Activities calendar

14 February 2016

సిరీస్ కైవసం..

వైజాగ్ : శ్రీలంకతో జరిగిన టి-20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. 3 మ్యాచ్ ల టి-20 సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడవ టి-20లో అలవోక విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దోని సేన లంకేయులను 82 పరుగులకే కుప్ప కూల్చారు. స్టార్ స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లు తీసి లంక నడ్డి విడిచాడు. తదనంతరం 83 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 13.5 ఓవర్లలోనే కేవలంఓ ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా బ్యాట్మెన్లలో ధావన్ 46 (నాటౌట్), రహానే (నాటౌట్), రోహిత్ 13 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రవి చంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. 

నేడు ఖమ్మంలో కేసీఆర్ పర్యటన..

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

మోడీతో అమీర్ ఖాన్ డిన్నర్..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సినీ నటుడు అమీర్ ఖాన్ శనివారం రాత్రి డిన్నర్ చేశారు. ఈ డిన్నర్ లో నటి కంగనా రనౌత్ కూడా పాల్గొన్నట్లు సమాచారం.

 

21:31 - February 14, 2016

హైదరాబాద్ : సీపీఎం కేంద్ర కార్యాలయంపై సంఘ్‌పరివార్‌ దాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీపీఎం కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తగులపెట్టారు. సంఘ్‌ పరివార్‌ చర్యలను తీవ్రంగా ఆక్షేపించారు. బీజేపీ అనుబంధ సంఘ్‌పరివార్‌ శ్రేణులు మరోసారి తమ అసహనాన్ని బయటపెట్టాయి. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడికి తెగబడ్డాయి. సంఘ్‌పరివార్‌ దాడికి నిరసనగా దేశ వ్యాప్తంగా సీపీఎం కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎం కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సీపీఎం కార్యాలయంపై దాడికి నిరసనగా మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్‌ దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతపురంలోనూ సీపీఎం నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీలోని సీపీఎం కార్యాలయంపై దాడి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా ర్యాలీ చేపట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టారు. సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా గుంటూరులో కూడా పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. శంకర్‌ విలాస్‌ సెంటర్‌ వరకు ర్యాలీ చేపట్టారు. బీజేపీ మతోన్మాద శక్తులపై వామపక్షాలు పోరాటం చేస్తూనే ఉంటాయని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. సీపీఎం కార్యాలయంపై దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. మతతత్వ శక్తులు మరోసారి తమ అసహనాన్ని బయటపెట్టాయని మండిపడుతున్నారు. 

21:28 - February 14, 2016

ఢిల్లీ : సీపీఎంను బలహీనపరిచేందుకే దాడులు చేస్తున్నారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి పేర్కొన్నారు. ఆదివారం సీపీఎం కేంద్ర కార్యాలయంపై ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టెన్ టివితో ఏచూరి మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌, కేరళ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే సీపీఎంను బలహీన పరచడమే లక్ష్యంగా సంఘ్ పరివార్‌ పావులు కదుపుతోందని విమర్శించారు. అలాగే బీజేపీ ప్రభుత్వం తన అసమర్థ విధానాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ఎందుకు జరిగిందో ? ఎవరు దాడి చేశారో వారిని అడగాలని, ఎవరు ప్రోత్సాహిస్తున్నారో స్పష్టంగా కనబడుతోందన్నారు. హెచ్ సీయూ లో రోహిత్ వేముల మృతి..ఐఐటి చెన్నై, ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ దాడి ఘటనలు ఇందుకు నిదర్శనమన్నారు. వారి సిద్ధాంతాలకు అనుగుణంగా చరిత్రను మార్చాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన తరువాత రాజకీయంతోనే సీపీఎం పోరాటం చేస్తుందని, దాడులు చేస్తే తాము ప్రిపేర్ అయి ఉన్నామని వారు గుర్తు పెట్టుకోవాలని ఏచూరి సూచించారు. 

భారత్ 29/1..

విశాఖపట్టణం : లంకతో జరుగుతున్న టీ -20 మ్యాచ్ లో భారత్ మొదటి వికెట్ ను కోల్పోయింది. రోహిత్ శర్మ (13) పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 5.3 ఓవర్లలో 29 పరుగులు చేసింది. ధావన్ 16, రహానే 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లంక జట్టు 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 

ఇండియా 12/0..

విశాఖపట్టణం : ఆఖరి టీ -20 మ్యాచ్ లో లంక జట్టు నిర్ధేశించిన 82 పరుగులు చేరుకోవడానికి భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. ధావన్ 10, శర్మ 2 పరుగులతో ఆడుతున్నారు. 

21:04 - February 14, 2016

ముంబై : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ముంబైలో మేక్ ఇన్ ఇండియా వారోత్సవ కార్యక్రమంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వేదిక మొత్తం మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనలో ఎవరైనా మృతి చెందారా ? ఎవరైనా గాయపడ్డారా ? అనేది తెలియాల్సి ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు రద్దు చేశారు. 
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆదివారం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవీస్, బాలీవుడ్ నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్, నటుడు అమీర్ ఖాన్, నటి హేమామాలిని తదితర ప్రముఖులు హాజరయ్యారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా వేదికపై మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు దట్టంగా వ్యాపించాయి. వేదికను కట్టెలు..దుస్తులు వాడడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. బిగ్ బికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ప్రముఖులను, రాజకీయ నేతలు, సినీ నటులను క్షేమంగా బయటకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. 

20:56 - February 14, 2016

ఢిల్లీ : సీపీఎం సెంట్రల్‌ కార్యాలయంపై సంఘ్‌ పరివార్‌ దాడికి తెగబడింది. సర్కారీ తప్పులను ఎత్తి చూపే భావ ప్రకటన స్వేచ్ఛపై అసహనం.. ప్రజాస్వామ్య వాదుల పట్ల... పాలక భారతీయ జనతాపార్టీ.. దాని అనుబంధ పరివార్‌ శ్రేణుల్లో పెల్లుబుకుతున్న అసహనం..ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై ఆదివారం.. సంఘ్‌పరివార్‌ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. దాడి సమయంలో.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. కార్యాలయంలోనే ఉన్నారు. సంఘ్‌ పరివార్‌కు చెందిన నలుగురు యువకులు.. ఈ సాయంత్రం ఒక్కసారిగా సీపీఎం కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయపు బోర్డుపై నల్లసిరాను పూశారు. పాకిస్థాన్‌ ముర్దాబాద్‌ అంటూ ఆ బోర్డుపై రాతలు రాశారు. బోర్డుపై తెల్లకాగితాలు అతికించారు.

ఒకరు అరెస్టు..
సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి.. పోలీసులు సుశాంత్‌ అనే యువకుడిని అరెస్టు చేసినట్లు సమాచారం. అతడినుంచి దాడికి పాల్పడ్డ మిగిలిన వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ జెఎన్‌యూలో 20 మంది విద్యార్థులపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ.. వామపక్షాలు.. బీజేపీ సర్కారును నిలదీయడమే.. సంఘ్‌ పరివార్‌కు కంటగింపుగా మారింది. తమపై వస్తున్న విమర్శలను రాజకీయంగా ఎదుర్కోలేక.. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోలేక... బీజేపీ, దాని అనుబంధ పరివార్‌ శ్రేణులు.. ఇలా ఓ జాతీయ పార్టీ కేంద్ర కార్యాలయంపైకి దాడికి తెగబడ్డారని ప్రజాస్వామ్య వాదులు ఆక్షేపిస్తున్నారు.

బెదిరింపు ధోరణలు..
జెఎన్‌యూలో ప్రభుత్వ ఆదేశాల మేరకే వీసీ నడచుకుంటున్నారని ఆక్షేపిస్తున్న వామపక్ష పార్టీల నేతలే లక్ష్యంగా బీజేపీ, దాని అనుబంధ పరివార్‌.. బెదిరింపు ధోరణికి దిగుతున్నాయి. ఇప్పటికే జెఎన్‌యూ ఘటనలో సీపీఐ జాతీయ నేత డి.రాజా కుమార్తెపైన కేసు నమోదు చేయడం.. తాజాగా సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం గమనార్హం. తాజా ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని వామపక్ష, ప్రగతిశీల శక్తులు డిమాండ్‌ చేస్తున్నాయి. 

భారత్ టార్గెట్ 83 పరుగులు..

విశాఖపట్టణం : ఆఖరి టీ -20 మ్యాచ్ లో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు, రైనా రెండు, నెహ్రా, బుమ్రా, జడేజా తలా ఒక వికెట్ తీశారు. 

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో అపశృతి..

ముంబై : మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం నిర్వహిస్తుండగా వేదికకు మంటలు అంటుకున్నాయి. దీనితో ప్రజలు పరుగులు తీశారు. భారీగా మంటలు అల్లుకున్నాయి. ఘటనా సమయంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, హేమమాలిని, అమీర్ ఖాన్ తదితరులున్నారు. 

లంక 79/9..

విశాఖపట్టణం : ఆఖరి టీ-20 మ్యాచ్ లో భారత బౌలర్లు విజృంభించారు. 16.4 ఓవర్లలో లంక జట్టు 9 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. 

20:24 - February 14, 2016

విజయవాడ : పాకల తొలగింపును ప్రశ్నించిన..పేదలకు న్యాయం చేస్తానన్న అధికార పార్టీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పటపట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆగ్రహించిన వల్లభనేని వంశీ తనకు కేటాయించిన గన్ మెన్లను తిరస్కరిస్తున్నట్లు డీజీపీకి లేఖ రాశారు.
ఆదివారం రామరప్పపాడులో పేదలు నివాసం ఉంటున్న గుడిసె వాసులపై విజయవాడ మున్సిపల్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపారు. పాకలను తొలగించే ప్రయత్నం చేశారు. పేదలందరూ అధికారులకు అడ్డం తిరిగారు. ముందస్తు నోటీసులు లేకుండానే నివాసాలను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వామపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాలు అక్కడికి చేరుకుని అధికారుల తీరును నిరసించారు. ఈ విషయం తెలుసుకున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేదలకు మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతానని, న్యాయం చేస్తానని పేదలకు హామీనిచ్చారు. అనంతరం పేదలతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. తనపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఎమ్మెల్యే వల్లభవనేని వంశీ తీవ్రంగా పరిగణించారు. దీనికి సంబంధించిన ఇష్యూను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని వంశీ భావిస్తున్నట్లు సమాచారం. 

20:21 - February 14, 2016

విశాఖపట్టణం :  శ్రీలంకతో జరిగిన టి-20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. 3 మ్యాచ్ ల టి-20 సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడవ టి-20లో భారత్ అలవోక విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దోని సేన లంకేయులను 82 పరుగులకే కుప్ప కూల్చింది. స్టార్ స్పిన్నర్ అశ్విన్ 4 వికెట్లు తీసి లంక నడ్డి విడిచాడు. తదనంతరం 83 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 13.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా బ్యాట్మెన్లలో ధావన్ 46 (నాటౌట్), రహానే (నాటౌట్), రోహిత్ 13 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రవి చంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. 
అశ్విన్ దండయాత్ర..                 
ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత దళం శ్రీలంకన్లకు చెమటలు పట్టించింది. బౌలర్ అశ్విన్ మంత్రానికి లంక బ్యాట్స్ మెన్స్ చతికిలపడ్డారు. ఆదిలోనే టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో లంక కష్టాల్లో పడిపోయింది. అశ్విన్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి ఓపెనర్ డిక్ వాలా (1) ను పెవిలియన్ పంపించాడు. అదే ఓవర్ లో ఆఖరి బంతికి దిల్షాన్ (1) కూడా అశ్విన్ అవుట్ చేయడంతో భారత శిభిరంలో ఉత్సాహాన్ని మరింత పెంచాడు. మరో ఓవర్ వేసిన అశ్విన్ చండిమాల్ (8) వెనక్కి పంపాడు. ఈ తరుణంలో లక జట్టు కేవలం 20 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. గునరత్నే (4), సిరివర్థన (4), శనక (19), ప్రసన్న (9) పరుగులు చేసి వెనుదిరిగారు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా నెహ్రా, జడేజాలు చెరో ఒక వికెట్ తీశారు. 

వల్లభనేనిపై కేసు నమోదు..

విజయవాడ : టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పటమట పీఎస్ లో కేసు నమోదైంది. రామవరప్పపాడు వద్ద పాకల తొలగింపుపై బాధితులతో కలిసి వంశీ రాస్తారోకోలో పాల్గొన్నారు. 

లంక 48/6..

విశాఖపట్టణం : ఆఖరి 20 మ్యాచ్ లో శ్రీలంక పటపట వికెట్లు కోల్పోతోంది. 5 ఓవర్లలో 21 పరుగులు చేసిన లంక జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. నాలుగు వికెట్లను అశ్వన్ తీశాడు. 

జార్ఖండ్ లో సరస్వతి విగ్రహం ఆవిష్కరణలో విషాదం..

జార్ఖండ్ : సరస్వతి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. పది మంది మృత్యువాత పడ్డారు. 

అశ్విన్ మంత్రం..లంక 21/4..

విశాఖపట్టణం : ఆఖరి 20 మ్యాచ్ లో శ్రీలంక పటపట వికెట్లు కోల్పోతోంది. 5 ఓవర్లలో 21 పరుగులు చేసిన లంక జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. నాలుగు వికెట్లను అశ్వన్ తీశాడు. 

శ్రీలంక వికెట్లు పటపట..

విశాఖపట్టణం : ఆఖరి 20 మ్యాచ్ లో శ్రీలంక పటపట వికెట్లు కోల్పోతోంది. 2.2 ఓవర్లలో 12 పరుగులు చేసిన లంక జట్టు మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లను అశ్విన్ తీశాడు. 

19:40 - February 14, 2016

హైదరాబాద్ : సినీ స్టార్ల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆరో సీజన్ టైటిల్ ను...తెలుగు వారియర్స్ గెలుచుకొంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముగిసిన ఫైనల్లో తెలుగు వారియర్స్ 9 వికెట్ల తేడాతో మూడుసార్లు విజేత కర్నాటక బుల్ డోజర్స్ ను చిత్తుచేసింది. ఈ టైటిల్ సమరంలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బుల్ డోజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు సాధించింది. 208 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన తెలుగు వారియర్స్ కు..ఓపెనర్లు సచిన్ జోషీ, ప్రిన్స్ మొదటి వికెట్ కు సెంచరీభాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. సచిన్ జోషీ 44 బాల్స్ లో సెంచరీతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత...వారియర్స్ మరి వెనుదిరిగి చూడకుండా ఆడి...టైటిల్ సొంతం చేసుకొంది. రాష్ట్రమంత్రి కేటీఆర్ ఈ టోర్నీ ఫైనల్స్ కు ప్రధాన అతిథిగా హాజరయ్యారు. సినీహీరోలు నాగార్జున, దగ్గుబాటి రానా, వెంకటేశ్ తమజట్టును ఊత్సాహపరుస్తూ సందడి సందడి చేశారు. భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్...తెలుగు వారియర్స్ కు శిక్షకునిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

19:38 - February 14, 2016

చిత్తూరు : జిల్లాలో షబహా అలియాస్‌ సంధ్య మర్డర్‌ మిస్టరీ వీడింది. ప్రేమికుడే యముడిలా మారి.. ఆమె ప్రాణాలు హరించాడని పోలీసులు తేల్చారు. ప్రేమికుల రోజున బయటపడ్డ ఈ అనుమానపు ప్రియుడి ఉదంతం.. స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు జిల్లాలో షబహా అలియాస్‌ సంధ్యను ఆమె ప్రియుడు నారాయణరెడ్డే హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. మూడేళ్లు ప్రేమాయణం సాగించి.. అనుమానంతో.. ప్రియురాలిని కిరాతకంగా హతామర్చి.. ఇంట్లోనే పాతిపెట్టినట్లు తేల్చారు. ప్రేమికుల రోజున బయటపడ్డ ఈ క్రూర ప్రేమికుడి ఉదంతం.. స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం గంగిరెడ్డిగారిపల్లె వాసి వేమ నారాయణరెడ్డి వాల్మీకిపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. అక్కడే కంప్యూటర్‌ కేంద్రం నిర్వహిస్తున్నారు. అదే మండలం పునుగుపల్లె గ్రామానికి చెందిన షబహా అలియాస్‌ సంధ్య వేమనారాయణ రెడ్డి కంప్యూటర్‌ కేంద్రంలో 2010 సంవత్సరంలో ఉద్యోగంలో చేరారు. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.

