Activities calendar

12 February 2016

విశాఖ గీతం వర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్య

విశాఖపట్నం : నగరంలోని గీతం వర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న బి.శ్రేయ ప్రసాద్‌ (19) అనే విద్యార్థిని వర్శిటీ వసతి గృహంలోనే చున్నీతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. శ్రేయ ప్రసాద్‌ ఈ సాయంత్రం 4.30 గంటల సమయంలో ఫోన్‌లో మాట్లాడుకుంటూ కంటతడి పెట్టినట్లు సీఐ తెలిపారు. అనంతరం హాస్టల్‌లో చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించినట్లు ఆయనచెప్పారు. 

21:22 - February 12, 2016

హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ మీడియాలో కలంతో కరవాలనం చేసిన ఆధునిక కవి, ప్రముఖ జర్నలిస్టు అరుణ్‌ సాగర్‌ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. మహా కలం యోధుడి ప్రస్థానం మహాప్రస్థానంలో ముగిసింది. ప్రముఖులు, జర్నలిస్టు మిత్రులు, అభిమానులు, బంధువులు, సన్నిహితులు అరుణ్‌ సాగర్‌కు కన్నీటి నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు.

పద్యాన్ని, గద్యాన్ని కాక్‌ టెయిల్లా కలిపి.....

పద్యాన్ని, గద్యాన్ని కాక్‌ టెయిల్లా కలిపి మంచి ఫ్రెంచి మద్యంలా సాహిత్యానికి ఆధునిక సొబగులు అద్దారని పేరు తెచ్చుకున్న మోడ్రన్ పోయెట్, ఎలక్ట్రానిక్ మీడియాకు నడకలు నేర్పిన అరుణ్‌ సాగర్‌ ఈ లోకానికి సెలవంటూ వెళ్లిపోయారు. మూడు రోజులు ఆసుపత్రిలో తుదిశ్వాసతో పోరాడుతూ తెల్లవారు జామున హఠాన్మరణం పొందిన అరుణ్‌ సాగర్‌ అంత్యక్రియలు కన్నీటి నయనాల మధ్య ముగిశాయి.

ఆసుపత్రి నుంచి మోతీనగర్‌లో స్వగృహానికి....

ఆసుపత్రి నుంచి మోతీనగర్‌లో స్వగృహానికి తరలించిన సాగర్‌ పార్థివదేహానికి ప్రముఖులు,సన్నిహితులు, మీడియా మిత్రులు, బంధువులు నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్రగా ఆయన పని చేస్తున్న న్యూస్‌ ఛానెల్‌ కార్యాలాయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానం శ్మశాన వాటికకు తరలించారు.

కడసారి వీడ్కోలు పలికిన స్నేహితులు, బంధువులు, సహచరులు ...

హలో బాస్ ఎలా ఉన్నావంటూ ఆప్యాయంగా అందర్నీ పలకరించే అరుణ్‌ సాగర్‌కు అందరూ తుది వీడ్కోలు పలికారు. కన్నీటి నయనాల మధ్య, శోకతప్త హృదయాల మధ్య అరుణ్‌ సాగర్‌ అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. మేల్‌కొలుపుతో సమాజాన్ని మేల్కొల్పి, పురుషుల బాధలను తనదైన శైలిలో వ్యక్తపరిచిన అరుణ్‌ సాగర్‌కు అత్యంత ఇష్టమైన పుస్తకం శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం. చివరికి అరుణ్ సాగర్‌ చేరుకున్నదీ మహాప్రస్థానమే.

శ్రీలంక విజయ లక్ష్యం 197

రాంచీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 51, రోహిత్ శర్మ 43, రెహానే 25, హార్ధిక్ పాండ్యా 25, సురేశ్ రైనా 30 పరుగులు చేసి అవుటయ్యారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 9 పరుగులు చేశాడు.

తెలంగాణ రాష్ట్రానికి బెస్ట్ గ్రీనరీ అవార్డ్...

ఢిల్లీ: తెలంగాణ రాష్ర్టాన్ని బెస్ట్ గ్రీనరీ అవార్డు వరించింది. రాష్ర్టానికి బెస్ట్ గ్రీనరీ అవార్డు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. కొంపల్లి-కామారెడ్డి మధ్య జాతీయ రహదారికి ఇరువైపులా, డివైడర్ మధ్యలో మొక్కలు పెంచినందుకు అవార్డు లభించింది. రాష్ర్టానికి అవార్డు దక్కడంపై అటవీశాఖ మంత్రి జోగు రామన్న హర్షం వ్యక్తం చేశారు.

శిశికుమార్ ఫ్రెండ్ మాత్రమే...

హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన డాక్టర్‌పై కాల్పుల కేసులో కీలకంగా మారిన చంద్రకళను నారాయణగూడ పోలీసులు నేడు విచారించారు. కాల్పులకు పాల్పడి, ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమార్‌తో చంద్రకళ సంబంధాలపై పోలీసులు ప్రశ్నించారు. శశికుమార్‌ తన స్నేహితుడని చెప్పిన చంద్రకళ, డాక్టర్ల మధ్య గొడవ గురించి తెలియదన్నారు. శశికుమార్‌ అన్ని విషయాలూ చెప్పేవారు కాదని, ఈ మధ్య ఆయన డిప్రెషన్‌లో ఉండడం గమనించానని పోలీసులకు ఆమె తెలిపారు. లారెల్‌ ఆస్పత్రి పెట్టినప్పటి నుంచి శశికుమార్‌ సంతోషంగా లేరన్న చంద్రకళ, తనను భాగస్వాములు మోసం చేస్తున్నారని బాధపడేవారని పోలీసులకు చెప్పారు.

22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన శిఖర్ ధావన్

రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతోన్న రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయి 82 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 25 బంతుల్లో 51 పరుగులు చేసి అవుటయ్యాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ధావన్ మొత్తం 25 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. 

విశాఖ టి-20 మ్యాచ్ కి ఆంక్షలు...

విశాఖ : ఈ నెల 14న నగరంలో భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగే టి-20 మ్యాచ్‌కి ఆంక్షలు విధించారు. మ్యాచ్‌కు 2 గంటల ముందే ప్రేక్షకులు స్టేడియానికి చేరుకోవాలని, పాసులు ఉన్న వారినే స్టేడియంలోకి అనుమతిస్తామని విశాఖ సీపీ అమిత్ గార్గ్ స్పష్టం చేశారు. స్టేడియంలోకి కర్రలు, బాటిళ్లు తీసుకురావడాన్ని నిషేధించారు. స్టేడియంలోని 42 సీసీ కెమెరాలను సీపీ కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేస్తారు.

బ్రహ్మోత్సవ ప్రోత్సాహకంపై వెనక్కి తగ్గిన సర్కార్

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకంపై ఏపీ సర్కారు తన గత నిర్ణయాన్ని మార్చుకుంది. బోర్డు సూచన మేరకు శాశ్వత ఉద్యోగులకు రూ.12,200 చొప్పున, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.6,100 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

20:11 - February 12, 2016

హైదరాబాద్ : టివి జర్నలిజంలో ఓ ధృవతార రాలిపోయింది. ప్రజల భాషల్లోకి వార్తలు తీసుకొచ్చి మహామేధావి అరుణ్ సాగర్, సార్ మీరు ఎక్కడ ఉన్నా మీ ఆత్మకు శాంతి కలగాలని మల్లన్న ముచ్చట్ల తరపున కోరుకుంటున్నాం. అప్ డేట్ దిక్కు అడుగులు వేస్తున్న అసెంబ్లీ... కంప్యూటర్లతోనే రేపటి ప్రశ్నోత్తరాలు, వోట్ల నామ యాడాదిల వొడ్వని పండ్గ... వారం పది రోజులల్లోనే మున్సిపాలిటీ ఓట్లు, తెర్లు.. తెర్లు అయిపోయిన తెలుగుదేశం పార్టీ....సైకిల్ మాదే అంటున్న దయాకన్న, ఆధార్ మొల్దారం తెంపిన మోడీ...అక్కర్లేని కాగితమని రూఢీ, ఎంఆర్వో ఆఫీస్ల గులాబి కోటర్లు...ఏసీబోళ్ల చేతల్లో అధికారుల మ్యాటర్లు.. అదిరి పోయిన ఆవుదూడ పెండ్లి... అందరూ తయారయి చూద్దాం రండి.. ఇత్యాది అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న మసాల విశేషాలను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

19:56 - February 12, 2016

హైదరాబాద్ : ధీరత్వమే దైవత్వమైంది. చెట్టూ, పుట్టా, పల్లె, పట్టణం ఆ శూరత్వానికి పొర్లిపొర్లి దండాలు పెడుతోంది. వీరవనితల త్యాగానికి అడవితల్లి సిసలైన నీరాజనం పలుకుతోంది. నాలుగు రోజుల పాటు జరిగే అద్భుత ఘట్టానికి ఏటూరునాగారం ఎగసి నింగిని తాకుతోంది. వేలు కాదు లక్షలు కాదు కోట్ల మంది జనాల గుండెల్లో కొలువైన సమ్మక్క సారాలమ్మల తీర్థానికి మేడారం సాదరంగా ఆహ్వానం పలికింది. ఆత్మీయ అనురాగాల సమ్మేళనానికి సంగమమైంది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం.

గిరిజన గూడేల్లో అవధులు లేని ఆనందం....

ప్రశాంతమైన పల్లెల్లో అవ్యాజమైన పారవశ్యం. కల్మషం లేని గిరిజన గూడేల్లో అవధులు లేని ఆనందం. ఎవరో వస్తున్నారు. ఏదో చేస్తున్నారు. తమను ఆవహించి ఆనంద డోలికల్లో ముంచేస్తున్నారు. ఇంతకీ ఎవరు వస్తున్నారు..? అడవిలో రేగుతున్న ఆ ఎర్రెర్రని ధూళి ఎక్కడిది...?

ఏటూరు నాగారం అడవుల్లో....

ఎక్కడో మారుమూలన ఏటూరు నాగారం అడవుల్లో ఉంది మేడారం. కాని ఈ చిన్న గ్రామమే నిరక్షర, అమాయక గిరిజనులకే కాదు నాగరికులకూ పరమ పవిత్ర క్షేత్రం. గిరిజన మహా కుంభమేళకు ఆతిథ్యమిచ్చే మేడారమంటే గిరిజన తెగలకు ప్రాణం. మేడారం గాలి సోకితే చాలు జీవితం ధన్యమవుతుందనుకుంటారు. ఇదే సమ్మక్క సారలమ్మల జాతరకున్న గొప్పతనం.

మావన జీవన పరిణామక్రమంలో అనేకానేక సంఘర్షణలు...

మావన జీవన పరిణామక్రమంలో అనేకానేక సంఘర్షణలు...యుద్ధాలు. ( గ్లోబ్‌ చూపించి..యుద్ధం విజువల్స్ చూపించాలి )గుంపుల మధ్య, తెగల మధ్య, రాజ్యాల మధ్య...ఒక్కటి కాదు తమ జాతి మనుగడ కోసం నిత్యం పోరాటాలు. ఇలాంటి వాటిల్లో కొన్ని యుద్ధాలు చరిత్ర పుస్తకాల్లో పదిలంగా నిక్షిప్తమై ఉన్నాయి. మరికొన్ని యుద్ధాలు ముందుతరాలకు తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోయాయి. చాలా కొద్ది సంఘర్షణలు మాత్రమే స్ఫూర్తిదాయకమై పూజింపబడుతున్నాయి. ఈ కోవకు చెందినదే సమ్మక్క, సారాలమ్మల జాతర

సమ్మక, సారలమ్మలు పురాణ దేవతలు కాదు....

సమ్మక, సారలమ్మలు పురాణ దేవతలు కాదు. తమ జాతి కోసం, తమవారి కోసం శత్రువుపై కత్తిదూసిన వీరవనితలు. ప్రత్యర్ధితో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అడవి ఆడపడుచుల యదార్థ గాధ ఇది. తమతో మెలిగి, తమతో కలిసి, తమవారికోసం ప్రాణాలు విడిచిన విషాద గాధ ఇది.

గిరిజనదొర మేడరాజు కూతురు సమ్మక్క.

అది 11వ శతాబ్ధం. కాకతీయుల సామ్రాజ్యంలో మొదటి ప్రతాపరుద్రుడి కాలం. ఈ కాలంలోనే ఓ అపురూప, అద్భుత ఘట్టం జరిగింది. ఇప్పటి కరీంనగర్‌ జిల్లా జిగిత్యాల ప్రాంతంలోని పోలవలసను పాలించే గిరిజనదొర మేడరాజు కూతురు సమ్మక్క. ఈమెను మేడారం పాలకుడు పడిగిద్దరాజుకిచ్చి పెళ్లి చేస్తారు. వీరికి పుట్టిన బిడ్డలే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. అప్పటి వరకు ప్రతాపరుద్రుడికి సామంతులుగా ఉంటూ కప్పం కడుతూ వచ్చిన మేడారం పాలకులు ఆ యేడాది కరువు కాటకాల వల్ల కప్పం కట్టలేకపోతారు. దీంతో రాజ్యంతో ఘర్షణ ఏర్పడుతుంది.

కాకతీయ చరిత్రలోనే మరపురాని ఘట్టం....

కాకతీయుల సైన్యం, సమ్మక్క సైన్యం మధ్య జరిగిన యుద్ధం కాకతీయ చరిత్రలోనే మరపురాని ఘట్టం. గెరిల్లా యుద్ధానికి నాంది పలికింది కూడా ఇక్కడే. ప్రతాపరుద్రుడి సైన్యంతో వీరోచితంగా పోరాడారు సమ్మక్క, సారలమ్మలు. పడిగిద్దరాజు, సారలమ్మ యుద్ధ భూమిలోనే మరణిస్తారు. ఓటమిని జీర్ణించుకోలేని జంపన్న సంపెంగ వాగులో పడి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్న వాగుగానే పిలుస్తారు. సమ్మక్కను వెన్నుపోటు పొడుస్తుంది కాకతీయ సైన్యం. వెనుక నుంచి బళ్ల్లెంతో పొడుస్తుంది. రక్తధారలతో సమ్మక్క యుద్ధ భూమి నుంచి నిష్ర్కమిస్తూ మేడారానికి ఈశాన్యాన ఉన్న గుట్ట దగ్గర అదృశ్యమౌతుంది. అదే చిలుకలగుట్ట

సమ్మక్క అంతర్ధానమైన చోట ఓ కుంకుమ భరిణి....

సమ్మక్క అంతర్ధానమైన చోట ఓ కుంకుమ భరిణి లభిస్తుంది. ఆ భరిణను పూజారులు చిలుకలగుట్ట వెనుక భద్రపరిచారు. ఆ భరిణనే సమ్మక్క అని గిరిజనుల అపార నమ్మకం. వీరవనితే దేవతగా మారి తమకోసం మళ్లీ తిరిగి వచ్చిందని ప్రగాఢ విశ్వాసం. అందుకే సమ్మక్క, సారలమ్మలంటే గిరిజనులకింత మమకారం. అందుకే అమ్మను నెత్తినపెట్టుకొని పూజిస్తారు. సంబరం చేస్తే అంబ పలుకుతుందని నమ్ముతారు. ఈ అచంచలమైన విశ్వాసంలోంచి పుట్టిందే గిరజన కుంభమేళ మేడారం. సమ్మక్క, సారాలమ్మల శౌర్యానికి, త్యాగానికి ప్రతీకయే ఈ మేడారం జాతర.

చిక్కగా పరుచుకున్న పచ్చదనం. కింద ఎర్రని మన్ను..

చిక్కగా పరుచుకున్న పచ్చదనం. కింద ఎర్రని మన్ను..ఎత్తైన కొండ..కొండ దిగువన వాగు..వాగు చట్టూ అడవి. అడవి మధ్యలో పల్లె. పల్లె మధ్యలో గద్దె..ఈ గద్దె గిరిజనులకు దేవి శక్తిపీఠం. గద్దె చుట్టూ లక్షల జనం. అన్ని అద్భుతాలు కలిస్తే మేడారం. అందరి మనసులు కలిస్తే మేడారం. ప్రకృతిని తమలో మమేకం చేసుకుంటే మేడారం.

బాహ్య ప్రపంచానికిది నాలుగు రోజులు సంబరం మాత్రమే.....

బాహ్య ప్రపంచానికిది నాలుగు రోజులు సంబరం మాత్రమే. వాస్తవానికి గిరిజనులు పదిరోజులు జరుపుకునే సంబరం. జాతరకు ఆరు రోజుల ముందు నుంచే మేడారం, కన్నెపల్లెల్లో పండుగ వాతావరణం వస్తుంది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజులను జాతరకు సిద్ధం చేస్తారు ప్రధాన పూజారులు. దీన్నే మండెమెలిగె అని అంటారు. ఈ మండెమెలిగలోని ప్రతీఘట్టాన్ని నియమ నిష్టలతో చేస్తారు. ఈ ఆరు రోజుల పండుగ కేవలం మేడారం, కన్నెపల్లె వాసులకే సొంతం.

ఆరు రోజుల ముందు తొలి అంకం....

జాతరకు సరిగ్గా ఆరు రోజుల ముందు తొలి అంకం మొదలవుతుంది. కన్నెపల్లెలో సారలమ్మ దేవాలయానికి ఉదయాన్నే వెళ్తారు ప్రధాన పూజారులు. పాలతో, నీళ్లతో గుడిని శుద్ధి చేస్తారు. ఆ తరువాత అమ్మవారిని పసుపు, కుంకుమలతో అలంకరించి పూజలు చేశారు. ముస్తాబైన సారలమ్మ అమ్మవారు తన పుట్టిల్లయిన మేడారానికి ఊరేగింపుగా బయల్దేరుతుంది. సారలమ్మను మోసుకొని పూజారులు కాలినడక మేడారానికి బయల్దేరుతారు. మూడు కిలోమీటర్లు ఈ ఊరేగింపు డప్పు చప్పుళ్లతో, గిరిజన నృత్యాలతో ధూళిని పైకి లేపుతుంది. చుట్టుపక్కల పల్లెలను తట్టి లేపుతుంది.

పుట్టింటికి వచ్చిన సారలమ్మను సాదరంగా...

పుట్టింటికి వచ్చిన సారలమ్మను సాదరంగా ఆహ్వానిస్తారు మేడారం గ్రామ పెద్దలు. ఇదే సమయంలో మేడారంలోని సమ్మక్కకు పూజలు నిర్వహిస్తారు. ఈ తొలిఘట్టంలో 100 మంది మేడారం గ్రామ పెద్దలు మాత్రమే పాల్గొంటారు. సమ్మక్క, సారలమ్మలకు పూజ చేసే హక్కుదారులు మాత్రం కొక్కెర వంశానికి చెందిన వాళ్లు. జాతరకు సంబంధించిన ప్రధాన పూజలు కూడా వీళ్లే చేయాలి. పూజామందిరాన్ని అలంకరించడంలో కొక్కెర వంశస్థులకు సిద్దబోయిన, మల్లెల వంశస్థులు సహాయపడతారు.

తొలి పూజల అనంతరం జాతర మొదలు...

పూజామందిరంలో తొలి పూజల అనంతరం జాతర మొదలవుతుంది. గ్రామ పొలిమేరలో నల్లకోడి, జీడిగింజలు, నిమ్మకాయలు, ఉల్లిగడ్డ, సొరకాయలతో తోరణం కడతారు. ఇలా చేస్తే దుష్టశక్తులేవీ మేడారంలోకి రావని గిరిజనుల నమ్మకం. పొలిమేరకు రెండు వైపులా బూరుగ వృక్షాలతో ధ్వజస్తంభాలను నాటి ఆహ్వానం పలుకుతారు. గిరిజనుల కుంభేమేళలో తొలి అంకాన్ని పూర్తి చేసి అసలు ఘట్టానికి అంకురార్పణ చేస్తారు.

వనవాసం వదిలి జనావాసంలోకి వచ్చే సమయం....

సమ్మక్క, సారాలమ్మలు వనవాసం వదిలి జనావాసంలోకి వచ్చే సమయం ఆసన్నమైంది. అడవితల్లి పులకించిపోతోంది. పూనకాలతో పరవశిస్తోంది.. శివసత్తుల నర్తనలతో అదిరిపోతుంది. గుండెల్లో గూడుకట్టుకున్న అభిమానం అగ్నిపర్వతంలా బద్దలై అమ్మకు సాష్టాంగ నమస్కారం పెడుతుంది. ఆడవాళ్లను ఆదిపరాశక్తిగా పూజిస్తామనడానికి ఈ జాతరే తార్కాణం.

చిలుకల గుట్ట నుంచి అమ్మ వస్తున్న ఆనవాళ్లు,....

మార్గశిర పూర్ణిమ వచ్చేసింది. చిలుకల గుట్ట నుంచి అమ్మ వస్తున్న ఆనవాళ్లు, కన్నెపల్లె నుంచి పుట్టింటికి వస్తున్న సారలమ్మ సవ్వడులు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన కుంభమేళ కోసం పల్లె పల్లె కదులుతోంది. నగరాలకు నగరాలు ఏటూరు నాగారం అడవుల బాట పట్టాయి. నాలుగు రోజుల పాటు జరిగే అబ్బురమైన సంబరం మొదలైంది. జంపన్న వాగు జనసంద్రమైంది

సమ్మక్క, సారలమ్మకు ఎంత ప్రాధాన్యం ఉందో ఈ జంపన్నవాగుకూ....

