Activities calendar

29 January 2016

పరేడ్ గ్రౌండ్ లో టీఆర్ఎస్ బహిరంగ సభ..

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా శనివారం సికింద్రాబాద్‌లోని పేరెడ్‌ గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కానున్నారు.

శనివారం కళాశాలల బంద్ - ఏబీవీపీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం కళాశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. హెచ్ సీయూ ఘటనపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శవ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన వైఖరికి నిరసనగా కళాశాలల బంద్ కు పిలుపునిచ్చినట్లు ఏబీవీపీ నేతలు పేర్కొన్నారు.

 

వన్ హైదరాబాద్ కూటమి రోడ్ షో..

హైదరాబాద్ : కూకట్ పల్లి, బాలాజీనగర్, కేపీహెచ్ బీలో వన్ హైదరాబాద్ కూటమి నేతలు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు, తమ్మినేని, నారాయణలు పాల్గొన్నారు. 

ముగిసిన కేసీఆర్..జర్నలిస్టు సంఘాల భేటీ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ తో జర్నలిస్టు సంఘాల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బ్యూరో, డెస్క్, వీడియో, ఫొటో లాంటి విభాగాలకు చెందిన జర్నలిస్టులకు సౌకర్యాలతో కూడిన ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

ఏపీ సర్కారీ కార్యాలయాలకు 2నసెలవు..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ వచ్చే నెల 2వ తేదీన సాధారణ సెలవును టి. ప్రభుత్వం ప్రకటించింది.

తొండూరులో వైఎస్ జగన్..

కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం తొండూరు మండలంలో పర్యటించారు. తొండూరు మండలం తుమ్మలపల్లిలో ఇటీవల విద్యుత్ షాక్ తో మృతి చెందిన మాజీ ఎంపీటీసీ రామసుబ్బారెడ్డి కుమారుడు రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

ధాన్యం కొనుగోళ్ల బకాయిలను విడుదల చేసిన ఏపీ సర్కార్..

గుంటూరు : రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి బకాయిలను విడుదల చేసినట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. రేపు ఖాతాల్లోకి రూ.900 కోట్ల బకాయిలను జమ చేయనున్నట్లు తెలిపారు. 

21:26 - January 29, 2016

బెంగళూరు : ఉగ్రవాది రఫిక్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి పెద్ద ఎత్తున బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇజ్రాయిల్‌ దేశస్థులు లక్ష్యంగా దాడులకు రఫిక్‌ కుట్రపన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల తెలంగాణ పోలీసులపై కూడా రఫిక్‌ దాడి చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఇటీవల పలు చోట్ల బాంబు పేలుళ్లకు పథకరచన చేసిన ఉగ్రవాదిని బెంగళూరులో అరెస్టు చేశారు. పట్టుబడ్డ ఉగ్రవాది రఫిక్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. అతని నుంచి పెద్ద ఎత్తున బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇజ్రాయిల్‌ దేశస్థులు లక్ష్యంగా దాడులకు రఫిక్‌ కుట్రపన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఇతడు గతంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులపై కూడా దాడులకు పాల్పడ్డట్లు పోలీసు అధికారులు గుర్తించారు.

ఉగ్రవాద సంస్థకు శిక్షకుడు..
ప్రస్తుతం రఫిక్ అల్ ఖలీఫా హ హింద్ ఉగ్రవాద సంస్థకు శిక్షకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. గుజరాత్‌లోని అహ్మదాబాద్ జోహాపూర్ ప్రాంతానికి చెందిన ఆలమ్ ఇండియన్ ముజాహిదీన్ ద్వారా అతను ఉగ్రవాదం వైపు మళ్లినట్లు సమాచారం. బెంగుళూరులో పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రవాది రఫిక్ కు రియాజ్ భత్కల్ తోను సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు మూడేళ్లుగా బెంగళూరులోని హోసూరు రోడ్డు దొడ్డనాగమంగళం ప్రాంతంలో ఉంటున్న ఆలమ్ రఫీక్.. అహ్మద్ పేరుతో మెకానిక్‌గా చెలామణి అవుతున్నాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సిరియాలో ఉన్న షఫీ ఆర్మర్ ప్రోద్బలంతో కొత్త రిక్రూట్ అవుతున్న జునూద్ క్యాడర్‌కు శిక్షణ ఇవ్వడానికి ఆలమ్ అంగీకరించినట్లు తెలుస్తోంది.

నివ్వెరపోతున్న అధికారులు..
బాంబుల తయారీ, ఆయుధాల వినియోగంపై ఎక్కడ శిక్షణ ఇవ్వాలనే అంశంపై ఈ సంస్థ చీఫ్ ముంబైకి ముదస్సిర్‌తో పాటు హైదరాబాదీ నఫీస్ ఖాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నట్లు తెలియడంతో... తెలంగాణ అధికారుల సాయంతో ఎన్ఐఎ అధికారులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అతను తెలంగాణ అధికారిపై హత్యాయత్నం చేశాడు రఫిక్ . బెంగళూరు చర్చి గేట్‌ వద్ద పేలుళ్లకు రఫిక్‌ కుట్రదారుడు. అలాగే అహ్మదాబాద్‌ పేలుళ్లలో ప్రధాన నిందితుడు. రఫిక్‌ ఇండియన్‌ ముజాహిద్దీన్‌ పాటు సిమిలో పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదుల కదలికలు రోజురోజుకి పెరిగిపోతుండటం.. పట్టుబడ్డవారి నుంచే వచ్చే సమాచారంతో అధికారులే నివ్వెరపోతున్నారు.

21:23 - January 29, 2016

కేరళ : ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీకి హైకోర్టులో ఊరట లభించింది. సోలార్ కుంభకోణంలో ఉమెన్‌ చాందీపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని త్రిసూర్‌ విజిలెన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ హైకోర్టు రెండు నెలల పాటు స్టే విధించింది. సీఎంతో పాటు ఆ రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి అర్యదాన్ మహ్మద్‌పై సోలార్ కుంభకోణంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ విజిలెన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలుపుదల చేసింది. విజిలెన్స్ కోర్టు కేసు తీరు గురించి తెలుసుకోకుండా తీర్పు వెల్లడించిందని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే త్రిశూర్‌ విజిలెన్స్‌ జడ్జి ఎస్ఎస్. వాసన్‌ స్వచ్ఛంద పదవీ విరమణ కావాల్సిందిగా ఆర్జీ పెట్టుకోవడం గమనార్హం.

కేసు నేపథ్యం..
ఈ కేసు నేపథ్యానికి వస్తే.. ప్రైవేట్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించేందుకు సీఎం ఊమెన్ చాందీకి తాము భారీ మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు టీమ్‌ సోలార్‌ కంపెనీ యజమాని సరితా నాయర్ ఆరోపణలు చేసింది. దీంతో ఈ కేసులో సీఎంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కేరళ విజిలెన్స్ కోర్టు ఆదేశించింది. 2013లో టీమ్‌ సోలార్‌ అనే కంపెనీ తక్కువ ధరలకు సోలార్‌ ప్యానల్స్ ఇస్తామని కేరళలో ప్రచారం నిర్వహించింది. ఈ కంపెనీ యజమానులు సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్‌. అయితే వీరిద్దరూ సీఎం కార్యాలయ సిబ్బంది ఇతర మంత్రుల కార్యదర్శుల అండదండలతో భారీ ఎత్తున ప్రజల నుంచి నిధులు సేకరించి సోలార్ ప్యానల్స్ అమర్చారు. ఈ సోలార్ ప్యానల్స్‌ అమరికపై ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 2013 నుంచి జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు సరితా నాయర్ జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు బుధవారం విచారణకు హాజరై తాను సీఎం చాందీ సన్నిహితుడికి రూ. 1.90 కోట్లు, విద్యుత్ శాఖ మంత్రికి రూ. 40 లక్షలు లంచం ఇచ్చినట్లు వాంగ్మూలమిచ్చారు.

లెఫ్ట్ ఆందోళన..
ఇక సోలార్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమెన్ చాందీ సీఎం పదవికి రాజీనామా చేయాలని విపక్ష ఎల్డీఎఫ్‌ ఆందోళన బాట పట్టింది. కేరళ సచివాలయం ఎదుట వామపక్ష యువజన సంఘాలు, డీవైఎఫ్‌ఐ నిరసన వ్యక్తం చేసింది. నిరసనకారులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. బాష్పవాయు ప్రయోగం జరిపారు. ఇది ఇలా ఉంటే ఉమెన్ చాందీ తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు వచ్చిన తప్పుడు ఆరోపణలతో పదవి నుంచి తప్పుకునే ప్రసక్తి లేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమైతే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. లిక్కర్ లాబీ తనకు వ్యతిరేకంగా కుట్ర చేసిందని ఆరోపించారు.

21:21 - January 29, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఉద్యమాన్ని అఖిల భారత స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ జన్మదినమైన ఈనెల 30వ తేదీ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావిస్తోంది. రోహిత్ ఆత్మహత్యకు సంతాపంగా, సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక రోజు మహాదీక్ష నిర్వహించనున్నట్లు విద్యార్థి జేఏసీ నాయకులు ప్రకటించారు.

నేటి నుండి ఆమరణ దీక్ష..
రోహిత్‌తోపాటు సస్పెండైన విద్యార్థులు ప్రశాంత్, విజయ్, సుంకన్న, శేషయ్యలు నేటి రాత్రి నుంచి ఆమరణ దీక్షను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రోహిత్ మృతికి సంతాపంగా నేడు రాత్రి 11 గంటలకు దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే రోహిత్‌ జయంతి రోజు నిర్వహించే మహాదీక్షకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొననున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.

సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి..
మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు విద్యార్థి సంఘాల నేతలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని దాదాపు 30 మందిని అదుపులోకి తీసుకుని అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం విద్యార్థులు సీఎం కార్యాలయం ముందు ఆందోళనకు యత్నించారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాగుట్ట స్టేషన్‌కు తీసుకెళ్లారు. అరెస్టు అయిన వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పార్లమెంటరీ కమిటీ పరిశృలన..
ఇక రోహిత్ ఆత్మహత్య ఘటనపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలన జరపనుంది. దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని, వారికి అన్యాయం జరుగుతోందనే ఫిర్యాదుల నేపథ్యంలో.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై బీజేపీ ఎంపీ ఫగ్గన్‌సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన జేపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీయూతోపాటు, చెన్నై ఐఐటీలోనూ విద్యార్థులు, ప్రొఫెసర్లతో మాట్లాడి, పార్లమెంటు ఉభయ సభలకు నివేదిక సమర్పించనుంది.

21:18 - January 29, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ..... భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించ తలపెట్టిన సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. రోడ్ షోలతో మంత్రి కేటీఆర్ గ్రేటర్ ను చుట్టేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల ముగింపు సభతో సంక్షేమ పథకాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు గ్రేటర్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలతో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రచార పర్వం మొదలైన నాటి నుంచి అన్ని తానై గ్రేటర్ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేశారు కేటీఆర్.

అధికార పార్టీ ఏర్పాట్లు..
ముఖ్యమంత్రి పర్యటనలను ఎక్కువగా నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని పార్టీ అధినేత అంచనా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకే ఒక్క భారీ బహిరంగ సభను నిర్వహించి.. గ్రేటర్ నేతలను, కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు పార్టీ నిర్ణయించింది. బూత్ స్థాయి నుంచి.. కార్యకర్తల నుంచి.. సభకు తరలించేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో పోలింగ్ బూత్ నుంచి కనీసం 150 మందిని సభకు తరలించాలని నేతలకు ఆదేశాలు వెళ్లాయి.

భారీ ఏర్పాట్లు..
శనివారం సాయంత్రం జరిగే సభ కోసం పరేడ్ గ్రౌండ్ లో భారీ ఏర్పాట్లను పార్టీ చేస్తోంది. దాదాపు 50 LED స్ర్కీన్ లను ఏర్పాటు చేస్తోంది. కార్యకర్తలు భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండేలా నేతలు పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణంలో మూడు వేదికలను నిర్మిస్తోంది. ముఖ్యమంత్రి సహా మంత్రులు ఇంచార్జ్ లుగా వ్యవహరించిన నేతలకు ఓ వేదిక, పోటీ చేస్తున్న అభ్యర్థులకు మరో వేదిక.. కళాకారుల ప్రద్శనలను ఇచ్చేందుకు మూడో వేదికను ఏర్పాటు చేశారు.

3వేల మంది పోలీసుల బందోబస్తు..
ముఖ్యమంత్రి పాల్గొనే ఏకైక సభ కావడంతో పార్టీ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భారీ ఎత్తున జనాన్ని సమీకరించడంపై దృష్టి సారించారు. ప్రధాన నేతలంతా సమావేశానికి హాజరు అవుతున్న నేపథ్యంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 3 వేల మంది పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.

21:16 - January 29, 2016

హైదరాబాద్ : పార్టీ ముఖ్య నేతలంతా ప్రచారంలోకి ఎంటరవడంతో గ్రేటర్‌ సీన్‌ మరింత హీటెక్కింది. అన్ని పార్టీల నేతలు హైదరాబాద్‌ను తామంటే తామే అభివృద్ధి చేశామంటూ హోరెత్తిస్తున్నారు. మరోవైపు వన్‌ హైదరాబాద్‌ కూటమిని గెలిపిస్తే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని లెఫ్ట్‌ పార్టీలు, లోక్‌సత్తా స్పష్టం చేశాయి.

బాబు రోడ్ షోలు..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నగరంలోని బేగంపేట, మెట్టుగూడ, సనత్‌నగర్‌ ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. టీడీపీ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. హైదరాబాద్‌లో నాకేం పని అని కొందరంటున్నారని, గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నాని.. ఇక్కడే ఉండి అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్పారు.

అందరూ సమానమే - కేటీఆర్...
హైదరాబాద్‌లో ఉన్న వారందరినీ సమానంగా చూస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. చందానగర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో కరెంట్, నీటి బకాయిలు మాఫీ చేశామని చెప్పారు. 60 ఏళ్లలో టీడీపీ, కాంగ్రెస్ చేసిందేమి లేదన్నారు. 60 ఏళ్ల దరిద్రం 18 నెలల్లో పోతుందా అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

వన్ కూటమిని గెలిపించాలన్న రాఘవులు...
గ్రేటర్ ఎన్నికల్లో వన్‌ హైదరాబాద్ కూటమిని గెలిపించి టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి చరమగీతం పాడాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌... అడ్డగుట్ట డివిజన్ నుంచి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి స్వర్ణలత తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. టిఆర్‌ఎస్ చెప్పేదానికి చేస్తున్నదానికి ఎక్కడా పొంతన ఉండడం లేదని రాఘవులు ఆరోపించారు.

టీడీపీకి ఓటేస్తే టీఆర్ఎస్ కు ఓటేసినట్లే - జేపీ...
టీడీపీకి ఓటేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లేనని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ అన్నారు. నేర చరితులను చట్టసభకలు వెళ్లకుండా చూడాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వన్‌ హైదరాబాద్‌ కూటమిని గెలిపిస్తే నిర్దిష్టమైన ప్రణాళికతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని జేపీ అన్నారు.

అన్ని వర్గాల మద్దతుందన్న డిగ్గీ రాజా..
కాంగ్రెస్‌ పార్టీకి అన్ని ప్రాంతాల, అన్నివర్గాల మద్దతు ఉందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఎన్‌రావునగర్‌, కాప్రా డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. అబద్దాలతో మోడీ, కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఎన్డీఏ, టీఆర్‌ఎస్‌ పాలనలో నిత్యావసర ధరలు పెరిగాయని దిగ్విజయ్‌సింగ్‌ ఆరోపించారు.

రేపు టీఆర్ఎస్ బహిరంగసభ...
జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా శనివారం సికింద్రాబాద్‌లోని పేరెడ్‌ గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కానున్నారు. ఈ సభలో మాటల తూటాలు దూస్తారో.. లేక అభివృద్ధి పనులపై హామీలు ఇస్తారో చూడాలి. 

అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపించే విధంగా బడ్జెట్ - జవదేకర్..

ఢిల్లీ : 2016-17 బడ్జెట్ సుస్థిర అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపించేదిగా ఉంటుందని, చారిత్రక బడ్జెట్ గా అది చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. పరిశ్రమలు..రైతులతో జరిగిన ఓ కార్యక్రమంలో బడ్జెట్ విషయపై ఆయన మాట్లాడారు. 

20:56 - January 29, 2016

గతంలో కేసీఆర్ ఇక్కడ తిరిగిండు..ఆయన ఇళ్లు కట్టిస్తామని చెప్పిండు.. కానీ ఇంతవరకు ఏమి కాలే అని ఓ మహిళ పేర్కొంది. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు మల్లన్న గ్రేటర్ పరిధిలో పర్యటించాడు. అందులో భాగంగా రాంగోపాల్ పేట డివిజన్ లో పర్యటించి మహిళలతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న విషయాలను మల్లన్నతో తెలిపారు. గతంలో కేసీఆర్ బస్తీ తిరిగిండు..గెలిచినంక ఇళ్లు కట్టిస్తమని చెప్పిండని తెలిపారు. హుస్సేన్ సాగర్ తో దోమలు..పందులు.. వస్తున్నాయని, మోకాళ్ల లోతులో నీళ్లు నిలుస్తున్నయి. పిలిస్తే పిలిస్తే వచ్చి చేస్తారని తెలిపారు. పైసలు ఇవ్వకపోతే కచరా ఇక్కడనే పారేస్తారని వాపోయారు. తమకు ఇళ్లు కట్టించి..తమ సమస్యలు తీరిస్తే కేసీఆర్ ఫొటోను ఇంటింటికి పెట్టుకుని పూజిస్తమని చెప్పారు. 

20:52 - January 29, 2016

అప్పట్లో చేసిన ఉద్యమ రోజులు మళ్లీ వస్తాయోమనని అంగన్ వాడీలు పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు మల్లన్న గ్రేటర్ పరిధిలో పర్యటించాడు. అందులో భాగంగా రాంగోపాల్ పేట డివిజన్ లో పర్యటించి అక్కడనే ఉన్న అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించాడు. అంగన్ వాడీలతో మల్లన్న ముచ్చటించాడు. తాము నెల రోజుల పాటు చేసిన పనులను సమీక్షిస్తామని అంగన్ వాడీలు పేర్కొన్నారు. కిరాయి ఇంట్లో అంగన్ వాడీలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. రెంట్ రావడం లేదని వాపోయారు. గర్భిణీలకు..బాలింతలకు సేవలు చేయడం జరుగుతుందని, ప్రభుత్వం అడిగే సమాచారాన్ని మొత్తం ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం సన్నబియ్యం ఇంకా రాలేదని, మూడు నెలల నుండి జీతాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అడిగితే తీసేస్తారని ఉద్యోగానికి భద్రత లేదని..ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లేదని..గవర్నమెంట్ జేఏసీలో ఉండాలని చెబుతున్నారని తెలిపారు. మొత్తంగా అంగన్ వాడీలపై సర్కారీ ఆంక్షలు విధిస్తోందని పేర్కొన్నారు. 

