Activities calendar

23 January 2016

గ్రేటర్ ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్ ఎంసీ కమిషనర్....

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈవీఎంలలో నోటా ఉండదని చెప్పారు. 7802 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల బరిలో 1,333 మంది అభ్యర్థులు ఉన్నారు. ఐదు వార్డుల్లో అత్యధికంగా 16 మంది చొప్పున పోటీ, 8 వార్డుల్లో అత్యల్పంగా నలుగురు చొప్పున పోటీ చేశారు. గ్రేటర్ మొత్తం 74, 23, 980 మంది ఓటర్లకు గానూ 13.87 లక్షల మందికి ఓటర్ స్లిప్ లు పంపిణీ చేశామని తెలిపారు. 

బెంగుళూరు శివారులో తలదాచుకున్న ఉగ్రవాదులు...

కర్నాటక : బెంగుళూరులో తెలంగాణ పోలీస్, ఎన్ ఐఏ జాయింట్ ఆపరేషన్ చేశారు. పట్టణ శివారులో ఉగ్రవాదులు తలదాచుకున్నారు. పారిపోతున్న ఉగ్రవాది దంపతులను పోలీసులు పట్టుకున్నారు. ఈనేపథ్యంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అహ్మదాబాద్ బాంబ్ పేలుళ్లలో కీలక సూత్రదారిగా గుర్తించారు. బెంగుళూరు శివారులోని ఓ గృహంలో ఎన్ ఐఎ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

22:11 - January 23, 2016

ఢిల్లీ : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు చెందిన వంద రహస్య ఫైళ్లను కేంద్రం బహిర్గతం చేసింది. నేతాజీ కుటుంబానికిచ్చిన హామీ మేరకు ప్రధాని వీటిని విడుదల చేశారు. దీంతో నేతాజీ మరణంపై 70 ఏళ్లుగా కొనసాగుతున్న మిస్టరీ ఇక వీడినట్టేనా?

100 రహస్య ఫైళ్లను విడుదల చేసిన ప్రధాని

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 119వ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన రహస్య ఫైళ్లను కేంద్రం బహిర్గతం చేసింది. నేతాజీ జీవితానికి సంబంధించిన 100 రహస్య దస్త్రాలను డిజిటల్‌ ప్రతుల రూపంలో ప్రధాని నరేంద్రమోది బహిర్గతం చేశారు. నేషనల్‌ ఆర్చివ్స్‌ ఆఫ్‌ ఇండియా ఈ పత్రాలను రిలీజ్‌ చేసింది. నేతాజీ మరణానికి సంబంధించిన రహస్యాన్ని తెలుసుకోవడానికి ఈ ఫైళ్లు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. ప్రతినెలా 25 డిజిటల్ కాపీలను బయట పెట్టాలని భారత జాతీయ ప్రాచీన పత్ర భాండాగారం- ఎన్‌ఏఐ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి 12 మంది నేతాజీ కుటుంబసభ్యులు హాజరయ్యారు. విడుదల చేసిన ఫైళ్లను చూసి బోసు కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.

రహస్య ఫైళ్లను బహిర్గతాన్ని స్వాగతించిన బోసు కుటుంబసభ్యులు

నేతాజీ రహస్య ఫైళ్లను బహిర్గతం చేయాలన్న ప్రధాని నిర్ణయాన్ని బోసు కుటుంబసభ్యులు స్వాగతించారు. భారత్‌లో నేడు పారదర్శకమైన రోజుగా నేతాజీ మనవడు చంద్రకుమార్‌ బోస్‌ అభివర్ణించారు. గత ఏడాది అక్టోబర్‌లో మోది -నేతాజీ కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య ఫైళ్లను ఆయన జయంతిరోజు బహిర్గతం చేస్తానని వారికి అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో నేతాజీకి సంబంధించిన 64 ఫైళ్లను బహిర్గతం చేసిన విషయం తెలిసిందే.

బోసు మరణంపై మిస్టరీ వీడడం లేదు..

సుభాష్‌చంద్రబోస్‌ 70ఏళ్ల క్రితం కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి బోసు మరణంపై మిస్టరీ వీడడం లేదు. నేతాజీ మరణంపై గతంలో వేసిన రెండు దర్యాప్తు కమిషన్‌లు- తైపీలో 1945, ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు ధృవీకరించాయి. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయాడన్న విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు, మరికొందరు అంగీకరించడం లేదు. ఇప్పటికిప్పుడు తాము చెప్పలేము కానీ నేతాజీ మృతి సంబంధించి అసలు విషయం బయటపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మూడు కథనాలు ప్రచారంలో

నేతాజీ సంబంధించి మూడు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 18 ఆగస్టు, 1945లో తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరణించారన్నది ఓ కథనం. చైనా నుంచి రష్యాకు చేరుకున్న నేతాజీ కొన్నాళ్ల తర్వాత హత్యకు గురయ్యాడన్నది మరో కథనం. నేతాజీ రహస్యంగా ఇండియాకు వచ్చారని, ఫైజాబాద్‌లో బాబాగా మారువేషంలో తిరిగారన్న కథనాలు వెలువడ్డాయి. జర్మనీలో నివసిస్తున్న నేతాజీ కూతురు అనితా బోస్‌ మాత్రం- విమాన ప్రమాదంలోనే తన తండ్రి మరణించినట్టు వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

22:06 - January 23, 2016

త్రివేండ్రం: కేరళ బార్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ఎక్సైజ్‌ మంత్రి కె.బాబు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామ పత్రాన్ని ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందికి అందజేశారు. బార్‌ కుంభకోణంతో సంబంధాలున్నాయన్న కారణంతో ఆర్థిక మంత్రి కెఎం మణి గత ఏడాది రాజీనామా చేయగా...తాజాగా ఎక్సైజ్‌ శాఖ మంత్రి బాబు రాజీనామా చేశారు. బార్‌ లిక్కర్‌ లైసెన్స్‌ల రెనివల్‌ కోసం బాబుకు పదికోట్లు లంచం ఇచ్చానని కేరళ బార్‌ ఓనర్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడు బిజు రమేష్‌ చేసిన ఆరోపణలు యుడిఎఫ్‌ ప్రభుత్వాన్ని కుదిపేశాయి.

 

 

21:59 - January 23, 2016

హైదరాబాద్ : రోహిత్‌ కేసు పక్కదారి పడుతోందా..? అవునన్న సమాధానమే వస్తోంది. రోహిత్‌ మరణ కారణాలను మరిచి... అతడి కులంపై ఆరా మొదలు పెట్టడంతో.. ఈ అంశం పక్కదారి పడుతున్నట్లు తేటతెల్లమవుతోంది. రోహిత్‌ దళితుడు కాదని తేల్చి.. వర్సిటీలో కుల వివక్షత లేదని చెప్పదలిచారా..? దీని చాటున.. వర్సిటీలోని వివక్ష, అణచివేతలను కప్పెట్టేయాలని భావిస్తున్నారా..? రోహిత్‌ వ్యవహారాన్ని విని చలించిపోయిన ప్రతి ఒక్కరి మదిలో కదలాడుతున్న ప్రశ్నలివి..

రోహిత్‌ ఆత్మహత్య కారణాలపై విచారణ ఏదీ..?

హైదరాబాద్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య అంశాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. రోహిత్‌ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను.. దానికి కారణాలను.. బాధ్యులను గురించి విచారించకుండా.. రోహిత్‌ పుట్టుపూర్వోత్తరాలు, కుల గోత్రాలపై దర్యాప్తు చేస్తుండడంతో ఈ అనుమానం బలపడుతోంది. రోహిత్‌ ఆత్మహత్య జరిగిన రెండు రోజులకే.. రాష్ట్ర పోలీసులు గుంటూరు జిల్లా గురజాలకు వెళ్లి.. రోహిత్‌ నాయనమ్మ, తండ్రిని కలిసి.. కులం గురించి విచారించడం... దేశవ్యాప్త విమర్శలకు తావిచ్చింది.

ఎస్‌సీ మాల కులంలో జన్మించిన రోహిత్‌ తల్లి

రోహిత్‌ తల్లి రాధిక.. ఎస్‌సీ మాల కులంలో జన్మించారు. వడ్డెర కులస్థుడిని పెళ్లి చేసుకున్నారు. తనతో పాటు.. ముగ్గురు పిల్లలనూ భర్త ఏమాత్రం పట్టించుకోక పోవడంతో.. పెళ్లయిన కొన్ని సంవత్సరాలకే ఆమె భర్త నుంచి వేరుపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె దళిత వాడలోనే నివసిస్తున్నారు. పిల్లలు కూడా తల్లి దగ్గరే మాల కులస్థులుగానే పెరిగారు. అయితే ఇప్పుడీ అంశాన్ని వివాదాస్పదం చేసేందుకు కేంద్ర పాలక పక్షం.. దాని అనుబంధ సంఘాలు విశ్వప్రయత్నాలూ చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

తల్లి వద్దే మాల కులస్థుడిగా పెరిగిన రోహిత్‌

తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నప్పుడు.. వారికి పుట్టే బిడ్డలు.. ఇద్దరిలో ఎవరో ఒకరి కులాన్ని ఎంచుకునే అవకాశం కల్పిస్తూ.. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రోహిత్‌.. తల్లి వద్దే మాల కులస్థుడిగా పెరిగాడు. అంటే అతడు దళితుడన్న అంశం తేటతెల్లమవుతోంది. అయినా రోహిత్‌ను వడ్డెర కులస్థుడనే వాదాన్ని తెరపైకి తెచ్చి.. వివాదాన్ని తెరమరుగు చేసే కుట్ర తీవ్రంగానే జరుగుతోంది.

వర్సిటీలో కుల వివక్షత లేదని తేల్చే ప్రయత్నం

బలవన్మరణానికి పాల్పడిన రోహిత్‌ వడ్డెర కులానికి చెందినవాడని ధ్రువపరిచి.. అతడు దళితుడే కాదని తేల్చి.. వర్సిటీలో కుల వివక్షత లేదని.. అతని మరణానికి కుల వివక్ష కారణం కానే కాదని చాటేందుకు పాలకులు ఆపసోపాలు పడుతున్నారన్నది సుస్పష్టం. హైదరాబాద్‌ వర్సిటీలోని కులవివక్షత, అణచివేతలకే రోహిత్‌ బలయ్యాడని.. బీజేపీయేతర పక్షాలన్నీ బలంగా నమ్ముతున్నాయి. కానీ కేంద్ర సర్కారు మాత్రం దీనికి భిన్నమైన వాదనను తెరపైకి తెచ్చి.. తను నమ్మినదాన్నే నిరూపించే ప్రయత్నం చేస్తోంది.

వర్సిటీలో కుల వివక్షత లేదంటే వాస్తవం తెరమరుగవుతుందా..?

ఇప్పుడు రోహిత్‌ దళితుడు కాదు అని తేల్చి.. వర్సిటీలో కుల వివక్ష లేదని చాటితే.. వాస్తవం తెరమరుగై పోతుందా..? ఓ మనిషి బలవన్మరణానికి పాల్పడితే.. తద్వారా ఓ తల్లికి తీరని కడుపు కోత మిగిలితే.. దానికి దారితీసిన కారణాలను అన్వేషించకుండా.. అతడి కులం గురించిన ఆరాలేంటి..? పైగా సాక్ష్యం కళ్లముందే ఉంది. జరిగిన.. జరుగుతున్న అన్యాయం రోజుకో రూపంలో బయట పడుతూనే ఉంది. అయినా నేరం తమ కాదని.. బాధితుణ్ణే బాధ్యుణ్ణి చేసే ప్రయత్నాలు సాగిస్తోంది కేంద్ర పాలక పక్షం.

వర్సిటీ అధికారుల చర్యలకు అర్థమేంటి...?

రోహిత్‌ ఆత్మహత్యకు కుల వివక్ష.. అణచివేతలే కారణం కాకుంటే.. వర్సిటీ అధికారులు తక్షణ చర్యలు ఎందుకు తీసుకుంటారు..? విద్యార్థుల సస్పెన్షన్‌ నిర్ణయం తప్పుడుది కాకుంటే.. ఎందుకు ఎత్తివేస్తారు..? పైగా వర్సిటీ నుంచి రోహిత్‌ కుటుంబానికి 8 లక్షల పరిహారం ప్రకటించడంలోని ఆంతర్యం ఏంటి..? కేంద్ర మంత్రి స్మృతి ఇరానీయే నేరుగా.. రోహిత్‌ తల్లితో మాట్లాడి.. వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడమేంటి..? ఇవన్నీ పాలకులు బదులివ్వని ప్రశ్నలు.

నిర్భయ వ్యవహారంలో ఆమె కులాన్ని ప్రస్తావించలేదే..?

అన్నిటికన్నా ముఖ్యంగా కన్న కొడుకు రోహిత్‌ను కోల్పోయిన రాధిక.. వేసిన సూటి ప్రశ్న అందరినీ ఆలోచింప చేస్తోంది. అత్యాచారానికి గురై మృతి చెందిన నిర్భయ వ్యవహారంలో... ఆమె కులాన్ని ప్రస్తావించని నేతలు.. ఇప్పుడు తన కుమారుడు రోహిత్‌ విషయంలోనే కులాన్ని ఎందుకు ఎత్తి చూపుతున్నారు..? అని రాధిక ప్రశ్నిస్తున్నారు. నిజమే. ఓ భారత పౌరుడు.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే.. కులం అంశాన్ని తెరపైకి తేవడం.. అసలు దోషులను తప్పించేందుకే అన్నది అర్థమవుతోంది.

వీసీ అప్పారావు, దత్తాత్రేయలను ఎందుకు విచారించలేదు?

