Activities calendar

04 February 2016

శుక్రవారం గ్రేటర్ కౌంటింగ్...

హైదరాబాద్ :జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన 1,333 మంది అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది.. మధ్యాహ్నం 3గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.. 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు.. ముందు పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు.. ఆ తర్వాత ఈవీఎం లు ఓపెన్ చేస్తారు.. సాయంత్రం 5తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు. 

ఉదయం 9గంటలకు ముద్రగడ దీక్ష..

తూర్పుగోదావరి : శుక్రవారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని ఆయన నివాసంలోనే సతీమణి పద్మావతితో కలిసి ముద్రగడ దీక్ష ప్రారంభించనున్నారు. 

పురానాపూల్ లో రీ పోలింగ్...

హైదరాబాద్ : పురాణాపూల్‌ లో శుక్రవారం రీ పోలింగ్ జరగనుంది. మంగళవారం నాటి గొడవతో 36 పోలింగ్‌ బూతుల్లో రీపోలింగ్‌కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. 

పారదర్శకంగా ఉద్యోగాలివ్వాలి - గవర్నర్...

హైదరాబాద్ : నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి సూచించారు. ప్రగతి రిసార్ట్స్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ 18వ జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న నరసింహన్ మాట్లాడారు. 

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 10, 12 తేదీల్లో కాకినాడ పోర్టు - సికింద్రాబాద్, 11, 15 తేదీల్లో రాత్రి 7.15 సికింద్రాబాద్ - కాకినాడ పోర్టు, 13న రాత్రి 7.15 కు సికింద్రాబాద్ - చెన్నై సెంట్రల్, 14న మధ్యాహ్నం 2.40గంటలకు చెన్నై సెంట్రల్ - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. 

ఆటో వ్యాన్ ఢీ..ముగ్గురు మృతి..

ఆదిలాబాద్ : ఆటో, వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ముదోల్ మండలం తక్లి గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. 

21:33 - February 4, 2016

జమ్మూ కాశ్మీర్‌ : సియాచిన్‌ ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకున్న 10 మంది జవాన్లు మృతి చెందినట్లు ఆర్మీ ప్రకటించింది. బుధవారం కొండ చరియలు విరిగిపడడంతో 10 మంది సైనికులు చిక్కుకున్నారు. వారికోసం ఆర్మీ అధికారులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విధి నిర్వహణలో ఎంతో ధైర్య సాహసాలు చూపి వీరమరణం పొందిన జవాన్లకు లెఫ్టినెంట్‌ జనరల్ డిఎస్‌ హూడా సైనిక వందనం సమర్పించారు. పాకిస్తాన్ సరిహద్దులోని 19 వేల 6 వందల అడుగుల ఎత్తున ఉండే సియాచిన్‌లో సైనికులు విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. 

21:31 - February 4, 2016

అరుణాచల్‌ప్రదేశ్‌ : రాష్ట్రపతి పాలనపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే చూస్తూ ఊరుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గవర్నర్‌ నిర్ణయంపై కోర్టుకు జోక్యం చేసుకునే హక్కు లేదని బిజెపి తరపు న్యాయవాది చేసిన వ్యాఖ్యలపై సుప్రీం మండిపడింది. ప్రజాస్వామ్యం హత్యకు గురవుతుంటే కోర్టు మూగవాడిలా ప్రవర్తించదని స్పష్టం చేసింది. రాష్ట్రపతి పాలన అమలు చేసిన తర్వాత జప్తు చేసుకున్న ప్రభుత్వ దస్తావేజు కాపీలను ముఖ్యమంత్రి నెబాం తుకీ, మంత్రులు, అసెంబ్లీ కార్యదర్శులకు తిరిగి ఇచ్చివేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.

21:22 - February 4, 2016

విజయవాడ : జూన్‌లోగా సీఆర్‌డీఏ బిల్డింగ్‌ నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. రాజధాని నిర్మాణ ప్రాంతంలో నిర్మిస్తున్న తొలి సీఆర్డీఏ బిల్డింగ్‌ నిర్మాణానికి ఈనెల 12న ఉదయం 4.15 నిమిషాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని మంత్రి ప్రకటించారు. 6 బ్లాకులుగా నిర్మిస్తున్న సీఆర్డీఏ బిల్డింగ్‌ను నిర్మించడానికి ఎల్‌అండ్‌ టీ తో పాటు షాపోజీ సంస్థలు ముందుకొచ్చాయన్నారు. 

21:19 - February 4, 2016

హైదరాబాద్ :జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన 1,333 మంది అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది.. మధ్యాహ్నం 3గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.. 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు.. ముందు పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు.. ఆ తర్వాత ఈవీఎం లు ఓపెన్ చేస్తారు.. సాయంత్రం 5తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, అడిషనల్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. వీరిని ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు రాండమ్‌గా నియమిస్తారు. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకోసం ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేస్తారు.

కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్..
కౌంటింగ్ కేంద్రాలదగ్గర 144 సెక్షన్ విధించారు.. కేవలం పాస్‌లున్నవారినే లోపలికి అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. ఇక పురాణాపూల్‌లో పోలింగ్‌ పూర్తయ్యాక లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు.. బ్యాలెట్‌ బాక్సులు వచ్చిన రెండుగంటల్లోపు ఫలితం ప్రకటించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గ్రేటర్‌ ఎన్నికల హంగామా రేపు రాత్రిలోగా ముగిసిపోనుంది.. విన్నర్లెవ్వరో, రన్నర్లెవ్వరో సాయంత్రంలోగా తేలిపోనుంది..

21:17 - February 4, 2016

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షకు సర్వం సిద్ధమయ్యింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు తూర్పుగోదారి జిల్లా కిర్లంపూడిలోని నివాసంలోనే దీక్ష ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని ఆయన నివాసంలోనే సతీమణి పద్మావతితో కలిసి దీక్ష ప్రారంభిస్తారు. దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1994 జూన్‌, జులైలో కూడా కిర్లంపూడి నివాసంలోనే దీక్ష చేశారు.

కాపులు ఒకపూట భోజనం మానేసి నిరసన తెలపాలి-ముద్రగడ..
కాపులను బీసీల్లో చేర్చడే తన ధ్యేయమని ముద్రగడ మరోసారి చెప్పారు. ఈ లక్ష్యసాధనలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదంటున్నారు. ఈసారి తాడోపేడో తేలాలంటున్నారు. దీక్షకు పక్కదారి పట్టించేందుకు కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల దీక్ష శిబిరం దగ్గరకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. కాపు సోదరులు ఒకపూట భోజనం మానేసి నిరసన తెలిపితే సరిపోతుంటున్నారు. కాపుల ఆకలి కేకలు ప్రభుత్వానికి వినపడాలన్నారు. ఆమరణ దీక్ష ప్రకటించిన తర్వాత తనతో మాట్లాడేందుకు... ప్రభుత్వం నుంచి ఎవరూ రాకపోవడం పట్ల ఒకింత అవేదన వ్యక్తం చేశారు. చర్చలకు వస్తే మాట్లాడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

దీక్షకు వచ్చే వారిని నియంత్రించేందుకు 35 చెక్‌ పోస్టులు..
తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సందర్భంగా హింస చోటుచేసుకున్న నేపథ్యంలో ముద్రగడ దీక్ష సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. 30 యాక్షన్‌ టీములను ఏర్పాటు చేశారు. నాలుగు వేల మంది పోలీసులతో కీలక ప్రాంతాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. నిఘా ముమ్మరం చేశారు. కిర్లంపూడి, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, కోనసీమ ప్రాంతాల్లో అదనపు బలగాలను నియమించారు. దీక్షకు తరలి వచ్చే వారిని ఎక్కడికక్కడ నియంత్రించేందుకు 35 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తే పోలీసులు ఏమీ అనరని, విధ్వంసానికి పాల్పడితే మాత్రం ఉపేక్షించబోమని జిల్లా ఎస్‌సీ రవిప్రకాష్‌ హెచ్చరించారు. మరోవైపు ముద్రగడ దీక్షను రాష్ట్ర మంత్రులు నారాయణ, చినరాజప్ప తప్పుపట్టారు. కాపులకు మేలు చేసే ఉద్దేశం ఉంటే దీక్ష ఉపసంహరించుకోవాలని చినరాజప్ప కోరారు. ముద్రగడ దీక్ష దరిమిలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు డీజీపీ.... జేవీ రాముడు వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. 

సియాచిన్ లో గల్లంతైన సైనికులు అమరులయ్యారు..

జమ్మూ : సియాచిన్ లో గల్లంతైన పది మంది సైనికులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఘటన చాలా బాధాకరమని, దేశాన్ని సంరక్షించేందుకు సరిహద్దులో కాపుకాస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు వందనం అంటూ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హుడా సంతాపం ప్రకటించారు. 

దక్షిణాసియా క్రీడలకు భద్రత కట్టుదిట్టం..

అస్సాం : గౌహతిలో శుక్రవారం నుండి ప్రారంభం కానున్న 12వ దక్షిణాసియా క్రీడలకు పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఈ వేడుకలు జరనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. 

20:35 - February 4, 2016

పది నెలలు కాలేదు. అప్పుడే సీన్ మారిపోయింది. ముఫ్తీ మహ్మద్ ఉన్నప్పుడు ఎలాగూ గట్టెక్కించాడు. ఆయన గతించాక మ్యాటర్ క్లియర్ అవుతోంది. రెండు పార్టీల మధ్య ఎంతటి అగాధం ఏర్పడిందో బయటపడుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తప్ప హామీలు నెరవేర్చే ప్రయత్నాలు చేయని కమలనాథుల తీరే ఈ పరిణామాలకు కారణమా ? పీడీపీ, బీజేపీల మధ్య అందనంత దూరం ఏర్పడిందా ?జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు ఏ దిశగా సాగుతున్నాయి. రాష్ట్రపతి పాలనా ? లేక ప్రజాస్వామిక ప్రభుత్వమా ? దీనిపై ప్రత్యేక కథనం. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:34 - February 4, 2016

అడవిలో 11 రోజులా ? వామ్మో అంటారు కదా..సినిమా స్టోరి అనుకుంటున్నర..అదేకాందు. నిజంగా జరిగింది. దట్టమైన అడవి.. భయంకరమైన ఎలుగుబంట్లకు, తోడేళ్లకు నిలయం. రాత్రిపూట పరిస్థితి మరింత దిగజారుతుంది. ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారి తప్పిపోయింది..? నాన్నను వెదుకుతూ వెళ్లిన ఓ చిన్నారి అడవిలో దారితప్పింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 రోజులు ఆ కీకారణ్యంలోనే ధైర్యంగా గడిపింది. ఈ బుజ్జి జాడ కుక్క తెలిపింది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో చూసేయుండ్రి..

20:22 - February 4, 2016

కేసీఆర్ మిడ్ మానేరు హామీ ఏమైంది ? జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ రేపటినుండి..నారాయణఖేడ్ చేరుకున్న విపక్షాలు..దిసీస్ నాట్ కరెక్ట్ అంటున్న పోచారం..మిడ్ మానేరు కథ..స్వాతంత్ర ఉద్యమం మొదలు పెట్టిన బైరెడ్డి..మేడారం జాతర...మద్యంపై మహిళల నిర్ణయం..కొరాఢాలతో కొట్టుకోవడం..పద కొండు రోజుల పాటు అడవీలో ఉన్న చిన్నపిల్ల..ఆనం నారాయణ హావాభావాలు..వీటిపై మల్లన్న తనదైన శైలిలో ముచ్చట్లు పెట్టిండు. ఈ ముచ్చట్లు కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట ప్రాంతానికి చెందిన భాను ప్రతాప్ వచ్చాడు. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

20:18 - February 4, 2016

ఓ అధికారిపై మంత్రి పోచారం కోపం ప్రదర్శించాడు. ఎందుకు కనబడలేదని నిలదీశారు. నాకు ఎందుకు కనబడలె ? ఎక్కడ కనబడ్డవ్ జనంలోనా ? ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నవ్ ? అంటూ తన కోపాన్ని ప్రదర్శించారు. ఇదంతా నిజామాబాద్ జిల్లాలో ఉద్యానవన పథకాలపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశాలం చోటు చేసుకుంది. పోచారం కోపం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

ఎమ్మెల్సీ రామచంద్రరావు అరెస్టుపై స్టే..

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసులో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఊరట లభించింది. రామచంద్రరావు అరెస్టుపై హైకోర్టు స్టే విధించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

సిరిసిల్ల రాజయ్య కుటుంబానికి బెయిల్...

వరంగల్ : సిరిసిల్ల రాజయ్య కుటుంబానికి బెయిల్ మంజూరైంది. షరతులతో కూడదిన బెయిల్ ను జిల్లా కోర్టు మంజూరు చేసింది. ప్రతి ఆదివారం సుబేదారి పీఎస్ లో హాజరు కావాలని, పాస్ పోర్టులు అప్పగించాలని..దేశం విడిచి పెట్టి వెళ్లరాదని షరతులు విధించింది. కోడలు, మనవళ్లు ఆత్మహత్య కేసులో నిందితులుగా రాజయ్య కుటుంబం ఉన్న సంగతి తెలిసిందే. 

జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో అపశృతి..

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం జాతీయస్థాయి కబడ్డీ పోటీలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్ట్స్ కాలేజీలో అకస్మాత్తుగా గ్యాలరీ కుప్పకూలింది. ఎనిమిది మందికి గాయాలు కాగా వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. 

సింహాచలం కొండపై రివాల్వర్ కలకలం..

విశాఖపట్టణం : సింహాచలం కొండపై రివాల్వర్ కలకలం సృష్టించింది. మచిలీపట్నానికి చెందిన ఇద్దరు భక్తుల నుండి రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

పెబ్బేరులో అక్రమంగా నిల్వ ఉంచిన ధాన్యం సీజ్...

మహబూబ్ నగర్ : పెబ్బేరులో సత్యసాయి రైస్ మిల్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 7 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని సీజ్ చేశారు. విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. 

కాసేపట్లో ముద్రగడతో ప్రభుత్వం చర్చలు..

తూర్పుగోదావరి : కాసేపట్లో కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇంటికి ఎమ్మెల్యేలు తోట, బోండా ఉమలు చేరుకోనున్నారు. ముద్రగడతో వీరు చర్చలు జరపనున్నారు. రేపు ఉదయం 9గంటల నుండి ముద్రగడ ఆమరణ నిరహార దీక్ష చేయనున్న సంగతి తెలిసిందే. 

ఐఎఫ్ఆర్ జరగడం అదృష్టం - బాబు..

విశాఖపట్టణం : ఐఎఫ్ఆర్ జరగడం మన అదృష్టమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సుందరమైన విశాఖ మినీ ఇండియాలా కనిపిస్తోందని, దేశానికి నేవీ ఎంతో ముఖ్యమైందని, ఇండియన్ నేవీ చాలా శక్తివంతమైందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ముందు నేవీ బలమెంతో నిరూపించుకొనే అవకాశం ఉందన్నారు. రక్షణ రంగంలో ఉత్పత్తులు కోస్తా తీరం అనుకూలమని, విశాఖలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. 

19:39 - February 4, 2016

ఢిల్లీ : 2016 ప్రారంభ టీ-20 ఆసియాకప్, టీ-20 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొనే టీమిండియా ఎంపిక కోసం...సందీప్ పాటిల్ నాయకత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ముంబైలో సమావేశమవుతోంది. రెండుటోర్నీల్లో పాల్గొనే భారతజట్టు సభ్యులను శుక్రవారం సెలెక్షన్ కమిటీ ప్రకటించనుంది. సీనియర్ ప్లేయర్లు అశీష్ నెహ్రా, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్...భారతజట్టులో చోటు సంపాదించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసియా క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి టీ-20 ఆసియాకప్ టోర్నీకి...బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6 వరకూ ఈ టోర్నీ నిర్వహిస్తారు. 2016 టీ-20 ఆసియాకప్ ప్రారంభమ్యాచ్ లో ఆతిథ్య బంగ్లాదేశ్ తో టీమిండియా పోటీపడుతుంది. ఫిబ్రవరి 27న పాకిస్థాన్ తో, మార్చి 1న శ్రీలంక జట్లతో టీమిండియా తలపడుతుంది. మార్చి 3న ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ ను సైతం నిర్వహిస్తారు.
ఆసియాకప్ లో పాల్గొనే జట్టుతో పాటు..టీ-20 ప్రపంచకప్ లో సైతం పాల్గొనే జట్లను ఒకేరోజు ఎంపిక చేసి..ప్రకటించాలని బీసీసీఐ నిర్ణయించింది. 2016 టీ-20 ప్రపంచకప్ మార్చి 8న భారత్ లో ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టులో వెటరన్ స్టార్లు అశీష్ నెహ్రా, హర్భజన్ సింగ్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్..తిరిగి చోటు సంపాదించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో ముగిసిన టీ-20 సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన...భారతజట్టులో ఒకటి రెండు మార్పులు ఉండే అవకాశం లేకపోలేదు.

