Activities calendar

05 February 2016

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయింది. అన్ని ఫలితాలను వెల్లడించారు. టీఆర్ ఎస్.. 99, ఎంఐఎం.. 44, బీజేపీ.. 4,కాంగ్రెస్ 2, టీడీపీ...1 స్థానాలను కైవసం చేసుకున్నాయి.

 

పురానాపూల్ లో ఎంఐఎం విజయం...

హైదరాబాద్ : పురానాపూల్ డివిజన్ లో ఎంఐఎం విజయం సాధించింది. 2800 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ పై ఎంఐఎం అభ్యర్థి రాజమోహన్ గెలుపొందారు. 

22:20 - February 5, 2016

హైదరాబాద్ : బల్దియా కోటపై గులాబీ జెండా రెపరెపలాడింది. ఇక ఇప్పుడు బల్దియా బాద్‌షా ఎవరు అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. బీసీలకురిజర్వ్‌ అయిన ఈ సింహాసనంపై.. మేయర్‌గా ఎవరు కూర్చోనున్నారు..? టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయి..? రేసులో ఉన్నదెవరు..? వారికున్న అనుకూల, ప్రతికూలాంశాలేంటి..? మేయర్‌ పదవి ఎవరిని వరిస్తుంది? గ్రేటర్‌ పగ్గాలు టీఆర్ఎస్ ఎవరికి అప్పగిస్తుంది? మహానగరం ఫస్ట్ సిటిజన్ ఎవరు? ఏ బీసీ నాయకుడికి బల్దియా సలాం చేస్తుంది?

మేయర్ పదవి బీసీకి రిజర్వ్

జీహెచ్‌ఎంసీ మేయర్ పదవి బీసీకి రిజర్వ్ అయ్యింది. మేయర్ రేసులో ప్రస్తుతం టీఆర్ఎస్‌లో వినిపిస్తున్న రెండే రెండు పేర్లు....బొంతు రామ్మోహన్, విజయలక్ష్మీ. మేయర్‌ రేసులో మొదట చెప్పుకోవాల్సింది బొంతు రామ్మోహన్. చర్లపల్లి నుంచి భారీ మెజారిటీతో గెలిచిన బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు.

మేయర్‌ రేసులో బొంతు రామ్మోహన్ పేరు

బొంతు రామ్మోహన్ పేరు గ్రేటర్‌ ఎన్నికల వరకు టీఆర్ఎస్‌లో పెద్దగా వినిపించలేదు. కానీ చివరి నిమిషంలో చర్లపల్లి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా టిక్కెటిచ్చారు కేసీఆర్. ఉద్యమ కాలంలో గులాబీ దళపతికి అండగా నిలిచాడు కాబట్టే...బొంతు రామ్మోహన్‌కు ఛాన్స్ వరించింది. ఎలాగైనా గెలిపించాలని చర్లపల్లి టీఆర్ఎస్ శ్రేణులను ఆదేశించారు కేసీఆర్. నాడు స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరుగని కృషి చేసిన రామ్మోహన్‌ అంటే కేసీఆర్‌కు వల్లమాలిన అభిమానమని చెబుతారు. కేసీఆర్ ఎలాంటి సభలు పెట్టినా జనసమీకరణలోనూ, సభ సక్సెస్ కావడంలోనూ అధినేతకు సహకరించారు రామ్మోహన్. అందుకే కేసీఆర్ కూతురు కవిత, కొడుకు కేటీఆర్ బొంతు రామ్మోహన్ విజయం కోసం కృషి చేశారు. బీసీ నేత, ఉద్యమ నాయకుడు, అందులోనూ కేసీఆర్‌కు ప్రియమైన యంగ్‌ లీడరైన బొంతు రామ్మోహన్‌కు మేయర్ పదవి ఖాయమని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మేయర్‌ రేసులో కేకే కుమార్తె

విజయలక్ష్మీ. టీఆర్ఎస్‌లో కీలక నేత, రాజ్యసభ ఎంపీ కె.కేశవ రావు గారాల కూతురు. బంజారాహిల్స్ డివిజన్‌ నుంచి గెలుపొందారు. విద్యావంతురాలు, ప్రజాసేవ చేయాలని తపిస్తున్న తన కూతురికి మేయర్ పదవి కోసం కేకే ఇప్పటికే లాబీయింగ్ ముమ్మరం చేశారు. గ్రేటర్‌ అభ్యర్థుల జాబితా వెల్లడించినప్పుడే విజయలక్ష్మీ పేరు మేయర్ రేసులో ప్రముఖంగా వినిపించింది. అయితే ప్రస్తుతం వీరిద్దరి పేర్లు వినిపిస్తున్నా.... టీఆర్ఎస్ అఖండ మెజారిటీ సాధించడంతో లెక్కలు కూడా మారే అవకాశముందని తెలుస్తోంది. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని కలలు కంటున్న కేసీఆర్..తనకు చేదోడుగా ఎవరిని మేయర్‌ పీఠంపై కూర్చోబెడతారో చూడాలి. మహానగరం ఫస్ట్‌ సిటిజన్ ఎవరన్నది మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది.

22:16 - February 5, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో.. ఎంఐఎం మరోసారి తన పట్టును నిలుపుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీలు నామరూపాల్లేకుండా కొట్టుకు పోగా.. ఎంఐఎం మాత్రం ఉనికిని స్పష్టం చేసింది. పాతబస్తీ సహా పట్టున్న అన్ని ప్రాంతాల్లోనూ ఎంఐఎం అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. 
 
రెండో స్థానంలో నిలిచిన ఎంఐఎం

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ప్రభంజనాన్ని.. పాతబస్తీ కాస్తంత నిలువరించింది. ఇక్కడ మజ్లిస్‌ పార్టీ జైత్రయాత్రను కొనసాగించింది. గత గ్రేటర్‌ ఎన్నికల్లో 43 సీట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమైన ఎంఐఎం.. ఈసారి స్థానాలు తగ్గినా.. రెండో స్థానంలో నిలిచింది. ఒవైసీ సోదరులు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లు.. పార్టీ శ్రేణులను చైతన్య పరుస్తూ ఓట్లను రాబట్టడంలో సఫలమయ్యారు. 

ఎంఐఎంకు గౌరవప్రదమైన స్థానాలు

గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలు.. పాలక పక్షంతో పాటు.. ఎంఐఎంనూ లక్ష్యంగా చేసుకుని ప్రచారం కొనసాగించాయి. టీడీపీ, బీజేపీ కూటమి అయితే.. నాడు కాంగ్రెస్‌ ప్లస్‌ ఎంఐఎం.. నేడు టీఆర్ఎస్‌ ప్లస్‌ ఎంఐఎం అంటూ ప్రచారం సాగించాయి. ఆ రెండు పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే నగరాభివృద్ధి ఆగిపోతుందనీ ప్రచారం చేశాయి. అయితే.. ఓటర్లు ఈ ప్రచారాన్ని ఏమాత్రం విశ్వసించలేదు. మేయర్‌ పీఠాన్ని గెలుచుకునేందుకు అవసరమైన పూర్తి మెజారిటీని టీఆర్ఎస్‌కు అందించిన ఓటర్లు.. ఎంఐఎంకూ గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారు. 
 

ప్రతిపక్ష పాత్రకే కింగ్‌ మేకర్‌
 

2009లో జరిగిన గ్రేటర్‌ ఎన్నికల్లో ఎంఐఎం 53 స్థానాలతో.. అతి పెద్ద పార్టీగా గెలిచిన కాంగ్రెస్‌తో మేయర్‌ పీఠాన్ని పంచుకుంది. తొలుత కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన బండ కార్తీకరెడ్డి మేయర్‌ కాగా.. తర్వాతి విడతలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ మేయర్‌ పదవిని చేపట్టారు. ప్రతిసారీ గ్రేటర్‌ ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌ పాత్రను పోషించే ఎంఐఎం ఈసారి మాత్రం ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. 

 

22:12 - February 5, 2016

హైదరాబాద్ :  గ్రేటర్‌ హైదరాబాద్‌లో కారు జోరుకు అడ్డులేకుండా పోయింది. గల్లీ గల్లీలోనూ ఆ పార్టీ స్వీప్‌ చేసింది. టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, బీజేపీలు కూడా కుదేలయ్యాయి. 2009 గ్రేటర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌తో కలిసి గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్‌.. కారు జోరులో నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ఇక అప్పటి ఎన్నికల్లో పోటీయే చేయని టీఆర్‌ఎస్‌ సెంచరీ కొట్టి మేయర్‌ పీఠాన్ని స్వంతంగా పట్టుకోవడానికి సిద్ధమైంది.

కాంగ్రెస్ ఘోర పరాజయం

2009 జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 53 వార్డుల్లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో హాఫ్‌ సెంచరీని దాటిన హస్తం..ఇప్పుడు సింగిల్‌ డిజిట్‌కు పరిమితమయ్యింది. 150 డివిజన్లకు గాను అత్యంత అవమానకర రీతిలో కేవలం ఒక డివిజన్‌లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. తెలంగాణను ఇచ్చిన పార్టీగా ఆ క్రెడిట్‌ను కనీస స్థాయిలోనూ వాడుకోలేని దుస్థితికి కాంగ్రెస్‌ చేరుకుంది.పటాన్‌చెరు డివిజన్‌లో మాత్రమే హస్తం విజయం సాధించింది.

ఒక్క డివిజన్‌లోనే టీడీపీ విజయం

2009 గ్రేటర్‌ ఎన్నికల్లో 46 వార్డులను గెలుచుకుని రెండో స్థానంలో ఉన్న టీడీపీ...ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యింది. బీజేపీతో జత కట్టిన టీడీపీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు..ఆయన కుమారుడు లోకేష్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా...గ్రేటర్‌ ఫలితాలను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయారు. కేవలం 1 డివిజన్‌లో మాత్రమే గెలుపొందడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేపోతున్నాయి. ఇక గత ఎన్నికల్లో ఐదు స్థానాలను గెలుచుకున్న బీజేపీ...ఈ సారి 4 డివిజన్లతో తృప్తిచెందింది. మొత్తంగా టీడీపీ, బీజేపీ కూటమి 5 స్థానాలతో సరిపెట్టుకుంది.

పాతబస్తీలో పట్టు నిలుపుకున్న మజ్లిస్‌

ఇక పాత బస్తీలో మజ్లిస్‌ తన పట్టును నిలుపుకుంది. 2009 ఎన్నికల్లో 43 డివిజన్లలో ఎంఐఎం విజయం సాధించగా..ప్రస్తుత ఎన్నికల్లో 37 స్థానాల్లో మజ్లిస్‌ గెలుపొందింది.

 

 

 

22:06 - February 5, 2016

హైదరాబాద్ : అంచనాలకు మించిన గెలుపు. ఊహకందని అపూర్వ విజయం. సవాళ్లను తిప్పికొట్టిన అఖండ విజయం. గ్రేటర్‌లో కనివిని ఎరుగని రీతిలో కారు దూసుకుపోయింది. బస్తీల ప్రజల నమ్మకం సాక్షిగా బల్దియాపై గులాబీ జెండా రెపరెపలాడింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 
సర్వేలను తల్లకిందులు చేసిన విజయం. 
సర్వేలను తల్లకిందులు చేసిన విజయం. ఎగ్జిట్‌పోల్స్ ను తలదన్నిన విక్టరీ. గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని హవా కొనసాగించింది. అంచనాలు మించిన విజయం నమోదు చేసింది. 150 డివిజన్లలో వందకు పైగా స్థానాలు సాధించింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్...ఐదు గంటలకే దాదాపు 20 డివిజన్లలో ఫలితాలు వచ్చాయి. తర్వాత వరుసగా అన్ని రౌండ్లలోనూ గులాబీ పార్టీ దూకుడు కనిపించింది.
107 టీఆర్ఎస్  స్థానాల్లో విజయం 
ఫలితాలు వెలువడుతున్నకొద్దీ టీఆర్ఎస్ అభ్యర్థుల విజయ పరంపర కొనసాగింది. మొత్తం 150 డివిజన్లలో పోటీ చేసిన టీఆర్ఎస్ 107 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఎవరి మద్దతూ అవసరం లేకుండానే మేయర్‌ పదవిని దక్కించుకోబోతోంది. ఇక ఎంఐఎం 37 సీట్లలో విజయకేతనం ఎగురువేసింది. రెండోస్థానం సంపాదించి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇక ప్రధాన పార్టీలైన టీడీపీ కేవలం ఒకే ఒక స్థానంలో గెలవగా, మిత్రపక్షం బీజేపీ నాలుగింటితోనే సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌కు కూడా దక్కింది ఒకే ఒక స్థానం. గ్రేటర్‌లో తొలిసారి పోటీ చేసిన టీఆర్ఎస్ బల్దియా చరిత్రలో కనివిని ఎరుగని విజయం  సాధించడంతో సంబరాలు చేసుకున్నారు పార్టీ శ్రేణులు. గులాబీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా కాలుస్తూ పండగ చేసుకున్నారు.

 

21:28 - February 5, 2016

హైదరాబాద్ : అందరి సహకారంతో గ్రేటర్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించామని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై ఆయన మాట్లాడారు. కౌంటింగ్ లో ఎలాంటి సమస్య తలెత్తలేదని చెప్పారు. టీఆర్ ఎస్.. 102, ఎంఐఎం 34 స్థానాలు, బిజెపి 3, కాంగ్రెస్ 1, టిడిపి 1 స్థానాలను కైవసం చేసుకున్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ మిషన్స్ వచ్చిన తర్వాత తప్పులు తక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. టెండర్ ఓట్లపై ఈసీ సీరియస్ గానే ఉందన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని గుర్తు చేశారు. పురానాపూల్ లో 47.4 శాతం ఓటింగ్ జరిగిందని చెప్పారు. పూరానాపూల్ లో ప్రశాంతంగా రీపోలింగ్ జరిగిందని పేర్కొన్నారు. జాంబాగ్ లో రీకౌంట్ చేయాలని కోరారని తెలిపారు.

 

పురానాపూలో లో కాంగ్రెస్ అధిక్యం..

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని పురానాపూల్ డివిజన్ లో రీకౌంటింగ్ కొనసాగుతోంది. 800 వందల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ముందజలో ఉన్నారు. పురానాపూల్ డివిజన్ ఫలితాలు ఆఖరికి వెలువడనున్నాయి. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

గౌతమ్ నగర్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపు

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. టీఆర్ ఎస్.. 99 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గౌతమ్ నగర్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.

ఉప్పుగూడలో ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్ షమీద్ బిన్ గెలుపు

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం రెండో స్థానంలో కొనసాగుతోంది. 33 స్థానాల్లో విజయం సాధించింది. ఉప్పుగూడలో ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్ షమీద్ బిన్ గెలుపొందారు. మరో ఆరు స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.

 

20:56 - February 5, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌లో గెలుపుదిశగా సాగుతున్న టీఆర్ఎస్ కు టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి కంగ్రాట్స్ చెప్పారు. ఎన్నికలకుముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సూచించారు. సాధారణంగా అధికారంలోఉన్న పార్టీకి అనుకూలంగా లోకల్ ఎన్నికలుంటాయని చెప్పుకొచ్చారు. తమను ప్రజలు తిరస్కరించారని భావించడంలేదని స్పష్టం చేశారు. కొన్నిసార్లు ఓటమి తప్పదని పరాజయంనుంచి కోలుకొని చాలాసార్లు పార్టీలు తర్వాత ఎన్నికల్లో విజయం సాధించాయని రేవంత్ గుర్తు చేశారు.

 

20:54 - February 5, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించిన ఘనత కార్యకర్తలకే దక్కుతుందని ఆ పార్టీ గ్రేటర్‌ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. టీఆర్ఎస్ పై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకానికి మించి ప్రభుత్వం పని చేస్తుందని మైనంపల్లి చెబుతున్నారు.

20:53 - February 5, 2016

హైదరాబాద్ : మేయర్ స్థానానికి పోటీ ఉంటుందని, ఆచి తూచి చర్చించి సీఎం అనుమతితో మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల తెలిపారు. గ్రేటర్‌లో తమను గెలిపిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై పెద్ద బాధ్యత పెట్టారన్నారు. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో అనేక బాధలకు గురైందని, ఊహించని ఫలితాలు వచ్చాయన్నారు. ఫలితాలను చూసి పొంగిపోమని, ఏ సమస్యలు పరిష్కారమౌతాయని ఆశించారో ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ తమ పార్టీయేనని నగరంలో ముస్లింలకు కూడా భావించారనడానికి ఫలితాలే నిదర్శనమన్నారు.

33 స్థానాలు ఎంఐఎం కైవసం

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం రెండో స్థానంలో కొనసాగుతోంది. 33 స్థానాల్లో విజయం సాధించింది. మరో ఆరు స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యంలో ఉంది. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 

20:44 - February 5, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో హస్తం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అధికార పక్షమైన టీఆర్ఎస్ గాలికి చేయి కొట్టుకపోయింది. కేవలం ఒక్క స్థానంలో విజయం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ తరహా పరాజయం ఉంటుందని కాంగ్రెస్ నేతలు ఊహించలేదు. డబుల్ డిజిట్ వస్తుందన్న ఆశలు ఏమాత్రం నెరవేరలేదు. దీనితో కాంగ్రెస్ నేతలందరూ నైరాశ్యంలో నెట్టుకపోయారు. టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ ప్రచారం చేయలేదనే విమర్శలున్నాయి. టీఆర్ఎస్ రెండో సారి ప్రచారానికి సిద్ధమౌతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రచారానికి సిద్ధం కావడం ఓటమి చెందడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా సీట్ల ఎంపిక సరియైన క్రమంలో జరగలేదని, కొందరి రాజకీయ వత్తిళ్లతోనే సీట్లు కేటాయించారనే చర్చ జరుగుతుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఉన్న 150 డివిజన్లను తనకు కేటాయించాలని దానం నాగేందర్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉప్సల్ లో దానంపై దాడి జరిగడంపై పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం పోరాటం చేయడం లేదనే కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వచ్చిన ఫలితాలతో పార్టీలో మార్పులు చేర్పులుంటాయా ? అనేది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

98 స్థానాలు టీఆర్ ఎస్ కైవసం...

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ప్రభంజనం సృష్టించింది. టీఆర్ ఎస్.. 99 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 

హస్తినాపురంలో టిఆర్ఎస్ అభ్యర్థి పద్మానాయక్ గెలుపు

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. హస్తినాపురంలో టిఆర్ఎస్ అభ్యర్థి రామావత్ పద్మానాయక్ విజయం సాధించింది. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 

వెంగళ్ రావు నగర్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి కిలారి మనోహర్ గెలుపు

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. వెంగళ్ రావు నగర్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి కిలారి మనోహర్ అభ్యర్థి విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.

 

20:34 - February 5, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌లో కారు జోరుకు కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ బ్రేకులు వేయలేకపోయాయి.. గులాబీ పార్టీ తర్వాత ఎంఐఎం రెండో పెద్ద పార్టీగా ఆధిక్యంలో కొనసాగుతోంది.. స్వయంగా మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి ఓటమితో హస్తం పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో కార్తీక రెడ్డి ఓటమిపాలయ్యారు.. సెంచరీ దిశగా సాగుతున్న కారు మేయర్‌ స్థానం కైవసం చేసుకునే దిశగా సాగుతోంది.

ప్రభావం చూపని విపక్షాలు..
గ్రేటర్ లో తెలుగుదేశం, బీజేపీ కూటమి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. తమకు పట్టున్న స్థానాల్లో కూడా.. చతికిలపడింది. టీడీపీకి కంచుకోటగా పేరున్న డివిజన్లలోనూ.. కారు పార్టీ దూసుకుపోయింది. సెటిలర్ల ప్రభావం ఉన్న స్థానాల్లోనూ వన్ సైడ్ ఓటింగ్ జరిగింది. అక్కడా కూడా గులాబీ పార్టీ రెపరెపలాడింది. చివరకు ఐటీ ప్రభావిత ప్రాంతాలైన మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌళి ప్రాంతాల్లోనూ...టీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు.

'గ్రేటర్' లో టీఆర్ ఎస్ ప్రభంజనం..

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ప్రభంజనం సృష్టించింది. టీఆర్ ఎస్.. 97 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.

