Activities calendar

02 February 2016

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కృష్ణా : జిల్లాలోని కొండపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇబ్రహీంపట్నానికి చెందిన షేక్ ఇమాం షా స్థానికంగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అతడు మంగళవారం సాయంత్రం తన బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇమాంషా అక్కడికక్కడే  మృతిచెందాడు.

20:42 - February 2, 2016

తెరాస ఎమెల్యే, ధూమ్ ధామ్ కళాకారుడు రసమయి బాలకిషన్ పాటల  విడుదల కార్యక్రమం లో మనసు పారేసుకున్నాడు. దీనితోపాటు ఆ సంగతేంటో వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది. ఒడిసిపోయిన జీహెచ్ ఎంసీ ఓట్ల పంచాయతీ, డీకే.అరుణ దంపతులు.. యజ్ఞయాగాలు, బీపీ పెంచబొతున్న బియ్యం ధరలు.. పెరుగనున్న బియ్యం ధరలు, బోరు బావిలో పడిన బాలిక, మనుండంగనే భార్య సమాధి పక్కన ఘోరికట్టుకున్న వ్యక్తి, కోతుల హచ్ చల్, 65 ఏళ్ల పిల్లి అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం..

20:35 - February 2, 2016

విశాఖ : నగరంలో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఫ్లీట్‌ రివ్యూలో 54 దేశాల యుద్ధ నౌకలతో పాటు.. దేశీయ మెరైన్‌ నౌకలు, కోస్ట్‌గార్డ్‌ నౌకలు పాల్గోనున్నాయి. ఫ్లీట్‌ రివ్యూ రిహార్సల్స్‌ను తూర్పు నౌకాదశ ప్రధాన అధిపతి సతీష్‌సోని సమీక్షించారు. 

20:29 - February 2, 2016

నెల్లూరు : ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేస్తున్నా.. మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. పొదుపు సంఘంలో ఉండాలంటే తాను చెప్పినట్లు వినాలంటూ.. నెల్లూరులో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్‌ భాస్కర్‌. గత కొన్ని రోజులుగా ఆమెను వేధించడంతో సహనం నశించిన మహిళ.. భాస్కర్‌కు తనదైన రీతిలో బుద్ది చెప్పింది. తనను వేధిస్తున్న భాస్కర్‌పై మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

20:15 - February 2, 2016

అనంతపురం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎన్డీయే ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విమర్శించారు. ఈ పథకాన్ని నీరు కార్చేందుకు ప్రధాని మోదీ సర్కార్‌ చేయని ప్రయత్నంలేదని ఆయన అన్నారు. అనంపురం జిల్లా బండ్లపల్లిలో జరిగిన ఉపాధి హామీ కూలీల భరోసా సభలో సభలో మన్మోహన్‌ పాల్గొన్నారు. ఈ పథకం కింద రాష్ట్రాలకు కేంద్రం ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని మన్మోహన్‌ చెబుతున్నారు. 

20:12 - February 2, 2016

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీపై దాడి చేసిన ఎంఐఎం కార్యకర్తలను అరెస్టు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పాతబస్తీ ఘటనపై సీఎం, హోంమంత్రి స్పందించాలన్నారు. ఈ ఘటనపై కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. టీఆర్ ఎస్, ఎంఐఎం కుట్రలో భాగమే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. పాతబస్తీలో భయభ్రాంతుల మధ్య ఎన్నికలు జరిగినట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు. టీఆర్ ఎస్, ఎంఐఎంలు రిగ్గింగ్ చేసుకోవాలని కుట్రపన్నారని ఆరోపించారు. డిజిపి, కమిషనర్ జోక్యం చేసుకుని
అవాంచనీయ ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అనంతరం భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యం జరిగిన దాడిగా అభివర్ణించారు. 

19:35 - February 2, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గెలుపు తమదేనని మంత్రి కేటీఆర్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ఏడు ఎగ్జిట్ పోల్ సంస్థలు.. టీఆర్ ఎస్ పెద్ద మెజారిటీతో గెలుస్తుందని చెప్పాయన్నారు. తమ గెలుపు అధికారికంగా ఖరారు అయిందని చెప్పారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా…ఎన్నికలను ప్రశంతంగా నిర్వహించామని తెలిపారు. ఎంఐఎ- కాంగ్రెస్, ఎంఐఎం-టిడిపి మధ్య జరిగిన ఘర్షణలు దురదృష్టకరమన్నారు. మీర్ చౌక్ ఘటనపై మాట్లాడారు. బాధ్యులపై పోలీసు యంత్రాంగం చట్టం ప్రకారం ఏం చేయాల్లో అది చేస్తుందన్నారు. అయితే కొన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని వస్తున్న డిమాండ్లపై ఆయన స్పందించారు. రీపోలింగ్ అవసరం లేదనుకుంటున్నట్లు తెలిపారు. ఇవాళ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినా… ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. హాలిడేను జాలీడే గా మార్చి ఇళ్లళ్లో ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉండడం సరికాదన్నారు. గతంలో 42.09 శాతం పోలింగ్ నమోదు అయిందని… ప్రస్తుతం.. 54 శాతం పోలింగ్ నమోదు అవుతుందని భావిస్తున్నట్లు వివరించారు.

 

గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతం : జనార్ధన్ రెడ్డి

హైదరాబాద్ : స్వస్ప ఘటనలు మినహా జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్ధన్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ 45 శాతం నమోదు అయిందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ వివరాలను ఆయన మీడియాకు వివరించారు. సౌత్ జోన్ లో అధికంగా పోలింగ్ శాతం నమోదు అయిందన్నారు. ఎనిమిది ప్రాంతాల్లోని ఈవీఎంలలో సమస్యలొచ్చాయని.. వాటిని సరిచేశామని తెలిపారు. 

19:24 - February 2, 2016

హైదరాబాద్ : స్వస్ప ఘటనలు మినహా జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్ధన్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ 45 శాతం నమోదు అయిందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ వివరాలను ఆయన మీడియాకు వివరించారు. సౌత్ జోన్ లో అధికంగా పోలింగ్ శాతం నమోదు అయిందన్నారు. ఎనిమిది ప్రాంతాల్లోని ఈవీఎంలలో సమస్యలొచ్చాయని.. వాటిని సరిచేశామని తెలిపారు. 2009లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 32.09 శాతం పోలింగ్ నమోదు అయిందని.. ఇప్పుడు 45 శాతం పోలింగ్ నమోదు తెలిపారు. ప్రస్తుతం నాలుగు టెండర్లు… ఓట్లు పడ్డాయని చెప్పారు. నేరెడ్ మెట్, రహ్మత్ నగర్, వీవీనగర్, కేబీహెచ్ కాలనీలలో టెండరు ఓట్లు నమోదు అయ్యాయని తెలిపారు. గతంలో 300 టెండర్లు వేశారని పేర్కొన్నారు. 2,800 పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్ కాస్టింగ్ విజయవంతమైందన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి అంతరాయం కలగలేదని చెప్పారు. 4 వార్డులో ఈవీఎంలు మొరాయించాయని పేర్కొన్నారు. పాతబస్తీలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని తెలిపారు. హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్ జరగలేదన్నారు. బ్రెయిలీ లిపితో కూడుకున్న బ్యాలెట్ ను ఏర్పాటు చేశామని వివరించారు. ప్రిసైడింగ్ అధికారి నివేదిక ఇచ్చిన తర్వాత పరిశీలించి రీపోలింగ్ పై ఆలోచిస్తామని చెప్పారు.

 

మీర్ చౌక్ ఘటనపై టీకాంగ్రెస్ అందోళన..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మీర్ చౌక్ ఘటనపై టీకాంగ్రెస్ అందోళన చేపట్టింది. డీజీపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో డీజీపీ ఆఫీస్ ముందు నేతలు బైఠాయించారు. పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

 

 

ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్ ఎన్నికలు : జనార్ధన్ రెడ్డి

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 2800 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఎన్నికల్లో నాలుగు టెండర్లు ఓట్లు నమోదు అయ్యాయని చెప్పారు.

 

18:12 - February 2, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపిన కాపు పోరాటంపై ప్రభుత్వం పలు చర్యలకు ఉపక్రమించింది. ఆదివారం జరిగిన కాపు గర్జనలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు పలు సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం కాపు మంత్రులు..ఇతర అధికారులతో బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాపు నేతలు పలు డిమాండ్లు వ్యక్త పరిచినట్లు సమాచారం. కాపు కమిషన్ కు 9 నెలలు గడువు విధించకుండా కేవలం 3 నెలల్లోనే నివేదిక వచ్చే విధంగా చూడాలని సూచించారు. అలాగే కాపు సంఘానికి ఇచ్చిన నిధులు కేవలం వంద కోట్లు ఏ మూలకు సరిపోవని, వేయి కోట్ల నిధులు కేటాయించాలని సూచించారు. అలాగే కమిషన్ లో మహిళా ప్రాతినిధ్యం ఇస్తే బాగుంటుందని సూచించారు. వెనుకబడిన వర్గాలను వారిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తుని ఘటనపై అన్యాయంగా..అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అలాగే కాపు నేతలను వేధించకూడదని వారు సూచించారు. దీనిపై బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

 

17:53 - February 2, 2016

హైదరాబాద్ : డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కుమారుడిపై ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అజంపురాలోని మహమూద్ అలీ ఇంటిపై ఎమ్మెల్యే బలాలా, అతని అనుచరులు దాడి చేసి.. డిప్యూటీ సీఎం కుమారునిపై దాడికి చేశారు. ఈ ఘటనలో ఆజాంకు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికనేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు వల్లే… ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఆజాంపై బలాలా దాడి చేశారని.. టీఆర్ ఎస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఎమ్మెల్యే బలాలాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

17:37 - February 2, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చెదురుముదురు ఘటనలు మినహా.. ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే గతం కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. స్లమ్స్ లో అధికంగా, కాలనీల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 

17:15 - February 2, 2016

అనంతపురం : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విధానాలపై ధ్వజమెత్తారు. జిల్లాలోని బండ్లపల్లిలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ భరోసా సభ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న రాహుల్ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై పలు విమర్శలు చేశారు. తమ హాయాంలో ఈ పథకానికి తీసుకున్న చర్యలు..రైతులు కోసం తీసుకున్న వాటిని సభకు వివరించారు.

జైట్లీ ప్రశంసించారు...
కొద్ది రోజుల కిందట కుమార్తె వివాహా ఆహ్వాన పత్రం ఇవ్వడానికి కేంద్ర మంత్రి జైట్లీ తన నివాసానికి రావడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకంపై జైట్లీ ఎంతో ప్రశంసించారని తెలిపారు. నాలుగు గోడల మధ్య ఎందుకు చెబుతారు ? బాహ్య ప్రపంచం వద్ద తెలియచేయాలని తాను సూచించడం జరిగిందన్నారు. ఈ పథకం గురించి అందరికీ అర్థమైనా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రస్తుతం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించడం లేదన్నారు. 15 లక్షలు వేస్తామని గతంలో మోడీ చెప్పారని, కేవలం బ్యాంకు అకౌంట్లతో ఏమీ జరగదని ఎద్దేవా చేశారు. 15 లక్షలు వేయలేకపోతే గ్రామీణ ఉపాధి హామీ పథకం డబ్బులు వేయాలని సూచించారు.

