Activities calendar

19 January 2016

దుబాయ్ లో సంక్రాంతి సంబురాలు...

హైదరాబాద్‌ : తెలుగు తరంగిణి ఆధ్వర్యంలో యు.ఎ.ఇ.లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంగ రంగ వైభవంగా జరిగాయి. రస్ అల్ఖైమా నగరంలో జాతీయ గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు హరిదాసుల సందడి, రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి పళ్లు, బొమ్మల కొలువులతో పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ సంక్రాంతి పండుగను ఆనందోత్సాహలతో జరుపుకున్నారు.

21:56 - January 19, 2016

పెనం మీదికొచ్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘటన.. బీజేపీ మెడకు వడ్డ హెచ్ సీయూ ఉచ్చు…  యాదరిగిగుట్ట కింద పోలీసుల డ్రంక్ ఆండ్ డ్రైవ్, స్వచ్ఛ అనంతపురం, రోడ్లపైకి వచ్చిన పులులు… కొత్త సన్యాసి, బట్టల దుకాణానికి పోయిన కేసీఆర్ వంటి అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం..
.

21:47 - January 19, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ మృతికి నిరసనగా విద్యార్థి,ప్రజాసంఘాలు పెద్దఎత్తున ధర్నాలు రాస్తారోకోలు చేశారు. రోహిత్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

రోహిత్‌ మృతితో ఆందోళనలు

హెచ్‌సీయూలో దళిత విద్యార్థి రోహిత్‌ మృతితో తెలుగురాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. కేంద్రమంత్రి దత్తాత్రేయ, వీసీ అప్పా రావులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కెవిపిఎస్ నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని పాత బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.  

రోహిత్ ది ఆత్మహత్య కాదు.. హత్యే : కళ్యాణరావు

రోహిత్ ది ఆత్మహత్య కాదని హత్యేనని విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణరావు ఆరోపించారు. వీసీ, కేంద్రమంత్రి దత్తాత్రేయపై చర్యలు తీసుకోవాలని ఒంగోలులో కులనిర్మూలన పోరాట సమితి డిమాండ్ చేసింది. 

రోహిత్ మృతికి రాజకీయ కుట్ర : రామకృష్ణ

రోహిత్ మృతికి రాజకీయ కుట్ర దాగి ఉందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. దీని వెనక బిజెపి కేంద్ర మంత్రులు, ఎంఎల్ సీల ప్రమేయం ఉందని కాబట్టే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు.  

వనపర్తిలో నిరసనలు 

మరోవైపు పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రమంత్రి దత్తాత్రేయ దిష్టిబొమ్మను PDSU నాయకులు దహనం చేశారు.  రోహిత్ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ మృతికి కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ అటు నిజామాబాద్ లోను ఆందోళనలు వెల్లువెత్తాయి. విద్యార్థి సంఘాల నాయకుల ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. కారకులను శిక్షించాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ, స్మృతి ఇరానీ దిష్టి బొమ్మలు దహనం చేశారు.  

పాలమూరు యూనివర్శిటీలో ఆందోళన 

ఇటు పాలమూరు యూనివర్శిటీ విద్యార్థులు రోహిత్ మృతికి నిరసనగా ఆందోళన చేపట్టారు. యూనివర్శిటీ గేట్ ఎదుట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. రోహిత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో రాయచూర్, హైదరాబాద్ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక నెల్లూరు జిల్లాలోను రోహిత్ మృతికి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, కులసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో పాటు కేంద్రమంత్రుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.  రోహిత్ మృతి చెందడంపై ఇంత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నా ఇప్పటికీ విసీ పై చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

21:42 - January 19, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతిపై తన ప్రగాడ సానుభూతిని ప్రకటించారు వైఎస్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. దళిత విద్యార్థులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు జగన్. మృతి  చెందిన విద్యార్థి రోహిత్ కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. విద్యార్థి మృతికి వీసీ కేంద్ర మంత్రుల పాత్ర ఉందని ఆరోపించారు. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.   

21:39 - January 19, 2016

హైదరాబాద్ : దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ మృతికి హెచ్‌సియూ వైస్ ఛాన్స్‌లర్, కేంద్ర ప్రభుత్వమే నైతికంగా బాధ్యత వహించాలని  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని ఖూనీ చేశారంటూ ప్రధానిపై కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. 
హెచ్ సీయూను సందర్శించిన రాహుల్ 
దళిత పిహెచ్‌డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీని సందర్శించారు. మృతుడి తల్లి రాధికను పరామర్శించారు. రోహిత్‌ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను రోహిత్‌ కుటుంసభ్యులు, సహచర విద్యార్థులు, విద్యార్థి నాయకులను అడిగి తెలుసుకున్నారు.
పక్షపాత ధోరణితో విద్యార్థుల జీవితాలు నాశనం : రాహుల్  
యూనివర్శిటీల్లో పక్షపాత ధోరణి కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడితే వారి కుటుంబాన్ని పరామర్శించే నైతిక బాధ్యత వీసీకి లేదా? అని రాహుల్‌ ప్రశ్నించారు. వీసీ, కేంద్రమంత్రులు సరిగా వ్యవహరించనందువల్లే రోహిత్‌ ప్రాణాలు తీసుకున్నాడని ఆరోపించారు.  రోహిత్ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రోహిత్‌ కుటుంబానికి పరిహారం చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. తానిక్కడికి రాజకీయాలు చేయడానికి రాలేదని, ఎప్పుడు అవసరమున్నా విద్యార్థులకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.  
వీసీపై కఠిన చర్యలు తీసుకోవాలి : అసదుద్దీన్ 
రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి హెచ్ సీయూ వైస్‌ ఛాన్సెలర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ  డిమాండ్ చేశారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించిన మంత్రి దత్తాత్రేయ వైఖరిని ఆయన ఖండించారు.
జంతర్‌మంతర్‌ వద్ద ఆప్‌ కొవ్వొత్తు ప్రదర్శన 
పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. దళిత విద్యార్థుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆప్‌ కొవ్వొత్తు ప్రదర్శన నిర్వహించింది. యూనివర్సిటీల్లో కాషాయ ఎమర్జెన్సీ కొనసాగుతోందని విద్యార్థులు మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్  స్పందించారు. 'దళితులను ఉద్ధరిస్తామని మోదీ సర్కారు గొప్పలు చెబుతోంది. మోదీ మంత్రులేమో ఐదుగురు దళిత విద్యార్థుల నోరు నొక్కి, వారిని సస్పెన్షన్ కు కారణమయ్యారు. ఇది ఆత్మహత్య కాదు, ప్రజాస్వామ్య హత్య. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక న్యాయాన్ని ఖూనీ చేశార'ని కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు. దీనికి బాధ్యులైన మంత్రులను మోది కాబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.
చెన్నైలో విద్యార్థి సంఘాల ఆందోళన
రోహిత్‌ వేముల మృతికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ చెన్నైలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నుంగంబాక్కంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయం శాస్త్రి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ, విసి అప్పారావు దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. బిజెపి కుల రాజకీయాలను ప్రోత్సహిస్తోందంటూ మండిపడ్డారు.

21:34 - January 19, 2016

ప్రపంచం తీవ్ర అసమానతలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచంలోని సంపదను అతి కొద్ది మందే అనుభవిస్తున్నారు. డబ్బును డబ్బే సంపాదిస్తుంది. సంపన్నులు మరింత సంపన్నులవుతున్నారు. పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. పేదరికం మరింత పేదరికాన్ని ఆకర్షిస్తోంది. శ్రీమంతులు వెలిగిపోగుతున్నారు. సామాన్యులు చితికి పోతున్నారు. అతి కొద్ది మంది దగ్గర పంపద పోగుపడుతుంది. అర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. సామాన్యులు కనీస సౌకర్యాలు లేక ఆగచాట్లు పడుతున్నారు. ఈ దుస్థితికి కారణమేంటీ...? ఇదే అంశంపై ఈరోజు వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం… పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

 

పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలులో సాంకేతికలోపం..

గుంటూరు : పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నడికుడి-పొందుగుల మధ్య రైలును నిలిపి వేశారు. 

 

గ్రేటర్ లో 3850 నామినేషన్లు ఆమోదం : ఈసీ

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలకు 3850 నామినేషన్లు ఆమోదం పొందాయని ఎన్నికల అధికారి తెలిపారు. 189 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని పేర్కొన్నారు. 7మంది అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారని చెప్పారు. ఈనెల 21 వరకు నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉందన్నారు. 3 వేల పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు

20:59 - January 19, 2016

హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వీసీ అప్పారావులు కారణమని వక్తలు ఆరోపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో రచయిత పసునూరి రవీంద్ర, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి రాకేష్, సామాజిక విశ్లేషకులు కోప్రా, బిజెపి అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొణగల మహేష్ పాల్గొని, మాట్లాడారు. రోహిత్ మృతికి బండార దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు పూర్తి బాధ్యత వహించాలన్నారు. 
విద్యార్థి మృతికి బిజెపి నేతలు కనీసం సానుభూతి, సంతాపం కూడా ప్రకటించడం లేదని మండిపడ్డారు. బిజెపి, ఆర్ ఎస్ ఎస్ హిందూత్వ, మతోన్మాద పోకడులకు పోతోందని విమర్శించారు. కిషన్ రెడ్డి వి పచ్చి అబద్ధాలని పేర్కొన్నారు. విద్యార్థులపై దత్తాత్రేయ నిందలు వేశారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని దళిత విద్యార్థులు 13 రోజులపాటు దీక్షకు దిగారు. అయనా కేంద్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోహిత్ మృతికి బీజేపీ నేతలే కారణమని.. వారే రోహిత్ ను చంపారని ఆరోపించారు. బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను బర్తరఫ్ చేయాలని, వీసీని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:45 - January 19, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ రిసెర్చ్ స్కాలర్ విద్యార్థి రోహిత్ మృతిపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. రోహిత్ మృతికి నిరసనగా రచయిత అశోక్ వాజ్ పేయి తనకు ఇచ్చిన డాక్టరేట్ అవార్డును వెనక్కి పంపించారు. హెచ్ సియు ప్రదానం చేసిన డి.లిట్ అవార్డును తిప్పి పంపుతున్నట్లు ఆయన ప్రకటించారు. హెచ్ సీయూతోపాటు ఢిల్లీలో ని సెంట్రల్ యూనివర్సిటీ, దేశ వ్యాప్తంగా రోహిత్ మృతి ఘటనకు నిరసనలు మిన్నంటాయి. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు ముక్త కంఠంతో నిరసన గళం వినిపిస్తున్నారు.

 

రోహిత్ మృతిపై వెల్లువెత్తున్న నిరసనలు

హైదరాబాద్ : హెచ్ సీయూ రిసెర్చ్ స్కాలర్ విద్యార్థి రోహిత్ మృతిపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. రోహిత్ మృతికి నిరసనగా రచయిత అశోక్ వాజ్ పేయి తనకు ఇచ్చిన డాక్టరేట్ అవార్డును వెనక్కి పంపించారు. హెచ్ సియు ప్రదానం చేసిన డి.లిట్ అవార్డును తిప్పి పంపుతున్నట్లు ఆయన ప్రకటించారు. 

20:15 - January 19, 2016

అనంతపురం : క్రికెటర్ ధోనికి ఊరట లభించింది. ధోనిపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను అనంతపురం కోర్టు రద్దు చేసింది. ధోనీ, దేవతా స్వరూపంలో ఉన్నట్లుగా బిజినెస్‌ టుడే పత్రిక ముఖచిత్రం ప్రచురించింది. దీనిపై ఆగ్రహించిన విశ్వ హిందూ పరిషత్.. ధోనీపై కోర్టులో కేసు వేసింది. ఆస్ట్రేలియాతో సిరీస్ జరుగుతున్నందున ధోనీ హాజరు కాలేడని , వారెంట్ ను రద్దు చేయాలని ధోనీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో న్యాయమూర్తి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను రద్దు చేశారు.

