Activities calendar

21 January 2016

వచ్చే నెల 11న జీహెచ్ ఎంసీ మేయర్ ఎన్నిక

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహా నగర మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఫిబ్రవరి 11న జరగనుంది. ఈ ఎన్నికకు ఫిబ్రవరి 6న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 1499 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

22:00 - January 21, 2016

కర్నాటక : బెంగళూరులో ఐబిఎం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని తానుండే అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైంది. 31 ఏళ్ల కుసుమ్‌ సింగ్లా గత ఏడాది ఆగస్టు నుంచి ఓ ఫ్లాట్‌లో మరో మహిళతో కలిసి నివసిస్తోంది. రూమ్మేట్‌ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి కుసుమ్‌ శవమై కనిపించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన స్నేహితుడే కుసుమ్‌ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు సుక్‌బీర్‌సింగ్‌ను హర్యానా పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు బెంగళూరు పోలీసు అధికారులు పేర్కొన్నారు. సుక్‌బీర్‌సింగ్‌ లాప్‌టాప్‌ వైర్‌తో కుసుమ్‌ గొంతు నులిమి చంపినట్టు తెలిపారు.  సీసీటీవీ పుటేజీ సరిగా లేకపోవడంతో సోషల్‌ మీడియా ఆధారంగా పోలీసులు 24 గంటల్లో ఈ హత్యను ఛేదించారు. కుసుమ్‌ సింగ్లాకు సుక్‌బీర్‌ సింగ్‌ 3 నెలల క్రితం సోషల్‌ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. సుక్‌బీర్‌సింగ్‌ 50 వేల అప్పు అడగగా సింగ్లా నిరాకరించడంతో వీరి మధ్య గొడవకు దారితీసింది.

 

21:57 - January 21, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అన్ని పార్టీల నుంచి పలువురు తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో వారిని బుజ్జగించేందుకు అగ్రనేతలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరిరోజు అన్ని పార్టీల నుంచి 1214 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణ గడువు ముగిసేసరికి 150 డివిజన్లలో 1499 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

నేటితో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ 

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ నేటితో ముగిసింది. నామినేషన్లలో అన్ని పార్టీలకు రెబల్‌ అభ్యర్థుల బెడద తప్పలేదు. ఉపసంహరణ గడువు ముగిసేసరికి 150 డివిజన్లలో 1939 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా పార్టీల అగ్రనేతల బుజ్జగింపులతో 698 మంది తిరుగుబాటు నేతలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 

తొలుత 150 డివిజన్ల నుంచి 4,144 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 114 నామినేషన్లు స్క్రుట్‌నీలో చెల్లుబాటు కానివిగా ఎన్నికల అధికారులు తేల్చారు. విత్‌డ్రాలు పోను చివరకు 1939 మంది అభ్యర్థులు గ్రేటర్‌ బరిలో నిలిచారు. 

తిరుగుబాటుదారుల బెడద 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీలకూ తిరుగుబాటుదారుల బెడద తప్పడంలేదు. బీఫామ్‌ల విషయంలో చివరి నిమిషంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ముందుగా ఒకరి పేరును ప్రకటించి బీఫామ్‌లు మరొకరికి ఇవ్వడంతో.. టికెట్ దక్కని వారు పార్టీ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. పలు డివిజన్లలో టీడీపీ, బీజేపీల పొత్తు వికటించింది. కొన్ని చోట్ల అభ్యర్థులకు రెండు పార్టీలూ బీఫాంలు ఇచ్చాయి. టీడీపీకి కేటాయించిన ఐదు స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. బీజేపీకి కేటాయించిన ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. బీఫారాలను టీడీపీ-బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ఇచ్చారు. అడిక్‌మెట్‌, అమీర్‌పేట్, సుభాష్‌నగర్, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ బరిలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. హబ్సిగూడ, రెహ్మత్‌నగర్‌, బిఎన్‌రెడ్డినగర్, పటాన్‌చెరు, జీడిమెట్లలో బీజేపీ అభ్యర్థులు పోటీకి దిగనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు కాంగ్రెస్ పార్టీ పలువురు అభ్యర్థులను మార్చింది. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు కూడా రెబల్ అభ్యర్థుల బెడద తప్పడంలేదు.

21:48 - January 21, 2016

హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ  విద్యార్థి మృతిపై నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కేంద్రం తీరును నిరసిస్తూ.. పోరాటం ఉధృతం చేసేందుకు ప్రజా సంఘాల జెఎసి ఏర్పడింది. ఈ జెఎసి ఆధ్వర్యంలో రేపటినుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మరింత ఉధృతం కానున్నాయి. 

విద్యార్థుల పోరాటం ఉధృతం 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతిని నిరసిస్తూ.. విద్యార్థుల పోరాటం మరింత ఉధృతం కానుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశంలో... పలు సంఘాల నేతలు... విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలు జెఎసి గా ఏర్పడ్డాయి. ఈ జేఏసీకి జస్టిస్ చంద్రకుమార్ ను కన్వీనర్ గా ఎన్నుకున్నారు

 రౌండ్ టేబుల్ సమావేశం

రౌండ్ టేబుల్ సమావేశానికి పలు విద్యార్థి సంఘాలు ,యువజన, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య, కంచె ఐలయ్య, కవి జయరాజ్  , సంధ్య, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు , మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు , మల్లేపల్లి లక్ష్మయ్య , టీజాక్ ఛైర్మన్ కోదండరామ్, జస్టిస్ చంద్ర కుమార్, వామపక్ష నేతలు, మేధావులు హాజరయ్యారు. రోహిత్ మృతికి కారణమైన కేంద్రమంత్రుల దిష్టి బొమ్మల దహనానికి JAC పిలుపునిచ్చింది. 
ఇందిరా పార్క్ వద్ద రిలే దీక్షలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. 24న జిల్లా, మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టనున్నారు. అన్ని యూనివర్శిటీలకు బస్సుయాత్ర చేపట్టాలని కూడా నిర్ణయించారు.  

రోహిత్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని , ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ , దత్తాత్రేయ రాజీనామా చేయాలని లేకపోతే మోడీనే వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు నేతలు. 

రోహిత్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు... మృతికి గల కారణాలను  విశ్లేషించాలని నేతలు డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ప్రజా సంఘాల జేఏసీ ఉద్యమిస్తుందన్నారు నేతలు.    

గ్రేటర్‌ లో ఎన్నికల బరిలో 1499 మంది అభ్యర్థులు

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరిలో 1499 మంది అభ్యర్థులు నిలిచారని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ఈరోజు ఒక్కరోజే 1214 నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. తెరాస-307, తెదేపా-252, భాజపా-182, కాంగ్రెస్‌-230, ఎంఐఎం నుంచి 6 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు

21:22 - January 21, 2016

కొంత కాలంగా ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. స్టార్టప్ ఇండియా... స్టాండప్ ఇండియా.. అంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని పిలుపునిచ్చిన సందర్భం. మెజారిటీ పాపులేషన్ యువత అయినపుడు, ఉపాధి అవకాశాలు రోజు రోజుకి తగ్గుతున్న సంక్షోభ కాలంలో స్టార్టప్ లకు ప్రాధాన్యత పెరిగింది. మరి, స్టార్టప్ లపై సర్కారు విధానం ఎలా ఉంది. స్టార్టప్ బూమ్ ఏ దిశగా సాగుతోంది? ఈ వివరాలతో ఈ రోజు వైడాంగిల్ కథనం చూద్దాం.. 

సరికొత్త పరిణామంపై అంచనాలు 


స్టార్టప్ అంటే ఇప్పుడు తెలియని వారుండరు. ఉద్యోగాలు వదిలి  స్టార్టప్ మంత్ర పఠిస్తున్నవారు కొందరైతే, స్ట్రైట్ గా యూనివర్సిటీ నుండి ప్రయోగాలు మొదలు పెడుతున్నవారు మరికొందరు. కార్పొరేట్ ఉద్యోగాల బాట వదిలి, సొంతంగా ఉపాధి వెతుక్కునే ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. దేశంలో నెలకొన్న ఈ సరికొత్త పరిణామంపై అంచనాలు పెరుగుతున్నాయి. 

ఎంత ఉత్సాహం ఉన్నా ప్రోత్సాహం కూడా కావాలి

ఎంత ఉత్సాహం ఉన్నా ప్రోత్సాహం కూడా కావాలి. పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. ప్రభుత్వాల నుండి కూడా ఎంతో కొంత ఆసరా కూడా కావాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాలసీలు వివిధ రకాలుగా ఉన్నాయి. కొన్నిరాష్ట్రాలు స్టార్టప్ లకు ఊతాన్నిస్తే, మరికొన్ని రాష్ట్రాల్లో నియమ నిబంధనల కారణంగా స్టార్టప్ లకు పెద్దగా ప్రోత్సాహం కనిపించని పరిస్థితి నెలకొంది. 

సరళీకృత విధానాలు నిలువునా ముంచాయి.. 


భారత్ లో స్టార్టప్ బూమ్ అనుకోకుండా వచ్చిన పరిణామమేమీ కాదు. చాలా మంది ఊహించిన విషయమే. ఒక్క 2015లోనే 850 స్టార్టప్ లు, 1005 ఒప్పందాలు, ఇదే భారత స్టార్టప్ బూమ్ స్థాయిని చెప్తోంది. కానీ ఎనాలసిస్ లు మాత్రం భారత్ లో స్టార్టప్ లకు ఉన్న అనేక అడ్డంకులను స్పష్టం చేస్తున్నాయి.

స్టార్టప్ లను ప్రోత్సహించటం మంచి విషయమే

స్టార్టప్ లను ప్రోత్సహించటం మంచి విషయమే. కానీ,  ఇప్పటికే బడాకంపెనీలు పన్ను రాయితీలతో పబ్బంగడుపుకుంటున్నాయి. 5 లక్షల కార్పొరేట్ సబ్సిడీలు సామాన్యుడి నడ్డివిరిచి కొందరి బొక్కసాలు నింపుతున్నాయి. స్టార్టప్ ల విషయంలో వెసులుబాటు ఎంత అవసరమో, పర్యావరణ, కార్మిక సంబంధిత అంశాల్లో నియమ నిబంధనలు కచ్చితంగా అనుసరించాలనే సూచనలు వినిపిస్తున్నాయి.

స్టార్టప్ లు అభివృద్ధి చెందటం అవసరమే కానీ...

స్టార్టప్ లు అభివృద్ధి చెందటం చాలా అవసరం కానీ, అదే సమయంలో దేశ వనరులను దుర్వినియోగం చేయకుండా, పర్యావరణాన్ని కాపాడుతూ, ఉపాధి పెంచుతూ,  ఆ ఉత్పత్తులు దేశానికి ఉపయోగపడేలా చేయటం అవసరం. అలాంటి స్టార్టప్ లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పారిశ్రామికాభివృద్ధి ఎంత అవసరమో .. ఆ వెల్లువలో మన వ్యవస్థకు హాని జరగకుండా చూసుకోవాలసిన అవసరం కూడా ఉంది. 

 

20:51 - January 21, 2016

రోహిత్ శవంపై పేలాలేరుతున్న బీజేపీ, గాంధీభవన్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వ్యక్తి, ఓటర్లకు ఓపిక ఉండాలంటున్న కేటీఆర్, పురుగుల మందు తాగిన జెడ్ పిటిసి సభ్యుడు, వందో సినిమాకు కథ రాస్తున్న బాలయ్య… ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం.…

 

20:13 - January 21, 2016

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన అనంతరం ప్రధాన సమస్యగా ఉన్న గోదావరి జలాల వివాదంపై బోర్డు సమావేశం ముగిసింది. ఈ భేటీలో తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పట్టిసీమ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం చర్చకు తెచ్చింది. పట్టిసీమ డీపీఆర్‌లను ఇవ్వాలని కోరింది. పట్టిసీమ పోలవరం అథారిటీలో భాగమేనని, పట్టిసీమ డీపీఆర్‌లను చూపించాల్సిన అవసరంలేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టు డీపీఆర్‌లను ప్రవేశపెట్టాలని ఏపీ అధికారులు కోరగా....  కొత్త ప్రాజెక్టుల నివేదికలు ఇంకా పూర్తి కాలేదని తెలంగాణ అధికారులు సమాధానమిచ్చారు. 2016-17 సంవత్సరానికి జలసౌధ ఖర్చుల కోసం 8 కోట్లు కావాలని గోదావరి బోర్డు సూచించింది. ఈ ఖర్చును చెరిసగం భరించేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అంగీకరించాయి. 

 

20:08 - January 21, 2016

నెల్లూరు : జిల్లా సెంట్రల్ జైలులో ఉన్న తమ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని... వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. తిరుపతి ఎయిర్ పోర్టు అధికారిపై దాడి కేసులో మిథున్ రెడ్డి, సమైక్యాంధ్ర ఉద్యమ కేసులో అరెస్టైన చెవిరెడ్డి... ప్రస్తుతం నెల్లూరు కాకుటూరు సెంట్రల్‌ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే తమ నేతలపై కేసులు బనాయిస్తోందని జగన్ మండిపడ్డారు. వాస్తవాలు బయటపడుతాయని విమానాశ్రయంలోని  సీపీటివి పుటేజిని బాబు సర్కార్ బయట పెట్టడం లేదని జగన్ ఆరోపించారు. 

 

19:56 - January 21, 2016

విజయవాడ : రాజధాని ప్రాంతంలో వ్యవసాయ పరిరక్షణ పేరుతో ప్రజల మెడకు ఉరితాడు వేస్తున్నారని వెంటనే ప్లాన్ లో మార్పులు చేపట్టాలంటూ సీపీఎం, వైసీపీ, కాంగ్రెస్ నేతలు సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ కు వినతిపత్రం అందజేశారు. మాస్టర్ ప్లాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్నారు నేతలు. అభ్యంతరాల గడువును పొడిగించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఉద్యామిస్తామని అఖిలపక్షం నేతలు హెచ్చరించారు.

 

 

19:49 - January 21, 2016

దావోస్‌ : స్విట్జర్లాండ్‌ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో లాక్‌హీడ్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీ పెట్టుబడులకు అనువైన రాష్ట్రమని చెప్పారు. ఏపీలో రక్షణ పరికరాల ఉత్పత్తికి అనువైన ప్రాంతాలపై లాక్‌హీడ్‌ ప్రతినిధులకు సీఎం వివరించారు.

 

ప్రభుత్వ స్కూల్ లో పేలుడు

కర్నూలు :  జిల్లాలోని కౌతాల మండలం యెరిగిరి ప్రభుత్వ పాఠశాలలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుడు పదార్థాలను బ్యాటరీకి కనెక్ట్‌ చేస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. 

