Activities calendar

24 January 2016

రోహిత్‌ మృతికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన

హైదరాబాద్‌: హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ మృతికి నిరసనగా విద్యార్థి సంఘాలు, వామపక్షాలు, దళిత సంఘాలు ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించాయి. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద వందలాది మంది కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ రోహిత్‌ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రోహిత్‌ మృతిపై న్యాయవిచారణ జరిపించాలని నేతలు డిమాండ్‌ చేశారు.

 

22:00 - January 24, 2016

అరుణాచల్‌ ప్రదేశ్‌ : రాజకీయ అస్థిరత కారణంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధమైంది. ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేంద్రమంత్రి వర్గం సిఫారసు చేసింది. ఇటీవలి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. గౌహతి హైకోర్టు సస్పెండ్‌ చేసిన 14 మంది ఎమ్మెల్యేలను ఉపసభాపతి తిరిగి అసెంబ్లీలోకి అనుమతించారు. ఈ చర్యతో ఆగ్రహించిన సభాపతి డిప్యూటీ స్పీకర్‌ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో పాటు గవర్నర్‌పై కూడా పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు అసెంబ్లీ సమావేశాలపై స్టే విధించింది. ఇదే సమయంలో అధికారపార్టీకి చెందిన 21మంది ఎమ్మెల్యేలు, 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు డిప్యూటీ స్పీకర్‌కి మద్దతు పలికారు. దీంతో రాష్ట్రంలో పార్టీ పీఠాలు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేబినెట్ సిఫార్సు చేసింది. 

21:58 - January 24, 2016

హైదరాబాద్‌ : నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనని ఆ పార్టీ యువనేత లోకేష్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్‌ సహా తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేతలు ఏఎస్‌రావు నగర్‌, ఈసీఐఎల్‌ తదితర ప్రాంతాల్లో రోడ్‌ షో నిర్వహించారు. 

 

21:55 - January 24, 2016

ఢిల్లీ : దేశంలో అడుగడుగునా నిఘా ఏర్పాటైంది. ప్రధాన నగరాల్లో భద్రతను కట్టదిట్టం చేశారు.ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాదుల ఆనవాళ్లపై ఆరా తీస్తున్నారు. ఏదీ వదలకుండా తనిఖీలు చేపడుతున్నారు. గణతంత్ర దినోత్సవం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే దేశ రాజధానిలో ఓ ఆర్మీ ఆఫీసర్‌ కారు అపహరణకు గురవడం తీవ్ర కలకలం రేపింది.

పోలీసు తనిఖీలు ముమ్మరం

దేశ రాజధానిలో హై అలర్ట్‌ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం దగ్గరపడుతున్న నేపథ్యంలో నిఘావర్గాల హెచ్చరికలతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే పలువురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీలో ఆర్మీవైద్యుడి కారు అపహరణ

ఢిల్లీలోని లోధి గార్డెన్ లో పార్క్ చేసిన ఓ ఆర్మీ ఆస్పత్రి వైద్యుడికి చెందిన కారును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించడం కలకలం రేపింది. ఉగ్రవాదులే ఆ కారును ఎత్తుకెళ్లి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పోలీసు బృందాలకు కారు ఫొటోను పంపించి వెతికే పని ప్రారంభించారు.

దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు

పోలీసుల తనిఖీలకు తోడు... జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కూడా దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో 14 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు తాజాగా గుజరాత్‌లోని వడోదరలో ఐదుగురు ఐఎస్ తీవ్రవాద అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

భద్రత కట్టుదిట్టం

దేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు ప్రధానమంత్రి నరేంద్రమోదీని టార్గెట్ చేశారనే సమాచారం నేపథ్యంలో దేశ రాజధానిని జల్లెడ పడుతున్నారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 

 

21:51 - January 24, 2016

హైదరాబాద్ : రోహిత్ ఆత్మహత్యపై హెచ్‌సీయూ రగులుతూనే ఉంది. విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. మరోపక్క వర్సిటీ వీసీ సెలవుపై వెళ్లారు. బాధ్యతలు ఇన్‌ఛార్జి వీసీకి అప్పగించారు. ఇక హెచ్‌సీయూలో రాజకీయ నాయకుల పరామర్శలు ఆదివారం కూడా కొనసాగాయి.

రోహిత్‌ ఆత్మహత్యపై నిరసనలు

హైద్రాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యపై నిరసనలు కొనసాగుతున్నాయి. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ స్టూడెంట్స్‌ చేస్తున్న ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

సెలవులో హెచ్‌సీయూ వీసీ

ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వర్సిటీలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు లీవ్ లో వెళ్లారు. ఇన్‌ఛార్జ్‌ వీసీగా ప్రొఫెసర్ వి శ్రీవాత్సవ్‌ను నియమించారు. ఐతే ఇన్ఛార్జ్ వీసీగా శ్రీవాత్సవ్ ను నియమించడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుబట్టాయి. గతంలోనూ ఓ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి ఆయనపై అభియోగాలున్నాయని స్టూడెంట్స్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి.

విద్యార్థుల ఉద్యమానికి మద్దతు

మరోపక్క యూనివర్శిటీలో రాజకీయ నాయకులు పరామర్శలు కొనసాగుతున్నాయి. ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థులకు తమ మద్దతు కొనసాగుతోందని స్పష్టం చేశారు. రోహిత్ తల్లి రాధికను నేతలు పరామర్శించారు.

మద్దతుగా రిలే దీక్షలు

రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రోహిత్‌ సంఘీభావ పోరాట కమిటీ ఆద్శర్వంలో ఇందిరాపార్కు దగ్గర రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. పలు కార్మిక సంఘాల నేతలు, అధ్యాపకులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. ట్యాంక్‌ బండ్‌ దగ్గర రోహిత్‌ సంఘీభావ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. పలు ప్రజా సంఘాల నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రోహిత్‌ ఆత్మహత్యపై తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.

ఏపీలోనూ ఆందోళనలు

రోహిత్‌ ఆత్మహత్యకు నిరసనగా ఏపీలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలో పాదయాత్ర చేపట్టారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

 

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌ : మాదాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతురాలిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతిగా గుర్తించారు. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఆ యువతి పనిచేస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

21:36 - January 24, 2016

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మల్లన్న పర్యటించి ఎన్నికలపై ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గోషామహల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మడ్ ఫోర్డు ప్రాంతంలోని పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో పర్యటించి… అక్కడి ప్రజల మనోభావాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలు, ఇబ్బందులు, కష్టాలను మీడియాతో వివరిస్తూ.. వాపోయారు. మరిన్ని వివరాలను వారి మాటల్లోనే…

ప్రజలు…

ఎన్నికలప్పుడు ఓట్ల కోసం అన్ని పార్టీల నేతలు వస్తారు. గెలిచాక మళ్లీ తిరిగి చూడరు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. బిజెపి, కాంగ్రెస్ ను గెలిపిస్తే.. ఏం పనులు చేయలేదు.. ఇళ్ల పట్టాలు ఇయ్యలేదు.. మంచీనీళ్లు లేవు, మరుగుదొడ్లు లేవు. ఓట్లప్పుడు కాళ్లు మొకుతున్నరు.. ఆ తర్వాత ఎవరు మా వైపు చూడడం లేదు'.. అని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం…

 

 

విద్యార్థులు సహకరిస్తే… చర్చలు : వీసీ శ్రీవాత్సవ్

హైదరాబాద్ : రేపు హెచ్ సీయూ పరిస్థితులపై సిబ్బందితో సమావేశమవుతానని హెచ్ సీయూ ఇంచార్జ్ వీసీ డా.విపిన్ శ్రీవాత్సవ్ తెలిపారు. విద్యార్థులు సహకరిస్తే… వారితో చర్చలు జరుపుతామని చెప్పారు.

రోహిత్ మృతికి కారకులను శిక్షించాల్సిందే : తమ్మినేని

హైదరాబద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారకులను శిక్షించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రోహిత్ సంఘీభావ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రోహిత్ చిత్రపటానికి తమ్మినేనితోపాటు చుక్కా రామయ్య, కంటె ఐలయ్య, పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రేపటి చలో హెచ్ సీయూ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. వీసీ సెలవులపై వెళ్లడం కాదు.. సస్పెండ్ చేయాలన్నారు.

ఆర్మీ స్టిక్కర్ కారును చోరీ చేసిన ఉగ్రవాదులు..?

ఢిల్లీ : లోధి గార్డెన్స్ వద్ద ఆర్మీ స్టిక్కర్ కారు చోరీకి గురైంది. తెలుపు రంగు సాంత్రో కారును ఎత్తుకెళ్లారని ఆర్మీ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారును ఉగ్రవాదులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

 

ఉగ్రవాద సంస్థలపై పాక్ కఠిన చర్యలు తీసుకోవాలి : ఒబామా

అమెరికా : ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఈమేరకు పిటిఐతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్థాన్ పూర్తిగా నోధించాలన్నారు. ఉగ్రవాద సంస్థలపై చర్యలకు పాక్ నుంచే ప్రారంభించాలని సూచించారు.

 

అంధుల టీ-20 ప్రపంచ కప్ విజేత భారత్

కొచ్చి : అంధుల టీ-20 ప్రపంచ కప్ ఫైనల్ లో పాకిస్థాన్ పై భారత్ అంధుల జట్టు విజయం సాధించింది. ఫైనల్లో పాక్ పై 45 పరుగల తేడాతో భారత్ గెలుపొందింది.

 

20:27 - January 24, 2016

హైదరాబాద్ : ఎండకాలంలో కరెంట్ కోతలు లేకుండా చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా నగరంలోని మాదాపూర్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు అడ్డమైన కండీషన్లు పెట్టిందని.… ఆ కండీషన్లను తాము పక్కకుపెట్టి సంక్షేమకార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మనిషికి ఆరు కిలోల బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం సరఫరా అందిస్తున్నామని పేర్కొన్నారు. హాస్టల్ లో సన్న బియ్యం పెడుతున్నామని తెలిపారు. కళ్యాణ లక్ష్మీపేరుతో ఆడపిల్లల వివాహానికి 50 వేల రూపాయలను ఇస్తున్నామని వివరించారు.

 

 

 

హెచ్ సీయూ విద్యార్థుల జేఏసీ సమావేశం

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థుల జేఏసీ సమావేశం అయ్యారు. వర్సిటీ అప్పారావు సెలవులపై వెళ్లడంపై వారు చర్చిస్తున్నారు.

20:00 - January 24, 2016

అమరావతి : బెజవాడలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఒక పక్క గణతంత్ర దినోత్సవ వేడుకలు మరోపక్క పెరుగుతున్న క్రైం రేటును దృష్టిలో పెట్టుకొని నిఘాను పటిష్ట పరిచారు. అడుగడుగునా తనిఖీలు చేస్తూ ప్రత్యేక దృష్టి సారించింది.

