Activities calendar

07 February 2016

పేకాట ఆడుతున్న పోలీస్ కానిస్టేబుళ్ల అరెస్టు

మహబూబ్ నగర్ : జిల్లాలోని అయోధ్యనగర్ పోలీసుల దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురు పోలీస్ కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.93,800 స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు పరారయ్యారు. 

21:59 - February 7, 2016

హైదరాబాద్ : గ్రూప్-2 నోటిఫికేషన్‌ నేపథ్యంలో పేద అభ్యర్థులకు నియో ఇనిస్టిట్యూట్ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటెన్సివ్ బ్యాచ్‌కు ఉచిత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో ఈ టెస్ట్ నిర్వహించారు. స్క్రీనింగ్ టెస్ట్‌కు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సంస్థ తరపున నగదు బహుమతి అందించారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ బాగుందని ప్రతిభను వెలుగులోకి తెచ్చేదిలా ఉందని విద్యార్థులు అన్నారు. 

21:55 - February 7, 2016

ఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థిని తన స్నేహితుడి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసు సంచలనం రేకెత్తిస్తోంది. ఆమె తల్లిదండ్రులు రెండు రోజులుగా కనిపించడం లేదని పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఓ వైపు ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగానే... పోలీసులకు.. శక్తినగర్ లోని తన స్నేహితుడి ఇంట్లో విగతజీవిగా కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతురాలి స్నేహితుడు నవీన్ ను అరెస్టు చేశారు. నవీన్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోవాలని యువతి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

 

21:51 - February 7, 2016

విశాఖ : సాగరతీరం సరికొత్త శోభను సంతరించుకుంది. రంగు రంగుల కాంతులు.. యుద్ధ విమానాల విన్యాసాలు.. భారీ యుద్ద నౌకల ప్రదర్శనలు.. మిగ్ 29 విమానాల విన్యాసాలతో సాగరతీరం పులకించిపోయింది. ఇంటర్నేషనల్ నేవీ ఫ్లీట్‌లో భాగంగా సాగిన ఈ విన్యాసాలను తిలకించేందుకు వచ్చిన ప్రజలతో విశాఖ తీరం జనసంద్రమైంది.

హౌరా అనిపించిన నేవీ ప్లీట్ రివ్యూ

విశాఖ సాగర తీరంలో నేవీ ప్లీట్ రివ్యూ హౌరా అనిపించింది. విశాఖ తీరం జనసంద్రంగా మారింది. దేశీ, విదేశీ నౌకల ప్రదర్శన.. దేశీయ యుద్ద విమానాల విన్యాసాలు అందరిని కట్టిపడేసాయి. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, పట్టాణాభివృద్దిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు.

విదేశాల నావికా దళాలు... పరేడ్ ప్లీట్ రివ్యూ

ఈ విన్యాసాల్లో వివిధ దేశాల నావికా దళాలు చేసిన పరేడ్ ప్లీట్ రివ్యూకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రధాని రాక అనంతరం.. విన్యాసాలు ప్రారంభమయ్యాయి. మెరైన్ కమెండోల మెరుపు దాడులు, సీకింగ్ ఎటాక్ హెలికాఫ్టర్లు, మిగ్-20 ఫైటర్ విన్యాసాలు, హారియర్ ఫైటర్ల దూకుడును చూసి ఆహుతులు మైమరచిపోయారు.

విదేశాల నౌకాదళ సిబ్బంది మార్చ్ ఫాస్ట్

అనంతరం.. వివిధ దేశాల నౌకాదళ సిబ్బంది మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. మధ్యలో కళాకారులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ఆస్ట్రేలియా నేవీ దళాలమ్యూజికల్ పరేడ్ అబ్బురపరిచింది. నావికా దళ యువతుల సాంప్రదాయ నృత్య ప్రదర్శన కళ్లప్పగించేలా చేసింది. వారి ప్రదర్శనను ప్రధాని సైతం ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు.

విశాఖ ప్రజల స్ఫూర్తి అభినందనీయం : ప్రధాని మోడీ

విశాఖ ప్రజల స్ఫూర్తి అభినందనీయమని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. హుదూద్ తుపాన్ వంటి విపత్తులు వచ్చినా చెక్కుచెదరని గుండె ధైర్యాన్ని ప్రదర్శించారని..వారికి తన అభినందనలు అన్నారు మోడీ. ఫ్లీట్‌ రివ్యూను అద్భుతంగా నిర్వహించిన నౌకాదళానికి ప్రధాని అభినందనలు తెలిపారు.

జనసంద్రంగా మారిన ఆర్కే బీచ్ గ్యాలరీలు

విశాఖలో నిర్వహిస్తున్న నేవీ ఫ్లీట్ రివ్యూను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ లోని గ్యాలరీలన్ని జనసంద్రంగా మారాయి. విన్యాసాలను దగ్గరి నుండి చూడలేని వారికి నగరంలో 50 ధియేటర్లలో ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రదర్శనలు ఏర్పాటు చేసింది .

 

 

21:45 - February 7, 2016

హైదరాబాద్ : ఇష్టానుసారంగా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారంటూ హైదరాబాద్‌లోని విజన్-40 ఐఐటి కోచింగ్ సెంటర్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గ్యానవాపి జూనియర్ కాలేజీతో టయప్‌ అయి టెన్త్‌ పాస్‌ కాని విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నారని అన్నారు. మరోపక్క ఇంటర్‌కు వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆరోపించారు. యాజమాన్యం ఎస్ఎఫ్‌ఐ కార్యకర్తలను అడ్డుకోవడంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది. విజన్-40 యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

21:42 - February 7, 2016

హైదరాబాద్ : మూస బడ్జెట్ రూపకల్పనకు చరమగీతం పాడాలనుకుంటోంది తెలంగాణ సర్కారు. ఉపయోగం లేని పథకాలను వదిలించుకోవడంతో పాటు.. వృధా ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. వాస్తవాలకు దగ్గరగా ఉండే బడ్జెట్‌ను రూపొందించాలని కేబినెట్ తీర్మానించింది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.

బడ్జెట్ రూపకల్పనపైనే ప్రధానంగా చర్చ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా బడ్జెట్ రూపకల్పనపైనే చర్చ జరిగింది. మూస బడ్జెట్ రూపకల్పనకు స్వస్తి పలకాలని కేసీఆర్ మంత్రులకు సూచించారు. వారం రోజుల్లోగా అన్ని శాఖలు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ప్రతిపాదనలు వచ్చాక మళ్లీ ప్రతి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఉపయోగంలో లేని పథకాలకు స్వస్తి పలకాలని కేసీఆర్ అన్నట్టు సమాచారం. ప్రతి శాఖకు ఎంత బడ్జెట్ కావాలో... ముందే నిర్ణయించుకోవడం...అలాగే కేటాయించిన బడ్జెట్‌ను సకాలంలో ఖర్చు పెట్టడం గురించి కేసీఆర్ మంత్రిమండలి సమావేశంలో సహచరులకు వివరించారు. వాస్తవాలకు దగ్గరగా ఉండేలా బడ్జెట్ రూపకల్పన చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. బడ్జెట్ పై పూర్తిస్థాయి సమీక్షలు జరిగాక మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

దుమ్ముగూడేం ప్రాజెక్టు రీడిజైనింగ్‌కు ఆమోదం

ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దుమ్ముగూడేం ఇంటిగ్రేటెడ్ లిఫ్టు ఇరిగేషన్ పథకం రీడిజైనింగ్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆ పథకానికి శ్రీరామ సాగునీటి పథకంగా పేరు మార్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాని ద్వారా ఖమ్మం జిల్లాలో అటవీ ప్రాంతం మినహాయించి...అన్ని ప్రాంతాలకు సాగునీటిని అందించవచ్చని సర్కారు భావిస్తోంది.

డైయిరీలకు లీటర్ కు రూ.4 ఇన్సెంటీవ్

ఇక విజయ డైరీకి ఎలాగైతే లీటర్‌కు 4 రూపాయల ఇన్సెంటీవ్ ఇస్తున్నారో.... రాష్ట్రంలో ఉన్న మిగిలిన డైయిరీలకు కూడా ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. అందుకోసం మంత్రివర్గ ఉపసంఘంని ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ సబ్‌కమిటీకి ఛైర్మన్‌గా పోచారం, సభ్యులుగా ఈటెల రాజేందర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఇక రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు హార్టికల్చర్‌ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. కల్తీ లేని నాణ్యమైన నిత్యావసర సరుకులను ప్రజలకు అందించేందుకు 200 ఎకరాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేయాలని డిసైడైయ్యింది. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు గాను... ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల క్రమబద్దీకరణ చట్టాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

చలనచిత్ర పరిశ్రమ అభివృ‌ద్ధికి కేబినెట్‌ సబ్ కమిటీ

రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృ‌ద్ధికి కూడా కేబినెట్‌ సబ్ కమిటీని వేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. దీనికి చైర్మన్‌గా తలసాని...సభ్యులుగా కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు వ్యవహరించనున్నారు. మొత్తంగా బడ్జెట్ సమావేశాల చుట్టూరా తిరిగిన కేబినేట్ సమావేశంలో ..ప్రతి శాఖ ప్రణాళికేతర వ్యయాన్ని 15 శాతం మేర తగ్గించుకోవాలని తీర్మాణించింది.

 

 

21:32 - February 7, 2016

హైదరాబాద్ : ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. హౌస్ కీపింగ్ చేస్తున్న కార్మికుడు సదానందం ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయాడు. దీంతో వారి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతి చెందిన హౌస్ కీపింగ్ కార్మికుడు సదానందం వృత్తిలో ఉండగా చనిపోయినందుకుగాను.. వారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని పలువురు కార్మికులు డిమాండ్ చేశారు.

కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : కృష్ణా పుష్కరాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలు నిర్వహించాలన్నారు. పుష్కరాలకు జరిగే సమయానికి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. నాగార్జున సాగర్, బీచ్ పల్లి, శ్రీశైలం వద్ద విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాలకు దాదాపు 50 ఘాట్లు నిర్మించాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 

21:17 - February 7, 2016

తూర్పుగోదావరి : కిర్లంపూడికి వీఐపీలు ఎవరూ రావొద్దని ఎస్పీ రవి ప్రకాశ్ పేర్కొన్నారు. వీఐపీలు వస్తే శాంతి భద్రతలు భంగం కలిగే అవకాశం ఉందన్నారు. వీఐపీలకు అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పారు. ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద భద్రతను తగ్గించేది లేదని స్పష్టం చేశారు. తుని ఘటన పునరావృతం అయ్యే అవకాశం ఉన్నందున భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 

ముద్రగడ ఇంటి వద్ద భద్రతను తగ్గించేది లేదు : ఎస్పీ రవి ప్రకాశ్

తూర్పుగోదావరి : ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద భద్రతను తగ్గించేది లేదని ఎస్పీ రవి ప్రకాశ్ అన్నారు. కిర్లంపూడికి వీఐపీలు ఎవరూ రావొద్దని తెలిపారు. వీఐపీలు వస్తే శాంతి భద్రతలు భంగం కలిగే అవకాశం ఉందన్నారు. వీఐపీలకు అనుమతి నిరాకరిస్తున్నామని చెప్పారు. తుని ఘటన పునరావృతం అయ్యే అవకాశం ఉన్నందున భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ముద్రగడ వారి మద్దతు తీసుకోవడం సిగ్గుచేటు : మంత్రి నారాయణ

విజయవాడ : ముద్రగడ పద్మనాభం.. వైసీపీ, కాంగ్రెస్ ల మద్దతు తీసుకోవడం సిగ్గుచేటని మంత్రి నారాయణ అన్నారు. దీక్షకు కాంగ్రెస్, వైసీపీలు సంఘీభావం తెలపడం అన్యాయమన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాపులకు ఏం చేసిందని నిలదీశారు. చిరంజీవి మంత్రిగా ఉన్న సమయంలో కాపుల రిజర్వేషన్ గుర్తుకు రాలేదా...? అని ప్రశ్నించారు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి 
హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. 

 

20:42 - February 7, 2016

హైదరాబాద్ : శ్రీరామ ఎత్తిపోతల పథకంతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఈ పథకానికి కేబినెట్‌ ఆమోదించిందని.. ఇందుకు కృషి చేసిన సీఎంకు జిల్లా తరపున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. శ్రీరామ ఎత్తిపోతల పథకానికి ఎటువంటి అనుమతులు అవసరం లేదని తుమ్మల స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించిన నికర జలాల్లో 50 టీఎంసీల వాడుకుంటున్నామన్నారు.

 

20:39 - February 7, 2016

హైదరాబాద్ : కల్తీలేని నాణ్యమైన సరుకులను అందించేందుకు హార్టీకల్చర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హార్టికల్చర్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రాసెస్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న 6 లక్షల 65 వేల హెక్టార్ల హార్టికల్చర్‌ తోటలకు అదనంగా...4 లక్షల 4వేల హెక్టార్లలో హార్టికల్చర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.

20:35 - February 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు గంటల పాటు సాగిన భేటీలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. దుమ్మగూడెం ప్రాజెక్టు రీడిజైన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమావేశం అనంతరం మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు శ్రీరామ సాగునీటి పథకంగా నామకరణం చేశామని తెలిపారు. దీని ద్వారా ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా రీ డిజైన్ ఉంటుందన్నారు. వీటితో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వేగవంతం చేయటంతో పాటు.. మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్స్ ఇళ్ల నిర్మాణం, ఉద్యోగుల డీఏ పెంపునపై కూడా చర్చ జరిగింది. 

