Activities calendar

15 February 2016

నేడు..నారాయణఖేడ్ ఓట్ల లెక్కింపు..

మెదక్ : నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫిబ్రవరి 13న జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీ కెమెరాల నిఘా మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగించనున్నారు. 14 టేబుళ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

నేడు ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం..

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది. పార్లమెంట్‌లోని సౌత్‌బ్లాక్‌లో ఉదయం 9.30 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

వీర జవాన్ అంత్యక్రియలకు జగన్..

కర్నూలు: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని పార్నెపల్లి గ్రామం పార్నపల్లికి వెళ్లనున్నారు. వీరజవాన్‌ ముస్తాక్‌ అహ్మద్‌ అంత్యక్రియలకు వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. వీరజవాన్‌ ముస్తాక్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.

బాబుకు మధు లేఖ..

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ రాశారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ నిర్ణయం వల్ల దస్తావేజులు రాసే వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని లేఖలో పేర్కొన్నారు. వారి జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఇళ్లు కట్టేందుకు 300 ఎకరాల భూమి - కేసీఆర్..

ఖమ్మం : జిల్లాలో పెద్ద సంఖ్యలో పేద ప్రజలు ఉన్నారని, వారి కోసం ఇళ్లు కట్టేందుకు దాదాపు 300 ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. నగరంలో ఇప్పటికే 2 వేల ఇళ్లు మంజూరు చేశామిన, మరో 3వేల ఇల్లు మంజూరు చేస్తామన్నారు. 

21:24 - February 15, 2016

హైదరాబాద్ : సీపీఎం ప్రధాన కార్యాలయంపై సంఘ్‌పరివార్‌ శ్రేణుల దాడిని నిరసిస్తూ వామపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎం కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సీపీఎం కార్యాలయంపై దాడిని నిరసిస్తూ విజయవాడలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశాయి. విశాఖలో సీపీఎం కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. సీపీఎం కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనను నిరసిస్తూ తిరుపతిలో వామపక్షాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపి ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని సీపీఎం నేతలు విమర్శించారు. కర్నూలులో సీపీఎం కార్యకర్తలు రాస్తారాకో చేపట్టారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆత్మకూరులోనూ సీపీఎం శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా సంఘ్‌పరివార్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.

కరీంనగర్ లో..
సీపీఎం ఢిల్లీ కార్యాలయంపై దాడికి నిరసనగా కరీంనగర్‌లోని పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌరస్తాలో మతోన్మాదులు దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ అండదండలతోనే సంఘ్‌పరివార్‌ శక్తులు రెచ్చిపోతున్నాయయని సీపీఎం నేతలు విమర్శించారు.సీపీఎం కార్యాలయంపై దాడిని నిరసిస్తూ నిజామాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఢిల్లీలోని సీపీఎం కార్యాలయంపై దాడి, జేఎన్‌యూ విద్యార్థుల అరెస్ట్‌కు నిరసనగా ఓయూలో వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. 19న రౌండ్‌ టేబుల్‌ సమావేశం, 23న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాయి. 

21:20 - February 15, 2016

విజయవాడ : ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఐదుగంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు అంశాలను చర్చించారు. ఇసుక విధానంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించారు. ఈ విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. క్యూబిక్‌ మీటర్‌ 500 రూపాయలకు మించి ఎక్కడా విక్రయించరాదని ఆదేశించారు. ప్రైవేటు నర్సింగ్‌హోంల ఏర్పాటుకు కేంద్ర చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని భేటీలో నిర్ణయించారు.మరోపక్క ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్‌పైనా చర్చ జరిగింది. నీటి పారుదల శాఖలో నిధుల వినియోగంపైనా సమావేశంలో చర్చకు వచ్చింది. శాఖల తరలింపు, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణ, తాత్కాలిక సెక్రటేరియట్‌ శంకుస్థాపన తదితర అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు సియాచిన్‌లో అమరులైన జవాన్లకు మంత్రివర్గం నివాళులర్పించింది. వీరజవాను ముస్తాక్‌ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. కేబినెట్‌ భేటీ అనంతరం పార్టీ విషయాలపై మంత్రులతో బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో లోకేష్‌, కళా వెంకట్రావు, పలువురు నేతలు పాల్గొన్నారు. 

21:16 - February 15, 2016

ఖమ్మం : జిల్లా అభివృద్దిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రధానితో చర్చించామని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఖమ్మంలో జిల్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో మిషన్‌ భగీరథ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. పాలేరు సెగ్మంట్‌లో మిషన్‌ భగీరథ పనులను అక్టోబర్‌ నాటికి పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ అన్నారు. పేదల ఇళ్ల కోసం 300 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏడు ఎకరాల్లో కొత్త బస్టాండ్లు నిర్మాణం చేస్తామని, ఐదారు శ్మశాన వాటికలు..దహన కార్యక్రమాల కోసం స్థలాలను కలెక్టర్ చూశారని తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఖమ్మం రింగ్ రోడ్డును వేగవంతంగా పూర్తి చేస్తామని, మిర్చి మార్కెట్ ను తరలింపు చేయాలనే డిమాండ్స్ ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులకు తెలియచేయడం జరిదని తెలిపారు. ప్రతి సంవత్సరం కార్పొరేషన్ లకు బడ్జెట్ లో వంద కోట్లు కేటాయించడం జరుగుతుందని, వరంగల్ కు మాత్రం ఈ బడ్జెట్ లో రూ. 300 కోట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. ఖమ్మం పట్టణంలో అక్టోబర్, నవంబర్ నాటికి మంచినీటి సమస్య ఉండదని, మునేరు నది దాటడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించడం జరిగిందన్నారు. బీపీఎస్, ఎల్ఆర్ ఎస్ కింద వంద కోట్లు రావడం జరిగిందని, ఇందులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టవద్దని సూచించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 100 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ కు రూ.270 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయన్నారు. మంచి పనులకు ఉపయోగించుకోవడానికి డబ్బులు ఉపయోగపడుతాయన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా డంపింగ్ యార్డు, రెండు కోట్లతో షాదీ ఖానా నిర్మాణం చేస్తామన్నారు. 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..

విజయవాడ : ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీ సమావేశాల నిర్శాహణ..జలవనరుల శాఖపై చర్చించారు. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు ప్రోత్సాహం, ఇతర అంశాలపై చర్చించారు. 

ఖమ్మం అభివృద్ధిపై సీఎం సమీక్ష..

ఖమ్మం : జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీపై త్వరలో నిర్ణయం చెబుతామని ప్రధాని మోడీ చెప్పారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్పీఎఫ్ ఎస్ఐ..

గుంటూరు : దాచేపల్లి మండలం నడికుడిలో సీబీఐ దాడులు చేసింది. రూ. 30వేలు లంచం తీసుకుంటూ ఆర్పీఎఫ్ ఎస్ఐ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. 

20:47 - February 15, 2016

నిగ నిగలాడే యాపిల్..పసని ఛాయలో మెరిసిపోయే మామిడి పండు..ఎర్రగా నోరూరించే పుచ్చపండు..వెంటనే తినాలని అనిపిస్తాయి. కానీ జరభద్రం..వాటి పక్కన రోగాలు పొంచి ఉన్నాయేమో చెక్ చేయండి. వాటి రంగు..రుచి కృత్రిమమో పరిశీలించండి..వాటిలో పోషకాలు మాట తరువాత తింటే భయంకరమైన రోగాలు వస్తాయేమో ఆలోచించండి. సహజసిద్ధంగా పండాల్సిన వివిధ రకాల కాయలను విషపూరిత..నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా అందిస్తుండడంతో ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన పండు అనారోగ్యాన్ని పంచిపెడుతున్నాయి. రోజుకో పండు తింటే ఆరోగ్యమని డాక్టర్లు చెబుతుంటే వాటిని పండించేందుకు చేస్తున్న కల్తీ ప్రజల ఆరోగ్యాన్ని బలి పెడుతోంది. ఈ అంశంపై ప్రత్యేక కథనం..

విషపు మెరుపు..
అది విషపు మెరుపు మాత్రమే. ఆ రంగు కృత్రిమం మాత్రమే. ఆ నిగనిగలు రసాయనాలతో వచ్చింది మాత్రమే. అసలీ భాగ్యనగరంలో ఎక్కడైనా రసాయనాలు లేకుండా పండించిన పండ్లు మీకు దొరుకుతున్నాయా? కాల్షియం కార్బైడ్‌ వంటి హానికర రసాయనాలతో, ఆక్సిటోసిన్ వంటి ఇంజెక్షన్లతో దీర్ఘకాలంలో ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం కలుగుతోంది. పండ్లు కావవి కడుపులో పుండ్లు కలుగజేసే విషాలు. ఒక్కసారి ఏదైనా ఫ్రూట్ మార్కెట్ ని నిశితంగా గమనించండి. ఎంత కృత్రిమంగా పండ్లు పక్వానికి తెస్తున్నారో అర్ధమవుతుంది. ఓ పక్క కార్బైడ్ పండ్లు, మరో పక్క పురుగుమందుల కూరగాయలు, ఇంకో పక్క కల్తీ అయిన వంటసరుకులు.. వెరసి ప్రజారోగ్యాన్ని మూడు వైపులనుండి మింగేస్తున్నాయి.

కార్బైడ్..
కార్బైడ్. ఇదే.. ఇప్పుడు భయాందోళనలు కలిగిస్తున్న రసాయనం. పేరుకి నిషేధించినా విచ్చలవిడిగా ఉపయోగిస్తూ ప్రమాదకర రోగాలకు కారణమౌతున్న కెమికల్ ఇది. ఏమిటీ కార్బైడ్..? ఇది పండ్లను ఎలా మగ్గేలా చేస్తుంది? దీనివల్ల ఎలాంటి జబ్బులొస్తాయి?  ఏ పండ్లనూ వదలటం లేదు.. మామిడి నుంచి, పైన్ యాపిల్ వరకు... ప్రతీ పండూ రసాయనాలతోనే మగ్గుతోంది. ఫ్లూట్ మార్కెట్లన్నీ కెమికల్స్ తో నిండుతున్నాయి. విషరసాయనాలు లేని పండ్లు దొరకటం అసాధ్యంగా మారుతోంది.. అసలు పండ్లు తింటున్నామా? లేక జబ్బులు కొని తెచ్చుకుంటున్నామా అనే సందేహం వస్తుందంటే ప్రమాద తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

పట్టించుకొనే వారు ఎవరు ? 
కేన్సర్ లాంటి భయంకర రోగాలు వస్తున్నా పట్టించుకునే నాథుడు లేదు. ఓ పక్క డాక్టర్లు పండ్లు తినమంటారు. వాటిని తింటే అదనంగా కొత్త రోగాలు కబళిస్తున్న దుస్థితి. ప్రభుత్వాలు నాలుగు రోజులు హడావుడి చేయటం, దాడులు చేసి సీన్ క్రియేట్ చేయటం తప్ప వాస్తవంలో ఈ కార్బైడ్ లాంటి కెమికల్స్ వాడకుండా తీసుకుంన్న చర్యలు శూన్యం. అసలు వ్యాపారాలకు శాస్త్రీయంగా పండ్లు మగ్గించే సౌకర్యాలు కల్పించకపోవటమే దీనికి చాలా వరకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ తీరులో మార్పు రావాలి..
తెల్లనివన్నీ పాలుకాదు.. ఘాటువన్నీ మసాలా దినుసులు కాదు.. నూనెలన్నీ నమ్మకమైనవి కాదు.. మిలమిల మెరిసేవన్నీ ఒరిజనల్ పండ్లు కాదు. ఏం తినాలి? ఏం తాగాలి? ఈ కల్తీ రాజ్యంలో ఎలా బతకాలి? తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనిషోయ్....అన్నాడు గురజాడ. జవసత్వాల్ని మింగేసి, ప్రమాదకరమైన రోగాల పాల్జేసే పదార్ధాలు ప్రజారోగ్యానికి తీరని ప్రమాదం.. దీనిపై వినియోగదారుల్లో చైతన్యం రావాలి. ప్రభుత్వ తీరులో మార్పు రావాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

20:30 - February 15, 2016

వరంగల్..ఖమ్మం రిజర్వేషన్లు ఖరారైయినయి..ఖమ్మం జిల్లాలో కలియదిరుగుతున్న కేసీఆర్...మంగళవారం నాడు ఖేడ్ ఓటింగ్..ట్యాంక్ బండ్ పై ప్రేమికుల ఇబ్బందులు..మేడారం జాతర..నీటి కోసం ఒంగోలు ప్రజల ఇక్కట్లు...బీడీ కార్మికుల ఆందోళనలు..కేటీఆర్ ఇలాఖాలో చిన్న బోయిన న్యాయం..ఆత్మహత్య చేసుకున్న బస్సు.. తదితర అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో 'మల్లన్న' తనదైన శైలిలో విశ్లేషించాడు. మరిన్ని విశేషాల కోసం వీడియో చూడండి. 

20:20 - February 15, 2016

ప్రేమికుల రోజు...ఫిబ్రవరి 14వ తేదీ..ఈ రోజు కోసం ప్రేమికులు ఎంతో ఎదురు చూస్తుంటరు కదా. ఎంతో మంది సెలబ్రేషన్ చేసుకుంటరు కదా. దీనిని అడ్డుకోవడానికి ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ నేతలు ప్రయత్నిస్తుంటరు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రేమికులను అడ్డుకున్నరు. ట్యాంక్ బండ్ పై భరతమాత బిడ్డలు అనే చెప్పుకొనే వీరు హల్ చల్ చేసిండ్రు. భరత్ మాతాకి జై..జై..శ్రీరాం..అంటూ నినాదాలు చేసిండ్రు. ఆ సమయంలో అక్కడనే ఉన్న ప్రేమికులను అడ్డుకున్నరు. వీళ్ల హడావుడికి ప్రేమికులు మస్తు ఇబ్బందులు పడ్డారు. విశేషాల కోసం వీడియో చూడుండి. 

కన్నయ కుమార్ కస్టడి పొడిగింపు..

న్యూఢిల్లీ : అక్రమ కేసులో అరెస్టయిన జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ కస్టడీని మరో రెండు పొడిగించారు. 

20:07 - February 15, 2016

టెన్ టివిలో మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అతిథి తన పాటతో అలరించాడు. సోమవారం నాడు ప్రసారమైన మల్లన్న ముచ్చట్లులో ఇబ్రహింపట్నం, యాచారం మండలం ధర్మనగూడెనికి చెందిన మండల నరేందర్ వచ్చాడు. ఈ సందర్భంగా తన ఓ పాట వినిపించిండు. ఆ పాట గెట్లుందో వీడియోలో వినండి.

19:48 - February 15, 2016

జెఎన్‌యూ ఘటనకు సంబంధించి మతతత్వ శక్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి. నిన్న సిపిఎం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన గూండాలు...తాజాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని చంపేస్తామంటూ బెదిరించారు. మరోవైపు జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌కు కోర్టు రెండు రోజుల కస్టడీని పొడిగించింది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో ప్రకాష్ రెడ్డి (బీజేపీ), వి.శ్రీనివాసరావు (సీపీఎం), వినయ్ కుమార్ (కాంగ్రెస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హాట్ హాట్ గా సాగిన ఈ చర్చను చూడాలంటే వీడియో చూడండి. 

తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు..

ఢిల్లీ : ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమైంది. 45 ఎకరాల్లో నిర్మించే తాత్కాలిక సచివాలయానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. ఈ సముదాయంలో 58,665 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ముఖ్యమంత్రి కార్యాలయం, శాసనసభ నిర్మించనున్నారు.

 

ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలి - చంద్రబాబు..

విజయవాడ : రాష్ట్రంలో ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు సూచించారు. క్యూబిక్ మీటర్ రూ. 500 మించి ఎక్కడా విక్రయించరాదని ఆదేశించారు. ప్రైవేటు నర్సింగ్ హోంల ఏర్పాటుకు కేంద్ర చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు. 

