Activities calendar

09 February 2016

21:29 - February 9, 2016

విజయవాడ : దళితులకు కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని సిఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలో అన్నారు. తాను ఎస్సీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే తప్పుబడుతూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నిన్న చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో పేదల గురించి మాట్లాడుతూ ఎవరూ ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకోరు కదా అని అన్నారు. దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

21:28 - February 9, 2016

విజయవాడ : కులాలన్నీ మనం పెట్టుకున్న అడ్డుగోడలే.. ప్రపంచంలో ఉన్నది రెండే కులాలు.. ఒకటి డబ్బున్న వారి కులం రెండు డబ్బు లేనివారి కులం. ఇలా సాగిపోయాయి సిఎం చంద్రబాబు వ్యాఖ్యలు. సోమవారం సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పరిస్థితుల గురించి బాబు మాట్లాడుతూ కులాలు, మతాలకు సంబంధించిన ప్రస్తావన చేశారు.

ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడంపై బాబు స్పందిస్తూ ....

కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడంపై బాబు స్పందిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. ఆ సందర్భంగా తమ పార్టీ పేదలను ఎప్పుడూ విస్మరించలేదని పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని అన్నారు. అసలీ కులాలు మతాలనే అడ్డుగోడలు మనం పెట్టుకున్నవేనని ఏ ఒక్కరూ తాను పలానా కులంలో పుట్టాలని కోరుకుంటూ జన్మించలేరు కదా అని ఉదహరించారు. ఈ సందర్భంలోనే ఎవరూ ఎస్సీగా జన్మించాలని కోరుకోరు కదా అని చంద్రబాబు అన్నారు.

ఘాటుగా స్పందించిన వైసీపీ నేతలు...

ఈ వ్యాఖ్యలపై వైసిపి నేతలు ఘాటుగా స్పందించారు. చంద్రబాబు దళితులను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని వైసిపి ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆరోపించారు. చంద్రబాబు తక్షణమే తన పదవికి రాజీనామా చేసి దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబుపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి బాబు తాను చేసిన తప్పు కడిగేసుకోవాలని సూచించారు. కాపులకు వ్యతిరేకంగా బిసిలతో చంద్రబాబే ఆందోళన చేయిస్తున్నారని బిసిలకు కాపులకు మధ్య బాబు విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వైసిపి నేతలు ఆరోపించారు.

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన కేవీపీఎస్....

చంద్రబాబు ఎస్సీల పరంగా చేసిన వ్యాఖ్యలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి తప్పుబట్టింది. దళితుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు మాట్లాడారని కెవిపిఎస్‌ విజయవాడ నగర కార్యదర్శి నటరాజ్‌ విమర్శించారు. విజయవాడలోని మాచవరం సెంటర్‌లో కెవిపిఎస్‌ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్‌ దళితుడని ఇంకా ఎందరో మేథావులు దళితుల్లో ఉన్నారని అటువంటి దళిత సామాజిక వర్గాన్ని కించపరచడం సరికాదని అన్నారు.

విపక్షపార్టీ ఆరోపణల నేపథ్యంలో టిడిపి నేతలు స్పందl...

విపక్షపార్టీ ఆరోపణల నేపథ్యంలో టిడిపి నేతలు స్పందించారు. ఏ సామాజిక వర్గానికీ చెడు చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు అన్నారు. కాపు రిజర్వేషన్‌ ద్వారా బీసీలకు నష్టం చేసే ఆలోచన తమకు లేదని వైఎస్‌ జగన్‌ కుల విభేదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం చేశారు. ఇప్పటికే కులపరంగా ఏపీలో పలురకాల ఆందోళనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు చేసిన కామెంట్స్‌ వివాదాస్పదమవుతున్నాయి. దేశాభివృద్ధికి ఆటంకం కలిగించే ఈ కుల వివాదాలు ఎందుకంటూ సామాజికవేత్తలు పెదవిరుస్తున్నారు. 

నగరంలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లు..

హైదరాబాద్ : నగరంలోని రెండు చోట్ల గొలుసు దుండగులు గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. వనస్థలిపురంలోని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాలనీలో ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. హయత్‌నగర్‌లోని లెక్చరర్స్‌ కాలనీలో ఓ కిరాణ దుకాణంలో ఉన్న మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు.

శ్రీలంక విజయలక్ష్యం 102 పరుగులు..

హైదరాబాద్ : పుణే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 18.5 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్‌మెన్లలో అత్యధిక అశ్విన్ 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. రోహత్‌శర్మ-0, శిఖర్ దావన్- 9, అజింకా రహానే-4, రైనా-20, యువరాజ్‌సింగ్-10, ధోని-2, పాండ్యా- 2, జడేజా-6, ఆశిష్ నెహ్రా- 6, బుమ్రా- 0 పరుగులు చేసి ఔటయ్యారు. కాగా శ్రీలంక బౌలర్లలో రజిత, శనకా మూడేసి వికెట్లు తీయగా చమీరా రెండు వికెట్లు, సేనానాయకే ఒక వికెట్‌ను పడగొట్టాడు. శ్రీలంక విజయలక్ష్యం 102 పరుగులు.

21:08 - February 9, 2016

హైదరాబాద్ : వాళ్లు బాబాలు... సర్వసంగ పరిత్యాగులు... కానీ వ్యవహారం చూస్తే అలా అనిపించదు. అశేష భక్త కోటికి బోధనలు చేయడమే కాదు.. కోట్లు సంపాదించడంలోనూ అంతే ప్రతిభ చూపిస్తున్నారు. ఆధ్యాత్మికతను ప్రజల్లో పెంచడమే కాదు, వ్యాపారాన్ని పగడ్బంధీగా చేస్తూ...వ్యాయామమే కాదు.. బిజినెస్ కూడా పగడ్బందీగా చేయగలమని నిరూపిస్తూ వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈబాబాలు పతంజలి, ఈర్షా, శ్రీశ్రీ ఆయుర్వేద, అమృత ఇలాంటి పేర్లతో గ్రూపులను పెంచుకుంటున్నారు. దీని కథా కమామీషు ఏమిటో నేటి వైడాంగిల్ లో విశ్లేషణ చేశారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

సీఎం చంద్రబాబు పై కేసు నమోదు

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి నేతలు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీల పట్ల చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణలంక, సూర్యారావుపేటలో చంద్రబాబుపై మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి నేతలు ఊటుకూరి రోజ్‌కుమార్‌, మానికొండ శ్రీధర్‌ ఫిర్యాదు చేశారు.

'ఒకే విడతలో రుణ మాఫీ -పరిశీలన'

హైదరాబాద్: ఒకే విడతలో వ్యవసాయ రుణమాఫీ చేసేందుకు పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో జరిగిన ఓ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై అధ్యయనానికి డెన్మార్క్, పోలాండ్‌లలో పర్యటిస్తామని తెలిపారు. అదేవిధంగా పాలీ హౌసెస్, బిందు సేద్యానికి అధిక ప్రధాన్యం ఇస్తామని తెలిపిన ఆయన పాల ఉత్పత్తిదారులకు 4 శాతం ప్రోత్సాహకం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

7వికెట్లు కోల్పోయిన భారత్

హైదరాబాద్ : పుణే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న భారత్ ఏడు వికెట్లను కోల్పోయింది. రోహత్‌శర్మ-0, శిఖర్ దావన్- 9, అజింకా రహానే-4, రైనా-20, యువరాజ్‌సింగ్-10, ధోని-2, పాండ్యా- 2 పరుగులు చేసి ఔటయ్యారు. జడేజా(4), అశ్విన్(5) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత ప్రస్తుత స్కోర్ 12 ఓవర్లకు గాను ఏడు వికెట్ల నష్టానికి 64 పరుగులతో ఉంది.

20:35 - February 9, 2016

హైదరాబాద్ : తన మాతృభూమి కోసం బతకాలన్న ఆశ. శత్రువులను కనీసం సరిహద్దులను ముట్టనివ్వకూడదన్న సంకల్పం. శరీరధారుఢ్యం. అంతకు మించిన మనో నిబ్బరం. ఇదే మన సైనికులను సియాచిన్‌ శిఖరంపై నిలబెడుతున్నాయి. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేస్తున్నాయి. మృత్యుంజయుడైన హనుమంతప్పను కూడా ఇవే బతికించాయి. అసలు హనుమంతప్పను ఆర్మీ ఎలా గుర్తించింది...హనుమంతప్ప తొలి మాటలేంటి..? ఫిబ్రవరి 3, 2016 సైనికులు సియాచిన్‌లో పహారా కాస్తున్నారు..దేశరక్షణలో నిమగ్నమయ్యారు..ఒక్కసారి మంచు తుపాను...భారత జవాన్లను మంచు ముంచేసింది..పది మంది మంచు సమాధి. అందులో ఒకరు మృత్యుంజయుడు..

ఒక్కరైనా బతికి ఉంటారని ఆశ..

పదిమంది సైనికులూ సమాధి అయ్యారని భావిస్తున్నా ఏదో ఆశ. ఒక్కరైనా బతికి ఉంటారని. అందుకే సైనికులు ఓపికతో సహాయక చర్యలు కొనసాగించారు. సుమారు 25 అడుగుల మంచు కింద హనుమంతప్ప కనిపించాడు. హనుమంతప్ప కదులుతూ కనిపించగా, మంచు తొలగిస్తున్న సైనికుల్లో ఆనందం కట్టలు తెంచుకుంది.

గభరావ్ మత్ (గాభరా పడకు)..

సహచరుల గొంతు వినబడగానే హనుమంతప్ప లేచే ప్రయత్నం చేశాడట. వెంటనే అతనిని వారించిన సైనికులు కదలొద్దని సూచించారట. కదిలితే మంచు మీద పడే అవకాశం ఉందని 'గభరావ్ మత్ (గాభరా పడకు)..హమ్ ఆగయ్ (మేము వచ్చేశాం)...శ్వాస్ లేలో (బాగా ఊపిరి పీల్చుకో)'అంటూ హనుమంతప్పకు ఏం చేయాలో సూచించారు సైనికులు.

'ఓయ్...కంబల్ లేకే ఆవ్ తూ (ఓయ్...నువ్వు రగ్గు తీసుకునిరా)....

మంచు తొలగిస్తూనే మరో సహచరుడికి 'ఓయ్...కంబల్ లేకే ఆవ్ తూ (ఓయ్...నువ్వు రగ్గు తీసుకునిరా)' అంటూ పురమాయించారు రెస్క్యూ సిబ్బంది. అలా హనుమంతప్ప మృత్యుంజయడిగా తిరిగివచ్చాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అత్యంత ప్రమాదకరమని ప్రాంతమని తెలుసు.!అయినా ఎందుకంత ప్రాధాన్యత? రెండు దేశాల సైనికులూ చనిపోతున్నారు.! అయినా పహారానే.?

భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో కీలక ప్రాంతం సియాచిన్....

అత్యంత ఎత్తైన రణక్షేత్రమైన సియాచిన్‌...భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో కీలక ప్రాంతం. పాకిస్తాన్ సైనికులు దీని ద్వారా భారత భూభాగంలోకి రావడానికి చాలాసార్లు ప్రయత్నించారు. అందుకే ఇండియా సియాచిన్‌లో అత్యంత కట్టుదిట్టంగా పహారా కాస్తోంది. పాక్‌ ఆక్రమణల ప్రమాదం నేపథ్యంలో 1984 నుంచి భారత సైనికులు ఇక్కడ కాపలా ఉన్నారు. ఒకవేళ దీని దగ్గర సైనికులను విరమించుకుంటే పాక్ సైనికులే కాదు అక్కడి ఉగ్రవాదులు కూడా మన దేశంలో చొరబడే అవకాశముంది. ఒకసారి రెండు దేశాలు సైనికులనూ విరమించుకోవాలని ప్రయత్నించినా, విఫలమయ్యాయి.

1984 నుంచి మొత్తం 879 మంది సైనికుల మృతి.....

మంచు, ఆక్సిజన్‌ కొరత, చర్మవ్యాధుల కారణంగా 1984 నుంచి మొత్తం 879 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మంచు గడ్డలు మీద పడ్డంతో పాకిస్తాన్‌ సైనికులు కూడా వందల సంఖ్యలో చనిపోయారు. ఇలా ఇరు దేశాల సైనికులు మృత్యువాతపడుతున్నా...రక్షణకే ప్రాధాన్యతనిస్తున్నాయి పాకిస్తాన్, ఇండియా.

సియాచిన్‌ కోసం ప్రత్యేకంగా సైనికుల ఎంపిక పద్దతులు....

సియాచిన్‌లో విధులు నిర్వహించే సైనికులకు ప్రత్యేక ఎంపిక ఉంటుంది. రక్తం గడ్డ కట్టే చలిని తట్టుకునే వాళ్లు, ధైర్యం, మనోనిబ్బరం, దేశం కోసం ప్రాణాలకైనా తెగించే సాహసికులు, విపరీతర వాతావరణాన్ని తట్టుకునే యువతను సెలక్ట్ చేసుకుంటారు.

అట్లాంటిక్ గ్లేసియర్లలో ట్రైనింగ్.....

సియాచిన్‌కు ఎంపికైన వారికి అట్లాంటిక్ గ్లేసియర్లలో ట్రైనింగ్ ఇస్తారు. ప్రత్యేక ఆహార పద్దతులు అలవాటు చేస్తారు. అలా అన్ని దశల్లోనూ ఫిల్టరైన వారే సియాచిన్‌కు పయనమవుతారు. సియాచిన్‌లో సైనికులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా అనేక ప్రయత్నాలు చేస్తుంది. రిజర్వేషన్లు, బహుమతుల్లోనూ మిగతా సైనికుల కంటే వీరికే మొదటి ప్రాధాన్యత. అలాగే అప్పుడప్పుడు మన దేశ ప్రధానులు, రాష్ట్రపతి, ఇతర సినిమా, క్రికెట్ సెలబ్రీలు సియాచిన్‌ బేస్‌ క్యాంపుకు వెళ్లి వారితో సంబరాలు చేసుకున్నారు. వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపారు. ఉన్న ఊరిని, కన్నవారిని, భార్యా, పిల్లలు...ఇలా అందర్నీ విడిచి ప్రాణాలకు తెగించి సియాచిన్‌లో పహారా కాస్తున్న జవాన్లకు సలాం చేస్తోంది భారతావని.

20:28 - February 9, 2016

హైదరాబాద్ : సైకిల్ ను జాడిచ్చి తన్నిన మళ్లొక తమ్ముడు, బంగారు తెలంగాణకు షురూ అయిన బాటలు, జనం ఓట్లేశినా? గ్రేటర్ ఎన్నికల్లో మిషీన్లు గోల్ మాల్ జేశ్నయ్ అని ఈసీకి ఫిర్యాదు, కొత్తిల్లు గట్టుకుంటున్న సీఎం కేసీఆర్, దేవుండ్ల సేవల మునిగిన అపర భక్తి సర్కార్, దూపైతుందంటున్న ఎములాడ రాజన్న, అంగన్ వాడీలు లేకుండా చేయాలని సర్కార్ కుట్ర, ఉపాధి హామీ పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దయజూపాలే అంటున్న కూలీలు, కలెక్టర్ గార్డెన్ లోకి పోయిన మేక, ప్రకృతి మప్పులో బార్డర్ల సైనికుడు ఇత్యాది అంశాలపై మల్లన్న మసాల ముచ్చట్లు చెప్పారు. ఆ ముచ్చట్లను మరి మీరూ చూడాలనుకుంటున్నారా అయితే... ఈ వీడియోను క్లిక్ చేయండి...

ఏసీబీకి చిక్కిన జూపార్క్ క్యూరేటర్

హైదరాబాద్: నగరంలోని జూపార్క్ క్యూరేటర్ అవినీతికి పాల్పడుతూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కాడు. క్యూరేటర్ జి.రవి రూ. 75 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి రవి ఈ లంచం తీసుకుంటుడగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

హైదరాబాద్ : భారత్, శ్రీలంకల మధ్య మూడు టీ20ల సిరీస్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మరికాసేపట్లో పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా మొదలు కానుంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఆతిథ్య దేశ జట్టు టీమిండియాను అతడు ఫస్ట్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్ లో ఆసీస్ భరతం పట్టి మంచి ఊపు మీదున్న ధోనీ సేన మరికాసేసట్లో బ్యాటింగ్ ప్రారంభించనుంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు టీమిండియా ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. ఆసీస్ తో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది.

జైట్లీతో ముగిసిన ఈటెల భేటీ...

హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ జరిపిన భేటీ ముగిసింది. సమావేశం అనంతరం మంత్రి ఈటల భేటీ వివరాలను వెల్లడిస్తూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచాలని కోరినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని అరుణ్‌జైట్లీ చెప్పారన్నారు. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు రూ. 700 కోట్లు సాయం అందించాలని విజ్ఞప్తి చేశాం. హెచ్‌ఎండీఏకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరాం. 13వ ఆర్థిక సంఘం బకాయిలను చెల్లించాల్ని కోరినట్లు మంత్రి వెల్లడించారు.

త్వరలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వేతనాల పెంపు...

హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సభ్యుల వేతనాలు త్వరలో పెరగనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతభత్యాలు పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. బడ్జెట్ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

18:59 - February 9, 2016

హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి ప్రభుత్వం అదనపు శాఖను కేటాయించింది. ఎస్సీ డెవలప్ మెంట్ అండ్ కో-ఆపరేటివ్ శాఖను కూడా ఆయనకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే మంత్రి కేటీఆర్ కు ప్రభుత్వం మున్సిపల్ శాఖను కూడా అదనంగా కేటాయించిన సంగతి తెలిసిందే.

18:55 - February 9, 2016

విజయవాడ : కాపులను బీసీల్లో చేరుస్తామనడంపై రగడ తీవ్ర రూపం దాలుస్తోంది. విజయవాడలో బీసీ సంఘం నేతలు నిర్వహించిన ఐక్య కార్యాచరణ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ ఓ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించాడు. సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతుండగానే ఆత్మహత్యకు యత్నించాడు బీసీసంఘం కార్యకర్త .                                                           

బీసీ సంఘాల తరహాలో కొత్త ఉద్యమం...

కాపులను బీసీల్లో చేర్చాలనే ముద్రగడ దీక్ష ముగియగానే.. బీసీ సంఘాల తరహాలో కొత్త ఉద్యమానికి తెరలేచింది. ఏడాదికి 1000 కోట్లు కేటాయిస్తామని... బీసీలకు ఇబ్బంది కలగకుండా కాపులను బీసీలో చేరుస్తామనడంపై బీసీ సంఘం నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిలో భాగంగా విజయవాడలో బీసీ కులాల ఐక్య సమావేశం నిర్వహించారు. సమావేశం జరుగుతుండగానే ఓ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

విజయవాడలో బీసీ సంఘం నేతలు సమావేశం...

