Activities calendar

08 February 2016

21:46 - February 8, 2016

హైదరాబాద్: దేశంలో నెలకొన్న అసహన పరిస్థితులపై ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ స్పందించారు. తాను సహించడం అనే పదానికే వ్యతిరేకం అన్నారు. సహనం కాదని, అంగీకరించడం నేర్చుకోవాలని . భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన మనదేశంలో ఎన్నో రకాల ప్రజలున్నారని, అందరినీ సమానంగా అంగీకరించాల్సిన అవసరం ఉందని కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లు భారత్‌ నుంచి విడిపోయాయని.. ఇకమీదటైనా దేశ ఐక్యతను కాపాడుకోవాలని కమల్‌హసన్‌ సూచించారు. నిరంతర నిఘా ద్వారా ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ వివిధ రంగుల దారాలతో అల్లిన స్వెటల్‌ లాంటిదని, అందులో ఒక ఆకుపచ్చని దారాన్ని లాగేసినా స్వెటర్‌కు రూపం ఉండదని కమల్ పేర్కొన్నారు. 

21:44 - February 8, 2016

హైదరాబాద్ : సొరియాసిస్‌ వ్యాధికి డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరొటరీ రూపొందించిన స్ప్రేకు యుఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ అప్రూవల్‌ లభించింది. సొరియాసిస్‌ స్ప్రే ప్రాడక్ట్‌ను వచ్చే మూడు నెలలో ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. ఇంతకు ముందు సెర్నివో స్ప్రేకు కూడా యుఎస్‌ఎఫ్‌డిఏ ఆమోదించినట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ కో ఛైర్మన్, సిఈఓ జీవీ ప్రసాద్‌ తెలిపారు. చర్మ వ్యాధులకు సంబంధించిన మందులను అమెరికా మార్కెట్‌లోకి మరింత విస్తరించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. సొరియాసిస్‌ వ్యాధి చికిత్స కోసం18 ఏళ్ల నుంచి వృద్ధుల వరకు సెర్నివో స్ప్రేను ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.

21:43 - February 8, 2016

హైదరాబాద్ : మూడు రోజుల్లో వందశాతం ప్లేస్‌మెంట్స్‌తో ఐఐఎం లక్నో సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. 30వ బ్యాచ్‌కు చెందిన 446 మంది విద్యార్థులు కేవలం మూడు రోజుల్లోనే ఉద్యోగం పొందారని ద ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లక్నో ప్రకటించింది. నేషనల్‌, ఇంటర్నేషనల్‌కు చెందిన 160 సంస్థలు వీరిని రిక్రూట్‌ చేసుకున్నట్టు పేర్కొంది. అల్వరేజ్‌ అండ్‌ మార్షల్, బ్లాక్‌ రాక్‌, అడ్వయిజర్స్, మాస్టర్‌ కార్డు, జీరో త్రీ కాపిటల్‌ లాంటి సంస్థలు ఐఐఎం లక్నోకు ప్రాధాన్యత నిచ్చాయి. భారత్‌లోని మార్కెటింగ్‌, ఫైనాన్స్, కన్సల్టింగ్‌ రంగాల్లో వీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనున్నారు.

21:41 - February 8, 2016

హైదరాబాద్ : భారత్‌లో ఫేస్‌బుక్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నెట్‌ న్యూట్రాలిటీ వైపే మొగ్గు చూపింది. ఒకే సమాచారానికి వేర్వేరు ధరలు నిర్ణయించడాన్ని వ్యతిరేకించింది. నిబంధనలు ఉల్లంఘించే టెలికాం ఆపరేటర్లకు రోజుకు 50 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

వేర్వేరు డాటా చార్జీలు ఉండాలన్న ప్రతిపాదనకు ట్రాయ్‌ ఫుల్‌స్టాప్....

మొబైల్‌ ఇంటర్నెట్ సేవల విషయంలో కంటెంట్ ఆధారంగా వేర్వేరు డాటా చార్జీలు ఉండాలన్న చర్చకు భారత టెలికం నియంత్రణ సంస్థ -ట్రాయ్‌ పుల్‌ స్టాప్‌ పెట్టింది. వేర్వేరు కంటెంట్ యాక్సెస్ పొందేందుకు వినియోగదారులకు వేర్వేరు డాటా చార్జీలు ఉంచాలన్న కంపెనీల ప్రతిపాదనను ట్రాయ్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ట్రాయ్‌ ఉత్తర్వులతో ఎయిర్‌టెల్ జీరో, ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ ప్రచారానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది.

ఫ్రీ బేసిక్స్ పేరిట ఫేస్‌బుక్ భారీ ప్రచారం....

గతకొద్ది నెలలుగా ఫ్రీ బేసిక్స్ పేరిట ఫేస్‌బుక్ భారీ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ విషయంలో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడమే కాకుండా.. ఈ పథకాన్ని కాపాడాలంటూ తన సోషల్ మీడియా సైట్‌లో నెటిజన్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది. ఫ్రీ బేసిక్స్‌ స్కీము ద్వారా భారత్‌లోని లక్షలాది గ్రామీణులకు ఉచిత ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామని ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జూకర్‌బర్గ్‌ ప్రకటించారు. అయితే వినియోగదారులు పొందే కంటెంట్ ఆధారంగా డాటా చార్జీలు ఉండాలన్న ఫేస్‌బుక్ ప్రతిపాదనను ట్రాయ్ తిరస్కరించింది. ఈ విషయంలో డాటా చార్జీల్లో వివక్ష చూపుతూ ఏ మొబైల్ ఆపరేటర్ అయినా ముందస్తు ఒప్పందం చేసుకుంటే తీవ్రమైన చర్యలు తప్పవని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు 50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

కంటెంట్‌ ప్రొవైడర్లు, స్టార్టప్‌ సంస్థలు నష్టపోతాయని ట్రాయ్‌...

వేర్వేరు ధరలు నిర్ణయించడం మూలంగా సాధారణ కంటెంట్‌ ప్రొవైడర్లు, స్టార్టప్‌ సంస్థలు నష్టపోతాయని ట్రాయ్‌ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉచిత సేవలను టారిఫ్‌ పూర్తయ్యే వరకు వినియోగదారులు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇక నుంచి వేర్వేరు ధరలు ప్రవేశపెట్టవద్దని సూచించింది.

మెజారిటీ నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకం...

ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్ ప్రచారాన్ని మెజారిటీ నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. రిలయన్స్‌తో కలిసి ఫేస్‌బుక్‌ ఫ్రీ బేసిక్స్‌ను అందిస్తోంది. మొబైల్‌ ఫోన్‌ ద్వారా చవకగా వెబ్‌ సేవలు, ఫేస్‌బుక్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ ద్వారా మెసేజింగ్‌ సేవలను ఉచితంగా అందించారు. ఫేస్‌బుక్‌ ఫ్రీబేసిక్స్‌ను కొన్ని రోజుల క్రితమే ట్రాయ్‌ నిలిపివేసింది.

'నారాయణ ఖేడ్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలి '

హైదరాబాద్: ఈవీఎంలపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ లేఖ రాశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపర్‌ జరిగాయన్న ఆరోపణలు వచ్చాయంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం ఇకనైనా నారాయణఖేడ్‌ ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లు ఏర్పాటు చేయండి లేదా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఎల్‌.రమణ కోరారు.

హైటెక్స్ లో బయో ఏసినా సదస్సు ప్రారంభం

హైదరాబాద్ : బయో ఏసియా సదస్సును తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. హైటెక్స్‌లో మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సదస్సుకు 50 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. సదస్సులో టి.సర్కార్‌తో పలు కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.

20:39 - February 8, 2016

హైదరాబాద్ : ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వరుసగా చుట్టుముడుతున్నాయి. విభజన తరువాత సమస్యల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సింది పోయి మరిన్ని గందరగోళానికి ఆజ్యం పోస్తున్నారు. పారదర్శకంగా ప్రజలను, విపక్షాలను కలుపుకుపోకుండా అందరినీ పక్కకు తోసేసి తన మాటే ఫైనల్ అనే దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలో రాజధాని నిర్మాణంలో అడుగడుగునా సమస్యలు కనిపిస్తోంటే కాపు సమస్యల్లాంటివి మరిన్ని తెరపైకి వస్తున్నాయి. మొత్తానికి వరుసగా చిక్కుల్లో చిక్కుకుంటున్న చంద్రబాబు తీరుపై నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు.. పూర్తి వివరాలు వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:29 - February 8, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఛైర్మన్ ఎవరో ఖరారు కాకుండానే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని షూరు చేసిన సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖను కేటీఆర్ కు అప్పగించిన కేసీఆర్, పరిపాలనలో దుమ్ములేపుతోన్న కేటీఆర్, పదకొండేళ్ల నుండి పురిటి నొప్పులు పడుతున్న బీబీ నగర్ నిమ్స్ దవాఖానకు డెలివరీ డేట్ ఫిక్స్ చేసిన మంత్రి లక్ష్మారెడ్డి, పాలమూరు జిల్లాలో పేకాట ఆడుతూ పట్టుబడ్డ పోలీసోళ్ళు, వరంగల్ లో గాంధీ బొమ్మను ఎందుకు ధ్వంసం చేశారు? ముంబైలో కోతులకు శిక్ష, జంగల్ ను విడిచి బెంగళూరులో పాఠశాలలో పులి, సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న చిన్నములకనూరులో బావిలో పడ్డ జింక, నారాయణ ఖేడ్ సర్కార్ బడిలో కొండవ శిలు, కడప జిల్లాకు ఆస్ట్రేలియా పక్షులు, 30 అడుగుల ఎత్తు నుండి దూకిన రెండేళ్ల పోరడు ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చలలో చర్చించారు. పూర్తి వివరాలు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

18:52 - February 8, 2016

హైదరాబాద్‌ : హిమాయత్‌నగర్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ముగ్గురు డాక్టర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఒక డాక్టర్‌పై మరో డాక్టర్‌ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గ్లోరియల్ హాస్పటల్ డైరక్టర్ల సమావేశంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. డాక్టర్ ఉదయ్ కుమార్‌పై మరో డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపాడు. మాధాపూర్‌కు చెందిన గ్లోరియల్ హాస్పటల్ డాక్టర్లు హిమాయత్‌నగర్‌లోని స్ట్రీట్ నెం 6లో ఉన్న రాజా రెసిడెన్సీలో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ఆస్పత్రి లావాదేవీలపై చర్చ జరిగింది. దాంట్లో డాక్టర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డాక్టర్లు ఉదయ్, శిశి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. ఆ సమయంలో శిశకుమార్ తన వద్ద ఉన్న గన్‌తో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. డాక్టర్ ఉదయ్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

18:50 - February 8, 2016

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్న భూపతిరెడ్డి ఇంటిపై ఏసిబి అధికారులు దాడి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టారు. బెంగళూరు, తిరుపతిలోని భూపతిరెడ్డి, ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో ఏసిబి అధికారులు సోదాలు చేశారు. భూపతిరెడ్డి ప్రస్తుతం కోదండరామస్వామి ఆలయ డిప్యూటీ ఈవోగా పనిచేస్తున్నారు. 

18:49 - February 8, 2016

హైదరాబాద్ : కర్నూలు జిల్లా రాజకీయాలు వలసలు వేడెక్కిస్తున్నాయి. ప్రతిపక్ష నేతల వలసలకు చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో జిల్లా పాలిటిక్స్ ఒక్కసారిగా తారుమారయ్యాయి. వైసీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ అవుతారనే ప్రచారం జోరుగా సాగింది. జగన్‌ అప్రమత్తమవడంతో ప్రస్తుతానికి వలసలకు బ్రేక్‌ పడినట్టు తెలుస్తోంది.పార్టీలోనే కొనసాగుతామని సదరు శాసనసభ్యులు చెబుతున్నప్పటికీ టీడీపీ నేతలతో క్లోజ్‌గా మూవ్‌ అవడం ఆ పార్టీలో కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేస్తోంది.

కోట్ల వ్యవహారం కలకలం...

ఇక కాంగ్రెస్‌లో కోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. బండ్లపల్లిలో జరిగిన రాహుల్‌ సభలో అవమానం జరిగిందంటూ మాజీ కేంద్రమంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి అలక పాన్పు ఎక్కారు. ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటారా..లేక పార్టీ మారుతారా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ నేతలు బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు. కోట్ల వర్గం మాత్రం ససేమిరా అంటోంది. కర్నూలులో పార్టీ కార్యాలయానికి తాళం వేసి, ఆందోళనలు కూడా చేశారు. హైకమాండ్‌ స్పందించకపోతే భవిష్యత్ ప్రణాళికపై దృష్టి సారిస్తామని కోట్ల వర్గం చెబుతోంది. ఈ నేపథ్యంలో కోట్ల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది హాట్‌టాపిక్‌గా మారింది.

టీడీపీ జిల్లాలో మరింత పట్టు సాధించేందుకు....

మరోపక్క టీడీపీ జిల్లాలో మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు మాత్రమే దక్కడంతో జిల్లాపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు.ప్రత్యర్థి పార్టీల నేతలనూ చేర్చుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు.. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ నేపథ్యంలో జగన్‌ కూడా అప్రమత్తమయ్యారు. మొత్తానికి వలసలు, అలకలతో జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 

హిమాయత్ నగర్ లో కాల్పుల కలకలం..

హైదరాబాద్ : హిమాయత్‌నగర్‌లో జరిగిన గ్లోరియల్ హాస్పటల్ డైరక్టర్ల సమావేశంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. డాక్టర్ ఉదయ్ కుమార్‌పై మరో డాక్టర్ శశికుమార్ కాల్పులు జరిపాడు. మాధాపూర్‌కు చెందిన గ్లోరియల్ హాస్పటల్ డాక్టర్లు హిమాయత్‌నగర్‌లోని స్ట్రీట్ నెం 6లో ఉన్న రాజా రెసిడెన్సీలో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ఆస్పత్రి లావాదేవీలపై చర్చ జరిగింది. దాంట్లో డాక్టర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డాక్టర్లు ఉదయ్, శిశి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. ఆ సమయంలో శిశకుమార్ తన వద్ద ఉన్న గన్‌తో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు.

జర్నలిస్టులకు బుద్వేల్ లో 100 ఎకరాల్లో ఇళ్లు: కేసీఆర్

హైదరాబాద్ :సీఎం కేసీఆర్ తో జర్నలిస్టు సంఘాల నేతల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బుద్వేల్ లో 100 ఎకరాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. నగరంలో పని చేస్తున్నా అన్ని రకాల జర్నలిస్టులకు ఇళ్లు సమకూరేలా బహుల అంతస్తులు నిర్మిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం బాధ్యతలు రంగారెడ్డి కలెక్టర్ కు అప్పగించనున్నట్లు తెలిపారు. బుద్వేల్ లో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధీనంలో ఉన్న స్థలాన్ని త్వరలోనే బదలాయిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా జర్నలిస్టులందరికీ ఇళ్లు కేటాయించేలా కలెక్టర్లు, మంత్రులకు సూచనలు ఇస్తామన్నారు.

18:01 - February 8, 2016

నారాయణ ఖేడ్ : హైదరాబాద్‌లో మాదిరే నారాయణఖేడ్ ఉప ఎన్నికలోనూ టిడిపి కాంగ్రెస్‌లు చిత్తుచిత్తుగా ఓడిపోతాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. మెదక్‌ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. టిఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరంటున్న మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

17:58 - February 8, 2016

హైదరాబాద్ : నారాయణ్‌ఖేడ్‌లో ప్రచారం హోరెత్తుతోంది. మూడు ప్రధాన పార్టీలు రేసులో ఉండడంతో అభ్యర్థుల తరపున రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ తరపున ప్రచార బాధ్యతను మంత్రి హరీష్‌ రావు భుజాన వేసుకున్నారు. అలాగే నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని మనూరు మండలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి భూపాల్‌ రెడ్డి తరపున డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు.