సమ్మక్క, సారలమ్మకు ఎంత ప్రాధాన్యం ఉందో ఈ జంపన్నవాగుకూ అంతే ప్రత్యేకత ఉంది. జంపన్న వాగులో స్నానం చేసిగాని గిరిజనులు జాతరలో అడుగుపెట్టరు. వాగులో మునకలు వేస్తేగాని జాతరలో పూజలు మొదలుకావు. జంపన్నవాగులో స్నానం చేయకుండా జాతరలో పాల్గొంటే అది పరిపూర్ణం కాదని గిరిజనుల ప్రగాఢ నమ్మకం. వనదేవతలకు, జంపన్న వాగుకు ఉన్న అనుబంధం అలాంటిది. తొలిరోజు సారలమ్మను కన్నెపల్లి గ్రామం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి ఆమె గద్దెపై ప్రతిష్టిస్తారు. సారలమ్మ తండ్రి పగిడిద్దరాజును కొత్తగూడ మండలం కొండ్రాయి గ్రామం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి మేడారం గ్రామంలో ప్రధానంగా ఏర్పాటు చేసిన గద్దెపై ప్రతిష్టిస్తారు.

అడవితల్లి, గిరిజనులు రెండేళ్లుగా ఎదురు....

ఇక అసలు ఘట్టం మిగిలే ఉంది. ఈ సమయం కోసమే అడవితల్లి, గిరిజనులు రెండేళ్లుగా ఎదురు చూస్తుంటారు. అదే సమ్మక్క రాక. జాతరలో రెండో రోజున జరిగేదే కీలక ఘట్టం. చిలుకలగుట్టలో కుంకుమ భరిణి రూపంలో ఉందని అనుకుంటున్న సమ్మక్కను తీసుకొచ్చే దృశ్యం అపూర్వమైనది. ఎలాంటి రూపం లేని వనదేవతను కుంకుమ భరిణిలో కుంకుమ వేసి దాన్ని వెదురు బొంగుతో చేసిన మొంటెలో ఉంచుతారు. దాని ఓ చిన్న పిల్లవాడి తలపై పెట్టి బయటకు తీసుకువస్తారు.

వనదేవతలు బయటకు రావడంతో మేడారం పూనకంతో ....

వనదేవతలు బయటకు రావడంతో మేడారం పూనకంతో ఊగిపోతుంది. శివసత్తువులతో తాండవం చేస్తుంది. సమ్మక్క గాలి సోకగానే గిరిజనులు తమను తాము మరిచిపోయి తన్మయానికి గురౌతారు. ఓ దశలో ఉద్వేగానికి లోనవుతారు. తమకోసం ప్రాణం త్యాగం చేసిన సమ్మక్కకు పొర్లిపొర్లిదండాలు పెడతారు. ఆమె వస్తున్న దృశ్యాన్ని చూసేందుకు ఎగబడతారు. ఆమె వస్తున్న దారిలో సాష్టాంగంగా పడుకొని తమపైనుంచి అమ్మను గద్దె వైపునకు నడిపిస్తారు. రూపం లేకపోయినా సమ్మక్కను వీళ్లు ఊహించుకోగలరు. ఆమే తమను ఆవహించిందనట్టుగా ఆనందానికి లోనవుతారు. రెండేళ్లకోసారి జరిగే ఈ అపురూప ఘట్టాన్ని గుండెల నిండా నింపుకుంటారు. దిక్కులు పిక్కటిల్లేలా తల్లీ కాపాడు అంటూ సమ్మక్కకు మోకరిల్లుతారు.

అడవితో పెనవేసుకున్న గిరిజన సంబంధాలు మేడారం జాతరలో...

అడవితో పెనవేసుకున్న గిరిజన సంబంధాలు మేడారం జాతరలో అణువణువునా కనిపిస్తుంటాయి. అందుకే మేడారం జాతరలో అమ్మవార్లకు సమర్పించే మొక్కులు నాగరికత ప్రపంచానికి కాస్తంత భిన్నంగా ఉంటాయి. కానీ ఇందులో పుట్టతేనంత కమ్మదనం, అడవి మల్లెలంత స్వచ్ఛదనం కనిపిస్తాయి. అసలు సిసలు బంగారంలా భాసిల్తుతాయి. అందుకే ఇది ఒక విశేషమైన, విశిష్టమైన జాతర.

వనదేవతలు గద్దెలపై కూర్చున్నారు...

వనదేవతలు గద్దెలపై కూర్చున్నారు. ఇక సమ్మక్క, సారలమ్మలకు మోకరిల్లితే తల్లి సల్లంగా చూస్తుందని భక్తులకు అంచెంచలమైన విశ్వాసం. అందుకే ఆమెకు తీరొక్కగా మొక్కుతారు. ఒకటి కాదు రెండు కాదు ఎవరికి తోచినట్టుగా వారు, ఎవరి సామర్థ్యానికి తగ్గట్టుగా వారు మొక్కులు చెల్లిస్తారు. ఎందుకంటే ఎలా పిలిచినా అమ్మపలుకుతుందని, భక్తిగా ఎంత సమర్పించుకున్నా సంతోషిస్తుందని గిరిజనుల నమ్మకం. సమ్మక్క, సారలమ్మల మొక్కుబడులు గిరిజన ఆచారాలను ప్రతిబింబిస్తాయి. జాతరలో సుమారు పది రకాల మొక్కుబడులు ఉంటాయి. ఇవి నాగరికులకు వింతగా అనిపించినా విశేషంగా ఆకట్టుకుంటాయి. వరం పట్టటం, తలనీలాలు, వడిబియ్యం, తొట్టెలు, బంగారం, పిట్ట, బాషింగం, కోడెను కట్టటం, ఎదురుకోళ్లు, తులాభారం ఇలా అడవిలో దొరికిన ప్రతీ గింజ వనదేవతలకే, ప్రతీ పుట్టా, పిట్టా వారికి నైవేద్యమే చేస్తారు గిరిజనులు.

గిరిజనుల ఇంట ఏ బిడ్డ క్యార్‌మన్నా...

ముఖ్యంగా గిరిజనుల ఇంట ఏ బిడ్డ క్యార్‌మన్నా తొలుత ఆ చంటిబిడ్డ మేడారానికి రావల్సిందే. జంపన్నవాగు దగ్గర తలనీలాలు సమర్పించి అమ్మవార్ల దర్శనం చేసుకోవల్సిందే. తమ పిల్లల తలవెంట్రుకలు ఇక్కడ తీస్తే వాళ్లు ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్ముతారు గిరిజనులు. అందుకే ఆమెకు తలనీలాలు ఇచ్చి మొక్కుబడి చెల్లించుకుంటారు. సంతానం లేని వాళ్లు తొట్టె కడతామని మొక్కుకుంటారు. జంపన్న గద్దెను ఆనుకొని ఉన్న ఒద్దిమాను చెట్టుకు తొట్టె కట్టి మొక్కును చెల్లించుకుంటారు. ఇలా వేల సంఖ్యలో తొట్టెలు దర్శనమిస్తాయి.

కోడెను కట్టే సంప్రదాయం మేడారం జాతరలో ప్రత్యేకం...

కోడెను కట్టే సంప్రదాయం మేడారం జాతరలో ప్రత్యేకమైంది. సమ్మక్క గద్దెకు పడమర వైపు కోడెను కడతారు. ఆ తరువాత కోడెతో మూడు సారు సమ్మక్క గద్దె దగ్గర ప్రదక్షిణం చేస్తారు. కోడిపిల్లను అమ్మవార్ల గద్దెల ఎదుట ఎగుర వేస్తారు. దీన్నే ఎదురుకోళ్ల మొక్కు అంటారు. అలా అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. ఇక వడిబియ్యం మొక్కు. కిలోంపావు బియ్యంలో ఖర్జూరపండ్లు, తమలపాకులు, కొత్త వస్ర్తాన్ని ఉంచి దాన్ని నడుముకు కట్టుకుంటారు. నడుముకు కట్టుకున్న బియ్యంతోనే అమ్మవారి గద్దెలకు వచ్చి ఆ మొక్కును సమర్పిస్తారు.

కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం.....

కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం సమ్మక్క,సారలమ్మలు. అమ్మవార్లకు బంగారం సమర్పిస్తేనే జాతర పుణ్యం దక్కుతుందనుకుంటారు గిరిజనులు. మేడారంలో మిగతా మొక్కలన్నీ ఒకెత్తయితే బంగారం చెల్లింపు మరో ఎత్తు. కోరిక ఉన్నా.. లేకున్నా జాతరలో అడుగుపెట్టే ప్రతీభక్తుడి తలపై బంగారం ఉంటుంది.

బంగారం లేనిదే మేడారంలో అడుగుపెట్టరు....

బంగారం లేనిదే మేడారంలో అడుగుపెట్టరు గిరజనులు. ఓ రకంగా గిరిజనుల కంటే బంగారమే ముందుగా మేడారంలోకి ప్రవేశిస్తుంది. మిగతా మొక్కుల సంగతి ఎలా ఉన్నా బంగారమిస్తే అమ్మలు కరుణిస్తుందనుకుంటారు అడవి బిడ్డలు. అందుకే ఆమెను నిలువెత్తు బంగారం అదే బెల్లంతో కొలుస్తారు. కుంకుమ ఎరుపు, మేలిమి పసుపు వర్ణంలో మేడారం కాంతులీనుతుంది.

వందల క్వింటాళ్ల కొద్ది బెల్లం మేడారం బాట ...

వందల క్వింటాళ్ల కొద్ది బెల్లం మేడారం బాట పడుతుంది. సమ్మక్క సారక్క జాతరకున్న ప్రత్యేకతే బంగారం మొక్కు. అమ్మవార్లకు మొక్కులు ఉన్నా లేకపోయినా బెల్లం సమర్పించుకోవడం నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ ఆనవాయినీ చాలా అబ్బురంగా జరుపుకుంటారు గిరిజనులు. మేడారం జాతరలో తులాభారం మజమజాగా సాగుతుంది. తమ బరువంత బెల్లాన్ని తూచి అమ్మవార్లకు నైవేద్యంగా వేస్తారు. ఆ తరువాత ఈ బెల్లాన్ని మహాప్రసాదంగా ఇళ్లకు తీసుకెళ్తారు. పరమపవిత్రంగా భావించే బెల్లాన్ని తమ కుటుంబ సభ్యుల మధ్యే పంచుకుంటారు. లేదా దీన్ని స్వీట్ల రూపంలోకి మార్చుకొని ప్రసాదంగా ఆరగిస్తారు. అమ్మవారికి సమర్పించిన బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని నమ్ముతారు. సమ్మక్క సారలమ్మల జాతరలో కనిపించే ప్రతీ దృశ్యం, ప్రతీ మొక్కుబడి గిరిజనుల జీవన శైలితో ముడిపడి ఉంటుంది. ఇక్కడ మొక్కులు చెల్లించడమంటే అమ్మలతో సంతోషాన్ని పంచుకోవడం. కష్ట సుఖాలను చెప్పుకోవడం. తమ సుఖదుఖాఃలలో వనదేవతలు తోడుగా ఉంటారని గిరిజనుల అచెంచలమైన నమ్మకం. అందుకే ప్రతీ సాధారణ భక్తుడూ కోరిక ఉన్నా లేకపోయినా అమ్మలకు బెల్లాన్ని సమర్పించి సమ్మక్క సారలమ్మలపై భక్తిభావాన్ని చాటుకుంటారు.

మేడారం జాతర పుట్టు పూర్వోత్తరాలు...

సమ్మక్కసారలమ్మలు కోట్లాది మంది భక్తుల కొంగు బంగారాలు. మేడారం జాతర వివిధ తెగలకు చెందిన గిరిజన సంస్కృతుల సంగమం. మొదట్లో తెలంగాణ ప్రాంత కోయ ఆదివాసీ గిరిజనులకు మూలదైవంగా నిలిచిన సమ్మక్క - సారలమ్మలు ఆ తర్వాత ఇతర ప్రాంతాల గిరిజనులకు, వివిధ తెగల వారికి కులదైవంగా మారి పూజలందుకుంటున్నారు. కొన్నేళ్ల పాటు గిరిజనులకే పరిమితమైన దేవతలు క్రమక్రమంగా గిరిజనేతరులకు కూడా ఆరాధ్య దైవాలయ్యారు. ఈ అసాధారణ జాతర అచ్చంగా గిరిజనులది. కోయలది. చెంచులది. వడ్దెరలది. వీళ్లే జాతర నిర్వహణకు హక్కుదారులు. ఏటూరు నాగారం ఏజెన్సీలో సుమారు 12 రకాల కోయ తెగలున్నాయి. రాచకోయ, గుత్తికోయ, పూసకోయ, చెంచుకోయ, గొట్టెకోయ, పారటాకుల కోయ, గీత కోయ, భాషకోయ, కొండకోయ, వెదురు కోయ, అమ్ముల కోయ. వీరిలో రాచకోయలు సమ్మక్క సారలమ్మల జాతరను నిర్వహిస్తారు.

సమ్మక్క సారాలమ్మ, పగిడిద్దరాజు, జంపన్నలు ఒకే తెగకు చెందిన వారు..

వనదేవతలుగా కొలువబడుతున్న సమ్మక్క సారాలమ్మలకు, అలాగే పగిడిద్దరాజు, జంపన్నలకు ఒకే తెగకు చెందిన వారు కాకుండా వేర్వేరు గోత్రాల వాళ్లు పూజలు నిర్వహిస్తారు. రాచకోయల్లో 3, 5 గోత్రీకులకు సమ్మక్క ఇలవేల్పు అయితే, నాలుగో గోత్రికులకు సారలమ్మ, పగిడిద్దరాజులు ఇలవేల్పులు. ఆరవ గోత్రీకులకు గోవింద రాజు ఇలవేల్పు. తమ జాతి కోసం ప్రాణ త్యాగం చేసి దైవాలుగా పూజింపబడుతున్న సమ్మక్క సారాలమ్మలు, పగిడిద్దరాజులను ఇలా వేర్వేరు గోత్రాల వాళ్లు పంచుకోడానికి కారణాలు కూడా లేకపోలేదు.

స్వాతంత్ర్యానికి ముందే నుంచే సమ్మక్క సారాలమ్మల జాతర ....

1947కు పూర్వం నుంచే అంటే స్వాతంత్ర్యానికి ముందే నుంచే సమ్మక్క సారాలమ్మల జాతర జరుగుతోంది. మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో బయ్యక్కపేట గ్రామం ఉంది. చందా వంశపు కోయ గిరిజనుల ఆడబిడ్డ సమ్మక్క జన్మించింది బయక్కపేటలోనే. ఈ వంశానికి సంబంధించిన సమ్మక్క వారసులు ఇప్పటికీ ఈ గ్రామంలోనే ఉన్నారు. జాతరను మొదట్లో బయ్యక్కపేటలోనే నిర్వహించేవారు. స్వయంగా చందా వంశస్తులే సమక్కను ఆరాధించారు. 1962 వరకూ జాతరను బయ్యక్కపేట గ్రామంలోనే నిర్వహించారు. ఇందుకు సాక్షిగా ఈ గ్రామంలోనే సమ్మక్క గుడి, గద్దె ఉంది 1944 సంవత్సరం జనవరి ఆరో తేదీన జాతర నిర్వహణకు అప్పటి ములుగు తహసిల్దార్ సమక్షంలో ఓ కమిటీ వేశారు. జాతర హక్కుదారులుగా చంద్రా వంశస్తులు చందా పరమయ్యగా ఓ ఒప్పంద పత్రం రాసుకున్నారు. జాతరలో పనిచేసిన పూజారులకు, డోలి, కూలివారకు, ప్రభుత్వానికి వాటా ఉన్నట్లుగా రాసిన ఒప్పంద పత్రాలు ఇప్పటీకీ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను టెన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా సంపాదించింది.

భక్తుల సంఖ్య విశేషంగా పెరిగిపోవడంతో ....

జాతరకు క్రమక్రమంగా భక్తుల సంఖ్య విశేషంగా పెరిగిపోవడంతో చందా వంశస్తులకు జాతర నిర్వహణ భారంగా మారింది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. కరువు కాటకాలు రావడంతో తిండి గింజలు కూడా దొరకలేదు.జాతరకు సరైన వసతులు కల్పించలేకపోయారు. ఈ సందర్భంలోనే చందావంశంలోని దాయాదులకు మధ్య తీవ్రమైన భేదాభిప్రాయాలు వచ్చాయి. వీళ్లు మూడు భాగాలుగా విడిపోయారు. దీంతో సమ్మక జాతర బాధ్యతలను వడ్డెర వంశీయులకు అప్పగించినట్లుగా ఈ ఒప్పందంలో రాసుకున్నారు చందా వంశస్తులు. ర్చులు భరించలేని పరిస్థితిలో అమ్మ పూజారులైన వడ్డెరలకు సమ్మక్కను అప్పగించారు. అలా సమ్మక్కను మేడారానికి సాగనంపారు. ప్రతి రెండేళ్లకోసారి జాతర జరగడానికి కూడా కారణం ఉంది. ఆర్థికపమైన కారణాల వల్లే జాతరను ఏడు విడిచి ఏడుగా జరుపుకుంటారని గిరిజనులు, చరిత్రకారులు చెబుతున్నారు. ఇలా వనదేవతలను పంచుకున్నారు గిరిజనులు. ఆర్థిక ఇబ్బందులెదురైనా జాతర చేసి అమ్మకు మోకరిల్లాలన్నదే ఇందులోని పరమార్థం. అందుకే ఆరాధ్య దైవాలను పంచుకొని పండుగ చేస్తున్నారు.

19:41 - February 12, 2016

ఖమ్మం :పట్టణంలో ఓ విద్యార్థిని అర్థాంతరంగా తనువు చాలించింది. కృష్ణవేణి జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కల్లూరు మండలం మెట్టపల్లికి చెందిన సంధ్యారాణి...హాస్టల్‌ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. సంధ్య మంచి ర్యాంకరని, రెండ్రోజుల క్రితమే తమతో మాట్లాడిందన్నారు. సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లేవని, కాలేజీ యాజమాన్యంపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు.

19:39 - February 12, 2016

హైదరాబాద్ : పార్టీ ని ఫిరాయించిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు టీటీడీ నేతలు. స్పీకర్ కు ఎర్రబెల్లిఇచ్చిన లేఖ చెల్లుబాటు కాదని.. పార్టీ విలీనం అవుతుందనే ప్రచారం చేస్తున్నారని అది జరిగిందన్నారు పార్టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలో.. ఎమ్మెల్సీలో ఫిరాయింపులకే పాల్పడితే పార్టీ విలీనం అయినట్లు కాదన్నారు రేవంత్ రెడ్డి. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే హైకోర్టులో కేసు వేస్తామన్నారు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలన్నారు రేవంత్.

19:37 - February 12, 2016

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఓ గర్భిణీ చనిపోయింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రియాంక ప్రసవం అయిపోగానే మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రియాంక చనిపోయిందంటూ బంధువులు ఆందోళనకు దిగారు.

18:29 - February 12, 2016

ఇమేజ్ కు తగిన కథలను ఎంచుకునే కథానాయకులే స్టార్లు అవుతారు. వీళ్లలో నాని మొదటి లిస్టులో ఉంటారు. తనకు సరిపోయే స్టోరీలతో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. నాని సినిమాలో ఎదో కొత్తదనం ఉంటుందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథతోనూ ఈ నమ్మకాన్ని మరింత పెంచాడు నాని. ..

కృష్ణ ..రాయలసీమలోని ఓ కుర్రాడు. బాలకృష్ణ అభిమాని. ఉండేది సీమలోనైనా....గొడవలంటే మహా భయం. ఫ్యాక్షన్ ఫ్యామిలీలోని మహాలక్ష్మి ని ప్రేమిస్తాడు. వీళ్లిద్దరి ప్రైమరీ స్కూల్ ప్రేమ. వీళ్ల లవ్ స్టోరీకి...మహా లక్ష్మి అన్న అడ్డుపడుతుంటాడు. తన చెల్లితో స్నేహంగా ఉన్నా...కృష్ణ చెడ్డవాడు కాదన్న ఒకే కారణంగా మహాలక్ష్మి అన్న కృష్ణని వదిలేస్తుంటాడు. తన ప్రేమ కారణంగా ఏళ్లకేళ్లు పెళ్లి వాయిదాలు వేస్తున్న హీరోయిన్ ...తన ఇంట్లో వాళ్లతో మాట్లాడమని కృష్ణకు టైమ్ ఫిక్స్ చేస్తుంది. స్నేహితురాలి పెళ్లికి వేరే ఉరెళ్తుంది. ధైర్యం చేసిన కృష్ణ ఒకరోజు బాగా తాగి...మహాలక్ష్మి అన్నకు తమ ప్రేమ విషయం చెప్పడానికి వాళ్లింటికెళ్తాడు. కానీ కృష్ణ ఇంట్లోకి వెళ్లగానే...ఆ ఇంటిపై ప్రత్యర్థుల దాడి జరుగుతుంది. దొరికిన వాళ్లను చంపేస్తుంటారు. ఈ సందర్భంలో మహాలక్ష్మి అన్న తనకు కనిపించిన కృష్ణకు ఓ ముగ్గురు చిన్నపిల్లల్ని అప్పగించి...వాళ్లను క్షేమంగా హైదరాబాద్ చేర్చమంటాడు. తనకీ సాయం చేస్తే...తన చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. మరి శత్రువుల దాడి నుంచి కృష్ణ ఆ పిల్లలను ఎలా కాపాడాడు. దీని వెనుక ఉన్న మలుపులేంటి అన్నది మిగతా కథ......

నాని మరోసారి తన సహజ నటనతో నాచురల్ స్టార్ అనిపించుకున్నాడు. భయస్తుడి పాత్ర చేసినా...ఎక్కడా అతిశయం కనిపించలేదు. చాలా కూల్ గా నటించాడు. సక్సెస్ లో ఉన్న ఆత్మవిశ్వాసం కనిపించింది. నాయిక మొహరీన్ బొద్దుగా బాగుంది. పాత్రకు సరిపోయింది. ఏసీపీ పాత్రలో నటించిన సంపత్..సినిమాకు ఫ్లస్ పాయింట్ అయ్యాడు. జమదగ్ని క్యారెక్టర్లో ఫృథ్వీ మరోసారి నవ్వించాడు....

