Activities calendar

31 January 2016

21:32 - January 31, 2016

విజయవాడ : తుని ఘటనలో రాజకీయం దురుద్దేశ్యం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ఘటనలో వైసీపీ హస్తం ఉందని పేర్కొన్నారు. కాపు గర్జనలో చోటు చేసుకున్న హింసాత్మక పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ట్రైన్ పూర్తిగా కాల్చారని, 25వాహనాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. 15 మంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. సీఐ, కానిస్టేబుల్ లకు తీవ్రగాయాలయ్యాయని, ఐదుగురు రైల్వే సిబ్బంది, ప్రెస్ వారికి కూడా గాయాలయ్యాయని తెలిపారు. ఇలాంటి ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరగలేదని, ఇలాంటి ఘటన జరగడం దిగ్ర్భాంతికి గురయ్యాన్నారు. అకారణంగా రాజకీయ దురుద్ధేశ్యంతో దారుణమైన పరిస్థితి తీసుకరావడం చాలా బాధేస్తుందన్నారు. విభజనతో అనేక సమస్యలున్నాయని, ఏ విధంగా ముందుకెళ్లాలి, పెట్టుబడులను ఆకర్షించాలి..ఇబ్బందులను అధిగమించాలని ప్రజల సహకారంతో రాత్రింబవళ్లు పనిచేయడం జరుగుతోందన్నారు.

వైసీపీ అడ్డుతగులుతోంది..
మెరుగైన పాలన కోసం కృషి చేస్తూనే పెట్టుబడులను ఆకర్షించడం కోసం కృషి చేయడం జరుగుతోందన్నారు. ఇబ్బందులు కలిగించే విధంగా రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. వారి స్వార్థం కోసం విధ్వంసానికి పాల్పడడం దారుణమన్నారు. పట్టిసీమ, అమరావతి కూడా అడ్డు తగిలారని, కాపులను ఎట్టి పరిస్థితుల్లో బీసీల్లో కల్పుతామని, బీసీ ప్రయోజనాలకు దెబ్బతగలకుండా చూస్తామన్నారు. ఈ విషయం చాలాసార్లు చెప్పడం జరిగిందని, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 100 కోట్లు ఏర్పాటు చేయడం జరిఇందని, జస్టిస్ మంజునాథన్ కమిటీ కూడా వేయడం జరిగిందన్నారు.

జీవో నెంబర్ 30 ఎలా అమలు చేస్తారు ? 
జీవో నెంబర్ 30ఈ జీవో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. సున్నితమైన అంశమని, రిజర్వేషన్ ఏమవుతాయోనన్న బీసీల్లో ఆందోళన ఉందన్నారు. మీ రిజర్వేషన్ లను ప్రొటక్షన్ చేస్తామని వారికి చెప్పడం జరుగుతోందన్నారు. పదేళ్లు కాంగ్రెస్ పాలన ఉంటే ఏం చేశారు ? ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. కార్పొరేషన్ వేశారా ? ఒక్క రూపాయి ఖర్చు చేశారా ? అని ప్రశ్నించారు. ప్రశాంతమైన వాతావరణంలో రెచ్చగొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది ? ప్లాన్ చేసి దుర్మార్గంగా వ్యవహరించారని తెలిపారు. రాజకీయం కోసం ఏమైనా చేయాలా అని వైసీపీని ఉద్ధేశించి విమర్శించారు. ఇలాంటి వారు రాజకీయాల్లోకి రావడం దురదృష్టకరమని తెలిపారు. కాపులను..బీసీలను రెచ్చగొడుతున్నారని, రాష్ట్రం తగులబడుతుంటే చూస్తుంటారని పేర్కొన్నారు. వాళ్ల ట్రాప్ లో పడితే నష్టం తప్ప లాభం రాదని..కాపులకు చంద్రబాబు సూచించారు. 

తుని ఘటన..రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు..

తూర్పుగోదావరి : తునిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రైల్వే శాఖ పలు చర్యలు తీసుకుంది. రైళ్లను రద్దు చేయడం..ఆపడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈనేపథ్యంలో రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు కేటాయించారు. విజయవాడ 0866-2575038...రాజమండ్రి 0883-2420451, 0833-2420543...తుని 08854-252172.

తుని ఘటనపై రేపు పవన్ స్పందన..

హైదరాబాద్ : తుని ఆందోళనలనపై సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేపు స్పందించనున్నారు. కేరళలో షూటింగ్ లో ఉన్న పవన్ రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 

కాపులను అణిచివేయడానికి సీఎం కుట్ర - వైసీపీ...

విజయవాడ : కాపులను అణిచివేయడానికి సీఎం కుట్ర పన్నారని వైసీపీ అధికార ప్రతినిధి మండలి హనుమంతరావు పేర్కొన్నారు. 

తుని మొత్తం ఉద్రిక్తత..

తూర్పు గోదావరి : తునిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. తుని రూరల్, టౌన్ పీఎస్ లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. తుని రూరల్ పీఎస్ వద్ద వాహనాలు దగ్ధం చేశారు. కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. 

తుని ఘటన..రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు..

తూర్పుగోదావరి : తునిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రైల్వే శాఖ పలు చర్యలు తీసుకుంది. రైళ్లను రద్దు చేయడం..ఆపడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈనేపథ్యంలో రైల్వే శాఖ హెల్ప్ లైన్ నెంబర్లు కేటాయించారు. విజయవాడ 0866-2575038...రాజమండ్రి 0883-2420451, 0833-2420543...తుని 08854-252172.

తుని ఘటన దిగ్ర్భాంతికి గురి చేసింది - బాబు..

విజయవాడ : తుని ఘటన తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ఘటన రాజకీయ దురేద్దేశ్యంతో కూడుకున్నదని తెలిపారు. ట్రైన్ పూర్తిగా కాల్చారని, 25 వాహనాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ ఘటనలో 15 మంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. 

20:40 - January 31, 2016

ఆయన ఫేస్ చూస్తే జనానికి పరమానందం...ఆయన నవ్వు చూస్తే అందరికీ మహదానందం..స్ర్కీన్ మీదకొచ్చి... బట్టబుర్ర సవరించుకొని... ఓ లుక్కిస్తే .. ఆయనే బ్రహ్మానందం. దాదాపు 1000 సినిమాల్లో నటించి.. గిన్నిస్ బుక్కు కెక్కిన ఆ నవ్వుల డాన్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన నవ్వుల ప్రస్తానంపై కథనం..

గుండ్రటి బట్టతల..
తెలుగు తెరపై కామెడీ జరగనవసరంలేదు. జోకులు పేలనవసరం లేదు. మనిషి కూడా కనిపించనవసరం లేదు. కానీ చందమామ లాంటి బ్రహ్మానందం గుండ్రటి బట్టతల కనిపిస్తే చాలు. థియేటర్ మొత్తం నవ్వులే నవ్వులు. మరి బ్రహ్మానందమా మజాకా. కేవలం ఆయన పర్సనాలిటీ వల్లే విజయాలు సాధించిన సినిమాలు కోకొల్లలు. బ్రహ్మానందం వాడుకున్నోళ్లకు వాడుకున్నంత ! ఆయనలో ఎన్ని వేరియేషన్లు ఉన్నాయో అన్నీ వాడుకునే ప్రయత్నం చేశారు తెలుగు సినీ దర్శకులు. వాటిలో పేలిన సినిమాలే ఎక్కువ ! ఒక దశ వచ్చేసరికి - హీరో పక్కన బ్రహ్మానందం కాదు, బ్రహ్మానందం పక్కన హీరోలు అనే స్థాయికి వెళ్లాడీ కమెడియన్‌. 'బ్రహ్మానందం' అని ఏ ముహూర్తాన తల్లితండ్రులు నామకరణం చేశారో కానీ.. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రేక్షకులకు బ్రహ్మానందాన్ని అందిస్తున్న సార్థకనామధేయుడు బ్రహ్మానందం. చిన్నవయసులోనే కష్టాలన్నీ అనుభవించేశారాయన.

శ్రీ తాతావతారం చిత్రంలో కథానాయకుడు..
బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ. నరేష్ కథానాయకుడిగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించాడు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని నవ్వులతోనే అధిగమించిన హ్యూమరిస్ట్ బ్రహ్మానందం. పెద్ద హీరోల సినిమా వేడుకలైనా సరే... బ్రహ్మానందం స్టేజ్ మీదకు రాగానే.. సదరు హీరోలతో సమానంగా జనాల్లో స్పందన. దీన్ని బట్టి ప్రేక్షకుల హృదయాల్లో ఆయనకున్న స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మీ నవ్వులకు ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులు. దాదాపు మూడు దశాబ్దాలనుంచి తెలుగు ప్రేక్షకులను నవ్వించడమే పనిగా పెట్టుకున్న ఆయన... వెయ్యి చిత్రాలను అతి సునాయాసంగా దాటేసారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సైతం మన బ్రహ్మీ అత్యధిక చిత్రాలతో నవ్వించిన నటుడిగా స్థానం సంపాదించారు.

కష్టతరమైంది హాస్యరసం..
అన్ని రసాల్లోనూ కష్టతరమైనది హాస్యరసం. దాన్ని సమర్థవంతంగా పోషించిన వాడు ఏ రసాన్నయినా సునాయాసంగా పండించగలడు. అందుకే.. బ్రహ్మానందంకి ఎలాంటి రసమైనా.. తృణప్రాయం. ఆయన కామెడీ కింగ్ మాత్రమే కాదు. ట్రాజెడీ కింగ్ కూడా. బ్రహ్మానందం తెలుగు తెరమీదకి అడుగు పెట్టాగానే హాస్యపు వరవడి మారింది. పరిధి పెరిగింది. జీవితంలో పెరిగిన వేగం, వైవిధ్యం,కపటత్వం, బూటకత్వం, పిరికి తనం, వీటన్నిటినీ వ్యంగ్య హాస్య భరితంగా వెండితెరమీద పలికించి.. మన పొట్ట చెక్కలు చేసి గిలిగింతలు పెట్టే బ్రహ్మానందం మరిన్ని సంవత్సరాలు ఇలాగే నవ్వుల జల్లుల్లో ఓలలాడించాలని కోరుకుందాం. నవ్వుల డాన్ బ్రహ్మానందానికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.

20:25 - January 31, 2016

హైదరాబాద్ : తుని ఘటనలో వైసీపీ హస్తం ఉందని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప ఆరోపించారు. తునిలో కాపు గర్జనలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆయన మీడియాతో మాట్లాడారు. జనవరి 31న తేదీన సభ పెడుతానని పద్మనాభం పేర్కొనడం జరిగిందని, 25 వేల లోన్ల కోసం దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 9 నెలల సమయం తీసుకోవడం జరిగిందని, ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. పద్మనాభం రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారని తెలిపారు. ఈ ఘటనపై పెద్దలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రైలు బోగీలను దగ్ధం చేశారని, పీఎస్ ని తగులబెట్టారని ఈ విషయంలో ప్రభుత్వం సంయమనంతో ఉందన్నారు. కాపు నాయకులు అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకపోతోందన్నారు.

ఏమి చెప్పాలని అనుకున్నారు - కళా..
కాపు గర్జనకు హాజరైన పెద్దలు ఏమి చెప్పాలని అనుకున్నారని ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. ప్రజలతో ఏమైనా చర్చించారా ? కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలనే అంశాన్ని ఏమైనా మాట్లాడారా ? అని ప్రశించారు. జనం ఎందుకు కూడారని..అది మాట్లాకుండా జనాన్ని రచ్చగొట్టే విధంగా ఎందుకు ప్రసంగించారని తెలిపారు. వైసీపీ గత రెండు మాసాల నుండి ప్రతి జెండా మీద పద్మనాభం ఫొటో పెట్టుకుందని, అరాచక శక్తులను అక్కడకి పంపించి వాళ్ల ద్వారా హింసను రెచ్చగొట్టిందన్నారు. టిడిపి ప్రభుత్వాన్ని నిందించడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేశారని కళా వెంకట్రావు పేర్కొన్నారు. 

ప్రజలను రెచ్చగొట్టేందుకు కాపు గర్జన – కళా..

విజయవాడ : ప్రజలను రెచ్చగొట్టేందుకు కాపు గర్జన నిర్వహించారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. 

తుని హింస వెనుక వైసీపీ హస్తం - చిన రాజప్ప..

విజయవాడ : తుని హింస వెనుక వైసీపీ హస్తం ఉందని హోం మంత్రి చిన రాజప్ప ఆరోపించారు. తునిలో కాపు గర్జన హింసాత్మకంగా మారడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కాపు గర్జనకు ప్రభుత్వం ఎలాంటి ఆటంకం కలిగించలేదని, కాపు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని సహించలేకే వైసీపీ హింసను ప్రేరేపించిందన్నారు. కాపులు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. 

తుని ఘటనలపై సీఎం అత్యవసర సమావేశం..

విజయవాడ : తుని ఘటనలపై ఏపీ సీఎం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తూ.గో.జిల్లా కలెక్టర్, ఏస్పీలతో ఫోన్ లో మాట్లాడారు. కాపు నాయకులతో మాట్లాడాలని హోం మంత్రి చినరాజప్పకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని డీజీపీకి బాబు ఆదేశించారు. రాత్రి గంటలకు బాబు మీడియాతో మాట్లాడనున్నారు. 

తుని మార్గంలో రైళ్లు రద్దు..

విజయవాడ : ప్రస్తుత పరిస్థితి సద్దుమణిగే వరకు తుని మార్గంలో అన్ని రైళ్లను నిలిపివేస్తున్నట్లు విజయవాడ డీఆర్ఎం అశోక్ కుమార్ ప్రకటించారు. అలాగే లోకల్ ట్రైన్ లను రద్దు చేసినట్లు తెలిపారు. టికెట్ బుక్ చేసుకుని వారికి డబ్బులు తిరిగి ఇచ్చేయడం జరుగుతుందన్నారు. 

విజయవాడ రైల్వే స్టేషన్ లో భారీ బందోబస్తు...

విజయవాడ : రైల్వే స్టేషన్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుండి రావాల్సిన పలు రైళ్లను నిలిపివేశారు. 

సిరియాలో జంట బాంబు పేలుళ్లు...

