Activities calendar

17 January 2016

కుత్బుల్లాపూర్ టిడిపిలో ముసలం..

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్ టిడిపిలో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే వివేకానంద ఇంటి వద్ద టిడిపి నేత పాలకృష్ణ ధర్నా నిర్వహించారు. 129 డివిజన్ టికెట్ కేటాయించకపోవడంపై పాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేస్తానని వెల్లడించారు. 

తెలంగాణ విద్యా సంస్థల బంద్ కు పిలుపు..

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలకు విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, టీవీవీ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. విద్యా సంస్థల బంద్ కు సీపీఎం, పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. 

21:31 - January 17, 2016

ఢిల్లీ : ఫిబ్రవరి మూడవ వారంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తామని పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. జీఎస్టీ రియల్ ఎస్టేట్ బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదింపజేస్తామని ఆయన తెలిపారు. జీఎస్టీ పై తమ అభ్యంతరాలకు సమాధానాలు చెబితే 15 నిమిషాల్లో బిల్లు ఆమోదిస్తామన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై.. ఇప్పటికే తాము సమాధానాలు ఇచ్చామని తెలిపారు.

21:29 - January 17, 2016

హైదరాబాద్ : తెలంగాణలో నిర్మించ తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులపై.. సీఎం కేసీఆర్‌.. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ప్రాణహిత-చేవెళ్ల పాత డిజైన్‌ సరిగా లేదని, వీటిని పూర్తి చేయరాదన్న భావనతోనే గత ప్రభుత్వాలు ఇలా రూపకల్పన చేశాయని సీఎం అభిప్రాయపడ్డారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలన్న ప్రతిపాదన వ్యాప్కోస్‌ది కాదని.. అప్పటి ప్రభుత్వం ఒత్తిడి వల్లే ఇలా ప్రతిపాదించారని సీఎం అన్నారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌కు కారణాలేంటో త్వరలో ప్రజలకు వివరిస్తామని.. దీనికి అవసరమైన సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు.

ప్రాణహితను రద్దు చేసే ఆలోచన లేదు..
మేడిగడ్డ దగ్గర తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందన్న సీఎం.. ఉద్యమ కాలంలో అనుకున్న మొక్కుల్ని చెల్లించి... అక్కడ ప్రాజెక్టుకు శ్రీకారం చుడతామన్నారు. గోదావరిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల దగ్గర బ్యారేజీల నిర్మాణంకోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహితను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. ఆ ప్రాజెక్టును ప్రయోజనాత్మకంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు కేసీఆర్.

వ్యాప్కోస్ తో సర్వే..
ప్రాణహిత దగ్గర బ్యారేజీ, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల కోసం వ్యాప్కోస్ తో సర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాలమూరు ఎత్తిపోతల కింద నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను రేండేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించాలని ఆధికారుల్ని సీఎం ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి ప్రస్తుత ఖరీఫ్ లోనే నీటిని అందించాలన్నారు. కొత్తగా చేపట్టేవాటితో పాటు పురోగతిలోఉన్న ప్రాజెక్టు పనుల్లోనూ వేగం పెంచాలన్నారు. 

ప్రతి ఏడాది రూ.25వేల కోట్లు..
ప్రాజెక్టు నిర్మాణంకోసం ప్రతి ఏడాది రూ. 25వేల కోట్లు కేటాయిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ నిధులతోపాటు ఇతర పథకాల నుంచి మరో 5వేలకోట్లు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల రీడిజైన్ పూర్తిచేసింది టీ సర్కారు. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఏకీకరణ ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఈ పనులకోసం వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. దుమ్ముగూడెంనుంచి నీటిని తోడి ఈ రెండు ప్రాజెక్టులను కలపాలని నిర్ణయించారు. రోడ్లపాడు, బయ్యారం రిజర్వాయర్లతో ఖమ్మం జిల్లాలో కొత్తగా 5లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని భావిస్తున్నారు.. ఈ పనులకుకూడా వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న సమయానికి ప్రాజెక్టులు పూర్తికావాలని అధికారులు దిశానిర్దేశం చేశారు కేసీఆర్‌.

21:25 - January 17, 2016

విజయవాడ : నెల్లూరు రాజకీయ స్వరూపం మారింది. మొన్నటి వరకు కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆనం సోదరులు పసుపు కండువా కప్పుకున్నారు. నెల క్రితమే టిడిపిలో లో చేరుతామని చెప్పినా... అధికారికంగా హంగూ, ఆర్భాటాలతో సీఎం సమక్షంలో పార్టీ మారారు. అధినేత మాట ప్రకారమే పనిచేస్తామని, ఏ విధమైన గొడవలకు చోటులేకుండా చూసుకుంటామని హమీఇచ్చారు. సోదరుల పార్టీ మార్పు కార్యక్రమంతో విజయవాడ సందడిగా మారింది. తమ బలం నిరూపించుకునేందుకు ఆనం బ్రదర్స్ ఏర్పాటుచేసిన సభ కార్యకర్తలతో క్రిక్కిరిసిపోయింది. నెల్లూరు నుంచి ప్రత్యేక రైలు ద్వారా వీరిని బెజవాడకు రప్పించారు. కార్యకర్తలు ఎక్కడా ఇబ్బందిపడకుండా పక్కా ఏర్పాట్లు చేశారు ఆనం సోదరులు.

బెజవాడ పసుమయం..
నెల్లూరు సోదరుల్ని టీడీపీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. కాంగ్రెస్‌ దుర్మార్గమైన ఆలోచనతో రాష్ట్రాన్ని విభజించిందని ఆరోపించారు. త్వరలో మొబైల్‌ ద్వారా ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడే కార్యక్రమం చేపట్టాలని చూస్తున్నామని ప్రకటించారు. టీడీపీతో కలిసి పనిచేస్తామని సభలో ప్రకటించారు నెల్లూరు సోదరులు. జిల్లాలో నూటికి నూరుశాతం పచ్చ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఆనం వారి హంగామాతో బెజవాడ పసుపు మయంగా మారింది.

21:21 - January 17, 2016

హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల స్వీకరణ చివరి రోజున మందీమార్బలంతో అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. జిహెచ్‌ఎంసి కార్యాలయాలు పార్టీల రంగురంగుల జెండాలతో కళకళలాడాయి. చివరి టైం దాకా పార్టీలు అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో సీక్రెట్ మెయింటెయిన్ చేయడంతో నేతలు ఫుల్ టెన్షన్‌ ఫీలయ్యారు. బిజెపి మాత్రం వ్యూహాత్మకంగా చివరి రోజున కూడా అభ్యర్థులను ప్రకటించలేదు.

చివరి వరకు టిడిపి, బిజెపి చర్చలు..
సీట్ల సర్దుబాటు విషయంలో చివరిదాకా టిడిపి-బిజెపి చర్చలు జరుపుతూ వచ్చాయి. చివరి మూమెంట్లో టిడిపి 87 మందికిగాను 81 మంది అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేసింది. బిజెపి మాత్రం అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించలేదు. దీంతో తనకు కేటాయించిన డివిజన్లలో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల చేత నామినేషన్లు దాఖలు చేయించింది. మొదటి నుంచీ అభ్యర్థుల ప్రకటనపై దూకుడు ప్రదర్శించిన టిఆర్‌ఎస్‌ కూడా పూర్తిస్థాయిలో లిస్ట్ విడుదల చేయలేదు. మొత్తంగా 143 మంది పేర్లనే ప్రకటించి మిగిలిన ఏడుగురి విషయంలో వెనక్కితగ్గింది. ఇక కాంగ్రెస్‌ కూడా పూర్తిస్థాయిలో అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. ఆదివారం ప్రకటించిన 49 మందితో కలిపి ఇప్పటివరకు 94 డివిజన్లకే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఎంఐఎం 75 సీట్లలో పోటీకి సిద్ధమైంది. వన్‌ హైదరాబాద్‌ పేరుతో పోటీకి దిగుతున్న సిపిఎం, సిపిఐ, లోక్‌సత్తా, తదితర పార్టీలు తమకు కేటాయించిన స్థానాల్లో అభ్యర్థుల చేత నామినేషన్లు దాఖలు చేయించాయి. మొత్తమ్మీద 150 డివిజన్లకుగాను 2 వేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి.

నేతల ఆవేదన..
పార్టీలు అభ్యర్థుల పేర్ల ప్రకటనలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండడంతో ఆశావహుల్లో టెన్షన్ కొనసాగుతోంది. అయితే మొదటి నుంచీ సీటు ఆశించిన అభ్యర్థులు చివర్లో పార్టీలు హ్యాండివ్వడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. హయత్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు తమ నేత శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్ దక్కకపోవడంతో హైవేపై ధర్నా నిర్వహించారు. రాత్రికి రాత్రే వేరే పార్టీ నుంచి వచ్చినవారికి టిక్కెట్లు అమ్ముకుని ఎప్పటినుంచో పార్టీకి సేవలు చేసినవారిని అధిష్ఠానం మోసం చేస్తోందని విమర్శించారు. పలు చోట్ల టిడిపి, టిఆర్‌ఎస్‌ రెబల్స్ నామినేషన్లు దాఖలు చేశారు. తనకు సీటు దక్కకపోవడంతో మూసాపేటకు చెందిన టిఆర్‌ఎస్‌ నేత మల్లేష్‌ యాదవ్‌ మీడియా ముందు కంటతడిపెట్టారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు జనవరి 21తో ముగుస్తుంది. ఎన్నికల అధికారులు సోమవారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 2వ తేదీన పోలింగ్, ఫిబ్రవరి 5వ తేదీన కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిచేస్తారు. 

21:19 - January 17, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో సస్పెన్షన్ కు గురైన దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ప్రకంపనలు సృష్టిస్తోంది. పలు ప్రజా సంఘాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇందుకు కారణమైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల హెచ్ సీయూలో కొంతమంది దళిత విద్యార్థులను సస్పెన్షన్ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ ఆత్మహత్య ఘటనపై అర్పిత హెచ్ సీయూ విద్యార్థి టెన్ టివితో మాట్లాడారు. చదువుల్లో దళితులు పైకి వస్తున్నారని భావించి హత్యలు చేస్తున్నారని అందులో రోహిత్ మృతి ఒక ఉదాహరణ అని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారని, అనంతరం మంత్రి స్మృతి ఇరానీ యూనివర్సిటీకి లేఖ రాశారని తెలిపారు. అనంతరం వర్సిటీపై బీజేపీ తీవ్ర వత్తిడి తెచ్చిందని, తరువాత విద్యార్థులను సస్పెన్షన్ చేశారని తెలిపారు. 14 రోజుల నుండి బయటే ఉంటున్నారని, ఎవరూ ఇంతవరకు రావడం లేదన్నారు. ప్రస్తుతం రోహిత్ మృతదేహం తమమధ్య ఉందని, పోలీసులు వెంటనే వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు. వైస్ ఛాన్స్ లర్ వచ్చి మాట్లాడాలని అర్పిత డిమాండ్ చేశారు. 

21:18 - January 17, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ అభ్యర్థుల జాబితా ప్రకటనలో. టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ క్రమంలో.. ఆఖరు క్షణం వరకూ ఉత్కంఠను కొనసాగించింది. నామినేషన్‌ల గడువు ముగియడానికి గంట ముందు మాత్రమే.. ఆపార్టీ అభ్యర్థుల జాబితాను వెలువరించింది. అవకాశం దక్కని ఆశావహులు.. పార్టీ నిర్ణయంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకున్నారంటూ.. రోడ్డెక్కారు. చర్చోపచర్చలు.. తర్జన భర్జనలు.. ఆశావహుల అలకలు.. అధినాయకుల అనునయాలు.. ఇలా రసవత్తర సన్నివేశాల నడుమ.. తెలుగుదేశం పార్టీ గ్రేటర్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. బీజేపీతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చాక.. పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్‌ ఆధ్వర్యంలో.. టీడీపీ తెలంగాణ నాయకులు.. గ్రేటర్‌ అభ్యర్థుల ఎంపికపై దాదాపు 24 గంటల పాటు ఏకధాటిగా కసరత్తు చేశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల వరకూ మల్లగుల్లాలు పడి జాబితాను ఖరారు చేశారు.

భారీ కసరత్తు..
సామాజిక న్యాయం విషయంలోనూ టీడీపీ భారీ కసరత్తు చేసినట్లు జాబితాను బట్టి అర్థమవుతోంది. బీసీ ముస్లింలకు 14 స్థానాలు, యాదవులకు పది, గౌడ కులస్థులకు 9, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు ఏడేసి డివిజన్‌లను కేటాయించారు. మున్నూరు కాపులకు 6, ముదిరాజ్‌లకు నాలుగు, వడ్డెరలకు రెండు డివిజన్‌లను కేటాయించారు. వెలమలు సహా.. మిగిలిన ప్రధాన కులాల వారికి ఒక్కో డివిజన్‌ను కేటాయించారు.

సెటిలర్స్ కు ప్రాధాన్యత..
డిప్యూటీ మేయర్‌ పదవిని సెటిలర్స్‌కు ఇస్తామని ప్రకటించిన టీడీపీ-బీజేపీ కూటమి.. అభ్యర్థుల ఎంపికలోనూ సెటిలర్స్‌కు ప్రాధాన్యతనిచ్చింది. రాజేందర్‌నగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సోదరుడు ప్రేమదాస్‌గౌడ్‌ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌నుంచి పోటీ చేస్తున్నారు. అటు స‌నత్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇంచార్జి కూన వెంక‌టేష్ గౌడ్ స‌తీమ‌ణి సత్యక‌ళాగౌడ్.. బేగంపేట డివిజ‌న్ నుంచి బ‌రిలో నిలిచారు. శేరిలింగంప‌ల్లి శాస‌న‌స‌భ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశించి భంగ‌ప‌డ్డ.. బండి ర‌మేశ్‌ గ్రేటర్‌ ఎన్నికల్లో... మియాపూర్ డివిజ‌న్ నుంచి బరిలో నిలుస్తున్నారు. టీడీపీ ఆశించిందే జరిగితే.. రమేశ్‌ పేరును డిప్యూటీ మేయర్‌ పదవికి ప్రతిపాదించే అవకాశాలున్నాయి.