దామోదర రాజనర్సింహ విస్తృతంగా ప్రచారం....

ఇక కాంగ్రెస్‌ తరపున మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే కిష్టా రెడ్డి మరణించినప్పటికీ సంప్రదాయాలు మరిచి టీఆర్‌ఎస్‌ పోటీకి దిగిందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సంజీవ్‌రెడ్డిని గెలిపించాలని దామోదర విజ్ఞప్తి చేశారు. టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సైతం నారాయణఖేడ్‌ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ హామీలను విస్మరించిందని రేవంత్‌ ప్రచారంలో ఎండగట్టారు. ఇదిలా ఉంటే మూడు పార్టీల ప్రచారంతో ఖేడ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. మరోవైపు ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు. 

17:55 - February 8, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈవీఎంల టాంపరింగ్ కు పాల్పడిందంటూ తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వివిధ ఛానళ్ల ఇంటర్వూలలో 100 సీట్లు గెలుస్తామని కేటీఆర్ చెప్పడం.. అలాగే 100 సీట్లు గెలవడం జరిగిందని ఆయన అన్నారు. ఎన్నికల ముందే 100 సీట్లు గెలుస్తామని చెప్పడం వెనక కుట్ర దాగుందన్నారు దాసోజు శ్రవణ్ . ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వం టాంపరింగ్ కు పాల్పడిందని ఆరోపించారు శ్రవణ్ .

టీఆర్ఎస్ టాంపరింగ్ కు పాల్పడింది : శ్రవణ్

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈవీఎంల టాంపరింగ్ కు పాల్పడిందంటూ తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వివిధ ఛానళ్ల ఇంటర్వూలలో 100 సీట్లు గెలుస్తామని కేటీఆర్ చెప్పడం.. అలాగే 100 సీట్లు గెలవడం జరిగిందని ఆయన అన్నారు. ఎన్నికల ముందే 100 సీట్లు గెలుస్తామని చెప్పడం వెనక కుట్ర దాగుందన్నారు దాసోజు శ్రవణ్ . ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వం టాంపరింగ్ కు పాల్పడిందని ఆరోపించారు శ్రవణ్ .

17:52 - February 8, 2016

హైదరాబాద్ : కుషాయిగూడలో నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. ఈ దుర్ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

17:35 - February 8, 2016

హైదరాబాద్ : న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాట్స్ మన్ బ్రెండన్ మెక్ కల్లమ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. అద్భుతమైన ఫాంలో ఉండగా క్రికెట్ నుంచి నిష్క్రమించిన క్రికెటర్ బ్రెండన్ మెక్ కల్లమ్ కావడం విశేషం. ఆస్ట్రేలియాపై 55 పరుగుల విజయంతో న్యూజిలాండ్ జట్టు మెక్ కల్లమ్ కు ఘనమైన వీడ్కోలు పలికింది. 27 బంతుల్లో 47 పరుగులు సాధించిన మెక్ కల్లమ్ న్యూజిలాండ్ తరపున అత్యధిక వన్డే సిక్సర్లు (200) బాదిన క్రికెటర్ గా రికార్డుపుటల్లో తన పేరు లిఖించుకున్నాడు. రిటైర్ అయినప్పటికీ మెక్ కల్లమ్ ఐపీఎల్ లో కనువిందు చేయనున్నాడు. కాగా, అంతర్జాతీయ స్ధాయిలో షాహిద్ అఫ్రిదీ (352), సనత్ జయసూర్య (270) క్రిస్ గేల్ (238), తరువాత మెక్ కల్లమ్ కొట్టిన సిక్సర్లే ఎక్కువ.

మధ్యాహ్న భోజనం వికటించి 32 మంది విద్యార్థులకు అస్వస్థత

విజయవాడ : నగరంలోని జమ్మిచెట్టు ప్రాంతంలో ఉన్న బియస్‌ఆర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను వెంటనే స్థానిక ఆసుత్రికి తరలించారు. విషయం తెలుకున్న మండల చీఫ్ మెడికల్ అఫీసర్ గోపినాయక్ , ప్రిన్సిపల్ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.

 

టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ ను కలిసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీని ముంబైలో మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు. వీరిద్దరు పలువురు కీలక అంశాలపై చర్చించారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకంలో భాగస్వామ్యమయేందుకు టాటాగ్రూప్ సంస్థల అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో టాటాస్పేస్ ఏఐజీ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. టాటా క్యాపిటల్‌తో టీహబ్ ఇన్నోవేషన్‌కు ఆర్థిక సహకారమందించేందుకు సైరస్‌మిస్త్రీ సిద్దంగా ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా డిఫెన్స్ ఏరోస్పేస్ రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు టాటాగ్రూప్ ఆసక్తిగా ఉన్నట్టు తెలిసింది.. 

తాత్కాలిక సచివాలయం శంకుస్థాపన వాయిదా : సీఎం చంద్రబాబు

విజయవాడ : ఈ నెల 12న తలపెట్టిన తాత్కాలిక సచివాలయం శంకుస్థాపన వాయిదా వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరలో ముహూర్తపు తేదీలను ఖరారు చేస్తాని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. కాపు వర్గంలోని పేదలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్నారు. వచ్చే బడ్జెట్ లో కాపులకు రూ. 1000 కోట్లు కేటాయిస్తామన్నారు. తుని ఘటన బాధ్యులను వదిలి పెట్టమని హెచ్చరించారు. కాపుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు.

తిరువణ్ణామలైలో తొక్కిసలాట.. నలుగురి మృతి

తమిళనాడు: ప్రముఖ అరుణాచలేశ్వర ఆలయంలో సోమవారం మహోదయ అమావాస్య సందర్భంగా భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట జరిగింది. భక్తులంతా ఆలయ కోనేరులో పవిత్ర స్నానం చేసే దగ్గర తోపులాట జరగడంతో నలుగురు వ్యక్తులు కోనేట్లో మునిగిపోయి మృతిచెందారు.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : నేడు స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 329.55 పాయింట్లు నష్టపోయి 24287.42 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 101.85 పాయింట్లు నష్టపోయి 7387 పాయింట్ల వద్ద ముగిసింది. 

ఏపీ సీఎం క్యాంపు ఆఫీసు ఎదుట మహిళ ఆందోళన

విజయవాడ : ఏపీ సీఎం క్యాంపు ఆఫీసు ఎదుట గుంటూరుకు చెందిన పద్మావతి అనే మహిళ సోమవారం ఆందోళనకు దిగింది. భర్తను కోల్పొయి చాలా రోజులు అవుతున్నా తనకు వితంతు పింఛన్ రాకపోవడంతో ఆందోళన బాట పట్టింది. సీఎం క్యాంపు ఆఫీసులో అర్జీ పెట్టుకుని నెల రోజులు అవుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ధర్నాకు దిగింది. తనకు ఇల్లు, ఉద్యోగం కల్పించాలని, అంతవరకూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని ఆమె తెలిపింది.

కుషాయిగూడలో కుప్పకూలిన భవనం:ఒకరి మృతి

హైదరాబాద్ : నగరంలోని కుషాయిగూడలో ఎన్‌ఎఫ్‌సీలో సోమవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పదిమంది గాయపడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..

తిరుపతి : టీటీడీ డిప్యూటీ ఈవో భూపతిరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు, బెంగళూరులోని.. భూపతిరెడ్డి బంధువుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేశారు. తిరుపతిలో నాలుగంతస్తుల భవనం, తిరుచానూరులో లాడ్జి, 30 ఇంటి స్థలాల డాక్యుమెంట్లు, 2 లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా 18 స్థలాలు అమ్మినట్టు నిర్ధారించారు. ముగ్గురు డీఎస్పీల ఆధ్వర్యంలో సోదాలు చేశారు.

పేకాటాడుతూ పట్టుబడ్డ పోలీసలు

మహబూబ్ నగర్ : అయోధ్య నగర్ లో పేకాట ఆడుతూ ఆరుగురు పోలీసులు పట్టుబడ్డారు. వారిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ విశ్వప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఫ్రీ బేసిక్ విధానాన్ని తిరస్కరించిన ట్రాయ్

హైదరాబాద్ : పేస్ బుక్ ప్రతిపాదించిన ఫ్రీ బేసిక్ విధానాన్ని ట్రాయ్ తిరస్కరించింది. నెట్ న్యూట్రిలిటీని ట్రాయ్ సమర్ధించింది. కంటెంట్ లేదా డేటీ ఆధారిత ఛార్జీల్లో తేడాలు చూపిస్తే రోజుకు రూ. 50వేలు జరిమానా విధించనున్నట్లు తెలిపింది.

రాష్ట్రపతి ప్రణబ్ తో గవర్నర్ల భేటీ

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో అన్ని రాష్ట్రాల గవర్నర్లు భేటీ అయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు.

15:53 - February 8, 2016

విజయవాడ: విశాఖ లో అంతర్జాతీయ నేవీ ఫ్లీట్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వివిధ దేశాల నుండి వచ్చి ప్రతినిధులు రాష్ట్రపతి, ప్రధానికి సెల్యూట్ చేయడం అరుదైఘటనగా అభివర్ణించారు. ప్రపంచ దేశాలను ఒక దగ్గర చేర్చి విశాఖలో విన్యాసాలు నిర్వహించిన ఇండియన్ నేవీకి అభినందనలు తెలిపారు. ఇంటర్నేషనల్ మ్యాప్ లో విశాఖ పట్టణంనేవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కేంద్ర బిందువుగా ఏర్పడిందన్నారు. హుదూద్ ఘటన జరిగిన ఒక సంవత్సరం మూడు నెలల్లో గతం కంటే విశాఖ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఇండస్ట్రీయల్ ఇన్వెస్టర్స్ మీట్ లో 44 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించేందుకు విశాఖపట్టణంలో 56 కిలోమీటర్ల రోడ్లు కొత్తవి వేశామని చెప్పారు. ఆర్ అండ్ బీ సుమారు 44 కిలోమీటర్ల దూరం రోడ్లు వేశాయని ఆయన తెలిపారు. ఇందుకు 84 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన వివరించారు. అర్బన్ డెవలెప్ మెంట్ అధారిటీ, గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ 23 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, పోర్టు ట్రస్టు 40 కోట్ల రూపాయలు వెచ్చించిందని ఆయన వివరించారు. వీటితో పాటు నేవల్ బేస్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఒసీ, బొర్రా కేవ్స్ తదితర సంస్థలన్నీ ఆయా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాయని ఆయన వెల్లడించారు. ఐఎఫ్ఆర్ లో భద్రత కోసం సుమారు 15వేల మంది పోలీసులను మోహరించామని వెల్లడించారు. వారికోసం 13 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన తెలిపారు. అందుకే ఐఎఫ్ఆర్ లో రవ్వంత తప్పు కూడా జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సంబరాలు వీక్షించేందుకు 6 లక్షల మంది విశాఖ బీచ్ రోడ్ కు తరలి వచ్చారని ఆయన వెల్లడించారు. ఇంత పెద్ద జనసందోహం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నాలుగు రోజుల పాటు ఇంత ఘనగం నిర్వహించడం గర్వకారణమని ఆయన చెప్పారు. ఇంత క్రమశిక్షణతో మెలిగిన విశాఖ వాసులకు ధన్యవాదాలు ఆయన తెలిపారు.

హుబ్లీ రైల్వేస్టేషన్‌లో కూలిన భవనం...

హైదరాబాద్ : కర్ణాటకలోని హుబ్లీ రైల్వేస్టేషన్‌లో పార్శిల్‌ కార్యాలయ భవనం కుప్పకూలింది. శిథిలాల్లో పలువురు చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సహాయ చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

15:43 - February 8, 2016

కృష్ణా : నాగాయలంక మండలం సొర్లగొందిలో దారుణం జరిగింది. మంటల్లో కాలి తమ్మ నాగలక్ష్మి అనే మహిళ మృతిచెందింది. నాగలక్ష్మిపై పెట్రోల్‌ పోసి తగలబెట్టినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి భర్త, అత్తమామలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

15:40 - February 8, 2016

తూ.గో : ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణతో కిర్లంపూడిలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ముద్రగడ నివాసం ఎదుట బాణా సంచా కాల్చారు. కాపు రిజర్వేషన్ల కోసం గత నాలుగు రోజులుగా ముద్రగడ కిర్లంపూడిలోని తన నివాసంలో దీక్షకు దిగారు. సోమవారం ప్రభుత్వ ప్రతినిధులు ముద్రగడతో చర్చలు జరుపగా అవి సఫలం కావడంతో ముద్రగడ దంపతులు దీక్ష విరమించారు. 

కిర్లంపూడిలో ముద్రగడ అభిమానుల సంబరాలు..

తూ.గో : ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణతో కిర్లంపూడిలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ముద్రగడ నివాసం ఎదుట బాణా సంచా కాల్చారు. కాపు రిజర్వేషన్ల కోసం గత నాలుగు రోజులుగా ముద్రగడ కిర్లంపూడిలోని తన నివాసంలో దీక్షకు దిగారు. సోమవారం ప్రభుత్వ ప్రతినిధులు ముద్రగడతో చర్చలు జరుపగా అవి సఫలం కావడంతో ముద్రగడ దంపతులు దీక్ష విరమించారు. 

రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవికి శ్యామ మల్లేష్ రాజీనామా

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా డిసీసీ అధ్యక్ష పదవికి శ్యామ మల్లేష్ రాజీనామా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అంతే కాకుండా గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ గ్రేటర్ అధ్యక్ష పదవికి దానం రాజీనామా చేశారు. దానం రాజీనామాను ఏఐసీసీ అంగీకరించింది.

నేవీ ఫ్లీట్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం : చంద్రబాబు

విజయవాడ : విశాఖ లో అంతర్జాతీయ నేవీ ఫ్లీట్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వివిధ దేశాల నుండి వచ్చి ప్రతినిధులు రాష్ట్రపతి, ప్రధానికి సెల్యూట్ చేయడం అరుదైఘటనగా అభివర్ణించారు. ప్రపంచ దేశాలను ఒక దగ్గర చేర్చి విశాఖలో విన్యాసాలు నిర్వహించిన ఇండియన్ నేవీకి అభినందనలు తెలిపారు. ఇంటర్నేషనల్ మ్యాప్ లో విశాఖ పట్టణంనేవీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కేంద్ర బిందువుగా ఏర్పడిందన్నారు. హుదూద్ ఘటన జరిగిన ఒక సంవత్సరం మూడు నెలల్లో గతం కంటే విశాఖ సుందరంగా తీర్చిదిద్దామన్నారు.

నల్గొండ జిల్లా గుర్రంపాడులో ఉద్రిక్తత

నల్లగొండ : గుర్రంపోడులో మృతదేహంతో రోడ్డు పై ధర్నా నిర్వహిస్తున్నారు. స్థానికంగా నివాసముంటున్న ఇటికల శేఖర్(26) అనే యువకుడిని ఓ కేసు నిమిత్తం అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని తీవ్రంగా కొట్టారు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో ఆగ్ర హించిన మృతుడి బంధువులు మృతదేహంతో రాస్తారోకో నిర్వహిస్తున్నారు. బాదిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని రోడ్డు భీష్మించుకొని కూర్చున్నారు.