19:36 - February 4, 2016

ఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి మే 13 వరకు రెండు దఫాలుగా జరగనున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఫిబ్రవరి 29న సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. మోది ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చే జిఎస్‌టి బిల్లు ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనైనా గట్టెక్కుతుందా? రోహిత్‌ ఆత్మహత్య, అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను కుదిపేసే అవకాశముంది. రెండు విడతలుగా సమావేశాలు జరుగనున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజనాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ కమిటీ బడ్జెట్‌ సమావేశాలను ఖరారు చేసింది. ఫిబ్రవరి 23న పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 25న రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 29న ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సాధారణ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 26న ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందుకు తెస్తారు. తొలి దఫా బడ్జెట్ సమావేశాలు మార్చి 16 వరకూ జరుగుతాయి.ఏప్రిల్ 25 నుంచి రెండో విడత బడ్జెట్

విపక్షాలతో చర్చలు...
సమావేశాలు ప్రారంభమై మే 13 న ముగుస్తాయి. ఏప్రిల్ మధ్యలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16 ఏప్రిల్‌ 25 మధ్య 40 రోజుల బ్రేక్‌ సమయంలో ఈసీ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. అస్సాం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై విపక్షాలతో కేంద్రం చర్చించింది. ఎన్నికల దృష్ట్యా బడ్జెట్‌ సమావేశాలను కుదించడాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంట్‌లో ఏయే అంశాలను ప్రస్తావించనుందో వాటికి సంబంధించిన షెడ్యూల్‌ ప్రకటించాలని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఈ షెడ్యూల్‌ను బట్టే ఎలక్షన్‌ కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించాలని కోరారు. విపక్షాల డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.

జిఎస్టీకి విపక్షాలు సహకరిస్తాయా ? 
ఈ బడ్జెట్‌ సమావేశాలు కేంద్రానికి అగ్నిపరీక్షగా మారాయి. రీసెర్చ్ స్కాలర్‌ వేముల రోహిత్‌ ఆత్మహత్య, అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీయనున్నాయి. ఆర్థిక సంస్కరణలు ఊతమిచ్చే జిఎస్‌టి బిల్లును ఏప్రిల్‌ నుంచి అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. కానీ ఈ బిల్లు ఆమోదానికి విపక్షాలు సహకరించడం లేదు. ఈ సమావేశాల్లో ఎలాగైనా జిఎస్‌టి బిల్లును గట్టెక్కించాలని కేంద్రం పట్టుదలగా ఉంది. గత ఏడాది లోక్‌సభలో జిఎస్‌టి బిల్లు పాసైనా విపక్షాల మెజారిటీ కారణంగా రాజ్యసభ వద్ద ఆగిపోయింది. జిఎస్‌టి బిల్లుకు ప్రతిపక్షాలు ఈసారైనా సహకరిస్తాయా... లేదా..అన్నది ఆసక్తిగా మారింది. 

19:34 - February 4, 2016

విజయవాడ : కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ అంశాన్నిఅధ్యయనం చేసేందుకు... బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ మంజునాథ కమిటీ.. త్వరలో పని ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలను కలిసి... చర్చించాలని కమిషన్‌ చైర్మన్‌ నిర్ణయించారు. మరోవైపు కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ముంజునాథ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. బీసీ కమిషన్‌ విధి, విధానాలపై చర్చించారు.
జస్టిస్‌ మంజునాథ కమిషన్‌కు ప్రభుత్వం 9 నెలల గడువు ఇచ్చింది. సమస్య తీవ్రత దృష్ట్యా నిర్ణీత సమయంలోగా నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కమిషన్‌ చైర్మన్‌కు సూచించారు. అయితే 9 నెలల్లో నివేదిక ఇచ్చే అంశంపై ముందుగానే ఏమీ చెప్పలేని, ప్రజలతో మాట్లాడిన తర్వాతే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటానని జస్టిస్‌ మంజునాథ... చంద్రబాబు దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించి కాపులతోపాటు, బీసీ సంఘాలు, వివిధ వర్గాల ప్రజలతో చర్చించి, సమస్యను క్షణ్ణంగా అధ్యయం చేయాల్సి ఉందని జస్టిస్‌ మంజునాథ చెప్పారు. మరోవైపు కాపుల రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆమరణ నిరాహార దీక్షపై ముద్రగడ పద్మనాభం పునరాలోచన చేయాలని కోరారు. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా కాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నదే ప్రభుత్వం ధ్యేయమని నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ఆర్ధికంగా, సామాజికంగా వెనుకడిన కులాల వివరాలు సేకరించేందుకు లక్షా 8 వేల మంది ఉపాధ్యాయుల సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

19:32 - February 4, 2016

గుంటూరు : ఏపీలో మున్సిపల్‌ కార్మికులు రోడెక్కారు.. జీవో నెంబర్ 279ని రద్దు చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గుంటూరులో కలెక్టర్‌ కార్యాలయం ముట్టడించారు. అటు నెల్లూరులోనూ ఆందోళనలు కొనసాగాయి. నగరంలో కార్మికులు ర్యాలీ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్ చేశారు.

అనంతపురంలో...
అటు అనంతపురంలోనూ ఆందోళనలు కొనసాగాయి.. సీఐటీయూ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్‌ను ముట్టడించారు కార్మికులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాటతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ధర్నా చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేశారు.. ఇక కర్నూలు జిల్లాకూడా నిరసనలతో హోరెత్తింది.. 279 జీవోను రద్దు చేయాలంటూ మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

19:28 - February 4, 2016

కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రజల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్‌ విమర్శించారు. గత ఎన్నికల్లో ఈప్రాంత ప్రజలు టిడిపికి ఓట్లు వేయలేదన్న నేపంతో చంద్రబాబు.... రాయలసీమ జిల్లాల పట్ల వివక్షచూపుతున్నారని ఆరోపించారు. రాజకీయాలకు అతీంతంగా అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేయాల్సని బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులన్నీ రాజధాని అమరావతి చుట్టూనే ఖర్చు పెట్టడం సరైన పద్ధతి కాదని గఫూర్‌ చెబుతున్నారు.

19:22 - February 4, 2016

తూర్పుగోదావరి : రేపు ఉదయం 9గంటలకు ఆమరణదీక్షలో కూర్చుంటానని ప్రకటించారు కాపుసంఘం నేత ముద్రగడ పద్మనాభం. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి చర్చల కోసం తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఎవరైనా చర్చలకు వస్తే మాట్లాడేందుకు తాను సిద్ధమని తెలిపారు. కాపులను బీసీల్లో కలపడమే తమ ప్రధాన డిమాండ్‌ అని మరోసారి తేల్చి చెప్పారు. ఒకపూట ఆహారం మానేసి నిరసన తెలపాలని, మన ఆకలి కేకలు ప్రభుత్వానికి వినబడాలని సూచించారు. మరోవైపు కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ నివాసం వద్దకు కాపు నేతలు తరలివస్తున్నారు. ముద్రగడ దీక్ష చేపడుతున్న సందర్భంగా జిల్లాలో కూడా దీక్షలు చేపట్టాలని, దీనికి సంబంధించిన కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. 

రీపోలింగ్ కు దూరంగా డీసీపీ..

హైదరాబాద్: పురానాపూల్ డివిజన్‌లో రేపు జరుగనున్న రీపోలింగ్‌కు డీసీపీ సత్యనారాయణ దూరం కానున్నారు. రీపోలింగ్‌కు సత్యనారాయణ ను దూరంగా ఉంచాలని హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. 

18:33 - February 4, 2016

విశాఖపట్టణం : సాగర తీరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద అమర వీరులకు సీఎం బాబు నివాళులర్పించారు. ఆంధ్రా యూనివర్సిటీలోని ఐఎఫ్ఆర్ గ్రామాన్ని బాబు ప్రారంభించారు. వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. 

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ సదస్సుకు హాజరైన గవర్నర్..

హైదరాబాద్ : పబ్లిక్ సీర్వసు కమిషన్ ఛైర్మన్ల జాతీయ సదస్సుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. నగర శివారులోని ప్రగతి రిస్టార్స్ లో ఈ 18వ జాతీయ సదస్సు జరుగుతోంది. 

మిషన్ కాకతీయ బిల్లులను సకాలంలో అందించాలి - హరీష్ రావు..

హైదరాబాద్: 'మిషన్ కాకతీయ' పనుల నిమిత్తం ఖర్చు చేయాల్సిన బిల్లులను ఆలస్యం చేయకుండా సకాలంలో అందించాలని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. మిషన్ కాకతీయ అంశంపై అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఉత్తమ్, షబ్బీర్ దాడి ఘటనలో నిందితులకు బెయిల్..

హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీలపై దాడి చేసిన నలుగురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కషఫ్, అబేద్, మసీ ఉద్దీన్, మిస్బాలను నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశ పెట్టారు. కషఫ్ ను పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరారు. కానీ దీనికి కోర్టు నిరాకరించింది. పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

రేపు జడేజా నిశ్చితార్థం..

ఢిల్లీ : క్రికెటర్ రవీంద్ర జడేజా ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. రాజ్ కోట్ కు చెందిన రీవా సోలంకి అనే 25 ఏళ్ల యువతితో రేపు నిశ్చితార్థం జరగనుంది. జడేజా సొంత రెస్టారెంట్ జడ్డూస్ ఫుడ్ లైఫ్ లో ఈ వేడుక జరగనుంది. 

18:20 - February 4, 2016

తిరుపతి : విద్యార్థులను సక్రమమైన మార్గంలో పయనించే విధంగా చేయాల్సిన ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతున్నారు. పరీక్షలు ప్రారంభం అవుతున్న దృష్ట్యా కార్పొరేట్ సంస్థలు తమ ఆగడాలను ప్రారంభించారు. కష్టపడి చదువుకుని పరీక్షలు రాసే భవిష్యత్ ను అంధకారం నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. గురువారం ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఎన్ఆర్ అకాడమీ విద్యార్థులతో ఏకంగా కాపీయింగ్ చేయించింది. పుస్తకాల్లో ఉన్న సమాధానాలను చింపి స్వయంగా అధ్యాపకులు ఇచ్చారు. వీరి కాపీయింగ్ దృశ్యాలను టెన్ టివి చిత్రీకరించింది. సమాచారం అందుకున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం యాజమాన్యం తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఎవరూ కాపీ కొట్టడం లేదని యాజమాన్యం బుకాయించడం విశేషం. మరి వారు ఎలా కాపీ కొడుతున్నారో వీడియోలో చూడండి. 

18:17 - February 4, 2016

తూర్పుగోదావరి : కాపులను బీసీల్లో చేర్చాలనే ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. గత కొంతకాలంగా దీనిపై డిమాండ్ చేస్తున్న ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరహార దీక్ష చేయాలని నిర్ణయించారు. రేపు ఉదయం 9గంటలకు కిర్లంపూడిలో తన దీక్ష ప్రారంభమౌతుందని, ఈ దీక్షలో తన సతీమణి కూడా పాల్గొంటుందని ముద్రగడ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి చర్చలకు ఎవరూ రాలేదని, ఎవరైనా చర్చలకు వస్తే మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కాపులను బీసీలో కలపడమే తన ప్రధాన డిమాండ్ అని తేల్చిచెప్పారు. కాపు సోదరులు ఎవరూ దీక్షా శిబిరం వద్దకు రావొద్దని, కాపు సోదరులు ఒకపూట ఆహారం మానేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఆకలికేకలు ప్రభుత్వానికి వినపడాలని సూచించారు. ఈ సందర్భంగా కిర్లపూడిలోని ముద్రగడ నివాసానికి కాపు నేతలు చేరుకుంటున్నారు. వారు టెన్ టివితో మాట్లాడారు. ఖాళీ ప్లేట్లతో రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపాలని, ఎవరూ భయపడవద్దని, ప్రశాంతమైన వాతావరణం నెలకొందన్నారు. ప్రభుత్వంలో ఉన్న కాపు నేతలు సీఎం చంద్రబాబు నాయుడు మనస్సును మార్చాలని సూచించారు. మూడు లెటర్లు సీఎం కు రాయడం జరిగిందని, జాతికి మేలు చేయాలని ఆ లేఖలో ముద్రగడ కోరడం జరిగిందన్నారు. ముద్రగడతో సంప్రదింపులు జరపడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. నిరహార దీక్షలో పద్మనాభం సతీమణి కూర్చుంటారు కాబట్టి మహిళలు కూడా నిరసన తెలుపాలని సూచించారు.

ఉత్తమ్, షబ్బీర్ లపై కేసులు దారుణం - శ్రవణ్..

హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీలపై కేసులు పెట్టడం దారుణమని పార్టీ నేత శ్రవణ్ పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఓవైసీని వదిలేసి తమ నాయకులపై కేసులు ఎలా పెడుతారని ప్రశ్నించారు. అసద్ హైదరాబాద్ విడిచి వెళ్లడం వెనుక పోలీసుల హస్తం ఉందని, తెలంగాణ మరో బీహార్ కావొద్దంటే అసద్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో గవర్నర్ ఎందుకు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ప్రశ్నించారు. గ్రేటర్ చట్టాన్ని ప్రభుత్వం దొడ్డిదారిన తెచ్చినందుకే కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. 

ఎన్ఆర్ఐ కళాశాలలో మాస్ కాపీయింగ్..

తిరుపతి : ఎన్ఆర్ఐ కళాశాలలో మాస్ కాపీయింగ్ జోరుగా కొనసాగింది. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో కళాశాల సిబ్బందే విద్యార్థులకు సమాధానాలు అందచేసిన వైనం 10 టెవి చిత్రీకరించింది. 

హుస్సేనీఆలం పీఎస్ లో సీపీ సమీక్ష..

హైదరాబాద్ : పురానాపూల్ రీ పోలింగ్ సందర్భంగా హుస్సేనిఆలం పీఎస్ లో సీపీ మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అడిషనల్ సీపీ అంజనీకుమార్ తదితర పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

ఉదయం 9గంటలకు దీక్ష – ముద్రగడ..

తూర్పు గోదావరి : రేపు ఉదయం 9గంటలకు ఆమరణ దీక్ష చేపడుతానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండది చర్చలకు ఎవరూ రాలేదని, ఎవరైనా చర్చలకు వస్తే మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కాపులను బీసీలో కలపడమే తన ప్రధాన డిమాండ్ అని తేల్చిచెప్పారు. కాపు సోదరులు ఎవరూ దీక్షా శిబిరం వద్దకు రావొద్దని, కాపు సోదరులు ఒకపూట ఆహారం మానేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఆకలికేకలు ప్రభుత్వానికి వినపడాలని సూచించారు.

 

17:35 - February 4, 2016

కరీంనగర్ : మేము సైతం ప్రపంచానికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను.. మేము సైతం గ్రామవృద్దికి చెమట చుక్కను దారపోస్తాను అన్నాడో సినిమాకవి. ఆయనను ఆదర్శంగా తీసుకున్నారేమో కాని తమ కన్నీటి చుక్కలనే ఆయుధాలుగా మలచుకున్నారు. నిత్యం ఇంట్లోని ప్రతి ఒక్కరు తాగుడుకు బానిసలే...నిత్యం ఇరుగుపొరుగు వారితో తగాదాలే.. ఇది గ్రామంలోని ఏ ఒక్క కుటుంబానికి సంబంధించించినదో కాదు. ప్రతి ఇంట్లో ఇదే తంతు.. ఏళ్లుగా భరిస్తూ వస్తున్న మహిళలు దీనికి చరమగీతం పాడాలనుకున్నారు. మద్యం మహమ్మారి పీచమనచాలనుకున్నారు కరీంనగర్ జిల్లాలోని చిన్నబోనాల గ్రామ మహిళా సంఘాల వారు. అనుకున్నదే తడవుగా వినూత్న ఆలోచనకు తెరలేపారు. తమ గ్రామంలోని మహిళా సంఘాల సహాయంతో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు.

1800 మంది నివాసం..
ఏళ్లుగా భరిస్తూ వస్తున్న వారు ఒక్కసారిగా తిరగబడితే ఎలా ఉంటుందన్నది చేసి చూపించారు చిన్నబోనాల గ్రామ మహిళలు. మొత్తం గ్రామంలో 1800 వందల మంది నివసిస్తున్నారు. అందులో 1265 మంది ఓటర్లు ఉన్నారు. గత డిసెంబర్ 31న గ్రామంలోని యువకులు తప్పతాగి గ్రామంలోని వారందరితో గొడవలు పడ్డారు. సహించలేని గ్రామమహిళలు మద్యంపై పోరాటాన్ని ఉదృతం చేశారు. గత మూడేళ్లుగా మద్యం అమ్మకాలను గ్రామంలో నిషేధించాలని అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఫలితం లేకపోవడంతో వారే ఉద్యమానికి నడుంబిగించారు. రుద్రవీణ సినిమాలో చిరంజీవి చేసిన ప్రయోగాన్ని గ్రామ మహిళలు ఆచరించారు. జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ దత్తత తీసుకున్న ఈ చిన్నబోనాల గ్రామంలో.. 36 గ్రామ ఐక్య సంఘాలన్ని ఒక తాటి పైకి వచ్చి మద్యం అమ్మకాలను నిషేధించాలని ఆందోళనకు దిగారు. రచ్చబండపై పోరాటానికి ఊపిరి ఊదారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు మద్యం తాగనని ప్రమాణం చేయాలని లేకపోతే.. భర్తలతో సంసారం చేసేది లేదని తేల్చి చెప్పారు. మరి మితిమీరితే వారిని గ్రామంలోంచి బహిష్కరించాలని నిర్ణయించారు. గ్రామంలో ఎవరు మద్యం అమ్మినా.. తాగినా వారికి 25 చెప్పు దెబ్బలు 50 వేల రూపాయల జరిమానా విధించాలని గ్రామమహిళలందరు పెద్దమనుషుల ఒప్పందం చేసుకున్నారు.