రోహిత్‌ ఆత్మహత్య వ్యవహారంలో నిందితులుగా ఉన్న హెచ్ సీయూ వీసీ అప్పారావును గానీ, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను గానీ ఇంతవరకు విచారించని పోలీసులు రోహిత్‌ కులంపై ఆరా తీయడం విస్మయాన్ని కలిగించక మానదు. రోహిత్‌ మరణంతో ప్రాణం పోసుకున్న వేల గొంతుకలు.. కుల వివక్షతకు వ్యతిరేకంగా గర్జిస్తున్నా.. వారి ఆక్రందనలు పాలకుల చెవికెక్కడం లేదు. ఇప్పటికైనా వాస్తవాలను వక్రీకరించకుండా.. హైదరాబాద్‌ వర్సిటీలో పాతుకుపోయిన కులవివక్ష మహమ్మారిని తుదముట్టించి.. దళితుల గొంతు నొక్కే ప్రయత్నాలను నిలువరించి.. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేలా.. విద్యార్థుల్లో విజ్ఞాన జ్యోతులు నింపేలా.. చర్యలు తీసుకోవాలి. లేకుంటే.. భవిష్యత్తులో పరిస్థితులు మరింతగా దిగజారే ప్రమాదం పొంచి ఉంది.

 

21:53 - January 23, 2016

హైదరాబాద్ : సెంట్రల్ వర్సిటీలో సెగలు చల్లారడం లేదు. హైడ్రామా మధ్య విద్యార్థుల ఆమరణ దీక్ష భగ్నమైంది. శాంతియుతంగా దీక్ష చేస్తున్న విద్యార్థులతో... చర్చించకుండానే ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మరోవైపు పాలకుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరచేతితో సూర్యకాంతిని, అరెస్టులతో తమపోరాటాన్ని ఆపలేరని జెఎసి నేతలు హెచ్చరించారు. నినాదాలు, నిరసనలు… ఆందోళనలు, ఆమరణ దీక్షలు… హెచ్‌సీయూలోని దృశ్యాలివి. సెంట్రల్ వర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది.

ఆమరణ దీక్ష భగ్నం

న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థుల దీక్ష భగ్నమైంది. నాలుగు రోజులుగా ఆరోగ్యం క్షీణిస్తున్నా... ఆమరణ దీక్ష చేస్తున్న ఏడుగురు విద్యార్థులతో చర్చించకుండానే వర్సిటీ పోలీసులు దీక్ష భగ్నం చేశారు. దీంతో ఒక్కసారిగా యుద్ధవాతావరణం ఏర్పడింది. వీసీకి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థుల్ని బలవంతంగా హెచ్‌సీయూ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడే విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నారు. మరోవైపు ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదంటూ హెచ్ సీయూ జేఏసీ స్పష్టం చేసింది. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ పోరాటం ఆగదని విద్యార్థులు తెలిపారు.

బాసటగా రాజకీయ పార్టీలు

ఇక హెచ్ సీయూ స్టూడెంట్స్‌కు రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌, సీపీఐ బాసటగా నిలిచాయి. క్యాంపస్‌లో కాంగ్రెస్‌ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎపిసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి సహా ఇరుప్రాంతాల లీడర్లు విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.

రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరం : జైపాల్ రెడ్డి

రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. తక్షణమే కేంద్రమంత్రి వర్గం నుంచి... దత్తాత్రేయ,స్మృతి ఇరానీలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రోహిత్‌ ఆత్మహత్యపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. విద్యార్థులు చేసిన తప్పేంటని ఏపీపీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రశ్నించారు.

సీపీఐ లక్ష రూపాయల ఆర్థికసాయం

రోహిత్‌ కుటుంబానికి సీపీఐ లక్ష రూపాయల ఆర్థికసాయం ప్రకటించింది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ దీక్షా శిబిరాన్ని సందర్శించి విద్యార్థులకు మద్దతు పలికారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు... రోహిత్‌ కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని నారాయణ తప్పుపట్టారు.

నా కుమాకుడి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి : రాధిక

అనంతరం రోహిత్ తల్లి రాధిక వర్సిటీలో ప్రసంగించారు. తాను ఎస్సీ కులానికి చెందిన వ్యక్తినేనని ఆమె తెలిపారు. తన కుమారుడి ఆత్మహత్యకు కారకులైన... వాళ్లను కఠినంగా శిక్షించాలని రాధిక డిమాండ్ చేశారు. ఇలా విద్యార్థుల ఆమరణ దీక్షలు, లీడర్ల పరామర్శలు, రోహిత్ బంధువుల ప్రసంగాలతో సెంట్రల్ వర్సిటీ హీటెక్కింది.

 

 

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి లేఖ రాశారు. సీఎం కేసీఆర్ పై రేవంత్ ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. 

వర్దమాన్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

మెదక్: జిన్నారం మండలం గడ్డిపోతారంలో వర్దమాన్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. రసాయనాలు లీక్ అవడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. 

21:28 - January 23, 2016

ఢిల్లీ : టీమిండియా స్టార్ క్రికెటర్లు జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతారంటూ తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఆస్ట్రేలియా సూపర్ హిట్టర్ గ్లెన్ మాక్స్ వెల్ చెప్పాడు. జట్టుకు విజయం అందించని సెంచరీలు ఎందుకంటూ ఎద్దేవా చేశాడు. వన్డే సిరీస్ లో తమజట్టు వైట్ వాష్ సాధించడం ఖాయమని హెచ్చరించాడు......

సెంచరీలు బాదినా...టీమిండియా ఓటమి 

ఆస్ట్రేలియా తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఇప్పటి వరకూ జరిగిన నాలుగు వన్డేల్లోనూ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్ లాంటి స్టార్ క్రికెటర్లు అత్యధికంగా ఐదు సెంచరీలు బాదినా...టీమిండియా ఎందుకు ఓడి పోతూ వస్తోంది?

రికార్డుల కోసమే ఆడుతున్నారా?....

భారత స్టార్ క్రికెటర్లు జట్టు ప్రయోజనాలు, విజయం కోసం కంటే..తమ వ్యక్తిగత ప్రయోజనాలు, రికార్డుల కోసమే ఆడుతున్నారా?....అవుననే అంటున్నాడు..ఆస్ట్రేలియా సూపర్ హిట్టర్ గ్లెన్ మాక్స్ వెల్‌. దానికి తగ్గట్టుగా కొన్ని గణాంకాలతో..టీమిండియా స్టార్ ప్లేయర్ల అంకితభావాన్ని ప్రశ్నిస్తున్నాడు. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, వన్ డౌన్ విరాట్ కొహ్లీ...గొప్పగా ఆడుతున్నా..తమజట్టు గెలుపు కోసం ఆడుతున్నట్లుగా తనకు ఏమాత్రం అనిపించలేదని చెప్పాడు. భారత ఆటగాళ్లు ఐదు సెంచరీలు సాధించినా...టీమిండియా ఎందుకు ఓటమి పాలయ్యిందో ఒక్కసారి గమనించాలని సూచించాడు.

ఒకరి వెనుక ఒకరు అవుట్

కాన్ బెర్రా లో ముగిసిన నాలుగో వన్డేలో 349 పరుగుల భారీలక్ష్య చేదనలో...ఓపెనర్ శిఖర్ ధావన్, వన్ డౌన్ విరాట్ కొహ్లీ కలసి 2వ వికెట్ కు 212 పరుగుల భాగస్వామ్యంతో పాటు..సెంచరీలు సాధించినా...ఒకరి వెనుక ఒకరుగా అవుట్ కావడాన్ని తప్పుపట్టాడు. కేవలం 63 బాల్స్ లోనే 84 పరుగులు, 89 బాల్స్ లోనే 100 పరుగులు చేసిన కొహ్లీ...అదే దూకుడు కొనసాగించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని...ఒకదశలో 21 బాల్స్ లో కేవలం 11 పరుగులే సాధించడం చూస్తే...కొహ్లీ జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత రికార్డు కోసమే ఆడినట్లుగా అనిపిస్తోందని...మాక్స్ వెల్ పరోక్షంగా చెప్పాడు.

రోహిత్ శర్మ171 పరుగులతో నాటౌట్

పెర్త్ లో ముగిసిన తొలివన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 163 బాల్స్ లోనే 171 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 13 బౌండ్రీలు, 6 సిక్సర్లున్నాయి. ఇదే ఇన్నింగ్స్ లో రోహిత్ తో కలసి ఆడిన విరాట్ కొహ్లీ 97 బాల్స్ లోనే 91 పరుగులు చేసి...9 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో అవుటయ్యాడు. అంతేకాదు...బ్రిస్బేన్ వన్డేలో రోహిత్ శర్మ 124 పరుగులు, అజింక్యా రహానే 80 బాల్స్ లోనే 89 పరుగులు సాధించారు. మెల్బోర్న్ లో జరిగిన మూడో వన్డేలో సైతం...విరాట్ కొహ్లీ 117 బాల్స్ లో 117 పరుగులు, రహానే, ధావన్ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. మొదటి మూడువన్డేల్లోనూ..టీమిండియా ముందుగానే బ్యాటింగ్ చేయడంతో....టాపార్డర్ అంకితభావాన్ని ప్రశ్నించడం ...మాక్స్ వెల్ కు ఎంతవరకూ అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

టాపార్డర్ నిర్లక్ష్యంతోనే నాలుగో వన్డేలో ఓటమి

అయితే...నాలుగో వన్డేలో మాత్రమే...టీమిండియా టాపార్డర్ నిర్లక్ష్యమే ఓటమికి కారణమని విశ్లేక్షకులు అంటున్నారు. సెంచరీలు సాధించిన వెంటనే శిఖర్ ధావన్, విరాట్ కొహ్లీ ఒకరి వెనుక ఒకరుగా అవుట్ కావడాన్ని మించిన నేరం మరొకటి లేదని..పలువురు భారత మాజీ గ్రేట్లు సైతం మండిపడుతున్నారు. ఒక వికెట్ కు 277 పరుగులు చేసిన ఒకజట్టు...ఆతర్వాతి తొమ్మిది వికెట్లను...కేవలం 46 పరుగులకే కోల్పోడాన్ని మించిన దారుణం మరొకటి ఉండదని అభిమానులు సైతం మండిపడుతున్నారు.

 

విద్యార్థిని చితకబాదిన ప్రయివేట్ స్కూల్ టీచర్

 ప్రకాశం : దర్శిలోని గౌతమి గ్రామర్‌ స్కూల్‌లో దారుణం జరిగింది. కరస్పాండెంట్‌ రాజా కేశవరెడ్డి తన మాట వినడంలేదని 9వ తరగతి విద్యార్థి శ్రీనివాస్‌రెడ్డిని చితకబాదారు. ఈ ఘటనలో విద్యార్థికి గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి బందువులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలు

ఆదిలాబాద్  : జిల్లాలోని దండేపల్లి మండలం వెలుగనూరు వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

21:12 - January 23, 2016

ఒబామా జేబులో హనుమంతుడి విగ్రహం, స్టార్టప్ ఇండియా..వర్క్ షాప్, కేరళలో మమ్మూటిపై కేసు, బీహార్ లో సమోసాలపై ట్యాక్స్, హరిద్వార్ లో కొత్త స్వామి దర్శనం..గోల్డెన్ బాబా..ఒంటిపై 15 కిలోల బంగారం...వాటి విలువ మూడు కోట్లు, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..… జాగిలాల కవాతు.. మరిన్ని క్రేజీ న్యూస్ ను వీడియోలో చూద్దాం…

 

21:01 - January 23, 2016

టీఆర్ ఎస్ లోకి రమన్నారు...కానీ వెళ్లలేదని నల్గొండ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ బూడిద భిక్షమయ్య గౌడ్ తెలిపారు. రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ ఎప్పుడైనా కింగే.. అన్నారు. టీఆర్ ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. టీఆర్ ఎస్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే…

నా చిన్నప్పుడు పాలు అమ్మాను. ఇంటర్ చదివేటప్పుడే వ్యవసాయం చేశాను. జనగాంలో డిగ్రీ చదివాను. డిగ్రీ చదువుతున్నప్పుడే పెళ్లి అయింది. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాను. ఆటోను నడిపాను. అనేక వ్యాపారాలు, ఉద్యోగాలు చేశాను. కష్టపడి పైకి వచ్చాను. మా ఆవిడ సహకారం నాకు పూర్తిగా ఉన్నది. గంజి నీళ్లు తాగాము… బెంజీకారు ఎక్కాము. కష్టాలు పడ్డాము… సుఖాలు అనుభవిస్తున్నాము.

రాజకీయ ప్రవేశం..

రాజకీయ నాయకున్ని కావాలని కోరుకున్నాను. విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి సంఘంలో పని చేశాను. 2009లో ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని భయపెట్టించి… పని చేపిచ్చుకున్నాను.. బతిమిలాడ లేదు. ఆలేరు కాపలాదారుడిగా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో 7 వందల కోట్ల రూపాయలను ఆలేరు నియోజవర్గ అభివృద్ధికి తెచ్చాను. నాకు అందరూ సమానమే. టీఆర్ ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు. సీఎం కేసీఆర్ వి జూట మాటలు. కాంగ్రెస్ ఎప్పుడైనా కింగే. గోదావరి నీళ్లు తెచ్చింది మేమే' అని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

 

20:30 - January 23, 2016

కృష్ణా : విజయవాడలో డిక్టేటర్‌ మూవీ టీం సందడిచేసింది. అన్నపూర్ణ థియేటర్‌లో సినిమా విజయోత్సవ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ హాజరయ్యారు. బాలయ్యను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. రామవరప్పాడు రింగ్‌ నుంచి భారీ ర్యాలీ చేశారు.

 

20:23 - January 23, 2016

నెల్లూరు : జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రాజమండ్రి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని రాజమండ్రికి తరలించారు. 2009లో రాజమండ్రిలో జరిగిన ఓ మీడియా సమావేశంలో పోలీసులను దుర్భాషలాడిన ఘటనలో చెవిరెడ్డిపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసు విషయమై చెవిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న రాజమండ్రి పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.