అనుమానం..
కొద్దికాలానికి షబహా మరో ఉద్యోగం చూసుకొని బెంగళూరు వెళ్లగా, భరించలేని నారాయణరెడ్డి ఆమెను వెనక్కి తీసుకొచ్చి.. పేరును సంధ్యగా మార్చి.. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆటోమొబైల్‌ షాపులో ఉద్యోగానికి కుదిర్చాడు. ఆధార్‌కార్డు, ఓటర్‌ కార్డుల్లో కూడా సంధ్యగా పేరు మార్చాడు. తిరుపతి రాజన్న పార్కు సమీపంలో ఓ అద్దె ఇంట్లో ఆమెను ఉంచి.. వారానికొకసారి వచ్చి వెళుతుండేవారు. ఇలా కొంత కాలం సాగిన తర్వాత, అదే షాపులో పనిచేస్తున్న యువకునితో షబహా సన్నిహితంగా మెలుగుతున్నట్లు వేమనారాయణరెడ్డి అనుమానించాడు.

అదృశ్యం..
ఈ నేపథ్యంలో జనవరి 28న తిరుపతి వచ్చిన వేమనారాయణరెడ్డి షబహాను పెళ్లి చేసుకుందామని కోరగా, తనకు ఇప్పట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని షబహా చెప్పడంతో గొడవపడ్డారని తెలిసింది. అదే రోజే ఆమె అదృశ్యమైంది. ఆటోమొబైల్‌ షాపు సిబ్బంది సమాచారంతో.. షబహా తల్లి.. పడమటి పోలీసు స్టేషన్‌లో ఫిబ్రవరి రెండున ఫిర్యాదు చేశారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వేమనారాయణరెడ్డి విషయం వెలుగులోకి వచ్చింది. అతడిని అదుపులో తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా పెళ్లి చేసుకోలేదనే కోపంతో షబహాను తానే హతమార్చి తన స్వగ్రామం గంగిరెడ్డిగారిపల్లెలోని ఇంటిలో పాతిపెట్టినట్లు వెల్లడించాడు. అతడి సమాచారం ఆధారంగా పోలీసులు షబహా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. షబహా మరణవార్తతో ఆమె స్వగ్రామం వాల్మీకిపురం మండలం పునుగుపల్లెలో విషాదచ్ఛాయలు నెలకొన్నాయి. తండ్రి చనిపోయిన తర్వాత తల్లి రెక్కల కష్టంపై బాగా చదువుకున్న షబహా జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయిందంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీలంక బ్యాటింగ్..అప్పుడే రెండు వికెట్లు..

విశాఖపట్టణం : శ్రీలంక బ్యాటింగ్ ఆరంభించింది. చివరి టీ-20 మ్యాచ్ విశాఖలో జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన శ్రీలంకకు ఆదిలోనే దెబ్బ తగిలింది. డిక్ వాల (0) అశ్విన్ పెవిలియన్ పంపించాడు. అనంతరం దిల్షాన్ ఎల్ డబ్యూగా వెనుదిరిగాడు. 1.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది. 

19:31 - February 14, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. రోడ్డు ప్రమాదంలో కొందరు..మరికొన్ని ఘటనలో మరికొంతమంది మృత్యువాత పడ్డారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో పదిమంది మృతువాత పడ్డారు. విశాఖ, శ్రీకాకుళం, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో ఈ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. విశాఖ జిల్లా యలమంచిలి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకొస్తుండగా ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌.. ప్రమాదవశాత్తూ..వంతెనపై నుంచి కిందికి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

మహబూబ్ నగర్ లో..
అటు.. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై కోనేటిపూర్‌ స్టేజీ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. కారు-ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులను నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన కూలీలు రమేశ్‌, సారయ్య, పాపులుగా పోలీసులు గుర్తించారు. కూలి నిమిత్తం వంగూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

సినీ నటి ప్రణీతకు ప్రమాదం..
మరోవైపు.. ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి.. ప్రముఖ సినీనటి ప్రణీత స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వస్తుండగా నల్గొండ జిల్లా మోతె వద్ద.. ఆమె ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి.. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రణీత, ఆమె తల్లి, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఖమ్మంలో ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి హాజరై తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రహదారి పనులు జరుగుతుండడంతో.. అక్కడే ఉన్న సిబ్బంది తక్షణం స్పందించి అంబులెన్స్‌ను పిలిపించి సహాయ చర్యలు చేపట్టారు. తమకు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని, అందరం క్షేమంగా ఉన్నామని ప్రణీత ట్విట్టర్లో పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల ప్రణీత స్వల్పగాయాలతో బయటపడ్డారు.

శ్రీకాకుళంలో..
శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం సిరికొండలో ఆటో-ఆర్టీసి బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

ఆదిలాబాద్ లో ...
అటు ఆదిలాబాద్‌ జిల్లా భైంసాలోనూ పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుండి బైంసాకు చేరుకున్న ఆర్టీసి లగ్జరీ బస్సు షార్ట్‌ సర్క్యూట్‌తో పూర్తిగా దగ్దమైంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుండి బైంసాకు ఉదయం 6 గంటలకు చేరుకున్న బస్సు ప్రయాణికులందరిని దింపిన తర్వాత డిపోకు చేరుకుంది. ఆ తర్వాత గంటసేపటికే బస్సు షార్ట్‌ సర్క్యూట్‌తో మంటల్లో కాలిపోయింది. విషయం తెలిసిన ఫైర్‌ సిబ్బంది డిపోకు చేరుకొని మంటల్ని ఆర్పేశారు.

మట్టిపెళ్లలు విరిగిపడి..
కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్‌ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా మట్టిపెళ్లలు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు. కంప్రెషర్‌తో బావిలో రంద్రాలు చేస్తుండగా..ఒక్కసారిగా పైనుంచి మట్టిగోడలు కూలడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో..ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెలవు రోజున జరిగిన ప్రమాదాలు ఏడు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. 

19:09 - February 14, 2016

ఢిల్లీ : తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీకి చెందిన నలుగురు ముష్కరులు పార్టీ కార్యాలయంపై దాడికి యత్నించారు. అందులో ఒకరిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏచూరి మీడియాతో మాట్లాడారు. దాడి జరగడం దారుణమని, దృష్టి మళ్లించడానికి ఇలాంటి ఘటనలకు పూనుకుంటున్నారని పేర్కొన్నారు. మహాత్మాగాంధీని చంపిన వాడిని హీరో అని కొలుస్తున్నారని, మోడీ అధికారంలోకి వచ్చాక మతతత్వ దాడులు పెరుగుతున్నాయన్నారు. జేఎన్ యూ యూనివర్సిటీలో దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని పేర్కొనడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేయడం జరుగుతోందన్నార. సాక్ష్యాధారాలతో పట్టుకుని శిక్షించడం జరగాలని తాము రాజ్ నాథ్ సింగ్ కు సూచించడం జరిగిందని, కానీ ఎలాంటి సాక్ష్యాధారలు లేకుండానే కొంతమందిని అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. హిందూ మతతత్వ శక్తులు ఈ దాడులకు పాల్పడుతున్నారని, రాజకీయంగానే ఎదుర్కొంటామని ఏచూరి స్పష్టం చేశారు. 

దాడిని ఖండిస్తున్నాం - ఏచూరి..

ఢిల్లీ : తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. 

టాస్ గెలిచిన భారత్..

విశాఖపట్టణం : భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగే మూడో టీ-20 మ్యాచ్ కొద్దిసేపటిలో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. 
భారత్ : రోహిత్ శర్మ, ధావన్, రహానే, రైనా, యువరాజ్ సింగ్, ధోని, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా.
శ్రీలంక : దిక్ వాలా, దిల్షాన్, చండిమాల్, కపుగెదెర, శనక, సిరివర్థన, పెరీరా, సేననాయకే, చమీర, వాండర్సే, రజిత.

సిద్ధిపేటలో గ్రూప్ 2 ఉచిత శిక్షణ తరగతులు..

మెదక్: సిద్దిపేటలో గ్రూప్-2 కోసం ఉచిత శిక్షణ తరగతులను మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రూప్-2 ఉచిత శిక్షణ కోసం వచ్చే విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో మాదిరిగా ఇక్కడ కోచింగ్ ఇస్తున్నామని పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 

రేపటి నుండి ఖమ్మంలో కేసీఆర్ పర్యటన..

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం బయల్దేరి వెళతారు. ముందుగా ఆయన ఖమ్మం నగరంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

దాడి ఘటనలో కఠిన చర్యలు తీసుకోవాలి - సీపీఎం..

ఢిల్లీ : సీపీఎం ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. రాజకీయ ప్రోద్భలంతోనే దాడి జరిగిందని, రాజకీయ దాడులను సీపీఎం తిప్పికొడుతుందని పేర్కొంది. 

దాడిని ఖండిస్తున్నాం - తమ్మినేని..

హైదరాబాద్ : సీపీఎం ప్రధాన కార్యాలయంపై ఎబీవీపీ, ఆర్ఎస్ఎస్ దాడిని ఖండిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. 

సీపీఎం కార్యాలయం దాడి దిగ్ర్భాంతికి గురయ్యాను - సురవరం..

ఢిల్లీ : సీపీఎం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం స్పందించారు. ఘటన జరిగిన విషయం తెలుసుకుని దిగ్ర్భాంతికి గురయ్యానన్నారు. కొంతకాలంగా దేశంలో అనే వర్గాల ప్రజలపై తీవ్రమైన దుష్ర్పచారం చేస్తున్నారని, అదుపులో పెట్టడానికి ప్రభుత్వం విఫలం చెందిందన్నారు.

ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి -వి. శ్రీనివాసరావు

ఢిల్లీ : సీపీఎం ప్రధాన కార్యాలయంపై జరిగిన ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎవరూ లేని సమయం చూసి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ముష్కరులు దాడికి యత్నించారని, పార్టీ బోర్డుకు నల్లరంగు పులిమారని తెలిపారు.

18:36 - February 14, 2016

హైదరాబాద్ : ఓయూలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రేమికుల రోజు సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టిన నిర్వాహకులను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ హాస్టల్ వద్ద ఐఎల్ యూ ఓ కార్యక్రమాన్ని నిర్శహించ తలపెట్టింది. ఉదయం నుండే పోలీసులు ఓయూలో భారీగా మోహరించారు. ఓయూకు వచ్చే దారులన్నింటినీ మూసివేశారు. పోలీసుల చర్యలను నిర్వాహకులు తీవ్రంగా ఖండించారు. తాము శాంతియుతంగానే వేడుకలు నిర్వహించడం జరుగుతోందని, దీనిని అడ్డుకుంటామని చెబుతున్న వారిని వదిలేసి తమను అదుపులోకి తీసుకోవడం ఏంటనీ ప్రశ్నించారు. ప్రజా స్వామ్య వాదులుందరూ నోరు విప్పాలని, కుల నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వానికి అండగా, రాజకీయ సిద్ధాంతానికి అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని తీవ్రంగా విమర్శించారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ప్రమోషన్ల కోసం ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారని పేర్కొన్నారు. రిజిష్ట్రార్ ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని, అడ్డుకోవడానికి పోలీసులకు ఎలాంటి రైట్స్ లేవన్నారు. ఆర్ఎస్ఎస్, మతోన్మాద శక్తులను అడ్డుకోకుండా తమను అడ్డుకోవడం దారుణమన్నారు. 

18:30 - February 14, 2016

ఢిల్లీ : సీపీఎం పార్టీ కేంద్ర కార్యాలయంపై ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ముష్కరులు జరిపిన దాడిని పలువురు ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అభివర్ణిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు పూనుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ముష్కరులు కొంతమంది సీపీఎం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని దాడికి యత్నించారు. నలుగురు రాళ్లు..కర్రలతో దాడికి ప్రయత్నించారు. సీపీఎం పార్టీ బోర్డుపై నల్లరంగు పులిమారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసు కమిషనర్ పార్టీ కార్యాలయానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఈ ఘటనపై టెన్ టివితో పలువురు నేతలు మాట్లాడారు.

ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి - వి.శ్రీనివాసరావు..
సీపీఎం ప్రధాన కార్యాలయంపై జరిగిన ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎవరూ లేని సమయం చూసి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ముష్కరులు దాడికి యత్నించారని, పార్టీ బోర్డుకు నల్లరంగు పులిమారని తెలిపారు. దీన్ని గమనించిన తమ కార్యకర్తలు పట్టుకోవడానికి ప్రయత్నించారని, ఒకరిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఒక పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నారని, భావా ప్రకటన స్వేచ్ఛ కన్నా తీవ్రమైనదన్నారు. జాతి వ్యతిరేకులు, దేశ ద్రోహులు అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. పఠాన్ కోట్ ఘటన జరిగినప్పుడు ఎక్కడున్నారు ? ఒక్కరోజులో జరిగాల్సిన ఆపరేషన్ ఐదు రోజుల పాటు కొనసాగిందని విమర్శించారు. ఇది క్షమించారని విషయమని, జేఎన్ యూలో ఘటనపై కొన్ని శక్తులు వామపక్షాలపై దుష్ర్పచారం చేస్తున్నారని, జేఎన్ యూ అధ్యక్షుడిని అరెస్టు చేశారని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది వామపక్ష పార్టీలని తెలిపారు. దీనిపై పోరాటం పోరాడుతున్న వారిపై దాడులకు దిగుతోందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు పొగొట్టుకున్న ఘన చరిత్ర సీపీఎంకు ఉందని, ఆర్ఎస్ఎస్ కు అలాంటి చరిత్ర లేదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

దిగ్ర్భాంతికి గురయ్యాను - సురవరం..
సీపీఎం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం స్పందించారు. ఘటన జరిగిన విషయం తెలుసుకుని దిగ్ర్భాంతికి గురయ్యానన్నారు. కొంతకాలంగా దేశంలో అనే వర్గాల ప్రజలపై తీవ్రమైన దుష్ర్పచారం చేస్తున్నారని, అదుపులో పెట్టడానికి ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ఈ దాడులు మరింత పెరిగే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు. మద్దతు తగ్గుతున్న కొద్ది..ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భంలో వత్తిడికి గురయి ఇలాంటి ఘటనలకు పూనుకుంటున్నారని విమర్శించారు. అంతేగాకుండా వ్యక్తిగతంగా.. రాజకీయంగా ఎదుర్కొనలేనప్పుడు..ఇలాంటి ఘటనకు పూనుకుంటున్నారని సురవరం పేర్కొన్నారు.

దాడులు చేయడమే పని - రామకృష్ణ..
దేశ వ్యాప్తంగా మతోన్మాదాలు పెట్రేగిపోతుండడానికి ఇది నిదర్శనమని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. తమకు అడ్డు లేదని, ఏదైనా చేయవచ్చని అనుకుని దాడులు చేయడమే ఒక పనిగా పెట్టుకుంటున్నారని విమర్శించారు. మోడీ అన్ని మాటలు మాట్లాడుతున్నారే కానీ ఇలాంటి ఘటనలపై స్పందించడం లేదన్నారు. జేఎన్ యూలో విద్యార్థి నాయకులపై దేశ ద్రోహ కేసులు పెట్టడంతో సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నేతలు పోరాటం చేయడం జరుగుతోందన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే సీపీఎం కార్యాలయంపై దాడి చేశారని రామకృష్ణ తెలిపారు.

దేశ వ్యాప్తంగా దాడులు - చాడ..
నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దేశ వ్యాప్తంగా దాడులు పెరిగిపోయాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్య దీనికి అద్దం పడుతోందన్నారు. గూండాయిజానికి దిగజాడరం..చట్టబద్ధంగా ఎదుర్కొనలేక ఇలాంటి ఘటనకు పూనుకొంటోందన్నారు. దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. 

శ్రీకాకుళంలో రోడ్డు ప్రమాదం..

శ్రీకాకుళం : పాలకొండ (మం) సిరికొండలో ఆటో - ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య..

నిజామాబాద్ : దర్పల్లి (మం) వెంగల్ పాడు తండాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకర్ (6), సుచిత్ర (6 నెలలు)కు ఉరి వేసి తల్లి అనిత (26) ఆత్మహత్య చేసుకుంది. కుటుంబకలహాలే కారణమని తెలుస్తోంది. 

పార్టీ ఆఫీసుపై దాడిని ఖండించిన సీపీఎం నేత మధు..

విజయవాడ : బీజేపీ మతోన్మాద రాజకీయాలతో అతి నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన ఖండించారు

రాష్ట్రానికి రావాల్సిన అంశాలన్నీ అడిగాం - వేణుగోపాలచారి..

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలను కేంద్రాన్ని అడిగామని చెప్పారు. కేంద్ర సర్కారుతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించుకుంటామని తెలిపారు. 

17:38 - February 14, 2016

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలను కేంద్రాన్ని అడిగామని చెప్పారు. కేంద్ర సర్కారుతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించుకుంటామని తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అంశాల వారీగా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. 

17:36 - February 14, 2016

మహబూబ్‌నగర్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంగూరు మండలం కోనేటిపూర్‌ సమీపంలో బైక్‌ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో కారు బోల్తాపడడంతో అందులో ఉన్న ఓ వ్యక్తి కూడా మృతిచెందాడు. ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలుకాగా..చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు నల్గొండ జిల్లాకు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

కవి కురూప్ మృతికి ప్రధాని మోడీ సంతాపం..

