Activities calendar

06 February 2016

విద్యుత్ షాక్ తో ఇద్దరు కూలీల మృతి

నల్లగొండ : జిల్లాలోని నడిగూడెం మండలం త్రిపురవరంలో విషాదం చోటుచేసుకుంది. కలప లోడ్‌తో వెళ్తున్న లారీకి హైటెన్షన్‌ కరెంట్ తీగలు తగిలాయి. దీంతో కరెంట్‌ తీగలు తాకడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మృతులు నాగరాజు, మల్లయ్యగా ఇద్దరు తాడ్వాయికి చెందిన వారిగా గుర్తించారు.

పిల్లల గొతు కోసి, తండ్రి ఆత్మహత్యాయత్నం....

మహబూబ్ నగర్ : జిల్లాలోని బూత్ పూర్ మండలం షేర్ పల్లిలో  దారుణం జరిగింది. భార్య కాపురానికి రావట్లేదని మనస్తాపం చెందిన సుభాష్(28) అనే వ్యక్తి తన ముగ్గురి పిల్లల గొతు కోసి, తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో ముగ్గురూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారిని మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ముగ్గురూ కోలుకున్నారని వైద్యులు తెలిపారు.

ఏసిబికి పట్టుబడ్డ బీసీ సంక్షేమశాఖ అధికారి

విజయనగరం : జిల్లాలో బీసీ సంక్షేమశాఖ అధికారి ఎం.రాజు రూ. లక్ష 10వేలు లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డాడు.

22:14 - February 6, 2016

సునీల్‌, నిక్కీ గల్రాని, డింపుల్‌ చోపడే హీరోహీరోయిన్లుగా వాసువర్మ దర్శకత్వంలో దిల్‌ రాజ్‌ నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణాష్టమి'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ, 'అదరగొట్టే డాన్సులు, మంచి కామెడీ టైమింగ్‌తో నటుడిగా నిరూపించుకున్న సునీల్‌ హీరోగా, వాసు వర్మ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. అమెరికా నుంచి వచ్చిన ఒక కుర్రాడు ఇండియాలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే ఇతివృత్తంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో, సునీల్‌ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో మాస్‌, క్లాస్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఆద్యంతం వినోదభరితంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈనెల 5న 'స్పీడున్నోడు', 12న 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రాలు విడుదలవు తుండడంతో నిర్మాతలకు లబ్ధి కలగాలని మా చిత్రాన్ని ఈ నెల 19న విడుదల చేయాలని నిర్ణయించాం. దీంట్లో భాగంగా వచ్చే వారం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం' అని అన్నారు.

22:11 - February 6, 2016

బెంగళూరు : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2016 వేలంలో షేన్‌ వాట్సన్‌  అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్‌ నెలకొల్పగా.... భారత ఆల్‌రౌండర్‌ పవన్‌ నెగీ  భారత ఆల్‌రౌండర్‌ అనూహ్యంగా ముందుకు దూసుకొచ్చాడు. పవన్‌ నెగీ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.ఎప్పటిలానే ఈ సారి వేలంలోనూ అన్ని ఫ్రాంచైజీలు ఆల్‌రౌండర్లకే  మొగ్గు చూపాయి. షేన్‌ వాట్సన్‌ , క్రిస్‌ మోరిస్‌, పవన్ నెగీ, మిషెల్‌ మార్ష్‌  వంటి మేటీ ఆల్‌రౌండర్లను సొంతం చేసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.భారత పేసర్లు  మోహిత్‌ శర్మ, అశిష్‌ నెహ్రా  అనూహ్యంగా 5 కోట్ల మార్క్‌ దాటారు.  ఐపీఎల్‌ 2016 వేలం ఆసక్తికరంగా సాగింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌  షేన్‌ వాట్సన్‌ 9.5 కోట్లతో టాప్‌ ప్లేస్‌లో నిలవగా..... అంతర్జాతీయ అనుభవం లేని పవన్‌ నెగీ రికార్డ్‌ ధర పలికాడు. 

ఆల్‌రౌండర్లకే అన్ని ఫ్రాంచైజీల మొగ్గు 

ఎప్పటిలానే ఈ సారి వేలంలోనూ అన్ని ఫ్రాంచైజీలు ఆల్‌రౌండర్లకే  మొగ్గు చూపాయి. షేన్‌ వాట్సన్‌ , క్రిస్‌ మోరిస్‌, పవన్ నెగీ, మిషెల్‌ మార్ష్‌  వంటి మేటీ ఆల్‌రౌండర్లను సొంతం చేసుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.భారత పేసర్లు  మోహిత్‌ శర్మ, అశిష్‌ నెహ్రా  అనూహ్యంగా 5 కోట్ల మార్క్‌ దాటారు.  
రూ.7 కోట్లకే పరిమితమైన యువరాజ్‌ 
గత రెండు సంవత్సరాల నుంచి ఐపీఎల్‌ వేలంలో రికార్డ్‌ ధరతో టాప్‌ ప్లేస్‌లో నిలిచిన యువరాజ్‌ సింగ్‌ ఈ సారి మాత్రం 7 కోట్లకే పరిమితమయ్యాడు. కెవిన్‌ పీటర్సన్‌  3.5 కోట్లతోనే సరిపెట్టుకోగా....స్పీడ్‌ గన్‌ డేల్‌ స్టెయిన్‌ సైతం 3 కోట్ల మార్క్‌ కూడా  దాటలేకపోయాడు. కానీ ఈ సారి ఆక్షన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం ఆల్‌రౌండర్‌ పవన్‌ నెగీ అనే చెప్పాలి. ఇంకా ఒక్క  అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడని పవన్‌ నెగీ కోసం  ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఐపీఎల్‌ 2016 వేలంలో కోటి రూపాయలకు పైగా పలికిన ఆటగాళ్ల లిస్ట్ ఇలా ఉంది. 
ఆటగాళ్ల లిస్ట్...

షేన్‌ వాట్సన్‌- రాయల్‌ చాలెంజర్స్‌ - 9.5 కోట్లు

పవన్‌ నెగీ - ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ - 8.5 కోట్లు 

యువరాజ్‌ సింగ్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ -  7 కోట్లు 

క్రిస్‌ మోరిస్‌ - ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ - 7 కోట్లు 

మోహిత్‌ శర్మ- పంజాబ్‌ కింగ్స్‌ - 6.5 కోట్లు

అశిష్‌ నెహ్రా- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - 5.5 కోట్లు 

కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ -  ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ - 4.2 కోట్లు

మురుగన్‌ అశ్విన్‌ - పుణే జెయింట్స్‌ - 4.5 కోట్లు 

కరుణ్ నాయర్‌ -  ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ - 4 కోట్లు 

ప్రవీణ్‌ కుమార్‌ - గుజరాత్‌ లయన్స్‌ -3.5 కోట్లు

నాతూ సింగ్‌ - ముంబై ఇండియన్స్‌ - 3.2 కోట్లు 

జోస్‌ బట్లర్‌ - ముంబై ఇండియన్స్‌ - 3.8 కోట్లు 

మిషెల్‌ మార్ష్‌ - పుణే సూపర్‌ జెయింట్స్‌ - 4.8 కోట్లు

సంజూ శాంసన్‌ - ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ - 4.2 కోట్లు 

కెవిన్‌ పీటర్సన్‌ - పుణే సూపర్‌ జెయింట్స్‌ - 3.5 కోట్లు

ఇషాంత్‌ శర్మ - పుణే జెయింట్స్‌ - 3.8 కోట్లు

 డేల్‌ స్టెయిన్‌ - గుజరాత్‌ లయన్స్‌ - 2.3 కోట్లు 

డ్వేన్ స్మిత్‌- గుజరాత్‌ లయన్స్‌  - 2.3 కోట్లు 

దినేష్ కార్తీక్‌ - గుజరాత్‌ లయన్స్‌ - 2.3 కోట్లు

కైలీ అబోట్‌ - పంజాబ్‌ కింగ్స్‌ - 2.1 కోట్లు 

ధవళ్‌ కులకర్ణి - గుజరాత్‌ లయన్స్‌ - 2 కోట్లు 

స్టువార్ట్‌ బిన్నీ - రాయల్‌ చాలెంజర్స్ - 2 కోట్లు 

జాన్‌ హేస్టింగ్స్‌ - కోల్‌కతా నైట్‌రైడర్స్‌ - 1.3 కోట్లు

బరీందర్‌ శ్రన్‌ - సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  - 1.2 కోట్లు
ఇర్ఫాన్‌ పఠాన్‌ - పుణే జెయింట్స్‌- కోటి 

అంతర్జాతీయ క్రికెటర్లపై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు 

సూపర్‌ ఫామ్‌లో ఉన్న మార్టిన్‌ గప్తిల్‌ , ఆస్ట్రేలియా టీ 20 కెప్టెన్‌  ఆరోన్‌ ఫించ్‌ , జార్జ్‌ బెయిలీ, వెటరన్‌  మైఖేల్‌ హస్సీ, ఉస్మాన్‌ క్వాజా , చటేశ్వర్‌ పుజారా, హషీమ్‌ ఆమ్లా,  కేన్‌ రిచర్డ్‌సన్‌ ,మహేల జయవర్ధనే , జాసన్ హోల్డర్‌ , షాన్‌ టెయిట్‌, నాథన్‌ లియోన్‌, దిల్షాన్‌ వంటి అంతర్జాతీయ క్రికెటర్లపై ఫ్రాంచైజీలు అసలే మాత్రం ఆసక్తి చూపలేకపోవడం విశేషం. మరి షేన్‌ వాట్సన్‌, యువరాజ్‌ సింగ్‌, బట్లర్‌ , క్రిస్‌ మోరిస్‌  వంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాళ్ల వరకూ సరే....మరి అనూహ్యంగా రికార్డ్‌ ధర పలికిన యువ ఆటగాళ్లు ఐపీఎల్‌ 2016 సీజన్‌లో ఏ స్థాయిలో రాణిస్తారో చూడాలి మరి.  

22:02 - February 6, 2016

రామలక్ష్మణులపై కేసు పెట్టిన ప్రబుద్ధుడు, చారు వడ్డించలేదని ఆగిపోయిన పెళ్లి, డబ్బును తగలబెట్టమంటున్న వెబ్‌సైట్, జలంధర్ లో మహర్షి చనిపోయి రెండేళ్లు అయినా శవాన్ని అలాగే ఉంచిన వైనం, ట్రెయిన్ ను తగులబెట్టిన కార్యకర్తలు, రాజస్థాన్ లో పని మనుషలకు శుభవార్త, కర్నాటకలోని విజయపురి జైల్లో డ్యాన్సులు, కేరళలో పనికి బిర్యానీ పథకం వంటి వార్తలను క్రేజీ న్యూస్ ను వీడియోలో చూద్దాం..

21:56 - February 6, 2016

తెలంగాణ సీఎం కేసీఆర్ మీటింగ్స్ లో డైలాగ్స్ మామూలుగా ఉంటయా? అబ్బ.. రేపు తెల్లారే సరికి పనులన్నీ పూర్తయిపోతాయా అనిపిస్తుంది. మరి ఆయన డైలాగ్స్ చెప్పిన తర్వాత ఆ ఏరియాలో పరిస్థితులు ఎట్లున్నయి? అక్కడి ప్రజలు ఏమనుకుంటుండ్రు వారి మాటల్లో వింటేనే బాగుంటుంది. ఈ ముచ్చటతో పాటు.. సగం ఓట్లు పడితినే సంబరాలు చేసుకున్న కారు పార్టోళ్లు.. ఎక్కువమంది ఓట్లెందుకెయ్యెలేదని గుస గుస.., సీఎం సార్కు ఉత్తరాలు రాస్తున్న ఊడ్సెటోళ్లు.. సపాయియోళ్లకి బదులిస్తాడో లేదో తెల్వది, మంచినీళ్ల కోసం తండ్లాడుతున్న జనం.... పట్టించుకోక పరాశ్కం జేస్తున్న సర్కారు,  ఫేసు బుక్కుల ఫేస్ మార్ఫింగ్ ఫొటువలు, బట్టతలోని భాగోతం బయటవెట్టిన పోలీసొళ్లు, పట్టపగలే చైను తెంపుకుపోతున్న దొంగలు.. తిర్మల్ పోలీసొళ్లు శాంతిభద్రత ముచ్చట్లల భేష్, దేడ్ దిమాక్ గాల్ల చేతిల చావు దెబ్బలు... బీడీ అడిగి దావఖాన బెడ్డెక్కిన వైనం, పన్నెండు మేకలను హత మార్చిన చిరుత పులి, బాలయ్యపై పొన్నం ఫిర్యాదు.. 'మల్లన్న ముచ్చట్లు' వీడియోలో చూస్తేనే గమ్మతి ఉంటది. 

 

21:50 - February 6, 2016

'సెన్సార్‌బోర్డ్‌ నిబంధనలను మోడ్రనైజ్‌ చేయడం అంతా సులభమేమీ కాదు. దానికి తగిన పరిశ్రమ చేయాల్సి ఉంటుంద'ని అంటున్నారు దర్శకుడు, సెన్సార్‌బోర్డ్‌ పునర్‌వ్యవస్థీకరణ కమిటీ అధ్యక్షుడు శ్యామ్‌ బెనగల్‌. 'అంకుర్‌', 'నిశాంత్‌', 'మంథన్‌', 'భుమిక', 'జునూన్‌', 'అరోహణ్‌', 'త్రికాల్‌', 'మమో', 'సమర్‌' వంటి జాతీయ అవార్డు చిత్రాలను రూపొందించి సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్యామ్‌ బెనగల్‌. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా సామాజిక నేపథ్యంలో సినిమాల్ని తీసి ఆకట్టుకున్నారు. ఆయన రూపొందించిన 25 చిత్రాల్లో 14 సినిమాలు జాతీయ అవార్డులనందుకోవడం విశేషం. మరెన్నో చిత్రాలు అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాయి. 70, 80, 90వ దశకాల్లో భారతీయ సినిమాకు ఒక దిక్సూచిగా ప్రత్యమ్నాయ సినిమాకు పునాది వేసిన దర్శకుడాయన. అందుకే సినీ వర్గాలంతా అయన్నీ 'మిడిల్‌ సినిమా' అని పిలుస్తుంటారు. ఇటీవల సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా సినిమాల విషయంలో సెన్సార్‌ బోర్డ్‌ లేదని, బోర్డ్‌ తీరు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో సెన్సార్‌ నిబంధనల్లో మార్పులు తేవాలని శ్యామ్‌ బెనగల్‌ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఈ నేపథ్యంలో కమిటీ అధ్యక్షులు, దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖుల అభిప్రాయాలు తీసుకునే పనిలో నిమగమైయ్యారు. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన శ్యామ్‌ బెనగల్‌ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిపై ఆశ్చర్యాన్ని, ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు. సెన్సార్‌లో మార్పుల విషయంపై స్పందించారు. 'సెన్సార్‌ని పునర్‌ వ్యవస్థీకరించే పనిలో భాగంగా హైదరాబాద్‌ వచ్చాను. ఇందులో తెలుగు సినీ ప్రముఖులు అభిప్రాయాలను తీసుకుంటున్నాను. ఇందులో భాగంగా సమాజంలో వస్తున్న మార్పులకను గుణంగా సినిమాటోగ్రఫీ యాక్ట్‌ ప్రకారం సెన్సార్‌ని కూడా మోడ్రనైజ్‌ చేయాల్సి ఉంది. అయితే ఇది అంత సులభమైన పని కాదు. మేం సినీ మేకర్స్‌ నుంచి అభిప్రాయాలతోపాటు డిమాండ్స్‌ని కూడా అడిగి తెలుసుకుంటున్నాం. నేనేం కొత్త అలిగేషన్స్‌ పెట్టడం లేదు. సినీ మేకర్స్‌ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగానే సెన్సార్‌ నిబంధనలను డిజైన్‌ చేస్తాం' అని తెలిపారు. 1977లో తెలుగులో 'అనుగ్రహం' అనే సినిమాను రూపొందించిన ఆయన తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ, 'తెలుగులో ఎగ్జైట్‌ చేసే స్క్రిప్టు దొరకడం లేదు. అందుకే చేయలేక పోతున్నాను. చాలా మంది ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌లో ఫిల్మ్‌ కోర్సులు చేసి వస్తున్నారు. దీంతో తమ సొంత కల్చర్‌ కంటే వరల్డ్‌ సినిమాను, వెస్ట్రన్‌ కల్చర్‌ను బాగా ఎక్స్‌పోజ్‌ చేస్తున్నారు. దీనివల్ల మన తెలుగులో సినిమాల్లో మన కల్చర్‌, నేటివిటీ మిస్‌ అవుతోంది. ఇకనైనా ఆ మోజుని వీడి తెలుగు కల్చర్‌ మీద దృష్టి సారిస్తే బాగుంటుంద'న్నారు.

