Activities calendar

10 February 2016

విజయవాడలో భారీగా స్తంభించిన ట్రాఫిక్...

విజయవాడ :గుణదల మేరీమాత ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌ స్తంభించింది. బెంజి సర్కిల్‌ నుంచి రామవరప్పాడు వరకు వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

21:28 - February 10, 2016

హైదరాబాద్ : పసుపుదండు గులాబీసేనగా మారిపోతోంది. గులాబీతోటకి రంగు మార్చుకుని పసుపుపచ్చ బంతిపూలు వెళ్లిపోతున్నాయి. గులాబీ ముళ్లతో సైకిల్‌కు పంచర్లు పడుతున్నాయి. గ్రేటర్‌లో గులాబీ సునామీతో పసుపుదళం అల్లాడిపోతోంది. చదరంగంలో రాజును ఒంటరి చేసి చుట్టూ సైనికులను ఒక్కొక్కరినే లాగేశారు గులాబీ దళపతి కేసీఆర్‌. చివరకు శాసనసభాపక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లినే లాగేసుకున్నారు. ఇక మిగిలింది వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే. వీరిలో ఎంతమంది క్యూలో ఉన్నారో తెలియదు. విభజన ముందు, విభజన సమయంలోను లేనంత గడ్డు పరిస్ధితిని తెలంగాణ తెలుగుదేశం ఇప్పుడు ఎదుర్కొంటోంది. తెలంగాణలో తెలుగుదేశమే లేకుండా తుడిచిపెట్టేయాలనుకున్న కేసీఆర్‌ లక్ష్యం క్లైమాక్స్‌కు చేరుకుంది. వైఎస్‌ హయాంలో గులాబీ దళాన్ని తిప్పలు పెట్టినట్లే.. నేడు కేసీఆర్‌ పసుపుదళాన్ని చిత్తు చేస్తున్నారు.

తెలంగాణలో కష్టంగా సైకిల్‌ సవారీ ....

తెలంగాణలో సైకిల్‌ సవారీ కష్టంగా మారింది. ప్రజా ప్రతినిధులంతా ఒక్కొక్కరుగా కారెక్కుతున్నారు. 2014 ఎన్నికల్లో 15 మంది సభ్యులు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. సీఎం కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్షో లేక అభివృద్ధి మంత్రమో ఏమోగానీ ఒక్కొక్కరుగా గులాబీ గూటికి చేరుతున్నారు.

తలసాని తో మొదలైన వలసలు...

తలసాని శ్రీనివాసయాదవ్‌తో మొదలైన వలసలు క్రమంగా కొనసాగుతూనే ఉన్నాయి. వివేకానంద, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సాయన్న, మాధవరం కృష్ణారావు, చల్లా ధర్మారెడ్డి ఇప్పటికే కారెక్కారు. తాజాగా.. టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజేందర్‌ నగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా పత్రాలను ఫ్యాక్స్‌లో టీడీపీ పార్టీ ఆఫీస్‌కు పంపించారు. ఇంతకు ముందే కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్‌ నేతలు సైతం టీడీపీకి గుడ్‌బై చెప్పి కారెక్కారు. దీంతో తెలంగాణలో పసుపు దళం గులాబీమయమైంది. ఇక టీడీపీలో రేవంత్‌ రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్‌, అరికపూడి గాంధీ, ఆర్‌ కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే ఉన్నారు.

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి

హైదరాబాద్ : అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. 10 రోజుల క్రితం అదృశ్యమైన ప్రవీణ్ గల్లా కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్ లో మృతదేహం లభ్యమయ్యింది.

20:48 - February 10, 2016

హైదరాబాద్ : సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో ఎర్రెబెల్లి, ప్రకాశ్ గౌడ్ టిఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ... టీడీపీ తెలంగాణలో బతికే అవకాశం లేదని ఎర్రబెల్లి తెలిపారు. తన వ్యక్తిగత కారణాల వల్లే పార్టీ మారుతున్నానని అన్నారు. తాను చంద్రబాబునాయుడుకు ఏమాత్రం వ్యతిరేకం కాదని అన్నారు. ఆయన అంటే తనకు గౌరవమని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి కూడా ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నానని అందుకే పార్టీ మారుతున్నానని ఆయన చెప్పారు. తనకు పదవి ఇస్తానని కేసీఆర్ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. గడ్డు పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ పార్టీలో కొనసాగే కంటే పార్టీ మారడమే మేలని ఆయన చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో టీడీపీ నుంచి ఇంకొంతమంది ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరుతారని, మూడొంతుల మంది పార్టీ టీఆర్ఎస్ లో చేరితే టీడీపీ విలీనం తప్పదని ఆయన తెలిపారు.

ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నా : ప్రకాశ్ గౌడ్...

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అంటే ఎంతో గౌరవమని ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయం సాధించినా ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని అన్నారు. తనను చంద్రబాబు చాలా అభిమానంగా చూసుకున్నారని ఆయన చెప్పారు. గెలిపించిన ప్రజలకు ఏదైనా చేయాల్సిన బాద్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల మనోభావాలు గౌరవించి పార్టీ మారామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ విధానాలకు అనుగుణంగా పని చేద్దామని ఆయన పేర్కొన్నారు. టీడీపీని నొప్పించాలన్న భావం లేదని చెప్పిన ఆయన, వారు అర్ధం చేసుకోవాలని కోరారు.

20:40 - February 10, 2016

హైదరాబాద్ : పేరులో ఫ్రీ వుంది.. కానీ జరిగేది మాత్రం నిలువునా మోసమే. బేసిక్ ఇస్తారని నమ్మితే జరిగేది అడ్డంగా ఫేస్ బుక్కే. జీరో ప్లాన్ నమ్మితే మిగిలేది జీరోనే. ఇంటర్నేట్ ను గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నాలు బలంగా చేశారు. నెట్ న్యూట్రాలిటికీ గండి కొట్టాలని చాలా ప్రయత్నమే చేశారు. కానీ ట్రాయ్ ఈ కుట్రలను తిప్పి కొట్టింది. నెట్ న్యూట్రాలిటీకే మా ఓటు అని తేల్చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రజల విజయం. ఇంటర్నెట్ ను తస్థంగా వాడటం తమ హక్కని నినదిస్తూ ప్రజలు చేసిన పోరాటానికి దక్కిన ఫలితం ఇదే. ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:08 - February 10, 2016

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్ దిక్కు మల్లా ఓట్ల గంట, కార్పొరేషన్ కాడికి ఉరకజూస్తున్న కారు, లవర్స్ డేకు తయారవుతున్న బజరంగ దళం, ఫిబ్రవరి 14 లవర్స్ అందరికీ అలర్ట్, ఆదిలాబాద్ లో ఆడిపాడుతున్న అడవి బిడ్డలు,తెల్లబట్టలు ఏసుకొని కులంలో కలిసిన పిల్లలు, సిలిగిరి వూరిని చీల్చి చెండాడిన ఏనుగు.. భయంతో పబ్లిక్ అంతా పరుగో పరుగు,బస్తాలు మోస్తున్న బాహుబలి క్యారెక్టర్, ఆటోనడుపుతున్న అక్కినేని నిఖిల్ ఇలాంటి అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మసాల విశ్లేషణను మీరూ వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

ఎర్రబెల్లి ఓ కోవర్టు : సండ్ర

హైదరాబాద్ : ఎర్రబెల్లి పార్టీలో ఉండి ఎప్పట్నుంచో అధికార పార్టీకి ఓ కోవర్టులా పని చేస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యానించారు. కొద్ది సేపటి క్రితం ఆంధ్రజ్యోతితో మాట్లాడిన సండ్ర..ఓ ఫ్లోర్ లీడర్‌గా భాద్యతలు అప్పగిస్తే..ఇంతటి దుర్మార్గానికి ఒడికట్టడం ఎర్రబెల్లికి తగదని ఆయన చెప్పారు. అక్షరం ముక్కరాని ఎర్రబెల్లిని ఎమ్మెల్యే , వర్కింగ్ ప్రసిడెండ్, ఫ్లోర్ లీడర్‌గా చేసినందుకు ఎర్రబెల్లి చేయాల్సిన పని మాత్రం ఇది కాదని ఎర్రబెల్లి తీరును ఆయన ఖండించారు.

19:53 - February 10, 2016

హైదరాబాద్ : ప్రజల భాగస్వామ్యంతోతెలంగాణ అభివృద్ధి సాధిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... 15 జీహెచ్ ఎంసీ ఎజెండా ప్రకటిస్తామన్నారు. జీహెచ్ ఎంసీ ఆదాయం పెంచుకోవడానికి సూచనలు చేసినట్లు తెలిపారు. వివిధ రంగాల నిపునలతో కార్పొరేట్లకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. యుఎఫ్ఐడీసీ ద్వారా నిధులు సమకూర్చుకుంటామన్నారు. ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రజలు తప్పకుండా పన్నులు చెల్లించాలని స్పష్టం చేశారు. లేదంటే కఠిన చట్టాలు రూపొందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

19:41 - February 10, 2016

హైదరాబాద్ : అమ్మ కడుపు నుంచి బయటకి రావడానికి తొమ్మిది నెలలే... పార్టీ పెట్టి అధికారంలోకి రావడానికి తొమ్మిది నెలలే అని నాడు తారకరాముడు చేసి చూపించాడు. ఆ రాముడు పెట్టిన తెలుగుదేశం 33 ఏళ్లు వచ్చేసరికి మూడు సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటి సంక్షోభానికి ఏపీ చంద్రుడు పరోక్షంగా కారణమైతే.. రెండోదానిని నడిపించిందే ఆయన. ఇక మూడో సంక్షోభానికి ఆయనే బాధితుడు. ఇక తెలంగాణ చంద్రుడు మొదటిదానికి నేత్రధారి.. రెండోదానికి పాత్రధారి.. ఇప్పుడు జరుగుతున్న మూడోదానికి సూత్రధారి.

మార్చి 29, 1982 టిడిపి ఆవిర్భావం...

మార్చి 29, 1982న తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో టీడీపీ ఆవిర్భవించింది. అప్పటికే సినిమాల్లో అశేష అభిమానులను సంపాదించుకున్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీకి నాంధి పలికారు. కాంగ్రెస్‌ పార్టీతో దేశంలో అవినీతి పెరిగిపోతుందని.. టీడీపీని ఆదరించాలంటూ పల్లెపల్లెకు చేరుకున్నారు. సుమారు 75 వేల కిలోమీటర్లు తిరిగి ప్రచారం చేశారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. 294 స్థానాలకు గాను 199 సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 9 జనవరి 1983న ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి కంటగింపుగా.....

కాంగ్రెస్‌ కోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయపార్టీ అధికారం చేపట్టడం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి కంటగింపుగా మారింది. ఎలాగైనా తమ అనుకూలురు సీఎంగా ఉంటే చూడాలనుకుంది. ఇంతలోనే హర్ట్‌ సర్జరీ కోసం ఎన్టీఆర్‌ అమెరికా వెళ్లారు. ఆగస్టు 15, 1984లో నాదెండ్ల భాస్కర్‌రావు తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. అప్పటి గవర్నర్‌ రామ్‌లాల్‌ నాదెండ్లతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదంతా ఇందిరా కనుసన్నల్లో జరిగిందని ఎన్టీఆర్‌ విమర్శించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్‌ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయాన్ని ప్రజలకు వివరిచేందుకు చైతన్య రథాన్ని ప్రయోగించారు. కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీలైన.. జనతాపార్టీ, భారతీయ జనతాపార్టీ, లెఫ్ట్‌ ఫ్రంట్‌, డీఎంకే, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మద్దతు కూడగట్టారు. ఇక తప్పదనుకున్నకేంద్రం వెనక్కి తగ్గింది. సరిగ్గా 31 రోజులపాటు సీఎం కుర్చీలో కూర్చున్న నాదెండ్ల భాస్కర్‌రావు గద్దె దిగాల్సి వచ్చింది. ప్రజా మద్దతుతో 1985లో రెండోసారి సీఎం అయ్యారు ఎన్టీఆర్‌.

1989లో టీడీపీ ఓడిపోయినా..

1989లో టీడీపీ ఓడిపోయినా.. తర్వాత 1994లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందింది. లెఫ్ట్‌ ఫ్రంట్‌తో పొత్తు పెట్టుకుని 250 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో టీడీపీకి సొంతంగా 226 సీట్లు వచ్చాయి. గ్రేట్‌ విక్టరీయే అయినా.. సీఎంగా ఎన్టీఆర్‌కు ఎక్కువ కాలం సంతోషమే లేకుండా పోయింది. కేవలం 9 నెలల్లోనే ఇంటి పోరు మొదలైంది. ఆగస్టు 23, 1995లో అల్లుడు నారా చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేశారు. లక్ష్మీపార్వతి వైఖరి వల్ల పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందంటూ చంద్రబాబు టీడీపీ నేతలను తనవైపు తిప్పుకున్నారు. వైస్రాయ్‌ హోటల్‌లో సమావేశం పెట్టి మెజార్టీ సభ్యులు తనవైపే ఉన్నారంటూ ప్రచారం చేసుకున్నారు. టీడీపీ పార్టీ తనదే అంటూ చంద్రబాబు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయిన ఎన్టీఆర్‌ పదవిని సైతం కోల్పోయారు. సెప్టెంబర్‌ 1, 1995లో చంద్రబాబు సీఎంగా పదవిని చేపట్టారు. టీడీపీలో 1984, 1995లో రెండుసార్లు జరిగిన సంక్షోభాలు ఆగస్టు నెలలోనే ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ప్రతిపక్ష పార్టీగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.....

ప్రతిపక్ష పార్టీగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దాదాపు పదేళ్లపాటు పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు. 2014 సాధారణ ఎన్నికలనాటికి టీడీపీ పరిస్థితి అయోమయంగా మారింది. తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ కోలుకోలేని విధంగా దెబ్బతీస్తూ వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్‌తో పార్టీలో చంద్రబాబు తర్వాత తామే అన్న స్థాయిలో ఉన్న దేవేందర్‌గౌడ్‌, నాగం జనార్దన్‌రెడ్డి లాంటి నేతలు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. సీమాంధ్రలో జగన్‌ దూకుడు కూడా టీడీపీని సమస్యల్లోకి నెట్టింది. అయితే చంద్రబాబు రాజకీయ చతురతతో..సీమాంధ్రలో పార్టీకి ఉన్న పట్టును కాపాడుకుంటూ వచ్చారు. తెలంగాణలో మాత్రం పార్టీని.. ప్రజాప్రతినిధులను కాపాడుకోలేని నిస్సహాయస్థితి నెలకొంది.

తెలంగాణలో 15 మంది టీడీపీ సభ్యులు ఎమ్మెల్యేలుగా

2014 సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో 15 మంది టీడీపీ సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్షో.. లేక అభివృద్ధి నినాదమో ఎదైతేనేం.. మొత్తానికి మెజార్టీ టీడీపీ సభ్యులు కారెక్కేశారు. తెలంగాణలో అసలైన టీడీపీ తమదే అంటూ పార్టీ మారిన శాసనసభ్యులు ప్రకటించినా ఆశ్చర్యపోని పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యేనాటికి తెలంగాణ తెలుగుదేశంలో ఒకరిద్దరు శాసనసభ్యుల మాత్రమే ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

30 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు....

మొత్తం మీద తెలుగుదేశం పార్టీ 30 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. ప్రతి ఒడిదొడుకుల్లోనూ భారీగానే మూల్యం చెల్లించుకుంది. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో పార్టీకి నిన్న మొన్నటి వరకు అండగా ఉన్న క్యాడర్‌ కూడా రాబోయే రోజుల్లో దారితప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు భవిష్యత్తులో చంద్రబాబు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారో చూడాలి.  

19:35 - February 10, 2016

హైదరాబాద్ :టిడిపి ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్ టిఆర్ ఎస్ చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తమ రాజీనామా లేఖను చంద్రబాబు కు ఫ్యాక్స్ ద్వారా తెలిపినట్లు ప్రకటించారు. సీఎం క్యాప్ ఆఫీసులో కేసీఆర్ తో టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. తెలంగాణ గెలిచిన 15 మంది టిడిపిఎమ్మెల్యేలు గెలవగా వారిలో 9 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడగా... మరో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టిడిపిలో ఉన్నారు.

టిఆర్ ఎస్ లో చేరిన ఎర్రబెల్లి,ప్రకాష్ గౌడ్

హైదరాబాద్ :ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్ టిఆర్ ఎస్ చేరినట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ తో టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు.

19:19 - February 10, 2016

హైదరాబాద్ :గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్‌ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా బోరబండ కార్పొరేటర్‌ ఫసీయుద్దీన్‌ పేరు ఫైనలైనట్లు సమాచారం. ఈ రెండు పేర్లను కేసీఆర్‌ ఓకె చేశారని.. రాత్రికి అధికారిక ప్రకటన చేస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. రేపు గ్రేటర్‌ కార్పొరేటర్ల సమావేశానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. రేపు ఉదయమే మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక లాంఛనప్రాయంగా పూర్తయ్యాక..బొంతు రామ్మోహన్‌, ఫసీయుద్దీన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

19:14 - February 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ టిడిపికి మరో షాక్ తగలనుంది. టిడిపి సీనియర్ నేత ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీ, గోపీనాథ్ కూడా టిఆర్ ఎస్ లో చేరనున్నట్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గ్రేటర్ లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బాధ్యతలు కేటాయించడం పై ఎర్రబెల్లి పార్టీలో ఒంటరి చేశారనే మీడియా ప్రతినిధుల ముందు ఆవేదన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. మంత్రి హరీష్ రావుతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా భంగం వాటిల్లే అవకాశం ఉన్నట్లు నేతలు భావిస్తున్నారు. అంతే కాకుండా గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దానం నాగేందర్ కూడా టిఆర్ ఎస్ చేరతారని వార్తలు గుప్పుమంటున్నాయి. గ్రేటర్ లో క్షేత్ర స్థాయిలో బలంగా ఉండేందుకే టిఆర్ఎస్ ఆకర్ష్ మంత్ర బాగా ఉపయోగపడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. 2019 ఎన్నికల టార్గెట్ గానే టిఆర్ ఎస్ పావులు కదుపుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

మేయర్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ !

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా చర్లపల్లి నుండి కార్పొరేటర్ గా గెలిచిన బొంతు రామ్మోహన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ గా ఫసీయుద్దీన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

టిఆర్ ఎస్ లోకి ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్!

హైదరాబాద్ : టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్, ప్రకాష్ గౌడ్ టిఆర్ ఎస్ లో చేరనున్నట్లు మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావుతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

మెట్ పల్లిలో ముగ్గురు దొంగల అరెస్ట్...

కరీంనగర్ : మెట్‌పల్లిలో ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న తులంన్నర బంగారం, బైక్‌, ఎల్‌ఈడీ టీవీ, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగల వెనుక ఏదైనా ముఠా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

మరింత క్షీణించిన హనుమంతప్ప ఆరోగ్యం

హైదరాబాద్ :ఆర్మీ జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చికిత్సకు ఆయన శరీరం సహకరించడం లేదని పేర్కొన్నారు. మంచులో ఎక్కువ రోజులు ఉండటంవల్ల రక్తపోటు తగ్గిందని, వెంటి లేటర్ పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఆర్మీ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న హనుమంతప్పను కర్ణాటక రెసిడెంట్ కమిషనర్ అతుల్ కుమార్ ఇవాళ చూశారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

18:21 - February 10, 2016

పశ్చిమ గోదావరి : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనపై దాడి చేశారంటూ ఏలూరుకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ మధు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంబించారు. తన అనుచరుడి ఇంటి తగాదాలో చింతమనేని జోక్యం చేసుకున్నారని, ఈ సమయంలోనే కానిస్టేబుల్ పై ఆయన దాడి చేసినట్టు తెలిసింది. గతంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని, ఆయన అనుచరులు దాడి చేశారు. అప్పట్లో ఈ ఘటన కలకలం రేపింది. మరో సారి వివాదం లో ఇరుక్కున్న చిన్నమనేనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

18:17 - February 10, 2016

హైదరాబాద్ : మేయర్, ఉప మేయర్‌ అభ్యర్థుల ఎంపిక ఉత్కంఠగా మారింది. గురువారం(రేపు) ఉదయం ఎనిమిది గంటలకు గ్రేటర్‌ కార్పొరేటర్ల సమావేశం మంత్రి కేటీఆర్‌ అధ్యక్షత జరగనుంది.మేయర్, ఉప మేయర్‌ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ సమావేశానికి గ్రేటర్‌ ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరుకానున్నారు. 

18:03 - February 10, 2016

హార్దిక్‌ పాండ్యా, జస్ప్రీత్‌ బుమ్రా వంటి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉందంటూ సంబరపడిపోతున్నారు ముంబై ఇండియన్స్‌ జట్టు యజమాని నీతా అంబానీ.ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తమ జట్టు తరఫున అద్భుతంగా రాణించిన....పాండ్యా, జస్ప్రీత్‌ బుమ్రా ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా మారడం...ముంబై ఇండియన్స్‌ జట్టు యజమానిగా తనకు గర్వకారణంగా ఉందని నీతా అంబానీ ఉప్పొంగిపోతున్నారు.

18:02 - February 10, 2016

స్టీల్ సిటీ విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగే టీమిండియా- శ్రీలంక జట్ల ఆఖరి టీ-20 మ్యాచ్ టికెట్ల ను మీ సేవ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నట్లు విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఏసీఏ – వీడీసీఏ స్టేడియాన్ని ఈమ్యాచ్ కోసం సకలహంగులతో ముస్తాబు చేశారు. మొత్తం 12 వేల టికెట్లు మాత్రమే అభిమానులకు అందుబాటులో ఉంటాయి. 18 మీ సేవా కేంద్రాల ద్వారా టికెట్ల సేల్ ఈరోజు నుంచి ప్రారంభించారు. 3 వేల రూపాయల నుంచి 300 రూపాయల ధరకు..మొత్తం ఆరు రకాల టికెట్లు విక్రయానికి ఉంచారు. 300, 600 రూపాయల టికెట్ల కోసం సాధారణ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు..

17:59 - February 10, 2016

శ్రీలంకతో పూణేలో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో తమజట్టుకు ఓటమి ఎదురు కావడాన్ని టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తేలిగ్గా తీసుకొన్నాడు. బ్యాటింగ్ లో విఫలమైనా బౌలర్లు గొప్పగా పోరాడారని కితాబిచ్చాడు. మరోవైపు..మితిమీరిన ఆత్మవిశ్వాసమే ధోనీసేనఓటమికి కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వన్ డౌన్ తో ఒత్తిడిలో పడిపోయిందన్నది నిజంగా నిజం. క్రికెట్ ఫార్మాట్ ఏదైనా...నిలకడలేమికి మరోపేరు టీమిండియా అని పదేపదే రుజువవుతూనే వస్తోంది. ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించడం ద్వారా...తిరిగి టాప్ ర్యాంక్ కైవసం చేసుకొన్న ధోనీసేన జోరుకు...3వ ర్యాంకర్ శ్రీలంక...తొలి మ్యాచ్ లోనే పగ్గాలు వేసింది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో..టీమిండియాను శ్రీలంక ఐదు వికెట్లతో చిత్తు చేసి..1-0 ఆధిక్యం సంపాదించింది. అంతేకాదు...పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను కేవలం 18.5 ఓవర్లలోనే 101 పరుగులకే శ్రీలంక పేసర్లు కుప్పకూల్చగలిగారు. అయితే...యువఆటగాళ్లతో కూడిన శ్రీలంక చేతిలో తమకు ఘోరపరాజయం ఎదురైనా...టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం..ఏమాత్రం పట్టించుకొన్నట్లుగా కనిపించడంలేదు.

గెలుపు ఓటములు..సహజమంట..
అదేమంటే...టీ-20 క్రికెట్లో గెలుపు, ఓటములు సహజమని...పొరపాటు వెంట పొరపాటు చేస్తూ ఉంటే...పుంజుకోడానికి అవకాశమే ఉండదని చెప్పాడు. క్రికెట్ ఫార్మాట్ ఏదైనా...విజయం సాధించాలంటే భాగస్వామ్యాలు ముఖ్యమని..పూణే మ్యాచ్ లో తాము భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోయామని...పిచ్ ను సైతం తమ బ్యాట్స్ మన్ అంచనా వేయలేక..పొరపాటు షాట్లు ఆడారని ధోనీ విశ్లేషించాడు. బ్యాటింగ్ లో విఫలమైనా, ప్రత్యర్థి ఎదుట 101 పరుగుల అతితక్కువ లక్ష్యం ఉంచినా తమ బౌలర్లు తుదివరకూ పోరాడారని కొనియాడాడు. మరోవైపు... వీవీఎస్ లక్ష్మణ్ లాంటి ..క్రికెట్ విశ్లేషకులు మాత్రం..ధోనీ వ్యూహాన్ని తప్పుపట్టారు. పిచ్ తీరుతెన్నులను ధోనీ కచ్చితంగా అంచనా వేయలేకపోయాడని దీనికి తోడు నెహ్రా, అశ్విన్ ఓవర్లను పూర్తిగా ఉపయోగించుడంలో విఫలమయ్యాడని వీవీఎస్ అంటున్నాడు. ప్రత్యర్థిని తక్కువగా అంచనావేయటం, మితిమీరిన ఆత్మవిశ్వాసం ధోనీ సేన వైఫల్యానికి కారణమని మరికొందరు విశ్లేషకులు తేల్చి చెప్పారు. ఏది ఏమైనా మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ లో ప్రపంచ నెంబర్ వన్ జట్టు వన్ డౌన్ తో ఒత్తిడిలో పడిపోయిందన్నది నిజంగా నిజం.

మళ్లీ చిక్కుల్లో సల్మాన్ ఖాన్

ఢిల్లీ : కండలవీరుడు, నటుడు సల్మాన్ ఖాన్ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. హిట్ అండ్ రన్ కేసులో హైకోర్టు తీర్పుపై బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ ఈనెల 12కు వాయిదా పడింది.

'డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు'

హైదరాబాద్ : మార్చి 1 నుండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలుకు కూడా పంపిస్తామని ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి వర్తించే కేసులే డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై కూడా పెడతామని హెచ్చరించారు.

మరో వివాదంలో ఎమ్మెల్యే చింతమనేని...

పశ్చిమ గోదావరి : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనపై దాడి చేశారంటూ ఏలూరుకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ మధు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఓ సివిల్ తగాదాలో చింతమనేని జోక్యం చేసుకున్నారని, ఈ సమయంలోనే కానిస్టేబుల్ పై ఆయన దాడి చేసినట్టు తెలిసింది. గతంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని, ఆయన అనుచరులు దాడి చేశారు. అప్పట్లో ఈ ఘటన కలకలం రేపింది.

సెట్ కన్వీనర్ లను ప్రకటించిన టి.ఉన్నత విద్యామండలి

హైదరాబాద్ : సెట్ కన్వీనర్ లను తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ సెట్ - యాదయ్య, ఐ-సెట్ - ఓం ప్రకాశ్, ఎంసెట్ - రమణారావు, పీజీ సెట్ -ఎస్ రామచంద్రం, ఎడ్ సెట్ - పి.ప్రసాద్, లాసెట్, పీజీలాసెట్ - ఎంవి రంగారావు, పీఈ సెట్ కన్వీనర్ గా ప్రభాకర్ ను నియమించారు.

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లు బుధవారం కూడా నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 262.08 పాయింట్లు నష్టపోయి 23760 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 82.50 పాయింట్లు నష్టపోయి 7216 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 67.87 వద్ద కొనసాగుతోంది.

16:57 - February 10, 2016

కరీంనగర్: ఎండిన పంటకు నష్టపరిహారం ప్రకటించాలని.. కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ సీపీఐ కార్యకర్తలు, రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజాసమస్యలు మరిచి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆకర్షించే పనిలో నిమగ్నమైందంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.

16:53 - February 10, 2016

కరీంనగర్ : హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో మంటల్లో చిక్కుకుని ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం కల్లేపల్లి వీరవ్వ తన ఇంటిముందున్న చెత్తను కాల్చేందుకు నిప్పు పెట్టింది. ఆ మంటలు కాస్తా ఆమె కప్పుకున్న దుప్పటికి అంటుకుని వృద్ధురాలు సజీవ దహనమైంది. ఈ ప్రమాద సమీపంలో ఎవరూ లేకపోవడంతో వృద్ధురాలిని కాపాడలేకపోయారు. ఆ తర్వాత గమనించిన ఆమె బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

16:52 - February 10, 2016

నిజామాబాద్ : దళిత యువకులను హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్య, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి తమ్మినేని హాజరయ్యారు. ఈ కేసుపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

16:50 - February 10, 2016

విజయవాడ : ఇండియన్ సెల్యూలార్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పంకజ్‌ మహీందో ఏపీ ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో భేటీ అయ్యారు. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ఐటి శాఖ ఉన్నతాధికారులతోపాటు సెల్‌కాన్‌ ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీలో ప్రతిపాదించిన ఫాక్స్‌కాన్, కార్బన్‌, సెల్‌కాన్‌, మైక్రోమ్యాక్స్ కంపెనీల పురోగతిపై పంకజ్ మంత్రితో చర్చించారు. సెల్‌-ఎలక్ట్రానిక్ పరిశ్రమకు ఏపీ సర్కార్‌ ఇస్తోన్న సహకారంపై ఆయన కృతజ్ఙతలు చెప్పారు. రాష్ట్రంలో సెల్ ఎలక్ట్రానిక్‌ ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. 

16:48 - February 10, 2016

శ్రీకాకుళం : జిల్లాలోని ట్రైమెక్స్ కర్మాగారం అడ్డగోలుగా చేస్తున్న మైనింగ్ వ్యవహారంపై 10 టీవీ కథనానికి ప్రజల్లో అధికారుల్లో స్పందన వస్తోంది. అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ హెచ్చరికలు పట్టించుకోకుండా యధేచ్చగా మైనింగ్ పాల్పడుతు న్న కంపెనీపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా అరుదైన ఆలీవ్ తాబేళ్లు అంతరించిపోతున్నాయని పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

16:37 - February 10, 2016

మెదక్ :తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే అధికార పార్టీ అభ్యర్థి భూపాల్ ను గెలిపించాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా టిఆర్ఎ స్ నిర్వహించి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి చెందాలన్నారు. రూ.35 వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, వెయ్యి రూపాల పెన్షన్ గ్రేటర్ గెలుపు నాంది పలికిందన్నారు. నారాయణ ఖేడ్ లో 34వేల మందికి పెన్షన్ ఇస్తున్నామన్నారు.. పేదలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా డబల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చేది టిఆర్ ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. గట్ లింగం పల్లి ప్రాజెక్టు తెచ్చి మీ కాళ్లు కడిగే బాధ్యత నదని కేసీఆర్ అన్నారు. సిద్ధి పేటలా నారాయణ ఖేడ్ ను చేస్తానని హరీష్ హామీ ఇచ్చారని... హరీష్ మాటను నిలబెడతానని... ఎమ్మెల్యే భూపాల్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, టిడిపిల పరిపాలనలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసునని.. అభివృద్ధి కావాలంటే అధికారంలోకి టిఆర్ ఎస్ రావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అనంతరం రెండు రోజుల పాటు నారాయణ ఖేడ్ లో ఉండి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏ అభ్యర్థి గెలిస్తే నారాయణ ఖేడ్ అభివృద్ధి చెందుతుందో మేధావులు ఆలోచించాలన్నారు. ప్రజలకు ఏది అవసరమో అది చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి నల్ల పెట్టి మంచినీరు అందించే పథకానికి నారయణ ఖేడ్ కు కూడా అమలు చేస్తానన్నారు. 

విశాఖ సబ్ రిజిస్ట్రార్ పోతురాజు ఇంటిపై ఏసీబీ దాడులు

విశాఖపట్నం : నగరంలోని సబ్ రిజిస్ట్రార్ పోతురాజు ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం దాడి చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. అతడి బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడుల చేశారు. ఇప్పటి వరకు రూ. కోటి 20 లక్షలకు పైగా ఆస్తులను ఏసీబీ గుర్తించినట్లు తెలిసింది. అయితే దాడులు కొనసాగుతున్నాయి. పోతురాజు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు.  

విషమంగానే హనుమంతప్ప ఆరోగ్యం: ఆర్మీ వైద్యులు...

హైదరాబాద్ : ఆర్మీ జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మంచులో ఎక్కువ రోజులు ఉండటంవల్ల రక్తపోటు తగ్గిందని, వెంటి లేటర్ పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అయితే ఆరు రోజుల పాటు మంచులో ఉన్నప్పటికీ ప్రాణాలతో ఎలా ఉండగలిగాడన్నది అతను స్పృహలోకి వస్తేనే తెలుస్తుందని, అంతరవకు ఏం జరిగిందో చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. ఆర్మీ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న హనుమంతప్పను కర్ణాటక రెసిడెంట్ కమిషనర్ అతుల్ కుమార్ ఇవాళ చూశారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

15:43 - February 10, 2016

హైదరాబాద్ : గచ్చిబౌలిలో తప్పిపోయిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుశ్రీ పటాన్‌చెరులోని సాకి చెరువు వద్ద ఆచూకీ లభించింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుశ్రీ మానసిక పరిస్థితి సరిగా లేదని వైద్యులు తెలిపారు. ట్రీట్‌మెంట్‌ అనంతరం ఆమెను గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  

15:42 - February 10, 2016

వరంగల్ : ఎక్స్ పైర్డ్ కూల్ డ్రింక్ తాగి ఇద్దరు గొర్ల కాపరులు అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. పరకాల మండలం వరికోల్ గ్రామానికి చెందిన రచమల్ల కనుకయ్య , కంచు కొంరయ్యతో పాటు మరో గొర్ల కాపరి ఎండ తీవ్రతను తట్టుకునేందుకు కూల్ డ్రింక్ తాగారు. తాగిన వెంటనే అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని గ్రామస్థులు యంజియం ఆసుపత్రికి తరలించారు. కూల్ డ్రింక్ తాగిన ఇద్దరు గొర్ల కాపరుల పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు.

15:40 - February 10, 2016

తిరుపతి : తిరుమల లో శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ఉత్సవం రథసప్తమి.. ఈ నెల 14 న జరగనున్న రధసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీనివాసుడు ఒకేరోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శమివ్వనున్నారు. ఇందుకు గాను టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు , వికలాంగులు , వృద్దులు చంటిపిల్లల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

15:38 - February 10, 2016

కడప : వేలమైళ్ల దూరంలో ఉన్న సైబీరియా నుంచి తరలివచ్చిన కొంగలు కడప జిల్లా గోపవరం మండలంలోని బేతాయపల్లె, బెడుసుపల్లె గ్రామాల్లో విడిది చేస్తున్నాయి. ఈ ఎర్రకాళ్ల సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ గ్రామాల్లో సందడి నెలకొంది.

శీతాకాలంలో సైబీరియా నుంచి ఎర్రకాళ్ల కొంగలు.....

జిల్లాలోని బేతాయపల్లె, బెడుసుపల్లె గ్రామాలకు శీతాకాలంలో సైబీరియా నుంచి ఎర్రకాళ్ల కొంగలు తరలిరావడం ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతోంది. తీవ్ర వర్షాభావం కారణంగా మూడేళ్ల నుంచి ముఖం చాటేసిన ఎర్రకాళ్ల కొంగలు మళ్లీ ఈ ఏడాది వచ్చాయి. గ్రామంలోని చెరువుగట్ల మీద వున్న చెట్లపై విడిది చేస్తున్నాయి. దీంతో ఈ గ్రామాల్లో సందడి నెలకొంది. శీతాకాలంలో సైబీరియాలో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోతాయి. దీంతో ఎముకలు కొరికే చలినితట్టుకోలేక.. ఈ కొంగలు సమశీతోష్ణ ప్రాంతాలకు తరలివస్తుంటాయి. ఈ క్రమంలోనే మూడేళ్ల తర్వాత ఎర్రకొంగలు తరలిరావడంతో వీటిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బేతాయపల్లె, బెడసుపల్లెకు తరలివస్తున్నారు.