19:33 - February 15, 2016

ఢిల్లీ : బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ పాకిస్తాన్‌ అనుకూల నినాదాలపై రచ్చరచ్చ జరుగుతోంది. జేఏఎన్‌యూ ఆందోళన ముసుగులో ఏబీవీపీ కార్యకర్తలు పాకిస్తాన్‌ను సపోర్ట్ చేస్తూ చేసిన స్లోగన్స్ జాతీయ ఛానెల్స్ తో పాటు యూట్యూబ్‌లోనూ హల్‌చల్ చేస్తున్నాయి. ఏబీవీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఇతర విద్యార్థి సంఘాలపై ఆరోపణలు చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అందుకు వీడియోనే సాక్ష్యమని చెబుతున్నాయి. ఫిబ్రవరి 9, 2016..జేఎన్‌యూ క్యాంపప్, ఢిల్లీ..అఫ్జల్‌గురు ఉరిశిక్షపై పలు విద్యార్థి సంఘాల ఆందోళనలు...స్లోగన్స్..అవును..ఇవి పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు..అది కూడా ఎక్కడో పాకిస్తాన్‌లో కాదు ఢిల్లీ జేఎన్‌యూ క్యాంపస్‌లో. వీరంతా ఎవరో తెలుసా ఏబీవీపీ కార్యకర్తలు. ఈ గుంపు నుంచే పాకిస్తాన్‌ జిందాబాద్ అంటూ నినాదాలు వస్తున్నాయి. వీటికి స్పందనగా ఏబీవీపీ కార్యకర్తలు కూడా జిందాబాద్ , జిందాబాద్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు. సర్కిల్‌ చేసిన స్టూడెంట్‌..ఈ విద్యార్థిని ఏబీవీపీ కార్యకర్తేనని చెప్పడానికి రుజువు ఇది. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న ఈ విద్యార్థి కూడా ఏబీవీపీ కార్యకర్తనే. సియాచిన్‌లో అమరుడైన హనుమంతప్పకు అనుకూలంగా నిర్వహించిన ర్యాలీలోనూ పాల్గొన్నాడు.

ఇతర విద్యార్థి సంఘాలపై నెపం..
ఏబీవీపీ కార్యకర్తలు పాకిస్తాన్‌ అనుకూల నినాదాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అఫ్జల్‌గురు ఉరిశిక్ష వ్యతిరేక ర్యాలీలో ఏబీవీపీ కార్యకర్తలు కూడా పాల్గొని, అందులో పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా స్లోగన్స్ చేస్తూ, చివరికి ఆ నెపాన్ని ఇతర విద్యార్థి సంఘాలపై నెట్టారని విపక్షాలు మండిపడుతున్నాయి. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని కన్హయ్య వంటి విద్యార్థి నేతలను అరెస్టు చేశారని విమర్శిస్తున్నాయి. ఇది కేవలం బీజేపీ, దాని అనుబంధ సంస్థ ఏబీవీపీ కుట్రేనని ఆరోపిస్తున్నాయి. ఏబీవీపీ కార్యకర్తల పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు జాతి వ్యతిరేక చర్యలు కాదా అని నరేంద్ర మోడీ సర్కారును ప్రశ్నిస్తున్నాయి. వీరిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీస్తున్నాయి.

19:30 - February 15, 2016

ఢిల్లీ : జెఎన్‌యూ ఘటనకు సంబంధించి మతతత్వ శక్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి. నిన్న సిపిఎం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన గూండాలు...తాజాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని చంపేస్తామంటూ బెదిరించారు. మరోవైపు జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌కు కోర్టు రెండు రోజుల కస్టడీని పొడిగించింది. కోర్టు వద్ద బిజెపి ఎమ్మెల్యే సాక్షిగా లాయర్లు విద్యార్థులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. విద్యార్థుల అరెస్ట్‌కు నిరసనగా రేపు ఒకరోజు ఆందోళనకు జెఎన్‌యు అధ్యాపక బృందం పిలుపునిచ్చింది. భారత వ్యతిరేక నినాదాలు చేశారన్న కారణంతో శుక్రవారం నాడు అరెస్ట్ అయిన జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌ను పోలీసులు పాటియాల కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా బిజెపి మద్దతుదారులైన లాయర్లు జెఎన్‌యు విద్యార్థులపై దాడి చేయడంతో కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. న్యాయవాదుల దాడిలో పలువురు జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. పాటియాల కోర్టు కారు పార్కింగ్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యే శర్మ రెచ్చిపోయాడు. విద్యార్థులను కిందపడేసి కొట్టాడు. పాకిస్తాన్‌కు అనుకూలంగా ఎవరు నినాదాలు చేసినా తాను ఇలాగే చేస్తానన్నాడు. బిజెపి కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తిస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారని విద్యార్థులు మండిపడ్డారు.

బెదిరింపు కాల్స్..
ఆదివారం ఢిల్లీలోని సిపిఎం కార్యాలయంపై దాడి చేసిన దుండగులు-తాజాగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి అర్ధరాత్రి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. సిపిఎం కార్యాలయం ల్యాండ్‌ లైన్‌ ఫోన్లో ఏచూరిని చంపేస్తామని దుండగులు బెదిరించారు. ఈ ఘటనపై విచారణ జరుపనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. జెఎన్‌యు వివాదానికి సంబంధించి పోలీసులు సోషల్‌ మీడియాలో వచ్చిన ట్వీట్స్‌పై దృష్టి పెట్టారు. జెఎన్‌యు విద్యార్థుల అరెస్టుకు నిరసనగా ఆందోళన కొనసాగుతోంది. కన్నయ్య అరెస్ట్ ను నిరసిస్తూ 8 వేల మంది విద్యార్థులు క్లాసులకు హాజరు కాలేదు. కన్నయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల అరెస్టుకు నిరసనగా 5 వందల మంది అధ్యాపకులు మంగళవారం ఒకరోజు ఆందోళనకు పిలుపునిచ్చారు. జెఎన్‌యు క్యాంపస్‌లో పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారేమోనన్న భయం నెలకొందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జెఎన్‌యు వీసి జగదీష్‌ కుమార్‌ జోక్యం చేసుకుని విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని సూచించారు.

ఫిబ్రవరి 25 విచారణ పూర్తి..
జెఎన్‌యు ఘటనకు సంబంధించిన వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేసినట్టు విసి జగదీష్ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై పోలీసులతో పాటు, యూనివర్సిటీ కమిటీ కూడా విచారణ జరుపుతోందన్నారు. అప్జల్‌ గురూ కార్యక్రమంపై విచారణ ఫిబ్రవరి 25న పూర్తవుతుందని, విద్యార్థులు క్లాసులకు హాజరు కావాలని విసి విజ్ఞప్తి చేశారు. అఫ్జల్‌ గురు కార్యక్రమానికి ఉగ్రవాద సంస్థ లష్కర్‌-ఎ-తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ మద్దతిచ్చారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆధారాలు చూపాలని వామపక్ష నేతలు ఏచూరి, రాజా కేంద్రాన్ని డిమాండ్‌ చేయడంతో వెనక్కి తగ్గిన హోంమంత్రి పోలీసులు పొరపాటున హఫీజ్‌ సయీద్‌ ట్వీట్‌గా భావించారని సర్ది చెప్పారు. హఫీజ్‌ సయీద్‌ ట్విట్టర్‌ను ఎపుడో బ్లాక్‌ చేశారని పాక్‌ దినపత్రిక డాన్‌ స్పష్టం చేసింది. జేఎన్‌యూలో ఆందోళనలకు, హఫీజ్‌ సయీద్‌కు లింకు ఉందన్న ఎలాంటి సమాచారాన్ని తాము హోంశాఖకు ఇవ్వలేదని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్ బస్సీ స్పష్టం చేశారు.

నినాదాలు చేసింది ఏబివిపి వారే..
పార్లమెంట్‌పై దాడి చేసి ఉరిశిక్షకు గురైన అఫ్జల్‌గురుకు సంబంధించి జెఎన్‌యు క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో పుటేజీ ఆధారంగా జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌తో పాటు మరో ఏడుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేశారు. భారత వ్యతిరేక నినాదాలు చేసిన వారు ఏబివిపికి సంబంధించినవారేనని సోషల్‌ మీడియాలో మరో వీడియో విడుదల కావడంతో, ఈ ఘటన వెనక బిజెపి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంలో భాగంగానే విద్యార్థులపై ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని వామపక్షాలు మండిపడ్డాయి.

మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు - జేఎండీ..

హైదరాబాద్ : మేడారం జాతరకు నాలుగు వేల ప్రత్యేక బస్లుసు నడపనున్నట్లు ఆర్టీసీ జేఎండీ రమణారావు పేర్కొన్నారు. జాతర ముగిసే వరకు హైదరాబాద్ నుండి మేడారం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. 

18:41 - February 15, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పది స్వచ్ఛ నగరాల జాబితాలో విశాఖకు ఐదో స్థానం రావడం సంతోషంగా ఉందని గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. విశాఖ ప్రజలు, కార్పొరేషన్‌ సిబ్బంది సహకారంతోనే ఈ ర్యాంక్‌ సాధించామన్నారు. వచ్చే ఏడాది కల్లా మొదటి స్థానం సాధించడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

18:39 - February 15, 2016

హైదరాబాద్ : పొత్తిళ్ల చిన్నారి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. సాయం చేసే చేతుల కోసం ఎదురుచూస్తోంది. మృత్యువుతో పోరాడే శక్తిని ఇవ్వమని ఎనిమిది నెలల పసికిందు అర్థిస్తోంది. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన కూతురిని బతికించగలరని నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బోసినవ్వుల పాపకు ప్రాణభిక్షపెట్టమని కన్నీరుమున్నీరవుతున్నారు. హైదరాబాద్ నిజాంపేటలో నివాసముంటున్న కృష్ణకు 8నెలల క్రితం కూతురు జన్మించింది. తన ఇంట మహాలక్ష్మి పుట్టిందనే సంతోషం ఆ తండ్రికి ఎంతో కాలం నిల్వలేకపోయింది. చిన్నారి పుట్టిన 5నెలలకే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే రెయిన్‌ బో ఆసుపత్రిలో కొన్నాళ్లు చికిత్స చేయించారు. పాప అనారోగ్యాన్ని పరిశీలించిన వైద్యులు కాలేయ సంబంధిత వ్యాదితో బాధపడుతోందని నిర్ధారించారు.

అండగా నిలిచిన అపార్ట్ మెంట్ వాసులు...
మెరుగైన చికిత్స అందించడం కోసం పాపను గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పాపను పరిశీలించిన వైద్యులు సర్జరీ చేయాలి, ఇందుకోసం 30 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో దిక్కోతోచని పరిస్థతుల్లో ఉన్న కృష్ణకు ఓ అపార్టమెంట్ వాసులు అండగా నిలిచారు. 11 లక్షల రూపాయల వరకు చందాలుగా వసూలు చేసి అందజేసారు. ప్రభుత్వానికి తమ పరిస్థితిని విన్నవించడంతో సియం రిలీఫ్ ఫండ్‌ నుంచి 15 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

మరో పది లక్షలు అవసరం..
ఆపరేషన్ ఖర్చులకు, ఇతర అవసరాలకు, మందులకు మరో 10లక్షల వరకు అవసరం ఉంటుంది. దాతలు స్పందించి ఒక పేద తండ్రిని ఆదుకోవాలని ది నెస్ట్ వెల్‌ఫేర్ అసోసియేషన్‌ ప్రెసిడెంట్ రమేష్ బాబు కోరుతున్నారు. సహాయం చేయదలచిన దాతలు కృష్ణ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ద్వారా సహాయం చేయగలరని పేర్కొన్నారు.J. Krishna, ICICI Bank, account Number.. 631201539377, కూకట్‌పల్లి బ్రాంచ్‌ , ifsc code 0006312.

18:35 - February 15, 2016

గుంటూరు : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రైతు మృతి చెందాడంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగిన ఘటన గుంటూరు జిల్లా రేపల్లె ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. పనుల నిమిత్తం ఉదయాన్నె పొలానికి వెళ్లిన రైతు చింతమోటు ప్రసాద్ ను పాము కాటువేసింది. అక్కడే ఉన్న రైతులు 108 లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాని డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో నర్సులు చికిత్స చేసి పంపించారని.. అంతలోనే ప్రసాద్ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. డ్యూటీకి రాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న వైద్యులపై, చికిత్స చేసిన నర్సులపై చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. 

18:34 - February 15, 2016

విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై నమోదు చేసిన కేసు విషయం వివాదంగా మారింది. ప్రజా ప్రతినిధిపై పోలీసు, రెవెన్యూ అధికారులు కలిసి కేసు నమోదు చేయడాన్ని వంశీ సీరియస్ గా తీసుకున్నారు. తాను స్టేషన్ లో లొంగిపోయి బెయిల్ కూడా తీసుకోవద్దని నిర్ణయించుకుని బయలుదేరగా... టిడిపి నేతలు బుజ్జిగించి లాయర్ ను మాత్రమే స్టేషన్ పంపారు. ప్రజా ప్రతినిధిని ఏ 1 ముద్దాయిగా చిత్రీకరించి కేసు నమోదు చేయడం దారుణమన్నారు వంశీ తరపు న్యాయవాది చిరంజీవి.

18:31 - February 15, 2016

హైదరాబాద్ : సియాచిన్ లో వీర మరణం పొందిన జవాన్ ముస్తాక్ అహ్మద్ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో బేగంపేట ఏయిర్ పోర్ట్ కు తీసుకొచ్చారు. ముస్తాక్ అహ్మద్ భౌతిక కాయానికి సైనిక లాంఛనాలతో త్రివిధ దళాలు శ్రద్ధాంజలి ఘటించాయి. అనంతరం ఎయిర్ ఫోర్స్ హెలీకాఫ్టర్ లో కర్నూలు జిల్లా నంద్యాలకు తరలించనున్నారు అధికారులు. సైనికవందనం తర్వాత రేపు స్వస్థలం పార్నెపల్లెలో అంత్యక్రియలు చేయనున్నారు. అటు ముస్తాక్ మృతికి ఏపీ కేబినెట్ శ్రద్ధాంజలి ఘటించింది.  

18:17 - February 15, 2016

హైదరాబాద్ : తిరుమలలో షాపుల కేటాయింపునకు టిటిడి తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. మొత్తం 70 దుకాణాలకు గాను ఐదు దుకాణాలకు టెండర్లు నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఐదు దుకాణాలకు చెందిన వారు ఊరట చెందారు. తిరుమలలో షాపుల కేటాయింపునకు టిటిడి ఈసారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇన్నాళ్లు మాస్టర్‌ ప్లాన్‌లో ఇళ్లు కోల్పోయినవారికి మాత్రమే ఇచ్చే షాపులను.. ఈసారి టెండర్ల ద్వారా కేటాయించాలని నిర్ణయించారు. దీనిపై కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా దుకాణదారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో 70 దుకాణాలకు టిటిడి టెండర్లు పిలవడం వివాదాస్పదమవుతోంది. ఎంతో కాలంగా తిరుమల మాస్టర్‌ ప్లాన్‌లో ఇళ్లు, షాపులు కోల్పోయిన వారికి మాత్రమే కేటాయించే దుకాణాలకు. ఇప్పుడు పబ్లిక్‌ టెండర్లు పిలవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

18:12 - February 15, 2016

అనంతపురం : జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. జనాల మీదకు లారీ దూసుకరావడంతో నలుగురు మృతి చెందారు. ఆ ప్రాంతమంతా హాహాకారాలు..బీభత్సమయంగా మారిపోయింది. మద్యం సేవించి లారీ నడపడమేనని తెలుస్తోంది. కదిరి మండలం కాలసముద్రంలో మారెమ్మ గుడి వద్ద కొందరు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అక్కడంతా రద్దీగా ఉంది. అదే సమయంలో కదిరి నుండి వేగంగా వస్తున్న లారీ జనాల మీదకు దూసుకెళ్లింది. లారీ కింద పడి నలుగురు మహిళలు మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. స్థానికులు వెంటనే లారీ డ్రైవర్ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తమ వారు చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. ఆ ప్రాంతమంతా రోదనలతో మారుమోగిపోయింది. 

టిటిడి నిర్ణయంపై హైకోర్టు స్టే..

చిత్తూరు : తిరుమల పునరావాసం కింద కేటాయించిన దుకాణాలకు టెండర్లు వేయాలని టిటిడి నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. మొత్తం 70 దుకాణాలకు గాను ఐదు దుకాణాలకు టెండర్లు నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అనంతలో లారీ బీభత్సం..నలుగురు మృతి..

అనంతపురం : జిల్లా కదిరి మండలం కాలసముద్రంలో లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే ఉన్న జనాలపైకి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడనే మృతి చెందారు. 

జవాన్ అహ్మద్ కుటుంబానికి ఏపీ సర్కార్ నివాళులు..