బెంగళూరు శివార్లలో చిరుత సంచలనం

కర్నాటక : బెంగళూరు శివార్లలో చిరుతపులి కలకలం సృష్టించింది. శివారు ప్రాంతంలోని ఓ స్కూల్ లోకి దూకిన చిరుతపులి... ఆరుగురిని గాయపరిచింది. చిరుతపులిని పట్టుకునేందుకు స్కూల్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సుమారు అరగంట పాటు చిరుత హంగామా సృష్టించింది. చివరకు ఫారెస్ట్ సిబ్బంది.. మత్తు మందు ప్రయోగించి.. అదుపులోకి తీసుకున్నారు.

20:29 - February 7, 2016

కర్నాటక : బెంగళూరు శివార్లలో చిరుతపులి కలకలం సృష్టించింది. శివారు ప్రాంతంలోని ఓ స్కూల్ లోకి దూకిన చిరుతపులి... ఆరుగురిని గాయపరిచింది. చిరుతపులిని పట్టుకునేందుకు స్కూల్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సుమారు అరగంట పాటు చిరుత హంగామా సృష్టించింది. చివరకు ఫారెస్ట్ సిబ్బంది.. మత్తు మందు ప్రయోగించి.. అదుపులోకి తీసుకున్నారు.

 

ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్తత...

తూర్పుగోదావరి : దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులు, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణలు ఆయన నివాసానికి వెళ్లారు. ముద్రగడ అనుచరులు వారిని అడ్డుకున్నారు. ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా అనుచరులు కార్లను అడ్డుగా పెట్టారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. 

20:16 - February 7, 2016

తూర్పుగోదావరి : దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులు, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణలు ఆయన నివాసానికి వెళ్లారు. ముద్రగడ అనుచరులు వారిని అడ్డుకున్నారు. ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా అనుచరులు కార్లను అడ్డుగా పెట్టారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. ముద్రగడ దీక్షతో రాజకీయం కూడా వేడెక్కుతోంది. ముద్రగడ దీక్షకు మద్దతుగా కాపులు ఇప్పటికే పన్నెండు చోట్ల నిరాహార దీక్షలు చేస్తున్నారు. 
దీక్షను భగ్నం చేస్తే.. రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని కాపు సంఘం కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు. నేటితో పద్మనాభం దంపతుల దీక్ష మూడో రోజుకు చేరుకుంది.
ఆయన సతీమణి ఆర్యోగం క్షీణించినట్లు తెలుస్తోంది. 

 

20:01 - February 7, 2016

విశాఖ : భద్రతపై అన్ని దేశాల నౌకాదళాలు దృష్టి సారించాలని ప్రధాని మోడీ సూచించారు. విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలకు ఆయన హాజరై, ప్రసంగించారు. 90 శాతం వాణిజ్యం సముద్రాల ద్వారానే జరుగుతుందని చెప్పారు. సునామీ, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సవాళ్లను విసురుతున్నాయన్నారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను అద్భుతంగా నిర్వహించిన నౌకాదళానికి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

 

 

ఈనెల 18న మేడారం జాతరకు వెళ్లనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఈనెల 18న సీఎం కేసీఆర్ మేడారం జాతరకు వెళ్లనున్నారు. సమ్మక్క సారక్కలను సీఎం దర్శించుకోనున్నారు. 

19:45 - February 7, 2016

కడప : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలోముగ్గురు మృతి చెందారు. సుండుపల్లి మండలం రాచమోళ్ల పల్లి సమీపంలో రెండు ఆటోలు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

19:37 - February 7, 2016

చిత్తూరు : జిల్లాలోని చంద్రగిరి మండలం రామిరెడ్డి గారిపల్లెలో ఈ ఉదయం పెద్ద ఎత్తున జల్లికట్టు పోటీలు జరిగాయి. నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు హీరో మనోజ్ ఈ వేడుకకు హాజరయ్యారు. పోటీల అనంతరం మోహన్‌బాబు మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఈ పోటీలు సాంప్రదాయంగా వస్తున్న ఆచారాలని జంతువులకు ఏ హానీ జరగకుండా పోటీలు నిర్వహించారని మంచు మనోజ్‌ అన్నారు.

 

19:26 - February 7, 2016

ఢిల్లీ : భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ప్రాణాలను కాపాడే మందులపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సుమారు 76 రకాల మందులపై.. కస్టమ్స్ సుంకం మినహాయింపులను కేంద్రం రద్దు చేసింది. ఈ జాబితాలో హెచ్‌ఐవీ నియంత్రణకు సంబంధించిన పది మందులు కూడా ఉన్నాయి.

సుంకం మినహాయింపు ఉపసంహరణ 

భారత ప్రభుత్వం.. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న 76 మందులపై కస్టమ్స్ సుంకం మినహాయింపులను ఎత్తి వేసింది. దాదాపు 22 శాతం మేర అనుమతించిన సుంకం మినహాయింపును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో.. ప్రాణాలు పోసే మందుల ధరలు పెరగనున్నాయి.

హిమోఫిలియా వ్యాధిగ్రస్థులపై తీవ్ర ప్రభావం

ప్రభుత్వ చర్య కారణంగా.. భారత్‌లోని హిమోఫిలియా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. జన్యు సంబంధమైన హిమోఫిలియా సోకిన వారిలో.. చిన్నపాటి గాయానికి కూడా రక్తం అధికంగా స్రవిస్తుంది. వ్యాధిని నియంత్రించే మందులను ఇంతకాలం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రభుత్వ చర్యతో.. హిమోఫిలియా వ్యాధిగ్రస్థులు మందులకోసం రెట్టింపు ధరలు చెల్లించాల్సి ఉంటుంది.

క్యాన్సర్‌, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు స్వల్ప ఊరట

ప్రభుత్వ చర్య కారణంగా భారత్‌లోని క్యాన్సర్‌, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు వెంటనే వచ్చే ఇబ్బందులేమీ లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధులకు సంబంధించిన జెనరిక్ మందులు ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. పైగా ఇవి విదేశీ మందుల కన్నా కూడా బాగా చవకగా దొరుకుతున్నాయి. ఎటొచ్చీ భారత్‌లో ప్రత్యామ్నాయం లేని మందులపై.. సుంకం మినహాయింపు ఉపసంహరణపైనే ఆందోళన వ్యక్తమవుతోంది. మినహాయింపులు రద్దయిన 76 రకాల మందుల్లో.. ప్రతి ట్యాబ్లెట్‌పైనా కనీసం నాలుగు రూపాయలు పెరిగే అవకాశం ఉంది. విదేశీ మందులకు సుంకం మినహాయింపు నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జనవరి 28నే విడుదల చేసినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

19:17 - February 7, 2016

ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెంలో 4వ రోజు సైన్యంలో చేరేందుకు ఆసక్తి కనబరిచిన నిరుద్యోగులకు ఆర్మీ అధికారులు వివిధ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 5 నుండి 6 వేల మంది నిరుద్యోగులు ఎంపిక కేంద్రం వద్ద బారులు తీరారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఛాతి కొలత, పరుగుపందాలను అధికారులు నిర్వహించారు. వీరిలో అర్హులైన వారిని రెటీనా టెస్ట్ కోసం హాల్ టికెట్లు మంజూరు చేశారు. ఫిబ్రవరి 28 న సికింద్రాబాద్ లో జరిగే రాతపరీక్షకు హాజరుకావాలని అధికారులు తెలిపారు.

19:13 - February 7, 2016

విశాఖ : గడిచిన రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీ పాలనలో మోసపోయారని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక చైర్మన్, ఎమ్మెల్సీ శర్మ పేర్కొన్నారు. ఫిబ్రవరి 5న విశాఖ ప్రభుత్వ అతిధి గృహంలో సీఎంను కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరితే ..పట్టించుకోలేదని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అవసరం లేదని సీఎం అనడం సరికాదన్నారు. 20 నెలల్లో ఉత్తరాంధ్రకు ఏం చేశారో తెలిపాలని శర్మ డిమాండ్ చేశారు.

 

 

19:09 - February 7, 2016

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌కు వరప్రదాయిని లాంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డి విమర్శించారు. తక్షణమే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి 2వేల కోట్లు విడుదల చేయాలని నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవిందపాణేను కోరినట్లు ఎంపీ తెలిపారు. ప్రత్యేక హోదా సంపాదించుకునే విషయంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. తుని హింసాత్మక సంఘటనలకు ప్రభుత్వ వైఫల్యమే కారణని ఆరోపించారు.

 

19:02 - February 7, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈవీఎంలను ముందుగానే టాంపరింగ్‌ చేశారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శ్రవణ్‌, మాజీ మేయర్‌ బండా కార్తీకరెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌ ఎన్నికలకు ముందుగానే.. 100 సీట్లు గెలుస్తామని చెప్పారని దానికి తగ్గట్లుగానే ఫలితాలు వచ్చాయన్నారు. అలాగే కొంతమంది అభ్యర్థులకు ఇంట్లో సభ్యులు వేసిన ఓట్లు కూడా పడలేదని వీడియో ఫుటేజ్‌లతో వివరించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.

 

 

18:54 - February 7, 2016

హైదరాబాద్ : 44 స్థానాలు గెలిచి.. పాతబస్తీలో సత్తా చాటిన మజ్లిస్‌ పార్టీలో... విజయోత్సాహం కన్నా నైరాశ్యమే ఎక్కువగా కనిపిస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో గతం కన్నా ఓ స్థానం ఎక్కువే గెలుచుకున్నా.. ఎంఐఎం నాయకత్వంలో ఆ జోష్‌ కనిపించడం లేదు. నేతల మధ్య అంతరాలు.. శ్రేణుల్లో లుకలుకలు.. ఎంఐఎం నాయకత్వాన్ని కలవర పరుస్తున్నాయి. పైగా పాతబస్తీలో జరిగిన అవమానాలు, అధినాయకులపైనే  పోలీసు కేసులు.. ఎంఐఎం శ్రేణులను కలతకు గురి చేస్తున్నాయి

మజ్లీస్‌లో భిన్నమైన వాతావరణం..

ఏ ఎన్నికల్లోనైనా... గెలిచిన పార్టీ విజయోత్సవాల్లో మునిగి తేలుతుంది. అయితే మజ్లీస్‌ పార్టీలో దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఎంఐఎం ప్రధాన కార్యాలయం దారుసలాంలో ఎన్నడూ లేని గంభీర వాతావరణం కనిపిస్తోంది. విజయాలతో ఆలింగనం కంటే పోలింగ్‌ సమయంలో చోటు చేసుకున్న ఘటనల ఆవేదనలతో కూడిన కరచాలనాలే కనిపిస్తున్నాయి. 

నేతల్లో పెరిగిన వర్గపోరు

ఎంఐఎంలో ఇటీవల నేతల మధ్య వర్గపోరు బాగా పెరిగింది. ఇది పార్టీ జయాపజయాలను దెబ్బతీస్తుందన్న భావన పార్టీ అధినాయకత్వంలో ఉండేది. మరోవైపు... మజ్లిస్‌ పార్టీకి పట్టున్న డివిజన్‌లలో గతంలో ప్రత్యర్థి పార్టీలు కన్నెత్తి చూసేవి కావు. అలాంటిది ఈసారి బీజేపీతో పాటు టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మజ్లిస్‌ అడ్డాల్లోకి దూసుకు వెళ్లారు. మజ్లిస్‌ నాయకత్వం దీన్నీ ఓ సవాలుగా భావిస్తోంది. పైగా ఇప్పటికే గౌస్‌ వంటి పలువురు నేతలు పార్టీకి వీడ్కోలు పలికారు. క్రియాశీలక కార్యకర్తలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందిని కలిగిస్తాయని ఎంఐఎం నాయకత్వం భావిస్తోంది. అయితే ఇవేవీ పట్టని.. మైనారిటీ ఓటర్లు.. పాతబస్తీలో ఎంఐఎం ఉండితీరాలన్న భావనతో ఆపార్టీకి పట్టం కట్టారు. 

కలవర పెట్టిన పోలీసు కేసులు 

ఏవైనా కేసుల్లో..  పార్టీ కేడర్‌నే పోలీసు స్టేషన్‌ దరిదాపుల్లోకి వెళ్లనిచ్చే వారు కాదు ఒవైసీ సోదరులు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. చార్మినార్‌ పోలీసు స్టేషన్‌లో ఎమ్మెల్యే అహ్మద్‌ పాషా ఖాద్రీని నిర్భంధించారు. చాదర్‌ఘాట్‌లో మలక్‌పేట ఎమ్మెల్యే బలాలాను అరెస్ట్‌ చేశారు. ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపి అసదుద్దీన్‌పై మీర్‌చౌక్‌ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. అక్బరుద్దీన్‌పై కూడా చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు మజ్లీస్‌ పార్టీలో కీలకం వ్యవహరించే పలువురు ద్వితీయ స్థాయి నేతలపై కేసులు నమోదు అయ్యాయి.

పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించిన అధిష్టానం

కేసులను ఎదుర్కొంటూనే పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలను పరిష్కరించడం.. పార్టీని చక్కదిద్దడం తక్షణ కర్తవ్యంగా మజ్లిస్‌ నాయకత్వం భావిస్తోంది. మరోపక్క కాంగ్రెస్‌ పార్టీతో విభేదాల వల్ల.. ఆ పార్టీకి చెందిన కొందరు మైనారిటీ ఓటర్లు మజ్లిస్‌కు దూరమయ్యారన్న భావనతో.. వారందరినీ తిరిగి ఎంఐఎం వైపు ఆకర్షించడం తక్షణ కర్తవ్యంగా ఆపార్టీ విశ్వసిస్తోంది. వీటికి సంబంధించి మజ్లిస్‌ కేంద్ర కార్యాలయం దారూసలాంలో మేథోమథనం జరుపుతున్నారు. మరి వీరి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. 

18:51 - February 7, 2016

ఢిల్లీ : బాస్మతి బియ్యానికి... జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌.. జీఐ ని పొందేందుకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. లాహోర్‌ ప్రాంత బాస్మతి ఉత్పత్తిదారులు వేసిన పిటిషన్‌ను.. ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ అప్పిలేట్‌ బోర్డు.. ఐపీఏబీ.. తోసిపుచ్చింది. భారతీయ బాస్మతి బియ్యానికి జీఐ ట్యాగ్‌ వేసుకునేందుకు అవకాశాన్ని సానుకూల పరిచింది.