పవన్ కల్యాణ్ ది శిఖండి పాత్ర : సిపిఐ నారాయణ

హైదరాబాద్ : సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయ వ్యవహారాల్లో శిఖండి పాత్ర పోషిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఉద్యమాలు వచ్చినప్పుడే సీఎం చంద్రబాబును రక్షించేందుకు ఆయన తెరపైకి వస్తున్నారని చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఆరోపించారు. ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక కుల రాజకీయాలను, ఉద్యమాలను తీసుకొచ్చింది చంద్రబాబేనని నారాయణ విమర్శించారు. దమ్ముంటే రాజ్యాంగ సవరణ ద్వారా కాపులను బీసీల్లో చేర్చగలరా? అంటూ ముక్కుసూటిగా ప్రశ్నించారు.

ఇసుకమాఫియాపై హైకోర్టులో విచారణ...

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో ఇసుకమాఫియాపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఇసుకమాఫియా ఆగడాలు అడ్డుకునేందుకు... అత్యున్నతస్థాయి కమిటీ వేసినట్లు ధర్మసానానికి తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఏపీలో ఇసుకమాఫియాపై అత్యున్నతస్థాయి కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో రెండువారాల్లో కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ అత్యున్నతస్థాయి కమిటీని కలవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.

14:54 - February 8, 2016

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని తమను సందేహాలున్నాయన్నారు... కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీ... కొందరు అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా రాలేదని తేలిందని.. వాళ్ల ఓటైనా వాళ్లకు రావాలికదా అని చెప్పుకొచ్చారు.. ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్షించుకుంటామని స్పష్టం చేశారు..

14:53 - February 8, 2016

హైదరాబాద్ : మరోసారి వివాదాస్పద ట్వీట్‌ చేశాడు రాంగోపాల్‌ వర్మ... ఈసారి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్‌ చేశాడు.. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనపై పవన్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు.. ప్రెస్‌మీట్‌లో పవన్‌ మాటలు ఆయనకైనా అర్థమయ్యయాయా? అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.. కారులో తన పక్కనున్న వ్యక్తి మాటలతో ప్రభావితమై మాట్లాడినట్లుగా పవర్‌ స్టార్‌ తీరు ఉందని విమర్శించారు.. ప్రెస్‌మీట్‌లో కల్యాణ్‌ తాను చేసిన ప్రసంగాన్ని మరోసారి చూసుకోవాలని కోరారు.. ఇది ఏపీ పౌరుడిగా... పవన్‌ అభిమానిగా తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.. పీకే అభిమానిగా తాను చెప్పిన విషయాలను వ్యతిరేకించేవారెవ్వరైనా తన దృష్టిలో నమ్మక ద్రోహి అన్నారు.. అలాగే చిరంజీవి రాజకీయ వైఫల్యంకంటే పవన్‌ కల్యాణే ఎక్కువగా ఫెయిల్ అయ్యాడని ట్వీట్ చేశాడు.. 

14:51 - February 8, 2016

వరంగల్‌ : వర్ధన్నపేట మండలం డీసీ తండాలో దారుణం జరిగింది.. భర్త ఓ యువతిని రెండోపెళ్లి చేసుకున్నాడంటూ మొదటి భార్య బంధువులు దాడికి దిగారు.. మహిళను వివస్త్రను చేసి కొడుతూ ఊరంతా తిప్పారు.. ఒళ్లంతా వాతలు పెట్టారు.. తండాకుచెందిన రవి మొదటిభార్య ఉండగానే వేరే యువతిని ప్రేమించాడు.. భార్య నిలదీయడంతో ఆమెకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.. ఇందుకోసం 6లక్షల రూపాయలు ఇచ్చేందుకు పెద్దమనుషులమధ్య ఒప్పందం కుదిరింది.. మధ్యలో మనసు మార్చుకున్న మొదటి భార్య... బంధువులతో కలిసి భర్త ప్రియురాలిపై దాడికి దిగింది.. తీవ్ర గాయాలపాలైన యువతిని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..

14:49 - February 8, 2016

హైదరాబాద్ :సమాజంలో కొన్ని పనులలో మహిళలనే చూస్తుంటాం. అలాగే మరి కొన్ని పనులు పురుషులే నిర్వర్తిస్తుంటారు. అందుకు అనేక కారణాలు కనిపిస్తుంటాయి. ఒకవైపు మహిళలు అంతరిక్షంలో అడుగుపెడుతున్నప్పటికీ మరి కొన్ని రంగాలలో వారి ప్రవేశం అరుదుగానే ఉంటోంది. అలా మహిళలు అరుదుగా రాణించే రంగమైన మెకానిజంలో అడుగుపెట్టి అందులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న వనిత విద్యా నంబిరాజన్. మహిళలు అరుదుగా రాణించే రంగంలో ప్రవేశించటం ఒకింత సాధ్యమే అయినప్పటికీ దీర్ఘకాలం పాటు కొనసాగించటం కష్టసాధ్యమే. అలాంటి కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని ఎంచుకున్న వృత్తికి కొత్త వన్నెలద్దుతున్న విద్యానంబిరాజన్ ఎంతో మంది మహిళలకు స్పూర్తిదాయకం. పూర్తి వివరాలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:46 - February 8, 2016

హైదరాబాద్ : పద్మశ్రీ... దేశంలో నాల్గో అత్యున్నత పౌర పురస్కారం. ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా ఎన్నికల సంవత్సరాల్లోనే ఈ అవార్డులను ఎక్కువగా ఇస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల ఏడాదిలో ఇచ్చినన్ని అవార్డులు అంతకు ముందు నాలుగేళ్లలో ఇచ్చిన దాఖలాలు లేవు. 2004లో ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ 74 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. 2000 నుంచి 2003 వరకు సగటున 57 పద్మశ్రీలు మాత్రమే ఇచ్చారు. 2009 ఎన్నికల ఏడాది కావడంతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌ 93 మందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది. 2005 నుంచి 2008 వరకు సగటున 66 మందికి పద్మశ్రీ ఇచ్చారు. 2014 ఎన్నికల సంవత్సరంలో యూపీఏ 101 మంది పద్మశ్రీలు ప్రకటించింది. 2010 నుంచి 2013 వరకు సగటున 80 మందికి మాత్రమే ఈ వార్డులు ప్రదానం చేశారు.

గత 16 ఏళ్లలో 1200 మంది పద్మశ్రీ అవార్డులు .....

పద్మశ్రీ అవార్డుల్లో ఢిల్లీ, మహారాష్ట్ర వాసులకు ఎక్కువగా దక్కుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. గత 16 ఏళ్లలో 1200 మందికి పద్మశ్రీ అవార్డులు ఇస్తే... వీటిలో మూడొంతులు ఈ రెండు రాష్ట్రాలకే దక్కాయి. ఈ కాలంలో బీహార్‌కు 20 అవార్డులు మాత్రమే దక్కాయి. మొత్తం అవార్డుల్లో ఇది 2 శాతం కంటే తక్కువ. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, కేరళ, కర్నాటకలకు ఎక్కువ అవార్డులు దక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ల వాటా 6 శాతం. ఇతర రంగాల్లోని వారితో పోలిస్తే కళాకారులకు ఎక్కువ పద్మశ్రీలు ప్రకటిస్తున్నారు. ఆ తర్వాత సాహిత్య, విద్య, వైద్యం, సైన్స్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లోని వారికి ఈ అవార్డులు ఇస్తున్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో జర్నలిజం నుంచి వచ్చే వారు చాలా తక్కువగా మంది ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 

14:45 - February 8, 2016

హైదరాబాద్ : 2008 నవంబర్‌ 26న జరిగిన ముంబయి దాడులకు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందని ఈ కేసులో నిందితుడుగా ఉన్న డేవిడ్‌ హెడ్లీ వెల్లడించాడు. అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న హెడ్లీని ముంబయి ప్రత్యేక న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. ప్రత్యేక న్యాయమూర్తి వేసిన దాదాపు 40 ప్రశ్నలకు హెడ్లీ సమాధానం చెప్పాడు. ముంబయి దాడులకు ముందు పాకిస్థాన్‌ను చాలాసార్లు సందర్శించినట్టు ఒప్పుకున్నాడు. పాక్‌ నుంచి ఏడుసార్లు, యూఏఈ నుంచి ఒకసారి భారత్‌ వచ్చినట్టు న్యాయస్థానం దృష్టికి తెచ్చాడు. తాను లష్కరే తోయిబాకు అనుచరుడిగా ఉన్నట్టు హెడ్లీ అంగీకరించాడు. ముంబయి మారణహోమం కేసులో డేవిడ్‌ హెడ్లీ గతేడాది సాక్షిగా అ మారాడు. 2006లో తన పేరును దావూద్‌ గిలానీకి బదులు డేవిడ్‌ హెడ్లీగా మార్చుకున్నట్టు కోర్టుకు వివరించాడు. కరాచీలోని రక్షణ శాఖ స్కూల్లో చదవినట్టు చెప్పాడు. భారత్‌లో వ్యాపారం చేసుకునేందుకు ఐదేళ్ల వీసా తీసుకున్నాడు. 

14:42 - February 8, 2016

హైదరాబాద్ : తైవాన్‌లో సంభవించిన భూకంపంలో మరణించినవారి సంఖ్య 35కు చేరింది. దాదాపు 121 మందికిపైగా జాడ తెలియటం లేదని సహాయక బృందాలు చెప్పాయి. తైనాన్‌ నగరంలో కుప్పకూలిన వీగువాన్‌ భవనంలో ఆరుగురు చిన్నారులతో సహా 22 మృతదేహాలను సహాయక బృంద కార్యకర్తలు వెలికి తీశారు. ఘటనా స్థలిలో దాదాపు 282 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, 340 మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తలు, 105 అగ్నిమాపక వాహనాలు బాధితులను ఆదుకునేందుకు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. 

14:38 - February 8, 2016

హైదరాబాద్  :  ప్రశ్నపై ఎదురుదాడి జరుగుతూనే ఉంటుంది. ప్రశ్న ఎప్పుడూ గాయపడుతూనే ఉంటుంది. ప్రశ్న ఎప్పుడూ అణచివేతకు గురవుతూనే ఉంది. నిచ్చెన మెట్ల వ్యవస్థలో అలాంటి ఒక ప్రశ్నే రోహిత్ వేముల. అలా ప్రశ్నించిన ధోరణే రోహిత్ ను బలితీసుకుంది. కన్నతల్లికి గర్భశోకాన్ని మిగిల్చింది. బిడ్డ మరణం తర్వత కూడా, ఆ తల్లిని ఈ పితృస్వామ్యం వెంటాడుతూనే, వేధిస్తూనే ఉంది. ఈ స్థితిని నిరసిస్తూ ఆమెకు అనేక సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, పౌరహక్కుల నేతలు మద్దతు తెలిపారు. అలాంటి రోహిత్ మృతికి కారకులైన వారిని శిక్షించాలని మానవి కోరుకుంటోంది. రోహిత్ తల్లికి సంఘీభావంగా నిలిచిన వారందరికి మద్ధతు తెలుపుతోంది.  ఈ సంఘీభావ కార్యక్రమంపై మానవి ప్రత్యేక కథనం.. మరి ఆవివరాల పూర్తి సారాంశాన్ని చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

సమ్మె విరమణకు ఢిల్లీ మున్సిపల్ కార్మికుల అంగీకారం..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు ఈరోజు సమ్మె విరమణకు అంగీకరించారు. మున్సిపల్‌ కార్పొరేషన్లు కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలను రెండు రోజుల్లో ఇస్తామని హామీ ఇవ్వడంతో మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల కార్మికులు సమ్మె విరమించి తక్షణమే విధుల్లో చేరడానికి దిల్లీ హైకోర్టు ముందు అంగీకారం తెలిపారు.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు : ముద్రగడ

తూ.గో :ప్రభుత్వ ప్రతినిధుల చర్చలు సఫలం అయ్యాయని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. దీంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, తోట త్రిమూర్తులు, వర్మ, బొడ్డు భాస్కరరామారావు... ముద్రగడతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఆయన దీక్ష విరమించారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లను అంగీకరించినట్లు తెలిపారు. కాపు కమిషన్ తో ముద్రగడ సూచించిన వ్యక్తి స్థానం, తుని ఘటనలో కేసులు ఎత్తివేతకు అంగీకరించారని తెలిపారు.

చర్చలు సానుకూలం :కళా

తూ.గో : ముద్రగడ పద్మనాభంతో అన్ని విషయాలు చర్చించినట్లు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. చర్చలు సానుకూల వాతావరణంతో జరిగాయన్నారు. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే కమిషన్‌ వేశామని.. 9 నెలల్లో నివేదిక వస్తుందని తెలిపారు. కమిషన్‌ కార్యకలాపాల వేగవంతానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముద్రగడకు స్పష్టం చేసినట్లు కళా వెంకట్రావు తెలిపారు.

దీక్ష విరమించిన ముద్రగడ..

తూర్పుగోదావరి :  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నాలుగురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈరోజు దీక్ష విరమించారు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, తోట త్రిమూర్తులు, వర్మ, బొడ్డు భాస్కరరామారావు... ముద్రగడతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఆయన దీక్ష విరమించారు. మంత్రి అచ్చెన్నాయుడు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.

నారాయణఖేడ్ లో తమ గెలుపు ఖాయమైంది - హరీష్..

మెదక్ : నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమైందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి కాంగ్రెస్ చేసేందేమి లేదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నారాయణఖేడ్ సుమారు రూ.850 కోట్లు కేటాయించామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 

అప్ఘన్ లో ఆత్మహుతి దాడి..ముగ్గురు సైనికుల మృతి..

కాబూల్ : అప్ఘనిస్తాన్ లో బల్ఖ్ ప్రావిన్స్ లో ఆత్మహుతి జరిపిన దాడిలో ముగ్గురు సైనికులు మృతి చెందారు. సైన్యానికి చెందిన మినీ బస్ పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో మరో 18 మంది సైనికులు గాయాలపాలయ్యారు. 

కాపుల రిజర్వేషన్ సమస్య ప్రభుత్వమే పరిష్కరించాలి - రామచంద్రయ్య..

రాజమండ్రి : కాపులకు రిజర్వేషన్ లకు సంబంధించి సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య పేర్కొన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి సంఘీభావం తెలిపేందుకు రాజమండ్రి నుండి కిర్లంపూడికి బయలుదేరారు. 

విజయవాడలో జపాన్ ప్రతినిధుల బృందం పర్యటన..

విజయవాడ : జపాన్ ప్రతినిధుల బృందం విజయవాడలో పర్యటిస్తోంది. మెట్రో రైలు క్షేత్రస్తాయిలో ఈ బృందం పరిశీలన చేస్తోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ తో ఈ బృందం భేటీ కానుంది. 

13:43 - February 8, 2016

తూర్పుగోదావరి :

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధుల బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాదాపు గంటన్నర సేపు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు అచ్చెన్నాయుడు, తోట త్రిమూర్తులు, కళా వెంకట్రావు, బొడ్డు భాస్కర రామారావు తదితరులు ముద్రగడతో చర్చించారు. చర్చల తర్వాత వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముద్రగడ అంగీకరించారు. దీంతో వైద్యులు ఆయన నివాసానికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కాపుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి తప్ప వారి అభ్యున్నతికి చేసిందేమీ లేదన్నారు.

ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న కృతనిశ్చయంతోనే తాము ముద్రగడతో చర్చలు జరిపినట్లు చెప్పారు. కాపు సామాజిక వర్గం అభివృద్ధి కోసమే తాను ఉద్యమబాట పట్టినట్లు ముద్రగడ పద్మనాభం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కాపులకు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే తాము అడుగుతున్నట్లు చెప్పారు. కాపు జాతి ఆకలి కేకలు చూడలేకే రోడ్డెక్కినట్లు స్పష్టం చేశారు. కాపు కులంలో పేదలు, ఆర్థికంగా వెనకబడి ఉన్నవారికి రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ ప్రధాన డిమాండని చెప్పారు. బీసీలకు ఎలాంటి నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ల కల్పించడం వల్ల బీసీలకు అన్యాయం జరిగితే తాము వూరుకోమన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే క్షమించాలని కోరారు. తమ విమర్శలు ఆవేదనతో చేసినవే తప్ప... ద్వేషంతో చేసినవి కాదన్నారు. తమ పోరాటానికి మద్దతు తెలిపిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, పలు కుల సంఘాల నేతలకు ముద్రగడ ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వం తమకిచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని భావిస్తున్నట్లు ముద్రగడ స్పష్టం చేశారు. చర్చల ద్వారా తమకు నమ్మకం కలిగిందన్నారు. కాపు కమిషన్‌కు ప్రస్తుతం రూ.500 కోట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని... వచ్చే బడ్జెట్‌లో ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తుని ఘటనలో అమాయకులపై కేసులు పెట్టినట్లు తన దృష్టికి వచ్చిందని... దానిపైనా పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కాపు జాతికి తన జీవితాన్ని అంకితం చేశానని... వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాపులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి రానివ్వకుండా చేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ముద్రగడ స్పష్టం చేశారు.


ముద్రగడ ప్రతిపాదనలకు ఒకే..
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రతిపాదించిన ప్రతిపాదనలకు అంగీకారం తెలిపినట్లు టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. కాపు కమిషన్ కాలపరిమితి 9 నెలలు విధించడం జరిగిందని..ఏడు నెలల్లో నివేదిక అందచేసే విధంగా చర్యలు తీసుకుంటామని..గొడవల్లో పాల్గొన్న వ్యక్తులపై కేసులు ఉండవని..లోతుగా విచారణ జరిపిన తరువాతే నిర్ణయాలు తీసుకుంటామని..కారు కార్పొరేషన్ రుణాలకు రూ.500 కోట్లు..ప్రతి బడ్జెట్ లో కాపులకు రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పాం...అంతేగాకుండా కాపు కమిషన్ లో ముద్రగడ సూచించిన వ్యక్తికి స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. 

ముద్రగడతో జరిగిన చర్చలు సఫలం..

తూర్పుగోదావరి : ముద్రగడంతో ప్రభుత్వ ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ముద్రగడ సూచించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒకే చెప్పింది. 

13:35 - February 8, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలోనే పేరొందిన నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్) లో నీటి కటకట ఏర్పడింది. గత రెండు రోజులుగా నీటి సమస్య ఏర్పరడడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. అలాగే పలు ఆపరేషన్ లు నిలిచిపోయినట్లు సమాచారం. మున్సిపల్ ప్రధాన పైపులైన్ పగిలిపోవడంతో ఈ సమస్య ఏర్పడిందని నిమ్స్ యాజమాన్యం పేర్కొంటోంది.
నిమ్స్ ఆసుపత్రికి దాదాపు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. అంతేగాక ప్రతి రోజు వందల సంఖ్యలో ఆపరేషన్ లు జరుగుతుంటాయి. ఇక్కడ నీటి సమస్య ఏర్పడడంతో ఓపీ, మిలినంయం బ్లాక్ లో ఉన్న రోగులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపల్ నుండి వచ్చే ప్రధాన పైపు లైన్ పగిలిపోవడంతో నీటి సమస్య ఏర్పడిందని నిమ్స్ వైద్యులు పేర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం 50-60 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతామని నిమ్స్ యాజమాన్యం పేర్కొంది. తాగునీటి సమస్య తీరినా ఇతరత్రా వాటికి నీటి వాడకంపై ఆందోళన నెలకొంది. కొన్ని ఎమర్జెన్సీ కేసులను బయటి ఆసుపత్రులకు పంపించడంపై రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. 

13:28 - February 8, 2016

రాజమండ్రి : తానేమన్నా టెర్రరిస్టునా అని దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రశ్నించారు. ఏపీ పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్ లు కల్పించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ను పరామర్శించేందుకు దాసరి హైదరాబాద్ నుండి కిర్లంపూడికి బయలుదేరారు. కానీ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని ఆయన మీడియాకు తెలిపారు. రాజమండ్రిలో ఆనంద్ రెసిడెన్సీ హోటల్ లో బస చేసిన దాసరి గృహ నిర్భందం చేశారు. ఈసందర్భంగా దాసరి మీడియాతో మాట్లాడారు. కాపులకు సంబంధించిన రిజర్వేషన్ లపై దీక్ష చేయాలని ముద్రగడ సడెన్ గా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళనగా ఉందని, 30 సంవత్సరాలుగా తనకు మంచి స్నేహితుడన్నారు. అతని కుటుంబంతో తనకు మంచి సత్సంబంధాలున్నాయని, అందుకోసం ఇక్కడకు రావడం జరిగిందన్నారు. సూర్యాపేట రాగానే అరెస్టు చేస్తారని మేసెజ్ వచ్చిందని అందుకుని ఖమ్మం మీదుగా కిర్లంపూడికి బయలుదేరడం జరిగిందన్నారు. కానీ రాజంపేట రాగానే మరో మెసేజ్ వచ్చిందని, అక్కడ కూడా పోలీసులు మోహరించారని పేర్కొన్నారు. మళ్లీ రూటు మార్చి వెళ్లడం జరిగిందని, డైరెక్టర్ గా తన ఆలోచనలు తనకుంటాయని పేర్కొన్నారు. ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలు తనకు కొత్తేమి కాదని, తెల్లవారుజామున హోటల్ కు రావడం జరిగిందని, హోటల్ చుట్టూ పోలీసులు మోహరించారని పేర్కొన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని దాసరి ప్రశ్నించారు. 

ముద్రగడతో ముగిసిన చర్చలు..

తూర్పుగోదావరి : కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రభుత్వ ప్రతినిధులు జరిపిన చర్చలు ముగిశాయి. ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంజునాథ కమిషన్ కు నిర్ధిష్ట కాలపరిమితి..కాపు కమిషన్ లో ముద్రగడ సూచించిన వ్యక్తికి స్థానం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. 

14 నుండి రాయలసీమ చైతన్య యాత్ర...

కర్నూలు : 14న అలూరు నుండి రాయలసీమ చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు, 3 నెలల పాటు యాత్ర కొనసాగుతుందని బైరెడ్డి రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలను చైతన్యపరుస్తామని, చంద్రబాబు రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. రాజధాని అమరావతిపైనే సీఎం చంద్రబాబు దృష్టి ఉందని తెలిపారు. 

రాష్ట్రం రావణకాష్టంగా మారడానికి బాబే కారణం - రామకృష్ణ..

విజయవాడ : రాష్ట్రం రావణకాష్టంగా మారడానికి చంద్రబాబే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. చంద్రబాబు దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని, రాజ్యాంగాన్ని ధిక్కరించి కాపులను బీసీల్లో చేర్చగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించకపోతే ఆందోళనలు చేస్తామన్నారు. 

12:25 - February 8, 2016

హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లొంగిపోయారు. అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీలపై జరిగిన దాడిలో ఆయనపై కేసు నమోదైంది. దీనితో సోమవారం ఉదయం సౌత్ జోన్ డీసీపీ ఎదుట అసదుద్దీన్ లొంగిపోయారు. అనంతరం అసద్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. తరువాత నాంపల్లి కోర్టులో అసదుద్దీన్ హాజరు పరిచారు. న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. రెండు పూచీకత్తులతో పాటు రూ.5వేలు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేయగా నలుగురికి బెయిల్ మంజూరైంది. 

రఘువీరా..చిరంజీవిలను అడ్డుకున్న పోలీసులు..

రాజమండ్రి : ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వచ్చిన ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా..ఏపీ కాంగ్రెస్ నేత చిరంజీవిలను పోలీసులు అడ్డుకున్నారు. వీరిని ఎయిర్ పోర్టు స్టేషన్ లో నిర్భందించారు. తమ నేతలను విడుదల చేయాలంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. 

12:14 - February 8, 2016

రాజమండ్రి : దర్శకరత్న దాసరి నారాయణ రావు ఏపీ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దేశ పౌరుడినా ? టెర్రరిస్టునా ? ప్రశ్నించారు. కిర్లంపూడిలో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడను పద్మనాభంను పరామర్శించేందుకు దాసరి కిర్లంపూడికి బయలుదేరారు. రాజమండ్రి చేరుకున్న అనంతరం ఓ హోటల్ లో బస చేసిన దాసరిని నిర్భందం చేశారు. హోటల్ చుట్టూ పోలీసులు మోహరించారు. దీనిపై దాసరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షకు వస్తుంటే పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారని, ఇబ్బందులు కలిగించారని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం బయలుదేరితే సోమవారం తెల్లవారుజామున చేరుకున్నట్లు, దేశ పౌరుడినా ? లేక టెర్రరిస్టునా ఆయన దాసరి ప్రశ్నించారు. దీక్ష చేసి అనారోగ్యంగా ఉన్న తన స్నేహితుడిని పలుకరించవద్దా ? అని నిలదీశారు. ఎలాగైనా తాను ముద్రగడను పరామర్శించి తీరుతానని దాసరి పేర్కొన్నారు. మరోవైపు కిర్లంపూడికి వెళ్లడానికి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా, కాంగ్రెస్ నేత చిరంజీవిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

12:08 - February 8, 2016

తూర్పుగోదావరి : కాపు రిజర్వేషన్లపై ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ అంశం ముగుస్తుందా ? లేదా ? ప్రభుత్వం ఇంకా సాగదీస్తుందా ? అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. నాలుగు రోజులుగా ఆయన ఆమరణ దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుండి స్పందన రాకపోయేసరికి తాను చర్చలకు వెళ్లనని..ఇదే ఆఖరి మీడియా సమావేశం అని చెప్పిన ముద్రగడ ఆదివారం అర్ధరాత్రి టిడిపి నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ముద్రగడ పలు ప్రతిపాదనలు తెలియచేసినట్లు సమాచారం. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి తెలియచేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బోడ్డు భాస్కరరావులు సోమవారం ఉదయం ముద్రగడ నివాసానికి చేరుకున్నారు. ముద్రగడ నివాసం గుమ్మం ఎదుట ఉన్న కార్లను తొలగించారు. అనంతరం ఉదయం 11.00 గంటల ప్రాంతంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావులు కిర్లంపూడికి చేరుకుని ముద్రగడతో చర్చలు జరిపారు. ఇంటికి వచ్చిన వీరిని ముద్రగడ సాదారంగా లోనికి ఆహ్వానించారు. అనంతరం వీరందరూ ప్రత్యేక గదిలోకి వెళ్లి చర్చలు జరుపుతున్నారు. ముద్రగడ చేసిన కొన్ని ప్రతిపాదనలకు ప్రభుత్వం కొన్ని సవరణలు చేసినట్లు సమాచారం. మరి వీరి చర్చలు ఫలిస్తాయా ? లేదా ? అనేది కొద్దిగంటల్లో తేలిపోనుంది. 

ఎంపీ అసదుద్దీన్ కు బెయిల్..

హైదరాబాద్ : ఎంపీ అసదుద్దీన్ కు బెయిల్ లభించింది. టిపిసిసి చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీపై జరిగిన దాడిలో అసదుద్దీన్ పై కేసు నమోదైంది. సోమవారం సౌత్ జోన్ డీసీసీ ఎదుట అసదుద్దీన్ లొంగిపోయారు. అనంతరం నాంపల్లి కోర్టు అసదుద్దీన్ కు బెయిల్ మంజూరు చేసింది. 

11:53 - February 8, 2016

హైదరాబాద్ : ఇచ్చేదే మూడు..నాలుగు వందల రూపాయలు..పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఆ వేతనంతోనే నెల మొత్తం గడపాలి..ఇది సాధ్యమౌతుందా ? కానీ వారు మాత్రం వెళ్లదీస్తూనే ఉన్నారు. వారే 'ముంపు మండలాలకు చెందిన ఆశా వర్కర్లు'..సర్కారు తమపై కరుణ చూపకపోతుందా ? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ సర్కార్ మాత్రం ఇచ్చే మూడు..నాలుగు వందలు సైతం ఇవ్వడం లేదు. దీనితో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ మొర వినాలాని ఎంతో మందిని కలిశార. కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి..ఏ ఒక్క అధికారి వీరి ఆవేదనను అర్థం చేసుకోలేదు. చివరకు ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. కోఠిలోని ఏపీ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు.
భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను విభజించే సమయంలో భద్రాచలంకు చెందిన ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపిన సంగతి తెలిసిందే. ఆ మండలాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు మూడు..నాలుగు వందల వేతనం ఇస్తోంది. ఈ వేతనం గత 36 నెలలుగా చెల్లించడం లేదని టెన్ టివితో ఆశా వర్కర్లు వాపోయారు. గత కొన్ని రోజులుగా విడతల వారీగా ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. గత మూడు నెలలుగా ఆందోళన నిర్వహించడం జరిగిందని, ఏజెన్సీలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆశాలను బలి పశువులను చేస్తున్నారని వాపోయారు. యూనిఫాం అలవెన్స్ కూడా ఇవ్వడం లేదని, యూనిఫాం వేసుకోవాల్సిందేనని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలకు సంబంధించిన బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మెలోకి వెళుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

11:47 - February 8, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దళితుడైన కడియం శ్రీహరి అంటే సీఎం కేసీఆర్ కు ప్రేమ లేదని ఎమార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం..ఇందుకు కారకుడు కేటీఆర్ అంటూ ప్రశంసలు..రావడం..కేసీఆర్ ఆయనకు మున్సిపల్ శాఖను కేటాయించడంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ కు మున్సిపల్ శాఖను కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇటీవల వరంగల్ లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు పశ్చిమ వరంగల్ నియోజవకర్గం ఇన్ చార్జీగా నియమించారని పేర్కొన్నారు. కానీ ఇక్కడే అతి తక్కువ పోలింగ్ నమోదు కావడం జరిగిందన్నారు. కడియం శ్రీహరి 24గంటల పాటు శ్రమించారని, అంతేగాకుండా దేశంలో అతి పెద్ద ఏడో మెజార్టీగా టి.టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు వచ్చిందన్నారు. అదే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు రాగానే కేటీఆర్ కు మున్సిపల్ శాఖను కేటాయించారని, అప్పటికే ఆయన దగ్గర ఐటీ, పంచాయతీ శాఖలు ఉన్నాయని తెలిపారు. కేటీఆర్ కు వర్తించిన సూత్రం కడియంకు ఎందుకు వర్తించదు అని మందకృష్ణ మాదిగ సూటిగా ప్రశ్నించారు. అల్లుడు హరీష్ రావు కూడా ఒక నియోజవకర్గానికి మాత్రమే పరిమితమయ్యారని, దళితుడైన కడియంపై కేసీఆర్ కు ప్రేమ లేదని పేర్కొన్నారు. 