20:17 - January 23, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఆర్ డీఏ మాస్టర్ ప్లాన్ ను ఎపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సమీక్షించారు. మాస్టర్ ప్లాన్ లో అర్బనైజేషన్ మీద స్పష్టత లేదని ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో ఏం చేయాలనుకుంటుందో చెప్పాలన్నారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ భాస్కరరావు. 65 శాతం భూములను గ్రీన్ జోన్ కింద పరిగణించడం కూడా సరికాదన్నారు. హౌసింగ్ లే అవుట్స్ హౌసింగ్ పాలసీపై కూడా స్పష్టత రాలేదన్నారు.

 

 

20:07 - January 23, 2016

హైదరాబాద్ : ఆగస్టు 12నుంచి జరగబోయే కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని... ఏపీ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.. ఉగాది నుంచి దేవాలయాల్లో 7 కొత్త కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు.. ఆలయాల్లో టికెట్‌ విక్రయాల కేంద్రాల దగ్గర బార్‌కోడ్‌ వ్యవస్థ, అన్నప్రసాదం దగ్గర బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు.. భగవంతుని సేవలు అందరికీ అందుబాటులో ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

 

19:53 - January 23, 2016

కృష్ణా : విజయవాడ సమీపంలోని కొండపల్లిలో పోలీసులు భారీ స్థాయిలో గంజాయిని పట్టుకున్నారు. కొండపల్లి ఇండస్ట్రీయల్‌ ప్రాంతంలో అనుమానాస్పదంగా నిలిపివుంచిన లారీ నుంచి కోటిన్నర విలువైన 4 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పరారీలో ఉన్నారని లారీని సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

వడ్డీ వ్యాపారి వేధింపులు... మహిళ ఆత్మహత్యాయత్నం

కృష్ణా : జిల్లాలోని నందిగామలో మరో కాల్‌మనీ ఘాతుకం వెలుగుచూసింది. వడ్డీవ్యాపారి దుర్గాప్రసాద్ తనను వేధిస్తున్నాడంటూ శిరీష అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. లక్షా 30వేలకు గాను ఇప్పటివరకు 11లక్షలు వసూలు చేశారని బాధితురాలు ఆరోపించింది. దుర్గాప్రసాద్ ఇంకా వేధిస్తున్నాడని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని తన సూసైడ్ నోట్‌ లో శిరీష ఆరోపించింది.

 

19:46 - January 23, 2016

కృష్ణా : జిల్లాలోని నందిగామలో మరో కాల్‌మనీ ఘాతుకం వెలుగుచూసింది. వడ్డీవ్యాపారి దుర్గాప్రసాద్ తనను వేధిస్తున్నాడంటూ శిరీష అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. లక్షా 30వేలకు గాను ఇప్పటివరకు 11లక్షలు వసూలు చేశారని బాధితురాలు ఆరోపించింది. దుర్గాప్రసాద్ ఇంకా వేధిస్తున్నాడని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదని తన సూసైడ్ నోట్‌ లో శిరీష ఆరోపించింది.

19:36 - January 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థుల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విడతల వారిగా ఏడుగురు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జయరాజు, రమేష్ లను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దీక్షలను భగ్నం చేయడాన్ని వర్సిటీ విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. రోహిత్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను పదవి నుంచి తొలగించాలని పట్టుబట్టారు. వర్సిటీ వీసీ అప్పారావును తొలగించాలని, సుశీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలన్నారు. దళితులకు రక్షణ కల్పించాలని కోరారు.

మొదటగా హెచ్ సీయూలో విద్యార్థులు చేపట్టిన దీక్షను పోలీసలు భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని వైద్యులు తెలపడంతో దీక్షను భగ్నం చేయడానికి పూనుకున్నారు. దీక్ష చేస్తున్న ఏడుగురిలో మైతిలి అనే మహిళ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణిచడంతో ఆమెను హెచ్ సీయూలోని హెల్త్ సెంటర్ కు తరలించారు. దీక్ష చేస్తున్న మిగిలిన విద్యార్థులను హెల్త్ సెంటర్లకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు పోలీసులను అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీక్ష విరమించేదిలేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. రోహిత్ మృతికి కారకులైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను పదవులను నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. వర్సిటీ వీసీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సుశీల్ కుమార్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిరాహార దీక్ష కొనసాగించిన విద్యార్థులు

మైథిలి అనే విద్యార్థిని ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురు విద్యార్థులు నిరాహార దీక్ష కొనసాగించారు. విద్యార్థులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత 4 రోజులుగా క్యాంపస్‌లో ఏడుగురు విద్యార్థులు ఆమరణ దీక్ష చేపట్టారు.

మళ్లీ దీక్ష భగ్నానికి పోలీసులు యత్నం

హెచ్ సీయూలో విద్యార్థుల దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు మళ్లీ ప్రయత్నం చేశారు. దీక్ష చేస్తున్న మరో ముగ్గురు విద్యార్థులను ఆస్పత్రిక్రి తరలించారు. మరో ముగ్గురు విద్యార్థులు దీక్ష కొనసాగిస్తున్నారు. పోలీసులు తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతకముందు విద్యార్థుల్లో మైథిలి అనే విద్యార్థిని ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురు విద్యార్థులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు. ఈనేపథ్యంలో పోలీసులు మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన మరో ముగ్గురు విద్యార్థులు దీక్షను కొనసాగించారు. ఈనేపథ్యంలో పోలీసులు విద్యార్థుల దీక్షను భగ్నం చేసి... విడదల వారిగా ఏడుగురిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వైఖరిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రోహిత్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను పదవి నుంచి తొలగించాలని పట్టుబట్టారు. వర్సిటీ వీసీ అప్పారావును తొలగించాలని, సుశీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలన్నారు. దళితులకు రక్షణ కల్పించాలని కోరారు. 

 

హెచ్ సీయూ విద్యార్థుల దీక్షను భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థుల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విడతల వారిగా ఏడుగురు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రమేష్ అనే విద్యార్థిని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. 

18:46 - January 23, 2016

ఆదిలాబాద్ : జిల్లాలో గిరిజనుల గుక్కెడు నీటి కోసం కొండలు కోనలు దాటి రావల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వాటర్‌ గ్రిడ్ కష్టాలను గట్టెక్కిస్తుందని ఆశతో ఎదురుచుస్తున్నా.... అధికారుల అలసత్వం విరి ఆశలపైనీళ్లు చల్లుతుంది.

మిషన్‌భగీరథ పనుల్లో జాప్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పనుల్లో జాప్యం నెలకొంది. నీటిని తీసుకునే ఇన్‌టేక్‌ వెల్స్‌ పనులు అస్తవ్యస్తంగా మారాయి. మొదలై ఏడాది కావస్తున్నా.. ఇంకా మందకొడిగానే తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కనీసం 20శాతం మేరకు కూడా పూర్తి కాలేదు. ఇక రెండో విడతగా చేపట్టిన పైపులైన్‌ పనులకు ఇంకా సర్వేదశనుంచి బయటపడలేదు. అధికారుల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి కారణమంటున్నారు స్థానికులు.

మిషన్‌ భగీరథ పనులకు రూ.4300కోట్లు

మిషన్‌ భగీరథ పథకానికి గానూ జిల్లాలో చేపట్టే పనులకు ప్రభుత్వం రూ.4300కోట్లను కేటాయించింది. వీటిని దశలవారీగా విభజించారు. తొలుత నీటిని తీసుకునే బావులకు రూ.300కోట్లు కేటాయించారు.అత్యవసరమైన ఈ బావుల పనులు గతేడాదిలోనే మొదలయ్యాయి. అయితే ఈ పనులు వేసవి సమీపిస్తున్నా 20శాతానికి మించి పనులుపూర్తికాలేదు. నిర్ణీత గడువులోగా పూర్తిచేయడం కష్టమే.

ఇంకా 80శాతం పనులు పెండింగ్

ఎస్సారెస్పీ పరిధిలోని నిర్మల్‌, లక్ష్మణచాందా మండలాలకు ఈఏడాది నుంచి తాగునీటిని అందించాల్సి ఉంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్ ద్వారా ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌ నియోజకవర్గాలకు నీటిని అందించడానికి రూ.1900కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ నీటిని తీసుకునే బావి పనులకు రూ.248 కోట్లు కేటాయించారు. కానీ.. ఇప్పటి వరకు కేవలం రూ.38కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 80శాతం పనులు చేయాల్సి ఉంది.

కడెం ప్రాజెక్టు పనులు 5 శాతం పూర్తి

ఇక కొమరంభీం ప్రాజెక్టు నుంచి ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌,బెల్లంపల్లి నియోజక వర్గాలతో పాటు ఖానాపూర్‌ నియోజక వర్గంలోని ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాలకు తాగునీటిని అందించడానికి పథకాన్ని రూపొందించారు.బావి నిర్మాణానికి రూ.115కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 30శాతమే పనులను పూర్తిచేశారు. ఇక్కడ కూడా బావికి గోడ కట్టే పనులు కొనసాగుతున్నాయి. అలాగే కడెం ప్రాజెక్టు కూడా 5 శాతం పనులే పూర్తయ్యాయి.

గిరిజనులకు రక్షిత మంచినీరు అత్యవసరం

ఇక జాతీయ, రాష్ట్రీయ రహదారులు, రైల్వేమార్గం, అటవీ భూములకు సంబంధించి అనుమతులు ఇంకా రాలేదు. కేవలం జాతీయ రహదారులకు మాత్రమే డిమాండ్‌ నోటీసు పంపారు. మిగిలిన అనుమతులకు ఇంకా ప్రతిపాదనలు పంపలేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా త్వరగా పనులుపూర్తి చేయాలని మిగితా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి గిరిజనులకు రక్షిత మంచినీరు అత్యవసరమని గిరిజనులు వేడుకుంటున్నారు.

 

 

18:40 - January 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థుల నిరాహారదీక్షను భగ్నం చేయడం దారుణమని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైనవారిని శిక్షించాలంటూ రోహిత్ సాలిడారిటీ, స్ట్రగుల్ కమిటీ రిలే దీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత జరుగుతున్నా తెలంగాణ మంత్రులెవ్వరూ వర్శిటీకి రాలేదని... రోహిత్ కుటుంబాన్ని పరామర్శించలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ అసలు ఈ విషయమే పట్టించుకోలేదని మండిపడ్డారు.. సీఎంకు గ్రేటర్‌ ఎన్నికలే ముఖ్యమని ఆయన ఆరోపించారు. ఉద్యమాన్ని ఉదృతం చేయాల్సిన అవసరముందన్నారు.

 

మళ్లీ హెచ్ సీయూ విద్యార్థుల దీక్ష భగ్నానికి పోలీసులు యత్నం

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థుల దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. దీక్ష చేస్తున్న మరో ముగ్గురు విద్యార్థులను ఆస్పత్రిక్రి తరలించారు. మరో ముగ్గురు విద్యార్థులు దీక్ష కొనసాగిస్తున్నారు. పోలీసులు తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

18:34 - January 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థుల దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. దీక్ష చేస్తున్న మరో ముగ్గురు విద్యార్థులను ఆస్పత్రిక్రి తరలించారు. మరో ముగ్గురు విద్యార్థులు దీక్ష కొనసాగిస్తున్నారు. పోలీసులు తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతకముందు విద్యార్థుల్లో మైథిలి అనే విద్యార్థిని ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురు విద్యార్థులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయని వైద్యులు తెలిపారు. ఈనేపథ్యంలో పోలీసులు మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు.  
మిగిలిన మరో ముగ్గురు విద్యార్థులు దీక్షను కొనసాగిస్తున్నారు. గత 4 రోజులుగా క్యాంపస్‌లో ఏడుగురు విద్యార్థులు ఆమరణ దీక్ష చేపట్టారు. 

 

18:28 - January 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై సహచరులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీక్షలో పాల్గొన్న విద్యార్థుల్లో మైథిలి అనే విద్యార్థిని ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆరుగురు విద్యార్థులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత 4 రోజులుగా క్యాంపస్‌లో ఏడుగురు విద్యార్థులు ఆమరణ దీక్ష చేపట్టారు. 

 

18:25 - January 23, 2016

సిడ్ని : ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో...మాజీ చాంపియన్ టీమిండియా ఆఖరి వన్డే విజయంతో ఊపిరిపీల్చుకొంది. ఆఖరి వన్డేలో టీమిండియా సంచలన విజయం సాధించింది. యువ ఆటగాడు మనీష్ పాండే స్ట్రోక్ ఫుల్ సెంచరీతో జట్టుకు మరపురాని విజయం అందించాడు. 331 పరుగుల భారీలక్ష్యాన్ని టీమిండియా 49.3 ఓవర్లలోనే సాధించి..విమర్శకుల నోటికి తాళం వేసింది. ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. మొదటి నాలుగువన్డేల ఓటమితో ఇప్పటికే సిరీస్ చేజార్చుకొన్న ధోనీసేన చివరకు...వైట్ వాష్ నుంచి తప్పించుకోగలిగింది. రోహిత్ శర్మ 99 పరుగుల స్కోరుతో భారత విజయానికి గట్టిపునాది వేశాడు. మనీష్ పాండే సెంచరీతో మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ విజయంతో టీమిండియా రెండోర్యాంక్ ను విజయవంతంగా నిలుపుకోగలిగింది. 4-1 తేడాతో ఆస్ట్రేలియా సీరీస్ ను కైవసం చేసుకుంది. రోహిత్, ధావన్, మనీష్ పాండే సిడ్నీలో చెలరేగారు. మనీష్ పాండే 104 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 81 బాల్స్ లో 8 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో పాండే సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ 99 పరుగులకు అవుట్ అయ్యాడు. ధావన్ 78 పరుగులకు ఔట్ అయ్యాడు. 
 