లాహోర్‌ బాస్మతి ఉత్పత్తిదారుల అభ్యంతరాలు తోసిరాజన్న ఐపీఏబీ

ఏడేళ్ల పోరాటం ఫలించింది. భారతీయ బాస్మతి బియ్యానికి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌.. జీఐని పొందేందుకు చేస్తున్న పోరాటంలో ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌ పరిసరాల్లోని బాస్మతి ఉత్పత్తిదారులు.. బియ్యంపై జీఐ ట్యాగ్‌ కోసం వేసిన పిటిషన్‌ను ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ అప్పిలేట్‌ బోర్డు.. తోసిపుచ్చింది. అంతేకాదు.. నాలుగు వారాల్లోగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి జీఐని మంజూరు చేయాలని చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

ఆరు వారాల్లోగా ఉత్తర్వుల జారీకి ఐపీబీఏ ఆదేశాలు

భారత్‌లో.. గంగా పరీవాహక ప్రాంతాలైన పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు.. జమ్మూ, కతువా జిల్లాల్లో బాస్మతిని పండిస్తున్నారు. ఈ జాబితాలో తమనూ చేర్చాలని కోరుతున్న మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాల విజ్ఞప్తులనూ పరిగణలోకి తీసుకోవాలని అప్పిలేట్‌ బోర్డు ఆదేశించింది. అపెడా అభ్యంతరాలు, రెస్పాండెంట్స్‌ వాదనలు విని.. ఆరు వారాల్లోగా పూర్తిస్థాయి ఉత్తర్వులు జారీ చేయాలని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

బాస్మతి ఉత్పత్తుల్లో భారతదేశమే అగ్రగామి

2014-15లో భారత దేశం, సుమారు 28వేల కోట్ల రూపాయల విలువ చేసే 37 లక్షల మెట్రిక్‌ టన్నుల బాస్మతి బియ్యాన్ని ఉత్పత్తి చేసింది. అపెడా లెక్కల ప్రకారం.. బాస్మతి ఉత్పత్తిలో భారతే అగ్రగామి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బాస్మతి బియ్యాన్ని సౌదీ అరేబియా, ఇరాన్‌, యూఏఈ, ఇరాక్‌, కువైట్‌ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తాజాగా ఐపీఏబి ఆదేశాలతో.. జీఐ ట్యాగ్‌ పొందిన మైసూర్‌పాక్‌, తంజావూరు వీణ, డార్జీలింగ్‌ టీల సరసన బాస్మతి బియ్యం కూడా చేరనుంది.

 

జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 45 లో కారు బీభత్సం సృష్టించింది. మైనర్లు మద్యంతాగి కారు నడిపారు. మాజీ కేంద్రమంత్రి శివశంకర్ ఇంటి గేటును కారు ఢీకొట్టింది.

 

టీడీపీ నేత లక్ష్మీనారాయణరెడ్డి హత్యకు కుట్ర

కర్నూలు : సంజాముల మండలం రెడ్డిపల్లిలో టీడీపీ నేత లక్ష్మీనారాయణరెడ్డి హత్యకు కుట్ర పన్నారు. కుట్రను కోవెలకుంట్ల పోలీసులు భగ్నం చేశారు. వైసీపీ నేత సూర్యనారాయణ రెడ్డితో సహా ఏడుగురుని పోలీసులు అరెస్టు చేశారు. నింధితుల నుంచి వేట కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు.

 

ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. మార్చి నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. వారంలోగా అన్ని శాఖలు ప్రతిపాదనలు పంపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు రీడిజైనింగ్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందని.. శ్రీరామ సాగునీటి పథకంగా నామకరణం చేసినట్లు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ చేయనున్నట్లు వివరించారు.

 

రేపట్నుంచి పట్టాలపైకి రత్నాచల్ ఎక్స్ ప్రెస్...

తూర్పుగోదావరి : రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులను అధికారులు రేపటి నుంచి పునరుద్ధరించనున్నారు. 

17:30 - February 7, 2016

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన వారిని శిక్షించాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. 'సేవ్ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సంయుక్తంగా సెమినార్ నిర్వహించారు. హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ పై చర్చలు కొనసాగించారు. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థుల మనోభావాలను గౌరవించాలన్నారు. విద్యార్థుల్లో వస్తున్న కొత్త అభిప్రాయాలను సమాజం అంగీకరించాలని ప్రొఫెసర్ హర గోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జాతీయ నాయకులు పాల్గొన్నారు.

 

కాపు ఉద్యమంపై ట్విట్టర్ లో స్పందించిన పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : కాపు ఉద్యమంపై జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. కాపు రిజర్వేషన్ అంశం టీడీపీ మ్యానిఫెస్టోలో ఉందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. ఎపి ప్రభుత్వం కాపు నేతలతో చర్చించాలని పవన్ తెలిపారు. ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పవన్ రేపు కిర్లంపూడికి వెళ్లే అవకాశం ఉంది. 

17:18 - February 7, 2016

హైదరాబాద్ : కాపు ఉద్యమంపై జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. కాపు రిజర్వేషన్ అంశం టీడీపీ మ్యానిఫెస్టోలో ఉందన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. ఎపి ప్రభుత్వం కాపు నేతలతో చర్చించాలని పవన్ తెలిపారు. ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పవన్ రేపు కిర్లంపూడికి వెళ్లే అవకాశం ఉంది.

 

16:51 - February 7, 2016

కడప : కరువు పరిస్థితులు, అప్పులు ఏపీలో ఓ రైతు ఆత్మహత్యకు కారణమయ్యాయి. కడప జిల్లా పుల్లంపేట మండలం మల్లెంవారిపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డి అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణమంటూ రాసిన లేఖ మృతుని జేబులో దొరికింది. వర్షాభావ పరిస్థితుల మూలంగా బోర్లలో నీరు పడకపోవడం, వ్యవసాయానికి తీసుకున్న రుణాలను చెల్లించాలని అధికారులు ఒత్తిడి చేయడం పైగా బోర్లు వేసేందుకు తెచ్చిన అప్పులు చెల్లించాలంటూ ఒత్తిడి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన మృతికి సిఎం విధి విధానాలే కారణమని లేఖలో రాశాడు. రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చినా అమలు చేయలేకపోయారని పేర్కొన్నాడు. 

 

16:49 - February 7, 2016

తూర్పుగోదావరి : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు సంఘీబావంగా కిర్లంపూడిలో దళితులు చేపడుతున్న రిలే దీక్షా శిబిరాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్న మాజీ ఎంపి జి.వి.హర్షకుమార్‌ను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. ప్రత్తిపాడులో హర్షకుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజమండ్రిలో ఆయన స్వగృహానికి తరలించారు. పోలీసుల చర్యపై హర్షకుమార్ మాట్లాడుతూ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసు బలగాలతో అణిచివేతకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. సామాజిక ఉద్యమాలకు సంఘీబావం ప్రకటించే నేతలను...గృహ నిర్బంధం చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని విమర్శించారు. 

16:40 - February 7, 2016

తూర్పుగోదావరి : వైద్య పరీక్షలకు ముద్రగడ పద్మనాభం అనుమతించడం లేదని పరీక్షల కోసం వచ్చిన వైద్యులు తెలుపుతున్నారు. 'మేము ఆరోగ్యంగానే ఉన్నామని.. ఏదైనా అవసరముంటే తామే సమాచారమిస్తామని ముద్రగడ తెలిపారని' వైద్యులంటున్నారు. అయితే చూడడానికి ముద్రగడ దంపతులు ఆరోగ్యంగానే కనిపిస్తున్నప్పటికీ.. బీపీ, షుగర్‌ ఉండడం వల్ల పరీక్షలు చేయకుండా ఏమీ చెప్పలేమని వైద్యులంటున్నారు. 

16:35 - February 7, 2016

కరీంనగర్‌ : జిల్లాలోని చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నీలం రమేశ్‌.. తన భార్య అనిత, ఏడాది వయసున్న కుమారుడికి విషమిచ్చాడు. వీరిద్దరు మృతి చెందిన అనంతరం.. గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గమనించి.. రమేశ్‌ను బావి నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రమేశ్‌ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులే ఘటనకు కారణమని తెలుస్తోంది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్య, కొడుకుకు తానే విషమిచ్చినట్లు రమేష్ పోలీసులకు తెలిపారు.

 

16:19 - February 7, 2016

తూర్పుగోదావరి : కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం దంపతుల దీక్ష  కొనసాగుతోంది. కాపు కుంటుంబాలు కిర్లంపూడిలో ఆందోళనకు దిగారు. విశాఖలో మంత్రుల సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. కాపు రిజర్వేషన్ పై కమిషన్ ద్వారానే ముందుకు వెళ్లాని నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ముద్రగడతో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. 

16:08 - February 7, 2016

హైదరాబాద్  : ఐటీ మంత్రి కేటీఆర్ కు  అదనంగా మున్సిపల్ శాఖను కేటాయించారు. ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. 5 వేల మంది కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగుల కరువు భత్యాన్ని 3.14 శాతానికి పెంచారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు రీడిజైనింగ్ కు ఆమోదం తెలిపారు. అటవీశాఖ వ్యయం 14 శాతం మేర తగ్గించుకోవాలని సీఎం ఆదేశించారు. బడ్జెట్ సమావేశాలతో పాటు 14 అంశాలపై చర్చిస్తున్నారు. 

15:56 - February 7, 2016

ఉత్తర కొరియా : ఐక్యరాజ్య సమితి ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా ఉపగ్రహ క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి 3,400 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం తేలిగ్గా ఛేదిస్తుంది. అణ్వాయుధాలను మోసుకెళ్లే ఈ క్షిపణి ప్రయోగంపై అమెరికా సహా, పలు దేశాలు మండిపడ్డాయి. ఉత్తరకొరియాది రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించాయి. గత నెల 6న హైడ్రోజన్‌ బాంబును పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించినప్పుడే అమెరికా, ఐరోపా దేశాలు మండిపడ్డాయి. ఖండాతర క్షిపణులను మోసుకెళ్లే రాకెట్ ను ఉత్తర కొరియా ప్రయోగించిన నేపథ్యంలో ఐక్యర్యాజ్య సమితి భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశ పరచాలని అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా డిమాండ్‌ చేశాయి.

 

15:53 - February 7, 2016

హైదరాబాద్ : మెట్రో పనుల కారణంగా మలక్‌పేట రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వాటర్‌ ట్యాంక్‌ ఢీకొట్టడంతో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు విద్యానగర్‌కు చెందిన కృష్ణమూర్తిగా గుర్తించారు. రోడ్డు ప్రమాదంతో చాదర్‌ఘాట్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

 

మంత్రి కేటీఆర్ కు అదనంగా మున్సిపల్ శాఖ

హైదరాబాద్ : ఐటీ మంత్రి కేటీఆర్ అదనంగా మున్సిపల్ శాఖను కేటాయించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కాపులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధం : యనమల

విజయవాడ : కాపులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించడమే తమ లక్ష్యమని చెప్పారు. దీక్ష ప్రజాస్వామ్య హక్కుగా అభివర్ణించారు. న్యాయం చేస్తామంటే దీక్ష చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. 

ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే కమిషన్ : గంటా శ్రీనివాస్

విజయవాడ : ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే కమిషన్ వేశామని ఎపి మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. సున్నిత అంశాన్ని జఠిలం చేయొద్దని హితవు పలికారు. ఎన్నికల హామీలను వంద శాతం నెరవేరుస్తామని చెప్పారు.

 

సబ్ కమిటీ, కాపు నేతలతో చంద్రబాబు భేటీ

విశాఖ : సబ్ కమిటీ, కాపు నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై చర్చించనున్నారు. 

15:13 - February 7, 2016

హైదరాబాద్ : సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభం అయింది. గ్రేటర్ ఎన్నికల గెలుపు నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి, అలాగే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. దీంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ పై కూడ కేబినేట్ చర్చించే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకునేలా సీఎం కేసీఆర్‌ సూచనలు చేయనున్నారు. నీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, డబుల్‌ బెడ్రూం పథకాల కేటాయింపులపై నిర్ణయం తీసుకొనున్నారు. ఈ సమావేశంలో మొత్తం 20 అంశాలు చర్చకు రానున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై చర్చించే అవకాశం ఉంది. టెంపరరీ ఉద్యోగుల రెగ్యులరైజ్ పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై చర్చ జరుగనుంది. ఉద్యోగులందరికీ 3.14 శాతం డీఏను పెంచేలా నిర్ణయం తీసుకునే అవకాశముంది. మంత్రి కేటీఆర్‌కు మున్సిపల్‌ శాఖ అప్పగింతపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ విజయంతో కేబినేట్‌ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం  ప్రారంభం అయింది. గ్రేటర్ ఎన్నికల గెలుపు నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి అలాగే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. దీంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ పై కూడ కేబినేట్ చర్చించే అవకాశం ఉంది. 

 

యాదాద్రిలో పోటెత్తిన భక్తులు..

నల్గొండ : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

 

సంగం ఆనకట్టను పరిశీలించిన జపాన్ బృందం..

నెల్లూరు : జిల్లాలోని సంగం ఆనకట్టను జపాన్‌కు చెందిన నిపుణుల కమిటి పరిశీలించింది. ఆదివారం ఆనకట్ట ప్రాంతానికి చెందిన ముగ్గురు సభ్యులు గల బృందం పరిశీలించింది. 

గన్నవరంలో ఉద్రిక్తత..