21:48 - February 6, 2016

అక్షయ్ కుమార్‌ తాజాగా నటించిన 'ఎయిర్‌ లిఫ్ట్‌' చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణతో బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించి 10 రోజుల్లో ఏకంగా 100 కోట్ల రూపాయల్ని కలెక్ట్‌ చేసి రికార్డ్‌ సృష్టించింది. అక్షయ్ కుమార్‌ నటించిన చిత్రాల్లో 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన నాలుగవ చిత్రమిది. అక్షయ్ కుమార్‌, నిమ్రత్‌ కౌర్‌లు నటించిన 'ఎయిర్‌లిఫ్ట్‌' చిత్రం జనవరి 22న విడుదలైంది. తొలి రోజు 12.35 కోట్లు, రెండో రోజు 14.60 కోట్ల రూపాయల వసూళ్ళని రాబట్టింది. విడుదలైన 10 రోజుల్లోనే 100 కోట్లకు దగ్గరగా వసూళ్ళని సాధించిందని సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లోనూ ఈ చిత్రం మంచి కలెక్షన్లతో విజయ పథంలో పయనిస్తోందని ఆయన చెప్పారు. కువైట్‌ - ఇరాక్‌ యుద్ధం ( 1990) సమయంలో అక్కడ ఉన్న 1,70,000 మంది భారతీయులను సురక్షింతంగా మన దేశానికి తరలించడంలో కృషి చేసిన కువైట్‌లోని అత్యంత ధనికుల్లో ఒకరైన భారతీయుడు రంజిత్‌ కత్యాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌ చిత్రం 'ఎయిర్‌లిఫ్ట్‌'. ఇంత మందిని రక్షించడమనే మిషన్‌ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ సంభవించలేదు. దీంతో ఈ మిషన్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకుంది.

21:41 - February 6, 2016

ఢిల్లీ : భారత సరిహద్దులోకి అక్రమంగా చొరబడ్డ పాకిస్తాన్‌కు చెందిన ఫిషింగ్‌ బోట్‌ను ఇండియన్‌ కోస్టల్‌ గార్డు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని కచ్‌ జఖావు తీరప్రాంతంలో చొరబడ్డ పాక్ పడవలోని 11 మంది మత్స్యకారులను అరెస్ట్‌ చేశారు. తీరప్రాంతం దాటే మత్స్యకారుల ఇరుదేశాలు అదుపులోకి తీసుకోవడం సహజమే. పాక్‌లో చొరబడ్డ 440 మంది భారతీయ మత్స్యకారులు  జైళ్లలో మగ్గుతున్నారు. భారత్‌కు చెందిన సుమారు 860 ఫిషింగ్‌ బోట్లు పాక్‌ స్వాధీనంలో ఉన్నాయి. వీరంతా గుజరాత్‌కు చెందినవారే. పాక్‌ జైళ్లలో ఉన్న మత్స్యకారులను భారత్‌కు తిరిగి పంపేలా చర్యలు తీసుకోవాలని గుజరాత్‌ మత్స్యకారుల సంఘం ఇటీవల ప్రధాని మోదికి విజ్ఞప్తి చేసింది.

 

21:38 - February 6, 2016


హైదరాబాద్ : బల్దియా కోటపై జయకేతనాన్ని ఎగరేసిన గులాబీ పార్టీలో... మేయర్‌ అభ్యర్ధిత్వంపై చర్చ జోరుగా జరుగుతోంది. సింహాసనాన్ని ఎవరు అధిష్ఠిస్తారోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈనెల 11న జరగనున్న ఎన్నికకు ముందే అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో అగ్రనేతలు తలమునకలయ్యారు. 

అధికార పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం

గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్య విజయంతో.. అధికార పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. గ్రేటర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీట్లు దక్కడం  అగ్రనేతల్లో కూడా జోష్‌ని నింపింది. గ్రేటర్ పీఠంపై పార్టీ జెండా ఎగురవేస్తామనే ధీమా.. ముందునుంచే అధికార పార్టీ నేతల్లో  ఉంది. అయితే.. ఓట్ల లెక్కింపు అనంతరం విపక్ష పార్టీలు నామమాత్రపు స్థానాలకే పరిమితం  కావడంతో అధికార పార్టీ నేతల అనందానికి అవధులు లేకుండా పోయాయి.

కేసీఆర్‌ అనుచరుడిగా బొంతు రామ్మోహన్‌కు పేరు

మేయర్ పదవిపై ఆశలు పెట్టుకుని.. బరిలో నిలిచి గెలిచిన నేతల్లో ఎవరికి  బల్దియాను అప్పగించాలన్న అంశంపై టీఆర్‌ఎస్‌ నేతల్లో చర్చ మొదలైంది. పార్టీ ఆవిర్భావం నుంచి బొంతు రామ్మోహన్  ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరుడిగా కొనసాగుతున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో.. రాష్ట్రస్థాయిలో  కీలక పదవి వస్తుందని భావించినా  గ్రేటర్ ఎన్నికల రంగంలోకి దిగడంతో మేయర్ పదవి రామ్మోహన్‌కే అనే ప్రచారం మొదలైంది. అయితే.. గ్రేటర్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన కేకే  కూతురు విజయలక్ష్మికి మేయర్ పదవి కట్టబెడతారనే  చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరిగింది. ఫలితాల అనంతరం  శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాలకు చెందిన నాగేందర్, ప్రసన్న రామ్మెహన్‌లు కూడా రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా గాంధీనగర్ నుంచి విజయం సాధించిన  ముఠా పద్మ పేరు కూడా వినిపిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక కోసం పార్టీ  నేతలు త్వరలోనే భేటీ కానున్నారు. గ్రేటర్ పరిధిలోని మంత్రులతో పాటు నేతలంతా  సమావేశం కానున్నారు. మేయర్ పదవి బీసీకి దక్కనుండడంతో.. డిప్యూటీ మేయర్ సెటిలర్లకు ఇవ్వాలని పార్టీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

21:22 - February 6, 2016

ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది తెలుగునాట దాదాపు 15 పర భాషా చిత్రాలు తెలుగులో రీమేక్‌ అవుతున్న విషయం విదితమే. స్టార్‌ హీరోల దగ్గర్నుంచి నవతరం హీరోల వరకు రీమేక్‌ చిత్రాలపైనే ఎక్కువగా ఆధారపడ్డారని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే, తమిళనాట కూడా రీమేక్‌ల హవా రోజు రోజుకి పెరుగుతోంది. ఇప్పటికే నాలుగైదు పరభాషా చిత్రాలను రీమేక్‌ చేసేందుకు తమిళ దర్శక, నిర్మాతలు రంగం సిద్ధం చేశారు. దీంట్లో భాగంగా బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన 'క్వీన్‌' చిత్రం, తెలుగులో అల్లు అర్జున్‌ నటించిన 'జులాయి', కొరియన్‌ చిత్రం 'మై డియర్‌ డెస్పెరాడో'లను తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. ఆ రీమేక్‌ చిత్రాల విశేషాలేంటో ఓసారి చూద్దాం..

రేవతి దర్శకత్వంలో 'క్వీన్‌' రీమేక్‌!

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'క్వీన్‌' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రేవతి దర్శకత్వంలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కంగనారనౌత్‌ నటించిన 'క్వీన్‌' 2013లో బాలీవుడ్‌లో విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు సాధించిన మహిళా ప్రధాన చిత్రంగానూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 'క్వీన్‌' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాత త్యాగరాజన్‌ రీమేక్‌ చేస్తున్నారు. ఈ రీమేక్‌ చిత్రాలకు నటి రేవతి దర్శకత్వం వహిస్తుండగా, సీనియర్‌ నటి సుహాసిని సంభాషణలు అందించడం విశేషం. 'మిత్ర్‌, మై ఫ్రెండ్‌', 'ఫిర్‌ మిలేంగే', 'కేరళ కేఫ్‌', 'ముంబై కట్టింగ్‌' వంటి చిత్రాలకు రేవతి దర్శకత్వం వహించిన సంగతి విదితమే. తాజాగా 'క్వీన్‌' రీమేక్‌తో మరోమారు దర్శకురాలిగా ప్రేక్షకుల ముందుకు రేవతి రాబోతున్నారు. బాలీవుడ్‌ 'క్వీన్‌'లో కంగనా రనౌత్‌ నటించి తన అసాధరణ నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. 
మరి తెలుగు, తమిళ భాషల్లో రూపొందబోయే రీమేక్‌లో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారో మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

'జులాయి' రీమేక్‌గా ప్రశాంత్‌ 'సాహసమ్‌'

 అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'జులాయి' చిత్రాన్ని తమిళంలో 'సాహసమ్‌' పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఈ రీమేక్‌లో ప్రశాంత్‌ హీరోగా, అమంద హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రశాంత్‌ నాన్నగా నాజర్‌ నటిస్తున్నారు. సోనూసూద్‌, కోట శ్రీనివాసరావు, రోబో శంకర్‌ తదితరులు ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అరుణ్‌ వర్మ దర్శకత్వంలో త్యాగరాజన్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

'మై డియర్‌ డెస్పెరాడో' రీమేక్‌గా 'కధలుమ్‌ కదంధు పోగుం'

'మై డియర్‌ డెస్పెరాడో' కొరియన్‌ చిత్రాన్ని 'కధలుమ్‌ కదంధు పోగుం'గా తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. విజరుసేతుపతి కథానాయకుడిగా ఈ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నట్టు 'సూదుకవ్వమ్‌' చిత్ర దర్శకుడు నలన్‌కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,''మై డియర్‌ డెస్పెరాడో' చిత్రాన్ని చూశాను. నాకెంతో బాగా నచ్చింది. 40 లక్షల రూపాయలతో రీమేక్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నాం. చిత్రంలోని పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ప్రేమకథా చిత్రమైనప్పటికీ ఇందులో నాయకానాయికలు తమ ప్రేమను సినిమా చివర్లో తెలియజేసుకుంటారు. అదే ఈ సినిమా ప్రత్యేకత' అని చెప్పారు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై సివికుమార్‌ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 

మరికొన్ని అనధికారికం రీమేకులు

వీటితోపాటు మరికొన్ని అనధికారికంగా రీమేకులు జరుగుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ యేడాది తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చిత్రాల నిర్మాణం మరింత ఊపందుకుంది. స్ట్రయిట్‌ కథలకు దూరంగా రీమేక్‌లపై ఆధారపడిన దర్శక, నిర్మాతలు, నటీనటులకు సక్సెస్‌ రావాలని ఆశిద్దాం..

కొనసాగుతున్న ముద్రగడ దీక్ష

తూర్పుగోదావరి : మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం దంపతుల ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతోంది. ముద్రగడ సతీమణి పద్మావతి ఆరోగ్యం క్షీణించింది. జిల్లా జాయింట్ కలెక్టర్, వైద్య బృందం కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. వైద్యులు ఇంట్లోకి రాకుండా ముద్రగడ  తలుపులు వేసుకున్నారు. తలుపులు తీయాలని జేసీ అడిగినా ముద్రగడ తలుపులు తీయలేదు. దీంతో చేసేదీ లేక జేసీ, వైద్య బృందం  వెనుదిరిగారు. మరో వైపు పద్మనాభం దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 

21:17 - February 6, 2016

తూర్పుగోదావరి : మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం దంపతుల ఆమరణ నిరాహారదీక్ష కొనసాగుతోంది. ముద్రగడ సతీమణి పద్మావతి ఆరోగ్యం  క్షీణించింది. జిల్లా జాయింట్ కలెక్టర్, వైద్య బృందం కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి చేరుకున్నారు. వైద్యులు ఇంట్లోకి రాకుండా ముద్రగడ  తలుపులు వేసుకున్నారు. తలుపులు తీయాలని జేసీ అడిగినా ముద్రగడ తలుపులు తీయలేదు. దీంతో చేసేదీ లేక జేసీ, వైద్య బృందం  వెనుదిరిగారు. మరో వైపు పద్మనాభం దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. భారీ ఎత్తున పోలీసులు మొహరించారు. జెసితోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు భారీ స్థాయిలో పోలీసులు మొహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  

 

21:02 - February 6, 2016

మూకీ చిత్రాలతో వెండితెర పై రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో విజయం సాధించిన మన తెలుగు దర్శక, నిర్మాతలకు 'టాకీ సినిమా' ఓ పెద్ద సవాల్‌ని విసిరింది. దృశ్యం, శబ్ధం ఈ రెండింటి కలయికతో వెండితెర మీద కదిలే బొమ్మల మాట్లాడే విచిత్రాన్ని ప్రేక్షకలోకానికి పరిచయం చేయడానికి దర్శక, నిర్మాతలు చేసిన అవిరళ కృషిలో చివరకు ఘన విజయం సాధించారు. ఆ ఘనవిజయానికి గుర్తుగా 1932, ఫిబ్రవరి 6వ తేదీని 'తెలుగు ఫిల్మ్స్‌ డే'గా తెలుగు సినిమా చరిత్రలో అభివర్ణించారు. ఆ రోజు తొలి తెలుగు టాకీ సినిమా 'భక్త ప్రహ్లాద' విడుదలై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చింది. అంతేకాకుండా తెలుగునాట టాకీ సినిమాల నిర్మాణానికి నాంది పలికిన చిత్రంగా 'భక్త ప్రహ్లాద' నిలిచింది. తొలి తెలుగు టాకీ చిత్రాన్ని ప్రేక్షకలోకానికి పరిచయం చేయడంలో దర్శక, నిర్మాత హనుమప్ప మునియప్ప రెడ్డి (హెచ్‌.ఎం.రెడ్డి) చేసిన కృషి అనిర్వచనీయం. ఆయన పడిన శ్రమకు ఫలితమే నేటి టాకీ సినిమా సరికొత్త పుంతలు తొక్కుతోంది. 'తెలుగు ఫిల్మ్స్‌ డే' సందర్భాన్ని పురస్కరించుకుని కళామంజూష కల్చరల్‌ అకాడమీ 'తెలుగు సినిమా తల్లి పుట్టిన రోజు పండుగ' పేరుతో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నేడు (శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగే ఈ వేడుకలో తెలుగు సినిమా రంగంలో విశేషంగా రాణించిన పలువురు ప్రముఖుల్ని ఘనంగా సత్కరించనుంది. సీనియర్‌ నటీనటులు కృష్ణవేణి, జమున, తొలి తెలుగు సినిమా నేపథ్య గాయని రావు బాలసరస్వతి, నిర్మాత కె.రాఘవ, ఎం.బాలయ్య, గీతాంజలి, రావి కొండలరావు, కాకరాల, కె.ఎస్‌.రావు తదితరులతోపాటు సీనియర్‌ సినిమా జర్నలిస్ట్‌ రెంటాల జయదేవను సముచితంగా సత్కరించనున్నారు.