విజయవాడ : సియాచిన్ లో మంచు చరియలు విరిగిపడి మరణించిన జవాన్ ముస్తాక్ అహ్మద్ కు ఏపీ మంత్రివర్గం నివాళులర్పించింది. ముస్తాక్ అహ్మద్ కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. విజయవాడలో జరుగుతున్న మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

17:41 - February 15, 2016

నిజామాబాద్ : బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తును కేంద్ర ప్రభుత్వం ముద్రించకుండా బీడీ కార్మికులంతా ఏకమై పోరాడాలని తెలంగాణ బీడీ కార్మికుల వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 7 లక్షల మంది కార్మికులు బీడీపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని.. పుర్రె గుర్తు ముద్రణతో ఉపాధి కోల్పోతారని మండిపడ్డారు బీడీ కార్మికసంఘం నేతలు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 

17:39 - February 15, 2016

ఖమ్మం : జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని లకారం చెరువును పరిశీలించారు. సీఎం వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు పలువురు అధికారులు ఉన్నారు. అంతకు ముందు ఆయన ఆర్టీసీ కొత్త బస్టాండ్, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏర్పాటు ప్రతిపాదనల వివరాలను... అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బైపాస్ రోడ్డులో డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించారు సీఎం. రమణగుట్టలో పర్యటించిన సీఎం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. సాయంత్రం 6 గంటలకు జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

17:38 - February 15, 2016

మెదక్ : నారాయణఖేడ్‌ బైపోల్ కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండలంలోని జూకల్‌ శివారులోని ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండడంతో ఇప్పటికే కళాశాలలోని హాల్‌లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
కౌంటింగ్‌ కోసం మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా 286 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరగగా... 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కౌంటింగ్‌కు వచ్చే పార్టీల ఏజెంట్లకు ఇప్పటికే పాసులు జారీ చేశారు. కళాశాల ప్రాంగణంలో డీఎస్పీ రాజారత్నం నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కౌంటింగ్‌ సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు, పార్టీల ముఖ్యనేతల్లో ఉత్కంఠ నెలకొంది. జయాపజయాలు ఎలా ఉన్నా... పార్టీల అభ్యర్థులు మాత్రం గెలుపుపై ధీమాతో ఉన్నారు. 

తెలంగాణ పాఠ్యపుస్తకాల ముద్రణపై స్టే..

హైదరాబాద్ : తెలంగాణ పాఠ్యపుస్తకాల ముద్రణపై హైకోర్టు స్టే విధించింది. బిడ్డింగ్ లో అవతవకలు జరిగాయని హైకోర్టును రెండు ఏజెన్సీలు ఆశ్రయించాయి. తదుపరి తీర్పు వెల్లడించే వరకు స్టే కొనసాగించాలని కోర్టు సూచించింది. తదుపరి విచారనను మార్చి 4కు వాయిదా పడింది. 

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జవాన్ భౌతికకాయం..

హైదరాబాద్ : బేగంపేట ఎయిర్ పోర్టుకు జవాన్ ముస్తాక్ అహ్మద్ భౌతికకాయం చేరుకుంది. రోడ్డు మార్గాన స్వస్థలం నంద్యాలకు తరలిస్తున్నారు. సియాచిన్ మంచుకొండలు కూలడంతో ముస్తాక్ చనిపోయిన సంగతి తెలిసిందే. 

గోర్రెల మందలో తోడేళ్లను కలిపినట్లే - ఆర్.కృష్ణయ్య..

హైదరాబాద్ : కాపులను బీసీ జాబితాలో చేర్చడమంటే గొర్రెల మందలలో తోడేళ్లను కలిపినట్లేనని టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. రేపు మిగతా కులాలు తమను బీసీల్లో చేర్చమని కోరుతాయని, అన్ని కుల సంఘాలు, మేధావులతో కలిసి ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

రోజా పిటిషన్ విచారణ..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. గతేడాది శాసనసభ సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏడాది పాటు ఆమెను స్పీకర్ సభ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రోజా హైకోర్టును ఆశ్రయించారు. 

17:03 - February 15, 2016

వరంగల్ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం మహాజాతర. ఈ ఉత్సవాన్ని 1996లో రాష్ట్ర పండగగా గుర్తించారు. మేడారం ఒక మహాజాతరగా ప్రసిద్దికెక్కింది. రద్దీ ఉన్నప్పటికీ ఆలయ ఆదాయం మాత్రం సున్నా. ఆలయం చట్టూ కొబ్బరి, బెల్లం అమ్మకాల కోసం కనీసం 100 దుకాణాలు వెలిశాయి. బొమ్మలు, కోళ్ల, గాజుల తదితర దుకాణాలు ఉన్నాయి. కాని ఆలయానికి పైసా రాదు. రోజుకు కనీసం 500 మంది భక్తులు కానుకలుగా తలో పది రూపాయలు వేసినా రోజుకు రూ. 5,000 ఆదాయం సమకూరుతుంది. ఇలా కానుకలను లెక్కిస్తే వారానికి కనీసం రూ. లక్షకు తగ్గకుండా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మహాజాతర అనంతరం రెండేళ్ల పాటు ఆలయానికి రూపాయి ఆదాయం లేకపోవడాన్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. దీంతో ఆలయ ఆదాయం పెంచడంపై దృష్టి సారించారు. ఆలయ ఆదాయాన్ని పెంచాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. అమ్మవార్ల గద్దెలపై శాశ్వత హుండీలు ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే మేడారం ఆలయానికి సంబంధించిన కార్యాలయం జిల్లా కేంద్రంలోని భద్రకాళి ఆలయంలోని ఓ కాటేజీలో కొనసాగుతోంది. ఈ కార్యాలయాన్ని మేడారానికి తరలించాలనుకున్నా అమలులో మాత్రం సాధ్యం కావడం లేదు. మేడారంలో ఆలయానికి సంబంధించిన మూడు భవనాలున్నాయి. ఇందులో ఏదో ఒక దానిని కార్యాలయానికి ఉపయోగించుకోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఇలా చేస్తే సీనియర్‌ అసిస్టెంట్‌, ఐదుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మేడారంలో ఉండి ఆలయ కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశముంది.

ఆదాయ వనరులపై దృష్టి..
ప్రభుత్వం ఈ సారి జాతరలో ఆదాయ వనరులపై దృష్టి సారించారు. ఇక వనదేవతలు కూడా ధన దేవతలయ్యే అవకాశం ఉంది. ఆలయం ఆదాయ పరిస్థితి ఇలా ఉంటే, మేడారం జాతర నాలుగు రోజులు మాత్రం సమీప గ్రామాల ప్రజలకు కాసుల వర్షం కురిపించనుంది. ఈ జాతరకు కోటిమందికి పైగా భక్తులు వస్తారని అంచనా. అందుకు తగ్గట్టే వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. దీంతో మేడారం పరిసర ప్రాంతాల్లో విడిది చేసే ఇళ్లకు, గదులకు అద్దెల డిమాండ్ బాగా పెరిగిపోయింది. లక్షల మంది భక్తులు వస్తుండటంతో అద్దె ధరలు హైదరాబాద్ ను తలదన్నే రీతిలో ఉన్నాయి.
జాతరకు వచ్చే భక్తుల బస అవసరాలు తీర్చేందుకు ఇక్కడి ప్రజలు తమ ఇళ్లు, పెరటి జాగలతో పాటు తమ పొలాలను సైతం అద్దెకు ఇస్తారు. వ్యాపార సముదాయాలకు కూడా జాగా కావాల్సి వస్తుండడంతో మేడారం స్థలాలకు క్రేజ్ పెరిగింది. వాణిజ్య అవసరాలకు సంబంధించి గద్దెల పరిసర ప్రాంతాల నుంచి జంపన్నవాగు వరకు ఉన్న రెండు కిలోమీటర్ల దారికి ఇరువైపులా ఇప్పటికే దుకాణాలు వెలిశాయి. ఇక గద్దెల చుట్టూ వంద మీటర్ల వరకు అన్నివైపులా గజం స్థలం విలువ రూ.7వేలు ఉంది.

కాసుల గలగల..
జంపన్నవాగు దగ్గర గజం స్థలం విలువ రూ.4వేలు ఉండగా ఇప్పటికే అన్ని బుక్ అవడమే కాకుండా వ్యాపారాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇక జాతర కేంద్రమైన మేడారం దాని పరిసర గ్రామాలైన రెడ్డిగూడెంలలో ఇళ్ల కిరాయికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీని తర్వాత స్థానంలో కన్నెపల్లి, ఆ తర్వాత నార్లాపూర్, ఊరట్టం గ్రామాలు ఉన్నాయి. జాతర జరిగే మూడు రోజుల పాటు ఒక గదికి అద్దె కనిష్టంగా రూ 3,000 నుంచి 5,000 వరకు పలుకుతున్నాయి. ముఖ్యంగా మేడారం గ్రామంలో ఉన్న ఇళ్ల వరండా అద్దె సగటున ఐదువేల రూపాయలుగా పలుకుతోంది. గతంలో వచ్చే భక్తులు పందిళ్లు వేసుకుని జాతర జరిగే రోజుల్లో ఇక్కడ బస చేసేవారు. నేటికీ ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఒక పందిరికి అద్దె వెయ్యి రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు అద్దె పలుకుతోంది. ముఖ్యంగా జంపన్నవాగు-గద్దెల మధ్య ఉన్న రెడ్డిగూడెం పరిసరాల్లో ఉండే పొలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నాలుగు రోజుల కోయ మహానగరంలో అద్దెలెలా చుక్కలనంటడంతో గ్రామస్తులకు మాత్రం కాసుల గలగల సాగనుంది. 

16:56 - February 15, 2016

హైదరాబాద్ : త్వరలో ఎన్నికలు జరగనున్న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో వార్డుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం పురపాలక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లలో మొత్తం 58 డివిజన్లు ఉండగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో 50 వార్డులున్నాయి. ఖమ్మం పట్టణంలో మొత్తం 50 వార్డులకు గానూ బీసీ జనరల్‌ 9 వార్డులు, బీసీ, జనరల్‌ మహిళలకు 8చొప్పున, ఎస్సీ మహిళలకు 3, ఎస్సీ జనరల్‌ 3 సీట్లు కేటాయించారు. ఎస్సీ మహిళకు ఒక వార్డు కేటాయించారు. ఇక వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 58 డివిజన్లకు గానూ వరంగల్ ఎస్టీ జనరల్ కింద ఒక డివిజన్ కేటాయించారు. ఎస్సీ జనరల్, మహిళలకు 5 సీట్ల చొప్పున రిజర్వేషన్ ఖరారైంది. బీసీ జనరల్ కింద 10, బీసీ మహిళలకు 9 వార్డులు కేటాయించారు. 

వరంగల్ కార్పొరేషన్..
ఎస్టీ జనరల్ 54
ఎస్సీ జనరల్ 124, 30, 34
ఎస్సీ మహిళ 5,11,12,35
ఎస్టీ మహిళ 58
బీసీ జనరల్ 8,43,19,10,23,14,16,41,20
బీసీ మహిళ 31,04,22,25,09,07,29,21,03
జనరల్ మహిళ 47,18,52,17,28,45,53,13,38,15,24,49,51,32,56,27,50,33,55,44,48,36,42,39,37,57,46,26

ఖమ్మం కార్పొరేషన్..
ఎస్సీ జనరల్ 1
ఎస్టీ మహిళ 1
ఎస్సీ జనరల్ 3
ఎస్సీ మహిళ 3
బీసీ జనరల్ 9
బీసీ మహిళ 8
జనరల్ మహిళ 13
ఆన్ రిజర్వ్డ్ 12

16:38 - February 15, 2016

రాజమండ్రి : చట్టం దృష్టిలో అధికార పక్షమైనా, విపక్షమైనా అందరూ ఒక్కటేనని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాజమండ్రిలో స్పష్టం చేశారు. ఆంధ్రా రీజియన్ జైళ్లశాఖ ఉద్యోగుల రిట్రీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. విజయవాడలో వల్లభనేని వంశీపై పోలీస్ కేసు నమోదైందని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, విచారణలో తప్పులేదని తేలితే కేసులను ఉపసంహరిస్తామని ఆయన చెప్పారు. తుని ఘటనపైనా విచారణ జరుగుతుందని హోం మంత్రి తెలిపారు.

16:36 - February 15, 2016

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కి 280 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కరువు సహాయనిధి కింద ఈ నిధులను మంజూరు చేసింది. రాజ్‌నాథ్‌సింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నతస్థాయి కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరవు బృందాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిధులను విడుదల చేశారు. తమిళనాడుకు రూ.1,773 కోట్లు, అసోం రూ.332.57 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌ - రూ.170.19 కోట్లను కేంద్రం కేటాయించింది. 

16:35 - February 15, 2016

గుంటూరు : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంపై సాంఘిక శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 13 జిల్లాల మున్సిపల్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వం కేటాయించిన నిధులు, వాటిని వినియోగించే తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీల్లో ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌తో అభివృద్ధి చేయాల్సిన అంశాలను అధికారులకు వివరించారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల లోపు అన్ని మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు వెనుకబడిన వర్గాల వారి కోసం వినియోగించాలని మంత్రి సూచించారు. సబ్ ప్లాన్ నిధులు వెనుకబడిన వర్గాలకే అందేలా చర్యలు తీసుకుంటామని, కొన్ని చోట్ల ఈ నిధులు దుర్వినియోగమౌతున్నాయని మంత్రి రావెల పేర్కొన్నారు. సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాధారణ బడ్జెట్ లోనూ ఏస్సీ, ఎస్టీల అభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తామన్నారు. 

16:33 - February 15, 2016

ఢిల్లీ : విశాఖ నగరానికి రెండు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు లభించాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఈ అవార్డులను ప్రకటించారు. పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని నగరాలకు ర్యాంకింగ్‌ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ జాబితాలో మైసూర్‌ నగరం మొదటి స్థానంలో నిలిచింది. రెండు మూడు స్థానాల్లో చంఢీగర్, తిరుచునాపల్లి ఉన్నాయి. ఈ జాబితాలో విశాఖపట్నం ఐదో స్థానంలో నిలిచింది. 

16:31 - February 15, 2016

హైదరాబాద్ : వైసీపీని టార్గెట్‌ చేస్తూ అసెంబ్లీ కమిటీ సమావేశం జరిగిందని ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. సోషల్‌ మీడియాలో లీకైన వీడియోలపై సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేద్దామన్న స్పందన లేదని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. బుద్ధప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీతో తమకు న్యాయం జరగదని భావిస్తున్నామని అన్నారు. 

16:27 - February 15, 2016

ఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థులపై ముష్కరులు ఇంకా దాడులకు తెగబడుతూనే ఉన్నారు. అక్రమ కేసులతో అరెస్టు చేసిన కన్హయ్యను సోమవారం పాటియాల కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. కోర్టు వద్దకు జేఎన్ యూ విద్యార్థులు..అధ్యాపకులు..జర్నలిస్టులు భారీగా చేరుకున్నారు. అదే సందర్భంలో నల్లకోట్లు ధరించిన కొంతమంది ముష్కరులు దాడులకు తెగబడ్డారు. జర్నలిస్టులు సైతం గాయపడిన వారిలో ఉన్నారు. దీనిపై జేఎన్ యూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నత విద్యాసంస్థలపై 'సంఘ్' భల్లూకపు పట్టు బిగుస్తోంది. ఐఐటీ-మద్రాస్‌లో అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌ గుర్తింపు రద్దుతో మొదలైన కాషాయ దాడి ఐఐటీ-ఢిల్లీ, ఎఫ్‌టిఐఐ, హెచ్‌సీయూల మీదుగా ఇప్పుడు దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయానికి (జేఎన్‌యూ) విస్తరించింది. జేఎన్‌యూ క్యాంపస్‌ ఇప్పుడు ఇనుప బూట్ల వీరంగానికి వేదికైంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, స్మృతి ఇరానీ 'సహించేది లేదం'టూ చేసిన ఫర్మానాలతో పోలీసులు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. 'జాతి వ్యతిరేక' నినాదాలు చేశారన్న ఆరోపణలతో గత శుక్రవారం విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ అరెస్టు తర్వాత, శనివారం మరో ఏడుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్హయ్య లాగానే వారి పైనా రాజద్రోహం ఆరోపణలు ఉన్నాయంటున్నారు. 

16:15 - February 15, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. తాత్కాలిక సచివాలయం శంకుస్థాపనపై చర్చించే అవకాశం ఉంది. నీటి పారుదల శాఖకు అదనపు కేటాయింపులు..కాపు రిజర్వేషన్లపైనా చర్చించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు. అలాగే మార్చి 5వ తేదీ నుండి 31 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 5వ తేదీన ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. మార్చి 12వ తేదీన సాధారణ బడ్జెట్..అలాగే 14వ తేదీన వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. అంతకుముందు ఉదయమే కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాక్స్ శాండ్ విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాక్స్ శాండ్ ను పరిశ్రమలుగా గుర్తించాలని, ఆరు జిల్లాల్లో ఇసుక వేలం పాట నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

పాటియాల కోర్టు వద్ద బీజేపీ ఎమ్మెల్యే వీరంగం..

