Activities calendar

25 January 2016

పథకాలతో దేశం దూసుకెళుతోంది - ప్రణబ్..

ఢిల్లీ : ఉగ్రవాదంపై పోరులో అందరూ కలిసి రావాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పిలుపునిచ్చారు. 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతదేశం సర్వమతాల సమ్మేళనం అని అన్నారు. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పథకాలతో దేశం దూసుకు పోతోందని రాష్ట్రపతి అన్నారు.

రిపబ్లిక్ డే..భారీ బందోబస్తు..

ఢిల్లీ : ఉగ్రదాడి హెచ్చరికలతో రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఐసిస్‌ సానుభూతిపరులను అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ- ఢిల్లీలో భద్రతపై వేయి కళ్లతో నిఘా పెట్టింది. రిపబ్లిక్‌ వేడుకలకు ఫ్రాన్స్‌ రాష్ట్రపతి హోలాండ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతుండడంతో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు.

21:33 - January 25, 2016

ఢిల్లీ : ఉగ్రదాడి హెచ్చరికలతో రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఐసిస్‌ సానుభూతిపరులను అరెస్ట్‌ చేసిన ఎన్‌ఐఏ- ఢిల్లీలో భద్రతపై వేయి కళ్లతో నిఘా పెట్టింది. ఇందుకోసం 49 వేల మంది సైనికులను నియమించింది. దేశవ్యాప్తంగా 67వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పఠాన్‌కోట్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ రక్షణ వలయంలోకి వెళ్లిపోయింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు 49 వేల మంది భద్రత దళాలను నియమించారు. ఇందులో 15 వేల మంది సైనికులు కాగా 34 వేలమంది ఢిల్లీ పోలీసులున్నారు. విజయ్‌ చౌక్‌ నుంచి లాల్‌కిలా వరకు ప్రధాన కూడళ్లలో 15 వేల సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్యఅతిథి..
రిపబ్లిక్‌ వేడుకలు ఫ్రాన్స్‌ రాష్ట్రపతి హోలాండ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతుండడంతో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. రాజ్‌పథ్‌లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించకుండా ఉండడం కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఎత్తైన భవనాలపై భద్రతా బలగాలు కాపలా కాస్తున్నాయి. రాజ్‌పథ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోది, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండ్‌కు మాత్రమే ప్రవేశముంది.

ఆర్మీ శునకాలు..
రిపబ్లిక్‌ పరేడ్‌ ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండున్నరకు ముగుస్తుంది. తొలిసారిగా ఫ్రాన్స్‌ దళాలు మన వేడుకల్లో కవాతు నిర్వహించనున్నాయి. 1950 నుంచి ఇప్పటి వరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విదేశీ సైనికులు ఎప్పుడూ పాల్గోలేదు. వారం రోజుల పాటు భారత సైన్యంతో కలిసి ఫ్రాన్స్‌ సైనికులు రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. 26 ఏళ్ల తరువాత కవాతులో ఆర్మీ శునకాలు
పాల్గోనున్నాయి.

నో ఫ్లయ్ జోన్..
ఢిల్లీ నగరానికి 3 వందల కిలోమీటర్ల నో ఫ్లయ్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో రాడార్‌ సహాయంతో ప్రత్యేక నిఘా చేపడతారు. పటేల్‌ చౌక్‌, రేస్‌ కోర్స్‌ ప్రాంతాలు మినహా ఢిల్లీలో మెట్రో రైళ్లు యథాతథంగా నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

21:31 - January 25, 2016

ఢిల్లీ : ఉగ్రవాదంపై పోరులో అందరూ కలిసి రావాలని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పిలుపునిచ్చారు. 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతదేశం సర్వమతాల సమ్మేళనం అని అన్నారు. స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పథకాలతో దేశం దూసుకు పోతోందని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందన్న ఆయన ఈ ఏడాది వృద్ధి రేటు 7.3 శాతం ఉందన్నారు. వృధ్ది రేటు ఇలాగే కొనసాగితే పది, పదిహేనేళ్లలో దేశంలో పేదరికాన్ని పారదోలవచ్చన్నారు. తయారీ రంగానికి మేక్ ఇన్ ఇండియా బూస్ట్‌ను ఇచ్చిందని తెలిపారు. డిజిటల్ ఇండియా ద్వారా యువతకు లాభమన్నారు. 96 కోట్ల మంది ప్రజలు ఆధార్ కార్డుతో ప్రయోజనం పొందుతున్నారని ప్రణబ్ వివరించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర జవాన్లకు రాష్ట్రపతి ప్రణబ్‌ నివాళులర్పించారు.

21:30 - January 25, 2016

ఢిల్లీ : 2016 సంవత్సరానికిగానూ కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్‌ వరించగా.. సానియామీర్జా, సైనానెహ్వాల్‌, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌లకు పద్మభూషణ్‌ లభించింది. ఇక బాహుబలి డైరెక్టర్‌ రాజమౌళి, బాలీవుడ్‌ నటులు ప్రియాంకాచోప్రా, అజయ్‌దేవ్‌గన్‌లకు పద్మశ్రీ వరించింది. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు.

తెలుగు తేజాలు..
పద్మ అవార్డుల్లో తెలుగు తేజాలు మెరిశారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌కు పద్మ అవార్డులు వరించాయి. సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 118 మందికి పద్మఅవార్డులను ప్రకటించగా, 10 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ అవార్డులను అందజేయనున్నారు.

పద్మ విభూషణ్..
పద్మవిభూషణ్‌ పొందిన వారిలో.. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, నాట్యకారిణి యామినీ కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్‌, సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, ప్రముఖ వైద్యులు విశ్వనాథన్‌ శాంత, జమ్మూ కశ్మీర్‌ మాజీ గవర్నర్‌ జగ్‌మోహన్‌, సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగం నుంచి వాసుదేవ్‌ కల్‌కుంటే ఆత్రే ఉన్నారు. వీరితో పాటు సాహిత్య రంగం నుంచి అవినాశ్‌ దీక్షిత్‌, రిలయన్స్‌ వ్యవస్థాపకుడు ధీరూభాయ్‌ అంబానీకి మరణనానంతరం పద్మవిభూషణ్‌ వరించింది.

పద్మ భూషణ్..
పద్మభూషణ్ పొందిన వారిలో హైదరాబాదీ స్టార్‌ క్రీడాకారులు సానియా మీర్జా, సైనా నెహ్వాల్‌తో పాటు సాహిత్య రంగం నుంచి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌, నేపథ్య గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌, ప్రముఖ శిల్పి రామ్‌ వి సుతార్‌, రంగస్థల కళాకారుడు హీస్నమ్‌ కన్హేలాల్‌, కాగ్‌ మాజీ డైరెక్టర్‌ వినోద్ రాయ్‌, సాహిత్యరంగం నుంచి ప్రొఫెసర్‌ NS రామానుజ తాతాచార్య, మీడియా రంగం నుంచి బల్జీందర్‌సింగ్‌ హందర్ద్‌, ఆధ్యాత్మిక వేత్త స్వామీ తేజోమయానంద, భారత్‌లో అమెరికా రాయబారి రాబర్ట్‌ డీ బ్లాక్‌విల్‌ తదితరులు ఉన్నారు.

పద్మశ్రీ..
ఇక పద్మశ్రీ పొందిన వారిలో బాహుబలి డైరెక్టర్‌ రాజమౌళి, బాలీవుడ్‌ నటులు ప్రియాంక చోప్రా, అజయ్ దేవగన్, భోజ్‌పురి సింగర్‌ మాలినీ అవస్థి, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్, యోగా విభాగం నుంచి ప్రిడ్రాగ్‌ కె నిక్కి, హూలాన్‌ జాంగ్‌ తదితరులు ఉన్నారు. ఈ అవార్డులను గణతంత్ర దినోత్సవం రోజున కేంద్రం అధికారికంగా ప్రకటించనుంది. 

21:27 - January 25, 2016

విజయవాడ : ఏపీలో ఆరోగ్యమిత్రల తొలగింపును వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించే ప్రయత్నం చేశారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఉద్యోగం పోయిందనే బాధతో ఓ ఉద్యోగిని ఆత్మహత్యా యత్నం చేసింది. అటు ప్రభుత్వం ఆరోగ్యమిత్రల తొలగింపు జీవోను ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

విజయవాడలో భారీ ధర్నా..
ఆరోగ్యమిత్రలను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఉద్యోగులు రోడ్డెక్కారు. ఉపాధి కోల్పోయినవారు ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రంగంలోకి దిగిన పోలీసులు ధర్నా చేస్తున్న ఆరోగ్య మిత్రలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఆత్మహత్య..
ఆరోగ్య మిత్ర ఉద్యోగులను తొలగిస్తున్నారని మనస్తాపం చెందిన మహిళా ఉద్యోగి సుమలత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలులో ఈ ఘటన జరిగింది. సుమలత, ఆనంద్‌ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఆనంద్‌కు రెండు కిడ్నీలు ఫెయిలై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. కాగా, సుమలత ఆరోగ్యమిత్ర కార్యకర్తగా పనిచేస్తూ కుటుంబపోషణ భారాన్ని మోస్తోంది. ఇటీవల ఆరోగ్యమిత్రలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితుల్లో సుమలత తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆమెను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు.

బాబుకు మధు లేఖ..
ఏపీ సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. తొలగించిన ఆరోగ్య మిత్ర ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని.. జీవో నెంబర్ 28 వెంటనే రద్దు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. అటు సీపీఐ సైతం ఆరోగ్యమిత్రను విధుల్లోంచి తొలగించడాన్ని ఖండించింది. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జీవో నెంబర్ 28ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

21:24 - January 25, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. మేయర్‌ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు గులాబీ దళపతి ఎత్తుకు పై ఎత్తులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. గ్రేటర్‌ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌..ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రులతో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేసేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ కసరత్తును ముమ్మరం చేసింది. నాలుగు రోజులుగా నగర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులతో ముఖ్యమంత్రి కేసిఆర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌ ప్రచారంలో క్షేత్ర స్ధాయిలో ప్రజలనుంచి వస్తున్న స్పందనను మంత్రులను అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా తనకు అత్యంత ప్రతిష్టాత్మకమైనవన్నారు సీఎం.

జింఖానాలో భారీ బహిరంగ సభ..
అంతేకాకుండా హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దేందుకు వేసిన ప్రణాళికలను ప్రజలెంత వరకు అమోదిస్తున్నారో ఈ ఎన్నికల ద్వారా తెలిసిపోతుందన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో స్వయంగా తాను పాల్గొంటానని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.హైదరాబాద్‌ నగరంలో తాము చేపడుతున్న అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేయాలని సీఎం సూచించారు. మరోవైపు గ్రేటర్‌ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రచించారు. ఈనెల 30న జింఖానా గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగకు హాజరవుతానని మంత్రులకు చెప్పినట్లు సమాచారం. ఒకవేళ జింఖానా గ్రౌండ్‌కు అనుమతి రాకపోతే నగరం నలువైపులా మీటింగ్‌లు, రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు.మొత్తానికి గ్రేటర్‌ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌..మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగాలని చూస్తున్నారు. మరి గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందో లేదో ఫిబ్రవరి 2న జరిగే ఎన్నికల్లో తేలనుంది. 