20:59 - February 6, 2016

ముంబైలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చిరంజీవి భుజానికి సంబంధించిన సర్జరీ చేయించుకున్నారు. గత కొంత కాలంగా ఆయన భుజం నొప్పితో బాధపడుతున్నారు. కొన్ని పరీక్షల అనంతరం డాక్టర్లు ఆయనకు గురువారం సర్జరీ చేశారు. దీని గురించి ఆయనకు అత్యంత సన్నిహితుడొకరు మాట్లాడుతూ,'ఇది చాలా మైనర్‌ ఆపరేషన్‌. చాలా కాలంగా ఆయనను భుజం నొప్పి బాధిస్తోంది. దీంతోపాటు త్వరలోనే ఆయన నటించబోయే చిత్రం కూడా ప్రారంభం కానుంది. వీటి దృష్ట్యా డాక్టర్ల సలహా మేరకు సర్జరీ చేయించుకున్నారు. రెండు వారాల పాటు ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది' అని తెలిపారు. చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తమిళ 'కత్తి' చిత్రాన్ని రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ నిర్మించబోయే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ కార్యక్రమాలు రామ్‌చరణ్‌ బర్త్‌డే రోజున ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

20:51 - February 6, 2016

తూర్పుగోదావరి : కాపులను బీసీల్లో చేర్చేవరకు దీక్షను విరమించే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం తేల్చి చెప్పారు. 'ఆయన మొండి అయితే.... నేను జగమొండి' అని సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి.. ముద్రగడ వ్యాఖ్యానించారు. కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ముద్రగడ దంపతులు నిన్న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ముద్రగడ దీక్ష రెండో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తమపై ప్రభుత్వం నిర్లక్ష్య దోరణి అవలంభిస్తోందని చెప్పారు. కాపులను కూరలో కరివేపాకు తీసేసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని.. ముద్రగడ మండిపడ్డారు.తమ డిమాండ్లు నెరవేర్చే దాకా... దీక్ష, ఉద్యమం ఆగదని పేర్కొన్నారు. తాము మోసపోవడానికి సిద్ధంగా లేమని చెప్పారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించనని చెబుతుందని తెలిపారు. తన దగ్గరికి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటూ.. తమ కార్యకర్తలు పాకిస్తాన్ వెళ్తున్నట్లుగా భావిస్తున్నారని.. తమ జాతిని తాలిబాన్ టెర్రరిస్టులుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా తనకు వైద్యపరీక్షలు అవసరం లేదన్నారు. తన ఆరోగ్యం, తన శ్రీమతి ఆరోగ్యం బాగుందన్నారు. కాపులను బీసీల్లో చేర్చే విషయంలో తన జీవితాన్ని కాపులకే అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదని చెప్పారు. ప్రభుత్వం తరపు నుంచి ఏ ఒక్కరు చర్చకు వచ్చినా.. చర్చిస్తామని చెప్పారు. 
గాంధేయమార్గంలో దీక్ష 
గాంధేయమార్గంలో దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. ధర్నాలు, రాస్తారోకోలు చేయరాదని... శాంతియుతంగా నిరసన తెలిపాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామాల్లో పల్లెం మీద గరిటెతో కొట్టి నిరసన తెలపాలన్నారు. అంతకముందు తనతో టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు జరిపిన చర్చలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను తెలపడానికి నిరాకరించారు. 

20:18 - February 6, 2016

విజయవాడ : మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం దీక్ష చేయడం సరికాదని ఎపి మంత్రి నారాయణ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మంజునాథ కమిషన్ నివేదిక రాగానే కాపులను బీసీల్లో చేర్చుతామని చెప్పారు. ముద్రగడ అన్ని ఆలోచించి..దీక్షను విరమించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాపులను పట్టించుకోలేదని చెప్పారు. 1994లో కాంగ్రెస్ హయాంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కంటితుడుపు చర్యగా ప్రభుత్వ జీవో ఇచ్చారని గుర్తు చేశారు. కాపులను బీసీలో చేర్చుతామని... 2004లో వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారని... కానీ చేర్చలేదని చెప్పారు. కాపులను బీసీలో చేరుస్తామని ఇచ్చిన హామీని వైఎస్సార్ నేతలు మరిచిపోయారని తెలిపారు. కాపులు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఎల్ ఆండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలు బిడ్లు వేశాయని తెలిపారు. అత్యధికంగా కోట్ వేస్తే రీటెండర్లు పిలుస్తామని చెప్పారు. 

టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర వైభవోత్సవాలు

హైదరాబాద్ : ఎన్ టిఆర్ స్టేడియంలో టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. 

పాకిస్తాన్ లో ఆత్మహుతి బాంబు దాడి

పాకిస్తాన్ : క్వెట్టా నగరంలో ఆత్మహుతి బాంబు దాడి జరిగింది.ఈఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. 
మరో ఇద్దరు గాయపడ్డారు. 

19:39 - February 6, 2016

 హైదరాబాద్ : ఏపీ ఈ సెట్‌- 2016 షెడ్యూల్‌ విడుదలైంది. మే 9న పరీక్ష నిర్వహించనున్నట్టు... అనంతపురం జెఎన్ టియు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 17 నుంచి మార్చి 28 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 30  నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పరీక్షను రాష్ట్రంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో మే 9న... ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. 

ఏపీ ఈ సెట్‌- 2016 షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్ : ఏపీ ఈ సెట్‌- 2016 షెడ్యూల్‌ విడుదలైంది. మే 9న పరీక్ష నిర్వహించనున్నట్టు... అనంతపురం జెఎన్ టియు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 17 నుంచి మార్చి 28 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

19:33 - February 6, 2016

గుంటూరు : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి బిడ్డల మార్పిడి వివాదాస్పదం అయింది. మగ బిడ్డ పుడితే, ఆడ బిడ్డను అప్పగించారంటూ బాధితులు ఆందోళన చేశారు. తెనాలికి చెందిన రమ్య కాన్పు కోసం నిన్న రాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. డెలివరీ అనంతరం రమ్యకు మగబిడ్డ పుట్టిందంటూ ఆయాలు చెప్పారని... ఆ తర్వాత ఆడ బిడ్డను తెచ్చి తమ చేతుల్లో పెట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ మగ  బిడ్డను తమకు అప్పగించాలని సూపరింటిండెంట్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కానీ ఆయాలు మాత్రం,..తాము మొదటి నుండి ఆడబిడ్డేనని చెప్పామని అంటున్నారు. 

 

19:26 - February 6, 2016

గుంటూరు : జిల్లాలో కాపు నేతలు చేపట్టిన నిరసన దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. దీంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టిడిపి మినహా ఇతర పార్టీలకు చెందిన కాపునేతలంతా కలెక్టరేట్ ఎదుట దీక్షల కోసం టెంట్లు వేసేందుకు ప్రయత్నించగా..పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాపు నేతలు, పోలీసులకు మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. 

19:20 - February 6, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించడంతో మంత్రి కేటీఆర్‌కు అభినందనల వెల్లువ వెల్లువెత్తుతోంది. మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి కేటీఆర్‌ను అభినందించేందుకు కార్పొరేటర్లు మంత్రి కేటీఆర్‌ నివాసానికి క్యూ కడుతున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించినందుకు మంత్రి కేటీఆర్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. కొత్త కార్పొరేటర్ల రాకతో మంత్రి కేటీఆర్‌ నివాసం పండుగ వాతావరాణాన్ని సంతరించుకుంది. 

 

18:54 - February 6, 2016

హైదరాబాద్ : తెలంగాణలో మరో నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే గ్రూప్ 2, డిఎస్సీ, కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఎస్సై పోస్టులకు కూడా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పోలీస్‌శాఖలో 510 ఎస్సై పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ వెలుడింది. 
చివరి తేదీ మార్చి 3..
వీటికి ఈనెల 10 నుంచి మార్చి 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 510 పోస్టుల్లో సివిల్‌ ఎస్సై 208 పోస్టులు, రిజర్వుడ్‌ ఎస్సై 205, ఏఆర్‌ఎస్సై 74, ఎస్పీఎఫ్‌ ఎస్సైలు 12, డిజాస్టర్‌ ఎస్సైలు 9, సీపీఎల్‌ అంబర్‌పేట ఎస్సైలు 2 ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
లక్షల సంఖ్యలో విద్యార్థులు ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ ఎంతో కొంత ఉపశమనమే. 

 

18:48 - February 6, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూలో రోహిత్‌ మృతికి కారణమైన వారిని శిక్షించాలని విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో.. విశ్వవిద్యాలయాల్లో సామాజిక అసమానతలు, కుల వివక్ష పెరిగిందని కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో దీనిపై జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని ప్రకటించారు. 

ఎపి తాత్కాలిక సచివాలయం ఆర్థిక బిడ్లను తెరిచిన సీఆర్ డీఏ

హైదరాబాద్ : ఎపి తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి ఆర్థిక బిడ్లు ఖరారు చేశారు. మొత్తం 3 ప్యాకేజీలకు బిడ్లను సీఆర్ డీఏ అధికారులు తెరిచారు. ఎల్ ఆండ్ టీ సంస్థ రెండు టెండర్లు దక్కించుకుంది. పల్లొంజీ సంస్థ ఒక టెండర్ ను దక్కించుకుంది.

 

 

అంగన్ వాడీల వేతనాలు పెంచుతూ ఎపి సర్కార్ ఉత్తర్వులు

హైదరాబాద్ : ఎపిలో అంగన్ వాడీ కార్యకర్తలు చేసిన పోరాటాలకు ఫలితం దక్కింది. రాష్ట్రంలోని అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ కార్యకర్తల వేతనాలను ప్రభుత్వం పెంచింది. ఈమేరకు వేతనాలు పెంచుతూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అంగన్ వాడీ కార్యకర్తలకు రూ.4200 వేతనం ఇచ్చేది.. ఇప్పుడు 
ఆ వేతనాన్ని రూ.7 వేలకు పెంచారు. మినీ అంగన్ వాడీ కార్యకర్తలకు రూ. 4500, అంగన్ వాడీ సహాయకుల వేతనాలను రూ.4500లకు పెంచారు. పెంచిన వేతనాలు ఎప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. 

ముద్రగడ దీక్ష విరమించాలి : మంత్రి నారాయణ

హైదరాబాద్ : మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం దీక్ష చేయడం సరికాదని ఎపి మంత్రి నారాయణ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ముద్రగడ దీక్షను విరమించాలని కోరారు.

18:25 - February 6, 2016

హైదరాబాద్ : ఎపిలో అంగన్ వాడీ కార్యకర్తలు చేసిన పోరాటాలకు ఫలితం దక్కింది. రాష్ట్రంలోని అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ కార్యకర్తల వేతనాలను ఎపి ప్రభుత్వం పెంచింది. ఈమేరకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అంగన్ వాడీ కార్యకర్తలకు రూ.4200 వేతనం ఇచ్చేది.. ఇప్పుడు ఆ వేతనాన్ని రూ.7 వేలకు పెంచారు. మినీ అంగన్ వాడీ కార్యకర్తలకు రూ. 4500, అంగన్ వాడీ సహాయకుల వేతనాలను రూ.4500లకు పెంచారు. పెంచిన వేతనాలు ఎప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

 

వేలూరులో పేలుడు.... ఒకరి మృతి

చెన్నై : వేలూరులోని భారతీదాస్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద పేలుడు సంభవించింది. ఈఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 

మా పోరాటాన్ని అణగదొక్కాలని సీఎం యత్నం : కాపు జేఏసీ

గుంటూరు : తమ పోరాటాన్ని అణగదొక్కాలని సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కాపు జేఏసీ ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం దీక్ష కొనసాగినంత కాలం గుంటూరులో దీక్షలు చేస్తామన్నారు.

17:44 - February 6, 2016

హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారంలో కార్పొరేటర్లు ఎప్పుడూ ముందుండాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. ఇవాళ దారుసలాంలోని ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన పార్టీ కార్పొరేటర్లతో అసదుద్దీన్ సమావేశమయ్యారు. గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిచిన ఎంఐఎం కార్పొరేటర్లకు అసద్ అభినందనలు తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కరానికి ఎప్పుడూ కృషి చేయాలన్నారు. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వారి పరిష్కారంలో చొరవచూపాలని ఆయన సూచించారు. స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం కీలకమని తెలిపారు.

 

17:36 - February 6, 2016

హైదరాబాద్ : మంచి పాలన అందిస్తే మంచి ఫలితాలు వస్తాయనడానికి గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తామన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు మానాలని సూచించారు. ప్రజలందరి మన్నన పొందిన పార్టీ ఒక్క టీఆర్‌ఎస్సేనని.. తప్పకుండా హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తలసాని అన్నారు.

 

17:32 - February 6, 2016

ఢిల్లీ : తెలంగాణకు రావాల్సిన కేంద్ర నిధులను విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయని  తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. ఢిల్లీలో 14వ ఆర్ధిక సంఘం భేటీ ముగిసిన అనంతరం ఈటెల వీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంఘం భేటీ తూతూ మంత్రంగా జరిగిందన్నారు. రాష్ట్రాల్లో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను కేంద్రం కుదించడం వల్ల పేదలకు అందే సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయని వాపోయారు. అన్ని ప్రజా రంజక పథకాలను కేంద్రం రద్దు చేసిందన్నారు. 

 

17:21 - February 6, 2016

నిజామాబాద్ : ఒకప్పుడు ఆ గ్రామం అంటే అందరికీ హడల్.. ఎక్కడచూసినా అపరిశుభ్ర వాతావరణం జనాల్ని బెంబేలెత్తించేది.. ఇప్పుడు ఆ పల్లె రూపురేఖలే మారిపోయాయి.. గ్రామస్తులంతా ఏకమై అద్భుతం చేసి చూపించారు.. ఆ గ్రామంలో వచ్చిన మార్పేంటి? స్పెషల్ స్టోరీ..