నిలిచిపోయిన మద్యం అమ్మకాలు..
గ్రామ మహిళలు తీసుకున్న నిర్ణయం అందరిని కదిలించడంతో గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. గ్రామంలో మద్యం తాగే వారి సంఖ్య తగ్గిందని.. గ్రామంలోని యువత మారారని గ్రామస్థులు తెలిపారు. మద్యం సేవించకుండా ఉండడానికి మహిళలు చూపిన ధైర్యం గ్రామస్థులను కనువిప్పుగించింది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆదర్శ గ్రామంగా మారుతోంది. గ్రామస్తులందరూ కలిసి సమగ్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతలు , ఉపాధి పథకాల అమలుతో పల్లెవాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కరీంనగర్ జిల్లా చిన్న బోనాల గ్రామమహిళలు చూపిన ధైర్యం అందరికి అదర్శంగా నిలుస్తోంది. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటే పల్లెలు కావా అభివృద్దికి సూచకాలు. 

17:32 - February 4, 2016

హైదరాబాద్ : తెలంగాణలో కాళోజీ హెల్త్ యూనివర్శిటీకోసం వేగంగా ఆడుగులువేస్తోంది ఆరోగ్యశాఖ.. మార్గదర్శకాల రూపకల్పనకు స్టడీ టూర్‌ నిర్వహిస్తోంది.. దేశంలోనే టాప్ వర్శిటీగా పేరుగాంచిన బెంగళూరులోని రాజీవ్‌ గాంధీ హెల్త్ యూనివర్సిటీని మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. అక్కడ అమలవుతున్న విధి విధానాలు తెలుసుకున్నారు.. అలాగే మిగతా విశ్వవిద్యాలయాలను కూడా అధ్యయనం చేసి బెస్ట్ ఆప్షన్‌ను ఎంచుకుంటామని అధికారులు చెబుతున్నారు..

17:30 - February 4, 2016

హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అక్బరుద్దీన్ బిన్ లాడెన్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. ఒవైసీ సోదరులను తమ పార్టీ నేతలే నెత్తికి ఎక్కించుకున్నారని గుర్తు చేశారు. ఒవైసీ సోదరులను కట్టడి చేయాలని ఆయన సీఎం కేసీఆర్ కు సూచించారు. గతంలో ఎంఐఎంను నెత్తిన పెట్టుకుని తప్పు చేశామని, ఆనాడు మద్దతు తెలిపిన తమ నాయకులే ఈనాడు తన్నులు తిన్నారని పేర్కొన్నారు. ఓవైసీకి కేసీఆర్ మద్దతు తెలపడం మానుకోవాలని, లేదంటే తమకు పట్టిన గతే కేసీఆర్ కూ పడుతుందని హెచ్చరించారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయ్యాక ఎంఐఎం గురించి తెలుస్తుందన్నారు. ఓవైసీ సోదరులను సపోర్టు చేయడమంటే పాముకు పాలు పోసి పెంచినట్లేనని తెలిపారు. 

17:28 - February 4, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా కంపెనీ డేటావిండ్ ముందుకొచ్చింది. ఈమేరకు సంస్థ ప్రతినిధులతో... తెలంగాణ సర్కారు ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి పాల్గొన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంతో 15 రోజుల్లోనే కంపెనీలకు అనుమతినిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక విధానం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు జూపల్లి.

17:26 - February 4, 2016

హైదరాబాద్ : టెక్నాలజీ వినియోగంలో టీఎస్పీఎస్సీ ఎంతో ముందుందని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని... ప్రగతి రిసార్ట్స్‌లో పీఎస్సీ ఛైర్మన్ల 18వ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సదస్సుకు యూపీఎస్సీ ఛైర్మన్‌తో పాటు... దేశంలోని 29 రాష్ట్రాల పీఎస్సీ ఛైర్మన్లు హాజరయ్యారు. హైదరాబాద్‌లో పీఎస్సీ ఛైర్మన్ల సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు కేటీఆర్. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఎంతో పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తోందని తెలిపారు. 

నవీపేట సర్కారీ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్..

నిజామాబాద్ : జిల్లాలోని నవీపేట ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్న భోజనం తిన్న 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

17:21 - February 4, 2016

నిత్యజీవితంలో ఒత్తిడి తో కూడిన జీవన శైలిలో సరియైన నిద్ర కరువైన పరిస్థితి ఎంతో మందికి ఉంటోంది. మరి ఈ నిద్రలేమికి కారణాలేమిటి? ఎలాంటి పరిష్కారమార్గాలున్నాయో దానిపై వైద్యులు సూచనలు చేశారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:20 - February 4, 2016

అద్దెగర్భాలెందుకు ? అనే ప్రశ్నలు దాటుకుని, అద్దెగర్భాల సంఖ్య ఎక్కడ ఎక్కువుందనే దశకు చేరుకున్నాం. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అరుదుగా వినిపించే ఈ మాట, ఇటీవల కాలంలో విస్తృతంగా వినిపిస్తోంది. రెండు రాష్టాల్లోనూ అద్దెగర్భాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం. గ్లోబలైజేషన్, మనిషి జీవితంలో ఎన్నో మార్పులు తెస్తోంది. ఆఖరికి అమ్మ గర్భాన్ని కూడా అంగడి సరుకుగా మార్చింది. అందుకు పేద మహిళల్ని ఎరగా ఎంచుకుంది. ఈ దోపిడీలో అమ్మతనం నిశ్శబ్దంగా నలిగిపోతోంది. సంతానం కావాలనే బలమైన కోరిక ఒకవైపు .. అందుకు ప్రతిగా పేద మహిళలు అద్దె తల్లులుగా మారుతున్న స్థితి మరోవైపు.. ఇందుకు సంబంధించిన చట్టాలు, న్యాయ సూత్రాలు బలంగా లేని పరిస్థితి ఇంకోవైపు.. ఇలాంటి గందరగోళాల మధ్య అంతిమంగా బాధితులుగా మారేది.. మారుతున్నది మాత్రం పేద మహిళలే.. అందుకే ఇకనైనా ప్రభుత్వాలు తేరుకుని, సరొగసికి సంబంధించి నిర్దిష్ట చట్టాలను రూపొందించాలని మానవి కోరుకుంటోంది. పేద మహిళల ఆరోగ్యాలను వైద్యరంగంలోని ప్రయోగాల కోసం ఫణంగా పెట్టొద్దని మానవి డిమాండ్ చేస్తోంది.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..

హైదరాబాద్: స్టాక్‌మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 115పాయింట్ల లాభానికి 24,338 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 7,404 పాయింట్ల వద్ద ముగిసింది. 

కాంగ్రెస్ నేతల దాడిలో కోర్టులో నిందితులు..

హైదరాబాద్ : పాతబస్తీలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ ఆలీలపై దాడి ఘటనకు సంబంధించిన నలుగురు నిందితులను గురువారం పోలీసులు నాంపల్లి కోర్టులో హజరు పరిచారు. ఈ ఘటనకు సంబంధించి మరో 8 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. 

ఇటిక్యాలలో అసదుద్దీన్ దిష్టిబొమ్మ దహనం..

మహబూబ్ నగర్ : కాంగ్రెస్ నాయకులపై ఎంఐఎం దాడిని నిరసిస్తూ ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో పార్టీ నేతలు గురువారం ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ప్రారంభం..

విశాఖపట్టణం : ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. బీచ్ రోడ్డులోని విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద అమరవీరులకు సీఎం నివాళులర్పించారు. 

16:48 - February 4, 2016

జమ్మూ కాశ్మీర్ : సియోచిన్ ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకున్న పది మంది సైనికుల జాడ తెలుసుకొనేందుకు సైనికులు గాలింపులు చర్యలు చేపట్టారు. ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీల తక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. బుధవారం కొండ చరియలు విరిగిపడడంతో పది మంది సైనికులు చిక్కుకున్నారు. సముద్రమట్టానికి 19600 అడుగుల ఎత్తున ఉండే ప్రాంతంలో సైనికులు విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

16:40 - February 4, 2016

మహారాష్ట్ర : ఆదర్శ హౌసింగ్ కుంభకోణం మరో కొత్త మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పై సీబీఐ విచారణకు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదర్శ స్కాంకు సంబంధించి చవాన్ ను విచారించేందుకు గతంలో సీబీఐ మహారాష్ట్ర గవర్నర్ కు లేఖ రాసింది. ఈ కుంభకోణంలో 13 మందిపై ఛార్జీషీటత్ దాఖలు చేసింది. అందులో మాజీ సీఎం చవాన్ పేరు కూడా ఉంది. 2013 ఆదర్శ స్కాంను సీబీఐకి అప్పగించడానికి అప్పటి తాత్కాలిక గవర్నర్ శంకర్ నారాయణ్ నిరాకరించారు. మాజీ సైనికులు, వీరమరణం పొందిన జవాన్ల కోసం 31 అంతస్తుల భవనం నిర్మించారు. ఇందులో మూడు అపార్ట్ మెంట్లను సమీప బంధువులకు ఇప్పించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో 2010లో చవాన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. 

16:34 - February 4, 2016

వరంగల్ : ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేటు రికార్డు సృష్టించింది. దేశీయ మిర్చి క్వాంటం రూ.18వేల రేటు పలికింది. సీజన్ ప్రారంభం నుండి మిర్చి ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారి. తేజోమిర్చి రూ.12వేలు, యూఎస్ 3ఫోర్1 రకం రూ. 12,600 ధర పలికింది. పంట మంచి రేటు పలకడంతో రైతులు సంతషం వ్యక్తం చేస్తున్నారు. 

16:30 - February 4, 2016

కర్నూలు : ఛైన్ స్నాచర్లపై ఉక్కుపాదం మోపాలని జిల్లా పోలీసు యంత్రాంగం నిర్వహించింది. స్నాచర్లను పట్టుకొనేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని సాయుధ బృందాలు కూడా ఉన్నాయి. స్నాచర్లను పట్టుకొనే క్రమంలో విధి నిర్వాహణలో ఉన్న పోలీసులపై ఎవరైనా తిరగబడితే కాల్పులు చేసే అధికారం ఈ బృందాలకు కల్పించారు. ఇరానీ దొంగల ముఠాతో పాటు అనంతపురం జిల్లా గుంతకల్, కర్నాటకలోని బళ్లారి నుండి వస్తున్న గ్యాంగ్ లు ఛైన్ స్నాచర్లకు పాల్పడుతున్నారని ఎస్పీ రవి కృష్ణ పేర్కొన్నారు. 

16:11 - February 4, 2016

విజయవాడ : కాపుల రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రేపటి నుండి నిర్వహించతలపెట్టిన ఆమరణ దీక్షపై ముద్రగడ పునరాలోచించుకోవాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంలో ఉన్న కాపు వర్గాలకు జీవో గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. 

16:08 - February 4, 2016

హైదరాబాద్ : ప్రొఫెషనల్ కబడ్డీలీగ్ విశాఖ అంచె పోటీలు ఆతిథ్య తెలుగు టైటాన్స్ కు మిశ్రమఫలితాలను మిగిల్చాయి. నాలుగు రౌండ్లలో రెండు విజయాలు, రెండు పరాజయాలతో టైటాన్స్ టీమ్...హోం రౌండ్ మ్యాచ్ లను ముగించింది. విశాఖ లెగ్ పోటీలు ముగియడంతో...కబడ్డీ సర్కస్ బెంగళూరు శ్రీకంఠీరవ స్టేడియానికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను ఓలలాడిస్తున్న 2016 ప్రొఫెషనల్ కబడ్డీలీగ్ విశాఖ అంచె పోటీలు...హోం టీమ్ తెలుగు టైటాన్స్ తో పాటు...డిఫెండింగ్ చాంపియన్ యూ-ముంబా, మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ కు మిశ్రమఫలితాలను మిగిల్చాయి. కబడ్డీలీగ్ మూడో సీజన్ ప్రారంభంలోనే జరిగిన విశాఖ అంచె పోటీల్లో భాగంగా మొత్తం నాలుగు రోజుల పాటు ఏడు రౌండ్ల మ్యాచ్ లు నిర్వహించారు. పోటీల తొలి రోజున ప్రస్తుత చాంపియన్ యూ-ముంబాతో ముగిసిన తొలిరౌండ్ పోటీలో 25-27 పాయింట్లతో పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్. ఆ తర్వాత జరిగిన రెండురౌండ్లలోనూ పుంజుకొని ఆడి వరుస విజయాలు నమోదు చేసింది.

టైటాన్స్ కు తొలి గెలుపు...
పూణేరీ పల్టాన్ తో ముగిసిన ఉత్కంఠభరిత పోటీలో..గట్టి పోటీ ఎదుర్కొన్న తెలుగు టైటాన్స్...చివరకు 27-26 పాయింట్ల విజయంతో బోణీ కొట్టింది. 2016 సీజన్లో టైటాన్స్ కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. ఆ తర్వాత...ఢిల్లీ దబాంగ్ తో జరిగిన మూడోరౌండ్ పోటీలో సైతం...రాహుల్ చౌదరి నాయకత్వంలోని తెలుగుటైటాన్స్ తన దూకుడు కొనసాగించింది. రైడింగ్, బ్లాకింగ్ విభాగాలలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 45-34 పాయింట్ల విజయంతో విజేతగా నిలిచింది. ఇక..విశాఖ అంచె ఆఖరిరోజు పోటీల్లో భాగంగా...బెంగాల్ వారియర్స్ తో జరిగిన పోటీలో మాత్రం..తెలుగు టైటాన్స్ కు అనూహ్య పరాజయం తప్పలేదు. బెంగాల్ జట్టు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టి ..25-17 పాయింట్లతో తెలుగు టైటాన్స్ కు షాకిచ్చింది. ప్రస్తుత సీజన్లో టైటాన్స్ కు ఇది రెండో పరాజయం. కెప్టెన్ కమ్ సూపర్ రైడర్ రాహుల్ చౌదరి..మొత్తం నాలుగు రౌండ్ల మ్యాచ్ ల్లోనే అత్యధికపాయింట్లు సాధించి...తన ప్రత్యేకత చాటుకొన్నాడు. మరోవైపు...డిఫెండింగ్ చాంపియన్ యూ-ముంబా, మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు సైతం..రెండురౌండ్లలో ఒక్కో గెలుపు, ఒక్కో ఓటమితో మిగిలాయి. 

15:59 - February 4, 2016

హైదరాబాద్ : ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ కు...మన హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 15 నుంచి 21 వరకూ గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియం వేదికగా..తెలంగాణా బ్యాడ్మింటన్ సంఘం ఈ పోటీలకు ఆతిథ్యమిస్తోంది. ఆసియా దిగ్గజాలు చైనా, మలేసియా, ఇండోనీషియా, జపాన్, చైనీస్ తైపీ, థాయ్ లాండ్, మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్, కొరియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, భారత్ జట్లు ..పురుషుల, మహిళల టీమ్ విభాగాల్లో తలపడబోతున్నాయి.పురుషుల విభాగంలో మొత్తం 14 జట్లు, మహిళల విభాగంలో 12 దేశాలజట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఒక్కోజట్టు మూడు సింగిల్స్, రెండు డబుల్స్ మ్యాచ్ ల సమరంలో తలపడాల్సి ఉంటుంది. పురుషుల విభాగంలో ఆతిథ్య భారత్, ఆసియా సూపర్ పవర్ చైనా ఒకే గ్రూపులో తలపడబోతున్నాయి. గ్రూప్- ఏ లీగ్ లో చైనా, భారత్, సింగపూర్ జట్లు ఢీ కొంటాయి. మహిళల విభాగంలో గ్రూప్- డీ లో భారత్, జపాన్, సింగపూర్ జట్లు తలపడతాయి. ఒక్కో గ్రూపు నుంచి రెండుజట్లు నాకౌట్ రౌండ్ కు చేరుకొంటాయి. ప్రపంచ రెండోర్యాంకర్ సైనా నెహ్వాల్,10వ ర్యాంకర్ పీవీ సింధు మహిళల సింగిల్స్, కిడాంబీ శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ పుషుల సింగిల్స్ లోనూ, మహిళల డబుల్స్ లో గుత్తా జ్వాల- అశ్వినీల జోడీ భారత్ కు ప్రాతినిథ్యం వహిస్తారు. పురుషుల, మహిళల రెండు విభాగాలలో చైనాజట్లు హాట్ ఫేవరెట్లుగా టైటిల్ వేటకు దిగనున్నాయి. 

15:56 - February 4, 2016

నార్తరన్‌ లైట్స్......ప్రకృతిని ప్రేమించే వారికి అసలే మాత్రం పరిచయం అక్కర్లేని పేరు.సూర్యుడి నుంచి వచ్చే విచ్చిన్న కిరణాలు.....భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకడం వల్ల వెలువడే ఈ రంగురంగుల కాంతి కిరణాలనే నార్తరన్‌ లైట్స్‌ అంటారు. ఆకాశంలో అందమైన హరివిల్లుని చూస్తేనే ఆశ్చర్యపోతుంటాం....భూమికి ఉత్తర ధృవంలో మాత్రమే కనిపించే ఈ కిరాణాలు చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే. వినువీధిలో కనిపించే ఈ అద్భుతం నిజంగా వర్ణనాతీతమనే చెప్పాలి. ఈ నార్తరన్‌ లైట్స్ ను అరోరా బోరియాలిస్‌, ఉత్తర ధృవ జ్యోతి అని కూడా పిలుస్తుంటారు. 

