Activities calendar

28 January 2016

హిజ్బుల్ తీవ్రవాది అరెస్టు...

శ్రీనగర్: హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఓ తీవ్రవాదిని శ్రీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. 

యెమెన్ రాష్ట్రపతి భవన్ వద్ద పేలుళ్లు..

యెమెన్ : రాష్ట్రపతి భవనం వద్ద కారు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

దర్గాలోకి అనుమతి కోరుతూ మహిళల ఆందోళన..

ముంబై: ముస్లిం మహిళలు తమకు హజీ షౌకత్ ఆలీ దర్గాలోకి ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మహారాష్ట్రలోని శనిసింగనపురంలో ఉన్న శనేశ్వర దేవాలయంలోకి తమను అనుమతించాలని కోరుతూ హిందు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. 

20:37 - January 28, 2016

మొన్న సార్స్ హెచ్ వన్ ఎన్ వన్...నిన్న ఎబోలా ఇవాళ జికా...ఇప్పటికే 25 దేశాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పుడు అమెరికాతో సహా పశ్చిమ దేశాలు దోమలను చూస్తే గడగడలాడిపోతున్నాయి. పలు దేశాల్లో ఆరోగ్యకర పరిస్థితిని విధించాయి. ముఖ్యంగా ఈ వైరస్ సోకిన మహిళల పిల్లలకు మెదడు సంబంధిత వ్యాధితో పుట్టడం ఎంతో ఆందోళన కలిగిస్తున్న అంశం. మరి భారతదేశానికి ముప్పు పొంచి ఉందా ? ఈ అంశంపై మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:31 - January 28, 2016

నగరంలో మాజీ మేయర్ గా పనిచేసిన బండా కార్తికరెడ్డి హాయాంలో నిర్మించిన ఇళ్లను 'మల్లన్న' పరిశీలించాడు. ఆ ఇంట్లో ఉన్న వారితో ముచ్చటించాడు. తమకు నీళ్లు సరిగ్గా రావడం లేదని వాపోయారు. వచ్చిన నీళ్లు కూడా మురికిగా ఉంటున్నయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఉంది. బంగాళా మీద కొంతమంది గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. గత 8 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని వారు మల్లన్నతో తెలిపారు. మరి వారి ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

20:28 - January 28, 2016

తమ హాయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు మాజీ మేయర్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న బండా కార్తిక రెడ్డి పేర్కొన్నారు. తార్నాక డివిజన్ లో పర్యటించిన 'మల్లన్న' ఆమెతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను బండ కార్తిక రెడ్డి తెలియచేశారు. ఎవరు ఏమి చేసిండ్రో ఓటర్ గమనిస్తున్నరని, పోస్టర్ లో పబ్లిషిటీ తప్ప ఏమి చేస్తలేరని తెలిపారు. 16 లక్షల ఇళ్లు కట్టిచ్చిన్నమని, తార్నాకలో కట్టిచ్చిన దానికి రాజీవ్ నగర్ పేరిట పేరు పెట్టిన్నమని పేర్కొన్నారు. అలాగే పాలథీన్ కవర్లు బ్యాన్ చేసినమని, ఫ్లై ఓవర్లు కట్టిచినమన్నారు. రెండు సంవత్సరాలలో ఎక్కడా అభివృద్ధి చేయలేదని, కేవలం మాటలే చెబుతున్నరంటూ బండా కార్తిక రెడ్డి విమర్శించారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:27 - January 28, 2016

గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్నయి. ప్రధాన పార్టీల మధ్య మాటలు తూటలు పేలుతున్నయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నరు. హామీల మీద హామీలు గుప్పిస్తున్నరు. ఈ తరుణంలో ప్రజలు ఏమి అనుకుంటున్నరో..నేతల అభిప్రాయాలు తెలుసుకొనేందుకు 'మల్లన్న' నగరంలోని పలు డివిజన్ లో పర్యటించి అభిప్రాయాలు తెలుసుకున్నాడు. తార్నాకా డివిజన్ లో పర్యటించి సమస్యలు..నేతల అభిప్రాయాలు తెలుసుకున్నరు. మరి ఆ విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:00 - January 28, 2016

స్వచ్ఛ హైదరాబాద్...స్వచ్ఛ రాజకీయాలు..అంటూ గ్రేటర్ రణరంగంలోకి వన్ హైదరాబాద్ దిగింది. సీపీఎం, సీపీఐ, లోక్ సత్తా, ఎంసీపీఐ కూటమిగా ఏర్పడ్డాయి. మరి ఈ కూటమి ఎన్నికల్లో ఏ విధంగా పోరాటం చేస్తోంది. లక్ష్యాలు ఏంటీ ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హామీలు..వాగ్ధానాలు అమలవుతాయా ? తదితర అంశాలపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని విశ్లేషించారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

 

కొనసాగుతున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు..

ఢిల్లీ : బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 

18:52 - January 28, 2016

 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సినీ నటుడు నాగార్జున వ్యాఖ్యతగా నిర్వహిస్తున్న మూడో సీజన్ లో అమర్ నాథ్ జోడి రూ.50 లక్షలు గెలిచి రికార్డు సృష్టించారు. విశాఖపట్టణానికి చెందిన అమర్ నాథ్ కొద్ది రోజుల క్రిందటే వివాహం చేసుకున్నారు. ఇప్పటివరకూ జరిగిన మూడు సీజన్లలో మొదటిసారి రూ 50 లక్షలు గెలుచుకున్న వ్యక్తిగా రికార్డులకెక్కారు. ఈ సందర్భంగా 'టెన్ టివి' అమర్ నాథ్ దంపతులతో ముచ్చటించింది. పోటీ అనుభవాలు..తదితర విషయాలను వారు వెల్లడించారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

హెచ్ సీయూలో క్లాసులు యథాతథం - ఇన్ ఛార్జీ వీసీ..

హైదరాబాద్ : రేపటి నుండి హెచ్ సీయూలో క్లాసులు యథాతథంగా జరుగుతాయని సహకరిస్తామని విద్యార్థులు చెప్పారని ఇన్ చార్జీ వీసీ పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యపై విచారణ జరుగుతోందని, వర్సిటీలో కులవివక్షత లేదన్నారు. హెచ్ సీయూలో ఆత్మహత్యలపై విచారణ చేపడుతామని, సెంథిల్ కుమార్ ఆత్మహత్యకు తాను బాధుడిని కాదన్నారు. దీనిపై సీబీఐ విచారణ కూడా జరిగిందన్నారు. 

రోహిత్ మృతిపై ఏకసభ్య కమిటీ..

ఢిల్లీ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతిపై విచారణకు ఏకసభ్య కమిటీని హెచ్ ఆర్డీ మంత్రిత్వ శాఖ నియమించింది. మూడు నెలల్లో ఏకసభ్య కమిటీ విచారణ జరిపి నివేదిక ఇవ్వనుంది. రిటైర్డ్ న్యాయమూర్తి అశోక్ కుమార్ రూపన్ వాల్ తో కమిటీ ఏర్పాటైంది. 

టీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి..

హైదరాబాద్ : టీఆర్ఎస్ నిర్వహిస్తున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యకర్త రవి (42) అనుమానస్పదంగా మృతి చెందాడు. 

తిరుపతిలో రివాల్వర్ కు..ఉగ్రవాదులకు సంబంధం లేదంట..

తిరుపతి : మురుగు కాలువలో లభించిన రివాల్వర్ కు ఉగ్రవాదులకు సంబంధం లేదని పోలీసులు తేల్చారు. బెంగళూరు టైల్స్ వ్యాపారి ముఖేష్ రివాల్వర్ గా గుర్తించారు. ముఖేష్ పై బెంగళూరు పోలీసులకు కిషోర్ ఫిర్యాదు చేశారు. భయంతో ముఖేష్ రివాల్వర్ ను కాలువలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

ఇద్దరు మేజర్ జనరల్స్ పై సీబీఐ విచారణ..

ఢిల్లీ : ఇద్దరు మేజర్ జనరల్స్ పై సీబీఐ విచారణకు రక్షణ మంత్రి పారికర్ ఆదేశాలు జారీ చేశారు. అశోక్ కుమార్, ఎస్ఎస్ లంబలపై ఈ విచారణకు ఆదేశించారు. ప్రమోషన్ల కోసం లంచం ఇచ్చారనే ఆరోపణలున్నాయి.

 

ఎయిర్ పోర్టు భద్రతపై అశోక్ గజపతి రాజు స్పందన..

ఢిల్లీ : ఎయిర్ పోర్టు భద్రతపై కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయని, వీటిని సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎయిర్ పోర్టుల్లో భద్రత ప్రమాణాలను పాటిస్తున్నట్లు, భద్రతా చర్యలకు వీఐపీలు సహకరించాలన్నారు. 

పాక్ లో కోహ్లీ అభిమానికి జైలు శిక్ష..

పాకిస్తాన్ : భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిమానియైన ఉమర్ ద్రాజ్ కు పది ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆసీస్ తో జరిగిన భారత్ 20 టీ మ్యాచ్ తరువాత కోహ్లీపై అభిమానంతో తన ఇంటిపై భారత జాతీయ పతాకాన్ని ఉమర్ ఎగరవేశాడు. పక్కింటి వారి ఫిర్యాదుతో ఉమర్ ద్రాజ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. 

కలెక్టర్లతో టి.సీఎస్ వీడియో కాన్ఫరెన్స్...

హైదరాబాద్ : జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే పథకాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామ సభల ద్వారా లబ్ది దారుల ఎంపికలో పారదర్శకత ఉండాలని అధికారులకు సూచించారు. ఈనెల చివరి కల్లా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

17:28 - January 28, 2016

హైదరాబాద్ : ప్రస్తుతం రాజకీయాల్లో అవకాశవాదం పెరిగిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పేదవాడి సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు. ప్రభుత్వాలు మురికివాడల్లో సదుపాయాలు కల్పించడం లేదని విమర్శించారు. పేదల అభివృద్ధికి చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమని..అందుకు వన్‌ హైదరాబాద్‌ కూటమి అభ్యర్థులను గెలిపించాలని తమ్మినేని కోరారు. 

17:25 - January 28, 2016

హైదరాబాద్ : బ్రిక్స్ బ్యాంక్‌ నుంచి 20వేల కోట్ల రూపాయల్ని అప్పుగా తెచ్చి హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామన్నారు సీఎం కేసీఆర్‌. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అలాగే హైదరాబాద్‌ నగరంలో రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా హైదరాబాద్‌ను ముంబై తరహాలో ఐలాండ్ పవర్‌ సప్లై చేస్తామన్నారు. నగరంలో 20 టీఎంసీల సామర్థ్యంతో రెండు భారీ రిజర్వాయర్లను నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

17:23 - January 28, 2016

హైదరాబాద్ : మజ్లిస్‌ తమతో మిత్రపక్షంగానే వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఫ్రెండ్లీ పార్టీగా ఉంటామని మజ్లిస్‌ అసెంబ్లీలోనే ప్రకటించిందన్నారు. వాళ్ల తత్వం..రక్తం గ్రూపుతో తమకు సంబంధం లేదన్నారు. ఫ్లెండ్లీ పార్టీగా ఉంటామని మద్దతు ప్రకటించారు. తత్వం..ఏ రక్తం గ్రూపు ఏంటీ ? మధ్యలో మనకెందుకు ? అని ప్రశ్నించారు. ఎక్కడో ఎవరో అన్నారని తనను ప్రశ్నిస్తే ఎలా అని ప్రశ్నించారు. 

17:21 - January 28, 2016

హైదరాబాద్ : తెలంగాణను వ్యతిరేకించిన వారినే తాను రాక్షసులు అని విమర్శించానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సమైక్యవాదానికి వత్తాసు పలుకుతున్న తెలంగాణ నేతలను కూడా సన్నాసులు, దద్దమ్మలు అని తిట్టిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారంతా తెలంగాణ వారే అని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డు తగులుతున్న వారిని తాను ఆ విధంగా విమర్శించడం జరిగిందన్నారు. సమైక్యాంధ్రకు అడుగులకు మడుగులొత్తుతున్న కాంగ్రెస్ నాయకును తాను విమర్శించడం జరిగిందన్నారు. నగరంలో ఉన్న వారు తమ బిడ్డలనేన్నారు. ఎవరికైనా ఇబ్బంది కలిగిందా ? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోయడం సరికాదని, లేని ప్రాంతీయ కక్షలు కట్టడం సరికాదన్నారు. 

