Activities calendar

13 February 2016

21:30 - February 13, 2016

హైదరాబాద్ : విశాఖ పట్నం వేదికగా...మొట్టమొదటి టీ-20 మ్యాచ్ కు రంగం సిద్ధమయ్యింది.స్టీల్ సిటీలోని ACA- VDCA స్టేడియం వేదికగా జరిగే సూపర్ సండే ఫైట్...టీ-20 టాప్ ర్యాంకర్ టీమిండియా, 3వ ర్యాంకర్ శ్రీలంకకు డూ ఆర్ డై గా మారింది. విశాఖ మ్యాచ్ నెగ్గినజట్టుకే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండడంతో..విజయమేలక్ష్యంగా రెండుజట్లూ పోటీకి దిగుతున్నాయి. ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ పోటీ ప్రారంభమవుతుంది.....

పూణే, రాంచీ నగరాల మీదుగా...స్టీల్ సిటీ.....

.టీ-20 ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ టీమిండియా, 3వ ర్యాంకర్ శ్రీలంకజట్ల మూడుమ్యాచ్ ల సిరీస్ షో...పూణే, రాంచీ నగరాల మీదుగా...స్టీల్ సిటీ విశాఖ నగరానికి చేరింది. ఇప్పటి వరకూ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లకు మాత్రమే ఆతిథ్యమిస్తూ వచ్చిన ఆంధ్రా క్రికెట్ సంఘం..విశాఖ వేదికగా తొలిసారిగా జరిగే ఆఖరి టీ-20 మ్యాచ్ కు విస్త్రుత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.

ఏసీఏ – విడిసిఏ స్టేడియంలో....

డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, మిడిలార్డర్ ఆటగాళ్ళు యువరాజ్ సింగ్, మహేంద్రసింగ్ ధోనీలకు...విశాఖ వేదికగా ఆడిన మ్యాచ్ ల్లో సెంచరీలు సాధించిన తీపిగుర్తులు ఉన్నాయి. దానికితోడు..27వేల సీటింగ్ సామర్థ్యంతో నిర్మించిన ACA- VDCA స్టేడియంలో జరిగే ఈ పోటీ కోసం 12వేల టికెట్లు మాత్రమే అభిమానులకు అందుబాటులో ఉంచారు. 300 రూపాయల నుంచి 3 వేల రూపాయల ధర వరకూ ఉన్న టికెట్లన్నీ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడు కావడంతో...ఇక మ్యాచ్ ప్రారంభమే తరువాయి అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది.

విశాఖ అభిమానులు సైతం..

విశాఖ అభిమానులు సైతం..మ్యాచ్ ప్రారంభానికి ముందే...టీమిండియా విజయం ఖాయమని ధీమాగా చెబుతున్నారు.

పూణే టీ-20లో భారత్ ఓటమి దురదృష్టకరమని..విశాఖ వేదికగా జరిగే మ్యాచ్ లో టీమిండియా విజయం ఖాయమని...మ్యాచ్ టికెట్ సొంతం చేసుకొన్న ఓ అభిమాని చెప్పాడు. విరాట్ కొహ్లీ.. సిరీస్ కు దూరంగా ఉండటం తనకు నిరాశ కలిగించిందని..అయితే రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ మరోసారి విశాఖలో రెచ్చిపోవాలని కోరుకొంటున్నట్లు మరో అభిమాని చెప్పాడు.

వన్డే పోటీల్లో టీమిండియాకు ఎదురేలేదని...

విశాఖలో ఇప్పటి వరకూ జరిగిన వన్డే పోటీల్లో టీమిండియాకు ఎదురేలేదని...సూపర్ సండే టీ-20 సమరంలోనూ ధోనీసేనదే విజయమని..ఓ అభిమాని అన్నాడు. ఇదిలాఉంటే...విశాఖ పిచ్ బ్యాటింగ్ కు ఎంతో అనువుగా ఉంటుందని..భారీస్కోరింగ్ మ్యాచ్ గా జరిగే అవకాశం ఉంటుందని ఏసీఏ - విడిసిఏ స్టేడియం క్యూరేటర్ నాగమల్లయ్య చెబుతున్నారు.

196 పరుగుల భారీస్కోరింగ్ సాధించిన తీరు చూస్తుంటే...

రాంచీలో ముగిసిన మ్యాచ్ లో టీమిండియా ఏకంగా 196 పరుగుల భారీస్కోరింగ్ సాధించిన తీరు చూస్తుంటే....విశాఖలోనూ అదేస్థాయి స్కోరు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే ..టీమిండియా ముందుగా బ్యాటింగ్ కు దిగితేనే భారీస్కోరు సాధ్యమయ్యే అవకాశం ఉంది.సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఆఖరి మ్యాచ్ లో అయినా...యువఆల్ రౌండర్ పవన్ నేగీకి..భారత టీమ్ మేనేజ్ మెంట్ అవకాశం ఇస్తుందా? లేదా అన్నదీ అనుమానమే.

శ్రీలంకతో పోల్చిచూస్తే...

శ్రీలంకతో పోల్చిచూస్తే...టీమిండియాజట్టే ఆట అన్నివిభాగాలలోనూ అత్యంత పటిష్టంగా, సమతూకంతో కనిపిస్తోంది. విశాఖ పిచ్ లో ఎలాంటి తేడా లేకుండా ఉంటే..పరుగుల మోత మోగడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీ కోసం...విశాఖ అభిమానులతో పాటు..దేశంలోని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

21:24 - February 13, 2016

ఢిల్లీ : జేఎన్‌యూలో విద్యార్థుల అరెస్ట్‌పై వామపక్షాలు నిరసిస్తున్నాయి. దేశ ద్రోహం పేరిట జెఎన్‌యుపై కేంద్రం దాడికి పాల్పడుతోందని ఆగ్రహించాయి. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న వీడియో ఫుటేజిపై అనుమానాలు వ్యక్తం చేసిన వామపక్షాలు- జెఎన్‌యూలో పోలీసుల జోక్యాన్ని తీవ్రంగా ఖండించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాల వ్యాప్తిలో భాగంగానే విద్యార్థులపై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డాయి. వామపక్ష విద్యార్థి సంస్థలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి.

జెఎన్‌యూ వివాదంపై కేంద్ర హోంమంత్రిని కలిసిన వామపక్ష నేతలు....

ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జేఎన్‌యూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్లమెంటు దాడి కేసులో దోషి అఫ్జల్ గురును ఉరితీయడానికి వ్యతిరేకంగా క్యాంపస్‌లో జరిగిన సమావేశం, అనంతరం జరిగిన పరిణామాలతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. జేఎన్‌యూలో విద్యార్థుల వివాదంపై వామపక్షాల నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, జెడియు నేత కేసీ త్యాగి తదితరులు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి చర్చించారు.

వీడియో పై ఏచూరి అనుమానాలు..

దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విద్యార్థులకు సంబంధించిన వీడియోపై సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వీడియోలో విద్యార్థులు నినాదాలు చేస్తున్నట్టు కనిపించడం లేదని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. జెఎన్‌యు క్యాంపస్‌లో సిసిటివి కెమెరాలే లేనపుడు ఎవరో తీసిన వీడియో క్లిప్పులకు ప్రామాణికత ఉండదన్నారు. వీటిని ఎవరు తీశారు? ఎందుకు తీశారన్నది రుజువు చేయాలని ఏచూరి సూచించారు.

విద్యార్థులను అరెస్ట్‌ చేసి విచారణ జరపడాన్ని తప్పు పట్టిన ఏచూరి,రాజా...

ఢిల్లీ పోలీసులు విద్యార్థులను అరెస్ట్‌ చేసి విచారణ జరపడాన్ని ఏచూరి, రాజా, త్యాగి తప్పు పట్టారు. అమాయక విద్యార్థులపై చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. జెఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఒక ఘటన ఆధారంగా జేఎన్‌యూపై ప్రభుత్వం దాడికి యత్నిస్తోందని విమర్శించారు.

ప్రస్తుతం జెఎన్‌యులో ఎమర్జెన్సీ....

ప్రస్తుతం జెఎన్‌యులో ఎమర్జెన్సీ కొనసాగుతోందని, మొత్తం యూనివర్సిటీకే దేశ ద్రోహాన్ని ఆపాదించడం సరికాదన్నారు. క్యాంపస్‌లోకి పోలీసులను విసి ఎలా అనుమతించారని ప్రశ్నించిన ఏచూరి- విసి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. అమాయకులపై చర్యలు తీసుకోబోమని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హామీ ఇచ్చారని ఏచూరి తెలిపారు.

తాజాగా మరో ఏడుగురు విద్యార్థులను అదుపులోకి...

ఇప్పటికే జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయాను అరెస్ట్‌ చేసిన పోలీసులు తాజాగా మరో ఏడుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కూడా దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న అభియోగాలు మోపారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరపనున్నారు. మరోవైపు జేఎన్‌యూలో జాతి వ్యతిరేక కార్యకలాపాలు వెంటనే ఆపకపోతే.. ఆ యూనివర్సిటీ తమకు ఇచ్చిన డిగ్రీలను తిరిగి ఇచ్చేస్తామని మాజీ సైనికులు హెచ్చరించారు.

అఫ్జల్ గురును ఉరితీయడానికి వ్యతిరేకంగా...

భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, స్మృతీ ఇరానీ ఇదివరకే స్పష్టం చేశారు. పార్లమెంటు దాడి కేసులో దోషి అఫ్జల్ గురును ఉరితీయడానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 9న జెఎన్‌యూలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొందరు భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంపై వివాదం రాజుకుంది. ఈ ఘటన నేపథ్యంలో జెఎన్‌యూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

21:20 - February 13, 2016

చిత్తూరు : ప్రియురాలిని ప్రియుడే హత్యచేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం అమిలేపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. నక్కలవారిపల్లికి చెందిన ఎంసీఏ చదివిన వేమనారాయణరెడ్డి పునుగు పల్లెకు చెందిన సబీహాను ప్రేమ పేరిట మోసం చేసి హత్యచేశాడు. బెంగళూరులో ఉద్యోగం చూశానని చెప్పి తనతో తీసుకెళ్లి.. ఆమెను హత్యచేసి తన స్వగృహమైన నక్కలవారిపల్లెలో పూడ్చి పెట్టాడు. తల్లి, చెల్లెలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.    

21:18 - February 13, 2016

ఖమ్మం : దోపిడీని యథేచ్ఛగా కొనసాగించేందుకే అధికార పార్టీ వలసలను ప్రోత్సహిస్తోందని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఎన్నికల్లో ధనప్రవాహం తీవ్రస్థాయికి చేరిందన్నారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమతో కలిసివచ్చే పార్టీలతో ఉమ్మడిగా పోటీ చేస్తామని తమ్మినేని ఖమ్మంలో తెలిపారు. 

20:09 - February 13, 2016

హైదరాబాద్ : సవ్వారీ ఎవ్వరిదీ... సల్లబడేది ఎవ్వరిదీ. నారాయణ ఖేడ్ ఆటల పోటీలు ఖతం, వ్యభిచారం కథ చెప్పిన సిపిఐ నారాయణ... రాజకీయానికి సరిగ్గా కలిసిన సూటీ, వ్యవసాయం చేయబోతున్న సర్కార్... కూరగాయల దుకాణాల మీద నజర్, తాత కోసం వెతుకులాడుతున్న మనుమడు.... ఢిల్లీలో కేసీఆర్.. సచివాలయంలో ఇమ్మాన్ష్, ముంబైలో దీక్షకు కూర్చున్న మోడీ వైఫ్, స్వచ్ఛా పేరుతో గుడిసెలు తీయొద్దని ఫైర్, పాడి మీద పండినంక లేసొచ్చిన శవం... సోసల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడయో ఇత్యాది అంశాలపై మల్లన్న ముచ్చట్ల కార్యక్రమంలో మల్లన్న చెప్పిన ఘరం ఘరం మసాల ముచ్చట్లను వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

జేఎన్ యూ వీసీకి ఢిల్లీ పోలీసుల లేఖ

ఢిల్లీ : జేఎన్ యూ వీసీకి ఢిల్లీ పోలీసులు లేఖ రాశారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడిన విద్యార్థుల వివరాలను ఇవ్వాలని పోలీసులు కోరారు. 124ఎ/34 సెక్షన్ కింద ఢిల్లీ పోలీసులు విచారించేందుకు రంగం సిద్ధమైంది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ఉమర్ ఖలీద్, కన్నయ్య, అశితోష్ కుమార్, అనిర్భన్ భట్టాచార్య, రామనాగ, అనంత ప్రకాశ్ పై పోలీసులు అభియోగాలు నమోదు చేసినట్లు సమాచారం.

ఏపీలో 8 ఈఎస్ఐ ఆస్పత్రులు : దత్తాత్రేయ

తిరుపతి: ఈఎస్ఐ ఆస్పత్రిని కేంద్రమంత్రి దత్తాత్రేయ సందర్శించారు. ఆస్పత్రిలో అదనపు భవనాల నిర్మాణాన్ని జూన్‌లోగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో చెల్లుబాటయ్యేలా ఈఎస్‌ఐ స్మార్ట్‌కార్డులను త్వరలో ప్రవేశపెడతామని తెలిపారు. వ్యాధి నిర్థారణ పరీక్షల వివరాలను ఆన్‌లైన్‌లో పెడతామన్నారు. కర్నూలు, కడపలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీలో త్వరలో ఎనిమిది ఈఎస్‌ఐ ఆస్పత్రులను నిర్మిస్తామని దత్తాత్రేయ తెలిపారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలుగా సాయం చేస్తోందని ఆయన చెప్పారు.

19:39 - February 13, 2016

రంగారెడ్డి : కార్పొరేట్‌ సంస్థల అడుగులకు మడుగులు ఒత్తే కొందరు అధికారుల తకరారు వ్యవహారం.. రైతులకు ఉపాధిని దూరం చేసింది. రెవిన్యూ అధికారుల జిమ్మిక్కుతో.. సుమారు 250 రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తమ స్వాధీనంలోని పొలాలను లాక్కొని జీవనోపాధిని దూరం చేయవద్దన్న ఈ కుటుంబాల అభ్యర్థన పాలకుల చెవికెక్కడం లేదు. పైగా రెవిన్యూ రికార్డులకు వక్రభాష్యం చెబుతూ.. బాధితులకు పరిహారం కూడా దక్కకుండా చేస్తున్నారు. దీంతో న్యాయం కోసం బాధిత రైతులు... మూడు వారాలుగా ఉద్యమబాటన సాగుతూనే ఉన్నారు.