 

20:13 - January 19, 2016

కాకినాడ: హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై తూర్పు గోదావరి జిల్లాలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రిలో పీడీఎస్ యూ విద్యార్థి సంఘం  ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తక్షణమే కేంద్ర మంత్రులను కేబినెట్ నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 

20:09 - January 19, 2016

గుంటూరు : జిల్లాలో అగ్రకులస్తుల దాడిలో ఓ దళితుడు మృతి చెందాడు. చుండూరు మండలం దిండిపాలెం గ్రామానికి చెందిన శామ్యూల్‌ అనే దళితుడిపై అగ్రకులస్తులు మూడు రోజులు దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శామ్యూల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన శామ్యూల్‌ బంధువులు... దళిత సంఘాల నాయకులు, కార్యర్తలతో కలిసి ఆస్పత్రి దగ్గర ఆందోళనకు దిగాయి. తీవ్ర ఉద్రిక్తతలు నెలకోనడంతో శాంతిభద్రతల పరిరక్షణకు   పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. 

 

19:44 - January 19, 2016

అనంతపురం : జిల్లాలో దారుణం జరిగింది. సమృద్ధి జీవన్ చిట్స్‌ ఏజెంట్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని అమడుగూరు మండలం సినిగానిపల్లె నివాసి శ్రీనివాసరెడ్డి కర్ణాటకకు చెందిన సమృద్ధి జీవన్ చిట్స్‌లో ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈనేపథ్యంలో తన పొలంలో పురుగులమందు తాగి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కంపెనీ వ్యవహారాలే అతని ఆత్మహత్యకు కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. మృతికి కారణమైన సమృద్ధి కంపెనీపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. 

 

19:37 - January 19, 2016

అనంతపురం : ఎయిరిండియా మేనేజర్ పై దాడి కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని 2 రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతించాలని శ్రీకాళహస్తి కోర్టులో పోలీసుల పిటీషన్ వేశారు. మరోవైపు  బెయిల్ కోసం ఎంపీ మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు తిరుపతి సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

 

19:32 - January 19, 2016

కృష్ణా : విజయవాడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజమండ్రికి చెందిన వినోద్‌ కదంబ్‌ను బంగారం దొంగతనం కేసులో పోలీసులు విచారణ కోసం తీసుకువచ్చారు. మూడో ఫ్లోర్‌ నుంచి అతన్ని కిందికి తీసుకువస్తుండగా పై నుంచి వినోద్‌ కిందకు దూకేశాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వినోద్‌ కోలుకుంటున్నాడని సమాచారం. దొంగతనం కేసుతో మనస్తాపంచెంది నిందితుడు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. 

 

19:26 - January 19, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్‌లో డిప్యూటీ స్పీకర్‌ బుద్దప్రసాద్‌ కమిటీ సమావేశం జరిగింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సంఘటనలు, రోజా సస్పెన్షన్‌, వీడియో లీక్‌పై కమిటీ చర్చించింది. ఈ నెల 27న మరోసారి భేటీ కావాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశానికి టీడీపీ నేత శ్రవణ్‌ కుమార్‌, వైసీపీ నేత శ్రీకాంత్‌ రెడ్డి, బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు హాజరయ్యారు.

 

19:23 - January 19, 2016

కృష్ణా : కాల్‌మనీ కేసులో ముగ్గురు నిందితులకు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నిందితులు యలమంచిలి రాము, భవానీ శంకర్‌, దూడల రాజేశ్‌కు షరతులతోకూడిన బెయిల్‌ ఇచ్చింది. లక్ష రూపాయల పూచీకత్తు, దేశం విడిచి వెళ్లకూడదని షరతు విధించింది. అలాగే విచారణకు సహకరించాలని ఆదేశించింది. 

19:19 - January 19, 2016

మహబూబ్ నగర్ : సీఎం కేసీఆర్ పర్యటనతో ఆ బస్తీవాసులు సంతోషంలో మునిగిపోయారు. మురికివాడలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామన్న సీఎం హామీతో ఇక తమ కష్టాలు తీరిపోయినట్లే అనుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లుతో పాటు మంచినీటి కష్టాలు తీరుస్తానని సీఎం వరాలు కురిపించారు. ఇదంతా ఏడాది క్రితం పాలమూరు మున్సిపాలిటీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు. అయితే నేటికీ ఒక్క హామీ కూడా అమలు కాకపోవడంతో మురికివాడల ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. 
హామీలు ఏమైనట్లు ? 
సరిగ్గా ఏడాది క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇవి. పాలమూరు మున్సిపాలిటీలోని మురికివాడల పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఇవి. 2015 జనవరి 18వ తేదీన పాలమూరు మున్సిపాలిటీలో ఒక రోజు సుడిగాలి పర్యటన నిర్వహించారు. పాతపాలమూరు, వీరన్నపేట, పాతతోట, ఎర్రమన్నగుట్ట కాలనీలో పర్యటించారు. ఇళ్లిల్లు తిరిగి బస్తీవాసుల కష్టాలు కళ్లారా చూశారు. ఇలాంటి చోట ఎలా నివసిస్తున్నారని మురికివాడల వాసులను ప్రశ్నించారు. ఇక మీ కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు.15రోజుల్లో వచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో మురికివాడల ప్రజలు ఎంతో ఆనందపడ్డారు. ఇక తమ కష్టాలు తీరిపోయాయనుకున్నారు. కానీ ఏడాదైనా సీఎం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలుకాకపోవడంతో బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం హామీలపై జనం ఆగ్రహం 
ఏడాది క్రితం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. పాలమూరులో ఉన్న 29 మురికి వాడలను దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. మొదటి విడతలో పాతపాలమూరు, వీరన్నపేట, పాతతోట, ఎర్రమన్నుగట్టు కాలనీలను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. మున్సిపాలిటీ పరిధిలో 6,500కు పైగా నివాసాలు లేని కుటుంబాలకు మొదటి విడతలో 2,300మందికి పక్కాగృహాలు కట్టిస్తామన్నారు. మున్సిపాలిటీలో ప్రతి రెండు వేల జనాభాకు నీటిశుద్ధి యంత్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఐదు చోట్ల అత్యాధునిక కూరగాయల మార్కెట్లు నిర్మిస్తామన్నారు. అలాగే 4కోట్ల రూపాయలతో మున్సిపల్ టౌన్ హాల్ నిర్మిస్తామన్నారు. పెద్దచెరువును ట్యాంకుబండ్‌ తరహాలో తీర్చిదిద్దుతామన్నారు. సామాజిక మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, పట్టణానికి ఇరువైపులా చెత్త నిల్వకేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ సీఎం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. డబుల్ బెడ్ ఇళ్ల విషయలో మాత్రం టెండర్లు పిలిచినా ధర సరిపోవడం లేదని గుత్తేదార్లు ముందుకు రావడంలేదు. దీంతో బస్తీవాసులు సమస్యల సుడిగుండంలోనే జీవనం కొనసాగిస్తున్నారు. 
దశల వారీగా 29 మురికి వాడల అభివృద్ది 
సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలే అమలు కాకపోతే పరిస్థితి ఏంటని బస్తీవాసులు ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ పర్యటన తర్వాత ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పది రోజుల పాటు హడావుడి చేసి ఆ తర్వాత సైలెంట్‌ అయ్యారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని మురికివాడల ప్రజలు కోరుతున్నారు. మరి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల ఫైలు ఇప్పటికైనా కదులుతుందో లేదో చూడాలి. 

 

19:10 - January 19, 2016

కరీంనగర్‌ : జిల్లాలో నిర్వహించిన చల్లప్ప కమిషన్‌ సమావేశం నిరసనలతో హోరెత్తింది. వాల్మీకి బోయ, కైతి లంబాడి కులస్థులను ఎస్‌టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌పై కమిషన్‌ అభిప్రాయ సేకరణ చేపట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ గిరిజన విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. వీరికి పోటీగా తమను ఎస్‌టీ జాబితాలో కలపాలంటూ వాల్మీకి, బోయ కులాల నేతలు నిరసన చేపట్టాయి. దీంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. వెంటనే కమిషన్‌ సభ్యులు సమావేశం ముగించి మధ్యలోనే వెళ్లిపోయారు.

 

19:07 - January 19, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతికి పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి దత్తాత్రేయ వహించాలని మాలమహానాడు నేత కారెం శివాజీ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని దత్తాత్రేయను భర్తరఫ్ చేయాలని కోరారు. వీసీ అప్పారావుపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.

 

19:02 - January 19, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య బాధాకరమని టీటీడీపీ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనుల్లోనే తాము బీజేపీతో భాగస్వామ్యమని...సామాజిక వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ఇది వర్తించదని తేల్చి చెప్పారు.

 

18:57 - January 19, 2016

హైదరాబాద్ : పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ దురదృష్టకరమని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఈ ఘటనలో హెచ్ సీయూ వీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారంటూ కేంద్రమంత్రి దత్తాత్రేయ వైఖరిని ఖండించారు.

 

18:28 - January 19, 2016

అమెరికా : ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలపై పడుతోంది. చివరకు ఐఎస్ ఐఎస్ నూ కుదిపేస్తోంది. అమెరికా దాడులతో ఐసిస్‌ తీవ్రవాదుల జీతాలను సగానికి కోసేశారు. సిరియాలో అన్ని హోదాల్లో ఉన్న ముజాహిద్దీన్లకూ కోత వర్తిస్తుందంటూ ఐసిస్‌ స్పష్టం చేసింది. 
ఐసిస్‌పై అన్నివర్గాల్లో వ్యతిరేకత 
ఐఎస్‌ఐఎస్‌.. ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఉగ్రవాద సంస్థ. ఎక్కడో ఇరాక్‌, సిరియాలో పుట్టిన ఈ టెర్రరిస్ట్‌ గ్రూప్‌ అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. సామాన్యులను ఊచకోత కోయడం.. బాంబులతో విరుచుకుపడుతూ అమాయకులను బలి తీసుకోవడంతో ఐసిస్‌పై అన్నివర్గాల్లో వ్యతిరేకతను పెంచింది.
ఐఎస్‌ఐఎస్‌ ఆర్థిక మూలాలపై అమెరికా దృష్టి 
ఐఎస్‌ఐఎస్‌ ఉగ్ర కార్యకలాపాలను సీరియస్‌గా తీసుకున్న అమెరికా వారి ఆర్థిక మూలాలపై దృష్టి సారించింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల వరుస దాడులతో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆదాయ మార్గాలు తగ్గడంతో సిరియాలో తన ఫైటర్ల జీతాలకు అమాంతం కోత పెట్టింది. ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ముజాహిద్దీన్ల జీతాలను 50శాతం వరకు తగ్గించింది.
ఐఎస్ఐఎస్ స్థావరాలపై వైమానిక దాడులు 
ఆపరేషన్ 'టైడల్ వేవ్ 2' పేరిట అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు సిరియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఐఎస్ఐఎస్ చమురు బావులు, చమురు సరఫరా లైన్లు, నగదు దుకాణాలు లక్ష్యంగా దాని ఆర్థిక వనరులను దెబ్బతీయడమే ధ్యేయంగా ఈ దాడులు జరుపుతున్నాయి. వ్యూహాత్మకంగా కొనసాగుతున్న ఈ దాడుల ప్రభావం ఐఎస్ఐఎస్‌ మీద గణనీయంగా ఉన్నట్టు ఆ గ్రూపు తాజాగా విడుదల చేసిన ఓ లెటర్‌ చెబుతోంది. 
ముజాహిద్దీన్ల జీతాలు సగానికి తగ్గింపు 
'ఇస్లామిక్ స్టేట్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ముజాహిద్దీన్లందరికీ చెల్లిస్తున్న జీతాల్ని సగానికి తగ్గిస్తున్నాం. ఎలాంటి హోదాలో ఉన్నవారికైనా ఈ నిర్ణయం నుంచి మినహాయింపు ఉండదు' అని సిరియా రఖ్కాలోని ఐఎస్‌ కోశాగార విభాగం 'బేత్‌ మాల్‌ అల్‌ ముస్లిమీన్‌' ఈ పత్రంలో స్పష్టం చేసింది. 