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ స్టోరీ యాక్షన్ ఫిల్మ్ చేయాల్సిన కథ. కానీ దర్శకుడు హను రాఘవపూడి హ్యూమరస్ గా మార్చి...నాని ఇమేజ్ కు తగ్గ సినిమా చేశాడు. సినిమా సక్సెస్ లో హనుకే మూడొంతుల క్రెడిట్ దక్కుతుంది. అన్ని పాత్రలను, అన్ని ట్విస్టులను క్లారిటీగా తెరకెక్కించాడు. నిడివి ఎక్కువవడం ఒక మైనస్ కాగా....సినిమా తొలి అర్థభాగంలో ప్రతి సీన్ లో ఉన్న నాయిక...సెకండాఫ్ లో ఎప్పటికోగానీ కనిపించదు. తమిళ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ బాగుంది. పాటల చిత్రీకరణలోనూ క్రియేటివిటీ కనిపించింది. మొత్తానికి తానేలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులు చూస్తారో...అలాంటి సినిమానే చేశాడు నాని....

 

ఫ్లస్ పాయింట్స్

  1. దర్శకత్వం

  2. నాని నటన

  3. హాస్య సన్నివేశాలు

  4. మ్యూజిక్

 

మైనస్ పాయింట్స్

  1. సినిమా నిడివి

  2. ఊహాతీత కథనం

18:27 - February 12, 2016

హైదరాబాద్ : చిన్నవాళ్లను సైతం అన్నయ్యా అని పిలిచే ఆ మంద్ర స్వరం మూగబోయింది. అక్షరాలను ఆయుధాలుగా చేసి విమర్శల జడివానను కురిపించే ఆ కలం కన్ను మూసింది. బుల్లితెరను బతుకుతెరగా పరిచయం చేసిన ఆ మీడియా బుల్లెట్‌ ఆగిపోయింది. కుర్రాళ్లను హుషారెత్తించి పనిలో పరుగులు పెట్టించే ఆ క్రేజీ సాగరం ఇక లేదు. ఆయన అందించిన అక్షరాలు ఇంకా పదునుగానే ఉన్నాయి. అందరినీ కన్నీటీసాగరంలో ముంచేసి తన పాత్రికేయ జీవితాన్ని చరిత్రగా అందించి వెళ్లిపోయిన ఆ అక్షరసాగరానికి అరుణాంజలి.

కన్ను మూసిన సీనియర్‌ జర్నలిస్ట్‌ అరుణ్‌సాగర్‌...

అరుణ్‌సాగర్‌.. ఈ పేరు వినని జర్నలిస్టు లేరు. ఆ స్టైల్‌ తెలియని చానెల్‌ ఉద్యోగి లేరు. అంతలా పెనవేసుకుపోయిన ఆ సీనియర్‌ జర్నలిస్ట్‌ చనిపోయారనే వాస్తవాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. వార్తలే ప్రపంచంగా.. రచనలే శ్వాసగా బతికిన అరుణ్‌సాగర్‌ మీడియాలో తనదైన ముద్రను బలంగా వేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్‌.. నాలుగురోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. అయినా చివరి క్షణం వరకు ఆయన జర్నలిస్ట్‌ డ్యూటీలోనే ఉన్నారు. ఆఖరి నిమిషం వరకు వార్తా ప్రపంచంలోనే ఉన్నారు.

ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతిలతో మొదలైన ప్రస్థానం....

ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతిలతో మొదలైన అరుణ్‌సాగర్‌ ప్రస్థానం టీవీ5 వరకు అప్రతిహతంగా సాగిపోయింది. టీవీ9లో అవుట్‌పుట్‌ ఎడిటర్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఎలక్ర్టానిక్‌ మీడియా కొత్తగా వచ్చిన రోజుల్లోనే ఆయన ఆ స్ధాయిలో పని చేసి.. తర్వాతివారికి ప్రొఫెషనలిజాన్ని అందించారు. 10టీవీ వ్యవస్ధాపనలోను, లాంఛింగ్‌లోను, దాని అభివృద్ధిలోను కీలక పాత్ర పోషించారు. అక్కడ CEOగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. తర్వాత టీవీ5లో ఎడిటర్‌గా వెళ్లి.. అక్కడ కూడా తనదైన ముద్రను వేసుకున్నారు.

కవితలు, రచనలతో కొత్త ఒరవడిని సృష్టించిన అరుణ్‌సాగర్‌....

అరుణ్‌సాగర్‌ కవితలు, రచనలతో తన జనరేషన్‌లో కొత్త ఒరవడిని సృష్టించారు. సాంప్రదాయిక భాషా సంకెళ్లను తెంచేసి.. తనదైన శైలిని పరుగులెత్తించారు. ఆయన కవిత చదివేవారు మొదట ఏం చెప్పాడు అని మొదలెడతారు. చదవడం పూర్తయ్యేసరికి అబ్బా ఏం చెప్పాడు అనుకుంటారు. అలా ఉంటుంది అరుణ్‌సాగర్‌ కవిత. నయా లైఫ్‌స్టైల్‌ను రచనలతో ఆయన చీల్చి చెండాడినట్లుగా బహుశా ఎవరూ చేయలేదేమో. ఒక్కోసారి ఆయన బతిమాలుతున్నట్లే ఉంటుంది.. పొగుడుతున్నట్లే ఉంటుంది.. కాని విమర్శిస్తున్నారనే విషయం కాసేపటికి గాని అర్ధం కాదు. చేగువేరాను వాడుకోనిచ్చి తప్పు చేశామని రాసినా.. యువతరం లేజీనెస్‌ను విమర్శించినా ఆయనకే చెల్లింది.

ఎస్‌ఎఫ్‌ఐలో పని చేసిన అరుణ్‌సాగర్‌....

విద్యార్ధిగా ఉన్నప్పుడే ఎస్‌ఎఫ్‌ఐలో పని చేశారు. ఆయన తండ్రి టీవీఆర్‌ చంద్రం ఖమ్మం జిల్లాలో ప్రముఖ కమ్యూనిస్టు నేత. చిన్నతనం నుంచే వామపక్ష భావాజాలం ప్రభావం ఆయనపై ఉంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆయన పనిలోను, రచనల్లోనూ ఆ ఎఫెక్ట్‌ కనపడుతూనే ఉంటుంది. అరుణకిరణాలు ఉదయించాలని కోరుకున్న అరుణ్‌సాగర్‌.. తాను సైతం సమిధనొక్కటి ఆహుతివ్వాలని తపనపడ్డారు.

ఆయన చివరి పుస్తకం మ్యూజిక్‌ డైస్‌....

ఇటీవలే విడుదలైన ఆయన పుస్తకం మ్యూజిక్‌ డైస్‌. ఆయన పుట్టిన భద్రాచలం పరిసర ప్రాంతాలతో మొదలై.. అక్కడి ప్రకృతి రమణీయతను తనదైన స్టైల్‌లో వర్ణించి.. మనలను ఎక్కడికో తీసుకెళతారు. అంతటి ప్రకృతి అందాలు నాశనమైపోతున్నాయనే విషయాన్ని నేటి తరానికి సైతం అర్ధమయ్యేలా.. పోలవరం వల్ల గిరిజనం ఎంత నష్టపోతుందనే విషయాన్ని స్పష్టంగా.. అందరికీ అర్ధమయ్యేలా చెప్పారు. ఆ పుస్తకం పూర్తిగా చదివి అర్ధం చేసుకున్నవారు ఖచ్చితంగా ఓ పర్యావరణవేత్తగా మారిపోవడం ఖాయం. అంతలా ముద్ర వేస్తుందా పుస్తకం.

ఎంతోమందికి గురువుగా...

మీడియాలో అరుణ్‌సాగర్‌ ఎంతోమందికి గురువుగా ఉన్నారు. ఆయన శిష్యులు ఇప్పుడు ప్రతి సంస్థలోనూ ఉన్నారు. ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకోవడం.. వారి కెరీర్‌కు, ఎదుగుదలకు ఆయన ఎక్కడున్నా సాయపడటం అనే తత్వమే నేడు అందరూ ఆయనను గుర్తుంచుకునేలా చేసింది.

నవ జర్నలిజంలో ఆయనొక సరికొత్త ఒరవడి...

నవ జర్నలిజంలో ఆయనొక సరికొత్త ఒరవడి...అక్షరాలనే తన ఆయుధంగా మలచుకొని రచనా రంగంలో నూతన శైలిని సృష్టించిన ఆధునిక కలం ఆయన. మీడియాలో భాష ఇలాగే ఉండాలనే కట్టుబాట్లను తెంచి స్వేచ్ఛా రచనకు పురుడు పోసిన నవయుగ కలం అరుణ్‌సాగర్‌. ఈ తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ సాగర్.. అమీర్‌పేట్‌లోని ప్రైమ్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు.

1967 జనవరి 2...

1967 జనవరి 2న జన్మించిన అరుణ్ సాగర్‌... ఆంధ్రా యూనివర్శిటీలో MA చదువుకున్నారు.. కవిగా, రచయితగా మంచి పేరుతెచ్చుకున్నారు.. ఆధునిక కవిత్వంలో అరుణ్‌ సాగర్‌ది ప్రత్యేకశైలి.. నగరజీవితంలోని విభినత్వాన్ని తన కవితల్లో ఆవిష్కరించారు. ఆ తర్వాత జర్నలిస్టుగా పలు ఛానళ్లకు సేవలందించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో కొత్త ఒరవడి సృష్టించారు.. రచయితగానూ ఎంతో ఖ్యాతి సంపాదించారు.. మాగ్జిమమ్‌ రిస్క్, మియర్‌ మేల్‌, మేల్‌కొలుపు, మ్యూజిక్‌ డైన్ కవితలు రచనారంగంలో సంచలనం సృష్టించాయి.

పలువురు సంతాపం...

అరుణ్‌సాగర్‌ అకాల మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీసీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, CPM తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, హన్స్ ఇండియా ఎడిటర్ నాగేశ్వర్, 10టీవీ ఎండీ వేణుగోపాల్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అరుణ్‌సాగర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

18:23 - February 12, 2016

విశాఖపట్నం : అమెరికా ట్రేడ్ డెవలప్ మెంట్ ఏజెన్సీలతో ఏపీ ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ దేశాల ప్రతినిధులు విశాఖకు రావడం సంతోషంగా ఉందని.. అమెరికా, అక్కడి సంస్థలతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు . దేశంలోనే స్మార్ట్ సిటీల జాబితాలో విశాఖ రెండో సిటీగా ఎంపికైందన్నారు సీఎం. హుదూద్ వంటి తుఫాన్ లు విశాఖను అతలాకుతలం చేసినా.. రెండు అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగాయన్నారు బాబు. భారత్ లో అవకాశాలు వనరులు ఎక్కువగా ఉన్నాయని రాబోయే 20, 30 సంవత్సరాలలో ప్రపంచ దేశాలలో భారత్ వృద్దిలో తిరుగుండదన్నారు బాబు.

18:22 - February 12, 2016

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రాణహిత, కాళేశ్వరం ప్రాజెక్టులుగా రీ-డిజైన్‌ చేశామని.. 71,436 కోట్ల రూపాయల అంచనాతో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి.. తగిన సహాయం అందించాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చే బృహత్తర పథకం మిషన్‌ భగీరథకు.. కేంద్రం పదివేల కోట్లు మంజూరు చేయాలనీ కోరారు.

కరవు నివారణకు రూ3,064 కోట్లు ఇవ్వాలని వినతి....

రాష్ట్రంలో కరవు పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానికి వివరించారు. కరవు నివారణ చర్యల కోసం కేంద్రం తక్షణమే 3వేల 64 కోట్లు విడుదల చేయాలని కోరారు. 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టుకు స్థల గుర్తింపు పూర్తయిందని.. ఆ నివేదిక ఆధారంగా తక్షణమే ఐటీఐఆర్‌కు తగినన్ని నిధులు విడుదల చేయాలనీ కోరారు. రాష్ట్రంలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు రెండు వందల ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని.. వచ్చే బడ్జెట్‌లో దీనికి సంబంధించిన నిధులను కేటాయించాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

ఐపీఎస్‌ల సంఖ్యను 141కి పెంచాలని విజ్ఞప్తి....

తెలంగాణలో ఐపీఎస్‌ల కొరత ఎక్కువగా ఉందని.. పోలీసు సేవలను మరింతగా విస్తరించేందుకు ప్రస్తుతమున్న ఐపీఎస్‌ల సంఖ్యను 112 నుంచి 141 పెంచాలని కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 0.5 శాతం పెంచాలని, రెండున్నర వేల కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌కు తగినన్ని నిధులు ఇవ్వాలనీ కేసీఆర్‌ కోరారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం.. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణకు.. కేంద్రం 30,571 కోట్లు మంజూరు చేయాలని కేసీఆర్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.  

విలీనం అంశంపై కోర్టుకెల్తాం.. : రేవంత్

హైదరాబాద్: విలీనం అంటే శాసనసభా పక్షమే కాదని, మొత్తం పార్టీనే మరో పార్టీలో విలీనం కావాలని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పారు. టీడీపీ భవన్‌లో ఎర్రబెల్లి లేఖపై విలేకరులతో మాట్లాడిన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో విలీనం అంశంపై సోమవారం హైకోర్టులో పిటిషన్‌ వేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌ మధుసూధనాచారికి ఎర్రబెల్లి దయాకర్ రాసిన లేఖ చెల్లుబాటు కాదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ..

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. విద్యుత్ రంగానికి సంబంధించిన పలు అంశాలను పీయూష్ గోయల్‌కు సీఎం వివరించారు. తాము ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ ద్వారా 2020 నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆ సమయానికి ఎన్టీపీసీ ద్వారా విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఖమ్మం మణుగూరులో రెండేళ్లలో 1080 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. సోలార్ పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కోరారని పేర్కొన్నారు.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ కోనేరులో మృతదేహం..

కరీంనగర్ : మల్యాల మండలంలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ కోనేరులో ఓ మృతదేహం శుక్రవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. కోనేరును శుభ్రం చేస్తుండగా.. సుమారు 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహం బయటపడింది. వ్యక్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇండోనేషియాలో భూకంపం

హైదరాబాద్ : ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదైంది. భూకంప నేపథ్యంలో ఎలాంటి నష్టం జరగలేదని ఇండోనేషియా విపత్తు అధికారులు ప్రకటించారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు.

ఫిల్మ్ నగర్ ప్రస్థానంలో అరుణ్ సాగర్ భౌతికకాయం

హైదరాబాద్ : ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ కవి అరుణ్‌సాగర్(49) భౌతికకాయం ఆయన ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంకు చేరుకుంది. కాసేపట్లో అరుణ్‌సాగర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నీటిపారుదల శాఖ పై హరీష్ రావ్ సమీక్ష...

హైదరాబాద్ : వచ్చే ఖరీఫ్‌లో సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నీటి పారుదల శాఖ అధికారులకు ఆ శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ నీటి పారుదల శాఖపై మంత్రి హరీష్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ప్యాకేజీల వారీ పనుల పురోగతిపై చర్చించామని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల భూసేకరణలో ఇబ్బందులపై దృష్టి సారించామన్నారు. పనుల్లో గుత్తేదారులు, అధికారుల జాప్యంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల సత్వర పూర్తికి ఇచ్చిన జీవోలో కదలిక లేకపోవడంపై కోపోద్రిక్తులయ్యారు.

జేఎన్ యూలో విద్యార్థి నేత అరెస్ట్

ఢిల్లీ : అఫ్జల్‌ గురు ఉరికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయాకుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనిపై దేశద్రోహం కేసు నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం ఈ యూనివర్సిటీ క్యాంపస్‌కు వచ్చిన పోలీసులు అక్కడ తనిఖీలు నిర్వహించి కన్హయాకుమార్‌ను అరెస్ట్ చేశారు. భారత పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి కేసులో అఫ్జల్‌ గురుకు మరణశిక్ష అమలైన సంగతి తెలిసిందే.

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ముంబై : నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 34.29 పాయింట్లు లాభపడి 22986.12 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్పంగా 4.60 పాయింట్లు లాభపడి 6980.95 పాయింట్ల వద్ద ముగిసింది. 

16:21 - February 12, 2016

నట్టింట్లో ఇల్లాళ్లు బలవుతున్నారు..కారణాలు మాత్రం ఆత్మహత్యలు అంటున్నారు..కానీ నాలుగు గోడల మధ్య ఏం జరుగుతోంది. చిన్న కారణంతో ఇంతటి ఘాతుకాలకు దిగుతున్నారా ? లేక ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా ? గడప దాటకుండానే ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి..అబలల ఆర్తనాదాలు ఆగేదెన్నడూ ? ? విజయనగరం జిల్లాలో దారుణమైన ఓ ఘటన వెలుగు చూసింది. ఒకే ఉరి తాడుకు తల్లి..ఇద్దరు పిల్లలు వేలాడిన ఘటన కలకలం సృష్టించింది. లారీ డ్రైవర్ గా పనిచేసే కృష్ణకు సరస్వతితో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అనుమానంతో కృష్ణ నిత్యం సరస్వతిని వేధించే వాడు. ఎన్ని చిత్ర హింసలు పెట్టినా సరస్వతి మౌనంగా భరించింది. వేధింపులు శృతి మించడంతో ఇక తనువు చాలించాలని నిర్ణయించుకుంది. తనతో పాటు ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్లాలని భావించింది. ఒకే ఉరి తాడుకు తల్లి..ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఆత్మహత్య కాదు..హత్యేనని సరస్వతి కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. భర్త అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని విలపిస్తూ పేర్కొన్నారు.
అనంతపురం తాడిపత్రిలో అత్తింటి ఆరాళ్లకు ఓ ఇల్లాలు బలైంది. అంజన్నమ్మకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ కట్టుకున్న వాడే చిత్ర హింసలకు గురి చేశాడు. పెద్దల సమక్షంలో సముదాయించి పంపించారు. కానీ అత్తారింటికి వచ్చిన అంజన్నమ్మ ఐదు రోజులకే దారుణ హత్యకు గురైంది. తమ బిడ్డను అత్తింటి వారే హత్య చేశారని అంజన్నమ్మ కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 

ముగిసిన హనుమంతప్ప అంత్యక్రియలు

కర్నాటక : సియాచిన్ హీరో లాన్స్ నాయక్ హనుమంతప్ప అంత్యక్రియలు కర్నాటకలో ముగిశాయి. ధార్వడ జిల్లాలో ఆయన స్వగ్రామమైన బెటదూర్‌లో ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు తుపాకులను గాల్లోకి పేల్చి గౌరవ వందనం సమర్పించారు. అంత్యక్రియలకు ముందు జరిగిన ర్యాలీలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హనుమంతప్ప అమర్ రహే నినాదాలతో బెటదూర్ మారుమోగింది.

16:06 - February 12, 2016

మీరు వివాహానికి వెళుతున్నారా ? అయితే మిమ్మల్ని మూడో కన్ను నీడలా వెంటాడుతోందన్న విషయం గమనించండి..తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల చోరులు అధికమౌతున్నారు.. అతిధులుగా హడావుడి చేస్తూ బంగారం..నగదును తస్కరిస్తున్నారు. మరి వీరు ఏం చేశారు ? అనేది తెలియాలంటే చదవండి..
అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ ఫంక్షన్ హాల్ లో వివాహం జరుగుతోంది. ఈ పెళ్లికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హాల్ కు చేరుకున్నారు. రాత్రి సమయంలో పెళ్లి కూతురు సోదరికి టోకరా ఇచ్చి 750 గ్రామలు బంగారాన్ని చోరీ చేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు బంధువులు లబోదిబోమన్నారు. ఇలా మూడు నెలల్లో నాలుగు మండపాల్లో చోరీలకు పాల్పడ్డారు. మెదక్ జిల్లాలోని పటన్ చెరువులో ఇలాంటి సంఘటనే జరిగింది. పెళ్లి జరుగుతున్న హాల్ కు చేరుకున్న ముగ్గురు చోరులు చోరీ కోసం బ్యాగులు సర్దుతున్నారు. దీనిని వివాహానికి వచ్చిన వారు గమనించారు. గమనించిన చోరులు కాళ్లకు పని చెప్పారు. ముగ్గురిలో ఒకరు స్థానికంగా ఉండే వైన్స్ షాప్ లో ఉన్నాడని సమాచారం అందింది. దీనితో బంధువులు అక్కడకు చేరుకుని అతడిని పట్టుకుని బంగారం ఛైన్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వేసవిలో ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు..

హైదరాబాద్ : ఉపాధి హామీ కూలీలకు వేసవిలో వేతనాలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల నుంచే పెంచిన వేతనాలను అమలు చేయనున్నారు. ఫిబ్రవరి నెలలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలలో 30శాతం, జూన్‌లో 20 శాతం పెంపుదలను అమలు చేస్తారు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏటా ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు అదనపు వేతనాలు అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా సమన్వయకర్తలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఏసీబీ వలలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సహాయకురాలు..