20:48 - January 29, 2016

గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి ? సర్కార్ చెప్పిన హామీలు అమలయ్యాయా ? అనేది తెలుసుకొనేందుకు 'మల్లన్న' గల్లీలో తిరుగుతున్నాడు. అందులో భాగంగా సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట డివిజన్ లో తిరిగిండు. అంబేద్కర్ నగర్ లో ఇస్త్రీ పనిచేసుకుంటున్న మహిళతో మల్లన్న ముచ్చటించాడు. తన కుటుంబం దీనిపై ఆధారపడి ఉంటున్నామని తెలిపింది. నేతలు ఇప్పుడే కలుస్తారని, మళ్లీ కలవరని, ప్రభుత్వం మస్తు పనులు చేయాల్సినవి ఉన్నయి అని తెలిపింది. తమ పిల్లలకు ఇలాంటి గతి రావద్దని ఆ మహిళ పేర్కొంది. గతంలో మస్తు హామీలిచ్చారని, పేర్లు చెబితే బాగుండదని తెలిపింది. 

20:47 - January 29, 2016

డేటింగ్ యాప్స్ తో డేంజర్ ఉందా ? ఆన్ లైన్ మోసాలకు డేటింగ్ సైట్స్ వేదిక అవుతున్నాయా ? డిజిటల్ లవ్ తో లైఫ్ రిస్క్ లో పడుతుందా ? స్నేహం పేరిట మోసాలకు దిగే కుట్రలు జరుగుతున్నాయా ? భారత్ లో సునామీ సృష్టిస్తున్న డేటింగ్ యాప్స్ దేశంలో పెరుగుతున్న డేటింగ్ కల్చర్ పర్యవసానం విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

20:30 - January 29, 2016

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గర పడుతున్నయి. మరి గ్రేటర్ లో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నరు ? నేతలు ఎలాంటి హామీలు గుప్పిస్తున్నరు ? సర్కార్ చెప్పిన హామీలు అమలయ్యాయా ? అనేది తెలుసుకోవాలని 'మల్లన్న' గ్రేటర్ లో పర్యటించాడు. రాంగోపాల్ పేట డివిజన్ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. అలాగే కస్తూర్బానగర్ లో కూడా పర్యటించాడు. మరి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో..ప్రజలు ఎలాంటి సమస్యలు తెలిపారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

బన్సీలాల్ పేటలో రూ.37 లక్షల నగదు స్వాధీనం..

సికింద్రాబాద్ : బన్సీలాల్ పేటలో ఈ రోజు సాయంత్రం పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్కూటీపై తరలిస్తున్న రూ.37 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

20:13 - January 29, 2016

హైదరాబాద్ : తమ దగ్గర కూడా పొరపాట్లు జరిగాయని, భిన్నమైన అభిప్రాయాలు రావడంతో గతంలో అలాంటి పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ వ్యూహం..టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన అభిప్రాయాలు తెలిపారు. కేసీఆర్ వస్తే బంగారు తెలంగాణ వస్తుందని కొందరు ప్రజలు గట్టిగా నమ్మారని అందుకే వారు ప్రభుత్వంలోకి రావడం జరిగిందన్నారు. అంతేగాకుండా రూ.200 నుండి రూ.1000 పెన్షన్ చేయడంతో మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిపారు. గెలుపు..ఓటములు కాదు..అడిగే హక్కు..నిలదీసే వాతావరణం తమ పార్టీలో ఉందన్నారు. హై కమాండ్ వర్డ్ తో రాజకీయం నడుస్తోందన్నారు.

గవర్నర్ కర్తవ్యంగా చేయడం లేదు...
తమ పార్టీకిలోకి ఎవరన్నా వస్తే తీసుకున్నామని, రాజీనామా చేసిన తరువాత పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్..సీఎం క్యాంపు కార్యాలయంలో కండువా వేయాలి..పార్టీలోకి తీసుకోవాలి ఇదే అభివృద్ధి అనుకుంటున్నారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ లో తమకే మెజార్టీ ఉందని, కండువాలు మార్చడం వల్ల ప్రస్తుతం మెజార్టీ లేకపోవడం జరిగిందన్నారు. ఇక్కడ గవర్నర్ కర్తవ్యంగా చేయడం లేదని విమర్శించారు. గోదావరి నీళ్లు, కృష్ణా వాటర్ మేము తెస్తే వాళ్లు చూపించుకుంటున్నరని విమర్శించారు. ఇంత అబద్ధపు ప్రచారం జరిగినా ఎన్నికల కమిషన్ ఏం చేయడం లేదని, చివరకు తాము జనంపై వదిలేయడం జరిగిందన్నారు.

విపక్షాలకు హోర్డింగ్స్ దక్కకుండా చేశారు..
80 శాతం టీఆర్ఎస్, 20 శాతం ఎంఐఎంకు ఇచ్చేయాలి అని బుక్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికలంటే ముందే నువ్వా..నేనా అనే పరిస్థితికి తాము తీసుకరావడం జరిగిందన్నారు. రాజకీయం అంటే డబ్బులు..పోస్టులు అంటూ ఒక బిజినెస్ చేశారు.

ఒక్క పని చేశారా ?
20 మాసాలు అయింది కదా ? మంత్రి కేటీఆర్ ఒక్క పని అయినా చేశారా ? క్రిస్టియన్ భవన్, బంజారా భవన్ ఇలాంటి ఎన్నో శంకుస్థాపనలు చేశారని వాటి పరిస్థితి ఏంటీ ? మూసీ నది, హుస్సేన్ సాగర్ క్లీన్ క్లీన్ అన్నారు..సిగ్నల్ లేని నగరం ఇలాంటివి ఎన్నో చెప్పారన్నారని గుర్తు చేశారు. తండ్రి మేనిఫెస్టో నమ్మాలా ? కొడుకు మేనిఫెస్టో నమ్మాలా ?అని ప్రశ్నించారు. తాము 2004-14 హాయాంలో ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని, ఇదంతా చెప్పడంలో తమ లోపం ఉందన్నారు. ప్రస్తుతం బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నామని, పాతబస్తీ ప్రజల్లో మార్పు తీసుకొచ్చామన్నారు. ప్రచారంలో ఎక్కడ కూడా ఎదురు గాలి కనిపించడం లేదన్నారు.

వంద సీట్లు గెలిస్తే రాజీనామా..
వంద సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి కేటీఆర్ సవాల్ కు తాను స్వీకరిస్తే ఆయన తోక ముడిచిపారిపోతున్నారన్నారు. మేయర్ పదవి చేజిక్కించకపోతే అంటూ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు.

అన్ని పార్టీలు యూ టర్న్..
తెలంగాణ విషయంలో గతంలో అన్ని పార్టీలు యూ టర్న్ తీసుకుందని, సీపీఎం ఒక్క పార్టీయే ఇవ్వవద్దని చెప్పిందన్నారు. టిడిపి పార్టీ రెండు లేఖలు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్..చంద్రబాబు ఎంత గేమ్ ఆడారో తెలుస్తుందన్నారు. గతంలో రౌడీల్లా మాట్లాడిన వీరిద్దరూ ప్రస్తుతం శాలువాలు కప్పుకుంటున్నారని, ఇద్దరి పరిస్థితి ప్రజలు చూస్తున్నారని తెలిపారు. అన్నదమ్ములుగా విడిపోదామని ఆనాడు చెప్పడం జరిగిందని, కానీ అప్పుడు రెచ్చగొట్టారని పేర్కొన్నారు. పుట్టిన వారు ఇక్కడి వారే అని చెప్పాలని, కేవలం రాజకీయం కోసం గేమ్ ఆడుతున్నారన్నారు. అర్బన్ ఏరియాలో మోడీ గాలి..తమకు అన్యాయం కలిగిందని సెటిలర్లు నమ్మారన్నారు. ప్రస్తుతం మోడీ గాలి లేదని బాబు ఏం చేస్తున్నారో ప్రజలు గమనించారన్నారు. సెటిలర్లకు తాము అన్యాయం చేయమని స్పష్టం చేశారు.

ఎంఐఎం మసీదు రాజకీయం..
ఎంఐఎం మసీదు రాజకీయం చేస్తోందని, పబ్లిక్ కొట్టేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. బీఫ్ బంద్ అవుతుంది..అంటూ మాంసంపై దృష్టి నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారని, అభివృద్ధిపై దృష్టి సారించకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. వీరిని తరిమితరిమి కొట్టే పరిస్థితి ఆసన్నమైందని, ప్రస్తుతం ఏమీ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని షబ్బీర్ ఆలీ స్పష్టం చేశారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

హైదరాబాద్ లో బాబు ప్రచారం.

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం, టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు నగరానికి చేసేందేమి లేదన్నారు. తలసాని శ్రీనివాస్ ఏ పార్టీలో గెలిచారని ప్రశ్నించారు. నగరాన్ని అభివృద్ధి చేసింది తానేనని, ఆనాడు వాజ్ పేయి ప్రభుత్వం సహకరించినందువల్లే ఇదంతా జరిగిందన్నారు. 13 ఏళ్లయినా మెట్రో రైలు పూర్తికాలేదని, తాను బాంబులకే భయపడలేదన్నారు. నగరం కోసం ప్రపంచం అంతా తిరిగానని, నగరంపై నాకు లేని హక్కు ఎవరికి ఉందన్నారు.

తమపై కుట్రపూరితంగా కేసులు పెట్టిస్తున్నారు - ఎంపీ మిథున్ రెడ్డి..

నెల్లూరు : వైసీపీ నేతలపై కుట్రపూరితంగా చంద్రబాబు కేసులు పెట్టిస్తున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. బాబు వత్తిడితోనే ఎయిర్ పోర్టు మేనేజర్ తమపై కేసు పెట్టారని ఆరోపించారు. ఎయిర్ పోర్టులో సీసీటీవీ ఫుటేజీని విడుదల చేస్తే నిజాలు బయటపడుతాయన్నారు. 

జికాపై ఆందోళన చెందవద్దు - జేపీ నడ్డా..

ఢిల్లీ : జికా వైరస్ కు సంబంధించి ఆందోళన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా సూచించారు. జికా వైరస్ పై అధికారులు, ఎయిమ్స్ వైద్యులతో చర్చించడం జరిగిందన్నారు. ఉన్నతస్థాయి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని, నిపుణుల బృందం నివేదిక ఆధారంగా చర్యలు చేపడుతామన్నారు. నివేదిక వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడం జరుగుతుందన్నారు. 

ఆర్మూర్ సర్కారీ పాఠశాలలో వికటించిన మధ్యాహ్న భోజనం..

నిజామాబాద్ : ఆర్మూర్ (మం) మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో ముర్రే..

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే ఫైనల్ కు చేరాడు. శుక్రవారం ముర్రే రోనిచ్ (కెనాడా) మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఐదు సెట్ల ఈ పోరులో ముర్రే 4-6, 7-5, 6-7, 6-4, 6-2 తేడాతో రోనిచ్ ను ఓడించాడు.

18:57 - January 29, 2016

పల్లె వాతావరణంలో ప్రేమ కథలు అరుదుగా తెలుగు తెరపైకి వస్తుంటాయి. వాస్తవానికి ఈ సినిమాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. కథ, కథలోని ఎమోషన్స్ బాగా కుదిరితే....విలేజ్ లవ్ స్టోరీలకు తిరుగుండదు. ఇలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు. మరి ఈ సినిమాకు ఆడియెన్స్ ఎలాంటి రిజల్ట్ నిచ్చారో తెల్సుకుందాం.

కథ..
రాజ్ తరుణ్, ఆర్తన రామచంద్రాపురం అనే పల్లెటూరిలో పెరుగుతుంటారు. ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడతారు. రాజ్ తరుణ్ ని తన కూతురు ప్రేమించడం నచ్చని తండ్రి రాజా రవీంద్ర వీళ్ల ప్రేమకు అడ్డుపడతాడు. ఊళ్లో క్రికెట్ ఆడటం అలవాటున్న రాజ్ తరుణ్ కు రంజీ ప్లేయర్ ఆదర్శ్ బాలకృష్ణతో పోటీ పెడతాడు. ఈ మ్యాచ్ లో గెలిస్తే తన కూతురిని ఇస్తానంటాడు. మరి హీరో ఈ పోటీలో గెలిచాడా లేదా అన్నది మిగిలిన కథ.

పాత్రల అభినయం..
కబడ్డీ కబడ్డీ మొదలు చాలా సినిమాలు ఇలాంటి కథలతో వచ్చినవే. కథ పాతదైనా...కొంత కామెడీని చేర్చి దర్శకుడు మ్యానేజ్ చేశాడు. సెకండాఫ్ లో కథను డ్రాగ్ చేసి ప్రేక్షకులను విసిగించాడు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ ఆర్తనా ఫర్మార్మెన్స్ బాగుంది. ఈ ఇద్దరి జోడీ సినిమాను ఆమాత్రం నిలబెట్టింది. షకలక శంకర్ హాస్య సన్నివేశాలు నవ్వించాయి. పల్లె వాతావరణాన్ని బాగా కాప్చర్ చేశాడు సినిమాటోగ్రాఫర్. గోపీసుందర్ సంగీతం సినిమాకు ఆకర్షణగా నిలిచింది.

ఫ్లస్ పాయింట్స్
రాజ్ తరుణ్, ఆర్తనా జోడీ
సంగీతం
సినిమాటోగ్రఫీ
కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్
పాత కథ
డ్రాగింగ్ స్క్రీన్ ప్లే
పండని ఎమోషన్స్
క్లైమాక్స్

18:55 - January 29, 2016

ఏమీ రానివాళ్లకు అవకాశాలిచ్చే టాలీవుడ్...ఎంతో టాలెంట్ ఉన్న వాళ్లను కాలగర్భంలో కలిపేస్తుంటుంది. లక్కీగా అవకాశం వచ్చిన దర్శకులు మాత్రం...లచ్చిందేవికి ఓ లెక్కుంది లాంటి సినిమాలు చేసి కనిపించకుండా పోతుంటారు. రోజూ న్యూస్ పేపర్లలో వచ్చే ఓ చిన్న పాయింట్ పట్టుకుని దానికి బూజు పట్టిన కథను అల్లి సినిమాగా తీసేశారు. ఇలా తెరపైకి వచ్చిన లచ్చిందేవి....ఆడియోన్స్ ను ఒ ఆటాడుకుంది.

కథ..
నవీన్, దేవీ..ఒకే బ్యాంకులో పనిచేస్తుంటారు. దేవీ క్యాషియర్, నవీన్ కస్టమర్ హెల్ప్ డెస్క్ లో పనిచేస్తుంటారు. ఈ వందేళ్లలో దేశంలోని చాలా బ్యాంకుల్లో గుర్తింపు లేని ఖాతాల డబ్బు వేల కోట్ల రూపాయల మూలన పడి ఉంటుంది. దీన్ని క్లియర్ చేయమని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలిస్తుంది. నవీన్, దేవీ పనిచేసే జనతా బ్యాంకులోనూ ఇలాంటి గుర్తింపులేని వ్యక్తులు జమ చేసిన కోట్ల రూపాయల సొమ్ము ఉంటుంది. ఈ విషయం తెల్సుకున్న విలన్ అజయ్...నవీన్ ను కిడ్నాప్ చేసి ఆ ఖాతాల వివరాలు ఇవ్వాలని బెదిరిస్తాడు. బయపడిన నవీన్ ఓ సందర్భం చూసుకుని అజయ్ కు ఖాతాల వివరాలు ఇస్తాడు. నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి అజయ్... జనతా బ్యాంక్ నుంచి కోట్ల రూపాయలు కాజేసేందుకు సిద్ధమవుతాడు. ఇక డబ్బు చేతికందుతుంది అనగా...మేనేజర్ సోమయాజులు ఈ కుట్రను కనుక్కుంటాడు. అజయ్ ను బెదరగొట్టి పంపి ఆ డబ్బును మేనేజర్ సోమయాజులు కొట్టేయాలని చూస్తాడు. దీనికి నవీన్ సాయం చేస్తాడు. ఈ కోట్ల రూపాయల డబ్బు దేవాలయ హుండీది కావడంతో అంకాలమ్మ, ఎప్పుడో మరణించిన మరో హక్కుదారు ఉమాదేవి క్యాషియర్ దేవికి పూనుతారు. దేవీ రూపంలో మేనేజర్ ను, నవీన్ ను హడలెత్తిస్తుంటారు. చివరకు సరైన వాళ్ల చేతుల్లోకి ఈ కోట్ల రూపాయల డబ్బు ఎలా చేరిందనేది మిగిలిన కథ.

పాత్రదారుల అభినయం..
లచ్చిందేవికి ఓ లెక్కుంది ఓ కాలం చెల్లిన కథ. సినిమాగా తీసే సరుకేం ఇందులో లేదు. ఒకవేళ తీయాలనుకున్నా...గుర్తింపు లేని ఖాతాల వేల కోట్ల రూపాయల సొమ్ము అనే పాయింట్ తో...ఇంకేదైనా బలమైన సోషల్ స్టోరీ రాసుకోవచ్చు. కానీ దీన్ని ఇలా పాడు చేశారు. లచ్చిందేవికి లెక్కుందిని దర్శకుడు జగదీశ్ పసలేని సినిమాగా తయారు చేశాడు. ఇంటర్వెల్ టైంలో రావాల్సిన ట్విస్టులను ఎక్కడో సినిమా చివర్లో పెట్టాడు. అదీ చూసీ చూసీ ఉన్న హార్రర్ కామెడీ ఫార్ములానే. ఇక లావణ్య త్రిపాఠీ దేవీ పాత్రకు సరిపోయింది. నవీన్ చంద్ర హీరోయిన్ చాటు హీరోలా మరోసారి ఒదిగిపోయాడు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సినిమాకు పెద్ద మైనస్. మిగతా ప్రొడక్షన్ వ్యాల్యూస్ సోసో గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్
లావణ్య త్రిపాఠీ
ఒకట్రెండు కామెడీ సీన్లు

మైనస్ పాయింట్స్
కాలం చెల్లిన కథ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం
సంగీతం
ప్రొడక్షన్ వ్యాల్యూస్

 

18:47 - January 29, 2016

తూర్పుగోదావరి : కాపులు గర్జించబోతున్నారు. ఈనెల 31వ తేదీన జిల్లాలో భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతోంది. దాదాపు పది లక్షల మంది హాజరౌతారని అంచనా వేస్తున్నారు. జాతీయ రహదారికి పక్కనే కొబ్బరి తోటలో ఏర్పాటు చేసిన సభకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. కాపులకు రిజర్వేషన్ లు కల్పిస్తాం..నిధులు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం తూతూ మంత్రంగా అమలు చేస్తోందని కాపు నేతలు అంటున్నారు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

నేరేడ్ మెట్ లో వన్ హైదరాబాద్ కూటమి ప్రచారం..

హైదరాబాద్ : నేరెడ్ మెట్ లో వన్ హైదరాబాద్ కూటమి గ్రేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. టీఆర్ఎస్ ది అసమర్థత పాలన అని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. కేసీఆర్ ఫాం హౌస్ లో నిద్రపోతూ సింగపూర్, జపాన్ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. 

రాజకీయాల్లో విలువలు తగ్గాయి - తమ్మినేని..

హైదరాబాద్ : రాజకీయాల్లో విలువలు తగ్గాయని, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేసే నేతలు ప్రజా సేవా చేస్తారా ? అని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ప్రశ్నించారు. నీతి, నిజాయితీకి కమ్యూనిస్టులు మారు పేరని, గ్రేటర్ లో వన్ హైదరాబాద్ కూటమి అభ్యర్థులను గెలిపిలంచాలని ఓటర్లను కోరారు. ప్రజలకు కష్టం సవ్తే ఎర్రజెండా అండగా ఉంటుందని తెలిపారు. 

విశాఖ శుభగృహ సంస్థపై ఆరోపణలు..