దేశంలో కరవు..
జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేస్తానని, అనేక దరిద్రమైన కార్యక్రమాల్లో ఒకటిని మోడీ హాస్యాస్పదంగా పేర్కొంటుంటారని తెలిపారు. జాతీయ ఉపాధి పథకం నిధుల్లో కోత విధిస్తున్నారని, దేశం అభివృద్ధి దిశలో నడవాలని మోడీ అంటుంటారని గుర్తు చేశారు. దేశంలో ప్రస్తుతం కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వ లెక్కల ప్రకారం నాలుగు లక్షల గ్రామాల్లో కరవు ఏర్పడిందన్నారు. దీనితో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, తమ హాయాంలో 72వేల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. కూలీలకు, చిన్న, సన్న కారు రైతులకు ఉపాధి హామీ పథకం వర్తించడం జరిగిందన్నారు.

పథకం డబ్బులు నింపింది..
పది సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్, సోనియాలు ఇక్కడకు వచ్చి ఉపాధి హామీ పథకం ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. ఒక పనిని తలపెట్టి ముందుకు వెళ్లే ముందు ఒక ఆలోచన మాత్రం జరగాలని, పేదోడికి పని ఉపయోగ పడుతుందా ? లేదా ? అనేది ఆలోచించాలని ఆనాడు గాంధీ చెప్పారని పేర్కొన్నారు. ఈ ధోరణిలో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. అంతేగాకుండా రైతు..రైతు కూలీలు ప్రధాన పాత్ర పోషిస్తుంటారని, దీనిని బలపర్చడానికే తాము ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పేదరికానికి కులం..మతం..ప్రాంతం..ఆడ..మగ అనే తేడా ఉండదని, పేదల మద్దతు కోసం ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ పథకం దాదాపు ఒకటిన్నర కోట్ల మందికి ప్రయోజనం కలిగిచిందని, దేశ జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి ఈ ఫలం దక్కిందన్నారు. చాలాకాలం తరువాత మొట్టమొదటిసారి కోట్లాది మంది పేదల జేబుల్లో డబ్బులు నింపిందన్నారు. ఎంతో గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో పని చేస్తామని పేదలు ముందుకొచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడకు వచ్చిన తాను సర్పంచ్ లు..ఉపాధి హామీ పథకం వర్కర్లతో తాను మాట్లాడడం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకం పనిలో తన తల్లిదండ్రులు
పనిచేయడం వల్ల తాను నగరంలో పనిచేయడం జరుగుతోందని ఓ వ్యక్తి పేర్కొనడం జరిగిందన్నారు. 

ఎంతో మంది మెచ్చుకున్నారు..
దేశంలో ఇంత ఆర్థిక వృద్ధి రేటు పెరగడటానికి ముఖ్య కారణం ఉపాధి హామీ పథకం అని ఆర్థిక నిపుణులు పేర్కొనడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఆర్థిక వృద్ధి రేటు మెరుగుపడితే దేశ ఆర్థిక వృద్ధి పెరుగుతుందన్నారు. విదేశాల నుండి వచ్చిన వారు ఈ పథకాన్ని చాలా మెచ్చుకున్నారని, తమ దేశంలో కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేస్తామని వారు పేర్కొనడం జరిగిందన్నారు. పథకం వల్ల అనేక మంది ప్రజలకు ఎంతో మేలు కలిగిందని, దేశ ఆర్థిక ప్రగతికి దోహదం కలిగిందని ఐక్య రాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు ఆర్థిక నిపుణులు పేర్కొన్నారని తెలిపారు.

ఆధికారంలోకి వస్తే ఆరోగ్య హక్కు..
కాంగ్రెస్ హాయంలో సర్పంచ్ అన్ని నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉండేదని, కానీ ప్రస్తుతం టిడిపి ప్రభుత్వ హాయాంలో పార్టీ వర్కర్ చేత పనులు చేస్తున్నారని తెలిపారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైద్యానికి చికిత్స కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని, పిల్లలకు మంచి విద్యనభ్యసించలేని పరిస్థితి ఉందన్నారు. విద్య, వైద్యం కీలకమైన రంగాల్లో ప్రభుత్వ బాధ్యత ఉందని కానీ ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం జరగుతోందన్నారు. అధికారంలో వస్తే ఆరోగ్య హక్కు ఇస్తామని రాహుల్ ప్రకటించారు. 

ముగిసిన జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి అవకాశం కల్పించనున్నారు. 

దోమలగూడలో పోలింగ్ సిబ్బంది ఆందోళన

హైదరాబాద్ : దోమలగూడలో పోలింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఎవి కాలేజీలో పోలింగ్ బూత్ లో భోజనం ఏర్పాట్లు చేయలేదని ఎన్నికల అధికారిపై పోలింగ్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు పోలింగ్ సిబ్బంది కాలేజీ గేటు ముందు బైఠాయించి ఆందోలన చేపట్టారు. రిటర్నింగ్ అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

 

16:56 - February 2, 2016

అనంతపురం : ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నదని కాంగ్రెస్‌ ఎంపీ ఆనంద్‌ శర్మ విమర్శించారు. అంతపురం జిల్లా బండ్లపల్లిలో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సభలో ప్రసంగించారు. యూపీఏ హయాంలో ప్రారంభించిన ఈ పథకానికి మోడీ సర్కార్‌ నిధుల కోత పెట్టిందన్నారు. దీంతో కూలీల ఉపాధికి భరోసా లేకుండా పోయిందని అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ఆనంద్‌ శర్మ విమర్శించారు. 

16:52 - February 2, 2016

హైదరాబాద్ : బాలీవుడ్ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు నగరంలో ఓటు ఉందా ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఆయనకు కూడా ఓటు హక్కు ఉందంట. పాతబస్తీలోని గౌలిపురా డివిజన్‌లోని లిస్టులో సల్మాన్ ఫోటోతో ఓటర్ స్లిప్ కనిపించింది. సల్మాన్ కు 64 ఏళ్లు ఉన్నట్టుగా వివరాలు నమోదు చేశారు. అయితే ఈ విషయంపై ఎన్నికల అధికారులు ఇంకా స్పందించలేదు. దీనిపై పోలింగ్ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

మీర్ చౌక్ పీఎస్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ : మీర్ చౌక్ పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మీర్ చౌక్ పీఎస్ వద్దకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అనుచరులతో కలసి వెళ్లారు. కాంగ్రెస్ పీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ అక్కడే ఉన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం నేతలు నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో షబ్బీర్ అలీకి గాయాలయ్యాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కారును ధ్వంసం చేశారు.

 

16:46 - February 2, 2016

 

హైదరాబాద్ : ఎన్నికల ప్రక్రియ మరికొద్ది గంటల్లో ముగుస్తుందనగా పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్, సీనియర్ నేత షబ్బీర్ ఆలీలు ఆందోళనకు దిగారు. దీనితో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ పాషా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఎమ్మెల్యే ఖాద్రీని చార్మినార్ పీఎస్ కు, పాషాను పురానాపూల్ పీఎస్ కు తరలించారు. విషయం తెలుసుకున్న టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టి.కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీలు పురానాపూల్ పీఎస్ కు చేరుకున్నారు. అభ్యర్థిని వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తనను అన్యాయంగా నిర్భందించారని గౌస్ పాషా పేర్కొన్నట్లు సమాచారం. తనపై ఎమ్మెల్యే పాషా ఖాద్రీ దాడి చేస్తే తనను నిర్భందించడం ఏంటనీ ? అభ్యర్థి నిలదీసినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ఈ వార్త దావానంలో వ్యాపించడంతో ఎంఐఎం కార్యకర్తలు కూడా పురానాపూల్ పీఎస్ వద్దకు చేరుకున్నారు. అక్కడనే ఉన్న ఉత్తమ్ కారును ధ్వంసం చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో షబ్బీర్ ఆలీకి గాయాలైనట్లు సమాచారం. 

జాంబాగ్ డివిజన్ దారుసలేంలో స్వల్ప లాఠీచార్జీ

హైదరాబాద్ : జాంబాగ్ డివిజన్ లోని దారుసలేంలో స్వల్ప లాఠీచార్జీ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు.. ఎంఐఎం కార్యకర్తలను అడ్డుకున్నారు. కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారిపై స్వల్ప లాఠీచార్జీ చేశారు. అనంతరం అక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎంఐఎం కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.  

ఉప్పుగూడ లో 44వ పోలింగ్ బూత్ వద్ద స్వల్ప ఉద్రిక్తత

హైదరాబాద్ : ఉప్పుగూడ డివిజన్ 44వ పోలింగ్ బూత్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, ఎంఐఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. 

ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలి : రాహుల్

అనంతపురం : రాష్ట్ర విభజన సమయంలో ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిందని.. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికైనా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా బండపల్లిలో ఏర్పాటు బహిరంగసభలో రాహుల్ ప్రసంగిస్తున్నారు. జాతీయ ఉపాధీ దేశంలోనే గొప్ప పథకమన్నారు.

 

సా. 4 గం.వరకు 42.56 శాతం పోలింగ్

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు వరకు 42.56 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగనుంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

ఎమ్మెల్యే పాషాఖాద్రి, గౌస్ లు అరెస్టు

హైదరాబాద్ : హుస్సేనీ ఆలం పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పాషాఖాద్రి, మాజీ కార్పొరేటర్ గౌస్ మధ్య వివాదం నెలకొంది. ఎమ్మెల్యే పాషాఖాద్రి, గౌస్ లను పోలీసులు అరెస్టు చేశారు. ఇరువురిపై కేసులు నమోదు చేశారు.