 

ముగిసిన మండలి బుద్ధప్రసాద్ కమిటీ సమావేశం...

హైదరాబాద్: ఎపి అసెంబ్లీ హాల్ లో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన సంఘటనలు, రోజా సస్పెన్షన్ వ్యవహారం, వీడియో లీకుల వంటి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 

17:39 - January 19, 2016

నల్గొండ : అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు కిడ్నీ విక్రయించిన నూకరాజును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్‌ నడుపుతున్న సురేశ్ ప్రజాపాటి... 57మందిని కొలంబోకు తరలించి కిడ్నీ మార్పిడి చేయించారని పోలీసులు తెలిపారు. కిడ్నీ కొనుగోలుచేసిన వారి ఆచూకీ రాబడుతున్నామని ప్రకటించారు. అవసరమైతే కొలంబో వెళ్లి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. 

 

17:36 - January 19, 2016

ప్రకాశం : సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ది ఆత్మహత్య కాదని హత్యేనని విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణరావు ఆరోపించారు. ఒంగోలులో కులనిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి దత్తాత్రేయ లేఖ రాసిన ఆధారంగానే రోహిత్ పై చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. విద్యార్థి మృతిని హత్యగా పరిగణించాల్సిన అవసరం ఉందని కళ్యాణ్ రావు అన్నారు. వీసీ, కేంద్రమంత్రి దత్తాత్రేయలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

17:30 - January 19, 2016

తూర్పుగోదావరి : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతిలో రాజకీయ కుట్ర దాగి ఉందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. కాకినాడలో దళిత హక్కుల పోరాట సమితి ద్వితీయ రాష్ట మహాసభ జరిగింది. మృతి చెందిన విద్యార్థి రోహిత్ కు ఆయన నివాళులు అర్పించారు. రోహిత్ మృతి వెనక బిజెపి కేంద్ర మంత్రులు, ఎంఎల్ సీల ప్రమేయం ఉంది కాబట్టే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. యూనివర్శిటీలో విద్యను కాషాయమయం చేస్తున్నారని విమర్శించారు. 

17:17 - January 19, 2016

అసోం : కాంగ్రెస్‌ పాలనలో అసోం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అసోం అసెంబ్లీకి వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కోక్రాఝర్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పదిహేనేళ్ల నుంచి అసోంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా మంచినీరు, విద్యుత్‌ వంటి సమస్యలు పరిష్కారం కాలేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. బీజీపీకి అధికారం ఇస్తే 15 నెలల్లోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మోడీ హామీ ఇచ్చారు. 

17:14 - January 19, 2016

 ఢిల్లీ : సీపీఐ అగ్రనేత బర్దన్‌ జీవితమంతా పోరాటమయమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ కొనియాడారు. ఢిల్లీలో నిర్వహించిన బర్దన్‌ సంతాపసభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బర్దన్ తో తన అనుబంధాన్ని ఏచూరీ గుర్తు చేసుకున్నారు. 

17:02 - January 19, 2016

విశాఖ : ఏజెన్సీలో పోలీసు నిర్భంద చర్యలపై సీపీఎం మండిపడింది. ఏ కారణం లేకుండా గిరిజనులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించింది. చింతపల్లి పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని సీపీఎం కార్యదర్శివర్గం సభ్యులు సీహెచ్ నర్సింగరావు విమర్శించారు. విశాఖలో ఆ పార్టీ ఆధ్వర్యంలో బాధిత గిరిజనులతో సమావేశం ఏర్పాటైన సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. జెర్రెల మాజీ సర్పంచ్‌ హత్య తర్వాత అరెస్టులు మరింత పెరిగాయన్నారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా పోరాడితే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ కుటుంబసభ్యుల్ని రహస్య ప్రదేశాలకు తీసుకువెళ్లి చిత్రహింసలు పెడుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

16:53 - January 19, 2016

విజయవాడ : ఈ ఏప్రెల్‌ నాటికి ఏపీని సారా రహిత రాష్ట్రంగా చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలో 13 జిల్లాల ఎక్సైజ్‌ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నాటు సారా తయారుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ మద్యం కేసులో ఇప్పటికే కొందరిని అరెస్టు చేశామని ప్రకటించారు. సిట్‌ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

 

16:47 - January 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదని టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉద్యమాన్ని వ్యతిరేకించినవారు ఇప్పుడు పాలకులై జనాల నెత్తిన కూర్చున్నారని విమర్శించారు.

16:44 - January 19, 2016

మహబూబ్ నగర్ : హెచ్ సీయూలో రోహిత్ మృతికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రమంత్రి దత్తాత్రేయ దిష్టిబొమ్మను పీడీఎస్ యూ నాయకులు దహనం చేశారు. రోహిత్ మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

 

16:39 - January 19, 2016

హైదరాబాద్: హెచ్ సీయూలో మృతి చెందిన దళిత విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా నెల్లూరు జిల్లాలో విద్యార్థి సంఘాలు , ప్రజా సంఘాలు దళిత సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థికి మృతికి నిరసనగా దిష్టి బొమ్మదహనం చేశారు. కాలేజీ వైస్ ఛాన్సలర్ నిరంకుశత్వానికి ఆత్మబలిదానం చేయాల్సి వచ్చిందని సీపీఎం నేతలు అన్నారు. 

 

రోహిత్ మృతిపై హెచ్ ఆర్ సీని ఆశ్రయించిన పిడమర్తి రవి

హైదరాబాద్: హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతిపై ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి హెచ్ ఆర్ సీని ఆశ్రయించారు.

 

పాక్ లో యూట్యూబ్‌పై నిషేధం ఎత్తివేత

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో యూట్యూబ్‌పై నిషేధం ఎత్తివేశారు. ఇక నుండి ఇక్కడ కూడా యూట్యూబ్‌ను వాడుకోవచ్చునని ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 2012లో ముస్లిములకు వ్యతిరేకంగా వచ్చిన 'ఇన్నోసెన్స్ ఆఫ్‌ ముస్లిమ్స్' అనే సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఫలితంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో దేశంలో యూట్యూబ్‌ను నిషేధించారు. 192 మిలియన్ల జనాభా ఉన్న పాక్‌లో మెజార్టీ వర్గం ముస్లిములదే. గతంలో ముస్లింలకు , ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చాలా మంది కొట్టి చంపారు.

ప్రపంచంలో అత్యంత వృద్ధుడు కన్నుమూత...

జపాన్: ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా రికార్డులకెక్కిన వృద్ధుడు ఈరోజు ఉదయం మృతి చెందాడు. జపాన్‌కు చెందిన యస్‌తారో కైడే అనే వృద్ధుడు గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అతని వయస్సు 112. కైడే ఓ టైలరిస్ట్ (దర్జీ). గతేడాది ఆగస్టులో అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొంది గిన్నీస్‌ రికార్డు సృష్టించాడు. జపాన్‌లోని సైతామా ప్రాంతానికి చెందిన సకారీ మోమయ్‌ తర్వాత 112 ఏళ్లు బతికిన వ్యక్తిగా కైడే గతేడాది ఆగస్టులో గుర్తింపు పొందాడు.

సీనియర్‌ పాత్రికేయుడు అరూన్‌ మృతి

హైదరాబాద్‌: సీనియర్‌ పాత్రికేయుడు, విద్యావేత్త అరూన్‌ టికేకర్‌ అనారోగ్య కారణాలతో మంగళవారం కన్నుమూశారు. పాత్రికేయ వృత్తికీ అరూన్‌ టికేకర్‌ విస్తృత సేవలు అందించారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రిఫరెన్స్‌ చీఫ్‌గా వ్యవహరించారు. దశాబ్ద కాలం (1992-2002) ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మరాఠీ పత్రికకు సంపాదకత్వం వహించారు. మహారాష్ట్ర టైమ్స్‌కు సీనియర్‌ అసిస్టెంట్‌ ఎడిటర్‌గా, లోక్‌సత్తా పత్రిక ఎడిటర్‌గా పనిచేశారు. మరాఠీ, ఆంగ్ల భాషల్లో 20పైగా పుస్తకాలు రాశారు.

 

15:46 - January 19, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతిపై సీపీఎం ఆగ్రహం  వ్యక్తం చేసింది. రోహిత్ ది ఆత్మహత్య కాదని.. ఎన్ డీఏ హత్య అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. విద్యా కాషాయీకరణను ఎండగడతామని చెప్పారు. వీసీ అప్పారావు, కేంద్రమంత్రి దత్తాత్రేయలను వారి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. రేపు హెచ్ సీయూకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ రానున్నారని తెలిపారు.

 

 

వచ్చే నెల 13 నుంచి 21 వరకు మేడారంకు ప్రత్యేక బస్సులు..

హైదరాబాద్ : ఫిబ్రవరి 13 నుంచి 21 వరకు హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలో జరిగే మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ప్రతిరోజు 50 చొప్పున ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు చేసుకునే సదుపాయం ఉందని ఆర్టీసీ వెల్లడించింది. టిఎస్ ఆర్ టిసి ఆన్ లైన్.ఇన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు.

రోహిత్ మృతిపై సీపీఎం ఆగ్రహం...

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతిపై సీపీఎం ఆగ్రహం  వ్యక్తం చేసింది. రోహిత్ ది ఆత్మహత్య కాదని.. ఎన్ డీఏ హత్య అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. విద్యా కాషాయీకరణను ఎండగడతామని చెప్పారు. వీసీ అప్పారావు, కేంద్రమంత్రి దత్తాత్రేయలను వారి పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. రేపు హెచ్ సీయూకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ రానున్నారని తెలిపారు. 

 

 

14:51 - January 19, 2016

హైదరాబాద్  : సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు వర్సిటీ వీసీ, హెచ్చార్డీ మినిష్టర్ స్మృతి ఇరాని బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్న సమయంలో రాహుల్ వర్సిటీకి చేరుకున్నారు. అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. రోహిత్  తల్లి, దండ్రులను పరామర్శించారు. జేఏసీ ఏర్పాటు చేసిన మీటింగ్ లో రాహుల్ మాట్లాడారు. ఇలాంటి ఘటన యూనివర్సిటీలో జరగడం బాధాకరమని విచారాన్ని వ్యక్తం చేశారు. తాను రాజకీయాలు చేయడానికి ఇక్కడికి రాలేదని ఆయన అన్నారు. వర్సిటీలో పక్షపాత దోరణి నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు కుటుంబానికి నష్ట పరిహారంతో పాటు ఉద్యోగం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ఉండే ప్రతి విద్యార్థికి అభిప్రాయాల్ని తెలిపే హక్కు ఉందని ఈ సందర్భంగా ఊటంకించారు. దేశంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. అందరం కలిసికట్టుగా వీటిని ఎదుర్కోవాలని రాహుల్ పిలుపునిచ్చారు. 

13:57 - January 19, 2016

హైదరాబాద్‌ : సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ఇది ఆత్మహత్య కాదు హత్యేనన్నారు. ప్రజాస్వామ్యంలో జరిగిన ఖూనీ అని కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దేశంలో సామాజిక న్యాయం కొరవడిందన్నారు. మోదీ కేబినెట్‌లోని మంత్రులు ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్‌ చేయించడం.. దళితులపై మోదీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ తెలుపుతుందన్నారు.   

13:42 - January 19, 2016

హైదరాబాద్ : హెచ్ సియూ లో రోహిత్ చిత్ర పటానికి ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య నివాళులర్పించారు. అనంతరం ఆయన విద్యార్థుల నుద్దేశించి మాట్లాడుతూ....యూనివర్శిటీలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉండకూడదని స్పష్టం చేశారు.