19:40 - January 21, 2016

కర్నూలు : జిల్లాలోని కౌతాల మండలం యెరిగిరి ప్రభుత్వ పాఠశాలలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పేలుడు పదార్థాలను బ్యాటరీకి కనెక్ట్‌ చేస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. 

 

19:29 - January 21, 2016

వరంగల్ : జిల్లాలో వడ్డీ వ్యాపారులు హల్ చల్ సృష్టించారు. కరీమాబాద్ కు చెందిన రాందాస్ కుటుంబంపై వడ్డీ వ్యాపారులు దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రులను 108 సహాయంతో హుటాహుటిన ఎంజీఎంకు తరలించారు. 10 శాతం పైగా వడ్డీ వసూలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి బాధితులు కోరుతున్నారు. గాయపడి చికిత్స పొందుతున్న రాందాస్ కుటుంబాన్ని మాజీ మంత్రి సార్యయ్య పరామర్శించారు.

 

సస్పెన్షన్ ముందే ఎత్తివేస్తే రోహిత్‌ ప్రాణాలు దక్కేవి : నాగేశ్వర్‌

హైదరాబాద్ : హెచ్ సీయూ స్టూడెంట్స్‌పై సస్పెన్షన్‌ను పది రోజుల ముందే ఎత్తివేస్తే రోహిత్‌ ప్రాణాలు దక్కేవని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. సస్పెన్షన్‌ను తాత్కాలికంగా కాకుండా పూర్తిగా ఎత్తివేయాలన్నారు. సస్పెన్షన్‌ తప్పుడు నిర్ణయం అయినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న అధికారులపై.. దానికి ఉసిగొల్పిన రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలని నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. 

18:49 - January 21, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ స్టూడెంట్స్‌పై సస్పెన్షన్‌ను పది రోజుల ముందే ఎత్తివేస్తే రోహిత్‌ ప్రాణాలు దక్కేవని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. సస్పెన్షన్‌ను తాత్కాలికంగా కాకుండా పూర్తిగా ఎత్తివేయాలన్నారు. సస్పెన్షన్‌ తప్పుడు నిర్ణయం అయినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న అధికారులపై.. దానికి ఉసిగొల్పిన రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలపాలని నాగేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. 

18:44 - January 21, 2016

హైదరాబాద్ : జిహెచ్ ఎంసి ఎన్నికల నామినేషన్ల చివరిరోజు.. బీఫాంలపై టీడీపీ-బీజేపీ చర్చలు ఓ కిలిక్కివచ్చాయి. ఓవైపు 3గంటలకే నామినేషన్ల సమయం ముగియడంతో... రెబల్స్ పోటీ ఉన్న చోట్లపై దృష్టిపెట్టారు. 10 డిజిజన్లలో వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించారు. హబ్సీగూడ, రెహ్మత్ నగర్, బీఎన్‌ రెడ్డి నగర్, పటాన్ చెరు, జీడిమెట్ల, జూబ్లీహిల్స్, అడిక్‌మెట్, అమీర్‌ పేట్, మాదాపూర్, సుభాష్‌ నగర్‌లలో పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. చావని డివిజన్‌లో ఇండిపెండెంట్‌కు ఇరుపార్టీల మద్దతు ప్రకటించాయి. అలాగే ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లిలో రెబల్స్‌ను టీడీపీ బుజ్జగించి.. వారితో నామినేషన్లు విత్‌డ్రా చేయించింది. రేపు ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో టీడీపీ అభ్యర్థుల సమావేశం జరుగనుంది. 

 

18:37 - January 21, 2016

చిన్నపాటి విటమిన్ లోపాలతో, వచ్చే సమస్యలు ఒక్కోసారి పెద్దవిగా కనిపిస్తాయి. దాంతో భయపడిపోతాం. హాస్పిటల్స్ చుట్టూ తిరగేస్తాం. కానీ, ఆ సమస్యలకు రీజన్ ఏంటో తెలుసుకుంటే, వాటికి మెడిసిన్స్ మన కిచెన్ లో ఉంటే అంతకంటే ఏం కావాలి. చాలామందిలో సాధారణంగా కనిపించే, బి కాంప్లెక్స్ విటమన్ లోపంతో కనిపించే సమస్యలేంటి? వాటికి నివారణ ఏమిటో ఇవాళ్టి మానవి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

 

18:32 - January 21, 2016

వరకట్నం వేధింపు కేసుల దర్యాప్తు స్వరూపం మారే సూచనలు కనిపిస్తున్నాయి. కేసు నమోదు కాగానే, భర్తను, కుటుంబ సభ్యులను అరెస్టు చేసే విధానాన్ని మార్పుచేసి, న్యాయస్థానం అనుమతితో రాజీపడేందుకు వారికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. లా కమీషన్ సూచన మేరకు కేంద్రం ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మహిళలపై హింసను అడ్డుకునేందుకు ఏర్పరచిన ఈ చట్టాన్ని నీరు గార్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో మానవి ప్రత్యేక కథనం. 

మహిళల పోరాటాలతోనే,  వారికి అనుకూలమైన ఏ చట్టమైనా  దేశంలో రూపుదిద్దుకుంది. ఈ చట్టాలన్నింటి  వెనక మహిళల అనేక దశాబ్దాల పోరాటముంది. మహిళా లోకం అలా పోరాడి సాధించుకున్న సెక్షన్ 498 ఏ లో మార్పుల కోసం ఇప్పుడు మరోసారి గట్టి ప్రయత్నాలే  జరుగుతున్నాయి. 

చట్టం ఎలా ఉన్నా.. అది కఠినంగా అమలయ్యేదైనా, సరళంగా ఉండేదైనా దోషులను శిక్షించేదిగా, బాధితులకు రక్షణ కల్పించేదిగా ఉండాలి. ఏ చట్టం అమలులోనైనా, లోటుపాట్లు సహజం. అదే సమయంలో దుర్వినియోగం కావడానికి కూడా అంతే ఆస్కారముంది. అలాగని, మహిళలకు ఎంతో కొంత రక్షణ కల్పిస్తున్న సెక్షన్ 498 ఏ కి సవరణలు చేయడం సరైన నిర్ణయం కాదని  నినదిస్తున్న మహిళా లోకంతో,  మానవి ఏకీభవిస్తోంది. దుర్వినియోగం కాకుండా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకులది, రక్షణ, న్యాయవ్యవస్థలది కూడా అని భావిస్తొంది. 

18:28 - January 21, 2016

హైదరాబాద్: టెక్నాలజీలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ స్థానాన్ని క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఆక్రమించనుంది.  మార్పులను  అందిపుచ్చుకోకపోతే ఐటీ  కంపెనీలకు భవిష్యత్‌లో మనుగడ కష్టమేని నిపుణులు  హెచ్చరిస్తున్నారు. ఐటీ నిపుణులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. భవిష్యత్‌ అంతా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగానిదేనని చెబుతున్నారు.

ఐటీ రంగంలో వస్తున్న మార్పులపై చర్చలు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక వేదక సదస్సులో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. టెక్నాలజీ రంగంలో వేగంగా వస్తున్న మార్పులను స్వీకరించని ఐటీ కంపెనీలు, నిపుణులకు భవిష్యత్‌ కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు భారత ఐటీ సంస్థలకు  విస్తృత అవకాశాలు, ప్రాజెక్ట్‌లతోపాటు ఆదాయం  సమకూర్చిపెట్టిన అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, మెయింటెనెన్స్‌ సేవలను నమ్ముకుంటే ఈ రంగంలో నిలదొక్కుకోవడం కష్టమంటున్నారు. 

క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత 


ఖాతాదారుల అవసరాలు మారుతున్నాయి. అప్లికేషన్‌  రంగం నుంచి క్లౌడ్‌ అప్లికేషన్‌ వైపు మర్లుతున్నారు. అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, మెయింటెనెన్స్‌ మరో ఐదు నుంచి ఏడేళ్లకు మించి ఉండకపోవచ్చని అంచనావేస్తున్నారు. ఆతర్వాత అంతా క్లౌడ్‌ కంప్యూటింగ్‌కే ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఈ దిశగా ఐటీ నిపుణులు, కంపెనీలు మారకపోతే వ్యాపారంలో నిలదొక్కుకోవడం కష్టమని చెబుతున్నారు. అలాఅని భారత ఐటీ కంపెనీలకు మంచికాలం లేదని   చెప్పడం తమ ఉద్దేశం కాదంటున్నారు.

ఆటోమేషన్‌తో మారనున్న ఐటీ పర్యవేక్షకుల విధులు 

మూడేళ్ల క్రితం క్లౌడ్‌ కంప్యూటింగ్‌ గురించి మాట్లాడితే ఒక వింతగా ఉండేదని, అప్పట్లో ఇది ప్రధాన అంశం కాదని, ఇప్పుడు  క్రమంగా దీనికి ప్రాధాన్యత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో చేస్తున్న పనే భవిష్యత్‌లో కూడా ఉంటుందని నమ్ముకుని కూర్చుంటే పుట్టె మునగడం  ఖాయమంటున్నారు. ఐటీ  కంపెనీలతో పాటు, నిపుణులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండాలనుకోవడంలేదని, మార్పులను స్వాగతిస్తూ, ఈ దిశగా పయనిస్తున్నారని, ఇది మంచిపరిణామమని చెబుతున్నారు. ఐటీ కంపెనీల్లో పర్యవేక్షణ ఉద్యోగుల విధుల్లో కూడా పూర్తిగా మార్పులు రాబోతున్నాయని, ఆటోమేషనే ఇందుకు కారణమని సూచిస్తున్నారు.  వచ్చే రెండు మూడేళ్లలో పర్యవేక్షణ  పనుల్లో  కూడా ఆధునీకరణ రోబోతోందని నిపుణులు చెబుతున్నారు. 

మధ్యస్థాయి ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం 

ఐటీ రంగంలో వస్తున్న మార్పులు మధ్యస్థాయి ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అంచనావేస్తున్నారు. ఎక్కువ నైపుణ్యంలో ఉద్యోగాల్లో చేరే జూనియర్లతోపాటు, సీనియర్లకు  సమస్య ఉండదని చెబుతున్నారు. కత్తి వేలాడేది మిడిల్‌ మేనేజ్‌మెంట్‌పైనేనని హెచ్చిరిస్తున్నారు. ఐటీ రంగంలో ఆటేమేషన్‌తో  నియామకాలు తగ్గుతాయా? అంటే.. అదేంలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న భారీ స్థాయి రిక్రూట్‌మెంట్లు భవిష్యత్‌లో ఉండకపోవచ్చంటున్నారు. ఐటీ నిపుణులకు ప్రస్తుతం ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటే భవిష్యత్‌కు భరోసాతోపాటు ఉద్యోగానికి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. 

18:19 - January 21, 2016

అనంతపురం : అకాల వర్షం కరవు ప్రాంత రైతులను నిండా ముంచింది. తాడిపత్రి డివిజన్ పరిధిలో కురిసిన వర్షానికి చేతికందొచ్చిన పంట నేలపాలైంది. పెద్దపప్పూరు, యాడికి, ఎల్లనూరు, పుట్లూరు, పెద్దవడుగూరు మండలాల్లో  పప్పుశనగ, జొన్న, దనియాలు, పత్తి, కంది పంటలు నేల పాలయ్యాయి. ఒక్క తాడిపత్రి డివిజన్‌ పరిధిలోనే అకాల వర్షానికి సుమారు 8.5 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అకాల వర్షం దెబ్బకు రైతులు మరింత నష్టాల్లో కూరుకుపోయారు

 

18:16 - January 21, 2016

కడప : విద్యార్ధి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్‌ జరుగుతున్నది. కడప కొత్త కలెక్టరేట్‌లో తొలగించిన అంబేద్కర్‌ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలన్న డిమాండ్‌లో  విద్యాసంస్థల బంద్‌ పాటిస్తున్నారు. దళితులు, బహుజనులు గత నెలలో  కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అధికారులు తొలగించడాన్ని విద్యార్ధి  నాయకులు తప్పుపడుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల పేరుతో అంబేద్కర్‌ విగ్రాహాన్ని తొలగించడం రాజ్యాంగ నిర్మాతను అవమానించినట్టే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌లో తొలగించిన అంబేద్కర్‌ విగ్రహాన్ని పునఃప్రతిష్టించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్ధి జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. 

 

రోడ్డు ప్రమాదంలో ఒకరి గాయాలు

విజయనగరం : జిల్లాలోని పార్వతీపురం బైపాస్‌ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు త్రీవంగా గాయపడ్డారు. పెట్రోల్ కొట్టించుకోవడానికి బంక్‌కు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. 

 

18:01 - January 21, 2016

పంజాబ్ : పఠాన్‌కోట్‌ దాడి నేపథ్యంలో ఎన్‌ఐఏ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌, అమృతసర్‌లలో దాడులు నిర్వహించింది. గురుదాస్‌పూర్‌ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌, ఇద్దరు సహచరులకు సంబంధించి ఆరు చోట్ల సోదాలు చేశారు. ఢిల్లీలో రెండురోజుల పాటు సల్వీందర్‌సింగ్‌పై లైడిటెక్టర్‌ టెస్ట్‌ నిర్వహించిన తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం. సల్వీందర్‌సింగ్‌తో పాటు ఉన్న రాజేష్‌ వర్మ, మదన్‌ గోపాల్‌ను డిసెంబర్‌ 31 రాత్రి ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే. సల్విందర్‌సింగ్‌ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఎన్‌ఐఏ అధికారులు ఆయనపై లై డిటెక్టర్‌ పరీక్షలు నిర్వహించారు.

 

17:58 - January 21, 2016

అహ్మదాబాద్ : ప్రఖ్యాత భరత నాట్య కళాకారిణి, పద్మభూషణ్ మృణాళిని సారాభాయి కన్ను మూశారు. ఆమె వయసు 97 ఏళ్లు,  ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్న మృణాళిని అహ్మదాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని  కుమార్తె ప్రముఖ నృత్య కళాకారిణి మల్లికా సారాభాయి ఫేస్ బుక్‌ పేజీలో వెల్లడించారు. 1948లో అహ్మదాబాద్‌లో దర్పణ అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్‌గా మృణాళిని బాధ్యతలు నిర్వహించారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 వేల మంది విద్యార్థులు భరతనాట్యం, కథకళి నుంచి పట్టాలు పొందారు. నృత్యకారిణిగానే కాకుండా మంచి రచయిత్రి, కవయిత్రిగా కూడా మృణాళిని గుర్తింపు పొందారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రం సారాభాయిని మృణాళిని 1942లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు సీఈఈ వ్యవస్థాపకులు కార్తికేయ సారాభాయి, కూతురు  క్లాసికల్ డ్యాన్సర్ మల్లికా సారాభాయిలు ఉన్నారు. 