పల్లెను అభివృద్ధిపధంలో నడిపించిన అమీన్‌పూర్ గ్రామస్తులు...

కలిసికట్టుగా ముందడుగేస్తే ఏదైనా సాధించవచ్చంటూ నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం అమీన్‌పూర్ గ్రామస్తులు.. కొన్నేళ్లక్రితం వరకూ ఈ గ్రామం సమస్యలకు నిలయంగా ఉండేది.. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అంతా కలిసి ప్రభుత్వ పథకాల ద్వారా పల్లెను అభివృద్ధిపధంలో నడిపించారు.. గ్రామజ్యోతి పథకంతో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామంగా రికార్డు సృష్టించారు.. ఇక పరిశుభ్రతలోనూ ఆదర్శంగా నిలిచారు..

అమీనాపూర్‌లో 479 కుటుంబాలు నివాసం

మండలంలొని మైనర్ గ్రామపంచాయితీగా ఉన్న అమీనాపూర్‌లో దాదాపు 479 కుటుంబాలు నివసిస్తున్నాయి.. జనాభా 1413మందికాగా... 947మంది ఓటర్లున్నారు.. కొన్నేళ్లక్రితంవరకూ సగం కుటుంబాల్లో టాయ్‌లెట్లు లేవు.. వీరంతా ఆరుబయట మలవిసర్జనకు వెళ్లేవారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకం మండల ప్రత్యేకాధికారి చైతన్య కుమార్‌ వీరిలో మార్పు తీసుకువచ్చారు.. గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈ అధికారి... ప్రజల్లో అవగాహన పెంచారు.. పథకానికి వచ్చే నిధులను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు..

చైతన్య కుమార్ కృషితో మారిన పల్లె రూపురేఖలు

చైతన్య కుమార్ కృషితో ఈ పల్లె రూపురేఖలే మారిపోయాయి.. గ్రామజ్యోతి ర్యాలీలద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుధ్యం ప్రాముఖ్యతను ప్రచారం చేశారు.. కేవలం 9వందలు చెల్లిస్తే ప్రభుత్వ నిధులతో టాయ్‌లెట్లు నిర్మిస్తామని నచ్చజెప్పారు.. ఈ పథకం అమలులోభాగంగా 7 కమిటీల్ని వేశారు.. మహిళా సంఘాల ప్రతినిధుల్ని భాగస్వామ్యం చేశారు.

గ్రామస్తులతో ప్రత్యేక సమావేశాలు

తరచూ గ్రామస్తులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.. అలా ఒక్కొక్కరిగా టాయ్‌లెట్ల నిర్మాణానికి ముందుకువచ్చేలా చేశారు.. వారిద్వారా మిగతావారూ ఇందులో భాగస్వామ్యమయ్యారు. గ్రామస్తులు ప్రజాప్రతినిధుల్ని కలిసి ఈ నిర్మాణాలకోసం సహకారం కావాలని కోరారు.. ఎక్కువమంది మేస్త్రీలను గ్రామానికి రప్పించుకున్నారు.. అలా పనులు చకచకా కొనసాగాయి. మెటీరియల్‌ ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఐకమత్యంగా సాగిన గ్రామస్తులు

ఒక్క టాయ్‌లెట్లే కాదు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలోనూ గ్రామస్తులు ఐకమత్యంగా సాగారు.. వీధులన్నీ శుభ్రం చేసుకున్నారు.. ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. అంతా ఒక్కటై తమ పల్లె అభివృద్ధికోసం కృషి చేస్తున్న ఈ గ్రామస్తులను అందరూ అభినందిస్తున్నారు.

 

17:10 - February 6, 2016

చిత్తూరు : తిరుపతిలో ఓ ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు గుంటూరు జిల్లా గణపవరానికి చెందిన శశికుమార్‌, స్టెల్లామేరీలుగా గుర్తించారు. ఇప్పటికే వీరిద్దరిపై గుంటూరు జిల్లాలో మిస్సింగ్‌ కేసు నమోదయ్యింది. అయితే మృతులు రైల్వేట్రాక్‌పై పడివున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

17:01 - February 6, 2016

తూర్పుగోదావరి : ప్రభుత్వ వైద్యుల వైద్య పరీక్షలను ముద్రగడ పద్మనాభం నిరాకరిస్తున్నారు. తనను పరామర్శించేందుకు వస్తున్న నాయకులు, కార్యకర్తలను... పోలీసులు అడ్డుకున్నందుకు నిరసనగా... ఆయన వైద్య పరీక్షలకు నిరాకరించారు. నిన్నటి నుంచి దీక్షలో ఉన్న ముద్రగడ...బీపీ, షుగర్ లెవల్స్ భారీగా పడిపోయాయి. 

అండర్-19 ప్రపంచకప్... సెమీస్ కు భారత్

ఢిల్లీ : అండర్-19 ప్రపంచకప్ లో భారత్ సెమీస్ కు చేరింది. క్వార్టర్స్ లో నమీబియాపై 197 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. భారత్ నిర్ణీత వోవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. నమీబియా నిర్ణీత వోవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయింది. 

510 ఎస్సై పోస్టులకు టీ.ప్రభుత్వం నోటిఫికేషన్

హైదరాబాద్ : 510 ఎస్సై పోస్టులకు తెలంగాణ ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 10 నుంచి మార్చి 3 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

 

రెండో రోజు కొనసాగుతున్న ముద్రగడ దీక్ష..

తూర్పుగోదావరి : మాజీ మంత్రి, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం తన నివాసంలో రెండో రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. తనను పరామర్శించేందుకు వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య పరీక్షలకు ముద్రగడ నిరాకరించారు. 

 

 

పవన్ నేగిని దక్కించుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్

బెంగళూరు : ఐపీఎల్-2016 వేలం కొనసాగుతోంది. యువరాజ్ సింగ్ కంటే పవన్ నేగి ఎక్కువ ధర పలికాడు. రూ.8.5 కోట్లకు పవన్ నేగిని ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుంది.

 

వికలాంగులపై దుబాయ్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ...

హైదరాబాద్‌ : దుబాయ్‌ ప్రభుత్వం తమ దేశంలో ఉన్న వికలాంగులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఎయిర్‌పోర్టుల వద్ద ప్రత్యేక కౌంటర్లు పెట్టడం, బ్రైయిలీ లిపితో సమాచారం అందించడం వంటి వాటితో పాటు మూగవారికి సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మూగభాషలో ట్రైనింగ్‌ పొందినవారిని చాలా చోట్ల నియమిస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్‌లలో వీల్‌చైర్ల ద్వారా ప్రవేశించేవారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్‌ ప్రదేశాలలో కూడా వారి కోసం ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేశారు.

రూ.7కోట్లకు యువరాజ్ ను దక్కించుకున్న సన్‌ రైజర్స్...

బెంగళూరు : ఐపీఎల్‌-9 కోసం ఆటగాళ్ల ఎంపికకు వేలం బెంగళూరులో జరుగుతుంది. ఈ వేలంలో భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను రూ.7కోట్లకు సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టు దక్కించుకుంది.

 

ఎంపీ నగేష్‌ ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న ఎంపీ నగేష్‌ ఇంటిని విద్యార్థి సంఘాలు శనివారం ముట్టడించాయి. జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీని వరంగల్‌కు తరలించడాన్ని నిరసిస్తూ ఎంపీ ఇంటిని ముట్టడించినట్లు విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా వారు ఎంపీ ఇంటిపై కోడిగుడ్లు విసిరి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించినా, నిరాకరించడంతో వారిని బలవంతంగా ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

వీఆర్వోపై దుండగులు దాడి..

మహబూబ్నగర్ : షాద్‌నగర్‌లోని రాఘవేంద్రకాలనీలో ఇంటిలో నిద్రిస్తున్న వీఆర్వో రవియాదవ్(35)పై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కరీంనగర్ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని జగిత్యాల మండలం కొండగట్టు వద్ద ఘాట్‌రోడ్డుపై ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో ఆటో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఏడుగురు భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

 

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు..

ఖమ్మం : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఇల్లందు మండలం నిజాంపేటలో రోడ్డు దాటుతున్న రాజేశ్వరి అనే మహిళను వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 

15:08 - February 6, 2016

ఢిల్లీ : 2016 మహిళల టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టుకు..మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తుంది. భారత్ వేదికగా మార్చి 15 నుంచి జరిగే మహిళా ప్రపంచకప్ టోర్నీలో పదిదేశాల జట్లు పోటీపడుతున్నాయి. భారతజట్టు సభ్యుల వివరాలు ఓసారి చూద్దాం...

కోల్ కతా వేదికలుగా మ్యాచ్ లు

కోల్ కతా వేదికలుగా మహిళా ప్రపంచకప్ మ్యాచ్ లు జరుగనున్నాయి. భారత్ వేదికగా మార్చి 15 నుంచి జరిగే 2016 టీ-20 మహిళల ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ..ముంబైలో ప్రకటించింది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ముగిసిన మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను 2-1తో గెలుచుకొని వచ్చిన జట్టునే..ప్రపంచకప్ కు సైతం కొనసాగించాలని మహిళా క్రికెట్ సెలెక్టర్లు నిర్ణయించారు.

యువప్లేయర్లకు చోటు

మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారతజట్టులో అపారఅనుభవం ఉన్న జులన్ గోస్వామి లాంటి ఆల్ రౌండర్లతో పాటు..ఉత్సాహంతో ఉరకలేసే యువప్లేయర్లకు సైతం చోటు కల్పించారు.

జట్టులోని ఇతర ప్లేయర్లలో స్మృతి మంథానీ, వేదా కృష్ణమూర్తి, హర్మన్ ప్రీత్ కౌర్, శిఖా పాండే, రాజేశ్వరీ గయక్వాడ్, సుష్మా వర్మ, పూనం యాదవ్, వెల్లాస్వామి వనిత, అనూజా పాటిల్, ఏక్తా బిస్త్, తిరుషా కామినీ, దీప్తీ శర్మ, నిరంజనా నాగరాజన్ ఉన్నారు.

మార్చి 15న బంగ్లాదేశ్ తో భారత్ ఢీ

మార్చి 15న బెంగళూరులో జరిగే ప్రపంచకప్ గ్రూప్ - బీ ప్రారంభమ్యాచ్ లో బంగ్లాదేశ్ తో భారత్ పోటీపడుతుంది. గ్రూప్ - బీ లో భారత్ తో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ -ఏ లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా,ఐర్లండ్ జట్లు తలపడతాయి. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, నాగపూర్, మొహాలీ, ధర్మశాల, ముంబై, కోల్ కతా వేదికలుగా మహిళా ప్రపంచకప్ మ్యాచ్ లు జరుగనున్నాయి.

 

15:02 - February 6, 2016

వరంగల్ : మేడారం జాతర సమయం వస్తోందంటే చాలు.. రైతుల్లో టెన్షన్ మొదలవుతుంది.. అమ్మల చెంతకు వచ్చే భక్తుల్లో ఆనందం కనిపిస్తుంటే... అన్నదాతల్లో ఆందోళన పెరుగుతుంది.. అయితే అధికారులు మాత్రం ఈసారి పంటలకు ఎలాంటి నీటి కొరతా రాదని స్పష్టం చేస్తున్నారు..

నీటి కష్టాలుండవని అధికారుల హామీ 

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈసారి నీటి కష్టాలుండవని అధికారులు హామీ ఇస్తున్నారు.. రైతుల పొలాలకూ నీటిని సరఫరా చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రకృతి దైవాలుగా పూజలందుకుంటున్న ఈ అమ్మవార్లకు ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తారు.. మాఘ శుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి బుధవారం నుంచి నాలుగురోజుల పాటు జాతర జరుగుతుంది.

సాగునీరు కోల్పోతున్న రైతులు

మేడారం జాతరకోసం లక్నవరం సరస్సు నుంచి జాతర సమయంలో నీటిని విడుదలచేస్తారు.. కాకతీయుల కాలంనుంచి ఇది కొనసాగుతోంది.. దీంతో రబీ సీజన్‌లో దాదాపు వెయ్యి ఎకరాలకు సాగునీరు కోల్పోవాల్సి వస్తోంది.. ఈసారి కూడా అదే సమస్య మొదలైంది.... ఈ సరస్సుపై ఆధారపడ్డ రైతుల్లో కంగారు మొదలైంది.. జాతరకు నీళ్లిస్తే తమ పంటలు ఎండిపోతాయంటూ ఇప్పటికే అన్నదాతలు అధికారుల దృష్టికి తెచ్చారు... వినతి పత్రాలిచ్చారు.. ఈ సమస్య పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు..

సరస్సు సామర్థ్యం 1.135 టీఎంసీలు

అటు ఈసారి లక్నవరం సరస్సులో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు అధికారులు.. ఈ సరస్సు సామర్థ్యం 1.135 టీఎంసీలు కాగా... ప్రస్తుతం

0.7టీఎంసీల నీరుందని చెబుతున్నారు.. ఇందులోనుంచి కొంత నీటిని జాతరకు.. మిగిలిన నీరు పొలాలకు ఇస్తామని ప్రకటించారు..

వాగు నుంచి కాలువలు వేసుకుంటున్న రైతులు

లక్నవరం నుంచి మేడారానికి మధ్య 25 కిలోమీటర్ల వాగు ఉంటుంది.. ఈ వాగు ద్వారా జాతరకు నీటిని సరఫరా చేస్తారు.. అయితే ఈ సమయంలో చుట్టుపక్కల రైతులు ఎక్కడపడితే అక్కడ వాగునుంచి కాలువలు వేసుకోవడం, గండ్లు కొట్టడం చేస్తారు.. మరికొందరు మోటార్ల ద్వారా నీటిని తోడుకుంటారు.. దీంతో జాతరకు నీటి సరఫరా మరింత తగ్గుతోంది.. ఈ అంశంపై దృష్టిపెట్టిన అధికారులు వాగు దగ్గర నిఘా పెట్టాలని భావించారు.. అయితే 25 కిలోమీటర్లు కనిపెట్టడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది.. చివరికి ఈ వాగు చుట్టుపక్కల రెండు యంత్రాలు ఏర్పాటు చేశారు.. ఎక్కడ గండివేసినట్లు తేలితే అక్కడికి ఈ యంత్రాలు పంపి సరిచేసేలా ప్లాన్‌ చేశారు.. అయినా రెండు యంత్రాలతో ఇంతదూరం సర్దుబాటు చేయడం కష్టంగా మారింది.. చివరకు రైతుల్లో అవగాహన పెంచితేనే నీరు పక్కదారి పట్టదని నిర్ణయించారు.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు..