 

16:08 - February 2, 2016

మహిళలను దేవాయాలు, దర్గాల్లోకి అనుమతించకపోవడం వివక్షే అవుతుందని వక్తలు పేర్కొన్నారు. మానవి వేదిక చర్చా కార్యక్రమంలో అంకురం వ్యవస్థాపకురాలు సుమిత్ర, ప్రిన్సిపల్ లక్ష్మీదేవి పాల్గొని, మాట్లాడారు. మహిళలపై వివక్ష చూపడం సరికాదన్నారు. మహిళలను దేవాలయాల్లోకి అనుమతించకపోవడం హక్కుల ఉల్లంఘనే అవుతుందని చెప్పారు. స్త్రీ, పురుషులు సమానం అనే భావన పై సమాజంలో విస్తృత ప్రచారం జరగాలన్నారు. మహిళలను అంటరాని వారిగా చూడటాన్ని వివక్షకాగే భావించాలని తెలిపారు. ప్రకృతి ధర్మాన్ని శాస్త్రీయదృక్పథంతో అర్థం చేసుకోవాలన్నారు. దేవాయాలలో ప్రవేశానికి ఇదే నియమం వర్తిస్తుందని గుర్తించాలి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

15:36 - February 2, 2016

హైదరాబాద్ : సమస్యలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత బోత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తుని ఘటనపై టిడిపి, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. తుని ఘటనకు కారణం వైసీపీనేనని టిడిపి ఆరోపిస్తుండగా..సంఘ విద్రోహ శక్తులు ఈ విధ్వంసానికి పూనుకున్నాయని వైసీపీ విమర్శిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం బోత్స మీడియాతో మాట్లాడారు. తాము చేసిన తప్పులను ఇతరులపైకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాపు రిజర్వేషన్ల కోసం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు టిడిపి నేతలు పరామర్శించకపోవడం దారుణమన్నారు. సమస్యలను పరిష్కరించకుండా పక్కదారి పట్టిస్తున్నారంటూ బోత్స అసహనం వ్యక్తం చేశారు. 

మలేషియాలో తెలుగు నిరుద్యోగులకు టోకరా..

కౌలాలంపూర్ : మలేషియాలో తెలుగు నిరుద్యోగులకు ఓ సంస్థ మోసం చేసింది. ఉద్యోగాల పేరుతో ఐఎస్ బీఎస్ రూ.10 లక్షలు వసూలు చేసింది. దీంతో 30 మంది నిరుద్యోగులు మలేషియాలో చిక్కుకున్నారు. నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. యజమాని పారారీలో ఉన్నాడు.

 

15:29 - February 2, 2016

హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాలను ఈ నెల 29 నుంచి నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. గతానికి భిన్నంగా ముందస్తు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట్లో భావించింది. అయితే పరిస్థితులు అనుకూలించలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు, నారాయణ ఖేడ్ ఉప ఎన్నికలు, సమక్క సారక్క జాతర నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది.

మార్చి 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఈటెల

గవర్నర్ ప్రసంగంతో పాటు ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని మార్చి 5న ఆర్ధిక మంత్రి ఈటెల బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు ముమ్మరం చేసారు.

టీ. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మూడో బడ్జెట్

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మూడో బడ్జెట్ అయినప్పటికి ఇది చాల కీలకంగా మారింది. మొదటి బడ్జెట్ కేవలం నాలుగు నెలలకే పరిమితం కావడం..రెండో బడ్జెట్ సమయానికి ప్రభుత్వ ఆదాయం అంచనా రాకపోవడంతో....బడ్జెట్ ఆచరణ అనుకున్నంత సాగలేదు. దీంతో ఈ బడ్జెట్ ను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ప్రాథమిక ముసాయిదాను సైతం సిద్ధం చేసింది.

భారీ బడ్జెట్ దిశగా ప్రభుత్వం అడుగులు

ఈ సారి కూడా భారీ బడ్జెట్ దిశలోనే తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గతంలో లక్షా పదిహేను వేల కోట్ల బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం...ఈ సారి కనీసం 15 శాతం పెంచి బడ్జెట్ ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. లక్షా 35 వేల కోట్ల మేర బడ్జెట్ ఉండేలా కసరత్తు జరుపుతుంది.

ప్రణాళికేతర వ్యయం తగ్గింపు

ప్రభుత్వ ఆదాయం పెరగడం... భూముల అమ్మకాలు, క్రమబద్దీకరణ వేగం పుంజుకోవడంతో భారీ బడ్జెట్ కే సై అంటుంది. అదే సమయంలో ప్రణాళికేతర వ్యయాన్ని సైతం తగ్గించుకునేలా జాగ్రత్త పడుతుంది. ప్రణాళిక బడ్జెట్ కనీసం 60 వేల కోట్లు ఉండేటా జాగ్రత్తలు తీసుకుంటుంది. మిషన్ కాకతీయకు 25 వేల కోట్లను కేటాయించనుంది. ఈ సారి జిల్లాల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు.

మూడోవారం లోపు ముసాయిదా సిద్ధం..

ఉచిత విద్య, డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు, వాటర్ గ్రిడ్ వంటి కార్యక్రమాలను ఎంత మేర కేటాయింపులు జరపాలని కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా శాఖల వారీగా సమావేశాలు సాగిస్తోంది ఆర్థిక శాఖ. మొత్తంగా మూడోవారం లోపు ముసాయిదా సిద్ధం చేసి సీఎంకు అందచేయనున్నారు.

 

 

15:29 - February 2, 2016

అనంతపురం : ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు చట్ట విరుద్ధమని కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ పేర్కొన్నారు. జిల్లాలోని బండ్లపల్లిలో నిర్వహించిన ఉపాధి హామీ సభలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై ఏపీ పీసీసీ కోర్టుకు వెళుతుందని, అన్ని విషయాల్లో జన్మభూమి కమిటీలకే ప్రాధాన్యతనిస్తున్నారని, ఎన్నికైన పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధులను పక్కన పెట్టారని విమర్శించారు. 

15:25 - February 2, 2016

అనంతపురం : జిల్లాలోని బండ్లపల్లిలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ భరోసా సభ నిర్వహించింది. ఈసభకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, అంబికా సోని, మీరా కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. 2006లో మొదటిసారిగా ఈ గ్రామం నుండి పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత టెన్ టివితో మాట్లాడారు. 2006-2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఈ చట్టం తీసుకొచ్చి అమలు చేసిందని పేర్కొన్నారు. దీనివల్ల వలసలు ఆగాయని, 2006-14 నుండి ప్రతి సంవత్సరం రూ. 44 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిందన్నారు. 14-16 సంవత్సరం తరువాత ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్ రూ. 35వేల కోట్లు చేసిందని, అంచెలంచెలుగా ఈ పథకాన్ని తీసివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 2006 సంవత్సరం ఫిబ్రవరి రెండో తేదీన మొదలు పెట్టారని, అలాంటి గ్రామానికి రాహుల్ రావడం ఆనందదాయకమని సభకు వచ్చిన ఓ మహిళ పేర్కొంది. 

మ. 3 గం. వరకు 38.25 శాతం పోలింగ్

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 38.25 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ కొనసాగుతుంది. 

15:21 - February 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఇష్టమొచ్చిన వారికి ఓటు వేయాలని, కానీ ఓటు హక్కు మాత్రం వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు పేర్కొన్నారు. ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడానికి సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని ఇస్లామియా ఉర్దూ స్కూల్ కు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు టెన్ టివితో మాట్లాడారు. ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి నగరంలో 30 శాతం పోలింగ్ నమోదైందని, సాయంత్రం వరకు 60 శాతం పోలింగ్ జరుగుతుందని అనుకున్నట్లు తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని..ఓటు నమోదు చేసుకోవాలని ఎన్నో పర్యాయాలు ప్రచారం నిర్వహంచడం జరిగిందన్నారు. మేయర్ పార్టీని కైవసం చేసుకుంటామని మంత్రి పద్మారావు పేర్కొన్నారు. 

అనంతకు చేరుకున్న మన్మోహన్ సింగ్..

అనంతపురం : జిల్లాలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ భరోసా సభకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. 

15:17 - February 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్ లో పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్న టీఆర్ ఎస్ కార్యకర్తలను టీడీపీ నేతలు అడ్డుకున్నారని..దాంతో తమ నేతలపై టీఆర్ ఎస్ కార్యకర్తలు దాడులకు సైతం పాల్పడ్డారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ఆరోపించారు. తమ నేతలపై దాడులు చేయడం దారుణమన్నారు. నగర ప్రజలను మోసపూరిత ప్రకటనలు జారీ చేశారని.. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీ, బీజేపీ కూటమే విజయం సాధిస్తుందన్నారు. ప్రజలు నోట్లకు ఓట్లు అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు.

 

15:09 - February 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలో ఉదయం నుండి ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్న సమయంలో వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, మాజీ కార్పొరేటర్ గౌస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వీరిద్దరినీ అరెస్టు చేసి చార్మినార్ పీఎస్ కు తరలించినట్లు తెలుస్తోంది. వివాదం చల్లబర్చేందుకు..వీరిద్దరి మధ్య సఖ్యత కుదుర్చేందుకు డీసీపీ సత్యనారాయణ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మాజీ కార్పొరేటర్ గా ఉన్న గౌస్ ఇటీవలే ఎంఐఎంకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో గౌస్ కుటుంబం మూడు డివిజన్ లో అభ్యర్థులుగా నిలుచున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో తాను ద్విచక్రవాహనంపై వెళుతున్న తనపై ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, అనచరులు దాడి చేశారని గౌస్ పాషా ఆరోపించారు. వీరిమధ్య వివాదం చెలరేగడంతో ఇద్దరినీ చార్మినార్ పీఎస్ కు తరలించి వీరితో డీసీపీ చర్చలు జరుపుతున్నారు. అనంతరం వీరిద్దరినీ విడిచిపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 

15:07 - February 2, 2016

హైదరాబాద్ : కమ్మ, కాపు వర్గాల వారు అన్యోన్యంగా కలిసి ఉంటున్నారని వరసలతో ఆనందంగా జీవిస్తున్నారని వారి మధ్య చిచ్చుపెట్టొద్దన్నారు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. వైఎస్ జగన్ పార్టీపై దుమ్మెత్తిపోసే ముందు తన గురించి కూడా ఆలోచించుకోవాలన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనడం సరైంది కాదని.. కాపులకు సరైన న్యాయం చేయాలనే ప్రభుత్వం ప్రయత్నస్తోందని ఆయన అన్నారు. పద్మనాభం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ .. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపులను బీసీల్లో ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు. కమ్మ, కాపు వర్గాల చిచ్చుపెట్టింది రాజశేఖర్ రెడ్డి అని విమర్శించారు.

 

15:02 - February 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్‌ పాతబస్తీలోని పోలింగ్ బూత్‌లలో డీసీపీ సత్యనారాయణ విస్తృతంగా పర్యటిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి సుమారు 150మంది అనుమానితులను, రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నామని దక్షినమండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 5వేల మంది కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.

 

కొండపల్లిలో బీసీ వసతి గృహం విద్యార్థుల అదృశ్యం..

కృష్ణా : కొండపల్లిలోని బీసీ వసతి గృహం నుండి ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. పీఎస్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

14:58 - February 2, 2016

హైదరాబాద్ : సైబరాబాద్‌ పరిధిలోని 64 వార్డుల్లో జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొసాగుతోందని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. సైబరాబాద్‌ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 20శాతం పోలింగ్‌ నమోదు అయిందని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్‌ పరిధిలో 16వేల మంది పోలీసులతో బందోబస్త్‌ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఓటు హక్కు చాలా విలువైందని..దాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. 