 

17:52 - January 21, 2016

అనంతపురం : ప్రఖ్యాత పుణ్య క్షేత్రం తిరుపతికి ఎలాంటి ఉగ్రముప్పు లేదని డీఐజీ సత్యనారాయణ అన్నారు. అనంతపురంలోని ఎస్ ఎస్ బిఎన్ కాలేజీలో ఏర్పాటు చేసిన 'చట్టం, న్యాయవ్యవస్థ'పై అవగాహనా సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. విద్యార్థులకు చట్టం పట్ల అవగాహన కల్పిస్తే నేరాలను అదుపుచేయవచ్చని తెలిపారు. హర్యానా, పంజాబ్, బీహార్ నుండి వేలాది మంది తిరుపతిలో నివసిస్తున్నారని వారిపై ఎప్పుడూ నిఘావేసి ఉంచుతున్నామన్నారు.

 

 

17:43 - January 21, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. చివరిక్షణం వరకు రెబల్స్‌ను బుజ్జగింపులు చేశారు. ప్రధాన పార్టీల్లో టికెట్ల కోసం అభ్యర్థుల పట్టుబడుతున్నారు. టీడీపీ- బీజేపీ నేతల మధ్య మనస్పర్థలు వచ్చాయి. 35 డివిజన్లలో బీజేపీకి అభ్యర్థులు కరువు అయ్యారు. బీజేపీ అభ్యర్థులు లేని డివిజన్లలో టీడీపీ తమ పార్టీ నేతలకు బీఫామ్‌లు ఇస్తుది.

 

కల్తీ మద్యం తాగిన ఒకరి మృతి

అనంతపురం : జిల్లాలోని గుంతకల్లులో కల్తీ మద్యానికి మరొకరు బలి అయ్యారు. స్వాగత్‌ వైన్‌ షాపులో మద్యం తాగి వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వైన్‌ షాపులో తనిఖీలు నిర్వహించారు.

 

కోల్‌కతాలోని బాలికల పాఠశాలలో అగ్నిప్రమాదం

పశ్చిమబెంగాల్ : కోల్‌కతాలోని ఓ బాలికల పాఠశాలలో ఈరోజు మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. బోబజార్‌ ప్రాంతంలోగల ఈ పాఠశాల ఐదో అంతస్థులో మంటలు చెలరేగాయి. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించి, అగ్నిమాపక సిబ్బందికి సమచారంఅందిచారు. అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు చెప్పారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది.

 

17:13 - January 21, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఈరోజుతో ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగిసింది. అన్ని పార్టీల నుంచి పలువురు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడంతో వారిని బుజ్జగించేందుకు అగ్రనేతలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరిరోజు అన్ని పార్టీల నుంచి సుమారు 500 మంది వరకు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణ గడువు ముగిసేసరికి 150 డివిజన్లలో సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరోవైపు టీడీపీ- బీజేపీ నేతల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. 35 డివిజన్లలో బీజేపీకి అభ్యర్థులు కరువయ్యాయి. బీజేపీ అభ్యర్థులు లేని డివిజన్లలో తమ పార్టీ నేతలకు టీడీపీ బీఫామ్‌లు ఇచ్చింది. 

 

16:52 - January 21, 2016

నిజామాబాద్ : బాలికలపై అత్యాచార యత్నం చేసిన ఆర్మీ కానిస్టేబుల్‌ కిరణ్‌కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ నిజామాబాద్‌ సదాశివనగర్‌ మండలం రామారెడ్డి గ్రామంలో స్థానికులు ఆందోళనకు దిగారు. ఎంపీటీసీగా ఉన్న కిరణ్‌కుమార్‌ తండ్రి ఆ పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరో నిందితుడు నితీష్‌కుమార్‌ను కూడా కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. 

 

టీసర్కార్ పై మల్లు భట్టి విక్రమార్క ఫైర్...

హైదరాబాద్ : టీకాంగ్రెస్ నేత మల్లుభట్టి విక్రమార్క టీసర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ అవినీతిమయం అయిందని విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆరోపించారు. 

16:39 - January 21, 2016

హైదరాబాద్ : టీకాంగ్రెస్ నేత మల్లుభట్టి విక్రమార్క టీసర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ అవినీతిమయం అయిందని విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ఆరోపించారు. దాన్ని పరిశీలన చేయాలని సూచించారు. అవసరరం లేని చోట కిలో మీటర్ల మేర పైపు లైన్లు వేస్తున్నారుని తెలిపారు. సర్కార్ ప్రజలకు ఉపయోగం లేని కార్యక్రమాలను చేపడుతోందని విమర్శించారు. 

16:24 - January 21, 2016

హైదరాబాద్ : బీఫామ్ ఇవ్వలేదని గాంధీభవన్ లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. యాకుత్ పురా నియోజకవర్గంలోని కుర్మగూడకు చెందిన కిషోర్ అనే వ్యక్తి తన వెంట బిసిలరీ బాటిల్ లో కిరోసిన్ తీసుకుని గాంధీభవన్ కు వచ్చారు. తమ కూతురికి టికెట్ ఇవ్వలేదనే మనస్తాపంతో గాంధీభవన్ ఎంట్రన్స్ దగ్గర కిషోర్ తన వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గాంధీ భవన్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. కిషోర్ శరీరంపై నీళ్లు పోశారు. ఈ ఘటన కలకలం రేపింది. 2 లక్షలు ఖర్చు పెట్టి ప్రచారం చేశానని కిషోర్ తెలిపారు. కానీ తన కూతురుకు టికెట్ ఇవ్వలేదని వాపోయారు. 

 

స్మృతి, దత్తాత్రేయవి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు : తమ్మినేని

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతిపై కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయవి బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు 

16:02 - January 21, 2016

హైదరాబాద్ : పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఈ నెల 2న జరిగిన ఉగ్రదాడికి తానే బాధ్యుడినంటూ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ ప్రకటించుకున్నాడు. తాము రోటీన్ గానే పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి చేశామని, భారత్-పాక్ చర్చల ప్రక్రియను అడ్డుకోవాలనే ఉద్దేశంతో దాడి చేయలేదని చెప్పాడు. ఇదే సమయంలో కాశ్మీర్ పై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీరును సలావుద్దీన్ తప్పుబట్టాడు. కాశ్మీరీల ఆక్రందనలు వినపడనట్టుగా షరీఫ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. 8 లక్షల మంది భారత సైనికులతో ముజాహిదీన్లు గత 26 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నారని, ఇందులో భాగంగానే పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి జరిగింది తప్ప దానికి ప్రత్యేకత ఏమీ లేదని చెప్పుకొచ్చాడు.

15:57 - January 21, 2016

హైదరాబాద్: గతేడాది ప్రేమ్ రతన్ ధన్‌పాయో సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ బ్యూటీ సోనమ్‌కపూర్. ఈ సినిమా సక్సెస్‌తో మంచి స్పీడు మీదున్న ఈ సొగసరి భామ తాజాగా నీరజ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. నీరజ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోనమ్‌కపూర్ ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా రిలీజ్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. దేశ కోసం జీవితాన్ని త్యాగం చేసిన నీర్జా బానోత్ నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నీర్జా బానోత్ పాత్రను సోనమ్ పోషిస్తుంది. రామ్‌మద్వానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో షబానా అజ్మీ, శేఖర్ రవిజానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నీరజ ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ బీజేపీకి రాజీనామా

హైదరాబాద్ : బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ రాజీనామా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి కార్పొరేషన్ టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం చేశారు. 

 

15:53 - January 21, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ యూనివర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రోహిత్‌ ఆత్మహత్య ఘటన తర్వాత... ప్రజాసంఘాలు, విపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రశాంత్‌, శేషయ్య, సుంకన్న, విజయ్‌లపై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. రోహిత్ ఆత్మహత్యపై విద్యార్థుల ఆందోళనలు తీవ్రం కావడంతో.. అత్యవసరంగా సమావేశమైన యూనివర్సిటీ పాలకమండలి... ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రోహిత్ ఆత్మహత్య ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతూనే ఉన్నాయి. నిరసన కార్యక్రమాలతో హెచ్ సీయూ అట్టుడుకుతోంది. జాతీయ నేతలు వర్సిటీని సందర్శిస్తున్నారు. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను వారి  పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వర్సిటీ వీసీ అప్పారావును రీకాల్ చేయాలని పట్టుబడుతున్నారు. 


 

హెచ్ సీయూలో నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత…

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య తర్వాత వర్సిటీ అధికారులు నిర్ణయం మార్చుకున్నారు. హెచ్ సీయూలో నలుగురు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేశారు. ప్రశాంత్, శేషయ్య, సుంకన్న, విజయ్ లపై సస్పెన్షన్ ఎత్తివేశారు. 

15:27 - January 21, 2016

విశాఖ : రేపు ఆంధ్రాయూనివర్సిటీ బంద్‌కు ఎస్ ఎఫ్ ఐ పిలుపు ఇచ్చింది. ప్రధాని మోదీ పాలనలో విద్యాసంస్థల్లో మతతత్వం పెరిగిపోవడం పట్ల ఎస్ ఎఫ్ ఐ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా ఆంధ్రాయూనివర్సిటీ బంద్‌కు పిలుపు ఇచ్చినట్టు ఆ సంఘం నాయకురాలు ప్రియాంక చెప్పారు. రోహిత్‌ది హత్యకాదని, మతోన్మాద శక్తులు చేసిన హత్య అని ఆరోపించారు. మతతత్వానికి  వ్యతిరేంగా విద్యార్ధిలోకం సంఘటితం కావాలని కోరుతూ ఏయూ ఆర్ట్స్‌ కాలేజీ దగ్గర కరపత్రాలు విడుదల చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరాని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మోడీ పాలనలో విద్యాసంస్థల్లో మతతత్వం పెరిగిందన్నారు. 

13:47 - January 21, 2016

హైదరాబాద్ : స్టూడెంట్స్ సే పంగా మత్ లేనా అని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సూచించారు. హెచ్ సీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఆయన నగరానికి వచ్చారు. గత కొన్ని రోజులుగా దీక్షలు చేపడుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను ఆయన ఆరా తీశారు. అనంతరం కేజ్రీవాల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా జై భీమ్..రోహిత్ అమర్ రహే..వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలు చేశారు. ఘటన జరిగిన అనంతరం వివిధ పత్రికలు చదవడం జరిగిందని, ఏబీవీపీకి చెందిన కొందరు వ్యక్తులు రోహిత్ ను వేధించారని, ఫేస్ బుక్ లో కూడా పోస్టు చేయడం జరిగిందన్నారు. ఏబీవీపీకి చెందిన నేత సుశీల్ కుమార్ తో కలవడానికి వెళ్లిన అనంతరం వేముల రోహిత్ ఇతరులకు సుశీల్ క్షమాపణలు చెప్పడం జరిగిందని, వీరిద్దరి మధ్య ఘర్షణ జరగలేదన్నారు. ఇందుకు సెక్యూర్టీ ఆఫీసర్ ప్రధాన సాక్షి అని పేర్కొన్నారు.

దత్తాత్రేయ లేఖతో మారిన పరిస్థితి..
కానీ ఆసుపత్రిలో అడ్మిట్ అయి అపెడింక్స్ ఆపరేషన్ చేసుకున్నానని సుశీల్ పేర్కొంటున్నారని, కానీ సుశీల్ ను చెక్ చేసిన వైద్యుడు ఎలాంటి గాయాలు లేవని పేర్కొనడం జరిగిందన్నారు. యూనివర్సిటీ రిజిష్ట్రార్ కూడా వీళ్ల తప్పు లేదని చెప్పారని పేర్కొన్నారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ వచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయిందన్నారు. యూనివర్సిటీలో ఉగ్రవాదులు..సంఘ విద్రోహ శక్తులు..లేఖలో దత్తాత్రేయ పేర్కొనడం సిగ్గు చేటన్నారు. ఒక బాధ్యాతయుతమైన పదవిలో ఉండి ఎలాంటి విచారణ చేపట్టకుండానే లేఖ రాశారని విమర్శించారు. దీనిపై విచారణ చేపట్టాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి దత్తాత్రేయ లేఖ రాశారని తెలిపారు. అనంతరం వీసీ వీరిని సస్పెండ్ చేశారని, గత 18 రోజులుగా దళిత విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్తితి ఏర్పడిందన్నారు.

స్మృతి ప్రకటన దారుణం..
దీనిపై వేముల రోహిత్ వీసీకి లేఖ రాయడం జరిగిందని, ఆ లేఖలో అడ్మిషన్ తీసుకోగానే దళిత పిల్లలకు ఉరి తాళ్లు..విషం ఇవ్వండని పేర్కొన్నారని గుర్తు చేశారు. ఘటన జరిగి..ఆందోళనలు జరుగుతున్న అనంతరం ఒక్కసారిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రకటన చేసిందన్నారు. కానీ ఈ ప్రకటన దారుణమన్నారు. అబద్ధాలపై అబద్ధాలు చెప్పిందన్నారు. రోహిత్ దళితుడా ? కాదా ? అనే ప్రకటన చేయడం వక్రీకరించే ప్రయత్నమేనన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా స్మృతి ఇరానీ న్యాయం చేయాల్సినవసరం ఉందన్నారు. ప్రస్తుతం విద్యార్థులు చేపడుతున్న ఈ ఆందోళనలకు దేశం మొత్తం మద్దతు పలుకుతోందని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం హిందువులు..ముస్లింలు..ఇలా ఎవరి సపోర్టు లేదన్నారు.

వీసీని కలుస్తానంటే వద్దన్నారు..
ప్రస్తుతం ఉన్న వీసీ గతంలో ఇక్కడ చీఫ్ వార్డెన్ గా ఉన్నాడని, ఆ సమయంలో అతనిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని విద్యార్థులు పేర్కొనడం జరిగిందన్నారు. వీసీని వెంటనే తొలగించాలని కోరడం జరిగిందన్నారు. దీక్షలు చేస్తున్న వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని వీసీని తాను కోరుతానని, ఇందుకు వీసీని కలుస్తానని విద్యార్థులకు చెప్పడం జరిగిందన్నారు. వీసీ విననిపక్షంలో తాను అక్కడినుండి కదలని విద్యార్థులకు చెప్పడం జరిగిందన్నారు. దీనికి విద్యార్థులు విబేధించారని, ఇష్యూ సస్పెన్షన్ కాదని వీసీ తొలగింపు అని, తమకు న్యాయం జరగాలని విద్యార్థులు పేర్కొనడం జరిగిందన్నారు. దీనితో తాను వీసీని కలవడం లేదన్నారు. అంబేద్కర్ ను ఫాలో అయ్యే వారు జాతి వ్యతిరేకులు ఎలా అవుతారని సూటిగా ప్రశ్నించారు.