డిసెంబర్‌-జనవరిలో విదేశీ కొంగలు....

డిసెంబర్‌-జనవరిలో విదేశీ కొంగలు ఈ ప్రాంతానికి వస్తాయి. గుడ్లుపొదిగి సంతానాన్ని ఉత్పత్తి చేసి, నాలుగు నెలలు ఉంటాయి. ఇక్కడ ఎండలు ముదిరిన తర్వాత పిల్లలను తీసుకుని మళ్లీ సైబీరియా వెళ్లిపోతాయి. ఏటా వచ్చే ఈ విదేశీ అతిథులను అపురూపంగా చూసుకుంటామని గ్రామస్థులు చెబుతున్నారు.

మూడేళ్ల తర్వాత....

మూడేళ్ల తర్వాత సైబీరియా కొంగలు రావడం పట్ల బేతాయపల్లె గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీటిని విదేశీ అతిథులగా భావిస్తున్నారు. విదేశీ విహంగాలు రావడాన్ని గ్రామస్థులు శుభసూచికంగా భావిస్తున్నారు. ఈ కొంగలు గ్రామంలో విడిది చేసినంతకాలం ప్రతికుటుంబంలో మనశాంతి ఉంటుందని, పంటలు బాగా పండుతాయని గ్రామస్థులు చెబుతున్నారు.

---------------------------

15:36 - February 10, 2016

ఢిల్లీ : బిజెపిపై మిత్రపక్షాలు గుర్రుగా ఉన్నాయి. ఎన్డీయేలో బిజెపి ఒంటెద్దు పోకడను సహించలేక పోతున్నాయి. మిత్రపక్షాల పట్ల బిజెపి పెద్దన్నగా వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలంటూ హెచ్చరించాయి. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బిజెపి మిత్రపక్షాలను దువ్వే పనిలో పడింది.                                                                                        

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు...

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభానికి ముందు బిజెపి నేతృత్వంలో మిత్రపక్షాల సమావేశం జరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో సమన్వయంతో ముందుకు సాగాలని బిజెపి చీఫ్‌ అమిత్‌షా సూచించారు.

బయటపడ్డ లుకలుకలు...

ఎన్డీయే పక్షాల సమావేశంలో లుకలుకలు బయటపడ్డాయి. అధికారపార్టీ బిజెపి పెద్దన్నలా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డట్టు సమాచారం. మిత్రపక్షాలకు బిజెపి ప్రాధాన్యత నివ్వడం లేదని టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మిత్రపక్షాలను బలోపేత చేయాలని సూచించారు.

టిడిపికి అకాళిదళ్‌, శివసేన తోడు.....

టిడిపికి అకాళిదళ్‌, శివసేన తోడయ్యాయి. మిత్రపక్షాలు ఏం కోరుతున్నాయో బిజెపి పట్టించుకోవడం లేదని అకాళిదళ్‌ దుయ్యబట్టింది. ఎన్డీయే అధినేతగా వ్యవహరించిన వాజ్‌పేయిని చూసి నేర్చుకోవాలని హితవు పలికింది. ఎన్డీయేకు అకాళిదళ్‌ రాం రాం చెబుతోందని గత కొన్ని నెలలుగా పంజాబ్‌లోని బిజెపి నేతలు చేస్తున్న ప్రచారంపై క్లారిటీ ఇవ్వాలని స్పష్టం చేసింది. బిజెపికి ముస్లింలు, క్రిస్టియన్లు దూరమయ్యారని తీవ్రంగా హెచ్చరించింది. బిజెపికి మద్దతుగా నిలిచిన సిక్కులను కూడా దూరం చేసుకుంటారా అని ప్రశ్నించింది.బిజెపితో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న శివసేన- గత 20 నెలలుగా బిజెపి మిత్రపక్షాలకు ప్రాధాన్యత నివ్వడం లేదని పేర్కొంది.

ఎంతవరకు సహకరిస్తాయన్నది ఆసక్తికరమే...

బిజెపిపై అసంతృప్తితో రగిలిపోతున్న మిత్రపక్షాలు పార్లమెంట్‌ సమావేశాల్లో అధికారపార్టీకి ఎంతవరకు సహకరిస్తాయన్నది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా రాజ్యసభలో బిజెపికి బలం లేనందున కాంగ్రెస్, ఇతర విపక్షాలను ఎదుర్కోవాలంటే మిత్రపక్షాల సహకారం తప్పనిసరి.

15:33 - February 10, 2016

హైదరాబాద్ : ముంబై దాడుల కేసులో అ్రపూవర్‌గా మారిన డేవిడ్‌ కోలమన్‌ హెడ్లీ రెండో రోజు కూడా ముంబై కోర్టు ముందు హాజరయ్యాడు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు జరిపిన విచారణలో ఉగ్రవాద సంస్థలు జైష్‌-ఎ-మహ్మద్‌, లష్కరే తొయిబాలకు పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఆర్థిక, సైనిక సహకారం అందిస్తోందని హెడ్లీ చెప్పాడు. తాను ఐఎస్‌ఐ కోసం కూడా పనిచేశానని ఈ సందర్భంగా పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన పలువురితో భేటి అయినట్టు తెలిపాడు.

2007లో హెడ్లీ తన భార్యతో పాటు ముంబైకి....

2007లో హెడ్లీ తన భార్యతో పాటు ముంబైకి వచ్చాడు. హోటల్‌ తాజ్‌లో బస చేశాడు. అప్పుడే తాజ్‌ హోటల్‌ పై దాడుల కోసం ఫొటోలు, వీడియోలు తీశాడు. ముంబైలో ప్రసిద్ధ సిద్ధి వినాయకుడి ఆలయాన్ని టార్గెట్‌ చేసినట్టు, దీనిపై తాను రెక్కీ కూడా నిర్వహించినట్టు కోర్టులో తెలిపాడు. భారత రక్షణశాఖ సైంటిస్టుల సమావేశాన్ని కూడా టార్గెట్‌ చేశామని, లష్కర్‌ మొదటి ప్లాన్‌ ఇదేనని ఆ తర్వాత మారిందన్నాడు. 2008లో జరిగిన ముంబై దాడులకు 2007లోనే పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో పథక రచన జరిగిందని పేర్కొన్నాడు. ఉగ్రవాద ట్రెయినింగ్‌ క్యాంప్‌లో లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌, జమాత్- ఉద్‌- దవా చీఫ్‌ జకీ ఉర్‌ రహ్మాన్‌తో తాను మాట్లాడినట్టు హెడ్లీ చెప్పాడు.

ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాదే ప్రధాన భూమిక....

భారత్‌లో టెర్రిరిస్టు దాడులకు ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాదే ప్రధాన భూమిక అని స్పష్టం చేశాడు. జకీ-ఉర్‌-రహ్మాన్‌ నేతృత్వంలోనే దాడుల ఆపరేషన్లు నిర్వహించారన్నాడు. లష్కరే తోయిబాతో తనకున్న సంబంధాలను తన భార్య ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేసిందని తెలిపాడు. ముంబై దాడులకు సంబంధించి తాను అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్నట్టు హెడ్లీ చెప్పాడు. 26 నవంబర్‌ 2008 కి ముందు ముంబైలో ఉగ్ర దాడులకు రెండుసార్లు ప్లాన్‌ చేసి విఫలమయ్యామని కోర్టుకు తెలిపాడు. 26/11 ఉగ్ర దాడిలో 166 మంది మృతి చెందారు.

డేవిడ్‌ హెడ్లీ అసలు పేరు దావూద్‌ గిలానీ.....

డేవిడ్‌ హెడ్లీ అసలు పేరు దావూద్‌ గిలానీ. 2006లో తన పేరును డేవిడ్‌ హెడ్లీగా మార్చుకున్నట్టు న్యాయస్థానం దృష్టికి తెచ్చాడు. దావూద్ గిలానీ పేరుతో భారత్‌లో ప్రవేశించడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో అమెరికన్‌లా పేరు మార్చుకున్నట్టు కోర్టుకు చెప్పాడు.

అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న హెడ్లీ...
అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న హెడ్లీ... ముంబై దాడుల కేసులో అ్రపూవర్‌గా మారతానని గతేడాది డిసెంబర్‌ 10న ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరాడు. దీనికి కొన్ని షరతులతో అంగీకరించిన కోర్టు.... సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. ఓ విదేశీ ఉగ్రవాది మన న్యాయస్థానం ముందు సాక్ష్యంగా చెప్పడం భారత న్యాయ చరిత్రలో ఇదే మొదటిసారి. కోర్టులో డేవిడ్‌ హెడ్లీ వీడియో కాన్ఫరెన్స్‌ విచారణ రెండోరోజుతో ముగిసింది.

మేడారం జాతరకు భద్రత కట్టుదిట్టం : ఎస్పీ

వరంగల్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ జా తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వరంగల్ పోలీసులు తయారు చేసిన మొబైల్ యాప్ యానిమేషన్‌ను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భద్రత కోసం జాతరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. జాతరకు వచ్చే భక్తులకు సరిపడా పార్కింగ్ స్థలాలను గుర్తించామని, భక్తులు పోలీసుల సూచనలను పాటించాలని కోరారు.

విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం సానుకూలం...

హైదరాబాద్ : విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి రైల్వేశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై రైల్వేశాఖ సాంకేతిక కమిటీ సమావేశమైంది. మిట్టల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జోన్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి రైల్వేజోన్‌ ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. అదేవిధంగా కాకినాడ-కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌కు కూడా కేంద్రం అంగీకారం తెలిపినట్లు తెలిసింది.

టిఆర్ ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది:కాంగ్రెస్

హైదరాబాద్ : టిఆర్ ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ మండి పడుతోంది. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ నే వాడాలని, పోలీసులు, ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తుందని విమర్శించారు.

ప.బెంగాల్ లో రోడ్డు ప్రమాదం:7గురి మృతి

కోల్‌కతా: పపశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. నేషనల్ హైవే-38పై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

15:00 - February 10, 2016

హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే రెండు పార్టీల అభ్యర్ధుల ఎంపిక కోసం ప్రైమరీస్‌ జరుగుతున్నాయి. అధ్యక్ష అభ్యర్ఢిగా బరిలో దిగేందుకు అధికార డెమాక్రాటిక్‌ పార్టీ తరుపున హిల్లరీ క్లింటన్‌, బెర్న్ శాండర్స్‌ పోటీ పడుతున్నారు. ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్ధులగా డోనాల్డ్‌ ట్రంఫ్‌, టెడ్‌ క్రూజ్‌తోపాటు ఒహాయో గవర్నర్‌ జాన్‌ కాషిస్‌, ప్లోరిడా సెనెటర్‌ మార్క్‌ రూబియో బరిలో ఉన్నారు. న్యూ హాంప్‌షైర్‌ ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంఫ్‌ గెలుపొందారు. డెమాక్రాటిక్‌ అభ్యర్ధుల్లో బెర్న్‌ శాండర్స్‌... అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్‌ను ఓడించారు. ఈనెల 1 ప్రారంభమైన ప్రైమరీస్‌ జూన్‌ వరకు కొనసాగుతాయి. యాభై రాష్ట్రాల్లో ఇవి జరుగుతాయి. రెండు పార్టీల తరుపును ఇద్దరు అధ్యక్ష అభ్యరులు నిర్ణమైన తర్వాత హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తారు. ఈ ఏడాది నవంబర్‌ 8న సాధారణ ఎన్నికలు జరగుతాయి. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుపొందిన అభ్యర్ధి 2017 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. 

14:58 - February 10, 2016

హైదరాబాద్ : పశ్చిమబంగ రాష్ట్రంలోని సిలిగురిలో ఏనుగు బీభత్సం సృష్టించింది.... జనావాసాల్లోకి ప్రవేశించిన ప్రజలను బెంబేలెత్తించింది.. బైకుంతపూర్‌ అటవీ ప్రాంతం నుంచి వచ్చి వీధుల్లో తిరుగుతూ ఇళ్లపై దాడి చేసింది.. ఏనుగు దాడిలో సుమారు 150 ఇళ్లు, ఆరు భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఏనుగును పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు... 

14:56 - February 10, 2016

హైదరాబాద్ : గెలుపోటములతో పనే లేదు.. అధికార పార్టీ హవా ఎంత ఉన్నా పోటీకి వెనుకాడని వైనం. కారు దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికల సమరానికి సై అంటున్న నేతలు.. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఫలించని ప్రతిపక్షాల వ్యూహాలు..

తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతూనే ఉంది. కారు స్పీడ్‌కు బ్రేక్‌ వేసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ఏ ప్రయత్నాలు ఫలించడం లేదు. అయినా ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధపడుతున్నాయి.

వరంగల్‌ ఎన్నికల్లో తమదే విజయమంటున్న టీఆర్‌ఎస్‌.....

తాజాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గులాబీ పార్టీకే పట్టం కట్టారు నగరవాసులు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. అయినా కూడా టీఆర్‌ఎస్‌ హవానే కొనసాగింది. ఇక జరగనున్న వరంగల్‌ ఎన్నికల్లో కూడా తమదే విజయమంటున్నారు టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు. దీంతో టికెట్ల కోసం ఆశావహులు పావులు కదుపుతున్నారు. ఎవరికి వారు తమకు తెలిసిన బడా నేతల ద్వారా రాయబారాలు నడిపిస్తున్నారు. ప్రస్తుత హవాలో తమ విజయం ఖాయమంటున్నారు నేతలు.

పోటీకి సిద్ధమంటున్న ప్రతిపక్షాలు .....

మరోవైపు ప్రతిపక్షాలు సైతం పోటీకి వెనక్కి తగ్గడం లేదు. అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తామన్న నమ్మకంతో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ హవా ఎంత ఉన్నా.. ప్రభుత్వంపై వ్యతిరేకత తమను గెలిపిస్తుందన్న ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌, బీజేపీ అధినాయకత్వాలు పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం......

ఇక గ్రేటర్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఎప్పుడు జారీ అయినా సిద్ధంగా ఉండాలని జిల్లా నేతలకు కాంగ్రెస్‌, బీజేపీ అధినాయకత్వాలు సూచించాయి. ఎన్నికల హామీలను నెరవేర్చని టీఆర్‌ఎస్‌ వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. వరంగల్‌ నగరాభివృద్ధి కేంద్రం సహకారంతోనే సాధ్యమని బీజేపీ నేతలంటున్నారు. గ్రేటర్‌ ఎన్నికలకు ప్రత్యేక మేనిఫెస్టో సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్తామంటున్నారు బీజేపీ నేతలు.

రిజర్వేషన్ల ప్రక్రియపై వామపక్షాలు అసంతృప్తి ......

ఇక ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలో రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే రిజర్వేషన్ల ప్రక్రియపై వామపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు 58 డివిజన్లలో పట్టున్న స్థానాలపై వామపక్ష పార్టీలు దృష్టి సారించాయి. రాష్ట్ర నేతలు సైతం జిల్లా నాయకులతో చర్చిస్తున్నారు. మరోవైపు పొత్తులు ఖరారైన వెంటనే ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు నేతలు. ఇదిలావుంటే ప్రధాన పార్టీల నుంచే కాకుండా స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు చాలామంది సమాయత్తమవుతున్నారు. మరి కారు జోరుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న యత్నాలకు ప్రజలు ఎంతవరకు సహకరిస్తారో వేచి చూడాలి. 

14:53 - February 10, 2016

గుంటూరు : ఏపీ తాత్కాలిక సచివాలయం నిర్మాణం మూడగులు ముందుకు... ఆరడుగులు వెనక్కి... అన్న చందంగా తయారయ్యింది. ఈ విషయంలో టీడీపీ సర్కార్‌ సరైన నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇందుకోసం పలు ప్రాంతాలను పరిశీలించి చివరికి అమరావతి పరిధిలోని వెలగపూడిలో నిర్మించాలని నిర్ణయించినా... టెండర్లు దాఖలు చేసిన నిర్మాణ సంస్థలు 23 శాతం అధికంగా కోడ్‌ చేయడంతో సర్కారు కాళ్లకు బంధాలు వేసినట్టు అయ్యింది.

అమరావతి టౌన్‌షిప్‌లో నిర్మాణానికి నిర్ణయం ....

తాత్కాలిక సచివాలయం ఏర్పాటుకు ఏపీ సర్కార్‌ గతేడాది ఆగస్టులో స్థలాన్వేషణ ప్రారంభించింది. మంగళగిరి సమీపంలోని అమరావతి టౌన్‌షిప్‌లో నిర్మించాలని ముందుగా పాలకులు నిర్ణయించారు. నిర్మాణాలు చేపడితే జాప్యం జరుగుతుందన్న ఉద్దేశంతో గన్నవరం సమీపంలోని మేధా టవర్స్‌లో ఏర్పాటు చేయాలనుకున్నారు. ఐటీరంగ పరిశ్రమల కోసం ఏర్పాటు చేసిన మేధా టవర్స్‌ను ఈ జోన్‌ నుంచి టీ నోటిఫై చేయించడానికి కేంద్రంతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపింది. అయితే ఈ భవనం సచివాలయం కోసం సరిపోతదంటూ... మళ్లీ అమరావతి టౌన్‌షిప్‌లో నిర్మాణాల కోసం టెండర్లు పిలిచి, ఖరారు చేశారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ స్ట్రక్చర్లతో తాత్కాలిక సచివాలయం నిర్మించాలని నిర్ణయించినా... ఆ తర్వాత దీనిపైనా వెనక్కి తగ్గింది.

బిడ్లు వేసిన ఎల్‌ అండ్‌ టీ, షాపూర్జీ పల్లొంజీ ......

కొత్త రాజధాని పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించి, టెండర్లు పిలిచారు. ముందుగా టెక్నికల్‌ బిడ్లు తెరిస్తే... ఎల్‌ అండ్‌ టీ, షాపూర్జీ పల్లొంజీ కంపెనీలే బిడ్లు వేశాయి. ఆర్ధిక బిడ్లు తెరిచిన తర్వాత వీటి అసలురంగు బయటపడింది. ప్రభుత్వం నిర్ణయించిన నిర్మాణ వ్యయానికి 23 శాతం అదనంగా బిడ్లు దాఖలు చేశాయి. ఈ టెండర్లు ఆమోదిస్తే ఖనాజాపై 40 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అప్పుడు మొత్తం వ్యయం 180 కోట్ల రూపాయల నుంచి 220 కోట్లకు చేరుతుందని లెక్కకట్టారు.