ఢిల్లీ : పాటియాల కోర్టు వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ గుర్తు తెలియని వ్యక్తిపై చేయి చేసుకున్నారు. పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయడంతో అతడిని పట్టుకోవడానికి తాము ప్రయత్నించడం జరిగిందని దాడి చేయ లేదని ఓపీ శర్మ పేర్కొన్నారు. 

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి టెండర్లు ఖరారైన సంగతి తెలిసిందే. దీని సంబంధిత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 

మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ.

హైదరాబాద్ : మావోయిస్టులు విద్యాసాగర్ రెడ్డి, శృతి ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పోస్టుమార్టం నివేదికను హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించింది. ఫోరెన్సిక్ నివేదికతో పాటు పోస్టుమార్టం వీడియో రికార్డులనూ పరిశీలించాలని పిటిషనర్ కోరారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. 

పలు స్థలాలను పరిశీలించిన సీఎం కేసీఆర్..

ఖమ్మం : జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. విశాల స్థలంలో ఖమ్మం కొత్త బస్టాండు నిర్మించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొత్త బస్టాండుకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ పరశీలించారు. ఖమ్మం పట్టణంలోని పేదలకు 2 పడకల ఇళ్ల నిర్మాణానికి దానవాయిగూడలోని డంపింగ్ యార్డును కూడా పరిశీలించారు. 

ఓయూలో వామపక్ష విద్యార్థి సంఘాల సమావేశం..

హైదరాబాద్ : ఢిల్లీలో సీపీఎం కార్యాలయంపై దాడి, జేఎన్ యూలో విద్యార్థుల అరెస్టుకు నిరసనగా ఓయూలో వామపక్ష విద్యార్థి సంఘాలు సమావేశమయ్యాయి. 19న రౌండ్ టేబుల్ సమావేశం, 23న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించాలని ఓయూ వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. 

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం..

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి టెండర్లు ఖరారైన సంగతి తెలిసిందే. దీని సంబంధిత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 

మోడీ హామీలు పూర్తి చేయరు - రాహుల్..

అస్సాం : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు పూర్తి చేయరని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయని అందువల్ల మళ్లీ బీజేపీ ప్రసంగాలు ఇస్తుందని, మోడీ తప్పుడు హామీలు గుప్పిస్తారని ఎద్దేవా చేశారు. ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. అధికారంలో రాకముందు ఎన్నో వాగ్ధానాలు ఇస్తారని, మేక్ ఇన్ ఇండియా, క్లీన్ ఇండియా..ఇలా ఏదో ఒక స్లొగన్ ఇస్తున్నారని విమర్శించారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పేదల కోసం పనిచేయరని విమర్శించారు. ఇటీవలే మృతి చెందిన దళితుడు రోహిత్ వేముల తన అభిప్రాయాలు వ్యక్త పరిచాడని రాహుల్ తెలిపారు. 

15:25 - February 15, 2016

ఖమ్మం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కేసీఆర్ సోమవారం జిల్లాకు చేరుకున్నారు. హైదరాబాద్ నుండి తిరుమలాయపాలెం చేరుకున్న కేసీఆర్ కు మంత్రి తుమ్మలతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు..అధికారులు ఘన స్వాగతం పలికారు.భోజన విరామం అనంతరం పట్టణంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. లకారం చెరువును కేసీఆర్ సందర్శించనున్నారు. సాయంత్రం జిల్లా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సీతారామ ప్రాజెక్టు, భక్త రామదాసు ఎత్తిపోతల పథకాలకు సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం తిరుమలాయపాలెం బహిరంగసభలో కేసీఆర్ పాల్గొనున్నారు. 

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు...

ఢిల్లీ : స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖకు రెండు అవార్డులు వరించాయి. టాప్ టెన్ లో మైసూర్, చండీఘడ్, తిరుచారపల్లి, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, విశాఖపట్టణం, సూరత్, రాజ్ కోట్, గ్యాంగ్ టక్, పింప్రి చించ్ వాడ్, గ్రేటర్ ముంబై నిలిచాయి. 

15:16 - February 15, 2016

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 20016-17 బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో దేశ రాజధానిలో అంగన్ వాడీలు కదం తొక్కారు. అంగన్ వాడీలు సోమవారం చలో పార్లమెంట్ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్ కు తగిన కేటాయింపులు జరపాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆరు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి టెన్ టివితో మాట్లాడారు. బడ్జెట్ లో రూ. 36వేల కోట్ల నిధులు కేటాయించాలని, కనీస వేతనం రూ. 18వేలు కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న 22 లక్షల మంది అంగన్ వాడీల తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఐసీడీఎస్ పథకం ద్వారా ఎన్నో సేవలు చేయడం జరుగుతోందన్నారు. దీనిని ప్రైవేటీకరించడానికి ప్రయత్నాలు జరగుతున్నాయని, నిధులు లేవనే నెపంతో వివిధ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో లాగానే బడ్జెట్ తక్కువగా కేటాయిస్తే

జీతాలు పెరగకపోతే మార్చి 1వ తేదీ నుండి వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతామని విజయలక్ష్మి హెచ్చరించారు. 

15:11 - February 15, 2016

ఫ్యాషన్ ప్రపంచంలో హాఫ్ సారీస్ ది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు టీనేజర్స్ కే పరిమితమైన ఈ ఫ్యాషన్ ఇప్పుడు అన్ని వయసుల వారినీ ఆకర్షిస్తోంది. అలాంటి హాఫ్ సారీస్ లో ట్రెండీ కలెక్షన్ తెలుసుకోవాలంటే వీడియో చూడండి.

15:09 - February 15, 2016

మహిళలు అభివృద్ధి సాధిస్తున్నారని ఎంత చెప్పినా పారిశ్రామిక రంగంలో ఇప్పటికీ వారి ప్రవేశం అరుదుగానే ఉంటోంది. అలాంటి రంగంలోకి భర్త సహకారంతో ప్రవేశించిన అతివ కథనం.. పురుషాధిక్య భావజాలం విస్తరించిన మన సమాజంలో మహిళల కెరీర్ ను నిర్ణయించటంలో వివాహానిది కీలక పాత్ర. వివాహం తర్వాత ఎంతో మంది మహిళలు తమ కెరీర్ అవకాశాలను అందుకనుగుణంగానే మలుచుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ అంశం కొందరికి సానుకూలంగా పనిచేసి అరుదైన అవకాశాలను అందుకునేందుకు సహాయ పడుతుంది. అలాంటి వారిలో ఒకరు ఎం.ఎస్. ప్లాస్టిక్స్ ప్రొప్రైటర్ శ్రీవిద్య. వ్యాపారం అంటే ఎంతో అనుభవం కావాలి.. వ్యాపారం అంటే ఎంతో మెలకువతో వ్యవహరించాలి. వ్యాపారం అంటే పెట్టుబడి కావాలి, అంత కంటే ఎక్కువగా ధైర్యం ఉండాలి.. ఇవన్నీ కేవలం పురుషులకే సాధ్యం అనే భావనను అధిగమిస్తూ ఉత్పత్తి రంగంలో తనదైన ప్రత్యేకత చాటుతున్న శ్రీవిద్య భవిష్యత్ లో చక్కటి పారిశ్రామికవేత్తగా రాణించాలని మానవి కోరుకుంటోంది. మరిన్ని విశేషాలకు వీడియో క్లిక్ చేయండి..

సంగారెడ్డిలో పనిచేయని బ్యాంకుల ఏటీఎంలు..

మెదక్ : సంగారెడ్డిలో అన్ని బ్యాంకుల ఏటీఎంలు పనిచేయడం లేదు. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

గిరిజన మహిళలతో గవర్నర్ భేటీ..

శ్రీకాకుళం : సీతంపేటలో గిరిజన మహిళలతో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. గిరిజనులు ఆర్థిక వననులను కాపాడుకోవాలని, చదువుపై దృష్టి పెట్టి బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని సూచించారు. 

రియాల్టీ షోలపై లోకాయుక్తకు ఫిర్యాదు..

హైదరాబాద్ : మా టీవీ, జీ టీవీల్లో వస్తున్న రియాల్టీ షోలపై లోకాయుక్తకు బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. బతుకు జట్కాబండి, సంసారం చదరంగం ప్రోగ్రాములలో చిన్నారుల హక్కులకు భంగం కలిగించేలా వ్యవమరిస్తున్నారని లోకాయక్తుకు బాలల హక్కుల సంఘం పేర్కొంది. 

పెళ్లి పేరిట ఎన్ఆర్ఐ మోసం..

హైదరాబాద్ : ఎల్బీనగర్ లో పెళ్లి పేరిట ఓ ఎన్ఆర్ఐ మోసం చేశాడు. మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి చేసుకుని మూడు రోజులకే భార్యను వదిలేసి యూకేకు ఎన్ఆర్ఐ శ్రవణ్ కుమార్ వెళ్లిపోయాడు. డీజీపీకి బాధితురాలు ప్రశాంతి ఫిర్యాదు చేసింది. 

14:58 - February 15, 2016

టాలీవుడ్‌ నుంచి రానా, రామ్‌ చరణ్‌ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. అదే తరహాలో మరో యంగ్‌ స్టార్‌ బాలీవుడ్‌లో విలన్‌గా తెరంగేట్రం చేయనున్నారు. 'రక్త కన్నీరు' ఫేం నాగభూషణం మనువడు, భూషణ్‌ విలన్‌గా బాలీవుడ్‌లో రూపొందించిన 'రిథమ్‌' చిత్రం ద్వారా ఈ నెల 19న ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఏక్‌ పోలీస్‌, పదహారేళ్ళ వయసు వంటి చిత్రాల ద్వారా తెలుగులో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు భూషణ్‌. మొదటిసారి తాను హిందీలో ఓ ఫుల్‌ లెంగ్త్ నెగటివ్‌ రోల్‌లో నటించానని భూషణ్‌ తెలిపారు.

 

14:56 - February 15, 2016

కాజల్‌ అగర్వాల్‌ దక్షిణాది చిత్రసీమలో మోస్ట్‌ పాపులర్‌ నటి. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి సినిమా రంగంలోకి వచ్చింది. 2004లో బాలీవుడ్‌లో ప్రవేశించింది. 2007లో 'లక్ష్మీకళ్యాణం'తో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది. అప్పటి నుంచి ఆమె తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చిత్రాలు చేస్తోంది. కెరీర్‌ ప్రారంభించిన దగ్గర నుంచి తన పై సహచరులుగానీ, వేరే వ్యక్తులు గానీ ఏమైనా కామెంట్లు చేస్తే వాటిపై ఆమె స్పందించిన సందర్భాలు తక్కువ. ఎందుకని అంటే అవి తనకు అనసరమైనవి అన్నట్టుగా భావించి వదిలేస్తానని చెబుతుంది. దర్శకుడు చెప్పి దానికి న్యాయం చేశామా? లేదా? అన్నదే తప్ప కామెంట్లను, రూమర్స్ ను పట్టించుకుంటూ పోతే నటించలేమంటుంది. ఎవరికి నచ్చినట్టు వారు ఉండడమే మంచిదని అంటోంది. ఈ అమ్మడు ఈ సారి పవన్‌ కళ్యాణ్‌ చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌'లో చేస్తోంది. పవన్‌ కళ్యాణ్‌తో నటించడం ఎంతో ఆనందంగా ఉందని తెగ సంబర పడిపోతోంది. ఈ సినిమా తన కెరీర్‌లో గొప్ప చిత్రంగా నిలిచిపోతుందని చెబుతోంది.

14:53 - February 15, 2016

రజనీకాంత్‌ కథానాయకుడుగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం '2.0'. ఇది రోబోకు కొనసాగింపు సినిమా. దీనిని సుమారుగా రూ. 250 నుంచి రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. నెల రోజుల నుంచి ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. మొదట షెడ్యూల్‌ పూర్తయింది. ఈనెల 18వ తేదీ నుంచి రెండో షెడ్యూల్‌ చిత్రీకరణకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్‌ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో తీయనున్నారు. చెన్నైలోని పూందమల్లి సమీపంలో అత్యాధునిక నగరంగా మారుతుందన్నట్టు ఈ సెట్‌ను నిర్మించారట. దీని కోసం రూ. 20 కోట్లు వెచ్చించారు. ఈ సెట్‌లో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ కెన్నీ తన టీమ్‌తో చేరుకున్నారు. ఆ సెట్‌లో ఇప్పటికే ఫైట్‌ సీక్వెన్స్‌ను కంపోజ్‌ చేస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిం చడానికి కొన్ని ఆధునిక త్రీడీ కెమెరాలు రప్పించారట శంకర్‌. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా రికార్డులు తిరగ రాయడానికి శంకర్‌ చేస్తున్న ప్రయత్నమే ఈ చిత్రం. ఇందులో అమీజాక్సన్‌ కథానాయకగా చేస్తోంది. బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్‌ ప్రతి నాయకుడి పాత్ర పోషించనున్నాడు. ఈ షెడ్యుల్‌కు శంకర్‌ కఠిన నిబంధనలు విధించాడట. సెట్‌ కనీసం ఎవరూ ఫోన్‌ కూడా ఉపయోగించరాదని షరత్తు విధించి నిబద్దతతో చేయాలని ఆదేశించాడట. రహమాన్‌ బాణీలు సమకూరుస్తున్నారు.

14:35 - February 15, 2016

అందం కోసం ఎన్నో క్రీమ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇంట్లో దొరికే పదార్థాలతో చర్మ సంరక్షణ చేసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. కానీ ఇంట్లో వాడే పదార్థాల్లో కూడా నేడు కల్తీ జరుగుతోంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. టమాటాలు, బంగాళాదుంపలు, కీరదోస, రకరకాల పండ్లు.. ఇవి ఎక్కువగా ఇంట్లో అందాన్ని పెంపొందించేందుకు వాడే పదార్థాలు. అయితే వీటిల్లో రసాయనాలు వేసి పెంచినవే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి వీటిని నేరుగా ముఖానికి రాసేయకుండా వాడే ముందు శుభ్రంగా కడిగి మరీ వాడండి. అంతేకాదు, ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఉంచిన కూరగాయలు, పండ్లను ముఖానికి రాసుకోకపోవడం ఎంతో ఉత్తమం.
చాలా చర్మ సమస్యలకు మనం తాగే, వాడే నీళ్లే కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నీళ్లు ఏ మాత్రం కలుషితంగా ఉన్నా.. అందులో కంటికి కనిపించని సూక్ష్మక్రిములు కొత్త సమస్యలని తెచ్చిపెడతాయి. కాబట్టి ముఖాన్ని మంచినీళ్లతో కడుక్కుంటేనే మంచిది. రంగు మారిన, కలుష్యతమైన నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు.
నిమ్మకాయ కూడా చర్మానికి మంచిదే. అయితే మరీ సున్నిత చర్మం ఉన్నవాళ్లు నిమ్మరసాన్ని నేరుగా చర్మంపై రాయకపోవడమే మంచిది. ఇందులో ఉండే ఆమ్లగుణం వల్ల బాగా మంటపుట్టడం, చర్మం ఎర్రబడటం జరుగుతుంది. కాబట్టి నిమ్మరసంలో కొద్దిగా గులాబీనీళ్లు కలిపితే దాని గాఢత తగ్గుతుంది. అప్పుడు రాసుకోవచ్చు.

14:33 - February 15, 2016

ప్రస్తుతం గ్యాస్‌ ధర విపరీతంగా పెరిగిపోతోంది. ఈ రోజుల్లో గ్యాస్‌ను పరిమితంగా వాడుకోవడం ఎంతో మంచిది. ఇందుకోసం కొన్ని వంటింటి చిట్కాలను పాటిస్తే గ్యాస్‌ వృధా కాకుండా ఆదా చేసుకోవచ్చు. అలాగే వంటనూ త్వరగా పూర్తి చేసుకోవచ్చు. సరైన మంట, తగినంత నీరు, సరిపడిన పాత్ర ఇలా చిన్నచిన్న విషయాలపై దృష్టి పెడితే చాలు. ఇందుకోసం కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే సరి.
బర్నర్‌ రంధ్రాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. మూసుకుపోయిన రంధ్రాల వల్ల వంట సమయం పెరిగి గ్యాస్‌ వృధా అవుతుంది. గ్యాస్‌ స్టౌవ్‌ వెలిగించినపుడు మంట నీలిరంగులో ఉండాలి. ఎరుపు, ఆరెంజ్‌ రంగుల్లో మండుతుంటే గ్యాస్‌ వృధా అవుతున్నట్టుగా గ్రహించి వెంటనే సర్వీసింగ్‌ చేయించాలి. వంటకు అన్ని వస్తువులను సిద్ధం చేసుకున్న తర్వాతే గ్యాస్‌ స్టౌవ్‌ను వెలిగించాలి. కాయగూరలను ఉడకబెట్టడానికి తగినంత నీరు మాత్రమే వాడాలి. ఎక్కువ నీరు పోసి వండితే పోషకాలు వృధా కావడమే కాకుండా గ్యాస్‌, సమయం కూడా వృథా అవుతుంది.
కాయకూరలు, పప్పులను ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించడం వల్ల గ్యాస్‌ను బాగా ఆదా చేసుకోవచ్చు. మంట పాత్ర అడుగుభాగాన్ని దాటి పైకి వస్తుంటే గ్యాస్‌ వృధా అవుతున్నట్టుగా గుర్తించాలి. కూరగాయలు, అన్నం తయారు చేసేటపుడు పాత్రలపై విధిగా మూతను వాడాలి. ఇలా చేయడం వల్ల పోషకాలు వృథాకావు. పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. ఇలాంటి చిన్నపాటి చిట్కాలను పాటించడం వల్ల గ్యాస్‌ను బాగా ఆదా చేసుకునే అవకాశం ఉంది. 