21:21 - January 25, 2016

గుంటూరు : మాటలు కోటలు దాటించారు. అనుకున్నది సాధించేవరకు వెంటపడ్డారు. అరచేతిలో స్వర్గం చూపించారు. వేలాది భూములు సేకరించారు. అంతా ఇంతా అంటూ స్వల్పకాలంలో లక్ష్యం చేరుకున్నారు. ఇప్పుడు అవసరం తీరిపోయింది. దీంతో పాలకులు మాట తీరు మారిపోయింది. భూములిచ్చిన వారే వారికి భారమయ్యారు. అభ్యంతరాలు చెబితే సమాధానం చెప్పే సహనం కరువైంది. నష్టపోతారంటూ హెచ్చరికల ఎపిసోడ్‌ షురూ అయ్యింది. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో అన్నదాతల నుంచి వేలాది ఎకరాలు ఏపీ సర్కార్‌ సేకరించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతులకు అనేక హామీలు ఇచ్చింది. గ్రామాలను తరలించే ప్రస్తక్తి లేదని చెప్పుకొచ్చింది. రాజధానిలో వాణిజ్య స్థలాలు అంటూ ల్యాండ్‌ పూలింగ్‌కు ఒప్పించింది. ఇప్పుడు అవసరం తీరిపోవడంతో సర్కార్‌ తీరులో మార్పు వచ్చేసింది. గ్రామాలను కదిలించే ప్రసక్తే లేదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు గ్రామాలకు గ్రామాలే లేకుండా చేసే ప్రణాళికకు ఓకే చెబుతోంది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లోని ఎక్స్‌ప్రెస్‌ హైవేలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.ఆరు ఎక్స్‌ప్రెస్‌ హైవేల రూట్‌పై 6 గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.పైగా సహకరించకపోతే రైతులే నష్టపోతారంటూ సెలవిచ్చారు సీఎం చంద్రబాబు. సర్కార్‌ తీరుపై రాజధాని గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆందోళనలను ముమ్మరం చేశారు. మాస్టర్‌ ప్లాన్‌ కాపీలను తగులుబెడుతూ నిరసన కార్యక్రమాలుచేపడుతున్నారు. రాజధాని గ్రామాల ప్రజల ఆందోళనకు ప్రభుత్వం దిగి వస్తుందా...లేక మొండిగా ముందుకు వెళుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

21:19 - January 25, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. అభ్యర్థులంతా డివిజన్లలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనిపించిన వారినల్లా ఓట్లడుగుతున్నారు. అన్ని పార్టీల తరపున సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. ప్రచారంలో అందరి కంటే ముందున్న టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇక అటు టీడీపీ- బీజేపీ.. ప్రచారంలో దూకుడు పెంచింది. టీడీపీ తరపున లోకేష్‌ ప్రచారంలోకి దిగారు.

వారసుల మాటల తూటాలు...
నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అందులో భాగంగా టీఆర్‌ఎస్‌ మంత్రి కెటిఆర్‌, టిడిపి యువనేత నారా లోకేష్‌ల మధ్య కూడా పరోక్షంగా మాటల యుద్ధం సాగుతోంది. వారసుల మధ్య మాటల ఫైట్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. మంత్రి కెటిఆర్ తన తండ్రి, సీఎం కేసీఆర్‌ను ఆకాశానికెత్తారు. కేసీఆర్‌లాంటి వ్యక్తి యుగానికి ఒక్కరు మాత్రమే పుడతారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరాన్ని టిడిపి, కాంగ్రెస్ పార్టీలు నాశనం చేశాయన్నారు. ఇక యువనేత లోకేష్‌ స్పీచుల్లో స్పీడ్‌ పెంచారు. హైదరాబాద్ పేరును గూగుల్‌లో సెర్చ్ చేస్తే, మూడు ఫొటోలు కనిపిస్తాయని, ఆ మూడు ఫొటోల్లో ఒకటి చార్మినార్, రెండోది బుద్ధుడి విగ్రహం, మూడోది హైటెక్ సిటీ అన్నారు. వీటిలో చార్మినార్‌ను మినహాయిస్తే బుధ్దుడి విగ్రహాన్ని ఎన్టీఆర్‌ ఏర్పాటు చేస్తే, చంద్రబాబు హైటెక్ సిటీని నిర్మించారన్నారు. రెండు టీడీపీ హయాంలోనే నిర్మించారని అన్నారు.

రేవంత్ కు చేదు అనుభవం..
టీడీపీ నుంచి మరో స్టార్ క్యాంపెయినర్‌ రేవంత్‌ రెడ్డి సైతం తన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌కు వలస వెళ్లిన నేతలను టార్గెట్‌ చేస్తూ ఎదురుదాడికి దిగారు. మంత్రి తలసానిపై రేవంత్‌ తన మార్కు డైలాగులతో ఫైర్‌ అయ్యాడు.
ఇక రేవంత్‌రెడ్డికి మిత్రపక్షమైన బిజెపి కార్యకర్తల నుంచి షాక్‌ తగిలింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన రేవంత్‌ రెడ్డిని బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఘటన హైదరాబాదులోని అమీర్‌పేటలో చోటు చేసుకుంది. తాము పోటీ చేస్తున్న డివిజన్లలో ప్రచారానికి రావొద్దని బీజేపీ శ్రేణులు రేవంత్‌ రెడ్డికి స్పష్టం చేశాయి. దీంతో రేవంత్ వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.

ఎంఐఎం అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు..
అటు ఓల్డ్‌ సిటీలోనూ ఎంఐఎం అధినేత తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఫ్‌ కావాలంటే ఎంఐఎంకు ఓటేయాలంటూ ప్రకటించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఎంఐఎం ఓడిపోతే హైదరాబాద్‌లో బీఫ్‌ తినే అవకాశం కోల్పోతామని వ్యాఖ్యానించారు.

మేయర్ అభ్యర్థిగా ముఖేష్ గౌడ్ తనయుడు...
కాంగ్రెస్ తరపున సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. డివిజన్లలో కలియ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రేపటి నుంచి పార్టీ తరపున సెలబ్రిటీలు, స్టార్లు ప్రచారం చేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదిలాఉంటే కాంగ్రెస్‌ పార్టీ తమ పార్టీ తరపున మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటిస్తూ సస్పెన్స్‌కు తెర దించింది. మొత్తానికి అన్ని పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డి తమ తమ డివిజన్లలో వెరైటీగా ప్రచారం చేస్తున్నారు.

21:16 - January 25, 2016

హైదరాబాద్ : వర్సిటీ రగులుతోంది. ఉద్యమం ఉధృతమవుతోంది. రోహిత్‌ ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. యూనివర్శిటీ మొత్తం పోలీసు పహారీలో ఉంది. ఛలో హెచ్‌సీయూ నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట వారిని లోపలికి అనుమతించలేదు. మరోపక్క ఈ నెల 27న దేశంలోని యూనివర్శిటీల బంద్‌కు హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ ప్రకటించింది. రోహిత్‌ ఆత్మహత్యపై హెచ్‌సీయూలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజు రోజుకూ నిరసన కార్యక్రమాలు ఉధృతమవుతున్నాయి. ఛలో హెచ్ సీయూ నేపథ్యంలో వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

భారీగా పోలీసులు..
యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. బయటి వ్యక్తులను యూనివర్సిటీలోకి అనుమతించలేదు. రాజకీయ నాయకులు, ఇతర సంఘాల నాయకులు సైతం యూనివర్సిటీలోకి ప్రవేశించడానికి పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇద్దరు మాజీ మంత్రులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఐడీ కార్డు లేనివారిని పోలీసులు యూనివర్సిటీలోకి అనుమతించలేదు. హెచ్‌సీయులో దీక్ష చేస్తున్న విద్యార్థుల కు B.R.అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్..సంఘీభావం ప్రకటించారు. స్టూడెంట్స్ చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఉంటామని ప్రకటించారు.

ఫిబ్రవరి 12కు విచారణ వాయిదా..
మరోపక్క హెచ్‌సీయూలో విద్యార్థుల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేసినట్టు యూనివర్సిటీ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇది ఇలా ఉంటే తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సుశీల్ కుమార్ తల్లి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదనపు సమాచారంతో కౌంటర్ దాఖలు చేస్తామని హోం శాఖ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్లపై విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.

హెచ్‌సీయూ విద్యార్థి జేఎసీ పిలుపు..
హెచ్‌సీయూ ఇన్‌ఛార్జ్‌ వీసీ శ్రీవాత్సవ్‌ నియామకంపై వర్సిటీలో రగడ కొనసాగుతోంది. శ్రీవాత్సవ్‌కు వ్యతిరేకంగా ఇద్దరు ప్రొఫెసర్లు తమ పరిపాలనా పదవులకు రాజీనామా చేశారు.డా. అనుపమ, డా. సౌమ్యాదేశాయ్‌ తన అడ్మినిస్ట్రేటివ్‌ పదవులకు రాజీనామా చేశారు. మరోపక్క 27న దేశ వ్యాప్తంగా యూనివర్శిటీల బంద్‌కు హెచ్‌సీయూ విద్యార్థి జేఎసీ పిలుపునిచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమం ఆపేది లేదని జేఏసీ స్పష్టం చేసింది. 

21:00 - January 25, 2016

స్వచ్ఛ హైదరాబాద్..గ్రీన్ హైదరాబాద్..హైదరాబాద్ డల్లాస్...అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పుకుంటున్న నాయకుల మాటలు నిజమేనా ? కాదా ? అని 'మల్లన్న' చూపెట్టిండు. ఒక్కసారి పార్సిగుట్ట వైపు చూడండి అంటున్నాడు. రాంనగర్..పార్సిగుట్టను కలిపే ప్రధాన రహదారిపై భారీగా చెత్తా చెదారం పేరుకపోయింది. అక్కడే పని చేస్తున్న వారితో..రోడ్లపై వెళుతున్న వారిపై మల్లన్న ముచ్చటించిండు. అంతేకాదు...రోడ్డు పక్కనే 'పాడు' పని చేస్తున్న వ్యక్తితో కూడా మల్లన్న ముచ్చటించిండు. మరి వారు ఏమన్నారో తెలుసుకోవాలంటే వీడియో చూడండి.

20:53 - January 25, 2016

ఏంటీ పిల్లలకు ఓటు గురించి 'మల్లన్న' చెప్పుడేంది అని పరేషాన్ అవుతున్నరా ? వారిని ఓటు వేయాలని మల్లన్న చెప్పలే. కొద్ది రోజల్లో గ్రేటర్ ఎలచ్చన్లు రాబోతున్నయి కదా. అందుకే 'మల్లన్న' గల్లీలో తిరుగుతున్నడు. ఓటు గురించి..ప్రజలు ఏం అనుకుంటున్నరో ఆరా తీస్తుండు. అందుకనే వారాసిగూడలో మల్లన్న తిరిగిండు. అక్కడనే ఉన్న ఓ స్కూల్ కు మల్లన్న వెళ్లిండు. ఓటు వేయాలని..ఓటును అమ్ముకోవద్దని అమ్మా..నాన్నలకు చెప్పాలని అక్కడున్న స్కూల్ పిల్లలకు మల్లన్న చెప్పిండు. అది విషయం. మరి 'మల్లన్న' చెప్పిన దానికి పిల్లలు ఏమన్నరో చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:48 - January 25, 2016

గ్రేటర్ ఎన్నికలు..అభ్యర్థుల కోసం కళాకారులు పాటలు పాడుతున్నరు. పొట్ట కూటి కోసం వీరు ఎక్కడి నుండో నగరానికి వచ్చిండ్రు..వీరంతా తెలంగాణ ఉద్యమంలో కాళ్లకు గజ్జెలు కట్టి ఎగిరినోళ్లు. ఇవాళ..రేపు..పని లేక అవస్థలు పడుతున్నోళ్లు. సర్కార్ గుర్తించక ఇబ్బందులు పడుతున్నోళ్లు. వరంగల్ జిల్లా పాలకుర్తి నుండి కళాకారులు పాటలు పాడుతున్నరు. పాటలను గళం విప్పుతున్నరు. మరి వీళ్లంతా ఎందుకు వచ్చిండ్రు. వీరి ఆటను ఎవరైనా ఆదరిస్తున్నారా.. వారితో మల్లన్న ముచ్చట్లు. మరి వారి బాధలు..అవస్థలు తెలుసుకోవాలంటే వీడియో చూడండి.