17:19 - January 28, 2016

హైదరాబాద్ : ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైదరాబాద్‌లో పనేమిటని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. ఆయన ఊడ్చుకోవడానికి ఏపీలో చాలా నగరాలున్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు గ్రేటర్‌ ప్రచారానికి రావడం వృథా ప్రయాసే అని కేసీఆర్‌ అన్నారు. ఏపీలో ఎన్నో నగరాలున్నాయని, చాలా ప్రధానమైన పట్టణాలున్నాయన్నారు. అక్కడనే బోల్డెంత పని ఉందని, పనికి వచ్చిన ముచ్చట కాదని ఎద్దేవా చేశారు. బాబు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారని, ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. 

జర్నలిస్టుల ఓట్లను అభ్యర్థించిన కేసీఆర్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ జర్నలిస్టులను కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఆయన ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. జర్నలిస్టు కాలనీ ఏర్పాటు కోసం కామన్ కమిటీ వేసుకోవాలని సూచించారు. త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. 

16:57 - January 28, 2016

అమరావతి ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌పై రాజధాని గ్రామాల ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు. అధిక సంఖ్యలో అభ్యంతరాలు సీఆర్‌డీఏకు అందుతూనే ఉన్నాయి. తాజాగా అగ్రికల్చర్‌ జోన్‌ మరో చిచ్చు రేపుతోంది. అగ్రిజోన్‌లో ఉన్న గ్రామాల ప్రజలు ముసాయిదా ప్లాన్‌పై మండిపడుతున్నారు. ప్లాన్‌ మార్చాలంటూ పట్టుబడుతున్నారు. ఈ అంశంపై విజయవాడ టెన్ టివి స్టూడియో జరిగిన చర్చా వేదికలో ఉప్పులేటి కల్పన (వైసీపీ ఎమ్మెల్యే), సీహెచ్ బాబురావు (సీపీఎం), పట్టాభిరామ్ (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారు ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో చూడండి. 

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

ముంబై : దేశీయ సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెనెక్స్ 23 పాయింట్లు నష్టపోయి 24,470 వద్ద ముగియగా నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 7,425 పాయింట్ల వద్ద ముగిసింది. 

16:35 - January 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తాను అండగా ఉంటానని..తాను ఎక్కడకు పోలేదని..ఇక్కడనే ఉంటానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు పటన్ చెరువులో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు దగ్గరిగా ఉన్నది..సమస్యలు పరిష్కరించింది టిడిపి పార్టీయేనని తెలిపారు. పక్కా ఇళ్లు..రైతుల కోసం..ఇలా ఎన్నో ఎన్టీఆర్ చేశారని, ఇది మరిచిపోకూడదన్నారు. ఈ నాయకులు ఎక్కడి నుండి వచ్చారో తనకు తెలియదని, తనను విమర్శించే హక్కు వీరికి లేదన్నారు. తాను 9 సంవత్సరాలు కష్టపడడం జరిగిందని, ఒక మంచి రాజధాని ఉండాలని అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 90 సార్లు గల్లీ గల్లీలో తిరిగానని, నగరంలో తాను చేసిన అభివృద్ధిని ఎవరూ మరిచిపోలేదన్నారు. ఇక్కడ ఆదాయం పెరగడం...ఉద్యోగాలు వస్తున్నాయనంటే దానికి కారణం టిడిపి పార్టీయేనన్నారు.

ఎక్కువగా ఆదాయం పొందింది తెలంగాణే..
నగరం నుండి ఎక్కువగా ఆదాయం పొందింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. టిడిపి అధికాంరలో ఉంటే మెట్రో నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యేదన్నారు. మెట్రో ఎందుకు లేట్ అవుతోందని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మెట్రోను పూర్తిగా నిర్వీర్యం చేశారని, ప్రస్తుతం సరిగ్గా జరగలేని పరిస్థితి ఉందన్నారు. తక్కువ సమయంలో కృష్ణా నీళ్లను అందించడం జరిగిందని, ఆదాయానికి చొరవ..దారి చూపించింది తెలుగుదేశం పార్టీనేనని, నగరానికి ఎన్నో ఇనిస్టిట్యూట్స్ తీసుకరావడం జరిగిందని చెప్పుకొచ్చారు. అదే కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిర్వీర్యమై పోయిందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలు కడితే అక్కడి జైలులో తామున్నామని, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కోసం ఇదంతా చేయడం జరిగిందన్నారు. ఇక్కడ ఉండే సమస్యలపై తాము రాజీలేని పోరాటం చేసినట్లు, అభివృద్ధిని చేసింది తాను అని..దీని ఫలాలు ఇక్కడి ప్రజలకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వంలో టిడిపి భాగస్వాములై ఉందని, ఢిల్లీకి వెళ్లినా తెలంగాణ సమస్యలను తాను మాట్లాడడం జరుగుతోందన్నారు. రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కోరడం జరుగుతోందన్నారు. 

నగరం అభివృద్ధి చేసింది టిడిపియే - బాబు..

హైదరాబాద్ : నగరాన్ని అభివృద్ధి చేసింది టిడిపి పార్టీయేనని ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పటన్ చెరులో ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించింది టిడిపిపార్టీయేనన్నారు. 

హెచ్ సీయూ ఘటన దురదృష్టకరం - కేసీఆర్..

హైదరాబాద్ : హెచ్ సీయూ ఘటన దురదృష్టకరమని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ అంశంలో తాము సైలెంట్ గా లేమని, జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత స్పందిస్తామన్నారు. 

పటన్ చెరువులో బాబు ఎన్నికల ప్రచారం..

హైదరాబాద్ : ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పటన్ చెరువులో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. 

స్మార్ సిటీ జాబితాలో తెలంగాణకు దక్కని చోటు..

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయబోయే 20 స్మార్ట్ సిటీల తొలి జాబితా విడుదలైంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ జాబితాను ప్రకటించారు.

16:08 - January 28, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు రాగానే రాజకీయ పార్టీలు ప్రజల మధ్యకు వచ్చి ప్రచారాన్ని హోరెత్తిస్తుంటారని, ప్రతి ఇంట్లో టివి ఉంటుందన్న ఉద్ధేశ్యంతో ఈ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జాగ్రత్తతో ఓటు వేయాలని ఆయన కోరారు. నాయకులు..పార్టీ యొక్క నిబద్ధతత..ప్రతిబద్ధతను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సరియైన తీర్పునివ్వాలన్నారు. 2001లో టీఆర్ఎస్ ప్రారంభించిన సందర్భంలో నీ జీవిత లక్ష్యంగా రాష్ట్రాన్ని సాధించేందుకు ముందుకు కదలడం జరిగిందన్నారు. ఇది సాధించకపోతే రాళ్లతో కొట్టి చంపాలని పిలుపునివ్వడం జరిగిందని గుర్తు చేశారు. 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. వివిధ రంగాల్లో ప్రభుత్వం చేసిన కృషి..చేస్తున్న పథకాలను..జరగబోయే కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు.

గతంలో ఉన్న వారు ఏం చేశారు ?
40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించిందని, 15 ఏళ్ల పాటు టిడిపి అధికారంలో ఉందని ఆ సమయంలో వీళ్లుం ఏం చేశారని ప్రశ్నించారు. జంట నగరాలు..తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో విద్యుత్ అంశంలో ఘోష పడ్డామన్నారు. చిమ్మచీకట్లు కమ్ముకుంటాయని గతంలో విమర్శలు చేశారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కన్వెర్టర్లు..జనరేటర్లు..ఇతరత్రా షాపులు మూసివేసి ఉన్నాయని, దీనిని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నామన్నారు. రెప్పపాటు కరెంటు పోకుండా, పారిశ్రామికవర్గాలకు కూడా కరెంటు ఇస్తున్నామన్నారు. మూసీ నది మురికి కూపంగా మార్చివేసిన ఘనత ఎవరిది ? హుస్సేన్ సాగర్ ను కాలుష్యకారంగా ఎవరు తయారు చేశారు ? అని ప్రశ్నించారు.పోటీ చేసే వారున్న వారు కొత్తగా వచ్చిన వారు కాదని, వీరి గత చరిత్ర అందరికీ తెలుసే అన్నారు. పరిశుభ్రమైన మంచినీళ్లు నగరానికి ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి కృష్ణా - గోదావరి నీళ్లు తెచ్చిస్తామని, మంచినీళ్లు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటు అడగదని గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగిందన్నారు. ఏ ఒక్కపార్టీ ఇలా చెప్పలేదని, ఇంత ఛాలెంజ్ గా తీసుకోలేదన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందన్నారు.

పలు కార్యక్రమాలు..
జంట నగరాల్లో ఉన్న ప్రస్తుతం ఉన్న జనాభా కు ఏడు మార్కెట్లు మాత్రమే ఉన్నాయని, ఇది సిగ్గు చేటన్నారు. నగరంలో 200 మార్కెట్లు నిర్మాణం చేయాలని ప్రభుత్వం యోచిందన్నారు. అలాగే 250 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలిపారు. చెత్త విసర్జన క్రమ పద్ధతిలో లేవని దీనికి పరిష్కారం చూపుతామన్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల బంధువులకు నైట్ షెల్టర్స్ నిర్మాణం చేయడం జరుగుతోందని, ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడడం జరిగిందన్నారు. 50 మల్లీ కమ్యూనిటీ హాల్స్ ప్రారంభించాలని తలిచినట్లు తెలిపారు.

బస్ బేలు..బస్ స్టేషన్ లు..రైల్వే టెర్మినల్ లు..
తెలంగాణ రాష్ట్రంలో బస్ బేలు..బస్ స్టేషన్ లు రైల్వే టెర్మినల్ నిర్మాణానికి తలిచినట్లు తెలిపారు. 3500 సిటీ బస్సులు నగరంలో తిరుగుతున్నాయని, నగరంలో బస్టాపులు ఉండాల్సిన పద్ధతిలో లేవన్నారు. ప్రభుత్వ స్థలాలు తీసుకుని బస్ బే లు నిర్మాణం చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇమ్లిబన్, జూబ్లి బస్ స్టేషన్ ల వల్ల సమస్యలు తీరవని, మరన్ని బస్ స్టేషన్ లు రావాలన్నారు. అలాగే రైల్వే స్టేషన్ లు మూడే ఉన్నాయని, ప్రస్తుతం రెండు కొత్త టెర్మినల్ ఏర్పాటు చేయాలని కేంద్రంతో మాట్లాడడం జరిగిందన్నారు. అందులో భాగంగా చర్లపల్లి వద్ద రైలు టెర్మినల్ చేయాలని కోరడం జరిగిందన్నారు. 1069 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.

సంక్షేమ పథకాలు...
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా 40 వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు చేయడం జరుగుతోందన్నారు. ఆత్మగౌరవం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం, వెయి రూపాయల ఫించన్ తీసుకొస్తే ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారని తెలిపారు. కేవలం ఓట్ల కోసమే ఇది చేయలేదని చెప్పారు. రైతులకు రుణాలు మాఫి చేయడం జరిగిందని, జంటనగరాల్లో ఉండే స్థలాలు కబ్జా చేసిన వారికి జీవో 58 కింద లక్ష మందికి పట్టాలిచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు.