అలిగి వెళ్లిపోయిన కోట్ల...

అనంతపురం : బండ్లపల్లిలో కాంగ్రెస్ బహిరంగసభ నిర్వహించింది. వేదికపైకి తనను ఆహ్వానించలేదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అలిగి వెళ్లిపోయారు. రఘువీరా డౌన్ డౌన్ అంటూ కోట్ల అనుచరులు నినాదాలు చేశారు.

 

గ్రేటర్ ఎన్నికలు..2గంటలక వరకు 32.18 శాతం..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి మధ్యాహ్నం రెండు గంటల వరకు 32.18 శాతం పోలింగ్ నమోదైంది.

 

మధ్యాహ్నం 2 గం. వరకు 32.18 శాతం పోలింగ్

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 32.18 శాతం పోలింగ్ నమోదు అయింది. సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ కొనసాగుతుంది. 

బండ్లపల్లికి చేరుకున్న రాహుల్..

అనంతపురం : బండ్లపల్లికి ఏఐసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఉపాధి హామీకి పదేళ్ల అవుతున్న సందర్భంగా రాహుల్ ఈ పర్యటన చేస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి కూలీలతో రాహుల్ మాట్లాడుతున్నారు. 

13:41 - February 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సమస్యత్మాక ప్రాంతంగా పేరొందిన పాతబస్తీలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. పాతబస్తీలో ఉదయం ప్రాంరభమైన పోలింగ్ మధ్యాహ్నం ఊపందుకుంది. ఉదయం పలు కేంద్రాల్లో మందకొడిగా సాగింది. ఘాన్సీ బజార్ లో మధ్యాహ్నం పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 25-30 శాతం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో 30 శాతం వరకు పోలింగ్ జరుగుతోంది. మరో వైపు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. 

13:37 - February 2, 2016

హైదరాబాద్ : తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని బస్తీ వాసులు భీష్మించుకొని కూర్చొవడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. హస్తినాపురం రోషన్ దౌలా బస్తీ వాసులు ఓటు హక్కును వినియోగించుకోమని ఖరాఖండిగా చెప్పారు. దీనితో డివిజన్ లో పోలింగ్ నిలిచిపోయింది. సుమారు రెండు వేల మంది ఓటర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టమైన హామీనిస్తేనే ఓటు వేస్తామని అధికారులకు తెల్చిచెప్పారు. సమాచారం అందుకున్న ఆర్డీఓ అక్కడకు చేరుకుని కాలనీ వాసులతో రెండు గంటల పాటు చర్చించారు. సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు రావడం లేదని..తాగునీటి సౌకర్యం లేక ఎప్పటి నుండో అవస్థలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు. చివరకు ఆర్డీఓ స్పష్టమైన హామీనిచ్చిన అనంతరం కాలనీ వాసులు ఓటు వేసేందుకు అంగీకరించారు.

13:28 - February 2, 2016

శ్రీకాకుళం : అప్పట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం..విపక్షాలు ఒక్కటై భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను నిట్టనిలువునా చీల్చారని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని టౌన్ హాల్ లోని యువభేరీలో జగన్ పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. 70 శాతం పరిశ్రమలు హైదరాబాద్ లోనే ఉన్నాయని, ఉద్యోగం కోసం పోవాలంటే నగరానికి వెళ్లాల్సి వస్తోందన్నారు. ఆనాడు పార్లమెంట్ లో అధికారపక్షం..ప్రతిపక్షం ఒక్కటై అయిపోయి రాష్ట్రాన్ని విడిగొట్టారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాల పాటు ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి హామీనిచ్చారని గుర్తు చేశారు. ఐదేండ్లు సరిపోదు..పదేండ్లు ఇవ్వాలని ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆనాడు కోరడం జరిగిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలప్పుడు ఎన్నో మాటలు చెప్పారని, ప్రస్తుతం అడిగితే మాకు తెలియదు..అంటూ ఇతర మాటలు చెబుతున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. విశ్వసనీయత లేదని వీరి తీరును బట్టి తెలుస్తోందని జగన్ విమర్శించారు. 

13:20 - February 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సరళి బాగానే జరుగుతోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్ వివరాలను ఆయన టెన్ టివికి తెలిపారు. ప్రతి రెండు గంటలకొకసారి ఓటింగ్ సరళిని తెలుసుకుంటున్నట్లు ప్రస్తుతం దాదాపు 25 శాతం పోలింగ్ నమోదైందన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో 30-35 శాతం నమోదైనట్లు తెలుస్తోందన్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోందని, ఎదైనా సమస్యలు ఉత్పన్నమౌవుతే లైవ్ ద్వారా వీక్షించి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 ఈవీఎంలలో టెక్నికల్ సమస్యలు ఏర్పడడం జరిగాయని, అనంతరం ఈసీఎల్ సిబ్బందితో సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. ఎక్కువ శాతం యువకులు ఓటింగ్ లో పాల్గొనడం లేదని తెలుస్తోందని, కానీ ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యువకులు పాల్గొంటున్నట్లు సమచారం వస్తోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. 

13:15 - February 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాప్రా పరిధిలో ఓటింగ్ సరళి మందకొడిగా సాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం తరువాత పుంజుకుంది. ది హన్స్ ఇండియా ఎడిటర్, రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఇందిరానగర్ కు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. నగరంలో ఇప్పటి వరకు 25-30 శాతం పోలింగ్ నమోదైందని సమాచారం వస్తోందని, ఇది చాలా తక్కువ అని పేర్కొన్నారు. పోలింగ్ 70-80 శాతం నమోదు కావాలని కోరుకోవాలని, పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్ లో పాల్గొనాలని సూచించారు. ఎవరికి ఓటు వేస్తారా మీ ఇష్టమని అది రాజ్యాగం ఇచ్చిన స్వేచ్చ అని తెలిపారు. రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న వారు తప్పకుండా ఓటు వేయాలని నాగేశ్వర్ సూచించారు. 

ప్రభుత్వం..విపక్షాలు ఒక్కటై రాష్ట్రాన్ని చీల్చారు - జగన్..

శ్రీకాకుళం : ఆనాడు అధికారం ఉన్న ప్రభుత్వం..విపక్షాలు ఒక్కటై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చారని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. యువభేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

నగర శుభ్రత కోసం రూ.7కోట్లతో స్పెషల్ డ్రైవ్ - జీవీఎంసీ..

విశాఖపట్టణం : ఐఎస్ఆర్ సందర్భంగా నగరాన్ని సుందరంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని, పోస్టర్లు, హోర్డింగ్ లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. నగర శుభ్రతపై రూ.7కోట్లతో 4 నుండి 8 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు, నగరంలో 292 కి.మీటర్ల రహదారులను శుభ్రం చేస్తామన్నారు. 

తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానం..

గుంటూరు : తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి రేపటి నుండి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఈనెల 15న టెండర్లు ఖరారు చేయడం జరుగుతుందని, టెండర్ల అనంతరమే నిర్మాణాలు చేపడుతామన్నారు. జూన్ 15 నాటికి ఉద్యోగులకు అందుబాటులో తెస్తామని, మొదటి ఫ్లోర్ లో 3,550 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

బండ్లపల్లికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు..

అనంతపురం : బండ్లపల్లికి దిగ్విజయ్ సింగ్, మాజీ స్పీకర్ మీరాకుమార్, అంబికా సోని కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఉపాధి హామీ పథకం మరో పనికి ఆహార పథకంలా మారిందని, తమది ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం కాదని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసమే తమ పోరాటమన్నారు.

ఓటు వేసిన సినీ ప్రముఖులు..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా కొందరు సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గచ్చిబౌలిలో కృష్ణ, విజయనిర్మల దంపతులు, జూబ్లిహిల్స్ లో జూ.ఎన్టీఆర్ దంపతులు, ఫిల్మ్ నగర్ లో మంచు మనోజ్, మంచు లక్ష్మిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

బోడగుట్టలో పోలింగ్ ను బహిష్కరించిన స్థానికులు..

హైదరాబాద్ : బాలాపూర్ డివిజన్ బోడగుట్టలో పోలింగ్ ను స్థానికులు బహిష్కరించారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అడ్డగుట్టలో ఓట్లు గల్లంతయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ముస్లిం స్కాలర్స్ తో రాజ్ నాథ్ భేటీ..

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింఘ్ ముస్లిం స్కాలర్స్ తో భేటీ అయ్యారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. 

12:40 - February 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు ఉద్యోగులకు 'పరీక్ష'గా మారింది. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని లేకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల హెచ్చరికలు..విధుల్లో పాల్గొనే వారికి తాము అన్ని ఏర్పాట్లు చేశాం..ఇదంతా పోలింగ్ ముందు మాటలు..కానీ ఈ మాటలన్నీ వట్టిమూటలేనని తేలిపోయింది. పలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కవాడీగూడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద అరకొర ఏర్పాట్లు చేయడంతో విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన రిజర్వ్ ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇక్కడకు వీరందరూ సోమవారం వచ్చారు. అప్పటి నుండి ఇక్కడే పడిగాపులు పడుతున్నారు. తమకు ఇక్కడ దగ్గరలో తాగునీటి వసతి ఏర్పాటు చేయలేదని, ఉదయం టిఫిన్..మధ్యాహ్నం నాసిరకంగా అందించారని ఓ ఉద్యోగి వ్యాపోయాడు. కనీసం సమాధానం చెప్పే వారు లేరని తెలిపారు. 150 మంది రిజర్వులో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాలని చెబుతున్నారని మహిళా ఉద్యోగి పేర్కొన్నారు. అధికారులు మాత్రం తాము అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పుకొస్తున్నారు.

సెంట్రల్ జోన్..
గ్రేటర్ పరిధిలోని సెంట్రల్ జోన్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అరకొర వసతులు ఏర్పాటు చేయడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వారు పలు ఇక్కట్లకు గురవుతున్నారు. వృద్దులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పోలింగ్ కేంద్రానికి బయటే ఆపుతుండడంతో వృద్ధ ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్నట్లు సమాచారం. సెంట్రల్ జోన్ పరిధిలో వికలాంగుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. 20 లక్షల మంది ఓటర్లున్న ఈ జోన్ లో 3300 బూత్ లు ఏర్పాటు చేశారు. 

గవర్నర్ తో బాలకృష్ణ భేటీ..

హైదరాబాద్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ ఉదయం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారో తెలియరాలేదు. లేపాక్షి ఉత్సవాల్లో పాల్గొనాలని గవర్నర్ ను ఆహ్వానించినట్లు బాలకృష్ణ తెలిపారు. 

12:26 - February 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచండి..ప్రతొక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి అంటూ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నా సంపన్నులు నివాసం ఉండే జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మంగళవారం గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సెలబ్రెటీలు కొంతమందే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధిక శాతం ఓటింగ్ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజీ లైఫ్ కారణంగా వీరు సాయంత్రం వరకు వీరు ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతోందని, సెలబ్రెటీలు చాలా మంది ఉంటున్నారని, అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓ సెలబ్రెటీ సూచించారు. 