జీ ప్లస్‌ సెవెన్‌ నుంచి జీ ప్లస్‌ వన్‌కు..

తాత్కాలిక సచివాలయం భవనాలను ఎన్ని అంతస్తుల్లో నిర్మించాలన్న అంశంపై కూడా సీఆర్‌డీఏ అధికారుల్లో గందరగోళం కొనసాగుతోంది. ముందుగా జీ ప్లస్‌ సెవెన్‌కు డిజైన్‌ చేశారు. ఇప్పుడు జీ ప్లస్‌ వన్‌గా నిర్ణయించారు. మొత్తం ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు భవనాలను మూడుదశల్లో నిర్మించాలనుకున్నారు. మరోవైపు తాత్కాలిక సచివాలయం నిర్మాణంపై ఏ విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. టీడీపీ పాలకులు విలువైన ప్రజాధానాన్నివృధా చేస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు.

ఎల్‌ అండ్‌ టీ, షాపూర్జీ పల్లొంజీ కంపెనీలకు అవకాశం.....

సీఆర్‌డీఏ అధికారుల వైఖరి, సర్కార్‌ నిలకడలేని నిర్ణయాలు చూస్తుంటే ... తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణ బాధ్యతలను ఎల్‌ అండ్‌ టీ, షాపూర్జీ పల్లొంజీ కంపెనీలకు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని విపక్ష నాయకలు అంటున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను వచ్చే జూన్‌ నాటికి కొత్త రాజధాని అమరావతికి తరలించాలన్నప్రభుత్వం లక్ష్యం కూడా నెరవేరే చాన్స్‌ లేదన్న వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి.  

14:49 - February 10, 2016

హైదరాబాద్ : విశాఖలో టీ-20 ఫీవర్‌ మొదలైంది. ఈనెల 14న భారత్‌-శ్రీలంక మధ్య జరగబోయే టీ-20 మ్యాచ్‌కు టికెట్ల అమ్మకాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మీ-సేవ సెంటర్ల ద్వారా 12 వేల టికెట్లను విక్రయించబోతున్నట్లు జేసీ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం ఆరు కేటగిరిలలో టికెట్లు విక్రయిస్తామన్నారు జేసీ.                                                                

రేపటి నుంచి టికెట్ల విక్రయం....

విశాఖలో టీ-20 ఫీవర్‌ మొదలైంది. ఈనెల 14న జరగబోయే టీ-20 మ్యాచ్‌కు టికెట్ల అమ్మకాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి మీ-సేవ సెంటర్ల ద్వారా 12 వేల టికెట్లను విక్రయించనున్నట్లు జేసీ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం ఆరు కేటగిరిలలో టికెట్లు విక్రయిస్తామన్నారు జేసీ. 

14:47 - February 10, 2016

హైదరాబాద్ : విశాఖ సినిమా హబ్‌గా అభివృద్ధి చెందాలంటే సర్కార్‌ సహకారం చాలా అవసరమంటున్నారు సినీ నటుడు, హీరో సుమన్‌. విశాఖలో సినిమా షూటింగ్‌లకు వెంటనే అనుమతులు దొరకడం చాలా కష్టంగా మరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న నిర్మాతలకు అనుకూలంగా పరిస్థితులు ఉంటే.. ఇక్కడ షూటింగ్‌లు ఎక్కువగా జరుగుతాయని అభిప్రాయపడ్డారు. విశాఖలో సినీ సాంకేతిక వనరులు మరింతగా అభివృద్ధి చెందాలని సుమన్ కోరుకుంటున్నారు.

14:43 - February 10, 2016

హైదరాబాద్ : న్యాయపరమైన సమస్యలకు చక్కటి పరిష్కారం అందించే 'మైరైట్' కార్యక్రమంలో 'మహిళాచట్టాలు- అమలౌతున్న తీరు' గురించి ప్రముఖ న్యాయవాది పార్వతి గారు వివరించారు. మహిళలకు సంబంధించి ఎన్ని చట్టాలు వున్నాయి? ఎంత మందికి అవగాహనం వుంది, వాటి అమలు తీరు ఎలా వుంది వంటి అంశాలపై పార్వతి వివరించారు. పూర్తి విశ్లేషణను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:41 - February 10, 2016

దగ్గుబాటి రానా..మూటలు మూయడం ఏంటీ ? ఆహా సినిమాలోనా ? అందులో ఆశ్చర్యపోవాల్సినవసరం ఏంటీ ? షూటింగ్ నిమిత్తం ఏవైనా చేస్తుంటారు..కదా అని అంటారు కదా..కానీ ఆయన నిజంగానే మూటలు మోశారు. ఇదంతా ఎందుకు చేశాడో చదవండి..
టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఇటీవల 'మేము సైతం' కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే కదా. పలువురు సెలబ్రెటీలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకొస్తున్నారు. ఇందులో భాగస్వాములవుతూ నిధులు సేకరించేందుకు సహాయం చేస్తున్నారు. వచ్చిన నిధులను వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారంట. ఇటీవలే రకూల్ కూకట్ పల్లిలో కూరగాయలు అమ్మగా..నాగార్జున కొడుకు అఖిల్ ఆటో నడిపారు. తాగా రానా ఓ మార్కెట్ లో కూలి అవతారమెత్తి మూటలు మోశాడు. రానాను చూడటానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. 

ములకలపల్లిలో ఉద్రిక్తత

ఖమ్మం : ములకలపల్లి మండలం చింతలపాడులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అటవీ అధికారులు తీసుకొచ్చిన జేసీబీకి గిరిజనులు నిప్పు పెట్టేందుకు యత్నించగా అధికారులు అడ్డుకున్నారు.

ఆంధ్రా వర్శిటీలో పీహెచ్ డీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

విశాఖ : ఆంధ్రా యూనివర్శిటీలో పరిశోధక విద్యార్థిని ఆత్మహాత్యాయత్నం చేసింది. జువాలజీ అధ్యాపకుడి వేధింపులే కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న యూనివర్శిటీ అధికారులు కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

బాలుడి కిడ్నాప్‌కు విఫలయత్నం చేసిన దుండగులు

నల్గొండ : భువనగిరిలో గుర్తు తెలియని దుండగులు ఓ బాలుని కిడ్నాప్‌కు విఫలయత్నం చేశారు. ఇవాళ ఉదయం ముగ్గురు వ్యక్తులు కారులో అరుణ్‌సాయి అనే పదేళ్ల విద్యార్థిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. కొంత దూరం వెళ్లాక విద్యార్థి వారి భారీ నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు బాలున్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్లపై పోలీసులకు విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మయన్మార్‌ లో కూలిన మిలిటరీ విమానం....

మయన్మార్‌ : నైపిడాలో ఓ చిన్న మిలిటరీ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు సిబ్బంది మృత్యువాతపడ్డారు. మొత్తం విమానంలో ఐదుగురు ప్రయాణిస్తున్నారని.. వారిలో నలుగురు మృతిచెందగా.. మరొకరు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు.

13:50 - February 10, 2016

ఢిల్లీ : సియాచిన్‌ మంచుచరియల్లో చిక్కుపోయి సజీవంగా బయడపడ్డ హనుమంతప్ప మృత్యువుతో పోరాడుతున్నాడు. హనుమంతప్ప ఆరోగ్యం విషమంగా ఉందని ఢిల్లీ సైనిక ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆరు రోజుల పాటు  మంచుచరియల్లో చిక్కుకుపోవడంతో హనుమంతప్పకు నిమోనియా సోకింది. కాలేయం, మూత్రపిండాలు పని చేయడంలేదు. ఐసీయూలో హనుమంతప్పకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు కృత్రిమ శ్వాస కల్పిస్తున్నారు. వెంటిలేషన్ పై అతనికి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. ఏడుగురితో కూడిన వైద్యుల బృందం అతనికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హనుమంతప్ప కోలుకోవాలని దేశ వ్యాప్తంగా ప్రార్థనలు జరుపుతున్నారు. అతని కుటుంబ సభ్యులు ఇవాళ ఆస్పత్రికి వెళ్లనున్నారు. 

13:44 - February 10, 2016

విజయవాడ : కుల, మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనకబడినవారికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ రామవరపుపాడు దగ్గర సెల్‌ టవర్‌ ఎక్కిన విద్యార్థి తన నిరసన విరమించాడు. బీటెక్ చదువుతున్న రవితేజ... కుల, మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనకబడినవారికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉదయం సెల్‌టవర్‌ ఎక్కాడు. విషయం తెలుసుకున్న మరికొందరు విద్యార్థులు రవితేజకు మద్దతుగా టవర్‌ దగ్గర ఆందోళనకు దిగారు.. అయితే టీడీపీ నేత గద్దె రామ్మోహన్‌ హామీ ఇవ్వడంతో రవితేజ తన నిరసనను విరమించి సెల్‌ టవర్ దిగాడు.  

 

13:42 - February 10, 2016

హైదరాబాద్ :  ప్రజలు ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. పురపాలక శాఖ అధికారులతో మంత్రి  సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ ఆదాయంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. 

 

13:39 - February 10, 2016

ప్రకాశం : జిల్లాలోని కారంచేడు పోలీసుస్టేషన్‌లో నిందితుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఓ కేసులో విచారణ నిమిత్తం హరిప్రసాద్‌ను పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. అయితే హరిప్రసాద్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు. మరోవైపు పోలీసులు మాత్రం ఫిట్స్ రావడంతో ప్రసాద్‌ను ఆస్పత్రికి తరలించామని.. చికిత్స పొందుతూ మరణించాడంటున్నారు. మరోవైపు పోలీసులు కొట్టిన దెబ్బలతోనే అతను మృతి చెందినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. 

 

జనగాంలో రైతులతో కేంద్రమంత్రి జేపీ నడ్డా భేటీ

వరంగల్ : జనగాంలో రైతులతో కేంద్రమంత్రి జేపీ నడ్డా భేటీ అయ్యారు. పలు అంశాలపై రైతులతో ఆయన చర్చిస్తున్నారు. 

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనుశ్రీ అచూకీ లభ్యం

హైదరాబాద్  : సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనుశ్రీ అచూకీ లభ్యమైంది. పటాన్ చెరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనుశ్రీ నిన్న అదృశ్యమైంది. అనుశ్రీ స్వస్థలం కర్నాటక. 

ఏసీబీ వలలో ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ

నల్లగొండ : జిల్లా ఇరిగేషన్‌ డిప్యూటీ ఈఈ మాణిక్‌ ప్రభు లక్షా 37వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. హైదరాబాద్‌ సైదాబాద్‌లోని తన ఇంట్లో కాంట్రాక్టర్‌నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేశారు. 

12:56 - February 10, 2016

నల్లగొండ : ఏసీబీకి మరో అవినీతి చేపచిక్కింది. నల్లగొండ ఇరిగేషన్‌ డిప్యూటీ ఈఈ మాణిక్‌ ప్రభు లక్షా 37వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. హైదరాబాద్‌ సైదాబాద్‌లోని తన ఇంట్లో కాంట్రాక్టర్‌నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేశారు.

 

12:53 - February 10, 2016

కృష్ణా : విజయవాడ రామవరపుపాడు దగ్గర ఓ విద్యార్థి సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు.. బీటెక్ చదువుతున్న రవితేజ... కుల, మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనకబడినవారికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశాడు.. ఈ విషయం తెలుసుకున్న మరికొందరు విద్యార్థులు రవితేజకు మద్దతుగా టవర్‌ దగ్గర ఆందోళనకు దిగారు.. రవితేజను కిందకు దించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు..

 

 

మున్సిపల్ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ : మున్సిపల్ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అక్రమ కట్టడాలపై కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ ఆదేశించారు. ఈ సమావేశానికి మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్, జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. 

రౌడీషీటర్ల దాడిలో గాయపడిన ఆంజనేయులును పరామర్శించిన మధు

గుంటూరు : రౌడీ షీటర్ల దాడిలో గాయపడి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం నేత ఆంజనేయులను ఆ పార్టీ ఎపి రాష్ట్ర కార్యదర్శి పరామర్శించారు. టీడీపీ మద్దతు దారులైన రౌడీషీటర్లు భూ కబ్జాల కోసం.. సీపీఎం నేతలపై హత్యాయత్నాలకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. పేదలను భూముల నుండి తరిమికొట్టేందుకు నిన్నటి ఘటన జరిగిందన్నారు.  తన భర్తకు ప్రాణ హాని ఉందని 15 రోజుల క్రితమే ఆంజనేయులు భార్య నల్లపాడు సీఐకి ఫిర్యాదు చేసిందని తెలిపారు. నల్లపాడు సీఐ రౌడీ షీటర్లకు మద్దతుగా నిలిచాడని ఆరోపించారు. నిందితులను అరెస్టు చేయడంతోపాటు సీఐ పూర్ణచంద్రరావుపై చర్యలు తీసుకోవాలన్నారు. 

 

రేపు కేటీఆర్ అధ్యక్షతన గ్రేటర్ కార్పొరేటర్ల సమావేశం

హైదరాబాద్ : రేపు గ్రేటర్ కార్పొరేటర్ల సమావేశం జరుగనుంది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మేయర్, ఉప మేయర్లను ఎంపిక చేయనున్నారు. గ్రేటర్ ఎక్స్ అఫిషియో సభ్యులు సమావేశానికి హాజరుకానున్నారు.

12:22 - February 10, 2016

హైదరాబాద్ : రేపు ఉదయం ఎనిమిది గంటలకు గ్రేటర్‌ కార్పొరేటర్ల సమావేశం మంత్రి కేటీఆర్‌ అధ్యక్షత జరగనుంది. మేయర్, ఉప మేయర్‌ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ సమావేశానికి గ్రేటర్‌ ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరుకానున్నారు. మరో వైపు మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకకొంది. మేయర్‌ రేస్‌లో మాత్రం బొంతు రామ్మోన్‌ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. మేయర్‌ కోసం మహిళా కార్పొరేటర్లు పోటీపడుతున్నారు.

12:07 - February 10, 2016

గుంటూరు : తమ కార్యర్తలపై దాడులకు పాల్పడ్డ రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయనతోపాటు కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య, రమాదేవి సుందరయ్యనగర్‌ను సందర్శించారు. మరోవైపు సీపీఎం కార్యకర్తలపై హత్యాయత్నంలో రౌడీషీటర్లు ఉపయోగించిన కత్తి, కారంపొడి ప్యాకెట్లను మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తున్న మరుగుదొడ్లలో వీరు గుర్తించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడారు. ఆయన మాటల్లోనే...''అధికార పార్టీ నేతల మద్దతుతోనే రౌడీషీటర్లు చెలరేగిపోతున్నారు. పేదల భూములు లాక్కునేందుకు కొంతమంది నేతలు యత్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను. పేదలు ఇళ్లు కట్టుకునేందుకు పట్టాలు ఇవ్వాలి. రౌడీషీటర్లకు పోలీసులు మద్దతిస్తున్నారు. దాడులు జరుగుతాయని పోలీసులకు తెలిసినా పట్టించుకోలేదు. రౌడీషీటర్లకు మద్దతిచ్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. స్థానిక సీఐ రౌడీషీటర్లకు మద్దతు ఇచ్చారు. టిడిపిలోని కొంతమంది బలపర్చడంతో రౌడీ షీటర్లు ఈ చర్యకు పూనుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు రౌడీ చర్యలను ప్రోత్సహిస్తున్నారు. రౌడీషీటర్లకు మద్దతు తెలపవద్దు. నేరస్తులను శిక్షిస్తే... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఘటన వెనుకాల సీఐ ప్రాత ఉందని ప్రజలు చెబుతున్నారు. కాలనీలో ఇళ్ల కట్టుకునే వారికి రక్షణ కల్పించాలి''...అని మధు పేర్కొన్నారు. 
దాడులకు పాల్పడుతూ ప్రజలకు వ్యతిరేకంగా అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్నారని వి.కృష్ణయ్య విమర్శించారు. మంత్రి రావెల కిషోర్ బాబు యూత్ పేరుతో యువకులు దాడికి పాల్పడ్డారని, ఘటన వెనుకున్న కారణాలను వెలికితీయాలని రమాదేవి డిమాండ్ చేశారు. అప్పుడే పోలీసులపై ప్రజలకు విశ్వాసం కలుగుతుందని తెలిపారు. 

11:29 - February 10, 2016

ఢిల్లీ : సియాచిన్‌ మంచుచరియల్లో చిక్కుపోయి సజీవంగా బయడపడ్డ హనుమంతప్పను జమ్ము నుంచి ఢిల్లీలోని సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రధాన నరేంద్ర మోడీ సైనిక ఆస్పత్రిలో హనుమంతప్పను పరామర్శించారు. ఆస్పత్రి డాక్టర్లతోపాటు, సైనికదళ ప్రధానాధికారి దల్బీర్‌ సింగ్‌ సుహాగ్‌తో మాట్లాడారు. హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి గురించి  అడిగి తెలుసుకున్నారు.  హనుమంతప్ప ఆరోగ్యం విషమంగా ఉందని సైనిక ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.  ఆరురోజుల పాటు  మంచుచరియల్లో చిక్కుకుపోవడంతో నిమోనియా సోకింది. కాలేయం, మూత్రపిండాలు పనిచేయడంలేదు. హనుమంతప్పకు కృత్రిమ శ్వాస కల్పిస్తున్నారు. 

 

11:26 - February 10, 2016

భూమ్మీద నూకలు బాకుంటె సముద్రంల నూకేసిన బత్కి బట్ట కడుతరు కొందరు.. అగో అట్లనే బత్కిండు వో ఆర్మీ పోలీసు.. ఆయినను జూశ్నంక అందరు పర్షాన్ అయ్యిండ్రు.. గంత పెద్ద అపాయంల శిక్కుకొని గుడ ఇంకా బత్కి ఉన్నడా అని సూశినోల్లు నోరెల్ల వెడ్తున్నరు.. ఇంతకు ఏం ఆపదల శిక్కుకున్నడు.. ఎట్ల బత్కిండు ఏందనేది వీడియోలో సూడుండ్రి..