 

20:29 - February 5, 2016

హైదరాబాద్ : గులాబీ పార్టీ దుమ్ము లేపింది. గ్రేటర్‌ రోడ్లపై కారు దూసుకుపోయింది. కారు స్పీడ్‌కు కాంగ్రెస్‌ కకావికలమైంది. కమలం వాడిపోయింది. సైకిల్‌ కదలకుండా మూలనపడిపోయింది. చిన్నా చితక పార్టీలు చెల్లాచెదురయ్యాయి. మొత్తంగా నగరం నలుమూలలా టీఆర్‌ఎస్ తన హవా చూపించింది. 88 సీట్లలో గెలిపించిన పార్టీ ... మరో 17 స్థానాల్లో ముందంజలో ఉంది. అటు 27 సీట్లను గెలుచుకున్న ఎంఐఎం మరో 9 స్థానాల్లో లీడ్ సాధించింది. ఇక బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌ కే పరిమితమయ్యాయి.

20:22 - February 5, 2016

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ వికసించింది. సమీప ప్రత్యర్థులైన కాంగ్రెస్, టిడిపిలకు డిపాజిట్లు కూడా దక్కలేదు. సికింద్రాబాద్ లోని వెస్లీ కాలేజీలో కౌంటింగ్ జరిగింది. సికింద్రాబాద్ కు చెందిన ఐదు డివిజన్లు, సనత్ నగర్ కు సంబంధించి నాలుగు డివిజన్ల కౌంటింగ్ ముగిసింది. అడ్డగుట్ట టీఆర్ఎస్ అభ్యర్థి విజయకుమారి సమీప సీపీఎం ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఇక్కడ సీపీఎం అభ్యర్థి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఈవీఎంలు పూర్తిగా టాంపరింగ్ చేశారని, అందుకొనే వన్ సైడ్ గా ఉందని విపక్షాలు ఆరోపించాయి.

అజంపురాలో ఎంఐఎం అభ్యర్థి అయేషా నషీమ్ గెలుపు

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని అజంపురాలో ఎంఐఎం అభ్యర్థి అయేషా నషీమ్ విజయం సాధించారు. 28 స్థానాలను ఎంఐఎం కైవసం చేసుకుంది. మరో ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 

 

'గ్రేటర్' లో దూసుకెళ్తున్న కారు....

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్తోంది. 95 స్థానాల్లో విజయం సాధించింది. మరో 10 స్థానాల్లో అధిక్యంలో ఉంది. 28 స్థానాల్లో ఎంఐఎం గెలుపొంది. మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కౌంటింగ్ కొనసాగుతోంది. బీజేపీ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, టిడిపి చెరొక స్థానంలో గెలుపొందారు.

20:04 - February 5, 2016

హైదరాబాద్ : పేదల ఎజెండానే తమ ఏజెండా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. పరేడ్ గ్రౌండ్ లో తాను ఇచ్చిన మాటలు..కార్పొరేటర్లు ఇచ్చిన మాటలను గుర్తు పెట్టుకుని వ్యవహరించాలని సూచించారు. చరిత్ర తిరగరాస్తూ ఏ పార్టీకి ఇవ్వని స్థానాలు ఇచ్చి అద్భుతమైన విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ విజయంలో అందరీ సమిష్టి కృషి ఉందని, ఏ ఒక్కరితో విజయం సాధించలేదని చెప్పుకొచ్చారు. నగర చరిత్రలో ఏ ఒక్క పార్టీగా జీహెచ్ఎంసీ అధికారం చేపట్టిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. తమపై పెద్ద బరువు మోపారని, పార్టీ నేతలకు గర్వం రాకూడదని పేర్కొన్నారు.

లక్ష ఇళ్లు...
ఈ ఎన్నికల్లో పేదలు డబుల్ బెడ్ రూం ఇళ్లు అధికంగా ఆశ్రయిస్తున్నారని, రాబోయే బడ్జెట్ లో లక్ష ఇళ్లు కట్టిస్తామని ఐదు సంవత్సరాల వరకు కడితే అందరికీ ఇళ్లు అందే అవకాశం ఉందన్నారు. ఎన్నిలక మేనిఫెస్టోను తు.చ తప్పకుండా అమలు చేస్తామని, వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. 99 శాతం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చామని, కేజీ టు పీజీ విద్య ఒక్కటే నెరవేర్చలేదన్నారు.

తెలంగాణలో ఐలాండ్ విద్యుత్..
ముంబై తరహాలో ఐలాండ్ విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెడుతామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ ధోరణి కనబర్చదని, స్కైవేలు, మల్టీ లేయర్ ఫ్లై ఓవర్స్..సిగ్నల్ ఫ్రీ తదితర కార్యక్రమాలు చేపడుతామన్నారు. వారం పది రోజుల్లో ఉస్మానియా ఆసుపత్రి పునర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని, కింగ్ కోఠి ఆసుపత్రిని రెండు వేయి పడకల ఆసుపత్రిగా మారుస్తామని, మంచినీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. నగరంలో రెండు రిజర్వాయర్ల నిర్మాణం చేస్తామని స్పష్టం చేశారు.

హైదరాబాదీలందరూ తమ బిడ్డలే...
విపక్షాలు ఎన్నో ఆరోపణలు గుప్పించారని, హైదరాబాదీలందరూ కేసీఆర్ తోనే ఉంటారని ఇక్కడున్న వారందరూ తమ బిడ్డలేనని మరోసారి స్పష్టం చేశారు. సరియైన పద్ధతుల్లో విమర్శలు చేస్తే బాగుంటుందని, టీఆర్ఎస్ గెలవడం చారిత్రక అవసరమని ప్రజలు భావించారని తెలిపారు. సీపీఐ నేత నారాయణ చేసిన విమర్శలపై నేతలు ఎలాంటి స్పందన వ్యక్తం చేయవద్దని సూచించారు. వరంగల్ ఫలితాల తరువాత మారుస్తారని భావించానని, హైదరాబాద్ గెలుపు తరువాతనైనా మారాలని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీలో అవినీతి లేకుండా చూడాలని, లంచం ఇచ్చే అవసరం లేకుండా ఇంటి పర్మిషన్ వచ్చిదంటే అప్పుడే తాము గెలుపు సాధించినట్లు అవుతుందన్నారు. నగరంలో ఉన్న మంత్రులు వీరిని కో ఆర్డినేషన్ చేసుకుని ముందుకు పోవాలన్నారు.

మేయర్ నిర్ణయం త్వరలో..
మేయర్ విషయంలో తాను ఒక్కరి తీసుకొనే నిర్ణయం కాదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పార్టీ కమిటీ ఉందని, పెద్దలు ఉన్నారని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

మేయర్ నిర్ణయం త్వరలో - కేసీఆర్…

హైదరాబాద్ : మేయర్ విషయంలో తాను ఒక్కరి తీసుకొనే నిర్ణయం కాదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పార్టీ కమిటీ ఉందని, పెద్దలు ఉన్నారని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

గ్రేటర్ ఎన్నికలు..టీఆర్ ఎస్ హవా...

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్తోంది. 88 స్థానాల్లో టీఆర్ ఎస్ విజయం సాధించింది. మరో 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 27 స్థానాల్లో ఎంఐఎం గెలుపొందింది. 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మూడు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్...ఒక స్థానంలో గెలుపొందింది. టీడీపీ... ఒక స్థానంలో విజయం సాధించింది.

 

ఒక స్థానంలో టిడిపి గెలుపు

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గ్రేటర్ లో ఒక స్థానంలో టిడిపి గెలుపొందింది. యూసుఫ్ గూడలో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు.

 

జర్నలిస్టులు తమకే ఓటు వేశారు - కేసీఆర్...

హైదరాబాద్ : జర్నలిస్టులు..వారి కుటుంబసభ్యులు కూడా తమకే ఓటు వేశారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం పట్ల ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు.

సమిష్టి కృషి వల్లే టీఆర్ ఎస్ గెలుపు : కేసీఆర్

హైదరాబాద్ : సమిష్టి కృషి వల్లే టీఆర్ ఎస్ గెలుపు సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ ఎస్ ను గెలిపించినందుకు ప్రతిఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగర చరిత్రలో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదని చెప్పారు. ఈ గెలుపుతో తమ బాధ్యత పెరిగిందన్నారు.

 

టపాకాయాలు కాల్చడం ఆపేయాలన్న కేసీఆర్..

హైదరాబాద్ :సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. చరిత్ర తిరగరాస్తూ ఏ పార్టీకి ఇవ్వని స్థానాలు ఇచ్చి అద్భుతమైన విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మాట్లాడుతున్న సందర్భంలో టపాకాయలు పేలుతుండడంపై కేసీఆర్ మాట్లాడడం ఆపేశారు.

హయత్ నగర్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి సామ తిరుమల్ రెడ్డి విజయం

హైదరాబాద్ : హయత్ నగర్ లో టీఆర్ ఎస్ అభ్యర్థి సామ తిరుమల్ రెడ్డి విజయం సాధించారు. 

మైలార్ దేవ్ పల్లిలో టీఆర్ ఎస్ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి విజయం

హైదరాబాద్ : మైలార్ దేవ్ పల్లిలో టీఆర్ ఎస్ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. 

రాంగోపాల్ పేటలో టీఆర్ ఎస్ అభ్యర్థి అత్తిలి అరుణ విజయం

హైదరాబాద్ : రాంగోపాల్ పేటలో టీఆర్ ఎస్ అభ్యర్థి అత్తిలి అరుణ విజయం సాధించారు.

 

19:03 - February 5, 2016

హైదరాబాద్ : ఎంఐఎంతో వ్యూహాత్మక పొత్తు, ప్రతి పక్షాలు బలహీనంగా ఉండటం, మరియు రాష్ట్రంలో తమ స్వింగ్ కొనసాగుతుండటంతో జీఎచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడానికి కారణాలు అయ్యాయని ది హన్స్ ఇండియా ఎడిటర్ ప్రొ.కె నాగేశ్వర్ అన్నారు. గ్రేటర్ రిజల్ట్స్ సందర్భంగా 10టీవీ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో నాగేశ్వర్ మాట్లాడారు. 'ఎంఐఎం యాంటి ముస్లిం ఓట్లు టీఆర్ఎస్ కు పడ్డాయి. టీఆర్ఎస్ అనుసరించిన ఎన్నికల వ్యూహం ఫలించింది. పార్టీల నుంచి లీడర్లతో పాటూ క్యాడర్ కూడా తరలి వెల్లడంతో టీఆర్ఎస్ కు లాభించింది. చంద్రబాబు నాయుడి ఆంధ్రప్రదేశ్ వ్యూహం పనిచేయలేదు. మోడీ పవనాలు కూడా పని చేయలేదు. బీజేపీ, టీడీపీల పొత్తును సీట్ల రూపంలో ఆశించలేము. కాంగ్రెస్ ఇంకా పాత ట్యాగ్ లైన్ అయిన 'మేమే తెలంగాణ' తెచ్చామనడం పెద్దగా ఫలితాన్నివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ తమన ముందు ముందు ఈ స్లోగన్ మార్చుకుంటే గెలుస్తుందేమో.'' అని నాగేశ్వర్ విశ్లేషించారు. 

18:37 - February 5, 2016

హైదరాబాద్ : తాను సవాల్ విసరలేదని, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరాడని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టిటిడిపి పరాభవం చెందింది. టీఆర్ఎస్ దూసుకపోవడమే గాకుండా మేయర్ స్థానాన్ని సొంతంగానే కైవసం చేసుకొనే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా మీడియాతో రేవంత్ మాట్లాడారు. కేటీఆర్ సవాల్ తాను స్వీకరించడం జరిగిందని అనంతరం మంత్రి కేటీఆర్ సవాల్ నుండి వెనక్కి వెళ్లారని తెలిపారు. వంద స్థానాలు అనలేదని కేటీఆర్ పేర్కొనడం జరిగిందని ఇదంతా రికార్డులో ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన్ను (కేటీఆర్)ను అడగాలని రేవంత్ సూచించారు.

18:34 - February 5, 2016

హైదరాబాద్ : చరిత్రను తిరగరాసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. నగర చరిత్రలో ఏనాడూ లేనంత పెద్ద విజయాన్ని నమోదు చేసిందని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంపై ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేశారని, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కులాలకు..మతాలకు..ప్రాంతాలకతీతంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దక్షతకు ఈ ఎన్నికలు నిదర్శమన్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి అని కేటీఆర్ అభివర్ణించారు.

 

18:32 - February 5, 2016

హైదరాబాద్ : జాంబాగ్ లో కౌంటింగ్ పూర్తయ్యింది. ఐదు ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారని అధికారులు ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు రీ కౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. అధికారులు దీనిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ పరాజయం చెందారు.

 

18:30 - February 5, 2016

హైదరాబాద్ : సైకిల్ పంక్చరయ్యింది..చేయి విరిగింది..కాషాయం వాడిపోయింది..గులాబీ వికసించిందని టీఆర్ఎస్ ఎంపీ సుమన్ వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఒంటరిగానే మేయర్ స్థానాన్ని కైవసం చేజిక్కించుకొనే దిశగా ముందుకెళుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ సుమన్ టెన్ టివితో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో సవాల్ విసిరిన నేతలు ఏమంటారని ప్రశ్నించారు. తొడలు కొట్టిండ్రు..నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు.

18:24 - February 5, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగా అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజార్టీని టీఆర్ఎస్ సాధిస్తోంది. ఇక తమ మేయర్ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని మాత్రం వెల్లడి కావడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో కారు అంచనాలకు మించి దూసుకెళుతోంది. పాతబస్తీలో ఎంఐంఎం 8 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించగా టిడిపి, బిజెపి పార్టీలు రెండు స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విక్రమ్ గౌడ్ జాంబాగ్ లో పరాజయం చెందారు. చర్లపల్లి డివిజన్ నుండి పటీ చేసిన బొంతు రామ్మోహన్ గౌడ్, బంజారాహిల్స్ డివిజన్ నుండి పోటీ చేసిన ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిల మధ్య పోటీ ఉందని తెలుస్తోంది.

గ్రేటర్ ఎన్నికలు...ఎంఐఎం విజేతలు..

హైదరాబాద్ : మోహిదీపట్నంలో మాజిద్ హుస్సేన్, డబిర్ పురాలో మీర్జా-రియాద్ -ఉల్ -హసన్, లలితాగ్ లో ఎండీ అలీ షరీఫ్, అసిఫ్ నగర్ లో అంజుమ్, బార్కస్ లో షబానా బేగం, ఫలక్ నుమాలో తారాబాయి, లంగర్ హౌస్ లో అభ్యర్థి అమీనా బేగం విజయం సాధించారు.

 

18:07 - February 5, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్న సందర్భంలో ఒక అనూహ్య చర్చ తెరపైకి వచ్చింది. ఈవీఎంలు టాంపరింగ్ అయినట్లు విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈనెల 2వ తేదీన 150 డివిజన్లకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కౌంటింగ్ శుక్రవారం జరిగింది. అత్యల్ప స్థానాల్లో ఉన్న టీఆర్ఎస్ ఈసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం పట్ల పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా ఈవీఎంలు టాంపరింగ్ చేయడం వల్లే సాధ్యమౌతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వెంటనే పలు స్థానాల్లో రీ పోలింగ్ జరిపించాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది.
వెస్లీ కాలేజీలో సికింద్రాబాద్ ఐదు డివిజన్లు, సనత్ నగర్ నియోజకవర్గం డివిజన్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించారు. ఇక్కడ సికింద్రాబాద్ ఐదు డివిజన్లు, సనత్ నగర్ లో రెండు డివిజన్లలో గులాబీ వికసించింది. ప్రధాన పార్టీకి ఈవీఎంలు అనుకూలంగా ఉన్నాయని సీపీఎం నేతలు ఆరోపించారు. రీ పోలింగ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను బౌద్దనగర్ టీఆర్ఎస్ నేత చిట్టి దేవేందర్ రెడ్డి కొట్టిపారేశారు. మోండా మార్కెట్ అభ్యర్థి విజయం సాధించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెడుతానని ఆమె టెన్ టివికి తెలిపారు.

గోషామహల్ జాంబాగ్ లో 5 ఓట్ల అధిక్యంలో ఎంఐఎం

హైదరాబాద్ : గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ లో ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయింది. ఎంఐఎం 5 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ ఎస్ రీకౌంటింగ్ చేయాలని కోరుతోంది. 

17:51 - February 5, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ విరాజల్లింది. కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీల అభ్యర్థులు ఘోర పరాజయాన్ని చవి చూశారు. సెటిలర్లు కూడా టీఆర్ఎస్ వైపు చూసినట్లు స్పష్టంగా తెలుస్తోందని పలువురు నేతలు తెలిపారు. ఎల్ బినగర్ ఇండోర్ స్టేడియంలో 13 డివిజన్లకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇక్కడ 12 డివిజన్లలో టీఆర్ఎస్ అధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నాగోల్ అభ్యర్థి విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై ఐదు వేల పైచిలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. కేసీఆర్ పాలనను ప్రజలు విశ్వసించారని, ఆయన చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు బాగా చేరువయ్యారని నేతలు పేర్కొన్నారు.

 

17:50 - February 5, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈనెల 2 తేదీన 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం 24 కేంద్రాల్లో కొనసాగించారు. ఐదు గంటల తరువాత ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.
 

నియోజకవర్గం అభ్యర్థి పార్టీ
నేరెడ్ మెట్ కత్తి శ్రీదేవి టీఆర్ఎస్
ఈస్ట్ ఆనంద్ బాగ్ ఆకుల నర్సింగరావు టీఆర్ఎస్
భారతీనగర్ సింధూ ఆదర్శ రెడ్డి టీఆర్ఎస్
మాదాపూర్ జగదీశ్వర్ రెడ్డి టీఆర్ఎస్
ఖైరతాబాద్ విజయారెడ్డి టీఆర్ఎస్
కూకట్ పల్లి ఎ.వెంకటేశ్వర్లు టీఆర్ఎస్
సోమాజిగూడ విజయలక్ష్మి టీఆర్ఎస్
అల్వాల్ చింతల విజయశాంతి టీఆర్ఎస్
చింతల్ రషీదా బేగం టీఆర్ఎస్
పటన్ చెరు శంకర్ యాదవ్ కాంగ్రెస్
కాచిగూడ ఎక్కాల చైతన్య టీఆర్ఎస్
కొండాపూర్ అమిత్ పటేల్ టీఆర్ఎస్
చిలుకానగర్ గోపు సరస్వతి టీఆర్ఎస్
గచ్చిబౌలి సాయిబాబా టీఆర్ఎస్
బౌద్ధనగర్ ధనంజన బాయి టీఆర్ఎస్
మోండా మార్కెట్ ఆకుల రూప టీఆర్ఎస్
చంపాపేట  సామ రమణారెడ్డి టీఆర్ఎస్
సీతాఫల్ మండి హేమ టీఆర్ఎస్
మెట్టుగూడ  పీఎన్ భార్గవి టీఆర్ఎస్
అడ్డగుట్ట ఎస్.విజయకుమార్ టీఆర్ఎస్
మియాపూర్ మేకా రమేష్ టీఆర్ఎస్
డబీర్ పురా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎంఐఎం
ఎర్రగడ్డ షాహిన్ బేగం ఎంఐఎం
విజయ్ నగర్ కాలనీ సల్మా అమీన్ ఎంఐఎం
శాలి బండ మహ్మద్ ముస్తాఫా ఆలీ ఎంఐఎం
నవాబ్ షాహి కుంట సిరిన్ కతున్ ఎంఐఎం
లలితాబాగ్ ఎండీ ఆలీ షరీఫ్ ఎంఐఎం
గోషామహల్  లక్ష్మణ్ సింగ్ బీజేపీ

మోహిదీపట్నం

మాజిద్ హుస్సేన్

ఎంఐఎం

జగద్గిరిగుట్ట

జగన్

టిఆర్ఎస్

బన్సీలాల్ పేట

 

కూర్మ హేమలత టీఆర్ ఎస్
పాతబోయిన్ పల్లి ముద్దం నర్సింహ్మయాదవ్ టీఆర్ ఎస్
గాజుల రామారం శేషగిరి టీఆర్ ఎస్
మచ్చబొల్లారం జిజేంద్రనాథ్ టీఆర్ ఎస్
గన్ ఫౌండ్రీ  మమతా గుప్తా టీఆర్ ఎస్ 
అల్లాపూర్  సబియాబేగం టీఆర్ ఎస్
సనత్ నగర్  కొలను లక్ష్మీ  టీఆర్ ఎస్ 
అసిఫ్ నగర్  అంజుమ్  ఎంఐఎం
కార్వాన్  రాజేంద్రప్రసాద్  ఎంఐఎం

లంగర్ హౌస్ 

అమీనా బేగం

ఎంఐఎం

ముషీరాబాద్

ఎడ్ల భాగ్యలక్ష్మీ

టీఆర్ ఎస్ 

కొండాపూర్ 

అమీద్ పటేల్

టిఆర్ ఎస్ 

హిమాయత్ నగర్

హేమలత 

టీఆర్ ఎస్

రాంగోపాల్ పేట

అత్తిలి అరుణ

టీఆర్ ఎస్ 

మైలార్ దేవ్ పల్లి

తోకల శ్రీనివాస్ రెడ్డి

టీఆర్ ఎస్ 

జూబ్లిహిల్స్

కాజా సూర్యనారాయణ

టీఆర్ ఎస్

హయత్ నగర్ 

సామ తిరుమల్ రెడ్డి 

టీఆర్ ఎస్

కొత్తపేట

సాగర్ రెడ్డి 

టీఆర్ ఎస్

హబ్సిగూడ

బేబీ స్వప్న

టీఆర్ ఎస్

17:20 - February 5, 2016

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 'కారు' దూసుకపోతోంది. ఈనెల 2వ తేదీన జరిగిన 150 డివిజన్ల గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం జరిగింది. పురానాపూల్ రీ పోలింగ్ సందర్భంగా సాయంత్రం ఐదు గంటల వరకు ఫలితాలు వెల్లడించవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం ఐదు గంటల తరువాత ఫలితాలు వెల్లడయ్యాయి. తొలి రౌండు నుండి చాలా వరకు డివిజన్లలో తన అధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. మెజార్టీ స్థానాల్లో గులాబీ అభ్యర్థులు తమ ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న గులాబీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. ఈ విజయం గ్రేటర్ ప్రజలదని టీఆర్ఎస్ నేత కట్టెల శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు.