కేరళ : ప్రముఖ మలయాళ కవి, రచయిత, జ్ఞాన్ పీఠ, పద్మ విభూషణ్ అవార్డుల గ్రహిత ఓఎస్ వీ కరుప్ మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు. 

హైదరాబాద్ కు బయలుదేరిన కేసీఆర్...

న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. తన మూడు రోజుల పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాద్ పయనమయ్యారు. 

17:28 - February 14, 2016

విజయవాడ : బీజేపీ మతోన్మాద రాజకీయాలతో అతి నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. టెన్ టివితో ఆయన మాట్లాడారు. బీజేపీ నగ్న రాజకీయ స్వరూపం బయటపడిందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ జాతీయోద్యమంలో లేరని, దేశం కోసం..స్వాతంత్ర్యం కోసం..కార్మికవర్గం కోసం వామపక్షాలు పోరాటం చేస్తున్నాయన్నారు. పాకిస్తాన్ ఏజెంట్లు అని పేర్కొంటూ దాడి చేయడం సరికాదని, ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాతంత్ర వాదులు ఈ ఘటనను ఖండించాలని సూచించారు. ప్రభుత్వం అధికారంలో ఉందని ఇలాంటి ఘటనలకు పాల్పడితే ప్రజలే బుద్ధి చెబుతున్నారని మధు పేర్కొన్నారు.                                                                                      

17:25 - February 14, 2016

ఢిల్లీ : ఆర్ఎస్ఎస్, కాషాయ శక్తులు పేట్రేగిపోతున్నాయి. తమకు అడ్డుగా..తమకు వ్యతిరేకంగా చేస్తున్న వారిపై తమ ప్రతాపం చూపుతున్నారు. భౌతికంగా దాడులకు దిగడమే కాకుండా పలు హింసాత్మక ఘటనలకు పూనుకుంటున్నారు. తాజాగా సీపీఎం ప్రధాన కార్యాలయంపై దాడికి దిగడం సంచలనం సృష్టించింది. ఆదివారం సాయంత్రం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలు గోల్ మార్కెట్ వద్దనున్న సీపీఎం కేంద్ర కార్యాలయానికి కర్రలు..రాళ్లతో చేరుకున్నారు. అనంతరం కార్యాలయంపై దాడి చేశారు. ఆ సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ఉన్నారు. నలుగురు ఈ ఘటనకు పూనుకున్నారు. వారిలో ఒకరిని పట్టుకున్నారు. వీరు ఎందుకు దాడి చేశారు ? దాడి వెనుక కారణాలేంటి అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఖండించిన సీపీఎం..
ఈ ఘటనను సీపీఎం ఖండించింది. దేశ సమాజ శ్రేయస్సు కోసం పార్టీ పని చేస్తుందని వెనుకడగు వేసే ప్రసక్తే లేదని వామపక్ష నేతలు ఖరాఖండిగా చెబుతున్నారు. దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న కమిషనర్ సీపీఎం ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. దాడికి జరిగిన విషయంపై ఏచూరిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పలు అంశాలపై వామపక్షాల పోరాటం..
ఇటీవలే దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పలు ఘటనలపై సీపీఎం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో హెచ్ సీయూలో విద్యార్థి రోహిత్ ఆత్మహత్య..జేఎన్ యూలో జరిగిన ఘటనపై వామపక్షాలు పోరాటం చేపట్టాయి. అంతేగాకుండా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ను కలిసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధం లేని వారిని శిక్షించవద్దని వామపక్ష నేతలు కోరారు. విద్యార్థులకు సంఘీభావంగా వామపక్షాలు, ఇతర పార్టీల నేతలు జేఎన్ యూలో బైఠాయించిన సంగతి తెలిసిందే. దీనితో దేశ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే సీపీఎం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడం గమనార్హం.

ఆర్టీసీ బస్సు - ఆటో ఢీ..ఇద్దరు మృతి..

శ్రీకాకుళం : జిల్లా పాలకొండ మండలం సిరికొండ వద్ద సాయంత్రం ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 

సీపీఎం ప్రధాన కార్యాలయంపై దాడి..

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంపై నలుగురు వ్యక్తులు దాడికి దిగారు. వీరు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ చెందిన వారుగా భావిస్తున్నారు. దాడికి దిగిన వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. దాడి జరిగిన సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కార్యాయంలోనే ఉన్నారు. 

17:04 - February 14, 2016

తెలుగునాట రీమేక్‌ల హవా నడుస్తుంటే, బాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్‌ ఊపందుకుంది. ప్రేక్షకుల విశేష ఆదరణ పొందిన పలు చిత్రాలకు సీక్వెల్స్ రూపొందించే పనిలో బాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు నిమగమై ఉన్నారు. ఈ క్రమంలో రెండు సీక్వెల్స్ అతి త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్నాయి.

'కహానీ2'..
ప్రేమ పేరుతో మోసం చేసిన ఓ యువకుడిని గర్భవతైన ఓ యువతి చంపే నేపథ్యంలో రూపొందిన మహిళా ప్రధాన చిత్రం 'కహానీ.' సుజోయ్ ఘోష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో గర్భవతిగా విద్యాబాలన్‌ నటించారు. 2012లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్‌లో అఖండ విజయాన్ని సాధించి మరిన్ని మహిళా ప్రధాన చిత్రాల నిర్మాణానికి ప్రేరణగా నిలిచింది. ఇదే చిత్రం తెలుగులో 'అనామిక'గా రీమేక్‌ అయ్యింది. నయనతార ప్రధాన పాత్రధారిణిగా రూపొందిన ఈ చిత్రానికి శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహించారు. తాజాగా 'కహానీ' చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు సుజోయ్ ఘోష్‌ 'కహానీ2' చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ప్రస్తుతం 'కహానీ 2' చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్‌ జరుగుతోంది. ఈ సినిమాలోనూ విద్యాబాలన్‌ నటిస్తారు. త్వరలోనే షూటింగ్‌ని ప్రారంభిస్తాం. ఈ చిత్రానికి కూడా కలకత్తానే నేపథ్యంగా ఉంటుంది' అని చెప్పారు.

'జుడ్వా 2'..
సల్మాన్‌ఖాన్‌, కరీష్మాకపూర్‌, రంభ నాయకానాయికలుగా డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో రూపొంది బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన చిత్రం 'జుడ్వా'. 1997లో విడుదలైన ఈ చిత్రం తెలుగులో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన 'హలో బ్రదర్‌' చిత్రానికి రీమేక్‌. ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా, బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ డబుల్‌ రోల్‌ చేశారు. జాకీచాన్‌ కథానాయకుడిగా రూపొందిన 'ట్విన్‌ ట్రాగన్స్' చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని ఇ.వి.వి. రూపొందించిన 'హల్‌ బ్రదర్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'జుడ్వా' చిత్రానికి సీక్వెల్‌గా 'జుడ్వా2' చిత్రాన్ని నిర్మించేందుకు దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ సన్నాహాలు చేస్తున్నారు. తనయుడు వరుణ్‌ధావన్‌ కథానాయకుడిగా ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్‌ధావన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈచిత్రానికి సంబంధించి ప్రస్తుతం ట్రయల్‌ షూట్‌ చేస్తున్నారు. భారీ యాక్షన్‌ సన్నివేశాలతోపాటు స్కై డైవింగ్‌ వంటి సాహస కృత్యాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు డేవిడ్‌ ధావన్‌ పేర్కొన్నారు. అయితే ఈ చిత్రంలో వరుణ్‌ధావన్‌ సరసన నటించే ఇద్దరు కథానాయికలు ఎవరన్నది మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరో మారు హిట్ కొట్టాలని నిర్మాతల ఆరాటం..
ప్రభుదేవా ప్రధాన పాత్రధారిగా డాన్స్ నేపథ్యంలో రూపొందిన 'ఎబిసిడి' చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించిన 'ఎబిసిడి2' చిత్రం సైతం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే సంగీత నేపథ్యంలో రూపొందిన 'రాక్‌ ఆన్‌' చిత్రం కూడా విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈచిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'రాక్‌ఆన్‌2' చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ నటించింది. అలాగే కంగనా రనౌత్‌ నటించిన 'తను వెడ్స్ మను' చిత్రం బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన మహిళా ప్రధాన చిత్రంగా రికార్డులు కూడా సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించిన 'తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రం కూడా అఖండ విజయం సాధించింది. కంగనా రనౌత్‌ కెరీర్‌లోనే ది బెస్ట్‌ ఫిల్మ్స్‌గా ఈ రెండు చిత్రాలు నిలిచాయి. దీంతో సక్సెస్‌ సాధించిన చిత్రాలకు సీక్వెల్స్‌ రూపొందించి మరోమారు హిట్‌ కొట్టాలని దర్శక, నిర్మాతలు ఆరాటపడుతున్నారు.

17:01 - February 14, 2016

పలు వ్యాపార ప్రకటనలతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన యామి గౌతమ్‌ 'విక్కీ డోనర్‌' చిత్రంతో బాలీవుడ్‌ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. ఇదే క్రమంలో తెలుగులో కూడా అల్లు శిరీష్‌తో 'గౌరవం' చిత్రంలోనూ నటించింది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో తెలుగునాట కూడా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. ప్రస్తుతం 'సనమ్‌ రే' చిత్రంతోపాటు రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్న యామి బాలీవుడ్‌లో ఓ లక్కీ ఛాన్స ని కొట్టేసింది. ఇంటెన్స్ లవ్‌స్టోరీ నేపథ్యంలో థ్రిల్లర్‌గా యశ్‌రాజ్‌ సంస్థలో రూపొందే 'కాబిల్‌' చిత్రంలో యామిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. తొలుత యామి ప్లేస్‌లో పరిణీతి చోప్రా, కరీనాకపూర్‌ వంటి పేర్లు వినిపించాయి. చివరగా యామిని తీసుకున్నట్లు నిర్మాత రాకేష్‌ రోషన్‌ అధికారికంగా తెలిపారు. సంజరుగుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

16:58 - February 14, 2016

ధనుష్‌, గౌతమ్‌ వాసుదేవ మీనన్‌లా కాంబినేషన్‌లో రూపొందబోయే 'ఎన్మల్‌ పయ్యుమ్‌ థోట' చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఇదే చిత్ర కథతో సూర్య చేయాలని గౌతమ్‌ మీనన్‌ అనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల ధనుష్‌తో చేస్తున్నారు. గ్యాంగ్‌ వార్స్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ధనుష్‌ చాలా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆయన క్యారెక్టర్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు గౌతమ్‌మీనన్‌ చెప్పారు. ధనుష్‌ ప్రస్తుతం పొలిటికల్‌ థ్రిల్లర్‌ 'కొడి'లో నటిస్తున్నారు. ఈ చిత్రంతోపాటు ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చిన సంగతి విదితమే. గౌతమ్‌ మీనన్‌ సినిమా ప్రారంభంలోపు హాలీవుడ్‌ సినిమాలోని తన పోర్షన్‌ని ధనుష్‌ పూర్తి చేయాలనే యోచనలో ఉన్నారట.

 

16:57 - February 14, 2016

ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ళని రాబట్టిన చిత్రంగా కూడా నిలవడం విశేషం. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొంది శాటిలైట్‌ రైట్స్‌తో కలిపి కేవలం 4 వారాల్లోనే 50 కోట్లకి పైగా షేర్‌ సాధించి సంచలన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ మాట్లాడుతూ,'ప్రారంభం నుంచే ఈ సినిమా హిట్‌ అవుతుందని నాగార్జునగారు చెబుతూ వచ్చారు. కొత్త దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణని పరిచయం చేస్తూ రూపొందించిన ఈ చిత్రం ఓవర్‌సీస్‌లోనూ కలెక్షన్లలో రికార్డ్‌ సృష్టిస్తోంది. సీనియర్‌ హీరోల్లో 50 కోట్ల క్లబ్‌లోకి చేరిన తొలి హీరో నాగార్జున కావడం విశేషంగా భావిస్తున్నాం. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన ఈ చిత్రంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా వారంతా నాగార్జునకు కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం' అని పేర్కొంది.

జేఎన్ యూ అల్లర్ల వెనుక ఉగ్రవాది హస్తం - రాజ్ నాథ్ సింగ్..

ఢిల్లీ : జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్ యూ)లో ఆందోళనల వెనుక పాకిస్తాన్ ఉగ్రవాది హస్తం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 

16:49 - February 14, 2016

కలబంద రసాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. అలాగే గాయాలేర్పడితే కలబంద రసాన్ని కాలిన గాయలపై పూతలా పూస్తే గాయాలు మటుమాయమౌతాయి. కలబంద అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే మనం కలబందతో ఎప్పుడూ మంచి అనుబంధం కలిగి ఉంటే ఆరోగ్యం మనవెంటే అంటున్నారు వైద్యులు.
ఉదయం పరకడుపున కలబంద ఆకులను సేవిస్తే ఉదర సంబంధమైన సమస్యలుంటే తొలగిపోతాయి.
కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని మోచేతులు, పాదాలకు పూస్తే చర్మంపై ఏర్పడిన నల్లటి మచ్చలు తగ్గుతాయి.
రోజ్‌ వాటర్‌లో కలిపిన కలబంద రసాన్ని చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది.
కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకొని ముఖంపై ఉన్న మొటిమలకు పూస్తే మొటిమలు మాయమౌతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

16:48 - February 14, 2016

పిల్లలకే కాదు, పెద్దలకు కూడా నూడిల్స్ అంటే ఎంతో ఇష్టం. కానీ ఇంట్లో తయారు చేయాలంటేనే అసలు సమస్య మొదలవుతుంది. అది, నూడుల్స్ ను ఉడికించేటప్పుడు అతుక్కుపోవడం. దాంతో ఎందుకొచ్చిన తంటా అని హోటల్‌లో కొనుక్కోని తింటుంటాం. కానీ ఇంట్లో తయారు చేసుకొని తింటే.. ఆ రుచే వేరు. నూడుల్స్ ను ఉడికించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు ఒకదానికొకటి అతుక్కుపోతుంటాయి. అంతేకాదు, చప్పగా కూడా మారతాయి. అలా జరగకుండా ఉండాలంటే.. నూడుల్స్ ను ఉడికించిన వెంటనే వడకట్టాలి. తర్వాత మోతాదుని బట్టి కొద్దిగా ఆలివ్‌ నూనె వేయాలి. ఆ తర్వాత ఫోర్క్‌తో కలిపితే.. ఒకదానికొకటి అతుక్కుపోకుండా ఉంటాయి. ఒక్కోసారి పొద్దున్నే ఉడికించి రాత్రి వండాలనుకుంటారు. ఇలాంటప్పుడే అతుక్కు పోతుంటాయి. అలాంటప్పుడు వేణ్నీళ్లలో ముంచి తీసి, తర్వాత చేత్తో ఒకదాన్నుంచి ఒకటి జాగ్రత్తగా వేరుచేస్తే అతుక్కోకుండా ఉంటాయి. అంతేకాదు, నూడుల్స్ ను చిన్న చిన్న గిన్నెల్లో కాకుండా కాస్త పెద్ద గిన్నెలో తీసుకోవాలి. తర్వాత మరిగించిన నీటిలో ఒకేసారి వేయాలి. కొద్దిగా ఉప్పు కూడా వేయడం వల్ల నూడుల్స్ రుచిని కోల్పోకుండా ఉంటాయి. నూడుల్స్ ని మరీ మెత్తగా కూడా ఉడికించకూడదు. అందుకే కాస్త బాగా ఉడికాయి అనుకున్న వెంటనే తీసేయాలి. వీటిని ఉడికించిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన సాస్‌లు కూడా వేస్తే చక్కని రుచి వస్తుంది. 

16:39 - February 14, 2016

హైదరాబాద్ : నిత్యావసర వస్తువుల కల్తీకి అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కల్తీ ఆగడాలు ఆగడం లేదు. నేరేడ్ మెట్ పీఎస్ పరిధిలోని కల్తీ పాల తయారీ కేంద్రంపై సైబరాబాద్ స్పెషల్ ఆఫీసు బృందం దాడులు నిర్వహించింది. వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన 200 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. పలు కంపెనీలకు చెందిన పాలను కొనుగోలు చేసి ఇంట్లో వంద లీటర్ల అసలు పాలకు రసాయనలతో కలిసి ఉన్న వంద లీటర్ల పాలను అదే కంపెనీలకు చెందిన ప్యాకెట్లలో నింపుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్ ఓటీ పోలీసులు తెల్లవారుజామున దాడి చేశారు. తయారీకి ఉపయోగిస్తున్న సామాగ్రీని స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. 

కేసీఆర్ పర్యటన విజయవంతం - వేణుగోపాలచారి..