డిమాండ్లు..
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెంటనే క్షమాపణలు చెప్పాలి..స్మృతి, దత్తాత్రేయ వెంటనే బర్తరఫ్ చేయాలి..స్మృతి ఇరానీలపై కూడా విచారణ చేయాలి..స్మృతి ఇరానీ, దత్తాత్రేయలు ఫోన్ లో ఎన్ని సార్లు వీసీతో మాట్లాడారో దానిపై విచారణ జరగాలి..ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిని అరెస్టు చేయాలి..విద్యార్థులు ఏకతాటిపై నిలిస్తే పదవీ ఉండదని ప్రధాని మోడీని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.

ఏ సహాయమైనా అందిస్తా..
ప్రస్తుతం ఢిల్లీలో ఈ ఘటనపై పలు ఆందోళనలు జరుగుతున్నాయని, వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేస్తున్నారన్నారు. ఢిల్లీ పోలీసుల అధికారం గవర్నర్ కింద ఉంటుందని, తన చేతుల్లో ఉండదన్నారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని, రౌడీ, గూండా నాయకులను మాత్రం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. తాను కూడా లాఠీ దెబ్బలను తిన్నానని, అంబేద్కర్ జాయింట్ యాక్షన్ కమిటీ చాలా బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఢిల్లీ రాష్ట్రంలో ఏదైనా చేయాలని అనుకొంటే సహాయ సహకారాలు అందచేయడం జరుగుతుందని కమిటీకి కేజ్రీవాల్ హామీనిచ్చారు. 

కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు : కేజ్రీవాల్

హైదరాబాద్: హెచ్ సియూ విద్యార్థి రోహిత్ మృతికి గల కారణాలను తెలుసుకున్నాని..కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ మృతిపై ఐదురోజులుగా హెచ్‌సీయూలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ విద్యార్థులను పరామర్శించి, దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏబీవీపీకి చెందిన సుశీల్ కుమార్ పై ఎవరూ దాడి చేయలేదని.. అపెండిక్స్ ఆపరేషన్ చేయిచంఉకుని దాడి చేశారని అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.

13:03 - January 21, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఎస్వీకేలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ పోరాటంలో దీక్షతో కూడిన పట్టుదల ప్రయత్నం అవసరమని, నిర్ధిష్టమైన ప్రణాళిక, నిర్మాణాత్మకమైన పోరాటం అవసరమన్నారు. ప్రస్తుతం ఈ ఆందోళనలో టీఆర్ఎస్ అరకొరగా ఉందని, జాగృతి ఆధ్వర్యంలో ధర్నాలు జరిగాయన్నారు. కానీ సీఎం కేసీఆర్ స్పందించలేదని, మరోవైపు టిడిపి పార్టీ కూడా అరకొరగానే ఉందన్నారు. అగ్రనాయకులు స్పందించడం లేదని, కొందరు నాయకులు రోహిత్ కుటుంబాన్ని పరామర్శించినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ప్రధానంగా బీజేపీ టార్గెట్ గా ఉండాలని, ఎందుకంటే ఘటనకు బాధ్యురాలిగా టార్గెట్ గా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మిగతా రాజకీయ పార్టీల విధానాలు ఎదైనా సరే కాంగ్రెస్ తో సహా ముందుకొచ్చి కమిటీలో ఉండగలిగితే బాగుంటుందని తెలిపారు. అలాగే టిడిపితో పార్టీతో సహా అన్ని పార్టీలు ఈ కమిటీలో ఉంటే బాగుంటుందన్నారు. అంతేగాకుండా సామాజిక సంస్థలు, విద్యార్థుల సంఘాలు కమిటీలో మెంబర్ షిప్ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రోహిత్ ఎస్సీ కాదు..బీసీ వడ్డెర అని జరుగుతున్న చర్చ అనవసరమైందన్నారు. తండ్రి వడ్డెర, తల్లి ఎస్సీ మాల అని తెలుస్తోందని, విడాకులు జరిగిన తరువాత తల్లి దగ్గర పిల్లలు ఉంటే తల్లి కులమే వర్తిస్తుందని సుప్రీం పేర్కొన్నట్లు తెలుస్తోందన్నారు. అసలు ఎస్సీ కాదనుకొంటే కేసు ప్రాధాన్యత పోతుందా ? అని ప్రశ్నించారు. ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పురిగొల్పే విధంగా ప్రేరేపించడం నేరమన్నారు. కులాలకు అతీతమైన తీర్పు ఇవ్వాలని, కులాన్ని బట్టి శిక్షించేది మనుధర్మ శాస్త్రమని తమ్మినేని తెలిపారు. 

హెచ్ సీయూలో కేజ్రీవాల్..

హైదరాబాద్ : ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నగరానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం హెచ్ సీయూలో విద్యార్థులను ఆయన పరామర్శించారు. 

ఫ్రాన్స్ కాన్సులేట్ కు బెదిరింపు లేఖ..

ఢిల్లీ : ఫ్రాన్స్ కాన్సులేట్ కు బెదిరింపు లేఖ కలకలం సృష్టిస్తోంది. భారత గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈనెల 14వ తేదీన ఈ లేఖ వచ్చిందని..దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారని తెలుస్తోంది. 

సీఆర్డీఏ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చిన అఖిలపక్షం..

విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని మాస్టర్ ప్లాన్ లోపాలపై అఖిలపక్ష నేతలు సీఆర్డీఏ కమిషనర్ ను కలిశారు. మాస్టర్ ప్లాన్ లోపాలపై వినతిపత్రాన్ని సమర్పించారు. 

12:43 - January 21, 2016

హైదరాబాద్ : దేశానికి అన్నం పెట్టే రైతులోకానికి భరోసానిచ్చేందుకు సుప్రసిద్ధ పైపుల తయారీ సంస్థ ఫినోలెక్స్‌ చేపట్టిన వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. దేశానికి ఆహారాన్ని అందిస్తున్న రైతన్నకు భరోసానిస్తూ సందేశాన్ని అందించండి.. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి అంటూ.. జనవరి 12న, ఫినోలెక్స్‌ ట్విట్టర్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈ పిలుపుతో దాదాపు 28 లక్షల మంది తమ స్పందనను తెలియజేశారు.
దేశ రైతాంగానికి అభినందనలు తెలపడంతో పాటు.. సుమారు 10,133 సందేశాలను షేర్‌ చేశారు. గ్రామీణ పండుగైన సంక్రాంతిని పురస్కరించుకొని.. ఫినోలెక్స్‌ సంస్థ.. ఏపీ, గుజరాత్‌, పంజాబ్‌ రాష్ట్రంల్లో సుమారు 50వేల గాలిపటాలనూ పంపిణీ చేసింది. రెండు మనసులను కలపడం అన్న తాత్విక విశాసంపై రూపొందించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడం ఆనందంగా ఉందని.. నగర ప్రజలకు, గ్రామీణ ప్రజలకూ మధ్య ఆత్మీయ బంధాన్ని పెనవేయడంలో ఫినోలెక్స్‌ క్రియాశీలక పాత్ర పోషించడం ఆనందంగా ఉందని సంస్థ హర్షం ప్రకటించింది. భవిష్యత్తులోనూ గ్రామీణ భారతానికి, నగర జీవితానికీ మధ్య వారధిగా నిలుస్తామని వెల్లడించింది. 

12:41 - January 21, 2016

విశాఖపట్టణం : అంతర్జాతీయ నేవీ ఫ్లీట్ రివ్యూకు రోజులు దగ్గర పడుతుండటంతో విశాఖ రామకృష్ణ బీచ్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భద్రతను మూడు రెట్లు పెంచుతున్నారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటన ఖరారయ్యింది. వచ్చే నెల 5 నుంచి మూడు రోజుల పాటు వీరిద్దరూ విశాఖలో బస చేయనున్నారు. నేవీ ఫ్లీట్ సందర్భంగా విశాఖ అందాలను వీడియోలో బంధించిన ఇండియన్ నేవీ ప్రపంచస్థాయిలో ప్రచారం చేస్తోంది. దాదాపు అన్ని ఏర్పాట్లను తీర రక్షణా దళం పూర్తి చేసింది. భద్రతపరమైన అంశాలపై ఒకటికి రెండుసార్లు పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తూర్పు నౌకాదళం కేంద్రంగా జరగనున్న ఫ్లీట్ రివ్యూ రామక్రుష్ణ బీచ్ వేదిక కాబోతోంది. ఇప్పటికే బీచ్ రోడ్డును అత్యంత సుందరంగా తయారయ్యింది.

పలు ఆంక్షలు..
నగరంలోని పలు ప్రధాన కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు అందంగా తీర్చిదిద్దారు. నేవీ ఫ్లీట్ జరిగే విశాఖ నగరం ప్రత్యేకతను వివరిస్తూ నేవీ అధికారులు ప్రత్యేక వీడియో విడుదల చేసారు. విశాఖ ప్రత్యేకత అందాలు కనువిందు చేసేలా వీడియో మైమరిపిస్తోంది. ఈ వేడుకకు ప్రధాని మోడీ, రాష్ట్ర్రపతి ప్రణబ్ ముఖర్జీలు ఫిబ్రవరి 5 తేదీకి విశాఖ చేరుకుంటారు. షెడ్యూల్ దాదాపుగా ఖరారయినట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ప్రత్యేకతను వివరిస్తూ భారత నావికాదళం విడుదల చేసిన ప్రచార వీడియో ఇప్పటికే హల్ చల్ చేస్తోంది. ఈ వేడుకకు విదేశీ నేవీ సైనిక దళాలు పెద్ద ఎత్తున వస్తుండటంతో భద్రతను పటిష్టం చేసారు. బీచ్ రోడ్ లో బారికేడ్లు, ప్రత్యేక గ్యాలరీలు నిర్మాణం జరుగుతోంది. నేవీ ఫ్లీట్‌కు కేవలం సరిగ్గా రెండు వారాలు ఉండటంతో నేవీ అధికారులు ఆంక్షలను పెంచుతున్నారు.

12:39 - January 21, 2016

శ్రీకాకుళం : జిల్లాలో టోల్‌ప్లాజాల దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. నిబంధనలకు విరుద్ధంగా టోల్‌ ఫీజు వసూలు చేస్తూ కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. హైవే అథారిటీ అధికారులతో అండదండలతోనే ఈ దందా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. 130 కిలోమీటర్లు దూరంలోనే ఇచ్చాపురం -బెల్లుపడ, పలాస -లక్ష్మీపురం, నరసన్నపేట- మడపాం, ఎచ్చెర్ల -చిలకపాలెం ప్రాంతాలలో నాలుగు టోల్ గేట్లు ఏర్పాటుచేశారు. వాస్తవంగా టోల్ గెట్ కు మరొక టోల్ గెట్ కు మధ్య అరవై కిలోమీటర్ల దూరం తప్పనిసరిగా ఉండాలి. చిలకపాలెం టోల్ ప్లాజా మడపాం నుండి 29 కిలోమీటర్లు, అటు నాతవలస నుండి నలభై కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఐనా నిబంధనలకు విరుద్ధంగా టోల్‌ప్లాజాను ఏర్పాటుచేసి..వాహన దారుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు.

విచారణ జరిపించాలి..
ఇది ఇలా ఉంటే వాహనదారుల నుంచి ఇష్టారాజ్యంగా టోల్‌ వసూలు చేస్తున్నారు. లైట్ మోటార్ వెహికల్స్ కు కిలోమీటర్ కు అరవై అయిదు పైసలకు మించి వసూలు చెయ్యకూడదు. ఐతే కిలోమీటర్ కు రూ. 1.75 పైసలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. నిర్ణీత టోల్ రుసుం సంవత్సరానికి మూడు శాతం అంటే.. ఏభై ఆరు పైసలు మించి వసూలు చెయ్యకూడదు. ఐనా ఎన్‌హెచ్‌ఐఏ అధికారుల అందదండలతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా టోల్‌పన్నును పెంచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టోల్‌ప్లాజాల దందాపై వాహనదారులు మండిపడుతున్నారు. దీనిపై హైవే అథారిటీ అధికారులు విచారణ జరిపించాలని డిమాండ్‌చేస్తున్నారు. 

12:36 - January 21, 2016

నిజామాబాద్ : జిల్లాలో కారుణ్య మరణానికి అనుమతి కోరుతున్న ముగ్గురు కానిస్టేబుళ్ల లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్ర పోలీస్‌ శాఖను కుదిపేస్తోంది. రూరల్‌ పీఎస్‌ నుంచి ఏఆర్‌ విభాగానికి బదిలీ చేయడంపై బాధిత కానిస్టేబుళ్లు భగ్గుమంటున్నారు. విధులు నిజాయితీగా నిర్వహించడమే తప్ప అని ఆక్రోశిస్తున్నారు...అసలు వారి ఆరోపణలకు కారణాలేంటి..? వారు చెబుతున్నట్లు రికవరీ సొమ్ము బొక్కేసిందెవరు..??

అందుకే ఏఆర్‌ విభాగానికి బదిలీ చేశారా?..
వై. శ్రీను, కె. ప్రమోద్ కుమార్ రెడ్డి, వై. చందు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో త్రీటౌన్ సీఐ 9 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. సీఐ మునినాయకు, ఎస్సై రవీందర్‌ నాయక్‌..పట్టుబడ్డవారిలో ఆరుగురిని తప్పించారన్నది కానిస్టేబుళ్ల ప్రధాన ఆరోపణ. పెద్ద మొత్తంలో రికవరీ చేసిన బంగారం, నగదులో.. మరో ముగ్గురు పోలీస్‌ అధికారులతో కలిసి సుమారు 14 లక్షలు మాయం చేశారన్నది మరో ఆరోపణ. పోలీస్‌ అధికారుల అవినీతి భాగోతాన్ని బయటపెడతామనే భయంతో...తమను ఏఆర్‌ విభాగానికి ట్రాన్స్‌ఫర్‌ చేశారని మండిపడుతున్నారు.