విశాఖపట్టణం : శుభగృహ సంస్థ లొసుగులు బయటపడుతున్నాయి. కస్టమర్లకు సంస్థ రిజిస్ట్రేషన్లు చేయకుండా కాలయాపన చేస్తోందని ఉద్యోగులు నిజాలు కస్టమర్లకు పలు నిజాలు చేప్పేశారు. యాజమాన్యం చంపుతామని ఉద్యోగులను బెదిరిస్తోందని, రెండు కోట్ల వేతన బకాయిలు చెల్లించలేదని ఉద్యోగులు తెలిపారు. 

18:00 - January 29, 2016

మెల్ బోర్న్ : టీ -20 మ్యాచ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. విజయం సాధిస్తుందని అనుకున్న జట్టు పరాజయం కావడం..పరాజయం చెందుతుందన్న జట్టు ఆఖరి క్షణంలో పుంజుకుని విజయం సాధించిన సందర్భాలు ఉంటాయి. ఇలాంటిదే భారత్ - ఆసీస్ టీ -20 మ్యాచ్ లో చోటు చేసుకుంది. భారత్ నిర్ధేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆసీస్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. దీనితో అందరూ ఆసీస్ విజయం సాధిస్తుందని ఆశించారు. కానీ చివరిలో భారత బౌలర్లు మేల్కోనడంతో మ్యాచ్ పై పట్టు బిగించింది. ఫలితంగా రెండో టీ -20 మ్యాచ్ లో భారత్ 27 రన్ల తేడాతో విజయం సాధించి టీ 20 సిరీస్ ను కైవసం చేసుకుంది.

ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్..
తొలుత టాస్ గెలిచిన ఆసీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో కూడా భారత ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వచ్చీ రాగానే దూకుడుగా ఆడడం..కోహ్లీ విజృంభజన కొనసాగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్లు బ్యాట్ ను జులిపించడం ప్రారంభించారు. అరోన్ ఫించ్, షాన్ మార్ష్ లు బంతిని బౌండరీలకు తరలించే పనిలో పడ్డారు. స్కోరు బోర్డు వేగం పుంజుకోవడంతో భారత శిబిరంలో ఆందోళనలు మిన్నంటాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్ బౌలింగ్ చేసిన నెహ్రా బౌలింగ్ లో ఫించ్ చివరి మూడు బంతులను బౌండరీలుగా మలిచాడు. ఆస్ట్రేలియా కేవలం 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ఈ తరుణంలో ఆసీస్ స్కోరు 94 పరుగుల వద్ద ఉన్నప్పుడు మార్ష్ (23) అవుట్ అయ్యాడు. మరో రెండు పరుగులు జోడించిన అనంతరం లైన్ (2) కూడా వెనుదిరిగాడు. మాక్స్ వెల్ (1) కూడా ఏ మాత్రం పోరాటం చేయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. మరోవైపు ఫించ్ మాత్రం తన పోరును కొనసాగించాడు. అర్ధ సెంచరీ దాటిన ఫించ్ ప్రమాదకరంగా మారాడు. అనంతరం భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మిగతా బ్యాట్స్ మెన్స్ పరుగులు తీయడానికి కష్టపడ్డారు. వాట్సన్ (15) అవుట్ అయిన అనంతరం జట్టు స్కోరు 124 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫించ్ (74) కూడా వెనుదిరగడంతో భారత అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. బంతులు తక్కువగా ఉండడం..పరుగులు భారీగా ఉండడంతో ఆసీస్ బ్యాట్స్ మెన్స్ వత్తిడికి గురయ్యారు. వెంటవెంటనే వికెట్లు సమర్పించుకున్నారు. ఫాల్క్ నర్ (10), హోస్టింగ్స్ (4), టై (4) అవుట్ అయ్యారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆసీస్ 157 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, జడేజా తలా రెండు, అశ్విన్, పాండ్యా, యువ రాజ్ సింగ్ చెరో ఒక వికెట్ తీశారు.

రాణించిన రోహిత్..కోహ్లీ..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (60: 47 బంతుల్లో 5x4, 2x6) శిఖర్ ధావన్ (42 : 32 బంతుల్లో 3x4, 2x6) ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఎడాపెడా బౌండరీలు బాదారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 11 ఓవర్లలో 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మాక్స్ వెల్ బౌలింగ్ రివర్స్ స్వీప్ షాట్ కోసం ప్రయత్నించి ధావన్ ఔటయ్యాడు. కోహ్లితో సమన్వయ లోపం కారణంతో జట్టు స్కోరు 143 పరుగుల వద్ద రోహిత్ శర్మ రనౌట్ గా వెనుదిరిగాడు. రోహిత్ అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని (14: 9 బంతుల్లో 2x4)తో కలిసి విరాట్ కోహ్లీ (59 నాటౌట్ : 33 బంతుల్లో 7x4, 1x6) స్లాగ్ ఓవర్లలో దూకుడుగా ఆడడంతో భారత్ 185 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మాక్స్ వెల్, అండ్రూ టై చెరో వికెట్ తీశారు. 

భారత్ విన్..

మెల్ బోర్న్ : రెండో టీ -20 మ్యాచ్ లో భారత్..ఆసీస్ ను మట్టికరిపించింది. మెల్ బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. 

12 బాల్స్ 40 రన్స్..

మెల్ బోర్న్ : ఆసీస్ తో జరుగుతున్న రెండో టీ -20 మ్యాచ్ లో భారత్ రాణిస్తోంది. ఆసీస్ క్రీడాకారులను కట్టడి చేస్తోంది. ప్రస్తుతం ఆసీస్ గెలవాలంటే 12 బంతుల్లో 40 పరుగులు చేయాల్సి ఉంది. 

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రపతి పాలనపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్..

ఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. పాలన విధించడంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 

రాణిస్తున్న భారత్..

మెల్ బోర్న్ : ఆసీస్ తో జరుగుతున్న రెండో టీ -20 మ్యాచ్ లో భారత్ రాణిస్తోంది. ఆసీస్ క్రీడాకారులను కట్టడి చేస్తోంది. ఫాల్క్ నర్ 10 పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆసీస్ ఆరు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. 

పంది దాడిలో చిన్నారికి గాయాలు..

నెల్లూరు : జిల్లాలో కోతుల దాడి మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. పంది దాడిలో ఓ చిన్నారికి గాయాలయ్యాయి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇప్పటికే జిల్లాలో పందుల దాడుల్లో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంకటేశ్వరపురంలోని మసీదు వీధులో చిన్నారిపై పంది దాడి చేసి గాయపరిచింది. వెంటనే తల్లిదండ్రులు రావడంతో పంది పరుగులు తీసింది. 

వాట్సన్ అవుట్

మెల్ బోర్న్ : భారత్ తో జరుగుతున్న రెండో టీ -20 మ్యాచ్ లో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. వాట్సన్ 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 14.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 121 పరుగులు చేసింది. 

17:05 - January 29, 2016

హైదరాబాద్ : టిడిపి ఓటు వేస్తే టీఆర్ఎస్ కు ఓటేసినట్లే అని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమిని గెలిపిస్తే నిర్ధిష్టమైన ప్రణాళికతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, హెచ్ యూజే జయప్రకాష్ నారాయణతో మీట్ ద ప్రెస్ నిర్వహించారు. నగర అభివృద్ధికి ప్రకటనలకే పరిమితమైన నాయకులను ఎన్నుకొంటే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. నేర చరిత్ర ఉన్న వారిని చట్టసభల్లోకి పంపడం ప్రజాస్వామ్యానికి అవమానమన్నారు. 

17:00 - January 29, 2016

అనంతపురం : కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నీరు గారుస్తున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా విమర్శించారు. ఆయన అనంతరం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. కూలీలు, చిన్న, సన్న కారు రైతులు పట్టణాలకు వలస వెళ్లి బిక్షగాళ్లుగా మారుతున్నారని కేంద్ర పెద్దలు సైతం ఈ పథకం ఎందుకు అన్నటుగా మాట్లాడుతున్నారని, ఫిబ్రవరి వతేదీన 2 జిల్లాలోని బండ్లపల్లిలో ఉపాధి హామీ పథకంపై జరిగే బహిరంగసభలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొం టారని రఘువీరా తెలిపారు.  

మాక్స్ వెల్ అవుట్..

మెల్ బోర్స్ : భారత్ తో జరుగుతున్న రెండో టీ -20 మ్యాచ్ లో ఆసీస్ జోరుకు భారత్ బ్రేకులు వేయడానికి ప్రయత్నిస్తోంది. యువ రాజ్ సింగ్ వచ్చి రాగానే మాక్స్ వెల్ (1) వికెట్ తీశాడు. ప్రస్తుతం 11.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఆసీస్ 101 పరుగులు చేసింది. 

ఆసీస్ 100/2..

మెల్ బోర్న్ : భారత్ తో జరుగుతున్న రెండో టీ -20 మ్యాచ్ లో ఆసీస్ జోరు కొనసాగుతోంది. 11 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ఫించ్ 69, మాక్స్ వెల్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

16:22 - January 29, 2016

విజయవాడ : బెజవాడ కార్పొరేషన్‌ సమావేశంలో హోర్డింగుల ఏర్పాటు ప్రైవేటువారికి అప్పచెప్పడంపై గొడవ జరిగింది. సీపీఎం కార్పొరేటర్‌ ఆదిలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు తమ మద్దతు లేకుండానే తీర్మానం ఆమోదించేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరి వాదనను టీడీపీ కార్పొరేటర్లు పట్టించుకోకపోవడంతో.. సీపీఎం, వైసీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. 49 డివిజన్ లున్న విజయవాడ ప్రధాన కేంద్రంగా కార్యకలపాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హోర్డింగ్ ఏర్పాటు విషయంలో కౌన్సిల్ అనుమతి లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు అగ్గిలమీద గుగ్గిలమయ్యాయి. ఈ రోజు జరిగిన సర్వసభ్య సమవాఏశంలో వారు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో మిగతా సభ్యులను కలుపుకుని తమ నిరసనను కొనసాగిస్తామని సీపీఎం, వైసీపీ సభ్యులు పేర్కొంటున్నారు. 

16:17 - January 29, 2016

బెంగళూరు : చర్చి స్ట్రీట్ బాంబు పేలుళ్ల కేసు ప్రధాన నిందితుడు మహ్మద్ రఫీక్ అలియాస్ జావీద్ అలియాస్ అలమ్ జేబ్ ఆఫ్రీదిని ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశాయి. రఫీక్ వద్ద నుండి పెద్దం ఎత్తున్న బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
2014 డిసెంబర్ 28వ తేదీన రాత్రి 8.30గంటల సమయంలో చర్చి స్ట్రీట్ లోని కోకోనట్ గ్రోవ్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద బాంబు పేలడంతో ఒకరు మృతి చెందారు. దీనికి కారకుడుగా రఫీక్ అని ఎన్ఐఏ భావించింది. అంతేగాకుండా చెన్నైలోని గౌహతి ఎక్స్ ప్రెస్ లోని పేలుళ్లకు, ఇజ్రాయిల్ వీసా సెంటర్ వద్ద బాంబుల అమర్చడం..అహ్మదాబాద్ పేలుళ్లలో రఫీక్ హస్తం ఉందని ఎన్ఐఏ భావించింది. ఇండియన్ ముజాహిద్దీన్ పాటు సిమీలో రఫీక్ పనిచేశాడు. తప్పించుకుని తిరుగుతున్న ఇతడి తలమీద రూ.3 లక్షల రివార్డు ఉంది. గత మూడేళ్లుగా బెంగళూరు శివారు ప్రాంతాల్లో నివసిస్తూ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. 

16:01 - January 29, 2016

మెల్ బోర్న్ : ఆసీస్ తో జరుగుతున్న టీ 20 మ్యాచ్ లో భారత క్రీడాకారులు జోరు పెంచుతున్నారు. రెండో టీ 20 మ్యాచ్ లో భారత్ మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. మొదటి టీ 20 మ్యాచ్ లో భారత్ 188 పరుగులు చేసి 35 పరుగుల తేడాతో ఆసీస్ ను మట్టి కరిపించిన సంగతి తెలిసిందే.
మెల్ బోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు శర్మ, ధావన్ లు వచ్చి రాగానే బ్యాట్ ఝులిపించడం ప్రారంభించారు. వీరిద్దరూ బంతిని బౌండరీలకు తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి మూడు ఓవర్లు ఆచితూచి ఆడినా ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన హేస్టింగ్స్ బౌలింగ్ లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదేశారు. తరువాత వచ్చిన ఫాల్క్ నర్ ఓవర్ లో కూడా రోహిత్ మూడు ఫోర్లు బాదాడు. భారత్ 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ముఖ్యంగా ధావన్ కొన్ని చూడముచ్చటైన షాట్లు కొట్టాడు. మాక్స్ వెల్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన ధావన్ (42: 32 బంతుల్లో 3x4, 2x6), ఫీల్డర్ క్రిస్ లియాన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ 37 బంతుల్లోనే 5x4, 2x6 సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేశౄడు. రోహిత్ - ధావన్ లు తొలి వికెట్ కు 11 ఓవర్లలో 97 పరుగుల భాగస్వామ్యంవ నమోదు చేయడం విశేషం. కోహ్లీతో సమన్వయ లోపం కారణంగా జట్టు స్కోరు 143 పరుగుల వద్ద రోహిత్ శర్మ (60) రనౌట్ గా పెవిలియన్ చేరాడు. రోహిత్ తరువాత వచ్చిన ధోని (14 : 9 బంతుల్లో 2x4) తో కలిసి విరాట్ కోహ్లి (59 నాటౌట్ : 33 బంతుల్లో 7x4, 1x6) దూకుడుగా ఆడడంతో భారత్ 184 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మాక్స్ వెల్, అండ్రూ టై చెరో వికెట్ తీశారు. 

15:51 - January 29, 2016

కేరళ : ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి హైకోర్టులో ఊరట లభించింది. సౌర ఫలకాల కుంభోకణంలో చాందీపై ఆరోపణలు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని త్రిశూర్ విజిలెన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై శుక్రవారం హైకోర్టు స్టే మంజూరు చేసింది. సోలార్‌ స్కాంలో తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్న త్రిశూరు కోర్టు ఆదేశాన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కోటి 90 లక్షలు ముఖ్యమంత్రి చాందీ వ్యక్తిగత సిబ్బందికి లంచం ఇచ్చినట్టు సోలార్‌ స్కాం ప్రధాన నిందితురాలు సరితా నాయర్‌ న్యాయ విచారణ కమిటీ ముందు ఆరోపించిన నేపథ్యంలో- చాందీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని త్రిశూరుకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. సోలార్‌ స్కాంకు సంబంధించి ఊమెన్‌చాందీకి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ బాసటగా నిలిచారు. 

15:48 - January 29, 2016

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల ప్రభుత్వ, ప్రయివేట్‌ కార్మికుల జీవన స్థితిగతులు నానాటికి దిగజారిపోతున్నాయని ట్రేడ్‌ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. విదేశీ పెట్టుబడులను అనుమతించడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డాయి. ఒకవైపు కార్మిక చట్టాలకు సవరణలు తెస్తూ వాటిని నీరుగారుస్తున్నారని.. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో కార్మిక ఉపాధిని దెబ్బ కొడుతున్నారని అవి విమర్శించాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మార్చి 10, 2016న కేంద్ర కార్మిక సంఘాలు సమావేశమై ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తాయని ట్రేడ్‌ యూనియన్‌ నేతలు పేర్కొన్నారు. మార్చి చివరి వారంలో ఢిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో కార్మీకుల భారీ సభ నిర్వహించనున్నట్టు వారు తెలియచేశారు.

15:46 - January 29, 2016

హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని జపాన్‌ డెలిగేట్స్ చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ పెట్టుబడులకు కేరాఫ్‌గా మారిందన్నారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో సమావేశమైన జపాన్‌ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పలు అంశాలపై చర్చించారు. మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉండి ఇక్కడి చారిత్రక ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు చెప్పారు.  

15:45 - January 29, 2016

వరంగల్ : బాల కార్మికులను పని పెట్టుకోవద్దని..పనుల్లో పెట్టుకున్న వారికి కఠిన శిక్షలు ఉంటాయని తెలిసినా పలువురు యజమానులు వారితో పనులు చేయించుకుంటున్నారు. తాజాగా వరంగల్ జిల్లలో వెట్టి చాకిరి చేస్తున్న బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. జిల్లాలోని ఇటుక బట్టీలపై పోలీసులు దాడులు చేశారు.ఈ దాడులలో సుమారు 50 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. ఒడిషా నుంచి తీసుకువచ్చి పనులు చేయించుకుంటున్న వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. ఆపరేషన్ స్మాయిల్ పేరిట కేంద్రం తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా డాడులు నిర్వహించినట్లుగా అధికారులు వెల్లడించారు. చిన్నారులను ఐఎస్ బాలసదన్ కు తరలించారు అధికారులు.

ఆసీస్ టార్గెట్ 185..

మెల్ బోర్న్ : ఆసీస్ తో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. శర్మ (60), ధావన్ (42), ధోని (14) పరుగులు చేశారు. కోహ్లీ 59, రైనా 0 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 

15:38 - January 29, 2016

కరీంనగర్ : జిల్లాలోని మార్కోస్ ఐటీఐ కళాశాలలో మాస్ కాపీయింగ్ జోరుగా జరుగుతోంది. విద్యార్థుల నుండి వేలాది రూపాయలను వసూలు చేసి ప్రశ్న పత్రాలకు బదులు జవాబు పత్రాలను ఇచ్చి కోతిరాంపూర్ లోని మార్కోస్ కళాశాల యాజమాన్యం మాస్ కాపీయింగ్ కు పాల్పడుతోంది. ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రిషియన్ రెండవ సెమిస్టర్ పరీక్షల్లో చీకటి గదులలో పరీక్షలను నిర్వహిస్తూ.. గేట్లకు తాళాలు వేసి ఎవరులోనికి రాకుండా చర్యలు తీసుకుంటూ మాస్ కాపీయింగ్ కు పాల్పడుతోంది కళాశాల యాజమాన్యం.

15:37 - January 29, 2016

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్స్ట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. భేటీ అనంతరం రాజేంద్రప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. ఈభేటీ కేవలం 'మా' అసోసియేషన్‌ కు సంబంధించిన పనుల గురించి మాత్రమేనని తెలిపారు. అయితే మా అసోసియేషన్‌ భవనం కోసం అలాగే వృద్ధకళాకారుల పెన్షన్‌ గురించి మంత్రి కేటీఆర్‌తో మాట్లాడామని రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. 

15:34 - January 29, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై కొనసాగిన ఉత్కంఠతకు తెరపడింది. కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎస్‌పీ ఠక్కర్‌ నియమితులయ్యారు. ఈయన 1981 వ సంవత్సరానికి చెందిన IAS అధికారి. ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐవైఆర్‌ కృష్ణారావు ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. కృష్ణారావు స్థానంలో ఠక్కర్‌ పదవీ బాధ్యతలు చేపడతారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియమాకం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద కసరత్తు చేశారు. చాలా ఐఏఎస్‌ అధికారుల పేర్లను పరిశీలించారు. ఏకే ఫరీదా,సీహెచ్‌ విశ్వనాథ్‌ పేర్లను పరిశీలించిన్నప్పటికీ... వీరు కేంద్ర సర్వీసులో ఉన్నారు. దీంతో ప్రణాళికా శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఎస్‌పీ ఠక్కర్‌తోపాటు, రాజభవన్‌లో గవర్నర్‌ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పేరును పరిశీలించారు. అయితే రమేష్‌కుమార్‌ 1982 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. దీంతో ముఖ్యమంత్రి చద్రబాబునాయుడు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కంటే సీరియరైన ఎస్‌పీ టక్కర్‌ వైపే మొగ్గు చూశారు.