కాపులను బీసీలను చేరిస్తే ఊరుకోబోమంటూ విజయవాడలో బీసీ సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. బీసీ కులాల వారు ఇప్పటికీ అణగారిన వారిగానే ఉన్నారని.. వారికి తగిన న్యాయం ఇంకా జరగనే లేదని.. ఇంతలోనే కొత్త కులాలను బీసీల్లో చేరిస్తే సహించబోమంటున్నారు ఆర్ కృష్ణయ్య.

ఇంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు....

ఇంతలో మురళీగౌడ్ అనే కార్యకర్త బీసీల్లో కాపులను చేర్చవద్దంటూ ఇంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో ఒక్కసారిగా నేతలందరూ ఉలిక్కిపడి .. కార్యకర్తను అడ్డుకున్నారు. బీసీలకు న్యాయం జరగాలని రాజ్యాధికారం కావాలంటూ నినాదాలు చేశాడు మురళీగౌడ్ . ఇది ఇలా ఉంటే చేతకాని వారు ఆత్మహత్యలు చేసుకుంటారని..మనకు తగిన బలం ఉందని ఐక్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య . ఎవరు ఆత్మార్పణకు యత్నించవద్దని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం బీసీలను తొక్కిపడుతోందని..

నేతల ప్రసంగాలు కొనసాగుతుండగానే బీసీ సంఘం నేతల తీరును తప్పుపడుతూ కొందరు కార్యకర్తలు సమావేశాన్ని అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను తొక్కిపడుతోందని.. వారికి రాజ్యాధికారం రాకుండా అడ్డుకుంటుందని అలాంటి పార్టీలో కొనసాగుతూ ఉంటే.. బీసీలకు న్యాయం జరగదని నినాదాలు చేశారు. దీంతో ఖంగుతిన్న కృష్ణయ్య మీ సమస్య ఏంటని అడగ్గా.. ఆర్ కృష్ణయ్య టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అధికార పార్టీలో ఉన్న నేతలు తమ పదవులకు రాజీనామా చేసి ప్రత్యక్ష కార్యాచరణలోకి రావాలని డిమాండ్ చేశారు కార్యకర్తలు. బీసీలను ఐక్యం చేయాలనే ఉద్దేశ్యంతో తలపెట్టిన సమావేశం గందరగోళంగా మారింది. ప్రతి ఒక్కరు బీసీల హక్కుల కోసం పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు.

18:52 - February 9, 2016

గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మళ్లీ కలకలం నెలకొంది. యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌లో మహిళా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పట్ల ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. మహిళా ప్రొఫెసర్‌ బాత్‌రూంలో స్నానం చేస్తుండగా.. అదే గెస్ట్‌హౌజ్‌లో బస చేసిన అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థి సాయి శ్రీకర్‌ సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఘటనపై మహిళా ప్రొఫెసర్‌ రిజిష్ట్రార్‌కు ఫిర్యాదు చేసింది. రిజిష్ట్రార్‌ పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థి సాయి శ్రీకర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. 

15 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ

హైదరాబాద్ : ఇకపై 15రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా 9సవరణలతో తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. 2 లేదా 3రోజుల్లో ఖమ్మం, వరంగల్ కార్ఫోరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదివరకే ఈవిషయంపై కాంగ్రెస్ పార్టీనేతలు కోర్టుకు వెళ్లడంతో తిరస్కరించి కొట్టివేసింది. ఈ ఆర్డినెన్స్‌తో ఇకపై జరిగే ఏ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అయినా 15రోజుల్లోనే పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కాగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌ను చట్టరూపంలో మార్చే అవకాశముంది.

18:43 - February 9, 2016

ఢిల్లీ : విభజన హామీలు పరిష్కరించాలని ప్రధానిని, కేంద్రమంత్రులను కోరినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులివ్వాలని కేంద్రాన్ని కోరామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక లోటును భర్తీ చేయాలని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహాయం కావాలని, గతంలో పెండింగ్ లో ఉన్న లోటుబడ్జెట్ భర్తీనిమిత్తం నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సూచించినట్టు ఆయన వెల్లడించారు.రాష్ట్రంలో వెనకబడిన7 జిల్లాలకు స్పెషల్ ప్యాకేజీలు ఇవ్వాలని, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని, గుంటూరు, విజయవాడ ల్లో డ్రైనేజీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని విశాఖ రైల్వే జోన్, విభజన చట్టంలో పేర్కొన్నట్టు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా కల్పించాలని కేంద్రానికి సూచించినట్టు ఆయన తెలిపారు. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ మేరకు అవసరమైన అందరితోనూ చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు. విభజన సందర్భంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశానని ఆయన అన్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే మంత్రి సురేష్ ప్రభు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. 

లేపాక్షి ఉత్సవాలు..టి.మంత్రులకు బాలయ్య ఆహ్వానం...

హైదరాబాద్ : లేపాక్షి ఉత్సవాలకు పలువురు తెలంగాణ మంత్రులను ఎమ్మెల్యే బాలకృష్ణ ఆహ్వానించారు. ఇవాళ మంత్రి చందూలాల్‌ను కలిసి ఉత్సవాలకు రావాలంటూ ఆహ్వానపత్రం అందజేశారు. త్వరలో మిగతా మంత్రులను కలుస్తామని బాలయ్య మీడియాతో తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కూడా ఉత్సవాలకు ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు. లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలంటూ బాలకృష్ణ ఆకాంక్షించారు.

శిశికుమార్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి..

రంగారెడ్డి : మెయినాబాద్‌లోని వ్యవసాయక్షేత్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డ డాక్డర్‌ శశికుమార్‌ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో శవపరీక్ష పూర్తయింది. దీంతో మృతదేహాన్ని చైతన్యపురిలోని స్వగృహానికి తరలించారు. నిన్న హిమయత్‌నగర్‌లో సహ వైద్యుడు ఉదయ్‌కుమార్‌పై శశికుమార్‌ కాల్పులు జరిపి పరారైనట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తెలంగాణలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జీతాల పెంపు యోచన

హైదరాబాద్ : తెలంగాణ లో తమ జీతాల పెంచాలని సీఎం కేసీఆర్ ను పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సీఎం కేసీఆర్ ను కలిపి విజ్ఞప్తి చేశారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచాలని వినతిపత్రం సమర్పించారు. ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు రూ.3లక్షలు ఖర్చు అవుతుందని సీఎం దృష్టికి తెలిపినట్లు సమాచారం.

కోమాలోకి ఆర్మీ జవాను హనుమతప్ప

న్యూఢిల్లీ: సియాచిన్ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఆర్మీ జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప కోమాలోకి వెళ్లినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరో 24గంటల వరకు ఏమీ చెప్పలేమని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రి లో హనుమంతప్ప కు వైద్యులు వెంటిలేటర్ పై చికిత్సను కొనసాగిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోడీ ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రికి వెళ్లి హన్మంతప్ప ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. 

17:50 - February 9, 2016

కరీంనగర్‌ : నగరంలో ఇంటర్‌ విద్యార్ధుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది. కరీనంగర్‌ రూరల్‌ మండలంలోని సీతారాంపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేందర్‌ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదువుతున్నాడు. సీనియర్లతో గొడవ పడ్డాడు. దీంతో బషీర్‌ అనే సీనియర్‌ విద్యార్ధి గత రాత్రి రాజేందర్‌ ఇంటికి వచ్చి కత్తితో పొడిచి పారిపోయాడు. రక్తం మడుగులో పడివున్న రాజేందర్‌ను కుటుంబ సభ్యుల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

17:48 - February 9, 2016

మీర్పూర్ : భారత అండర్ -19 క్రికెటర్ సర్ఫ్రాజ్ ఖాన్...జూనియర్ ప్రపంచకప్ లో వెయ్యి పరుగులు సాధించిన నాలుగో క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న 2016 అండర్ -19 ప్రపంచకప్ టోర్నీలో లీగ్ దశ నుంచి సెమీస్ వరకూ..మ్యాచ్ కు హాఫ్ సెంచరీ చొప్పున సాధిస్తూ నిలకడగా రాణించాడు. మీర్పూర్ షేరే బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో ముగిసిన తొలి సెమీఫైనల్లో సర్ఫ్రాజ్ ఖాన్...కేవలం 71 బాల్స్ లో ఆరు బౌండ్రీలు, ఒక సిక్సర్ తో 59 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.ఈ క్రమంలో..జూనియర్ వన్డే ప్రపంచకప్ లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు. 

17:46 - February 9, 2016

మీర్పూర్ : అండర్‌ -19 వరల్డ్‌ కప్‌లో మూడు సార్లు చాంపియన్‌ భారత్.....మరో టైటిల్‌పై కన్నేసింది. సెమీఫైనల్‌లో శ్రీలంక జట్టును చిత్తు చేసిన ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆల్‌రౌండ్‌ షోతో లంక జట్టుపై 97 పరుగుల తేడాతో నెగ్గింది. భారత్ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ అన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ హాఫ్‌ సెంచరీలకు తోడు... బౌలర్లు సమిష్టిగా రాణించడంతో....లంక జట్టుకు ఓటమి తప్పలేదు. మీర్పూర్‌లోని షేర్‌ ఎ బంగ్లా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు....50 ఓవర్లలో 9 వికెట్లకు 267 పరుగులు నమోదు చేసింది.

27 పరుగులకే రెండు వికెట్లు..
ఓపెనర్లు రిషబ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌ విఫలమవ్వడంతో.... భారత జట్టు 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న జట్టును అన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌తో కలిసి ఆదుకున్నాడు. ఇద్దరూ కలిసిన మూడో వికెట్‌కు 96 పరుగులు జోడించి జట్టు భారీ స్కోర్‌కు పునాది వేశారు. 65 బంతుల్లో 6 ఫోర్లు ఓ సిక్సర్‌తో 59 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ఔటైనా...స్కోర్‌ వేగం తగ్గలేదు. వాషింగ్టన్‌ సుందర్‌ రాణించడంతో పాటు.. అర్మాన్‌ జాఫర్‌ మరోసారి మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో భారత జట్టు శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్నుంచింది. 122 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 72 పరుగులు చేసిన అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

42.4 ఓవర్లలో కుప్పకూలిన లంక..
268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు....42.4 ఓవర్లలోనే కుప్పకూలింది. భారత బౌలర్లు అవేష్‌, దగార్‌ చెలరేగడంతో లంక బ్యాట్స్‌మెన్‌ క్యూ కట్టారు. దీంతో శ్రీలంక జట్టు విజయానికి చేరువగా కూడా రాలేకపోయింది. మెండిస్‌, అషాన్‌, డి సిల్వా కొద్దిసేపు పోరాడినా...మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో లంక జట్టు 170 పరుగులకే ఆలౌటైంది. 97 పరుగుల తేడాతో నెగ్గిన భారత జట్టు ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది.అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు భారత జట్టు అర్హత సాధించడం ఇది 5వ సారి కావడం విశేషం.
ప్రస్తుత టోర్నీలో భారత జట్టు జోరు చూస్తుంటే టైటిల్‌ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మూడు సార్లు అండర్‌-19 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు నాలుగో సారి టైటిల్‌ సాధిస్తుందో లేదో చూడాలి. 

17:23 - February 9, 2016

గుంటూరు :నగరంలో సుందరయ్యనగర్‌లో సీపీఎం నాయకులపై దుండగులు గొడ్డళ్లతో దాడి చేశారు. సుందరయ్యనగర్‌శాఖ సహాయ కార్యదర్శి ఆంజనేయులు, సతీష్‌పై దాడికి పాల్పడ్డారు. తలపైన బలమైన గాయాలు కావడంతో వీరిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.గత కొంత కాలంగా స్థానిక సమస్యలపై సీపీఎం నేతలు పోరాడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే దాడి చేసినట్లు తెలుస్తోంది. కోటేశ్వరరావు, బాజీతో పాటు మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రభుత్వాసుపత్రి ఎదుట సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడ్డవారిని అరెస్ట్‌ చేసి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో బాధితులను అర్బన్‌ ఎస్పీ త్రిపాఠి పరామర్శించారు. నిందితులపై గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి రామారావు ఆరోపించారు. నిందితులను వెంటనే ఆ ఏరియానుండి సస్పెండ్ చేయాలని నగర కార్యదర్శి భావన్నారాయణ డిమాండ్ చేశారు. 

విద్యాశాఖ బడ్జెట్ సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : విద్యాశాఖ బడ్జెట్ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మెడికల్, అగ్రి కల్చర్, ఫార్మా మినహా అన్ని స్థాయిల విద్యా సంస్థల నిర్వహణ బాధ్యత విద్యాశాఖకే అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని... దాన్ని ప్రక్షాళన చేయాలన్నారు. వేరు వేరు శాఖల నిర్వహణలో ఉన్న స్కూళ్లు, కాలేజీలు, వృత్తి విద్యా సంస్థలు, స్టడీ సర్కిళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. ఎవరికి వారు విద్యా సంస్థలు నిర్వహించడం వల్ల సమగ్రత లోపించందన్నారు.

ఖేడ్ లో కాంగ్రెస్, టిఆర్ ఎస్ కార్యకర్తల పరస్పర దాడులు

హైదరాబాద్ : నారాయణ ఖేడ్ లో కాంగ్రెస్, టిఆర్ ఎస్ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

ఓఆర్ ఆర్ పై కారు బోల్తా...

రంగారెడ్డి: రాజేంద్రనగర్ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిని తరలించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 266 పాయింట్లు నష్టపోయి 2,020 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 7,298 వద్ద ముగిసింది. 

16:47 - February 9, 2016

హైదరాబాద్ : సియాచిన్‌లో సంభవించిన భీకర మంచు తుపానులో చిక్కుకుని మరణించారని భావించిన పదిమంది భారతీయ సైకుల్లో ఒకరు సజీవంగా బయటపడ్డారు. మిలిగిన వారంతా మరణించారని నిర్ధారయ్యింది. సియాచిన్‌లో మంచును తొలగిస్తున్న సైనిక బృందాలు.... 25 అడుగుల మేర మంచులో కూరుకుపోయిన సైనికుడు హనుమంతప్పను బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు.

3 సియాచిన్‌ వెళ్లిన 10 మంది భారత సైనికులు ....

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు హనుమంతప్ప. ఆర్మీలో లాన్స్‌ నాయక్‌ హోదాలో పనిచేస్తున్నాడు. ఈనెల 3న సియాచిన్‌ గ్లేషియర్‌కు వెళ్లిన పది మంది భారత సైనిక బృందంలో హనుమంతప్ప కూడా ఉన్నాడు. అయితే ఒక్కసారిగా విరుచుకుపడ్డ మంచు తుపాను... మన జవాన్లను కప్పేసింది.

సైనికులంతా మరణించాలని సైన్యం ప్రకటన.....

ఆ తరువాత మృతుల కోసం గాలింపు చేపట్టారు. అతికష్టం మీద సోమవారం..మృతదేహాలను కనుగొన్నారు. మంచును తొలగించి మృత దేహాలను తొలగిస్తుండగా... మంచులో కప్పబడి కొనవూపిరితో వున్న హనుమంత్పను గుర్తించారు. వెంటనే అతన్ని ఆస్సత్రికి తరలించారు. 4 రోజులుగా 25 అడుగుల లోతున బతికి ఉండటం చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. కఠిన శిక్షణ, మనోబలమే... హనుమంతప్పను కాపాడిందని చెబుతున్నారు. కర్నాటకకు చెందిన హనుమంతప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో.. జమ్ము నుంచి ఢిల్లీలోని సైనిక ఆస్పత్రికి తరలించారు.

మరణించిన సైనికుల్లో ఐదుగురి మృతదేహాల వెలికతీత ...

సియాచిన్‌ గ్లేషియర్‌ మంచుతో సజీవ సమాధైన తొమ్మిది మంది సైనికుల్లో ఐదుగురి మృత దేహాలను వెలికితీశారు. మిగిలినవారి మృత దేహాలు బయటపడే అవకాశంలేదని భావిస్తున్నారు. మంచు గడ్డకట్టుకుపోవడంతో సహాయ చర్యలకు అంతరాయం కలుగుతోంది. భారీ యంత్రాలు, థర్మల్‌ ఇమేజర్లు, జాగిలాలతో సహాయ చర్యలు చేపడుతున్నారు. కశ్మీర్‌ ఉత్తర భాగంలో ఉన్న సియాచిన్‌ పాక్‌ సరిహద్దు ప్రాంతం. ప్రస్తుతం ఇక్కడ మైనస్‌ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 1980 తర్వాత నుంచి ఇప్పటి వరకు సియాచిన్‌లో 869 సైనికులు, సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్‌. 

16:44 - February 9, 2016

నల్గొండ : బావికి వెళ్లే దారిలో అడ్డంగా ఉన్న కొండచిలువలను చంపేశారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం అజీంపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. బావికి వెళుతుండగా దారికి అడ్డంగా ఉన్న కొండచిలువలు రెండిటిని గ్రామస్తులు చూశారు. అవి కదలకుండా అక్కడే ఉండటంతో.. వాటిని చంపేశారు. గతంలో కూడా ఇక్కడ కొండచిలువలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.

16:43 - February 9, 2016

హైదరాబాద్ : నెల్లూరులో ఎస్ ఎఫ్ఐ కార్యకర్తపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ ఎఫ్ఐ కార్యకర్త మధు తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి ఒక చెవి వినపడకుండా పోయింది. ఇటీవల హెచ్ సియూ లో రోహిత్‌ మృతికి నిరసనగా నెల్లూరులో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మధు కీలకంగా వ్యవహరించాడు. దీన్ని జీర్ణించుకోలేని ఏబీవీపీ కార్యకర్తలు కాలేజీలో ఉన్న మధును బయటకు పిలిచి దాడికి పాల్పడ్డారు. మధు వీఆర్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నాడు. మధు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏబీవీపీ దాడిని విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. 

16:40 - February 9, 2016

హైదరాబాద్: గ్రేట‌ర్‌లో ఊహించ‌ని విజ‌యాన్ని ద‌క్కించుకున్న గులాబీ పార్టీకి వ‌ల‌స‌ల తాకిడి మ‌రింత పెరిగేలా క‌నిపిస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన నేత‌లు పెద్ద ఎత్తున కారెక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయ‌డంతో ఆ పార్టీకి చెందిన శాస‌న‌స‌భ్యులు ఒకరిద్దరు మిన‌హా అంతా గులాబీ గూటికి చేరుకుంటార‌న్న ప్రచారం అధికార పార్టీలో జ‌రుగుతోంది.

గ్రేట‌ర్ చుట్టూ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ...