18:01 - January 23, 2016

కరీంనగర్ : పతనమవుతున్న జీవన ప్రమాణాలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ లో వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలు రెండో రోజు కొనసాగుతున్నాయి. జాతీయ సంఘం ఉపాధ్యక్షుడు రామయ్య సమావేశాలను ప్రారంభించారు. ఈ మహాసభలకు నాగేశ్వర్ హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగ సంక్షోభం భూమిలేని నిరుపేదల మీద పడుతోందని.. ఆ రంగం మీద ఆధారపడ్డ కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

 

 

17:34 - January 23, 2016

హైదరాబాద్ : 18 నెలల పాలనలో టీఆర్‌ఎస్‌ చేసిందేమీలేదని కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఎద్దేవా చేశార. టీసర్కార్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. మురికివాడలు లేని నగరాన్ని నిర్మిస్తామన్నారని.. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోందని మండిపడ్డారు. ఆరు నెలల్లో ఉచిత వైఫై అంటూ హామీలు గుప్పించారని... అధికారంలోకి వచ్చాక ఆ విషయమే మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలోనే నీళ్లొచ్చాయని.. తామే తెచ్చినట్లు సర్కారు చెప్పుకుంటోందని పేర్కొన్నారు. సిటీలో ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోందని... ఒక్క రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు.

 

నా కుమారుడి మృతికి కారకులను శిక్షించాలి : రోహిత్ తల్లి రాధిక

హైదరాబాద్ : తన కుమారుడు రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వాళ్లను కఠినంగా శిక్షించాలని రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేశారు. తాను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తినని ఆమె స్పష్టం చేశారు. 1985లో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో... తనకు కులాంతర వివాహం జరిగిందన్నారు. చిన్న కుమారుడు పుట్టగానే విడాకులు తీసుకున్నట్లు రాధిక తెలిపారు. తన ముగ్గురు పిల్లలు మాల కమ్యూనిటీలోనే పెరిగారని ఆమె చెప్పారు. తన కులం గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారని రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. 

17:24 - January 23, 2016

హైదరాబాద్ : తన కుమారుడు రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వాళ్లను కఠినంగా శిక్షించాలని రోహిత్ తల్లి రాధిక డిమాండ్ చేశారు. తాను ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తినని ఆమె స్పష్టం చేశారు. 1985లో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో... తనకు కులాంతర వివాహం జరిగిందన్నారు. చిన్న కుమారుడు పుట్టగానే విడాకులు తీసుకున్నట్లు రాధిక తెలిపారు. తన ముగ్గురు పిల్లలు మాల కమ్యూనిటీలోనే పెరిగారని ఆమె చెప్పారు. తన కులం గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారని రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. 

16:58 - January 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్‌ మృతికి కారణమైనవారిని శిక్షించాలంటూ హైదరాబాద్‌ ఇందిరాపార్క్ దగ్గర రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. రోహిత్ సంఘీభావ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ దీక్షలు చేపట్టారు.. ఈ కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, విశ్వేశ్వరరావు, ఇతర ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.. తమ్మినేనితో పాటు పలువురు నేతలు దీక్షలో కూర్చున్నారు.. కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.. 

ఐదో వన్డేలో భారత్ విజయం..

సిడ్నీ వన్డే : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. మొదటగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత వోవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 49.4 వోవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసి ఆస్ట్రేయాపై విజయం సాధించింది. పాండే 81 బంతుల్లో 104 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 99 పరుగులు చేశాడు. 4-1 తేడాతో ఆస్ట్రేలియా సీరీస్ ను కైవసం చేసుకుంది. 

ధోనీ ఔట్

సిడ్నీ వన్డే : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ నాలుగో వికెట్ కోల్పయింది. 325 పరుగుల వద్ద ధోనీ (34) ఔట్ అయ్యాడు.

 

16:29 - January 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులు చేపట్టిన దీక్షను పోలీసలు భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని వైద్యులు తెలపడంతో దీక్షను భగ్నం చేయడానికి పూనుకున్నారు. దీక్ష చేస్తున్న ఏడుగురిలో మైతిలి అనే మహిళ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణిచడంతో ఆమెను హెచ్ సీయూలోని హెల్త్ సెంటర్ కు తరలించారు. దీక్ష చేస్తున్న మిగిలిన విద్యార్థులను హెల్త్ సెంటర్లకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.  విద్యార్థులు పోలీసులను అడ్డుకుంటున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీక్ష విరమించేదిలేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. రోహిత్ మృతికి కారకులైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను పదవులను నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. వర్సిటీ వీసీపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సుశీల్ కుమార్ పై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

నాంపల్లి కోర్టుకు నలుగురు ఐసిస్ సానుభూతిపరులు

హైదరాబాద్ : నలుగురు ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. ఐసిస్ సానుభూతిపరులు షరీఫ్, ఒబేదుల్లా, నజుముల్లా, అబూలను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. పిటీ వారెంట్ పై వారిని ఢిల్లీకి తరలించనున్నారు. 

గిరిజన విద్యార్థినుల మృతి విషయం తమ దృష్టికి వచ్చింది : కవిత

వరంగల్ : జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల మృతి విషయం తమ దృష్టికి వచ్చిందని ఎంపీ కవిత అన్నారు. మేడారం సంస్కృతిని దేశ వ్యాప్తం చేస్తామని చెప్పారు. నల్లబెల్లి ఎస్ ఐపై ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.

 

15:47 - January 23, 2016

హైదరాబాద్ : నగరంలో అరెస్టయిన ఉగ్రవాదులు మహ్మద్‌ నఫీజ్‌ ఖాన్‌, మహ్మద్‌ షరీఫ్‌ మొయినుద్దీన్‌ఖాన్‌  సహా మరో ఇద్దరిని పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం వారిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఢిల్లీకి తరలించారు. పారిస్‌ తరహాలో ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్ర చేసిన సమాచారం నిఘావర్గాలు బహిర్గతం చేయడంతో.. ఎన్ ఐఎ రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు ఎన్ ఐఎ 4 రాష్ట్రాల్లో సోదాలు చేసి 14మందిని అరెస్ట్ చేసింది. పోలీసుల వద్ద ఉన్న జాబితా ప్రకారం ఇంకా అరుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

స్మృతి, దత్తాత్రేయలకు పదవిలో కొనసాగే వీల్లేదు : నారాయణ

హైదరాబాద్ : కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, బండారు దత్తాత్రేయలపై సీపీఐ నేత నారాయణ అన్నారు. వారు మంత్రి పదువుల్లో కొనసాగే విల్లేదని పేర్కొన్నారు.

రోహిత్ ఔట్...

సిడ్నీ వన్డే : భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 231 పరుగుల వద్ద రోహిత్ శర్మ (99) ఔట్ అయ్యాడు. ఒక పరుగు తేడాతో రోహిత్ సంచరీ మిస్ అయ్యాడు. 

15:25 - January 23, 2016

పశ్చిమగోదావరి : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్‌ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలో బంద్‌ పాటిస్తున్నారు. అన్ని చోట్ల ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏలూరు ఆర్టీసీ డిపో దగ్గర ఆందోళకారులు బస్సులను అడ్డుకున్నారు. దీంతో జేఏసీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

15:09 - January 23, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్ధి వేముల రోహిత్‌ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్, సీపీఐలు డిమాండ్ చేశాయి. రోహిత్‌ ఆత్మహత్యకు కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ కారకులని ఆ పార్టీలు ఆరోపించాయి. కేంద్ర మంత్రివర్గం నుంచి వీరిద్దరిని తొలగించాలని ఈ రెండు పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌లో కాంగ్రెస్‌, సీపీఐ నేతలు హెచ్ సీయూ దగ్గర ర్యాలీ నిర్వహించారు. రోహిత్‌ స్టూపం దగ్గర నివాళుర్పించారు. యూనివర్సిటీలోదీక్ష చేస్తున్న విద్యార్ధులను పరామర్శించారు. రోహిత్‌ కుటుంబానికి సీపీఐ లక్ష రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించింది. కాంగ్రెస్‌ కూడా ఆదుకుటుంమాని హామీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రోహిత్‌ కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుపట్టారు. రోహిత్‌ ఆత్మహత్యపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమర్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 

14:58 - January 23, 2016

ఢిల్లీ : రిపబ్లిక్‌ డే వేడుకలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందన్న నిఘా సంస్థల హెచ్చరికలతో ఎన్‌ఐఏ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆరు నగరాల్లో 12 చోట్ల తనిఖీలు చేపట్టారు. 13 మంది అనుమానితులను అరెస్ట్‌ చేశారు. ముంబైలో పట్టుబడిన అనుమానిత వ్యక్తి.. భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదిగా ఎన్‌ఐఏ అధికారులు భావిస్తున్నారు. 

14:54 - January 23, 2016

ఢిల్లీ : తెలుగు తేజం పీవీ సింధు..మలేసియన్ ఓపెన్ గ్రాండ్ ప్రీ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు చేరుకొంది. పెనాంగ్ లో జరిగిన సెమీఫైనల్లో కొరియా ప్లేయర్ సుంగ్ జీ హూన్ ను మూడుగేమ్ ల పోరులో సింధు అధిగమించి..2016 సీజన్లో తొలి టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది. ఫైనల్లో చోటు కోసం జరిగిన హోరాహోరీ సమరంలో..3వ సీడ్ సింధు 19-21, 21-12, 21-10తో సుంగ్ ను చిత్తు చేసింది. 2013లో మలేసియన్ ఓపెన్ టైటిల్ తొలిసారిగా గెలుచుకొన్న సింధు..రెండేళ్ల విరామం తర్వాత తిరిగి అదే టైటిల్ కు గురిపెట్టింది.

సోపూర్ లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్టు

జమ్మూకాశ్మీర్ : సోపూర్ లో ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. రాత్రి ముంబైలో ఒక ఉగ్రవాదిని ఎన్ ఐఎ అధికారుఉల అరెస్టు చేశారు.
 

కోహ్లీ అవుట్

హైదరాబాద్ : భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఐదో వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 134 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (8) అవుట్ అయ్యాడు.

 

కర్మన్‌ఘాట్ వద్ద తనిఖీల్లో రూ.6.33 లక్షలు స్వాధీనం.

హైదరాబాద్ : నగరంలో శనివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహన రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సరూర్‌నగర్ పోలీసులు శనివారం మధ్యాహ్నం కర్మన్‌ఘాట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కారులో వస్తున్న వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.6.33 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి పత్రాలు అతని వద్ద లేకపోవటంతో నగుదను సీజ్ చేసి, దర్యాప్తు చేపట్టారు.

సిమెంట్ బ్యాగ్‌ల తరహాలో ఇసుక బస్తాల విక్రయం

హైదరాబాద్ : ఇసుక అక్రమ దందాకు చెక్‌ పెడుతూ.. వినియోగదారులకు చౌక ధరలకే ఇసుకను అందించేందుకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాన్నితీసుకోబోతోంది. ఇసుకను సిమెంట్ బ్యాగ్‌ల తరహాలో సంచుల్లో నింపి అమ్మాలని సర్కారు నిర్ణయించింది. క్యూబిక్ మీటర్ ఇసుకకు 600, టన్ను ఇసుకకు 400 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది.. రీచ్‌ల నుంచి సేకరించిన ఇసుకను.. స్టాక్‌యార్డు వద్దకు చేర్చి.. అక్కడి నుండి వినియోగదారుడికి పంపేందుకు పటిష్ఠ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది... ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియ కొనసాగేలా చర్యలు చేపట్టింది..

13:33 - January 23, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వం పలు పథకాలు ప్రకటించిందని టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల కోడ్ ఉన్నపుడు పాలమూరు ఎత్తిపోతలకు టెండర్లు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. దీన్ని పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు. నమస్తే తెలంగాణ దిన పత్రికపై ప్రెస్

13:27 - January 23, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌కు శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, శేరిలింగంపల్లి టీడీపీ నేత బండి రమేష్‌ తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌ ప్రేమ్‌సింగ్‌తో పాటు ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ వస్తే ఎన్నో ఇబ్బందులు వస్తాయని ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పారని.. కేసీఆర్‌ అధికారంలో వచ్చాక అవన్నీ పటాపంచలు అయ్యాయని కేటీఆర్‌ తెలిపారు. 

13:26 - January 23, 2016

కృష్ణా : కంచికచర్లలో విషాదం నెలకొంది. గౌతమి స్కూల్‌లో 10వ తరగతి విద్యార్ధి వినయ్‌కుమార్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి హాస్టల్‌లో నిద్రించిన విద్యార్ధి.. తెల్లవారుజామున ఉరేసుకున్నాడు. అలికిడికి లేచిన తోటి విద్యార్ధులు విషయాన్ని ప్రిన్సిపాల్‌కు తెలియజేశారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే వినయ్‌ మృతిచెందాడు. హాస్టల్‌కు చేరుకున్న తల్లిదండ్రులు వినయ్‌ మృతితో కన్నీరుమున్నీరవుతున్నారు. 

13:25 - January 23, 2016

ఢిల్లీ : నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌కు సంబంధించిన మరికొన్ని రహస్య ఫైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ బహిర్గతం చేశారు. మొత్తం వంద ఫైళ్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఢిల్లీలోని నేషనల్‌ ఆర్కైవ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి నేతాజీ కుటుంబ సభ్యులతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

భారత్ విజయ లక్ష్యం 331

హైదరాబాద్ : భారత్‌తో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా మరోసారి టీమిండియాకు 330/7తో భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచిన భారత్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటి వరకు సిరీస్‌లో జరిగిన నాలుగు వన్డేల్లోనూ నిరాశపరిచిన భారత్‌ బౌలర్లు తొలిసారిగా సిడ్నీలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను కట్టడి చేసేలా కనిపించారు.