మైనస్ మూడు డిగ్రీలు..
ఈ కాంతి కిరణాలు వెలువడే సమయంలో స్పానిష్‌ యాక్రోబ్యాటిక్‌ పారాగ్లైడర్‌ హోరాసియో లోరెన్స్ పెద్ద సాహసమే చేశాడు. నార్వేలో మోస్ట్ హ్యాపెనింగ్‌ సిటీ ట్రోమ్సోలోని ప్రముఖ టూరిస్ట్‌ స్పాట్‌ అయిన నార్తరన్‌ లైట్స్ పాయింట్‌ వద్ద పారా గ్లైడింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరచాడు. కానీ ట్రోమ్సోలో పారాగ్లైడింగ్‌ చేయడమంటే మాటలు కాదు. మైనస్‌ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎముకలు కొరికే చలి, పైగా బలమైన ఈదురుగాలులు. పారా గ్లైడింగ్‌ చేయడానికి అసలే మాత్రం అనుకూలించని వాతావరణం. ఇటువంటి ప్రతికూల వాతావరణంలోనూ లోరెన్స్‌ పారా గ్లైడింగ్‌ చేసి ... వారెవ్వా అనిపించాడు. ఈదురుగాలులకు అనుగుణంగా పారాచ్యూట్‌ను బాలెన్స్ చేస్తూ గాల్లో తేలిపోయాడు. రిస్క్‌ను సైతం లెక్కచేయకుండా పారా గ్లైడింగ్‌ జంప్స్‌తో వీక్షకులను థ్రిల్‌ అయ్యేలా చేశాడు.

అరుదైన సాహస యాత్ర...
పారా గ్లైడింగ్‌, బ్యాక్‌ గ్రౌండ్‌లో నార్తరన్‌ లైట్స్ ఇటువంటి అరుదైన, ఎంతో అందమైన దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లు చాలలేదనే చెప్పాలి. లోరెన్స్ చేసిన ఈ ఫీట్‌ ప్రస్తుతం ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్ వరల్డ్‌లోనే హాట్‌ టాపిక్‌గా మారింది. ట్రోమ్సో నార్తరన్‌ లైట్స్ పాయింట్‌ వద్ద పారా గ్లైడింగ్‌ చేసిన చేసిన తొలి గ్లైడర్‌గా హోరాసియో లోరెన్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మరి ఉత్తర ధృవజ్యోతి వద్ద పారా గ్లైడింగ్‌ చేయాలన్న ఆలోచన రావడమే గొప్ప అనుకుంటే అదే ఆలోచనను ఆచరించి చూపించిన ఘనత మాత్రం హోరాసియో లోరెన్స్‌కే దక్కింది. హోరాసియో లోరెన్స్ చేసిన ఈ స్టంట్‌ ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్‌లోనే ఓ అరుదైన సాహస యాత్రగా మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

15:52 - February 4, 2016

బెంగళూరు : భారత్ లో అత్యధిక జనాదరణ పొందిన, అత్యంత వివాదాస్పాద ..ఇండియన్ ప్రీమియర్ లీగ్ 9వ సీజన్ వేలానికి...బెంగళూరులో ఏర్పాట్లు చకచకాసాగిపోతున్నాయి. ఏప్రిల్ 9 నుంచి మే 23 వరకూ జరిగే ఐపీఎల్ 9వ సీజన్ కోసం..శనివారం ఈ వేలం నిర్వహిస్తున్నారు. సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్, డాషింగ్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్, కెవిన్ పీటర్సన్ తో సహా మొత్తం 351 మంది జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లను వేలానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం తొమ్మిది ఫ్రాంచైజీల ఓనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ యాజమాన్యాలన్నీ..ఈ వేలం కార్యక్రమంలో పాల్గొనబోతున్నాయి. ఢిల్లీ ఫ్రాంచైజీ అత్యధికంగా 37 కోట్ల 15 కోట్ల రూపాయల మొత్తంతో వేలం కార్యక్రమంలో పోటీకి దిగుతోంది.

230 మంది భారత క్రికెటర్లు..
కింగ్స్ లెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ 23 కోట్లు, కోల్ కతా నైట్ రైడర్స్ 17 కోట్ల 95 లక్షల రూపాయలు, ముంబై ఇండియన్స్ 14 కోట్లు, బెంగళూరు ఫ్రాంచైజీ 21 కోట్లు, హైదరాబాద్ సన్ రైజర్స్ 30 కోట్లు, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ 27 కోట్లు, గుజరాత్ లయన్స్ 27 కోట్ల రూపాయల మొత్తంతో పోటీకి దిగుతున్నాయి. ఐపీఎల్ లో నమోదైన మొత్తం 714 మంది ఆటగాళ్ల పూల్ నుంచి...351 మంది క్రికెటర్లను తిరిగి వేలంలో ఉంచారు. వీరిలో 230 మంది భారత క్రికెటర్లు సైతం ఉన్నారు. సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్, లంబూ పేసర్ ఇషాంత్ శర్మ, ఇంగ్లండ్ స్టార్ హిట్టర్ కెవిన్ పీటర్సన్, కంగారూ జెయింట్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్, వెటరన్ పేసర్ అశీష్ నెహ్రా, దినేశ్ కార్తీక్, ధవళ్ కులకర్ణీ, సంజు శాంప్సన్, స్టువర్ట్ బిన్నీ, మైకేల్ హస్సీ, కేన్ రిచర్డ్ సన్, మిషెల్ మార్ష్ లాంటి మేటి క్రికెటర్ల కనీసధర 2 కోట్ల రూపాయలుగా ఉంచి..వేలం నిర్వహించబోతున్నారు.

కొత్త ఫ్రాంచైజీలు..
మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు..సస్పెన్ష్ కు గురికావడంతో...వాటిస్థానంలో వచ్చిన రాజ్ కోట్ ఫ్రాంచైజీ..సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, బ్రెండన్ మెకల్లమ్, జేమ్స్ ఫాక్నర్, డ్వయన్ బ్రావో లాంటి ఆటగాళ్లను సొంతం చేసుకొంది.
పూణే ఫ్రాంచైజీ..మహేంద్ర సింగ్ ధోనీ, అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్, స్టీవ్ స్మిత్, ఫాఫ్ డూప్లెసీ లాంటి మొనగాళ్ళను దక్కించుకొంది. ఇదిలా ఉంటే గుజరాత్ లయన్స్ జట్టుకు కెప్టెన్ గా సురేశ్ రైనాను, కోచ్ గా బ్రాడ్ హాడ్జ్ ను...రాజ్ కోట్ ఫ్రాంచైజీ ప్రకటించింది. గత సీజన్ వరకూ 16 కోట్ల రూపాయలు అందుకొన్న సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్ కు ప్రస్తుత సీజన్లో ఎంత ధర పలుకుతుందన్నదే ఇక్కడి అసలు పాయింట్. 

15:48 - February 4, 2016

విశాఖపట్టణం : అంతర్జాతీయ ప్లీట్ రివ్యూలో భాగంగా తూర్పు నావికాదళం ఏర్పాటు చేసిన మారిటైమ్ ఎగ్జిబిషన్ ఆకర్షణీయంగా ఉంది. భారత రక్షణ రంగానికి వెన్నుదన్నుగా ఉన్నపలు సంస్థలు చేసిన ప్రయోగాలు, ఫలితాలు శక్తివంతమైన యుద్ద పరికరాలు నమూనాలు ఎగ్జిబిషన్ లో ఉంచారు. భారత రక్షణ రంగంలో ఎలాంటి యంత్రాలు ఉన్నాయి ? ఎలాంటి పాత్ర పోషిస్తుంది ? అనే విషయాలు తెలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మరిన్ని విషయాల కోసం వీడియో చూడండి. 

15:47 - February 4, 2016

విజయవాడ : 13 జిల్లాల ప్రజలతో ముఖాముఖి తర్వాతే..కాపుల రిజర్వేషన్‌పై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు జస్టిస్ మంజునాథన్. ప్రభుత్వం 9నెలల కాలపరిమితి ఇచ్చినా... ప్రజలతో చర్చించిన తర్వాతే కాలపరిమితి విషయాన్ని సీఎంకు వెల్లడిస్తామని తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఏపీ ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేసింది. నిన్నటి కేబినెట్‌ సమావేశంలో కాపుల రిజర్వేషన్‌పైనే ప్రధానంగా చర్చించిన సీఎం చంద్రబాబు..జస్టిస్‌ మంజునాథతో భేటీ అయ్యారు. కాపు రిజర్వేషన్ల విధివిధానాలపై జస్టిస్‌ మంజునాథతో సీఎం చంద్రబాబు చర్చించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఏర్పాటైన జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ 9నెలల గడువును మరింత కుదించేందుకు సీఎం జస్టిస్‌ ముంజునాథ్‌తో చర్చించినట్లు సమాచారం. 

15:44 - February 4, 2016

కర్నూలు : ఫేస్‌ బుక్‌ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకుని లైంగికంగా వేధించిన సైబర్‌ నేరగాడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని పగడ్యాలకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ కొంత కాలం క్రితం ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. అమ్మాయిలను ఆకర్షించేందుకు తన బట్టతలకు విగ్గుపెట్టుకుని తీయించిన ఫోటోలను ఫేస్‌ బుక్‌లో పెట్టాడు. డాక్టర్‌గా, డైరెక్టర్‌గా పలు కొటేషన్లు పోస్టు చేసి యువతులకు వలవేశాడు. ఫేస్‌ బుక్‌లో పరిచయమైన అమ్మాయిలను లాడ్జిలకు పిలిపించుకుని లైగింక వేధింపులకు గురి చేశాడు. వారి నగ్న చిత్రాలను తీసి, సోషల్‌ మీడియా సైట్లలో పెడతానని బెదిరించి లొంగతీసుకున్నాడు. వారి నుంచి బంగారం, నగలు తీసుకుని మోసాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రాజ్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. 

సీబీఐ కోర్టులో నోయిడా ఇంజినీర్..

న్యూఢిల్లీ : యూపీలోని నోయిడా అథార్టీ ఇంజినీర్ యాదవ్ సింగ్ ను పోలీసులు సీబీఐ కోర్టులో హాజరు పరిచారు. అవినీతి, నిధుల దుర్వినియోగం, ఆదాయ వనరుల ను మించి ఆస్తుల సంపాదన వంటి పలు ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. 

అశోక్ చవాన్ ను ప్రశ్నించేందుకు గవర్నర్ అనుమతి..

మహారాష్ట్ర : మాజీ సీఎం అశోక్ చవాన్ ను ప్రశ్నించేందుకు సీబీఐకి గవర్నర్ అనుమతినిచ్చారు. ఆదర్శ హౌసింగ్ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు చవాన్ ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

వైసీపీలోకి ఆనం సోదరుడు..

నెల్లూరు : వైసీపీలోకి ఆనం సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి చేరడానికి రంగం సిద్ధమైంది. చింతారెడ్డిపాలెంలోని తన నివాసంలో ఆత్మయులు, అనుచరులతో ఆనం విజయ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. త్వరలో పార్టీలో చేరే తేదీని ప్రకటిస్తానని తెలిపారు.

ఓవైసీ మరో బిన్ లాడెన్ - వీహెచ్..

హైదరాబాద్ : అసదుద్దీన్ ఓవైసీ మరో బిన్ లాడెన్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానించారు. గతంలో ఎంఐఎంను నెత్తిన పెట్టుకుని తప్పు చేశామని, ఆ నాడు మద్దతు తెలిపిన తమ నాయకులే ఈనాడు తన్నులు తిన్నారని పేర్కొన్నారు. ఓవైసీకి కేసీఆర్ మద్దతు తెలపడం మానుకోవాలని, లేదంటే తమకు పట్టిన గతే కేసీఆర్ కూ పడుతుందని హెచ్చరించారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయ్యాక ఎంఐఎం గురించి తెలుస్తుందన్నారు. ఓవైసీ సోదరులను సపోర్టు చేయడమంటే పాముకు పాలు పోసి పెంచినట్లేనని తెలిపారు. 

కిర్లంపూడిలో శాంతిభద్రలను సమీక్షించిన ఐజీ, డీఐజీ..

తూర్పు గోదావరి : రేపు ముద్రగడ ఆమరణ దీక్షకు దిగనున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కిర్లంపూడిలో శాంతి భద్రతలను కోస్తా జిల్లాల ఐజీ విశ్వజిత్, ఏలూరు రేంజ్ డీఐజీ హరికుమార్ సమీక్షించారు. 

ముద్రగడతో చర్చలు జరపనున్న ప్రభుత్వం .

విజయవాడ : కాపుల రిజర్వేషన్ల కోసం దీక్షకు దిగనున్న ముద్రగడ ప్రభుత్వం నుండి చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. గంటా, ఎంపీ తోట నర్సింహం, ఎమ్మెల్యే తోటా త్రిమూర్తులులు ముద్రగడతో చర్చలు జరపున్నట్లు సమాచారం. 

మంత్రి హరీష్ వీడియో కాన్ఫరన్స్..

హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

15:17 - February 4, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను ఐదు గంటల్లో నిర్వహిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 3.30గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుందన్నారు. పురానాపూల్ రీ కౌంటింగ్ కారణంగా కౌంటింగ్ ప్రక్రియ సమయాన్ని మార్చారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కౌంటంగ్ కంటే ముందు మాక్ కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సెల్ ఫోన్ లను అనుమతించరని, ప్రత్యేక మీడియా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నార. 5.30 గంటల ప్రాంతంలో 26 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ప్రకటిస్తామన్నారు. 6గంటల ప్రాంతంలో మరో 26 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ను ప్రకటిస్తామని వెల్లడించారు. మొత్తం ప్రక్రియ ఐదు గంటలు పడుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పాస్ లున్న వారే లోనికి అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు వాడడం ద్వారా ఎలాంటి సమస్యలు రావడం లేదన్నారు. విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని అనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పురానాపూల్ కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. 

13 జిల్లాల ప్రజలతో ముఖాముఖి - జస్టిస్ మంజునాథన్..

విజయవాడ : పదమూడు జిల్లాల ప్రజలతో ముఖాముఖి తరువాతే కాపుల రిజర్వేషన్ పై ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుందని జస్టిస్ మంజునాథన్ పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడారు. ప్రభుత్వం తొమ్మిది నెలల కాలపరిమితి పెట్టింది కానీ ప్రజలతో చర్చించిన తరువాత కాలపరిమితి విషయాన్ని సీఎం చంద్రబాబుకు వెల్లడిస్తానన్నారు. 

15:03 - February 4, 2016

దర్శకుడు బల్కీ తన సినిమాల్లో కుటుంబ బంధాలు, అనుబంధాలను అత్యంత శక్తివంతంగా చూపించగలరు. ఆయన గత చిత్రాల మాదిరిగానే కుటుంబ నేపథ్యంలో 'కి అండ్‌ కా' ప్రత్యేకంగా ఉంటుంది' అని చెబుతోంది కరీనాకపూర్‌. ఏప్రిల్‌ 1వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న ఈచిత్రం గురించి కరీనా మాట్లాడుతూ,'భారతీయ సమాజంలో పెళ్ళైన భార్యభర్తల మధ్య మగ, ఆడ అనే జెండర్‌ తేడా ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందనే పాయింట్‌తో ఈ చిత్రం రూపొందింది. భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఇటువంటి చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. అర్జున్‌ కపూర్‌, అమితాబ్‌, జయాబచ్చన్‌ వంటి వారితో నటించటం మరచిపోలేని అనుభూతినిచ్చింది' అని తెలిపారు.

 

15:01 - February 4, 2016

సుమంత్‌ అశ్విన్‌, పూజా జవేరి జంటగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'రైట్‌ రైట్‌'. రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'సినిమా తొలి షెడ్యూల్‌ను అరకు, ఒడిశాలో 25 రోజుల పాటు చిత్రీకరించాం. రెండో షెడ్యూల్‌లో భాగంగా వికారాబాద్‌లోని బస్‌డిపో, బస్టాండ్‌, ఫారెస్ట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ నెల 20 నుంచి మార్చి 5 వరకు జరిగే మూడో షెడ్యూల్‌తో ఒక పాట మినహా మొత్తం షూటింగ్‌ పూర్తవుతుంది. మిగిలిన పాటను ఔట్‌డోర్‌లో చిత్రీకరించి వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. హీరో సుమంత్‌ అశ్విన్‌ కెరీర్‌లో పూర్తి భిన్నమైన సినిమాగా నిలిచే ఈ చిత్రంలో 'బాహుబలి' ఫేమ్‌ ప్రభాకర్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. మలయాళంలో పెద్ద హిట్‌ అయిన ఓ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి రూపొందిస్తున్న చిత్రమిది. ఎస్‌.కోట నుంచి గవిటికి వెళ్ళే ఓ ఆర్టీసీ బస్సు ఈ సినిమాలో కీ రోల్‌ ప్లే చేస్తుంది. కామెడీ, లవ్‌, మిస్టరీ అంశాలతోసాగే ఈ చిత్రం అందరిని ఆలరిస్తుందని నమ్ముతున్నాం' అని అన్నారు. నాజర్‌, దన్‌రాజ్‌, షకలక శంకర్‌, తాగుబోతు రమేష్‌, జీవా, రాజా రవీంద్ర, భరత్‌రెడ్డి, వినోద్‌, పావని, కరుణ, జయవాణి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 

14:57 - February 4, 2016

వైవిధ్యమైన భారీ చిత్రాల నిర్మాణానికి కేరాఫ్‌గా ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌ నిలిచిన విషయం విదితమే. తాజాగా కళ్యాణ్‌రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని రూపొందించేందుకు ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సన్నాహాలు చేస్తోంది. ప్రొడక్షన్‌ నెం.8గా తెరకెక్క బోయే ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ ఏప్రిల్‌ నెల నుండి ప్రారంభం కానుంది. ''అతనొక్కడే' చిత్రం దగ్గర్నుంచి 'ఫటాస్‌' వరకు డిఫరెంట్‌ చిత్రాల్లో నటించిన కళ్యాణ్‌రామ్‌ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే 'బద్రి' నుండి 'లోఫర్‌' వరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తానేమిటో నిరూపించుకున్నారు పూరీజగన్నాథ్‌. ఈ డిఫరెంట్‌ కాంబినేషన్‌లో ఎన్టీఆర్‌ ఆర్ట్స్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. కళ్యాణ్‌రామ్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా దర్శకుడు పూరీజగన్నాథ్‌ అత్యద్భుతమైన స్క్రిప్ట్‌ని రెడీ చేశారు. ఏప్రిల్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభిస్తాం. ఈ చిత్రంలో నటించే నటీనటులు, పని చేసే సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే తెలియజేస్తాం' అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

14:55 - February 4, 2016

నాగశౌర్య, మాళవిక నాయర్‌ హీరోహీరోయిన్లుగా నందిని రెడ్డి దర్శకత్వంలో శ్రీ రంజిత్‌ మూవీస్‌ బ్యానర్‌పై దామోదర ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణ వైభోగమే'. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత దామోదర ప్రసాద్‌ మాట్లాడుతూ, 'ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభించింది. ఆద్యంతం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే మంచి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ముఖ్యంగా యూత్‌కి బాగా కనెక్ట్‌ అయ్యే అన్ని రకాల అంశాలను దర్శకురాలు నందిని రెడ్డి వినోదభరితంగా రూపొందించారు. నాగశౌర్య, మాళవిక నాయర్‌ జోడీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ నెలాఖరులోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. రాశి, ఐశ్వర్య, ఆనంద్‌, పర్ల్‌ మానె, రాజ్‌ మదిరాజ్‌, తాగుబోతు రమేష్‌, ధన్‌రాజ్‌ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్‌ కోడూరి, సినిమాటోగ్రఫీ: జి.బి.ఎస్‌.రాజు, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్దిక్‌.