20:43 - January 25, 2016

గ్రేటర్ ఎలచ్చనలలో నగరంలోని గల్లీలో 'మల్లన్న' పర్యటించాడు. ఎన్నికలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొనే ప్రయత్నం చేసిండు. ఇందులో భాగంగా బౌద్ధనగర్ లో పర్యటించాడు. అభ్యర్థుల కోసం పాటలు పాడటానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల అవస్థలు ఎలా ఉన్నాయో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి పిల్లలకు వివరించాడు. అలాగే ఓటు హక్కు గురించి మహిళలకు తెలియచేశారు. అక్కడే ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులతో కూడా మాట్లాడారు.. ఇక స్వచ్ఛ భారత్ అంటూ ఉపన్యాసాలు దంచుతున్న నాయకుల మాటలు ఎలా అమలుతున్నాయో మల్లన్న చూపించారు. మరి మల్లన్న ముచ్చట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:39 - January 25, 2016

ఆకలి భారతం కథ. శిథిలం భారతం గాథ. స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్ధాలు అవుతున్నా తీరని వ్యథ..దేశంలో కుబేరుల సంఖ్య పెరిగిందని..పెరుగుతోందని..అంబానీలు..ఆదానీల ఆస్తులు డబుల్..ట్రిపుల్ అవుతున్నాయని చూస్తున్నాం. అదే సమయంలో తినడానికి తిండి లేక నిత్యం కొట్లాది భారతీయులు నానా ఆగచాట్లు పడుతున్నారని వింటున్నాం. ఆరోగ్య సదుపాయాలు లేక ఎందరో అనేక రోగాలకు బలౌతున్నారని గమనిస్తున్నాం. మరి అసమానతలకు పరిష్కారం ఏంటీ ? సంపన్నులపై పన్నులు పెంచడం తప్పనిసరి పరిష్కారం అవుతుందా ? జీడీపీలో పన్నుల శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందా ? దీనిపై ప్రత్యేక కథనం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

బెంగళూరులో హై అలర్ట్..

బెంగళూరు : రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు హైఅలర్ట్ ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఇటీవలే బెంగళూరులో ఐసీస్ సానుభూతిపరుల అరెస్టు నేపథ్యంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

ప్రజల అభిప్రాయం తరువాతే సరి బేసి - కేజ్రీవాల్..

న్యూఢిల్లీ : హస్తిన ప్రజల అభిప్రాయం తర్వాతే సరి - బేసి రెండో విడతను అమలు చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సోమవారం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఒక నిర్మాణాత్మకమైన ప్రణాళికను తయారు చేస్తామని వెల్లడించారు. 

18:23 - January 25, 2016

విశాఖపట్టణం : నిన్నమొన్నటిదాకా ఏదో ఉన్నాయిలే అన్నట్లుండే రోడ్లు నేడు తళతళా మెరిసిపోతున్నాయి. రాత్రయ్యిందంటే ఎల్‌ఇడి, హైమాస్ట్‌ లైట్లు వెలుగులు విరజిమ్ముతున్నాయి. కోట్ల రూపాయలు రోజుల వ్యవధిలో ఖర్చయిపోతున్నాయి. ఆ నగరంలో ఇంత ఆర్భాటంగా పనులు ఎందుకు చేస్తున్నారు.? పాలక మహాశయుల్లో హఠాత్తుగా ఇంతమార్పెలా వచ్చిందంటే కారణం ఒక్కటే.! అక్కడ ఐఎఫ్‌ఆర్‌ నిర్వహించబోతున్నారు మరి. కానీ అభివృద్ధి ముసుగులో అవినీతికి గేట్లెత్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హఠాత్‌ అభివృద్ధికి కోస్టల్ సిటీ విశాఖ వేదికైంది. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్ విశాఖలో నిర్వహిస్తుండడంతో సిటీ రూపురేఖలే మారిపోతున్నాయి. ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు ఈ ఫ్లీట్ నిర్వహించనున్నారు. విశాఖపట్నానికి ప్రపంచస్థాయిలో ప్రచారం విస్తృతం చేస్తున్నారు. నేవీ ఐఎఫ్ఆర్‌పై ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించి విశాఖ ప్రాధాన్యతను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఐఎఫ్‌ఆర్‌ నిర్వహణ నేపథ్యంలో 92 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ చకచకా పనులు చేపట్టింది. 630 రహదారులను సుందరీకరించింది. అయితే జివిఎంసికి ఎపి సర్కారు మాత్రం నిధుల సహకారం అందించలేదు. దీంతో జివిఎంసి నిధులకు పెద్దగండే పడింది.

అవినీతి..
ఇక వుడా కూడా 23 కోట్ల రూపాయలను నగర సుందరీకరణకు ఖర్చు చేస్తోంది. కైలాసగిరి, ఎయిర్ పోర్టు, బీచ్ రోడ్డు, మిగిలిన పర్యాటక ప్రదేశాల్లో పనులు చేపట్టారు. అవన్నీ పూర్తి కావొచ్చాయి. లైటింగ్ కోసం 4కోట్లా 75 లక్షలు, బారికేడ్ల ఏర్పాటుకు 2.20 కోట్లు, నీటి సదుపాయం కోసం 40 లక్షలు, తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటుకు 40 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇలా సిటీ సుందరీకరణ కోసం ఎడా పెడా నిధులు ఖర్చు చేస్తున్నారు. అయితే పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరాన్ని అందంగా మార్చడం మంచిదే అయినా.. హడావుడి పనుల మూలంగా ఖర్చవుతున్నదానికి లెక్కా జమ ఉండడం లేదు. ఏమైనా విశాఖ అందాన్ని మరింత రెట్టింపు చేసే ప్రతిచర్యకూ స్వాగతం పలికినా.. ఆ ముసుగులో జరిగే అవినీతిని ఖండిస్తున్నారు.

సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నా..

విజయవాడ : సీఆర్డీఏ కార్యాలయం ఎదుట సీపీఎం, సీపీఐ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్టు కాపీలను నేతలు తగులబెట్టారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మాస్టర్ ప్లాన్ డ్రాఫ్టులో సమూల మార్పులు చేయాలని సీపీఎం నేత బాబురావు డిమాండ్ చేశారు. వ్యవసాయ పరిరక్షణ జోన్ లో ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు. 

బాబుకు మధు లేఖ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. తొలగించిన ఆరోగ్య మిత్రలను కొనసాగించాలని, జీవో నెంబర్ 28 వెంటనే రద్దు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 

వన్ హైదరాబాద్ కూటమి మీడియా సమావేశం..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో అవినీతి పెరిగిపోయిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలతో వన్ హైదరాబాద్ కూటమి పోటీ చేస్తోందన్నారు. జీహెచ్ఎంసీలో అవినీతి పాలనకు విముక్తి పలకాలని, నగరాభివృద్ధిపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్నారు. ప్రజల తరపున పోరాడే వన్ హైదరాబాద్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. మేయర్ పదవి ఉత్సవ విగ్రహంలా మారిందని లోక్ సత్తా నేత జేపీ పేర్కొన్నారు.

టి.కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా విక్రమ్ గౌడ్..

హైదరాబాద్ : గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా విక్రమ్ గౌడ్ పేరును టిపిసి చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. 

ఆరోగ్య మిత్రల అరెస్టును ఖండిస్తున్నాం - సీపీఐ..

విజయవాడ : ఆరోగ్య మిత్రల అరెస్టును ఖండిస్తున్నట్లు, అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని సీపీఐ నేత రామకృస్ణ పేర్కొన్నారు. జీవో నెంబర్ 27ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య మిత్ర కార్యకర్తలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాజధానిలో పోలీసుల నిరంకుశ వైఖరి ఆపకపోతే మూల్యం చెల్లించకోక తప్పదని హెచ్చరించారు. 

దక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంపై విచారణ..

విశాఖపట్టణం : కేశవరం దక్కన్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాద ఘటనపై విచారణకు మంత్రి గంటా ఆదేశాలు జారీ చేశారు. విచారణ కమిటీ ఛైర్మన్ గా విశాఖ రెండో జాయింట్ కలెక్టర్ వ్యవహరించనున్నారు. అగ్నిప్రమాదంపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

బాబు క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

విజయవాడ : సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జీవోనెంబర్ 27ను రద్దు చేయాలని కోరుతూ ఆరోగ్య మిత్రలు ధర్నా చేపట్టారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. 

వ్యవసాయ శాఖ జేడీ సస్పెన్షన్..

మెదక్ : వ్యవసాయ శాఖ జేడీ సస్పెన్షన్ కు గురయ్యారు. రూ.3.13 కోట్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. జేడీతో పాటు 8 మందిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

మెట్రోలో మోడీ..హోలాండె..

ఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఆయనతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు.

 

16:59 - January 25, 2016

పద్మవిభూషణ్‌
రజనీకాంత్‌(సినీనటుడు)
రామోజీరావు (మీడియారంగం)
ధీరూభాయ్‌ అంబానీ (మరణానంతరం పురస్కారం)
యామినీ కృష్ణమూర్తి (నాట్యరంగం)
శ్రీశ్రీ రవిశంకర్‌ (ఆధ్యాత్మికం)
గిరిజాదేవి (సంగీత విద్వాంసురాలు)
విశ్వనాథన్‌ శాంత (వైద్య రంగం)
జగ్‌మోహన్‌ (జమ్మూకశ్మీర్‌ మాజీ గవర్నర్‌)

పద్మ భూషణ్‌
అనుపమ్‌ ఖేర్‌ (సినీ నటుడు)
సానియా మీర్జా (క్రీడాకారిణి)
సైనా నెహ్వాల్‌ (క్రీడాకారిణి)
ఉదిత్‌ నారాయణ (సంగీత విద్వాంసుడు)
వినోద్‌రాయ్‌ (కాగ్‌ మాజీ అధికారి)
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ (సాహిత్యం)
నాగేశ్వర్‌రెడ్డి (గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌)
రాబర్ట్‌ డీ బ్లాక్‌విల్‌ (భారత్‌లో అమెరికా రాయబారి)

పద్మశ్రీ
రాజమౌళి (సినీ దర్శకుడు)
ప్రియాంకా చోప్రా (సినీ నటి)
అజయ్‌దేవ్‌గన్‌ (సినీ నటుడు)
మాలినీ అవస్థి (భోజ్‌పురి సింగర్‌)
ప్రిడ్రాగ్‌ కె.నిక్కి (సైబీరియా) (యోగా విభాగం)
హూ లాన్‌ జాంగ్‌ (చైనా) (యోగా విభాగం)
ఉజ్వల్‌ నిఖమ్‌ (సీనియర్‌ న్యాయవాది)

16:43 - January 25, 2016

ఢిల్లీ : ఢిల్లీ నుంచి ఖాట్మాండు వెళ్తున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ చెందిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఓ అగంతుకుడి నుంచి డిసిపికి కాల్‌ వచ్చింది. బాంబుతో కూడిన గిఫ్ట్‌ బాక్స్‌ సీటు కింద పెట్టినట్టు పేర్కొన్నాడు. దీంతో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానాన్ని అధికారులు ఆపివేశారు. విమానంలో సోదాలు నిర్వహిస్తున్నారు. విమానంలో 104 మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రాధాన్యమని జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యం పేర్కొంది.

16:41 - January 25, 2016

హైదరాబాద్ : బాలాజీనగర్‌ డివిజన్‌లో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప్పు విజయలక్ష్మికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఐద్వా కార్యకర్తలతో పాటు, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం రోడ్‌ షో నిర్వహించి, ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలను చేసిన సీపీఎం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ధనవంతులు మాత్రమే పోటీ చేస్తున్నారని, డబ్బులు ఇచ్చి గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మళ్లీ వీళ్లు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇదొక వ్యాపారమయంగా మార్చివేశారని విమర్శించారు. ప్రాణాలు ఫణంగా పెట్టి కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్నారని తెలిపారు. 

16:40 - January 25, 2016

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కీళ్ల మార్పిడి ఆపరేషన్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. గుంటూరు ప్రభుత్వాసుప్రతిలో కీళ్లు, మోచిప్ప ఆపరేషన్‌ చేయించుకున్న మంత్రి శ్రీనివాస్‌ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. జీజీహెచ్‌లో కీళ్ల మార్పిడి ఆపరేషన్ల కోసం అవసరమయ్యే సామాగ్రిని ఇవ్వడానికి పలువురు దాతలు ముందుకు వస్తున్నారని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్‌ నిర్వహించేందుకు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. 

16:38 - January 25, 2016

విజయవాడ : సింగపూర్‌ ప్రభుత్వంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలేవీ చెల్లవని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సీహెచ్‌ బాబురావు పేర్కొన్నారు. ఇప్పటివరకు సింగపూర్‌తో చేసుకున్న ఒప్పంద వివరాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా, గుంటూరుతో పాటు రాష్ట్ర ప్రజలందరూ మాస్టర్‌ప్లాన్‌ను తిరస్కరించినా ప్రభుత్వానికి బుద్దిరాలేదని బాబురావు విమర్శించారు. ముఖ్యంగా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు సింగపూర్‌కు తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. ప్రజల అభ్యంతరాలు ప్రభుత్వానికి ఇస్తే సింగపూర్ వారికి ఇవ్వడమేంటనీ ప్రశ్నించారు. పూర్తిగా ఆక్షేపణీయమైందని, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలను సింగపూర్ కు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. 