14:31 - February 15, 2016

వేడి ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతోంది. ఈ ఎండల్లో దాహం తీర్చుకోవడానికి రకరకాల పానియాలు తాగుతుంటాం. అయితే అన్నింటిలోకి మజ్జిగ చాలా ఉత్తమమైనదని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఊబకాయంతో బాధపడేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే ఊబకాయ సమస్య నుండి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో విటమిన్‌ బి12, పొటాషియం, ఫాస్పరస్‌, కాల్షియం ఉంటాయి. ఊబకాయ నివారణకు ఇవి ఎంతో సహకరిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. ప్రతిరోజూ మజ్జిగ తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా జరిగి తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమయ్యేందుకు దోహదడపుతుంది. మజ్జిగ శరీరానికి కావలసిన విలువైన విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి. వివిధ జబ్బులను రానీయకుండా మజ్జిగ శరీరాన్ని కాపాడుతుంది. ఇది ఆరోగ్యకరమైన పానియం కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజూ మజ్జిగను తీసుకునేందుకు ప్రయత్నించండి.

ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం..

విజయవాడ : కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. రాక్స్ శాండ్ విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాక్స్ శాండ్ ను పరిశ్రమలుగా గుర్తిస్తామని, ఆరు జిల్లాల్లో ఇసుక వేలం పాట నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. 

ఖమ్మం చేరుకున్న కేసీఆర్..

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంకు చేరుకున్నారు. పట్టణంలో పర్యటించి సమస్యలు తెలుసుకోనున్నారు. లకారం చెరువును కేసీఆర్ సందర్శించనున్నారు. సాయంత్రం జిల్లా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సీతారామ ప్రాజెక్టు, భక్త రామదాసు ఎత్తిపోతల పథకాలకు సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం తిరుమలాయపాలెం బహిరంగసభలో కేసీఆర్ పాల్గొనున్నారు. 

ఢిల్లీకి చేరుకున్న సియాచిన్ జవాన్ల మృతదేహాలు..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి సియాచిన్ జవాన్ల మృతదేహాలు చేరుకున్నాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో జవాన్లకు త్రివిధ దళాలు శ్రద్ధాంజలి ఘటించారు. సియాచిన్ లో మంచుకొండలు కూలడంతో తొమ్మిది మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. 

సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ..

కర్నూలు : సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణకు మంత్రి గంటా ఆదేశించారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ కు మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. 

మంగాపురం తండాకు కరెంటు షాక్...

నల్గొండ : గరిడెపల్లి (మం) మంగాపురం తండాకు కరెంటు షాక్ తగిలింది. దరావత్ బాలు (27) అనే వ్యక్తి, మహిళకు గాయాలయ్యాయి. మరొకరి ఇంట్లో కలర్ టీవీ పేలింది.

 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై మంత్రి రావెల సమీక్ష..

గుంటూరు : మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ సిబ్బందితో మంత్రి రావెల సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై చర్చించారు. సబ్ ప్లాన్ నిధులు వెనుకబడిన వర్గాలకే అందేలా చర్యలు తీసుకుంటామని, కొన్ని చోట్ల ఈ నిధులు దుర్వినియోగమౌతున్నాయని పేర్కొన్నారు. సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాధారణ బడ్జెట్ లోనూ ఏస్సీ, ఎస్టీల అభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తామన్నారు. 

13:35 - February 15, 2016

కృష్ణా : విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో గోడ కూలి తల్లీ, కూతురు మృతి చెందారు. ఇదే గ్రామానికి చెందిన ముదిగొండ రాధ, శిరీష ఇద్దరూ ఇంటి బయట పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మీద పడింది. తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కూతురు శిరీష విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇద్దరు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

13:33 - February 15, 2016

విజయవాడ: బీజేపి సపోర్ట్‌తోనే సీపీఎం కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడిచేశారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కోట్ల రూపాలతో నూతన రాజధాని శంకుస్థాపన చేసిన చంద్రబాబు..ఇవాళ తాత్కాలిక సచివాలయం పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

13:32 - February 15, 2016

తిరుపతి : ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై మతోన్మద శక్తులు దాడి చేసిన ఘటనను నిరసిస్తూ తిరుపతిలో వామపక్షాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దాడిని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలో ఆందోళన నిర్వహించారు. బీజేపి ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని సీపీఎం నేతలు ఖండించారు.

13:29 - February 15, 2016

హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాల్లో రైతు ఆత్మహత్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రైతు ఆత్మహత్యల నివారణకు సంబంధించిన వివరాలను రాధాకృష్ణ కమిషన్‌కు నివేదించామని ఏపీ ప్రభుత్వం, తగ్గాయని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని పిటషనర్‌ వాదించారు. తదుపరి విచారణకు మూడు వారాలకు కోర్టు వాయిదా వేసింది.                                                                                

13:28 - February 15, 2016

హైదరాబాద్ : టిడిపి కార్యాలయంలో తెలంగాణ టిడిపి నేతలు భేటీ అయ్యారు. ఇటీవల టీఆర్‌ఎస్‌లోకి టి టిడిపి నేతలు వెళ్లడంతో తెలంగాణ పార్టీ పరిస్థితిపై నేతలు చర్చించనున్నారు. ఈ సమావేశానికి టి టిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణతో పాటు టిడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి, మిగతా నేతలు హాజరయ్యారు.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు

విజయవాడ : వల్లభనేని వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణాజిల్లా, రామవరప్పాడు రైవస్‌ కాలువ కట్టపై రెవెన్యూ అధికారులు ఇళ్లు కూల్చివేస్తుండడంపై స్థానికులు రాస్తారోకోకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే వల్లభనేని వారికి మద్దతుగా నిలిచారు. విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే రాస్తారోకోలో పాల్గొన్నారనే అభియోగంతో పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. దీనికి నిరసనగా ఆయన తనకు కేటాయించిన గన్‌మెన్‌లను వెనక్కి పంపారు. తనపై కేసు నమోదు కావడంతో సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.

రాక్ శాండ్ విధానాన్ని ఖరారు చేసిన ఏపీ సర్కార్

విజయవాడ : ఆరు జిల్లాల్లో ఇసుక టెండర్లను నిలిపివేయాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయించింది. సోమవారం విజయవాడలో జరిగిన సబ్‌ కమిటీ భేటీలో పలు అంశాలను చర్చించారు. రాక్‌ శాండ్‌ విధానాన్ని ఖరారు చేశారు. సబ్‌కమిటీలో తీర్మానం చేసిన అంశాలను కేబినెట్‌కు పంపిస్తామని, ఆయా అంశాలని పరిశీలించి కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకుంటుందని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. కేబినెట్‌లో నిర్ణయం అయిన తర్వాత మీడియాకు అన్ని విషయాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

బడ్జెట్ ప్రతిపాదనలపై హరీష్ రావు సమీక్ష

హైదరాబాద్ : బడ్జెట్ ప్రతిపాదనలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయిస్తామని, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ :తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. రైతు ఆత్మహత్యల నివారణకు సంబంధించిన వివరాలను రాధాకృష్ణ కమిషన్ కు నివేదించామని ఏపీ సర్కార్ తెలిపింది. రాఊంలో ఆత్మహత్యలు తగ్గాయని టి. సర్కార్ తెలిపింది. మరో వైపు ఆత్మహత్యలు కొనసాగుతూనే వున్నాయని పిటిషనర్ వాదించారు. చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వాలని పిటిషనర్ కు కోర్టు ఆదేశించింది.ప్రభుత్వాలు కోర్టుకు చెబుతున్న విషయాలు అమలు చేయడం లేదని పిటిషనర్లు వాదించారు. స్టేట్ లెవల్ ఫార్మర్స్ కమిషన్ పై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : అమిత్ షా..

ఢిల్లీ : రాహుల్, కాంగ్రెస్ ను అమిత్ సా టార్గెట్ చేశారు. రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా రాహుల్ గాంధీ దేశద్రోహులకు మద్దతు పలికారని, కాంగ్రెస్ పార్టీ దేశ భక్తికి కొత్త నిర్వచనం చెబుతోందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ దేశ విచ్ఛన్నం కోరుకుంటోందని విమర్శించారు.

ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం బయల్దేరారు 

ప్రహరీ గోడ కూలి తల్లీకూతుళ్లు మృతి

విజయవాడ : ప్రహరీ గోడ కూలి తల్లీకూతుళ్లు మరణించిన విషాద ఘటన కృష్ణా జిల్లాలో సోమవారం జరిగింది. జిల్లాలోని నిడమానూరులో ప్రహరీ గోడకూలి తల్లీకూతుళ్లు రాధామాధవి(40), కూతురు శిరీష (15)లు మరణించారు. ఈ సంఘటనతో వారి బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు.

12:46 - February 15, 2016

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంపై నిన్న దాడిచేసిన సంఘటన సంఘ విద్రోహశక్తుల పనే అని సీపీఎం నేత శ్రీనివాసరావు అన్నారు. కార్యాలయంపై దాడి చేయడమే కాకుండా...సీతారాం ఏచూరిని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఘటనలపై బీజేపి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఆయన మాటల్లోనే 'మతాన్ని, మత విద్వేశాల్ని బీజేపి ప్రభుత్వం పెంచిపోషిస్తుందని మండి పడ్డారు. ఆయన 'టెన్ టివి'తో మాట్లాడుతూ.. ఇలాంటి దాడువి కొత్త కాదు ఈ రకమైన ఉన్మాదం తలకెక్కిన వాళ్లు ఎంతటి దేశభక్తులనైనా శంకించి దాడులకు తెగబడే తత్వం వారిది. ఈరకమైన ఉన్మాదంఎక్కిడంలో ఆర్ ఎస్ ఎస్, బిజెపిలు ప్రత్యేకించి గత వారం, 10 రోజులగా అమాయకులైన కొంత మంది యువత మెదడుల్లోకి ఎక్కించి దేశ సమగ్రతను, దేశ సమైక్యను దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. ఈ ఘటనలపై పోలీసులకు ఎఫ్ ఐఆర్ ఇచ్చినట్లు తెలిపారు. గత రెండేళ్లు గా అధికారంలో ఉన్న బిజెపి పై యువతలో వున్న భ్రమలు తొలిపోయి వ్యతిరేక పెరుగుతోంది. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కూడా వారు దెబ్బతిన్నారు. దీని నుంచి తప్పించుకుని ప్రజలను పక్కదారి పట్టించేందుకు మత ఆయుధాన్ని బయటకు తీశారు. హెచ్ సియూలో రోహిత్ మరణం తరువాత దళితులకు సామాజిక న్యాయం చేయడంలో బిజెపి కావాలని దళితుల్ని అణగదొక్కుతున్నారు, మనువాదాన్ని ముందుకు తీసుకు వస్తున్నారు, యూనివర్శిటీల్లో రాజకీయాలను ప్రవేశ పెట్టి, యూనివర్శిటీ విద్యను రాజకీయ మయం చేస్తున్నారనే అంశంలో బిజెపి ఒంటరి అయ్యి, మేధావుల విమర్శలకు గురయ్యారన్నారు. ఈ రెండు సమస్యల నుండి దృష్టి మరల్చి... జాతి వ్యతిరేక, అనుకూల పద్ధతుల్లో పాకిస్థాన్ ను మధ్యలో లాగి, జేఎన్ యూలో జరిగిన కొన్ని ఘటనలను ఉపయోగించుకుని ఆరంగునంతా వామపక్షాలకు పూసి... ఉద్దేశ్య పూర్వకంగా.. ఓ పథకం ప్రకారం వామపక్షాలపై దాడి ఓ రాజకీయ కుట్ర. దేశ భక్తి విషయంలో వామపక్షాల సాటి ఎవరూ లేరు. విమపక్షాల దేశభక్తిని శంకించేవాడిని శంకించాలి తప్ప.. వామపక్షాల దేశభక్తిని శంకించడం చాలా అన్యాయమైన విషయం' అని శ్రీనివాసరావు తెలిపారు.

ఘట్ కేసర్ ఆంధ్రాబ్యాంక్ లో చోరీ

రంగారెడ్డి : ఘట్ కేసర్ ఆంధ్రాబ్యాంక్ లో చోరీ జరిగింది. దుండగులు గ్యాస్ కట్టర్లతో షట్టర్ ను తొలగించి దొంగతనానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

సుప్రీం కోర్టులో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు

ఢిల్లీ : సుప్రీం కోర్టులో కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురు అయ్యింది. ప్రతిపక్ష హోదా కల్పించాలన్న పిటిషన్ ను కొట్టివేసింది.

ఓయూలో వామపక్ష ,అంబేద్కర్ విద్యార్థి సంఘాలు అత్యవసర భేటీ

హైదరాబాద్: ఓయూ అంబేద్కర్ హాస్టల్ లో వామపక్ష విద్యార్థి, అంబేద్కర్ విద్యార్థి సంఘాలు అత్యవసర భేటీ అయ్యాయి. యూనివర్శిటీల్లో లెఫ్ట్ విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలు, ఢిల్లీలో సీపీఎం కార్యాలయం పై దాడి, జేఎన్ యూ లో కన్హయకుమార్ అరెస్ట్ అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

ఢిల్లీ చేరుకున్న సియాచిన్ జవాన్ల మృతదేహాలు

హైదరాబాద్ : సియాచిన్ లో మంచు కొండలు కూలి మృతి చెందిన 9 జవాన్ల మృతదేహాలు ఢిల్లీకి చేరుకున్నాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో జవాన్లకు త్రివిధ దళాల శ్రద్ధాంజలి ఘటించాయి.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

గుంటూరు: దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో మున్నా కళ్యాణి (22) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అదనపు కట్నం కోసం అత్తింటి వారే తమ కూతురిని చంపారని కళ్యాణి తల్లిదండ్రులు ఆరోపించారు. భర్త, అత్త, బావ, అడబిడ్డలపై దాచేపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

11:34 - February 15, 2016

విజయవాడ : నేడు విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అమరావతిలో నిర్మించనున్న తాత్కాలిక సచివాలయంతో సహా పలు అంశాలపై చర్చించనున్నారు. తాత్కాలిక సచివాలయానికి టెండర్లు ఖరారవడంతో దాని నిర్మాణం, శాఖల తరలింపు, టెక్స్‌టైల్ రంగం, తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. 

కర్నూలు, కాకినాడ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్ : కర్నూలు, కాకినాడ మున్సిపల్ ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల కమిషనర్ ను నియమించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రెండు వారాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని ఏపీ సర్కార్ కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

రోజా సస్పెన్షన్ పిటిషన్ పై నేడు విచారణ

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే.రోజా పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరగనుంది. గతేడాది శాసనసభ సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాను ఏడాదిపాటు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. తరువాత దానిపై ఆమె హైకోర్టుకు వెళ్లారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను కొట్టివేయాలని, స్పీకర్ ఈ విషయంలో తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఓ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తన బాధ్యతలను తాను నిర్వర్తించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని రోజా కోరారు.

పడగల్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణహత్య

నిజామాబాద్‌ : జిల్లా వేల్పూరు మండలం పడగల్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణహత్యకు గురయ్యాడు. ఉపాధ్యాయుడు గంగాధర్‌ను గుర్తు తెలియని దుండగులు బండరాయితో మోదీ హత్యచేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఘనంగా సంత్ సేవాల్ మహారాజ్ 277వ జయంతి వేడుకలు

హైదరాబాద్ : సైఫాబాద్ పీజీ కాలేజీలో సంత్ సేవాల్ మహారాజ్ 277వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎంపి కవిత పాల్గొన్నారు. సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తామని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు పోతోంది అని ఎంపి కవిత తెలిపారు.