13:34 - January 19, 2016

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చేరుకున్నారు. హెచ్ సియూ లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తల్లి దండ్రులను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు.అనంతరం రోహిత్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం సస్పెన్షకు గురైన మరో 4 గురు విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖా ముఖీ నిర్వహిస్తున్నారు.

సస్పెండ్ అయిన విద్యార్థులతో రాహుల్

హైదరాబాద్ : హెచ్ సియూ లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తల్లి దండ్రులను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. అనంతరం సస్పెన్షకు గురైన మరో 4 గురు విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖా ముఖీ నిర్వహిస్తున్నారు.

రోహిత్ తల్లిదండ్రులను పరామర్శించిన రాహుల్

హైదరాబాద్ : హెచ్ సియూ లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ తల్లి దండ్రులను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు.

హెచ్ సియూకి చేరుకున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చేరుకున్నారు. రోహిత్ ఆత్మహత్య పై విద్యార్థులతో ముఖాముఖీ మాట్లాడనున్నారు.

13:02 - January 19, 2016

హైదరాబాద్ : రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా లీడ్ రోల్స్లో తెరకెక్కిన పీరియాడిక్ విజువల్ వండర్ 'బాజీరావ్ మస్తానీ'. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ ప్రేమకథ బాలీవుడ్లో కాసుల పంట పండిస్తోంది. షారూఖ్ ఖాన్ 'దిల్ వాలే' సినిమాకు పోటీగా రిలీజ్ అయి కూడా మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. డిసెంబర్ 18న రిలీజ్ అయిన బాజీరావ్ మస్తానీ హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కుటుంబ సమేతంగా 'బాజీరావ్ మస్తానీ' సినిమాను చూశారు. 16 శతాబ్దానికి చెందిన విశేషాలను కళ్లకు కట్టినట్టుగా చూపించిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రతిభకు ముగ్దుడైన అఖిలేష్, ఈ సినిమాకు ఉత్తర ప్రదేశ్లో వినోద పన్ను మినహాయింపు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఫిలిం ఫేర్ అవార్డ్స్లోనూ సత్తా చాటిన బాజీరావ్ మస్తానీ 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టిన వీనస్ విలియమ్స్

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్స్లామ్లో అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో పదో ర్యాంకర్ వీనస్కు 47 వ ర్యాంకర్ జొహన్నా కంటె (బ్రిటన్) షాకిచ్చింది. జొహన్నా 6-4, 6-2 స్కోరుతో వీనస్ను ఓడించింది. పురుషుల సింగిల్స్లో బ్రిటన్ గ్రేట్ ఆండీ ముర్రే శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ముర్రే 6-1, 6-2, 6-3 స్కోరుతో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ని ఓడించాడు.

కీలక దశకు కిడ్నీ రాకెట్‌ కేసులో దర్యాప్తు...

హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కిడ్నీ రాకెట్‌ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరింది. ప్రధాన నిందితుడు సురేష్‌తో పాటు దిలీప్‌ చౌహాన్‌(అహ్మదాబాద్‌) హైదరాబాద్‌కు చెందిన జీను నూకరాజు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్‌ మీడియాతో మాట్లాడారు. కిడ్నీదందా ద్వారా సురేష్‌ రూ. 3 కోట్లు సంపాదించాడని, ఆ సొమ్మును రికవరీ చేస్తామని తెలిపారు. 2012 నుంచి ఇప్పటి వరకు 60 కిడ్నీలు విక్రయించారని ఈ కేసులో కిడ్నీ దాతలు, స్వీకర్తలు ఇద్దరూ నిందితులేనని అన్నారు. శ్రీలంకలోని 4 ప్రధాన ఆస్పత్రుల వైద్యులకు కిడ్నీ రాకెట్‌లో పాత్ర ఉందని ఆయన వెల్లడించారు.

12:49 - January 19, 2016

నెల్లూరు :శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం మరో రాకెట్ లాంచింగ్‌కు సన్నద్ధమైంది. ఇక్కడి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండోవ ప్రయోగ వేదిక నుంచి పీఎస్ ఎల్వీ సి-31 రాకెట్‌ను బుధవారం ఉదయం 9 గంటల 31 నిమిషాలకు ప్రయోగించనున్నారు. ఇందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ప్రయోగ సమయానికి 48 గంటల ముందుగానే కౌంట్ డౌన్ ప్రారంభించారు. నిర్విరామంగా 48 గంటల కౌంట్‌డౌన్ పూర్తి చేసుకుని రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళనుంది.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ......

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఉపగ్రహాన్ని పీఎస్ ఎల్వీ రాకెట్ నింగిలోకి తీసుకెళ్ళనుంది. ఇప్పటి వరకు పీఎస్ ఎల్వీ సిరీస్‌లో 32 ప్రయోగాలను ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు 33వ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పీఎస్ ఎల్వీ ప్రయోగాల్లో మొదటిది అపజయంతో ప్రారంభమైనా తర్వాత ప్రయోగించిన 31 ప్రయోగాలు విజయవంతంగా కొనసాగించింది. రేడియో, వాతావరణం, భూగర్భ పరిశోధనలు, గ్రహాల స్ధితిగతులను కనుగొనేందుకు 100కు పైగా ఉపగ్రహాలను ఇప్పటికే ఇస్రో ప్రయోగించింది.

ఐఆర్ ఎన్ ఎస్ ఎస్-1 ఉపగ్రహాన్ని రోదసీకి....

పీఎస్ ఎల్వీ సి-31 రాకెట్‌ ద్వారా 1425 కిలోల బరువున్న ఐఆర్ ఎన్ ఎస్ ఎస్-1ఈ ఉపగ్రహాన్ని రోదసీకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఐఆర్ ఎన్ ఎస్ ఎస్-1ఈ ఉపగ్రహం ఇండియన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ఉపగ్రహాల సీరిస్‌లో ఇది ఐదోవది. ఈ ఉపగ్రహంలో రెండు రకాల సాంకేతిక పరికరాలను అమర్చి పంపుతున్నారు. నావిగేషన్ పేలోడ్స్‌లో ఎల్-5 బ్యాండ్, ఎస్‌ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్‌ను పంపుతున్నారు. దీనివల్ల నావిగేషన్ సర్వీస్ సిగ్నల్స్‌ను వేగంగా అందిస్తుంది. రేంజింగ్ పేలోడ్స్‌లో సీ బ్యాండ్ ట్రాన్స్‌ఫాండర్స్, రెట్రోరిఫ్లెక్షన్ లేజర్ రేంజింగ్ అనే పరికరాలు పనిచేస్తాయి. ఈ సాంకేతిక పరికరాలన్నీ భారత్‌కు దిక్సూచి వ్యవస్థలను అందిస్తాయి. ఈ ప్రయోగంతో ఐదు ఉపగ్రహాలను పూర్తి చేసుకుని ఫిబ్రవరి, మార్చిలో మరో రెండు ఉపగ్రహ ప్రయోగాలను పూర్తి చేసే లక్ష్యంతో ఇస్త్రో శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.

12:45 - January 19, 2016

హైదరాబాద్ : రోహిత్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాసేపట్లో హైదరాబాద్‌ రానున్నారు. అయితే రాహుల్‌ పర్యటనను అడ్డుకుంటామని ఏబీవీపీ హెచ్చరిస్తోంది. మానవాతా ధృక్పథంతో పరామర్శించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవడమేంటని నాగేందర్ ప్రశ్నించారు.

12:44 - January 19, 2016

విజయవాడ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కాడు. విజయవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌ ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. శ్రీనివాస్‌నగర్‌ బ్యాంక్‌ కాలనీలోని ఇంట్లో పలు కీలక పత్రాలు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రసాద్‌ ఆస్తులు 3 కోట్ల 20 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. ఓపెన్‌ మార్కెట్‌ ప్రకారం ఈ విలువ 20 నుంచి 30 కోట్ల వరకు ఉంటుందన్నారు.

 

12:42 - January 19, 2016

రంగారెడ్డి : చెంగిచర్ల మ్యారీగోల్డ్‌ ఫామ్‌హౌస్‌లో వంశీకృష్ణ అనుమానాస్పదంగా చనిపోవడంతో.. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే 17 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్‌డే పార్టీ తర్వాత ఈ వంశీకృష్ణ చనిపోయినట్లు తెలుస్తోంది. 

12:41 - January 19, 2016

హైదరాబాద్ : పఠాన్ కోట్ వైమానిక స్థావరానికి ఉగ్రవాదులు చేరుకోడానికి ఎస్పీ సల్వీందర్ సింగ్ సహకరించాడని ఎన్ఐఏ భావిస్తోంది. అయితే..విచారణలో ఆయన చెప్పే సమాధానాలు మాత్రం పొంతన లేకుండా ఉన్నాయి. అందుకే సల్వీందర్ సింగ్ కు లై డిటెక్టర్ ద్వారా నిజాలు రాబట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ మేరకు సల్విందర్‌కు లై డిటెక్టర్‌ పరీక్ష నిర్వహించేందుకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి నిచ్చింది.

ఢిల్లీ లేదా బెంగళూరులో...

సల్వీందర్ సింగ్ ను ఢిల్లీ లేదా బెంగళూరుకు తీసుకువెళ్ళి పాలిగ్రాఫ్ పరీక్షలు జరిపిస్తామని వెల్లడించారు. ఇందుకు సల్వీందర్ సింగ్ అంగీకరించడా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. సల్వీందర్ సింగ్ పీర్ దర్గాకి వెళ్లి వస్తుండగా ఉగ్రవాదులు దాడి చేసి తన వాహనంతో పాటు సెల్ ఫోన్లు కూడా తీసుకువెళ్ళినట్లు చెప్పాడు.

సల్వీందర్ సింగ్ చెప్పిన మాటలు అవాస్తవమని భావిస్తున్న ఎన్‌ఐఏ....

పీర్ దర్గాకు తరచూ వెళ్తానని సల్వీందర్ సింగ్ చెప్పిన మాటలు అవాస్తవమని నిర్ధారణ అయింది. సల్వీందర్ సింగ్ తో ఉన్న ఇద్దరిపై ఉగ్రవాదులు దాడి చేసారు. కానీ..ఆయనకు మాత్రం ఒక్క చిన్న గాయం కూడా కాకపోవడం అనుమానాన్ని మరింత బలపరుస్తుంది. ఒకటే రోజు మూడు సార్లు సల్వీందర్ సింగ్ దర్గాకు వెళ్ళడం..దర్గా సమీపంలో పాక్ కంపెనీకి చెందిన బూట్ల గుర్తులు లభించడం, అదే రోజు గురుదాస్ పూర్ జిల్లాకు ఓ నేత, స్మగ్లర్ ను కలవడం..ఇదంతా ఉగ్రవాదులతో చేతులు కలిపిన సల్వీందర్ సింగ్ ప్లాన్ అని తెలుస్తోంది.అతను నిజానిజాలు వెల్లడిస్తే విచారణ ముందుకు సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. పాలిగ్రాఫ్ పరీక్ష ద్వారానే సల్వీందర్ సింగ్ నిజాలు చెబుతాడని అధికారులు పేర్కొన్నారు.

12:37 - January 19, 2016

హైదరాబాద్ : బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా రోడ్డు మార్గం ద్వారా హెచ్ సియూ చేరుకోనున్నారు. రోహిత్ ఆత్మహత్య, పర్యవసనాలపై తోటి విద్యార్థులతో చర్చించనున్నట్లు సమాచారం. రోహిత్ కుటుంబ సభ్యులతో, వర్శిటీ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపుతున్నాయి.

రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేయొద్దు : కిషన్ రెడ్డి

హైదరాబాద్ : హెచ్ సి యూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేయవద్దని బిజెపి నేత కిషన్ రెడ్డి సూచించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ… వర్శిటీ నియమాలు ఉల్లంఘించారనే విద్యార్థుళను సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. దత్తాత్రేయ లేఖ రాయక ముందే విద్యార్థులను సస్పెండ్ చేశారని… విద్యార్థుల సస్పెన్షన్ లో దత్తాత్రేయ, స్మృతీ ఇరాకీ ఎలాంటి సంబంధం లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

బేగంపేట్ కు చేరుకున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్ : బేగం పేట్ ఎయిర్ పోర్ట్ కు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా రోడ్డు మార్గం ద్వారా హెచ్ సియూ చేరుకోనున్నారు. రోహిత్ ఆత్మహత్య, పర్యవసనాలపై తోటి విద్యార్థులతో చర్చించనున్నట్లు సమాచారం.

అత్తాపూర్ లో రూ.77 లక్షలు స్వాధీనం...

హైదరాబాద్ : అత్తాపూర్ లో ఎన్నికల ప్రత్యేక అధికారు లు కారులో తరలిస్తున్న రూ.77 లక్షలతో పాలు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

మల్లాది విష్ణు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

విజయవాడ : కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కాంగ్రెస్ నేత మల్లాది విష్ణుకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయనకు నిరాశ తప్పలేదు.

కిడ్నీ రాకెట్ సూత్రధారుల గుట్టురట్టు...

నల్గొండ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీరాకెట్‌లో ప్రధాన సూత్రధారులైన గుజరాత్‌కు చెందిన సురేష్, ప్రజాపతితో పాటు మరో ఇద్దరిని నల్గొండ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ ముఠా దాదాపు వంద మందికి చెందిన కిడ్నీలను విక్రయించారని పోలీసులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అదనపు సమాచారం కోసం విచారిస్తున్నారు.

హెచ్ సియూ లో కొనసాగుతున్న ఆందోళన

హైదరాబాద్ : హెచ్ సియూలో రోహిత్ ఆత్మహత్య పై విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. వీసీ కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వైస్ ఛాన్సలర్ అప్పారావును తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

రోహిత్ మృతిపై హెచ్ సీయూలో విచారణ

హైదరాబాద్ : హెచ్ సీయూలో రోహిత్ మృతిపై కేంద్ర ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. విద్యార్థుల సస్పెన్షన్ అనంతర పరిణామాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ఏపీలోనే బడ్జెట్ సమావేశాలు : కోడెల

గుంటూరు : ఏపీలోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నామని ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. కేఎల్ యూనివర్శిటీ, హాయ్ ల్యాండ్ ను కోడెల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏపీలో బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

హార్దిక్ పటేల్ పై 2,700 పేజీల ఛార్జీషీట్ నమోదు

అహ్మదాబాద్: పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్‌తో పాటుగా అతని ముగ్గురు అనుచరులపై గుజరాత్ క్రైం బ్రాంచ్ పోలీసులు తాజాగా 2,700 పేజీల చార్జీషీట్‌ను నమోదు చేశారు. హార్దిక్‌కు అతని మద్దతుదారులకు మధ్య నడిచిన 42 ఫోన్‌కాల్స్ రికార్డు, 503 మంది సాక్షులు, ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నివేధికలను పోలీసులు ఛార్జీషీట్‌లో పొందుపరిచారు. గుజరాత్ పోలీసులు హార్దిక్ పటేల్‌పై గతంలో రాజద్రోహం కేసులో 370 పేజీల ఛార్జీషీట్‌ను ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు ఆల్ఫేష్ కతారియా, అమ్రిష్ పటేల్ ఇంకా పరారీలోనే ఉన్నారు.

రోహిత్ ఆత్మహత్యపై ప్రధాని క్షమాపణలు చెప్పాలి : కేజ్రీవాల్

ఢిల్లీ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. హెచ్ సియూ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ప్రధాని క్షమాపణ చెప్పాలని, ఈ ఘటనకు బాధ్యులైన కేంద్ర మంతులను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

లాభాల్లో స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్టాక్‌మార్కెట్లు నేడు ప్రారంభం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 128 పాయింట్లకు పైగా లాభంలో, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడవుతున్నాయి.

డీఐజీ ఆఫీస్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు..

విజయవాడ : నగరంలోని శ్రీనివాస బ్యాంక్‌ కాలనీలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ దుర్గాప్రసాద్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. డీఐజీ ఆఫీస్‌లో సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణల మధ్య ఈ దాడులు జరిగాయి.ఈ సోదాల్లో రూ.2.5 కోట్ల విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

భార్య చేతులు నరికిన భర్త....

ఆదిలాబాద్: మంచిర్యాలలోని అశోక్‌రోడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య చేతులను ఓ భర్త నరికేశాడు. కుటుంబకలహాలే ఇందుకు కారణంగా సమాచారం. బాధితురాలిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి వద్ద నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం సేకరించారు.

 

10:28 - January 19, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కు నిరసనగా ఈ రోజు ఉదయం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించేందుకు తెలంగాణ జాగృతి యువజన విభాగం యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జాగృతి నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దత్తాత్రేయ లేఖ వల్లే విద్యార్థుల బహిష్కరణ, ఆత్మహత్యకు కారణమంటూ కార్యకర్తలు తెలిపారు. తక్షణమే దత్తాత్రేయ, స్మృతి ఇరానీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ సియూ వీసీ అప్పారావును సస్పెండ్ చేసే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 

10:24 - January 19, 2016

నెల్లూరు : జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు వచ్చాయి. దుత్తలూరు మండలంలోని పలుగ్రామాల్లో మంగళవారం ఉదయం 9:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో భూమి కంపించింది. బోడవారిపల్లి, దుత్తలూరు, నర్రవాడ, లక్ష్మీపురం, కమ్మవారిపాలెం, బండకిండపల్లి తదితర గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. నెల్లూరు జిల్లాలో గత 3నెలల వ్యవధిలో భూమి కంపించడం ఇది పదోసారి. అయితే కొండ ప్రాంతంలో ఇలాంటి శబ్ధాలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

09:32 - January 19, 2016

హైదరాబాద్ : టీవీ నటుడు జబర్దస్త్‌ ప్రోగ్రాం కమెడియన్‌ చలాకీ చంటీ న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కారు. తనను ఫేస్‌బుక్‌లో ఓ యువకుడు అసభ్య పదజాలంతో కామెంట్స్‌ చేశాడంటూ ఖమ్మం జిల్లా ఇల్లందు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబందించి ఇల్లందుకు చెందిన గిరిజనుడు గొగ్గల రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హీరో ప్రభాస్‌ను బకరా అన్నాడని అందుకే తన ఫ్రెండ్స్‌ పోస్ట్‌ చేసిన కామెంట్లను చంటీకి పోస్ట్‌ చేశానని రాజు చెప్పుకొచ్చాడు. పోలీసులు రాజుపై కేసు నమోదు చేశారు.

09:30 - January 19, 2016

నల్లగొండ : నార్కెట్‌పల్లి మండలం అక్కెనపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. గుట్టల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు

నెల్లూరు :జిల్లాలో మళ్లీ భూప్రకంపనలు వచ్చాయి. దుత్తలూరు మండలంలోని పలుగ్రామాల్లో మంగళవారం ఉదయం 9:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో భూమి కంపించింది. బోడవారిపల్లి, దుత్తలూరు, నర్రవాడ, లక్ష్మీపురం, కమ్మవారిపాలెం, బండకిండపల్లి తదితర గ్రామాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. నెల్లూరు జిల్లాలో గత 3నెలల వ్యవధిలో భూమి కంపించడం ఇది పదోసారి.

దత్తాత్రేయ ఇంటి ముట్టడికి తెలంగాణ జాగృతి యత్నం..

హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కు నిరసనగా ఈ రోజు ఉదయం రాంగనగర్ లోని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించేందుకు తెలంగాణ జాగృతి యువజన విభాగం యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జాగృతి నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

09:08 - January 19, 2016

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ రానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బేగం పేటకు చేరుకుని… అనంతరం రోడ్డు మార్గం ద్వారా హెచ్‌సీయూను సందర్శిస్తారు. రోహిత్‌ ఆత్మహత్యకు గల కారణాలు, తదితర పరిణామాలపై విద్యార్థి సంఘాల నేతలతో రాహుల్ సమావేశమవుతారు. అనంతరం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులతో ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. 

08:39 - January 19, 2016

హైదరాబాద్ : విద్యార్థులు తప్పు చేస్తే సంఘబహిష్కరణ లాంటి శిక్షలు విధించడం ఆందోళన కరం... అని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ఎడిటర్, ప్రొ.కె.నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య చాలా బాధాకరం అని అన్నారు. హెచ్ సియూ లో రోహిత్య ఆత్మహత్యకు ప్రధాన మైన కారణం రెండు విద్యార్థి సంఘాల మధ్య చిన్న ఘర్షణ తో ప్రారంభమయ్యింది. యూనిర్శిటీలో ఘర్షణ అక్కడి వరకే పరిమితం చేయాలా లేదా? ఈ అంశాన్ని విద్యార్థి సంఘాలు, ఆ యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ డీల్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? రాజకీయ ఒత్తిళ్లకు వీసీ తలొగ్గారు అనే అంశం స్పష్టం అవుతోందా? విద్యార్థులను సాంఘీక బహిష్కరణ చేయడం అంటే ఏమిటి? కేంద్ర మంత్రిగా ఉన్న దత్తాత్రేయ రొటీన్ గా లేఖ రాశనని చెప్పడం ఎంత వరకు సబబు? ఒక అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంది.. భినాభిప్రాయం తెలియజేయడమే తప్పంటే ఎట్లా? భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిని సంఘవ్యతిరేక శక్తులు అనడం ఎంత వరకు సబబు? బిన్నాభిప్రాయాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఇంటాలరెన్స్ తెలియజేస్తుందా? మద్దతు ఇస్తే సంఘసంస్కర్తలు...వ్యతిరేకిస్తే సంఘ విద్రోహ శక్తులు అన్న వర్గీకరణ చేయడం చాలా బాధాకరం. 13 రోజులుగా హెచ్ సియూలో సస్పెండయిన 5గురు దళిత విద్యార్థులు హంగర్ స్ట్రైక్ చేస్తుంటే, పాలనా యంత్రాంగం, కేంద్రం ఏలాంటి చర్యలు చేపట్టకపోవడంలో అర్థం ఏమిటి? ఇత్యాది అంశాలపై ప్రొ.నాగేశ్వర్ తన అభిప్రాయాలను తెలియజేశారు. పూర్తి చర్చను మీరు వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఏపీలో నేటి నుంచి విధులకు వీఆర్ ఏలు...

విజయవాడ :ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి వీఆర్‌ఏలు విధులకు హాజరుకానున్నారు. గడచిన 78 రోజులుగా వీరంతా సమ్మె చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీతో వీఆర్‌ఏలు సమ్మె విరమించారు.