తెలంగాణాలో అధికార పార్టీగా అవ‌త‌రించిన నాటి నుంచి పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించిన గులాబి బాస్ విప‌క్ష పార్టీల నేత‌ల‌ను కారెక్కించుకుంటున్నారు. కింది స్థాయి కార్యక‌ర్త నుంచి శాస‌న‌ స‌భ్యుడి వ‌ర‌కు ఏ ఒక్కరినీ కాద‌న‌కుండా పార్టీలోకి చేర్చుకుంటున్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు జిల్లాల్లో జ‌రిగిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఇప్పుడు గ్రేట‌ర్ చుట్టూ మ‌రోసారి తిరుగుతోంది. కాంగ్రెస్‌కి పెద్దగా ఇక్కడ బ‌లం లేక‌పోవ‌డంతో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బ‌ల‌ప‌డాలంటే తెలుగు త‌మ్ముళ్లను కారెక్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా టిఆర్ఎస్ వ్యూహాలు ర‌చిస్తోంది. గ్రేట‌ర్‌లో త‌మ‌కు కూడా బ‌లం ఉంద‌ని ఇప్పటి వ‌ర‌కు అంచ‌నా వేసుకున్న తెలుగుదేశం నేత‌లు ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ఇదే అంశాన్ని టిఆర్ఎస్ అస్త్రంగా వాడుకుంటోంది. తెలుగుదేశంకు తెలంగాణలో భ‌విష్యత్ ఉండ‌ద‌నే స్పష్టమైన సంకేతాల‌ను అధికార పార్టీ ఇస్తోంది. దీంతో టీడీపీ త‌ర‌పున విజ‌యం సాధించిన మెజార్టీ శాస‌న‌స‌భ్యులు కారెక్కేందుకు సిద్ధమ‌వుతున్నట్లు స‌మాచారం.

వివేక్‌ బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు?

తెలుగుదేశం పార్టీని తెలంగాణాలో కోలుకోని విధంగా దెబ్బ తీస్తేనే భ‌విష్యత్‌లో త‌మ‌కు ఎదురుండదని గులాబీ పార్టీ పావులు క‌దుపుతోంది. అందుకు అనుగుణంగా గ్రేట‌ర్ ప‌రిధిలోని ప‌లువురు ఎమ్మెల్యేలను ఇప్పటికే కారెక్కించుకోగా మ‌రోసారి మరికొంతమందికి ఇప్పుడు త‌లుపులు తెరిచింది. కుత్బుల్లాపూర్ శాస‌న‌ స‌భ్యుడు వివేకానంద కారెక్కడంతో ఇంకొందరు శాస‌న‌స‌భ్యులు అదే బాట‌లో న‌డువనున్నారు. రాజేంద్రన‌గ‌ర్, శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ కీల‌క నేత‌ల‌తో కొన్ని రోజులుగా ట‌చ్‌లో ఉన్నారు. కాని గ్రేట‌ర్ ఎన్నిక‌లు ఎదుర్కోవాల్సి ఉండ‌డంతో వారంతా వేచి చూసే ధోర‌ణ‌ని అవ‌లంభించారు. ఇప్పుడు మ‌రోసారి కారెక్కేందుకు తెలుగుదేశం శాస‌న‌స‌భ్యులు క్యూలో ఉన్నట్లు అధికార పార్టీ నేత‌ల్లో చ‌ర్చలు జ‌రుగుతున్నాయి.

గులాబీ గూటికి ఆరుగురు శాస‌న‌స‌భ్యులు....

సాధార‌ణ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం నుంచి 15 మంది ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు. తర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో మొత్తం ఆరుగురు శాస‌న‌స‌భ్యులు గులాబీ గూటికి చేరుకున్నారు. మ‌రో నలుగురు సైకిల్‌ పార్టీ ఎమ్మెల్యేల‌ను కారెక్కించుకుంటే పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం ప‌రిధిలోకి కూడా వ‌చ్చే అవ‌కాశం లేద‌ని అధికార పార్టీ నేత‌లు భావిస్తున్నారు. ఒక్కరిద్దరు శాస‌న‌స‌భ్యులు మిన‌హా తెలుగుదేశంలో మ‌రెవరూ కొన‌సాగే అవ‌కాశం లేద‌ని గులాబి పార్టీ నేత‌లు అంటున్నారు.

క్షేత్రస్థాయిలో బ‌ల‌ప‌డేందుకు టార్గెట్ టీడీపీ......

దీర్ఘకాలిక ప్రయోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని టిఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ నేత‌ల‌నే టార్గెట్ చేస్తోంది. రాబోయే సాధార‌ణ‌ ఎన్నిక‌ల నాటికి సెంటిమెంట్‌తో కాకుండా క్షేత్రస్థాయిలో బ‌ల‌ప‌డేందుకు టీడీపీని ల‌క్ష్యంగా చేసుకుంది. సాధార‌ణ ఎన్నిక‌లు వ‌చ్చే స‌మ‌యానికి నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య కూడా భారీ ఎత్తున పెరిగే అవ‌కాశం ఉండ‌డంతో గులాబీ పార్టీ నేత‌ల‌తో పాటు వ‌ల‌స వ‌స్తున్న నేత‌ల‌కూ పోటీ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించేందుకు అధికార పార్టీ ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తోంది.

16:38 - February 9, 2016

విజయవాడ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు , ప్రభుత్వ విధానాలు , పరిష్కార మార్గాలు వంటి అంశాలపై విజయవాడలోని ఎంబి భవన్ లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని.. జిల్లాలో లక్ష మంది ఉన్నారని.. వారందరికి చట్టప్రకారం గుర్తింపుకార్డులు ఇస్తామని చంద్రబాబు మాట తప్పారన్నారు నేతలు. ఆత్మహ్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి 21 నఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

16:36 - February 9, 2016

హైదరాబాద్ : నేపాల్‌లో మాదేశీలు ఆందోళన విరమించారు. ఆ దేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఐదు నెలలుగా భారత్-నేపాల్ సరిహద్దుల్లో మాదేశీ తెగ ప్రజలు నిరసన చేస్తున్నారు. సరిహద్దుల్లో భారత్ నుంచి వచ్చే నిత్యావసరాల దిగుమతిని అడ్డుకున్నారు. దీంతో పెట్రోల్, ఆహారం, మెడిసిన్ వంటి నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. సంక్షోభం తీవ్రమవుతుండటంతో మాదేశీ తెగ ప్రజలు ఆందోళన విరమించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తమ నిరసన మరో రూపంలో కొనసాగుతూనే ఉంటుందని వారు స్పష్టం చేశారు. మాదేశీలు ఆందోళన విరమించడంతో ఇరు దేశాల సరిహద్దుల్లో రాకపోకలు పునరుద్ధరణ అయ్యాయి.

 

16:34 - February 9, 2016

హైదరాబాద్ : గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ 199 మిలియన్‌ డాలర్ల విలువ చేసే స్టాక్స్‌ సొంతం చేసుకొని రికార్డు సృష్టించారు. అత్యధిక వేతనం పొందుతున్న గూగుల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఘనత పొందారు. గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ సుందర్‌కు 199 మిలియన్‌ డాలర్ల విలువ చేసే 273,328 క్లాస్‌ సి గూగుల్‌ స్టాక్‌ యూనిట్లను ఇచ్చింది. వీటి విలువ రూపాయల్లో సుమారు 1,356 కోట్లు ఉంటుంది. దీంతో అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌లో పిచాయ్‌ చోటు దక్కించుకోనున్నారు. 

గుంటూరులో సీపీఎం నాయకులపై గొడ్డళ్లతో దాడి

గుంటూరు : సుందరయ్య నగర్ సీపీఎం నాయకులపై దాడి జరిగింది. సీపీఎం సుందరయ్య నగర శాఖ సహాయ కార్యదర్శిగా పని చేస్తున్నా ఆంజనేయులు, సతీష్ గొడ్డళ్లతో కోటేశ్వరరావు, బాజీ అనే వ్యక్తులు దాడి చేశారు. దాడిలో గాయపడిన ఆంజనేయులు, సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని రోజులుగా స్థానిక సమస్యలపై సీపీఎం నేతలు పోరాటం చేస్తున్నారు. దాడికి పాల్పడిన కోటేశ్వరరావు, బాజీలతో పాటు మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల విచారణ ప్రారంభించారు.

మంత్రి జగదీష్ రెడ్డికి అదనపు బాధ్యతలు

హైదరాబాద్ : మంత్రి జగదీష్ రెడ్డి సీఎం కేసీఆర్ అదనపు బాధ్యతలు కేటాయించారు. ఎస్సీ డెవలప్ మెంట్ శాఖను అదనంగా అప్పజెప్పారు.

మంత్రి కేటీఆర్ తో వాల్ మార్ట్ ఉపాధ్యక్షుడు హ్యాట్రిక్

హైదరాబాద్ :మంత్రి కేటీఆర్ తో వాల్ మార్ట్ ఉపాధ్యక్షుడు హ్యాట్రిక్ భేటీ అయ్యారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వంలో మూడు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పరస్పర అంగీకారం కుదిరింది. రిటైల్ రంగంలో మహిళలకు ఉపాధి కల్పన, సర్ఫ్ ఆధ్వర్యంలో కృషి, మార్ట్ నిర్వహణ శిక్ష, హార్టికల్చర్ మార్కెట్ ద్వారా కూరగాయలు, పండ్లు వాల్ మార్ట్ కు సరఫరా చేసే విధంగా ఒప్పందం కుదిరింది. ఈ నెలాఖరులో గా ప్రభుత్వంలో వాల్ మార్ట్ ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర మంత్రి జైట్లీ తో చంద్రబాబు భేటీ

హైదరాబాద్ : ఢిల్లీలో పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గుడుపుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి పలువరు కేంద్రమంత్రులతో బాబు భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో చంద్రబాబు సమావేశమయ్యారు. రెవెన్యూ లోటు కింద రూ.12,106 కోట్లు మంజూరు చేయాలి కోరారు. అలాగే ప్రత్యేకహోదా, విదేశీ ఆర్థికసాయాన్ని రూ.3 వేల కోట్లకు పెంచాలని వినతి చేశారు. వెనుకబడిన జిల్లాలకు ఏటా రూ.200 కోట్ల చొప్పున గ్రాంట్‌ ఇవ్వాలని సీఎం చంద్రబాబు విన్నవించారు. విశాఖలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజి ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌కు రూ.7,444 కోట్లు ఇవ్వాలని కోరారు.

బీసీ నేతలకు కాపు నేతల వినతిపత్రం...

విజయవాడ : నగరంలో జరుగుతున్న బీసీ సంఘాల సమావేశంలో కాపు నాయకుల రాకతో అలజడి చెలరేగింది. కాపులను బీసీల్లో చేర్చేందుకు అడ్డుపడొద్దంటూ పలువురు కాపు నాయకులు ఆర్.కృష్ణయ్యకు వినతిపత్రం అందజేశారు. అయితే తమ సమావేశానికి ఎందుకు వచ్చారంటూ కాపు సంఘం నాయకులపై బీసీ ప్రతినిధులు మండిపడ్డారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాపు నాయకులను బయటకు తీసుకెళ్లారు.

ఖమ్మం జిల్లాలో సైకో హల్ చల్

ఖమ్మం:జిల్లాలోని సారపాక-ఇరవెండు రోడ్డులో సైకో హల్‌చల్ చేశాడు. రోడ్డుపై వెళుతున్న వాహనాలపై రాళ్లు విసిరి అద్దాలు ధ్వంసం చేశాడు. అప్రమత్తమైన స్థానికులు సైకోను పట్టుకుని కట్టేసి పోలీసులకు అప్పగించారు.

15:57 - February 9, 2016

హైదరాబాద్ : ట్రైమెక్స్‌..! ఈ సంస్థ కార్యకలాపాలు.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారాయి. పాలక పెద్దల దన్నుతో ఖనిజాలను యధేచ్ఛగా దోచేస్తోందని ఈ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తు శాసనసభ ప్రజాపద్దుల కమిటీయే.. ట్రైమెక్స్‌ అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు చేసింది. నిగ్గు తేలేవరకూ తవ్వకాలు ఆపేయాలంటూ ఈ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తామెలాంటి తప్పూ చేయడం లేదంటూ.. ట్రైమెక్స్‌ సంస్థ తవ్వకాలను యధావిధిగా కొనసాగిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థతో 15 ఏళ్ల కిందట కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం పునరుద్ధరించుకోవడం కొసమెరుపు. ఇంతకీ ట్రైమెక్స్‌ లీలలేంటి..? టెన్‌ టీవీ స్పెషల్‌ ఫోకస్‌..

విస్తారమైన సముద్ర తీరంలో...

విస్తారమైన సముద్ర తీరం.. తీరపు ఇసుకలో లెక్కకు మిక్కిలిగా విలువైన ఖనిజాలు.. ఈ ఖనిజాలపై కన్నేసి.. ప్రభుత్వానికి నామమాత్రపు రుసుము చెల్లించి.. అక్రమ మార్గాల్లో కోట్లాది రూపాయలు గడిస్తోందన్నది ట్రైమెక్స్‌ సంస్థపై వచ్చిన ప్రధాన ఆరోపణ.

బీచ్‌ శాండ్‌లో ఇలిమినైట్‌, రూటైల్‌ గార్నైట్‌, సిలిమినైట్‌ ఖనిజాలు.....

శ్రీకాకుళం జిల్లాలోని విస్తారమైన సముద్ర తీరం.. వెలకట్టలేని ఖనిజాలను నిక్షిప్తం చేసుకుంది. ఇక్కడి బీచ్‌ శాండ్‌లో... ఇలిమినైట్‌, రూటైల్‌ గార్నైట్‌, సిలిమినైట్‌, జిర్కాన్‌, టైటానియం, మొనోజైట్‌ తదితర విలువైన ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. రాకెట్‌లకు ఇంధనంగా, ఎలెక్ట్రానిక్స్‌ వస్తువుల తయారీలో విరివిగా వినియోగించే టైటానియం సహా.. ఇతర ఖనిజాలను ఇసుక నుంచి వేరు చేసి.. విదేశాలకు ఎగుమతి చేస్తోంది ట్రైమెక్స్‌ సంస్థ. అంతర్జాతీయ మార్కెట్‌లో టైటానియంకు మంచి డిమాండ్‌ ఉండడంతో.. దీన్ని ఆ సంస్థ బాగా క్యాష్‌ చేసుకుంటోంది.

2004కు ముందే ప్రభుత్వంతో ట్రైమెక్స్‌ ఒప్పందం.....

శ్రీకాకుళం జిల్లాలోని శాండ్‌ బీచ్‌లోని ఖనిజాలను కొల్లగొట్టి కోట్లు గడించేందుకు.. ట్రైమెక్స్‌ సంస్థ.. 2004కు ముందే.. అప్పటి చంద్రబాబు సర్కారుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా గార మండలం వత్సవలస గ్రామంలో ట్రైమెక్స్‌ శాండ్స్‌ సంస్థ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అనుమతులు లేని ప్రాంతాల్లో తవ్వుతూ.. యధేచ్ఛగా అన్ని రకాల ఖనిజాలనూ ఎగుమతి చేస్తున్నట్లు ట్రైమెక్స్‌పై ఆరోపణలున్నాయి.

అడ్డూ అదుపూ లేకుండా ట్రైమెక్స్‌ కార్యకలాపాలు

ప్రశ్నించేవారే లేకపోవడం.. చట్టాన్ని పరిరక్షించాల్సిన వారే చుట్టాలై పోవడంతో.. ట్రైమెక్స్‌ సంస్థ ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇక్కడి ఇసుక నుంచి వేరు చేసిన ఖనిజాలను.. నిత్యం వందలాది లారీలలో పోర్టులకు తరలిస్తున్నారని... అక్కడినుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈస్ట్‌కోస్ట్‌ సంస్థకు లీజు కట్టబెట్టిన ప్రభుత్వం.....

ట్రైమెక్స్‌ సంస్థ ఆరంభం నుంచే అక్రమాల బాటనే సాగుతోందన్న విమర్శలున్నాయి. ఈస్ట్‌ కోస్ట్‌ మినరల్స్‌ అండ్‌ శాండ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు ప్రభుత్వం బీచ్‌శాండ్‌ మైనింగ్‌ లీజును కట్టబెట్టింది. అయితే.. అక్కడిప్పుడు ట్రైమెక్స్‌ సంస్థ పేరిట బీచ్‌ శాండ్‌ తవ్వకాలు సాగుతున్నాయి. ఒక సంస్థ పేరిట లీజు మంజూరు చేసినప్పుడు.. అదే సంస్థ పేరిట 60 రోజుల్లో మైనింగ్‌ కార్యకలాపాలు జరగాలి. లేకుంటే లీజును రద్దు చేయాలి. కానీ ట్రైమెక్స్‌ విషయంలో ఈ నిబంధనలన్నీ బేఖాతరయ్యాయని ప్రజాపద్దుల కమిటీ తేల్చింది.

730 హెక్టార్లలో మైనింగ్‌ అనుమతులు......

ఇక మైనింగ్‌లోనూ ట్రైమెక్స్‌ సంస్థ ఇష్టారాజ్యంగా ముందుకు వెళుతోందంటున్నారు. ఇసుక నుంచి ఖనిజాలను వేరు చేసేందుకు గాను.. ప్రభుత్వం ఈ సంస్థకు 730 హెక్టార్లలో మైనింగ్‌కు అనుమతులు మంజూరు చేసింది. అటవీశాఖకు చెందిన 387 ఎకరాల జోలికి రాకూడదని స్పష్టంగా అనుమతుల పత్రంలో పేర్కొంది. అయినా ట్రైమెక్స్‌ సంస్థ.. ఇష్టారాజ్యంగా అనుమతి లేని ప్రాంతాల్లోనూ ఇసుకను తవ్వుకుంటూ వెళ్లిందని ప్రజాపద్దుల కమిటీ గుర్తించింది.

ఎనిమిది మీటర్లకు పైగా లోతులో సాగుతున్న తవ్వకాలు.....

బీచ్‌శాండ్‌ను కేవలం నాలుగు మీటర్ల లోతు వరకే తవ్వేందుకు ప్రభుత్వం అనుమతించింది. కానీ.. ప్లాంట్‌ పరిధిలో ఎనిమిది మీటర్ల లోతు వరకూ తవ్వుకుంటూ.. విలువైన ఖనిజాలను లూటీ చేస్తోందన్నది ట్రైమెక్స్‌పై మరో ఆరోపణ. ఇక ఖనిజాలను వేరు చేసే విషయంలోనూ ట్రైమెక్స్‌ సంస్థ అన్ని నిబంధనలనూ ఉల్లంఘించిందని విమర్శలున్నాయి. ఇక్కడి మొనోజైట్‌ ఖనిజానికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. అక్కడ కిలో ఎనిమిది లక్షల వరకూ అమ్ముడుపోతోంది. దీంతో.. అనుమతి లేకున్నా.. ఇసుక నుంచి మొనోజైట్‌నూ వేరు చేసి ఎగుమతి చేస్తోందని ట్రైమెక్స్‌పై ఆరోపణలున్నాయి.

ఇతర ఖనిజాలతో మొనోజైట్‌ ఖనిజం మిక్స్‌.....