నగరంపై నిఘానేత్రం ఉంచాలని పోలీసుల నిర్ణయం

గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సందర్భంలో అసాంఘిక శక్తుల చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా నేత్రాలపై కూడా మరింతగా దృష్టి సారించింది. నగరం మొత్తాన్ని తమ కనుసన్నల్లోనే ఉంచుకునేలా పోలీస్‌శాఖ చర్యలు చేపట్టింది. అన్ని వీధుల్లోనూ పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. సీపీ గౌతం సవాంగ్ నిఘాపై ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రతి వీధి తమ పోలీసుల కనుసన్నల్లో

ఇదే సమయంలో నగరంలోని ప్రతి వీధి తమ కనుసన్నల్లో ఉండాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ అసాంఘిక శక్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

విజయవాడ రైల్వే స్టేషన్‌పై నిఘా

ఇక విజయవాడ నగరంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే.. సహించేది లేదని రౌడీలకు, అల్లరిమూకలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో పాటు నిఘాను మరింత ముమ్మరం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రాజధాని నగరానికి రైళ్ల ద్వారానే ఎక్కువగా వస్తున్నారనే సమాచారం మేరకు విజయవాడ రైల్వేస్టేషన్ లో.. తనిఖీలు నిర్వహించి గస్తీని ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల్లో చోరీలు, దోపిడీలకు పాల్పడి విజయవాడకు రాకపోకలు సాగిస్తున్న గ్యాంగ్ ల భరతం పట్టేందుకు ఆయా శాఖల అధికారులతో కలసి బెజవాడ రైల్వే జంక్షన్లో పోలీసులు పహారా కొనసాగిస్తున్నారు.

ప్రతీ వీధిలోనూ సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు

విజయవాడ నగరంలో ఐదు వేల వీధులుంటాయని పోలీస్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రతి వీధిలోనూ పోలీస్ నిఘాతోపాటు సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చి పూర్తిగా నిఘా ఉంచాలనే భావనలో సీపీ ఉన్నట్లు తెలుస్తోంది. వీధి నిడివి, అవసరాలను బట్టి కెమెరాల సంఖ్య నిర్ణయించే అవకాశం ఉంది.

రద్దీ కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు

రైల్వేస్టేషన్, బస్ స్టేషన్, ఇతర రద్దీ కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. కొత్త వ్యక్తులు ఎవరు నగరంలోకి ప్రవేశించినా, ఎటొచ్చినా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

19:42 - January 24, 2016

అనంతపురం : పరిటాల రవీంద్ర పదకొండో వర్థంతి అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పరిటాల కుటుంబసభ్యులతో పాటు... ఛీప్ విప్ కాలువ శ్రీనివాసులు, మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, ఎంఎల్ఏలు హాజరయ్యారు. ఏప్రిల్‌లో హిందూ, ముస్లింలకు సామూహిక వివాహాలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. పరిటాల రవీంద్రకు వివాహాలు చేయడమంటే ఇష్టమని అందుకే... వర్థంతి సందర్బంగా పెళ్ళిళ్ళు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

 

19:28 - January 24, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమిని గెలిపించాలని టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. బల్దియా ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ-టీడీపీ పార్టీలు.. తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమను గెలిపిస్తే హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ కార్పొరేషన్ డబ్బులను ప్రభుత్వం డైవర్టు చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ కార్పొరేషన్ కు చెందిన 150 కోట్ల రూపాయలను ఆర్టీసీకి డైవర్టు చేశారని విమర్శించారు. హైదరాబాద్ ను తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఎల్.రమణ..

సీఎం కేసీఆర్ పై టిటిడిపి ప్రెసిడెంట్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ పరిపాలన కేంద్రమైన హైదరాబాద్ కు సమయం ఇవ్వకుండా ఆయన ఫామ్ హౌజ్ లో ఉంటున్నాడని విమర్శించారు. సమస్యలు చెప్పుకుందామంటే ప్రజలకు సీఎం అందుబాటులో ఉండడం లేదన్నారు. టీఆర్ ఎస్ కు అధికారం ఇస్తే గ్రేటర్ లో మరిన్ని సమస్యలు వస్తాయని చెప్పారు. నగర శివారులో ఉన్న బహుళజాతికి సంస్థలకు సహకరిస్తామని తెలిపారు.

 

19:02 - January 24, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు. బల్దియా ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ-టీడీపీ పార్టీలు.. తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ను మురికి వాడలు లేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు. స్వచ్ఛ్ భారత్ నిధులతో మురికి వాడలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్య త్రీవంగా ఉందని... నరకకూపంగా మారిందన్నారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర సహకారం లేకుండా హైదరాబాద్ అభివృద్ధి జరగదన్నారు. జీహెచ్ ఎంసీలో టిఆర్ ఎస్ అన్ని రకాల పన్నులు పెంచనున్నారని చెప్పారు. గులాబీ రంగులో ప్రజలను ముంచుతున్నారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే.. టీసర్కార్ ప్రజలపై అదనపు భారం మోపుతుందని చెప్పారు. టీఆర్ ఎస్ ప్రకటించిన ఏ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.

 

18:50 - January 24, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో తమదే విజయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా మద్దతు తమకే ఉందని స్ఫష్టం చేశారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రతిపక్షాల పసలేని విమర్శలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇతర పార్టీల వారిని పార్టీలో చేర్చుకోవడం కొత్తేమీ కాదని.. అయినా అసలు వాళ్లు పార్టీని ఎందుకు వీడుతున్నారో విపక్షాలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా గ్రేటర్ ఎన్నికల్లో విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. 

 

18:45 - January 24, 2016

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగలింది. తెలంగాణ విభాగం ఉపాధ్యక్షుడు కృష్ణయాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన టీఆర్ఎస్‌లో చేరనున్నారు. టీడీపీ పెత్తందార్ల చేతుల్లో కేలుబొమ్మగా మారిందని కృష్ణ యాదవ్ ఆరోపించారు.

 

 

18:37 - January 24, 2016

కృష్ణా : విజయవాడలో ఫలపుష్ప ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది.విభిన్న రకాల పూల మొక్కులు ఎగ్జిబిషన్‌లో కొలువు దీరాయి.ఎగ్జిబిషన్‌లో 40 స్టాళ్లను ఏర్పాటుచేశారు. హరిత ప్రియ ప్లాంట్‌ లవర్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫలపుష్ప ప్రదర్శనను కేంద్రమంత్రి సుజనా చౌదరి, డీజీపీ రాముడు ప్రారంభించారు. 

18:32 - January 24, 2016

ఆదిలాబాద్‌  : జిల్లా బెల్లంపల్లిలో దారుణం జరిగింది. నవ మాసాలు మోసి.. కనిపెంచిన తల్లిని కన్నకొడుకులు మరిచారు. నలుగురు కొడుకులు కన్నతల్లిని ఒంటరిగా ఇంట్లో నిర్బంధించారు. సుభాష్‌నగర్‌లో మల్లమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలిని ఇంటిలోపలే ఉంచి తాళం వేసి కుమారులు వెళ్లిపోయారు. తినడానికి తిండిలేక..తాగడానికి నీళ్లు లేక నాలుగు రోజులుగా ఆ వృద్ధురాలు అలమటిస్తోంది. వృద్ధురాలిని గమనించిన బస్తీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మల్లమ్మ నలుగురు కొడుకుల్లో ఒకరు సింగరేణిలోనూ, మరొకరు ఆర్టీసీ డ్రైవర్‌గా, ఇంకొకరు 108 డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

 

18:22 - January 24, 2016

కడప : జిల్లాలో ఫారెస్ట్ అధికారులు మరోసారి భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంలో ఒకే నెంబర్ ఉన్న 2 తమిళనాడు బస్సులను పట్టుకున్నారు. ఈ 2 బస్సుల్లో 50 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు డ్రైవర్లను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా.. 2 బస్సుల్లో 80మంది తమిళ కూలీలు అడవిలోకి వెళ్లారని తెలిపారు. దీంతో పోలీసులతో కలిసి ఫారెస్ట్ సిబ్బంది... కూంబింగ్ ప్రారంభించారు.

 

18:19 - January 24, 2016

విశాఖ : జిల్లాలోని పాయకరావుపేట మండలం రాజవరంలోని దక్కన్‌ కెమికల్స్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్స్‌ నిల్వ ఉంచే గోదాములో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున పొగలతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడ్డారు. మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీ చుట్టుపక్కల రాజవరం, కేశవరం, గజపతినగరం గ్రామాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. మంటల నుంచి వచ్చే రసాయనాల దుర్గంధం భరించలేక వాహనల్లో తుని ప్రాంతానికి తరలి వెళ్లారు. అగ్నిప్రమాదంతో మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు అదుపులోకి రావడానికి మరింత సమయం పడుతుందని సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

 

 

దక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

విశాఖ : పాయకరావుపేట కేశవరం సమీపంలోని దక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. 250 మందికి పైగా కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

 

18:09 - January 24, 2016

విజయవాడ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై కేసీఆర్‌, చంద్రబాబు స్పందించాలని సీపీఐ ఎపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించకపోవడం దారుణమన్నారు. దేశంలోని రాజకీయ పార్టీల నేతలందరూ యూనివర్శిటీకి వస్తున్నా, కేసీఆర్‌ ఇప్పటికీ పట్టించుకోకపోవడం సరికాదన్నారు.

 

 

18:01 - January 24, 2016

హైదరాబాద్ : బల్దియా ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ-టీడీపీ పార్టీలు.. తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సమగ్రమైన అభివృద్ధి, పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు తమ మేనిఫెస్టో రూపొందించినట్టు నేతలు తెలిపారు. నగరాన్ని మురికి వాడలు లేని నగరంగా మారుస్తామని బీజేపీ-టీడీపీ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి, కేంద్రమంత్రి దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

 

హెచ్ సీయూ ఘటనలో మరో మలుపు..

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన మరో మలుపు తిరిగింది. హెచ్ సీయూ వీసీ అప్పారావు సెలవులపై వెళ్లారు. అప్పారావు తాత్కాలిక సెలవులు తీసుకున్నారు. డా.విపిన్ శ్రీవాత్సవ్ కి వీసీ బాధ్యతలు అప్పగించారు. రేపటి నుంచి శ్రీవాత్సవ్ బాధ్యతలు తీసుకోనున్నారు.  

17:54 - January 24, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన మరో మలుపు తిరిగింది. హెచ్ సీయూ వీసీ అప్పారావు సెలవులపై వెళ్లారు. అప్పారావు తాత్కాలిక సెలవులు తీసుకున్నారు. డా.విపిన్ శ్రీవాత్సవ్ కి ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. రేపటి నుంచి శ్రీవాత్సవ్ బాధ్యతలు తీసుకోనున్నారు. వీసీ సెలవులపై వెళ్లడాన్ని విద్యార్థులు త్రీవంగా తప్పుబడుతున్నారు. కేంద్రం, వీసీ రాజకీయ డ్రామా ఆడుతున్నారని మండిపడుతున్నారు. కుట్ర పూరితంగానే వీసీ సెలవులపై వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసును తప్పుదోవపట్టించడానికి ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థుల ఆందోళన ఉధృతం 

మరోవైపు హెచ్ సీయూలో విద్యార్థులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. రోహిత్ మృతికి ప్రధాన నిందితుడు వీసీ అప్పారావు అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వీసీ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీసీ అప్పారావు రాజకీయంలో భాగంగానే సెలవులపై వెళ్లిపోయారని విమర్శించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే అప్పారావు సెలవులపై వెళ్లారని మండిపడుతున్నారు. కేంద్రప్రభుత్వం వీసీ అప్పారావును తొలగించాలని… అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ డ్రామా ఆడుతున్నారని మండిపడుతున్నారు. రోహిత్ మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, బండారు దత్తాత్రేయలను పదవుల నుంచి తొలగించాలని కోరుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డివమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ ఉద్యమం ఆగదని విద్యార్థులు హెచ్చరించారు. తమ నిరసన కొనసాగుతోందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రేపటి చలో హెచ్ సీయూ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తామని చెప్పారు.