నేతాజీ రహస్య ప్రతాలను విడుదల చేసిన ప్రధాని...

ఢిల్లీ :నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్య పత్రాలను ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేశారు. నేతాజి జయంతి సందర్భంగా రహస్య దస్త్రాల డిజిటల్‌ ప్రతులను ప్రధాని విడుదల చేశారు. కార్యక్రమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

నేను టీఆర్ ఎస్ లో చేరడం లేదు : అరికెపూడిగాంధీ

హైదరాబాద్ : టిఆర్ ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని… తాను టిఆర్ ఎస్ పార్టీలో చేయడం లేదని, పార్టీ తరపున జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఉన్నాని అరికె పూడి గాంధీ స్పష్టం చేశారు.

టిఆర్ ఎస్ లో చేరిన ప్రేమ్ సింగ్ రాథోడ్

హైదరాబాద్ : మంత్రి కేటీర్ సమక్షంలో బిజెపి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ టిఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

టిఆర్ ఎస్ లో చేరిన టిడిపి నేత బండి రమేష్

హైదరాబాద్ : శేరిలింగంపల్లి టీడీపీ నేత బండి రమేష్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టిఆర్ ఎస్ భవన్ పలువురు మంత్రుల సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. మాజీ కార్పొరేటర్‌లు శంకర్‌యాదవ్, అశోక్ గౌడ్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.

రోడ్డు ప్రమాదంలో నాట్కో అధికారి మృతి

రంగారెడ్డి :శంషాబాద్ మండలం బూర్జుగడ్డ తండా సమీపంలోని పీ-వన్ రోడ్డుపై శుక్రవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. నాట్కో కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న పి.కృష్ణారావు(48) శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని కారులో వస్తుండగా రోడ్డుపైకి అడవి పందులు అడ్డుగా వచ్చాయి. వాటిని తప్పించబోయే క్రమంలో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణారావు అక్కడికక్కడే చనిపోయారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

12:42 - January 23, 2016

హైదరాబాద్ : కిడ్నీ రాకెట్‌ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. కొలంబోలో కిడ్నీ రాకెట్‌తో సంబంధం ఉన్న నాలుగు ప్రధాన ఆస్పత్రులతో పాటు.. ఆరుగురు డాక్టర్లపై దర్యాప్తునకు అక్కడి దర్యాప్తు సంస్థలు ఆదేశించాయి. నల్లగొండ జిల్లాలో రాకెట్‌ బయటపడడంతో.. పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశారు.

గుట్టురట్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు....

సంచలనం కలిగించిన కిడ్నీ రాకెట్‌ను నల్లగొండ జిల్లా పోలీసులు గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే...అహ్మాదాబాద్‌ చెందిన ముఠా సూత్రధారులు సురేష్ ప్రజాపతిని విచారించిన పోలీసులకు ఎంతో సమాచారం అందింది.. కిడ్నీ ముఠాను దర్యాప్తు చేస్తు్న నల్లగొండ జిల్లా పోలీసులు అక్రమ ఆపరేషన్ లు నిర్వహిస్తున్న శ్రీలంక రాజధాని కొలంబోలో నాలుగు ఆసుపత్రులతో పాటు ఆరుగురు డాక్టర్లకు సంబంధం ఉందని సమాచారాన్ని సేకరించింది...ఈ విషయాన్ని కొలొంబోలోని దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించారు.. రాష్ట్ర డీజీపీ అనురాగశర్మ ఇప్పటికే శ్రీలంకకు లేఖ రాయడంతో అక్కడ కూడా డొంక కదులుతోంది... తెలంగాణా పోలీసులు ఇచ్చిన సమాచారంతో కొలొంబోలోని దర్యాప్తు సంస్థలు మేల్కొన్నాయి...

జాతీయ దర్యాప్తు సంస్థలు అప్రమత్తం...

జిల్లా పోలీసు విభాగం నుంచే కాకుండా, తెలంగాణ పోలీసు విభాగం, జాతీయ దర్యాప్తు సంస్థల నుంచి శ్రీలకం ప్రభుత్వానికి సమాచారాన్ని చేరవేశారు... ఈ నేపథ్యంలో శ్రీలంక ఆరోగ్యశాఖా మంత్రి రజిత సెనారత్నే ఆ దేశంలో తక్షణమే విదేశీయులకు సంబంధించిన కిడ్నీ మార్పిడి చికిత్సలపై నిషేదం విదిస్తున్నట్లు ప్రకటించారు... కొంతమంది అక్రమ పద్ధతుల్లో కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్నారని భారత పోలీసు వర్గాల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ప్రకటించినట్లుగా ఆ దేశ వార్తాసంస్థలు ప్రకటించాయి. కొలంబోలోని నవలోక్ ఆసుపత్రి, వెస్టర్న్ ఆసుపత్రి, హేమ ఆసుపత్రి, లంకన్ ఆసుపత్రులతో పాటు రాకెట్ కు సంబంధమున్న డాక్టర్లు మాదవ, మౌనిక, సాధన, షమీల, నిరోష, హబీబ్ షరీప్ లపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం...

కిడ్నీ రాకెట్‌లో దూసుకుపోతున్న కాప్స్...

దేశవ్యాప్తంగా 12కు పైగా రాష్ట్రాలతో సంబంధం ఉన్న కిడ్నీ రాకెట్‌ కుంభకోణం వెలుగులోకి తీసుకువచ్చిన నల్లగొండ జిల్లా పోలీసులు కేవలం 20 రోజుల్లోనే ఎంతో కీలక సమాచారాన్ని రాబట్టారు..వ్యూహాత్మకంగా అడుగులువేస్తూ జిల్లా పోలీసు తనదైన శైలిలో కిడ్నీ రాకెట్‌ గుట్టును బయటపెట్టేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు..దీనిలో భాగంగానే కీలక సూత్రధారి సురేష్ ప్రజాపతిని పట్టుకుని పైచేయి సాధించారు...

2008 నుంచి రాకెట్ కార్యకలాపాలు..

కిడ్నీ రాకెట్‌ను పట్టుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది...ఈ రాకెట్ కీలక సూత్రధారి సురేశ్ ప్రజాపతిని అహ్మదాబాద్‌లోని అతడి ఇంటికే నేరుగా వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి కిడ్నీ రాకెట్‌లో నల్లగొండకు చెందిన కస్పరాజు సురేశ్ తదితరులు అరెస్టయిన విషయం అప్పుడే ప్రజాపతికి తెలిసిపోయింది. దీంతో అతను అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు.

ఆన్‌లైన్ నంబర్ వాడడం మానేశాడు..

అహ్మదాబాద్‌లోని సురేష్ ప్రజాపతిని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ప్లాన్‌ నుంచి తప్పించుకోలేకపోయాడు... ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి ఓ నంబర్ తో అతని ఫ్రెండ్స్ లిస్టును ట్రాప్ చేశారు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్స్ లిస్టులో నుంచి ప్రజాపతి స్నేహితులను ఎంచుకుని వారిని సంప్రదించి అతడి గురించి ఆరా తీశారు. పూర్తి సమాచారం రాబట్టాక అహ్మదాబాద్‌కు వెళ్లి అక్కడ వల వేశారు. ప్రజాపతి ఉన్న ఇల్లును కనుగొన్నారు. అతడు ఇంట్లోనే ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత అతను ఉపయోగించే ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఓ కొరియర్ వచ్చిందంటూ వెళ్లి డోర్ తట్టిన పోలీసులు ఇంట్లోకి నీళ్లు కావాలంటూ వెళ్లిన ప్రజాపతిని పట్టుకున్నారు...ఇక, కిడ్నీ రాకెట్‌లో మరో కీలక ఏజెంట్ దిలీప్‌ను కూడా ఆన్‌లైనే పట్టించింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని ఎరగా వేసి దిలీప్‌ను పట్టుకున్నారు.

మరో సవాల్‌ను ఎదుర్కోనున్న పోలీసులు..

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తి కిడ్నీరాకెట్‌లో కీలకమని తెలుస్తోంది..సురేష్ ప్రజాపతి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం...ఇక ఈ రాకెట్‌లో మరో ముఖ్య వ్యక్తిది మహారాష్ట్రలోని ముంబై. ఇతడు సురేశ్ ప్రజాపతికి రైట్‌హ్యాండ్. దక్షిణ భారత దేశం నుంచి ఎవరు వచ్చినా.. శ్రీలంక తీసుకెళ్లి కిడ్నీలు మార్పించేది ఇతడేనని సమాచారం. వీరిద్దరినీ అరెస్టు చేస్తే మరో 100 మంది వరకు కిడ్నీ విక్రేతలు, గ్రహీతలు బయటకు వస్తారని సమాచారం..

12:38 - January 23, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను టీఆర్‌ఎస్‌ విడుదల చేసింది. 'అభివృద్ధిలో ముందు' నినాదంతో.. 15 పేజీలతో మేనిఫెస్టోను రూపొందించారు. అందరికంటే ముందు అభ్యర్ధులను ఎంపిక చేశామని.. అన్ని పార్టీల కంటే ముందు మేనిఫెస్టోను విడుదల చేశామని టీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు. నూతన శకానికి నాంది పలికే విధంగా మేనిఫెస్టో రూపొందించామని కేకే అన్నారు. ప్రజలు కోరుకునే మౌలిక అంశాలపై దృష్టి పెట్టామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

12:37 - January 23, 2016

వరంగల్‌ : జిల్లా కలెక్టరేట్ దగ్గర ఆగి ఉన్న ఇండికా కారులో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జాం అయింది.

12:35 - January 23, 2016

చిత్తూరు : నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రాజమండ్రి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని రాజమండ్రికి తరలించారు. 2009లో రాజమండ్రిలో జరిగిన ఓ మీడియా సమావేశంలో పోలీసులను దుర్భాషలాడిన ఘటనలో చెవిరెడ్డిపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసు విషయమై చెవిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న రాజమండ్రి పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.

12:34 - January 23, 2016

హైదరాబాద్ : హెచ్ సియూలో విద్యార్థుల నిరవధిక నిరాహార దీక్షలు నాల్గో రోజుకు చేరుకున్నాయి. హెచ్‌సీయు వైద్యులు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవల్స్‌ ఆందోళనకరంగా ఉన్నాయి డాక్టర్లు చెప్పారు. తక్షణమే దీక్ష విరమించాలని విద్యార్థులకు సూచించామన్నారు.

ఎన్ఐఏ అదుపులో మరో13 మంది అనుమానితులు

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం 6 నగరాల్లోని 12 చోట్ల సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు 13మంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్టయిన వారి సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబయిలో పట్టుబడిన అనుమానిత వ్యక్తి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు.

రోహిత్ కుటంబాన్ని ఆదుకుంటాం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రోహిత్ ఆత్మహత్య బాధాకరమని, ఘటనను రాజకీయం చేయడం సరికాదని ఆయన అన్నారు. ఉద్రేకాలు పెరిగేలా రెచ్చగొట్టవద్దని ఇతర పార్టీలకు మంత్రి కేటీఆర్ హితవు పలికారు.

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన చందర్ పాల్

హైదరాబాద్ :వెస్టిండీస్ వెటరన్ ఆటగాడు శివనారాయణ్ చందర్పాల్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 22 సంవత్సరాల పాటు వెస్టిండీస్ క్రికెట్ కు సుదీర్ఘ సేవలందించిన చందర్పాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తాజాగా ప్రకటించాడు. అన్ని ఫార్మెట్ల క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు చందర్ పాల్ స్పష్టం చేశాడు.

11:19 - January 23, 2016

విజయవాడ : ప్రభుత్వ పాఠశాలలు ఎన్జీవో సంస్థల చేతికి వెళ్లనున్నాయా.. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం క్రమక్రమంగా తప్పుకుంటుందా... ఏపీ ప్రభుత్వం ప్రాథమిక విద్యారంగంలో ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు ఇటువంటి అనుమానాలనే కలిగిస్తున్నాయి..

మూసివేసి ప్రక్రియ మరింత వేగవంతం.....

ఏపీలో ప్రభుత్వ పాఠశాలల మూసివేసి ప్రక్రియ మరింత వేగవంతం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే సక్సెస్‌ స్కూల్స్‌ పేరుతో పదిహేడు వందల స్కూళ్లను మూసివేసిన ఏపీ ప్రభుత్వం మరో మూడువేల ప్రాథమిక పాఠశాలలను రేషనలైజేషన్‌ పేరుతో మూసేసింది. తాజాగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలను వివిధ స్వచ్ఛంద సంస్థలకు, ఎన్జీవో సంస్థలకు అప్పగించే ప్రతిపాదనలో ఉంది ఏపీ ప్రభుత్వం..

వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో ....

ఇటీవల లండన్‌లో జరిగిన వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొనటానికి మంత్రి గంటా శ్రీనివాసరావు వెళ్లారు. ఆయనతో పాటుగా ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ అధికారులు లండన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా లండన్‌లో స్కూళ్లను ఎన్జీవోలు అభివృద్ధి చేసిన విధానం ఆకర్షించింది.

ప్రభుత్వ పాఠశాలలను అప్పగించే ప్రతిపాదన తెర మీదకు....

దీంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎన్జీవో సంస్థలకు ప్రభుత్వ పాఠశాలలను అప్పగించే ప్రతిపాదన తెర మీదకు తీసుకువస్తుంది. ఇదే గనుక జరిగితే ఇక సాధారణ విద్యను పూర్తిగా కొనుక్కునే పరిస్థితి కలుగుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బేగం బజారులో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ : నగరంలోని బేగంబజార్‌లోని ఓ భవనంలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. గంజ్ ప్రాంతంలోని భవనం పైఅంతస్థులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్ని మాపక సిబ్బంది కి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

'తన నోట్‌లో రోహిత్ తండ్రి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు'

హైదరాబాద్ : రోహిత్ తన సూసైడ్ నోట్‌లో తల్లి, చెల్లి గురించి మాత్రమే ప్రస్తావించాడని సామాజిక వేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య తెలిపారు. సూసైడ్ నోట్‌లో రోహిత్ తండ్రి గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన అన్నారు. రోహిత్‌ ప్రస్తావించని తండ్రిని ఈ ప్రభుత్వాలు ఎక్కడి నుంచి సృష్టించాయని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. రోహిత్‌ దళితుడు అనడానికి అతని మాటలు, జీవనమే సాక్ష్యాలని కంచె ఐలయ్య అన్నారు. రోహిత్ దళితుడు కాదు అనటానికి తండ్రితోసహా మరేవి సాక్ష్యాలు కావని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాల్లోని దళిత సంఘాలు ఈ కుట్రల నుంచి దళిత తల్లిని కాపాడుకోవాలని ప్రోఫెసర్ కంచె ఐలయ్య పిలుపునిచ్చారు.

10:39 - January 23, 2016

హైదరాబాద్ : నాచారం డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కార్పొరేటర్‌ అభ్యర్ధి మేడల జ్యోతి మల్లికార్జున్‌గౌడ్‌కు మద్దతుగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివని.. 19 నెలల్లోనే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని రాజయ్య అంటున్నారు. ఖచ్చితంగా బల్దియా పీఠంపై గులాజీ జెండా ఎగురుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

10:37 - January 23, 2016

హైదరాబాద్ : టివిఎస్‌ కంపెనీ స్టార్‌ సిటీ ప్లస్‌ బైక్‌ను సరికొత్తగా ఆవిష్కరించింది. క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని, డాన్స్‌ మాస్టర్ ప్రభుదేవాతో కొత్త యాడ్‌ రూపొందించారు. ఈ యాడ్‌ కోసం ధోని తొలిసారిగా స్టెప్పులు వేయడం విశేషం. ఈ యాడ్‌ను సరికొత్తగా ఆవిష్కరించడానికి టివిఎస్‌ టీం చూపిన క్రియేటివిటీ అంతా ఇంతా కాదు....

త్రీ స్టార్లతో యాడ్‌ ఆవిష్కరణ .....

టివిఎస్‌ స్టార్‌ సిటీ ప్లస్‌ బైక్‌ కమర్షియల్‌ క్రియేటివిటి యాడ్‌ కోసం క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని, నటుడు ప్రభుదేవాలను కంపెనీ సాదర స్వాగతం పలికింది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద పండగ సంక్రాంతి పర్వదినాన త్రీ స్టార్లతో యాడ్‌ ఆవిష్కరణ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. త్రీస్టార్లు అంటే ఎవరో కాదు...ఒక స్టార్‌ బ్రాండ్‌ అంబాసిడర్ ధోని, రెండో స్టార్ టివిఎస్‌ స్టార్‌ సిటీ ప్లస్‌ కాగా మూడో స్పెషలిస్ట్‌ మాత్రం ప్రభుదేవా...

రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించిన ధోని......

టివిఎస్‌ కంపెనీ షోరూంని రిబ్బన్‌ కట్‌ చేసి ధోని ప్రారంభించారు. ఈ యాడ్‌ కోసం ధోని, ప్రభుదేవాలు తమిళ సాంప్రదాయం ప్రకారం లుంగీలు ధరించారు. ఈ యాడ్‌లో ఎలా నటించాలో దర్శకుడు ధోనికి సూచన లిచ్చారు. ప్రభుదేవాకు లుంగి ధరించడం కొత్త కాదు...

లుంగీ డ్యాన్స్ లో ధోని....

డాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవా లుంగీతో ఎలా డాన్స్‌ చేయాలో ధోనికి చూపించాడు. ధోనికి ఇదో కొత్త అనుభూతని ప్రభుదేవా పేర్కొన్నాడు.దర్శకుడు శివ, టివిఎస్‌ టీంతో పని చేయడం ఓ కొత్త అనుభవమని ప్రభుదేవా చెప్పాడు.

టిఆర్ ఎస్ ఎజెండా ప్రజల ఎజెండా : కేకే

హైదరాబాద్ :టిఆర్ ఎస్ ఎజెండా ప్రజల ఎజెండా అని టిఆర్ ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కే.కే అన్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టిఆర్ ఎస్ నేతలు మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ్యుడు కేకే మాట్లాడుతూ....నూతన శకానికి నాది పలకాలనే ఉద్దేశ్యంతో మేనిఫెస్టోను విడుదల చేసినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో గ్రేటర్ లో ముందుకెళ్తున్నాం, అభ్యర్థుల ఎంపికలో అన్నివర్గాలకు న్యాయం చేశాం. నూతన శకంతో నాంది పలకాలనే ఉద్దేశంతో మేనిఫెస్టో తయారు చేసినట్లు స్పష్టం చేశారు.

నేతాజీ రహస్య ఫైళ్లను బహిర్గతం చేయనున్న మోదీ

ఢిల్లీ : స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన సుమారు వంద రహస్య ఫైళ్లను ఇవాళ ప్రధాని మోదీ బహిర్గతం చేయనున్నారు. చంద్రబోస్ కుటుంబసభ్యులు ప్రస్తుతం ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంట్‌లో జరిగే కార్యక్రమంలో వాళ్లు పాల్గోనున్నారు. నేతాజీ 119వ జయంతి సందర్భంగా ప్రధాని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రహస్య ఫైళ్లకు సంబంధించి డిజిటల్ వర్షన్‌ను ప్రధాని ఆవిష్కరిస్తారు. 70 ఏళ్ల క్రితం నేతాజీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమయ్యారు. రహస్య ఫైళ్ల వల్ల ఆ మిస్ట్రీకి సంబంధించిన అనేక అంశాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ఆ ఫైళ్లను డిజిటల్ రూపంలోనూ దర్శించవచ్చు.

10:01 - January 23, 2016

హైదరాబాద్ : ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది నిర్వాకంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో 70 మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రాయపూర్‌కు వెళ్లేందుకు విమానం ఎక్కిన ప్రయాణికులు.. సీట్ల విషయంలో సిబ్బందితో ఘర్షణ పడ్డారు. దీంతో వారిని ఎయిర్‌పోర్ట్‌లోనే దించేసి విమానం వెళ్లిపోయింది. అర్ధరాత్రి నుంచి ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఆందోళనకు దిగారు. 

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి మృతి

చిత్తూరు : పులిచర్ల మండలం కల్లూరు వద్ద ద్విచక్రవాహనాన్ని... ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్సకోసం క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించారు.

టాటా మ్యాజిక్ - డీసీఎం ఢీ : ముగ్గురు మృతి

మెదక్ : నంగనూరు మండలం రాంపూర్ చేరస్తా వద్ద టాటా మ్యాజిక్ - డీసీఎం ఢీ కొని ముగ్గురుమృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. కొమరవెల్లి మల్లన్న జాతరకు వెళ్లి వస్తుండా ఈ ప్రమాదం జరిగింది.

ప్రత్తికోళ్లలంకలో 144 సెక్షన్...

పశ్చిమగోదావరి : ఏలూరు మండలం ప్రత్తికోళ్లలంకలో పాతకక్షలు భగ్గుమన్న నేపథ్యంలో పోలీసుల గస్తీని మరింత పెంచారు. గ్రామం అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని 53 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతికోళ్లలంకలో చేపల చెరువుల వివాదంలో శుక్రవారం ఇరు వర్గాలు మధ్య వివాదం చోటు చేసుకుంది.

రాజమండ్రి పోలీసులు కస్టడీకి ఎమ్మెల్యే చెవిరెడ్డి

నెల్లూరు : వెంకటాచలం సబ్ జైలులో ఎమ్మెల్యే చెవిరెడ్డిని రాజమండ్రి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అనంతరం రాజమండ్రి కోర్టులో హాజరుపర్చనున్నారు. 2009లో మీడియా సమావేశంలో పోలీసులను తిట్టిన కేసులో కస్టడీకి తీసుకున్నారు.

09:42 - January 23, 2016

హైదరాబాద్ : బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా రూపొందుతున్న స్పీడున్నోడు చిత్రం ఆడియో విడుదల వేడుక శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీజే వసంత్‌ సంగీతమందించారు. సోనారికా కథానాయిక. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు కథానాయికలు తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌, రెజీనా, సాక్షి చౌదరి, హెబ్బాపటేల్‌, తేజస్వి, పూర్ణ, కేథరిన్‌, దర్శకుడు వీవీ వినాయక్‌, నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తదితరులు హాజరయ్యారు.

09:39 - January 23, 2016

కడప : ఆలుమగల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఎంతటి ఘోరాలకో దారితీస్తున్నాయి...ఎన్నో కుటుంబాల మనుగడలేకుండా చేస్తున్నాయి.. ప్రధానంగా వారి పిల్లలు అందరూ ఉన్న అనాథలుగా మారుతున్నారు... ఇది ఇప్పటిది కాదు.. చాలా కాలంగా జరుగుతున్న దారుణాలు.. ఎన్నో కిరాతకాలను చూశాం..చూస్తున్నాం..కొందరు తల్లిదండ్రుల వల్ల జరుగుతున్న అనర్థాలు లోకం తెలియని పసిబిడ్డలకు ప్రాణసంకటంగా మారుతోంది... కడపలో ఓ దంపతుల గొడవ కోర్టు దాకా వెళ్లింది..చివరకు ఆ కోర్టు గడపలోనే ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాల్సిన పసిబిడ్డను వదిలేశారు అమ్మానాన్నలు...

బంగారు తల్లి పేరు సాయికీర్తి...

ఈ బంగారు తల్లి పేరు సాయికీర్తి...అమ్మ లేక కాదు...నాన్న లేక కానే కాదు...ఇద్దరూ ఉన్నారు...కాని ఆ ఇద్దరూ వదిలేశారు.. కడుపు తీపిని మర్చిపోయిన అమ్మ తనకెందుకీ భారమనుకుంది..గుండెల్లో పెట్టుకోని చూసుకోవాల్సిన నాన్న నాకెందుకంటూ వదిలేశాడు...

న్యాయస్థానం సాక్షిగా....

కన్నవారిద్దరూ వదిలేసింది ఎక్కడో కాదు... న్యాయస్థానం సాక్షిగా ఈ ఘోరానికి కన్నవారే పాల్పడ్డారు...కడప జిల్లాకు చెందిన ఈ చిట్టితల్లి కన్నవారు విజయభారతి,ఈశ్వర్...దంపతుల మధ్య విభేదాలతో విడిపోవాలనుకున్నారు..ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకోవాలనుకున్నారు..కోర్టు విచారించి విజయభారతి జీవనభృతి కోసం ప్రతినెల 3500 రూపాయలు చెల్లించాలని ఈశ్వర్ ను ఆదేశించింది...అయితే భర్త ఈశ్వర్ నుండి వచ్చే 3500 రూపాయలు ఏడాదిన్నర్ర వయసున్న సాయికీర్తి పాల ఖర్చులకు కూడా సరిపోవని, తాను పోషించలేనని ఆ తల్లి కోర్టు వద్దే చిట్టి చిన్నారిని వదిలేసింది...పాప తనకేమీ సంభందంలేదని తండ్రి ఈశ్వర్ కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు....

అమ్మానాన్నలు కన్పించక కన్నీరుమున్నీరు...

అమ్మానాన్నలు కోర్టు సాక్షిగా వదిలేసి వెళ్లిపోవడంతో దిక్కులేనిదయిన పసిబిడ్డ ఆర్తనాదాలు ప్రతీ ఒక్కరిని కదిలించాయి..న్యాయస్థానం దృష్టికి వెళ్లడంతో చలించి వెంటనే చిన్నారిని ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించాలని ఆదేశించారు... ప్రస్తుతం చిన్నారిని బాలల సదనంలో అధికారులు సంరక్షిస్తున్నారు...

కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామన్న ఐ.సి.డి.ఎస్.....

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఐ.సి.డి.ఎస్. అధికారులు చెబుతున్నారు...ఆలుమగల గొడవల్లో పావులవుతున్న పసివాళ్లు.. అమ్మానాన్నలున్నా అనాథలవుతున్న చిట్టిచిన్నారులు.. పసికందులపై పగబట్టినట్లు కొందరి వ్యవహారం. సాయికీర్తిని చూసి కన్నీరు పెడుతున్న కడప...ఒక్క సాయికీర్తినే కాదు...ఇలాంటి ఎందరో పసిబిడ్డలు అమ్మానాన్నలు ఉండి కూడా అనాథలవుతున్నారు... వీధిన పడుతున్నారు.. 

09:34 - January 23, 2016

హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైలు సర్వీసును యాదాద్రి వరకూ పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు. భక్తుల రద్దీని తట్టుకోవాలంటే.. ఎంఎంటీఎస్ రైలు సర్వీసును పొడిగించడమే ఏకైక మార్గమని.. లేఖలో వివరించారు. ఈ ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం భరించేందుకూ తాము సిద్ధమేనని సీఎం వెల్లడించారు.

కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభుకు సీఎం కేసీఆర్‌ లేఖ....

యాదాద్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్‌ సర్కారు.. ఆ క్షేత్రానికి ఎంఎంటీఎస్ రైలు సర్వీసునూ పొడిగింప చేయాలని భావిస్తున్నారు. ఈమేరకు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభుకు.. కేసీఆర్‌ ఓ లేఖ రాశారు. ప్రస్తుతం ఘట్‌కేసర్‌ వరకు జరుగుతున్న ఎంఎంటీఎస్ రైలు మార్గం నిర్మాణ పనులను యాదాద్రి వరకూ పొడిగించాలని కేసీఆర్‌ తన లేఖలో కోరారు.

యాదాద్రికి రోజూ 20వేల మంది సందర్శకులు....

