Activities calendar

30 January 2016

వ్యాపం రిటైర్డ్ అధికారుల ఇళ్లలో సోదాలు.

భోపాల్ : వ్యాపంలో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారుల ఇళ్లలో సీబీఐ శనివారం అధికారులు సోదాలు చేపట్టింది. పలు దస్త్రాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఘనంగా రవీనా కుమార్తె వివాహం..

హైదరాబాద్ : బాలీవుడ్ నటి రవీనా టాండన్ చిన్న కుమార్తె ఛాయ వివాహం ఈనెల 25న గోవాలోని ఓ రిసార్ట్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన పలు చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

ఏపీ ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్..

హైదరాబాద్ : ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఎన్.రమేష్ కుమార్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 

21:33 - January 30, 2016

కెనడా : హిమపాతం వణికిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో భారీ హిమపాతం వల్ల జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న మంచు కారణంగా ఐదుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో విపరీతంగా మంచు కురవడంతో పాటు వర్షాలుడ పడ్డాయి.

21:32 - January 30, 2016

విశాఖపట్టణం : ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సీఎం చంద్రబాబు తొడగొట్టడమేంటనీ ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం. విశాఖలో ప్రొ.కబడ్డీ లీగ్ పోటీలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తొడ కొట్టారు. తెలుగు టైటాన్స్, యు ముంబ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. తొడ ఎలాగొట్టారో వీడియోలో చూడండి. 

21:29 - January 30, 2016

పాకిస్తాన్ : పఠాన్‌కోట్ ఉగ్రదాడి ఘటన.. భారత్, పాకిస్థాన్ శాంతి చర్చల ప్రక్రియకు విఘాతం కలిగించిందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఇరు దేశాల సంబంధాలు సరైన దిశలో సాగుతున్న సమయంలో ఈ ఉగ్రదాడి ఘటన జరగడం ప్రతికూల ప్రభావం చూపించిందని షరీఫ్‌ అంగీకరించారు. పాకిస్థాన్ రేడియాలో ఈ వ్యాఖ్యలు చేశారు. పఠాన్‌ కోట్‌ దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య జరగాల్సిన దౌత్య చర్చలు వాయిదా పడ్డాయి.

 

21:28 - January 30, 2016

కోల్ కతా : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కామ్‌దుని సామూహిక అత్యాచారం, హత్య కేసులో కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముగ్గురుకి మరణ శిక్ష విధించింది. ఆరుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. ఇవాళ శిక్షలు ఖరారుచేసింది. ఈ కేసులో మరో ముగ్గురికి జీవిత ఖైదును విధించింది. 2013లో కామదునికి కెందిన ఓ కాలేజి విద్యార్థిని కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, ఆపై హతమార్చిన ఘటన సంచలనం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దీంతో బాధిత కుటుంబీకులను పరామర్శించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ న్యాయ విచారణకు ఆదేశించారు. అయితే ఇటీవల నిందితుల్లో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడం దుమారం రేగింది. వారిద్దరు పాలకపార్టీకి చెందినవారు కావడం వల్లే నిర్దోషులుగా బయటపడేలా పోలీసులు కేసు రూపొందించారని రాష్ట్ర వామపక్ష సంఘటన చైర్మన్‌ బిమన్‌ బసు ఆరోపించారు.

21:24 - January 30, 2016

విజయవాడ : కాపులు ఎదగకుండా సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. తునిలో రేపు కాపు బహిరంగ సభ పెట్టుకుంటుంటే..దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 

21:22 - January 30, 2016

హైదరాబాద్ : పూణేకు చెందిన భారతీయ ఛాత్ర సంసద్‌ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారాన్ని అందించింది. రాష్ట్ర విభజన జరిగిన క్లిష్ట పరిస్థితుల్లో నూతన రాష్ట్ర ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గానూ సీఎం చంద్రబాబుకు ఈ పురస్కారం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. 

21:21 - January 30, 2016

హైదరాబాద్ : దేశంలో కుల వివక్ష నిర్మూలనకు చట్టం తీసుకు రావాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. భారతీయ జనతాపార్టీ.. తన భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలంటూ.. హెచ్ సీయూ విద్యార్థులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా రాహుల్‌ కూడా సుమారు 18 గంటల పాటు దీక్ష చేశారు. రోహిత్‌ ఆత్మహత్యపై హెచ్‌సీయూలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం ఉద్యమం మరింత ఉధృతమైంది. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిరాహార దీక్షకు కూర్చున్నారు. శుక్రవారం అర్ధరాత్రి క్యాంపస్‌కు చేరుకున్న ఆయన విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రోహిత్ తల్లి రాధికను కలిసి పరామర్శించారు.

దీక్షలో పాల్గొన్న సంగ్మా..
కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. భాజపా తన భావజాలాన్ని జనంపై రుద్దడానికి యత్నిస్తోందని ఆరోపించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ చట్టం తీసుకురాకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నేషనల్‌ పీపుల్ పార్టీ నేత, మాజీ లోక్‌సభ స్పీకర్ పీఏ సంగ్మా కూడా నిరాహార దీక్షలో కూర్చున్నారు.

బైఠాయించిన టి.కాంగ్రెస్ నేతలు...
మరోపక్క రాహుల్‌ దీక్షకు మద్దతుగా కాంగ్రెస్‌ నేతలు హెచ్‌సీయూ గేట్ వద్ద బైఠాయించారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని బర్తరఫ్ చేయాల్సిందేనని ధర్నాకు దిగారు. ధర్నాకు అనుమతిలేదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. విద్యార్థుల డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సుమారు 18గంటల పాటు దీక్షలో పాల్గొన్న రాహుల్‌కు అధ్యాపకులు, విద్యార్థులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.

పలు ప్రాంతాల్లో నిరసనలు...
మరోవైపు.. దిల్లీ జేఎన్‌యూ, మద్రాస్‌ యూనివర్సిటీ, ఇఫ్లూ, ఓయూ విద్యార్థులు, హెచ్‌సీయూ ఎస్సీ, ఎస్టీ ఫోరం అధ్యాపకులు దీక్షలో పాల్గొని మద్దతు తెలపగా, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమత సైనిక్‌ దళ్‌ కవాతు నిర్వహించి రోహిత్‌కు నివాళులర్పించారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో దేశంలోని యూనివర్సిటీలన్నింటిలోనూ సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించారు.

21:18 - January 30, 2016

హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలే పోరాటం చేస్తున్నాయని సీపీఎం, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, చాడ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రచారంతో పబ్బం గడుపుతోందని విమర్శించారు. హామీలు నెరవేర్చకుండానే కేసీఆర్‌ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. మియాపూర్‌లో వన్‌ హైదరాబాద్‌ కూటమి.. బహిరంగ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న వామపక్ష నేతలు గ్రేటర్‌ ఎన్నికల్లో వన్‌ హైదరాబాద్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

21:17 - January 30, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూట‌మి విజేతగా అవ‌త‌రిస్తుంద‌ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. హైద‌రాబాద్ మ‌ళ్లీ అభివృద్ధి బాట ప‌ట్టాలంటే టీడీపీ, బీజేపీ కూట‌మికి ఓటు వేయాల‌ని చంద్రబాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కూట‌మి గెలుపు చారిత్రక అవసరమని అన్నారు. టీడీపీ, బీజేపీ కూట‌మికే ఓటు వేయాల‌ని టిడిపి అధినేత చంద్రబాబు నగర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తమ కూట‌మి గెలుపు చారిత్రక అవ‌స‌ర‌మని అన్నారు. 12 సంవత్సరాలుగా న‌గ‌ర‌ అభివృద్ధి కుంటుప‌డింద‌ని మీట్‌ ద ప్రెస్‌ సందర్బంగా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవ‌రికి ఏ ఆప‌ద వ‌చ్చినా అర‌గంట‌లో ఇక్కడ ఉంటాన‌ని.. ఎవ‌రూ అదైర్య ప‌డొద్దని చంద్రబాబు చెప్పారు.

మంచి ఫలితాలు..
గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్‌ అభివృద్ధిలో తెలుగుదేశం పాత్రను మీడియా ముందు వివరించారు. భ‌విష్యత్తు త‌రాల కోసం తాను చేసిన శ్రమ‌కు ఇప్పుడు మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని ఆయన గుర్తుచేశారు.11 నెల‌ల్లో హైటెక్‌సిటీ నిర్మాణాన్ని పూర్తి చేసి ఐటీకి ఒక ఊపు తీసుకొచ్చామన్నారు. అదే స‌మ‌యంలో కేంద్రంతో పోరాడి శంషాబాద్‌లో అద్భుత‌మైన ఇంటర్నేషనల్‌ ఎయిర్ పోర్టును నిర్మించామ‌న్నారు.  మ‌రో వైపు ఆనాడు కేంద్రం ఒప్పుకోక‌పోయినా నాటి ప్రధాని వాజ్ పేయిపైన ఒత్తిడి తీసుకొచ్చి న‌గ‌రానికి మెట్రోను సాధించామన్నారు. కానీ ప్రస్తుతం మెట్రో ఎందుకు ఆలస్యం అవుతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 12ఏళ్లుగా న‌గ‌రాభివృద్ధి కుంటుప‌డింద‌ని చంద్రబాబు ఆవేద‌న వ్యక్తం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ కూట‌మి కింగ్‌లా అవ‌త‌రిస్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల అనంతరం బిజేపి-టిడిపి కూటమి కీలక పాత్ర పోషించడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 

21:15 - January 30, 2016

హైదరాబాద్ : పరేడ్‌ గ్రౌండ్‌ సభలో సీఎం కేసీఆర్‌ టిడిపి అధినేత చంద్రబాబు, కేంద్ర మంత్రి దత్తాత్రేయపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌పై అడుగడుగునా తన ముద్ర ఉందని చెప్తున్న చంద్రబాబుకు..బషీర్‌బాగ్‌ కాల్పుల గుర్తులు ఇప్పటికి అలాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేంద్ర సహకారంతో తెలంగాణలో డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను కడుతున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పడం హాస్యాస్పదమన్నారు.  ఇక్కడనే ఉంటా..నగరాభివృద్ధిలో తన ముద్ర ఉందని బాబు పేర్కొంటున్నారని తెలిపారు. ఆయన ముద్రలు అనేకం ఉన్నాయని..బషీర్ బాగ్ లో రక్తపు ముద్ర..అంగన్ వాడీలను తొక్కించిన ముద్రలు...హుస్సేన్ సాగర్ కాలుష్య ముద్ర..మూసీ నది మురికి ముద్రలు..అనేకం ఉన్నాయని కేసీఆర్ విమర్శించారు. 

21:13 - January 30, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు మున్సిపల్‌ శాఖ మంత్రి పదవి కేటాయిస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ నగరమంతా తిరిగి సమస్యలు తెలుకున్నాడు కాబట్టి ..మున్సిపల్‌ శాఖను కేటాయిస్తానని పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా ప్రకటించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌ లో.. జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. 

20:55 - January 30, 2016

రిపబ్లిక్ డే ఉత్సవాల్లో 26 ఏళ్ల తరువాత జాగిలాల ప్రదర్శన..ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ ఎన్నికలు..వింతలు విశేషాలు..బట్ట తల పని పడుతాం అని పలు సంస్థలు ముందుకు రావడం..సీఎం కేసీఆర్ షాపింగ్..చీర..సీఎం భార్య కోసం వాటర్ ఫ్రూఫ్ శారీ కొనుగోలు..80 శాతం మంది ఇంజనీర్లు ఉద్యోగాలకు పనికి రారంట..ఓ బాలుడికి కుక్కనుతో పెళ్లి..30వేల కోట్లను ఆర్బీఐ తగులబెట్టడం..ధనవంతుల దగ్గర ఎక్కువ ట్యాక్స్ వేయాలని ఓ వ్యక్తి కామెంట్..మరిన్ని కేజ్రీ న్యూస్ కోసం వీడియోలో చూడండి..

20:39 - January 30, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబుపై గరం గరం అయ్యారు. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగసభలో బాబు పై కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఉత్సుహకత నెలకొంది. బాబుపై కేసీఆర్ తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు, ఇతరులు కుట్ర చేయడాన్ని ప్రజలు మరిచిపోరని తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగిందని, ఈ సమయంలో గట్టిగా నిలబడి హైదరాబాద్ తో కూడిన తెలంగాణ తెచ్చుకోవడం జరిగిందన్నారు. ఆయనకు పని లేకకాదు...అక్కడ పని బాగా ఉందని చంద్రబాబును ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు చక్కిలిగింతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఇందులో కొట్టుకపోవద్దని సూచించారు.

బాబు ముద్రలు..
నగరంలో తన ముద్రలు అనేకం ఉన్నాయని పేర్కొంటున్నారని, బషీర్ బాగ్ రక్తపు ముద్ర ఇంకా ఉందని, అంగన్ వాడీలను తొలగించిన ముద్ర ఇంకా ఉందని, మూసీ, హుస్సేన్ సాగర్ ఇలా అనేక ముద్రలున్నాయన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ తెచ్చింది బాబు ముద్రేనని, వీరిని పర్మినెంట్ చేసిన ముద్ర తమదేన్నారు. పెట్టుబడు దారులకు అనుగుణంగా వ్యవహరించారని, కార్మికులను కడుపుకొట్టిన ముద్ర బాబుదేనని విమర్శించారు. శాంతంగా ఉన్న నగరంలో కలకలం రేపే ప్రయత్నం చేస్తున్నారని, ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఖమ్మంలో ఏడు మండలాలు గుంజుకున్నారని, గుంజుకున్నది టిడిపి అయితే గుంజి ఇచ్చింది బీజేపీ అని ఎద్దేవా చేశారు.

నగరంపై రాజీ పడాలన్నారు..
2001లో ప్రారంభించిన ఉద్యమం 2004లో ఉద్యమం యొక్క ఫలితం వచ్చిందని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అనంతరం ఏజెండాలో చేర్చిందన్నారు. నగరం మీద రాజీ పడాలని, తెలంగాణ తొందరగా ఇస్తామని కాంగ్రెస్ పేర్కొనడం జరిగిందన్నారు. నగరంపై రాజీ పడితే 2006-07లో తెలంగాణ వచ్చేదని, ప్రాణం పోయినా సరే హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ అని మొండెం లేని తలకాయ వద్దని స్పష్టంగా తాను వారితో చెప్పడం జరిగిందని తెలిపారు. రోశయ్య సీఎంగా ఉన్న సమయంలో 14 ఎఫ్ తీసుకొచ్చారని, దీనిపై తాను ఆమరణ దీక్షకు కూర్చొవడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం చెలరేగిన ఉద్యమంలో ప్రజల ఐక్యమత్యం చూసి తెలంగాణ ఇస్తామని ప్రకటిందన్నారు.