మారిగోల్డ్ ఫామ్ హౌస్ లో యువకుడు మృతి

రంగారెడ్డి : చెంగిచర్ల మారిగోల్డ్ ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీలో విషాదం చోటు చేసుకుంది. వంశీకృష్ణ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈఘటనలో 17 మందిని యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డ కానిస్టేబుల్

గుంటూరు : పేరేచర్ల సమీపంలో ఓ మహిళకు మద్యం తాగించి కిరణ్ అనే కానిస్టేబుల్ ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ పై బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు స్వీకరించలేదు. సమాచారం అందుకున్న అర్బన్ ఎస్పీ త్రిపాటీ జరగిన ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

07:42 - January 19, 2016

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ను సద్వినియోగం చేసుకుంటూ ఖర్చు, కాలాన్ని తగ్గించుకుంటున్న నేపథ్యంలో సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లలో వాట్సాప్ నెట్‌వర్క్ అందుబాటులోకి రావడంతో సమాచారాన్ని చేరవేసేందుకు మార్గం మరింత సుగుమం అయింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను ఇక ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా వాడుకోవచ్చని... ఏడాదికి వసూలు చేస్తున్న ఒక డాలరు ఫీజును రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ సోమవారం తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఆదాయం కోసం థర్డ్ పార్టీల నుంచి ప్రకటనలను కూడా ప్రవేశపెట్టబోమని పేర్కొంది. సాధారణ పద్ధతిలో మొబైల్ నెట్‌వర్క్‌లో మెసేజ్‌లు పంపాలంటే నెలకు ఇన్ని మాత్రమే ఉచితం, ఇంకా కావాలంటే దానికి నిర్దేశించిన ధర చెల్లించాల్సి వస్తుంది. అధికంగా ఎస్‌ఎంఎస్‌లు పంపాలంటే ఎస్‌ఎంఎస్ ఆఫర్ వేసుకోవాల్సి ఉంది. అయితే, వాట్సాప్ రంగప్రవేశంతో అటువంటి నిబంధనలేవీ అవసరం లేదు. మొదట్లో నెలకు పది రూపాయలు చొప్పున చెల్లించాల్సి వచ్చినప్పటికీ, ఇప్పడు అంతా ఉచితం అయిపోయింది. ఈ వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్‌లే కాకుండా ఫొటోలు, చిన్నచిన్న వీడియోలు క్షణాల్లో అవతలివారికి చేరవేసే అవకాశం కలిగింది. ఈ సోషల్‌నెట్ వర్క్ వల్ల కొన్ని అనర్థాలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉపయోగమే ఉందనే భావన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది.
వాట్సాప్‌ను వాడుకున్న తొలి ఏడాది తర్వాత ఫీజు చెల్లించాలని కొంతమంది యూజర్లను అడుగుతున్నామని, అయితే తాము విస్తరించడంతో, అది అమల్లో సాధ్యం కావడం లేదని తేలినట్లు వెల్లడించింది. తమ యాప్‌కు సంబంధించిన వివిధ వెర్షన్లపై ఫీజును రానున్న వారాల్లో రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్ భారత్‌లోని యూజర్ల నుంచి ఫీజు వసూలు చేయడం లేదు. కాగా, ప్రకటనల్లేకుండా తమ సర్వీసు అందించేందుకు కొన్ని టూల్స్‌ను పరీక్షిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. తమ యాప్ ద్వారా యూజర్లు వ్యాపారులతో, బ్యాంకులు తదితర సంస్థలతో సంప్రదింపులు నెరపడానికి టూల్స్‌ను ఈ ఏడాది నుంచి పరీక్షిస్తామని పేర్కొంది.

హెచ్ సియూకి రాహుల్ గాంధీ

హైదరాబాద్ : ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్ సియూకి రానున్నట్లు సమాచారం. యూనివర్శిటీకి వెళ్లి విద్యార్థులతో భేటీ కానున్నారు. హెచ్ సియూ లో పీహెచ్ డీ స్కాలర్, దళిత విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన కాస్తంత ఆసక్తి రేపుతోంది..

07:37 - January 19, 2016

హైదరాబాద్ : హెచ్ సియూలో పీహెచ్ డి స్కాలర్, దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చాలా బాధాకరంఅని 'న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు.. హెచ్‌సియులో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్‌కు నాటకీయ పరిణామల మధ్య ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రోహిత్‌ ఆత్మహత్య సెగలు హస్తినను తాకాయి. విద్యార్థి సూసైడ్‌కు ప్రధాన కారణాలు విచారించి నివేదిక సమర్పించేందుకు కేంద్ర స్థాయిలో కమిటీ ఏర్పాటైంది. ఈ దారుణం వెనక కేంద్రమంత్రి ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ యూనివర్శిటీ రీసెర్చ్ కు పెద్ద పీఠ వేస్తోంది. దళిత విద్యార్థులకు గైడ్స్ కరువయ్యారా? యూనివర్శిటీల్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యిందా? స్మృతీ ఇరానీ స్టేట్ మెంట్ కు హెచ్ సియూ లో ఘటనకు పోలిక ఉందా? దళిత విద్యార్థులను సాంఘీక బహిష్కరణ చేయం అంటే సభ్య సమాజం తలదించుకునే లా లేదా? కేంద్ర మంత్రిగా ఉండి దత్తాత్రేయ ఎందుకు లేఖ రాశారు? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్, ఎస్ ఎఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు, బిజెపి నేత ఆచారి పాల్గొన్నారు. వారి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల: తిరుమల భక్తుల రద్దీ అతి సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 3 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడకన వెళ్లే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

రోహిత్ మృతిపై సర్వత్రా నిరసనలు

హైదరాబాద్ : హెచ్ సియూ విద్యార్థి మరణంపై రణం మొదలైంది. రోహిత్ మృతి మంటలు హస్తినకు తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కులరక్కసిని కూకటివేళ్లతో పెకిలించాలని డిమాండ్ చేశారు. తెలుగురాష్ట్రాల్లోనూ వామపక్ష, దళిత సంఘాల ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. రోహిత్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. 

నాటకీయ పరిణామాల మధ్య రోహిత్ అంత్యక్రియలు

హైదరాబాద్ : హెచ్‌సియులో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్‌కు నాటకీయ పరిణామల మధ్య ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రోహిత్‌ ఆత్మహత్య సెగలు హస్తినను తాకాయి. విద్యార్థి సూసైడ్‌కు ప్రధాన కారణాలు విచారించి నివేదిక సమర్పించేందుకు కేంద్ర స్థాయిలో కమిటీ ఏర్పాటైంది. ఈ దారుణం వెనక కేంద్రమంత్రి ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి. 

దావోస్‌కు ఏపీసీఎం చంద్రబాబు

హైదరాబాద్ : పెట్టుబడులతో ఏపీ దశను మార్చేందుకు సీఎం చంద్రబాబు దావోస్‌ బాట పట్టారు. దావోస్‌లో జరగునున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార దిగ్గజాలు, ఆర్థిక వేత్తలు, పలు దేశాల ఆర్థిక మంత్రులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఏపీలో పెట్టుబడుల ఆవశ్యకతను చాటి చెప్పేందుకు సీఎం చంద్రబాబు ఈ అవకాశాన్ని వినియోగించుకోనున్నారు.

07:15 - January 19, 2016

హైదరాబాద్ : తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ ఖ్యాతితో సింగరేణి కాలరీస్‌ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని టి సర్కార్ ప్రశంసించింది. ఈ సందర్భంగా సంస్థ తన లాభాల నుంచి భారీ మొత్తంలో డివిడెండ్‌ను ప్రభుత్వానికి అందించింది.

విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గు సరఫరా చేస్తూ .....

చీకట్లను తరిమి వెలుగులు నింపుతున్న సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచింది. అటు పరిశ్రమలకు ఇటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బొగ్గు సరఫరా చేస్తూ రెండు రంగాలకూ సాయపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ మొత్తం 490కోట్ల రూపాయల లాభాలు సాధించింది.

66.42 కోట్ల రూపాయల డివిడెండ్‌ను.....

2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 66.42 కోట్ల రూపాయల డివిడెండ్‌ను సింగరేణి కాలరీస్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది. చెక్కును సంస్థ సిఎండి ఎన్.శ్రీధర్ సోమవారం క్యాంపు కార్యాలయంలో సిఎంకు అందచేశారు. ఈ సందర్భంగా సింగరేణి కార్యకలాపాలను సమీక్షించడంతోపాటు కెసిఆర్‌... సంస్థ సిబ్బందిని అభినందించారు.

2014-15 సంవత్సరంలో .....

2014-15 సంవత్సరంలో 5 కోట్లా 20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి, 2015-16 సంవత్సరానికి ఆరు కోట్ల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటిదాకా లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి సాధించింది. తద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న ఎనిమిది కోల్ ఇండియా సంస్థల్లో సింగరేణి అత్యధిక ఉత్పత్తి సాధిస్తున్న సంస్థగా నిలిచింది. కోల్ ఇండియా సగటు వృద్ధి రేటు 8శాతం కాగా సింగరేణి మాత్రం 23శాతం వృద్ధి సాధించింది. బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా సింగరేణి గణనీయమైన ప్రగతి సాధిస్తున్నదని, సంస్థ అభివృద్ధికి ప్రభుత్వం కూడా చేయూత అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భారీ మొత్తంలో లాభాలు ఆర్జించిపెడుతున్న సింగరేణికి తెలంగాణలోనే మరో 50 ఏళ్ల వరకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని సిఎం కెసిఆర్ అన్నారు. అయినప్పటికీ ఇతర చోట్లా గనులను నిర్వహించాలని అధికారులను కోరారు.

07:11 - January 19, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మూతపడ్డ ప్రతిష్టాత్మక రామగుండం ఎరువుల కర్మాగారానికి మహర్దశ పట్టనుంది. ఈ దిశగా తెలంగాణ సర్కార్ చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. సంస్థను పునరుద్ధరించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.

ప్రారంభమైన పదేళ్ళకే....

నాటి పాలకుల నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతతో ప్రారంభమైన పదేళ్ళకే రామగుండం ఎరువుల ఉత్పత్తి కర్మాగారం మూతపడింది. ఈ భారీస్థాయి కర్మాగారానికి మళ్లీ ఊపిరులూది పునప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 1980లో ప్రారంభమైన ఈ కంపెనీ సుమారు 3 వేల మందికి నేరుగా ఉపాధి కల్పించింది. తెలంగాణలోని రైతులకు అవసరమైన యూరియా, అమ్మోనియం ఈ ఫ్యాక్టరీ నుంచే ఉత్పత్తయ్యేది. అలాంటిది గత ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా మూతపడింది.

కేంద్ర సహకారాన్ని కోరిన టి సర్కార్....

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనిని తిరిగి పునరుద్ధరించాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో టి సర్కార్ కేంద్ర సహకారాన్ని కోరింది. రాష్ట్ర అభ్యర్థనతో నేషనల్ ఫర్టిలైజర్ సిఎండి మనోజ్ మిశ్రా, ఆర్.ఎఫ్.సి.ఎల్. సిఇఓ వివేక్ మల్హోత్రా, సిఎఫ్ఓ సునిల్ భాటియాలు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌తో భేటి అయ్యారు. ఆర్.ఎఫ్.సి.ఎల్. పునరుద్ధరణ గురించి చర్చించారు. 4.95 లక్షల టన్నుల యూరియా, 2.97 లక్షల టన్నుల అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఆర్.ఎఫ్.సి.ఎల్.ను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ఈ భేటీలో తెలిపారు.

2018 జూన్ నాటికి ఆర్.ఎఫ్.సి.ఎల్‌ను పునరుద్ధరించాలని.....

2018 జూన్ నాటికి ఆర్.ఎఫ్.సి.ఎల్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్యాక్టరీకి మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా ఎల్లంపల్లి ఇన్ టేక్ వెల్ నుంచి 0.55 టిఎంసిల నీరు సరఫరా చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. ఫ్యాక్టరీకి అవసరమయ్యే 40 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన టిఎస్ ఐపాస్ చట్టానికి అనుగుణంగా ఆర్.ఎఫ్.సి.ఎల్.కు సహకారం అందించాలని సిఎం నిర్ణయించారు.

గత ప్రభుత్వాలకు భిన్నంగా....

మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వాలకు భిన్నంగా వరంగల్‌లోని రెయిన్ ఫ్యాక్టరీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీ ఓపెన్‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజాం షుగర్స్‌ను కూడా రీ ఓపెన్ చేస్తే చెరుకు రైతులు, కార్మికులు కష్టాల నుంచి బయటపడతారు. మరి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందో లేదో చూడాలి. 