జంట నగరాల్లో నిరంత విద్యుత్ సరఫరా చేయడం కోసం ఐలాండ్ తరహా విధానం చేయబోతున్నట్లు వెల్లడించారు. గతంలో పారిశ్రామిక వేత్తలు ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేపట్టే వారని, ప్రస్తుతం 24గంటల పాటూ కరెంటు సరఫరా జరుగుతోందన్నారు. గతంలో ఉన్న టిడిపి, కాంగ్రెస్ నాయకులు ఈ పని ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉండడం..చేయాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమన్నారు. ప్రస్తుతం జంట నగరాల్లో ఐలాండ్ తరహా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, జనరేటిక్ స్టేషన్ లను అనుసంధించి రెప్పపాటులో కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

కాంగ్రెస్ హామీలు పేలవం..
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన హామీలు గుప్పిస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. నీళ్లు ఫ్రీగా ఇస్తామని చెబుతున్నారని, ఇది జీహెచ్ఎంసీ పరిధిలోకి రాదని హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలోకి వస్తుందన్నారు. అన్నింటికీ ట్యాక్స్ ఉంటాయని కేవలం మాటలకే ట్యాక్స్ ఉండవన్నారు. పేలవంగా అనాలోచితమైన హామీలు ఎలా ఇస్తారో తెలియదన్నారు.

ఓటింగ్ శాతాన్ని పెంచండి..
ప్రస్తుతం జీహెచ్ ఎంసీ జరిగే పోలింగ్ లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. ఓటింగ్ లో పాల్గొనరనే విమర్శ ఉందని..సరియైన వారిని గెలిపించాలన్నారు. 

కొత్త సచివాలయం వస్తుంది - కేసీఆర్..

హైదరాబాద్ : త్వరలోనే తాను కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం నూతన సచివాలయానికి తానే స్వయంగా శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. 

వారిని రాక్షసులు అనడం వాస్తవమే - కేసీఆర్..

హైదరాబాద్ : గతంలో సమైక్యాంధ్ర వారిని రాక్షసులు అనడం వాస్తవమేనని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డు తగులుతున్న వారిని తాను ఆ విధంగా విమర్శించడం జరిగిందన్నారు. అదే కాంగ్రెస్ నాయకులు కూడా సమైక్యాంధ్ర వారికి అడుగులు మడుగులొత్తుతున్న వారిని తాను విమర్శించడం జరిగిందన్నారు. నగరంలో ఉన్న వారు తమ బిడ్డలనేన్నారు. ఎవరికైనా ఇబ్బంది కలిగిందా ? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోయడం సరికాదని, లేని ప్రాంతీయ కక్షలు కట్టడం సరికాదన్నారు. 

బాబుది వృదా ప్రయాస – కేసీఆర్..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయడం వృదా ప్రయాసేనని కేసీఆర్ పేర్కొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఏపీలో ఎన్నో నగరాలున్నాయని, చాలా ప్రధానమైన పట్టణాలున్నాయన్నారు. అక్కడనే బోల్డెంత పని ఉందని, పనికి వచ్చిన ముచ్చట కాదని ఎద్దేవా చేశారు. బాబు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారని, ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ హామీలు పేలవం - కేసీఆర్..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన హామీలు గుప్పిస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. నీళ్లు ఫ్రీగా ఇస్తామని చెబుతున్నారని, ఇది జీహెచ్ఎంసీ పరిధిలోకి రాదని హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధిలోకి వస్తుందన్నారు. అన్నింటికీ ట్యాక్స్ ఉంటాయని కేవలం మాటలకే ట్యాక్స్ ఉండవన్నారు. పేలవంగా అనాలోచితమైన హామీలు ఎలా ఇస్తారో తెలియదన్నారు. 

నిరంతర విద్యుత్ సరఫరా కోసం 'ఐలాండ్' - కేసీఆర్..

హైదరాబాద్ : జంట నగరాల్లో నిరంత విద్యుత్ సరఫరా చేయడం కోసం ఐలాండ్ తరహా విధానం చేయబోతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పారిశ్రామిక వేత్తలు ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేపట్టే వారని, ప్రస్తుతం 24గంటల పాటూ కరెంటు సరఫరా జరుగుతోందన్నారు. గతంలో ఉన్న టిడిపి, కాంగ్రెస్ నాయకులు ఈ పని ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉండడం..చేయాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమన్నారు. ప్రస్తుతం జంట నగరాల్లో ఐలాండ్ తరహా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, జనరేటిక్ స్టేషన్ లను అనుసంధించి రెప్పపాటులో కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 

రూ.40వేల కోట్లతో సంక్షేమ పథకాలు - కేసీఆర్..

హైదరాబాద్ : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా 40 వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు చేయడం జరుగుతోందన్నారు. ఆత్మగౌరవం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం, వెయి రూపాయల ఫించన్ తీసుకొస్తే ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారని తెలిపారు. కేవలం ఓట్ల కోసమే ఇది చేయలేదని చెప్పారు. 

తగిన వాళ్లకే ఓటు వేస్తే మంచి ఫలితాలు - కేసీఆర్..

హైదరాబాద్ : తగిన వాళ్లకి ఓటు వేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడవారు. కాంగ్రెస్, టిడిపి హయాంలోనే భూ కబ్జాలు, దారుణాలు జరిగాయని, మూసీ నదిని మురికికూపంగా మార్చిన ఘనత గత ప్రభుత్వాలేదన్నారు. ఇప్పుడవే పార్టీలు ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్లడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. 

మీడియాతో కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. గ్రేటర్ ఎన్నికలపై కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సమావేశం సుమారు రెండు గంటల పాటు కొనసాగనుంది. 

పనగారియాతో భేటీ కానున్న టి.రాష్ట్ర అధికారులు..

ఢిల్లీ : నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు పనగారియాతో మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ రాష్ట్ర అధికారులు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విద్యుత్, బొగ్గు కేటాయింపులు సాంస్కృతిక, పర్యాటక శాఖకు సంబంధించిన అంశాలపై శాఖల వారీగా పనగారియాతో అధికారులు చర్చించనున్నారు. 

కాసేపట్లో కేసీఆర్ మీడియా సమావేశం.

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. గ్రేటర్ ఎన్నికలపై కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సమావేశం సుమారు రెండు గంటల పాటు కొనసాగనుంది. 

14:56 - January 28, 2016

క్యాన్సర్... విస్తృతంగా వ్యాపిస్తున్న వ్యాధి. కొంత అవగాహన, కొంత జాగరూకతతో ఉంటే, ఈ రెండింటినీ జయించడం సాధ్యమే. ఆ జాగ్రత్తలేంటో వైద్యురాలు ఎలాంటి సూచనలు తెలియచేశారో వీడియోలో చూడండి.

14:54 - January 28, 2016

భారత ప్రభుత్వం ప్రతి ఏటా, విభిన్న రంగాల్లో కృషి చేసిన వారికిచ్చే పద్మ పురస్కారాలను ఈ ఏడాది తమ తమ రంగాల్లో ప్రత్యేకతను సాధించిన మహిళలు సొంతం చేసుకున్నారు. ఆ విశిష్ట మహిళలకు మానవి అభినందనలు తెలియచేస్తోంది. భారత క్రీడా చరిత్రలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సానియా మీర్జా, సైనా నెహ్వాల్ లు ఈ ఏడాది పద్మ భూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. క్రీడా విభాగంలో ప్రకటించిన పద్మ అవార్డులు, ఈ ముగ్గురు క్రీడాకారిణులకు దక్కడం విశేషం. గత ఏడాది ఈ ముగ్గురు అంతర్జాతీయ స్థాయిలో దేశ పతాకాన్ని రెపరెపలాడించారు. అప్రతిహిత విజయాలతో తమ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. లైంగిక దాడికి గురైతే, ఆ గాయం నుండి కోలుకోవడం అంత తేలికైన వ్యవహమేమీ కాదు. ఒక వేళ ఆ ఘటన నుండి తేరుకున్నాగానీ, నలుగురిలోకి వచ్చి, అనేకానేక కారణాలతో అన్యాయంగా సెక్స్ వృత్తిలో మగ్గిపోతున్న వారికి చేయూతగా ఉండాలనుకునే వారికి తోడుగా ఉండడం ఈ సమాజంలో అంత భద్రమైన విషయయేమీ కాదు. కానీ, అలాంటి అభ్రదతతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తూనే అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపే, ప్రయత్నం చేస్తూ, నిత్య పోరాట స్రవంతిగా నిలుస్తున్న సునీతా కృష్ణన్ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. ఈ ఏడాది పద్మ విభూషణ్ కు ఎంపికైన మహిళలు భిన్న రంగాలకు చెందిన వారు. దశాబ్దాల పాటు తమ తమ రంగాల్లో తమ కృషితో, శ్రమతో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన విశిష్ట వనితలందరికీ మానవి మరోసారి అభినందనలు తెలియచేస్తోంది. 

14:35 - January 28, 2016

హైదరాబాద్ : చిరంజీవి 150వ సినిమాకు కొత్త అడ్డంకులు ఎదురవుతున్నాయి. చాలా రోజులుగా ఎంతో కసరత్తు చేసి ఇప్పుడిప్పుడే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తమిళంలో హిట్‌ అయిన 'కత్తి' సినిమా కథ తనదేనని.. తనకు న్యాయం చేసిన తర్వాతే తెలుగులో రీమేక్‌ చేయాలంటూ రచయిత ఎన్‌.నరసింహారావు తెరపైకి రావడంతో మెగాస్టార్‌ కొత్త సినిమా మరో ట్విస్ట్ తిరిగింది.

కత్తి సినిమాతో రీ ఎంట్రీ..
చిరంజీవి 150వ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది.గత కొంతకాలంగా ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్‌.. ఎట్టకేలకు తమిళంలో విజయ్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో సూపర్‌హిట్‌ అయిన 'కత్తి' సినిమాను రీమేక్‌ చేయాలని డిసైడ్‌ అయ్యారు. మెగా ఫ్యామిలీ మొత్తం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. చిరు తనయుడు రామ్‌చరణ్‌ స్వయంగా నిర్వహణ బాధ్యతలు చేపట్టబోతున్నారు. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలుపెట్టారు. రేపో, మాపో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్న క్రమంలో రచయిత ఎన్‌.నరసింహారావు నుంచి ఈ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది.

రచయితల సంఘానికి ఫిర్యాదు..
'కత్తి' సినిమా కథ తనదేనని తెలుగు కథా రచయితల సంఘానికి ఫిర్యాదు చేశాడు నరసింహారావు. తనకు న్యాయం చేసేవరకు ఈ సినిమా నిర్మాణాన్ని చేపట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు. కత్తి సినిమాను రీమేక్‌ చేయకుండా డబ్బింగ్‌ చేసుకోవచ్చని.. లేదంటే స్ట్రయిట్‌గా విడుదల చేసుకోవచ్చని సూచించాడు. ఇలాకాకుండా సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తే మాత్రం 24 క్రాఫ్ట్స్‌ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుందని హెచ్చరించాడు.

పలు ఆంక్షలు..
ఇక నరసింహారావు ఫిర్యాదు నేపథ్యంలో కథా హక్కుల వేదిక ఈ సినిమా నిర్మాణంపై ఆంక్షలు విధించింది. నరసింహారావుకు న్యాయం చేసిన తరువాతే సినిమా నిర్మాణం చేపట్టాలని తెలుగు కథా రచయితల సంఘం అధ్యక్షుడు దాసరి నారాయణరావు సూచించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఇదిలావుంటే మెగా క్యాంప్‌ మాత్రం మురుగదాస్‌ స్వయంగా రాసి తెరకెక్కించిన చిత్రాన్నే రీమేక్‌ చేస్తున్నామంటున్నారు. తమిళంలో నిర్మించిన లైకా ప్రొడక్షన్స్‌ తెలుగులోనూ సినిమాను నిర్మిస్తుండడంతో హక్కుల విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవంటున్నారు. ఏది ఏమైనా తాజా వివాదంతో మెగాస్టార్‌ 150వ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశకు గురయ్యారు. రచయిత నరసింహారావు ఫిర్యాదు.. కథా హక్కుల వేదిక ఆంక్షలు నేపథ్యంలో ఈ సమస్యను కూల్‌గా ఎలా సాల్వ్ చేసుకుంటారో వేచి చూడాలి. 