హైదరాబాద్‌ నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని యాదాద్రి క్షేత్ర దర్శనానికి.. ప్రతి రోజూ సుమారు 20 వేల మంది భక్తులు వెళుతున్నారు. వారాంతాల్లో ఈ సంఖ్య 50 వేల వరకూ చేరుతుంటుంది. యాదాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే 2వేల ఎకరాలు సేకరించిన ప్రభుత్వం.. భవిష్యత్తులో యాదాద్రికి వచ్చే భక్తుల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అందుకే..ఎంఎంటీఎస్ సర్వీసును యాదాద్రి వరకూ పొడిగించాలని సీఎం తన లేఖలో కోరారు.

సికింద్రాబాద్‌-కాజీపేట సెక్షన్‌లో యాదాద్రి క్షేత్రం...

యాదాద్రి క్షేత్రం.. సికింద్రాబాద్‌-కాజీపేట సెక్షన్‌లో ఉంది. దీనికి దగ్గర్లోని రాయగిరి స్టేషన్‌లో.. ఇప్పటికే పలు రైళ్లకు హాల్టింగ్‌ ఉంది.ఇదే విషయాన్ని తన లేఖలో వివరించిన సీఎం.. ఘట్‌కేసర్‌ నుంచి రాయగిరి వరకు 32 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ సర్వీసును పొడిగించాలని.. రాయగిరి స్టేషన్ పేరును యాదాద్రిగా మార్చాలనీ విజ్ఞప్తి చేశారు. 

09:30 - January 23, 2016

హైదరాబాద్ : తార్నాక డివిజన్ లాలాపేట్ లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మోతె శోభన్ రెడ్డి నాయకత్వంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో వైసీపీ నేత గూడూరు జైపాల్ రెడ్డి పార్టీలో చేరారు. వీరితో పాటు 1000 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి డివిజన్ అభ్యర్థి ఆలకుంట సరస్వతి పాల్గొని పార్టీలోకి ఆహ్వానించారు.

ఎస్పీ సల్వీందర్ కు క్లీన్ చిట్...

ఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో సీనియర్ పంజాబ్ పోలీస్ అధికారి సల్వీందర్ సింగ్‌కు ఎన్‌ఐఏ క్లీన్‌చిట్ ఇచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఎస్‌పీ సల్వీందర్ పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో ఉన్నతాధికారులు ఇప్పటికే ఆయనను పలుమార్లు విచారించారు. విచారణతో పాటుగా లై డిటెక్టర్ పరీక్షను కూడా చేపట్టారు. ఎస్పీ గడిచిన రెండు వారాలుగా పలుమార్లు విచారణను ఎదుర్కొన్నారు. అధికారులు అతని స్వస్థలం అమృత్‌సర్‌తో పాటు పలుచోట్ల సోదాలు నిర్వహించారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

సిడ్నీ : భారత్‌, ఆస్ట్రేలియా చివరి వన్డే కాసేపట్లో ప్రారంభం కానుంది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. ఐదు వన్డేల సిరీస్‌లో 4-0తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది.

 

08:35 - January 23, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులకు... ఓటర్లను ఆకట్టుకునే విధానంపై శుక్రవారం తర్ఫీదునిస్తోంది. ఎన్నికల ప్రచారంలో సామాజిక సమీకరణల ఆధారంగా ఓటర్లకు ఎలా గాలం వేయాలి.. ప్రత్యర్థి పార్టీల ఎత్తులను ఎలా చిత్తు చేయాలి లాంటి అంశాలపై శిక్షణనిచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆధ్వర్యంలో.. ఈ కార్యక్రమం సాగింది.

సామాజిక మాధ్యమాలను విస్తృతంగతా....

గ్రేటర్‌ పరిధిలో బాగా ప్రచారంలో ఉండే సామాజిక మాధ్యమాలను విస్తృతంగతా వినియోగించుకోవాలని నేతలు.. అభ్యర్థులకు సూచించారు. పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటూనే.. 18 నెలల టీఆర్ఎస్‌ పాలన వల్ల గ్రేటర్‌ పౌరులకు ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ.. ఓటర్లకు చేరువ కావాలన్నారు. గ్రేటర్‌లో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధినీ ఓటర్లకు వివరించాలని నేతలు సూచించారు.

మిత్రపక్షం బీజేపీ స్నేహపూర్వక పోటీలో....

మిత్రపక్షం బీజేపీ స్నేహపూర్వక పోటీలో ఉన్న స్థానాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా.. బీజేపీకి కేటాయించిన స్థానాల గురించి పార్టీ శ్రేణులు ప్రస్తావించగా.. లోకేశ్‌ వారిని సముదాయించారు. కార్యక్రమం ప్రారంభంలో.. అభ్యర్థులందరితోనూ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రమణ ప్రమాణం చేయించారు. గ్రేటర్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సీడీని కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. 

08:33 - January 23, 2016

హైదరాబాద్: ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ సర్కస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. మొదటి నాలుగు వన్డేల్లోనూ తిరుగులేని విజయాలతో కంగారూటీమ్ సిరీస్ ఖాయం చేసుకొన్నా...సిడ్నీలో ఇవాళ జరిగే ఆఖరివన్డే రెండుజట్లకూ ప్రతిష్టాత్మకంగా మారింది. వరుసగా ఐదో విజయంతో వైట్ వాష్ సాధించాలన్న పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంటే....టీమిండియా మాత్రం ఆఖరివన్డేలో అయినా...నెగ్గి క్లీన్ స్వీప్ తప్పించుకోవాలన్న కసితో ఉంది......

తొలివిజయానికి టీమిండియా తహతహ

ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్ టీమిండియాజట్ల ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ షో....పెర్త్, బ్రిస్బేన్, మెల్బోర్న్, కాన్ బెర్రా నగరాల మీదుగా...సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కు చేరుకొంది. ఇప్పటికే ఆతిథ్య ఆస్ట్రేలియా వరుసగా నాలుగో వన్డే నెగ్గి సిరీస్ ఖాయం చేసుకొన్నా...రెండుజట్ల సమరం మాత్రం నువ్వానేనా అన్నట్లుగానే సాగుతోంది.

349 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోడంలో సఫం....

మొదటి మూడువన్డేల్లోనూ చేజింగ్ విజయాలు సాధించిన కంగారూ టీమ్..నాలుగో వన్డేలో మాత్రం 349 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోడంలో సఫలమయ్యింది.స్వదేశంలో ఆడిన గత 19 వన్డేల్లోనూ అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా వరుసగా..19వ విజయానికి గురిపెట్టింది.

19 వన్డేలు ఆడిన కంగారూ టీం....

కాన్ బెర్రాలో ముగిసిన నాలుగోవన్డే వరకూ వివిధ జట్లతో మొత్తం 19 వన్డేలు ఆడిన కంగారూ టీమ్ 18 విజయాలు సాధించగా...మరో మ్యాచ్ రద్దులపద్దులో చేరిపోయింది. ప్రపంచ చాంపియన్, నెంబర్ వన్ ర్యాంకర్ ఆస్ట్రేలియా...ఇప్పటి వరకూ ఆడిన నాలుగు వన్డేల్లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. కేవలం మూడు, నాలుగు వన్డేల్లో మాత్రమే టీమిండియా గట్టిపోటీ ఇచ్చి పోరాడి ఓడింది. కాన్ బెర్రా మనూకా ఓవల్ వేదికగా ముగిసిన హైస్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ ను అలవోకగా నెగ్గితీరాల్సిన టీమిండియా చేజేతులా ఓటమి కొనితెచ్చుకొంది.

రెండో వికెట్ కు ధావన్- కొహ్లీ డబుల్ సెంచరీ భాగస్వామ్యం, టాపార్డర్లో రెండు సెంచరీలతో..ఒకదశలో ఒక వికెట్ కు 277 పరుగుల స్కోరుతో పటిష్టమైన స్థితిలో ఉన్న ధోనీసేన..ఆ తర్వాత కేవలం 46 పరుగుల వ్యవధిలోనే 9 వికెట్లు నష్టపోయి..చేజేతులా ఓటమి కొనితెచ్చుకోవాల్సి వచ్చింది.

ఆస్ట్రేలియా ఓటమి అంచుల నుంచి....

ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్ సన్ ఐదు వికెట్లు పడగొట్టడంతో..ఆస్ట్రేలియా ఓటమి అంచుల నుంచి బయటపడి..అద్భుత విజయం సొంతం చేసుకోగలిగింది.అయితే...మొదటి నాలుగు వన్డేల్లో తమ ఓటమికి గల కారణాలను టీమిండియా సమీక్షించుకొని..ఆఖరి వన్డేలో పునరావృతం కానివ్వరాదన్న పట్టుదలతో ఉంది.

ఆఖరి వన్డే వేదికగా సిడ్నీ పిచ్...స్పిన్ బౌలర్లకు అనువుగా ఉండే అవకాశం ఉండడంతో జట్టులో రెండుమార్పులు చేయాలని భారత టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. చేతిగాయంతో ఆటకు దూరమైన అజింక్యా రహానే స్థానంలో మనీష్ పాండే, మీడియం పేసర్ రిషీ ధావన్ స్థానంలో ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ను తుదిజట్టులో చేర్చుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

మొదటి రెండు వన్డేల్లో సెంచరీలు బాదిన రోహిత్ శర్మ.....

మొదటి రెండు వన్డేల్లో సెంచరీలు బాదిన రోహిత్ శర్మ, మూడు , నాలుగు వన్డేల్లో బ్యాక్ టు బ్యాక్ శతకాలు సాధించిన విరాట్ కొహ్లీ, కానెబెర్రా సెంచరీ హీరో శిఖర్ ధావన్...తమ సూపర్ ఫామ్ ను సిడ్నీలో సైతం కొనసాగించగలిగితే కంగారూలకు గట్టిపోటీ తప్పదు. టీమిండియా కనీసం ఆఖరి వన్డేలో నెగ్గినా..పరువు దక్కించుకోడంతో పాటు...ఈనెల 26 నుంచి జరిగే మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో ఆత్మవిశ్వాసంతో పాల్గొన గలుగుతుంది. భారత కాలమానప్రకారం ఈ పోటీ శనివారం ఉదయం ప్రారంభమవుతుంది.

 

నేడు ఆసీస్‌, భారత్‌ మద్య సిడ్నీలో చివరి వన్డే

హైదరాబాద్ : నేడు ఆసీస్‌, భారత్‌ మద్య సిడ్నీలో చివరి వన్డే జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 8.50కి మ్యాచ్‌ ప్రారంభమౌతుంది. చివరి మ్యాచ్‌లో నెగ్గి సీరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో నెగ్గి వైట్‌వాస్‌ నుంచి తప్పించుకోవాలని భారత్ ఉంది. అంతేకాక ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే రెండో ర్యాంక్‌ కూడా కోల్పోనుంది.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణీకుల ఆందోళన

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. రాయ్ పూర్ వెళ్లే ఇండిగో విమానంలో రాత్రి 11 గంటలకు ఎయిర్ హోస్టర్స్, ప్రయాణీకు లమధ్య వివాదం చెలరేగింది. తమకు కేటాయించిన సీట్లలో కాకుండా ఇష్టారాజ్యంగా కూర్చోవడంతో 70 మంది ప్రయాణీకులను ఇండిగో విమానం ఎయిర్ పోర్టులో వదిలి వెళ్లిపోయింది.

నేటి నుండి మంత్రి కేటీఆర్ రోడ్ షోలు

హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేటి నుంచి 28వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్‌షోలలో పాల్గొననున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల గెలుపునకు మంత్రి ప్రచారాన్ని తలపెట్టారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు రోడ్‌షో ప్రారంభం కానుంది. గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్‌పేట్, మియాపూర్, చందానగర్, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, జగద్గిరిగుట్టలో రోడ్‌షో కొనసాగనుంది. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ఈ ఉదయం 10 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనుంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు 3 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 2 గంటలు పడుతుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.

06:53 - January 23, 2016

హైద్రాబాద్ : నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది తెలంగాణ ప్రభుత్వం. మల్టీ లెవల్ ప్లై ఒవర్స్..స్కై వేలు, ఆకాశ హర్మ్యాలు ఇలా ఎన్నో ప్లానింగ్ తయారు చేసింది. కానీ వాటిని నిర్మించడం ..ప్రస్తుతం ఉన్న ఆర్ధిక వనరుల తో సాధ్యం కాదు. వేలా కోట్ల రుపాయాలతో చేపట్టాల్సిన ఈ ప్రణాళికలకు బ్రిక్స్ బ్యాంక్ నుండి రుణం తీసుకోనేందుకు అవసరమైన ప్రణాళికను తయారు చేస్తోంది.

ప్రణాళికలు సిద్ధం చేస్తోన్న సర్కార్...

హైద్రాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు స్కైవేలను ...ఎలివేటేడ్ హైవేస్ ను నిర్మించనుంది టీఎస్ సర్కారు. ఈ మేరకు ఎన్ని కోట్లు ఖర్చు కానుందో అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే జిహెచ్ఎంసి పరిధిలో, హెచ్ఎండిఏ పరిధిలో మంచినీటి సరఫరా, డ్రైనేజీ, వర్షపు నీరు, మురుగునీరు వేర్వేరుగా వేళ్ళేలా కాలువల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం ప్రణాళికలు.....

ఇప్పటికే స్కైవేల నిర్మాణం కోసం టెండర్లను పిలిచింది.రానున్న 25 ఏళ్ళ ట్రాఫిక్ ను అంచనా వేసి హైద్రాబాద్ నగరంలో నివసించే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చేస్తోంది. ఇప్పటికే అధికారులు కొన్ని ప్రణాళికలను సిద్దం చేశారు.ఈ ప్రణాళికలపై చర్చిస్తున్నారు.

బ్రిక్స్ బ్యాంకు చైర్మెన్ ను కలిసిన సీఎం కేసీఆర్.....