16:29 - January 25, 2016

ఢిల్లీ : భారత్‌-ఫ్రాన్స్‌ పలు అంశాలపై కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రధాని మోది, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండే సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు 13 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌ నుంచి 36 రాఫెల్‌ జెట్‌యుద్ధ విమానాలు భారత్‌ కొనుగోలు చేయనుంది. రైల్వేలకు సంబంధించి ఫ్రాన్స్‌ నుంచి 8 వందల లొకోమోటివ్‌లను భారత్‌ కొనుగోలు చేయనుంది. ఇరుదేశాల కుదుర్చుకున్న ఒప్పందాలపై భారత ప్రధాని మోది, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హొలాండే సంయుక్త ప్రకటన చేశారు. భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలున్నాయని ఈ సందర్భంగా మోది చెప్పారు. భారత గణతంత్ర దినోత్సవానికి హొలాండేను ఆహ్వానించడం దేశానికి గర్వకారణమన్నారు.

16:24 - January 25, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థుల ఆందోళనలు ఇంకా సద్దుమణగలేదు. దళిత విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళనలు, దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వీరికి జాతీయ స్థాయిలో మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయికి చెందిన నేతలు పలువురు వచ్చి సంఘీభావం ప్రకటించారు. వీరికి మద్దతుగా ఇప్పటికే దళిత ప్రొఫెసర్లు రాజీనామా చేశారు. తాజాగా మరో ఇద్దరు ప్రొఫెసర్లు రాజీనామా చేశారు. దీనికి కారకుడైన వీసీని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో వీసీ లాంగ్ లీవ్ లో వెళ్లడం ఇన్ ఛార్జీ వీసీగా శ్రీవాత్సవ్ ను నియమించడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఈ నియామకంపై ఇద్దరు నాన్ దళిత ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ పదవులకు డా.అనుపమ, డా. సౌమ్యాదేశాయ్ లు రాజీనామా చేశారు. రోహిత్ మృతిపై ఆందోళన చేస్తున్న, రాజీనామా చేసిన దళితుల ప్రొఫెసర్లకు వారు మద్దతు తెలిపారు. శ్రీవాత్సవ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ ఫోరం ప్రకటించింది. 

16:18 - January 25, 2016

విజయనగరం : భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు ఊరట లభించింది. భూ సేకరణపై హైకోర్టు స్టే విధించింది. మంగళవారం కోర్టులో పిటిషన్ పై వాదనలు జరిగాయి. విజయనగరం జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు నిలిపివేసింది. దీనితో ఎయిర్‌పోర్టు పనులు నిలిచిపోనున్నాయి. భూసేకరణను వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనను కొనసాగిస్తున్నారు. అయినా కేంద్రం నుంచి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుమతి లభించింది. జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ చెల్లదంటూ రైతులు కోర్టుకు వెళ్లడంతో.. హైకోర్టు విచారణకు స్వీకరించి.. భూసేకరణపై స్టే విధించింది.
భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఉప్పాడ సూర్యనారాయణ, కాకర్లపూడి సత్యనారాయణ రాజు ...న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. భోగాపురం మండలంలోని 9 రెవెన్యూ ప్రాంతంలో గ్రీన్ ఎయిర్ ఫీల్డ్ నిర్మణం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి భూ సేకరణ జరపాలన్న నిర్ణయంపై కోర్టు మెట్లు ఎక్కారు. గత కొన్ని నెలలుగా పిటిషన్ పై వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం నుండి పూర్తి సమాచారం లేకపోవడంతో కోర్టు భూ సేకరణపై స్టే విధించింది. దీనితో రైతుల ముఖాల్లో ఆనందం తాండవించింది.
విమానాశ్రయ నిర్మాణం కోసం ఏకంగా 15 వేల ఎకరాల భూమి సేకరించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో 5వేల ఎకరాలకు కుదించింది. ఈ మేరకు ఆగస్టు 31న జిల్లా కలెక్టర్ భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ జారీపై ఆగ్రహించిన బాధిత ప్రజలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తమ గ్రామాల్లో నిరాహార దీక్షలు, జిల్లా స్థాయిలో ఆందోళనలు చేశారు. సీపీఎం నేతల మద్దతుతో ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఇదే సమయంలో రైట్స్ అనే సంస్థ సర్వేకు దిగింది. దానికి రైతులు ఎక్కడికక్కడ అడ్డుతగిలారు. పోలీసులను మోహరింపజేసి రైతులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ భయపెట్టజూశారు. ఇటీవల భూ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష నేతలు చేపట్టిన పాదయాత్రలను అడ్డుకొని పలువురిపై కేసులు నమోదు చేశారు.

ఒప్పుకొనేది లేదంటున్న సీపీఎం..
విమానాశ్రయ స్థలానికి పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ కార్యదర్శి రాజీవ్‌ నయన్ చౌబే ఢిల్లీలో ప్రకటించారు. దీంతో నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి భూములు సేకరించేందుకు తాము ఒప్పుకునే ప్రసక్తేలేదని సిపిఎం నేతలు అంటున్నారు. విమానయాన శాఖ ఆమోదం తెలపడంతో మౌలిక సౌకర్యాల కల్పనకు సుమారు 15 వందల కోట్ల రూపాయల అవసరం ఉంది. ఈ నిధుల కోసం వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించేందుకు స్పెషల్‌ వెహికల్ పర్సస్ వెహికల్‌ బోర్డు డైరెక్టర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. విమానాశ్రయం కోసం భూసేకరణ విధానం లేదా భూ మార్పిడి విధానం ద్వారా గాని రైతుల నుంచి భూములను సేకరించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం హైకోర్టు విధించిన స్టేపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం..

విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్ల క్రమబద్దీకరణ అంశంపై మంత్రులు చర్చించనున్నారు. దీంతోపాటు రాజధాని మాస్టర్‌ ప్లాన్ అభ్యంతరాల అంశం, ఇసుక రేవుల వేలంపాట, విద్యుత్‌ చార్జీల పెంపుదల, 100 గజాల నుంచి 500 గజాలలోపు ఉన్న ఆక్రమిత భూముల క్రమబద్దీకరణ అంశాలపై చర్చించనున్నారు. సిఎం దావోస్ పర్యటన అంశాలు, సిఆర్‌డిఎ పరిధిలోని గ్రామ కంఠాల భూములపై తుది నిర్ణయం తీసుకుంటారు. 

15:43 - January 25, 2016

హైదరాబాద్ : 18 నెలల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌కు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ నేత మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాలను ఈ ఏడాదిన్నర కాలంలోనే తేవడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఆర్కేపురం డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దీపు సురేఖ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ముచ్చటించారు. ఆర్కేపురంలో డివిజన్ లో దీపు సురేఖ గతంలో కార్పొరేటర్ గా ఉన్నారని తెలిపారు. రామకృష్ణాపురం డివిజన్ లో ఉన్న ఎన్టీఆర్ నగర్ లో సీపీఐ మద్దతు ప్రకటించిందన్నారు. సురవరం, తాము అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గంప చెత్త కూడా ఎత్తిపోయేలేదన్నారు. కేవలం మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. కొంతమంది ప్రజాప్రతినిధులను అంగట్లో పశువులను కొనే విధంగా చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో చూడాలన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరవయ్యారని, అధికారం ఉంది గనుక అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. 

15:41 - January 25, 2016

కర్నూలు : ఆత్మహత్యలకు గురైన రైతు కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో రైతుల ఆత్మ హత్యలు పెద్ద ఎత్తున జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ మండిపడ్డారు. అప్పుల బాధతో కర్నూలు జిల్లాలో 58 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వారిని కుటుంబాలకు నష్టపరిహారం అందించడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తక్షణమే రైతు ఆత్మహత్యలకు గురైన కటుంబాలకు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.

15:39 - January 25, 2016

అనంతపురం : జీవో నెంబర్‌ 279ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అనంతపురం నగరంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన కార్మికులు మున్సిపాలిటీ సేవలను ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. జీవో అమలుతో వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే 279 జీవోను ఉపసంహరించుకోవాలని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

15:38 - January 25, 2016

విజయవాడ : మంగళవారం విజయవాడలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇందిరాగాందీ మున్సిపల్‌ స్టేడియం ముస్తాబవుతోంది. రిపబ్లిక్‌ డే ఉత్సవాల ఏర్పాట్లను నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. గత సంవత్సరం కూడా సీఎం బాబు, గవర్నర్ నరసింహన్ లు వేడుకల్లో పాల్గొన్నారని, ప్రభుత్వం చేపడుతున్న పథకాలను శకటాల ద్వారా తెలియచేయడం జరిగిందన్నారు. రేపు ఉదయం 7.45 గంటలకు బాబు వేదిక వద్దకు వస్తారని, అనంతరం రాష్ట్ర గవర్నర్ కూడా వస్తారన్నారు. జెండా ఆవిష్కరణ, పోలీసు కవాతు, శకటాల ప్రదర్శన ఉంటుందన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బహుమతుల ప్రధానం ఉంటుందని దేవినేని ఉమ పేర్కొన్నారు. 

15:35 - January 25, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ మృతికి వీసీ, కేంద్రమంత్రులిద్దరూ బాధ్యత వహించాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ డిమాండ్‌ చేశారు. హెచ్‌సీయూలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా వర్శిటీకి వచ్చిన ఆయన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీసీ, ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌పై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. టెన్ టివితో ఆయన ఎలాంటి అభిప్రాయాలు తెలియాచేశారో వీడియో క్లిక్ చేయండి.

15:35 - January 25, 2016

హైదరాబాద్ : బడుగు బలహీన వర్గాల విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలకు అరికట్టేందుకు రోహిత్‌ యాక్ట్‌ పేరిట సరికొత్త చట్టాన్ని రూపొందించాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు డిమాండ్‌ చేశారు. హెచ్‌సీయూలో జరిగిన ఘటనలపై వర్సిటీ వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

15:20 - January 25, 2016

హైదరాబాద్ : టిడిపిని విమర్శించే అర్హత మంత్రి తలసానికి లేదని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజకరవర్గంలోని పలు డివిజన్ లో ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తలసాని రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నుండి గెలిచిన తలసాని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూన వెంకటేష్ ను అభ్యర్థిగా నిలబెడుతామని, ఇతనిపై గెలవాలని సవాల్ విసిరారు. అప్పుడే తలసాని కథ..కూన వెంకటేష్ కథ తెలుస్తుందన్నారు. ప్రెస్ మీట్ లు పెట్టి టీవీల ఎదుట ప్రగల్భాలు పలకడం కాదని..సనత్ నగర్ సందుల్లోకి రా..అప్పుడే తెలుస్తుందన్నారు.

15:11 - January 25, 2016

ఢిల్లీ : 2016 సంవత్సరానికి గాను 'పద్మ' అవార్డులను కేంద్రం ప్రకటించింది. నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి, ప్రముఖ నటుడు రజనీకాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, వ్యాపారవేత్త కే.శే. ధీరూభాయ్ అంబానీ, రామోజీ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ఆధ్మాత్మిక గురువు పండింట్ రవిశంకర్ లకు పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. అలాగే ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్, ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, బ్యాడ్మింటెన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, మోడీ గురువు స్వామి దయానంద సరస్వతిలకు పద్మ భూషణ్ లు వరించాయి. 

15:04 - January 25, 2016

ఒకప్పుడు టీనేజర్స్ కే పరిమితమైన లంగా వోణీలు ఇప్పుడు మధ్య వయస్సు వారిని కూడా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి లంగా ఓణీలకు ఆధునిక డిజైన్స్ తెలుసుకోవాలంటే వీడియో చూడండి. 