తూర్పుగోదావరి :జిల్లాలోని పి.గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముద్రగడపై ఏపీ డిప్యూటి సీఎం చిన రాజప్ప చేసిన వ్యాఖ్యలపై ఆయనపై కాపులు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన రాజప్పతో సహా టిడిపి ఫ్లెక్సీలను దహనం చేశారు. 

13:34 - February 7, 2016

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం నియంతలా వ్యవమరిస్తోందని ఏపీ పీసీస చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేస్తున్న దీక్షపై ఆయన మాట్లాడారు. ఆదివారం ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీసీల రిజర్వేషన్ లు పెరగడానికి, కాపులను బీసీల్లో పేర్చడం ఆస్కారం ఉందన్నారు. అన్ని పార్టీలు ఒప్పుకొన్నా కావాలని సమస్యను జఠిలం చేయవద్దని సూచించారు. రెండు మాసాల్లో సమస్యలను పరిష్కరించవచ్చని ముద్రగడకు సూచించడం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలని ప్రయత్నించడం జరిగిందన్నారు. కానీ ఏ ఒక్క అధికారి ఫోన్ తీయడం లేదని రఘువీరా ఆరోపించారు. 

13:31 - February 7, 2016

నల్గొండ : సూర్యాపేటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సూర్యాపేటలో కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూరు విగ్రహ ఏర్పాటుకు వామపక్ష నేతలు నిర్ణయం తీసుకున్నారు. కానీ విగ్రహాన్ని తామే ఏర్పాటు చేస్తామని పలు కులసంఘాలు ప్రకటించాయి. విగ్రహ ఏర్పాటుకు యత్నించిన సీపీఎం డివిజన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లతో సహా పలువురు వామపక్ష నేతలను మందస్తు అరెస్టు చేశారు. సూర్యాపేటలో 144 సెక్షన్ అమలు చేశారు. అధికార పార్టీ నేతలు, మంత్రి ఒత్తిడితో కులసంఘాలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వామపక్ష నేతలు ఆరోపించారు. 

13:20 - February 7, 2016

హైదరాబాద్ : కాపులను బీసీల్లో చేర్చాలనే దానిపై జరుగుతున్న ఉద్యమంపై ఏపీ ప్రభుత్వం ఆచూతూచి స్పందిస్తోంది. తాను చర్చలు చేపట్టేది లేదని ఆదివారం ఉదయం ముద్రగడ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టెన్ టివి ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం విశ్లేషణ అందించారు. ముద్రగడతో సన్నిహితంగా ఉన్న వారితో చర్చలు జరపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోందని, ఇప్పటికే కొంతమంది నేతలు సమావేశమైనట్లు తెలుస్తోందన్నారు. కాపు సామాజిక వుర్గాన్ని ఎలా సముదాయించాలి ? అనే దిశగా చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావడం లేదని తెలిపారు. గతంలో ముద్రగడతో టిడిపి నేతలు చర్చలు జరిపారని, జస్టిస్ మంజునాథన్ కమిషన్ కాల వ్యవధిని కుదించడం..కమిషన్ నిధులు పెంచడం..తదితర అంశాలపై ముద్రగడ స్పష్టమైన డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోందన్నారు. అంతేగాక తను పట్టువిడుపు, సర్దుబాటు ధోరణిలో ఉంటానని పేర్కొన్నట్లు సమాచారమన్నారు. 

8మంది జీహెచ్ఎంసీ అధికారుల సస్పెన్షన్..

హైదరాబాద్ : ముజ్రా పార్టీలో అనైతిక చర్యలకు పాల్పడి పోలీసులకు పట్టుబడిన 8 మంది జీహెచ్ఎంసీ అధికారులను కమిషనరన్ జనార్ధన్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. 

13:06 - February 7, 2016

హైదరాబాద్ : నగర శివారు ప్రాంతంలోని మాదాపూర్ ఖానామెట్ లో ముజ్రా పార్టీలో పాల్గొన్న జీహెచ్ఎంసీ సిబ్బందిపై కమిషనర్ జనార్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మధ్యాహ్నం వీరిపై వేటు వేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయిన తరువాత కొంతమంది సిబ్బంది జల్సాలకు, రాసలీలలకు తెరలేపారు. ఖానామెట్ లోని ఓ ఫాం హౌజ్ లో ముజ్రా పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో 24 మంది పాల్గొన్నారు. ఈ పార్టీలో యువతులు అశ్లీల నృత్యాలు చేశారు. సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది ఫాం హౌస్ పై దాడి చేశారు. దొరికి 24 మందిలో 8 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు. ముంబై నుండి నగరానికి వచ్చిన యువతులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ముంబై ఎయిర్ పోర్టులో భారీ బంగారం స్వాధీనం..

ముంబై : ఎయిర్ పోర్టులో అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణీకుడి వద్ద 26 బంగారు బిస్కెట్లు, 18 బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నారు. బంగారు బిస్కెట్ల విలువ 75, 10,485, గాజుల విలువ 4,90,622 విలువ ఉంటుందని అంచనా.

దీక్ష విరమించాలి ముద్రగడకు మంత్రి నారాయణ సూచన..

హైదరాబాద్ : కాపు ఉద్యమ నేత ముద్రగడ నిరహార దీక్ష విరమించాలని మంత్రి నారాయణ సూచించారు. కాపులకు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ మూడు రోజులుగా ముద్రగడ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. కాపులకు రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ మంజునాథ కమిషన్ కు కాలపరిమితి 9 నెలలు విధించడం జరిగిందని, ఇంకా 7 నెలల 23 రోజులే ఉందన్నారు. 

అది బాబుకే సాధ్యం - చిన రాజప్ప..

విజయవాడ : కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించడం సీఎం చంద్రబాబుకే సాధ్యమని హోం మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు. ఇప్పటికే మంజునాథ్ కమిషన్ నియమించి కాపు జాతి పట్ల తనకున్న చిత్తశుద్ధిని రుజువు చేసుకున్నారని తెలిపారు. సీఎం ఆస్తుల గురించి ముద్రగడ విమర్శలు చేయడం తగదని, తన ఆస్తుల విషయం సీఎం పారదర్శకంగా ఉన్నారని తెలిపారు. సీఎంపై అనవసర ఆరోపణలు చేయడం తగదని చిన రాజప్ప సూచించారు. 

ఐఎఫ్ఆర్ పాస్ ల రగడ..

విశాఖపట్టణం : పోలీసు కమిషనర్ ఆఫీసులో ఐఎఫ్ఆర్ పాస్ ల రగడ నెలకొంది. పాస్ లు కార్యాలయ వర్గాలు బ్లాక్ లో అమ్ముకుంటున్నాయి. మీడియా పాస్ లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. 

12:39 - February 7, 2016

విశాఖపట్టణం : అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష (ఐఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఆయనతో పాటు భారత నౌకాదళ చీఫ్ ఆర్ కె ధావన్, ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు హాజరు కానున్నారు. దీనితో ఆర్కే బీచ్ రోడ్డు ఆంక్షల మయంగా మారిపోయింది. కొన్ని పరిమితులకు లోబడి ప్రజానీకం లోనికి రావాల్సి ఉంటుంది. పాస్ లు లేనిదే బీచ్ లోకి అనుమతినివ్వడం లేదు. ఆధార్ తో కూడిన పాస్ తీసుకున్న వారికే అనుమతినిస్తారు. దాదాపు రెండు లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరౌతారని అధికారులు అంచనా వేస్తున్నారు. బీచ్ లో జరిగే యుద్ధ విన్యాసాలను తిలకించేందుకు భారీ ఎల్ సీడీలను ఏర్పాటు చేశారు. బీచ్ సమీపంలో ఉన్న అపార్ట్ మెంట్ ల వారికి కూడా పలు సూచనలు..ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్కరూ కూడా బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. నిర్ధేశించిన స్థలాల్లో కూర్చొని విన్యాసాలు చూడొచ్చని అధికారులు పేర్కొన్నారు. 

12:19 - February 7, 2016

తూర్పుగోదావరి : కాపులను బీసీలో చేర్చాలనే డిమాండ్ తో ముద్రగడ చేస్తున్న దీక్ష తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ఆయన వైద్య పరీక్షలకు నిరాకరించడం..నిర్వహించుకోవాలని పోలీసుల సూచనలతో వాతావరణం వేడెక్కుతోంది. ముద్రగడను పరామర్శించేందుకు..సంఘీభావం తెలిపేందుకు భారీగా కాపు నేతలు..కార్యకర్తలు..ప్రజలు భారీగా తరలివస్తున్నారు. జిల్లాల నుండి వస్తున్న వారిని అడుగడుగునా తనిఖీలు చేస్తుండడంపై కాపు నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మేమేమన్నా టెర్రరిస్టులామా ? పాకిస్థాన్ - భారత్ సరిహద్దులో ఉన్నట్లు అనిపిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ముద్రగడకు మద్దతు తెలుపుతూ పలు జిల్లాల్లో కాపు నేతలు నిరాహార దీక్షలకు పూనుకుంటున్నారు.

  • ఆదివారం ఉదయం ముద్రగడ దీక్షను కొనసాగించారు. అదే సమయంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ రవి ప్రకాష్ లు నివాసానికి చేరుకున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని ముద్రగడను కోరారు. దీనికి ముద్రగడ నిరాకరించారు.
  • సీఎం చంద్రబాబు నాయుడు మొండి అయితే తాను జగమెండి అని ముద్రగడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం రెండు ఎకరాల పొలం ఉన్న చంద్రబాబు అనతికాలంలో రూ. లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
  • తరువాత ముద్రగడ నివాసానికి పోలీసులు వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారూ కోరారు. పోలీసుల తీరును నిరసిస్తూ దీక్షా స్థలం నుండి మరో గదికెళ్లిన ముద్రగడ తలుపులు వేసుకున్నారు.
  • శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు ముద్రగడ దంపతులకు వైద్యుల బృందం వచ్చి పరీక్షలు నిర్వహించింది. బిపి, షుగర్‌ పరీక్షలు చేసి వెళ్లిపోయారు.
  • ఆ తర్వాత పోలీసు బలగాలు అధికంగా మోహరించాయని తెలిసిన ముద్రగడ.. సందర్శకులను ఆపవద్దని పలుమార్లు పోలీసులను కోరారు. అయినప్పటికీ పోలీసులు సందర్శకులను ఎక్కడికక్కడ నిలువరించారు.
  • ఉదయం పదిగంటలకు రెండోసారి వైద్య పరీక్షలు చేసేందుకు వచ్చిన వైద్య బృందాన్ని తమకు పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని తిప్పిపంపారు. 

పెండింగ్ బిల్లులకు విపక్షాలు సహకరిస్తాయనే ఆశాభావం - వెంకయ్య...

ఢిల్లీ : పెండింగ్ లో ఉన్న జీఎస్టీ ఇతర బిల్లులకు విపక్ష పార్టీలు సహకరిస్తాయనే ఆశాభావం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

11:58 - February 7, 2016

నాడు శంబూకుని శిరస్సు తెగిపడటం ఓ కుట్ర.. ఏకలవ్యుని బొటవ్రేలును గురుదక్షిణగా తెగ్గొట్టడం ఓ కుట్ర.. నేడు రోహిత్ ను ఆత్మహత్యకు పురికొల్పడం మరో కుట్ర. తరాలు మారుతున్నా.. మారని వివక్ష అనేక రూపాల్లో అన్ని దిక్కులనుండీ కబళిస్తుంటే విలవిల్లాడిన సున్నిత హృదయం అతనిది. ఎన్నో కలలతో ఆశలతో ఆశయాలతో యూనివర్సిటీలలో చదువుకోవాలని వచ్చిన దళిత విద్యార్థులు ఇలా అర్థాంతరంగా తనువులు చాలించడం దేశంలోని మేధావులను కలవరపరుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత యువ మేధావి, రోహిత్ వేముల ఇటీవల ఆత్మహత్యకు పాల్పడటం దేశాన్ని కుదిపేసింది. ఈ దుస్సంఘటనపై విద్యార్థిలోకంతో పాటు కవులు రచయితలు మేధావులు స్పందించారు. కవులు తమ కవితాస్త్రాలు సంధించి రోహిత్ మరణం పట్ల తీవ్ర ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ స్పందనల సమాహారంపై ప్రత్యేక కథనం...

రోహిత్ పిరికివాడు కాదు..
ఎక్కడుందీ కులం… ఎప్పుడో పోయిందంటారు.. చాలా మంది. కానీ, పల్లెలదాకా ఎందుకు, మా యూనివర్సిటీ క్యాంపస్ లలో ఓ సారి అడుగు పెట్టి చూడండి. ఊరి చివరి దళితులు ఊరికి మరింత దూరమవుతున్నట్టే, ఎన్నో అడ్డంకులను దాటుకుని యూనివర్సిటీల గడప తొక్కిన దళిత విద్యార్ధులు ఇక్కడ ఎన్ని అగచాట్లు పడుతున్నారో తెలుస్తుంది. కులం మా భవితను ఎలా నిర్ణయిస్తుందో తేటతెల్లమవుతుంది అంటున్నారు...తెలుగు కవులు అనేకమంది తమ ఆవేదనను, ఆగ్రహాన్ని ఇదే కోణం లో వెలిబుచ్చారు. రోహిత్ పిరికివాడు కాదు. పారిపోలేదు. తాను ఎందరికో ధైర్యం చెప్పాడు.. కానీ, నుదుటి వేసిన కులం ముద్ర తన బతుకును శాసిస్తుంటే, తనను ప్రధాన స్రవంతి నుండి వెలివేస్తుంటే చెదిరిపోతున్న కలలను చూసి కలత చెందాడు. ఆ కలలను విచ్ఛిన్నం చేస్తున్న శక్తులపై పోరాటానికి దిగాడు. ఈ పోరాటంలో తానొక్కడే కాదు. ప్రజాస్వామిక, లౌకిక శక్తులంతా ఏకం కావాలని చెప్పే ప్రయత్నంలో తనను తాను బలితీసుకుని, యూనివర్సిటీలో రెపరెపలాడే పోరాట పతాకను ఎగరేశాడు. ఆ పోరాటాన్ని అలుపెరగకుండా సాగించటమే రోహిత్ కి నివాళి. మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

జాతీయ విద్యాశాస్త్ర పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన మోడీ..

