Activities calendar

18 January 2016

ప్రభుత్వ ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ ఇళ్లు..

హైదరాబాద్ : రాజీవ్ స్వగృహ ఇళ్ల కేటాయింపుపై ఉద్యోగ సంఘాలతో సీఎస్ రాజీవ్ శర్మ సమావేశమయ్యారు. ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ప్రభుత్వం ధరలను నిర్ణయించనుంది. వార్షిక ఆదాయం రూ. 6 లక్షల కన్నా తక్కువగా ఉన్న ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ ఇళ్ల కేటాయింపు ఉంటుందన్నారు. 600 చదరపు అడుగల లోపు ఉన్న ప్లాట్లను కేంద్ర ప్రభుత్వ స్కీం కింద ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 600 చ. అడుగుల కంటే ఎక్కువ ఉన్న మరో 6 వేల ప్లాట్లకు ధరలు నిర్ణయించి ఉద్యోగులకు ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

మోడీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీలపై దాడులు పెరిగాయి - పునియా..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీలపై దాడులు పెరిగాయని, మద్రాసు ఐఐటీలో కూడా ఇలాంటి ఘటనలు కూడా జరిగాయని జాతీయ ఎస్పీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ పునియా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. వారిపై వెంటనే విచారణ చేపట్టాలని, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారం, దాడులు జరిగినప్పుడు బాధితుల పక్షాన ఆర్ఎస్ఎస్ ఉండడం లేదని పేర్కొన్నారు. 

రోహిత్ ఆత్మహత్యకు నా లేఖకు సంబంధం లేదు - దత్తాత్రేయ..

హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు తాను రాసిన లేఖకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్య వెనుక కేంద్రమంత్రుల ప్రమేయం ఉందని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో దత్తాత్రేయ స్పందించారు. యూనివర్సిటీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని తనకు విజ్ఞాపన వచ్చిందన్నారు. సంఘ, జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు.

 

హెచ్ సీయూను సందర్శించిన పునియా..

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీని జాతీయ ఎస్పీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ పునియా సందర్శించారు. పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న గదిని ఆయన పరిశీలించారు. రోహిత్ కు సంబంధించిన వివరాలను హెచ్‌సీయూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కంట్రోల్ రూం..

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు 040-29802897/29802895. ఎన్నికలకు సంబంధించిన పలు అనుమానాలను ఈ నంబర్లకు చేసి నివృత్తి చేసుకోవచ్చు. 

తెలంగాణ పంచాయతీ డివిజన్ల సంఖ్య పెంపు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ డివిజన్ల సంఖ్య పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 12 డివిజన్లు ఏర్పాటు చేసింది. మంచిర్యాల, ఉట్నూరు, సిరిసిల్ల, మంథని, జనగాం, నర్సంపేట, వనపర్తి, పాల్వంచ, మల్కాజ్ గిరి, సూర్యాపేట, దేవరకొండ డివిజన్లను ఏర్పాటు చేసింది. 

ఏపీలో సమ్మె విరమించిన వీఆర్ ఏలు..

విజయవాడ : పే స్కేల్ అమలు చేయాలంటూ 78 రోజులుగా సమ్మె చేస్తున్న ఏపీ వీఆర్ ఏలు సమ్మె విరమించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి కొంత మెరుగైనా తరువాత పే స్కేల్ అమలు చేస్తానని, వారి డిమాండ్లు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి హామీనిచ్చారు. 

ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు..

హైదరాబాద్ : ఏపీలో 2016-17 లో విద్యుత్ ఛార్జీల పెంపునకు డిస్కంలు ఈ ఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాయి. రూ. 783 కోట్లతో విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈ రోజు సాయంత్రం ప్రతిపాదించాయి. 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారికి నాలుగు శాతం మేర పెంచాలని..200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి ఛార్జీల పెంపు వర్తించదని ఆ ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. 

20:59 - January 18, 2016

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిదంటరు చూడండి అదే అయితుంది జీహెచ్ఎంసీ ఓట్లలల్ల..చేయి గుర్తు పెద్ద మత్తదువు ఉత్తమ్ కుమార్ రెడ్డి..పువ్వు గుర్తు పెద్దయ్య కిషన్ రెడ్డి..టిడిపి అత్యవసర ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి..ముగ్గురు అగ్గిగుండాల్లో దుకుండు తప్పేటట్టు లేదు. వీళ్లకు జీహెచ్ఎంసీ ఓట్లకు వీరికే సంబంధం అంటరా ? అయితే ఈ వీడియో చూసేయుండ్రి..

20:58 - January 18, 2016

జీహెచ్ఎంసీలో ఓట్లంటే నేతలకు తమాషా అయిపోయినయి. ఈ రోజు ఈ పార్టీలో ఉన్నవాడు జరసేపటికి ఇంకో పార్టీలో తేలుతున్నడు. అరగంటలోనే నిర్ణయాలు కూడా మార్చేసుకుంటున్నరు. నిన్న బంగారు తెలంగాణ అన్న లీడరు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది అంటూ రకరకాలుగా మాట్లడుతున్నరు. ఒక్క నాలికతో ఎన్ని చిత్రాలు చూడండి ఈ వీడియోలో చూడండి. 

20:51 - January 18, 2016

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నో హామీలు గుప్పిస్తుంటరు కదా..కానీ ఆ హామీలు అమలైందా ? ఏమో తెల్వదు అంటరు కదా. అలాంటిదే ఇది కూడా పాలమూరు జిల్లాలో గత ఏడాది సీఎం కేసీఆర్ పర్యటించిండు. జనవరి 18వ తేదీన పాలమూరుకు వెళ్లిండు. బస్తీ జనం బాధలు కరిగిపోయిన కేసీఆర్ హమీలు గుప్పించిండు. స్ట్రీట్ లైట్లు, మోరీలు, నల్లాలు, ఇళ్లు ఇలా హామీలు ఇచ్చిండు. అంతేగాక కేవలం ఎనిమిది రోజుల్లో పనులు మొదలు కావలె. ఐదు నెలల్లో మంచి ఇళ్లల్లో ఉండాలె...కొబ్బరికాయ కొట్టి నేనే ప్రారంభిస్తానని చెప్పిండు. ఇది వన్న జనం చప్పట్లు కొట్టిండ్రు. కానీ ఆ హామీలు పూర్తయ్యాయా ? ఈ వీడియో చూడండి..

20:41 - January 18, 2016

యూనివర్సిటీలా ? లేక కుల పిచ్చిగాళ్లకు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే వాళ్లకు అడ్డాలా ? విద్యా సుగంధాలు పంచి విద్యార్థుల బంగారు భవితను అందించాల్సిన యూనివర్సిటీలు ఎలా తయారవుతున్నాయి. కులం పేరుతో మతం పేరుతో విభజించి వివక్షతో ఎందరో విద్యార్థల భవితతో ఆడుకుంటుంటే చివరకు ఆ కలలన్నీ ఉరికొయ్యకు వేలుడుతున్నాయి. నా చావుకు నేనే కారణం..నా మిత్రులను శత్రువులను ఇబ్బంది పెట్టవద్దంటూ సూసైడ్ రాసిన రోహిత్ లేఖ చెప్పని అంశాలు చాలా ఉన్నాయి. దీనిపై మరింత విశ్లేషణ చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:36 - January 18, 2016

జనవరి 18వ తేదీన సీఎం కేసీఆర్ పాలమూరుకు వెళ్లి వచ్చి సంవత్సరం దాటింది. కానీ అక్కడ ఆయన ఇచ్చిన హామీ అలానే ఉండిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు రాని అభ్యర్థుల ఆవేదన. ఉత్తమ్..కిషన్..రేవంత్ రెడ్డిల ముగ్గురు ఆట ఉంటుందా ? తెలంగాణ రాష్ట్రం కళాకారుల పరిస్థితి...కొమరంవెల్లి మల్లన్న జాతరకు పోటెత్తిన భక్తులు..సీఎం కేసీఆర్ ను కలిసిన సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ...నెల్లూరులో పెంపుడు కుక్కల ప్రదర్శన..బ్రెజిల్ లో రెండో అంతస్థు నుండి పడిన చిన్నారి...ఈ అంశాలపై టెన్ టివి 'మలన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న విశ్లేషించాడు. అంతేగాకుండా ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా చండూరు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అతిథిగా వచ్చి తన గోసును వెల్లబోసుకున్నడు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:17 - January 18, 2016

'సారూ..నా భూమి కబ్జా చేసిండ్రు' అంటూ ఓ వ్యక్తి 'మల్లన్న' ఎదుట వాపోయిండు. టెన్ టివిలో ప్రసారమయ్యే 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో నల్గొండ జిల్లా చండూరు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి వచ్చిండు. తన గోస వెల్లబోసిండు. 1992లో కొన్న భూమిని కొందరు కబ్జా చేసేశారని వాపోయిండి. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు..అధికారులకు విన్నవించుకున్న ఫలితం లేదని తెలిపిండు. చివరకు మంత్రి కేటీఆర్ దగ్గరి వెళ్లి లెటర్ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయినా గింతవరకు తన సమస్య తీరలేదని ఆవేదన వెలిబుచ్చిండు. ఇందులో బిల్ కలెక్టర్, ఈవో ఉన్నాడని, తీగ లాగితే డొంకతా కదులుతుందని సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు.

18:37 - January 18, 2016

గుంటూరు : జిల్లాలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. హత్యలు చేసిన 14 మంది నిందితులను సోమవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. నగరానికి చెందిన సూరి శివయ్య, గువ్వల రాజేష్ లు ఓ అమ్మాయి విషయంలో గొడవకు దిగారు. ఇది మనస్సులో పెట్టుకుని ఎలాగైనా శివయ్యను హతమార్చాలని రాజేష్ యోచించాడు. ఇందుకు స్నేహితుల సహకారం తీసుకున్నాడు. శివయ్య తన స్నేహితులతో కలిసి రాజేష్ ఉన్న ప్రాంతానికి వచ్చాడు. ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. ఇదికాస్తా ముదిరింది. రాజేష్ తో పాటు అతని స్నేహితులైన రాము, రవి, రాజాలను శివయ్య బృందం అత్యంత దారుణంగా హతమార్చింది. అనంతరం వీరంతా పరారయ్యారు. ప్రధాన నిందితుడైన శివయ్యపై పలు కేసులు నమోదై ఉన్నాయి. 

18:31 - January 18, 2016

కర్నూలు : జిల్లాలోని పుణ్యక్షేత్రాల బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని ఏపీ డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా కర్నూలులో దేవాదాయ, పర్యాటక శాఖాధికారులతో కేఈ సోమవారం సమీక్ష నిర్వహించారు. రాయలసీమ పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు వంద కోట్ల రూపాయలు కేటాయించారని కేఈ పేర్కొన్నారు. 

హెచ్ సీయూ ఘటన దురదృష్టకరం - పూనియా..

హైదరాబాద్ : హెచ్ సీయూ సంఘటన దురదృష్టకరమని జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పూనియా పేర్కొన్నారు. దళిత విద్యార్థి రోహిత్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాజంలో అసమానతలు తగ్గించకుండా పెంచడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

టవర్ ఎక్కిన గులాబీ కార్యకర్త..

మెదక్ : ఆర్సీపురంలో టీఆర్ఎస్ కార్యకర్త విద్యుత్ టవర్ ఎక్కాడు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత శ్రీధరాచారికి టికెట్ ఇవ్వలేదని కబీర్ అనే కార్యకర్త టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. 

18:20 - January 18, 2016

అనంతపురం : ఏపీ రాష్ట్రంలో వృద్ధులకు పెన్షన్ లు పెంచిన ఘనత తమదే..వారికి ఎలాంటి సమస్యలు రాకుండా పెన్షన్ లు ఇస్తున్నామంటూ బాబు సర్కార్ గొప్పలు చెప్పుకొంటుంటుంది. కానీ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇది అంతా శుద్ధ అబద్ధమని నిరూపిస్తోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం భారీ సంఖ్యలో వృద్ధులు చేరుకున్నారు. తమకు పెన్షన్ రావడం లేదని, నెలల పాటు అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారు కనికరించడం లేదని వారు వాపోయారు. శరీరం సహకరించక..కర్ర సాయంతో వీరంతా అక్కడకు చేరుకున్న పరిస్థితిని చూసిన వారికి హృదయాలు చలించిపోయాయి. గ్రీవెన్స్ సెల్ కు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా జిల్లాలో వృద్ధులకు సరియైన విధంగా పెన్షన్ లు అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కుంటిసాకులు చెబుతూ వీరికి పెన్షన్ లు అందచేయడం లేదని తెలుస్తోంది. వీరి పెన్షన్ లను అధికార పార్టీకి చెందిన వారు కాజేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికైనా ఈ వృద్ధుల పట్ల ఏపీ ప్రభుత్వం కనికరం చూపిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

అనంతపురంలో పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు..

అనంతపురం : జిల్లాలో వృద్ధులకు పెన్షన్ కష్టాలు మొదలయ్యాయి. కలెక్టర్ కార్యాలయం వద్ద వృద్ధులు పడిగాపులు పడుతున్నారు. నెలలకొద్ది తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, తమకు పెన్షన్ ఇవ్వాలని వృద్ధులు కోరుతున్నారు. 

రోహిత్ మృతిపై ముంబైలో నిరసన..

ముంబై : హైదరాబాద్ నగరంలోని హెచ్ సీయూలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ముంబైలో టిఐఎస్ఎస్ విద్యార్థులు నిరసన మార్చ్ నిర్వహించారు. 

ఢిల్లీ, మధ్యప్రదేశ్ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ఢిల్లీ, మధ్యప్రదేశ్ కు వెళ్లనున్నారు. ప్రధాని మోడీ అపాయింట్ ను కేసీఆర్ కోరారు. తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని ప్రధానిని కేసీఆర్ కోరనున్నారు. ఢిల్లీ పర్యటనకు ముందు మధ్యప్రదేశ్ లో కేసీఆర్ పర్యటించనున్నారు. అక్కడ నీటి పారుదల వ్యవస్థను కేసీఆర్ పరిశీలించనున్నారు. 

ఆరేళ్ల బాలుడిని చితకబాదిన తల్లి..