15:00 - January 25, 2016

బుల్లితెర మీదైనా, సిల్వర్ స్క్రీన్ మీదైనా మహిళలు నటన లో తప్పితే, ఇతర రంగాల్లో నిలదొక్కుకోవడం అంత సులువైన విషయమేమీ కాదు. కానీ, అతి చిన్న వయసులోనే అనేక సమస్యలకు ఎదురీదుతూనే ఈ రెండు రంగాల్లో, తనని తాను నిలబెట్టుకుంటున్న సుచరిత పయనంతో ఎంతో మందికి స్పూర్తినిస్తోంది. సినిమా అంటే, డబ్బున్న వాళ్ల వేదికగా, తలపండిన వారసుల ఇలాఖాగా మారిన నేపథ్యం మనం చూస్తున్నాం. అలాంటి రంగంలో ఎలాంటి నేపథ్యం లేకున్నా, కేవలం నటన మీదున్న ఆసక్తితో, అంతకు మించి, స్వయం కృషితో పదిమందిలో ప్రత్యేకత సాధిస్తోంది సుచరిత రామానుజాపురం. షార్ట్ ఫిల్మ్స్ తో పాటు, ఈ కొత్త ఏడాది, బ్లాక్ బస్టర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని సుచరిత రామానుజపురం ఆత్మవిశ్వాసంతో చెప్తోంది. ఆమె కల నెరవేరాలని, కోరుకున్న విధంగా, భిన్న రంగాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించాలని మానవి కోరుకుంటోంది.

భారత్ - ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు..

ఢిల్లీ : భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధాన మంత్రి కార్యాలయంలో దేశ ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండెలు 13 ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అందులో అంతరిక్ష సహకారం, టెక్నాలజీ, అంబాలా, లూథియానా రైల్వే స్టేషన్ ల పునరుద్ధరణ, ఫుడ్ సేఫ్టీ, స్మార్ట్ గవర్నెన్స్ వంటి అంశాలున్నాయి. 

కుప్పకూలిన కివీస్ క్రికెటర్ మిచెల్ మెక్ క్లాన్..

వెల్లింగ్టన్ : పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ అన్వర్ ఆలీ వేసిన బంతికి న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ మెక్ క్లాన్ గన్ మైదానంలో కుప్పకూలిపోయాడు. వెల్లింగ్టన్ లో ఇరుదేశాల మధ్య వన్డే పోరు జరుగుతోంది. అన్వర్ వేసిన బౌన్సర్ మిచెల్ హెల్మెట్ కు తాకింది. తరువాత బాల్ ఎడమ కంటికి తాకడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీనితో మిచెల్ మైదానంలో కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన అధికారులు అతడిని ఆసుపత్రికి తరలించారు. తాను క్షేమంగానే ఉన్నానని మిచెల్ చికిత్స అనంతరం వెల్లడించాడు.

 

కొత్త విధానాలపై చర్చించాం - బాబు..

విజయవాడ : ప్రపంచంలో అవలింబిస్తున్న కొత్త కొత్త విధానాలపై తాము దావోస్ లో చర్చించడం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దావోస్ పర్యటన విశేషాలను మీడియాకు ఆయన తెలియచేశారు. సదస్సుకు హాజరు కావడం వల్ల చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరగుతుందో తెలుసుకొనే అవకాశం లభించిందన్నారు. జురిచ్ లో 11 కంపెనీల ప్రతినిధులను తాను కలవడం జరిగిందన్నారు. 

పద్మ అవార్డుల ప్రకటన..

ఢిల్లీ : పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తికి పద్మ విభూషణ్, ప్రముఖ నటుడు రజనీకాంత్ కు పద్మ విభూషణ్, ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు పద్మ భూషణ్, ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కు పద్మ భూషణ్ లు వరించాయి. 

14:35 - January 25, 2016

హైదరాబాద్ : నగరంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి లోకాయుక్త చైర్మన్ జస్టిస్ సుభాషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లలో చైతన్యం కలిగించడంలో గత ఐదేళ్లుగా ఎంతో కృషి చేస్తున్నామన్నారు ఎన్నికల ప్రత్యేక అధికారి భన్వర్ లాల్. మద్యం ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని జస్టిస్ సుభాషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ పాల్గొన్నారు.  

14:33 - January 25, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ వీసీ అప్పారావు జుట్టు ఎమ్మెల్సీ రాంచందర్ రావు చేతిలో ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఎద్దేవా చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ దూకుడు పెరిగిందని అగ్రకులాల పెత్తనంతో దళిత విద్యార్థులు చిత్ర హింసలకు గురవుతున్నారన్నారు. రోహిత్ మృతి ఆత్మహత్య కాదని ఆర్ఎస్ఎస్ హత్యగా ఆరోపించారు. మోడీ దేశ ముద్దు బిడ్డను కోల్పోయిందని మొసలి కన్నీరు కారుస్తున్నారని వీహెచ్ తనదైన శైలిలో మండిపడ్డారు.  

14:31 - January 25, 2016

హైదరాబాద్ : ఏ అనుమతుల్లేకుండానే హెచ్‌సియులోకి ప్రవేశించడాన్ని ఎలా అడ్డుకుంటారని సిపిఐ సీనియర్ నేత అజీజ్‌ పాషా ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోకి వెళ్లబోతుండగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాలు చలో హెచ్‌సియుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో యూనివర్శిటీలోకి ఎవరినీ అనుమతించడం లేదు. గత కొన్ని రోజులుగా రోహిత్ మృతిపై విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఘటనకు కారకులైన కేంద్ర మంత్రి దత్తాత్రేయ, వీసీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

14:29 - January 25, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఘటన చాలా బాధాకరమన్నారు బీ.ఆర్.అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్. విద్యార్థుల పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని ప్రకటించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను నాశనం చేసే వాతావరణం వర్శిటీలో ఉందని ఆరోపించారు. తామంతా మీతో ఉన్నామని చలో హెచ్ సీయూకు వచ్చిన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. యూనివర్శిటీలో దీక్ష చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

14:27 - January 25, 2016

హైదరాబాద్ : చలో హెచ్ సీయూ లో భాగంగా పెద్దసంఖ్యలో విద్యార్థులు యూనివర్శిటీలోకి చేరారు.. వీరిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.. అయినా తోసుకుంటూ వర్శిటీలోకి వచ్చారు స్టూడెంట్స్... అటు ప్రజా సంఘాల నేతలను మొదట అడ్డుకున్న పోలీసులు కొద్ది సేపటి తర్వాత లోపలికి అనుమతించారు. ఇక విద్యార్థులు విశ్వవిద్యాలయంలో తిరుగుతూ భారీ ర్యాలీ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైనవారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత విద్యార్థుల దీక్షచేస్తున్న ప్రదేశానికి చేరారు. అక్కడ సమావేశం కానున్నారు. ఈ భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.

14:26 - January 25, 2016

హైదరాబాద్ : హెచ్‌సియు విద్యార్థి రోహిత్ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలంటూ హైదరాబాద్ ఇందిరా పార్క్‌ వద్ద జరుగుతున్న రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి. రోహిత్ సంఘీభావ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ దీక్షలు నిర్వహిస్తున్నారు. రోహిత్ మృతికి కారణమైన కేంద్ర మంత్రి, విసిని పదవుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వీసీని రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, వెంటనే ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. 173 సంఘాలతో కమిటీ ఏర్పడడం జరిగిందని, రోహిత్ మరణం సహజ మరణం కాదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నిందని ప్రపంచం కోడై కూస్తోందన్నారు. వడ్డెర, బీసీ కులమంటూ పేర్కొంటున్నారని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్డీయే ప్రభుత్వంతో కుమ్మకైందన్నారు. రోహిత్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 

నగరంలో నకిలీ వీసా ముఠా గుట్టు రట్టు...

హైదరాబాద్ : నకిలీ వీసాల తయారీ ముఠా గుట్టురట్టైంది. మహిళలను విదేశాలకు తరలిస్తున్న ఆరుగురిని శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు అరెస్టు చేశారు. 

జైళ్ల శాఖలో రాష్ట్రపతి సేవా పతకాలు..

విజయవాడ : జైళ్ల శాఖలో రాష్ట్రపతి సేవా పతకాలను ప్రకటించారు. మహిళా జైలు సూపరింటెండెంట్ బషీరా బేగం, చర్లపల్లి జైలు చీఫ్ వార్డెన్ మనోహర్ ప్రసాద్ కు సేవా పతకాలు..వరంగల్ జైలు హెడ్ వార్డెన్ జయపాల్ రెడ్డికి సేవా పతకాలు లభించనున్నాయి.

చైతన్యపురిలో పోలీసుల తనిఖీలు..

హైదరాబాద్ : చైతన్యపురిలోని అలకాపూర్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న రూ.12.43 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

కాపులకు బాబు అన్యాయం చేయరు - డొక్కా...

గుంటూరు : కాపులకు సీఎం చంద్రబాబు నాయుడు అన్యాయం చేయడని టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. కాపుల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, కాపు కార్పొరేషన్ కు రూ. 100 కోట్లు కేటాయించిందన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై మంజునాథన్ కమిషన్ ఏర్పాటు చేసిందని, త్వరలోనే కాపులను బీసీలో చేరుస్తామని వెల్లడించారు. 

సనత్ నగర్ లో రేవంత్ రెడ్డి ప్రచారం...

హైదరాబాద్ : సనత్ నగర్ నియోజకవర్గంలో టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ నేతలు సంక్రాంతి గంగిరెద్దుల్లా ఓట్లు అడుగుతున్నారని, శశిధర్ రెడ్డి పెద్ద దొంగ, తలసాని చిన్న దొంగ అని రేవంత్ విమర్శలు చేశారు. తలసాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం తగదని సూచించారు.

రాష్ట్రపతితో భేటీ కానున్న కాంగ్రెస్ బృందం..

ఢిల్లీ : సాయంత్రం 5.30గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలువనుంది. 

కాసేపట్లో రాష్ట్రపతిని కలువనున్న రాజ్ నాథ్..

ఢిల్లీ : కొద్దిసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ కానున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపుపై చర్చించనున్నారు.

దక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత..

విశాఖపట్టణం : దక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్యాక్టరీని తొలగించాలంటూ పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహించారు. 

హెచ్ సీయూ ప్రధాన గేటు వద్ద ఉద్రిక్తత...

హైదరాబాద్ : హెచ్ సీయూ ప్రధాన గేటు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులతో కలిసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీపీఐ నేత అజీజ్ ఫాషాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

13:36 - January 25, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూలో విద్యార్థుల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేసినట్టు యూనివర్సిటీ అధికారులు వివరణ ఇచ్చారు. హెచ్‌సియులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘాల చలో హెచ్‌సియు పిలుపు నేపథ్యంలో యూనివర్శిటీలో పోలీసులను భారీగా మోహరింపజేశారు. రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు, ఇతరత్రా ప్రముఖులను హెచ్‌సియు లోపలికి అనుమతివ్వట్లేదు. వర్శిటీలోకి ప్రవేశించేవారని గేట్ వద్దే ఆపి ఐడి కార్డులు ఉన్నవారినే లోపలికి పంపుతున్నారు. విద్యార్థులు మాత్రం క్యాంపస్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. 

13:30 - January 25, 2016

హైదరాబాద్ : యూఎస్‌లో భీకర మంచు తుఫాన్‌ వణికిస్తోంది.. ఈశాన్య అమెరికాలో 15నుంచి 28 అంగుళాలవరకూ స్నో పేరుకుపోయింది.. తుఫాన్‌ ప్రభావంతో 11 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.. వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌తోపాటు... వివిధ నగరాల్లో విద్యుత్ సేవలు నిలిచిపోయాయి.. వేలకొద్దీ విమానాలు రద్దయ్యాయి..

ఎనిమిదిన్నర కోట్లమందిపై....

ఎనిమిదిన్నర కోట్లమందిపై ఈ మంచు తుఫాన్‌, పెనుగాలుల ప్రభావం కనిపించింది.. న్యూయార్క్ సిటీ వంటి నగరాల్లో అత్యవసర వాహనాలు మినహా సాధారణ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.. ఉపరితల మెట్రోనూ ఆపేశారు.. రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.. న్యూజెర్సీ, డెలావర్‌లకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు భావిస్తున్నారు.. మరో 24గంటలు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు..