14:30 - January 28, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి ఐఏఎస్‌ల కొరత ఇబ్బందికరంగా మారింది. అధికారుల కొరతతో సంక్షేమ పథకాల అమలుకు ఆటంకం ఏర్పడుతోంది. రాష్ట్రానికి మరిన్ని ఐఏఎస్‌ పోస్టులు మంజూరు చేయాలని టీ సర్కార్‌ ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపింది. త్వరలో ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్‌..ఇదే అంశంపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది.

కేంద్రానికి జాబితా పంపించిన ప్రభుత్వం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వం పదే పదే వినతులు పంపడంతో 8 నెలల త‌ర్వాత కేంద్రం కొంత మంది ఐఏఎస్‌లను కేటాయించింది. ఐనా కొరత కొనసాగుతూనే ఉంది. మరికొంతమంది అధికారులు కావాలని సర్కార్‌ మళ్లీ జాబితా పంపించింది. కొత్త జిల్లాలు ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టల‌ అథారిటీలు,కార్పోరేష‌న్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మ‌రి కొంత మంది కేంద్ర స‌ర్వీసు అధికారులు కావాల‌ని టీ సర్కార్‌ కోరింది. రాబోయే కొత్త బ్యాచ్‌ల నుంచి 30 మంది చొప్పున తమకు కేటాయించాల‌ని కోరుతూ కేంద్రానికి ప్రత్యేక నివేదికను పంపింది.

పదవీ విరమణ చేయనున్న మరికొంతమంది అధికారులు..
మరోపక్క అధికారుల్లో కొంత మంది రిటైర్ట్ కాబోతుండ‌డం ఇబ్బందిక‌రంగా మార‌నుంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 15 మంది పదవీ విరమణ పొందారు. త్వరలో మరో నలుగురు ఐఏఎస్‌లు పదవీ విరమణ చేయనున్నారు.

మరింతమంది ఐఏఎస్‌లు అవసరం..
రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. 12 నుంచి 14 కొత్త జిల్లాలను ఏర్పాటుచేయాలని సర్కార్‌ నిర్ణయించింది.నేప‌థ్యంలో మరింత మంది ఐఏఎస్‌లు అవసరమవుతారు. కొత్త జిల్లాలకు, ప్రభుత్వ శాఖలకు కలిపి మొత్తం 60 మంది అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఐఏఎస్‌ అధికారుల కొరతకు సంబంధించి సీఎస్‌ రాజీవ్ శ‌ర్మ కేంద్రానికి నివేదిక సమర్పించారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌ర్వాత హస్తిన పర్యటనకు వెళుతున్న కేసీఆర్‌..ఐఏఎస్‌ల కొరతపై ప్రధానితో చర్చిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

14:27 - January 28, 2016

ఢిల్లీ : పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన సెగ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమకు వేతనాలు రెగ్యులర్‌గా చెల్లించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు... వినూత్న రూపంలో ఆందోళనకు దిగారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటి ముందు... చెత్తా చెదారం వేసి... నిరసన తెలిపారు. నినాదాలతో హోరెత్తించారు. నిలువరించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు కార్మికులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

14:21 - January 28, 2016

ఢిల్లీ : 2002 హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్..సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి ఎలాంటి ఆదేశాలు జారీచేయవద్దంటూ... కేవియెట్ దాఖలు చేశారు. హిట్ అండ్ రన్ కేసులో ముంబై హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం... సుప్రీంను ఆశ్రయించింది. దీనికి పోటీగా... సల్మాన్ ఇవాళ కేవియెట్ దాఖలు చేశారు.
2002లో జరిగిన హింట్ అండ్ రన్ ఘటనలో ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి చనిపోగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. దాంతో ముంబై స్థానిక కోర్టు కొన్ని నెలల కిందట సల్మాన్ కు 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఆ తీర్పును బాంబే హైకోర్టులో సవాల్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. సల్మాన్ ను దోషిగా తేల్చలేమని బాంబే హైకోర్టు అనంతరం ప్రకటించింది. ఆయనపై అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. విచారణ దశలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రక్త నమూనాల పరీక్షల్లో విభిన్నత ఉందని వెల్లడించింది. కాగా, ఈ కేసులో ట్రయల్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల శిక్ష విధించగా, ఆయన దాన్ని హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. 

14:20 - January 28, 2016

హైదరాబద్ : వన్‌ హైదరాబాద్‌ కూటమి ప్రచారంలో దూకుపోతోంది. జంగంపేట్‌ డివిజన్‌లో తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్రెడ్డి ప్రచారం చేశారు. ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఈటీ నర్సింహ్మ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి నర్సింహ టెన్ టివితో మాట్లాడారు. గత 15 రోజులుగా విస్తృతంగా పర్యటించడం జరిగిందని, ఐదు సంవత్సరాలతో పోలిస్తే విపరీతమైన మార్పు చోటు చేసుకుందన్నారు. మతపరమైన రాజకీయాలతో విసిగిపోయారని, నగరంలో ఎన్నో సమస్యలున్నాయన్నారు. మార్పు అభివృద్ధి కావాలంటే తమకు ఓటు వేయాలని ఈటీ నర్సింహ విజ్ఞప్తి చేశారు. 

14:18 - January 28, 2016

తిరుపతి : రైల్వేస్టేషన్‌లో కర్నాటక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవలే ఒడిషాలో పట్టుబడ్డ ఉగ్రవాది రామచంద్రన్‌ సుభాష్‌ను వెంట తీసుకొచ్చిన పోలీసులు తిరుపతి రైల్వేస్టేషన్‌, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో విష్ణునివాసం అతిథి గృహం వద్ద డ్రైనేజీలో ఓ కవరును స్వాధీనం చేసుకున్నారు. అందులో తుపాకి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఉగ్రవాది రామచంద్రన్‌ గతంలో తిరుపతి, తిరుమలలో సంచరించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

గ్రేటర్ లో వన్ హైదరాబాద్ కూటమి ప్రచారం..

హైదరాబాద్ : గ్రేటర్ లో వన్ హైదరాబాద్ కూటమి ప్రచారం ఊపందుకుంది. సంతోష్ నగర్, ఐఎస్ సదన్ లో తమ్మినేని, చాడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 

ప్రాజెక్టుల రీ డిజైన్ పై మరింత అధ్యయనం - జానా..

హైదరాబాద్ : ప్రాజెక్టుల రీ డిజైన్ పై మరింత అధ్యయనం జరగాలని టి.కాంగ్రెస్ నేత జానారెడ్డి సూచించారు. మాజీ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ హనుమంతరావు సూచనలను ప్రభుత్వం అమలు చేయాలని, పొలాల్లో కందకాలు తవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం దీనిని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని సూచించారు.

14:00 - January 28, 2016

వరంగల్‌  : జిల్లాలో దారుణం జరిగింది.. కట్టుకున్న భార్యపై సల సలమరిగే వేడినీళ్లు పోసి చంపేశాడో దుర్మార్గపు భర్త.. ములుగు మండలం మహ్మద్‌గౌస్‌పల్లికిచెందిన లలితకు... వరంగల్‌ ఫోర్ట్‌రోడ్‌లోని వేణుతో ఇరవైఏళ్ల క్రితం వివాహం జరిగింది.. మద్యానికి బానిసైన వేణు రోజూ తాగి భార్యను కొట్టేవాడు.. రాత్రికూడా గొడవ జరగడంతో మరింత రెచ్చిపోయాడు.. భార్యపై వేడినీళ్లు పోశాడు.. లలిత కేకలు విన్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ బాధితురాలు ప్రాణాలు విడిచింది.. భర్త వేణు పరారీలో ఉన్నాడు.. 

ఆరోగ్య మిత్రలను కొనసాగించాలన్న హైకోర్టు..

విశాఖపట్టణం : ఆరోగ్య మిత్రలను కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో 55 మంది బాధితులు పిటిషన్ దాఖలు చేశారు. ఆరోగ్య మిత్రలను తొలగించేందుకు విద్యార్హతను సాకుగా చూపుతున్నారని కోర్టుకు పిటిషనర్లు విన్నవించారు. 

పాతబస్తీలో పోలీసులు దాడులు..

హైదరాబాద్ : పాతబస్తీ రెయిన్ బజార్ లో బుర్ఖా తయారీ కర్మాగారాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 15 మంది బాలలకు విముక్తి కల్పించారు. 

మావోయిస్టుల అంతిమయాత్ర ప్రారంభం..

వరంగల్ : మావోయిస్టు దంపతుల కుమార స్వామి, సోని అంతిమయాత్ర ప్రారంభమైంది. నర్సంపేట (మం) బాంజీపేటలో వీరి అంత్యక్రియలు జరుగనున్నాయి. అంతిమయాత్రలో వరవరరావు పాల్గొన్నారు. అంతిమయాత్రలో నివాళులర్పించేందుకు వచ్చిన టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని స్థానికులు, ప్రజా సంఘాలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

కేరళ సచివాలయం వద్ద ఉద్రిక్తత..

కేరళ : సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉమెన్ చాందీ రాజీనామా చేయాలని లెఫ్ట్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్ లెఫ్ట్ కార్యకర్తలపై లాఠీ ఛార్జీ చేశారు. 

13:57 - January 28, 2016

విజయవాడ : అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూల్చిన బిజెపికి నైతిక విలువల గురించి మాట్లాడే హక్కులేదని సిపిఐ నేత నారాయణ విమర్శించారు. విజయవాడలో జరిగిన సిపిఐ కార్యవర్గ సమావేశంలో పాల్గొని, ఆయన మాట్లాడారు. దేశంలో గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్‌ల మూలంగా ఆస్తినష్టమే తప్ప ఏ ప్రయోజనమూ లేదని స్పష్టం చేశారు. రోహిత్ హత్య ప్రభుత్వాల హత్యేనని ఆరోపించారు. 

13:54 - January 28, 2016

విశాఖ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు భరోసా ఇచ్చేందుకు ఫిబ్రవరి 2న ఛలో బండ్లపల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఏపీ పీసీసీ చీఫ్‌ రఘవీరారెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా బండ్లపల్లిలో జరిగే ఉపాధి కూలీలకు భరోసా సభకు రాహుల్‌ హాజరవుతారన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కాంగ్రెస్‌ నేతలు విడుదల చేశారు. కూలీల కడుపు నింపుతున్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని.. కూలీలకు భరోసా కల్పించేందుకే రాహుల్‌ వస్తున్నారని రఘువీరా చెప్పారు.

13:50 - January 28, 2016

త్రివేండ్రం : కేరళ సీఎం ఊమెన్ చాందీ చిక్కులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సోలార్ స్కాంలో చాందీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని త్రిసూర్ కోర్టు ఆదేశించింది. ఈ స్కాంలో ఊమెన్ చాందీకి కోటి 90లక్షల నగదు ఇచ్చానని.. ఈ కేసులో కీలక నిందితురాలైన సరితనాయర్ ఆరోపించింది. కేసును విచారిస్తున్న త్రిసూర్ కోర్ట్.. ప్రాధమిక ఆధారాలను పరిశీలించి... చాందీపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. మరోవైపు చాందీ రాజీనామా కోరుతూ లెఫ్ట్ పార్టీలు ధర్నాకు దిగాయి. ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్ దిగడంతో.. తిరువనంతపురంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. 

 

 

 

13:48 - January 28, 2016

న్యూఢిల్లీ: అవినీతి రహిత దేశాల్లో భారత్‌కు 76వ స్థానం దక్కింది. 2015 ఏడాదికి ప్రపంచ దేశాల ర్యాంకులను ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్‌ బుధవారం ప్రకటించింది. గతేడాది (2014) 174 దేశాలను పరిగణనలోకి తీసుకోగా, ఈసారి 168 దేశాలకు మాత్రమే ర్యాంకుల్ని కేటాయించింది. అవినీతి విషయంలో పలు అంశాలను పరిశీలించి మార్కులు వేసి ర్యాంకులు కేటాయిస్తారు. అవినీతి అసలే లేని దేశానికి నూటికి నూరు మార్కులు వేస్తారు. ఐతే, ప్రపంచంలో ఏ దేశమూ ఆ స్థాయిని అందుకోలేదు. జీరో మార్కులు వస్తే ఆ దేశం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినట్టు. 2014 లోనూ, 2015లోనూ భారత్‌ ఒకే మార్కులు (100కు38) సాధించిన ప్పటికీ ర్యాంకు మారి పోయింది. 2014లో భారత్‌ ర్యాంకు 85. ఈసారి 37 మార్కులు సాధించిన చైనాకు 83వ ర్యాంకు దక్కింది.