12:15 - February 2, 2016

హైదరాబాద్ : మెహిదీపట్నంలో గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. 66వ డివిజన్ లో సీపీఎం గుర్తుకు బదులు సీపీఐ గుర్తు కేటాయించడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని సీపీఎం అభ్యర్థి అధికారులకు సూచించడంతో సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం 12గంటల వరకు 20 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ 3300 బూత్ లు ఏర్పాటు చేశారు. మొత్తం 20 లక్షల మంది ఓటర్లు తమ ఓటును హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ శాతం అధికమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

గ్రేటర్ ఎన్నికలు..16.5 శాతం పోలింగ్..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11గంటల వరకు 16.65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. 

రెపోరేటు యథాతథం - ఆర్బీఐ..

ముంబై : ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష వివరాలను ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు. మార్చి 2017 నాటికి ద్రవ్యోల్బణం ఐదు శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 

11:42 - February 2, 2016

హైదరాబాద్ : కాప్రా ఏరియా పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొలుత మందకొడిగా సాగింది. 8గంటల తరువాత ఓటర్లు మెల్లిగా కేంద్రాలకు రావడం మొదలు పెట్టారు. పది గంటల వరకు 18శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. గతంలో నమోదైన 57 శాతాన్ని ఈ ఎన్నికలు అధిగమిస్తాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మల్లాపూర్ లో 49 బూత్ లు ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ 47వేల ఓట్లు ఉన్నాయి. మల్లాపూర్ కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్పటికప్పుడు సౌకర్యాలు కల్పిస్తున్నారు. 

పోలింగ్ ప్రశాంతం - అనురాగ్ శర్మ..

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదని, పోలీసు శాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. 

హబ్సీగూడలో ఉద్రిక్తత..

హైదరాబాద్ : టిడిపి అభ్యర్థికి పోలీసులు సహకరిస్తున్నారని టిఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హబ్సిగూడ గిరిజన బస్తీ పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

హబ్సీగూడలో ఉద్రిక్తత..

హైదరాబాద్ : టిడిపి అభ్యర్థికి పోలీసులు సహకరిస్తున్నారని టిఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హబ్సిగూడ గిరిజన బస్తీ పోలింగ్ కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

11:29 - February 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పాతబస్తీలో మాత్రం 11 గంటల అవుతున్నా తక్కువగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రారంభమై సుమారు నాలుగు గంటలైనా పది శాతం కూడా దాటలేదు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతోంది. సౌత్ జోన్ డీసీపీ పోలింగ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎప్పటిలాగే పాతబస్తీలో పోలింగ్ ఆలస్యంగా మొదలవుతుందని, మధ్యాహ్నం సమయంలో క్యూలు కట్టే అవకాశం ఉందని పోలింగ్ అధికారులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ తో పోలిస్తే 60-80 శాతం పోలింగ్ అయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీలో లలితాబాగ్ లో మొత్తం 2600 ఓట్లు ఉండగా ప్రస్తుతం 290 మాత్రమే ఓట్లు పోలయ్యాయి. 

11:23 - February 2, 2016

హైదరాబాద్ : ఎన్నికల పోలింగ్..సిబ్బంది అందరూ హాజరు కావాలి. హాజరు కాకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం..ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం..ఇది అధికారులు చెప్పిన..చెబుతున్న మాటలు..కానీ పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు సదూర ప్రాంతాల నుండి వచ్చిన ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు కల్పించ లేదు. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్త చేశారు. కాచిగూడలోని పెద్ద భవంతిగా పేరొందిన రెడ్డి కాలేజీలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ ఓ మూలకు తెరలు ఏర్పాటు చేసి అందులో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నా ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పోలింగ్ సిబ్బంది తెలిపారు. ఇప్పటి వరకు 162 ఓట్లు పోలయ్యాయని పేర్కొన్నారు. 

11:06 - February 2, 2016

విద్యార్థులకు కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు ఓ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. స్కూల్‌ పిల్లల నంచి కాలేజీ విద్యార్థుల దాకా వినియోగించుకోగల ఈ అప్లికేషన్‌ పేరు 'స్కౌట్‌ ప్లస్‌' హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమైన ఈ యాప్‌ ప్రారంభమైంది.
స్కౌట్‌ ప్లస్‌ : కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఈ యాప్‌ అంది స్తుంది. ఎక్కడ జరిగేది, వాటి తేదీలు, సిలబస్‌ లాంటివి తెలుపుతుంది. ఉద్యోగాలు, విద్యార్థులు ఎక్కువగా ఎదురు చూసే విషయాల్లో ఇది కూడా ఒకటి. ఎమ్మెన్సీ, పబ్లిక్‌ లేదా ప్రైవేట్‌ కంపెనీల్లో ఉండే ఉద్యోగ సమచారం అందిస్తుంది.క్రికెట్‌, ఫుడ్‌ బాల్‌ లాంటి క్రీడలు, ఇతర ఆటలకు సంబంధించిన లైవ్‌ అప్‌ డేట్స్ అందిస్తుంది. దీంతో పాటు ఆటపై విశ్లేషాత్మక కథనాలు కూడా చూడొచ్చు. సాంకేతికత, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న న్యూస్‌ ఏజెన్సీ లు అందించే తాజా సమచారాన్ని కూడా అందిస్తుంది. మొబైల్స్, గాడ్జెట్స్, వేరబుల్‌, వీడియో, గేమ్స్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు.
బ్యాంక్‌ ఎగ్జామ్స్, బ్యాంక్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవు తున్న విద్యర్థుల కోసం సమాచారం అందిస్తుంది. సాధారణ సేవలతో పాటు ఇందులో ప్రధానంగా ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తెచ్చారు. వీటి తోపాటు ఆధార్‌ కార్డ్‌, ఓటర్‌ ఐడీ కార్డ్‌ ఆన్‌ లైన్‌ రిజిస్ట్రేషన్‌ లాంటివి అందిస్తారు. జీఆర్‌ఈ, ఎబ్రాడ్‌ వెళ్లి చదువుకోవాలనుకునే విద్యా ర్థులకు జీఆర్‌ఈ కి సంబంధించిన మెటీరియల్‌, ప్రాక్టీస్‌ లాంటి సేవలను అందిస్తారు. సినిమాల్లాంటి ఎంటర్‌ టైన్మెంట్‌, కరెంట్‌ అఫైర్స్, కెరీర్‌ గైడెన్స్ లాంటి సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు.

టిటిడిపి డివిజన్ అధ్యక్షులతో బాబు..

విజయవాడ : జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ డివిజన్ అధ్యక్షులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్రమాలు జరిగితే వెంటనే అధికారులకు తెలియచేయాలని బాబు సూచించారు. 

ఓటు హక్కు వినియోగించుక్నున అల్లు అర్జున్..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో సినీ నటుడు అల్లు అర్జున్, ఆజంపూరాలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, మారేడ్ పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, చిక్కడపల్లిలో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్, హిమాయత్ నగర్లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

కాసేపట్లో కాపు నేతలతో బాబు సమావేశం..

విజయవాడ : కాపులకు రిజర్వేషన్లు అంశంపై ఆ వర్గం నేతలతో కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం జరపనున్నారు. 11గంటలకు భేటీ జరుగుతుందని తెలుస్తోంది. 

10:40 - February 2, 2016

హైదరాబాద్ : ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి కుందన్‌బాగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ ఎమ్మెల్సీ చింతల రాంచంద్రారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీలో ఓటు వేసి.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పది నిమిషాల సమయాన్ని ఓటు వేసేందుకు కేటాయించాలని కోరారు. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

10:36 - February 2, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభమైనా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు ఇప్పుడిప్పడే చేరుకుంటున్నారు. కొండాపూర్‌ 33, 34, 35 పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. లంగర్‌హౌస్‌లో పోలింగ్‌ బూత్‌లో సీపీఎం గుర్తు మారిపోయింది. సీపీఎం తరపున పోటీచేస్తున్న కే.పుష్పలతకు సీపీఎం గుర్తుకు బదులుగా సీపీఐ గుర్తును కేటాయించారు. దీంతో అభ్యర్థులు కొంత తికమక పడాల్సి వచ్చింది. అయితే తప్పును గుర్తించిన ఎన్నికల సిబ్బంది..సీపీఐ గుర్తుమీద సీపీఎం గుర్తును అతికించారు. 

10:34 - February 2, 2016

సాధారణంగా చలికాలంలో చర్మంతో పాటు పెదాల ఆరోగ్యానికి కూడా శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అందుకే మహిళలు ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అందమైన అధరాల కోసం.. ఈ చిట్కాలు పాటించడం వల్ల పెదాల ఆరోగ్యంతోపాటు అందాన్నీ కాపాడుకోవచ్చు.అవేంటో చూద్దాం...
కొద్దిగా తేనెలో రోజ్‌వాటర్‌ లేదా నానబెట్టిన గులాబీ రెబ్బల పేస్టు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని రోజుకి రెండుసార్లు చొప్పున పెదాలకు రాసుకొని 10 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలకు ఎర్రటి రంగు వస్తుంది.
ఒక చెంచాడు పసుపును పాలతో ముద్దగా చేయాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసుకొని ఐదు నిమిషాల తర్వాత కడిగేసి లిప్‌బామ్‌ రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల నలుపు పోయి పెదాలు అందంగా కనిపిస్తాయి. చక్కెరలో కొద్దిగా నిమ్మరసం కలిపి స్క్రబ్‌ తయారు చేయాలి. దీనితో పెదాలను కొద్దిసేపు రుద్దాలి. ఈ విధంగా రెండు రోజులకొకసారి చేస్తే పెదవులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
క్యారెట్‌ లేదా బీట్‌రూట్‌ను పేస్టులా చేసి దానిలో రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున తేనె, ఆలివ్‌ ఆయిల్‌ కలపాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయం, రాత్రి పెదాలకు రాసుకొని పావుగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై మృతకణాలు తొలగిపోయి అందంగా కనిపిస్తాయి.
స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి దానిలో కొద్దిగా పెట్రోలియం జెల్లీ కలపాలి. ఈ మిశ్రమం లిప్‌బామ్‌లా పనికొస్తుంది. దీన్ని పెదాలకు రాసుకోవడం వల్ల నలుపు రంగు పోయి అందంగా, మృదువుగా అవుతాయి.