ఎన్నో సంక్షేమ పథకాలు..
తమ ప్రభుత్వ హాయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం జరిగిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఓ కట్టెను పట్టుకుని ఎన్నో కథలు చెప్పారని, పరేడ్ గ్రౌండ్ చూస్తే తెలంగాణ జిగేల్ మంటోందన్నారు. ఆనాటి దుష్ర్పచారాలు తప్పని తేలిందని, కరెంటు ఇవ్వాలంటూ ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేపట్టే వారని తెలిపారు. ప్రస్తుతం కోతలు లేని కరెంటు ఇవ్వడం జరుగుతోందని స్పష్టం చేశారు. ఫించన్, ఆరు కిలోల బియ్యం, కళ్యాణ లక్ష్మి లాంటి అనేక పథకాలు తీసుకరావడం జరిగిందన్నారు. ప్రధానంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేయడం జరుగుతోందని, పేదవారికి ఈ ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు.

ఆ రెండింటికి రూ. 30 కోట్లు కావాలి..
నగరంలో వానాకాలంలో పేదల ఇళ్లలకు..నీరు రావద్దంటే ఖర్చు రూ. 11 వేల కోట్లు..మంచినీళ్లు శుభ్రంగా రావాలంటే రూ. 12 వేల కోట్లు. మొత్తంగా రూ.25-30 కోట్లు ఖర్చు పెడితే నగరం అభివృద్ధి సాధ్యమౌతుందని, పక్క సీఎం ఏమి చేయలేడన్నారు.

టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే అభివృద్ధి...
బల్దియా మీద, రాష్ట్రం మీద అధికారం చెలాయించింది ఎవరో ఆలోచించాలని సూచించారు. ఆనాడు తెలంగాణ కోసం ఏలా పోరాటం చేశామో, నగరాన్ని కూడా అలాగే అభివద్ధి బల్దియాలో గులాబీ జెండా ఎగిరితే రాష్ట్ర ప్రభుత్వం చెట్టాపెట్టాలు వేసుకుని పనిచేస్తారన్నారు.

దత్తాత్రేయ అబద్ధాలు మాట్లాడుతున్నారు..
కేంద్ర మంత్రి దత్తాత్రేయ అనే పెద్ద అబద్ధాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తున్నారని అబద్ధాలు చెబుతున్నారని, డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని, ఏ దేశంలోనైనా ఉందా అని ప్రశ్నించారు. గతంలోనే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో తాము ఇవన్నీచెప్పడం జరిగిందని పేర్కొన్నారు.

భువనేశ్వరీ ఓటు టీఆర్ఎస్ కే
సీఎం చంద్రబాబు నాయుడు సతీమణీ భువనేశ్వరీ ఓటు తమకే వేస్తారనే నమ్మకం ఉందని వెల్లడించారు. తాను ఇక్కడనే ఉంటానని బాబు పేర్కొంటున్నారని ఎవరు వెళ్లిపోవాలని చెప్పారని ప్రశ్నించారు. ఎన్నికల కార్యక్రమంలో భువనేశ్వరీ ఇంటికి కార్యకర్తలు వెళ్లడం జరిగిందని, ఓటు తమకే వేస్తారనే నమ్మకం ఉందన్నారు.

మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ కు
తన వద్దనున్న మున్సిపల్ పరిపాలన శాఖను మంత్రి కేటీఆర్ కు అప్పగిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల భాగంగా కేటీఆర్ నగరంలో పలు ప్రాంతాల్లో తిరిగారని, అందుకే ఆ శాఖను అప్పగిస్తానని కేసీఆర్ తెలిపారు. 

మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్ కు - కేసీఆర్..

హైదరాబాద్ : తన వద్దనున్న మున్సిపల్ పరిపాలన శాఖను మంత్రి కేటీఆర్ కు అప్పగిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల భాగంగా కేటీఆర్ నగరంలో పలు ప్రాంతాల్లో తిరిగారని, అందుకే ఆ శాఖను అప్పగిస్తానని తెలిపారు. 

బాబు సతీమణి భువనేశ్వరీ ఓటు టీఆర్ఎస్ కే - కేసీఆర్..

హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు సతీమణీ భువనేశ్వరీ ఓటు తమకే వేస్తారనే నమ్మకం ఉందని కేసీఆర్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో పాల్గొని ప్రసంగించారు. తాను ఇక్కడనే ఉంటానని బాబు పేర్కొంటున్నారని ఎవరు వెళ్లిపోవాలని చెప్పారని ప్రశ్నించారు. ఎన్నికల కార్యక్రమంలో భువనేశ్వరీ ఇంటికి కార్యకర్తలు వెళ్లడం జరిగిందని, ఓటు తమకే వేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జరిగిందన్నారు. 

బాబు ముద్రలు అనేకం ఉన్నాయి - కేసీఆర్..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై సీఎం కేసీఆర్ పలు విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఇక్కడనే ఉంటా..నగరాభివృద్ధిలో తన ముద్ర ఉందని బాబు పేర్కొంటున్నారని తెలిపారు. ఆయన ముద్రలు అనేకం ఉన్నాయని..బషీర్ బాగ్ లో రక్తపు ముద్ర..అంగన్ వాడీలను తొక్కించిన ముద్రలు...హుస్సేన్ సాగర్ కాలుష్య ముద్ర..మూసీ నది మురికి ముద్రలు..అనేకం ఉన్నాయని కేసీఆర్ విమర్శించారు. 

దత్తాత్రేయ అబద్ధాలు మాట్లాడుతున్నారు - కేసీఆర్..

హైదరాబాద్ : కేంద్ర మంత్రి దత్తాత్రేయ అనే పెద్ద అబద్ధాలు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తున్నారని అబద్ధాలు చెబుతున్నారని, డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని, ఏ దేశంలోనైనా ఉందా అని ప్రశ్నించారు. 

నగరం గుండె కాయ – కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి నగరం గుండె కాయ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నగరం మీద రాజీ పడాలని, తెలంగాణ తొందరగా ఇస్తామని కాంగ్రెస్ ఆనాడు పేర్కొనడం జరిగిందన్నారు. నగరంపై రాజీ పడితే 2006-07లో తెలంగాణ వచ్చేదని, ప్రాణం పోయినా సరే హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ అని మొండెం లేని తలకాయ వద్దని స్పష్టంగా తాను వారితో చెప్పడం జరిగిందని తెలిపారు. 

పరేడ్ గ్రౌండ్ లో మాట్లాడుతున్న కేసీఆర్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ నిర్వహిస్తున్న బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. 

గుడిసెలు లేని నగరం కావాలి - నాయినీ..

హైదరాబాద్ : హైదరాబాద్ గుడిసెలు లేని నగరం కావాలని మంత్రి నాయినీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదలు, కార్మికుల పక్షపాతి అని, తెలంగాణవస్తే కరెంటు రాదన్న కిరణ్ కిదర్ గయా అని ఎద్దేవా చేశారు. నగరాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 

మేయర్ పీఠం గులాబీదే - మైనంపల్లి..

హైదరాబాద్ : అంచనాలకు మించి గ్రేటర్ పీఠంపై గులాబీ జెండాను ఎగురవేస్తామని టీఆర్‌ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్ లో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న బహిరంగసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ ఒక మినీ ఇండియా అని ఇక్కడ అన్ని మతాలు, ప్రాంతాలు, భాషల వారు నివసిస్తున్నారని వివరించారు.

19:42 - January 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక విజన్ ఉందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్ లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని కేసీఆర్ నిర్వహించి 2500 ఆటోలు, 40 లక్షల డస్ట్ బిన్ లు అందించడం జరిగిందన్నారు. విపక్షాలు ఎదురు దాడులు చేస్తున్నాయని, నగరాన్ని ఏదో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు నగరాన్ని అభివృద్ధి చేశారని, హుస్సేన్ సాగర్, మూసీ నదిలో ఉన్న కంపును తొలగించేందుకు కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో ఉన్న పాలకులు 24 గంటల కరెంటు ఎందుకివ్వలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని తలసాని ప్రశ్నించారు. 

టీఆర్ఎస్ బహిరంగసభలో తలసాని..

హైదరాబాద్ : పరేడ్ గ్రౌండ్ లో టీఆర్ఎస్ నిర్వహస్తున్న బహిరంగసభలో మంత్రి తలసాని పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ఒక విజన్ ఉందని, నగరాభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో పాలించిన పాలకులు 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని కేంద్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. 

బాబు..కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలు - తమ్మినేని..

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు ఇద్దరూ తోడు దొంగలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని విమర్శించారు. కొండాపూర్, శేరిలింగంపల్లిలో వన్ హైదరాబాద్ కూటమి సభ నిర్వహించింది. ఈ సభలో తమ్మినేనితో పాటు సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ ఫాషాలు పాల్గొన్నారు. దోచుకోవడంలో ఇరు రాష్ట్రాల సీఎంలు పోటీ పడుతున్నారని, ప్రజా సమస్యలపై మొదటి నుండి పోరాడుతున్నది తామేనన్నారు. వన్ హైదరాబాద్ కూటమి అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. 

కరావులపల్లి తండాలో దారుణం..

అనంతపురం : గోరంట్ల (మం) కరావులపల్లి తండాలో తమ్ముడి భార్య, ఇద్దరు పిల్లలను శివశంకర్ అనే వ్యక్తి నరికిచంపాడు. లక్ష్మీభాయి (30), యుమన (6), చంద్రిక (2) మృతి చెందిన వారిలో ఉన్నారు.

టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి..

చిత్తూరు : తిరుమల శేషాచలం అడవుల్లో తుండూరు తీర్థం వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

విశాఖకు చేరుకున్న సీఎం బాబు..

విశాఖపట్టణం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖకు చేరుకున్నారు. కాసేపట్లో ప్రొ.కబడ్డీ పోటీలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. 

19:01 - January 30, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ బహిరంగసభ నిర్వహిస్తోంది. కాసేపట్లో సీఎం కేసీఆర్ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభకు కార్యకర్తలు, నేతలు తరలివస్తున్నారు. ఈసందర్భంగా కళాకారులు నృతప్రదర్శనలు ఇచ్చారు. వేదికపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి ఆధ్వర్యంలో కళాకారులు తెలంగాణ పాటలు పాడారు. 

18:46 - January 30, 2016

కృష్ణా : జిల్లా మచిలీపట్నంలో రెండు కాలేజీల విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. హిందూ కళాశాలలో నిర్వహిస్తున్న యువకెరటాల కార్యక్రమంలో ఈ ఘర్ణణ చోటుచేసుకుంది. మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే విద్యార్థులు పరస్పరం బ్లేడ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి.

18:44 - January 30, 2016

ఢిల్లీ : మాజీ ఆర్మీ చీఫ్‌, మాజీ గవర్నర్‌...కేవీ కృష్ణారావు కన్నుమూశారు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. 1942లో సైన్యంలో చేరిన జనరల్‌ కృష్ణారావు ఆర్మీ చీఫ్‌గా 1983లో ఉద్యోగ విరమణ చేశారు. 1984లో నాగాలాండ్‌, మణిపూర్‌, త్రిపుర గవర్నర్‌గా నియమితులయ్యారు. 1990లో జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. జనరల్‌ కృష్ణారావు స్వస్థలం విజయవాడ. జనరల్‌ కృష్ణారావు మృతిపై గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. 

18:42 - January 30, 2016

హైదరాబాద్ : ఫిబ్రవరి 27,28 తేదీలలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. లేపాక్షి ఉత్సవాల ఏర్పాట్ల గురించి చర్చించేందుకు హిందూపురం ఎమ్మెల్యే మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, మాణిక్యాలరావులు అధికారులతో ఏపీ సచివాలయంలో దాదాపు రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా హాజరయ్యారు. లేపాక్షిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని కోరనున్నట్లు బాలయ్య తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 4 కోట్ల రూపాయలను కేటాయించింది.  

18:41 - January 30, 2016

విజయవాడ : ఏపీలో అభివృద్ధి ప్రచారం పేరుకే తప్ప ఆచరణలో ఏమీ లేదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. ఎంవోయుల వలన పెద్దగా ఉపయోగం లేదని గత ప్రభుత్వాలలో కూడా ఇలాంటివి చాలా జరిగాయని వాటివల్ల ఒరిగిందేమీ లేదని అన్నారు. చంద్రబాబు గొప్పలు చెప్పుకునేందుకు ఇస్తున్న ప్రాధాన్యత.. చేతల్లో చూపడం లేదన్నారు తెలకపల్లి రవి.

 

18:40 - January 30, 2016

విజయవాడ : ఏపీ ప్రభుత్వం రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ లో పిటిషన్ వేసిన శ్రీమన్నారాయణ ఆరోపించారు. సీఆర్డీఏ పరిధిలోని ఏ గ్రామానికి కూడా సరైన సమాచారం అందించడం లేదని, అధికారులు, మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. భూములు ఇచ్చాక రైతులను బానిసలుగా చూస్తున్నారని శ్రీమన్నారాయణ మండిపడ్డారు. 

భీమారం విద్వాన్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం.

వరంగల్ : భీమారం విద్వాన్ కాలేజీలో పురుగుల మందు తాగి ఇంటర్ విద్యార్థి భాస్కర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇతడిని ఏంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని తెలుస్తోంది. 