మొనోజైట్‌ను నేరుగా ఎగుమతి చేస్తే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో.. ఈసంస్థ అతితెలివిని ప్రదర్శిస్తోందని... మొనోజైట్‌ను.. అనుమతి ఉన్న ఖనిజాలతో మిక్స్‌ చేసి.. విదేశాలకు ఎగుమతి చేసి.. అక్కడ.. మొనోజైట్‌ను వేరు చేసి అమ్మేస్తోందని సమాచారం. ఈ సంస్థ ఉత్పత్తి చేసిన ఖనిజ నిష్పత్తికి.. నిల్వ ఉంచిన ఖనిజ నిష్పత్తికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది.. అంటే.. ప్రభుత్వానికి ఆమేర భారీ స్థాయిలో ఎగనామం పెడుతూ విలువైన ఖనిజాలను దేశాలు దాటిస్తోందన్న విమర్శ ఉంది.

తీరానికి ముప్పు వాటిల్లుతుందని స్థానికుల వేదన.....

శ్రీకాకుళం జిల్లాలోని శాండ్‌ బీచ్‌ మైనింగ్‌ను... స్థానికులు ముందునుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఇసుకను తవ్వి పోయడం వల్ల.. తీరానికి ముప్పుతో పాటు.. మట్టి సారమూ కోల్పోతుందని జిల్లా వాసులు ముందునుంచీ ఈ ప్లాంట్‌ను వ్యతిరేకించారు. అప్పట్లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా రసాభాసగా సాగింది. అయితే తెరవెనుక కార్యక్రమాల వల్ల.. ఉద్యమం షుప్తావస్థకు చేరిందని స్థానికులు చెప్పుకుంటారు. కొన్ని ప్రజాసంఘాలు అడపాదడపా ఆందోళనలు నిర్వహిస్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

ట్రైమెక్స్‌ సంస్థ అవినీతి సంపాదన మొత్తం రూ.63వేల కోట్లు.....

చట్టాలను బేఖాతరు చేసేంత ధైర్యం ట్రైమెక్స్‌ సంస్థకు ఎలా వచ్చింది..? ఇక్కడి అక్రమాలపై ఆందోళనలు చెలరేగకుండా... ఒకవేళ ఎవరైనా ఉద్యమించినా.. వాటిని ఈ సంస్థ ఎలా చల్లారుస్తోంది..? ఈ ప్రశ్నలు సామాన్యులను వేధిస్తున్నాయి. ప్రజాపద్దుల కమిటీ అంచనాల ప్రకారం.. ట్రైమెక్స్‌ సంస్థ అవినీతి సంపాదన మొత్తం 63వేల కోట్లు. అంత భారీగా వచ్చిన లాభాల నుంచి అతి స్వల్ప మొత్తాన్ని... స్థానిక అభివృద్ధి కార్యకలాపాలకు ఖర్చు చేస్తూ.. స్థానికులను మభ్య పెడుతూ వ్యతిరేకత రాకుండా చూసుకుంటోందీ సంస్థ. గనుల శాఖతో పాటు.. ఇతర అధికారుల చేతులనూ భారీగా తడపడంతో వారంతా ట్రైమెక్స్‌ అక్రమాలకు సంపూర్ణంగా సహకరిస్తున్నట్లు విమర్శలున్నాయి. అడపా దడపా పర్యావరణవేత్తలు, వామపక్ష నేతల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నా.. ప్రభుత్వ అండతో.. అన్నింటినీ కంట్రోల్ చేసేస్తోందీ సంస్థ.

సర్వే నంబర్‌ 216, 217 భూముల వివాదంపైనా ఫిర్యాదు....

దాదాపు పన్నెండు సంవత్సరాలుగా బీచ్ శాండ్ మైనింగ్ జరుపుతున్న ట్రైమేక్స్ తీరును స్థానికులు ఆక్షేపిస్తున్నారు. ఈ సంస్థ అక్రమ మైనింగ్‌పై గ్రీవెన్స్‌ సెల్‌కూ ఫిర్యాదు చేశారు. అదే విధంగా సర్వే నంబర్ 216, 217భూమి లో నెలకొన్న వివాదం, అటవీశాఖ భూమిలో మైనింగ్, ఇసుకను త్రవ్వి.. రీ ఫిల్లింగ్ చెయ్యకపోవడం లాంటి విషయాలపై ఫిర్యాదు చేశారు.

ట్రైమెక్స్‌ వ్యవహారాన్ని బయటపెట్టిన అసెంబ్లీ పీఏసీ....

ట్రైమెక్స్‌ వ్యవహారాన్ని అసెంబ్లీ పీఏసీ బయటపెట్టి.. తవ్వకాలను ఆపేయాలని ఆదేశించినా... ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా... ట్రైమెక్స్‌ యాజమాన్యం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. పైగా తాము అనుమతుల మేరకే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఆటమిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు ఆదేశాల వల్లే మొనోజైట్‌ను నిల్వ ఉంచామని బుకాయించింది. సామాజిక బాధ్యతతో.. దాదాపు 20కోట్ల రూపాయలను ఈ ప్రాంత అభివృద్ధికి వెచ్చించామనీ తెలిపిందీ సంస్థ. అయితే.. వన్యప్రాణి సంరక్షణ చట్టం.. సి.ఆర్.జెడ్ చట్టం, తీరంలోని సహజమైన ఆవాసాలు దెబ్బతినడం, షెడ్యూల్ మూడులోని అత్యంత అరుదైన నక్షత్ర తాబేళ్ల మనుగడను దెబ్బతీసే ఉల్లంఘనలు తదితర ఆరోపణలపై మౌనాన్నే ఆశ్రయిస్తోంది.

ఆరోపణలను పట్టించుకోని ప్రభుత్వం....

ట్రైమెక్స్‌ సంస్థపై ఆరోపణలు శరపరంపరగా వస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా.. ఇదే సంస్థతో తాజాగా ఇంకో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భావనపాడు ప్రాంతంలో మరో మైనింగ్ ప్రాజక్టు ఏర్పాటుకు 15 ఏళ్ల క్రితం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది.

ప్రభుత్వానికి ట్రైమెక్స్‌ చెల్లించిన రుసుము రూ.39 కోట్లు....

బీచ్‌శాండ్‌ మైనింగ్‌ ద్వారా విలువైన ఖనిజాలను పుష్కర కాలంగా యధేచ్ఛగా త్రవ్వుకుంటూ న్న ట్రైమెక్స్ సంస్థ ఇప్పటివరకూ ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించింది కేవలం 39 కోట్ల రూపాయలే. మైనింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా తవ్వకాలు చేపట్టినా.. ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు సమకూరే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రైమెక్స్‌ అక్రమ తవ్వకాలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి.. తీరం దెబ్బతినకుండా చూడాలని కోరుతున్నారు. 

15:46 - February 9, 2016

నెల్లూరు : కావలిలో ఆత్మహత్యకు పాల్పడ్డ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ మాధవి మృతితో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. మాధవి జిబియస్‌ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. నెల్లూరులోని కళ్యాణి జ్యూయలర్స్‌లో పనిచేస్తున్న భానుతేజతో కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. తనను వివాహమాడాలని మాధవి భానుతేజను కోరగా అతను తిరస్కరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మృతికి కారకుడైన భానుతేజను కఠినంగా శిక్షించాలని మాధవి తల్లి అభ్యర్థిస్తున్నారు. 

15:44 - February 9, 2016

నారాయణ ఖేడ్: పార్టీలకతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన ఘనత టీఆర్‌ఎస్‌దని... వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌, టీడీపీలకు లేదని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. నారాయణఖేడ్‌లో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఏర్పాటు చేసిన మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌, టీడీపీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్‌ స్థానం కాంగ్రెస్‌దని కాంగ్రెస్‌కే అవకాశం ఇవ్వాలనడం సరికాదని హరీష్‌రావు అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తూ చనిపోయిన స్థానంలో కుటుంబ సభ్యులు పోటీ చేస్తే వారిపై కాంగ్రెస్‌, టీడీపీలు సైతం పోటీ చేశాయని ఆయన గుర్తుచేశారు. . టీడీపీ ఆరిపోయే దీపమని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్

హైదరాబాద్ : అండర్ -19 ప్రపంచ కప్ ఫైనల్ కు భారత్ చేరుకుంది. సెమీ ఫైనల్లో శ్రీలంక పై భారత్ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ -267జ9, శ్రీలంక 170 ఆలౌట్.

15:17 - February 9, 2016

హైదరాబాద్ : మాధాపూర్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అదృశ్యమైన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అనుశ్రీ సోమవారం ఆఫీసుకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై అనుశ్రీ అదృశ్యంపై బంధువులు, తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. 

సజీవంగా బయటపడ్డ సైనికుడికి ప్రధాని పరామర్శ

ఢిల్లీ : సియాచిన్ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ఆర్మీజవాను లాన్స్ నాయక్ హనుమంతప్పను ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజలంతా ప్రార్థనలు చేయాలని ట్విట్టర్ లో మోదీ కోరారు. ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ కూడా ఆ సైనికుడిని పరామర్శించారు. కాగా అతని ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

సాప్ట్ వేర్ ఉద్యోగిని అదృశ్యం...

హైదరాబాద్ : సాప్ట్‌వేర్ ఉద్యోగిని అదృశ్యమైన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అనుశ్రీ అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు

15:01 - February 9, 2016

హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభుతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రైల్వే ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. విశాఖ రైల్వేజోన్‌పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని బాబు కోరారు. 

15:00 - February 9, 2016

హైదరాబాద్ : సామాజిక సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్న స్వచ్చంధ సేవా సంస్థ బాలవికాస్‌ రజతోత్సవాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల వికాస్‌ ద్వారా గ్రామాల్లో విద్య, వైద్య సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. మంచినీటి పరఫరా పథకాలు చేపట్టారు. వితంతువులకు ఆర్ధిక సహకారం అందిస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను అముల చేస్తున్న బాల వికాస్‌ సంస్థ నిర్వాహకులను కేసీఆర్‌ అభినందించారు. బాల వికాస్‌ మంచినీటి పరఫరా పథకాలకు ఉచింతంగా కరెంట్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. 

14:57 - February 9, 2016

హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి పదేళ్లు గడుస్తున్నా అనుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపంతో కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేందుకు పనులు దొరక్క... చేసిన పనులకు కూలీ రాక అనేక అవస్థలు పడుతున్నారు. ఈ పథకం కింద కోట్ల రూపాయలు నిధులు మూలుగుతున్నప్పటికీ.. పనులు లేక కూలీలు ఇతర ప్రాంతాలకు వలసపోయే దుస్థితి ఏర్పడింది.

ప్రతి ఏటా 10-12 లక్షల మంది కూలీలు వలస.....

ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి హామీ పథకం మహబూబ్‌నగర్‌ జిల్లాలో నీరు గారిపోతుంది. కూలీలకు 150 రోజులు పని కల్పించాల్సిన అధికారులు.. ఆ వైపు దృష్టి సారించడం లేదు. దీంతో జిల్లాలోని 43 లక్షల జనాభాలో సుమారు 10 నుంచి 12 లక్షల మంది కూలీలు ప్రతి ఏటా ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.

9 లక్షలకు పైగా కూలీలకు జాబ్‌ కార్డులు .....

జిల్లాలో 9 లక్షలకు పైగా కూలీలకు ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డులున్నాయి. అయితే ఇందులో కేవలం లక్షా 30 వేల లోపు మంది కూలీలకు మాత్రమే ఉపాధి హామీ పథకం కింద పనులు లభిస్తున్నాయి. మిగతావారికి ఇప్పటివరకు ఎలాంటి పనులు లభించలేదు. జిల్లాలో 100 రోజులు పనులు పూర్తి చేసుకున్నవారు కేవలం 22 వేల మందే ఉన్నారు. మరోవైపు ఉపాధి హామీ పథకం నిధులన్నీ అలాగే మూలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కేవలం 194 కోట్లు మాత్రమే అధికారులు ఖర్చు చేశారు. మిగిలిన రెండు నెలల్లో 274 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉందంటే కూలీలకు పనులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి బయటపడుతోంది.

అపహాస్యమవుతున్న పథకం .....

కూలీలకు పనులు చూపకపోవడం,.. చేసిన పనులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం, కూలీ గిట్టుబాటు కాకపోవడం లాంటి సమస్యలతో ఈ పథకం అపహాస్యమవుతోందని పలువురు భావిస్తున్నారు. మరోవైపు రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో అధికారులు కూలీలకు పనులు చూపించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. పనులు లేక అవస్థలు పడుతున్న పల్లె ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన అధికారులు.. వారిని ఏ విధంగా ఆదుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పర్యవేక్షణ లోపం వల్ల...

ఇక ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం లాంటి పనులు ఉపాధి హామీ పనులకు అనుసంధానం చేసినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల అవి ముందుకు సాగడం లేదు. మరోవైపు జాబ్‌కార్డులున్న కూలీలు సైతం.. ఇచ్చే కూలీ గిట్టుబాటు కాకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఉపాధి హామీ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తే వలసలు తగ్గించే అవకాశం ఉంది. 

14:57 - February 9, 2016

ఛత్తీస్ గఢ్ :దొంగలను అరెస్ట్‌ చేయడం తెలుసు.. అనుమానితులను అరెస్ట్‌ చేయడం తెలుసు కానీ అక్కడ మాత్రం పోలీసులు ఓ మేకను అరెస్ట్‌ చేశారు. అంతేకాదు దాని యజమానిని సైతం కటకటాల వెనక్కి పంపారు. మేకను అరెస్టు చేయడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి. ఎన్నిసార్లు తరిమినా.. మేక మళ్లీ మళ్లీ తోటలోకి వస్తోంది. ఆ తోట ఓ న్యాయమూర్తిది. మేక సంగతి చూడమని జడ్జి గారు ఆదేశించగానే.. పోలీసులు మేకతో పాటు దాని యజమానిపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కొరియా జిల్లాలో జరిగింది. అబ్దుల్‌ హసన్‌కు చెందిన మేక.. జిల్లా న్యాయమూర్తి హేమంత్‌రాత్రేకు చెందిన తోటలోకి దూరి పూలు, పండ్ల మొక్కలను తినేస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా అబ్దుల్‌ హసన్‌ వినిపించుకోకపోవడంతో.. చివరకు జడ్జిగారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితులు దోషులుగా తేలితే న్యాయస్థానం రెండు నుంచి ఏడేళ్ల వరకు శిక్షించవచ్చు. మరి బుజ్జిమేక జైలుకు వెళ్తుందో లేదో చూడాలి.

14:53 - February 9, 2016

హైదరాబాద్ : భారతదేశంలో లింగనిర్ధారణ పరీక్షలు అంటే తల్లి గర్భంలో వున్నది ఆడపిల్లా,మగబిడ్డా అని తెలుసుకోవడం పూర్తిగా నిషేధం. కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెస్తోంది. సొంత అభిప్రాయం అని చెప్తున్నప్పటికీ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ లింగనిర్ధారణ పరీక్షలు చేయడం తప్పని సరి చేయాలి... ఇలా అయితేనే ఆడపిల్లలను మనం కాపాడుకోగలం అని తెలిపారు. ఇది ఎంత వరకు ఆచరణ సాధ్యం అవుతుంది? దీని వల్ల ఏమైనా ప్రమాదం పొంచి వుందా? ఈ అంశం పై 'వేదిక'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి జనవిజ్ఞానవేదిక నేత, కరుణ కాట్రగడ్డ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గనైజేషన్ సెక్రటరీ, జి.అనురాధ రాష్ట్రీయ ఉపాధ్యాయ పడిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షురాలు పాల్గొన్నారు. వారి మధ్య జరిగిన ఆశక్తికరమైన చర్చను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి

14:50 - February 9, 2016

విజయవాడ : నగరంలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ బేబుల్ సమావేశం జరుగుతుండగానే మురళీ అనే వ్యక్తి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ డిమాండ్ చేస్తూ ఆత్మహత్య కు యత్నించారు. అప్రమత్తమైన నేతలు ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు చేపట్టారు.

14:47 - February 9, 2016

తిరుమల : అలనాటి సినీనటి రాధ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తె కార్తీక, భర్తతో కలిసి తిరుమల వచ్చారు. రాధ కుమార్తె కార్తీక ప్రస్తుతం కథానాయకిగా ఉన్నారు. టిటిడి అధికారులు విఐపీ బ్రేక్‌ దర్శనం సమయంలో రాధ కుటుంబ సభ్యులు దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.తన భర్త ... బర్త్‌ డే సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినట్టు రాధ చెబుతున్నారు. 

సీఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు : వర్ల రామయ్య

విజయవాడ : సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. దళితుడైన బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ను చేశారని గుర్తు చేశారు. రాజకీయాలు-కులం వేరని చంద్రబాబు విశ్లేషించారని అయితే వైసీపీ గడ్డిపోచతో సముద్రాన్ని ఈదాలనుకుంటోందని మండిపడ్డారు. మధిరలో 48 వేల మాదిగ ఓట్లుంటే మందకృష్ణకు 25 వేల ఓట్లే వచ్చాయని వర్ల అన్నారు. 

ఆత్మహత్యకు యత్నించిన బీసీ సంక్షేమ కార్యకర్త

విజయవాడ : నగరంలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ బేబుల్ సమావేశం జరుగుతుండగానే మురళీ అనే వ్యక్తి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కాపులను బీసీల్లో చేర్చవద్దంటూ డిమాండ్ చేస్తూ ఆత్మహత్య కు యత్నించారు. 

14:27 - February 9, 2016

అందాల నటి 'సమంత' జిమ్ లో ఎక్సర్ సైజ్ చేస్తోందంట. బరువులు ఎత్తుతూ చెమటను చిందిస్తోందట. అంతేకాదండోయ్..ఏకంగా వంద కిలోల బరువు కూడా ఎత్తింది. ఈ విషయాన్ని 'సమంత' ట్రైనర్ తన మొబైల్ లో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. వెయిట్ లిఫ్టింగ్ తరువాత సమంత తన కండలు ఎలా ఉన్నాయో చెప్పండి అంటూ ఫొటో కూడా దిగింది.
అసలు 'సమంత' ఎందుకు ఎక్సర్ సైజ్ లు చేస్తోంది అనేది మాత్రం తెలియరావడం లేదు. ప్రస్తుతం సమంత మాత్రం ప్రిన్స్ మహేష్ తో 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటిస్తోంది. మరి ఈ చిత్రం కోసం సమంత కండలు పెంచుతోందా ? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

14:03 - February 9, 2016

'సినిమా బాగుందంటేనే చూడండి... లేకపోతే చూడకండి'..అని హీరో నాని అన్నారు. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' హీరో హీరోయిన్లు ఆ సినిమా ముచ్చట్లను తెలిపారు. వారి అనుభవాలను వివరించారు. పైరసీని ప్రోత్సహించవద్దని కోరారు. ఆ వివరాలను చూద్దాం...