కేసును నిర్వీర్యం చేస్తారని బాధితుల ఆందోళన..
నిజామాబాద్‌ రూరల్‌ సీఐ, ఎస్‌ఐలు వేధిస్తున్నారని, కారుణ్య మరణం పొందేందుకు అనుమతివ్వాలంటూ బాధిత కానిస్టేబుళ్లు.. ఈనెల2న హెచ్‌ఆర్సీకి లేఖ రాశారు. సీఎం కేసీఆర్‌నూ మరో లేఖలో అభ్యర్థించారు. అంతర్రాష్ట్ర దొంగలముఠాలో ఆరుగురిని తప్పించారని, ఆ విషయం బయటపెడతామనే టార్చర్‌ పెడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. పూర్తి వివరాలు పోలీస్‌ స్టేషన్‌లోని సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పాటు జనరల్‌ డైరీలో నమోదు అయ్యాయని చెప్పారు. అయితే సీసీ ఫుటేజీ నుంచి దృశ్యాలను తొలగించారని, జనరల్‌ డైరీలో నమోదుచేసిన కాగితాన్ని సైతం చించేశారని ఆరోపించారు. కానిస్టేబుళ్ల కారుణ్య మరణం అభ్యర్థనపై కథనాలు రావడంతో ఘటనపై విచారణ జరిపించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. విచారణ బాధ్యతలు రూరల్ సీఐకి అప్పగించడంపై బాధిత కానిస్టేబుళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు నిర్వీర్యం చేస్తారని ఆవేదన చెందుతున్నారు. వీరి ఆందోళనలపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.  

12:13 - January 21, 2016

‘సోగ్గాడే చిన్నినాయన’గా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టేశాడు. హీరోగానే కాక నిర్మాతగానూ నాగార్జునకు ఈ మూవీ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి... దీంతో ఈ యువదర్శకుడికి అఖిల్ రెండో సినిమా బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తున్నారట కింగ్ నాగార్జున. అయితే ఈ సినిమాకు నాగార్జునే నిర్మాతగా వ్యవహరించనున్నాడని సమాచారం. అఖిల్ మొదటి సినిమా ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో... రెండో సినిమా విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు నాగార్జున. ప్రపంచాన్ని కాపాడే రక్షకుడు తరహా పాత్రలు కాకుండా.. ప్రస్తుతానికి హీరోయిన్‌ను కాపాడగలిగే పాత్రలైతే అఖిల్‌కు చాలంటున్నాడట నాగ్. ఈ నేపథ్యంలో అఖిల్ కోసం రెండు ప్రేమకథలు సిద్ధమయ్యాయట. ప్రస్తుతం వీటి బాధ్యత సోగ్గాడే చిన్నినాయన దర్శకుడు కళ్యాణకృష్ణపై ఉంచారట నాగార్జున. దీంతో ఈ రెండింటికి స్క్రీప్ట్ వర్క్ చేస్తున్నాడట ఈ యువ దర్శకుడు. ఈ రెండింటి స్క్రీప్ట్ వర్క్ పూర్తయ్యాక వీటిలో నాగ్ ఏది అంగీకరిస్తాడో.. ఆ సినిమాలో అఖిల్ నటిస్తాడట. ఈ రెండు సినిమాలూ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ కావటం విశేషం..

హెచ్ సీయూ విద్యార్థులకు సురవరం సంఘీభావం..

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యార్థులను ఆయన పరామర్శించారు. ఆయనతో పాటు నేతలు ఎంపీ రాజా, చాడ వెంకటర్ రెడ్డిలున్నారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేజ్రీవాల్..

హైదరాబాద్ : ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. హెచ్ సీయూలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటించనున్నారు. 

వరంగల్ జిల్లాలో ఫైనాన్షియర్ల ఆగడాలు..

వరంగల్ : జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతి మించుతున్నాయి. కరీమాబాద్ లో రాందాస్ అనే గిరిజనుడి కుటుంబాన్ని ఫైనాన్షియర్లు చితకబాదారు. 

పంజాబ్ లో ఎన్ఐఏ సోదాలు..

పంజాబ్ : ఎస్పీ సల్వీందర్ సింగ్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది. గురుదాస్ పూర్, అమృత్ సర్ లతో పాటు ఆరు చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. సల్వీందర్ సన్నిహితులు రాజేష్ వర్మ, మదన్ గోపాల్ ఇళ్లల్లో సోదాలు జరిపింది. 

క్లాసికల్ డ్యాన్సర్ మృణాళిని సారాబాయ్ కన్నుమూత..

ఢిల్లీ : క్లాసికల్ డ్యాన్సర్ మృణాళిని సారాబాయ్ తుది శ్వాస విడిచారు. అహ్మదాబాద్ లో ఆమె కన్నుమూశారు. 

హెచ్ సియూ లో దళిత ప్రొఫెసర్ల రాజీనామా..

హైదరాబాద్: స్కాలర్ రోహిత్ వేముల మృతిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. కాగా విద్యార్థుల ఆందోళనకు వర్సిటీ దళిత ప్రొఫెసర్లు, సిబ్బంది తోడైయ్యారు. తమ పదవులకు రాజీనామా చేసి విద్యార్థులకు మద్దతు పలికారు. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించిన తీరుకు నిరసనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. కృష్ణ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొ. రవీంద్రకుమార్, పలు హాస్టళ్ల వార్డెన్లు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.

12:04 - January 21, 2016

హైదరాబాద్‌: ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాతో కలిసి ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా శిల్పాశెట్టి భారతీయ ఆహారంపై రచించిన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ డైట్‌’ అనే పుస్తకాన్ని బాబాకు బహూకరించారు. ఆయనతో కలిసి యోగా సాధన చేయడం చాలా ఆనందంగా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్న శిల్పాశెట్టి ఆ ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

గుజరాత్ లో స్కూల్ బస్సు బోల్తా..6గురి మృతి..

గుజరాత్ : కేశోడ్ ప్రాంతంలో స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఆరుగురు మృతి చెందారు. ఇందులో నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలున్నారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. 

వేముల రోహిత్ మృతిపై ఆప్ నిరసనలు..

ఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన దళిత విద్యార్థి వేముల రోహిత్ మృతిపై ఆప్ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందని ఆ పార్టీ నేత ఆశుతోష్ పేర్కొన్నారు. ప్రతి జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. 

పఠాన్ కోట్ వద్ద ఉగ్రవాదులు..

పంజాబ్ : పఠాన్ కోట్ వద్ద ముగ్గురు ఉగ్రవాదులు లోనికి ప్రవేశించేందుకు యత్నించారు. వీరి యత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. 

హెచ్ సీయూకు రానున్న జేడీయూ బృందం..

ఢిల్లీ : శుక్రవారం జేడీయూ బృందం హెచ్ సీయూకు రానుంది. ఇటీవల దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

10:16 - January 21, 2016

హైదరాబాద్‌: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కేరళ ప్రభుత్వం నిశాగాంధీ పురస్కారం అందజేసింది. కేరళ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తిరువనంతపురంలో బుధవారం నిశాగాంధీ డ్యాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ. 1,50,000 నగదు అందజేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్‌ అకాడమీ ఏర్పాటు కోసం ఇళయరాజాకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు ఉమెన్‌చాందీ ప్రకటించారు. అకాడమీ ఏర్పాటుచేసి వందలాది మంది ఇళయరాజాలను తయారుచేస్తానని ఈ సందర్భంగా ఇళయరాజా పేర్కొన్నారు.

10:07 - January 21, 2016

హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటి సన్ని లియోన్ హుందాతనం చూసి ముచ్చటేసిందని నటుడు ఆమిర్‌ ఖాన్‌ కితాబిచ్చారు. ఇటీవల ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యాత ప్రత్యేకంగా ఆమె గతం గురించి పదే పదే ప్రశ్నిస్తూ.. ఆమెను కించపరచాలని చేసిన ప్రయత్నాన్ని సన్నీ ఎదుర్కొన్న తీరును ఆమిర్‌ అభినందించారు. తాను ఆమెతో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆమె గతంతో తనకెలాంటి సమస్యా లేదన్నారు. ఈ విషయాన్ని ఆమిర్‌ ఖాన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. సన్నీ 2012లో ‘జిస్మ్‌-2’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. ఇటీవల ఏక్‌ పహేలీ లీలా, కుచ్‌ కుచ్‌ లోచా హై, మస్తీజాదే చిత్రాల్లో నటించారు.

హెచ్ సీయూలో ఐదో రోజు విద్యార్థుల దీక్షలు..

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థుల దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. విద్యార్థి రోహత్ ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నేడు హెచ్ సీయూ విద్యార్థులకు సీఎం కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం, ఎంపీ రాజా సంఘీభావం తెలుపనున్నారు. 

09:57 - January 21, 2016

మెగ్నీషియం లోపం శరీరానికి ఒక రోగం అని కూడా పూర్వీకులు అభివర్ణిస్తుంటారు..అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యం. లేకపోతే ఏదో ఒక రూపంలో అనారోగ్యం బయటపడుతుంది. ముఖ్యంగా శరీరంలో మెగ్నీషియం తగ్గితే చాలా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జరిగే 300 రకాల రసాయనిక చర్యల్లో దీనిపాత్ర ఉంటుంది. గుండె కొట్టుకోవడం నుండి కండరాలు, హార్మోన్ల పనితీరు వరకు మెగ్నీషియం పాత్ర ఉంటుంది.

కనీసం రోజుకు 350 మిల్లీగ్రాముల మెగ్నీషియమ్‌....

శరీరంలో కాల్షియం, విటమిన్‌ -సిలు జీర్ణం కావడానికి మెగ్నీషియం ఎంతో అవసరం. యువకులు కనీసం రోజుకు 350 మిల్లీగ్రాముల మెగ్నీషియమ్‌ ఆహారంలో తీసుకోవాలి. యువతులయితే కనీసం 300 మిల్లీగ్రాములు తీసుకోవాలి. గర్భిణీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు అనుదినం మరొక 150 మిల్లీగ్రాములు అదనంగా తీసుకోవాల్సివస్తుంది. తమాషా ఏమిటంటే ప్రజల్లో చాలా మంది పైన సూచించిన పరిమాణంలో సగం పరిమాణంలో కూడా మెగ్నీషియం తమ ఆహారంలో తీసుకోవడం లేదు.

బ్లడ్‌షుగర్‌ను శక్తిగా మార్చగల నైపుణ్యం....

శరీరంలో బ్లడ్‌షుగర్‌ను శక్తిగా మార్చగల నైపుణ్యం మెగ్నీషియానికి సొంతం అంటున్నారు. ఒత్తిడికి లోనయిన వారిని సులువుగా మాములు స్థితికి తీసుకువస్తుంది. మనిషిని చురుగ్గా వుంచుతుంది. శరీరంలో అధికంగా కాల్షియం డిపాజిట్లు వుంటే వాటిని కరిగించగల్గుతుంది. పైగా మూత్ర పిండాలు, జీర్ణకోశంలో రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది. జీర్ణశక్తిని విపరీతంగా పెంచుతుంది.

శరీరంలో దాని పాత్ర......

మెగ్నీషియం ద్రాక్షపళ్లలో ఎక్కువగా వుంటుంది. శరీరంలో ప్రతి కణానికి మెగ్నీషియం అవసరం. మెదడుకు కూడా కావాలి. ప్రోటీన్‌ల సంశ్లేషణకు, కార్బొహైడ్రేట్‌లు, కొవ్వుల వినియోగానికి ఇది అవశ్యం.వందలాది ఎన్‌జైమ్‌ వ్యవస్థల చర్యలు మెగ్నీషియం లేనిదే జరగవు. ప్రత్యేకించి శక్తిఉత్పత్తికి అవసరమైన ఎంజైమ్‌లకు మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం పుష్కలంగా వుంటేగాని విటమిన్‌ బి6 శోషణసరిగా జరుగదు. శక్తివిడుదలకు విటమిన్‌ బి6 ఎంతో అవసరం.

మెగ్నీషియం అధికంగా.....

కాల్షియం వలె మెగ్నీషియం కూడా నాడులను కాపాడి వాటి సేద తీరుస్తుంది. మెగ్నీషియం అధికంగా అత్తిపళ్ళు, బాదంపప్పు, ఆకుకూరలు, ఆపిల్స్‌లో కూడా లభిస్తుంది. మల్టీవిటమిన్‌ టాబ్లెట్స్‌లో, మల్టీ మినరల్‌ మందుల్లో మెగ్నీషియంను కలుపుతున్నారు. ఇటువంటి మందులు భోజనానంతరం వేసుకోకూడదు. పైగా దీర్ఘకాలం వాడకూడదు. ఎందుకంటే తిండి తిన్నాక అది జీర్ణంకావడానికి కడుపులో చాలా రకాల ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. వాటి ఉత్పత్తిని మెగ్నీషియం అదుపులో వుంచుతుంది. అందుకే దీనిని భోజనానంతరం వేసుకోకూడదు. మనం తినే ఆహారంలో పాలు - పాల ఉత్పనాల్లో మెగ్నీషియం కన్నా కాల్షియం ఎక్కువగా వుంటుంది. జంతు ఉత్పనాలలో మెగ్నీషియం చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఉండకపోవచ్చు. కాల్షియం వినియోగానికి మెగ్నీషియం అవసరం.

మెగ్నీషియం తక్కువయితే ? ....

మెగ్నీషియం తక్కువయితే పళ్లు పాడవడం, ఎముకలు గుల్లబారడం, విరిగిన ఎముకలు త్వరగా నయం కాకపోవడం జనంలో ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీనికి ముఖ్యకారణం కాల్షియం ఎక్కువ, మెగ్నీషియం తక్కువగా ఉండడం కావచ్చు. వినియోగపడని కాల్షియం వల్ల శరీరానికి లాభం ఏమిటి? ప్రకృతిలో లభించే పళ్లు, కూరగాయల్లో శరీరానికి కావలసిన పోషకాలన్నీ తగినంతగా లభిస్తాయి. ఆకుపచ్చని మొక్కల్లో తప్పనిసరిగా వుండే పత్రహరితంలో మెగ్నీషియం ఒక భాగంగా ఉంటుంది.

అందుకే మనకు మెగ్నీషియం మొక్కలనుండే లభిస్తుంది. మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో వణుకులు మొదలవుతాయి. కండరాలు బలహీనమవుతాయి. నిద్రపట్టదు, గుండె క్రమమైన పద్ధతిలో కొట్టుకోదు. కాళ్ళలో పగుళ్ళువస్తాయి. సాధారణంగా నీళ్ళ విరేచనాలు ఉండేవారు, మూర్చరోగాలు, మూత్రపిండాల వ్యాధులు వున్న వారిలో మెగ్నీషియం లోపం వుంటుంది. గుర్తుంచుకోండి కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు బాగా తినండి. మెగ్నీషియం లోపం ఉండదు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

కాఫీ, ఆల్కాహాల్, సోడా తీసుకోవం వల్ల...