సీతంపేటలో గవర్నర్ నరసింహన్ పర్యటన

శ్రీకాకుళం : సీతంపేటలో గవర్నర్ నరసింహన్ పర్యటన కొనసాగుతుంది. పీఎంఆర్ సీ సమీపంలో గిరిజనులతో గరవ్నర్ ముఖాముఖి చేపట్టారు. గిరిజన ఉత్పత్తులను గరవ్నర్ పరిశీలించారు.

రామవరప్పాడులో వైఎస్ జగన్ పర్యటన

విజయవాడ : రామవరప్పాడులో వైఎస్ జగన్ పర్యటన సాగిస్తున్నారు. భూసేకరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు జగన్ పరామర్శిస్తున్నారు. పాలకల తొలగింపు, అన్యాయం, అని బాధితులకు అండగా నిలుస్తామని తెలిపారు. టీడీపీ నేతల లబ్ధి కోసమే పేదల ఇళ్లు తొలగిస్తున్నారని మండి పడ్డారు.

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్టాక్‌మార్కెట్లు ఇవాళ ప్రారంభం నుంచి భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. 460 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 151 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ టేడ్రవుతున్నాయి.

10:43 - February 15, 2016

ఢిల్లీ: నిన్న సీపీఎం కార్యాలయంపై దాడికి పాల్పడిన దుండగులు ఈ సారి బెదింరింపులకు దిగారు. సీపీఎం కేంద్ర కార్యాలయానికి, సీతారాం ఏచూరికి అర్ధరాత్రి బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. నీ సంగతి తేలుస్తామంటూ ఏచూరికి బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.

10:38 - February 15, 2016

ప్రకాశం : వేసవిరాక ముందే ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి ప్రారంభమయ్యింది. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని రేషన్‌ కోటా తరహాలో ఇస్తున్నారు. అది కూడా ఏడు లేదా ఎనిమిది రోజులకు ఒకసారి వచ్చే టాంకర్‌ కోసం జనం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రకాశం జిల్లాలో దాహార్తిపై 10 TV ప్రత్యేక కథనం.

అడుగంటుతున్న భూగర్భ జలాలు...

వర్షాభావంతో ప్రకాశం జిల్లాలో భూగర్బ జలాలు అడుగంటాయి. దీంతో బోర్లు ఎండిపోయాయి. చెరువుల్లో కూడా నీరు అడుగంటడంతో జిల్లా ప్రజలు దాహార్తితో పరితపిస్తున్నారు. పూర్తిగా వేసవి రాకముందే పరిస్థితి ఇంత తీవ్రంగా ఇలా ఉంటే.... మున్ముందు ఇంకా ఎలా భయకరంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

జిల్లా జనాభా 33 లక్షలు ....

జిల్లాలో ఏటేటా జనాభా పెరుతున్నా... మంచినీటి సరఫరా పరిస్థితి మాత్రం మెరుగుపడటంలేదు. జిల్లాలో 33 లక్షల మంది జనాభా ఉన్నారు. చాలా ప్రారంతాలకు నాగార్జునసాగర్‌ జలాలే ప్రధాన వనరు. ఈసారి సాగర్‌లో కనీస స్థాయిలో కూడా నీరు లేకపోవడంతో... మంచినీటి సరఫరా తగ్గిపోయింది. దీంతో తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు దొరక్క జనం అల్లాడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దారుణ పరిస్థితులను చూడలేదని జిల్లా వాసులు చెబున్నారు. ట్యాంకర్ల ద్వారా వారానికి ఒకరోజు సరఫరా చేస్తున్న మంచినీరు....అవసరాలకు సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాల్లో 260 చెరువులు ....

జిల్లాలోని పలు గ్రామాలకు చెరువులే ఆధారం. జిల్లాలో వ్యాప్తంగా 260 చెరువులున్నాయి. వీటిలో నీరు దాదాపుగా అడుగంటిపోయింది. దీంతో చెరువులపై ఆధారపడిన యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, దర్శి ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. చెరువుల్లోనే గేదెల కడుతున్నారు. దీంతో వీటిలోని నీరు కలుషితువుతోంది. ఈ నీళ్లను ఏ అవసరానికి కూడా ఉపయోగించుకునే అవకాశం లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మంచినీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ట్యాంకర్ల ద్వారా రెండు రోజులకు ఒకసారైనా మంచినీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.

మంచినీటి సమస్యపై ఫిర్యాదులకు 1077 టోల్‌ ఫ్రీ నంబర్‌ .....

జిల్లాలో నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడి దృష్టిలో పెట్టుకుని సమస్యను అధికారుల దృష్టికి తెచ్చేందుకు 1077 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేశారు. ఈ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా... పట్టించుకునే నాథుడే లేరని ప్రజలు గోడువెళ్లబోసుకుంటున్నారు. జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలు దీర్చేందుకు మార్కాపురం సమీపంలోని గొట్టిపడియ దగ్గర 1996 మార్చి 5 వెలిగొండ ప్రాజెక్ట్‌కు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు శిలాఫలకం వేశారు. ఇప్పటికి నలుగురు ముఖ్యమంత్రులు మారినా.. ప్రాజెక్ట్‌ పూర్తికాలేదు. జిల్లా కేంద్రం ఒంగోలుకు సమీపంలో ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లో కూడా నీరు అడుగంటింది. దీంతో ఒంగోలు నగరానికి కూడా సక్రమంగా మంచినీరు సరఫరా కావడంలేదు.

కనిగిరి, అద్దంకి, దర్శి ప్రాంతాల్లో....

కనిగిరి, అద్దంకి, దర్శి ప్రాంతాల్లో చాలా గ్రామాల ప్రజలు తాగేందుకు నీరు లేక అల్లాడుతున్నారు. ట్యాంకర్ల కోసం ఒక్కోసారి రోజుల తరబడి వేచిచూడాల్సి రావడంతో కూలిపను మానుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దశాబద్ధాల తరబడి మంచినీటి సమస్య ఉన్నా...

జిల్లా దశాబద్ధాల తరబడి మంచినీటి సమస్య ఉన్నా... పరిష్కారంపై అటు పాలకులు కానీ, ఇటు అధికారులు కానీ శ్రద్ధకనపరచకోవడంతో ఇది జటిలమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఏయేటికాయేడు తాత్కాలికు ఉపశమన చర్యలు చేపట్టి చేతులు దులుపుకునే బదులు ... శాశ్వత పరిష్కార మార్గాలు చూడాలి కోరుతున్నారు. 

10:34 - February 15, 2016

మహబూబ్ నగర్ : తెలంగాణలో అత్యంత వెనుకబడిన మహబూబ్‌నగర్‌ జిల్లాకు ప్రతి రైల్వే బడ్జెట్‌లో అన్యాయం జరుగుతూనే ఉంది. పెండింగ్‌ రైల్వే ప్రాజెక్ట్‌లతోపాటు, ఆర్బీఓ లకు నిధలులు కేటాయించడంలేదు. దీంతో వీటికి మోక్షం లభించడంలేదు. మహబూబ్‌నగర్‌-మునీరాబాద్‌ రైల్వేలైను నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు , రాయచూర్‌ నుంచి గద్వాల వరకు పూర్తైన రైలు మార్గం మాచర్ల వరకు పొడిగింపు..... సికింద్రాబాద్‌-కర్నూల్‌ లైను డబ్లింగ్‌, విద్యుదీకరణ వంటి ప్రాజెక్ట్‌లను చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు నిధులు...

ఈనెలాఖరులో రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రతి ఏదాడి మాదిరిగానే ఈసారి కూడా మహబూబర్‌నగర్ జిల్లా ప్రజలు రైల్వే బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించడంతోపాటు, పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

ఒకప్పుడు పది రైళ్లు

మహబూబ్‌నగర్‌కు నిజాం నవాబుల కాలంలో వేసిన సింగిల్‌ రైల్వే లైనే దిక్కయ్యిందని ప్రజలను నిట్టూరుస్తున్నారు. ఒకప్పుడు ఈ మార్గంలో పదిరైళ్లు మాత్రమే నడిచేవి. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌లు, పాసింజర్లు కలిపి రోజు 60 వరకు తిరుగుతున్నాయి. ఈ రైల్వేలైనుపై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సికింద్రాబాద్‌-కర్నూలు-డోన్‌-గుత్తి మార్గాన్ని డబ్లింగ్‌గా మర్చాలని ఎప్పటి నుంచే ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఇంతవరకు దీని అతీగతి పట్టించుకున్న వారులేరన్న విమర్శలున్నాయి. ప్రతి ఏటా రైల్వేబడ్జెట్‌ ముందు ప్రాంతం ఎంపీలు రైల్వే మంత్రికో, రైల్వే బోర్డు చైర్మన్‌లో మొక్కుబడిగా వినతి పత్రాలు అందచేసి, చేతులు దులుపుకోవడం మినహా.... చేస్తున్నదేమీలేదని ప్రజలు మండిపడుతున్నారు.

రాయచూరు-గద్వాల మధ్య డెమో రైలు.....

కర్నాటకలోని రాయచూరు నుంచి ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైను నిర్మించాలని నిజాం కాలం నుంచి ఉన్న ప్రతిపాదనపై మూడుసార్లు సర్వే చేసినా.... ఇంతవరకు మోక్షంలేదు. రాయచూరు-గద్వాల మధ్య పూర్తిచేసిన మార్గంలో డీజిల్‌ మల్టిపుల్‌ యూనిట్‌ రైలు నడుపుతున్నా... దీనికి ప్రజాదరణ అంతంత మాత్రమే. దీనిని మాచర్ల వరకు విస్తరిస్తే జిల్లాలోని వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, దేవరకొండ, మల్లేపల్లికి రైలుమార్గం ఏర్పడుతుంది. కానీ దీని అతీగతి గురించి పట్టించుకున్నవారులేరు. జడ్చర్ల నుంచి నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ మీదుగా నంద్యాల వరకు కొత్తలైను నిర్మాణం కాగితాలకే పరిమితం అయ్యింది. మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ చేస్తామని ప్రకటించి నాలుగేళ్లైనా... ఇంతవరకు పనులు ప్రారంభంకాలేదు. దేశంలోని అన్ని రైల్వే జోన్లతో పోలిస్తే దక్షిణ మధ్య రైల్వేలోనే ఎక్కువ ఆదాయం వస్తున్న ఈ ప్రాంత ప్రాజెక్ట్‌లకు నిథుల కేటాయింపులో అన్యాయం జరుగుతోగుతోందని్న విమర్శలున్నాయి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రైల్వే ప్రాజెక్ట్‌లకు ఎక్కువ నిధుల....

ఈసారి బడ్జెట్‌లోనైనా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రైల్వే ప్రాజెక్ట్‌లకు ఎక్కువ నిధుల కేటాయించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. 

10:30 - February 15, 2016

విశాఖ : సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో చోరీ జరిగింది. 10 లక్షల రూపాయల విలువైన తలనీలాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దీనిపై ఆలయాధికారులు విచారణ చేపట్టారు.

10:29 - February 15, 2016

హైదరాబాద్‌ : నగరంలోని నాచారంలో వడ్డీ వ్యాపారి రెచ్చిపోయాడు. 30 లక్షల అప్పు విషయంలో వడ్డీ వ్యాపారి కుమార్‌, గిరి అనే వ్యక్తి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో వడ్డీవ్యాపారి కుమార్‌ గిరిపై కత్తితో దాడి చేశాడు. పోలీసులు కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

10:27 - February 15, 2016

తూ.గో : కాకినాడ వార్పు రోడ్డులో ఎమ్మెల్సీ లక్ష్మీ శివ కుమారి కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ కారుతో బీభత్సం సృష్టించాడు. అర్ధరాత్రి మద్యం మత్తులో కారు నడుపుతూ రెండు కార్లను ఢీకొట్టాడు. రెండు ఆవులను కూడా ఢీకొనడంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రవీణ్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులు, మరో అమ్మాయి ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు.

10:26 - February 15, 2016

హైదరాబాద్ : బీడీ కట్టపై పుర్రెగుర్తుకు వ్యతిరేకంగా బీడి పరిశ్రమల యజమానులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం బీడి కట్టలపై ముద్రిస్తున్న పుర్రెగుర్తు సైజును 85 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశ్రమ యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా..సోమవారం నుంచి ఈనెల 24 వరకు బీడీ పరిశ్రమలను ముసివేయాలని పరిశ్రమల యజమానులు నిర్ణయించారు. దీంతో బీడి పరిశ్రమలపై ఆధారపడ్డ తెలంగాణ కార్మికుల బ్రతుకులు రోడ్డున పడే పరిస్దితి ఎర్పడటంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూన్నారు.

10:24 - February 15, 2016

నెల్లూరు : మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్తకు చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పింది ఓ భార్య. ఈ ఘటన నెల్లూరులో జరిగింది. వెంకటాచలం మండలానికి చెందిన వెంకటేష్‌, స్వప్నకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లకు కూడా ఉన్నారు. అయితే నాలుగేళ్లుగా భర్త వెంకటేశ్‌ కనిపించకుండా పోయాడు. భర్త ఆచూకి కోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. రెండు రోజుల క్రితం భర్త మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని తెలుసుకున్న స్వప్న అక్కడకు వెళ్లి భర్తను వీర బాధుడు బాదింది. చెప్పుతో భర్తకు దేహశుద్ధి చేసింది. 

10:22 - February 15, 2016

చిత్తూరు : తిరుపతి ఎస్వీ జూపార్క్‌ సమీపంలోన ఎస్‌వీనగర్‌ అటవీప్రాంతంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఎర్రచందనం కూలీలు తారస పడ్డారు. పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. రాళ్ల దాడిలో టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ వాసుకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. 

కోల్ కత్తాలో కాల్పుల కలకలం

కోల్ కతా :ఓ స్కూల్ వద్ద కాల్పుల కలకలం రేగింది. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులకు జరిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరికి గాయాలు అవగా... ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సీతారాం ఏచూరికి బెదిరింపు కాల్ ... విచారణ

ఢిల్లీ: సీపీఎం జాతీయ కార్యాదర్శి సీతారాం ఏచూరికి గత అర్థర్రాతి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. నీ సంగతి తేలుస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు ఏచూరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు విచారణ చేపట్టారు.

సింహాచలంలో అప్పన్న స్వామి ఆలంయలో చోరీ

విశాఖ : సింహాచలంలో అప్పన్న స్వామి ఆలంయలో చోరీ జరిగింది. రూ.10లోల విలువైన తలనీలాలు అపహరణకు గురయినట్లు అధికారులు గుర్తించి.. విచారణ చేపట్టారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి మూడు గంటలు, నడకదారిన కొండ ఎక్కి వచ్చిన భక్తులకు రెండు గంటలు, రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది.

 

కూర్మనాథస్వామిని దర్శించుకున్న గవర్నర్

శ్రీకాకుళం : జిల్లాలోని శ్రీకూర్మంలో కొలువైన కూర్మనాథస్వామిని సోమవారం ఉదయం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్‌ సీతంపేటలో పర్యటించనున్నారు. సీతంపేట పీఎంఆర్‌సీలో స్టాల్స్‌, ఫొటో ఎగ్జిబిషన్‌ సందర్శించి, మహిళా సంఘాలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

08:38 - February 15, 2016

విజయవనగరం : జిల్లాలో అప్పుడే పట్టణాలు పల్లెల అనే తేడా లేకుండా మంచినీటి సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో భూ గర్భజలాలు అడుగంటిపోతున్నాయి. బిందెడు నీళ్ల కోసం కిలో మీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితి తలెత్తింది. జిల్లాలోని మారుమూల గ్రామానికి వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

గ్రామాలకు వాగులు చెలమలే మంచినీటి వనరులు.....

గ్రామాలకు సమీపంలోని వాగులు, చెలమలే ప్రజలకు మంచినీటి వనరులవుతున్నాయి. అవి కూడా ఎండిపోతుండడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం టాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నా అవి ఎందుకు సరిపోవడం లేదు. కెఎల్ పురం, గాజులరేగ, ప్రశాంత్ నగర్ , శాంతినగర్ తదితర ప్రాంతాలకు ట్యాంకర్లే దిక్కు. విజయనగరంతో పాటు పార్వతీపురం , సాలూరు బొబ్బిలి మున్సిపాలిటీలోని ప్రజలు తెల్లవారితే మంచినీటి కోసం ఎదురు చూడాల్సిందే.

జిల్లా కేంద్రంలో 3 లక్షల మంది జనాభా .....

