Activities calendar

26 January 2016

కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్టు..

నల్గొండ : కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్ లో సానియా డయోగ్నిస్టిక్ మేనేజర్ మహేశ్వరాన్ని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ రాకెట్ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేశారు. 

ఇద్దరూ ఎందుకు రాలేదో తెలియదు - నరసింహన్...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ రాకపోవడానికి గల కారణాలు తనకు తెలియదని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరు కాలేదు. ఈ విషయపై పై విధంగా నరసింహన్ స్పందించారు. 

ట్రాఫిక్ పోలీసుపై యువతి దాడి..

రంగారెడ్డి : కీసర (మం) నాగారంలో ట్రాఫిక్ పోలీస్ పై యువతి దాడి చేసింది. బైక్ పై రాంగ్ రూట్ లో వెళుతుండగా కానిస్టేబుల్ ఫొటో తీశాడు. ఫొటోను డిలీట్ చేయాలంటూ కానిస్టేబుల్ పై యువతి దాడి చేసింది. అనంతరం యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నగరంలో ఐఎస్ఐఎస్ సానుభూతి అరెస్టు..

హైదరాబాద్ : నగరంలో మరొక ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడిని కేంద్ర నిఘా బృందం అరెస్టు చేసింది. రహస్య ప్రదేశంలో ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు ఎన్ఐకే అప్పగించే అవకాశం ఉందని సమాచారం.

 

21:17 - January 26, 2016

అనంతపురం : జిల్లాలో రిపబ్లిక్ డే ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. జాతీయ జెండా పైపులోకి విద్యుత్ ప్రవహించడంతో విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన తాడిపత్రి మండలం కావేటి సముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో గోపాల మిత్ర భవనంలో జెండాను ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేశారు. జెండా సరిగ్గా ఎగురకపోవడంతో దానిని సరిచేయడానికి వంశీధర్ రెడ్డి (8వ తరగతి) పైపు ఎక్కేందుకు ప్రయత్నించాడు. పైపు పక్కనే ఉన్న విద్యుత్ వైర్లపై పడడం..ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించడంతో వంశీధర్ రెడ్డి అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. పైపును పట్టుకున్న మనోజ్ కుమార్ అనే విద్యార్థికి కూడా తీవ్రగాయాలయ్యాయి. 

స్వదేశానికి బయలుదేరిన హోలన్..

ఢిల్లీ : మూడు రోజుల పాటు భారత్ లో పర్యటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్ వో హోలన్ తిరిగి స్వదేశానికి పయనమయ్యారు. ఢిల్లీలోని ఏఎఫ్ఎస్ పాలం విమానాశ్రయంలో ఆయన ప్రత్యేక విమానంలో ఫ్రాన్స్ కి బయలుదేరారు. 

బుధవారం కేరళలో పర్యటించనున్న రాజ్ నాథ్ సింఘ్..

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజధాని త్రివేండ్రంలో నిర్వహించే కమ్యూనిటీ పోలీసింగ్‌పై జరిగే జాతీయ సెమినార్‌లో పాల్గొననున్నారు.

20:55 - January 26, 2016

రామాంతాపూర్ లో పర్యటించిన 'మల్లన్న'కు కొంతమంది విద్యార్థులు కళ్ల పడ్డారు. వీరంతా మేకల అనాల హనుమంత రెడ్డి విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్నరు. ప్రచారం నిర్వహించే వారికి భోజన సదుపాయం నిర్వహించారు. అక్కడకు వెళ్లిన 'మల్లన్న' వారితో ముచ్చట్లు కలిపాడు. మరి నేతలు..విద్యార్థులు ఏమన్నరో వీడియోలో చూడండి..

20:52 - January 26, 2016

ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యం. ఉచితం పేరిట ఓట్లను కొళ్లగొట్టడమే టార్గెట్. వాగ్ధానాలు హోరెత్తుతున్నాయి. అడ్డూ అదుపు లేని హామీలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ పార్టీల నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..అంటూ రాజకీయ నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. మరి ఈ హామీలు తీర్చాలంటే ఎంత ఖర్చు అవుతుంది ? దానిపై రాజకీయ పక్షాలకు అవగాహన ఉందా ? వీటిపై ఓటరు మాటేంటి ? ఈ అంశంపై ప్రత్యేక కథనం. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:36 - January 26, 2016

రామంతాపూర్ డివిజన్ లో 'మల్లన్న' పర్యటించిండు. అక్కడున్న పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయిండు. బాధలు..గోసను చెప్పుకుంటున్న వారిని 'మల్లన్న' ఓదార్చిండు. తనకు ఫించన్ వస్తలేదనని..తనకు కొడుకులు..ఇళ్లు ఉందని ఫించన్ ఇవ్వరంట అని ఓ వృద్ఢుడు మల్లన్నతో కు చెప్పుకుంటూ వాపోయిండు. అంటే రోడ్డుపై ఉండాలా అని ప్రశ్నించాడు. మరొక గల్లిలోకి వెళ్లిన మల్లన్నకు వాస్తవ పరిస్థితి ఎలా ఉందో స్థానికులు చూపెట్టిన్నరు. కేటీఆర్ వచ్చిండని, కేసీఆర్ నగర్ ను దత్తత తీసుకుంటానని చెప్పాడని ఓ వ్యక్తి పేర్కొన్నాడు. పబ్లిక్ ను మోసం చేస్తుండ్రని, తమకు ఇంటి నెంబర్ ఇప్పించాలని, అప్పుడే ఓటు వేస్తామని ఖరాఖండిగా చెప్పిండ్రు. వైఎస్ హాయంలో ఉన్న జీవోను రద్దు చేయాలని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఏమి చేయలేదని ఘంటాపథంగా చెప్పారు.

నీళ్లలో పురుగులు…
పేరుకు మంచినీళ్లే..కానీ అందులో అన్నీ పురుగులే ఉన్నయి. అవును 'మల్లన్న' పర్యటనలో ఇది వెల్లడైంది. బోరింగ్ నీళ్లు..అమాంతం మోరీల్లోంచి తీసుకొచ్చినట్లున్నయి. ఈ నీళ్లు పశువులు కూడ తాగయని అనుకుంటానని మల్లన్న పేర్కొన్నాడు. ఇక్కడకు వచ్చే లీడర్ కు మొదట ఈ నీళ్లు తీసుకొచ్చి ఇవ్వాలే అని తెలిపాడు.మరొక ఇంట్లో వచ్చిన మంచినీళ్లలో అన్ని పురుగులే ఉన్నాయని మల్లన్న చూపెట్టిండు. తాను ఇక్కడకు వచ్చి 26 ఏండ్లు అవుతోందని, సమస్య ఇంత వరకు తీరలేదని ఓ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. కట్టలు కట్టలు మింగుతున్నరని, గరీబోన్నళ్లను అలానే ఉంచుతున్నరని ఆక్రోషం వెళ్లగక్కింది. 

20:32 - January 26, 2016

గ్రేటర్ ఎలక్షన్స్ పోలింగ్ కు తేదీ దగ్గర పడుతోంది. నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నరు. ప్రతి డివిజన్ లో పర్యటిస్తూ హామీల మీద హామీలు గుప్పిస్తున్నరు. మరి ప్రజల పరిస్థితి ఎలా ఉంది ? వారి జీవన స్థితి ఎలా ఉంది ? అసలు ప్రజలు ఏమనుకుంటున్నరు అనేది తెలుసుకోవడానికి 'మల్లన్న' గ్రేటర్ పరిధిలో పర్యటిస్తున్నడు. ఎన్నికలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకొనే ప్రయత్నం చేసిండు. రామాంతాపూర్ పరిధిలో 'మల్లన్న' పర్యటించాడు. మరి అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో..ప్రజలు ఏమనుకుంటున్నరో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేసేయండి. .

పాపికొండల్లో పోలీసుల ఓవరాయాక్షన్..

పశ్చిమగోదావరి : పాపికొండల్లో పోలీసులు ఓవరాయాక్షన్ చేశారు. పేరంటాలపల్లిలో మద్యం మత్తులో మహిళపై దాడి చేశారు. పోలీసులను స్థానికులు చెట్టుకు కట్టేసి కొట్టారు. 

సచ్చినోడుబండ అడవిలో కూంబింగ్...

తిరుపతి : సచ్చినోడుబండ అటవీ ప్రాంతంలో టాస్క్ పోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఎర్రచందనం కూలీలు పోలీసులకు తారసపడ్డారు. లొంగిపోవాలంటూ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ముగ్గురు కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

ఉప్పుటేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి..

శ్రీకాకుళం : రూరల్ మండలం కనుగువానిపేటలో విషాదం చోటు చేసుకుంది. ఉప్పుటేరులో జారిపడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. లావణ్య (9), మణికంఠ (7), సంగీత (6)లుగా గుర్తించారు.

 

అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన..

ఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. 

18:34 - January 26, 2016

విజయవాడ : హెచ్ సీయూ దళిత విద్యార్థి రోహిత్ ది ఆత్మహత్య కాదని..హత్యేనని తండ్రి వేముల ఫణికుమార్ స్పష్టం చేశారు. విజయవాడలో వడ్డెర కులస్తులతో ఏర్పాటైన రోహిత్ న్యాయ పోరాట కమిటీ నేతలు ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశంలో ఫణికుమార్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీలో శవ రాజకీయాలు మాని తన కుమారుడి మరణానికి కారకులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. పోలీసులు, సీబీఐ విచారణతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే నమ్మకం తనకు లేదని, సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రోహిత్ కుల మార్పిడి విషయంలో తన కుటుంబసభ్యులు ఎందుకు మాట మార్చారో తెలియదన్నారు. ఈ విషయంలో ఎవరి తప్పిదం ఉంటే వారిపై చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని మణికుమార్ పేర్కొన్నారు. 