17:15 - February 5, 2016

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 'కారు' దూసుకపోతోంది. ఈనెల 2వ తేదీన జరిగిన 150 డివిజన్ల గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం జరిగింది. పురానాపూల్ రీ పోలింగ్ సందర్భంగా సాయంత్రం ఐదు గంటల వరకు ఫలితాలు వెల్లడించవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం ఐదు గంటల తరువాత ఫలితాలు వెల్లడయ్యాయి. తొలి రౌండు నుండి చాలా వరకు డివిజన్లలో తన అధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. మెజార్టీ స్థానాల్లో గులాబీ అభ్యర్థులు తమ ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. పాతబస్తీలో కూడా టీఆర్ఎస్ అధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గద్దపై టీఆర్ఎస్ సొంతంగా అధికారం చేపట్టే దిశగా దూసుకపోతోంది.

 

కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఓటమి

హైదరాబబాద్ : తార్నాకలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఓటమిపాలయ్యారు. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 

సోనియా, రాహుల్‌ పై ప్రధాని మోడీ విమర్శలు...

ఢిల్లీ : సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై ప్రధాని మోడీ దాడి ప్రారంభించారు. అసోంలో పర్యటన సందర్భంగా మోడీ విమర్శల వేడిని పెంచారు. గాంధీ కుటుంబం ప్రభుత్వాన్ని పనిచేయనివ్వడం లేదని ఘాటుగా స్పందించారు. చాలా అంశాల్లో నిర్ణయాలు తీసుకోనివ్వకుండా అడ్డుతగులుతున్నారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటువేయాలని మోడీ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కేంద్ర క్రీడామంత్రిగా ఉన్న సర్బానంద్‌ సోనోవాల్‌ని అసోం రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని ఆయన ఓటర్లును కోరారు. పేదలను పట్టించుకునే ప్రభుత్వం అసోం ఏర్పాటు కావాలని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఛత్తీస్ గడ్ లో లొంగిపోయిన 43 మంది మావోయిస్టులు

హైదరాబాద్ : ఆంధ్ర సరిహద్దు ప్రాంతం ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కొంత కాలంగా చత్తీస్ గఢ్ లో లొంగు బాటుల పరంపర కొనసాగుతోంది. అడవుల్లో పోలీసుల కదలికలు ఎక్కువవడంతో  ప్రాణ రక్షణకోసం జన జీవన స్రవంతి కలిసి పోవాలని నిర్ణయించుకున్న గిరిజనులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ముద్రగడ దీక్ష వార్తలను టీవీలో చూస్తూ ప్రాణాలు విడిచాడు...

తూర్పు గోదావరి : జిల్లాలోని పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడులో రామకృష్ణ అనే వ్యక్తి శుక్రవారం టీవీలో ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష వార్తలను చూస్తూ ప్రాణాలు విడిచాడు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం దంపతులు తమ నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి వార్తలను టీవీలో చూస్తూ రామకృష్ణ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాసేపట్లో గ్రేటర్ ఎన్నికల ఫలితాలు

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా చోట్ల కౌంటింగ్ పూర్తి అయింది. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.

నయనతార అరెస్టు...?

హైదరాబాద్ : మలేషియా ఎయిర్ పోర్ట్ లో అధికారులు హీరోయిన్ నయనతారను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. షూటింగ్ కోసం మలేషియా వెళ్లిన ఈ బ్యూటీ పాస్ పోర్ట్ లో పేరు మిస్ మ్యాచ్ అయినట్లు గుర్తించిన అక్కడి అధికారులు.. ఎయిర్ పోర్ట్ లోనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

డయాబెటిక్‌ వ్యాధిపై జరిగే ప్రచారంలో పాల్గోనున్న అక్షయ్‌....

హైదరాబాద్ : బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థతో జతకలిశాడు. భారతదేశంలో డయాబెటిక్‌ వ్యాధిపై జరిగే ప్రచారంలో అక్షయ్‌ పాల్గోనున్నాడు. ఈ కార్యక్రమం కోసం రూపొందించే వీడియోలో అక్షయ్‌ కుమార్‌ నటించనున్నాడు. మహారాష్ట్ర ప్రభుత్వం అక్షయ్‌ కుమార్‌ను సంప్రదించి వీడియోలో నటించాలని కోరడంతో రెండో ఆలోచన లేకుండా అక్షయ్‌ ఒప్పుకున్నాడు. దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ రూపొందించే ఈ వీడియో ప్రపంచ ఆరోగ్యదినోత్సవమైన ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. దీనికి సంబందించిన షూటింగ్‌ కార్యక్రమం ముంబైలో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. యూ ట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా ఈ ప్రచార వీడియో విడుదల కానుంది.

కౌంటింగ్ ప్రక్రియను వీడియో రికార్డు చేస్తున్న అధికారులు

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు జరిగింది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అధికారులు కౌంటింగ్ ప్రక్రియను వీడియో రికార్డు చేస్తున్నారు. కౌంటింగ్ ను వెబ్ కాస్టింగ్ ద్వారా కమిషనర్ పరిశీలిస్తున్నారు. 

15:54 - February 5, 2016

హైదరాబాద్ : బల్దియా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం మూడు గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించారు. అనంతరం ఈవీఎంలు తెరిచి కౌంటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఎల్ బినగర్ ఇండోర్ స్టేడియంలో భారీ భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. వెస్లీ కాలేజీలో సికింద్రాబాద్, సనత్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన డివిజన్ల కౌంటింగ్ కొనసాగుతోంది.
సాయంత్రం ఐదు గంటల తరువాతే మొదటి ఫలితం వెల్లడించనున్నారు. ఎన్నికల విధుల్లో మొత్తం 5226 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 1674 టేబుళ్లు, 827 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కౌంటింగ్ జరిగే ప్రాంతాల వద్ద మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. ఐడీ ఉన్న వారినే లోనికి అనుమతినిస్తున్నారు. అన్ని చోట్ల 144 సెక్షన్ అమల్లో ఉంది. మరోవైపు ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాత్రి 8గంటలకల్లా పూర్తి ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు.

కొనసాగుతున్న ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

 

15:48 - February 5, 2016

ఇంటిని అందంగా ఉంచుకోవాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, ఏదో ఒక అభిరుచికి పదును పెట్టుకోవాలి. అలాంటి అభిరుచిలో చాలా మంది ఇష్టపడేది పెయింటింగ్. పెయింటింగ్ లో సృజనాత్మకతకు పదునుపెడితే, కొత్త అందాలను చూడొచ్చు. ఈ రోజు అలాంటి పెయింటింగ్ మెళకువలతో మీ ముందుకొచ్చింది సొగసు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

15:46 - February 5, 2016

హైదరాబాద్ : పురానాపూల్ లో రీ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. భారీ భద్రత మధ్య ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది. నలుగురు ఏసీపీలతో పాటు మూడు వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల వరకు 40 శాతం పూర్తయైందని, సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు సిటీ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను మూడు గంటలకు ప్రారంభించారు. 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

 

15:46 - February 5, 2016

ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న దాఖలాలే కానీ, తరుగుతున్న సూచనలేమీ కన్పించడం లేదు. ప్రభుత్వాలు, ఇతర వ్యవస్థలూ సమర్థవంతంగా పనిచేయనంత కాలం ఈ దుస్థితి కొనసాగుతూనే ఉంటుంది. ఇదే సమయంలో ఆడపిల్లలు ఆత్మరక్షణా మార్గాలు నేర్చుకోవాల్సిన పరిస్థితీ ఉంది. అందుకే, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి నిర్భయ. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

15:44 - February 5, 2016

కేంద్ర పారామిలటరీ దళ చరిత్రలో నాయకత్వ బాధ్యతల్లో మహిళలకు ఇప్పటివరకూ స్థానం లేదు. ఆ స్థానాన్ని ఇప్పుడు అర్చనా రామసుందరం కైవసం చేసుకున్నారు.

శని సింగణాపూర్ ఆలయంలోకి ప్రవేశంపై, భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అండగా నిలుస్తున్నారు.

మహిళల భద్రత విషయంలో ఢిల్లీ మహిళా కమీషన్ తీవ్రంగా స్పందించింది. నేరాల అదుపుకు చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించాలని ఒకవైపు మహిళలు నిరసన గళం వినిపిస్తున్నారు. మరోవైపు మహిళా శిశు సంక్షేమ మంత్రిగారే, ఆ పరీక్షలను సమర్థిస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

మహిళలు అన్ని రంగాల్లోకి దూసుకెళ్తున్నారని చెప్పుకుంటున్నా, ఇంకా ఉన్నత స్థాయి పదవుల్లో వారికి సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదనేది వాస్తవం.

దశాబ్దాల పాటు తెలుగు సాహిత్యంలో, మహిళా లోకంలో చెరగని ముద్ర వేసిన నాయని కృష్ణకుమారి గారు తుదిశ్వాస విడిచారు. సాహిత్య లోకంలో ఒక లోటును మిగిల్చారు.

వేధింపులను అరికట్టేందుకు షి టీమ్స్ మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

 

ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం...

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.

 

పలు డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి

హైదరాబాద్ : గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి అయింది.

 

కొనసాగుతున్న గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు జరుగనుంది. కౌంటింగ్ ను వెబ్ కాస్టింగ్ ద్వారా కమిషనర్ పరిశీలిస్తున్నారు. 

 

15:35 - February 5, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన లైవ్ అప్ డేట్స్ టెన్ టివి ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది. అప్ డేట్స్ కోసం ఫాలో అవ్వండి..

 • గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తన హవా చూపించింది. 102 సీట్లలో గెలిచింది. అటు ఎంఐఎం 31 సీట్లను గెలుచుకుంది. ఇక బీజేపీ మూడు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. టిడిపి సింగిల్ డిజిట్‌ కే పరిమితమైంది.
 • నగరం నలుమూలలా టీఆర్‌ఎస్ తన హవా చూపించింది. 95 సీట్లలో గెలిచిన పార్టీ మరో 01 స్థానాల్లో ముందంజలో ఉంది. అటు 28 సీట్లను గెలుచుకున్న ఎంఐఎం మరో 08 స్థానాల్లో లీడ్ సాధించింది. ఇక బీజేపీ మూడు, టీడీపీ, కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌ కే పరిమితమయ్యాయి.
 • 95 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. 28 స్థానాల్లో ఎంఐఎం గెలుపు పొందింది. బీజేపీ మూడు, టిడిపి 1 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ ఒక స్థానానికి పరిమితమైంది.
 • గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 90 స్థానాల్లో విజయం సాధించగా 15 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది.
 • ఈ ఎన్నికల్లో పేదలు డబుల్ బెడ్ రూం ఇళ్లు అధికంగా ఆశ్రయిస్తున్నారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాబోయే బడ్జెట్ లో లక్ష ఇళ్లు కట్టిస్తామని ఐదు సంవత్సరాల వరకు కడితే అందరికీ ఇళ్లు అందే అవకాశం ఉందన్నారు. ఎన్నిలక మేనిఫెస్టోను తు.చ తప్పకుండా అమలు చేస్తామని, వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. 99 శాతం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చామని, కేజీ టు పీజీ విద్య ఒక్కటే నెరవేర్చలేదన్నారు.
 • మేయర్ విషయంలో తాను ఒక్కరి తీసుకొనే నిర్ణయం కాదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పార్టీ కమిటీ ఉందని, పెద్దలు ఉన్నారని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
 • అద్భుతమైన విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 84 స్థానాల్లో విజయం సాధించగా 16 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. విజయంలో అందరి సమిష్టి కృషి ఉందని, ఏ ఒక్కరితో విజయం సాధించలేదని చెప్పుకొచ్చారు. నగర చరిత్రలో ఏ ఒక్క పార్టీగా జీహెచ్ఎంసీ అధికారం చేపట్టిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. పెద్ద బరువు మోపారని, నేతలకు గర్వం రాకూడదని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు అధికంగా ఆశ్రయిస్తున్నారని, రాబోయే బడ్జెట్ లో లక్ష ఇళ్లు కట్టిస్తామని, ఐదు సంవత్సరాల వరకు కడితే అందరికీ ఇళ్లు అందే అవకాశం ఉందన్నారు. ఎన్నిలక మేనిఫెస్టోను తు.చ తప్పకుండా అమలు చేస్తామని, వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. 99 శాతం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చామని, కేజీ టు పీజీ విద్య ఒక్కటే నెరవేర్చలేదన్నారు. ఎన్నో ఆరపణు హైదరాబాదీలందరూ కేసీఆర్ తోనే ఉంటారని, ఇక్కడున్న వారందరూ తమ బిడ్డలేనని మరోసారి స్పష్టం చేశారు.
 • సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. చరిత్ర తిరగరాస్తూ ఏ పార్టీకి ఇవ్వని స్థానాలు ఇచ్చి అద్భుతమైన విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మాట్లాడుతున్న సందర్భంలో టపాకాయలు పేలుతుండడంపై కేసీఆర్ మాట్లాడడం ఆపేశారు.
 • సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. చరిత్ర తిరగరాస్తూ ఏ పార్టీకి ఇవ్వని స్థానాలు ఇచ్చి అద్భుతమైన విజయాన్ని చేకూర్చిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గులాబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 84 స్థానాల్లో విజయం సాధించగా 16 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది.
 • ఈ నెల 11న మేయర్ ఎంపిక జరుగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. టీఆర్‌ఎస్ తరపున గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మేయర్ ఎంపికపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
 • సీఎం కేసీఆర్ చేస్తోన్న అభివృద్ధికే పట్టం కట్టారని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. ఈ విజయంతో తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు.
 • కాసేపట్లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 80స్థానాల్లో గెలుపొందగా 20 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. దీనితో ఒంటరిగానే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకొననుంది.
 • గ్రేటర్ ఎన్నికల్లో ప్రజల తీర్పు శిరసావహిస్తామని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఊహించని విధంగా ఫలితాలు వెలువడడంపై కారణాలను సమీక్షిస్తామని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
 • గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీలు పరాజయం చెందాయి. కొన్ని స్థానాల్లో మాత్రమే గెలుపు సాధిస్తున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ 80 స్థానాల్లో విజయం సాధించింది. 20 స్థానాల్లో అధిక్యంలో దూసుకెళుతోంది. ఎంఐఎం 24 స్థానాల్లో విజయం సాధించింది. టిడిపి ఒక స్థానంలో అధిక్యంలో కొనసాగుతుంది. బిజెపి 3స్థానాల్లోవిజయంసాధించింది. కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించింది.
 • గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాంనగర్ డివిజన్ నుంచి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు.
 • సైకిల్ పంక్చరయ్యింది..చేయి విరిగింది..కాషాయం వాడిపోయింది..గులాబీ వికసించిందని టీఆర్ఎస్ ఎంపీ సుమన్ వ్యాఖ్యానించారు.
 • తాను సవాల్ విసరలేదని, మంత్రి కేటీఆర్ సవాల్ విసిరాడని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
 • గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం పట్ల మంత్రి జగదీష్, టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ పరిపాలనకు ఇది నిదర్శనమన్నారు.
 • గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, బిజెపి పార్టీలు ఘోర పరాజయం చవి చూశాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ 53 స్థానాల్లో గెలు పొందగా 49 స్థానాల్లో అధిక్యంలో దూసుకెళుతోంది. ఎంఐఎం 20 స్థానాల్లో విజయం సాధించి 03 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. బిజెపి, టిడిపి ఒకస్థానంలో అధిక్యంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించింది.
 • ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చరిత్రను తిరగరాసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. నగర చరిత్రలో ఏనాడూ లేనంత పెద్ద విజయాన్ని నమోదు చేసిందని తెలిపారు.
 • జాంబాగ్ లో కౌంటింగ్ పూర్తయ్యింది. ఐదు ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారని అధికారులు ప్రకటించారు. టీఆర్ఎస్ అభ్యర్థులు రీ కౌంటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. అధికారులు దీనిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ పరాజయం చెందారు.
 • గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని అధిక్యతను కనబరుస్తోంది. రాత్రి ఏడు గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కేటీఆర్ దత్తత తీసుకున్న హైదర్ నగర్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది. సొంతంగానే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. గ్రేటర్ లో పాత రికార్డులు బద్ధలు కొట్టింది.
నియోజకవర్గం అభ్యర్థి పార్టీ
నేరెడ్ మెట్ కత్తి శ్రీదేవి టీఆర్ఎస్
ఈస్ట్ ఆనంద్ బాగ్ ఆకుల నర్సింగరావు టీఆర్ఎస్
భారతీనగర్ సింధూ ఆదర్శ రెడ్డి టీఆర్ఎస్
మాదాపూర్ జగదీశ్వర్ రెడ్డి టీఆర్ఎస్
ఖైరతాబాద్ విజయారెడ్డి టీఆర్ఎస్
కూకట్ పల్లి ఎ.వెంకటేశ్వర్లు టీఆర్ఎస్
సోమాజిగూడ విజయలక్ష్మి టీఆర్ఎస్
అల్వాల్ చింతల విజయశాంతి టీఆర్ఎస్
చింతల్ రషీదా బేగం టీఆర్ఎస్
పటన్ చెరు శంకర్ యాదవ్ కాంగ్రెస్
కాచిగూడ ఎక్కాల చైతన్య టీఆర్ఎస్
కొండాపూర్ అమిత్ పటేల్ టీఆర్ఎస్
చిలుకానగర్ గోపు సరస్వతి టీఆర్ఎస్
గచ్చిబౌలి సాయిబాబా టీఆర్ఎస్
బౌద్ధనగర్ ధనంజన బాయి టీఆర్ఎస్
మోండా మార్కెట్ ఆకుల రూప టీఆర్ఎస్
చంపాపేట  సామ రమణారెడ్డి టీఆర్ఎస్
సీతాఫల్ మండి హేమ టీఆర్ఎస్
మెట్టుగూడ  పీఎన్ భార్గవి టీఆర్ఎస్
అడ్డగుట్ట ఎస్.విజయకుమార్ టీఆర్ఎస్
మియాపూర్ మేకా రమేష్ టీఆర్ఎస్
డబీర్ పురా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎంఐఎం
ఎర్రగడ్డ షాహిన్ బేగం ఎంఐఎం
విజయ్ నగర్ కాలనీ సల్మా అమీన్ ఎంఐఎం
శాలి బండ మహ్మద్ ముస్తాఫా ఆలీ ఎంఐఎం
నవాబ్ షాహి కుంట సిరిన్ కతున్ ఎంఐఎం
లలితాబాగ్ ఎండీ ఆలీ షరీఫ్ ఎంఐఎం
గోషామహల్  లక్ష్మణ్ సింగ్ బీజేపీ