250 రైతు కుటుంబాలకు పిడుగుపాటులా.....

వేలాది ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలన్న సర్కారు నిర్ణయం.. 250 రైతు కుటుంబాలకు పిడుగుపాటులా మారింది. పాతికేళ్లుగా ఉపాధిని కల్పిస్తున్న భూములపై తమ హక్కును... ప్రభుత్వం బలవంతంగా లాక్కునే కుతంత్రం చేస్తుంటే ఈ రైతులు తల్లడిల్లిపోతున్నారు. పైగా వీరి భూములకు పరిహారమూ ఇవ్వకుండా అధికారులు చేస్తున్న మాయాజాలం ఈ 250 రైతు కుటుంబాలను రోడ్డు పాల్జేస్తోంది.

కందుకూరు మండలం ముచ్చర్లలో.. 12వేల ఎకరాల్లో.....

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో.. 12వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిటీ కోసం సేకరించే భూములకు సంబంధించి... రైతులందరికీ పరిహారం చెల్లించడంతో పాటు.. అర్హతలను బట్టి.. ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలూ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రకటన.. సహజంగానే స్థానిక బడుగు, బలహీన వర్గాల రైతులు, తండా వాసుల్లో ఆశలను రేకెత్తించింది. అయితే.. క్రమంగా ప్రభుత్వాధికారుల కుట్రపూరిత ధోరణి వెల్లడి కావడంతో.. ఈ ప్రాంత రైతులు, ఇతర వృత్తుల వారూ హతాశులయ్యారు.

ప్రతిపాదిత ఫార్మాసిటీ కోసం..

ప్రతిపాదిత ఫార్మాసిటీ కోసం.. ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, ఉట్లపల్లి ప్రాంతాల రైతుల పొలాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. కొందరికి నష్టపరిహారాన్నీ ప్రకటించారు. అయితే.. ఈ పరిహారం జాబితాలో.. పొలాలు కోల్పోయే 250 మంది రైతులకు చోటు కల్పించలేదు. ఇదేమి అన్యాయం అని ప్రశ్నిస్తే.. వీరి హక్కుభుక్తంలో ఉన్న భూములు గుట్టలని.. అవి ఎవరి ఆధీనంలోనూ లేవని అధికారులు తేల్చారు. అధికారుల నివేదిక 250 రైతు కుటుంబాలపై పిడుగు పడినట్లయింది.

1992లో అప్పటి ప్రభుత్వం ముచ్చర్ల....

1992లో అప్పటి ప్రభుత్వం ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, ఉట్లపల్లి ప్రాంతాల్లోని భూములు లేని వారికి.. పట్టాలు మంజూరు చేసింది. ప్రతి కుటుంబానికీ ఎకరా చొప్పున కేటాయించింది. సర్కారు ఇచ్చిన భూముల నిండా రాళ్లూ రప్పలే. పైగా ఇక్కడ సాగునీరూ అందుబాటులో లేదు. దీంతో సేద్యం కన్నా... అక్కడి చెట్ల నుంచి లభించే ఫలసాయంపైనే ఈ రైతులు ఆధారపడ్డారు. చెట్లనుంచి ఫలసాయాన్ని సేకరించి.. సమీపంలోని హైదరాబాద్‌లో విక్రయించి ఉపాధిని పొందేవారు. లాది ఎకరాల్లో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ రైతులను పూర్తిగా విస్మరించింది. స్థానిక రెవిన్యూ అధికారులు కూడా.. ఈ రైతులకు నష్టపరిహారాన్ని ఎగవేసేలా నివేదికలు రూపొందించారు.

250 మంది నుంచి సేకరించ తలచిన భూములకు....

ప్రభుత్వం 250 మంది నుంచి సేకరించ తలచిన భూములకు సంబంధించిన పహాణీలు కూడా రైతుల వద్ద ఉన్నాయి. అంతేకాదు.. వీటిపై బ్యాంకుల నుంచి రుణాలూ తీసుకున్నారు. కొందరికి రుణమాఫీ పథకమూ వర్తించింది. ఇన్ని ఆధారాలున్నా అధికారులు ఈ భూములు ఎవరి హక్కుభుక్తమూ కాదని తప్పుడు నివేదికలు సమర్పించారు. దీంతో సుమారు పాతికేళ్లుగా గుట్టల మధ్య సాగు చేసుకుంటూ.. చెట్లకు కాసిన పండ్లను అమ్ముకుంటున్న రైతులు రోడ్డున పడ్డారు.

ముచ్చర్ల ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనతో..

ముచ్చర్ల ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనతో.. భూములు కోల్పోతున్న రైతులు.. ముఖ్యంగా పరిహారం దక్కని రైతులు.. ఉద్యమబాటన సాగుతున్నారు. రోజూ తెల్లవారకముందే.. తమ పొలాలకు చేరుకుంటున్నారు. సరిహద్దు గోడలు నిర్మించేందుకు వచ్చే జేసీబీలను, ఇతర కూలీలను అడ్డుకుంటున్నారు. 251 ఎకరాల్లో ఎక్కడ జేసీబీ వచ్చినా రైతులంతా కలసి కట్టుగా అక్కడికి చేరుకుని జేసీబీకి అడ్డుగా బైఠాయిస్తున్నారు. సాయంత్రం తిరిగి ఇళ్లకు వెళుతున్నారు.

శాంతియుతంగా పోరాడుతున్న రైతులపై పోలీసులు....

తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న రైతులపై పోలీసులు తరచూ విరుచుకుపడుతున్నారు. చాలా సందర్భాంల్లో లాఠీలతో చితకబాది తరిమేయాలని చూశారు. పోలీసుల కర్కశపు దెబ్బలు భరించారేగానీ.. రైతులు తమ భూములను వదిలి అంగుళం కూడా జరగలేదు. సుమారు నెల రోజులుగా.. ఫార్మాసిటీ ప్రాంతంలో తరచూ.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

ఎకరాకు 8 లక్షల రూపాయలు....

ఫార్మాసిటీ ప్రతిపాదిత స్థలంలోని రైతులకు ఎకరాకు 8 లక్షల రూపాయలు చెల్లించారు. తమకూ అంతే మొత్తాన్ని ఇచ్చి.. భూములను తీసుకోవాలని.. లేకుంటే ఉపాధిని కల్పించే తమ భూములను వదిలేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. బలవంతం చేస్తే తమ ప్రాణాలైనా త్యాగం చేస్తాము తప్ప.. సర్కారీ ఒత్తిళ్లకు తలొగ్గబోమని స్పష్టం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయల ఖర్చుతో.. ఫార్మా సిటీని నిర్మిస్తున్న ప్రభుత్వం.. నిరుపేద రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా కుయుక్తులు పన్నడం ఎంతవరకు సమంజసమని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. నిరుపేదలకు భూములు పంచుతామని ప్రగల్బాలు పలుకుతున్న ప్రభుత్వం.. గతంలో పంచిన భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా.. వాటిని లాక్కోవాలనుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఈ 250 మంది రైతుల సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

19:33 - February 13, 2016

విజయవాడ: సోలార్‌ విద్యుత్‌ వినియోగం ఆవశ్యకతపై.. సోల్‌టెక్‌ సంస్థ విజయవాడలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. బీసీ రుణమేల శిబిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో సోలార్‌ విద్యుత్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసి.. సందర్శకులకు వాటి పనితీరును వివరించారు. రాబోయే కాలంలో ప్రజలందరికీ సోలార్‌ విద్యుత్తే అత్యంత కీలకంగా మారనుందని, గృహావసరాలతో పాటు.. పొలాల్లో రైతులూ సోలార్‌ విద్యుత్‌ను వినియోగించుకోవచ్చని సోల్‌టెక్‌ సంస్థ ప్రతినిధులు చెప్పారు. సోలార్‌ ప్యానెల్స్‌ వినియోగం కోసం ప్రభుత్వం అందించే సబ్సిడీల వివరాలనూ ప్రజలకు వివరించారు. 

19:32 - February 13, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు మరోసారి కేంద్రం చేతిలో దగాపడ్డాయి.. కరువు, రైతు ఆత్మహత్యలతో అల్లాడుతున్నా.. కేంద్రం మాత్రం కనికరం చూపడం లేదు. ఆదుకోండి అని దీనంగా వేడుకున్నా స్పందించడం లేదు. కేంద్రం ప్రదర్శించిన పిసినారితనం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై మోడీ సర్కార్ వివక్షను సూచిస్తోంది.

తెలుగు రాష్ట్రాలపై కేంద్రం శీతకన్ను ......

మోడీ సర్కార్ తీరు.. తెలుగు రైతుల పాలిట శాపంగా మారబోతోంది.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కరువు వెంటాడుతున్నా.. నిధుల విడుదలలో కేంద్రం మొండి చేయి చూపింది. అయితే ఇదే మోదీ సర్కార్‌... బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌పై వరాల జల్లు కురిపించింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో 2 వేల కోట్లు కేటాయించాలని ఏపీ, 2వేల 601 కోట్లు కేటాయించాలని తెలంగాణ విజ్ఞప్తి చేశాయి. అయితే కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు 433 కోట్లు, తెలంగాణకు 791 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది.

కరువుసాయంలో భారీగా కోతలు .....

కరవు సాయంగా కోరిన మొత్తంలో కనీసం 20శాతమైనా ఇచ్చిందని రెండు రాష్ట్రాలూ నిట్టూరుస్తున్నంతలోనే.. కేంద్రం మనసు మార్చుకుంది. జాతీయ విపత్తు సహాయ నిధిలో డబ్బులు లేవంటూ.. తెలంగాణకు 56 కోట్లు, ఏపీకి 34 కోట్ల సాయం ప్రకటించింది. దీంతో ఇరు రాష్ట్రాలూ కంగుతిన్నాయి. అన్నదాతను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి... చిల్లర విదిల్చిన కేంద్రం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెైతులకు కరువు సాయం పెంచి ఆదుకోవాలని అత్యున్నత న్యాయస్థానం చేసిన ఆదేశాలనూ.. తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్రం బేఖాతరు చేసింది. యూపీ కూడా ఇదే తరహా అన్యాయానికి గురయ్యింది...

మధ్య ప్రదేశ్‌పై కేంద్రం ఉదారత.....

కేంద్రం ప్రకటించిన కరవు సాయం జాబితా పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. రైతు ఆత్మహత్యలు, కరువు విషయంలో తెలుగు రాష్ట్రాల కన్నా తీవ్రత తక్కువగా ఉన్నా.. మధ్యప్రదేశ్‌కు 14 వందల 81 కోట్ల రూపాయలు కేటాయించింది.. కానీ దేశంలో కరువు, అన్నదాతల బలవన్మరణాలు ఎక్కువగా నమోదవుతున్న తెలంగాణ, ఏపీలకు సాయంపై మాత్రం కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరిచింది. రైతుల బలవన్మరణాలను నివారించేందుకు ప్రతిపాదించిన ఇన్ పుట్ సబ్సిడీపై కూడా కేంద్రం ఆశించిన స్థాయిలో స్పందించలేదు.

కేంద్రం తీరుపై రైతు సంఘాల కన్నెర్ర.....

ఎన్డీఆర్‌ఎఫ్ నిధులు విరివిగా లభ్యమైతేనే తెలుగు రాష్ట్రాలకు సాయమందిస్తామని కేంద్రం చెబుతోంది.. నిజంగానే సాయం చేయాలన్న మనసుంటే.. కేంద్రానికి నిధుల కొరత సమస్యే కాదు. దాటవేతకు ఇదో సాకని రైతు సంఘాల నాయకులు పెదవివిరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ అంశాన్నే ప్రధాన ఎజెండాగా చేసుకుని కేంద్రంపై పోరాడాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

19:28 - February 13, 2016

మెదక్‌ : నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 286 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ ఎన్నికలో అత్యధికంగా 80 శాతం మేర పోలింగ్ నమోదైంది. గతంకంటే పోలింగ్ పర్సంటేజీ పెరిగిందని అధికారులు తెలిపారు. ఓటింగ్‌ గడువు సాయంత్రం 5 గంటలకే ముగిసినా అప్పటికే క్యూలైన్లో ఉన్న అందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. ఎలక్షన్ ప్రశాంతంగా ముగియడంతో మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ పార్టీలు, ప్రజలు, పోలీస్ సిబ్బంది, అధికారులకు కృతజ్ఙతలు తెలిపారు. ఈ నెల 16న కౌంటింగ్ జరగనుంది.  

19:25 - February 13, 2016

అనంతపురం : హిందూపురంలో డిగ్రీ విద్యార్థినిపై గుర్తు తెలియని యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతూ కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుండగా గౌసియా అనే విద్యార్థినిపై దుండగుడు యాసిడ్ చల్లి పరారయ్యాడు. ఈ ఘటనలో గౌసియా భుజంపై స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ గౌసియాను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

హిందూపూర్ లో విద్యార్థిని పై యాసిడ్ దాడి

అనంతపురం : హిందూపూర్ లో డిగ్రీ విద్యార్థిని గౌస్య పై యాసిడ్ దాడి జరిగింది. కాలేజి నుండి ఇంటికి వెళుతుండగా వెనుక నుండి వచ్చి యాసిడి చల్లిన దుండగుడు పరారయ్యాడు. ఈ ఘటనలో గౌస్య భుజం పై స్వల్ప గాయం అయ్యింది. ఈ ఘటనతో బాధితురాలు షాక్ గురయినట్లు తెలుస్తోంది.

19:01 - February 13, 2016

చిత్తూరు : తిరుపతిలో బీసీ నేత రామచంద్రయ్య ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అరెస్ట్ సమయంలో.. ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అడ్డుకొని.. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని రామచంద్రయ్య నిరసిస్తూ ఆమరణ దీక్ష చేపట్టారు. 