కుప్పలు కుప్పలుగా కురుస్తున్న మంచుతో.....

ఇక కుప్పలు కుప్పలుగా కురుస్తున్న మంచుతో రహదారులు, ఇళ్లు, కార్లు అన్నీ కప్పబడిపోతున్నాయి.. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.. బలమైన ఈదురుగాలులతో జనాలు వణికిపోతున్నారు.. ఇప్పటికే తుఫాన్‌ ధాటికి 19మంది మృత్యువాత పడ్డారు.. ఈ తుఫాన్‌ తీవ్రత తగ్గుముఖం పడుతూ అట్లాంటిక్‌ మహా సముద్రం దిశగా సాగుతోంది..

అంతరిక్ష కేంద్రం నుంచి అమెరికా వ్యోమగామి స్కాట్‌ కెల్లీ చిత్రాలు...

అటు ఈ తుఫాన్‌ చిత్రాలను అంతరిక్ష కేంద్రం నుంచి అమెరికా వ్యోమగామి స్కాట్‌ కెల్లీ క్లిక్‌మనిపించారు. ఇందులో చికాగో నుంచి తూర్పు వైపునకు కదులుతుండటం, దట్టమైన మంచు గుప్పిట్లో వెలుగుతున్న నగర దీపాల చిత్రాలున్నాయి... మ

ఎమ్మెల్యే సాయన్నకు గుండెపోటు

హైదరాబాద్ :కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు గుండెపోటు వచ్చింది. వెంటనే హైదర్ గూడలో ని ఆపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

12:50 - January 25, 2016

హైదరాబాద్ : హెచ్‌సియులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘాల చలో హెచ్‌సియు పిలుపు నేపథ్యంలో యూనివర్శిటీలో పోలీసులను భారీగా మోహరింపజేశారు. రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు, ఇతరత్రా ప్రముఖులను హెచ్‌సియు లోపలికి అనుమతివ్వట్లేదు. వర్శిటీలోకి ప్రవేశించేవారని గేట్ వద్దే ఆపి ఐడి కార్డులు ఉన్నవారినే లోపలికి పంపుతున్నారు. విద్యార్థులు మాత్రం క్యాంపస్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అదే సమయంలో ఏ అనుమతుల్లేకుండానే హెచ్‌సియులోకి ప్రవేశించడాన్ని ఎలా అడ్డుకుంటారని సిపిఐ సీనియర్ నేత అజీజ్‌ పాషా ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోకి వెళ్లబోతుండగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాలు చలో హెచ్‌సియుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో యూనివర్శిటీలోకి ఎవరినీ అనుమతించడం లేదు.

 

12:49 - January 25, 2016

విజయవాడ : ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ఆరోగ్యమిత్రలను పోలీసులు అడ్డుకున్నారు.. తుమ్మలపల్లి కళాక్షేత్రంనుంచి ర్యాలీగా వెళుతున్న వీరిని ఆపేశారు.. ముందుజాగ్రత్త చర్యగా పలువురు కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.. క్యాంప్‌ కార్యాలయందగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.. తమను ఉద్యోగాల్లోంచి తొలగించడాన్ని వ్యతిరేకేస్తూ ఆరోగ్యమిత్రలు... ఈ కార్యక్రమం చేపట్టారు ..  

12:47 - January 25, 2016

నెల్లూరు : ఉద్యోగంనుంచి తొలగించారంటూ మనస్తాపంతో ఓ వైద్యమిత్ర ఆత్మహత్య చేసుకుంది.. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం ఎరుకుల కాలనీలోఉండే సుమలత వైద్యమిత్రగా పనిచేసేది.. ఆమెకు ఇద్దరు కూతుళ్లున్నారు.. భర్తకు రెండు కిడ్నీలు పనిచేయక కుటుంబ భారాన్ని సుమలతే మోస్తోంది.. ప్రభుత్వం నాలుగురోజులక్రితం వైద్యమిత్రలను ఉద్యగాల్లోంచి తీసివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.. ఉద్యోగం పోతే కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక సుమలత ఆందోళన చెందింది.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది.. చికిత్సకోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది.. 

12:46 - January 25, 2016

హైదరాబాద్‌ : కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకుంది.. యూపీకిచెందిన 26ఏళ్ల లిపి మిశ్రా డిఎల్ ఎఫ్ టవర్స్‌లోని టిప్కో కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తోంది.. ఇంద్రానగర్‌లోని ఉదయ్‌వెండ్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌లో రసాయనిక పొగ పెట్టుకొని ఉపిరాడక చనిపోయింది.. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడంలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.. మృతురాలు రాసిన సుసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు..  

12:45 - January 25, 2016

విజయవాడ : కాపులకు రిజర్వేషన్లు కల్పించితీరతామన్నారు.. ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప.. ఇందులో భాగంగా కమిషన్‌ కూడా ఏర్పాటు చేశామని ప్రకటించారు.. ఆరు నెలల్లో నివేదిక వస్తుందని స్పష్టం చేశారు.. కొందరు నేతలు చెప్పే కళ్లబొల్లి మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం పేరూరులో బీసీ కార్పొరేషన్ కొత్త డైరెక్టర్‌ చంద్రమౌళి అభినందన సభలో చినరాజప్ప ఈ ప్రకటన చేశారు.  

12:43 - January 25, 2016

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి కల్పనా రంజని అనారోగ్యంతో కన్నుమూశారు.. హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 50ఏళ్లు.. మళయాళ నటి అయిన కల్పన వివిధ భాషల చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం నాగార్జున, కార్తి హీరోలుగా నటిస్తున్న ఉన్న 'ఊపిరి' సినిమాలో కల్పన నటిస్తున్నారు.. ప్రేమ మూవీతో పాటు.. సతీ లీలావతి, చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. తన ఉత్తమ నటనతో ఆమె అనేక పురస్కారాలు అందుకున్నారు. కల్పన మృతిపట్ల దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

12:42 - January 25, 2016

తూర్పుగోదావరి : అల్లవరం మండలం కొమరగివరి పట్నం సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది.. భోజనం తిన్న పలువురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.. వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.. ఈ విద్యార్థులను ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు.. పూర్తి వివరాలతో నివేదిక అందించాలని ఆర్డీఓ ను ఆదేశించారు..  

12:41 - January 25, 2016

విశాఖ :పాయకరావు పేటలో డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్యాక్టరీని మూసేయాలంటూ నాలుగు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీని ముట్టడించిన స్థానికులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. 

12:40 - January 25, 2016

ఢిల్లీ : భారత్‌ పర్యటనలో ఉన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండో... రెండోరోజు హస్తిన చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆయనకు.. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. మోదీ.. తన మంత్రివర్గ సహచరులను హోలాండోకు పరిచయం చేశారు. అంతకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు... రాజ్ ఘాట్‌ లో బాపుజీకి నివాళులు అర్పించారు.

12:39 - January 25, 2016

హైదరాబాద్ : ఉత్తరాదిని మంచుదుప్పటి వణికిస్తోంది. తెల్లవారుజామున భారీగా కురుస్తున్న మంచుతో...ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉదయం 11 గంటల వరకు.. వెలుతురు లేకపోవడంతో... వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు పెరిగాయి. నిన్నటి నుంచి జరిగిన ప్రమాదాల్లో 50 కార్లు ప్రమాదానికి గురయ్యాయి. 

సీఎం కార్యాలయం ముట్టడికి ఆరోగ్యమిత్ర కార్యకర్తల యత్నం...

విజయవాడ: తమను అన్యాయంగా తొలగించారంటూ సోమవారం విజయవాడలోని సీఎం కార్యాలయం ముట్టడికి ఆరోగ్య మిత్ర కార్యకర్తలు యత్నించారు. ఆరోగ్యమిత్ర కార్యకర్తల ఆందోళనకు దిగటంతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద పోలీసులు ఆరోగ్య కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. 

ఒడిశాలో ఎన్ కౌంటర్

హైదరాబాద్ : ఒడిశాలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు కమాండర్ పుట్టపాక కుమారస్వామి, భార్య సోని మృతి చెందారు. 70 కేసుల్లో కుమారస్వామి నిందితుడు. కుమారస్వామి పై రూ.20 లక్షలు, సోనిపై రూ.5లక్షల రివార్డు ఉంది.

అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన

హైదరాబాద్ : రాజకీయ అస్థిరత కారణంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేంద్రమంత్రి వర్గం సిఫారసు చేసింది. ఇటీవలి రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. గౌహతి హైకోర్టు సస్పెండ్‌ చేసిన 14 మంది ఎమ్మెల్యేలను ఉపసభాపతి తిరిగి అసెంబ్లీలోకి అనుమతించారు. ఈ చర్యతో ఆగ్రహించిన సభాపతి డిప్యూటీ స్పీకర్‌ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో పాటు గవర్నర్‌పై కూడా పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు అసెంబ్లీ సమావేశాలపై స్టే విధించింది.

కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైల్లో సాంకేతిక లోపం

హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ వెళ్తున్న బీబీనగర్ - భువనగిరి మధ్య సాంకేతిక లోపంతో కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైలు నలిచిపోయింది. గంట నుంచి ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు.

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

హైదరాబాద్ : నేడు స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతున్నాయి.

విశాఖ పరవాడ సెజ్ లో అగ్ని ప్రమాదం..

విశాఖ : జిల్లాలోని పరవాడ సెజ్‌లోని ఓ కంపెనీలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. జవహర్‌లాల్ ఫార్మాసిటీ అలివెర ప్రైవేట్ లిమిటెడ్‌ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. షార్టసర్క్యూటే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

పాతబస్తీలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

హైదరాబాద్ : పాతబస్తీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చి...మోసాలకు పాల్పడుతున్న ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 565 సిమ్ కార్డులు, 528 ఫిక్స్ డ్ వైరెస్ ఫోన్లు, 17 గేట్ వే పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు.

ప్రముఖ నటి కల్పనా రంజని కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ మళయాళ నటి కల్పనా రంజని(50) కొద్ది సేపటి క్రితం అపోలో ఆసుపత్రిలో మరణించారు. మళయాళంతో పాటు తెలుగులో సతీలీలావతి, బ్రహ్మచారి తదితర చిత్రాల్లో నటించి ఉత్తమ సహాయ నటిగా పురస్కారాన్ని పొందారు. ప్రస్తుతం నాగార్జున హీరోగా రూపొందుతున్న ఊపిరి చిత్రలో కూడా ఆమె నటిస్తున్నారు.

డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద స్థానికులు ఆందోళన

విశాఖ : డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. అగ్నిప్రమాద ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంపై పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు.

ఎంఎస్ నారాయణ సతీమణి కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ (63) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ జూబ్లీహిల్స్ లో తన స్వగృహంలో కళాప్రపూర్ణ కన్నుమూశారు.

09:41 - January 25, 2016

హైదరాబాద్ : కట్నం కోసం వేధిస్తున్న భర్త నుండి కాపాడాలని మలక్ పేట్ పోలీసులను ఆశ్రయించింది ఓ యువతి. శామీర్ పేట్ లోని దివ్యజ్యోతి స్కూల్ లో పనిచేస్తున్న పర్వినాను యజమాని కొడుకు సూరజ్ ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని.. మొదట్లో బాగానే ఉన్న సూరజ్ తరచూ 10 లక్షల కట్నం తీసుకురావాలని వేధిస్తుండడంతో భరించలేని యువతి పౌరహక్కుల సంఘం నాయకులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని తన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.

09:39 - January 25, 2016

హైదరాబాద్ : నేడు చలో హెచ్‌సీయూకి దేశవ్యాప్తంగా విద్యార్థులు తరలివస్తున్నారు.. అటు నిన్నటినుంచి రెండో దఫా నిరాహార దీక్షలకు దిగారు విద్యార్థులు.. ఇంచార్జ్ వీసీగా బాధ్యతలు తీసుకున్న బిపిన్‌ శ్రీవాస్తవ... ఇవాళ యూనివర్శిటీ స్టాఫ్‌తో సమావేశం కానున్నారు.. 