1981 ఐఏఎస్..
కొత్త సీఎస్‌గా నియమితులైన టక్కర్‌ది ఢిల్లీ. అక్కడే లా చదివారు. 1981 లో ఐఏఎస్‌కు ఎంపికై, ఏపీ కేడర్‌ పొందారు. 1983లో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పని చేశారు. సాంఘిక సంక్షేమం, భూపరిపాలన, పౌరసరఫరాలు, పంచాయతీరాజ్‌, వ్యవసాయ శాఖల్లో వివిధ హోదాల్లో పని చేశారు. 2004 నుంచి 2010 వరకు జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన టక్కర్‌... ఆ తర్వాత ప్రణాళిక శాఖకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, సీఎస్‌గా నియమితులయ్యారు. ఫిబ్రవరి 1న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టే ఠక్కర్‌... ఈఏడాది ఆగస్టు 31 వరకు పదవిలో కొనసాగుతారు. అభివృద్ధిలో ఏపీని నంబర్‌ వన్‌ స్థానానికి తీసుకెళ్లాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్న తరుణంలో టక్కర్‌ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. 

15:31 - January 29, 2016

అతివలకు అన్ని సందర్భాలకు తగిన విధంగా అమరిపోయే వస్త్రధారణ చుడీదార్స్. ఈ చుడీదార్స్ లో ప్రత్యేక సందర్భాల కోసం చక్కటి కలెక్షన్ ను అందిస్తున్నారు కియారా డిజైనర్స్. ఆ కలెక్షన్ ఏమిటో వీడియోలో చూడండి..

15:31 - January 29, 2016

మహిళలకు అడుగడుగునా వేధింపులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆత్మరక్షణా పద్ధతులలో వారు నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉంది. కరాటేలో మెళకువలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

భారత్ 160/2..

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ -20 మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ ను కోల్పోయింది. అర్ధ సెంచరీ సాధించి శతకం వైపుకు దూసుకెళుతున్న శర్మ (60) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 17.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ 46, ధోని 3 పరుగులతో ఆడుతున్నారు. 

15:05 - January 29, 2016

దేశంలో మహిళల సంఖ్య అతి తక్కువగా ఉన్న రాష్ట్రం బీహార్. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఆడపిల్ల మనుగడ కోసం, అక్కడి ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఆడపిల్లల రక్షణ కోసం కొత్త కొత్త కార్యక్రమాలను రూపొందించింది, అమలు చేస్తోంది. అసహనంపై తన నిరసన కొనసాగుతుందని ప్రముఖ రచయిత నయనతార సెహగల్‌ కేంద్ర సాహిత్య అకాడమీకి కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడులు కొనసాగుతున్నంత కాలం రచయితల నిరసన కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఒకవైపు సెక్షన్ 498ఏ కి సవరణల విషయంలో భిన్నవాదనలు వినిపిస్తూంటే, ఇదే సమయంలో ముంబయి హైకోర్టుల ముస్లిం జంట విడాకుల కేసులో కీలక తీర్పు వెలువరించింది. అకారణంగా విడాకులు ఇవ్వడం సరైంది కాదని తేల్చి చెప్పింది. 400 సంవత్సరాలుగా శనిసింగాపూర్ ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేకపోవడాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇదే సమయంలో ఇక్కడి మహిళలు పెద్ద ఎత్తున ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని కదం తొక్కడం విశేషం.
భారత ప్రభుత్వం ప్రతి ఏటా, విభిన్న రంగాల్లో కృషి చేసిన వారికిచ్చే పద్మ పురస్కారాలను ఈ ఏడాది తమ తమ రంగాల్లో ప్రత్యేకతను సాధించిన మహిళలు సొంతం చేసుకున్నారు. ఆ విశిష్ట మహిళలకు మానవి అభినందనలు తెలియచేస్తోంది. భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించింది. సన్నాహక మ్యాచ్ ల్లో శుభారంభం చేసింది.

ధావన్ అవుట్..

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఒక వికెట్ కోల్పోయింది. ధావన్ (42) ను మాక్స్ వెల్ పెవిలియన్ పంపించాడు. ప్రస్తుతం 12 ఓవర్ ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో శర్మ 53, కోహ్లీ 1 పరుగుతో ఆడుతున్నారు. 

భారత్ 84/0..

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ -20 మ్యాచ్ లో భారత్ ఓపెనర్లు విజృంభిస్తున్నారు. 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. శర్మ 36, ధావన్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

14:37 - January 29, 2016

ఢిల్లీ : వివాదస్పద విష్ణుమూర్తి పోస్టర్‌పై క్రికెటర్‌ ధోనికి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. ధోనికి వ్యతిరేకంగా అనంతపురం కోర్టు జారీ చేసిన నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్‌పై స్టే విధించింది. దీనిపై సమాధానమివ్వాలని అనంతపురం పోలీసులను ఆదేశించింది. పోస్టర్ వివాదం కేసులో ఫిబ్రవరి 25న కోర్టుకు హాజరు కావాలని అనంతపురం కోర్టు ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2013లో ఓ బిజినెస్‌ పత్రిక ధోని విష్ణుమూర్తి అవతారంలో పోస్టర్‌ ప్రచురించింది. ధోని 8 చేతుల్లో వివిధ ఉత్పత్తులకు చెందిన వస్తువులన్నాయి. ఓ చేతిలో చెప్పు కూడా ఉండడం వివాదస్పదమైంది. హిందువుల మనోభావాలను కించ పరచారంటూ ధోనిపై అనంతపురం, బెంగళూరులో కేసు నమోదైంది.

14:35 - January 29, 2016

మెలో బోర్న్ : మిథాలీరాజ్ నాయకత్వంలోని భారత జట్టు ...ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టీ-20 సిరీస్ నెగ్గి సంచలనం సృష్టించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో ముగిసిన రెండోవన్డేను.. భారత్ డక్ వర్త్- లూయిస్ విధానం ద్వారా 10 వికెట్ల తేడాతో నెగ్గి..మొదటి రెండు టీ-20 లు ముగిసే సమయానికే 2-0 తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. వర్షంతో పలుమార్లు నిలిచిపోయిన ఈ పోటీలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసింది. సమాధానంగా డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం 10 ఓవర్లలో 66 పరుగులు చేయాల్సిన భారత్ 9.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యం చేరి..10 వికెట్ల విజయం సొంతం చేసుకొంది. భారత ఓపెనర్లు మిథాలీరాజ్ ఆరు బౌండ్రీలతో 37, స్మృతి మంథానీ 24 బాల్స్ లో 3 బౌండ్రీలతో 22 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

14:33 - January 29, 2016

ముంబై : బాలీవుడ్‌ నటి, బిజెపి ఎంపీ హేమా మాలిని వివాదంలో ఇరుక్కున్నారు. ముంబైలో డాన్స్ స్కూలు పేరిట భూకబ్జాకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీదైన భూమిని కారు చవకగా కొట్టేశారని ఆర్టీఐ కార్యకర్త ఆరోపిస్తున్నారు. 40 కోట్ల విలువ చేసే భూమిని మహారాష్ట్ర ప్రభుత్వం కేవలం 70 వేలకు హేమమాలిని ధారాదత్తం చేసింది.  బాలీవుడ్‌ ప్రముఖ నటి, బిజెపి ఎంపీ హేమామాలిని ముంబైలో ఏర్పాటు చేయనున్న డాన్స్ అకాడమికి మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమి వివాదస్పదంగా మారింది. నెల రోజుల క్రితం ముంబైలోని అత్యంత ఖరీదైన అంధేరీలోని ఒషివరాలో 2 వేల స్క్వేర్‌ మీటర్ల స్థలాన్ని డిసెంబర్‌ 29, 2015న హేమమాలినికి ఫడ్నవిస్‌ ప్రభుత్వం కేటాయించింది. 40 కోట్లు ఖరీదు చేసే ఈ భూమిని కేవలం 70 వేల రూపాయలకు కేటాయించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

భూ కబ్జాను బయటపెట్టిన ఆర్టీఐ కార్యకర్త..
హేమమాలిని భూకబ్జాను సామాజిక కార్యకర్త అనిల్‌ గల్‌గలీ బయట పెట్టారు. హేమామాలినికి భూకేటాయింపు ఇదే మొదటి సారి కాదు... 1997లో శివసేన-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం కూడా హేమమాలినికి 10 లక్షల విలువ చేసే 17 వందల 41 స్క్వేర్‌ మీటర్ల భూమిని కేటాయించింది. ఈ స్థలం కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌-సిఆర్‌జడ్‌లో ఉండడం వల్ల అభివృద్ధి చేయడానికి ఆస్కారం లేకపోవడంతో అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. అయితే ఆ భూమిని హేమమాలిని తిరిగి ఇవ్వకపోగా... ప్రభుత్వం మళ్లీ భూమిని ఎలా కేటాయిస్తుందని అనిల్‌ గల్‌గలీ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌కు లేఖ రాశారు. కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు రాజీవ్‌ శుక్లాకు అంధేరి వెస్ట్‌లో ప్లాట్‌ కేటాయిస్తే బిజెపి-శివసేన వ్యతిరేకించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 2014లో శుక్లా తనకు కేటాయించిన ప్లాట్‌ను తిరిగి ఇచ్చివేశారని గల్‌గలీ గుర్తు చేశారు. స్క్వేర్‌ మీటర్‌ 35 రూపాయల చొప్పున హేమమాలినికి భూమి కేటాయించినట్టు ముంబై సబర్బన్‌ కలెక్టర్‌ తెలిపారు. 18 కోట్ల 50 లక్షలతో డాన్స్‌ అకాడమి కల్చరల్‌ కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌ను హేమామాలిని చేపడుతున్నారు. రూల్‌ ప్రకారం ప్రాజెక్టు ఖర్చులో కనీసం 25 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కాని హేమమాలిని కేవలం మూడున్నర కోట్లు మాత్రమే బాలెన్స్‌లో చూపారు. ఇది 25 శాతం కన్నా తక్కువ. మిగిలిన 75 శాతం బాలెన్స్‌పై క్లారిటీ లేదని అధికారులు పేర్కొన్నారు. హేమామాలిని నాట్య కళా కేంద్రం ఇచ్చిన ఆధారాలపై సంతృప్తి చెందని కలెక్టర్‌ -మిగతా బ్యాలెన్స్‌ డబ్బుకు సంబంధించిన ఆధారాలను రెండు నెలల్లోగా సమర్పించాలని ఆదేశించారు.

14:30 - January 29, 2016

కేరళ : సోలార్‌ స్కాంపై కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ హైకోర్టును ఆశ్రయించారు. సోలార్‌ స్కాంలో తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్న త్రిసూరు కోర్టు ఆదేశాన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కోటి 90 లక్షలు ముఖ్యమంత్రి చాందీ వ్యక్తిగత సిబ్బందికి లంచం ఇచ్చినట్టు సోలార్‌ స్కాం ప్రధాన నిందితురాలు సరితా నాయర్‌ న్యాయ విచారణ కమిటీ ముందు ఆరోపించిన నేపథ్యంలో- చాందీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని త్రిసూరుకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. సోలార్‌ స్కాంకు సంబంధించి ఊమెన్‌చాందీకి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ బాసటగా నిలిచారు. 

14:25 - January 29, 2016

నల్లగొండ : జిల్లా యాదగిరిగుట్ట మండలం బొల్లేరులో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది.. సనర్గ్ లాబొరేటరీస్ లిమిటెడ్‌ కంపెనీ విస్తరణకోసం ఈ కార్యక్రమం చేపట్టారు.. అయితే ఉదయం ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నంవరకూ మొదలేకాదు.. ఎప్పుడు స్టార్ట్ చేస్తారని ప్రశ్నించిన మీడియాపై కంపెనీ ప్రతినిధులు దురుసుగా ప్రవర్తించారు.. ఈ విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్‌ సత్యనారాయణ కంపెనీ తీరును తప్పుబట్టారు.. ఆ తర్వాత యాజమాన్యం మీడియాకు సభాముఖంగా క్షమాపణ తెలిపింది.. అటు ఈ కార్యక్రమానికి ముందు కంపెనీ విస్తరణను వ్యతిరేకిస్తూ రైతులు కంపెనీలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయాలు చెప్పాలని రైతుల్ని కోరారు. కంపెనీ వ్యర్ధాలతో తమ పొలాలన్నీ ఎందుకు పనికిరాకుండా తయారయ్యాయని అన్నదాతలు ఆరోపించారు. కంపెనీ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. ఆరోపణలపై స్పందించిన యాజమాన్యం.. ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.. 

14:23 - January 29, 2016

కృష్ణా : జిల్లా రైతులు సాగునీటి కోసం కదం తొక్కారు. చందర్లపాడు మండలం కోనాయపాలెం వద్ద సాగర్ కాల్వ సాగునీటి కోసం నందిగామ ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పటివరకు కృష్ణానదిపై వేదాద్రి వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి సాగునీటిని సాగర్‌ కాల్వ ద్వారా అందజేస్తున్నారు. ఈ ఏడాది సాగర్ కాల్వల ద్వారా నీటి విడుదల లేకపోయినా నందిగామ ప్రాంత రైతులకు వేదాద్రి ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించారు. ప్రస్తుతం వేలాది ఎకరాల్లో మిరపతోటలు సాగు చేశారు. సరిగ్గా దిగుబడులు వచ్చే తరుణంలో కృష్ణా నదిలో నీటి నిల్వలు లేవనే ఉద్దేశంతో వేదాద్రి ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేయడం ఆపేశారు. దీంతో మిరపతోటలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తక్షణమే సాగర్ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. 

14:21 - January 29, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం అంతా ఓ నాటకీయంగా సాగుతోందని వైసిపి నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ నేతలు పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో మొదటి ముద్దాయి చంద్రబాబు అని చెప్పిన సీఎం కేసీఆర్‌...ఇవాళ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. 

మార్కోస్ ఐటీఐ కళాశాలలో మాస్ కాపీయింగ్..

కరీంనగర్ : కోతిరాంపూర్ మార్కోస్ ఐటీఐ కళాశాలలో సెకండ్ సెమిస్టర్ పరీక్షల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగింది. ఏకంగా కాలేజీ గేట్లకు తాళం వేసి నిర్వాహకులు కాపీయింగ్ చేయించారు. సమాచారం అందుకున్న పోలీసులు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. 

గుంటూరులో అసెంబ్లీ పీఏసీ కమిటీ సమావేశం..

గుంటూరు : అసెంబ్లీ పీఏసీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ ఛైర్మన్ మోదుగుల, చెవిరెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు. 9 అంశావలపై సమీక్షించి నివేదికను అసెంబ్లీకి అందించడం జరుగుతుందని, సీఆర్డీఏ పరిధిలోని రైతులు, కూలీల సమస్యలు అభివృద్ధి వంటి అంశాలపై నివేదిక తయారు చేసి అసెంబ్లీకి అందచేయడం జరుగుతుందని మోదుగుల, చెవిరెడ్డి పేర్కొన్నారు. ఫిబ్రవరి మాసంలో అండమాన్, తమిళనాడులో పర్యటించడం జరుగుతుందన్నారు.

 

మళ్లీ హెచ్ సీయూకి రాహుల్..

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి నగర కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రానున్నారు. హెచ్ సీయూలో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు సాయంత్రం రాహుల్ గాంధీ విద్యార్థులతో కలిసి ఆందోళనలో పాల్గొనున్నారు. రాత్రికి హెచ్ సీయూలోనే బస చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఏఐసీసీ అధికార ప్రతినిధిగా మనీశ్ తివారి..

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధిగా నియమితులయ్యారు. 

13:55 - January 29, 2016

శ్రీకాకుళం : జిల్లాలో జరిగిన చిన్నారుల మృతి సంఘటన స్థానికంగా ఎంతో విషాదం నింపింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో వాస్తవానికి మొత్తం ఏడుగురు చిన్నారులు చిక్కుకుంటే.. నలుగురు మృత్యు ముఖం నుంచి బయటపడ్డారు. వారికి పునర్జన్మ దక్కిందంటే కారణం ఓ సాహస బాలుడే. ఈ ఘటన నేపథ్యంలో అతని ధైర్య సాహసాలు గమనించిన జిల్లా అధికారులు ఓ అత్యున్నత అవార్డుకు అతని పేరును ప్రతిపాదించారు.

ముగ్గురు చిన్నారుల దుర్మరణం

వీరి శోకానికి కారణం ఓ ప్రమాదకరమైన ఊబి. ఈ సాహసవంతుడు ప్రమాద సమయంలో లేకుంటే జరిగే విషాదాన్ని ఊహించడం కూడా కష్టమవుతుందేమో.. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలోని కనుగులవానిపేటలో మంగళవారం ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. వారి మృతి గ్రామం మొత్తాన్ని శోక సంద్రంలో ముంచింది. గ్రామానికి సమీపంలోని నారాయణపురం లింక్ కెనాల్‌లో స్నానానికి దిగి ఊపిరాడక ఈ న్నారులు మృతిచెందారు. గ్రామంలో ఓ వ్యక్తి మరణించిన నేపథ్యంలో అందరూ స్నానానికి వాగుకు వెళ్ళారు. వెళ్లినవారిలో లావణ్య, మణికంఠ, సంగీత, ఇందు, కల్పన, ధరణి, హారికలు ఉన్నారు. వారంతా పదేళ్ళ లోపు వయసువారే.

నలుగురిని రక్షించిన రాకేశ్

ముందుగా సంగీత, లావణ్య, మణికంఠలు కెనాల్‌లోకి దిగగా వారిని అనుసరించి మిగిలిన వారూ దిగారు. అయితే కెనాల్‌లో ఉన్న ఊబి ప్రాంతంలో మొదటగా వెళ్ళిన ముగ్గురు చిన్నారులు చిక్కుకున్నారు. దీంతో సహాయం కోసం వారు కేకలేస్తూ మునిగిపోయారు. ఈలోగా అటువైపుగా వెళ్తున్న రాకేశ్ అనే బాలుడు వారి అరుపులు విని అత్యంత సాహసంతో వాగులో ఈదుకుంటూ వెళ్లాడు. మిగిలిన నలుగురిని రక్షించాడు. ముందుగా దిగిన వారు ఊబిలో చిక్కుకుపోవడంతో వారిని కాపాడలేకపోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు... వాగు వద్దకు చేరుకుని ప్రమాదం నుండి బయటపడిన చిన్నారులకు ప్రథమ చికిత్స అందించారు. ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన పిల్లలను బయటకు తీశారు. ఆ సమయంలో రాకేశ్ ధైర్య సాహసాలు ప్రదర్శించకపోతే మరో నలుగురు చిన్నారులను మృత్యువు కబలించేదే.

సాహస బాలల పురస్కారానికి రాకేశ్‌ పేరు

నలుగురి కుటుంబాల్లో ఆనందాన్ని నింపిన రాకేశ్ పదో తరగతి చదువుతున్నాడు. అతని ధైర్యసాహసాలను అందరూ కొనియాడుతున్నారు. చిన్నారుల తల్లిదండ్రులు రాకేశ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాకేశ్‌ను అభినందించడంతో పాటు జిల్లా అధికారులకు విషయాన్ని తెలియబరిచారు. ఈ నేపథ్యంలో గురువారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం రాకేశ్‌ను అభినందించారు. రాష్ట్రపతి అందించే సాహస బాలల పురస్కారానికి రాకేశ్‌ పేరును ప్రతిపాదిస్తామని తెలిపారు. మొత్తానికి అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన రాకేశ్ నలుగురు చిన్నారులకు పునర్జన్మనిచ్చాడు. అతనిని బాలలందరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

 

 

మాక్స్ వెల్ వచ్చేశాడు..