డమాస్కస్: సిరియాలోని షియా ప్రార్థనా మందిరం వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి. దక్షిణ డమాస్కస్ ప్రాంతంలోని సయీద్ జీనాబ్ ప్రార్థనా మందిరం వద్ద జరిగిన జంట పేలుళ్లలో 45మంది మృతి చెందినట్టు సమాచారం.

19:27 - January 31, 2016

విశాఖపట్టణం : తుని ఘటనతో పలు రైళ్లు రద్దయ్యాయి. తునిలో నిర్వహించిన కాపు గర్జన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రత్నాచల్ ఎక్స్ ప్రెస్..తుని రూరల్ పీఎస్ పై ఆందోళనకారులు దాడులు చేయడంతో పరిస్థితి హింసాత్మకంగా మారిపోయింది. ఈ ఘటనతో పలు రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్టణంలో విశాఖ, గోదావరి, వాకా ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. ఎలమంచలిలో హౌరా - చెన్నై మెయిల్, సామర్ల కోట రైల్వే స్టేషన్ లో జన్మభూమి ఎక్స్ ప్రెస్, రెండు ప్యాసింజర్ రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. విశాఖ – కాకినాడ, విశాఖపట్టణం - రాజమండ్రి ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై రైల్వే యంత్రాంగం పూర్తిగా చర్చిస్తోంది. ఉద్యమ తీవ్రతను గుర్తించడంలో కేంద్రం, రాష్ట్రం, రైల్వే శాఖ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పలు రైళ్లు రద్దు కావడంతో విశాఖపట్టణం రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. 

19:22 - January 31, 2016

తూర్పుగోదావరి : తునిలో చోటు చేసుకున్న పరిణామాలపై పలు చర్యలు తీసుకున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శశి శంకర్ పేర్కొన్నారు. తునిలో నిర్వహించిన కాపు గర్జన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రత్నాచల్ ఎక్స్ ప్రెస్..తుని రూరల్ పీఎస్ పై ఆందోళనకారులు దాడులు చేయడంతో పరిస్థితి హింసాత్మకంగా మారిపోయింది. ఈ ఘటనతో పలు రైళ్లు రద్దయ్యాయి. దీనితో తుని రైల్వే స్టేషన్ లో ప్రయాణీకులు ఆగచాట్లు పడుతున్నారు. సమాచారం అందుకున్న జాయింట్ కలెక్టర్ శశి శంకర్ తుని రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రస్తుతం రత్నాచల్ ఎక్స్ ప్రెస్, తిరుమల ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగి ఉన్నాయని తెలిపారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని, బిస్కెట్లు, పాలు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీరిని బస్సుల్లో కాకినాడకు పంపించడం జరుగుతుందని అక్కడి నుండి వారి గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్నారు. సున్నితమైన అంశం కనుక అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా భద్రత పెంపు - అదనపు డీజీ..

విజయవాడ : తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా భద్రత పెంచినట్లు ఏపీ శాంతి భద్రతల అదనపు డీజీ తెలిపారు. తుని ప్రాంతానికి అదనపు బలగాలు తరలించినట్లు పేర్కొన్నారు. అన్ని రైల్వే స్టేషన్ లు, బస్ స్టేషన్ లలో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

తుని ఘటనతో నిలిచిపోయిన రైళ్లు..

తూర్పుగోదావరి : జిల్లా తునికి సమీపంలోరత్నాచల్ రైలు బోగీలకు నిప్పు పెట్టిన సంఘటనతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆగిపోయాయి. విశాఖ - విజయవాడ మార్గంలో నడవాల్సిన పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విశాఖ, గోదావరి, ఓకా ఎక్స్ ప్రెస్ రైళ్లు విశాఖపట్టణంలో ఆగిపోయినట్లు తెలుస్తోంది. 

19:01 - January 31, 2016

తూర్పుగోదావరి : కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని కాపులు చేస్తున్న ఆందోళన తీవ్ర హింసాయుత్మకంగా మారిపోయింది. ఆదివారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలతో తుని కాపు గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తమ డిమాండ్ నెరవేర్చే వరకు రైల్ రోకో, రాస్తారోకో నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీనితో ఆందోళనకారులు తుని రైల్వేస్టేషన్ కు చేరుకురని..ఆ సమయంలో వచ్చిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టారు. 8 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆందోళకారులు చేసిన దాడిలో నలుగురు రైల్వే సిబ్బంది గాయాలపాలయ్యారు. మరోవైపు ఆందోళనకారులు తుని రూరల్ పీఎస్ పై దాడి చేశారు. అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడం..లక్షల్లో ఉన్న వీరిని వందల సంఖ్యలో ఉన్న పోలీసులు నిలువరించలేకపోయారు. పీఎస్ జరిపిన దాడిలో కానిస్టేబుల్ మృతి చెందాడనే వదంతులు వ్యాపించాయి. 

18:53 - January 31, 2016

విజయవాడ : తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో చోటు చేసుకున్న పరిణామాలు దురదృష్టకరమని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్..తునీ రూరల్ పీఎస్ పై ఆందోళనకారులు దాడి చేసి నిప్పంటించారు. ఈ సందర్భంగా టెన్ టివితో మధు ముచ్చటించారు. రైలు..వాహనాలపై దాడులు చేయడాన్ని సాధారణంగా ఎవరూ హర్షించరని తెలిపారు. ఆందోళన చేస్తున్న వారితో సంప్రదింపులు జరపాలని, ఇలాంటి పరిస్థితులకు దారి తీయకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. 

తుని రూరల్ పీఎస్ పై దాడి కానిస్టేబుల్ మృతి ?

తూర్పు గోదావరి : తునిలో నిర్వహించిన కాపు గర్జన పూర్తిగా హింసాయుత్మకంగా మారిపోతోంది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టిన ఆందోళన కారులు కొద్దిసేపటి క్రితం తుని రూరల్ పీఎస్ పై దాడి చేశారు. స్టేషన్ కు నిప్పంటించారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందారనే వదంతులు వ్యాపిస్తున్నాయి. 

18:46 - January 31, 2016

విశాఖపట్టణం : కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపులు చేస్తున్న ఆందోళన పూర్తిగా హింసాయుతంగా మారిపోతుండడంపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు..అధికారులు సమావేశానికి హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తుని ప్రాంతంలో కాపు గర్జన పేరిట భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు లక్షలాదిగా కాపులు తరలివచ్చారు. అనంతరం తమ డిమాండ్లు సాధించుకోవడం కోసం ఇప్పటి నుండే ఉద్యమ కార్యాచరణ చేద్దామని..రైలు రోకోలు..రాస్తారోకోలు చేద్దామని పిలుపునిచ్చారు. వెంటనే సభకు వచ్చిన లక్షలాది మంది రైల్ రోకో చేశారు. అదే సమయంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రావడం..దానిపై రాళ్లు రువ్వారు. దీనితో నలుగురు రైల్వే సిబ్బంది గాయపడ్డారు. అంతేగాకుండా నిప్పు పెట్టడంతో 8 బోగీలు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై కాపు డిమాండ్లను పరిష్కరిస్తుందా ? లేదా? అనేది వేచి చూడాలి. 

18:34 - January 31, 2016

తూర్పుగోదావరి : కాపు సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చాలని ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు గర్జనలో పాల్గొనేందుకు తెలంగాణ నేత, రాజ్యసభ సభ్యుడు వీహెచ్, కాంగ్రెస్ నేత గంగా భవాన్ని హాజరయ్యారు. ఈసందర్భంగా వీహెచ్ టెన్ టివితో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ఇచ్చిన జీవోను టిడిపి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతోంది బహిరంగసభ కాదని సునామీ అని అభివర్ణించారు. టిడిపిని గెలిపించారని, ఇచ్చిన జీవోను నొక్కి పెట్టారని తెలిపారు. పైసలు అవసరం లేదని, బిచ్చమెస్తారా ? అని ప్రశ్నించారు. రిజర్వేషన్ 69 శాతం తమిళనాడులో ఇస్తుందా ? లేదా ? అని నిలదీశారు. ఓటు అయిపోయిన తరువాత కాపులను దూరం పెట్టారని, ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమం ఆగదన్నారు. తన పూర్తి మద్దతు ఉంటుందని, పార్టీ కూడా సహకారం చేస్తుందని వీహెచ్ స్పష్టం చేశారు.

కాపులంటే కడుపు మంట - గంగా భవాని..
కాపులంటే ఏపీ ప్రభుత్వానికి కడుపు మంట అని ఏపీ కాంగ్రెస్ నేత గంగా భవాని పేర్కొన్నారు. పాలకులు అన్యాయం చేస్తే ఎంతకైనా తెగిస్తారని, కాపు సూర్యకాంతితో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దయాదాక్షిణ్యాలతో చంద్రబాబు సీఎం అయ్యాడని విమర్శించారు. కాపులు ఎంత మంచి వాళ్లో..కోపం వస్తే అంత ప్రళయం తీసుకొస్తారని పేర్కొన్నారు. 

తుని రూరల్ పీఎస్ పై దాడి..

తూర్పుగోదావరి : తునిలో నిర్వహించిన కాపు గర్జన పూర్తిగా హింసాయుత్మకంగా మారిపోతోంది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టిన ఆందోళన కారులు కొద్దిసేపటి క్రితం తుని రూరల్ పీఎస్ పై దాడి చేశారు. స్టేషన్ కు నిప్పంటించారు. 

18:26 - January 31, 2016

తూర్పుగోదావరి : తునిలో ప్రస్తుతం భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. కాపు గర్జన పూర్తిగా హింసాయుతంగా మారిపోయింది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఎనిమిది బోగీలు పూర్తిగా కాలిపోయాయి. దీనితో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ డిమాండ్లు పరిష్కరించేందుకు ఇప్పటి నుండే ఉద్యమ కార్యాచరణ చేద్దామని...ఇందుకు రైల్ రోకోలు..రోడ్లపై కూర్చొందాని నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలులో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తుని రైల్వే స్టేషన్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనితో ఎక్కడకు వెళ్లాలో ప్రయాణీకులకు అర్థం కాలేదు. తాము ఆరు కిలోమీటర్ల దూరం వరకు నడిచి ఇక్కడకు చేరుకోవడం జరిగిందని టెన్ టివితో ప్రయాణీకులు పేర్కొన్నారు. రైలు పట్టాలపై రైలు దగ్ధం చేయడంతో విశాఖపట్టణం - తిరుపతి ట్రైన్ తునిలో ఆగిపోయింది. ఏసీ కంపార్ట్ మెంట్ లోకి చొరబడి కాల్చి వేశారని, ఏసీలను ధ్వంసం చేసేశారని ఓ ప్రయాణికుడు పేర్కొన్నారు. ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చామని, రోడ్డంతా బ్లాక్ చేశారని తెలిపారు. రైల్లోకి రావడంతో ఒకరికి గుండె పోటు, ఒకరికి పెరాల్సిల్స్ వచ్చాయన్నారు. చికిత్స చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని, తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

18:15 - January 31, 2016

హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో నిర్వహిస్తున్న కాపు గర్జన హింసాయుత్మకంగా మారిపోయింది. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ గర్జనలో కాపు నేతలు ఆందోళకు దిగారు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి చేశారు. నలుగురు రైల్వే సిబ్బందికి గాయాలయ్యాయి. రైలుకు నిప్పు పెట్టడంతో ఎనిమిది బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషణ అందించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. కాపు గర్జన ఇలాంటి పరిస్థితికి దారి తీస్తుందని అంచనా వేయలేకపోయిందన్నారు. బల ప్రదర్శన చేస్తారని..నాయకుల ప్రసంగాలు ఉంటాయని..తమ డిమాండ్లు ప్రభుత్వానికి నివేదిస్తారని భావించిందన్నారు. కానీ నిర్వాహకులు ధిక్కార ధోరణిని ప్రదర్శించడమే గాకుండా ముందస్తు అనుమతి తీసుకోలేదన్నారు. ఈ గర్జనకు 5-6 లక్షల మంది తరలి వచ్చారని, ఎలాంటి హెచ్చరికలు లేకపోవడంతో జాతీయ రహదారులను నిర్భందించడం...రైలు రోకోలు చేశారని పేర్కొన్నారు. దీనితో అనూహ్య పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలనే పరిస్థితి ఏర్పరిచారని తెలిపారు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పై నిప్పు పెట్టడంతో పూర్తిగా జనజీవనం స్తంభించి పోయిందని ఐదారు రాష్ట్రాలపై ఈ ప్రభావం కనిపిస్తుందన్నారు. ఇక ఉద్యమకర్త ముద్రగడకు రాజకీయ జగమొండి అనే పేరు ఉందని, గతంలో ఆయన ఆమరణ నిరహార దీక్ష చేయడం జరిగిందన్నారు. దీక్షకు భంగం కలిపిస్తే ఆత్మహత్యకు పాల్పడుతానని ఆ సమయంలో హెచ్చరించిన సందర్భాలున్నాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎదుట మూడు అంశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముద్రగడకు అనుకూలంగా ఉండే నేతలతో చర్చలు జరిపించడం..నియమించిన కమిషన్ కాల వ్యవధిని కుదించడం..శాంతిభద్రతలో కోణంలో చూడడం వంటి అంశాలున్నాయన్నారు. కానీ ఇక్కడ సానుకూలంగా ఉంటేనే ముద్రగడ చర్చలకు వస్తారనే ప్రచారం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఫైనల్ విజేత జొకోవిచ్..

ఆస్ట్రేలియా : ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో సెర్బియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జొకోవిచ్ తన ప్రత్యర్థి యాండీ ముర్రేపై ఘన విజయం సాధించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో 6-1, 7-5, 7-6(3) వరుస సెట్లలో జొకోవిచ్ ముర్రేపై గెలుపొందాడు.

 

17:53 - January 31, 2016

తూర్పు గోదావరి : తునిలో నిర్వహించిన కాపు గర్జన పూర్తిగా హింసాయుతంగా మారిపోయింది. శాంతియుతంగా చేయాల్సిన ఆందోళన అదుపు తప్పింది. కాపు నేత ముద్రగడ పద్మనాభవం ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు గర్జన తీవ్ర ఉద్రిక్తతల చోటు చేసుకుంది. ఈ రోజు నిర్వహించిన కాపు గర్జనలో ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టారు. ఎనిమిది బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కాపు కార్యకర్తలపై లాఠీఛార్జీ చేశారు. కానీ లక్షల మంది జనాలు ఉండడంతో పోలీసులు ఏమి చేయలేకపోయారు. దీనితో కాపులు రెచ్చిపోయారు. రైలుపై రాళ్లతో దాడి చేశారు. నలుగురు రైలు సిబ్బందికి గాయాలయ్యాయి.