ఒంగోలు : తూర్పు వీరాయపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలుడిని తల్లి కళ్యాణి చితకబాదింది. ఛైల్డ్ లైన్ సిబ్బందికి అజ్ఞాత వ్యక్తి సమాచారం అందించాడు. తల్లి కళ్యాణిపై టూ టౌన్ పీఎస్ లో కేసు నమోదు చేశారు.

 

టీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ..

హైదరాబాద్ : రెహత్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి షఫీ నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు. ముగ్గురు పిల్లలున్నారనే కారణంతో నామినేషన్ తిరస్కరించారు. మరోవైపు వివేకానందనగర్ 122 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం శ్వేత నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. ఓటు హక్కు లేకపోవడంతో అధికారులు నామినేషన్ ను తిరస్కరించారు. 

17:55 - January 18, 2016

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న విద్యార్థి మృతదేహాన్ని దర్శించడానికి వెళ్లిన తమ్మినేని, ప్రజాకవి గద్దర్‌ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రోహిత్ అంత్యక్రియలు ఇక్కడే జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

కఠినంగా శిక్షించాలి - ఉత్తమ్..
రోహిత్ మృతికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని టీ-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టీ విక్రమార్క డిమాండ్ చేశారు. హెచ్‌సీయూలో దళిత విద్యార్థి మృతిపై ప్రధానమంత్రి స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వ విద్యాలయాల్లో ఇలాంటి దుర్ఘటనలు జరగడం బాధకరమని భట్టీ విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ విషయంపై ప్రస్తావిస్తామన్నారు విక్రమార్క.

బాధాకరం - జస్టిస్ చంద్రకుమార్..
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతి బాధకరమన్నారు జస్టిస్ చంద్రకుమార్‌. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 ఏళ్ల అయినా... నేటికి కులవివక్ష కొనసాగుతోందని ఆయన అన్నారు. కులం సమాజాన్ని కూల్చుతోందని, కులం సమాజాన్ని చీల్చుతోందని చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కుల రక్కసిని తరిమేందుకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కత్తిపద్మారావు ఆందోళన..
భారత రాజ్యాంగం సంక్షోభం పడిందని దళిత నేత కత్తి పద్మారావు ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్ మృతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాముడ్ని, కృష్ణున్ని ముందుకు తీసుకొచ్చి... హత్యారాజకీయాలు చేస్తున్నారని కత్తి పద్మారావు మండిపడ్డారు.  

17:52 - January 18, 2016

హైదరాబాద్ : గద్వాల ప్రాంత రైతులకు విత్తనోత్పత్తి రైతులకు పరిహారం ఇవ్వాలని రైతు సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.... విత్తన కంపెనీలతో నష్టపోయిన 60శాతం పంటకు వెంటనే పరిహారం ఇప్పించాలని కోరారు.. హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్, జస్టిస్ చంద్రకుమార్‌, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు.. 

17:51 - January 18, 2016

హైదరాబాద్ : సైదాబాద్‌ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి స్వర్ణలతా రెడ్డి ప్రచారంలో ముందున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు. ఎవరు గెలిచినా స్పోర్టివ్‌గా తీసుకుని, బస్తీ అభివృద్దికి కృషి చేద్దామని ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు పిలుపునిచ్చారు స్వర్ణలతా రెడ్డి.

నగరంలో దళత విద్యార్థుల నిరసన మార్చ్..

హైదరాబాద్ : హెచ్ సీయూలో దళిత విద్యార్థి రోహిత్ మృతిపై నిరసన వ్యక్తం చేస్తూ నగరంలో దళిత విద్యార్థులు మార్చ్ నిర్వహించారు. 

రోహిత్ కుటుంబానికి స్మృతి సంతాపం..

ఢిల్లీ : హెచ్ సీయూలో దళిత విద్యార్థి రోహిత్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఆమె ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. ఈ ఘటనపై వాస్తవాలు తెలుసుకొనేందుకు ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విశ్వ విద్యాలయ పరిపాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. 

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టు..

నెల్లూరు : వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు రైల్వేకోర్టులో చిత్తూరు పోలీసులు హాజరు పరిచారు. ఈనెల 29 వరకు రిమాండ్ విధించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రైల్ రోకో ఘటనలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయ్యారు. 

ఆర్ ఎఫ్సీఎల్ పునరుద్ధరణపై కేసీఆర్ సమీక్ష..

హైదరాబాద్ : రామగుండం ఫెర్టిలైజర్ మరియు కెమికల్ లిమిటెడ్ పునరుద్ధరణపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 1990లో మూతపడిన సంస్థను తెరిపించాలని కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని కేసీఆర్ తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా 3వేల మందికి ఉపాధి దొరుకుతుందని, ఆర్ఎఫ్సీఎల్ ద్వారా 4.95 లక్షల టన్నుల యూరియా, 2.97 లక్షల టన్నుల అమోనియం ఉత్పత్తి చేయొచ్చన్నారు. 2018 కల్లా ఆర్ఎఫ్సీఎల్ ను పునరుద్ధరించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు, అవసరమైన నీటిని మిషన్ భగీరథ దావరా ఎల్లంపల్లి ఇంటెక్ వెల్ నుండి 0.55 టీఎంసీల నీరు, 40 మె.వా. విద్యుత్ ను వాడుకోవాలని అధికారులకు సూచించారు. 

16:27 - January 18, 2016

ఢిల్లీ : నగరంలో హెచ్ సీయూలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆత్మహత్యకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ వైఖరిలే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో ఢిల్లీలోని స్మృతి నివాసం, కార్యాలయం ఎదుట దళిత సంఘాలు, వామపక్ష సంఘాలతో ఇతర సంఘాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. స్మృతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందస్తుగానే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వివిధ మార్గాల నుండి భారీ సంఖ్యలో వస్తున్న వారిని పోలీసులు కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. బారికేడ్లను దాటుకుని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వాటర్ కెనాన్ లను ప్రయోగించారు. వాటర్ కెనాన్ లు, లాఠీ ఛార్జీలకు బెదరమని సంఘాల నేతలు పేర్కొన్నారు. హెచ్చార్డీ కార్యాలయలోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసుల లాఠీలు కరాళనృత్యం చేశాయి. దీనితో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రోహిత్ ఆత్మహత్య ఘటనపై పలు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రోహిత్ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 

16:18 - January 18, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ ఘటనపై పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం రోహిత్ హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం రోహిత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అంత్యక్రియలు ఇక్కడే నిర్వహిస్తామని తల్లిదండ్రులు పేర్కొన్నట్లు, దీనికి పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేప్పినట్లు తెలుస్తోంది. అనంతరం రోహిత్ స్వగ్రామమైన ఉప్పల్ కు తరలిస్తారని అనుకున్నారు. కానీ నేరుగా అంబర్ పేట శ్మశానికి రోహిత్ భౌతికకాయాన్ని తరలించారు. అక్కడ రోహిత్ అంత్యక్రియలను పూర్తి చేశారు. రోహిత్ అంత్యక్రియలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై పలువురు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంత్యక్రియలను ఆఘమేఘాలపై ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. రోహిత్ కుటుంబసభ్యులు..స్నేహితుల కన్నీటి నివాళులర్పించారు.

పీహెచ్ డీ చేస్తున్న రోహిత్...
పొలిటికల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న రోహిత్‌ మతోన్మాద రాజకీయాలకు బలయ్యాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన రోహిత్‌ స్వస్థలం గుంటూరు. క్యాంపస్‌లో దళిత, వామపక్ష ఉద్యమాల్లో యాక్టివ్‌గా రోహిత్‌ చాలాకాలంగా యాక్టివ్‌గా పాల్గొన్నాడు. వర్సిటీలోని విద్యార్థుల సమస్యలపై రోహిత్‌ క్రియాశీలకంగా వ్యవహరించాడు.

ఏబీవీపీ నాయకుడు సుశీల్‌పై దాడి చేశారన్న కారణంతో ...
హెచ్‌సీయూలోని ఏబీవీపీ నాయకుడు సుశీల్‌పై దాడి చేశారన్న కారణంతో సరిగ్గా 15 రోజుల క్రితం ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారు వీసీ అప్పారావు. సస్పెండ్‌ అయిన విద్యార్థుల్లో దొంత ప్రశాంత్‌, వేల్పుల సుంకన్న, శేషయ్య, విజయ్‌కుమార్ లతో పాటు వేముల రోహిత్‌ సైతం ఉన్నారు. అప్పటి నుంచి బాధిత విద్యార్థులు, అన్ని విద్యార్థి సంఘాలు వర్సిటీలో నిరసనలు కొనసాగించారు.

సస్పెన్షన్‌ వెనుక కేంద్ర మంత్రులు హస్తం...
ఇదిలా ఉంటే విద్యార్థుల సస్పెన్షన్‌ వెనుక కేంద్ర మంత్రులు హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏబీవీపీ విద్యార్థి సంఘానికి చెందిన నేతలు కేంద్ర మంత్రి బండారుదత్తాత్రేయ ద్వారా దళిత వామపక్ష విద్యార్థులను సస్పెండ్‌ చేయాలంటూ లెటర్‌ రాసినట్లు సమాచారం. ఈ లెటర్‌ ద్వారానే కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరానీ ఆదేశించారు. ఇదిలా ఉంటే హెచ్‌సీయూ వర్సిటీ నియామకం వెనుక కూడా మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రోద్బలం ఉన్నట్లు సమాచారం.

రోహిత్ ఆత్మహత్యపై నలుగురిపై కేసు నమోదు..
హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై నలుగురిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సుశీల్ కుమార్, విష్ణుపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

హెచ్ సీయూ ఘటనపై ద్విసభ్య కమిటీ ఏర్పాటు..
హైదరాబాద్ : కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పీహెచ్ డీ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూనివర్సిటీలో చోటు చేసుకుంటున్న ఘటనపై మానవ వనరుల అభివృద్ధి శాఖ ఓఎస్డీఈ షకీలా శంషు, డిప్యూటి సెక్రటరీ సూరత్ సింగ్ ఆధ్వర్యంలో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. 

స్మృతి ఇరానీ నివాసం వద్ద ఉద్రిక్తత..

ఢిల్లీ : నగరంలో హెచ్ సీయూలో దళిత విద్యార్థి రోహిత్ మృతిపై పలు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్మృతి ఇరానీ నివాసం, కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. 

దళిత విద్యార్థి రోహిత్ అంత్యక్రియలు పూర్తి..

హైదరాబాద్ : హెచ్ సీయూ దళిత విద్యార్థి రోహిత్ మృతదేహం అంత్యక్రియల నిమిత్తం అంబర్ పేట శ్మశానికి తరలించారు. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో పోస్టుమార్టం నిర్వహించారు. 

ఎన్టీపీసీ, సింగరేణి కాలరీస్ తో టీఎస్ ట్రాన్స్ కో ఒప్పందాలు..

హైదరాబాద్ : ఎన్టీపీసీ, సింగరేణి కాలరీస్ తో టీఎస్ ట్రాన్స్ కో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. సీఎం కేసీఆర్ సమక్షంలో ఒప్పంద పత్రాలను అధికారులు మార్చుకురన్నారు. రామగుండం ఎన్ టీపీసీ ప్లాంటు నుండి 1600 మె.వా. విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది.

15:39 - January 18, 2016

హైదరాబాద్ : చైతన్యపురం డివిజన్ ను గ్రేటర్ లో ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ అభ్యర్థి గురు నరేంద్ర రెడ్డి చెప్పారు. కారు స్పీడ్ ను చేయి ఆపుతుందని, 22వ వార్డును నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. గతంలో కౌన్సిలర్ గా పనిచేసిన అనుభవం..డివిజన్ లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు, ఎల్ బినగర్ వార్డు నెంబర్ 2లో కౌన్సిలర్ గా పనిచేయడం జరిగిందన్నారు. 

15:36 - January 18, 2016

హైదరాబాద్ : ఆర్కే పురం డివిజన్ లో గత కార్పొరేటర్ చేసేందేమి లేదని టిడిపి, బిజెపి మిత్రపక్షాల అభ్యర్థి రాధా ధీరజ్ రెడ్డి విమర్శించారు. ఈ డివిజన్ లో అనేక సమస్యలున్నాయని, వీటిని పరిష్కరించే విధంగా తాను కృషి చేస్తానని హామీనిచ్చారు. డివిజన్ లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొంటూ చేదోడువాదోడుగా నిలవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేగా ఉంటున్న తీగల ఏమి అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు ఆయన కోడలు టీఆర్ఎస్ నుండి బరిలో నిలిపారని ఇప్పుడు ఏం చేస్తారని రాధా ధీరజ్ రెడ్డి ప్రశ్నించారు. 

15:32 - January 18, 2016

విజయవాడ : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బాబు ప్రసంగించారు. ఎన్టీఆర్ సేవలను ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రిగా అహర్నిశలు పేదల కోసం పాటు పడిన మహానేత ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగు జాతి నిరాదరణకు గురవుతోంది..ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు..తనను ఆరాధించిన వారి కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారని పేర్కొన్నారు. కమ్యూనిజం..క్యాప్టలిజం..సోషలిజం అప్పట్లో మాట్లాడారని, కానీ ఈ సిద్ధాంతాలు కాదు..సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు..అని ఎన్టీఆర్ మొట్టమొదటిగా చెప్పారని పేర్కొన్నారు. 

15:27 - January 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. క్యాన్సర్ ఆసుపత్రి సేవలను కేసీఆర్ కు వివరించారు. ఆసుపత్రి వద్ద రోగుల సౌకర్యార్థం చేపట్టిన పలు నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని ఈ సందర్భంగా బాలకృష్ణ కోరారు. అలాగే తాను నటించిన 'డిక్టేటర్' మూవీని చూడాలన్నారు. రోగులను మరిన్ని సేవలందించాలని ఈ సందర్భంగా బాలకృష్ణకు కేసీఆర్ సూచించారు. వందో సినిమా ఎప్పుడు తీస్తున్నారని వాకబు చేశారు. త్వరలో 'ఆదిత్య 369' సీక్వెల్ గా సినిమా చేయబోతున్నట్లు బాలకృష్ణ పేర్కొన్నారు. 