14:52 - February 4, 2016

విశ్వవ్యాప్తంగా బహుళ ఆదరణ పొందిన 'బాహుబలి' చిత్రానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రేక్షకులకు, పాఠకులకు ముఖ్యంగా పిల్లలకు మరింత దగ్గరగా తీసుకెళ్ళేందుకు కామిక్స్, యానిమేషన్‌, గేమ్స్ రూపంలో 'బాహుబలి' రాబోతోంది. దీనికి సంబంధించి గ్రాఫిక్‌ ఇండియా సంస్థతో 'బహుబలి' నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకుని 'బాహుబలి' కామిక్‌ లుక్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ,'సినిమా ప్రపంచంతో నిమిత్తం లేకుండా 'బాహుబలి' పరిధిని మరింత విస్తృతం చేసే ప్రయత్నమిది' అని అన్నారు. 'గ్రాఫిక్‌ ఇండియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది. ఈ సంస్థ నుంచి వెలువడే 'బాహుబలి' కామిక్స్, యానిమేషన్‌, గేమ్స్ ఎలా ఉంటాయో చూడాలనే ఆసక్తితో ఉన్నాం' అని ఆర్కామీడియా వర్స్క్ సిఇఓ శోభ యార్లగడ్డ చెప్పారు. 'బాహుబలి- ద లాస్ట్‌ లెజెండ్స్' పేరుతో రూపొందబోయే యానిమేషన్‌ ప్రాజెక్ట్‌ని సైతం తమ గ్రాఫిక్‌ ఇండియా సంస్థ చేస్తున్నట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు శరద్‌దేవరాజన్‌ తెలిపారు.

14:45 - February 4, 2016

మన శరీరంలో చేరిన టాక్సిన్స్ (వ్యర్థాలను)బయటకు నెట్టివేయడానికి, శరీరం రోజంతా తేమగా, ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా అవసరం. ఆరోగ్యానికి మాత్రమే కాదు, యవ్వనంగా గ్లోయింగ్‌ స్కిన్‌తో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుండాలంటే నీరు అత్యంత అవసరం. అయితే, ప్లెయిన్‌ వాటర్‌ మాత్రమే ఎందుకు జ్యూసులెందుకు తాగకూడదు. జ్యూసులు మన శరీరానికి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్ ను పుష్కలంగా అందిస్తాయి.
క్యారెట్‌ జ్యూస్‌: క్యారెట్‌ జ్యూస్‌లో విటమిన్‌ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది. అలాగే స్కిన్‌ పిగ్మెంటేషన్‌నివారిస్తుంది.
దానిమ్మ జ్యూస్‌: ఇది చర్మాన్ని మరమత్తు చేయడం మాత్రమే కాదు, కొత్తగా చర్మ కణాలు ఏర్పడుటకు కూడా సహాయపడుతుంది. దానిమ్మ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్లోయింగ్‌ స్కిన్‌ పొందవచ్చు. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది.
ద్రాక్ష జ్యూస్‌: ఈ జ్యూస్‌లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ప్రతి రోజూ గ్రేప్‌ జ్యూస్‌ను తాగడం వల్ల మీ చర్మం తాజాగా ఉంటుంది. అలాగే చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
టమోటో జ్యూస్‌: టమోటాల్లో లైకోపిన్‌ అధికంగా ఉంటుంది. ఇది బాడీలో యాంటీఆక్సిడెంట్స్ ను తొలగించి చర్మం కాంతివంతం చేస్తుంది. జిడ్డు చర్మాన్ని నివారిస్తుంది. టమాటాలను జ్యూస్‌లా చేసుకుని కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
కీర జ్యూస్‌: కుకుంబర్‌ జ్యూస్‌ స్కిన్‌ పిగ్మెంటేషన్‌ తగ్గిస్తుంది. దాంతో చర్మంలో ఎలాంటి స్కార్స్, మార్క్స్ కనబడవు. ఇందులో వాటర్‌ కంటెంట్‌ అధికంగా ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ను ఎఫెక్టివ్‌ గా తొలగిస్తుంది. కిడ్నీలను శుభ్రపరిచి అధికంగా ఉండే రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. కీళ్ళ వ్యాధులను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
ఆరెంజ్‌ జ్యూస్‌: దీనిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. 

ముస్లిం రిజర్వేషన్ ల మాటేమిటి ? - అసదుద్దీన్..

ఉత్తర్ ప్రదేశ్ : ముస్లింలకు రిజర్వేషన్ లు ఇస్తామని వాగ్ధానం చేసి ఎందుకు ఇవ్వడం లేదని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఆయన ఫిరోజాబాద్ లో జరిగిన ఓ సభలో ప్రసంగించారు. 

బాలకృష్ణ ఓటు ఎలా వేస్తారు - పొన్నం..

హైదరాబాద్: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇక్కడ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు ఎలావేస్తారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ఈమేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బాలకృష్ణ ఓటు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

మహిళను వివస్త్ర చేయలేదు - కర్ణాటక హోం మంత్రి..

బెంగళూరు : నాలుగు రోజుల కిందట టాంజానియా మహిళపై జరిగిన అమానుష ఘటనపై కర్ణాటక హోం శాఖ మంత్రి జి.పరమేశ్వర స్పందించారు. ఆ మహిళను వివస్త్రను చేసి ఊరేగించారనడం అసత్యమన్నారు. 

14:16 - February 4, 2016

హైదరాబాద్ : మిషన్ కాకతీయకు సాంకేతిక సహకారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ ఐఐటి, బిట్స్, నాబార్డు సంస్థలతో ఈ ఒప్పందం జరిగింది. మంత్రి హరీష్ రావు సమక్షంలో అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు ఈ సంస్థల సహకారం తీసుకుంటామని హరీష్ రావు మీడియాకు తెలిపారు. కార్యక్రమం ప్రజల వరకు ఎంత వరకు వెళుతోంది ? లోటు పాట్లను సరిచేసుకోవాల్సినవసరం ఉందా ? అనేది తెలుస్తుందన్నారు. 

భోగాపురంలో రాఘవులు పర్యటన..

విజయనగరం : భోగాపురం ఎయిర్ పోర్టు నిర్వాసిత గ్రామాలైన కౌలువాడ, రెడ్డికంచేరు, గూడెపువలసలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పర్యటించారు. ఎయిర్ పోర్టు ప్రయాణికుల కోసం కాదని, భూ స్వాముల కోసం పచ్చ ఉండే ప్రాంతాన్ని నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. ఎయిర్ పోర్టును సమర్థించే నాయకులను వెలివేయండని పిలుపునిచ్చారు. 

రాజ్ భవన్ లో గవ్నరర్ ను కలిసిన సీపీ..

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ ను సీపీ మహేందర్ రెడ్డి కలిశారు. పాతబస్తీ గొడవలపై సీపీ నివేదిక సమర్పించారు. గంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. 

14:07 - February 4, 2016

హైదరాబాద్ : మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. చట్టాన్ని సవరించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఏజీ వాదనలు వినిపించారు. ఒకసారి మాత్రమే సవరించే అధికారం ఉందని పిటిషనర్లు వాదించారు. చట్టం సవరణపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని కోర్టు పేర్కొంది.
ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేర్చుతూ టీ సర్కార్‌ జీవో నెంబర్ 207 విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ నేత శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం దీనిపై విచారణ జరిగింది. చట్ట సవరణపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధపడింది. తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ ఒక రోజు గడువు కోరడంతో నేటికి వాయిదా వేసింది. చట్టానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఇవ్వలేదని న్యాయవాది టెన్ టివికి తెలిపారు. కాంగ్రెస్, ఎంఐఎం, టిడిపి పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారని, టీఆర్ఎస్ కు అనుకూలంగా చేయలేదన్నారు. 

కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం ఫిర్యాదు..

హైదరాబాద్ : పాతబస్తీ మీర్ చౌక్ పీఎస్ లో కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం ఫిర్యాదు చేశారు. ఉత్తమ్, షబ్బీర్ ఆలీ, రామ్మోహన్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. 143,147, 448, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

ఎక్స్ అఫిషియో సభ్యుల వివాదంపై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుల వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. చట్టాన్ని సవరించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఏజీ వాదనలు వినిపించారు. ఒకసారి మాత్రమే సవరించే అధికారం ఉందని పిటిషనర్లు వాదించారు. చట్టం సవరణపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని కోర్టు పేర్కొంది. 

13:40 - February 4, 2016

హైదరాబాద్ం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ మనవరాలు మిరయావాద్రా పుదుచ్చేరిలో సందడి చేశారు. పుదుచ్చేరిలో జరుగుతున్న 42వ సబ్‌ జూనియర్‌ జాతీయ బాస్కెట్‌ బాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఆమె పాల్గొంది. హరియాణా జట్టు తరుపున మిరయా వాద్రా బరిలోకి దిగింది. ఈ టోర్నిలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తమిళనాడుతో హరియాణా తలపడింది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ప్రియాంకగాంధీ కూడా వచ్చారు. ఈ మ్యాచ్‌లో 15వ నంబర్‌ జెర్సీ ధరించిన మిరయా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఐతే ఈ మ్యాచ్‌లో హర్యానాపై తమిళనాడు విజయం సాధించింది. 

13:39 - February 4, 2016

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా సోనియా, రాహుల్‌ వేర్వేరుగా రెండు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలని ఆ పిటిషన్లలో కోరారు. 

13:37 - February 4, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరికొన్ని గంటలు అదనంగా కొనసాగనుంది. రేపు కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్‌ జరుగుతుండటంతో.. ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు..మధ్యాన్నం 3.30 గంటలకు ప్రారంభం కానున్నది. 

13:34 - February 4, 2016

విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఏపీ ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేసింది. బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కాపుల రిజర్వేషన్‌పైనే ప్రధానంగా చర్చించిన సీఎం చంద్రబాబు..జస్టిస్‌ మంజునాథతో కాసేపటి క్రితం భేటీ అయ్యారు. కాపు రిజర్వేషన్ల విధివిధానాలపై జస్టిస్‌ మంజునాథతో సీఎం చంద్రబాబు చర్చించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఏర్పాటైన జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ 9నెలల గడువును మరింత కుదించేందుకు సీఎం జస్టిస్‌ ముంజునాథ్‌తో చర్చిస్తున్నుట్లు సమాచారం. మరో వైపు మహిళలకు కూడా ప్రాతినిధ్యం వుండేలా చూడాలను సూచించినట్లు తెలుస్తోంది.

13:32 - February 4, 2016

కడప : తన ప్రతిజ్ఞ కోసం గడ్డాన్ని అడ్డంగా పెట్టారు ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసే వరకు గడ్డం తీయనని ఆయన గ్యారంటీ ఇస్తున్నారు. ఆయన గురువాంర 'టెన్ ప్రాజెట్టు కంప్లీట్‌ అయిన తరువాతే క్లీస్‌ షేవ్‌ చేయించుకుంటానని గడ్డం మీద ఒట్టేసి చెబుతున్నారు. జిఎన్ ఎస్ ఎస్ కాలువ పనులను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్న సతీష్‌రెడ్డితెలిపారు. ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా సీఎం చూస్తున్నారని తెలిపారు. సకాలంలో నిధులు మంజూరు చేసిన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

13:28 - February 4, 2016

విజయవాడ : కాపులను బీసీల్లో కలపాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఏపీ రాష్ట్ర బీసీ సంఘం నేతలు 13 జిల్లాల్లోని కలెక్టరేట్లను ముట్టడించే కార్యక్రమం చేపట్టారు. అయితే విజయవాడ నగరంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తారన్న కారణంగా ముందుగానే బీసీ నేతలను హౌస్ అరస్ట్ చేశారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ..ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపు మేరకూ బీసీ నేతలు ఈ ఆందోలన కార్యక్రమం చేపట్టడంతో పోలీసులు వీరిని గృహ నిర్భందన చేశారు. ప్రభుత్వం తమ వాదన వినకుండానే కాపులను బీసీల్లో చేర్చడం లాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని బీసీ నేత పోతేని మహేష్‌ అన్నారు. 

13:26 - February 4, 2016

తూ.గో: కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ బీసీ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. కాకినాడలోని కలెక్టర్‌ కార్యాలయాన్ని బీసీ సంఘాల నేతలు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపులో బీసీల్లో చేర్చితే సహించేదిలేదని స్పష్టం చేశారు.

13:24 - February 4, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిపై నేషనల్‌ గ్రీన్‌ట్రిబ్యునల్‌లో విచారణ జరిగింది. అమరావతిపై పర్యావరణ అనుమతులపై వారంలోగా వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ ఈనెల 7కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

'ముస్లింలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి'

విజయవాడ :ఎన్నికల సందర్భంగా ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముస్లిం మేధావుల ఫోరం డిమాండ్ చేసింది. ఈ మేరకు వారు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... వృత్తి విద్యలో 8శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ రూ. 500 కోట్లు కేటాయించాలన్నారు. గృహనిర్మాణ పథకంలో ముస్లింలకు 17 శాతం ఇళ్లు కేటాయించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. త్వరలో విజయవాడలో భారీ ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

అమరావతిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ

ఢిల్లీ : అమరావతిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులపై వారంలోగా వివరాణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 7వ తేదీకి వాయిదా వేసింది.

గుంటూరు కలెక్టరేట్ మట్టుడి

గుంటూరు : కాపులను బీసీల్లో చేరుస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో గుంటూరు కలెక్టర్ ముట్టడికి యత్నించాయి. ఈ సందర్భంగా బీసీ సంఘం నేత క్రాంతి కుమార్ మాట్లాడుతూ... 50 శాతంఉ న్న బీసీల ఓటు బ్యాంకు రాజకీయ నాయకులు వాడుకుంటున్నారని ఆరోపించారు. కాపులను బీసీల్లో చేరిస్తే బీసీలంతా కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

ఇఫ్లూ నుంచి 11 మంది విద్యార్థుల సస్పెండ్..

హైదరాబాద్: ఆంగ్ల-విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ)లో విద్యనభ్యసిస్తున్న 11 మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ వర్సిటీ నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు విద్యార్థులపై ఆరోపణ. వర్సిటీ నిర్ణయంపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సాయంత్రం భారీ ర్యాలీ తీసేందుకు విద్యార్థులు సమాయత్తమౌతున్నారు.

గవర్నర్ తో సీపీ మహేందర్ రెడ్డి భేటీ...

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో గొడవలు జరిగిన నేపథ్యంలో అఖిలపక్షం ఫిర్యాదు మేరకు సీపీ మహేందర్‌రెడ్డిని ఈ రోజు గవర్నర్‌ రాజ్‌భవన్‌కు పిలిపించారు. గొడవలపై పూర్తి వివరాలను ఆయన సీపీని అడిగి తెలుసుకున్నారు.

12:33 - February 4, 2016

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 23 నుంచి మార్చి 16 వరకు తొలి బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 23న బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. 25న రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 29న సాధారణ బడ్జెట్‌ను అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టనున్నారు. రెండు విడతలు కలిపి 43 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.

12:32 - February 4, 2016

హైదరాబాద్ : ప్రపంచాన్నే భయాందోళనలకు గురి చేసిన ట్విన్ టవర్స్ దాడికి స్ఫూర్తినిచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి చేయడం ఒసామా బిన్ లాడెన్ సొంత ఆలోచన కాదని, ట్విన్ టవర్ల కూల్చివేతకు రెండు సంవత్సరాల ముందే జరిగిన ఓ సంఘటన నుంచి స్ఫూర్తి పొందాడని ఉగ్రవాద సంస్థకు చెందిన 'ఆల్‌మస్రా' పత్రిక వెల్లడించింది.

ఈజిప్టు ఎయిర్‌లైన్స్ ప్రమాదం నుంచే లాడెన్‌ స్ఫూర్తి....

ప్రపంచాన్నే గడగడలాడించిన ఉగ్ర దాడి సెప్టెంబర్‌ 11 ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత. అయితే 217 మంది మృతికి కారణమైన ఈజిప్టు ఎయిర్‌లైన్స్ ప్రమాదం నుంచే లాడెన్‌ స్ఫూర్తి పొంది అమెరికాలో ట్విన్‌ టవర్స్‌పై దాడులు చేశాడని సంచలన కథనం ఒకటి వెలుగు చూసింది.