18:58 - February 13, 2016

అనంతపురం : హిందూపురంలో విశ్వశాంతికోసం నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు.. ఎంజీఎం పాఠశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది.. యాగంలో పాల్గొనేందుకు వచ్చిన బాలయ్యకు మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు పూజారులు.. 

18:57 - February 13, 2016

తూర్పుగోదావరి : జిల్లా అల్లవరం మండల ప్రాంతాలైన దేవర్లంక వాసులు ఓఎన్జీసీ కి నిరసనగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది. ధ్వని కాలుష్యంతో ఇళ్లకు పగుళ్లు రావడంపై ఎంపీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఓఎన్జీసీ గెయిల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దెబ్బతిన్న 146 ఇళ్లు నిర్మిస్తామని గెయిల్ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారు. గ్రామాభివృద్దికి పలు కార్యక్రమాలు చేపడతామని కూడా తెలిపారు.

18:55 - February 13, 2016

పశ్చిమ గోదావరి : జిల్లాలోని తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీని వెంటనే ఆపాలని కోరుతూ మొగళ్తూరు రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు. గోదావరి ఆక్వాఫుడ్ నిర్మాణ ఆలోచనను విరమించుకోవాలని, లేకపోతే మరోసారి రైతులతో ఫ్యాక్టరీని ముట్టడిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చిరించారు. కేరళలో ఫుడ్ ఫ్యాక్టరీల నిర్మాణాలను మూసివేస్తుంటే ఏపీ మాత్రం పర్మిషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

18:53 - February 13, 2016

విజయవాడ: వైసీపీ కి చెందిన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మరోసారి భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ముస్లింలకు చట్టబద్ధత ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చంద్రబాబుకు వినతిపత్రం అందజేశానన్నారు. 2016-17 వార్షిక బడ్జెట్‌లో ముస్లింలకు దామాషా ప్రకారం...బడ్జెట్ కేటాయించాలని కోరినట్టు జలీల్ ఖాన్ తెలిపారు. తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు. 

18:51 - February 13, 2016

విశాఖ : శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్ కు విశాఖ నగరం సిద్ధమైంది. స్టీల్ సిటీలోని ఏసీఏ- విడిసిఏ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే టికెట్లన్ని సేల్ కాగా.. ఇరు జట్లు కొద్దిసేపటి క్రితం విశాఖ చేరుకున్నాయి. మ్యాచ్‌ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన పోలీసులు... స్టేడియంను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇరు జట్లకు కీలకంగా మారిన ఈ మ్యాచ్ రేపు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

జేఎన్ మూ విద్యార్థులకు మద్దతు తెలిపిన రాహుల్, ఏచూరి, రాజా

ఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థుల ఆందోళనలకు రాహుల్ గాంధీ, సీతారం ఏచూరి, డి. రాజా మద్దతు తెలిపారు. జేఎన్ మూలో రాహుల్ కు నల్లజెండాలతో ఏబీవీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.

పాడేరు మండలం చిలుకలూరి పేటలో విషాదం

విశాఖ : పాడేరు మండలం చిలుకలూరి పేటలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెప్తున్నారు.

బీసీ నేత రామచంద్రయ్య ఆమరణ దీక్ష భగ్నం

తిరుపతి : కాపులను బీసీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ బీసీ నేత రామచంద్రయ్య ఆమరణ దీక్ష ను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. అరెస్టు సందర్భంగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని అన్నా రామచంద్రయ్య ఆత్మహత్యాయత్నం చేయగా అడ్డుకుని రామచంద్రయ్యను పోలీసులు అరెస్టు చేశారు.

గవర్నర్ ను కలిసిన మేయర్, డిప్యూటీ మేయర్

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌ను మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కలిశారు. ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. గవర్నర్‌కు పుష్పగుచ్చానికి బదులు మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్‌కు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ మహా నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చి దిద్దాలని సూచించారు. కాగా, మొన్న జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో జరిగిన కార్పొరేటర్ల సమావేశంలో బొంతు రామ్మోహన్‌ను మేయర్‌గా, ఫసియుద్దీన్‌ను డిప్యూటీ మేయర్‌గా కార్పొరేటర్లు ఎన్నుకున్న విషయం తెలిసిందే. నిన్న మేయర్‌గా రామ్మోహన్ బాధ్యతలు స్వీకరించారు.

ఉప ఎన్నికలో 82.75 శాతం పోలింగ్ : కలెక్టర్

మెదక్: నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 82.75 శాతం పోలింగ్ నమోదైనట్టు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ వెల్లడించారు. గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ నమోదైనట్టు పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన వివరాలు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు పేర్కొన్నారు. రాత్రి 9 గంటల కల్లా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి భద్ర పరుస్తామన్నారు. ఈనెల 16న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

పిచ్చి కుక్కుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు..

ఆదిలాబాద్ : పిచ్చికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం ఆదిల్‌పేటలో చోటుచేసుకుంది. సాయంత్రం ఇంటిముందు ఆడుకుంటున్న యశ్వానంద్‌పై నాలుగు పిచ్చికుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడి కుడి చెవి, పెదవులను కుక్కలు పూర్తిగా కొరికేశాయి. స్పందించిన స్థానికులు బాలుడిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

17:51 - February 13, 2016

హైదరాబాద్ : అబిడ్స్ పోలీస్ స్టేషన్‌ను ఆస్ట్రేలియా పోలీస్ బృందం సందర్శించింది. పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు.. ఇటీవలే అబిడ్స్ పీఎస్‌ను ఆధునీకరించారు. వీటిని ఇవాళ ఆస్ట్రేలియా పోలీస్ అధికారుల బృందం సందర్శించింది. కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరుతో పాటు పోలీస్ కొత్త వాహనాలను వారు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, నూతన వాహనాల్లో టెక్నాలజీ వినియోగం, సత్వర కేసుల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలు చూసి.. ఆస్ట్రేలియా పోలీసులు సంతృప్తి వ్యక్తం చేశారు. 

17:49 - February 13, 2016

హైదరాబాద్ : పాలమూరు జిల్లా కల్వకుర్తిలో వాటర్ గ్రిడ్ పనులను ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ వాటర్ గ్రిడ్ పథకం పనులను వేగవంతం చేయాలని.. జిల్లా ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ లను స్మితా సబర్వాల్ ఆదేశించారు.

మేడారం జాతరకు ఏర్పాట్లు : మంత్రి చందూలాల్

హైదరాబాద్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ మంత్రి చందూలాల్‌ తెలిపారు. ముఖ్యమంత్రి సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జాతరకు సుమారు 1.80కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. భక్తుల కోసం రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

17:31 - February 13, 2016

మెదక్ : నారాయణఖేడ్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 5 గంటల వరకు క్యూలో ఉన్నవారికి పోలింగ్ సిబ్బంది ఓటు వేసేందుకు అవకాశం అనుమతిచ్చారు. ఇప్పటివరకు 78 శాతం పోలింగ్ నమోదైందని చెబుతున్నారు. అయితే పోలింగ్ పూర్తి వివరాలను ఈసీ మరికాసేపట్లో ప్రకటించనుంది. ఈ నెల 16న ఖేడ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే.

యూపీలో జర్నలిస్టు కాల్చివేత...

హైదరాబాద్ : గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో ఓ జర్నలిస్టు దారుణహత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోసాయ్‌గంజ్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కట్కా బజార్ ప్రాంతంలో కరుణ్ మిశ్రా(28) అనే జర్నలిస్టుపై మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన కరుణ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ ఆయన మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రశాంతగా ముగిన ఖేడ్ పోలింగ్‌

మెదక్ : నారాయఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 78 శాతం పోలింగ్ నమోదయ్యింది. సాయంత్రం 5 గంటల వరకు లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు ఈసీ తెలిపింది. ఈనెల 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఆయుష్ విభాగంలో 391 పోస్టుల భర్తీకీ మార్గదర్శకాలు..

హైదరాబాద్ :జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ కింద ఆయుష్‌ విభాగంలో 391 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. మొదటి ఏడాది కాలానికి ఒప్పంద పద్ధతిన తర్వాత అవసరాలకు అనుగుణంగా కొనసాగించే విధానంలో నియామకాలు చేపట్టనున్నారు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన అధికారుల కమిటీ ఎంపికలు చేపడుతుంది. అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, అనుభవం, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 391 పోస్టుల్లో 183 మెడికల్‌ అధికారులు, 147 కాంపౌండర్‌, యోగ బోధకులు, 55 స్వీపర్‌ కమ్‌ నర్సింగ్‌ పోస్టులున్నాయి.

మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన కన్నుమూత..

ఖమ్మం : అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మిత్రసేన తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో గత నెల 28న మిత్రసేన నిమ్స్‌లో చేరారు. 2009 నుంచి 2014 వరకు అశ్వారావుపేట ఎమ్మెల్యేగా మిత్రసేన సేవలందించారు. 2009లో కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రసేన విజయం సాధించారు. మిత్రసేన స్వస్థలం అశ్వారావుపేట మండలం సున్నంబట్టి గ్రామం. మిత్రసేన మృతితో సున్నంబట్టిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మిత్రసేన కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

తిరుమలగిరి హెచ్ డీఎఫ్ సీ ఏటీఎంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ : తిరుమలగిరి హెచ్ డీఎఫ్ సీ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

16:56 - February 13, 2016

హైదరాబాద్ : దేవాదుల ప్రాజెక్టు పునరాకృతి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. దేవాదుల ఎత్తిపోత పనుల పురోగతిపై మంత్రి ఈరోజు సమీక్ష చేపట్టారు. రెండో దశలోని రెండు, మూడు ప్యాకేజీల పనుల పురోగతిపై కాంట్రాక్టర్లు, ఇంజినీర్లతో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు సూచనలతో ముందుకెళ్లి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వరద కాలువ ద్వారా జనగాం, పాలకుర్తి నియోజకవర్గాలకు నీరందించే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది.

16:55 - February 13, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ పలు అవకతవకలకు పాల్పడిందని దానిపై న్యాయ పోరాటం చేస్తామని టి కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ హైదరాబాద్‌లో అన్నారు. రాబోయే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లోనైనా అక్రమాలు జరగకుండా అడ్డుకోవాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరారు.

16:53 - February 13, 2016

హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణ చేసే ఆలోచనలేదని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అనడం దారుణమన్నారు మందకృష్ణ మాదిగ. ఎంఆర్పీఎస్ వెనక జగన్ ఉన్నారని అన్న వ్యాఖ్యలను మందకృష్ణ ఖండించారు. కాపులను బీసీల్లో చేర్చే విషయంలో 70 కేసుల్లో నిందితుడిగా ఉన్న ముద్రగడను అరెస్టు చేసే దమ్ము ప్రభుత్వానికి.. పుల్లారావుకు ఉందా అని ప్రశ్నించారు. SC వర్గీకరణ విషయంలో టిడిపి కి చిత్తశుద్దిలేదన్నారు మందకృష్ణ. ఏప్రిల్ 30 న విజయవాడలో 10 లక్షల మందితో భారీ సభను నిర్వహిస్తామన్నారు మందకృష్ణ.   

16:50 - February 13, 2016

హైదరాబాద్ : బీడీ కంపెనీలను మూసివేసే నిర్ణయాన్ని యజమానులు ఉపసంహరించుకోవాలని CITU డిమాండ్ చేసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. తెలంగాణలో 7 లక్షల మంది ఉపాధి కోల్పోవడంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. కంపెనీల మూసివేత నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 15న RDO కార్యాలయాల ఎదుట ధర్నాలు, 16న మండల కేంద్రాల్లో దిష్టి బొమ్మదహనం చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం వెంటనే బీడీ కార్మికుల సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలన్నారు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్. 

16:49 - February 13, 2016

హైదరాబాద్ : బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసిస్తూ మార్చి 2న పార్లమెంట్ ముట్టడించనున్నామని సిఐటియు ప్రకటించింది. ఈ ఆందోళన కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్నటు వంటి బ్యాంక్ యూనియన్లు పాల్గొనాలని సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడం వలన అవి నిర్వీర్యం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

 

16:47 - February 13, 2016

విజయవాడ : ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు, విద్యార్థినీ విద్యార్థులు తరలివస్తున్నారు. దీంతో ప్రధాన క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. రధ పంచమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన మహా సరస్వతియాగంలో విద్యార్థులు అత్యధికంగా పాల్గొంటున్నారు. ఇంద్రకీలాద్రి పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. 

16:45 - February 13, 2016

హైదరాబాద్ : రాజకీయాల్లో శాశ్వత శతృత్వం అంటూ ఏదీ ఉండదు. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న కాంగ్రెస్, డీఎంకే పార్టీలు మళ్లీ జత కట్టాయి. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య పొత్తు కుదిరిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ చెన్నైలో ప్రకటించారు. డీఎంకే అధినేత కరుణానిధి ఇంట్లో కాంగ్రెస్‌ నేతలు గులాంనబీ అజాద్‌, ముకుల్‌ వాస్నిక్‌ భేటీ అయ్యారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పొత్తు అంశంపై ఇరు పార్టీన నేతలు ఓ అవగాహనకు వచ్చారు. 2013 తర్వాత మళ్లీ డీఎంకేతో కలిసి కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. కాంగ్రెస్‌ తమకు పూర్తి సహకారమందిస్తామని చెప్పినట్టు ఆ పార్టీ కోశాధికారి ఎంకె స్టాలిన్‌ చెప్పారు. సీట్ల సర్దుబాటుపై మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు.

16:43 - February 13, 2016

ఢిల్లీ : పాకిస్థాన్‌కు ఎనిమిది ఎఫ్-16 జెట్‌ యుద్ధ విమానాలను అమ్మాలని అమెరికా నిర్ణయించింది. వీటి విలువ దాదాపు 4 వేల 770 కోట్లు. అమెరికా విదేశాంగ శాఖ ఈ అమ్మకానికి ఆమోదం తెలిపిందని పెంటగాన్ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది. అమెరికా చర్యను భారత్ తీవ్రంగా పరిగణించింది. భారత విదేశాంగ కార్యదర్శి జయశంకర్‌ అమెరికా రాయబారి రిచర్డ్ వర్మను పిలిపించి తమ నిరసన వ్యక్తం చేశారు. అమెరికా తన వైఖరిని పునః సమీక్షించుకోవాలని భారత్‌ అభిప్రాయపడింది. ఉగ్రవాదంపై పోరాడేందుకు, చొరబాట్లను ఎదుర్కొనేందుకు ఈ యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు ఇవ్వడం సమంజసమేనని అమెరికా తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది.