 

జేడీయూ ఎమ్మెల్యే సర్ఫరాజ్ అరెస్టు

హైదరాబాద్ : జేడీయూ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలంను పోలీసులు అరెస్టు చేశారు. రైలులో ఓ మహిళతో ఘర్షణ పడ్డారని సర్ఫరాజ్ అరోపణలున్నాయి. ఈమేరకు పోలీసులు సర్ఫరాజ్ ను అరెస్టు చేశారు.

 

17:00 - January 24, 2016

ఢిల్లీ : రిపబ్లిక్‌ డే కవాతు సన్నాహాలు దేశ రాజధాని ఢిల్లీలో చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే రాజ్‌పథ్‌లో రిహార్సల్స్‌ చూపరులును ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హొలాండే దేశరాజధాని ఢిల్లీలో జరుగబోయే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.

ఎయిర్‌ఫోర్స్ జెట్ విన్యాసాలు

ఫ్రెంచ్ కంటిజెంట్‌కు చెందిన 123 మంది సైనికుల కవాతు.. ఊపిరి బిగబట్టి చూడాల్సిన ఎయిర్‌ఫోర్స్ జెట్ విన్యాసాలు.. దేశ సంస్కృతి సంప్రదాయాలను, అభివృద్ధి నమూనాలను కండ్ల ముందుంచేలా సాగిపోనున్న వివిధ రాష్ర్టాలు, శాఖల వాహనాలు.. త్రివిధ దళాలకు చెందిన మహిళా సైనికుల మార్చ్‌ఫాస్ట్.. ఒకటేమిటి? ప్రత్యక్షంగా తిలకించే అతిథులను, ప్రత్యక్ష ప్రసారాలద్వారా వీక్షించే కోట్ల మంది దేశ ప్రజలను అలరించేందుకు, కొత్త ఉత్సాహాలు రేకెత్తించేందుకు 67వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది.

కన్నులపండువగా డ్రస్ రిహార్సల్స్ 

సాధారణంగా 115 నిమిషాలపాటు ఉండే వేడుకల సమయాన్ని ఈసారి కాస్త తగ్గించినా ఘనత ఏమాత్రం తగ్గని పద్ధతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రాజ్‌పథ్‌లో నిర్వహించిన డ్రస్ రిహార్సల్స్ కన్నులపండువగా సాగాయి. రిహార్సల్ వల్ల ఢిల్లీలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు 

ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హొలాండే దేశరాజధాని ఢిల్లీలో జరుగబోయే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన నేటి నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు.

రాక్‌ గార్డెన్స్‌ను సందర్శించిన హోలాంండ్ 

నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో ఆయన చంఢీగడ్‌ చేరుకున్నారు. అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి రాక్‌ గార్డెన్స్‌ను సందర్శించారు. సాయంత్రం భారత్‌-ఫ్రాన్స్‌ వ్యాపార సదస్సుకు హాజరుకానున్నారు. అనంతరం 6.30గంటలకు అక్కడ నుంచి దిల్లీకి పయనం కానున్నారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
 

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు పర్యటన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజ్‌పథ్‌ పరిసర ప్రాంతాల్లోని ట్రాఫి‌క్‌ను దారి మళ్లించనున్నారు.

 

16:50 - January 24, 2016

హైదరాబాద్ : రోహిత్‌ ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందిరాపార్కు దగ్గర రోహిత్‌ సంఘీభావ పోరాట కమిటీ ఆద్శర్వంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఇవాళ రెండో రోజుకు చేరుకున్నాయి. పలు కార్మిక సంఘాల నేతలు, అధ్యాపకులు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. కుల, వర్గ రహిత సమాజం కోసం పోరాడాలని ప్రొఫెసర్‌ గాలి వినోద్‌ కుమార్‌ అన్నారు.

 

తెలంగాణ టిడిపికి మరో ఝలక్

హైదరాబాద్ : తెలంగాణ టిడిపికి మరో ఝలక్ తగలింది. కృష్ణయాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో టీఆర్ ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. 

టీడీపీ, బీజేపీ 'గ్రేటర్ విజన్ డాక్యుమెంట్' విడుదల

హైదరాబాద్ : టీడీపీ, బీజేపీ గ్రేటర్ విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. హైదరాబాద్ షహర్ హమారా పేరుతో విజన్ డాక్యుమెంట్ ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విడుదల చేశారు. ఎల్.రమణ, కిషన్ రెడ్డి, ఎర్రబెల్లితోపాటు పలువురు నేతలు హాజరయ్యారు.

 

16:20 - January 24, 2016

ఢిల్లీ : టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ...2016 సీజన్ ఆస్ట్రేలియా టూర్ తొలిదశ వన్డే సిరీస్ ను ధూమ్ ధామ్ గా ముగించాడు. ప్రపంచ చాంపియన్ ఆసీస్ ప్రత్యర్థిగా వెయ్యి పరుగులు పూర్తి చేయడంతో పాటు....వన్డే క్రికెట్లో 5 వేల పరుగులు సాధించిన క్రికెటర్ ఘనత సొంతం చేసుకొన్నాడు. టీమిండియా వండర్ ఓపెనర్ రోహిత్ శర్మపై 10 స్పోర్ట్స్ స్పెషల్ ఫోకస్‌......

రోహిత్ పరుగుల జోరు, సెంచరీల హోరు

ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ ను టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులజోరు, సెంచరీల హోరుతో ముగించాడు. రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో...రికార్డుల మోత మోగించాడు.

ఐదుమ్యాచ్ ల సిరీస్ లో 441 పరుగులు

మొత్తం ఐదుమ్యాచ్ ల సిరీస్ లో 441 పరుగులు సాధించి...టాప్ స్కోరర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు. పెర్త్ వాకా స్టేడియం వికెట్ పై జరిగిన తొలి వన్డేలో 171 పరుగుల స్కోరుతో బోణీ కొట్టిన రోహిత్....సిడ్నీలో ముగిసిన ఆఖరి వన్డేలో 99 పరుగులకు అవుటై ..సిరీస్ లో మూడో సెంచరీ చేజార్చుకొన్నాడు.

కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన రోహిత్

సహఓపెనర్ శిఖర్ ధావన్, వన్ డౌన్ విరాట్ కొహ్లీలతో కలసి పలు కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన రోహిత్...తొలివన్డేలో 171, రెండో వన్డేలో 124, మూడో వన్డేలో 6 పరుగులు, నాలుగో వన్డేలో 41 పరుగులు, ఆఖరి వన్డేలో 99 పరుగుల స్కోర్లు నమోదు చేశాడు.

భారీషాట్లతో చెలరేగిన రోహిత్ శర్మ

కంగారూ బౌలర్లను..స్పిన్..పేస్ అన్న తేడాలేకుండా ఎదుర్కొన్న రోహిత్ శర్మ భారీషాట్లతో చెలరేగిపోయాడు. గ్రౌండ్ నలుమూలలకూ మెరుపుషాట్లు కొడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించాడు. ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా వెయ్యి పరుగుల సాధించిన క్రికెటర్ గా నిలిచాడు.

ఆస్ట్రేలియాపై ఐదు సెంచరీలు చేసిన రోహిత్

అంతేకాదు..ఆస్ట్రేలియాపైన ఐదు సెంచరీలు సాధించిన అతికొద్ది మంది క్రికెటర్లలో ఒకనిగా రికార్డుల్లో చేరాడు. గతంలో ఆస్ట్రేలియా పై 209, 141, 138 స్కోర్లతో సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ... ప్రస్తుత సిరీస్ లో 171, 124, 99 స్కోర్లు నమోదు చేశాడు. సిడ్నీలో ముగిసిన ఆఖరి వన్డే ద్వారా...5 వేల పరుగుల మైలురాయి చేరాడు. కేవలం 148 వన్డేల్లోనే రోహిత్ శర్మ 5 వేల పరుగులు సాధించడం విశేషం.

ఐర్లాండ్ పై రోహిత్ తొలివన్డే

2007లో బెల్ ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్ పై తొలివన్డే మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. ప్రస్తుత సిడ్నీ మ్యాచ్ వరకూ ...148 మ్యాచ్ లు ఆడి.. 10 సెంచరీలతో 5 వేలకు పైగా పరుగులు సాధించాడు. రోహిత్ 28 హాఫ్ సెంచరీలు సైతం నమోదు చేశాడు. ఇందులో 264 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు కూడా ఉంది. 2015 జనవరిలో మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డేలో 138 పరుగులతో సెంచరీ సాధించిన రోహిత్...2016 జనవరి 12న జరిగిన పెర్త్ వన్డేలో 171 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం..ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

 

 

16:00 - January 24, 2016

హైదరాబాద్ : త్వరలో తెలంగాణ బ్రాహ్మణ ఫెడరేషన్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కూకట్ పల్లిలోని బ్రాహ్మణ చైతన్య వేదిక సభలో పాల్గొని, మాట్లాడారు. 60 ఏళ్ల దారిద్య్రాన్ని 19 నెలల్లో ఎలా పొగడతామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇన్నేళ్లలో గ్రేటర్ లో ఏం చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏం చేశారని నిలదీశారు. ప్రాజెక్టులు నిర్మించాలనే కనీస అవగాహన లేని నాయకులు ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు. తామున్నది ప్రజల కోసమేనని...ప్రజల సేవే కోసమే కేసీఆర్ ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఉద్యమకాలంలో మాటల తూటలు పేల్చాం.. కాని బాధ్యత గల పార్టీగా అందరినీ అక్కున చేర్చకుంటున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ రావాల్సిందేనని స్పష్టం చేశారు.

 

కాంగ్రెస్ కాపు నేతల సమావేశంలో గందరగోళం

హైదరాబాద్ : కాంగ్రెస్ కాపు నేతల సమావేశంలో గందరగోళం నెలకొంది. వంగవీటిరంగా ఫొటో లేదని కొంతమంది నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో వంగవీటి రంగా ఫొటోను ఏర్పాటు చేయడంతో గొడవ సద్దుమనిగింది.

 

15:44 - January 24, 2016

ఢిల్లీ : మోడీ అనుయాయుడు, బిజెపి జాతీయ కార్యదర్శి అమిత్‌ షా మరోసారి ఆ పదవికి ఎన్నికయ్యారు. ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుని ఎన్నిక కార్యక్రమం జరిగింది. అమిత్‌ను మోడీ, కేంద్రమంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బలపరిచారు. దీంతో అమిత్‌ రెండోసారి జాతీయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా మూడేళ్లపాటు షా జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీటింగ్‌కు సీనియర్ నేతలైన అద్వానీ, మురళీ మనోహర్‌జోషి గైర్హాజరయ్యారు. ఇదేసమయంలో మార్గదర్శక్‌ మండల్‌కు వారిద్దరూ సభ్యులుగా ఎంపికయ్యారు. బిజెపి అధ్యక్షుడిగా ఎంపికవడంతో అమిత్‌ను బిజెపి నేతలు అభినందించారు.

 

15:40 - January 24, 2016

ఢిల్లీ : భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గోనేందుకు మూడురోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్ చండీఘఢ్ లోని వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ఇండియాకు చేరుకున్న హోలాండ్ ను అధికారులు సాధరంగా ఆహ్వానించారు. అనంతరం ఇరు దేశాల వ్యాపార సదస్సుకు హాజరుకానున్నారు హోలాండ్. రేపు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే విందులో పాల్గొంటారు. అనంతరం మహాత్మాగాంధీ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పిస్తారు హోలాండ్. సోమవారం ఉదయం 11.15కు విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో, మధ్యాహ్నం12.00కు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమవుతారన అధికారిక వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో ఢిల్లీ అంతటా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రాజ్‌పథ్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు.

 

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా..