కరీంనగర్ : జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ ప్రభుత్వ ఆస్పత్రి సీనియర్ వైద్య సహాయకురాలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. బిల్లుల మంజూరుకు వైద్య సహాయకురాలు ఓ వ్యక్తి నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

15:48 - February 12, 2016

కడప : 315 రోజులు..జైలులోని నాలుగు గోడల మధ్య బతుకు..విడుదలకు సమయం ఆసన్నం..ఇంకేముంది..అతను ఆనందడోలికల్లో తేలిపోయాడు..కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు..మళ్లీ అతను జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఎందుకు ? ఏమిటా కారణం తెలియాలంటే ఇది చదవండి..
ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి మామ, పుల్లంపేట మండలాధ్యక్షుడు బాబుల్ రెడ్డి. ఇతను ఓ హత్య కేసులో 315 రోజులు శిక్ష అనుభవించాడు. నాలుగు గోడల మధ్య నుండి బాహ్యప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నానన్న విషయం తెలిసిన బాబుల్ రెడ్డి ఆనందడోలికల్లో మునిగిపోయాడు. తెల్లని ఖద్దరు దుస్తులు ధరించి ఠీవీగా బయటకు వచ్చాడు. ఆయన విడుదల కోసం బాబుల్ రెడ్డి అనుచరులు వేచి చూస్తున్నారు. ఇంకేముంది..తన అనుచరులతో హంగామా చేశాడు. కొద్దిదూరం నడుచుకుంటూ వచ్చిన బాబుల్ రెడ్డి ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యాడు. పోలీసులను చూసిన బాబుల్ రెడ్డి ఆశ్చర్యపోయాడు. అరెస్టు చేస్తున్నామంటూ పోలీసులు చెప్పడంతో బాబుల్ రెడ్డి ఒక్కసారిగా హతాశుడయ్యాడు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని, వారెంట్ చూపెట్టాలంటూ వాగ్వాదానికి దిగాడు. రెండు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో తప్పించుకుని తిరుగుతున్నట్లు..దీనిపై పీటీ వారెంట్ జారీ అయ్యిందని..అందుకనే అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం అతడిని నందలూరు కోర్టుకు తీసుకెళ్లారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

కేరళ శాసనసభలో గందరగోళం

హైదరాబాద్ : కేరళ శాసనసభలో శుక్రవారం గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ 2016-17 బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న తరుణంలో విపక్షాలు అడ్డుతగిలాయి. సోలార్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎంకు బడ్జెట్‌ ప్రవేశపెట్టే అర్హత లేదని విపక్షాలు నిరసన తెలిపుతూ...సభలో ఫ్లకార్డులు ప్రదర్శించి, సీఎం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సభ నుంచి వాకౌంట్‌ చేశారు.

విశాఖ పోర్టును సందర్శించిన అమెరికా రాయబారి

విశాఖ : దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విశాఖపట్టణం పోర్టును అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ నేడు సందర్శించారు. రాయబారికి స్వాగతం పలికిన పోర్టు చైర్మన్‌ కృష్ణబాబు, ఆయనకు పోర్టు కార్యకలాపాలను వివరించారు.

15:32 - February 12, 2016

నిజామాబాద్ : వసంత పంచమి సందర్భంగా బాసర పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు రాష్ర్టం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇక్కడి వసతి గృహాలు భక్తులతో నిండిపోయాయి. 

15:29 - February 12, 2016

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి జీహెచ్ఎంసీ మేయర్ గా బొంతు రామ్మోహన్ , డిప్యూటీ మేయర్ గా బోరబండకు చెందిన బాబాఫసియుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి జీహెచ్ఎంసీ మేయర్ గా బొంతు రామ్మోహన్ బాధ్యతలు చేపట్టారు. తాను మేయర్ గా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందని.. జీహెచ్ ఎంసీ అభివృద్దికి తగిన ప్రణాళికలు వేస్తున్నామని.. బల్దియా సమస్యలను గుర్తించి అభివృద్దికి బాటలు వేస్తామని తెలిపారు రామ్మోహన్ .  

15:27 - February 12, 2016

విజయవాడ : సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్‌ కేసుకు సంబంధించి.. ఆ సంస్ధ యజమానులకు.. ఏలూరు కోర్ట్ 14 రోజుల రిమాండ్‌ విధించింది. నిన్న రాత్రి అరెస్టయిన అగ్రిగోల్డ్‌ ఫార్మ్‌ ఎస్టేట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌, సీఎండీ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషునారాయణవులను ఈరోజు వేకువజామున పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తీసుకొచ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు స్థానిక పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో విచారణ అనంతరం.. కోర్టులో ప్రవేశపెట్టారు. మరోవైపు హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ ఈనెల 19కు వాయిదా పడింది. ఉదయం ఆస్తుల విలువ, వివరాలను యాజమాన్యం కోర్టుకు సమర్పించింది. వీటిని పరిశీలించిన ధర్మాసనం.. విచారణ ఈనెల 19కు వాయిదా వేసింది. మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలపై ఏర్పాటైన సీతాపతి కమిటీ ఇవాళ సమావేశం కానుంది. 

15:25 - February 12, 2016

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తనను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేశారు. పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వాదనలకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ కోరారు. దీంతో విచారణను కోర్టు 15వ తేదీకి వాయిదా వేసింది.

15:24 - February 12, 2016

హైదరాబాద్ : ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ కవి అరుణ్‌సాగర్(49) ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన నివాసం నుండి అంతిమ యాత్ర ప్రారంభం అయ్యింది. ఆయన పనిచేస్తున్న టివి 5 లో కొద్ది సేపు ఉంచి అనంతరం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో అరుణ్‌సాగర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ ప్రకటించారు.

15:21 - February 12, 2016

హైదరాబాద్ : ఆధునిక కలం ఆగిపోయింది... యువ జర్నలిస్టుల, నవ రచయితల దిక్సూచి అనంత కాలంలో కలిసిపోయింది. సూటిగా..బాణంలా దూసుకుపోయే అక్షరాలు.. అన్యాయాన్ని నిలబెట్టి కడిగేసే పదునైన పదాలు...మూగబోయాయి. ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులకు రోల్ మోడల్‌ అయిన అరుణ్‌సాగర్‌ నిశ్శబ్ధంగా అందరినీ వీడి నింగికేగారు.                                                                             

స్వేచ్ఛా రచనకు పురుడు పోసిన నవయుగ కలం....

నవ జర్నలిజంలో ఆయనొక సరికొత్త ఒరవడి...అక్షరాలనే తన ఆయుధంగా మలచుకొని రచనా రంగంలో నూతన శైలిని సృష్టించిన ఆధునిక కలం ఆయన. మీడియాలో భాష ఇలాగే ఉండాలనే కట్టుబాట్లను తెంచి స్వేచ్ఛా రచనకు పురుడు పోసిన నవయుగ కలం అరుణ్‌సాగర్‌. ప్రముఖ కవి, సీనియర్‌ జర్నలిస్ట్ అరుణ్‌సాగర్‌ కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ సాగర్.. అమీర్‌పేట్‌లోని ప్రైమ్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. 1967 జనవరి 2న జన్మించిన అరుణ్ సాగర్‌... ఆంధ్రా యూనివర్శిటీలో MA చదువుకున్నారు.. కవిగా, రచయితగా మంచి పేరుతెచ్చుకున్నారు.. ఆధునిక కవిత్వంలో అరుణ్‌ సాగర్‌ది ప్రత్యేకశైలి.. నగరజీవితంలోని విభినత్వాన్ని తన కవితల్లో ఆవిష్కరించారు. ఆ తర్వాత జర్నలిస్టుగా పలు ఛానళ్లకు సేవలందించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో కొత్త ఒరవడి సృష్టించారు.. రచయితగానూ ఎంతో ఖ్యాతి సంపాదించారు.. మాగ్జిమమ్‌ రిస్క్, మియర్‌ మేల్‌, మేల్‌కొలుపు, మ్యూజిక్‌ డైన్ కవితలు రచనారంగంలో సంచలనం సృష్టించాయి.

పలువురు నివాళులు...

అరుణ్‌సాగర్‌ అకాల మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీసీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సీపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, హన్స్ ఇండియా ఎడిటర్ నాగేశ్వర్, 10టీవీ ఎండీ వేణుగోపాల్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అరుణ్‌సాగర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయంత్రం 4గంటలకు ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అరుణ్‌సాగర్‌ మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటు: మంత్రి హరీష్‌

అరుణ్‌సాగర్‌ భౌతికకాయాన్ని మంత్రి హరీష్‌రావు సందర్శించారు. సాగర్‌ కుటుంబానికి సానుభూతి తెలిపారు. చిన్నవయసులోనే సాగర్ మృతి తీరని లోటని అన్నారు. అరుణ్‌సాగర్‌ మృతదేహాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.

అరుణ్‌సాగర్‌ మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటు: అల్లం నారాయణ

అరుణ్‌సాగర్‌ మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటని ప్రెస్‌ అకాడమి ఛైర్మన్‌ అల్లంనారాయణ అన్నారు. జర్నలిజంలో విభిన్న శైలిని ఎంచుకొని సరికొత్త బాటలు వేసిన వ్యక్తి అరుణ్‌సాగర్ అని కొనియాడారు. సాగర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

అభ్యుదయ భవాలున్న వ్యక్తి అరుణ్‌సాగర్‌: తమ్మినేని వీరభద్రం

అభ్యుదయ భావాలున్న వ్యక్తి , కవి అయిన అరుణ్‌సాగర్‌ చిన్నవయసులోనే మృతి చెందడం బాధాకరమని తెలంగాణ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 10 టీవీ స్థాపనలో అరుణ్‌సాగర్‌ క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. అరుణ్‌సాగర్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

అరుణ్ సాగర్ అంతిమ యాత్ర ప్రారంభం

హైదరాబాద్ :  ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ కవి అరుణ్‌సాగర్(49) ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన నివాసం నుండి అంతిమ యాత్ర ప్రారంభం అయ్యింది.ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో అరుణ్‌సాగర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ ప్రకటించారు.

దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం పేరు మార్పు....

హైదరాబాద్ : దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం పేరును తెలంగాణ ప్రభుత్వం మార్పు చేసింది. దీనిని సీతారామ సాగునీటి పథకంగా నామకరణం చేస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంతేకాక పాలేరు మాధురిపురం ఎత్తిపోతల పథకం పేరును కూడా భక్తరామదాసు పథకంగా మార్పు చేస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

14:51 - February 12, 2016

హైదరాబాద్ : అమ్మాయిలు సౌకర్యవంతంగా ధరించే వస్త్రధారణ చుడీదార్స్ . అలాంటి చుడీదార్స్ లో పార్టీవేర్ కలెక్షన్ ను పరిచయం చేసేందుకు ఇవాళ్టి 'సొగసు' దిల్ షుక్ నగర్లో ని పివికె మార్కెట్ స్టాల్ నెం126 వచ్చేసింది. మీ ముందుకొచ్చింది. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

14:40 - February 12, 2016

హైదరాబాద్ : మహిళలు ఇంటా, బయటా అనేక ఒత్తిడుల మధ్య పనిచేయాల్సిన స్థితి. ఇలాంటి స్థితిలో శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఫిట్ నెస్ కలిగి ఉంటేనే అనేక పనులు సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం. అందుకోసం ఎలాంటి ఫిట్ నెస్ యాక్టివిటీని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలో ఇవాళ్టి 'నిర్భయ'లో కొన్ని అంశాలను తెలియజేశారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈవీడియోను క్లిక్ చేయండి..

14:35 - February 12, 2016

హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో మహిళకు సగభాగం కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయనుంది. అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత మంత్రి వెల్లడించారు.

స్త్రీనిధి బ్యాంకు విశేష సేవలు....

మహిళా సాధికారత సాధనలో భాగంగా స్త్రీనిధి బ్యాంకు విశేష సేవలందిస్తున్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు కూడా స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

బాలీవుడ్ నటి కాజోల్ ప్రత్యేక గుర్తింపు...

బాలీవుడ్ నటి కాజోల్ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ప్రసార భారతి బోర్డు తాత్కాలికసభ్యురాలిగా ఆమెను ఉపరాష్ట్రపతి ఎంపిక చేసారు.

రక్షణ రంగంలోనూ సత్తా చాటుతున్న మహిళలు...

రక్షణ రంగంలోనూ మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఇటీవల కాలంలో శాంతి పరిరక్షణ దళాల్లో మహిళల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదికలు తేలుస్తున్నాయి.

మహిళలను అధికార పీఠం అప్పచెప్పేందుకు...

మహిళలను అధికార పీఠం అప్పచెప్పేందుకు ఇప్పటికీ యాజమాన్యాలు తటపటాయిస్తూనే ఉంటాయి. కానీ, వాస్తవంలో మహిళలు నేతృత్వం వహించే సంస్థలన్నీ లాభాల బాటలో నడుస్తున్నాయని, సర్వే లో తేలింది.

క్రీడారంగంలో అమ్మాయిల హవా....

క్రీడారంగంలో అమ్మాయిల హవా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే, క్రికెట్ లో, టెన్నిస్ లో విజయపతాక ఎగరేసిన క్రీడాకారిణులు ఇప్పుడు స్క్వాష్ లోనూ తమ సత్తా చాటుతున్నారు.

 

14:31 - February 12, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. సుమారు 40 నిమిషాల పాటు మోడీతో సమావేశమైన సీఎం కేసీఆర్ పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చాలని సీఎం ప్రధానిని కోరినట్లు సమాచారం. 

ఏపీ సర్కార్ తీరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: ఏపీ సర్కార్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో జన్మభూమిల కమిటీల ఏర్పాటు సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. అర్హులైన లబ్థి దారులకు పింఛన్ తొలగించడంపై దాఖలైన పిటిషన్ ను శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రజాసామ్యబద్దంగా ఎన్నికైన సర్పంచ్ లను పక్కకు పెట్టడమేంటని న్యాయస్థానం సీరియస్ అయింది. మరో వైపు సెక్రటరీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా అర్హులైన 348 లబ్ధి దారులకు మే 1 వతేదీ లోపల మంజూరు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా బొంతు రామ్మోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌కు డిప్యూటీ సీఎం మహముద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అభినందనలు తెలిపారు. ఉద్యమంలో చూపించిన ఉత్సాహం పనిలోను చూపిస్తానని రామ్మోహన్ తెలిపారు. జీహెచ్‌ఎంసీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం..

విజయనగరం :జిల్లాలో మెంటాడ మండలం, కొండలింగాలవలస పంచాయతీ పరిధిలో గిరిజన గ్రామానికి చెందిన ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపారు. సరుకులు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వస్తున్న ఆమెను యువకులు ఆపి పొలాల్లోకి తీసుకువెళ్లారు. చిన్న పిల్లలు ఉన్నారని చెప్పినా వినకుండా తనపై అత్యాచారం చేశారని బాధితురాలు కన్నీరు మున్నీరు అవుతోంది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సిగ్నల్ పడినా ఆగకపోతే లైసెన్స్ రద్దే!

హైదరాబాద్ : నగర రోడ్లపై ఇక సిగ్నల్ పడినా ఆగకుండా వెళ్లారో... మీ లైసెన్స్ రద్దైపోవడం ఖాయమే. ట్రాఫిక్ నియంత్రణలపై ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇకపై హైవేలపై గంటకు 80 కి.మీ, జిల్లాల రోడ్లపై 65 కి.మీ, టీఆర్ రోడ్లపై 50 కి.మీల వేగ పరిమితిని నిర్దేశించింది. ఈ వేగాన్ని మించి ప్రయాణిస్తే కఠిన చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో అరుణ్ సాగర్ అంత్యక్రియలు..

హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ కవి అరుణ్‌సాగర్(49) ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అరుణ్‌సాగర్‌కు జర్నలిజంలో 25 ఏళ్ల అనుభవం ఉంది. మేల్‌కొలుపు, మాగ్జిమమ్‌రిస్క్, మియర్‌మేల్, మ్యూజిక్‌డైస్ తదితర రచనలు చేశారు. ఆసుపత్రి నుంచి సాగర్ బౌతికికాయాన్ని రాజీవ్‌నగర్‌లోని ఆయన స్వగృహాన్నికి తీసుకువచ్చారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం టీవీ5కి తరలించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో అరుణ్‌సాగర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ ప్రకటించారు. 

13:59 - February 12, 2016

హైదరాబాద్ : సీఎం చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఘాటైన విమర్శలు చేశారు. అవినీతి, అక్రమాలు, వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు అని విమర్శించారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని తెలిపారు. రాక్షస సంతతికి పుట్టిన వాళ్లైతేనే టీడీపీలో చేరతారని ఎద్దేవా చేశారు. కులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ మునిగేపోయే పడవని పేరొన్నారు. చంద్రబాబు ప్రజాస్యామ్యాన్ని అపహాస్యం చేసస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిని జన్మభభూమి కమిటీలో నియమిస్తున్నారని తెలిపారు. ఓడిపోయిన వారికి నిధులు ఇస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. తమ కార్యకర్తలపై తప్పడు కేసుల పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జగన్ కోసం ప్రాణాలు అర్పించే వారు.. వంద మంది ఉన్నారు... నీ కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఇద్దర్ని చూపించంటూ'... సవాల్ విసిరారు. చంద్రబాబు అస్తమించే సూర్యుడు.. జగన్ ఉదయించే సూర్యుడన్నారు. చంద్రబాబు పాత టైప్ రైటర్... అయితే జగన్ హైస్పీడ్ యాపిల్ కంప్యూటర్ లాంటివివాడని పేర్కొన్నారు. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెంట ఉన్నాముని.. భవిష్యత్ లో కూడా ఉంటామని చెప్పారు. తమ పార్టీ నేతలు ఎవరూ టీడీపీలోకి చేరరని చెప్పారు.

 

 

13:51 - February 12, 2016

విశాఖ : ఎల్లుండి విశాఖలో జరిగే భారత్ -శ్రీలంక టి20  మ్యాచ్  కోసం రెండో రోజూ టిక్కెట్ల విక్రయాలు జోరందుకున్నాయి. మీ సేవ సెంటర్లలో 1000, 1500, 2000, మూడువేల రూపాయల ఖరీదైన టిక్కెట్లు విక్రయించారు. ఉదయం నుంచి మీసేవా సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో  క్రికెట్ అభిమానులు బారులు తీరారు. దొండపర్తి  సెంటర్‌లో కార్యాలయ సిబ్బంది టిక్కెట్లు గోల్  మాల్ చేసారంటూ అభిమానులు ఆరోపించారు. 8గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ టిక్కట్లు గంట ఆలస్యంగా ప్రారంభం కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేసారు. 

 

13:50 - February 12, 2016

ముంబై : లష్కర్ తీవ్రవాది డేవిడ్ హెడ్లీ విచారణ ముంబైలో నాలుగురోజు కొనసాగింది. బాల్ ఠాక్రే హత్యకు కుట్రపన్నినట్టు హెడ్లీ కోర్టుకు తెలిపాడు. శివసేన భవన్‌ కూల్చివేతకు కూడా రెక్కి నిర్వహించామన్నారు. ముంబై ఎయిర్ పోర్టులో మారణహోమం సృష్టించేందుకు కూడా ప్లాన్ చేసినట్టు హెడ్లీ తెలిపాడు. ముంబై దాడులు పక్కాగా జరగాలని లష్కర్ కమాండర్ జకీవుర్ రెహ్మన్ నూరిపోసినట్టు కోర్టుకు వివరించాడు. కసబ్ పట్టుబడటంతో తీవ్ర నిరాశకు గురయ్యామని హెడ్లీ కోర్టుకు తెలిపాడు. VIS

 

13:48 - February 12, 2016

ఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు.. వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు ఇచ్చింది.

13:46 - February 12, 2016

హైదరాబాద్ : డ్వాక్రా సంఘాలన్నింటికీ రూ.10 లక్షల వడ్డీలేని రుణాలివ్వాలని, రానున్న బడ్జెట్‌లో అన్ని శాఖల్లో మహిళలకు 50 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు చలో హైదారాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందిరాపార్క్‌ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ర్ట నలుమూలల నుంచి మహిళలు భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చారు.

 

13:45 - February 12, 2016

మహబూబ్ నగర్ : రోహిత్ మృతికి కారకులైన వారిని శిక్షించే వరకు పోరాటం ఆగదని హెచ్‌సియు జేఏసీ నేతలు అన్నారు. రోహిత్‌ న్యాయ పోరాట యాత్ర రెండోరోజులో భాగంగా పాలమూరు యూనివర్సిటీలో సమావేశం నిర్వహించారు. రోహిత్‌ చట్ట తేవడంతో పాటు మృతికి కారణమైన వారిని శిక్షించాలని, రోహిత్‌ కుటుంబానికి 50 లక్షల ఆర్థికసాయం ఇవ్వడంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

 

13:42 - February 12, 2016

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కాసేపటి క్రితం ఆయన ప్రధానితో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆర్థిక అంశాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్‌లో ఉన్న సీఎస్టీ బకాయిల చెల్లింపు, విభజన చట్టంలోని అంశాలను కేసీఆర్‌ ప్రధానితో చర్చించనున్నారు. మిషన్‌ కాకతీయ రెండో దశ పనుల ప్రారంభానికి, దామరచర్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ పనుల ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు.

 

తెలంగాణలో టీడీపీకి మరో షాక్

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీకి మరో షాక్. శాసనసభలో తమదే అసలైన టీడీపీగా గుర్తించాలని ఎర్రబెల్లి.. స్పీకర్‌కు లేఖ రాశారు. పార్టీ సభ్యుల్లో 2/3 వంతు ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నారని ఎర్రబెల్లి లేఖలో పేర్కొన్నారు. లేఖపై 10మంది ఎమ్మెల్యేల సంతకాలు చేశారు. నిన్నటి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. 