వైద్య, ఆరోగ్యశాఖపై చంద్రబాబు సమీక్ష...

విజయవాడ : వైద్య, ఆరోగ్య శాఖపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆ శాఖ అధికారులు హాజరయ్యారు.

విశాఖ కు చేరుకున్న భారత్, శ్రీలంక జట్లు...

విశాఖపట్నం: టీ20 ఫైనల్‌కు వేదిక అయిన విశాఖకు భారత్, శ్రీలంక జట్లు చేరుకున్నాయి. మూడు టీ20 సీరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరుజట్లకు ఆదివారం జరిగే మ్యాచ్ కీలకమైంది. భారత్ మెదటి ర్యాంక్ నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలిచితీరాలి. ఒక వేళ భారత్ ఓటమిపాలైతే ర్యాంకింగ్‌లో 8వ స్థానానికి పడిపోవడం జరుగుతుంది. విశాఖ స్టేడియంలో కెప్టెన్ ధోనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పవచ్చు.

15:46 - February 13, 2016

హైదరాబాద్ : ఢిల్లీ జెఎన్ యూ లో విద్యార్థుల అరెస్టును నిరసిస్తూ.. ఓయూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అయితే విద్యార్థులను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకోవటంతో... ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. వివరాల్లోకి వెళితే...ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లో రాజుకున్న ఘర్ణణల సెగ హైదరాబాదులోని ఉస్మానియా వర్సిటీ (ఓయూ)ని తాకింది. భారత పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురుకు అనుకూలంగా ఓ విద్యార్థి సంఘం ర్యాలీ, దానిని వ్యతిరేకిస్తూ మరో విద్యార్థి సంఘం నిరసన... వెరసి జేఎన్ యూ భగ్గుమంది. దీనిపై స్పందించిన ఢిల్లీ పోలీసులు అఫ్జల్ గురుకు అనుకూలంగా, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విద్యార్థిని అరెస్ట్ చేశారు. దీనిని నిరసిస్తూ ఉస్మానియా వర్సిటీలో కొద్దిసేపటి క్రితం ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ఐ, పిడిఎస్ యూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న ఏబీవీపీ విద్యార్థులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

15:42 - February 13, 2016

మెదక్ : నారాయణ్‌ఖేడ్‌లో ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసేందుకు వస్తున్నారు. 2 గంటల వరకు 58 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు పోలింగ్ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ హరిసింగ్ గుండెపోటుతో మృతిచెందాడు. 

డీఎంకేతో కలిసి పోటీ చేస్తాం : ఆజాద్

హైదరాబాద్ : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి పోటీచేయనున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. డీఎంకే చీఫ్ కరుణానిధితో ఆయన నివాసంలో సమావేశమైన అనంతరం ఆజాద్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ‘‘తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తాయి. డీఎంకే సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యం’’ అని ఆజాద్ పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ డీఎంకే నేతలతో మరిన్ని చర్చలు జరిగిన తర్వాత ఈ విషయంలో స్పష్టత వస్తుందన్నారు.

15:23 - February 13, 2016

హైదరాబాద్ : వాలంటైన్స్ డే రోజు ప్రేమికులకు రక్షణ కల్పించాలంటూ హైదరాబాద్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ను కలిసింది ఇండియన్‌ లవర్స్ యూనిటీ.. ఓయూ విద్యార్థి సంఘాలతో కలిసి వినతి పత్రం ఇచ్చింది.. ప్రేమికుల రోజు కనిపిస్తే దాడులు చేస్తామని కొందరు ప్రకటించారని అంజనీ కుమార్‌కు వివరించారు.. వారిని ముందస్తుగా అరెస్టు చేసి యువతీ, యువకులకు రక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.. పార్కులు, రెస్టారెంట్లు తెరిచిఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.. 

ఓయూలో ఉద్రిక్తత

హైదరాబాద్: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లో రాజుకున్న ఘర్ణణల సెగ హైదరాబాదులోని ఉస్మానియా వర్సిటీ (ఓయూ)ని తాకింది. భారత పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురుకు అనుకూలంగా ఓ విద్యార్థి సంఘం ర్యాలీ, దానిని వ్యతిరేకిస్తూ మరో విద్యార్థి సంఘం నిరసన... వెరసి జేఎన్ యూ భగ్గుమంది. దీనిపై వేగంగా స్పందించిన ఢిల్లీ పోలీసులు అఫ్జల్ గురుకు అనుకూలంగా, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విద్యార్థిని అరెస్ట్ చేశారు. దీనిని నిరసిస్తూ ఉస్మానియా వర్సిటీలో కొద్దిసేపటి క్రితం ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ఐ, పిడిఎస్ యూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

బీహార్ లో రోడ్డు ప్రమాదం : 11 మంది మృతి

పాట్నా : బీహార్‌లోని రోహతస్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతుల స్వస్థలం భోజ్‌పూర్ జిల్లాలోని కుష్మా గ్రామం. రోహతస్ జిల్లాలోని గుప్తధామ్ వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొని తమ సొంత గ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కృష్ణా రీజియనలో ఆర్టీసి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్వూలు

విజయవాడ : ఏపీఎస్‌ ఆర్టీసీ కృష్ణా రీజియనలో కారుణ్య నియామకాలలో భాగంగా ఆర్టీసీ కానిస్టేబుల్‌ ఉద్యోగాల కొరకు ఈ నెల 16న ఉదయం 10.30 గంటలకు బస్‌స్టేషనలోని రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కృష్ణా రీజియన రీజినల్‌ మేనేజర్‌ పి.వి.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల కాల్‌ లెటర్స్‌ జారీ చేసినట్లు, వారి జాబితాను, కార్యాలయంలోని నోటీసు బోర్డులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జాబితాలో ఉన్న అభ్యర్థులు సంబంధిత అన్ని ఒరిజనల్‌ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిందిగా ఆర్‌ఎం రామారావు తెలిపారు.

14:47 - February 13, 2016

తిరుమల : రథ సప్తమి వేడుకలకు తిరుమల తిరుపతి దేవస్థానం ముస్తాబైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రథ సప్తమి సందర్భంగా శ్రీనివాసుడు ఒకేరోజు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నాడు. భక్తులు భారీగా రానున్న నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ.                                                                                     

ఒకేరోజు ఏడు వాహనాలపై దర్శనం....

బ్రహ్మోత్సవాల సమయంలో ఏడు రోజులపాటు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చే శ్రీనివాసుడు.. రథ సప్తమి సందర్భంగా ఒకే రోజు ఏడు వాహనాలపై దర్శనమివ్వడం విశేషం. ఉదయం ఐదున్నర గంటలకు సూర్యప్రభ వాహనంతో వేడుకలు ప్రారంభమై వరుసగా.. చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై రాత్రి 10 గంటల వరకు ఆలయ మాడవీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు పుష్కరిణిలో ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం జరిపి చక్రస్నానం నిర్వహిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు....

రథ సప్తమి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందుకోసం అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. అంతేకాకుండా వికలాంగులు, వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలను సైతం రద్దు చేశారు. స్వామివారి ఊరేగింపును చూసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు గ్యాలరీలలో ఉన్నవారికి మంచినీరు, అల్పాహారాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో భక్తులు భారీగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

14:46 - February 13, 2016

చిత్తూరు : తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రేయ దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాతం సేవలో పాల్గొన్న ఆమెకు.. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. 

14:45 - February 13, 2016

చిత్తూరు : తిరుమల శ్రీవారికి కోయంబత్తూరుకు చెందిన బాలమురుగన్‌ దంపతులు వజ్ర కిరీటాన్ని కానుకగా అందజేశారు. వీఐపి బ్రేక్‌ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న బాలమురుగన్‌ దంపతులు.. స్వామివారికి ఈ కిరీటాన్ని అందజేశారు. ఉత్సవర్లు మలయప్ప స్వామివారికి అలంకరించేందుకు వీలుగా దాత ఈ కిరీటాన్ని తయారు చేయించారు. 

14:44 - February 13, 2016

హైదరాబాద్ : కొందరికి మేలు చేసేందుకు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు టెండర్ల నిబంధనలు మార్చారన్నారు.. బిజెపి నేత నాగం జనార్ధన్‌ రెడ్డి.. ఇందులో పెద్ద స్కాం ఉందని ఆరోపించారు.. నిపుణులు ఇచ్చిన కమిటీని కొట్టివేసి ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు..

చిత్తూరు జిల్లాలో దారుణం

హైదరాబాద్ : పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ప్రియురాలిని చంపి ఇట్లోనే పాతి పెట్టాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఉరవకొండ మండలం, నక్కలవారి పల్లె గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్న వేం నారాయణ రెడ్డి, తిరుపతిలో ఎంబీఏ చదువుతున్న షజీనా ఇద్దరూ గత కొంత కాలంగా తిరుపతిలో సహజీవనం చేస్తున్నాట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోమని ప్రియురాలు బలవంతం చేయడంతో ప్రియుడి సొంత గ్రామానికి తీసుకెళ్లి చంపి ఆ ఇంట్లో నే పాతి పెట్టినట్లు సమాచారం. తమ కుమార్తె కనపడటం లేదని...

14:41 - February 13, 2016

హైదరాబాద్ : పెళ్లి చేసుకోమని బలవంతం చేయడంతో ప్రియురాలిని చంపి ఇట్లోనే పాతి పెట్టాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం నక్కలవాండ్లపల్లిలో దారుణం  గ్రామంలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం గంగిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎన్.వేమనారాయణరెడ్డి (30) వాయల్పాడులో ఓ నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఎఫ్.సబియా అనే యువతి ఎంబీయే అనంతరం నారాయణరెడ్డి నెట్ సెంటర్‌లో ఉద్యోగానికి కుదిరింది. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం తర్వాత నారాయణరెడ్డి ఆమెకు తిరుపతిలోని విజయలక్ష్మి ఆటోమొబైల్స్‌లో ఉద్యోగం ఇప్పించాడు. రోజూ తల్లితో మాట్లాడే సబియా గత నెల 28 నుంచి కాల్ చేయడం మానేసింది. దీంతో ఆమె తల్లి కాల్ చేయగా సబియా ఫోన్ స్విచ్చాఫ్ అని రావడంతో ఈ నెల 1న తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని కాల్ డేటా ఆధారంగా వేమ నారాయణను అరెస్ట్ చేసి విచారించగా... సబియాను తానే హత్య చేసి గంగిరెడ్డిగారిపల్లెలోని తన ఇంట్లోనే పూడ్చిపెట్టినట్టు ఒప్పుకున్నాడు.

ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోల మృతి

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసుల కూంబింగ్‌ కొనసాగుతోంది.

టీడీపీ నేతల మధ్య విభేదాలు

గుంటూరు : ఎస్సీ వర్గీకరణ అంశం టీడీపీ నేతల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ చేసే ఆలోచన లేదన్న మంత్రి ప్రత్తిపాటి వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేకపోతే జీవో నెం.25 ఎందుకు ఇచ్చారని డొక్కా ప్రశ్నించారు. సున్నితమైన అంశాలు మాట్లాడేటప్పుడు మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. 

రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా ఇచ్చిన హామీలు, సివిల్‌ సర్వేంట్ల కోటా పెంపుపై చర్చించారు. అదేవిధంగా ఉద్యోగుల విభజన, ప్రత్యేక హైకోర్టు సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాజ్‌నాథ్‌సింగ్‌కు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

13:55 - February 13, 2016


ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా ఇచ్చిన హామీలు, సివిల్‌ సర్వేంట్ల కోటా పెంపుపై చర్చించారు. అదేవిధంగా ఉద్యోగుల విభజన, ప్రత్యేక హైకోర్టు సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాజ్‌నాథ్‌సింగ్‌కు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

 

13:53 - February 13, 2016

గుంటూరు : ఎస్సీ వర్గీకరణ అంశం టీడీపీ నేతల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణ చేసే ఆలోచన లేదన్న మంత్రి ప్రత్తిపాటి వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేకపోతే జీవో నెం.25 ఎందుకు ఇచ్చారని డొక్కా ప్రశ్నించారు. సున్నితమైన అంశాలు మాట్లాడేటప్పుడు మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం తనకు అప్పగిస్తే.. 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తానని డొక్కా పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం రేపు రేపు ఉ.10 గంటలకు మాదిగ నేతలతో, ఎల్లుండి మాల నేతలతో సమావేశమవుతామన్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని అనంతరం ఇదే అంశంపై సీఎంను కలిసి తగు సూచనలు ఇస్తామని డొక్కా తెలిపారు. 

 

13:45 - February 13, 2016

ఢిల్లీ : ఒక ఘటన ఆధారంగా జేఎన్‌యూపై దాడి చేసే ప్రయత్నం జరుగుతుందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. జేఎన్‌యూ విద్యార్ధుల వివాదంపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను వామపక్ష నేతలు కలిశారు. జేఎన్‌యూ విద్యార్ధుల వివాదంపై చర్చ జరిపారు. అయితే అమాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోమని రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చినట్లు ఏచూరి తెలిపారు. 

 

13:40 - February 13, 2016

హైదరాబాద్ : అకాల మరణం చెందిన ఆధునిక కవి, ప్రముఖ జర్నలిస్టు అరుణ్‌ సాగర్‌కు 10టీవీ సంతాపం తెలిపింది. 10 టీవీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో సిబ్బంది, జర్నలిస్టు మిత్రులు.. సాగర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహా కలం యోధుడితో ఉన్న అనుబంధాన్ని ప్రతి ఒక్కరూ పంచుకున్నారు. ఈ సందర్భంగా 10 టీవీ ఎండీ వేణగోపాల్ మాట్లాడుతూ అందరి కష్టాలు తెలిసిన వ్యక్తి సాగర్ అని అన్నారు. జనాన్ని మరిచిపోని వ్యక్తని సాగర్ అని నవ తెలంగాణ ఎడిటర్‌ వీరయ్య చెప్పారు. అందరితో సాగర్‌కు మంచి అనుబంధం ఉందని  ప్రముఖ సాహితీవేత్త తెలకపల్లి రవి తెలిపారు. వచనల్లో కూడా కవిత్వాన్ని అందంగా చెప్పిన వ్యక్తి అరుణ్ అని 10టీవీ అసోసియేట్‌ ఎడిటర్‌ శ్రీధర్‌బాబు కొనియాడారు. 10టీవీ ప్రోగ్రాం హెడ్‌ ప్రసాదమూర్తి మాట్లాడుతూ చిన్న పిల్లవాడి మనస్తత్వం ఉన్న వ్యక్తి సాగర్‌ అని పేర్కొన్నారు. 

వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాం : చంద్రబాబు

విజయవాడ : బీసీలకు టీడీపీ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలో నిర్వహించిన బీసీ మేళా కార్యక్రమంలో చంద్రన్న ఉపాధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెనుకబడిన వర్గాలు లేకపోతే టీడీపీ లేదన్నారు. చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేసిన ఘనత టీడీపీదే అన్నారు.

13:34 - February 13, 2016

విజయవాడ : బీసీలకు టీడీపీ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలో నిర్వహించిన బీసీ మేళా కార్యక్రమంలో చంద్రన్న ఉపాధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెనుకబడిన వర్గాలు లేకపోతే టీడీపీ లేదన్నారు. చేనేత కార్మికులు తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేసిన ఘనత టీడీపీదే అని పేర్కొన్నారు. 50 శాతం సబ్సిడీతో చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేశామని చెప్పారు. సగం ధరకే చీర, దోతీ ప్రవేశపెట్టిన చర్రిత టిడిపికి ఉందన్నారు. చేనేత, గీత కార్మికులకు 55 సంవత్సరాలకే వృద్ధ్యాప్య పింఛను ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. వాల్మికి జయంతి, మహాత్మపూలే జయంతులను ప్రభుత్వ తరపున నిర్వహిస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాల్లో ఇంకా చైతన్యం రావాలన్నారు. మొదటి బీసీ మేళాలో చేనేత కార్మికులకు 127 వేల కోట్ల రూపాయలతో 37 వేల మందికి ఆర్థికసాయం చేశామని చెప్పారు. రెండో మేళాలో 34, 200 మందికి ఆర్థిక సాయం చేశామని తెలిపారు. రెండో బీసీ మేళాలో చేనేతకార్మికులకు 187 వేల కోట్ల రూపాయలు, గీత కార్మికులకు 13 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. చేనేత వర్గానికి రుణ మాఫీ చేస్తమని చెప్పి చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. 

 

12:55 - February 13, 2016

మహారాష్ట్ర : ముంబయి దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్‌హెడ్లీ న్యాయస్థానం ముందు మరిన్ని విషయాలు వెల్లడించాడు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ముంబై ఎయిర్‌పోర్ట్‌ను  టార్గెట్‌ చేసిందని చెప్పాడు. ముంబై దాడుల్లో పట్టుబడి ఉరిశిక్షకు గురైన అజ్మల్‌ కసబ్‌ను కూడా హెడ్లీ గుర్తించాడు.
నాలుగో రోజు కొనసాగిన విచారణ 
26/11 ముంబయి దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్‌హెడ్లీ విచారణ నాలుగో రోజు కూడా కొనసాగింది. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ కోసం బాబా అణు విద్యుత్ కేంద్రం బార్క్‌ను వీడియో తీసినట్లు డేవిడ్‌ హెడ్లీ వెల్లడించారు. ఆ వీడియోను ఐఎస్‌ఐకు చెందిన మేజర్‌ ఇక్బాల్‌కు అందించినట్టు చెప్పారు. బార్క్‌ శాస్త్రవేత్తలను ఐఎస్‌ఐ ఏజెంట్లుగా నియమించాలని ఇక్బాల్‌ తనకు పురమాయించినట్టు పేర్కొన్నాడు. 
నావెల్‌ ఎయిర్‌ స్టేషన్‌, సిద్ధి వినాయక్‌ ఆలయంపై దాడికి వ్యూహం 
ముంబైలోని నావెల్‌ ఎయిర్‌ స్టేషన్‌, సిద్ధి వినాయక్‌ ఆలయంపై దాడికి వ్యూహం రచించాలని లష్కరే ఉగ్రవాద సంస్థ తమ సభ్యులకు ఆదేశించిందన్నారు. అయితే అక్కడ పటిష్టమైన భద్రత కారణంగా తాను అడ్డు తగిలానని హెడ్లీ చెప్పారు. ఇజ్రాయిల్స్‌, యూదులు ఎక్కువగా ఉండే ప్రాంతమైన చాబద్‌ హౌస్‌పై దాడి చేసేందుకు లష్కరే తోయిబా లక్ష్యంగా చేసుకుందన్నారు. ముంబై విమానాశ్రమంపై దాడి చేయలేకపోవడంతో లష్కరే నేతల్లో అసహనం కనిపించిందని హెడ్లీ వెల్లడించారు. తాను సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించానని, అక్కడ పవిత్ర దారాలు కొనుగోలు చేసి లష్కరేకు చేరవేసినట్లు వెల్లడించారు. ఆ దారాలను తనతోపాటు దాడి చేయడానికి వచ్చిన 10మంది దుండగులకు ఇచ్చానని.. వాటిని ధరించడంతో.. తమను అందరూ హిందువుల్లా భావించారని వివరించాడు. అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న హెడ్లీని ముంబై కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  విచారిస్తోంది.

 

హైదరాబాబాద్, రంగారెడ్డి జిల్లా అధికారులతో కమిషనర్ జనార్థన్ రెడ్డి భేటీ

హైదరాబాద్ : హైదరాబాబాద్, రంగారెడ్డి జిల్లా అధికారులతో జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి భేటీ అయ్యారు. పలు విషయాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

బీహార్ లో రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

పాట్నా : బీహార్ లోని ససరాంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో  11 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 25 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

శ్రీకాకుళం : జిల్లాలోని ఎక్సైజ్‌ కమిషనర్‌ వాహనం సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిదో తరగతి విద్యార్థి విజయ్‌ మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి.ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలంటూ రిమ్స్ దగ్గర బంధువుల ఆందోళన చేపట్టారు.

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

విజయనగరం : జిల్లాలోని బొబ్బిలి మండలం గున్నతోటవలసలో రైలు కింద పడి రామకృష్ణ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామకృష్ణ దొంగతనం కేసులో పోలీసులు వేధిస్తున్నారంటూ సూసైట్‌ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.

రాజ్‌నాథ్‌సింగ్‌ ను కలిసిన ఏచూరి, రాజా

ఢిల్లీ : కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ను సీపీఎం జాతీయ కార్యదర్శి, సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ నేత రాజా కలిశారు. ఈ సమావేశంలో జేఎన్‌యూలో విద్యార్థుల అరెస్ట్ పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రమేయం లేని విద్యార్థులపై కేసులు పెట్టొద్దని రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

12:41 - February 13, 2016

నిజామాబాద్ : ఆ ఊళ్లలో ఎవరిని పలకరించినా ... ఒకటే ప్రశ్న.. ఎవరిని కలిసినా ఒకటే ప్రశ్న.. ఆ ఊళ్లలోని వారంతా మొగులయ్యలే.. ఆ ఊళ్లలోని ఆడవాళ్లంతా మొగులవ్వలే.. ఇంతకీ ఆ ఊళ్లోని వారందరూ అడిగే ప్రశ్న ఏంటి... అందరిని మొగులయ్య.. మొగులవ్వ అనే ఎందుకు పిలుస్తున్నారు దీని వెనక హిస్టరీ తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరి.
సుమారు 3 వేల మంది జనాభా
నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ పట్టణానికి 3 కి.మీ దూరంలో ఉన్న గ్రామమే సోమేశ్వర్ గ్రామం. సుమారు 3 వేల మంది జనాభా ఉన్నారు. ఆ గ్రామం చుట్టుప్రక్కల గ్రామాలైన నాగారం , కొల్లూరు , దుర్కి, దేశయ్ పేట వంటి తదితర గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఎవరి నోట విన్న .. ఓ మొగులవ్వ ఇలా రా .. ఓ మొగులయ్య ఇలా రా.. అనే మాటలే వినిపిస్తాయి. వినడానికి చిత్రంగా ఉన్నా ఇది నిజంగా నిజం.
ప్రశ్నల మీద ప్రశ్నలు
ఒక వైపు ప్రపంచం మొత్తం కంప్యూటర్ వైపు పయనిస్తున్నా.. ఇక్కడి ప్రజలు మాత్రం పాత పద్థతులు ,ఆచారాలను తు.చ తప్పకుండా పాటిస్తూనే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎవరైనా కొత్తవారు సోమేశ్వర్ గ్రామానికి వెళ్లి పలానా మొగులయ్య కావాలనో..పలానా మొగులవ్వ కావాలనో అడిగారో ఒక అంతే ప్రశ్నల మీద ప్రశ్నలు మీముందుంటాయి. ఏ మొగులయ్య కావాలి ఏ మొగులవ్వ కావాలి అనే ప్రశ్నలు సందిస్తారు. ఎందుకంటే ఆ గ్రామంలోని వారందరి పేర్లు మొగులయ్య , మొగులవ్వ లే కాబట్టి. ఇంటి పేరు చెబితే కాని అంత ఈజీగా ఎవరు అడ్రస్ చెప్పలేరు. అంతలా అక్కడి వారు అలవాటు పడిపోయారు.
రేషన్ కార్డులో, ఓటర్ లిస్టులలో సైతం అవే పేర్లు
ఇది ఇలా ఉండగా రేషన్ కార్డులో, ఓటర్ లిస్టులలో సైతం అవే పేర్లు కనబడతాయి. కాలక్రమేనా మారుతున్న కాలాను గుణంగా ఇప్పటి వారు కాస్త మారుతున్నా ... వారి పిల్లల పేర్లు సైతం మొదటి అక్షరం మ.. తోనే మొదలయ్యేలా మోహన్ , మమతా, మౌనిక అనే పెట్టుకుంటున్నారు. తమ తాత ముత్తాతల కాలం నాటి నుండి సోమేశ్వర్ గ్రామంలో మొగలాయి దర్గా ఉందని.. కుల మతాలకు అతీతంగా అందరూ పీర్ల పండుగను జరుపుకుంటున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. తమకు అన్ని విధాల మంచి చేస్తున్న మొగులాయి దేవుడే అన్ని అంటున్నారు గ్రామస్తులు. తమను పిలుచుకుంటున్న సమయంలో తమ ఇష్టదైవాన్ని తలచుకున్నట్టే ఉంటుందని చెప్పడం మరో విశేషం. నిజామాబాద్ జిల్లాలోని సోమేశ్వర్ గ్రామానికి వెళ్లాలనుకున్నవారు ఎవరైనా గ్రామస్థుల ఇంటి పేర్లతో సహా తెలియకుండా వెళ్లారో ప్రశ్నలు ఎదుర్కోవలసిందే.. ఏది ఏమైనా కాలం మారుతున్నా ఇంకా తమ ఇష్ట దైవాన్నే తమ పేర్లుగా పెట్టుకోవడం విచిత్రంగా అనిపించినా మనమూ అలాగే పిలవక తప్పదు మరి.

 

12:33 - February 13, 2016

హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు చేరడం లేదు. అధికారులు, నాయకులు వివక్ష చూపడంతో పేదలు పేదలుగా మిగిలిపోతున్నారు. కార్పోరేషన్‌ అందించే రుణాల విషయంలోనూ వివక్ష చూపుతుండడంతో గ్రామీణ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2016 సంవత్సరంలో వెనుకబడిన వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో  సబ్సిడీ రూణాలు అందించాలనే ఉద్దేశంతో బిసీ,ఎస్సీ, కార్పోషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం షెడ్యులు విడుదల చేసింది. 
అభ్యర్థుల ఇంటర్వ్యూలు వాయిదా
ఎన్నికలు నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఇంటర్వ్యూలను బ్యాంకు అధికారులు వాయిదా వేశారు. ఎన్నికల అనంతరం ప్రారంభమైన బిసీ, ఎస్సీ కార్పోషన్ రుణాల ఇంటర్వ్యూల నిర్వహణలో బ్యాంకు అధికారులు వివక్ష చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రుణాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు నిరాశే ఎదురవుతోంది. 
మహబూబ్‌ నగర్‌ జిల్లాకు 2338 యూనిట్లు మంజూరు
ఈ ఏడాది మహబూబ్‌ నగర్‌ జిల్లాకు 2338 యూనిట్లు మంజూరవగా, గ్రామీణ ప్రాంతాల వారికి 1880 యూనిట్లకు గానూ 17.04 కోట్లు, రాజీవ్ అభ్యుదయ యోజన క్రింద 370 యూనిట్లకు గానూ 3. 50 కోట్లు, చేత్తి వృత్తుల వారికి 84 యూనిట్లకు 12.60 కోట్లు ఈ ఏడాది  కేటాయించారు. ఈ యూనిట్ల కోసం 22వేల137 మంది నిరుద్యోగ  అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఏ బ్యాంకు రూణం మంజూరు కావాలన్నా రాజకీయ నాయకుల ఆశీస్సులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి గ్రామంలో ఏదో ఒక రాజకీయ నాయకుడు చెబితేనే బ్యాంకు రుణాలను మంజూరు చేస్తున్నారు. నిజమైన పేద యువతకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకు అధికారులు వివక్ష చూపుతున్నారు. 
నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం 
కార్పోషన్ రుణాల మంజూరులో బ్యాంకర్ల తీరుతో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బ్యాంకులకు తాళలు వేసి యువత నిరసనలు తెలుపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 64 మండలాలతో పాటు 8 మున్సిపాలిటిలలో ఇదే విధంగా కొనసాగడంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న యువత దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు.

 

లెఫ్టు విద్యార్థి సంఘం నేతలపై ఎబివిపి నేతలు దాడి

హైదరాబాద్ : ఓయూలో లెఫ్టు విద్యార్థి సంఘం నేతలపై ఎబివిపి విద్యార్థి సంఘం నేతలు దాడికి  పాల్పడ్డారు. 