ఢిల్లీ : సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతమైందని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి పేర్కొన్నారు. విభజన చట్టం హామీలు..ఐఐఎం, ఎయిమ్స్, ట్రైబల్ వర్సిటీ, ప్రత్యేక హైకోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని, కేంద్ర మంత్రులను కేసీఆర్ కోరడం జరిగిందన్నారు. ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కోరినట్లు తెలిపారు. 2016-17 కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను కేంద్రం కేటాయిస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

16:25 - February 14, 2016

చిత్తూరు : జిల్లాలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సప్త వాహనాలపై శ్రీవారు కనువిందు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఎన్నడూ లేని విధంగా సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. స్వామి వారి వాహన సేవలను చూసేందుకు తిరుమలకు భారీగా భక్తులు చేరుకున్నారు. కానీ ఎండ వేడిమి తీవ్రంగా ఉండడంతో భక్తులు పలు ఇబ్బందులకు గురయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు టిటిడి అధికారులు మజ్జిగ...నీళ్లు..ఏర్పాటు చేసింది. 

ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి టెండర్లు..

విజయవాడ : ఏపీ తాత్కాలిక సచివాలయ టెండర్లు ఖరారయ్యాయి. ఎల్ అండ్ టీ రెండు ప్యాకేజీలను దక్కించుకుంది. షావూర్జీ పల్లోంజి కంపెనీ ఒక ప్యాకేజీని దక్కించుకుంది. రేపటి కేబినెట్ లో చర్చించి శంకుస్థాపన తేదీని ఖరారు చేయనున్నారు. 

16:13 - February 14, 2016

ఢాకా : అండర్ 19 వరల్డ్ ప్రపంచ కప్..భారత్ మూడు సార్లు ఛాంపియన్..అండర్ 19 వరల్డ్ కప్ -2016 లో తొలి నుండి భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈసారి కూడా కప్ భారత్ దే అని అందరూ అనుకున్నారు. కానీ అందరీ ఆశలు..కలలను భారత బ్యాట్స్ మెన్స్ నెరవేర్చలేదు. తమదే ఈసారి కప్ అని అనుకున్న భారత బ్యాట్స్ మెన్స్ కలలు కల్లలయ్యాయి. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విండీస్ విజేతగా నిలిచింది. భారత క్రీడాకారుల అతివిశ్వాసమే కొంప ముంచింది. భారత ఓపెనర్లు ఘోరంగా విఫలం చెందారు. నిర్ణీత 50 ఓవర్లలో 45.1 ఓవర్లలో 145 పరుగులకే భారత్ కుప్పకూలింది. విండీస్ 49.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విండీస్ లక్ష్యాన్ని చేధించింది. తొలిసారి వరల్డ్ కప్ సాధించడంతో విండీస్ క్రీడాకారులు స్టేడియంలో డ్యాన్సులు చేశారు. మరోవైపు మ్యాచ్ విఫలం చెందడం పట్ల భారత బ్యాట్స్ మెన్స్ కన్నీరుమున్నీరుయ్యారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు విండీస్ బౌలర్ల ధాటికి 45.1 ఓవర్లలో 145 పరుగులు చేసి కుప్పకూలింది. జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (51: 89 బంతుల్లో 5x4, 1x6) ఒక్కడే అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. స్వల్ప లక్ష్య చేధనకు దిగిన వెస్టిండీస్ జట్టు 49.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి అండర్ -19 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 

బెంగళూరు ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం..

బెంగళూరు: ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తోన్న మూడు కిలోల, రెండు వందల గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. 

మేడారంలో డీజీపీ ఏరియల్ సర్వే...

వరంగల్: జిల్లాలోని తాడ్వాయ్ మండలం మేడారంలో జరుగనున్న సమ్మక్క, సారలమ్మ జాతర కోసం ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం డీజీపీ అనురాగ్ శర్మ ఏరియల్ సర్వే ద్వారా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఏరియల్ సర్వేలో డీజీపీతోపాటు డీఐజీ మల్లారెడ్డి, ఎస్సీ అంబర్ కిషోర్ ఝా తదితరులు పాల్గొన్నారు. 

అండర్ 19..వరల్డ్ కప్ విజేత..

ఢాకా : అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ పరాజయం చెందింది. ఐదు వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించింది. భారత్ నిర్ధేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 49.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. 

వెస్టిండీస్ 9 బాల్స్..5 రన్స్..

ఢాకా : అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వెస్టీండీస్ విజయానికి చేరువకు వచ్చింది. 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. అంతకు ముందు భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 

15:44 - February 14, 2016

శ్రీకాకుళం : జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో.. రథసప్తమి సందర్భంగా.. అధికారులు విఐపీల సేవలో తరించారు. అర్ధరాత్రి నుంచి క్యూలలో వేచివున్న భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సామాన్యులను ఇబ్బంది పాల్జేస్తున్న ఆలయ సిబ్బంది తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో ఆదివారం రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యనారాయణ స్వామి మహాభిషేకానికి భక్తులు లక్షల్లో తరలివచ్చారు. ఆదిత్యుని దర్శించుకునేందుకు భక్తులు పది కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో శ్రీ శారద పీఠాదిపతి స్వామి స్వరూపానంద సూర్య భగవానునికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆదిత్యునికి క్షీరాభిషేకం జరిపారు. అప్పటినుండి స్వామి వారి మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షీరాభిషేకం సమయంలో పలువురు ప్రముఖులు స్వామి వారిని నిజదర్శనం చేసుకున్నారు. విఐపీల తాకిడి కారణంగా సామాన్య భక్తులకు ఆదిత్య దర్శనాన్ని నిలిపివేశారు. దీనిపై భక్తులు తీవ్రంగా మండిపడ్డారు.

చేతులేత్తిసిన అధికారులు..
అరసవెల్లి దేవస్థానం నుండి శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్ వరకూ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వీఐపీ ల బ్రేక్ నేపథ్యంలోగంటల కొద్దీ క్యూలైన్లలో నిలిపివేయడం .. దీనికి తోడు భక్తులకు సదుపాయాలు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దైవాన్ని దర్శించుకునేందుకు వచ్చి ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నామంటూ భక్తులు వాపోయారు. వీఐపీల సేవలోనే ఆలయ అధికారులు తరిస్తున్నారని.. సామాన్య భక్తులను పట్టించుకోవడంలేదని భక్తులు ఆరోపించారు. ఇది ఇలా ఉంటే అరసవెల్లి దేవస్థానం తరపున పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని వీఐపీ పాసులు ఎవరికి ఇవ్వలేదని .. భక్తులు సంయమనం పాటించకపోతే తాము చేసేది ఏమి లేదని చేతులెత్తేశారు అధికారులు. మొత్తమ్మీద ఏడాదికోసారి వచ్చే అరుదైన వేడుకలో.. ఆదిత్యుణ్ణి తనివితీరా దర్శించుకునే అవకాశం కల్పించలేదంటూ.. భక్తులు ఆలయ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక సందర్భాల్లోనైనా తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఎలా అని నిలదీశారు. 

15:41 - February 14, 2016

హైదరాబాద్ : ఫిబ్రవరి 14..ప్రేమికుల రోజు..ఈ రోజు వస్తుందంటే ప్రేమికుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఈ రోజును అడ్డుకుంటామని..ప్రేమికుల పక్షులను నిలువరిస్తామని ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన, శివసేన వంటి కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేశారు. దీనితో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రధానంగా ఓయూలో భారీగా పోలీసులు మోహరించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమికుల రోజు సందర్భంగా ఓయూలో సాయంత్రం ఐదు గంటలకు బహిరంగసభ ఏర్పాటు చేస్తామని ఐఎల్ యూ ప్రకటించింది. దీనితో ఓయూలో పోలీసులు ఆంక్షలు విధించారు. విద్యార్థులను బయటికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. విద్యానగర్, డీడీ కాలనీలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనితో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. యూనివర్సిటీకి వెళ్లే మార్గాలను పూర్తిగా మూసివేశారు. తొలి ప్రేమ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని ప్రకటించింది. ఐఎల్ యూ లెఫ్ట్ భావజాలంతో ఉన్న సంఘాలు, 25 విద్యార్థి సంఘాలున్నాయి. 

15:38 - February 14, 2016

హైదరాబాద్ : ప్రేమికుల రోజు ఉస్మానియా యూనివర్సిటీలో భారీగా పోలీసులను మోహరించారు. ఓయూలోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి... ఎన్‌సీసీ గేటు మూసివేశారు. ప్రేమికుల రోజు జరుపుతామని కొన్ని విద్యార్థి సంఘాలు ప్రకటించడంతో... వారిని ముందు జాగ్రత్తగా నిన్ననే అరెస్ట్ చేశారు. ఇవాళ క్యాంపస్‌ లోకి ఎవరిని రానీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసుల తీరుపై అటు విద్యార్థులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సహకరించకుండా నిర్భందించారని, భావా ప్రకటనలకు స్వేచ్ఛ ఉందన్నారు. పోలీసులు ఇలా ఎందుకు చేస్తున్నారని, ఓయూలోనే ప్రేమికులుంటారా ? అని ప్రశ్నించారు. 

15:37 - February 14, 2016

విజయవాడ : ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం తమకు ఉందని టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. సీఎం మనుసు నొప్పించకుండా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు మాదిగ వర్గంలో కలవరాన్ని గురిచేశాయని, దాంతోనే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. కమ్యునికేషన్‌ గ్యాప్‌ వల్లే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అలా మాట్లాడారని పేర్కొన్నారు. 

15:34 - February 14, 2016

విజయవాడ : ఎస్సీ వర్గీకరణకు టిడిపి అధినేత చంద్రబాబు అనుకూలమో..వ్యతిరేకమో తేల్చాలని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా ఏ విషయమైంది స్పష్టం చేయాలని డెడ్‌లైన్‌ విధించారు. ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ఎస్సీ వర్గీకరణపై భిన్నమైన ప్రకటనలు చేశారని ఇద్దరిలో ఎవరి మాటలు విశ్వసించాలో కూడా చంద్రబాబే చెప్పాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో గుంటూరులో భేటీ అయిన మందకృష్ణ..ఈనెల 18న రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీల్లోని మాదిగలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో లేఖలు రాసిన బాబు ప్రస్తుతం ఎందుకు లేఖలు రాయడం లేదని...అసెంబ్లీ ఎందుకు తీర్మానం చేయడం లేదని..గతంలో అఖిలపక్షాన్ని డిమాండ్ చేసిన బాబు ప్రస్తుతం అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లడం లేదని మందకృష్ణ ప్రశ్నించారు. 

15:32 - February 14, 2016

నల్గొండ : టాలీవుడ్ హీరోయిన్‌ ప్రణీత పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో తాను ప్రయాణిస్తున్న కారు బోల్తా పడగా.. హీరోయిన్ స్వల్ప గాయాలతో బయటపడింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లి వస్తుండగా జరిగన ఈ అనుకోని ఘటన షాక్ కు గురి చేసింది. 
ఆదివారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా మోతె సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఆ కారులో ప్రణీతతో పాటు ఆమె పర్స్‌నల్‌ మేకప్‌ ఉమెన్‌ భాగ్యలక్ష్మి ప్రయాణిస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో వీరిరువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఖమ్మంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రణీత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గాయపడ్డ ప్రణీత, ఆమె మేకపప్ ఉమెన్ ను సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేయించుకున్న ప్రణీత వేరే కారులో హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని కాకపోతే షాక్‌నుంచి ఇంకా తేరుకోలేదని ప్రణీత 'బోల్తా పడ్డ తన కారు ఫొటోలను' ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే కారు బోల్తా పడిన తీరు చూస్తే ప్రణీత స్వల్ప గాయాలతో బయట పడటం చాలా లక్కీ అనుకోవచ్చు. ప్రమాదం గురించి మాట్లాడిన హీరోయిన్.. సీటు బెల్టు పెట్టుకోవడం వల్లనే తనకు పెను ప్రమాదం తప్పిందని, ఎలాంటి గాయాలు కాలేదని ప్రణీత చెప్పుకొచ్చింది.
ప్రణీత కారు బోల్తా పడ్డదన్న వార్త విని ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కి పడింది. కాగా హైదరాబాద్ చేరుకున్న ప్రణీత 'బొంగారాలంటి' కళ్లు తిప్పుతూ 'ఐయామ్ సేఫ్' అంటూ నవ్వుతూ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అండర్ 19 వరల్డ్ కప్..ఉత్కంఠ..

ఢాకా : అండర్ 19 వరల్డ్ కప్ భారత్ - వెస్టీండీస్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. భారత్ నిర్ధేశించిన 145 పరుగులు లక్ష్యాన్ని చేరుకోవడానికి వెస్టీండీస్ బ్యాట్స్ మెన్స్ కష్ట పడుతున్నారు. 44.3 ఓవర్లలో వెస్టిండీస్ ఐదు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. 

శ్రీశైలం - హైదరాబాద్ హైవేపై రోడ్డు ప్రమాదం..

మహబూబ్ నగర్ : వంగూరు (మం) కోనేటిపురం వద్ద శ్రీశైలం - హైదరాబాద్ హైవేపై బైక్ - కారు ఢీకొన్నాయి. ఈఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. 

వెస్టిండీస్ 49 బాల్స్..33 రన్స్..

ఢాకా : అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వెస్టీండీస్ విజయానికి చేరువైతోంది. 41.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన వెస్టీండీస్ 113 పరుగులు చేసింది. అంతకు ముందు భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 

రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం - ప్రత్తిపాటి..

విజయవాడ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. చెరకు పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. 

15:09 - February 14, 2016

బీహార్‌ : తాను ఓ ప్రజాప్రతినిధి అని మరిచిపోయాడో ఆ ఎమ్మెల్యే. ఏకంగా ఓ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్‌బల్లా యాదవ్. మైనర్‌ను కిడ్నాప్‌ చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు పెట్టొద్దంటూ తనకు 30వేల రూపాయలు ఇచ్చాడని బాధితురాలు ఆరోపిస్తోంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు పరారీలోఉన్న రాజ్‌బల్లాకోసం గాలిస్తున్నారు. అటు డీజీపీ కూడా ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటన ఈ నెల 6న జరిగింది.

వెస్టిండీస్ 99/5..

ఢాకా : అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ 37 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 

14:50 - February 14, 2016

హైదరాబాద్ : పేద మద్య తరగతి యువతకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు గాను నాణ్యమైన శిక్షణ అందించాలనే ఉద్దేశ్యంతో 'NICE' సంస్థను ఏర్పాటు చేశామని డైరెక్టర్ మీనయ్య తెలిపారు. ఒత్తిడిని ఆందోళనను తగ్గించి యువతకు భరోసా కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు చెందిన కోచింగ్ ను ఈ నెల 15 నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని తెలిపారు నైస్ డైరెక్టర్ మీనయ్య. 

14:47 - February 14, 2016

నల్గొండ : శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. రథసప్తమికి తోడు... ఆదివారం కావడం.. అటు మేడారం భక్తులు యాదాద్రికి రావడంతో.. ఆలయం కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికం కావడంతో కొండపైకి పోలీసులు వాహనాలను అనుమతించడం లేదు. రథసప్తమి సందర్భంగా ఆలయంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 

14:47 - February 14, 2016

నెల్లూరు : జిల్లా ఆత్మకూరులో కుక్కలు జనాల్ని హడలెత్తిస్తున్నాయి. ఎవరైనా కనిపిస్తే చాలు వెంటపడి కరుస్తున్నాయి. మూడు రోజుల్లో దాదాపు 20మందిని కరిచాయి. ఇందులో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిలో వృద్ధులు, చిన్నారులున్నారు. వీరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

14:44 - February 14, 2016

కరీంనగర్ : తనకు న్యాయం జరగదని..ఇందుకు పోలీసులే కారణమని భావిస్తూ ఓ వివాహిత పీఎస్ ఎదుట ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన జిల్లాల్లో కలకలం సృష్టించింది. సురేష్ తో హరికకు వివాహం జరిగింది. కానీ సురేష్ కు వివాహేతర సంబంధం ఉందని హరిక గ్రహించింది. దీనితో కుటుంబంలో విబేధాలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని హరిక స్థానిక రూరల్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. కానీ సురేష్ రాజకీయ వత్తిళ్లు తేవడంతో కేసు పరిష్కారం కావడం లేదని హరిక భావించినట్లు సమాచారం. తరచూ పీఎస్ కు పిలుస్తుండడం..పోలీసులు సూటిపోటి మాటలు చేస్తుండడంతో హరిక తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆదివారం మధ్యాహ్నం పీఎస్ ఎదుటనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే హరికను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

14:38 - February 14, 2016

మహబూబ్‌ నగర్‌ : జిల్లాలో సాండ్‌ మాఫియా రెచ్చిపోయింది. తిమ్మాజీపేట మండలం రాళ్లచెరువుతండాకు చెందిన శ్రీను నాయక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.. రాత్రి ఇసుక కోసం వాగులోకి నాయక్‌తో పాటు... మరో వ్యక్తి వెళ్లారు.. వీరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు.. మొహానికి మాస్క్‌లు వేసుకొని ఘాతుకానికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో నాయక్‌ చనిపోగా... మరో యువకుడికి చేయి విరిగింది.. ఈ హత్య చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

14:37 - February 14, 2016

విశాఖపట్టణం : మృతదేహాన్ని తీసుకెళుతున్న వారు మృత్యులోకాలకు చేరుకున్నారు. ఓ అంబులెన్స్ వాహనం వంతెనపై నుండి పడడంతో నలుగురు మృతి చెందారు. ఇందులో ఓ చిన్నారి కూడా ఉంది. వివరాల్లోకి వెళితే..నగరం నుండి ఓ మృతదేహాన్ని కొంతమంది అంబులెన్స్ లో కటక్ వైపు ప్రాంతానికి తీసుకెళుతున్నారు. యలమంచిలి వద్దకు రాగానే అదుపు తప్పిన అంబులెన్స్ వంతెన పై నుండి కిందకు పడిపోయింది. అందులో ఉన్న నలుగురు మృతి చెందగా మరికొందరు తుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

పీఎస్ ఎదుట వివాహిత ఆత్మహత్య..