మెల్ బోర్న్ : భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 వన్డే మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇదిలా ఉంటే ఆసీస్ జుట్టులోకి మాక్స్ వెల్ తిరిగి చేరాడు.
ఆసీస్ జట్టు : ఫించ్, వాట్సన్, షాన్ మార్ష్, క్రిస్ లిన్, మాక్స్ వెల్, మాథ్యూ వేడ్, ఫాల్క్ నర్, హేస్టింగ్స్, అండ్రూ టై, లియాన్,
భారత్ జట్టు : ధావన్, రోహిత్, కోహ్లి, రైనా, ధోని, యువరాజ్, హార్దిక్ పాండ్య, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా. 

13:50 - January 29, 2016

హైదరాబాద్ : రోహిత్‌ ఆత్మహత్యను నిరసిస్తూ ఓయూలో విద్యార్థి సంఘాలు చేపట్టిన సియం క్యాంప్ ఆఫీస్ ముట్టడి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. రోహిత్ ఆత్మహత్యపై సిఎం కెసిఆర్ స్పందించకపోవడంపై విద్యార్థి సంఘాలు సిఎం క్యాంప్ ఆఫీస్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. వారు చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

13:47 - January 29, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో ఏపార్టీ సహకారం లేకుండానే మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. సైదాబాద్‌ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ను అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ మంత్రి తుమ్మల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వచ్చే మూడున్నర సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటిని పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారని మంత్రి అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలవుతాయన్నారు. 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

మెల్ బోర్న్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య కాసేపట్లో రెండో టీ.20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  

13:42 - January 29, 2016

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ వి అన్ని అభూత కల్పనలు, అబద్ధాలని టిటిడి నేత రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను అన్నిరకాలుగా అభివృద్ధి చేసింది ఒక్క టిడిపియేనని రేవంత్‌ తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కేసిఆర్‌కు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు.  

13:38 - January 29, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో వన్‌ హైదరాబాద్ కూటమిని గెలిపించి టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి చరమగీతం పాడాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు రాఘవులు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌... అడ్డగుట్ట డివిజన్ నుంచి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి స్వర్ణలత తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. టిఆర్‌ఎస్ చెప్పేదానికి చేస్తున్నదానికి ఎక్కడా పొంతన ఉండడం లేదని రాఘవులు ఆరోపించారు. వన్ హైదరాబాద్ కూటమితోనే నరగరాభివృద్ధి సాధ్యమని చెప్పారు.

 

ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ దక్కించున్న సానియా-హింగిస్ జోడీ

హైదరాబాద్ : హైదరాబాదీ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా - మార్టీనా హింగిస్ జోడీ..ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను గెలుచుకొంది. టాప్ సీడింగ్ జోడీగా టైటిల్ వేటకు దిగిన సానియా- హింగిస్ వరుస సెట్లలో 7వ సీడ్ లావకోవా- రాడెకా జోడీని 7-6, 6-2తో ఓడించి..2016 గ్రాండ్ స్లామ్ సీజన్లో తొలి టైటిల్ అందుకొన్నారు.

13:33 - January 29, 2016

ఆస్ట్రేలియా : హైదరాబాదీ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా - మార్టీనా హింగిస్ జోడీ..ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను గెలుచుకొంది. టాప్ సీడింగ్ జోడీగా టైటిల్ వేటకు దిగిన సానియా- హింగిస్ వరుస సెట్లలో 7వ సీడ్ లావకోవా- రాడెకా జోడీని 7-6, 6-2తో ఓడించి..2016 గ్రాండ్ స్లామ్ సీజన్లో తొలి టైటిల్ అందుకొన్నారు. ప్రపంచ నెంబర్ వన్ డబుల్స్ ప్లేయర్ సానియా కు మహిళల డబుల్స్ లో ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. గత ఏడాది హింగిస్ తో కలసి వింబుల్డన్, అమెరికన్ ఓపెన్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన సానియా..కొత్త సంవత్సరంలోనూ అదేజోరు కొనసాగించింది. ఇప్పటికే మూడు మిక్సిడ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన సానియా కెరియర్ లో ఇది ఆరవ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.

చాందీకి వ్యతిరేకంగా లెఫ్ట్‌ ఫ్రంట్‌ కార్యకర్తల ఆందోళన

త్రివేండ్రం : సిఎం ఊమెన్‌ చాందీకి వ్యతిరేకంగా లెఫ్ట్‌ ఫ్రంట్‌ కార్యకర్తలు కేరళ సెక్రటేరియట్‌ ముందు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వామపక్ష కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. పోలీసుల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

13:29 - January 29, 2016

త్రివేండ్రం : సిఎం ఊమెన్‌ చాందీకి వ్యతిరేకంగా లెఫ్ట్‌ ఫ్రంట్‌ కార్యకర్తలు కేరళ సెక్రటేరియట్‌ ముందు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వామపక్ష కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. పోలీసుల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సోలార్‌స్కాంకు సంబంధించి ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ రాజీనామా చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

13:25 - January 29, 2016

కేరళ : చేయిచేయి కలిస్తే ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది. ఎంతటి సమస్యైనా క్షణాల్లో పరిష్కారమైపోతుంది. అందుకు కావాల్సిందల్సా అంకితభావం. పోవాల్సిందల్లా మనకెందుకులే అన్న నిర్లక్ష్య భావం. మీరు కొంచెం కష్టపడి ఈ పనిచేయండి.. ఆ శ్రమను మరిచిపోయేలా చిన్న ట్రీట్ ఇస్తామని కోజికోడ్‌ కలెక్టర్‌ చెప్పారు. అంతే వెంటనే గ్రామస్తులు రంగంలోకి దిగారు. శభాష్‌ అనిపించుకున్నారు. ఆ వ్యవహారమేంటో మీరూ చూడండి. నీలి జలాలతో అందంగా ఉండే చెరువు.. కొంత కాలానికి ఇలా చెత్తా చెదారంతో నిండిపోయింది..
కాలకూట విషంలా నీరు  
నీరు కాలకూట విషంలా మారి ఎందుకూ పనికిరాకుండా పోయింది. దీంతో చెరువును మళ్లీ సుందరంగా మార్చేందుకు కలెక్టర్‌ రంగంలోకి దిగారు. అంతే చెరువు కాస్తా అందంగా మారిపోయింది. ఇందుకు ఆయన గ్రామస్తులకు చిన్న ట్రీట్ ఇచ్చారు. దాని ఫలితం మాత్రం అద్భుతంగా వచ్చేసిం  ది. ఇదంతా జరిగింది జన చైతన్యం ఎక్కువగా ఉండే కేరళ రాష్ట్రంలో.. కేరళలోని కోజికోడ్‌కు 25 కిలో మీటర్ల దూరంలో కొల్లం చిరా అనే సరస్సుంది. అది చెత్తాచెదారం నిండిపోయి దుర్వాసన వచ్చేది. చెరువును ఎలాగైనా బాగుచేయాలన్న ఆలోచన జిల్లా కలెక్టర్ ఎన్.ప్రశాంత్ భూషణ్‌కు కలిగింది. వెంటనే రంగంలోకి దిగి గ్రామస్తులకు ఓ ఆఫర్ ఇచ్చాడు. చెరువును బాగుచేసి బిర్యానీ తినండి అంటూ సరదాగా ఓ ఆఫర్‌ ఇచ్చాడు. దీనికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చిన్నాపెద్దా అంతా లేక్‌లోకి దిగి నాలుగు గంటలపాటు శ్రమించారు. చెరువుకు పూర్వ వైభవం తీసుకొచ్చారు.

చెరువులోకి దిగి పని చేసిన కలెక్టర్ 

కలెక్టర్ ప్రశాంత్‌ భూషణ్‌ కూడా చెరువులోకి దిగి పని చేశారు. అనంతరం గరిటె పట్టి బిర్యానీ కూడా చేశారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇలా కేవలం పరిపాలన అంశాల్లోనే కాక సామాజిక స్పృహను కలిగించడంలోనూ కలెక్టర్‌ ముందుంటున్నారు. 'కంపాషనేట్ కోజికోడ్' అనే ప్రత్యేక సంస్థను స్థాపించి దాని ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా కలిసి పనిచేస్తే ఏ సమస్యైనా ఇట్టే తొలగిపోతుందని స్థానికులిప్పుడు దృఢంగా నమ్ముతున్నారు. ఆ దిశగా మరిన్ని సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తున్నారు. 

13:15 - January 29, 2016

శీతాకాలంలో తరచూ అలర్జీలు, నిరంతరం దగ్గు, జలుబు చేస్తుంటే తినే ఆహారం మితంగా తీసుకోవాలి. ఆయుర్వేదంలో ఈ ప్రక్రియను 'లఘనాన్‌ థెరఫీ' అని పిలుస్తారు. ఫుడ్‌ క్వాంటిటీని తగ్గించడం వల్ల జీర్ణశక్తిని పెరుగుతుంది. దీంతో శరీరంలో వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో పోరాడే శక్తి అధికమవుతుంది. అంతేకాదు రోజులో పూర్తిగా ఆకలి, దప్పికైనప్పుడు మాత్రమే ఆహార, పానీయాలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో మాంసాహారం, స్వీట్స్‌, ఐస్‌క్రీమ్స్‌తోపాటు కోలా, సోడా వంటి శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. లేదా పరిమితంగా తీసుకోవాలి. మసాలాలలో, అల్లం పౌడర్‌, పసుపు, బ్లాక్‌ పెప్పర్‌, దాల్చిన చెక్క, యాలుకలు, మరియు కరివేపాకు ప్రతి ఒక్కటి గ్రాము చొప్పున తీసుకొని, పౌడర్‌ చేసుకోవాలి. ఈ పౌడర్‌ను రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఇన్లుమేటరీ, యాంటీ వైరల్‌ లక్షణాలు వింటర్లో వచ్చే అలర్జీలు, దగ్గు, జలుబు, వైరల్‌ ఇన్ఫెక్షన్‌లనును నివారిస్తాయి. నూనెలు, ఆలివ్‌ ఆయిల్‌, కానోలా ఆయిల్‌, మస్టర్డ్ ఆయిల్‌, సీసమ్‌ ఆయిల్స్‌ను వంటకు ఉపయోగించాలి. వింటర్లో జలుబు, దగ్గు ఉన్నప్పుడు నెయ్యి తినకపోవడం మంచిది. తప్పనిసరి అనుకుంటే...చాలా తక్కువ పరిమాణంలో ఉపయోగించాలి. ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యికి, గ్రాము పసుపు చేర్చి ఉపయోగించాలి.

13:10 - January 29, 2016

మహిళలు నిత్యం ఇంటి కార్యకలాపాలతోపాటు ఆఫీసు పనులను నిర్వర్తించుకోవడం వల్ల ఎక్కువగా అలసిపోతారు. ఉదయం ఎంత హుషారుగా వుంటారో సాయంత్రానికి అంతకంటే ఎక్కువగానే నీరసించిపోతారు. అంటే.. వారి శరీరంలో వ్యాధినిరోధక శక్తి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంటుందన్నమాట! అలాంటప్పుడు పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటే ఆ శక్తిని పెంచుకోవచ్చు. వీటికంటే.. తేనె, దాల్చిన చెక్క ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్‌తో రెమెడీ చేసుకుని తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దాల్చిన చెక్క, తేనె మిశ్రమంలో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌ తీసుకోవడానికి ఒక గంట ముందు తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. అలాగే.. రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఈ మిశ్రమాన్ని తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

13:09 - January 29, 2016

టమాటాలను మనం కేవలం ఆహార పదార్థంగా లేదా సౌందర్య సాధనంగా మాత్రమే ఉపయోగిస్తుంటాం. అయితే టమాటా మంచి క్లీనింగ్‌ ఏజెంట్‌ కూడా. టమాటాలకు పై పొరను తీసేసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా చేయండి. దానికి కొంచెం మెత్తటి ఉప్పును చేర్చి, స్టవ్‌ మీద, ఫ్లాట్‌ ఫామ్‌ మీద పడ్డ మొండి మరకల మీద రాసి, కాసేపటికి పొడిబట్టతో తుడిచేస్తే.. మరకలు తొలగిపోతాయి. అంతేనా.. స్టీలు గిన్నెలు తెల్లగా మారాలన్నా, ఇత్తడి, రాగి పాత్రలు తళతళలాడాలన్నా దీనికి మించిన క్లీనింగ్‌ ఏజెంట్‌ మరోటి లేదు. వెండి, బంగారు వస్తువులు, ఆభరణాలను కూడా టమాటా గుజ్జుతో శుభ్రం చేస్తే సరిపోతుంది. 

13:08 - January 29, 2016

టాలీవుడ్‌లో రీమేక్‌ల హీరోగా పేరు తెచ్చుకున్న వెంకటేష్‌ మరో రీమేక్‌ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. బాలీవుడ్‌లో విడుదలకు ముందే క్రేజ్‌ను సొంతం చేసుకున్న 'సాలా ఖడూస్‌' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలనుకుంటున్నారు. నేడు (శుక్రవారం) విడుదల కానున్న ఈ చిత్రాన్ని బాక్సర్స్ కి మాత్రమే ప్రత్యేకంగా ప్రీమియర్‌ షో వేశారు. హీరో వెంకటేష్‌ కూడా ఈ ప్రీమియర్‌ షోకి వెళ్ళారు. సినిమా చూసిన వెంటనే మైండ్‌ బ్లోయింగ్‌ మూవీ అని దర్శక, నిర్మాతల్ని పొగిడారట. ఇదే కథతో తెలుగులో రీమేక్‌ చేస్తానంటే కాల్షీట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చిత్ర దర్శకులు సుధా కొంగర ప్రసాద్‌కు వెంకటేష్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలై విజయం సాధిస్తే కచ్చితంగా తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌ నటించే ఛాన్స్ ఉందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. గతేడాది వెంకటేష్‌ నటించిన 'దృశ్యం' రీమేక్‌ పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.

బాక్సర్స్ కి 'సాలా ఖడూస్‌' ప్రత్యేక షో..
శుక్రవారం ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత రాజ్‌ కుమార్‌ హిరానీ ప్రొఫెషనల్‌ బాక్సర్స్ అందర్ని ఆహ్వానించి సోమవారం ప్రీమియర్‌ షో వేశారు. బాక్సర్స్ నీరజ్‌ గోయట్‌, వికాస్‌ యాదవ్‌, మన్‌వీర్‌ సింగ్‌, మనోజ్‌ కుమార్‌, మహవీర్‌ సింగ్‌, జితేందర్‌ కుమార్‌, పర్‌మోద్‌ కుమార్‌, దీపక్‌ తన్వార్‌, సందీప్‌ బగ్రీ, రామ్‌ సింగ్‌ తదితరులు పాల్గొని సినిమాని తిలకించారు. అనంతరం రాజ్‌ కుమార్‌ హిరానీకి, ఈ చిత్రంలో బాక్సర్‌గా నటించిన రితికా సింగ్‌కి బాక్సింగ్‌ గ్లౌవ్స్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇండియన్‌ అథ్లెట్‌ మిల్కా సింగ్‌ ఈ చిత్ర యూనిట్‌ని డిన్నర్‌కి ఆహ్వానించారు. ఓ రిటైర్డ్‌ బాక్సర్‌ మట్టిలో మాణిక్యాన్ని వెతికి బాక్సింగ్‌ ఛాంపియన్‌గా చేయడమనే ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుధా కొంగర ప్రసాద్‌ దర్శకత్వంలో రాజ్‌ కుమార్‌ హిరానీ నిర్మించారు. తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రంలో ఆర్‌.మాధవన్‌ రిటైర్డ్‌ బాక్సర్‌గా, రియల్‌ లైఫ్‌ బాక్సర్‌ రితికా బాక్సర్‌గా నటించారు.

13:05 - January 29, 2016

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల కలయిక మరోసారి వార్తల్లో హైలైట్‌గా నిలిచింది. పవన్‌కళ్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం షూటింగ్‌ సెట్‌లో చిరంజీవి సందడి చేయడమే ఇందుకు కారణం. సెట్‌ మొత్తం కలయ తిరుగుతూ ఈ ఇద్దరన్నదమ్ములు సరదాగా గడిపారు. అంతేకాకుండా చిత్రయూనిట్‌ సభ్యులందరితోనూ ఫొటోలు దిగి హల్‌చల్‌ చేశారు. 'సర్దార్‌తో శంకర్‌దాదా..' అంటూ ఈ విశేషంతోపాటు ఫొటోల్ని సైతం నిర్మాత శరత్‌మరార్‌ ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా నటించిన 'బ్రూస్‌లీ' చిత్రంలో చిరంజీవి అతిథి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

 అభిమానుల అమితానందం..
ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో విజయపథంలో పయనిస్తున్న తరుణంలో ఇంటికెళ్ళి చిరంజీవిని పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేకంగా అభినందించారు. కారణాలేమైనా మెగాబ్రదర్స్‌ ఇద్దరూ మళ్ళీ మళ్ళీ కలవడం పట్ల అభిమానులు అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం షూటింగ్‌ ప్రోగ్రెస్‌ విషయానికొస్తే, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వేసిన రతన్‌పూర్‌ ఊరి సెట్‌లో ఏకధాటిగా జరుగుతోంది. ఈ చిత్రం ఆడియోను మార్చి 12న విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం. పవన్‌కళ్యాన్‌ సరసన కాజల్‌ నటిస్తున్న ఈ చిత్రంలో రారులక్ష్మీ ఓ ప్రత్యేక పాటలో మెరువనుంది. బాబీ దర్శకత్వంలో పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై శరత్‌మరార్‌, సునీల్‌ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 8న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

13:02 - January 29, 2016

వేటూరి సుందరరామ్మూర్తి ... తెలుగు సినిమా పాటల స్వర్ణయుగానికి నాంది పలికిన ఘనుడు. తెలుగు పాటను దేశవ్యాప్తం చేసిన దిట్ట. తెలుగు నుడికారాలతో భావయుక్తమైన పాటలు రాసి తనకు తానే సాటి అని నిరూపించుకున్న పాటల తోటమాలి. తెలుగు భాషపై ఉన్న మమకారాన్ని, ప్రేమని పాటల రూపంలో చూపించి శ్రోతల మదిలో చెరగని ముద్ర వేసుకున్న పాటల రారాజు. వేటూరికి ముందు.. వేటూరికి తర్వాత అనే స్థాయికి తెలుగు పాటను తీసుకొచ్చిన నిరంతర పాటల శ్రామికుడు వేటూరి జయంతి నేడు(శుక్రవారం).