ఆందోళన..
మరోవైపు టీడీపీ టికెట్‌ ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు.. జాబితా విడుదల కాగానే.. పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ పలువురు ముఖ్య నేతలపై విమర్శలు గుప్పించారు. సలీమ్ న‌గ‌ర్, మన్సురాబాద్ డివిజ‌న్ల సిట్టింగ్ కార్పొరేట‌ర్ల‌కు టిక్కెట్లు ఇవ్వకపోవడంతో వారి అనుచ‌రులు నిర‌స‌న‌కు దిగారు. సీతాఫ‌ల్ మండి కార్యకర్తలు కూడా త‌మ‌కు అన్యాయం జ‌రిగిందంటూ ఆందోళ‌న‌కు దిగ‌డంతో పార్టీ నేత‌లు నచ్చ చెప్పారు. కొన్ని డివిజ‌న్ల‌ను బీజేపీకి కేటాయించ‌డంపైనా ప‌లువురు టీడీపీ కార్యకర్తలు నిర‌స‌నకు దిగారు.

తలనొప్పి...
ఎఎస్ రావ్‌ నగర్‌, చందానగర్‌, రామచంద్రాపురం, హైదర్‌నగర్‌, ఆల్విన్‌ కాలనీ, మోండా మార్కెట్‌ డివిజన్‌లకు అభ్యర్థుల ఎంపిక టీడీపీకి తలనొప్పిగా మారింది. ఇక్కడ ఆశావహుల మధ్య విపరీతమైన పోటీ ఉండడంతో... తొలుత ఆశావహులతో నామినేషన్‌లు వేయించి.. ఆ తర్వాత ఎంపిక చేసిన వారికి బీ-ఫాం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తానికి గతానుభవాల దృష్ట్యా, వలసలను నిలువరించేందుకు... ఇతర పార్టీల జాబితాలు వెలువడ్డాకే తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించాలన్న టీడీపీ వ్యూహం ఫలించిందనే చెప్పాలి. అయితే... పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తూ ఇప్పటికే నామినేషన్‌లు దాఖలు చేసిన వారిచేత ఉపసంహరింప చేయడం పార్టీ నేతలకు ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది. 

ఎంపీ తోటకు తప్పిన ప్రమాదం..

విశాఖపట్టణం : ఎంపీ తోట నరసింహంకు ప్రమాదం తప్పింది. నక్కపల్లి వద్ద లారీని తప్పించబోయి తోట నరిసింహం వాహనం డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదం నుండి తోట నర్సింహం క్షేమంగా బయటపడ్డారు.

 

దళిత విద్యార్థి రోహిత్ మృతి పట్ల తమ్మినేని సంతాపం..

హైదరాబాద్ : హెచ్ సీయూలో సస్పెన్షన్ కు గురైన దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ మృతిపట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సంతాపం తెలిపారు. రోహిత్ ను సస్పెన్షన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, స్మృతి ఇరానీల వత్తిడితోనే విద్యార్థులను బహిష్కరించారని విమర్శించారు. 

హెచ్ సీయూలో దళిత విద్యార్థి ఆత్మహత్య..

హైదరాబాద్ : హెచ్ సీయూలో సస్పెన్షన్ కు గురైన దళిత విద్యార్థి రోహిత్ వేములు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

20:53 - January 17, 2016

హైదరాబాద్ : హెచ్‌సియులో సస్పెన్స్‌కు గురైన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సస్పెన్షన్‌ను తట్టుకోలేక మనస్తాపంతో దళిత విద్యార్థి రోహిత్ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. దీనితో హెచ్‌సియులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రోహిత్ పీహెచ్ డీ చేస్తున్నాడు. దీనిపై ప్రొ.హరగోపాల్ టెన్ టివితో మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దిగ్ర్భాంతి కలిచివేసిందని, అతనికి ఆత్మవిశ్వాసం ఇవ్వకపోవడం పట్ల పాలన, బీజేపీ ప్రభుత్వం, విద్యార్థులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమాజం, బీజేపీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. కొంతకాలంగా నానుతూ వస్తోందని, ఇందులో చాలా సమస్యలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థ అని, పాలన విషయంలో జోక్యం చేసుకోవద్దని అభిప్రాయం వ్యక్తం చేశారు. లోకల్ మినిస్టర్ లేఖ రాశాడని..యూనివర్సిటీ అధికారులకు లేఖ వచ్చిందని అనంతరం విద్యార్థులను సస్పెండ్ చేశారని తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ సగం పాడు చేశారని అనంతరం బీజేపీ కలుషితం చేశారని విమర్శించారు. సంఘటన జరిగినప్పుడు కమిటీ వేయడం జరుగుతుందని, కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి ? దళిత విద్యార్థుల విషయంలో ఎలా పనిచేస్తున్నాయనే దానిపై దృష్టి ఉంటుందన్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయని, విద్యార్థుల మధ్య ఒక అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రొ.హరగోపాల్ పేర్కొన్నారు. 

విద్యార్థి సూసైడ్ : వీడియో https://youtu.be/000t2mpGAxQ

 

 

 

20:43 - January 17, 2016

విశాఖపట్టణం : సంక్రాంతి పండగను ముగించుకుని హైదరాబాద్‌లాంటి నగరాలకు తిరుగు ప్రయాణమవుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రద్దీకి తగ్గట్లు ఆర్టీసీ బస్సులు, రైళ్లు సరిపోని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ బస్సుల్లో భారీ స్థాయిలో ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే ప్రయాణికులకు ఏ ఆటంకమూ లేకుండా బస్‌ సర్వీసులు కేటాయిస్తున్నామని విశాఖ రీజనల్ డైరెక్టర్‌ రామకృష్ణ తెలిపారు.

20:39 - January 17, 2016

ప్రకాశం : ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఒక్కసారిగా బాంబు పేలుడంతో గ్రామస్తులంతా ఉలిక్కిపడ్డారు. ప్రజలంతా పండుగ హడావుడిలో ఉండగా నాటుబాంబులు పేలి పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో గ్రామమంతా దిగ్భ్రాంతికి గురైంది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం బచ్చలవారిపాలెం గ్రామంలో బాంబు పేలుడు సంఘటన ప్రజలను భయాందోళనకు గురిచేసింది. కనుమపండుగ సందర్భంగా ప్రజలంతా హడావుడిగా ఉన్న సమయంలో హటాత్తుగా గ్రామంలోని పోలేరమ్మగుడి వద్ద పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. దీంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

చీరాల ఏరియా ఆసుపత్రికి తరలింపు..
బాంబ్ పేలిన ఘటనలో గ్రామస్తులు నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సనిమిత్తం చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో తలారి శ్రీనివాస్, పాతనబోయిన శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. బాంబ్ పేలిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఈ ఘటనకు పాతకక్ష్యలే కారణం అయివుండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా స్థలిని పరిశీలించిన బాంబు స్క్వాడ్..
పోలీసుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని విస్పోటనం జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించింది బాంబ్ స్క్వాడ్ . ఘటనా స్థలంలో దొరికిన రెండు బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను శిక్షించాలని పోలీసులను ఆదేశించారు ఎమ్మెల్యే. పండుగనాడు బాంబ్ పేలుడు సంభవించడంతో గ్రామస్తులంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబ్ పేలుడు ఘటనకు కారకులైన వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. 

20:01 - January 17, 2016

హైదరాబాద్ : తనను టిడిపి పార్టీ పిచ్చికుక్కలాగా తిప్పుకుందని, టికెట్ విషయంలో పార్టీ తనను మోసం చేసిందని మల్లాపూర్ నుండి టికెట్ ఆశించిన ఆంజనేయులు పేర్కొన్నారు. స్థానికేతరుడికి టికెట్ కేటాయించారంటూ ఆంజనేయులు వర్గీయులు ఆందోళన చేశారు. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆంజనేయులు టెన్ టివితో మాట్లాడారు. తాను గతంలో ఇక్కడ కౌన్సిలర్ గా పనిచేయడం జరిగిందని, గ్రేటర్ ఎన్నికల సందర్భంగా గత నెల రోజులుగా టిడిపి పిచ్చికుక్కలాగా తనను తిప్పుకుందని తెలిపారు. టికెట్ ఇస్తే ఇస్తాను..ఇవ్వమని చెప్పాలని హైకమాండ్ కు చెప్పడం జరిగిందన్నారు. మల్లాపూర్ టికెట్ అమ్ముకున్నారని, స్థానికంగా ఉన్న సమస్యలు ఏమి తెలుసని ప్రశ్నించారు. ఎన్ని కాలనీలున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. 

టీఆర్ఎస్ ఐదో జాబితా..

హైదరాబాద్ : నామినేషన్ల గడువు ముగిసిన అనంతరం టీఆర్ఎస్ ఐదో జాబితా విడుదల చేసింది. బేగంబజార్ - రమేష్ కుమార్ బాంగ్, చిలుకానగర్ - గోపు సరస్వతి, నేరెడ్ మెట్ - శ్రీదేవి హనుమంతరావు, అడిక్ మెట్ - హేమలత జయరామ్ రెడ్డి లను అభ్యర్థులుగా ప్రకటించారు. 

2969 నామినేషన్ లు దాఖలు - జనార్దన్ రెడ్డి.

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 2969 నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు 1074 నామినేషన్లు దాఖలయ్యాయని, ఇవాల్టితో నామినేషన్ గడవు ముగిసిందన్నారు. టీఆర్ఎస్ 698, కాంగ్రెస్ 501, టిడిపి 506, బీఎస్పీ 82, ఎంఐఎం 61, లోక్ సత్తా 31, సీపీఎం 29, సీపీఐ 28, వైసీపీ 3 నామినేషన్ లు దాఖలు చేసినట్లు తెలిపారు. బి ఫామ్ లేనివారిని స్వతంత్ర్య అభ్యర్థులుగా పరిగణిస్తామన్నారు. నగరంలో భారీ ఫ్లెక్సీలను తొలగించినట్లు పేర్కొన్నారు.

 

గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు మృత్యువాత..

తూర్పుగోదావరి : పి.గన్నవరం (మం) పూళ్లలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఓ యువకుడి మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. పి.ప్రకాష్, సుమన్, ప్రమీళ అని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఎదుట ఆందోళనలు..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఎదుట ఉదయం నుండి నిరసన సెగలు తాకుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహం వద్ద మూసారాంబాగ్ డివిజన్ టిడిపి కార్యకర్తలు బైఠాయించారు. రేవంత్ రెడ్డి, మాగంటి గోపిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 

కాల్ మనీని ఉపేక్షించేది లేదు - బాబు…

విజయవాడ : కాల్ మనీని ఉపేక్షించేది లేదని, విజయవాడలో రౌడీయిజం అనే మాట వినపడకూడదన్నారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. రౌడీలను రాష్ట్రం నుండి తరిమేస్తామన్నారు. 

18:16 - January 17, 2016

ఒంగోలు : రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమమని వైసీపీ నేత సుబ్బారెడ్డి పేర్కొన్నారు. చెన్నైలో ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదో ఒక రకంగా భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి తిరుపతి ఎయిర్ పోర్టు అధికారులపై చేయి చేసుకుంటే సీసీ కెమెరాల ఫుటేజ్ లను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. 

17:59 - January 17, 2016

టీమిండియా యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ...ఈ పేరు ఇప్పడు ప్రపంచ క్రికెట్‌లో మార్మోగిపోతోంది.ఫార్మాట్‌ ఏదైనా...ఈ స్టైలిష్‌ బ్యాట్స్‌మెన్‌ ఫార్ములా ఒక్కటే...పరుగులు సాధించడం.డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ ప్లేయర్‌గా పేరున్న విరాట్‌ ....వన్డేల్లో రికార్డ్‌ల మోత మోగిస్తున్నాడు. మెల్‌బోర్న్‌ వన్డేతో.. ఇప్పటివరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని, అరుదైన రికార్డ్‌న కొహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో విరాట్‌ కొహ్లీ వీరవిహారంపై స్పెషల్‌ ఫోకస్‌... టీమిండియా యాంగ్రీ యంగ్‌ గన్‌ విరాట్‌ కొహ్లీ. క్రికెట్‌ ప్రపంచంలోనే ఇప్పుడు డిల్లీ డైనమైట్‌. కొహ్లీనే హాట్‌ టాపిక్‌.పాత రికార్డులు బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. మెల్‌బోర్న్‌ మ్యాచ్‌తో వన్డేల్లో ఇప్పటివరకూ ఏ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాని రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

మెల్ బోర్న్ లో అదరగొట్టిన కోహ్లీ..
ఫార్మాట్‌ ఏదైనా.....విరాట్‌ ఫార్ములా ఒక్కటే...పరుగులు సాధించడం.ఇక వన్డేల్లో విరాట్‌ ఏ స్థాయిలో చెలరేగుతాడో అందరికీ తెలిసిందే. ఫామ్‌లో ఉంటే చాలు స్కోర్‌ బోర్డ్‌ పరుగులు పెట్టాల్సిందే. అప్పటివరకు ఆడుతూనే ఉంటాడు...అంతలోపే సెంచరీ పూర్తయిపోతుంది. ఒక్కసారి క్రీజ్‌లో పాతుకపోయాడంటే చాలు జోరును టాప్ గేర్ కు పెంచేసి ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. అది విరాట్‌ స్పెషాలిటీ. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ విరాట్‌ దూకుడు కొనసాగుతోంది. తొలి వన్డేలో 91 పరుగులు, రెండో వన్డేలో 59 పరుగులతో సెంచరీ చేజార్చుకున్న కొహ్లీ....మెల్‌బోర్న్‌ వన్డేలో మాత్రం అదరగొట్టాడు.