ఈ రకమైన ప్రణాళిలకు సుమారు 30 నుండి 35 వేల కోట్లు ఖర్చు అవుతోందని ప్రభుత్వం అంచనావేస్తోంది. ఈ పనుల నిర్వహాణ నిమిత్తం బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన న్యూ డెవలప్ మెంట్ బ్యాంకును ప్రభుత్వం రుణం కోరనుంది. చైనా పర్యటనలో సిఎం కెసిఆర్ ఇప్పటికే బ్రిక్స్ బ్యాంకు చైర్మెన్ ను కలిసి తమ రాష్ట్రానికి రుణం కావాలని కోరారు.

అవసరమైన నిధుల కోసం చర్చ.....

బ్రిక్స్ బ్యాంకు రుణం కోసం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , మున్సిఫల్ అడ్మినిస్ట్రేటివ్ స్పెషల్ ప్రత్యేక కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది ...అవసరమైన నిధుల కోసం చర్చించారు.

ఏ రంగానికి ఎంత రుణం....

బ్రిక్స్ బ్యాంక్ నుండి ఏ రంగానికి ఎంత రుణం తీసుకోవాల్సిన అవసరం ఉందనే దానిపై చర్చ జరిగింది. ఈ మేరకు నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. 15 రోజుల్లో నివేదికను పంపనున్నారు. ఈ నిధుల ద్వారా జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలను చేపట్టనుంది. 

06:49 - January 23, 2016

హైదరాబాద్ : భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు బీజేపీ అనుబంధ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ అన్నారు. ఈ ప్రయత్నాలకు ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరీంనగర్‌లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రథమ మహాసభల్లో మాణిక్‌ సర్కార్‌ పాల్గొన్నారు.

కరీంనగర్ లో వ్యవసాయ కార్మిక సంఘం ప్రథమ మహాసభలు.....

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రథమ మహాసభలు కరీంనగర్‌లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ సభలు జరుగుతాయి. పది జిల్లాల నుంచి ప్రతినిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె కృష్ణమూర్తినగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు.ముఖ్య అతిథిగా హాజరయిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీకి శరీరం లాంటిది.....

ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీకి శరీరం లాంటిదని మాణిక్‌ సర్కార్‌ విమర్శించారు. భారతదేశాన్ని హిందూ దేశంగా మలిచేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ చేస్తున్న ప్రయత్నాలకు మోదీ నాయకత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. హిందూ ఉన్మాద విధానాలను అంగీకరించాలని దేశ ప్రజలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రయత్నాలను అడ్డుకోవడానికి జనతా ప్రజాతంత్ర వామపక్ష ఐక్య సంఘటనే మార్గమని మాణిక్‌ సర్కార్‌ అన్నారు.

సంక్షోభంలోకి నెట్టిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదే...

గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వానిది అని మాణిక్‌ సర్కార్‌ విమర్శించారు. భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేందుకు ఎన్డీయే సర్కార్‌ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

అటవీ భూములను గిరిజనులకు దక్కకుండా ప్రభుత్వం కుట్ర....

అటవీ భూములను గిరిజనులకు దక్కకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ కార్యరూపం దాల్చడం లేదని మండిపడ్డారు. మహాసభల సందర్భంగా నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్‌ స్టేడియం నుంచి బహిరంగ సభాస్థలి వరకు ఈ ప్రదర్శన సాగింది. వేలాది మంది వ్యవసాయ కార్మికులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. 

06:45 - January 23, 2016

హైదరాబాద్ : తెలంగాణకు భారీ పెట్టుబడులు రాబోతున్నాయి.. జాతీయ పెట్టుబడులు, మాన్యుఫాక్చరింగ్‌ జోన్ల కింద కేంద్రం నాలుగు పారిశ్రామిక వాడలకు కేంద్రం అనుమతులు మంజూరుచేసింది.. మెదక్ జిల్లాలో 60వేల కోట్ల టర్నోవర్‌తో... 2లక్షల 61వేలమందికి ఉపాది కల్పించే లక్ష్యంతో.. ఈ పారిశ్రామిక వాడ నిర్మించబోతున్నారు.. ఇందులో పలు కంపెనీలు తమ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నాయి..

పాశమైలారం పారిశ్రామికవాడలో పాడి ప్రాసెసింగ్ క్లస్టర్‌

పాశమైలారం పారిశ్రామికవాడలో పాడి ప్రాసెసింగ్ క్లస్టర్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సరిహద్దుల్లో ఫార్మా వాడను నెలకొల్పేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ ప్రాజెక్ట్ రూ. 45,000 కోట్ల పెట్టుబడులతో 2.25 లక్షల మందికి ఉపాధి లభించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.

పసుపు బోర్డు, స్పైసెస్ బోర్డు, పార్క్ ఏర్పాటుపై కేంద్రానికి లేఖ

పసుపు బోర్డు, స్పైసెస్ బోర్డు, పార్క్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పనుపు బోర్టు ఏర్పాటును సానుకూలంగా స్పందించిన కేంద్రం స్పైసెస్ పార్క్ ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే ఇతర పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది.ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సెజ్ ల ఏర్పాటుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఇప్పుడు మరో నాలుగు పారిశ్రామిక వాడలకు అనుమతులు లభించాయి. 

06:44 - January 23, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక నాలుగో రోజు సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఏపీలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను ముఖ్యమంత్రి సదస్సులో వివరించారు.

ఏపీలో సాగుకు సాయం

వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ప్రపంచ ఆర్థిక వేదిక నిర్ణయించింది. తమ కార్యక్రమాలను అమలు చేయడానికి రాష్ట్రంలో కార్యాలయం ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చింది.ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు నాలుగో రోజు వ్యవసాయంలో కొత్త దృక్కోణం..నవీన కార్యాచరణ అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..రాష్ట్రంలో వ్యవసాయం రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు..కార్యక్రమాలను వివరించారు.

రుణమాఫీ, రైతు సాధికార సంఘం ఏర్పాటు....

వ్యవసాయ రుణాల మాఫీ, రైతు సాధికార సంఘం ఏర్పాటు, ఇన్‌పుట్‌ సబ్బిడీ అందజేత...గోదావరి, కృష్ణ నదుల అనుసంధానం..సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలను చంద్రబాబు చర్చాగోష్టిలో వివరించారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించడం, నీరు చెట్టు కార్యక్రమం, ఫామ్‌ పాండ్స్ ఏర్పాటు, భూసార పరీక్షలు చేపట్టే ప్రతి రైతుకీ సాయిల్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వడం వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు.

సీఎంకు వెల్లువెత్తిన అభినందనలు.....

వ్యవసాయ సంస్కరణలపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రికి అభినందనలు వెల్లువెత్తాయి. చంద్రబాబును పలు దేశాధినేతలు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేయాలని ప్రపంచ ఆర్థిక వేదిక నిర్ణయించింది. 

06:31 - January 23, 2016

హైదరాబాద్ : రోహిత్ ఆత్మహత్యతో... సెంట్రల్ వర్సిటీ రగిలిపోతోంది. న్యాయం కోసం... దళిత, బహుజన గొంతుకలు గర్జిస్తున్నాయి. పాలకులపై పోరుచేసేందుకు... జెండాలకు అతీతంగా ఒక్కటై నినదిస్తున్నాయి. మరోవైపు బరువెక్కిన గుండెలకు బాసట లభిస్తోంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతు పెరిగిపోతోంది. హెచ్ సియూ విద్యార్థులకు త్రిపుర సీఎం అండగా నిలిచారు. చదువుతూ పోరాడు-చదువుకై పోరాడమన్నారు మాణిక్ సర్కార్‌.

వారిని వెంటనే తొలగించాలి....

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఆందోళనల పర్వం కొనసాగుతూనే ఉంది. నిరసనలు, నినాదాలతో క్యాంపస్ మార్మోగిపోతోంది. తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం విద్యార్థులు పోరాటం చేస్తూనే ఉన్నారు. వీసీ అప్పారావును తక్షణమే తొలగించాలని, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయల రాజీనామాకు విద్యార్థులు డిమాండ్ చేశారు.

కొనసాగుతున్న సంఘీభావం...

హెచ్ సియూ విద్యార్థుల దీక్షలకు సంఘీభావం కొనసాగుతోంది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌... సెంట్రల్ యూనివర్సిటీ సందర్శించారు. ఆయనతో పాటు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఉన్నారు. ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులతో మాణిక్ సర్కార్ మాట్లాడారు. రోహిత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన వీసీ....

రాజకీయ ఒత్తిళ్లకు వీసీ తలొగ్గాడని మాణిక్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్‌ ఆత్మహత్యపై విచారణ ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా జరగాలన్నారు. విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు మాణిక్ సర్కార్‌. విద్యాలయాల్లో రక్షణ కరువైందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రోజు రోజుకూ పెరుగుతున్న మద్దతు....

హెచ్‌సీయూ విద్యార్థులకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు రోజురోజుకు పెరిగిపోతోంది. శుక్రవారం సీపీఎం రాజ్యసభ ఎంపీ సీమ, రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ చంద్రకుమార్‌, మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కీ వర్సిటీలో పర్యటించారు. ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఇక వర్సిటీ ప్రొఫెసర్లు మేముసైతం అంటూ విద్యార్థులకు మద్దతు పలికారు. దీక్షా శిబిరానికి చేరుకుని విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

క్షీణించిన విద్యార్థుల ఆరోగ్యం....

మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తోంది. బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి. కానీ విద్యార్థులు మాత్రం దీక్షను విరమించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెబుతున్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ ప్రకటించారు.

06:27 - January 23, 2016

హైదరాబాద్ : ఒకరిది న్యాయ పోరాటం. మరొకరిది న్యాయ విచారణ. సెంట్రల్ వర్సిటీ సెగలపై అటు కేంద్రం, ఇటు స్టూడెంట్స్‌ వ్యూహాలివి. నష్టపరిహారం కోసం విద్యార్థుల ఉద్యమం ఉధృతం అవుతుంటే... నష్టనివారణ చర్యలపై కేంద్రం దృష్టి సారించింది. ఇక దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మాత్రం ఆగడం లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

మొద్దు నిద్ర వీడిన హెచ్ ఆర్డీ....

రోహిత్ ఆత్మహత్యతో హెచ్ ఆర్డీ మొద్దునిద్ర వీడింది. హెచ్‌సీయూ ఘటనతో హస్తినలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నారు. పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యపై న్యాయవిచారణకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలంటూ కమిటీకి సూచించింది. ఇటు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ సైతం ఆర్థికసాయం చేసేందుకు ముందుకొచ్చింది. రోహిత్ కుటుంబానికి 8 లక్షల రూపాయల్ని నష్ట పరిహారంగా ప్రకటించింది.

హెచ్‌ఆర్డీ కమిషన్, హెచ్ సియూ నష్టపరిహారంపై......

మరోవైపు హెచ్‌ఆర్డీ కమిషన్, హెచ్ సియూ నష్టపరిహారంపై వర్సిటీ జేఏసీ సీరియస్‌గా రియాక్ట్ అయింది.హెచ్ ఆర్డీ కమిషన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు విద్యార్థులు స్పష్టం చేశారు. కాలయాపన కోసమే కమిటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రోహిత్ కుటుంబానికి యూనివర్సిటీ ప్రకటించిన... 8 లక్షల రూపాయల నష్ట పరిహారం సరిపోదంటూ విద్యార్థులు ఫైర్ అయ్యారు.

వెల్లువెత్తుతున్న నిరసనలు....

ఇక దేశవ్యాప్తంగా ఆందోళనలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తెలుగురాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటాయి. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని కోరుతూ ...ప్రజాసంఘాలు, వామపక్షాలు ఆందోళన ఉధృతం చేశాయి. కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, దత్తాత్రేయలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు లెఫ్ట్ నేతలు. రోహిత్‌ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.

ఢిల్లీలో ఎస్ ఎస్ యూఐ ఆందోళన....

అటు ఢిల్లీలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. రోహిత్ మృతిలో నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఎస్ ఎస్ యూఐ ఆందోళనకు దిగారు. శాస్త్రి భవన్ లోని హెచ్ ఆర్డీ కార్యాలయం ముట్టడికి ఎస్ ఎస్ యూఐ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులు బారికేడ్లు దాటి ముందుకు రావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. గుంటూరులో శనివారం ఏఎన్‌యూ బంద్‌కు దళిత, బహుజన సంఘాలు పిలుపు ఇచ్చాయి. రోహిత్ మృతికి కారకులైన వ్యక్తుల్ని శిక్షించాల్సిందేనంటూ నేతలు డిమాండ్ చేశారు.

యాదాద్రికి ఎంఎంటీఎస్

హైదరాబాద్ : యాదగిరిగుట్టకు ప్రయాణికులు సులువుగా చేరుకోవడానికి వీలుగా అక్కడికి ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఎంఎంటీఎస్ లైన్‌ను ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించి రైళ్లను నడిపించాలని శుక్రవారం కేంద్రమంత్రికి రాసిన లేఖలో కోరారు. ఈ పనులకయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడింట రెండొంతుల భాగాన్ని భరిస్తుందని, మిగిలిన మొత్తాన్ని రైల్వే శాఖ భరించాలని సీఎం ప్రతిపాదించారు. ఈ మేరకు 2016-17 రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని కోరారు.

ఎస్ బీహెచ్ ఫార్మర్ మేనేజర్ రామారావు అరెస్ట్

హైదరాబాద్ : మల్కాజ్ గిరి ఎస్ బీహెచ్ ఫార్మర్ మేనేజర్ కేవీ రామారావుపై ప్రభుత్వ నిధులు ప్రైవేటు వ్యక్తులకు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో సిబీఐ అరెస్ట్ చేసింది. 

Don't Miss