09:37 - January 25, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం విజయవాడలో జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో.. దశాబ్దాల నుంచి ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్దీకరించే అంశంపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. వంద గజాల నుంచి 500 గజాల వరకు ఉన్న స్థలాలను క్రమబద్దీకరించాలనే ఆలోచనతో మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై చర్చించే అవకాశముంది. చంద్రబాబు దావోస్‌ పర్యటన, సింగపూర్‌ ప్రతినిధులతో రాజధాని బృహత్తర ప్రణాళికపై చర్చలు, సీఆర్‌డీఏ ప్రాంతంలో గ్రామకంఠాల వ్యవహారం, ఇసుక రేవుల వేలం, విద్యుత్‌ సుంకం విధింపు తదితరాలపై కూడా చర్చించే అవకాశాలున్నాయి.

హెచ్ సియూ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..

హైదరాబాద్ : విద్యార్థి సంఘాల చలో హెచ్ సియూ పిలుపు నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. హెచ్ సీయూకు కిలో మీటర్ దూరంలో చెక్ పోస్టు ఏర్పాటు చేశారు.

యూపీ గవర్నర్ రామ్ నాయక్ కు అస్వస్థత

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. ఆయన తీవ్ర ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

కారు టైరు పేలి మహిళ మృతి

మహబూబ్ నగర్ : మానవపాడు మండలం ఉండవెల్లి వద్ద ప్రమాదం జరిగింది. హైవేపై ముందలి టైరు పేలి కారు బోల్తా పడిన సంఘటనలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు సౌత్‌జోన్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ నీలకంఠరెడ్డి, అతని డ్రైవర్ అని పోలీసులు చెప్పారు. మృతురాలు నీలకంఠరెడ్డి తల్లి లక్ష్మీపార్వతి అని పోలీసులు చెప్పారు.

09:11 - January 25, 2016

హైదరాబాద్ : హెచ్‌సియులో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్‌కు మద్దతుగా కుల వివక్షకు వ్యతిరేకంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో సెంట్రల్ యూనివర్సిటీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్‌-కవితాగానం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి పలువురు సామాజికవేత్తలు, కవులు హాజరయ్యారు. దేశంలో బడుగు బలహీనవర్గాలు, దళితులు ఎదుర్కొంటున్న వివక్షపై కవితాగానం చేశారు. 

09:10 - January 25, 2016

ఖమ్మం : భద్రాద్రిలో 999 మంది బాల, బాలికలతో భక్త రామదాసు కీర్తనలకు నృత్యనీరాజనం చేశారు. అవార్డ్ టీచర్స్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలోని ఉత్తరద్వారం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఘనంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన చిన్నారులు ఒకేసారి భక్తరామదాసు కీర్తనలకు నృత్యం చేయడం అందిరిని అలరించింది. ఈ నృత్య ప్రదర్శనను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ , తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ , సూపర్ చిల్డ్రన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేశారు.

09:09 - January 25, 2016

హైదరాబాద్ : 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత క్రీడాకారులు గళం కలిపారు. జాతీయగీతాన్ని ఆలపిస్తూ.. తమలోని దేశభక్తి స్ఫూర్తిని ప్రదర్శించారు. దేశంలో క్రీడలకు ప్రోత్సాహం కలిగించేలా అభిజిత్ పన్సే రూపొందించిన ఈ వీడియోలో 8మంది క్రీడా దిగ్గజాలు పాల్గొన్నారు. క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్, టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, మహేష్ భూపతి, హాకీ మాజీ కెప్టెన్ ధన్ రాజ్ పిళ్లై, సీనియర్ ఫుట్ బాల్ ప్లేయర్ బైచుంగ్ భూటియా, షూటర్ గగన్ నారంగ్, కుస్తీలో ఒలింపిక్ పతక విజేత సునీల్ కుమార్.. జనగణ పాడుతూ.. దేశభక్తి స్ఫూర్తిని రగిలించారు. 

08:20 - January 25, 2016

విజయవాడ : నగరంలో కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం కొత్తపుంతలు తొక్కుతోంది. ఉదయం 900 రూపాయలు ఇచ్చి, సాయంత్రానికి వెయ్యి రూపాయలు వసూలు చేసే స్థాయికి చేరింది. రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసుకుని పొట్టపోసుకునే వారే లక్ష్యంగా కాల్‌ నాగులు వడ్డీ దందా నిర్వహిస్తున్నారు. రోజూ కొన్ని లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఉదయం ఇచ్చిన డబ్బు సాయంత్రానికి ఇవ్వకపోతే... గతంలో మాదిరిగానే వేధింపులు, సాధింపులు.. .ఆతర్వాత బెదిరింపులు షరామామూలేఉ. డబ్బు వడ్డీకి ఇచ్చి నోట్లు రాయించుకుంటే పోలీసు సోదాల్లో దొరికిపోతామన్న భయంతో కాల్‌ నాగులు ఇప్పుడు రోజువారీ వ్యాపారం ప్రారంభించారు.

కాల్‌ నాగులు వేధింపులలో నందిగామలో మహిళ ఆత్మహత్యాయత్నం .

కాల్‌ మనీ వ్యాపారం చేస్తున్న వారిలో ఎక్కువ మంది అధికార తెలుగుదేశం నేతలే. కాల్‌ నాగులు వేధింపులు తట్టుకోలేక రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లా నందిగామలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న కేసులో కూడా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పాత్ర బయడపడింది. అయితే అధికారం అండచూసుకుని ఇలాంటి కేసుల నుంచి కాల్‌ మనీ వ్యాపారులు చాకచక్యంగా తప్పుకుంటున్నారన్న విమర్శులున్నాయి.

సగానికిపైగా కేసుల్లో ఆధారాలు లేవంటున్న పోలీసులు ..............

విజయవాడలో వెయ్యికిపైగా కాల్‌ మనీ కేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో సగానికి పైగా కేసుల్లో ఆధారాలు లేవని పోలీసులు తేల్చారు. రాజకీయ ఒత్తిళ్లే దీనికి కారణమంటున్నారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ కేసును నీరు కార్చే ప్రయత్నంల్లో ఇదో ఎత్తుగడని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు కాల్‌ మనీ కేసుల్లో ఎంతటివారు ఉన్నా ఉపేక్షించబోమని పోలీసులు చెబతున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కాల్‌ మనీ కేసుల్లో చిన్న, చితక నేతలు, వ్యాపారులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్న పోలీసులు ఈ వ్యవహారంతో సంబంధ ఉన్న ప్రజాప్రతినిధుల జోలికివెళ్లడంలేదన్న విమర్శలున్నాయి. 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ....

తిరుమల : తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం, నడకదారి భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. 

నేడు ఏపీ కేబినెట్ భేటీ...

విజయవాడ : నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం విజయవాడలో జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో..దశాబ్దాల నుంచి ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్దీకరించే అంశంపై చర్చ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.

08:00 - January 25, 2016

హైదరాబాద్ : కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంలో సామాజిక పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేయాలని 'న్యూస్ మార్నింగ్ షో' సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ పై వైసీపీ ఇపుడు ఎందుకు మాట్లాడుతోంది? కాలపును ఆకట్టుకునేందుకు వైసీపీ మాట్లాడుతోందా? టిడిపి కాపులకు బిసి హోదా కల్పిస్తుందని నమ్మకం లేదా?వైసీపీ, టిడిపి,బిజెపి కాపులను రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తోందా? రాజకీయ పార్టీలు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల ముందు వాగ్ధానాలకే పరిమితం చేస్తున్నాయా? రిజర్వేషన్ల అంశం ఆచితూచి అడుగులు వేయాలి… మొక్కుబడి చర్యల వల్ల ఉపయోగం ఉంటుందా?కాపులకు రిజర్వేషన్ కోసం కమిషన్ కంటి తుడుపు చర్యేనా? పార్లమెంట్ లో కాపుల రిజర్వేషన్ పై చర్చ జరగాల్సిన అవసరం లేదా? ఏపీలో కులాల కుంపటి రాజేయడానికి వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయా? రాజ్యాంగ బద్ధమైన రిజర్వేషన్ల పై కేంద్రం ఒక విధానం ప్రకటించాల్సిన అవసరం లేదా? ఇలాంటి అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో తెలకపల్లి రవితో పాటు టిడిపి నేత సూర్యప్రకాష్, వైసీపీ నేత కరణం ధర్మశ్రీ, కాపునాడు నేత సుబ్రమణ్యం పాల్గొన్నారు. మరి చర్చను మీరు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

పెరేడ్ గ్రౌండ్ లో విస్తృత తనిఖీలు..

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవ సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానాన్ని సందర్శించి బందోబస్తు ఏర్పాట్లపై పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ఈ గణతంత్ర వేడుకల్లో మూడు పారా మిలటరీ, పోలీస్‌ బృందాలు పాల్గొంటున్నాయన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తామన్నారు.

రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

హైదరాబాద్ : రాజ్‌భవనలో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు గణతంత్ర దినోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతున్నందున రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిసూ నగర ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ జితేందర్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాజ్‌భవన్ కు మోనప్ప ఐలాండ్‌తోపాటు వీవీ విగ్రహం జంక్షన నుంచి వచ్చే వాహనదారులు మంగళవారం మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఇతర మార్గాల్లో వెళాల్లి.

గులాబీ రంగు పాసు ఉన్నవారు గేట్‌ నెం.1 ద్వారా లోపలికి వెళ్లాలి. వాహనాలను రాజ్‌భవన లోపల కేటాయించిన స్థలంలో పార్కింగ్‌ చేయాలి.

06:53 - January 25, 2016

హైదరాబాద్ : తమిళనాడు ఎన్నికలు జయలలిత పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందట. పొత్తులు, అవగాహనల ప్రక్రియ అసలు మొదలు కాకముందే.. తమిళనాడుకు చెందిన ఓ సంస్థ నిర్వహించిన ప్రీపోల్‌ సర్వేలో.. జయలలిత నేతృత్వంలోని అన్నా డిఎంకే స్వల్ప మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు తేలింది. అయితే.. డిఎంకే నేతృత్వంలోని ఫ్రంట్‌ కొంత కృషి చేస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమూ లేకపోలేదని ఆ సర్వే వెల్లడించింది.

ది పీపుల్స్‌ స్టడీస్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో .....

తమిళనాడు ఎన్నికల్లో.. అన్నా డిఎంకే మరోమారు విజయఢంకా మోగించబోతోందని.. ది పీపుల్స్‌ స్టడీస్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే... ప్రత్యర్థి డిఎంకే.. జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకే చేతుల్లో దెబ్బతినడం ఖాయమని ఆ సర్వే జోస్యం చెప్పింది. శాంపిల్‌ సర్వేలో పాల్గొన్న వారిలో.. 33.3 శాతం మంది అన్నాడిఎంకేకి ఓటేస్తామని.. 33.1 శాతం మంది డిఎంకేకి ఓటేస్తామని వెల్లడించారట. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో చెప్పాలంటూ వేసిన ప్రశ్నకు మాత్రం.. డిఎంకే నేతృత్వంలోని ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదని ఓటర్లు చెప్పారని సర్వే సంస్థ వెల్లడించింది.

అన్నాడిఎంకే ఓట్లు కూడా 10శాతం పెరుగుదల...

తమిళనాడు రాష్ట్రంలోని 39 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 120 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ది పీపుల్స్‌ స్టడీ సంస్థ... ర్యాండమ్‌గా 5వేల 464 మందిని సర్వే చేసింది. ఇందులో ఎస్సీలు19.8 శాతం, ఎంబీసీలు 28.9 శాతం, ఓబీసీలు 41.2 శాతం ఓటర్లు పాల్గొన్నారు. పీపుల్స్‌ స్టడీస్‌ సంస్థ 2014 నవంబర్‌, 2015 ఆగస్టు నెలల్లో నిర్వహించిన సర్వేలతో పోలిస్తే.. 2016 జనవరిలో సర్వేలో డిఎంకే ఓట్లు 7.1 శాతం పెరగగా.. అదే స్థాయిలో అన్నాడిఎంకే ఓట్లు కూడా 10శాతం పెరగడం విశేషం.

సర్వే పై విపక్షాల మండిపాటు....