డెన్మార్క్‌కు మొదటి స్థానం..
100కు 91 మార్కులు సాధించిన డెన్మార్క్‌ అవినీతిరహిత దేశాల్లో మొదటి స్థానంలో నిలిచింది. 90 మార్కులతో ఫిన్‌లాండ్‌ రెండో స్థానంలో, 89 మార్కులతో స్వీడన్‌ మూడో స్థానంలో నిలిచాయి. న్యూజీలాండ్‌కు నాలుగు, నెదర్‌లాండ్‌కు ఐదో స్థానం దక్కాయి. అమెరికాకు 16, రష్యాకు 119, పాకిస్తాన్‌కు 117, నేపాల్‌కు 130, శ్రీలంకకు 83, భూటాన్‌కు 27 ర్యాంకులిచ్చారు. ప్రపంచంలో అత్యంత అవినీతికర దేశాలుగా సోమాలియా, ఉత్తర కొరియాలకు 167వ ర్యాంకు ఇచ్చారు.

వరంగల్ జిల్లాలో దారుణం...

వరంగల్ : జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై భర్త వేడి నీళ్లు పోశారు. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

 

గ్రేటర్ ఎన్నికల్లో నేర చరితుల జాబితా విడుదల

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో నేర చరిత అభ్యర్థుల జాబితా విడుదలైంది. పార్టీల వారిగా మొత్తం 72 మంది నేర చరిత కలిగిన అభ్యర్థులు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో 8 మంది మహిళలున్నారు. టీఆర్ ఎస్ నుంచి 14, టీడీపీ నుంచి 13, కాంగ్రెస్ నుంచి 13, ఎంఐఎం నుంచి 11, బిజెపి నుంచి 4, ఎంబిటి నుంచి ఇద్దరు నేర చరిత కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. 

13:41 - January 28, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో నేర చరిత ఉన్న అభ్యర్థుల జాబితా విడుదలైంది. పార్టీల వారిగా మొత్తం 72 మంది నేర చరిత కలిగిన అభ్యర్థులు గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో 8 మంది మహిళలున్నారు. టీఆర్ ఎస్ నుంచి 14, టీడీపీ నుంచి 13, కాంగ్రెస్ నుంచి 13, ఎంఐఎం నుంచి 11, బిజెపి నుంచి 4, ఎంబిటి నుంచి ఇద్దరు నేర చరిత కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఒక్కొక్కరిపై ఒకటి నుంచి రెండు కేసుల వరకు ఉన్నాయి. వీరిలో కొంతమందిపై క్రిమినల్ కేసులు కూడా ఉండడం గమనార్హం. అయితే నేర చరిత కలిగిన వ్యక్తులకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదని.… అలాంటి వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీలు టికెట్లు ఇవ్వరాదని గతంలో న్యాయస్థానాలు తీర్పు ఇచ్చాయి. కానీ పార్టీలు మాత్రం కోర్టు ఆదేశాలు, సూచనలు పాటించకుండా… తమ ఇష్టానుసారంగా నేర చరిత కలిగిన వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వడం శోచనీయం.

 

13:38 - January 28, 2016

న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన పిస్టల్‌ షూటర్‌ హీనా సింధూ 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫైయింగ్‌ పోటీల్లో బుధవారం నాడు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో హీనా సింధూ బంగారు పతకం సాధించింది. ఈ పోటీలో మొత్తం 387 పాయింట్లు సాధించి హీనా ప్రధమ స్థానంలో నిలిచింది. బుధవారం ఫైనల్‌లో మొత్తం 8 మంది షూటర్లు తలపడ్డారు. బంగారు పతకం సాధించడంపై హీనా సంతోషం వ్యక్తం చేసింది. గతంలో చేసిన పొరపాట్లను మర్చిపోయానని, ఒలింపిక్స్‌పైనే తన దృష్టి ఉందని తెలిపింది. ఈ ఏడాది రియో ఒలింపిక్స్‌కు ఇప్పటికే అభినవ్‌ బింద్రా, గగన్‌ నారంగ్‌, జితూరాయ్ అర్హత సాధించారు.

13:33 - January 28, 2016

సరబ్జిత్‌ చెల్లెలుగా ఉద్వేగభరితంగా ఐశ్వర్యరాయ్‌ చెప్పిన రెండు నిమిషాల భారీ డైలాగ్‌ సెట్‌లో ఉన్న అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఆద్యంతం హృద్యంగా చెప్పిన తీరుకు యూనిట్‌ సభ్యులందరూ క్లాప్స్‌తో స్టాండింగ్‌ ఒవేషన్‌ చేశార'ని నిర్మాత సందీప్‌సింగ్‌ తెలిపారు. టెర్రరిస్ట్ అనే ముద్రతో పాకిస్తాన్‌ జైలులో మగ్గి, అక్కడి ఖైదీల చేతిలో మరణించిన సరబ్జిత్‌ అనే రైతు జీవిత కథ ఆధారంగా దర్శకుడు ఒమాంగ్‌ కుమార్‌ 'సరబ్జిత్‌' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సరబ్జిత్‌ చెల్లెలుగా ఐశ్వర్యారాయ్‌ నటిస్తోంది. టెర్రరిస్ట్‌ అంటూ అన్నయ్యను అక్రమంగా జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ చెల్లెలుగా ఆవేదన వ్యక్తం చేసే సందర్భాన్ని ఇటీవల చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య చెప్పిన ఆవేదన భరిత తీరుకు యూనిట్‌సభ్యులంతా హ్యాట్సాఫ్‌ చెప్పారు. సరబ్జిత్‌గా రణ్‌దీప్‌ హుడా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 19న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

13:31 - January 28, 2016

'కథా రచయిత ఎన్‌.నరసింహారావుకు న్యాయం జరిగిన తర్వాతే 'కత్తి' చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని' తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు, కథా హక్కుల వేదిక చైర్మన్‌ దాసరి నారాయణ రావు అన్నారు. విజయ్ ద్విపాత్రాభినయంలో ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన 'కత్తి' తమిళనాట మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా, వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం 'కత్తి' కథ తనదేనని, చట్టపరంగా తనకు న్యాయం జరిగేలా చూడాలని కథా రచయిత ఎన్‌.నరసింహారావు రచయితల సంఘం, దర్శకుల సంఘంతో పాటు ఫిల్మ్ ఫెడరేషన్‌ని కూడా ఆశ్రయించారు. రచయిత ఇచ్చిన ఫిర్యాదుని స్వీకరించిన అన్ని సంఘాలు వాస్తవాన్ని కనుక్కునే దిశగా ప్రయత్నాలు చేశాయి. ఈ ప్రయత్నంలో భాగంగా కథా హక్కుల వేదిక చైర్మన్‌ దాసరి నారాయణరావు అన్ని అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో రచయితకు న్యాయం జరిగిన తర్వాతే సదరు దర్శక, నిర్మాతలు షూటింగ్‌ జరుపుకోవాలని తీర్మానించారు. తీర్మానాన్ని ఉల్లంఘించి నిర్మాణ బాధ్యతలు చేపడితే ఇండస్టీ నుండి చిత్ర యూనిట్‌కు ఎటువంటి సహాయ సహకారాలు అందవని హెచ్చరించారు. 

13:28 - January 28, 2016

మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు'. ప్రేక్షకుల విశేష ఆదరణతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలవడమే కాకుండా 100 కోట్ల షేర్‌ సాధించింది. 15 సెంటర్స్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేటితో (గురువారం)తో ఎమ్మిగనూరు - లక్ష్మణ్‌ థియేటర్‌లో డైరెక్ట్ గా 175 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు మాట్లాడుతూ, 'మా బేనర్‌లో నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రం నేటితో 175 రోజులు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా తొలి ప్రయత్నంగా నిర్మించిన ఈ చిత్రం ఇంత భారీ విజయాన్ని సాధించడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. డైరెక్టర్‌ కొరటాల శివ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా రూపొందించి మా బేనర్‌కు ఘన విజయాన్ని చేకూర్చారు. మా తొలి సినిమాని సూపర్‌స్టార్‌ మహేష్‌తో నిర్మించడం, అది సిల్వర్‌ జూబ్లీ చిత్రం కావడం విశేషంగా భావిస్తున్నాం. 15 సెంటర్స్‌లో శతదినోత్సవం జరుపుకోవడంతోపాటు ఓవర్సీస్ స్‌లోనూ భారీ కలెక్షన్లను సాధించింది. ఎమ్మిగనూరు లక్ష్మణ్‌ థియేటర్‌లో డైరెక్ట్‌గా 175 రోజులు ప్రదర్శితమైంది. దీంతోపాటు ఈ చిత్రానికి 6 'ఐఫా' అవార్డులు రావడం మరింత సంతోషంగా ఉంది. ఉత్తమ నటుడుగా మహేష్‌, ఉత్తమనటిగా శృతిహాసన్‌, ఉత్తమ సహాయ నటుడిగా జగపతిబాబు, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్‌, ఉత్తమ గేయరచయితగా రామజోగయ్య శాస్త్రి (రామ..రామ పాటకు) ఉత్తమ నేపథ్యగాయకుడిగా సాగర్‌ 'ఐఫా' అవార్డులు అందుకున్నారు' అని చెప్పారు.

ఎపిలో ఆరోగ్యమిత్రలను కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు..

హైదరాబాద్ : ఎపిలో ఆరోగ్యమిత్రలను కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 55 మంది బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోగ్యమిత్రలను తొలగించేందుకు విద్యార్హతలను సాకుగా చూపుతున్నారని మండిపడ్డారు. ఈమేరకు విచారణ చేపట్టిన హైకోర్టు ఆర్యోగ మిత్రలను కొనసాగించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.

13:18 - January 28, 2016

హైదరాబాద్ : ఎపిలో ఆరోగ్యమిత్రలను కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యమిత్రల తొలగింపుపై 55 మంది బాధితులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆరోగ్యమిత్రలను తొలగించేందుకు ప్రభుత్వం విద్యార్హతను సాకుగా చూపుతున్నారని పిటిషనర్లు పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

 

13:16 - January 28, 2016

మీకు ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక కావాలనుకుంటున్నారా... అయితే మీకు ఈ ప్రణాళిక కచ్చితంగా సరిపోతుంది. సాంప్రదాయక ఆహర పదార్ధాలతో కూడిన ఈ ఆహార నియమాలను పాటించడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్‌ వలన వచ్చే మరణాలను తగ్గించవచ్చు. అంతేకాక మతిమరుపును, నరాల బలహీనతలను కూడా తగ్గిస్తుందని అనేక పరిశోధకులు తెలుపుతున్నాయి.

ఉపయోగించవలసిన ఆహార పదార్ధాలు..
ప్రధానంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్‌, చిక్కుడు జాతి... ఇలాంటి మొక్కల ఆధారిత ఆహార పదార్ధాలు ఆహారంలో ముఖ్యంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నెయ్యి, వెన్న స్థానంలో ఆరోగ్యకర కొవ్వులున్న ఆలివ్‌ ఆయిల్‌ ను ఉపయోగించడం, ఉప్పుకు బదులు సుగంధ ద్రవ్వాలు(దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు) లాంటివి ఉపయోగించడం వలన రుచి కి రుచి..... ఆరోగ్యం కూడా....