10:33 - February 2, 2016

హైదరాబాద్ : సరిగ్గా పదేళ్ల క్రితం పురుడుపోసుకుంది. పేదల జీవితాల్లో వెలుగులు నింపింది. వలసల వరదకు అడ్డుకట్ట వేసింది. పట్టణాలకు పోయిన వారిని తిరిగి పల్లె బాట పట్టించింది. సొంత గ్రామంలో గంపెడు ఆశలను తీసుకొచ్చింది. ఉన్న ఊళ్లోనే ఉపాధి కల్పించింది. అచ్చంగా గ్రామీణుల మాటల్లో చెప్పాలంటే ఇది పేదల పథకం. కేవలం వామపక్షాల ఒత్తిడి వల్లే.. అప్పటి యూపీఏ సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకానికి ఫిబ్రవరి రెండుతో.. పదేళ్లు నిండుతున్నాయి.

2006. ఫిబ్రవరి2న ప్రారంభం...

2006. ఫిబ్రవరి2. అదే రోజున చరిత్రాత్మకైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమైంది. తెలుగు గడ్డపైనే వైభవంగా ఆరంభమైంది. కరువు నేలపైన పురుడు పోసుకుంది.

యూపీఏ1 హయాంలో పథకం ప్రారంభం....

ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని యూపీఏ1 ప్రభుత్వం తీసుకొచ్చింది. అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ తరువాత మహత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా మార్చారు.

వామపక్షాల ఒత్తిడి మేరకు ఉపాధి హామీ పథకం.....

పనులు లేని సమయంలో రైతు కూలీలు, పేదలకు ఈ పథకం ఉపాధి కల్పించింది. అప్పటి యూపీయేలో భాగస్వామ్యమైన వామపక్షాల ఒత్తిడి మేరకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టు కింద.. ఈ పథకాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభించినా.. తర్వాత కరవు కోరల్లో చిక్కుకున్న మరో నాలుగు జిల్లాలకూ దీన్ని విస్తరించారు. అప్పట్లో ఈ పథకం వల్ల.. రైతులకు కూలీలు కూడా దొరకని స్థితి ఉండేదంటే.. పేదలకు ఎన్ ఆర్ఈజీఎస్ ఎంతలా ఉపయోగ పడిందో అర్థమవుతుంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కానీ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కానీ, రెండో సారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఈ పథకం కూడా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఫిబ్రవరి2 కి పదేళ్లు పూర్తి.....

ఫిబ్రవరి2 తో గ్రామీణ ఉపాధి హామీ పథకం పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బండ్లపల్లిలో పర్యటించనున్నారు. అదే రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాహుల్‌గాంధీతో పాటు పలువురు జాతీయ స్థాయి నాయకులు కూడా బహిరంగ సభకు హాజరవుతున్నారు. పథకం అమలు తీరుపై ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సర్పంచ్‌లు, ఎన్జీవోలతో ముఖాముఖిగా మాట్లాడతారు.

ఉపాధి హామీ పథకంపై నీలి నీడలు...

పదేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా ప్రారంభమైన ఉపాధి హామీ పథకంపై నేడు నీలిమేఘాలు కమ్ముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

నిధుల విడుదలో విపరీత జాప్యం.........

కాంగ్రెస్‌ హయాంలో పురుడుపోసుకున్న ఈ పథకంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమ చూపుతున్నాయి. నిధుల విడుదలలో విపరీత జాప్యం జరుగుతోంది. సకాలంలో చెల్లింపుల లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు.

ఉపాధి హామీ పథకంలో అవినీతి జాడ్యం...

మరోపక్క అవినీతి జాడ్యం కూడా ఉపాధి హామీ పథకాన్ని పట్టి పీడిస్తోంది. ఈ పథకం అధికారుల జేబులు నింపుతోందనే విమర్శలు ఉన్నాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కై బోగస్‌ మస్టర్లతో దండుకుంటున్నారనే ఆరోపణలు సర్వ సాధారణమయ్యాయి. ఇక నేతల దందాకూ పథకం వేదికగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఆడిట్‌ అన్నదే లేకుండా నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. సామాజిక సర్వేలో బయటపడిన అక్రమాలు.. పథకం ఉద్దేశం పూర్తిగా నీరుగారిందన్న అభిప్రాయాన్ని కలిగించింది.

అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిపై కక్ష సాధింపు చర్యలకు .....

మరోపక్క ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిపై సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో నియమితులైన సిబ్బందిని కొత్త ప్రభుత్వాలు తొలగించడం వివాదాస్పదమవుతోంది. మొత్తానికి అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ఉపాధి హామీ పథకంపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి.

బండ్లపల్లిలోనే నత్తనడకన ఉపాధి హమీ పథకం

శంకుస్థాపన జరిగిన గ్రామంలోనే ఉపాధి హామీ పథకం సన్నగిల్లుతోంది. పురుడు పోసుకున్న ప్రాంతంలోనే పడకేస్తోంది. మహా మహులు ప్రారంభించిన పల్లెలోనే పథకం మూలన పడింది. సర్కార్‌ నిర్లక్ష్యంతో బండ్లపల్లిలోనే ఉపాధి హామీ పథకం నత్తనడకన సాగుతోంది.

కూలీలకు నెలల తరబడి అందని జీతాలు ..........

అనంతపురం జిల్లా బండ్లపల్లిలో ప్రారంభమైన మహత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం.. ఆ గ్రామంలోనే నత్తనడకన సాగుతోంది. కూలీలకు నెలల తరబడి జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి కల్పించిన 529 కుటుంబాల్లో, కేవలం 14 కుటుంబాలకు మాత్రమే వందరోజుల పనిని కల్పించారు. దీనిని బట్టే ఉపాధి హామీ పథకం ఈ స్థాయిలో అమలవుతుందో అర్ధమవుతోంది.

కూలీలకు వేతనాలను ఫినో సంస్థ పంపిణీ.....

గతంలో ఉపాధీ కూలీలకు వేతనాలను ఫినో సంస్థ పంపిణీ చేసింది. వేతనాల పంపిణీ సక్రమంగా లేకపోవడంతో ఆ సంస్థను రద్దుచేశారు. దీంతో కూలీలకు అందాల్సిన దాదాపు 6 కోట్ల రూపాయల నిధులు వెనక్కిపోయాయి. ఈ వేతనాలను తిరిగి తీసుకురావడంలో జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేలు పూర్తీగా విఫలమయ్యారని రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు.

ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తే....

ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తే, ఇక తమకు వలసలే శరణ్యమని కూలీలు వాపోతున్నారు. కరువు జిల్లా అయిన అనంతపురంలో ఉపాధి పని దినాలను పెంచడమేకాకుండా, నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. క్యూబిక్ మీటర్ కు ఇచ్చే కూలిని కూడా పెంచాలని, చిన్న, సన్నకారు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని కూలీలు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

నత్తనడకన....

పదేళ్లు పూర్తి చేసుకుంటున్న ఉపాధి హామీ పథకం నేడు నత్తనడక కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పథకం పడకేస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 2న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బండ్లపల్లికి వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. పథకాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని డిమాండ్‌ చేయనున్నారు. 

10:25 - February 2, 2016

స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్‌.నారాయణమూర్తి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'దండకారణ్యం'. త్రినాథ్‌, ప్రసాద్‌రెడ్డి, విక్రమ్‌ ప్రధాన పాత్రధారులు. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ, 'త్రేతాయుగంలో సీతారాములు, ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు దండకారణ్యంలోనే ఉన్నారు. అలాంటి దండకారణ్యం ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం చేపట్టే బాక్సైట్‌ గనుల త్రవ్వకాలతో అక్కడున్న ఆదివాసీలకు మనుగడ లేకుండా పోతుంది. ఆదివాసీ హక్కుల గురించి తెలియజేసే చిత్రమే 'దండకారణ్యం'. ఇందులో ఏడు పాటలున్నాయి. వాటిలో మూడు పాటలను గద్దర్‌ పాడగా, మరో నాలుగు పాటలని వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారు. గోరేటి వెంకన్న, ములుగు తిరుపతి, కాశీపతి సాహిత్యమందించారు. ఈ చిత్రాన్ని బొబ్బిలి, అరకు, విజయనగరం, పాల్వంచ, రంపచోడవరం, పాపికొండలు, ఛత్తీస్‌ఘడ్‌ ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. డబ్బింగ్‌ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రీరికార్డింగ్‌, ఫైనల్‌ మిక్సింగ్‌ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమాను విడుదల చేస్తాం' అని అన్నారు.

లాభాలతో స్టాక్ మార్కెట్లు...

ముంబై : నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష జరగనుంది. దీని ప్రభావం స్టాక్‌మార్కెట్లపై పడింది. నిన్న 45పాయింట్ల నష్టంతో 24,825 వద్ద ముగిసిన సెన్సెక్స్‌..

10:23 - February 2, 2016

అన్ని భాషా పరిశ్రమల్లో ఇటీవల హర్రర్‌ సినిమాల జోరు పెరిగింది. హర్రర్‌ చిత్రాలకు రోజురోజుకు విశేష ఆదరణ పెరుగుతుండటంతో స్టార్‌ హీరో, హీరోయిన్లు సైతం నటించేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ క్రేజీ కాంబినేషన్‌లో హర్రర్‌ చిత్రానికి రూపకల్పన జరుగుతోంది. నటుడిగా, నృత్యదర్శకుడిగా, దర్శకుడిగా బాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న ప్రభుదేవా హీరోగా, తమన్నా హీరోయిన్‌గా ఓ హర్రర్‌ చిత్రం అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ చిత్రాన్ని విజయ్ దర్శకత్వంలో ప్రభుదేవా స్వయంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే 12 సంవత్సరాల క్రితం తమిళంలో రూపొందిన 'ఎంగల్‌ అన్నా' చిత్రంలో చివరిసారిగా ప్రభుదేవా నటించారు. ఆ తర్వాత తమిళంలో ఆయన నటించే చిత్రమిది కావడం విశేషం. దీంతోపాటు పలు బాలీవుడ్‌ ప్రాజెక్టులతో ప్రభుదేవా బిజీగా ఉంటే, తమన్నా ప్రస్తుతం నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఊపిరి' చిత్రంలోనూ, 'బాహుబలి2', తమిళంలో విజయ్ సేతు సరసన 'ధర్మదురై' వంటి చిత్రాల్లో నటిస్తోంది.

10:23 - February 2, 2016

హై ఇంటెలిజెంట్‌ కథల నేపథ్యంతో సినిమాల్ని రూపొందించడంలో దర్శకుడు సుకుమార్‌ దిట్ట. 'వన్‌.. నేనొక్కడినే', 'నాన్నకు ప్రేమతో..' వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు నిదర్శనాలుగా నిలిచాయి. తాజాగా రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందట. 'బ్రూస్‌లీ' తర్వాత రామ్‌చరణ్‌ తమిళనాట ఘన విజయం సాధించిన 'తని ఒరువన్‌' చిత్రం రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటించ బోయేచిత్రం సైతం బాలీవుడ్‌లో రూపొందిన 'రాకీ హ్యాండ్సమ్‌' చిత్రానికి రీమేక్‌ అనే వార్త ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. 2010లో విడుదలైన కొరియన్‌ చిత్రం 'ద మ్యాన్‌ ఫ్రమ్‌ నో వేర్‌' చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో స్వయంగా జాన్‌ అబ్రహం నిర్మిస్తున్నారు.

10:22 - February 2, 2016

మంచు మనోజ్‌, రెజీనా జంటగా దశరథ్‌ దర్శకత్వంలో బేబీ త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన మంచు మోహన్‌బాబు ఆడియో బిగ్‌ సిడీని రిలీజ్‌ చేయగా, బి.గోపాల్‌ పాటల సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, 'మనోజ్‌తో దశరథ్‌ మా బ్యానర్‌లో 'శ్రీ' అనే సినిమా చేశారు. ఇప్పుడు 'శౌర్య' చేస్తున్నారు. మనోజ్‌ ఎలాంటి పాత్ర చేస్తే చూడాలనుకున్నానో అలాంటి క్యారెక్టర్‌ ఈ చిత్రంలో చేస్తున్నాడు. సంగీత దర్శకుడు వేదా చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. భవిష్యత్‌లో తను గొప్ప మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుతాడు. నిర్మాత శివకుమార్‌ ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించారు. దర్శక, నిర్మాతలకు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమవుతుంది' అని అన్నారు. 'మంచి కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని బి.గోపాల్‌ తెలిపారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ, 'శివకుమార్‌ మంచి అభిరుచి ఉన్న నిర్మాత. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి చిత్రాలొస్తాయి' అని చెప్పారు. మనోజ్‌ మాట్లాడుతూ, 'సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కచ్చితంగా ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను' అని చెప్పారు.

 

10:20 - February 2, 2016

తమిళ సూపర్ స్టార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మణిరత్నం పై విధంగా స్పందించారు. 24 ఏండ్ల క్రితం రజనీకాంత్‌, మణిరత్నం కాంబినేషన్‌లో రూపొందిన 'దళపతి' తమిళనాట సంచలన విజయం సాధించింది. అంతేకాకుండా పలు భాషల్లో అనువాదితమై ఆయా భాషల్లోనూ అఖండ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ కాంబినేషన్‌లో ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. తాజాగా రజనీపై బయోపిక్‌ రూపొందించేందుకు మణిరత్నం అమితాసక్తితో ఉన్నారని ఆయన మాటల్లో స్పష్టంగా తెలియడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఇందులో స్వయంగా రజనీకాంతే నటిస్తారా లేదా వేరే నటుడు ఎవరైనా నటిస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఏదిఏమైనా యావత్‌ భారతదేశం గర్వించదగ్గ నటుడు రజనీకాంత్‌ జీవిత చరిత్రపై సినిమా రావడం విశేషం. 

10:16 - February 2, 2016

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో రోడ్‌ నంబరు 10 పోలింగ్‌ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్‌ ఏర్పాట్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. నగర అభివృద్ధిని కాంక్షించే వారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఓటింగ్ కు దూరంగా హస్తినాపురం ఓటర్లు

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలోని హస్తినాపురంలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనలేదు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే పోలింగ్‌లో పాల్గొంటామని ఓటర్లు బైఠాయించారు.

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, బ్రహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

వివేకానంద నగర్ లో ఓట్ల గల్లంతు.. ఆందోళన

హైదరాబాద్ : ఓట్ల గల్లంతుపై పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కూకట్‌పల్లి వివేకానందనగర్‌ కాలనీలోని ఒకే అపార్ట్‌మెంట్‌లో 60 ఓట్లు గల్లంతయ్యాయి. ఓట్ల గల్లంతుపై స్థానికులు 32వ పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.పోలింగ్‌ సరళిని వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని: కేటీఆర్

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో రోడ్‌ నంబరు 10 పోలింగ్‌ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్‌ ఏర్పాట్లు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. నగర అభివృద్ధిని కాంక్షించే వారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

09:32 - February 2, 2016

హైదరాబాద్ : కుందన్ బాగ్ పోలింగ్ కేంద్రంలో సీపీ మహేందర్ రెడ్డి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ...పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. అంతే కాకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు 25 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నామని, వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామన్నారు. నగరంలో పలు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అప్రమత్తం చేశామన్నారు. పోలీసు యంత్రాంగం చాలా పగడ్బందీగా ఏర్పాటు చేశామన్నారు.

09:29 - February 2, 2016

హైదరాబాద్ : ముషీరాబాద్ లోని పలు పోలింగ్ స్టేషన్లలో ఓట్లు గల్లంతయ్యాయి. ఏళ్లుగా ఓట్లు వేస్తున్నామని ఇటీవల తమ ఓటును తీసివేశారని .. ఓటరు గుర్తింపు కార్డు ఇచ్చారని పోలింగ్ స్టేషన్లలో తమ పేరు లేదని పలువురు వృద్దులు వాపోతున్నారు. పలువురు ఓటర్లు తమకు పోల్ చీటీలు ఇవ్వడం లేదంటున్నారు .

నగరంలోని పలుచోట్ల గల్లంతయిన ఓట్లు

హైదరాబాద్ : ముషీరాబాద్ లోని పలు పోలింగ్ స్టేషన్లలో ఓట్లు గల్లంతయ్యాయి. ఏళ్లుగా ఓట్లు వేస్తున్నామని ఇటీవల తమ ఓటును తీసివేశారని .. ఓటరు గుర్తింపు కార్డు ఇచ్చారని పోలింగ్ స్టేషన్లలో తమ పేరు లేదని పలువురు వృద్దులు వాపోతున్నారు. పలువురు ఓటర్లు తమకు పోల్ చీటీలు ఇవ్వడం లేదంటున్నారు .

09:27 - February 2, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభమైనా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు ఇప్పుడిప్పడే చేరుకుంటున్నారు. కొండాపూర్‌ 33, 34, 35 పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. లంగర్‌హౌస్‌లో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కారణంగా బ్యాలెట్‌ పేపర్‌లో సీపీఎం గుర్తుకు బదులుగా మరో గుర్తును ముద్రించారు. మరో వైపు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి కుందన్‌బాగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3గంటలు, కాలినడక భక్తులకు 2గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటల సమయం పడుతోంది.

పలు చోట్ల మెరాయించిన ఈవీఎం లు

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గడిచిన రెండు రోజులుగా సూర్యుడి ప్రతాపం పెరిగిపోవడంతో అధికారులు ముందస్తుగా టెంట్ల ఏర్పాటుతో పాటు మంచినీళ్ల సౌకర్యం కల్పించారు. కాగా ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యమౌతోంది. కొండాపూర్ 33, 34, 35వ బూత్‌లలో అదేవిధంగా కేబీహెచ్‌బీ కాలనీ 5,6,7,8,9,10 బూత్‌ల్లో, హయత్‌నగర్ సిద్ధార్థ స్కూల్లో, వనస్థలిపురం రోడ్ నెం. 9లో ఈవీఎంలు మొరాయించాయి.

ఓటు వినియోగించుకున్న దత్తాత్రేయ

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులు రామ్‌నగర్‌లో ఓటేశారు. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిలు కుందన్‌బాగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

07:35 - February 2, 2016

హైదరాబాద్ : తుని ఘటన కు ప్రభుత్వంతో పాటు అందరి నిర్లక్ష్యం ఉందని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ అన్నారు. తుని ఘటనపై జ్యుడిషరీ ఎంక్వైయిరీ వేయించాల్సిన అవసరం లేదా? తుని ఘటనకు ముద్రగడ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? కాపులను అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయా? ఉద్యమం చేయడం తప్పు కాదు కాని.. హింసాత్మక ఘటనలకు పాల్పడటం తప్పు అని న్యూస్ మార్నింగ్ లో పాల్గొన్న నేతలు అభిప్రాయపడ్డారు. నగేష్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ,టిడిపి నేత వర్ల రామయ్య పాల్గొన్నారు. ఇంకా వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

నేడు కోయంబత్తూరుకు ప్రధాని

హైదరాబాద్ : నేడు ప్రధాని మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన ఇక్కడికి చేరుకుంటారు. స్థానికంగా ఈఎస్‌ఐ ఆసుపత్రికి అనుసంధానంగా నిర్మించిన వైద్యకళాశాలను ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ భాజపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

తొలి ఓటేసిన జీహెచ్ ఎంసి కమిషనర్

హైదరాబాద్ : కొద్ది సేపటి క్రితం ప్రారంభమై గ్రేటర్ ఎన్నికల పోలింగ్ లో జీహెచ్ ఎంసీ కమిషనర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుందన్ బాగ్ పోలింగ్ బూత్ లో తొలి ఓటును వేసి పోలింగ్ ను ప్రారంభించారు. అనంతరం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించకున్నారు. 150 డివిజన్లకు గాను 100 కుపైగా డివిజన్లలో పోలింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. మిగతా చోట్ల ఏజెంట్ల సమక్షంలో మాక్ ఓటింగ్ ను నిర్వహిస్తున్నారు. పలు చోట్ల వందల సంఖ్యలో ప్రజలు ఓటు వేసేందుకు బారులు తీరారు.

ప్రారంభమైన గ్రేటర్ పోలింగ్

హైదరాబాద్ : కొద్ది సేపటి క్రితం గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 150 డివిజన్లలో 1,333 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 7802 పోలింగ్ కేంద్రాల్లో 12200 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. 7,43,200 మంది ఓటర్లు ఈ పోలింగ్ లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

06:57 - February 2, 2016

విజయవాడ : తుని ఘటనల తర్వాత ప్రతిపక్ష నేత జగన్‌ను ఏపీ మంత్రులు టార్గెట్‌ చేశారు. ఆయనపై ముప్పేట దాడి మొదలు పెట్టారు. అధికార పక్షం కూడా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తోంది. దీని పూర్వాపరాలు, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

గుక్కతిప్పుకోకుండా విమర్శలతో దాడి......

తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ విధ్వంసానికి దారితీసిన తర్వాత ప్రతిపక్ష నేత జగన్‌ను... అధికార పక్షం లక్ష్యంగా ఎంచుకుంది. వైసీపీ ప్రోదోద్బలంతోనే హింస జరిగిందని ఆరోపించింది. ఇటు ఏపీ మంత్రులు, అటు అధికార పార్టీ నేతలు... జగన్‌ను గుక్కతిప్పుకోకుండా విమర్శలతో దాడి చేస్తున్నారు. తుని ధ్వంస రచన అంతా జగన్‌దేనని మండిపడ్డారు.

సీఎం కావాలన్న ఉద్దేశంతో......

సీఎం కావాలన్న ఉద్దేశంతో జగన్ ఎంతకైనా తెగించేందుకు వెనుకాడటంలేదని ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘురాథరెడ్డి విమర్శించారు. కాపుల రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు చెప్పారు. ప్రతిపక్ష నేతగా విఫమైన జగన్‌.. కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని అరాచకం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు తుని విధ్వంస ఘటనల వెనుక టీడీపీ హస్తముందని కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించడాన్ని మున్సిపల్‌ మంత్రి నారాయణ తప్పుపట్టారు. టీడీపీ నేతలు కూడా జగన్‌ను టార్గెట్‌ చేశారు. ఒకరి తర్వాత మరొకరు ప్రతిపక్ష నేతపై విరుచుకుపడుతున్నారు. విమర్శల దాడితో జగన్‌ ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తున్నారు. 

06:54 - February 2, 2016

విజయవాడ : కాపు రిజర్వేషన్ల అంశం ఏపీలో రాజకీయ చిచ్చు రాజేస్తోంది. తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ విధ్వంసంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నాయి. తుని ఘటనల వెనుక వైసీపీ అధినేత హస్తముందన్న సీఎం ఆరోపణలపై.. జగన్‌ తీవ్రంగా ప్రతి స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతి విషయంలోనూ పబ్బం గడుపుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్‌ ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీ చిరంజీవి కూడా కాపు రిజర్వేషన్లపై టీడీపీ ప్రభుత్వ వైఖరి తప్పుపట్టారు.

పరస్పర విమర్శలు...

కాపు రిజర్వేషన్ల అంశం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ హింసాత్మకంగా మారి, విధ్వంసానికి దారితీయడంపై పార్టీల నేతలు, పాలకులు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.

కాపు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన వైసీపీ.....

తునిలో కాపుల ఐక్య గర్జన సభ తర్వాత జరిగిన హింసాత్మక ఘటలను చంద్రబాబునాయుడు తనకు అంటగట్టే ప్రయత్నం చేయడాన్ని జగన్‌ తప్పుపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమని కాపులు ఉద్యమిస్తుంటే.. టీడీపీ నేతలు తమపై అభాండాలు వేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. కుల, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు వెనుకాడటంలేదని విమర్శించారు. కాపు రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన జగన్‌... ఇదే సమయంలో బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు మాటతప్పారని మండిపడ్డారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని జగన్‌ విమర్శించారు. రాజధాని కోసం రైతులు భూములు లాక్కున్న అంశాన్నిప్రశ్నిస్తే అమరావతికి జగన్‌ వ్యతిరేకమని ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు.

చంద్రబాబు సర్కార్‌పై చిరంజీవి విమర్శలు.....

మరోవైపు కాపు రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ఎంపీ చిరంజీవి... ముఖ్యమంత్రి చందబ్రాబుకు లేఖ రాశారు. తుని ఘటనల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి... చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత లేకపోవడం వల్లే తుని ఘటన జరిగిందని నిందించారు. విభజించి పాలించు విధానంతో చంద్రబాబు సమాజంలోని వివిధ వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని లేఖలో ఆరోపించారు. ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేశారు. అన్ని విషయాల్లో ప్రభుత్వం మేల్కోపోతే అమరావతి రైతులు కూడా ఆందోళనబాట పడతారని చిరంజీవి హెచ్చరించారు.

హాట్ టాపిక్ గా కాపు రిజర్వేషన్...

మొత్తం మీద కాపు రిజర్వేషన్ల అంశం ఏపీలో రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. మంత్రులు, పార్టీల నేతలు, ఉద్యమకారుల పరస్పర విమర్శలు, ఆరోపణలతో వాతావరణం వేడెక్కుతోంది. 

06:48 - February 2, 2016

హైదరాబాద్ : కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో డబ్బులు పంచుతున్నారన్న సమాచారం అధికార,విపక్ష నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. నిజాంపేట్ రోడ్‌లోని నాగార్జున హోమ్స్ డి బ్లాకులో అధికార పార్టీకి చెందిన కొందరు మహిళలు డబ్బులు పంచారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇదే సమయంలో టీడీపీ-టీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ముష్టి ఘాతానికి దిగారు. డబ్బులు పంచుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చెయ్యటం లేదంటూ టిడిపి కార్యకర్తలు, శేర్‌ లింగంపల్లీ టీడీపీ ఎమ్మెల్యే అరికె పూడి గాంధీ రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులకు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. 

06:47 - February 2, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ప్రత్యేక రాష్ట్రం అనంతరం తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద ఎన్నికలు కావడంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

గ్రేట‌ర్‌లో 150 డివిజ‌న్లు......

గ్రేట‌ర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక‌ల‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది జీహెచ్‌ఎంసీ. గ్రేట‌ర్ పరిధిలో ఉన్న 150 డివ‌జ‌న్లలో 7802 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 74ల‌క్షల 23వేల మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. 46వేల మంది పోలింగ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగ‌స్వాములు అవుతున్నారు. మంగళవారం ఉద‌యం 6గంట‌ల‌కు ఏజెంట్ల స‌మ‌క్షంలో మాక్ పోలింగ్ నిర్వహించ‌నున్నారు. తర్వాత 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమవుతుంది. అందుకోసం అవ‌స‌రమైన పూర్తి మెటీరియ‌ల్‌తో ఎన్నిక‌ల సిబ్బంది పోలింగ్ కేంద్రాల‌కు ప‌య‌న‌మ‌య్యారు.

9,352 పోలింగ్ పార్టీలు.........

ఇక పోలింగ్ జ‌రిగే 7802 పోలింగ్ కేంద్రాల‌కు 20శాతం అద‌నంగా 9,352 పోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశామ‌న్నారు క‌మిష‌న‌ర్. ఒక్కో పోలింగ్ పార్టీలో ఐదుగురు ఉద్యోగులు, ఒక ప్రిసైడింగ్ ఆఫీస‌ర్‌, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీస‌ర్, ముగ్గురు ఓపిఓలు ఉంటారు. ఈవీఎంలలో స‌మ‌స్యలు వ‌స్తే వెంటనే రిప్లేస్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స‌ర‌ళిని ప‌ర్యవేక్షించేందుకు 1,500 మైక్రో అబ్జర్వర్స్ ను నియ‌మించారు. మొత్తం సమస్యాత్మక ప్రాంతాలు 1,987, అతి సమస్యాత్మక ప్రాంతాలు 867గా గుర్తించారు. స‌మ‌స్యాత్మక కేంద్రాల్లో ప‌టిష్ట భ‌ద్రతా ఏర్పాట్లు చేశారు. 32వేల మంది పోలీసులు పోలింగ్ కేంద్రాల దగ్గర విధులు నిర్వహిస్తారు. అలాగే 3,000 మంది ఇంజ‌నీరింగ్ విద్యార్థుల ద్వారా వెబ్ కాస్టింగ్ నిర్వహించ‌నున్నారు.

ఓటింగ్ రోజు ప్రత్యేక ఏర్పాట్లు....

గ్రేట‌ర్ ప‌రిధిలో ఓటింగ్ శాతాన్ని పెంచ‌డానికి వివిధ రూపాల్లో ప్రచారం చేసిన జిహెచ్ఎంసి ఓటింగ్ రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడికి వ‌చ్చే విక‌లాంగుల‌కు, వృద్దుల‌కు ప్రత్యేక సౌక‌ర్యాలు సిద్దం చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో ప్రజ‌ల భాగ‌స్వామ్యం పెర‌గాలంటే అంద‌రూ త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌న్నారు క‌మిష‌న‌ర్ జ‌నార్థన్ రెడ్డి.

06:44 - February 2, 2016

హైదరాబాద్ : నేడు గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రాత్రంతా నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు తెగ శ్రమించారు. అర్ధరాత్రి వేళ ప్రముఖ పార్టీల నేతలు, కార్యకర్తలు కాలనీలు, బస్తీల్లో భారీగా డబ్బు, మద్యం బాటిళ్లు పంపిణీ చేశారు. కాచిగూడ, సీతాఫల్‌మండి, లంగర్ హౌజ్, శేర్‌లింగంపల్లి, నిజాంపేట్, ఎల్‌బి తదితర ప్రాంతాల్లో డబ్బుల పంపిణీ జరిగినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోలేదంటూ ప్రతిపక్ష టిడిపి ఆరోపణలు చేసింది. ఎల్‌బినగర్‌లో టిడిపి, టిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు ఒకరికొకరు మీరు డబ్బులు పంచుతున్నారంటే మీరు పంచుతున్నారంటూ బాహాబాహీకి దిగారు. కారు అద్దాలను పగులగొట్టారు. కోఠిలోని సుల్తాన్‌బజార్ పీఎస్ పరిధిలో అర్ధరాత్రి గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి పోలీసులు 20లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. వనస్థలిపురంలో సంపూర్ణ థియేటర్‌లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి కుమారుడు డబ్బులు పంపిణీ చేస్తున్నాడంటూ టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష పార్టీ క్యాండెట్ల ప్రలోభాలను పోలీసులు అడ్డుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళలకు చీరల పంపిణీ జరిగినట్లు సమాచారం అందుతోంది. 

06:42 - February 2, 2016

నల్గొండ : బోరు బావిలో పడిన చిన్నారి శాన్వి జీవితం విషాదాంతమైంది. చిన్నారిని సజీవంగా బయటకు తెచ్చేందుకు అధికారులు చేసిన శ్రమ ఫలించలేదు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాలలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. శాన్వి తల్లిదండ్రులు వ్యవసాయ బావిలో పూడికతీస్తుండగా బాలిక ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారు 20 అడుగుల లోతులో చిన్నారి అరుపులు వినిపించడంతో ఆమెను రక్షించొచ్చని అంతా భావించారు. జేసీబీ సాయంతో బోరుబావికి సమాంతరంగా గుంతను తవ్వడం మొదలుపెట్టారు. మధ్యలో బండరాళ్లు అడ్డురావడంతో తవ్వకానికి కొంత ఆటంకమేర్పడింది. మొత్తమ్మీద 12 గంటలపాటు తీవ్రంగా శ్రమించి తెల్లవారుజామున 3 గంటల వేళ బాలికను వెలికితీయగలిగారు. అయితే అప్పటికే శాన్వి మృతిచెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. 

బోరుబావిలో పడిన చిన్నారి మృతి

నల్గొండ : నిన్న బోరుబావి లో పడిన  చిన్నారి శాన్వీ మృతి .  శాలీగౌరారం మండలం వల్లలకు చేందిన స్వామి , సుస్మిత ల కుమార్తె అయిన శాన్వీ నిన్న(సోమవరం) మధ్యాహ్నం ఆడుకుంటు  బోరుబావి లో పడిండి. దాదాపు12 గంటలపాటు శ్రమించి శాన్వీని బయటకు తీసిన అధికారులు, అప్పటికే   చిన్నారి శాన్వీ  మృతి చేందినట్లు వైద్యుల  నిర్ధారించారు. నకిరేకల్ ఆస్పుత్రికి  చిన్నారి శాన్వీ మృతదేహం తరలించారు. శాన్వీ స్వస్థలం నల్గోండ మండలం ద్వీపకుంట గ్రామం .

Don't Miss