 

 • మేయర్ పీఠం స్థానం సాధించే దిశగా గులాబీ దూసుకెళుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కారు అంచనాలకు మించి దూసుకెళుతోంది. పాతబస్తీలో ఎంఐంఎం 8 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించగా టిడిపి, బిజెపి పార్టీలు రెండు స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విక్రమ్ గౌడ్ జాంబాగ్ లో పరాజయం చెందారు.
 • టీఆర్ఎస్ 48 స్థానాల్లో విజయం సాధించగా 50 స్థానాల్లో అధిక్యత కొనసాగుతోంది. ఎంఐంఎం 13 స్థానాల్లో విజయం సాధించగా 13 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. టిడిపి, బిజెపి పార్టీల అభ్యర్థులు ఇంకా విజయం సాధించలేదు. కాంగ్రెస్ ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించింది.
 • శివారు డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించింది. సొంతంగానే మేయర్ పీఠం సాధించే దిశగా కారు దూసుకెళుతోంది. ఈ ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్, బిజెపి ఘోర పరాజయాన్ని చవి చూశాయి.
 • జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో వంద స్థానాల్లో కారు ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటికే పలు స్థానాల్లో విజయం సాధించింది. కారు స్పీడును విపక్షాలు అందుకోలేదు. ఈ విజయం గ్రేటర్ ప్రజలదేనని టీఆర్ఎస్ నేత కట్టెల శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. విజయం సాధించడం పట్ల తెలంగాణ భవన్ లో నేతలు సంబరాలు జరుపుకున్నారు.
 • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. పలు స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. దీనితో తెలంగాణ భవన్ లో నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. పలువురు స్వీట్స్ పంచుకున్నారు.
 • జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కారు దూసుపోతోంది. 47 స్థానాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 50 స్థానాల్లో గులాబీ పార్టీ అధిక్య దిశగా దూసుకెళుతోంది. ఎంఐఎం 25 స్థానాల్లో ముందంజలో ఉంది. టిడిపి, కాంగ్రెస్ పరిస్థతి దారుణంగా తయారైంది. తార్నాకలో బండ కార్తిక రెడ్డి పరాజయం చెందినట్లు తెలుస్తోంది. మచ్చబొల్లారం, అల్వాల్ లో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
 • మరో కొద్ది నిమిషాల్లో బల్దియా ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. సాయంత్రం ఐదు గంటల తరువాత జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు. గ్రేటర్ ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విజయం సాధిస్తామని ఆయా పార్టీల అభ్యర్థులు ధీమాను వ్యక్త పరుస్తున్నారు.
 • బల్దియాలో ఓట్ల లెక్కింపు ఫలితాలు కొద్దిసేపట్లో వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్ది గంటల్లో సగానికి పైగా రౌండ్ల లెక్కింపు పూర్తయినట్లు తెలుస్తోంది.
 • బల్దియాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్ది గంటల్లో మూడు రౌండ్లు పూర్తయినట్లు సమాచారం. ఈసీ ఆదేశాల ప్రకారం ఫలితాలను వెల్లడించడం లేదు. దత్తాత్రేయనగర్, అక్బర్ బాగ్, రెయిన్ బజార్, నవాబ్ సాహెబ్ కుంట డివిజన్ల ఫలితాలు మొదట వెల్లడయ్యే అవకాశం ఉంది.
 • జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మూడు గంటలకు ప్రారంభమైంది. పలు డివిజన్లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యింది. ప్రస్తుతం ఈవీఎంలను తెరిచి లెక్కిస్తున్నారు. ప్రస్తుతం రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యిందని సమాచారం. 5గంటల తరువాతే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
 • ఈనెల 2వ తేదీన 150 డివిజన్లకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయమే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పురానాపూల్ రీ పోలింగ్ నేడు జరుగుతున్న దృష్ట్యా కౌంటింగ్ సమయాన్ని మార్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు.
 • మొదట అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఎన్నికల విధుల్లో మొత్తం 5226 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 1674 టేబుళ్లు, 827 రౌండ్ల ద్వారా ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.
 • కౌంటింగ్ జరిగే ప్రాంతాల వద్ద మూడెంచల భద్రతను ఏర్పాటు చేశారు. ఐడీ ఉన్న వారినే లోనికి అనుమతినిస్తున్నారు. అన్ని చోట్ల 144 సెక్షన్ అమల్లో ఉంది. మరోవైపు ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాత్రి 8గంటలకల్లా పూర్తి ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు.

యూసుఫ్ గూడలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం

హైదరాబాద్ : యూసుఫ్ గూడలో ఎనిమిది డివిజన్లకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.

 

15:25 - February 5, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎల్ బినగర్ ఇండోర్ స్టేడియంలో 13 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ ను అధికారులు లెక్కిస్తున్నారు. పోస్టల్ కు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను మొదట లెక్కిస్తున్నారు. కౌంటింగ్ జరిగే ప్రాంతం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఐడీ కార్డులను చూపెట్టిన తరువాతే లోనికి రానిస్తున్నారు. అభ్యర్థులకు సంబంధించిన అనుచరులను కౌంటింగ్ దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. సెల్ ఫోన్..ఇతరత్రా సామాగ్రీని లోనికి అనుమతించడం లేదు. ఒకసారి లోనికి వెళితే సాయంత్రం ఐదు గంటల తరువాతే వారిని బయటకు అనుమతినించనున్నారు. పురానాపూల్ రీ కౌంటింగ్ సందర్భంగా ఈసీ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. సాయంత్రం ఐదు గంటల తరువాతే ఫలితాలు బయటకు రానున్నాయి.

15:24 - February 5, 2016

ఛండీఘర్ : హర్యానాలోని ఫరీదాబాద్‌లో నలుగురు వ్యక్తులు రెచ్చిపోయారు. బీడీ అడిగిన పాపానికి ఓ వ్యక్తిని అమానుషంగా కొట్టి అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ టీవీలో రికార్డయిన ఈ షాకింగ్ దృశ్యాలు పలువురిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. మితిమీరిన ఆవేశంలో నలుగురు వ్యక్తులు ఉన్మాదుల్లా మారిపోయారు. ఆ వ్యక్తిని పట్టుకుని పిడిగుద్దుల వర్షం కురిపించారు. నిస్సహాయుడిని చేసి బెల్ట్ తో విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. కిందపడిపోయిన అతనిపై  మూత్రం పోసి హేయంగా ప్రవర్తించారు. సీసీ  కెమెరాలో రికార్డయిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అయితే బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం లేదు. 

 

15:21 - February 5, 2016

ఢిల్లీ: సియాచిన్‌లో గల్లంతైన పది మంది సైనికులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఘటన చాలా బాధాకరమని, దేశాన్ని సంరక్షించేందుకు సరిహద్దులో పహారా కాస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు వందనం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.

సియాచిన్‌ గ్లేసియర్‌లో భారీ హిమపాతం

ఇండో పాక్ సరిహద్దులోని ఎత్తైన, ప్రమాదకర సియాచిన్ గ్లేసియర్‌లో బుధవారం భారీగా మంచుచరియలు విరిగిపడ్డాయి. భారత్ సైనిక శిబిరంపై ఆరు వందల మీటర్ల ఎత్తైన భారీ మంచుగడ్డలు పేరుకుపోయాయి. దీంతో మద్రాస్ బెటాలియన్‌కు చెందిన పది మంది సైనికులు అందులో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు గత రాత్రి నుంచి ముమ్మర ప్రయత్నాలు జరిగినప్పటికీ అవేవీ ఫలించలేదు.

మంచు కట్టర్లతో సైనికులను కాపాడేందుకు ప్రయత్నం

గురువారం మంచుకట్టర్లు, రక్షణ సామాగ్రితో కూడిన బృందం సియాచిన్ చేరుకుని గాలింపు చర్యలు చేపట్టింది. అయితే భారీగా మంచు పేరుకుపోవడంతో తొలగించడం అసాధ్యంగా మారింది. దీంతో మంచులో కూరుకుపోయిన సైనికుల ప్రాణాలపై ఆర్మీ ఆశలు వదులుకుంది. రెండు వారాల కిందటే మద్రాస్ బెటాలియన్‌కు చెందిన సైనికులు సియాచిన్ చేరారు. అప్పటి వరకు విధులు నిర్వహించిన రాజస్థాన్ బెటాలియన్ బృందానికి రిలీఫ్ ఇచ్చారు. అంతలోనే ఈ ఘోరం జరిగింది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సైనిక శిబిరం

సముద్ర మట్టానికి సరిగ్గా 19వేల 600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సైనిక శిబిరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. నిర్వాహణ కూడా భారీ ఖర్చుతో కూడుకున్నది. మైనస్ 25 నుంచి 42 డిగ్రీల ఉష్టోగ్రత ఉండే ఈ ప్రాంతంపై పట్టు కోసం భారత్, పాక్ తమ జవాన్ల ప్రాణాలను ఫణంగా పెడుతున్నాయి.

ప్రతికూల వాతావారణంలో మృతి చెందుతున్న సైనికులు

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు చాలా మంది చనిపోయారు. ఎంతో మందికి కాళ్ళు, చేతులు చచ్చుబడిపోయాయి. 2012లో భారీ హిమపాతానికి పాక్‌కు చెందిన 140 మంది మృతి చెందారు. ఇందులో 129 మంది సైనికులే. దీంతో ఈ ప్రాంతాన్ని సైనిక రహితంగా చేయాలన్న ఇరు దేశాల ప్రయత్నాలు కొలిక్కి రాలేదు.

 

15:20 - February 5, 2016

హైదరాబాద్ : బల్దియా ఎన్నికల కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పాతబస్తీలోని సిటీ కాలేజీలో 11 కేంద్రాలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ ప్రక్రియను ఆరు విడతలుగా విడదీశారు. చివరగా పురానాపూల్ డివిజన్ కు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. పురానాపూల్ ఫలితం రావడానికి రాత్రి పదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సిటీ కాలేజీలో కౌంటింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కౌంటింగ్ జరిగే ప్రాంతం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

15:19 - February 5, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. దోమల్ గూడలోని ఏవీ కాలేజీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ ను అధికారులు ప్రారంభించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించారు. ముషిరాబాద్ ఆరు డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ ఇందులో జరుగుతోంది. ఏ వార్డు ఎప్పుడు కౌంటింగ్ ఉంటుందనే సమాచారం ముందుగానే అధికారులు తెలిపారు. దీనితో ఆయా వార్డులకు సంబంధించిన ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. మొదటి రెండు గంటల్లోనే ఫలితం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కౌంటింగ్ జరిగే కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎవరినీ సెల్ ఫోన్ లను అనుమతించడం జరగదని, మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందని పోలీసు అధికారి పేర్కొన్నారు.

15:16 - February 5, 2016

కర్నూలు : వయస్సు మీదపడుతుంది...అయినా ఒక్క అమ్మాయితో పరిచయం లేదు.. ఉన్న జుట్టు కాస్త ఊడిపోయింది... బట్టతలతో బయటకు వెళ్లలేకపోతున్నాడు..ఆర్‌ఎంపీగా ఉన్న తన వద్దకు అప్పుడప్పుడు అమ్మాయిలు వచ్చినా అంకుల్‌లా చూస్తున్నారు...తనమీదే తనకు అసహ్యం వేసిందేమో..రాత్రి రాత్రి ఐడియా చేశాడు..మార్ఫింగ్ చేసి ఆర్‌ఎంపీ కాస్త కాస్టలీ కుర్రాడిలా మారిపోయాడు... ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి...ఒక్కనిమిషం... అమ్మాయిలూ ఇలాంటివారున్నారు జాగ్రత్త... అసలు ఫేస్‌ ఇది... బట్టతలతో ఫోటో...మార్ఫింగ్ చేశాక ఇలా... బ్లేజర్‌తో ఫోటో..ఇవి ఫోటోలు మాత్రమే నిజంగా చూస్తే... విగ్గు తగిలిస్తే సారు కాస్త యూత్‌లా మారిపోయి... ఇదీ అసలు కథ...ఫేస్ మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌తో నేరాలు..
అసలు పేరు రాజ్‌కుమార్...
ఇతని అసలు పేరు రాజ్‌కుమార్...కర్నూలు జిల్లా పగిడ్యాల చెందిన రాజ్‌కుమార్‌ తనకు తెలిసిన వైద్యంతో మాత్రలు ఇస్తూ ఆర్‌ఎంపీగా చేస్తున్నాడు...ఇలా వచ్చే సంపాదన సరిపోక...అదే సమయంలో తనపై తనకు విరక్తి కలిగేలా వచ్చిన బట్టతలతో విసిగిపోయాడు.. అద్దంలో ముఖం చూసుకుని బాధపడేవాడు.. ఇలా కొన్నాళ్లు తనకు తాను మానసికంగా కృంగిపోయిన రాజ్‌కుమార్‌ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ ఓపెన్ చేసి తన ఫేస్‌ ఫోటో పెట్టాడు...
ఎంతకూ దొరకని దోస్తులు..
ఫ్రెండ్‌షిప్ రెక్వెస్ట్‌లకు లేని స్పందన...
ఫ్రెండ్‌షిప్ రెక్వెస్ట్‌లకు లేని స్పందన... తన ముఖాన్ని చూసి ఫ్రెండ్ కాని అమ్మాయిలు.. రాత్రికి రాత్రి సరికొత్త ఐడియా... ముఖారవిందం కోసం తన ఫోటోకు మార్ఫింగ్...ఇక రాజ్‌కుమార్‌ విసిగిపోయి తాను కూడా అమ్మాయిలతో చెట్టాపట్టాలేసుకుని తిరగాలనుకున్నాడు...తన ముఖం తాను చూసుకుని ఆ అవకాశం రాదని నిర్ధారించుకున్నాడు... నిత్యం జరుగుతున్న ఫేస్‌బుక్ నేరాలను చూసి తాను కూడా రాత్రి రాత్రి ఐడియా చేశాడు...తనకు తెలిసిన పరిజ్ఞానంతో తన ఫోటోను రకరకాలుగా మార్ఫింగ్ చేసుకుని చూశాడు...
తనను తానే గుర్తించలేకపోయాడు..
అమ్మాయిలకు ఫ్రెండ్ రెక్వెస్ట్‌లు..
అమ్మాయిలను ఆకర్షించే విధంగా బట్టతలకు విగ్గుపెట్టుకొని అందంగా ఉండేలా ఫోటోలు దిగి ఫేస్ బుక్ లో పెట్టాడు...మరికొన్నింటిని మార్ఫింగ్ చేశాడు...ఇక తన పేరు పక్కన డాక్టర్, డైరెక్టర్ అంటూ తనకు తాను డిజిగ్నేషన్లు ఇచ్చుకున్న రాజ్‌కుమార్‌ రకరకాల ఆకర్షితమైన కొటేషన్లను పోస్ట్ చేస్తూ యువతులను ట్రాప్ చేశాడు....
ఫేస్‌బుక్‌లో అమ్మాయిలతోనే ఫ్రెండ్‌షిప్..
ఫేస్ బుక్ లో పరిచయమైన అమ్మాయిల వ్యక్తిగత విషయాలను తెలుసుకొని కర్నూలులోని లాడ్జిలకు పిలుపించుకొని నగ్న చిత్రాలు తీసి, లైంగికంగా లోబరుచుకునే వాడు...ఆ తర్వాత ఆ చిత్రాలను ఫేస్ బుక్, వాట్సాప్ లో పెడతానంటూ అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు...ఇలా ఎందరో అమ్మాయిలను బెదిరింపులకు గురిచేసి వారి వద్ద ఉండే బంగారు నగలు నగదు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నాడు....
పెరిగిపోతున్న బాధితురాళ్లు..
రాజ్ కుమార్ అరెస్టు...
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రాజ్ కుమార్ ను వలవేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి 20 తులాల బంగారు వస్తువులు, సెల్ పోన్ ల ఓ వాహనం స్వాధీనం చేసుకున్నారు. చూశారుగా రాజ్‌కుమార్‌ అసలు రూపం...ఇదీ... ఇలాంటివారెందరో రకరకాల మోసాలు చేసేవారున్నారు...వారి మాటలకు.. కొటేషన్లకు పడిపోయారో జీవితాలతో ఆడుకుంటారు... భవిష్యత్తును నాశనం చేస్తారు...ఇప్పటికే ఇలాంటి రాజ్‌కుమార్‌ల మోసాలు బయటపడ్డాయి...ఇంకా ఎందరో ఉన్నారని గుర్తుంచుకోండి.

 

15:13 - February 5, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు. కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బంజారాహిల్స్ ఏసీపీ టెన్ టివితో మాట్లాడారు. ఎనిమిది వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ఇందులో జరుగుతోందని, మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 250 మంది పోలీసులు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారని, విజయోత్సవ ర్యాలీలు నిషేధం విధించడం జరిగిందన్నారు. ఒకసారి లోనికి వెళ్లిన తరువాత ఐదు గంటల వరకు బయటకు రానీయడం జరగదని ఏసీపీ తెలిపారు.

15:09 - February 5, 2016

సికింద్రాబాద్ : కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పుడిప్పుడే పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు చేరుకుంటున్నారు. కౌంటింగ్ జరుగుతున్న వెస్లీ కాలేజీ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్రంలోకి వెళ్లే వారిని క్షుణ్ణంగా పరీక్షించిన అనంతరం లోనికి వదులుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ఐదు డివిజన్లు, సనత్ నగర్ కు సంబంధించిన నాలుగు డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. డీసీపీ నార్త్ జోన్ ఆధ్వర్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఐడీ కార్డు చూపించిన అనంతరం లోనికి వదలడం జరుగుతుందని గోపాల్ నగర్ ఏసీపీ టెన్ టివితో తెలిపారు.

 

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కోసం మొత్తం 24 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రం దగ్గర 7 నుంచి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. సాయంత్రం 5 గంటల తరువాతే ఫలితాను వెల్లడించనున్నారు. రాత్రి 8 గంటలకల్లా పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పురానాపూల్ డివిజన్ లో రీపోలింగ్ కొనసాగుతోంది. పురానాపూల్ లో ఆఖరి ఫలితం వెలువడనుంది.

 

14:55 - February 5, 2016

హైదరాబాద్ : అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టి-20 వరల్డ్ కప్ కు వెళ్లే భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెలక్టర్లు పొట్టి కప్ కు వెళ్లే భారత జట్టును మీడియాకు వెల్లడించారు. మరో సారి యూవీ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఈ టీ-20 వరల్డ్ కప్ కు కూడా యూవరాజ్ ఎంపికయ్యాడు. చాలా రోజులు జట్టుకు దూరమై ఆస్ట్రేలియా సిరీస్ తో తిరిగి టి-20 జట్టులో స్థానం సంపాధించుకున్న యువీపై సెలక్టర్లు మరోమారు నమ్మకముంచారు. ధోని సారథ్యంలోని టీమిండియా ఈ టీ-20 వరల్డ్ కప్ హాట్ ఫెవరేట్ గా బరిలోకి దిగనుంది. 
వారికీ దక్కిన చోటు.. 
ఆసీస్ సిరీస్ లో రాణించిన నెహ్రా, యువరాజ్ చోటు నిలుపుకోగా, మరో వెటరనర్ బజ్జీ కూడా పొట్టి జట్టులో చోటు సంపాదించాడు. కాగా ఈ వరల్డ్ కప్ అనంతరం ఈ ముగ్గురు వెటరన్ ఆటగాళ్లు వీడ్కోలు తీసుకునే అవకాశం ఉన్నట్లు క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ధోని కూడా ఈ వరల్డ్ కప్ తర్వాత వీడ్కోలు తీసుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
జట్టు..
 కెప్టెన్‌గా ధోనీ, కోహ్లి, శిఖర్‌ధావన్‌, రోహిత్ శర్మ, యువరాజ్‌, రహానె, జడేజా,హర్భజన్‌,అశ్విన్‌,మహ్మద్‌ షమీ, నెహ్రా, పవన్‌నేగి, హార్ధిక్‌పాండ్యా, బూమ్రా జట్టులో ఎంపికయ్యారు. భువనేశ్వర్‌, మనీష్‌పాండేకు టీమిండియా జట్టులో చోటు దక్కలేదు.