మాంసాహారం..
మాంసాహారం విషయానికి వస్తే మాంసాన్ని నెలలో ఒకటి, రెండు సార్లుకే పరిమితం చేయాలి. చికెన్‌, చేపలను వారంలో రెండుసార్లు తీసుకున్నా పర్వాలేదు. ఇలాంటి ఆహారంతో పాటు శారీరక వ్యాయామం, కుటుంబానికి, బంధువులకు సమయాన్ని కేటాయించడం....వారితో కలిసి భోజనం చేయడం.... లాంటి పనులకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడే జీవితంలో మానసిక, శారీరక ఆనందం... సంతోషం.... కలుగుతుంది. అప్పుడే మొదడు చురుకుగా కూడా పనిచేస్తుంది. తినే కూరగాయలకు, పండ్లకు తృణధాన్యాలను కూడా చేర్చండి. పైన చెప్పిన విధంగానే ప్రతి భోజనంలో కూరగాయలు, పండ్లు చేర్చండి. ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. భోజనానికి భోజనానికి మధ్యలో స్నాక్స్ కి తృణధాన్యాలతో తయారు చేసిన బ్రడ్‌, సెరల్స్ ను ఉపయోగించడం మంచిది. బ్రౌన్‌ రైస్‌, పాస్తాలను కూడా చేర్చుకోవచ్చు. క్యారెట్లు, ఆపిల్‌, అరటిపండ్లతో స్నాక్‌ సంతృప్తికరంగా తయారు చేసుకోవచ్చు. వీటన్నింటి కన్నా పండ్లతో కూడిన సలాడ్‌ ఎంతో ఆద్భుతమైన... ఆరోగ్యకరమైన... స్నాక్‌.
మొలకెత్తిన విత్తనాలు: ఫైబర్‌, ప్రోటీన్‌లు, ఆరోగ్యకర కొవ్వులు సంతృప్తికరమైన పదార్ధాలు. ఎలాంటి స్నాక్స్‌ అందుబాటులో లేనప్పుడు మనకు గుర్తుకు వచ్చేవి బాదం, పిస్తా, జీడిపప్పు, అక్రోట్‌లు... సహజ సిద్ధమైన వేరుశనగపప్పుల బటర్‌తో లేదా వేపిన నువ్వులతో బ్రడ్‌.. ఇవి కూడా మంచి పోషకాలున్న స్నాక్స్‌.
వెన్న, డాల్డాలను మరిచిపోండి...
వీటికి బదులు ఆలివ్‌ ఆయిల్‌ను ప్రయత్నించండి. కూరలు చేసేటప్పుడు తక్కువ(పరిమిత) నూనెలను వాడండి. అది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
మసాలా దినుసులు : రుచికరమైన ఆహారం కోసం మసాలా దినుసులు కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉప్పుకు ప్రత్యామాయంగా ఉపయోగించవచ్చు.
చేపల వైపుకి చూపు తిప్పండి : తక్కువ నూనెతో వేయించిన... కాల్చిన... బేక్‌ చేసిన చేపలు ఎంతో రుచికరంగా ఉంటాయి. వీటిని ఆహారంలో వారానికి రెండుసార్లు చేర్చుకోవచ్చు.
మాంసాన్ని నెలలో ఒకటి, రెండు సార్లు అంటే పరిమితంగా తీసుకోండి. దీనికి ప్రత్యామాయంగా చేపలు, చికెన్‌ను ఎంచుకోండి. అధిక కొవ్వులు, ప్రాసెస్‌ చేసిన మాంసాన్ని మరిచిపోండి. తక్కువ కొవ్వున్న పాల ఉత్పత్తులను ఎంచుకోండి. అధిక కొవ్వుతో కూడిన పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీములు, చీజ్‌లను పరిమితంగా వాడండి. స్కీమ్డ్ పాలుకొవ పెరుగు, చీజ్‌లను ఎన్నుకోండి. 

13:11 - January 28, 2016

సాధారణంగా చలికాలంలో జలుబు బాగా ఇబ్బంది పెడుతుంది. దీనికి తోడు గొంతు ఇన్‌ఫెక్షన్‌ కూడా తరచూ వస్తుంటుంది. వీటిని అధిగమించాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
ప్రతి ఒక్క ఇంట్లో పసుపుపొడి తప్పకుండా ఉంటుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. కప్పు పాలలో చిటికెడు పసుపు చేర్చి తీసుకుంటే సమస్యను త్వరగా దూరం చేస్తాయి.
గొంతులో మంట, పట్టేసినట్టు నొప్పి విపరీతంగా బాధిస్తుంటే దాల్చిన చెక్క నూనె చెంచా తీసుకొని అందులో తేనె కలిపి తాగితే తక్షణం ఉపశమనం ఉంటుంది. అవసరమైతే వేడి నీటిలో తేనె వేసుకుని పుక్కిలిస్తే ఎంతో మంచిది.
ఓ గ్లాసు వేడి నీటిలో దాల్చిన చెక్క, మిరియాల పొడిని ఓ చెంచా కలపాలి. కాసేపైన తర్వాత వడకట్టి పుక్కిలించాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయడం వల్ల సమస్య నుంచి చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.
అరకప్పు వేడి నీటిలో చెంచా శొంఠి పొడి, అర చెంచా నిమ్మరసం, అల్లం రసం, తేనె కలిపి పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేస్తే నొప్పి, మంట అదుపులోకి వస్తాయి.

12:59 - January 28, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తరగతులు నిర్వహించేందుకు ప్రొఫెసర్లు యత్నించారు. హెచ్ సీయూ జాక్ నేపథ్యంలో తరగతులను అడ్డుకున్నారు. తరగతి గదుల వద్ద విద్యార్థులు బైఠాయించారు. ప్రొఫెసర్లు, విద్యార్థుల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. 

ఇంటర్నేషనల్ క్రికెట్కు పాక్ క్రికెటర్ ఇమ్రాన్ గుడ్బై...

హైదరాబాద్‌: పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఫర్హాత్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. పాకిస్థాన్ టెస్టు జట్టుకు ఓపెనర్గా సేవలందించిన ఈ లెఫ్ట్ హ్యండ్ బ్యాట్స్మెన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ను 2013లో ఆడాడు. దుబాయ్లో జరగనున్న మాస్టర్స్ ఛాంపియన్స్ లీగ్(ఎంసీఎల్)లో పాల్గొననున్న నేపథ్యంలో ఫర్హాత్ రిటైర్మెంట్ నిర్ణయం తసుకున్నాడు. పాకిస్థాన్‌ తరపున 40 టెస్ట్లు, 58 వన్డేలు, 7 టీట్వంటీ మ్యాచ్లకు ఫర్హాత్ ప్రాతినిథ్యం వహించాడు.

12:48 - January 28, 2016

హైదరాబాద్ : కరెంట్ లేకుండానే షాక్ కొడుతోంది. కత్తి లేకుండానే యుద్ధం జరుగుతోంది. బల్దియా పోరు రసవత్తరంగా మారుతోంది. మాటల తూటాలతోనే... లీడర్లు మంటలు పుట్టిస్తున్నారు. ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ఇక మేమేం తక్కువంటూ... కదనరంగంలోకి దూకుతున్నారు ఇద్దరు చంద్రులు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు గ్రేటర్ ఫైట్‌కు కదలుతున్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఇద్దరు సీఎంల ప్రచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వేడెక్కనున్న బల్దియా సంగ్రామం

బల్దియా సంగ్రామం మరింత వేడెక్కనుంది. మహానగరంలో ప్రచారం చేసేందుకు ఇద్దరు చంద్రుళ్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జీహెచ్ ఎంసీ పోరులో యువరాజసం ఉట్టిపడుతోంది. గులాబీ ప్రచార సారథిగా అన్నీ తానై కేటీఆర్ పర్యటిస్తుంటే... పసుపు దళంలో జోష్ నింపేందుకు లోకేష్‌ బాబు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇద్దరూ లీడర్లు తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు.

తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచార పర్వం

ఇకపై గ్రేటర్‌లో తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచార పర్వం కొనసాగనుంది. ప్రచార గడువుకు డెడ్‌లైన్‌ పడుతుండటంతో... టిఆర్ ఎస్, టీడీపీ అభ్యర్థులు అధినేతలపైనే ఆశలు పెట్టుకున్నారు. స్టార్‌ క్యాంపెయిన్‌తో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే నేటి నుంచి రెండ్రోజుల పాటు... హైటెక్‌ నగరంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు చంద్రబాబు. రోడ్‌షోలతో పాటు బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అధినేత ప్రచారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తెలుగు తమ్ముళ్లు పూర్తి చేశారు.

జనవరి 30న టీఆర్ ఎస్ భారీ బహిరంగ సభ

మరోవైపు జనవరి 30న భారీ బహిరంగసభకు టిఆర్ ఎస్ రెడీ అవుతోంది. పరేడ్ గ్రౌండ్ వేదికగా బల్దియా ప్రజల్ని ఉద్దేశించి గులాబీ దళపతి ప్రసంగించనున్నారు. విశ్వనగరాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా ఆయన మాట్లాడనున్నారు. జీహెచ్‌ఎంసీలో తమకు అవకాశం ఇస్తే... మున్ముందు ఏం చేస్తామన్నది కేసీఆర్ ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇకపై జరిగే ప్రచారం.. మరో ఎత్తు

ఇప్పటివరకు గ్రేటర్‌లో జరిగిన ప్రచారం ఒకెత్తయితే ఇకపై జరిగేది మరో ఎత్తు. అగ్రనేతలు రంగంలోకి దిగిన తర్వాత... పరిణామాలు ఎలా ఉంటాయన్న భావన అన్నిపార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా టీడీపీ-బీజేపీ కూటమి, టీఆర్ ఎస్ పార్టీలు ఇద్దరు చంద్రులపైనే ఆశలు పెట్టుకున్నాయి. బాబు ప్రచారంతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని తమ్ముళ్లు, దళపతి సభతో మెజార్టీ సీట్లు సాధిస్తామని గులాబీ నేతలు ధీమాతో ఉన్నారు. కేసీఆర్‌, చంద్రబాబు రంగంలోకి దిగితే... మహానగర రాజకీయ సమీకరణాల్లో మార్పులుంటాయని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి రోడ్‌షోలు, బహిరంగ సభలు ఏ మేరకు ఫలితాలు తెచ్చిపెడుతాయో చూడాలి.

 

 

 

తిరుపతి రైల్వేస్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

చిత్తూరు : తిరుపతి రైల్వేస్టేషన్‌లో కర్నాటక పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఇటీవల పట్టుబడిన ఓ ఉగ్రవాదిని పోలీసులు తీసుకొచ్చిన తిరుపతికి తీసుకొచ్చారు. ఉగ్రవాది ఇచ్చిన సమాచారం మేరకు తనిఖీలు పోలీసులు చేశారు. రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ కవర్‌ను కర్నాటక పోలీసులు  తీసుకెళ్లారు. లభ్యమైన కవర్ పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

12:36 - January 28, 2016

చిత్తూరు : తిరుపతి రైల్వేస్టేషన్‌లో కర్నాటక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవలే ఒడిషాలో పట్టుబడ్డ ఉగ్రవాది రామచంద్రన్‌ సుభాష్‌ను వెంట తీసుకొచ్చిన పోలీసులు తిరుపతి రైల్వేస్టేషన్‌, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో విష్ణు నివాసం అతిథి గృహం వద్ద డ్రైనేజీలో ఓ కవరును స్వాధీనం చేసుకున్నారు. అందులో తుపాకి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఉగ్రవాది రామచంద్రన్‌ గతంలో తిరుపతి, తిరుమలలో సంచరించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

హెచ్ సీయూలో కొనసాగుతోన్న ఆందోళన

హైదరాబాద్ : రోహిత్ మృతికి నిరసనగా హెచ్ సీయూలో ఆందోళన కొనసాగుతోంది. తరగతులు నిర్వహించేందుకు ప్రొఫెసర్లు యత్నించారు. తరగతి గదుల వద్ద విద్యార్థులు బైఠాయించారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు.