రికార్డుల మీద రికార్డులు..
ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, రహానేలతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన విరాట్‌ జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశాడు. తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అలరించిన విరాట్‌ స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. కంగారూ బౌలర్లు రెచ్చగొడుతున్నా ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా క్రీజ్‌లో పాతుకుపోయాడు. వన్డేల్లో 24 సెంచరీలు పూర్తి చేసి ప్రపంచరికార్డ్‌ నమోదు చేశాడు. కేవలం 161 ఇన్నింగ్స్‌ల్లోనే 7వేల పరుగుల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. 166 ఇన్నింగ్స్‌ల్లో 7వేల పరుగుల మార్క్‌ దాటిన సఫారీ సూపర్‌ మ్యాన్‌ ఏబీ డివిలియర్స్‌ రికార్డ్‌ను విరాట్‌ బద్దలు కొట్టాడు. అంతే కాదు వన్డేల్లో అతితక్కువ వయసులోనే అత్యంత వేగంతా 24 సెంచరీలు నమోదు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కొహ్లీ రికార్డ్‌లకెక్కాడు.ఈ సెంచరీతో విరాట్‌...వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ లిస్ట్‌లో 5వ స్థానానికి చేరుకున్నాడు. 2008లో వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు.వన్డేల్లోకి వచ్చీ రావడంతోనే రికార్డులు సృష్టించాడు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ జట్టులో స్థానం పదిలం చేసుకొన్నాడు.

7098 పరుగులు..
ఇప్పటివరకు ఆడిన 173 వన్డేల్లో రికార్డ్‌ లెవల్లో 24 సెంచరీలు,36 హాఫ్‌ సెంచరీలతో 7098పరుగులు నమోదు చేశాడు. ఫ్యూచర్‌లో కూడా విరాట్‌ ఇదే జోరు కంటిన్యూ చేస్తే వన్డేల్లో ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ను మించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్లో సచిన్‌ టెండుల్కర్‌ సాధించిన రికార్డులను అధిగమించే సత్తా ఉన్న ఏకైక క్రికెటర్‌ విరాట్‌ ఒక్కడే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వన్డేల్లో సచిన్‌ రికార్డులను తిరగరాసే స్టామినా, అంతటి అవకాశం, వయసు ఉన్న ఏకైక బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కొహ్లీనే. మరి 27 ఏళ్ల విరాట్‌ కొహ్లీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

17:55 - January 17, 2016

మెల్ బోర్న్ : వన్డే సిరీస్‌లో తమ జట్టుకు ఏదీ కలిసి రాలేదని టీమిండియా కెప్టెన్‌ మహేందర్‌ సింగ్ ధోనీ చెప్పాడు. భారీ స్కోర్లు నమోదు చేసినా...ఓడిపోవడం దురదృష్టకరమని ధోనీ అభిప్రాయపడ్డాడు. కొహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన ధోనీ బౌలర్ల వైఫల్యమే సిరీస్‌ ఓటమికి కారణమని చెప్పాడు. మరోవైపు భారత్‌పై సిరీస్‌ విజయం సాధించడంతో కంగారూ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ గాల్లో తేలిపోతున్నాడు. భారత్‌ వంటి పటిష్టమైన జట్టుపై సాధించిన సిరీస్‌ విజయం ...తమ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని చెప్పాడు.సమిష్టికృషి కారణంగానే సిరీస్‌ విజయం సాధించగలిగామని....తమ జట్టు బ్యాట్స్‌మెన్‌ రాణించిన తీరు అద్భుతమని స్మిత్‌ అభిప్రాయపడ్డాడు.

 

17:53 - January 17, 2016

మెల్ బోర్న్ : భారత్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. మెల్‌బోర్న్‌ వేదికగా ముగిసిన మూడో వన్డేలోనూ సునాయాస విజయాన్ని నమోదు చేసి...సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ వన్డేలో 296 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీమ్‌...ఓపెనర్‌ షాన్‌ మార్ష్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేయడంతో పాటు డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో మరో 7 బంతులు మిగిలుండగానే విజయంసాధించింది.

శుభారంభం ఇచ్చిన ఆసీస్ ఓపెనర్లు..
ఓపెనర్లు ఫించ్‌, మార్ష్‌ శుభారంభాన్నివ్వగా...కెప్టెన్‌ స్మిత్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 215 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టును...మ్యాక్స్‌వెల్‌, జేమ్స్‌ ఫాక్నర్‌తో కలిసి ఆదుకున్నాడు. మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసిన భారత బౌలర్లు...ఆఖరి డెత్‌ ఓవర్లలో మరోసారి తేలిపోయారు.83 బంతుల్లో 3 సిక్స్‌లు 8 ఫోర్లతో 96 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ ఆస్ట్రేలియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 3 వికెట్లతో నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు మూడో వన్డేతో పాటు...మరో రెండు వన్డేలు మిగిలుండగానే సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంది.ధోనీ నాయకత్వంలో భారత జట్టు వన్డే సిరీస్‌ ఓడిపోవడం ఇది వరుసగా మూడో సారి కావడం విశేషం.

భారీ లక్ష్యం ఉంచినా..
మూడో వన్డేలో ధోనీ సేన మరోసారి ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్నుంచింది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ వన్డేలో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు...భారీ స్కోర్‌ నమోదు చేసింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ విఫలమైనా....డాషింగ్ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కొహ్లీ సెంచరీతో జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశాడు. ధావన్‌,రహానే హాఫ్‌ సెంచరీలు నమోదు చేయడంతో పాటు ఆఖర్లో ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 295 పరుగులు చేసింది. 117 బంతుల్లో 7 ఫోర్లు రెండు సిక్స్‌లతో 117 పరుగులు చేసిన విరాట్‌ కొహ్లీ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

మాక్స్ వెల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు..
మెల్‌బోర్న్‌ వన్డేలో ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్‌ ఆడి...జట్టులో కీలక పాత్ర పోషించిన గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.83 బంతుల్లో 3 సిక్స్‌లు 8 ఫోర్లతో 96 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌ ...ఫాక్నర్‌తో కలిసి కేవలం 63 బంతుల్లోనే 80 పరుగులు జోడించి ఆస్ట్రేలియా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన వన్డే కెరీర్‌లోనే ఈ ఇన్నింగ్స్‌ ఓ మైలురాయి అని మ్యాచ్‌ అనంతరం మ్యాక్స్‌వెల్‌ చెప్పాడు.

తెలుగు తమ్ముళ్ల కొట్లాట..

హైదరాబాద్: మల్లాపూర్ డివిజన్ లో తెలుగు తమ్ముళ్లు నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ఆంజనేయులు, లక్ష్మీనారాయణ వర్గీయులు ఘర్షణ పడ్డారు. 

కేజ్రీవాల్ పై యువతి ఆరోపణలు..

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్ పై ఇంకు చల్లిన యువతి పలు ఆరోపణలు గుప్పించింది. సీఎన్జీ విషయంలో పెద్ద స్కాం జరిగిందని, ఇందుకు సంబంధించిన సీడీ తనదగ్గర ఉందని పేర్కొంది. సరి బేసి విధానం సక్సెస్ అయ్యిందని ఆప్ నిర్వహించిన సభలో పాల్గొన్న సీఎం కేజ్రీవాల్ పై యువతి సిరా చల్లిన సంగతి తెలిసిందే. 

17:34 - January 17, 2016

ఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్‌పై ఓ యువతి సిరాతో దాడి చేసింది. దిల్లీలోని ఛత్రశాల స్టేడియంలో సరి-బేసి విధానం ప్రయోగాత్మక అమలు ముగిసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేజ్రీవాల్‌ ప్రసంగిస్తుండగా ఓ 20 ఏళ్ల యువతి అక్కడికి వచ్చి ఆయనపై సిరా చల్లింది. దీంతోపాటు కొన్ని కాగితాలను, సీడీలను ఆయనపై విసిరింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. సరి-బేసి వాహనాల వినియోగ విధానం విజయవంతం కావడంతో ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు కేజ్రీవాల్‌ ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

17:28 - January 17, 2016

హైదరాబాద్: మగ్ధూం భవన్ సీపీఐ సీనియర్ నేత బర్ధన్ సంతాప జరిగింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి నాయినీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, చాడ వెంకట్ రెడ్డిలు హాజరయ్యారు. టిడిపి నేత ఎల్.రమణ, సీపీఐ నేత నారాయణ, మంద కృష్ణ మాదిగ తదితరులు హాజరై నివాళులర్పించారు. అనునిత్యం పేదలు, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారని సురవరం పేర్కొన్నారు. బర్ధన్ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని తమ్మినేని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలన్నీ ప్రపంచీకరణ వైపు పయనిస్తున్నాయని, రాబోయే కాలంలో కమ్యూనిస్టుల ఐక్యత మరింత గరిష్ట స్థాయికి తీసుకెళ్లాలనే ముందున్న కర్తవ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. 

17:21 - January 17, 2016

హైదరాబాద్ : 'సొగ్గాడే చిన్ని నాయనా' చిత్రం ఘనవిజయం సాధించడం పట్ల చిత్ర హీరో నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. చిత్రం విడుదలై వరుసగా మూడు రోజులూ రూ.5 కోట్లు వసూలు చేసిందన్నారు. ఓవర్సీస్ లో 80 థియేటర్ లో రిలీజ్ చేయడం జరిగిందన్నారు. కడపలో రెండో రోజు రాత్రి 12.30 గంటలకు షోలు చేయడం జరిగిందని, ఆడవారి మాటలకు కాదనలేక చిత్రాన్ని ఆ టైంలో ప్రదర్శించడం జరిగిందన్నారు. రెండో వారంలో చిత్రం 600 థియేటర్ లకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా నమ్మకంగా ఉండడబట్టే ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ సీజన్ లోనే విడుదల చేయాలని చాలా మంది వత్తిడి తేవడం జరిగిందని, చిత్రం సక్సెస్ అవుతుందని అంత నమ్మకం ఉండడమే దీనికి కారణమన్నారు. ఇళ్లు ఇళ్లు కదిలి రావడం ఎప్పుడూ చూడలేదని డిస్ట్రిబ్యూటర్ పేర్కొంటున్నారని తెలిపారు. ఈ చిత్రం చూసిన తరువాత పంచెకట్టు ఫ్యాషన్ మొదలవుతుందని భావిస్తున్నట్లు, తాను నేను పంచెకట్టు కోవాలని అనుకుంటున్నట్లు నాగార్జున పేర్కొన్నారు. 

మొవ్వలో 3 రోజుల పసికందు మృతి..

కృష్ణా : మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 3 రోజుల పసికందు మృతి చెందింది. పోలియో చుక్కలు వికటించడం వల్లే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

రామారావు స్వస్థలం మచిలీపట్నం..

హైదరాబాద్ : రామరావు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1966లో తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మొత్తం నాలుగు సార్లు ఎమ్మెల్సీగా రామారావు పనిచేశారు. 

రామారావు మృతికి పలువురు సంతాపం..

హైదరాబాద్ : సిక్కిం మాజీ గవర్నర్ రామారావు మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సీఎం కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు జగన్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు సంతాపం వ్యక్తం చేశారు. 

ఆస్ట్రేలియా విన్..

మెల్ బోర్న్ : మూడో వన్డేలోనూ భారత్ పరాజయం పాలైంది. భారత్ నిర్ధేశించిన 295 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 48.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి సాధించింది. దీనితో సిరీస్ ను 3-0 తో ఆసీస్ సిరీస్ ను కైవసం చేసుకుంది. 

16:37 - January 17, 2016

వరంగల్ : జిల్లాలో ఆశ్రమ పాఠశాలల విద్యార్థినిల మృతులపై చాలా సందేహాలున్నాయని ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. విద్యార్థినిల మృతిలో ఆశ్రమ పాఠశాలల సిబ్బందిదే బాధ్యత ఉంటుందన్నారు. ఈ అంశంపై టెన్ టివితో ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడారు. జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని, తల్లిదండ్రులే తీసుకెళ్లడం..వదిలిపెట్టడం వంటి నిబంధనలు లేవన్నారు. వీరంతా సామాజిక, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, సంస్కృతి..సంప్రదాయం లేదన్నారు. పిల్లలను ఎవరైనా ట్రాప్ చేస్తున్నారా అనే సమాచారం లేదన్నారు. ఇటీవలే భూమిక, ప్రియాంక విద్యార్థినిల మృతిపై గిరిజన సంఘాలకు అనుమానాలున్నాయని, మళ్లీ హాస్టల్ కు రాలేదని వార్డు పేర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయంపై పలువురు అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. సరియైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. తల్లిదండ్రులపై కేసు నమోదు కాలేదని ఎస్ఐ పేర్కొనడం జరిగిందని, నల్లబెల్లి ఎస్ఐ సకాలంలో స్పందించి ఉంటే బాగుండేదన్నారు. అధికారులతో ఎంక్వయిరీ విచారణ చేపట్టాలని, ఈ ఘటనలపై తాను మౌనంగా ఉండడం కరెక్టు కాదన్నారు. హాస్టల్ నిర్వాహణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. 

16:32 - January 17, 2016

హైదరాబాద్ : దుమ్ముగూడెం ప్రాజెక్టు సమగ్ర ప్రణాళికపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ క్యాంపు నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి తుమ్మలతో పాటు ఇరిగేషన్ శాఖాధికారులు హాజరయ్యారు. గోదావరి నదిపై అన్నారం, సింగిల్ వద్ద ప్రాజెక్టులను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఖమ్మంలో రాజీవ్ నగర్, ఇంద్రాసాగర్ ప్రాజెక్టులను కలపాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 

బీజేపీ సీనియర్ నేత రామారావు కన్నుమూత..

హైదరాబాద్ : సిక్కిం మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత రామారావు (81) కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధ పడుతున్నారు. జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 

16:24 - January 17, 2016

గుంటూరు : సంక్రాంతి పండుగ వచ్చిదంటే ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు నరకం కనిపిస్తుంటుంది. బస్సులు..రైళ్లలో సీట్లు దొరక్క..కార్లలో ఇబ్బందులు పడుతూ వెళుతుంటారు. మూడు రోజుల పాటు సంతోషంగా గడిపిన వీరందరూ స్వస్థలాలకు పయనమౌతుంటారు. అప్పుడు కూడా వీరికి నరకం కనిపిస్తుంటుంది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజా వద్ద చాంతాడులా ఉన్న కార్లు కనిపిస్తుంటాయి. సీమాంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంత రాజధాని హైదరాబాద్ కు భారీగా ప్రజలు పయనమయ్యారు. దీనితో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై కార్లు భారీగా నిలిచిపోయాయి. నల్గొండ వద్దనున్న టోల్ ప్లాజా వద్ద కార్లు బారులు తీరి నిలిచిపోయాయి. టోల్ వసూలులో కొంత జాప్యం జరుగుతుండడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జాం..

విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

వెంకయ్య నివాసంలో సంక్రాంతి వేడుకలు..

ఢిల్లీ : కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నివాసంలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. 

ముగిసిన నామినేషన్ల పర్వం..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు టోకెన్లు తీసుకున్న వారందరికీ నామినేషన్ దాఖలు చేసేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. ఇవాళ భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలన సోమవారం జరగనుంది. ఈ నెల 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 2న ఎన్నికలు, 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

15:51 - January 17, 2016

మెల్ బోర్న్ : మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఎదుట భారత్ 296పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోహ్లీ 117 బంతుల్లో2 సిక్స్‌లు, 7 ఫోర్లతో 117 పరుగులు సాధించాడు. శిఖర్‌ధావన్‌ 68, రహనే 50 పరుగులతో రాణించారు. చివర్లో కెప్టెన్‌ ధోనీ 9 బంతుల్లో 23 పరుగులు సాధించడంతో భారత్‌ ఆ మాత్రం స్కోర్‌ చేయగలిగింది. ఆసీస్‌ బౌలర్లలో హాస్టింగ్‌ 4 వికెట్లు... రిచర్డ్‌సన్‌, ఫాల్క్‌నర్‌ చెరో వికెట్‌ తీశారు. ఇప్పటికే 2-0తో వెనకబడ్డ టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌పై ఆశలుంటాయి. 

ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్..

మెల్ బోర్న్ : ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. వాదే 6 పరుగులతో వెనుదిరిగాడు. అంతకుముందు మార్ష్ (17) కూడా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం మాక్స్ వెల్ 40, పాల్క్ నర్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 38.2 ఓవర్లలో 216 పరుగులు చేసింది. 

15:46 - January 17, 2016

అప్ఘనిస్తాన్ : జలాలాబాద్‌ నగరంలో ఆత్మాహుతి దాడి జరిగింది. అఫ్గాన్‌ నేత ఇంటి ముందు జరిగిన ఈ పేలుడులో 11 మంది మృతిచెందగా మరో 20మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. జలాలాబాద్‌లోని పాకిస్థాన్‌ దౌత్య కార్యాలయం ఎదుట ఆత్మాహుతి దాడి చోటుచేసుకున్న నాలుగు రోజుల అనంతరం ఇవాళ మరో పేలుడు సంభవించింది. దీంతో ఈ ప్రాంతంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

15:45 - January 17, 2016

అమెరికా : ఇరాన్ పై ఆంక్షలను అమెరికా సడలించింది. అణుకార్యక్రమాల నియంత్రణపై, జులై 14న కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఇరాన్‌ నిలుపుకోవడంతో.. అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన అమెరికా.. ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ తో సమావేశం అనంతరం.. అమెరికా మంత్రి జాన్ కెర్రీ ఈ ప్రకటన చేశారు. అయితే.. అమెరికా పౌరులు గానీ, అక్కడి కంపెనీలు కానీ.. ఇరాన్ తో ఎలాంటి సంబంధాలూ కొనసాగించరాదన్న ఆంక్షలు మాత్రం మరికొంత కాలం అలాగే ఉంటాయి. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం వల్ల.. భారత దేశానికి పరోక్షంగా మేలు చేకూరనుంది. ఇరాన్ నుంచి మన దేశానికి చమురు దిగుమతులపై ఉన్న ఆంక్షలూ తొలగిపోతాయి. దీంతో పాటు.. ఇరాన్‌తో వాణిజ్య, సహకార రంగాల్లో సంబంధాల కొనసాగింపునకూ భారత్‌కు అవకాశం ఏర్పడుతుంది. 

15:43 - January 17, 2016

విజయవాడ : తమ టార్గెట్ 2019 అని, ఆ సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యంగా తాము పనిచేయడం జరుగుతుందని టిడిపిలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో టిడిపి బలోపేతానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించకుండా నాయకత్వం అప్పగించిన బాధ్యతలను శిరసావహిస్తామన్నారు.పదవులు ఆశించి టిడిపిలోకి రాలేదని చెప్పుకొచ్చారు. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయడం జరుగుతుందని, ఇందుకు మూడు సంవత్సరాలు ఉపయోగించుకుంటామన్నారు. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు మీరు కలిసి ఏం చేస్తారని మీడియా ప్రశ్నించిందని, తమ టార్గెట్ 2019 అని ఆనం పేర్కొన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవని, ఇవన్నీ కూడా 2019లో వస్తున్నాయని, ఇప్పుడు పునాదులు గట్టిగా వేస్తేనే అప్పట్లో విజయం సాధించడం సులభమౌతుందన్నారు. 

15:37 - January 17, 2016

విజయవాడ : తాను ఉక్కు సంకల్పంతో ముందుకెళుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఆనం రామనారాయణరెడ్డి, వివేకానంద రెడ్డి అనచరులు రెండు వేల మంది కలిసి టిడిపిలో చేరారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో బాబు ప్రసంగించారు. భావి తరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలని వారికి సూచించారు. కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొంటే రాష్ట్రాభివృద్ది సాధ్యమని, కష్టసమయంలో రైతు రుణమాఫీ అమలు చేశామన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచ్చారు. రాష్ట్రం అభివృద్ది చేసేందుకు అందరం సహకరించుకుంటూ ముందుకెళుదామన్నారు. ఏపీలో ఆర్థిక అసమానతలు లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ వల్లే ఇంత ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.
తనకు నాయకులు..ప్రజల అవసరమని, రాష్ట్రంలో పట్టిసీమ అంటే ఇది రావొద్దంటూ ఉద్యమాలు చేశారన్నారు. అమరావతి రాజధాని కడుదామని రైతులకు పిలవడం జరిగిందన్నారు. 33వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతులు భూములిచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. 

15:32 - January 17, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు అధికారపక్షానికి చుక్కలు చూపిస్తున్నాయి. తమకు టికెట్ కేటాయించకపోవడం పట్ల పలువురు రోడ్డెక్కుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. ఇతరులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. హయత్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ లో అసమ్మతి జ్వాల ఎగిసిపడింది. రాత్రికి రాత్రి పార్టీలోకి వచ్చిన వారికి టికెట్లు ఎలా కేటాయిస్తారని, టికెట్లు అమ్ముకున్నారంటూ డివిజన్ నాయకులు రోడ్డెక్కారు. పార్టీ పుట్టినప్పటి నుండి జెండా మోసి లాఠీ దెబ్బలు తిన్నామని నేతలు వాపోయారు. తమ సేవలు మరిచి సీట్లు అమ్ముకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు వెన్నంటి ఉండే శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇవ్వాలని, లేదంటే డివిజన్ లో పార్టీని ఓడిస్తామని నేతలు హెచ్చరించారు. 

15:28 - January 17, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. ఆదివారంతో సమయం ముగుస్తుందనడంతో అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. పలువురితో భేటీలు జరుపుతూ మంతనాలు జరుపుతున్నారు. రహమత్ నగర్ డివిజన్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థి షఫీ బరిలో ఉన్నారు. ఆయన ఆదివారం స్థానిక నేతలతో షఫీ మంతనాలు జరిపారు. డివిజన్ సమస్యలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా షఫీ టెన్ టివితో ముచ్చటించారు. డివిజన్ లో పార్టీ పెద్ద ఎత్తున విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత పాలకులు ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని పేర్కొన్నారు. రహమత్ నగర్ లో పది సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్పొరేటర్ గా ఉన్నాడని, ఎలాంటి అభివృద్ధి చేయ లేదన్నారు. డ్రైనేజీ నీరు..ఇతర మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. శ్రీరాంనగర్ లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, హైటెన్షన్ వైర్లు ఇంటిపై నుండి వెళుతున్నాయన్నారు. గెలిచిన అనంతరం వాటర్, ఇతర మౌలిక సమస్యలను పరిష్కరిస్తానని షఫీ హామీనిచ్చారు. 

15:21 - January 17, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు..ఎలాగైనా డివిజన్ లో గెలవాలని..పీఠాన్ని కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచించారు. అభ్యర్థుల ప్రకటనలో చివరి వరకు రహస్యంగా ఉంచారు. దీనితో ఆయా పార్టీల నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికారపక్షమైన టీఆర్ఎస్ ముందుగానే జాబితాను ప్రకటించింది. చివరి రోజైన ఆదివారం మధ్యాహ్నం రెండు జాబితాలు విడుదల చేసింది. తామేమి తక్కువ కాదన్నట్లుగా టిడిపి, కాంగ్రెస్ లు వ్యహరించాయి. సమయం ముగుస్తుందనగా జాబితాను ప్రకటించారు. దీనితో అభ్యర్థులు నామినేషన్ లు వేయడానికి ఆఘమేఘాల మీద కార్యాలయాలకు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే తమకు టికెట్ రాలేదంటూ ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు రాజ్యమేలుతున్నాయి.

టిడిపిలో అసంతృప్తులు..
87 స్థానాల్లో టిడిపి 81 మందిని ఖరారు చేసింది. 63 శాతం బీసీలకు కేటాయించినట్లు ప్రకటించింది. కానీ మొదటి నుండి తాము పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నామని, ఎలాంటి క్యాడర్ లేని వారికి ఎలా సీట్లు కేటాయిస్తారంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రధానంగా టిడిపిలో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది. పొత్తులో భాగంగా బిజెపికి పలు సీట్లను టిడిపి కేటాయించింది. కానీ తమకు టికెట్ వస్తుందని ఆశించిన పలువురు నేతలు తీవ్ర నిరాశ నిస్రృపహలకు గురయ్యారు. యువతకు అవకాశం ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో ఇలా చేస్తారా అంటూ పలు డివిజన్ లకు చెందిన టిడిపి యువత పలు విమర్శలు గుప్పిస్తున్నారు.

టిపిసిసి ఉత్తమ్ పై ఫైర్..
తెలంగాణ కాంగ్రెస్ లో గ్రేటర్ చిచ్చు రగిలింది. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పై మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జీలు అసమ్మతి రాగం వినిపించారు. ఎన్నికల్లో తాము సూచించిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం లేదంటూ గుర్రుగా ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానానికి లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్ లు లేఖలు రాయనున్నారు. గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి టికెట్లు కేటాయించారంటూ మండి పడుతున్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుక సైతం నేతలు సిద్ధమౌతున్నట్లు సమాచారం. 
టీఆర్ఎస్ లో ...
టీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకొనడం ద్వారా పార్టీ బలోపేతానికి వ్యూహాలు రచించింది. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల సమయంలో పలువురికి టికెట్లు కేటాయించింది. దీనితో ఉద్యమంలో మొదటి నుండి పాల్గొన్న తమకు సీటు కేటాయించకుండా ఇతరకు సీట్లు ఎలా కేటాయిస్తారంటూ పలు డివిజన్ ప్రాంతాలకు చెందిన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. సీటు వస్తే నామినేషన్ ఉంటుంది..రానిపక్షంలో ఉపసంహరించుకోవచ్చన్న భావన అభ్యర్థుల్లో నెలకొంది. దీనితో భారీగా నామినేషన్ లు దాఖలు చేశాయి. 

15:00 - January 17, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు టిడిపిలో చిచ్చు రేపుతున్నాయి. పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుపై తెలుగు తమ్ముళ్లు కన్నెర్ర చేస్తున్నారు. ఎలాంటి క్యాడర్ లేని వారికి ఎలా సీట్లు కేటాయిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం టిడిపి జాబితా విడుదల చేసింది. దీనితో తమ పేర్లు లేవని మలక్ పేటకు చెందిన నేతలు ఆందోళన చేపట్టారు. మొదటి నుండి జెండా పట్టుకున్న వారికి న్యాయం జరగలేదన్నారు. గతంలో బూతులు తిట్టిన వారికి టికెట్ ఇచ్చారని, డబ్బులు తీసుకుని టికెట్ కేటాయిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాగంటి గోపి బ్రోకర్ గా చేస్తున్నాడని, డబ్బులకు అమ్ముకున్నాడని నేతలు ఆరోపించారు. 

14:39 - January 17, 2016

హైదరాబాద్ : కొద్దిసేపట్లో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని అనగా కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసింది. ఇందులో 49 మంది ఉన్నారు. మన్సూరాబాద్ - జె.ప్రభాకర్ రెడ్డి, బీఎన్ రెడ్డి నగర్ - సుమన్ గౌడ్, వనస్థలిపురం - పి.మహేష్ యాదవ్, హస్తినాపురం – ప్రవలిక, చంపాపేట - నల్ల రఘురామరెడ్డి, లింగోజిగూడ – రాజశేఖరరెడ్డి, గడ్డి అన్నారం - తులసి శ్రీనివాస్, సరూర్ నగర్ - నీరజ, ఆర్కేపురం - దీప సురేఖ భాస్కర్ రెడ్డి, కొత్తపేట - లింగాల రాహుల్ గౌడ్, ఓల్డ్ మలక్ పేట - అఫ్రిన్ జాఫ్రి, అక్బర్ బాగ్ - వినోద్ కుమార్, జంగంపేట అవాద్ అఫ్రి, సులేమానగర్ - మహముద బేగం, సహస్త్ర్రిపురం - జైపాల్, మైలార్ దేవులపల్లి - శ్రీనివాసగౌడ్, రాజేంద్రనగర్ - దివ్యబాతుల, అత్తాపూర్ - బండారి రూపలున్నారు. 

14:38 - January 17, 2016

వరంగల్ : గూడూరు ఆశ్రమపాఠశాల నుంచి అదృశ్యమైన బాలిక కవిత ఆచూకి లభ్యమైంది. ఐనవోలు జాతర సమీపంలోని గర్నెపల్లి గ్రామంలోని ఆమె స్నేహితురాలి ఇంట్లో కవిత ప్రత్యక్షమైంది. అయితే బాలిక మిస్సింగ్‌ కేసులో తండ్రి రవిని పోలీసులు విచారించారు. పోలీసులు విచారణతో మనస్తాపానికి గురైన తండ్రి రవి చర్ల తండాలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జరిగిన రెండ్రోజులకు కవిత ఆచూకి లభ్యమైంది. పోలీసులు కవితను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

14:37 - January 17, 2016

హైదరాబాద్ : సైదాబాద్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ కార్యక్రమానికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. సైదాబాద్‌ డివిజన్‌ను ఖచ్చితంగా గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని బూర నర్సయ్యగౌడ్‌ తెలిపారు. 