జిల్లా కేంద్రంలో 3 లక్షల మంది జనాభా ఉండగా 3 పథకాల ద్వారా మంచినీరు సరఫరా జరుగుతోంది. వాస్తవానికి ప్రతీరోజు ఒక వ్యక్తికి 140 లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 70 లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి మంచినీటిని అందించే చంపావతి నది ప్రస్తుతం ఏడారిని తలపిస్తోంది. నదీ గర్భం బీటలు వారిపోయింది. ఉన్న నీటిని నిల్వ చేయడంలోఅధికారులు విఫలమవడంతో ... నీరు సముద్రంలో కలిసిపోయింది. నదిలో నీరు లేకపోవడంతో ఊటబావులకు నీరు అందడం లేదు. మధుపాడ నుంచి తాగునీటిని తరలించే పనులకు కోటి 70 లక్షల వ్యయాన్ని ప్రతిపాదించారు. అయితే అదీ కాగితాలకే పరిమితమైంది.

చుక్కనీరు దొరకని గోస్తనీ నది ప్రక్క గ్రామాలు.....

పట్టణాలలోనే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గోస్తనీనది ప్రక్కనే ఉన్న వందలాది గ్రామాలకు చుక్కనీరు దొరకడం లేదు. నది నీటిని కొన్ని పరిశ్రమలకు మల్లిస్తున్నారు. అయితే నదిని ఆనుకుని ఉన్న తమ గ్రామాలకు నీటిని ఇవ్వకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో బావులు ,బోర్ల పైనే ప్రధానంగా ప్రజలు ఆధారపడుతున్నారు. ఎండిపోయిన బోర్లను బాగు చేయడానికి నిధులలేమి ఆటంకంగా మారింది. వీటితో పాటు 21 సీపీడబ్ల్యూఎస్ పథకాలు ప్రస్తుతం థర్డ్ పార్టీ ద్వారా నిర్వహిస్తున్నారు. సుమారు 700 గ్రామాల్లోని 5 లక్షల మంది ప్రజలకు ఈ పథకాల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.

జనావాసాలు 2వేల 893 ....

ప్రస్తుతం జిల్లాలో జనావాసాలు 2 వేల 893 ఉంటే.. ఇందులో 1318 ప్రాంతాలకే తాగునీరు సరఫరా అవుతోంది. 1558 ప్రాంతాల్లో పాక్షికంగా నీరు అందుతుంటే.. 62 ప్రాంతాలకు సురక్షితమైన నీటి వనరులే లేవు. గిరిజన ప్రాంతాలలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సెలయేళ్లలో చిన్నచిన్న కుంటలలో నీటిని పట్టుకుంటున్నారు. కలుషితమైన నీటిని తాగుతూ రోగాలను కొనితెచ్చుకుంటున్నారు.

వేసవి రాకముందే ఇలా ఉంటే....

వేసవికాలం రాకముందే విజయనగరం జిల్లాలోని గ్రామాల్లో గుక్కెడు నీటి కోసం ప్రజలు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సి వస్తోంది. ఇక మండువేసవిలో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే.. తాగునీటి కోసం వలసెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

08:34 - February 15, 2016

హైదరాబాద్ : ఖమ్మం, వరంగల్‌ జిల్లా ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీరుస్తూ రూపొందించిన ఇందిరా సా గర్‌, రాజీవ్‌ సాగర్‌ పేరు మార్చాలనుకోవడం అన్యాయమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రాజెక్టుకు శ్రీరామ ఇరిగేషన్‌ స్కీమ్‌ అనే పేరు పెట్టాలనుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని... దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16న కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు.

 

08:32 - February 15, 2016

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 12 గంటలకు తిరుమలాయపాలెం చేరుకుంటారు. రోడ్డు మార్గం గుండా 12.30 గంటలకు NSP అతిథిగృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు భోజనం తర్వాత 3 గంటల నుంచి ఖమ్మం పట్టణాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు పాపిరెడ్డి ఫంక్షన్‌హాల్లో జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు డిన్నర్ తర్వాత ఖమ్మంలోనే బస చేస్తారు. మంగళవారం ఉదయం ఖమ్మం నుంచి బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా 9.15 నిమిషాలకు ముదిగొండ చేరుకుంటారు. ముతరాం గ్రామంలోని రాయాలయాన్ని సందర్శిస్తారు. ముదిగొండ నుంచి 9.40 నిమిషాలకు బయల్దేరి 10.15 నిమిషాలకు తిరుమలాయపాలెం చేరుకుంటారు. అక్కడ భక్త రామదాసు పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం 10.20 నిమిషాలకు అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 12 గంటలకు బయల్దేరి టేకులపల్లి మండలం రోళ్లపాడుకు వెళతారు. 12.30 నిమిషాలకు అక్కడ సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 12.45కు రోళ్లపాడు ప్రజలతో మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు భోజనం ముగించుకొని హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కు బయల్దేరుతారు. 

08:31 - February 15, 2016

ప.గో : ప్రజా ఉద్యమానికి ఏపీ ప్రభుత్వం తలొగ్గింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వాఫుడ్‌ పార్క్‌ను వ్యతిరేకింస్తూ... స్థానికుల నుంచి పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో నిర్మాణం నిలిపివేతకు సర్కార్‌ నిర్ణయించింది. చంద్రబాబు ఆదేశాలతో నిర్మాణం నిలిపివేసినట్లు ఎమ్మెల్యే మాధవనాయుడు ప్రకటించారు. ఒక వైపు ఎమ్మెల్యే ఈ ప్రకటన చేస్తూ మరో వైపు సీపీఎం నేతలను అరెస్టు కొనసాగిస్తున్నారు. ఈ అరెస్టుల పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

08:00 - February 15, 2016

హైదరాబాద్ :జాతివ్యతిరేకులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని సీనియర్ జర్నలిస్ట్ న్యూస్ మార్నింగ్ చర్చలో తెలకపల్లి రవి డిమాండ్ చేశారు. బీజేపీ అనుబంధ సంఘ్‌పరివార్‌ శ్రేణులు మరోసారి తమ అసహనాన్ని బయటపెట్టాయి. ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడికి తెగబడ్డాయి. సంఘ్‌పరివార్‌ దాడికి నిరసనగా దేశ వ్యాప్తంగా సీపీఎం కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్ యూ ను జైలు గోడలా మార్చారా? సీపీఎం కేంద్ర కార్యాలయం సంఘపరివార్ దాడి ఎందుకోసం? కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన అవసరం లేదా? అప్ఝల్ గురూ ఉరిని వ్యతిరేకించిన పీడీపీతో బిజెపి ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? అఫ్జల్ గురు ఉరి తీతను వ్యతిరేకించిన వామపక్ష విద్యార్థులను ఎందుకు కార్నార్ చేస్తోంది? జేఎన్ యూ విద్యార్థులకు అఫీజ్ మద్దతు తెలుపుతూ ట్వీట్స్ వచ్చాయని కేంద్ర హోం మంత్రి ఆరోపించారు? దాంట్లో నిజా నిజాలు బయటపెట్టాల్సిన అవసరం లేదా? ఈ అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈచ ర్చలో తెలకపల్లి రవితో పాటు వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, బిజెపి నేత అల్జాపూర్ శ్రీనివాస్, కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

వైభవంగా చెర్వుగుట్టు బ్రహ్మోత్సవాలు..

నల్గొండ : జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా పేరొందిన చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజామున స్వామివారు వృషభవాహనంపై కల్యాణ మండపానికి విచ్చేయగా... వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి, అమ్మవార్ల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి హాజరై ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

వరంగల్ జిల్లాలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు :4గురు మృతి

వరంగల్ : జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇందారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీ, కూతురు మృతి చెందారు. ఆరుగురికి గాయాలు అవడంతో వారిని ఎంజీఎంకు తరలించారు. మేడారం జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. పర్వతగిరి మండలం కలేదాలో పెళ్లి వ్యాన్ ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి.

కాకినాడలో ఎమ్మెల్సీ కారు బీభత్సం...

తూ.గో : కాకినాడ వార్ఫు రోడ్డులో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న ఆవులను ఢీకొని రెండుకార్లను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో రెండు ఆవులు మృతి చెందాయి. బీభత్సం సృష్టించిన కారు ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి కారుగా స్థానికులు గుర్తించారు. లక్ష్మీశివ కుమారి కొడుకు ప్రవీణ్‌ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ప్రవీణ్ ను ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ప్రవీణ్ వాహనం నడిపినట్టు స్థానికులు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మాదాపూర్‌ హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం...

హైదరాబాద్ : మాదాపూర్‌ హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్‌పై రాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసం కాగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సినిమా ఫైట్స్‌లోని దృశ్యాలను తలపించే విధంగా ఈ ఘటన జరిగింది.

ఎర్రచందనం కూలీల రాళ్ల దాడి : గాల్లోకి కాల్పులు

చిత్తూరు :తిరుపతి ఎస్వీ జూపార్కు సమీపంలో పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యదళం సిబ్బందిపై ఎర్రచందనం కూలీలు రాళ్లురువ్వారు. కూలీల దాడిలో ఆర్‌ఎస్‌ఐకి స్వల్ప గాయాలయ్యాయి. ప్రత్యేక కార్యదళం సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపడంతో ఎర్రచందనం కూలీలు పరారయ్యారు. ఘటనాస్థలంలో 25 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భీమవరంలో ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం నిలిపివేత

ప.గో : ప్రజా ఉద్యమానికి చంద్రబాబు సర్కార్ తలొగ్గింది. భీమవరంలో ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణం సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిలిపివేస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు మాదవనాయుడు ప్రకటించారు.

07:14 - February 15, 2016

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ భేటీ అయ్యారు. విడివిడిగా జరిగిన ఈ సమావేశాల్లో.... దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతోపాటు... పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలపై చర్చించినట్టు సమాచారం. జేఎన్‌యూ వ్యవహారం రాజకీయ వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా విస్తృతంగా సమాలోచనలు జరిపారు. జేఎన్‌యూలో భారత్‌ వ్యతిరేక నినాదాలు చేసిన విద్యార్ధులపై అటు పోలీసులతోపాటు, ఇటు యూనివర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకోడంపై రాజకీయ పార్టీలు విమర్శలు చేయడాన్నివీరు తప్పుపట్టారు. జేఎన్‌యూ విద్యార్ధుల చర్యల దేశద్రోహం కిందకు వస్తుందన్ని చర్చించించారు. భారత్‌ వ్యతిరేక నినాదాలు చేసిన విద్యార్ధలను కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు వెనకేసుకురావడాన్ని తప్పుపట్టారు. ప్రతిపక్షాల చర్యల ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉందన్న అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందని సమాచారం.

వస్తు, సేవల పన్ను బిల్లుకు ఆమోదం పొందాలి .....

ఈనెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలపై కూడా అమిత్‌ షా, అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌తో మోదీ చర్చించారు. ఈ సారి సమావేశాల్లో వస్తు, సేవల పన్ను బిల్లుకు ఆమోదం పొందేలా చూడాలని ప్రతిపాదించారు. లేకపోతే పన్నుల సంస్కరణల అమలల్లో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని అరుణ్‌ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల శాసనసభలు కూడా జీఎస్‌టీ బిల్లును ఆమోదించాల్సి ఉన్న తరుణంలో బడ్జెట్‌ సమావేశాల విరామానికి ముందే దీనికి ఆమోదం పొందేలా చూడాలన్న అంశంపై చర్చించారు.

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరలో బీజేపీకి పట్టు తక్కువే .....

ఈ ఏడాది ఏప్రిల్‌-మే లో జరిగే ఐదు రాష్ట్రా అసెంబ్లీ ఎన్నికలపై కూడా అమిత్‌ షా, అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌తో మోదీ చర్చించినట్టు సమాచారం. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో పార్టీకి అంతగా పట్టులేని విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈసారి ఈ రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని నిర్ణయించారు. అసోంలో అధికామే లక్ష్యంగా పని చేసే అంశంపై చర్చించారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో అసోంలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిన దృష్ట్యా... దీనికి కొనసాగింపుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై సమాలోచనలు జరిపారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా అధికారం కోసం తృణమూల్‌, వామపక్షాల నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటున్న అంశంపై చర్చకు వచ్చిందని సమాచారం. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులకు అనుణంగా ఇతర పార్టీలతో పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశంపై కూడా అమిత్‌ షాతో మోదీ చర్చించారు. 

07:10 - February 15, 2016

హైదరాబాద్ : బాలీవుడ్‌ నటుడు షారూఖ్‌ఖాన్‌ను టార్గెట్‌ చేస్తూ మరోసారి కాషాయ నేతలు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లో షారూఖ్‌ ఖాన్‌కు చెందిన కారుపై విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. సిటీలోని హయత్‌ రీజెన్సీ హోటల్‌ పార్కింగ్‌ ప్లేస్‌లో షారూఖ్‌ కారును నిలిపి ఉంచగా వాళ్లు రాళ్లు విసిరారు. దేశంలో నెలకొన్న మత అసహనంపై ఇంతకుముందు ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ప్రధానంగా ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రస్తుతం గుజరాత్‌లో ఆయన నటిస్తున్న రయీస్‌ చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్‌ను వ్యతిరేకిస్తూ దాడికి పాల్పడ్డామని విహెచ్‌పి కార్యకర్తలు తెలిపారు. సుమారు 8 మంది బైక్‌లపై వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేశారు. దాడికి పాల్పడింది తామేనని వీహెచ్‌పీ రాష్ట్ర విభాగం స్పష్టంచేసింది. అయితే ఘటనా సమయంలో షారూఖ్‌ హోటల్‌లో లేరు.

07:08 - February 15, 2016

విజయనగరం : మెంటాడ మండలంలోని కొండలింగాల వలస పంచాయతీలో సంచలనం రేకెత్తించిన గిరిజన మహిళ గ్యాంగ్‌ రేప్‌ కేసును పోలీసులు చేదించారు. నలుగురు నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

ఆండ్రకు వచ్చిన గిరిజన మహిళ.....

గత బుధవారం రాత్రి కూలీ పనుల నిమిత్తం భర్తను వేరే ఊరికి పంపించేందుకు ఆండ్రకు వచ్చింది మూలపాడుకు చెందిన గిరిజన మహిళ. పనుల కోసం తీసుకెళ్తున్న మేస్త్రీ నుంచి ఆరు వేల రూపాయలు తీసుకున్న భర్త.. ఆమెకు ఐదు వేల రూపాయలు ఇచ్చాడు. ఇంటికి కావాల్సిన సరుకులు, పిల్లలకు మిఠాయిలు తీసుకున్న మహిళ గ్రామానికి బయల్దేరింది. ఇదే అదనుగా భావించిన నలుగురు దుండగులు.. ఆండ్ర ఎస్టీ కాలనీ నీటి ట్యాంకు సమీపంలో ఆమెను ఎత్తుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డారు. నోట్లో గుడ్డలు గుక్కి దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. ఆమె వద్ద ఉన్న డబ్బులను కూడా లాక్కున్నారు. ఆమెను చంపేందుకు యత్నించగా ప్రాణభయంతో కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడకు చేరుకోవడంతో దుండగులు పారిపోయారు.

కుల పెద్దలకు విషయం చెప్పిన మహిళ......

తీవ్రగాయాలైన యువతిని స్థానికులు చేరదీశారు. బాధితురాలు ఉదయం మూలపాడుకు చేరుకుని కులపెద్దలకు విషయాన్ని చెప్పింది. వారితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల నిమిత్తం ఆమెను పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపడంతో పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు ఆమెను పరామర్శించాయి. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. ప్రయోజనం లేకుండా పోతున్నాయని.. దుండగులకు ఉరిశిక్ష వేయాలని పలువురు డిమాండ్‌ చేశారు.

దుండగులను గుర్తించిన బాధిత మహిళ...

తనపై దాడి చేసిన ఎలుసూరి ఆదినారాయణ, సవరవిల్లి శంకర్రావులను బాధిత మహిళ గుర్తించింది. వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. లక్ష్మణ్‌, చిన్నారావులను కూడా అరెస్ట్‌ చేశారు. ఎన్ని చట్టాలు వచ్చినా ఇటువంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు సామాజిక అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయడంతో పాటు.. యువతను పెడద్రోవ పట్టించే అంశాలపై కఠినంగా ఉండాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. 

గిరిజన మహిళ పై గ్యాగ్ రేప్ కేసును ఛేదించిన పోలీసులు..

విజయనగరం : గిరిజన మహిళపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ కేసును పోలీసులు ఛేదించారు. కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు దుండగులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని రహదారులు ఆదివారం నెత్తురోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో పదిమంది మృతువాత పడ్డారు. విశాఖ, శ్రీకాకుళం, మహబూబ్‌నగర్‌,నల్గొండ జిల్లాల్లో ఈ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. 