మితిమీరిన మోతాదులో కాఫీ, ఆల్కహాల్‌, సోడా తీసుకోవడం వలన శరీరానికి తగిన స్థాయిలో మెగ్నీషియం అందదు. అలాగే కూల్‌డ్రింకులు ఎక్కువగా తాగే అలవాటున్నా ఇదే పరిస్ధితి తలెత్తుతుంది. ఈ విషయాలను ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకున్నపుడు శరీరం విటమిన్‌ డిని శోషించుకోలేదు. విటమిన్‌ డి లేకపోతే శరీరం మెగ్నీషియంను ఎక్కువగా తీసుకోలేదు. తీపి పదార్థాలను అతిగా తీసుకున్నా కిడ్నీల ద్వారా మెగ్నీషియం బయటకు పోతుంది. అయితే ఈ కొరతని పూడ్చుకోవడానికి సప్లిమెంట్లు తీసుకోవచ్చు కానీ, అవి ఎక్కువైతే గుండెకు ప్రమాదం. అందుకే డాక్టర్‌ సలహా ప్రకారమే సప్లిమెంట్లు వాడాలి. ఆకుకూరలు, గింజలు, తృణ ధాన్యాలు, నట్స్‌, చేపలు, పెరుగు, అరటిపళ్లు, డార్క్‌ చాక్‌లెట్‌ మొదలైన పదార్థాల్లో మనకు మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది.

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం..

ముంబై : వరుస నష్టాలను చవిచూస్తున్న స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా అదేవిధంగా నిఫ్టీ 70 పాయింట్లకు పైగా లాభపడి ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి.

09:45 - January 21, 2016

హైదరాబాద్ : దీర్ఘకాలికం (సుమారు పదేళ్లు) గా జలుబు, దగ్గు, తుమ్ములు ఉంటే ఆ బాధ చెప్పనలవి కాదు. ఇంతకాలంగా ఈ లక్షణాలు ఉండటాన్ని వైద్య పరిభాషలో అలర్జీ అని పరిగణిస్తారు. చల్లదనం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వారికి ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీనికి హోమియోలో చికిత్స ఉందా? అంటే, ఉందని చెప్తున్నారు హోమియో నిపుణులు. ఆ వివరాల్లోకి వెళితే..

అలర్జీ అనే మాటను సర్వసాధారణం....

అలర్జీ అనే మాటను సర్వసాధారణంగా మనం రోజూ వింటున్నాం. ఎందుకంటే నేటి అభివృద్ధిలో అలర్జీ జత కట్టేసింది మరి. మనం పారిశ్రామిక ప్రాంతాలలో, పెద్ద పట్టణాలలో ఉండటం వల్ల వాతావరణ కాలుష్యానికి లోనవడం అలర్జీకి ప్రధాన కారణాలు. అలర్జీ అంటే శరీర రోగ నిరోధక శక్తి అసందర్భ ప్రతిచర్య. అలర్జీకి కారకమైన వాటిని అలర్జైన్స్‌ అంటారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ అలర్జీ బారిన పడుతున్నారు. దీనిని వైద్య పరిభాషలో అలర్జిక్‌ రైనైటిస్‌ అంటారు. అలర్జీకి సంబంధించిన ప్రేరేపకాలు ఎదురయినప్పుడు శరీరం యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యాంటీబాడీస్‌ ముక్కులో మాస్ట్‌ కణాలకు అతుక్కుని ఉంటాయి. ఏదైనా పడని వస్తువు తిన్నా, తాగినా మాస్ట్‌ కణాలు హిస్టామిన్‌ అనే పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల ముక్కులోని పొరలన్నీ ఉబ్బిపోతాయి. 70 శాతం మంది ముక్కు అలర్జీతో బాధపడుతున్నారు. ఆస్తమా రోగులలో 80 శాతం మందిలో అలర్జీ ప్రధాన కారణంగా ఉంటుంది. డస్ట్‌ అలర్జీ ఉన్నవారు దుమ్ములో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వెంటనే విపరీతంగా తుమ్ములు, కళ్లు, ముక్కు, గొంతులో, చెవిలో దురద, ఇరిటేషన్‌ కలగడం, ముక్క వెంట నీళ్లు కారడం, దగ్గు, ముక్కులు మూసుకుపోవడం, ఆయాసం, పిల్లికూతలు వస్తుంటాయి.

కారణాలు.......

మనం తినే ఆహారంలో, తాగే పదార్థాలలో, పీల్చే గాలిలో అలర్జీ కారకాలు ఉంటాయి. పొగ, ఆల్కహాల్‌, హెయిర్‌ డైస్‌, కొన్ని రకాల నొప్పులు తగ్గించే మందులు అలర్జీ ప్రేరేపకాలుగా గుర్తించవచ్చు. డస్ట్‌మైట్స్‌, ధూళికణాలు, బొద్దింకలు, చెట్లు, గడ్డి, కొన్ని రకాల పువ్వుల నుంచి వచ్చే పుప్పొడి వల్ల కూడా డస్ట్‌ అలర్జీ వస్తుంది. జంతువుల వెంట్రుకలు, ఈకల వల్ల కూడా దీని బారినపడతారు.

లక్షణాలు.......

తుమ్ములు, ముక్కులో నుంచి నీరు కారడం, కళ్లల్లో దురద, ముక్కు బిగుసుకుపోవడం, గొంతులో ఏదో అడ్డుపడ్డ భావన, ఆయాసం, గురక, దగ్గు, ఛాతీ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

నిర్ధారణ.......

సీబీపీ, సీటీస్కాన్‌, ఎక్స్‌రే, అలర్జీ లెవెల్‌ పరీక్షల ద్వారా.

చికిత్స...........

డస్ట్‌ అలర్జీని తగ్గించడానికి హోమియోలో మంచి మందులున్నాయి. రోగినిరోధక శక్తిని పెంచి, వ్యాధి నివారణ అయ్యేలా చేస్తాయి. హోమియో నిపుణుని ఆధ్వర్యంలో మందులు వాడితే ఫలితాలు కనపడతాయి.

09:39 - January 21, 2016

హైదరాబాద్‌ : హను రాఘవపూడి దర్శకత్వంలో నాన్ని హీరోగా వస్తున్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. 14 రీల్స్ ఎంటర్టైన్-మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు. 

09:35 - January 21, 2016

హైదరాబాద్ : సంజయ్‌దత్‌ నటించిన 'మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌', 'లగేరహో మున్నాభాయ్‌' సినిమాలు బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించి సంజయ్‌దత్‌ కెరీర్‌లోనే మైలురాళ్ళుగా నిలిచాయి. తాజాగా ఈ సిరీస్‌ను కొనసాగిస్తూ దర్శక, నిర్మాత రాజ్‌కుమార్‌ హిరానీ మూడో చిత్రంగా 'మున్నాభాయ్‌ చలే అమెరికా'ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేశాయి. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ను హిరానీ 2010లోనే సిద్ధం చేశారు. అయితే అనుకోకుండా సంజయ్‌దత్‌కు జైలుశిక్ష పడటంతో తాత్కాలికంగా ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. వచ్చే నెలలో సంజయ్‌దత్‌ జైలు నుంచి విడుదలవుతుండటంతో మున్నాభాయ్‌ సిరీస్‌లో మూడో సినిమాగా 'మున్నాభాయ్‌ చలే అమెరికా' వస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో సినిమా ఉంటుంది కాని స్క్రిప్ట్‌ మారిపోయిందంటూ హిరానీ అందరికీ షాక్‌ ఇచ్చారు. తన మిత్రుడు అభిజిత్‌ వద్ద ఉన్న కొన్ని ఆలోచనల ఆధారంగా కథగా తయారు చేసి దాంతోనే సినిమా తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు హిరానీ తెలిపారు. ప్రస్తుతం సంజయ్‌దత్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీసే సినిమాపై దృష్టి పెట్టానని ఆయన చెప్పారు.

09:32 - January 21, 2016

హైదరాబాద్ : రంజిత్, అర్చన హీరోహీరోయిన్లుగా మాంత్రిక్స్‌ మీడియా పతాకంపై సాయి కిరణ్‌ ముక్కామల స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కథనం'. 'ఏ ప్లే ఆఫ్‌ గాడ్‌' అనేది ఉపశీర్షిక. సాబు వర్గీస్‌ సంగీతమందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు పూరీ జగన్నాథ్‌ బిగ్‌ సీడీని ఆవిష్కరించారు. ఆడియో సీడీలను తనికెళ్ళభరణి, మోషన్‌ పోస్టర్‌ని పరుచూరి వెంకటేశ్వరరావు, టీజర్‌ను ఎ.కోదండరామిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్‌ మాట్లాడుతూ, 'సినిమా పోస్టర్‌, ప్రోమో, టైటిల్‌, ట్యాగ్‌లైన్‌ అన్నీ బాగున్నాయి. దేవుడు మనతో ఆడుకుంటాడనే ట్యాగ్‌లైన్‌ బాగుంది. ప్రతి మనిషికి బిగ్గెస్ట్‌ పెయిన్‌ ప్రకృతి నుంచే వస్తుంది. సాబు అందించిన మ్యూజిక్‌ చాలా బాగుంది. సినిమా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. 'యంగ్‌ టీమ్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం సక్సెస్‌ కావాలి' అని కోదండరామిరెడ్డి ఆకాంక్షించారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, 'స్క్రీన్‌ప్లే బాగుంటేనే సినిమా హిట్టవుతుంది. అలాగే దేవుడు స్క్రీన్‌ప్లే బాగుంటేనే జీవితం బాగుంటుంది. ఈ చిత్రం ట్యాగ్‌లైన్‌ కూడా అదే చెబుతుంది' అని చెప్పారు. 'రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు తనయుడు రంజిత్‌ నటిస్తున్న చిత్రమిది. ఈ టీమ్‌ చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలి' అని తనికెళ్ళ భరణి తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ, 'ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. ప్రతి మనిషికి ఓ కథ, కథనం ఉంటుంది. రొటీన్‌కి భిన్నంగా ఉండే ఈ చిత్రం కథ, కథనాన్ని తెరపైనే చూడాలి. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి' అని చెప్పారు. '2012లో జరిగిన నిర్భయ ఘటన తర్వాతే ఈ చిత్ర కథ పుట్టింది. పూర్వజన్మలో ఒక వ్యక్తి చేసిన పాపానికి, మరు జన్మలో దేవుడు ఏం చేశాడు, ఎలా చేశాడనేది ఈ చిత్రం కథ. అర్చన బాగా నటించింది. కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్న థ్రిల్లర్‌ చిత్రమిది' అని హీరో రంజిత్‌ తెలిపారు. 'తెలుగులో నేను నటించిన తొలిచిత్రమిది. కన్నడలో ఇప్పటికే మూడు చిత్రాల్లో నటించాను. ఈ సినిమాతో తెలుగునాట మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను' అని హీరోయిన్‌ అర్చన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు సాబు వర్గీస్‌, సురేష్‌ కొండేటి, నాగినీడు, రుద్ర తదితరులు పాల్గొన్నారు.

శంషాబాద్ లో రెడ్ అలర్ట్..

హైదరాబాద్ : గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఉన్నతాధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్‌ను ప్రకటించారు. సీఐఎస్‌ఎఫ్, అక్టోపస్, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్‌లను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నెల 31 వరకు విమానాశ్రయానికి సందర్శకుల రాకకు అనుమతి నిరాకరించారు.

09:28 - January 21, 2016

హైదరాబాద్ : హృతిక్‌రోషన్‌ కథానాయకుడిగా విజరు కృష్ణ ఆచార్య దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించనున్న తాజా చిత్రం 'థగ్‌'. ఈచిత్రంలో హృతిక్‌కి జోడీగా కత్రినాకైఫ్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. గతంలో హృతిక్‌, కత్రినా కాంబినేషన్‌లో 'బ్యాంగ్‌ బ్యాంగ్‌' యాక్షన్‌చిత్రం వచ్చిన విషయం విదితమే. తాజాగా ఈ కాంబినేషన్‌లో 'థగ్‌' రానుందని తెలుస్తోంది. యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ ఈ చిత్రానికి సంబంధించి తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. 'ఈ చిత్రంలో డ్రామా, యాక్షన్‌, హ్యూమర్‌, రొమాన్స్‌, సాంగ్స్‌..ఇలా అన్ని అంశాలున్నాయి. అయితే ఈ చిత్రానికి 'ధూమ్‌' సిరీస్‌కి ఏమాత్రం పోలీక లేదు. ఓ కొత్త కాన్సెప్ట్‌తో రూపొందనున్న చిత్రమిదని యూనిట్‌ చెప్పింది. హృతిక్‌రోషన్‌ ప్రస్తుతం అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్‌ డ్రామా చిత్రం 'మొహెంజోదారో' చిత్రంలో నటిస్తుంటే, కత్రినాకైఫ్‌ 'ఫితూర్‌', 'జగ్గాజాసూస్‌' తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

పలు ప్రాంతాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు…

ఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో చలి విజృంభిస్తుండడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. చలి నుండి రక్షించుకొనేందుకు చలి మంటలు వేసుకుంటున్నారు. 

09:25 - January 21, 2016

హైదరాబాద్ : నగర సెంట్రల్ యూనివర్సిటీల్లో వరుసగా ఐదో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల నిరసన జ్వాలలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈనెల 17వ తేదీన హెచ్ సీయూ దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి కారణమైన కేంద్ర మంత్రి దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వీసీ, ఏబీవీపీ నాయకుడులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని వారికి నష్టపరిహారం అందించాలని, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ ప్రో.రాజీనామాలు..
ఆందోళనలను మరింత ఉధృతరూపం చేయాలని విద్యార్థులు నిర్ణయించారు. ఇందుకు భవిష్యత్ కార్యాచరణనను రూపొందిస్తున్నారు. వీరు చేస్తున్న ఆందోళనలకు మద్దతు పెరుగుతూ వస్తోంది. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయి నేతలు హెచ్ సీయూకు తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా పరిపాలనాపరమైన పోస్టులకు ఎస్సీ, ఎస్టీ ప్రోఫెసర్లు రాజీనామా చేశారు. మరోవైపు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిలు హెచ్ సీయూకు రానున్నారు.

హెచ్ సీయూకు రానున్న కేజ్రీ..సురవరం..మాయావతి..
దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ తమ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఎనిమిది మంది రీసెర్చ్ స్కాలర్స్ బుధవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేశారు.