11:24 - February 10, 2016

వలస బత్కులు అనేటియి ఉండొద్దు.. ఉన్న ఊళ్లె పని జూపెడ్తం.. కరువు కరాల నృత్యం జెయ్యని.. ఇంకేమన్న జెయ్యని.. జాన్తానై.. అని కాంగ్రేసోల్లు.. ఉపాధి హామీ పతకాన్ని.. పదేండ్ల కింద హంగూ హార్బాటాలతోని సుర్వు జేశిండ్రు. మరి అప్పుడు సుర్వైన పతకం ఎట్లున్నది.. మన బంగారి తెలంగాణ బాటసారి కేసీఆర్ సారు ఆధ్యర్యంల ఎట్ల నడుస్తున్నది ఏం కత అనేది వీడియో చూడండి..

11:24 - February 10, 2016

కర్నూలు : సియాచిన్‌ మంచుచరియల్లో చిక్కుకుపోయి మరణించిన తొమ్మిది మంది సైనికుల మృతదేహాలను సహాయ బృందాలు వెలికితీశాయి. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలకు చెందిన జవాను ముస్తాక్‌ అహ్మద్‌ కూడా ఉన్నారు. ముస్తాక్‌ది బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామం. ముస్తాక్‌  అహ్మద్‌ మృతితో పార్నపల్లె గ్రామంలో విషాదం నెలకొంది.

నల్గొండ జిల్లాలో చిరుతపులి హల్ చల్...

నల్లగొండ : జిల్లాలోని రాజాపేట మండలం చల్లూరు పడమటిగుట్ట సమీపంలో చిరుత సంచరిస్తుందనే వార్త కలకలం రేపింది. వ్యవసాయ క్షేత్రాల సమీపంలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు ఆవు దూడ మృతిచెంది ఉండటాన్ని గమనించి గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు చిరుత దాడి చేసి ఆవు దూడను చంపిందని నిర్ధరించుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

11:20 - February 10, 2016

సర్కారుకు కోపమొచ్చినా..? అంగన్ వాడీల మీదనే.. ఊరి సర్పంజికి కోపమొచ్చినా అంగన్ వాడీల మీదనే.. మరి అంగన్ వాడీలకు కష్టమొస్తె ఎవ్వలికి జెప్పుకోవాలె చెప్పుండ్రి..? అని అడ్గుతున్నరు అమ్మలక్కలంత.. మెల్లెగ మెల్లెగ రాష్ట్రంల అంగన్ వాడీలు అనెటోళ్లు లేకుంట జెయ్యాలె అని కుట్ర జేస్తున్నదట సర్కారు.. వాళ్లు లొల్లి వెడ్తున్నరు...జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ వీరు కష్టపడ్డరు. మరి ఆ కష్టానికి పైకమివ్వాల గద..కానీ ఇవ్వలే. ఎందుకివ్వలేదో..వారి బాధేందో వీడియోలో సూడుండి.

చిలీలో భూకంపం....

చిలీ : శాండియాగోలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.3గా నమోదు అయింది. ఇప్పటి వరకైతే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు చెబుతున్నారు.

 

11:16 - February 10, 2016

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్టైంది మా పని అంటున్నరు కాంగ్రెస్ పెద్ద ముత్తైదువు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సైకిల్ మావటి రమణ సారు.. ఎందుకంటె జీహెచ్ఎంసీ ఓట్లళ్ల ఓటర్లు మాకు ఓటేశ్నాగని.. ఈవీఎంలు అడ్డం బడ్డయ్ అని మొత్తుకుంటున్నరు.. మరి వాళ్ల మొత్తుకోళ్ల ఎంత న్యాయం ఉన్నది అనేది జూద్దాం..

11:16 - February 10, 2016

ఎన్కటి రాజులు శ్రీక్రిష్ణదేవరాయలు కాడికెళ్లి సూడుండ్రి.. మన తెలంగాణ భూమిని ఏలిన నిజాం నవాబుల దాక.. వాళ్లకో సప్రేటు చరిత్ర ఉన్నది.. రాయలవారు.. తిరుమల ఎంకన్నసామికి చేతికి ఎంతొస్తె అంతే బహుమానాలు ఇచ్చిండు.. నిజాం రాజులు గూడ.. భద్రాచల రామయ్యకు బొచ్చెడు దానాలు జేశిండ్రు.. ఇప్పటిదాక మనం సద్వుకున్న చరిత్ర ఇది.. ఇగ ఇప్పుడు ఇండ్లకు ఇంకో చరిత్రొచ్చి జొర్రవోతున్నది.. సూడుండ్రి.

11:15 - February 10, 2016

ఊరు సర్పంజి గుడ్సెలుండి..? ఊరిజనమంత పెద్దపెద్ద బంగ్లలళ్ల ఉంటే..? ఆ ఊరి పర్వేమన్న ఉంటదా..? సూడొచ్చినోళ్లు ఏమంటరు.. అవ్వో గా సర్పంజి ఇంకా గుడ్సెలనే ఉంటున్నడు ఏమాయే మంచిదొక ఇల్లుగట్టుకుంటే..? అని ఊరిపర్వుదీశిపోతరు.. ఆడ సర్పంజి ఇజ్జత్ వోకున్నా.? ఉరినే అంటరుగదా..? పలానా ఊర్లే సర్పంజికి ఇల్లే గతిలేదని.. అగో గసొంటి బద్నం గాకుంట మన ముఖ్యమంత్రి సారు ఒక పని జేస్తున్నడట..గదేందో వీడియో చూడండి..

11:10 - February 10, 2016

కడప : జిల్లాలోని రైల్వేకోడూరు మండలం బిల్లుపాటిపల్లి వద్ద భారీగా ఎర్రచందనం దుంగలను ఎక్సైజ్‌ శాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్‌లో తరలిస్తున్న సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే దుంగలను పట్టుకున్నారు. వాహనాన్ని వదిలి స్మగ్లర్లు పరారయ్యారు.

11:05 - February 10, 2016

నేపాల్‌లో భారత సంతతికి చెందిన మాదేశీలు ఆందోళన విరమించారు. ఆ దేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఐదు నెలలుగా భారత్-నేపాల్ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న మాదేశీలు తాత్కాలికంగా తమ నిరసనకు తెరదించుతున్నట్టు ప్రకటించారు. దీంతో రెండు దేశాల సరిహద్దు మార్గాలు తెరుచుకున్నాయి. నేపాల్‌కు నిత్యావసరాల ఎగుమతులు యథాతథమయ్యాయి. అయితే తమ డిమాండ్ల సాధనకు మరో రూపంలో ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు మాదేశీలు.

భారత సంతతికి చెందిన మాదేశీయులు

హిమాలయ దేశమైన నేపాల్‌ సరిహద్దుల్లో కీలకమైన ప్రాంతం తెరాయి. ఇది భారత్-నేపాల్ బోర్డర్‌లో ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మాదేశీ తెగకు చెందిన గిరిజనులు నివసిస్తుంటారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఎక్కువగా కనిపించే ఈ తెగలో అత్యధికులు భారత సంతతి ప్రజలే. అయితే నేపాల్‌లో అమల్లోకి వచ్చిన కొత్త రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు మాదేశీలు. భారత మూలాలు ఉన్న తమకు రాజకీయంగా ఎటువంటి హక్కులు కల్పించలేదన్నది మాదేశీయుల ఆరోపణ. 

నేపాల్ జనాభాలో 25 శాతం మాదేశీలే
 

నేపాల్ జనాభాలో 25 శాతం మాదేశీలు ఉన్నారు. సుమారు 80 నియోజికవర్గాలలో ఎక్కువ శాతం మాదేశీలే. కొత్త రాజ్యాంగంలో తమకు హక్కులు కల్పించకపోవడంపై మాదేశీలు ఐదు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. తమపై నేపాల్ ప్రభుత్వం జాతి వివక్ష ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు దేశాల సరిహద్దు మార్గాలను మూసివేశారు. దీంతో   కిలోమీటర్ల మేర బోర్డర్‌లో ట్రక్కులు నిలిపోయాయి. నేపాల్‌కు ఎగుమతులు నిలిపివేసింది భారత్. పెట్రోల్, ఆహారం, మెడిసిన్‌ వంటి నిత్యావసరాల దిగుమతులు ఆగిపోయాయి. పలు సందర్భాల్లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కావాలనే భారత్ ఆందోళనలు ఎగదోసి, ఎగుమతులను బంద్‌ చేసిందని నేపాలీలు నిరసనలు చేశారు. దీంతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఆందోళన విరమించాలని మాదేశీల నిర్ణయం

అయితే దేశంలో నిత్యావసరాల సంక్షోభం తీవ్రమవడంతో  మాదేశీలు మొత్తానికి కాస్త వెనక్కి తగ్గారు. దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆందోళన విరమించాలని నిర్ణయించామని చెప్పారు. అయితే తమ ప్రావిన్స్‌లను గుర్తించడం, జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాల విభజన, రాజకీయ ప్రాతినిధ్యం వంటి ప్రధాన డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మరో రూపంలో తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. మొత్తానికి మాదేశీల ఆందోళన విరమణతో ఇరు దేశాల సరిహద్దు మార్గాలు తెరుచుకున్నాయి. నిత్యావసరాల దిగుమతులు పునరుద్దరణ అయ్యాయి. 

 

11:01 - February 10, 2016

సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత విజయకుమార్, సీపీఎం నేత రమాదేవి పాల్గొని, మాట్లాడారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ప్రభుత్వం రాబట్టుకోవడం లేదన్నారు. ఈ ప్రభుత్వం మాటలతో కాలం గడుపుతోందని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

10:53 - February 10, 2016

ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వేరొక పార్టీలో విలీనం కావడం రాజకీయ అనైతికమని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్  అన్నారు. గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. విలీనం అనే ప్రక్రియ రాజ్యాంగ విరుద్దమన్నారు. ఎమ్మెల్యేలను అధికారికంగా విలీనం చేసుకోవాలనే ప్రక్రియ అనైతికమన్నారు. పార్టీలు విలీనం కావడం తప్పుకాదు.. కానీ ఎమ్మెల్యేలు విలీనం కావడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే ...
పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు
ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వేరొక పార్టీలో విలీనం అవుతూ పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తూ.. ఆ ఆ చట్టాన్ని అబాసుపాలు చేస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది. ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు హక్కు స్పీకర్ చేతుల్లో ఉన్నంత కాలం పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉంటాయి. ఒక పార్టీ మరో పార్టీలో విలీనమైనప్పుడు విలీనమైన పార్టీకి ఎన్నికల గుర్తు ఉంటుందా...? ఆ పార్టీ ఇంకా కొనసాగుతుందా...? అనే విషయాన్ని ఆలోచించాలి. పార్టీ ఫిరాయింపులను ప్రజాస్వామ్య వాదాలు వ్యతిరేరించాలి. 
ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు.. సమగ్ర చర్చ...
ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ల కల్పనపై సమగ్ర చర్చ జరగాలి. రాజ్యాంగపరమైన సానుకూల వివక్ష ఎక్కడా అమలు కావడం లేదు. భారతదేశంలో అసంఘటిత రంగంలో రిజర్వేషన్లు కల్పిండం అసాధ్యం. ప్రయివేట్ రంగంలో పోటీ ఉంటుంది. ప్రభుత్వరంగంలో పోటీ ఉండదు. ప్రపంచ వ్యాప్తంగా పోటీ నెలకొంటుంది. 
ప్రభుత్వ రంగంలోనే రిజర్వేషన్లు పూర్తిగా అమలు కావడం లేదు.. అలాంటప్పుడు ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారు. కాబట్టి సమగ్ర చర్చ జరగడం ఉత్తమం. 
మరణశిక్షపై భిన్న వాదనలు 
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు మరణశిక్షను అమలు చేయడం లేదు. మరణశిక్షపై భిన్న వాదనలు ఉన్నాయి. అత్యంత క్లిష్టమైన, రేర్ కేసులోనే మరణశిక్షను అమలు చేయాలని చెబుతున్నారు. మరణశిక్ష, జీవిత ఖైదీలపై భిన్నవాదనలు ఉన్నాయి. మరణశిక్షను వ్యతిరేకిస్తే.. దేశ ద్రోహి, మరణశిక్షను సమర్థిస్తే.. దేశ భక్తులు అనడం సరికాదు' ప్రచారం జరుగుతోందని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్... 170 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉంది. నిఫ్టీ 50 పాయింట్లకు పైగా నష్టోల్లో ఉంది. సెన్సెక్స్, నిఫ్టీలు 52 వారాల కనిష్టస్థాయిని తాకాయి.

 

10:16 - February 10, 2016

 

ముఖ ఛాయ ఆకర్షణీయంగా కనిపించేందుకు దోహదపడేవి పెదవులు. అలాంటి పెదవులు అస్తమానం తడాలిపోతూ, పొడిగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను నివారించేందుకు ఎన్ని సార్లు లిప్‌ కేర్‌ రాసినా, ఎంత మోతాదులో మంచినీళ్లు తాగినా పెదాలు మాత్రం పొడిబారి తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి అలా పొడిబారిన పెదాలకు సరైన ఇంటి చిట్కాలను పాటిస్తే సమస్య నుండి బయటపడవచ్చు.
పంచదారను స్క్రబ్‌లా ఉపయోగించుకోవచ్చు. పెదాలపై డార్క్‌నెస్‌, డెడ్‌ స్కిన్‌ని తొలగించి, పింక్‌ కలర్‌ పెదవులను సొంతం చేసుకోవచ్చు. అలా రోజూ పంచదారతో స్క్రబ్‌ చేస్తూ ఉంటే పెదవులు ఎంతో ఆకర్షణీయంగా తయారవుతాయి.
కొన్ని గులాబీ రేకులు తీసుకుని పాలు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే పెదవులపై రాస్తూ ఉండాలి. పాలు డార్క్‌ కలర్‌ని తొలగిస్తే, గులాబీ రేకులు పింక్‌ అండ్‌ గార్జియస్‌ పెదాలను అందిస్తాయి.
రాత్రి పడుకోవడానికి ముందు తాజా కొత్తిమీర తీసుకుని పెదాలపై రుద్దాలి. రాత్రంతా అలానే ఉంచుకుని.. ఉదయాన్నే పెదలాలో వచ్చే తేడాను మీరే స్పష్టంగా గమనించవచ్చు.
పెదాలపై ఒకటి లేదా రెండు చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ వేసి, మృదువుగా మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై డార్క్‌నెస్‌ తగ్గించి, మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
నిమ్మరసం చర్మం, జుట్టు సంరక్షణలో చాలా బాగా పనిచేస్తుందని అందరికీ తెలుసు. అయితే ఇది పెదవుల మెరుపుకి కూడా ఉపయోగపడుతుంది. రెండు, మూడు చుక్కల నిమ్మరసం పెదాలకు పట్టించాలి. తర్వాత బాగా మసాజ్‌ చేయాలి. అలా చేస్తే పెదాలపై ఉండే నలుపుదనం పోతుంది.
నారింజ తొక్క పెదాల అందానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ తొక్కతో పెదవులపై మసాజ్‌ చేయాలి. దీనివల్ల మృదువుగా తయారవడంతోపాటు కలర్‌ఫుల్‌గా తయారవుతాయి.
ఉదయాన్నే బ్రెష్‌ అయ్యాక.. పెదాలకూ బ్రెష్‌ చేయాలి. రోజూ అలా బ్రష్‌ చేయడం వల్ల డెడ్‌ స్కిన్‌ తొలగిపోతుంది. బ్రెష్‌ చేసిన తర్వాత లిప్‌ బామ్‌ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఆల్మండ్‌ ఆయిల్‌, కొబ్బరినూనె సమానంగా తీసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని లిప్‌బామ్‌ మాదిరిగా తరచుగా పెదవులపై రాస్తూ ఉండాలి. అలా చేస్తే. పెదాలు పొడిబారడం తగ్గిపోవడంతోపాటుగులాబి వర్ణంలోకి మారతాయి.
ప్రతిరోజూ వెన్నను పెదాలకు రాయడం వల్ల సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేసి, మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది. నెయ్యి కూడా పొడిబారిన పెదాల పగుళ్ల ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

 

10:14 - February 10, 2016

న్యూయార్క్‌ : సిక్కు-అమెరికన్‌ నటుడు, డిజైనర్‌ని మెక్సికో సిటీ నుండి న్యూయార్క్‌కు వెళ్ళే విమానంలో ఎక్కకుండా అడ్డుకున్నారు. భద్రతా తనిఖీల్లో భాగంగా తన తలపాగా తీయడానికి ఆ నటుడు తిరస్కరించడంతో ఈ పరిస్థితి ఎదురైంది. మన్‌హటన్‌లో వుండే వారిస్‌ అహ్లూవాలియా (41) మాట్లాడుతూ మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏరోమెక్సికో ఎయిర్‌లైన్స్‌ కౌంటర్‌ వద్ద సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో తనను చెక్‌ చేశారని, ఫస్ట్‌ క్లాస్‌ బోర్డింగ్‌ పాస్‌ ఇచ్చారని, దాని కోడ్‌ ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ అని అంటే దానర్ధం రెండో భద్రతా చెక్‌ అవసరమని చెప్పారు. తర్వాత నా టర్బన్‌ కారణంగా అనుమతించడం లేదని తెలియచేశారని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పారు. ఉపయోగం లేకుండా పోయిన విమానం టిక్కెట్‌ను పట్టుకుని మరీ దిగిన ఫోటోను కూడా అప్‌లోడ్‌ చేశారు.