14:35 - January 17, 2016

హైదరాబాద్ : ఇంగ్లాండ్‌లో రేపటినుంచి నాలుగు రోజులపాటు జరగనున్న వరల్డ్‌ ఎడ్యుకేషన్ ఫోరం సమావేశానికి హాజరవుతున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ సమావేశంలో ప్రపంచంలోని అన్ని దేశాల్లో అమలవుతున్న విద్యావిధానాలపై సమీక్ష జరుగుతుందన్నారు. దీనివల్ల రాష్ట్రానికి మెరుగైన విద్యా విధానాలు చేపట్టేందుకు అవకాశముందంటున్నారు కడియం. 

14:33 - January 17, 2016

నెల్లూరు : ఆనం సోదరులు టిడిపి లో చేశారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో టిడిపి జాతీయ ఆధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... ఆనం సోదరులకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వాంచారు. ఈ సందర్భంగా ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెస్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజనపాపం కాంగ్రెస్‌దేనన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. 

14:32 - January 17, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నామినేషన్ పత్రాల దాఖలకు సమయం ముగిస్తుందనగా టిడిపి జాబితా విడుదల చేసింది. బిజెపితో పొత్తులో భాగంగా వచ్చిన 87 స్థానాల్లో 81 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 63 శాతం సీట్లను బీసీలకు కేటాయించినట్లు పార్టీ ప్రకటించింది. 

ఆశ్రమ విద్యార్థిని ఆచూకి లభ్యం..

వరంగల్ : గూడూరు ఆశ్రమ పాఠశాల నుండి అదృశ్యమైన కవిత బాలిక ఆచూకి లభ్యమైంది. వర్ధన్నపేట ఐనవోలు జాతర లో కవిత ఉన్నట్లు గుర్తించారు. దీనితో పోలీసులు కవితను విచారిస్తున్నారు. 

గ్రేటర్ కాంగ్రెస్ రెండో జాబితా..

హైదరాబాద్ : కొద్దిసేపట్లో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని అనగా కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసింది. ఇందులో 49 మంది ఉన్నారు.

ఆస్ట్రేలియా 78/1..

మెల్ బోర్న్ : ఇండియాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో మొదటి వికెట్ కోల్పోయింది. యాదవ్ బౌలింగ్ లో ఫించ్ (21) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 12 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. మార్ష్ 32, స్మిత్ 22 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 295 పరుగులు చేసింది. 

గ్రేటర్ ఎన్నికలు..టిడిపి జాబితా విడుదల..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ దాఖలుకు చివరి రోజైన నేడు మధ్యాహ్నం టిడిపి జాబితా విడుదల చేసింది.

దుమ్ముగూడెం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : దుమ్ముగూడెం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ శాఖాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు రీ డిజైన్ ను ప్రభుత్వం ఆమోదించనుంది. 

ఫిబ్రవరి మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు - వెంకయ్య..

ఢిల్లీ : ఫిబ్రవరి మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ను వెంకయ్య కలిశారు. ప్రధానిని కలిసిన అనంతరం తేదీలను ఖరారు చేయడం జరుగుతుందన్నారు.

 

మగ్ధూం భవన్ లో ఏబీ బర్ధన్ సంతాప సభ..

హైదరాబాద్ : మగ్ధూం భవన్ లో ఏబీ బర్ధన్ సంతాప సభ జరిగింది. హోం మంత్రి నాయినీ, బండారు దత్తాత్రేయ, జానారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, చాడ వెంకట్ రెడ్డిలు హాజరయ్యారు. ఎల్.రమణ, సీపీఐ నేత నారాయణ, మంద కృష్ణ మాదిగ తదితరులు హాజరయ్యారు.

అల్వాల్ లో 134 డివిజన్ బరిలో రెబల్ అభ్యర్థి..

హైదరాబాద్ : అల్వాల్ 134వ డివిజన్ నుండి టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా తోట సుజాతరెడ్డి నామినేషన్ వేశారు. శనివారం టీఆర్ఎస్ తరపున చింతల విజయశాంతి రెడ్డి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. 

13:33 - January 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రేటర్‌ చిచ్చు రగిలింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు అసమ్మతి రాగం వినిపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తాము సూచించిన వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానికి లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్‌, శ్రీధర్‌ లేఖ రాయనున్నారు. గత ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికే టిక్కెట్లు కేటాయించారంటూ మండిపడుతున్నారు. మరో వైపు కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు పలువురు కాంగ్రెస్‌ నేతలు సిద్ధమయ్యారు.

13:31 - January 17, 2016

హైదరాబాద్ : తాను పార్టీకి చేసిన సేవకు గుర్తింపుగా సుభాష్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ టికెట్‌ను తన శ్రీమతికి కేటాయించినందుకు కేసీఆర్‌కు రాజేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వెనకబడిన డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి శాంతిశ్రీ అంటున్నారు. 

13:30 - January 17, 2016

హైదరాబాద్ : నామినేషన్ తుది గడువు ముంచుకొస్తుండటంతో.. టీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేయడంలో తలమునకలుగా ఉంది. 50 మంది అభ్యర్థులతో ఉదయం మూడో జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్ ఎన్నికల కమిటీ.. మరో 15 మంది పేర్లతో నాల్గో జాబితా విడుల చేసింది. మరో ఏడు స్థాలాలు పెడింగ్ లో ఉన్నాయి. మొత్తం 143 మంది అభ్యర్థులను ప్రకటించినట్లైంది.

డివిజన్ అభ్యర్థి పేరు

సరూర్ నగర్

అనంత దయాకర్ రెడ్డి

నల్ల కుంట

గోరిగంటి శ్రీదేవి

అంబర్ పేట్

పులి జగన్

మైలార్ దేవ్ పల్లి

తోకల శ్రీశైల్ రెడ్డి

బీఎన్ రెడ్డి నగర్

లక్ష్మీప్రసన్న గౌడ్

వనస్థలి పురం

జిట్టా రాజశేఖర్ రెడ్డి

నాగోల్

సంగీత ప్రశాంత్ గౌడ్

హస్తినాపురం

పద్మానాయక్

చంపాపేట్

సామ రమణారెడ్డి

లింగోజీగూడ

ముద్ర బోయిన శ్రీనివాస్ రావు

కొత్త పేట

జీవీ సాగర్ రెడ్డి

గడ్డి అన్నారం

ప్రవీణ్ ముదిరాజ్

బాగ్ అంబర్ పేట్

పద్మావతి డీపీ రెడ్డి

బేగంపేట్

తరుణీ రాయ్

హఫీజ్ పేట్

పూజితా జగదీష్ గౌడ్

మెహిదీపట్నం

చింతల అశోక్

ఆసిఫ్ నగర్

లక్ష్మమ్మ

విజయనగర్ కాలనీ

చంద్రకళ

హమ్మద్ నగర్

అస్మతున్నీస

రెడ్ హిల్స్

మార్గం సరిత

మల్లేపల్లి

సంతోషి

అత్తా పూర్

రావుల విజయజంగయ్య

మల్కాజ్ గిరి

ఎన్ జగదీష్ గౌడ్

మెట్టుగూడ

పీఎస్ భార్గవి

సీతాఫల్ మండి

సామల హేమ

జూబ్లీ హిల్స్

కాజా సూర్యనారాయణ

బార్కాస్

ఎన్ సరిత

లలిత్ బాగ్

రాఘవేంద్ర రాజ్

కాంచన్ బాగ్ 

ఎల్లం అంజమ్మ బాలరాజు

ఫతేనగర్

సతీష్ గౌడ్

కార్వాన్

చిన్న నరేందర్

గోల్కొండ

అర్షియా ఖాన్

నానల్ నగర్

షేక్ అబ్దుల్ అజీం

టౌలీ చౌకీ

సులక్షణ

హిమాయత్ నగర్

ఇందిరా ప్రభాకర్ రెడ్డి

గాజుల రామారం

రావుల శేషగిరి

రంగారెడ్డి నగర్

విజయ్ శేఖర్ గౌడ

చింతల్

రహీదా బేగం

సుభాష్ నగర్

దేవగిరి శాంతి శ్రీ

సూరారం

మంత్రి సత్యనారాయణ

హయత్ నగర్

సామతిరుమల్ రెడ్డి

దత్తాత్రేయ నగర్ 

అఖిల్ అహ్మద్

ఆల్విన్ కాలనీ 

వెంకటేశ్ గౌడ్

కూకట్ పల్లి

జూపల్లి సత్యానారాయణరావు

ఓల్డ్ బోయిన్ పల్లి 

నర్సింహయాదవ్

హైదర్ నగర్

జానకీ రామరాజు

మియాపూర్

మేక రమేష్

మూసాపేట్

తూము శ్రవణ్ కుమార్

అక్బర్ బాగ్

తేళ్ల మహేశ్ కుమార్

బాలాజీ నగర్

హరీష్ రెడ్డి

షేక్ పేట్

చెరకు మహేష్

జగద్గిరి గుట్ట

శేఖర్ యాదవ్

మచ్చబొల్లారం

జితేంద్రనాథ్

వెంకటాపురం

సబితా అనిల్

ఈస్ట్ ఆనంద్ బాగ్

ఆకుల నర్సింగరావు

వినాయక్ నగర్

పుష్పలతా రెడ్డి

గౌతం నగర్

శిరీష జితేంద్ర రెడ్డి

మౌలాలి

ఫాతిమా అమినుద్దీన్

గోషామహల్ 

ముఖేష్ సింగ్

మంగల్ హాట్

పరమేశ్వరి సింగ్

జాంబాగ్

ఆనంద్ గౌడ్

గన్ ఫౌండ్రీ

మమతా గుప్తా

వివేకానందనగర్ కాలనీ

మాధవరం స్వాతి
13:29 - January 17, 2016

రంగారెడ్డి : మణికొండలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు 7 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. సార్వత్రిక వ్యాధి నిర్మూలన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. 

13:28 - January 17, 2016

హైదరాబాద్ : జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ పల్స్‌ పోనియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా వ్యాప్తంగా మూడు రోజులు పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. వైద్యారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని చెప్పారు. 

13:26 - January 17, 2016

హైదరాబాద్ : శ్రీమంతుడు సినిమా తర్వాత మహేశ్‌ బాబు గ్రామాలను దత్తత తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని రెండు గ్రామాలను ఎంపిక చేసుకుని.. వాటిని అన్ని విధాల అభివృద్ధి చేయాలనుకున్నారు. వీటిలో మహబూబ్‌నగర్‌ జిల్లా సిద్ధాపూర్‌ కూడా ఉంది. ఈగ్రామాన్ని దత్తత తీసుకుని ఐదు నెలలు కావస్తోంది. మహేశ్‌ బాబు రాక కోసం గ్రామస్థులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా... ఇంతవరకు రాకపోవడంతో వారిలో ఒకింత నిరాశ కనిపిస్తోంది.

నలుగురికి ఆదర్శంగా నిలవాలనుకున్నా....

కోటీశ్వరుడి కుమారడైన్నటికీ.. సిటీని విడిచిపెట్టి... సొంతూరు వచ్చి అభివృద్ధి చేస్తాడు హీరో. శ్రీమంతుడు సినిమాలో మహేష్‌బాబు పాత్ర ఇది. తన ఆదర్శం సినిమా పాత్రకే పరిమితం కాకూడదనుకున్నారు మన మహేశ్‌ బాబు. నిజజీవితంలో కూడా వెనుకుబడ్డ గ్రామాలను అభివృద్ధి చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాలనుకున్నారు ఆరడుగుల అందగాడు.

తన ఆదర్శాన్ని అమలు చేసేందుకు....

తన ఆదర్శాన్ని అమలు చేసేందుకు వెనుకబడిన మహబూబ్‌నగర్‌ను ఎంపిక చేసుకున్నారు. కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్‌ను దత్తత తీసుకుంటున్నట్టు ట్వీట్‌ చేశారు. దీంతో ఊరి ప్రజల ఆనందానికి అవధులేకుండా పోయాయి. వెండితెర రాకుమారుడుని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలుగుతుందని భావించారు. గ్రామానికి వచ్చినప్పుడు సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని భావించారు. ఊరు అభివృద్ధి చెందుతుందని ఆశించారు. కానీ దత్తత తీసుకున్న తర్వాత మహేష్‌బాబు ఇంతవరకు సిద్ధాపూర్‌ రాకపోవడంతో ప్రజల్లో ఒకింత నిరాశ కనిపిస్తోంది.

హైదరాబాద్‌కు 36 కి.మీ. దూరంలో ఉన్న సిద్ధాపూర్‌ .....

మహేశ్‌బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్‌ గ్రామం హైదరాబాద్‌కు కేవలం 36 కి.మీ. దూరంలోనే ఉంది. మొత్తం 720 కుటుంబాలు ఉంటున్నాయి. జనాభా 3,004 మంది. ఎస్టీలు-1120 మందికాగా, ఎస్సీలు-453 మంది ఉన్నారు. ఇతరులు 1431. సిద్ధాపూర్‌ పంచాయతీ పరిధిలో ఏన్గుమడుగు తండా, చింతగట్టు తండా, కొడిచర్లకుంట తండాలున్నాయి. సిద్ధాపూర్‌తోపాటు, తండాల్లో సీసీ రోడ్లు లేవు. ప్రాథమిక, ప్రాథమికోన్నతి, ఉన్నత పాఠశాలున్నా... అవి శిథాలవస్థకు చేరుకున్నాయి. మొత్తం 280 మంది విద్యార్ధులున్నా.. వీరికి సరిపడ తరగతి గదులులేవు. బాలికలకు మరుగుదొడ్ల సౌకర్యంలేదు. వైద్యశాల, పశువైద్యశాల శూన్యం. ముగురునీరు రోడ్లపైనే ప్రవహిస్తుంది. నల్లానీటి సౌకర్యంలేకపోవడంతో ఊరికి ఆమడదూరంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ దగ్గరకు వెళ్లి మంచినీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. మహేష్‌బాబు దత్తత తీసుకోవడంతో ఈ సమస్యలన్నీ తీరతాయని భావిస్తే.. చివరికి నిరాశే మిగిలిందని నిట్టూరుస్తున్నారు.