జయలలిత ప్రవేశ పెట్టిన మిక్సర్‌, గ్రైండర్‌ లాంటి సంక్షేమ పథకాలను 23.6 శాతం మంది ప్రశంసించగా.. ల్యాప్‌టాప్‌ లాంటి పథకాలను 21.1 శాతం మంది మెచ్చుకున్నారు. మిగిలిన వారు వృద్ధాప్య పింఛన్ల వంటి పథకాలను స్వాగతించారు. ఇక దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం అధినేత విజయకాంత్‌ బహిరంగ ప్రవర్తనకు సంబంధించి నిర్వహించిన సర్వేలో.. 56.4 శాతం మంది అదేమంత పెద్ద సమస్య కాదని తేల్చి చెప్పారు. 12.4 శాతం మందేమో ఆయన పాపులారిటీ బాగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. శ్రీలంక తమిళులు, జల్లికట్లు అంశాలు సర్వేలో ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. అయితే ఈ సర్వే బూటకమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 

06:49 - January 25, 2016

హైదరాబాద్ : వంటగ్యాస్‌ రీఫిల్‌ బుకింగ్‌కు ఆన్‌లైన్‌ నగదు చెల్లింపు విధానం అందుబాటులోకి వచ్చింది. రీఫిల్‌ బుక్‌ చేసుకున్నప్పుడే డబ్బులు చెల్లించే వీలు కల్పించారు. ఇంతకుముందు సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌కు మాత్రమే అన్‌లైన్‌ విధానం ఉంది. డబ్బులు మాత్రం సిలిండర్‌ తెచ్చిన తర్వాత డెలివరీ బోయ్స్‌కు ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై సిలిండర్‌ బుక్‌ చేసుకున్నప్పుడే ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యం కల్పించారు. www.mylpg.in వెబ్‌సైట్‌ ద్వారా 13 భాషల్లో ఆన్‌లైన్‌ చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో గ్యాస్‌ బుక్‌ చేసుకుని, డబ్బులు చెల్లించేందుకు టచ్‌స్క్రీన్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేసే అంశాన్ని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పరిశీలిస్తున్నాయని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. కొత్తగా గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకునే వినియోగదారులు ఖర్చును 24 సమాన వాయిదాల్లో చెల్లించే ప్రతిపాదనపై కూడా ఓ ఎంసీ లు కసరత్తు చేస్తున్నాయి. 

06:48 - January 25, 2016

హైదరాబాద్ : కరీంనగర్‌లో మూడు రోజులపాటు జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం సహాసభలు నూతన కార్యవర్గం ఎన్నికతో ముగిశాయి. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ మొదటి రోజు ఈ సభలను ప్రారంభించారు. రెండో రోజుల సమావేశాలను అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు పాటూరి రామయ్య ప్రారంభించారు. రెండురోజు సమావేశాల్లో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కీలకకోపన్యాసం చేశారు. మూడో రోజు సమావేశాలకు హాజరైన సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు.

24 అంశాలపై తీర్మానాలు ఆమోదం .....

వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై 24 తీర్మానాలను ఈ మహాసభల్లో ఆమోదించారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. వ్యసాయ కార్మికులకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు జరపాలన్న డిమాండ్‌తో వచ్చే నెల 1 నుంచి 15 వరకు ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చారు.

కమిటీ సభ్యులు 73 మంది .....

వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా వెంకట్‌, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. మరో 73 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారికి ఉద్యమాలే ఊపిరిగా పని చేయాలని నిర్ణయించారు.

ఉపాధి హామీ పథకానికి గండికొట్టే విధంగా....

తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి గండికొట్టే విధంగా వ్యవహరిస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్రంలో కోటి 20 లక్షల మంది వ్యవసాయ కార్మికుల పొట్ట కొట్టేలా పనులు చేస్తోందని మండిపడ్డారు. వ్యవసాయ కార్మిక సంఘం మహాసభల ముగింపు సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కళాకారలు ప్రదర్శించిన నాటికలు అందర్నీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీలపై ప్రదర్శించిన నాటిక నవ్వులు పూయించింది. మొత్తంమీద మూడు రోజుల పాటు జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు విజయవంతమయ్యాయి. 

06:45 - January 25, 2016

విశాఖ : జిల్లా పాయకరావుపేట మండలం రాజవరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. దక్కన్‌ కెమికల్స్‌లో జరిగిన ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలయ్యింది. రసాయనాలు నిల్వ ఉంచిన గోదాముల్లో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తు పొగలు వ్యాపించాయి. ఆ తర్వాత ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో గాయపడిన కార్మికులను తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దక్కన్‌ కెమికల్స్‌లో మంటలు......

దక్కన్‌ కెమికల్స్‌లో మంటలు చెలరేగడంతోపాటు పెద్ద శబ్ధాలు వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటల నుంచి వచ్చే రసాయాల దుర్గంధం భరించలేక చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పొలాల్లోకి పరుగులు తీశారు. రాజవరంతోపాటు, కేశవరం, గజపతినగరం గ్రామాల ప్రజలు భయంతో ఆహాకారాలు చేస్తూ ప్రాణాలు అరచేతపెట్టుకుని సురక్షింత ప్రాంతాలకు తరలిపోయారు. మరికొందరు ట్రాక్టర్లతోపాటు అందుబాటులో ఉన్న ఇతర వాహనాల్లో తుని వైపు వెళ్లారు. పాయకరావుపేటతోటు ఆ పక్కనే ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని తుని పరిసరాలకు కూడా దట్టమైన పొగలు వ్యాపించాయి. పాయకరావుపేట మండలలోని పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.

యాజమాన్యం నిర్లయక్ష్యంతోనే ప్రమాదం....

పోలీసులు, రెవిన్యూ అధికారులు కేశవరం చేరుకుని పరిస్థితి సమీక్షించారు. యాజమాన్యం నిర్లయక్ష్యంతోనే ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్ని మాపక, పోలీలు అధికారులు అనుమానిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత దర్యాప్తు చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయంటున్నారు. ఆదివారం కావడంతో తక్కువ మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. దక్కన్‌ కెమిల్స్‌లో అగ్ని ప్రమాదాలు కొత్త కాదని కార్మికులు, స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

06:43 - January 25, 2016

కృష్ణా : విజయవాడలో గంజాయి రవాణ జోరుగా సాగుతోంది. నగరానికి రవాణ సదుపాయాలు పుష్కలంగా ఉండడంతో భారీగా గంజాయి అక్రమ రవాణ అవుతోంది. ఈ అక్రమ దందాకు పోలీసులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో గంజాయి రవాణకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఖమ్మం, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల నుంచి గంజాయి నగరానికి చేరుతోంది. నగర శివార్లలోని కొందరు వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అక్రమార్కులు ఎవ్వరికీ అనుమానం రాకుండా సూట్‌కేసులు, స్టీలు సామానుల సంచులు, మెడికల్‌ కిట్లలో రవాణా చేస్తున్నారు. వాసన రాకుండా ఉండేందుకు పౌడర్‌ చల్లుతూ గంజాయిని యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు.

విజయవాడలో గంజాయికి విపరీతమైన డిమాండ్‌............

నగరంలో ఎటువంటి చెక్‌పోస్టులు లేకపోవడం, గంజాయి సేవించేవారి సంఖ్య నానాటికి పెరగడం వ్యాపారులకు వరంగా మారుతోంది. నగరానికి చెందిన రౌడీషీటర్లు, మధ్యలోనే చదువు ఆపేసిన విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారడంతో దీనికి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. కృష్ణాజిల్లా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి అక్రమ రవాణా అవుతోంది. గత సంవత్సరంలో సుమారు 40 కోట్ల రూపాయల విలువైన గంజాయి పట్టుబడిందంటే ఈ అక్రమ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు.

ఒరిస్సా నుంచి 4 టన్నుల గంజాయితో వచ్చిన లారీ......

సుమారు 4 టన్నుల గంజాయితో ఒరిస్సా నుంచి విజయవాడ వచ్చిన లారీని.. సరకును వ్యాపారులకు తరలించడానికి కొండపల్లిలోని పారిశ్రామిక ప్రాంతంలో దాచారు. అయితే స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ గంజాయి మీడియా కంటబడకుండా గోప్యంగా ఉంచేందుకు యత్నించారు. గంజాయిని కాటా వేస్తున్న సమయంలోనూ మీడియాను చిత్రీకరించకుండా అడ్డుకున్నారు. దీన్ని బట్టి చూస్తే వ్యాపారులకు పోలీసులు మధ్య ఉన్న లింకు ఏమిటో తెలుస్తోంది. ఈ అంశంపై విజయవాడ పశ్చిమ ఏసీపీ రామకృష్ణను సంప్రదించగా... కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

పలు విమర్శలు ఎదుర్కొంటున్న పోలీసులు...

ఏదేమైనప్పటికీ గంజాయి వ్యాపారుల పట్ల పోలీసులు ఉదాసీన వైఖరి ప్రదర్శించడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా పోలీసులు గంజాయి అక్రమ రవాణదారుల పట్ల ఉక్కుపాదం మోపి, వ్యాపారుల ఆట కట్టించాలని ప్రజలు కోరతున్నారు. విద్యార్థులు, యువత మత్తుకు బానిసలను కాకుండా చూడాలంటున్నారు.

కొత్త పుంతలు తొక్కుతోన్న కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం

విజయవాడ : నగరంలో కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం కొత్తపుంతలు తొక్కుతోంది. ఉదయం 900 రూపాయలు ఇచ్చి, సాయంత్రానికి వెయ్యి రూపాయలు వసూలు చేసే స్థాయికి చేరింది. రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసుకుని పొట్టపోసుకునే వారే లక్ష్యంగా కాల్‌ నాగులు వడ్డీ దందా నిర్వహిస్తున్నారు. రోజూ కొన్ని లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఉదయం ఇచ్చిన డబ్బు సాయంత్రానికి ఇవ్వకపోతే... గతంలో మాదిరిగానే వేధింపులు, సాధింపులు.. .ఆతర్వాత బెదిరింపులు షరామామూలేఉ.

గ్రేటర్‌లో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

హైదరాబాద్ : మహానగరాన్ని మొత్తంగా మార్చేస్తాం. మంచినీరు మస్తుగా ఇస్తాం. నల్లా కనెక్షన్‌ ఫ్రీగా బిగించేస్తాం. ఉచితంగా వైఫై ఇచ్చి వండర్స్‌ సృష్టిస్తాం. అంతేనా పేదవారికి పక్కా ఇళ్లను పరిమితులు లేకుండా పంచేస్తాం. ఇవీ రాజకీయ పక్షాల మేనిఫెస్టోల్లోని అంశాలు. దాదాపుగా అన్ని పార్టీలూ ఇవే హామీలను గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోల్లో పొందుపరిచాయి. 

06:39 - January 25, 2016

హైదరాబాద్ : జనపథానికి స్వాగతం. ఇవాళ ఓటర్స్ డే. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్స్ డేకి ప్రాధాన్యత ఏర్పడింది. ఓటర్స్ డే ప్రాధాన్యత ఏంటి....ప్రజాస్వామిక సమాజంలో ఓటు హక్కుకున్న విలువేంటి....మనదేశంలో సగటు 50 నుంచి 60 శాతానికి మించి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోకపోవడానికి కారణమేంటి...ఎన్నికల్లో ఓటర్లు రకరకాల ప్రభావాలకు లోనవుతున్నారు...డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నాయి. ఈ రకమైన ట్రెండ్ వల్ల జరుగుతున్న నష్టాలేంటి. ఇలాంటి అంశాలపై ఇవాల్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో లోక్‌సత్తా నేత రాము పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై మాట్లాడారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

నేడు చలో హెచ్ సియూ

హైదరాబాద్ : హెచ్ సియూ పీహెచ్ డి విద్యార్థి వేముల రోహిత ఆత్మహత్య ఘటనపై ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. రోహిత మృతికి కారకులను శిక్షించే వరకూ ఆందోళనను కొనసాగించాలని తీర్మానించింది. ఇందులో భాగంగానే, సోమవారం ‘చలో హెచసీయూ’ను నిర్వహిస్తోంది. ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి దళిత సంఘాలు, విద్యార్థులు, పలు సంస్థల కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల నుంచి, ఇతర వర్సిటీల నుంచి విద్యార్థులు తరలి రానున్నారని వివరించింది.

Don't Miss