ఒడిశా: జట్నిలో జాతీయ విద్యాశాస్త్ర పరిశోధన కేంద్రాన్ని ప్రధాని మోడీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. పరదీప్ లో రూ. 35వేల కోట్ల వ్యంతో నిర్మించిన చమురు శుద్ధి కర్మాగారాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. 

ఉప్పల మల్పూరు విగ్రహ ఏర్పాటుకు ఆటంకాలు..

నల్గొండ : సూర్యాపేటలో కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్పూరు విగ్రహ ఏర్పాటుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మల్పూరు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వామపక్ష నేతలు నిర్ణయం తీసుకున్నారు. కానీ విగ్రహాన్ని తామే ఏర్పాటు చేస్తామని పలు కులసంఘాలు ప్రకటించాయి. సీపీఎం డివిజన్ కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లతో సహా పలువురు వామపక్ష నేతలను మందస్తు అరెస్టు చేశారు. అధికార పార్టీ నేతలు, మంత్రి ఒత్తిడితో కులసంఘాలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. 

బాబును కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు..

విశాఖపట్టణం : సీఎం చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఎమ్మెల్యేలు తోట, వర్మ, ఎమ్మెల్సీ భాస్కరరామారావు వచ్చారు.

 

మధిరలో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు..

ఖమ్మం : మధిరలో అంతర్ రాష్ట్ర దొంగ సయ్యద్ జానీని పోలీసులు అరెస్టు చేశారు. 1.2 కిలోల బంగారం, రూ. 1.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

శాటిలైట్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా..

ఢిల్లీ : శాటిటైల్ క్షిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా నిర్వహించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లడంతో పాటు 3,400 మైళ్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం చేధించగల ఖండాతర క్షిపణిని ప్రయోగించింది. 

యూపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ..

ఢిల్లీ : ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతోంది. యూపీ రాష్ట్రంలో జరిగే ఎన్నికలపై భేటీలో చర్చిస్తున్నారు.

 

10:46 - February 7, 2016

ఉత్తర్ ప్రదేశ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహింను కలిశారా ? అవును కలిశారని సమాజ్ వాది నేత, మంత్రి ఆజంఖాన్ అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కలకలం రేపుతోంది. గత ఏడాది డిసెంబర్ 25వ తేదీన పాకిస్తాన్ లో మోడీ పర్యటించారని, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ తో మోడీ వ్యక్తిగత భేటీ జరిగిందన్నారు. ఈ భేటీలో షరీఫ్ తల్లి, కూతురుతో పాటూ దావూద్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇది అబద్ధమని మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గరున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజంఖాన్ చేసిన ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. వెంటనే మంత్రి పదవిని నుండి ఆజంఖాన్ ను తొలగించాలని బీజేపీ పార్టీకి చెందిన ఓ నేత డిమాండ్ చేశారు. 

రాంచీలో విద్యార్థి మృతిపై పోలీసుల దర్యాప్తు..

రాంచీ : ఓ ప్రైవేటు స్కూల్ లో మృతి చెందిన విద్యార్థి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రైవేటు స్కూల్ లో తనిఖీలు చేపట్టారు.

 

10:13 - February 7, 2016

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన దీక్ష హె టెన్షన్ తలపిస్తోంది. ఆయన నివాసం వద్ద ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు..దీనికి ముద్రగడ నిరాకరిస్తుండడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకొంటోంది. మూడో రోజు ఆదివారం ఉదయం 9గంటల ప్రాంతంలో యదావిధిగా ముద్రగడ దీక్షకు పూనుకున్నారు. అదే సమయంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ రవి ప్రకాష్ చేరుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని ముద్రగడను కోరారు. దీనికి ముద్రగడ నిరాకరించారు. వైద్యులు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.

పోలీసులు వెళ్లిపోవాలి..
మరోవైపు ముద్రగడ నివాసానికి పోలీసులు వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. పోలీసుల తీరును నిరసిస్తూ దీక్షా స్థలం నుండి మరో గదికెళ్లిన ముద్రగడ తలుపులు వేసుకున్నారు. ఆయన వేరే గదిలోకి వెళ్లిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీక్షలను డిస్ట్రబ్ చేయాలనే కారణంతో పోలీసులు ప్రవర్తిస్తున్నారని కాపు నేతలు టెన్ టివితో పేర్కొన్నారు. దీక్ష చేస్తున్న ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ ఆపివేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే ముద్రగడ నివాసం నుండి పోలీసులు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు విశాఖపట్టణంలో ఉన్న చంద్రబాబు ఎమ్మెల్సీ బోడ్డు రామారావుతో చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ముద్రగడ డిమాండ్లను బాబుకు తెలియచేస్తారని అనంతరం రామారావు కిర్లంపూడి చేరుకుని ముద్రగడతో చర్చలు జరుపుతారని సమాచారం. ముద్రగడ దీక్షను భగ్నం చేస్తారా ? లేదా ? ఉత్కంఠ నెలకొంది. 

చిన్నారి దివ్యాంశ్ మృతిపై సీబీఐకి సిఫార్సు – సిసోడియా..

ఢిల్లీ : రాయన్ ఇంటర్నేషనల్ స్కూలులో ఒకటో తరగతి చదువుతున్న దివ్యాంశ్ కాక్రోరా అనే పిల్లవాడి మృతిపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఓ జాతీయ ఛానెల్ కు తెలిపారు. 

ముద్రగడ నివాసానికి వెళ్లిన పోలీసులు..

తూర్పుగోదావరి : ముద్రగడ నివాసానికి పోలీసులు వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. పోలీసుల తీరును నిరసిస్తూ దీక్షా స్థలం నుండి మరో గదికెళ్లిన ముద్రగడ తలుపులు వేసుకున్నారు.  

ముద్రగడ..వైద్య పరీక్షలు చేయించుకోవాలన్న జేసీ, ఎస్పీ..

తూర్పుగోదావరి :జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ రవి ప్రకాష్ మరోసారి ముద్రగడ నివాసానికి వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. 

ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి..

విశాఖపట్టణం : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఆయన విశాఖకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఒడిశా కు చేరుకున్న మోడీ..

భువనేశ్వర్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒడిశాకు చేరుకున్నారు. జతాని వద్ద నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. 

09:33 - February 7, 2016

విశాఖపట్టణం : జిల్లాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ చూడటానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. సందర్శకులను అనుమతినివ్వకపోవడం వివాదాస్పదంగా మారింది. పాస్ లు లేవనే కారణంతో సందర్శకులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనితో పోలీసులు..సందర్శకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంటోంది. పాస్ ల కోసం ప్రజలు థియేటర్ల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. టికెట్లు ఇవ్వకుండానే హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రివ్యూకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఐఎఫ్ఆర్ పాస్ ల విషయంలో ప్రజల నుండి భారీ స్పందన వస్తోంది. కానీ వీరికి పాస్ లు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం చెందిందనే విమర్శలు వస్తున్నాయి. గత రెండు నెలల క్రితమే మీ సేవా సెంటర్ల ద్వారా సుమారు 1.45 వేల పాస్ లు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సెంటర్ల ద్వారా పాస్ లు అయిపోవడంతో మరో 40 వేల పాస్ లు జారీ చేస్తామని, ఆధార్ కార్డు ఉంటే పాస్ లు తీసుకోవచ్చని ప్రభుత్వ అధికారులు సూచించారు. పాస్ లన్నీ అయిపోవడంతో ప్రజలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు జిల్లాలో ఉన్న థియేటర్లలో కూడా రివ్యూ చూడవచ్చని, ఆధార్ కార్డు ఉంటే పాస్ లు అందచేస్తారని అధికారులు పేర్కొన్నారు. థియేటర్ లకు వెళ్లినా అక్కడ కూడా పాస్ లు అయిపోయాయని హౌస్ ఫుల్ బోర్డులు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

09:14 - February 7, 2016

తూర్పుగోదావరి : 'సీఎం చంద్రబాబు నాయుడు మొండి అయితే తాను జగమెండి' అంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. ఇంతకాలం కాపుల రిజర్వేషన్ల పై మాట్లాడిన ముద్రగడ ఆదివారం ఉదయం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కేవలం రెండు ఎకరాల పొలం ఉన్న చంద్రబాబు అనతికాలంలో రూ. 2 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ దంపతులు నిరవధిక నిరహార దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. కిర్లంపూడిలో ఆయన నివాసంలో చేపడుతున్న దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా తాను దీక్షలు ఆపేది లేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు రాస్తూ దీక్షను భగ్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే చిట్టచివరి మీడియా సమావేశమని, చర్చలు జరిపేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. మరోవైపు విశాఖపట్టణంలో ఉన్న చంద్రబాబు ఎమ్మెల్సీ బోడ్డు రామారావుతో చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ముద్రగడ డిమాండ్లను బాబుకు తెలియచేస్తారని అనంతరం రామారావు కిర్లంపూడి చేరుకుని ముద్రగడతో చర్చలు జరుపుతారని సమాచారం. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముద్రగడ చర్చల్లో పాల్గొంటారా ? లేదా ? అనేది చూడాలి. 

దీక్ష ఆపేది లేదు - ముద్రగడ..

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ చేపడుతున్న దీక్ష మూడో రోజుకు చేరుకుంది. తాను దీక్ష ఆపేది లేదని, ఇక చర్చలకు వచ్చేది లేదని స్పష్టం చేశారు. 

జార్ఖండ్ లో విద్యార్థి అనుమానాస్పద మృతి..

జార్ఖండ్ : రాంచీలోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. 

08:53 - February 7, 2016

ఢిల్లీ : ఆర్థిక మంత్రుల సమావేశం హాట్ హాట్‌గా సాగింది. సంక్షేమ పథకాలకు నిధులు తగ్గించిన అంశంపై అన్ని రాష్ట్రాల మంత్రులు కేంద్రంపై దాడికి దిగారు. రాష్ట్రాల అభ్యంతరాలు పట్టించుకోకుండా కేంద్రం వ్యవహరిస్తోందని తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలకు కేంద్రం నిధుల కొరత విధించిందని కేంద్రంపై మండిపడ్డారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్‌ పాల్గొన్నారు. రాష్ట్రాల వికాసమే దేశ వికాసం అని నినాదమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆచరణలో విఫలం అయ్యారని మండిపడ్డారు. పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు కేంద్రం అండగా ఉండాల్సి పోయి అనేక సంక్షేమ పథకాలను తొలగిస్తుందని మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3 నుంచి 3.5 శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరామని మంత్రి ఈటెల తెలిపారు.

కరవు నిధులు బడ్జెట్ లో కేటాయించాలన్న ఈటెల..
తెలంగాణలోని వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, కరవు నిధులు బడ్జెట్‌లో కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి ఈటెల తెలిపారు. అయితే ప్రధాని మోడీ ప్రభుత్వం బడా కంపెనీలకు మేలు చేసేలా వ్యవహరిస్తుందన్నారు మంత్రి ఈటెల. చిన్న తరహా, దేశీయ పరిశ్రమలకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్నారు. సెజ్‌లలో మ్యాట్ మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ను రూపొందించడంలో రాష్ట్రాల నుండి సలహాలను తీసుకున్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ. మౌళిక సదుపాయాల కల్పన కోసం, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మరింత పెద్ద ఎత్తున నిధులను కేటాయించాలని అరుణ్ జైట్లీ ఈ సందర్బంగా సూచించారు. పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయని,..ముఖ్యంగా వ్యవసాయ రంగంపై అధిక శ్రద్ధ చూపుతున్నాయని జైట్లీ తెలిపారు. మౌళిక సదుపాయాలపై నిధులను ఖర్చు చేసే రాష్ట్రాలకు మరింత సాయం అందిస్తామన్నారు. మొత్తానికి డిసెంబర్‌లో జరగాల్సిన ఈ సమావేశాన్ని కేంద్రం తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుందని విమర్శించారు వివిధ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు రాజ్యాంగబద్దంగా రావాల్సిన నిధులను వెంటనే కేటాయించాలని ఆర్ధిక మంత్రి ఈటెల విజ్ఞప్తి చేశారు. 

08:52 - February 7, 2016
08:50 - February 7, 2016

కృష్ణా : దేవినేని నెహ్రూ వైసీపీలోకి ఎంటర్‌ అవుతున్నారన్న వార్త... జగన్‌ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నెహ్రూ ఎంట్రీకి అధినేత జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియడంతో.. వంగవీటి రాధా వర్గం భగ్గుమంటోంది. నెహ్రూని పార్టీలో చేర్చుకుంటే త‌మ‌దారి తాము చూసుకుంటామని రాధా వర్గం హెచ్చరిస్తోంది. ఏళ్ల తరబడి ఉప్పు నిప్పులా ఉన్న దేవినేని నెహ్రూ, వంగవీటి రాధాకృష్ణలు ఒకే ఒరలో ఇమడగలరా? కృష్ణా జిల్లాలో ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. నెహ్రూ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. కృష్ణా జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే ఆ పార్టీలో కొనసాగుతున్న వంగవీటి రాధా, దేవినేని నెహ్రూ వర్గాల మధ్య దీర్ఘకాలంగా విరోధం ఉంది. ఇటీవల.. కాల్‌మనీ ఎపిసోడ్‌లో ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దేవినేని నెహ్రూ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుంది..? ఇప్పుడిదే అంశం జగన్‌ పార్టీ నేతలను కలవరపరుస్తోంది.