కరీంనగర్ : సిరిసిల్ల మండలం పిల్లవంచలో రూరల్ పీఎస్ ఎదుట వివాహిత హరిక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ హరిక మృతి చెందింది. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. 

విండీస్ 72/4...

ఢాకా : అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ 26.5 ఓవర్లకు 72 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. 

పంజాగుట్టలో భజరంగ్ దళ్ కార్యకర్తల అరెస్టు..

హైదరాబాద్ : వాలంటైన్స్ డే ను నిరసిస్తూ నిరసనలు చేపడుతూ బైక్ లపై వెళుతున్న ప్రేమికుల జంటలను అడ్డుకుంటున్న భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

వంతెనపై పడిన అంబులెన్స్

విశాఖపట్టణం : యలమంచిలి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వంతెనపై నుండి అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఎమ్మెల్యే 

13:47 - February 14, 2016

బెంగళూరు స్కూలో చిరుతల సంచారం, కెబిహెచ్ బీలో వంకాయలమ్ముకున్న రకుల్ ప్రీత్ సింగ్, ఓటర్ లిస్టులో సల్మాన్ ఖాన్ పేరు, ఐపిల్ ఆప్షన్స్, వాట్సప్ లో 286 మందిని యాడ్ చేసుకోవచ్చంట, నేరస్తులతో నిజాలు చెప్పిస్తున్న విధానం,  డ్రయర్ లో పక్షులు, కోతులను సర్దుకున్న వ్యక్తి,  అండర్ వేర్ లో 14 మద్యం ఫుల్ బాటిల్స్, వాలెంటైన్స్ డే కు లోన్ వంటి అంశాలను ఈరోజు క్రేజీ న్యూస్ లో చూద్దాం....

శ్రీవారి గరుడసేవలో ముగ్గురు అనుమానితులు

చిత్తూరు : తిరుమలలో స్వామివారికి గరుడ వాహన సేవలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని వన్‌ టౌన్  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముసుగులో వచ్చి.. వీరు స్వామి వారి ఫోటోలు తీస్తుడటంతో... అదుపులోకి తీసుకున్నారు. 

13:39 - February 14, 2016

చిత్తూరు : తిరుమలలో స్వామివారికి గరుడ వాహన సేవలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని వన్‌ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముసుగులో వచ్చి.. వీరు స్వామి వారి ఫోటోలు తీస్తుడటంతో... అదుపులోకి తీసుకున్నారు. 

13:35 - February 14, 2016

అరుణ్ సాగర్.. ఈ పేరుకో వైబ్రేషన్.. ఎలక్ట్రానిక్ మీడియాలో అతనో  సెన్సేషన్. కవిత్వాభిమానులకు ఇష్టమైన అబ్సెషన్. ఒక్కమాటలో చెప్పాలంటే అరుణ్ సాగర్ అంటే కొత్తదనం, సూటిదనం, ఓ విస్ఫోటనం, ప్రవహించే ఎర్రదనం. తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన కవి ఆయన. స్వర్ణ భస్మమురా మన కవిత, అలజడి చెందిన అక్షర సమూహమన్న  నిత్య నవయవ్వన కవి. సీలేరు ఒడ్డున విరుగుతున్న విల్లు ఫెటఫేటేల్ ధ్వానాల్ విను.. వినరా రామా అంటూ నిర్వాసితుల గోడును పలవరించి మరణ వాంగ్మూలాన్ని వినిపించిన అరుణ్ సాగర్ ఇకలేడని, కనిపించడని అంటే నమ్మలేని విషాదం.
సరికొత్త కవిత్వానికి అరుణ్ బాటలు
ప్రపంచం నడుస్తున్న దారిలోంచి కొంచెం పక్కకు జరిగి పరికించే శక్తి కొందరికే ఉంటుంది. అతడు 24గంటల ఎలక్ట్రానిక్ మీడియా ప్రవాహంలో పరిగెత్తుతూనే సమాజాన్ని నిశితంగా పరికించాడు. అత్యాధునిక భావజాలంతో తనదైన ఆలోచనా ధోరణితో, మానవ విలువలతో పలవరించాడు. తడి నిండిన అక్షరాలలో మెట్రోసెక్సువల్ మేల్ వాదనను, నిర్వాసితుల గోడును వినిపించాడు. జీవితం మాగ్జిమమ్ రిస్క్ లో ఉన్నా.. చిరునవ్వు చెదరకుండా సరికొత్త కవిత్వానికి బాటలు వేశాడు. 
ఎంతటి మేధావో..అంతటి నిగర్వి 
ఎంతటి మేధావో..అంతటి నిగర్వి. ఎంతటి సాహసికుడో అంతటి సామాన్యుడు. కవిత్వంలో మాత్రమే  మాటల పొదుపరి...స్నేహంలో కాదు. చెలిమి కోసం ప్రాణాలిచ్చే సావాసగాడు. 
వామపక్ష నేపథ్యాన్ని వీడలేదు..
కానీ, ఏ క్షణంలోనూ తాను నడిచొచ్చిన దారిని మరువలేదు. తాను ఎదిగొచ్చిన వామపక్ష నేపథ్యాన్ని వీడలేదు. తాను పనిచేస్తున్న సంస్థ మార్కెట్  పోటీలో నిలదొక్కుకునేలా తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే వీలు దొరికినప్పుడూ..అవసరం ఏర్పడినప్పుడూ తన భావజాలాన్ని ప్రదర్శించడంలో వెనకాడలేదు జంకలేదు. దటీజ్ అరుణ్ సాగర్. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

13:25 - February 14, 2016

నల్గొండ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరోయిన్ ప్రణీతకు స్వల్ప గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా నల్గొండ జిల్లాలోని మోతె వద్ద ప్రణీత ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి.. అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రణీతోపాటు ఆమె ఎయిర్ స్టైలిష్ భాగ్యలక్ష్మీ, మేకప్ మెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రణీత ఎడమచేతికి స్వల్ప గాయం అయింది. ప్రణీత వేరొక కారులో హైదరాబాద్ బయల్దేరారు.  మరో ఇద్దరు క్షతగాత్రులను సూర్యపేట ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. 

పోలీసుల అదుపులో నలుగురు ఎర్రచందనం కూలీలు

చిత్తూరు : జిల్లాలోని శేషాచలం అడవుల్లో కూంబింగ్‌ జరుపుతున్న టాస్క్‌ ఫోర్స్ సిబ్బంది. నలుగురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. బాలపల్లి వద్ద అటవీప్రాంతంలో 10 మంది ఎర్రచందనం కూలీలు... సిబ్బందికి తారసపడ్డారు. వీరిలో నలుగురిని పట్టుకోగా... మిగిలినవారు పరారయ్యారు. పారిపోయిన కూలీల వద్ద నాటుతుపాకులు ఉన్నట్లు సమాచారం. వీరు కోడూరు, శ్రీకాళహస్తి, ఏర్పేడుకు చెందిన వారుగా గుర్తించారు. 

13:14 - February 14, 2016

చిత్తూరు : జిల్లాలోని శేషాచలం అడవుల్లో కూంబింగ్‌ జరుపుతున్న టాస్క్‌ ఫోర్స్ సిబ్బంది. నలుగురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. బాలపల్లి వద్ద అటవీప్రాంతంలో 10 మంది ఎర్రచందనం కూలీలు... సిబ్బందికి తారసపడ్డారు. వీరిలో నలుగురిని పట్టుకోగా... మిగిలినవారు పరారయ్యారు. పారిపోయిన కూలీల వద్ద నాటుతుపాకులు ఉన్నట్లు సమాచారం. వీరు కోడూరు, శ్రీకాళహస్తి, ఏర్పేడుకు చెందిన వారుగా గుర్తించారు. 

13:12 - February 14, 2016

హైదరాబాద్ : నిత్యావసర సరుకుల కల్తీని నివారించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా కల్తీ మాత్రం కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ కల్తీ పాల తయారీ స్థావరంపై సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ బృందం సభ్యులు దాడి చేశారు. వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన 200 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. పలు కంపెనీలకు చెందిన పాలను కొనుగోలు చేసి ఇంట్లో 100 లీటర్ల అసలు పాలతో మరో 100 లీటర్ల రసాయనాలు కలిపిన పాలను అదే కంపెనీలకు చెందిన ప్యాకెట్లలో నింపుతున్నారు. సమాచారమందుకున్న ఎస్‌వోటీ పోలీసులు తెల్లవారుజామున స్థావరంపై దాడిచేసి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 200 లీటర్ల కల్తీపాలు, తయారీ యంత్రాలు, రసాయన పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

13:11 - February 14, 2016

విశాఖ : ఉత్తరాంధ్ర జిల్లాలో పరిశ్రమల మూసివేతపై సీఐటీయూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మూతబడిన 36 కంపెనీలను వెంటనే తెరిపించాలంటూ విశాఖ రైల్వే స్టేషన్‌నుంచి జీవీఎంసీ వరకూ ర్యాలీ నిర్వహించింది. గాంధీ విగ్రహం దగ్గర సదస్సుకు సిద్ధమైంది. 

 

రోడ్డు ప్రమాదంలో హీరోయిన్ ప్రణీతకు గాయాలు

నల్గొండ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హీరోయిన్ ప్రణీతకు స్వల్ప గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా జిల్లాలోని మోతె ప్రణీత ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రణీతోపాటు ఆమెతో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మహబూబ్ నగర్ : వంగూరు మండలం కోనేటిపురం వద్ద శ్రీశైలం-హైదరాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 

ప్రేమికుల రోజు.. ఓయూలో పోలీసుల మోహరింపు

హైదరాబాద్ : ప్రేమికుల రోజు సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. ఓయూలోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి... ఎన్‌సీసీ గేటు మూసివేశారు. 

12:50 - February 14, 2016

హైదరాబాద్ : ప్రేమికుల రోజు సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. ఓయూలోకి ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి... ఎన్‌సీసీ గేటు మూసివేశారు. ఎస్ ఎఫ్ ఐ, ఎఐఎస్ ఎఫ్, పిడిఎస్ యూ విద్యార్థి సంఘాలు ఇంటర్నేషనల్ లవర్స్ యూనిటీ పేరుతో ఫామ్ అయి... ప్రేమికుల రోజు జరుపుతామనని ప్రకటించడంతో... వారిని ముందు జాగ్రత్తగా నిన్ననే అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రేమికుల రోజును అడ్డుకుంటామని భరజరంగదళ్, ఎబివిపి సంఘాలు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఇవాళ క్యాంపస్‌ లోకి ఎవరిని రానీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు.

 

12:40 - February 14, 2016

వరంగల్ : మహా కుంభమేళాను తలపించే వన సంబరం. ఖండాంతరాలు దాటిన చరిత్ర సొంతమైనా..అభివృద్ధి మాత్రం పిసరంతే. అధికారుల్లో ప్రణాళికా లోపంతో పైసా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడే దేవాదాయ శాఖ ఆదాయం పై దృష్టి పెట్టింది. లోపాలను సరిదిద్దుకునే పనిలో పడింది. వాచ్ దిస్ టెన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం మహాజాతర. ఈ ఉత్సవాన్ని 1996లో రాష్ట్ర పండగగా గుర్తించారు. మేడారం ఒక మహాజాతరగా ప్రసిద్దికెక్కింది. రద్దీ ఉన్నప్పటికీ ఆలయ ఆదాయం మాత్రం సున్నా.
100 దుకాణాలు వెలిశాయి
ఆలయం చట్టూ కొబ్బరి, బెల్లం అమ్మకాల కోసం కనీసం 100 దుకాణాలు వెలిశాయి. బొమ్మలు, కోళ్ల, గాజుల తదితర దుకాణాలు ఉన్నాయి. కాని ఆలయానికి పైసా రాదు. రోజుకు కనీసం 500 మంది భక్తులు కానుకలుగా తలో పది రూపాయలు వేసినా రోజుకు రూ. 5,000 ఆదాయం సమకూరుతుంది. ఇలా కానుకలను లెక్కిస్తే వారానికి కనీసం రూ. లక్షకు తగ్గకుండా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మహాజాతర అనంతరం రెండేళ్ల పాటు ఆలయానికి రూపాయి ఆదాయం లేకపోవడాన్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు.
ఆలయ ఆదాయం పెంచడంపై దృష్టి
దీంతో ఆలయ ఆదాయం పెంచడంపై దృష్టి సారించారు. ఆలయ ఆదాయాన్ని పెంచాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. అమ్మవార్ల గద్దెలపై శాశ్వత హుండీలు ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇదిలాఉంటే మేడారం ఆలయానికి సంబంధించిన కార్యాలయం జిల్లా కేంద్రంలోని భద్రకాళి ఆలయంలోని ఓ కాటేజీలో కొనసాగుతోంది. ఈ కార్యాలయాన్ని మేడారానికి తరలించాలనుకున్నా అమలులో మాత్రం సాధ్యం కావడం లేదు.
మూడు భవనాలు
మేడారంలో ఆలయానికి సంబంధించిన మూడు భవనాలున్నాయి. ఇందులో ఏదో ఒక దానిని కార్యాలయానికి ఉపయోగించుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇలా చేస్తే సీనియర్‌ అసిస్టెంట్‌, ఐదుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మేడారంలో ఉండి ఆలయ కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశముంది. ప్రభుత్వం ఈ సారి జాతరలో ఆదాయ వనరులపై దృష్టి సారించారు. ఇక వనదేవతలు కూడా ధన దేవతలయ్యే అవకాశం ఉంది.
గ్రామాల ప్రజలకు కాసుల వర్షం
ఆలయం ఆదాయ పరిస్థితి ఇలా ఉంటే, మేడారం జాతర నాలుగు రోజులు మాత్రం సమీప గ్రామాల ప్రజలకు కాసుల వర్షం కురిపించనుంది. ఈ జాతరకు కోటిమందికిపైగా భక్తులు వస్తారని అంచనా. అందుకుతగ్గట్టే వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. దీంతో మేడారం పరిసర ప్రాంతాల్లో విడిది చేసే ఇళ్లకు, గదులకు అద్దెల డిమాండ్ బాగా పెరిగిపోయింది. లక్షల మంది భక్తులు వస్తుండటంతో అద్దె ధరలు హైదరాబాద్ ను తలదన్నే రీతిలో ఉన్నాయి.
మేడారం స్థలాలకు క్రేజ్
జాతరకు వచ్చే భక్తుల బస అవసరాలు తీర్చేందుకు ఇక్కడి ప్రజలు తమ ఇళ్లు, పెరటి జాగలతో పాటు తమ పొలాలను సైతం అద్దెకు ఇస్తారు. వ్యాపార సముదాయాలకు కూడా జాగా కావాల్సి వస్తుండడంతో మేడారం స్థలాలకు క్రేజ్ పెరిగింది. వాణిజ్య అవసరాలకు సంబంధించి గద్దెల పరిసర ప్రాంతాల నుంచి జంపన్నవాగు వరకు ఉన్న రెండు కిలోమీటర్ల దారికి ఇరువైపులా ఇప్పటికే దుకాణాలు వెలిశాయి. ఇక గద్దెల చుట్టూ వంద మీటర్ల వరకు అన్నివైపులా గజం స్థలం విలువ రూ.7వేలు ఉంది.
వ్యాపారాలు కూడా ప్రారంభం
జంపన్నవాగు దగ్గర గజం స్థలం విలువ రూ.4వేలు ఉండగా ఇప్పటికే అన్ని బుక్ అవడమే కాకుండా వ్యాపారాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక జాతర కేంద్రమైన మేడారం దాని పరిసర గ్రామాలైన రెడ్డిగూడెంలలో ఇళ్ల కిరాయికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీని తర్వాత స్థానంలో కన్నెపల్లి, ఆ తర్వాత నార్లాపూర్, ఊరట్టం గ్రామాలు ఉన్నాయి. జాతర జరిగే మూడు రోజుల పాటు ఒక గదికి అద్దె కనిష్టంగా రూ 3,000 నుంచి 5,000 వరకు పలుకుతున్నాయి.
అద్దె సగటున ఐదువేల రూపాయలు
ముఖ్యంగా మేడారం గ్రామంలో ఉన్న ఇళ్ల వరండా అద్దె సగటున ఐదువేల రూపాయలుగా పలుకుతోంది. గతంలో వచ్చే భక్తులు పందిళ్లు వేసుకుని జాతర జరిగే రోజుల్లో ఇక్కడ బస చేసేవారు. నేటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఒక పందిరికి అద్దె వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు అద్దె పలుకుతోంది. ముఖ్యంగా జంపన్నవాగు-గద్దెల మధ్య ఉన్న రెడ్డిగూడెం పరిసరాల్లో ఉండే పొలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నాలుగు రోజుల కోయ మహానగరంలో అద్దెలెలా చుక్కలనంటడంతో గ్రామస్తులకు మాత్రం కాసుల గలగల సాగనుంది.