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన అధ్యక్షుడిగా ఉన్న ఆయన రెండోసారి ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకకు అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి దూరంగా ఉండడం విశేషం. అధ్యక్షుడిగా అమిత్ షా పేరును మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపాదించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు పలువురు పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. మూడేళ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

హెచ్ సీయూ ఘటన..మోడీ మొసలి కన్నీరు - తమ్మినేని..

కరీంనగర్ : హెచ్ సీయూలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై ప్రధాని మోడీ మొసలి కన్నీరు కారుస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని విమర్శించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని ఎందుకు ప్రకటన చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ, వీసీ కాల్ డేటాను బహిర్గతం చేయాలని సూచించారు. వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలు ప్రభుత్వంపై కాకుండా గ్రామస్థాయి ధనికవర్గంపై ఉధృతం చేయాలన్నారు. 

భారత్ లో ఫ్రాన్స్ అధ్యక్షుడు..

ఢిల్లీ : భారత్ ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండ్ అడుగు పెట్టారు. మూడు రోజుల పాటు ఆయన దేశంలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో హొలాండ్ ముఖ్యఅతిథిగా పాల్గొనున్నారు.

 

కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి - ఉత్తమ్..

హైదరాబాద్ : కాంగ్రెస్ హాయాంలోనే అభివృద్ధి జరిగిందని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జలాలు నగరానికి తెచ్చింది కాంగ్రెస్సేనని, ఐటీ రంగం కాంగ్రెస్ పాలనలో మొదలైందని, మురికివాడలకు రూ.5వేల 400 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. 

13:34 - January 24, 2016

విజయవాడ : మరో విద్యా కుసుమం రాలిపోయింది. నోవా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ప్రేమ్ ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం వల్లూరు గ్రామానికి చెందిన ప్రసాద్ ఇబ్రహింపట్నంలో ఉన్న నోవా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రసాద్ బీటెక్ చదువుతున్నాడు. ఇతనికి తల్లిదండ్రులు లేరు. దీనితో అన్నా..వదినల సాయంతో విద్యనభ్యసిస్తున్నాడు. శనివారం స్నేహితులతో ప్రసాద్ సినిమాకు వెళ్లాడు. అనంతరం తిరిగి హాస్టల్ కు చేరుకున్నారు. ఉదయం రూంలో ఉరి వేసుకుని ప్రసాద్ కనిపించాడు. వెంటనే ఈవిషయాన్ని తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాలేజీ యాజమాన్యం వేధింపులు..ప్రేమ వ్యవహారం కారణమాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

13:26 - January 24, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు విజయం తథ్యమని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. సైదాబాద్ లో అభ్యర్థి సింగిరెడ్డి స్వర్ణలత కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. కేవలం ఓట్ల మెజార్టీ పెంచుకొనేందుకు తాము ప్రచారం నిర్వహించడం జరుగుతోందన్నారు. అన్ని ఏరియాల్లో చక్కటి స్పందన వస్తోందని, సైదాబాద్ డివిజన్ ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతామన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ విజయం తథ్యమని స్పష్టం చేశారు. ఇక్కడ 5500 పెన్షన్లు, అంత్యోదయ కార్డులు, రేషన్ కార్డులు..ఇతరత్రా సమస్యలు తీర్చడం జరిగిందన్నారు. విద్య, వైద్య రంగాలకు పెద్ద పీఠ వేస్తామన్నారు. గతంలో సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేశారని, ప్రస్తుతం చేపడుతున్న ప్రచారానికి మంచి స్పందన వస్తోందన్నారు. 

13:25 - January 24, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో గన్ ఫౌండ్రీ డివిజన్ లో తామే విజయం సాధిస్తామని టిడిపి, బిజెపి పక్షాల కూటమి అభ్యర్థి సరితా గౌడ్ పేర్కొన్నారు. డివిజన్ లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె టెన్ టివితో మాట్లాడారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలవడం జరుగుతోందని, గన్ ఫౌండ్రీ కార్పొరేటర్ గా తన భర్త మధుగౌడ్ సేవలందించాడన్నారు. అందుకే తనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రచారం నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ప్రజల నుండి ఆదరణ ఉందన్నారు. డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్, వాటర్ సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. గన్ ఫౌండ్రీ ప్రజలు తనను ఆదరించాలని అభ్యర్థి సరిగా గౌడ్ కోరారు.

 

13:12 - January 24, 2016

పెనాంగ్ : భారత స్టార్ షట్లర్, తెలుగుదేశం పీవీ సింధు కొంత ఏడాదిలో టైటిల్ ను సాధించింది. ప్రీమియర్ బ్యాడ్మింటెన్ లీగ్ లో అజేయంగా నిలిచిన సింధు అదే జోరు అదే ఫామ్ మలేషియాలో పునారవృతం చేసింది. పెనాంగ్ లో జరిగిన 2016 సీజన్ టైటిల్ ఫైట్ లో మూడో సీడ్ సింధు ఫైనల్ లో గిల్మోర్ పై అలవోకగా విజయం సాధించింది. 21-15, 21-9 తేడాతో సింధు గెలుపొందింది. 2013లో తొలిసారిగా మలేషియన్ టైటిల్ ను నెగ్గిన సంగతి తెలిసిందే. తిరిగి రెండేళ్ల విరామం తరువాత అదే టైటిల్ గెలుచుకోవడం విశేషం. ఈ విజయంతో విలువైన ర్యాకింగ్ పాయింట్లతో రూ.9 వేల డాలర్ల ప్రైజ్ మని చేజిక్కించుకుంది. 

మలేషియన్ గ్రాండ్ ప్రీ విజేత సింధు..

మలేషియన్ గ్రాండ్ ప్రీ విజేతగా పీవీ సింధు నిలిచింది. రెండోసారి టైటిల్ నెగ్గినట్లైంది. ఫైనల్ లో గిల్మోర్ పై సింధు అలవోకగా విజయం సాధించింది. 21-15, 21-9 తేడాతో సింధు గెలుపొందింది. 

టి.కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టి.కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. నిన్ననే టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

సాహస బాలలకు అవార్డుల ప్రధానం..

ఢిల్లీ : సాహస బాలలకు పురస్కారాలను ప్రధాని మోడీ అందచేశారు. అవార్డు అందుకున్న వారిలో మెదక్ జిల్లాకు చెందిన శివ్వంపేటకు చెందిన రుచిత ఉన్నారు.

 

12:53 - January 24, 2016

దళిత బహుజన భావజాలంతో అద్భుతమైన అభివ్యక్తితో కవిత్వం రాస్తున్నకవి యం వెంకట్. ఆయన రాసిన వర్జి కావ్యం సంచలనం సృష్టించింది. సముద్రం నేపథ్యంగా మత్స్యకారుల ఛిద్రమైన జీవన చిత్రాలకు అద్దం పట్టే కవిత్వం రాసిన అసలు సిసలైన కవి ఆయన. నల్గొండ జిల్లాకు చెందిన కవి వెంకట్ కవిత్వం ధిక్కార స్వరమై ఎగసింది. సాహితీ విశ్లేషకులు జి.లక్ష్మీనర్సయ్యగారి వ్యాఖ్యానంతో వెంకట్ పై ప్రత్యేక కథనం. మరిన్ని విశేషాల కోసం వీడియో చూడండి..

12:51 - January 24, 2016

సాహిత్యం సామాన్య ప్రజలను సైతం కదిలించాలి. వారిని ఆలోచింపజేయాలి. చైతన్యవంతులను చేయాలి. అన్యాయాలను అక్రమాలను ఎదిరించే ఉద్దీపన శక్తిగా పనిచేయాలి. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారెందరో మన మధ్యలో ఉన్నారు. ఈ పేరు వింటేనే ...కల్పన, దొంగల సంత, మహిత, పుష్పవర్ణమాసం మెుదలైన అద్భుత కథలు గుర్తొస్తాయి. నిశిత పరిశీలనతో, వాస్తవికత ఉట్టి పడే విధంగా కథలల్లడంలో ఆమె దిట్ట. ఆమె కేవలం కథలే కాదు అద్భుతమైన భావుకతతో కవిత్వం కూడా రాస్తారు. ఇటీవల ఆమె డార్జిలింగ్ ఆదివాసీల కథలను గ్రంథస్థం చేసి హైదరాబాద్ బుక్ ఫేర్ లో ఆవిష్కరించారు. ప్రముఖ కవయిత్రి, కథనశిల్పి సామాన్య పై ప్రత్యేక కథనం.

 

అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు కేబినెట్ సిఫార్సు..

ఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ సిఫార్సు చేసింది. 

12:27 - January 24, 2016

కర్నూలు : జిల్లాలో నాటుసారా రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. నాటుసారా ఇద్దరి ప్రాణాలు బలిగొంది. సమీప బంధువు చనిపోవడంతో కొయలకుంట్ల మండలం కంపమల్ల గ్రామానికి చంద్రయ్య, దాసరి మద్దయ్యలు వెళ్లారు. అక్కడ వీరు నాటుసారా సేవించారు. వీరిద్దరూ అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆసుపత్రికి తరలించారు. నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మత్తయ్య..కోయలకుంట్ల ఆసుపత్రిలో చికిత్స పొందుత్తూ చంద్ర మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. కల్తీ మద్యమే కారణమా ? ఇతరత్రా కారణాలు ఏవైవా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

12:22 - January 24, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ఇటీవలే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న టిడిపి నేత కిల్లి మనోహర్ పేర్కొన్నారు. వెంగళరావు నగర్ డివిజన్ నుండి ఆయన బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. కేసీఆర్ అద్భుత పనితీరు నచ్చి తాను టిడిపిలోకి వచ్చినట్లు తెలిపారు. 1999లో బూత్ కన్వీనర్ గా టిడిపి నుండి రాజకీయ ప్రస్థానం చేశానని, సమస్యలపై పోరాటం చేయాలని విజయరామారావు సూచనలు చేయడం జరిగిందన్నారు. నీరు మీరు కార్యక్రమంలో 128 ఇంకుడుగుంతలను చేయడం పట్ల బాబు అభినందించడం జరిగిందన్నారు. టిడిపి ఒక నాయకుడిగా తీర్చిదిద్దిందని, ప్రస్తుతం ఈ పార్టీలో తెలంగాణలో ఒక నాయకుడు లేడని, ఒక దశ, దిశ లేదన్నారు. కేటీఆర్ నాయకత్వం బాగా నచ్చిందని, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఒక వారధిగా నిలబెడుతానన్నారు. అలాగే డివిజన్ లో కొన్ని సమస్యలు నెలకొని ఉన్నాయని, మధురానగర్ లో స్విమ్మిగ్ పూల్ ఏర్పాటు..వెంగళరావు నగర్ డివిజన్ లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన..ల్రైబరీ, జవహర్ నగర్ డంపింగ్ యార్డు తరలింపు..ఇతరత్రా సమస్యలను పరిష్కరిస్తానన్నారు. 

12:18 - January 24, 2016

హైదరాబాద్ : గుంటూరు - కాచిగూడ ప్యాసింజర్ రైల్ లో కలకలం రేగింది. రైలు బాత్ రూంలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఉదయం నగరానికి చేరుకున్న రైలులో క్లీన్ చేయడానికి కాంట్రాక్టు కార్మికులు వెళ్లారు. బాత్ రూంలో గోనె సంచి ఉండడం అందులో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులకు తెలిచేశారు. వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళ శరీరంపై బలమైన గాయాలున్నాయి. సంబంధిత మహిళను చిత్ర హింసలకు గురి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మహిళ ఎవరనేది తెలియరాలేదు. 

బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అమిత్ షా..