18:27 - January 26, 2016

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో ఓ లారీ డ్రైవర్ హాడావుడి చేశాడు. ఈఘటన విజయవాడలోని ఫల పుష్ప ప్రదర్శన జరుగుతోంది. ఈ కార్యక్రమానికి బాబు విచ్చేసి అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అదే సమయంలో టిడిపి వల్ల తన కుటుంబం రోడ్డున పడిందని శివరామ్ అనే లారీ డ్రైవర్ నినాదాలు చేయసాగాడు. దీనిపై బాబు ఒకింత ఆగ్రహం వ్యక్తపరిచారు. ఏదైనా ఉంటే కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అనంతరం నినాదాలు చేసిన శివరామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రాజ్ భవన్ లో ఎట్ హోం..

హైదరాబాద్ : రాజ్ భవన్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఎట్ హోం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. 

రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోం కార్యక్రమం..

ఢిల్లీ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత అద్వానీ తదితరులు హాజరయ్యారు. 

18:08 - January 26, 2016

ఆడిలైడ్ : ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ వేదికగా జరిగిన తొలి టీ -20 మ్యాచ్ లో భారత్ 37 పరుగుల తేడాతో ఆసీస్ ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ విరాట్ కోహ్లీ (90 నాటౌట్ : 55 బంతుల్లో 9x4, 2x6) చెలరేగి ఆడడంతో మూడు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనను ఆస్ట్రేలియా ఓపెనర్లు అరోన్ ఫించ్ (44 : 33 బంతుల్లో 4x4, 2x6), వార్నర్ (17 : 9 బంతుల్లో 2x4, 1x6) ధాటిగా ఆరంభించి తొలి వికెట్ కు 5.1 ఓవర్లలోనే 47 పరుగులు జత చేశారు. వీరిని జన్ ప్రీత్ బుమ్రా విడదీశాడు. స్పిన్లర్లు జడేజా, అశ్విన్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ బ్యాట్స్ మెన్స్ పరుగులు తీయడానికి కష్టపడ్డారు. సాధించాల్సిన పరుగులు పెరిగిపోతుండడం..బంతులు తక్కువగా ఉండడంతో బ్యాట్స్ మెన్స్ ఒత్తిడికి లోనయ్యారు. దీనిని అవకాశంగా తీసుకున్న భారత్ బౌలర్లు లైన్ అండ్ లెన్త్ లో బాల్స్ వేశారు. వత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు ఆసీస్ 19.3 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో భారత్ మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో అధిక్యంలో నిలిచింది.

రాణించిన కోహ్లీ…
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కోహ్లీ విశ్వరూపం ప్రదర్శన చేశాడు. ఇతనికి రైనా చక్కటి సహకారం అందించాడు. భారత్ ఓపెనర్లు శర్మ, ధావన్ లు ఆట ప్రారంభించారు. వీరిద్దరూ ధాటిగానే ఆడడం ఆరంభించారు. ముఖ్యంగా శర్మ అడపదడప షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించే క్రమంలో పడ్డాడు. ఈ దశలో భారత్ స్కోరు 40 పరుగులు ఉండగా ధావన్ (5) ను వాట్సన్ వెనక్కి పంపించాడు. ఒక పరుగు జత చేసిన అనంతరం శర్మ (31) కూడా పెవిలియన్ చేరాడు. దీనితో భారత్ మళ్లీ అదే ఆట తీరును కనబరుస్తుందా ? అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమమయ్యాయి. కానీ అనుమానాలను కోహ్లీ పటాపంచలు చేశాడు. బంతిని బౌండరీలకు తరలించే పనిలో పడ్డాడు. కేవలం 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి మంచి ఊపుమీదున్నట్లు కనిపించాడు. ఇతడికి జతగా వచ్చిన రైనా మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించే పనిలో పడ్డారు. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. జట్టు స్కోరు 174 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫాల్క్ నర్ బౌలింగ్ లో రైనా (41) వెనుదిరిగాడు. చివరిలో కోహ్లీ విజృంభించడంతో భారత్ 188 పరుగులు చేసింది. కోహ్లీ 90, ధోని 11 పరుగులతో నాటౌట్ గా మిగిలారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో వాట్సన్ రెండు, ఫాల్క్ నర్ ఒక వికెట్ తీశారు.
భారత బౌలర్లలో బుమ్రా 3, అశ్విన్, జడేజా, పాండ్యా తలా రెండు, నెహ్రా ఒక వికెట్ తీశారు. 

17:45 - January 26, 2016

మహారాష్ట్ర : అహ్మద్ నగర్ లోని శనిసింగ్నాపూర్ లో మహిళల ప్రవేశానికి కోసం చేస్తున్న ఆందోళన ఉధృతమౌతోంది. భూ మాత బ్రిగేడ్ స్వచ్ఛంద సంస్థ ఈ ఆందోళన చేపట్టింది. బారికేడ్లను తోసుకుని శని ఆలయంలోనికి వెళ్లడానికి చూసిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించేంత వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని మహిళలు రోడ్డుపై పడుకున్నారు. ఏడు వందల మంది మహిళలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. శని సింగ్నాపూర్ లో కేవలం పురుషులకు మాత్రమే అనుమతి ఉన్న విషయం తెలిసిందే. ఆనాదిగా వస్తున్న ఆచారానికి భిన్నంగా మహిళల ప్రవేశానికి ఒప్పుకొనేది లేదని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

ఇండియా విన్..

ఆడిలైడ్ : మొదటి టీ -20 మ్యాచ్ లో ఆసీస్ పై ఇండియా విజయం సాధించింది. 37 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 19.3 ఓవర్లలో ఆసీస్ 151 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అంతకుముందు ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. 

విజయానికి చేరువలో భారత్...

ఆడిలైడ్ : భారత్ తో జరుగుతున్న మొదటి టీ -20 మ్యాచ్ లో ఆసీస్ 9 వికెట్ కోల్పోయింది. 18.2 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 

17:27 - January 26, 2016

హైదరాబాద్ : రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. హెచ్ సీయూలో ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. సచివాలయం వద్దకు చేరుకున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు వీరిని సచివాలయం లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, వీసీ అప్పారావులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. 

కష్టాల్లో ఆసీస్..

ఆడిలైడ్ : మొదటి టీ -20 మ్యాచ్ లో ఆసీస్ కష్టాల్లో పడింది. వరుసగా వికెట్లు పడిపోతున్నాయి. 17.2 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ మూడు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 

ఆసీస్ 129/7..

ఆడిలైడ్ : ఆస్ట్రేలియా మరో వికెట్ కోల్పోయింది. వేడ్ 5 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం 16.1 ఓవర్లలో ఏడు వికెట్లకు 129 పరుగులు చేసింది. 

17:14 - January 26, 2016

ఒడిషా : రాజధాని భువనేశ్వర్‌లో ఉగ్రవాదుల జాడ కలకలం రేపింది. నలుగురు అనుమానిత ఉగ్రవాదులు ఓ హోటల్‌లో ఉన్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. అయితే వారు అక్కడి నుంచి పారిపోయారు. రైల్వే స్టేషన్‌ సమీపంలోని బడ్జెట్‌ హోటల్‌లో నలుగురు విదేశీయులు బస చేసినట్టు పోలీసులు తెలిపారు. వారు ఐడి కార్డు చూపకపోవడంతో హోటల్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారులో వారు వచ్చారు. ఆ కారు రిజిస్ట్రేషన్‌ నెంబర్ కూడా ఫేక్‌ అని తేలింది.

17:13 - January 26, 2016

అస్సాం : మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొండపై నుంచి బస్సు లోయలో పడి 10 మంది ప్రయాణీకులు మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు 150 కిలోమీటర్ల దూరంలో తొంగ్‌సెంగ్‌ హిల్స్‌ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అస్సాంలోని గువహతి నుంచి హైలాకాండీ జిల్లా వైపు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. కొంత మంది ప్రయాణీకులు బస్సులోనే చిక్కుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

17:09 - January 26, 2016

హైదరాబాద్ : తెలంగాణలోని రాజకీయ పార్టీలు గణతంత్ర వేడుకలతో సందడిగా మారాయి.. తెలంగాణ అసెంబ్లీలో జెండా ఎగురవేశారు స్పీకర్‌ మధుసూధనాచారి.. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఏపీ అసెంబ్లీలో జెండా ఎగురవేశారు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.. అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు.. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ భవన్‌లో జెండా ఎగురవేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి.. రోహిత్ ఆత్మహత్యపై ఆవేదన వ్యక్తం చేశారు.. రోహిత్‌కు రాజ్యంగం ప్రకారం నిరసన తెలిపే హక్కులేకుండా చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జెండా ఎగురవేశారు.. ఎందరో మహానుభావుల త్యాగాలవల్ల మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. టీడీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం జరిగింది.. ఎల్‌ రమణ జాతీయ జెండా... ఎర్రబెల్లి దయాకర్‌ రావు పార్టీ జెండా ఆవిష్కరించారు.. ప్రతి పౌరుడు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే హక్కులు వాటంతట అవే వస్తాయన్నారు రమణ. తెలంగాణ భవన్‌లో 67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జెండా ను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని చెప్పుకొచ్చారు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జాతీయ జెండా ఎగురవేశారు సీపీఎం రాష్ట్ర కార్యద్శి తమ్మినేని వీరభద్రం... జెండా ఆవిష్కరణ తర్వాత రాజ్యాంగం పౌరహక్కులు అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ తన అభిప్రాయాన్ని చెప్పినందుకు సాంఘిక బహిష్కరణ చేశారని ఇది జాతికే అవమానమని విమర్శించారు తమ్మినేని.