 

 

12:31 - February 14, 2016

సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'వన్‌ : నేనొక్కడినే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతిసనన్‌ ఆ తర్వాత బాలీవుడ్‌లో 'హీరో పంటీ' చిత్రంలో నటించింది. ఈచిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుని సైతం దక్కించుకుంది. దీని తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ నటించిన 'దిల్‌వాలే' చిత్రంలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా సుషాత్‌సింగ్‌ రాజ్‌ఫుత్‌ కథానాయకుడిగా రూపొందబోయే 'రాబ్త' చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఈ చిత్రంలో కథానాయికగా అలియాభట్‌ని అనుకున్నప్పటికీ ఫైనల్‌గా కృతిసనన్‌ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కృతిసనన్‌ మాట్లాడుతూ,'బాలీవుడ్‌లో లభించిన మరో మంచి అవకాశమిది. 'దిల్‌వాలే' తర్వాత చేస్తున్న చిత్రమిది. ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా నా పాత్ర తీరుతెన్నులుంటాయి. కెరీర్‌ పరంగా మంచిపేరు తీసుకొచ్చే చిత్రమిది' అని చెప్పింది.

12:28 - February 14, 2016

పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాత పొట్లూరి వి.ప్రసాద్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం 'ఊపిరి'. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని గురించి నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ,'ఫ్రాన్స్‌, బల్గేరియా, స్లోవేనియా వంటి ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎవ్వరూ షూట్‌ చెయ్యని లొకేషన్స్‌లో ఈ చిత్రాన్ని షూట్‌ చేయడం జరిగింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. నాగార్జునగారి కెరీర్‌లో 'ఊపిరి' మరో మెమరబుల్‌ మూవీ డెఫినెట్‌గా అవుతుంది. అలాగే కార్తీ ఫస్ట్‌ టైమ్‌ తెలుగులో చేస్తున్న ఈ స్ట్రెయిట్‌ సినిమా అతని కెరీర్‌లో మరో మంచి చిత్రమవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం మా పివిపి సంస్థలో మరో ప్రతిష్ఠాత్మక చిత్రమవుతుంది. ఈనెలాఖరులోగా ఆడియోను విడుదల చేస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చిలో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని అన్నారు. 'ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య ఏర్పడిన స్నేహం, తద్వారా జరిగే ఓ ఎమోషనల్‌ జర్నీ ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా ఓ కలర్‌ఫుల్‌ సెలబ్రేషన్‌లా ఉంటుంది. అందరికీ సంతోషాన్ని పంచే చక్కని చిత్రం అవుతుందన్న పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ వస్తున్నాయి. స్నేహితులుగా నాగార్జున, కార్తీ ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసేలా ఈ చిత్రం రూపొందింది' అని దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పారు.

12:25 - February 14, 2016

టాలీవుడ్‌ మ్యూజిక్‌ అవార్డ్స్‌ మూడో వార్షికోత్సవ వేడుక దుబారులో శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. సినీ తారల హంగామాతో అవార్డుల ప్రదానోత్సవం ఆద్యంతం సందడిగా సాగింది. తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించి నటుడు, నిర్మాత కృష్ణంరాజును 'లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌' పురస్కారంతో గామా-2015 వేదిక సముచితంగా గౌరవించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'మా రోజుల్లో నిర్మాతలకిచ్చే గౌరవం వేరు. నిర్మాత బతికితేనే సినిమాలో 24 క్రాప్ట్స్‌కి పని దొరుకుతుంది. అటువంటి నిర్మాత ఇప్పుడెక్కడున్నాడు?, ఇప్పుడు నిర్మాత పరిస్థితి ఏంటి? అని అనుకుంటున్న తరుణంలో నిర్మాతలంటే మేము అంటూ వందేళ్ళ తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేస్తూ 'బాహుబలి' చిత్రాన్ని నిర్మించారు. మన తెలుగు సినిమాని హాలీవుడ్‌ స్థాయికి పెంచాడు రాజమౌళి. పెద్దనాన్న మీరు ఇండిస్టీకి వచ్చి 50 ఏళ్ళు అయ్యింది. అతి త్వరలోనే యాభై ఏళ్ళ పండగ చేస్తానని ప్రభాస్‌ నాతో అన్నాడు. అలా అనుకున్న వెంటనే గామా అవార్డ్స్‌లో లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డుని ఎనౌన్స్‌ చేశారు. నా యాభై ఏళ్ళ నట జీవితానికి సంబంధించిన సెలబ్రేషన్స్‌ ఇలా దుబారులో మొదలవ్వడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు. 'కథ విన్న తర్వాత 'బాహుబలి' ఒకటే పార్ట్‌ అనుకున్నాం. రాజమౌళి కథ నెరేట్‌ చేసిన తర్వాత ఎంత బడ్జెట్‌ అవుతుందో పేపర్‌ మీద లెక్కలు వేసి, ఈ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్‌ అవ్వదని చెప్పి, బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్‌తో సినిమా చేద్దామని చెప్పారు. సినిమా అంటే ఎంతో ప్యాషన్‌ ఉన్న శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లు ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు. మేం సపోర్ట్‌ చేస్తాం. లెక్కలు చూసుకోకుండా ధైర్యంగా మీరు తీయండంటూ రాజమౌళికి చెప్పి 'బాహుబలి'కి ప్రాణం పోశారు. ఇంత రిస్క్‌ తీసుకుని సినిమాని నిర్మించిన వాళ్ళని అభినందించి తీరాల్సిందే' అని ప్రభాస్‌ అన్నారు. 'గామా అవార్డులకి సంబంధించి నేను అందుకున్న మూడో అవార్డు ఇది. మూడు సంవత్సరాలు డిఫరెంట్‌ కేటగిరిల్లో అవార్డులను అందుకున్నాను. తాజాగా పొందిన అవార్డును మా నాన్నతోపాటు సంగీత దర్శకుడు అనూప్‌ మదర్‌కి కూడా అంకితమిస్తున్నాను' అని సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ చెప్పారు.
గామా - 2015 అవార్డు విజేతల వివరాలు
- బెస్ట్‌ మూవీ ఆఫ్‌ ద ఇయర్‌ : బాహుబలి
- లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌ మెంట్‌ అవార్డు : కృష్ణంరాజు
- ఉత్తమ టైటిల్‌ సాంగ్‌ - శ్రీమంతుడు (రామజోగయ్యశాస్త్రి)
- ఉత్తమ నేపథ్యగాయని - రమ్య బెహెరా ( ధీవర - బాహుబలి)
- ఉత్తమ సెలబిట్రీ సింగర్‌ - లక్ష్మీ మంచు 
- ఉత్తమ గీత రచయిత - సిరివెన్నెల సీతారామశాస్త్రి - విద్వేషం.. (కంచె)
- ఉత్తమ ప్రేమ గీతం - 
ఎస్‌.ఎస్‌.థమన్‌, జోనిత గాంధీ ( నువ్వే నువ్వే -కిక్‌2)
- బెస్ట్‌ డ్యూయెట్‌ సాంగ్‌ - 
కార్తీక్‌, దామిని (పచ్చబొట్టేసిన - బాహుబలి)
- బెస్ట్‌ అప్‌కమింగ్‌ ఫీమేల్‌ సింగర్‌ - స్ఫూర్తి (కిక్‌2)
- బెస్ట్‌ కమర్షియల్‌ సాంగ్‌ - దేవీశ్రీప్రసాద్‌, శ్రావణ భార్గవి 
(సూపర్‌ మచ్చి - సన్నాఫ్‌ సత్యమూర్తి)
- బెస్ట్‌ పొయోటిక్‌ సాంగ్‌ - శ్రీమణి 
(చూపులతో - బెంగాల్‌ టైగర్‌)
- బెస్ట్‌ మ్యూజికల్‌ సాంగ్‌ - గోపీ సుందర్‌, రేణుక అరుణ్‌ 
( ఎందరో మహానుభావులు - భలే భలే మగాడివోరు)
- బెస్ట్‌ అప్‌కమింగ్‌ లిరిసిస్ట్‌ - 
రామాంజనేయులు (లవ్‌ చేయాలా వద్దా - కుమారి 21 ఎఫ్‌)
- బెస్ట్‌ అప్‌కమింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ - భీమ్స్‌ ( బెంగాల్‌ టైగర్‌)
- బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌ - అనూప్‌ రూబెన్స్‌ (గోపాల గోపాల)
- స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌ - 
చంద్రబోస్‌ (తెలుగంటే - సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌)
- బెస్ట్‌ అప్‌కమింగ్‌ సింగర్‌ - యాజీన్‌ నిజార్‌ 
(చారుశీల - శ్రీమంతుడు, సీతాకాలం - సన్నాఫ్‌ సత్యమూర్తి)

12:22 - February 14, 2016

చిత్తూరు : రథసప్తమికి తిరుమలలో భారీగా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు.
ఈమేరకు ఆయన టెన్ టివితో సాంబశివరావు ప్రత్యేకంగా మాట్లాడారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాహనసేవలకు ఆటంకం కలగకుండా చూస్తున్నామని చెప్పారు. భక్తులకు అన్న ప్రసాదం, మజ్జిగ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

 

11:58 - February 14, 2016

వరంగల్ : ఒకప్పటి దట్టమైన మేడారం అడవి నేడు చిట్టడవిగా మారుతోంది. పుష్కలమైన అటవీ సంపద కంటికి కనిపించడం లేదు. గిరిజన మ్యూజియం మాటలకే పరిమితమైంది. ఆదివాసీ సంస్కృతిని ప్రతిభింభిస్తామన్నపాలకుల హామీ గాలిలో కొట్టుకుపోయింది. దీంతో పచ్చని అడవి కాస్తా కనుమరుగైంది. మైదానంలా మారుతున్న మేడారంపై ప్రత్యేక కథనం
తరిగిపోతున్న మేడారం అటవీ విస్తీర్ణం
ఒకప్పుడు మేడారం జాతర అంటే దట్టమైన అడవి గుండా ప్రయాణం చేయాల్సి వచ్చేది. అయితే గడిచిన దశాబ్దకాలంగా భక్తుల సంఖ్య పెరగడం..అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తుండడం కారణంగా అటవీ విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. వన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం పరిసర ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం పెంచడంలో వరంగల్ జిల్లా అధికారుల శ్రద్ధ చూపకపోవడం వన జాతర జనజాతరవుతోంది.
అటవీసంపదను కాపాడేందుకు చర్యలు
మేడారం జాతర-2012 సందర్భంగా అప్పటి జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా  అటవీ సంపదను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వచ్చే జాతర నాటికి మేడారం పరిసర ప్రాంతాల్లో రెండు లక్షల మొక్కలను పెంచుతామన్నారు. కానీ..జాతర సందర్భంగా ఈ విషయాన్ని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. 
హరితహారంలో మేడారంకు చోటులేదు
ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో మేడారం యాక్షన్ ప్లాన్‌కు చోటు దక్కలేదు. మరోవైపు ఇక్కడ నిర్మిస్తామని చెప్పిన గిరిజన మ్యూజియం నాలుగేళ్లుగా ప్రకటనలకే పరిమితమైంది. మేడారం చుట్టు పక్కల 6,630 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంటే..దీనిలో 2,500 హెక్టార్ల అటవీ ప్రాంతంలో భక్తులు విడిది చేస్తున్నారు.
మైదానంగా  మారిన 200 హెక్టార్ల అటవీ ప్రాంతం 
అటవీశాఖ లెక్కల ప్రకారమే మేడారం చుట్టు పక్కల ప్రాంతాల్లో 200 హెక్టార్ల అటవీ ప్రాంతం పూర్తి మైదానంగా మారింది. అటవీ విస్తీర్ణం పెంచడంలో వరంగల్ జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల మేడారం వనజాతర కాస్త మేడారం-మైదాన జాతరగా మారిపోయే పరిస్థితులు వచ్చాయి. 
2012లో గిరిజన మ్యూజియం హామీ
మేడారం జాతర-2012 సందర్భంగా  అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మేడారంలో గిరిజన మ్యూజియం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2014లో వచ్చే జాతర కల్లా మేడారంలో గిరిజన మ్యూజియం ఏర్పాటు అందుబాటులోకి వస్తుందన్నారు. 2014 జాతర సమయంలో టెండర్ల ప్రక్రియ జరుగుతోందంటూ హడావుడి చేశారు. ఆ తర్వాత ఈ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. 
కంకవనాల విస్తీర్ణం 
జాతర విశిష్టతలు, ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జాతరకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే కంకవనాల విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకుంటేనే జాతర దేదీప్యమానమవుతుంది.

 

11:46 - February 14, 2016

శ్రీకాకుళం : అన్ని పాఠశాలలో సూర్య నమస్కారాలు అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీనరసింహం తెలిపారు. అరసవెల్లిలో రథసప్తమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సంరద్భంగా టెన్ టివితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.  రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. గవర్నర్, రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు వస్తారని తెలిపారు. దేశంలో నిత్య పూజలందుకుంటున్న ఏకైక ఆలయం అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయమని పేర్కొన్నారు. 

 

రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు : జిల్లాలో రైలు కింద పడి హరి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధ్యాపకుల వేధింపులే హరి ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. హరి.. సిల్వర్ జూబ్లీ కాలేజీలో బీఎస్ సి చదువుతున్నాడు.  

11:29 - February 14, 2016

ముంబై : హఫీజ్ సయీద్ సీనియర్‌ అంకుల్, జాకీర్ రహ్మాన్ లఖ్వీ యంగ్‌ అంకుల్‌... డేవిడ్ హెడ్లీ తన సహచర తీవ్రవాదితో సంభాషణ కోసం వాడిన కోడ్ లాంగ్వేజి ఇది. ముంబై దాడి కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్‌ హెడ్లీ ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.   
డేవిడ్‌ హెడ్లీ ఐదోరోజు విచారణ 
26/11 ముంబయి దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన డేవిడ్‌ హెడ్లీ ఐదోరోజు విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ముంబై దాడుల తర్వాత భారత్‌కు వచ్చానని పేర్కొన్న హెడ్లీ ఢిల్లీ, పుష్కర్, పుణె, గోవాలను సందర్శించినట్టు తెలిపారు. పుణెలోని ఇండియన్‌ ఆర్మీ ఇన్‌స్టాలేషన్, ఇండియన్‌ ఆర్మీకి చెందిన దక్షిణ కమాండ్‌ హెడ్‌క్వార్టర్లపై రెక్కి నిర్వహించానని కోర్టుకు తెలిపాడు. భారత సైనిక వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ఆ సైన్యంలో పనిచేసే ఎవరో ఒక అధికారి తమ కింద పనిచేసేలా రిక్రూట్‌ చేసుకోవడమే ఉద్దేశమన్నారు.
సాజిద్‌ మిర్‌తో సంబంధాలు 
26/11 దాడుల అనంతరం తాను లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు సాజిద్‌ మిర్‌తో సంబంధాలు కొనసాగించామని హెడ్లీ తెలిపారు. ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్‌ ప్రభుత్వం విచారణ చేపట్టడంతో ఈమెయిల్‌ ద్వారా సంప్రదింపులు జరిపానని చెప్పాడు. ఎవరికీ అనుమానం రాకుండా హఫీజ్ సయిద్‌ను తన  ఓల్డ్‌ అంకుల్‌గా, జాకీర్ రహ్మాన్ లఖ్వీని యంగ్‌ అంకుల్‌గా కోడ్ లాంగ్వేజిలో పేర్కొన్నాడు.  
హెచ్‌1 వైరస్‌ కోడ్‌
హెడ్లీ అతని అనుచరులు హెచ్‌1 వైరస్‌ కోడ్‌ను కూడా ఉపయోగించారు. భారత్‌లో హెచ్‌1 ఎన్‌1 వైరస్‌ వ్యాప్తి చెందడంతో ఈ కోడ్‌ను ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆగస్టు28న' ఓల్డ్ అంకుల్‌కు  హెచ్1 వైరస్ కూడా వచ్చిందా? ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ చెకప్ చేయాలనుకుంటున్నాడు అనే సారంశంతో హెడ్లీ మెయిల్ చేశాడు.  వారిపై విచారణ జరిగితే హఫీజ్ సయీద్‌కు అనుకూలంగా ఉంటామని హెడ్లీ కోర్టుకు తెలిపిన అసలు అర్థం. అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తున్న హెడ్లీని ముంబై కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  విచారిస్తోంది.