 

11:47 - January 28, 2016

వరంగల్‌  : జిల్లా నర్సక్కపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండ్రోజుల క్రితం నర్సక్కపల్లిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు, ప్రజాసంఘాలు బాలిక మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించడం లేదు. న్యాయం జరిగేంత వరకు అంత్యక్రియలు జరగనివ్వమంటున్నారు. పోలీసులు ఇవాళ 14 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నేరస్తులను శిక్షించాల్సిందేనంటూ మహిళా సంఘాలు నర్సక్కపల్లికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

 

సొంతూరుకు మావోయిస్టు దంపతుల మృతదేహాలు

వరంగల్ : ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు దంపతుల మృతదేహాలు వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం బాంజీపేటకు చేరాయి.. 25ఏళ్లక్రితం అజ్ఞాతంలోకివెళ్లిన కుమారస్వామి ఇలా విగతజీవిగా తిరిగిరావడంతో స్థానికులు, బంధువులు కంటతడి పెట్టారు..

11:25 - January 28, 2016

వరంగల్ : ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు దంపతుల మృతదేహాలు వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం బాంజీపేటకు చేరాయి.. 25ఏళ్లక్రితం అజ్ఞాతంలోకివెళ్లిన కుమారస్వామి ఇలా విగతజీవిగా తిరిగిరావడంతో స్థానికులు, బంధువులు కంటతడి పెట్టారు.. స్వామి భార్య సోనీ విశాఖకుచెందినవారు... దళంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.. ఒడిషా దియోగొడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.. పోలీసులు ప్రత్యేక అంబులెన్స్ పంపి డెడ్‌ బాడీస్‌ తెప్పించారు.. మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు..

 

11:22 - January 28, 2016

కడప : జిల్లాలోని జమ్మలమడుగులో బాంబులు కలకలం సృష్టించాయి. మోరగుడి బైపాస్ రోడ్డులో ఓ వాహనంలో పోలీసులు 2 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మోరగుడి గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి తన అన్న సుదర్శనరెడ్డిని హతమార్చేందుకే ఈ బాంబులను మైదుకూరుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టు సీఐ వెంకటకుమార్‌ తెలిపారు. ఆస్తి విషయంలోనే అన్నదమ్ముల మధ్య వివాదం కొనసాగుతోందని చెప్పారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 

పోలీసులకు లొంగిపోయిన గంజాయి స్మగ్లర్‌

కృష్ణా : జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట గంజాయి స్మగ్లర్‌ అవుకు శివశంకర్‌రెడ్డి లొంగిపోయాడు. కృష్ణాజిల్లా కుంచనపల్లికి చెందిన శివశంకర్‌రెడ్డి ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలింపు కేసులో నిందితుడు.

10:51 - January 28, 2016

కృష్ణా : జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట గంజాయి స్మగ్లర్‌ అవుకు శివశంకర్‌రెడ్డి లొంగిపోయాడు. కృష్ణాజిల్లా కుంచనపల్లికి చెందిన శివశంకర్‌రెడ్డి ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలింపు కేసులో నిందితుడు. ప్రతిరోజూ మహారాష్ట్రకు వందల టన్నుల్లో గంజాయి తరలిస్తుంటామని, గంజాయి నిల్వచేసేందుకు విజయవాడలోని పలు ప్రాంతాల్ల గోడౌన్‌లు ఏర్పాటు చేసుకున్నామని పోలీసులకు తెలిపాడు. శివశంకర్‌రెడ్డికి సంబంధించిన 3 నెలల ఫోన్‌ కాల్స్‌ డేటాను పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు.

 

10:43 - January 28, 2016

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని అధికారాలను గవర్నర్ వినియోగించుకున్నారని పేర్కొన్నారు. గవర్నర్ చర్యలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాష్ట్రపతి పాలనను పార్లమెంట్ ఆమోదించాలని తెలిపారు. గవర్నర్ ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరిపారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో గవర్నర్ అధికంగా జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. గవర్నర్.. కేంద్రప్రభుత్వ ప్రతినిధి కాదని.. రాజ్యాంగ ప్రతినిధని గుర్తు చేశారు. ప్రధాన పార్టీలు అధికారంలో ఉంటే రాష్ట్రపతి పాలన విధిస్తాయి.. ప్రతిపక్షంలో ఉంటే రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తాయని విమర్శించారు. స్వార్థపూరిత రాకీయాలు మంచివి కావని హితపు పలికారు. 'అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై కేంద్రంకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ను ఆదేశించింది'. ఈ ఆంశాలపై నాగేశ్వర్ మాట్లాడారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే..

అత్యవసర పరిస్థితుల్లోనే రాష్ట్రపతి పాలన...

'అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడంపై కేంద్రంకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులు ఇవ్వడమే ప్రతికూలం కాదు. భారత రాజ్యాంగం 356 అధికరణ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం మేరకు ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం ఉంది. రాష్ట్రంలో పాలనలో ప్రతిష్టంభన నెలకొన్నప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఏ రాజ్యాంగ అధికరణ అయినా...దుర్వినియోగం కావచ్చు.... అంతమాత్రాన దాన్ని ధిక్కరించడం సరికాదు. 1959లో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు… కేరళలో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే దేశంలోని ప్రధాన పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రపతి పాలన విధిస్తారు.. ప్రతిపక్షంలో ఉంటే రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ 47 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఇందులో 24 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బిజెపిలో చేరారు. 11 స్థానాలను బిజెపి గెలుచుకుంది. 2 స్థానాలను స్వతంత్రులు గెలుచుకున్నారు. జనవరి 14న అసెంబ్లీ సమావేశాలు జరపాలని ప్రభుత్వం తెలిపింది. కానీ జనవరి 16న సమావేశాలు ప్రారంభించాలని గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు. సీఎం స్వతంత్రంగా పని చేసే అధికారం లేదు. రాష్ట్ర కేబినెట్ సహకారం తీసుకోవాలి. అలాగే గవర్నర్ కు సొంతంగా నడుచుకునే హక్కు లేదు. దేశంలోని ఏ రాష్ట్రానికైనా ఒకే విధానం ఉంటుంది. స్వార్థం కోసం, రాజకీయ అవసరాల కోసం పని చేస్తే. .. దేశ సమగ్రతకు భంగం కలుగుతుంది. దేశంలో ఎక్కడా లేని అధికారాలను గవర్నర్ వినియోగించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఆ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. ఆ విషయంలో గవర్నర్ జోక్యం అవసరం లేదు.

గవర్నర్ రాజ్యాంగం ప్రతినిధి...

గవర్నర్ కేంద్రప్రభుత్వ ప్రతినిధి కాదు... గవర్నర్ రాజ్యాంగం ప్రతినిధి. అరుణాచల్ ప్రదేశ్ లో కేంద్ర పెద్దల ఆదేశాల మేరకే గవర్నర్ నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నర్ ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరిపారు. ప్రభుత్వం బల నిరూపణ చేయాల్సింది.. హోటల్స్, ప్రైవేట్ బంగ్లాల్లో కాదు.. అసెంబ్లీ వేదికపైన చేసుకోవాలి. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్ టీ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందలేదు. కేంద్రం రాజకీయ కుట్రలు చేసి.. పార్లమెంట్ సమావేశాలు జరుగకుండా ప్రయత్నించింది'.… అని నాగేశ్వర్ ఆరోపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:59 - January 28, 2016

విశాఖ : నగరంలో నిన్న పట్టుబడ్డ ఇరాన్ దేశస్థులను పోలీసులు విచారించారు. వారి వద్ద పాస్ పోర్ట్, వీసాలు సరిగానే ఉన్నాయని నిర్ధారించారు. ఒడిషా నుంచి పారిపోయి వస్తున్న వీరిని... నిన్న నక్కపల్లి కాగిత టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేశారు. మరోవైపు వీరిని విచారించేందుకు ఒడిషా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వస్తున్నారు.

 

09:45 - January 28, 2016

త్రివేండ్రం : కేరళలో సోలార్‌ స్కాంకు సంబంధించి ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ న్యాయ విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. 14 గంటల పాటు విచారణ సాగింది. లై డిటెక్టర్‌ టెస్ట్‌కు చండీ నిరాకరించారు. కేరళకు చెందిన ఓ సిఎం న్యాయ విచారణ కమిటీ ముందు హాజరు కావడం ఇదే తొలిసారి.

చండీపై సరితానాయర్‌ ఆరోపణ

కేరళ సోలార్‌ స్కాం ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సిఎం చండీ వ్యక్తిగత సిబ్బందికి సుమారు ఏడు కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించినట్టు ఈ కేసులో ప్రధాన నిందితురాలు సరితానాయర్‌ ఆరోపించారు. రెండు కోట్లను రెండు విడతల్లో తాను స్వయంగా సిఎం సిబ్బందికి చెల్లించినట్టు పేర్కొన్నారు. ఈ ఆరోపణలన్నీ నిరాధారమని ముఖ్యమంత్రి చండీ కొట్టివేశారు. సోలార్‌ స్కాంకు సంబంధించి 2013లో అరెస్ట్‌ అయిన సరితానాయర్‌కు బెయిలు లభించింది. సోలార్‌ స్కాంపై రిటైర్డ్‌ హైకోర్టు జడ్జి నేతృత్వంలో నియమించిన విచారణ కమిటీ ముందు హాజరైన సరితా నాయర్‌ ముఖ్యమంత్రిపై తాజా ఆరోపణలు చేశారు.

న్యాయ విచారణ కమిటీ ముందు చండీ హాజరు

నాయర్‌ ఆరోపణల నేపథ్యంలో ఊమెన్‌ చండీ సోమవారం న్యాయ విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. 14 గంటల పాటు ముఖ్యమంత్రిని కమిటీ విచారించింది. లై డిటెక్టర్‌ టెస్ట్‌కు ఆయన నిరాకరించారు. తానెలాంటి తప్పు చేయనప్పుడు లై డిటెక్టర్‌ పరీక్ష చేయాల్సిన అవసరం ఏముందని సిఎం మీడియాతో అన్నారు. తనపై, తన కార్యాలయ సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ కక్షతోనే చేశారని ఆయన పేర్కొన్నారు. ఊమెన్‌ చండీ పాలిగ్రాఫ్‌ పరీక్షకు హాజరు కాకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయన ఎలాంటి తప్పు చేయకుంటే లైడిటెక్టర్‌ పరీక్ష జరపడానికి ఎందుకు నిరాకరించారని ప్రశ్నించాయి.

2013లో సోలార్‌ స్కాం

2013లో సోలార్‌ కుంభకోణం వెలుగు చూసింది. ఈ కుంభకోణం కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వాన్ని తలవంచుకునేలా చేసింది. ఈ స్కాంకు సంబంధించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ డిమాండ్‌ చేసింది.

చండీ పేరుతో కోట్ల రూపాయల వసూలు

సిఎం చండీ పేరు వాడుకుని సౌర విద్యుత్‌ పేరిట సరితా, రాధా కృష్ణన్‌ ప్రజల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సరిత బెయిలుపై బయటకు రాగా...భార్య హత్య కేసుకు సంబంధించి రాధాకృష్ణన్‌ ఇంకా జైలులోనే ఉన్నాడు. సౌరవిద్యుత్‌ ప్లాంట్‌ కోసం వీరికి స్థలాన్ని కూడా కేటాయిస్తామని సిఎం అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోలార్‌, బార్‌ స్కాంలు కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి.

 

09:39 - January 28, 2016

వరంగల్‌ : జిల్లాలో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది. నర్సంపేట బాలాజీ ఇంజనీరింగ్‌ కాలేజిలో సీనియర్లు.. జూనియర్‌పై దాడికి పాల్పడ్డారు. వారం రోజుల క్రితం ట్రిపుల్‌ ఇ విద్యార్ధులు భూమేష్‌, చరణ్‌లు ర్యాగింగ్‌ చేశారని జూనియర్‌ విద్యార్ధి ఆదిత్య ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వారిపై ప్రిన్సిపాల్‌ చర్యలు తీసుకున్నాడు. తాజాగా మళ్లీ కాలేజికి వచ్చిన సీనియర్లు.. గ్యాంగ్‌తో వచ్చి తనపై దాడి చేశారని బాధితుడు ఆదిత్య ఆరోపిస్తున్నాడు. తన కుమారుడిపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆదిత్య తండ్రి సదానందం కోరుతున్నారు.