ఢిల్లీ : బీజేపీ ప్రధాన కార్యలయానికి అమిత్ షా చేరుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి షా నామినేషన్ వేయనున్నారు. 

విద్యార్థుల దీక్షలు భగ్నం చేయడం సిగ్గు చేటు - సీపీఐ...

విజయవాడ : హెచ్ సీయూలో విద్యార్థుల దీక్ష భగ్నం చేయడం సిగ్గు చేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రోహిత్ మృతిపై ఇరు రాష్ట్రాల సీఎంలు స్పందించకపోవడం శోచనీయమని, మోడీకి భయపడే వారు హెచ్ సీయూకు వెళ్లడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారో, ఇవ్వరో స్పష్టంగా చెప్పాలని, టిడిపి అధికారంలోకి వచ్చాక ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

నోవా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య..

విజయవాడ : ఇబ్రహీంపట్నంలో నోవా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి ప్రవీణ్ ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ లో ఉరి వేసుకుని ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తూ.గో. జిఆ్ల కపిలేశ్వరపురానికి చెందిన వాడు. 

వ్య.కా.స ముగింపు సభలకు హాజరైన తమ్మినేని..

కరీంనగర్ : జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నేడు ముగియనున్నాయి. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు.

 

న్యూ డెమోక్రసీ, పోలీసుల మధ్య కాల్పులు..

వరంగల్ : జిల్లా కొత్తగూడ మండలం దొరవారివేం పల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూ డెమోక్రసీ పెద్ద చంద్రన్నవర్గం, కేకే దళం మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. 

త్వరలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం - హొలాండే..

ఢిల్లీ : భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం త్వరలో కుదురుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిన్ హొలాండే వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్, ఫ్రాన్స్ కలిసి పోరాడుతాయని తెలిపారు. 

వెంకటాపురంలో పరిటాల వర్ధంతి..

అనంతపురం : రామగిరి మండలం వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం జరిగింది. పరిటాల రవి ఘాట్ వద్ద ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, కుటుంబసభ్యులు, టిడిపి నేతలు నివాళులర్పించారు. 

11:23 - January 24, 2016

బరోడాలో ఓ ట్యూషన్ టీచర్లు ప్రయోగాలు చేస్తున్నారంట. రాకేష్ పటేల్ అనే ట్యూషన్ టీచర్ విద్యార్థులకు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరగాలంటే పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడు. ఏకంగా విద్యార్థులను గాజులపెంకుల మీద నడిపిస్తున్నాడు. అలా చేస్తే ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతుందని నమ్మకమంట. దీనిపై తల్లిదండ్రులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదంట. ఇలా చేస్తే ఐఐటీలో సీట్లు వచ్చేస్తాయని అనుకుంటున్నారంట. కాళ్లు తీసేస్తే వికలాంగుల కోటా కింద వస్తాయని కొందరు సెటైర్లు విసురుతున్నారు. 

పొగమంచు..ఢీకొన్న 20 కార్లు..

ఉత్తర్ ప్రదేశ్ : ఉత్తరాదిలో భారీగా పొగమంచు కమ్ముకుంది. యమున ఎక్స్ ప్రెస్ హైవేపై ఓ టోల్ ప్లాజా వద్ద 20 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 

10:46 - January 24, 2016

బాహుబలి..మూడు బాషల్లో విడుదలైన ఈ చిత్రం రికార్డుల సునామీ సృష్టించింది. దేశ, విదేశాల్లో సైతం మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని రూపొందించిన రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రధాన పాత్ర పోషించిన 'ప్రభాస్' కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రభాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, రానా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. సుమారు రూ.650 కోట్లకు కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం 'బాహుబలి'కి సీక్వెల్ గా 'బాహుబలి ది కంక్లూజన్ మూవీ' షూటింగ్ జరుగుతోంది. ప్రశంసల జల్లు కురిసిన ఈ చిత్రంపై సీనియర్ నటి 'జమున' మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసింది. బాహుబలి ఓ చెత్త సినిమా అని, హీరో తప్ప, కథ ఎక్కడుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒకరకంగా స్టుపిడ్ సినిమా అని పేర్కొన్నారు. తమన్నా పాత్రను అనుష్క చేసి ఉంటే కాస్త బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు జమున ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు ? అనేది మాత్రం తెలియడం లేదు. 

ముంబై ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు..

ముంబై : ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపులు వచ్చాయి. ఫిబ్రవరి రెండో తేదీలోగా ఎయిర్ పోర్టును పేల్చివేస్తామంటూ శనివారం రాత్రి ఆగంతకుడు విమానాశ్రయ సిబ్బందిని ఫోన్ ద్వారా హెచ్చరించారు. దీనితో ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 

10:17 - January 24, 2016

ఢిల్లీ : ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హొలాండే దేశరాజధాని ఢిల్లీలో జరుగబోయే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన నేటి నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో ఆయన చంఢీగడ్‌ కు చేరుకుంటారు. అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి రాక్‌ గార్డెన్స్‌ను సందర్శిస్తారు. సాయంత్రం భారత్‌ - ఫ్రాన్స్‌ వ్యాపార సదస్సుకు హాజరుకానున్నారు. అనంతరం 6.30గంటలకు అక్కడ నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు పర్యటన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజ్‌పథ్‌ పరిసర ప్రాంతాల్లోని ట్రాఫి‌క్‌ను దారి మళ్లించనున్నారు.

10:16 - January 24, 2016

హైదరాబాద్ : మల్లాపూర్ లో తనదే విజయమని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్త మల్లారెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ సీటు ఇవ్వకపోవడం తనను బాధించిందన్నారు. డివిజన్ లో ప్రచారం నిర్వహిస్తున్న ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎన్నో పనులు చేశానని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో క్యాడెంట్ ను చూసి ఓటేస్తామని డివిజన్ ప్రజలు చెబుతున్నారన్నారు. ప్రతి సమస్యకు ముందు నిలబడి పరిష్కరించడం జరుగుతోందన్నారు. ఇంటింటికి వెళ్లి తాను ఓటును అభ్యర్థించడం జరుగుతోందని, పనిచేసే నాయకుడు కావాలని ప్రతొక్కరూ పేర్కొంటున్నారని తెలిపారు. డ్రైనేజీ, వాటర్ సమస్యలు అధికంగా ఉన్నాయని కొత్త మల్లారెడ్డి తెలిపారు. 

10:15 - January 24, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ మహాసముద్రం. ఎంతమంది పోయినా ఫర్వాలేదని కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్ బినగర్ నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరవయ్యారని విమర్శించారు. అందుకే ఇతర పార్టీల వ్యక్తులను ప్రలోభాలకు గురి చేసి వారిని అభ్యర్థులుగా నిలబెట్టారని, టీఆర్ఎస్ ఇన్ని రోజుల పాలనలో ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారికి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నగరంలో గతంలో కాంగ్రెస్ ఏం చేసింది. ? రానున్న రోజుల్లో ఏం చేస్తుందనే దానిపై ప్రజల్లోకి తీసుకెళుతున్నామన్నారు. ఓటు వేస్తే తాము ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీనిస్తున్టన్లు తెలిపారు. ఈ హామీలపై ప్రజలు ఆకర్షితులవుతున్నారని, కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపిస్తారనే దానిలో సందేహం లేదన్నారు. 

10:00 - January 24, 2016

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల రాజధాని చుట్టూ అగ్రికల్చర్ ప్రొటక్షన్ జోన్స్ వెలుస్తున్నాయి. ఈ జోన్స్ వల్ల రైతులకు నిజంగా లాభం జరుగుతుందా ? నష్టం జరుగుతుందా ? అసలు ఈ ప్రోటక్షన్స్ జోన్స్ ఎందుకు ? ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో ఈ ప్రొటక్షన్ జోన్స్ ప్రతిపాదిస్తోంది ? వ్యవసాయ రంగానికి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. అసలు దీని వెనుక మతలబు..ఇతర విషయాలపై 'ఫర్ ది పీపుల్' కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి…

 

09:55 - January 24, 2016
09:21 - January 24, 2016

ఢిల్లీ : ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కమ్మేసింది. ఎక్కడ చూసినా పొగమంచే దర్శనమిస్తోంది. ఉదయం 9గంటల అవుతున్నా మంచు వీడకపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు అసలు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. విమనయాన, రైళ్లు సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగోంది. దీనితో 18 రైళ్లు రద్దు కాగా 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుండే వచ్చే రైళ్లు 15 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. దేశ రాజధానిలో 4.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

09:15 - January 24, 2016

హైదరాబాద్ : నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ నేత షబ్బీర్ ఆలీ వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహిస్తున్న షబ్బీర్ ఆలీ టెన్ టివితో మాట్లాడారు. కబుర్లు చెప్పడం..యూ టర్న్ లు తీసుకోవడం కేసీఆర్ ఫ్యామిలీకి అలవాటై పోయిందని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం చాలా బాగుందని, 2004 నుండి 2010 సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయలతో మెట్రో రైలు, డ్రింకింగ్ వాటర్, గోదావరి, ఫ్లై ఓవర్ బ్రిడ్జీ, ఐఐటి, ట్రిపుల్ ఐఐటి ఇలా ఏది చేసినా కాంగ్రెస్సే చేసిందన్నారు. గోదావరి 2008 లో శంకుస్థాపన చేయడం జరిగిందని, ఆ సమయంలో కేటీఆర్ అమెరికాలో జాబ్ చేస్తున్నాడని విమర్శించారు. మేం చేస్తే నీళ్లు చల్లుకుంటున్నాడని, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. పాత దినాలు మర్చిపోయిండ్రు అని, ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్..దళిత సీఎం హామీలు ఏమయ్యాయి అంటే ఎప్పుడన్నా అని వారు పేర్కొనడం జరుగుతుందన్నారు. వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు రాకుంటే మంత్రి పదవి వదులుతానని మంత్రి జగదీష్ అన్నాడని, మరి ఆ మాట ఏమైందని ప్రశ్నించారు. 

09:11 - January 24, 2016

చిత్తూరు : శ్రీవారు దర్శనానికి వెళుతున్న వారు శ్రీవారి దర్శనం కాకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన బంగారుపాళ్యం మొగిలిఘాట్ వద్ద చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన కొంతమంది ఇన్నో వాహనంలో తిరుపతికి బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున మొగిలిఘాట్ వద్ద చేరుకున్న వీరి వాహనాన్ని లారీ వేగంగా ఢీకొంది. దీనితో వాహనంలో ఉన్న సురేష్, నరేష్ బాబు, మైల్ వెల్లి రాజా (డ్రైవర్)లు అక్కడికక్కడనే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కానీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. లారీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

భార్యను ముక్కలుగా నరికిన భర్త..

గుజరాత్ : సూరత్ లో దారుణం చోటు చేసుకుంది. కటోదర ప్రాంతంలో భార్యను భర్త నరికి చంపాడు. అతని నివాసంలో శరీర భాగాలు లభ్యమయ్యాయి. నిందితుడు పరారీలో ఉన్నాడు. 

ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు..

ఢిల్లీ : ఉత్తర భారంలో దట్టంగా పొగమంచు అలుముకుంది. దీనితో విమాన, రైళ్ల ప్రయాణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. 135 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా 20 రైళ్లు రద్దయ్యాయి. 

వేల్పూరంలో ముగ్గురు మెడికల్ విద్యార్థినిల ఆత్మహత్య..

తమిళనాడు : రాష్ట్రంలో వేల్పూరంలో ముగ్గురు మెడికల్ విద్యార్థినిలు ఓ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీస్తున్నారు. 

నెక్లెస్ రోడ్డులో 10 కే రన్..

హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ ఈ ఉదయం 10కే రన్‌ను ప్రారంభించారు. అణగారిన వర్గాల పిల్లల విద్యాప్రమాణాల మెరుగుకోసం డిలైట్ ఆధ్వర్యంలో ఈ రన్ ను నిర్వహించారు. ఈ 10కే రన్‌లో యువత పెద్దఎత్తున పాల్గొన్నారు. 

త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు..

ఉత్తర్ ప్రదేశ్ : పౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. భారీగా పొగమంచు కమ్ముకోవడంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. 

07:45 - January 24, 2016

మొక్కై వంగనిది మానై వంగుతుందా? చెప్పండి. పిల్లలకు చిన్నప్పుడు ఏ పదార్థాలనైతే తినిపిస్తారో వాటినే పెద్దయ్యాక ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే చిన్నతనం నుంచే అన్ని పదార్థాలను పిల్లలకు అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు తొలి ఆరునెలలు తల్లిపాలనే ఇవ్వాలి. బయట పదార్థాలను అస్సలు తినిపించకూడదు. ఆ తర్వాత నుంచి కొద్దికొద్దిగా అన్నం, మెత్తని పండ్లు.. అలా ఆహారపదార్థాలను అలవాటు చేయాలి. సాధారణంగా బాల్యంలో రుచి చూసే పదార్థాలకు అనుగుణంగా నాలుకపై రుచి బుడిపెలు అభివృద్ధి చెందుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైందని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ సమయంలో తినే పదార్థాలనే పెద్దైన తర్వాత కూడా తినడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి పెద్దైన తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటే చిన్నప్పట్నుంచే పిల్లలకు వాటిని రుచి చూడటం నేర్పించాలి.

07:44 - January 24, 2016

గుప్పెడు గులాబిరేకలను బాగా కడిగి ఒక పాత్రలో వేసి నీళ్లుపోసి మరిగించాలి. చల్లారాక వడకట్టి ఓ సీసాలో పోసుకొని అవసరమైనపుడల్లా ఈ గులాబీనీటిని ముఖానికి రాసుకుంటూ ఉంటే ముఖంపై పేరుకునే దుమ్ముధూళి పూర్తిగా తొలగిపోయి చర్మం తేటగా మారుతుంది. ఇది అన్ని రకాల చర్మతత్వం వారికి సరిపోతుంది. చెంచా పెరుగుకు కాస్త బత్తాయిరసం చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి పళ్ళెంలో పోసి అందులో ముంచి ఆ చేతులతో నెమ్మదిగా ముఖాన్ని మర్దనా చేసి ఐదు నిమిషాలయ్యాక కడిగేయాలి. మృదువైన చర్మంతో పాటు మీ చేతులూ శుభ్రంగా అవుతాయి. ఐదారు బీన్స్‌ తీసుకొని మెత్తగా గ్రైండ్‌ చేసుకొని దానికి కొంచెం పెరుగు కలిపి చర్మానికి రాసుకుని మర్దన చేయాలి. ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. చర్మం కోమలంగా తయారవుతుంది.

07:43 - January 24, 2016

తమ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంలో ప్రేక్షకులకు అవగాహన కలిగించే రీతిలో ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ని విడుదల చేసే సంప్రదాయాన్ని దర్శక, నిర్మాతలు తూ.చ.తప్పకుండా పాటిస్తున్నారు. కథ, హీరో క్యారెక్టరైజేషన్‌ తదితర అంశాలతోపాటు స్టార్‌ హీరోలకైతే వాళ్ళ అభిమానులకి తగ్గట్టు..ఇలా అన్ని రకాల అంశాల్ని పరిగణనలోకి తీసుకుని దర్శక, నిర్మాతలు ఎంతో క్రియేటివిటీతో ఫస్ట్‌లుక్‌ని రూపొందించి ఇంప్రెషన్‌ కొట్టేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌కి విపరీతమైన ప్రయారిటీ పెరిగింది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇద్దరు స్టార్‌ హీరోలు ఫస్ట్‌లుక్‌లతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అల్లుఅర్జున్‌ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ రూపొందిస్తున్న 'సరైనోడు' చిత్రానికి సంబంధించి ప్రీ -లుక్‌ శుక్రవారం విడుదలైంది. ఈ ప్రీ-లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు బోయపాటి శ్రీను తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే, కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య సైతం తన తాజా చిత్రం 'ఎస్‌3' ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. సూర్య హీరోగా 'సింగం' చిత్రానికి మూడవ సీక్వెల్‌గా 'ఎస్‌3' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సింహాన్ని పోలిన్నట్లు ఉన్న సూర్య 'ఎస్‌3' పోస్టర్‌ ఇప్పుడు అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. హరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క, శ్రుతిహాసన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

07:40 - January 24, 2016

యాక్షన్‌ సిరీస్‌గా 'ధూమ్‌' సిరీస్‌ బాలీవుడ్‌ ప్రేక్షకుల్నే కాదు యావత్‌ భారతీయ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుని కోట్ల రూపాయల్ని కొల్లగొట్టింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు వచ్చిన చిత్రాలన్ని మెగాహిట్స్‌ అయ్యాయి. ఈ మధ్యకాలంలో 'ధూమ్‌4' చిత్రానికి సంబంధించి రకరకాల వార్తలు సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేశాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఓ ప్రకటన చేసింది. త్వరలోనే 'ధూమ్‌' సిరీస్‌లో భాగంగా 'ధూమ్‌4' ప్రారంభమవుతుంది. ఇందులో ఎవరెవరు నటిస్తారనే విషయాన్ని అతి త్వరలోనే ప్రకటిస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌తోపాటు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌రోషన్‌, ఐశ్వర్యరాయ్ నటిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, తాజాగా పరిణితి చోప్రా సైతం ఈచిత్రంలో నటిస్తోందంటూ వార్తలొస్తున్నాయి. ఏది ఏమైనా సంచలన విజయం సాధించిన 'ధూమ్‌' సిరీస్‌లో భాగస్వామి అవ్వడమనేది కెరీర్‌లో పరిణితి ఓ అడుగు ముందుకేసినట్టే కదా.

07:39 - January 24, 2016

'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'తో పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. పవన్‌ మార్కు వినోదంతో సాగే ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన మూడు ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను భారీగానే పెంచాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు ఈ చిత్రం ఆడియోను మార్చి 12 న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. పవన్‌కళ్యాణ్‌ అభిమానులు, ప్రేక్షకులందరికీ నచ్చే రీతిలో ఇప్పటికే సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ అత్యద్భుతమైన స్వరాల్ని సమకూర్చారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో వేసిన రతన్‌పూర్‌ సెట్‌లో శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో నటించే ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్‌కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పవన్‌ కళ్యాణ్‌ దగ్గరుండి చూసుకున్న విషయం విదితమే. పవన్‌ కళ్యాణ్‌ సరసన కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ ప్రత్యేక పాటలో పవన్‌తో జత కట్టింది. పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శరత్‌ మారర్‌, సునీల్‌ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 8న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

07:35 - January 24, 2016

మలయాళ చిత్రం 'ప్రేమమ్‌'తో సౌత్‌లో బాగా ఫేమసైన హీరోయిన్‌ సాయి పల్లవి తాజాగా అగ్ర దర్శకుడు మణిరత్నం సినిమాలో నటించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం మణిరత్నం కోలీవుడ్‌ నటుడు కార్తీ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ కోసం ఇటీవల ఆడిషన్స్‌ నిర్వహించారు. స్క్రీన్‌టెస్ట్‌లో పల్లవి బాగా ఆకట్టుకోవడంతో మణిరత్నం ఆమెను వెంటనే ఫైనలైజ్‌ చేశారు. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా రూపొందబోయే ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతమందిస్తుండడం విశేషం. అయితే ఈ చిత్రంలో ముందుగా దుల్కర్‌ సల్మాన్‌ని హీరోగా, నిత్యా మీనన్‌, కీర్తి సురేష్‌లను హీరోయిన్లుగా అనుకున్నారట. కాని వారంతా తమ సినిమాలతో బాగా బిజీగా ఉండడంతో కార్తీని హీరోగా ఎంపిక చేశారు. గతేడాది నటించిన సాయి పల్లవి 'ప్రేమమ్‌' చిత్రం మాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడంతోపాటు అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో నాగచైతన్య హీరోగా 'మజ్ను'గా రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

07:33 - January 24, 2016

'కొన్ని సినిమాల్లోని పాత్రల నిడివి తక్కువే అయినప్పటికీ వాటి ప్రాముఖ్యత చాలా ఉంటుంది. అటువంటి పాత్రలు కొన్ని సార్లు సినిమాల్లో చాలా కీలకంగా కూడా ఉంటాయని' అంటోంది శృతిహాసన్‌. జాన్‌ అబ్రహం కథానాయకుడిగా బాలీవుడ్‌లో 'రాకీ హ్యాండ్సమ్‌' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. 2010లో విడుదలైన కొరియన్‌ చిత్రం 'ద మ్యాన్‌ ఫ్రమ్‌ నో వేర్‌' చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని స్వయంగా జాన్‌ అబ్రహం నిర్మిస్తున్నారు. 'ఓ డ్రగ్స్‌ మాఫియా ముఠాకి చెందిన కొంతమంది ఎనిమిదేళ్ళ పాపను ఎత్తుకెళ్తారు. ఆ ఎత్తుకెళ్ళిన పాపను కథానాయకుడు సురక్షితంగా ఎలా తీసుకొచ్చాడనేదే ఈ చిత్రకథ. ఈచిత్రంలోని ఓ ముఖ్యపాత్రలో శ్రుతిహాసన్‌ నటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మార్చి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నటించిన అతిథి పాత్ర గురించి శ్రుతి పై విధంగా స్పందించింది. 'ఈ చిత్రకథ నాకెంతో బాగా నచ్చింది. అందుకే ఎంతో ఇష్టపడి ఈ చిత్రంలో నటించాను. ఓ పాపను రక్షించే క్రమంలో నా పాత్ర ఏం చేసిందనేది మాటల్లో కంటే వెండితెర మీద చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇటువంటి పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. పాత్ర నిడివి తక్కువైనప్పటికీ దీనికున్న ప్రాధాన్యతే నన్ను నటించేలా చేసింది' అని శ్రుతి చెప్పింది.

07:31 - January 24, 2016

కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు 'మరుదనాయగం'. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం, హీరో అన్నీ తానే. పదిహేనేళ్ళ క్రితం ఈ సినిమాను ప్రారంభించారు కమల్‌. కాని అంత భారీ బడ్జెట్‌ పెట్టడానికి నిర్మాతలెవరూ ముందుకు రాకపోవడంతో ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టారాయన. ఈ సినిమా గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా 'ఎప్పుడో ఒకప్పుడు నా డ్రీమ్‌ ప్రాజెక్టును తప్పకుండా తీస్తాను' అని అంటుండేవారు. ఇప్పుడా కల నెరవేరబోతుంది. ప్రారంభంలోనే ఆగిపోయిన ఈ చిత్రం త్వరలో మళ్ళీ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. కోలీవుడ్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిందట. ప్రస్తుతం టి.రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అమ్మనాన్న ఆట' చిత్రంలో కమల్‌ హాసన్‌ నటిస్తున్నారు.