17:07 - January 26, 2016

ఢిల్లీ : భారత రాజధాని ఢిల్లీలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. హేమంత సమీరాలకు తెలిమంచు తోడైన వేళ రాజ్‌పథ్‌ వినువీధిలో మువ్వన్నెల జెండా శోభిల్లింది. గతానికి భిన్నంగా ఈ వేడుకల్లో ఎటువంటి ప్రసంగాలూ చోటుచేసుకోలేదు. రాష్ట్రపతి ప్రణబ్‌ కానీ ముఖ్య అతిథి హోలండేకానీ ఏ ప్రసంగమూ చేయకుండానే వేడుకలు ముగిసాయి. భారత శక్తిసామర్థ్యాలను ప్రతిబింబించే ఆయుధాలు, త్రివిధ దళాల సైనికుల విన్యాసాలు వీక్షకులను అలరించాయి. ఈసారి గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత దేశ ప్రముఖులు, వేలాది మంది వీక్షకుల మధ్య ఢిల్లీలో రిపబ్లిక్‌ దినోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అణువణువునా భారత సార్వభౌమత్వాన్ని ప్రతిబింబిస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ముఖ్య అతిథి ఫ్రాంకోయిస్ హోలాండే తొలుత రాష్ట్రపతి భవన్ నుంచి వేడుకలకు బయల్దేరి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా గేట్ వద్ద అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమర్‌ జ్యోతి వద్ద రెండు నిమిషాలపాటు మౌనం పాటించిన అనంతరం వారి త్యాగాలను స్మరిస్తూ పుస్తకంలో లిఖించారు.

విదేశీ సైనికుల కవాతు..
వివిధ శాఖల అధికారులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, ముఖ్య అతిథి హోలండే, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులకు రాజ్‌పథ్‌లో ఘనంగా స్వాగతం పలికారు. ప్రణబ్ ముఖర్జి జండా వందనం గావించారు. లాన్స్ నాయక్‌ మోహన్‌ నాథ్ గోస్వామికి ప్రకటించిన అశోక చక్ర పురస్కారాన్ని ఆయన సతీమణికి అందించారు. అనంతరం రాష్ట్రపతి త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. భారత రిపబ్లిక్‌ దినోత్సవ చరిత్రలో మొదటిసారిగా విదేశీ సైనిక దళాలు కవాతు నిర్వహించాయి. ఫ్రాన్స్ సైనిక దళాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. ఇక భారత ఆయుధ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ వివిధ రకాల క్షిపణులు, త్రివిధ దళాల ఆయుధాలతో పరేడ్ నిర్వహించారు.

డాగ్ స్వ్కాడ్ తో పరేడ్..
ఢిల్లీ రిపబ్లిక్‌డే వేడుకల్లో 26 ఏళ్ల తర్వాత తొలిసారిగా డాగ్‌ స్క్వాడ్‌తో పరేడ్ నిర్వహించారు. ఎప్పటిలానే ఒంటెలతోనూ పరేడ్ జరిపారు. వివిధ రాష్ట్రాల సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ శకటాలను ప్రదర్శించారు. కొన్ని సాంకేతిక కారణాల రీత్యా తెలుగు రాష్ట్రాల శకటాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. సైనిక దళాలు బైక్‌లపై నిర్వహించిన విన్యాసాలు అందరినీ అలరించాయి. అత్యంత సాహసోపేతంగా చేసిన విన్యాసాలు ఆహూతులను ఆశ్చర్యచకితులను చేశాయి. చివరల్లో త్రివర్ణ శోభిత బెలూన్లను ఎగరేసి ఉత్సవాలను ముగించారు. 

ఆసీస్ 93/4…

ఆడిలైడ్ : భారత్ తో జరుగుతున్న మొదటి టీ 20 మ్యాచ్ లో ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఫించ్ (44), వార్నర్ (17), స్మిత్ (21), హెడ్ (2) పరుగులు చేసి వెనుదిరిగారు. 

ఆస్ట్రేలియా 47/1…

ఆడిలైడ్ : భారత్ తో జరుగుతున్న మొదటి టీ 20 మ్యాచ్ లో ఆసీస్ మొదటి వికెట్ కోల్పోయింది. ఐదో ఓవర్ లో వార్నర్ (17) పెవిలియన్ దారి పట్టాడు. ప్రస్తుతం 5.1 ఓవర్ లలో ఒక వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. 

ఆస్ట్రేలియా 47/0..

ఆడిలైడ్ : భారత్ నిర్ధేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆసీస్ ధీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు వార్నర్, ఫించ్ లు ధాటిగా ఆడుతున్నారు. ప్రస్తుతం ఐదు ఓవర్ లలో 47 పరుగులు చేసింది. వార్నర్ 17, ఫించ్ 28 పరుగులతో ఆడుతున్నారు.

బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్..

ఆడిలైడ్ : మొదటి టీ - 20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆరంభించింది. అంతుకుమందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. 

బాబును కలిసిన కాల్ మనీ బాధితులు..

విజయవాడ : సీఎం చంద్రబాబును కాల్ మనీ బాధితులు కలిశారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, చిన్నాన్న బుద్ధా భాస్కర్ రావులు తమ ఇంటిని లాక్కొన్నారని బాబుకు ఫిర్యాదు చేశారు. 

15:51 - January 26, 2016

ఆడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో ఘోర పరాజయం చవి చూసిన టీమ్ ఇండియా టీ -20 మ్యాచ్ లో సత్తా చూపెట్టాలని తహ తహలాడుతోంది. మంగళవారం అడిలైడ్ వేదికగా మొదటి టీ -20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మూడో బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగిన కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఇతనికి రైనా చక్కటి సహకారం అందించాడు. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది.

టాస్ గెలిచిన ఆసీస్...
తొలుత ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఓపెనర్లు శర్మ, ధావన్ లు ఆట ప్రారంభించారు. వీరిద్దరూ ధాటిగానే ఆడడం ఆరంభించారు. ముఖ్యంగా శర్మ అడపదడప షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించే క్రమంలో పడ్డాడు. ఈ దశలో భారత్ స్కోరు 40 పరుగులు ఉండగా ధావన్ (5) ను వాట్సన్ వెనక్కి పంపించాడు. ఒక పరుగు జత చేసిన అనంతరం శర్మ (31) కూడా పెవిలియన్ చేరాడు. దీనితో భారత్ మళ్లీ అదే ఆట తీరును కనబరుస్తుందా ? అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమమయ్యాయి. కానీ అనుమానాలను కోహ్లీ పటాపంచలు చేశాడు. బంతిని బౌండరీలకు తరలించే పనిలో పడ్డాడు. కేవలం 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి మంచి ఊపుమీదున్నట్లు కనిపించాడు. ఇతడికి జతగా వచ్చిన రైనా మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించే పనిలో పడ్డారు. వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. జట్టు స్కోరు 174 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫాల్క్ నర్ బౌలింగ్ లో రైనా (41) వెనుదిరిగాడు. చివరిలో కోహ్లీ విజృంభించడంతో భారత్ 188 పరుగులు చేసింది. కోహ్లీ 90, ధోని 11 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. ఆస్ట్రేలియా బౌలర్లలో వాట్సన్ రెండు, ఫాల్క్ నర్ ఒక వికెట్ తీశారు. 

భారత్ 190 పరుగులు..

ఆడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టీ -20 మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లల లో మూడు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఇందులో కోహ్లీ 90 పరుగులు చేశాడు.

రైనా అవుట్..

ఆడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టీ -20 మ్యాచ్ లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. రైనా 41 పరుగులు చేసి వెనుదిరిగాడు. 

15:39 - January 26, 2016

ఖమ్మం : ఏ ఊరో తెలియదు.. ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు.. తనేం చేస్తుందో తెలియదు.. ఆకలేస్తే కుళ్లిన కోళ్ల వ్యర్థాలనే తింటోంది. అవ్వా అవి తినొద్దే అంటే అర్థం చేసుకోలేని స్థితి. ఏదిక్కూ లేని ఆ అవ్వను అక్కున చేర్చుకుంది మణుగూరులోని రెడ్ క్రాస్ సొసైటీ. ఆమె ఓ పండుటాకు..! స్పష్టంగా మాట్లాడలేని బోసినోరు.. తన బాధ ఇదీ అని చెప్పలేని మతి భ్రమణం..! ఏం తింటుందో.. ఏం తాగుతుందో... తనకే అర్థం కాని మానసిక దుస్థితి. ఆకలికి తాళలేక.. కడుపు నింపుకునేందుకు.. నిత్యం కోళ్ల వ్యర్థాలను తింటూ జీవనం సాగిస్తోంది.  ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణంలోని పలు కాలనీల్లో ఇలా వ్యర్థాలు ఏరుకుంటూ జీవనం గడుపుతున్న మతిస్థతిమితం లేని అవ్వను అక్కున చేర్చుకున్నారు అక్కడి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు. నిత్యం ఏది పడితే అది తింటూ.. వ్యర్థాల్లోనే పడుకుంటున్న అవ్వ స్థితిని చూసిన ఐసీడీసీ సుఖ్ జీవన్ బాబు తల్లడిల్లిపోయారు. వెంటనే నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ అన్నం శ్రీనివాస్ కు ఫోన్ చేసి వృద్దురాలి పరిస్థితిని వివరించారు.