09:17 - January 21, 2016

మెదక్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ లారీ ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడనే మృతి చెందారు. కౌడీపల్లి మండలం రాజంపేట గ్రామానికి చెందిన ఓ మహిళ, వినయ్, రఘులు హైదరాబాద్ కు వెళ్లేందుకు ఆటో (టిఎస్1 5 యుఎ 4520)లో బయలుదేరారు. నర్సాపూర్ వద్ద మలుపు తిరిగే సమయంలో హైదరాబాద్ నుండి నర్సాపూర్ కు వెళుతున్న లారీ వేగంగా వచ్చిన ఆటోను ఢీకొంది. దీనితో ఆటో సగానికి సగం విరిగిపోయింది. అందులో ఉన్న వారు నుజ్జునుజ్జయ్యారు. ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. లారీని ఆపకుండానే డ్రైవర్ వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతి చెందిన ముగ్గురిని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

08:39 - January 21, 2016

హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు నమ్మే విధంగా లేవని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనులపై గవర్నర్ ప్రశంసలు..హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్య తదితర అంశాలపై నాగేశ్వర్ విశ్లేషించారు. ఆయన మాటల్లోనే..

గిరిజన ప్రాంతాలకు గవర్నర్ ఎందుకు వెళ్లడం లేదు..
''ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మిషన్ కాకతీయ పథకం పనులను పరిశీలించి ప్రశంసల వర్షం కురిపించారు. గవర్నర్ మెచ్చుకుంటే అభ్యంతరం చెప్పాల్సినవసరం లేదు. కానీ ఇక్కడ ఎన్నికల సమయంలో చేయడం వల్ల పలు ఆరోపణలకు గురి కావాల్సి ఉంటుంది. ఒకవిధంగా ప్రభుత్వ పథకాలు గవర్నర్ ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు సమీక్షించి అద్బుతంగా ఉన్నాయని సర్టిఫికేట్ ఇవ్వలేం. కేవలం గంట పాటు వెళ్లి కార్యక్రమం బాగుందని చెప్పడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. లోతుగా అధ్యయనం చేసిన తరువాత ప్రశంసించాలి. ప్రభుత్వానికి ప్రచారంగా చేయాల్సినవసరం లేదు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో గవర్నర్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. గవర్నర్ వ్యవస్థకు తలవొంపు తెచ్చేదే. తెలంగాణ గిరిజన ప్రాంతాలకు వెళ్లారా ? గిరిజన జీవితాలు మార్చేందుకు కృషి చేయవచ్చు కదా ? గవర్నర్ అనేది రాజ్యాంగ వ్యవస్థ. గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లి వారి పరిస్థితిని చూసిన తరువాతే చెబుతున్నాను. సెక్షన్ 8 ప్రకారం లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగితే తప్ప ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది. కానీ గిరిజన ప్రాంతాల్లో వేరే పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని పక్కన పెట్టి కూడా ఆదేశాలు జారీ చేయవచ్చు.

హెచ్ సీయూలో రోహిత్ ఆత్మహత్య..
ప్రతిపక్ష ఎంపీ వీహెచ్ రాసిన లేఖ రాస్తే వత్తిడి తెస్తారా ? ఈ రీతిలో స్పందిస్తారా ? వీహెచ్ ను ప్రభుత్వంలోకి తీసుకోండి. ఇవన్నీ ఎంటీ చెప్పడం. ఆరు లేఖలు రాసి వత్తిడి తీసుకొచ్చిన మాట నిజం. పెద్ద అండదండలతో వీసీ నియామకం జరిగిన మాట వాస్తవం. ఇంత గొడవ జరుగుతుంటే వీసీని పక్కకుపెడుతాం అని ఎందుకు చెప్పడం లేదు. సస్పెన్షన్ ఎత్తివేయలేదు. విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు కొత్తేమీ కాదు. చిన్న సంఘటనను శేరిలింగం పీఎస్ హ్యాండిల్ చేయాల్సి ఉంది. ఆయన చూసుకుంటాడు కదా. కేంద్ర కేబినెట్ అంతా రంగంలోకి దిగడం అవసరమా ? ఈ రకంగా సంఘ బహిష్కరణ ఉందో చెప్పాలి. తీవ్రవాదానికి సంబంధించిన కేసులో సంజయ్ దత్ జైల్లో ఉన్నాడు. బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని చెప్పారా ? స్మృతి ఇరానీ ఏమి తెలియకుండా ఆరు లేఖలు రాస్తారా ? దత్తాత్రేయ మాటలు అంగీకరించవచ్చు కాని స్మృతి ఇరానీ మాటలు నమ్మే విధంగా లేవు.

వర్సిటీల్లో జోక్యం చేసుకోవడం అవసరమా ?
కేంద్రంలో అధికారంలో ఉన్న వారు వత్తిడి తెచ్చారు. యూనివర్సిటీల్లో జోక్యం చేసుకోవడం అవసరమా ? రోహిత్ దళితుడు కాదు వడ్డెర కులస్తులు అని వాదిస్తున్నారు. ఏ బిడ్డకైనా సంఘబహిష్కరణ విధిస్తారా ? ఎక్స్ గ్రేషియా ఇంతవరకు ఇవ్వలేదు. మీ డబ్బులు కాదు కదా..కులం చర్చల్లోకి వెళ్లకూడదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగజారడం దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం పనిచేయాల్సిన పనేనా ? బ్లాక్ మనీ..ఇతర అంశాలు ఎన్నో ఉన్నాయి. దానిపై విచారణ చేయండి. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి''. అని పేర్కొన్నారు. పీఎస్ఎల్వీ సీ -31 రాకెట్ ప్రయోగం విజయవంతం, బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా తిరిగి నియామకం..ఈ అంశాలపై కూడా ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

నర్సాపూర్ లో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..

మెదక్ : నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

07:39 - January 21, 2016

హెచ్ సీయూ లో రోహిత్ ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హెచ్ సీయూలో దళిత విద్యార్థులు చేపడుతున్న దీక్షలకు నేతలు మద్దతు పలుకుతున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యపై కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు స్పందించారు. దళితులు, దళితేతరుల సమస్య కాదని స్మృతి పేర్కొన్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో విష్ణువర్ధన్ రెడ్డి (బీజేవైఎం), కైలాష్ నాథ్ (కాంగ్రెస్), వీరయ్య (నవతెలంగాణ ఎడిటర్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

రెండో రోజు 46వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు...

దావోస్ : నేడు రెండో రోజు 46వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరు కానున్నారు. 

నేడు గోదావరి నది యాజమాన్య బోర్డు భేటీ.

హైదరాబాద్ : నేడు గోదావరి నది యాజమాన్య బోర్డు భేటీ జరగనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శులు, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు హాజరు కానున్నారు. 

తెలుగు రాష్ట్రాలకు నేడు వర్ష సూచన.

విశాఖపట్టణం : ఛత్తీస్ గఢ్ నుండి ఒడిశా, జార్ఖండ్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడకక్కడ కొద్దిపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

హెచ్ సీయూకు రానున్న కేజ్రీవాల్..

హైదరాబాద్ : ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేడు హెచ్ సీయూకు రానున్నారు. విద్యార్థి రోహిత్ వేముల ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

హెచ్ సీయూకు రానున్న కేజ్రీవాల్..

హైదరాబాద్ : ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేడు హెచ్ సీయూకు రానున్నారు. విద్యార్థి రోహిత్ వేముల ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

06:50 - January 21, 2016

వరకట్న వేధింపుల చట్టం 498ఏ లో సవరణలు తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అసలు 498 ఏ లో ఏముంది? దీనివల్ల వరకట్న బాధితులకు జరుగుతున్న మేలేమిటి? అసలు 498ఏ అమలు తీరు ఎలా వుంది? ఈ చట్టం ఏ నేపథ్యంలో వచ్చింది? ఇప్పుడు దీనిని సవరించాలని కేంద్రం ఎందుకు భావిస్తోంది? 498ఏ ను సవరిస్తే మహిళల జీవితాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ చట్టాన్ని సవరించడం ఎంత వరకు సమర్ధనీయం? ఈ అంశంపై జనపథంలో ఐద్వా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హైమవతి విశ్లేషించారు. మరిన్ని విశేషాలకు వీడియో చూడండి. 

06:49 - January 21, 2016

498A చట్టం దుర్వినియోగం అవుతోందన్నది ఈ చట్టం వ్యతిరేకుల వాదన. నిజంగా ఈ సెక్షన్‌ దుర్వినియోగం అవుతోందా? దుర్వినియోగాన్ని అరికట్టే మార్గమే లేదా? దుర్వినియోగం పేరుతో చట్టాన్నే మార్చేయాలనుకోవడం సరియైన విధానమేనా? ఇలాంటి అనేక ప్రశ్నల మీద లోతుగా చర్చించాల్సిన అవసరం వుంది. తన సొంత ఇంటిలోనే, తన సొంత మనుషుల నుంచే హింసను ఎదుర్కోవాల్సి రావడానికి మించిన నరకం మరొకటి వుండదు. కానీ, ఇలాంటి అతిభయంకర నరకాన్ని అనుభవిస్తున్న స్త్రీలు మన దేశంలో కోకొల్లలు. కాళ్ల పారాణి ఆరకముందే భర్త, అత్తింటివారు పెట్టే వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న నవ వధువుల గురించి వింటున్నప్పుడు మన మనస్సు చివుక్కుమంటుంది. గుండె ఆర్థ్రమవుతుంది . అయ్యో! బంగారు బొమ్మల్లాంటి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారే! అన్న బాధ కలుగుతుంది. మన దేశంలో అమ్మాయిలను బొమ్మలుగా చూసే దుర్మార్గ సంస్కృతి మారనంత కాలం ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతూనే వుంటాయేమో.!

కట్నం తీసుకోవడం..ఇవ్వడం నేరమే..
మన దేశ చట్టాల ప్రకారం కట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం రెండూ నేరమూ. కానీ, కట్నకానుకల లెక్క తేలకుండా మన దేశంలో సంబంధం ఖాయం కావడం చాలా కష్టం. ఇచ్చిన కట్నం చాలలేదంటూ, అనుకున్నవన్నీ ఇవ్వలేదంటూ, మరికొంత కట్నం కావాలంటూ నిత్యం గొడవపడే ప్రబుద్ధులెందరో మన చుట్టూ వున్నారు. ఇలాంటి వేధింపుల నుంచి స్త్రీలకు ఎంతో కొంత రక్షణ కల్పించేందుకు చేసిన చట్టమే 498A సెక్షన్‌. దీని ప్రకారం కట్నం పేరుతో, మరో పేరుతోనో వేధింపులకు పాల్పడితే భర్తతో పాటు అత్తమామలమీద, ఆడపడుచుల మీద, మరుదుల మీద కూడా కేసు పెట్టే అవకాశం వుంది. వరకట్న వేధింపులు, గృహ హింసలకు వ్యతిరేకంగా అనేకమంది స్త్రీలు సాగించిన పోరాటాల ఫలితంగా వచ్చిందే 498A సెక్షన్‌. దీనిప్రకారం మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం వుంది.

చట్టం దుర్వినియోగం అవుతుందా..?
అయితే, 498A సెక్షన్‌ దుర్వినియోగం అవుతోందన్నది దీని వ్యతిరేకుల వాదన. వేధింపులతో తమకు ఏ సంబంధం లేకపోయిన్నప్పటికీ, ఎక్కడో దూరంగా తమ బతుకులు తాము బతుకుతున్నప్పటికీ, కేవలం తోబుట్టువులం అయినంత మాత్రన తమ మీద కేసులు పెట్టడం, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పడం ఎంత వరకు న్యాయం అన్నది వీరి ప్రశ్న. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతున్న మాటా, అక్కడక్కడ ఒకరిద్దరు అమాకుల మీద కేసులు నమోదవుతున్న మాట కొంతవరకు నిజమే అయినా, ఇలాంటివాటిని చూపించి మొత్తం చట్టమే దుర్వినియోగం అవుతోందని వాదించడం అర్ధరహితం.

చట్టానికి తూట్లు పొడవడం అవసరమా ?
నిజానికి 498 A సెక్షన్‌ను సమర్ధవంతంగా అమలు చేయడం లేదన్న విమర్శలు మహిళా సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ సెక్షన్‌ ప్రకారం గృహిణి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు భార్యాభర్తలను, అత్తింటివారిని పిలిపించి కౌన్సిలింగ్‌ చేయించాల్సి వుంటుంది. కానీ, చాలాచోట్ల పోలీసులు తమ విధి సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల సమస్య వస్తోందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మనదేశంలో వరకట్న హత్యలు అధికం. ప్రతి 90 నిమిషాలకో వివాహిత వరకట్న వేధింపులకు బలైపోతోంది. ప్రతి లక్ష మంది మహిళల్లో ఏడాదికి ఇద్దరిని వరకట్నం చంపేస్తోంది. ఏటా 8వేలకు పైగా వరకట్నం హత్యల కేసులు నమోదవుతున్నాయి. ఇంకా పోలీస్‌ రికార్డులకెక్కని కేసులు మరెన్నో. వరకట్న హత్యల్లో చాలా భాగం గ్యాస్‌ స్టవ్‌ పేలుళ్లు, వంటింటి ప్రమాదాల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. మరికొన్ని కేసులను కడుపు నొప్పి ఆత్మహత్యలంటూ వక్రీకరిస్తున్నారు. వరకట్న వేధింపులు, వరకట్న హత్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. వరకట్నం కారణంగా ఇంతమంది ఇన్ని రకాలుగా మన కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతుంటే, వీటిని నిరోధించే మార్గాల దృష్టి పెట్టకుండా, ఏవో కొన్ని తప్పుడు కేసులు నమోదయ్యాయంటూ, అసలు చట్టం స్పూర్తికే తూట్లు పొడవడం ఎంత వరకు సమర్ధనీయం.

06:44 - January 21, 2016

పాకిస్థాన్ : ఉగ్రవాదులు మళ్లీ నరమేధానికి పాల్పడ్డారు. వాయవ్య పాకిస్థాన్ ఛార్‌సద్దాలోని బచాఖాన్‌ యూనివర్సిటీపై దాడికి తెగబడ్డారు. సాయుధులైన ఉగ్రవాదులు యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడి పేలుళ్లు, కాల్పులతో బీభత్సం సృష్టించారు. ఖైబర్ పక్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని బచాఖాన్ యూనివర్సిటీలోకి ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు చొరబడ్డారు. ఉదయం పొగమంచు దట్టంగా ఉన్న సమయంలో గోడ దూకి లోనికి వెళ్లారు. తరగతులు, హాస్టళ్లలోని విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. టెర్రరిస్టుల కాల్పుల్లో 25 మంది మృతి చెందారు. 50 మందిపైగా గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. మృతుల్లో విద్యార్థులు, ప్రొఫెసర్, పోలీసుతో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.