 

13:55 - February 9, 2016

హైదరాబాద్ : ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్... బెదిరించి లొంగతీసుకుంటున్నారని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో విపక్షం లేకుండా చేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. గులాబీ నేతల తీరును.. ప్రజలు తీవ్రంగా గమనిస్తున్నారన్నాని రేవంత్ హెచ్చరించారు. విపక్షం లేకుండా చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. టీసర్కార్ పై ఎల్.రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

13:52 - February 9, 2016

హైదరాబాద్ : నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరినట్టు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్‌ చెప్పారు. ఈమేరకు టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కేసీఆర్ అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితుడినయ్యానని వివేకా తెలిపారు. బాబు ఏపీకి సీఎం అయ్యాక... తెలంగాణలో పార్టీ గురించి కార్యకర్తల్లో ఆందోళన మొదలైదన్నారు. 

 

13:49 - February 9, 2016

హైదరాబాద్ : కులాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దళితులను చిన్న చూపు చూసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం తగదన్నారు. చంద్రబాబు వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు.

13:46 - February 9, 2016

హైదరాబాద్ :  డాక్టర్ల కాల్పుల కేసులో ప్రత్యక్ష సాక్షి డాక్టర్ సాయికుమార్ ప్రస్తుతం నారాయణగూడ పోలీసుల అదుపులో ఉన్నారు. డాక్టర్ ఉదయ్‌ మీద ఎవరు కాల్పులు జరిపారన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాల్పులు తాను జరపలేదని, సాయికుమారే కాల్చాడని తన సూసైడ్ నోట్‌లో శశికుమార్ పేర్కొన్నారు. కానీ శశికుమారే తమ ఇద్దరిపై కాల్పులు జరిపాడని సాయికుమార్ అంటున్నారు. శశికుమార్‌ను తన ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లిన చంద్రకళను విచారించాలనే యోచనలో పోలీసులు కనిపిస్తున్నారు. కానీ కాల్పుల ఘటనతో తనకు సంబంధం లేదని ఆమె చెబుతున్నారు.ఇక శశికుమార్ ఫామ్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అక్కడకు ఒక రంపం, కొడవలి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోడానికి రకరకాల మార్గాలు చూసుకుని, చివరకు తన రివాల్వర్‌తో కాల్చుకున్నారా.. లేక మరేదైనా అవసరం కోసం వాటిని తీసుకెళ్లారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  మరోవైపు నిన్న కాల్పుల్లో గాయపడ్డ ఉదయ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. 

13:43 - February 9, 2016

హైదరాబాద్ : డాక్టర్ల కాల్పుల వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. తన భర్తది ఆత్మహత్య కాదు హత్యేనని  శశికుమార్‌ భార్య క్రాంతి మీడియాకు తెలిపారు. నిన్న మధ్యాహ్నం  తన భర్తకు ఫోన్‌ చేసి రమ్మన్నారని, కిరాయి హంతకులతో శశికుమార్‌ను చంపించారని అంటున్నారు.

 

13:39 - February 9, 2016

హైదరాబాద్: కుత్బుల్లాపూర్‌ టీడీపీ ఎమ్మెల్యే వివేక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాలను తమ నియోజకవర్గంలో అమలు చేసేందుకు గాను తాను టీఆర్‌ఎస్‌లో చేరినట్టు ఎమ్మెల్యే వివేక్‌ చెప్పారు. తమ వెంబడే ఉంటానని కేసీఆర్ చెప్పారన్నారు. తానను కుటుంబ సభ్యునిగా గుర్తు చేసుకున్నారు.

 

 

శేషాచలం అడవుల్లో తప్పిపోయిన సౌందర్య, నవీన్‌ల ఆచూకి లభ్యం

చిత్తూరు : రెండ్రోజుల క్రితం శేషాచలం అడవుల్లో తప్పిపోయిన సౌందర్య, నవీన్‌ల ఆచూకి లభ్యమైంది. ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న నవీన్‌, సౌందర్య ఈ నెల ఆరో తేదీన అదృశ్యమయ్యారు.ద అయితే నిన్న తండ్రికి ఫోన్‌ చేసిన సౌందర్య తాము అడువల్లో తప్పిపోయామని సమాచారం అందించింది. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గాలించిన అధికారులు వీరిని పెండ్లిమర్రి మండలం పీకిబండ్ల అటవీ ప్రాంతంలో గుర్తించారు. విద్యార్థులను ట్రిపుల్ ఐటీకి తీసుకొస్తున్నారు.

 

13:30 - February 9, 2016

చిత్తూరు : రెండ్రోజుల క్రితం శేషాచలం అడవుల్లో తప్పిపోయిన సౌందర్య, నవీన్‌ల ఆచూకి లభ్యమైంది. ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న నవీన్‌, సౌందర్య ఈ నెల ఆరో తేదీన అదృశ్యమయ్యారు.ద అయితే నిన్న తండ్రికి ఫోన్‌ చేసిన సౌందర్య తాము అడువల్లో తప్పిపోయామని సమాచారం అందించింది. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గాలించిన అధికారులు వీరిని పెండ్లిమర్రి మండలం పీకిబండ్ల అటవీ ప్రాంతంలో గుర్తించారు. విద్యార్థులను ట్రిపుల్ ఐటీకి తీసుకొస్తున్నారు.

13:23 - February 9, 2016

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' నటించిన చిత్రం 'సుల్తాన్' ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోంది. ఈ చిత్రంలోని మరో కొత్త పోస్టర్ ను 'సల్మాన్' తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశాడు. హర్యాణ రెజ్లర్ సుల్తాన్ ఆలీ ఖాన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలి అబ్బాస్ జఫర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో సల్మాన్ కు జంటగా అనుష్క శర్మ నటిస్తోంది.
ఇక ఈ చిత్రంలో పాత్ర కోసం 'సల్మాన్' ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడంట. కుస్తీ, యుద్ధ కళలను అత్యంత శ్రద్ధగా నేర్చుకుంటున్నాడు. అంతర్జాతీయ శిక్షకుడు లార్నెల్ స్టొవాల్ దగ్గర కుస్తీ, యుద్ధ విద్యలను కఠోరంగా సాధన చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యాశ్ రాజ్ ఫిల్మ్స్ పేరు మీదే రానుంది. 2012లో ఇదే బ్యానర్ పై వచ్చిన ఏక్ థా టైగర్ చిత్రం బాలీవుడ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి ఇదే బ్యానర్ పై 'సుల్తాన్' గా సల్మాన్ దర్శనమివ్వనున్న నేపథ్యంలో రికార్డులు తిరగ రాస్తుందేమో వేచి చూడాల్సిందే.

ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక

మీర్పుర్ : అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ లో భాగంగా మీర్పుర్‌లో జరుగుతున్న భారత్, శ్రీలంక సెమీఫైనల్లో మ్యాచ్‌లో భారత్‌ నిర్ణిత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక జట్టు 268 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగింది. భరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుత జట్టు స్కోరు 6 ఓవర్లకు 25 పరుగులు విజయానికి ఇంకా 243 పరుగులు చేయల్సి ఉంది. ఈమ్యాచ్‌లోశ్రీలంక టాస్‌ గెలిచి  ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది.

13:20 - February 9, 2016

కర్నూలు : నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఆనంద్‌ థియేటర్‌ వద్ద మురికి కాలువలో నాలుగు ఆడశిశువుల మృతదేహాలు బయటపడ్డాయి. మున్సిపల్‌ కార్మికులు కాలువలను శుభ్రం చేస్తుండగా నీటి ప్రవాహంలో కొట్టుకొస్తున్న శిశువుల మృతదేహాలను గుర్తించారు. నగరంలోని స్కానింగ్‌ సెంటర్లు, నర్సింగ్‌ హోమ్స్‌కు వచ్చే గర్భిణీ  స్ర్తీలు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొని ఆడపిల్లలని తేలడంతో అబార్షన్‌లు చేయించుకుంటున్నారని, నెలలు నిండని ఆడ శిశువుల మృతదేహాలు ఈకోవకు చెందినవేనని స్థానికులు అంటున్నారు.

 

13:18 - February 9, 2016

విశాఖ : జిల్లాలోని గాజువాక శ్రీహరిపురంలో దారుణం చోటుచేసుకుంది. తండ్రిపై కూతురు, అల్లుడు దాడి చేశాడు. బండరాయితో మోది హత్య చేశారు. తండ్రి రెండో భార్యపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రస్తుతం ఆమెను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్తి తగాదాల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.

 

13:04 - February 9, 2016

కరీంనగర్‌ : ఇంటర్‌ విద్యార్ధుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది. కరీనంగర్‌ రూరల్‌ మండలంలోని సీతారాంపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజేందర్‌ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదువుతున్నాడు. సీనియర్లతో గొడవ పడ్డాడు. దీంతో బషీర్‌ అనే సీనియర్‌ విద్యార్ధి గత రాత్రి రాజేందర్‌ ఇంటికి వచ్చి కత్తితో పొడిచి పారిపోయాడు. రక్తం మడుగులో పడివున్న రాజేందర్‌ను కుటుంబ సభ్యుల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

13:00 - February 9, 2016

హైదరాబాద్ : ప్రయివేట్, కార్పొరేట్ కంపెనీలకు వందలు, వేల ఎకరాల భూములను కట్టబెడుతున్న ప్రభుత్వం... నిరు పేదలు, నిలవ నీడలేని నిరు పేదలు జానెడు జాగలో.. అది కూడ ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుంటే చూసి ఓర్వ లేకపోయింది. నిర్దాక్షిణ్యంగా తొలగించింది. ఎన్నో ఏళ్లుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలను ఒక్కసారిగా ఖాళీ చేయించడంతో వారు రోడ్డున పడ్డారు. వారి బతుకులు ఛిద్రం అయ్యాయి. జూబ్లీహిల్స్ లో అధికారులు ఉదయం నుంచి ఆక్రమణల తొలగింపు చేపట్టారు. అంబేద్కర్ వర్సిటీ దగ్గర ప్రభుత్వస్థలంలో ఉన్న గుడిసెలను తొలగించారు. అయితే స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల సాయంతో.. అధికారులు గుడిసెలను కూల్చివేశారు.

 

12:52 - February 9, 2016

ఢిల్లీ : సియాచిన్‌ గ్లేషియర్‌లో హిమపాతం బారినపడిన పదిమంది సైనికుల్లో ఒకరు సజీవంగా మిగిలారు. ముందుగా సైనికులందరూ మరణించినట్టు రక్షణశాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే ఆరురోజుల తర్వాత లాన్స్ నాయక్‌ హనుమంతప్ప ప్రాణాలతో బయటపడ్డాడు. ఇతనిది కర్నాటక. హిమపాతం బారినపడిన సైనికుల కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందం మంచును తొలగిస్తుండగా హనుమంతప్ప బయటపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాతిక అడుగుల మేర పేరుకుపోయిన మంచులో చిక్కుకున్న హనుమంతప్ప సంకల్పబలంతో ప్రాణాలు నిలదొక్కుకున్నాడు. హిమపాతానికి గురైన తొమ్మిదిమందిలో ఇప్పటి వరకు ఐదుగురి దేహాలు లభ్యమయ్యాయి. 

12:50 - February 9, 2016

ప్రకాశం : జిల్లాలో అద్దంకి పట్టణ పరిధిలోని పాత బస్టాండ్ సెంటర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్‌ లీకై హోటల్‌ దగ్ధమైంది. మంటలు భారీగా వ్యాపించడంతో.... పక్కనే ఉన్న కూరగాయల షాపు కూడా దగ్ధమైంది. 

12:46 - February 9, 2016

కాపుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి కొత్త ప్రకటన రాలేదని... అలాంటప్పుడు ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడంలో ఆంతర్యమేమిటని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కాపుల డిమాండ్లపై సీఎం చంద్రబాబు కొత్త ప్రకటన ఏమీ చేయలేదన్నారు. ప్రభుత్వం కొత్త హామీలు ఇవ్వకుండానే ముద్రగడ దీక్ష విరమిచారని తెలిపారు. కాపుల రిజర్వేషన్లపై అన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. రిజర్వేషన్లు రాజ్యాంగపరమైన చర్యని.. కమిషన్ వేసినంత మాత్రం రిజర్వేషన్లు ఇచ్చినట్లు కాదన్నారు. కమిషన్ రిపోర్టు లేకుండా రిజర్వేషన్లు అమలు చేయడం జరగదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఢిల్లీలో అగ్నిప్రమాదం....నలుగురు సజీవ దహనం

ఢిల్లీ : దిల్షాద్‌ కాలనీలో ఓ డ్రైక్లీనింగ్‌ దుకాణంలో మంగళవారం ఉదయం మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో  నలుగురు సజీవదహనం అయ్యరు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశాయి. విద్యుదాఘాతం కారణంగానే అగ్నిప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.

12:26 - February 9, 2016

కాపుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేశ్ కుమార్, వైసిపి నేత మదన్ మోహన్ రెడ్డి, టిడిపి అధికార ప్రతినిధి రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. కాపు రిజర్వేషన్లపై కమిషన్ ఏడు నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వలేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:06 - February 9, 2016

ఢిల్లీ : టీ-20 ఆసియాకప్, ప్రపంచకప్ టోర్నీలకు మాజీ చాంపియన్ టీమిండియా సన్నాహాలను జోరుగా ప్రారంభించింది. ఆస్ట్రేలియాతో ముగిసిన టీ-20 సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయం సాధించిన ధోనీసేన..శ్రీలంకతో జరిగే తీన్మార్ సిరీస్ కు సైతం సిద్ధమయ్యింది.పూణేలోని మహారష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా మంగళవారం జరిగే తొలిసమరంలో శ్రీలంకతో తలపడబోతోంది.. ఈ సిరీస్ వన్ సైడెడ్ షోగా ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
టీమిండియా తుది సన్నాహాలు..
బంగ్లాదేశ్ వేదికగా జరిగే ప్రారంభ టీ-20 ఆసియాకప్ తో పాటు...భారత్ ఆతిథ్యంలో జరిగే 2016 టీ-20 ప్రపంచకప్ కు మాజీ చాంపియన్, హాట్ ఫేవరెట్ టీమిండియా తుదిసన్నాహాలను ప్రారంభించింది. ఆస్ట్రేలియాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన ఆత్మవిశ్వాసంతో..టీమిండియా ఇప్పుడు 3వ ర్యాంకర్ శ్రీలంకతో జరిగే సిరీస్ కు గురిపెట్టింది.
పూణేలో తొలి మ్యాచ్  
సిరీస్ లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా మంగళవారం జరిగే తొలి సమరానికి మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ చండీమల్ కెప్టెన్సీలోని శ్రీలంక ఢీ అంటే ఢీ అంటున్నాయి. సీనియర్ స్టార్లు తిలకరత్నే దిల్షాన్, లాసిత్ మలింగ్ లాంటి ఆటగాళ్లు అందుబాటులో లేకపోడంతో..శ్రీలంక యువఆటగాళ్లతో పాటు..వెటరన్ స్టార్లు దిల్హర పెర్నాండో, తిస్సార పెరీరా లాంటి ఆటగాళ్లపై ఆధారపడాల్సి వస్తోంది.
శ్రీలంక జట్టు కెప్టెన్ గా మలింగ 
కాలి గాయం నుంచి కోలుకొంటున్న ఫాస్ట్ బౌలర్ కమ్ యార్కర్ల కింగ్ లాసిత్ మలింగను..ఆసియాకప్, ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొనే శ్రీలంక జట్టుకు కెప్టెన్ గా శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే...టీమిండియాతో జరిగే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో మాత్రం...వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ చండీమల్ కు..జట్టు పగ్గాలు అప్పజెప్పారు. శ్రీలంకజట్టులో గుణరత్నే, గుణతిలక, చమరా కాపుగదేరా, తిస్సార పెరీరా, సీకుగే ప్రసన్న, కసున్ రజిత, సుచిత్ర సేనానాయకే, దాసున్ శనాకా, మిలింద సిరివర్ధనే, జెఫ్రీ వాండర్సే లాంటి ఆటగాళ్లున్నారు.
కొహ్లీకి విశ్రాంతి 
మరోవైపు..టీమిండియా రన్ మెషీన్ విరాట్ కొహ్లీకి మాత్రం.. ప్రస్తుత ఈ సిరీస్ లో మాత్రమే విశ్రాంతి ఇచ్చారు. జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని భారతజట్టులో...శిఖర్ ధావన్, అశ్విన్, బుమ్రా,రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, పవన్ నేగీ, అశీశ్ నెహ్రా, మనీశ్ పాండే, హార్ధిక్ పాండ్యా, అజింక్యా రహానే, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఇటీవలి ఆస్ట్రేలియా సిరీస్ లో విశ్వరూపం ప్రదర్శించిన టీమిండియా..కళ్ళు చెదిరే ఫామ్ లో ఉండడంతో...శ్రీలంక ఏమాత్రం పోటీ ఇవ్వగలదన్నది అనుమానమే. శిఖర్ ధావన్,రోహిత్ శర్మ, అజింక్యా రహానే, సురేశ్ రైనా,యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలతో కూడిన పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ తో టీమిండియా టాపార్డర్ అత్యంత పటిష్టంగా, సమతూకంతో కనిపిస్తోంది. 
హైస్కోరింగ్ మ్యాచ్ నమోదయ్యే అవకాశం
టీమిండియాను అధిగమించాలంటే...శ్రీలంక అంచనాలకు మించి రాణించక తప్పదు. మ్యాచ్ కు వేదికగా ఉన్న మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం పిచ్ బ్యాటింగ్ తో పాటు..స్పిన్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో..హైస్కోరింగ్ మ్యాచ్ నమోదయ్యే అవకాశం లేకపోలేదు. టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నెంబర్ వన్ టీమిండియాకు...అంతంత మాత్రం బలంతో ఉన్న 3వ ర్యాంకర్ శ్రీలంక ఎంత వరకూ సమఉజ్జీకాగలదన్నది అనుమానమే. ఈ సిరీస్ వన్ సైడెడ్ షోగా ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

 

12:06 - February 9, 2016

యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' 2013 లో 'మిర్చి' చిత్రంలో కనబడ్డాడు. అనంతరం 2015లో 'బాహుబలి' చిత్రంతో ముందుకొచ్చాడు. అనంతరం మళ్లీ కనబడలేదు. 'బాహుబలి -2' చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాలుగా ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. 'బాహుబలి' చిత్రం కోసం 'ప్రభాస్' శివుడి పాత్ర కోసం ఏకంగా 130 కిలోల బరువు పెరిగాడన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా 'బాహుబలి -2' లోని అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం 150 కేజీల బరువు పెరిగాడంట. ఈ పాత్ర మహిష్మతి రాజ్యాధినేత కాబట్టి రాజసం..ఠీవి ఉట్టిపడేలా ఉండాలంటే బరువు అధికం కావాలంట. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