ఆశ్రయం కల్పించిన నిర్వాహకులు..
మతిస్థిమితంలేని అవ్వ కోసం వెతికిన నిర్వాహకులకు అంటుకట్టిన జుట్టుతో చిరిగిపోయిన దుస్తులతో దారుణ పరిస్థితిలో ఆమెను గుర్తించి అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించారు. వెంట్రుకలను తొలగించి.. కొత్త దుస్తులు వేయించి.. ఆమెను సంరక్షిస్తూ.. మానవత్వాన్ని చాటారు నిర్వాహకులు. తమ సంరక్షణలోకి తీసుకున్న వృద్ధురాలికి ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. తమ వద్దకు వచ్చిన నాటి నుండి.. కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మణుగూరు రైల్వే స్టేషన్‌.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చాలా రైళ్లకు చివరి స్టేషన్‌. దీంతో.. ఎక్కడెక్కడో రైళ్లు ఎక్కిన వారు.. ఇక్కడ దిగుతుంటారు. వారిలో మతిస్థిమితం లేని వారు ఎందరో ఉంటారు. నగరంలో ఇలాంటి వారు ఇంకా చాలా మందే ఉన్నారని.. కుటుంబ పరిస్థితులు.. ఆర్థిక ఇబ్బందుల వల్ల వారిలా తయారవుతుంటారని రెడ్‌క్రాస్‌ సొసైటీ నిర్వాహకులు అంటున్నారు. ప్రస్తుతం వీరి సంరక్షణలోని వృద్ధురాలి భాష తమిళాన్ని పోలి ఉండడంతో ఆమె తమిళనాడుకు చెందినదిగా భావిస్తున్నారు. స్థానికంగా తగిన వైద్య చికిత్స చేయించి... హైదరాబాద్ లోని మానసిన వైద్యాలయానికి తరలించి చికిత్స చేయించాలని భావిస్తున్నట్లు రెడ్‌క్రాస్‌ సొసైటీ నిర్వాహకులు తెలిపారు.  

టి.ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు..

హైదరాబాద్ : తెలంగాణ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 115 అసిస్టెంట్ల పోస్టులకు నిర్వహించిన పరీక్షలో 238 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 28వ తేదీన జెన్టీయూహెచ్ లో అభ్యర్థుల సర్టిఫికేట్లను అధికారులు పరిశీలించనున్నారు. 

బాబు సభలో లారీ డ్రైవర్ ఆందోళన..

విజయవాడ : సీఎం చంద్రబాబు సభలో ఓ లారీ డ్రైవర్ ఆందోళన చేశాడు. టిడిపి వల్ల తన కుటుంబం రోడ్డున పడిదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నినాదాలు చేసిన డ్రైవర్ శివరామ్ ను బాబు వారించారు. సభలో గొడవ దిగడం సరికాదంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులు శివారామ్ ను అరెస్టు చేశారు.

 

కోహ్లీ హాఫ్ సెంచరీ..

ఆడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టీ - 20 మ్యాచ్ లో కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. కోహ్లీ 51, రైనా 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

సచివాలయం ఎదుట హెచ్ సీయూ విద్యార్థుల ఆందోళన..

హైదరాబాద్ : నగర కేంద్రీ విశ్వ విద్యాలయం విద్యార్థులు తెలంగాణ సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. 

భారత్ 98/2…

ఆడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టీ -20 మ్యాచ్ లో 12 ఓవర్ ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. కోహ్లీ 34, రైనా 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

15:04 - January 26, 2016

చాలా అరుదైన సందర్భాలల్లో మహిళలకు అనువైన తీర్పులను న్యాయస్థానాలు ఇస్తుంటాయి. వివాహమైన కుమార్తెకు తండ్రి యొక్క డెత్ బెనిఫిట్స్ ఇవ్వాలని కొత్తగా ఓ తీర్పును హైకోర్టు వెలువరించింది. ఈ అంశంపై మానవి 'వేదిక' చర్చ చేపట్టింది. దేవి (సామాజిక కార్యకర్త), రమణి స్పందన (అడ్వకేట్) అభిప్రాయాలు తెలిపారు. ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

 

ధావన్ ఔట్..

ఆడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టీ -20 మ్యాచ్ లో అప్పుడే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. 41 పరుగుల వద్ద రోహిత్ (31) వెనుదిరిగగా అదే స్కోరు వద్ద ధావన్ (5) కూడా పెవిలియన్ చేరాడు. వీరిద్దరినీ ఒకే ఓవర్ లో వాట్సన్ అవుట్ చేశాడు.

14:38 - January 26, 2016

వరంగల్ : ప్రసార మాధ్యమాల్లో అత్యంత వేగంగా ప్రజల కోసం పనిచేస్తున్న చానెల్‌ టెన్ టివి అని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ప్రశంసించారు. హన్మకొండలో టెన్‌ టివి కేలెండర్‌ను స్పీకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ టెన్‌ టివి పురుడు పోసుకున్న అనతికాలంలోనే కోట్లాది మంది వీక్షకుల అభిమానాలను చూరగొందని అన్నారు. బంగారు తెలంగాణ సాకారం కోసం టెన్ టివి కృషి చేయాలని స్పీకర్ ఆకాంక్షించారు. 

14:31 - January 26, 2016

కరీంనగర్ : డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు..! కేసీఆర్‌ సర్కారు ఊరిస్తున్న పథకం. అమల్లో ఇది ఎంతవరకు సాధ్యమో తెలియదు కానీ.. కరీంనగర్‌లో పథకాన్ని హైలెట్‌ చేస్తూ రూపొందించిన శకటం మాత్రం ముందుకు కదలను మొర్రో అంటూ మొరాయించింది. దాని రూపకర్తలు..గృహనిర్మాణ శాఖ సిబ్బంది... వెనక్కి ముందుకు నెడుతూ.. దాన్ని పరుగులు పెట్టించేందుకు ఆపసోపాలు పడ్డారు. పాతబడ్డ వాహనంపై డబుల్‌ బెడ్ రూమ్‌ నమూనాను రూపొందించారు. అయితే ఆ వాహనపు ఇంజన్‌ ఉన్నట్లుండి నిలిచిపోయింది. దీంతో ఆ వాహనాన్ని స్టార్ట్‌ చేసేందుకు సిబ్బంది నానా తంటాలూ పడ్డారు. చివరికి అది స్టార్ట్‌ కాకపోవడంతో.. చేతులెత్తేశారు. ఈ పథకంపై... కేసీఆర్‌ సర్కారు వైఖరిని ఆ వాహనం చాటిచెప్పిందని విపక్షాలు ఎద్దేవా చేశాయి. దీంతో రిపబ్లిక్‌ డే వేడుకలకు హాజరైన ప్రజలు, అధికారులకు కాసేపు హాస్యాన్ని పంచింది. 

14:29 - January 26, 2016

హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలువురు ఆర్మీ అధికారులు అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అమరవీరులకు నివాళులర్పించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి గణతంత్ర వేడుకల్లో పాల్గొని తన సందేశాన్ని జాతికి అంకితం చేశారు సీఎం కేసీఆర్.

షీల్డులు అందచేసిన గవర్నర్...
తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి గణతంత్ర వేడుకలు జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు గవర్నర్ నరసింహన్. తెలంగాణ రాష్ట్ర గౌరవం నలుదిశలా చాటుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని.. నదీ జలాల వినియోగం సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ చేస్తున్నారన్నారు గవర్నర్. అందరూ కలలుగన్న బంగారు తెలంగాణను సాధించుకుందామని పిలుపునిచ్చారు గవర్నర్ నరసింహన్. పలు రంగాల్లో కృషి చేసిన పోలీసు అధికారులకు గవర్నర్ షీల్డులు అందజేశారు. ఎన్ సీసీ క్యాడెడ్ కు ప్రాతినిద్యం వహించిన శ్రావణికి.. షీల్డు అందజేశారు గవర్నర్. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ తరపున ప్రతిభచాటినందుకుగాను మాస్టర్ శ్రీహరిని గవర్నర్ సత్కరించారు. పలువురు హిమాలయాలను అధిరోహించిన విద్యార్థులకు షీల్డులను అందజేశారు గవర్నర్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రిపబ్లిక్ డే వేడుకల్లో.. వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన కవాతు అందరిని అలరించింది. ఆర్మీ అత్యున్నత అధికారులు గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం అదనపు విశేషం. 

14:26 - January 26, 2016

విశాఖపట్టణం : రిపబ్లిక్ డే సందర్భంగా తూర్పు నావికాదళం ప్రత్యేకమైన రీతిలో సంబరాలు జరిపింది. ఇంటర్నేషనల్ ఫీట్ రివ్యూ లో భాగంగా నావికా దళంలో కొత్త ఉత్సాహం కనిపించింది. విశాఖ బీచ్ లో విమాన విన్యాసాలు అందరిని అలరించాయి. విశాఖ బీచ్ లో ప్రజలు పెద్ద సంఖ్యలో విన్యాసాలను తిలకించారు. 

14:24 - January 26, 2016

పంజాబ్ : పఠాన్‌కోట్‌ లో మళ్లీ కలకలం రేగింది. రైల్వే స్టేషన్ లో ఓ అనుమానాస్పద బ్యాగు ఉండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఇటీవలే ఎయిర్ వేస్ పై ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే..మంగళవారం రోజున రైల్వేస్టేషన్‌లో బ్యాగ్ కలకలం సృష్టించింది. అనుమానాస్పద బ్యాగును పోలీసులు గుర్తించారు. దీంతో రైల్వేస్టేషన్ ను మొత్తం ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. బాంబు లేదని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు.  

పఠాన్ కోట్ లో అనుమానాస్పద బ్యాగ్..

పంజాబ్ : పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద బ్యాగ్ కలకలం సృష్టించింది. బాంబు స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. చివరకు బాంబు లేదని నిర్ధారించడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

పుస్పూర్ లో ఉద్రిక్తత..

ఆదిలాబాద్ : లోకేశ్వరం (మం) పుస్పూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం పంకజ్ పటేల్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. పంకజ్ మృతికి కారణమైన నిందితుడి ఇంటిపై దాడి చేసి రెండు బైక్ లు, ఆటో ను గ్రామస్తులు దగ్ధం చేశారు. నిందితులను రహస్యంగా తరలించినందుకు పోలీసులపై కూడా దాడి చేశారు. 