11:41 - February 8, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసు ఎటూ తేలడం లేదు. గత కొన్ని రోజులుగా ఈ కేసు హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అగ్రిగోల్డ్ ఏజెంట్లలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా ఏపీ సీఐడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, లక్షలాది మధ్యతరగతి కుటుంబాలను ముంచిన కేసును ఎందుకు పరిష్కరించడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని తాము భావిస్తుంటే ఆస్తుల వేలానికి గాని, విక్రయానికి గాని అగ్రిగోల్డ్ సంసిద్ధత వ్యక్తం చేయడం లేదని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో యాజమాన్యం మెతకవైఖరి అనుభవిస్తోందని, అలాగే సీఐడీ కూడా దర్యాప్తును నత్తనడకన సాగిస్తోందని తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో డిపాజిటర్ల సంక్షేమం దృష్ట్యా కేసు దర్యాప్తుకు సీబీఐకి బదలాయించాలని హైకోర్టు పేర్కొంది. అనంతరం కేసును శుక్రవారానికి వాయిదా వేసింది.
అగ్రిగోల్డ్ స్కాంలో లక్షలాది మధ్య తరగతి కుటుంబాలున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలకు చెందిన బాధితులున్నారు. వివిధ దీనిపై సీబీఐ దర్యాప్తును నత్తనడకన సాగిస్తోందని బాధితులు పలుసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. బినామీ ఆస్తులను ఒక్కొక్కటిగా యాజమాన్యం అమ్ముకొంటోందని కోర్టు దృష్టికి బాధితులు తీసుకెళ్లారు. తమకు న్యాయం జరుగుతుందని గత కొంతకాలంగా వేచి చూస్తున్న బాధితులు న్యాయం జరిగెదెన్నడో ? 

11:28 - February 8, 2016

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజుల నుండి ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడతో కాసేపట్లో ప్రభుత్వం చర్చలు జరపనుంది. గత రెండు రోజులుగా ఆయన వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారు. ముద్రగడతో పాటు ఆయన సతీమణి నీరసించిపోయారు. హై డ్రామా వద్ద ఆదివారం అర్ధరాత్రి టిడిపి నేతలు ముద్రగడతో చర్చించారు. ఈసందర్భంగా ముద్రగడ స్పష్టమైన ప్రతిపాదనలు అందచేశారు. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి తెలియచేస్తామని, అనంతరం ప్రభుత్వ ప్రతిపాదనలను తెలియచేస్తామని వారు ముద్రగడకు తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెం న్నాయుడు, ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావులు కిర్లంపూడికి బయలుదేరారు. అంతకుముందే తొలి నుండి చర్చలు చేస్తున్న ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు ముద్రగడ ఇంటికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముద్రగడ ఇంటి తలుపులకు ఎదురుగా ఉంచిన కార్లను తొలగిస్తున్నారు. ఈసందర్భంగా వారు టెన్ టివితో మాట్లాడారు. ముద్రగడ సానుకూలంగానే ఉన్నారని, ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందన్నారు. ఆయన ఇచ్చిన ప్రతిపాదలను ప్రభుత్వానికి తెలియచేయడం జరిగిందని, అలాగే ప్రభుత్వం చెప్పిన ప్రతిపాదనలను ముద్రగడకు తెలియచేయడం జరుగుతుందన్నారు. మంత్రి అచ్చెం నాయుడు, ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావులు చేరుకున్న అనంతరం ముద్రగడతో చర్చలు జరిపి ఉత్కంఠకు తెరదించుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి చర్చలు ఫలిస్తాయా ? విఫలం చెందుతాయా ? అనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో హైకోర్టు సీరియస్..

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ అంశంలో సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. వేలం నిర్వహించడం అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ఇష్టం లేదని పేర్కొంది. సీఐడీ దర్యాప్తు సరిగ్గా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఎంపీ అసదుద్దీన్ లొంగుబాటు..

హైదరాబాద్ : ఎంపీ అసదుద్దీన్ సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. 

కాసేపట్లో ముద్రగడతో చర్చలు..

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడతో చర్చలు జరిపేందుకు మంత్రి అచ్చెన్నాయుడు, ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావులు కిర్లంపూడికి బయలుదేరారు. 

దాసరి గృహ నిర్భందం..

రాజమండ్రి : తాను దేశ పౌరుడినా ? టెర్రరిస్టునా ? అని దర్శక రత్న దాసరి నారాయణ రావు ప్రశ్నించారు. కిర్లంపూడిలో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడను పద్మనాభంను పరామర్శించేందుకు బయలుదేరారు. రాజమండ్రి వద్ద ఆయన్ను పోలీసులు గృహ నిర్భందం చేశారు. దీక్షకు వస్తుంటే పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారని, ఇబ్బందులు కలిగించారని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం బయలుదేరితే సోమవారం తెల్లవారుజామున చేరుకున్నట్లు, దేశ పౌరుడినా ? లేక టెర్రరిస్టునా ఆయన దాసరి ప్రశ్నించారు. దీక్ష చేసి అనారోగ్యంగా ఉన్న తన స్నేహితుడిని పలుకరించవద్దా ? అని నిలదీశారు. 

10:45 - February 8, 2016

వరంగల్ : ఆదివాసీల్లో అసంతృప్తి రేగుతోంది.. సర్కారుపై అడవి బిడ్డలు గుర్రుగా ఉన్నారు... గిరిజన జాతరను హైజాక్ చేస్తున్నారని అలక బూనుతున్నారు... మేడారం జాతర చేజారుతోందని గిరిపుత్రులు ఆవేదన చెందుతున్నారు... ఇంతకీ ప్రభుత్వం చేస్తోందేంటి?..గిరిజనుల్లో గూడు కట్టుకున్నదేంటి? వాచ్ దిస్ స్టోరీ. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఆలయ కమిటీలో ఆదివాసీలకు ప్రాధాన్యం కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీల పాత్ర ఎక్కువగా ఉండేలా కమిటీని ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం తొమ్మిది మందిలో ఒక్కరికే అవకాశం ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కమిటీలో ఒక్కరే ఆదివాసీ..
జాతర, ఆలయ కమిటీల్లో అధికార పార్టీ నేతలను సభ్యులుగా నియమించడం సహజంగా జరిగే విషయమే. తాజా పుననరుద్ధరణ కమిటీలోనూ ఇదే జరిగింది. ఇలా అధికార పార్టీ నేతలతో నియమించిన కమిటీలో ఆదివాసీలను పట్టించుకోకపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమ్మక్క-సారలమ్మ ఆలయ పునరుద్ధరణ కమిటీలో తమ వర్గం వారికి ప్రాధాన్యం కల్పిస్తే సమంజసంగా ఉండేదని ఆదివాసీ సంఘాల నేతలు అంటున్నారు. మొత్తం తొమ్మిది మంది సభ్యుల కమిటీలో ఒక్కరే ఆదివాసీ వ్యక్తి ఉన్నారు. మిగిలిన వారిలోనూ ఎస్టీ, ఎస్సీ, బీసీలు కాకుండా ఇతర వర్గం వారు ఉన్నారు. ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గిరిజనేతరు ఆధిపత్యం..
సమ్మక్క-సారలమ్మ జాతర పునరుద్ధరణ కమిటీలో మొదటి పేరు కాక లింగయ్యది. ఇతనొక్కడే ఆదివాసీ గిరిజనుడు. గోవిందరావుపేటకు చెందిన ఎస్.సాంబలక్ష్మీ, దడిగెల సమ్మయ్య, లొడంగి లింగయ్య, పోరిక కస్నానాయక్, గిరిజన మంత్రి బంధువు అజ్మీరా జవహర్‌లాల్ సభ్యులుగా ఉన్నారు. వీరితోపాటు వ్యాపారులు సూరపనేని సాయికుమార్, పింగిలి సంపత్‌రెడ్డి, కొంపెల్లి రమణారెడ్డికి కమిటీలో చోటు కల్పించారు. ఆదివాసీ గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరలో ఆదివాసీల పాత్ర ప్రశ్నార్థకంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆదివాసీల జాతరలో గిరిజనేతరుల ఆధిపత్యానికి మేడారం కమిటీ కూర్పు అద్దం పడుతుందనే వాదన తెరపైకి వచ్చి చర్చనీయాంశమవుతోంది.

10:41 - February 8, 2016

కరీంనగర్ : అదో ప్రైవేట్ ఆస్పత్రి... రోగుల ప్రాణాలంటే వారికీ అసలు లెక్కేలేదు.. బ్లీడింగ్‌ అవుతోందని... విపరీతమైన నొప్పితో గర్భిణీ బాధపడుతోందని చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదు... నిదానంగా వచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. నవ మాసాలు మోసి బిడ్డకోసం ఎన్నో కలలు కన్న ఆ తల్లికి తీరని వేదన మిగిల్చారు. కరీంనగర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకానికి అప్పుడే పుట్టిన శిశువు బలయ్యాడు. విద్యానగర్‌కు చెందిన గర్భిణీ మొదటి నుంచీ శ్రీదేవి నర్సింగ్‌హోంలో పరీక్షలు చేయించుకుంది. నెలలు నిండాక తీవ్ర రక్తస్రావం కావడంతో బంధువులు టెన్షన్ పడ్డారు. వెంటనే ఆస్పత్రికి తీసుకు వచ్చారు. పేషంట్ విపరీతమైన నొప్పి, బ్లీడింగ్‌తో బాధపడుతోందని డాక్టర్‌ను పిలిపించాలని అక్కడి సిబ్బందిని కోరారు. అయినా వైద్యులు వెంటనే రాలేదు.

డాక్టర్లను నిలదీసిన బంధువులు...
దాదాపు నలభై నిమిషాల తర్వాత వచ్చిన డాక్టర్‌ అప్పుడు ఆపరేషన్‌ కోసం ఏర్పాట్లు చేశారు. శస్త్రచికిత్స చేసి తల్లిని మాత్రమే కాపాడామని.. బాబును బతికించలేకపోయామని చావు కబురు చల్లగా చెప్పారు. ఆ తర్వాత బిల్లు కూడా భారీగానే వేశారు. శిశువు మృతివిషయం తెలుసుకున్న బంధువుల డాక్టర్లను నిలదీశారు. డాక్టర్లు త్వరగా వచ్చిఉంటే చిన్నారి బతికి ఉండేవాడంటూ ఆందోళనకు దిగారు. పేషంట్ బంధువుల గొడవతో స్థానిక నేతను రంగంలోకి దించింది ఆస్పత్రి యాజమాన్యం. రంగంలోకి దిగిన ఆ నేత తమను బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. ఆస్పత్రికి, నేతకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న ఇలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

10:38 - February 8, 2016

చిత్తూరు : తిరుమలలో షాపుల కేటాయింపునకు టీటీడీ కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఇన్నాళ్లు మాస్టర్‌ ప్లాన్‌లో ఇళ్లు కోల్పోయినవారికి మాత్రమే ఇచ్చే షాపులను.. ఈసారి టెండర్ల ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. దీనిపై కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా దుకాణదారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో 70 దుకాణాలకు టీటీడీ టెండర్లు పిలవడం వివాదాస్పదమవుతోంది. ఎంతో కాలంగా తిరుమల మాస్టర్‌ ప్లాన్‌లో ఇళ్లు, షాపులు కోల్పోయిన వారికి మాత్రమే కేటాయించే దుకాణాలకు. ఇప్పుడు పబ్లిక్‌ టెండర్లు పిలవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండు వేల షాపులు..
తిరుమలలో మొత్తం రెండు వేల షాపులుంటాయి. ఇందులో 95 శాతం దుకాణాలు తిరుమల మాస్టర్‌ ప్లాన్‌లో ఇళ్లు, షాపులు కోల్పోయిన వారికి కేటాయించినవే. నిత్యం రద్దీగా ఉండే కూడలిలో షాపు ఉంటే కుటుంబం హాయిగా గడిపేయవచ్చు. దీంతో ప్రధాన కూడలిలో ఉన్న షాపులకు భారీ డిమాండ్‌ ఉంది. ఈ షాపుల ద్వారా టీటీడీకి నెలకు రెండు నుండి మూడు లక్షల రూపాయలు ఆదాయం రానుంది. గతంలో షాపుల కేటాయింపు వ్యవహారంలో అనేక ఆరోపణలు రావడంతో టీటీడీ ఈవో సాంబశివరావు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈవో నిర్ణయం పట్ల షాపులు లేనివారు సంతోషం వ్యక్తం చేస్తుండగా ఇప్పటికే షాపులు ఉన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అద్దెలు పెరుగుతాయనే భావన..
దుకాణాలకు టెండర్లు ఆహ్వానిస్తే.. భవిష్యత్‌లో అద్దెలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని దుకాణదారులు ఎమ్మెల్యేలు, టీటీడీ చైర్మన్‌ను కలిసి ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మరోవైపు అధికారులు మాత్రం టెండర్ల ద్వారానే షాపులు కేటాయించాలనే పట్టుదలతో ఉన్నారు. ఓవైపు దుకాణదారుల ఆందోళన.. మరోవైపు టీటీడీ పట్టుదలతో ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. 

10:27 - February 8, 2016

అనంతపురం : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీలు గాయపడ్డారు. ఈ ఘటన నల్ల చెరువు వద్ద చోటు చేసుకుంది. రోడ్డు నిర్మాణ పనుల కోసం నడింపల్లి నుండి కొందరు మహిళా కూలీలు వెళుతున్నారు. వీరి రాకపోకల కోసం కాంట్రాక్టర్ ఆటోను సమకూర్చాడు. ఎప్పటిలాగానే నడింపల్లి నుండి ఏడుగురు మహిళలు ఆటోలో ప్రయాణిస్తున్నారు. నడింపల్లికి సమీపంలో ఆటోను ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. దీనితో ఆటో బోల్తా కొట్టింది. ఈప్రమాదంలో ఆటో ఉన్న ఏడుగురు మహిళా కూలీలు, ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. వీరిని కదిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు మహిళా కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. వీరికి మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరు లేదా ఇతర ప్రాంతాలకు తరలిస్తారని తెలుస్తోంది. 

10:21 - February 8, 2016

రంగారెడ్డి : మహేశ్వరం మండలంలోని మంఖాల్ అసిత రసాయన పరిశ్రమలో సంభవించిన పేలుడులో మరో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. అప్పటికే నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనితో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. సోమవారం తెల్లవారుజామున 4-5గంటల సమయంలో కంపెనీలోని రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. అక్కడనే ఉన్న కోసారామ్, దస్రురాయ్, దేవా, జోగా రామ్ లు సజీవదహనమయ్యారు. మరికొందరికి కార్మికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు కన్నుమూశారు. మంటల్లో మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు వంద మందిదాక ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. దుర్ఘందమైన వాసన వెదజల్లుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

10:12 - February 8, 2016

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న ముద్రగడ నీరసించారు. గత మూడు రోజుల నుండి ఆయన దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. వైద్య పరీక్షలు చేయించుకోవాలన్న వైద్యుల సూచనలు బేఖాతర్ చేస్తున్నారు. తన ఇంట్లోకి ఎవరూ రాకుండా ఉండేందుకు గుమ్మాల ఎదుట కార్లను ఉంచారు. దీనితో ఆయన ఇంట్లోకి ఎవరూ వెళ్లలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం తరపున చర్చించేందుకు మంత్రులు కిర్లంపూడికి వస్తున్నారు. ఉదయం 11గంటలకు ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. ముద్రగడతో వీరు ఎలా చర్చిస్తారనేది తెలియరావడం లేదు. మరోవైపు ముద్రగడను పరామర్శించేందుకు ఏపీ కాంగ్రెస్, వైసీపీ నేతలు కిర్లంపూడికి రానున్నారు. ఎవరూ రావొద్దని జిల్లా ఎస్పీ పేర్కొంటున్నారు. దీనితో ముద్రగడ నివాసం ఎదుట గంభీర వాతావరణం నెలకొంది. ఆదివారం ఉదయం నుండి వైద్య పరీక్షలు చేయించుకోలేదు. అర్ధరాత్రి టిడిపి పార్టీ నేతలు ముద్రగడతో చర్చించారు. ఈసందర్భంగా ముద్రగడ తన స్పష్టమైన ప్రతిపాదనలు వారి ముందట పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వం ఎదుట ప్రతిపాదనలు తెలియచేస్తామని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

  • ఆదివారం ఉదయం ముద్రగడ దీక్షను కొనసాగించారు. అదే సమయంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ రవి ప్రకాష్ లు నివాసానికి చేరుకున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని ముద్రగడను కోరారు. దీనికి ముద్రగడ నిరాకరించారు.
  • సీఎం చంద్రబాబు నాయుడు మొండి అయితే తాను జగమెండి అని ముద్రగడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం రెండు ఎకరాల పొలం ఉన్న చంద్రబాబు అనతికాలంలో రూ. లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
  • తరువాత ముద్రగడ నివాసానికి పోలీసులు వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని వారూ కోరారు. పోలీసుల తీరును నిరసిస్తూ దీక్షా స్థలం నుండి మరో గదికెళ్లిన ముద్రగడ తలుపులు వేసుకున్నారు.
  • శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు ముద్రగడ దంపతులకు వైద్యుల బృందం వచ్చి పరీక్షలు నిర్వహించింది. బిపి, షుగర్‌ పరీక్షలు చేసి వెళ్లిపోయారు.
  • ఆ తర్వాత పోలీసు బలగాలు అధికంగా మోహరించాయని తెలిసిన ముద్రగడ.. సందర్శకులను ఆపవద్దని పలుమార్లు పోలీసులను కోరారు. అయినప్పటికీ పోలీసులు సందర్శకులను ఎక్కడికక్కడ నిలువరించారు.
  • ఉదయం పదిగంటలకు రెండోసారి వైద్య పరీక్షలు చేసేందుకు వచ్చిన వైద్య బృందాన్ని తమకు పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని తిప్పిపంపారు. 