మేడారం జాతర ఈ నెల 17నుంచి ప్రారంభం

మేడారం జాతర ఈ నెల 17నుంచి 20వ తేదీవరకూ జరగబోతోంది.. లక్నవరం నుంచి వచ్చే నీరు 16వతేదీన జంపన్నవాగులోకి చేరేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.. అంతకు రెండురోజులముందు లక్నవరంలోకి నీళ్లు వదలాలని చూస్తున్నారు.. ఇలా 17, 18, 19 తేదీల్లో నీటిని సరఫరా చేస్తారు.. ఆ తర్వాత ఆపేస్తారు.. ఇక వంతెనలకు రెండువైపులా కట్టాల్సిన చెక్‌ డ్యాంలను జాతర పూర్తయ్యాక నిర్మించాలని చూస్తున్నారు..

గుండ్లవాగు ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవాలన్న రైతులు

మరోవైపు జంపన్న వాగుకు లక్నవరం నుంచి కాకుండా గుండ్లవాగు ప్రాజెక్టు నుంచి తీసుకోవాలని రైతులు కొత్త ప్రతిపాదన తెచ్చారు.. దీనిపై స్పందించిన అధికారులు ఇది హైదరాబాద్‌ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేశారు.. ఇప్పటికే రెండో పంటకు అవసరమైన నీటిని విడుదల చేశారు..

 

14:54 - February 6, 2016

వరంగల్ : రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు వారివి.. ఉన్న ఆ కాస్త భూమి కాంట్రాక్టర్‌ అక్రమాలతో చెరువు కట్టకిందకు వెళ్లిపోయింది.. ఏం చేయాలో... ఎలా బతకాలో అర్థంకాని రైతులు వరంగల్‌ కలెక్టర్‌ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

కక్కిరాలపల్లి గ్రామస్తులు..

వరంగల్‌ జిల్లా కక్కిరాలపల్లి గ్రామస్తులు.. కాంట్రాక్టర్‌ అక్రమాలతో భూములు కోల్పోతున్నామంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు.. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు..

భూములు కోల్పోయిన రైతులు

పంచాయతీ రాజ్ శాఖ నిధులతో వర్ధన్నపేట మండలం కక్కిరాలపల్లి గ్రామంలో బీటీ రోడ్డు పనులు మొదలయ్యాయి.. ఈ పనుల్లో భాగంగా చెరువు కట్ట వెడల్పుకూడా ప్రారంభమైంది.. నిబంధనలప్రకారం చెరువుకు రెండువైపులా ఈ వెడల్పు కార్యక్రమం చేయాలి.. కాంట్రాక్టర్‌మాత్రం ఒకేవైపు పని సాగించాడు.. దీంతో కట్టకిందిభాగంలో రైతులు తమ భూముల్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది.. ఉన్న ఆ కాస్త భూమిపోవడంతో తాము ఎలా బతకాలంటూ రైతన్నలు ఆందోళనకు దిగారు..

కాంట్రాక్టర్‌ను నిలదీసిన రైతులు

బాధిత రైతులు తమకు జరుగుతున్న అన్యాయంపై కాంట్రాక్టర్‌ను నిలదీశారు.. అయినా అతను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.. పైగా తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌కు తమ గోడు చెప్పుకున్నారు రైతులు.. ఈ అంశంపై కలెక్టర్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

14:48 - February 6, 2016

హైదరాబాద్ : టార్గెట్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌..! ఏపీ విద్యా శాఖ తాజా నినాదమిది. లోపాలను సవరించడం ద్వారా పాఠశాల విద్యాప్రమాణాలు పెంచి మెరుగైన ఫలితాలు సాధించాలన్నది సర్కారు భావన. ప్రతిష్ఠాత్మక బడిపిలుస్తోంది కార్యక్రమం జోష్‌తో.. పాఠశాల విద్యలో సంస్కరణల అమలుకు ఏపీ విద్యాశాఖ సిద్ధమవుతోంది.

"బడి పిలుస్తోంది" కార్యక్రమానికి రూపకల్పన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టిని సారించింది. వేల కోట్లు ఖర్చు పెడుతున్నా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించలేక పోవడం.. అంతకంతకూ పెరుగుతున్న డ్రాపవుట్స్‌, ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల పోటీ నేపథ్యంలో ప్రభుత్వం బడి పిలుస్తోంది కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇది సత్ఫలితాలనివ్వడంతో.. ఫుల్‌ జోష్‌లో ఉన్న స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌.. మరిన్ని సంస్కరణల అమలుకు కసరత్తు చేస్తోంది.

ప్రైవేటు పాఠశాలల వైపు తల్లిదండ్రుల మొగ్గు

తల్లిదండ్రులు, తమ పిల్లలను.. ప్రాథమిక విద్య స్థాయిలో.. తమ స్థాయికి తగ్గ ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. లోపభూయిష్ట విధానాలు, ఆచరణలో ఎడతెగని నిర్లక్ష్యం, అరకొర వసతులతో సమస్యల సుడిగుండంలో ఉన్న పాఠశాలల వైపు ఎవరూ చూడడం లేదు. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు ముందుచూపున్న సంస్కరణలే శరణ్యమని ఏపీ సర్కారు భావిస్తోంది.

ప్రభుత్వ భాగస్వామ్యంలో 46,961 పాఠశాలలు

సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనివ్వాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భాగస్వామ్యంలోని 46,961 పాఠశాలల్లో సుమారు 70 లక్షల మంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. సుమారు రెండు లక్షల 68వేల 994 మంది టీచర్లు విద్యాబోధన చేస్తున్నారు. సుమారు 81 శాతం సర్కారీ బాలికల బడుల్లో మరుగుదొడ్లు లేవని ఓ సర్వే తేల్చింది. అలాగే 70 శాతం పాఠశాల్లోనే పూర్తి స్థాయి విద్యుత్‌ అందుబాటులో ఉందని వెల్లడించింది. ఇలాంటి మౌలిక సమస్యల వల్లే.. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు అనాసక్తి చూపుతున్నారని ప్రభుత్వమూ గుర్తించింది.

టీచర్ల కొరతను అధిగమించేందుకు డిఎస్సీ ప్రకటన

పాఠశాల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం... ఇప్పటికే కసరత్తును ప్రారంభించింది. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా.. పాఠశాల విద్యకు బడ్జెట్‌లో పెద్దపీట వేసి.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 12వేల 664 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించింది. మరో ప్రధాన సమస్య టీచర్ల కొరతను అధిగమించేందుకు తొలి ఏడాదే డిఎస్సీ ప్రకటన వెలువరించి.. ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియనూ చేపట్టింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనను చేపట్టింది.

విద్యార్థికి ప్రాథమిక అంశాల పట్ల అవగాహన పెంపు

మౌలిక వసతులను కల్పిస్తూనే విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు మూడో తరగతి పూర్తయ్యేలోపే విద్యార్థికి ప్రాథమిక అంశాల పట్ల అవగాహన పెంచడం.. ఐదో తరగతిలోపు విద్యార్థుల్లో హయ్యర్‌ గ్రేడ్‌ సాధించలేని వారిని గుర్తించి వారిలో సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలు వంటివి చేపడుతున్నారు. పాఠ్యప్రణాళిక, అభ్యసన లక్ష్యాలు, బోధనాభ్యాసన పరికరాల వినియోగం, స్కూల్‌ లీడర్‌షిప్‌, మేనేజిమెంట్‌ డెవలప్‌మెంట్‌ వంటి అంశాల్లోనూ విద్యార్థులను తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచించారు. ఈ లక్ష్యాలతో వచ్చే విద్యాసంవత్సరం నాటికి ప్రభుత్వ పాఠశాలల వ్యవస్ధలొ సమూల మార్పును సాధిస్తామనీ ఏపీ పాఠశాల విద్యాశాఖ ధీమా వ్యక్తం చేస్తొంది.

 

శ్రీలంకలో ఐటీ పార్కుకు సాయం చేస్తాం : సుష్మాస్వరాజ్

కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ అక్కడ ఐటీ పార్కు ఏర్పాటు విషయంలో సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైజ్‌ ఆఫ్ డిజిటల్‌ ఇండియా ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో ఆమె ప్రసంగించారు. ఇరు దేశాలకు చెందిన సంస్కృతుల కలయికతో సంగమ్‌ అనే కార్యక్రమంలో భాగంగా ఈ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. భారతదేశంలో కంప్యూటర్‌ రంగం, డిజిటల్‌ టెక్నాలజీ రంగాలు ఏవిధంగా అభివృద్ధి చెందాయో ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. భారతదేశంలో ప్రజల దినచర్యలో ఈ విభాగాలు ఎటువంటి మంచి మార్పులు తీసుకువస్తున్నాయో వివరించారు.

బిహార్‌లో ఎల్‌జేపీ నేత బ్రిజ్‌నాథ్‌సింగ్‌ హత్య...

పాట్నా: బిహార్‌లో ఎల్‌జేపీ నేత బ్రిజ్‌నాథ్‌సింగ్‌ దారుణ హత్యకు గురయ్యారు. రాదేపూర్‌ ప్రాంతానికి చెందిన ఆయన శుక్రవారం రాఘోపూర్‌ జిల్లాకు పని నిమిత్తం వెళ్లారు. తన బంధువులతో కలిసి వెళ్తున్న ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అరుణాచల్‌ప్రదేశ్‌ అగ్నిప్రమాదం... 23 దుకాణాలు దగ్ధం

ఇటానగర్ : అరుణాచల్‌ప్రదేశ్‌ లోహిత్‌ జిల్లాలోని మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 23 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. పోలీసులు కథనం ప్రకారం.. టిజు మార్కెట్‌లో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. మార్కెట్‌ ప్రాంతంలోని 23 దుకాణాలకు మంటలు వ్యాపించడంతో షాపుల్లోని వస్తువులన్నీ కాలి బూడిదైనట్లు డిప్యూటీ కమిషనర్‌ టమియో తెలియజేశారు.

13:45 - February 6, 2016

తూ.గో : కాపులకు రిజర్వేషన్‌ కల్పించాలంటూ దీక్ష చేస్తున్న ముద్రగడతో టీడీపీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు చర్చలు జరిపారు. ముద్రగడ పద్మనాభం డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని.. వెంటనే ఈ సమస్య పరిష్కరించబడుతుందని ఆశిస్తున్నట్లు బొడ్డు భాస్కరరామారావు చెప్పారు.

13:44 - February 6, 2016

తూ.గో : ముద్రగడ దీక్షకు మద్దతుగా కాపు నేతలు కొందరు పళ్లాలను స్పూన్లతో మోగిస్తూ అర్ధనగ్నంగా ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు ఇప్పటికైనా కాపులకు రిజర్వేషన్‌ కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు.

13:43 - February 6, 2016

హైదరాబాద్ : దక్షిణాది కుంభమేళాపై కేంద్రం చిన్న చూపు చూస్తోంది.. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరపై బీజేపీ హామీలు నీటి మూటలవుతున్నాయి.. జాతీయ పండుగగా మారుస్తామన్న ప్రకటన మాటలకే పరిమితమైంది.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

జాతీయ పండుగగా చేస్తామంటూ ఎన్నికలకు ముందు బీజేపీ హామీ...

దక్షాణాది కుంభమేళాగా ప్రసిద్ధికెక్కింది మేడారం జాతర.... తాము అధికారంలోకివస్తే ఈ జాతరను జాతీయ పండుగగా చేస్తామంటూ ఎన్నికలకు ముందు బీజేపీ హామీ ఇచ్చింది.. ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయింది.. ప్రభుత్వం స్థాపించి 18 నెలలు గడుస్తున్నా ఆ హామీ విషయమే పట్టించుకోవడంలేదు..

1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం....

ఊర్లు, వాడలు ఏకమై జనసంద్రంగా మారే ఈ గిరిజనుల పండుగ దేశవ్యాప్తంగా పేరుగాంచింది... 1996లో అప్పటి ఏపీ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఉత్తర, దక్షిణ భారత దేశాలకు వారధిగా ఉన్న ఈ జాతర... దేశంలోని అన్ని గిరిజన జాతులను ఏకం చేస్తూ మహా కుంభమేళాలాగా జరుగుతుంది. ఇక మధ్య భారతదేశంలోని గిరిజన ప్రజలు ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క-సారలమ్మలను కచ్చితంగా దర్శించుకుంటారు. ఎంపీ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, ఏపీ, కర్ణాటక, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ర్టాల నుంచి దాదాపు కోటిమంది ఈ జాతరకు తరలివస్తారు..

నవంబర్‌లో కేంద్ర గిరిజన శాఖామంత్రిని కలిసిన బీజేపీ నేతలు.....

సార్వత్రిక ఎన్నికలకు ముందు... తమను గెలిపిస్తే మేడారంను జాతీయ పండుగగా ప్రకటిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.. ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయింది. అత్యంత ఘనంగా సాగే ఈ జాతర నిర్వహణ బాధ్యతల్ని మొదటినుంచీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. వివిధ అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు ఖర్చు చేస్తోంది.. ఈ జాతరను జాతీయ పండుగగా మారిస్తే కేంద్రం ఈ బాధ్యతల్ని తీసుకునే అవకాశం ఉంటుంది.. అలాగే జాతీయ స్థాయిలో ఈ పండుగకు మరింత ప్రాముఖ్యత లభిస్తుంది.. కొన్నేళ్లుగా ఆదివాసీ గిరిజన సంఘాలు, పార్టీలు ఈ డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్నా సర్కారునుంచి సమాధానం రావడంలేదు.. గత ఏడాది నవంబర్‌లో తెలంగాణ బీజేపీ నేతలు కేంద్ర గిరిజన శాఖామంత్రిని కలిసి ఈ విషయంపై విజ్ఞప్తికూడా చేశారు.. మంత్రి సానుకులంగా స్పందించారని చెబుతున్నా ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడంలేదు..ఈ గిరిజనుల మహా జాతరను ఇప్పటికైనా జాతీయ పండుగగా ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.. 

13:40 - February 6, 2016

ఢిల్లీ : బడ్జెట్‌ ప్రతిపాదనలపై రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ సమావేశమయ్యారు. ఈ నెల 29న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ప్రతిపాదనలు, రాష్ట్రాల నుంచి అందే వినతులపై చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అనేక రాష్ట్రాల నుంచి ఆర్ధిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

13:39 - February 6, 2016

హైదరాబాద్ : ఫిన్‌లాండ్‌ వేదికగా జరుగుతున్న ఐస్‌ క్రాస్‌ వరల్డ్ చాంపియన్‌షిప్‌ పోటీలు టాప్‌ గేర్‌లో పడ్డాయి. మొత్తం పది రౌండ్లలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో టాప్‌ క్లాస్‌ ఐస్‌ స్కేటింగ్‌ స్పెషలిస్ట్‌లు పోటీపడ్డారు. ఇప్పటివరకూ ముగిసిన ఐదు రౌండ్ల పోటీల్లో జర్మనీకి చెందిన స్కాట్‌ క్రోక్సల్‌ అదరగొట్టాడు. మికెల్స్‌, రాబర్ట్‌సన్‌, ఆడమ్‌ జోన్స్‌ వంటి టాప్‌ క్లాస్‌ కంటెస్టంట్స్‌ను వెనుక్కు నెట్టి ఓవరాల్‌ స్టాండింగ్స్‌లో 750 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ప్లేస్‌లో నిలిచాడు.