10:13 - February 10, 2016

షిల్లాంగ్‌ : 12వ దక్షిణాసియా గేమ్స్‌లో పతకాల సాధనలో భారత్‌ దూసుకుపోతుంది. ఈ గేమ్స్‌లో భారత్‌ ఇప్పటి వరకూ సాధించిన పతకాల సంఖ్య 100 దాటింది. ఇందులో 75 స్వర్ణాలు ఉండటం విశేషం. మంగళవారం స్విమ్మింగ్‌లో భారత్‌ 7 స్వర్ణాలు సాధించింది. మొదటగా పురుషుల 400 మీ. ఫ్రీ స్టయిల్‌లో సౌరభ్‌ సంగ్వేకర్‌ స్వర్ణం సాధించగా, మహిళల 400 మీ. ఫ్రీ స్టయిల్‌లో వి మాళవిక విజేతగా నిలిచింది. మూడో స్వర్ణాన్ని 200 మీ. బటర్‌ఫ్లైలో సజన్‌ ప్రకాష్‌ గెలుచుకున్నాడు. 200మీ బటర్‌ఫ్లైలో దామిని గౌడకు స్వర్ణం దక్కింది. పురుషుల 50 మీ బ్యాక్‌స్ట్రోక్‌లో పిఎస్‌ మధుకు స్వర్ణం లభించింది. 4×200 మీ ఫ్రీ స్టయిల్‌లో పురుషుల, మహిళల విభాగంల్లో భారత్‌కు స్వర్ణాలు లభించాయి. స్విమింగ్‌లో భారత్‌కు నాలుగు రజతాలు లభించాయి. మంగళవారం నాడు అర్చరీ విభాగంలో భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ విభాగంలో భారత్‌కు చెందిన మహిళల, పురుషుల, మిక్స్‌డ్‌ జట్లు తమ విభాగాల్లో స్వర్ణాలు సాధించాయి. దీంతో మన దేశానికి 5 స్వర్ణాలు, రెండు రజతాలు లభించాయి.

12 స్వర్ణాలు..
వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌ మంగళవారం ఒక స్వర్ణం, ఒక రజతం సాధించింది. దీంతో ఈ విభాగంలో భారత్‌ మొత్తం 12 స్వర్ణాలు సాధించింది. భారత పురుష, మహిళాల వెయిట్‌ లిఫ్టర్లు సమానంగా స్వర్ణాలు సాధించాడు. ఇద్దరూ 6 బంగారు పతకాలు చొప్పున సాధించారు. మంగళవారం నాడు సుశీల పన్వార్‌ 75 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. ఈ భారత మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మొత్తం 198 కేజీల బరువునెత్తింది. ఈ విభాగంలో అన్నుష్క కలుతంత్రి (శ్రీలంక), తారా దేవి (నేపాల్‌) రజత, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల 105 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన గుర్‌దీప్‌ సింగ్‌ రజత పతకం సాధించాడు. మహమ్మద్‌ నూన్‌ దస్తగిర్‌ (పాకిస్థాన్‌) స్వర్ణం, సమాన్‌ గెదర (శ్రీలంక) కాంస్యం సాధించారు.

అథ్లెటిక్స్ లో..
అథ్లెటిక్‌ విభాగంలో భారత్‌కు మంగళవారం 5 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్య పతకాలు లభించాయి. సైక్లింగ్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం లభించింది. ఈ పోటీలు ముగిసాయి. దీంతో సైక్లింగ్‌లో మొత్తం 8 స్వర్ణాల్లో 6 పతకాలు భారత్‌ సాధించింది. వుషులో భారత్‌కు చెందిన చిరాగ్‌ శర్మ స్వర్ణం సాధించాడు. ఈ గేమ్స్‌లో భారత హకీ జట్టుపై పాకిస్థాన్‌ 2-1తో విజయం సాధించింది. గ్రూప్‌ దశలో సాగిన ఈ మ్యాచ్‌ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. 2014లో చాంపియన్స్‌లీగ్‌లో వివాదస్పద మ్యాచ్‌ తరువాత భారత్‌, పాక్‌ హకీ జట్లు తలపడ్డం ఇదే తొలిసారి. ఈ టోర్నిలో ఈ నెల 12న జరిగే ఫైనల్‌లోనూ భారత్‌, పాకిస్థానే తలపడతాయని అంచనా.
పతకాల పట్టిక...

 

దేశం స్వర్ణం  రజతం కాంస్యం  మొత్తం
భారత్‌ 76 36  10 122
శ్రీలంక 17 36 31 84
పాకిస్థాన్ 5 12  20 37
బంగ్లాదేశ్‌ 27 38
నేపాల్‌ 1 5 13 19
అఫ్ఘనిస్థాన్‌ 2 5 7
భూటాన్‌ 0 1 4 5
మాల్దీవులు 0 1 1 2
10:07 - February 10, 2016

కోల్‌కతా : ప్రో కబడ్డీ లీగ్‌ 2016లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు వారియర్స్‌పై 36-31 స్కోరుతో పాట్నా పైరట్స్‌ విజయం సాధించింది. ఈ లీగ్‌లో పాట్నాకు ఇది వరసగా 5వ గెలుపు. మంగళవారం చివరి వరకూ హోరాహోరీ సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి పాట్నా జట్టు 4 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రారంభం నుంచి కూడా ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్లు సాధించడంలో చాలా దూకుడు కొనసాగించారు. దీంతో తొలి అర్థభాగం ముగిసే సరికి బెంగాల్‌ 17, పాట్నా 16 పాయింట్లు సాధించింది. రెండో అర్థభాగం ప్రారంభంలోనే పాట్నా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ దశలో పాట్నాకు ఏకంగా ఒక్కసారిగా 6 పాయింట్లు లభించాయి. ఈ తరువాత మ్యాచ్‌పై పట్టు బిగించాలని బెంగాల్‌ యత్నించింది. కానీ పాట్నా కూడా హోరాహోరీగా పాయింట్లు సాధించడంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. చివరికి మ్యాచ్‌ 36-31తో ముగిసింది. ఈ విజయంతో ప్నాట్నా జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 5 విజయాలతో 25 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. బెంగాల్‌ జట్టు 21 పాయింట్లు (5 మ్యాచ్‌లు, 4 విజయాలు) రెండో స్థానంలోనూ, తెలుగు టైటాన్స్‌ 17 పాయింట్లు (6 మ్యాచ్‌లు, 3 విజయాలు) మూడో స్థానంలో ఉంది.

10:06 - February 10, 2016

అక్షయ్ కుమార్‌ కథానాయకుడుగా యధార్థ ఘటన ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం 'రస్టోమ్‌'. ఈ చిత్రంలో స్పోర్టివ్‌మెన్‌గా చిన్న చిన్న మీసాలతో అక్షయ్ కన్పించబోతున్నాడు. ఈ హీరోకు జోడీగా ఇద్దరు కథానాయికలు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత నీరజ్‌ పాండే వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారన్న దానిపై ఇప్పటి వరకు అనేక ఊహాగానాలు వచ్చాయి. చివరకు ఇషా గుప్తా, ఇలియానాలు ఎంపికయ్యారు. ఈ చిత్రం పనుల్లో బిజీగా ఉండడం వల్లే ఈ మధ్య అక్షయ్ కుమార్‌ అభిమానులకు అందుబాటులో ఉండడం లేదు. తిను దేశాయ్ దర్శకత్వంలో రూపొందునున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే చేపట్టనున్నారు. ఇంగ్లాండ్‌, యూరఫ్‌ దేశాల్లో షూటింగ్‌ జరపనున్నారు.

10:05 - February 10, 2016

దిల్వాలే' చిత్రం విజయం సాధించింది కానీ బాక్సీఫీస్‌ వద్ద అనుకున్న స్థాయిలో కాసులు కురిపించలేకపోయింది. దేశవ్యాప్తంగా మినమమ్‌ గ్యారెంటీ సినిమాగా భావించిన ఈ చిత్రం పంపిణీకి రూ.130 కోట్లు అయింది. కానీ దేశవ్యాప్తంగా అది వసూలు చేసింది మాత్రం కేవలం రూ.150 కోట్లే. దీంతో పంపిణీదారులు సుమారుగా రూ.55 నుంచి 60 కోట్లు వరకు నష్టపోయారు. ఈ విషయంలో ఈ చిత్ర కథానాయకుడు స్పందించాడు. నష్టపోయిన పంపిణీదారులకు నష్టపోయిన మొత్తంలో సగం తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫలితంగా సుమారుగా రూ.25 కోట్లను షారుఖ్‌ తిరిగి పంపిణీదారులకు చెల్లించాడు. 2001, 2005లో విడుదలైన అశోక్‌, పహెలి చిత్రాలకు నష్టం వస్తే అప్పుడూ పంపిణీదారులను ఆదుకున్నాడు.

10:04 - February 10, 2016

తన పని తాను చూసుకుంటూ పోవడమే తప్ప జయాపజయాలను పట్టించుకోనని కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెబుతోంది. ''నేను నటించిన సినిమాలు విజయం సాధించాయా? లేదా? అన్న దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోను. నాకు దర్శకుడు చెప్పిన పాత్రకు న్యాయం చేశానా? లేదా? అన్నదే నాకు ప్రధానం. అలా అనుకుంటేనే నేను ఓ నటిగా సినిమాల్లో నటించగలను'' అని అంటోంది. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో బిజీగా ఉన్న నటి ఈమె. సినిమాలో నటించామా? లేదా ? అన్నట్టే తన పాత్రలను చేసుకుంటూ పోతోంది. అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ రామ్‌ చరణ్‌తో జోడీ కట్టే అవకాశం వచ్చింది. ఈ బ్రూస్‌లీ చిత్రం 'తని ఒరువన్‌' రీమేక్‌లో రకులే హీరోయిన్‌గా చేస్తుంది. 'నాన్నకు ప్రేమతో' చిత్రం తనకు మంచి గుర్తింపునిచ్చిందని చెప్పింది.

10:03 - February 10, 2016

హాలీవుడ్‌లో సినిమాలు చేయాలంటే ఎంతో ధైర్యం, ఏకాగ్రత కావాలి. అవన్ని ప్రియాంక చోప్రాలో పుష్కలంగా ఉన్నాయని నిరూపించింది. ఆమె సినీ పయనం మనందరికీ స్ఫూర్తిదాయకం' అని అంటోంది బాలీవుడ్‌ నటి కత్రినాకైఫ్‌. తాజాగా నటించిన 'ఫితూర్‌' ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో కత్రినా మాట్లాడుతూ పై విధంగా పేర్కొంది. 'ప్రియాంక సాధించిన విజయాన్ని తప్పకుండా అభినందించాల్సిందే. షూటింగ్‌ కోసం 22 గంటలు ప్రయాణిస్తూ హాలీవుడ్‌లో ఎలా నిలదొక్కుకోగలిగిందనే విషయాన్ని ప్రియాంక ఓ పుస్తక రూపంలో రాస్తే బాగుంటుంది. ప్రేక్షకులతోపాటు ప్రియాంక సక్సెస్‌ వెనుకున్న సీక్రెట్‌ ఏమిటో తెలుసుకోవాలనే ఆత్రుతతో నేనూ ఉన్నాను' అని కత్రినా అంది.

10:03 - February 10, 2016

గత కొంతకాలంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా మామూలుగా లేదు. భిన్న రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తుల జీవిత కథా చిత్రాల నిర్మాణంతో బాలీవుడ్‌ కళకళలాడుతోంది. దాదాపు ఇరవైకి పైగా బయోపిక్‌లు బాలీవుడ్‌లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. వీటికి భిన్నంగా తాజాగా మరో బయోపిక్‌ సినిమా నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అండర్‌వరల్డ్‌ డాన్‌గా గడగడలాడించిన ముంబై గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌ జీవితం ఆధారంగా 'హసీనా - ద క్వీన్‌ ఆఫ్‌ ముంబై' పేరుతో ఓ ఒయోపిక్‌ని అపూర్వ లఖియా రూపొందిస్తున్నారు. అన్న నీడలో ముంబైతోపాటు దేశ, విదేశాల్లో సైతం హసీనా పార్కర్‌ గడగడలాడించింది. వెండితెరపై హసినా పార్కర్‌ పాత్రలో తొలుత రాణిముఖర్జీని ఎంపిక చేసినప్పటికీ కొన్ని కారణాల రీత్యా ఆ పాత్రలో సోనాక్షి సిన్హాని తీసుకున్నారని సమాచారం. ఈ చిత్రకథ సోనాక్షికి బాగా నచ్చడంతో నటించేందుకు వెంటనే గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిందని తెలుస్తోంది. యాదృచ్ఛికంగా 'ఒన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ముంబై' (2013)లో దావూద్‌ ఇబ్రహీం లవ్‌ ఇంట్రెస్ట్‌గా సోనాక్షి నటించడం విశేషం. ఈ చిత్రంతోపాటు సోనాక్షి ప్రస్తుతం 'అకిరా', 'ఫోర్స్‌2' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

10:02 - February 10, 2016

జీవితంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే.. భవిష్యత్తులో మంచి మార్గానికి దారులు అని పెద్దలంటుంటారు. నిజమే.. ఇది ఆహారానికి వర్తిస్తుంది. ఇదే రోజువారీ తీసుకునే ఆహారంలోనూ వర్తిస్తుంది. ఆహారంలో కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆ చిన్న చిన్న జాగ్రత్తలేమిటంటే..కూరగాయల సలాడ్‌తో మంచి ఆరోగ్యం సమకూరుతుందన్న విషయం తెలిసిందే. ఇటీవల క్యారెట్‌, టమాటా, చిన్న చిన్న ఉల్లి ముక్కలతో సలాడ్స్‌ చేసి తీసుకోవడం పెరిగింది. ప్రధాన భోజనం సమయంలోనూ, చిరుతిండిగా స్నాక్స్‌ తీసుకునే సమయంలో ముందుగా ఇలాంటి సలాడ్‌ తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.మనలోని ప్రతి జీవకణంలోనూ ప్రతి రోజూ జరిగే జీవక్రియల్లో కణానికి కొంత నష్టం జరుగుతుంది. దీన్నే సెల్‌ డ్యామేజ్‌ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్న ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల సెల్‌ డ్యామేజ్‌ తగ్గడమే కాకుండా, కణానికి తగిలే దెబ్బలను ఇవి రిపేర్‌ చేస్తాయి.

పెరుగు..
మనం తీసుకునే ప్రధాన ఆహారానికి తోడుగా బాదం, క్యారెట్‌, టమాటాలను కలిపి తింటే మంచి ఆరోగ్యం సమకూరుతుంది. ఉదాహరణకు బ్రెడ్‌తో ఈ ముక్కలన్నింటినీ శాండ్‌విచ్‌లా కలిపి తినడం మంచిది.బ్రేక్‌ఫాస్ట్‌ను వండే సమయం లేనప్పుడు పెసర్లు లాంటి పొట్టు తీయని గింజధాన్యాలను నానబెట్టి, ప్రతిరోజూ ఉదయం ఏదో ఒక పండుతో పాటు తిని, పాలు తాగడం టిఫిన్‌కు ఒక ప్రత్యామ్నాయం.కొవ్వు తీసిన పాలతో తోడేసిన పెరుగును ఆహారం తర్వాత తీసుకోవడం మంచిది. ఈ పెరుగును చిలికి మజ్జిగ చేసుకుని అందులో కొద్దిగా మిరియాలపొడి, జీలకర్ర, అల్లం రసంతో కలుపుకుని బటర్‌మిల్క్‌ రూపంలో తాగడం వల్ల వంటికి చలువ చేస్తుంది.రోజూ ఎక్కువసార్లు కూల్‌డ్రింక్స్‌ లేదా ప్యాకింగ్‌ డ్రింక్స్‌ తాగేవారు దానికి బదులు ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల కూల్‌డ్రింక్స్‌ నుంచి కలిగే దుష్పరిణామాలను నివారించడంతో పాటు మంచి ఆరోగ్యాన్ని ఏకకాలంలో పొందవచ్చు. కాబట్టి, ఇలాంటి చిన్న చిట్కాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

10:00 - February 10, 2016

అందంపై పెరిగిన ఆసక్తి కారణంగా.. అమ్మాయిలే కాదు అబ్బాయిలు సైతం అనేక రకాల కాస్మటిక్స్‌ వాడుతున్నారు. ఇప్పుడు మార్కెట్‌లో కాస్మటిక్స్‌ ఉత్పత్తుల టర్నోవర్‌ కోట్లల్లో ఉంది అంటే అందుకు కారణం అందంపై పెరిగిన మక్కువే. అయితే అందం కోసం ఉపయోగించే వీటి కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల్లో స్పష్టమైంది. మహిళల ఆరోగ్యాన్ని హరించి వేయడంలో కాస్మటిక్స్‌ ప్రధాన పాత్ర వహిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కాస్మటిక్స్‌లో ఉపయోగించే రసాయనాలు అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. ఎక్కువగా కాస్మటిక్స్‌ వాడితే..

 1. ఎలర్జీలతో పాటు చర్మ క్యాన్సర్‌, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
 2. లిప్‌స్టిక్‌లో ఉపయోగించే లిడ్‌, కాండిమమ్‌, పెరాట్‌, మెథక్రిటేట్‌ వంటి రసాయనాలతో పాటు ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి ఉపయోగించే ట్రెక్లోజన్‌ కారణంగా అనారోగ్య సమస్యలు వస్తాయి.
 3. ఫెయిర్‌ నెస్‌ క్రీముల్లో ఎక్కువగా ఉపయోగించే మెర్కురీ కారణంగా దీర్ఘకాలంలో మూత్రపిండ సంబంధమైన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 4. కాస్మటిక్స్‌ దీర్ఘకాలంగా ఉపయోగించే వారిలో కండరాల శక్తి తగ్గిపోతుంది.
 5. అధిక బరువు, అవాంఛిత రోమాలు, నెలసరి సమస్యలు వస్తాయి.
 6. చర్మ క్యాన్సర్‌ వచ్చే వారిలో కాస్మటిక్స్‌ వాడకం ప్రధానమైన కారణంగా నిపుణులు గుర్తించారు.
 7. ఇన్నీ విధాల సమస్యలను తీసుకువచ్చే కాస్మటిక్స్‌ను మితంగా వాడితేనే మంచిది. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు చెప్పినట్లు సున్నిపిండి, వంటిట్లో ఉండే పసుపు, పాలు, మీగడ, పెరుగు, శెనగ పిండి మొదలైనవి ఉపయోగిస్తే.. అందంతో పాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. 
09:59 - February 10, 2016

పిండివంటల్లో విరివిగా వాడే బెల్లం నిజానికి ఒక గొప్ప ఔషధం. ఇందులో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీన్ని అప్పుడప్పుడు కాకుండా తరచుగా ఆహారంలో భాగంగా తీసుకోవడం అత్యవసరమని కూడా అనిపిస్తుంది. ఇందులో ఉన్న మంచి లక్షణాలు..