 

జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఈసీ ఆంక్షలు

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఈసీ ఆంక్షలు విధించింది. పురానాపూల్ రీపోలింగ్ సందర్భంగా ఫలితాలపై ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ మొదలైనా సాయంత్రం 5 గంటల తర్వాతే ఫలితాలు వెల్లడికానున్నాయి. 

వివిధ శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం

హైదరాబాద్ : వివిధ శాఖల అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వేగం చేయాలని కేసీఆర్ అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంపు అమలు చేయాలని తెలిపారు. హైదరాబాద్ లో రెండు పెద్ద ఆస్పత్రులు నిర్మించాలని చెప్పారు.

14:34 - February 5, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..కాజల్ జంటగా నటిస్తున్న 'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి చిత్ర దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిత్ర షూటింగ్ కు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూటింగ్ జరిగే దృశ్యాలను బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ కొన్ని ఫొటోలు మాత్రం బయటకు వస్తున్నాయి. తాజాగా 'కాజల్' కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 'సర్ధార్' చిత్రం కాజల్ యువరాణిగా కనిపిస్తుందని, పవన్ కళ్యాణ్ రతన్ పూర్ పోలీస్ గా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. శరత్ మరార్ నిర్మాణంలో బాబి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలు అందుకుంటుందా ? లేదా ? అనేది వేచి చూడాలి.

13:41 - February 5, 2016

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన ప్రచారానికి ఓటర్లు ఎలా స్పందించారు ? ఏ పార్టీని గెలిపించారో కొద్ది గంటల్లో తేలిపోనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. పురానాపూల్లో రీ కౌంటింగ్ నిర్వహిస్తున్న దృష్ట్యా సాయంత్రం ఐదు గంటల తరువాత ఫలితాలను వెల్లడించనున్నారు. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి 24 కేంద్రాల్లో ఈ కౌంటింగ్ కొనసాగనుంది. ఒక్కో కేంద్రంలో ఆరు నుండి పది డివిజన్ల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 1674 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే దత్తాత్రేయనగర్, అక్బర్ బాగ్, నవాబ్ సాహెబ్ కుంట, రెయిన్ బజార్ డివిజన్ల ఫలితాలు మొదటిగా వెల్లడికానున్నాయి. అనంతరం సనత్ నగర్, కొత్తపేట, చంపాపేట, గడ్డి అన్నారం, సరూర్ నగర్ తదితర డివిజన్ల ఫలితాలు వెల్లడికానున్నాయి. చిట్టచివరిగా పురానాపూల్ ఫలితం వెల్లడి కానుంది. మరి ఎవరు గెలుస్తారో ? ఎవరు పరాజితులవుతారో వేచి చూడాలి.

టీ 20 వరల్డ్ కప్ కు భారత్ జట్టు ఎంపిక

హైదరాబాద్ : టీ 20 వరల్డ్ కప్ కు భారత్ జట్టు ఎంపికయ్యింది. కెప్టెన్ గా ధోనీ, కోహ్లీ, రోహిత్, రైనా, ధావన్,యువరాజ్, నెహ్రా, హర్బజన్, జడేజా, అశ్విన్, మహ్మద్ షమీ, పవన్ నేగి, పాండ్యా, బూమ్రా ను ఎంపిక చేశారు. ఈ జట్టులో మనీష్ పాండే కు చోటు దక్కలేదు.

 

13:32 - February 5, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమైంది. 149 డివిజన్ల ఓట్ల లెక్కింపు 3 గంటలకల్లా ప్రారంభం కానున్నది. పురానాపూల్‌ డివిజన్‌ ఒక్కటే రీపోలింగ్‌ పూర్తయిన తర్వాత కౌంటింగ్‌ మొదలెట్టనున్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కించి.. ఆ తర్వాత ఈవీఎంల డేటా తీయనున్నారు. 

13:30 - February 5, 2016

హైదరాబాద్ : కాపులకు, బీసీలకు మధ్య చిచ్చుపెట్టేందుకు సీఎం చంద్రబాబు కుట్రపన్నుతున్నారని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...మాయమాటలు మాని వెంటనే కాపులకు 2వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 3నెలల్లో జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ను కుదించి ముద్రగడ దీక్షను విరమింపచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

13:27 - February 5, 2016

తూ.గో : ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం దంపతులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడకు బీపీ 160/110, షుగర్ లెవల్స్ 178 ఉండగా.. ప్రస్తుతం ఆయన బరువు 86 కేజీలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముద్రగడ సతీమణి పద్మావతికి బీపీ 180/110, షుగర్ లెవల్స్ 120గా ఉండగా.. ఆమె బరువు 78 కేజీలుగా వైద్యులు నిర్ధారించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముద్రగడ నివాసాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇంటిగేట్లను మూసివేశారు. మరో వైపు కాపు నేతలు ముద్రగడను కలిసేందుకు ఇంటికి వస్తున్నారు.

13:26 - February 5, 2016

తూ.గో : కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కోనసీమలో ఆమరణ, రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి వ్వవస్థాపక కన్వీనర్‌ దివంగత నల్లా సూర్యచంద్రరావు కుమారుడు నల్లా అజయ్‌ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. చంద్రరావు సతీమణి వారికి పూలదండలేసి రిలేదీక్షలు ప్రారంభించారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆమరణ దీక్ష కొనసాగుతుందని నల్లా అజయ్‌ ప్రకటించారు. 

ఢిల్లీలో పీసీసీ చీఫ్ ల సమావేశం...

హైదరాబాద్ : దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షల సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు, పలువురు సీనియర్‌ నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. మిగిలిన రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై కూడా రాహుల్‌గాంధీ చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రఘువీరారెడ్డి సమావేశానికి హాజరయ్యారు.

13:18 - February 5, 2016

గౌహతి : రియో ఒలింపిక్స్‌కు ముందు సన్నాహకం అన్నట్టు..12వ దక్షిణాసియా క్రీడలు (సాగ్‌) నేటి నుంచే ఆరంభం కానున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ ఈ ప్రతిష్మాత్మక క్రీడోత్సవానికి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆగష్టులో 2016 ఒలింపిక్స్‌ నేపథ్యంలో.. దక్షిణాసియా దేశాలు తాజా టోర్నీలో బలప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఎనిమిది దేశాల నుంచి 2,672 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. శుక్రవారం గౌహతిలో జరుగనున్న ప్రారంభోత్సవంలో భారత ప్రధాని నరెంద్ర మోడీ అధికారికంగా దక్షిణాసియా క్రీడలను ఆరంభించనున్నారు.
ఎనిమిది దేశాల నుంచి : దక్షిణాసియా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సాగ్‌లో ఎనిమిది దేశాలు పాల్గొంటాయి. భారత్‌ సహా అఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులు, నేపాల్‌, పాకిస్తాన్‌, శ్రీలంకలు దక్షిణాసియా క్రీడల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. పోటీలు మొత్తం 23 క్రీడాంశాల్లో ఉండనున్నాయి. విభాగాల వారీగా మొత్తం 228 కేటగిరిల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, హాకీ, ఫుట్‌బాల్‌, జూడో, కబడ్డీ, ఖోఖో, షూటింగ్‌, ఖోఖో, తైక్వాండో, టెన్నిస్‌, రెజ్లింగ్‌ సహా మరికొన్ని క్రీడాంశాల్లో భారత్‌ పతకాలపై కన్నేసింది.
నాలుగేండ్ల తర్వాత : వాస్తవానికి 12వ దక్షిణాసియా క్రీడలు 2012లోనే జరగాల్సి వున్నా అనివార్య కారణాలతో 2016లో నిర్వహించాల్సి వస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నా.. పరిపాలన పరమైన సమస్యలు, ఈ మధ్యలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో సాగ్‌ వాయిదా పడింది. 2015లో నిర్వహించాలని ఐఓసీ నిర్ణయించినా.. పాల్గొనే దేశాలు సమాయత్తం కావటానికి మరికొంత సమయం కావాలని కోరటంతో చివరకు 2016లో అస్సాం, మేఘాలయలను ఆతిథ్య వేదికలుగా నిర్ణయించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్భానంద సోనోవాల్‌.. తన సొంత రాష్ట్రానికి ప్రతిష్టాత్మక దక్షిణాసియా క్రీడలను నిర్వహణ బాధ్యతను అప్పగించాడు.
12వ దక్షిణాసియా క్రీడలు
ఎప్పుడు : ఫిబ్రవరి 5- 16
వేదిక : గౌహతి, షిల్లాంగ్‌
పాల్గొనే దేశాలు : 8
పాల్గొనే అథ్లెట్లు : 2,672
క్రీడాంశాలు : 23

13:11 - February 5, 2016

తూర్పు గోదావరి : కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష చేపట్టారు. కిర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ దంపతులు దీక్ష చేపట్టారు. ఇంటికి ఎవరూ రావొద్దని...దీక్షకు సంఘీభావంగా మధ్యాహ్నం ఆహారం మానేసి కంచం..ప్లేటుతో కొడుతూ తమ నిరసన తెలియచేయాలని ముద్రగడ పిలుపునిచ్చారు. దీనితో కాపులకు చెందిన నేతలు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలియచేశారు. తాము సంఘీభావం తెలియచేసేందుకు ముద్రగడ నివాసం వద్దకు చేరుకోవడానికి తాము ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని పలువురు పేర్కొన్నారు. ఒక విధంగా పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నామా ? అనే భావన కలుగుతోందన్నారు. 

ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుల సమావేశం..

ఢిల్లీ : ఏఐసీసీ కార్యాలయంలో శుక్రవారం అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. 

12:58 - February 5, 2016

ఐశ్వర్యరాయ్, రణ్‌బీర్‌ కపూర్‌, అనుష్కశర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'యే దిల్‌ హై ముష్కిల్‌'. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్‌ను చిత్ర యూనిట్‌ బుధవారం నుంచి ప్రారంభించింది. ఓ క్లాప్‌ బోర్డ్‌ని పట్టుకుని ఉన్న రణ్‌బీర్‌, అనుష్కశర్మలతో ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఆ క్లాప్‌బోర్డ్‌పై 'హాయ్.. వి ఆర్‌ అమిత్‌ అండ్‌ అలిజే' (మేం ప్రేమలో ఉన్నాం) అని రాసి ఉంది. దీంతో సినిమాలో వీరిద్దరూ ప్రేమికులని ప్రేక్షకులకు చిత్రయూనిట్‌ స్పష్టంగా చెప్పేసింది. వీళ్ళిద్దరు ప్రేమికులైతే మరి ఐశ్వర్య పాత్ర ఏ తరహాలో ఉంటుంది?, ఐశ్వర్య పాత్రకు ఈ పాత్రలకు ఉన్న సంబంధమేంటనే అంశాలపై ఆసక్తికలిగేలా చిత్రయూనిట్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంది. కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లిసా హైడెన్‌, ఫవడ్‌ఖాన్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 'రారు', 'బాంబే వెల్వేట్‌', 'తమాషా' వంటి మూడు వరుస ప్లాప్స్‌ తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న చిత్రమిది. దీంతోపాటు రణ్‌బీర్‌ 'జగ్గా జాసూస్‌' చిత్రంలోనూ నటిస్తున్నారు. అనుష్కశర్మ సైతం ఈ చిత్రంతోపాటు సల్మాన్‌ఖాన్‌ సరసన 'సుల్తాన్‌' చిత్రంలో నటిస్తోంది.

12:55 - February 5, 2016

పవన్‌ కళ్యాణ్‌, కాజల్‌ జంటగా బాబీ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై శరత్‌ మారర్‌, సునీల్‌ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'. ప్రస్తుతం కేరళలో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శరత్‌ మారర్‌ మాట్లాడుతూ, 'ప్రేక్షకులు, అభిమానులు 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లు ఇప్పటికే విశేష ఆదరణ పొంది, సినిమాపై మరింత క్రేజ్‌ని, హైప్‌ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం కేరళలో షూటింగ్‌ జరుపుతున్నాం. ఈ షెడ్యూల్‌ తర్వాత హైదరాబాద్‌లో జరిపే షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. పవన్‌కళ్యాణ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఓ ల్యాండ్‌మార్క్‌గా నిలిచే ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఒన్‌ మ్యాన్‌ షోగా పవన్‌కళ్యాణ్‌ అందర్నీ విశేషంగా అలరిస్తారు. కథానుగుణంగా దేవీశ్రీప్రసాద్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయి. త్వరలోనే గ్రాండ్‌గా ఆడియోను విడుదల చేస్తాం' అని చెప్పారు.

12:44 - February 5, 2016

రాత్రిపూట ద్రాక్ష పండ్లు తింటే హాయిగా నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ద్రాక్షలో నిద్రకు సహాయపడే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉంటుంది. అలాగే ద్రాక్ష పండ్లలో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫినోల్స్‌, ఫ్లెవనాయిడ్స్‌ అధిక మొత్తంలో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పాలకూరలో అధికంగా ఉండే పోటాషియం, క్యాల్షియం రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి సహకరిస్తాయి. అంతేకాదు, ప్రతిరోజూ పాలకూర తినే వాళ్లకు ఒత్తిడి, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పి దరిచేరవు. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా నిద్రపోవచ్చు. ఒక కప్పు నీటిలో రెండు పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారేదాకా ఉంచి తర్వాత వడగట్టి చక్కెర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిద్రపోవడానికి అరగంట ముందు తాగితే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

12:42 - February 5, 2016

ఉరుకులు పరుగులతోనే జీవితం సాగిపోతుంది.ఉదయం నిద్రలేవగానే రెడీ అవ్వడం, కాలేజీ, ఆఫీసులంటూ పరుగుతీస్తూ ఆరోగ్యం, అందంపై శ్రద్దపెట్టే సమయం లేకుండా పోయింది. అలాంటప్పుడు ఫంక్షన్స్‌కు హఠాత్తుగా వెళ్ళాల్సి వస్తే మీ ముఖం డల్‌గా.. నిర్జీవంగా.. కనిపిస్తుంది. అప్పటికప్పుడు పార్లర్లకు, స్పాలకు వెళ్లలేం. మనకు మనం రెడీ కావాల్సిందే. అప్పుడు హడావుడిగా వెళ్లడానికి ఏదో ఒక మేకప్‌ వేసుకుని వెళ్తుంటాం. అలాకాకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే అందంగా తయారవ్వొచ్చు.
ఆఫ్రికాట్‌, వాల్నట్‌, బాదాంతో ముఖాన్ని, చేతులను స్క్రబ్‌ చేయడం వల్ల కేవలం బ్లాక్‌ హెడ్స్‌ను తొలగించడం మాత్రమే కాకుండా తక్షణ మెరుపునిస్తుంది.
మీ పళ్ళను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. నోటి నుండి వచ్చే చెడువాసన చికాకు కలిగిస్తుంది. కాబట్టి పార్టీకి వెళ్లే ముందు బ్రష్‌ చేయడం మంచిది.
ఆరెంజ్‌ జ్యూస్‌, కొంచెం నిమ్మరసం, తేనె వంటి వాటితోనే పదినిమిషాల్లో తాజాగా మారిపోవచ్చు.ఈ మూడింటిని కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీన్ని అలాగే పది నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. అంతే ముఖం నిగనిగలాడుతుంది.
ముఖంపై మొటిమలు, మచ్చలు లేకుండా చేసుకొనేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ముల్తానీ మట్టి మొటిమల మీద తక్షణ ప్రభావం చూపుతుంది. అలాగే సాండిల్‌ వుడ్‌ పేస్ట్‌ తక్షణ ప్రభావాన్ని చూపుతుంది.
ఒక చెంచా పెరుగు, పసుపు, శెనగపిండి వంటివి అద్భుతమైన బ్లీచింగ్‌ ఏజెంట్స్‌గా పనిచేస్తుంది. అంతేకాదు టమాటాలతో ఫేస్‌ని శుభ్రం చేసుకోవడం వల్ల సన్‌టాన్‌ తొలగిపోయి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
చాలా మంది గోళ్ల సంరక్షణ గురించి అంతగా పట్టించుకోరు. గోళ్లను ట్రిమ్‌ చేయరు. కాబట్టి పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లే ముందు గోళ్లు చక్కగా సరైన ఆకారంలో ఉన్నాయో లేదో చూసుకొని, ట్రిమ్‌ చేసుకోవాలి. అంతే.. మీరు అనుకున్న టైంకు ఎంచెక్కా సిద్ధమైపోవచ్చు.

12:40 - February 5, 2016

మారుతున్న ఆహార అలవాట్ల వల్ల చాలామంది అధిక కొలెస్ట్రాల్‌ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. అందుకే అధిక కొవ్వును క్రమంగా తగ్గించుకుంటే నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే ఈ కొవ్వును తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే చాలు.. కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఉల్లిపాయలో క్రోమియం ఎక్కువ మోతాదులో నిల్వ వుంటుంది. ఇది షుగర్‌ లెవల్స్‌ను క్రమబద్ధం చేస్తుంది. అలాగే టైప్‌2 డయాబెటిస్‌ను ఉల్లిపాయ నివారిస్తుంది. పచ్చి ఉల్లిపాయ నిత్యం తీసుకుంటే.. అధిక కొవ్వును అతి తక్కువ సమయంలోనే తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ గొప్ప యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ సెప్టిక్‌, యాంటీ బయోటిక్‌, యాంటీ మైక్రో బ్యాక్టీరియల్‌ లక్షణాలను కలిగివుంది. ఇందులో విటమిన్‌ సి, బి1, బి6, విటమిన్‌ కె, బయోటిన్‌, క్రోమియం, క్యాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌, డైటరీ ఫైబర్‌ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని పోషక విలువలు కలిగిన ఉల్లిపాయను ప్రతిరోజూ డైటింగ్‌లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
ఉల్లిపాయ సాధారణ జలుబు, దగ్గు, శ్వాసనాళపు వాపు, ప్ల్యూమోనియ, అధిక జ్వరం, ఆస్తమా వంటి జబ్బుల్ని నివారిస్తుంది. ఇంకా పొట్ట సమస్యలు, వికారం, డయేరియాను నివారించడానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్‌ కారకాలు లివర్‌ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ఈ ఉల్లిపాయ కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. బ్యూటీపరంగానూ ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసంను అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. అలాగే.. చర్మ సమస్యల్ని నివారించుకోవడానికి ఈ ఉల్లిపాయతో ఎన్నో రెమెడీస్‌ చేసుకోవచ్చని కూడా వారు సూచిస్తున్నారు.

12:32 - February 5, 2016

తూ.గో : కాపులను బీసీల్లో చేర్చే ఉద్దేశ్యం సీఎం చంద్రబాబుకు లేదని కాంగ్రెస్ నేత వట్టి వసంతకుమార్ ఆరోపించారు. ఆయన కిర్లంపూడిలో దీక్ష చేస్తున్న ముద్రగడ కు సంఘీభావం తెలియజేసేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత వట్టి వసంతకుమార్ 'టెన్ టివి'తో మాట్లాడారు. జీవో ఎంఎస్ నెంబర్ 30 పై మంత్రి నారాయణ ఒకటంటే... సీఎం మరొకటి అంటున్నారని మండి పడ్డారు. తునిలో జరిగిన ఘటనకు జగన్ దే బాధ్యత అని.... ముద్రగడ మీద కేసులు బుక్ చేశారని తెలిపారు. కాపు కులం అనేది ఒక బంతి లాంటిదని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారా అని వట్టి ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చాం దీన్ని అమలు చేయాలన్న ఆలోచన లేదని మండి పడ్డారు. 

12:28 - February 5, 2016

విశాఖ : నగరంలోని కొమ్మాది చైతన్య టెక్నో స్కూల్‌లో అర్థరాత్రి విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. 9,10వ తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో వివాదం కాస్తా పోలీసుల వరకు వెళ్లింది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థల మధ్య ఘర్షణతో కాలేజీలోని ఫర్నీచర్‌ అంతా ధ్వంసం అయింది. 

12:27 - February 5, 2016

విశాఖ : సాగరతీరం సమరాంగణమవుతోంది. అలల హోరుకు ధీటుగా ఆయుధ విన్యాసం జరుగుతోంది. కెరటాల ఉప్పెనకు పోటీగా సాహస సంబరాల విందు సాగుతోంది. విశాఖ తూర్పు తీరం సాక్షిగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మొదలైంది.

ఇంటర్నేషనల్ ఫ్లీట్‌ రివ్యూకు సిద్దమైన విశాఖ....

ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఆరంభమైంది. వివిధ దేశాలకు చెందిన నావికాదళాల ముందు భారత్ తమ శక్తి సామర్ధ్యాలను , ప్రతిభా పాటవాలను, యుద్ద విన్యాసాలను ప్రదర్శించబోతోంది.

సముద్ర జలాల్లో పరస్పర అవగాహన, స్నేహతత్వం .......

సముద్ర జలాల్లో పరస్పర అవగాహన, స్నేహతత్వం పెంపొందించుకోవడానికి ఈ ఫ్లీట్ రివ్యూ ఎంతగానో ఉపయోగపడబోతోంది. IFR వేదిక విశాఖ కావడంతో ప్రపంచ ముఖచిత్రంలో సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్‌ పేరు మారుమోగుతోంది.

ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించిన విశాఖ......

అంతర్జాతీయ నేవీ ఫ్లీట్ రివ్యూకు తూర్పు తీరం వేదిక కావడంతో విశాఖ ముఖచిత్రం ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. విశాఖ అందాలు, నావికాదళ సామ్రాజ్యానికి పెట్టని కోటలా ఉన్న సముద్రతీరం, కొండలు భారత రక్షణ రంగంలో కీలకంగా మార్చాయి. రానున్న రోజుల్లో విశాఖ కేంద్రంగా ఆయుధ సంపత్తిని, రక్షణ రంగ వ్యవహారాలను నిర్వహించాలన్నది భారత్ ఆలోచనగా కనిపిస్తోంది. శ్రతుదేశాలకు దుర్భేధ్యమైన ప్రాంతంగా నిలుస్తోంది విశాఖ తీరం. అందుకే ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్న నేవీ ఫ్లీట్ రివ్యూకు విశాఖ వేదికగా మారింది.

దేశ సైనిక సంపత్తిలో తూర్పు నౌకాదళం పెద్దన్న పాత్ర .......

ఆధునిక ఆయుధ సంపత్తిలో తూర్పు నౌకాదళం కీలకంగా మారింది. దేశ సైనిక సంపత్తిలో తూర్పు నౌకాదళం పెద్దన్న పాత్రగా మారుతోంది. జలరవాణా విషయంలో తూర్పు నౌకాదళ ప్రాంత సముద్ర జలాలు అనువుగా భావిస్తున్నారు. రక్షణరంగ బలోపేతానికి తూర్పు తీరం కేంద్రంగా మార్చాలని భావిస్తోంది భారత్.

శత్రు దుర్భేద్యంగా తూర్పు తీర సముద్ర జలాలు.......

పైరేట్స్ దాడులకు ప్రతిదాడులు చేయడమే కాదు...తూర్పు తీర సముద్ర జలాలు శత్రు దుర్భేద్యంగా మారుతున్నాయి. ఇలా ఎన్నో రకాలుగా తూర్పు తీరం అనుకూలమైనదిగా భావిస్తున్న రక్షణశాఖ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నిర్వహణకు విశాఖను ఎంపిక చేసింది. ప్రపంచ దేశాలు విశాఖ వైపు చూడటంతో విశాఖ అందాలు దేశ విదేశాల్లో చక్కర్లు కొడుతున్నాయి. నేవీ ఫ్లీట్ రివ్యూకు విశాఖను సిద్దం చేసింది నేవీ. రామకృష్ణ బీచ్‌లో ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు అద్భుత విన్యాసాలతో మైమరిపించనుంది. విశాఖ ప్రాధాన్యత, టూరిజంపై విస్తృత ప్రచారం చేస్తోంది. ప్రత్యేకంగా వెబ్ సైట్ ఏర్పాటు చేసింది. అన్ని వివరాలు అందులో పొందుపర్చింది.

జనవరి 27 నుంచే అబ్బురపరిచిన రిహార్సల్స్.....

గత 10 ఏళ్ళలో విశాఖను ఈ స్ధాయిలో ఆకాశాన్నెత్తిన కార్యక్రమం జరగలేదని స్థానికులంటున్నారు. తెలుగు ప్రజల కళ్ళకు కట్టే ఎన్నో అద్భుత విన్యాసాలు జనవరి 27 నుంచే సముద్ర తీరంలో అబ్బురపరిచాయి. 27 నుంచే రిహార్సల్స్ ప్రారంభం కావడంతో విశాఖకే కాదు ఏపి తెలంగాణా, ఒడిషా, చత్తీస్ ఘడ్, రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల టూరిస్టులూ యుద్ద విన్యాసాలను తిలకించారు. అసలు సిసలు సాహసాలను చూసేందుకు సిద్దమయ్యారు.

2001లో ముంబైలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూల్లో 12 సార్లు భారత్ పాల్గొంది. 2001లో ముంబైలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగింది. రెండోసారి విశాఖలో ఫ్లీట్ రివ్యూ భారత్ ఆతిథ్యమిస్తోంది. పశ్చిమ తీరంలో జరిగిన ఫ్లీట్ రివ్యూకు తూర్పుతీరంలో జరగనున్న ఫ్లీట్ రివ్యూకు చాలా వ్యత్యాసం ఉంది. అప్పటికంటే అత్యధిక దేశాలు ఫ్లీట్ రివ్యూలో భాగస్వాములవుతున్నాయి.

విజువల్స్

ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొంటున్న 50కి పైగా దేశాలు

ఐఎఫ్‌ఆర్‌లో 50 దేశాలకు పైగా యుద్ద విమానాలు, నౌకలు, ఇతర సైనిక బలం తమ సాహసాలను ప్రదర్శించబోతున్నాయి. 24 విదేశీ యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. చైనాకు చెందిన నేవీ బృందం కూడా పార్టిసిపేట్‌ చేస్తుండగా, పాకిస్తాన్ మాత్రం ఫ్లీట్ రివ్యూకు దూరంగా ఉంది. మరికొన్ని దేశాల యుద్ద విమానాలు , యుద్ద నౌకలు ఎయిర్ క్రాఫ్ట్స్ షోలో పాల్గొంటాయన్న సమాచారం నేవీలో ఉంది. జనవరి 27 నుంచి జరుగుతున్న రిహార్సల్స్ విశాఖ ప్రజలను మంత్రముగ్ధులను చేసాయి. మన నేవీ సత్తా ఇది అని గర్వంగా చెప్పుకునే విధంగా ఆకర్షించాయి.

ఫిబ్రవరి 5 రాత్రికి విశాఖకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ......

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీల ష్యెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 5 రాత్రికి విశాఖ చేరుకుంటారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. నావికాదళ సంప్రదాయ గౌరవ వందనం ఇవ్వడం ప్రతిదేశ నేవీలో భాగం. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్‌కు భారత్ ఆతిథ్యమిస్తుండటంతో త్రివిధ దళాల అధిపతి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేవీ సైనికుల గౌరవవందనం స్వీకరిస్తారు. 21 తుపాకులు గాలిలో కాల్చి తమ వందనం చెబుతారు. ఆరున రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ ఉంటుంది. ఏడవ తేదీ ఉదయం తిరిగి ఢిల్లీ వెళతారు.

విజువల్స్

ఫిబ్రవరి 5 రాత్రికి విశాఖకు ప్రధాని మోదీ .....

ఇక ఫిబ్రవరి 5 రాత్రికి ప్రధాని మోదీ కూడా విశాఖ చేరుకుంటారు. రాత్రికి నేవీహౌస్‌లో బసచేస్తారు. 6న ఉదయం ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఏయూ ఇంజనీరింగ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన నేవీ విలేజ్‌ను సందర్శిస్తారు. అదే రోజు రాత్రి 9:25కు భువనేశ్వర్‌ వెళతారు. 7న మధ్యాహ్నం 4:30కు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుని 4:55 గంటలకు జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో పాల్గొంటారు. అనంతరం అతిధులకు విందు ఇచ్చి తిరిగి ఢిల్లీ వెళతారు.

విదేశీ అతిథుల భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ.......

ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ నిర్వహణలో ఏపీ ప్రభుత్వం పాత్ర కీలకంగా మారుతోంది. నగరంలో విదేశీ అతిథుల భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, పాస్‌ల పంపణీ, ప్రజలకు సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. నేవీ ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చే ప్రజలు, ముఖ్య అతిధుల కోసం బీచ్ రోడ్డులో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 75 ఎల్‌సిడిలు ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండటంతో అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆధార్ కార్డు నెంబర్ల ఆధారంగా పాసుల పంపిణీ ......

ఈనెల 4 నుంచి 10 వరకు నగరంలో భద్రత కీలకంగా మారుతోంది. ఆధార్ కార్డు నెంబర్ల ఆధారంగా పాసులు పంపిణీ చేశారు. మీడియాలో విభజన చేసి కవరేజిలో చాలామందికి ఆంక్షలు పెట్టారు. 7న జరిగే ఆపరేషనల్ డెమోకు ప్రజలకు అనుమతి ఉండటంతో ప్రతి ఒక్కరి కదలికలపైనా నిఘావేసారు. ఐఎఫ్ఆర్ విజయవంతం చేయడం ద్వారా భారత ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయడానికి నేవీ కృషి చేస్తోంది. రెండోసారి విజయవంతంగా ఐఎఫ్ ఆర్ సక్సెస్ చేసిన దేశాల సరసన చేరడానికి ఉవ్విళ్ళూరుతోంది.

తీర ప్రాంతంలో భద్రత, సుస్థిరత ప్రతి దేశానికి ముఖ్యం : ఆర్‌.కే.ధోవన్‌

హైదరాబాద్ : తీర ప్రాంతంలో భద్రత, సుస్థిరత ప్రతి దేశానికి ముఖ్యమని భారత నౌకాదళం అధిపతి అడ్మిరల్ ఆర్‌.కే.ధోవన్‌ అన్నారు. విశాఖల నోవాటెల్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... విశాఖ ఓ ఆహ్లాద కరమైన నగరమని హుద్‌హుద్‌ తుపాను సమయంలో విశాఖ వచ్చానని, తుపాను ధాటికి 50వేల చెట్లు దెబ్బతిన్నాయన్నారు. దెబ్బతిన్న నగరాన్ని అందంగా తీర్చిదిద్దిన సీఎం, ప్రజలకు అభినందనలు తెలిపారు. తీర ప్రాంతంలో భద్రత, సుస్థిరత ప్రతి దేశానికి ముఖ్యమన్న ఆయన డాక్‌ యార్డులో స్వదేశీ పరిజ్ఞానంతో 46 కొత్త నౌకలు, సబ్‌ మెరైనట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ముంబై ఓ ఉగ్రవాది అరెస్ట్

హైదరాబాద్ : ముంబైలోని మొహసిన్ ఐఎస్ బీటీలో ఉగ్రవాది ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాది నుంచి రూ.85 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు..

తూ.గో : కాపుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండు చేస్తూ కిర్లంపూడిలో దీక్ష చేపట్టిన ముద్రగడ దంపతులకు వైద్యులు పరీక్షలు జరిపారు. బీపీ, షుగర్‌ లెవల్స్‌ సాధారణంగానే ఉన్నాయని వైద్యులు తేల్చారు. ముద్రగడ బరువు -84 కేజీలు; బీపీ- 160/110, షుగర్‌- 178, ముద్రగడ భార్య పద్మావతి బీపీ-180/110, బ్లడ్‌షుగర్‌- 121 ఉందని ప్రభుత్వ వైద్యులు చెప్పారు.

ముద్రగడకు మద్దతుగా 16 మండలాల్లో కాపు నేతల దీక్షలు

తూ.గో : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆమరణ దీక్షకు దిగిన మాజీ మంత్రి ముద్రగడపద్మనాభం దంపతులకు మద్దతుగా టీబీకే జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురంతో పాటు కోనసీమలోని 16 మండలాల్లో కాపు నేతలు రిలేదీక్షలు చేపట్టారు. మరో వైపు కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష చేస్తున్న ఇంటిని పోలీసులు తమ ఆంధీనంలోకి తీసుకున్నారు.

10:54 - February 5, 2016

హైదరాబాద్ : రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 8 నుంచి పట్టాలపైకి రానుంది. 17 బోగీలతో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్దరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 2 ఏసీ ఛైర్‌కార్‌ బోగీలు, 8 సెకండ్‌ సిట్టింగ్‌, 4 సాధారణ ద్వితీయ శ్రేణి బోగీలు, ఒక వంటశాల బోగీ, రెండు సరకు, బ్రేక్‌ వ్యాన్‌ ఏర్పాటు చేయనున్నట్లు అదికారులు వెల్లడించారు.

10:37 - February 5, 2016

తిరుమల : కలియుగ వైకుంఠం తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఓ కారు అగ్నికి ఆహుతైంది. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. తమిళనాడుకు చెందినదిగా భావిస్తోన్న కారులో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్తతతో కారులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడగటిగారు.

10:29 - February 5, 2016

హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌, హైదరాబాద్ ఎన్నికలు... ఇలా వరుసపెట్టున జరుగుతున్న ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ముందంజలో ఉంటోంది. ఫలితంగా మిగిలిన పార్టీలు అంతకంతకూ ప్రజల నుంచి దూరమైపోతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో తిరిగి తెలంగాణలో బలం పుంజుకునేందుకు టీటీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో గెలిచి తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆరాటపడుతోంది. ఈ కోణంలోనే మెదక్‌ జిల్లా నారాయణ్‌ఖేడ్‌ అసెంబ్లీ స్థానంపై టీటీడీపీ నేతలు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.

13న ఉప ఎన్నిక...

నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి ఈ నెల 13న ఎన్నిక జరగనుంది. ఇలాంటి సిచ్యుయేషన్‌లో అధికార పార్టీ వైఫల్యాలే అస్త్రాలుగా టీడీపీ ప్రచారానికి దిగుతోంది. విజయపాల్‌రెడ్డి తరపున ప్రచారం చేసేందుకు సీనియర్ నేతలు క్యాంపెయిన్‌లో పాల్గొనబోతున్నారు. విజయపాల్‌కు పొలిటీషియన్‌గా మంచి గుర్తింపు ఉండడంతో పార్టీ ముఖ్య నేతల్లో విజయంపై భరోసా ఏర్పడుతోంది. విజయపాల్ తండ్రి భూపాల్‌రెడ్డికి కూడా మంచి పేరుండేది. దీంతో విజయంపై ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే అధికార పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రి హరీష్‌రావు నియోజకవర్గంలోనే మకాంవేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విజయపాల్‌ను టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శలదాడి చేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా టీడీపీ రేవంత్‌రెడ్డిని ప్రచారంలోకి దింపుతున్నారు. ఈ నెల 6నుంచి రేవంత్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించబోతున్నారు.

టిడిపి, టిఆర్‌ఎస్ మధ్యే గట్టి పోటీ ఉందని విశ్లేషకుల అంచనా....

టీఆర్‌ఎస్‌ అధికారంలోకొచ్చి 18నెలలు దాటిపోతున్నా ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేకపోయిందని ఖేడ్ ప్రజానీకానికి చెప్పే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవడం లేదని టిడిపి ఆరోపిస్తోంది. లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్‌ ఇంతవరకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏ ఒక్క హామీనీ అమలు చేయలేని అధికార పార్టీని ప్రజలు నిలదీయాలని టీటీడీపీ నేతలు కోరుతున్నారు. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌ పార్టీ కూడా బరిలో దిగుతున్నా ప్రధాన పోటీ మాత్రం టీడీపీ-టీఆర్ఎస్‌ల మధ్యే ఉండబోతోందని రాజకీయ వర్గాలు అంచనావేస్తున్నాయి. అందుకే పార్టీ ముఖ్యనేతలతోపాటు చంద్రబాబు తనయుడు లోకేష్‌తో కూడా ప్రచారంలో పాల్గొనేలా రాష్ట్ర నాయకులు ప్లాన్ చేస్తున్నారు. 

10:24 - February 5, 2016

తూ.గో : ఎన్నికల సందర్భంగా కాపులను బీసీల్లో చేరుస్తున్నా సీఎం హామీని అమలు చేయమని అడగడం తప్పా అని కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో భార్యతో కలిసి ఆమరణ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా యన 'టెన్ టివి'తో మాట్లాడుతూ...తనకు రక్షణ అవసరం లేదని ముద్రగడ స్పష్టం చేశారు. నా ఇంట్లోప్రశాంతంగా దీక్ష చేస్తుంటే ఇంటి చుట్టూ పోలీసు బెటాలీయన్లు దింపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రక్షణ గురించి నాకు భయం లేదని తెలిపారు. కాపు సోదరులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన కోరారు. కాపు సోదరులెవరూ దీక్షా శిబిరానికి రావద్దని, మీ గ్రామాల్లో నిరసన తెలపాలని ముద్రగడ కోరారు. కాపు సోదరులు ఆందోళనల్లో పాల్గొని కేసులలో చిక్కుకోవద్దని,శాంతియుతంగా నిరసన తెలపాలని ముద్రగడ పిలుపునిచ్చారు.

 

8 నుండి రత్నాచల్ ఎక్స్ ప్రెస్

హైదరాబాద్ : రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 8 నుంచి పట్టాలపైకి రానుంది. 17 బోగీలతో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్దరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 2 ఏసీ ఛైర్‌కార్‌ బోగీలు, 8 సెకండ్‌ సిట్టింగ్‌, 4 సాధారణ ద్వితీయ శ్రేణి బోగీలు, ఒక వంటశాల బోగీ, రెండు సరకు, బ్రేక్‌ వ్యాన్‌ ఏర్పాటు చేయనున్నట్లు అదికారులు వెల్లడించారు.

విశాఖకు గరవ్నర్, రాష్ట్రపతి, ప్రధాని...

విశాఖ : నగరంలో ఐఎన్ఎస్ శాతవాహన కమాండ్ స్టేడియంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ నేడు రాత్రి విశాఖ చేరుకోనున్నారు. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 11 వేల నేవీ ప్రతినిధులు హాజరుకానున్నారు. శనివారం జరిగే తూర్పు నౌకాదళ సమీక్షలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ :9 మందికి గాయాలు..

మహబూబ్ నగర్ :ధరూర్‌ మండలం ఓబులోనిపల్లెలో భూతగాదాలతో దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో 9 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. 

మాదాపూర్ లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

హైదరాబాద్ : మాదాపూర్‌లోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కరీంనగర్‌జిల్లా హుజూరాబాద్‌కు చెందిన సాయికృష్ణగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసనమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

09:35 - February 5, 2016

హైదరాబాద్ : రాజకీయమంటే ఏంటో మహాభారతం లాంటి పురాణగాధలో పిచ్చ క్లారిటీ ఇచ్చారు. మహాభాగవత కథలో కృష్ణుడితో రాజకీయం ఎన్ని మెలికలు తిరుగుతుందో అరటిపండు వలిచినట్లు చెప్పించారు. ఇప్పుడా పురాణకథల క్లాసులకే దిమ్మతిరిగేలా నేటితరం రాజకీయనేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ ఎత్తుగడలు వారికి చెరుకుగడలైతే.. ప్రత్యర్ధికి మాత్రం గుండెదడే. ఎవరికీ చిక్కకుండా.. ఎన్ని రూల్స్‌ ఉన్నా దొరక్కుండా దూసుకుపోవడం వీరికే చెల్లుతోంది. న్యాయస్థానం నిలదీసింది. జీవోలు ఎప్పుడుబడితే అప్పుడు ఎలాబడితే అలా ఇచ్చేసుకుంటారా అంటూ క్లాసు తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ. నెం.207ను నిలిపేయడానికి సిద్ధపడింది. ఇంతలో ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌.. కాస్త టైమివ్వండి అని అడిగారు. టైమడిగితే.. వివరణ ఇస్తారని.. లేదా దాంట్లో ఏదైనా మార్పులు చేస్తారేమోనని.. అందరూ అనుకున్నారు. కాని టీసర్కార్‌ ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది.

జీఓ స్థానంలో ఆర్డినెన్స్‌ జారీ...

కోర్టు కాలడ్డం పెడుతుందని ముందే కనిపెట్టేసింది టీసర్కార్‌. అందుకే యమర్జెంటుగా అదే జీఓను ఆర్డినెన్స్‌ రూపంలో సంధించింది. ఇందుకు గవర్నర్‌గారు సైతం సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఇప్పుడు హైకోర్టు విచారించినా, నిలదీసినా, ప్రశ్నించినా.. ఆర్డినెన్స్‌ను మాత్రం ఆపలేదు. ఇంతకీ ఇంత హడావుడిగా ఆర్డినెన్స్‌ ఇచ్చుకోవాల్సినంత అవసరం ప్రభుత్వానికేంటని చూస్తే.. విషయం ఎవరికైనా ఈజీగానే అర్ధమైపోతోంది.