11:51 - February 9, 2016

ఎపిలోని కౌలు రైతులు సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం నేత జమలయ్య డిమాండ్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతులు పోరుబాట పట్టారు. మార్చి 21న చలో  అసెం బ్లీకి పిలుపునిచ్చారు. కౌలు రైతుల చలో అసెంబ్లీ పిలుపునకు కారణం ఏమిటి? కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే మిటి? మన వ్యవసాయంలో కౌలు రైతులకున్న ప్రాధాన్యత ఏమిటి? కౌలు రైతులకు ఉద్దేశించిన చట్టాలెలా వున్నాయి?  కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి'? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

11:46 - February 9, 2016

మన దేశంలో వ్యవసాయాన్ని బతికిస్తున్నది కౌలు రైతులే. అంతేకాదు ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో అత్యధికులు కౌలు రైతులే. 70శాతం భూమిని కౌలు రైతులే సాగుచేస్తున్నా, వారి సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కౌలు రైతుల సంక్షేమాన్ని కాంక్షించి చేసిన చట్టాలు అమలు చేయడం లేదు. దీంతో వీరి పరిస్థితి దుర్భరంగా మారుతోంది. 
కౌలు రైతులందరికీ దక్కని బ్యాంక్‌ రుణాలు
వ్యవసాయం ఇప్పుడొక జూదం. అది అందరికీ లాభం పంచుతుందున్న గ్యారంటీ లేదు. వ్యవసాయం చేసేవాడు ప్రతి రోజూ టెన్షన్‌ అనుభవించాల్సిందే. ఒక రోజు వర్షాల కోసం, ఇంకోరోజు విత్తనాల కోసం, మరోరోజు ఎరువుల కోసం, ఇంకో రోజు బ్యాంక్‌ లోన్‌ల కోసం ఇలా ప్రతి సందర్భంలోనూ టెన్షన్‌ అనుభవించక తప్పనిస్థితి రైతులది. ఈ టెన్షన్స్‌ భరించలేక, ఈ నష్టాలు తట్టుకోలేక, చాకిరీ చేయలేక, చాలామంది భూ యజమానులు వ్యవసాయం మానేస్తున్నారు.   తమకు చక్కటి సారవంతమైన భూములున్నా వ్యవసాయం చేయలేక, అది గిట్టుబాటుకాక చాలామంది వాటిని కౌలుకిచ్చి పట్టణాలకు వెళ్తున్న దృశ్యం ప్రతిగ్రామంలోనూ కనిపిస్తుంది. 
కౌలు రైతుల్లో  సెంటు భూమిలేని నిరుపేదలు 
ఇలా భూములు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నవారిలో అత్యధికులు దళితులు, బలహీనవర్గాల వారే కావడం విశేషం. కొద్దిపాటి భూమివున్నవారే కాకుండా సెంటు భూమిలేని నిరుపేదలు సైతం కౌలు రైతుల్లో కనిపిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 20 లక్షల మంది దాకా కౌలు రైతులుంటారని అంచనా. సొంత భూమి వున్న రైతులకు మించిన కష్టాలు కౌలు రైతులవి.  ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో అత్యధికులు కౌలు రైతులే కావడం మరో విషాదం.
భూమి వున్నవారికే మర్యాద
గ్రామాల్లో భూమి వున్నవారికే ఎంతోకొంత మర్యాద లభిస్తుంది. వ్యవసాయం చేయడం ఒక సామాజిక హోదా.  అందుకే భూమిని కౌలుకు తీసుకునైనా వ్యవసాయం చేయాలని చాలామంది ఆరాటపడుతుంటారు. దాదాపు 70శాతం భూమిని కౌలు రైతులే సాగుచేస్తున్నారంటే ఆశ్చర్యపోకండి. ఇవాళ చాలా గ్రామాల్లో వ్యవసాయం ఇంకా బతికి వుందంటే కారణం ఇలాంటి కౌలు రైతులే.  వీరిలో చాలామంది ఏంబావుకుంటున్నారో తెలియదు  కానీ, వీరే లేకపోతే అనేక గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ మరెంతగా ధ్వంసమై వుండేదో ఊహించలేం. మన దేశంలో ప్రతి ఏటా  ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాల సాధనలో ఆరుగాలం శ్రమిస్తున్నది కౌలు రైతులే. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడుతున్న కౌలు రైతుల విషయంలో ప్రభుత్వాలు నిర్ధయగా వ్యవహరిస్తుండడమే బాధాకరం. 
దీనస్థితిలో కౌలు రైతు
కడుపు చించుకుంటే కాళ్లమీద పడింది అన్నట్టుగా వుంటుంది కౌలు రైతుల పరిస్థితి. కుటుంబ సభ్యులంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఈ ఏడాది సాగుచేసిన భూమి వచ్చే ఏడాది తమకే వుంటుందన్న గ్యారంటీ లేదు. కాలం నెత్తిమీదకొచ్చే దాకా కౌలు ఖాయం కాదు.  వీరి పేరుతో పాస్‌పుస్తకాలుండవు కాబట్టి, భూ యజమానులు హామీ పడరు కాబట్టి వీరికి బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు పుట్టవు. ప్రయివేట్ అప్పులే వీరికి దిక్కు. డిమాండ్‌ను బట్టి , అవసరాన్ని బట్టి మూడు నుంచి పది రూపాయల దాకా వడ్డీ కక్కాల్సిన దీనస్థితి కౌలు రైతులది. 
లోన్‌ ఎలిజిబిలిటీ కార్డులిస్తే ప్రయోజనం 
కౌలు రైతులకు లోన్‌ ఎలిజిబిలిటీ కార్డులిస్తే ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ మార్గదర్శకాల ప్రకారం లక్ష రూపాయల రుణం పొందేందుకు కౌలు రైతులు కూడా అర్హులవుతారు. కానీ మన ప్రభుత్వాలు పదిశాతం మందికి కూడా రుణ అర్హత పత్రాలివ్వడం లేదు. రెవెన్యూ అధికారులే స్వయంగా గ్రామాలకు వెళ్లి, కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు ఇవ్వాలని 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం స్పష్టం చేస్తోంది. కానీ, అది ఎక్కడా అమలు కావడం లేదు. దీంతో కౌలు రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఆర్థిక, సామాజిక, రాజకీయ దన్ను లేకపోవడం కౌలు రైతులకు పెద్ద శాపంగా మారుతోంది. కౌలు రైతులు సంఘటితమై పోరాడిన ప్రాంతాల్లో మాత్రమే రుణ అర్హత పత్రాలు లభిస్తున్నాయి.  కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలిస్తే బ్యాంక్‌ అప్పులతో పాటు, విత్తనాలు, ఎరువుల సబ్సిడీలతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో నష్టపరిహారం పొందే అవకాశం కూడా లభిస్తుంది. 
భూమి వున్నవారివే రాజకీయాలు
గ్రామాల్లో భూమి వున్నవారే రాజకీయాలను శాసిస్తారు. వారి చుట్టూనే అధికారం తిరుగుతుంది. దీంతో బ్యాంక్‌లిచ్చే వ్యవసాయ రుణాల్లో అత్యధిక భాగం వ్యవసాయం చేయనివారే స్వాహా చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. నిజంగా వ్యవసాయం చేస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థనూ బతికిస్తూ, దేశ ప్రజలందరి అవసరాలు తీరుస్తున్న కౌలు రైతులకేమో బ్యాంకుల్లో న్యాయంగా దక్కాల్సిన అప్పు పుట్టడం లేదు. అసలు వ్యవసాయమే చేయని భూ యజమానులు క్రాప్‌ లోన్స్ తీసుకుంటూ, వాటిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లోకో, వడ్డీ వ్యాపారాల్లోకో, ఇతర వ్యాపారాల్లోకో తరలిస్తూ మరింత సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత ప్రజాస్వామిక ప్రభుత్వాల మీద లేదా? నిజంగా వ్యవసాయం చేసేవారికి పంట రుణాలివ్వకపోవడం అన్యాయం కాదా? 

టిఆర్ ఎస్ లో చేరిన వివేక్

హైదరాబాద్ : తెలంగాణ టీడీపీకి కుత్భుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్ గుడ్‌బై చెప్పారు. తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా టీడీపీ ఆఫీసుకు పంపించారు. సీఎం సమక్షంలో వివేక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీఆర్ పార్టీ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. 

11:10 - February 9, 2016

నెల్లూరు : ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకుంటాడని ఆ యువతి నమ్మింది. కానీ ఆ యువకుడు మోసం చేసే వరకు తట్టుకోలేకపోయింది. చివరకు ప్రాణాలు తీసుకోవాలని భావించింది. అనుకున్నదే తడవుగా నిండు ప్రాణాలు బలి తీసుకుంది. చనిపోయే ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకుంది. తాను ఎంతటి బాధ..ఎంతటి నరకం అనుభవించానో ఆ వీడియోలో కన్నీళ్లతో బాధ పడింది. తనను చూడటానికి వస్తే తన చేతులకు గాజులు..నుదుటిపై బొట్టు పెట్టాలని కోరుకుంది. ఈ ఘటన కావలిలో చోటు చేసుకుంది. 
డీబీఎస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా మాధవి పనిచేస్తోంది. భాను అనే యువకుడు ప్రేమించింది. కానీ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొంది. మాధవి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'నాకు బతుకు మీద ఆశ లేదు..చనిపోవాలన్న ఉద్ధేశ్యం ఉంది..నీ సమస్యలకు పరిష్కారం ఉంటుందని..వెళ్లిపోతున్నా..ఇప్పటికే చాలా నరకం అనుభవించాను..నా చేతులకు గాజులు వేసి..నా నుదుటికి బొట్టు పెట్టు..ఈ ఒక్క కోరిక తీర్చు' అంటూ వీడియోలో పేర్కొంది. ఇంకా ఎలాంటి వివరాలు తెలియచేసిందో వీడియోలో చూడండి..

 

11:02 - February 9, 2016

పవన్‌ కళ్యాణ్‌ చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'ను మార్చి 8న విడుదల చేయడానికి నిర్మాత శరద్‌ మరార్‌ ఓ నిర్ణయానికి వచ్చేశాడు. ఆ తేదీలో విడుదల చేయాలంటే చిత్రీకరణ శరవేగంగా సాగాలి. అయినా పూర్త అయ్యే అవకాశం లేదని చిత్ర బృందానికి అనిపించిందేమో గానీ రెండు సెట్లలో షూటింగ్‌ మొదలు పెట్టారు. పవన్‌ కళ్యాణ్‌ సినీ కెరీర్‌లోనే ఇలా రెండు సెట్లలో షూటింగ్‌ జరపడం ఇదే ప్రథమం. ఒక సెట్‌లో చిత్రంలోని ప్రముఖంగా ఉన్న సన్నివేశాలన్నీ చిత్రీకరిస్తున్నారు. మరొక సెట్‌లో అంతగా ప్రాధాన్యం లేని కొన్నింటిని షూట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది.

11:02 - February 9, 2016

బీజింగ్‌: మన్మథ నామ సంవత్సరం..ఇలా కొన్ని పేరిట నామ సంవత్సరాలు వింటుంటాం కాని గిదేం నామ సంవత్సరం ? అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఇది చదవండి..
చైనా రాజధాని బీజింగ్‌లో ఆ దేశ నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రహదారులన్నీ ఎరుపు రంగు పులుముకుని కనువిందు చేస్తున్నాయి. చైనాలో చంద్రుడి గమనం అనుసరించి రూపొందించిన 'ల్యూనార్‌ క్యాలెండర్‌' ప్రకారం ఫిబ్రవరి 8న నూతన సంవత్సర వేడుకలను జరుపుకొంటారు. అక్కడ ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. అలా ఈ ఏడాది అక్కడ కోతి సంవత్సరం. వేడుకల్లో భాగంగా కళాకారులు తమ దేశ సంప్రదాయ నృత్యాలు, డ్రాగన్‌, లయన్‌ డాన్స్‌లు చేస్తూ అలరించారు. ఈ నృత్యాలను తిలకించడానికి సందర్శకులు, పర్యాటకులు అధిక సంఖ్యలో హాజరై ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు.
చైనా న్యూ ఇయర్‌ వేడుకలను జపాన్‌, ఇంగ్లాండ్‌, మలేషియా, పోర్చుగల్‌, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌తో పాటు పలు దేశాల్లో జరుపు కుంటారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, కోతి బొమ్మలను ఒకరికొకరు బహుమతులుగా ఇచ్చి పుచ్చుకుంటారు. ఆ బొమ్మలు ఇంట్లో ఉంటే అంతా మంచి జరుగుతుందని వారి నమ్మకం. వేడుకల్లో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రాంతాలు.. షాపింగ్‌ మాల్స్‌.. ఇతరత్రా ప్రదేశాల్లో ఎరుపు రంగు లాంతర్లని వేలాడదీశారు.

11:01 - February 9, 2016

న్యూఢిల్లీ: 'ఎక్కువ డబ్బు అనర్ధదాయకం' ఇది మన పెద్దవారు తరుచూ చెప్పే మాట. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఎక్కువగా కరెన్సీ నోట్లతో వ్యవహారాలు జరిపే వారికి మాత్రం కొన్ని కష్టాలు తప్పవంటున్నారు పరిశోధకులు. వీరు ఎక్కువగా కొన్ని ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నది వారి వాదన. నిత్యం షాపులు, మార్కెట్లు, బ్యాంకుల్లో ప్రత్యక్షంగా కరెన్సీ నోట్ల చెలామణి జరిపే వారికి ఈ ముప్పు అధికమని వారు చెబుతున్నారు. వివిధ రకాల వ్యక్తుల నుంచి కరెన్సీ నోట్లు చెలామణి అవుతుండడం.. వారిలో చాలామంది కనీస వ్యక్తిగత శుభ్రతను పాటించకపోవడం వల్ల డబ్బు కాగితాల ద్వారా యాంటీబయోటిక్స్‌ను ఎదుర్కొని నిలిచే ప్యాథజెన్స్‌ బ్యాక్టిరియా విస్తరిస్తోందట. 'సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండిస్టియల్‌ రీసర్చ్‌' (సీఎస్‌ఐఆర్‌), 'ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయోలజీ' సంస్థలు ఒక పరిశోధనలో నోట్లపై ప్రమాదకరమైన బ్యాక్టిరియా ఉండడాన్ని గుర్తించాయి. ఈ బ్యాక్టిరియాల మూలంగా పలు రకాల చర్మ వ్యాధులు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌లు కలిగే అవకాశం ఉన్నట్లు తేల్చారు. నోట్ల చెలామణి విభాగంలో ఉండేవారు చేతులను శుభ్రంగా కడగకుండా ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల ఉదరకోశ ఇన్ఫెక్షన్లతో పాటు పలు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. భారత్‌ మార్కెట్లలో బాగా చెలామణిలో ఉండే రూ.10, రూ.20, రూ.100. రూ.500 నోట్ల ద్వారా పలు వ్యాధికారక బ్యాక్టిరియాలు, వైరెస్‌లు ఎక్కువగా ఇతరులకు వ్యాప్తి చెందుతున్నాయి. ఇక్కడి కరెన్సీ నోట్లపై సుమారు 70 శాతం మేర ఫంగీ వంటి వ్యాధికారక క్రిములు, 9 శాతం వరకు వివిధ బ్యాక్టీరియా, ఒక శాతం మేర వైరెస్‌ ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. నోట్లతో వ్యవహారం జరపకుండా బతకడం చాలా కష్టం కాబట్టి డబ్బు కాగితాలు.. జబ్బు కాగితాలుగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా ఇలాంటి వ్యాధికారక క్రిములు విస్తరించకుండా జాగ్రత్తపడొచ్చన్నది వారి సూచన. ఎక్కువగా నగదు కౌంటింగ్‌ యాంత్రాలు, ఆన్‌లైన్‌ వ్యవహారాలను ప్రోత్సహించాలని వారు చెబుతున్నారు. కాబట్టి కరెన్సీ కాగితాలతో జర భద్రం.

10:59 - February 9, 2016

 

కోల్‌కతా: రూ.2 లక్షలకు మించి బంగారం, ఆభరణాల కొనుగోళ్లు జరిపే వారు విధిగా పాన్‌కార్డు గానీ లేదా డిక్లరేషన్‌ను గానీ సమర్పించాలన్న సర్కారు నిబంధనపై పసిడి వర్తకులు కన్నెర్రజేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం (10న) ఒక్క రోజు సమ్మె బాట పట్టాలని నిర్ణయించినట్లు 'ఆల్‌ ఇండియా జెమ్స్‌ అండ్‌ జ్యువెల్లర్స్‌ ట్రేడ్‌ ఫెడరేషన్‌' (జేజీఎఫ్‌) తెలిపింది. ఇందులో భాగంగా తమ నిరసనను తెలియజేశేలా దేశ వ్యప్తంగా ఉన్న దాదాపు లక్ష బంగారం దుకాణాలను 10న మూసి ఉంచనున్నట్లు సంఘం సభ్యులు తెలియజేశారు. జనవరి నుంచి అమలులోకి వచ్చిన పాన్‌ నిబంధన పట్ల వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందనీ.. ఫలితంగా తమ వ్యాపారం బాగా దెబ్బతింటోన్నట్లు సంఘం వివరించింది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్‌ ప్రాంతాలలో తాము ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు సంఘం తెలిపింది. ఈ నిబంధన కారణంగా మూడో వంతు వ్యాపారం దెబ్బతిన్నట్లు జీజేఎఫ్‌ ఈస్ట్‌జోన్‌ ఛైర్మన్‌ శంకర్‌ సేన్‌ తెలిపారు. చాలా మంది గ్రామీణ మహిళలకు పాన్‌కార్డులు లేవనీ.. డిక్లరేషన్‌పై సంతకం చేయమని కోరితే వారు నిరాకరించి వెళ్లిపోతున్నట్లు ఆయన వాపోయారు.

10:43 - February 9, 2016

హైదరాబాద్  :  తెలంగాణ టీడీపీకి కుత్భుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్ గుడ్‌బై చెప్పారు. తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా టీడీపీ ఆఫీసుకు పంపించారు. టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్న వివేక్ కాసేపట్లో ముఖ్యమంత్రి సమక్షంలో గులాబీ తీర్థం తీసుకున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వివేక్ బాటలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 

10:39 - February 9, 2016

హైదరాబాద్ : మొయినా బాద్ ఫాంహౌస్‌లో డాక్టర్ శశికుమార్‌ సూసైడ్ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను పరిశీలిస్తున్నారు. శశికుమార్‌ తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనాస్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ లభ్యమైంది. సూసైడ్ నోట్‌ను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. లారెల్ ఆస్పత్రి ఏర్పాటుకు గాను పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టానన్న శశికుమార్... ఉదయ్, సాయికుమార్ తనను మోసం చేసినట్టు లేఖలో పేర్కొన్నారు. ఉదయ్‌ని కాల్చింది తాను కాదని.. సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. తన చావుకు ఉదయ్, సాయికుమార్‌లే కారణమని 
ఉదయ్‌ని కాల్చింది నేను కాదు: సూసైడ్ నోట్‌లో శశికుమార్‌ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. శశికుమార్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 

10:30 - February 9, 2016


ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మరో ముఖ్యమైన అత్యున్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దేశ భద్రత, కేంద్ర పథకాల అమలు, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంపు తదితర అంశాలు అజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఇవాళ, రేపు జరగనున్న ఈ సదస్సుకు..ప్రధాని మోదీ సహా...కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు హాజరుకానున్నారు. 