నారాయణఖేడ్ బైపోల్.... 11.30 గం.లకు 40 శాతం పోలింగ్

మెదక్ : జిల్లాలోని నారాయణఖేడ్‌లో ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు  ఓటర్లు  పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 11.30 గంటల వరకు 44 శాతం ఓటింగ్ పోల్‌ అయింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 142 కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలతో పోలింగ్‌ సరళిని చిత్రీకరిస్తున్నారు. 

 

ఉ.10 గం. వరకు 22 శాతం పోలింగ్‌

మెదక్ : జిల్లా నారాయణఖేడ్‌లో ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు  ఓటర్లు  పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం పది గంటల వరకు 22 శాతం ఓటింగ్ పోల్‌ అయింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 142 కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలతో పోలింగ్‌ సరళిని చిత్రీకరిస్తున్నారు. 

 

11:58 - February 13, 2016

మెదక్ : జిల్లాలోని నారాయణఖేడ్‌లో ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు  ఓటర్లు  పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 11.30 గంటల వరకు 44 శాతం ఓటింగ్ పోల్‌ అయింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 142 కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలతో పోలింగ్‌ సరళిని చిత్రీకరిస్తున్నారు. 

 

11:43 - February 13, 2016

హైదరాబాద్ : వైసిపి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. సస్పెన్షన్‌ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలంటూ ఆమె కోర్టులో పిటిషన్ వేశారు. రోజా పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది న్యాయస్థానం.
సస్పెన్షన్‌ పై రోజా న్యాయ పోరాటం 
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా తనను శాసన సభ నుంచి సస్పెన్షన్‌ చేయడంపై న్యాయ పోరాటం ప్రారంభించారు. సస్పెన్షన్ విషయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేగా శాసనసభలో తన బాధ్యతలను తాను నిర్వర్తించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు రోజా. అంతేకాదు సస్పెన్షన్ విషయంలో సభాపతి తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని ఆరోపించారు. 
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం-రోజా
గతేడాది డిసెంబర్ 17 నుంచి జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సాగిన అనేక చర్చలతో పాటు కాల్ మనీ సెక్స్ కుంభకోణంపై కూడా చర్చ జరిగిందని పిటిషన్‌లో వివరించిన రోజా...ఈ కేసులో నిందితులకు, అధికార పార్టీకి మధ్య ఉన్న అనుబంధంపై తాను పలు ప్రశ్నలు వేశానని చెప్పారు. అయితే తెలుగుదేశం సభ్యులు తనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని, వెంటనే ఆయన తన సస్పెన్షన్‌కు తీర్మానం చేయాలని వారికి సూచించారని వివరించారు. అసెంబ్లీ బిజనెస్ రూల్స్‌కు విరుద్ధంగా తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు రోజా. స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుసరించిన విధానం రాజ్యాంగ విరుద్ధమన్న రోజా...ఈ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్‌లో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ చర్యలు న్యాయసమీక్ష లోబడి ఉంటాయని తెలియజేస్తూ..సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగిన తన సస్పెన్షన్ విషయంలో జోక్యం చేసుకోవాలని హైకోర్టును అభ్యర్థించారు.
వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదు-రోజా
తీర్మానం ప్రవేశపెట్టడం, దానిని స్పీకర్ ఆమోదించి ఏడాది పాటు సస్పెండ్ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయని రోజా తెలిపారు. కనీసం తనకు సస్పెన్షన్ కాపీ కానీ, ఎలాంటి ముందస్తు నోటీసూ కానీ ఇవ్వలేదని వివరించారు. తన వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలో తన ప్రవర్తనపై అభ్యంతరం ఉంటే ఆ ఒక్క సెషన్‌కే సస్పెండ్ చేయాలి తప్ప, ఏడాది పాటు సస్పెండ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. రోజా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

11:39 - February 13, 2016

ఖమ్మం : తెలంగాణ సాగునీటి పారుదల శాఖ అధికారుల తీరుపై.. సంబంధిత మంత్రి హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే సీజన్‌ కల్లా.. రైతులకు సాగునీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా... అధికారుల్లో కదలిక లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలోనూ డిస్ట్రిక్ట్‌ ఇరిగేషన్‌ కార్డును రూపొందించి.. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
జీవో 146 అమలులో జాప్యంపై మండిపాటు
ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని.. తెలంగాణ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, శుక్రవారం సమీక్షించారు. అధికారుల తీరుపై ఆయనీ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. వచ్చే సీజన్‌కల్లా కొత్త ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్న ప్రభుత్వ నిశ్చయానికి.. అధికారుల నుంచి సరైన స్పందనే లేదని మండిపడ్డారు. దీనికి సంబంధించిన జీవో 146ను జారీ చేసి మూడు నెలలైనా.. అధికారులు దాన్ని పట్టించుకోకపోవడంపై హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. 15న బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమావేశం
ఈనెల 20వ తేదీలోపు, ఏజెన్సీలన్నీ తప్పనిసరిగా ప్రతిపాదనలు పంపాలని.. స్పందించని వారిని తక్షణమే తొలగించాలని హరీశ్‌రావు.. ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ డిస్ట్రిక్ట్‌ ఇరిగేషన్‌ కార్డును రూపొందించుకోవాలని.. దాని ప్రకారమే ప్రాజెక్టుల పూర్తికి కృషి చేయాలని సూచించారు. ఈనెల 15న బడ్జెట్‌పై సమావేశం కావాలని, ప్రతిపాదనలు సిద్ధం చేసేటప్పుడు అధికారులు ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు.
భూసేకరణ కష్టాల నివారణపై దృష్టి
భూసేకరణలో ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కుల గురించి సమీక్ష సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దీన్ని అధిగమించేందుకు.. త్వరలోనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశం కావాలని హరీశ్‌ నిర్ణయించారు. ఇక దమ్ముగూడెం ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగాను, పాలేరు లిఫ్ట్‌ను భక్త రామదాసు లిఫ్ట్‌ ఇరిగేషన్‌గాను నామకరణం చేయనున్నామని, దీనికి సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఈనెల 20 తర్వాత పాలమూరు జిల్లాలో రెండు రోజుల పాటు ఉండి.. అన్ని ప్రాజెక్టులనూ పరిశీలిస్తానని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

 

 

నేడు విశాఖకు భారత్, శ్రీలంక క్రికెట్ ప్లేయర్స్..

విశాఖ : భారత్, శ్రీలంక క్రికెట్ ప్లేయర్స్ నేడు విశాఖకు రానున్నారు. విశాఖలో రేపు ఇరు జట్ల మధ్య టీ-20 మ్యాచ్ జరుగనుంది. 

తాడిపత్రిలో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు

అనంతపురం : తాడిపత్రిలో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు అయింది. పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3 లక్షల నకిలీ నోట్లు, కంప్యూటర్, జిరాక్స్ మిషన్ లను స్వాధీనం చేసుకున్నారు. 

శ్రీవారికి కానుకగా బంగారం కిరీటం

తిరుమల : కోయంబత్తూర్‌కు చెందిన మురుగన్‌ దంపతులు శ్రీవారికి కోటి విలువచేసే బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. మురుగన్ దంపతులు శ్రీవారిని దర్శించుకొని పూజలు చేశారు. టీటీడీ అధికారులు మురుగన్ దంపతులకు శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.

పహాడిషరీఫ్ లో పోలీసుల కార్డన్ సెర్చ్...

హైదరాబాద్ : నగరంలోని పహాడిషరీఫ్, షహీన్ నగర్‌లో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భారీ మొత్తంలో పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఏడుగురు రౌడీషీటర్లతో పాటూ 50 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. సరైన పత్రాలులేని 50బైక్లు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

హిందూపురంలో అయుత చండీయాగం ప్రారంభం

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలోని ఎంజీఎం క్రీడామైదానంలో అయుత చండీయాగం వైభవంగా ప్రారంభమైంది. చండీయాగంలో భాగంగా నిర్వహించిన సుదర్శనయాగంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయుత చండీయాగాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

10:24 - February 13, 2016

అనంతపురం : లేపాక్షి శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఉత్సవాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈనెల 27,28 తేదీల్లో జరిగే లేపాక్షి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లను వేగవంతం చేసింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ..దగ్గరుండి మరీ పనుల్ని పర్యవేక్షిస్తుండడంతో లేపాక్షిలో పండుగ వాతావరణం నెలకొంది.
లేపాక్షి సర్వాంగ సుందరంగా ముస్తాబు 
లేపాక్షి శిల్పకల వైభవాన్ని దేశ, అంతర్జాతీయస్థాయిలో చాటి చెప్పేలా ఉత్సవాలను నిర్వహించేందుకు అనంతపురం జిల్లాలోని లేపాక్షి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. దీంతో ఉత్సవాల పనులు ఊపందుకున్నాయి. 
ఈనెల 27, 28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు 
స్థానిక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధ్యక్షతన లేపాక్షి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఏపీ, తెలంగాణ ఉమ్మడి  అష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కర్ణాటక మంత్రులు, పలువురు సినీప్రముఖులు హాజరవుతున్నారు. దీంతో ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది ప్రభుత్వం. ప్రముఖులకు హెలీఫ్యాడ్‌ ఏర్పాట్లు, బ్యారికేడ్లు, శానిటేషన్‌, తాగునీరు, ప్రముఖుల భద్రత, ట్రాఫిక్‌, అభివృద్ధి పనులు, వేదిక, ప్రదర్శనశాలలు, ప్రాచీన క్రీడలు, హస్తకళలల ప్రదర్శన, వంటి పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు, హెరిటేజ్‌పై సైకిల్‌ ర్యాలీ, హిందూపురంలో 5కె రన్‌, లేపాక్షిలో హెరిటేజ్‌ రన్‌ వంటి కార్యక్రమాలను కూడా రూపొందించారు. 
ప్రాచీన క్రీడలు, హస్తకలల ప్రదర్శన 
అయితే లేపాక్షిలో జరుగుతున్న ఏర్పాట్లను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దగ్గరుండీ మరీ పర్యవేక్షిస్తున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఉత్సవాలలో భాగంగా తాను శ్రీ కృష్ణదేవరాయ పాత్రలో నాటకం వేయబోతున్నానని బాలకృష్ణ తెలిపారు. తెలుగు ప్రజలందరూ ఈ లేపాక్షి ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలన ఇకోరు. 
అనంతపురం వాసుల సంతోషం
మొత్తానికి అనంతపురంలో లేపాక్షి ఉత్సవాలు జరుగుతుండడంతో అనంతపురం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలతోనైనా తమ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుందని జిల్లా వాసులు ఆశతో ఎదురుచూస్తున్నారు. 
 

జమ్మూకాశ్మీర్ లో భద్రత దళాలు, తీవ్రవాదుల మధ్య కాల్పులు

 శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ కుప్వారా జిల్లాలోని మర్సారి గ్రామంలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. ఈ మేరకు సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. సదరు గ్రామంలోని ఓ ఇంట్లో తీవ్రవాదులు దాగి ఉన్నారని భద్రత దళాలకు సమాచారం అందింది. 
ఈ నేపథ్యంలో రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ అపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ పోలీసులు తీవ్రవాదులు దాగి ఉన్న ఇంటిని చుట్టిముట్టారు. ఆ విషయాన్ని గమనించిన తీవ్రవాదులు... భద్రత దళాలపైకి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడ్డారని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.

 

తూర్పు ఇండోనేషియాలో తీవ్ర భూకంపం

కౌలాలంపూర్ : తూర్పు ఇండోనేషియాలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 6.5గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 5.02 గంటలకు సుంబా ప్రాంతంలో తూర్పు- ఆగ్నేయ అందేకంటేర్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతున భూకంపకేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌జీఎస్ వెల్లడించింది. సునామీ వచ్చే అవకాశాలు లేవని తెలిపింది. భూకంపం వల్ల ఎక్కడా ఎలాంటి నష్టం నమోదు కాలేదని ఇండోనేషియా విపత్తు నివారణ ఏజెన్సీ పేర్కొన్నది.

10:17 - February 13, 2016

హైదరాబాద్ : బడ్జెట్‌ అంచనాలపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. శాఖల వారీగా కేటాయింపులు ఎలా ఉండాలన్న అంశంపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తును ప్రారంభించింది. ఈసారి ఏపీ బడ్జెట్‌ లక్షా 30వేల కోట్ల రూపాయలు దాటొచ్చని.. అందులో ప్రణాళికేతర వ్యయమే 90వేల కోట్లు ఉండొచ్చని అంచనా. బడ్జెట్‌లో అన్నింటికన్నా ముఖ్యంగా అమరావతి నిర్మాణానికే ప్రభుత్వం పెద్ద పీట వేయనుందని భావిస్తున్నారు. 
అమరావతికి నిర్మాణానికే ప్రాధాన్యత?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2016-17 వార్షిక బడ్జెట్‌ రూపకల్పనపై కసరత్తును ముమ్మరం చేసింది. ఆమ్‌ ఆద్మీని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ఆయా శాఖలకు కేటాయింపులు.. వ్యయం నివేదికల ఆధారంగానే కొత్త బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని ఆర్థిక మంత్రి రామకృష్ణుడు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనికి తగినట్లుగానే అన్ని శాఖల అధిపతులు కసరత్తును ప్రారంభించారు. ఈసారి బడ్జెట్‌లో రాజధాని అమరావతికి నిధుల కేటాయింపులకే అధిక ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. రాజధాని మొదటి దశ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెబుతున్నారు. 
ఈసారీ భారీగానే వ్యవసాయ బడ్జెట్‌?
వ్యవసాయానికి ప్రత్యేకంగా ప్రవేశ పెట్టే బడ్జెట్‌ కూడా భారీగానే ఉండాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. సేద్యానికి అనువైన ఆధునిక విధానాలతో.. విత్తనోత్పత్తి, కొనుగోలు అంశాల్లో రైతులకు ఉపకరించేలా వ్యవసాయ బడ్జెట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ బడ్జెట్‌ వ్యయంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేలా కొత్త బడ్జెట్‌ను రూపొందించాలని సర్కారు యోచిస్తోంది. 
పాత పథకాల కొనసాగింపు.. కొత్త పథకాల ప్రకటన
ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే.. గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన వాటిని కొనసాగిస్తూనే కొత్త పథకాలను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్‌ రూపకల్పన దిశగా.. ఆయా శాఖల బడ్జెట్‌   ప్రతిపాదనల కోసం.. ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేశ్‌.. ఈనెల 16 నుంచి శాఖల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికోసం ఆయా శాఖల అధిపతులు ఇప్పటికే సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నారు. 2016-17 వార్షిక బడ్జెట్‌ లక్షా 30వేల కోట్ల రూపాయలు దాటే అవకాశాలున్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 
మార్చి ఐదు నుంచి నెలాఖరు వరకు బడ్జెట్‌ సమావేశాలు 
ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి ఐదు నుంచి నెలాఖరు వరకు సాగే అవకాశాలున్నాయి. పదిరోజుల సెలవు పోను.. ఇరవై రోజుల పాటు.. శాసనసభ పనిచేయనుందని సమాచారం.  