వంగవీటి రంగాపై విమర్శలు చేసిన నెహ్రూ..
దేవినేని నెహ్రూను వైసీపీలో చేర్చుకునేందుకు అధినేత జ‌గ‌న్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. నెహ్రూకు కృష్ణా జిల్లా బాధ్యతలు కూడా అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో రాధా వర్గం రగిలిపోతోంది. అంతేకాదు.. నెహ్రూ అంశం వైసీపీలోనూ నేతలను రెండుగా చీల్చుతోంది. నెహ్రూ రాక‌ను ఇప్పటికే వంగ‌వీటి రాధాతో పాటు జిల్లాకు చెందిన పార్థ సారధి, ఎమ్మెల్యే కొడాలి నాని తదితర నేత‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే... జ‌గ‌న్ మాత్రం నెహ్రూను పార్టీలోకి తెచ్చేందుకే ప్రయత్నిస్తున్నారని.. ఇందులో భాగంగా.. నెహ్రూ త‌న‌యుడు అవినాష్‌కి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ పార్లమెంట్‌ టికెట్ ఇచ్చేందుకూ సుముఖత వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది.

జగన్‌ నిర్ణయంపై రాధా, పార్థసారథి, కొడాలి నాని ఆగ్రహం..
వైసీపీలో క‌మ్మ సామాజిక వ‌ర్గం నేత‌ల లోటు ఉండటంతో నెహ్రూను తీసుకు రావాల‌న్నది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా కనిపిస్తోంది. రెడ్డి సామాజిక వ‌ర్గానికి టీడీపీ దగ్గరవుతుండటంతో... సీఎం చంద్రబాబు సామాజిక వ‌ర్గమైన కమ్మ వారిని తన పార్టీలోకి తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో నెహ్రూ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయ‌మ‌నే వార్తలు గుప్పుమంటున్నాయి. నెహ్రూ ఆగమనంపై తాడో పేడో తేల్చుకునేందుకే రాధా వర్గం నిర్ణయించుకుందని సమాచారం. నెహ్రూను పార్టీలోకి చేర్చుకున్నట్లయితే తాము పార్టీని వీడతామ‌ని స్పష్టం చేస్తున్నారు. మరి అధినేత జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. కృష్ణా జిల్లాలో రాజకీయంగా దాని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశం ఉత్కంఠను రేపుతోంది. 

08:47 - February 7, 2016

వో శెప్పుమంటె..మన సీఎం కేసీఆర్ సారు..శిన్నం మాటలు శెప్తడా..శిన్న ముల్కనూరును దత్తత తీస్కున్నప్పుడు ఏమనే.. ఊరంటె ఇట్లుంటదా.. ఈ ఇర్కు సందులల్ల ఎట్ల బత్కుతున్నరు. ఇట్లుంటె కుద్రది దీని ఆలత్ నే మార్చేస్త అన్నడు. అంతటితోని ఆగకుంట డబుల్ బెడ్ రూం ఇండ్లు గట్టిస్తన్నడు.. స్వయాన సీఎం సారే కట్టిస్త అనెవర్కల్ల ఊరోల్లు ఇండ్లు కూలగొట్టుకోని గుడ్శెలేస్కున్నరు. మరి గుడ్శెలల్లనే ఉన్నరా గృహప్రవేశం సూడాలంటే వీడియో క్లిక్ గొట్టండి..

హెచ్ సీయూలో పీహెచ్ డీ విద్యార్థి అదృశ్యం...

హైదరాబాద్ : హెచ్ సీయూలో పీహెచ్ డీ రీసెర్చ్ స్కాలర్ అదృశ్యమయ్యాడు. ఈ మేరకు గచ్చిబౌలి పీఎస్ లో కేసు నమోదైంది. డి. సురేష్ అనే స్కాలర్ మానసిక ఆందోళనలో ఉన్నాడని, ట్రీట్ మెంట్ చేసుకుంటున్నాడని సీఎంఓ రవీంద్ర కుమార్ వెల్లడించారు.

08:29 - February 7, 2016

మహారాజ శ్రీ... ప్రియమైన ముఖ్యమంత్రి గారు.. ప్రియమైన ముఖ్యమంత్రి అయ్య ఉత్తరం రాస్తున్న బదులిస్తారా మీరు.. హామీలు ఇచ్చినారు.. అమలు చేసుడే మరిచినారు. ఏమి అడిగినా గాని బదులు శెప్తారు అంట తమరు.. పోన్ల బ్యాలన్సు లేదు.. రీచార్జుకు పైశల్లేవు.. అందుకే రాస్తున్న ఈ వుత్తరం.. ఏంది మల్లన్న ముచ్చట్లు జెప్పుకుంట రోజుకో పాటతోని దుమ్ములేపుతుండు అన్కుంటున్నరు గదా.. ఈపాట ఇప్పుడు ఎందుకు నా నోటి నుంచి జాలు వారిందంటే వీడియో సూడుండ్రి..

08:13 - February 7, 2016

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన నిరవధిక దీక్ష మూడో రోజుకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి ముద్రగడ నివాసం ఎదుట హై డ్రామా నడించింది. ముద్రగడ నివాసం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. జిల్లా ఎస్పీ పోలీసులను బయటకు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మూడో రోజుకు చేరుకోవడంతో ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఎలాగైనా ముద్రగడకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ తలుపులు తీయడానికి ముద్రగడ అంగీకరించడం లేదు. బలవంతంగా తలుపులను బద్ధలు కొట్టి ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించి వీరిని ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముద్రగడ చేస్తున్న దీక్షకు సంఘీభావంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కాపు నేతలు దీక్షలు చేపడుతున్నారు. వీరి ఆరోగ్య పరీస్థితి కూడా క్షీణిస్తున్నట్లు సమాచారం.
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం పెడచెవిన పెట్టేసరికి ఆయన ముద్రగడ నిరవధిక దీక్షకు పూనుకున్నారు. ఆయన సతీమణి కూడా దీక్ష చేస్తున్నారు. దీక్షకు మద్దతుగా కుమారులు, కోడలు, కూతురు కూడా రెండోరోజూ దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా మహిళలతోపాటు కాపు నాయకులు ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు తదితరులు దీక్షలు కొనసాగించారు. ఉదయం నుంచీ పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి దీక్షల్లో ఉన్న ముద్రగడను పరామర్శించారు. మరోవైపు కిర్లిపూడి గ్రామానికి ప్రజలు తరలకుండా చూసేందుకు పోలీసు బలగాలను భారీగా మోహరించారు.

07:55 - February 7, 2016

శరీరంలోని జీర్ణవ్యవస్థ, మెటబాలిజం, ఇమ్యునిటీ, పోషకాల నిలువ వంటి ప్రధాన ప్రక్రియలు సజావుగా సాగడానికి లివర్‌ బాధ్యత తీసుకుంటుంది. ఈ వ్యవస్థలన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే, కాలేయం ఆరోగ్యంగా ఉండాలి. కాలేయం శరీరంలోని హానికారక మలినాలతోపాటు రక్తంలోని మలినాలను కూడా తొలగిస్తుంది. రక్తంలోని పోషకాలను తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు కొన్ని విటమిన్స్ ఐరన్‌ వంటి వాటిని నిలువచేస్తుంది. అలాగే ఇన్సులిన్‌ లెవెల్స్‌ తగ్గించడంలో కూడా లివర్‌ దే బాధ్యత. పాత ఎర్రరక్తకణాలను నాశనం చేసి, అవసరమైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే అనారోగ్యకరమైన ఆహారాలు, అలవాట్లు, జీవనశైలి కాలేయంపై ప్రభావం చూపుతాయి. అలాగే టాక్సిన్స్‌ని బయటకు పంపడంలో విఫలమైతే బరువు పెరగడానికి కారణమవుతుంది. దీనివల్ల ఒబెసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, అలసట, తలనొప్పి, జీర్ణవ్యవస్థ సమస్యలు, అలర్జీ వంటి అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాలేయం ఆరోగ్యానికి, కాలేయం పనితీరు సక్రమంగా ఉంటడానికి ఉపయోగపడే ఆహారాలు డైట్‌లో చేర్చుకోవడం తప్పనిసరి. మరి అలాంటి ఆహారాలేంటో ఒకసారి చూద్దాం.
కాలేయంలో ఎంజైమ్స్‌ని ఉత్సాహపరిచి, టాక్సిన్స్‌ని బయటకు పంపడానికి వెల్లుల్లి సహాయపడుతుంది. లివర్‌ టాక్సిక్‌ విఫలం కాకుండా ఇది ప్రొటెక్ట్‌ చేస్తుంది. కాబట్టి 2 లేదా 3 పచ్చి వెల్లుల్లి రెబ్బలను రోజూ తీసుకోవాలి.
బీట్‌రూట్స్ కాలేయంలో విషపూరిత మలినాలను బయటకు పంపడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో ఫ్లేవనాయిడ్స్, బీటా కెరోటిన్‌ ఎక్కువగా ఉండటం వల్ల లివర్‌ ఫంక్షన్‌కి తోడ్పడుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో బీట్‌రూట్స్‌ని గానీ, బీట్‌ రూట్‌ జ్యూస్‌ని గానీ చేర్చుకుంటే సరిపోతుంది.
నిమ్మకాయలు లివర్‌ని డెటాక్సిఫై చేయడానికి ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలోని ఎంజైమ్‌లను ఉత్సాహపరిచి, మలినాలను బయటకు పంపడానికి సహాయపడేలా చేస్తాయి. ఒక లీటర్‌ నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
రోజూ గ్రీన్‌ టీ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, కొవ్వుకు కారణమయ్యే కారకాలను బయటకు పంపడం తేలికవుతుంది. అంతేకాదు కాలేయ సంబంధిత వ్యాధులను నిరోధించడానికి గ్రీన్‌ టీ చక్కటి పరిష్కారం.
శరీరంలో ఫ్యాట్స్ సులభంగా జీర్ణమవడానికి పసుపు ఉపయోగపడుతుంది. అంతేకాదు పాడయిన లివర్‌ సెల్స్‌ని మళ్లీ ఉత్పత్తి చేయడంలో పసుపు సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో పావు టీ స్పూన్‌ పసుపు వేసి మరిగించాలి. కొన్ని వారాలపాటు రోజుకి రెండుసార్లు దీన్ని తీసుకుంటే మంచిది.
రోజుకి ఒక యాపిల్‌ తీసుకోవడం వల్ల లివర్‌ ఆరోగ్యంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యాపిల్స్‌లో ఫైబర్‌ తోపాటు పెక్టిన్‌ ఉంటుంది. ఇది టాక్సిన్స్‌ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు యాపిల్‌ జ్యూస్‌ తీసుకున్నా సరిపోతుంది.

07:46 - February 7, 2016

యష్‌రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న 'థగ్‌' చిత్రంలో ఎట్టకేలకు హృతిక్‌ రోషన్‌ సరసన పరిణీతి చోప్రాని ఎంపిక చేశారు. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్‌ కూడా అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జానీడెప్‌ నటించిన 'పైరేట్స్ ఆఫ్‌ ద కరేబియన్‌' చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో పరిణీతి మాట్లాడుతూ,'థగ్‌'లో నటించడం ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర ఏమిటి?, దాని తీరు తెన్నులు ఎలా ఉంటాయి?, సినిమా నేపథ్యం ఏమిటనే విషయాల్ని ఇప్పడే రివీల్‌ చేయలేను. ఆద్యంతం విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేసే చిత్రమని మాత్రం చెప్పగలను. ఇకపోతే సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న 'సుల్తాన్‌' సినిమాలో నటించే అవకాశాన్ని నేను కోల్పోయానని రకరకాల వార్తలొచ్చాయి. 'సదరు పాత్రకి నేను సరిపోతానని వారు కచ్చితంగా ఫీలైతే.. ఆ అవకాశం నాకే దక్కి ఉండేది. కాని అలా జరగనప్పడు ఆ పాత్రలో నేను నటించాలని వెంపర్లాడ్డం సబబు కూడా కాదు. నా ప్లేస్‌లో అనుష్కశర్మని తీసుకున్నా రంటే.. ఆ పాత్రకి ఆమె కరెక్ట్‌ అని చిత్రయూనిట్‌ భావించింది. అవకాశాలనేవి ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరైనా చెప్పగలరా? అందుకే వచ్చే అవకాశాల మీద కాకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళడం నేర్చుకున్నాను' అని చెప్పింది.

07:44 - February 7, 2016

'నేను శైలజ' చిత్రంతో దర్శకుడిగా మంచి హిట్‌నందుకున్న కిషోర్‌ తిరుమల తాజాగా నితిన్‌తో ఓ ప్రాజెక్ట్‌ చేయబోతున్నారు. హీరో రామ్‌ కెరీర్‌లోనే ఓ మంచి ఎంటర్‌ టైనర్‌గానే కాకుండా అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా 'నేను శైలజ' నిలిచింది. 'ఇష్క్', గుండెజారి గల్లంతయ్యిందే' వంటి ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్లతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్ అందుకున్న నితిన్‌ హీరోగా, కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై నికితా రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. నితిన్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో 'అ.. ఆ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం పూర్తయిన తర్వాత కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది.