గ్రేటర్‌లో ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫీషియో మెంబర్‌షిప్‌...

గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌లో కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌ అఫిషీయో సభ్యులుగా కొనసాగొచ్చు. కాని వారంతా ఈ నగరంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. అది కూడా వారు ఎమ్మెల్సీలు అయిన సమయానికే. అధికారంలోకి వచ్చాక వాళ్లు వీళ్లు తేడా లేకుండా సైన్యాన్ని పెంచేసుకుంటున్న గులాబీసేన.. ఎమ్మెల్సీలను భారీగానే గెలిపించుకుంది. గ్రేటర్‌లో మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన నెంబర్‌ కావాలంటే.. వీరందరికి ఎక్స్‌అఫీషియో మెంబర్‌షిప్‌ ఇచ్చేయాలి. కాని కొందరికి ఇక్కడ ఓటుహక్కు లేదు. ఇంకేముంది ఓ జీవో తయారు చేసి పారేశారు. దీనిపై కాంగ్రెస్‌ నేత శ్రవణ్‌కుమార్‌ కోర్టుకెక్కడంతో గవర్నమెంట్‌కు ఇరకాటంగా తయారైంది. అందుకే ఇలా ఆర్డినెన్స్‌ ఇచ్చేసి.. అనుకున్నది చేసుకుంది.  

09:31 - February 5, 2016

హైదరాబాద్ : పాతబస్తీలోని పురాణాపూల్‌లో రీపోలింగ్‌ కొనసాగుతోంది. 36 పోలింగ్‌ బూతుల్లో ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీపోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీపోలింగ్‌ సాయత్రం 5గంటలవరకూ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగంకోసం పురాణాపూల్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు పేయిడ్‌ హాలీడేగా హైదరాబాద్‌ కలెక్టర్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే రీపోలింగ్‌ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. 

09:29 - February 5, 2016

తూ.గో : కాకినాడలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించినట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ తెలిపారు.ఆయ న శుక్రవారం 'టెన్ టివి'తో మాట్తాడుతూ... 'ముద్రగడ నిరాహార దీక్ష నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కేంద్ర పారామిలటరీ దళాలు భారీగా మోహరించాయి. కేంద్ర బలగాలకు తోడు రాష్ట్ర పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ పెద్ద సంఖ్యలో ముద్రగడ నివాసం వద్ద బందోబస్త్‌లో పాల్గొన్నారు. కిర్లంపూడి సహా, తూర్పుగోదావరిజిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాం. జాతీయ రహదారిపై పలు సమస్యాత్మక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. తుని, తొండంగి, కోనందూరు, తేటగుంట, కత్తిపూడి తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. వాహనాలను నిశితంగా పరిశీలించి పంపుతున్నాం. ఆరుగురు డీఎస్పీలు, 24మంది సీఐలు, 50మంది ఎస్సైలు 200మంది ఏఎస్సైలు, 700 మంది కానిస్టేబుళ్లు, వెయ్యిమందికి పైగా పారామిలటరీ బలగాలతో భద్రతా ఏర్పాటు చేశామని'తెలిపారు.

09:26 - February 5, 2016

తూ.గో : ప్రభుత్వ పెద్దల చర్చల మంత్రాంగం ఫలించలేదు. ప్రభుత్వ ప్రకటనలు ఫలితాన్నివ్వలేదు. కాపులకు రిజర్వేషన్‌ సాధించేవరకు వెనక్కు తగ్గేది లేదంటూ ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు దిగారు. స్వగ్రామమైన కిర్లంపూడిలోని తన ఇంటిలోనే ఆయన తన సతీమణి పద్మావతితో సహా దీక్ష ఆరంభించారు. దీంతో ఇటు ప్రభుత్వంలోనూ.. తూర్పుగోదావరిలోనూ టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. అంతక ముందు ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ..తానిచ్చిన గడువులోపు ప్రభుత్వం స్పందించలేదు.. అందుకే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతున్నట్లు కాపునేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. అందరూ శాంతియుతంగా ఉండాలని.. సంఘ వ్యతిరేక శక్తులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని ఆయన కోరారు. కాపు సోదరులంతా మధ్యాహ్న భోజనం మానేసి.. ఇళ్లపైకి వచ్చి ఖాళీ పళ్లెంను మోగిస్తూ నిరసన తెలియచేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

ముద్రగడ దీక్ష ప్రారంభం

తూ.గో : కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం,ఆభార్య ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రారంభానికి కొద్ది సేపటి ముందు తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు జాతి కోసం చేస్తోన్న న్యాయమైన దీక్షకు మద్దతు పలకాలని మీడియా ద్వారా ముద్రగడ ప్రజలకు విన్నవించుకున్నారు. తాను ముందే చెప్పినట్లు రాష్ట్రంలోని కాపులు ఎక్కడికక్కడే నిరసన తెలియజేయాలని, మధ్యాహ్న భోజనం మానేసి సీఎంకు వినిపించేలా కంచాలపై గరిటెలతో చప్పుడుచేయాలని ఆయన కోరారు. 'నాకు మద్దతు పలికేందుకు సోదరులెవరూ ఇక్కడికి(కిర్లంపూడికి) రావద్దు.

08:34 - February 5, 2016

హైదరాబాద్ : అరుణా చల్ ప్రదేశ్ రాష్ట్రపతి పాలన విధించడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో ద హన్స్ ఇండియా ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ లో కాపు ఉద్యమం - దారితీసిన పరిణామాలు, గ్రేటర్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టిఆర్ ఎస్ కు ఎక్కువ అకకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ లో ఎవరు గెలిచినా ప్రజలకు వరిగేది ఏమీ లేదని, ప్రజాస్వామ్యం ఓడి పోవడం ఖాయం అని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించడం ఎంత వరకు సమంజసం? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కుదిపేయడం ఖాయం... కానీ తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ప్రొ.కె నాగేశ్వర్ విశ్లేషణ చేశారు. ఈ అంశాలపై పూర్తి విశ్లేషణ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల...

తిరుపతి : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను తితిదే శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనుంది. మార్చి 1 నుంచి 31 వరకు భక్తులు నమోదు చేసుకునేందుకు వీలుగా 53,389 వేల టిక్కెట్లను తితిదే అంతర్జాలంలో ఉంచనుంది. ఉదయం 11 గంటల నుంచి టిక్కెట్ల కొనుగోలుకు అవకాశం ఉంటుంది. శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, విశేషపూజ, అష్టదళ పాదపద్మారాధన, నిజపాదదర్శనం, కల్యాణోత్సవం, వూంజలసేవ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. భక్తుల సౌకర్యార్థం, పారదర్శకంగా జారీ కోసం నెలకోసారి టిక్కెట్లను తితిదే విడుదల చేస్తోంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల: తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతుంది.

07:41 - February 5, 2016

హైదరాబాద్ : పురానాపూల్ డివిజన్ లో రీపోలింగ్ ప్రారంభమయ్యింది. పురానాపూల్ 52వ డివిజన్ లోని 38 పోలింగ్ కేంద్రాల్లో కాసేపటి క్రితం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 34,413 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన మూడుగంటల్లో ఫలితాలు వెలుడనున్నాయి. మరో పోలీసు అధికారులు పటిష్టమైనభద్రతా ఏర్పాట్లు చేశారు. వెబ్ కామ్ ద్వారా మినిట్ టూ మినిట్ అధికారులు పోలింగ్ సరళని పరీక్షించనున్నారు.

07:31 - February 5, 2016

హైదరాబాద్ : కాపులను ఓటు బ్యాంకు గానే వాడుకుంటున్నారని 'న్యూస్ మార్నింగ్' లో పాల్గొన్న కాపు సంఘం నేత మూర్తి నాయుడు అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షలో ఎలాంటి మార్పూ లేదు. ఆయన దీక్ష విరమింపజేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటికీ ప్రభుత్వం కొంత దిగొచ్చినా ముద్రగడ మాత్రం యూ టర్న్‌ తీసుకునే ప్రసక్తే లేదన్నారు. నేటి ఉదయం 9 గంటలకు ముద్రగడ దీక్ష ప్రారంభమవుతుంది. కాపు కమ్యూనిటీ చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు..కాపులను ఓటు బ్యాంకు గానే వాడుకుంటున్నారా? రిజర్వేషన్ కల్పించడానికి చట్టబద్ధత అవసరం లేదా? 9 నెలలు ఆగమంటే కాలయాపనేనా? బీసీలను సీఎం చంద్రబాబు ఉసికొల్పుతున్నారా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో మూర్తి నాయుడుతో పాటు టిడిపి నేత రామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. వారు ఇంకా ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:10 - February 5, 2016

హైదరాబాద్ : ప్రపంచంలో ఎన్నో రహస్యాల చిట్టా విప్పిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేను బ్రిటన్‌లో నిర్బంధించడం అక్రమమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. అసాంజేను ఏకపక్షంగా నిర్భందించారని తన వాదనలు వినిపించేందుకు తగిన అవకాశం ఇవ్వలేదని ఐక్యరాజ్యసమితి ప్యానెల్‌ తెలిపింది.

బిట్రన్ నిర్బంధించడం అక్రమం....

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను బిట్రన్ నిర్బంధించడం అక్రమం, చట్టవ్యతిరేకమని ఈ విషయమై విచారణ జరుపుతున్న ఐక్యరాజ్యసమితి కమిటీ నిర్ణయించినట్లు స్వీడన్ విదేశాంగశాఖ, బీబీసీ వెల్లడించాయి. కాగా ఈ తీర్పుపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈలోగానే బీబీసీ తదితరవర్గాలు ఈ విషయాన్ని బయటపెట్టాయి.

యూఎన్ తీర్పు అసాంజేకు అనుకూలంగా....

యూఎన్ తీర్పు అసాంజేకు అనుకూలంగా ఉందని, ఆయన నిర్బంధం ఏకపక్ష చర్య అని తీర్పులో ఉందని స్వీడన్ విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ తీర్పు దృష్ట్యా అసాంజేను నిర్బంధం నుంచి వెంటనే విడిపించడానికి ఆయన తరఫు లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. విడిచిపెట్టిన తరువాత ఆయన బ్రిటన్ నుంచి వెళ్లడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని, జప్తు చేసుకొన్న ఆయన వీసాను తిరిగి అప్పగించాలని ఆయన తరఫు లాయర్లు స్వీడన్ దౌత్యవర్గాలను కోరుతున్నారు.

స్వీడన్‌లో అత్యాచార కేసును ఎదుర్కొంటున్న అసాంజే.....

ఇదిలా ఉంటే స్వీడన్‌లో అత్యాచార కేసును ఎదుర్కొంటున్న అసాంజే 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నాడు. అయితే ఆ కేసుకు సంబంధించి అతను 2014లో ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేశాడు.

ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే....

ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే కొన్నేళ్ల క్రితం అమెరికా ప్రభుత్వానికి చెందిన వేలాది రహస్య పత్రాలను విడుదల చేశాడు. దాంతో అప్పట్లో అతను వార్తల్లోకి ఎక్కాడు. అయితే అతనిపై స్వీడన్‌లో అత్యాచార కేసు నమోదైంది. అసాంజే తనను రేప్ చేసినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. దానిపై ప్రస్తుతం అతను కేసును ఎదుర్కొంటున్నాడు. ఒకవేళ స్వీడన్‌కు తనను అప్పగిస్తే, ఆ దేశం తనను అమెరికాకు అప్పగిస్తుందని అసాంజే అనుమానిస్తున్నాడు.

వికీలీక్స్‌కు సంబంధం లేకుండా అత్యాచార కేసులో....

వికీలీక్స్‌కు సంబంధం లేకుండా అత్యాచార కేసులో ఇరుక్కున్న అసాంజేపై స్వీడన్ 2010లో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆ సమయంలో అసాంజే లండన్‌లో ఉన్నాడు. అరెస్ట్ వారెంట్‌పై వేసిన అభ్యర్థనను కోర్టు కొట్టి పారేసింది. దాంతో అసాంజే ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నాడు.

07:07 - February 5, 2016

విశాఖ మరోసారి అంతర్జాతీయ స్థాయి వేడుకకు వేదిక కావటం హర్షణీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష సందర్భంగా ఐఎఫ్‌ఆర్‌ గ్రామం, ప్రదర్శనను ప్రారంభించారు. ఫ్లీట్‌ రివ్యూను పురస్కరించుకొని వైజాగ్‌ నగరం సర్వాంగ సుందరంగా మారింది.

మంచి వనరుగా తూర్పు తీర ప్రాంతం....

దేశానికి, రాష్ట్రానికి, మంచి వనరుగా తూర్పు తీర ప్రాంతం ఉపయోగపడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేశీయ ఉత్పత్తి విధానానికి నాంది పలికిన నౌకాదళానికి, కార్యక్రమానికి విచ్చేసిన వివిధ నౌకాదళ అధికారులకు అభినందనలు తెలిపారు. ఐఎఫ్‌ఆర్‌ వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా బీచ్‌రోడ్డులో వివిధ దేశాల నౌకాదళ సిబ్బంది నిర్వహించిన సన్నాహక కవాతు, విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఆహూతులను విశేషంగా అలరించాయి.

ఐఎఫ్‌ఆర్‌ గ్రామాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు....

ఈ వేడుకల సందర్భంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్‌ గ్రామాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు చాటిచెప్పేలా గ్రామాన్ని తీర్చిదిద్దారు. నౌకాదళం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులతో ప్రదర్శన ఆకట్టుకుంటోంది. రక్షణశాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచారు.

'విక్టరీ ఎట్‌ సీ' స్థూపం వద్ద అమరవీరులకు నివాళుల...

అంతకుముందు విశాఖ చేరుకున్న చంద్రబాబు బీచ్‌రోడ్డులోని 'విక్టరీ ఎట్‌ సీ' స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఇదిలా ఉంటే సరిగ్గా ఏడాదిన్నర కిందట హుదూద్ బీభత్సానికి విశాఖ రూపురేఖలే మారిపోయాయి. విశాఖ తేరుకోవటం కష్టమే అన్నవారెందరో. కానీ ఇప్పుడు అదే వైజాగ్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు ఆతిథ్యం ఇచ్చింది, అంతేకాదు అనూహ్యరీతిలో సరికొత్త అందాలను సంతరించుకుంది. వీధి దీపాలు, పారిశుద్ధ్యం, ఉద్యానవనాల అభివృద్ధికి జీవీఎంసీ పెద్దపీట వేసింది. మొత్తంగా చూస్తే వైజాగ్ సుందరీకరణ వూహించని రీతిలో జరిగింది.

నేడు రాష్ట్రపతి, ప్రధాని....

నేడు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారు. వీరితో పాటు సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 9తీర ప్రాంతాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లు, 51 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. 1.40 లక్షలకుపైగా ప్రజలు నౌకా విన్యాసాలను తిలకించేలా నిర్వాహకులు పాసులు జారీ చేశారు. 15 ఏళ్ల కిందట ముంబై కేంద్రంగా ఉన్న పశ్చిమ నౌకాదళంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది.

పురానాపూల్ లో రీపోలింగ్ ప్రారంభం

హైదరాబాద్ : పురానాపూల్ డివిజన్ లో రీపోలింగ్ ప్రారంభమయ్యింది. పురానాపూల్ 52వ డివిజన్ లోని 38 పోలింగ్ కేంద్రాల్లో కాసేపటి క్రితం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన మూడుగంటల్లో ఫలితాలు వెలుడనున్నాయి.

07:01 - February 5, 2016

గుంటూరు : ఏపీ రాజధాని తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే నిర్మాణ బాధ్యతలకోసం రెండు సంస్ధలు టెండర్లు దాఖలు చేయగా, ఈ నెల పదవ తేదిన టెండర్లను ఖరారు చేయనున్నారు. 12వ తేదీన తాత్కాలిక సెక్రెటేరియట్‌ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంఖుస్ధాపన చేయనున్నారు.

జూన్ నాటికల్లా అమరావతికి ఉద్యోగులు...

జూన్ నాటికల్లా హైదరాబాద్ నుంచి ఏపీ ఉద్యోగులందరినీ రాజధాని అమరావతికి రప్పించాలన్న కృతనిశ్చయంతో ఉన్న ఏపీ ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తోంది. పాలనా పరంగా కీలకమైన సచివాలయ నిర్మాణంపై గతకొన్నిరోజులుగా తీవ్రంగా కసరత్తు చేస్తోంది. తాత్కాలికంగా చేపట్టనున్న సెక్రెటేరియట్ నిర్మాణం సీఆర్డీఏ పరిధిలో ఎక్కడ ఉండాలన్న దానిపై సలహాలు, సంప్రదింపుల అనంతరం చివరకు తుళ్ళూరు మండలం వెలగపూడి గ్రామ రెవిన్యూ పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ముందుగా మంగళగిరి సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌లో ఈ నిర్మాణం చేపట్టాలని అనుకున్నప్పటికీ, రాజధాని పక్కా నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతానికి ఓ మూలగా ఉండటంతో భౌగోళిక పరిస్ధితులు అనుకూలించవన్న కారణంతో ఆప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకుంది.

వెలగపూడిలో ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణుల బృందం....

వెలగపూడిలో ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణుల బృందం 30 మీటర్ల లోతులో 20 మట్టి నమూనాలను సేకరించి పరీక్షా కేంద్రాలకు పంపారు. రిపోర్టులు కూడా అనుకూలంగానే ఉండటంతో పురపాలక శాఖ వేగంగా టెండర్ల ఖరారు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. సచివాలయం నిర్మాణంలో పాలుపంచుకునేందుకు రెండు అగ్రశ్రేణి నిర్మాణ సంస్ధలు టెండర్లు దాఖలు చేశాయి. వాటిలో L&T ఒకటికాగా, రెండవది షాపూర్ జీ పల్లోంజి సంస్ధ, ఈనెల 10లోపు రెండు సంస్ధల సాంకేతిక పరిజ్ఞానంపై పరిశీలన జరిపి అదేరోజు టెండర్ల ఖరారు, పనులను అప్పగించనున్నారు. 6లక్షల చదరపు అడుగుల్లో ఆరు భవనాలను మూడుదశల్లో నిర్మించాల్సి ఉండటంతో ఈ రెండు సంస్ధలకు చెరిసగం పనుల బాధ్యతలను అప్పగించే అవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. సచివాలయాన్ని రెండు బ్లాకులుగా నిర్మించాలని ప్రణాళికలు రూపొందించిన సిఆర్‌డిఎ అధికారులు పనులను మూడుదశలుగా విభజించారు. ఒక్కో ప్యాకేజీ విలువ 60కోట్లుగా అంచనావేసి, మొత్తం 180 కోట్ల విలువైన ప్రాజెక్టును జీ ప్లస్ 7 నిర్మాణాలకు డిజైన్ చేశారు. తొలుత జీ ప్లస్ 1 నిర్మాణాలను పూర్తిచేయాల్సి ఉంది.

10వ తేదీన టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తయిన వెంటనే....

మరోవైపు 10వ తేదీన టెండర్ల ఖరారు ప్రక్రియ పూర్తయిన వెంటనే తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి శంఖుస్ధాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి తేదీని కూడా ఖరారు చేశారు. ఈనెల 12వ తేదీ తెల్లవారు జామున 4.15 నిమిషాలకు సీఎం చంద్రబాబు తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంఖుస్ధాపన చేసేలా ముహుర్తం నిర్ణయించారు.

06:58 - February 5, 2016

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాల్లో మిషన్ కాకతీయ ఒకటి. రాష్ట్ర రూపు రేఖలు మార్చే ఈ పథకానికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్నందునే ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు త్వరితగతిన ప్రాజెక్ట్‌లను పూర్తిచేసే దిశగా అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం వివిధ స్థాయిల్లోని అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.

మిషన్ కాకతీయ ఫస్ట్, సెకండ్ ఫేజ్‌ల పరిస్థితిపై సమీక్ష....

వివిధ జిల్లాల్లో మిషన్ కాకతీయ ఫస్ట్, సెకండ్ ఫేజ్‌ల పరిస్థితిపై మంత్రి సమీక్షించారు. ఫస్ట్ ఫేజ్‌లోని పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఫేజ్‌2లో అనుమతులు లభించిన పనులకు వెంటనే టెండర్లు పిలవాలని అదేశించారు. ఏ కాంట్రాక్టరైనా సరే పనులు సక్రమంగా పూర్తిచేయకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి మిషన్ కాకతీయకు ఎలాంటి జాప్యమూ లేకుండా నిధుల చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. పనుల పూర్తికి ప్రజలు, నాయకుల సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించారు.