 

09:49 - February 13, 2016

హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఏ-4 నిందితుడు మత్తయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఉప్పల్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు.. నోటీసులు అందజేశారు. 160 సీఆర్‌పీసీ సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేశారు. వారంలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

 

09:45 - February 13, 2016

రాంచీ : శ్రీలంకతో తొలి ట్వంటీ 20లో ఎదురైన పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది.  రెండో టీ 20 లో శ్రీలంకపై అద్భుత విజయాన్ని సాధించింది. తొలుత లంకేయులకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా.. ఆపై వారిని కట్టడి చేసి 69 పరుగుల తేడాతో మరపురాని గెలుపును సొంతం చేసుకుంది. దీంతో మూడు టీ 20ల సిరీస్  1-1తో సమం అయ్యింది.
శ్రీలంకపై భారత్‌ అద్భుత విజయం
మూడు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంకపై భారత్‌ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 127 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది. ఆదిలోనే లంకకు ఎదురుదెబ్బ తగలడంతో ఇక తేరుకోలేకపోయింది. ఓపెనర్ దిల్షాన్ పరుగులేమీ చేయకుండా తొలి వికెట్ గా పెవిలియన్ చేరితే, ఆ తరువాత ప్రసన్న కూడా అదే బాట పట్టాడు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, ఆశిష్ నెహ్రా, బూమ్రా, జడేజాలకు తలో రెండు వికెట్లు లభించాయి.
197 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచిన టీమిండియా 
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 197 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 25 బంతుల్లో 51 పరుగులతో దూకుడుగా ఆడి భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. జట్టు స్కోరు 75 పరుగుల వద్ద శిఖర్ ధావన్ తొలి వికెట్ గా అవుట్ కావడంతో టీమిండియా దూకుడు కాస్త తగ్గింది. అనంతరం రోహిత్ శర్మ 35 బంతుల్లో 43 పరుగులు చేసి బాధ్యతాయుతంగా ఆడి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అజింక్యా రహానే 25 పరుగులు,సురేష్ రైనా 30 పరుగులు, పాండ్యా 27పరుగులతో  జాగ్రత్తగా ఆడటంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ డకౌట్‌గా పెవిలియన్ కు చేరగా, కెప్టెన్ ధోనీ నాటౌట్ గా నిలిచాడు.
శ్రీలంక పేస్ బౌలర్ తిషారా పెరీరా అరుదైన ఘనత
ఈ మ్యాచ్‌లో శ్రీలంక పేస్ బౌలర్ తిషారా పెరీరా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. హ్యాట్రిక్ సాధించి టీ 20ల్లో ఆ ఘనతసు సాధించిన తొలి లంక క్రికెటర్ గా నిలిచాడు. 19వ ఓవర్ ను వేసిన పెరీరా హ్యాట్రిక్ తో శభాష్ అనిపించాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో భారత ఆటగాళ్లను బోల్తా కొట్టించాడు. నాల్గో బంతికి పాండ్యాను అవుట్ చేసిన పెరీరా.. ఆ తరువాత రైనా, యువరాజ్ లను పెవిలియన్ కు పంపాడు. దీంతో ఓవరాల్ గా టీ 20ల్లో హ్యాట్రిక్ సాధించిన నాల్గో ఆటగాడిగా పెరీరా గుర్తింపు పొందాడు. అంతకుముందు బ్రెట్ లీ,జాకబ్ ఓరమ్, సౌతీలు హ్యాట్రిక్ లు సాధించిన వారిలో ఉన్నారు.

 

09:40 - February 13, 2016

పవన్‌కళ్యాణ్‌, ఎన్టీఆర్‌ దగ్గర్నుంచి ఈ మధ్యకాలంలో సినిమాల్లో పాటలు పాడేందుకు హీరోలందరూ అమితోత్సాహం చూపిస్తున్నారు. పైగా వారు పాడిన పాటలకు మంచి పాపులారిటీ రావడంతో పాట పాడేందుకు ఏమాత్రం సంకోచించడం లేదు. పాటలు పాడే హీరోల జాబితాలోకి తాజాగా అల్లు అర్జున్‌ కూడా చేరబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ రూపొంది స్తున్న 'సరైనోడు' చిత్రం కోసం అల్లు అర్జున్‌ ఓ పాట పాడారని సమాచారం. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తోంది. నటుడిగా, డాన్సర్‌గా ప్రేక్షకుల్ని అలరించిన అల్లు అర్జున్‌ గాయకుడిగా ఎంత మేరకు ఆకట్టుకుంటాడో వేచి చూద్దాం.

09:31 - February 13, 2016

మెదక్ : నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం అయిందన్నారు. అంతకంటే ముందు మాక్ పోలింగ్ కూడా నిర్వహించామని చెప్పారు. 286 కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. 54 సమస్యాత్మక కేంద్రాలు, 65 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సెంట్రల్ పారా మిలిటరీ బలగాలను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ ను రెండు సార్లు కలవడం జరిగిందన్నారు. రథం ఏర్పాటు చేసి.. ఓటర్లలలో అవగాహన కల్పించేందుకు ప్రచారం చేశామని తెలిపారు.   

 

'ఓటుకు నోటు' నిందితుడు ముత్తయ్యకు ఎసిబి నోటీసులు

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు నిందితుడు ముత్తయ్యకు ఎసిబి నోటీసులు జారీ చేసింది. ఈమేరకు ఉప్పలోని ఆయన ఇంటికి వెళ్లి అధికారుల నోటీసులు ఇచ్చారు. 160 సీఆర్ పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. వారంలోగా విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.

08:51 - February 13, 2016

ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపులు పరిపాటిగా మారాయని... పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని వక్తలు పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో విశ్లేషకుడు వినయ్ కుమార్, టీడీపీ నాయకురాలు శోభారాణి, టీఆర్ ఎస్ నేత నరేంద్రగౌడ్ లు పాల్గొని, మాట్లాడారు. తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని వాపోయారు. ఎన్నికలు ధనార్జనగా మారాయన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని... లేదా దాని వల్ల ఉపయోగం లేకపోతే తీసివేయాలని చెప్పారు. దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత అరుణ్ సాగర్ మృతి విచారకరం, బాధాకరం. సాగర్ మృతి మీడియా, ప్రజాస్వామిక వాదులకు తీరని లోటన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:42 - February 13, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ ఎన్నికలు ముగిశాయి. పార్టీలు ఏవైనా.. 150 మంది కార్పొరేటర్‌లు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది కొత్తవారే. మేయర్‌ కూడా ఈ పదవికి కొత్తే. మరి వీరి పాలన ఎలా సాగబోతోంది..? అసలు నగరపాలక సంస్థ పాలన గురించి జీహెచ్‌ఎంసీ చట్టం ఎలాంటి విధివిధానాలను సూచిస్తోంది...? కార్పొరేటర్‌ల అధికారాలేంటి..? నిధుల మంజూరులో వారి పాత్ర ఏంటి..? వారికి ఉన్న ఇతరత్రా సౌకర్యాలు ఏంటి..? ఈ అంశాలపై 10టీవీ స్పెషల్ స్టోరీ..
15 మంది సభ్యులతో స్టాండింగ్‌ కమిటీ
హైదరాబాద్‌ అభివృద్ధిలో జీహెచ్ ఎంసీ పాత్ర చాలా కీలకమైంది... జీహెచ్‌ఎంసీ రూపొందించుకున్న ప్రత్యేక చట్టం ప్రకారమే.. నగరపాలక సంస్థ పాలన కొనసాగుతోంది. మేయర్‌గా ఎన్నికైన వ్యక్తి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. నగర పాలకమండలి కచ్చితంగా జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం.. వివిధ కమిటీల సూచనల మేరకే పాలన సాగించాల్సి ఉంటుంది. కార్పొరేషన్‌, కమిషనర్‌, స్టాండింగ్‌ కమిటీ, వార్డ్‌ కమిటీలు.. పరిపాలనలో ఈ నాలుగూ అత్యంత కీలక విభాగాలు. ఇవి తీసుకునే నిర్ణయం మేరకే నిధుల మంజూరు.. పనుల వేగవంతం సాధ్యం.
మేయర్‌కు రూ. 2కోట్లవరకూ మంజూరు చేసే అధికారం
కార్పొరేషన్‌ విభాగంలో ఆయా శాఖలు పనులను చేపడతాయి. ఇక రెండో విభాగమైన స్టాండింగ్‌ కమిటీ పరిపాలనలో అత్యంత కీలకమైనది. ఈ కమిటీలో 15మంది సభ్యులుంటారు.. ప్రతి సంవత్సరమూ ఈ కమిటీని ఎన్నికల ద్వారా నియమిస్తారు. ఈ కమిటీకి మేయరే చైర్మన్‌గా వ్యవహరిస్తారు. నిధుల మంజూరులోనూ ఈ కమిటీకి మేయర్‌ స్థాయిలోనే అధికారాలుంటాయి. వివిధ అభివృద్ధి పనుల కోసం.. మేయర్‌ నేరుగా 2కోట్ల రూపాయల వరకూ నిధులను మంజూరు చేయొచ్చు.. స్టాండింగ్‌ కమిటీకి అయితే 3కోట్ల రూపాయల వరకూ మంజూరు చేసే అధికారం ఉంటుంది. అంతకు మించి నిధులు ఇవ్వాలంటే మాత్రం.. సర్వసభ్య సమావేశంలో చర్చించి అనుమతి తీసుకోవాలి..
వార్డ్ కమిటీలకు ఛైర్మన్‌గా కార్పొరేటర్
ఎంత పెద్దస్థాయిలో ఉన్నా... మేయర్‌, కమిషనర్‌లే అయినా సరే ఇష్టానుసారంగా నిధులు ఖర్చు చేసే అధికారం లేదు.. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం యాభైవేల రూపాయలు తక్షణ సాయం మంజూరుచేసే అధికారం మేయర్‌కు ఉంటుంది..
నగర పాలనలో వార్డు కమిటీలు కీలక భూమిక
ఇక వార్డు కమిటీలూ నగర పాలనలో కీలక భూమిక పోషిస్తాయి. ఆయా డివిజన్లనుంచి ఎన్నికైన కార్పొరేటర్‌ వార్డు కమిటీల ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.. వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులను వార్డు సభ్యులతో చర్చించి మంజూరు చేస్తారు..
మేయర్‌ వేతనం రూ. 50వేలు
ఇక జీతాల విషయానికివస్తే కార్పొరేటర్లకు ప్రతి నెలా ఆరువేల రూపాయలను జీతంగా చెల్లిస్తారు.. ఫోన్‌ బిల్లుకోసం మరో రెండు వేలు ఇస్తారు.. మేయర్‌కు 50వేలు... డిప్యూటీ మేయర్‌కు 25వేల రూపాయలు గౌరవ వేతనంగా ఇస్తారు.. ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రజాప్రతినిధులు.. అధికారాలను అనుభవించడమే కాదు.. జీహెచ్ ఎంసీ చట్టంలోని సెక్షన్ 630 ప్రకారం బాధ్యతగానూ వ్యవహరించాలి.. తమ డివిజన్లలో ప్రజల అవసరాలు గుర్తించి సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి..
స్టడీ టూర్లకు అవకాశం
ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు..? వాటిని గ్రేటర్‌లో అమలు చేసే అవకాశాలు ఏంటి అన్న అంశాలపై అధ్యయన యాత్రలకు వెళ్లే అవకాశమూ కార్పొరేటర్‌లకు ఉంటుంది. అయితే దీనికి ముందుగా స్టాండింగ్‌ కమిటీల అనుమతిని పొందడం తప్పనిసరి. ఇలా ప్రతి విషయంలోనూ ఎలా వ్యవహరించాలన్న స్పష్టమైన నిబంధనలను జీహెచ్‌ఎంసీ చట్టంలో రూపొందించారు.

 

08:33 - February 13, 2016

హైదరాబాద్ : బంగారం పరుగుకు బ్రేక్‌ పడింది. 10 గ్రాముల 24 క్యారెట్లు బంగారం ధర 30 వేలకు చేరింది. కిలో వెండి ధర కూడా గణనీయంగా పెరింది. దిగుమతి సుంకం పెంపుతో బంగారం, వెండి కనీస ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి.  
ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, క్రూడ్ ధరలు, స్టాక్ మార్కెట్ల పతనం, రూపాయి విలువ బలహీనత నేపథ్యంలో పసిడి, వెండి ధరలు పరుగులు పెగుతున్నాయి. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా ప్రస్తుతం భారత్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల ధర  30 వేల 17రూపాయలతో వద్ద ట్రేడవుతోంది. 
వెండి కేజీ ధర రూ. 38 వేల 566  
వెండి కేజీ ధర రూ. 38 వేల 566 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే దేశీ మార్కెట్లలో  పసిడి ధర  రూ.1,000కి పెకైగసే అవకాశం ఉంది.
ముంబైలో పసిడి ధర రూ. 28,985
ముంబై ప్రధాన మార్కెట్‌లో 10 గ్రాములకు 99.9 స్వచ్ఛత పసిడి రూ. 28,985కి చేరింది.  99.5 స్వచ్ఛత పసిడి ధర కూడా ఇంతే మొత్తం పెరిగి రూ.28,835కు ఎగసింది. పసిడికి ఈ ధర గడిచిన  ఏడాదిన్నరలో ఇది గరిష్ట స్థాయిగా చెప్పవచ్చు. 2014 మే 20 తరువాత ఈ స్థాయికి ధరలు ఎగయడం ఇదే తొలిసారి. ఇక వెండి కేజీ ధర ఏకంగా రూ.1,215 ఎగసి రూ.38,000కి ఎగసింది.
బంగారం, వెండి లోహాలకు డిమాండ్
అంతర్జాతీయ సంకేతాలతో పాటు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయంగా సైతం బంగారం, వెండి లోహాలకు డిమాండ్ ఏర్పడింది. కాగా, భారత్ పసిడి డిమాండ్ 2015లో 849 టన్నులుగా నమోదైందని... ధరలు తగ్గిన పరిస్థితుల్లో కొనుగోలు దారులు జాగరూకతగా వ్యవహరించడమే డిమాండ్ దాదాపు నిశ్చలంగా ఉండడానికి కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్  నివేదిక పేర్కొంది. 