07:43 - February 7, 2016

సినిమాలు ఫ్లాప్‌ అయితే ఆ నష్ట భారాన్ని డిస్ట్రిబ్యూటర్లే మోయాలా?, మొత్తంగా వాళ్ళే రోడ్డున పడాలా అనే ప్రశ్నలకు సమాధానంగా.. కాదు, వాళ్ళు కూడా బాగుండాలనే ధోరణి తెలుగునాట కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఈ తరహా ధోరణికి నాంది పలికిన వాళ్ళలో ఈమధ్య దర్శకుడు వి.వి.వినాయక్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ వినాయక్‌ దర్శకత్వంలో విడుదలైన 'అఖిల్‌' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని తీసుకున్న అన్ని ఏరియాలా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాన్ని చవిచూశారు. ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ దర్శకుడు వినాయక్‌ తను తీసుకునే పారితోషికంలో దాదాపు సగానికి పైగా బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు స్వయంగా ఇచ్చేసి, మరికొంతమందికి స్ఫూర్తిగా నిలిచారు.
ఇదిలా ఉంటే, బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌ సైతం 'దిల్‌వాలే' సినిమాని తీసుకుని నష్టపోయిన బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు 50శాతం డబ్బుని తిరిగి ఇచ్చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్‌ సినిమా విశ్లేషకుడు కోమల్‌ నహాటా ధ్రువీకరిస్తూ ట్వీట్‌ కూడా పెట్టారు. 'షారూఖ్‌ చేసిన పని ప్రశంసనీయం. ఏదైనా సినిమా ఫ్లాప్‌ అయితే ఒక్క డిస్ట్రిబ్యూటరే ఎందుకు నష్టాన్ని ఫేస్‌ చేయాలి?, అతను కూడా సేఫ్‌ జోన్‌లో ఉండాలి కదా. ఈ క్రమంలో 50 శాతం డబ్బుని షారూఖ్‌ వారికి ఇవ్వడం అభినందనీయం' అని మరో విశ్లేషకుడు కుమార్‌ మోహన్‌ తెలిపారు. 'దిల్‌వాలే' సినిమా ఫలితం వ్యక్తిగతంగా నాకు సంతృప్తినివ్వలేదు. అలాగే బాక్సాఫీస్‌ వద్ద కూడా పూర్తిగా నిరాశపర్చింది. డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు ఇవ్వడం అనేది ఇండియాలో కొత్తగా అనిపించవచ్చు.. ఈ పద్ధతి జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది' అని షారూఖ్‌ చెప్పారు. షారూఖ్‌ కంటే ముందు రణ్‌బీర్‌కపూర్‌, దీపికా పదుకొనె సైతం తమ పారితోషికంలోని 15 కోట్ల రూపాయల్ని 'తమాషా' సినిమాని తీసుకున్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు స్వయంగా అందించారు. 'తమషా' చిత్రం కూడా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయం పాలైంది.

07:41 - February 7, 2016

ముఖంపై ఏర్పడిన మచ్చలు, మొటిమలు పోగొట్టి నిగారింపు తీసుకురావడంలో చందనానికి సాటి మరోటి లేదు. అయితే కేవలం సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి కూడా చందనం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పాతకాలంలో గంధం నిత్యం ఏదో ఒక చోట వాడుతూ ఉండేవారు. ఈ రోజుల్లో అందాన్ని మెరుగుపరుచుకోవడానికి వివిధ క్రీములు వాడుతున్నాం. వీటిల్లో కూడా చందనం విరివిగా వాడుతున్నారు. ఎండకు నల్లబడిన చర్మాన్ని మళ్లీ కాంతి వంతం చేసేందుకు కొబ్బరినీళ్ళు, పచ్చిపాలు, కీరారసం, నిమ్మరసం, శనగపిండి, కొద్దిగా చందనం పొడి కలిపి పేస్టులా చేయండి. దీన్ని స్నానానికి గంట ముందు చర్మానికి పట్టించండి. ఇలా వారంలో రెండు సార్లు చేయండి. దీంతో చర్మం శుభ్రమైపోతుంది.
చందనంలో యాంటీ బయోటిక్‌ గుణం ఉంటుంది. అలాగే సహజమైన ఔషధ గుణాల కారణంగా గంధం మీ అందాన్ని మరింత పెంచుతుంది.
చందన లేపనం మొటిమలను తొలగించటంతోపాటు చర్మాన్ని శుభ్రం చేసి మృదుత్వాన్ని ఇస్తుంది.
ఎలాంటి కురుపులు, గాయాలు ఉన్నా గంధాన్ని రెగ్యులర్‌గా వాడి తొలగించవచ్చు.
గంధం పొడిలో నల్ల శనగల పొడి సమాన మోతాదులో కలిపి పాలు లేదా గులాబీ నీటితో ముఖానికి పట్టించి రాత్రంతా ఉంచితే మొటిమలు తొలగిపోతాయి.
చెమట ఎక్కువగా వస్తే గంధం పొడిలో నీళ్లు కలిపి దేహానికి రాసుకుంటే చెమట తగ్గుతుంది.
గంధం సువాసనను పీల్చితే ఊపిరితిత్తులు క్రీయాశీలమవుతాయి.
గంధం తైలాన్ని స్ప్రే చేస్తే దేహానికి చల్లదనం అనుభూతి కలుగుతుంది.
సూర్య కిరణాలతో ప్రభావితమైన చర్మానికి చల్లదనం, తాజాదనం లభిస్తాయి.
కొన్ని చుక్కల గంధం తైలాన్ని రోజూ నీళ్లలో వేసి ఆ నీటితోనే స్నానం చేయండి. ఇది మీ చర్మానికి ఒక రక్షణ పొరలా ఉంటుంది.
గంధాన్ని రెగ్యులర్‌గా వాడటం వల్ల చర్మం మృదువుగా, యవ్వనంగా కనిపిస్తుంది.

07:39 - February 7, 2016

'ఆహారాన్ని మితంగా తీసుకుంటే ఔషధం. అతిగా తింటే విషం' అన్న సంగతి మనకి తెలిసిందే. అయితే కొన్ని ఆహారపదార్ధాలు కొన్ని కొన్ని సమయాల్లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అవే ఆహారపదార్థాలను పరగడుపున తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. పరగడుపున అంటే ఎర్లీ మార్నింగ్‌ కాదని ఎమ్టీ స్టమక్‌ (ఖాళీ కడుపుతో) అని వారు అంటున్నారు. మరి క్షణం తీరిక లేని జీవన శైలిలో ఆలస్యంగా లేచినా. పరగడుపున తినకూడని ఆహారపదార్ధాలేంటో మనమూ తెలుసుకుందామా.
చాలామంది ఉదయం నిద్రలేవగానే కాఫీ, టీ లను తాగుతుంటారు. ఉదయం వాటిని తాగడం మంచిదే అయినా పరగడుపున తాగడం మంచిది కాదని, ఈ విధంగా తాగడం వల్ల హార్మోన్లు అన్‌ బ్యాలెన్స్‌ అవుతాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఒక గ్లాస్‌ మంచి నీటిని తాగిన తర్వాతే కాఫీ, టీ లు తాగటం మంచిదంటున్నారు.
ఘాటైన మసాలా కూరల్ని పరగడుపున తినకూడదు. అలా తింటే పొట్టలో తిప్పడమే కాక రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎక్కవ కాలం కొనసాగితే అల్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉదయం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
చాలా మంది పరగడుపున టమోటా రైస్‌, టమోటా బాత్‌ లాంటివి తింటుంటారు. కానీ ఖాళీ కడుపుతో పుల్లని పదార్థాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఏదైనా వేరే పదార్థం తిన్న తరువాత పుల్లటి పదార్థాలు తినడం మంచిదంటున్నారు డాక్టర్లు.
పరగడుపున పళ్లు తినడం మంచిదని ఇటీవల ప్రచారం జోరుగా జరుగుతోంది. కానీ అది నిజానికి అంత మంచిది కాదు. అందునా అరటి పండు అస్సలు తినకూడదు. అందులో ఉన్న మెగ్నీషియం ఉదయం పూట ఎక్కువ మోతాదులో శరీరానికి అందటం మంచిదికాదు.
పరగడుపున శీతల పానీయాలు తాగడం వల్ల జీర్ణాశయంలో హాని చేసే కొన్ని ఆమ్లాలు విడుదలౌతాయి. ఈ ఆమ్లాల కారణంగా వికారం, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. కాబట్టి ఖాళీ కడుపుతో తినేముందు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. 

07:31 - February 7, 2016

ఒడిశా : అంతర్జాతీయ నౌకా సమీక్షకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ భువనేశ్వర్‌ బయల్దేరి వెళ్లారు. భువనేశ్వర్‌లో జాతీయ విద్యాశాస్త్ర పరిశోధనా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం పూరీ జగన్నాథస్వామిని దర్శించుకుంటారు. పారాదీప్‌లో నెలొల్పిన చమురు శుద్ధి కేంద్రాన్ని జాతికి అంకితమిస్తారు. ఆదివారం సాయంత్రం తిరిగి విశాఖ చేరుకుంటారు.

నలుగురు స్మగ్లర్లను మట్టుబెట్టిన బీఎస్ఎఫ్..

పంజాబ్ : కేమ్ కరన్ సెక్టార్ పరిధిలో నలుగురు స్మగ్లర్లను బీఎస్ఎఫ్ జవాన్లు మట్టుబెట్టారు. ఇండో - పాక్ సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరివద్ద పది కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లలో ఇద్దరు భారతదేశనికి చెందిన వారు కాగా మరో ఇద్దరు పాకిస్తాన్ దేశానికి చెందిన వారని బీఎస్ఎఫ్ ఐజీ అనీల్ ఓ జాతీయ వార్తా సంస్థకు తెలిపారు. 

మూడో రోజుకు చేరుకున్న ముద్రగడ దీక్ష..

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీసమేతంగా చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. నిన్న సాయంత్రానికే ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో వైద్యం చేసేందుకు వచ్చిన వైద్యులను ముద్రగడ తిరస్కరించారు. 

నేటి నుండి నాగోబా జాతర..

ఆదిలాబాద్ : నేటి నుండి జిల్లాలోని ఇంద్ర మండలం కేస్లాపూర్‌ గ్రామంలో నాగోబా జాతర ప్రారంభం కానుంది. మెస్రం తెగ ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగుతుంది.

ఈనెల 11న జీహెచ్ఎంసీ సమావేశం..

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల తొలి సమావేశం ఈ నెల 11న ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ ఎంజీ గోపాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 

06:48 - February 7, 2016

ఢిల్లీ : బుధవారం ప్రారంభమైన ఆటో ఎక్స్‌పోకు మంచి స్పందన కనిపిస్తోంది. శుక్రవారం సాధారణ ప్రజలను అనుమతించడంతో తొలిరేజే 80 వేల మంది ఆటో ఎక్స్‌పోను సందర్శించారు. మారుతీ, మహీంద్రా, హ్యుందాయ్‌, హోండా, టాటా మోటార్స్‌, ఆడీ తదితర కంపెనీలు వాహనాలను ప్రదర్శిస్తున్నాయి. ఫోర్‌ వీలర్స్‌తో పాటు టూ వీలర్స్‌ను కూడా ప్రదర్శించారు. ఈ నెల 9తో ముగియనున్న ఈ ప్రదర్శనను సియామ్‌, వాహన విడి భాగాల తయారీదారుల సంఘం, భారతీయ పరిశ్రమల సమాఖ్య-సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. త్వరలో భారత మార్కెట్లోకి రానున్న వాహనాలను చూడటానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని సియామ్ పేర్కొంది.

06:45 - February 7, 2016

ఆదిలాబాద్ : జిల్లాలో ప్రకృతిని ప్రాణంగా భావించే ఆదివాసీలు తమ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రాణం కంటే మిన్నగా భావిస్తుంటారు. ఏడాది పొడవునా ఏదో ఒక ఉత్సవాన్ని జరుపుకుంటూనే ఉంటారు. గిరిజనుల దైవాలలో నాగోబా దేవునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ జాతర యావత్‌ తెలంగాణకే తలమానికం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్ర మండలం కేస్లాపూర్‌ గ్రామంలో నాగోబా ఆలయం కొలువుదీరింది. మెస్రం తెగ ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగుతుంది. నాగోబా జాతరకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఒక్క గిరిజనులేగాక గిరిజనేతరులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. పుష్యమాసారంభం నుంచి నెలవంక కనిపించిన రెండో రోజున మెస్రం జాతివారు కేస్లాపూర్‌లో సమావేశమవుతారు. నాగోబా దేవునికి పూజలు చేసి మరుసటి రోజు ఇచ్చోడ మండలంలోని సిరికొండలోని కుమ్మరులకు కుండలు చేయమని చెప్పి వస్తారు. పుష్యమాసంలో వెన్నెల కనిపించిన తర్వాత గిరిజనులంతా నియమ నిష్టలతో తమ ఇండ్లు వాకిళ్లు శుభ్రపరిచి అనంతరం పుట్ట దగ్గరికి వెళతారు. పుట్ట మన్ను తెచ్చి కుండలను తయారుచేస్తారు. పుష్యమాసం పౌర్ణమి నాడు మెస్రం తెగవారు పూజ కలశం తీసుకుని గోదావరి నది పవిత్ర జలాలను తీసుకురావడానికి బయల్దేరుతారు. కేస్లాపూర్ నుంచి సుమారు 80 కిలోమీటర్లు నడిచి గోదావరి తీరానికి వెళ్తారు. నాలుగు రోజుల్లో జన్నారం మండలం కలమడుగు గ్రామ సమీపంలోని గోదావరి తీరానికి చేరి అక్కడగల పంచ లింగాలకు పూజ చేస్తారు. అలా గోదావరి నుంచి తీసుకొచ్చిన జలాలతో ఇప్పటికే కేస్లాపూర్‌ చేరుకున్నారు.

సందడి వాతావరణం..
అత్యంత జాగ్రత్తగా తీసుకొచ్చిన గోదావరి జలాలను ఆలయ ఆవరణలోని మర్రి చెట్ల వద్దకు చేర్చారు. మరోవైపు జాతరకు గిరిజనం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో మర్రిచెట్ల వద్ద డేరాలు వేసుకొని ఉంటున్నారు. తమ ఇష్టదైవాన్ని పూజించుకునేందుకు వారం రోజుల పాటు ఇక్కడే ఉంటారు. నేటి ఉదయం బాజాభజంత్రీలతో పవిత్ర జలాలను ఆలయానికి తీసుకువస్తారు. మర్రిచెట్ల వద్ద ఉన్న బావినుంచి మెస్రం వంశ మహిళలు కుండలతో నీళ్లు తెచ్చి ఆలయ ప్రాంగణంలో పుట్టలు తయారు చేస్తారు. పుట్టల తయారీతో పూజలు ప్రారంభమవుతాయి. పూజల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన కుండలను సిరికొండ గ్రామం నుంచి తీసుకొచ్చారు. మట్టి కుండలేగాక దీపాలను కూడా తీసుకొచ్చారు. నాగోబా జాతరను పురస్కరించుకుని రంగుల రాట్నాలతోపాటు వివిధ దుకాణాలు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేశారు. దీంతో కేస్లాపూర్‌లో ఎటుచూసినా సందడి వాతావరణం నెలకొంది.