నిరంతర పాటల శ్రామికుడు..
నాలుగు దశబ్దాల పాటు తెలుగు సినిమా పాటకు సరికొత్త సొగసులు అద్ది.. తెలుగునాట తిరుగులేని గీత రచయితగా వెలుగొందిన వేటూరి 1936లో కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లిలో జన్మించారు. డిగ్రీ వరకు చదువుకున్న వేటూరి తొలుత జర్నలిస్టుగా ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, సినీ హెరల్డ్ పత్రికల్లో దాదాపు పదహారేళ్ళపాటు పనిచేశారు. ఆ సమయంలోనే సినీ రంగంలోని ప్రముఖులు పరిచయం కావడంతో సినిమాలపై దృష్టి సారించారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన 'ఓ సీత కథ' ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలినాళ్ళలో హెచ్‌.ఎమ్‌.రెడ్డి రూపొందించిన 'గజదొంగ' చిత్రానికి వేటూరి మాటలు రాశారు. అలాగే 'స్వర్ణగౌరి' చిత్రానికి కథ, మాటలు, పాటలు రాశారు. 'దేవత' చిత్రం వేటూరికి మంచి పేరును తీసుకొచ్చింది. నిర్మాత భావ నారాయణ, జానపద బ్రహ్మ విఠలాచార్యుల ప్రోత్సాహంతో దాదాపు 42 చిత్రాలకు రచనా సహకారమందించారు. 'భారతి' చిత్రాన్ని వేటూరి రాసిన కథ ఆధారంగానే తెరకెక్కించారు. అలాగే 1967లో వచ్చిన 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రానికి వేటూరి రాసిన పాటలతోనే ఎస్పీ బాలసుబ్రమ్మణ్యం సినీరంగ ప్రవేశం చేయడం విశేషం. వేటూరికి స్వతహాగా సాహిత్యంపై అవగాహన ఉండడంతో తనదైన శైలిలో పాటలు రాసి బాణీలను సైతం కొత్త పుంతలు తొక్కేలా చేశారు. సాంప్రదాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణ సాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి వాటి ద్వారా అందమైన పాటల్ని అలవోకగా రాయడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఇండిస్టీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అగ్ర గీత రచయితగా నిలిచారు. 'శంకరాభరణం' ఎవర్‌గ్రీన్‌ క్లాసికల్‌ చిత్రంగా నిలిచిందంటే అందుకు వేటూరి పాట మహత్యమే. 'అడవి రాముడు', 'సిరిసిరి మువ్వ', 'సాగరసంగమం', 'సప్తపది', 'సీతాకోక చిలుక', 'ముద్దమందారం', 'సితార', 'అన్వేషణ', 'స్వాతిముత్యం' వంటి చిత్రాల్లోనే పాటలన్నీ అప్పట్లో ఒక ఊపుఊపాయి.

భావోద్వేగాలే అక్షరాలుగా..
'పిల్లన గ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు', 'నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మా ఆ కట్టు బడికి తరించేను పట్టుపురుగు జన్మ', 'ఉచ్చ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవ నాడులే' వంటి అలనాటి పాటలు రాసినా, 'ఎదలో గానం పెదవే మౌనం', 'వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా', 'మనసా వాచా, నిన్నే వలచా' వంటి యువతరం పాటలు రాసినా అది ఆయనకే చెందింది. ఎప్పటి కప్పుడు సమాజంలో వస్తున్న మార్పుల్ని గ్రహిస్తూ తన పాటల ద్వారా ఆ మార్పును శ్రోతలకు తెలియజెప్పారు. అంతే కాకుండా ప్రతి పాటలో మానవ సంబంధాలు, భావో ద్వేగాలకు పెద్ద పీట వేశారు. పూర్తి స్థాయి పాటల రచయితగా 1970లో ప్రారంభమైన ఆయన సినీ గీత ప్రస్థానం 2010 వరకు నిర్విరామంగా సాగింది. రెండు వేలకు పైగా చిత్రాల్లో ఐదువేలకు పైగా పాటలను రాసి ఎందరో నూతన రచయితలకు స్ఫూర్తిగా నిలిచారు. వేటూరి పాటలే కాదు పుస్తకాలు కూడా రాశారు. రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింబించే విధంగా 'సిరికా కొలను చిన్నది', సినీ మహనీయుల గొప్పతనాన్ని ప్రస్తుతిస్తూ 'కొమ్మ కొమ్మకో సన్నాయీ' వంటి పుస్తకాలు రాశారు. 1977లో 'పంతులమ్మ' చిత్రానికిగాను రాసిన 'మానస వీణ మధురగీతం' పాటకు తొలిసారి నంది అవార్డునందుకున్నారు. ఆ తర్వాత 'శంకరా నాదశరీరాపరా' పాటకు, 'బృందావని ఉంది', 'ఈ దుర్యోదన దుశ్శాసన', 'పావురానికి పంజరానికి', 'ఆకాశాన సూర్యుడుండడు', 'ఓడను జరిపే', 'ఉప్పొంగెలే గోదావరి' వంటి పాటలకు మొత్తం ఎనిమిది నంది అవార్డులనందుకున్నారు. 'మాతృదేవోభవ'లోని 'వేణవై వచ్చాను' పాటకు మనస్విని పురస్కారం, 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' పాటలకు జాతీయ అవార్డు అందుకున్నారు. అయితే అప్పటి వరకు తెలుగు భాషకు జాతీయ స్థాయిలో క్లాసికల్‌ హోదా లేకపోవడంతో తెలుగు భాషకు క్లాసికల్‌ హోదా కల్పిస్తేనే అవార్డు తీసుకుంటానని చెప్పి, తనకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చారు. దీంతో కేంద్రప్రభుత్వం తెలుగు భాషకు ఆ హోదానిచ్చి ఆయన్ని సముచితంగా గౌరవించింది.

అభిమాన ధనం..
తెలుగు పాటకే స్వర్ణయుగం తీసుకొచ్చిన వేటూరి ఆర్థికంగా స్థిరపడలేకపోయినా అభిమాన ధనంతో నిత్య సంపన్నుడిగా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సినీ ఫార్ములాలు ఏర్పడ్డ తర్వాత జీవన చిత్రాల జోలికి వెళ్ళడం దర్శకనిర్మాతలు మానేశారు. వినోదం ఒక్కటే సినిమాకి పరమావధి చేసుకున్నారు. జనాకర్షణ తద్వారా ధనార్జనే ప్రధానమైన తర్వాత పాటకు చంధస్సు మారిపోయింది. మాటకు విలువ పడిపోయింది. చిరునవ్వులో, నిట్టూర్పులో, కన్నీటిచుక్కలో మౌనమైన మాటకి శక్తిపోయిందని వేటూరి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలెన్నో..

12:56 - January 29, 2016

కృష్ణా : జిల్లా నందిగామ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఎసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు. వసతిగృహాల్లో రిజిస్టర్లు పరిశీలించగా... ఉన్న పేర్ల కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. గిరిజన సంక్షేమ వసతిగృహంలో ఒక్క విద్యార్థి కూడా లేనట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

12:52 - January 29, 2016

వరంగల్‌ : జిల్లాలోని శాయంపేట మండలంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. పిచ్చికుక్కల దాడిలో 15మంది గ్రామస్తులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 3ఏళ్ల పాప పరిస్థితి విషమంగా ఉండడంతో ములుగు సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. శాయంపేట మండలంలో పిచ్చి కుక్కల బెడద తీవ్రంగా ఉండడంతో బయటకు రావాలంటేనే భయం వేస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చికుక్కల దాడిలో గాయపడి చికిత్స చేసుకునేందుకు శాయంపేట పీహెచ్‌సీకి బాధితులు పెద్ద ఎత్తున రావడంతో ఆసుపత్రి రోగులతో నిండిపోయింది. 

12:49 - January 29, 2016

కరీంనగర్ : హెల్మెట్ పెట్టుకోండి.. ప్రాణాలు నిలుపుకోండి.. ఇదే విషయాన్ని అధికారులు ఎప్పటినుంచో ప్రచారం చేస్తున్నా ఎంతమంది పట్టించుకుంటున్నారో మనకు తెలియంది కాదు. అయినా ప్రయాణ వేళ హెల్మెట్ ధరించండంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్‌ ధరించాలనే నినాదంతో దాని ఆకారంలో కూర్చుని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌.. నాగేశ్వరి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు రికార్డ్ సృష్టించారు. ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు. సుమారు 2,500 మంది విద్యార్థులు ప్లకార్డులతో కూర్చొని హెల్మెట్ ప్రయోజనాల గురించి నినాదాలు చేశారు. అయితే దేశంలో ఇలాంటి కార్యక్రమాలు ఎవరూ చేసుండకపోవడంతో ఈ ఫీట్ ఇండియన్ బుక్ ఆఫ్‌ రికార్డులో నమోదైంది. కాలేజీ యాజమాన్యానికి జిల్లా రవాణాశాఖ అధికారులకు నమోదు పత్రాన్ని అందజేశారు. 

 

12:47 - January 29, 2016

హైదరాబాద్ : ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేసుకుని తిన్నారు. తినరా మైమరిచి అంటూ పక్కనే ఉన్న విలేకర్లకు తినిపించారు. అదిరింది వంటకంబూ అంటూ చక్కని కితాబు ఇచ్చారు. పుష్టిగా బోంజేసి పథకం బేషుగ్గా ఉందంటూ పబ్లిక్‌గానే పొగిడేశారు. ఐదు రూపాయల భోజనం అద్భుతం అంటూ అందరి ముందూ పొగడ్తల వర్షం కురిపించారు. ఐతే ఈ పొగడ్తలు తమ కొంప ముంచుతాయంటున్నారు టీ కాంగ్రెస్‌ నేతలు. ఇంతకూ లంచ్‌ సూపర్‌ అంటూ పంచ్‌ ఇచ్చింది ఏవరో కాదు..ఆ పార్టీ సీఎల్పీ నేత జానారెడ్డి. గ్రేటర్‌ వార్‌ టైమ్‌లో జానా చేసిన భోజనం భజనతో టీ కాంగ్రెస్‌ నేతలకు నిద్ర పట్టడం లేదు.

జోరుగా గ్రేటర్‌ ప్రచారం

ఒకపక్క గ్రేటర్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీని అడ్డుకునేందుకు టీ కాంగ్రెస్‌ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యనేతలంతా గల్లీలో తిరుగుతున్నారు. ఐతే ప్రచారానికి దూరంగా ఉన్న టీ కాంగ్రెస్‌ సీఎల్పీ నేత జానారెడ్డి హస్తం నేతలకు ఝలక్‌ ఇచ్చారు. జీహెచ్‌ఎమ్‌సీ ఐదు రూపాయల భోజనం తెప్పించుకుని తిని పథకం సూపర్ అంటూ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. లొట్టలేసుకుని తినడమే కాకుండా అక్కడే ఉన్న మీడియా ప్రతినిధుల‌కూ తినిపించారు జానా. పుష్టిగా తిన్న తర్వాత భోజ‌నం సూపర్‌ అంటూ కితాబి ఇచ్చారు.

ఐదు రూపాయల భోజనంపై జానా పొగడ్తలు

టీఆర్ఎస్ సర్కార్ పథకంలో భాగమైన ఐదు రూపాయల భోజనంపై జానారెడ్డి పొగడ్తల వర్షం కురిపించడం టీ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. జానాగారి లంచ్ అధికార పార్టీకి అనుకూల ప్రచారం అవుతుందని ఆ పార్టీ నేతలు గుసగ‌స‌లాడుకుంటున్నారు. ప్రచారానికి దూరంగా ఉండడమే కాకుండా.. ఇలా వ్యవహరించడమేమిటని గొణుకుంటున్నారు. ఐతే తన లంచ్‌కూ ఓ లెక్కుందంటున్నారు జానారెడ్డి. ఈపథకం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ప్రారంభమైందని చెప్పడానికే ఇలా చేశానంటున్నారాయన. ఐతే ఎవ‌రేం చేశార‌న్నది కాదు ముఖ్యంకాదు...... ఇప్పుడెవరు చేస్తున్నారనేదే పాయింట్‌ అంటున్నాయి కాంగ్రెస్‌ శ్రేణులు. మొత్తానికి జానా పొగడ్తలతో అధికార పార్టీకే లబ్ధి జరుగుతుందనే టాక్‌ కాంగ్రెస్ వ‌ర్గాల్లో వినిపిస్తుంది.

 

 

12:44 - January 29, 2016

హైదరాబాద్ : ఇస్లామిక్‌ స్టేట్‌ తెలుగు రాష్ట్రాల్లోనూ కాలు పెడుతోందా...రెండూ రాష్ట్రాల్లో కార్యకలాపాలకు కసరత్తు చేస్తోందా..? భావజాలంతో పాతుకుపోయేందుకు పన్నాగం పన్నుతోందా..? ఇక్కడి యువకులకు ఉగ్రవాద సంస్థ వలేస్తుందా...? ఇప్పటికే కొందమందిని దేశం మీదకు వదిలేసిందా...?తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి.

భారత్‌లో ఐసిస్‌ కలకలం

ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఐసిస్‌...భారత్‌లోనూ కలకలం రేపుతోంది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఇండియాపై లుక్కేసిందని నిఘా వర్గాలు ఇప్పటికే పసి గట్టాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా కొంతమంది ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించిన ఇంటెలిజెన్స్‌ సంస్థలు..దేశ వ్యాప్తంగా 16 మంది ఉగ్ర అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. ఈ అనుమానితుల కదలికలు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండడం కలకలం రేపుతోంది.

తిరుపతి రైల్వే స్టేషన్‌ కర్నాటక పోలీసులు తనిఖీలు

ఇటీవలే ఒడిషాలో పట్టుబడ్డ ఉగ్రవాది సానుభూతిపరుడిగా భావిస్తున్న రామచంద్రన్‌ సుభాష్‌ తిరుపతిలో సంచరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుభాష్‌ ఇచ్చిన సమాచారం మేరకు కర్ణాటక పోలీసులు తిరుపతి రైల్వే స్టేషన్‌, పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. విష్ణునివాసం అతిథి గృహం వద్ద డ్రైనేజీలో ఓ కవరును స్వాధీనం చేసుకున్నారు. అందులో తుపాకి ఉండటం కలకలం రేపింది. రామచంద్రన్‌ గతంలో తిరుపతి, తిరుమలలో సంచరించినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఐసిస్ సానుభూతిపరుల అరెస్టు..

ఇక హైదరాబాద్‌లో ఐసిస్‌ సానుభూతిపరులుగా భావిస్తున్న పలువురిని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకోవడం..గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులు ఇస్లామిక్‌ స్టేట్‌లో పనిచేస్తున్నారనే వార్తలు రావడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. మొత్తానికి ఐఎస్ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ తెలుగు రాష్ట్రాల్లోనూ దృష్టి సారించిందనే విషయం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

 

 

12:40 - January 29, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అడ్మినిస్ర్టేటివ్‌ కార్యాలయం దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరికి ఎస్సీ, ఎస్టీ ప్రొఫేసర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ మద్ధతుగా నిలిచారు. అయితే విద్యార్థులతో మాట్లాడేందుకు ఇంచార్జ్‌ వీసీ ప్రయత్నించారు. విద్యార్థులు వీసీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేయడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

హెచ్ సీయూలో కొనసాగుతున్న ఉద్రిక్తత

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అడ్మినిస్ర్టేటివ్‌ కార్యాలయం దగ్గర విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీరికి ఎస్సీ, ఎస్టీ ప్రొఫేసర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ మద్ధతుగా నిలిచారు. అయితే విద్యార్థులతో మాట్లాడేందుకు ఇంచార్జ్‌ వీసీ ప్రయత్నించారు. విద్యార్థులు వీసీ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేయడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

బిర్బూం, మాల్దాలో చెలరేగిన హింస...

పశ్చిమబెంగాల్ : బిర్బూం, మాల్దాలో హింస చెలరేగింది. బిర్బూంలో టీఎంసీ ఎమ్మెల్యే హజరా, స్థానిక నేతకు చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్రూపులు పరస్పరం బాంబులు విసురుకున్నారు. మల్దాలో టీఎంసీ మద్దతుదారులపై దుండుగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ టీఎంసీ కార్యకర్త మృతి చెందారు.

 

 

పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ లో ఆఫ్గాన్ యువకుడు అరెస్టు

పంజాబ్ : పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ లో ఆఫ్గాన్ యువకున్ని పోలీసులు అరెస్టు చేశారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తుండడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

 

నందిగామలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో ఎసిబి తనిఖీలు..

కృష్ణా : నందిగామలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో ఎసిబి తనిఖీలు నిర్వహించింది. రికార్డులో ఉన్న వారికంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించిందిం.

 

11:31 - January 29, 2016

మెల్బోర్న్ : ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల తీన్మార్ టీ-20 సమరం..అడిలైడ్ నుంచి..ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ కు చేరుకొంది. మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలివన్డేలో టీమిండియా విజయం సాధించడంతో... ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఈ రెండోమ్యాచ్ డూ ఆర్ డై గా మారింది. సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలంటే మెల్బోర్న్ టీ-20లో కంగారూటీమ్ నెగ్గి తీరాల్సి ఉంది. నేడు జరిగే పోటీ రెండుజట్లకూ మాత్రమే కాదు..సిరీస్ కే కీలకంగా ఉంది

వేడెక్కిన మూడు మ్యాచ్ ల సిరీస్

టీ-20 ప్రపంచ రెండోర్యాంకర్ ఆస్ట్రేలియా, 8వర్యాంకర్ టీమిండియాజట్ల మూడు మ్యాచ్ ల సిరీస్ మరింత వేడెక్కింది. తీన్మార్ సిరీస్ సమరంలోని తొలిమ్యాచ్ లో టీమిండియా 37 పరుగుల సంచలన విజయం సాధించడంతో...సిరీస్ లోని రెండోమ్యాచ్ హాట్ హాట్ గా మారింది.

రెండో మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆసీస్

అడిలైడ్ ఓవల్ లో ముగిసిన తొలిసమరంలో దారుణంగా విఫలమైన కంగారూ టీమ్...మెల్బోర్న్ లో శుక్రవారం జరిగే రెండో మ్యాచ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే...రెండో మ్యాచ్ నెగ్గితీరాల్సి ఉండడంతో..విజయం సాధించి తీరాలన్న కసితో బరిలోకి దిగుతోంది.

పోటీకి సిద్ధమైన ఆస్ట్రేలియా

అడిలైడ్ ఓవల్ మ్యాచ్ లో...టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొనడంలో తడబాటు లాంటి లోపాలను సవరించుకొని..సరికొత్త వ్యూహంతో ధోనీ అండ్ కో పనిపట్టాలని ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా పోటీకి సిద్ధమయ్యింది. సూపర్ హిట్టర్ గ్లెన్ మాక్స్ వెల్ గాయం నుంచి కోలుకొని అందుబాటులోకి రావడంతో కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ కు సరికొత్త శక్తి వచ్చినట్లయ్యింది.

రెండో మ్యాచ్ లో షేన్ టెయిట్‌ కొనసాగింపు..?

తొలిటీ-20లో భారీగా పరుగులిచ్చిన లైట్నింగ్ ఫాస్ట్ బౌలర్ షేన్ టెయిట్‌ను మెల్బోర్న్ మ్యాచ్ కు సైతం కొనసాగించాలని కంగారూ టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సమతూకంతో ఉండడంతో టీమిండియా మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, వన్ డౌన్ విరాట్ కొహ్లీ, రెండోడౌన్ సురేశ్ రైనా చక్కటి ఫామ్ లో ఉండటం, మిడిలార్డర్లో అనుభవజ్ఞులైన యువరాజ్ సింగ్, కెప్టెన్ ధోనీ, యంగ్ గన్ హార్ధిక్ పాండ్యా, అశ్విన్ లతో భారత బ్యాటింగ్ అమేయంగా కనిపిస్తోంది. అడిలైడ్ టీ-20లో 90 పరుగుల స్కోరుతో అజేయంగా నిలిచిన విరాట్ కొహ్లీ మెల్బోర్న్ లోనూ అదేజోరు కొనసాగించాలన్న లక్ష్యంతో ఉన్నాడు.