 

మహిళ ఆత్మహత్యాయత్నం..

మెదక్ : జిల్లాలోని సిద్ధిపేట మార్కెట్ వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పరిస్థితి విషమించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే అమె ఆత్మహత్యాయత్నానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్...

 చిత్తూరు : జిల్లాలో మరోసారి భారీ ఎత్తున ఎర్ర చందనం స్మగ్లింగ్ బయటపడింది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఎర్రదుంగలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.20 లక్షలు వరకు ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ఒకరిని అరెస్టు చేశారు.

ఇరాన్ దేశస్థులపై పోలీసుల రహస్య విచారణ…

విశాఖ : ఇరాన్ దేశస్థులపై పోలీసులు రహస్య విచారణ చేపట్టారు. నిన్న నక్కలపల్లి కాగిత టోల్ గేట్ వద్ద ఐదుగురు ఇరాన్ దేశస్థులు పోలీసులకు పట్టుబడ్డారు. 

08:46 - January 28, 2016

హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే అవినీతి పోవాలని వక్తలు పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింహ్మారావు, బిజెపి నేత ఆచారి, టిఆర్ ఎస్ అధికార ప్రతినిధి పాదూరి శ్రీనివాస్ రావులు పాల్గొని, మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు ఎన్ని నెరవేర్చారో టీఆర్ ఎస్ చెప్పాలన్నారు. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం…

 

08:14 - January 28, 2016

తమ సమస్యలను పరిష్కరించాలని హిజ్రాల సంఘం నేత లైలా డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో లైలా పాల్గొని, మాట్లాడారు. 'హిజ్రాలు లేదా ట్రాన్స్ జెండర్స్ పోరుబాట పడుతున్నారు. తెలంగాణలో దాదాపు 23వేల మంది హిజ్రాలున్నారు. వీరిలో 8వేల మంది హైదరాబాద్ లో నివసిస్తున్నారు. వీరిలో అత్యధికులు విద్యావంతులే. వీరిలో డిగ్రీ, పీజీ చేసినవారు కూడా వుండడం విశేషం. వీరంతా సంఘంగా ఏర్పడి, తమ డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేథప్యంలో హిజ్రాలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? ఏయే వర్గాల నుంచి ఏయే సమస్యలు ఎదుర్కొంటున్నారు? సామాజికంగా వీరికి ఎదురవుతున్న అనుభవాలేమిటి? కుటుంబ సభ్యులు వీరి పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు? వీరు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నదేమిటి? ఇలాంటి అంశాలపై లైలా మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.…

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

చిత్తూరు : తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తుల రద్దీ అతి సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 3 కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

గ్రేటర్ లో నేటి నుంచి చంద్రబాబు, కేసీఆర్ ప్రచారం..

హైదరాబాద్ : నగరంలో మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం నేటి నుంచి మరింత ముమ్మరం కానుంది. ఇప్పటికే అన్ని పార్టీల ప్రధాన నేతలు నగరంలోకి వీధుల్లో కలియ తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం చెమటోడుస్తున్నారు. తాజాగా నేటి నుంచి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా రంగంలోకి దిగనున్నారు. నేటి మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్న కేసీఆర్ ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలపైనే మాట్లాడనున్నారు. ఇక నేటి నుంచి రెండు రోజుల పాటు చంద్రబాబు గ్రేటర్ పరిధిలో టీడీపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహించనున్నారు.

07:40 - January 28, 2016

వరంగల్ : దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారక్క జాతరకు వరంగల్ జిల్లా మేడారం ముస్తాబైంది. ఫిబ్రవరి 17నుంచి 20 వరకు జరిగే ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 3నెలలుగా జాతరపై అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు..జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జాతర

దేశంలోనే అతిపెద్దదైన గిరిజ‌న జాత‌ర స‌మ్మక్క-సార‌క్క జాత‌రకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యయి. ఫిబ్రవరి 17 నుంచి 20 వ‌ర‌కు జ‌రిగే సమ్మక్క సారలమ్మ జాతరకు తరలొచ్చే కోట్లాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు తెలిపారు. నిధుల విషయంలో ఎక్కడా రాజీపడకుండా మొత్తం 162 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మొద‌టి జాత‌ర కావ‌డంతో బ్రహ్మాండంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించిందన్నారు.

కోటికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం

గ‌తంలోకంటే ఈ సారి జాతరకు భ‌క్తులు కోటికిపైగా జాత‌ర‌కు తరలివ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప్రభుత్వం భావిస్తోంది. జాతరకు ఒక్క తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మ‌హారాష్ట్ర, ఛత్తీస్‌ఘ‌డ్, మ‌ధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివచ్చే అవకాశం ఉంది. తాగునీరు, పార్కింగ్, స్నాన ఘ‌ట్టాల విష‌యంలో భ‌క్తులకు ఎలాంటి అసౌర్యం క‌ల‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని అధికారులకు మంత్రులు సూచించారు. జాతరలో ఎక్కడా అవాంచనీయ ఘటనలు జరగకుండా 200 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేయడంతో పాటు..వేలాది మంది పోలీసులతో పటిష్ట భద్రత కల్పించనున్నట్లు మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. జ‌న‌వ‌రి 31 తేదీలోగా అన్ని పనులు పూర్తి చేయాల‌ని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

జాత‌ర‌కు విస్తృత స్థాయిలో ప్రచారం

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాత‌రగా ప్రసిద్ధి పొందిన స‌మ్మక్క-సారక్క జాత‌ర‌కు విస్తృత స్థాయిలో ప్రచారం క‌ల్పించేందుకు రాష్ట్ర స‌మాచారశాఖ ప్రయ‌త్నాలు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ని మంత్రులు కడియం శ్రీహారి, ఇంద్రకరణ్ రెడ్డి, చందులాల్, సలహాదారు రమణాచారి విడుదల చేశారు. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాత‌ర‌ను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు స‌ర్కారు స‌న్నద్ధమవుతోంది.

 

 

07:36 - January 28, 2016

విశాఖ : నగరంలో అనుమానాస్పందంగా సంచరిస్తున్న ఐదుగురు ఇరానీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నక్కపల్లి కాగిత టోల్‌గేట్‌ దగ్గర తనిఖీలు చేస్తుండగా... ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారును పోలీసులు ఆపారు. అందులో ఉన్న వారిని అనుమానించి ప్రశ్నించారు. వీరంతా ఇరాన్‌ దేశస్థులని తేలడంతో నర్సీపట్నం ఏఎస్ పీ ఐశ్వర్య వీరిని విచారిస్తున్నారు. ఇరాన్‌ దేశస్థులు ప్రయాణిస్తున్న కారు డీఎల్ సీసీజే 1520 రిజిస్ట్రేషన్‌తో ఉంది.

 

07:31 - January 28, 2016

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లోని వినాయక్‌నగర్‌లో దారుణం జరిగింది. ఆర్ధిక ఇబ్బందులు భరించలేని ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చింది. దీంతో మూడేళ్ల ప్రత్యూష, 9 నెలల శ్రావణి మృతి చెందారు. ఆ తర్వాత తల్లి సరిత కూడా ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సరిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

07:27 - January 28, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థుల‌ను డేగ కన్నుతో ఈసీ మానిట‌రింగ్ చేస్తోంది. ప్రతి పైసా లెక్క క‌డుతోంది. అభ్యర్థులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎంత ఖ‌ర్చు పెడుతున్నారు... అనే దానిపై అధికారులు కంప్లీట్ అబ్జర్వేష‌న్ చేస్తున్నారు. ఐఎఎస్ అధికారుల‌ను అబ్జర్వర్స్‌గా నియ‌మించి మ‌రీ అభ్యర్థుల ప్రచారాన్ని ప‌రిశీలిస్తోంది. అస‌లు ఖ‌ర్చు నియంత్రణపై ఎల‌క్షన్‌ క‌మిష‌న్‌ ఏం చేస్తోంది.

పార్టీల అభ్యర్ధులు, నేత‌లు ప్రచారం సంద‌డి

గ్రేట‌ర్ హైద్రాబాద్ ఎన్నిక‌లా.... మ‌జాకా ? అనే స్థాయిలో ఆయా పార్టీల అభ్యర్ధులు, నేత‌లు ప్రచారంలో సంద‌డి చేస్తూ దూసుకుపోతున్నారు. త‌న‌తో వ‌చ్చే వంద‌లాది మందిని వెంటేసుకుని, వారికి కావాల్సిన బాగోగులు చూసుకుంటూ హ‌డావుడి చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో త‌మ‌కోసం ప్రచారానికి వ‌చ్చే పార్టీల ముఖ్యనేత‌ల కోసం భారీగా ఫ్లెక్సీలు, బ్యాన‌ర్‌ల‌తో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఉద‌యం టీ మొద‌లు ఈవినింగ్ డిన్నర్ వ‌ర‌కు అన్ని స‌దుపాయాలూ చూసుకుంటూ భారీగానే ఖ‌ర్చు చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో భారీగా వాహ‌నాల కాన్వాయ్‌లు పెట్టి తిరుగుతున్నారు. అయితే దీనిపై కంప్లీట్ మానిట‌రింగ్ ఉంటుంద‌ని గ్రేట‌ర్ ఎల‌క్షన్ అధారిటీ జ‌నార్దన్ రెడ్డి అంటున్నారు. ఎప్పటిక‌ప్పుడు దీనిపై ఆరా తీసుస్తున్నట్లు తెలిపారు.

అభ్యర్ధికి 5 ల‌క్షల వ‌ర‌కు ఖ‌ర్చు చేయొచ్చు...

ఇక గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నియ‌మ నిబంధ‌నావ‌ళి ప్రకారం ఒక అభ్యర్ధి 5 ల‌క్షల వ‌ర‌కు ఖ‌ర్చు చేసుకునే అవ‌కాశం ఉంది. అంత‌కు మించి ఖ‌ర్చు చేస్తే త‌ర్వాత ఎన్నిక‌ల సంఘం క్రమ‌శిక్షణా చ‌ర్యలు తీసుకుంటుంది. అవ‌స‌ర‌మైతే ఎన్నిక‌ను కూడా ర‌ద్దు చేస్తారు.

వ్యయ ప‌రిశీల‌కులుగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు

ప్రస్తుతం గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అభ్యర్ధులు భారీగా ఖ‌ర్చు చేసే అవ‌కాశం ఉండ‌టంతో వీరిని నియంత్రించేందుకు ఎన్నిక‌ల సంఘం 24మంది సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌ను వ్యయ ప‌రిశీల‌కులుగా నియ‌మించింది. వీరు అభ్యర్ధుల వెంటే కార్యక‌ర్తల్లానో..ఓట‌ర్‌గానో ఉంటూ టీ ఖ‌ర్చు నుంచి స‌భ‌లు, స‌మావేశాల్లో కుర్చీల సంఖ్య వాటి క‌య్యే ఖ‌ర్చు వ‌ర‌కు లెక్కలు రాసుకుంటున్నారు. ఇలా 1333 మంది అభ్యర్ధుల వెంట వీరూ వీరి సిబ్బంది నిత్యం నిఘాపెడుతున్నారు. ప్రతిదీ నోట్‌ చేసుకుంటూ వారి ఖాతాల్లోకి ఖ‌ర్చును మళ్ళిస్తున్నారు. అయితే పార్టీలు చేసే ఖ‌ర్చుపై వ్యయ‌ప‌రిమితి లేక‌పోవ‌డంతో అభ్యర్ధుల ఖ‌ర్చును కూడా పార్టీల ఖ‌ర్చులోకి మ‌ళ్ళించే అవ‌కాశం ఉండ‌టంతో వ్యక్తిగ‌త ఖ‌ర్చుల‌ను ఎలా లెక్కలోకి తీసుకుంటారో చూడాలి.

 

నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం

ఢిల్లీ : నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

Don't Miss