 • జీర్ణక్రియకు పనికొచ్చే ఎంజైములు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. పేగుల పనితీరుని మరింత ఉత్తేజపరుస్తుంది. అందుకే బెల్లం మలబద్దకానికి మంచి మందులా పనిచేస్తుంది.
 • లివర్‌లోని హానికరమైన విషాలను బయటకు తోసేందుకు తోడ్పడుతుంది. శరీరంలోని వ్యర్థాలను సమర్ధవంతంగా బయటకు నెడుతుంది.
 • దగ్గు, జలుబు లాంటి వాటికి బెల్లం మంచి ఔషధం. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు బెల్లంను వేడి నీటితో కానీ, టీలో వేసుకుని కానీ తాగితే మంచిది.
 • రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాలు బెల్లంలో ఉన్నాయి.
 • ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది.
 • శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పేగులు, పొట్ట, అన్నవాహిక.. వీటన్నింటినీ శుభ్రం చేసే శక్తి బెల్లంకి ఉంది. గనులు, ఫ్యాక్టరీలు, సిమెంటు పనులు, ఇంకా కాలుష్యంతో కూడిన ప్రాంతాల్లో పనిచేసేవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.
 • ప్రి మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ కారణంగా నెలసరికి ముందు ఇబ్బందులు పడేవారు, ఆ సమయంలో నొప్పులను అనుభవించేవారు దీన్ని తీసుకుంటే సమస్యలు తగ్గుముఖం పడతాయి.
 • బెల్లంలో ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ ఉండటం వలన రక్తలేమిని నివారిస్తుంది. ఎర్రరక్త కణాలు తగ్గకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గర్భిణులకు మరింత మేలు చేస్తుంది.
 • ఇందులో మెగ్నీషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన పేగులకు బలం చేకూరుస్తుంది. ప్రతి పది గ్రాముల బెల్లంలో 16 మిల్లీ గ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. అంటే ఇది మనకు ఒకరోజుకి కావాల్సిన మెగ్నీషియంలో నాలుగోవంతుని అందిస్తున్నట్టు లెక్క.
 • బెల్లం శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరిస్తుంది. దీని వలన శరీరం చల్లబడుతుంది. అందుకే ఎండాకాలంలో చల్లని నీళ్లలో బెల్లం కలుపుకుని తాగమని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు.
 • పొటాషియం, సోడియం ఉండటం వలన శరీరంలో యాసిడ్స్‌ లెవల్స్‌ను సక్రమంగా ఉంచేశక్తి దీనికి ఉంది. రక్తపోటుని సైతం క్రమబద్ధీకరిస్తుంది కూడా.
 • శ్వాసక్రియ సమర్ధవంతంగా ఉంచడంలో బెల్లం శక్తివంతంగా పనిచేస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్‌ లాంటి సమస్యలను దూరం చేస్తుంది. నువ్వులతో కలిపి దీన్ని తీసుకుంటే శ్వాసకోశ వ్యవస్థకు అద్భుతమైన మేలు చేస్తుంది.
 • జాయింట్‌ నొప్పులతో బాధపడుతున్న వారికి బెల్లం మంచి ఔషధమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాస్తం బెల్లం ముక్కని అల్లంతో కలిపి తీసుకుంటే నొప్పులకు ఉపశమనంగా ఉంటుంది. అలాగే పాలల్లో బెల్లం కలుపుకుని తాగినా ఎముకలకు మంచిది.
 • బెల్లం బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇందులో ఉన్న పొటాషియం, కండరాల నిర్మాణంలో మెటబాలిజంని పెంచడంలో శరీరంలో నీటిని తగ్గించడంలో తోడ్పడి బరువుని అదుపులో ఉంచుతుంది.
 • పంచదార కంటే శరీరానికి శక్తిని ఇవ్వడంలో బెల్లం మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది. పంచదారలా ఒక్కసారిగా కాకుండా శరీరానికి ఎక్కువ సమయం కార్బోహైడ్రేట్‌లను ఇవ్వగలుగుతుంది. అందువల్ల రక్తంలో ఒక్కసారిగా షుగర్‌ స్థాయి పెరగదు.
 • అలాగే బెల్లం శరీరంలో అలసటని, బలహీనతని పోగొడుతుంది. బెల్లంలో ఇన్ని అద్భుత గుణాలుండటం విశేషమే. అయితే ఇందులో కేలరీలు ఎక్కువగా ఉండటం వలన తగిన మోతాదులో మాత్రమే తీసుకుంటే మంచిది.
09:50 - February 10, 2016

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇవాళ నగల షాపులు మూతపడనున్నాయి. పాన్ కార్డు నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జ్యూయెలరీ షాపుల యజమానులు బంద్‌కు పిలుపునిచ్చారు. మొత్తం 300 అసోసియేషన్స్‌కు సంబంధించిన లక్షకు పైగా దుకాణ యజమానులు బంద్‌లో పాల్గొననున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే  భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించి ఉద్యమ బాట పడతామని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.   

నగల షాపు యజమానుల సమ్మె 

బుధవారం దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. 2 లక్షలు అంతకు మించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుకు పాన్ కార్డు తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా సమ్మె చేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ చర్య...దేశవ్యాప్తంగా ఉన్న అధిక సంఖ్యాక జ్యూయెలర్స్‌, నగల తయారీదారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. 

కృష్ణాలో దుకాణాల బంద్ 

కృష్ణా జిల్లా వ్యాప్తంగా దుకాణాలు మూసివేసి బంద్ చేపట్టనున్నారు. ఇప్పటికే విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో నగల దుకాణ యజమానులతో సమావేశాలు నిర్వహించి బంద్‌ను జయప్రదం చేయాలని అసోసియేషన్ సభ్యులు పిలుపునిచ్చారు.

నగల వ్యాపారులకు అడ్డుగా పాన్ కార్డు నిబంధన  

ఆదాయపు పన్ను చెల్లించలేని, గ్రామాల్లో నివసించే నగల వ్యాపారులకు పాన్ కార్డు నిబంధన అడ్డుగా పరిణమిస్తోందని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. ప్రభుత్వ చర్య వల్ల జ్యూయెలరీ పరిశ్రమ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నిస్తున్నారు. పాన్ కార్డు తప్పనిసరి చర్య అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచి పరిశ్రమ మొత్తం టర్నోవర్ 30 శాతం తగ్గిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వ్యాపారులు, నగల తయారీ దారుల ఉపాధి కల్పన ప్రశ్నార్ధకంగా మారిందంటున్నారు. 
బంగారు ఆభరణాలు దుకాణ యజమానుల బంద్ నేపధ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

 

09:46 - February 10, 2016

పూణె : ఆస్ట్రేలియాపై విజయంతో జోష్‌ మీద ఉన్న భారత్‌ జట్టుకు శ్రీలంక షాక్‌ ఇచ్చింది. లంకేయులతో జరుగుతున్న టి-20 సిరీస్‌ మొదటి మ్యాచ్‌లో ఇండియా ఓటమి పాలయ్యింది. ఈ విజయంతో శ్రీలంక 1-0  ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ 20 మ్యాచ్‌ రాంచిలో ఫిబ్రవరి12న జరుగనుంది.  

పరాజయంతో ప్రారంభించిన భారత్‌

స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సీరిస్‌ను భారత్‌ పరాజయంతో ప్రారంభించింది. పూణె వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో లంకేయులు విజయం సాధించారు. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్లు తేలిపోవడంతో 101 పరుగులకే భారత్‌ కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని లంక జట్టు ఆడుతూ పాడుతూ చేధించింది. సీనియర్ ఆటగాళ్ల లేకపోయినా సమిష్టిగా పోరాడి ధోని సేనపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

నిరాశపరిచిన టాప్ ఆర్డర్ 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ధోని సేన 101 పరుగుల స్కోరును మాత్రమే నమోదు చేసింది. భారత టాప్‌ ఆర్డర్‌ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని నిరాశపరిచారు. ఓ దశలో 58 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను అశ్విన్ 31 పరుగులు చేసి ఆదుకున్నాడు. లంక బౌలర్లలో కాశున్ రజితా, షనాకా తలో మూడు వికెట్లు సాధించగా,సమీరాకు రెండు, సేననాయకేకు ఒక వికెట్ దక్కింది.

 1-0 ఆధిక్యంలో శ్రీలంక

భారత్ విసిరిన 102 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో సాధించిన శ్రీలంక... సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. ప్రారంభంలోనే డెక్ విల్లా, గుణతిలకావికెట్లను కోల్పోయి లంక జట్టు కష్టాల్లో పడింది. కెప్టెన్ చండిమాల్, కపుగదరెలు ఆదుకోవడంతో గాడిలో పడింది. వీరిద్దరూ ఒకరి తరువాత ఒకరు అవుటైనా  లక్ష్యం పెద్దదిగా లేకపోవడంతో సిరివర్దనే జట్టును విజయతీర్చాలకు చేర్చాడు. భారత బౌలర్లలో ఆశిష్ నెహ్రా, అశ్విన్ లకు తలో రెండు వికెట్లు లభించగా, రైనాకు ఒక వికెట్ దక్కింది. రెండో ట్వంటీ-20 మ్యాచ్‌ రాంచీలో ఈ నెల 12న జరుగుతుంది. 

కన్నబిడ్డలను చంపేసిన తండ్రి...

విశాఖ : జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో కన్నతండ్రి ఇద్దరు పిల్లను హతమార్చాడు. ఈ ఘటన పాయకరావుపేట మండలంలో చోటుచేసుకుంది.  

09:32 - February 10, 2016

విశాఖ : జిల్లాలో దారుణం జరిగింది. కన్న పిల్లలను అల్లారుముద్దుగా పెంచాల్సిన తండ్రి వారి పాలిట యముడయ్యాడు. కుటుంబ కలహాలతో కన్నతండ్రి ఇద్దరు పిల్లను హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాయకరావుపేటకు చెందిన సత్తిబాబు అనే వ్యక్తికి గతంలో ఓ దళిత మహిళతో పరిచయం ఏర్పడింది. ఆరేళ్ల క్రితం సత్తిబాబు ఆ మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యతో తరచూ అతను గొడవపడుతున్నాడు. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈనేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను సత్తిబాబు బయటికి తీసుకెళ్లి చంపేశాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రౌడీషీటర్ల దాడిలో గాయపడ్డ సీపీఎం కార్యకర్తలను పరామర్శించనున్న మధు

గుంటూరు : నేడు గుంటూరు జిల్లాలో సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించనున్నారు. సుందరయ్యనగర్ లో నిన్న రౌడీ షీటర్ల దాడిలో గాయపడ్డ సీపీఎం కార్యకర్తలను పరామర్శించనున్నారు. 

నేడు నిజామాబాద్ జిల్లాలో తమ్మినేని వీరభద్రం పర్యటన

నిజామాబాద్ : జిల్లాలో నేడు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించనున్నారు. కలెక్టరేట్ వద్ద దీక్షలో ఆయన పాల్గొననున్నారు.

 

నేడు నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా అంత్యక్రియలు

ఖాట్మాండు : నేడు నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాలా అంత్యక్రియలు జరుగనున్నాయి. నిన్న సుశీల్ కన్నుమూశారు.

 

రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

కడప : రైల్వే కోడూరు మండలం బిల్లుపాటిపల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రూ. 2కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. స్మగ్లర్లు పరారయ్యారు. 

 

తెలంగాణలో నేటి నుంచి ఎస్సై పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్ : తెలంగాణలో నేటి నుంచి ఎస్సై పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 

08:11 - February 10, 2016

నానాటికీ పెరుగుతున్న స్త్రీ భ్రూణ హత్యలను, అబార్షన్ లను నివారించాలంటే ఏం చేయాలి? లింగ నిర్దారణ పరీక్షలను చట్టబద్దం చేయాలట.   ఇది కేంద్ర మంత్రి మేనకాగాంధీ ఆలోచన.    ఆడశిశువులకు మనస్పూర్తిగా స్వాగతం పలకలేని దుర్భలత్వం వున్న సమాజంలో లింగ నిర్ధారణ పరీక్షలను చట్టబద్దం చేయడం సమర్ధనీయమా? 

దేశంలో స్త్రీ పురుష నిష్పత్తిలో చాలా తేడా 

మన దేశంలో స్త్రీ పురుష నిష్పత్తిలో చాలా తేడా వస్తోంది. ఇది అత్యంత ఆందోళనాకర పరిణామం. మన దేశంలో  ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది స్త్రీలు మాత్రమే వున్నారు. ఇది  మనం చాలా సీరియస్ గా పట్టించుకోవాల్సిన డేంజర్ సిగ్నల్.  స్త్రీ శిశు జననాల పట్ల సమాజంలో రోజురోజుకీ విముఖత పెరుగుతోంది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసిన మరుక్షణమే అబార్షన్  చేయించుకుంటున్నారు. లేదా పుట్టిన పిల్లలను పుట్టినట్టే  మురికి కాలువల్లో, చెత్త కుప్పల్లో పారేస్తున్నారు. కన్నుతెరవక ముందే చంపేస్తున్నారు. ఇలాంటి విషాదవార్తలు ప్రతి రోజూ మన హ్రుదయాలను కకావికలం చేస్తూనే వున్నాయి. ఇలాంటి సామాజిక నేపథ్యంలో స్త్రీ శిశు భ్రూణ హత్యలను నివారించాలన్న లక్ష్యంతో లింగనిర్ధారణ పరీక్షలను, అబార్షన్ లను కఠినతరం చేశారు. పుట్టబోయే శిశువు అమ్మాయో, అబ్బాయో ముందస్తుగానే నిర్ధారించడాన్ని, బహిరంగ పర్చడాన్ని నిషేధించారు.

స్త్రీ శిశువులను హతమార్చే అనాగరికం

అయిన్నప్పటికీ, స్త్రీ శిశువులను హతమార్చే అనాగరికం కొనసాగుతూనే వుంది. ఆడపిల్లలను కనడం, పెంచడం, చదివించడం,  పెళ్లి చేయడం ఇవన్నీ కష్టమన్న అభిప్రాయం సమాజంలో పాతుకుపోతుండడం  అత్యంత దురద్రుష్టకరం. సిరిసంపదలతో తులతూగుతున్నవారు, ఆర్థికంగా స్థితిమంతులు కూడా తమ కుటుంబంలో మరో ఆడపిల్ల జన్మించడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోతున్న దౌర్భాగ్యం మన దేశంలో పెరుగుతోంది. తరతరాలుగా స్త్రీల పట్ల వున్న చిన్నచూపు ఒక కారణమైతే,  దేశంలో అమ్మాయిల మీద నానాటికీ పెరుగుతున్న నేరాలు, వేధింపులు ఇందుకు కారణమవుతున్నాయి. ఆడ పిల్లల కిడ్నాప్ లు, ముక్కుపచ్చలారని పసికందుల మీద కూఅత్యాచారాలు, ఈవ్ టీజింగ్ లు, యాసిడ్ దాడులు ఇలాంటివన్నీ  ఆడజన్మకు శాపాలుగా మారుతున్నాయి.  చదువుకోవడానికి స్కూలుకో కాలేజీకో వెళ్లిన తమ  చిట్టితల్లిని ఎవరు ఎన్ని రకాలుగా వేధిస్తారోనన్న ఆవేదన,  తమ బంగారుతల్లికి ఎవరి నుంచి ఏ రూపంలో  ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందోనన్న ఆందోళన  సగటు తల్లిదండ్రులది. ఇంతటి భయానక వాతావరణంలో ఆడపిల్లకు జన్మనివ్వాలంటేనే చాలా యువజంటలు జంకుతున్నాయి. ఇలాంటి సామాజిక నేపథ్యంలో లింగనిర్ధారణ పరీక్షలను చట్ట బద్దం చేస్తే, ఫలితం మరింత దారుణంగా వుంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆడపిల్లలను కన్నందుకు పచ్చిబాలింతలను వేధిస్తున్న, కడతేరుస్తున్న దుర్మార్గులున్న సమాజం మనది. ఒకవేళ తమకు పుట్టేది ఆడపిల్లేనని  ముందుగానే ఖాయంగా తెలిస్తే, ఆ గర్భిణీలకు  పిడికెడన్నమైనా పెడతారా? అన్నది సందేహమే. తమకు ఆడపిల్లలు పుట్టొద్దని కోరుకుంటున్నవారిలో పురుషులే కాదు స్త్రీలు కూడా వుంటున్నారన్న వాస్తవాన్ని  విస్మరించకూడదు. ఆడపిల్లల విముఖంగా వున్న గర్భిణీకి తనకు అమ్మాయే పుట్టబోతోందని తెలిస్తే, ఆ గర్భాన్ని ఆమె సంతోషంగా మోయగలదా?  గర్భంలోని శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోగలదా?  అయ్యో నాకు ఆడపిల్లే పుడుతోందా? అంటూ కుమిలిపోతే, తల్లి తన కడుపునున్న బిడ్డకు సంతోషంగా స్వాగతం చెప్పగలదా? ఆడపిల్లలు ఇష్టం లేని తండ్రి , గర్భం దాల్చిన భార్యను అసలు ఇంట్లో వుండనిస్తాడా?  ఇలాంటి పరిస్థితులు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవా? ఇవన్నీ సీరియస్ గా ఆలోచించాల్సిన విషయాలు. తన గర్భంలో ఆడ శిశువులను మోస్తున్న గర్భిణీల మీద నిఘా వుంచాలన్న ప్రతిపాదన కూడా మేనకాగాంధీ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇంతకంటే అన్యాయం, అనాగరికం, అప్రజాస్వామ్యం, క్రూరత్వం మరొకటి వుంటుందా? దేశంలో  పురుషులతో సమానంగా స్త్రీల జనాభా పెరగాలంటే  ముందుగా చేయాల్సింది పుట్టినవారికి సంపూర్ణ సంరక్షణ కల్పించడం.  ఆడ పిల్లల తల్లిదండ్రులకు ప్రోత్సహాకాలివ్వడం. ఆడపిల్లల చదువులకు, వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరాయించడం. ఇంటా బయటా స్త్రీల మీద జరిగే నేరాలను జీరో స్థాయికి తీసుకురావడం. స్త్రీలు పురుషులు సమానమేనన్న చైతన్యాన్నివ్వడం. ఇవేవీ చేయకుండా లింగ నిర్ధారణ పరీక్షలను చట్టబద్దం చేయడం, గర్భిణీల మీద నిఘా పెట్టడం లాంటి చర్యలకు దిగడంలో ఏరకంగానూ సమర్ధనీయం కాదు. 

