి 90వ దశకం వరకూ ఎన్నో మరపురాని చిత్రాలను ఆయన అందించారు. కోరాకాగజ్‌, తపస్య చిత్రాలకు ఆయన జాతీయ అవార్డులను అందుకున్నారు. సాహెబ్‌, త్రిష్న, కాందాన్‌, హమ్‌కాదామ్‌, ప్యార్‌ కే కబిల్‌, బలిదాన్‌ చిత్రాలతో తనదైన ముద్రవేశారు. ఆయన కూతురు రూపాలీ గంగూలీ నటిగా, కుమారుడు విజయ్‌ గంగూలీ నృత్యదర్శకుడు, దర్శకుడిగా కొనసాగుతున్నారు.

Don't Miss