 

13:35 - February 12, 2016

కర్నాటక : లాన్స్ నాయక్ హనుమంతప్పకు కడసారి వీడ్కోలు పలికేందుకు కర్నాటక ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రివర్గ సభ్యులు, రాజకీయనేతలతో పాటు... సాధారణ పౌరులు భారీగా హనుమంతప్ప నివాసానికి తరలివచ్చారు. సియాచిన్ యోధునికి తుది వీడ్కోలు పలుకుతున్నారు. సాయంత్రం అధికార లాంఛనాలతో హనుమంతప్ప అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

 

13:32 - February 12, 2016

హైదరాబాద్ : ఆధునిక కలం ఆగిపోయింది... యువ జర్నలిస్టుల, నవ రచయితల దిక్సూచి అనంత కాలంలో కలిసిపోయింది.  సూటిగా..బాణంలా దూసుకుపోయే అక్షరాలు.. అన్యాయాన్ని నిలబెట్టి కడిగేసే పదునైన పదాలు...మూగబోయాయి. ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులకు రోల్ మోడల్‌ అయిన అరుణ్‌సాగర్‌ నిశ్శబ్ధంగా అందరినీ వీడి నింగికేగారు.
నవ జర్నలిజంలో ఆయనొక సరికొత్త ఒరవడి 
నవ జర్నలిజంలో ఆయనొక  సరికొత్త ఒరవడి...అక్షరాలనే తన ఆయుధంగా మలచుకొని  రచనా రంగంలో నూతన శైలిని సృష్టించిన ఆధునిక కలం ఆయన. మీడియాలో భాష ఇలాగే ఉండాలనే కట్టుబాట్లను తెంచి స్వేచ్ఛా రచనకు పురుడు పోసిన నవయుగ కలం అరుణ్‌సాగర్‌.
అరుణ్‌సాగర్‌ కన్నుమూత
ప్రముఖ కవి, సీనియర్‌ జర్నలిస్ట్ అరుణ్‌సాగర్‌ కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ సాగర్.. అమీర్‌పేట్‌లోని ప్రైమ్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు.
1967 జనవరి 2న జననం...
1967 జనవరి 2న జన్మించిన అరుణ్ సాగర్‌... ఆంధ్రా యూనివర్శిటీలో MA చదువుకున్నారు.. కవిగా, రచయితగా మంచి పేరుతెచ్చుకున్నారు.. ఆధునిక కవిత్వంలో అరుణ్‌ సాగర్‌ది ప్రత్యేకశైలి.. నగరజీవితంలోని విభినత్వాన్ని తన కవితల్లో ఆవిష్కరించారు. ఆ తర్వాత జర్నలిస్టుగా పలు ఛానళ్లకు సేవలందించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో కొత్త ఒరవడి సృష్టించారు.. రచయితగానూ ఎంతో ఖ్యాతి సంపాదించారు.. మాగ్జిమమ్‌ రిస్క్, మియర్‌ మేల్‌, మేల్‌కొలుపు, మ్యూజిక్‌ డైన్  కవితలు రచనారంగంలో సంచలనం సృష్టించాయి.
పలువురు సంతాపం...
అరుణ్‌సాగర్‌ అకాల మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీసీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, హన్స్ ఇండియా ఎడిటర్ నాగేశ్వర్, 10టీవీ ఎండీ వేణుగోపాల్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అరుణ్‌సాగర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయంత్రం 4గంటలకు ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
అరుణ్‌సాగర్‌ మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటు : అల్లం నారాయణ
అరుణ్‌సాగర్‌ మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటని ప్రెస్‌ అకాడమి ఛైర్మన్‌ అల్లంనారాయణ అన్నారు. జర్నలిజంలో విభిన్న శైలిని ఎంచుకొని సరికొత్త బాటలు వేసిన వ్యక్తి అరుణ్‌సాగర్ అని కొనియాడారు. సాగర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
అభ్యుదయ భవాలున్న వ్యక్తి అరుణ్‌సాగర్‌: తమ్మినేని
అభ్యుదయ భావాలున్న వ్యక్తి , కవి అయిన అరుణ్‌సాగర్‌ చిన్నవయసులోనే మృతి చెందడం బాధాకరమని తెలంగాణ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 10 టీవీ స్థాపనలో అరుణ్‌సాగర్‌ క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. అరుణ్‌సాగర్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

13:16 - February 12, 2016

ఆనందంతోని అంగి లాగిడ్సి ఎగిరితె.. ఆకలిగొన్న కుక్క అవ్వెత్కపోయిందట అని అంటరు సూడు... అగో అట్లనే అయ్యింది తమిళనాడుల ఒక పోలీసాయిన పనిగూడ.. ఆనందం ఆపుకోలేక.. కాళ్లకు భర్త నాట్యం జోడియ్యవొయ్యి.. మొత్తం కాళ్లకు పని లేకుంట ఇంట్ల గూసునె కాడికొచ్చింది యవ్వారం ఆ కథ ఏందో సూడుండ్రిగ మీరే.

13:13 - February 12, 2016

విశాఖ : యూనివర్శిటీల్లో కుల వివక్ష కొనసాగుతూనే ఉంది.. రోహిత్‌ ఆత్మహత్యను మరువకముందే మళ్లీ ఏయూలో అలాంటి ఘటనే జరిగింది.. తోటి విద్యార్థులు గమనించడంతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది.
శిరీషకు ఫెలోషిప్‌ రాకుండా చేస్తానంటూ బెదిరింపు
ప్రొఫెసర్ వేధింపులు తట్టుకోలేక విశాఖలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించింది.. జువాలజీ విభాగంలో పీహెచ్ డీ చేస్తున్న శిరీష... ప్రొఫెసర్ అన్నపూర్ణ దగ్గర ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది.. కొద్దిరోజులక్రితం శిరీష ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకిచ్చే రాజీవ్‌ గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌కు ఎంపికైంది.. ఈ ఫెలోషిప్‌ తన చదువుకు ఉపయోగపడుతుందని... ఇకనుంచి ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా పనిచేయలేనంటూ ప్రొఫెసర్‌కు చెప్పింది శిరీష.. దీంతో ఆగ్రహించిన అన్నపూర్ణ శిరీషపై సీరియస్‌ అయింది.. నానా మాటలు తిట్టింది.. శిరీషకు ఫెలోషిప్‌ రాకుండా యూటీసీకి లేఖ రాస్తానంటూ బెదిరించింది.. ప్రొఫెసర్‌ తీరుతో మనస్తాపం చెందిన శిరీష ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.. ఈ విషయం గమనించిన ఆమె స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించారు..
శిరీష పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
ప్రస్తుతం శిరీష పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. అటు ఈ విషయంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రోహిత్ చట్టం తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు..

 

 

13:10 - February 12, 2016

కొందరు కళాకారులు ఎట్లుంటరంటే పాట కోసం పాణమిస్తరు.. భూకంపం వొచ్చి భూమి అదులుతున్న అకుంఠింత దీక్షతోని ఇయ్యాలనుకున్న పర్ఫామెన్స్ ఇచ్చిన శబ్బాష్ అనిపిచ్చుకుంటరు.. అగో గట్లనే జేశింది వొక పిల్ల.. స్టేజీ మీద ఈవెంట్ మేనేజరేనో లేకుంటే కార్యక్రమాన్కి హాజిరైన అతిథో తెల్వగని గని.. స్టేజీ మీదికెల్లి జారిపడ్డడు.. కిందవడి ఆయిన తిప్పల వడ్తుంటే.. ఆమె డ్యాన్స్ స్టెప్పులు ఎట్లేశిందో ఇగో ఇండ్ల సూడుండ్రి..

13:04 - February 12, 2016

ఆదిలాబాద్ జిల్లా అంటె ఏంది..? మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారును జెప్పుమంటే.. అది తెలంగాణకు కాశ్మీర్ అసొంటిది అంటడు.. ఇంకా జెప్పుమంటే.. మావా నాటే.. మావా రాజ్ అని కొమురంభీం నినాదం గూడ అచ్చుగుద్దినట్టు జెప్తడు.. ఇంకా ఏమన్న ఉన్నదాంటే..? గిరిజన గోండు గూడాలకు అంబులెన్సులు వోవుగా వట్టి హెలికాప్టర్లు వెట్టి వాళ్లను దావఖాండ్లకు దోల్కొస్తాని గూడ అంటడు.. మరి ఈ తెలంగాణ కాశ్మీర్ కథ చెప్పి రెండేండ్లైంది. మరి గిప్పుడు ఎలా ఉందో చూడాలంటే వీడియో సూడుండ్రి.

13:02 - February 12, 2016

తెలంగాణల తెల్గుదేశం పార్టీ పరిస్థితి ఏడికెళ్లి ఏడికొచ్చింది సూశిండ్రా..? గుడ్డి కంటె మెల్లెనన్న నయ్యం అనుకుంటరు.. కని ఆ పార్టీకి కనీసం గుడ్డి గూడ లేకుంటయ్యెతట్టున్నది ఇప్పటి పరిస్థితిని వట్టి సూస్తుంటె.. రెండువేల పద్నాలు కెళ్లి ఇప్పటిదాక.. తెల్గుదేశం పార్టీ ఎట్ల తెర్లయింది..? దానికి కర్మ కర్త క్రియ ఎవ్వలు అనేది వీడియోలో చూడండి.

12:59 - February 12, 2016

మహబూబ్ నగర్ : పాలమూరు ఎత్తిపోతల పథకం మరోసారి చర్చనీయాంశమైంది. పాలమూరు ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడం మరో వివాదానికి దారితీస్తోంది. సర్కార్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో ఇప్పటికే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 
ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీళ్లు 
మహబూబునగర్‌ జిల్లాల్లోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్‌ మార్పుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త డిజైన్‌తో కల్వకుర్తి ప్రాజెక్టులోని లక్ష ఎకరాల ఆయకట్టుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే  ప్రమాదముంది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి నీళ్లు తీసుకుపోయేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇవ్వాల్సిందిగా వాప్కోస్ అనే సంస్థకు  బాధ్యతలు అప్పగించింది. 
రోజూ ఒక టీఎంసీ నీరు 
రోజూ ఒక టీఎంసీ నీటిని డిండి తీసుకుపోయేందుకు 150మీటర్ల వెడల్పు, 100ఫీట్ల లోతులో కాల్వలను తవ్వనున్నారు. గన్యాగుల, ముష్టిపల్లి, నెల్లికుదురు, దాసిపల్లి, జమిస్తాపూర్‌, నాగర్ కర్నూల్ మీదాగ మేడిపూర్‌ వరకు కాల్వల ద్వారా నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి డిండి రిజర్వాయర్‌లోకి నీటిని తరలిస్తారు. సుమారు 70 కిలోమీటర్ల వరకు కాలువ  తవ్వే అవకాశం ఉండటం వల్ల... ఈ కాలువ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టును చీల్చుకుంటూ వెళుతుంది. దీనివల్ల దాదాపుగా యాభై వేల నుంచి లక్ష ఎకరాల ఆయకట్టు దెబ్బతినే అవకాశముంది. అలాగే కల్వకుర్తి పథకానికి సంబంధించిన కాలువల ఫీడర్‌ ఛానళ్ళు దెబ్బతినే ప్రమాదముంది. డిండికి  30టీఎంసీలు తరలించుకుపోవడం వల్ల.. పాలమూరు ఎత్తిపోతలకు 70టీఎంసీల నీటి కేటాయింపు సాధ్యపడకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. 
డిజైన్‌ మార్పును తప్పుపడుతున్న విపక్షాలు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డిజైన్‌ మార్పును విపక్షాలు తప్పుపడుతున్నాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా సాగుతున్నాయి. పాలమూరు రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ ఈనెల 19కి వాయిదా

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ ఈనెల 19కు వాయిదా పడింది. ఉదయం ఆస్తుల విలువ, వివరాలను యాజమాన్యం కోర్టుకు సమర్పించింది. వీటిని పరిశీలించిన ధర్మాసనం.. విచారణ ఈనెల 19కు వాయిదా వేసింది. మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలపై ఏర్పాటైన సీతాపతి కమిటీ ఇవాళ సమావేశం కానుంది.  

12:49 - February 12, 2016

హైదరాబాద్ : హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ ఈనెల 19కు వాయిదా పడింది. ఉదయం ఆస్తుల విలువ, వివరాలను యాజమాన్యం కోర్టుకు సమర్పించింది. వీటిని పరిశీలించిన ధర్మాసనం.. విచారణ ఈనెల 19కు వాయిదా వేసింది. మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలపై ఏర్పాటైన సీతాపతి కమిటీ ఇవాళ సమావేశం కానుంది.

 

12:47 - February 12, 2016

పశ్చిమగోదావరి : ఏలూరు కోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ ముగిసింది. సంస్థ ఛైర్మన్, ఎండీలకు న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం... ఇద్దరిని ఏలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు వీరిద్దరిని తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

 

12:38 - February 12, 2016

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీకి మరో షాక్. శాసనసభలో తమదే అసలైన టీడీపీగా గుర్తించాలని ఎర్రబెల్లి.. స్పీకర్‌కు లేఖ రాశారు. పార్టీ సభ్యుల్లో 2/3 వంతు ఎమ్మెల్యేలు తమవైపు ఉన్నారని ఎర్రబెల్లి లేఖలో పేర్కొన్నారు. లేఖపై 10మంది ఎమ్మెల్యేల సంతకాలు చేశారు. నిన్నటి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. 

 

12:36 - February 12, 2016

మెగాస్టార్ చిరంజీవి నివాసంలో చాలా రోజుల తరువాత శుభకార్యం జరుగుతోంది. రామ్ చరణ్ వివాహం జరిగి మూడు సంవత్సరాలు అవుతోంది. చిరంజీవి, సురేఖ దంపతుల చిన్న కుమార్తె శ్రీజ వివాహం జరుగబోతోంది. చిత్తూరుకు చెందిన ఓ ఎన్నారైతో ఈ వివాహం జరగనుంది. ఈ సందర్భంగా చిరు నివాసంలో జరిగిన పెళ్లి పనులకు శ్రీకారం చుట్టిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. చిరు దంపతులు పసుపు కొమ్ములు దంచుతున్న ఫొటోతో బాటు శ్రీజ సందడి చేస్తున్న ఫొటోలు సందడి సందడి చేస్తున్నాయి. పెళ్లి పందిరి..పసుపు కొమ్ములు దంచే కార్యక్రమాన్ని చిరు దగ్గరుండి చూసుకుంటున్నాడు. మార్చిలో ఈ వివాహం జరగనుందని తెలుస్తోంది. 'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ మానుకుని వివాహ వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనున్నట్లు సమాచారం. 

12:35 - February 12, 2016

హైదరాబాద్ : ఆధునిక కలం ఆగిపోయింది. యువ జర్నలిస్టుల, నవ రచయితల దిక్సూచి అనంత కాలంలో కలిసిపోయింది.  సూటిగా..బాణంలా దూసుకుపోయే అక్షరాలు.. అన్యాయాన్ని నిలబెట్టి కడిగేసే పదునైన పదాలు...మూగబోయాయి. ఎలక్ర్టానిక్ మీడియా జర్నలిస్టులకు రోల్ మోడల్‌ అయిన అరుణ్‌సాగర్‌ నిశ్శబ్ధంగా అందరినీ వీడి నింగికేగారు.
1967 జనవరి 2న జననం 
1967 జనవరి 2న జన్మించిన అరుణ్ సాగర్‌... ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఎ చదువుకున్నారు. కవిగా, రచయితగా మంచి పేరుతెచ్చుకున్నారు. ఆధునిక కవిత్వంలో అరుణ్‌ సాగర్‌ది ప్రత్యేకశైలి. నగరజీవితంలోని విభినత్వాన్ని తన కవితల్లో ఆవిష్కరించారు. ఆ తర్వాత జర్నలిస్టుగామారిన అరుణ్ సాగర్... ఎలక్ట్రానిక్ మీడియాలో కొత్త ఒరవడి సృష్టించారు.. రచయితగానూ ఎంతో ఖ్యాతి సంపాదించారు.. మాగ్జిమమ్‌ రిస్క్, మియర్‌ మేల్‌, మేలు కొలుపు, మ్యూజిక్‌ డైన్ కవితలు రాశారు.. 

 

12:29 - February 12, 2016

హైదరాబాద్ : ప్రముఖ కవి, సీనియర్‌ జర్నలిస్ట్ అరుణ్‌సాగర్‌ కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అరుణ్‌సాగర్‌ అకాల మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీసీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, హన్స్ ఇండియా ఎడిటర్ నాగేశ్వర్, టెన్ టీవీ ఎండీ వేణుగోపాల్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అరుణ్‌సాగర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయంత్రం 4గంటలకు ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

 

12:27 - February 12, 2016

హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి కసరత్తులు కూడా ప్రారంభించింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాతల మండలితో కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశమయ్యింది. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను నిర్మాతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.  
చిత్ర నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో విధానం
తెలుగు చలన చిత్ర రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌ సబ్‌కమిటీ తొలిసారిగా నిర్మాతల మండలితో సమావేశమయ్యింది. మంత్రులు తలసాని,కేటీఆర్‌, తుమ్మలతో  మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌,  డి సురేష్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, కళ్యాణ్‌, కె ఎస్‌ రామారావు, ఆర్‌ నారాయణ మూర్తి, రామ్మోహన్‌ రావుతో పాటు ఇతర నిర్మాతలు, అధికారులు  భేటీ అయ్యారు. చిత్ర నిర్మాణ అనుమతుల కోసం సింగిల్‌ విండో విధానాన్ని తీసుకురావాలని నిర్మాతల మండలి ప్రభుత్వాన్ని కోరింది. చిన్న సినిమాలు, బాలల చిత్రాలకు ఇప్పటి వరకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. 
ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మాలి
బ్లాక్‌ టిక్కెట్లను అరికట్టడానికి టికెట్ల ఆన్‌లైన్‌ అమ్మకాల విధానాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని నిర్మాతల మండలి సబ్‌ కమిటీని కోరింది. మల్టీప్లెక్స్‌ తరహాలో మిగతా థియేటర్లకు 5వ చిత్ర ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని సూచించింది. ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, ఫైర్‌ సర్వీస్‌ నుంచి పొందాల్సిన అనుమతుల రెన్యూవల్స్ సమయం మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచాల్సిన అవసరం ఉందని పలువురు నిర్మాతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సినిమా రంగంలో పనిచేస్తున్న వారికి చిత్రపురి దగ్గరే ఇళ్లు కట్టించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
సమస్యలను పరిష్కరిస్తామన్న తలసాని 
నిర్మాతల మండలి తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని తలసాని అన్నారు. చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని చెప్పారు. పుణె ఫిల్మ్ ఇనిస్ట్టిట్యూట్‌ తరహాలో తెలంగాణలోనూ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. 
నిర్మాతల మండలితో మరోసారి భేటీ కానున్న సబ్‌ కమిటీ
నిర్మాతల మండలితో మరోసారి భేటీ అవ్వాలని సబ్‌ కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా సినీ రంగంలో ఉన్న సంఘాలన్నీ ఏక తాటిపైకి రావాలని కమిటీ సూచించింది. 

12:25 - February 12, 2016

స్వార్థంతోనే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహింహిచన న్యూస్ మార్నింగ్ చర్చ కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, టీడీపీ నేత దుర్గాప్రసాద్, వైసిపి నేత ఉప్పులేటి కల్పన పాల్గొని, మాట్లాడారు. స్పీకర్లు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జర్నలిస్టు అరుణ్ సాగర్ మరణం అనూహ్యంగా ఉందని... చాలా బాధాకరమన్నారు.  సాగర్ తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారని తెలిపారు.  ఆయన మృతికి పంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:31 - February 12, 2016

ప్రైవేట్ ఉద్యోగాల్లో అభద్రతా భావంతోనే ప్రభుత్వ ఉద్యోగాలపై యువత ఆసక్తి చూపుతోందని ది హన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్ ప్రొ.నాగేశ్వర్ అన్నారు.  గుడ్ మార్నింగ్ నాగేశ్వర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. విద్యావ్యస్థలో సమూల మార్పులు తేవాలన్నారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లోనే...

'గవర్నమెంట్ రంగంలో ఎప్పుడూ వేలు, లక్షల సంఖ్యలో ఉద్యోగ పోస్టులను వేయరు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు పీహెచ్ డీ విద్యార్థులు దరఖాస్తు చేశారు. వీఆర్ ఏ పోస్టులకు ఇంజనీరింగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రయివేట్ రంగం కన్నా ప్రభుత్వ ఉద్యోగాల పట్ల యువతలో ఆసక్తి పెరిగింది. గతంలో పబ్లిక్ సెక్టార్ లో పని చేయాలంటే మనుషులు దొరికే వారు..కానీ ఇప్పుడు ప్రభుత్వరంగంలో పని చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రభుత్వంతోపాటు ప్రయివేట్ రంగాన్ని పోల్చితే..  ప్రయివేట్ రంగంలో సాలరీలు అధికంగా ఉండవు, సెక్యూరిటీ సమస్, స్థిరత్వం లేకపోవడం, హైర్ ఆండ్ ఫైర్, వర్క్ టార్గెట్, వర్క్ ఫర్మామెన్స్, నిరంతరం నూతన ఆవిష్కరణలు ఆవిష్కరిస్తూనే ఉండాలి' ఈకారణాలతో యువత ప్రభుత్వరంగ ఉద్యోగాలపై ఆసక్తి చూపుతున్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మళ్లీ గవర్నమెంట్ జాబుల వైపు ప్రజలు వెళ్తున్నారు. ప్రభుత్వ రంగంలో అత్యంత ఎక్కువ సాలరీ..... 2 లక్షల 20 వేల రూపాయలు. ప్రభుత్వరంగంలో మంచి సాలరీలు ఉన్నాయి. మిడిల్ లెవల్ తో పోలిస్తే.. ప్రయివేట్ రంగంతో పోల్చితే ప్రభుత్వరంగంలో ఎక్కవ సాలరీలున్నాయి. ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో  లెవల్ లో ప్రభుత్వరంగంలో కంటే ప్రయివేట్ రంగంలో సాలరీలు ఎక్కువగా ఉన్నాయి.  విద్యా విధానం బాగ లేదు... మారాలి. ప్రభుత్వం రంగంలో రిస్కు ఉండదనే భావన ప్రజల్లో నెలకొంది. యువత కంఫర్ట్ ను కోరుకుంటున్నారు. చాలెంజెస్ ను యువత స్వీకరించాలి. క్రియేటివ్ టాలెంట్ ఉండాలి. నైపుణ్యానికి గుర్తింపు ఉంటుంది. వ్యాపారం దాతృత్వం కాదు. ఓయూలో చాలా మంది వ్యవసాయ కార్మిక బిడ్డలు చదువుతున్నారు. పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలి.