శివారు తండాలను అభివృద్ధి చేయాలి....

సిద్ధాపూర్‌తోపాటు, పంచాయతీ పరిధిలోని తండాల్లో వ్యవసాయాధార కుటుంబాలే ఎక్కువ. భూమిలేని నిరుపేదలు ఉపాధి కోసం పొట్టచేతపట్టుకుని హైదరాబాద్‌, షాద్‌నగర్‌కు వలసపోయి ఫ్యాక్టరీల్లో పని చేస్తున్నారు. మహేష్‌బాబు ఇప్పటికైనా సిద్ధాపూర్‌తోపాటు, శివారు తండాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. దత్తత తీసుకున్నగ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు మహేశ్‌బాబు ముందుకొస్తే అన్ని విధాల సహకరిస్తామని సిద్ధాపూర్‌ సర్పంచ్‌ జంగయ్య చెబుతున్నారు. జిల్లాలోని కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న నటుడు ప్రకాష్‌రాజ్‌... ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. మహేశ్‌బాబు కూడా సిద్ధాపూర్‌లో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

 

గ్రేటర్ కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు

హైదరాబాద్ : గ్రేటర్ కాంగ్రెస్ లో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. పీసీసీ తీరుపై మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, బిక్షపతి, ఇన్ ఛార్జ్ లు లక్ష్మారెడ్డి, శ్రీధర్ మండిపడుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్పొరేట్ టికెట్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాసేపట్లో ఉత్తమ్ ను కలిసి రాజీనామా లేఖలు ఇస్తామని హెచ్చరించారు.

జలాలాబాద్ ఆత్మాహుతి దాడి :11 మంది మృతి

హైదరాబాద్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్ సిటీలో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో 11 మంది మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆత్మాహుతి దాడితో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 13న జలాలాబాద్‌లోని పాకిస్థాన్ కాన్సులేట్ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు సంభవించిన విషయం విదితమే. ఈ ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందారు. ఆప్ఘనిస్థాన్‌లో 15 రోజుల వ్యవధిలో ఇది మూడో ఉగ్రదాడి.

బిజెపి నేత రామారావుకు అస్వస్థత...

హైదరాబాద్ : బిజెపి సీనియర్‌నేత, సిక్కిం మాజీ గవర్నర్‌ వి.రామారావు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు అయన్ను జూబ్లీహిల్స్‌ని అపోలో ఆసుపత్రికి తరలించారు.

పలమనేరు హైవేవద్ద ఆర్టీసీ బస్సు-సుమో ఢీ...

చిత్తూరు :పలమనేరు దగ్గర హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-సుమో ఢీ కొనడంతో సుమో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సు డ్రైవర్‌ సహా 10 మంది ప్రయాణికులకు తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకోసం స్థానికులు తరలించారు.

ఆసీస్ లక్ష్యం 296 పరుగుల..

హైదరాబాద్ : మూడో వన్డేలో కూడా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 295/6 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 296 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం గెలుస్తేనే సీరీస్ పోటీలో నిలుస్తుంది.

12:42 - January 17, 2016

ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి విమర్శకునిగా, ప్రముఖ కవిగా వెలుగొందిన అద్దేపల్లి రామ్మోహన్ రావు ఇటీవలే కన్ను మూశారు. తన 80ఏళ్ల జీవితంలో సుమారు 55 ఏళ్లు రచనలు చేసి ఎందరో కవులను, రచయితలను ప్రభావితం చేశారు. తన పాఠలతో… గజల్స్ గానంతో సాహితీ వేదికలను ఉర్రూతలూగించిన ఆయన గళం మూగబోయింది. అందరినీ ప్రేమించే అరుదైన వ్యక్తి, స్నేహశీలి, ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు అద్దేపల్లి రామ్మోహన్ మృతి తెలుగు సాహితీ రంగానికి తీరని లోటు ఆ మహా మనిషికి, సాహితీ సౌజన్య మూర్తికి నివాళులర్పిస్తూ 'టెన్ టివి' లో వస్తున్న 'అక్షరం' కార్యక్రమంలో ప్రత్యేక కథనం. మరి ఆ కథనాన్ని మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

12:32 - January 17, 2016

ప్రకాశం : వేటపాలెం మండలం బచ్చులవారిపాలెం గ్రామంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు. గ్రామంలోని పోలేరమ్మ గుడి దగ్గర ఈ పేలుడు సంభవించింది. భారీ శబ్ధం రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.

12:31 - January 17, 2016

చిత్తూరు : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని నేతలు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా గాజులమన్యం హైవేపై వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేశారు. 

12:30 - January 17, 2016

చిత్తూరు : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని నెల్లూరు సబ్‌జైలుకు తరలించారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ అధికారిపై దాడి కేసులో నిన్న చెన్నైలో మిథున్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీకాళహస్తి మెజిస్ట్రేట్‌ ముందు ప్రవేశపెట్టగా మిథున్‌రెడ్డికి 14 రోజుల కస్టడీ విధించారు.

12:27 - January 17, 2016

విజయవాడ : 2014 తర్వాత దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదుకాలేదని ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. వియజవాడలో ఆయన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ప్రపంచలో పోలియో నిర్మూలనలో మన దేశమే ముందు ఉందని చెప్పారు. ఆరోగ్యరంగంలో ఇది పెద్ద విజయమన్నారు. 

12:25 - January 17, 2016

హైదరాబాద్ : తనకు అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు రంగారెడ్డినగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్ధి విజయ్‌ శేఖర్‌గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తాను అనేక సమస్యలను పరిష్కరించానని.. మళ్లీ అధికారంలోకి వస్తే డివిజన్‌ను ఇంకా అభివృద్ధి చేస్తానంటున్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాంటున్న విజయ్‌ శేఖర్‌గౌడ్‌ స్పష్టం చేశారు..

సెంచరీ చేసిన కోహ్లీ....

హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో చెలరేగాడు. 105 బంతుల్లో విరాట్‌ కోహ్లి 100 పరుగులు చేసి వన్డే కెరీర్‌లో 24వ శతకం పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కి ధావన్‌తో కలిసి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లి.. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రహానెతో మూడో వికెట్‌కి శతక భాగస్వామ్యంతో అజేయంగా కొనసాగుతున్నాడు. దీంతో భారత్‌ 44 ఓవర్లు ముగిసే సమయానికి 241 పరుగులతో కొనసాగుతోంది.

ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా ఆందోళనలు..

చిత్తూరు :ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా గాజుల మన్యం హైవేపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన బాట పట్టారు. ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.

మెల్ బోర్న్ లో భారత్ దూకుడు

హైదరాబాద్ : మెల్ బోర్న్‌లో భారత్ దూకుడుగా ఆడుతుంది. భారత్ 40 ఓవర్లలో 207/2 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 100 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 92 పరుగులు పూర్తి చేశాడు. మరో ఎండ్‌లో అజింకా రహానే 43 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు.

11:20 - January 17, 2016

హైదరాబాద్‌: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ షూటింగ్‌లో గాయపడ్డారు. అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో హృతిక్‌, పూజా హెగ్డే జంటగా ‘మొహెంజోదారో’ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా హృతిక్‌ ఎడమ కాలికి ప్రమాదవశాత్తు గాయమైంది. కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

నరసరావుపేట ఎమ్మెల్యేపై కేసు నమోదు...

గుంటూరు : నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదయింది. తమ భూముల్లో రోడ్లు వేస్తున్నారంటూ ఈ నెల 11వ తేదీన రామిరెడ్డిపాలెం గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గ్రామస్తులకు మద్దతుగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

టిఆర్ ఎస్ గ్రేటర్ నాలుగో జాబితా విడుదల...

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ నాలుగో జాబితాను విడుదల చేసింది. 150 డివిజన్లకు నాలుగు జాబితాలుగా అభ్యర్థులను పేర్లను టీఆర్‌ఎస్ వెల్లడించింది. తొలి జాబితాలో 60 మంది, రెండో జాబితాలో 20 మంది, మూడో జాబితాలో 48 మంది, నాలుగో జాబితాలో 22 మంది పేర్లను ప్రకటించింది. ఇక నామినేషన్ల దాఖలు సమయం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది.

పోలియో రహిత రాష్ట్రంగా తెలంగాణ : రాజీవ్ శర్మ...

హైదరాబాద్ : తెలంగాణను పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగించేందుకు ఓ ఉద్యమంలా అవగాహన కల్పిస్తున్నామనిరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. హైదరాబాద్‌ బేగంపేట కుందన్‌బాగ్‌లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని సీఎస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2007 తర్వాత తెలంగాణలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. ఇదే పరిస్థితిని కొనసాగించేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 44లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే లక్ష్యంతో 27వేల కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఎస్‌ చెప్పారు.

రెండో వికెట్ కోల్పోయిన భారత్

హైదరాబాద్ : భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 134 పరుగుల వద్ద ధావన్ (65) పరుగులు చేసి ఔటయ్యాడు. మెల్‌బోర్న్ వన్డేలో విరాట్ కోహ్లీ, శిఖర్‌ధావన్ ఇరువురు అర్థసెంచరీలు పూర్తిచేశారు.  

గుంటూరులో గ్యాంగ్ రేప్ :పోలీసు హస్తం...

గుంటూరు: నగరంలో శనివారం అర్థరాత్రి ఓ మహిళపై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. మహిళకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాని ఘటనలో ఓ కానిస్టేబుల్‌ పాత్ర ఉన్నట్టు సమాచారం ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

రూ.14 కోట్ల బంగారం స్వాధీనం...

చిత్తూరు : పరమనేరు సమీపంలోని కేటిల్‌ఫామ్ వద్ద ఉన్న అంత ర్రాష్ట్ర వాణిజ్యపన్నుల చెక్‌పోస్టు వద్ద ఆదివారం ఉదయం రూ.14 కోట్ల విలువైన బంగారంను పట్టుకున్నారు. ఈ సందర్భంగా కారు డ్రైవర్‌ను అరెస్ట్‌చేశారు. బెంగుళూరు నుంచి చిత్తూరువైపు వెళుతున్న కారును ఆపి తనిఖీ చేయగా అందులో 14 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను కనుగొన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి బిల్లులు లేవు. ఈనేపథ్యంలో ఆ జిల్లా ఏస్పీ మీడియా సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించనున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ అధికారులు తెలియజేశారు.

10:49 - January 17, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ మూడో జాబితా విడుదల చేసింది. ఇప్పటికే 80 మంది పేర్లను ప్రకటించిన టీఆర్‌ఎస్.. ఈరోజు మరో 48 మంది పేర్లను ప్రకటించింది. 150 డివిజన్లకు గానూ 128 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడి అయ్యాయి. మరి కాసేపట్లో మిగతా అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది.

10:47 - January 17, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. అగ్రిగోల్డ్‌ పరివార్‌ పరస్పర సహకార క్రెడిట్‌ సొసైటీ పేరుతో వందకు నాలుగు రూపాయలు వడ్డీ ఇస్తామని డిపాజిట్‌దారుల నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అసలు, వడ్డీ చెల్లించాలని బాధితులు ఆందోళన చేపట్టారు. దీంతో బాధితులు సహకారశాఖకు ఫిర్యాదు చేశారు. అగ్రిగోల్డ్‌ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 19 నుంచి విచారణకు సిద్ధమని సహకార శాఖ తెలిపింది. దీంతో సీఐడీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. 

10:44 - January 17, 2016

హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో సంచలనం రేకెత్తించిన ట్రిపుల్‌ మర్డర్‌ కేసులో 8 మంది నిందితులను గుంటూరు అర్బన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే ఈ హత్యలకు పాతకక్షలే కారణమని అనుమానిస్తున్నారు. ఈ హత్యలో నిందితులంతా 20 ఏళ్ల లోపు యువకులు కావడం విశేషం. 

బీజేపీ, టీడీపీ అభ్యర్థుల వివరాలు కాసేపట్లో వెల్లడి!

హైదరాబాద్ : ఫిరాయింపుల భయంతో టీడీపీ అభ్యర్థుల జాబితాను గోప్యంగా ఉంచుతోంది. ప్రస్తుతానికి అభ్యర్థుల జాబితా విడుదల లేనట్టేనని తెలుస్తోంది. టీడీపీ నియోజకవర్గ పరిశీలకులకు బీఫాంలు అప్పగించింది. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు అభ్యర్థుల జాబితా వెల్లడిచేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ ఏయే స్థానాల్లో పోటీ చేసే వివరాలు కాసేపట్లో వెల్లడి చేయనున్నట్లు సమాచారం.

10:42 - January 17, 2016

చిత్తూరు : ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా తిరుపతిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గాజులమన్యం హైవేపై రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలు పాల్గొన్నారు. 

ఏపీ స్థానికతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

విజయవాడ :ఏపీ స్థానికతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానికతపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖను కేంద్రం పరిశీలించింది. 2017 జూన్ లోపు ఏపీకి వచ్చే ఉద్యోగులకు స్థానికత ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వారితో పాటు ఇతరులు కూడా 2017 జూన్ లోపు ఏపీకి వస్తేనే స్థానికత ఉంటుందని కేంద్రం తెలిపింది. నివేదికను పరిశీలించిన కేంద్రం న్యాయశాఖ ఆమోదముద్ర కోసం పంపింది.

 

10:30 - January 17, 2016

విజయవాడ : ఆనం సోదరులు నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆనం బ్రదర్స్‌తో పాటు.. భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు టీడీపీలో చేరబోతున్నారు. ఇందుకోసం నెల్లూరు నుంచి విజయవాడకు ప్రత్యేక రైల్లో ఆనం అనుచరులు బయల్దేరారు. 