15:19 - January 18, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ దళిత విద్యార్థి రోహిత్ వేముల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అతని స్వగ్రామమైన ఉప్పల్ బ్యాంకు కాలనీకి భౌతికకాయానికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. రోహిత్ మృతదేహాన్ని పరామర్శించేందుకు వస్తున్న నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఎందుకు నిర్భంద కాండ వ్యవహరిస్తున్నారని నేతలు ప్రశ్నించారు. ఈ ఘటనపై వాస్తవాలు బయటకు రావాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై విచారణ చేపట్టాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ లేఖ రాయడం..తరువాత విద్యార్థులు సస్పెన్షన్ కు గురయ్యారని విద్యార్థులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఢిల్లీలో నిరసనలు..
మరోవైపు రోహిత్ మృతిపై ఢిల్లీలో నిరసన జ్వాలలు పెల్లుబికాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నివాసం ఎదుట దళిత సంఘాలు, ఇతర సంఘాలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉంటే మంత్రి స్మృతి ఇరానీ ఇద్దరు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మానవ వనరుల అభివృద్ధి శాఖ ఓఎస్డీఈ షకీలా శంషు, డిప్యూటి సెక్రటరీ సూరత్ సింగ్ ఉన్నారు. వీరు నగరానికి బయలుదేరారు. మూడు రోజుల్లో ఘటనపై ఓ నివేదిక ఇవ్వనున్నారు. 

హెచ్ సీయూ ఘటనపై ద్విసభ్య కమిటీ ఏర్పాటు..

హైదరాబాద్ : కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పీహెచ్ డీ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూనివర్సిటీలో చోటు చేసుకుంటున్న ఘటనపై మానవ వనరుల అభివృద్ధి శాఖ ఓఎస్డీఈ షకీలా శంషు, డిప్యూటి సెక్రటరీ సూరత్ సింగ్ ఆధ్వర్యంలో ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. 

ట్రిపుల్ మర్డర్ కేసులో 14 మంది నిందితులు..

గుంటూరు : మూడు రోజుల క్రితం జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో 14 మంది నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. అమ్మాయి విషయంలో వివాదమే హత్యలకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. 

రోహిత్ భౌతికకాయాన్ని పరామర్శించిన తమ్మినేని..

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో దళిత విద్యార్థి రోహిత్ భౌతికకాయాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, ఎమార్పీఎస్ నేత మందకృష్ణలు పరామర్శించారు. రోహిత్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. అంత్యక్రియలు గుంటూరులో నిర్వహించాలని పోలీసులు రోహిత్ తల్లిదండ్రులపై వత్తిడి తెస్తున్నారని, తల్లిదండ్రుల ఇష్టప్రకారమే రోహిత్ అంత్యక్రియలు జరగాలని సూచించారు. బాధ్యులపై చర్యలు తీసుకొనేలా విద్యార్థి, ప్రజా సంఘాలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు వాస్తవాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

14:56 - January 18, 2016

వరంగల్ : జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లిలోని శ్రీ మల్లికార్జునస్వామి దేవాలయం. గొల్లకుర్మ కులస్థులు ఇక్కడి మల్లన్న స్వామిని ఇలవేల్పుగా కొలుస్తారు. వీరశైవ, యాదవ సంప్రదాయం ప్రకారం ఇక్కడ పూజలు జరుగుతాయి. ఈనెల 3వ తేదీన నిర్వహించిన కల్యాణోత్సవం అనంతరం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ఈ జారత ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అత్యంత ప్రాశస్త్యం పొందిన శైవక్షేత్రాల్లో ఒకటిగా జానపద సంస్కృతికి నిలువుతద్దంగా ఈ ఆలయం నిలుస్తోంది. ఇక్కడ మల్లన్న జాతర 12 వారాల పాటు కొనసాగుతుంది. ఈ జాతరకు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఒడిషా, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు.

ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు..
జాతర సందర్భంగా స్వామి వారి కల్యాణం, పట్నం వారం, లష్కర్‌ వారం, మహా శివరాత్రి పర్వదినం రోజున నిర్వహించే పెద్ద పట్నం, ఉగాది పండగ అనంతరం అగ్నిగుండాలు కార్యక్రమాలకు ఈ ఉత్సవాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. దీంతో కొమురవెల్లి ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు రాజగోపురం పక్కనే మూడు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అలాగే తడకలతో చలువ పందిళ్లు వేయించారు. ప్రసాదాల విక్రయం, బుకింగ్‌ తదితర ప్రాంతాల్లో భక్తుల కోసం సౌకర్యాలు కల్పించారు. రద్దీకి సరిపడా లడ్డు ప్రసాదాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

14:38 - January 18, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ వేముల అంత్యక్రియలు తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లుగా ఇక్కడే జరిపేందుకు అవకాశం ఇవ్వాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పేర్కొన్నారు. రోహిత్ మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఉస్మానియాకు చేరుకున్న తమ్మినేని మీడియాతో మాట్లాడారు. అంత్యక్రియల్లో పోలీసులు పలు సలహాలు చెబుతున్నారని, ఇక్కడ జరగడానికి వీలు లేదని గుంటూరుకు తీసుకెళ్లాలని వారు పేర్కొంటున్నారని తెలిపారు. కానీ ఇక్కడే అంత్యక్రియలు జరుపుతామని రోహిత్ తల్లి తనతో చెప్పిందని తెలిపారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించే విధంగా అవకాశం ఇవ్వాలన్నారు. పోలీసులు ఇందులో జోక్యం చేసుకోవడానికి వీలు లేదన్నారు. విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పోగవుతాయని, పోలీసు పెద్దలు లేదా వారి వెనుకున్న బీజేపీ నేతలు ఆందోళన చేస్తారనే భయంతో ఉన్నారని విమర్శించారు. ఈ సమస్యను నిగ్గు తేల్చాలని, దీనికి సంబంధం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని, రోహిత్ మెరిట్ స్టూడెంట్ అని తల్లి తెలిపిందన్నారు. వాస్తవాలను అణిచివేయాలని చూస్తుంటే ప్రజా ఉద్యమాలు ఉవ్వెతున ఎగిసి పడుతాయని, రోహిత్ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని తమ్మినేని డిమాండ్ చేశారు. 

14:28 - January 18, 2016

హైదరాబాద్ : తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్ కు తెలంగాణ ప్రభుత్వం తరుపున నివాళి అర్పించకపోవడాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తప్పుపట్టారు. ఘాట్‌ దగ్గర ఎన్టీఆర్ కు ఆయన నివాళి అర్పించారు. తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో ఎన్టీఆర్ కు స్థానం కల్పించాల్సి ఉందన్నారు. మరోవైపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చిరిస్తున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావుపై టిటిడిపి అధ్యక్షుడు రమణ మండిపడ్డారు. 

14:25 - January 18, 2016

హైదరాబాద్ : మరో కల్తీ ముఠా గుట్టు రట్టయింది. హుస్సేనీఆలం పోలీసు స్టేషన్‌ పరిధిలో.. కల్తీ సాస్‌, మసాలా దినుసులు తయారు చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. పురానాపూల్‌ ఔట్‌పోస్టు వద్దనున్న గోడౌన్‌లో ఈ కల్తీ దందా జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. గోడౌన్‌పై దాడి చేసి ముఠా గుట్టును రట్టు చేశారు. 

14:21 - January 18, 2016

గుంటూరు : జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రొంపిచర్ల మండలం రామిరెడ్డి పాలేనికి చెందిన రైతుల పొలాల మీదుగా రహదారి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ... ఈనెల 11న శ్రీనివాసరెడ్డి, రొంపిచర్ల ఎమ్మార్వో ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారంటూ.. ఎమ్మార్వో రాజారత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ రోజు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిని అరెస్టు చేశారు. ఎమ్మెల్యే అరెస్టును కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా... పోలీసులకు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఎమ్మెల్యేని నరసరాపుపేట రూరల్‌ స్టేషన్‌కు తరలించడంతో.. కార్యకర్తలు అక్కడికీ చేరుకుని.. ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

14:13 - January 18, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆత్మహత్య ఘటనలో వీసీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయలపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల హెచ్ సీయూ లో కొంతమంది దళిత విద్యార్థులను వీసీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో తీవ్రమనస్థాపానికి గురైన రోహిత్ ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై దళిత విద్యార్థులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనితో సోమవారం గచ్చిబౌలి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, వీసీ అప్పారావు, ఏబీవీపీ విద్యార్థి సుశీల్ కుమార్, సుశీల్ సోదరుడు విష్ణుపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే యూనివర్సిటీలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 400 మంది విద్యార్థులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. రోహిత్ ఎక్కడైతే దీక్ష చేశాడో అదే ప్రాంతం వద్ద విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరికి మద్దతుగా వచ్చిన కొంతమంది ప్రజా సంఘ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు వీరికి మద్దతు నిలిచారు. 

రోహిత్ ఆత్మహత్యపై నలుగురిపై కేసు నమోదు..

హైదరాబాద్ : హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై నలుగురిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, సుశీల్ కుమార్, విష్ణుపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 

నాస్కామ్ ముందుకు రావడం శుభపరిణామం - కేటీఆర్..

హైదరాబాద్: టీ హబ్ లో 10 వేల స్టార్టప్ లకు నాస్కామ్ ముందుకు రావడం శుభ పరిణామమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్టార్టప్ లో నాస్కామ్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్టప్ లో హైదరాబాద్ టీ హబ్ ముందుకు దూసుకెళుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. 

రామారావు భౌతికకాయం ఎదుటే బీజేపీ నేతల ఆందోళన..

హైదరాబాద్ : బీజేపీ కార్యాలయానికి గ్రేటర్ సెగ తాకింది. సిక్కిం మాజీ గవర్నర్ రామారావు భౌతికకాయం ఉండగానే టికెట్ రాలేదని పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. చైత్యపురి టికెట్ ను అమ్ముకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.

13:51 - January 18, 2016

కొంతమంది నటులు భౌతికంగా కనుమరుగైనా కాలానికి అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో చిరంజీవులుగా నిలిచిపోతారు. అలాంటి వారిలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామరావుది ప్రత్యేక స్థానం. ఓ మామూలు నటుడి స్థాయి నుంచి భారతదేశం గర్వించదగ్గ నటరత్నంగా ఆయన ఎదిగిన తీరు, ప్రజానాయకుడిగా ఆయన చేసిన సేవలు నేటితరానికి స్ఫూర్తిదాయకం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు...మహాపురుషులవుతారు.. అనే నానుడికి నిఖార్సయిన నిదర్శనంగా నిలిచిన ఎన్టీఆర్‌ వర్థంతి నేడు (సోమవారం). ఈ సందర్భంగా నటరత్న ఎన్టీఆర్‌ సినీ జీవిత విశేషాలు..

400 చిత్రాల్లో నటన..
'వెండితెర మీద నేను ఇలా నిలిచి ఉండటానికి, మీ అభిమానం సంపాదించ గలగడానికి కారణం నేను ధరించిన పాత్రలేనని నా విశ్వాసం. అభిమాన పాత్ర ధరించి అభిలాష తీర్చుకొనడం కన్న ఏ నటుడూ ఆశించేది మరొకటి లేదు. నటనకు చోటు దొరికే బలమైన పాత్రలంటే నాకు చాలా అభిమానం' అని పలు సందర్భాల్లో చెప్పిన ఎన్టీఆర్‌ 44 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానం నేటి తరానికి మార్గదర్శకమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించి ప్రేక్షకుల్ని మెప్పించడమే కాకుండా రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.

పలు చిత్రాల నిర్మాణం..
తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించారు. మరికొన్ని చిత్రాలకు దర్శకత్వమూ వహించారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాల్లో నటించారు. ఆయా చిత్రాల్లో నటనకు ప్రేక్షకులు ముగ్ధులై విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఎన్టీఆర్‌ని కొనియాడటం విశేషం. 'దాన వీర శూర కర్ణ', 'మాయాబజార్‌', 'పాతాళ భైరవి', 'మల్లీశ్వరి', 'అడవిరాముడు', 'వేటగాడు', 'సర్దార్‌ పాపారాయుడు', 'కొండవీటి సింహం', 'బొబ్బిలిపులి' తదితర చిత్రాలు నటుడిగా, 'సీతారామ కళ్యాణం', 'గులేబకావళి కథ', 'శ్రీ కృష్ణ పాండవీయం', 'వరకట్నం', 'తల్లా పెల్లామా', 'దానవీర శూరకర్ణ', 'శ్రీరామ పట్టాభిషేకం', 'శ్రీమద్విరాట పర్వం', 'శ్రీమద్విరాట్‌ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి చరిత్ర', 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' వంటి చిత్రాలతో దర్శకుడిగా, 'శ్రీనాథ కవి సార్వభౌమ', 'శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం', 'చండశాసనుడు' వంటి చిత్రాలతో అభిరుచిగల నిర్మాతగా, బిదాయి (హిందీ) చిత్రానికి రచయితగా ఎన్టీఆర్‌ తన ప్రత్యేకతను చాటుకున్నారు.

తెలుగుదేశం పార్టీ స్థాపన..
వెండితెర కథానాయకుడిగానే కాకుండా తెలుగు దేశం పార్టీని స్థాపించి ప్రజలకు చేసిన సేవతో ప్రజానాయకుడిగా కూడా ఎన్టీఆర్‌ తానేమిటో నిరూపించుకున్నారు. అంతేకాకుండా మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవ చేసిన ఘనత కూడా ఈయనకే దక్కుతుంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆశేష జన అభిమానాన్ని ఎన్టీఆర్‌ చూరగొన్నారు. సినిమా పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరు మీద ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని సినీ ప్రముఖులకు అందజేయడం తెలుగు సినీ చరిత్రలోనే ఓ అరుదైన విశేషం.

13:50 - January 18, 2016

హైదరాబాద్ : ప్రపంచ జనాభా ఒకవైపు.. ఆ 62 మంది మరో వైపు..! ఎందుకో తెలుసా..? ప్రపంచంలో సగం సంపద వాళ్ల దగ్గరే పోగైవుంది మరి! ప్రపంచంలోని మొత్తం ధనంలో సగం... ధనవంతులయిన 62 మంది దగ్గర ఉన్న సొమ్ముతో సమానమని ఓ సర్వే వెల్లడించింది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతున్న సందర్భంగా చారిటీ 'ఆక్స్‌ఫామ్‌' తాజాగా తన నివేదికను విడుదల చేసింది. అయితే దేశంలోని సొమ్ము కొందరి వద్దే కేంద్రీకృతమవుతోందనీ, రానురానూ వారి సంఖ్య తగ్గుతోందనీ సర్వే వెల్లడించింది.