టీ.టీడీపీ ప్రతికూల పరిస్థితులు 
తెలంగాణలో టీడీపీ ప్రతికూల పరిస్థితలను ఎదుర్కొంటుంది. ఎప్పటికైనా సీమాంధ్ర రాజకీయ నేతల కిందే టీటీడీపీ నేతలు ఉండాలి. ఎపి, తెలంగాణల మధ్య వివాదాలున్నాయి. తెలంగాణ టీడీపీకి స్వయంప్రతి ఉండే అవకాశం లేదు. తెలంగాణలో స్వతంత్ర రాజకీయాలు చేయలేదని' వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఏలూరు కోర్టులో అగ్రిగోల్డు కేసుపై విచారణ

పశ్చిమగోదావరి : ఏలూరు కోర్టులో అగ్రిగోల్డు కేసుపై విచారణ జరిగింది. అగ్రిగోల్డు చైర్మన్, ఎండీలకు 14 రోజలపాటు రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు వారిని జైలుకు తరలించనున్నారు.

 

10:52 - February 12, 2016

కరీంనగర్‌ : జిల్లా కోరుట్లలో నకిలీ నోట్లు పట్టుబడ్డాయి.. మేడిపల్లి జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. అందులో సోదాలు జరిపిన పోలీసులకు దాదాపు 2లక్షల 9వేల రూపాయల నకిలీ నోట్లు దొరికాయి. ఈ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వాహనంలోఉన్న నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఈ డబ్బు తీసుకువచ్చారని పోలీసులు చెబుతున్నారు.

10:51 - February 12, 2016

పశ్చిమగోదావరి : అగ్రిగోల్డ్ నిందితులను సీఐడీ అధికారులు ఏలూరు కోర్టులో హాజరుపర్చారు.  అగ్రిగోల్డ్ ఛైర్మన్ వెంకట రామారావు, ఎండీ వెంకట శేషునారాయణరావులను నిన్న సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 

10:46 - February 12, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డు బాధితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పంజాగుట్టలోని అగ్రిగోల్డ్‌ కార్యాలయం ముందు బాధితులు నిరసనకు దిగారు. తమ డిపాజిట్లు తిరిగి చెల్లించాలిని డిమాండ్‌ చేస్తున్నారు.

10:36 - February 12, 2016

కారులో ప్రయాణిస్తున్నాం... మనం ఎక్కడున్నామో మన తప్ప ఇతరులెవరికీ తెలి యదు. మన ప్రయాణం ఎక్కడ వరకు సాగిందో ఇంట్లో వాళ్లు తెలుసుకోవాలంటే ఫోన్‌ చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో నెట్‌వర్క్‌ లేకపోవడం తో సాధ్యం కాదు. దీంతో టెన్షన్‌ తప్పదు. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు హైదరాబాదీ కవలలు జరు కపాడియా, విజరు కపాడియా. 'ట్రాక్‌కింగ్‌' అనే వెహికిల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను వీరు రూపొందించారు. మనం ప్రయాణిస్తున్న వాహనం ఎక్కడున్నా 'ట్రాకింగ్‌' ఇట్టే చెప్పేస్తుంది. ఇంటర్నెట్‌ లేకుండానే ఈ అప్లికేషన్‌ పనిచేస్తుంది. ఒకసారి వెహికల్‌ రిజిస్ట్రర్‌ చేసుకుంటే చాలు ఆ వాహనం ఎక్కడున్నదో మెసేజ్‌ అందిస్తుంది.

ఎలా పనిచేస్తుందంటే...
వాహనం ఇంజన్‌ కింద డివైజ్‌ పెడతారు. ఇది క్లౌడ్‌తో కనెక్ట్‌ అయి ఉంటుంది. ప్రస్తుతం వాహనం ఇంజన్‌ ఎక్కడుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ చేస్తుంది. ఈ డివైజ్‌ ద్వారానే మొత్తం సమాచారం లభిస్తుంది. ఎమర్జెన్సీలో ఎంతగానో సాయపడే సేఫ్టీ ఫీచర్‌ ఇది. అమ్మాయిలు ఒంటరిగా డ్రైవ్‌ చేస్తుంటే సాయపడుతుంది. వారి వెహికల్‌ ఎక్కడుందనే విషయాన్ని తెలియడమే కాకుండా, వన్‌ బటన్‌తో వారి క్షేమ సమాచారం మనకు అందిస్తుంది.

10:34 - February 12, 2016

గుంటూరు : పరిపాలన పరుగులు పెడతానంటోంది. అవసరాలు ఆయాసం తెప్పిస్తున్నాయి. కనురెప్పపాటులో కాలం కరిగిపోతోంది. అమరావతి కట్టేదెప్పుడో తెలియదు.. కనీసం పరిపాలన అమరావతికి మారేదెన్నడు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే ఏపీ ప్రభుత్వం అపసోపాలు పడుతోంది. తాత్కాలిక సచివాలయం ఎపిసోడ్‌లో లేటైనా మొత్తానికి వేగం పెంచింది.
45 ఎకరాల్లో సచివాలయం
తాత్కాలిక సచివాలయం వెలగపూడిలోనే కడతామని ఏపీ ప్రభుత్వం తేల్చేసింది. ఉత్తర్వులు జారీ చేసి కాస్తో కూస్తో ఉన్న అనుమానాలను తీర్చేసింది. అయితే ముందనుకున్నట్లు 20 ఎకరాల్లో కాకుండా 45 ఎకరాల్లో సచివాలయం, 27 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు, 18 ఎకరాల్లో ప్రజా సదుపాయాలను నిర్మిస్తామని వివరణ ఇచ్చింది.
ఇంకా ఖరారు కాని టెండర్లు
ఇప్పటికీ టెండర్లు అయితే ఖరారు కాలేదు. చదరపు గజం రేటుపై నానా కసరత్తు చేసిన నారాయణ.. ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ప్రభుత్వం అనుకున్న రేటుకు కంపెనీలను ఒప్పించలేకపోయారు. దీంతో మళ్లీ టెండర్లు పిలవాలా అనే ఆలోచనలో ప్రభుత్వం పడింది. అయితే ఒకటి రెండురోజుల్లో ఆ సమస్యను పరిష్కరించి.. శంకుస్థాపన తేదీ ఖరారు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
పరిపాలన కోసం బాబు ఎదురుచూపులు
తాత్కాలిక సచివాలయం నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. ఉద్యోగులను రప్పించి.. పరిపాలన పూర్తిస్థాయిలో చేయాలని చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. కాని కాగితంపై రాసుకున్నంత తేలిగ్గా పనులు కాకపోవడంతో.. కాలం కరిగిపోతోంది. మొత్తం మీద ఈ సంవత్సరంలోనే అమరావతిలో పరిపాలన పరుగులు పెడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

అరుణ్ సాగర్ మృతికి సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ సంతాపం...

హైదరాబాద్ : ప్రముఖ జర్నలిస్టు అరుణ్ సాగర్ హఠాన్మరణం చెందారు. సాగర్ మృతికి సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

 

10:27 - February 12, 2016

ఈ చెట్టును చూస్తే ఆకుల్లేని, కాయలు మాత్రమే ఉన్న చెట్టులా ఉంది కదూ ! ఇది చెట్టే కానీ జీవం లేని కృత్రిమ చెట్టు. దీని పేరు విండ్‌ ట్రీ. కృత్రిమ చెట్టని దీన్ని తీసి పారేయడానికి వీల్లేదు. సహజమైన చెట్టు చల్లటి గాలి, నీడ ఇస్తే ఈ వైట్‌ విండ్‌ ట్రీ కరెంటునిస్తుంది. అదెలాగంటారా... 36 అడుగులున్న ఈ స్టీలు చెట్టుకి 72 ఆకుల్లాంటి నిర్మాణాలుంటాయి. ఏ చిన్న గాలి తరంగాలు వచ్చినా ఆకుల్లాంటి టర్బైన్లు గుండ్రంగా తిరిగి కరెంటుని ఉత్పత్తి చేస్తాయి. అన్నట్లు ఇవి అస్సలు శబ్దం చేయవంట. ఎంత చెట్టుకి అంత గాలి అనే మాటని దీని విషయంలో ఎంత గాలి వస్తే అంత కరెంటు ఉత్పత్తి అవుతుందని అన్వయించుకోవచ్చు. ఇంతకీ దీన్ని తయారు చేసిందెవరో తెలుసా... ఫ్రాన్స్‌కు చెందిన న్యూ విండ్‌ సంస్థ. దీని వ్యవస్థాపకుడు జెమోర్‌ మిచాడ్‌ లారివియర్‌ మాటల్లో చెప్పాలంటే ఈ విండ్‌ ట్రీలని వీధుల్లో, పార్కులో పెట్టుకుంటే అక్కడి లైట్లకి ఈ కరెంటు సరిపోతుంట. ఇంతకీ ఈ చెట్టు ఖరీదెంతో తెలుసా ? సింపుల్‌గా 29,000 యూరోలు. డాలర్లలోనైతే 35,000. మన రూపాయల్లో అక్షరాలా 24 లక్షలు.

10:22 - February 12, 2016

న్యూఢిల్లీ : మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్‌ కిషన్‌జీని మమతా బెనర్జీ ప్రభుత్వమే హత్య చేయించిందని పశ్చిమ బెంగాల్‌ ప్రణాళికా మంత్రి రచ్‌పాల్‌సింగ్‌ అన్నారు. ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ కూడా ఒక ర్యాలీలో మాట్లాడుతూ సరిగ్గా ఇదే మాట చెప్పారన్నది గమనార్హం. మంత్రి రచ్‌పాల్‌ హుగ్లీలోని బాలాగఢ్‌లో జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడుతూ కిషన్‌జీని తమ ప్రభుత్వం ఎలా మట్టుబెట్టిందో వివరించారు. 'టీవీల వాళ్లు, పత్రికల వాళ్లు కిషన్‌జీని ఎప్పుడూ కలుస్తుండే వారు. అతను కనిపించే వాడు కానీ ఎవరికీ చిక్కకపోయేవాడు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక అతనిని పట్టుకోవడం కేవలం పోలీసుల వల్ల అయ్యే పని కాదని గ్రహించారు. దాంతో ఆమె కిషన్‌జీకి సంబంధించిన నిఘా సమాచారాన్ని సేకరించే బాధ్యతను స్వయంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ఫలితంగా మూడు నెలలల్లోనే ఆయనను ఎన్‌కౌంటర్‌లో చంపెయ్యగలిగాం' అని మంత్రి బహిరంగ సభలో అన్నారు. రచ్‌పాల్‌సింగ్‌ ప్రకటన తృణమూల్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి మమతాబెనర్జీని ఇరుకున పెట్టింది. సంయుక్త బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లోనే కిషన్‌జీ మరణించారని ఇప్పటి దాకా చెబుతూ వచ్చారు. గతంలో అభిషేక్‌ బెనర్జీ, ఇప్పుడు రచ్‌పాల్‌ సింగ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కిషన్‌జీది బూటకపు ఎన్‌కౌంటరే అనే వాదనకు బలం చేకూరుతుంది. 2008లో లాల్‌గఢ్‌ ప్రాంతంలో జరిగిన మావోయిస్టు కార్యకలాపాలకు మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిషన్‌జీ నేతృత్వం వహించారు. 2011 నవంబర్‌ 24న ఆయన పశ్చిమ మిడ్నపూర్‌ జిల్లాలోని బురిసోల్‌ అడవిలో జరిగిందని చెప్పిన ఎన్‌కౌంటర్‌లో హతులయ్యారు. అయితే, ఆ ఎన్‌కౌంటర్‌ బూటకమనే ఆరోపణలు తొలి నుంచీ ఉన్నాయి.

09:59 - February 12, 2016

మీర్పూర్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో గెలుపొందిన వెస్టిండీస్‌.. టైటిల్‌ పోరులో భారత్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. మీర్పూర్‌ స్టేడియంలో ఉత్కంఠగా సాగిన సెమీస్‌లో 227 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్‌.. అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. విజయం కోసం ఆఖరు వరకూ అద్భుతంగా పోరాడిన ఆతిథ్య బంగ్లాదేశ్‌.. ఓడినా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' విండీస్‌ ఆల్‌రౌండర్‌ స్ప్రింగర్‌ (62, 88 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధ సెంచరీతో కరీబియన్‌ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్‌ కోసం భారత్‌, వెస్టిండీస్‌లు తలపడనున్నాయి. నువ్వా నేనా అన్నట్టు సాగిన సెమీస్‌లో విజయం కోసం ఇరు జట్లు ఆఖరు దాకా పోరాడాయి. స్వల్ప స్కోరుకు కాపాడుకోవటంలో.. బంగ్లా బౌలర్లు విశేషంగా రాణించారు. ఐనప్పటికీ విండీస్‌ బ్యాట్స్‌మన్‌ స్ప్రింగర్‌ (62) అజేయ ఇన్నింగ్స్‌కు తోడు శిర్మణ్‌ (60) అర్ధ సెంచరీ చేయటంతో విండీస్‌ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ.. ఎప్పటికప్పుడు రేసులోకి వచ్చిన బంగ్లాదేశ్‌ విమర్శకుల్ని సైతం ఆకట్టుకుంది. అంతకుముందు విండీస్‌ బౌలర్లు పాల్‌ (3/20), స్ప్రింగర్‌ (2/36) రాణించటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 226 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా జట్టులో హసన్‌ హసన్‌ మీరాజ్‌ (60) అర్ధ సెంచరీతో రాణించాడు. జోరురాజ్‌ షేక్‌ (35), సైఫుద్దీన్‌ (36)లు సైతం కాసిన్ని పరుగులు చేసి.. జట్టు స్కోరు 200 మార్క్‌ దాటించారు.
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ : 226/10 ( హసన్‌ మీరాజ్‌ 60, మహ్మద్‌ సైఫుద్దీన్‌ 36, పాల్‌ 3/20, స్ప్రింగర్‌ 2/36)
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ : 230/7 ( స్ప్రింగర్‌ 62, శిర్మణ్‌ 60, అహ్మద్‌ షవాన్‌ 3/37, సైఫుద్దీన్‌ 2/46)

అగ్రిగోల్డు కార్యాలయం ఎదుట బాధితుల ఆందోళన

హైదరాబాద్ : పంజాగుట్టలో అగ్రిగోల్డు కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. డిపాజిట్టు చెల్లిచాలని డిమాండ్ చేశారు.   

09:51 - February 12, 2016

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. మరో టీడీపీ ఎమ్మెల్యే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు  సిద్ధమయ్యారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ మంత్రులతో భేటీ అయిన రాజేందర్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
టీటీడీపీ మనుగడే ప్రశ్నార్థకం
టీటీడీపీ మనుగడే ప్రశ్నార్థకం చేసేలా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ పావులు వేగంగా కదుపుతోంది. ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరగా, మరో ఎమ్మెల్యేను కూడా అధికార పార్టీలోకి చేర్చుకుంది. టీడీపీకి చెందిన నారాయణ్‌ పేట్‌ ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో మూడింటా రెండొంతుల మంది సభ్యులను పార్టీలోకి చేర్చుకున్నట్లుయ్యింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత  ఆయన సమక్షంలో టీఆర్ఎస్‌లో అధికారికంగా చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విషయమై ఇప్పటికే కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడానని ఆయన తెలిపారు. 
టీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్‌ 
ఇదిలా ఉంటే టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పటికే తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా రాజేందర్‌రెడ్డి కూడా అధికార పార్టీ గూటికి చేరుతుండటంతో కారు ఎక్కిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరనుంది. 

టీటీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్ లో విలీనం 
తెలంగాణలో టీడీపీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో 10కిపైగా మంది టీఆర్ఎస్‌లో చేరడంతో మూడింట రెండొంతుల మంది ఆ పార్టీలో చేరినట్టయింది. దీంతో టీటీడీపీ శాసనసభాపక్షం టీఆర్ఎస్ లో విలీనానికి మార్గం సుగమమైనట్టు భావిస్తున్నారు. 

టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి 
నిజానికి టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పార్టీ మారుతారని టాక్ రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ వినిపించలేదు. ఆయన టీడీపీలోనే కొనసాగుతారన్న అంతా భావించారు. ఇటీవల జరిగిన టీటీడీపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్ మార్గంలోనే రాజేందర్‌రెడ్డి కూడా సైకిల్‌ను వీడి కారు ఎక్కుతుండటంతో టీడీపీకి మరో పెద్ద షాక్ తగిలినట్టయింది.

09:45 - February 12, 2016

ఈ మధ్య ఎవరిని కదిలించినా గుర్తులేదు..మర్చిపోయాం అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటికి కారణం పనివత్తిడి, టెన్షన్స్‌, ఎక్కువగా ఆలోచించడం అంటున్నారు నిపుణులు. ఈ బిజీ లైఫ్‌లో మనం మన ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టలేకపోతున్నాం. పొద్దున లేవగానే టీ కప్పుతోనే ఎంతో మంది తమ రోజును ప్రారంభిస్తారు. పనివత్తిడిలో ఉన్నపుడు టీ తాగితే ఒత్తిడి తగ్గుతుందంటారు కొందరు. అయితే ఇలాంటి మన దైనందిక సమస్యలకు కప్పు గ్రీన్‌ టీ తో చెక్‌ పెట్టొచ్చంటున్నారు డాక్టర్లు. సహజంగా గ్రీన్‌ టీ అనగానే బరువు తగ్గేందుకు ఓ చక్కని ఉపాయంగా అందరూ భావిస్తారు. శరీరంలోని కొవ్వును కరిగించి చక్కటి శరీరాకృతిని అందించే గ్రీన్‌టీలో మనకు తెలియని ఎన్నో ఔషధగుణాలున్నాయి. అవి అధిక బదువును తగ్గించడమే కాదు, షుగరు వ్యాధిని దరిచేరకుండా చేస్తాయి. గ్రీన్‌ టీ లో ఉండే ధయామిన్‌ , అమినోసిడ్స్‌ మనల్ని ఒత్తిడి నుండి దూరం చేస్తాయి. రోజుకో కప్పు గ్రీన్‌ టీ తాగటం వల్ల కీళ్ళనొప్పులు దూరమవుతాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. గుండెకు రక్త ప్రసరణ అందేలా చేస్తూ గుండెలో కొవ్వుని తగ్గించి, గుండెపోటు, రక్తపోటు వంటి ప్రమాదాల నుండి రక్షిస్తుంది. పురుషుల్లో సంభంవించే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ని గ్రీన్‌ టీ నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తూ శరీరానికి శక్తినందిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మరీ ముఖ్యంగా గ్రీన్‌ టీని తాగడం వల్ల మన శరీరం తేజోవంతంగా, ఆరోగ్యంగానూ ఉంటుంది. మనకి ఇన్ని లాభాలను తెచ్చిపెడుతున్న గ్రీన్‌ టీని తాగి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!

09:40 - February 12, 2016

ఢిల్లీ : లాన్స్ నాయక్‌ హనుమంతప్ప కోసం దేశవ్యాప్తంగా చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం కన్ను మూశారు. వీర సైనికుడి మరణంతో దేశ వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. హనుమంతప్పకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులర్పించారు.
తుదిశ్వాస విడిచిన హనుమంతప్ప
సియాచిన్‌లో ఆరు రోజుల పాటు 35 అడుగుల కింద మంచు చరియల్లో చిక్కుకుపోయి కొన వూపిరితో బయటపడ్డ హనుమంతప్ప ఇక లేరు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 11.45 నిముషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. 
వూపిరితిత్తుల్లో న్యుమోనియా 
కోమాలో ఉన్న హనుమంతప్ప ఆరోగ్యం గురువారం ఉదయానికి మరింత క్షీణించిందని మెడికల్ బులెటిన్ పేర్కొంది. మూత్రపిండాలు, కాలేయం పని చేయకపోవడంతో వైద్యులు ఆయనకు కృత్రిమ శ్వాస అందించడం, డయాలసిస్‌ చేస్తూ వచ్చారు. వూపిరితిత్తుల్లో న్యుమోనియా ఉన్నట్లు వైద్యుల పరిశీలనలో తేలింది. హనుమంతప్ప ప్రాణాలు కాపాడేందుకు  ఆర్మీ వైద్యులతో పాటు, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం చేసిన అన్ని రకాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. వీర సైనికుడి క్షేమం కోసం దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఆ రోజు ఏం జరిగింది?
సియోచిన్‌లో వెయ్యి మీటర్ల పొడవు, 8 వందల మీటర్ల వెడల్పు ఉన్న  భారీ మంచు పలక పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న భారత సైనిక శిబిరంపై పడటంతో 9 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆరురోజుల పాటు 35 అడుగుల లోతున మంచులో కూరుకుపోయిన జవాన్ హనుమంతప్ప ప్రాణాలతో ఉండటం వైద్యనిపుణులను, సైనికాధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం హనుమంతప్పను  ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆరు రోజుల పాటు నీళ్లు లేకుండా ఉండడం వల్ల డీహైడ్రేషన్‌ అయిందని, మెదడుతో పాటు ఇతర శారీరక అంగాలు పూర్తి స్థాయిలో దెబ్బ తిన్నాయని వైద్యుల సమాచారం. సియాచిన్‌లో మంచు తుపాను సంభవించిన చోటు 20 వేల అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ 45 డిగ్రీల కన్నా తక్కువగా ఉండడం గమనార్హం.
అక్టోబర్‌ 2002లో 19 వ బెటాలియన్‌లో చేరిక
కర్ణాటకకు చెందిన 33 ఏళ్ల హనుమంతప్ప అక్టోబర్‌ 2002లో మద్రాస్‌ రెజిమెంట్‌లోని 19 వ బెటాలియన్‌లో చేరారు. 13 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేసిన ఆయన పదేళ్లు అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో పనిచేశాడు. 2003 నుంచి 2006 వరకు, 2008 నుంచి 2010 వరకు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేకంగా పోరాడాడు. 2010 నుంచి 2012 వరకు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీఎఫ్‌బి, ఉల్ఫా తీవ్రవాదులతో పోరాడాడు. ఆగస్టు 2015 నుంచి సియాచిన్‌లో పనిచేస్తూ మంచు తుపాను ధాటికి తట్టుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హనుమంతప్ప ప్రాణాలు కోల్పోయాడు. 
హనుమంతప్ప మృతిపై ప్రధాని మోడీ త్రీవ సంతాపం  
హనుమంతప్ప మృతిపై ప్రధాని తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా హనుమంతప్ప మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

09:36 - February 12, 2016

విలక్షణ దర్శకుడిగా బాలీవుడ్‌లో పేరొందిన మధుర్‌ భండార్కర్‌కు గౌరవ డాక్టరేట్‌ లభించనుంది. సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను ఆర్ట్స్‌ విభాగంలో రాయ్ యూనివర్సిటీ (గుజరాత్‌) ఈనెల 12న జరిగే స్నాతకోత్సవంలో మధుర్‌కు డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. 'చాందినిబార్‌', 'దిల్‌తో బచ్చాహై', 'ఫ్యాషన్‌', 'ట్రాఫిక్‌సిగల్‌', 'హీరోయిన్‌', 'క్యాలెండర్‌ గర్ల్స్‌' వంటి చిత్రాలను వాస్తవికతకు చాలా దగ్గరగా మధుర్‌ రూపొందించారు. 'ట్రాఫిక్‌ సిగల్‌' చిత్రానికి జాతీయ ఉత్తమ దర్శకుడిగా అవార్డుని అందుకున్న మధుర్‌ను ఈ యేడాది ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో కేంద్రప్రభుత్వం సముచితంగా గౌరవించింది.