07:08 - January 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌కాకతీయ ఫేస్‌-2 పనులు వేగం పుంజుకున్నాయి. మిషన్‌ కాకతీయ ఫేస్‌-2 పనులపై సచివాలయంలో మంత్రి హరీష్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్‌లో మిషన్‌కాకతీయ పైలాన్‌ ఆవిష్కరణకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తారని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.

ఫిబ్రవరి మొదటి వారంలో పైలాన్‌ ఆవిష్కరణ.....

మిషన్‌కాకతీయ రెండొవ దశ పనులపై మంత్రి హరీష్‌రావు సోమవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఫిబ్రవరి మొదటి వారంలో మిషన్‌కాకతీయ పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమం వరంగల్‌లో ఉంటుందని..ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని మంత్రి హరీష్‌రావు స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ప్రధాన మంత్రి మోడి..ఈ కార్యక్రమానికి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. మంత్రి హరీష్‌రావు నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశానికి ఇరిగేషన్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఇఎన్‌సీలు మురళీధర్‌రావుతో పాటు వివిధ జిల్లాల అధికారులు ఉన్నారు.

ప్రతి చెరువుకు ఓ విశిష్ట సంఖ్య .......

ఇక మిషన్‌ కాకతీయలో భాగంగా..ప్రతి చెరువుకూ ఓ విశిష్ట సంఖ్యను కేటాయించినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. మిషన్‌కాకతీయ మొదటి దశ పనులు పూర్తయినట్లు క్షేత్రస్థాయిలో నిర్థారణ అయిన తర్వాతే నివేదికలు పంపాలన్నారు. ఇక చెరువుల శిఖం విషయంలో రెవిన్యూ అధికారులతో కలిసి సంయుక్తంగా మ్యాపింగ్‌ చేయాలన్నారు. ఇకపై ఆన్‌లైన్‌ వివరాల ఆధారంగానే సమీక్షలు ఉంటాయని..ఈ వారంలో 3వేల చెరువుల పునరుద్దరణకు పాలనా పరమైన అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన సాంకేతిక అనుమతులు, టెండర్‌ ప్రక్రియలు త్వరగా పూర్తి చేయాలని ఇంజినీర్లను మంత్రి ఆదేశించారు. మార్చి 31 వరకూ మిషన్‌ కాకతీయ మొదటి దశ పనులను పూర్తి చేయాలని..జనవరి 31 వరకూ అంచనాలను పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.

ప్రతి వారం సమీక్ష......

ఇక నుంచి మిషన్‌ కాకతీయపై జిల్లా కలెక్టర్లు ప్రతి వారం సమీక్షించాలని మంత్రి హరీష్‌రావు కోరారు. రెండొవ దశ పనుల్లో భాగంగా 10,308 చెరువులను పునరుద్దరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వ్యవసాయశాఖ సహకారంతో భూసార పరీక్షలు చేయించాలన్నారు. మొదటి దశ పనులను సకాలంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీచేశారు. 

07:04 - January 19, 2016

హైదరాబాద్ : విద్యుత్ కోతలు లేని రాష్ట్రంకోసం తెలంగాణ సర్కారు అన్ని ప్రయత్నాలు చేస్తోంది.. తాజాగా మరో అంతర్రాష్ట్ర ఒప్పందానికి శ్రీకారం చుట్టింది.. రామగుండంలోని ఎన్టీపీసీ ప్లాంట్‌నుంచి 16వందల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు అగ్రిమెంట్‌ కుదిరింది.. సెంట్రల్ ఈఆర్సీ సిఫారసులప్రకారం ధర చెల్లించి కరెంటు కొనేందుకు ఎన్టీపీసీతెలంగాణ ట్రాన్స్‌కో అంగీకారం కుదుర్చుకుంది.. సీఎం కేసీఆర్‌ సమక్షంలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు, ఎన్టీపీసీ జనరల్‌ మేనేజర్లు సీవీ ఆనంద్‌, ఎస్ కే ఖర్‌, అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ కే సుదర్శన్‌ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.. అలాగే ఇక సింగరేణి కాలరీస్‌ జైపూర్‌ ప్లాంట్‌నుంచి 12వందల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకోసం ట్రాన్స్‌కో, సింగరేణి సంస్థలమధ్య ఒప్పందం కుదిరింది.. ఈ ఏప్రిల్‌ నాటికి 12వందల మెగావాట్ల కరెంటు అందించేందుకు సింగరేణి సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది..

చత్తీస్‌గఢ్‌తో టీ ప్రభుత్వం ఒప్పందం

అయితే తెలంగాణ ఏర్పాటుకాగానే కరెంటు కొరత తీర్చేందుకు చత్తీస్‌గఢ్‌తో టీ ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుంది.. ఇందుకోసం స్వయంగా ఆ రాష్ట్రానికి వెళ్లారు సీఎం కేసీఆర్‌.. అయితే ఆ ఒప్పందం ఇంతవరకూ అచరణలోకి రాలేదని విమర్శలు వచ్చాయి.. మొత్తానికి వేసవికిముందే కరెంటు సమస్యపై దృష్టిపెట్టిన టీ ప్రభుత్వం... ముందుజాగ్రత్త చర్యగా అన్ని ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది.. ఎండల్లోకూడా 24గంటల విద్యుత్ సరఫరాకోసం అన్ని మార్గాలు అన్వేషిస్తోంది.. 

07:02 - January 19, 2016

విజయవాడ : ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపునకు డిస్కంలు ప్రతిపాదించాయి. విద్యుత్ చార్జీలు 4 శాతం పెంచాలని ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. ఈ మేరకు విద్యుత్ చార్జీలు పెంచితే ప్రభుత్వానికి 783 కోట్ల రూపాయల మేర ఆదాయం లభించే అవకాశముంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకందారులకు మినహాయింపు చార్జీలకు మినహాయింపునిచ్చారు. 

07:01 - January 19, 2016

హైదరాబాద్ : సెంట్రల్ వర్సిటి విద్యార్థి ఆత్మహత్య... కేంద్రమంత్రి దత్తాత్రేయ మెడకు చుట్టుకుంటుందా..? ఈ కేసులో A-2 నిందితుడిగా ఉండటంతో...దత్తన్నకు పదవి గండం తప్పదా..? బండారు పనితీరుపై అసంతృప్తిగా ఉన్న హైకమాండ్‌కు... హెచ్‌సీయూ ఎపిసోడ్ కలిసొచ్చిందా..? అవుననే అంటున్నాయి కాషాయ వర్గాలు.

దేశవ్యాప్తంగా సంచలనం...

దేశవ్యాప్తంగా రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య సంచలనం సృష్టిస్తోంది. క్యాంపస్‌లో స్టూడెంట్స్ మధ్య జరిగిన గొడవ చినికిచినికి గాలివానలా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు విద్యార్థులు పోరుబాట పట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే ఇప్పుడు కేంద్రమంత్రి దత్తాత్రేయకు ఇబ్బందికరంగా మారింది.

 

సెంటర్ పాయింట్ గా దత్తాత్రేయ....

హెచ్ సియూ ఘటనకు దత్తాత్రేయ సెంటర్ పాయింట్‌గా మారారు. ఒక్కే ఒక్క లేఖ ఆయనలో కలవరం సృష్టిస్తోంది. కేంద్ర విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ, ఎఎస్ ఎ (అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్) మధ్య జరిగిన గొడవకు దత్తన్నే ఆజ్యం పోశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2015 ఆగస్టు 17న కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి దత్తాత్రేయ లేఖ రాశారు. యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు కుల, తీవ్రవాద, జాతి వ్యతిరేక విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు.

ఒక్కసారైనా హెచ్‌సీయూలో కాలుపెట్టని దత్తాత్రేయ......

కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ ఆదేశాలతో రోహిత్‌తో పాటు మరికొందరు విద్యార్థులను సస్పెండ్ చేశారు హెచ్‌సీయూ వీసీ అప్పారావు. ఇదే ఇప్పుడు బండారు కొంప ముంచేట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక్కసారైనా హెచ్‌సీయూలో కాలుపెట్టని దత్తాత్రేయ... విద్యార్థుల్లో తీవ్రవాద, జాతి వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ... ఏబీవీపీని పురిగొల్పారని విద్యార్థులు మండిపడుతున్నారు.

మోదీ సర్కార్‌కు ఇబ్బందికరంగా .....

మరోవైపు దేశవ్యాప్తంగా రోహిత్ ఆత్మహత్య సంచలనం సృష్టించడం మోదీ సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది. వీటన్నింటికీ సాక్ష్యంగా దత్తాత్రేయ లేఖ బయటికి రావడంతో కేంద్రం సైతం కేంద్రం సమర్థించుకోలేని పరిస్థితి. దత్తాత్రేయను కేబినెట్ నుండి తప్పించాలన్న వాదన ఇంటా-బయటా వినిపిస్తోంది. దీనికితోడు దత్తన్న పనితీరుపై మోదీ సైతం అసంతృప్తిగా ఉన్నారని కమలనాథులు గుసగుసలాడుతున్నారు. రోహిత్ ఆత్మహత్య కేసులో ఏ-2 నిందితుడిగా దత్తాత్రేయ ఉండటంతో... ఆయన్ను కేంద్రమంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. మొత్తానికి వివాదాలకు దూరంగా ఉండే దత్తాత్రేయ హెచ్ సియూ సంఘటనతో చిక్కుల్లో పడ్డారు. మరి ఆయన మంత్రి పదవికి ఈ వ్యవహారం గండంగా మారనుతుందా..? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

06:57 - January 19, 2016

హైదరాబాద్ : హెచ్ సియూ విద్యార్థి మరణంపై రణం మొదలైంది. రోహిత్ మృతి మంటలు హస్తినకు తాకాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కులరక్కసిని కూకటివేళ్లతో పెకిలించాలని డిమాండ్ చేశారు. తెలుగురాష్ట్రాల్లోనూ వామపక్ష, దళిత సంఘాల ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. రోహిత్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో టెన్షన్ వాతావరణ...

దళిత విద్యార్థి రోహిత్ మృతితో హస్తినలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. హెచ్ ఆర్డీ మినిస్టర్ కార్యాలయ ముట్టడికి... ఎస్ ఎఫ్ఐ, ఎఐఎస్ ఎఫ్ సహా దళిత సంఘాలు ప్రయత్నించాయి. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని... పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది.

ఇక హైదరాబాద్‌లోనూ సేమ్‌ సీన్.....

ఇక హైదరాబాద్‌లోనూ సేమ్‌ సీన్. విద్యార్థుల నిరసనలతో గచ్చిబౌలి హెచ్ సియూ క్యాంపస్‌ వేడెక్కింది. రోహిత్‌ది ఆత్మహత్య కాదని, మతోన్మాదుల హత్యంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను తక్షణమే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు.

తెలుగురాష్ట్రాల్లోనూ సర్వత్రా నిరసనలు.....

మరోవైపు తెలుగురాష్ట్రాల్లోనూ సర్వత్రా నిరసనలు మిన్నంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలు బంద్ పాటించాయి. నల్లగొండలోని క్లాక్ టవర్‌ సెంటర్‌లో వీసీ అప్పారావు, కేంద్రమంత్రి దత్తాత్రేయ దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌లోనూ విద్యార్థులు నిరసనలు మిన్నంటాయి. మెదక్, ఆదిలాబాద్‌, వరంగల్ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.అటు గుంటూరు, విజయవాడలోనూ ఎస్ ఎఫ్ ఐ విద్యార్థులు ఆందోళన చేశారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ, మిగిలిన విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. లేదంటే ఉద్యమం చేస్తామంటూ హెచ్చరించారు.

యువతే దేశానికి వెన్నెముకంటూ.....

యువతే దేశానికి వెన్నెముకంటూ ప్రధాని మోదీ ప్రసంగాలతో ఊదరగొడుతున్నారు. కానీ విజ్ఞాన కేంద్రాల్లోనే అర్ధాంతరంగా విద్యాకుసుమాలు రాలిపోతున్నాయి. కులం పేరుతో, మతం పేరుతో చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మరి మన పాలకులు స్పందిస్తారో..? లేదో..? చూడాలి.