06:40 - February 7, 2016

విజయవాడ : ఏపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరనుంచి చంద్రబాబును ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఆర్థిక సమస్యలైతే చంద్రబాబును నీడలా వెంబడిస్తున్నాయి. పెట్టుబడుల కోసం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న బాబుకు స్థానిక సమస్యలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉన్న సమస్యలు చాలవన్నట్లు తాజాగా కాపు రిజర్వేషన్ అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ప్రస్తుత ప్రాబ్లమ్‌ను బాబు ఎలా డీల్ చేస్తారన్నది సస్పెన్స్‌ మూవీని తలపిస్తోంది. సమస్యలు వర్సెస్‌ చంద్రబాబు.. ప్రస్తుతం ఏపీ సిఎం చంద్రబాబు కష్టాలను ప్రతిబింబించే వాక్యమిది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టిన చంద్రబాబుకు ప్రతి అంశమూ స‌వాలుగానే ప‌రిణ‌మిస్తోంది. రాజ‌ధాని నిర్మాణం కోసం భూ సేక‌ర‌ణ‌, పెట్టుబ‌డులు, ప్రోత్సాహ‌కాలు, పుష్కరాల నిర్వహ‌ణ‌, రాజ‌ధాని శంఖుస్థాప‌న మ‌హోత్సవం లాంటి కార్యక్రమాలు బ‌య‌ట‌కు స‌జావుగానే సాగుతున్నట్టు క‌నిపిస్తున్నా అంతర్గతంగా చాలా ఇబ్బందులే ఉన్నాయి. అయిన‌ప్పటికీ బాబు ఏదోలా వాటిని నెట్టుకొస్తున్నారు. అయితే అనుకోకుండా హఠాత్తుగా మీదపడుతున్న ప్రాబ్లమ్స్‌ ఆయన ముందరి కాళ్లకు బంధాలేస్తున్నాయి.

ఇబ్బంది పెడుతున్న పలు సమస్యలు...
ప్రత్యేక హోదా, కాల్‌ మ‌నీ వ్యవహారం, బాక్సైట్‌ త‌వ్వకాలు, ఇసుక రీచ్‌ల వ్యవహారం.. త‌దిత‌ర అంశాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌చ్చేందుకు దేశంలోని వివిధ పారిశ్రామికవేత్తల‌తో భాగ‌స్వామ్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. సింగ‌పూర్, జ‌పాన్, మ‌లేషియా, చైనా లాంటి దేశాల చుట్టూ పెట్టుబడుల కోసం తిరుగుతున్నారు. ప్రకృతి విపత్తులు, ఆర్థిక సమస్యలను ఏదోలా మేనేజ్‌ చేస్తున్నా బాబుకు కాపు రిజర్వేష‌న్ అంశం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. క‌మిష‌న్ వేసినా స‌సేమిరా అంటున్న కాపులు తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ వెంటబడుతున్నారు. ఏపీలో 26శాతం ఉన్న కాపు వ‌ర్గాన్ని వెనుక బ‌డిన వ‌ర్గాల జాబితాలో చేర్చుతామ‌ని టిడిపి 2014 ఎన్నిక‌ల మానిఫెస్టోలో పొందుప‌రిచింది. అందుకు త‌గ్గట్టుగానే మంజునాథన్ క‌మిటీని నియ‌మించారు. ఇంత‌వ‌ర‌కు సజావుగా సాగినా ముద్రగ‌డ ప‌ద్మనాభం చేప‌ట్టిన కాపు గ‌ర్జన ఆ వర్గంలో రిజర్వేష‌న్ ఆకాంక్ష ఏ స్థాయిలో ఉందో తెలియ‌జెప్పింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గ‌డుస్తున్నా తమకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని వారు ప్రభుత్వాన్ని నిల‌దీస్తున్నారు. కిర్లంపాడులో ముద్రగ‌డ చేస్తున్న ఆమ‌రణ నిరాహార దీక్షతో ప‌రిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. పైగా క‌మిషన్ల వ‌ల్ల కాల‌యాప‌నే త‌ప్ప ప్రయోజనం ఉండదని కాపునేత‌లు వాదిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చ‌ర్చలు జ‌రప‌డానికి ముందుకు వ‌స్తే మాట్లాడ్డానికి సిద్ధమని ముద్రగ‌డ స్పష్టం చేస్తున్నారు. ఐతే ముద్రగ‌డ‌తోపాటు కాపునేత‌ల‌ను ప్రభుత్వం ఎలా ఒప్పిస్తుంద‌నే విషయంలో స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

సంక్షోభాలు, విపత్కర ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాకపోయినా ఆయనను సవాలు చేస్తున్న సమస్యలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం అంతకంతకూ పెరుగుతున్న కాపులకు రిజర్వేషన్ వివాదం ఏవైపుకు దారితీస్తుంది.. బాబు దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది. 

06:37 - February 7, 2016

హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాలను ఈ నెల చివరి వారంలో నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. గతానికి భిన్నంగా ముందస్తు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట్లో భావించింది. అయితే పరిస్థితులు అనుకూలించలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, సమక్క సారక్క జాతర నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 26 లేదా 27 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించే అవకాశం ఉంది. అయితే నేడు జరిగే కేబినేట్‌ భేటీలోనే ఈ విషయం తేలనుంది. గవర్నర్ ప్రసంగంతో పాటు ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆర్ధిక మంత్రి ఈటెల బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు ముమ్మరం చేసారు. నేడు జరిగే కేబినేట్‌ భేటీలోనూ బడ్జెట్‌ అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మూడో బడ్జెట్ అయినప్పటికి ఇది చాల కీలకంగా మారింది. మొదటి బడ్జెట్ కేవలం నాలుగు నెలలకే పరిమితం కావడం..రెండో బడ్జెట్ సమయానికి ప్రభుత్వ ఆదాయం అంచనా రాకపోవడంతో....బడ్జెట్ ఆచరణ అనుకున్నంత సాగలేదు. దీంతో ఈ బడ్జెట్ ను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ప్రాథమిక ముసాయిదాను సైతం సిద్ధం చేసింది.

లక్షా 35వేల కోట్లు..
ఈ సారి కూడా భారీ బడ్జెట్ దిశలోనే తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గతంలో లక్షా పదిహేను వేల కోట్ల బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం...ఈ సారి కనీసం 15 శాతం పెంచి బడ్జెట్ ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది. లక్షా 35 వేల కోట్ల మేర బడ్జెట్ ఉండేలా కసరత్తు జరుపుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరగడం... భూముల అమ్మకాలు, క్రమబద్దీకరణ వేగం పుంజుకోవడంతో భారీ బడ్జెట్ కే సై అంటుంది. అదే సమయంలో ప్రణాళికేతర వ్యయాన్ని సైతం తగ్గించుకునేలా జాగ్రత్త పడుతుంది. ప్రణాళిక బడ్జెట్ కనీసం 60 వేల కోట్లు ఉండేటా జాగ్రత్తలు తీసుకుంటోంది. మిషన్ కాకతీయకు 25 వేల కోట్లను కేటాయించనుంది. ఈ సారి జిల్లాల వారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. ఇక ఉచిత విద్య, డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు, వాటర్ గ్రిడ్ వంటి కార్యక్రమాలను ఎంత మేర కేటాయింపులు జరపాలని కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా శాఖల వారీగా సమావేశాలు సాగిస్తోంది ఆర్థిక శాఖ. మొత్తంగా మూడోవారం లోపు ముసాయిదా సిద్ధం చేసి సీఎంకు అందచేయనున్నారు.

06:35 - February 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు మధ్యాహ్నం సచివాలయంలోని సీ బ్లాక్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో భేటీ కానున్నది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత మంత్రివర్గం భేటీ అవుతోంది. ప్రాధాన్యపరంగా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్‌పై మంత్రివర్గం లోతుగా చర్చించే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ సమావేశాలను ఎప్పుడు ప్రారంభించాలి.. గవర్నర్ ప్రసంగం తదితర అంశాలను పరిశీలిస్తారు. బడ్జెట్ రూపకల్పన చర్చల్లో భాగంగా అన్నిశాఖలు, మంత్రులు ఖర్చులను 10 నుంచి 15 శాతం తగ్గించుకోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులకు సూచించే అవకాశం ఉందంటున్నారు.

సాగునీటి ప్రాజెక్టులు..
దీంతోపాటు ప్రభుత్వ ప్రాధాన్య అంశాలైన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, డబుల్‌ బెడ్రూం ఇండ్లు తదితర అంశాలవారీగా కేటాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్యాబినెట్ సమావేశంలో ఆర్థికశాఖకు సంబంధించి మొత్తం ఏడు అంశాలు, నీటిపారుదల శాఖకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశాన్ని టేబుల్ అంశంగా చేర్చి చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మొత్తం 20 అంశాలు చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన చట్టాన్ని తెలంగాణకు అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే 1993కు ముందు నుంచి పనిచేస్తున్న టెంపరరీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

కేటీఆర్ కు మున్సిపల్ పరిపాలన..
ఇదిలా ఉంటే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మున్సిపల్ పరిపాలన శాఖను కూడా అప్పగించే వ్యవహారం కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. కేటీఆర్‌కు మున్సిపల్ శాఖను అప్పగిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పలు అంశాలపైకూడా చర్చ ఉండే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా నగరంలో లక్ష డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై చర్చించనున్నారు. అలాగే ఉద్యోగులందరికీ 3.14 శాతం డీఏను పెంచేలా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

06:31 - February 7, 2016

హైదరాబాద్‌ : నిన్నటి దాక రేవ్ పార్టీలు..తాజాగా ముజ్రా పార్టీలు..పోలీసుల ఎన్ని దాడులు చేస్తున్నా ఈ పార్టీలు ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట రేవ్..ముజ్రాల పేరిట పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. వీకెండ్..ఇతర సందర్భాల్లో నగర శివారులో ఉండే ఫాం హౌస్ లో ఇలాంటి అసాంఘీక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా నగరంలోని మాదాపూర్‌ ఫాతిమా గెస్ట్ హౌస్‌ లో జరుగుతున్న ముజ్రాపార్టీపై శనివారం రాత్రి ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. జల్సాలు చేస్తున్న 10మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులంతా జీహెచ్‌ఎంసీ ఉద్యోగులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని మాదాపూర్‌ పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు యువతులు కూడా పట్టుబబడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఉద్యోగులు జల్సా చేయడానికి ముజ్రా పార్టీకి వచ్చినట్లు తెలుస్తోంది. 

06:29 - February 7, 2016

తూర్పుగోదావరి : ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం సతీమణి పద్మావతి ఆరోగ్యం క్షీణించింది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పోలీసులకు, ముద్రగడ పద్మనాభం అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ముద్రగడకు ఉదయం మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించామని జేసీ సత్యనారాయణ తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య బృందాన్ని తీసుకురాగా ముద్రగడ తలుపులు మూసేసి వారిని లోపలికి రానీయలేదు. దీంతో చేసేదిలేక జిల్లా జేసీ, వైద్య బృందం తిరిగి వెళ్లిపోయారు. అయితే ముద్రగడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లైతే బలవంతంగానైనా ఆయనను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు.

 

ముద్రగడ నివాసాన్ని చుట్టుముట్టిన సీఆర్పీఎఫ్ బలగాలు.

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసాన్ని సీఆర్పీఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి. ఆయన గత కొన్ని రోజులుగా కాపులను బీసీల్లో చేర్చాలని ఆమరణ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. 

నేడు సిటీ పరేడ్..హాజరు కానున్న మోడీ..

విశాఖపట్టణం : అంతర్జాతీయ నౌకాదళాల ప్రదర్శన (ఐఎఫ్ఆర్ 2016) లో భాగంగా నౌకాదళ విన్యాసాలను ఆదివారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30గంటల నుండి 7 గంటల వరకు నిర్వహించే ఈ విన్యాసాలకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.

 

సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..

సికింద్రాబాద్ : క్యాచీ ఫర్నీచర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంజు థియేటర్ సమీపంలో ఉన్న ఈ మూడంతస్తుల భవనంలో మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

హామీలు నెరవేర్చే వరకు దీక్ష ఆగదు - ముద్రగడ..

తూర్పుగోదావరి : హామీలు నెరవేర్చే వరకు దీక్ష ఆగదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తేల్చిచెప్పారు. నేతలు, అభిమానులు అనుమతించకపోవడంతో వైద్య పరీక్షలకు నిరాకరించారు. ఆత్మహత్యకు పాల్పడుతామంటూ పిఠాపురంలో మద్దతుదారులు నీళ్ల ట్యాంకు ఎక్కారు. 

ముజ్రా పార్టీలపై ఏస్ ఓటీ దాడులు..

హైదరాబాద్ : ఖానామెట్ లో ముజ్రాపార్టీలపై ఎస్ ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ముజ్రా పార్టీలతో జల్సా చేస్తూ పది మంది జీహెచ్ఎంసీ ఉద్యోగులు పట్టుబడ్డారు. ఉద్యోగులతో పాటు మరో ఆరుగురు మహిళలు పట్టుబడిన వారిలో ఉన్నారు. 

Don't Miss