పద్మనాభం పిలుపుతో మారిన పరిస్థితి..
కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్న కాపులు తుని రైల్వే స్టేషన్ లో ఆందోళన చేపట్టారు. ఆదివారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో తునిలో కాపు ఐక్యగర్జన నిర్వహించారు. ఆయన సభలో ప్రసంగించారు. తమ హక్కులను సాధించుకోవడానికి రైల్ రోకో..రోడ్లపై కూర్చొవాలని పద్మనాభం పిలుపునివ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పద్మనాభం స్టేజిపై నుండి కిందకు దిగుతుండగానే సభ ప్రాంగణం లోపల..బయట ఉన్న వారంతా తుని రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఆ సమయంలోనే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రావడం..దానిపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. అక్కడనే పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ లక్షల సంఖ్యలో ఉన్న వీరిని అదుపు చేయడం వందల సంఖ్యలో ఉన్న పోలీసులకు కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

ముగిసిన గ్రేటర్ ప్రచారం..

హైదరాబాద్ : నేటితో ప్రచారం ముగిసిన గ్రేటర్ ఎన్నికలకు ఫిబ్రవరి 2న పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 150 డివిజన్లలో 7,802 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.

కాపు గర్జన..రైలుకు నిప్పు..

తుని : కాపు గర్జన పోరాటం హింసాయుతంగా మారింది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టారు. దీనితో 8 బోగీలు దగ్ధమయ్యాయి. ఆందోళనకారులపై సీఆర్పీఎఫ్, ఇతర పోలీసులు లాఠీ ఛార్జీ జరిపారు. 

17:28 - January 31, 2016

సిడ్నీ : వన్డే సిరీస్ ఓటమి తరువాత..వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్ ఇండియా మరో క్లీన్ స్వీప్ చేసింది. పొట్టి ఫార్మాట్ లో తిరుగులేని ఫామ్ లో ఉన్న ధోని సేన...సిడ్నీలో జరిగిన ఆఖరి టీ 20 లోనూ నెగ్గింది. 3-0తో సిరీస్ సొంతం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరిగింది. ఆసీస్ కెప్టెన్ వాట్సన్ ఆల్ రౌండ్ షో వృధా అయ్యింది. రోహిత్, కోహ్లీ సూపర్ హాఫ్ సెంచరీ నమోదు చేయగా రైనా, యువీ భారత్ విజయాన్ని పూర్తి చేశారు.

చివరి బంతి వరకు ఉత్కంఠ..
ఆసీస్ తొలుత టాస్ గెలిచి ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు శర్మ, ధావన్ లు గట్టి పునాది వేసే ప్రయత్నం చేశారు. ఓవర్ కు పది పరుగులు సాధించాలనే లక్ష్యంతో ఆడారు. గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలో స్కోరు బోర్డు 46 పరుగుల వద్ద ఉన్నప్పుడు ధావన్ (26) వెనుదిరిగాడు. శర్మకు జోడిగా కోహ్లీ జత కలిశాడు. వీరిద్దరూ కూడా స్కోరు తగ్గకుండా ఆడారు. 35 బంతుల్లో 5x4, 1x6 సాయంతో రోహిత్ 50 పరుగులు చేశాడు. 11.3 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 118 పరుగులు చేసింది. జట్టు స్కోరు 124 పరుగుల వద్ద శర్మ (52) పెవిలియన్ చేరాడు. కోహ్లీకి రైనా జత కలిశాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. బంతులను బౌండరీలకు తరలించే పని చేశారు. కోహ్లీ 36 బంతుల్లో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చివరిలో బంతులు తక్కువగా ఉండడం..పరుగులు ఎక్కువగా ఉండడంతో భారత్ విజయం సాధిస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. క్రీజులో ఉన్న రైనా, యువ రాజ్ సింగ్ లు ఎలాంటి వత్తిడికి లోనుకోకుండా ఆడారు. విజయానికి కావాల్సిన పరుగులు సాధించారు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. దీనితో మూడు మ్యాచ్ ల్లో ఆసీస్ ను భారత్ చిత్తు చేసింది.

ఆసీస్ బ్యాటింగ్..
భారత్ తో జరుగుతున్న చివరి టీ -20 మ్యాచ్ లో వాట్సన్ చెలరేగిపోయాడు. భారత బౌలర్లను చీల్చిచెండాడు. ఆకాశమే హద్దు అన్నట్లుగా ఆడాడు. దీనితో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచిన ఆసీస్ ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంది. ఖజావా, వాట్సన్ ఓపెనర్లు ఆటను ఆరంభించారు. వచ్చి రాగానే వాట్సన్ బ్యాట్ జులిపించాడు. కానీ ఆరంభంలోనే ఆసీస్ కు దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 16 పరుగుల వద్ద ఖజావా (14) వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన మార్ష్ విజృంభిస్తాడని అనుకున్నారు. కానీ అశ్విన్ బౌలింగ్ లో మార్ష్ (9) పెవిలియన్ చేరాడు. మాక్స్ (3) కూడా వచ్చిరాగానే వెనుదిరిగాడు. మరోవైపు వాట్సన్ మాత్రం తన జోరును కొనసాగించాడు. మైదానం నలువైపులా చూడముచ్చటైన షాట్లు కొట్టాడు. 41 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసిన వాట్సన్ అదే జోరును కొనసాగించాడు. ఇతనికి హెడ్ కొద్దిసేపు సహకరించాడు. స్కోరు బోర్డును పరుగెత్తించాలనే లక్ష్యంతో వాట్సన్ వేగంగా పరుగులు చేశాడు. కేవలం 62 బంతుల్లో శతకం చేశాడు. ఇతడిని అవుట్ చేయడానికి భారత బౌలర్లు శ్రమించారు. జట్టు స్కోరు 168 పరుగుల వద్ద హెడ్ (26) అవుట్ అయ్యాడు. అనంతరం లైన్ (13)కూడా నిష్ర్కమించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 197 పరుగులు చేయగలిగింది. వాట్సన్ (124: 86 బంతుల్లో 10x4, 6x6) నాటౌట్ గా మిగిలాడు.
భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, అశ్విన్, జడేజా, యువ రాజ్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు.
ఆసీస్ బౌలర్లలో బోయ్సే రెండు, వాట్సన్ ఒక వికెట్ తీశారు. 

భారత్ విజయం..

సిడ్నీ : భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ తో జరుగుతున్న టీ 20 మ్యాచ్ లో ఆసీస్ పై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

భారత్..ఆరు బాల్స్...17రన్లు..

సిడ్నీ : ఆస్ట్రేలియా నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్ శ్రమిస్తోంది. కేవలం 6 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉంది. 

భారత్ 12 బాల్స్..22 రన్లు..

సిడ్నీ : భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. భారత్ విజయం సాధించాలంటే 12 బాల్స్ లో 22 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి.

భారత్..ఆసీస్..ఉత్కంఠగా టీ -20...

సిడ్నీ : భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారింది. భారత్ విజయం సాధించాలంటే 23 బాల్స్ లో 38 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి.

ఖైరతాబాద్ లో వన్ హైదరాబాద్ కూటమి సభ..

హైదరాబాద్ : ఖైరతాబాద్ లో వన్ హైదరాబాద్ కూటమి సభ నిర్వహించింది. లోక్ సత్తా అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించింది. సీపీఎం నేత డీజీ నర్సింహ రావు తదితర నేతలు పాల్గొన్నారు. 

కోహ్లీ అవుట్..

సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో భారత్ త్వరతరగా వికెట్లు కోల్పోతోంది. 149 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం రైనా 13, యువరాజ్ 0 క్రీజులో ఉన్నారు. 30 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉంది.

భారత్ 36 బాల్స్ 59 రన్స్..

సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరుగుతన్న చివరి టెస్టు మ్యాచ్ లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కోహ్లీ 42, రైనా 13 క్రీజులో ఉన్నారు. 36 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది. 

రోహిత్ అర్ధ శతకం..అవుట్..

సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ లో రోహిత్ అర్ధ సెంచరీ సాధించి అవుట్ అయ్యాడు. కేవలం 38 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ 13.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. 

భారత్ 113/1..

సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ -20 మ్యాచ్ లో భారత్ 11.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 113 పరుగులు చేసింది..

16:26 - January 31, 2016

తూర్పుగోదావరి : తునిలో నిర్వహిస్తున్న కాపు గర్జన ఆందోళన క్రమక్రమంగా ఉద్రిక్తంగా మారుతోంది. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం వీడేది లేదని, తక్షణమే తాము డిమాండ్ చేస్తున్న జీవోలను విడుదల చేయాలని ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆల్టిమేటం జారీ చేశారు. కాపు గర్జనకు తుని జాతీయ రహదారిపై భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. లక్షల సంఖ్యలో కాపు నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

రెండు డిమాండ్లు..
కాపు గర్జన బహిరంగసభలో ముద్రగడ పద్మనాభం మాట్లాడారు. తాము రెండు డిమాండ్లు కోరడం జరుగుతోందని, కాపు కార్పొరేషన్ నిధులు కేటాయించాలని..రిజర్వేషన్ల జీవో జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సభ నుండి పోరాడం కాదని..రైలు పట్టాలు..రోడ్లపై నిలబడి పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. వెంటనే తనతో పాటు ఉద్యమంలోకి రావాలని..ఉద్యమంలో ముందు తన కుటుంబం ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయం కోసం అడుగుతుంటే కాలయాపన చేయడం సరికాదన్నారు. రాజధానికి, గ్రీన్ పోర్టు, భూములు తీసుకోవడానికి అర్ధరాత్రి జీవోలు జారీ చేసిన సందర్భాలున్నాయన్నారు. తమ స్పష్టమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఇంటికి వెళ్లేది లేదని ఖరాఖండిగా చెప్పడంతో ఆందోళన ఒక్కసారిగా రూటు మారింది.

రత్నాచలం ఎక్స్ ప్రెస్ పై దాడి..
పద్మనాభం పిలుపునందుకున్న కాపు కార్యకర్తలు భారీగా తుని రైల్వే స్టేషన్ కు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో వెళుతున్న రత్నాచలం ఎక్స్ ప్రెస్ ను ఆపివేశారు. కొంత మంది రాళ్లు రువ్వడంతో రైలు అద్దాలు పగిలిపోగా నలుగురు రైల్వే సిబ్బందికి గాయాలయ్యాయి. దీనితో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. మరి ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

ఎన్టీఆర్ ఘాట్ వద్ద లోకేష్ నివాళులు..

హైదరాబాద్ : ఎన్టీఆర్ ఘాట్ వద్ద టి.టిడిపి నేతలు లోకేష్, ఎర్రబెల్లి, రమణ, రేవంత్ రెడ్డి, మోత్కుపల్లిలు నివాళులుర్పించారు. 

కేసీఆర్, చంద్రబాబు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ - షబ్బీర్ ఆలీ..

హైదరాబాద్ : కేసీఆర్, చంద్రబాబు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని టి.కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ ఆరోపించారు. చంద్రబాబు, కేసీఆర్ తిట్టుకోవడం, శాలువావలు కప్పుకోవడం ప్రజలు చూస్తూనే ఉన్నారని, వీరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. కీలక శాఖలన్నీ కేసీఆర్ కుటుంబం వద్దే ఉండాలా అని ప్రశ్నించారు. 

తునిలో ఎక్స్ ప్రెస్ రైలుపై దాడి..

తూర్పుగోదావరి : తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. రైలు ఇంజన్ ధ్వంసమైంది. 

కాపు ఉద్యమంలో తన కుటుంబం ముందుంటుంది - ముద్రగడ..

తుని : కాపు ఉద్యమంలో తాను, తన కుటుంబం ముందుంటుందని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. తునిలో కాపు గర్జన నిర్వహించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోవడంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని, కాపులను బీసీల్లో కలుపుతూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో జారీ చేఏ వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 

విద్యార్థులతో వీసీ పెరియాస్వామి చర్యలు..

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థులతో ఇన్ ఛార్జీ వీసీ పెరియా స్వామి చర్చలు జరిపారు. వర్సిటీ పాలనా వ్యవహారాలు, తరగతులు సక్రమంగా జరిగేలా సహకరించాలని పెరియా స్వామి విద్యార్థులను కోరారు. 

వైజాగ్ లో పోలీసుల విస్తృత తనిఖీలు..

విజయనగరం : వైజాగ్ లో ఐఎఫ్ఆర్ సమావేశాల నేపథ్యంలో ఐదో నెంబర్ జాతీయ రహదారిపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

సహకార ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఏర్పాటు...

విజయవాడ : సహకార సంఘ ఉద్యోగుల సమస్యలపై అధ్యయనానికి ఏపీ ప్రభుత్వం కమిటీ వేసింది. నాబార్డు రిటైర్డ్ సీజీఎం మోహల్య అధ్యక్షతన ఈ కమిటీ పనిచేయనుంది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీ ఆదేశాలు జారీ చేసింది. 

రైలు పట్టాలపై ముద్రగడ..

తూర్పుగోదావరి : కాపులను బీసీల్లో చేర్చే వరకూ తన ఉద్యమం ఆగదని కాపు నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తునిలో కాపు గర్జన నిర్వహించారు. అనంతరం ఆయన ఏకంగా రైలు పట్టాలపైకి చేరుకున్నారు. ఉద్యమ కార్యాచరణను తక్షణమే అమలు చేద్దామని పేర్కొంటూ రైలు పట్టాలపై బైఠాయించారు. ఆయనతో పాటు భారీగా కాపు నేతలు తరలివెళ్లారు. 