07:54 - February 10, 2016

లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలని మేనకాగాంధీ వ్యాఖ్యలు చేయడం అప్రజాస్వామికమని ఐఎఫ్ టీయూ నేత ఎస్ ఎల్.పద్మ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. 'కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకాగాంధీ కొత్త చర్చకు తెరలేపారు. లింగనిర్ధారణ పరీక్షలను అనుమతించి,  కంపల్సరీ చేయాలన్నది ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం. ఈ ఆలోచన మీద ఇప్పుడు జోరుగా చర్చలు సాగుతున్నాయి. పుట్టబోయే శిశువు అమ్మాయో, అబ్బాయో నిర్ధారించే పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు సబబు? వీటిని చట్టబద్దం చేయడం ఎలాంటి ఫలితాన్నిస్తుంది? లింగ నిర్ధారణ పరీక్షలను చట్టబద్దం చేయడం, కంపల్సరీ చేయడం స్త్రీల జీవితాల మీద ఎలాంటి ప్రభావాన్ని పడేస్తుంది? ఈ ఆలోచన స్త్రీలకు మేలు చేస్తుందా? లేకపోతే మరింత కీడు చేస్తుందా'? ఇలాంటి అంశాలపై ఎస్ఎల్ పద్మ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:43 - February 10, 2016

మెదక్ : నారాయణ్ ఖేడ్ ఎన్నికలప్రచారంలో నేతలు బిజిబిజీ గా గడుపుతున్నారు. అటు టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. నేతల పరస్పర ఆరోపణలతో నారాయణ్ ఖేడ్ లో రాజకీయాలు వేడెక్కాయి. టిఆర్ ఎస్ పార్టీ తరపున మంత్రి హరీష్‌రావు సుడిగాలి ప్రచారం చేస్తున్నారు.

ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక

మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధ మయింది. ఇప్పటికే నారాయణ్ ఖేడ్ లో ప్రచారం చేస్తున్న వివిధపార్టీల నేతలు పరస్పర ఆరోపణలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గ్రేటర్ విజయంతో టీఆర్ఎస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తోంది. ఈ నెల 13 న పోలింగ్ ఉండడంతో పార్టీలు ప్రచార జోరును పెంచాయి.

టీఆర్ఎస్ పథకాలు పూర్తిగా విఫలం : కాంగ్రెస్

20 నెలల కాలంలో రాష్ట్రంలో అవలంబిస్తున్న పథకాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూం ఇళ్లంటూ ప్రచారం చేసిన టీఆర్ ఎస్ పార్టీ నారాయణ్ ఖేడ్ కు ఏంచేసిందో చెప్పాలని టీ కాంగ్ నేతలు ప్రశ్నలు సందిస్తున్నారు. కేసీఆర్ ది మాటల ప్రభుత్వమేనని ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ది టీడీపీతోనే సాధ్యమని నేతలు ఎర్రబెల్లి , ఎల్ రమణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం సింగూరు జలాలను కిందికి వదిలి తాగు నీటికి ఇబ్బంది కలిగించిందని పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ ఆరోపించగా.. హరీష్ రావు ధీటుగా సమాధానం ఇచ్చారు.

రసవత్తరంగా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక

ఇలా వరుస బాణాలు సందించుకుంటూ నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికను రసవత్తరంగా మారుస్తున్నారు నేతలు. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి పలు పార్టీల నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. ఈనెల 13న పోలింగ్ ఉండడంతో ఈ లోగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు తమ వాణిని పెంచుతున్నారు. ఇది ఇలా ఉంటే నారాయణ్‌ ఖేడ్ ను ఖూనీ చేసి దోచుకుని ప్రజల వైద్య, ఆరోగ్య భద్రత కల్పించకుండా చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వం అని విరుచుకుపడ్డారు హరీష్ రావు. నారాయణ్ ఖేడ్ లో కనబడేది.. నిలబడేది.. చెప్పేందిచేసేది.. టీఆర్ఎస్ పార్టీ అంటున్నారు హరీష్ రావు.

కాంగ్రెస్ పై హరీష్ రావు విమర్శలు

రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ ఎకగ్రీవం చేయకుండా అభ్యర్థిని బరిలో దించిన సందర్భాలు చాలానే ఉన్నాయని ..నేడు విచిత్రంగా ఎమ్మెల్యే చనిపోతే ఏకగ్రీవం చేయలేదంటూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నేతల మరణానంతరం పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో ఉంచిన తీరును వివరించారు హరీష్ రావు.

వివిధ పార్టీల నేతల ప్రచార జోరు

పోలింగ్ సమయం దగ్గరపడుతుండడంతో వివిధ పార్టీల నేతలు ప్రచార జోరును పెంచారు. పరస్పర ఆరోపణలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు వెళుతుంటే గత ప్రభుత్వం నారాయణ్ ఖేడ్ కు ఏం చేసిందే చెప్పాలని అధికార పార్టీ రివర్స్ ఎటాక్ ఇస్తోంది. దీంతో నారాయణ్‌ ఖేడ్ ఖేల్ ను తలపిస్తోంది.

 

 

07:36 - February 10, 2016

హైదరాబాద్ : విజయంతో మున్సిపల్‌ శాఖను పొందిన కేటీఆర్‌..ఇప్పుడు ఆ శాఖపై దృష్టిసారించారు. మున్సిపల్‌ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే రివ్యూ మీటింగ్‌లో పట్టణాలు, నగరాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించనున్నారు.

మున్సిపల్‌ శాఖపై కేటీఆర్‌ దృష్టి

గ్రేటర్‌లో విజయం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా కేటాయించిన మున్సిపల్‌ శాఖపై మంత్రి కేటీఆర్‌ దృష్టిసారించారు. ఆ శాఖ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. బుద్ధ పూర్ణిమలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మీటింగ్‌ జరుగుతుంది. మున్సిపల్‌ శాఖకు చెందిన పలు అంశాలను ఈ సమావేశంలో అధికారులతో కేటీఆర్‌ చర్చించనున్నారు.

నగరాలు, పట్టణాల అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన

నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికల రూపకల్పనకు కేటీఆర్‌ ఈ రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల స్థితిగతులను ఈ సమావేశంలో చర్చిస్తారు. పట్టణాలు, నగరాల్లో సమస్యలు..వాటి పరిష్కార మార్గాలపై ఒక రోడ్‌ మ్యాప్‌ను తయారుచేయాలని మంత్రి భావిస్తున్నారు. నగర, పట్టణ పాలనతో పౌరులకు భాగస్వామ్యం కల్పిస్తామని కేటీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. 15 రోజులకు ఒకసారి టౌన్‌హాల్‌ సమావేశాలు ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఇవాళ జరుగుతున్న రివ్యూ మీటింగ్‌లో ఈ అంశాలన్నీ చర్చకు రానున్నాయి. మున్సిపల్‌ శాఖ కు చెందిన కిందిస్థాయి అధికారుల నుంచి ప్రిన్సిపల్‌ సెక్రటరీ వరకు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరాభివృద్ధిపై కేటీఆర్‌ తన విజన్‌ను ఆవిష్కరించనున్నారు.

 

07:30 - February 10, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటిని ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విద్యార్థులకు ఉపాధి కల్పించే విద్యకే పెద్దపీట వేయాలని సర్కార్‌ భావిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోడల్‌ స్కూల్స్‌ ఊహించినంత సక్సెస్‌ కాకపోవడంతో వాటిపై పునరాలోచన చేయాలని భావిస్తోంది. 

ఒకే గొడుకు కిందికి విద్యాసంస్థలు 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలను ఒకే గొడుకు కిందకు తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. విద్యా సంస్థల విలీనంపై అధ్యయనం చేసి వచ్చే విద్యా సంవత్సరంలోపు రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. బడ్జెట్ ప్రతిపాదనపై క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి, అధికారులతో సమావేశం అయిన సీఎం కేసీఆర్‌..రాష్ట్రంలో విద్యా సంస్ధల బాధ్యతంతా విద్యాశాఖకే అప్పగించాలని నిర్ణయించారు. మెడిసిన్‌, ఫార్మా, అగ్రికల్చర్‌ విద్యా సంస్థలను మాత్రం యథావిధిగా ఉంచనున్నారు.  

రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తం 

రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ అంతా అడ్డదిడ్డంగా, అస్తవ్యస్తంగా ఉందని,.పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థలు, స్టడీ సర్కిళ్లు ఇలా వేర్వేరుగా విద్యా సంస్థలు ఉండడం మంచిది కాదని..వాటన్నింటిని ఒకే గొడుకు కిందకు తేవాలని నిర్ణయించారు. ఎవరికి వారుగా విద్యా సంస్థలను నిర్వహించడం వల్ల సమగ్రత లోపించిందని..విద్యార్థులకు అవసరమైన విద్య, ఉద్యోగావకాశాలు పెంచే శిక్షణ అందడంలేదన్నారు సీఎం. అలాగే రాష్ట్రం, దేశంలో ఏఏ ఉద్యోగవకాశాలు ఉన్నాయో తెలుసుకొని..వాటికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవడంలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, జాతీయ స్థాయిలో నిర్వహించే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షల గురించి మాత్రమే అటు విద్యార్థులు, ఇటు ప్రభుత్వం దృష్టి పెడుతోందన్నారు. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా రక్షణ, రైల్వే, బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలు కోసం పోటీ పరీక్షలు ఉన్నాయి. వాటిని సంబంధించిన సమాచారం విద్యార్థులకు అందకపోవడంతో పరీక్షలకు విద్యార్థులు సిద్ధపడడంలేదన్నారు. అంతేకాకుండా అటు విద్యా వ్యవస్థ, ఇటు ఉద్యోగావకాశాలున్న రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొత్త ధోరణులు వస్తున్నప్పుడే సరి కొత్త అవకాశాలు ఉంటాయి. విస్తరిస్తున్న ఐటి రంగంలో ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయని..దీనికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.  

నూతన విద్యావిధానానికి రూపకల్పన

అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకోకపోవడం కూడా ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవడంలో వెనుకబడుతున్నట్లు సీఎం భావిస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో వైద్యులు ఎంత మంది కావాలి? ఇంజనీర్లు ఎందరు కావాలి? ఇంకా ఏఏ ఉద్యోగాలకు ఎంత మంది కావాలి? అనే అంచనా లెక్కలు విద్యాశాఖ వద్ద ఉండాలని సీఎం సూచించారు. దానివల్ల విద్యార్థులను ఆయా ఉద్యోగాలకు సిద్ధం చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతమున్న విద్యా విధానం వల్ల విద్యార్థులు నిరుద్యోగులుగా మారుతున్నారే తప్ప ఉద్యోగావకాశాలు లభించడంలేదని సీఎం కేసీఆర్‌. ఇక దేశవ్యాప్తంగా మోడల్ స్కూళ్లు పథకం అంత బాగా లేదని..ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలను విద్యాశాఖ పరిధిలోకి తెచ్చే విషయంలో సమగ్ర అధ్యయనం చేసి,..కొత్త విద్యా విధానం రూపొందించాలని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మలను సీఎం ఆదేశించారు. నూతన విద్యావిధానం వచ్చే విద్యాసంవత్సరం నాటికి రూపకల్పన జరగాలని సూచించారు. 

07:22 - February 10, 2016

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూరు బిజీబిజీగా సాగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈపర్యటనలో ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులను సీఎం కలిశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఏపీ సమస్యలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని సీఎం కోరారు.

ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. మొదటి రోజు ఎన్డీయే మిత్రపక్షాల సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. రెండో రోజు ప్రధాని మోదీ సహా పలువురు కీలక మంత్రులు, నేతలతో భేటీ అయ్యారు.

చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ..
మంగళవారం సాయంత్రం చంద్రబాబు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రెవెన్యూలోటు, ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం పై మోడితో బాబు చర్చించారు. అమరావతి నిర్మాణానికి వచ్చే బడ్జెట్ లో 4000 కోట్ల ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించడంతో పాటు... రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన 2408 కోట్లను తిరిగి ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని. వీటితో పాటు పలు రాజకీయ అంశాలు కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చింది.

అరుణ్ జైట్లీతో సమావేశమైన చంద్రబాబు..
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన చంద్రబాబు .. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానంగా చర్చించారు . రెవెన్యూ లోటు భర్తీకి ఇప్పటి వరకు రెండు వేల కోట్లు మాత్రమే ఇవ్వగా.. ఇంకా 13వేల కోట్ల పైనే రావాల్సి ఉంది. వాటిని తక్షణమే విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కోరారు .హిమాచల్, ఉత్తరాఖండ్ తరహాలో పూర్తిస్థాయిలో పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని చంద్రబాబు జైట్లీ ని కోరారు ..

సురేష్‌ప్రభుతో చంద్రబాబు భేటీ..
ప్రధానితో సమావేశం అనంతరం చంద్రబాబు రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభుతో భేటీ అయ్యారు. విశాఖ రైల్వేజోన్‌ను త్వరగా ఏర్పాటుచేయాలని కోరారు. కాకినాడ - పిఠాపురం,కోటిపల్లి - నరసాపురం,గుత్తి -ధర్మవరం ,సింగరాయకొండ - కనిగిరి లకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరారు.

నితిన్ గడ్కరీని కలిసిన చంద్రబాబు..
కేంద్ర రోడ్లు మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన చంద్రబాబు..సాగరమాల, భారత మాల ప్రాజెక్టుల గురించి చర్చించారు . అనంతపురం - విజయవాడ హైవే ప్రాజెక్టు, విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి తగిన చర్యలు చంద్రబాబు కోరారు. మొత్తానికి బడ్జెట్‌ సమావేశాలకు ముందు ఏపీ సీఎం రాష్ట్ర సమస్యలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మరి ఆయన వినతులను కేంద్రం ఎంతవరకు పట్టించుకుంటుందో బడ్జెట్‌ వరకు వేచి చూడాల్సిందే..

ఎంఎంటిఎస్ లో స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రయాణం

హైదరాబాద్ : ఎంఎంటిఎస్ లో స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రయాణం సాగనుంది. నేడు ఎంఎంటిఎస్ లో పేపర్ లెస్ టిక్కెట్ వ్యవస్థకు శ్రీకారం చుట్టనుంది.

06:44 - February 10, 2016

స్నేహ చిత్ర పిక్చర్స్‌ పతాకంపై ఆర్‌.నారాయణమూర్తి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'దండకారణ్యం'. త్రినాథ్‌, ప్రసాద్‌రెడ్డి, విక్రమ్‌ ప్రధాన పాత్రధారులు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. 
ఈ సందర్భంగా మంగళవారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆర్‌.నారాయణ మూర్తి మాట్లాడుతూ, 'త్రేతాయుగంలో సీతారాములు, ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు దండకారణ్యంలోనే ఉన్నారు. అలాంటి దండకారణ్యం ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వం చేపట్టే బాక్సైట్‌ గనుల తవ్వకాల్లో అక్కడున్న ఆదివాసీలకు మనుగడ లేకుండా పోతుంది. ఆదివాసీ హక్కుల గురించి తెలియజేసే చిత్రమే 'దండకారణ్యం'. దండకారణ్యంలో పోలీసులకు, నక్సల్స్‌కి ఎప్పుడు కాల్పులు జరుగుతాయి. ప్రభుత్వం దీనిపై చర్చలు జరిపి అరణ్యంలో శాంతి చర్చలు జరపాలి. ఆదివాసీయుల సంపద వారికే చెందాలనే చెప్పేదే ఈ చిత్రం. ఇందులో వీప్లవ వీరుడు కోటన్న పాత్రలో నటించాను. ఏడు పాటలున్న ఈ చిత్రంలో మూడు పాటలను గద్దర్‌ మూడు పాడగా, మరో నాలుగు పాటలను వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారు. గోరేటి వెంకన్న, ములుగు తిరుపతి, కాశీపతి సాహిత్యమం దించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ నెల 20న ఆడియోను విడుదల చేసి, మార్చి 4న సినిమాను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను'అని అన్నారు.

06:41 - February 10, 2016

కృష్ణ, విజయనిర్మల ప్రధాన పాత్రధారులుగా ముప్పలనేని శివ ఎస్‌.బి.ఎస్‌.ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సాయి దీప్‌ చాట్ల, వై.బాలు రెడ్డి, షేక్‌ సిరాజ్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'శ్రీశ్రీ'. త్వరలో ఆడియో విడుదల కానున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ,'ఇ.ఎస్‌.మూర్తి సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 18న శిల్పకళావేదికలో నిర్వహించనున్నాం. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా పాటలు విడుదలవుతాయి. 
ఈ ఆడియో వేడుకకి సూపర్‌ స్టార్‌ కృష్ణ తనయుడు మహేష్‌బాబు అతిథిగా విచ్చేస్తుండడం విశేషం. ఈ ఫంక్షన్‌లో కృష్ణ 50ఏళ్ళ సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇదొక గోల్డెన్‌ హిస్టరీగా భావిస్తూ సూపర్‌స్టార్‌ సినీ స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపనున్నాం. ఇండిస్టీకి చెందిన అతిరథ మహారథులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డి, కృష్ణంరాజు, వెంకటేష్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. హీరో సుధీర్‌బాబు క్లైమాక్స్‌లో పోలీస్‌ఆఫీసర్‌గా నటిస్తూ ఆకట్టుకుంటారు. ఓ అర్థవంతమైన చిత్రంగా జనరంజకంగా ఉంటుందీ చిత్రం' అని అన్నారు. నరేష్‌, సాయి కుమార్‌, పోసాని కృష్ణమురళి, ఎల్బీ శ్రీరామ్‌, తోటపల్లి మధు, దేవదాస్‌ కనకాల, మురళీ శర్మ, కునాల్‌ కౌశిక్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల, సంగీతం: ఇ.ఎస్‌.మూర్తి, ఆర్ట్‌: అశోక్‌, ఎడిటింగ్‌: రమేష్‌.

Don't Miss