ఢిల్లీలో నేడు, రేపు కీలక సదస్సు

భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షతన ఢిల్లీలో నేడు, రేపు కీలక సదస్సు జరగనుంది. దేశ భద్రత, కేంద్ర పథకాల అమలు, ఉన్నత విద్యలో ప్రమాణాల పెంపు తదితర అంశాలు అజెండాగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ  ఈ అత్యున్నత సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర మంత్రులు, 23మంది గవర్నర్లు, ఇద్దరు లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌...సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకున్నారు. 

ప్రణబ్‌ నేతృత్వంలో నాల్గో సమావేశం 

రాష్ట్రపతి అధ్యక్షతన నేటి నుంచి ప్రారంభం కానున్న ఇలాంటి అత్యున్నతస్థాయి సమావేశం 47వది కాగా...ప్రణబ్‌ నేతృత్వంలో ఇది నాల్గొవది. ఈ సమావేశంలో తీవ్రవాదం, విద్రోహ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిపెట్టడంతో పాటు దేశ అంతర్గత, బాహ్య భద్రతపై చర్చించనున్నారు. అలాగే యువతకు ఉద్యోగాల కల్పన, పాఠశాలలు మానేసిన చిన్నారులకు నైపుణ్యాలు అభివృద్ధిపై దృష్టిసారించనున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రాయోజిత పథకాలైన స్వచ్ఛభారత్‌ అభియాన్‌, 2022లోగా అందరికీ ఇండ్లు, స్మార్ట్‌నగరాల అమలుపై చర్చించనున్నారు. వీటితో పాటు ఉన్నత విద్యలో నాణ్యత పెంచడం, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని ఉపాధి కల్పనకు ప్రోత్సహించడం, ఈశాన్య ప్రాంత అభివృద్ధిపై కూడా చర్చలు జరపనున్నారు. 

కేంద్రమంత్రులు హాజరు

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతీఇరానీ, కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ, వాణిజ్య పరిశ్రమలశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌, నీటి అయోగ్‌ ఉపాధ్యాక్షులు అరవింద్‌ పనగారియా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ధోవల్‌ తదితరులు హాజరుకానున్నారు. 

10:24 - February 9, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ ఎన్నికకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 11న జ‌రిగే మేయర్, డిప్యూటి మేయ‌ర్ ఎన్నికల‌కు  హాజ‌రు కావాల‌ని నూత‌నంగా ఎన్నికైన కార్పొరేట‌ర్లకు, ఎక్స్ అఫిషియో స‌భ్యుల‌కు నోటిసులు ఇచ్చారు అధికారులు. ప్రత్యేక స‌మావేశం నేప‌థ్యంలో గ్రేటర్ కౌన్సిల్ హాల్‌ను ముస్తాబు చేస్తున్నారు. 
ఈనెల 11న కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం 
2014 డిసెంబర్ నాలుగున ముగిసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ఏడాదిన్నర తరువాత కొత్త సభ్యులతో కళకళలాడబోతోంది. బల్దియా ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి 99 స్థానాలు, మజ్లీస్‌కి 44, బీజేపీకి 4, కాంగ్రెస్‌కి 2, టీడీపీకి ఒక స్థానం లభించాయి. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ఈనెల 11న జరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌ను అధికారులు రెడీ చేస్తున్నారు.
కౌన్సిల్లో మొత్తం 217 మంది సభ్యులు
గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్లో మొత్తం 217 మంది సభ్యులున్నారు. ఇందులో 150 మంది కార్పొరేటర్లు కాగా 67 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు. మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక జ‌ర‌గాలంటే 109 మంది సభ్యుల కోరం అవ‌స‌రం. కార్పొరేటర్‌తో పాటు ఎక్స్ అఫిసియో స‌భ్యుల‌కు ప్రిసైడింగ్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా  నోటీసులు జారీ చేశారు. 11వ తేది ఉద‌యం హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. స‌మావేశంలో హాజ‌రైన పార్టీల‌ సభ్యులు త‌మ పార్టీ మేయ‌ర్ అభ్యర్థి పేరును ప్రతిపాదించాల్సి ఉంటుంది. దానిని మ‌రొక‌రు బ‌ల‌ప‌రచాలి. త‌రువాత ప్రిసైండింగ్ అధికారులు, ఆమోదం తెలిపిన వారు చేతులెత్తాల్సిందిగా కోరతారు. ఎవ‌రికి ఎక్కువ మెజారీటి వ‌స్తే వారిని మేయ‌ర్ గా ప్రక‌టిస్తారు. డిప్యూటి మేయ‌ర్ ఎన్నిక కూడా ఇదే ప‌ద్దతిలో జ‌రుగుతుంది.  
మేయ‌ర్ ఎన్నిక లాంఛన‌మే
ఇక జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారీటి ఉంది. ఎక్స్ అఫిషియో స‌భ్యుల్లోనూ అధికార పార్టీ వారే అధికం.. దాంతో మేయ‌ర్ ఎన్నిక లాంఛన‌మే. చాలా మంది కార్పొరేటర్లు కొత్తగా ఎన్నికైన వారు. ఇందులో చాలామంది ఉన్నత విద్యావంతులు. అయితే ఎవరు మేయర్, డిప్యుటి మేయర్ అవుతార‌నే అంశంపై  ఇంకా స్పష్టత రాలేదు. 

10:19 - February 9, 2016

హైదరాబాద్ : తెలంగాణ సర్కార్‌ను నిధుల కొరత వెంటాడుతోంది. మిగులు బడ్జెట్ రాష్టమని చెబుతున్నప్పటికీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.ఈ ఏడాది ఇప్పటి వరకు ఆదాయ వ్యయాల మధ్య తేడా భారీగా ఉంది. దీంతో కొత్త బడ్జెట్ లో కోతలు ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. 
రూ. 8 వేల కోట్లు లోటు
తెలంగాణ ఖజాన ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఆదాయ వ్యయాల మధ్య తేడా భారీగా ఉండటం ఆర్ధిక శాఖ అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. జనవరి చివరి వరకు ప్రభుత్వానికి సమకూరిన రెవిన్యూ, అవుతున్న వ్యయాల మధ్య అంతరం భారీగా ఉంది. వ్యయం 54 వేల 424 కోట్లు కాగా....ఆదాయం మాత్రం 46 వేల 145 కోట్లుగా తేలింది. మొత్తం 8 వేల కోట్ల రూపాయల లోటు ఏర్పడింది. ఈ లోటు ఇప్పటికి ఇప్పుడు పూడ్చుకునే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ అధికారులే చెబుతున్నారు. 
మళ్లీ మొదటికొచ్చిన బడ్జెట్‌ ప్రతిపాదనలు
ఆదాయ, వ్యయాల మధ్య తేడా భారీగా ఉండడంతోనే బడ్జెట్ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ తిప్పి పంపారు. మరోసారి శాఖల వారీగా సమగ్ర ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. నిధుల కొరత అధికంగా ఉన్నందున...వీలైనంత మేర ప్రతిపాదనలు కుదించాలని స్పష్టం చేసారు.అన్ని శాఖలు కనీసం 15 శాతం మేర వ్యయాలను తగ్గిస్తూ ప్రతిపాదనలు పంపాలని సూచించారు. దీంతో అన్ని శాఖలు మళ్లీ బడ్జెట్ కసరత్తులు మొదలు పెట్టాయి. 
కత్తిమీద సాములా బడ్జెట్‌ రూపకల్పన
మరోవైపు ఆర్ధిక శాఖ కు కూడా కొత్త బడ్జెట్ రూపకల్పన కత్తి మీద సాములా మారింది. ప్రణాళిక వ్యయం గతంలో మాదిరిగా 50 వేల కోట్లు ఉండనుండగా అందులో సగం వరకు ఇరిగేషన్ శాఖకే పోనుంది. నీటి పారుదల శాఖకు 25 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. మరో 4 వేల కోట్లు రుణ మాఫీకి కేటాయించాల్సి ఉంటుంది. దీంతో మిగిలిన 20 వేల కోట్లనే మిగిలిన అన్ని శాఖలకు సర్దాల్సి ఉంటుంది. అదే సమయంలో విద్యా, వైద్యం..డబుల్ బెడ్ రూము ఇళ్ల పథకానికి అధిక నిధులు ఖర్చు కానున్నాయి. ఈ నేపథ్యంలో నిధులు ఏలా రాబట్టాలన్న దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 
కేంద్రం నుంచి అంతంతమాత్రంగానే నిధులు
మరోపక్క కేంద్రం నుంచి కూడా నిధులు అనుకున్నంత మేర రావడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 22 వేల కోట్లు రావాల్సి ఉండగా...18 వేల 500 కోట్లనే మంజూరు చేసింది. వాటిలోనూ కోత పెట్టి 15 వేల 700 కోట్లనే విడుదల చేసింది. దీంతో ఆదాయ వ్యయాల మధ్య తేడా కొనసాగుతునే ఉంది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని తెలుస్తోంది. 

 

10:15 - February 9, 2016

హైదరాబాద్ : ఏపీ బడ్జెట్‌ కసరత్తులు చివరి దశకు చేరుకున్నాయి. గత ఏడాదిలాగే ఈ సారి కూడా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు. మార్చి 5న రాష్ట్ర బడ్జెట్, 8న వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాలని సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. 

కాపు కార్పొరేషన్‌కు వెయ్యికోట్లు

వచ్చే బడ్జెట్ లో కాపు కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జలవనరుల శాఖకు 4600కోట్ల రూపాయలు కేటాయించినా..ఆ శాఖ 6వేల కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసింది. ఈ ఖర్చుల ఆధారంగానే నీటిపారుదల శాఖకు నిధులు కేటాయించాలని సర్కార్‌ భావిస్తోంది. 

రూ. 14,184 కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌

రుణమాఫీకి రాబోయే బడ్జెట్‌లో 5వేల కోట్ల రూపాయలు కేటాయించే అవకాశాలున్నాయి. గత ఏడాది  వ్యవసాయానికి 14వేల 184 కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సారి కూడా మార్చి 8వ తేదీన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు. 

రూ.లక్షా 30 వేల కోట్లతో కొత్త బడ్జెట్‌

మొత్తం మీద రాష్ట్ర బడ్జెట్ లక్షా 30వేల కోట్ల రూపాయలు దాటే అవకాశాలన్నాయి. ఇందులో ప్రణాళికేతర వ్యయం దాదాపు 90 వేల కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికేతర వ్యయం కింద 78,637 కోట్లు, ప్రణాళిక వ్యయం 34,412 కోట్లు కలిపి మొత్తం 1,13,049 కోట్లుగా ప్రతిపాదించారు. కొత్తబడ్జెట్‌ ఈసారి కనీసం 15-20 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి రాష్ట్ర వృద్ధిరేటు 12శాతంఉంటుందని అంచనా వేస్తున్నారు. జీడీపీ పరిమాణం సుమారు లక్ష కోట్లు పెరిగే అవకాశం ఉన్నందున బహిరంగ విపణిలో తీసుకునే రుణ శాతం కూడా పెరుగుతుంది. వీటన్నింటి దృష్ట్యా కొత్త బడ్జెట్‌ లక్షా 30వేల కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చని ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. 

10:08 - February 9, 2016

విశాఖ : ఏపీ పర్యాటక రంగంలో మరో కలికితురాయి చేరింది. భారత తీర రక్షణలో సేవలు అందించిన యుద్ధనౌక విరాట్‌ను ఏపీ పర్యాటక శాఖకు ఇచ్చేందుకు రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విరాట్‌ రాకతో పర్యాటకులను మరింతగా ఆకట్టుకోవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 
ఐఎన్‌ఎస్ విరాట్..
ఐఎన్‌ఎస్ విరాట్..భారత నావికాదళానికి చెందిన విమాన వాహక యుద్ధనౌక.. అటు బ్రిటిష్, ఇటు భారత నావికాదళాలకు 57 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించి ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన యుద్ధనౌకగా గుర్తింపు పొందింది. ఏడేళ్ల క్రితమే భారత నావికాదళ సేవల నుంచి తప్పుకోవలసి ఉన్నా వీలుకాక ఇంకా సేవలందిస్తోంది. విశాఖలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో ఆఖరి అంకాన్ని ప్రదర్శించి ఘనంగా వీడ్కోలు తీసుకుంది.
మొదట బ్రిటిష్ రాయల్ నేవీలోకి విరాట్‌ నౌక 
విరాట్‌ నౌక మొదట బ్రిటిష్ రాయల్ నేవీలోకి హెచ్‌ఎంఎస్ హెర్మస్ పేరుతో 1959లో చేరింది. 1982లో జరిగిన ఫాక్‌ల్యాండ్ యుద్ధంలో పాల్గొంది. సుమారు 27 ఏళ్లు బ్రిటీష్‌ రాయల్ నేవీలో సేవలందించాక దాన్ని 1986 ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఐఎన్‌ఎస్ విరాట్ పేరుతో ఇండియన్ నేవీలో చేరింది. 
23,900 టన్నుల బరువు తీసుకెళ్లగలదు...
ఈ భారీ యుద్ధనౌక 23,900 టన్నుల బరువును తీసుకెళ్లగలదు. ఇది గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో పయనిస్తుంది. వరుస మరమ్మతుల కారణంగా 2009లోనే ఐఎన్‌ఎస్ విరాట్‌ను సేవల నుంచి తప్పించాలనుకున్నారు. దాని స్థానంలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ ఆలస్యం కావడంతో ఇంత కాలం విరాట్‌ కొనసాగింది. 
విశాఖ తీరానికి ఐఎన్‌ఎస్‌ విరాట్‌ 
ఇదిలాఉంటే ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ సందర్భంగా ఐఎన్‌ఎస్‌ విరాట్‌ విశాఖ తీరానికి చేరింది. విధుల నుంచి తప్పుకోనున్న ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌక ఏపీ సర్కారును ఆకర్షించింది. ఈ నౌకను పర్యాటక రంగంలో సేవలు కొనసాగించేందుకు రక్షణ శాఖను కోరింది. సీఎం చంద్రబాబు కోరిక మేరకు రక్షణ శాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో సుమారు 500 గదులు ఉన్నాయి. వీటిని ఆధునీకరించి సకల హంగులతో ఏపీ పర్యాటక శాఖకు అందుబాటులోకి రానుంది. యుద్ధ నౌకగా ఇన్నాళ్లూ సేవలందించిన విరాట్‌ ఇక నుంచి ఏపీ పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ దీనికవసరమైన ఏర్పాట్లు చేయనుంది.

10:06 - February 9, 2016

దోమ కాటు వల్ల వచ్చే జ్వరాలను తప్పించుకోవాలంటే ఇంట్లో దోమలను నివారించాలి. కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలతో దోమలను చాలా వరకు నివారించవచ్చు...
ఇంట్లో దోమల బాధ ఎక్కువగా ఉంటే టీ పొడిని ఒక పాత్రలో వేసి కాల్చితే ఆ ఘాటుకు దోమలు దూరమవుతాయి.
పుదీనా ఘాటు వాసన దోమలకు పడదు. అందుకే పుదీనా మొక్కను ఓ కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకు దోమలు పారిపోతాయి.
ఒక గ్లాసులో సగానికి నీళ్ళు పోసి అందులో నాలుగైదు కర్పూరం బిళ్ళలు వేయాలి. గదంతా కర్పూరం వాసనతో నిండి ఆ వాసనకు దోమలు బయటకు పోతాయి.
దోమలను తరిమేందుకు ప్రత్యేకంగా కాయిల్స్‌ (రసాయనాలు లేకుండా) కూడా లభ్యమవుతున్నాయి. వాటిని ఉపయోగించి చూడవచ్చు.
దోమ కుట్టిన చోట నొప్పి, దురదగా ఉన్న చోట వెనిగర్‌ అద్దిన దూదితో మృదువుగా రుద్దితే సమస్య పరిష్కారం అవుతుంది. 

10:03 - February 9, 2016

కాఫీ తాగడానికి ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఉదయం నిద్రలేచినప్పుడు ఓసారి, తిరిగి సాయంత్రం మళ్ళీ ఇంకోసారి కాఫీ తాగే అలవాటు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇలా కాఫీ తాగడం వల్ల కాస్త పని ఒత్తిడి తగ్గుతుందని, మైండ్‌ ఫ్రెష్‌ అవుతుందని భావిస్తూ అంతా తాగుతారు. అయితే... కొంతమంది కాఫీ ప్రియులు మాత్రం రోజుకు కనీసం 5 నుండి 8 గ్లాసుల వరకు విచ్చలవిడిగా తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాఫీ కంటెంట్‌ అధికమైతే శరీరంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ... కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? కాదా? అన్నది మాత్రం చాలా మందికి తెలియదు.
సాధారణంగా కాఫీ లేదా బ్లాక్‌ కాఫీ రెండు రకాలుగా ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పనిచేస్తాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా పాలు, చక్కెరతో తయారు చేసే కాఫీకి బదులుగా తక్కువ క్యాలరీలున్న బ్లాక్‌ కాఫీ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే... ఒక కప్పు బ్లాక్‌ కాఫీలో కేవలం 4.7 క్యాలరీలున్నాయి. అదే రెగ్యులర్‌ కాఫీలో అయితే ఏకంగా 56.6 క్యాలరీలు ఉంటాయి. అంటే, దీనిని ఎక్కువగా తాగితే శరీర బరువు బాగా పెరిగిపోతుందన్నమాట! కాబట్టి బ్లాక్‌ కాఫీ తీసుకోవడమే ఉత్తమం. అలాగే, సాయంత్రం వేళల్లో నిద్ర సమస్యలతో బాధపడేవారు సాధారణ కాఫీ అంతగా తీసుకోకపోవడమే మంచిదని న్యూట్రీషన్లు అంటున్నారు.
అయితే... కొందరు నిద్రపోకుండా ఉండేందుకు కాఫీ తాగుతుంటారు. అప్పుడు సాధారణ కాఫీ కాకుండా బ్లాక్‌ కాఫీ తాగితే మంచిది. ఇది నిద్రను పోగొట్టడంతోపాటు ఎటువంటి ఆరోగ్య సమస్యల్ని కలిగించదు. కానీ, ఎసిడిటి ఉన్నవాళ్లు మాత్రం బ్లాక్‌ కాఫీ తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

10:03 - February 9, 2016

ఒత్తిడికి గురైనప్పుడు మొదట జరిగేది శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం. శ్వాసక్రియలు సక్రమంగా జరగకపోతే గుండెకు హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే ఒత్తిడికి గురైనప్పుడు శ్వాస వ్యాయామం చేయడం ఎంతో ఉత్తమం. అప్పుడు ఒత్తిడిని అధిగమించవచ్చు. అంటే ఆక్సిజన్‌ను లోపలకు తీసుకోవడం వల్ల ఒత్తిడి ప్రభావం తగ్గి రిలాక్స్‌గా అనిపిస్తుంది.
కుర్చీలో కానీ, నేలమీద కానీ మీ శరీరానికి అనువుగా ఉండేటట్లు కూర్చొని కళ్ళు మూసుకోవాలి. చేతుల్ని మీ పక్కకు పెట్టి, మొదడులోని అన్ని ఆలోచనలను, అవరోధాలను పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల నెమ్మదిగా రిలాక్సేషన్‌ పొందుతారు.
ఆ తర్వాత మీ కుడిచేతిని మీ పొట్టమీద పెట్టుకొని దీర్ఘంగా అంటే నెమ్మదిగా ఐదు సెకన్లపాటు శ్వాస తీసుకోవాలి. ఇలా తీసుకున్న శ్వాసను ఒక సెకనుపాటు లోపల నిలిపి, ఆ తర్వాత నెమ్మదిగా వదలాలి. ఒక సెకండ్‌ విరామం ఇచ్చి మళ్ళీ ఈ ప్రక్రియను కొనసాగించాలి. ఇలా ఐదుసార్లు చేయాలి.
అయితే ఇందులో ముఖ్యమైనది, గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే శ్వాసక్రియ నెమ్మదిగా, దీర్ఘంగా ఉండాలి. అలాగే శ్వాస పీల్చుకోవడం, వదలడం రెండూ కూడా సంపూర్ణంగా ఒక పద్ధతిలో పూర్తిచేయాలి. ఈ శ్వాసక్రియ విధానాన్ని ఎవరికి వారు వారి ఊపిరితిత్తుల సామర్థ్యానికి తగ్గట్టు చిన్నచిన్న మార్పులు చేసుకోవచ్చు.