రెండేళ్ల ముందే....

సెప్టెంబర్‌ 11 దాడులకు సరిగ్గా రెండేళ్ల ముందే ఈజిప్టు ఎయిర్ ఫ్లైట్ 990 విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. ఈ విమానం లాస్‌ఏంజల్స్ నుంచి కైరోకు ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మొత్తం 217 మంది జల సమాధి అయ్యారు. వీరిలో దాదాపు సగం మంది అమెరికాకు చెందినవారే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఇంజన్ ఫెయిల్ కావటం వల్ల జరగిందని ఈజిప్టు విచారణాధికారులు తేల్చారు. కానీ, యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు మాత్రం ఎయిర్‌ ఫ్లైట్ 990 కో పైలెట్ 'జమీల్ ఆల్ బటౌటి' ఉద్దేశ పూర్వకంగానే విమానాన్ని నీటిలోకి దించాడని నిర్ధారించింది. కానీ, ఈ సంఘటన నుంచి ఆల్‌ఖైదా నాయకుడు లాడెన్ స్ఫూర్తి పొంది, దీని నుంచే వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చివేయాలనే గట్టిగా భావించారు. అయితే ఈజిప్ట్ విమానం వార్త 'ఆల్ మస్రా'లో వచ్చినప్పుడు దాన్ని చదువుతూ ఆవేశంతో ... విమానాన్ని నీటిలోకి ఎందుకు దించాడు.. భవనాన్ని ఎందుకు ఢీకొట్టలేదని లాడెన్ అన్నాడని సన్నిహితులు పేర్కొన్నారు.

మొత్తం 12 విమానాలతో దాడులు చేయాలని....

ఆనాటి ట్విన్ టవర్స్ దాడుల్లో మొదట మొత్తం 12 విమానాలతో దాడులు చేయాలని నిర్ణయించుకున్నారని కమిషన్‌ రిపోర్టు తేల్చింది. అయితే విమానాలతో భవనాలపై దాడులు చేయించాలనే ఆలోచన మాత్రం లాడెన్‌ దే అని తేలింది. ఈ దాడుల్లో దాదాపు 3వేల మంది అమాయక పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 23 నుంచి మార్చి 16 వరకు తొలి బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 25 నుంచి మే 13 వరకు రెండో విడత సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 23న బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. 25న రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 29న సాధారణ బడ్జెట్‌ను అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టనున్నారు. రెండు విడతలు కలిపి 43 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.

శ్రీశైలం నుంచి సాగర్ కు నీటి విడుదల

హైదరాబాద్: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు తాగు నీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. దీంతో నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో 18,116, ఔట్ 800 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఏమ్మార్సీ కాలువ నుంచి అధికారులు తాగునీటి రిజర్వాయర్లకు నీటిని తరలిస్తున్నారు.

తూ.గో జిల్లా వ్యాప్తంగా టెన్షన్ టెన్షన్

విజయవాడ : తూర్పు గోదావరి జిల్లాలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఒక పక్క ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షకు పిలుపునివ్వడం..మరోపక్క బీసీ సంఘాల కలెక్టరేట్ల ముట్టడి నేపథ్యంలో జిల్లాలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కాకినాడలోని కలెక్టర్‌ దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. 

11:59 - February 4, 2016

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సైకిల్‌ దూసుకుపోతుందని తెలుగు తమ్ముళ్లు నమ్మకంగా ఉన్నారు.. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పైచేయి తమదేనని గట్టిగా చెబుతున్నారు.. ప్రచారంలో అధికార పార్టీ జోరుకు టీడీపీ బ్రేక్‌ వేస్తుందని అంచనా వేసుకుంటున్నారు.. తెలంగాణలో డీలాపడినా... గ్రేటర్‌ వార్‌లో అనుకున్న స్థానాల్లో పసుపు జెండా ఎగరడం ఖాయమని ధీమాగా ఉన్నారు.. గతంలో టిడిపి చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని నమ్మకం పెట్టుకున్నారు.. ఐటీతో విదేశీ అవకాశాలు కల్పించామని.. ఈ రంగంలోని ఉద్యోగులంతా సైకిల్‌కే ఓటేసి ఉంటారని లెక్కలు వేసుకుంటున్నారు.. అలాగే కార్యకర్తలు, బడుగు, బలహీనవర్గాల ఓట్లన్నీ తమవేనని అంచనాకు వచ్చారు..

ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన చాలా బాగుందని....

ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన చాలా బాగుందని తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు.. ఇక చంద్రబాబు పర్యటనకైతే జనాలు జేజేలు పలికారని సంబరపడుతున్నారు.. యువ నేత లోకేశ్ టూర్‌తో యూత్‌ ఓట్లన్నీ తమవేనని అంచనాతో ఉన్నారు.. ఇలా అన్నీ తమకు కలిసొచ్చాయని ఉత్సాహంగా ఉన్నారు..

50 సీట్లలో గెలుపు తమదేనని....

అధికార పార్టీ ఎన్నిరకాలుగా ప్రయత్నించినా 50 సీట్లలో గెలుపు తమదేనని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు.. గ్రేటర్‌లో TDPకి ఓటు బ్యాంక్ చాలా ఉందని నమ్మకంగా ఉన్నారు.. ఈ స్థానాల్లో గెలుపుతో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ప్లాన్‌లు వేసుకుంటున్నారు.. ఎన్నికల్లో విజయంపై ఎవరి అంచనాలు వారికున్నా... తమ్ముళ్లు మాత్రం ఇలా యమ జోరుమీదున్నారు.. ఢిల్లీనుంచి నిధులు తెచ్చి గ్రేటర్‌ అభివృద్ధికి పాడుపడతామని ముందుగానే ప్రణాళికలు వేసుకుంటున్నారు.. 

11:55 - February 4, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓట్లపై హైకోర్టులో ఇవాళ కూడా విచారణ జరుగుతోంది. ఎమ్మెల్సీలను ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా చేర్చుతూ టీ సర్కార్‌ చేసిన చట్టసవరణను హైకోర్టు విచారిస్తోంది. బుధవారం దీనిపై విచారణ జరిగింది. చట్ట సవరణపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధపడింది. తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ ఒక రోజు గడువు కోరడంతో నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

11:41 - February 4, 2016

కాకినాడ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాపులను వెంటనే బీసీల్లో చేర్చాలని రేపటి నుండి మాజీ మంత్రి ముద్రగడ తలపెట్టిన దీక్షకు 13 జిల్లాల నుంచి ప్రజలు రావద్దని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ విజ్ఞప్తి చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... జిల్లా మొత్తం 144 సెక్షన్ తో పాటు, సెక్షన్ 30 అమలులో వుందని తెలిపారు. తుని కేసులో 63 కేసులు నమోదయ్యాయాని పేర్కొన్నారు.. ఈ కేసులో క్షుణ్ణంగా విచారణ చేపట్టినట్లు తెలిపారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకూడదనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాని తెలిపారు. సాధారణ పనులకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. తుని ఘటనపై పరాదర్శకంగానే కేసులు నమోదు చేస్తామన్నారు. నేరం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసుల విచారణకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

11:35 - February 4, 2016

విజయవాడ : కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు.  మంత్రులు నారాయణ, చిన్నరాజప్ప, కొల్లు రవీంద్ర విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కాపు రిషర్వేషన్ల అంశంపై నియమించిన జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ గడువు 9 నెలలు ఉంది కనుక కాపులందరూ అప్పటివరకు సంయమనం పాటించాలని అన్నారు. ఈ విషయాన్ని కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం గ్రహించి నిరాహార దీక్షను విరమించుకోవాలని మంత్రి సూచించారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం జీవో 30ను ఇప్పటికే విడుదల చేసిందని..దాంట్లో అన్ని విషయాలు సమగ్రంగా ఉన్నాయన్నారు ఏపీ మంత్రి నారాయణ. కాపులందరూ జీవో 30ను ఓసారి చదివి అర్థం చేసుకోవాలన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని అయినా ముద్రగడ నిరాహార దీక్ష చేపట్టడం ఎందుకని మంత్రి నారాయణ ప్రశ్నించారు. 

12వ తేదీ తెల్లవారుజామున సచివాలయానికి శంకుస్థాపన

విజయవాడ : 12వ తేదీ తెల్లవారుజామున 4.15 నిమిషాలకు తాత్కాలిక సచివాలయానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వెలగపూడి, మల్కాపురం మధ్య సచివాలయ నిర్మాణం చేపట్టనున్నారు.

సుప్రీంను ఆశ్రయించిన సోనియా, రాహుల్ గాంధీ

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో హైకోర్టు విచారణపై సోనియా, రాహుల్ గాంధీలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ సదస్సు ప్రారంభం

రంగారెడ్డి : ప్రగతి రిసార్ట్ లో 18వ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ సదస్సు ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. యూపీపీఎస్సీ ఛైర్మన్ దీపక్ గుప్తా తో వివిధ రాష్ట్రాల కమిషన్ ఛైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.

10:41 - February 4, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం గత నెలల్లో ఆహ్వానించిన టెండర్ల సాంకేతిక బిడ్లను బుధవారం తెరిచారు. దిగ్గజ నిర్మాణ సంస్థలు ఎల్ అండ్ టీ, షాపూర్జీ అండ్‌ పల్లోంజీ కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. తాత్కాలిక సచివాలయాన్ని కూడా ముందుగా నిర్ణయించినట్టు మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌లో కాకుండా... రాజధాని ప్రాంతంలోని మల్కాపురం, వెలగపూడి భూముల్లో నిర్మించే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

సాంకేతిక బిడ్లు తెరిచిన సీఆర్‌డీఏ అధికారులు ......

హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న ఏపీ ఉద్యోగస్వామ్యాన్ని కొత్త రాజధాని ప్రాంతానికి తరలించేందుకు చంద్రబాబు సర్కార్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఓ ముందడుగు పడింది. తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి పిలిచిన టెండర్ల సాంకేతిక బిడ్లను సీఆర్‌డీఏ అధికారులు తెరిచారు. కేవలం రెండు నిర్మాణ దిగ్గజ సంస్థలు ఎల్‌ అండ్‌ టీ, షాపూర్జీ అండ్‌ పల్లోంజీ కంపెనీలు మాత్రమే బిడ్లు వేశాయి. ఈనెల 10న ఫైనాన్షియల్‌ బిడ్లను తెరిచి టెండర్లు ఖరారు చేస్తారు. ఆతర్వాత నిర్మాణ పనులు అప్పగిస్తారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు సేకరించిన మల్కాపురం, వెలగపూడిలోనే తాత్కాలిక సచివాలయం నిర్మిస్తారు.

తాత్కాలిక సచివాలయ నిర్మాణ వ్యయం రూ.120 కోట్లు .....

ఏపీ త్కాత్కాలిక సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం నిర్దేశించిన వ్యయం 120 కోట్ల రూపాయలు. దీనికంటే తక్కువ కోట్‌ చేసిన కంపెనీకి కాంట్రాక్ట్‌ దక్కుతుంది. సర్కార్‌ నిర్ణయించిన గడువుకు నెలరోజులు ముందే నిర్మాణాలు పూర్తి చేస్తే... నజరానా ఇస్తారు. కాంట్రాక్ట్‌ వ్యయంలో ఇది 1 శాతం చెల్లించే విధంగా టెండర్లలోనే నిబంధన చేర్చారు. అలాగే జాప్యం జరిగితే జరిమాన విధేంచే నిబంధనను కూడా చేర్చారు. జీ ప్లన్‌ వన్‌ పద్ధతిలో త్కాత్కాలిక సచివాలయ భవనాలు నిర్మిస్తారు. వచ్చే జూన్‌ నాటికి నిర్మాణాలు పూర్తి చేసి, సిబ్బందిని తరలించాలని ఏపీ సర్కార్‌ భావిస్తోంది.

ముందుగా మంగళగిరి అమరావతి టౌన్‌షిప్‌లో....

తాత్కాలిక సచివాలయం నిర్మాణంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఏ పీ ప్రభుత్వం సవరించింది. మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌లో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి అనుమతిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు దీనిని మార్పు చేసి.. రాజధాని కోసం భూములు సేకరించిన మల్కాపురం, వెలగపూడిలోనే సెక్రటేరియట్‌ భవనాలు నిర్మాణానికి వీలు కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 

10:38 - February 4, 2016

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజలకు పన్నుపోటు తప్పేలా కనిపించడం లేదు. ఒక పక్క వ్యయం పెరిగిపోవడం..మరోపక్క ఆశించిన మేరకు ఆదాయం లేకపోవడంతో భారం తప్పదనే సంకేతాలు సర్కార్‌ నుంచి వస్తున్నాయి.

ఆదాయం 15శాతం పెరిగిందంటున్న ప్రభుత్వం...

గతేడాదితో పోలిస్తే ఆదాయం 15 శాతం మేర పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. కాని అదే సమయంలో వ్యయాలు కూడా పెరిగిపోతున్నాయి. మరోపక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు కూడా అంతగా ఫలించడం లేదు. రాజధానిలో భూముల అమ్మకాలు ముందుకు సాగటం లేదు. సైబరాబాద్ పరిధిలో వందల ఎకరాలను అమ్మాలనుకున్న సర్కార్‌...కేవలం 10 ఏకరాలు మాత్రమే అమ్మగలిగింది. పన్నులను పకడ్బందిగా వసూలు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా అంతగా ఫలించడం లేదు.

పెరుగుతున్న వ్యయం...

ఒకపక్క రాబడి తగ్గిపోతుంటే మరోపక్క అదనపు వ్యయం మరింత పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో కాబినేట్ తీసుకున్న నిర్ణయాల వల్ల వేల కోట్లు రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అవుట్ సోర్సింగ్ జీతాల పెంపు, డియర్ నెస్ అలవెన్స్ పెరుగుదల, కాంట్రాక్ట్‌ కార్మికులు క్రమబద్ధీకరణ తదితర నిర్ణయాల వల్ల వందల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. విద్యుత్ కంపెనీలకు సబ్సిడీ, సన్నబియ్యం పథకం, పాత అప్పులకు వడ్డీ చెల్లింపులు, హైద్రాబాద్ పరిధిలోని నీటి బిల్లులు, విద్యుత్ బకాయిల మాఫీ, పేదల ఇంటిపన్నులు తగ్గింపు కూడా ప్రభుత్వ ఖజనాపై ప్రభావాన్ని చూపనున్నాయి. ఇవన్నీ కలిపితే కనీసం రూ. 4 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది.

ప్రజలపై పన్నుల భారం!....

అయితే ఈ భారాలను ప్రభుత్వం ఏలా భరిస్తుందన్నదే ఆసక్తిగా మారింది. ఇప్పటికిప్పుడు అంత మేర రెవెన్యూను పెంచుకునే అవకాశం లేకపోవడంతో...ప్రజలపై పన్నుల భారం తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు. మిగులు బడ్జెట్ రాష్టమని చెబుతున్నా 4 వేల కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం మోసే పరిస్థితుల్లో లేదు. ఈ నేపథ్యంలోనే విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఇప్పటికే ప్రతిపాదనలు తయారుచేసింది. పెట్రోల్ డిజీల్ పై అదనంగా సర్ ఛార్జీలను వసూలు చేస్తోంది. తాజాగా మరి కొన్ని శాఖల్లో పన్నుల మోత మోగించే అవకాశాలున్నాయి. ఆర్టీసీ, సెల్స్ టాక్స్, ఇంటి పన్నుల పెంపు, సర్ చార్జ్ లు, వాణిజ్య పన్నులను కొంత మేర పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రజా వ్యతిరేకత వస్తుందనే ఆందోళన....

మరోపక్క పన్నులు పెంచితే ప్రజా వ్యతిరేకత మూట గట్టుకోవాల్సి వస్తుందనే ఆందోళన కూడా ప్రభుత్వ వర్గాల్లో కనబడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి అదనపు నిధులను రాబట్టేందుకు సర్కార్‌ ప్రయత్నిస్తోంది. అప్పుల పరిమితి పెంచాలని, రాష్టానికి రావాల్సిన వాటాలను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. ఒకవేళ కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తే పన్ను పోటు తగ్గే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబుతో భేటీ కానున్న కాపు కమిషన్ ఛైర్మన్

విజయవాడ : ఏపీలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకు నియమితులైన కాపు కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ మంజునాథ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశం కానున్నారు. కమిషన్‌లో ఇప్పటివరకు ఆయన ఒక్కరే ఉన్నారు. మంజునాథ ఛైర్మన్‌గా ఉన్న కమిషన్‌లో మరో ముగ్గురు సభ్యులను నియమించనున్నారు. ఇందుకుగాను ప్రభుత్వానికి 15 దరఖాస్తులు అందాయి. వీటిల్లో ముగ్గురిని ఎంపికి చేసి నియామకంపై ఈరోజు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

10:27 - February 4, 2016

విశాఖ :ఆర్థిక స్తోమత ఉన్నంతలోనే చదువుకున్నారు..ఆ తర్వాత కష్టం చేసుకుంటున్నారు... విదేశాల్లో తాము చేస్తున్న పనికి ఉద్యోగం దొరికే అవకాశం ఉందని తెలిసి సంతోషపడ్డారు..వెంటనే ఆ సంస్థ ముందు క్యూ కట్టారు విశాఖ నిరుద్యోగులు.. లక్షలు చెల్లించిన ఆరు నెలల క్రితం మలేషియా వెళ్లిన వారికి ఉద్యోగంలేదు.. ఉండేందుకు వసతి లేదు..చీకటి గదిలో మగ్గుతూ..తినడానికి తిండిలేక అల్లాడిపోతున్నారు..న్యాయం కోసం బాధిత కుటుంబాలు 10టీవీని ఆశ్రయించడంతో ఆలస్యంగా ఓ సంస్థ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది...