2010-15 మధ్య ప్రపంచంలోని పేదల సంపద 50 శాతం నుంచి 41 శాతానికి పడిపోయింది! మరోవైపు వాళ్ల జనాభా మాత్రం 40 కోట్లు పెరిగింది! ఇదే సమయంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 62 మంది శ్రీమంతుల సంపద 500 బిలియన్‌ డాలర్ల నుంచి ఏకంగా 1.76 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది! 2010లో 50 శాతం సంపద 388 మంది వద్ద కేంద్రీకృతమై ఉంటే.. 2014 నాటికి ఈ కోటీశ్వరుల సంఖ్య 80కి చేరగా.. 2015లో ఆ సంఖ్య మరింత తగ్గి 62కు చేరడం గమనార్హం! అందుకే.. ప్రపంచ ఆర్థికవేత్తలంతా తక్షణం ఈ తీవ్రమైన ఆర్థిక అసమానతను సరిచేసే విధానాలపై దృష్టి సారించాలని ఆక్స్‌ఫాం పేర్కొంది.

13:48 - January 18, 2016

పిల్లల చర్మం చాలా మృదువైనది. అయితే ప్రస్తుతం కాలుష్యం అధికంగా ఉండటంతో ముఖంలో మట్టి చేరకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు కాసింత చల్లని నీటితో ముఖం కడుగుతూ చూసుకోవాలి. అప్పుడప్పు దురద వంటి అలెర్జీలకు వైద్యుల సలహా మేరకు క్రీమ్‌లు వాడొచ్చు. అలాగే ఇంట్లో దోమలుంటే అలెర్జీ ఏర్పడటం ఖాయం. అందుచేత దోమల బారి నుంచి పిల్లలు తప్పుకునేందుకు వీలుగా మాశ్చరైజింగ్‌ క్రీమ్‌లు వాడటం మంచిది.
ఇంకా సీజన్‌ వారీగా పిల్లల్లో ఏర్పడే అలెర్జీలకు క్రీమ్‌లను కూడా వైద్యుల సలహాలు మేరకే వాడాలి. ఎప్పుడూ హాట్‌ వాటర్‌ తో స్నానం చేయించడం.. అప్పుడప్పుడు ముఖం కడగడం.. పరిశుభ్రమైన దుస్తులను తొడగడం.. శుభ్రతతో కూడిన ఆహారాన్ని పెట్టడం వంటివి చేస్తే.. అలర్జీలు ఏమాత్రం పిల్లల దరిచేరవు.
ఎక్కువ వేడి లేదా కోల్డ్ వాటర్‌ కంటే గోరువెచ్చని లేదా మితమైన ఐస్‌, హాట్‌ వాటర్‌ను పిల్లల స్నానానికి, ఫేస్‌ వాష్‌లకు ఎంచుకోవచ్చు. పిల్లలకంటూ ప్రత్యేకంగా టవల్స్ వాడటం చేయాలి. స్కూల్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొనేటప్పుడు ఒకే కాటన్‌ను ఉపయోగించకుండా చూసుకోవాలి. మేకప్‌ వస్తువులు కూడా ఇతరులు ఉపయోగించినవి.. పిల్లలు వాడకుండా చూసుకోవాలి. ఎక్కువ సేపు మేకప్‌ అలాగే ఉంచకూడదు.
ఇక విటమిన్‌ లోపాల కారణంగానూ అలెర్జీలు ఏర్పడతాయి. అందుచేత విటమిన్‌ - ఎ తో కూడిన స్వీట్‌ పొటాటో, క్యారెట్లు, నట్స్‌, దోసకాయ, క్యాప్సికమ్‌, మామిడి వంటివి పిల్లల డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే 18 ఏళ్ళు నిండేంత వరకు పిల్లలను బ్యూటీపార్లర్‌ వైపు వెళ్లనివ్వకండి. అక్కడ వాడే రసాయనాలతో పిల్లల చర్మానికి హాని కలుగవచ్చునని చైల్డ్ కేర్‌ నిపుణులు సూచిస్తున్నారు. 

13:46 - January 18, 2016

పౌష్ఠికాహారం కోసం మాంసాహారం, గుడ్లు తీసుకుంటే వాటిని అరిగించుకోవడానికి జీర్ణకోశంపైన అనవసరపు భారం పడుతుంది. శరీరంలోని జీవశక్తి అదనంగా ఖర్చవుతుంది. అలాగని మాంసాహారం, గుడ్లు పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. ఒక పరిమితిలో వీటిని తీసుకోవచ్చు. అయితే, మాంసాహారం నుంచి మాత్రమే కావలసిన పోషకాలు లభిస్తుందనుకోవడం సరికాదు. శాఖాహారం నుంచి కూడా అవసరమైన ప్రొటీన్లతో పాటు పోషక పదార్థాలన్నీ లభిస్తాయి. మొలకెత్తిన పెసర్లు, శనగలు వీటి నుంచి ప్రోటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్లతో పాటు లవణాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. నానబెట్టిన వేరుశనగలలో శరీరానికి కావలసిన ఎన్నో పౌష్ఠిక విలువలు, ప్రోటీన్లు ఉంటాయి. వేరుశనగ గింజలను నానబెట్టాలి. ఆ తర్వాత నీరు తీసివేయాలి. ఇలా చేయడం వల్ల అందులోని హానికారక అంశాలు తొలగిపోతాయి. వీటిని బెల్లంతో కలిపి తీసుకుంటే ఎంతో శక్తి లభిస్తుంది. 

అదృశ్యమైన బాలుడు మురికి కాల్వలో శవమై...

విజయవాడ : రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు మురికి కాల్వలో శవమై తేలాడు. విజయవాడలోని కేఎల్‌రావు నగర్‌లో అవుట్‌పాల్ కాల్వలో ఆరేళ్ల వయసున్న ఓ బాలుడి మృతదేహాన్ని స్థానికులు సోమవారం ఉదయం చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 15న కలర్ హాస్పిటల్ ప్రాంతం నుంచి అదృశ్యమైన సాయిగా మృతుడ్ని గుర్తించారు. బాలుడు కనిపించకుండాపోయిన ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా అతడు శవమై కనిపించడంతో పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

13:36 - January 18, 2016

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన కీలక నివేదిక సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. కృష్ణలంకలో స్వర్ణబార్ లో జరిగిన కల్తీ మద్యం ఘటనలో ఐదుగురు మృతి చెందడమే గాకుండా 27 మంది తీవ్ర అస్వస్థతకు గురయైన సంగతి తెలిసిందే. దీనిపై అనేక ఆధారాలను సిట్ సేకరించింది. బార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుదేనని ఆరోపణలు వచ్చాయి. దీనితో ఈ ఘటనలో విష్ణుతో పాటు ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా కేంద్రానికి పంపిన ఫోరెన్సిక్ నివేదిక సిట్ అధికారుల వద్దకు చేరింది. సీల్డ్ కవర్ లో సిట్ అధికారులు నివేదికను కోర్టుకు సమర్పించారు. నివేదికలో ఎలాంటి అంశాలున్నాయో బయటకు తెలియాల్సి ఉంది. కానీ మద్యంలో ఎలాంటి కల్తీ జరగలేదని, బార్ లో ఉన్న మంచినీటిలో సెనైడ్ కలిపినట్లు నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. నివేదిక కాపీ కావాలని మల్లాది విష్ణు తరపు న్యాయవాది కోర్టును కోరినట్లు సమాచారం. 

విజయవాడ లో ఘనంగా ఎన్టీఆర్ వర్థంతి

విజయవాడ : ఏ ఎన్వెన్షన్ సెంటర్ లో ఎన్టీఆర్ వర్థంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.… నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్టీఆర్ రాజీలేని పోరాటం చేశారన్నారు. దేశంలో సంక్షేమ పథాకాలకు ఎన్టీఆర్ నాంది పలికారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నుంచే వెనుకబడి వర్గాలు, మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు.

రోహిత్ మృతి పట్ల ప్రభుత్వం స్పందించాలి: తమ్మినేని

హైదరాబాద్ : హెచ్ సియూ లో పిహెచ్ డి స్కాలర్, దళిత విద్యార్థి రోహిత్ మృతి పట్ల ప్రభుత్వం స్పందించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. విద్యార్థి మృతికిఇ కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సృతీ ఇరానీలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. టిఆర్ ఎస్ వ్యతిరేక విధానాలపై పోరాడతామని.. ఖమ్మం కార్పొరేషన్ గెలుపు తమ పార్టీదేనని థీమా వ్యక్తం చేశారు.

13:30 - January 18, 2016

హైదరాబాద్ : దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హెచ్‌సీయూలోని ఏబీవీపీ నాయకుడు సుశీల్‌పై దాడి చేశారన్న కారణంతో సరిగ్గా 15 రోజుల క్రితం ఐదుగురు దళిత విద్యార్థులను వీసీ అప్పారావు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్‌ అయిన విద్యార్థుల్లో దొంత ప్రశాంత్‌, వేల్పుల సుంకన్న, శేషయ్య, విజయ్‌కుమార్ లతో పాటు వేముల రోహిత్‌ సైతం ఉన్నారు. పొలిటికల్ సైన్స్ లో పీహెచ్ డీ చేస్తున్న రోహిత్ ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో హెచ్ సీయూలో విషాదం నెలకొంది. రోహిత్ మృతదేహాన్ని తీసుకోపోనీయకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రోహిత్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. రోహిత్ మృతిపై జాక్ ఓ ప్రకటన విడుదల చేసింది. సెంట్రల్ యూనివర్సిటీలో ఎలాంటి వాతావరణం ఉండాలి ? వీసీని సస్పెండ్ చేయాలి..అలాగే కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఇతరులపై చర్యలు తీసుకోవాలి..కేసులు ఎత్తివేయాలి..సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలి. అప్పుడే తమ సమస్యలు పరిష్కారమౌతాయని జాట్ ఆ ప్రకటనలో పేర్కొంది.

11 మందిని చంపేశారు...
ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు టెన్ టివితో మాట్లాడారు. తాము రేపు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం రోహిత్ మృతదేహాన్ని గుంటూరుకు తీసుకెళుతామని, తమకు న్యాయం చేయాలని కోరితే లాఠీచార్జీ చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం శాంతియుతంగా నడుస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఇతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ వేముల లెటర్ ఏమి రాశాడో చూడాలని, 11 మందిని చంపేశారని పేర్కొన్నారు. ఉరి తాళ్లు, విషం ఇవ్వండి అంటూ రోహిత్ లెటర్ లో పేర్కొనడం ఎంత ఆవేదన చెందాడో అర్థమౌతుందన్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణలు ఉండడం సహజమేనని, ఇలాంటివి పరిష్కారం చేయాల్సిన బాధ్యత వర్సిటీదేనన్నారు. అంబేద్కర్ భావజాలంతో ఉండడం తప్పా ? చదువుకొందామని వర్సిటీకి వస్తే ఇలా చేయడం కరెక్టేనా ? బీజేపీకి చెంచాగిరి ఎందుకు చేస్తున్నావంటూ సూటిగా ప్రశ్నించారు. రోహిత్ కు ఎన్ని శిక్షలు వేయాలో అన్ని వేశారని, దళిత ప్రొపెసర్లు స్పందించడం లేదన్నారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాలుగా వర్సిటీని దళితుల శవాల కుప్పలుగా తయారు చేస్తున్నారని, సుశీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలని మరో విద్యార్థి డిమాండ్ చేశారు. 

జీడిమెట్ల ఎస్‌బీఐలో చోరీకి యత్నం...

హైదరాబాద్ : జీడిమెట్ల ఎస్‌బీఐలో ఓదొంగచోరీకి యత్నించాడు. దొంగ చేసిన చోరీ యత్నం సీసీ టీవీలో రికార్డయింది. దీంతో పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.

రోహిత్ ఆత్మహత్యకు బీజేపీ నేతలే కారణం : ఎంపి కవిత

హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యకు బీజేపీ నేతలే కారణమని ఎంపి కవిత విమర్శించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో హెచ్‌సీయూలో నిన్న రోహిత్ అనే ఓ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వర్సిటీలో కొనసాగుతోన్న ఉద్రిక్తతపై ఆమె ఇవాళ స్పందించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్రానికి లేఖ రాయడం వల్లే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. దత్తాత్రేయ ఓ విద్యార్థి సంఘానికి మద్దతునిచ్చే ఉద్దేశ్యంతోనే కేంద్రానికి లేఖ రాశారని వివరించారు.

కల్తీ మద్యం కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇలా...

విజయవాడ : నగరంలో స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో మంచినీళ్లలోనే సెనేడ్ కలిపారని వెల్లడించింది. మద్యంలో కల్తీ జరగలేదని స్పష్టం చేసింది.

స్వర్ణబార్ కల్తీ మద్యం కేసు..

హైదరాబాద్ :నగరంలో స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను సీల్డ్ కవర్ లో సిట్ పోలీసులు కోర్టు సమర్పించారు.. ఈ నివేదికలో మంచినీళ్లలోనే సెనేడ్ కలిపారని వెల్లడించింది. మద్యంలో కల్తీ జరగలేదని స్పష్టం చేసింది. ఫోరెన్సిక్ నివేదిక కాపీ తమకు ఇవ్వాలని కోర్టులో మల్లాది విష్ణు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే బాలకృష్ణ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ను హిందూ పూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కలిసారు. ఈ సందర్భంగా క్యాన్సర్ ఆసుపత్రి సేవలను కేసీఆర్ కు బాలకృష్ణ వివరించారు. క్యాన్సర్ ఆసుపత్రి వద్ద రోగుల సౌకర్యార్థం చేపట్టిన పలు నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని బాల కృష్ణ కోరారు. ప్రభుత్వం సహకరింస్తుందని కేసీఆర్ హామీఇచ్చారు. రోగులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కేసీఆర్ బాలకృష్ణను కోరారు. డిక్టేర్ సినిమా చూడాలని కేసీఆర్ ను బాలయ్య ఆహ్వానించారు.

కల్తీసాస్, కల్తీమసాలా తయారీ గోదాం పై దాడి...