07:28 - January 24, 2016

శ్వేతా మీనన్‌, మహత్‌ రాఘవేంద్ర, చైతన్య ఉత్తేజ్‌, సోనియా అగర్వాల్‌ ప్రధాన పాత్ర ధారులుగా పర్స రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్‌ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు నిర్మిస్తున్న చిత్రం 'షీ'. 'ఈజ్‌ వెయిటింగ్‌' అనేది ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మూడో షెడ్యూల్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత మాట్లాడుతూ, 'ఫిబ్రవరి 15వ తేదీతో ముగిసే మూడో షెడ్యూల్‌తో టాకీపార్ట్‌ మొత్తం పూర్తవుతుంది. సాంగ్స్‌ బ్యాలెన్స్‌ ఉంటాయి. ఓ సాంగ్‌ ను బెల్జియంలో, మరోపాటను ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరిస్తాం. ఇందులో హీరో శివాజీ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. వీరితోపాటు దీక్షాపంత్‌, రవిప్రకాష్‌ ఇలా చాలా మంది ఆర్టిస్టులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ స్టార్‌ శింబు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ ఈ సినిమా కోసం ఓ పాట పాడుతున్నారు. శ్వేతా మీనన్‌ అద్భుతంగా యాక్ట్‌ చేస్తున్నారు. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీపడకుండా రూపొందిస్తున్నాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వేసవి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. 'మన సంస్కృతి సంప్రదాయాలకు భయాన్ని జోడించి తెరకెక్కిస్తున్న స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రమిది' అని దర్శకుడు తెలిపారు. శివాజీ మాట్లాడుతూ, 'రాజకీయాల్లో నేను సరిపోనని అర్థమయ్యాక మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టాను. యాభై సినిమాల్లో హీరోగా నటించిన నేను ఇందులో నెగటివ్‌ రోల్‌ చేస్తున్నాను. దీనికి కామెడీని కూడా జోడిస్తున్నాను' అని తెలిపారు. 'ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేయడం ఆనందంగా ఉంది. సీనియర్‌ ఆర్టిస్టులతో పనిచేయడం మంచి అనుభూతినిచ్చింది' అని శ్వేతామీనన్‌ తెలిపారు.

07:27 - January 24, 2016

సినిమా ప్రారంభానికి ముందే అజిత్‌ సినిమాకి బోల్డెంత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. 'తలా 57'గా విష్ణువర్థన్‌ దర్శకత్వంలో రూపొందబోయే తాజా చిత్రంలో అజిత్‌ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నయనతార, తమన్నా, కృతిసనన్‌ నటించడమే ఈ క్రేజ్‌ రావడానికి కారణం. అంతేకాదు ఇదే చిత్రంలో ప్రతినాయకుడిగా మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటిస్తున్నారనే వార్త కూడా ప్రస్తుతం సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీంతోపాటు అజిత్‌ డబుల్‌ రోల్‌లో నటించడం కూడా ఈ సినిమా పబ్లిసిటీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలాంటి ప్రత్యేకతలతో ప్రారంభానికి ముందే ఓ పాజిటివ్‌ బజ్‌ని సృష్టించుకున్న 'తలా 57' చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి పార్లర్‌గా అజిత్‌ మరో చిత్రాన్ని శివ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. పలు సినిమాలతో నయనతార బిజీగా ఉన్నప్పటికీ కథ, కథనం, పాత్ర నచ్చి ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించిందని తెలుస్తోంది. వెంకటేష్‌ కథానాయకుడిగా తెలుగులో ఇటీవల ప్రారంభమైన చిత్రంలోనూ నయనతార నటిస్తుండగా, 'బాహుబలి 2', 'ఊపిరి', 'ధర్మదురై' తదితర చిత్రాల్లో నటిస్తూ తమన్నా బిజీగా ఉంది. అలాగే తెలుగులో మహేష్‌బాబు సరసన 'ఒన్‌ నేనొక్కడినే' చిత్రంలోను, షారూఖ్‌ కాంబినేషన్‌లో 'దిల్‌వాలే' చిత్రంలోనూ కృతిసనన్‌ నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా అంగీకరించిన అజిత్‌ చిత్రంలో కృతి సెకండ్‌ హీరోయిన్‌గా నటించనుందని తెలిసింది.

 

07:24 - January 24, 2016

'లింగా' తర్వాత చాలా గ్యాప్‌ తీసుకుని రజనీకాంత్‌ నటిస్తున్న చిత్రం 'కబాలి'. పా.రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కలైపులి.యస్‌.థాను అత్యంత భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'నేను చాలా మంది పెద్ద హీరోలతో పనిచేసినప్పటికీ రజనీకాంత్‌గారితో సినిమా చేయడమనేది నా లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌. ఇది నా కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమా అవుతుంది. ఇండియన్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో చైనా సూపర్‌స్టార్‌ విల్సన్‌ చౌ విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. సాల్ట్‌ పెప్పర్‌ లుక్‌తో రాజసంగా రజనీకాంత్‌ కూర్చుని ఉన్న ఫస్ట్‌లుక్‌కు సర్వత్రా సినిమాపై క్రేజ్‌ను పెంచింది. ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ ఈ నెల 20 నుంచి మలేషియాలో జరుగుతోంది. రజనీతోపాటు కీలక పాత్రధారులంతా పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌ ఫిబ్రవరి 28తో ముగుస్తుంది. దీంతో సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. మేలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సంతోష్‌ నారాయణన్‌ సమకూర్చిన బాణీలకు తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్‌, అనంత శ్రీరామ్‌ సాహిత్యం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం' అని అన్నారు. రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో థన్సిక, కిశోర్‌, జాన్‌ విజరు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

07:23 - January 24, 2016

రాంచీ: దేశంలోనే అత్యంత ఎత్తయిన త్రివర్ణ పతాకాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్‌ ఝార్ఖండ్‌లో శనివారం ఆవిష్కరించారు. రాంచీలోని పహారీ మందిర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎత్తయిన జెండాను నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 119వ జయంతి సందర్భంగా ఆవిష్కరించినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటిష్‌ వలస పాలకులు అనేక మంది యోధులను ఈ మందిరం వద్దనే ఉరి తీశారని ఆ దేవాలయ నిర్వాహక కమిటీ సభ్యులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం రిజపబ్లిక్‌ డే, స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడం ఆనవాయితీగా వస్తోంది. 66మీటర్ల పొడవు, 99 మీటర్ల వెడల్పుతో 293 అడుగుల ఎత్తులో ఉన్న ఈ జెండాను తయారు చేసేందుకు రూ.44 లక్షలను వెచ్చించారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.1.25కోట్లను ఖర్చుచేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో గత సంవత్సరం 250 అడుగుల ఎత్తయిన జెండాను ఎగురవేశారు. దీనికంటే రాంచీ జెండా 43 అడుగులు ఎత్తు ఎక్కువ. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి రఘువీర్‌ దాస్‌,పలువురు మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

మొగిలి ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం.

చిత్తూరు : జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌రోడ్ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ గుర్తు తెలియని వాహనం కారును ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

06:52 - January 24, 2016

తెలుగు తేజం పీవీ సింధు..మలేసియన్ ఓపెన్ గ్రాండ్ ప్రీ మహిళల సింగిల్స్ ఫైనల్స్ కు చేరుకొంది. పెనాంగ్ లో జరిగిన సెమీఫైనల్లో కొరియా ప్లేయర్ సుంగ్ జీ హూన్ ను మూడుగేమ్ ల పోరులో సింధు అధిగమించి..2016 సీజన్లో తొలి టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది. ఫైనల్లో చోటు కోసం జరిగిన హోరాహోరీ సమరంలో..3వ సీడ్ సింధు 19-21, 21-12, 21-10తో సుంగ్ ను చిత్తు చేసింది. 2013లో మలేసియన్ ఓపెన్ టైటిల్ తొలిసారిగా గెలుచుకొన్న సింధు..రెండేళ్ల విరామం తర్వాత తిరిగి అదే టైటిల్ కు గురిపెట్టింది.

06:49 - January 24, 2016

ఢిల్లీ : రిపబ్లిక్‌ డే కవాతు సన్నాహాలు దేశ రాజధాని ఢిల్లీలో చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే రాజ్‌పథ్‌లో రిహార్సల్స్‌ చూపరులును ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హొలాండే దేశరాజధాని ఢిల్లీలో జరుగబోయే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఫ్రెంచ్ కంటిజెంట్‌కు చెందిన 123 మంది సైనికుల కవాతు.. ఊపిరి బిగబట్టి చూడాల్సిన ఎయిర్‌ఫోర్స్ జెట్ విన్యాసాలు.. దేశ సంస్కృతి సంప్రదాయాలను, అభివృద్ధి నమూనాలను కండ్ల ముందుంచేలా సాగిపోనున్న వివిధ రాష్ర్టాలు, శాఖల వాహనాలు.. త్రివిధ దళాలకు చెందిన మహిళా సైనికుల మార్చ్‌ఫాస్ట్.. ఒకటేమిటి? ప్రత్యక్షంగా తిలకించే అతిథులను, ప్రత్యక్ష ప్రసారాలద్వారా వీక్షించే కోట్ల మంది దేశ ప్రజలను అలరించేందుకు, కొత్త ఉత్సాహాలు రేకెత్తించేందుకు 67వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు రంగం సిద్ధమైంది.

భారీ భద్రత..
సాధారణంగా 115 నిమిషాలపాటు ఉండే వేడుకల సమయాన్ని ఈసారి కాస్త తగ్గించినా ఘనత ఏమాత్రం తగ్గని పద్ధతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రాజ్‌పథ్‌లో నిర్వహించిన డ్రస్ రిహార్సల్స్ కన్నులపండువగా సాగాయి. రిహార్సల్ వల్ల ఢిల్లీలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హొలాండే దేశరాజధాని ఢిల్లీలో జరుగబోయే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన నేటి నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో ఆయన చంఢీగడ్‌ చేరుకుంటారు. అనంతరం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి రాక్‌ గార్డెన్స్‌ను సందర్శిస్తారు. సాయంత్రం భారత్‌-ఫ్రాన్స్‌ వ్యాపార సదస్సుకు హాజరుకానున్నారు. అనంతరం 6.30గంటలకు అక్కడ నుంచి ఢిల్లీకి పయనం కానున్నారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు పర్యటన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజ్‌పథ్‌ పరిసర ప్రాంతాల్లోని ట్రాఫి‌క్‌ను దారి మళ్లించనున్నారు.