15:31 - January 31, 2016

సిడ్నీ : భారత్ తో జరుగుతున్న చివరి టీ -20 మ్యాచ్ లో వాట్సన్ చెలరేగిపోయాడు. భారత బౌలర్లను చీల్చిచెండాడు. ఆకాశమే హద్దు అన్నట్లుగా ఆడాడు. దీనితో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచిన ఆసీస్ ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంది. ఖజావా, వాట్సన్ ఓపెనర్లు ఆటను ఆరంభించారు. వచ్చి రాగానే వాట్సన్ బ్యాట్ జులిపించాడు. కానీ ఆరంభంలోనే ఆసీస్ కు దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 16 పరుగుల వద్ద ఖజావా (14) వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన మార్ష్ విజృంభిస్తాడని అనుకున్నారు. కానీ అశ్విన్ బౌలింగ్ లో మార్ష్ (9) పెవిలియన్ చేరాడు. మాక్స్ (3) కూడా వచ్చిరాగానే వెనుదిరిగాడు. మరోవైపు వాట్సన్ మాత్రం తన జోరును కొనసాగించాడు. మైదానం నలువైపులా చూడముచ్చటైన షాట్లు కొట్టాడు. 41 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసిన వాట్సన్ అదే జోరును కొనసాగించాడు. ఇతనికి హెడ్ కొద్దిసేపు సహకరించాడు. స్కోరు బోర్డును పరుగెత్తించాలనే లక్ష్యంతో వాట్సన్ వేగంగా పరుగులు చేశాడు. కేవలం 62 బంతుల్లో శతకం చేశాడు. ఇతడిని అవుట్ చేయడానికి భారత బౌలర్లు శ్రమించారు. జట్టు స్కోరు 168 పరుగుల వద్ద హెడ్ (26) అవుట్ అయ్యాడు. అనంతరం లైన్ (13)కూడా నిష్ర్కమించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 197 పరుగులు చేయగలిగింది. వాట్సన్ (124: 86 బంతుల్లో 10x4, 6x6) నాటౌట్ గా మిగిలాడు. భారత బౌలర్లలో నెహ్రా, బుమ్రా, అశ్విన్, జడేజా, యువ రాజ్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు. 

15:19 - January 31, 2016

తుని : కాపులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపులకు అన్యాయం చేశారని ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. తునిలో నిర్వహించిన కాపు గర్జనలో ఆయన మాట్లాడారు. ఈ గర్జనకు భారీగా కాపులు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడిపై ముద్రగడ పద్మనాభం పలు విమర్శలు గుప్పించారు. కాపులకు ఎంతో చేశానని చెబుతున్నారని, ఆరోజు ఇచ్చిన తీర్పును ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని వారు ప్రశ్నిస్తున్నారని, ఆ రోజు ఎమ్మెల్యేగా తాను ఉండడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనడం తెలియదా అని ప్రశ్నించారు. అమాయక ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించే స్టేట్ మెంట్లు, చీకట్లో రాయించే రాతలు సమాజానికి మంచిది కాదని ముద్రగడ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

భారత్ టార్గెట్ 198 పరుగులు..

సిడ్నీ : భారత్ తో జరుగుతున్న చివరి టీ -20 మ్యాచ్ లో ఆసీస్ నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. వాట్సన్ చెలరేగిపోయాడు. కేవలం 71 బంతుల్లో 124 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. 

15:12 - January 31, 2016

తూర్పుగోదావరి : కాపుల గర్జనతో తుని స్తంభించిందిపోయింది. వివిధ జిల్లాల నుండి భారీగా కాపు కులానికి చెందిన వారు తునికి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది పోయింది. ప్రధానంగా తుని జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. సభా ప్రాంగణానికి ఐదు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీనితో వాహనాలను అక్కడే వదిలేసి నడుచుకుంటూ సభా ప్రాంగణానికి నడుచుకుంటూ వెళుతున్నారు. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

ఆసీస్ 176/4..

సిడ్నీ : ఆసీస్ మరో వికెట్ కోల్పోయింది. హెడ్ 26 పరుగులు చేసి వెనుదిరిగాడు. మరోవైపు ఓపెనర్ వాట్సన్ మాత్రం ఒంటరి పోరు చేస్తున్నాడు. 65 బంతుల్లో 111 పరుగులు చేశాడు. ప్రస్తుతం 18 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 

వాట్సన్ సెంచరీ చేశాడు..

సిడ్నీ : ఓపెనర్ వాట్సన్ బ్యాట్ ఝులిపిస్తున్నాడు. 41 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసిన వాట్సన్ సెంచరీ చేశాడు. కేవలం 62 బంతుల్లో శతకం చేశాడు. ఇందులో 10 ఫోర్లు ఉండగా 5 సిక్స్ లున్నాయి. ఆసీస్ ఆరంభంలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఖజావా 14, మార్ష్ 9, మాక్స్ వెల్ 3 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. వాట్సన్ 109, హెడ్ 26 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం 16.5ఓవర్లలో మూడు వికెట్లకు 168 పరుగులు చేసింది. 

14:57 - January 31, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో త్వరలో చర్చలు జరుపుతామన్నారు. రాష్ట్రంలో ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. మున్సిపల్ కార్మికులు ఎక్కడ లేరో.. అక్కడ కాంట్రాక్టు పద్ధతిన నియమించుకునేందకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు నారాయణ. 

14:55 - January 31, 2016

తుని : ప్రభుత్వం తరపున గాని, పార్టీ తరపున కాపు గర్జనకు రాలేదన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ. ప్రజల అభీష్టం మేరకు.. కాపులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గుర్తు చేయడానికే కాపు గర్జన అని పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యతిరేకిస్తుందనే భావన లేదని, కొపు సోదరుడిగా వచ్చానని, కాపు సమస్యలను తెలియచేసేందుకు ఈ సభలో పాల్గొనడం జరిగిందన్నారు. 

దంచి కొడుతున్న వాట్సన్..

సిడ్నీ : ఓపెనర్ వాట్సన్ బ్యాట్ ఝులిపిస్తున్నాడు. 41 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసిన వాట్సన్ సెంచరీ వైపుకు దూసుకెళుతున్నాడు. ఆసీస్ ఆరంభంలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఖజావా 14, మార్ష్ 9, మాక్స్ వెల్ 3 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. వాట్సన్ 81, హెడ్ 22 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం 14.3ఓవర్లలో మూడు వికెట్లకు 126 పరుగులు చేసింది. 

వాట్సన్ 50 పరుగులు..

సిడ్నీ : ఆస్ట్రేలియా తడబడుతున్నా ఓపెనర్ వాట్సన్ బ్యాట్ ఝులిపిస్తున్నాడు. 41 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఆరంభంలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఖజావా 14, మార్ష్ 9, మాక్స్ వెల్ 3 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. వాట్సన్ 56, హెడ్ 12 పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుతం 11.3ఓవర్లలో మూడు వికెట్లకు 98 పరుగులు చేసింది. 

14:35 - January 31, 2016

హైదరాబాద్ : 65 ఏళ్ల దరిద్రం 18 ఏళ్లలో పోతదా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని తనదైన శైలిలో ప్రసంగించారు. కేసీఆర్ ను తిట్టాలే..తెల్లారితే లొల్లి.. మోరి ఎందుకుంది ? దోమలు ఎందుకున్నయి ? అని అంటున్నారని ప్రశ్నించారు. 65 ఏళ్లు దేశంలో టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పాలించారని, 65 ఏళ్లలో చేయని పనిని 18 ఏళ్లలో ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. అల్లాఉద్దీన్ అద్బుత దీపం ఇచ్చి పోయిండా ? ఒక్కసారి ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. 

మాక్స్ వెల్ కూడా అవుట్..

సిడ్నీ : ఆస్ట్రేలియా తడబడుతోంది. ఆరంభంలోనే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఖజావా 14, మార్ష్ 9, మాక్స్ వెల్ 3 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. వాట్సన్ 46 క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం 9.1 ఓవర్లలో మూడు వికెట్లకు 75 పరుగులు చేసింది. 

మార్ష్ అవుట్...

సిడ్నీ : ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. భారత్ తో ఆఖరి టీ 20 మ్యాచ్ లో మార్ష్ 9 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం వాట్సన్ 43, మాక్స్ వెల్ 1 క్రీజులో ఉన్నారు. 7.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. 

ఆసీస్ 54/1...

సిడ్నీ : భారత్ తో జరుగుతున్న చివరి టీ -20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా 50 పరుగులు చేసింది. ఖజావా 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 5.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 54పరుగులు చేసింది. క్రీజులో వాట్సన్ 37, మార్ష్ 3 ఉన్నారు. 

14:13 - January 31, 2016

హైదరాబాద్ : అవినీతి రహిత పాలన అందించేందుకే వన్ హైదరాబాద్ కూటమి గ్రేటర్ లో పోటీ చేస్తుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముషీరాబాద్ లో ఆ పార్టీ నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. గ్రేటర్ లో ప్రచారం తారాస్థాయికి చేరిందన్నారు. ఈ సారి ఎన్నికలకు ప్రాధాన్యత ఉందని...  గతంలో తాము పది లోపు స్థానాల్లో పోటీ చేసామని.. ప్రస్తుతం 90 డివిజన్లలలో వామపక్షాలు పోటీ చేస్తున్నాయని తెలిపారు. వామపక్షాలు, లోక్ సత్తా కలసి పోటీ చేస్తున్నాయని చెప్పారు. నీతి, నిజాయితీ విలువలతో ఉన్న కూటమి 'వన్ హైదరాబాద్ కూటమి' అని పేర్కొన్నారు. మురికి వాడలకు ముషీరాబాద్ నిలయంగా ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే.. సామాన్యుల సమస్యలను పట్టించుకోవాలన్నారు. తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న పద్మకు ఆపూర్వ స్పందన లభిస్తుందని చెప్పారు. డివిజన్ లో విజయం వైపుగా తమ ప్రచారం.. సాగుతోందన్నారు. 

ఆసీస్ మొదటి వికెట్..

సిడ్నీ : భారత్ తో జరుగుతున్న చివరి టీ -20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదటి వికెట్ కోల్పోయింది. ఖజావా 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 3.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. క్రీజులో వాట్సన్ 9, మార్ష్ 1 ఉన్నారు. 

13:56 - January 31, 2016

హైదరాబాద్  :  స్టైల్‌గా సెల్పీ తీసుకుంది. తన అందాలను అందులో బిగించింది. ఎత్తు పల్లాలను ఒడుపుగా ప్రదర్శించింది. లోతైన లోయలను చక్కగా చూపించింది. ఈ అందాలను అందరూ చూడాలనుకుంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి కానుకగా పంపించింది.మత్తుగా...ముద్దుగా ఉన్న తన సెల్ఫీ ఫొటోలను సక్రమంగా చేరవేసింది. 

అంగారకుడిపై పరిశోధనలు సాగిస్తున్న క్యూరియాసిటీ రోవర్‌ మరో ముందడుగు వేసింది. మార్స్‌కు సంబంధించి ఇప్పటికే పలు చిత్రాలను పంపించిన రోవర్‌..తాజాగా అక్కడ సెల్ఫీని తీసింది. అంగారికుడిపై ఉన్న ఇసుక తెన్నెలు..పర్వతాలు ఈ సెల్ఫీలో కనిపించాయి. ఈ సెల్ఫీని తిన్నగా భూమికి పంపించింది క్యూరియాసిటీ రోవర్‌.

రోవర్‌లోని మార్స్‌ హ్యాండ్‌ లెన్స్‌ ఇమేజర్‌ కెమెరా తీసిన 57 చిత్రాలను కలగలిపి తాజాసెల్ఫీని శాస్త్రవేత్తలు రూపొందించారు.క్యూరియాసిటీ పంపించిన చిత్రాల్లో బాగ్‌నోల్డ్‌ డ్యూన్‌ ఫీల్డ్‌కు సంబంధించిన చీకటి ఇసుకతిన్నెలు  కనిపించాయి. గత రెండు నెలలుగా ఈ రోవర్‌.. అక్కడ నమూనాలను సేకరిస్తోంది. క్యూరియాసిటీ ముఖ్య లక్ష్యమైన షార్ప్‌ పర్వతానికి వాయువ్య దిశలో ఈ ప్రదేశం ఉంది. 

రోవర్‌ ఈ ప్రాంతంలో మూడుసార్లు ఇసుకను రోవర్‌ సేకరించింది. ఆసమయంలో నమూనా విశ్లేషణ యాక్చువేటర్‌ ఒకటి సరిగా పనిచేయకపోవడంపై నాసా శాస్త్రవేత్తలు కారణాలను అన్వేషిస్తున్నారు. 

13:51 - January 31, 2016

సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందా..? మనుషుల్లో మార్పును తీసుకొస్తుందా? ప్రజలను ఉద్యమాల బాట పట్టిస్తుందా? అంటే ఇలాంటి ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెప్పుకోవాలి. ఎందరో  కవులు రచయితలు, నాటకకర్తలు సమాజహితం కోసం రచనలు చేస్తూనే ఉన్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. అలాంటి వారిలో  దెంచనాల శ్రీనివాస్ ఒకరు. కవి, నాటక రచయిత దెంచనాల శ్రీనివాస్ ప్రత్యేక కథనంతో పాటు కంటి సాయన్న జనం పాట, వివిధ సాహితీ వేదికల వేడుకల సమాహారంగా ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం
దెంచనాల శ్రీనివాస్.. 
దెంచనాల శ్రీనివాస్.. ఈ పేరు వింటే బలిపీఠం నాటకం మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. అంతే కాదు ఆయన పదునైన భాషతో దళిత బహుజన కవిత్వాన్ని శిల్పీకరించిన కవి. ఒక వైపు తెలుగు నాటకరంగాన్ని ఆధునికరిస్తూనే మరో వైపు దళిత బహుజన కవిత్వాన్ని అద్భుతంగా ధ్వనింపజేస్తున్నారు. కవి, నాటకకర్త, దెంచనాల శ్రీనివాస్ కవిత్వం, నాటకాల పరిచయం చూద్దాం...

కంటి సాయన్న 
కొంతమంది యువకులు ముందు యుగం దూతలు అన్నారు మహాకవి శ్రీశ్రీ. అలాంటి యువకుల్లో కంటి సాయన్న ఒకరు. ఆయన ఒక ఆర్.యం.పి డాక్టరుగా పేద ప్రజలకు సేవ లందిస్తూనే ప్రజలను చైతన్యవంతులను చేయడానికి పాటలు రాస్తూ క్యాసెట్లు వెలువరించారు. గేయరచయిత కంటిసాయన్న ..ఆయన పరిచయ కథనం నేటి జనంపాటలో చూద్దాం.. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాహితీ వేదికల వేడుకల విశేషాలన వీడియోలో చూద్దాం..


 

బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్..

సిడ్నీ : భారత్ తో జరుగుతున్న ఆఖరి టీ-20 మ్యాచ్ ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఖవాజా, వాట్సన్ లు ఆటను ఆరంభించారు. 