హైదరాబాద్ : ఉస్సేనీ ఆలం పీఎస్ పరిధిలో కల్తీసాస్, మసాలా దినుసు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. పురాణాపూరల్ ఔట్ పోస్టు వద్ద గల గోదాంపై టాస్క్ పోర్స్ పోలీసులు దాడి చేసి ఒకరిని అరెస్టు చేశారు. అంతే కాకుండా భారీగా కల్తీసాస్, మసాల దినుసులు స్వాధీనం చేసుకున్నారు.

గద్దర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్ : హెచ్ సియూ లో పీహెచ్ డి స్కాలర్ రోహిత్ భౌతికకాయాన్ని చూసేందుకు ఉస్మానియా ఆసుపత్రికి వచ్చిన గద్దర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

హెచ్త్ సియూ వీసీ,కేంద్ర మంత్రి దత్తాత్రేయ పై కేసు నమోదు...

హైదరాబాద్ : హెచ్ సియూ లో రోహిత్ ఆత్మహత్య ఘటనపై నలుగురిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన వారిలో వీసీ అప్పారావు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఏబీవీపీ నేత సుశీల్ కుమార్, విష్ణు ఉన్నారు. వీరి పై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

తిరుపతిలో ప్రారంభమైన నంది నాటకోత్సవాలు

తిరుపతి : మహతి ఆడిటోరియలంలో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు సాగనున్న ఈ ఉత్సవాల్లో 44 నాటకాలను కళాకారులు ప్రదర్శించనున్నారు. విజయనగరానికి చెందిన జేవీ రమణ మూర్తికి ఎన్టీఆర్ రంగ స్థల అవార్డును ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు.

నర్సరావుపేట ఎమ్మెల్యే అరెస్ట్...

గుంటూరు : ప్రభుత్వాధికారుల విధులకు భంగం కలిగించిన కేసులో గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(వైకాపా)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంలోని అసైన్ట్‌ భూముల్లో అధికారులు రహదారి పనులు చేస్తుండగా... ఎమ్మెల్యే తన అనుచరులతో వెళ్లి అడ్డుకున్నారు. దీంతో తహసీల్దార్‌ రాజారత్నం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట రూరల్‌ పోలీసులు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

హుగ్లీలో భారీ అగ్ని ప్రమాదం...

కోల్‌కతా : హుగ్లీలోని చాందీతల ఏరియాలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న 10 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

13:00 - January 18, 2016

హైదరాబాద్ : ఇరాన్‌లో నవశకం ప్రారంభమయ్యింది. నూతన అణు ఒప్పందానికి ఇరాన్‌ కట్టుబడి ఉందని అంర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా సహా, పాశ్చాత్య దేశాలు ఆదేశం విధించిన ఆర్ధిక, చమురు ఆంక్షలను తొలగించాయి. దీంతో ఇంతకాలం ఆంక్షలతో సతమతమైన ఇరాన్‌ ఆర్ధిక వ్యవస్థ గాడినపడే అవకాశం ఉందని దేశాధ్యక్షుడు హసన్‌ రౌనీ ప్రకటించారు.

అణు కేంద్రాల తనిఖీకి అనుమతి ఇవ్వని ఇరాన్‌ ...

ఆణుబాంబులు తయారు చేస్తుందన్న ఆరోపణలతో అమెరికా సహా, ఐరోపా దేశాలు ఇరాన్‌పై ఆర్ధిక ఆంక్షలు విధించాయి. తమ అణుకేంద్రాల తనిఖీకి అంతర్జాయ అణశక్తి సంస్థ...ఐఏఈఏ.. అధికారులను ఇరాన్‌ చాలాకాలం అనుమతించలేదు. దీంతో ఇరాన్‌పై పాశ్చాత్య దేశాల అనుమానాలు పెరిగాయి. ఆ తర్వాత అమెరికా సహా ఐరోపా దేశాలు ఆర్ధిక ఆంక్షలు విధించాయి. దీంతో ఇరాన్‌ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యింది.

అణుకేంద్రాల తనిఖీకి ఒప్పుకుంటూ ఒప్పందం........

అధికార మార్పిడితో ఇరాన్‌ పాలకుల వైఖరిలో మార్పు వచ్చింది. హసన్‌ రౌనీ అధ్యక్షుడైన తర్వాత అగ్రరాజ్యాలతో కయ్యం పనికిరాదనుకున్నారు. నెయ్యం మొదలు పెట్టారు. తమ దేశంలోని అణు కేంద్రాల తనిఖీకి ఒప్పుకుంటూ కొత్త అణు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఇరాన్‌లోని అణుకేంద్రాలను తనిఖీ చేసిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధికారులు... ఒప్పందానికి కడ్డుబడి ఉందని నివేదించారు. ఇరాన్‌ అణుబాంబులు తయారు చేయడంలేదని ప్రకటించారు. దీంతో అగ్రరాజ్యాలు ఇరాన్‌పై ఆర్ధిక ఆంక్షలు తొలగించాయి. దీనికి ప్రతిగా ఇరాన్‌ తన దగ్గర ఉన్న అమెరికా బంధీలను విడుదల చేసింది. వీరిలో వాషింగ్‌టన్‌ పోస్టు పత్రిక విలేకరి జాసన్‌ రెజాయిన్‌తోపాటు మ్యాథ్యూ త్రెవిథిక్‌ మరో ముగ్గరు అమెరికన్లు ఉన్నారు. అలాగే ఐరోపా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన బంధీలను కూడా ఇరాన్‌ విడుదల చేసింది.

వంద బిలియన్‌ డాలర్ల ఆస్తుల విడదుల.........

ఇరాన్‌పై ఆర్ధిక, చమురు ఆంక్షలు తొలగించడం వలన ఆ దేశానికి భారీగా ప్రయోజనాలు సమకూరనున్నాయి. గతంలో అమెరికాతోపాటు, పాశ్చాత్య దేశాలు స్తంభింపచేసిన వంద బిలియన్‌ డాలర్ల ఆస్తులను ఇప్పడు విడుదల చేసేందుకు అంగీకరించాయి. ఇదంతా ఇరాన్‌ విక్రయించిన చమురుకు చెల్లించాల్సిన బకాయిలు. అయితే ఇరాన్‌ అణుబాంబులు తయారు చేయడంలేదంటూ ఐఏఈఏ ఇచ్చిన నివేదికపై ఇజ్రాయిల్‌ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇరాన్‌ ఇంకా అణుబాంబు తయారీని కొనసాగిస్తోందన్న అనుమాలను వ్యక్తం చేస్తోంది.   

12:56 - January 18, 2016

హైదరాబాద్ : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సినీనటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయనకు నివాళి అర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌ వద్దకు వచ్చిన బాలకృష్ణ.. తన తండ్రి సమాధిపై పూలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. చరిత్రలో ఎన్నిటికీ మరచిపోని మహనీయుడు ఎన్టీఆర్ అంటూ నివాళులర్పించారు. 

12:54 - January 18, 2016

హైదరాబాద్ : స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.... కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరినీ లోకేష్‌ పలకించరించారు. రక్తదానంలో టిడిపి కార్యకర్తలు దేశంలో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. సేకరించిన రక్తం ఎందరికో ప్రాణదానం చేస్తుందన్నారు. 

12:53 - January 18, 2016

హైదరాబాద్‌: నగరంలోని టిడిపి ప్రధాన కార్యాలయం ట్రస్ట్‌ భవన్‌లో ఎన్టీఆర్ వర్ధింతి కార్యక్రమం నిర్వహించారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తోపాటు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సినీ చాయాచిత్ర ప్రదర్శనను వీరు తిలకించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్ నటించిన ఫోటోలను ప్రదర్శించారు. 

12:51 - January 18, 2016

హైదరాబాద్ : గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో నిందితుడైన మాజీ న్యాయమూర్తి ప్రభాకర్‌రావు ఈరోజు మృతిచెందారు. సికింద్రాబాద్‌ ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని నివాసంలో ప్రభాకర్‌రావు కన్నుమూశారు. ప్రభాకర్‌రావు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా గుండెపోటుతో మృతి చెందారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాలి బెయిల్‌ కుంభకోణంలో ప్రభాకర్‌రావును గతంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.  

12:44 - January 18, 2016

హైదరాబాద్ : హెచ్ సియూలో రోహిత్ ఆత్మహత్యకు కారకుడైన కేంద్ర మంత్రి దత్తాత్రేయను ప్రభుత్వం నుండి వెంటనే భర్తరఫ్ చేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. టీడబ్ల్యూజేఎస్ నిర్వహించిన 'మీట్ ద ప్రెస్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దత్తాత్రేయ చర్య వల్లే 5గురు విద్యార్థులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుంచి సాంఘీక బహిష్కరణ చేశారని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వంలోని మంత్రులే కారణమని ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. వీసీ అప్పారావు, దత్తాత్రేయ, ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారులు ఈ విషయం యొక్క సీరియస్ నెస్ గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

12:40 - January 18, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయ అవకాశవాదం పరాకాష్టకు చేరిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి విమర్శించారు. ఆయన సోమవారం ప్రెస్ క్లబ్ లో టీడబ్ల్యూజేఎస్ నిర్వహించిన 'మీట్ ద ప్రెస్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ… ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఓడిపోయిన వాళ్లు ఓపిక పట్టలేక అధికార పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని అధికార పార్టీ కుట్ర చేస్తోందని ఏపీలో టిడిపి, తెలంగాణ లో టిఆర్ ఎస్ ఒకేలా వ్యవహరిస్తున్నాయని తమ్మినేని విమర్శించారు. హైదరాబాద్ ను విశ్వనగరం చేస్తామంటున్నారు కానీ… చేతల్లో చూపించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పని చేయడం లేదని ఆరోపించారు. టిడిపి- బిజెపి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. 

12:31 - January 18, 2016

హైదరాబాద్ : హెచ్ సియూ లో పిహెచ్ డి స్కాలర్, దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని దళిత విద్యావేత్త మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులైన కేంద్ర మంత్రి దత్తాత్రేయను భర్తరఫ్ చేయాలని, వీసీ అప్పారావు రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేసిన విద్యార్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

12:20 - January 18, 2016

హైదరాబాద్ : యూనివర్శిటీ పెద్ద వల్లే దళిత విద్యార్థులు చనిపోతున్నారని రోహిత్ స్నేహితులు ఆరోపించారు. వారు టెన్ టివితో మాట్లాడుతూ...రోహిత్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని… రోహిత్ ఆత్మహత్య కు వీసీ ప్రేరేపించారని మండి పడ్డారు. యూనివర్శిటీలో ఎలాంటి గొడవ జరగకపోయినా కేంద్ర మంత్రి దత్తాత్రేయ లేఖ వల్ల 5గురు విద్యార్థులను వీసీ సోషల్ బాయ్ కట్ చేశారని మండి పడ్డారు. వీసీ ఇర్రెస్సాన్స్ బుల్ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారు. యూనివర్శిటీలో ఎలాంటి గొడవా జరగలేదు. గొడవ జరిగిందని… ఒక కమిటీ వేశారు. అస్సలు ఆ కమిటీలో ఎవరు వున్నారు… ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇప్పటికైనా వీసీని రీకాల్ చేయాలని, కేంద్ర మంత్రిని దత్తాత్రేయని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్శిలో ఇప్పటి వరకు 12 మంది విద్యార్థులు చనిపోయారని… వారిలో 12వ వ్యక్తి రోహిత్ అని తెలిపారు. మృతి చెందిన వారిలో 10 మంది దళితులు ఉన్నారని ఇప్పటికైనా దళిత విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని, యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ వల్ల చనిపోతున్నారని ఆరోపించారు.

12:00 - January 18, 2016

హైదరబాద్ : హెచ్ సియూ లో పిహెచ్ డీ స్కాలర్ దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకుడైన ఏబీవీపీ విద్యార్థి సుశీల్ కుమార్ ను వెంటనే యూనివర్శిటీ నుండి సస్పెండ్ చేయలని హెచ్ సియూ విద్యార్థి వెంకటేశష్ డిమాండ్ చేశారు. ఆయన 'టెన్ టివి' తో మాట్లాడుతూ...హైదరాబాద్ సెట్రల్ యూనివర్శిలో ఇప్పటి వరకు 11 మంది దళిత విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ యూనివర్శిటీలో కుల మతోన్మాదం రాజ్యమేలుతోంది. హైందవ సమాజంలో బతకడమే నిరసగా బతుకుతున్నామని విద్యార్థి నేతలు వాపోయారు. ఇప్పుడుడిపుడే యూనివర్శిటీకి వచ్చి చదువుకుంటున్న దళిత, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు వాళ్ళ హక్కులు, కరప్షన్ గురించి ప్రశ్నిస్తే ఈ యూనివర్శిటీలో వారిని బతకనివ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. చంపకుండా ప్రత్యక్ష నరకం చూపి చచ్చిపోయేలా ప్రేరేపిస్తారని ఘాటుగా విమర్శించారు. రోహిత్ హత్య ముమ్మాటికి అడ్మినిస్ట్రేషన్ చేసిన హత్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ జోక్యం చేసుకుని మమ్మల్ని యూనివర్శిటీ నుండి బహిష్కరించారని… వెంటనే దత్తాత్రేను భర్తరఫ్ చేయాలని, సుశీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

మధ్యాహ్నం బిజెపి నేత రామారావు అంత్యక్రియలు..

హైదరాబాద్ :సిక్కిం మాజీ గవర్నర్, బిజెపి నేత రామారావు భౌతికాయానికి సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు లు నివాళులర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశాసన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎన్టీఆర్ ను కేసీఆర్ సర్కార్ విస్మరించింది:టిటిడిపి

హైదరాబాద్ : మహనీయుడైన ఎన్టీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని తెలంగాణ తెదేపా విమర్శించింది. ఆయన వర్థంతి సందర్భంగా కనీస ఏర్పాటు కూడా చేయలేదని గ్రేటర్‌ హైదరాబాద్‌ తెదేపా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో నేతలు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. రాజకీయ జీవితం ప్రసాదించిన ఎన్టీఆర్‌ను కేసీఆర్‌ విస్మరించడం దారుణమని నేతలు విమర్శించారు.

కోర్టుకు హాజరైన కరుణా నిధి

హైదరాబాద్‌: పరువునష్టం దావా కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి(92) సోమవారం చెన్నైలోని సెషన్స్‌ కోర్టుకు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేసిన పరువునష్టం దావా కేసులో విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు వచ్చారు. ఆయనతో పాటు కుమార్తె కనిమొళి, చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్‌ ఉన్నారు. కేసును విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.