18:20 - January 30, 2016

హైదరాబాద్ : దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకరావాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఉద్యమాన్ని అఖిల భారత స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ జన్మదినమైన 30వ తేదీ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావించింది. రోహిత్ ఆత్మహత్యకు సంతాపంగా, సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక రోజు మహాదీక్ష నిర్వహించారు. ఈ దీక్షల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ శుక్రవారం అర్ధరాత్రి హెచ్ సీయూకు చేరుకున్నారు. అక్కడ జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం వరకు ఈ దీక్షలు కొనసాగాయి. అనంతరం ప్రొ. కంచె ఐలయ్య నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్ధేశించి రాహుల్ ప్రసంగించారు. తాను ఇక్కడకు ఎందుకు వచ్చారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారని, దేశంలో మరే విద్యార్థి ఇలాంటి వత్తిడితో ఆత్మహత్యకు పాల్పకూడదనే ఉద్ధేశ్యంతో తాను రావడం జరిగిందన్నారు. బీజేపీ తన భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తోందని, యూనివర్సిటీల్లో వివక్ష ఉంటే దేశం ముందుకు సాగదని స్పష్టం చేశారు. గతంలో గాంధీకి జరిగిన అవమానం లాంటిదే రోహిత్ కు జరిగిందన్నారు. రోహిత్ ఒంటరి వాడు కాదని దేశంలో రోహిత్ లాంటి వ్యక్తులు చాలా మందే ఉన్నారని, రోహిత్ కు జరిగిన అవమానం దేశంలో ఇంకా ఎవరికైనా జరగవచ్చన్నారు. వివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకరాకుంటే తాము పోరాటానికి వెనుకాడమని, ప్రజాస్వామ్యాన్ని భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని రాహుల్ స్పష్టం చేశారు. 

నారాయణఖేడ్ ఉప ఎన్నిక బరిలో 8 మంది..

మెదక్ : నారాయణఖేడ్ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడవు ముగిసింది. ఉప ఎన్నిక బరిలో 8 మంది అభ్యర్థులు నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 

రోహిత్ ఒంటరి వాడు కాదు - రాహుల్..

హైదరాబాద్ : రోహిత్ ఒంటరి వాడు కాదని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హెచ్ సీయూలో రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులు ఒక రోజు దీక్షకు పూనుకున్నారు. ఈదీక్షలో రాహుల్ తో పాటు రోహిత్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రసంగించారు. దేశంలో రోహిత్ లాంటి వ్యక్తులు చాలా మందే ఉన్నారని, రోహిత్ కు జరిగిన అవమానం దేశంలో ఇంకా ఎవరికైనా జరగవచ్చన్నారు. 

హెచ్ సీయూలో దీక్ష విరమణ..

హైదరాబాద్ : హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఉద్యమాన్ని అఖిల భారత స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ జన్మదినమైన 30వ తేదీ నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని భావించింది. రోహిత్ ఆత్మహత్యకు సంతాపంగా, సామాజిక న్యాయాన్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక రోజు మహాదీక్ష నిర్వహించారు. ఈ నిరసన దీక్షలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రోహిత్ కుటుంసభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాహుల్, రోహిత్ తల్లికి పళ్లరసం ఇచ్చి ప్రొ. కంచె ఐలయ్య దీక్షలను విరమింపచేశారు. 

బాసరలో రోడ్డు ప్రమాదం..

ఆదిలాబాద్: జిల్లాలోని బాసరలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక శంకరీ పాఠశాల సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

మచిలీపట్నం హిందూ కళాశాలలో ఉద్రిక్తత..

కృష్ణా : మచిలీపట్నం హిందూ కళాశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువ కెరటాలు కార్యక్రమంలో రెండు కాలేజీలకు చెందిన విద్యార్థల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బ్లేడులతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. 

ఏపీ సీఎస్ గా టక్కర్..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్పీ టక్కర్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఎల్ బ్లాక్ లో టక్కర్ బాధ్యతలు స్వీకరించగా పదవీ విరమణ చేసిన ఐవైఆర్ కృష్ణారావుకు సాధారణ పరిపాలన శాఖ వీడ్కోలు పలికింది. 

హెచ్ సీయూలో రాహుల్ ప్రసంగం..

హైదరాబాద్ : హెచ్ సీయూలో వేముల రోహిత్ మృతిపై విద్యార్థులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరై ప్రసంగించారు. 

కొండాపూర్ లో వన్ హైదరాబాద్ కూటమి..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా వన్ హైదరాబాద్ కొండాపూర్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సీపీఎం, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, చాడ వెంకట్ రెడ్డిలు పాల్గొన్నారు. 

హేమ మాలిని ఇంటి ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా..

ఢిల్లీ : ప్రముఖ సినీ నటి హేమా మాలిని ఇంటి ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. హేమామాలినిపై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

హెచ్ సీయూలో రాహుల్..

హైదరాబాద్ : హెచ్ సీయూలో దళిత విద్యార్థులు చేపట్టిన నిరసనలో ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి ఆయన హెచ్ సీయూకు చేరుకున్న సంగతి తెలిసిందే. 

17:18 - January 30, 2016

మెల్ బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్ లో పెను సంచలనం చోటు చేసుకుంది. మెల్ బోర్న్ పార్కులో జరుగుతున్న మహిళా సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లో జర్మన్ క్రీడాకారిణి ఏజెంలికా కెర్బర్ చేతిలో సెరెనా విలియమ్స్ ఓటమి పాలైంది.ఏంజెలికా కెరీర్ లో తొలి గ్రాండ్ శ్లామ్ టైటిల్ ఇదే కావడం గమనార్హం. ఫైనల్ లో 6-4, 3-6, 6-4 తేడాతో పరాజయం చవి చూసింది. కెర్బర్, సెరెనా హోరాహోరీగా తలపడ్డారు. వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సొంతం చేసుకొనేందుకు బరిలోకి దిగిన సెరెనా కెర్బర్ ధీటుగా నిలువరించింది. రెండు సెట్లలో చెరొకటి దక్కించుకున్నారు. కీలకమైన మూడో సెట్లో సెరెనా షాట్లను కెర్బర్ సమర్థవంతంగా ఎదుర్కొంది.
జర్మనీ ఓపెన్ తో కెర్బర్ తన కెరీర్ ను ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే మహిళల సింగిల్స్ లో ఏడు డబ్ల్యూటీఏ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది. వీటిలో నాలుగింటిని ఒకే ఏడాదిలో దక్కించుకుంది. తాజాగా జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ తో తొలి గ్రాండ్ స్లామ్ ను దక్కించుకుంది. 

17:11 - January 30, 2016

తాను ప్రస్తుతం తీవ్రమైన వత్తిడిలో ఉన్నానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా టెన్ టివి ఆయనతో ముచ్చటించింది. పార్టీ పరిస్థితి..టిడిపితో పొత్తు..హెచ్ సీయూ ఘటన..టీఆర్ఎస్ పాలక వర్గంపై ఆయన అభిప్రాయాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు టీఆర్ఎస్ నే సమర్థించాలి..అధికారంలో రావాలని ఆశించారని, ప్రస్తుతం పాలకులు మాటలు..గారడిలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇంకా నమ్ముతున్నారని, కండువాలు కప్పుకున్న వారంతా గుంపులు గుంపులుగా బయటకు త్వరలో వస్తారని జోస్యం చెప్పారు. తెలంగాణలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వారు నివాసం ఉంటున్నారని, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారిని బయటి వాళ్లు అనడం సందర్భరహితమని పేర్కొన్నారు. కుట్రలు..కుతంత్రాలతో చేర్చుకుని బయటి వ్యక్తులకు టికెట్లు కేటాయించారని విమర్శించారు. బీజేపీకి మేయర్ కు కావాల్సిన సీట్లు వస్తాయని అంచనా వేశామని, వంద సీట్లు లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. నగరంలో అన్ని రకాల సమస్యలున్నాయని, అకౌంటబులిటీ లేదన్నారు. ఎంఐఎం మేయర్ స్థానంలో కూర్చొని ఏమి చేయలేదు. తమ పార్టీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని, తొందరపాటులో ఇది జరిగిందని దీనికి ఎమ్మెల్యేకు సమయం ఇచ్చామన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ తనకు మధ్య సఖ్యత లేదనడం వాస్తవం కాదన్నారు. అధ్యక్షుడిగా తాను మళ్లీ కానని, తీవ్ర వత్తిడిలో ఉన్నానని పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలు తనకు కొత్తేమి కాదని, కొత్త రాష్ట్ర అధ్యక్షుడి సూచనల మేరకు పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం టిడిపి పార్టీతో పొత్తు కొనసాగుతుందని, 2019 ఎన్నికల వరకు పొత్తు ఉంటుందా ? లేదా ? అనేది తన చేతుల్లో ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం అనేక సహాయం చేస్తోందని, స్మార్ట్ సిటీలో హైదరాబాద్ వద్దని..కరీంనగర్ కావాలని సీఎం కేసీఆర్ కోరడం జరిగిందన్నారు. కానీ కరీంనగర్ కు సంబంధించిన నివేదిక ఇవ్వలేదని తెలిపారు. అనేక దళిత వాడుల్లో పట్టుఉందని, జరుగుతున్న పరిస్థితులను సమీక్షించాలని కేంద్ర మంత్రి దత్తాత్రేయ లేఖ రాయడం జరిగిందని, ఓ వ్యక్తినో..సంస్థనో టార్గెట్ చేయాలని రాయలేదు. రాజకీయ దృక్పథంతో బీజేపీని దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సందర్భంలో అసహనం ప్రచారం చేశారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదన్నారు. ఎవరిని చేర్చుకోవాల్సినవసరం లేదని, మరొక పార్టీ ప్రభుత్వంలో చేర్చుకోవాలను కోవడం అనుకోవడం లేదన్నారు. టీఆర్ఎస్ చేర్చాలని అనుకుంటే తన అభిప్రాయం పార్టీకి చెబుతానని, టీవీల ఎదుట చెప్పకూడదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:35 - January 30, 2016

హైదరాబాద్ : గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటు ఇంటర్వ్యూలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల జేఏసీ భారీ ధర్నా చేపట్టింది. టీఎస్ పీఎస్సీ ఎదుట నిర్వహించిన ఈ ధర్నాలో భారీగా నిరుద్యోగులు పాల్గొన్నారు. గ్రూప్ 2 పరీలను మరో మూడు నెలల వరకు వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఛైర్మన్ ఘంటా చక్రపాణిని కలిసి వినతిపత్రం అందచేశారు. పోస్టులను పెంచే అధికారం తన వద్ద లేదని ప్రభుత్వం వద్ద తేల్చుకోవాలని చెప్పడంపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుటే బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకని స్టేషన్ కు తరలించారు. 

16:15 - January 30, 2016

చిత్తూరు : టిటిడి పాలక ధర్మకర్తల మండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ. 2,678 కోట్ల వార్షిక బడ్జెట్ కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ద్వారా వడ్డీ ఎక్కువగానే వస్తుందని పాలక మండలి భావించింది. స్పెషల్ ఎంట్రీ, వీఐపీ దర్శనాల ద్వారా రూ.209 కోట్లు..తలనీలాల ద్వారా రూ.150 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అలాగే బడ్జెట్ లో ఇన్వెస్ట్ మెంట్లకు రూ.757 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ.500 కోట్లు కేటాయించారు. శ్రీవారి ప్రసాదాల ధరలను, ఆర్జిత సేవల ధరలను పెంచకూడదని, మరోసమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పాలక మండలి నిర్ణయించింది. బంగారు వాకిలికి బంగారు తాపడం..రూ.5.90 కోట్లతో తిరుమల సప్తగిరి గెస్టు హౌస్ లో రెండు బ్లాక్ ల ఆధునీకరణ..తూర్పుగోదావరి జిల్లా అంతర్ వేదీ వద్ద రూ. 4.90 కోట్లతో వసతి సముదాయం నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర వైభోత్సవాలను 9 రోజుల నుండి 5 రోజులకు కుదించారు. మాధవం గెస్ట్ హౌస్ లో సౌకర్యాల కల్పనకు రూ. 2.75 కోట్లు..పాపవినాశనం టోల్ గేట్ వద్ద రూ.4.5 కోట్లతో ఆక్టోపస్ భవన నిర్మాణానికి పాలక మండలి ఆమోద ముద్ర వేసింది. మహామణి మండపం డిజైన్, టెండర్లను ఖరారు చేసింది. 

ముగిసిన టిటిడి పాలక మండలి సమావేశం..

చిత్తూరు : టిటిడి పాలక మండలి సమావేశం ముగిసింది. రూ. 2,678 కోట్ల వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాదాల ధరల పెంపునకు విముఖత చూపించింది. ఉప సంఘం సిఫార్సును తిరస్కరించింది. 

ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష..

కోల్ కతా : ముగ్గురు నిందితులకు ఉరిశిక్షను విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. కందుని సామూహిక అత్యాచారం, హత్య కేసులో కోర్టు పై విధంగా తీర్పును వెలువరించింది. 

ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద విద్యార్థుల భారీ ధర్నా..

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యలయం వద్ద విద్యార్థులు భారీగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. హెచ్ సీయూలో దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా వారు ఈ ఆందోళన చేపట్టారు. విద్యార్థులు ముందుకు రాకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను దాటుకుని ముందుకెళ్లడానికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీనితో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. 

పంజాబ్ లో మాజీ సబ్ ఇన్సెపెక్టర్ అరెస్టు..

పంజాబ్ : మాజీ పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద పాక్ దేశానికి చెందిన సిమ్ కార్డు లభ్యమైనట్లు తెలుస్తోంది. 

15:42 - January 30, 2016

హైదరాబాద్ : 2016-17 వార్షిక బడ్జెట్‌ అంచనాల తయారీపై దృష్టి సారించింది తెలంగాణ సర్కార్‌. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఆర్ధికశాఖ.. ప్రతిపాదనలు స్వీకరించింది. ఇక వీటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలను పరిశీలించి ముసాయిదాను తయారు చేసే పనిలో పడ్డారు సీఎస్‌ రాజీవ్‌శర్మ. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. తొలి రోజు పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, విద్య, వైద్యం, అగ్రికల్చర్‌, పౌరసరఫరాలు, లా, ప్లానింగ్‌, విద్యుత్‌శాఖ అధికారులతో సమావేశం కానున్నారు సీఎస్‌. సోమవారం సంక్షేమ శాఖలు, ట్రాన్స్‌పోర్ట్, రెవెన్యూ, పరిశ్రమలు, హౌసింగ్‌, లేబర్‌, టూరిజం శాఖల అధికారులతో చర్చించనున్నారు. నూతన విధానంలో తీసుకువచ్చే బడ్జెట్‌లో.. అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక కేంద్ర బడ్జెట్‌ కన్నా ముందే రాష్ట్రంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని సర్కార్‌ భావించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో మార్చి నెల మొదటి లేదా రెండో వారంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఈ ఏడాది లక్షా 30 వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని సర్కార్‌ భావిస్తోంది. అన్ని శాఖల అధికారులతో సీఎస్‌ రాజీవ్‌శర్మ సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. దీని తర్వాత ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్‌ అన్ని శాఖల మంత్రులతో సమావేశమై.. తుది ముసాయిదాను ఖరారు చేయనున్నారు. 

15:38 - January 30, 2016

హైదరాబాద్ : తునిలో నిర్వహించతలపెట్టిన కాపు గర్జనను పూర్తిగా రాజకీయం చేస్తున్నారని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు విమర్శించారు. ముద్రగడ పద్మనాభాన్ని ముందు ఉంచి రాజకీయం చేయాలనుకుంటున్నారన్నారు. కాపులకు వైఎస్సార్ చేసిందేమిలేదని.. వంగవీటి రంగా భార్యకు కనీసం ఎంఎల్ ఏ టికెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కాపుల కోసం టీడీపీ రూ.100 కోట్లు కేటాయించామన్నారు. 1999 లో 12 మంది కాపులన్నారని, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు.

15:36 - January 30, 2016

హైదరాబాద్ : టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌ సిద్ధమైంది. సాయంత్రం 4గంటలకు ఈ సభ ప్రారంభం కాబోతోంది. ఈ సభకోసం భారీగా ఏర్పాట్లు చేశారు నేతలు. సభ ప్రాంగణంలో మూడు వేదికలు, గ్రౌండ్‌లో దాదాపు 50 ఎల్ ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు ఇంచార్జ్ లుగా వ్యవహరించిన నేతలకు ఓ వేదిక, పోటీ చేస్తున్న అభ్యర్థులకు మరో వేదిక, కళాకారుల ప్రదర్శనలకోసం మూడో వేదికను ఉపయోగించుకోనున్నారు. ప్రధాన నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దీంతో సుమారు 3వేల మంది పోలీసులు ఈ బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.

15:34 - January 30, 2016

హైదరాబాద్ : కొత్త రాష్ట్రం ముందున్న సవాళ్లను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న ఎస్పీ టక్కర్‌ అన్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు ఓ కొత్త టీంను తయారుచేస్తానని తెలిపారు. విభజన సందర్భంగా చాలా కష్టాలు ఉన్నాయని, ప్రపంచం..దేశంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో అధ్యయనం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ఏపీలో రెండంకెల అభివృధ్ధి సాధించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. 

15:32 - January 30, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూలో విద్యార్థులకు మద్దతుగా రాహుల్ చేస్తున్న ధర్నాలో మాజీ లోక్ సభ స్పీకర్ పీఏ సంగ్మా పాల్గొన్నారు. రోహిత్ కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలిపారు సంగ్మా. తెలంగాణ లో టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు సంగ్మా. కాంగ్రెస్ నాయకత్వ లోపంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. టీడీపీ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైందని ఎద్దేవా చేశారు సంగ్మా. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తులకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు పీఏ సంగ్మా.

తెలంగాణలో రైతులు, విద్యార్థులకు ఇబ్బందులు - సంగ్మా..

హైదరాబాద్ : తెలంగాణలో రైతులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత సంగ్మా పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోందని, రాష్ట్రంలో బీజేపీ ప్రభావం అంతగా లేదన్నారు.

రెండో రోజు ఏపీ సీపీఎం కమిటీ సమావేశాలు..

విజయవాడ : రెండో రోజు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు, మతోన్మాద శక్తులు బలపడుతున్న తీరుపై చర్చ జరుగుతోంది. రైతుల భూములను కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారని, ఎంవోయూలు పెద్ద బూటకమని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. భూ నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, బలవంతపు భూ సేకరణ దారుణమన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని, ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి నిరసనగా మార్చి 10న అసెంబ్లీని ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.

15:17 - January 30, 2016

చిత్తూరు : జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించడానికి జిల్లా పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పలు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా 'ఆపరేషన్ రెడ్' పేరిట స్మగ్లర్లను పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్మగర్లను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మరో ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారు. కోల్ కతాకు చెందిన మారుకొండ లక్ష్మణ్ ..ఢిల్లీకి చెందిన వికాస్ మెహందిలను అదుపులోకి తీసుకున్నారు. చైనా, జపాన్, సింగపూర్, హాంకాంగ్ దేశాలకు వీరు చాకచక్యంగా ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. గతంలో కూడా లక్ష్మణ్, అతని సోదరుడిపై ఎర్రచందనం స్మగ్లింగ్ లో పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అంతేగాకుడా పీడీ యాక్టు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఇద్దరూ ఎక్కడున్నారో తెలియడం లేదు. వీరిని సాయంత్రం వరకు చిత్తూరు జిల్లాకు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

వేముల రోహిత్ సూసైడ్..ఢిల్లీలో విద్యార్థుల నిరసన..

ఢిల్లీ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ఘటనపై ఇంకా పలు ప్రాంతాల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపడుతూనే ఉన్నారు. రోహిత్ జన్మదినం సందర్భంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో శనివారం విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

చిత్తూరులో అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్టు..

చిత్తూరు : జిల్లాలో ఇద్దరు అంతర్జాతీయ స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. కోల్ కతా చెందిన లక్ష్మణ్, ఢిల్లీకి చెందిన వికాస్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పాలమూరు ఎత్తిపోతల డిజైన్ మార్పు సరికాదు - నాగం..

మహబూబ్ నగర్ : పాలమూరు ఎత్తిపోతల డిజైన్ మార్పు సరికాదని నాగం జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. డిండికి నీళ్లు తరలించే కేఎల్ ఆయుకట్టు నాశనమౌతోందని, కేసీఆర్ వి తుగ్లక్ నిర్ణయాలని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

కాపు గర్జన వెనుక వైసీపీ హస్తం - టిడిపి

హైదరాబాద్ : కాపు గర్జన వెనుక వైసీపీ హస్తం ఉందని ఏపీ డిప్యూటి సీఎం చిన రాజప్ప, కళా వెంకట్రావు పేర్కొన్నారు. రాజకీకయ ప్రయోజాల కోసమే వైసీపీ కాపులను రెచ్చగొడుతోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. 

సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలం - ఏపీ సీఎస్..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర విఫలం చెందిందని ఏపీ సీఎస్ కృష్ణా రావు విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటే కేంద్రంతో పనేముందని, 37 ఏళ్ల ఉద్యోగ జీవితం సంతృప్తినిచ్చిందన్నారు. 

టి.బడ్జెట్ పై సీఎస్ సమీక్ష..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కసరత్తుపై సీఎస్ సమీక్ష కొనసాగుతోంది. వివిధ శాఖల ప్రిన్స్ పల్ సెక్రటరీలు..అధికారులు పాల్గొన్నారు. 

అండర్ 19..భారత్ ఘన విజయం..

ఢిల్లీ : అండర్ 19 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. 120 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టు ఓటమి చెందింది. భారత్ 258 పరుగులు చేయగా న్యూజిలాండ్ జట్టు 138 పరుగులకే కుప్పకూలింది. 

రెండంకెల అభివృద్ది..వ్యవసాయ అభివృద్ధే లక్ష్యం - టక్కర్..

హైదరాబాద్ : రెండంకెల అభివృద్ధితో పాటు వ్యవసాయ అభివృద్ధి సాధించడమే తమ ముందున్న లక్ష్యమని ఏపీ నూతన సీఎస్ ఎస్పీ టక్కర్ పేర్కొన్నారు. ఉద్యోగుల విభజనపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. 

13:58 - January 30, 2016

మన శరీరానికి కావల్సిన అతిముఖ్యమైన ఖనిజం కాల్షియం.ఇది ఎముకల పటిష్టత, దంతాల ఆరోగ్యానికి ఎంతో అవసరం. అంతేకాదు కండరాల సంకోచవ్యాకోచాలకు కూడా కాల్షియం కావల్సిందే. ఎముకలలో కాల్షియం పరిమాణం తగ్గితే ఎముకల బలం తగ్గి అనేక రకాల నొప్పులకు కారణం అవుతుంది. ఆస్టియో పోరోసిస్‌కు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాదు కాల్షియం తక్కువైతే హైబి.పి వస్తుంది. పిల్లల పెరుగుదల సక్రమంగా ఉండాలంటే కాల్షియం తగినంత పరిమాణంలో తీసుకోవాలి. అందుకే గర్భవతుల కు కాల్షియం టాబ్లెట్స్‌ రూపంలో ఇస్తుంటారు.మరి ఇంత ముఖ్యమైన ఖనిజం మనం తినే ఆహారంలో తగినంత ఉంటోందా అని ప్రశ్నించుకుంటే లేదనే చెప్పాలి. ఎలాంటట ఆహారం తీసుకుంటే శరీరానికి కావల్సిన కాల్షియం అందుతుందో తెలుసుకోవాలి. 
కొన్ని రకాల ఆహార పదార్థాలలో కాల్షియం పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది.ఉదాహరణకు వరి, గోధుమ, బంగాళా దుంప తదితరమైన వాటిలో 100 గ్రాముల పదార్థంలో 10-20 మి.గ్రా కన్నా కాల్షియం లభించదు. కొన్ని పదార్థాలలో కాల్షియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సోయా, కొత్తమీర, మెంతి, బెల్లం, గేదెపాలు, నువ్వులు, పిస్తా, వాల్‌నట్‌, రాగులు, పొట్టుతో ఉండే మినుములు, ఉలవలు, తోటకూర, తమలపాకులు, క్యారెట్‌, కాలీఫ్లవర్‌, కరివేపాకు, పుదీనా, పసుపు, పొన్నగంటి కూర, ధనియాలు, జీలకర్ర, చేపలు, జున్ను, గ్రుడ్లు, చిలకడదుంపలు, ఎండుకొబ్బరి, బాదం తదితర పదార్థాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. 
కాల్షియం - జాగ్రత్తలు 
కాఫీ, ఎక్కువగా ఉప్పు, మాంసం, ధూమపానం, మద్యం తీసుకుంటే శరీరంలో కాల్షియం నిల్వలు తగ్గుతాయి. పీచు పదార్థాలు, జంతువుల నుంచి తీసుకునే మాంసకృత్తులు వంటివి కాల్షియంను శరీరం గ్రహించే శక్తిని తగ్గిస్తాయి.
ఆకుకూరలలోని అగ్జాలిక్‌ ఆమ్లం శరీరానికి కాల్షియంను అందనివ్వదు.
శారీరక శ్రమ లేకపోతే కాల్షియం కండరాలకు అందదు.
ఎక్కువగా తీసుకుంటే...:
అవసరం ఉన్నంతవరకు మా త్రమే కాల్షియం టాబ్లెట్ల రూపంలో వినియోగించడం మంచిది. డాక్టర్‌ సూచన లేకుండా కాల్షియం ఉపయోగిస్తే..సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. 
- కడుపుబ్బరం, వికా రం, మలబద్దకం, విరేచనాలు తదితర సమస్యలు వస్తాయి. 
- ఖాళీ కడుపుతో ఎప్పుడూ కాల్షియం తీసు కోవటం మంచిది కాదు. 
- రెండు మూడు ట్యాబ్లెట్స్‌ తీసుకున్నా ప్రమాదమే. కారణం.. రోజుకి మన శరీరం 1000 నుండి 1500 మిల్లీ గ్రాములు మాత్రమే అవ సరం అవుతుంది. అదనపు కాల్షియం శరీరంలో చేరితే అది మూత్ర పిండాలలో సమస్యగా మారొచ్చు.
- విటమిన్‌ డి తక్కువగా ఉండేవారిలో కాల్షియం తక్కువగా ఉండే ప్రమాదం ఉంది. 
కాల్షియం లోపం కారణంగా వచ్చే సమస్యలు :
కాల్షియం లోపం కారణంగా వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది ఎముకల బలహీనత ( ఆస్టియోఫొరోసిస్‌ ) చిన్నపిల్లల్లో కనిపించే జాయింట్‌ పెయిన్స్‌, మహిళల్లో కనిపించే కీళ్లనొప్పులు, 40 దాటిన వారిలో తరచు కనిపించే కండరాల నొప్పులకు కాల్షియం లోపమే కారణం.

హెచ్ సీయూ వద్ద కాంగ్రెస్ నేతల ధర్నా..

హైదరాబాద్ : హెచ్ సీయూ వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. క్యాంపస్ లో రాహుల్ దీక్షకు మద్దతుగా గేటు వద్ద వారు ఆందోళన చేపట్టారు. వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. 

13:56 - January 30, 2016

నిజామాబాద్‌ :  జిల్లా రైతుల్ని కరువు మరింత కుంగదీస్తోంది.. పంటల సాగు సగానికి సగం తగ్గిపోవడంతో రైతన్నలు అప్పుల్లో మునిగిపోయారు.. రెండేళ్లుగా వర్షాలు లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. వర్షాలు కురుస్తాయి... కనీసం ఈసారైనా అప్పులన్నీ తీరతాయనుకున్న రైతులకు ఈసారీ నిరాశే మిగిలింది.. కరువుతో కొట్టుమిట్టాడుతున్న నిజామాబాద్ జిల్లా రైతులు మరింత అప్పుపాలయ్యారు.. కుటుంబపోషణ భారమై... రుణాలు ఎలా చెల్లించాలో తెలియక కన్నీరు పెట్టుకుంటున్నారు.. ఈ ఏడాది వర్షాలు లేక భూగర్భ జలాలు తగ్గిపోయాయి... మరింత నష్టం తప్పదని చిన్న, సన్నకారు రైతులు పంటలే వేయలేదు.. 50 శాతంకంటే తక్కువగా కురిసిన వర్షంతో తాగునీటికే ఇబ్బందులు తప్పడంలేదు.. జిల్లామొత్తం ఇదే పరిస్థితి ఉంది.. దీంతో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది ప్రభుత్వం... అయినా రైతన్నలకు ఎలాంటి సాయం అందించలేదు.. 

17 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు

గత 30ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా ఈసారి భూగర్భ జలాలు మరింత అడుగంటాయి.. గత ఏడాది సరాసరి 10.23 మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా... ఈసారి 17 మీటర్ల లోతుకు పడిపోయాయి.... దీంతో పంటల విస్తీర్ణం మరింత తగ్గింది.. రబీలో మామూలుగా రెండు లక్షల మూడు వేల హెక్టార్లలో పంట సాగయ్యేది.. గత ఏడాది కరువుతో
లక్షా 49వేల 424 హెక్టార్లలో పంటలు వేశారు.. ఈ ఏడాది కేవలం 90వేల 523 హెక్టార్లలో మాత్రమే వ్యవసాయం నడుస్తోంది.. ప్రతిసారికంటే ఈ ఏడాది 55శాతం విస్తీర్ణం తగ్గింది..

8,239 హెక్టార్లలో పంట సాగు

ఇక జిల్లాలో వరి సాగు మరింత పడిపోయింది.. మామూలుగా రబీలో 88వేల 500 హెక్టార్లలొ వరి వేస్తారు... గత ఏడాది 55వేల 432 హెక్టార్లలో నాట్లు వేశారు.. ఇప్పుడు భూగర్భ జలాలు లేక 8వేల 239 హెక్టార్లలో పంట సాగవుతోంది.. జిల్లాలో ఇంత తక్కువ స్థాయిలో వరి వేయడం ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.. అలాగే మొక్కజొన్న మామూలుగా 28వేల 663 హెక్టార్లలొ ఈ పంట సాగవుతుంది.. ఈ రబీలో కేవలం 11వేల 722 హెక్టార్లలో పంట వేశారు.. సజ్జ, జొన్న విస్తీర్ణమైతే పదిశాతానికి మించలేదు.. పెసర, మినుములు, మిర్చి, నువ్వులు, పొద్దు తిరుగుడు, సోయాబీన్‌ సాగుకూడా పడిపోయింది. 

అప్పుల్లో రైతులు 

ఇలా పంటల సాగు తగ్గిపోవడంతో రైతులు మరిన్ని కష్టాల్లో పడ్డారు.. అప్పుల్లో మునిగిపోయారు.. బ్యాంకులు ఇప్పటివరకూ 395కోట్ల రుణాలే విడుదల చేశాయి.. ఇందులో ఎక్కువగా రెన్యువల్‌వి ఎక్కువగా ఉన్నాయి.. ఇలా ఇబ్బందులన్నీ ఒకేసారి రావడంతో రైతన్నలు ఆర్థికంగా చితికిపోతున్నారు.. వ్యవసాయం వీలుకాక... ఏం పని చేయాలో తెలియక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు... సాయం అందించి ఆదుకోవాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు..
ఈసారీ తప్పని కరువు
 

4న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీ..

ఢిల్లీ : ఫిబ్రవరి 4వ తేదీన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుపై చర్చించనున్నారు. 

రోహిత్ మృతిపై కాంగ్రెస్ ది అనవసర రాద్ధాంతం - వెంకయ్య..

ఢిల్లీ : రోహిత్ మృతిపై కాంగ్రెస్ ది అనవసర రాద్ధాంతం చేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. గతంలో హెచ్ సీయూలో 9 మంది విద్యార్థులు చనిపోతే ఆనాడు రాహుల్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. యూనివర్సిటీ వాతావరణాన్ని రాహుల్ కలుషితం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ రెండు సార్లు హెచ్ సీయూకు రావడంలో అర్థమేంటని ప్రశ్నించారు.

నగరాన్ని అభివృద్ధి మేమే చేశాం - బాబు..

హైదరాబాద్ : నగరాన్ని తామే అభివృద్ధి చేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి శ్రీకారం చుట్టినట్లు...నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం తమ హాయాంలోనే జరిగిందన్నారు. కృష్ణా జలాలు..బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు, లుంబినీ పార్కు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మతసామరస్యాన్ని కాపాడడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం హైదరాబాద్ వల్లే వస్తోందన్నారు. తెలుగు జాతికి నష్టం కలిగేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని పేర్కొన్నారు..

13:51 - January 30, 2016

విజయవాడ : రాష్ట్రంలో బలవంతపు భూసేకరణ ఆపాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. ఈమేరకు ఆయన విజయవాడలో వీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో రైతాంగం నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తుందని ఆరోపించారు. 2013 చట్టం ప్రకారం...రైతుల అంగీకారం లేకుండా... భూములను సేకరించ కూదని.. కానీ 2013 చట్టనికి విరుద్దంగా రైతు నుంచి సర్కార్ భూసేకరణ చేస్తుందని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భూములు కోల్పయిన నిర్వాసితులకు ఎంత భూమి కోల్పోతే అంత భూమి ఇస్తామని చెప్పింది... కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆరున్నర ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో వివిధ జిల్లాల్లో నాలుగు గ్రామాలను బుల్ డోజర్లతో తొలగించారని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీలు ప్రభుత్వాన్ని నడుపుతున్నాయన్నారు. దౌర్జన్య, నిరంకుశత్వం, ప్రజలపై పెత్తనం చేసే కమిటీలుగా ఉన్నాయని విమర్శించారు. జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నర్సాపురం పోర్టు పేరుతో రైతుల నుంచి భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే... అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు.

 

13:40 - January 30, 2016

ఏంటీ త్రీడీ 'కాలేయం' అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం. శరీరంలో కాలేయం కూడా ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. కాలేయానికి సంబంధించిన పలు సమస్యలు ఏర్పడుతుంటాయి. అప్పుడు మందులకు నయం కాని స్థితికి చేరుకున్నప్పుడు ఈ త్రీడి కణజాలం దోహదపడుతుంట. మరి ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి....
బెంగళూరుకు చెందిన పాండోరమ్‌ టెక్నాలజీ సంస్థ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. మానవ కాలేయంలా పనిచేసే త్రీ డి జీవ కణజాలాన్ని రూపొందించింది. ఏదైనా రుగ్మత సంభవించి కాలేయ మార్పిడి చేయాల్సిన పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుందని ఓ ప్రకనటనలో పేర్కొంది. కాలేయం పూర్తిగా మందగించి మందులకు నయం కాని స్థితికి చేరుకున్నప్పుడు ఈ త్రీడి కణజాలం దోహదపడుతుందని సంస్థ సహ వ్యవస్థాపకుడు అరున్‌ చందు తెలిపారు. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా ఇది పని చేస్తుందని, అతితక్కువ ధరకే రోగులకు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. పూర్తిగా దెబ్బతిన్న కాలేయాన్ని మెరుగుపర్చడంపై పరిశోధనలు చేసేందుకు అనేక ప్రఖ్యాత ఫార్మా కంపెనీలు పదేళ్ల కాలంలో సుమారు పది బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి విఫలమయ్యాయని ఆయన తెలిపారు. తాము తయారు చేసిన త్రీడి కణజాలం సంచలనం సృష్టిస్తోందని చెప్పారు. ఎలాంటి మందులు అవసరం లేకుండానే దీని ద్వారా రుగ్మతను నయం చేసుకోవచ్చని, డబ్బుతోపాటు సమయం కూడా ఆదా అవుతుందని వివరించారు.

13:40 - January 30, 2016

కరీంనగర్: అసలే వర్షాలు లేక కరువు తాండవిస్తున్న రోజులివి. గ్రామాల్లో రోజూ కూలిపనులకు వెళ్లనిదే పొట్టగడవని కాలమిది. ఏదో ఉపాధి హామీ ద్వారా పని దొరుకుతుంది కదాంటే ఆ పథకంలో దొంగలు పడ్డారు. చేసిన పనికి డబ్బులు ఇవ్వాల్సింది పోయి ఇదిగో అదిగో అంటూ ఏళ్లకు ఏళ్లు నానుస్తున్నారు. లక్షల రూపాయల కూలీల సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా మాయం చేశారు. కూలీల నిరక్షరాస్యతను బ్యాంక్‌ సిబ్బంది సొమ్ముచేసుకున్న వైనం తాజాగా కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అతిపెద్ద మోసం జరిగేదాకా అధికారులు ఎందుకు మౌనం వహించారన్నది పలు అనుమానాలకు దారితీస్తోంది. పగలంతా కష్టపడింది ఈ కూలీలైతే జేబులు నిండింది వేరొకరికి..ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఏకంగా మూడేళ్లుగా వీరి శ్రమకు ఫలితం దక్కలేదు.. అసలేం జరిగిందని ఆరా తీస్తే ఉపాధి హామీ పథకంలో భారీ స్కాం జరిగినట్లు తేలింది.

16 వేల మంది కూలీలకు ఆగిన చెల్లింపులు

కరీంనగర్ జిల్లాలో ఉపాధి హమీ పథకం వేతనాల చెల్లింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. అవి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలో 57మండలాల్లో 6 లక్షల 57,501మంది ఉపాధి హమీ కార్మికులుగా పనిచేస్తున్నట్లు జాబ్ కార్డులు ఇచ్చారు. అయితే ఇందులో దాదాపు 39 మండలాల్లో 200 గ్రామాలకు చెందిన 16వేలమంది కూలీలకు 2012-2014 వరకు చేసిన పనికి వేతనాల చెల్లింపులు జరగలేదు. తమకు జరిగిన అన్యాయాన్ని కూలీలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు.

రూ.68 లక్షల మేర అవకతవకలు

జిల్లాలో ఉపాధి కూలీలకు సంబంధించిన వేతనాలను ఐసిఐసిఐ, ఫినో కంపెనీద్వారా చెల్లిస్తున్నారు. అయితే మూడేళ్లుగా కూలీలకు వేతనాలు చెల్లించట్లేదు. దీంతో వేలాది మంది కూలీలు గ్రామస్థాయిలో ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపిలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలెక్టర్ నీతూ ప్రసాద్ విచారణకు ఆదేశించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వహిస్తున్న డ్వామా.. 68లక్షల రూపాయలమేర ఆవకతవకలు జరిగినట్లు విచారణలో తేల్చింది.

చూసీచూడనట్లు వ్యవహరించిన అధికారులు

ఐసిఐసిఐ వావిలాలపల్లి బ్యాంకు మేనేజర్ కొమ్మూరి శ్రీనివాసమూర్తి, ఫీనో ఏజన్సీ నిర్వాహకులు షేక్ బాషా, వెంకటేశ్వరరావు, రషీద్, సందీప్, అరవింద్‌లపై డ్వామా పీడీ గణేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫీనో కంపెనీపై ఆది నుండి ఆరోపణలు వస్తున్నా వారిపై అధికారులు చర్యతీసుకోవడంలో అలసత్వాన్ని ప్రదర్శించారు. సాంకేతిక కారణాలంటూ మూడేళ్లుగా కాలం వెల్లబుచ్చుతూ వచ్చిన ఫీనో కంపెనీపై పథకాన్ని నిర్వహిస్తున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనేది అసలు ప్రశ్న.

ఫీనో ఏజన్సీ, ఐసిఐసిఐ సిబ్బందిపై ఫిర్యాదు

నిరక్షరాసులైన కూలీలకు బ్యాంకు లావాదేవీలు ఏవీ తెలియకపోవడంతో ఫీనో సిబ్బంది, బ్యాంకు అధికారులకు కలిసొచ్చింది. అలా ఏకంగా 68లక్షల కూలీల డబ్బును స్వాహా చేశారు. పది హేను రోజులకోసారి కూలీ వేతనాలను చెల్లించాల్సి ఉండగా ఏళ్లు గడుస్తున్న ఇంత వరకు చేసిన పనికి చెల్లింపులు జరగలేదు. పెద్ద మొత్తంలో ఉపాధిహామీ వేతనాలను ఫీనో, ఐసిఐసిఐ సిబ్బంది నొక్కేయడంతో డ్వామా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి విచారిస్తున్నారు. 16 వేలమంది కూలీలు బాధితులుగా ఉన్న ఈ కేసులో అధికారుల విచారణ బృందం గ్రామస్థాయిలో పర్యటించి వివరాలను సేకరిస్తోంది.

పెండింగ్‌ బకాయిలపై దృష్టిపెట్టాలని ఆదేశం

లేటుగా మేల్కొన్న డ్వామా అధికారులు కేసు పెట్టడంతో ఆశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సిఎఫ్ఓ కేఎస్ఆర్‌మూర్తి జిల్లా కేంద్రానికి వచ్చి అధికారులతో సమావేశం నిర్వహించి పోలీసులకు పూర్తి సమాచారమిచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించారు. కేవలం 68లక్షలే కాకుండా ఇంకా చెల్లించకుండా ఉన్న పెండింగ్ బకాయిలపై దృష్టి సారించాలని సూచించారు. అయితే ఈ స్కాంలో నొక్కేసిన మొత్తం 68లక్షలే కాక ఇంకా ఎక్కువే ఉండొచ్చన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి పోలీసుల దర్యాప్తుద్వారా ఈ స్కాంలో ఎవరెవరికి ప్రమేయముందో వాళ్ల పేర్లు బయటకొస్తాయా.? మాయమైన 68 లక్షలను వెలికితీయగలుగుతారా లేక విచారణ అధికారులు చేతులెత్తేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

 

 

13:37 - January 30, 2016

ఫేస్‌బుక్‌లో ఏదైనా పోస్టు నచ్చితే ఏం చేస్తాం.. 'లైక్‌' బటన్‌ నొక్కుతాం. అంతే తప్ప ఆ పోస్టు నచ్చినప్పుడు మన మనసులోని భావనను వ్యక్తపర్చడం కుదరదు. ఇక అలా కాదు... పోస్ట్‌ నచ్చినప్పుడు కలిగే భావోద్వేగాన్ని కూడా తెలియజేయొచ్చు. త్వరలోనే ఫేస్‌బుక్‌లో అలాంటి ఆప్షన్‌ అందుబాటులోకి రానుంది. దాని పేరే 'రియాక్షన్స్‌' 'లైక్‌' తరహాలో వెంటనే మన అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా వెల్లడించేందుకు పలు సింబల్స్‌ను అందుబాటులోకి తెస్తోంది ఫేస్‌బుక్‌. ఫేస్‌బుక్‌లో పెట్టిన కామెంటు, వీడియో లేదా ఫొటో నచ్చిందని చెప్పడానికి ఇప్పటివరకు లైక్‌ ఆప్షన్‌ మాత్రమే ఉంది. ఈ ఆప్షన్‌ను మరింత విస్తరిస్తూ సరికొత్త 'రియాక్షన్‌' సింబల్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. 'కోపం', 'బాధ', 'వావ్‌', 'హాహా', 'యాయ్', 'లవ్‌' వంటి ఎమోషనల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చే యానిమేటెడ్‌ ఇమేజ్‌లను ప్రవేశపెట్టబోతున్నది. దీంతోపాటు యాథావిధిగా 'లైక్‌' బటన్‌ కూడా ఉంటుంది. 'లైక్‌' బటన్‌ను కాసేపు గట్టిగా ప్రెస్‌ చేస్తే ఈ రియాక్షన్స్‌ కనిపిస్తాయి. వాటిలో నచ్చినదానిని యూజర్‌ ఎంచుకోవచ్చు.

13:31 - January 30, 2016

ఇటీవల 'లోఫర్‌' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశాపాట్నీ హాలీవుడ్‌లో ఓ అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. 'కుంగ్‌ ఫూ యోగ' చిత్రాన్ని ప్రముఖ యాక్షన్‌ స్టార్‌ జాకీచాన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాకీచాన్‌ సరసన ఇద్దరు కథానాయికలు నటిస్తుండగా, ఇందులో ఒకరిగా ఇప్పటివరకు అమైరా దస్తూర్‌ని ఎంపిక చేశారు. తాజాగా మరో కథానాయికగా దిశాని సెలెక్ట్‌ చేశారు. ఇదే చిత్రంలో ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సోనూసూద్‌ సైతం నటిస్తున్నారు. దిశా బదులు తొలుత ఇలియానాని తీసుకోవాలనుకున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా దిశాని ఎంపిక చేసినట్టు చిత్ర యూనిట్‌ తెలిపింది. యాక్షన్‌ సన్నివేశాలు చేసేందుకు అనువైన బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉండటమే దిశాకి ఈ అవకాశం దక్కడానికి కారణమట. 'ఆర్కియాలజీ ప్రొఫెసర్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నాను. మగధ రాజ్యానికి సంబంధించిన సంపద టిబెట్‌లో ఉందని కనుక్కునే క్రమంలో ఏం జరిగిందనేదే చిత్ర కథ. జాకీచాన్‌ వంటి నటుడితో నటించే అరుదైన అవకాశం రావడం చాలా చాలా ఆనందంగా ఉంద'ని దిశా చెప్పింది.

13:28 - January 30, 2016

మరోసారి ఎన్టీఆర్‌, సమంత జోడీ రిపీట్‌ కానుందని సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'బృందావనం', 'రామయ్య వస్తావయ్యా', 'రభస' వంటి చిత్రాలొచ్చాయి. తాజాగా ఈ కాంబినేషన్‌తో కొరటాల శివ 'జనతా గ్యారేజ్‌' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కథానుగుణంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన ఇద్దరు కథానాయికలు నటించాల్సి ఉంది. ఇందులో ఒకరిగా ఇప్పటికే నిత్యమీనన్‌ని ఎంపిక చేశారు. రెండో కథానాయికగా సమంతని సెలెక్ట్‌ చేశారని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ తన చిత్రాల్లో హీరోయిన్లకు మంచి ప్రాధాన్యం ఇస్తారని వేరే చెప్పక్కల్లేదు. 'మిర్చి'లో అనుష్క పాత్ర, 'శ్రీమంతుడు'లో చారుశీలగా శ్రుతిహాసన్‌ పాత్ర ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. ఆయా పాత్రల తీరు తెన్నులు ఫ్రెష్‌గా ఉంటూ అందరికీ గుర్తిండిపోయాయి. ఎన్టీఆర్‌ సరసన నటిస్తున్న సమంత, నిత్యమీనన్‌ల పాత్రలు ఎలా ఉంటాయనేది మరికొంత కాలం వేచిచూడాల్సిందే. ఈ చిత్రంతోపాటు సమంత ప్రస్తుతం నితిన్‌కి జోడీగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'అ..ఆ' చిత్రంలోను, కృష్ణవంశీ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించబోయే మహిళా ప్రధాన చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే నిత్యమీనన్‌ సైతం తెలుగుతోపాటు ఇతర భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. నిత్య ప్రస్తుతం నాగచైతన్య కథానాయకుడిగా రూపొందుతున్న 'మజ్ను'చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది.

13:26 - January 30, 2016

సునీల్‌, నిక్కి గల్రాని, డింపుల్‌ చోపడే హీరోహీరోయిన్లుగా వాసువర్మ దర్శకత్వంలో 'దిల్‌' రాజు నిర్మించిన 'కృష్ణాష్టమి' చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత 'దిల్‌' రాజు మాట్లాడుతూ, 'మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తొలుత ఫిబ్రవరి 5న రిలీజ్‌ చేద్దామనుకున్నాం. కాని 'స్పీడున్నోడు' ఫిబ్రవరి 5, 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' 12న విడుదల చేస్తున్నామని ఆయా చిత్రాల నిర్మాతలు మమ్మల్ని రిక్వెస్ట్‌ చేయడంతో, నిర్మాతలకు బెనిఫిట్‌ దొరకాలని మా చిత్రాన్ని ఫిబ్రవరి 19కి వాయిదా వేశాం' అని అన్నారు. 'అమెరికా నుంచి వచ్చిన ఓ కుర్రాడు ఇండియాలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఉన్నతమైన సాంకేతిక విలువలతో కుటుంబమంతా చూడదగిన విధంగా ఉంటుంది. సునీల్‌ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న ఈ చిత్రం అటు క్లాస్‌ని, ఇటు మాస్‌ని బాగా అలరిస్తుంది' అని దర్శకుడు వాసు వర్మ తెలిపారు.

13:24 - January 30, 2016

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 'ఐఫా' అవార్డుల వేడుకల్లో నటి ఛార్మి కన్నీళ్ళు పెట్టుకున్న విషయం అందరికి తెలిసిందే. దీంతో ఛార్మి ఎందుకు కన్నీళ్ళు పెట్టింది? అసలక్కడ ఏం జరిగింది? వంటి ప్రశ్నలతో గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్‌లోనే కాదు సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సదరు ప్రశ్నలకు ఎవరికి వారు తమకిష్టమైన సమధానాలు చెబుతూ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ కూడా చేశారు. వీటిపై ఛార్మి స్పందిస్తూ తన కన్నీళ్ళ కథ గురించి సోషల్‌ మీడియాలో ఇలా తెలియ చేసింది. ''ఐఫా' ఉత్సవాల్లో భాగంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ 'నాన్నకు ప్రేమతో..' చిత్రంలోని పాట పాడారు. ఈ పాటను దేవీ స్టేజ్‌పై పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యాను. సత్యమూర్తిగారితో నాకూ మంచి అనుబంధముంది. దేవి శ్రీ పాట పాడుతున్న క్షణంలో సత్యమూర్తిగారితో నాకున్న అనుబంధం గుర్తుకొచ్చి బాగా ఎమోషనల్‌ అయ్యాను. కంట్రోల్‌ చేసుకోలేక అందరి ముందు అలా ఏడ్చేశాను. అయినా ఇలాంటి సున్నిత విషయాలను మీడియాలో ప్రచురించే ముందు జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది' అని ఛార్మి పేర్కొంది.

13:22 - January 30, 2016

హైదరాబాద్  : ఏపీ సచివాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఎస్ పి టక్కర్‌, ఇతర ఉన్నతాధికారులు... ఆ తర్వాత కొద్దిసేపు మౌనం పాటించారు.. గాంధీ చేసిన సేవల్ని గుర్తుచేసుకున్నారు. 

 

13:21 - January 30, 2016

జుట్టు రాలడం ఇప్పుడు ప్రధాన సమస్య. జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే.. ముందుగా తలపై చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. జుట్టు రాలడానికి కారణాలేమైనా కావచ్చు.. కానీ కొన్ని పద్ధతులను పాటించడం వల్ల... రాలటం తగ్గి ఆరోగ్యకరమైన మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది. అవేంటో చూద్దాం..
ఆరోగ్యకర ఆహారం: జుట్టు రాలకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కావలసిన విటమిన్స్‌, మినరల్స్‌ ఉండేలా చూసుకోవాలి. మీ ఆహారంలో పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, ఓట్స్‌, హోల్‌ గ్రైన్స్‌, తృణధాన్యాలను కలుపుకోండి. విటమిన్స్‌తోపాటు ప్రోటీన్‌, అయోడిన్‌ వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి తప్పని సరి. 
రెండు రోజులకోసారి: రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేయాలి. అయితే వేడి నీరు జుట్టుకు ప్రమాదం కలిగిస్తుంది. తలస్నానానికి గోరు వెచ్చని లేదా చల్లని నీటిని వాడటం మంచిది. మీ తలపై చర్మానికి ఆయిల్‌ లేదా స్నానం చేసే సమయంలో చేతి గోళ్ళు మాడుకు తాకకుండా, కేవలం వేళ్ళు మాత్రమే తాకేలా చూడండి.
జుట్టును ఆరబెట్టడం: తడిగా ఉన్న జుట్టును సహజంగా ఆరబెట్టండి. డ్రయర్‌లను వాడటం వలన జుట్టు మరింత పాడయ్యే అవకాశం ఉంది. ఎక్కువ వేడితో డ్రయర్‌ను వాడి జుట్టును ఆరబెట్టడం వలన జుట్టు బలహీనంగా, అనారోగ్యంగా మారుతుంది.
జుట్టును ఎలా దువ్వటం: జుట్టు దువ్వేందుకు ఎక్కువ ఖాళీలు(దూరం దూరం పళ్లు) ఉన్న దువ్వెనలను వాడండి. దువ్వెనను కూడా కింది వైపు నుంచి దువ్వండి. జుట్టు తడిగా ఉన్నపుడు మాత్రం దువ్వకూడదు. ఇలా చేస్తే జుట్టు తొందరగా తెగిపోయే అవకాశం ఉంది.
కండీషనర్ల వాడకం: జుట్టుకు కండీషనర్ల వాడకం తప్పని సరే అని చెప్పవచ్చు. కండీషనర్‌ను వాడటం వలన వెంట్రుకలపై ఒక పొరలా ఏర్పడి క్లోరిన్‌ కలిగి ఉన్న నీటి నుండి హానికర సూర్యకిరణాల నుండి కాపాడుతుంది.
జుట్టు ఆరోగ్యానికి వ్యాయామాలు: శారీరక వ్యాయామాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. వ్యాయామాల వలన ఒత్తిడి తగ్గి, తలపై చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. జీవక్రియ పెరిగి.. ఆహారంలోని పోషకాలకు జుట్టుకు అందుతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.

13:19 - January 30, 2016

బిజీలైఫ్‌... టెన్షన్‌ జీవితం. ఆఫీసు, ఇల్లు.. పనులతో జీవితం యాంత్రికంగా మారిపోయింది. దీంతో ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోవడం లేదు. ఇది అనేక రకాల సమస్యలకు దారి తీస్తోంది. జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యం తప్పనిసరి. ఆ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాల్సిందే. ఇప్పుడు యోగా నుంచి ఎరోబిక్స్‌ వరకు అనేక రకాల వ్యాయామాలు ఉన్నాయి. వ్యాయామం ప్రతిరోజూ చేయడం వల్ల ఎముకలు, కండరాల నిర్మాణం, నాడీమండలం, రక్తప్రసరణ వ్యవస్థ ఇలా ప్రతి భాగం ఉత్తేజమవుతూ ఉంటుంది. ఎముకలు, కండరాల బలహీనత లాంటి అనేక దీర్ఘకాల వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది. అయితే.. ఈ వ్యాయామం చేయడానికి ముందు-తర్వాత తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి.

సూచనలు..
ఎరోబిక్స్‌ చేయడానికి ముందు కనీసం ఐదు నిమిషాలపాటు దేహాన్ని వార్మప్‌, తర్వాత కూల్‌ డౌన్‌ చేసుకోవాలి. వార్మప్‌ చేయడం వల్ల కండరాలు మృదువుగా కదులుతాయి. కీళ్ల కదలికలు సులువుగా మారుతాయి. చిన్నపాటి కదలికలతో దేహంలో ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం, రక్తప్రసరణ వేగం పెరుగుతాయి. కండరాలకు సరిపడినంత రక్తం అందడం, దాని వల్ల చిన్నపాటి గాయాలు వాటంతట అవే తగ్గిపోవడం వంటి ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా శరీరంలో అన్ని అవయవాల పనితీరులో సమన్వయం పెరుగుతుంది. దేహాన్ని స్ట్రెచ్‌ చేసేటపుడు ఒక్కసారిగా వంచేయకూడదు. నిదానంగా రిలాక్స్‌ అవుతూ చేయాలి. వార్మప్‌లో భాగంగా దేహాన్ని స్ట్రెచ్‌ చేసేటపుడు ఒక్కొక్క దశలో పదిహేను సెకన్లు ఉండేటట్లు చూసుకుంటే మంచిది. అలాగే.. స్ట్రెచ్‌ చేసేటపుడు ఊపిరి బిగపట్టకుండా నిదానంగా గాలి పీల్చుకోవాలి. వ్యాయామం పూర్తయ్యాక కొద్దిసేపు కూల్‌డౌన్‌ చేయాలి. ఐదారు నిమిషాలపాటు మామూలు వేగంతో వ్యాయామాన్ని ముగించాలి. ఇలా చేయడం వల్ల గుండె వేగం, రక్తప్రసరణ వేగం వంటివన్నీ తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి. వార్మప్‌ చేయడం ఎంత అవసరమో కూల్‌డౌన్‌ చేయడం కూడా అంతే ముఖ్యం!

13:16 - January 30, 2016

హైదరాబాద్ : రాహుల్ హెచ్ సీయూను కలుషితం చేస్తున్నారన్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. రోహిత్ మృతిని కాంగ్రెస్ రాజకీయం చేస్తుందన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లోకోడలు మృతి చెందినప్పుడు రాహుల్ ఎక్కడికెళ్లాడని ప్రశ్నించారు. హెచ్ సీయూలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడే రాహుల్ స్పందించి ఉంటే రోహిత్ మృతి చెందేవాడా అని ప్రశ్నించారు. చౌకబారు రాజకీయాలకు రాహుల్ పాల్పడుతున్నారని విమర్శించారు. 

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

నల్గొండ : జిల్లాలోని సంస్థాన్‌ నారాయణపురం మండలం లింగవారిగూడెంలో విషాదం నెలకొంది. తొమ్మిదో తరగతి విద్యార్థిని శిరీష శనివారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సెల్‌పోన్‌ మాట్లాడవద్దని మేనమామ మందలించినందుకు మనస్తాపానికి గురైన శిరీష ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

చత్తీస్‌గఢ్ : సుకుమా జిల్లా పాలమడుగు అటవీప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

13:01 - January 30, 2016

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా బాపుఘాట్‌ దగ్గర పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

 

12:59 - January 30, 2016

హైదరాబాద్ : పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ మృతికి కారుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ హెచ్ సీయూలో విద్యార్థులు చేస్తున్న దీక్షకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మద్దతు తెలిపారు. ఉదయం నుంచి విద్యార్థులతో పాటు దీక్షలో కూర్చున్నారు. రోహిత్‌ తరపున న్యాయం కోసం పోరాడేందుకే మళ్లీ హైదరాబాద్‌కు వచ్చానని రాహుల్‌ అన్నారు. సాయంత్రం వరకు రాహుల్‌గాంధీ దీక్షలో పాల్గొననున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ పి.ఎ.సంగ్మా, రోహిత్‌ తల్లి రాధిక, సోదరుడు రాజు, విద్యార్థులు దీక్షలో పాల్గొన్నారు.

12:54 - January 30, 2016

హైదరాబాద్ : అమరవీరుల దినోత్సవం సందర్భంగా నగరంలో 2 నిమిషాలు ట్రాఫిక్ ను నిలిపి వేశారు. అన్ని సిగ్నల్స్ వద్ద 11 గంటలకు 2 నిమిషాలకు ట్రాఫిక్ నిలిపివేశారు.

 

అమరవీరుల దినోత్సవం.. 2 నిమిషాలు ట్రాఫిక్ నిలిపివేత

హైదరాబాద్ : అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసులు నగరంలో 2 నిమిషాలు ట్రాఫిక్ నిలిపివేయనున్నారు. అన్ని సిగ్నల్స్ వద్ద 11 గంటలకు 2 నిమిషాలకు ట్రాఫిక్ నిలిపివేశారు. 

12:43 - January 30, 2016

రాగులు అందరికీ తెలిసే ఉంటుంది. రాగుల్లో ఎన్నో పోషకాలున్నాయి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను ముఖ్యంగా మధుమేహం, బిపీ సమస్య నుంచి నివారణ పొందవచ్చు. చాలా ఈజీగా రాగులతో చేసుకునే ఆహారం రాగి మాల్ట్‌. సూపర్‌ మార్కెట్‌లోనూ రాగిమాల్ట్‌ లభిస్తోంది. అయితే కాస్త తీరిక చేసుకుని ఇంట్లోనే రాగిమాల్ట్‌పిండిని తయారుచేసుకోవచ్చు. 
రాగి మాల్ట్‌ తయారు చేయడానికి రాగులను 18 గంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లను వంపి పలుచటి కాటన్‌ గుడ్డలో వదులుగా మూటకట్టాలి. ఈ మూటను గాలి తగిలే చోట ఉంచి.. అప్పుడప్పుడు మూటపై నీరు చిలకరించాలి. ఒకటి నుంచి మూడు రోజులలో మూటలోని రాగులు మొలకెత్తుతాయి. వీటిని నీరెండలో ఆరపెట్టాలి. ఆ తర్వాత సన్నటి సెగపై పెనం పెట్టి.. మంచి వాసన వచ్చేవరకు మొలకెత్తిన రాగులను వేయించుకోవాలి. ఆ తర్వాత పొడిగా చేసుకోవాలి. సువాసన కొరకు కొద్దిగా ఏలకులను కూడా వేసుకోవచ్చు. ఈ పిండిని గాలి చొరబడని డబ్బలో నిల్వచేసుకోవాలి. గ్లాస్‌ వేడి నీటిలో రెండు టేబుల్‌ స్పూన్ల రాగి మాల్ట్‌ పొడి వేసి మరిగించాలి. దీనికి పాలను చేర్చి పంచదార లేదా ఉప్పు కలిపి జావలాగా తాగొచ్చు. 
మాల్ట్‌ చేయడం వల్ల పోషకాలు వృద్ధి చెందుతాయి.వాటిలోని శక్తి, మాంసకృత్తులు, ఎ,బి,సి విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. రాగి మాల్ట్‌లో అమైలేజ్‌ అనే ఎంజైమ్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది. రాగిమాల్ట్‌ అన్ని వయసుల వారికి ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా అవసరమయ్యే పెరుగుదల ఉన్న పిల్లలకు చాలా మంచిది. స్థూలకాయాన్ని నివారిస్తుంది. 
రాగిమాల్ట్‌తో జావనే కాకుండా సంగటి, రొట్టె, పాయసం, లడ్డు, దోశ, బర్ఫీ కూడా తయారుచేసుకోవచ్చు. పెసలు, శనగలు మొదలుగు మొలకెత్తిన పప్పుధాన్యాలను కలిపి చిన్నారులకు బలవర్ధకమైన ఆహారంగా ఇవ్వవచ్చు.

12:30 - January 30, 2016

హైదరాబాద్ : టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఎపి సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగర ప్రజలకు టిడిపిపై నమ్మకం ఉందన్నారు. ఐటీని అభివృద్ధి చేసిన ఘనత టిడిపిదేనని చెప్పారు. హైటెక్ సిటీ ప్రాంతంలో గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. కానీ తాను వచ్చిన తర్వాత అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రజలకు టిడిపిపై నమ్మకం, అచంచల విశ్వాసముందన్నారు. టిడిపి చేసిన అభివృద్ధిని చూసి పార్టీపై నమ్మకం కల్గిందన్నారు. హైదరాబాద్ కు ఒక విజన్ ఇచ్చామని తెలిపారు. ప్రపంచ దేశాలు తిరిగి అధ్యయనం అనంతరం హైదరాబాద్ ను అభివృద్ధి చేసామని తెలిపారు. తమ హయాంలో నగరంలో ఫ్లైవోర్లు, రోడ్లను వెడెల్పు చేశామని చెప్పారు. గ్రేటర్ లో టీడీపీ, బీజేపీ కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భౌగోళికంగానే రాష్ట్ర విభజన జరిగిందని.. తెలుగు వారు కలిసే ఉన్నారని పేర్కొన్నారు. తెలుగు వారందరూ ఒకటిగా ఉండాలనేది తన ఆకాంక్ష అన్నారు. స్మార్ట్ సిటీల తర్వాత లిస్టులో వరంగల్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

 

హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది టీడీపీయే: చంద్రబాబు

హైదరాబాద్ : టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఎపి సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగర ప్రజలకు టిడిపిపై నమ్మకం ఉందన్నారు. ఐటీని అభివృద్ధి చేసిన ఘనత టిడిపిదేనని చెప్పారు. హైటెక్ సిటీ ప్రాంతంలో గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. కానీ తాను వచ్చిన తర్వాత అభివృద్ధి చేశామని చెప్పారు. 

12:04 - January 30, 2016

కృష్ణా : విజయవాడ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడి, వేడిగా జరిగింది. కాంట్రాక్ట్‌ కార్మికులను రోడ్డున పడేసే జీవో 279ను రద్దు చేయాలని కౌన్సిల్ బయట కార్మికులు ఆందోళన చేపట్టారు. కౌన్సిల్ లోపల ప్రతిపక్ష కార్పొరేటర్‌ల నిరసనలతో సమావేశం ఉత్కంఠగా సాగింది. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా.. అధికార దర్పాన్ని కొనసాగిస్తూ ప్రతిపాదనలను ఏకపక్షంగా ఆమోదించుకున్నారు.

కార్మికులు భారీ ఆందోళన

రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులను తొలగించడంతో పాటు, పారిశుధ్య పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ప్రభుత్వం 279 జీవోను తెస్తోందంటూ.. విజయవాడ నగర పాలక సంస్థ వద్ద కార్మికులు భారీ ఆందోళన చేపట్టారు. అయితే అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

కార్పొరేటర్ల కేకలతో హోరెత్తిన సమావేశం

అటు నగర పాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం ప్రతిపక్ష, అధికారపక్ష కార్పొరేటర్ల కేకలతో హోరెత్తింది. సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్మికులకు పూర్తిస్దాయిలో ఉద్యోగ భద్రత కల్పిచాల్సింది పోయి కార్మికులను తొలగించడమేమిటంటూ కార్మిక సంఘాల నేతలు, కాంట్రాక్టు కార్మికులు ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు.

279 జీవోను రద్దు చేయాలని ప్రతిపక్షాల డిమాండ్‌

ఇదిలా ఉంటే కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరగడంతో పాటు, కార్పొరేటర్ల కేకలతో హోరెత్తింది. ప్రభుత్వం జారీచేసిన 279 జీవోను తక్షణమే రద్దుచేయాలని ప్రతిపక్ష పార్టీ సభ్యులు డిమాండ్‌ చేయగా పాలక పక్షం ఆ డిమాండ్లను తోసిపుచ్చుతూ తీర్మానాన్ని ఆమోదించుకున్నారు. దీంతో ప్రతిపక్షనాయకులు ఆందోళనకు దిగారు. అలాగే ప్రైవేటీకరణ దిశగా పావులు కదుపుతున్న నగర సుందరీకరణ హోర్డింగుల విషయంలో కూడా తీవ్ర చర్చ జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు కొంత సేపు సభనుంచి వాకౌట్ కూడా చేశాయి. 203 ప్రతిపాదనలపై కౌన్సిల్‌లో చర్చజరగాల్సి ఉండగా.. పాలక పక్షం ఏకపక్షంగా వాటిని ఆమోదించుకుంది. మేయర్ తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ వారిని మాట్లాడనివ్వకుండా అడ్డుపడుతూ సభను కొనసాగించారు.

 

11:58 - January 30, 2016

నల్లగొండ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యపేట మండలం రాయిగూడెం జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఇద్దరినీ మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. 

11:48 - January 30, 2016

నెల్లూరు : జిల్లాలో వైట్ పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కు స్వల్పగాయాలయ్యాయి. కోవ్వూరు మండలం నదనగుంట ఎన్ హెచ్ 5 జాతీయ రహదారిపై విజయవాడ నుండి రేణిగుంట వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్ కు స్వల్పగాయాలయ్యాయి. లక్షలు విలువ చేసే వైట్ పెట్రోల్ ను పట్టుకునేందుకు బిందెలు, డ్రమ్ములతో, క్యాన్లతో ప్రజలు ఎగబడ్డారు.

 

11:47 - January 30, 2016
10:31 - January 30, 2016

విశాఖ : నగరంలో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు జరగనున్న అంతర్జాతీయ నేవీ ఫ్లీట్ రివ్యూకు సమయం దగ్గర పడుతుండడంతో నావికా దళం రిహార్సల్స్‌ను ముమ్మరం చేసింది. ఫ్లీట్ రిహార్సల్స్‌లో భాగంగా విశాఖ సాగర తీరంలో వివిధ విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. ఫిబ్రవరి 2న జరిగే ఫైనల్ రిహార్సల్‌లో వివిధ దేశాల నేవీ దళాలు పాల్గొంటాయి. ఫిబ్రవరి 6న జరిగే ఫ్లీట్ రివ్యూలో ప్రధాని, రాష్ట్రపతి, పలుదేశాల ప్రతినిధులు పాల్గొంటారు. 


 

 

10:24 - January 30, 2016

చిత్తూరు: కొచ్చి వెళ్తున్న శబరిమలై ఎక్స్ ప్రెస్‌లోకి అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. తిరుపతి సమీపంలో బి-2 కోచ్‌లోకి చొరబడ్డ దొంగలు పలువురు ప్రయాణికులు లాప్‌ట్యాప్‌లను, మొబైల్ ఫోన్లను దొంగిలించారు. దొంగల హల్‌చల్‌తో ప్రయాణికులు హడలెత్తిపోయారు.

విద్యార్థుల దీక్షలో పాల్గొన్న రాహుల్

హైదరాబాద్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్ సీయూ చేరుకున్నారు. రోహిత్ మృతికి నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆమరణనిరాహార దీక్షలో రాహుల్ పాల్గొన్నారు. నేడు ఒక రోజు దీక్షలో పాల్గొననున్నారు. మరోవైపు రాహుల్ రాకను వ్యతిరేకిస్తూ...వర్సిటీ గేట్ దగ్గర ఎబివిపి ఆందోళన చేపట్టింది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.

 

09:52 - January 30, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్ సీయూ చేరుకున్నారు. రోహిత్ మృతికి నిరసనగా విద్యార్థులు చేపట్టిన ఆమరణనిరాహార దీక్షలో రాహుల్ పాల్గొన్నారు. నేడు ఒక రోజు దీక్షలో పాల్గొననున్నారు. మరోవైపు రాహుల్ రాకను వ్యతిరేకిస్తూ...వర్సిటీ గేట్ దగ్గర ఎబివిపి ఆందోళన చేపట్టింది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.

 

09:48 - January 30, 2016

హైదరాబాద్ : రోహిత్ మృతికి నిరసనగా హెచ్ సీయూలో విద్యార్థులు చేపట్టిన సామూహిక దీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దీక్ష స్థలికి అర్ధరాత్రి రాహుల్ గాంధీ చేరుకున్నారు. రోహిత్ మృతికి సంతాపంగా విద్యార్థులు అర్ధరాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఇవాళ రోహిత్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్నారు. నేడు ఒక రోజు రాహుల్ దీక్షలో పాల్గొననున్నారు. ఇన్ చార్జీ వీసీ శ్రీవాస్తవ్ సెలవుపై వెళ్లడంతో అతని స్థానంలో కొత్త వీసీగా పెరియ స్వామి నియామించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడారు.. ఆ వివరాలను వారి మాటల్లోనే..

దళితులుపై కేంద్రం, బిజెపి కుట్ర

దళితులుపై కేంద్రం, బిజెపి కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. దళితులను చంపడం కేంద్రం, బిజెపి కోసం స్కెచ్ వేసింది. హంతకుడైన వీసీని కాపాడడం కోసం ఐదు వేల మంది జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది. రోహిత్ హత్యకు కారణమైన వీసీ అప్పారావును తొలగించాలి. వీసీని లీవ్ లో పంపిండం దుర్మార్గమైన చర్య. దళితులపై దాడులకు పాల్పడే వారికి వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమను సస్పెండ్ చేసినప్పుడు డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాము. విచారణను 18 కి వాయిదా వేసింది. అనంతరం రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. మమ్మల్లి చంపడం కోసం కేంద్రం, బిజెపి, ఎబివిపి, వీసీ అప్పారావు స్కెచ్ వేశారు. రెండో వీసీ విపిన్ శ్రీవాత్సవ్ పై ఆరోపణలున్నాయి. 2008 సంత్సరంలో సెంథిల్ కుమార్ అనే దళిత విద్యార్థి హత్యకు విపిన్ శ్రీవాత్సవ్ కారకుడు.

ఇటీవల తమ ఐదుగురిని బహిష్కరించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సబ్ కమిటీలో శ్రీవాత్సవ్ సభ్యుడు.. అంతేకాదు,.. ఆ కమిటీకి చైర్ పర్సన్ కూడా. అలాంటి వ్యక్తిని మళ్లీ తీసుకొచ్చి వీసీగా నియమించడం దారుణం. తాము అతన్ని వ్యతిరేకించన తర్వాత ఇంచార్జీ వీసిగా ఉండే శ్రీవాత్సవ్ ను సెలవులపై పంపారు. మొదటగా వీసీ అప్పారావును సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలి. ఆ తర్వాత రోహిత్ మృతికి కారణమైన మిగిలిన హంతకులపై చర్యలు తీసుకోవాలి. దళితులకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేయాలి. రోహిత్ చనిపోకముందు తమ సస్పెన్సన్ పై ఎంపీ కవితకు విన్నవించాము... పరిశీలిస్తామని చెప్పింది.. కానీ తర్వాత రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తర్వాత కవిత స్తబ్ధంగా ఉన్నది. ఘటనపై సీఎం చంద్రబాబు ఎలాంటి స్పందన లేదు.

హంతకులతో చర్చలకు సిద్ధంగా లేము

శ్రీవాత్సవ్ తమతో చర్చలకు ఒకసారి వచ్చారు. హంతకులతో చర్చలకు తాము సిద్ధంగా లేము. చర్చలకు సిద్ధంగా ఉన్నాము.. కానీ హంతకులతో చర్చలకు సిద్ధంగా లేము. పెరియ స్వామి వీసీగా బాధ్యతలు తీసుకుంటున్నారు. అందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. తాము పెట్టిన ఏ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించడం లేదు. వీసీని సెలవుపై పంపడం దారుణం. విద్యార్థుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నారు. అప్పారావు, శ్రీవాత్సవ్ లు దళిత వ్యతిరేకులు.

విద్యార్థుల డిమాండ్లు...

రోహిత్ మృతికి కారకుడైన వీసీ ఆప్పరావును తొలగించాలి..

అప్పారావును అరెస్టు చేయాలి..

రోహిత్ కుటుంబానికి రూ. 50 లక్షలు ఇవ్వాలి..

రోహిత్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి..
మాపై ఎలాంటి షరతులు పెట్టకుండా బహిష్కరణను ఎత్తి వేయాలి'.. అనే డిమాండ్లతో ఆందోళన చేపట్టారు. డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని పేర్కొన్నారు.

 

హైదరాబాద్‌-గుల్బర్గా మధ్య ప్రత్యేక రైళ్లు రద్దు...

హైదరాబాద్‌ : ప్రయాణికుల నుంచి ఆదరణ లేని కారణంగా హైదరాబాద్‌-గుల్బర్గా మధ్య ఫిబ్రవరి 1 నుంచి 29 వరకు నడపాలని నిర్ణయించిన ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. గతంలో ప్రకటించిన హైదరాబాద్‌-గుల్బర్గా-హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 01318/01317) ప్రత్యేక రైలును రద్దు చేస్తున్నట్టు ఆయన వివరించారు.

08:44 - January 30, 2016

హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ చనిపోవడం చాలా బాధాకరమని... ఘటనకు బాధ్యులైన వారిపై కేంద్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీటీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, చెంగల్ రాయుడు పాల్గొని, మాట్లాడారు. వర్సిటీ వీసీ పెట్టిన మానసిక ఒత్తిడి తట్టుకోలేక రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రుల లేఖల వల్లే రోహిత్ మృతి చెందారని చెప్పారు. బాధ్యులైన కేంద్రమంత్రులను పదవుల నుంచి తప్పించాలని, వీసీని తొలగించాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ యూనిర్సిటీలో కేంద్రం జోక్యం ఉండకూడదని సూచించారు.

 

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్‌ లక్ష్మీగూడలో విషాదం నెలకొంది. కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలుడికి కూడా గాయాలవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ కలహాలకారణంగానే దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

నేడు కాలేజీల బంద్ కు ఎబివిపి పిలుపు

హైదరాబాద్‌ : హెచ్‌సీయూలో చోటుచేసుకున్న దురదృష్టకర ఘటనను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాజకీయం చేస్తున్నారని ఏబీవీపీ తెలంగాణ కార్యదర్శి అయ్యప్ప ధ్వజమెత్తారు. ఆయన తీరును నిరసిస్తూ శనివారం రాష్ట్రంలో కళాశాలల బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రమాదంలో ఇద్దరు మృతి...

నల్లగొండ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యాపేట మండలం రాయనిగూడెం శివారులో బైక్-కంటైనర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ అతి సాధారణంగా ఉంది. వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు 3 కంపార్ట్‌మెంట్లలో పనిచేస్తుంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది.

ఓయూలో వివిధ కోర్సుల పరీక్షలు వాయిదా...

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు జరిగే వివిధ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాయిదా పడిన పరీక్షల వివరాలు, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో తదితర వివరాలు, తేదీలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడొచ్చని అధికారులు పేర్కొన్నారు.

నేడు టీఆర్ ఎస్ బహిరంగ సభ..

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ నేడు  భారీ బహిరంగసభ నిర్వహించేందుకు సిద్ధమైంది. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే ఈ సభకు భారీ ఎత్తున జనసమీకరణ జరుపుతున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ఈ బహిరంగ సభ హైలెట్‌గా నిలుస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటి వరకు ప్రచార రంగంలోకి రాలేదు. ఈ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. బహిరంగ సభ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు సీఎం కేసీఆర్ సభాప్రాంగణానికి చేరుకుంటారు.

నేడు సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

హైదరాబాద్ : ఎపి సీఎం చంద్రబాబు నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. పలు అంశాలపై ఆయన మీడియాకు వివరించనున్నారు. 

07:52 - January 30, 2016

హైదరాబాద్ : రోహిత్ మృతికి నిరసనగా అర్ధరాత్రి హెచ్ సీయూలో విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించి రోహిత్ కు సంతాపం ప్రకటించారు. రోహిత్ మృతికి కారమైన కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వర్సిటీ వీసీ అప్పారావులను తొలగించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, తమ డిమాండ్లను పరిష్కరించేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. రోహిత్ తోపాటు సస్పెండ్ అయినా విద్యార్థులు నిన్నటి నుంచి నిరాహారదీక్షకు కూర్కుకున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దీక్షా స్థలికి చేరుకుని.. నేడు ఒక్కరోజు దీక్ష చేయనున్నారు.  

07:43 - January 30, 2016

ఢిల్లీ :  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్‌ ముప్పును ఎదుర్కొనేందుకు మన దేశం సిద్ధమవుతోంది. ప్రాణాంతక జికా వైరస్‌  నిర్ధారణ పరీక్షల కోసం ప్రత్యేక వైద్య పరికరాల కిట్స్‌ను తీసుకురావాలని కేంద్ర వైద్యారోగ్య మంత్రి శాఖ నిర్ణయించింది. పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలో జికా పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ప్రపంచాన్ని భయపెడుతున్న జికా వైరస్‌ 

డెంగీ, స్వైన్‌ ఫ్లూ, ఎబోలా తర్వాత ఇప్పడు జికా వైరస్‌ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పడు 25 దేశాల్లో  దీనిని గుర్తించారు. లాటిన్‌ అమెరికా దేశాలను వణికిస్తున్న జికా వైరస్‌... మన దేశంలో కూడా చాపకింద నీరులా ప్రవేశించే అవకాశం ఉందని కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంచనావేస్తేంది. ఈ ముప్పును ఎదుర్కొనేందకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 

శిశు జననాలపై ప్రత్యేక దృష్టి 

మనదేశంలో ఎవరికైనా జికా వైరస్‌ సోకితే ఎలా   గుర్తించాలన్న   అన్న అంశంపై తర్జనభర్జన పడ్డ వైద్యారోగ్య శాఖ... ఇందుకు కోసం ప్రత్యేక  వైద్య పరికరాల కిట్లను తీసుకువాల నిర్ణయించింది. ఈ వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన  జాగ్రత్తలు, పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారం కోసం అమెరికాలోని  సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌...సీడీసీకి లేఖ రాస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో శిశు జననాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏ నవజాత శిశువుకైనా జికా లక్షణాలు ఉన్నట్టు గుర్తిస్తే వెంటనే సమాచారం తెలుసుకునే ఏర్పాట్లు చేసింది. జికా వైరస్‌ ప్రబలిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అవరసమైతే విమానాశ్రాయల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించే అంశాన్ని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిశీలిస్తోంది. గతంలో స్వైన్‌ ఫ్లూ, ఎబోలా  వ్యాప్తి చెందిన దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు విమానాశ్రయాల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 

ఏడిస్‌ ఏజిప్టై దోమ ద్వారా గతంలో  డెంగీ, చికున్‌గున్యా 

ఏడిస్‌ ఏజిప్టై ఆడ దోమ కాటు ద్వారా జికా వైరస్‌ అతిశీఘ్రంగా వ్యాపిస్తుంది. ఈ దోమ పగలే కుడుతుందని పరిశోధనల్లో తేలింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ ప్రజలను కోరింది. ఇదే దోమ ద్వారా గతంలో డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు కూడా వ్యాపించాయి. జికా వైరస్‌ను గుర్తించి, నిర్ధారించేందుకు పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాజీ...ఎన్‌ఐవీ..లో  పరీక్షలకు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని ఎవరికైనా జికా వైరస్‌ సోకినట్టు అనుమానిస్తే రక్తం నమూనాలు పంపితే  ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరికరాలతోనే పరీక్షలు నిర్వహిస్తామని ఎన్‌ఐవీ డైరెక్టర్‌ డీటీ మౌర్య ప్రకటించారు. ఏడిస్‌ ఏజిప్టై దోమలు మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇంతవరకు  జికా వైరస్‌ సోకిన దాఖలాలులేవన్నారు. మన దేశంలో కానీ, ఆసియాలో కానీ ఇది ప్రజారోగ్య సమస్యలకు దారితీయలేదన్నారు. 

ఏడిస్‌ ఏజిప్టై దోమలు గడ్లు పెట్టకుండా చూసుకోవాలి-వైద్యులు 

జికా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త  చర్యలను డాక్టర్లు సూచిస్తున్నారు. ఏడిస్‌ ఏజిప్టై దోమ గుడ్లు పెట్టకుండా చూడాలి. ఇళ్లలోని బక్కెట్లు సహా ఏ రకమైన పాత్రల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. చెత్త పోగుపడకుండా చర్యలు తీసుకోవాలి. దోమ కాటు నివారణకు శరీరం మొత్తానికి కవరయ్యే చొక్కాలు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. దోమ తెరలు  వేసుకుని పడుకోవాలి. వైద్యుల సిఫారసు చేసిన మస్క్విటో కాయిల్స్‌, రిపెల్లెంట్లు వాడాలి. గర్భవతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. జికా వైరస్‌ వ్యాపించిన దేశాలకు వెళ్లొద్దని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సూచించింది. 
 

నేడు రెండో రోజు కడప జిల్లాల్లో జగన్ పర్యటన

కడప: వైసిపి అధినేత జగన్ నేడు రెండో రోజు కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

07:29 - January 30, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూలో విద్యార్ధుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. రోహిత్‌ జయంతి సందర్బంగా విద్యార్ధులు శుక్రవారం అర్ధరాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విద్యార్ధులకు సంఘీభావం తెలిపేందుకు రాహుల్‌గాంధీ అర్ధరాత్రి హెచ్‌సీయూకు చేరుకున్నారు. విద్యార్ధులతో పాటు రాహుల్‌ కూడా 18 గంటలపాటు సామూహిక నిరాహార దీక్షకు దిగారు. 
కొవ్వొత్తుల ర్యాలీ

హెచ్‌సీయూలో వేముల రోహిత్‌ జయంతి సందర్భంగా విద్యార్ధులు శుక్రవారం అర్ధరాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హెచ్‌సీయూ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్ధులు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. 

రోహిత్‌ స్మారక స్థూపం వద్ద తల్లి రాధిక నివాళులు

రోహిత్‌ స్మారక స్థూపం వద్ద ఆయన తల్లి రాధికతో పాటు.. విద్యార్ధులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోహిత్‌ ఆశయాలను సాధిస్తామని విద్యార్ధులు నినాదాలు చేశారు. ఇక అర్ధరాత్రి నుంచి విద్యార్ధులు 18 గంటలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. 
హెచ్‌సీయూకు చేరుకున్న రాహుల్‌

ఇక విద్యార్ధులకు మద్దతు తెలిపేందుకు రాహుల్‌గాంధీ అర్ధరాత్రి హెచ్‌సీయూకు చేరుకున్నారు. రాత్రి 12 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్‌... నేరుగా హెచ్‌సీయూకు చేరుకున్నారు. విద్యార్ధులు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం రోహిత్‌ స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. విద్యార్ధులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడమే కాకుండా.. స్వయంగా దీక్షకు దిగారు రాహుల్‌గాంధీ. ఈ దీక్ష ఈరోజు మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. రాహుల్‌తో పాటు రోహిత్‌ తల్లి రాధిక కూడా దీక్ష చేపట్టారు. 
రాహుల్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన

ఇక అంతకుముందు రాహుల్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు హెచ్‌సీయూ గేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. రాహుల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఏబీవీపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు పలువురిని అరెస్ట్‌ చేశారు. 

ఇంచార్జీ వీసీగా డీన్ పెరియాస్వామి

మరోవైపు హెచ్‌సీయూలో విద్యార్ధుల ఆందోళనలు రోజురోజుకు ఉధృతం కావడంతో ఇన్‌చార్జ్‌ వీసీ శ్రీవాత్సవ కూడా నాలుగు రోజులు సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో డీన్‌ పెరియాస్వామి బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 

 

నేటి నుంచి బడ్జెట్ తయారీపై రాజీవ్ శర్మ అధికారులతో భేటీ

హైదరాబాద్ : బడ్జెట్ తయారీపై తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ నేటి నుంచి అన్ని విభాగాల అధికారులతో భేటీ కానునున్నారు. బడ్జెట్ తయారీపై చర్చించనున్నారు. 

నేడు పరేడ్ గ్రౌండ్ లో టీఆర్ ఎస్ బహిరంగ సభ

హైదరాబాద్ : నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో టీఆర్ ఎస్ బహిరంగ సభ జరుగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ ప్రారంభం కానుంది.

 

Don't Miss