13:47 - January 31, 2016

హైదరాబాద్ : ప్రజల కనీస అవసరాలని తీర్చలేని కేసీఆర్... రాష్ట్రానికి ఏం చేస్తారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం చివరిరోజు.. టీడీపీ.. భారీ బైక్ నిర్వహించన ర్యాలీలో ఆయన పాల్గొని, మాట్లాడారు. లోకేష్ తన దైన శైలిలో టీఆర్ఎస్ పార్టీపై సెటైర్ లు వేసిరారు. కారు నగరాన్ని కలుషితం చేస్తుందని.. సైకిల్ పర్యావరణాన్ని కాపాడుతుందన్నారు. హైటెక్‌ సిటీ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. కొండాపూర్‌, అఫీజ్‌పేట, ఆల్విన్‌ కూడలి, చందానగర్‌ మీదుగా ర్యాలీ కొనసాగింది. 

రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం సీపీఎం బహిరంగసభ..

చిత్తూరు : రాయలసీమ సమస్యల పరిష్కారం కోరుతూ మదనపల్లి బీటీ కాలేజీ మైదానంలో సీపీఎం బహిరంగసభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పాల్గొన్నారు. 

ఎల్లమ్మ బండ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ : ఎల్లమ్మ బండ వద్ద టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి ర్యాలీలు ఎదురెదురుగా వచ్చాయి. టీడీపీ ర్యాలీనీ టీఆర్ఎస్ ముందుకు పోనివ్వకపోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

 

వన్ హైదరాబాద్ కూటమిని గెలిపించండి - తమ్మినేని..

హైదరాబాద్ : రాజకీయాల్లో మార్పు కోసం వన్ హైదరాబాద్ కూటమి పోటీ చేస్తోందని, వన్ హైదరాబాద్ కూటమిని గెలిపించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. 2019లో వామపక్షాలే ప్రత్యామ్నాయమన్నారు. దోచుకోవడంలో ఇతర పార్టీలు పోటీ పడుతున్నాయని, ప్రజల పక్షాన నికరంగా పోరాడుతున్నది ఎర్రజెండాలేనని తెలిపారు. 

టిడిపి భారీ ర్యాలీ..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో చివరి రోజైన ఆదివారం టిడిపి భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. హైటెక్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రజలకు మాయమాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తోందంటూ మండిపడ్డారు.

 

టిడిపి, బిజెపితోనే అభివృద్ధి సాధ్యం - జవదేకర్..

హైదరాబాద్ : టిడిపి, బిజెపి కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి జవదేకర్ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఆయన సైదాబాద్, ఓల్డ్ మలక్ పేట, మొగల్ పురా ప్రాంతాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

13:43 - January 31, 2016

హైదరాబాద్ : తెలంగాణ అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం కేంద్ర ప్రభుత్వానిది కాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిషన్ భగీరధ, స్వఛ్ హైదరాబాద్ కింద వందల కోట్లు ఖర్చుచేశామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమన్నారు తలసాని. 

ప్రజా సమస్యలు పరిష్కారించడంలో బాబుకు చిత్తశుద్ధి లేదు : బివి.రాఘవులు

చిత్తూరు : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని సీపీఎం పొలిట్ బ్యూర్ సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. జిల్లాలోని మదనపల్లిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధిపై, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి కనీస బాధ్యత కూడా లేదని ఆయన విమర్శించారు. మొదటగా ప్రభుత్వం పట్టిసీమ పూర్తి చేస్తామని చెప్పాలని.. ప్రాజెక్టులోని సగం వాటర్ ను సీమకు ఇస్తామని జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఒక రిజర్వాయర్ నిర్మించాలని కోరారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

సిడ్నీ : భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో, ఆఖరి టీ.20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

 

13:01 - January 31, 2016

గుంటూరు : జిల్లాలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా దర్శి వాసి హరిణి.… గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈనేపథ్యంలో హరిణి కళాశాల భవనం నుంచి దూకింది. తీవ్ర గాయాలైన ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

12:53 - January 31, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే సెటిలర్లపై టీఆర్ఎస్ నేతలు ఎప్పుడు లేని ప్రేమ వొలకబోస్తున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. గ్రేటర్‌లో 'వన్ హైదరాబాద్ కూటమి' ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. విభజనకు ముందు విమర్శలు చేసిన నేతలే.. ఇప్పుడు సెటిలర్ల జపం చేస్తున్నారని ఆరోపించారు. తిట్టిన నోటితోనే ఎలా పొగుడుతున్నారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్‌గా మారిన పార్టీలను ఈ ఎన్నికల్లో తరిమికొట్టాలని తమ్మినేని పిలుపునిచ్చారు.

 

12:43 - January 31, 2016

కృష్ణా : విజయవాడలో భారీ అగ్రి ప్రమాదం జరిగింది. కబేళా సెంటర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్యలక్ష్మీ ప్లాస్టిక్‌ గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

 

విజయవాడ కబేళా సెంటర్ లో అగ్ని ప్రమాదం

కృష్ణా : విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కబేళా సెంటర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాజ్యలక్ష్మీ ప్లాస్టిక్‌ గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

12:39 - January 31, 2016

విశాఖ : ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ అభ్యర్థలకు శుభవార్త. ఎపి సర్కార్ డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు అందించింది. డీఎస్సీ నియామకాల షెడ్యూల్ ను విడుదల చేసింది. డీఎస్సీ షెడ్యూలును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రేపు డీఎస్సీ అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేస్తారు. ఫిబ్రవరి 5న సెలక్షన్‌ జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 8న జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా సెలక్షన్‌ లిస్ట్‌ను ఖరారు చేస్తారు. ఫిబ్రవరి 17న అర్హుల జాబితాను సీజీజీకి అందజేస్తారు.ఫిబ్రవరి 24న ఖాళీల జాబితా...ఫిబ్రవరి 25న సర్టిఫికెట్ల పరిశీలన, ఫిబ్రవరి 29న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 1 నుంచి 4 వరకు వెబ్‌ కౌన్సిలింగ్‌ ఉంటుందని తెలిపారు. మార్చి 5న అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇస్తామని ప్రకటించారు. 

 

12:30 - January 31, 2016

కృష్ణా : విజయవాడ గన్నవరంను పొగమంచు కమ్మేసింది. నగరమంతా పొగమంచు కమ్ముకోవడంతో.. విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. దిల్లీ నుంచి విజయవాడ వచ్చిన ఎయిరిండియా విమానం పొగమంచు కారణంగా గన్నవరం విమానాశ్రయంలో దిగేందుకు అరగంట నుంచి గాల్లోనే చక్కర్లు కొట్టింది. వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయింది.

 

 

వెంగళ్ రావు నగర్ లో సీపీఎం ప్రచారం

హైదరాబాద్ : వెంగళ్ రావు నగర్ లో సీపీఎం ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పాల్గొన్నారు. ఓట్ల కోసమే కేసీఆర్ సెటిలర్లపై ప్రేమకురిపిస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లో మార్పు కోసేమే వన్ హైదరాబాద్ కూటమి పోటీ చేస్తుందని చెప్పారు. వన్ హైదరాబాద్ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 2019 లో వామపక్షాలే ప్రత్యామ్నాయమన్నారు. ప్రజల తరపున పోరాడుతున్నది వామపక్షాలేనని చెప్పారు. దోచుకోవడంలో ఇతర పార్టీలు పోటీపడుతున్నాయని ఎద్దేవా చేశారు. 

 

ఎపి డీఎస్సీ షెడ్యూల్ విడుదల

విశాఖ : ఎపి డీఎస్సీ షెడ్యూల్ విడుదలైంది. ఈమేరకు మంత్రి గంటా శ్రీనివాస్ ఇవాళ షెడ్యూల్ విడుదల చేశారు. రేపు ఆన్ లైన్ లో డీఎస్సీ మెరిట్ అభ్యర్థుల లిస్టు ఉంచనున్నారు. ఫిబ్రవరి 5న డీఎస్సీ అభ్యర్థుల సెలెక్షన్ లిస్టు.

11:35 - January 31, 2016

ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సమరానికి ..మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనాలో రంగం సిద్ధమయ్యింది. టాప్ సీడ్ కమ్ హాట్ ఫేవరెట్ నొవాక్ జోకోవిచ్, రెండోసీడ్, నాలుగుసార్లు రన్నరప్ యాండీ ముర్రే ఫైనల్లో తలపడబోతున్నారు. ఐదవ ప్రయత్నంలో అయినా....టైటిల్ నెగ్గాలన్న కసితో ముర్రే పోటీకి దిగుతుంటే...మాజీ చాంపియన్ జోకోవిచ్ మరోసారి టైటిల్ తనదే అన్నధీమాతో ఉన్నాడు.....

జోకోవిచ్, ముర్రే ఢీ అంటే ఢీ

2016 గ్రాండ్ స్లామ్ సీజన్ తొలిటోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఫైట్ కు...మెల్బోర్న్ రాడ్ లేవర్ పార్క్ లో రంగం సిద్ధమయ్యింది. సూపర్ సండే ఫైట్ గా జరిగే ఈ టైటిల్ సమరంలో ప్రపంచ నెంబర్ వన్ నొవాక్ జోకోవిచ్, రెండో ర్యాంకర్ యాండీ ముర్రే ఢీ అంటే ఢీ అంటున్నారు. తొలిసెమీఫైనల్లో ...మాజీ నెంబర్ వన్ , మూడోర్యాంకర్ రోజర్ ఫెదరర్ ను నాలుగుసెట్ల సమరంలో ...టాప్ సీడ్ జోకోవిచ్ ఓడిస్తే… రెండో సెమీఫైనల్లో...యాండీ ముర్రే అడుగడుగునా గట్టిపోటీ ఎదుర్కొని..ఐదుసెట్ల థ్రిల్లింగ్ ఫైట్ లో....కెనడా సంచలనం రావ్ నిచ్ ను అధిగమించాడు. నువ్వానేనా అన్నట్లుగా.. నాలుగున్నర గంటలపాటు సాగిన ఈ సమరంలో ముర్రే..4-6, 7-5, 6-7, 6-4, 6-2తో విజేతగా నిలిచి..ఐదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. టాప్ సీడ్ జోకోవిచ్, రెండోసీడ్ ముర్రే..ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఇద్దరూ గతంలో మూడుసార్లు టైటిల్ ఫైట్ కు దిగితే..మూడుసార్లూ జోకోవిచ్ విజేతగా, ముర్రే రన్నరప్ గా నిలిచారు. ఇప్పటికే పలుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అనుభవంతో...సెర్బియన్ థండర్ జోకోవిచ్..హాట్ ఫేవరెట్ గా ఫైనల్లో పాల్గొంటున్నాడు.

చరిత్రను తిరగరాయాలన్న పట్టుదలతో ముర్రే

మరోవైపు...ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ చేరడం, ఓడిపోడం ఆనవాయితీగా చేసుకొన్న..నాలుగుసార్లు రన్నరప్ యాండీ ముర్రే మాత్రం..ఈసారి చరిత్రను తిరగరాయాలన్న పట్టుదలతో ఉన్నాడు. తనను ఊరిస్తూ, ఉడికిస్తూ వస్తున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను ఐదో ప్రయత్నంలో అయినా సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు. రావ్ నిచ్ తో ముగిసిన మారథాన్ సెమీస్ లో తుదివరకూ పోరాడి అలసిపోయిన ముర్రే...కేవలం ఒక్కరోజు విశ్రాంతితోనే...ఫైనల్లో జోకోవిచ్ ను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొనగలడన్నదే ఇక్కడి అసలు పాయింట్.

 

 

 

11:30 - January 31, 2016

సిడ్ని : కంగారూ ల్యాండ్ లో టీమిండియా మినీ టూర్ క్లయ్ మాక్స్ దశకు చేరుకొంది. 2016 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ఆఖరాటకు...సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో రంగం సిద్ధమయ్యింది. ఈ సూపర్ సండే ఫైట్ ద్వారా..క్లీన్ స్వీప్ సాధించాలన్న పట్టుదలతో టీమిండియా ఉంటే...ఆఖరిమ్యాచ్ లో నెగ్గి పరువుదక్కించుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది...…

ముగింపు దశకు సమరం..

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్ రెండో ర్యాంకర్ ఆస్ట్రేలియా, 8వ ర్యాంకర్ టీమిండియా జట్ల మూడుమ్యాచ్ ల సమరం...ముగింపు దశకు చేరుకొంది. భారత్ వేదికగా జరిగే 2016 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా జరుగుతున్న ఈ మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లూ ..ఇప్పటికే నెగ్గడం ద్వారా..ధోనీ నాయకత్వంలోని టీమిండియా 2-0 ఆధిక్యంతో సిరీస్ ఖాయం చేసుకొంది.

ఆఖరి పోటీలో నెగ్గాలని ఆసీస్ ఆశ..

మరోవైపు..వరుస పరాజయాలతో ఆయోమయంలో చిక్కుకొన్న ఆతిథ్య ఆస్ట్రేలియా..కనీసం ఆఖరి పోటీలో నెగ్గినా పరువుదక్కుతుందన్న ఆశతో ఉంది. మొదటి రెండుమ్యాచ్ ల్లో 17 మంది ఆటగాళ్ళను ఉపయోగించిన కంగారూటీమ్..ఆఖరి టీ-20 కోసం..ఉస్మాన్ క్వాజా, కామెరూన్ బాన్ క్రాఫ్ట్ ను అదనంగా జట్టులో చేర్చుకొంది.

ఆఖరిమ్యాచ్ పగ్గాలు.. షేన్ వాట్సన్ కు 

మొదటి రెండుమ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన ఆరోన్ ఫించ్ కు గాయం కావడంతో..ఆఖరిమ్యాచ్ పగ్గాలు..ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కు అప్పగించారు. అడిలైడ్ ఓవల్ లో ముగిసిన తొలి టీ-20లో 37 పరుగులు, మెల్బోర్న్ మ్యాచ్ లో 27 పరుగులతో పొందిన పరాజయాలతో కంగుతిన్న ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్ మెంట్...ఏం చేయాలో...ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో అర్థంకాని పరిస్థితిలో చిక్కుకొంది.