విదేశాల్లో ఉద్యోగాలన్నారు...

విదేశాలకు వెళ్లి కొన్నాళ్లు పనిచేసినా చాలు...ఆ కష్టార్జితం జీవితాంతం దారి చూపిస్తుందనుకున్నారు..డబ్బు లేకున్నా అప్పులు చేశారు.. ఓ సంస్థను ఆశ్రయించి ఉద్యోగాల కోసం కష్టాలు పడ్డారు..లక్షలు వసూలు చేసిన సంస్థ వారిని మలేషియాకు పంపిస్తే అక్కడ కొత్త కష్టాలు మొదలయ్యాయి...జీతం లేదు..ఉద్యోగం లేదు..చీకటి గదిలో జీవనం..దోమల మధ్య సహవాసం..తినడానికి తిండిలేక కష్టాలు.. ప్రస్తుత పరిస్థితి ఇది.. విశాఖ చెందిన నిరుద్యోగులు ఇప్పుడు మలేషియాలో అనేక కష్టాలు పడుతున్నారు... కాయకష్టం చేసుకుని సంపాదించాలనుకుని వెళ్లిన ఆ యువకులకు నిరాశే మిగిలింది..ఉద్యోగంలేక.. తినడానికి తిండి దొరక్క చీకటి గదిలో మగ్గుతున్నారు..ఆరు నెలలయినా ఎలాంటి దారి దొరక్క కష్టాలు పడుతున్న నిరుద్యోగులంతా వారి కుటుంబాలకు తెలియజేయడంతో న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు...

విశాఖలోని ఓ సంస్థ నిర్వాకం...

విదేశీ ఉద్యోగం అనగానే తమ జీవితాలకు ఓ దారి దొరికిందనుకున్నారు...కష్టపడి సంపాదించిన డబ్బుతో పాటు అప్పులు చేసి 30 మంది నిరుద్యోగులు విశాఖలోని ఐఎస్ బీఎస్ సంస్ధను ఆశ్రయించారు...మలేషియాలో ఉద్యోగం రావాలంటే ఖర్చులు కావాలని సంస్థ లక్షన్నర చొప్పున వసూలు చేసింది..ఆ సంస్థపై ఉన్న నమ్మకంతో నిరుద్యోగులు క్యూలు కట్టి డబ్బులు చెల్లించారు..5 నెలల కిత్రం మలేషియా వెళ్ళిన నిరుద్యోలకు ఎలాంటి ఉద్యోగం లేదు...చీకటి గదిలో మగ్గుతున్న నిరుద్యోగులంతా తిండిలేక మలమల మాడిపోతున్నారు... ఇలా ఎన్నో కష్టాలు పడుతున్నవారికి మాత్రం సంస్థ ఇదుగో అదుగో ఉద్యోగాలంటూ మాయమాటలు చెబుతోంది...చేసిందంతా చేసేసి తనకేమీ తెలియదన్నట్లు isbs సంస్ధ నిర్వాహకులు తప్పించుకుంటున్నారు...ఆ సంస్ధ చైర్మన్ దుబాయ్ లో ఉంటున్నాడు...జనరల్ మేనేజర్ సురేష్ బాధితులతో మాత్రం వారిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు...

ఆరు నెలలుగా నరకం చూస్తున్న నిరుద్యోగులు...

ఆరు నెలలవుతోంది.. నరకం చూస్తున్న నిరుద్యోగులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించి తమను ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు...దీంతో న్యాయం చేయాలంటూ సంస్థ వద్దకు వెళ్లిన బాధిత కుటుంబాలు 10 టివిని ఆశ్రయించారు. ఎస్ బీఎస్ సంస్ధ మోసాలపై బాధితులు పోలీసులను ఆశ్రయించనున్నారు...మలేషియాలో కష్టాలు పడుతున్నవారిని రప్పించాలంటూ వేడుకుంటున్నారు...

09:56 - February 4, 2016

హైదరాబాద్: తన భుజానికి అయిన గాయానికి మెగాస్టార్ చిరంజీవి నేడు శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఇప్పటికే ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఆపరేషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు తెలుస్తోంది. తన 150వ సినిమాగా తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని ఎంచుకున్న ఆయన, షూటింగ్ ప్రారంభమయ్యే ముందే ఈ ఆపరేషన్ ముగించేసుకోవాలని భావించినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, చిరు వెంట ఆయన భార్య సురేఖ కూడా ఉన్నారు. ఆపరేషన్ ముగిసిన తరువాత దాదాపు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ తరువాత పూర్తిగా కోలుకున్నాకనే చిరంజీవి హైదరాబాద్ వస్తారని తెలుస్తోంది.

భారత్ కు ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్ హెచ్చరిక

హైదరాబాద్ :భారత్ లో పఠాన్ కోట్ తరహా దాడులు మరిన్ని చేస్తామని ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్ హెచ్చరికలు చేశారు. పాక్ మీడియా కు ఇచ్చిన ఇంటర్య్వూలో జైష్ - ఏ- మహ్మద్ సంస్థ అధినేత హఫీజ్ సయీద్ ఈ అంశాన్ని తెలిపారు.

09:41 - February 4, 2016

హైదరాబాద్ : ఎంఐఎం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మిత్రపక్షం కాబట్టి ఆపార్టీపై చర్య తీసుకోవడానికి వెనకాడుతోందని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ ఆరోపించారు. ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ... గ్రేటర్‌ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వస్తే ఎంఐఎంపై చర్య తీసుకునే అవకాశం ఉందని..ఒకవేళ తక్కువ సీట్లు వస్తే చర్య తీసుకోకపోవచ్చని షబ్బీర్‌ అలీ అన్నారు. ఎంఐఎం దాడిపై గవర్నర్‌ స్పందించడంలేదు కాబట్టే..ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని షబ్బీర్‌ అలీ తెలిపారు.

09:38 - February 4, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరికొన్ని గంటలు అదనంగా కొనసాగనుంది. రేపు కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్‌ జరుగుతుండటంతో.. ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఓట్ల లెక్కింపు.. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. పాత బస్తీలోని పురానాపూల్‌ 52వ డివిజన్‌లో రేపు రీపోలింగ్‌ జరగనుంది. 36 పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రేపు ఉదయం 7 గంటల ఉంచి సాయంత్రం 5 వరకు రీపోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

రూ.40లక్షల విలువైన ఎర్రచందనం దుంగల స్వాధీనం.

తిరుపతి : పుత్తూరు మండలం గొల్లపల్లి చెక్ పోస్టు వద్ద అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో తరలిస్తున్న రూ. 40 లక్షల విలువైన 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులను చూసిన వాహన డ్రైవర్ పరారయ్యాడు.

ఇండోనేషియా టిమోర్ ద్వీపంలో భూకంపం

హైదరాబాద్ : ఇండోనేషియాలోని టిమోర్‌ ద్వీపంలో ఈరోజు ఉదయం భూ ప్రకంపనలు సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పైవీటి తీవ్రత 5.2గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు వెల్లడించారు.

పాతబస్తీ ఘటనపై గరవ్నర్ సమీక్ష..

హైదరాబాద్ : పాతబస్తీలో పోలింగ్ రోజు జరిగిన దాడుల నేపథ్యంలో మధ్యాహ్నం 1.30గంటలకు తనను కలవాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీలను గవర్నర్‌ నరసింహన్ ఆదేశించారు. పాతబస్తీలో కాంగ్రెస్‌ నేతలపై దాడి ఘటనపై విపక్ష నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నరు పోలీసు ఉన్నతాధికారులను పిలిచారని సమాచారం. 

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా

హైదరాబాద్ :ఘర్షణల వల్ల కొందరు ఓటర్లు ఓటు వేయలేక పోయినందు వల్ల పురానాపూల్‌ డివిజన్లో రేపు రీపోలింగ్ జరపాలని ఈసీ ఆదేశించింది.దీంతో జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. పురానాపూల్‌లో రీపోలింగ్‌ కారణంగా ఓట్ల లెక్కింపును వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

08:43 - February 4, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌ ఎన్నికల్లో ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫీషియో సభ్యత్వం కల్పించటానికి వీలుగా చట్టాన్ని సవరిస్తూ జీవో జారీ చేసిన తీరుపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జీహెచ్ఎంసీలో ఓటు హక్కు పొందిన వారికి ఎక్స్ ఫీషియో సభ్యత్వం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో 207 ద్వారా చట్ట సరణ తీసుకువచ్చింది. అస్సలు ఎక్స్ ఫీషియో నిబంధనలు ఏమి చెప్తున్నాయి అనే అంశంపై' గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో దహన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ప్రజాఉద్యమాలు ప్రజస్వామ్యానికి నష్టదాయకం కాదు...ప్రజాఉద్యమాలను అణచివేస్తామంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు సాధ్యం కాదు.. కాపుల రిజర్వేషన్లు రాజకీయ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. విభజన సమయంలో రాజకీయ పార్టీలు ఆడిన నాటకాలు కాపుల రిజర్వేషన్ల అంశంపై కూడా ఆడుతున్నాయని తెలిపారు. రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల పై స్పష్టమైన వైఖరిని పార్టీలు వెల్లడించాలన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలు సమస్యను జఠిలం చేసే విధంగా వ్యవహరించరాదని నాగేశ్వర్ పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించి ప్రొ.నాగేశ్వర్ పూర్తి విశ్లేషణ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

కొత్తగూడెంలో సైనిక నియామకాల ప్రక్రియ ప్రారంభం..

ఖమ్మం: కొత్తగూడెంలో సైనిక నియామకాల ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. ఈ నియామకాలకు తెలంగాణలోని 10 జిల్లాల నుంచి పెద్దయెత్తున యువకులు తరలివచ్చారు.5వేల మంది యువకులకు అధికారులు అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు.

07:31 - February 4, 2016

హైదరాబాద్ : ఎంఐఎం దాడి నేపథ్యంలో సెక్షన్ -8 అమలు చేయమనడం అనాలోచిత నిర్ణయం అని 'న్యూస్ మార్నింగ్' చర్చలో పాల్గొన్న నవతెలంగాణ ఎడిటర్ ఎస్.వీరయ్య తెలిపారు. సెక్షన్ -8కు పాతబస్తీలో ఘటనకు సంబంధం ఉందా? పాత బస్తీ ఘటనకు అధికార పార్టీ అండ లేదా? అన్ని పార్టీలపై ఎంఐఎం దాడి చేయడం అప్రస్వామికం కాదా? అవకాశవాద రాజకీయాలను అధికార పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా? ఎంఐఎం దాడిని చూపించి సెక్షన్ -8 అమలు చేయాలని అడగడం సమంజసమా? సెక్షన్ -8 అమలు అంటే ప్రమాదకరం కాదా? సెక్షన్ -8 అంటే అధికారం గవర్నర్ పాలన కోరుకోవటం కాదా? ఎంఐఎం దాడులను నివారణ రాజకీయ అంశం కాదా? ఎంఐఎం తో రాజకీయ పొత్తు లేదని అధికార పక్షం ప్రకటించాల్సిన అవసరం లేదా? పొత్తు తప్పుకాదు కానీ... మతోన్మాద పార్టీలతో పొత్తు అంటే పాముతో చెలగాటం కాదా? పూర్తి మెజారిటీ రాకపోతే మతోన్మాదపార్టీలతో పొత్తు కంటే ఎన్నికలకు పోవడమే మేలు అని నేతలు అభిప్రాయాపడ్డారు. ఇంకా అనేక అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రంలో వీరయ్యతో పాటు టిఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ అంశాలపై వారు ఎలాంటి విశ్లేషణ చేశారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమల: తిరుమల భక్తుల రద్దీ అతి సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 2 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

నేటి నుండి విశాఖ లో నేవీ ఉత్సవాలు...

విశాఖ : ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు విశాఖ వేదిక కాబోతుంది. నేటి నుంచి నావికా విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. వివిధ దేశాలకు చెందిన నావికాదళాల ముందు తమ శక్తి సామర్ధ్యాలు, ప్రతిభా పాటవాలు, యుద్ధ విన్యాసాలు ప్రదర్శించేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాలతో ప్రపంచ ముఖచిత్రంలో విశాఖ సిటీ ఆఫ్‌ డెస్టినీగా మారనుంది. 

07:00 - February 4, 2016

తిరుమల: టీటీడీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చే బహుమానాన్ని భారీగా కుదించింది. శాశ్వత ఉద్యోగులకు 12 వేల 200 రూపాయలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 6 వేల 100 రూపాయలు ఇవ్వాలంటూ టీటీడీ పాలకమండలి తీర్మానం చేసింది. అయితే శాశ్వత ఉద్యోగులకు 10వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5 వేలు మాత్రమే ఇవ్వాలంటూ టీటీడీ ఈవోకు దేవాదాయ ముఖ్య కార్యదర్శి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్ధిక భారం దృష్ట్యా ఇకపై బ్రహ్మోత్సవ బహుమానాన్ని పెంచకూడదంటూ ఈవోను ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులపై టీటీడీ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

06:59 - February 4, 2016

హైదరాబాద్ : 150 సీట్లకు గాను వంద సీట్లు గెలుస్తాం. మేయర్ పీఠం తమదే అంటూ గులాబీ పార్టీ.. ప్రత్యర్థులకు సవాలు విసురుతూ వచ్చింది. అయినా ఎందుకో అనుమానం. మేయర్ పీఠం దక్కదేమోనని గులాబీ అధినేతకు గతంలోనే భయం పట్టుకుందేమో ఎక్స్ అఫీషియో ఓట్లతో గట్టెక్కే ప్లాన్ చేశారు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ చట్ట సవరణలు చేశారు. అయితే టిఆర్‌ఎస్‌కు హైకోర్ట్‌లో చుక్కెదురైంది. ఇష్టానుసారంగా నిబంధనలు ఎలా మారుస్తారని ఏజీని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై నేడు కోర్టు ఆదేశాలు జారీచేయనుంది.

టిఆర్ఎస్‌కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్....

హైదరాబాద్ మేయర్‌ పీఠం ఎవరికి దక్కుతుందో శుక్రవారం తేలనుంది. రేపు విడుదలయ్యే ఫలితాలను బట్టి ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది. అయితే ఇప్పటికే మేయర్ పీఠం టిఆర్‌ఎస్‌దేనంటూ ఎగ్జిట్ పోల్‌ సర్వేలు మూకుమ్మడిగా గులాబీ పార్టీకి ఓటేశాయి. అయినా గెలుపుపై కొంత అనుమానం ఉందేమో ఎక్స్‌అఫీషియో ఓట్లతో గట్టున పడేందుకు అధికార పార్టీ కొన్ని చట్ట సవరణలు చేసింది. ప్రస్తుతం ఆ సవరణలు ఎలా సాధ్యమంటూ హైకోర్ట్‌ మధ్యంతర ఉత్తర్వులు విధించేందుకు సిద్ధమైంది.

ఫిబ్రవరి 5 ఫలితాలు ....

జిహెచ్‌ఎంసిలో మొత్తం 150 వార్డులున్నాయి. ఫిబ్రవరి 2న ఎన్నికలు జరగ్గా 5న ఫలితాలు వెలువడనున్నాయి. 11న మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో మొత్తం 150 మంది కార్పొరేటర్లతోపాటు ఎక్స్‌ అఫీషియో సభ్యులు కూడా ఓటేసి మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. ఇలా ఎక్స్ అఫీషియో సభ్యులు 64 మంది దాకా తేలారు. అంటే మేజిక్ ఫిగర్ 108 మంది ఓట్లతో మేయర్‌ పదవిని సాధించుకోవచ్చు. వేరే ఏ ఇతర పార్టీతో సంబంధం లేకుండా బల్దియా పీఠాన్ని సాధించుకోవాలని అధికార టిఆర్‌ఎస్‌ ముందస్తుగా వ్యూహాలు రచిస్తూ వచ్చింది. పైగా సరిపోనన్ని వార్డులు గెలుచుకోలేకపోతే ఇతరుల సాయం తీసుకోవాల్సివస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌అఫీషియో ఓట్లు కీలకంకానున్నాయి. దీంతో ఎక్స్‌అఫీషియో ఓట్లు పెరిగేలా టిఆర్‌ఎస్‌ ప్లాన్ చేసింది.

ఎమ్మెల్సీ ఎక్స్‌అఫీషియోల పరంగా చట్ట సవరణ

ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫీషియో సభ్యత్వం కల్పించే విషయమై కెసిఆర్ ప్రభుత్వం ఇటీవల చట్టసవరణ చేసింది. తద్వారా ఎమ్మెల్సీ కాకముందే జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికలో ఓటరుగా ఉండాలన్న నిబంధనను తొలగించింది. ఈ మేరకు డిసెంబర్‌ 31న జీవో నెంబర్‌ 207ను జారీ చేసింది. ఇలా చేయడం ద్వారా ఎమ్మెల్సీ ఎక్స్‌అఫీషియో ఓట్లు టిఆర్‌ఎస్‌కు పెరుగుతాయి. ఇలా చట్ట సవరణ చేయడాన్ని కాంగ్రెస్‌ నేత శ్రవణ్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు సిద్ధపడగా కొంత గడువు కావాలని అడ్వకేట్‌ జనరల్‌ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. మరి నేటి విచారణలో ఎలాంటి ఆదేశాలు జారీ అవుతాయో చూడాలి. 