10:26 - January 17, 2016

శ్రీకాకుళం : రాజాం మండలం పొగిరి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జి.సిగడాం మండల కేంద్రంలో జరిగిన జాతరలో తమను పోలీసులు అకారణంగా కొట్టారంటూ పొగిరి గ్రామస్తులు ఆందోళన చేపట్టి.. పోలీసులను నిర్బంధించారు. అయితే నిర్బంధంలో ఉన్న పోలీసులను విడిపించేందుకు వచ్చిన మరో పోలీసు జీపు అద్దాలను యువకులు ధ్వంసం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ గ్రామ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని వదిలివేసి.. తమపై పోలీసులు దాడికి దిగడం దారుణమని పొగిరి గ్రామస్తులంటున్నారు. 

09:31 - January 17, 2016

చిత్తూరు : చెన్నైలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌ రాజశేఖర్‌పై తన అనుచరులతో కలిసి దాడి చేసిన ఘటనలో మిథున్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం శ్రీకాళహస్తి పీఎస్‌కు తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. మిథున్‌రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. మిథున్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్‌ విధించారు. ఎలాంటి ఆందోళనలు తలెత్తకుండా జిల్లాలో 144 సెక్షన్‌ విధించారు. ఇక ముందస్తుగా పలువురు కార్యకర్తలను అరెస్ట్‌ చేయడంతో పాటు.. ఆరుగురు ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. 

ట్రిపుల్ మర్డర్ కేసులో 5గురు అరెస్ట్....

గుంటూరు : ట్రిపుల్ మర్డర్ కేసులో గుంటూరు అర్బన్ పోలీసులు 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

అగ్రిగోల్డ్ సంస్థ మరో మోసం బట్టబయలు...

విజయవాడ : అగ్రిగోల్డ్ సంస్థ మరో మోసం బయటపడింది. అగ్రిగోల్డ్ పరివార్ పరస్పర సహకార క్రెడిట్ సొసైటీ పేరుతో రూ.100లకు రూ. 4వడ్డీ ఇస్తామని రూ. 500 కోట్లు సేకరించింది. అసలు, వడ్డీ చెల్లించాలని డిపాజట్ దారులు ఆందోళన చేపట్టారు. అంతే కాక సహకరా శాఖకు బాధితులు ఫిర్యాదు చేయగా ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. అంతే కాక 19 నుంచి సహకార శాఖ విచారణకు సిద్ధం అయ్యింది. మరో వైపు సీఐడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు.

తొలి వికెట్ కోల్పోయిన భారత్

హైదరాబాద్ : మెల్ బోర్న్ లో జరుగుతున్న భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగుల వద్ద రోహిత్ శర్మ(6) ఔటయ్యాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

మెల్ బోర్న్ :భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

నేటి నుంచి వ్యవసాయరంగం పై జాతీయ సదస్సు

ఢిల్లీ : నేటి నుంచి వ్యవసాయ రంగంపై జాతీయ సదస్సు జరగనుంది. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో రెండు రోజుల సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు పాల్గొననున్నారు. వ్యవసాయ రంగ సమస్యలపై సదస్సులో చర్చించనున్నారు.

నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న ఆనం అనుచరులు

హైదరాబాద్ : నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలు ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి అనుచరులు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఇవాళ తెదేపాలో చేరనున్నారు. ఆదివారం ఉదయం దాదాపు 2వేల మంది ఆనం అనుచరులు నెల్లూరు రైల్వేస్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో విజయవాడ బయలుదేరారు. ఆనం అనుచరుల చేరిక సందర్భంగా విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌సెంట్‌లో తెదేపా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు ముఖ్యనేతలు బహిరంగసభలో పాల్గొనున్నారు.

కొలిక్కి వచ్చిన టిడిపి అభ్యర్థుల జాబితా

హైదరాబాద్ : టిడిపి అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. తెల్లవారుజామున 5 గంటల వరకు జాబితాపై లోకేష్, ఎల్ రమణ, మల్లారెడ్డి తదితర సీనియర్ నేతలు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఫైనల్ జాబితాను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపిన నేతలు… ఆయన ఆమోదం అనంతరం జాబితాను విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

07:44 - January 17, 2016

కర్నూలు : ఆదోలోని వీబీఎస్‌ ఆయిల్‌ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. మిల్లులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారుగా రూ. 50 లక్షల ఆస్థినష్టం వాటిల్లినట్లు ప్రాథమిక సమాచారం...

07:27 - January 17, 2016

చిత్తూరు : తిరుపతి విమానాశ్రయం మేనేజర్ పై దాడి కేసులో కడప జిల్లా రాజంపేట ఎంపి మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అర్థరాత్రి చెన్నై విమానాశ్రయంలో మిథున్ రెడ్డితో పాటు మరో నిందితుడు మధుసూధన్ రెడ్డిని విమానశ్రయ అధికారులు అదుపులోకి తీసుకుని తిరుపతి పోలీసులకు అప్పగించారు. నిందితులను శ్రీకాళహస్తి జ్యుడిషీయల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. అంతక ముందు శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రిలో వైద్య చికిత్సలు చేశారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ఆరుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

07:10 - January 17, 2016

హైదరాబాద్ : సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా రూపొందిన ‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతి కానుకగా విడుదలై అభిమానులను ఆకట్టుకుంటూ విజయపథంలో దూసుకెళ్తొంది. ఈ చిత్రంలో సినిమా చివరన వినిపించే ‘నాన్నకు ప్రేమతో’.. గీతం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడమే కాదు థియేటర్‌ నుంచి బయటికి వచ్చినా ఆ అనుభూతిని వెంట తీసుకెళ్లేలా చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో శనివారం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రాజేంద్ర ప్రసాద్‌, సుకుమార్‌, దేవిశ్రీప్రసాద్‌, విజయ్‌చక్రవర్తి, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ పాల్గొని మాట్లాడారు.

నేడు పోలియో చుక్కల మందు పంపిణీ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కల మందును పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 27 వేల కేంద్రాల్లో పోలియో చుక్కల మందు వేయనున్నారు. ఆయా కేంద్రాలకు చిన్నారులను తీసుకెళ్లి పోలియో చుక్కలు చేయించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సమాచారం తెలియక మందు వేయించనివారికోసం సోమ, మంగళవారాల్లో ఆరోగ్య సిబ్బందే ఇంటింటికి రానున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లోని చిన్నారుల కోసం బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

07:01 - January 17, 2016

ఢిల్లీ : స్టార్ట్-అప్ ఇండియాను కేంద్రం లాంఛనంగా ప్రారంభించింది. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చి దిద్దడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. నూతన ఆవిష్కరణలే ధ్యేయంగా స్టార్ట్‌అప్‌కు కేంద్రం రూపకల్పన చేసింది.

స్టార్ట్-అప్ ఇండియాను ప్రారంభించిన ప్రధాని.......

యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన స్టార్ట్-అప్ ఇండియాను ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రారంభించారు.

నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడమే స్టార్ట్‌అప్ ధ్యేయం.....

నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించడమే ప్రధాన ధ్యేయంగా స్టార్ట్‌ అప్‌ను ప్రారంభించడం జరిగిందని ప్రధాని అన్నారు. స్టార్టప్‌ అంటే మిలియన్‌, బిలియన్‌ డాలర్ల పెట్టుబడి కాదని.. ఐదుగురికి ఉపాధి కల్పించినా స్టార్ట్‌ అప్‌కు సార్థకత చేకూరినట్టేనని మోది పేర్కొన్నారు. ఉద్యోగం కోసం పాకులాడుతున్న యువతలో మానసిక పరివర్తన తీసుకు రావలసిన అవసరం ఉందన్నారు. ఉద్యోగం కోసం వెతకడం కాదు.. యువతను ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే స్టార్ట్‌ అప్‌ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు.

ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే స్టార్ట్‌అప్‌ లక్ష్యం....

యువత ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు.. ఎన్నో కలలు కంటున్నారు.. వాటిని సాకారం చేసే మార్గం వారికి లభించడం లేదని మోదీ అన్నారు. స్టార్టప్‌ ఇండియా.. కొత్త ఆలోచనలు చేసి ఉద్యోగాలు సృష్టించే యువత కోసమేనని పేర్కొన్నారు. డబ్బు కోసం పనిచేయాలనుకునేవారు సక్సెస్‌ కాలేరని, ఏదో ఒకటి ఆవిష్కరించాలన్న తపన ఉన్నవారికి డబ్బు దానంతట అదే వస్తుందన్నారు. స్టార్టప్‌ కార్యక్రమం బ్యాంక్‌ బాలెన్స్‌, డబ్బుతో ముడిపడి లేదని, సామాన్య మానవులకు మేలు చేకూర్చడమే దీని ప్రధాన ఉద్దేశమని ప్రధాని తెలిపారు. టెక్నాలజీ కొందరికే పరిమితం కాకూడదని, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య ధనవంతులకే లభిస్తోందని, ఇది సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న పేద పిల్లలకు కూడా లభించాలని ప్రధాని ఆకాంక్షించారు.

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు....

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టింది. స్టార్టప్‌ కోసం సింగిల్‌ విండో వ్యవస్థ ఏర్పాటు, మూడేళ్ల వరకు అధికారుల పర్యవేక్షణ ఉండదు. పెటెంట్‌ ఫీజులో 80 శాతం రాయితీ కల్పించారు. అలాగే మూడేళ్ల వరకు ఇన్‌కం టాక్స్‌ అడగరు. మహిళల కోసం స్టార్టప్‌ మరిన్ని ప్రోత్సాహకాలిచ్చింది. 

06:57 - January 17, 2016

విజయవాడ : శాండ్‌ మాఫియాకు చెక్‌ పెట్టేందుకు ఏపీ సర్కార్‌ కొత్త ఇసుక విధానం తీసుకురానుంది. పారదర్శకతకు పెద్దపీట వేసే విధంగా ఇసుక వేలంకు ఆన్‌లైన్‌లోనే బిడ్లు స్వీకరించాలని నిర్ణయించింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఉన్న అన్ని రీచ్‌లను వచ్చే నెల 1 లోగా ప్రభుత్వానికి అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అక్రమాలకు తావులేకుండా అధునాత టెక్నాలజీలతో....

ప్రస్తుతం అమల్లో ఉన్న ఇసుక తవ్వకాల విధానం మాఫియాకు ఆలవాలంగా మారడంతో దీనిలో సమూల మార్పు చేయాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. అక్రమాలకు తావులేకుండా అధునాత టెక్నాలజీలతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టేందుకు కొత్త విధానం తీసుకురానుంది. ఇసుక తవ్వకాల నుంచి రవాణ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని నిర్ణయించింది.

మహిళా సంఘాల ముసుగులో మాఫియా .....

ఇసుకతవ్వకాల్లో అక్రమాలను అరికట్టే ఉద్దేశంతో మహిళా సంఘాలకు అప్పగించినప్పటికీ మహిళల ముసుగులో మాఫియానే అంతా నిర్వహించింది. ఇసుకాసురులతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. అక్రమాలపై కోర్టులు కూడా ప్రభుత్వానికి అక్షింతలు వేయడంతో కొత్త విధానం తీసుకొస్తోంది. క్యూబిక్‌ మీటర్‌ ఇసుక తవ్వకానికి 550 రూపాయలుగా ధర నిర్ణయించింది. అదేవిధంగా విక్రయం కూడా ఇదే రేటుకు విక్రయించేందుకు ముందుకు వచ్చే వారే వేలంలో పాల్గొలన్న నిబంధన విధించింది. వేలంలో కోసం జిల్లా జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. ఇసుకు ర్యాంపులు పొందినవారు తవ్వకాలకు యంత్రాలను వాడకూడదు. ప్రాజెక్ట్‌లు, ఆనకట్టలకు 500 మీటర్ల లోపు ఇసుక తవ్వకూడదన్న నిబంధన విధించింది. వీటిని అతిక్రమిస్తే భారీ జరిమానా విధిస్తారు.

సాగునీటి ప్రాజెక్ట్‌లు, రోడ్ల, బలహీన వర్గాల గృహాలు, మరుగుదొడ్లు....

రోజురోజుకు ఇసుక అవసరాలు పెరుగుతున్న తరుణంలో... ఏడాది పొడవునా ఇసుక అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని సర్కార్‌ నిర్ణయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సాగునీటి ప్రాజెక్ట్‌లు, రోడ్ల, బలహీనవర్గాల గృహలు, మరుగుదొడ్ల నిర్మాణ పథకాలను సాధారణ ధరకే ఇసుక విక్రయించాలన్న నిబంధను కొత్త విధానంలో చేర్చాలని ప్రతిపాదించారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు, మంచినీటి వనరలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను కాంట్రాక్టర్లపై ఉంచింది. ఏపీ ప్రభుత్వం తీసురానున్న కొత్త విధానంతో ఇసుక మాఫియా అరాచకాలు ఎంతవరకు అదుపులోకి వస్తాయో చూడాలి. 

06:54 - January 17, 2016

గుంటూరు : క్షణికావేశంలో అయినవారినే హత్య చేయిస్తున్న సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చిన్నచిన్న వివాదాలే చినికిచినికి గాలివానలా మారి విలువైన ప్రాణాలను హరించివేస్తున్నాయి. ఇదే కోణంలో గుంటూరు నగర శివారులో ముగ్గురు హత్యకు గురయ్యారు. ఆ ముగ్గురినీ తామే చంపామంటూ ఆరుగురు నిందితులు సినీ ఫక్కీలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే హత్యలకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

ఒకరికొకరు బాగా తెలిసినవారే. .....

ముగ్గురు యువకులు.. ఒకరికొకరు బాగా తెలిసినవారే. మంచి స్నేహితుల్లాగే మసులుతున్నవారే. అంతలో ఏమైందో చివరికిలా హత్యకు గురయ్యారు. ఎక్కడో చంపి ఇలా పొలాల్లో తెచ్చి పడేశారు. గుంటూరు రూరల్ మండలం లింగాయపాలెం పంటపొలాల్లో యువకుల మృతదేహాలు పడిఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారమందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల ఆనవాళ్ళ అధారంగా గుంటూరు నగరంలోని ఎటి అగ్రహారం ప్రాంతానికి చెందిన వారిగా నిర్ధారించారు. వారిలో ఒకరు హోంగార్డు కుమారుడు బాలు కాగా, మరో ఇద్దరిని రాజేష్, రాములుగా గుర్తించారు.

శుక్రవారం రాత్రి నుంచి ఈ ముగ్గురూ కనబడకుండా....