లోకేష్ ప్రతిపాదనకు నో అన్న బీజేపీ...

హైదరాబాద్ : స్నేహపూర్వకంగా పోటీ చేసే స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు తప్పుకోవాలని లోకేష్ కోరారు. ఇందుకు బీజేపీ అధిష్టానం నిరాకరించింది. ఇప్పటికే ప్రచారంలో ముందుకెళ్లామని, సాధ్యం కాదని బీజేపీ పేర్కొంది. 

రోహిత్ ది ఆత్మహత్య కాదు - తండ్రి మణికుమార్...

విజయవాడ : తన కుమారుడిది ఆత్మహత్య కాదని హత్యేనని హెచ్ సీయూ దళిత విద్యార్థి రోహిత్ తండ్రి మణికుమార్ పేర్కొన్నారు. రోహిత్ మృతితో కొందరు శవ రాజకీయాలు చేస్తున్నారని, రోహిత్ మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

13:45 - January 26, 2016

హైదరాబాద్‌ : నగరంలోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రిపబ్లిక్ వేడుకలు జరిగాయి. బాలకృష్ణ జాతీయ జెండా ఎగురవేశారు. క్యాన్సర్ ఆస్పత్రి దేశంలోని టాప్ హాస్పిటల్స్‌లో ఒకటిగా నిలిచిందని చెప్పుకొచ్చారు. ఏపీలో కూడా ఆస్పత్రిని ప్రారంభిస్తామని ప్రకటించారు.

 

13:42 - January 26, 2016

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో జెండా ఎగురవేశారు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.. అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు.. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..

 

13:39 - January 26, 2016

హైదరాబాద్ : 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ర్టాలకు చెందిన ప్రముఖ వైద్యులు గళం కలిపారు. జాతీయగీతాన్ని ఆలపిస్తూ.. తమలోని దేశభక్తి స్ఫూర్తిని ప్రదర్శించారు.

 

13:31 - January 26, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 67 వ గణతంత్ర వేడుకలు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వందనం స్వీకరించారు.  ఎన్నో కష్టనష్టాల కోర్చి తెలంగాణ  రాష్ట్రాన్ని సాధించుకున్నామని .. రాష్ట్రం ఏర్పడ్డాక  రెండో సారి వేడుకలు జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు గవర్నర్. తెలంగాణ సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని గవర్నర్ కితాబిచ్చారు.  

తెలంగాణ అసెంబ్లీలో 

తెలంగాణ అసెంబ్లీలో రిపబ్లిక్ వేడుకలు జరిగాయి.. జెండా ఎగురవేశారు స్పీకర్‌ మధుసూధనాచారి.. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు... 

తెలంగాణ భవన్ లో

67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి  జెండా ను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం సాధించినట్లే తెలంగాణను సాధించుకున్నామన్నారు నాయిని నర్సింహారెడ్డి. తెలంగాణ అభివృద్ది హైదరాబాద్ అభవృద్ది చెందాలంటే కేసీఆర్ ను గెలిపిచాలంటున్నారు. గ్రేటర్ లో కారు జోరు మీదుందని ఎవరు అడ్డుకోలేరని తనదైన శైలిలో నాయిని తెలిపారు .   

ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో 

హైదరాబాద్‌ ఎన్ టిఆర్ ట్రస్ట్‌ భవన్‌లో గణతంత్ర దినోత్సవం జరిగింది.. ఎల్‌ రమణ జాతీయ జెండాను... ఎర్రబెల్లి దయాకర్‌ రావు పార్టీ జెండా ఆవిష్కరించారు.. ప్రతి పౌరుడు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే హక్కులు వాటంతట అవే వస్తాయన్నారు రమణ..

గాంధీ భవన్‌లో 

గాంధీ భవన్‌లో జెండా ఎగురవేశారు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి.. రోహిత్ ఆత్మహత్యపై ఆవేదన వ్యక్తం చేశారు.. రోహిత్‌కు రాజ్యంగం ప్రకారం నిరసన తెలిపే హక్కులేకుండా చేశారని ఆరోపించారు. 

13:20 - January 26, 2016

ఢిల్లీ: భారత రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండే, ప్రధాని నరేంద్రమోడీ, ఉపరాష్ర్టపతి హమీద్ అన్సారీ, కేంద్ర మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, వివిధ పార్టీల అధినేతలు, త్రివిధ దళాధిపతులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సైనిక దళాల నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకలను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేశారు.

వివిధ రకాల సైనిక దళాల పరేడ్

ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో వివిధ రకాల సైనిక దళాలు పరేడ్ నిర్వహించాయి. భారత అమ్ములపొదిలోని ముఖ్య క్షిపణులను ప్రదర్శించారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలతోపాటు డిఆర్‌డిఓ తదితర విభాగాలు తమ శకటాలను ప్రదర్శించాయి.

విదేశీ దళాల కవాతు

భారత గణతంత్ర వేడుకల్లో మొదటిసారిగా విదేశీ దళాలు కవాతు నిర్వహించాయి. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన సైనిక దళాలు భారత రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. ఇవే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

డాగ్ స్క్వాడ్‌తో పరేడ్

26 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో డాగ్ స్క్వాడ్‌తో పరేడ్ నిర్వహించారు. వేడుకల నేపథ్యంలో పూర్తిస్థాయిలో జాగిలాలకు శిక్షణ ఇచ్చి పరేడ్ నిర్వహించారు. డాగ్‌ స్క్వాడ్‌ ప్రదర్శన అందరినీ అలరించింది. రిపబ్లిక్ వేడుకల్లో ప్రత్యేకంగా జంతువులతో పరేడ్ నిర్వహిస్తుంటారు.

వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన

ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో వివిధ రాష్ట్రాల శకటాలు ప్రదర్శన అలరించింది. ఆయా రాష్ట్రాల సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ శకటాల రూపకల్పన జరిగింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల రీత్యా తెలుగు రాష్ట్రాల శకటాలను ప్రదర్శించలేదు.

 

టీసచివాలయం ముట్టడికి ఓయూ జేఏసీ సిద్ధం

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా తెలంగాణ సచివాలయం ముట్టడికి ఓయూ జేఏసీ సిద్ధమైంది. సచివాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

 

పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద బ్యాగ్ లభ్యం

పంజాబ్ : పఠాన్ కోట్ లో రైల్వై స్టేషన్ లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద బ్యాగ్ లభ్యం అయింది. దీంతో హైఅలర్ట్ ప్రకటించారు.

 

 

విద్యుత్ షాక్ తో ఇద్దరు రైతులు మృతి

ప్రకాశం : జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరులో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో రైతులు నాగిరెడ్డి, అనిల్ మృతి చెందారు. పొలంలో విద్యుత్ స్తంభం నిర్మాణం చేపడుతుండగా ఘటన చోటుచేసుకుంది.

 

12:57 - January 26, 2016

బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 100వ చిత్రం 'ఆదిత్య 999'లో నటించే అరుదైన లక్కీ ఛాన్స్‌ని తాప్సీ దక్కించుకుందని సమాచారం. 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన 'ఆదిత్య 369' బాలకృష్ణ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'ఆదిత్య 999' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో కొంత గ్యాప్‌ తర్వాత బాలకృష్ణ వంటి అగ్రనటుడి సరసన తాప్సీ నటించడం విశేషం. తాప్సీ దీంతోపాటు తమిళంలో 'కాన్‌' చిత్రంలోను, రానాకి జోడీగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న 'ఘాజీ'లోనూ నటిస్తోంది.

12:46 - January 26, 2016

హైదరాబాద్ : భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాధాన్యం ఉన్న ఐఫా అవార్డ్స్‌ ప్రధానోత్సవం హైదరాబాద్‌ వేదికగా గచ్చిబౌలి స్టేడియంలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇన్నాళ్ళూ ఉత్తరాదికే పరిమితమైన అవార్డ్స్‌ను ఈసారి దక్షిణాది నటులకు కూడా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో టాలివుడ్‌, కోలివుడ్‌, సాండల్‌వుడ్‌, మళయాళ స్టార్లు స్టేజ్‌పై నృత్యాలతో అదరగొట్టారు.                                                                                                                    

దిగివచ్చిన తారాలోకం

హైదరాబాద్‌లో ఐఫా అవార్డుల కార్యక్రమం మొదలైంది. ప్రతిష్టాత్మకమైన ఈ సినిమా అవార్డుల కార్యక్రమానికి తారాలోకం దిగివచ్చింది. అవార్డ్‌లను ప్రారంభించి 15 ఏళ్లు అవుతున్నా... ఇన్నాళ్లూ బాలివుడ్‌ కే ఇవి పరిమితమయ్యాయి. ఇప్పుడు దక్షిణాది సినిమాలకు స్థానం దక్కింది. రెండ్రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం తొలిరోజున గచ్చిబౌలి స్టేడియం టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌ సెలబ్రిటీలతో కళకళలాడింది. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

తారల రాకతో భాగ్యనగరం కలర్‌ఫుల్‌

తారల రాకతో భాగ్యనగరం కలర్‌ఫుల్‌గా మారింది. ఐఫా అవార్డుల కార్యక్రమంతో గచ్చిబౌలిలో సందడి నెలకొంది. రామ్‌చరణ్‌, అదాశర్మ, శ్రియ, తాప్సి, తమన్నా, అఖిల్‌ తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మైమరపించనున్నారు. ఇందుకోసం వారు కొద్దిరోజులుగా స్టేడియంలో ముమ్మరంగా డాన్స్ ప్రాక్టీస్‌ చేశారు.

నిధులతో చెన్నై వరద బాధితులకు సాయం

ఈ వేడుకల ద్వార వసూలు చేసిన నిధులతో చెన్నై వరద బాధితులకు సాయం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ ఉత్సవాలు మొదటి రోజు ఘనంగా జరిగాయి. నేడు కూడా ఐఫా అవార్డుల వేడుక కలర్‌ఫుల్ గా కొనసాగనుంది.