పూర్తి ఆత్మవిశ్వాసంతో ధోనీ

ఇక బౌలింగ్ లో వెటరన్ నెహ్రా, యువపేసర్ల ద్వయం బుమ్రా, హార్థిక్ పాండ్యా, స్పిన్ విభాగంలో అశ్విన్, రవీంద్ర జడేజా, పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ అందుబాటులో ఉండడంతో...కెప్టెన్ గా ధోనీ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక మెల్బోర్న్ గ్రౌండ్స్ లో జరిగే ఈ పోటీకి 70వేలకు పైగా అభిమానులు హాజరయ్యే అవకాశాలు లేకపోలేదు. టీమిండియాకు చెలగాటం, ఆస్ట్రేలియాకు సిరీస్ సంకటంగా మారిన ఈ పోటీ..ఆఖరి బంతి వరకూ సస్పెన్స్ థ్లిల్లర్లా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

 

పాకిస్తాన్ లో తాలిబాన్లు కాల్పులు... నలుగురు పోలీసుల మృతి

పాకిస్థాన్‌ :  బాలోచిస్థాన్‌లో తాలిబన్లు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు పోలీసులు మృతి చెందారు. క్వెట్టా నగరంలో ఈ ఘటన జరిగింది. సాయుధులైన మిలిటెంట్లు మోటార్‌ సైకిళ్లపై వచ్చి పోలీసుల వ్యాన్‌పై కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు పోలీసులు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రితకి తరలించారు. వీరు చికిత్స పొందుతూ చనిపోయారని సీనియర్‌ పోలీసు అధికారి శుక్రవారం వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తెహ్రిక్‌-ఐ-తాలిబన్‌ సంస్థ ప్రకటన చేసినట్లు అధికారులు వెల్లడించారు.

10:58 - January 29, 2016

ప్రపంచవ్యాప్తంగా బాదం వాడకం ఎక్కువే. బాదం గురించి తెలియని వారుండరు.అందం, ఆరోగ్యం ఇలా అనేక రకాలుగా బాదం మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. అత్యధిక పోషకాలున్న బాదం పప్పును రోజూ కనీసం ఐదారు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బాదంలో మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాటియాసిడ్లు, విటమిన్‌ ఇ ఉంటాయి. ఈ రెండూ గుండెజబ్బుల బారి నుంచి కాపాడుతాయి. బాదంలోని మెగ్నీషియం, బి6 విటమిన్‌- జీవక్రీయకు శక్తినందించి చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతాయి.
అన్ని రకాల ఖనిజలవణాలు, విటమిన్లు వెరసిన సూక్ష్మ పోషకాలు బాదం సొంతం. ఎముకలు ఆరోగ్యంగా, పటుత్వంగా ఉండేందుకు బాదంలోని పాస్పరస్‌, కాల్షియం తోడ్పడతాయి. ఆస్టియోపొరోసిస్‌కు ఇది మంచి నివారణిగా పనిచేస్తుంది..
ప్రతి వందగ్రాముల బాదం పప్పులో రాగి 1.15 మిల్లీగ్రాములు ఆర్గానిక్‌ రూపంలో లభిస్తుంది. ఈ రాగితో పాటు ఇనుము.. ఇతర పోషకాలు కూడా అధికం. బాదం రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతను పోగొడుతుంది.
కడుపునొప్పి, మలబద్దకం సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా బాదం తింటే సమస్య పరిష్కారం అవుతుందంటున్నారు వైద్య నిపుణులు. బాదంలో విరేచనాన్ని కలిగించే గుణం ఉండడమే అందుకు కారణం.
పాయసం చేస్తున్నపుడు బాదం పేస్ట్‌ను రెండుచెంచాలు కలిపి చూడండి. పాయసం చిక్కబడుతుంది. రుచి పెరుగుతుంది. బలవర్థకం కూడా.
వారానికోసారి కొద్దిగా బాదం నూనె, ఉసిరిరసం కలిపి తలకు రాసుకుని మర్దనా చేయాలి. జుట్టు రాలడం, చుండ్రు, రంగు మారే సమస్యలన్నింటికీ దీనివల్ల చక్కటి పరిష్కారం లభిస్తుంది. బాదం ఆకులను మెత్తగా పేస్టులాగా చేసి వాడటం వల్ల మొటిమలను నివారించుకోవచ్చు. 

09:53 - January 29, 2016

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయడం తప్పు కాదని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. చంద్రబాబు హైదరాబాద్ లో ప్రచారం చేయొద్దని కేసీఆర్ అనడం సరికాదని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబుపై కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని హితవు పలికారు. ఒకరి రాజకీయ హక్కును ప్రశ్నించడం న్యాయం కాదని సూచించారు. కేసీఆర్ కు ఎపిలో కూడా ప్రచారం చేసే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే.…

చంద్రబాబు పాలనలో కేసీఆర్ ఏడేళ్లు మంత్రిగా 

ఎపి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు 9 సంవత్సరాల పాలనలో కేసీఆర్ ఏడేళ్లు మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై తీవ్ర గగ్గోలు పెట్టే కేసీఆర్.. అప్పుడు ఏం చేశారు. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ కు గ్లోబల్ ఇమేజ్, గుర్తింపు వచ్చింది. ఐటీ రంగంలో అభివృద్ధి చెందింది. కానీ మంచి నీటి కల్పన, కరెంట్ సరఫరాలో విఫలం చెందింది. ఏ ప్రభుత్వంలో కూడ అన్ని సమస్యలు పరిష్కారం కావు. సమాచార, సాంకేతిక విప్లవం వచ్చిన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నారు. చంద్రబాబు సీఎం కాకముందే బీహెచ్ ఈఎల్, ఈసీఐఎల్ లాంటి పలు ప్రభుత్వ పారిశ్రామిక కంపెనీలు ఉన్నాయి. చంద్రబాబు.. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశాడు.. అందులో అనుమానం లేదు. అయితే ఏ ప్రభుత్వం ఐనా తన పాలనలో చేసిన అభివృద్ధిని మాత్రమే చెప్పుకోవచ్చు… కానీ చేయని వాటిని తాము చేసినట్లుగా చెప్పుకోవడం తప్పు. ఇతర ప్రభుత్వాలతో పోల్చడం కూడా సరికాదు. కానీ ఎవరిటైమ్ లో ఏ అభివృద్ధి జరిగినా.. దాన్ని ఆహ్వానించాలి. 1918 లో ఓయూ ఏర్పడింది.

సీఎంగా ప్రచారం చేస్తే కొంత అసంబద్దత 

చంద్రబాబు టిడిపి అధినేతగా హైదరాబాద్ లో ప్రచారం చేస్తే.. అసంబద్ధం కాదు. జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు ప్రచారం చేయొచ్చు. టిడిపి నేతగా చంద్రబాబుకు 600 జిల్లాలో ప్రచారం చేసే హక్కు ఉంది. కానీ ఎపి సీఎంగా ప్రచారం చేస్తే కొంత అసంబద్దంగానే ఉంటుంది. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మల్యేగా గెలిచారు.. కానీ ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు కదా.. కేసీఆర్ కు ఎపిలో కూడా ప్రచారం చేసే హక్కు ఉంటుంది. పార్లమెంట్ కు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే హక్కు ఉంటుంది.

తెలంగాణకు మొండిచేయి…

దేశంలోని 20 స్మార్ట్ సిటీలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్ లో 3, రాజస్థాన్ లో 2, ఎపిలో 2, తెలంగాణకు మొండిచేయి చూపించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ లలో స్మార్ట్ సిటీలను ప్రకటించ లేదు… ఆ రాష్ట్రాల్లో ఒక్కటి కూడా స్మార్ట్ సిటీకి నోచుకోలేదా..? బిజెపి, ఎన్ డిఎ పాలిత రాష్ట్రాలకు స్మార్ట్ సిటీలను ఇచ్చారు. అందులో ఎన్ డిఎ పాలిత రాష్ట్రాలకు అధికంగా ఇచ్చారు. ఎన్నికలున్న రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీలను ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు రెండు కాదు.. నాలుగు ఇచ్చినా… ఎవరూ వ్యతిరేకించాల్సిన పని లేదు. కానీ తెలంగాణలో స్మార్ట్ సిటీలను ప్రకటించకపోవడం దారుణం. స్మార్ట్ సిటీల ప్రకటనతో తెలంగాణలో బిజెపికి కాస్త ఓట్లు పడే అవకాశాన్ని బిజెపి చేజార్చుకుంది. ఆ కాస్తా ఓట్లు కూడా బిజెపికి పడే అవకాశం ఉండదు.

మెత్త బడిన చంద్రబాబు... 

తెలంగాణలో స్మార్ట్ సిటీను ప్రకటించకపోవడంపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ స్మార్ట్ సిటీ ఇవ్వాలని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారు. కానీ వరంగల్ కు స్మార్ట్ సిటీ ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయలేదు.... రాసి ఉండాల్సింది. గ్రేటర్ ఎన్నిక ప్రచారంలో చంద్రబాబు చాలా సౌమ్యంగా మాట్లాడారు. 'ఓటు నోటుకు విషయంతో చంద్రబాబు మెత్తబడ్డారు... చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు అంతకముందులా దూకుడుగా లేరనే వాదన టిడిపి నేతల్లో వస్తోంది'… అని నాగేశ్వర్ వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..…

 

 

09:26 - January 29, 2016

చిత్తూరు : చంద్రగిరి మండలం రాజమానుగుంట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 130 మంది ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. లొంగిపోవాలంటూ పోలీసులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. దీంతో కూలీలు పరాయ్యారు. రూ. 2 కోట్ల విలువైన 104 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి పరారైన కూలీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

09:18 - January 29, 2016

అక్షయ్ కుమార్‌ కథానాయకుడిగా ఇటీవల విడుదలైన 'ఎయిర్‌లిఫ్ట్‌' చిత్రానికి వినోదం పన్ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని నటులు అక్షరుకుమార్‌, నిమ్రత్‌కౌర్‌లు ట్విట్టర్‌ఖాతా ద్వారా వెల్లడి చేస్తూ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కువైట్‌లో జరిగిన ఓ వాస్తవ సంఘటనలో దాదాపు లక్షా 75వేల మంది ప్రజల్ని కాపాడిన భారతీయుడి ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం మంచి కలెక్షన్లతోపాటు విమర్శకుల ప్రశంసల్ని సైతం పొందింది.

09:13 - January 29, 2016

కృష్ణా : విజయవాడ విజయనగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఆటోనగర్‌లో పాత ఇనుము వ్యాపారం చేసుకునే రంగస్వామి ఈ కాలనీలో నివాసం ఉంటున్నారు. రాత్రి వంట చేసుకున్న తర్వాత వీరి ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్ ద్వారా గ్యాస్ లీకయింది. ఉదయం వరకూ ఇల్లంతా వ్యాపించింది. ఉదయం సిగరెట్‌ తాగేందుకు రంగస్వామి అగ్గిపుల్ల వెలిగించారు. వెంటనే పేలుడు జరిగి మంటలు అంటుకున్నాయి. ఇల్లు మొత్తం ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడ్డ రంగస్వామిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీకేజ్ వల్లే ఈ పేలుడు జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బాంబ్‌స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. 

విజయవాడలోని ఓ ఇంట్లో పేలుడు...

కృష్ణా : విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ ఇట్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుని పరిస్థితి విషమంగా ఉంది. 

పిచ్చికుక్క దాడి...పదిమందికి గాయాలు

వరంగల్ : జిల్లాలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా పిచ్చికుక్కల దాడిలో 10 మంది వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లా శాయంపేట మండలం సాధనపల్లిలో చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం శాయంపేట ఆస్పత్రికి తరలించారు.

08:45 - January 29, 2016

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని సమస్యలకు పరిమితమై ప్రచారం చేయాలని వక్తలు సూచించారు. నగరంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి తాడూరు శ్రీనివాస్, టీడీపీ అధికార ప్రతినిధి విద్యా సాగర్ లు పాల్గొని, మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనుల గురించి చర్చకు వస్తున్నాయని గుర్తు చేశారు. నరగంలోని డ్రైనేజీ విషయంలో కొత్తగా చేసింది ఏమీ లేదని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

 

120 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

చిత్తూరు : చంద్రగిరి మండలం రాజమానుగుంట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 130 మంది ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. లొంగిపోవాలంటూ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కూలీలు పరాయ్యారు. 120 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూలీల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

08:04 - January 29, 2016

ఎంబీసీలు ఐక్యమవ్వాలని ఎంబీసీ సిద్ధాంతకర్త కోప్రాగా ప్రసిద్ధులైన కోలపూడి ప్రసాద్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తమకున్న హక్కులు, చట్టాలను తెలుసుకోవాలన్నారు. తమ సమస్యల పరిష్కారానికి పోరు చేయాలని పిలుపునిచ్చారు. 'ఎంబీసీలు గళం విప్పుతున్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో తమకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఇంతకీ ఎంబీసీలంటే ఎవరు? ఎంబీసీలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతోంది? ఎంబీసీలకు ప్రత్యేక గుర్తింపు రాకుండా అడ్డుపడుతున్న అంశాలేమిటి? ఎంబీసీలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం వల్ల ఆయా వర్గాలకు కలిగే లాభాలేమిటి? ఎంబీసీ కులాలను ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్స్ ఎంత వరకు సహేతుకం? ఎంబీసీల ఉద్యమం ఓబీసీలకు వ్యతిరేకమన్న వాదన ఎంత వరకు కరెక్ట్? ఇలాంటి అంశాలపై కో.ప్ర మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం…

 

07:58 - January 29, 2016

త్రివేండ్రం : కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ మెడకు సోలార్‌ స్కాం చుట్టుకుంటోంది. తాజాగా చాందీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని త్రిసూరు కోర్టు పోలీసులను ఆదేశించింది. విపక్షాలు సిఎం రాజీనామా కోరుతున్న నేపథ్యంలో కోర్టు ఆదేశం చాందీకి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది.

చాందీపై సరితానాయర్ ఆరోపణలు

కేరళ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీకి సోలార్‌ స్కాం ఉచ్చు బిగుస్తోంది. సిఎం వ్యక్తిగత సిబ్బంది ఏడు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేశారని ఈ కేసులో ప్రధాన నిందితురాలు సరితా నాయర్‌ జస్టిస్‌ శివరాజన్‌ కమిటీ ముందు ఆరోపించారు. కోటి 90 లక్షల రూపాయలను సిఎం వ్యక్తిగత సిబ్బందికి ఇచ్చానని, మంత్రి మహమ్మద్‌కు 40 లక్షలు లంచం ఇచ్చానని నాయర్‌ పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కేసును విచారిస్తున్న త్రిసూర్‌ కోర్టు - ప్రాథమిక ఆధారాలను పరిశీలించి -ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

చాందీ రాజీనామా కోరుతూ లెఫ్ట్‌ఫ్రంట్‌ ఆందోళన

మరోవైపు చాందీ రాజీనామా కోరుతూ లెఫ్ట్‌ఫ్రంట్‌ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆందోళనకారులు సెక్రటేరియట్‌ వద్ద బారికేడ్లను తొలగించి లోనికి వెళ్లేందుకు చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. భాష్పవాయువు ప్రయోగించారు. సరితా నాయర్‌ ఆరోపణల నేపథ్యంలో ఊమెన్‌ చాందీ సోమవారం న్యాయ విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. 11 గంటల పాటు ముఖ్యమంత్రిని కమిటీ విచారించింది. సరితా నాయర్‌ తరపు లాయర్‌ లై డిటెక్టర్‌ టెస్ట్‌ కోసం చేసిన ప్రతిపాదనను చాందీ నిరాకరించారు.

నా పై ఆరోపణలు నిరాధారం : చాందీ

తనపై, తన కార్యాలయ సిబ్బందిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ కక్షతోనే చేశారని ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ పేర్కొన్నారు. ఈ ఆరోపణల వెనక మద్యం లాబీయింగ్‌ ఉందన్నారు. కేరళలో బార్లపై ప్రభుత్వం నిషేధం విధించిందని, దీనిపై వారికి ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురు కావడంతో ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారని చాందీ ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు సిబ్బందిని సస్పెండ్‌ చేసినట్టు సిఎం తెలిపారు. బార్‌ స్కాం ఆరోపణలతో మంత్రులు కెఎం మణి, కె బాబు రాజీనామా చేశారని, సోలార్‌ స్కాంకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా వారి బాటలోనే తగు నిర్ణయం తీసుకోవాలని సిపిఎం సీనియర్‌ నేత అచ్యుతానందన్‌ సూచించారు.

సోలార్‌ స్కాంలో ప్రధాన నిందితులు సరితా నాయర్, రాధా కృష్ణన్‌

సోలార్‌ స్కాంలో ప్రధాన నిందితులైన సరితా నాయర్, రాధా కృష్ణన్‌-తమకున్న రాజకీయ పలుకుబడితో సౌర విద్యుత్‌ పానెల్‌ను చవకగా అందిస్తామని నమ్మించి పారిశ్రామికవేత్తల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేశారు. సరిత బెయిలుపై బయటకు రాగా...భార్య హత్య కేసుకు సంబంధించి రాధాకృష్ణన్‌ ఇంకా జైలులోనే ఉన్నాడు. ఈ సంవత్సరం కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండడంతో ప్రతిపక్షాలు సోలార్‌ స్కాంను అస్త్రంగా చేసుకుని ఊమెన్‌ చాందీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నాయి.

 

 

07:51 - January 29, 2016

హైదరాబాద్ : టీ-సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితుల భూ పంపణీ కార్యక్రమం నత్తనడక నడుస్తోంది. పథకం ప్రారంభించి ఏడాదిన్నర గడచిపోయినా... నిర్ణీత లక్ష్యంలో 28 శాతానికి కూడా చేరుకోలేదు. దళితులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ భూములు లేవు. ప్రైవేటు భూములు కొనుగోలు చేసి పంపిణీ చేద్దామన్నా ... ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని జిల్లా కలెక్టర్లు... విషయాన్ని సీఎస్ దృష్టికి తెచ్చారు.

పేదలకందని భూ పంపిణీ

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే ప్రజా సంక్షేమమన్నారు. ఉద్యమ సమయంలో హామీల వర్షం కురిపించారు. భూమి లేని దళితులకు మూడెకరాలు ఇస్తామన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లోనూ... ఇదే ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లి పవర్‌లోకి వచ్చారు. కానీ దళితుల సంక్షేమంపై మాత్రం కారు స్పీడ్‌గా పోవడం లేదు. గులాబీ దళపతి హామీలు ఆచరణ రూపంలోకి వచ్చే సరికి నత్తనడకగా సాగుతున్నాయి. 2014 ఆగస్టు 15న అట్టహాసంగా భూ పంపిణీ పథకాన్ని ప్రారంభించినా... ఆ ఫలాలు మాత్రం పేదలకు అందనంత దూరంలోకి ఉన్నాయి.

భూ పంపిణీపై సీఎస్ ఆరా....

సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరుతెన్నులు పరిశీలించేందుకు జిల్లాల పర్యటనలకు వెళుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ... దళితులకు భూ పంపిణీ కార్యక్రమం అమలుపై ఆరా తీస్తున్నారు. భూ పంపిణీపై ఏటేటా లక్ష్యాలు నిర్ణయిస్తున్నా... వాటిని సాధించలేకపోవడంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసిన రాజీవ్‌ శర్మ.. పథకం అమల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

సమస్యలను సీఎస్‌ దృష్టికి తీసుకొచ్చిన కలెక్టర్లు

దళితుల భూ పంపిణీ కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లు తాము ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను సీఎస్‌ దృష్టికి తెచ్చారు. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు లేని విషయాన్ని ప్రస్తావించారు. ఎకరానికి 2 నుంచి 7 లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేటు భూములు కొనుగోలు చేద్దామాన్నా... ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంలేదని చెప్పారు. భూ పంపిణీ కోసం ఎస్‌సీ కార్పొరేషన్‌ 2,878 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. వీరి కోసం 8,634 భూమి కావాల్సి ఉంది. కానీ భూమి లభించకపోవడంతో ఇంతవరకు 903 మంది దళితులకు 2,449 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు.