సిసోడియా ఇంటి ఎదుట ఎంసీడీ వర్కర్స్ ఆందోళన..

ఢిల్లీ : ఎంసీడీ వర్కర్స్ చేపడుతున్న ఆందోళన 13వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా ఇంటి ఎదుట ఎంసీడీ వర్కర్స్ ఆందోళన చేశారు. 

రియాక్టర్ పేలిన ఘటనలో మరో ఇద్దరి మృతి..

రంగారెడ్డి : మహేశ్వరంలోని అశిత ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రియాక్టర్ పేలడంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడనే మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

పట్టాలు తప్పిన అవధ్ ఎక్స్ ప్రెస్..

బీహార్ : ముజఫర్ జంక్షన్ రైల్వే స్టేషన్ సమీపంలో అవధ్ అస్సాం ఎక్స్ ప్రెస్ కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు గాయాలు కాలేదని తెలుస్తోంది. 

09:51 - February 8, 2016

ఢిల్లీ : తైవాన్ లో సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య 24కు చేరుకుంది. దాదాపు 121 మంది జాడా తెలియడం లేదని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. తైవాన్ నగరంలో కుప్పకూలిన విగువాన్ భవనంలో ఆరుగురు చిన్నారులతో సహా 22 మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీశాయి. ఘటనా స్థలిలో దాదాపు 282 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది, 340కిపైగా స్వచ్ఛంద కార్యకర్తలు, 105 అగ్నిమాపక వాహనాలు బాధితులను ఆదుకొనేందుకు కృషి చేస్తున్నాయి. 

విచారణలో వివరాలు వెల్లడించిన హెడ్లీ..

ముంబై : భారతదేశంలో ప్రవేశించడానికే తాను అమెరికన్ లా పేరు మార్చుకున్నానని ముంబై పేలుళ్ల సూత్రధారి డేవిడ్ కాల్మన్ హెడ్లీ పేర్కొన్నారు. ముంబై ప్రత్యేక కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హెడ్లీని విచారించింది. పేరు మార్చుకున్న విషయాన్ని లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మీర్ కు చెప్పడం జరిగిందని, కొన్ని వారాల తరువాత పాక్ కు వెళ్లినట్లు వెల్లడించారు. భారత్ లో ఏదైనా వ్యాపారం లేదా ఆఫీసు పెట్టాలని సాజిద్ తనకు చెప్పడం జరిగిందని, కొత్త పేరుతో నకు పాస్ పోర్టు వచ్చిన అనంతరం భారత్ కు 8 సార్లు రావడం జరిగిందన్నాడు. అందులో ఏడు సార్లు ముంబై నగరంలో సంచరించినట్లు చెప్పాడు.

09:16 - February 8, 2016

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ నేత ముద్రగడ చేపడుతున్న దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుండి స్పందన లేకపోయేసరికి ఆదివారం రాత్రి తనకు తాను పూర్తిగా నిర్భంధించుకొనే ప్రయత్నం చేశారు. చిట్టచివరకు అర్ధరాత్రి టిడిపి నేతలు ముద్రగడతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ముద్రగడ స్పష్టమైన ప్రతిపాదనలు తెలియచేశారు. దీనితో మంత్రులు సోమవారం ఉదయం 11గంటలకు ముద్రగడతో చర్చలు జరపనున్నారు. వీరితో కూడా ముద్రగడ ప్రతిపాదనలు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. తుని ఘటనలో అమాకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి...మంజు నాథన్ కమిటీ కమిషన్ సభ్యుల్లో ఒక సభ్యుడు తమ వారై ఉండాలి...బడ్జెట్ లో 1900 కోట్లను కేటాయించాలి...దరఖాస్తు చేసుకొనే వారందరికీ లోన్లు ఇవ్వాలి.. అంటూ కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. రూ. 1900 కోట్లను ఒక్కసారిగా విడుదల చేయలేమని, రూ. 1000 కోట్లను ముందుగా చెల్లిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక వైద్య పరీక్షలకు ముద్రగడ అనుమతినివ్వలేదు. ఉదయం 9గంటలకు వైద్యులు ముద్రగడ నివాసానికి వచ్చారు. కానీ ఆయన ఇంతవరకు నిద్ర లేవలేదని, ఇక్కడి నుండి వెళ్లిపోవాలని చెప్పడంతో వైద్యులు వెళ్లిపోయారు. ఉదయం 11గంటలకు జరిగే చర్చలు ఫలించకపోతే ముద్రగడ సతీమణి విజయలక్ష్మిని ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 

పంజాబ్ ఎన్నికలపై ఎన్డీయే నేతలు భేటీ..

ఢిల్లీ : పంజాబ్ లో జరిగే ఎన్నికలపై చర్చించేందుకు ఎన్డీయే నేతలు భేటీ కానున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నానున్నారు. 

కొనసాగుతున్న హెడ్లీ విచారణ..

ఢిల్లీ : ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్ర ధారి డేవిడ్ హెడ్లీ విచారణ కొనసాగుతోంది. అమెరికాలో శిక్ష అనుభవిస్తున్న హెడ్లీని ముంబై కోర్టు న్యామూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్నారు. 

08:40 - February 8, 2016

ఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త నిరసనలకు సీఐటీయూ పిలుపునిచ్చింది. పీఎస్ యూలో పెట్టుబడుల ఉపసంహరణ, అమ్మకం ప్రతిపాదలను విరమించుకోవాలని సీఐటీయూ కార్యదర్శి తపన్ సేన్ డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ రంగంలోని ఇంజనీర్ దిగ్గజ సంస్థ బీహెచ్ఎల్, చమురు రంగంలోని ఓఎన్జీసీ, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, రక్షణ రంగంలోని బీఎఎమ్ఎల్, హెచ్ఎఎల్ వంటి లాభాల్లాంటి సంస్థలను అమ్మాలనే ఆలోచన దుర్మార్గమైందని సేన్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలను ప్రజలు సహించబోరని తపన్ సేన్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా ప్రజలు, కార్మికులు ఎక్కడికక్కడ నిరసనలు తెలియచేయాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. 

08:33 - February 8, 2016

ముంబై : బాంబు పేలుళ్ల ప్రధాన సూత్ర ధారి డేవిడ్ హెడ్లీ ఈ రోజు పెదవి విప్పనున్నాడు. హెడ్లీని ముంబై కోర్టు విచారించనుంది. ప్రస్తుతం అమెరికాలో శిక్ష అనుభవిస్తున్న హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించనున్నారు. హెడ్లీ ఇచ్చే వాంగ్మూలం ద్వారా దాడి ఘటనలో అనేక అనుమానాలు నివృత్తి కానున్నాయి. ఈ వాంగ్మూలం ద్వారా పాక్ లో ఉన్న అబూ జిందాల్ పై యాక్షన్ తీసుకోవాలని భారత్ వత్తిడి పెంచేందుకు అవకాశం లభించినట్లైంది. లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న హెడ్లీని గత ఏడాది ఎఫ్ బిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే హెడ్లీని భారత్ కు అప్పగించేందుకు అమెరికా నిరాకరించింది. దీనితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు రంగం సిద్ధం చేశారు. 

08:26 - February 8, 2016

కర్నూలు : జిల్లాలో ఓ వ్యక్తి హత్యాయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సంజామల్ల మండలం రెడ్డి పల్లెలో పాతకక్షల నేపథ్యంలో లక్ష్మీ నారాయణ రెడ్డిని చంపేందుకు సూర్యనారాయణ వర్గీయులు పథకం పన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి హత్య కుట్రను భగ్నం చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరివద్ద నుండి వేటకొడవళ్లు, కత్తులు, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

08:10 - February 8, 2016

రంగారెడ్డి : పొట్టకూటి కోసం నగరానికి వచ్చి జీవనం గడుపుతున్న నలుగురు కార్మికుల కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. జిల్లాలోని మహేశ్వరంలోని మంఖాల్ పారిశ్రామిక వాడలోని అసిత ఫార్మా కంపెనీ ఉంది. సోమవారం తెల్లవారుజామున 4-5గంటల సమయంలో కంపెనీలోని రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. అక్కడనే ఉన్న కోసారామ్, దస్రురాయ్, దేవా, జోగారామ్ లు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా ముక్కలుముక్కలయ్యాయి. వీరు ఛత్తీస్ గఢ్ కు చెందిన వారిగా తెలుస్తోంది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రదేశానికి చేరుకుంది. రసాయనం నుండి వచ్చే వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

07:59 - February 8, 2016

కాపు రిజర్వేషన్లు అంశం రగులుతూనే ఉంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. దీనితో ఏపీలోని పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున కొంతమంది మంత్రులు ముద్రగడ పద్మనాభంతో చర్చలకు వెళ్లనున్నారు. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు..తదితర అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో రాకేష్ రెడ్డి (బీజేపీ), ఇందిర (కాంగ్రెస్), వర్ల రామయ్య (టిడిపి), తెలకపల్లి రామయ్య (విశ్లేషకులు) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 

విమానరాకపోకలపై పొగమంచు ప్రభావం..

ఢిల్లీ : దేశ రాజధానిలో భారీగా పొగ మంచు అలుముకుంది. దట్టమైన పొగమంచు ఏర్పడడంతో ముందున్నవి కనిపించకపోవడంతో వాహనదారులు, పాదాచారులు ఇక్కటక్లు గురవుతున్నారు. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 

07:55 - February 8, 2016

ఒడిశా : సమాజాంలో వేళ్లూనుకున్న కుల వివక్షను అంతం చేయాలి అని ఉద్యమాలు జరుగుతుంటే ఎక్కడో ఒక చోట కులం పేరిట వివక్ష కొనసాగుతూనే ఉంది. కులం పేరిట..పలువురిని వెలి వేసే ఘటనలను మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇందులో ఓ మంత్రిని కూడా కులం పేరిట ఊరు..కులం నుండి వెలివేశారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. అగ్రకులం వరునితో కుమార్తె వివాహం జరిపించిన దానికి ఈ శిక్ష వేశారు. ఈ పెళ్లి విషయంలో ఆ మంత్రికి అండగా నిలిచిన వారికి కూడా 'వెలి' శిక్ష విధించారు. సాక్షత్తూ మంత్రినే వెలివేసిన ఘటన వెలుగు చూడడంతో సంచలనం సృష్టిస్తోంది.

మంత్రి కుమార్తె వివాహం..
ఒడిశా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, అభివృద్ధి, క్రీడలు, యూత్ సర్వీసు శాఖ మంత్రిగా సుదమ్ మురాండీ నిర్వహిస్తున్నారు. ఇతను సంతాన్ గిరిజన తెగకు చెందిన వారు. ఆయన కుమార్తె సంజీవిని, బిజూ జనతాదళ్ స్టూడెంట్ నాయకుడు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సునీల్ సరంగి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వివాహానికి నో చెప్పని మంత్రి మురాండి జనవరి 31న వైభవంగా పెళ్లి జరిపించారు. ఈ వివాహ మహోత్సవానికి ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు ఇతరులు హాజరయ్యారు. ఈ సమాచారం కుల పెద్దలు తెలుసుకున్నారు. పట్టణంలో ఏకంగా పంచాయతీ పెట్టి సంతాల్ తెగ (గిరిజన) కులాంతర వివాహాలకు తావులేదని తేల్చారు. అంతేగాకుండా మంత్రి సుదమ్ నియమాలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనను కులం నుండి..ఊరి నుండి వెలి వేస్తున్నట్లు ప్రకటించారు. 

07:37 - February 8, 2016

రవితేజ చెప్పే పంచు డైలాగులకే ఫిదా అయిపోతారు చాలా మంది. ఆయనలో ఉన్న ఎనర్జీ చూసే ఎంతో మంది అభిమానులైపోయారు. ఇప్పుడు మరొక రవితేజాను చూడబోతున్నాం. అడ్డంగా కోటీశ్వరులైపోయిన వారి సంపదను తీసుకొచ్చి పేదలకు పంచే వ్యక్తి 'రాబిన్‌ హుడ్‌'గా మారబోతున్నాడు. హాలీవుడ్‌, బాలీవుడ్‌లో ఈ తరహా సినిమాలు చాలా వచ్చాయి. తెలుగులో మాత్రం రవితేజ చేయబోతున్నాడు. ఒక పక్క పల్లెటూరి కుర్రాడులా, మరొక పక్క రాబిన్‌ హుడ్‌గా రెండు పాత్రలు పోషించేందుకు రవితేజ సిద్ధమైపోయాడు. ఈ చిత్రం ద్వారా చక్రి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. దామోదర్‌ ప్రసాద్‌ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అమీ జాక్సన్‌ను కథానాయికగా నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. దీనికి ముందు రవితేజ 'ఎవడో ఒకడు' చిత్రం చేయాల్సి ఉంది. కానీ నిర్మాత దిల్‌ రాజు, రవితేజకు పారితోషికం విషయంలో తేడాలు రావడంతో ఆ చిత్రం చేయడానికి ఈ మాస్‌ మహారాజ్‌ నిరాకరించాడని తెలిసింది.

07:35 - February 8, 2016

వెంకటేష్‌ గత ఏడాదిలో ఒక్క చిత్రమైనా చేయలేదు. ఈ సంవత్సరం మాత్రం వరుసగా సినిమాలు చేయ డానికి సిద్ధమైనట్టుగా ఉంది. ఈ సంవత్సరం మొదటగా మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' చేయడానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా చేస్తోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే మరొక చిత్రం చేయడానికి వెంకీ సిద్ధమైపోయాడు. ఇటీవల విడుదలై విజయవంతమైన 'నేను శైలజ' చిత్ర దర్శకుడు కిషోర్‌ తిరుమలతో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ చిత్రాన్ని మల్టీడైమన్షన్‌ రామ్మోహన్‌ నిర్మిస్తున్నారు. వెంకటేష్‌ నుంచి తన అభిమానులు ఏం ఆశిస్తారో, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఏం కోరుకుంటారో అన్ని కమర్షియల్‌ అంశాలుంటూనే చక్కటి వినోదం ఉంటే కథను తయారు చేశానని దర్శకుడు కిషోర్‌ తిరుమల అన్నారు.