 

 

12:35 - January 26, 2016

హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రజలకు జవాబుదారీగా.. పారదర్శకంగా పాలన అందిస్తుందన్నారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు గవర్నర్‌.

ఎపిలో గణతంత్ర దినోత్సవాలు 

ఆంధ్రప్రదేశ్‌లో గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్ర ప్రజలకు రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమయంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన నేతలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని నరసింహన్‌ అభిప్రాయపడ్డారు. ఇక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. దేశంలోనే అగ్రభాగాన నిలిచేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని గవర్నర్‌ అన్నారు.

రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్‌

రాష్ట్రంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలతో పాటు.. ఆరుగాలం శ్రమించే రైతులకు ఉచితంగా 7 గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తుందని గవర్నర్‌ అన్నారు. దేశంలోనే తొలిసారి నదులను అనుసంధానం చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదన్నారు. ఇక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి ప్రభుత్వం నడుం బిగించిందన్నారు. గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. జన్మభూమిలో యువత పాలుపంచుకోవడంతో పాటు.. ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వామ్యం కావాలని గవర్నర్‌ కోరారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు గవర్నర్‌ నరసింహన్‌ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా ఉజ్వల భారత్‌ను నిర్మించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరముందని నరసింహన్‌ ఆశించారు. 

12:13 - January 26, 2016

గ్రేటర్ ఎన్నికలకు బీఫ్ తినడానికి సంబంధం లేదని వక్తలు పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికలు… ఎంఐఎం ఓవైసీ వ్యాఖ్యలు అనే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో ది హిందు మాజీ రెసిడెన్స్ ఎడిటర్.. నగేశ్,  టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి, టీడీపీ నేత శ్రీరాములు పాల్గొని, మాట్లాడారు. ఎంఐఎం ఎన్నికల లబ్ధి కోసమే బీఫ్ అంశాన్ని తీసుకొస్తుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

వైసిపి కార్యాలయంలో గణతంత్ర వేడుకలు..

హైదరాబాద్ : నగరంలోని లోటస్ పాండ్ లోని వైసిపి కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ పార్టీ అధినే జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 

ఇందిరాభవన్ లో గణతంత్ర వేడుకలు..

హైదరాబాద్ : నగరంలోని ఇందిరాభవన్ లో గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. జాతీయ పతాకాన్ని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఆవిష్కరించారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 

గాంధీభవన్ లో గణతంత్ర వేడుకలు..

హైదరాబాద్ : నగరంలోని గాంధీభవన్ లో గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. జాతీయ పతాకాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గణతంత్ర వేడుకలు

హైదరాబాద్ : నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 67 వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

 

11:39 - January 26, 2016

హైదరాబాద్ : భారతీయులకు ఈరోజు గొప్ప శుభదినమని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో 67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలను పరిశీలించారు. అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ ఎందరో మహనీయుల త్యాగఫలంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. భారతీయులకు ఈరోజు గొప్ప శుభదినమని కొనియాడారు. తెలంగాణ 29 వ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుందన్నారు. గోదావరి, కృష్ణా జలాలతో తెలంగాణ భూములు తడవాలని ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అయితే ప్రపంగం మొదట్లో, చివర్లో తెలుగులో మాట్లాడారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సీఎస్ రాజీవ్ శర్మ, మంత్రులు, అధికారులు, డీజీపీతోపాటు పలువురు పాల్గొన్నారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి.

 

హైదరాబాద్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సైనికులు కవాతు నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సీఎస్ రాజీవ్ శర్మ, మంత్రులు, అధికారులు, డీజీపీతోపాటు పలువురు పాల్గొన్నారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి.

 

విద్యాశాఖ అధికారులతో మంత్రి గంటా సమావేశం

విజయవాడ : విద్యా శాఖ అధికారులతో మంత్రి గంటా శ్రీనివాస్ రావు సమావేశం అయ్యారు. ఇంటర్ లో జంబ్లింగ్ విధానంపై చర్చిస్తున్నారు.

ఓవైసీ వ్యాఖ్యలను తప్పుబట్టిన షబ్బీర్ అలీ..

హైదరాబాద్ : ఎంఐఎం ఓడిపోతే బీఫ్ తిననివ్వరనే ఓవైసీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తప్పుబట్టారు. పాత బస్తీ ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో మతపరమైన అంశాలతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మతం పేరుతో ఓవైసీ కుటుంబం కోటీశ్వరులైతే.. పాతబస్తీ ప్రజలు పేదలయ్యారని పేర్కొన్నారు. ఓవైసీ కుటుంబానికి పాతబస్తీలో ఓట్లడిగే ధైర్యం లేదన్నారు. పాతబస్తీ వాసులు కాంగ్రెస్ కు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత రాహుల్ పాతబస్తీలో పర్యటిస్తారని చెప్పారు. 

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ప్రణబ్

ఢిల్లీ : దేశ రాజధానిలో ఢిల్లీలో భారత్ 67 వ గణతంత్ర దినిత్సవేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజ్ పథ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్రమోడీ అమరవీరులకు నివాళులర్పించారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ హాజరయ్యారు. 80 వేల సిబ్బందితో పటిష్టభద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. ఈ వేడుకల్లో ఉప రాష్ట్రపతి అమీద్ అన్సారీ, కేంద్రమంత్రులు, అధికారులు పాల్గొన్నారు. భారత గణతంత్ర వేడుకల్లో తొలిసారి ఫ్రెంచ్ సైనికులు కవాతు నిర్వహించారు.

10:23 - January 26, 2016

ఢిల్లీ : దేశ రాజధానిలో ఢిల్లీలో భారత్ 67 వ గణతంత్ర దినిత్సవేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజ్ పథ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్రమోడీ అమరవీరులకు నివాళులర్పించారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ హాజరయ్యారు. 80 వేల సిబ్బందితో పటిష్టభద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. ఈ వేడుకల్లో ఉప రాష్ట్రపతి అమీద్ అన్సారీ, కేంద్రమంత్రులు, అధికారులు పాల్గొన్నారు. భారత గణతంత్ర వేడుకల్లో తొలిసారి ఫ్రెంచ్ సైనికులు కవాతు నిర్వహించారు. కవాతులో 70 మంది ఫ్రెంచ్ సైనికులు పాల్గొన్నారు.

 

రోడ్డు ప్రమాదం… పదిమందికి గాయాలు

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్ మండలం పాలమాకుల దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు-డీసీఎం ఢీకొన్న ఘటనలో 10 మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

09:36 - January 26, 2016

విజయవాడ : నేడు భారతీయులకు గొప్ప దినమని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలిపారు. తెలుగు రమణీయమైన భాషని కొనియాడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నీటి పారుదలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. రికార్డు స్థాయిలో పట్టిసీమను పూర్తి చేసినందుకు గర్విస్తున్నామన్నారు. నీరు-మీరు పథకం ద్వారా భూగర్భ నీటి నిల్వలు పెరిగాయని పేర్కొన్నారు. ఎన్ టిఆర్ వైద్య సేవా పథకం ద్వారా పలు రకాల సేవలు అందిస్తున్నామని వివరించారు. వైద్య రంగానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించామని తెలిపారు. రూ.500 కోట్లతో కాపు నిధి ఏర్పాటు చేశామని చెప్పారు. వేడుకల సందర్భంగా వివిధ శకటాలను ఏర్పాటు చేశారు. గవర్నర్ శకటాలను పరిశీలించారు.  నరసింహన్... పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రులు, డిజిపి రాముడు, అధికారులతోపాటు పలువురు పాల్గొన్నారు. 

 

09:26 - January 26, 2016

పిల్లల సంరక్షణకు సంబంధించిన అనేక చట్టాలున్నాయని వాటిని సక్రమంగా అమలు చేయాలని సాధన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు చిక్కుడు మురళీధర్ కోరారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'ఇవాళ రిపబ్లిక్ డే. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సుదినం. భారత రాజ్యాంగం పిల్లలకు అనేక హామీలిచ్చింది. పుట్టిన పుట్టబోతున్న శిశువుల సమగ్రాభివృద్ధికి, వారి సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాజ్యాంగం వాగ్ధానం చేసింది. పిల్లలకు సంరక్షణ కు సంబంధించిన అనేక చట్టాలున్నాయి. అంతర్జాతీయ ఒండబడికలున్నాయి. అయితే, వీటి అమలుతీరు ఎలా వుంది? అసలు మన పిల్లలకు భారత రాజ్యాంగం ఇచ్చిన హామీలేమిటి? కల్పించిన రక్షణలేమిటి? వివిధ అంతర్జాతీయ వేదికల మీద మన దేశం చేసిన సంతకాలేమిటి? పిల్లల కోసం ప్రత్యేకంగా చేసిన చట్టాలేమిటి? వాటి నేపథ్యం ఏమిటి? వాటి అమలు తీరు ఎలా వుంది? మన పిల్లల సంరక్షణకు మన ప్రభుత్వాలు ఇంకా చేయాల్సిందేమిటి'? ఇలాంటి అంశాలపై మురళీధర్ మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం…

 

ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో గణతంత్ర వేడుకలు

హైదరాబాద్ : ఎన్ టిఆర్ ట్రస్టు భవన్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

08:29 - January 26, 2016

ఇటానగర్ : అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టేలా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అటు కాంగ్రెస్‌తోపాటు, ఇటు కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయా? అని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ప్రశ్నించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌  ముఖ్యమంత్రి నబం తుకీ ఆరు నెలలుగా అసెంబ్లీకి ఎందుకు సమావేశ పరలేకపోయారని కాంగ్రెస్‌ ప్రతినిధి బృందాన్ని రాష్ట్రపతి నిలదీశారు. ఈ అంశాలు ఇప్పుడు రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. 

రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర కెబినెట్ నిర్ణయం..

రాజకీయ అనిశ్చితి నెలకొన్న అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్‌ మండిపడ్డింది. అంతేకాదు... కేబినెట్‌ నిర్ణయంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. కాంగ్రెస్‌ పిటిషన్‌పై బుధవారం విచారణ జరుగుతుంది. అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం రాష్ట్రపతి భవన్‌కు చేరింది. కేబినెట్‌ నిర్ణయం గురించి రాష్ట్రతికి వివరించేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌... సోమవారం  రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయ్యారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో పరిస్థితి క్షీణించిందని రాజ్‌నాథ్‌సింగ్‌ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.  ఈ సందర్భంగా రాష్ట్రపతి రాజ్‌నాథ్‌కు కొన్ని ప్రశ్నలు వేశారు. 

అరుణాచల్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయా ? 

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడానికి అక్కడేమైనా శాంతి భద్రతలు క్షీణించాయా? అంటూ ప్రణబ్‌ ముఖర్జీ.. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన విధించాలన్ని అవసరం ఏమొచ్చిందని అడిగారు.  మంత్రివర్గ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నాయకులు సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపే ముందు న్యాయ నిపుణులను సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటానని ప్రణబ్‌ చెప్పడంతో... రాష్ట్రపతి భవన్‌ నుంచి రాజ్‌నాథ్‌ వెనుతిరిగారు.

గౌహతి హైకోర్టు పరిధిలో ఉన్న ఫిరాయింపుల వ్యవహారం 

రాజ్‌నాథ్‌సింగ్‌ రాష్ట్రపతిని కలిసిన కొన్ని గంటల తర్వాత రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష నేత గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం కూడా ప్రణబ్‌ను  కలిసింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జన్ ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబాల్‌ కూడా ఈ బృందంలో ఉన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్‌ సిఫారసు చేయడం అన్యాయం, అక్రమమంటూ  కాంగ్రెస్‌ నాయకులు ప్రణబ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సమయంలో రాష్ట్రపతి కాంగ్రెస్‌ నేతలకు కొన్ని ప్రశ్నలు వేశారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి నబమ్‌ తుకీ ఆరు నెలులుగా అసెంబ్లీని ఎందుకు సమావేశ పరచలేకపోయారని అడిగారు. బీజేపీ నాయకులు ఫిరాయింపులను ప్రోత్సహించడం వలనే శాసనసభ భేటీని ఏర్పాటు చేయలేకపోయారని  కాంగ్రెస్  సమాధానం చెప్పింది. అరుణాచల్‌ప్రదేశ్‌   ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం గౌహతి హైకోర్టు పరిధిలో ఉండగా రాష్ట్రపతి పాలన విధించడాన్ని కాంగ్రెస్‌ నాయకులు తప్పుపట్టారు. 

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తన్న మోదీ-రాహుల్‌ 

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనకు కేంద్రం సిఫారసు చేయడంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇది  ప్రజాతీర్పుతోపాటు, రాజ్యాంగంపై దాడి అని మండిపడ్డారు. ప్రధాని మోదీ సమాఖ్య విధానం గురించి మాట్లూడూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌  ఎమ్మెల్యేల్లో 21 మంది బీజేపీకి మద్ధతు పలుకుతున్నారు. బీజేపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో నబమ్‌ తుకీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహించిందన్నది కాంగ్రెస్‌ నేతల వాదన. అరుణాచల్‌ప్రదేశ్‌ రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. 

08:21 - January 26, 2016

హైదరాబాద్ : విద్యార్థుల ఆందోళనలతో హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీ అట్టుడుకుతోంది. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునేంతవరకు ఉద్యమం ఆగదని విద్యార్థులు తేల్చిచెప్పడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికితోడు ఇద్దరు విద్యార్థుల మరణాలకు కారణమైన విపిన్‌ శ్రీవాస్తవను ఇంచార్జ్‌ వీసీగా ఒప్పుకునే ప్రసక్తేలేదని విద్యార్థులు ఆందోళనను తీవ్రతరం చేశారు. 

వీసీ అప్పారావు సెలవుపై వెళ్లినా ఆగని ఆందోళనలు 

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికిపోతుంది. వీసీ అప్పారావు సెలవుపై వెళ్లినా సెంట్రల్ వర్సిటీలో ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. రోహిత్‌ ఉదంతంలో వీసీ అప్పారావు ఏ-1 నిందితుడని..ఇంచార్జ్‌ వీసీ విపిన్ శ్రీవాస్తన ఏ-2 నిందితుడని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. రోహిత్ మరణంలో శ్రీవాస్తవ ప్రధాన సూత్రదారి అని విద్యార్థులు మండిపడుతున్నారు. రోహిత్‌తో పాటు మరో నలుగురు విద్యార్ధులను సస్పెండ్ చేసిన కమిటీకి నేత్రుత్వం వహించిందే విపిన్ శ్రీవాస్తవ అని గుర్తు చేస్తున్నారు. 

సెంథిల్‌ ఆత్మహత్యకు శ్రీవాత్సవ్ బాధ్యుడన్న విద్యార్థులు 
 
2008లో సెంథిల్‌ అనే దళిత రీసెర్చ్‌ స్కాలర్ ఆత్మహత్యకు కూడా విపిన్‌ శ్రీవాత్సవనే బాధ్యుడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ హెడ్‌గా ఉన్న శ్రీవాస్తవ..పీహెచ్‌డీలో జాయిన అయిన సెంథిల్‌కు గైడ్‌ను కేటాయించడంలో నిర్లక్ష్యం వహించారని..అందుకే సెంథిల్‌ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అప్పుడు సెంథిల్..ఇఫ్పుడు రోహిత్ మరణాల్లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ని ఇంచార్జ్ వీసీ గా అంగీకరించమని విద్యార్థులు తేల్చిచెప్తున్నారు. 

శ్రీవాస్తవపై పలు రకాల ఫిర్యాదులు 

కేవలం దళిత విద్యార్ధుల మరణానికే కాకుండా శ్రీవాస్తవపై పలు రకాల ఫిర్యాదులున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫిజిక్స్ డిపార్ట్ మెంటులో పీహెచ్‌డీ చేస్తున్న ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి వ్యక్తికి ఇంచార్జ్‌ వీసీ బాధ్యతలు ఎలా అప్పచెప్తారంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకే శ్రీవాస్తవను ఇంచార్జ్‌ వీసీగా నియమించారని విద్యార్దులు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీవాస్తవను తొలగించి వేరొకరిని వీసీగా నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి వీసీ అప్పారావు, ఇంచార్జ్ వీసీ శ్రీవాత్సవలను తొలగించేంతవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు స్పష్టం చేయడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌ నెలకొంది. 

 

08:05 - January 26, 2016

విజయవాడ : ఏపీ మంత్రివర్గ సమావేశం వాడి వేడిగా జరిగింది.  కొందరు మంత్రులు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.   అసహనంతో పాటు, ఆగ్రహావేశాలు ప్రదర్శించారు.  
కొందరు మంత్రులపై సీఎం సీరియస్.

అచ్చన్నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ చంద్రబాబు 

సీఏం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..... ఎప్పుడూ సీరియస్‌గా ఉండరు. అటువంటి చంద్రబాబు ఒక్కసారిగా ఉగ్రనేత్రుడైతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సోమవారం విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇదే జరిగింది. కార్మిక శాఖ మంత్రి అచ్చన్నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంక్రాంతి సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో చోటుచేసుకున్నలోపాలను అచ్చన్నాయుడు ప్రస్తావించారు. పరోక్షంగా ఇది పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను వేలెత్తిచూపుతూ, ఆమెపై ఫిర్యాదు చేసినట్టు  అయ్యింది.  దీంతో చంద్రబాబుకు చిర్రెత్తుకొన్చినట్టుంది. ముందుగా మీ శాఖను సమక్రంగా నిర్వహించాలంటూ అచ్చెన్నాయుడుకు చురకలు అంటించారని ప్రచారం జరగుతోంది. 

చంద్రన్న సంక్రాంతి కానుక ప్రజలకు సరిగా చేరలేదని సీఎం ఆగ్రహం 

చంద్రన్న సంక్రాతి కానుకలో నాసిరకం సరకులు పంపిణీ చేశారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై చంద్రబాబు ఇంతకు ముందే జిల్లా కలెక్టర్లు, మంత్రులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లోనే చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన సరకులు అందించాలని ఆదేశించారు. కానీ చంద్రబాబు ఆదేశాల తర్వాత కూడా పరిస్థితి మెరుగుపడలేదు. విజయనగరం జిల్లాలో కూడా చంద్రన్న కానుకలను ప్రజలకు చేర్చలేకపోవడంతో ఈసారి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని.... పౌర సరఫరాల శాఖ అధికారులపై మంత్రివర్గ సమావేశంలో బాబు మండిపడ్డారని సమాచారం. అధికారులు నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారని వినిపిస్తోంది. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్‌ ఇచ్చినట్టు ప్రచారం జరగుతోంది. 

కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి 

అచ్చన్నాయుడే కాదు... వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావుకు కూడా చంద్రబాబునాయుడు అక్షింతలు వేసినట్టు తెలుస్తోంది. రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలను మంత్రులు పట్టించుకోవడంలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని  చెబుతున్నారు. రాజధాని రైతులు  ప్రతి రోజు రోడ్డెక్కుతూ ఆందోళనకు దిగుతున్నా వారి సమాధాన పరిచే ప్రయత్నం కూడా చేయకపోవడాన్ని సీఎం తప్పుపట్టునట్టు సమాచారం. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నా పట్టించుకోరా... అంటూ బాబు నిలదీయడంతో.. సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలినట్టు మంత్రులే చెప్పుకుంటున్నారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. జలవనరులు శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పనితీరుపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వినిపిస్తోంది. కేబినెట్‌ భేటీలో చంద్రబాబు ఇచ్చిన  వార్నింగ్‌లో మంత్రుల్లో ఎంతవరకు మార్పు వస్తుందో చూడాలి. 