10:51 - January 18, 2016

హైదరాబాద్ : కేంద్ర మంత్రి దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ భర్తరఫ్ చేయాలి, వీసీ అప్పారావ్ ను రీకాల్ చేయాలి, స్టూడెంట్ సుశీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలని హెచ్ సియూ విద్యార్థి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆయన 'టెన్ టివి' తో మాట్లాడుతూ...ఏం తప్పు చేశామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ 'యాంటి నేషన్' గా రాశారు అని ఆవేదన వెళ్ల గ్రక్కారు. మేం సంఘ విద్రోహులమా? దేశద్రోహులమా? జాతి ద్రోహులమా? ఉగ్రవాదులమా? తీవ్రవాదులమా? నక్సలైట్లమా? ఏం తప్పు చేశామని దత్తాత్రేయను సూటిగా ప్రశ్నించారు. హక్కులు అడిగితే దేశ ద్రోహులు అని అంటారా? మా విద్యార్థి రోహిత్ చనిపోవడానికి, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, కుల రాకాసే కరణమని విమర్శించారు. యూనివర్శిటీలో 5 మందితో వేసిన అప్పర్ క్యాస్ట్ కమిటీ వేశారు. 5 శాతం మంది ఈ యూనివర్శిటీలో చదువుకోవడానికి వస్తున్నా వారిని కూడా బతకనీయకుండా చేస్తున్నారని వాపోయారు. గురువులే మాపై కులాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. మా రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయండి అని డిమాండ్ చేశారు. దళిత విద్యార్థులు చావకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కుల మహమ్మారి ఈ యూనివర్శిటీలో ఇంత ఘోరంగా ఉందని చెప్పడానికి రోహత్ ఆత్మహత్యే ఉదాహరణ అని చెప్పారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ భర్తరఫ్ చేయాలి, వీసీ అప్పారావ్ ను రీకాల్ చేయాలి, స్టూడెంట్ సుశీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

10:41 - January 18, 2016

హైదరాబాద్ : వీపీ అప్పారావ్ ను రీకాల్ చేయాలని హెచ్ సియూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దళిత విద్యార్థి హెచ్ సియూ లో పీహెచ్ డి స్కాలర్ రోహిత్ ఆత్మ హత్య పై విద్యార్థులు భగ్గు మంటున్నారు. వారు 'టెన్ టివి' తో మాట్లాడుతూ… హెచ్‌సీయూలోని ఏబీవీపీ నాయకుడు సుశీల్‌పై దాడి చేశారన్న కారణంతో సరిగ్గా 15 రోజుల క్రితం ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారు వీసీ అప్పారావు. దీనిని నిరసిస్తూ గత కొన్ని రోజులగా నిరాహార దీక్షలకు దిగాం. వీసీని హక్కుల గురించి అడిగితే నన్ను ఎన్డీయే ప్రభుత్వం అపాయింట్ మెంట్ చేసిందని… వారికి సమాధానం చెప్పుకోవాలని చెప్తున్నాడని మండి పడ్డాడు. ఎన్డీఏ ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్ వా? విద్యార్థులకు వైస్ ఛాన్సలర్ వా అని ప్రశ్నించారు. 13 రోజుల నుంచి చలిలో హక్కుల కోసం ధర్నా చేస్తుంటే పరామర్శించడానిక టైం లేదా అని అడుగుతున్నారు. విద్యార్థులను పట్టించుకోని వీసి మాకు అక్కర లేదని వెంటనే వీసీ అప్పారావును రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు.

రోహిత్ సూసైడ్ నోట్ వివరాలు...

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 'మనిషిని మనిషిగా చూడటం లేదు. నా పుట్టుకను చూస్తున్నారు. కులం పేరుతో ఇంకా ఏన్నాళ్లు చూస్తారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. కొన్ని రోజులుగా నా మనసుకు శరీరానికి తీవ్ర ఘర్షణ జరుగుతోంది. నాపుట్టుక తప్పా.. లేక నేనా కులంలో పుట్టడం తప్పా..'' ఇవి రోహిత్‌ వేముల రాసిన చివరి మాటలు విద్యార్థి లోకాన్ని కలిచి వేస్తున్నాయి.

10:23 - January 18, 2016

హైదరాబాద్‌ : సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ మృతదేహాన్ని పోలీసుల ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అడ్డుకున్న విద్యార్ధులపై లాఠీఛార్జి చేశారు. క్యాంపస్‌లోనే విద్యార్ధులు ఆందోళన కొనసాగిస్తున్నారు.హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ మృతదేహాన్ని పోలీసుల ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అడ్డుకున్న విద్యార్ధులపై లాఠీఛార్జి చేశారు. క్యాంపస్‌లోనే విద్యార్ధులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

మాజీ జడ్జి ప్రభాకర్ రావు మృతి

హైదరాబాద్ : మాజీ జడ్జి ప్రభాకర్ రావు మృతి చెందారు.. ఆయన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ స్కామ్ లో కీలకనిందితుడుగా ఉన్నారు. అరెస్టయి బెయిల్ పై ఇటీవలే విడుదలయ్యారు. గుండె పోటుతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రభాకర్ మృతిని అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పీఎస్ ఎల్వీ -31 కౌంట్ డౌన్ ప్రారంభం

నెల్లూరు : పీఎస్ ఎల్వీ -31 కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ కౌంట్ డౌన్ 48 గంటల పాటు కొనసాగనుంది. బుధవారం ఉదయం 9.31 గంటలకు పీఎస్ ఎల్వీ -31 ప్రయోగం జరగనుంది. ఐఆర్ ఎస్ ఎస్ ఎస్ -1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టనుంది.

09:54 - January 18, 2016

మధుమేహ వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా చెప్పవచ్చు, ఇది రెండు రకాలు అవి మొదటిది-ఇన్సులున్ ఉత్పత్తి స్థాయిలో లోపం మరియు రెండవది-శరీరంలో ఇన్సులిన్ సరైన స్థాయిలో ఉత్పత్తి చెందినా, వినియోగంలో లోపం అని చెప్పవచ్చు. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ మరియు శరీర రక్తంలోని చక్కెరలను (గ్లూకోస్ రూపంలో ఉన్న), కాలేయంలో నిల్వ చేస్తుంది, ఈ నిల్వలో కొవ్వు కాణాలు మరియు కండర కణాలు సహాయపడతాయి. మధుమేహ వ్యాధి వలన చాలా రకాల సమస్యలు కలుగుతాయి ముఖ్యంగా నరాలు ప్రమాదానికి గురవటం, రక్త ప్రసరణ లోపాలు ముఖ్యంగా కలిగే ప్రమాదకర అంశాలు అని చెప్పవచ్చు. వీటిని నివారించాలంటే ఈ క్రింది వాటిని తీసుకుంటే సరి.… మరి అవి ఏంటో చూద్దామా....

గింజలు మరియు విత్తనాలు మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యాన్ని చేకూర్చటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. విత్తనాలు మరియు గింజలు మధుమేహ వ్యాధిని తగ్గిస్తాయి. నిజం, గింజలు మరియు విత్తనాల వలన అన్ని రకాల వ్యాధులను తగ్గుతాయట.

బాదం గింజలు.....

బాదంలు అధిక మొత్తంలో ప్రోటీన్'లు, విటమిన్ మరియు మినరల్'లను కలిగి ఉంటాయి; ఆరోగ్యాన్ని ఏలా పెంపొందిస్తాయి అనే దానిపై 'అమెరికన్ యూనివర్సిటీ అఫ్ మెడిసిన్' వారు జరిపిన పరిశోధనల ప్రకారం, రోజు ఒక జత బాదం విత్తనాలను తినటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో కొవ్వు స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ హార్మోన్'ను ఉత్తేజ పరుస్థాయి మరియు రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి అని తెలిపారు

బట్టర్ నట్స్.....

వీటినే వైట్ నట్స్ అని కూడా అంటారు. ఇవి మోనోసాచురేతేడ్ ఫాటీ ఆసిడ్'లను మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను కలిగి ఉండి, టైప్-2 డయాబెటిస్ వలన వచ్చే క్లిష్ట సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా, ఈ గింజలను రోజు తినటం వలన చర్మం కాంతివంతంగా అవటమే కాకుండా, కంటి చూపును కూడా మెరుగుపడుతుంది

ఆక్రోటుకాయ లేదా వాల్నట్స్....

ఆక్రోటుకాయలు ఎక్కువ స్థాయిలో మోనో మరియు పాలీ అన్ సాచురేటేడ్ ఫాట్'లను కలిగి ఉండి శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఎవరైతే రోజు ఈ గినజలను తింటారో, వారి శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు ఆరోగ్యకరంగా మరియు సాధారణ స్థితిలో నిర్వహించబడతాయి.

పిస్తా....

శరీర రక్తంలోని చక్కర స్థాయిలు పెరుగుటకు గల కారణం, శరీరంలో కార్బోహైడ్రేట్'ల స్థాయిలు పెరగటం వలన అని చెప్పవచ్చు. కానీ రోజు పిస్తాలను తినటం వలన శరీరంలో పెరిగే కార్బోహైడ్రేట్'ల స్థాయిలు సాధారణ స్థితిలో లేదా వాటి పెరుగుదలను ఇవి తగ్గిస్తాయి.

జీడిపప్పు.....

ఇతర గింజలతో పోలిస్తే, జీడిపప్పులో తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలు ఉంటాయి. జీడిపప్పులో, గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే మోనో-సాచురేటేడ్ ఫాట్ లేదా 'ఒలేయిక్ ఆసిడ్'లను 75 శాతం వరకు కలిగి ఉంటాయి. జీడిపప్పులో ఉండే ఫాట్'లు, ఆలివ్ ఆయిల్'లో ఉండే ఫాట్'లు ఒకేరకం అని చెప్పవచ్చు. మోనోసాచురేటేడ్ ఫాట్'లు శరీరంలో ట్రై-గ్లిసరైడ్ లేదా రక్తంలో ఉండే ఫాట్'లను తగ్గించి, మధుమేహ వ్యాధి గ్రస్తులలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి అని చెప్పవచ్చు

గుమ్మడి విత్తనాలు....

గుమ్మడి వలన మధుమేహ వ్యాధి గ్రస్తులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతున్నాయి, వీటి విత్తనాల వలన కూడా ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి, గుమ్మడి విత్తనాలు విటమిన్ 'సి', 'ఇ' ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ప్రోటీన్ మరియు ఫైబర్ వంటి చాలా రకాల మూలకాలను అందిస్తుంది. గుమ్మడి విత్తనాలు మధుమేహ వ్యాధి అభివృద్ధి, వాటి వలన కలిగే సమస్యలు, ఇన్సులిన్ ఉత్పత్తి మరియు ఒత్తిడిని తగ్గించటంలో ఈ విత్తనాలు సహాయం చేస్తాయి

నేరేడు విత్తనాలు

మధుమేహ వ్యాధి గ్రస్తులకు నేరేడు పండ్లు అద్బుతమైన ఆహరం అని అందరికి తెలిసిందే, అంతేకాకుండా, వీటి విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఉపయోగాన్ని కలిగిస్తాయి. ఎండబెట్టిన వీటి విత్తనాలను, దంచి, పోడిలా చేసి రోజు వాడటం వలన శరీర రక్తంలోని చక్కరలను సాధారణ స్థితిలో ఉంచబడతాయి. ఈ విత్తనాలు ఔషద గుణాలను కలిగి ఉన్న 'జామ్బిలిన్' అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది, ఇది శరీర రక్తంలోని చక్కెరలను స్థిరంగా ఉంచుతుంది.

మెంతులు....

మధుమేహ వ్యాధి గ్రస్తులు వారి పరిస్థితిని సాధారణ స్థితిలో ఉంచుకోటానికి ఈ విత్తనాలు సహాయపడతాయి. మెంతి విత్తనాలు ఫోలిక్ ఆసిడ్, సోడియం, జింక్, మెగ్నీషియం, కాపర్, థయామిన్, నియాసిన్, కేరోటీన్ వంటి మూలకాలను కలిగి ఉండి, మధుమేహ వ్యాధి మరియు కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి. రోజు ఒక చెంచా మెంతి విత్తనాల పొడిని నీటిలో కలుపుకొని తాగటం వలన ఆరోగ్యం పెంపొందించబడుతుంది

నువ్వులు......

నువ్వు విత్తనాలు యాంటీ ఆక్సిడెంట్'లు, పాలీ మరియు మోనో అన్ సాచురేటేడ్ ఫాట్'లను పుష్కలంగా కలిగి ఉంటాయి. రోజు మీరు తినే ఆహరంలో నువ్వు విత్తనాలను కలుపుకోవటం వలన అధిక రక్త పీడనం, రక్తంలో గ్లూకోస్, చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచటమే కాకుండా, క్యాన్సర్ వ్యాధిని కూడా నివారిస్తుంది.

09:26 - January 18, 2016

హైదరాబాద్‌ : సెంట్రల్‌ యూనివర్శిటీ ఉడికిపోతోంది. దళిత విద్యార్ధి రోహిత్‌ ఆత్మహత్యతో అట్టుడికిపోతోంది. పదిరోజులుగా నడుస్తున్న నిరసనలు, ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. రోహిత్‌ ఆత్మహత్యకు వీసీ తీసుకున్న సస్పెన్షన్‌ చర్యలే కారణమని విద్యార్ధులు, విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నారు. ఏబీవీపీ, ఇతర విద్యార్ధి సంఘాల మధ్య మొదలైన వివాదం పెరిగి పెద్దదైంది. బిజెపి నేతలు పైస్థాయిలో జోక్యం చేసుకుని మరీ దళిత విద్యార్ధులను సస్పెండ్‌ చేయించారని విద్యార్ధులు మండిపడుతున్నారు. ఇప్పుడు రోహిత్‌ ఆత్మహత్యతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు రోహిత్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. 

09:22 - January 18, 2016

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ మరణించి 20 ఏళ్లయినా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఎన్టీఆర్‌ ఉంటే రెండు రాష్ట్రాల్లో ప్రజలు సుభిక్షంగా ఉండేవారన్నారు. టీడీపీతో ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేదని లక్ష్మీపార్వతి అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఆశయాలు కొనసాగే పరిస్థితులు లేవన్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ను సైతం సరిగా అలంకరించలేదని లక్ష్మీపార్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఓల్డ్ బోయిగూడలో దారుణ హత్య...