శుక్రవారం రాత్రి నుంచి ఈ ముగ్గురూ కనబడకుండా పోయారు. మద్యం మత్తులో స్నేహితుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణే ఈ ముగ్గురి హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మొహం, తల భాగాలపైనే ఎక్కువగా గాయాలు కనిపిస్తున్నాయి. వేరే చోట ఎక్కడో హత్యచేసి లింగాయపాలెం వద్ద మృతదేహాలను వదిలి వెళ్లుంటారని నిర్థారణకు వచ్చారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మిత్రులు ఫుల్‌గా మద్యం సేవించి మిగిలినవారితో గొడవ పడుంటారని ఆ కోణంలోనే హత్యకు గురై ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రేమ, డబ్బు వ్యవహారాలపరంగానూ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

06:51 - January 17, 2016

హైదరాబాద్ : తెలంగాణా ఉద్యమంతో ప్రజల్లోకి వెళ్లిన గులాబి పార్టీ.. అధికార పార్టీగా అవతరించడంతో ఆధునీకరణ వైపు అడుగులు వేస్తోంది. పార్టీ సభ్యత్వాల నుంచి పార్టీ కార్యక్రమాల నిర్వహణ వరకు కొత్త అడుగులు వేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది.

సోషల్‌ మీడియా ద్వారా విద్యావంతులు, యువతను ఆకట్టుకునే యత్నం.........

ఉప ఎన్నికల్లో ఏకపక్షంగా విజయాలు దక్కించుకున్నా.. గ్రేటర్‌లో అంత సులువు కాదన్న అభిప్రాయం పార్టీలో ఉంది. దీంతో విజయం కోసం పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గ్రేటర్ పరిధిలో విద్యావంతులను, యువతను చేర్చుకునేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని నిర్ణయించింది. ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. వాట్సప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ఎప్పటికప్పుడు కొత్త నినాదాలను పోస్టు చేస్తూ.. సాంకేతికతను పూర్తిగా అందిపుచ్చుకుంటోంది. ఇందుకోసం టీఆర్‌ఎస్‌ భవన్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశారు.

-సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనే అంశాన్ని పరిశీలిస్తున్న నేతలు.........

ఇక గ్రేటర్‌ ఎన్నికల్లో ఈ-ప్రచారం చేసేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. కేసీఆర్ రోడ్ షోలు, బహిరంగ సభలతో పాటు ఈ-సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనే అంశాన్ని సీనియర్ నేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటివరకు కేసీఆర్‌ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే గ్రేటర్ ప్రజలతో ముఖాముఖి అయ్యేందుకు మాత్రం ముఖ్యమంత్రి ఈ-సభలను ఎంచుకునే అవకాశం ఉందని పార్టీ నేతలంటున్నారు. గత ఎన్నికల్లో ఆధునిక విధానాలతో పార్టీ ప్రచార సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినా... అవి క్షేత్ర స్థాయిలో అంత విజయవంతం కాలేదు. దీంతో ప్రత్యక్షంగానే సీఎం ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. మరి ఇప్పుడైనా ఈ-ప్రచారం ఎంతవరకు సఫలీకృతమవుతుందో చూడాలి. 

06:48 - January 17, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ల కేటాయింపు కొత్త తంటాలకు వేదికైంది. టిక్కెట్లు దక్కని వాళ్లు రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారు. కష్టపడిన వారికి టిక్కెట్లు ఇవ్వరా..? అంటూ నాయకత్వంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మరోవైపు క్యాడర్‌ను కంట్రోల్‌ చేసేందుకు కారు పార్టీ ఆపసోపాలు పడుతోంది. ఎక్కడ రెబెల్స్ కొంప ముంచుతారోనని...గులాబీ శ్రేణులు గుబులు పడుతున్నాయి.

గ్రేటర్‌లో గులాబీ దళానికి కొత్త భయం....

గ్రేటర్‌లో గులాబీ దళానికి కొత్త భయం పట్టుకుంది. అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అధికార పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. సీట్లు ఆశించి భంగపడ్డ గల్లీ లీడర్లు దడపుట్టిస్తున్నారు. కొందరైతే బహిరంగంగానే అధిష్టాన పెద్దలపై విమర్శలు చేస్తున్నారు. మరికొందరు నామినేషన్లతో రెబెల్స్‌గా మారుతున్నారు.

అల్వాల్‌, కేపీహెచ్‌బీల్లో గులాబీ రెబెల్స్ నామినేషన్లు....

అల్వాల్‌, కేపీహెచ్‌బీల్లో గులాబీ రెబెల్స్ నామినేషన్లు వేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ సీటు ఆశిస్తున్న టీఆర్ఎస్ నేత వెంకటేశ్‌ గౌడ్‌... ఆ డివిజన్ ఇంఛార్జ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఇంటిని ముట్టడించారు. తనకు న్యాయం చేయాలంటూ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు.

ఇక కాప్రాలోనూ ఇదే సీన్‌....

ఇక కాప్రాలోనూ ఇదే సీన్‌. తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ తమను కాదని... అనర్హులకు టిక్కెట్లు కేటాయించారంటూ ఆందోళన బాట పట్టారు. కాప్రా సర్కిల్‌ టిఆర్ ఎస్ అధ్యక్షుడు బాలరాజు ఇంటిని, తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారిని స్థానిక కార్యకర్తలు ముట్టడించారు. డబ్బులకు ఆశపడి అనర్హులకు టిక్కెట్లు ఇచ్చారని... కాప్రా నాయకులు షేర్‌ మణెమ్మ ఆరోపించారు.

డ్యామేజ్‌ను కంట్రోల్‌ చేసేందుకు గులాబీ పెద్దలు నానా తంటాలు....

మరోవైపు డ్యామేజ్‌ను కంట్రోల్‌ చేసేందుకు గులాబీ పెద్దలు నానా తంటాలు పడుతున్నారు. ఇంటిపోరును చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. అసంతృప్తులను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే క్యాడర్‌లో నిరుత్సాహం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మరి అసమ్మతి జ్వాలలను ఎలా చల్లబరుస్తారో చూడాలి.

06:44 - January 17, 2016

హైదరాబాద్ : వరుస సమావేశాలు... మంతనాల మీద మంతనాలు... కేంద్రమంత్రుల సిఫార్సులతో ఎట్టకేలకు టిడిపి, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. అయితే అభ్యర్థుల లిస్టుపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది.

ఆశావహులు బీఫాం దక్కుతుందనే ఆశతో నామినేషన్లు....

అటు బీజేపీలోనూ, ఇటు టీడీపీలోనూ టికెట్ల కోసం ఎందరో కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఎలాగైనా బల్దియా బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు. అధిష్టాన పెద్దల ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆశావహులు బీఫాం దక్కుతుందనే ఆశతో నామినేషన్లు వేసేశారు. వారిలో బీఫాం దక్కనున్న వారికి అధిష్టానం ఫోన్ల ద్వారా తెలియజేసినట్లు సమాచారం.

లోకల్ లీడర్ల గుండెల్లో గుబులు.....

మరోవైపు సీట్ల సర్దుబాటు లోకల్ లీడర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గతంలో టీడీపీ గెలుపొందిన స్థానాలను... బీజేపీకి కేటాయించారనే వార్తలతో... అసంతృప్తుల నిరసనలు మొదలయ్యాయి. టీడీపీ బలంగా ఉన్న డివిజన్లను బీజేపీకి ఎలా కేటాయిస్తారని అప్పుడే అమీర్‌పేట్‌, జూబ్లీ హిల్స్‌ టీడీపీ డివిజన్‌ నేతలు రోడ్డెక్కారు. జూబ్లీ హిల్స్‌ డివిజన్‌ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు తన స్థానాన్ని బీజేపీకి కేటాయించడంపై అసంతృప్తిని వెళ్లగక్కారు. బీజేపీ ఎమ్మెల్యే చింతల టీఆర్‌ఎస్‌ గెలుపుకోసం కుట్ర పన్నారని ఆరోపించారు. అమీర్‌ పేట్‌ డివిజన్‌లో సైతం అసంతృప్తులు రోడ్డెక్కారు. సిట్టింగ్‌ స్థానాన్ని బీజేపీకి ఎలా కేటాయిస్తారని టీడీపీ డివిజన్‌ అధ్యక్షురాలు అనంజిత్‌ కౌర్‌ నిలదీశారు.

బీజేపీ - టీడీపీల సీట్ల సర్దుబాటు కొత్త తలనొప్పులు....

మెత్తానికి బీజేపీ - టీడీపీల సీట్ల సర్దుబాటు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. గతంలో హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ అభ్యర్థిని గెలిపించిన బాటలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని కూటమి ప్రయత్నిస్తున్నప్పటికీ అసంతృప్తుల గండం మాత్రం కలవరపెడుతోంది.  

06:41 - January 17, 2016

హైదరాబాద్ : ఎట్టకేలకు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-బీజేపీ మధ్య సీట్ల ఒప్పందం ఫైనలైంది. సీట్ల ఒప్పందాన్ని ఖరారు చేయడానికి అమీర్‌పేట ఆదిత్య పార్క్‌ హోటల్‌లో టీటీడీపీ-బీజేపీ నేతలు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. సమావేశ అనంతరం ఇరు పార్టీల నాయకులు వివరాలు వెల్లడించారు. టీడీపీ-87, బీజేపీ-63 డివిజన్లలో పోటీ చేస్తాయని ఆ పార్టీల నేతలు వివరించారు. మొదట టిడిపి 90 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది. చివరి టైంలో భారతీనగర్, ఐఎస్‌ సదన్, గోషామహల్‌ స్థానాలను తమకు కేటాయించాలని బిజెపి పట్టుబట్టడంతో అందుకు టిటిడిపి సమ్మతించింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ వందకు పైగా స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా పనిజేస్తామన్నారు. సిఎం కెసిఆర్ చెప్పే కల్లబొల్లి కబుర్లు వినేంత అమాయకులు ఎవరూ లేరని టిడిపి నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇక ఏయే డివిజన్‌లలో ఎవరెవరు బరిలో దిగుతారనేది మరికాసేపట్లో వెల్లడిస్తారు. 

06:40 - January 17, 2016

హైదరాబాద్ : డప్పుళ్ల మోతలు, తీన్మార్ స్టెప్పులు... భారీ ర్యాలీలు, ఊరేగింపులు... జెండాల రెపరెపలు, కార్యకర్తల హంగామా... బల్దియాలో ఎటుచూసినా ఇదే సందడి కనిపిస్తోంది. నామినేషన్ల కోలాహలం కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. నేటితో నామినేషన్ల ప్రక్రియకు... తెరపడనుండటంతో రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి.గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నాయి.

కొనసాగుతున్న నామినేషన్ల పర్వం....

గ్రేటర్‌ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ రెండు విడతల్లో 80 మంది అభ్యర్ధులను, కాంగ్రెస్‌ 45 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించడంతో నామినేషన్ల పర్వం కోలాహలంగా జరిగింది. అన్ని డివిజన్లలో అభ్యర్ధులందరూ భారీ ఊరేగింపుతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో సీట్లు దక్కని అభ్యర్ధులు సైతం ఇండిపెండెంట్‌గా బరిలో నిలుస్తున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్దులు సైతం....

కాంగ్రెస్‌ అభ్యర్దులు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు భారీ ఊరేగింపులతో నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో గెలిచిన అభ్యర్ధులే పోటీకి దిగుతుండడంతో.. తమ బలగాలతో వచ్చి నామినేషన్లు వేశారు. ఇక టీడీపీ-బీజేపీ పొత్తుతో సీటు రాదని ముందే తెలిసిన ఆశావహులు.. టీడీపీ, బీజేపీల నుంచి అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. ఇదిలావుంటే.. ఎన్నోఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్నా.. సీటు దక్కని అభ్యర్ధులు.. రెబల్స్‌గా రంగంలోకి దిగి పోటీకి సై అంటున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో 50 శాతం సీట్లు మహిళలకే కేటాయించడంతో.. ఇక హంగామా అంతా వారి భర్తలదే నడుస్తోంది. ఇక సీట్లు రాని వారు బంధువర్గం తరపున నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇప్పటివరకు మొత్తం నామినేషన్లు 1097 నమోదు...

ఇప్పటివరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 1097కు చేరింది. ఇందులో టీఆర్‌ఎస్‌-277, కాంగ్రెస్‌-200, టీడీపీ-181, బీజేపీ-93, ఎంఐఎం-27, సీపీఐ-14, లోక్‌సత్తా-12, సీపీఎం-8, స్వతంత్ర అభ్యర్ధులు 249 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక గ్రేటర్‌లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌. ఎట్టకేలకు గ్రేటర్‌లో ఓటర్ల లెక్కతేలింది. మొత్తం 74 లక్షల 23 వేల 980 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో 39 లక్షల 69 వేల ఏడు మంది పురుషులు,.. 34 లక్షల 53 వేల 910 మంది మహిళా ఓటర్లు.. ఒక వెయ్యి 63 మంది ఇతరులు ఉన్నారు. ఇక నామినేషన్ల దాఖలుకు ఆదివారం చివరిరోజు కావడంతో నామినేషన్ల పర్వం భారీగా కొనసాగనుంది. ఆదివారం అయినప్పటికీ.. అధికారులు ఖచ్చితంగా విధులకు హాజరుకావాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

51 హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు...

హైదరాబాద్ : బంజరాహిల్స్‌లోని హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. 51 హుక్కా సెంటర్లపై వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్వంలో ఈ దాడులు చేపట్టారు. 120 మంది యువతి, యువకులను అదుపులోకి తీసుకున్నారు. 13 హుక్కా సెంటర్లను సీజ్‌ చేశారు.

ఆదోని విబీఎస్ ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం

కర్నూలు :ఆదోని విబీఎస్ ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనళకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎంపి మిథున్ రెడ్డి అరెస్ట్

చిత్తూరు :రేణిగుంట ఎయిర్ పోర్ట్ మేనేజర్ పై ఎంపి మిథున్ రెడ్డి దాడి ఘటనలో అర్థరాత్రి చెన్నై ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 8న తన అనుచరులతో వచ్చి ఎయిర్ పోర్ట్ మేనేజర్ రాజశేఖర్ పై దాడి చేసినట్లు కేసు నమోదు అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగా… ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Don't Miss