బెంబేలెత్తిపోతున్న కంగారూ టీమ్

తమ బౌలింగ్ ఎటాక్ ను ఓపెనర్ రోహిత్ శర్మ, వన్ డౌన్ విరాట్ కొహ్లీ..అలవోకగా ఎదుర్కొంటూ ఊచకోత కోస్తున్న తీరు చూసి...కంగారూటీమ్ బెంబేలెత్తిపోతోంది. రెండుసార్లూ చేజింగ్ లోనే బోల్తా కొట్టడం తో ఉక్కిరిబిక్కిరవుతోంది.

అత్యంత సమతూకంతో టీమిండియా

మరోవైపు..పవర్ ఫుల్ బ్యాటింగ్, పదునైన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్ తో టీమిండియా అత్యంత సమతూకంతో ఉంది. ధోనీ నాయకత్వంలో పట్టిందల్లా బంగారంలా మారడం టీ-20 సిరీస్ నుంచే తిరిగి ప్రారంభమయ్యింది. అడిలైడ్, మెల్బోర్న్ అన్న తేడా లేకుండా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ పరుగుల మోత మోగించడమే కాదు..180కి పైగా భారీస్కోర్లు అందించడంతోనే...విజయానికి పునాది వేస్తూ వస్తున్నారు. ఈ పునాదిని పేస్ జోడీ బుమ్రా, నెహ్రా, స్పిన్ ద్వయం జడేజా,అశ్విన్ అద్భుతంగా ఉపయోగించుకొంటుంటే...పార్ట్ టైమ్ బౌలర్లు యువరాజ్ సింగ్, హార్థిక్ పాండ్యా కీలక వికెట్లు పడగొడుతూ..కంగారూలను కోలుకోనివ్వకుండా చేస్తున్నారు.

సిడ్నీ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం

ఇక..ఆఖరి పోరాటానికి వేదికగా ఉన్న సిడ్నీ స్టేడియం పిచ్ సైతం..బ్యాటింగ్ కు అనువుగా ఉండడంతో..భారీస్కోరింగ్ మ్యాచ్ గా ముగిసే అవకాశాలు లేకపోలేదు. ఇదే గ్రౌండ్లో ముగిసిన ఆఖరి వన్డేలో భారీచేజింగ్ విజయం సాధించిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా..టీ-20 విజయం కోసం ఉరకలేస్తోంది.

టీమిండియా విజయాలకు ఆసీస్ అడ్డుకట్ట వేస్తుందా?

వరుసగా మూడో విజయంతో..ఆస్ట్రేలియా టూర్ ను ముగించాలని ధోనీ అండ్ కో భావిస్తున్నారు. చివరిసారిగా 2014 నవంబర్ 9న ఓ టీ-20మ్యాచ్ నెగ్గిన ఆస్ట్రేలియా..కనీసం ఈ ఆఖరిమ్యాచ్ లో నెగ్గి ..టీమిండియా విజయాలకు అడ్డుకట్ట వేస్తుందా? లేక...క్లీన్ స్వీప్ కమ్ బ్రౌన్ వాష్ ఓటమితో మరింతగా దిగజారిపోతుందా తెలుసుకోవాలంటే..ఆదివారం సాయంత్రం వరకూ వేచిచూడక తప్పదు.

 

 

11:21 - January 31, 2016

విజయవాడ : ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తుంది. ఒంటరిగా రోడ్డుపై నడవాలంటే వణకువస్తోంది. వీధుల్లో సింహ స్వప్నాలున్నాయన్న సంగతి దడ పుట్టిస్తోంది. ఎటువైపు నుంచి దాడి జరుగుతోందన్న ఆందోళన వెంటాడుతోంది. మొత్తంగా కాలభైరవులతో విజయవాడ వాసులకు కంటి మీద కునుకు కరువైంది.  

కాల భైరవులుగా మారుతున్న శునకాలు 
విజయవాడలో శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. గల్లీ గల్లీలో సింహ స్వప్నాలుగా మారిపోతున్నాయి. దారంటా వెళ్లే వారిపై దాడి చేసి తమ ప్రతాపం చూపిస్తున్నాయి. చిన్నారుల పాలిట కాల భైరవులుగా మారుతున్నాయి. నగరంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కబేళా, విద్యాధరపురం, అజిత్ సింగ్ నగర్, డంపింగ్ యార్డ్, కృష్ణలంక, శ్మశానవాటిక, రామలింగేశ్వరనగర్, బందరు రోడ్, మురికివాడలలో శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయి.

పెరుగుతున్న శునకాల బాధితులు
 

శునకాల బాధితులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. కుక్కకాటుతో రోజూ 25 మంది వరకు  విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వస్తున్నారు. కుక్కల దాడిలో కంచికచర్లలో బాలిక మృతి వంటి ఘటన జరిగినా...అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

విజయవాడ నగర పాలక సంస్థకు నిధుల కొరత

మరోవైపు విజయవాడ నగర పాలక సంస్థను నిధుల కొరత పట్టిపీడిస్తోంది.  వీధికుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు.. వ్యాక్సిన్ల కోసం నిధులు కేటాయించే పరిస్థితి లేదంటూ కార్పొరేషన్‌ అధికారులు చేతులెత్తేస్తున్నారు. కుక్కల నియంత్రణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు.
పిచ్చి కుక్క కరిస్తే... బాధితులకు ఇవ్వాల్సిన ఇమ్యునోగ్లోబ్యులిన్  వ్యాక్సిన్ విజయవాడ ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో లేదు. ఆ వ్యాక్సిన్ కోసం గుంటూరు పెద్దాస్పత్రికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజయవాడ వాసులు కోరుకుంటున్నారు. 
 

 

11:10 - January 31, 2016

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఎవరో ఒకరు నిర్మించింది కాదని... నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన 'స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. హైదరాబాద్ లో పరస్పరం గౌరవించుకునే సంస్కృతి ఉందన్నారు. సంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలున్నాయని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్ ను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేశారని తెలిపారు. రూ.20 వేలకోట్లతో నగరంలో రోడ్లను అభివృద్ధి చేశామని చెప్పారు. నగర ప్రజలకు ఉస్మాన్ సాగర్, హిమయాత్ సాగర్ ల ద్వారా తాగు నీరు అందుతుందన్నారు.

 

'స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్' లో పాల్గొన్న కేటీఆర్

హైదరాబాద్ : నగరంలో నిర్వహించిన స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో పరస్పరం గౌరవించుకునే సంస్కృతి ఉందన్నారు. సంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వ కార్యక్రమాలున్నాయని తెలిపారు. 

టీటీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత, ఎపి సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రేటర్ లో టీడీపీ బలంగా ఉండటాన్ని చూసి కేసీఆర్ భరించలేకపోతున్నారని పేర్కొన్నారు. అసహనంతో సీఎం కేసీఆర్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని తెలిపారు. టీఆర్ ఎస్ అధికార దుర్వినియోగాన్ని సమర్థంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు రోజులు రాత్రింబవళ్లు కష్టపడి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక మంచి లక్ష్యం కోసం కలిసికట్టుగా పని చేయాలని కోరారు.

10:32 - January 31, 2016

సినిమాల్లో ఎక్కువగా కల్పనలకే ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కోసారి చారిత్రక అంశాలను బేస్‌ చేసుకుని తీసిన సినిమాల్లో కూడా హీరోయిజాన్ని కాపాడేందుకు యథార్థాలను వక్రీకరిస్తుంటారు. సరిగ్గా ఎయిర్‌ లిఫ్ట్‌ సినిమాలో కూడా ఇలాగే జరిగిందన్న విమర్శలు బయల్దేరాయి. విమర్శించింది మరెవరో కాదు ప్రభుత్వ అధికారులే. ఇంతకి ఈ హిట్ మూవీలో యథార్థాన్ని వక్రీకరించిన విషయం ఏమై ఉంటుంది.? అధికారులను కదిలించిన అంశాలు ఏమున్నాయి.?

ఎయిర్‌లిఫ్ట్‌.. అక్షయ్‌ కు సూపర్‌ హిట్‌ మూవీ

చాలా ప్లాఫుల తర్వాత బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌కు ఎయిర్‌లిఫ్ట్‌ రూపంలో సూపర్‌ హిట్‌ మూవీ దక్కింది. 1990లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం కథను అల్లుకున్నారు. 1990ల్లో సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో ఇరాక్‌ కువైట్‌పై దాడి చేసి ఆక్రమించుకుంది. ఆ టైంలో తలెత్తిన వార్‌లో కొందరు భారతీయులు చిక్కుకోగా వారిని హీరో అక్షయ్‌కుమార్‌ వీరోచితంగా రక్షిస్తాడు. ఇదీ సినిమా స్టోరీ. అయితే ఇండియన్స్‌ను కాపాడే విషయంలో భారత విదేశాంగ శాఖ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారన్న దృశ్యాలు ఈ చిత్రంలో ఉన్నాయి. దీన్ని ప్రస్తుతం ఆ శాఖ అధికారులు ఖండిస్తున్నారు.

ఎయిర్ లిఫ్టుపై విదేశాంగ శాఖ విమర్శలు

విదేశాంగ వ్యవహరాల శాఖకు చెందిన వికాస్‌ స్వరూప్ ఎయిర్‌లిఫ్ట్‌ మూవీ గురించి స్పందిస్తూ దానిలో యథార్థాలను వక్రీకరించారని విమర్శించారు. చిత్ర యూనిట్‌ స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ అవాస్తవాలను చిత్రీకరించిందన్నారు. బందీలను కాపాడ్డంలో విదేశాంగశాఖ ప్రముఖ పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు. చరిత్రను చదివి ప్రజలు ఆ విషయాన్ని గుర్తించాలని కోరారు. యధార్థానికి దూరంగా ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇలాంటి దృశ్యాలను చిత్రీకరించడం సరికాదని అన్నారు.

'బందీలను విడిపించి ఇండియాకు తీసుకొచ్చాం' : అధికారులు

మరో అధికారి కె.పి ఫాబియన్‌ స్పందిస్తూ విదేశాంగ శాఖ మంత్రి ఐకె గుజ్రాల్, ఎయిర్‌ ఇండియా, విమానయాన శాఖ అధికారులు చక్కటి సహకారంతో బందీలను విడిపించి ఇండియాకు తీసుకొచ్చారని అన్నారు. అలాంటిది ఎయిర్‌లిఫ్ట్‌ సినిమాలో హీరోనే అంతా చేసేసినట్లు చూపడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదేమైనా ఇప్పటివరకు సినిమాల్లో చూపే అవాస్తవ సంఘటనలను అధికారులు అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ రీసెంట్‌గా విడుదలైన ఎయిర్‌లిఫ్ట్‌ విషయంలో మాత్రం చూసీచూడనట్లుగా ఉండలేకపోతున్నారు. మరి అధికారుల స్పందనపై చిత్ర యూనిట్‌ ఏవిధంగా రెస్పాండ్‌ అవుతుందో చూడాలి.

 

ఇల్లు దగ్ధం... వృద్ధురాలు సజీవ దహనం

కరీంనగర్ : పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో విషాదం నెలకొంది. షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం అయింది. ఇంట్లో ఉన్న వృద్ధురాలు సజీవ దహనం అయింది. 

బొబ్బిలిలో పోలీసుల తనిఖీలు

విజయనగరం : బొబ్బిలిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సూర్యరావు అనే వ్యక్తి ఇంట్లో పేలుడు పధార్థాలను గుర్తించారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

10:15 - January 31, 2016

'శ్రీమంతుడు' సినిమా తర్వాత సినిమాలు చేసే విషయంలో మహేష్‌బాబు దూకుడు పెంచారు. ప్రస్తుతం ఓ పక్క 'బ్రహ్మోత్సవం' చిత్రంలో నటిస్తూనే, మరో పక్క ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తమిళం, తెలుగు భాషల్లో రూపొందబోయే చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు. దాదాపు 120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్‌ పనులు ఏకధాటిగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే, గత కొన్ని నెలలుగా దర్శకుడు శేఖర్‌కమ్ములతో మహేష్‌ ఓ ప్రాజెక్ట్‌ చేస్తారనే వార్తలు వినిపిం చాయి. ఇప్పుడావార్తలు నిజం కాబోతున్నాయని సమాచారం. శేఖర్‌ చెప్పిన లైన్‌ మహేష్‌కి బాగా నచ్చడంతో మిగిలిన పనుల మీద కాన్‌సన్‌ట్రేట్‌ చేయమని దర్శక, నిర్మాతలు శేఖర్‌కమ్ముల, జయంత్‌.సి.పరాన్జీలకు మహేష్‌ చెప్పారట.

10:13 - January 31, 2016

బాలకృష్ణ 100వ సినిమా గురించి రోజుకొక వార్త వెలుగులోకి వస్తోంది. ఇటీవల ఓ సినిమా వేడుకలో 100వ చిత్రంగా 'ఆదిత్య 999' చేస్తున్నానని బాలకృష్ణ ప్రకటించిన విషయం విదితమే. కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ ఆయన 100వ చిత్రం ఓ పోలీస్‌ కథతో రూపొందనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'రామారావు గారు' అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారట. 'పటాస్‌' దర్శకుడు అనిల్‌రావిపూడి చెప్పిన పోలీస్‌ కథ ఆద్యంతం బాలకృష్ణకి నచ్చడంతో 100వ చిత్రంగా 'రామారావుగారు'ని చేసేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. గతంలో కూడా పోలీస్‌ కథా నేపథ్యంలో రూపొందిన 'రౌడీ ఇన్‌స్పెక్టర్‌', 'లక్ష్మీ నరసింహ' వంటి చిత్రాల్లో నటించి బాలకృష్ణ ఘనవిజయాల్ని సాధించారు.