09:36 - February 12, 2016

'నేను..శైలజ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కీర్తి సురేష్‌ తాజాగా తమిళంలో విజయ్ సరసన నటించే లక్కీఛాన్స్‌ను అందుకుంది. విజయ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 60వ చిత్రంలో కీర్తి సురేష్‌ని ఎంపిక చేసినట్టు దర్శకుడు భరతన్‌ తెలిపారు. కీర్తి సురేష్‌ ప్లేస్‌లో తొలుత కాజల్‌ని అనుకున్నారు. విజయ్, కాజల్‌ కాంబినేషన్‌లో 'తుపాకి', 'జిల్లా' చిత్రాలు రూపొంది తమిళనాట ఘనవిజయాన్ని సాధించాయి. విజయ్ 60వ చిత్రంలో సైతం కాజల్‌ ఉంటే బాగుంటుందని యూనిట్‌ అనుకున్నప్పటికీ చివరిగా కీర్తి సురేష్‌ని సెలెక్ట్‌ చేశారని తెలుస్తోంది. కీర్తి సురేష్‌ ఈచిత్రంతోపాటు మహేష్‌బాబు హీరోగా ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ద్విభాషా చిత్రంలోనూ ఎంపికైనట్టు సమాచారం. వీటితోపాటు మలయాళంలో కూడా రెండు చిత్రాల్లో కీర్తి సురేష్‌ నటిస్తూ బిజీగా ఉంది.

 

09:35 - February 12, 2016

దిలీప్‌, మమతా మోహన్‌దాస్‌ జంటగా మలయాళంలో సంచలన విజయం సాధించిన 'టూ కంట్రీస్‌' చిత్రం తెలుగు హక్కుల్ని నిర్మాత బండ్ల గణేష్‌ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ మాట్లాడుతూ,''టూ కంట్రీస్‌' చిత్రం మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా 50 కోట్లని కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం తెలుగు హక్కుల కోసం భారీ పోటీ ఉన్నప్పటికీ ఫ్యాన్సీ ఆఫర్‌తో నేను దక్కించుకోవడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్ని ఉన్న ఈ చిత్రాన్ని భారీ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నాను. ఈ చిత్రంలో నటించేందుకు ప్రముఖ టాప్‌ స్టార్స్‌ మరింత ఆసక్తిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రంలో నటించే నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాల్ని తెలియజేస్తాను. గతంలో మా పరమేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో నిర్మితమైన 'తీన్‌మార్‌', 'గబ్బర్‌సింగ్‌', 'బాద్‌షా', 'ఇద్దరమ్మాయిలతో, 'గోవిందుడు అందరి వాడేలే', 'టెంపర్‌'వంటి భారీ చిత్రాల స్థాయిలోనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం' అని చెప్పారు.

09:34 - February 12, 2016

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా నిర్మాతగా నిర్మిస్తున్న తొలి చిత్రం 'వెంటిలేటర్‌' షూటింగ్‌ గురువారం ప్రారంభమైంది. పర్పుల్‌ పెబుల్స్‌ పిక్చర్స్‌ పతాకంపై మరాఠీలో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజేశ్‌ మపుస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన క్లాప్‌బోర్డ్‌ ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రియాంక చోప్రా అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రంతోపాటు బెంగాలీ, పంజాబీ, భోజ్‌పురి భాషల్లో మరో మూడు చిత్రాలను ప్రియాంక నిర్మించనుంది. వినాయక చవితి కానుకగా మరాఠీ 'వెంటిలేటర్‌' చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రియాంక సన్నాహాలు చేస్తున్నారు. నటిగా ప్రియాంక ప్రస్తుతం ప్రకాష్‌ ఝా దర్శకత్వంలో రూపొందుతున్న 'జై గంగాజల్‌2' చిత్రంలోను, రీమా కట్నీ తెరకెక్కిస్తున్న 'మిస్టర్‌ చాలూ' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. హాలీవుడ్‌ టెలివిజన్‌ సిరీస్‌ 'క్వాంటికో'తోపాటు తాజాగా 'బేవాచ్‌' టెలివిజన్‌ సిరీస్‌లోనూ ప్రియాంక నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్లు సమాచారం.

09:33 - February 12, 2016

'బద్లాపూర్‌' చిత్రంతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌. తాజాగా థ్రిల్లర్‌ నేపథ్యంలో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. అక్షయ్ కుమార్‌ హీరోగా నటించే ఈచిత్రంలో అలియాభట్‌ నటిస్తోంది. షీలా జోస్‌ రాసిన 'గాన్‌ విత్‌ ద బుల్లెట్‌' నవల ఆధారంగా దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా షీలా జోస్‌ మాట్లాడుతూ, 'నలభై ఏళ్ళ ఓ హంతుకుడిని 18 సంవత్సరాల ఓ యువతి ప్రేమిస్తుంది. ఈ ప్రేమ వారిద్దరి జీవితాల్ని ఎటువంటి మలుపు తిప్పిందనే అంశం ప్రధానంగా ఈ చిత్రం ఉంటుంది. నేను రాసిన నవల ఆధారంగా శ్రీరామ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం ఆనందంగా ఉంది. పాత్రల తీరు తెన్నుల దృష్ట్యా అక్షయ్ కుమార్‌, అలియాభట్‌లను ఎంపిక చేయడం జరిగింది' అని చెప్పారు.

09:33 - February 12, 2016

అక్కినేని నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న చిత్రం 'నిర్మల కాన్వెంట్‌'. ఈ చిత్రంతో జి.నాగ కోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. 'జై చిరంజీవ', 'దూకుడు', 'రోబో' వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా అస్కార్‌ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహ్మాన్‌ తనయుడు ఎ.ఆర్‌.అమీన్‌ నేపథ్య గాయకుడుగా పరిచయమవుతున్నారు. తండ్రి ప్రోత్సాహంతో సంగీత కళాకారుడుగా ఎదుగుతున్న ఎ.ఆర్‌.అమీన్‌ను 'నిర్మల కాన్వెంట్‌' చిత్రంలో ఓ పాట పాడించి సింగర్‌గా పరిచయం చేస్తున్నారు అక్కినేని నాగార్జున. ఈ పాటను నేడు (శుక్రవారం) విడుదల చేయబోతున్నారు.

09:29 - February 12, 2016

బీడీ కార్మికుల జీవితాలు రానురాను మరింత దుర్భరంగా మారుతున్నాయి . బీడీ కార్మికుల సంక్షేమం కోసమంటూ ప్రవేశపెట్టిన పథకాల అమలులో చిత్తశుద్ధి లోపిస్తోంది. మరోవైపు అసలు పరిశ్రమ ఉనికికే ప్రమాదకర పరిస్థితులొస్తున్నాయి.

కోటికి పైగా కుటుంబాలకు బీడీలు చుట్టడమే జీవనాధారం

మన దేశంలో కోటికి పైగా కుటుంబాలకు బీడీలు చుట్టడమే జీవనాధారం. బీడీలు చుట్టే పనిలో 60 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుంటే, ఆకు సేకరణ, రవాణా లాంటి పనుల్లో మిగిలిన కుటుంబాలు బతుకుబండిని లాగిస్తున్నాయి. తెలంగాణలో వ్యవసాయం, చేనేత తర్వాత అత్యధిక శాతం మందికి ఉపాధి చూపిస్తున్నదీ పరిశ్రమ. తెలంగాణలో 8 లక్షల కుటుంబాలకు ఇది జీవనాధారం. ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ సంఖ్యలోనే బీడీ కార్మికులున్నారు.

బీడీ...పేదోడి సిగరెట్‌

పేదోడి సిగరెట్‌ గా పేరొందిన బీడీ ప్రభుత్వానికి భారీ ఆదాయమే సమకూర్చి పెడుతోంది. గల్ఫ్‌ దేశాల్లో మంచి క్రేజ్ సంపాదించిన మన బీడీలు విదేశీ మారకద్రవ్యమూ ఆర్జించి పెడుతున్నాయి. మన దేశంలో రోజుకి సుమారు 150 కోట్ల బీడీలు తయారవుతుండగా, వాటి మీద సెస్‌ రూపంలో ప్రభుత్వాలకు రెండు కోట్ల రూపాయలు లభిస్తోంది. ప్రతి రోజూ ఇంత సొమ్ము ఖజానాలో జమ చేసుకుంటున్న ప్రభుత్వం బీడీ తయారీలో పొగచూరిపోతున్న బతుకుల గురించి పట్టించుకోకపోవడమే బాధాకరం.

ఏటా లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయల బీడీ వ్యాపారం

మన దేశంలో ఏటా లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయల బీడీ వ్యాపారం జరుగుతోంది. ఇంత టర్నోవర్‌ వున్నా బీడీలు చుట్టేవారికి జబ్బులు తప్ప మరేమీ మిగలడం లేదు. తలనొప్పి, మెడనొప్పి, భుజం నొప్పి, వెన్నునొప్పి, నడుమునొప్పి, కాళ్ల నొప్పి, టీబీ, కేన్సర్, గర్భకోశ వ్యాధి, శ్వాసకోశ వ్యాధి, ఆస్తమా, జలుబు, దగ్గు, గ్యాస్‌ట్రబుల్‌, నీరసం, నిస్సత్తువ, మలబద్దకం, చికెన్‌ పాక్స్‌, రక్తహీనత, చూపు మందగించడం... ఇలాంటి సవాలక్ష అనారోగ్యాలే వీరు కూడబెట్టుకుంటున్న ఆస్తులు. అయిదారేళ్ల పాటు బీడీలు చుట్టినవారి శరీరమంతా జబ్బుల పుట్టగా మారిపోతుంది.

బీడీలు చుట్టడమంటే ఆరోగ్యాన్ని కుళ్లబొడుచుకోవడమే

బీడీలు చుట్టడమంటే రోజుకింత చొప్పున ఆరోగ్యాన్ని కుళ్లబొడుచుకోవడమే. ఉదయం లేచినదగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా బీడీలు చుట్టడం తప్ప మరే వ్యాపకం వుండదు వీరికి. రోజుకి 12 నుంచి 16 గంటలు శ్రమిస్తే తప్ప ఇల్లు గడవదు. కార్ఖానాలలో పనిచేసేవారికంటే ఇళ్లలో బీడీలు చుట్టేవారే ఎక్కువ. గాలీ వెలుతురు సోకని ఒకే ఒక్క గదిలో కాపురం చేసే కుటుంబాలెన్నో.

బీడీ పరిశ్రమలో 80శాతం మందికి పైగా స్త్రీలే

బీడీ పరిశ్రమలో 80శాతం మందికి పైగా స్త్రీలే. పాతిక శాతం మంది పిల్లలే. మూడో ఏడు రాగానే అక్షరాభ్యాసం చేసే అదృష్టం బీడీ కార్మికుల కుటుంబాల్లోని పిల్లలకు వుండదు. అంత చిన్న వయస్సులోనే అమ్మకో, అక్కకో బీడీలు చుట్టే సహాయకులుగా వీరు మారిపోతారు. అయిదారేళ్లు రాకముందే కార్ఖానాలో బందీలవుతారు. పనికి ఆలస్యంగా వెళ్లినా, కార్ఖానాలో పక్క పిల్లలతో మాట్లాడినా, టార్గెట్‌ పూర్తిచేయకపోయినా దెబ్బలు తప్పవు. ఇదీ బీడీ కార్మిక కుటుంబాల్లోని బాలల దైన్యం. బీడీలు చుట్టే చాలామంది తల్లులకు తొలికాన్పు గర్భశోకమే మిగిలిస్తుంది. ఎవరింట్లోనైనా తొలి బిడ్డ బతికితే పూర్వజన్మ సుకృతంగా కళ్లకు అద్దుకుంటారు. తమకు పుట్టే శిశువుల బరువు అతి తక్కువగా వుండడం మరో శాపం.

నెలసరి ఆదాయం రూ.1500

ఇన్ని బాధల మధ్య, కడుపు నిండా దుఃఖాన్ని నింపుకుని, రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా వీరికి నెలకు నికరంగా వచ్చే ఆదాయం 1500ల రూపాయలకు మించదు. ఒక్కొక్కరు రోజుకి 800 నుంచి వెయ్యి బీడీలు మాత్రమే చుట్టగలరు. అందుకు వీరికి దక్కే కూలీ వంద రూపాయలు దాటితే అది మహాభాగ్యం. వీరి సంపాదనలో సగం డబ్బులు మాయదారీ రోగాలు, మందు గోళీలే మింగేస్తాయి.

సంక్షేమ కార్యక్రమాలు అందని బీడీ కార్మికులు

ఇంతటి దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్న వీరికి కనీసం ఐడీ కార్డులివ్వడానికి కూడా ప్రభుత్వాలకు మనసొప్పడం లేదు. ఐడీ కార్డులు లేకపోతే, బీడీ కార్మికులకు దక్కాల్సిన సంక్షేమ పథకాలు, వైద్య ఆరోగ్య సేవలు వీరికి అందడం లేదు. బీడీలు చుట్టే పనిలో 60 లక్షల కుటుంబాలు ఆరోగ్యాలను గుల్ల చేసుకుంటున్నప్పుడు బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా ముందుగా ఏం చేయాలి? వారి సంక్షేమం గురించి ఆలోచించాలి. మాస్క్‌లు, గ్లౌస్‌లు, ఇతర రక్షా కవచాలు అందించి, జబ్బులొచ్చే రిస్క్‌ను తగ్గించాలి. పని గంటలు కుదించాలి. న్యాయమైన వేతనం అందేలా చూడాలి. బీడీ కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకపోగా, ఈ కొద్దిపాటి కూడు పెట్టే వృత్తిని కూడా నామరూపాల్లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం. ధూమపానాన్ని మాన్పించే వంకతో స్వదేశీ బీడీ పరిశ్రమకు నిప్పుపెడుతోంది. మరోవైపు విదేశీ సిగరెట్‌లను ముద్దు చేస్తోంది. నిజమే, ధూమపానం ఎవరికీ మంచిది కాదు. దాన్ని మాన్పించాల్సిందే. అయితే, విదేశీ సిగరెట్ కంపెనీల ఒత్తిడిలకు లొంగి స్వదేశీ కుటీర బీడీ పరిశ్రమను దెబ్బతీయడమే అభ్యంతరకరం.

 

 

09:22 - February 12, 2016

రాంచీ : టీమిండియా, శ్రీలంకజట్ల మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ సమరం...హాట్ హాట్ గా మారింది. జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా..శుక్రవారం జరిగే రెండోమ్యాచ్...3వ ర్యాంకర్ శ్రీలంకకు చెలగాటం, టాప్ ర్యాంకర్ టీమిండియాకు సిరీస్ సంకటంగా మారింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఈ డూ ఆర్ డై సమరం ప్రారంభమవుతుంది. ప్రారంభ ఆసియాకప్ కు సన్నాహాలలో భాగంగా...టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ సమరం ...రెండోమ్యాచ్ కే వేడెక్కింది.
ఆత్మరక్షణలో టీమిండియా
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ లో....5 వికెట్లతో చిత్తుగా ఓడిన టీమిండియా...ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఏమాత్రం అనుభవంలేని శ్రీలంక బౌలింగ్ ఎటాక్ ను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఆడి భారీమూల్యమే చెల్లించింది. పూర్తికోటా 20 ఓవర్లూ ఆడకుండానే...కేవలం 101 పరుగులకే కుప్పకూలి...చేజేతులా ఓటమి కొనితెచ్చుకొంది.
సంచలన విజయంతో శ్రీలంక సిరీస్ ప్రారంభం
మరోవైపు..ఎలాంటి అంచనాలు లేకుండా..ఎక్కువమంది యువఆటగాళ్లతో బరిలోకి దిగిన శ్రీలంక మాత్రం..సంచలన విజయంతో సిరీస్ ను ప్రారంభించింది. రెండో మ్యాచ్ లో సైతం అదే జోష్ కొనసాగించాలన్న పట్టుదల..చండీమల్ నాయకత్వంలోని లంకజట్టులో కనిపిస్తోంది. తొలిమ్యాచ్ దెబ్బతో రగిలిపోతున్న టీమిండియా...రెట్టించిన బలంతో తమపైన విరుచుకుపడటం ఖాయమని..దీటుగా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని.. శ్రీలంక కెప్టెన్ ఇప్పటికే ప్రకటించాడు.
భారత్... డూ ఆర్ డై మ్యాచ్
అయితే...టీమిండియా మాత్రం..తమ కెప్టెన్ హోంగ్రౌండ్ వేదికగా జరిగే ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో భారీ విజయం సాధించాలన్న పట్టుదలతో పోటీకి సిద్ధమయ్యింది. తొలి టీ-20లో జరిగిన పొరపాట్లను రాంచీలో పునరావృతం కానివ్వరాదని భారత టీమ్ మేనేజ్ మెంట్ గట్టిగా నిర్ణయించింది. పూణే పిచ్ బ్యాటింగ్ కు, స్ట్రోక్ ప్లేకు అంతగా అనువుగా ఉండదని తాము గ్రహించినా..పొరపాటు షాట్లు ఆడి..ప్రత్యర్థికి అవకాశమిచ్చామని టీమిండియా కెప్టెన్ ధోనీ అంటున్నాడు. తొలిటీ-20లో తమకు ఓటమి ఎదురైనా..లోయర్ ఆర్డర్ ఆటగాళ్లకు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిందని...క్లిష్టసమయంలో లోయర్ ఆర్డర్ సత్తా ఏపాటిదో పూణే మ్యాచ్ ద్వారా తెలిసి వచ్చిందని ధోనీ గుర్తు చేశాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన సిరీస్ లో నిలకడగా రాణించిన ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ స్థాయికి తగ్గట్టుగా రాణించగలిగితే...శ్రీలంక బౌలర్లకు కష్టాలు తప్పవు. వన్ డౌన్ అజింక్యా రహానే, మిస్టర్ డిపెండబుల్ సురేశ్ రైనా, సిక్సర్లకింగ్ యువరాజ్ సింగ్, కెప్టెన్ ధోనీ..ధూమ్ ధామ్ బ్యాటింగ్ తో చెలరేగితే...విజయం ఏమంత కష్టంకాబోదు.
రాంచీ పిచ్ ..బ్యాటింగ్ కు అనువు
రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ ..బ్యాటింగ్ కు అనువుగా ఉండడంతో..180 కి పైగా స్కోరు నమోదయ్యే అవకాశాలున్నాయి. తొలిమ్యాచ్ లో కీలక టాస్ నెగ్గి..ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న శ్రీలంక...రెండో మ్యాచ్ లో అదే సాహసానికి దిగుతుందా అన్నది అనుమానమే. ఏదిఏమైనా..సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే...రాంచీ మ్యాచ్ లో ..ఆరునూరైనా టీమిండియా నెగ్గితీరాల్సి ఉంది. అంతేకాదు..విరాట్ కొహ్లీ లేకుండా తాము మ్యాచ్ నెగ్గగలమని నిరూపించుకోవాల్సిన బాధ్యత ధోనీ అండ్ కో పైన ఎంతైనా ఉంది.
శ్రీలంకకు చెలగాటం
శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీ...శ్రీలంకకు చెలగాటం, టీమిండియాకు సిరీస్ సంకటంగా కనిపిస్తున్నా...ధోనీసేనే హాట్ ఫేవరెట్ అనడంలో ఏమాత్రం సందేహంలేదు. ధోనీ సొంత గ్రౌండ్ జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో...టీమిండియా మ్యాజిక్ చేస్తుందా? లేక చిచ్చరపిడుగు శ్రీలంక దెబ్బ మీద దెబ్బ కొడుతుందా?...తెలుసుకోవాలంటే...కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

 

09:10 - February 12, 2016

చర్మ రక్షణకు కేవలం ఫేస్‌ ప్యాకులు, రకరకాల క్రీములు మాత్రమే వాడితే మాత్రం సరిపోదు. వాటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. వీటిని తినడం వల్ల మొటిమలు రాకుండా నివారించవచ్చు.
చర్మం లోపల పేరుకుపోయిన బ్యాక్టీరియా, ఇతర క్రీములు బయటకు విడుదల కావడం వల్ల మొటిమలు వస్తాయి. బచ్చలి కూరలో విటమిన్‌-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది మొటిమలకు యాంటీ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
పసుపు చర్మంలోని మంటను తగ్గిస్తుంది. అలాగే చర్మం కాంతివంతంగా మెరవడానికి ఉపయోగపడుతుంది. సహజసిద్దమైన యాంటీబయోటిక్‌ అయిన పసుపును ఏదో ఒక రూపంలో రోజుకు పావు చెంచా చొప్పున తప్పనిసరిగా తీసుకోవాలి. దీంతో రక్తంలోని హానికరమైన బ్యాక్టీరియా నాశనమవుతుంది.
క్యారెట్‌లో బీటా కెరోటిన్‌ రూపంలో విటమిన్‌-ఎ అధికంగా ఉంటుంది. ఇది మొటిమలకు కారణమయ్యే క్రిములను నాశనం చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కనీసం ఒక క్యారెట్‌ అయినా తినడం ద్వారా మొటిమలు రావు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లం అధికంగా లభిస్తుంది. ఇది గుండె, చర్మం వంటి అవయవాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. 

09:09 - February 12, 2016

నేటి ఆధునిక ప్రపంచంలో సెల్‌ఫోన్‌ ప్రతి ఒక్కరికి ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఫోన్‌ వాడకం పెరిగిపోయి అనేక అనారోగ్యాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆ ప్రమాదాల నుండి బయటపడటానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి...
మీరు ఫోన్‌ మాట్లాడేటప్పుడు రేడియేషన్‌ ప్రసరిస్తుంది. కానీ మెసేజ్‌లు పంపినపుడు కానీ, చూసినపుడు కానీ ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడటం వలన ప్రమాదం తగ్గుతుంది.
చేతులతో దూరంగా ఫోన్‌ను పట్టుకోండి మీరు హెడ్‌ సెట్‌ లేదా స్పీకర్‌తో మాట్లాడినప్పుడు మీ చెవుల నుండి ఫోన్‌ను కాస్త దూరంగా పట్టుకొని మాట్లాడండి.
తక్కువ రేడియేషన్‌ ఉన్న ఫోన్‌లను కొనుగోలు చేయండి. ఫోన్‌ కొనేటపుడు అందులోని గైడ్‌ చూడండి. (మీ ఫోన్‌ యొక్క నమూనా సంఖ్య మీ బ్యాటరీ క్రింద ముద్రించి ఉండవచ్చు.) మీరు ఒక కొత్త ఫోన్‌ కోసం మార్కెట్‌లో చుస్తూ ఉంటే, సాధ్యమైనంత తక్కువ రేడియేషన్‌ ప్రసరణ ఉండేది, ఇప్పటి మీ అవసరాలకు తగినది కొనుగోలు చేయండి.
సిగల్స్‌ లేనపుడు ఫోన్‌ అపుచేయండి తక్కువ సిగల్‌ బార్స్‌ అంటే ఫోన్‌ టవర్‌ తన వికిరణాలను ఎక్కువగా విడుదల చేస్తుంది. మీ ఫోన్‌లో సిగల్స్‌ ఉన్నప్పుడు మాత్రమే ఫోన్‌ చేయాలి. 

09:08 - February 12, 2016

ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎక్కువ గంటలు నిలబడి పనిచేయడం అనేది కూర్చొని పని చేయడం కన్నా ఎక్కువ ప్రమాదకరమని వారు అంటున్నారు. ఐదు నుంచి ఆరు గంటలు నిలబడి పని చేయడం వల్ల కాళ్ళకు తిమ్మిరి, ఆయాసం, వెన్నునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
పని మధ్యలో అరగంట పాటు విరామం తీసుకున్నా, పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా వారు చెబుతున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సుగల వారిని రెండు గ్రూపులుగా విభజించి వారి పనిగంటలు, పని విధానం అధ్యయనం చేశారు. ఎక్కువసేపు కూర్చొని పని చేసేవారిలో కన్నా కూడా ఎక్కువసేపు నిలుచుని పనిచేసే వారిలోనే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
కొన్ని రోజుల తర్వాత ఈ రెండు గ్రూపుల వారికి మధ్యాహ్నం 30 నిమిషాల విరామ సమయాన్ని కేటాయించారు. అయినప్పటికీ నిలుచుని పనిచేసేవారిలో పలురకాలైన ఆరోగ్య సమస్యలు ప్రారంభంకావడం వీరి దృష్టికి వచ్చింది. 50 సంవత్సరాలు పైబడిన వారిలో కనిపించే ఆరోగ్య సమస్యలను వీరిలో గుర్తించారు. దీనికి కారణం ఎక్కువ గంటలు నిలబడి పని చేయడమేనని నిపుణులు వెల్లడించారు. ఉద్యోగులు నిలుచుని పనిచేస్తున్నా లేదా కూర్చొని పనిచేస్తున్నా, మధ్యమధ్యలో విరామం తీసుకోవాలని వీరు హెచ్చరిస్తున్నారు. 

08:49 - February 12, 2016

బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బీడీ కార్మిక సంఘం నేత రమాదేవి డిమాండ్ చేశారు. ఇదే అంశాలపై ఇవాళ్టి జనపథంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. 'బీడీ పరిశ్రమ సంక్షోభం అంచుల్లో వుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పరిశ్రమను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీడీ కట్టలపై ముద్రించే కేన్సర్‌ గుర్తు బొమ్మను 40 శాతం నుంచి 85శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీడీ పరిశ్రమల యజమానులు 15 వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సమ్మెను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తుండడం విశేషం.  బీడీ పరిశ్రమ యాజమాన్యాల సమ్మెను కార్మిక సంఘాలు వ్యతిరేకించడానికి కారణం ఏమిటి? అసలు బీడీ పరిశ్రమ, బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేమిటి? బీడీ కార్మికులకు ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్న అంశాలేమిటి? తెలంగాణలో బీడీ కార్మికులకు పెన్షన్‌లు ఎలా అమలవుతున్నాయి? బీడీ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేమిటి? అంశాలపై రమాదేవి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

08:44 - February 12, 2016

హైదరాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ మేయ‌ర్‌గా బొంతు రామ్మోహ‌న్‌  ప్రమాణం స్వీకారం చేశారు. కొత్త పాత కలబోతతో బల్దియా ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లంతా ప్రమాణ స్వీకారం చేసారు. దాదాపు ఎనబై శాతం కొత్త కార్పొరేటర్లే. బల్దియా సమస్యలతో పాటు బడ్జెట్‌పై తొలి కౌన్సిల్‌ మీటింగ్‌ ఈ నెల చివరి వారంలో జరగనుంది.
మేయర్‌గా బొంతు రామ్మోహన్‌ 
66 ఏళ్ల గ్రేటర్‌ చరిత్రలో 26వ మేయర్‌గా చర్లపల్లి డివిజన్ నుంచి ఎన్నికైన బొంతు రామ్మోహన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్‌గా బోరబండ కార్పొరేటర్ బాబా ఫషియద్దీన్ ఎన్నికయ్యారు. మేయర్‌గా రామ్మోహన్‌ను వెంకటేశ్వరకాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ మన్నే కవిత ప్రతిపాధించగా మీర్‌పేట కార్పొరేటర్ అంజయ్య బలపర్చారు.
డిప్యూటీ మేయర్‌గా ఫసియుద్దీన్‌ 
డిప్యూటీ మేయర్‌గా ఫసియుద్దీన్‌ను అమీర్ పేట్‌ కార్పొరేటర్‌  శేషుకుమారి ప్రతిపాధించగా రామ్‌నగర్‌ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌ రెడ్డి బలపర్చారు. మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నికకు మద్దతు ఇస్తున్నట్టు కౌన్సిల్లో ఎంఐఎం ప్రకటించింది.   మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్‌ల‌కు ఎవ్వరూ పోటీప‌డ‌క‌పోవడంతో రామ్మోహ‌న్, ఫ‌సియుద్దీన్‌ ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు. అంతకు ముందు 150 మంది కార్పొరేటర్లతో ప్రిసైడింగ్‌ అధికారి రాహుల్‌ బొజ్జా.. ఎన్నిక పరిశీలకుడుగా వచ్చిన అశోక్ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. 109 మంది కోరం సభ్యులు హాజరు కావడంతో మేయర్...డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఏకగ్రీవం అయింది.
88 మందికి పైగా తొలిసారిగా ఎన్నిక
99 మంది టీఆర్ఎస్‌, 44 మంది మజ్లిస్‌ కార్పొరేటర్లతో పాటు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు కౌన్సిల్‌ హాల్‌లో హాజరయ్యారు. అయితే 150 మంది కార్పొరేటర్లలో 88 మందికి పైగా తొలిసారిగా ఎన్నికైన వారే. కార్పొరేటర్‌గా తమకు వచ్చిన అవకాశాన్ని ప్రజలకు మంచిచేసి సద్వినియోగం చేసుకుంటామని నూతన కార్పొరేటర్లు చెబుతున్నారు. 
కాంగ్రెస్ నుంచి ఇద్దరు
ఇక కాంగ్రెస్ నుంచి ఎన్నికైన నాచారం, పటాన్‌చెరు కార్పొరేటర్లు తాము ఇద్దరమే అయినా ప్రభుత్వం నుంచి తమ డివిజన్ల అభివృద్ధికి రావాల్సిన నిధులు రాబడుతామని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ఆలోచనే లేదంటున్నారు. గ్రేట‌ర్‌లో ప్రతిప‌క్షాలుగా ఉన్న బీజేపీ, టీడీపీ కార్పొరేటర్లు నగర స‌మ‌స్యల‌పై పోరాడుతామంటున్నారు.  
గన్ పార్కు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు
మరోవైపు గ్రేటర్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత పెద్దఎత్తున టీఆర్ఎస్‌ కార్యకర్తలంతా గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు.
సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా టీడీపీ కార్పొరేటర్‌ మందాడి శ్రీనివాసరావు
గ్రేటర్‌ కౌన్సిల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన కార్పొరేటర్లలో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు కేబీహెచ్‌బీ టీడీపీ కార్పొరేటర్‌ మందాడి శ్రీనివాస రావు. టీటీడీపీ నుంచి అధికార పార్టీలోకి వలసలు జోరుగా జరుగుతున్నా.. తాను మాత్రం పార్టీ మారనని డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అంటున్నారు. 
ప్రమాణ స్వీకార కార్యక్రమం.. తలసాని.. అంతా తానై 
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అంతా తానై వ్యవహరించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌. ఎక్స్ అఫిషియల్ సభ్యులను హజరు పరచడం దగ్గర నుంచి మేయర్ డిప్యూటి మేయర్ల ఎన్నిక తంతంగం వరకు ప్రొసీడింగ్ పనులను గులాబీ పార్టీ తరుపున నిర్వహించారు. 

 

08:11 - February 12, 2016

ఢిల్లీ : రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలుస్తారు. రానున్న బడ్జెట్‌లో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేంద్రాన్ని కోరనున్నారు. 
రెండు రోజుల పాటు పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆయన రాజధానిలో పర్యటిస్తారు. ఈ నెలాఖరును కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారు.శుక్రవారం మధ్యాహ్నం  ప్రధాని మోదీతో కేసీఆర్‌ సమావేశమవుతారు.  తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరు, వాటర్‌గ్రిడ్‌కు నిధులు మంజూరు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు జాతీయ హోదా, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి సహకారం తదితర అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. 
శనివారం కేంద్రమంత్రులతో భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్‌ శనివారం పలువురు కేంద్రమంత్రులను కలుస్తారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు రైల్వే మంత్రి సురేష్‌ప్రభులతో ముఖ్యమంత్రి విడివిడిగా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పట్టుకుని తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించానలి ఆర్థిక మంత్రిని కేసీఆర్‌ కోరనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలుపైనా అరుణ్‌జైట్లీతో చర్చించే అవకాశముంది. ఇక ప్రత్యేక హైకోర్టుపై హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కేసీఆర్‌ భేటీ అవుతారు. 
సురేష్‌ప్రభుతో భేటీకానున్న కేసీఆర్‌
రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టుల చర్చ
ఇక రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులపై రైల్వే మంత్రి సురేష్‌ప్రభుతో కేసీఆర్‌ చర్చిస్తారు. కొత్త లైన్ల ఏర్పాటు, కాజీపేట్‌ వ్యాగన్‌ ఫ్యాక్టరీ, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ తదితర అంశాలను ఆయన కేంద్రమంత్రి దృష్టికి తీసుకురానున్నారు. రానున్న రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా రైల్వే మంత్రిని కోరనున్నారు. 
 

08:06 - February 12, 2016

హైదరాబాద్  : అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ఆ సంస్థ చైర్మన్ వెంకటరామరావు, ఎండీ శేషునారాయణరావును ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను 8 గంటల పాటు విచారించారు. నేడు ఏలూరు కోర్టులో హాజరుపర్చనున్నామని పోలీసుల తెలిపారు. అగ్రిగోల్డ్‌ సంస్థల అధినేత అవ్వా వెంకట రామారావును సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అతనితోపాటు మేనేజింగ్‌ డైరెక్టర్‌ శేషునారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరులో నమోదైన కేసుకు సంబంధించి అరెస్టు చేసినట్లు సిఐడి అధికారులు తెలిపారు. 

రూ.22 వేల కోట్లు వసూలు..
అగ్రిగోల్డ్‌ ఏడు రాష్ట్రాల్లో సుమారు 40 లక్షల మంది నుండి రూ.22 వేల కోట్లు వసూలు చేసినట్లు అధికారులు నిర్థారించారు. అయితే డిపాజిట్లకు సంబంధించి గడువు తీరినప్పటికీ తమకు డబ్బులు ఇవ్వడం లేదని, పలువురు ఏజెంట్లు, బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదుల చేశారు. విచారణ అనంతరం విజయవాడ, ఏలూరు, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు తదితర నగరాల్లో కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో అగ్రిగోల్డ్‌ ఆస్తులు అమ్మి వారి బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించి ఆస్తుల అమ్మకానికి న్యాయవాదులను నియమించింది. అమ్మకంలో జాప్యం జరగడంతో హైకోర్టు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

నేడు విచారణ..
విచారణలోనూ సహకరించడం లేదని ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లను హెచ్చరించారు. ఇప్పటికి రెండు వాయిదాలతోపాటు ఆదేశించిన గడువు తీరిపోయినా ఆస్తులు అమ్మలేదు. నిరర్థకమైన, విలువలేని ఆస్తులను చూపిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన హైకోర్టు విచారణ అధికారులనూ హెచ్చరించింది. నేడు దీనిపై విచారణ జరగనుంది. ఒకవేళ సిఐడి దీనిపై తగు నిర్ణయం తీసుకోకపోతే సిబిఐకి అప్పగించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆస్తులు అమ్మలేకపోవడంతో ఛైర్మన్‌ను హైదరాబాద్‌ తీసుకెళ్లి విచారించారు. అనంతరం అరెస్టు చేశారు. నేడు ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతోపాటు మేనేజింగ్‌ డైరెక్టర్‌ శేషు నారాయణను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ సుమారు రూ.22 వేల కోట్ల వరకూ కుంభకోణం జరిగిందని అధికారులు నిర్థారించారు. బాధితులూ లక్షల సంఖ్యలో ఉన్నారు.

07:53 - February 12, 2016

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ కవి, రచయిత అరుణ్ సాగర్ హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్ లో ఆయన మృతి చెందారు. సాగర్ ప్రస్తుతం టీవీ5 సీఈవో గా పని చేస్తున్నారు. గతంలో టెన్ టివి సీఈవో గా పని చేశారు. ఆంధ్రజ్యోతిలో జర్నలిస్టుగా పని చేశారు. అరుణసాగర్ మృతి పట్ల సీఎం కేసీఆర్, ప్రొ.నాగేశ్వర్, టెన్ టివి ఎండీ వేణుగోపాల్, టెన్ టివి అసోసియేట్ ఎడిటర్ శ్రీధర్ బాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ప్రొ.నాగేశ్వర్...
అరుణ్ సాగర్ మృతి వార్త తీవ్ర దిగ్ర్భాంతి కలిగించింది. చాలా ఆవేదన కలిగించింది. సాగర్ కవి, రచయిత, జర్నలిస్టుగా పని చేశారు.  విద్యార్థి ఉద్యమాల పట్ల ఆయన ఆకర్షితడయ్యాడు. తెలుగు జర్నలిజంలో సృజనాత్మక రచనలు చేశారు. టీవీ స్క్రీన్ ఎలా ఉండాలని విజువలైజ్ చేయగలిగాడు. వివాదాస్పద విషయాలను నిర్మోహమాటంగా స్పందించేవాడు. 
రచనలు, కవితలు రాసేవరారు. ప్రమాణాలు కలిగిన,  సృజనాత్మక కలిగిన వ్యక్తిని కోల్పోయాం.
టెన్ టివి ఎండీ వేణుగోపాల్..
అరుణ్ సాగర్ మృతి చాలా దిగ్ర్భాంతి కలిగించింది. వ్యక్తిగతంగా సాగర్ నాకు మంచి మిత్రుడు. టెన్ టివి చానెల్ స్థాపనలో,  దానికి రూపం ఇవ్వడంలో ఆయన కృషి అమోఘం. మొహమాటం లేకుండా తన అభిప్రాయాలు చెప్పేవారు. నిక్కచ్చితనంగా ఉండేవాడు. మంచి మిత్రున్ని కోల్పోయాం. ఆయన మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము.

టెన్ టివి అసోసియేటెడ్ ఎడిటర్.. శ్రీధర్ బాబు... 
అరుణ్ సాగర్ మంచి కవి, మిత్రుడు.  జర్నలిస్టుగా మార్క్ వేసిన వ్యక్తి సాగర్. మంచి రచనలు, కవితలు రాసాడు.  

అరుణ్ సాగర్ మృతికి ప్రొ.నాగేశ్వర్ సంతాపం...

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ కవి, రచయిత అరుణ్ సాగర్ హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్ లో ఆయన మృతి చెందారు. అరుణసాగర్ మృతి పట్ల ప్రొ.నాగేశ్వర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

07:33 - February 12, 2016

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ కవి, రచయిత అరుణ్ సాగర్ హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్ లో ఆయన మృతి చెందారు. అరుణ్ సాగర్ ప్రస్తుతం టీవీ5 సీఈవో గా పని చేస్తున్నారు. గతంలో టెన్ టివి సీఈవో గా పని చేశారు. ఆంధ్రజ్యోతిలో జర్నలిస్టుగా పని చేశారు. సాగర్ మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అరుణసాగర్ మృతి పట్ల సీఎం కేసీఆర్,  ప్రొ.నాగేశ్వర్, టెన్ టివి ఎండీ వేణుగోపాల్, టెన్ టివి అసోసియేట్ ఎడిటర్ శ్రీధర్ బాబు సంతాపం ప్రకటించారు.  ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ప్రొ.నాగేశ్వర్...
అరుణ్ సాగర్ మృతి వార్త తీవ్ర దిగ్ర్భాంతి కలిగించింది. చాలా ఆవేదన కలిగించింది. సాగర్ కవి, రచయిత, జర్నలిస్టుగా పని చేశారు.  విద్యార్థి ఉద్యమాల పట్ల ఆయన ఆకర్షితడయ్యాడు. తెలుగు జర్నలిజంలో సృజనాత్మక రచనలు చేశారు. టీవీ స్క్రీన్ ఎలా ఉండాలని విజువలైజ్ చేయగలిగాడు. వివాదాస్పద విషయాలను నిర్మోహమాటంగా స్పందించేవాడు. రచనలు, కవితలు రాసేవరారు. ప్రమాణాలు కలిగిన,  సృజనాత్మక కలిగిన వ్యక్తిని కోల్పోయాం.

టెన్ టివి ఎండీ వేణుగోపాల్..

అరుణ్ సాగర్ మృతి చాలా దిగ్ర్భాంతి కలిగించింది. వ్యక్తిగతంగా సాగర్ నాకు మంచి మిత్రుడు. టెన్ టివి చానెల్ స్థాపనలో,  దానికి రూపం ఇవ్వడంలో ఆయన కృషి అమోఘం. మొహమాటం లేకుండా తన అభిప్రయాలు చెప్పేవారు. నిక్కచ్చితనంగా ఉండేవాడు. మంచి మిత్రున్ని కోల్పోయాం. ఆయన మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము.

టెన్ టివి అసోసియేటెడ్ ఎడిటర్.. శ్రీధర్ బాబు... 
అరుణ్ సాగర్ మంచి కవి, మిత్రుడు.  జర్నలిస్టుగా మార్క్ వేసిన వ్యక్తి సాగర్. మంచి రచనలు, కవితలు రాసాడు.  

అరుణసాగర్ మృతి పట్ల టెన్ టివి ఎండీ వేణుగోపాల్ సంతాపం

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ కవి అరుణ్ సాగర్ హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. అరుణసాగర్ మృతి పట్ల టెన్ టివి ఎండీ వేణుగోపాల్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

అరుణసాగర్ మృతి పట్ల తమ్మినేని వీరభద్రం సంతాపం

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ కవి అరుణ్ సాగర్ హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. అరుణసాగర్ మృతి పట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

సీనియర్ జర్నలిస్టు అరుణ్ సాగర్ హఠాన్మరణం..

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ కవి అరుణ్ సాగర్ హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. అరుణసాగర్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. 

Don't Miss