13:13 - February 6, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో టిఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం గ్రేటర్ ఎన్నికల ఓటమి, గెలుపు అంశాలపై మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లో 'సాధారణంగా అధికారంలో టిఆర్ ఎస్ చేపట్టిన అభివృద్ధికార్యక్రమాలను చూసి ఓటు వేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి...పార్టీల మనోధైర్యాన్ని దెబ్బతీయడంలో టిఆర్ ఎస్ సక్సెస్ అయ్యింది. టూ బెడ్ రూం ఇళ్లు కావాలంటే టిఆర్ ఎస్ కు ఓటు వేయాలనే నినాదాన్ని అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లడం అధికార పార్టీ సక్సెస్ అయ్యింది. టిడిపి, బిజెపి వాస్తవ విషయాలను తెలియజేయడంలో విఫలం అయ్యాం. ఓటమితో కుంగిపోం. ప్రతిపక్ష పార్టీగా ప్రజలపక్షాన నిలబడి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల అమలుకు పోరాడతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం రాబట్టడంలో ప్రత్యేక కృషి చేస్తామన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వం పై ఒత్తి తెస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు టిఆర్ఎస్ మంచి పరిపాలన అందించాలని' కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

పోలీసుల ఆధీనంలో ముద్రగడ నివాసం...

తూ.గో : కాపు రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడ పద్మనాభం నివాసాస్ని పోలీసులు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. అయితే ముద్రగడకు మద్దతు తెలిపేందుకు వస్తున్న అభిమానులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

12:45 - February 6, 2016

హైదరాబాద్ : గ్రూప్‌ తగాదాలవల్లే తమ పార్టీ ఓడిపోయిందన్నారు... కాంగ్రెస్‌ నేత దానం నాగేందర్.. కాంగ్రెస్‌ తనకు పూర్తి బాధ్యతలు ఇవ్వకున్నా గెలుపుకోసం కృషి చేశానని చెప్పుకొచ్చారు.. గ్రేటర్‌ అధ్యక్షుడిగా మళ్లీ పనిచేయనని తేల్చి చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ గ్రేటర్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానన్నారు.

12:44 - February 6, 2016

హైదరాబాద్ : ప్రజలు తమపై బాధ్యత పెట్టారని.. ఎన్నికలసందర్భంగా హామీలను సక్రమంగా నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. శనివారం బన్సీలాల్‌పేట హమాలీ బస్తీలో ఇంటింటికి తిరిగి.. సమస్యలను తెలుసుకునేందుకు మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 'టెన్ టివి'తో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామని చెప్పారు. గెలుపు ధీమాతో విర్రవీగకుండా బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికైన ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేయకుం డా నిర్మాణాత్మక సూచనలు చేయాలని హితవు పలికారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. 

12:43 - February 6, 2016

హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతుల ఆమరణ దీక్ష కొనసాగుతోంది. ముద్రగడ భార్య పద్మావతికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు షుగర్‌ లెవల్స్‌ పడిపోయాయని చెప్పారు. వైద్య బృందం ప్రతి 3గంటల కోసారి ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు నిన్న రాత్రి ముద్రగడతో చర్చలు జరిపారు. ముద్రగడ చెప్పిన అంశాలను ఇవాళ సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు భాస్కరరావు చెప్పారు. మరో వైపు ముద్రగడ దీక్షకు మద్ధతుగా జిల్లా వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి.

గ్రూపులను ప్రోత్సహించడం వల్లే ఓడిపోయాం: దానం

హైదరాబాద్ : పార్టీలో గ్రూపులను ప్రోత్సహించడం వల్లే గ్రేటర్ లో ఓడిపోయామని గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షపద వికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. సామాన్య కార్యకర్తగా పార్టీలో కొనసాగుతా అని తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్నారు. విజయం కోసం కృషి చేసినప్పటికీ గ్రేటర్ లో విజయం సాధించలేకపోయామన్నారు. నాకు పూర్తి బాధ్యతలు ఇవ్వకపోయినా కష్టపడి పనిచేశానన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో కొండచిలువ కలకలం

మెదక్ : ప్రభుత్వ పాఠశాలలో కొండ చిలువ కలకలం సృష్టించింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పరుగులు తీశారు. ఈ ఘటన నారాయణ్ ఖేడ్ పరిధిలోని గాంధీ నగర్ ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలోకి నేటి ఉదయం ఓ కొండచిలువ ప్రవేశించింది. అప్పటికే పాఠశాలలోకి చేరిన విద్యార్థులు, ఉపాధ్యాయులు కొండచిలువను చూసి బయటకు పరుగులు తీశారు. 

ఢిల్లీలో ఆర్థిక మంత్రుల సమావేశం ప్రారంభం.

ఢిల్లీ: రాష్ర్టాల ఆర్థిక మంత్రుల సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ర్టాల ఆర్థిక మంత్రులు హాజరైయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రం తరపున మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అదేవిధంగా అన్ని రాష్ర్టాల ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు సమావేశానికి హాజరైయ్యారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రులతో జైట్లీ సమావేశం అవుతున్నారు.

11:37 - February 6, 2016

విశాఖ : నీలిరంగు ఆకాశం కిందకు దిగితే.. ఆ ఆకాశంలో హంసలు విహరిస్తేఎలా ఉంటుంది. పై నుంచి పౌర్ణమి చంద్రుడు కుంచె పట్టుకుని సముద్రంపై సాగరకన్యను చిత్రించి.. రంగులద్దితే ఎలా ఉంటుంది. విశాఖ సాగరతీరంలో యుద్ధ నౌకల విహారం అలాగే ఉంది. ఏరువాకలా సాగిన తెరచాపల కవాతు దీనికి తోడవటంతో.. అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ విదేశాల నుంచి వచ్చిన 70కి పైగా యుద్ధనౌకలు బాడీ బిల్డింగ్‌ పోటీల్లో కండలు చూపించడానికే అన్నట్లు ఆరు వరుసల్లో కవాతు సముద్ర అలలపై కవాతు నిర్వహిస్తున్నాయి. కాని యుద్ధంలో రణభేరి మోగించే నౌకల్లా కాకుండా, అందాల పోటీకి వచ్చిన వయ్యారి భామల్లా సముద్రనీటిపై గంభీరంగా..కదులుతూ.. చూపరులకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. విశాఖ సాగర తీరంలో కనపడుతున్న ఈ దృశ్యం అద్భుతం..అమోఘం.

70 యుద్ధనౌకలు ఒకదాని తర్వాత ఒకటి....

70 యుద్ధనౌకలు ఒకదాని తర్వాత ఒకటి నేలపై నడిచే గజరాజుల్లా.. నీటిపై పయనించనున్నాయి. ఆ ప్రదర్శనను తిలకిస్తూ గౌరవ వందనం స్వీకరించనున్నారు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ. ఈ యుద్ధనౌకలతో పాటు అందమైన తెరచాపలతో కూడిన నాటు పడవలు, దేశీయ నౌకలు సైతం ఈ ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి. 

11:34 - February 6, 2016

హైదరాబాద్ : ఐపీఎల్‌ సీజన్‌-9 హడావుడి మొదలైంది. ఆటగాళ్ల వేలంపాట బెంగళూరులో నడుస్తోంది. షేన్‌ వాట్సన్‌ను 9.50 కోట్లకు బెంగళూరు దక్కించుకోగా.. కెవిన్‌ పీటర్‌సన్‌ను 3.50 కోట్లకు పూణె దక్కించుకుంది. ఫాస్ట్‌బౌలర్‌ అశిష్‌నెహ్రాను హైదరాబాద్‌ జట్టు 5.50 కోట్లకు కొనుగోలు చేసింది. డ్వేన్‌ స్మిత్‌ను 2.3 కోట్లకు గుజరాత్‌ దక్కించుకుంది. మొత్తం 10 టీమ్‌లు 351 మంది ఆటగాళ్లను ఎంచుకోనున్నాయి.

11:32 - February 6, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి దానం నాగేందర్‌ రాజీనామా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ దానం రాజీనామా చేశారు. కాసేపట్లో దానం నాగేందర్‌ మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

గుంటూరు : కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ తో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడకు మద్దతుగా దీక్ష చేస్తున్న కాపు సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

రూ.7కోట్లకు యువరాజ్ సింగ్

హైదరాబాద్ : మరో రెండు నెలల్లో ఐపీఎల్‌ తొమ్మిదో సీజన్‌ మొదలవనున్న నేపథ్యంలో ఈరోజు నిర్వహించిన తొలిదశ వేలంలో ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వేలం ద్వారా 351 మంది ఆటగాళ్లను 10జట్లు ఎంచుకోనున్నాయి. ముందుగా పూణె సూపర్‌ జైంట్స్‌ వేలాన్ని ప్రారంభించింది. తొలి దశ వేలంలో మార్వీ్క ప్లేయర్ల జాబితాలో షేన్‌ వాట్సన్‌ అత్యధిక ధర పలికాడు. ఆస్ట్రేలియన్‌ ఆల్‌రౌండర్‌ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ని రూ.9.5కోట్లతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంచైజీ వేలంలో కొనుగోలు చేసింది.

గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం రాజీనామా

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేశారు. మరి కాసేపట్లో దానం మీడియాతో మాట్లాడున్నట్లు సమాచారం.

రాజాపూర్ వీర్వో పై కత్తులతో దాడి

మహబూబ్ నగర్ : జిల్లాలోని బాలా నగర్ మండలం రాజాపూర్ వీఆర్వోపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. వీఆర్వో రవిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

10:33 - February 6, 2016

తూ.గో : కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆయన సతీమణితో కలిసి చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరింది. ముద్రగడ సతీమణి పద్మావతికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు చక్కెర నిల్వల స్థాయిలు పడిపోయాయని తెలిపారు. వైద్య బృందం ప్రతి 3గంటల కోసారి ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. తుని సంఘనకు సంబంధించి నమోదు చేసిన కేసులను విత్ డ్రా చేయాలని, కాపు కార్పొరేషన్ కు 2000వేల కోట్లు కేటాయించాలని, కాపులను బీసీల్లో చేరాలని ఏర్పాటు చేసిన కమిషన్ ను 3 నెలలకు కుదించాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు నిన్న రాత్రి ముద్రగడతో చర్చలు జరిపారు. ముద్రగడ చెప్పిన అంశాలను ఇవాళ సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు భాస్కరరావు తెలిపారు.

ఐపీఎల్ -9 వేలం ప్రారంభం..

బెంగళూరు : ఐపీఎల్‌-9 కోసం ఆటగాళ్ల ఎంపికకు వేలం ఈరోజు ఉదయం బెంగళూరులో ప్రారంభమైంది. ఇంకో రెండు నెలల్లో ఐపీఎల్‌ తొమ్మిదో సీజన్‌ మొదలవనున్న నేపథ్యంలో ఈరోజు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. వేలంలో 351 మంది ఆటగాళ్లను 10జట్లు ఎంచుకోనున్నాయి. ముందుగా పూణె సూపర్‌ గెయిన్ట్స్‌ వేలాన్ని ప్రారంభించింది. ఇంగ్లాండ్‌కి చెందిన కెవిన్‌ పీటర్సన్‌ని రూ.3.5 కోట్లకు, భారత క్రికెటర్‌ ఇషాంత్‌ శర్మని రూ.3.8కోట్లకు పూణె సూపర్‌ గెయిన్ట్స్‌ దక్కించుకుంది. రూ.3.8 కోట్లకు ఇషాంత్‌ శర్మను పుణె జెయింట్స్‌ జట్టు దక్కించుకుంది.

గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి

హైదరాబాద్ : విశాఖ సాగర తీరంలో ప్లీట్ రివ్యూ ప్రారంభం అయ్యింది. నేడు అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నౌకాదళాల గౌరవవందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్, సీఎంచం ద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఐఎన్ ఎస్ సుమిత్రలో రాష్ట్రపతి, ప్రధాని మోదీ పర్యటించారు.

తిరుపతి రైల్వే ట్రాక్ యువజంట ఆత్మహత్య...

తిరుపతి : నగరంలోని పద్మావతి యూనివర్సిటీ రైల్వేగ్రేట్‌ సమీపంలో శనివారం ట్రాక్‌పై గుర్తు తెలియని యువజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ యువజంట వయసు 25 ఏళ్లు ఉంటాయని పోలీసులు చెప్పారు. రైల్వే పోలీసులు యువజంట మృతదేహాలను స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

09:14 - February 6, 2016

హైదరాబాద్ : విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నౌకాదళం గౌరవ వందనాన్ని స్వీకరించారు. 70 యుద్ధ నౌకల నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమిత్రలో రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి పరికర్, గవర్నర్ నరసింహిన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నౌకాదళ సమీక్షకు బయలుదేరారు. యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్ విన్యాసాలను వీక్షిస్తున్నారు.15 ఫార్మేషన్లలో విన్యాసాల్లో 45 యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. బోర్నెస్ట్రక్ ఫైటర్ మిగ్ 29కె, పీ8ఐ నేవీ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హెలికాఫ్టర్ కేఎం-31 విన్యాసాలు ప్రదర్శించనుంది.

నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జైట్లీ బడ్జెట్ చర్చలు...

ఢిల్లీ: వచ్చే బడ్జెట్‌కు సంబంధించి ముందస్తు చర్చల్లో భాగంగా రాష్ట్ర విత్త మంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ నేడు భేటీ కానున్నారు. కేంద్ర పథకాల కింద లభించే నిధులను ఖర్చు పెట్టడంలో మరింత వెసులుబాటును కల్పించడంతోపాటు, నిధుల కేటాయింపులు మరింత పెంచాలని రాష్ట్రాలు జైట్లీని కోరే అవకాశం ఉంది.

08:43 - February 6, 2016

గుంటూరు : కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గుంటూరులో బీసీ నేతలు అర్ధరాత్రి మెరుపు దీక్షలకు దిగారు. బీసీ నేతలు వరప్రసాద్‌, వరలక్ష్మి, అశోక్‌లు ఆమరణ దీక్ష చేపట్టినట్లు ప్రకటించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని వారు విమర్శించారు.

08:42 - February 6, 2016

విశాఖ : సాగరతీరం నేడు మరో అరుదైన ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతుంది. 70 యుద్ధనౌకలు ఒకదాని తర్వాత ఒకటి నేలపై నడిచే గజరాజుల్లా.. నీటిపై పయనించనున్నాయి. ఆ ప్రదర్శనను తిలకిస్తూ గౌరవ వందనం స్వీకరించనున్నారు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ. ఈ యుద్ధనౌకలతో పాటు అందమైన తెరచాపలతో కూడిన నాటు పడవలు, దేశీయ నౌకలు సైతం ఈ ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ నేవీ ఫ్లీట్‌ విన్యాసం కనులవిందు చేయబోతుంది. 