06:57 - February 4, 2016

హైదరాబాద్ : దాదాపు నెలరోజులుగా హోరెత్తిపోయిన జీహెచ్ ఎంసీ ఎన్నికల హంగామాకు రేపటితో పూర్తిగా తెరపడనుంది.. గెలిచేదెవరో... ఓడేదెవరో శుక్రవారం మధ్యాహ్నంలోగా తేలిపోనుంది.. ఉత్కంఠ రేపుతున్న ఈ ఫలితాలకోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

శుక్రవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం ....

జీహెచ్ ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది.. శుక్రవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.. ఓట్ల లెక్కింపుకోసం ఒక్కో సర్కిల్‌ చొప్పున 24 కేంద్రాలు... 970 టేబుళ్లు ఏర్పాటు చేశారు.. ఈ విధుల్లో 3వేల 200మంది సిబ్బంది పాల్గొంటున్నారు.. 11వందల 54మంది అబ్జర్వర్ల సేవలను ఉపయోగించుకుంటున్నారు.. ఉదయం పదిగంటలకల్లా తొలి ఫలితం వస్తుందని జీహెచ్ ఎంసీ ఎన్నికల అడిషనల్‌ కమిషనర్‌ సురేంద్ర మోహన్ తెలిపారు.. మధ్యాహ్నం రెండుగంటలలోపే అన్ని ఫలితాలు వస్తాయని ప్రకటించారు..

300 పోస్టల్ ఓట్లు వచ్చాయన్న అధికారులు.....

ఇక పోస్టల్ ద్వారా ఇప్పటివరకూ 300ఓట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.. అభ్యర్థులు, ఆయా పార్టీల ఏజంట్లనుమాత్రమే కౌంటింగ్‌ టేబుళ్ల దగ్గరకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.. ఫలితాలు వెలువడ్డాక కౌంటింగ్‌ కేంద్రాల బయటమాత్రమే సంబరాలు చేసుకోవాలని అధికారులు

150 డివిజన్లలో 1333 మంది అభ్యర్థులు పోటీ ....

ఈ ఎన్నికలకోసం 150 డివిజన్లలో 1333 మంది అభ్యర్థులు పోటీ చేశారు.. టీఆర్‌ఎస్‌నుంచి 150మంది, కాంగ్రెస్‌నుంచి 149మంది, బీజేపీ, టీడీపీనుంచి 160మందితోపాటు వందమంది ఇతర పార్టీల అభ్యర్థులు, 644మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు.. 74లక్షలమంది ఓటర్లకుగాను 33లక్షలమంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. దాదాపు నెలరోజులుగా ఉత్కంఠ రేపిన ఈ ఫలితాలకోసం అన్ని పార్టీలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. 

06:54 - February 4, 2016

హైదరాబాద్ : పురానాపూల్‌ 52వ డివిజన్‌లో రేపు రీపోలింగ్‌ జరగనుంది. 36 పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రేపు ఉదయం 7 గంటల ఉంచి సాయంత్రం 5 వరకు రీపోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

06:53 - February 4, 2016

హైదరాబాద్ : పాతబస్తీ ఘటన నేపథ్యంలో సెక్షన్‌-8 అంశం మరోసారి తెరపైకి వచ్చింది. శాంతికి విఘాతం కలిగించే పరిస్థితులు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రతిపక్షాలు సర్కార్‌ను ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఓల్డ్‌సిటీలో కాంగ్రెస్‌ నేతలపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా సర్కార్‌పై ఒత్తిడి పెంచాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. ఇప్పటికే ఈసీ, గవర్నర్‌ను కలిసిన నేతలు.. త్వరలోనే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు.

కాంగ్రెస్‌ నేతలపై దాడిని ఖండించిన అఖిలపక్ష నేతలు.....

హైదరాబాద్‌ పాతబస్తీలో కాంగ్రెస్‌ నేతలపై జరిగిన దాడిని అఖిలపక్ష నేతలు ఖండించారు. గాంధీభవన్‌లో సమావేశమైన కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ నేతలు.. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుండి అధికారపక్షం ఎంఐఎంతో కుమ్మక్కై అవకతవకలకు పాల్పడిందని నేతలు ఆరోపించారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌, గవర్నర్‌ను కలిసిన నేతలు త్వరలోనే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రులను కలవాలని నిర్ణయించారు. ఇక పాతబస్తీలో రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు అఖిలపక్ష నేతలు.. అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌లపై కేసులు నమోదు చేయాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.

శాంతి భద్రతలకు విఘాతం ......

హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎంఐఎం వ్యవహరించిందని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అన్నారు. దాడుల వల్ల హైదరాబాద్‌ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పెట్టుబడులు కూడా రావని అభిప్రాయపడ్డారు. పరిస్థితి చేయి దాటకుండా గవర్నర్‌ వెంటనే సెక్షన్‌-8పై స్పందించాలన్నారు జానారెడ్డి.

టీఆర్‌ఎస్‌ అవకతవకలకు పాల్పడింది......

గ్రేటర్‌ పీఠం దక్కించుకునేందుకు ఎంఐఎంతో కలిసి అధికార పార్టీ ఎన్నో అవకతకలకు పాల్పడిందని బీజేపీ నేత లక్ష్మణ్‌ ఆరోపించారు. ఎన్నోసార్లు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కేసీఆర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత ఎల్‌.రమణ దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులపై దాడి వ్యవహారాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామన్నారు. పాతబస్తీ ఘటనలో ఎంఐఎంపై చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. 

06:50 - February 4, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై దాడి కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులు కశాప్, అబేద్, మసియుద్దీన్ లను డీసీపీ కార్యాలయానికి తరలించారు. పోలింగ్ సందర్భంగా భావోద్వేగాలను రెచ్చగొట్టినట్లుగా మాట్లాడటం వల్లే టీపీసీసీ అధ్యక్షుడిపై దాడికి యత్నించినట్లు తెలిపారు.

వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుల గుర్తింపు......

వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని సౌత్ జోన్ డీసీపీ తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాతబస్తీ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ ప్రయాణిస్తున్న వాహనంపై అసద్‌ అతని అనుచరులు దాడులకు దిగారు.

ఎంపీ అసద్‌ అనుచరులపై కేసులు నమోదు......

ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహమ్మద్ షబ్బీర్ అలీ ఫిర్యాదు మేరకు మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన అనుచరులపై మీర్‌చౌక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 143, 323, 341, 427, 506, ఆర్/డబ్ల్యూ 149 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు.

జర్నలిస్టుపై దాడికి దిగిన కేసులో ఎంపీ అసద్‌ అతని అనుచరులపై కేసులు......

మరోవైపు సియాసత్ ఉర్దూ దినపత్రిక విలేకరి ముబాషీర్ పై దాడికి పాల్పడిన ఘటనలో కూడా అసద్, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.

06:48 - February 4, 2016

విజయవాడ : కాపులను బీసీల్లో చేర్చాలన్న అంశం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ప్రభుత్వం రిజర్వేషన్‌ల జీవోను అమలు చేయకుంటే రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ముద్రగడ పద్మనాభం అల్టిమేటం జారీ చేశారు. దీనికి ప్రతిగా.. కాపులకు రిజర్వేషన్‌లు కల్పిస్తే తాము నష్టపోతామంటూ బీసీ సంఘం ఉద్యమానికి సమాయత్తమైంది. నేడు జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీల్లో చేర్చాలంటూ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ డిమాండ్‌ చేస్తోంది. అటు ప్రభుత్వమూ బీసీలను ఒప్పించి కాపులను బీసీల్లో చేరుస్తామంటూ చెబుతోంది. ఈ దిశగా కాపు నేతలతోను, మంత్రివర్గ సభ్యులతోనూ చర్చలు సాగిస్తోంది. ఇంతకీ ఈ వ్యవహారం ఏ రీతిగా సమసిపోనుంది..?

ఉద్యమానికి ఉద్యుక్తులయిన ముద్రగడ....

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌ను.. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మళ్లీ తెరపైకి తెచ్చారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని చంద్రబాబు 18 నెలల తర్వాత కూడా నిలుపుకోలేదంటూ.. ముద్రగడ పద్మనాభం.. ఉద్యమానికి ఉద్యుక్తులయ్యారు. మూడు నెలల క్రితమే ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. డిసెంబర్‌లోగా కాపులను బీసీల్లో చేర్చకుంటే.. జనవరిలో ఉద్యమం చేపడతామని.. అదే తన తుది ఉద్యమమనీ ఆయన ప్రకటించారు. ముందుగా నిర్ణయించినట్లుగానే జనవరి 31న తునిలో భారీ ఎత్తున కాపు గర్జన నిర్వహించారు. అయితే అనూహ్యంగా ఆ ఆందోళన హింసాత్మకమైంది. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును, తుని రూరల్‌ పోలీసు స్టేషన్‌ను, ప్రైవేటు వాహనాలను ఆందోళనకారులు తగులబెట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా కలకలం.....

ప్రశాంత గోదావరి జిల్లాల్లో చెలరేగిన ఈ హింస.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. కాపుల డిమాండ్‌.. ప్రభుత్వాల దోబూచులాటల గురించిన చర్చ విస్తృతమైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. కాపులను బీసీల్లో చేరుస్తానని, ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఏటా వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో ఐదువేల కోట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో కాపులంతా గంపగుత్తగా టీడీపీని బలపరిచారు. కానీ ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలు దాటినా.. తమకు ఇచ్చిన హామీపై చంద్రబాబు స్పందించక పోవడంతో కాపుల్లో అసంతృప్తి రేగింది. దీంతో ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమానికి కార్యాచరణ ప్రకటించారు. దీంతో ప్రభుత్వం హడావుడిగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి.. దానికి వందకోట్ల రూపాయలను కేటాయించింది. కానీ దీన్ని కంటితుడుపు చర్యగానే భావించిన ముద్రగడ పద్మనాభం.. విపక్షాలనూ కలుపుకుని కాపుగర్జన చేపట్టారు.

1910లో కాపులను బీసీలుగా గుర్తించిన ఆంగ్లేయులు...

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌ ఈనాటిది కాదన్నది వారి వాదన. 1910లో ఆంగ్లేయులు కాపులను బీసీలుగా గుర్తించి రిజర్వేషన్‌లు అమలు చేశారని, 1956లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని రద్దు చేసిందని చెబుతున్నారు. 1961లో సీఎంగా ఉన్న దామోదరం సంజీవయ్య కాపులను బీసీలలో కలిపి రిజర్వేషన్లను పునరుద్ధరించారని... 1966లో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించిందని చెబుతున్నారు. 1962లో కోల్పోయిన రిజర్వేషన్‌లను పొందేందుకు అప్పటి నుంచీ ఉద్యమిస్తూనే ఉన్నామన్నది కాపు నేతల వాదన.

వంగవీటి రంగా హత్యతో ఏకతాటిపైకి కాపులు....

మూడు దశాబ్దాల క్రితం వంగవీటి రంగా హత్యతో కాపు సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. రావులపాలెంలో కాపుల సభకు హాజరైన ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఆ సంఘటన కాపుల ఉద్యమాన్ని మలుపు తిప్పింది. అప్పట్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న ముద్రగడ పద్మనాభం పదవికి రాజీనామా చేసి కాపు రిజర్వేషన్‌ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆయన ఆమరణ నిరాహార దీక్షతో.. దిగొచ్చిన ప్రభుత్వం 1994లో జీవో-30ని జారీ చేసింది. అనంతరం టీడీపీ హయాంలో కొందరు వ్యక్తులు ఈ జీఓపై కోర్టుకు వెళ్లారు.

24 నుంచి 28 శాతానికి పెరిగిన కాపుల జనాభా....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో 24 శాతం ఉన్న కాపులు.. రాష్ట్ర విభజన తర్వత 28 శాతానికి పెరిగారు. తమ డిమాండ్‌ గతంలో మాదిరిగా.. ఎన్నికల అస్త్రంగా మిగిలిపోకూడదని.. ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ సాధించుకు తీరాలని కాపులు సంకల్పించుకుంటున్నారు. అందుకే.. తూర్పుగోదావరి తుని వేదికగా.. మరోసారి కాపుల రిజర్వేషన్ల ఉద్యమానికి ఉద్యుక్తులయ్యారు. అయితే అనూహ్యంగా ఆందోళన హింసాత్మకమైంది.

విపక్షాలు సైతం....

కాపుల చారిత్రక ఆందోళనను ప్రభుత్వం గుర్తించి తీరాలని ఆ సామాజిక వర్గం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. విపక్షాలు కూడా అసమగ్రంగా ఉన్న జీవో-30 స్థానంలో కొత్త జీవోను తెచ్చి కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు.. కాపులను బీసీల్లో చేర్చాలన్న ఉద్యమం ఉధృతం కావడంతో.. బీసీ సంఘాలూ ఆందోళనకు సమాయత్తమవుతున్నాయి. కాపులకు రిజర్వేషన్‌లు కల్పిస్తే.. బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ గురువారం.. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి బీసీ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.

ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు రంగంలోకి.....

కాపుల ఆందోళనలు, బీసీ సంఘాల అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు రంగంలోకి దిగింది. ఆదివారం నాటి తుని ఘటనల తర్వాత.. కాపుల సమస్యపై చర్చలను ప్రారంభించింది. మంగళవారం కాపు నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. బుధవారం మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. కాపులను సంతృప్తి చేయడంతో పాటు.. బీసీల్లోనూ అలజడి రేగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంతనాలు సాగించారు. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

06:41 - February 4, 2016

విజయవాడ : స్మార్ట్ సిటీలూ, అమ్రుత సిటీలంటూ ప్రభుత్వాలు సరికొత్త నినాదాలిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం తొలివిడతలో దేశవ్యాప్తంగా 20 నగరాలను ఎంపిక చేసింది. మరో 40 సిటీల జాబితాను సిద్ధం చేస్తోంది. నగరాలను అత్యంత సుందరంగానూ, ఆకర్షణీయంగానూ, హైటెక్ గానూ తీర్చిదిద్దుతామంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. మరోవైపు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు పౌర సమాజం పట్ల నిర్వర్తించే విధుల్లో కీలకపాత్ర పోషించే కార్మికుల, ఉద్యోగుల కోరికల విషయంలో నిర్లప్తంగా వ్యవహరిస్తున్నాయి. మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పర్మినెంట్ ఉద్యోగాలకు ఎప్పుడో ఎగనామం పెట్టారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానాన్ని నెత్తినపెట్టుకున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ను కూడా పక్కనబెట్టి, పనులను కాంట్రాక్ట్ కిచ్చే విధానం వస్తోంది. అంటే కార్మికుల, సిబ్బంది విషయంలో ప్రభుత్వాలు ఇక నుంచి ఏ బాధ్యతలూ తీసుకోవు. వారి సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవు. మనుషుల సంఖ్యను తగ్గించడం, యంత్రాల సంఖ్యను పెంచడం అన్న విధానం వైపు ప్రభుత్వాలు పయనిస్తున్నాయి. యంత్రాలు సమకూర్చిపెట్టే బడా కంపెనీలకు, కాంట్రాక్టర్లకు, ఏజెన్సీలకు పనులు అప్పగిస్తున్నారు. నిజానికి యంత్రాలు మానవ శ్రమను తగ్గించాలి. రెక్కల కష్టాన్ని సులభతరం చేయాలి. కానీ, దురద్రుష్టవశాత్తు యంత్రాల రాక ఉపాధి అవకాశాలకు గండికొడుతోంది. ఇప్పటికే చాలీచాలనీ జీతాలతో బతుకుబండిని లాగిస్తున్నవారికి ఆ మాత్రం ఉపాధి కూడా లేకుండా చేస్తోంది. పనుల కాంట్రాక్ట్ లు పొందిన సంస్థలు అతి కొద్ది మందిని నియమించి, అత్యధిక లాభాలు పిండుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పనిచేసే సిబ్బంది, కార్మికులు ఉపాధిని కోల్పోతుంటే, కాంట్రాక్ట్ పొందిన సంస్థల బొజ్జలు నింపుకుంటున్నాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే తమ పొట్టలు కొడుతున్న 279 జీవోను రద్దు చేయాలంటూ మున్సిపల్ కార్మికులు ఆందోళనబాట పట్టారు. 

06:40 - February 4, 2016

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ వర్కర్లు ఇవాళ కలెక్టరేట్ల ముట్టడికి సిద్ధమవుతున్నారు. 279 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ 279 జీవోలో ఏముంది? ఈ జీవో వల్ల మున్సిపల్ వర్కర్ల జీవితాలు ఎలా ప్రభావితమవుతున్నాయి? వివిధ మున్సిపాల్టీలలో పనిచేస్తున్న వర్కర్లు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? పట్టణ పరిశుభ్రత, మంచినీటి సరఫరా లాంటి అత్యంత కీలక అంశాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మున్సిపల్ సిబ్బంది విషయంలో ప్రభుత్వ విధానాలు ఎలా వుంటున్నాయి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేత కె. ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

నేటి నుంచి పీఎస్సీ ఛైర్మన్ల సదస్సు

హైదరాబాద్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే నియామక పరీక్షల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు ఆధునిక సాంకేతికతను విరివిగా వినియోగించుకునేలా, ఆన్‌లైన్ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించడంపై అన్ని రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సదస్సులో లోతుగా చర్చించనున్నారు. అన్ని రాష్ర్టాలకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల 18వ జాతీయ సదస్సు గురువారం ప్రారంభం కానుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఈ సదస్సుకు ఆతిథ్యమిస్తున్నది.

పురానాపూల్ 52వ డివిజన్ లో రీపోలింగ్

హైదరాబాద్ : పురానాపూల్‌ 52వ డివిజన్‌లో రీపోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మొత్తం 36 పోలింగ్‌బూత్‌ల్లో ఈ నెల 5న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల ఉంచి సాయంత్రం 5 వరకు రీపోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Don't Miss