రంగారెడ్డిలో ఇద్దరు కార్మికులు సజీవ దహనం..

రంగారెడ్డి : మహేశ్వరంలోని కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు. 

07:33 - February 8, 2016

ఏదైనా ఓ పుస్తకం రాయాలంటే గొప్ప కవే కానక్కర్లేదు. మంచి ఆలోచనలు ఉంటే చాలు. అవి సమాజానికి కాస్తోకూస్తో ఉపయోగపడతాయని భావిస్తే చాలు... దాన్ని ఆచరణలో పెట్టేయొచ్చు. అందుకే ఆ పని తామూ చేయొచ్చునని నటులు నిరూపించారు. జీవితంలో వారు ఎదుర్కొన్న వాటి గురించి తెలపడానికి కవులయ్యారు ఈ తారలు. సంతానం విషయంలోనూ, పిల్లల పెంపకంలోనూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓ కథానాయిక రాస్తే, కేన్సర్స్‌తో పోరాడి జీవితాన్ని ఎలా గెలవాలో మరొక నటుడు పేర్కొన్నాడు. నాజుగ్గా ఉండడం ఎలా అన్నదానిపై 'శిల్పా'లు చెక్కినట్టు వర్ణించింది ఓ హీరోయిన్‌. ఆధునిక మహిళ ఎలా ఉండాలో చెప్పింది మరో నటి.
సోనాలి బింద్రే..
సోనాలి బింద్రేకు వివాహం అయిన చిత్రసీమకు దూరమైంది. అప్పట నుంచి నిత్యం ఏదొక విషయంపై పరిశోధన చేస్తునే ఉండేది. 2005లో తను రణవీర్‌కు జన్మనిచ్చిన తర్వాత సంతానంపై ఓ పుస్తకం రాసింది. 'ది మోడన్‌ గురుకుల్‌ మై ఎక్సపర్‌మెంట్స్ విత్‌ పరేటింగ్‌' పేరుతో దాన్ని విడుదల చేసింది. సంతానం విషయంలో ఆమె పాటించిన మూడు పద్ధతులను అందులో వివరించింది. దాంతో పాటు సంప్రదాయం, ఆధునికతను ఎలా బ్యాలెన్స్ చేయాలన్న విషయాన్ని అందులో పేర్కొంది.

ట్వింకిల్ ఖన్నా..ఇమ్రాన్ హష్మీ..శిల్పా శెట్టి..
ట్వింకిల్‌ ఖన్నా సినిమా రంగానికి దూరమైన తర్వాత ఇంటరీయల్‌ డిజైనర్‌గా మారిపోయింది. అప్పుడప్పుడు తన కలం నుంచి మంచి మంచి పుస్తకాలు కూడా వస్తుంటాయి. ఈ విధంగానే 'మిస్సెస్‌ ఫన్నీబోన్స్' అనే పుస్తకం రాసింది. ఆధునిక భారతీయ మహిళలు ఎలా ఉండాలన్న దానిపై ఈ పుస్తకంలో రాసింది. కేన్సర్‌తో పోరాడుతున్న వారి కోసం కథానాయకుడు ఇమ్రాన్‌ హష్మి ఓ పుస్తకం రాశాడు. అది ఈ ఏడాది మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నాడు. తన కొడుకు అయాన్‌ కేన్సర్‌తో బాధితుడయ్యాడు. ఆ వ్యాధిని మొదట దశలో ఉండగానే గుర్తించాడు. తర్వాత దాన్ని నుంచి బయటపడ్డాడు. ఈ పరిస్థితులను తానే దగ్గరుండి చూశాడు ఇమ్రాన్‌. దీంతో కేన్సర్‌తో బాధపడే వారు ఎలా ఉంటారు. వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే తన కొడుకులా తిరిగి యథాస్థితికి వస్తారో తెలిపాడు. తన జీవితంలో ఉన్న అన్ని సంఘటనలను కూడా ఆ పుస్తకంలో వివరించాడు. ఈ పుస్తకాన్ని 2016లో విడుదల చేస్తానని ఇమ్రాన్‌ గత ఏడాది అక్టోబర్‌లో వెల్లడించాడు. చాలా మంది లావు అయిపోతున్నారని చాలా బాధపడితుంటారు. అటువంటి వారి కోసం శిల్పాశెట్టి తన ఆలోచనలను లక్కీతో 'ది గ్రేట్‌ ఇండియా డైట్‌' పేరిట ఓ పుస్తకం రాయించింది. దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. స్లిమ్‌గా ఉండడానికి ప్రతి రోజు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏయే సమయంలో ఏయే జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలన్నీ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. దీంతో పాటు తాను ఏవిధమైన ఆహారం తీసుకుంటుందో కూడా తెలిపింది. 

07:25 - February 8, 2016

సరదాగా ఎక్కడికైనా టూర్‌ ప్లాన్‌ చేసుకుంటారు. ట్రైనో, బస్సో, ఫ్లైటో ఏదైనా ఎక్కాల్సి వస్తుంది. తీరా వాటిలో ఏదైనా పడకపోతే వికారం, వాంతులు మొదలు. హ్యాపీగా వెళ్లాల్సిన జర్నీ కాస్త.. నీరసంగా నడుస్తుంది. ఇలాంటి వాళ్లు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంట్లో వాడే వస్తువులతో బోలెడు చిట్కాలున్నాయి. అవేంటంటే..
దీనికి అల్లం చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. వాంతులను ఈజీగా తగ్గిస్తుంది. అల్లంలో ఉండే ఆమ్లాలు తిన్న ఆహారం తేలికగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. కాబట్టి, ప్రయాణానికి ముందు అల్లం టీ లేదా అల్లంతో తయారుచేసిన ఆహారాలను తీసుకుంటే ఎలాంటి సమస్య లేకుండా ప్రయాణం పూర్తి చేయొచ్చు. వాంతులు, వికారం మీ దరిచేరకుండా ఉంటాయి.
పుదీనా టీ కూడా వాంతులను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెష్‌గా ఉండే పుదీనా ఆకులను నీళ్లల్లో వేసి బాగా మరిగించి, ప్రయాణానికి ముందు తీసుకోవాలి. అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని చేతిలో పట్టుకుని వాసన చూడటం లేదా నమలటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పుదీనా ఆకు నుంచి వచ్చే సువాసన వాంతులను తగ్గిస్తాయి. బస్సు, ట్రైన్‌ లలో ప్రయాణం అంటే పడని వారు ఖచ్చితంగా వీటిని మీ దగ్గర పెట్టుకుని బయలుదేరండి. ఉపశమనం పొందండి.

07:23 - February 8, 2016

వాతావరణంలో వేడి రోజురోజుకి పెరుగుతోంది.ఇంకా ఎండలు ముదురుతాయి. అయినా వచ్చేది ఎండాకాలం! ఈ కాలంలో వేడిని తట్టుకునేందుకు మంచినీళ్లు మొదలు, చల్లని జ్యూస్‌ల వరకూ ఎన్నో తీసుకుంటాం. కానీ అన్నీ మంచివి కావంటున్నారు నిపుణులు. దాహం తీర్చుకోవడానికి కెఫీన్‌ అధికంగా ఉండే పానీయాలు, పంచదార ఎక్కువగా ఉండే జ్యూస్‌లు, శీతల పానీయాలు, నిల్వ కారకాలు వాడే పండ్లరసాలు తీసుకుంటాం. కానీ వాటిని తాగడం వల్ల మరింత డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఈ తరహా పానీయాలు తాగడం వల్ల రక్తంలో పాస్పరస్‌ అధికంగా చేరుతుంది. దీనివల్ల ఎముక సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. దంతాలు, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎంజైముల పనితీరుకు ఆటంకం కలుగుతుంది.
మరీ చల్లగా ఉండేవి తాగడం వల్ల ప్రయోజనం ఉండదు. అవి తాత్కాలికంగా మాత్రమే చల్లని భావనని ఇస్తాయి. అంతేకానీ ఒంట్లో వేడి ఏ మాత్రం తగ్గదు.
కీర, పాలకూర, ముల్లంగి, ఉల్లి, వెల్లుల్లి, బీట్‌రూట్‌, అనాస, మామిడి శరీరంలో వేడిని తగ్గించే ఆహారం. తాజా పండ్లను తినాలి. సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల వేడి తాలూకు ప్రభావం తగ్గుతుంది.
చెమట రూపంలో కోల్పోయిన లవణాలు తిరిగి పొందాలంటే మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం లాంటివి తరచూ తాగుతూ ఉండాలి.
ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలతో పాటు సమోసా, వడ, చిప్స్, బజ్జీలు వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

07:20 - February 8, 2016

బొప్పాయి, అరటి వంటి పండ్ల గుజ్జుతో రోజూ ఓ పది నిమిషాలు మసాజ్‌ చేసుకోవాలి. తర్వాత రోజ్‌వాటర్‌తో కలిపిన ఫేస్‌ప్యాక్‌ వేసుకుని, ఆరాక శుభ్రపరుచుకుని, మాయిశ్చరైజర్‌ లేదా లోషన్‌ని రాసుకోవాలి.
రోజుకు పది, పదిహేను గ్లాసుల నీళ్లు తాగడం, తాజా పళ్లు, కూరగాయలు.. ముఖ్యంగా ఆకుకూరలను తీసుకునే ఆహారంలో చేర్చడం మంచిది. పళ్లు, క్యారెట్‌, బీట్‌రూట్‌ జ్యూస్‌లలో ఏదైనా రోజూ ఒక గ్లాసు తాగాలి.
పొడి చర్మం గలవారు నైట్‌ క్రీమ్స్ ఉపయోగిస్తే మంచిది. నైట్‌ క్రీమ్స్ లో ఆయిల్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని త్వరగా పొడిబారనివ్వదు. దీంతో చర్మం కాంతివంతం అవుతుంది.
బాదం నూనె లేదా ఆలివ్‌నూనెలతో చర్మాన్ని మసాజ్‌ చేసుకోవడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. మైల్డ్‌ సోప్‌ లేదా ఫేస్‌ వాష్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోవడం మంచిది. పొడిచర్మం గలవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే చర్మం కాంతి వంతంగా, మృదువుగా అవుతుంది. 

నేడు, రేపు ప్రెస్ కౌన్సిల్ సబ్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : నేడు, రేపు ప్రెస్ కౌన్సిల్ సబ్ కమిటీ సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటు ప్రకటనల పాలసీపై సమీక్ష జరగనుంది.

 

నేడు ముంబై కు కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముంబైకి వెళ్లనున్నారు. ముకేష్ అంబానీ, టాటా, ఎల్ అండ్ టీ సంస్థల ఛైర్మన్ లతో కేటీఆర్ విడివిడిగా భేటీ కానున్నారు. ప్రాజెక్టులు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. 

నేటి నుండి రత్నాచల్ ఎక్స్ ప్రెస్..

తూర్పు గోదావరి : నేటి నుండి రత్నాచల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు ఎక్కనుంది. జనవరి 31వ తేదీన కాపు గర్జనలో ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. 

నేడు, రేపు సార్వత్రిక సమ్మెపై బ్యాలెట్

ఢిల్లీ : నేడు, రేపు సార్వత్రిక సమ్మెపై బ్యాలెట్ విడుదల కానుంది. రైల్వే స్టేషన్ లతో పాటు కార్యాలయాల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులకు వ్యతిరేకంగా సమ్మె చేపట్టనున్నారు. 

06:45 - February 8, 2016

తెలంగాణలో బీసీ సబ్‌ ప్లాన్‌ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా బస్సు యాత్ర జరుగుతోంది. ఎల్లుండితో ఈ యాత్ర ముగుస్తుంది. బీసీ సబ్‌ ప్లాన్‌ ఆవశ్యకత ఏమిటి? సబ్‌ ప్లాన్‌ ద్వారా బీసీలకు దక్కే ప్రయోజనాలేమిటి? ప్రస్తుతం వివిధ చేతివృత్తులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి ? వాటికి బడ్జెట్‌ లో ఇస్తున్న ప్రాధాన్యత ఎంత ? ఇలాంటి అంశాలపై టెన్ టివి జనపథంలో బీసీ సబ్‌ ప్లాన్‌ సాధన కమిటీ నేత కిల్లె గోపాల్‌ విశ్లేషించారు. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:44 - February 8, 2016

స్మార్ట్‌ సిటీలొస్తున్నాయి. అమృత నగరాలు ఏర్పడుతున్నాయి. కానీ గ్రామాల్లో చేతి వృత్తులు ధ్వంసమవుతున్నాయి. గ్రామాల్లోనే కాదు పట్టణాలు, మహానగరాల్లో సైతం విస్తరిస్తున్న కార్పొరేట్‌ కల్చర్‌ అనేక వృత్తులవారికి పెను సవాలు విసురుతోంది. వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే, భవిష్యత్‌ మరింత దుర్భరంగా మారుతుంది. మన దేశంలో వ్యవసాయంతో పాటు ఎక్కువ మందికి జీవనోపాధి కల్పిస్తున్నది చేతివృత్తులే. వీరిలో అత్యధికులు బలహీనవర్గాలవారే. ప్రభుత్వ విధానాల కారణంగా వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. చేతివృత్తులకు ఆదరణ తగ్గుతోంది. అత్యంత ప్రాధాన్యత గల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న అనేక వృత్తులకు సైతం ప్రోత్సాహం లభించని దుస్థితి. కార్పొరేట్ సంస్థల, విదేశీ ఉత్పత్తుల ధాటికి చేతి వృత్తులు తట్టుకుని నిలబడలేని పరిస్థితి ఎదురవుతోంది. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల రాయితీలిచ్చే, విదేశీ సంస్థలకు ఎర్రతివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు మన దేశంలోని వృత్తులవారికి కనీస సదుపాయాలు కల్పించలేని దౌర్భాగ్యాన్ని మనం చూస్తూనే వున్నాం. దీంతో వృత్తులకు ఆదరణ లభించక, పూటగడవని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నవారెందరో.

బీసీ సంక్షేమానికి అరకొర నిధులు..
చేతి వ్రుత్తులవారు తమ నైపుణ్యాలు పెంచుకోవడానికి, తాము ఉత్పత్తి చేసినవాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయం స్వల్పం. ఇందుకు నిదర్శనమే బడ్జెట్ కేటాయింపులు. దేశ జనాభాలో యాభై శాతం మంది బలహీనవర్గాలవారే ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులుండడం లేదు. కనీసం ఒక్క శాతం బడ్జెట్ కూడా కేటాయించని దుస్థితి. 2012 - 13, 2013-14 బడ్జెట్ లలో కేటాయించింది 0.6శాతమేనంటే ప్రభుత్వాలు బీసీల పట్ల ఎంత నిర్ధయగా వ్యవహరిస్తున్నాయో అర్ధమవుతోంది. ఇకగా ఈ ఏడాది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 32 వెనకబడిన తరగతుల సంక్షేమ పథకాలకు కోత పెట్టడమో, రద్దు చేయడమో జరిగింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లలోనూ బీసీ సంక్షేమానికి కేటాయింపులు 2.4 శాతానికి మించలేదు. వాటినీ సక్రమంగా వినియోగించలేదు. తెలంగాణ రాష్ట్రంలోనూ కేసీఆర్ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి కేటాయించింది కేవలం 2,172 కోట్ల రూపాయలు మాత్రమే. ఇలా అరకొర నిధుల కేటాయింపులతో బీసీ సంక్షేమం ఎలా సాధిస్తారో ఎవరికీ బోధపడదు. 