 

11:19 - February 14, 2016

ఢిల్లీ : ఎఫ్‌డిఐలకు భారత్ స్వర్గధామమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎఫ్‌డీఐల వృద్ధి 48శాతం నమోదైనట్లు మోదీ తెలిపారు. డిసెంబర్‌ 2015లో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయని మోది పేర్కొన్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న మేక్‌ ఇన్‌ ఇండియా వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత్‌ అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. దేశంలో 35 ఏళ్ల లోపు యువత 65 శాతం ఉందని.. దేశాభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వీడన్‌ ప్రధాని స్టీఫెన్‌ లోఫెన్, ఫిన్లాండ్‌ ప్రధాని జుహా సిపిలాతో పాటు 49 దేశాల అధికార ప్రతినిధులు, 68 దేశాల వ్యాపార ప్రతినిధులు హాజరయ్యారు.

 

11:13 - February 14, 2016

చిత్తూరు : జిల్లాలోని తరికొండలో నిన్న ప్రియుడిచేతిలో హత్యకు గురైన షబహా మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. ముందుజాగ్రత్త చర్యగా భారీగా పోలీసుల్ని మోహరించారు.. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

11:06 - February 14, 2016

తూర్పుగోదావరి : కాల్‌మనీ కాలనాగు బుసలు కొడుతూనే ఉంది. కేటుగాళ్ల కుతంత్రాలు బయట పడుతూనే ఉన్నాయి. అవసరానికి అప్పుచ్చి..ఆ తరువాత అకృత్యాలకు పాల్పడే తత్వం బోధపడుతూనే ఉంది. వడ్డీ పేరుతో మహిళలను వేధింపులకు గురిచేస్తున్న మాయగాళ్ల ఆగడాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో మరో కాల్‌మనీ కేసు కలకలం రేపింది.                                                                        
కాల్‌మనీ కేటుగాళ్ల ఆగడాలకు మరో కుటుంబం బలి
కాల్‌మనీ కేటుగాళ్ల ఆగడాలకు తూర్పు గోదావరి జిల్లాలో మరో కుటుంబం బలైపోయింది. లక్షల రూపాయలను వడ్డీ పేరుతో పీల్చేసిన మాయగాళ్ల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. వడ్డీ వ్యాపారుల వేధింపులను తట్టుకోలేక ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోయిన వైనం ఆలస్యంగా ప్రపంచానికి తెలిసింది. అంతటితో ఆగని కాల్‌ నాగులు కామంతో బుసలు కొడుతున్నాయి. ఆ కుటుంబంలో మహిళపై వేధింపులకు పాల్పడుతున్నాయి.
అప్పుగా 10లక్షల రూపాయలు
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరం గ్రామానికి చెందిన చంద్రాల వీరయ్యమ్మ కుటుంబీకులు రాజమండ్రికి చెందిన వీరన్న చౌదరి అనే వ్యక్తి దగ్గర 10లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. దీని కోసం ఎకరం 40 సెంట్ల భూమిని పవర్‌ ఆఫ్‌ అటార్నీ చేశారు. 2009లో ఈ అప్పును తీసుకున్నారు. ఐతే వడ్డీ పేరుతో ఇప్పటి వరకు 50 లక్షల వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా 4 ఎకరాల భూమిని కూడా బలవంతంగా రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారని విలపిస్తున్నారు.
వేధింపులు తట్టుకోలేకే నాగప్రసాద్ మృతి
వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేకే తన మనమడు నాగప్రసాద్‌ చనిపోయాడని వీరయ్యమ్మతో పాటు ఆమె కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు.
మహిళలు టార్గెట్‌
కాల్‌మనీ కేటుగాళ్లు అంతటితో ఆగలేదు. ఆ కుటుంబంలోని మహిళలను టార్గెట్‌ చేసుకున్నారు. సూటిపోటి మాటలతో...వెకిలి చేష్టలతో వేధింపులకు దిగారు. వడ్డీ పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కాల్‌మనీ కేసు కలకలం రేపింది. వేధింపులకు పాల్పడిన వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

 

 

 

10:54 - February 14, 2016

కృష్ణా : విజయవాడ నగర శివారులోని రామవరప్పాడు సమీపంలో రైవస్‌ కాలువగట్టుపై ఇళ్లు తొలగించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించడం ఉద్రిక్తత నెలకొంది. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ పనుల్లో భాగంగా.... అడ్డంగా ఉన్న ఇళ్లు తొలగించేందుకు అధికారులు ఇళ్ల వద్దకు చేరుకోగానే నివాసితులు వారితో వాగ్వాదానికి దిగారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి హోటల్‌ను కాపాడేందుకు తమ ఇళ్లు తొలగించేందుకు ప్రయత్నించడం సబబు కాదని వాదించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇళ్లు తొలగిస్తే సహించేది లేదంటూ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఓ వ్యక్తి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా ... నిలువరించి పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. 

 

10:51 - February 14, 2016

చిత్తూరు : తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. 

'ప్రేమికులను అడ్డుకుంటాం'...

హైదరాబాద్ : ప్రేమికుల రోజు సందర్భంగా ప్రపంచం వ్యాప్తంగా ప్రేమికులు సిద్ధమవుతుంటే వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నేతలు మాత్రం ప్రేమికులను తాము అడ్డుకుంటామని చెబుతున్నారు. నగరంలో ఎక్కడైనా ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామని భజరంగ్‌దళ్‌ హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే..ప్రేమికులను అడ్డుకోవడం తగదు..తాము ప్రేమికులకు అండగా నిలుస్తామంటూ ఇండియన్ లవర్స్ యూనియన్ భరోసా ఇస్తోంది. లవర్స్ అడ్డుకోవడానికి ఎవరికి ఏ హక్కులేదు. బలవంతపు పెళ్లిళ్లను తాము ఆపుతామంటూ ఐఎల్‌యూ చెబుతోంది.

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్..

మీర్ పూర్ : అండర్ -19 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో టాస్ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్ జట్టు ఐదో వికెట్‌ కోల్పోయింది. భారత్ జట్టు 50 పరుగుల వద్ద అరమన్‌ జాపర్ (5) పరుగులు చేసి సిప్రింగర్‌ బౌలింగ్‌ వెనుదిరిగాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 18 ఓరవ్లకు 51 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. క్రీజులో సర్పారాజ్‌ ఖాన్‌ (12), లోమరార్‌ (1) పరుగులతో ఉన్నారు.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న గవర్నర్ దంపతులు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఆదివారం ఉదయం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్‌ దంపతులకు ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రథసప్తమి వేడుకల్లో గవర్నర్‌ దంపతులు పాల్గొన్నారు.

09:50 - February 14, 2016

నల్గొండ : కొందరి దగ్గర వంద రూపాయలు తీసుకున్నాడు. మరికొందరి దగ్గర వెయ్యి రూపాయలు కట్టించుకున్నాడు. ఇంకొందరి దగ్గర లక్ష రూపాయలు సేకరించాడు. ఐదు లక్షల వరకూ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. ఇలా అందరి దగ్గరా అందినకాడికి దండుకున్నాడు. పోస్ట్‌మేనే కదా...అని అందరూ అతన్ని నమ్మేశారు. ఊళ్లోనే ఉంటున్నాడు కదా అని ఎడాపెడా డబ్బులు కట్టేశారు. చివరికి అతగాడు అన్నీ మూటకట్టుకుని ఉడాయించేశాడు. కోటి రూపాయల వరకు కూడబెట్టుకుని ఆ గ్రామస్తుల కొంప ముంచాడు. 
గ్రామస్తుల నుంచి డబ్బులు తీసుకుని ఉడాయింపు
నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం మాండ్ర గ్రామంలో పోస్ట్ మ్యాన్‌ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. పోస్ట్ ఆఫీసులో కడతానంటూ గ్రామస్తుల నుంచి డబ్బులు తీసుకుని ఉడాయించాడు. గత కొన్ని రోజులుగా పోస్ట్‌మ్యాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండా పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. 
సేవింగ్స్ పేరుతో డిపాజిట్లు 
వనం శ్రీరాములు అనే పోస్ట్ మ్యాన్‌ మాండ్ర గ్రామంలో గత 20 ఏళ్లుగా ఉంటున్నాడు. సేవింగ్స్ పేరుతో గ్రామస్తుల నుంచి డిపాజిట్లు సేకరించాడు. గ్రామంలో సుమారు 150 మంది నుంచి  డబ్బులు తీసుకున్నాడు. ఒక్కొక్కరూ 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు ముట్టజెప్పారు. వీరిలో కొంతమంది 5 లక్షల వరకు చెల్లించామని చెబుతున్నారు.
జనానికి కుచ్చుటోపీ పెట్టి
ఎన్నో ఏళ్లుగా గ్రామంలోనే నివాసం ఉంటున్నాడని పోస్ట్ మ్యాన్‌ శ్రీరాములను జనం నమ్మేశారు. లక్షలాది రూపాయలను అతని చేతుల్లో పెట్టారు. చివరికి శ్రీరాములు జనానికి కుచ్చుటోపీ పెట్టి.. ఫ్యామిలీతో సహా పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పోలీసులు పోస్ట్ మ్యాన్‌ శ్రీరాములను పట్టుకుని తమ డబ్బులు తమకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 

 

09:43 - February 14, 2016

ఆదిలాబాద్ : జిల్లా మందమర్రి మండలంలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. అతిల్ పేట్ గ్రామంలో యశ్వనంద్ అనే బాలుడు ఆడుకుంటుండగా వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడు మెడకు, నోటికి తీవ్ర గాయాలు కావడంతో మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  

09:41 - February 14, 2016

శ్రీకాకుళం : అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్‌ లక్ష్మీ నరసింహం అరసవెల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో 5 కిలోమీటర్ల మేర క్యూలైన్‌లో భక్తులు నిలుచున్నారు. మరో వైపు వీఐపీల పేరుతో క్యూ లైన్‌ను నిలిపివేయడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

09:35 - February 14, 2016

హైదరాబాద్ : సుధీర్ఘ విరామం తర్వాత మహానగర పాలక సంస్థ కొలువు తీరింది. మేయర్‌ పాలన పగ్గాలు చేపట్టిన బొంతు రామ్మోహన్‌..గ్రేటర్‌ సమస్యలపై దృష్టిపెట్టారు. ప్రధానంగా క్షేత్రస్థాయి అభివృద్ధిపై ప్రణాళికలు రచిస్తున్నారు. అధికారులతో అన్ని విషయాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ బిజి బిజిగా గడుపుతున్నారు. 
గ్రేటర్‌ పాలన షురూ 
గ్రేట‌ర్ ప‌రిధిలో గ‌త ఏడాదికాలంగా ఎదురు చూస్తున్న జీహెచ్ఎంసి పాల‌క మండ‌లి ఎట్టకేలకు పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. గ్రేటర్‌ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంతరం మేయ‌ర్, డిప్యూటి మేయ‌ర్ ప్రమాణ స్వీకారంతో గ్రేటర్‌లో మేయర్ పాలన షురూ అయింది. ఇక మిగిలింది గ్రేటర్‌ అభివృద్దిపై ప్రణాళికలు రచించి వాటిని అమలు చేయడమే. దీంతో కొత్తగా ఎన్నికైన మేయర్‌ బొంతు రామ్మోహన్‌..గ్రేటర్లోని సమస్యలపై దృష్టి సారించారు. 
కుంటుపడ్డ అభివృద్ధి పనులు 
అయితే గ‌త పాల‌క మండ‌లిలో వార్డు క‌మిటీల ఏర్పాటు, నిర్వహ‌ణ‌లో నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రించ‌డంతో చాలా ప్రాంతాల‌లో అభివృద్ధి ప‌నులు కుంటుప‌డ్డాయి. కార్పొరేట‌ర్లకు కేటాయించిన నిధులు కూడా ఖ‌ర్చుకాకుండా మురిగిపోయాయి. అయితే కొత్తగా కొలువుదీరిన పాల‌క‌మండ‌లి వార్డు క‌మిటీల ఏర్పాటుపై దృష్టిసారించింది. దాంతో పాటు పాల‌న‌పై అవ‌గాహ‌న పెంచేందుకు త‌మ‌ హ‌క్కులు, విధులు తెలియ‌జేసుందుకు ఈనెల 20న కార్పొరేటర్లందరికి శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ  సమావేశానికి సమన్వయ కర్తగా సీఎం కేసీఆర్‌ హాజరై..కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయ‌నున్నారు.
వార్డు కమిటీల్లో రాజకీయ జోక్యం 
అయితే బ‌స్తీలు, కాల‌నీల అభివృద్దిలో ఎంతో కీల‌క‌మైన వార్డు క‌మిటీల‌లో రాజ‌కీయ జోక్యం పెరిగిపోవడంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాజ‌కీయ నాయ‌కుల బంధువులు, కాంట్రాక్టర్లు, ఏజెంట్లను వార్డు క‌మిటీల‌లో చేర్చుకోవడంతో..కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనే విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వ‌న‌గ‌ర నిర్మాణ‌మే ధ్యేయంగా అడుగులు వేస్తున్న టిఆర్ఎస్ ప్ర‌భుత్వం క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం తీసుకోవ‌డం ఎంతైనా అవ‌స‌రం. అయితే చ‌ట్టాన్ని అమ‌లు చేస్తారా....., లేక మ‌రో విధానాన్ని అవ‌లంబిస్తారా అనేది మ‌రో ముడు నెల‌ల్లో తెలిపోనుంది. 

09:29 - February 14, 2016

హైదరాబాద్ : ఒక పక్క గ్రేటర్‌ ఉత్సాహం ఉరకలేస్తోంది. మరోపక్క సక్సెస్‌ను కంటిన్యూ చేయడానికి సీక్వెల్‌ సిద్ధమవుతోంది. అనుకున్న టార్గెట్‌ రీచ్‌ కావడంతో కొత్త  టార్గెట్‌ లైన్‌లోకి వస్తోంది. మరో రెండు కార్పొరేషన్లలో కాలు పెట్టేందుకు పక్కా ప్లాన్‌ పురుడు పోసుకుంటోంది. అక్కడ కూడా గులాబీ జెండాను రెపరెపలాడించేందుకు ముందస్తు ప్రణాళిక రెడీ అవుతోంది.                                                                                    
విజయం కోసం ప్రణాళికలు
గ్రేటర్‌లో గ్రేట్‌ సక్సెస్‌ను సొంతం చేసుకున్న అధికార పార్టీ మరో రెండు కార్పొరేషన్లపై కన్నేసింది. ఆ రెండు కార్పొరేషన్లలోనూ విజయం సాధించేందుకు ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. వరంగల్‌, ఖమ్మం నగర పాలక సంస్థల్లో పాగా వేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రణాళికలు రెడీ చేస్తోంది.
వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు
వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్‌ విడుదల కాకముందే అధికార పార్టీలో హడావుడి స్టార్టయ్యింది. ఈ రెండు కార్పొరేషన్లను కూడా తమ ఖాతాలో జమ చేసుకోవాలని కారు పార్టీ కలలు కంటోంది. ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత ఆయా జిల్లాల నేతలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. ఎలక్షన్‌ స్ట్రాటజీపై ఇప్పటి నుంచే మంతనాలు ప్రారంభించారు.
ఖమ్మంపై ప్రత్యేక దృష్టి
వరంగల్‌ కార్పొరేషన్‌పై అధికార పార్టీ కాన్ఫిడెంట్‌గానే ఉన్నా ఖమ్మం మాత్రం కాస్త కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేత ఖమ్మంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన తుమ్మలను పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టారు. అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సండ్ర వీరయ్యను కూడా కారు ఎక్కించేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. సండ్ర తుమ్మల అనుచరుడు కావడం..ఓటు నోటు కేసులో నిందితుడిగా ఉండడంతో ఆయన గులాబీ గూటికి చేరక తప్పదని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోపక్క ఖమ్మంలో పర్యటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెడీ అవుతున్నారు. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే వరంగల్‌,ఖమ్మం కార్పొరేషన్లపై గులాబీ పార్టీ గురిపెట్టింది. 