పది వేల చెరువులు పూర్తి చేయాలన్నది....

పది వేల చెరువులు పూర్తి చేయాలన్నది మిషన్ కాకతీయ రెండో ఫేస్ లక్ష్యంగా ఉంది. అయితే ఇప్పటి వరకు 6 వేల చెరువులకు సంబంధించిన ఎస్టిమేషన్లు వచ్చినట్లు మంత్రి తెలిపారు. మిగతా 4 వేల చెరువులకు సంబంధించిన ఎస్టిమేషన్లను ఫిబ్రవరి 16 నాటికి పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 తర్వాత మిషన్ కాకతీయ పనులను పరిశీలించేందుకు జిల్లాల్లో పర్యటిస్తానని హరీష్‌రావు అన్నారు. ఇక ఫేజ్‌-2లో భాగంగా పరిపాలన అనుమతులు పొందిన రెండు వేల చెరువులకు సంబంధించి టెండర్ తదితర పనులు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 15 నుంచి పనులు ముమ్మరం చేయాలని సూచించారు.

పూడిక మట్టిని రైతులు తరలించుకపోయేలా....

పూడిక మట్టిని రైతులు తరలించుకపోయేలా గట్టి ప్రచారం నిర్వహించాలని మంత్రి సూచించారు. మిషన్ కాకతీయ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న అధికారులను ప్రశంసించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. 

నీటిపారుదల ప్రాజెక్ట్‌లపై హరీష్ రావ్ సమీక్ష

హైదరాబాద్ : మిషన్‌ కాకతీయ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తూ లక్ష్యాలు రీచ్‌ కావాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చేపట్టిన వివిధ నీటిపారుదల ప్రాజెక్ట్‌లపై ఆయన సచివాలయంలో సమీక్ష జరిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల సాయం తీసుకుంటూ ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలని నీటి సమస్య లేని సుందర తెలంగాణ కలను సాకారం చేయాలని అధికారులను కోరారు. 

06:55 - February 5, 2016

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎమ్మెల్సీలను ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా గుర్తించేందుకు ఉద్దేశించి విడుదల చేసిన జీవోను టి సర్కార్ రద్దు చేసింది. దాని స్థానంలో కొత్తగా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు. దాని ప్రకారం ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసే సమయానికి గవర్నర్‌ నామినేట్ చేసే సమయానికి జిహెచ్ఎంసి పరిధిలో ఓటు హక్కు కలిగిన వారినే ఎక్స్ అఫీషియో సభ్యులుగా గతంలో పరిగణించేవారు. ఈ నిబంధనను తొలగిస్తూ గత డిసెంబర్ 30న జీఓ నెంబర్‌ 207ను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం కాలంతో సంబంధం లేకుండా జిహెచ్‌ఎంసి పరిధిలో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీలంతా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎక్స్‌ అఫీషియోలుగా ఓటేయొచ్చు. ఈ జీవోను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేత హైకోర్ట్‌లో కేసు వేశారు. సంబంధిత జీవోపై కోర్టు కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది. చట్ట సవరణ అధికారం ప్రభుత్వానికి ఉండదని చట్టసభల ద్వారానే అది జరగాలని హైకోర్ట్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాను చేసిన మార్పును చట్టబద్దం చేసేందుకు ఆర్డినెన్స్ విడుదల చేసింది. దానిపై గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో హైదరాబాద్‌లో ఓటు హక్కున్న ఎమ్మెల్సీలంతా ఎక్స్‌అఫీషియోలుగా మేయర్ ఎన్నికలో పాల్గొనవచ్చు.

 

06:53 - February 5, 2016

హైదరాబాద్ : పాతబస్తీలోని పురాణాపూల్‌ మళ్లీ పోలింగ్‌కు సిద్ధమైంది.. 36 పోలింగ్‌ బూతుల్లో రీపోలింగ్‌కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.. శుక్రవారం ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 5గంటలవరకూ పోలింగ్‌ జరగబోతోంది.. ఓటు హక్కు వినియోగంకోసం పురాణాపూల్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ను కోరారు బల్దియా ఎన్నికల అధికారి జనార్ధన్‌ రెడ్డి..

హాట్ టాపిక్ గా మారిన పురాణాపూల్....

ఈసారి గ్రేటర్‌ ఎన్నికల్లో పురాణాపూల్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.. హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలు చేయాలంటూ ప్రతిపక్షాలు గవర్నర్‌ను కోరే పరిస్థితివరకూ వచ్చింది.. ఈ డివిజన్లోని కొన్ని పోలింగ్‌ బూతుల్లో రీ పోలింగ్‌కోసం ఏకంగా ఓట్ల లెక్కింపు సమయాన్ని మార్చారు.. ఇలా చేయడం బల్దియా చరిత్రలోనే తొలిసారంటున్నారు అధికారులు.. మరోవైపు గతంలోలాగా ఇక్కడ ఎలాంటి ఉద్రిక్తత ఏర్పడకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు..

గతంలో ఎంఐఎం కార్పొరేటర్‌గాఉన్న మహ్మద్‌ గౌస్....

పురాణాపూల్‌లో ఎంఐఎం కు గట్టి పట్టుంది.. ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ గౌస్‌ గతంలో ఎంఐఎం కార్పొరేటర్‌గా ఉన్నారు.. కొద్దికాలంక్రితం కాంగ్రెస్‌ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు.. పోలింగ్‌ రోజు ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీకి, గౌస్‌కిమధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది.. పోలీస్‌ స్టేషన్‌లో వీరు ఒకరిపై ఫిర్యాదు చేసుకున్నారు.. ఇదికాస్తా రెండు పార్టీలమధ్య గొడవకు దారితీసింది.. అర్ధరాత్రివరకూ కొనసాగిన హంగామాతో ఇక్కడ మళ్లీ రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.. అయితే ఈ టెన్షన్ వాతావరణంలో ఎంతమంది ఓటర్లు ఓటు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది..

మూడు గంటల్లోపు ఫలితాలు....

పురాణాపూల్‌లో పోలింగ్‌ పూర్తయిన మూడు గంటల్లోపు ఫలితాలు ప్రకటించబోతున్నారు.. కాంగ్రెస్‌, MIMమధ్య టగ్‌ అఫ్ వార్‌గా మారిన ఈ స్థానంలో ఎవరు గెలుస్తారన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.. 

కాసేపట్లో రీ పోలింగ్

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన పురాణాపూల్‌లో కాసేపట్లో రీ పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఆ తర్వాత జరిగే కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

నేడు జీహెచ్ ఎంసీ ఎన్నికల కౌంటింగ్

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ విజేతలెవరో... పరాజితులెవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలనుంచి కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రంలోగా పూర్తి ఫలితాలు విడుదలకానున్నాయి.. ఒక్క పురానాపూల్‌లో మాత్రం సాయంత్రం 5 తర్వాత కౌంటింగ్‌ మొదలు కానుంది.

06:48 - February 5, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన 1,333 మంది అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది.. మధ్యాహ్నం 3గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.. 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు.. ముందు పోస్టల్ ఓట్లు లెక్కిస్తారు.. ఆ తర్వాత EVMలు ఓపెన్ చేస్తారు.. సాయంత్రం 5తర్వాత ఫలితాలు విడుదల చేస్తారు..

ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ .......

ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, అడిషనల్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. వీరిని ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు రాండమ్‌గా నియమిస్తారు. ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ మొత్తాన్ని వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకోసం ప్రత్యేక టేబుల్ ఏర్పాటు చేస్తారు.

కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర 144 సెక్షన్.........

కౌంటింగ్ కేంద్రాలదగ్గర 144 సెక్షన్ విధించారు.. కేవలం పాస్‌లున్నవారినే లోపలికి అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. ఇక పురాణాపూల్‌లో పోలింగ్‌ పూర్తయ్యాక లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు.. బ్యాలెట్‌ బాక్సులు వచ్చిన రెండుగంటల్లోపు ఫలితం ప్రకటించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.. తెలంగాణవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గ్రేటర్‌ ఎన్నికల హంగామా రేపు రాత్రిలోగా ముగిసిపోనుంది.. విన్నర్లెవ్వరో, రన్నర్లెవ్వరో సాయంత్రంలోగా తేలిపోనుంది..

తమిళనాడులో రైలు ప్రమాదం

హైదరాబాద్ : తమిళనాడులో రైలు ప్రమాదం సంభవించింది. వేలూరు జిల్లా పనూర్చర్ చెన్నై - బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 4 బోగీలు పక్కకు ఒరగడంతో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కారులో మంటలు

తిరుమల : రెండో ఘాట్ రోడ్డులో కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణీకులు వెంటనే కారునుండి బయటకు పరుగులు తీశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. షార్ట్ సర్య్కూట్ తో మంటలు చెలరేగినట్లు సమాచారం. తిరుమల లింక్ రోడ్డు ఈ ఘటన చోటు చేసుకుంది.

ముద్రగడ దీక్షలో ఎలాంటి మార్పు లేదు..

తూ.గో : కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షలో ఎలాంటి మార్పూ లేదు. ఆయన దీక్ష విరమింపజేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటికీ ప్రభుత్వం కొంత దిగొచ్చినా ముద్రగడ మాత్రం యూ టర్న్‌ తీసుకునే ప్రసక్తే లేదన్నారు. నేటి ఉదయం 9 గంటలకు ముద్రగడ దీక్ష ప్రారంభమవుతుంది. 

06:41 - February 5, 2016

తూ.గో : కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షలో ఎలాంటి మార్పూ లేదు. ఆయన దీక్ష విరమింపజేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటికీ ప్రభుత్వం కొంత దిగొచ్చినా ముద్రగడ మాత్రం యూ టర్న్‌ తీసుకునే ప్రసక్తే లేదన్నారు. నేటి ఉదయం 9 గంటలకు ముద్రగడ దీక్ష ప్రారంభమవుతుంది.

కిర్లంపూడిలో దీక్ష...

కాపులకు రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యం.. ఆ దిశగానే తాను అమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమయ్యా. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదు.. ఇదీ ముద్రగడ పద్మనాభం ఫైనల్‌గా చెప్పిన డైలాగ్‌. కాపులను బీసీల్లో చేర్చడం తదితర పలు డిమాండ్లతో ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షకు చేపడుతున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసంలో సతీమణి పద్మావతితో కలిసి దీక్ష ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయి. నిజానికి కాపులకు రిజర్వేషన్లు కోరుతూ 1994 జూన్‌, జులైలో కూడా కిర్లంపూడిలో ముద్రగడ దీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదంటూ ఒకింత ఆవేదన.....

అయితే ఈ దీక్షకు సంబంధించి ముద్రగడ ఇంతకు ముందు మాట్లాడుతూ తాను ఆమరణ దీక్ష ప్రకటించినా తనతో మాట్లాడేందుకు ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదంటూ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. బహుశా ఈ నేపథ్యంలోనేనేమో టిడిపి ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు గురువారం రాత్రి ముద్రగడతో చర్చలు జరిపారు. ఇప్పటికే కొన్ని రౌడీ ముఠాల మూలంగా ఐక్యగర్జన రసాభాస అయిందని మీరు ఆమరణ దీక్ష చేపడితే అలాంటి సమస్యలు మళ్లీ తలెత్తే ప్రమాదముందని వారు ఆయనతో అన్నారు. కాపులకు రిజర్వేషన్‌ పరంగా ఇప్పటికే ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తోందని వివరించారు. దీక్ష ఆలోచనను విరమించాలని సూచించారు.

దీక్ష విరమించాలన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు...

ముద్రగడతో మంతనాలు జరిపిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తాము ప్రభుత్వ దూతలుగా రాలేదని అన్నారు. కాపు వర్గానికి చెందినవారుగా, వ్యక్తిగతంగా వచ్చామని తెలిపారు. మూడు నెలల్లో కాపు కమిషన్‌ నివేదిక వస్తుందని, రానున్న బడ్జెట్‌లో ప్రభుత్వం కాపులకు 19 వందల కోట్లు కేటాయించనుందని కనుక దీక్ష విరమించాలని ముద్రగడకు సూచించామన్నారు.

దీక్షలో ఎలాంటి మార్పు లేదన్న ముద్రగడ...

టిడిపి నేతలు మంతనాలు జరపడంపై ముద్రగడ స్పందిస్తూ తన దీక్షలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశారు. తానేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని టిడిపి మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే అమలు చేయాలని కోరుతున్నామన్నారు.

అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం-ముద్రగడ

తన దీక్ష గురించి ముద్రగడ ఇంతకుముందే మాట్లాడుతూ దీక్షను పక్కదారి పట్టించేందుకు కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. అందువల్ల దీక్షా శిబిరం దగ్గరకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. కాపు సోదరులు ఒకపూట భోజనం మానేసి నిరసన తెలిపితే సరిపోతుందన్నారు.

జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధింపు

ముద్రగడ దీక్ష నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 144వ సెక్షన్‌ విధించారు. 30 యాక్షన్‌ టీములు... నాలుగు వేల మంది పోలీసులతో కీలక ప్రాంతాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. కిర్లంపూడి, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, కోనసీమలో అదనపు బలగాలను నియమించి ఎలాంటి అవాంతరాలూ జరగకుండా జాగ్రత్తపడుతున్నారు. దీక్షకు తరలివచ్చే వారిని ఎక్కడికక్కడ నియంత్రించేందుకు 35 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. 

06:37 - February 5, 2016

హైదరాబాద్ : వచ్చే ఏప్రిల్ 1 నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలులోకి వస్తోంది. అయితే, ప్రధాని తాజాగా ప్రకటించిన పంటల బీమా పథకంలో కొన్ని సానుకూలాంశాలున్నప్పటికీ, పాత లోపాలు అలాగే కొనసాగుతున్నాయి.

అత్యధికశాతం రైతులు పంటల బీమాకు దూరం....

వ్రుష్టి ఇవి రెండూ రైతులకు శాపాలు. ప్రక్రుతి వైపరీత్యాలు తలెత్తిన్నప్పుడు తీవ్రంగా దెబ్బతింటున్నది అన్నదాతలే. వీరికి అందుతున్న నష్టపరిహారం నామమాత్రమే. పర్యావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు, రాత్రికి రాత్రే విజ్రుంభించే తుపానులు, భయంకరమైన ఈదురుగాలులు, వడగళ్లు పంటలకు అపారనష్టం కలిగిస్తున్నాయి. ఒక్కొక్కసారి చేతికొస్తున్న పంటలను సైతం తుపాన్ లు తుడిచిపెట్టేస్తున్నాయి. ఇలాంటి ఆపత్కాలంలో రైతులను ఆదుకునేందుకు వీలుగా తీసుకొస్తున్నవే పంటల బీమా పథకాలు. అయితే, వీటి ప్రీమియం అధికంగా వుండడం, వీటి గురించి సరియైన ప్రచారం చేయకపోవడం, బీమా చెల్లింపుల సమయంలో కంపెనీలు నానా రకాల కొర్రీలు పెడుతుండడం, సక్రమంగా క్లయిమ్ లు పరిష్కరించకపోవడం లాంటి కారణాల వల్ల చాలామంది రైతులు పంటల బీమాకు దూరంగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ప్రధాని పంటల బీమా పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలులోకి వస్తుంది. ఈ పథకంలో రైతులు భారీ సంఖ్యలో చేరాలని పిలుపునిస్తున్నారు. మూడేళ్లలో 50శాతం మందిని చేర్పించాలన్నది లక్ష్యం.

కోతలు కోసి నూర్పిళ్లకు సిద్ధంగా వున్న పంటకు కూడా....

కోతలు కోసి నూర్పిళ్లకు సిద్ధంగా వున్న, ఆర బెట్టిన పంటలకు కూడా బీమాను వర్తింపచేస్తున్నారు. ఇలా ఆరబెట్టిన తర్వాత గరిష్టంగా 14 రోజుల లోపు అకాల వర్షాలు, వడగళ్లతో పంటకు నష్టం వాటిల్లితే నష్టం నిష్పత్తి ప్రకారం బీమా మొత్తం నుంచి సదరు బీమా సంస్థ రైతులకు చెల్లించాల్సి వుంటుంది. ఈ పథకంలో ప్రీమియంను తగ్గించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఖరీఫ్ పంటలకు 2శాతం, , రబీ పంటలకు 1.5 శాతం చొప్పున ప్రీమియం వసూలు చేస్తారు. వాణిజ్య పంటలకు 5శాతం వుంటుంది. దీనిని రైతులే చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. అయితే, రెండు ప్రభుత్వాలు ఆలస్యం చేయకుండా సకాలంలో తమ వంతు వాటాలు చెల్లించిన్నప్పుడే రైతులకు బీమా ప్రయోజనాలు దక్కుతాయి. అయితే, ప్రభుత్వాలు చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే రైతులకు ఇబ్బందులు తప్పవు. పంటల బీమా పథకంలో నష్టం అంచనా అత్యంత కీలకమైంది. బ్లాక్, మండల, న్యాయ పంచాయతీ వంటి యూనిట్ ల ఆధారంగా నిర్ణయించే విధానం ప్రస్తుతం అమలవుతోంది. దీని విషయంలో రైతులకు అభ్యంతరాలున్నాయి. ప్రక్రుతి వైపరీత్యాలు తలెత్తిన్నప్పుడు ఒకే గ్రామంలో పంట నష్టాలు విభిన్నంగా వుంటాయి. కాబట్టి, సర్వే నెంబర్ల నే యూనిట్ గా తీసుకోవాలన్న డిమాండ్ వుంది. నష్టం అంచనాలో అవినీతి జరగకుండా చూడాల్సి వుంటుంది. ప్రధాని ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రకటించేముందు ఇన్స్యూరెన్స్ కంపెనీలతో చర్చలు జరిపారు తప్ప రైతుల ప్రతినిధులతో చర్చలు జరపకపోవడం ఈ పథకం రూపకల్పనలో మరో లోపం. పంట నష్ట పోయిన వెంటనే బీమా మొత్తంలో 25శాతం చెల్లించాలన్న నిబంధన మంచిదే అయినా, అది బ్యాంకర్లు తమ అప్పుల ఖాతాలో జమ చేసుకోకుండా జాగ్రత్త తీసుకుంటేనే ఆపదలో వున్న రైతులకు మేలు చేస్తుంది. ఈ పథకంలో వున్న మరో లోపం కౌలు రైతులకు బీమా రక్షణ కల్పించలేకపోవడం. మనదేశంలో 75శాతం మంది కౌలు రైతులే. ప్రక్రుతి వైపరీత్యాలలో తీవ్రంగా నష్టపోతున్నదీ వీరే. కౌలు రైతులకీ మేలు జరిగేలా ఈ పథకాన్ని మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం వుంది. రైతులను కేంద్రంగా తీసుకుని బీమా పథకాలను అమలు చేయకుండా, బీమా కంపెనీల, వ్యవసాయ రుణాలు సమకూర్చిన ఫైనాన్స్ సంస్థల ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకుని బీమా పథకాలు రూపొందిస్తున్నారన్న విమర్శలకు ప్రధాని మంత్రి ఫసల్ బీమా యోజన కూడా సమాధానం చెప్పలేకపోతోంది. 

06:35 - February 5, 2016

హైదరాబాద్ : కొద్ది రోజుల క్రితమే ప్రధాని నరేంద్రమోడీ పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ బీమా పథకం అమలులో ప్రధాన పాత్రను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గతం కంటే ప్రీమియంను తగ్గించారు. గత పథకాల కంటే ఇది కొంత మెరుగైనదే అయిన్నప్పటికీ, ఇంకా అనేక మార్పులు రావాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని పంటల బీమా పథకంలో వున్న ప్రత్యేకతలేమిటి? పంటల బీమా పథకంలో వున్న లోపాలేమిటి? రైతులకు మరింత మేలు జరగాలంటే ఈ పథకంలో తీసుకురావాల్సిన మార్పులేమిటి? బీమాను అందించే విషయంలో ఆయా కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు ఎలా వుంది? పంటల బీమా పథకాలు ఆచరణలో రైతులకు ఎంత వరకు మేలు చేస్తున్నాయి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం నేత రంగారావు విజయవాడ 10టీవీ స్టూడియో నుండి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss