Activities calendar

03 February 2016

విద్యార్థినిపై యువకుడు అత్యాచారం

నల్గొండ : సూర్యపేట ఎస్సీ బాలికల హాస్టల్లోని విద్యార్థినిపై షేక్ సైదా అనే యువకుడు అత్యాచారం చేశాడు. హాస్టల్ కు పాలు పోసేందుకు వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పీఎస్ లో విద్యార్థిని తల్లి ఫిర్యాదు చేసింది.

 

22:05 - February 3, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలు తెలంగాణాలో కొత్త రాజకీయాలకు తెరలేపుతున్నాయి. ఎంఐఎం మిత్రపక్షమని స్వయంగా ప్రకటించుకున్న అధికార పార్టీ.. తాజా ఘటనపై ఆచితూచి వ్యవహరిస్తోంది. మజ్లిస్‌కు మద్దుతు ఇవ్వలేక.. జరిగిన ఘటనను సమర్ధించుకోలేక సతమతమవుతోంది. ఈ అంశంపై విపక్షాలన్నీ ఏకం కావడంతో టిఆర్ ఎస్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఎంఐఎంకు కొత్త సవాల్‌ విసిరిన గ్రేటర్‌ ఎన్నికలు

గ్రేటర్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు నువ్వా-నేనా అని తలపడ్డాయి. సుమారు నెల రోజులుగా గ్రేటర్‌లో సత్తా చాటేందుకు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. నేతల మధ్య మాటల తూటాలు పెటాయి. అధికార, విపక్ష పార్టీలు క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు శక్తికి మించి ప్రయత్నించాయి. ప్రభుత్వ ఏర్పాటు నుంచి.. టిఆర్ ఎస్ కు స్నేహపూర్వక మద్దతు ఉందని చెప్పుకుంటున్న ఎంఐఎంకు ఈ ఎన్నికలు కొత్త సవాల్‌ను విసిరాయి.

అన్ని అస్త్రాలను ప్రయోగించిన గులాబీదళం

ఎంఐఎంకు ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ కూడా నామమాత్రంగానే అభ్యర్థులను రంగంలోకి దించింది. అయితే అధికార పార్టీ కావడంతో.. అన్ని అస్త్రాలను గులాబీదళం ప్రయోగించింది. ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో గులాబి పార్టీలో ఈ ఎన్నికలు కొత్త జోష్‌నే నింపాయి. ఒక్క స్థానం కూడా లేని TRS ఈ ఎన్నికలతో గ్రేటర్‌లో పాగా వేస్తామన్న ధీమాకు చేరుకుంది.

ప్రచారంలో ఎంఐఎంను టార్గెట్‌ చేయని టీఆర్‌ఎస్‌

ఇరు పార్టీల మధ్య అవగాహనతో గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంను మిత్రపక్షంగానే భావించింది టీఆర్‌ఎస్‌. తన ఎన్నికల ప్రచారంలో ఎక్కడా టార్గెట్ చేయలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపిలపై విమర్శల వర్షం గుప్పించింది. కానీ.. పోలింగ్ రోజున ఎంఐఎం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో జరిగిన ఘటనలు అధికార పార్టీని కూడా పునరాలోచనలో పడేలా చేశాయి. కాంగ్రెస్ నేతలపై దాడులు జరగడంతో పాటు డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ఇంటిపై ఎంఐఎం చేసిన దాడిని గులాబి పార్టీ సీరియస్‌గా పరిగణిస్తోంది. ఇప్పుడే ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పూర్తి ఫలితాలు వచ్చేంత వరకు వేచి చూడాలనే ధోరణితో ఉంది.

ఒంటరిగా గ్రేటర్‌ పీఠం దక్కించుకుంటే ఎంఐఎంకు చిక్కులు

ఒంటరిగా గ్రేటర్ పీఠం దక్కించుకుంటే.. మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంను ఇరుకున పెట్టేందుకు అధికారపార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఎంఐఎం శాసనసభ్యులున్న నియోజకవర్గాల్లో కూడా తమ క్యాడర్‌ను వచ్చే సాధారణ ఎన్నికల నాటికి సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంఐఎంకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలను కూడా కూడగట్టుకునే యోచనలో గులాబీబాస్ ఉన్నట్లు సమాచారం. అయితే.. గ్రేటర్ ఫలితాల తర్వాతే ఓల్ట్‌సిటీపై దృష్టి సారించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

21:59 - February 3, 2016

ఢిల్లీ : వయసు పై బడ్డా ఆయనలో ఉల్లాసం తగ్గలేదు...78 ఏళ్ల వయసులోనూ స్టెప్పులేసి ప్రేక్షకుల మతి పోగొట్టారు. ఇంతకీ ఆయన సినీ నటుడనుకుంటే మాత్రం పొరబడ్డట్టే...రాజకీయాల్లో ఆరితేరిన కురువృద్ధుడు...జమ్ముకశ్మీర్‌ మాజీ సిఎం ఫారూఖ్‌ అబ్దుల్లా! ఎన్డీటీవీ నిర్వహించిన 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో హీరో రణవీర్‌సింగ్‌తో పాటు ఫారూఖ్‌ అబ్దుల్లా డాన్స్‌ చేశారు. ఈ పొలిటికల్- సినీ హీరోల డ్యాన్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రణ్ వీర్ సింగ్ కు 'బెస్ట్ ఎంటర్ టైనర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రదానం చేసేందుకు స్టేజ్ పైకి వచ్చిన ఫారూఖ్‌ అబ్దుల్లా- 'బాజీరావు మస్తానీ' సినిమా పాటకు యువ హీరోతో కలిసి స్టెప్పులేశారు. మధ్యలో ఛానెల్‌ ప్రతినిధి బర్ఖాదత్‌ కలుగుజేసుకోకుంటే వీరిద్దరు నాన్‌స్టాప్‌గా డాన్స్‌ చేసేవారేమో... 

 

21:57 - February 3, 2016

హైదరాబాద్ : ప్రపంచాన్నే వణికిస్తున్న జికా వైరస్‌కు విరుగుడు దొరికింది. అది ఎక్కడో కాదు...మన దేశంలోనే...ఇంకా చెప్పాలంటే మన హైదరాబాద్‌లోనే.... భారత్ బయోటెక్ సంస్థ -జికా వైరస్ నిరోధక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌ ప్రయోగానికి ప్రధాని సహాయం కోసం ఎదురు చూస్తోంది.
 

ప్రపంచ దేశాలను వణికిస్తున్న జికా వైరస్

జికా .. ప్రస్తుతం ఈ వైరస్‌ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు గజగజలాడుతున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌లో ఓ వ్యక్తికి జికా సోకింది. దోమ ద్వారా ఈ వైరస్‌ వ్యాపిస్తుందని ఇన్నాళ్లు భావించారు. కానీ ఈ వైరస్‌ లైంగిక చర్య ద్వారా కూడా వ్యాపిస్తున్నట్లు అమెరికా వైద్య నిపుణులు తేల్చడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రకటించింది. అంతేకా ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు పరిశోధనలు జరపాలని ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేసింది.

వ్యాక్సిన్‌ను తాము కనుగొన్నట్టు చెబుతున్న భారత్‌ బయోటిక్‌ సంస్థ

ప్రపంచ దేశాలు జికా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనుగొనేందుకు తలమునకలై ఉన్న సమయంలో ఈ వ్యాక్సిన్‌ను తాము కనుగొన్నట్టు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటిక్‌ సంస్థ ప్రకటించడం గమనార్హం. ఇందుకోసం తొమ్మిది నెలల కిందటే పేటెంట్‌ తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. రెండున్నరేళ్లుగా జికా వైరస్ నిరోధక వ్యాక్సిన్‌పై పరిశోధనలు చేస్తున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.  వ్యాక్సిన్‌తో జికా వైరస్‌ను నిరోధించగలిగామని తమ పరిశోధనల్లో తేలిందని స్పష్టం చేసింది. డిఎన్‌ఎ టెక్నాలజీ ఆధారంగా ఈ వ్యాక్సిన్‌ రూపొందుతోంది. వచ్చే రెండు వారాల్లో జంతువులపై వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తామని భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా తెలిపారు. తాము చేస్తున్న ప్రయోగాలకు భారత ప్రభుత్వం ముందుకు వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోది చొరవ చూపితే  నాలుగు నెలల్లో 10లక్షల వ్యాక్సిన్‌లను తయారుచేస్తామని ఎల్లా తెలిపారు. వ్యాక్సిన్‌ అత్యవసరమున్న బ్రెజిల్‌ లాంటి దేశాలకు సప్లయ్‌ చేస్తామని ఆయన పేర్కొన్నారు. జికా వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలను భారత్‌ బయోటెక్‌ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌కు నివేదించింది. భారత్‌ బయోటెక్‌ ప్రయోగానికి ఐసిఎమ్‌ఆర్‌ సానుకూలంగా స్పందించింది. భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌పై నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

జికా వైరస్‌ ప్రభావం పిల్లలు, పెద్దల్లో ఒకే మాదిరి 

జికా వైరస్‌ ప్రభావం పిల్లలు, పెద్దల్లో ఒకే మాదిరి ఉంటుంది. ఈ వైరస్‌ సోకితే జ్వరం, తలనెప్పి, కళ్ల మంట, కీళ్ల నొప్పులు, దద్దుర్లు లాంటి సంక్రమిస్తాయి. కొందరికి ఈ లక్షణాలు కూడా కనపడే అవకాశం లేదు. ఈ వైరస్‌ నరాలపై ప్రభావం చూపడం వల్ల ఒకేసారి పెరాల్సిస్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్‌ కారణంగా పుట్టే పిల్లల మెదడు పెరగదు. సాధారణంగా ఉండే తలకన్నా చిన్నగా ఉంటుంది.  ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాల్లో జికా వ్యాధి లక్షణాలు కనిపించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

21:54 - February 3, 2016

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాపు రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలించేందుకు ఆరుగురు మంత్రులతో  ఉప సంఘం ఏర్పాటు చేసింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల రూపాయలు నిధులు  కేటాయించాలని నిర్ణయించింది. రిజర్వేషన్ల అంశంపై అధ్యయనం చేసేందుకు జస్టిస్‌ మంజునాథ అధ్యక్షతన ఏర్పాటైన కాపు  కమిషన్‌ నివేదికను వీలైనంత త్వరగా తెప్పించుకునే అంశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు.  
కాపు రిజర్వేషన్లపై సుదీర్ఘ చర్చ
ముఖ్యమంత్రి  చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం కాపు రిజర్వేషన్ల  అంశాన్ని సుదీర్ఘంగా చర్చించారు.  దీనిపై  వర్గాలతో మాట్లాడేందుకు ఆరుగురు మంత్రులతో  కమిటీ ఏర్పాటు చేశారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్‌ మంత్రి పీ నారాయణ, మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎక్సైజ్‌   శాఖ మంత్రి కొల్లు రవీంద్ర  మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులు. వీరంతా ఇటు కాపులతోపాటు, ఈ సామాజిక వర్గ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న ఇతరులతో చర్చలు జపుతారు. ఏ వర్గానికి నష్టం జరగని విధంగా రిజర్వేషన్ల అంశం పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. 
కాపు కార్పొరేషన్‌కు నిధుల పెంపు
కాపు కార్పొరేషన్‌కు నిధులు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు కేటాయించిన నిధులను... 2016-17 ఆర్ధిక సంవత్సరంలో వెయ్యి కోట్లకు పెంచాలని నిర్ణయించారు. జస్టిస్‌ మంజునాథ అధ్యక్షతన ఏర్పాటైన కాపు కమిషన్‌  పై కూడా చర్చించారు. మూడు నెలల్లో నివేదిక తెప్పించేలా చూడాలని కొందరు మంత్రులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అయితే ఈ కాలవ్యవధిలో నివేదిక తెప్పించడం సాధ్యకాదన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. జస్టిస్‌ మంజునాథ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయినప్పుడు ఈ అంశాన్ని చర్చిస్తారు.
జగన్‌ ప్రోద్బలంతోనే విధ్వంసం
కాపు ఐక్య గర్జన సభ సందర్భంగా తునిలో జరిగిన హింసాకాండ అంశం కూడా మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. వైసీపీ అధినేత జగన్‌ ప్రోద్బలంతోనే విధ్వంసం జరిగిందని చర్చించారు.  విధ్వంస కేసు దర్యాప్తు పురోగతి, నిందితుల గుర్తింపు, కేసులు, ఈనెల 5 నుంచి ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న దీక్ష అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. 

 

21:49 - February 3, 2016

ఓ మహిళ ఆ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతోంది.. ఓ మహిళ ఆ రాష్ట్ర నేతలకు ముచ్చెమటలు పోయిస్తోంది. సాక్షాత్తు సీఎంనే ఇరకాటంలో పెడుతోంది. కేరళ అధికార పక్ష పొలిటీషయన్లకు ముచ్చెమటలు పోయిస్తుంది. లంచం, అక్రమమం, అధికార దుర్వినియోగం, సెక్స్ స్కాండిల్ వెరిసి.. ఓ స్కాం ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎవరామే..? ఏమా స్కాండిల్.. ఎమిటా వివరాలు.. కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న సోలార్ స్కాంపై డిటెయిల్డ్ స్టోరీని ఈరోజు వైడ్ యాంగిల్ లో చూద్దాం... మరిన్ని వివరాలను వీడియోలో చూడండి...

 

21:34 - February 3, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌ నేతలపై దాడిచేసిన ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టి మిగతావారిని అరెస్టు చేస్తామని ప్రకటించారు. నిందితుల కాల్‌డాటా, సీసీ టీవీ ఫుటేజ్‌ కూడా ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. సౌత్‌జోన్‌ పరిధిలో మొత్తం 8కేసులు నమోదయ్యాయని డీసీపీ సత్యనారాయణ తెలిపారు.

 

ఎపి ప్రభుత్వ తీరుపై కన్నా ఆగ్రహం

గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులతో చర్చలంటూనే కేసులు పెడతున్నారని కన్నా పేర్కొన్నారు. తనపై పెట్టిన కేసును ఖండిస్తున్నట్లు తెలిపారు. సర్కార్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కాపు రిజర్వేషన్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ : కాపు రిజర్వేషన్లపై ఎపి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు కేఈ.కృష్ణమూర్తి, చిన రాజప్ప, కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. 

21:04 - February 3, 2016

పట్టుమీదికొచ్చిన పాతబస్తీ ఫైటింగ్ పంచాదీ..జట్టు కట్టబోతున్న పంతగీ పార్టీ ప్రతిపక్షాలు, సర్వే రిపోర్టులు జూసి మురిసిబోతున్న గెలిసెటోళ్లు, అవిటి సంగతి ఎరుకేనంటున్న తెలుసుకునోళ్లు, చిత్ర విచిత్రాలకు పేరుగాంచిన ఎన్నికల సంఘం.. సల్మాన్ ఖాన్ కు హైదరాబాద్ లో ఓటు హక్కు, నోట్లో బెల్లంపెట్టి... నెత్తిమీదికెళ్లి గుద్దిన సర్కార్, తెలంగాణల అంగన్ వాడీ అక్కల అరిగోస, నీళ్లు లేక తెర్లు, తెర్లు అయితున్న తెలంగాణ కాశ్మీర్.. మాటలు జెప్పి మాయమైన ముఖ్యమంత్రి, మూడో దినం సిరిసిల్ల కాడ ఆగిన చేనేత మగ్గాలు.. జీవితాలు కాదు... జీతాలు మార్చాల్నంట... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

20:57 - February 3, 2016

కాపుల రిజర్వేషన్ల అంశానికి సహేతుక పరిష్కారం కావాలని వక్తలు పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, బీసీ సంఘం నేత శ్రీనివాస్ గౌడ్, కాపునాడు జాతీయ సమన్వయకర్త గార్ల సుబ్రహ్మణ్యం, కరణం ధర్మశ్రీ, టిడిపి నేత...చందు సాంబశివరావు పాల్గొని, మాట్లాడారు. కాపులు, బీసీలు ఘర్షణ పడడం సరికాదన్నారు. సమస్యను జఠిలం చేయడం తగదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

20:43 - February 3, 2016

విజయవాడ : కాపు రిజర్వేషన్లను రాజకీయం చేస్తే సమస్య జఠిలమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని వివాదం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై 1994 నుంచి 2014 వరకు ఎవరూ మాట్లాడలేదన్నారు. 2014 ఎన్నికల్లో అన్ని పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాయన్నారు. బీసీలకు నష్టం జరగకుండా కాపులకు న్యాయం చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వైసిపిది రెండు నాల్కల ధోరణి కాదా అని ప్రశ్నించారు. కాపులు టీడీపీని నమ్మారని పేర్కొన్నారు. కాపులు వన్ సైడ్ గా టీడీపీకి ఓటు వేశారని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ పొలిటికల్ కాపుల రిజర్వేషన్లపై వర్క్ చేస్తుందని చెప్పారు. వచ్చే బడ్జెట్ లో కాపు కార్పొరేషన్ కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. కాపు నాయకులకు అన్ని విషయాలు వివరించామని తెలిపారు. జీవోలో ప్రభుత్వ అభిప్రాయం మాత్రమే చెప్పామని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తే.. రాష్ట్రానికి, ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. కాపులు, వెనుకబడివర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి ఘటనకు పాల్పడితే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుందన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ చేసే పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా...? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎందుకు కాపులను బిసిల్లో చేర్చలేదని ప్రశ్నించారు. కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం అంశాన్ని వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. కులం పేరుతో వైసిపి విధ్వంసం సృష్టిస్తుందన్నారు. తుని ఘటనలో రైలు దహనం కావడంతోపాటు 25 వాహనాలను కాల్చేశారని వాపోయారు. కాపు రిజర్వేషన్లను రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. 

 

 

20:15 - February 3, 2016

హైదరాబాద్ : కాపు రిజర్వేషన్లపై ఎపి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు కేఈ.కృష్ణమూర్తి, చిన రాజప్ప, కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు.

 

19:36 - February 3, 2016

అనంతపురం : జిల్లాలోని బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అనంతపురం నుంచి ధర్మపురం వెళ్తున్న ఓ లారీ బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో అదుపు తప్పి ముందు నుంచి వెళ్తున్న ఇన్నోవా కారును ఢీకొట్టింది. అనంతరం ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో కారు, బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ... లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. లారీ డ్రైవర్‌ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాద దృశ్యాలు పీఎస్‌ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

 

19:25 - February 3, 2016

హైదరాబాద్ : ఎపి తాత్కాలిక రాజధాని నిర్మాణంలో స్వల్ప మార్పులు చేశారు. అమరావతి టౌన్ షిప్ బదులు వెలగపూడి, మల్కాపురం పరిధిలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాపురం, వెలగపూడిలో నిర్మించనున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సీఆర్ డీఏ అధికారులు బిడ్లు తెరిచారు. సాంకేతిక పరమైన బిడ్లను మాత్రమే సీఆర్ డీఏ తెలిచింది. అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి రెండు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ఎల్‌ అండ్‌ టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. సాంకేతిక బిడ్లు తెరిచిన సీఆర్‌డీయే అధికారులు..10న తుది బిడ్లను ఓపెన్‌ చేయనున్నారు.

 

19:14 - February 3, 2016

హైదరాబాద్ : వలస కార్మికుల కో-ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌గా బసంత్‌రెడ్డి నియమితులయ్యారు. 35 వేల వలస కార్మికుల కోసం పోరాటం చేసేందుకు ఏర్పాటు చేసిన కో-ఆర్డినేషన్‌ కమిటీకి కన్వీనర్‌గా బసంత్‌రెడ్డిని నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. వలస కార్మికుల కోసం ఎంతో శ్రమిస్తున్న బసంత్‌రెడ్డిని వలస కార్మిక సంఘాల నేతలు ప్రశంసించారు. దుర్భర జీవితం గడుపుతున్న ఎంతో మందికి మంచి జీవితాన్ని ఇచ్చారని పొగడ్తలతో ముంచెత్తారు. 

 

ఎంఐఎం దాడులపై అఖిలపక్షం ఆగ్రహం..

హైదరాబాద్ : ఎంఐఎం దాడులపై కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. ఇతర ప్రతిపక్ష పార్టీలతో అఖిలపక్షం నిర్వహించిన నేతలు హైదరాబాద్‌లో రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. గవర్నర్‌ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కమిషన్‌ను కలిసి జరిగిన ఘటనలపై వివరించారు. రీపోలింగ్‌ ఆయా ప్రాంతాల్లో నిర్వహించాలని కోరారు. కాసేపట్లో గవర్నర్‌ను కూడా కలిసి నిన్నటి ఘటనలపై నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

19:05 - February 3, 2016

హైదరాబాద్ : ఎంఐఎం దాడులపై కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. ఇతర ప్రతిపక్ష పార్టీలతో అఖిలపక్షం నిర్వహించిన నేతలు హైదరాబాద్‌లో రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. గవర్నర్‌ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కమిషన్‌ను కలిసి జరిగిన ఘటనలపై వివరించారు. రీపోలింగ్‌ ఆయా ప్రాంతాల్లో నిర్వహించాలని కోరారు. కాసేపట్లో గవర్నర్‌ను కూడా కలిసి నిన్నటి ఘటనలపై నేతలు ఫిర్యాదు చేయనున్నారు.

ఎపి తాత్కాలిక రాజధాని నిర్మాణంలో స్వల్ప మార్పులు..

హైదరాబాద్ : ఎపి తాత్కాలిక రాజధాని నిర్మాణంలో స్వల్ప మార్పులు చేశారు. అమరావతి టౌన్ షిప్ బదులు వెలగపూడి, మల్కాపురం పరిధిలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాపురం, వెలగపూడిలో నిర్మించనున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సీఆర్ డీఏ అధికారులు బిడ్లు తెరిచారు. సాంకేతిక పరమైన బిడ్లను మాత్రమే సీఆర్ డీఏ తెలిచింది. ఎల్ ఆండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ బిడ్లు దాఖలు చేశారు. 

 

బత్తలపల్లి పీఎస్ ఎదుట లారీ బీభత్సం...

అనంతపురం : బత్తలపల్లి పీఎస్ ఎదుట లారీ బీభత్సం సృష్టించింది. లారీ వెనక నుంచి ఇన్నోవా కారును ఢీకొనడంతో కారు బోల్తా పడింది. అనంతరం లారీ అదుపు తప్పి బస్సును కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఇన్నోవా కారు డ్రైవర్ కు గాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.

 

తుని ఘటనలో గాయపడిన పోలీసులను పరామర్శించిన డీజీపీ

తూర్పుగోదావరి : జిల్లాలోని తుని ఘటనలో గాయపడిన పోలీసులను డీజీపీ రాముడు పరామర్శించారు. పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ రాముడు సమావేశం బుధవారం సమావేశం నిర్శహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుని ఘటనలో అమాయకులపై కేసులు పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. విధ్వంసం సృష్టించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ రాముడు అన్నారు.

గవర్నర్ ను కలిసిన అఖిలపక్ష నేతలు..

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో జరిగిన ఘటనలపై తెలంగాణ రాజకీయ పక్షాలు గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశాయి. ఎంఐఎం కార్యకర్తలు కాంగ్రెస్‌ నేతలపై దాడికి పాల్పడ్డారని... దీనికి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గవర్నర్‌ కలిసిన వారిలో కాంగ్రెస్‌, తెదేపా, భాజపా నేతలు ఉన్నారు.

17:57 - February 3, 2016

హైదరాబాద్ : ప్రజాప్రతినిధులపై ఎంఐఎం పార్టీ నేతలు, కార్యకర్తల దాడిని.. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలు ఖండించాయి. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందన్నారు. దీనికి సర్కారే బాధ్యత వహించాలన్నారు. ఈ అంశంపై ఈసీతోపాటు... గవర్నర్‌ నరసింహన్‌, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రణబ్‌లను కలుస్తామని స్పష్టం చేశారు.. అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. 

 

17:43 - February 3, 2016

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటయ్యేనా? పిడిపి-బిజెపిలు అధికారాన్ని పంచుకుంటాయా? లేక తుంచు కుంటాయా? మెట్టు దిగనంటున్న మెహబూబా ముఫ్తీతో బిజెపి జత కట్టేనా? మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై పిడిపి-బిజెపి తేల్చుకోవాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్‌ హుకూం జారీ చేశారు.

పిడిపి-బిజెపిలకు గవర్నర్‌ డెడ్‌లైన్

జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం కొలిక్కి వచ్చేనా? గత 10 నెలలుగా కలిసి పనిచేసిన పీడీపీ-బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుపై ఏదో ఒకటి తేల్చుకోవాలంటూ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా డెడ్‌లైన్ విధించారు. ఆ రెండు పార్టీలు కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయో లేదో మంగళవారం ఉదయం తమను సంప్రదించాలని ఆదేశించారు.

గవర్నర్ అల్టిమేటంతో రెండు పార్టీల్లో కదలిక

గవర్నర్ అల్టిమేటంతో రెండు పార్టీల్లోనూ కదలిక వచ్చింది. జమ్మూలో బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది. తాజా రాజకీయ పరిస్థితిపై కేంద్ర నేతలతో చర్చించేదుకు ఆ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లారు.

మారిన రాజకీయ సమీకరణాలు

ముఫ్తీ మహ్మద్ సయ్యిద్ మరణించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. పది నెలలు కలిసి అధికారం పంచుకున్న పీడీపీ-బీజేపీల మధ్య దూరం పెరిగింది. మిత్రపక్షం బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ముందుకు రాలేదు. సంయుక్త ఎంజెడాపై బీజేపీ తన వైఖరిని చెప్పాలంటూ మెలికపెట్టారు. ఆదివారం నాడు జరిగిన పిడిపి పార్టీ సమావేశంలో మళ్లీ ఎన్నికలకు వెళ్లడానికే మెహబూబా మొగ్గు చూపారు. దీంతో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ప్రమాదంలో పడింది. రాష్ట్ర రాజకీయ, ఆర్థిక అంశాలపై కేంద్రం వైఖరి స్పష్టం చేస్తేనే బీజేపీతో పొత్తు విషయం ఆలోచిస్తామంటూ తేల్చిచెప్పడంతో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. బిజెపి మాత్రం పిడిపితో కలిసి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న నమ్మకంతో ఉంది.

జనవరి 9 నుంచి కొనసాగుతోన్న గవర్నర్‌ పాలన

మెహబూబూ ముఫ్తీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో జనవరి 9 నుంచి జమ్ము కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన కొనసాగుతోంది.

 

17:40 - February 3, 2016

ఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్‌  కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. మున్సిపల్‌ కార్మికులకు తమ ప్రభుత్వం జీతాలు చెల్లించడం జరిగిందని ఆయన తెలిపారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌కు తమ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఏమి లేవని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం 893 కోట్లు చెల్లించామన్నారు. ఇది కాకుండా ఎన్ డిఎంసి కింద మరో వంద కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. ఈ డబ్బుకు సంబంధించిన లెక్కలను ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ చూపడం లేదన్నారు. దీని వెనక పెద్ద కుంభకోణం జరిగిందని, దీనిపై సిబిఐతో విచారణ జరపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్మికుల సమ్మె కారణంగా నగరంలోని హాస్పిటల్స్, స్కూళ్లలో పేరుకు పోయిన చెత్త చెదారాన్ని తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న తమ వేతనాలను వెంటనే విడుదల చేయాలని గత వారం రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. బీజేపీ పాలిత కార్పొరేషన్ల ప్రతినిధులు ఆందోళన వెనక ఉన్నారని ఆప్‌ ఆరోపిస్తోంది. కార్మికుల సమ్మె ఆప్‌, భాజపా మధ్య రాజకీయ వివాదాలకు తెరతీసింది.