 

09:19 - February 14, 2016

మెదక్ : నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. గతంలో జరిగిన ఎన్నికలకన్నా అధికంగా... 80శాతం పోలింగ్ నమోదైంది. 2014లో ఇక్కడి నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే హఠాన్మరణం చెందారు. దీంతో సాంప్రదాయానికి భిన్నంగా మిగిలిన పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దించడంతో ఎలక్షన్ అనివార్యమైంది. 
80 శాతం మేర ఓటింగ్ 
నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఇవిఎం బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలవరకు కొనసాగింది. 5 గంటల తర్వాత కూడా క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. మొత్తం 286 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలో మాదిరే ఇక్కడా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎలక్షన్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అయితే వారి శ్రమ గ్రేటర్‌లో ఫలించకపోయినా నారాయణఖేడ్‌లో మాత్రం సక్సెస్ అయింది. గత ఎన్నికల కన్నా భిన్నంగా అత్యధికంగా 80 శాతం మేర ఓటింగ్ నమోదైంది. 
పకడ్బందీ బందోబస్తు మధ్య ఎలక్షన్
పకడ్బందీ బందోబస్తు మధ్య ఎలక్షన్ నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని వెబ్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఎన్నిక ప్రశాంతంగా ముగియడంతో మెదక్‌ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్‌ అధికారులు, పోలీస్ సిబ్బంది, పార్టీల నేతలకు కృతజ్ఙతలు తెలిపారు. 
పోలింగ్ సమయంలో విషాదం
పోలింగ్ సమయంలోవిషాదం చోటుచేసుకుంది. కొండాపూర్ లో ఎన్నికల విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు.  హెడ్ కానిస్టేబుల్ ను పటాన్ చెరు కు చెందిన హరిసింగ్ గా గుర్తించారు. పోలింగ్ అనంతరం... ఈవీఎం బాక్సులను పటిష్ట బందోబస్తు మధ్య భద్రపరిచారు. పార్టీలు అవసరమైతే తమ ఏజెంట్లను బాక్సులను భద్రపరిచిన కేంద్రం వద్ద ఉంచొచ్చని కలెక్టర్‌ సూచించారు. ఈనెల 16న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

 

09:04 - February 14, 2016

హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న డబుల్‌బెడ్‌ రూం పథకం అమలుపై గ్రేటర్‌ అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశించిన టార్గెట్‌ను చేరుకోవడానికి అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. నగరంలో ఖాళీ స్థలాల వివరాలు సేకరిస్తూ... ఎక్కడ ఏఏ నిర్మాణాలు చేపట్టాలి అన్న వివరాలతో పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 
సీఎం వాగ్దానం అమలుకు అధికారుల కసరత్తు
ఏడాది కాలంలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీతో.. గ్రేటర్‌ ఓటర్లు టీఆర్ఎస్‌కు పట్టం కట్టారు. డబుల్‌ బెడ్‌ రూం పథకంపై ప్రజల్లో నెలకొన్న ఆశలే టీఆర్ఎస్‌ అప్రతిహత విజయానికి, మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడానికీ ప్రధాన కారణమనడం నిర్వివాదాంశం. నగరపాలక సంస్థ పాలకమండలి కొలువు దీరిన తరుణంలో... సీఎం ఇచ్చిన వాగ్దానం అమలుకు అధికారులు కసరత్తును మొదలు పెట్టారు. 
500 ఎకరాలు కావాలని అంచనా
జంటనగరాల్లో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కావలసిన భూమిని సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా... రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల రెవిన్యూ యంత్రాంగంతో.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దనరెడ్డి శనివారం సమావేశం నిర్వహించారు. లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి జంటనగరాల్లో కనీసం ఐదు వందల ఎకరాల భూమి అవసరమని భావిస్తున్న  జీహెచ్‌ఎంసీ అధికారులు... ఈ రెండు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ ఖాళీ భూములను తమకు అప్పగించాలని రెవిన్యూ అధికారులను కోరారు. 
రెండు స్థలాలనే అప్పగించిన రెవిన్యూ అధికారులు
నగరంలోని వెయ్యీ నాలుగు వందల అరవై ఆరు (1,466) నోటిఫైడ్‌ స్లమ్స్ లో నివసించే దాదాపు రెండు లక్షల మందికి ఇళ్లు లేవని అధికారులు అంచనా వేశారు. రంగారెడ్డి జిల్లాలోని 20 ప్రాంతాలను డబుల్‌బెడ్‌ రూం పథకానికి ఎంపిక చేశారు. ఎలాంటి వివాదాలు లేని మరో 11 స్థలాలనూ జీహెచ్‌ఎంసీ కోరుకుంటోంది. అయితే రెవిన్యూ అధికారులు ఇప్పటి వరకూ కేవలం రెండు ప్రాంతాలనే జీహెచ్‌ఎంసీకి అప్పగించారు. జీహెచ్‌ఎంసీ, రెవిన్యూ అధికారుల సమన్వయంతోనే పథకం అమలు వేగవంతమవుతుందని కమిషనర్‌ జనార్దనరెడ్డి తెలిపారు. 
సోమవారం నుంచి రెవిన్యూ అధికారుల సమావేశాలు
ఇళ్ల నిర్మాణంతో పాటు.. న‌గ‌రంలో నైట్ షెల్టర్లు, పార్కులు, గార్బేజ్ ట్రాన్స్‌ఫ‌ర్ స్టేష‌న్లు, డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి కూడా పెద్ద ఎత్తున భూమి అవ‌స‌ర‌మ‌ని, ఈ భూముల‌ను కూడా  సేకరించాలని క‌మిష‌న‌ర్ కోరారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే నిర్దేశించిన టార్గెట్‌ కావడంతో.. రెవిన్యూ అధికారులు.... ఆర్డీవోల స్థాయిలో తహశీల్దార్‌లు, ఆర్‌ఐలు, వీర్‌ఓలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకునే పనిలో పడ్డారు. సోమవారం నాటి నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీలైనంత త్వరలో కనీసం యాభైవేల ఇళ్లయినా నిర్మిస్తే.. ప్రజల్లో సర్కారుపై నమ్మకం పెరుగుతుందని.. ఈ దిశగా త్వరత్వరగా భూసేకరణ చేపట్టాలని అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 

 

08:57 - February 14, 2016

హైదరాబాద్ : ఏపీలో కులాల కుంపట్లు రగులుకుంటున్నాయి. కాపు రిజర్వేషన్ వివాదం చల్లారకముందే బీసీల ఆందోళన..అది ముగియకముందే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకొచ్చింది. ఈసారి టిడిపి నేతలు  తమలో తామే విమర్శల వాగ్బాణాలు విసురుకుంటున్నారు. దీనికి ఎస్సీ వర్గీకరణ అంశం మూల కారణమైంది. 
నేడు ఎస్సీ వర్గీకరణ 
మొన్న కాపు రిజర్వేషన్ వివాదం.. నిన్న కాపు రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తూ బీసీల ఆందోళన.. నేడు ఎస్సీ వర్గీకరణ అంశం...ఇదీ ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితి. ఎస్సీ వర్గీకరణ చేసే ఆలోచన ఏదీ లేదంటూ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎమ్మార్పీఎస్ వెనుక జగన్ హస్తం ఉందని విమర్శించారు. 
పత్తిపాటి ప్రకటనపై మందకృష్ణ మాదిగ సీరియస్ 
మంత్రి పత్తిపాటి ప్రకటనపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీరియస్ అయ్యారు. కాపులను బీసీల్లో చేర్చే విషయంలో 70 కేసుల్లో నిందితుడిగా ఉన్న ముద్రగడను అరెస్టు చేసే దమ్ము ప్రభుత్వానికి.. పుల్లారావుకు ఉందా అని ప్రశ్నించారు. SC వర్గీకరణ విషయంలో టిడిపికి చిత్తశుద్ధి లేదంటూ విమర్శించారు. ఏప్రిల్ 30న విజయవాడలో 10 లక్షల మందితో భారీ సభను నిర్వహిస్తామని మందకృష్ణ అన్నారు. 
ప్రత్తిపాటి వ్యాఖ్యలపై డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఆగ్రహం  
ఎస్సీ వర్గీకరణ చేసే ఆలోచన లేదన్న మంత్రి ప్రత్తిపాటి వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆలోచన ప్రభుత్వానికి లేకపోతే జీవో నెం.25 ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సున్నితమైన అంశాలు మాట్లాడేటప్పుడు మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం తనకు అప్పగిస్తే..24 గంటల్లో పరిష్కరిస్తానన్నారు డొక్కా. 
డొక్కా వ్యాఖ్యలను తప్పుబట్టిన రావెల కిషోర్‌బాబు
అయితే డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వ్యాఖ్యలను మంత్రి రావెల కిషోర్‌బాబు తప్పు పట్టారు. ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం నూటికి నూరుపాళ్లు కట్టుబడి ఉందన్నారు. ఎస్సీల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని...అందుకే జీవో నెంబర్‌ 25ను విడుదల చేశామన్నారు. 
మందకృష్ణ వ్యాఖ్యలను తప్పుబట్టిన వర్ల రామయ్య 
టీడీపీ నేతల మధ్య వాగ్యుద్ధం ఓవైపు సాగుతుండగానే..మరోవైపు... మందకృష్ణ వ్యాఖ్యలను.. టిడిపి నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. మందకృష్ణకు ఆంధ్రప్రదేశ్‌లో పనేంటని ప్రశ్నించారు. మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు అధికంగా ఉన్న తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్‌ కోసం పోరాడాలంటూ సూచించారు. అక్కడ కెసిఆర్‌ను ప్రశ్నించే దమ్ము లేక ఇక్కడిక్కడే తిరుగుతున్నారంటూ వర్ల రామయ్య ఫైరయ్యారు. అసలే కుల వివాదాలతో సతమతమవుతున్న ఏపి సిఎం చంద్రబాబుకు.. ఈ వర్గీకరణ అంశం మరింత చికాకు తెచ్చేలా ఉంది. 

తరికొండలో సబహా మృతదేహం గుర్తింపు

చిత్తూరు : తరికొండలో సబహా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రియుడు సబహాను హత్య చేసి ఇంట్లో పూడ్చి పెట్టాడు. సబహా మృత దేహాన్ని పోలీసులు వెలికి తీస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. 

 

రెండో వికెట్ కోల్పోయిన భారత్

ఢాకా : భారత్, వెస్టిండీస్ ల మధ్య అండర్ 19  క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ రెండో వికెట్ కోల్పోయింది.   

మొదటి వికెట్ కోల్పోయిన భారత్

ఢాకా : భారత్, వెస్టిండీస్ ల మధ్య అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ మొదటి వికెట్ కోల్పోయింది.   

దుండగుల దాడిలో ఒకరి మృతి

మహబూబ్ నగర్ : జిల్లాలోని మిడ్జిల్ మండలం చివ్వెలలో అర్థరాత్రి ఇసుక తరలిస్తున్న పలువురిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆర్ సీ తండాకు చెందిన శ్రీను నాయక్ అనే వ్యక్తి మృతి చెందాడు. 

 

కాసేపట్లో అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్

ఢాకా : భారత్, వెస్టిండీస్ ల మధ్య అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  

08:31 - February 14, 2016

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఢిల్లీ పర్యటనలో ఇవాళ బిజీబిజీగా గడిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోనూ ఆయన సమావేశమయ్యారు. విభజన చట్టంలోని అంశాల అమలుపై హోంమంత్రికి.. రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు అంశంపై సీజేకి వినతిపత్రాలు సమర్పించారు. 
రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన కేసీఆర్ 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం రెండో రోజు కూడా ఢిల్లీలో పలువురు కీలక వ్యక్తులను కలుసుకున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి.. రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో ఐపీఎస్ అధికారుల కొరత-అధికారుల సంఖ్య పెంపు అంశాలను రాజ్ నాథ్‌ దృష్టికి తీసుకువచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని,  వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రానికి రూ. 30 వేల 571 కోట్ల ప్రత్యేక గ్రాంటు ఇవ్వాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.
సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ తో భేటీ
హోంమంత్రితో భేటీ అనంతరం.. కేసీఆర్‌ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ తో భేటీ అయ్యారు. హైకోర్టు విభజన అంశం గురించి ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్రం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా.. ఏపీ, తెలంగాణలకు ప్రత్యేక హైకోర్టు లేకపోవడంతో కోర్టు పరిధిలోని వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేసీఆర్‌ వివరించారు. వీలైనంత త్వరగా హైకోర్టును విభజించాలని జస్టిస్‌ ఠాకూర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర  సమస్యలపై కేసీఆర్‌ చేసిన విజ్ఞప్తులకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని.. టీఆర్ఎస్‌ ఎంపీలు వెల్లడించారు. 

హైదరాబాద్ లో పోలీసుల డ్రంక్ ఆండ్ డ్రైవ్

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ లో పోలీసుల డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 11 మందిపై కేసులు నమోదు చేశారు. వారి నుండి ఐదు కార్లు, ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

మరోసారి ప్రయివేట్ ట్రావెల్స్ నిర్వాకం...

నల్గొండ : ప్రయివేట్ ట్రావెల్స్ నిర్వాకం మరోసారి బయటపడింది. ధనుంజయ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తోంది. మార్గంమధ్యలో నల్గొండ జిల్లాలోని సూర్యపేట మండలం పిల్లలమర్రి వద్ద రాత్రి 11 గంటలకు సాంకేతిక కారణాలతో బస్సు ఆగిపోయింది. బస్సు బ్రేక్ డవున్ అయిందని తెలుస్తోంది. సిబ్బంది బస్సును వదిలేసి వెళ్లిపోయారు. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ఆరు గంటలపాటు రోడ్డుపై పడిగాపులు కాసారు. 

నేడు భారత్, శ్రీలంక ఆఖరి టీ-20 మ్యాచ్

విశాఖ : భారత్, శ్రీలంకల మధ్య మూడో, ఆఖరి టీ-20 మ్యాచ్ నేడు విశాఖలో జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

07:55 - February 14, 2016

నల్గొండ : ప్రయివేట్ ట్రావెల్స్ నిర్వాకం మరోసారి బయటపడింది.  ప్రయివేట్ ట్రావెల్స్ యాజమాన్యానికి డబ్బుల మీద ధ్యాస సౌకర్యాలపై లేదు. ధనుంజయ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తోంది. మార్గంమధ్యలో నల్గొండ జిల్లాలోని సూర్యపేట మండలం పిల్లలమర్రి వద్ద రాత్రి 11 గంటలకు సాంకేతిక కారణాలతో బస్సు ఆగిపోయింది. బస్సు బ్రేక్ డవున్ అయిందని తెలుస్తోంది. సిబ్బంది బస్సును వదిలేసి వెళ్లిపోయారు. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు ఆరు గంటలపాటు రోడ్డుపై పడిగాపులు కాసారు. అంతక ముందు బస్సు లారీని ఢీకొట్టిందని ప్రయాణికులు తెలిపారు. ట్రావెల్స్ యాజమాన్యానికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదని..ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని   ప్రయాణికులు వాపోయారు. పైగా బస్సు సిబ్బంది తమతో దుర్భాషలాడారని పేర్కొన్నారు. తమ బాధను పెట్రోలింగ్ పోలీసులకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. విజయవాడలో ఈరోజు 9 గంటలకు పరీక్ష ఉన్నాయి.... ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నామని.. పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు గంటలు పడిగాపులుకాసిన తర్వాత ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఒక బస్సును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

 

 

07:27 - February 14, 2016

నెల్లూరు : జిల్లాలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని వింజమూరు మండలంలో చాకలిగొండ, దక్కినవారిపల్లి, వరికుంటపాడు మండలంలోని రామదేవరపాడు, గణేశ్వరపురంలో తెల్లవారుజామున 4.45 గంటలకు మూడు సెకన్లపాటు భూమి కంపించింది. భయంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

 

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. 

తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం

చిత్తూరు : తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి. సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి. స్వామివారు సప్త వాహనాలపై దర్శనమిస్తున్నాడు.  

నెల్లూరు జిల్లాలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు

నెల్లూరు : జిల్లాలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. వింజమూరు మండలంలో చాకలిగొండ, దక్కినవారిపల్లి, వరికుంటపాడు మండలంలోని రామదేవరపాడు, గణేశ్వరపురంలో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. 

సూర్యనారాయణస్వామిని దర్శింకుచున్న పలువురు ప్రముఖులు

శ్రీకాకుళం : అరసవెల్లిలో సూర్యనారాయణస్వామిని మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ లక్ష్మీనరసింహం దర్శించుకున్నారు. సూర్యనారాయణస్వామి సూర్య నమస్కారాలను దశల వారిగా అన్ని పాఠశాలల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీనరసింహం టెన్ టివితో తెలిపారు. 

అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు

శ్రీకాకుళం : అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి పాల్గొన్నారు. సూర్యనారాయణస్వామి నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తారు. 

Don't Miss