10:01 - February 9, 2016

తస్లీమ్‌, దివిజ, శ్రేష్ఠ, చరణ్‌, హర్ష ప్రధాన పాత్రధారులుగా రషీద్‌ భాషా దర్శకత్వంలో మాస్టర్‌ మహ్మద్‌ అఫాన్‌ సమర్పణలో, హెచ్‌.డి. విజన్‌ ఇండియా బ్యానర్‌పై ఇబ్రహీం షేక్‌, అమీర్‌ బాషా షేక్‌, ఖాజాబి షేక్‌, నజీమ్‌ షేక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'లిటిల్‌ స్టార్స్‌'. ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ, 'చిల్డ్రన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ స్ఫూర్తితో ఈ బాలల చిత్రాన్ని రూపొందించాను. ఆరుగురు స్నేహితులు తమ స్నేహితురాలి కోసం ఏం చేశారనేది ఈ చిత్ర కథ. పిల్లలే ఈ చిత్రానికి స్క్రిప్టు అందించడం విశేషం. ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని అన్నారు. 'కథాంశాల పరంగా తెలుగు చిత్ర సీమ ఎదగాల్సిన అవసరముంది. బాలల చిత్రానికి తగినంత ఆదరణ లభించడం లేదు. చిన్నపిల్లలు చిత్రాలకు పెద్ద పీఠ వేయాలి. అందులో భాగంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి బాలల చిత్రోత్సవాలకు హైదరాబాద్‌ను శాశ్వత వేదికగా ఏర్పాటు చేశాం' అని వేదకుమార్‌ తెలిపారు. భగీరథ మాట్లాడుతూ, 'తారే జమీన్‌పర్‌', 'భజరంగీ భాయిజాన్‌' వంటి చిత్రాల్లో అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ వంటి స్టార్‌ హీరోలు నటించడంతో ఆ సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. తెలుగులోనూ చిన్న పిల్లల చిత్రాలకు ప్రభుత్వం చేయూతనివ్వాలి' అని చెప్పారు. 

టీటీడీపీకి ఎమ్మెల్యే వివేక్ గుడ్ బై

హైదరాబాద్ : తెలంగాణలో టిడిపికి మరో షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ టీడీపీ ఎమ్మెల్యే వివేక్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన బాటలోనే మరో ఇద్దరు ఎమ్యెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో సీఎం కేసీఆర్ సమక్షంలో వివేక్ టీఆర్ ఎస్ లో చేరనున్నారు. 

09:48 - February 9, 2016

విశాఖ : ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ విజయవంతంగా ముగిసింది. సాగర తీరం సాక్షిగా దేశ నావికాదళ సత్తా అందరినీ అబ్బురపరిచింది. రక్షణరంగ కీలక పరిశోధనలు..యుద్ధ పరికరాల తయారికీ తూర్పు తీరం ప్రాధాన్యత ఈ రివ్యూతో మరోసారి తేటతెల్లమయ్యింది. 
అందరినీ ఆకట్టుకున్న ఫ్లీట్‌ రివ్యూ 
ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూను తూర్పు నౌకాదళం గ్రాండ్‌గా నిర్వహించింది. విశాఖ తీరంలో జరిగిన ఈ ఫ్లీట్‌ రివ్యూ అందరినీ ఆకట్టుకుంది. తూర్పు తీరంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఫ్లీట్‌ రివ్యూ దోహదపడనుంది.రానున్న కాలంలో  నౌకాదళ కార్యకలాపాలకు విశాఖ తీరాన్ని కేంద్రబిందువు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. 
భారత్ నౌకాదళం యుద్ధ విన్యాసాలు 
భారత్ నౌకాదళం ప్రదర్శించిన యుద్ధ విన్యాసాలు  దేశ శక్తి సామర్ధ్యాలను వెల్లడిచేశాయి. వివిధ దేశాల నౌకాదళాల మధ్య సత్సంబంధాలను పెంపొందించుకోవడమే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ ప్రధాన ఉద్దేశం. ఐతే మన దేశ నౌకాదళ శక్తి యుక్తులు, బలం, ఆయుధ సంపత్తిని పరోక్షంగా విదేశాలకు తెలియజేసేందుకు ఫ్లీట్‌ రివ్యూ వేదికగా ఉపయోగపడింది. ఇక ఫ్లీట్ రివ్యూలో అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, రష్యా లాంటి దేశాలు  పాల్గొనడం ప్రత్యేకతను చాటింది. ఆయా దేశాల నేవీ ప్రదర్శించిన సిటీ పరేడ్ ఆకట్టుకుంది. వివిధ దేశాల సాంస్కృతి వారసత్వాన్ని ప్రదర్శించేలా ఏర్పాటుచేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 
మారిటైమ్ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన 
మరోపక్క అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఏయూగ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన మారిటైమ్ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన వస్తోంది. బుధవారంతో ఎగ్జిబిషన్ ముగుస్తుండటంతో విద్యార్ధులు, ప్రజలు పెద్ద ఎ్తతున తరలివస్తున్నారు. వివిధ రక్షణ రంగ సంస్థలు, వాటి పరిశోదనలు, ఆయుధ పరికరాలకు చెందిన పలు నమూనాలను ఈ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటుచేశారు. 

 

09:24 - February 9, 2016

ఢిల్లీ : ఏపీకి కేంద్ర సాయ‌మే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. 2016-17 వార్షిక బ‌డ్జెట్ క‌స‌ర‌త్తు కేంద్రం ప్రారంభించటంతో ఏపీకి అందాల్సిన‌, ఏపీ కోరుతున్న సాయంపై చంద్రబాబు కేంద్రంతో చ‌ర్చలు జ‌ర‌ప‌నున్నారు. ఏపీ తొలి ఏడాది రెవెన్యూ లోటు భ‌ర్తీ, పోల‌వ‌రానికి నిధులు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. దీనితో పాటు ప‌లు స‌మ‌స్యల‌పై ఆయా శాఖ‌ల ఉన్నతాధికారుల‌ను ముఖ్యమంత్రి క‌లిసే అవ‌కాశముంది.
2016-17 వార్షిక బ‌డ్జెట్‌పై  కేంద్ర ఆర్దికశాఖ క‌స‌ర‌త్తు 
ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, తీర్చాల్సిన సమస్యల చిట్టాతో ఢిల్లీ ఫ్లైటెక్కారు సీఎం చంద్రబాబు. ప్రధానంగా 2016-17 వార్షిక బ‌డ్జెట్ పై కేంద్ర ఆర్థిక శాఖ క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల‌తో కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ స‌మావేశం నిర్వహించారు. ఏపీ నుంచి హాజ‌రైన ఆర్దిక శాఖ ముఖ్య కార్యద‌ర్శి పివి ర‌మేష్, ఏపి ఆర్థిక ప‌రిస్థితిని వివరించ‌టంతో పాటుగా కేంద్రం నుంచి ఎటువంటి సాయం కోరుకుంటున్నదీ స్పష్టం చేశారు. ప్రభుత్వ గ‌ణాంకాల ప్రకారం 16,079 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిన‌ట్లు కాగ్ సైతం ధృవీక‌రించింది. అయితే కేంద్రం నుంచి ఇప్పటి వ‌ర‌కు 2,303 కోట్లు మాత్రమే భ‌ర్తీ జ‌రిగింది. దీంతో పాటు 14వ ఆర్థిక సంఘ నిధుల విడుద‌లపైనా సీఎం కేంద్ర ఆర్థిక మంత్రితో చ‌ర్చించ‌నున్నారు. 
పోలవరానికి రూ. 4 వేల కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి 
పోల‌వ‌రాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రక‌టించిన త‌రువాత‌ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4,092 కోట్లకు పైగా ఖ‌ర్చు చేసింది. అయితే, కేంద్రం మాత్రం కేవ‌లం 350 కోట్లు మాత్రమే విడుద‌ల చేసింది. గ‌త బ‌డ్జెట్‌లో కేవ‌లం వంద కోట్లు కేంద్రం కేటాయించ‌టంపై అప్పట్లోనే ఏపి ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈసారి బ‌డ్జెట్‌లో పోల‌వ‌రం కోసం నాలుగు వేల కోట్లు నిధులు కేటాయించాల‌ని ఏపి ప్రభుత్వం కోరుతోంది. అలాగే వెనుక బ‌డిన జిల్లాల ప్రత్యేక అభివృద్ది నిధి కింద ఒక్కో జిల్లాకు యాభై కోట్ల చొప్పున ఏడు జిల్లాల‌కు కేంద్రం రెండు ద‌ఫాలుగా మొత్తం 700 కోట్లు కేటాయించింది. అయితే ఏపీ ప్రభుత్వం ఒక్కో జిల్లాకు వంద కోట్లు కేటాయించాల‌ని కోరుతోంది. 
విశాఖకు రైల్వే జోన్, అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్
ఇక‌ విశాఖ‌కు ప్రత్యేక రైల్వో జోన్ గ‌త రైల్వే బ‌డ్జెట్‌లోనే కేటాయిస్తామ‌ని కేంద్రం సూత్రప్రాయంగా చెప్పిన‌ప్పటికీ సాంకేతిక కార‌ణాల‌తో వాయిదా వేసింది. దీనిపై రైల్వే నిపుణుల బృందం సైతం కేంద్రానికి నివేదిక ఇవ్వటంతో ఈసారి రైల్వే బ‌డ్జెట్‌లో ప్రత్యేక రైల్వే జోన్ ప్రక‌ట‌న‌తో పాటుగా రాజ‌ధాని అమ‌రావ‌తికి రైల్వే లైన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాల‌ని సీఎం చంద్రబాబు కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరే అవ‌కాశముంది. ఏపిలో పెట్టుబ‌డుల కోసం వ‌స్తున్న హామీలు, జ‌రుగుతున్న ఒప్పందాల‌ను కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే  అద‌న‌పు పెట్టుబ‌డి రాయితీ, అద‌న‌పు త‌రుగు రాయితీ కింద 15 శాతం వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చింది కేంద్రం. అయితే కొత్త రాష్ట్రం కావ‌టంతో ఉత్తరాంచ‌ల్‌, హిమాచ‌ల్ ప్రదేశ్‌ల‌కు ఇచ్చిన విధంగా ప‌దేళ్ల పాటు ఆదాయ ప‌న్ను, సేవా ప‌న్నుల‌ మిన‌హాయింపునివ్వాల‌ని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. రాజ‌ధాని అమరాతిలో మౌలిక వ‌స‌తులు, మెట్రో కోసం నాలుగు వేల కోట్లు కేటాయించాల‌ని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. 
ప్రధానికి నీతి అయోగ్ నివేదిక
టిడిపి-బిజెపికి సంబంధించిన రాజ‌కీయ అంశాలపైనా ముఖ్యమంత్రి ఢిల్లీ ప‌ర్యట‌న‌లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఇక‌ ఏపికి అందించాల్సిన సాయంపై నీతి అయోగ్ నివేదిక ప్రధానికి చేర‌టంతో మోదీతోనూ సీఎం సమావేశ‌మ‌య్యే అవకాశాలున్నాయి. దీంతో రానున్న రోజుల్లో కేంద్రం నుంచి ఏపికి అందే సాయంపై చంద్రబాబు పర్యట‌న‌ ద్వారా కొంత స్పష్టత వ‌చ్చే ఛాన్స్ ఉంది.

 

08:59 - February 9, 2016

హైదరాబాద్‌ : నగరంలో సంచలనం సృష్టించిన డాక్టర్ల కాల్పులు వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. డాక్టర్‌ ఉదయ్‌పై కాల్పులు జరిపిన శశికుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని మొహినాబాద్‌ లక్కలపల్లిలోని గెస్ట్ హౌస్‌లో తన రివాల్వర్‌తో కాల్చుకుని శశికుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కుమార్ కోయిరాల కన్నుమూత

ఖాట్మాండ్ : నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కుమార్ కోయిరాల (79) కన్నుమూశారు. రేపు సుశీల్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సుశీల్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. 

 

హైదరాబాద్ లో గుడిసెల కూల్చివేత

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ లో అంబేద్కర్‌ వర్సిటీ వెనుక ప్రభుత్వ స్థలంలో పేదల గుడిసెలను అధికారులు తొలగించారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాము నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేసినందుకు పేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో విషాదం..

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని కొడంగల్ మండలం కస్తూరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. లారీ అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. వీరిలో మూడేళ్ల చిన్నారితోపాటూ ఓ వృద్ధురాలు ఉన్నారు. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో కొడంగల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటలు, కాలినడకన వచ్చిన భక్తులకు 2గంటల సమయం పడుతోంది.

07:45 - February 9, 2016

 నాగశౌర్య, మాళవిక నాయర్‌ హీరోహీరోయిన్లుగా నందిని రెడ్డి దర్శకత్వంలో శ్రీరంజిత్‌ మూవీస్‌ పతాకంపై కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణ వైభోగమే'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'ఆడియో వేడుక నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ను మా చిత్రం తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రదర్శన హక్కులను 'అభిషేక్‌ పిక్చర్స్‌' సంస్థ సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవల కాలంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను విడుదల చేసిన ఈ సంస్థ మా సినిమా విడుదల హక్కులను కూడా దక్కించు కోవడం విశేషం. ప్రస్తుతం యువతలో ప్రేమ, పెళ్ళిలాంటి బంధాలపై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికీ చక్కగా అర్ధ మయ్యేలా రూపొందించిన చిత్రమిది. సున్నితమైన భావోద్వేగాలకు వినోదం, సంగీతాన్ని సరైన పాళ్ళలో మేళవించి తెరకెక్కించిన కుటుంబ కథా చిత్ర మిది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ నెలాఖరులోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు. రాశి, ఐశ్వర్య, ఆనంద్‌, రాజ్‌ మదిరాజ్‌, తాగుబోతు రమేష్‌, ధన్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణ్‌ కోడూరి, కెమెరా: జి.వి.ఎస్‌.రాజు, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిక్‌.

07:43 - February 9, 2016

నటనని మెరుగుపర్చుకోవడమే కాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తెలుగునాట హీరోయిన్‌గా మంచి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రవితేజ వంటి హీరోల సరసన నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. 

తాజాగా 'సరైనోడు'లో అల్లు అర్జున్‌కి జోడీగా నటిస్తోంది. ఇదిలా ఉంటే, మరోమారు రామ్‌చరణ్‌ సరసన నటించే అవకాశాన్ని రకుల్‌ దక్కించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో 'బ్రూస్‌లీ ద ఫైటర్‌' వచ్చిన సంగతి విదితమే. తమిళనాట సంచలన విజయం సాధించిన 'తని ఒరువన్‌' తెలుగు రీమేక్‌ను రామ్‌చరణ్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రకుల్‌ని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ కార్యక్రమాలు ఈనెల మూడోవారం నుంచి ప్రారంభం కానున్నాయని సమాచారం.

07:27 - February 9, 2016

 'నేను శైలజ' సాధించిన విజయం తర్వాత ఇటీవలే నితిన్‌ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాన్ని దర్శకుడు కిషోర్‌ తిరుమల పొందిన విషయం విదితమే. ఇదిలా ఉంటే, వెంకటేష్‌ హీరోగా మరో సినిమాని చేసే ఛాన్స్‌ని దక్కించుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రాన్ని మల్టీడైమన్షన్‌ రామ్‌మోహన్‌ నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ''నేను శైలజ' చిత్రం తర్వాత వెంకటేష్‌కి కథ చెప్పడం జరిగింది. ఆయనకి కథ నచ్చడంతో ప్రాజెక్టు ఓకే చేశారు. వెంకటేష్‌ లాంటి అగ్ర హీరోను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టు వర్క్‌ చేస్తున్నాను. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పూర్తయిన తర్వాత మా చిత్రం ఉంటుంది. వెంకటేష్‌ అభిమానులు ఎలాంటి అంశాలుంటే ఎంజారు చేస్తారో అలాంటి అంశాలతో కమర్షియల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతుంది. దీంతోపాటు పలు ఆసక్తికర అంశాలుంటాయి కూడా కథలో ఉన్నాయి. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాన'న్నారు.

వ్యక్తి దారుణ హత్య

విశాఖ: శ్రీహరిపురంలో ఓ వ్యక్తి దారుణ హత్య గావించపడ్డాడు. ఆస్తి తగాదాలతో అప్పలనాయుడు అనే వ్యక్తిని అతని మొదటి భార్య కూతురు, అల్లుడు బండరాయితో మోది చంపారు. 

రివాల్వర్ తో కాల్చుకుని డా.శశికుమార్ ఆత్మహత్య

హైదరాబాద్ : రివాల్వర్ తో కాల్చుకుని డా.శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్ లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిన్న డాక్డర్ ఉదయ్ కుమార్ పై శశికుమార్ కాల్పులు జరిపారు.  

నేడు ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ..

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ నేడు ఎపి సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ప్రత్యేకహోదా, రెవెన్యూ లోటు భర్తీ అంశాలపై చర్చించనున్నారు. 

 

 

Don't Miss