08:40 - February 6, 2016

హైదరాబాద్ : తైవాన్‌ను భూకంపం కుదిపేసింది. 17 అంతస్తుల భవనం ఒకటి భూప్రకంపనల ధాటికి కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. మిగతావారిని సహాయక సిబ్బంది సురక్షితంగా తప్పించనట్లు సమాచారం. రాయిటర్స్‌ కథనం ప్రకారం 10 రోజుల పాపతో పాటు 40 ఏళ్ల వ్యక్తి చనిపోగా.. 90 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. దక్షిణ తైవాన్‌లో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.4గా నమోదైంది. అనేకచోట్ల భవనాలు ఊగటం.. ఇళ్లలోని సామానులు కదలడంతో.. ప్రజలు భయభ్రాంతులయ్యా రు.

08:38 - February 6, 2016

హైదరాబాద్ : కల్వకుంట్ల తారక రామారావు.. ఇప్పుడు గ్రేటర్‌ హీరోగా సరికొత్త కీర్తిని సంపాదించు కున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్‌.. వ్యూహాత్మకంగా పావులు కదిపి.. టీఆర్ఎస్‌ను ఒంటి చేత్తో గెలిపించారు. తండ్రి అడుగు జాడలలో సాగుతూనే.. ఆయనకు తగ్గ వారసుడిగా తన సత్తాను చాటారు. అంతేకాదు.. పార్టీలోను, ప్రభుత్వంలోనూ కేసీఆర్‌ తర్వాతి స్థానం తనదేనని.. తానే నెంబర్‌-టూ అని ఈ గెలుపు ద్వారా తేటతెల్లం చేశారు.

ఎన్నికల షెడ్యూలు కన్నా ముందు నుంచే..

ఎన్నికల షెడ్యూలు కన్నా ముందు నుంచే.. కేటీఆర్‌ గ్రేటర్‌ పీఠాన్ని గెలుచుకునే వ్యూహాన్ని అమలు చేశారు. అభ్యర్థుల ఎంపిక మొదలు.. వారి తరఫున ప్రచారం.. విజయ వ్యూహరచన.. తదితర అంశాలపై అలుపెరుగని కృషి చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధికి తమ మదిలో ఉన్న ఆలోచనను ఓటర్ల ముందు అత్యంత పకడ్బందీగా ఆవిష్కరించారు. టీవీ మాధ్యమాలను ఉపయోగించుకుని.. తమ ప్రాధాన్యతలను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా.. అందరినీ ఆకట్టుకునేలా వివరించారు.

సీమాంధ్ర ఓటర్లనూ లక్ష్యంగా చేసుకొని..

గ్రేటర్‌ పరిధిలో అత్యధిక సంఖ్యలో ఉండే సీమాంధ్ర ఓటర్లనూ లక్ష్యంగా చేసుకొని.. కేటీఆర్‌ పావులు కదిపారు. ఉద్యమానికి ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదన్న అంశాన్ని ఆయన పదే పదే ప్రస్తావించారు. తనకు దొరికిన ప్రతి వేదికపైనా ఈ వాదనను వినిపిస్తూ.. సీమాంధ్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

గ్రేటర్‌లోని కీలక విపక్ష నేతలను..

ఇక రాజకీయంగానూ కేటీఆర్ తనదైన శైలిలో దూసుకు పోయారు. గ్రేటర్‌లోని కీలక విపక్ష నేతలను.. ముఖ్యంగా మాజీ కార్పొరేటర్‌లను టీఆర్ఎస్‌లోకి స్వాగతిస్తూ.. ప్రత్యర్థి పార్టీలకు నిద్ర లేకుండా చేశారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ తనకు అనుకూలంగా మలచుకుంటూ.. ముందుకు సాగారు. లోకేశ్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన తీరు ఆయన మాటల చమత్కారానికి దర్పణంగా నిలుస్తోంది.

ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. ....

కేటీఆర్‌ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి కాదు. గత సంవత్సరం వరంగల్‌ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయన తనదైన శైలిలో పార్టీ అభ్యర్థిని ఘన విజయం దిశగా నడిపించారు. తాను బాధ్యత స్వీకరించిన వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో.. టీఆర్ఎస్‌ అభ్యర్థికి అంతకు ముందు కన్నా ఓ ఎనిమిది వేల అధిక మెజారిటీని తెప్పించారు. దీని వెనుక కేటీఆర్‌ వ్యూహం తేటతెల్లం.

తండ్రి చాటు బిడ్డగా ఉద్యమంలోకి....

తండ్రి చాటు బిడ్డగా ఉద్యమంలోకి ప్రవేశించిన కేటీఆర్‌.. క్రమంగా పార్టీలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఓ గురుతరమైన బాధ్యతను చేపట్టి.. పార్టీని ఒంటరిగా విజయ తీరాలకు చేర్చాడు. గ్రేటర్‌ పరిధిలో కలియతిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్న కేటీఆర్‌కు.. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మున్సిపల్‌ శాఖను అప్పగిస్తానని సీఎం కేసీఆర్‌.. ఎన్నికల సభలో ప్రకటించారు. దీంతో కేటీఆర్‌పైనా.. కాలనీల సమస్యల పరిష్కారంపైనా.. గ్రేటర్‌ ప్రజల్లో ఎన్నో ఆశలు చిగురిస్తున్నాయి. వీటన్నింటినీ కేటీఆర్‌ ఎలా పరిష్కరిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

08:01 - February 6, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లకు 'న్యూస్ మార్నింగ్' లో పాల్గొన్న నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కారు జోరుకు అడ్డులేకుండా పోయింది. గల్లీ గల్లీలోనూ ఆ పార్టీ స్వీప్‌ చేసింది. టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, బీజేపీలు కూడా కుదేలయ్యాయి. 2009 గ్రేటర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌తో కలిసి గ్రేటర్‌ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్‌.. కారు జోరులో నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. ఇక అప్పటి ఎన్నికల్లో పోటీయే చేయని టీఆర్‌ఎస్‌ 99 సీట్లు సాధించి మేయర్‌ పీఠాన్ని స్వంతంగా దక్కించుకునేందుకు సిద్ధమైంది. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజల్ని ఆకిర్షంచిన అంశాలు ఏమిటి? విపక్షాలు విఫలం కావడానికి కారణాలు ఏమిటి? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టిఆర్ ఎస్ నేత నరేంద్ర గౌడ్, కాంగ్రెస్ నేత వకుళాభరంణ కృష్ణ ప్రసాద్, టిడిపి నేత రాజారాం యాదవ్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమల భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడకన వెళ్లే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

07:26 - February 6, 2016

హైదరాబాద్ : విశాఖ తీరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఫ్లీట్‌ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని మోడీలు విశాఖపట్నం చేరుకున్నారు. వీరికి గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. నేడు అంతర్జాతీయ నేవీ ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొననున్నారు. మరోవైపు 51 దేశాలకు చెందిన నౌకలు ఇప్పటికే విశాఖ తీరంలో సందడి చేస్తున్నాయి.

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.....

ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌ విశాఖపట్నం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్‌ ప్రణబ్ ముఖర్జీకి ఘనస్వాగతం పలికారు. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 11 వేల మంది నౌకా దళ సిబ్బంది హాజరుకానున్నారు. నేడు జరిగే తూర్పు నౌకాదళ ఫ్లీట్‌ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొంటారు.

గౌరవ అతిథిగా ప్రధాని మోదీ....

ఇదిలా ఉంటే నేడు జరిగే ఫ్లీట్‌ రివ్యూ కార్యక్రమానికి ప్రధాని మోడీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. కాగా ఇప్పటికే ప్రధాని మోడీ విశాఖ చేరుకున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. వీఐపీల రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

విశాఖకు క్యూ కట్టిన విదేశీ నౌకలు.....

ఇదిలా ఉంటే అమెరికా, ఇటలీ, జపాన్‌ దేశాల సైనికాధిపతులు, ఇతర ప్రతినిధులు ప్రత్యేక నావికా విమానాల్లో విశాఖ నగరానికి విచ్చేశారు. భారత నావికాదళం ఏర్పాటు చేసిన హోటళ్లలో విశ్రాంతి తీసుకుని, ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొంటారు. విశాఖ విమానాశ్రయానికి ఇప్పటికే సుమారు ఐదు ప్రత్యేక విమానాలు వచ్చాయి. ఈ మూడు రోజులు సుమారు 20 వరకు ప్రత్యేక విమానాలు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో దాదాపు 50 వరకు ప్రత్యేక విమానాలకు సరిపడా పార్కింగ్‌ సదుపాయాన్ని కల్పించారు.

07:23 - February 6, 2016

హైదరాబాద్ : కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. కాపులను బీసీల్లో చేరుస్తూ.. ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఆయన దీక్ష చేస్తున్నారు. ముద్రగడ సతీమణి పద్మావతి కూడా దీక్షలో కూర్చున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలోనే ముద్రగడ దంపతులు దీక్ష చేస్తున్నారు. పద్మనాభం దీక్షతో కిర్లంపూడిని పోలీసులు దిగ్బంధించారు.

స్పష్టమైన హామీ రాకపోవడంతో దీక్ష.....

కాపులకు బీసీ రిజర్వేషన్లు సాధించాలన్న డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం దంపతులు.. ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన నివాసంలోనే భార్య పద్మావతితో కలిసి దీక్షకు కూర్చున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు దీక్ష చేపట్టారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో దీక్ష ప్రారంభించక తప్పలేదని ముద్రగడ తెలిపారు.

ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ దంపతుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరి బీపీ, షుగర్‌ స్థాయులను వైద్యులు ఎప్పటి కప్పుడు పరీక్షిస్తున్నారు.

1900 కోట్ల రూపాయలను వెంటనే కేటాయించాలి...

చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంతోనే దీక్ష చేస్తున్నట్టు ముద్రగడ తెలిపారు. కాపు కార్పొరేషన్‌కు రెండేళ్లకూ కలిపి బకాయిలు 1900 కోట్ల రూపాయలను వెంటనే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. తుని ఘటనలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

ముద్రగడను పరామర్శించిన మాజీ ఎంపి హర్షకుమార్....

దీక్ష చేస్తున్న ముద్రగడను కాంగ్రెస్‌ మాజీ ఎంపీ హర్షకుమార్‌ పరామర్శించారు. ముద్రగడ దీక్షకు మద్దతు పలికారు. ఇది నిరంకుశ ప్రభుత్వమా లేక ప్రజాస్వామ్య ప్రభుత్వమా అని హర్షకుమార్‌ ప్రశ్నించారు. కమిషన్ల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు.

ఎంపీ వీహెచ్ పరామర్శ....

ముద్రగడను పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ వీ హనుమంతరావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగి... రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత దీక్షా శిబిరం దగ్గరకు అనుమతించడంతో ముద్రగడ దంపతులను వీహెచ్‌ పరామర్శించారు. దీక్షకు మద్దతు ప్రకటించారు.

కిర్లంపూడిని దిగ్బంధించిన పోలీసులు....

ముద్రగడ దీక్ష దృష్ట్యా కిర్లంపూడిని పోలీసులు దిగ్బంధించారు. దీక్షా శిబిరం దగ్గరకు కార్యకర్తలెవరూ రాకుండా చూస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించారు. రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ.. కాపులు ఒకపూట భోజనం మానేసి గరిటెలతో కంచాలను మోగించి నిరసన తెలిపారు.

దీక్ష విరమించాలని విజ్ఞప్తి.....

దీక్ష విరమించుకోవాలని ప్రభుత్వంతోపాటు, పలువురు కాపు నేతలు ముద్రగడకు విజ్ఞప్తి చేశారు. ముద్రగడ దీక్షపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్నంలో సమీక్ష నిర్వహించారు. కాపు రిజర్వేషన్లపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాపుల రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీక్ష విరమించుకోవాలని రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి నారాయణ ముద్రగడకు విజ్ఞప్తి చేశారు.

దీక్షను తప్పుపట్టిన బిసి నేత ఆర్ కృష్ణ....

మరోపైపు కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ దీక్ష చేపట్టడాన్ని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య తప్పుపట్టారు. బీసీ కమిషన్‌ నివేదిక వచ్చే వరకు కూడా ఆగలేకపోయారా.. అన్ని ప్రశ్నించారు. గతంలో ఏ కమిషన్‌ కూడా కాపు రిజర్వేషన్లకు సిఫారసు చేయలేదని కృష్ణయ్య స్పష్టం చేశారు.

బీసీ-కాపు ఐక్య వేదిక నేతలు తిరుపతిలో సమావేశం....

ముద్రగడ దీక్ష నేపథ్యంలో బీసీ-కాపు ఐక్య వేదిక నేతలు తిరుపతిలో సమావేశం నిర్వహించారు. కాపులను బీసీల్లో చేర్చుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టమైన హామీ ఇచ్చిన కారణంగా దీక్షను విరమించాలని ముద్రగడకు విజ్ఞప్తి చేశారు.

దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం .....

మరోవైపు కాపులను బీసీల్లో చేర్చాలంటూ దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.. ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదని మనస్తాపం చెందాడు.. ముద్రగడ ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపిన బాధితుడు... కాపులకు రిజర్వేషన్లులేక పిల్లల్ని చదివించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.. అక్కడినుంచి బయటకువచ్చి పురుగులమందు తాగాడు.. ఈ విషయం తెలుసుకున్న ASP దామోదర్‌ తన వాహనంలో దుర్గా ప్రసాద్‌ను కాకినాడ ఆస్పత్రికి తరలించారు. 

07:15 - February 6, 2016

హైదరాబాద్ : 400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ మహా నగరానికి జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కనీసం పోటీ చేసేందుకు సైతం వెనుకాడిన టీఆర్‌ఎస్‌ ఈ సారి 99 సీట్లు సాధించి ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో నిలిచింది. ఈ ఘన విజయానికి దారి తీసిన పరిస్థితులేంటి..? ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలకు కారణాలేంటి..? ఈ అంశాలపై సమగ్రకథనం...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.....

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 99 స్ధానాల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించి తనకు ఎదురులేదని నిరూపించింది. ఈ విజయానికి అధికార పార్టీ టిఆర్ఎస్ వేసిన ఎత్తులకు ప్రతిపక్షాలన్నీ చిత్తయ్యాయి. అయితే సీఎం కేసీఆర్‌ వ్యూహం, మంత్రి కెటిఆర్‌ కృషితో పాటు ఎన్నో అంశాలు కలిసి వచ్చాయి.

నగర వాసులను ఆకట్టుకున్న హామీలు...

ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ ఇచ్చిన హామీలు నగర వాసులను ఆకట్టుకున్నాయి. నేతల ప్రసంగాల్లో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నోసార్లు అవకాశాలిచ్చారని, తమకు ఒక్కసారి అవకాశమివ్వాలనే అంశం ప్రజలకు బాగా చేరింది. ప్రధానంగా ఆస్తిపన్ను, కరెంటుబిల్లు, వాటర్‌ బిల్లు మాఫీ అంశాలు బస్తీల్లోని ఓటర్లను ప్రభావితం చేశాయి. అలాగే అక్రమకట్టడాల క్రమబద్దీకరణ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల హామీ మధ్యతరగతి ప్రజలను ఆకర్షించింది.

అసంతృప్తులను బుజ్జగించడంలో సఫలం....