 

10:10 - January 31, 2016

ప్రస్తుతం తెలుగులో దాదాపు 15 చిత్రాలు పరభాషా చిత్రాలకు రీమేక్‌లుగా రూపొందుతున్నాయి. వీటిల్లో చిరంజీవి దగ్గర్నుంచి అల్లరి నరేష్‌ వరకూ ఉన్నాయి. తాజాగా ఈ రీమేక్‌ల జాబితాలోకి పవన్‌కళ్యాణ్‌ కూడా చేరబోతున్నట్టు తెలుస్తోంది. అజిత్‌ నటించిన 'వీరమ్‌' చిత్రం తమిళనాట సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తే బాగుంటుందనే యోచనలో పవన్‌కళ్యాణ్‌ ఉన్నారని సమాచారం. ముగ్గురు తమ్ళుళ్ళుకు పెద్ద అన్నయ్యగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే కథానాయకుడి కథగా 'వీరమ్‌' చిత్రం రూపొందింది. ఇటువంటి కథతో తెలుగులో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చినప్పటికీ ట్రీట్‌మెంట్‌, ప్రజంటేషన్‌, స్క్రీన్‌ప్లే, కామెడీ తమిళనాట విశేష ప్రేక్షకాదరణ పొందడానికి కారణాలుగా నిలిచాయి. ఈ రీమేక్‌ చిత్రాన్ని'ఖుషీ' దర్శకుడు ఎస్‌.జె.సూర్యతో చేసేందుకు పవన్‌ సుముఖంగా ఉన్నారట. ప్రస్తుతం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. మార్చి 12న ఆడియోను, ఏప్రిల్‌ 8న సినిమాని విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు.

 

విజయవాడ గన్నవరంలో పొగమంచు

విజయవాడ : గన్నవరంలో పొగమంచు కమ్ముకుంది. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్

హైదరాబాద్ : నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జకోవిచ్ తో ముర్రే తలపడనుంది.

 

09:39 - January 31, 2016

నెల్లూరు : ముప్పై ఏళ్లపాటు పాటు కాంగ్రెస్‌లో కొనసాగి టీడీపీ తీర్థం పుచ్చుకున్న నెల్లూరు ఆనం సోదరులు మధ్య చీలిక వచ్చింది. పచ్చ కండువా వేసుకొని నెలైనా గడవక ముందే ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం విజయ్‌కుమార్‌ రెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు మారే అవకాశం ఉంది.

ఆనం సోదరులకు ఎదురుదెబ్బ

నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి సోదరులకు ఎదురుదెబ్బ తగలనుంది. ఆనం సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. వైసీపీ జిల్లా నేతలను కలసి ఆయన ఈ మేరకు చర్చలు జరిపారు. పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కార్యాలయానికి వెళ్లి మాట్లాడారు.

త్వరలో వైసిపిలో చేరనున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి

అనంతరం ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధానాలు తనకు నచ్చాయని, ఆయన నేతృత్వంలో పార్టీలో పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. అనుచరులతో మాట్లాడి త్వరలో పార్టీలో చేరే నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.

టీడీపీలో చేరిన నారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి 

ఇదిలా ఉంటే ఆనం సోదరులు నారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ టీడీపీలో చేరడం పట్ల మొదటి నుంచి విజయ్ కుమార్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆనం విజయకుమార్ రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించి పార్టీని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు వైసీపీ కార్యాచరణలోకి దిగింది. ఆనం విజయ్‌ కుమార్‌కు నెల్లూరు రూరల్‌లో గట్టిపట్టు ఉంది. దీంతో ఆ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డితో పాటు నెల్లూరు రూరల్‌, గూడూరు, సూళ్లూరు పేట ఎమ్మెల్యేలు.. జిల్లాలోని పలువురు నాయకులు పార్టీలోకి విజయ్‌కుమార్‌ను ఆహ్వానించారు.

జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ఆనం సోదరులు

మొదటి నుంచి ఆనం సోదరులు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీకి బలం చేకూరుతుందని వైసీపీ భావించింది. కానీ ఆనం సోదరులైన వివేకా, రామనారాయణ రెడ్డిలు టీడీపీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపారు. దీంతో కనీసం ఆనం విజయ్‌ కుమార్‌ రెడ్డినైనా వైసీపీలోకి ఆహ్వానించేందుకు సిద్ధపడింది.

 

09:21 - January 31, 2016

నెల్లూరు : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. మనుబోలు మండలం యాచవరం గ్రామానికి చెందిన తిరుమలరావు.. కుటుంబసభ్యులతో బైక్‌పై వెళ్తుండగా మార్గంమధ్యలో గూడూరు మండలంలో బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తిరుమలరావు భార్య, చిన్న కూతరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. 

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

కరీంనగర్ : జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుల్తానాబాద్ మండలం కనుకుల సమీపంలో ఆటోలో తరలిస్తున్న 18 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం ఉదయం పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న కూరపు రవీందర్, శ్రవణ్‌లను పోలీసులు  అరెస్ట్ చేశారు.

రాజేంద్రనగర్లో అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో ఆదివారం తెల్లవారుజామున ఓ వర్క్షాపులో ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలులు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పినారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.

09:12 - January 31, 2016

విశాఖ : నగరంలో వచ్చే నెల 4 నుంచి జరుగుతున్న నేవీ ఫ్లీట్ రివ్యూ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు  ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో ఐఎఫ్ ఆర్ కు చేసిన ఏర్పాట్లు, భద్రతపరమైన చర్యలు పటిష్టంగా  ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. విదేశాల నుండి పలువురు ప్రతినిధులు రాష్ట్రానికి వస్తున్నందున అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు బాబు.

 

డివైడర్ ను ఢీకొన్న బైక్... తల్లీకూతుళ్లు

నెల్లూరు : డివైడర్ ను బైక్ ఢీకొన్న ఘటనలో తల్లీ కూతుళ్లు మృతి చెందారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం బద్దెవోలు గ్రామం దగ్గర బైక్ డివైడర్ ను ఢీకొంది. దీంతో బైక్ పై వస్తున్న లక్ష్మీకాంతం, దీపిక అనే తల్లీ కూతుళ్లు మృతిచెందారు.

ఢిల్లీలో విద్యార్థి అనుమానాస్పద మృతి

ఢిల్లీ : హస్తినలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల విద్యార్థి పాఠశాల ఆవరణలోనే అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. వసంత్‌కుంజ్ ప్రాంతంలో గల రేయాన్ ఇంటర్నేషన్‌లో స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్న దేవాన్షు మీనా అనే విద్యార్థి స్కూల్లోనే చనిపోయి పడిఉన్నాడు. ఈ ఘటన నిన్న మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతికి గల కారణం స్పష్టంగా తెలియరాలేదు. పాఠశాల యాజమాన్యం స్పందిస్తూ తరగతి గదినుంచి విద్యార్థి మాయమయ్యాడు. తీరా చూస్తే గుంతలో చనిపోయి పడిఉన్నాడని పేర్కొంది.

ఆ జిల్లాల టీచర్లకు ఫిబ్రవరి 3న సెలవు...

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే మహబూబ్‌నగర్‌, నల్గొండ, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులకు ఫిబ్రవరి 3వ తేదీన ప్రత్యేక సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఫిబ్ర వరి 2న జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు దాదాపు 50వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులను నియమించామని, వీరిని హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల నుంచి ప్రత్యేకం గా ఎన్నికల విధులకు నియమించామని తెలిపారు.

08:43 - January 31, 2016

చెన్నై : త్వరలో తమిళనాట ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ద్రవిడ పార్టీల్లో ఆశావహుల సందడి మొదలైంది. పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని పార్టీలు బంపర్‌ ఆఫర్‌ ఇవ్వడంతో పోటీకి పలువురు సై అంటున్నారు. అయితే అన్నాడీఎంకే నుంచి పోటీ చేసేందుకు ఔత్సాహికులు బారులు తీస్తుండగా.. డీఎంకే నిరుత్సాహపడుతోంది. దీంతో ఈసారి ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న టెన్షన్‌ అందరిలోనూ మొదలైంది.

ప్రతి ఐదేళ్లకోసారి అధికార మార్పిడి

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయి. గత 35 ఏళ్లుగా ద్రవిడ పార్టీలే అధికారాన్ని పంచుకున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి అధికార మార్పిడి చేసుకుంటూ వస్తున్నాయి. అయితే రానున్న ఎన్నికల్లో చరిత్ర తిరగరాస్తామని అధికార పార్టీ అన్నా డీఎంకే నేతలంటుంటే.. అమ్మకు అంత సీన్‌ లేదు.. తమదే అధికారమని డీఎంకే పార్టీ నేతలంటున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ హీట్‌ మొదలైంది.

ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్‌, డీఎండీకే పార్టీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించే పనిలో పడ్డాయి. ఇందుకోసం అన్ని పార్టీలు ప్రత్యేక కౌంటర్లు ఓపెన్‌ చేశాయి. దీంతో జనవరి 20వ తేదీ నుంచి ఇప్పటివరకు అన్నాడీఎంకే పార్టీ నుంచి పోటీ చేసేందుకు 13 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా మరో నాలుగు రోజులు సమయం ఉండడంతో ఈ సంఖ్య 20 వేలకు చేరే అవకాశముందని నేతలంటున్నారు. అమ్మ చేస్తున్న అభివృద్ధి పనుల వల్లే తమ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారంటున్నారు. అయితే వచ్చిన దరఖాస్తుల్లో జయలలిత తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆరు వేల దరఖాస్తులు వచ్చాయి. ఇక దరఖాస్తుదారుల నుంచి పార్టీకి ఇప్పటికి 14.30 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది.

ఆసక్తి కనబర్చని ఔత్సాహికులు

మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఔత్సాహికులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. ఇప్పటివరకు కేవలం 200 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. మరో నాలుగు రోజులు సమయం ఉన్నప్పటికీ.. ఈ సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం లేదని నేతలు భావిస్తున్నారు.

బలమైన శక్తిగా మారిన అన్నాడీఎంకే

అన్నాడీఎంకే బలమైన శక్తిగా మారడం.. ఆ పార్టీని ఎదుర్కొనే శక్తి డీఎంకే లేదని ప్రజలు భావించడం వల్లే ఈ పరిణామం చోటు చేసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు దరఖాస్తుదారుల నుంచి అన్నాడీఎంకే 11 వేల రూపాయలు వసూలు చేస్తుండగా.. డీఎంకే 25 వేల రూపాయలు వసూలు చేయడం కూడా కారణమై ఉంటుందని పలువురంటున్నారు. ఏది ఏమైనా ప్రతి ఐదేళ్లకోసారి అధికార మార్పిడి జరిగే తమిళనాట.. ప్రస్తుత పరిస్థితి చూస్తేంటే ఈసారి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న టెన్షన్‌ అందరిలోనూ నెలకొంది.

 

08:39 - January 31, 2016

చిత్తూరు : శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లు..లడ్డూ ప్రసాదం ధరల పెంపుపై టీటీడీ పాలక మండలి వెనక్కి తగ్గింది. ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ధరల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది. తిరుమలలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ  నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది.  శ్రీ వెంకటేశ్వర వైభోవోత్సవాలను తొమ్మిది నుంచి 5 రోజులకు కుదించాలనే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. 
పలు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర  
తిరుమలలో శనివారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ కేటాయింపు, శ్రీవారి వైభోత్సవాలు, తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో మరమ్మతు పనులు.. కొండపై పలు అభివృద్ధి పనులు తదితర అంశాలకు చెందిన ప్రతిపాదనలకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. 
ఆర్జిత సేవ టిక్కెట్లు, లడ్డూ ప్రసాద ధరల పెంపు వాయిదా 
శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లు, లడ్డూ ప్రసాద ధరల పెంపును వాయిదా వేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. లడ్డూల ధరలను పెంచేది లేదని పాలకమండలి స్పష్టం చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2678 కోట్ల బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది.శ్రీవారి హుండీ ద్వారా రూ.1010కోట్లు, డిపాజిట్లపై వడ్డీల ద్వారా రూ.779 కోట్లు, శ్రీవారి దర్శనం టిక్కెట్ల నుంచి రూ.209 కోట్లు, ప్రసాదాల వితరణ నుంచి రూ.175 కోట్లు, తలనీలాల విక్రయం ద్వారా రూ.150 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేశారు. 
రూ.18 కోట్లతో మహామణి మండపం నిర్మాణం
తిరుమల, నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి మండపాన్ని రూ.18 కోట్లతో నిర్మించేందుకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. మహామణి మండపం డిజైన్‌ను పాలక మండలి ఖరారు చేసింది. తిరుమల పాప వినాశనం టోల్‌గేట్‌ దగ్గర రూ. 4.50 కోట్లతో ఆక్టోపస్‌ భవనం నిర్మించాలని నిర్ణయించింది. తిరుమల సప్తగిరి గెస్ట్‌ హౌస్‌లో రెండు బ్లాక్‌ల ఆధునీకరణకు రూ. 5.90 కోట్లు మంజూరు చేసింది. 