 

07:58 - January 26, 2016

కృష్ణా : విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రులు, డిజిపి రాముడు, అధికారులతోపాటు పలువురు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా వివిధ శకటాలను ఏర్పాటు చేశారు. గవర్నర్ శకటాలను పరిశీలించారు. గవర్నర్ నరసింహన్... పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు.   

దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా 67 వ గణతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో జాతీయ పథాకాన్ని ఆవిష్కరించనున్నారు. 

విజయవాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిని గవర్నర్ నరసింహన్...

కృష్ణా : విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిజిపి రాముడుతోపాటు పలువురు పాల్గొన్నారు.  

విజయవాడలో 67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కృష్ణా : విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాసేపట్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 

07:43 - January 26, 2016

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా  సత్ప్రవర్తన కలిగిన 400 మంది ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు.  పలు అభివృద్ధి పథకాలను భూములు కేటాయించారు.  సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు వచ్చే నెలలో ప్రాజెక్ట్‌ బాట కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అన్ని దళితవాడల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం వాడ వాడల చంద్రన్న దళిత బాట పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. 

విజయవాడలో కేబినెట్‌ సమావేశం 

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్యక్షతన సోమవారం విజయవాడలో ఏపీ కేబినెట్‌ సమావేశం జరిగింది.  మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా రాష్ట్రంలోని జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన 400 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ, వారిని  విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను   హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 29 లేదా మార్చి 1 నుంచి అసెంబ్లీ భేటీ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌ వెలుపల  సమావేశాలు నిర్వహించాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రతిపాదించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. 

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 110 మంది ఖైదీల రిలీజ్ 

మంత్రివర్గ నిర్ణయం ప్రకారం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి 110 మంది విడుదలవుతారు. అనంతపురం జైలు  నుంచి 146, విశాఖ జైలు నుంచి 41, కడప నుంచి 58, నెల్లూరు నుంచి 22 , శ్రీకాకుళం జైలు నుంచి 9  మంది ఖైదీలను  విడుదల చేస్తారు. ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించిన 400 మంది ఖైదీల్లో 22 మంది మహిళలు కూడా ఉన్నారు.  క్షమాభిక్షపై విడుదలయ్యే  ఖైదీలు 50 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే  ప్రతిమూడు నెలలకు ఒకసారి స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాలన్న నిబంధన విధించారు. 

సాగునీటి ప్రాజెక్ట్‌లపై సుదీర్ఘం చర్చ

మంత్రివర్గ సమావేశంలో సాగునీటి ప్రాజెక్ట్‌లపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తోటపల్లి, వంశధార, మహేంద్రతనయ  ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తి చేసే అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. పోలవరం స్పిల్‌వే, రాక్‌ఫిల్‌ డ్యామ్‌, డయాఫ్రం నిర్మాణ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఇందుకోసం విదేశాల నుంచి మనదేశంలోని ఓడరేవులకు వచ్చిన యంత్రపరికరాలను వచ్చే నెల మధ్యనాటికి పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకుంటారు. 

దళితవాడల్లో సీసీ రోడ్ల నిర్మాణం 

వచ్చే మూడు, నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని దళితవాడల్లో సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఇందుకోసం వచ్చే నెల నుంచి  వాడ వాడల చంద్రన్న దళిత బాట పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 

అభివృద్ధి పథకాలకు భూముల కేటాయింపు 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టే పలు అభివృద్ధి పథకాలకు భూములు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా ఎంపీ కుంటలో అల్ట్రా మెగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌కు 873.23 ఎకరాల భూమి కేటాయించారు. ఈ నెలాఖరుతో రిటైర్‌ కానున్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు సేవలను మంత్రివర్గం ప్రశంసించింది. రిటైరైన తర్వాత కూడా ఆయన సేవలను మరో రూపంలో వినియోగించుకోవాలని  నిర్ణయించారు. 

 

07:34 - January 26, 2016

ఢిల్లీ : గణతంత్ర దినోత్సవ సంబరాలకు భారత్ ముస్తాబైంది. గల్లీ గల్లీ ఎగరటానికి మువ్వన్నెల జెండాలు రెడీ అయ్యాయి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఉత్సవాలకు భారతీయులు సిద్ధమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక ప్రధాన నగరాల్లో గణతంత్ర వేడుకలకు పటిష్ట భద్రత కల్పించారు. 

నేడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సుదినం

1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం మాత్రమే సిద్ధించింది. బ్రిటీష్ పాలకులు రూపొందించిన చట్టాలతోనే పాలన సాగేది. మనకంటూ నియమ నిబంధనలు ఉండాలని, ఓ రాజ్యాంగం కావాలని మేధావులు ఆకాంక్షించారు. ఆ ఆలోచన ఫలితమే "రాజ్యాంగ పరిషత్‌" ఆవిర్భావం. 1946 డిసెంబర్ 9న జరిగిన మొట్ట మొదటి సమావేశంలో డాక్టర్ సచ్చిదానంద సిన్హా  తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత డిసెంబర్ 11న జరిగిన సమావేశంలో డాక్టర్ బి. రాజేంద్రప్రసాద్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

బీఆర్ అంబేద్కర్‌కు రాజ్యాంగ ముసాయిదా తయారీ బాధ్యతలు 

న్యాయకోవిదుడైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు రాజ్యాంగ ముసాయిదా తయారీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల అనంతరం భారతదేశంలో రాజ్యాంగం రూపుదిద్దుకుంది. 1949 నవంబర్ 26నే భారత రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగాన్ని ఆమోదించింది. కానీ రాజ్యాంగం జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 1930 జనవరి 26న మొదటిసారి పూర్ణ స్వరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. దీంతో ఆ తేదీకి ఉన్న చారిత్రక స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి తెచ్చారు. 

రాజ్యాంగమే పవర్ ఫుల్‌

మనదేశంలో ఖురాన్, బైబిల్, భగవద్గీత కంటే రాజ్యాంగమే పవర్ ఫుల్‌. రాజ్యాంగానికి కట్టుబడే ఉండాలి. అందుకే స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవం పేరుతో ఏటా రెండు జెండా పండగలను జరుపుకునేందుకు యావత్భారతం ఏకమవుతుంది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా మువ్వన్నెలా జెండా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. 

దేశ రాజధాని ముస్తాబు

త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు దేశరాజధాని ముస్తాబైంది. ఢిల్లీ సహా హైదరాబాద్, ముంబై, లక్నో, కోల్‌కతా నగరాల్లో భద్రతను పెంచారు. రిపబ్లిక్‌ డేను ప్రజలు పండగగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది సంబరాలకు యావత్‌ దేశం సిద్ధమైంది. 

 

07:13 - January 26, 2016

'రంగ్‌ దే బసంతి'.. పదేళ్ళ క్రితం వచ్చిన సంచలన చిత్రం. బాలీవుడ్‌ కలెక్షన్లను తిరగ రాస్తూ ఘన విజయం సాధించి విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ చిత్రం విడుదలై నేటితో పదేళ్ళు పూర్తి చేసుకుంటుంది. అమీర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రధారుడిగా 2006 జనవరి 26న విడుదలైన ఈ చిత్రానికి రాకేష్‌ ఓంప్రకాష్‌ మెహ్రా దర్శకత్వం వహించారు. ఇంగ్లీష్‌ అమ్మాయి భారత్‌లో బ్రిటీష్‌కు వ్యతిరేఖంగా పోరాడిన వారిపై తీసే సినిమాల్లో ఫ్రీడమ్‌ ఫైటర్స్‌గా అమీర్‌ ఖాన్‌, సిద్ధార్థ్‌, శర్మన్‌ జోషి, ఆర్‌.మాధవన్‌, కునాల్‌ కపూర్‌, సోహా ఆలీ ఖాన్‌, వహీదా రెహ్మాన్‌ నటించారు. స్వేచ్ఛ కోసం పోరాడే యువకులుగా వీరి నటన ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ముఖ్యంగా ఏ.ఆర్‌.రెహ్మాన్‌ అందిం చిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ఈ చిత్రం పలు జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రద ర్శించబడి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్‌కు, బ్రిటీష్‌ అకాడమీ అవార్డుకు, గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారా లకు నామినేట్‌ అయ్యింది. విశేషప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. దీంతో పాటు ఏడు విభాగాల్లో ఫిల్మ్‌ ఫేర్‌ అవా ర్డులను సొంతం చేసుకుంది. వంద కోట్లకుపైగా వసూళ్ళ ను రాబట్టి రికార్డు సృష్టించింది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

హైదరాబాద్‌: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా వుంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటలు, నడకదారి భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

నేడు ఖ్మమం సెంట్రల్ జైలు నుంచి 59 మంది జీవిత ఖైదీల విడుదల

ఖమ్మం : నేడు ఖ్మమం సెంట్రల్ జైలు నుంచి 59 మంది జీవిత ఖైదీలు విడుదల కానున్నారు. 

నేడు భారత్ -ఆస్ట్రేలియా తొలి ట్వంటీ-20 మ్యాచ్..

ఆడిలైడ్ : నేడు భారత్, ఆస్ట్రేలియాల మధ్య తొలి ట్వంటీ-20 మ్యాచ్ జరుగనుంది. ఆడిలైడ్ వేదికగా మధ్యాహ్నం 1 గంటకు మ్యాచ్ ప్రారంభం కానుంది.  

Don't Miss