భూపంపిణీలో మహబూబ్‌నగర్‌ కొద్దిగా మెరుగు

తెలంగాణలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే భూపంపిణీలో ఒక్క మహబూబ్‌నగర్‌ కొద్దిగా మెరుగా ఉంది. ఈ జిల్లాలో 54 శాతం లక్ష్యాన్ని సాధించారు.రంగారెడ్డి జిల్లాలో కేవలం 12 మందికి 35.39 ఎకరాలు పంచారు. భూముల కొనుగోలు కోసం 413.70 కోట్ల రూపాయలను అందుబాటులో ఉంచినా... ఇంతవరకు 103.82 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశారు. పంపిణీ చేసిన భూమిలో కూడా 659 మంది లబ్ధిదారులకు 1814 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చేసి, పట్టాలు ఇచ్చారు. మిగిలిన భూమికి రిజిస్టర్‌ చేయాల్సి ఉంది. భూ పంపిణీతోపాటు మిగిలిన సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని ఆదేశించారు.

 

07:42 - January 29, 2016

హైదరాబాద్ : 'హెల్మెట్ లేకుండా రోడ్డెక్కుతున్నారా..? శిరస్త్రాణం కొనడం మర్చిపోయారా..? అయితే మీ ఆటలిక సాగవు. మీ కోసం కాదు..! మీ వాళ్ల కోసమైనా హెల్మెట్ ధరించండి. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు'. అందుకే హెల్మెట్‌ లేకుండా రయ్‌ రయ్‌ మంటూ రోడ్లపై దూసుకెళ్లే వాహనదారులకు ఏపీ సర్కార్‌ స్పీడు బ్రేకులు వేస్తోంది. ఇవాళ్టి నుంచి శిరస్త్రాణాన్ని ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.

జనవరి 29 నుంచి అమలు

ఏపీలో ద్విచక్ర వాహనాదారులు హెల్మెట్ ధరించాల్సిన సమయం అసన్నమైంది. హెల్మెట్‌ నిబంధన అమలు చేయాల్సిందే అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో జనవరి 29నుంచి హెల్మెట్‌ నిబంధనను తప్పకుండా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది.

ద్విచక్ర వాహనదారులకు అవగాహన

హెల్మెట్‌ నిబంధన అమలుపై ఇప్పటికే ట్రాఫిక్‌ పోలీసులు రోడ్ సేఫ్టీ వారోత్సవాల పేరిట ద్విచక్ర వాహనదారులకు కొంత అవగాహన కల్పించారు. విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్‌ పోలీసులు, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా కలిసి హెల్మెట్‌ వాడకంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అయితే నిబంధనలు అతిక్రమించే వారిపై ఇకమీదట వార్నింగ్‌లు, అపరాధ రుసుములు, జరిమానాలు విధిస్తామని,.అప్పటికీ హెల్మెట్‌ పెట్టుకోకపోతే వాహనదారుడి లైసెన్స్ రద్దు చేస్తామని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మూణ్నాళ్ల ముచ్చటగా హెల్మెట్ల వాడకం

ద్విచక్ర వాహనం కొనుగోలు చేసే సమయంలోనే కొనుగోలుదారుడికి నాణ్యమైన హెల్మెట్ అందివ్వాలని 2010లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అది అమల్లోకి రాలేదు. దీంతో హెల్మెట్ల వాడకం మూణ్నాళ్ల ముచ్చటగా తయారైంది. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హెల్మెట్‌ నిబంధనను ఖచ్చితంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది.

 

07:34 - January 29, 2016

హైదరాబాద్ : రోహిత్‌ ఆత్మహత్యపై రిటైర్డు జడ్జీతో విచారణ చేపట్టేందుకు హెచ్ ఆర్డీ ఓ కమిటీ వేసింది. ఇక యూనివర్సిటీలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, నేటి నుంచి క్లాసులు కూడా మొదలవుతాయని హెచ్ సీయూ తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ ప్రకటించారు. మరోవైపు విద్యార్థులు మాత్రం న్యాయపోరాటాన్ని ఆపేది లేదంటూ స్పష్టం చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.

యూనివర్సిటీలో క్లాసులు యధాతథం

యూనివర్సిటీలో క్లాసులు యధాతథంగా జరుగుతాయని హెచ్ సీయూ తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ ప్రకటించారు. యూనివర్సిటీలో తాజా పరిస్థితిపై వీసీ శ్రీవాత్సవ ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా రోహిత్‌ ఆత్మహత్యపై విచారణ కొనసాగుతుందని శ్రీవాత్సవ పేర్కొన్నారు. వర్సిటీలో కుల వివక్ష ఉందన్న ఆరోపణలు అవాస్తవం అన్నారు.

రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ

ఇక గతంలో సెంథిల్‌ కుమార్‌ ఆత్మహత్యకు తాను బాధ్యుడిని కాదని, ఈ అంశంపై సీఐడీ విచారణ జరిపిందని శ్రీవాత్సవ తెలిపారు. ఇక ఘటనపై అలహాబాద్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపాలని కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయించింది.

ముగ్గురు ఉపాధ్యాయులు ఒకరోజు నిరాహార దీక్ష

మరోవైపు హెచ్‌సీయూలో నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ ఫోరంకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఒకరోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. వీసీ అప్పారావుపై కేసు నమోదు చేయడంతో పాటు తాత్కాలిక వీసీని సైతం తొలగించాలని వీరు డిమాండ్‌ చేశారు. మరోవైపు నేటి నుంచి తరగతి గదులను మొదలుపెట్టేందుకు వర్సిటీ అధికారులు ప్రయత్నించగా, విద్యార్థులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే రోహిత్‌ మృతికి వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సబ్‌ కమిటీ పూర్తి బాధ్యత వహించాలని ఎస్సీ, ఎస్టీ స్టాఫ్‌ ఫోరం డిమాండ్‌ చేసింది.

 

 

నేడు భారత్, ఆస్ట్రేలియా రెండో టీ-20 మ్యాచ్

మెల్ బోర్న్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో టీ-20 మ్యాచ్ జరుగనుంది. మెల్ బోర్న్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు రెండో రోజు 'వన్ హైదరాబాద్ కూటమి' ప్రచారం..

హైదరాబాద్ : నేడు రెండో రోజు గ్రేటర్ లో 'వన్ హైదరాబాద్ కూటమి' ప్రచారం చేయనుంది. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొననున్నారు.

 

07:16 - January 29, 2016

హైదరాబాద్ : పారిశ్రామిక వేత్తలకు రాయితీల మీద రాయితీలు. సామాన్యులకు మాత్రం షాకుల మీద షాకులు. పెట్టుబడి దారులకు రెడ్ కార్పెట్ వేస్తున్న పాలకులు... పేదలకు మాత్రం రెడ్ సిగ్నల్స్ ఇస్తున్నారు. ప్రజారోగ్య తెలంగాణలో సహాయ నిధి... నిస్సహాయక నిధిగా మారుతోంది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు దొడ్డిదారిలో కోత పెడుతోంది కేసీఆర్ సర్కార్‌. పేదలకు వైద్య సేవలు... అందని ద్రాక్షన్న చందంగా మారుతోంది.

సామాన్యులపై సర్కార్ సవతితల్లి ప్రేమ

ధనిక రాష్ట్రమంటూ గొప్పలు… ఖజానా లేదంటూ నిధుల కోతలు...తెలంగాణ రాష్ట్రంలో పాలకుల తీరిది. సామాన్యులపై సర్కార్ సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తోంది. పేద, మధ్య తరగతి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్‌కు కష్టాలు వీడటం లేదు. రోగులకు అపన్న హస్తం అందించే సహాయనిధికి ప్రభుత్వమే కోతల మీద కోతలు విధిస్తోంది.

సీఎంఆర్ ఎఫ్ కేటాయింపులకు కోత

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎంఆర్ ఎఫ్ కేటాయింపులకు కోతపడుతూనే ఉంది. రాష్ట్ర విభజనకు ముందు... సీఎం సహయ నిధి కింద రోగికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేది. పేషెంట్ హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్‌ అయ్యేవరకు ఖర్చులన్నింటినీ సర్కారే చెల్లించేది. ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ... కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఇంత వరకు బాగానే ఉంది. అవినీతి పరులు, అక్రమార్కుల భరతం పట్టాల్సిందే. సీఐడీ ఎంక్వైరీ చేపట్టి ఏడాదైనా... ఇంత వరకు ఒక్క నిందితుడిని గుర్తించలేదు. కానీ అక్రమాలంటూ సీఎంఆర్ ఎఫ్ నిధుల్లో భారీ కోతలు విధించింది.

కేవలం లక్ష రూపాయలే మంజూరు

రోగికి అయిన ఖర్చుతో సంబంధం లేకుండానే కేవలం లక్ష రూపాయలే మంజూరు చేయాలని టీ-సర్కార్ నిర్ణయించింది. తాజాగా ఆ లక్షకు గండికొట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. వైద్యసేవల ఖర్చులు, బిల్లులతో సంబంధం లేకుండా... కేవలం 50 వేలనే మంజూరు చేస్తోంది. సర్కార్ సహాయం కోసం... మారుమూల గ్రామాల నుంచి పేదలు.. రోజూ సచివాలయానికి వస్తారు. హాస్పిటల్ బిల్లులు, ధువపత్రాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే రికమండేషన్ లెటర్ జతపర్చి... గంటలతరబడి క్యూ లైన్లలో నిలబడి అప్లై చేస్తారు. ఇంత కష్టపడ్డా పాలకులు చిన్నచూపు చూడటం పట్ల పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం సహయ నిధుల్లో కోతలు

ఇక సీఎం సహయ నిధి కుదింపుపై సర్కార్ వాదన విచిత్రంగా ఉంది. ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న వాళ్లు కూడా... సీఎంఆర్ ఎఫ్ కోసం అప్లై చేస్తున్నారని చెబుతోంది. దరఖాస్తుదారులను తగ్గించేందుకే సహయనిధిని కుదించామంటోంది. అంతేకాకుండా దాతల విరాళాలు కూడా రావడం లేదట. మిషన్ కాకతీయ, గ్రామాల దత్తత వంటి కార్యక్రమాలకే ఫండ్స్‌ వెళ్తున్నాయట. అందుకే సీఎం సహయ నిధుల్లో కోతలు విధించినట్లు సమాచారం.

పేదలకు వైద్యసేవల్ని దూరం చేసినట్లే

ప్రభుత్వం చెబుతున్న కారణాలేమైనా..? సీఎంఆర్ ఎఫ్ నిధుల్లో కోతలు విధించడం అంటే... పేదలకు వైద్యసేవల్ని దూరం చేసినట్లే. ప్రయివేట్ ఆసుపత్రుల్లో లక్షలకు లక్షలు బిల్లులు వసూలు చేస్తుంటే... కార్పొరేట్ దోపిడీకి కళ్లెం వేయాల్సిన పాలకులు మాత్రం... సామాన్యుడికి అందించే సహాయనిధికి తూట్లు పొడవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య శ్రీ నిబంధనలను సరళతరం చేయడంతో పాటు... రోగి వైద్య ఖర్చలన్నింటినీ ప్రభుత్వమే భరించాలి. అప్పుడే కేసీఆర్‌ చెబుతున్న ఆరోగ్య తెలంగాణ సాధ్యం.

 

 

07:04 - January 29, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 20 స్మార్ట్‌ సిటీలను ప్రకటించింది. తొలి విడత స్మార్ట్‌ సిటీల జాబితాలో విశాఖపట్నం, కాకినాడలకు చోటు దక్కింది. తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపింది.

స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. స్మార్ట్‌ సిటీ ఛాలేంజ్‌ తొలి జాబితాలో టాప్‌ 20 నగరాల పేర్లను కేంద్రం ప్రకటించింది. భువనేశ్వర్, పుణె, జైపూర్‌, సూరత్, కోచి, అహ్మదాబాద్‌, జబల్‌పూర్‌, విశాఖపట్నం, సోలాపూర్, ధవన్‌గిరి, ఇండోర్‌, న్యూఢిల్లీ ప్రాంతం, కోయంబత్తూర్, కాకినాడ, బెల్‌గామ్‌, ఉదయ్‌పూర్‌, గువహటి, చెన్నయ్‌, లూధియానా, భోపాల్‌ నగరాలను ఎంపిక చేశారు. ఇందులో నాలుగు రాజధాని నగరాలున్నాయి.

స్మార్ట్‌ సిటీల జాబితాలో భువనేశ్వర్‌ తొలిస్థానం

స్మార్ట్‌ సిటీల జాబితాలో భువనేశ్వర్‌ తొలిస్థానం దక్కించుకోగా 8 వ స్థానంలో విశాఖపట్నం, కాకినాడ 14 వస్థానంలో ఉంది. స్మార్ట్‌ సిటీ ఛాలేంజ్‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కలేదు. ఒక పాయింట్ తేడాతో వరంగల్ అవకాశం కోల్పోయింది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌లోని నగరాలకు కూడా తొలి జాబితాలో చోటు లభించలేదు.

ఏప్రిల్‌లో రెండో జాబితా

స్మార్ట్‌ నగరాల్లో తాగు నీరు, విద్యుత్‌, శానిటేషన్, చెత్తకోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఐటితో అనుసంధానం, ఈ గవర్నెన్స్‌, రోడ్లు తదితర వసతులుంటాయి. ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని ఆధునికంగా అభివృద్ధి చేస్తారు. స్మార్ట్‌ సిటీల నిర్మాణాల వల్ల నగర ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడతాయని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల ఎంపికలో పారదర్శక విధానం పాటించామన్నారు. ఏప్రిల్‌లో రెండో జాబితాను ప్రకటిస్తామని ఇందుకు ఆయా నగరాలు పోటీ పడాలని మంత్రి పేర్కొన్నారు.

స్మార్ట్‌ సిటీల లిస్టులో మొత్తం 97 నగరాలు

స్మార్ట్‌ సిటీల లిస్టులో మొత్తం 97 నగరాలున్నాయి. ఆకర్షణీయ నగరంగా ఎంపికయ్యేందుకు కేంద్రం పెట్టిన నిబంధనలను పూర్తి చేసిన 20 నగరాలకు స్మార్ట్‌సిటీల తొలి జాబితాలో స్థానం దక్కింది. వచ్చే ఐదేళ్లకు గాను వంద స్మార్ట్ సిటీల కోసం కేంద్రం 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టనుంది.

 

 

06:58 - January 29, 2016

హైదరాబాద్ : రాజకీయాల్లో రాణించాలన్నా..రాజకీయ పదవులు పొందాలన్నా..ప్రజలకు సేవ చేసి మెప్పు పొందాల్సిందే. ఇది ఒక‌ప్పటి మాట‌. కానీ ప్రస్తుతం ప‌రిస్థితులు తారుమార‌య్యాయి. ఎన్ని నేరాలు చేస్తే అంత గొప్ప నాయకుడవుతాడు. పోలీస్టేషన్లలో ఎన్ని ఎక్కువ కేసులు నమోదైతే అన్ని గొప్ప పదవులను పొందవచ్చు. ప్రస్తుత రాజకీయాల్లో నెలకొన్న తాజా పరిస్థితి ఇది. వీధి రౌడీ నుండి మొదలయ్యే రాజకీయ నాయకుల చరిత్ర..కార్పొరేటర్ స్థాయికి పెరిగింది. బల్దియా ఎన్నికల బరిలో పోటికి దిగిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే..నేర‌చ‌రిత్ర ఉన్న వాళ్ల సంఖ్య చాంతాడంత ఉంది.

నేర చరిత్ర ఉన్నవాళ్లకే ప్రాధాన్యత

మనకు ఏదైనా ఉద్యోగం రావాలంటే చదివిన చదువును చూసి కొలువిస్తారు. కానీ చట్టసభల్లో అడుగు పెట్టాలంటే మాత్రం మొట్ట మొదటి అర్హత నేరాల సంఖ్య ఎంత ఉంటే అంత తొందరగా ప్రజా ప్రతినిదులుగా ఎన్నిక కావచ్చని మన నేతలు ఋజువు చేస్తున్నారు. సేవా గుణమున్న నేతల కంటే నేర చరిత్ర ఉన్న నాయకులే చట్ట సభల్లోకి అడుగుపెట్టి ప్రజలను శాసిస్తున్నారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించినట్టే ఎలక్షన్‌ టైంలో కోట్లాది రూపాయల్ని కుమ్మరించి పార్టీ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారు. అంతే కాదు ఎన్నికల ప్రచారంలో విచ్చల విడిగా డబ్బు, మద్యాన్ని పంపిణీ చేసి ప్రజా ప్రతినిధిగా విజయం సాధించి చట్ట సభల్లోకి అడుగు పెడుతున్నారు. అటు రాజకీయ పార్టీలు సైతం ప్రజాసేవ చేసే నాయకుల కంటే గెలుపు గుర్రాలను చూసుకొనే టిక్కెట్లను ఇస్తున్నారు.

అత్యధికంగా టీఆర్ఎస్ 14 మంది

గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థకు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో నేర‌చరితులే అధికంగా పోటీకి దిగారు. పార్టీల‌ పరంగా చూస్తే..నేర చరిత్ర ఉన్ననేత‌ల్లో అత్యధికంగా టీఆర్ఎస్‌కు చెందిన లీడ‌ర్లే 14 మంది ఉన్నారు. పోలీసు రికార్డును పరిశీలించి తెలుసుకొంటే వీరి నేర‌చ‌రిత్ర బ‌య‌ట ప‌డింది. ఇక 13మందితో రెండొవ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీతో పాటు టిడిపి అభ్యర్థులు దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థుల్లో నలుగురు నేర‌చ‌రిత్ర క‌లిగిన వారున్నారు. ఎన్‌బిటి నేత‌ల్లో ఇద్దరిపై కేసులు ఉండగా..15మంది ఇతరులపై కేసులున్నాయి. సాక్షాత్తు మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ పైనే ఏడు కేసులు నమోదైనట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఇలా అన్ని పార్టీలను లెక్కేస్తే..బల్దియా బరిలో దిగుతున్న నేరగాళ్ల సంఖ్య మొత్తం 72కు చేరుకుంది.

నేరగాళ్లను ఎన్నుకోవద్దంటున్న ప్రజాసంఘాలు

నేరచరిత్ర ఉన్న వారు చట్ట సభల్లోకి ప్రవేశించకుండా ఎన్ని చట్టాలు చేసినా వాటిని రాజకీయ పార్టీలు పట్టించుకోవడంలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అర్థబలం, అంగబలం ఉన్న నాయకులకే టిక్కెట్లను కేటాయిస్తున్నారు కానీ..వారి నేర చరిత్రను పరిగణలోకి తీసుకోవడం లేదు. స్థానికంగా తమకున్న బలాన్ని ప్రదర్శిస్తూ అధికారంలోకి వస్తున్నారు. అందుకే రోజు రోజుకు రాజకీయాల్లో నేరస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే నేరచరిత్ర ఉన్న అభ్యర్థులను ఎన్నుకోవద్దని ప్రజాసంఘాలు పిలుపునిస్తున్నాయి.

 

 

 

నేటి నుంచి హెచ్ సీయూలో పరిశోధనలు

హైదరాబాద్ : నేటి నుంచి హెచ్ సీయూలో పరిశోధనలు ప్రారంభం కానున్నాయి. వర్సిటీలోని అన్ని విభాగాలు పని చేయనున్నాయి. రెండో రోజుల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. 

Don't Miss