08:37 - January 31, 2016

హైదరాబాద్ : అధికారానికి రాకమునుపు భూబకాసురుల భరతం పడతామన్నారు. అక్రమంగా కొల్లగొట్టిన వేల ఎకరాల తెలంగాణ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. అయితే అధికార పీఠమెక్కిన పాలకులు ఆ దిశగా అడుగులు ముందుకు వేయడం లేదు. భూ అక్రమాలపై వేసిన కమిటీలు నామమాత్రంగానే మిగిలాయి. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
భూ ఆక్రమణదారులపై ఉద్యమ కాలంలో విరుచుకుపడ్డ కేసీఆర్‌
తెలంగాణ నిధులు, వనరులు దోచిన వారి భరతం పడతామని.. ఉద్యమకాలంలో సీఎం కేసీఆర్‌ పలుమార్లు హెచ్చరించారు. రాజధాని హైద్రాబాద్‌ చు‌ట్టూరా వేల ఎకరాల భూములను సీమాంధ్ర పెట్టుబడిదారులు కొల్లగొట్టారని.. వాటిని స్వాధీనం చేసుకొని తీరుతామని ప్రకటించారు. అక్రమ భూ బదలాయింపులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
రెండేళ్లు గడిచినా భూ స్వాధీనంపై చర్యలు శూన్యం
ఎన్నికలు ముగిశాయి. ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. సుమారు రెండేళ్లు గడిచిపోతున్నాయి. అయితే.. నేటికీ  భూముల స్వాధీనంపై సర్కారు పెదవి విప్పడం లేదు. అసెంబ్లీ వేదికగా అ్రకమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టమని సాక్షాత్తూ సీఎం ప్రకటించారు. వక్ఫ్‌ భూములు,ఫిలింనగర్‌ సొసైటీ భూముల లావాదేవీల్లో అక్రమాలను బయటపెట్టి ప్రభుత్వ  భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు అందుకు అనుగుణంగా జనవరి 18, 2015న అధికార పార్టీ ఎమ్మెల్యేలు చైర్మన్లుగా మూడు సభా సంఘాలు వేశారు. 
సభా సంఘాలు నియమించి ఏడాది పూర్తి
వక్ఫ్‌ భూముల అన్యాక్రాంతంపై నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, హౌసింగ్‌ సొసైటీల అక్రమాలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, తెలంగాణ వ్యాప్తంగా భూముల ఆక్రమణలపై మేడ్చల్‌ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌ రెడ్డి నేతృత్వంలో సభాసంఘాలు వేసారు. అయితే కమిటీల నియామకం జరిగి సంవత్సరం గడిచినా ఒక్కటంటే ఒక్క సమావేశం జరగకపోవడం చూస్తే ప్రభుత్వం చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ మొదలుకాని పనులు 
కమిటీల కన్నా ముందే భూముల సమగ్ర విచారణపై రిటైర్డ్‌ ఐఎఎస్‌ శ్యామ్‌ కుమార్‌ సిన్హా అధ్యక్షతన టాస్క్‌ ఫోర్స్‌ నియామకం జరిగింది. తెలంగాణలో గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భూ కేటాయింపులు బదలాయింపులు, విక్రయాలు, దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని డిసెంబర్‌ 5, 2014న టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. రెండు సంవత్సరాల్లో సమగ్ర విచారణ జరిపి.. అక్రమాలను వెలికి తీయాలన్న టార్గెట్‌ పెట్టింది. అయితే అటు సభా సంఘాలు, ఇటు టాస్క్‌ ఫోర్స్‌ ఏడాది కాలంలో అసలు పనులే ప్రారంభించలేదు. 
నగరం నడిబొడ్డున వందల ఎకరాలు ఆక్రమణ..? 
నగరం నడిబొడ్డున వందల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయంటున్న ప్రభుత్వ పెద్దలు, కొత్త సచివాలయం కోసం పట్టుమని పది ఎకరాలు గుర్తించలేకపోవడం ప్రభుత్వ పనితీరు ఎంత వేగంగా ఉందో తెలుస్తుంది. మూడు సంఘాలు, ఒక టాస్క్ ఫోర్స్‌ను నియమించినా క్షేత్రస్థాయిలో పర్యటించింది లేదు . దీంతో నిజంగా ప్రభుత్వానికి భూ అక్రమాల విషయంలో చిత్తశుద్ధి ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒకరిద్దరి భూములను స్వాధీనం చేసుకోవడం తప్ప చర్యలేమీ లేవు. కోర్టు తీర్పులు, లీజుల పూర్తి, ఒప్పందాలను ఉల్లంఘించిన ఒకరిద్దరి భూములను స్వాధీనం చేసుకోవడం తప్ప ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదనే అపవాదులు వెలువడుతున్నాయి. మరోనెలలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విపక్షాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

 

08:23 - January 31, 2016

తూర్పుగోదావరి : కాపు కులస్తులు తలపెట్టిన ఐక్య గర్జనకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. తునిలో జరగనున్న భారీ బహిరంగ సభకు 10లక్షల మందికి పైగా కాపులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. సభకు వచ్చేవారి వాహనాల కోసం పార్కింగ్ ప్రదేశాలతోపాటు సకలం సిద్ధం చేశారు. తమనూ బీసీల్లో చేర్చాలని, రిజర్వేషన్లు కల్పించాలని కాపు నేతలు డిమాండ్ చేశారు. 

తుని రూరల్‌లో భారీ బహిరంగ సభ 

కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ఏపీలో ఆ వర్గం తలపెట్టిన నిరసనలు అంతకంతకూ ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్‌లో భారీ బహిరంగ సభను తలపెట్టారు. జనవరి 31న నిర్వహించనున్న ఈ సభకు జాతీయ రహదారి పక్కనగల కొబ్బరి తోటలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్టేజి ఏర్పాటుతోపాటు బారికేడ్లను సిద్ధం చేశారు. 150 ఎకరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్ ప్రదేశాలను రెడీ చేశారు.

సభకు ప్రభుత్వ అనుమతులు లేవు...

విజయవాడ నుండి వచ్చే వారిని సభా ప్రాంగణం వద్ద దించి విశాఖ వైపు పార్కింగ్ చేసేలా, విశాఖ నుండి వచ్చే వాహనాలను రాజమండ్రి వైపు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. అయితే కాపుల ఐక్య గర్జనకు ఇంత భారీ స్థాయిలో సకలం సిద్ధం చేస్తున్నా ప్రభుత్వ అనుమతులు లేవు. నిర్వాహకులు ముందుగా రెడీ చేసుకున్న ఆర్ టీసీ బస్సులను ప్రభుత్వం రద్దు చేసింది.
'కాపుల ఐక్యగర్జనను ఎవరూ ఆపలేరు'  
స్కూల్ బస్సులను ఇచ్చినా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించడంతో నిర్వాహకులు ప్రైవేట్ వాహనాలను రెడీ చేసుకుంటున్నారు. అయితే కాపుల హక్కులను నెరవేర్చాలంటూ తాము చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం తమ పార్టీలోని కాపులతో ఎదురుదాడి చేయిస్తోందని నిర్వాహకులు విమర్శిస్తున్నారు. అయినా కాపుల ఐక్యగర్జనను ఎవరూ ఆపలేరని అంటున్నారు.   

'కాపుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం'

పదవుల కోసం పాకులాడే కొందరు కాపుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అంటున్నారు. ఇంతకు ఐక్య గర్జన ఎలాంటి ఆటంకాలూ లేకుండా జరుగుతుందా లేదా అన్నది ఆయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

 

తిరుపతిలో 28 ఎర్రచందనం దుంగలు స్వాధీనం...

తిరుపతి : జూపార్క్ దగ్గర ఎస్సీకాలనీలో రూ.40లక్షల విలువైన 28 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో తమిళనాడు తిరువన్నామలైకి చెందిన స్మగ్లర్ సంగప్పన్ అరెస్ట్ చేశారు. పలువురు స్మగ్లర్లు పరార్ కావడంతో పోలీసులుగాలీస్తున్నారు.

నేడు కాపు కులస్తుల ఐక్య గర్జన

తూర్పుగోదావరి : కాపు కులస్తులు తలపెట్టిన ఐక్య గర్జనకు భారీగా ఏర్పాట్లు జరిగాయి. తునిలో జరగనున్న భారీ బహిరంగ సభకు 10లక్షల మందికి పైగా కాపులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. సభకు వచ్చేవారి వాహనాల కోసం పార్కింగ్ ప్రదేశాలతోపాటు సకలం సిద్ధం చేశారు. తమనూ బీసీల్లో చేర్చాలని, రిజర్వేషన్లు కల్పించాలని కాపు నేతలు డిమాండ్ చేశారు. 

 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

హైదరాబాద్‌: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా వుంది. భక్తులు 7 కంపార్ట్ మెంట్లలో వేచివున్నరు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం, నడకదారి భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిపై కత్తితో దాడి..

హైదరాబాద్ : హయత్‌నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి ముత్యాల చంద్రశేఖర్‌రావుపై శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగలు రాళ్లతో ఆయన ప్రయాణిస్తున్న కారుపై దాడిచేశారు. ఈ దాడిలో ఆయన కారు దిగి ప్రాణాలు కాపాడుకోబోతుండగా కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన తప్పించుకొని ఆస్పత్రిలో చేరాడు. ప్రాణాన్నికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు.

నేడు టిటిడిపి లక్ష బైక్ లతో ర్యాలీ

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిస్తుండంతో నేడు టిడిపి లక్ష బైక్ లతో ర్యాలీ నిర్వహించనుంది. 6ప్రాంతాలనుండి ఎన్టీఆర్ పార్క్ వరకు ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీలో భాగంగా నారాలోకేష్ ,రేవంత్ రెడ్డి,ఆర్ కృష్ణయ్య పాల్గొనున్నారు.

కాంగ్రెస్, బిజెపిల మధ్య ఘర్షణ... బిజెపి కార్యకర్తలకు గాయాలు

హైదరాబాద్‌: నగరంలోని ఆర్కేపురం డివిజన్‌లో బిజెపి, కాంగ్రెస్‌ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడికి దిగాయి. ఈ ఘటనలో నలుగురు బిజెపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. తమ కార్యకర్తలను అన్యాయంగా కొట్టారని ఆరోపిస్తూ చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్‌ నాయకులపై బిజెపి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

08:01 - January 31, 2016

హైదరాబాద్ : పేదల పక్షాన పోరాడేది వామపక్షాలేనని ఆ పార్టీ నేతలన్నారు. గ్రేటర్‌ ప్రచారంలో భాగంగా మియాపూర్‌లో 'వన్‌ హైదరాబాద్‌' కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించింది. కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన నెరవేర్చకుండా.. ప్రచారంతో పబ్బం గడుపుతున్నారని నేతలు ఆరోపించారు. అవినీతి రాజకీయాలను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని... గ్రేటర్‌ ఎన్నికల్లో అవకాశవాద రాజకీయాలకు బుద్ధిచెప్పాలన్నారు నేతలు.
భారీ బహిరంగ సభ 
గ్రేటర్‌లో ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో మియాపూర్‌లో 'వన్‌ హైదరాబాద్‌' కూటమి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. 
'పేదల కోసం పోరాటాలు చేసేది వామపక్షాలే'
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసేది వామపక్షాలే నేతలన్నారు. గ్రేటర్‌ ఎన్నికలు సాదాసీదావి కాదని.. అవకాశవాద రాజకీయాలకు బుద్ది చెప్పేందుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు తమ్మినేని. ఈరోజు ఓ పార్టీ నాయకుడు ఒక పార్టీలో ఉంటే.. రేపు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మరోవైపు వలసలతో నేతలను పార్టీలో చేర్చుకున్న కేసీఆర్‌.. 100 సీట్లు తామే గెలుస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం అవినీతి రాజకీయాలను తరిమికొట్టేందుకు 'వన్‌ హైదరాబాద్‌' కూటమి అభ్యర్ధులను గెలిపించాల్సిన అవసరముందన్నారు తమ్మినేని. 
'కావాల్సింది సమస్యలు లేని తెలంగాణ'
సామాన్యుని ఆయుధమైన ఓటు ద్వారా ప్రజల సమస్యలను పట్టించుకోని రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పాలని చాడ వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్‌ బంగారు తెలంగాణ చేస్తానని సామాన్యుల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలకు కావాల్సింది టీఆర్‌ఎస్‌ చెప్పుతున్నట్లు బంగారు తెలంగాణ కాదని.. బతుకు తెలంగాణ కావాలన్నారు. సమస్యలు లేని తెలంగాణ కావాలన్నారు చాడ. అవినీతి రాజకీయాలను తరిమి కొట్టాలంటే 'వన్‌ హైదరాబాద్‌' కూటమి అభ్యర్ధులను గెలిపించాలని నేతలు కోరారు. 

 

07:53 - January 31, 2016

హైదరాబాద్ : ఈటెల్లాంటి మాటలు... తూటాల్లాంటి ప్రసంగాలు. పదునైన విమర్శలు... పంచ్ డైలాగ్‌లు. నిర్మొహమాటం... ముక్కు సూటిదనం. ఇప్పటి వరకు జరిగిన గ్రేటర్ ప్రచారం వేరు. ఆయన గ్రౌండ్‌లో ఎంటరైన తర్వాత జరిగింది వేరు. వ్యంగ్యస్త్రాలతోనే ప్రత్యర్థిపై బుల్లెట్ల వర్షం కురిస్తున్నారు. ఏకంగా చంద్రన్నపైనే అస్త్రాలు సంధించారు. వదినమ్మ ఓటు... కారుకేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక బాబాయి మాటలపై అబ్బాయి సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అమ్మచెప్పిందంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు లోకేశ్‌.
భువనేశ్వరి ఓటు... టీఆర్ఎస్‌ కే : కేసీఆర్ 
గ్రేటర్ ఎన్నికల వేళ గులాబీ దళపతి వ్యూహాలివి. అన్న మాట ఎలా ఉన్నా..! వదిన ఓటు మాత్రం తమకేనన్నారు. ఎపి సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఓటు... టీఆర్ఎస్‌కు వేయడం ఖాయమంటూ... కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేసీఆర్‌
ఒకవైపు భువనేశ్వరిపై ప్రశంసలు కురిపిస్తూనే... మరోవైపు బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్‌. టీఆర్ఎస్‌తోనే గ్రేటర్ అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌ను... వదల బొమ్మాళి వదలంటున్నారని, అసలాయన్ను ఎవరు పొమ్మన్నారని గులాబీ బాస్ ప్రశ్నించారు. కావాలంటే హైదరాబాద్‌లో హెరిటేజ్ దుకాణాలు పెట్టుకో... లైసెన్స్ కావాలా..? ఏం కావాలో..? చెప్పు... అన్నీ ఇస్తామంటూ గులాబీ దళపతి ఆఫరిచ్చారు. వదిన భువనేశ్వరి వ్యాపారాలు... సక్రమంగానే చూసుకుంటున్నారని, కావాలంటే 15 రోజులకు ఓసారి... హైదరాబాద్‌కు వచ్చి లెక్కలు చూసుకుని పోవాలని కేసీఆర్ బాబుకు సూచించారు. భువనేశ్వరి కూడా ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి గ్యారంటీగా తమకే ఓటు వేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు సతీమణి 
ఇక తెలంగాణ సీఎం వ్యాఖ్యలను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఖండించారు. తన ఓటు ఎప్పటికీ టీడీపీకేనన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో అబద్ధమాడారని... అమ్మ చెప్పినట్లు లోకేశ్ ట్వీట్ చేశారు. ఓటర్లను గందరగోళానికి గురిచేసేందుకు, తన పేరును వాడుకోవద్దంటూ టీఆర్ఎస్ శ్రేణులకు భువనేశ్వరీ సూచించారు. తాను టీఆర్ఎస్‌కు ఓటేస్తున్నానంటూ... కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని, అలా చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికే బల్దియాలో ఇద్దరు చంద్రులు మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు. గ్రేటర్‌ ప్రచారంలో ఒక అడుగు ముందుకేసిన కేసీఆర్... ఏకంగా బాబు ఫ్యామిలీలోనే తమకు ఓటంటూ వ్యాఖ్యలు చేశారు. మరి చంద్రన్న ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.  

నేటితో ముగియనున్న ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ ల దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్ : నేటితో ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ ల దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది. మొత్తం 53 వేల దరఖాస్తులు వచ్చాయి. 

Don't Miss