హైదరాబాద్ : మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయిగూడలో దారుణం జరిగింది. సోనాజ్ సింగ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సోనాజ్ సింగ్ స్నేహితుడే చంపి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ముంబై లోని అంధేరి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ : ముంబయిలోని అంధేరి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐదు అంతస్తుల టైమ్స్ స్కయర్ భవనంలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి 8 ఫైరింజన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తుంది. మంటలు ఎగిసిపడుతుంటడంతో ఆ ప్రాంతంలో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ఇక ఈ భవనంలో కార్పొరేట్, ఐటీ కార్యాలయాలతో పాటు పలువురు నివాసముంటున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తుంది.

08:26 - January 18, 2016

హైదరాబాద్ : నేడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 20వ వర్ధంతి. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయనకు కుటుంబసభ్యులు నందమూరి హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ తదితరులు నివాళులు అర్పించారు. సినీ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి కూడా ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. గ్రామాలకు రహదారులు, బస్సు సౌకర్యాలు కల్పించింది ఎన్టీఆర్‌ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు. ‘నాన్నకు ప్రేమతో’ తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు.

స్వచ్ఛభారత్ కు స్ఫూర్తి ఎన్టీఆరే : హరికృష్ణ

హైదరాబాద్ :నేడు దేశవ్యాప్తంగా అమలవుతున్న స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి మాజీ సీఎం ఎన్టీఆరే స్ఫూర్తి అని ఆయన తనయుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌ 20వ వర్థంతి సందర్భంగా ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. హరికృష్ణ తనయులు కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌, దర్శకుడు వైవీఎస్‌ చౌదరి తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ నిరంతరం పేదల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. గ్రామాలకు రహదారులు, బస్సు సౌకర్యాలు కల్పించింది ఎన్టీఆర్‌ హయాంలోనే అని ఆయన గుర్తు చేశారు.

సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. విద్యార్థులను చెదరగొట్టి మృతదేహాన్ని తరలించేందుకు పోలీయులు యత్నిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

07:56 - January 18, 2016

హైదరాబాద్ : హెచ్ సియూలో రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రోహిత్ ఆత్మహత్యకు హెచ్ సియూ వైస్ చాన్సలర్ దే బాధ్యత వహించాలని 'న్యూస్ మార్నింగ్'చర్చలో సీపీఎం నేత బి.వెంకట్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కుల వివక్షకు మరో విద్యా కుసుమం నేలరాలింది. మతోన్మాద శక్తుల కుట్రకు దళిత పరిశోధక విద్యార్థి బలయ్యాడు. ఇటీవలే ఏబీవీపీ విద్యార్థిపై దాడిచేశారనే ఆరోపణతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో సాంఘిక బహిష్కరణకు గురైన వేముల రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్‌ హెచ్‌సీయూలో సైన్స్‌ ఆండ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఐదుగురు దళిత విద్యార్థులపై సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలని 15 రోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి నిరాహార దీక్షలు ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం,కేంద్రమంత్రులు ప్రేరణ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందా? ప్రభుత్వాలు, సంఘాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదా? నిజా నిజాలు తేల్చాల్సిన అవసరం లేదా? ఈఘటనలో కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ బాధ్యత ఎంత? హెచ్ సీయూ వైస్ చాన్సలర్ ప్రమేయం ఎంత? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చించారు. ఈ చర్చలో వెంకట్ తో పాటు టిఆర్ ఎస్ తాడూరి శ్రీనివాస్, బిజెపి నేత శ్రీథర్ రెడ్డి, టి.కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. ఈ ఘటనపై వారు స్పందించిన తీరు ఎలా వుందో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:42 - January 18, 2016

హైదరాబాద్ : నారింజరంగులో మెరిసి పోతున్న ఈ జినియా పువ్వును చూశారు కదూ! ఏమిటి దీని ప్రత్యేకత అంటా రా? అంతరిక్షంలో విర బూసిన తొలి పువ్వు ఇది! ఎన్నో ప్రయో గాలు, పరిశోధనలతో నాసా శాస్త్రవేత్తలు అం తర్జాతీయ స్పేస్‌ సెంట ర్‌లో సాధించిన విజయ మిది! ఏళ్ల తరబడి సాగిన కృషి తరువాత ఆదివారం జినియా పువ్వు పూర్తి స్థాయిలో వికసించడంతో వారిలో హార్షాతిరేకం వెల్లి విరిసింది. అంతరిక్షంలో పంటలు పండించేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. అంతరిక్షంలో తొలిసారి పూసిన జినియా పువ్వు చిత్రాన్ని నాసా శాస్త్రవేత్త స్కాట్ కెల్లీ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్‌ఎస్) నుంచి ట్వీట్ చేశారు. అంతరిక్షంలో జీవం ఉందనడానికి నిగనిగలాడుతున్న జినియా పువ్వే సాక్ష్యమని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మైక్రో గ్రావిటీలో మొక్కల పెంపకాన్ని చేపట్టామని, ఆ క్రమంలోనే ఐఎస్‌ఎస్‌లోని వెజ్జీ ల్యాబ్‌లో 2014 మే నెలలో ఈ పువ్వు విత్తనాన్ని నాటామని ఆయన తెలిపారు. జినియా మొక్క పెంపకం ద్వారా సాధించిన అనుభవం, విజ్ఞానంతో రానున్న కాలంలో అంతరిక్షంలో టమాటా, ఇతర ఆహార పంటలను పండిస్తామని శాస్త్రవేత్తలు దీమా వ్యక్తం చేశారు. మొక్కలకు అసవరమయ్యే సూర్యకాంతి కోసం ల్యాబ్‌లో ఎరుపు, నీలి, ఆకుపచ్చని రంగులో ఉండే ఎల్‌ఈడీ లైట్లను శాస్త్రవేత్తలు ఉపయోగించారు.

టోల్ గేట్ ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా ఊరెళ్లిన వారు తిరిగి వస్తుండటంతో టోల్ గేట్ ల వద్ద భారీగా వ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఎక్కడికక్క వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన హరికృష్ణ

హైదరాబాద్ : నేడు ప్రముఖ నటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామరావు 20వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు హరికృష్ణ, మనుమళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.

నేడు ఎన్టీఆర్ 20వ వర్థంతి....

హైదరాబాద్ : నేడు ప్రముఖ నటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామరావు 20వ వర్ధంతి.ఈ సందర్భంగా వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని చోట్ల ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహించేందుకు తెలుగు తమ్ముళ్లు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఆర్మీ దరఖాస్తులకు రేపు తుది గడువు

ఖమ్మం : కొత్తగూడెంలో వచ్చేనెల 4 నుంచి 13 వరకు నిర్వహించనున్న ఆర్మీ ర్యాలీకి మంగళవారం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్ 20 నుంచి ప్రారంభమైన ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 19న ముగియనుంది. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే ఈ ఆర్మీ ర్యాలీలో పాల్గొనే అవకాశం కల్పించారు. మొత్తం ఆరు విభాగాల్లో నియామకాలు చేయనున్నారు.

06:51 - January 18, 2016

హైదరాబాద్ : విద్యార్థులకిది పరీక్షా కాలం. మరికొద్ది వారాల్లో ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ఆ తర్వాత అన్ని తరగతులవారికి వార్షిక పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మరో వైపు తెలంగాణ లో ఏప్రిల్ లోనే గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతోంది. వివిధ సెట్ల తేదీలు ప్రకటించారు. ఇప్పుడు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటిలోనూ ఎగ్జామ్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఒక రౌండ్ సిలబస్ పూర్తి చేసినవారు రివిజన్ ప్రారంభిస్తున్నారు. అసలు పుస్తకాలు తెరవనివారు ఇప్పుడిప్పుడే వాటి దుమ్ము దులుపుతున్నారు. మొత్తానికి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ పై విద్యార్థులంతా దృష్టి సారిస్తున్నారు. ఇటు అమ్మానాన్నలు, అటు ట్యూటర్ లు పిల్లల చదువుల మీద ఓ కన్నేసి వుంచుతున్నారు. తమ పిల్లలకు మంచి ర్యాంక్, మంచి కాలేజీలో సీటు రావాలన్న ఉద్దేశంతో ఒత్తిడి పెంచుతున్నారు. రాబోతున్న పరీక్షల కారణంగా పెరుగుతున్న మానసిక ఒత్తిడిని జయించడం ఎలా? పరీక్షల ప్రిపరేషన్ లో పాటించాల్సిన మెళుకువలేమిటి? ప్రిపరేషన్ సమయంలో సాధారణంగా విద్యార్థులు, వారి పేరెంట్స్ చేసే పొరపాట్లేమిటి? పరీక్షలకు ప్రిపేరవుతున్న పిల్లలకు అమ్మానాన్నలు ఎలాంటి సహకారం అందించాలి? ఇలాంటి అంశాలపై జనపథంలో చర్చను చేపట్టింది. ఈ అంశాలపై సలహాలు సూచనలు అందించేందుకు ప్రముఖ సైకాలజిస్ట్ టీఎస్ రావు విజయవాడ స్టూడియో నుంచి చర్చలో పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను సూచించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

06:45 - January 18, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించడంతో .. టీఆర్ఎస్‌లో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. పార్టీని నమ్మకున్న తమకు టికెట్లు దక్కలేదంటూ పలువురు నేతలు.. రెబల్స్‌గా రంగంలోకి దిగారు. వీరితో నామినేషన్లను ఉపసంహరింప చేసేందుకు.. అధికార పార్టీ కొంత మంది కీలక నేతలను రంగంలోకి దించింది.

మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలని తహతహ.....

గ్రేటర్‌ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలని తహతహ లాడుతున్న పాలక టీఆర్ఎస్‌కు.. పార్టీలోని అసంతృప్తులు తలనొప్పిగా మారాయి. అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ ఆచితూచి వ్యవహరించింది. నిజానికి గ్రేటర్‌ పరిధిలో పార్టీకి పెద్దగా పట్టు లేదు. అయినా.. ఆపార్టీ ఏడాదికాలంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌ను విశ్వసించింది. ఎన్నికల నగారా మోగాక కూడా.. ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆహ్వానించింది. దీంతో.. గ్రేటర్‌ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం టీఆర్ఎస్‌కు ఇబ్బంది కాలేదు.

అయితే ఇదే అంశం పార్టీలో అసంతృప్తినీ రాజేసింది.

సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.....

ఇతర పార్టీల అభ్యర్థుల గురించి ఆరాలు తీస్తూనే.. సర్వేల ఆధారంగా తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది టీఆర్ఎస్‌. ఈ ఎన్నికల్లో ఎందరో ఆశావహులు పార్టీ టికెట్‌ ఆశించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలతో పాటు.. టిజెఏసీ నేతలు కూడా అధికార పార్టీ టికెట్లను ఆశించారు. కానీ వారందరికీ మొండి చేయి ఎదురైంది. పైగా టీఆర్ఎస్‌ ప్రకటించిన జాబితాలో.. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతల కుటుంబ సభ్యులకే పెద్ద పీట వేసినట్లు స్పష్టమైంది. పైగా పార్టీ టికెట్‌ పొందినవారిలో చాలామంది ఇటీవలి కాలంలో పార్టీలోకి చేరినవారే. దీంతో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారిలో అసంతృప్తి భగ్గుమంది. వీరిలో అత్యధికులు రెబెల్‌ అభ్యర్థులగా బరిలోకి దిగారు. మరోవైపు.. టికెట్‌ ఆశించి భంగపడ్డ పలువరు అమాత్యుల అనుచరులు కూడా తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్‌లు వేశారు.

రెబల్స్‌ను బుజ్జగించే పనికి శ్రీకారం....

రెబెల్స్‌ రంగంలో ఉంటే.. టీఆర్ఎస్‌ అధికార అభ్యర్థులకు కష్టమేనని పార్టీ అధిష్ఠానం గుర్తించింది. దీంతో.. రెబల్స్‌ను బుజ్జగించే పనికి శ్రీకారం చుట్టింది. పార్టీకి చెందిన కీలక నేతలను ఈ పనికి పురమాయించింది. వీరు, రెబల్స్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే టికెట్ల కేటాయింపులో కూడా దళారులు రంగంలోకి దిగడంతోనే అన్యాయం జరిగిందని పలువురు నేతలు వాపోతున్నారు.

06:42 - January 18, 2016

విజయవాడ : ఏపీ ప్రగతి రథ చక్రాలు.. ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్‌ నగరంలో పరుగులు తీస్తున్నాయి. ఏపీ ఖ్యాతినీ, అమరావతి విశిష్టతనూ స్విట్జర్లాండ్‌లో చాటుతూ.. ఏపీ బస్సు రయ్యి రయ్యిన దూసుకు వెళుతోంది. ఆంధ్రా బస్సేంటి..? స్విట్జర్లాండ్‌లో పరుగులు పెట్టడం ఏంటి..? అనుకుంటున్నారా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్తున్న సందర్బంగా..పెట్టుబడుల్ని ఆకర్శించేందుకు ఏపీ బస్సు స్విట్జర్లాండులో పరుగులు పెడుతోంది.

ప్రపంచ ఆర్థిక వేదికగా భాసిల్లే దావోస్‌ లో.........

స్విట్జర్లాండ్‌లో.. ప్రపంచ ఆర్థిక వేదికగా భాసిల్లే దావోస్‌ నగరంలో.. ఓ బస్సు స్థానికులను విపరీతంగా ఆకర్షిస్తోంది. మేక్‌ ఆంధ్రప్రదేశ్‌ యువర్‌ బిజినెస్‌ అన్న స్లోగన్‌.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లోగోలతో ఉన్న ఈ బస్సు.. అక్కడి ప్రయాణికులను రయ్యి రయ్యిమంటూ గమ్యస్థానాలకు చేరుస్తోంది.

రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులతో ..

సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరిట.. ఇటీవలే విశాఖలో వాణిజ్య భాగస్వామ్య సదస్సును నిర్వహించిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్రపంచ స్థాయి సదస్సులపైనా కన్నేసింది. విశాఖ సీఐఐ సదస్సులో దాదాపు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి అమలు అంశంపై దృష్టి సారిస్తూనే.. మరిన్ని విదేశీ పెట్టుబడులను సాధించేందుకు చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తోంది. విదేశాల్లో జరిగే ఎకనామిక్‌ ఫోరమ్‌లను లక్ష్యంగా చేసుకొని.. పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే... ఈ బస్సు ద్వారా.. ఇలా ఏపీ రాష్ట్రానికి ప్రచారం కల్పిస్తోంది.

ఈనెల 20నుంచి 23వ తేదీ వరకూ.....

ఈనెల 20నుంచి 23వ తేదీ వరకూ.. దావోస్‌ నగరంలో ప్రపంచ ఆర్థిక వేదిక 46వ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని మంత్రుల బృందం కూడా హాజరు కానుంది. దావోస్‌కు వచ్చే వాణిజ్య వేత్తలను ఆకర్షించేందుకు.. ప్రభుత్వం సదస్సుకు వారం ముందు నుంచే బస్సు ద్వారా ఏపీ గురించి ఇలా ప్రచారం ప్రారంభించింది.

వాణిజ్యవేత్తలంతా ఇట్టే గుర్తుపట్టే విధంగా ......

ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని.. వాణిజ్యవేత్తలంతా ఇట్టే గుర్తుపట్టే విధంగా చేయాలన్నదే తమ ఉద్దేశమని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. దావోస్ లాంటి నగరంలో ప్రచార రథాలను పరుగులను పెట్టించడం ద్వారా విదేశీలను విశేషంగా అకర్షించడమే కాకుండా పెట్టుబడులు పెద్ద మొత్తంలో రానున్నాయనే అభిప్రాయం ఏపీ సర్కార్ లో ఉంది. ప్రభుత్వ ఉద్దేశమెలా ఉన్నా.. దావోస్‌ రహదారులపై దూసుకుపోతున్న రాష్ట్ర ప్రగతి రథ చక్రాలు మాత్రం.. స్థానికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.  

06:39 - January 18, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పాలక మండలి ఎన్నికలకుగాను అన్ని వార్డుల్లోనూ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి నిమిషం వరకూ ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తిస్థాయి అభ్యర్థుల జాబితా ప్రకటించలేకపోయింది. ఒక్కో డివిజన్ లో ప్రతి రాజకీయ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో రెబల్స్ బరిలో నిలిచారు.

నాలుగు రోజుల పాటు జరిగిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ...

జీహెచ్‌ఎంసీలో నాలుగు రోజుల పాటు జరిగిన నామినేషన్ల దాఖలు ప్రక్రియలో చివరి నిమిషం వరకూ అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉత్కంఠ కలిగించింది. ఫిబ్రవరి రెండున జరిగే బల్దియా ఎన్నికల కోసం రెండు వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రెండు రోజుల్లో కేవలం 94 నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా... చివరి రెండు రోజుల్లో అభ్యర్థులు 2969 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

నేటి నుంచి నామినేషన్ల పరిశీలన.......

నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నేటి నుంచి ఎన్నికల సంఘం చేపట్టనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21 వ తేదీ వరకు గడువు ఉంది. అదే రోజు బరిలోకి దిగే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఈ నెల 21 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోగా బీ ఫారం లను రిటర్నింగ్ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. బీ ఫారం అందజేసిన అభ్యర్థులకు మాత్రమే సంబంధిత రాజకీయ పార్టీ అధికారిక గుర్తు కేటాయిస్తారు.. బీ ఫారం లేని అభ్యర్థులు స్వతంత్రులుగా ప్రకటిస్తారు.

పెద్ద సంఖ్యలో రెబల్స్ బరిలో......

అన్ని రాజకీయ పార్టీల నుంచీ పెద్ద సంఖ్యలో రెబల్స్ బరిలో ఉండటంతో..... వారిని బుజ్జగించే ప్రయత్నాలను పార్టీల నేతలు ముమ్మరం చేశారు. మరో వైపు ఎన్నడూ లేని విధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగానే రంగంలోకి దిగారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలూ నామినేషన్ల గడువు పూర్తయ్యే వరకు కూడా పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితా విడుదల చేయలేకపోయాయి. అభ్యర్థుల నుంచి తీవ్ర పోటీతో పాటు పార్టీ ఫిరాయింపుల భయం కూడా జాబితా రాకపోవటానికి కారణమని పార్టీల నేతలు చెబుతున్నారు.

జీహెచ్ఎంసీలో ని మొత్తం 150 డివిజన్లకు గాను......

జీహెచ్ఎంసీలో ని మొత్తం 150 డివిజన్లకు గాను తెరాస 143 డివిజన్లకు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ 94 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది. బీజేపీ, టీడీపీ కూటమి 150 డివిజన్లకు గాను చివరి క్షణంలో 144 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 63 స్థానాలకు బీజేపీ అభ్యర్థులు 87కు గాను 81 స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. పార్టీల జాబితాలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహులంతా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం ముగియటంతో రెబల్ గా బరిలోకి దిగిన అభ్యర్థులను బజ్జగించేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఆయా పార్టీల సీనియర్ నేతలు బుజ్జగింపుల పనిలో నిమగ్నమయ్యారు.

06:34 - January 18, 2016

హైదరాబాద్ : దళిత విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యతో సెంట్రల్‌ వర్సిటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమతో పాటు పోరు సాగిస్తున్న మిత్రుడు బలవన్మరణం పొందాడనే విషయాన్ని తోటి విద్యార్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తూనే రోహిత్‌ మతోన్మాద శక్తులతో అలుపెరుగని పోరు సాగించాడు. కానీ చివరకు కుల రక్కసి కాటుకు విగత జీవి అయ్యాడు.

ఈ యూనివర్సిటీలో మనిషిని మనిషిగా చూడటం లేదు......

ఈ యూనివర్సిటీలో మనిషిని మనిషిగా చూడటం లేదు. నా పుట్టుకను చూస్తున్నారు. కులం పేరుతో ఇంకా ఏన్నాళ్లు చూస్తారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. కొన్ని రోజులుగా నా మనసుకు శరీరానికి తీవ్ర ఘర్షణ జరుగుతోంది. నాపుట్టుక తప్పా.. లేక నేనా కులంలో పుట్టడం తప్పా..'' ఇవి రోహిత్‌ వేముల రాసిన చివరి మాటలు. అతని ఆత్మాభిమానికి సాక్ష్యంగా నిలిచింది ఈ సూసైడ్‌ నోట్‌..

పొలిటికల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న రోహిత్‌.....

పొలిటికల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న రోహిత్‌ మతోన్మాద రాజకీయాలకు బలయ్యాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన రోహిత్‌ స్వస్థలం గుంటూరు. క్యాంపస్‌లో దళిత, వామపక్ష ఉద్యమాల్లో యాక్టివ్‌గా రోహిత్‌ చాలాకాలంగా యాక్టివ్‌గా పాల్గొన్నాడు. వర్సిటీలోని విద్యార్థుల సమస్యలపై రోహిత్‌ క్రియాశీలకంగా వ్యవహరించాడు.

ఏబీవీపీ నాయకుడు సుశీల్‌పై దాడి చేశారన్న కారణంతో .....

హెచ్‌సీయూలోని ఏబీవీపీ నాయకుడు సుశీల్‌పై దాడి చేశారన్న కారణంతో సరిగ్గా 15 రోజుల క్రితం ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారు వీసీ అప్పారావు. సస్పెండ్‌ అయిన విద్యార్థుల్లో దొంత ప్రశాంత్‌, వేల్పుల సుంకన్న, శేషయ్య, విజయ్‌కుమార్ లతో పాటు వేముల రోహిత్‌ సైతం ఉన్నారు. అప్పటి నుంచి బాధిత విద్యార్థులు, అన్ని విద్యార్థి సంఘాలు వర్సిటీలో నిరసనలు కొనసాగిస్తున్నారు.

విచారణలో ఏబివిపి విద్యార్థిపై దాడి జరగలేదని తేలింది.....

యూనివర్శిటీ విచారణ కమిటీ, పోలీసులు చేసిన విచారణలో ఏబివిపి విద్యార్థిపై దాడి జరగలేదని తేలింది. అయినప్పటికీ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు కక్షసాధింపు చర్యలకు దిగినట్లు విద్యర్థులు ఆరోపిస్తున్నారు. వీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాలు జేఏసీ ఏర్పాటు చేసి పోరు సాగిస్తున్నాయి. అయితే సస్పెన్షన్‌ ఎత్తివేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఇప్పటికే విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.

సస్పెన్షన్‌ వెనుక కేంద్ర మంత్రులు హస్తం.....

ఇదిలా ఉంటే విద్యార్థుల సస్పెన్షన్‌ వెనుక కేంద్ర మంత్రులు హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏబీవీపీ విద్యార్థి సంఘానికి చెందిన నేతలు కేంద్ర మంత్రి బండారుదత్తాత్రేయ ద్వారా దళిత వామపక్ష విద్యార్థులను సస్పెండ్‌ చేయాలంటూ లెటర్‌ రాసినట్లు సమాచారం. ఈ లెటర్‌ ద్వారానే కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇరానీ ఆదేశించారు. ఇదిలా ఉంటే హెచ్‌సీయూ వర్సిటీ నియామకం వెనుక కూడా మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రోద్బలం ఉన్నట్లు సమాచారం. 

06:31 - January 18, 2016

హైదరాబాద్ : కుల వివక్షకు మరో విద్యా కుసుమం నేలరాలింది. మతోన్మాద శక్తుల కుట్రకు దళిత పరిశోధక విద్యార్థి బలయ్యాడు. ఇటీవలే ఏబీవీపీ విద్యార్థిపై దాడిచేశారనే ఆరోపణతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో సాంఘిక బహిష్కరణకు గురైన వేముల రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన రోహిత్‌ హెచ్‌సీయూలో సైన్స్‌ ఆండ్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ఐదుగురు దళిత విద్యార్థులపై సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలని 15 రోజులుగా వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి నిరాహార దీక్షలు ప్రారంభం అయ్యాయి.

రోహిత్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని....

ఈ దీక్షల్లో మధ్యాహ్నం 12 గంటల వరకూ అక్కడే ఉన్న రోహిత్‌ డాక్టరల్‌ కమిటీ రిపోర్టు ఇవ్వాల్సి ఉందని నోట్స్‌ రాసుకుంటానని, ఎన్‌ఆర్‌హెచ్‌ హాస్టల్‌లోని ఆయన స్నేహితుడు ఉమామహేశ్వర్‌రావు రూముకు వెళ్లాడు. ఈ క్రమంలో సాయంత్రం ఆరున్నర గంటలకు రూముకు వెళ్లి చూడగా, రోహిత్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు. దీంతో విషయం తెలిసిన విద్యార్థులంతా అక్కడికి చేసుకొని బోరున విలపించారు.

14 రోజుల పాటు అందరం చలిలోనూ.....

14 రోజుల పాటు అందరం చలిలోనూ కలిసి ఉన్నామని, ఇలా జరుగుతుందని ఊహించలేకపోయామని వాపోయారు. ఈ సందర్భంగా నాలుగు పేజిల సూసైడ్‌ నోట్‌ రాశారు. దీంట్లో ప్రస్తుతం దళితుల స్థితిగతులు, వర్సిటీలో విద్యార్థుల పరిస్థితిని వివరించారు.

డిప్యూటీ సెక్యూరిటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్‌రావు అడ్డుకున్న విద్యార్థులు...

విషయం తెలుసుకున్న డిప్యూటీ సెక్యూరిటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్‌రావు అక్కడికి రావడంతో విద్యార్థులు ఆయనను అపడ్డుకున్నారు. వీసీ అప్పారావు వచ్చే వరకూ భౌతికకాయం తరలించేందుకు ఒప్పుకోమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఇది ఆత్మహత్య కాదని, మతోన్మాదుల హత్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలను వెంటనే అరెస్టు చేయాలని....

ఈ ఆత్మహత్య కారకులైన కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీలను వెంటనే అరెస్టు చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయగా విద్యార్థులు ప్రతిఘటించారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కు పిలుపు...

ఇదిలాఉంటే హెచ్‌సీయూలో వేముల రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. తెలంగాణలోని అన్ని మండల, డివిజన్‌, జిల్లా, కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం, మతోన్మాదుల దిష్టిబొమ్మలను దహనం చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. 

రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్

హైదరాబాద్ :  హెచ్‌సీయూలో వేముల రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. తెలంగాణలోని అన్ని మండల, డివిజన్‌, జిల్లా, కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం, మతోన్మాదుల దిష్టిబొమ్మలను దహనం చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. 

హెచ్‌సీయూలో దళిత విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ : కుల వివక్షకు, రాజకీయకక్షకు విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి నేలకొరిగాడు. తనను మనిషిగా చూడటం లేదని, కులం పేరుతో ఇంకా ఎన్నాళ్లు చూస్తారంటూ ప్రశ్నించి విగత జీవిగా మారాడు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని వారాలుగా వర్సిటీలో జరుగుతున్న పరిణామాలే రోహిత్ మృతికి కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. 

06:26 - January 18, 2016

విశాఖ : గాజువాకలో పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి గుంటూరు వెళ్తున్న కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్‌ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాంధోళనకు గురయ్యారు. గాజువాకకు చేరుకోగానే బస్సులో వస్తున్న మంటల్ని చూసిన ప్రయాణికులు వెంటనే బస్సును ఆపి అందరూ దిగేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. 

06:23 - January 18, 2016

కర్నూలు : వెల్దుర్తి మండలం మల్లేపల్లి వద్ద కేరళ నుండి వస్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వాసులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.

గాజువాకలో ఓల్వో బస్సు దగ్ధం

విశాఖ : నగరంలో గాజువాక నుండి గుంటూరుకు బయలు దేరిన కాళేశ్వరి ట్రావెల్స్ కు చెందిన ఓల్వో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన ప్రయాణీకులు హుఠాహుటిన బస్సు నుండి కిందకి దిగి పోయారు. వెంటనే బస్సు కాలి పోయింది. గ్యాస్ లీక్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

డివైడర్ ను ఢీ కొట్టిన కారు : ఆరుగురు మృతి

కర్నూలు : వెల్దుర్తి మండలం మల్లేపల్లి వద్ద ఓ కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 6గురు మృతి చెందారు. మృతులు మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వాసులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.

Don't Miss