06:46 - January 24, 2016

బెంగళూరు : అహ్మదాబాద్‌ పేలుళ్ల కేసులో కీలక నిందితుడు రఫిక్‌ అహ్మద్‌ను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు ఐఎస్‌ కుట్ర పన్నిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. బొమ్మనహళ్లిలో రఫిక్‌ ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ, హైదరాబాద్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన అధికారులపై రఫీక్‌ దాడికి యత్నించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ గాయపడ్డారు. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. రఫీక్‌ మూడేళ్లేగా బెంగళూరులోనే ఉంటూ ఉగ్రకార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఏసీ మెకానిక్‌గా చెప్పుకొని ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరు ఐఎస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగుళూరులో ఈ ఇద్దరిని ఏటీఎస్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరి పేర్లు నజ్మల్ హుదా, సయ్యద్ హుస్సేన్ అని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ఇస్లామిక్ స్టేట్ భావజాలానికి ఆకర్షితులై ఐఎస్‌లో చేరేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే వీరిపై నిఘా పెట్టిన ఏటీఎస్‌ ఇవాళ చాకచాక్యంగా పట్టుకున్నారు. తాజా ఘటనతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాని నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరో వైపు ముంబైలో మరో ఐఎస్ సానుభూతిపరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

06:44 - January 24, 2016

విజయవాడ : సీమ జిల్లాలను రాజధానితో అనుసంధానిస్తూ 965 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. విశాలమైన ఈ రోడ్లకు 14వేల 400 కోట్లు ఖర్చవుతుందని అంచనావేసింది. రాయలసీమ ప్రధాన నగరాలనుంచి ప్రకాశం జిల్లా మర్కాపురం వరకూ నాలుగు వరుసల రోడ్డు. అక్కడినుంచి అమరావతి వరకూ ఆరు వరసల రహదారినీ నిర్మించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అనంతపురం నుంచి అమరావతి వరకు ప్రస్తుతం 472 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్డు ఉంది... ఈ చిన్న దారిలో గంటలకొద్దీ ప్రయాణంకంటే హైదరాబాద్‌కు వెళ్లడమే మంచిదని జిల్లా వాసులు భావిస్తారు.. పైగా రాజధానిగా అమరావతి పేరు ప్రకటించగానే రాయలసీమ వాసులనుంచి మొదట్లో అసంతృప్తి వ్యక్తమైంది. అమరావతికి వెళ్లాలంటే 10గంటలపాటు ప్రయాణం చేయాలంటూ ప్రజలు ఆందోళన చెందారు. ఈ సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం 373 కిలోమీటర్లవరకూ కొత్త రోడ్డు నిర్మించాలని తీర్మానించింది. అనంతపురంనుంచి తాడిపత్రివరకూ పాత రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. అక్కడినుంచి గుంటూరువరకూ మరో రహదారికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ కొత్త రోడ్డుతో 99 కిలోమీటర్ల దూరం రెండు గంటల సమయం తగ్గుతాయి. ఈ రహదారి నిర్మాణంలోభాగంగా అటవీప్రాంతంలో 25కిలోమీటర్ల రోడ్డు వేయాల్సి ఉంటుంది. ఈ మార్గం పూర్తిచేయాలంటే 8వేల 100 కోట్లు ఖర్చవుతుందని అంచనావేస్తున్నారు.

అటవీ ప్రాంతంలో కూడా రోడ్డు..
ఇక కడప నుంచి రాజధానికి మధ్య 390 కిలోమీటర్ల దూరం ఉంది. కొత్త రోడ్డు నిర్మాణంతో 61 కిలోమీటర్ల దూరం, 70 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతాయి. ఈ రోడ్డుకు 2వేల 900 కోట్లు ఖర్చవుతాయని భావిస్తోంది ప్రభుత్వం. అలాగే కడప నుంచి అమరావతికి అదనంగా రెండు ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. కడప నుంచి నేరుగా గుంటూరు వరకు ఒకటి, కడప నుంచి నరసారావుపేట మీదుగా రెండో ప్లాన్‌ రూపొందించారు.. కర్నూలు నుంచి అమరావతి వరకు ఉన్న 311 కిలోమీటర్ల రోడ్డు స్థానంలో 283 కిలోమీటర్ల రహదారికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది సర్కారు. ఇందుకోసం 26 కిలోమీటర్లవరకూ అటవీప్రాంతంలో రోడ్డు వేయాల్సి ఉంటుంది. ఈ కొత్త మార్గం వల్ల 28 కిలోమీటర్ల దూరం, 40 నిమిషాల ప్రయాణ సమయం కలిసొస్తాయి.. ఈ రోడ్ల నిర్మాణానికి 3వేల 400 కోట్లు ఖర్చవుతుందని అంచనావేస్తున్నారు.. ఈ మార్గంలో డోర్నాల వరకుఉన్న పాత రోడ్డును నాలుగు వరుసల రహదారిగా మార్చబోతున్నారు.. అక్కడినుంచి కొత్త రోడ్డుకు ప్రణాళిక వేస్తున్నారు. ఒక్క రాజధానికే కాకుండా శ్రీకాకుళంనుంచి నెల్లూరు జిల్లా శ్రీహరికోటకుకూడా కొత్త రోడ్డు వేయబోతున్నారు.. ఏషియన్ డెవలప్‌మెంట్‌ బ్యాంక్ నిధులతో 6 లైన్ల రహదారికోసం ప్రతిపాదన సిద్ధం చేశారు.. ఈ రోడ్డుకు 27 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఏపీ సర్కారు సంతకం చేసింది. అనుకున్న సమయానికి అన్నీ పూర్తిచేసేలా ప్రయత్నాలు చేస్తోంది.

06:40 - January 24, 2016

గుంటూరు : నిన్నటి వరకు రాజధానికి భూములు ఇస్తామని ముందుకు వచ్చిన వారే సర్కార్ తీరుపై నిప్పులు కక్కుతున్నారు. ఆందోళనలు, అభ్యంతరాలతో విరుచుకుపడుతున్నారు. రాజధానికి భూములు ఇవ్వమంటూ.. తేల్చిచెబుతున్నారు. భూములు ఇవ్వాలని ఊరువాడ తిరిగిన మంత్రులు మొఖం ఎందుకు చాటేస్తున్నారని అధికారులను నిలదీస్తున్నారు. మా గ్రామసమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు.. మాకు కేటాయిస్తామన్న వాటా భూమి ఎప్పుడిస్తారు.. తియ్యని మాటలు చెప్పి.. మమ్మల్ని మాయచేసి భూములు తీసుకున్న మంత్రులు రాకుండా మీరెందుకు వచ్చారు ఈ ప్రశ్నల వర్షం నిన్నటిదాకా రాజధాని ప్రాంత రైతుల నుండి మారుమ్రోగిపోయాయి. రైతుల ప్రశ్నలతో అవగాహన కల్పించాలని గ్రామాలకు వెళ్లిన సీఆర్డీఏ అధికారులకు దిమ్మదిరిగిపోయింది. రైతులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చుక్కలు కనబడడంతో పాటు ముచ్చెమటలు పట్టాయి.

29 గ్రామాల్లో భూసేకరణ..
ప్రపంచ స్థాయిలో నిర్మితమయ్యే రాజధానంటూ.. మొదటి నుండి ఊదరగొడుతూ వచ్చింది ఏపీ ప్రభుత్వం. సింగపూర్ ప్రతినిధులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై గత నెల 25 వ తేది నుండి అభ్యంతరాల స్వీకరణ చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో భూసేకరణ జరిగిన 29 గ్రామాల్లో రైతులకు అవగాహనా కార్యక్రామాలు నిర్వహిస్తున్నారు అధికారులు. గ్రామాలకు వెళ్లిన సీఆర్ డీఏ అధికారులకు అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు మనం చూసింది మొదటి నుండి రాజధాని ప్లాన్ ను వ్యతిరేకించిన గ్రామాల సంగతి.. ఎంతో ఉత్సాహంగా భూములు ఇచ్చిన తుళ్లూరు మండలంలోని గ్రామాల రైతులు సైతం అధికారులపై తిరగబడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా మాస్టర్ ప్లాన్ ఏమిటంటూ నిలదీస్తున్నారు. తమ ప్రాంతమంత్రులు ప్రజా ప్రతినిధులు వచ్చేవరకు సదస్సులు జరగనివ్వమంటూ అధికారులకు తెగేసిచెబుతున్నారు.

రోడ్ల నిర్మాణంపై వ్యతిరేకత..
మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎక్స్ ప్రెస్ హైవేల పేరుతో గ్రామాల గుండా రోడ్లు వేస్తామనడం పై మంగళగిరి , తాడేపల్లి మండలాల పరిధిలోని గ్రామాల రైతులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలుపుతున్నారు. ఇప్పటికే రాజధాని కోసం తమ భూములు కోల్పోయామని , ఇప్పుడు ఇళ్లను కోల్పోయి రోడ్డు మీద పడలేమంటున్నారు రైతులు. ఎక్స్ ప్రెస్ వేల డిజైన్లో మార్పులు చేయాలంటూ డిమండ్ చేస్తున్నారు. అధికారికంగా గ్రామ పంచాయతీ , మండల పరిషత్ మున్సిపాలిటీల అభిప్రాయాన్ని తీసుకోవాలంటూ కొత్తగా డిమాండ్లు ప్రతిపాదిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ వివరాలు సామాన్యులకు అర్థమయ్యే విధంగా తెలుగులో ప్రచురించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. గ్రీన్ బెల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలు భూ పరిహారం తదితర విషయాలకు సంబంధించిన రైతులు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళితే తీవ్ర స్థాయిలో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు సీపీఎం నేతలు.

మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు..
అటు మేధావులు సైతం రాజధాని మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న భౌగోళిక పరిస్థితులపై అవగాహన లేకుండా సింగపూర్ ప్రతినిధులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలు చేయడం సరైంది కాదని ఆర్కిటెక్చర్ నిపుణులు వాదిస్తున్నారు. తల తోకలేని మాస్టర్ ప్లాన్ ను ప్రజల మందు ఉంచి రాజధానిని ఎలా నిర్మించాలనుకుంటున్నారో అర్థ కావడం లేదంటూ పెదవి విరుస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా రాజధాని నిర్మాణం త్వరగా పూర్తవుతుందనుకున్న ప్రభుత్వం.. రైతుల వేస్తున్న ప్రశ్నలతో దిక్కుతోచని స్థితిలో పడుతోంది. సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. రాజధాని విషయంలో ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతుందా.. లేక ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటుందా అన్నది వేచిచూడాలి.

06:37 - January 24, 2016

విజయవాడ : దావోస్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ నుంచి సింగపూర్‌ బయల్దేరారు. నేడు సాయంత్రం వరకు సింగపూర్‌ అధికారులతో చంద్రబాబు భేటీకానున్నారు. ఈ భేటీలో పాల్గొనేందుకు మంత్రి నారాయణ కూడా ఏపీ నుంచి నేడు సింగపూర్‌కు వెళ్లనున్నారు. సింగపూర్ అధికారులతో రాజధాని మాస్టర్‌ప్లాన్‌పై చంద్రబాబు చర్చించనున్నారు. ఇప్పటికే భూసేకరణ పూర్తవడంతో పాటు సీడ్‌ కాపిటల్‌ నిర్మాణం జరగాల్సి ఉంది. దీంతో పాటు ఆరు నెలల సమయంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం జరగనుంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ పర్యటనకు అభ్యంతరం లేదని కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. దీంతో చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్, సీఎం కార్యదర్శి సాయిప్రసాద్, సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ సింగపూర్ పర్యటనకు సంబంధించి జీఏడీ ఉత్తర్వులు జారీచేసింది. సింగపూర్‌లో బాబు రాజధాని మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేయనున్న అసెండాస్ సెంబ్రిడ్జి అండ్ సెంబ్‌ క్రాప్ కన్సార్టియం ప్రతినిధులతో పాటు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో చర్చించనున్నారు. నేటి రాత్రి సింగపూర్‌ నుంచి విశాఖకు సీఎం బయలు దేరనున్నారు. 

నేడు కరీంనగర్ లో వ్య.కా.స మహాసభల ముగింపు...

కరీంనగర్ : నేడు జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘ సమావేశాలు ముగియనున్నాయి. ఈ ముగింపు సమావేశాలకు తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నారు. 

హెచ్ సీయూ విద్యార్థులకు ఓయూ విద్యార్థి సంఘాల మద్దతు..

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థులకు ఓయూ విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఓయూలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు కొనసాగనున్నాయి.

 

హైదరాబాద్ - తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు ఆలస్యం..

హైదరాబాద్ : నేడు హైదరాబాద్ - తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు ఆలస్యంగా బయలుదేరనుంది. పొగ మంచు కారణంగా ఉదయం 6.25 రావాల్సిన ఎక్స్ ప్రెస్ రైలు మధ్యాహ్నం 1.30 బయలుదేరనుంది. 

Don't Miss