08:23 - February 13, 2016

మెదక్ : నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. 286 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. లక్షా 88 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 146 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల పరిశీలకులుగా నలుగురు ఐఎఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలిస్తున్నారు. 

07:56 - February 13, 2016

హైదరాబాద్ : పైకి గంభీరంగా దర్శనమిస్తున్న టీటీడీపీ నేతలు.. లోపల మాత్రం ఇంకా ఎంత మంది పార్టీని వీడతారోనన్న టెన్షన్ మొదలైంది. దీంతో తెలుగుతమ్ముళ్లు ముందస్తు చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పార్టీ ఫిరాయించిన నేతలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
పార్టీ ఫిరాయింపుపై తెలుగు తమ్ముళ్ల గుర్రు
గత వారం రోజులుగా టీడీపీకి చెందిన ఐదుగురు నేతలు పార్టీని ఫిరాయించడంపై తెలుగు తమ్ముళ్లుగా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారం తిరిగి తిరిగి స్పీకర్ కార్యాలయానికి చేరింది. తాము గ్రూపుగా టీఆర్ఎస్ లో విలీనం అవుతామని చెబుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు స్పీకర్ కు ఇచ్చిన లేఖపై టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కౌంటర్ ఎటాక్ ఇచ్చింది.
ఎర్రబెల్లి లేఖ చెల్లదు : రేవంత్
ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన లేఖ చెల్లదని స్పీకర్ కార్యాలయానికి లిఖిత పూర్వకంగా తెలియజేశారు రేవంత్ రెడ్డి. విలీనం అంటే శాసనసభాపక్షమే కాదు మొత్తం పార్టీ మరో పార్టీ లోకి విలీనం కావడానికి అంగీకరించాలన్నారు. గతంలో పీఆర్పీ పార్టీ మొత్తంగా కాంగ్రెస్ లో విలీనం అయిందన్న ఆయన ఉత్తరప్రదేశ్ లో బీఎస్పీ ఎమ్మెల్యేల విషయంలో అక్కడి హైకోర్టు.. ఎమ్మెల్యేల విలీనం చెల్లదని తీర్పు నిచ్చిందన్నారు. దీంతో వారిపై అనర్హత వేటు తప్పదన్నారు రేవంత్ . పార్టీ మారిన ఎమ్మెల్యే , ఎమ్మెల్సీలను స్పీకర్ వెంటనే అనర్హులుగా ప్రకటించాలన్నారు.

హైకోర్టుకు వెళ్తామంటున్న టీ.టీటీపీ నేతలు

అటు శాసనమండలిలోను పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని... మండలిలో శాసనసభాపక్షం విలీనం అయిందని చెబుతున్న అంశాలపై హైకోర్టుకు వెళ్తామంటున్నారు టీ టీటీపీ నేతలు. పార్టీ మారితే 2/3వంతు ఎమ్మెల్యేలు, జనరల్ బాడీ మీడింగ్ పెట్టుకుని తమను విలీనం చెయ్యాలన్నా..తమను నిజమయిన టీడీపీ వారిగా గుర్తించాలన్నా పార్టీ నుండి కూడా అనుమతి తీసుకోవాలన్నారు రావుల. ఈ తరహా విషయాలను తేల్చాల్సింది స్పీకర్ కాదని ఎన్నికల కమిషన్ అని వారు పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని చూసిన నేతలందరూ కాల గర్భంలో కలిసిపోయారన్నారు.
పార్టీ మారిన నేతలపై అనర్హత పిటీషన్
పార్టీ మారిన తమనే నిజమయిన తెలుగుదేశంగా గుర్తించాలంటున్న ఫిరాయింపుదారులకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది టీడీపీ. ఇదే సమయంలో పార్టీ మారిన నేతలపై అనర్హత పిటీషన్ వేసింది టీ టీడీపీ. మరి వీరి వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.

 

కొనసాగుతున్న నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్‌

మెదక్ : జిల్లాలోని నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 286 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలతో పోలింగ్ సరళిని చిత్రీకరణ చేయనున్నారు. నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

07:45 - February 13, 2016

విశాఖ : విశాఖపట్నం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమెరికా ట్రేడ్ డెవలప్ మెంట్ ఏజెన్సీలతో  ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. అమెరికాతో ఒప్పందాలు చేయడం సంతోషంగా ఉందన్నారు బాబు.   
అమెరికా ఏజెన్సీలతో పలు కీలక ఒప్పందాలు
విశాఖపట్నంలో అమెరికా ట్రేడ్ డెవలప్ మెంట్ ఏజెన్సీలతో ఏపీ ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది.  వివిధ దేశాల ప్రతినిధులు అమెరికా ప్రతినిధి మెహనాజ్ అండ్ శానీ , హితాకే మానీ లానీగాంగ్ యూఎస్ డెలిగేట్ రిచర్డ్ వర్మ విశాఖకు రావడం సంతోషంగా ఉందని.. అమెరికా, అక్కడి సంస్థలతో  కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. దేశంలోనే  స్మార్ట్ సిటీల జాబితాలో విశాఖ రెండో సిటీగా ఎంపికైందన్నారు సీఎం.  ప్రధాని మోడీ తో పలు దఫాలుగా విశాఖ అభివృద్ధిపై చర్చించామన్నారు.
సీఐఐ సదస్సులో 72 బిలియన్ డాలర్స్  పెట్టుబడులు 
హుదూద్ వంటి తుఫాన్ లు విశాఖను అతలాకుతలం చేసినా.. రెండు అంతర్జాతీయ కార్యక్రమాలు జరిగాయన్నారు బాబు. 72 బిలియన్ డాలర్స్ ను సీఐఐ సదస్సులో పెట్టుబడులుగా  సాధించామన్నారు బాబు.  అంతర్జాతీయ ప్లీట్ రివ్యూను విజయవంతంగా నిర్వహించామని దాదాపు 50 దేశాల ప్రతినిధులు భారత ప్రధానికి సెల్యూట్ చేయడం బహుషా ఏ దేశ ప్రధానికి దక్కని గౌరవంగా భావిస్తున్నామన్నారు బాబు. 
భారత్ లో అపార నిల్వలకు అవకాశాలు 
 భారత్ లో అవకాశాలు వనరులు ఎక్కువగా ఉన్నాయని.. చైనా కంటే భారత్ మెరుగైనా స్థితిలోనే ఉందన్నారు... రాబోయే 20, 30 సంవత్సరాలలో ప్రపంచ దేశాలలో భారత్ వృద్దిలో తిరుగుండదన్నారు బాబు.  అవకాశాలు , అపార వనరులున్న దేశం భారత్ అన్నారు బాబు. భారత్ నుండి ప్రపంచానికి  విద్య, ఉపాధి కల్పనకు కావాల్సిన అన్ని అవసరాలు భారత్ లో ఉన్నాయన్నారు. 
చెన్నై - విశాఖ‌ మద్య పారిశ్రామిక కారిడార్
చెన్నై - విశాఖ‌ పారిశ్రమిక కారిడార్  గా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్దంగా ఉన్నాయన్నారు.  బెంగుళూరు చెన్నై -విశాఖ మద్య మరో పారిశ్రామిక  కారిడార్ ను   జైకా సహకారంతో  ముందుకు తీసుకెళుతున్నామన్నారు. రానున్న రోజుల్లో  విశాఖ ను లాజిప్టిక్ హబ్ గా మారుస్తామన్నారు. జైకా సహకారంతోనే  చెన్నై , విశాఖ కృష్ణపట్నం మరో పారిశ్రమిక కారిడార్ గామారుస్తున్నామన్నారు. పశ్చిమాన ముంబై, తూర్పున విశాఖ అమెరికాలోని డాక్టర్లు ఏపీ వారేనన్నారు. రాబోయే కాలంలో విశాఖ ను నెం 1 స్మార్ట్ సిటీగా   మారుతుందని ఏపీ సీఎం  చంద్రబాబు  ఆశాభావం వ్యక్తం చేశారు. 

07:38 - February 13, 2016

హైదరాబాద్‌ : నగరంలోని పహాడీషరీఫ్‌లో 300 మంది పోలీసులతో కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 60 వాహనాలు, 3 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు రౌడీ షీటర్లను, ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

 

07:27 - February 13, 2016

మెదక్ : జిల్లాలోని నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉప ఎన్నికలో ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలిపై సిరాగుర్తు పెట్టనున్నారు. నియోజకవర్గంలో మొత్తం  ఒక లక్షా 88వేల 839  మంది ఓటర్లున్నారు. మొత్తం 286 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ప్రారంభమైన నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్‌

మెదక్ : జిల్లాలోని నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉప ఎన్నికలో ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలిపై సిరాగుర్తు పెట్టనున్నారు. నియోజకవర్గంలో మొత్తం  ఒక లక్షా 88వేల 839  మంది ఓటర్లున్నారు. మొత్తం 286 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

07:15 - February 13, 2016

హైదరాబాద్ : హయత్‌ నగర్ లోని బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా హయత్‌ నగర్ లోని బాటసింగారం వద్ద టిప్పర్ ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్యాబిన్‌లో చిక్కుకొని డ్రైవర్‌ మృతి చెందినట్లు సమాచారం. మరో ఆరుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న వారిని స్థానికులు కాపాడినట్లు సమాచారం. 

 

07:02 - February 13, 2016

మెదక్ : నారాయణఖేడ్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పోలింగ్‌  కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా.. అదనపు పోలీసు బలగాలను మోహరించారు. 
  286 కేంద్రాల్లో పోలింగ్‌
  మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 286 కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్‌ జరుగుతుంది. ఖేడ్‌ శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో.. ఈవిఎంల పనితీరును ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు.  అనంతరం, ఈవీఎంలు సహా.. పోలింగ్‌ మెటీరియల్‌ను పీఓలకు అందజేశారు. 
పోలింగ్‌కు గంట ముందే మాక్ పోలింగ్‌
ఈవీఎంల వినియోగంపై పోలింగ్‌ అధికారులకు ఇప్పటికే రెండు సార్లు శిక్షణనిచ్చారు. శనివారం ఉదయం.. పోలింగ్‌ ప్రారంభానికి గంట ముందే.. అంటే ఆరు గంటలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు. దీని ద్వారా ఈవీఎంలలో ఏవైనా సమస్యలుంటే తక్షణమే పరిష్కరించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. 
ప్రతి కేంద్రం వద్దా వెబ్‌ కాస్టింగ్‌
నారాయణఖేడ్‌ ఉప ఎన్నికల్లో 128 మంది మైక్రో అబ్జర్వర్లు అనునిత్యం పోలింగ్‌ సరళిని పరిశీలిస్తుంటారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద చిత్రీకరణకు అధికారులు సుమారు రెండు వందల మంది వీడియోగ్రాఫర్‌లను నియమించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రతి క్షణం ఏమి జరుగుతుందో తెలుసుకునేలా వెబ్‌ క్యాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. అలాగే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా..  పటిష్ఠ భద్రతనూ ఏర్పాటు చేశారు. 
తీవ్ర ఇబ్బందులుఎదుర్కొన్న పోలింగ్‌ సిబ్బంది  
మరోవైపు.. పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ కేంద్రం వద్ద సరైన భోజన, వసతి సదుపాయాలు లేకపోవడంతో.. పోలింగ్‌ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్‌ మెటీరియల్‌ను తీసుకు వెళ్లేందుకు సిబ్బందికి కేటాయించిన వాహనాలన్నింటికీ.. పట్టణంలోని ఒకే పెట్రోలు బంక్‌ వద్ద ఇంధనం నింపే ఏర్పాటు చేయడం వల్ల.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉన్నతాధికారుల అలసత్వంపై ప్రజలు, పోలింగ్‌ సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. 

 

కాసేపట్లో నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్‌

మెదక్ : జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్‌ కాసేపట్లో మొదలు కానుంది. ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉప ఎన్నికలో ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలిపై సిరాగుర్తు పెట్టనున్నారు.

06:57 - February 13, 2016

మెదక్ : జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్‌ కాసేపట్లో మొదలు కానుంది. ఎన్నికల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉప ఎన్నికలో ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలిపై సిరాగుర్తు పెట్టనున్నారు. నియోజకవర్గంలో మొత్తం  ఒక లక్షా 88వేల 839  మంది ఓటర్లున్నారు. మొత్తం 286 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 1,374 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 49 అత్యంత సమస్యాత్మక, 64 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్‌కేంద్రాల వద్ద 142 సెక్షన్ అమలుచేస్తున్నారు. 142 కేంద్రాల్లో వెబ్‌కెమెరాలతో పోలింగ్ సరళిని చిత్రీకరిస్తున్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను నారాయణఖేడ్‌లోని పాలిటెక్నిక్ కాలేజీకి తరలించనున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు

 

నేడు శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన

శ్రీకాకుళం : వైసిపి అధినేత వైఎస్ జగన్ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. వంశధార నిర్వాసితులను ఆయన కలవనున్నారు. 

నేడు రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్న కేసీఆర్

ఢిల్లీ : సీఎం కేసీఆర్ నేడు కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు. పలు అంశాలపై ఇరువురు చర్చించనున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి

హైదరాబాద్ : హయత్ నగర్ బాట సింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. టిప్పర్ ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందారు. మరో పది మంది బస్సులో ఇరుక్కుపోయారు. 

Don't Miss