06:39 - February 8, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈవీఎంలను ముందుగానే టాంపరింగ్‌ చేశారని దానికి తగ్గట్లుగానే టీఆర్‌ఎస్‌కు ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. మరోసారి ఈవీఎంల టాంపరింగ్‌ అంశం తెరపైకి వచ్చింది. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఎన్నికలకు ముందుగానే..కేటీఆర్‌ 100 సీట్లు గెలుస్తామని చెప్పారని దానికి తగ్గట్లుగానే ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శ్రవణ్‌, మాజీ మేయర్‌ బండా కార్తీక రెడ్డి ఆరోపించారు. అలాగే కొంతమంది అభ్యర్థులకు ఇంట్లో సభ్యులు వేసిన ఓట్లు కూడా పడలేదని వీడియో క్లిప్పింగులతో వివరించారు.

న్యాయపోరాటం..
ఈవీఎంలలో ఎటు ఓటు వేసినా అధికార పార్టీకే పడేలా ఏర్పాటు చేశారని శ్రవణ్‌ ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయన్నారు. టీఆర్‌ఎస్‌కు రాష్ట్ర ఎన్నికల అధికారులు సైతం చేయికలిపారన్నారు. ఏ చట్టం ప్రకారం ఈవీఎంలలో నోటాను తొలగించారో అధికారులు చెప్పాలన్నారు. ఈవీఎంలకు ప్రింటర్‌ను వాడాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించిందని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎందుకు ప్రింటర్‌ను వాడలేదని శ్రవణ్‌ ప్రశ్నించారు. తార్నాక డివిజన్‌లోనూ అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని బండా కార్తీక రెడ్డి ఆరోపించారు. పలు డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులకు సున్నా ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. నారాయణఖేడ్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 

06:36 - February 8, 2016

మెదక్ : నారాయణఖేడ్‌ అసెంబ్లీకి జరుగనున్న బై ఎలక్షన్‌ నేపథ్యంలో పార్టీల ప్రచారం వేడెక్కింది. ఫిబ్రవరి 13న పోలింగ్‌ ఉండడంతో ఖేడ్‌ నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున రాష్ట్రనేతల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పోలింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతుంది. మూడు ప్రధాన పార్టీలు రేసులో ఉండడంతో అభ్యర్థుల తరపున రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ తరపున ప్రచార బాధ్యతను మంత్రి హరీష్‌ రావు భుజాన వేసుకున్నారు. అలాగే నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని మనూరు మండలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి భూపాల్‌ రెడ్డి తరపున డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. 

పార్టీల విస్తృత ప్రచారం..
ఇక కాంగ్రెస్‌ తరపున మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే కిష్టా రెడ్డి మరణించినప్పటికీ సంప్రదాయాలు మరిచి టీఆర్‌ఎస్‌ పోటీకి దిగిందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సంజీవ్‌రెడ్డిని లిపించాలని దామోదర విజ్ఞప్తి చేశారు. టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సైతం నారాయణఖేడ్‌ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ హామీలను విస్మరించిందని రేవంత్‌ ప్రచారంలో ఎండగట్టారు. ఇదిలా ఉంటే మూడు పార్టీల ప్రచారంతో ఖేడ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. మరోవైపు ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం చేస్తున్నారు.

06:34 - February 8, 2016

మెదక్ : బావమరిది బంపర్‌ హిట్‌ కొట్టారు. సింగిల్‌ హ్యాండ్‌తో సెంచరీ వరకు దూసుకుపోయారు. గ్రేటర్‌లో గులాబీ జెండా రెపరెపలాడించారు. ఇప్పుడు బావ టైమ్‌ వచ్చింది. ఆయన కూడా అదే రేంజ్‌లో ఆడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నారాయణఖేడ్‌ను కైవసం చేసుకుని మామకు కానుకగా ఇవ్వాలని భావిస్తున్నారు.  గ్రేటర్‌లో గులాబీ జెండాను ఎగరవేయడంలో కేటీఆర్‌ కీలకపాత్ర వహించారు. ప్రచార బాధ్యతను భుజానికెత్తుకున్న కేటీఆర్‌..జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో పార్టీకి భారీ విజయాన్ని అందించారు. ఇప్పుడు అదే రూట్‌లో హరీష్‌రావు ప్రయాణం చేస్తున్నారు. నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న హరీష్‌రావు..గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే మంత్రి హరీశ్‌రావు నారాయణఖేడ్‌లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఓ వైపు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూనే......మరోవైపు క్యాడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేశారు. నోటిఫికేషన్ తరువాత ఆయన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన భూపాల్ రెడ్డినే టీఆర్ఎస్‌ తన అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఇది కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానం కావడంతో అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఒకే ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. అదే పద్ధతిలో నారాయణఖేడ్‌లోనూ 10వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మొత్తంగా మంత్రి కేటీఆర్ గ్రేటర్‌లో పార్టీకి భారీ విజయాన్ని సాధించి పెట్టడంతో...మెదక్ జిల్లాలో కూడా అదే ఫలితాన్ని రాబట్టాలని మంత్రి హరీశ్‌రావు పావులు కదుపుతున్నారు. 

06:29 - February 8, 2016

తూర్పుగోదావరి : ముద్రగడ దీక్షకు మద్దతుగా ఏపీలో వివిధ ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ల సాధనకు కాపులు శాంతియుతంగా ఆందోళనలు జరపాలని ముద్రగడ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కాపులు ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని మేనిఫెస్టోలో ఉన్నవాటినే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాపులను బీసీ జాబితాలో చేర్చడం, వారి సంక్షేమానికి ఏటా వెయ్యి కోట్ల రూపాయల చొప్పున కేటాయించడం తదితర డిమాండ్లతో ఏపీ వ్యాప్తంగా కాపులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్లేట్లు గరిటెలతో చప్పుళ్లు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సైతం పిల్లా పెద్దా తేడా లేకుండా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో కాపులు ర్యాలీ నిర్వహించారు. గడియారం స్తంభం సెంటర్లో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వంగవీటి రంగా, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తక్షణమే ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

పలువురు దీక్షలు..
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ సర్పవరం, కొవ్వూరు, రేపూరులో కాపు సంఘాల నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తన ఆరోగ్య పరిస్థితులు లెక్కచేయకుండా ముద్రగడ నిరాహార దీక్ష చేస్తుంటే టిడిపి ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా సూర్యచంద్రరావు తనయుడు అజయ్‌తోపాటు నల్లా పవన్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వీరి దీక్షకు పలువురు సంఘీభావం తెలిపారు. ఇక కోనసీమ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అమలాపురంలో సుమారు 300 మంది మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కాపులను బీసీ జాబితాలో చేర్చాలని కోరారు.

ఎంపీ హర్షకుమార్ అరెస్టు..
ముద్రగడ దీక్షకు మద్దతుగా కిర్లంపూడిలో దళితులు చేపట్టిన రిలే దీక్షా శిబిరాన్ని ప్రారంభించేందుకు వెళ్తున్న అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను పోలీసులు మార్గమధ్యంలో అరెస్ట్ చేశారు. అనంతరం రాజమండ్రిలోని ఆయన స్వగృహానికి తరలించారు. పోలీసుల చర్యను హర్షకుమార్‌ ఖండిస్తూ ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనని విమర్శించారు. మరోవైపు కాపుల రిజర్వేషన్‌పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని ముద్రగడ తన దీక్షను విరమించుకోవాలని మాజీ మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్, శనక్కాయల అరుణ కోరారు. ఉన్నపళంగా రిజర్వేషన్లు కల్పిస్తే రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులొస్తాయని.. మంజునాథన్‌ కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే కాపు రిజర్వేషన్‌పై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ప్రతిపక్షాలు స్వలాభాల కోసం కాపులు, బీసీలకు మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. 

06:26 - February 8, 2016

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితులను పరీక్షించేందుకు వచ్చిన వైద్యులను సైతం ముద్రగడ అనుమతించడం లేదు. ప్రభుత్వం దిగొచ్చి మేనిఫెస్టోలో పెట్టినవాటిని అమలు చేసేదాకా దీక్ష విరమించబోనని ముద్రగడ స్పష్టం చేశారు. మరోవైపు ముద్రగడతో అర్థరాత్రి ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్‌రావు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చర్చలు జరిపారు. ప్రభుత్వం తరపున నేడు మంత్రులు ముద్రగడతో అధికారికంగా చర్చలు జరుపుతారని వారు ప్రకటించారు. ఇదిలా ఉంటే ముద్రగడ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాపులని బీసీల్లో చేర్చేంతవరకు తన దీక్ష కొనసాగుతుందని ముద్రగడ పద్మనాభం తేల్చిచెప్తున్నారు. అర్థరాత్రి చర్చలకు వచ్చిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్‌రావు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు కూడా ఇదే విషయాన్ని ఖరాఖండింగా చెప్పినట్లు సమాచారం. మూడో రోజు కూడా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముద్రగడ పద్మనాభం నిరాకరించడంతో..తూర్పుగోదావరి జేసి సత్యనారాయణ, ఎస్పీ రవిప్రకాష్‌లు వైద్య బృందం వెనుతిరిగాల్సి వచ్చింది.

వైద్య పరీక్షలకు నో..
రంపచోడవరం ఏఎస్పీ ముద్రగడ నివాసంలోకి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఇలా దుకుడుగా వ్యవహరిస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. ముద్రగడను పరామర్శించేందుకు పలువురు తరలివస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. వారిని ఎందుకు రానీయడం లేదంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. దీంతో పోలీసులు, ముద్రగడ అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు ముద్రగడ నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇక ముద్రగడ, ఆయన సతీమణి ఆరోగ్యం క్షీణించిపోతుండడంతో బలవంతంగానైనా వారిని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించే అవకాశముందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసుల చర్యను అడ్డుకునేందుకు ముద్రగడ అనుచరులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో కిర్లంపూడిలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

పవన్ కళ్యాణ్ ట్వీట్...
ముద్రగడ దీక్ష, కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశాలపై చర్చించేందుకు..విశాఖలో ఉన్న సీఎం చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘంతో ఆదివారం భేటీ అయ్యారు. కాపు సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కమిషన్ ప్రకారమే నడుచుకుందామని..సమావేశంలో చంద్రబాబు సూచించారు. ఇదే విషయాన్ని ముద్రగడకు వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తూ ప్రభుత్వం నేరుగా కాపు సంఘాల నేతలతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మేథావులు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రఘువీరారెడ్డి, చిరంజీవి, వైసిపి నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దాసరి నారాయణరావు సోమవారం ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించి ఆయన దీక్షకు సంఘీభావం తెలపనున్నారు. అయితే వీరిలో దాసరి నారాయణరావు...ఆదివారం రాత్రే కిర్లంపూడికి బయల్దేరినట్లు సమాచారం.

అర్ధరాత్రి చర్చలు...
ముద్రగడతో చర్చలు జరిపేందుకు ఆదివారం అర్థరాత్రి ఆయన నివాసానికి ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్‌రావు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వచ్చారు. అయితే సోమవారం ప్రభుత్వం తరపున ముగ్గురు మంత్రులు వస్తున్నారని వారితో ముద్రగడ చర్చలు జరుపుతారని బొడ్డు భాస్కర్‌రావు తెలిపారు. మంత్రులు అచ్చెంన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావ్‌ ముద్రగడతో చర్చలు జరుపుతారని సమాచారం తెలుస్తోంది. అయితే కాపులకు సంబంధించి ముద్రగడ కొన్ని సూచనలను బొడ్డు భాస్కర్‌రావుకు వివరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ మంజునాథ్‌ కమిషన్‌లో తాము సూచించిన వ్యక్తిని మెంబర్‌గా నియమించాలని ముద్రగడ చెప్పినట్లు సమాచారం. దాంతో పాటు...ఈనెల 20లోగా ఎంతమంది కాపు విద్యార్థులు దరఖాస్తులు చేస్తారో వారందరికి స్కాలర్‌షిప్‌లను మంజూరు చేయాలని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక ముద్రగడ దీక్ష నేపథ్యంలో జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ గట్టి బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ముద్రగడను కలిసేందుకు వీఐపీలెవరూ రావొద్దని సూచించారు. వీఐపీల రాకతో ఆందోళనలు చెలరేగే అవకాశం ఉందన్నారు. అయితే ఇవాళ ఉదయం 11గంటలకు ముద్రగడతో చర్చలు జరిపేందుకు ముగ్గురు మంత్రులు వస్తుండడంతో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. 

06:22 - February 8, 2016

హైదరాబాద్ : కాపులను బీసీల్లో చేర్చేవరకు తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని ముద్రగడ పద్మనాభం తేల్చిచెప్తున్నారు. ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి ఇవాల్టికి నాలుగో రోజుకు చేరుకుంది. మరోవైపు ముద్రగడ దీక్షను విరమింపచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ఒక దఫా ముద్రగడతో చర్చలు జరిపిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు...అర్థరాత్రి మరోసారి ముద్రగడతో చర్చలు జరిపారు. బొడ్డు భాస్కరరామారావుకు తోడుగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. అయితే ముద్రగడ కొన్ని విషయాల్ని వీరితో పంచుకున్నట్లు సమాచారం. ముద్రగడతో కొంతసేపు చర్చించిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు...ఇవాళ ఉదయం 11 గంటలకు ముగ్గురు మంత్రులు ప్రభుత్వం తరపున చర్చించడానికి వస్తారని తెలిపారు. మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావ్‌లు ప్రభుత్వం తరుపున ముద్రగడతో చర్చించడానికి వస్తున్నారని తెలిపారు. అయితే జస్టిస్‌ మంజునాథ్‌ కమిషన్‌లో తాము సూచించిన వ్యక్తిని మెంబర్‌గా నియమించాలని ముద్రగడ డిమాండ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ముద్రగడతో నేడు ప్రభుత్వం చర్చలు..

తూర్పుగోదావరి : కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడతో నేడు ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉదయం 11గంటలకు మంత్రులు చర్చలకు వస్తారని తోట పేర్కొన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావ్ చర్చలు జరపున్నారు. 

నేడు కిర్లంపూడికి చిరంజీవి, రఘువీరా..

తూర్పుగోదావరి : నేడు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా కిర్లంపూడికి రానున్నారు. ఆయనతో పాటు చిరంజీవి కూడా రానున్నారు. 

నేడు కిర్లంపూడికి వైసీపీ కాపు నేతలు..

హైదరాబాద్ : నేడు కిర్లంపూడికి వైసీపీ పార్టీకి చెందిన కాపు నేతలు రానున్నారు. బోత్స, అంబటి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ముద్రగడను పరామర్శించనున్నారు.

 

మంత్రి నారాయణతో కంపెనీల ప్రతినిధుల భేటీ..

విజయవాడ : నేడు మంత్రి నారాయణతో ఎల్ అండ్ టి, షాపూర్ జీ పల్లోంజి కంపెనీల ప్రతినిధులు భేటీ కానున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ గుత్తెదారుల ఎంపికపై చర్చించనున్నారు. 

మహేంద్ర తనయలో మహోదయం..

శ్రీకాకుళం : నేడు మహేంద్రతనయలో 'మహోదయం' జరగనుంది. సోంపేట (మం) బారువలో పుణ్యస్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 28 ఏళ్లకొకసారి మహోదయం పుణ్యకాలం వస్తుంది. 

Don't Miss