07:03 - February 15, 2016

హైదరాబాద్ : ఉస్మానియా వర్సిటీలో ప్రేమికుల దినోత్సవం ఉద్రిక్తతకు దారి తీసింది. వాలెంటైన్‌ సంబరాలకు సిద్ధమైన ఇండియన్‌ లవర్స్‌ యూనియన్‌ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఓయూలోని ఎన్‌ఆర్‌ఎస్‌ హాస్టల్‌ వద్ద ఏర్పాటు చేసిన వాలంటైన్‌ వేడుకల సభలో.. ప్రేమికులు కేకును కట్ చేస్తుండగా.. పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వైఖరిపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

వాలెంటైన్స్‌ డే నిర్వహణ కమిటీ నేతల అరెస్ట్....

ఓయూలో ప్రేమికుల దినోత్సవం ఉద్రిక్తతకు దారి తీసింది. వాలెంటైన్స్‌ డే నిర్వహణ కమిటీ నేతలను పోలీసులు నిర్బంధించారు. హాస్టల్‌ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఆర్ట్స్‌ కాలేజీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్శిటీ అంతటా ఆంక్షలు విధించారు. వాలెంటైన్స్‌ సభ నిర్వహించకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు చేపట్టారు. అయినా కొందరు విద్యార్థులు.. ఈ ఆంక్షలను ధిక్కరిస్తూ.. అంబేడ్కర్‌ హాస్టల్‌ వద్ద బెలూన్స్‌ ఎగరవేసి కేక్‌ కట్‌ చేసేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో.. స్వల్ప తోపులాట జరిగింది.

విద్యార్థుల ఆగ్రహం...

యూనివర్శిటీలో పోలీసుల నిర్బంధ కాండపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు.. విహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌లకు కార్యకర్తల్లా పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. పోలీసులు ప్రశాంత వాతావరణాన్నీ ఉద్రిక్తంగా మారుస్తున్నారంటూ విద్యార్థులు నినదించారు. ఉద్రిక్తత నడుమే.. అమర ప్రేమికులకు నివాళిగా క్యాండిల్స్‌ వెలిగించారు. 

ఓయూ... ప్రేమికుల రోజు.. ఉద్రిక్తత

హైదరాబాద్ : ఉస్మానియా వర్సిటీలో ప్రేమికుల దినోత్సవం ఉద్రిక్తతకు దారి తీసింది. వాలెంటైన్‌ సంబరాలకు సిద్ధమైన ఇండియన్‌ లవర్స్‌ యూనియన్‌ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఓయూలోని ఎన్‌ఆర్‌ఎస్‌ హాస్టల్‌ వద్ద ఏర్పాటు చేసిన వాలంటైన్‌ వేడుకల సభలో.. ప్రేమికులు కేకును కట్ చేస్తుండగా.. పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వైఖరిపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

ఘనంగా రథసప్తమి వేడుకలు..

హైదరాబాద్ : రథసప్తమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ప్రపంచానికే ప్రాణం పోస్తున్న ఆ వేలుగుల రేడు సూర్యభగవానున్ని దర్శించుకొని భక్తులు పునీతులయ్యారు. ఆదిత్యుడి రథసప్తమి సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

07:00 - February 15, 2016

హైదరాబాద్ : రథసప్తమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ప్రపంచానికే ప్రాణం పోస్తున్న ఆ వేలుగుల రేడు సూర్యభగవానున్ని దర్శించుకొని భక్తులు పునీతులయ్యారు. ఆదిత్యుడి రథసప్తమి సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

అరసవల్లి ఆదిత్యుడి ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ దంపతులు...

రథసప్తమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటాయి. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యుడి ఆలయాన్ని రథసప్తమి సందర్భంగా గవర్నర్ నరసింహన్‌ దంపతులు దర్శించుకున్నారు. రధసప్తమి సందర్భంగా ఆదిత్యుడి నిజరూప దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్య జయంతి రోజున అరసవల్లి దర్శనం ఆనందంగా ఉందని గవర్నర్ అన్నారు.

అరసవల్లిలో తెల్లవారుజాము నుంచే వీఐపీల తాకిడి ....

మరోవైపు అరసవల్లిలో తెల్లవారుజాము నుంచే వీఐపీల తాకిడి పెరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే వీఐపీల తాకిడి కారణంగా సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచిఉండడంతో..తీవ్ర అవస్థలు పడ్డారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించే రీతిలో రధసప్తమి వేడుకలు...

మరోవైపు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించే రీతిలో రధసప్తమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో తిరుమల వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారి సప్తవాహన సేవల్లో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటలకు మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనం అధిరోహించి మాఢవీధుల్లో విహరించారు. ఆ తర్వాత వరుసగా చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు ఊరేగారు.

కడపలోని మాఢ వీధుల్లో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరుడు....

రధసప్తమి సందర్బంగా కడపలోని మాఢ వీధుల్లో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరుడు తేరుపై ఊరేగాడు. రధోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి, శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పిఠాపురంలో రధసప్తమిని పురస్కరించుకొని.....

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో రధసప్తమిని పురస్కరించుకొని సూర్యనమస్కారాల పోటీలు ఘనంగా జరిగాయి. సేవాభారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు పిఠాపురం నియోజకవర్గంలోని 16 స్కూళ్లనుంచి 302 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మోగాలో భాగమైన సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిర్వాహకులు తెలిపారు.

మిగతా జిల్లాల్లో కూడా రధసప్తమి వేడుకలు....

అటు మిగతా జిల్లాల్లో కూడా రధసప్తమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తడంతో దేవాలయాలన్నీ జనసంద్రంగా మారాయి. 

06:56 - February 15, 2016

విజయవాడ : ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ పడింది. ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ పల్లోంజి సంస్థలు టెండర్లను దక్కించుకున్నాయి. చదరపు అడుగు 3350 రూపాయలకు నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

సీఆర్డీఏ సలహామండలితో సీఎం సమీక్ష....

తాత్కాలిక సెక్రటేరియట్‌కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ సలహామండలితో సమీక్ష నిర్వహించారు. టెండర్ల ఖరారుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టెండర్లను దక్కించుకున్న ఎల్ అండ్ టీ..సచివాలయంలో నాలుగు భవనాలను నిర్మిస్తుంది. షాపుర్జీ పల్లోంజీ రెండు భవనాల నిర్మాణం చేపట్టనుంది.

మొత్తం 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం....

ఈ రెండు కంపెనీలూ చదరపు అడుగుకు రూ.3,350 చొప్పున మొత్తం 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నాయి. ఒక్కో చదరపు అడుగుకు రూ.350 అదనంగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 15 నాటికి సచివాలయం నిర్మాణాలను పూర్తి చేయాలని సీఆర్‌డీఏ షరతు విధించింది. మే నెలాఖరులోగా గ్రౌండ్‌ ఫ్లోర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది.

శంకుస్థాపన తేదీలపై ప్రభుత్వం దృష్టి....

తాత్కాలిక సచివాలయం టెండర్లు ఖరారవడంతో శంకుస్థాపన తేదీలపై ప్రభుత్వం దృష్టిసారించింది. సోమవారం జరిగే కేబినెట్‌ సమావేశంలో దీనిపై మంత్రివర్గం చర్చించనుంది. కేబినెట్‌ తీర్మానం అనంతరం శంకుస్థాపనపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయనుంది. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 180 కోట్ల రూపాయలతో గుంటూరు జిల్లా మంగళగిరి మండంలోని వెలగపుడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం జరుగుతుంది. 

ఏపీ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

విజయవాడ: ఏపీ తాత్కాలిక సచివాలయం నిర్మాణంపై ముందడుగు పడింది. సెక్రటేరియట్‌ నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. రెండు కంపెనీలు ఈ టెండర్లను దక్కించుకున్నాయి. ఇక తాత్కాలిక సెక్రటేరియట్‌ శంకుస్థాపన కార్యక్రమమే మిగిలింది. సోమవారం జరిగే కేబినెట్‌ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. 

సీపీఎం కేంద్ర కారాల్యంపై దాడి... సర్వత్రా విమర్శలు..

హైదరాబాద్ : ఢిల్లీలోని సీపీఎం సెంట్రల్‌ కార్యాలయంపై సంఘ్‌ పరివార్‌ దాడికి తెగబడింది. పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి.. కార్యాలయంలో ఉండగానే దుండగులు అందులోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు బాధ్యుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘ్‌పరివార్‌ చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

06:52 - February 15, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం సమావేశమయ్యారు. ప్రధాని మోదీ... కేసీఆర్‌కు కేవలం 20నిమిషాలే కేటాయించినా.. ఇద్దరి మధ్య దాదాపు గంటసేపు భేటీ నడిచింది. ఇందులో రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన వివిధ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రతిపాదనలనూ ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తెచ్చారు. పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపైనా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలిపినట్లు సమాచారం.

గంటసేపు ప్రధానితో భేటీ అయిన కేసీఆర్‌ ......

ప్రధానితో భేటీ సందర్భంగా.. రాష్ట్ర రాజకీయ అంశాలూ ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వరంగల్‌ పార్లమెంటు ఉప ఎన్నిక, గ్రేటర్‌ విజయాలపై మోదీ ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోదీని కోరారని.. దానికి ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం. ప్రధాని రాకను పురస్కరించుకొని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం.

చర్చకు వచ్చిన రాజకీయ అంశాలు .....

మోడీ తెలంగాణా పర్యటన అనంతరం రాజకీయంగా బీజేపీతో మరింత దగ్గరయ్యేందుకు టీఆర్‌ఎస్‌కు మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయం టీఆర్ఎస్‌ నేతల్లో వ్యక్తం అవుతోంది. మోదీ ఆహ్వానిస్తే కేంద్రంలో చేరే అవకాశమూ లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో.. కేంద్రంలో చేరి.. తెలంగాణాలో అంతంత మాత్రంగా ఉన్న బిజెపిని ఎందుకు బలపడేలా చేయాలన్న భావనా వ్యక్తమవుతోంది. మొత్తం మీద కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్రం నుంచి గతానికి భిన్నమైన సానుకూల స్పందన రావడం అధికార పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపింది. 

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

విజయవాడ : నేడు విజయవాడలో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అమరావతిలో నిర్మించనున్న తాత్కాలిక సచివాలయంతో సహా పలు అంశాలపై చర్చించనున్నారు. తాత్కాలిక సచివాలయానికి టెండర్లు ఖరారవడంతో దాని నిర్మాణం, శాఖల తరలింపు, టెక్స్‌టైల్ రంగం, తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. 

06:49 - February 15, 2016

హైదరాబాద్ : మన దేశంలో కోటిన్నర కుటుంబాలకు చేపలే జీవనాధారం. దాదాపు పాతిక కోట్ల మందికి చేప ఇష్టమైన ఆహారం. సీఫుడ్‌కి మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద మార్కెట్‌ వుంది. మత్స్యసంపద విషయంలో చైనా తర్వాతి స్థానం మనదే. ఏటా మన దేశం నుంచి 18, 856 కోట్ల రూపాయల విలువైన మత్స్య సంపద ఎగుమతి అవుతోంది. వ్యవసాయరంగం ఎగుమతుల్లో జలచరాలది 17శాతం వాటా. జీడీపీలో మత్స్యసంపద వాటా ఒక శాతానికి చేరింది.

మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదు. .....

దేశానికి ఇన్ని రకాలుగా సేవలందిస్తున్న మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదు. మన దేశంలో సముద్రాలు, నదులు, భారీ జలాశయాలతో పాటు చెరువులు, కుంటలు, చిన్నచిన్న తటాకాలు కూడా మత్స్యసంపదకు నిలయాలుగా విలసిల్లుతున్నాయి. సముద్రాలు, నదుల్లో చేపలు పట్టేవారికి ప్రతి దినమూ గండమే. కోస్తా తీరంలో ఎప్పుడు ఏ తుపాన్‌ వచ్చినా తొలి దెబ్బతినేది మత్స్యకారులే. సర్వంకోల్పోయేదీ వారే. ఒక్కొక్కసారి ప్రాణాలూ పోతాయి. చేపల వేటకు సముద్రం మీదకు వెళ్లినవారు తిరిగొచ్చేదాకా కుటుంబ సభ్యులంతా టెన్షన్‌ అనుభవిస్తూనే వుంటారు. సముద్రంలో చేపల వేట చాలామందికి మూడునాలుగు వారాల పాటు సాగే సుదీర్ఘ ప్రయాణం. ఎగిసెగిసిపడే అలల మధ్య తమ ప్రాణాలనే ఫణంగా పెడుతూ దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెడుతున్నారు మత్స్యకారులు.

మత్స్యకారుల సంక్షేమానికి శ్రద్ధ చూపని ప్రభుత్వాలు..

ఎంతో రిస్క్‌ తీసుకుని పట్టుకొచ్చిన జలచరాలను మార్కెట్‌ చేసుకోవడం మత్స్యకారులకు అంతకు మించిన ప్రయాసగా మారుతోంది. మన దేశంలో పాతిక కోట్ల మంది నికరంగా చేపల వినియోగదారులున్నా మార్కెట్‌ సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు. విదేశీ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని, విదేశీ మారకద్రవ్యాన్ని ఆరగించడమే తప్ప వారి సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేవీ లేవు. చివరకు హైదరాబాద్‌ లాంటి మహానగరాల్లో సైతం ప్రభుత్వం నెలకొల్పిన చేపల మార్కెట్‌ లేకపోవడం మత్స్యకారుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న అశ్రద్ధకు నిదర్శనం. కార్పొరేట్ సంస్థలకు వేలాది ఎకరాలు ధారాదత్తం చేసే ప్రభుత్వాలకు చేపల మార్కెట్ లు ఏర్పాటు చేయడానికి ఎందుకు మనసొస్పదో ఎవరికీ అర్ధం కాదు.

కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాలు విస్తరించకపోవడంతో ....

సముద్రాల్లో జలాశయాల్లో చేపలు వేటాడడం ఒక ఎత్తయితే, వాటిని నిల్వ చేయడం మరో ఎత్తు. కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాలు విస్తరించకపోవడంతో మత్స్యకారులు పట్టుకొచ్చిన మత్స్యసంపదలో పాతిక శాతం వృధాగా పాడైపోతోంది. మనదేశంలో ఏటా దాదాపు 15వేల కోట్ల రూపాయల మత్స్యసంపద పాడైపోతోందంటే అంతకు మించిన దురదృష్టం మరొకటి వుంటుందా?

మత్స్యకారులకు శాపంగా....

మత్స్యకారులు ఎదుర్కొంటున్న మరో ముఖ్య సమస్య నాణ్యమైన , ఆరోగ్యవంతమైన సీడ్‌ దొరకకపోవడం. సీ ఫుడ్స్‌ కి మనదేశంలో గిరాకీ పెరుగుతున్నా, ప్రోసెసింగ్‌ పరిశ్రమ వేళ్లూనుకోకపోవడమూ మత్స్యకారులకు శాపంగా మారింది.

జలచరాల ఉత్పత్తులు పెంచడానికి చక్కటి అవకాశాలు....

నిజానికి మనదేశంలో జలచరాల ఉత్పత్తులు పెంచడానికి చక్కటి అవకాశాలున్నాయి. మనదేశంలో దాదాపు 24 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో జలాశయాలుండగా చేపల ఉత్పత్తికి అందులో సగం మాత్రమే వినియోగించుకుంటున్నాం. పెద్ద పెద్ద రిజర్వాయర్‌లలో హెక్టార్‌కి మూడు నాలుగు టన్నుల చేపలను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం ఒక టన్ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. ఫిషరీస్‌లో సరైన శిక్షణ లేకపోవడం, వాటర్‌ బాడీస్‌ను సరిగా వినియోగించుకోలేని అసమర్ధతలే ఇందుకు కారణం. మరోవైపు అభివృద్ధి పేరుతో , ఎస్‌ఈజడ్‌ల పేరుతో కోస్తాతీరంలో జరుగుతున్న విధ్వంసం, తీరప్రాంతాల్లో ఫార్మాసిటీల ఏర్పాటు, పరిశ్రమలు వదిలే విషపదార్థాలు మత్స్యసంపదకు మరణశాసనం రాస్తున్నాయి.

06:45 - February 15, 2016

హైదరాబాద్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్‌ కోసం వివిధ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తమ కోరికలూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశ ప్రజలకు రుచికరమైన విలువైన పోషకాహారాన్ని అందిస్తూ , మన దేశ ఆర్థిక వ్యవస్థలో , ఎగుమతుల రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న మత్స్యసంపద అభివృద్ధికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రస్తుతం మత్స్య సంపద విషయంలో మన ప్రభుత్వాల పాలసీలు ఎలా వున్నాయి? మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? మత్స్యకారుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్ర ప్రదేశ్‌ మత్స్యకారుల సంఘం నేత అప్పలరాజు విశాఖపట్టణం 10టీవీ స్టూడియో నుండి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

Don't Miss