ఇక సంస్థాగతంగా టీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ అసంతృప్తులను బుజ్జగించడంలో సఫలమైంది. తమకు బలం లేని చాలా చోట్ల స్థానికంగా బలం ఉన్న ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంలో టీఆర్‌ఎస్‌ సఫలం అయ్యింది. గెలిచిన అభ్యర్థుల్లో మెజారిటీ అభ్యర్థులు గతంలో టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నుంచి వలస వచ్చిన వారే కావడం గమనార్హం.

మేయర్ పదవి గెలవకుంటే రాజీనామా చేస్తానన్న కేటీఆర్....

మేయర్ పదవి గెలవకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ సవాల్ చేయడం పని చేసింది. డివిజన్‌ రిజర్వేషన్ల విషయం సైతం అధికార పార్టీకి బాగా కలిసి వచ్చింది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలకు డివిజన్ల బాధ్యతలను అప్పగించగా వారంతా ప్రతి ఓటరు వద్దకు వెళ్లి వ్యక్తిగతంగా కలిసి మరీ ఓట్లు అభ్యర్థించారు. ఇక కెటిఆర్ సిటీలో గల్లీ గల్లీ తిరిగారు. పరేడ్ మైదానంలో కెసిఆర్ చేసిన ప్రసంగం సైతం గ్రేటర్‌ విజయానికి దోహదం చేసింది.

కేటీఆర్ ఉధృతంగా ప్రచారం....

కేటీఆర్ ఉధృతంగా సాగించిన ప్రచారం కూడా టీఆర్ఎస్ విజయానికి కారణమని అంటున్నారు. గ్రేటర్ ప్రచారంలో మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో ప్రచారం చేశారు. ముఖ్యంగా ''గాడిదకు గడ్డి వేసి ఆవును పాలివ్వమంటే ఇస్తుందా.. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్‌ను గెలిపించండి'' అన్న మాటలు కూడా ఓటర్ల మీద గట్టిగానే ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది.

సీమాంధ్రులు ఉండే ప్రాంతాల్లోనూ .....

గ్రేటర్ ఎన్నికల్లో విశేషం ఏమిటంటే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివసించే మాదాపూర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి డివిజన్లలో టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయం సాధించింది.  

07:11 - February 6, 2016

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బరిలోకి దిగిన వివిధ రాజకీయ పార్టీల నేతల వారసుల్లో కొందరిని అదృష్టం వరించగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. గతంలో ఎమ్మెల్యేలుగానూ మంత్రులుగానూ, కేంద్ర మంత్రులుగానూ పనిచేసిన వారి వారసులు గ్రేటర్‌ బరిలో నిలబడ్డారు. గ్రేటర్‌ సీటు ద్వారా తమ రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు వారసులంతా క్యూ కట్టడం ఈ సారి ఎన్నికల్లో చోటు చేసుకున్నమరో విశేషం.

బంజారాహిల్స్ నుండి కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు ప్రముఖుల వారసులను అదృష్టలక్ష్మి వరించింది. ఈ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వారసుల్లో టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఒకరు. ఆమె బంజారాహిల్స్ నుంచి గెలుపొందారు.

ఖైరతాబాద్‌లో పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి....

ఇక ఖైరతాబాద్‌లో ఇదే పార్టీ నుంచి బరిలోకి దిగిన పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి కూడా కార్పోరేటర్‌గా ఎన్నికయ్యారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ముషీరాబాద్ నుంచి గెలుపొందారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి అల్వాల్ నుంచి విజయం సాధించారు.

మహమూద్ అలీ తనయుడు మాత్రం ఓటమి....

ఫలితాల్లో టిఆర్ఎస్ దూసుకుపోతుంటే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తనయుడు మాత్రం ఓటమి పాలయ్యారు. అలాగే కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్‌ తనయుడు విక్రమ్ గౌడ్‌ సైతం పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించుకున్న విక్రమ్ గౌడ్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి మొదటిసారిగా మేయర్ అభ్యర్థిని ప్రకటించింది. అయినా ఓడిపోయింది.

బండా కార్తీక రెడ్డి ఓటమి....

మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి తార్నాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఆమె టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కార్తీక రెడ్డి నగర మేయర్‌గా వ్యవహరించారు. టిడిపి గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్‌కు గట్టి షాక్ తగిలింది. తన నియోజకవర్గంలో కూడా ఆయన అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. బంగారు లక్ష్మణ్ మనమరాలు స్రవంతి, ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి కోడలు అనితా రెడ్డి, ఆలె నరేంద్ర భార్య లలిత గ్రేటర్‌ ఎన్నికల్లో ఓడిపోయారు.

07:07 - February 6, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్‌ ప్రజ‌లు ఇచ్చిన తీర్పును శిర‌సావ‌హిస్తామ‌న్నారు టీడీపీ నేత‌లు. బ‌ల్దియా పీఠంపై టీఆర్ఎస్‌ను కూర్చోబెట్టాల‌ని ప్రజ‌లు నిర్ణయించార‌ని... ఈ ఎన్నిక‌ల్లో ప్రజ‌ల‌కు టీఆర్ఎస్‌ ఇచ్చిన హ‌మీల‌ను నిల‌బెట్టుకోవాల‌ని అన్నారు. అటు న‌గ‌ర‌ ప్రజ‌లు టీఆర్ఎస్‌కు ఓట్లు వేసినంత మాత్రాన త‌మ‌ను తిర‌స్కరించిన‌ట్టు కాద‌ని.. రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం అని విపక్ష నేతలు అంటున్నారు.

అధికార పార్టీకి అనుకూలంగా.....

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాలు అధికార పార్టీకి అనుకూలంగా వ‌చ్చాయ‌న్నారు టీడీపీ నేత‌లు. ఓట‌ర్ల తీర్పును తాము గౌర‌విస్తామ‌న్నారు. తమ అభ్యర్ధుల ఓట‌మికి కార‌ణాలు విశ్లేషించుకుంటామ‌ని చెప్పారు. అటు ఈ ఎన్నిక‌ల్లో ప్రభుత్వం ఇచ్చిన హమీల‌ను అమలు చేసేవ‌ర‌కూ ప్రజ‌ల ప‌క్షాన ఉండి పోరాడుతామ‌న్నారు. ఈ ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ముల‌పై పార్టీ ప్రభావం కంటే స్ధానిక స‌మ‌స్యలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయ‌న్నారు.

గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థులకు రేవంత్ అభినందనలు...

గ్రేట‌ర్ ఫ‌లితాలు అధికార పార్టీకి మేయ‌ర్ పీఠాన్ని క‌ట్టబెట్టాయ‌న్నారు టీడీపీ నేత రేవంత్‌రెడ్డి. ఈ ఎన్నిక‌ల్లో గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థులకు రేవంత్ అభినంద‌న‌లు తెలిపారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో వందసీట్ల గెలుపునకు సంబంధించిన సవాల్ విసిరింది తాను కాదని, ఆ సవాల్ విసిరింది మంత్రి కేటీఆర్ అని అన్నారు. సవాల్‌ను స్వీకరించానని తాను చెప్పినా.. ఆ తర్వాత కేటీఆరే వెనక్కి తగ్గారన్నారు. వందసీట్లు అనకుండా జెండా ఎగరవేస్తామని కేటీఆర్ త‌రువాత వివ‌రించారన్నారు. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడినంత మాత్రాన ప్రజలు తమను తిరస్కరించినట్టు కాదన్న రేవంత్‌.. ఫ‌లితాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వ‌న్నారు. గ్రేట‌ర్ ప్రజ‌ల‌కు అధికార పార్టీ ఇచ్చిన హమీల‌ను నేర‌వేర్చే విధంగా చూడాల్సిన బాధ్యత త‌మ‌పై ఉంద‌న్నారు. మొత్తం మీద గ్రేట‌ర్ ఫ‌లితాలు టీడీపీకి నిరాశ‌నే మిగిల్చాయి. ఇప్పటికే తెలంగాణ‌లో ప‌డుతూ లేస్తున్న ఈ పార్టీకి గ్రేట‌ర్ దెబ్బ శ‌రాఘాతంగా త‌గిలిందంటున్నారు తెలుగు త‌మ్ముళ్ళు.

07:05 - February 6, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌లో విజయంతో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తెలంగాణభవన్‌తో పాటు.. జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. బాణా సంచాకాలుస్తూ సందడి చేశారు.

మంత్రి కేటీఆర్‌కు కంగ్రాట్స్ చెప్పేందుకు.....

గ్రేటర్‌లో గెలుపుతో మంత్రి కేటీఆర్‌కు కంగ్రాట్స్ చెప్పేందుకు మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కేటీఆర్‌ను ప్రశంసలతో ముంచేత్తారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు కేటీఆర్‌ గాల్లోకి ఎత్తుతూ అభినందనలు చెప్పారు. రంగులు చల్లుకుంటూ... డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

సెటిలర్ల ఓట్లు అధికంగా ఉనా...

సెటిలర్ల ఓట్లు అధికంగా ఉన్న శేరిలింగంపల్లిలోనూ కారు హవా కొనసాగింది. నియోజకవర్గంలోని 10 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో...

మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల పట్టణంలోనూ టీఆర్‌ఎస్‌ శ్రేణులు గ్రేటర్‌ విక్టరీతో పండుగ చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. బాణసంచా కాల్చి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

కరీంనగర్ జిల్లాలో...

జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో.. కరీంనగర్‌ జిల్లాలో ఆపార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా కమలాకర్‌ బ్యాండ్‌ వాయించి కార్యకర్తల్లో జోష్‌ను నింపారు. అటు జగిత్యాలలోనూ టీఆర్ఎస్‌ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి తెలంగాణ తల్లికి పూలమాలవేశారు. అనంతరం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 

07:01 - February 6, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఘనవిజయం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్‌ జంటనగరాల ప్రజలపై వరాలు కురిపించారు. నగర చరిత్రలో ఏ ఒక్కపార్టీ కూడా స్వయంగా అధికారం చేపట్టిన దాఖలాలు లేవని... కానీ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు అద్భుత అవకాశం ఇచ్చారన్నారు. ఈ గెలుపుతో ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజల రుణం తప్పకుండా తీర్చుకుంటామని స్పష్టం చేశారు.

హామీలను వందశాతం అమలుచేస్తా....

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వందశాతం అమలుచేస్తామని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసిన వారికి ఈ ఫలితాలు చెంపపెట్టు లాంటివన్నారు. తెలంగాణ ప్రజలే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిలైన వారంతా టీఆర్‌ఎస్‌ను నమ్మి గెలిపించారని అన్నారు. డబుల్‌ బెడ్‌ ఇళ్ల నిర్మాణం, రెండు రిజర్వాయర్ల నిర్మాణం హామీలను వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. నగరంలో ఒక్క నిమిషం కూడా కరెంట్‌ పోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. స్కై వంతెనలు, సిగ్నల్‌ ఫ్రీ కూడళ్లు, మంచినీటి సరఫరా తదితర హామీలను నెరవేరుస్తామన్నారు.

మరో వెయ్యి పడకల సామర్థ్యం గల మూడు ఆస్పత్రులు...

ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు అనుబంధంగా నగరంలో మరో వెయ్యి పడకల సామర్థ్యం గల మూడు ఆస్పత్రులను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. శివారు ప్రాంతాల ప్రజల అవసరాలకు అనుగుణంగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించి ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. కూరగాయల మార్కెట్లు, స్మశాన వాటికల నిర్మాణం, బస్‌బేలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం తదితర హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంలో తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలను తిప్పి కొట్టిన ప్రజలు...

ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయని... వాటన్నింటినీ ప్రజలు తిప్పికొట్టారని కేసీఆర్‌ అన్నారు. కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా అన్ని వర్గాలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారన్నారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విపక్షాలకు సూచించారు. ఇదిలా ఉంటే గ్రేటర్‌ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హామీ అమలు విషయంలో కట్టుబడిఉంటామని కేటీఆర్‌ అన్నారు

టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర పరిపూర్ణం....

మొత్తానికి గ్రేటర్‌ విజయంతో టీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర పరిపూర్ణం అయ్యిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా డబుల్‌ బెడ్‌ రూం హామీపై ప్రజల్లో విస్తృత ప్రచారం ఏర్పడింది. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎంతమేరకు నగర వాసులకు డబుల్‌ బెడ్‌ రూం పథకం అందిచనుందో భవిష్యత్తులో తేలనుంది. 

నేతలు, కార్యకర్తల సమిష్టి కృషి ఫలితమే : కేసీఆర్

హైదరాబాద్ : గత ఎన్నికల రికార్డులను చెరిపేస్తూ గ్రేటర్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌కు చారిత్రక విజయం కట్టబెట్టారని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విజయం మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల సమిష్టి కృషి ఫలితమేనన్నారు.

06:57 - February 6, 2016

హైదరాబాద్ : అంచనాలకు మించిన గెలుపు. ఊహకందని అపూర్వ విజయం. సవాళ్లను తిప్పికొట్టిన అఖండ విజయం. గ్రేటర్‌లో కనీవినీ ఎరుగని రీతిలో కారు దూసుకుపోయింది. బస్తీల ప్రజల నమ్మకం సాక్షిగా బల్దియాపై గులాబీ జెండా రెపరెపలాడింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.

సర్వేలను తల్లకిందులు చేస్తూ...

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించింది. సర్వేలను తల్లకిందులు చేస్తూ గ్రేటర్‌లో తిరుగులేని శక్తిగా అవతరించింది. 150 డివిజన్లకుగాను 99 స్థానాల్లో విజయం సాధించింది. మెజార్టీ స్థానాల్లో గులాబీ పార్టీ దూకుడు కనిపించింది.

ఫలితాలు వెలువడుతున్నకొద్దీ....

ఫలితాలు వెలువడుతున్నకొద్దీ టీఆర్ఎస్ అభ్యర్థుల విజయ పరంపర కొనసాగింది. మొత్తం 150 డివిజన్లలో పోటీ చేసిన టీఆర్ఎస్ 99 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ఎవరి మద్దతూ అవసరం లేకుండానే మేయర్‌ పదవిని దక్కించుకోబోతోంది. ఇక ఎంఐఎం 44 స్థానాల్లో విజయకేతనం ఎగురువేసింది. దీంతో మజ్లిస్‌ రెండోస్థానం సంపాదించి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇక ప్రధాన పార్టీలైన టీడీపీ కేవలం ఒకే ఒక స్థానంలో గెలవగా, మిత్రపక్షం బీజేపీ నాలుగింటితోనే సరిపెట్టుకుంది. గత ఎన్నికల్లో అత్యధికంగా 52 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ సైతం ఈ సారి డీలా పడింది. హస్తం పార్టీకి దక్కింది రెండు స్థానాలే. గ్రేటర్‌లో తొలిసారి పోటీ చేసిన టీఆర్ఎస్ బల్దియా చరిత్రలో కనీవినీ ఎరుగని విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. గులాబీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా కాలుస్తూ పండగ చేసుకున్నారు.

నేపాల్, తైవాన్ లో భారీ భూకంపం

హైదరాబాద్ : తైవాన్ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.4 గా నమోదయ్యింది. నేపాల్ లో కూడా భూకంప తీవ్రత 5.5 గా నమోదయినట్లు తెలుస్తోంది.

Don't Miss