 

17:33 - February 3, 2016

నిజామాబాద్ : చనిపోయిన తరువాత గుర్తుండేందుకు సమాధిని నిర్మిస్తారు. అది సంప్రదాయం. కానీ బతికుండగానే ఒ వ్యక్తి తన సమాధిని నిర్మించుకున్నాడు. కొడుకులకు తాను చనిపోయిన తరువాత ఎలాంటి భారం కావద్దనుకున్నాడో.. మరేమోగానీ తన భార్య సమాధి వద్దే తన సమాధిని నిర్మించుకున్నాడు.

పడాల గంగాధర్, చంద్రబాగు దంపతులు

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన పడాల గంగాధర్, భార్య పడాల చంద్రబాగు దంపతులకు ఇద్దరు కుమారులు. ఒకరు ఉపాధి నిమిత్తం అరబ్ దేశానికి వెళ్లగా... రెండవ కుమారుడు ఆర్ ఎంపి వైద్యునిగా పని చేస్తున్నాడు. కిరాణా కొట్టు నడుపుతూ జీవనం సాగించే గంగాధర్‌.. ప్రాణముండగానే తన సమాధి నిర్మించుకొని ఔరా అనిపిస్తున్నాడు. తన భార్య పడాల చంద్రబాగు ఏప్రిల్ 14, 2007లో డాబాపై నుండి పడి చనిపోయింది. జీవితాంతం కలిసి మెలసి ఉంటానన్న పెళ్లి నాటి ప్రమాణాలు గుర్తు తెచ్చుకొని గంగాధర్ తన వ్యవసాయ తోటలో భార్య సమాధి నిర్మించాడు. భార్య విగ్రహంతో పాటు తన విగ్రహన్ని ఏర్పాటు చేయించాడు. బతికుండగానే సమాధి కట్టించుకోవడాన్ని గ్రామస్తులు వింతగా చూస్తున్నారు.

భార్య ఒంటరి కాకూడదని..

బతికుండగానే సమాధి నిర్మించుకోవటం అంటే కొడుకులపై నమ్మకం లేక కాదని..తన సహ ధర్మచారిణి ఒంటరి కాకూడదన్నదే తన కోరిక అని గంగాధర్‌ అంటున్నాడు.

చంద్రబాగు పేరిట అమ్మ ఫౌండేషన్ ఏర్పాటు

చంద్రబాగు పేరిట ఆమె కొడుకు అమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు గ్రామాల్లో పేదలకు దుస్తులు క్రీడా సరికరాలు అందిస్తున్నారు. సమాధి నిర్మాణ విషయంలో ఎవరేమనుకున్నా తనకు అవసరం లేదని.. సమాధి వద్ద ఉద్యానవనంగా తీర్చిదిద్ది బాటసారులకు సేదతీర్చుతానని గంగాధర్‌ చెబుతున్నాడు.

 

17:29 - February 3, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ నాయకులపై ఎంఐఎం దాడులకు తెగబడటంపై అన్ని పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం వ్యవహరించిందని నేతలు విమర్శిస్తున్నారు. పాతబస్తీయేమైనా మజ్లిస్‌ సామ్రాజ్యమా అన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ధోరణులను ప్రతిఒక్కరూ ఖండించాలని సూచించారు.

పాతబస్తీలో ఉద్రిక్తత

గ్రేటర్‌ ఎన్నికలు మొదలైన దగ్గర్నుంచీ ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రశాంతంగా జరుగుతూ వచ్చింది. ఇంకో రెండు మూడు గంటల్లో ఎన్నికలు ముగుస్తాయనుకుంటుండగా పాతబస్తీలో ఉద్రిక్తత మొదలైంది. టిఆర్‌ఎస్‌ నేత డిప్యూటీ సిఎం మెహమూద్‌ అలీ తనయుడిపైన, అలాగే కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌అలీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపైనా ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

ఎంఐఎం చర్యను ఖండించిన వివిధ పార్టీలు

ఎంఐఎం చర్యను వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల చివరి సమయంలో పాతబస్తీలో కొన్ని దురదృష్టకర ఘటనలు జరగడం విచారకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధ్యులపై చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు. అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ అండజూసుకునే ఎంఐఎం పాతబస్తీలో చెలరేగిపోతోందని టిటిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆరోపించారు. పాతబస్తీలో ఎంఐఎం అరాచకాలకు అడ్డుకట్టవేయాలని రమణ సూచించారు.

తమ నేతలపై ఎంఐఎం దాడి అత్యంత హేయం : జానారెడ్డి

తమ నేతలపై ఎంఐఎం దాడి అత్యంత హేయమైన చర్యఅని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి అన్నారు. రిగ్గింగ్ కోసం ఎంఐఎం రౌడీలతో దాడి చేయించిందని రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

టిఆర్‌ఎస్‌ అండతోనే ఎంఐఎం దుర్మార్గాలు : కిషన్ రెడ్డి

ఎంఐఎం ఎంతటి ప్రమాదకరమైన పార్టీయో కాంగ్రెస్‌కు ఇప్పుడు తెలిసొచ్చిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌ అండ చూసుకునే ఎంఐఎం దుర్మార్గాలకు పాల్పడుతోందని విమర్శించారు.

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ఎంఐఎం : తమ్మినేని

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ ఎంఐఎం వైఖరి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేదిగా ఉందన్నారు. మజ్లిస్‌ నాయకులు సీపీఎం కార్యకర్తలతో పాటు, ఉప ముఖ్యమంత్రి మెహమూద్‌ అలీ తనయుడిపై దాడి చేయడం దారుణమన్నారు. ఈ తరహా చర్యలు ఏ మాత్రం క్షమార్హం కాదన్నారు. మజ్లిస్‌ నేతలు పాతబస్తీని తమ సామ్రాజ్యంగా భావిస్తూ... రౌడీయిజం చేస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు.

ఎంఐఎం దుందుడుకు ధోరణికి అడ్డుకట్టవేయాలి..

గన్‌మెన్ల రక్షణలో ఉండే అగ్రనాయకులకే పాతబస్తీలో సేఫ్టీ లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎంఐఎం దుందుడుకు ధోరణికి అడ్డుకట్టవేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు ఎంఐఎం కార్యకర్తల చేతిలో దాడికి గురైన కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఫిర్యాదు మేరకు ఎంపి అసదుద్దిన్‌ ఒవైసీపై మీర్‌చౌక్ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. ఇదే ఘటనకు ఎంఐఎం ఎమ్మెల్యే బలాలాను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

17:19 - February 3, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు, ఆ తర్వాత  ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు. 24 కేంద్రాల్లోని 88 హాళ్లలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

17:11 - February 3, 2016

పంజాబ్ : ఇఫ్‌కో చైర్మన్ సురీందర్ కుమార్ జక్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పంజాబ్ రాష్ట్రంలో అభోపూర్ లోని తన ఫామ్ హౌస్ లో సురీందర్ మరణించారు. 56 ఏళ్ల సురీందర్.. ఈ ఉదయం తన తుపాకిని శుభ్రం చేస్తుండగా అది పొరపాటున పేలి మరణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పేలుడు విన్న వెంటనే సురీందర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. సురీందర్..కేంద్ర మాజీ స్పీకర్ బలరామ్ జక్కర్ ముగ్గురు కుమారుల్లో రెండో వాడు. సురీందర్ జక్కర్ సహకార రంగంలో మూడు దశాబ్దాలుగా విశేష కృషి చేశారు. సురీందర్ మృతి పట్ల.. హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా తీవ్ర సంతాపం ప్రకటించారు. సహకార రంగానికి సురీందర్ సేవలు మరువరానివని అన్నారు.

 

17:00 - February 3, 2016

హైదరాబాద్ : కాపులకు రిజర్వేషన్‌కు సంబంధించిన జీవోలో క్లారిటీ లేదని వైసిపి నేత అంబటి రాంబాబు అన్నారు. మూడేళ్ల కాలవ్యవధితో మంజునాధన్‌ కమిటీ వేశారని గుర్తుచేశారు. ఈ కమిషన్‌ నివేదిక అంత త్వరగా పూర్తికాదని చెప్పుకొచ్చారు. ఉద్యమంలో చీలికకోసం సర్కారు చవకబారు ఎత్తుగడలు వేస్తోందని ఆరోపించారు.

 

16:48 - February 3, 2016

హైదరాబాద్ : వైద్య ఉద్యోగుల విభజన విషయంలో తెలంగాణ డాక్టర్లకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని వెల్లడించింది. డాక్టర్లు సబ్‌మిట్ చేసిన సర్టిఫికేట్స్‌ను మరోసారి పరిశీలించాలని కమిటిని ఆదేశించారు ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి. అప్పటి వరకు విభజన ప్రక్రియను ముగించోద్దని.... విభజకు మరో నెల రోజుల గడువు ఇవ్వాలని కమల్‌నాథన్‌ను సర్కార్‌ కోరింది.
ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష
వైద్య ఉద్యోగుల విభజనలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి లక్ష్మారెడ్డి. విభజనపై డాక్టర్ల జేఏసీ లేవనెత్తిన అంశాలపై చర్చించారు. విధాన పరంగా విభజన జరగలేదని.. అంతాలోటు పాట్లే ఉన్నాయని డాక్టర్ జేఏసీ నేతలు మంత్రికి ఫిర్యాదు చేశారు. స్టడీ సర్టిఫికేట్స్ వివరాలను కూడా కొందరు ఏపీ డాక్టర్లు ఇవ్వలేదని... దీంతో వారు తెలంగాణకు లోకల్‌గా చూపించుకుంటున్నారన్నారు. ప్రైవేటు ఉద్యోగాలను కూడా స్పౌస్ కేసులుగా చూపుతున్నారని డాక్టర్ల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. 
ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి...
డాక్టర్ల జేఏసీ లేవనెత్తిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని... విభజన కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్లు అందించిన సర్టిఫికేట్స్‌ను పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. పాలసీ అబ్జెక్షన్స్‌ను తిరిగి అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. అప్పటి వరకు విభజన ప్రక్రియను ముగింపు పలకొద్దని... కమల్‌నాథన్‌తో మాట్లాడి డాక్టర్ల విభజన గడువును మరో నెల వ్యవది పెంచేందుకు అనుమతి తీసుకున్నారు మంత్రి. డాక్టర్లకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వనని.. అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి లక్ష్మారెడ్డి. మొదటి నుంచి ఉద్యోగుల విభజనలో ఏపీ ఎంప్లాయిస్‌ తప్పుడు సర్టిఫికేట్స్ చూపుతున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు.

 

16:34 - February 3, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఘర్షణలు జరిగిన ఆరు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపే యోచనలో ఉన్నారు. కాసేపట్లో అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. 

తెలంగాణలో ఈనెల 5 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు...

హైదరాబాద్ : తెలంగాణలో ఈనెల 5 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు 3,08,091 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 

గ్రేటర్ లో రీపోలింగ్ జరిగే అవకాశం...

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ పరిధిలో రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఘర్షణలు జరిగిన ఆరు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపే యోచనలో ఉన్నారు. కాసేపట్లో అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

 

15:41 - February 3, 2016

సమాజంలో వరకట్నం, సతీసహాగమనం వంటి పలు సాంఘీక దురాచారాలు ఉన్నాయని అయితే.. ప్రస్తుతం సతీసహాగమనం లేకపోయినా.. వరకట్న దురాచారం కొనసాగుతూనే ఉందని లాయర్ పార్వతి అన్నారు. మానవి.. మైరైట్ చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. 
వరకట్న దురాచారం...
వధువు తరపు వారు వరునికి, వరుని తరపు వారు వధువుకి వివాహ సందర్భంగా ఇచ్చే డబ్బు, ఆస్తి, సెక్యూరిటీని
వరకట్నం అంటారు. వరకట్నాన్ని వధువు తల్లిదండ్రులు.. వరుని తల్లిదండ్రులకు.. లేదా వరుని తల్లిదండ్రులు వరుడి తల్లిదండ్రులకు ఇస్తారు. అది వివాహానికి సంబంధించినదై ఉండాలి. 1961 లో వరకట్న నిషేదం చట్టం అమలులోకి వచ్చింది' అని పార్వతి తెలిపారు. పలువురి కాలర్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

హస్తినలో 8వ రోజుకు మున్సిపల్‌ వర్కర్ల సమ్మె

ఢిల్లీ : హస్తినలో మున్సిపల్‌ వర్కర్ల సమ్మె 8వ రోజుకు చేరింది. జీతాలు అందకపోవడంతో ఆగ్రహించి రోడ్డెక్కిన కార్మికులు ఉదృతంగా నిరసనలు తెలియజేస్తున్నారు. వేలాది మంది కార్మికులు ప్రధాన కూడళ్ల వద్ద అడ్డంగా నిలబడడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సానిటేషన్‌ వర్కర్లు నేషనల్‌ హైవే పై కూడా నిరసనలు తెలియజేశారు. పురపాలక సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులు, పాఠశాలలకు ఇబ్బంది తలెత్తింది. ఆసుపత్రి సిబ్బంది, ఉపాధ్యాయులు, డాక్టర్లు అందరు సమ్మెలో పాల్గొనడంతో చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

15:10 - February 3, 2016

హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసులో ఎలా జైలుకు పోవాలో యువభేరిలో విద్యార్థులకు నేర్పిస్తారా అంటూ విమర్శించారు. కుంభకోణాల్లో మొదటి నిందితుడు అయిన జగన్ ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలా అంటూ ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రత్యేక హోదాపై ప్రశ్నించాడని చంద్రబాబు భయపడడం లేదని ఆయన అన్నారు. జగన్ లా ఈడీ కేసులు చంద్రబాబు పై లేవన్నారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించే విధంగా జగన్ యువభేరి ఉందని తెలిపారు.

14:56 - February 3, 2016

హైదరాబాద్ : తమ నేతలపై దాడి చేసిన ఎంఐఎం కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్‌ నేత వి. హనుమంతరావు డిమాండ్‌ చేశారు. మజ్లిస్‌తో కాంగ్రెస్‌ మోసపోయిందని..టీఆర్‌ఎస్‌ కూడా మోసపోవద్దని కేసీఆర్‌కు సూచించారు. పాతబస్తీలో తమ ప్రాభల్యం తగ్గిపోతోందనే.. మజ్లిస్‌ ఇలాంటి దాడులకు దిగుతోందని ఆరోపించారు.

 

14:54 - February 3, 2016

కృష్ణా : విజయవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమైంది. రాజీవ్ గాంధీ పూల మార్కెట్ సమీపంలో ఉన్న గుడిసెలో వంట చేస్తున్న సమయంలో గుడిసెకు మంటలు అంటుకున్నాయి. మంటలు మిగిలిన ఇళ్లకు అంటుకుని మొత్తం 300 ఇళ్లు దగ్ధం అయ్యాయి. ఓ ఇంట్లోని సిలిండర్ పేలడంతో మహిళ సజీవదహనం అయింది. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్షతగాత్రులైనవారికి, నష్టపోయిన వారిని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని, ఇళ్లు నిర్మిస్తుందని మంత్రులు తెలిపారు. కాసేపట్లో ఘటనాస్థలానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. 

 

అగ్నిప్రమాదంలో మహిళ సజీవదహనం

కృష్ణా : విజయవాడ పూల మార్కెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ సజీవ దహనం అయింది. పూల మార్కెట్ లోని గుడిసెలు తగులబడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.

13:36 - February 3, 2016

హైదరాబాద్ : కాపులకు బీసీల్లో చేర్చి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో బీసీలందరూ కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. 'రిజర్వేషన్లు పేదరిక నిర్మూలనా పథకం కాదు, ప్రతి కులానికి చెందిన వారిలో వెనకబడిన వారిని అభివృద్ధి చేయడానికి రిజర్వేషన్లు ఇవ్వాలి. వాటా కోసం జరిగే పోరాటమే రిజర్వేషన్లు. జనాభాకు మించిన రిజర్వేషన్లు కాపులకు ఉన్నాయి. కాపులను బీసీల్లో కలిపితే బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీల్లో చాలా ఆందోళన ఉంది. ఈ అంశంలో సీఎం చంద్రబాబు ఏకపక్ష వైఖరి మార్చుకోవాలి. ఏపీలో గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించాలని పిలుపునిచ్చాం. ప్రతి జిల్లాలో 5 లక్షల మందితో మీటింగ్ ఏర్పాటు చేసి బీసీ సత్తా చూపిస్తాం. సామాజిక విలువల మీద పాలన సాగాలి. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన 16 హామీలను అమలు పర్చాలని డిమాండ్ చేశారు. కాపులను బీసీ రిజర్వేన్లలో కలపకుండా… కాపుల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లుకల్పించాలి. కాపులను బీసీల్లో కలపడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 138 కులాకు చెందిన బీసీ లు ఉద్యమంలో పాల్గొనాలని' కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

ఢిల్లీ : దేశరాజధానిలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ గత 8 రోజులుగా ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు ఉదయం 24వ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కార్మికుల ఆందోళనపై ఎట్టకేలకు దిల్లీ ప్రభుత్వం స్పందించింది. కార్మికుల సమస్యలపై మధ్యాహ్నం 3గంటలకు ప్రకటన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటన కార్మికులకు సంతృప్తి కలిగేలా ఉంటుందని పేర్కొన్నారు.

కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నాం: బీసీ సంఘాలు

విజయవాడ : కాపులను బీసీల్లో చేర్చడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని బీసీ సంఘాల నేతలు తెలిపారు. 25 బీసీ సంఘాలు విజయవాడలో సమావేశం నిర్వహించాయి. కాపు కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి లేదని, కాపుల ఒత్తిడికి తలొగ్గి జీవో ఇస్తే అభాసుపాలవుతారని హెచ్చరించారు. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని బీసీ సంఘాలు నేతలు హెచ్చరించారు.

12:54 - February 3, 2016

హైదరాబాద్ : పాతబస్తీ ఘటనపై టీ కాంగ్రెస్‌ అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆ పార్టీ సీఎల్పీ నేత జానారెడ్డి నేతృత్వంలో ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఉత్తమ్‌, షబ్బీర్‌ అలీలపై ఎంఐఎం నేతల దాడిపై ఈ భేటీలో చర్చించారు. 

12:53 - February 3, 2016

కర్నూలు : ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై పార్టీ మారాలని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారు. నిన్నటి రాహుల్ సభకు ఆహ్వానం అందకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కార్యకర్తలు.కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటికి కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో అధిష్టానం పెద్దలు ముందస్తు చర్యలు చేపట్టి బుజ్జగింపు కార్యక్రమాలు మొదలుపెట్టింది.

12:50 - February 3, 2016

హైదరాబాద్ : పాతబస్తీ దాడి కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే బలాలకు బెయిల్‌ మంజూరయ్యింది.బలాలకు నాంపల్లి కోర్టుబెయిల్‌ మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ఇంటిపై దాడి కేసులో బలాలపై మలక్‌పేట్‌ పీఎస్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 

12:47 - February 3, 2016

విజయవాడ : తుని ఘటనకు వైఎస్సార్‌సీపిదే బాధ్యత అని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ....తుని ఘటనలో తనను ఇరికించేందుకు వైసిపి అధినేత జగన్‌ కుట్రలు పన్నుతున్నాడని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికలో మాత్రమే తన గురించి రాసారంటే జగన్‌ ఏవిధంగా తనపై కుట్రలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని మంత్రి నారాయణ అన్నారు. 

12:46 - February 3, 2016

నల్గొండ : పిచ్చికుక్క దాడి చేసి నలుగురిని తీవ్రంగా గాయపరిచిన సంఘటన నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలం సంగెంలో చోటుచేసుకుంది. కుక్కలు నలుగురి పై ఇష్టం వచ్చినట్లు దాడిచేయడంతో .. గాయత్రి అనే పాపకు తీవ్రంగా గాయాలు కావడంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రి లో ప్రథమ చికిత్సచేసినా.. పాప పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్ కు తరలించారు. 

12:44 - February 3, 2016

వరంగల్ : సమ్మక్క-సారలమ్మ గిరిజన జాతరకు వరంగల్ జిల్లా మేడారం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరిగే ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. దీంతో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మూడు నెలలుగా జాతరకు సంబంధించి అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. 162 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న మొద‌టి సమక్క సారలమ్మ జాత‌ర కావ‌డంతో సర్కార్‌ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది.

17 నుండి మేడారంజాతర...

ఈనెల 17 నుంచి నాలుగు రోజులపాటు జరుగనున్న మేడారం జాతరకు అప్పుడే జనం తాకిడి ప్రారంభమైంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత నెల రోజులు నుంచే ముందస్తు మొక్కులు ఊపందుకున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జంపన్నవాగు వద్ద అధికారులు చేసిన స్వల్ప ఏర్పాట్లు భక్తులను సంతృప్తి పరచడం లేదు. ఈసారి కోటీ 50లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర జరిగే సమయంలో విపరీతమైన రద్దీ నెలకొంటుంది. దానిని తట్టుకోలేని వృద్ధులు, పిల్లలు, మొక్కుబడులు ఉన్నవాళ్లు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు ముందస్తుగా మేడారం బాట పట్టారు.

గిరిజన సంప్రదాయం ప్రకారం.....

గిరిజన సంప్రదాయం ప్రకారం గద్దెలపై పసుపు, కుంకుమ, బంగారంగా భావించే బెల్లం, నూతన వస్ర్తాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేల సంఖ్యలో వస్తున్న భక్తులతో జంపన్నవాగు స్నానఘట్టాలు, ఆలయంలో, క్యూలైన్లలో, ప్రధాన రహదారులలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. జంపన్నవాగు, శివరాంసాగర్‌ చెరువు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాలలోని చెట్లకింద వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా విడిది చేసి వంటలు చేస్తున్నారు. భక్తులు వేలాదిగా తరలిరావడంతో అధికారులు ప్రధాన గేట్‌ను మూసివేసి క్యూలైన్ల ద్వారా భక్తులను అనుమతిస్తున్నారు. అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లకుండా దూరం నుంచి దర్శించుకునేలా చర్యలు చేపట్టారు.

పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు.....

మహాజాతర సందర్భంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తులకు సేవలందించేందుకు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ సహకారం తీసుకుంటున్నారు. సుమారు వెయ్యి మంది పోలీసులు గద్దెల సమీపంలో విధులు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు గద్దెల లోపలికి వెళ్లే ప్రధాన ద్వారాన్ని మూసేశారు. భక్తులు సమర్పించే కొబ్బరి, బెల్లం తదితర ద్రవ్యాలను గద్దెలపైకి విసురుతున్నారు. అమ్మవార్ల చుట్టూ ఏర్పాటు చేసిన గ్రిల్స్ వద్దనే భక్తులు కొబ్బరి కాయలు కొడుతుండడంతో గద్దెల ప్రాంగణమంతా బురద మయమైంది. అయితే గద్దెల చుట్టూ టైల్స్‌ వేయడంతో బురదకు భక్తులు జారిపడుతూ ఇబ్బందికరంగా మారింది.

జంపన్నవాగు, జంపన్నగద్దె పక్కన స్నానఘట్టాలు....

జంపన్నవాగు, జంపన్నగద్దె పక్కన, ఎదురుగా రెండువందల మీటర్ల పొడవులో చిన్ననీటి పారుదల శాఖాధికారులు జల్లుస్నానాలు చేసే ఏర్పాట్లు చేశారు. అమ్మవార్లకు తలనీలాలర్పించేచోటా రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి రెండేళ్లకోసారీ జరిగే జాతర కావడం.. భక్తుల ముందస్తు మొక్కులు చెల్లిస్తుండడంతో సందడి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జాతరకు ముందే రికార్డు స్థాయిలో 15 లక్షల మంది రావడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. 

17 నుండి సమ్మక్క, సారలమ్మ జాతర....

వరంగల్ : ఆసియాలోనే అతిపెద్దదైన గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ వేడుక. ఈ నెల 17 నుంచి జరిగే ఈ వేడుకకు భక్తులు పోటెత్తుతున్నారు. మేడారం జనారణ్యంగా మారుతోంది. అన్ని దారులూ ఏటూరునాగారం వైపు సాగుతున్నాయి. వారం రోజుల ముందే ముందస్తు మొక్కులతో భక్తులు వనదేవతల ప్రసన్నం కోసం తరలి వస్తున్నారు. మరోవైపు జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

12:40 - February 3, 2016

గుంటూరు : నగరంలో కోతులు రెచ్చిపోతున్నాయి. మహిళలు, పిల్లలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నగర శివారులో ఉన్న ఇందిరా ప్రియదర్శిని కాలనీలో కోతుల భయంతో జనం భయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. గత మూడు నెలలుగా దాదాపు 70 కోతులు ఇక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. స్థానిక శివాలయంలోని చెట్లపైకి ఎక్కి చుట్టు ప్రక్కల వారిపై దాడికి దిగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో స్కూల్‌, కాలేజ్‌లకు వెళ్లే పిల్లలపైన, ఇంటి ముందు పని చేసుకుంటున్న మహిళలపై దాడి చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వృద్ధురాలు కోతి దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆమెను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

నెల్లూరులో ఆరుగురు ఎర్రచందనం కూలీల అరెస్ట్...

నెల్లూరు: ఎర్రచందనం అక్రమార్కులను అరికట్టేందుకు పోలీసులు, అటవీశాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎర్రచందనం యదేచ్ఛగా తరలివెళ్తోంది. ఈ క్రమంలో మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి దగ్గర అటవీ సిబ్బంది పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను వారు గుర్తించారు. దాదాపు రూ.6 లక్షలు విలువచేసే 42 దుంగలు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీఅధికారులను గుర్తించిన ఎర్రచందనం కూలీలు 20 మంది అక్కడి నుంచి పరారయ్యారు. అటవీశాఖ బైకును సైతం అపహరించారు. ఆరుగురు తమిళనాడు కూలీలను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ఎమ్మెల్యే బలాలకు బెయిల్ మంజూరు

హైదరాబాద్ : ఎమ్మెల్యే బలాలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డిప్యూటీ సీఎం మహ్మద్‌అలీ ఇంటిపై దాడి కేసులో ఎమ్మెల్యే బలాల నిందితుడు. మలక్ పేట పీఎస్ 341, 448,427,506,147 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు తరలించారు.

లోక్ సభ 8వ స్పీకర్ బలరాం జక్కర్ కన్నుమూత..

హైదరాబాద్ : లోక్ సభ 8వ స్పీకర్, సీనియర్ కాంగ్రెస్ నేత బలరాం జక్కర్ ఈ ఉదయం 7 గంటల సమయంలో స్వగృహంలో మరణించారు. జక్కర్ వయసు 92 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం రేపు పంజాబ్ లోని అబోహర్ కు తరలించనున్నట్టు కాంగ్రెస్ నేత, జక్కర్ కుమారుడు సునీల్ జక్కర్ తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు అబోహర్ సమీపంలోని పంచకోశిలో అంత్యక్రియలు జరుగుతాయని అన్నారు.

 

11:51 - February 3, 2016

విజయవాడ : రాజధాని నిర్మాణంలో భాగంగా ఇళ్లను కోల్పోతున్న గ్రామస్తులకు మెరుగైన నష్టపరిహారం ఇస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. ఆయన బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ....మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా కొన్ని రోడ్లు గ్రామాల నుంచి వెళ్తున్నాయని అలాంటి వాటిలో ఇళ్లను తొలగించాల్సి వస్తుందన్నారు. రోడ్ల నిర్మాణంలో భాగంగా సుమారు వెయ్యి ఇళ్లను తొలగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అతి త్వరలో రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని మంత్రి నారాయణ ప్రకటించారు. రాజధాని నిర్మాణ టెండర్లను ఇవాళ ఓపెన్‌ చేసి త్వరలో టెండర్లను ఖరారు చేస్తామన్నారు.

11:49 - February 3, 2016

విజయవాడ: కాపు రిజర్వేషన్, మంజునాథన్ కమిషన్‌ ఏపీ కేబినెట్‌లో ప్రధానంగా చర్చిస్తామంటున్నారు ఏపి మంత్రి పల్లె రఘునాథరెడ్డి. ఆయన బుధవారం విజయవాడలో 'టెన్ టివి'తో మాట్లాడుతూ...కాపు రిజర్వేషన్లపై మంజునాథన్ కమిషన్ రిపోర్టులు వచ్చాకే తుది నిర్ణయమంటున్న మంత్రి పల్లె స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ బీసీలకు అన్యాయం జరగకుండా చూస్తామని.... కావున బీసీలు ఆందోళన పడాల్సిన అవసరంలేదని తెలిపారు.

ముద్రగడపై 76 కేసులు నమోదు..

తూ.గో : తుని లో జరిగిన హింసాత్మక ఘటనలో ముద్రగడ పై రైల్వే శాఖ సెక్షన్ 163, 164 కింద 76 కేసులు నమోదు చేసింది. తన రెండు గన్‌లను ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి పోలీసులకు అప్పగించారు. లైసెన్స్ రివాల్వర్‌తో పాటు సింగల్ బ్యారల్ గన్ ను పోలీసులకు అందజేశారు. ఉద్దేశపూర్వకంగా రైల్వే ట్రాక్ లపైకి రావడం రైల్వే ఆస్తులను తగలబెట్టడంపై కేసులు నమోదు చేసిందిరైల్వే శాఖ .

11:45 - February 3, 2016

తూ.గో : కాపు గర్జన సభ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘటనలో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. దుండగులు వచ్చిన వాహనాలను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కర్చీఫ్‌లు కట్టుకుని వచ్చిన కొంతమంది ఉద్దేశపూర్వకంగానే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌పై దాడికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి ప్రయాణికుల సెల్‌ఫోన్‌ వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

ముద్రగడపై 76 కేసులు నమోదు..

తుని లో జరిగిన హింసాత్మక ఘటనలో ముద్రగడ పై రైల్వే శాఖ సెక్షన్ 163, 164 కింద 76 కేసులు నమోదు చేసింది. తన రెండు గన్‌లను ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి పోలీసులకు అప్పగించారు. లైసెన్స్ రివాల్వర్‌తో పాటు సింగల్ బ్యారల్ గన్ ను పోలీసులకు అందజేశారు. ఉద్దేశపూర్వకంగా రైల్వే ట్రాక్ లపైకి రావడం రైల్వే ఆస్తులను తగలబెట్టడంపై కేసులు నమోదు చేసిందిరైల్వే శాఖ .

11:39 - February 3, 2016

తూ.గో : ఈనెల 5 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈలోగా జైల్లో పెడితే జైల్లోనే దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో బుధవారం ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ...కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కాపులను బీసల్లోకి చేర్చేంత వరకు పోరాటం సాగిస్తానన్నారు. కాపు నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సంతృప్తిగా లేవు. కాపు జాతిని కరివేపాకుగా చూడటం అటవాటు గా మారిందన్నారు. తన అనుచరులు, కాపు కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. తునిలో దహనకాండకు ప్రభుత్వమే రూపకల్పన చేసిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని, ప్రభుత్వ చర్యల కారణంగా బయట పెట్టలేకపోతున్నామన్నారు. ఉద్యమానికి, ఉద్యమకారులకు తాను అండగా ఉంటానని, ఒకరిని అరెస్టు చేస్తే వందమంది జైలుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

11:39 - February 3, 2016

తూ.గో : ఈనెల 5 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈలోగా జైల్లో పెడితే జైల్లోనే దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో బుధవారం ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ...కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కాపులను బీసల్లోకి చేర్చేంత వరకు పోరాటం సాగిస్తానన్నారు. కాపు నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సంతృప్తిగా లేవు. కాపు జాతిని కరివేపాకుగా చూడటం అటవాటు గా మారిందన్నారు. తన అనుచరులు, కాపు కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. తునిలో దహనకాండకు ప్రభుత్వమే రూపకల్పన చేసిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని, ప్రభుత్వ చర్యల కారణంగా బయట పెట్టలేకపోతున్నామన్నారు. ఉద్యమానికి, ఉద్యమకారులకు తాను అండగా ఉంటానని, ఒకరిని అరెస్టు చేస్తే వందమంది జైలుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

ప్రారంభమైన ఏపీ కేబినెట్

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం బుధవారం ఉదయం ప్రారంభమైంది. కాపుల రిజర్వేషన్ అంశంపై ప్రధానంగా చర్చ జరుగనుంది. అలాగే శాసనసభ సమావేశాలపై చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరుగనుంది. వివిధ సంస్థలకు భూకేటాయింపులపై సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ భేటీలో కొత్త సీఎస్ టక్కర్ పాల్గొననున్నారు. 

లష్కరే తోయిబా ఉగ్రవాది అజీజ్ అరెస్ట్...

హైదరాబాద్ : లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు లక్నో విమానాశ్రయంలో అబ్దుల్ అజీజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అజీజ్ నగరంలోని గణేశ్ ఆలయం పేల్చివేత కుట్ర కేసుతో పాటు మరో కేసులో ప్రధాన నిందితుడు. బెయిల్‌పై విడుదలై 2003లో సౌదీకి పారిపోయాడు. సౌదీ నుంచి ఆ దేశ ప్రభుత్వం అజీజ్‌ను వెనక్కి పంపింది. నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు లక్నోలో అజీజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదిని తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యే బలాల

హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే బలాలను బొల్లారం పోలీస్‌స్టేషన్‌ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. డిప్యూటీ సీఎం మహ్మద్‌అలీ ఇంటిపై దాడి కేసులో ఎమ్మెల్యే బలాల నిందితుడు. బలాలను కోర్టుకు తరలించడంతో మజ్లిస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 

రాహుల్ గాంధీ పై కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అసంతృప్తి...

కర్నూలు : రాహుల్‌గాంధీపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న అనంతపురం జిల్లా బండ్లపల్లిలో జరిగిన రాహుల్‌ పర్యటనలో తనను వేదికపైకి పిలవకపోవడంపై కోట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రాత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని కాంగ్రెస్ నేతలు బాపిరాజు, పల్లంరాజులు బుజ్జగించారు. అయినా కోట్ల వర్గీయులు ససేమీరా అంటున్నారని సమాచారం.

 

ఈడీ పిలుపు మేరకు ఢిల్లీకి జగన్

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. రేపు ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ అందులో తెలిపారు. దాంతో విచారణకు హాజరయ్యేందుకు రేపు ఢిల్లీ వెళుతున్నట్టు సమాచారం. అక్కడి ఖాన్ మార్కెట్ లో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయంలో ఆయనను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే వైసీపీ నేత, ఆడిటర్ విజయసాయిరెడ్డికి కూడా సమన్లు ఇవ్వగా ఆయన ఇవాళ ఢిల్లీ వెళుతున్నట్టు తెలిసింది. క్విడ్ ప్రోకో కింద భారీ మొత్తంలో జగన్ కంపెనీలలోకి వచ్చిన పెట్టుబడులపై ఈడీ తరపున ఇంకా కాన్ని చార్జిషీట్లు పెండింగ్ లో ఉన్నాయి.

5వ తేదీ నుండి ఆమరణదీక్ష : ముద్రగడ

తూ.గో : ఈనెల 5 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈలోగా జైల్లో పెడితే జైల్లోనే దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. తన అనుచరులు, కాపు కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. తునిలో దహనకాండకు ప్రభుత్వమే రూపకల్పన చేసిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని, ప్రభుత్వ చర్యల కారణంగా బయట పెట్టలేకపోతున్నామన్నారు.

10:46 - February 3, 2016

విశాఖ పట్టణం : నగరంలో జరుగుతున్న ప్రపంచస్ధాయి నేవీ ప్రదర్శనను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వివిధ దేశాల నుంచి నగరానికి ప్రతినిధులు రానున్న నేపథ్యంలో.. నగర పరిశుభ్రతపై అధికారులు దృష్టి సారించారు. నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పబ్లిక్‌ ప్రాంతాల్లో చెత్త కనిపించకుండా చూడాలని మున్సిపల్‌ సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమాయత్తమైంది.

నగర ప్రతిష్ఠను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలంటే ....

మరోవైపు నగర ప్రతిష్ఠను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలంటే ప్రజలంతా సహకరించాలని కోరారు జీవీఎంసీ కమిషనర్‌. చెత్తను రోడ్లపై వేయకుండా.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. జీవీఎంసీ గోడలపై ఎలాంటి పోస్టర్లు అంటించకూడదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జీవీఎంసీ విస్తృత ఏర్పాట్లు .....

ఇక విశాఖలో ఏడున జరిగే ఆపరేషనల్‌ డెమో, ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌కు భారీగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో జీవీఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫ్లీట్‌ రివ్యూకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. 

10:42 - February 3, 2016

కడప : జిల్లా మైలవరం మండలం బోగాలకట్ట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి..విద్యుత్‌షాక్‌తో తండ్రీ కొడుకులు మృతి చెందారు. గ్రామానికి చెందిన ద్వారకచర్ల లక్ష్మారెడ్డి, అతని కుమారుడు గురుమోహన్‌రెడ్డి పొలానికి నీరు పెట్టడానికి వెళ్లారు. లక్ష్మారెడ్డి స్టార్టర్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. తండ్రిని రక్షించేందుకు ప్రయత్నించిన గురుమోహన్‌రెడ్డి కూడా విద్యుత్‌ షాక్‌తో చనిపోయాడు. తండ్రీ కొడుకుల మృతితో బోగాలకట్ట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

10:41 - February 3, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. కాపులకు రిజర్వేషన్లపై త్వరగా నివేదిక ఇవ్వాలని జస్టిస్‌ మంజునాథ కమిషన్‌కు సూచించేలా తీర్మానించే అవకాశముంది. జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ విధివిధానాలు, కాపు కార్పొరేషన్‌కు 2వేల కోట్లు కేటాయింపు డిమాండ్‌పై మంత్రివర్గం చర్చించనుంది. దాంతో పాటు పోలవరం, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి చేపట్టాల్సిన చర్యలు, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలపై మంత్రివర్గ భేటీలో చర్చ జరిగే అవకాశముంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మంత్రివర్గ తొలిసారి సమావేశంలో ఏపీ సీఎస్‌ టక్కర్‌ పాల్గొనున్నారు.

 

10:38 - February 3, 2016

హైదరాబాద్ : పాత బస్తీ ఘటనలపై పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. ఉత్తమ్‌, షబ్బీర్‌లపై దాడికి కారణమైన వారిపై కేసులో నమోదు చేశారు. అసదుద్దీన్‌తో ఓవైసీతో పాటు ఎంఐఎం కార్యకర్తలపై పలు కేసులు ఫైల్‌ చేశారు. మొత్తం 149 కేసులు నమోదుచేశామని పోలీసులు తెలిపారు. 

10:29 - February 3, 2016

హైదరాబాద్ : పూట గడవని స్థితిలో నేత కార్మికులు సమ్మె బాట పట్టారు. వస్ర్తోత్పత్తి ఖిల్లా సిరిసిల్లలో కనీస వేతనాలు అమలు చేయాలంటూ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. కార్మికులు చేస్తున్న ఊడిగం యాజమాన్యాలకు లాభాలు తెచ్చి పెడుతున్నా కార్మికులను మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. పస్తులుంటూనే మరో వైపు సమ్మె బాట పట్టిన సిరిసిల్ల చేనేత కార్మికుల పోరాటంపై 10టీవీ ప్రత్యేక కథనం.

చేనేత రంగంపైనే వేలాది మంది కార్మికులు.....

కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వస్ర్తోత్పత్తి కీలక రంగం. చేనేత రంగంపైనే వేలాది మంది కార్మికులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే యంత్రాలున్నప్పటికీ మానవీయ శక్తితో ఎక్కువ శాతం వస్ర్తాలు తయారవుతుంటాయి. ఇప్పటికీ చాలా మంది సాంచాలతో వస్త్రాలను నేస్తుంటారు. సిరిసిల్లలో మొత్తం ఏడు వేల సాంచాలపై దాదాపు ఆరు వేల మంది ఆసాములు, కార్మికులు జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ మగ్గాలపై నేసిన వస్త్రాలు నాణ్యతతో ఉంటాయి. ఇవే యజమానులకు లాభాలను తెచ్చి పెడుతున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన వస్త్రాన్ని పెట్టికోట్స్, బనియన్స్, టవల్స్‌కు ఎక్కువగా ఉపయోగిస్తారు.

ప్రతి రెండు సంవత్సరాలకోసారి వేతన సవరణ చేయాల్సి ఉంది.....

చేనేత రంగంపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులకు ప్రతి రెండు సంవత్సరాలకోసారి వేతన సవరణ చేయాల్సి ఉంది. ఈ విధంగా ఒప్పందం ఉన్నా యాజమాన్యాలు మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాయి. నెల క్రితం వేతనాల పెంపు కోసం కార్మికులు సమ్మె చేపట్టగా.. యాజమాన్యాలు త్వరలోనే వేతనాలు పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఆసాములను, కార్మికులను బుజ్జగించి సమ్మెను విరమింప చేశాయి. కొత్త వేతనాలపై ఆశతో ఉన్న కార్మికులకు నెల గడిచినా యజమానుల నుంచి స్పందన లేకపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో సమ్మె బాట పట్టారు.

పన్నెండు గంటలు కష్టపడితే రోజుకు 180 రూపాయలు...

2013లో యజమానులతో జరిగిన చర్చల్లో నూతన వేతన ఒప్పందం కుదిరింది. అప్పటి ఒప్పందం ప్రకారం పది పిక్కులకు 32 పైసలు చెల్లిస్తున్నారు. కొత్తగా 45 పైసలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పన్నెండు గంటలు కష్టపడితే రోజుకు 180 రూపాయల వరకే సంపాదించ గలుగుతున్నామని... పెరిగిన నిత్యావసర ధరలతో జీవనం కష్టంగా ఉందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

యాజమానుల కంటే కార్మికులకే ఎక్కువగా నష్టం....

సాంచాలు బంద్ పెడితే యాజమానుల కంటే కార్మికులకే ఎక్కువగా నష్టం వస్తుంది..ఎందుకంటే కార్మికులు దినం కూలి చేస్తే తప్పా ఐదు వేళ్ళు నోట్లోకి పోని పరిస్థితి. ఈ విషయం తెలిసిన యజమానులు కొంత మొండి పట్టుగా వ్యవహరిస్తూ వేతనాల పెంపుపై జాప్యం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తమ జీవనం దుర్భరంగా ఉందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో పక్క మార్కెట్ లో పోటీ .....

సిరిసిల్ల చేనేత వస్త్ర రంగానికి మరో పక్క మార్కెట్ లో పోటీ పెరుగుతోంది. పాలీ, బల్హోత్రా, ఈరోడ్ నుంచి మార్కెట్ లోకి తక్కువ ధరలకు కాటన్ వస్త్రాలు వస్తుండటంతో సిరిసిల్ల మార్కెట్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సిరిసిల్ల వస్త్రాలకు నాణ్యత ఉన్నా మార్కెట్‌లో ధర పలకలేని దుస్థితి ఏర్పడటంతో యజమానులు కూడా వేతనాలు పెంపుపై తర్జనభర్జనలు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్లను టెక్సైటైల్‌జోన్‌గా ప్రకటించి చేనేత వస్త్ర పరిశ్రమను ఆదుకుంటామని చెప్పినా ఇంత వరకు హామీ కార్యరూపం దాల్చడం లేదు. దీంతో ఇక్కడి పరిశ్రమలు ఎప్పుడు మూత పడుతాయోనని కార్మికవర్గం ఆందోళనలో ఉంది. 

ఏపీ ఐసెట్ షెడ్యూల్ ఇలా...

విశాఖపట్నం: డిగ్రీ విద్యార్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆంధ్రప్రదేశ్ ఐసెట్-2016 షెడ్యూల్ విడుదల అయింది. ఆంధ్రా యూనివర్సిటీ వీసీ వీఎస్ఎన్ రాజు బుధవారం ఐసెట్ షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు.

ఏపీ ఐసెట్ - 2016 షెడ్యూలు వివరాలు:

కేటీపీపీ రెండోదశలో సాంకేతిక లోపం..

వరంగల్ : ఘన్‌పూర్ మండలం చెల్పూర్ కేటీపీపీ రెండోదశలో పనులు నిలిచిపోయాయి. ఎలక్ట్రానిక్ వ్యవస్థలో సాంకేతికలోపం తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాని సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

హైదరాబాద్: నేడు ప్రారంభం నుండి స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెనెక్స్ 240 పాయింట్లు, నిఫ్టి 70 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి.

09:06 - February 3, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ ఎస్ కు ఆధిక్యత చాటుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ ఎన్నికల విషయంలో టిఆర్ ఎస్ కు ధీమా పెరిగింది. మొత్తం స్థానాల్లో పోటీచేసిన గులాబి పార్టీ కనీసం 80 స్థానాల్లో విజయం సాధిస్తానని అంచనా వేస్తోంది. మరో వైపు టిఆర్ ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని ఎగ్జిపోల్స్ సర్వేలు, రాజకీయ పార్టీల నేతల ఆఫ్ ద రికార్డుల ప్రకారం తెలుస్తోంది. పూర్తిగా ఆధిక్యం టిఆర్ ఎస్ వస్తుందో లేదో చూడాల్సిందే. అనేక పరిస్థితులు టిఆర్ ఎస్ కు అనుకూలంగా మారాయా? ఎంఐఎంతో టిఆర్ ఎస్ కు వ్యూహాత్మక అవగాహన పెట్టుకుందా? సంక్షేమ పథకాలు కూడా పని చేశాయా? ప్రజల్లో కేసీఆర్ పై ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ పని చేసిందా? క్షేత్రస్థాయిలో బలమైన నేతలను టిఆర్ ఎస్ లోకి చేర్చుకున్నారు. అన్ని పార్టీ పాలనను చూసిన ప్రజలు కొత్తగా వచ్చిన టిఆర్ ఎస్ పాలనను కూడా చూద్దామని ఆశించారా? తెలంగాణ లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు టిఆర్ ఎస్ కు ఓట్లు వేశారా? సీమాంధ్ర ఓటర్లు టిఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం లేదా? నగర ఓటర్లు ఎందుకు ఓటింగ్ పాల్గొనలేదు?

ఉపాధి హామీ పథకం సంపద సృష్టించే విధంగా ఉండాలి....

జాతీయ ఉపాధి హామీ పథకానికి నిన్నటికి పదేళ్లు ముగిశాయి. అయితే దీనిని కుదించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ఈ పథకం వల్ల కూలి రేట్లు పెరిగాయా? ఉపాధి హామీలో కూలీలకు నైపుణాన్ని అందించాలి. ఉపాధితో పాటు సంపద సృష్టించే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ పథకంలో లోపం లేదు, కానీ దాని అమలులో లోపాన్ని సవరించాలి.

విద్యావ్యవస్థలో సమూల మార్పులు రావాలి...

తెలంగాణ లో పీహెచ్ డీ చేసిన వాళ్లు కానిస్టేబుళ్ల పోస్టులకు పోటీ పడుతున్నారు... ఎందుకు? కారణాలు ఏమిటి? నిబంధనలు పక్కన పెట్టి వేల మందికి యూనివర్శిటీలు పీహెచ్ డీ పట్టాలు ఇస్తున్నాయా? నైపుణ్యం ఇచ్చే విద్యను అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందా? ఇత్యాది అంశాలపై గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ప్రొ.కె. నాగేశ్వర్ తన అభిప్రాయాలను తెలియజేశారు. వారు ఈ అంశాలపై ఇంకా ఎలాంటి విశ్లేషణ చేశారో వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఎంపి అసదుద్దీన్ పై క్రిమినల్ కేసు :డీపీసీ సత్యనారాయణ

హైదరాబాద్ : పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్, షబ్బీర్ అలీ లపై దాడి ఘటనలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఎంఐఎం కార్యకర్తలపై 14-16యు/ఎస్, 143,323,341,506 ఆర్/ డబ్ల్యు,149 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డీసీపీ సత్యనారాయణ తెలిపారు.

పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లి తండ్రీ, కొడుకు మృతి

కడప : మైలవరం మండలం బోగాల కట్ట గ్రామంలో విషాదం నెలకొంది. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో తండ్రీ కొడుకులు మృతి చెందారు.

రేపటి నుంచి కొత్తగూడెంలో సైనిక ఎంపికలు

ఖమ్మం : కొత్తగూడెం పట్టణంలో గురువారం నుంచి సైనిక నియామకాలు ప్రారంభంకానున్నాయి. 4 నుంచి 10వ తేదీ దాకా నియామకాలు జరుగుతాయి. సింగరేణి సంస్థ సహకారంతో తెలంగాణ పది జిల్లాల యువకుల కోసం ఈ ఎంపికలను చేపడుతున్నారు. ఈ సారి ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టడంతో అభ్యర్థులు పలు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. సైనిక ఎంపికల్లో పాల్గొనే అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి సంబంధించి ధ్రువీకరణ పత్రాల తనిఖీ కోసం ముందురోజు రాత్రి 12 గంటల కల్లా హాజరు కావాల్సి ఉంటుంది. ప్రకాశం మైదానంలో శరీర దారుఢ్య పోటీలుంటాయి.

నేడు, రేపు 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ రద్దు

విశాఖపట్నం : విజయవాడ - విశాఖపట్నం మధ్య నడిచే రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 12718, 12717 రైలు సర్వీసు రెండు రోజులపాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు సర్వీసులు బుధవారం, గురువారం రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే హౌరా - చెన్నై మెయిల్ (12839) మరింత ఆలస్యంగా నడుస్తుందని పేర్కొన్నారు. ఈ రైలు మంగళవారం రాత్రి 11.45 గంటలకు విశాఖ రావాల్సి ఉందని కానీ బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు విశాఖ చేరుకుంటుందని వాల్తేర్ డివిజన్ అధికారులు చెప్పారు.

07:31 - February 3, 2016

హైదరాబాద్ : పాత బస్తీలో నియంతృత్వంగా వ్యవహరిస్తూ దాడులకు పాల్పడ్డ ఎంఐఎం ఎంపి ఓవైసీని వెంటనే అరెస్టుచేయాలని సీపీఎం నేత బి.వెంకట్ న్యూస్ మార్నింగ్ చర్చలో డిమాండ్ చేశారు. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా పాతబస్తీ ఆజంపురాలో కాంగ్రెస్-ఎంఐఎంల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్ నేతలకు గాయాలయ్యాయి. అటు డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ ఇంటిపైనా దాడికి తెగబడ్డారు ఎంఐఎం కార్యకర్తలు. పోలీసులు రంగప్రవేశం చేసి అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చినా ఇంకా టెన్షన్ వాతావరణమే కొనసాగుతోంది. ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ఎంఐఎం ప్రవర్తిస్తోందా? పాత బస్తీలో ఎంఐఎం పునాదులు కదిలిపోతున్నాయా? ఎంఐఎంకి టిఆర్ఎస్ అంటకాగుతోందా? ఎంపి ఓవైసీని ఎందుకు అరెస్టు చేయడం లేదు? తెలంగాణ ప్రభుత్వం దాడులకు ప్రేరేపిస్తోందా? పాతబస్తీలో ప్రశాంతతను కాపడటానికి టిఆర్ ఎస్ ఎందుకు ప్రయత్నించడం లేదు? డిప్యూటీ సీఎం కుమారుడి ఇంటి పై దాడి చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎంఐఎంను మైనార్టీలను ఒకే గాటన కట్టకూడదా? మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి ఎంఐఎం చూస్తోందా? పాత బస్తీలో జరుగుతున్న ఘటనలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? గ్రేటర్ ఎన్నికల పై ఎగ్జిపోల్స్ లో తెలిపిన అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో వెంకట్ తో పాటు కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్, టిఆర్ఎస్ నేత రాకేష్ పాల్గొన్నారు. వీరి మధ్య జరిగిన ఆసక్తి కరమైన చర్చను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి. 

07:20 - February 3, 2016

హైదరాబాద్ : లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్స్ -ఎల్జీబీటి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భారత పీనల్ కోడ్ చట్టం 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం కిందికి వస్తుందని 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ ఓ ఎన్జీవో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. స్వలింగ సంపర్కాన్ని నిషేధించాలా... లేక కొనసాగించాలా అన్న విషయాన్ని పరిశీలించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ బెంచ్‌ 377 సెక్షన్‌పై విస్తృతంగా చర్చంచనుంది. చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఏఆర్‌ దవే, జస్టిస్‌ ఖేహర్‌లతో కూడిన బెంచ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కుల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తమ వద్ద ఎనిమిది పిటిషన్లు దాఖలయ్యాయని కోర్టు తెలిపింది.

2009లో ఢిల్లీ హైకోర్టు తీర్పు....

స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని 2009లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఐపిసిలోని 377 సెక్షన్‌ నుంచి ఎల్జీబీటీని తొలగించాలని పేర్కొంది. దీనిపై కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరంగానే పరిగణిస్తూ ఐపిసిలోని 377 సెక్షన్‌ను దీన్ని తొలగించడానికి నిరాకరించింది.

సుప్రీంకోర్టు నిర్ణయంతో స్వలింగ సంపర్కుల్లో ఆనందం...

సుప్రీంకోర్టు నిర్ణయంతో స్వలింగ సంపర్కుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. అసలు విచారణకే రాదనకున్న తమ పిటిషన్‌పై చాలాకాలం తర్వాత కదలిక రావడంతో స్వలింగ సంబరాలు జరుపుకుంటున్నారు.

ఐపిసి సెక్షన్‌ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం

హైదరాబాద్ : స్వలింగ సంపర్కుల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. హోమో సెక్స్‌వల్‌ను నిషేధించిన కేసును సుప్రీంకోర్టు మళ్లీ విచారణ జరపనుంది. ఐపిసిలోని సెక్షన్‌ 377 ప్రకారం నేరంగా భావిస్తున్న ఎల్జీబీటీని నిషేధించాలా...కొనసాగించాలా అన్నదానిపై ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం పరిశీలించనుంది. 

07:16 - February 3, 2016

హైదరాబాద్ : జమ్ముకాశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్‌ తొలగలేదు. జమ్ముకాశ్మీర్‌ సంయుక్త ఎజెండాపై నమ్మకం కలిగేలా కేంద్రం చర్యలు చేపడితేనే బిజెపితో పొత్తు కొనసాగుతుందని మెహబూబా ముఫ్తి స్పష్టం చేశారు. బిజెపితో కలిసి పనిచేయడానికి తన తండ్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌లా అనుభవం లేదన్నారు. దీనిపై కేంద్రం సానుకూల వైఖరితో స్పందించాలన్నారు. పీడీపీ-బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుపై ఏదో ఒకటి తేల్చుకోవాలని గవర్నర్‌ సోమవారం డెడ్‌లైన్‌ విధించడంతో ఇరు పార్టీల నేతలు వోహ్రాతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై వారం పది రోజుల గడువు ఇవ్వాలని బిజెపి గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రాను కోరింది.

07:12 - February 3, 2016

హైదరాబాద్ : జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసినందుకుగాను తెలంగాణకు ఐదు జాతీయ అవార్డులు లభించాయి. ఎక్కువ మందికి ఉపాధి కల్పన, పారదర్శకత, వికలాంగులకు పని కల్పించడం సహా సరైన సమయంలో డబ్బులు చెల్లించినందుకు గాను తెలంగాణకు ఈ అవార్డులు లభించాయి. జాతీయ ఉపాధిహామీ పధకం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్ అవార్డులు ప్రదానం చేశారు.

నిజామాబాద్ జిల్లాకు, పారదర్శకత -సామాజిక బాధ్యత కనబరిచినందుకు.....

ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడంలో విశేషంగా కృషి చేసినందుకు తెలంగాణకు ఐదు జాతీయ అవార్డులు లభించాయి. ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసినందుకు నిజామాబాద్ జిల్లాకు, పారదర్శకత -సామాజిక బాధ్యత కనబరిచినందుకు, వికలాంగులకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పించినందుకు తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు లభించాయి. అలాగే లబ్దిదారులకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించిన కరీంనగర్ జిల్లా చందుర్తి సర్పంచ్‌కు, కూలీలకు మూడు రోజుల్లోగా డబ్బులు చెల్లించిన ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు పోస్టాఫీస్‌కు అవార్డులు వచ్చాయి. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్ ఈ అవార్డులు ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా నాలుగు జిల్లాలు ఉత్తమ ప్రతిభ కనబర్చగా అందులో నిజామాబాద్‌ ఒకటని ఆ జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

కరవు ప్రభావం ఉన్నప్పుడు 50 వేల మందికి వంద రోజులు ఉపాధి.....

కరవు ప్రభావం ఉన్నప్పుడు 50 వేల మందికి వంద రోజులు ఉపాధి కల్పించగా ఇప్పుడు నూటయాభై రోజులు పని కల్పిస్తున్నామని నిజామాబాద్ కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 216 కోట్లతో ఉపాధి హామీ పనులు జరిగాయని ఎస్సీ ఎస్టీలకు 75 శాతం పని కల్పించామని వివరించారు. జిల్లాలోని 85 శాతం వికలాంగులకు సైతం ఉపాధి కల్పించి చేయూతనిచ్చామన్నారు. క్షేత్రస్థాయిలో కొంత అవినీతి జరిగినా వారిపై చర్యలు తీసుకుని డబ్బు రికవరీ చేశామని కలెక్టర్‌ తెలిపారు. పేద ప్రజలు ఉపాధి హామీ పథకాన్ని నమ్మి పని చేయడం వల్లే ఈ అవార్డు సాధించగలిగామన్న కలెక్టర్ వాళ్ల తరఫున తాను అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

07:07 - February 3, 2016

విజయవాడ : కాపులను బీసీల్లో చేర్చే విషయంలో ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో కాపు సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. కాపు రిజర్వేషన్ల కల్పనకు అనేక అడ్డంకులు ఉన్నాయని సీఎం వివరించారు. మరోవైపు కాపులకు రిజర్వేషన్‌ దక్కదేమోనన్న ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డ వెంకటరమణ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్‌ పరామర్శించారు.

ఏపీలో కాపు రిజర్వేషన్ల స్ట్రగుల్ కొనసాగుతూనే .....

ఏపీలో కాపు రిజర్వేషన్ల స్ట్రగుల్ కొనసాగుతూనే ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కాపులకు రిజర్వేషన్ ఇష్యూపై తమదైన రీతిలో స్పందిస్తున్నాయి. సిఎం క్యాంపు కార్యాలయంలో కాపు సంఘాల నేతలతో చంద్రబాబు సమావేశమై మంతనాలు జరిపారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కల్పనకు అనేక అడ్డంకులు ఉన్నాయని వాటిని తొలగించడానికి 9నెలల సమయం పడుతుందని అన్నారు. కాపు కార్పోరేషన్‌కు నిధులు పెంచుతామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు హామీలపై కాపు సంఘాల నేతలు హర్షం .....

ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలపై కాపు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం హామీలను తాము పూర్తిగా విశ్వసిస్తున్నామని చెప్పారు. బీసీలకు అభ్యంతరం కలగకుండా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.

రిజర్వేషన్ల అంశంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణపై కమిటి....

రిజర్వేషన్ల అంశంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీనియర్‌ నేతలు ఒక కమిటీలా ఫామై పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలో టిడిపి ఏపీ అధ్యక్షుడు కళావెంకట్రావు, మంత్రులు చినరాజప్ప, నారాయణ, గంటా శ్రీనివాసరావు, ఎంపి తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఒక పర్యవేక్షక బృందంలా ఏర్పాటయ్యారు.

ఆత్మహత్యకు పాల్పడ్డ వెంకటరమణమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన జగన్

మరోవైపు కాపులను బీసీల్లో చేర్చాలంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డ వెంకటరమణమూర్తి కుటుంబాన్ని వైసిపి అధినేత జగన్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నరపైగానే అవుతున్నా కాపుల రిజర్వేషన్ అంశాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు తమిళనాడుకు వెళ్లి చూస్తే అక్కడ రిజర్వేషన్లు ఎలా అమలవుతున్నాయో జ్ఞానోదయం కలుగుతుందని జగన్‌ అన్నారు. వెంకటరమణమూర్తి కుటుంబాన్ని పరామర్శించినవారిలో జగన్‌తోపాటు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే వంగవీటి రాధా తదితరులున్నారు. 

07:03 - February 3, 2016

హైదరాబాద్ : కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ నాయకులపై ఎంఐఎం దాడులకు తెగబడటంపై అన్ని పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం వ్యవహరించిందని నేతలు విమర్శిస్తున్నారు. పాతబస్తీయేమైనా మజ్లిస్‌ సామ్రాజ్యమా అన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ధోరణులను ప్రతిఒక్కరూ ఖండించాలని సూచించారు.

గ్రేటర్‌ ఎన్నికలు మొదలైన దగ్గర్నుంచీ.....

గ్రేటర్‌ ఎన్నికలు మొదలైన దగ్గర్నుంచీ ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రశాంతంగా జరుగుతూ వచ్చింది. ఇంకో రెండు మూడు గంటల్లో ఎన్నికలు ముగుస్తాయనుకుంటుండగా పాతబస్తీలో ఉద్రిక్తత మొదలైంది. టిఆర్‌ఎస్‌ నేత డిప్యూటీ సిఎం మెహమూద్‌ అలీ తనయుడిపైన, అలాగే కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌అలీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపైనా ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

చివరి సమయంలో పాతబస్తీలో దాడులు దురదృష్టకరం...

ఎంఐఎం చర్యను వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల చివరి సమయంలో పాతబస్తీలో కొన్ని దురదృష్టకర ఘటనలు జరగడం విచారకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధ్యులపై చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు. అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ అండజూసుకునే ఎంఐఎం పాతబస్తీలో చెలరేగిపోతోందని టిటిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆరోపించారు. పాతబస్తీలో ఎంఐఎం అరాచకాలకు అడ్డుకట్టవేయాలని రమణ సూచించారు.

ఎంఐఎం దాడి అత్యంత హేయమైన చర్య....

తమ నేతలపై ఎంఐఎం దాడి అత్యంత హేయమైన చర్యఅని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి అన్నారు. రిగ్గింగ్ కోసం ఎంఐఎం రౌడీలతో దాడి చేయించిందని రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్‌కు ఇప్పుడు తెలిసొచ్చిందా...

ఎంఐఎం ఎంతటి ప్రమాదకరమైన పార్టీయో కాంగ్రెస్‌కు ఇప్పుడు తెలిసొచ్చిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌ అండ చూసుకునే ఎంఐఎం దుర్మార్గాలకు పాల్పడుతోందని విమర్శించారు.

ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేదిగా ఉంది......

సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ ఎంఐఎం వైఖరి ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేదిగా ఉందన్నారు. మజ్లిస్‌ నాయకులు సీపీఎం కార్యకర్తలతో పాటు, ఉప ముఖ్యమంత్రి మెహమూద్‌ అలీ తనయుడిపై దాడి చేయడం దారుణమన్నారు. ఈ తరహా చర్యలు ఏ మాత్రం క్షమార్హం కాదన్నారు. మజ్లిస్‌ నేతలు పాతబస్తీని తమ సామ్రాజ్యంగా భావిస్తూ... రౌడీయిజం చేస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు.

ఎంపి అసదుద్దిన్‌ ఒవైసీపై మీర్‌చౌక్ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు....

గన్‌మెన్ల రక్షణలో ఉండే అగ్రనాయకులకే పాతబస్తీలో సేఫ్టీ లేనప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎంఐఎం దుందుడుకు ధోరణికి అడ్డుకట్టవేయాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు ఎంఐఎం కార్యకర్తలచేతిలో దాడికి గురైన కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఫిర్యాదు మేరకు ఎంపి అసదుద్దిన్‌ ఒవైసీపై మీర్‌చౌక్ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. ఇదే ఘటనకు ఎంఐఎం ఎమ్మెల్యే బలాలాను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

06:59 - February 3, 2016

హైదరాబాద్ : మీర్‌చౌక్‌లో షబ్బీర్‌ ఆలీపై జరిగిన దాడిని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ ఘటనపై ఆపార్టీ నేతలు సాయంత్రం రోడ్డెక్కారు. ర్యాలీగా డీజీపీ కార్యాలయానికి చేరిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు.. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో.. కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమ పార్టీ నేతలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఓవైసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తమపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని పీసీసీ చీఫ్‌....

మీర్‌చౌక్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుటే ఎంఐఎం కార్యకర్తలు తమపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌తో కలిసి ఎంఐఎం రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆయన ఆరోపించారు. షబ్బీర్‌అలీపై దాడి చేసిన వారిపై 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఉత్తమ్‌ హెచ్చరించారు.

ఓవైసీని వెంటనే అరెస్ట్‌ చేయాలని .....

తమ ఇలాకాలోకి ఎందుకు వచ్చారంటూ తనపై దాడి చేశారని షబ్బీర్‌అలీ అన్నారు. దాడికి పాల్పడిన ఓవైసీని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అసదుద్దీన్‌ ఓవైసీపై 24 గంటల్లోగా కఠిన చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరించారు. 

మీర్ చౌక్ ఘటనపై కాంగ్రెస్ సీరియస్

హైదరాబాద్ : మీర్ చౌక్ ఘటనను టీ-కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించారు. డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ బైఠాయించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

పాతబస్తీలో ప్రజ్వరిల్లిన హింస

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో... చివరి నిమిషాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా పాతబస్తీ ఆజంపురాలో కాంగ్రెస్-ఎంఐఎంల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్ నేతలకు గాయాలయ్యాయి. అటు డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ ఇంటిపైనా దాడికి తెగబడ్డారు ఎంఐఎం కార్యకర్తలు. పోలీసులు రంగప్రవేశం చేసి అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చినా ఇంకా టెన్షన్ వాతావరణమే కొనసాగుతోంది.

06:56 - February 3, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో... చివరి నిమిషాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా పాతబస్తీ ఆజంపురాలో కాంగ్రెస్-ఎంఐఎంల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కాంగ్రెస్ నేతలకు గాయాలయ్యాయి. అటు డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ ఇంటిపైనా దాడికి తెగబడ్డారు ఎంఐఎం కార్యకర్తలు. పోలీసులు రంగప్రవేశం చేసి అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తెచ్చినా ఇంకా టెన్షన్ వాతావరణమే కొనసాగుతోంది.

కాంగ్రెస్, ఎంఐఎం వాగ్వాదం...

గ్రేటర్‌ ఎన్నికల్లో చెలరేగిన హింస. పోలింగ్ కేంద్రాల సాక్షిగా ముష్టిఘాతాలకు తెగబడ్డారు. ముఖ్యంగా పాతబస్తీలోని పురానాపూల్లో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ నాయకుల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్ను అరెస్ట్ చేశారు. గౌస్ అరెస్ట్కు నిరసనగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు గౌస్ను విడుదల చేశారు. అదే సమయంలో అక్కడకు ఎంపీ అసదుద్దీన్ చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది.

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కారుపై ఎంఐఎం కార్యకర్తలు దాడి.....

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కారుపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కారుపై రాళ్లు విసిరారు. అద్దాలు ధ్వంసం చేశారు. కారులో కూర్చున్న వారిని కొట్టారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు. కొన్ని క్షణాల పాటు అక్కడ యుద్ధ వాతావరణం రాజ్యమేలింది. ఈ దాడిలో ఉత్తమ్ కారు ధ్వంసమైంది. ఉత్తమ్‌తో పాటు షబ్బీర్‌ అలీకి గాయాలయ్యాయి.

షబ్బీర్ అలీపై దాడి...

ఈ ఘటనలో షబ్బీర్‌ అలీని ఓ వ్యక్తి కొడుతున్న విజువల్స్ మీడియాలో ప్రముఖంగా ప్రసారమయ్యాయి. విండోలోంచి పంచ్‌లు విసిరారు. డోర్లు తెరిచి కొట్టారు.

డిప్యూటీ సీఎం మొహ్మద్ అలీ ఇంటిపైనా దాడి.....

ఆజంపురాలోని డిప్యూటీ సీఎం మొహ్మద్ అలీ ఇంటిపైనా దాడికి తెగబడ్డారు ఎంఐఎం కార్యకర్తలు. ఆయన కుమారుడు ఆజం అలీపై ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా, ఆయన అనుచరులు దాడి చేశారు. దీంతో డిప్యూటీ సీఎం ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యే బలాలాతో పాటు అనుచరులను అరెస్టు చేశారు.

పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు...

తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పాతబస్తీకి భారీగా చేరుకున్నాయి భద్రతా బలగాలు. ఎక్కడికక్కడ ఎంఐఎం కార్యకర్తలు, ఇతర పార్టీల నేతలను అరెస్టు చేస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉత్తమ్, షబ్బీర్‌ అలీపై దాడిని కాంగ్రెస్‌ నేతలతో సహా అన్ని పార్టీల నేతలు ఖండించారు. ఎంఐఎం నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్వయంగా ఎంపీ అసదుద్దీన్ దాడికి తెగబడ్డారని ప్రతిపక్ష నేత జానారెడ్డి ఆరోపించారు. పోలింగ్ సందర్భంగా గ్రేటర్‌లోని అనేక చోట్ల గొడవలు జరిగాయి. బీజేపీ-ఎంఐఎం, కాంగ్రెస్, అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు ఘర్షణపడ్డారు. ప్రజాస్వామ్య భారతంలో ఇలాంటి చర్యలన్నీ సరైనవి కావని రాజకీయ పండితులు హితవు పలికారు.

గ్రేటర్‌ ఎన్నికల్లో విజయంపై టిఆర్‌ఎస్‌ ధీమా

హైదరాబాద్ : ఎండింగ్‌లో కాస్తంత అలజడి చెలరేగినా గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసాయి. ఈవీఎంలలో అభ్యర్థుల భవిష్యత్‌ నిక్షిప్తమై ఉంది. అయితే చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ ఎన్నికల విషయంలో టిఆర్ ఎస్ కు ధీమా పెరిగింది. మొత్తం స్థానాల్లో పోటీచేసిన గులాబి పార్టీ కనీసం 80 స్థానాల్లో విజయం సాధిస్తానని అంచనా వేస్తోంది. పోలింగ్ సరళిని పరిశీలించిన పార్టీ నేతలు... 5వ తేదీన ప్రత్యర్థి పార్టీలకు హై ఓల్టేజీ షాక్‌ తగలబోతుందన్నారు..

గ్రేటర్‌ ఎన్నికల్లో విజయంపై టిఆర్‌ఎస్‌ ధీమా

హైదరాబాద్ : ఎండింగ్‌లో కాస్తంత అలజడి చెలరేగినా గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసాయి. ఈవీఎంలలో అభ్యర్థుల భవిష్యత్‌ నిక్షిప్తమై ఉంది. అయితే చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ ఎన్నికల విషయంలో టిఆర్ ఎస్ కు ధీమా పెరిగింది. మొత్తం స్థానాల్లో పోటీచేసిన గులాబి పార్టీ కనీసం 80 స్థానాల్లో విజయం సాధిస్తానని అంచనా వేస్తోంది. పోలింగ్ సరళిని పరిశీలించిన పార్టీ నేతలు... 5వ తేదీన ప్రత్యర్థి పార్టీలకు హై ఓల్టేజీ షాక్‌ తగలబోతుందన్నారు..

06:51 - February 3, 2016

హైదరాబాద్ : ఎండింగ్‌లో కాస్తంత అలజడి చెలరేగినా గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసాయి. ఈవీఎంలలో అభ్యర్థుల భవిష్యత్‌ నిక్షిప్తమై ఉంది. అయితే చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ ఎన్నికల విషయంలో టిఆర్ ఎస్ కు ధీమా పెరిగింది. మొత్తం స్థానాల్లో పోటీచేసిన గులాబి పార్టీ కనీసం 80 స్థానాల్లో విజయం సాధిస్తానని అంచనా వేస్తోంది. పోలింగ్ సరళిని పరిశీలించిన పార్టీ నేతలు... 5వ తేదీన ప్రత్యర్థి పార్టీలకు హై ఓల్టేజీ షాక్‌ తగలబోతుందన్నారు..

వ్యూహాత్మకంగా వ్యవహరించిన టిఆర్ ఎస్...

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను వ్యూహాత్మకంగా ఎదుర్కొన్న అధికార పార్టీ అదే స్థాయిలో ఫలితాలు కూడా దక్కుతాయని ధీమా వ్యక్తం చేస్తోంది. గత గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయకున్నా ఈ ఎన్నికల్లో మాత్రం 150 స్థానాలకు అభ్యర్థులను రంగంలోకి దించింది. అయితే అభ్యర్థుల్లో వేరే పార్టీలనుంచి వచ్చినవారే ఎక్కువమంది ఉన్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే వంద సీట్లను టార్గెట్‌ చేస్తూ పకడ్బందీగా ఎన్నికల బరిలో దిగింది.

ప్రత్యేక దృష్టి పెట్టిన కేటీఆర్...

ఎన్నికల బాధ్యతంతా భుజాలకెత్తుకున్న కెసిఆర్‌ తనయుడు కేటీఆర్ గ్రేటర్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు అన్నీ తానై చూసుకున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 5న ఎదురుకాబోతున్న ఓటమికి విపక్ష పార్టీలు ఇప్పటినుంచే కారణాలు వెతుకుతున్నాయని ఆరోపించారు.

పాతబస్తీలో గొడవలను లైట్ గా తీసుకుంటున్న అధికార పార్టీ...

ఎన్నికల సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్న అధికార పార్టీ పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలను లైట్‌గా తీసుకుంటోంది. అయితే డిప్యూటీ సీఎం ఇంటిపై జరిగిన దాడి ఘటనలో మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయంతో తెలంగాణాలో టిఆర్ఎస్‌ మరో కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతోందని కేటీఆర్ అన్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్న సమస్యలను తీర్చేందుకు ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి స్పష్టం చేశారు.

06:47 - February 3, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. రైతుల నుంచి దాదాపు 15 లక్షల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుంటే, తమకు జీవనాధారమైన భూమిని కాపాడుకునేందుకు రైతులు భూ పరిరక్షణ పోరాటాలు చేస్తున్నారు

నిరుపేదలకు భూములు పంచిన గత ప్రభుత్వాలు.....

దళితులు, గిరిజనులు, వ్యవసాయ కూలీలు, చిన్న రైతుల పట్ల ప్రభుత్వాల పోకడలు మారుతున్నాయి. ప్రభుత్వ, పోరంబోకు, అటవీ, మిగులు భూములను గుర్తించి వాటిని భూమిలేని నిరుపేదలకు పంచడం గత ఆదర్శంగా వుండేది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రతి రాజకీయ పార్టీ పేదలకు భూమిలిస్తామని వాగ్ధానం చేయడం పరిపాటి. భూములు ఇవ్వడమే కాకుండా వాటి అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వాలు చెబుతుండేవి. కానీ, ఇప్పుడు ప్రభుత్వాల స్వరం మారుతోంది. భూ పంపిణీ గురించి ఇప్పుడు ప్రభుత్వాలు మాట్లాడడం లేదు. భూ సంస్కరణల ఊసెత్తడం లేదు. భూ పంపిణీ కార్యక్రమం పక్కన పెట్టేసి, భూ సమీకరణ, భూ సేకరణ, ల్యాండ్ బ్యాంకింగ్ అంటూ జనం గుండెల్లో దడపుట్టిస్తున్నారు. భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ యోగ్యమైన భూములు పంచడం మాట అటుంచి, చిన్న రైతుల ఆధీనంలోని ఒకట్రెండు ఎకరాల భూమిని కూడా ప్రభుత్వాలు స్వీకరించే కార్యక్రమం ఇప్పుడు నడుస్తోంది. ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లో మరింత వేగంగా అమలవుతున్నట్టు కనిపిస్తోంది. భూ సమీకరణ పేరుతో ఇప్పటికే అమరావతి కోసం 30 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వం తీసుకుంది. భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఎక్కడ ఇస్తారో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

బందరు పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్ట్ భూ సేకరణ కు.....

ఇక బందరు పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్ట్ భూ సేకరణ కు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 15 లక్షల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేసిందన్న వార్తలు రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు, దళితులకు, బలహీనవర్గాలకు గతంలో ఇచ్చిన భూములను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పావులు కదుపుతోందన్న వార్తలు వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

ల్యాండ్ బ్యాంకింగ్ ద్వారానే సాధ్యమవుతుందన్నది ప్రభుత్వ వాదన....

రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా ల్యాండ్ బ్యాంకింగ్ ద్వారానే సాధ్యమవుతుందన్నది ప్రభుత్వ వాదన. నిజానికి ఇప్పటికే ఎస్ ఈ జడ్ ల పేరుతో కొన్ని వేల ఎకరాల భూములను విభిన్న సంస్థలకు అప్పగించారు. నయానో భయానో అదిరించో బెదిరించో ఇప్పటికే కొన్ని పారిశ్రామిక సంస్థలు కారుచౌకగా రైతుల భూములు తీసుకున్నాయి. పది పదిహేనేళ్ల క్రితం పారిశ్రామిక వేత్తలకు, ఎస్ ఈ జడ్ లకు ఇచ్చిన భూములు ఇప్పటికీ నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రచారం చేసిన స్థాయిలో ఎక్కడా పరిశ్రమలు రాలేదు. ఒకవేళ ఒకట్రెండు చోట్ల పెట్టినా, వాటిలో స్థానికులకు, భూములిచ్చిన కుటుంబాలకు దక్కిన ఉద్యోగాలు ఎన్ని వున్నాయన్నదీ ప్రశ్నార్ధకమే. కొత్త పరిశ్రమలు రాకపోగా, వున్న పరిశ్రమలే మూతపడుతున్న దయనీయ స్థితి. మూతపడ్డ పరిశ్రమలను తెరిపించకుండా, సిక్ ఇండస్ట్రీస్ ను కాపాడే ప్రయత్నాలు చేయకుండా, పారిశ్రామికాభివ్రుద్ధి పేరుతో మరికొన్ని భూములను స్వాధీనం చేసుకోవడంలో అర్ధం వుంటుందా? పారిశ్రామిక అభివ్రుద్ధి పట్ల ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి వుంటే ఇప్పటికే కేటాయించిన భూముల్లో పరిశ్రమలు నెలకొల్పే చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలు పెట్టేందుకు ఉత్సాహం చూపని యాజమాన్యాల నుంచి భూములను వెనక్కి తీసుకోవాలి. కానీ, అలాంటి ప్రయత్నాలు చేయకుండా, చిన్న చిన్న రైతుల నుంచి, గిరిజనుల నుంచి, దళితుల నుంచి, బలహీనవర్గా ల నుంచి భూములు తీసుకోవడంలోని ఆంతర్యం ఏమిటో? 

06:44 - February 3, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ను భూసేకరణ వ్యవహారం కుదిపేస్తోంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రభుత్వం దాదాపు 15 లక్షల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించేందుకు సమాయత్తమవుతోంది. ఇదే నేపథ్యంలో భూ సేకరణను వ్యతిరేకిస్తూ భూ పరిరక్షణ పోరాట కమిటీ మార్చి 9న చలో విజయవాడకు పిలుపునిచ్చింది. భూ సేకరణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి విధానం అవలంభిస్తోంది? ప్రభుత్వం తలపెట్టిన భూ సేకరణ వల్ల రైతుల మీద ఎలాంటి ప్రభావం పడుతోంది? రైతులతో పాటు తీవ్రంగా ప్రభావితం అయ్యే వర్గాలేమిటి? భూసేకరణను వ్యతిరేకిస్తున్న భూ పరిరక్షణ కమిటీ చూపిస్తున్న ప్రత్యామ్నాయాలేమిటి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్‌ భూ పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ వంగల సుబ్బారావు విజయవాడ 10టీవీ స్టూడియో నుండి పాల్గొన్నారు. మరి వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

హెచ్ సియూలో కొనసాగుతున్న దీక్షలు

హైదరాబాద్‌ : హెచ్ సియూలో రీసెర్చ్ స్కాలర్ రోహితవేముల ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యతీసుకోవాలని కోరుతూ వర్సిటీలోని షాపింగ్‌కాంప్లెక్స్‌ సెంటర్‌ విద్యార్థులు మంగళవారం కూడా రిలేనిరాహారదీక్షలు నిర్వహించారు. వర్సిటీవిద్యార్థులు సర్వేశ్వర్‌, దిలీప్‌సేన్‌, ధనుంజయ్‌, ఎండి ఉస్తార్‌ రిలేదీక్షలో పాల్గొన్నారు. దీక్షాశిబిరాన్ని సామాజిక ఉద్యమకారుడు యేగేంద్రయాదవ్‌ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి రోహితవేముల మృతికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనిపై ఎంహెచ్‌ఆర్‌డీ స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Don't Miss