06:52 - January 19, 2016

హైదరాబాద్ : హెచ్‌సియులో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్‌కు నాటకీయ పరిణామల మధ్య ఎట్టకేలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రోహిత్‌ ఆత్మహత్య సెగలు హస్తినను తాకాయి. విద్యార్థి సూసైడ్‌కు ప్రధాన కారణాలు విచారించి నివేదిక సమర్పించేందుకు కేంద్ర స్థాయిలో కమిటీ ఏర్పాటైంది. ఈ దారుణం వెనక కేంద్రమంత్రి ప్రమేయముందన్న ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదయ్యాయి.

తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న రోహిత్‌ ఆత్మహత్య....

జాతి కుల వివక్షతలకు బలైన దళిత విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 15 రోజుల క్రితం సస్పెండైన రోహిత్ మనస్తాపంతో ఆదివారం హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం జాతి వివక్ష కారణాలతో రోహిత్‌తో సహా మరో నలుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల సస్పెండ్‌ను వ్యతిరేకిస్తూ హెచ్‌సియులో పలు విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. వాళ్ల సస్పెన్షన్‌ను ఎత్తేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆదివారం వరకు గడువు విధించాయి. అయితే విద్యార్థుల సస్పెన్షన్‌పై విసి అప్పారావు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన రోహిత్ సూసైడ్ నిర్ణయం తీసుకున్నాడు.

అత్యంత పకడ్బందీగా పోస్టుమార్టం....

రోహిత్ మృతికి కారణమైనవారిని అరెస్ట్ చేయాలంటూ ఆదివారం రాత్రి నుంచే విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. ఉదయం 7 గంటల సమయంలో విద్యార్థులను చెదరగొట్టి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. దీంతో విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత కొనసాగింది. రోహిత్ మృతదేహానికి పోస్ట్‌మార్టం ప్రక్రియను కూడా పోలీసులు అత్యంత పకడ్బందీగా భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. ప్రజాసంఘాలు, పార్టీల నేతలనూ ఆస్పత్రి లోపలికి అనుమతించలేదు. పోలీస్‌ వైఖరిని ప్రజాసంఘాల నేతలు, సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తప్పుబట్టారు. ఈ ఘటనపై సిపిఎం పొలిట్‌బ్యూరో స్పందిస్తూ తక్షణమే విసి అప్పారావుపై ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

ఆగమేఘాలుగా అంత్యక్రియలు...

విద్యార్థి, ప్రజా సంఘాల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు రోహిత్ మృతదేహానికి ఆగమేఘాలపై అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడి ఆత్మహత్యపై అతని తల్లి స్పందిస్తూ తనకు న్యాయం జరిగే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనక ప్రముఖుల పేర్లు వినిపిస్తుండడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

హస్తినను తాకిన నిరసనలు....

రోహిత్ మృతితో చెలరేగిన ఆందోళన సెగలు హస్తినను తాకాయి. ఏకంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, విసిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు షకీలాశంషూ, సూరత్‌సింగ్‌.. హెచ్సీయూలో ఏం జరిగిందనే అంశాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించనున్నారు.

తన లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదంటున్న దత్తాత్రేయ....

ఇక రోహిత్ మృతికి కారణమయ్యారంటూ వీసీ అప్పారావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌, బీజేవైఎం నాయకుడు విష్ణుపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏఐఎస్‌ఏ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఢిల్లీలో స్పందించారు. తన లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. యూనివర్సిటీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని ఏబీవీపీ కార్యకర్తలను కొట్టినట్లు తనకు గతంలో వినతిపత్రం వచ్చిందని అన్నారు. ఆ లెటర్‌ను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు యథావిధిగా పంపించినట్లు వారు దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదని వివరించారు. తనపై నమోదైన కేసులు గురించి ఎలాంటి కామెంటూ చేయనని బండారు దత్తాత్రేయ అన్నారు. 

06:48 - January 19, 2016

హైదరాబాద్ : పెట్టుబడులతో ఏపీ దశను మార్చేందుకు సీఎం చంద్రబాబు దావోస్‌ బాట పట్టారు. దావోస్‌లో జరగునున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార దిగ్గజాలు, ఆర్థిక వేత్తలు, పలు దేశాల ఆర్థిక మంత్రులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఏపీలో పెట్టుబడుల ఆవశ్యకతను చాటి చెప్పేందుకు సీఎం చంద్రబాబు ఈ అవకాశాన్ని వినియోగించుకోనున్నారు.

ఈ నెల 19నుంచి 23వరకూ దావోస్‌ పర్యటన.....

ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా ముందుకుసాగుతున్న సీఎం చంద్రబాబు మరో టూర్‌కు బయలుదేరబోతున్నారు.. ఈనెల 19నుంచి 23వరకూ దావోస్‌లో పర్యటిస్తారు.. 19న సిఐఐ ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు.. 20 నుంచి 23 వరకూ వరల్డ్ ఎకనమిక్‌ ఫోరం 46వ సదస్సుకు హాజరవుతారు.. ఈ కార్యక్రమానికి వెళుతున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా... ఇదే సమావేశంలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్బీఐ గవర్నర్‌ రఘురామరాజన్‌కూడా పాల్గొంటున్నారు..

రక్షణ, వైమానిక, విద్యుత్, ఇంధన, వైద్యపరికరాల తయారీ.........

దావోస్‌ టూర్‌లో రక్షణ, వైమానిక, విద్యుత్, ఇంధన, వైద్యపరికరాల తయారీ, మౌలిక సదుపాయాల కల్పన, రవాణా, నౌకాయాన రంగాలు, కన్సల్టింగ్‌, ఐటీ సెక్టార్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన సంస్థల అధిపతులతో చంద్రబాబు సమావేశం అవుతారు.. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, సాఫ్ట్ బ్యాంక్‌ అధికారులతోనూ చర్చలు జరుపుతారు..

పట్టణాభివృద్ధి సర్వీసులు, మౌళిక సదుపాయాలు.......

ఇక వరల్డ్ ఎకనమిక్‌ సమావేశంలో పట్టణాభివృద్ధి సర్వీసులు, మౌళిక సదుపాయాలు, వ్యవసాయం ముందస్తు ప్రణాళిక, ఇంధన విధానం కొత్త రూపురేఖలు, ఉత్పాదక రంగం అంశాలపై బాబు ప్రసంగించనున్నారు.. ఆ తర్వాత నెస్లె, ట్రినా సోలార్‌, జెట్రో, ఊబర్‌, మారియట్‌ ఇంటర్నేషనల్‌, ఫోర్స్ అండ్ ఇంటర్‌ కాంటినెంటల్‌ హొటల్స్ ప్రతినిధులతో సమావేశమవుతారు.. నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రధానాంశంగా నిర్వహించబోయే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏపీసీఎం స్పీచ్‌ ఉంటుంది..

దావోస్‌ వీధుల్లో ఆంధ్రప్రదేశ్ యువర్‌ బిజినెస్‌ రథం............

ఇప్పటికే మేక్ ఆంధ్రప్రదేశ్ యువర్‌ బిజినెస్‌ పేరుతో రూపొందించిన పబ్లిసిటీ బస్... దావోస్‌ వీధుల్లో తిరుగుతోంది.. ఇదే నినాదంతో అక్కడ హోర్డింగ్‌లు కూడా ఏర్పాటయ్యాయి.. విశాఖ సీఐఐ సదస్సు విజయవంతమైన ఉత్సాహంలో ఉన్న చంద్రబాబు... ఈ టూర్‌కూడా సక్సెస్‌ చేయాలని పట్టుదలగా ఉన్నారు.. ఈ పర్యటనలో బాబుతోపాటు.. మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వసలహాదారు పరకాల ప్రభాకర్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ వెళుతున్నారు.. 

06:45 - January 19, 2016

హైదరాబాద్ : జాతి కుల వివక్షతలకు బలైన దళిత విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 15 రోజుల క్రితం సస్పెండైన రోహిత్ మనస్తాపంతో ఆదివారం హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం జాతి వివక్ష కారణాలతో రోహిత్‌తో సహా మరో నలుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల సస్పెండ్‌ను వ్యతిరేకిస్తూ హెచ్‌సియులో పలు విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. వాళ్ల సస్పెన్షన్‌ను ఎత్తేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆదివారం వరకు గడువు విధించాయి. అయితే విద్యార్థుల సస్పెన్షన్‌పై విసి అప్పారావు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన రోహిత్ సూసైడ్ నిర్ణయం తీసుకున్నాడు.

ఆదివారం రాత్రి నుంచే విద్యార్థులు ఆందోళన....

రోహిత్ మృతికి కారణమైనవారిని అరెస్ట్ చేయాలంటూ ఆదివారం రాత్రి నుంచే విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. ఉదయం 7 గంటల సమయంలో విద్యార్థులను చెదరగొట్టి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. దీంతో విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత కొనసాగింది. రోహిత్ మృతదేహానికి పోస్ట్‌మార్టం ప్రక్రియను కూడా పోలీసులు అత్యంత పకడ్బందీగా భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు. ప్రజాసంఘాలు, పార్టీల నేతలనూ ఆస్పత్రి లోపలికి అనుమతించలేదు. పోలీస్‌ వైఖరిని ప్రజాసంఘాల నేతలు, సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తప్పుబట్టారు. ఈ ఘటనపై సిపిఎం పొలిట్‌బ్యూరో స్పందిస్తూ తక్షణమే విసి అప్పారావుపై ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

ఆగమేఘాలపై అంత్యక్రియలు....

విద్యార్థి, ప్రజా సంఘాల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు రోహిత్ మృతదేహానికి ఆగమేఘాలపై అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడి ఆత్మహత్యపై అతని తల్లి స్పందిస్తూ తనకు న్యాయం జరిగే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన వెనక ప్రముఖుల పేర్లు వినిపిస్తుండడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

రోహిత్ మృతితో చెలరేగిన ఆందోళన సెగలు హస్తినను తాకాయి. ఏకంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, విసిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు షకీలాశంషూ, సూరత్‌సింగ్‌.. హెచ్సీయూలో ఏం జరిగిందనే అంశాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించనున్నారు.

వీసీ అప్పారావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పై కేసు నమోదు...

ఇక రోహిత్ మృతికి కారణమయ్యారంటూ వీసీ అప్పారావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌, బీజేవైఎం నాయకుడు విష్ణుపై గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏఐఎస్‌ఏ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఢిల్లీలో స్పందించారు. తన లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. యూనివర్సిటీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని ఏబీవీపీ కార్యకర్తలను కొట్టినట్లు తనకు గతంలో వినతిపత్రం వచ్చిందని అన్నారు. ఆ లెటర్‌ను మానవ వనరుల మంత్రిత్వ శాఖకు యథావిధిగా పంపించినట్లు వారు దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదని వివరించారు. తనపై నమోదైన కేసులు గురించి ఎలాంటి కామెంటూ చేయనని బండారు దత్తాత్రేయ అన్నారు. 

06:42 - January 19, 2016

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య అత్యంత బాధాకర పరిణామం. గతకొంతకాలంగా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఈ ఆత్మహత్యకు దారితీశాయి. అసలు రోహిత్‌ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? సెంట్రల్‌ యూనివర్సిటీలలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? గత కొంతకాలంగా వివిధ యూనివర్సిటీలో విద్యార్థుల మీద దాడులు, వేధింపులు, ఆత్మహత్యలు పెరగడానికి కారణం ఏమిటి? సెంట్రల్‌ యూనివర్సిటీల పాలనా వ్యవహారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి ఎలా వుంటోంది? సెంట్రల్‌ యూనివర్సిటీలో వేధింపులు, ఆత్మహత్యలు లాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా వుండాలంటే ఏం చేయాలి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చను చేపట్టారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

Don't Miss