3వేల మంది విద్యార్థులు...
ఉగ్రదాడి ఘటనతో సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ల సహాయంతో యూనివర్సిటీలో ఆపరేషన్‌ నిర్వహించారు. పొగమంచు దట్టంగా అలముకోవడంతో వర్సిటీలోకి ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారనేది తెలియడం లేదు. కాల్పులు ఆగిపోయాయి. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు భద్రతాదళాలు పేర్కొన్నాయి. ఉగ్రదాడి సమయంలో యూనివర్సిటీ క్యాంపస్‌లో 3 వేల మంది విద్యార్థులున్నారు. మరో 6 వందల మంది అతిథులున్నారు. ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ వర్ధంతి సందర్భంగా యూనివర్సిటీలో కవితా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో హాహా కారాలతో యూనివర్సిటీలో భయానక వాతావరణం నెలకొంది.

భయాందోళనలు...​
70 శాతం విద్యార్థులను సురక్షితంగా యూనివర్సిటీ నుంచి బయటకు పంపినట్టు అధికారులు తెలిపారు. కొంతమంది విద్యార్థులు టాయ్‌లెట్లు, గదులు, అటకపై దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. పెషావర్‌లోని అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర ఎమర్జెన్సీ ప్రకటించారు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, వర్సిటీ సిబ్బంది కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్‌-ఎ-తాలిబాన్ సంస్థ ప్రకటించుకుంది. యూనివర్సిటీపై దాడిని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు, పౌరులకు మతంతో సంబంధం లేదని అన్నారు. 2014లో తాలిబాన్ ఉగ్రవాదులు పెషావర్ సైనిక స్కూల్ పై దాడి జరిపి 134 విద్యార్థులను కాల్చి చంపారు. ఈ సంఘటన మర్చిపోకముందే యూనివర్సిటీపై మరో దాడి జరగడం పట్ల భయాందోళన వ్యక్తమవుతోంది.

06:40 - January 21, 2016

విజయవాడ : ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమన్నారు కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేస్తామన్నారు.. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చింది మొదలు.. వరుసగా.. ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. మొన్న అంగన్‌వాడీలను తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారు... నిన్న ఆదర్శ రైతులు, బిల్డింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌లను తొలించారు... తాజాగా ఆరోగ్య మిత్రలకు మంగళం పాడారు. కేవలం రాజకీయ కోణంలోనే ఆరోగ్యమిత్రలను తొలగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎంతోకాలంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్యమిత్రలను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 19 వందల మంది ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తొలగించిన వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.. ఎన్‌టీఆర్‌ వైద్య సేవల్లో వైద్యమిత్ర, నెట్‌వర్క్ సిబ్బందిని ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించేందుకు అనుమతినిచ్చింది. జిల్లాల వారీగా పోస్టుల వివరాలు పంపాల్సిందిగా ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో ను ఆదేశించింది.. ప్రస్తుతమున్న జిల్లా కో-ఆర్డినేటర్లు, జిల్లా మేనేజర్ల.. విధులు ఒకేరకంగా ఉన్నాయని భావిస్తున్న సర్కారు... జిల్లా మేనేజర్‌ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించింది.

సహాయంగా ఉంటున్న ఆరోగ్య మిత్రలు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకోసం వచ్చినవారికి ఆరోగ్యమిత్రలు సహాయంగా ఉంటారు.. ఏ డాక్టర్‌ను కలవాలి? వారు ఎక్కడ ఉంటారు? టెస్టులు ఎక్కడ చేయించుకోవాలి? లాంటి వివరాలు చెబుతారు.. అయితే ఇప్పటివరకూ పనిచేసిన ఆరోగ్యమిత్రల తీరు సరిగాలేదని సర్కారు భావిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగులను వీరు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారని విశ్వసిస్తోంది. అలాగే అర్హత లేకుండా.. ఎవరిని పడితే వారిని ఆరోగ్యమిత్రలుగా నియమించారని, అందుకే వీరి స్థానంలో నర్సింగ్, ఫార్మసీ పూర్తిచేసినవారిని కొత్తగా నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

27 అవార్డులకు ఏమి సమాధానం చెబుతుంది. 
ప్రభుత్వ నిర్ణయంతో ఆరోగ్యమిత్రలు ఆందోళన చెందుతున్నారు. తమ పనితీరు సరిగా లేదన్న ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో తమ సేవలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లభించిన 27 అవార్డులకు ఏమి సమాధానం చెబుతుందని అంటున్నారు. తాము విధులు సరిగా నిర్వహించకపోతే ఈ అవార్డు ఎలా వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. కొత్త ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీ బాధ్యతను కలెక్టర్ అధ్వర్యంలోని కమిటీకి అప్పగించారు.. అయితే ఇదంతా పైకి చెబుతున్నా ఈ తొలగింపు వెనక వేరే కారణముందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. పాత ఉద్యోగులంతా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారు. వారి స్థానంలో టీడీపీ శ్రేణులను నియమించేందుకే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన...
ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామంటూ హామీలు గుప్పించిన ప్రభుత్వం కొత్త పోస్టులు భర్తీ చేయకపోగా... ఉన్న ఉద్యోగులను తొలగిస్తుండడం నిరుద్యోగుల్లో కలవరాన్ని కలిగిస్తోంది. గతంలో అంగన్‌వాడీలు, ఆదర్శ రైతులు, బిల్డింగ్‌ వర్క్ ఇన్స్‌పెక్టర్లను ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు 19 వందల మంది ఆరోగ్య మిత్రలను రోడ్డు పాల్జేసే నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు సర్కారు నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. 

06:36 - January 21, 2016

హైదరాబాద్ : నారాయణఖేడ్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు నేటి నుంచి తెరలేవబోతోంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే పడనుంది. ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఆకస్మిక మృతి కారణంగా జరుగనున్న ఈ ఎన్నికల్లో అభివృద్ధి తమతోనే సాధ్యమని టీఆర్‌ఎస్‌, కిష్టారెడ్డిపై ఉన్న సానుభూతి, ఆయన ప్రజలకు చేసిన మేలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్‌, తమ అభ్యర్థి ఇన్నేళ్లుగా స్థానికంగా అందుబాటులో ఉన్న తీరే తమకు గొప్ప అనుకూలమైన అంశమని టీడీపీ చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు నుంచి 27వ తేదీకి వరకు నారాయణఖేడ్‌ ఉప ఎన్నికకు నామినేషన్ల ను స్వీకరిస్తారు. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఫిబ్రవరి 13న జరగనుంది. 16వ తేదీన ఈ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. నారాయణఖేడ్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని సహాయ ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇక అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎం.భూపాల్‌రెడ్డి పోటీ చేయనున్నట్లు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన భూపాల్‌రెడ్డి .. కాంగ్రెస్ అభ్యర్థి కిష్టారెడ్డి చేతిలో ఓటమి పాలై రెండో స్థానంలో నిలిచారు. ఇక కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించింది. నారాయణఖేడ్‌ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఏ అంశంతో ప్రజల్లోకి వెళుతోంది. ఇక కాంగ్రెస్‌కు ఉన్న అనుకూలతలేమిటి? పార్టీల ప్రచారశైలి ఎలా ఉండబోతోంది? ప్రధాన ప్రత్యర్థి ఎవరనే అంశాలు మరికొద్ది రోజుల్లో తేలిపోతాయి.

06:34 - January 21, 2016

హైదరాబాద్ : తెలంగాణలో గోదాముల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీష్‌రావు మార్కెటింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. నాబర్డ్ నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న గోదాముల పరిస్థితిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొడౌన్ల నిర్మాణంలో నల్లగొండ జిల్లా ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఇంజనీరింగ్‌ అధికారులను హరీష్‌రావు అభినందించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వెనుకబడడంపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 31 నాటికి వంద గోదాములను నిర్మించాలని హరీష్‌రావు అధికారులకు సూచించారు. రెండో దశలో భాగంగా జూన్‌ 31 నాటికి మరో 250 గొడౌన్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. గొడౌన్లపై సోలార్‌ ప్యానల్స్ ఏర్పాటుపైనా మంత్రి మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సమీక్షించారు. తెలంగాణలో కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణానికి సంబంధించి పలు అంశాలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మార్కెటింగ్‌ శాఖ రూపొందించిన ఉల్లిగడ్డ పాలసీ ముసాయిదాను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ముసాయిదాను అతి త్వరలో చట్టరూపంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. 

06:32 - January 21, 2016

హైదరాబాద్ : మార్చిలో జరగబోయే బడ్జెట్ సమావేశాలకు ముందుగానే ప్రణాళికలు సిద్దం చేస్తూ.. బిజీగా ఉన్న తెలంగాణ ఆర్థికశాఖ, ఇతర శాఖలకు షాక్ ఇచ్చింది. ఆయా శాఖలకు భారీ స్థాయిలో నిధులు కేటాయించలేమని స్పష్టం చేసింది. మార్చిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు సంబంధించి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు ,ఇతర సిబ్బంది నెలరోజుల నుండి కసరత్తు చేస్తున్నారు. 2016-17 బడ్జెట్ లో నీటిపారుదలరంగానికి రూ.25వేలకోట్లు నేరుగా కేటాయించాలంటూ ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రతిజిల్లాలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు.. పెండింగ్ సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. సీఎం సూచనలకు అనుగుణంగా అధికారులు బడ్జెట్‌ రూపకల్పనపై దృష్టిసారించారు.

కేంద్ర నిధుల్లో కోత..
మరోవైపు రుణమాఫీ కోసం 4 వేల 250 కోట్ల నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వం అంచనా వేసినట్లుగా ఆదాయం రావడం లేదు. భూముల అమ్మకం.. క్రమబద్దీకరణ ద్వారా ఆశించిన మేర ఆదాయం రావడం లేదు. దీంతో పాటు కేంద్రనిధుల్లో కోతపడింది.ఈ నేపథ్యంలో పరిమితబడ్జెట్ లోనే శాఖలకు నిధులు కేటాయించాల్సి రావడం ఆర్థికశాఖకు ఇబ్బందిగా మారింది.

బకాయిల ఎగవేతదారులపై దృష్టి..
మరోపక్క రెవెన్యూ పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా పలు శాఖలకు ఆర్థిక శాఖ టార్గెట్లు విధిస్తోంది. పన్నుల వసూళ్ల్లో ఎక్కడా అక్రమాలకు తావులేకుండా చెక్ పోస్టులను బలోపేతం చేయడంతోపాటు బకాయిల ఎగవేత దారులపై ఆర్థిక శాఖ దృష్టిసారించింది. 

06:30 - January 21, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో జెండా ఎగరేసేందుకు టీ-టీడీపీ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ టీడీపీ నేతలు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే మేనిఫేస్టోను సిద్ధం చేసిన తెలుగు తమ్ముళ్లు.. బల్దియాలో ప్రచారానికి రెడీ అయ్యారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్ లు కవర్ అయ్యేలా ప్రచారం చేసేందుకు తెలంగాణ తమ్ముళ్లు సిద్దమవుతున్నారు. గ్రేటర్ లో వార్డుల వారీగా సీనియర్లను మోహరించడంతో పాటు... రెబెల్స్‌ బెడదను తొలగించుకునేందుకూ కసరత్తు చేస్తున్నారు. వీరి వ్యవహారంపై జాతీయ నేత చంద్రబాబుతో ఇప్పటికే చర్చించిన నేతలు ఆయన సూచనల మేరకు.. వ్యూహాత్మక ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 22 నుంచి 27 వరకు టీడీపీ పార్టీ ముఖ్యనేతలు ప్రచారం చేయనున్నారు. 20 నెలల టీఆర్ఎస్ వైఫల్యాలే టార్గెట్ చేసుకుని ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించారు.

31 న లక్షమందితో భారీ ర్యాలీ..
గ్రేటర్ లో 87 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ. మిగిలిన స్థానాలను మిత్రపక్షమైన బీజేపీకి వదిలింది. కూటమి తరఫున టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈనెల 28,29,30 తేదీల్లో ప్రచారం నిర్వహించేలా టీడీపీ నేతలు ప్లాన్‌ సిద్ధం చేశారు. నగరంలోని పలు చోట్ల రెడ్ షోలలో అధినేత పాల్గొననుండడంతో తెలుగు తమ్ముళ్లు సన్నాహాలు చేస్తున్నారు. బాబుతో పాటు పార్టీ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ కూడా ప్రచారంలో పాల్గొంటారని నేతలు చెబుతున్నారు. 31 న నగరంలో లక్ష మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ప్రచారంలో టీడీపీ రూపొందించిన మేనిఫేస్టోలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ వేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అన్ని పార్టీలు ప్రచారం ప్రారంభించినా... టీడీపీ మాత్రం ఆచితూచి ప్రచార బరిలోకి దిగాలని భావిస్తోంది. ఒక వైపు స్థానిక నేతలు, మరో వైపు అధినేత ప్రచారంతో విజయబాటలో సాగాలని యోచిస్తోంది. గురువారంలోగా రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణ చేయించే ఏర్పాట్లలో నేతలు తలమునకలయ్యారు. 

06:28 - January 21, 2016

విజయవాడ : రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై ఏపీలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ చేపట్టారు. కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కర్నూలులో కూడా సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు కార్యక్రమాలు నిర్వహించారు. రోహిత్‌ కుటుంబానికి 5కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివక్ష చూపడంవల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆయన నెల్లూరులో మండిపడ్డారు. రోహిత్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కడపలో రోహిత్ ఆత్మకు శాంతి కలగాలంటూ వైఎస్సార్ స్టుడెంట్స్ యూనియన్‌, వైఎస్సార్ యువజన విభాగం కార్యకర్తలు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు.. విద్యార్థుల జీవితాలతో రాజకీయ నేతలు ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కులవివక్ష వ్యతిరేక చట్టాన్ని తీసుకురావాలని సీపీఎం డిమాండ్ చేసింది.. 

నేడు ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మూడు గంటలకు ముగియనుంది. కాగా, ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్ అందలేదు.

నేటి నుండి పెడికాన్ ఆసియా పసిఫిక్ సదస్సు..

హైదరాబాద్ : శిశు మరణాలు, భ్రూణహత్యలు, చిన్నపిల్లల్లో వ్యాధులు తదితర సమస్యల పరిష్కారం, పిల్లల వైద్య సంరక్షణే లక్ష్యంగా 15వ ఆసియా-పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్, 53వ పెడికాన్ 2016, 5వ ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ నర్సింగ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు హైదరాబాద్ హైటెక్స్‌లో అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. 

నేడు నెల్లూరుకు జగన్..

నెల్లూరు : జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పరామర్శించనున్నారు. 

Don't Miss