Activities calendar

16 February 2016

ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి బుట్రోస్‌ గలీ కన్నుమూత

హైదరాబాద్ : ఐక్య రాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి బుట్రోస్‌ గలీ కన్నుమూశారు. ఐరాస భద్రత మండలి మంగళవారం ఆయన మృతి చెందారని ప్రకటించింది. 93 ఏళ్ల బుట్రోస్‌ బుట్రోస్‌ గలి ఈజిప్ట్‌ రాజధాని కైరోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఆ దేశ మీడియా తెలిపింది. 1992-1996 మధ్య కాలంలో ఆయన ఐరాస ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. భద్రతా మండలి ప్రస్తుత అధ్యక్షుడు, వెనిజులా ఐరాస అంబాసిడర్‌ రాఫెల్‌ రమిరెజ్‌ ఆయన మృతి వార్తను తెలపడంతో మంగళవారం మండలి ఒక నిమిషం పాటు మౌనం పాటించింది. 

పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

అనంతపురం : జిల్లాలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అఫ్రిన్ అనే విద్యార్థిని ఇంట్లో ఉరివేసుని ఆత్మహత్య చేసుకుంది. అయితే తోటి విద్యార్థి ప్రేమ వేధింపులతోనే తమ కూతురు మృతి చెందిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

22:05 - February 16, 2016

హైదరాబాద్ : నియోజవర్గ ప్రజల అకాంక్ష మేరకే తాను టీఆర్ ఎస్ లో చేరానని నారాణపేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎ స్ లో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణలో భాగస్వామినవుతాని తెలిపారు. 

22:00 - February 16, 2016

ఢిల్లీ : 12వ శాఫ్ గేమ్స్ పతకాల పట్టికలో...ఆతిథ్య భారత్ 308 పతకాలతో ఓవరాల్ విజేతగా నిలిచింది. అసోం, మేఘాలయ రాష్ట్రాల సంయుక్త ఆతిథ్యంలో గత రెండువారాలుగా జరిగిన ఈ క్రీడల్లో భారత్ 188 స్వర్ణ, 90 రజత, 30 కాంస్య పతకాలు గెలుచుకొని..టేబుల్ టాపర్ గా నిలిచింది. శ్రీలంక 25 స్వర్ణాలతో సహా 186 పతకాలతో రెండు, బంగ్లాదేశ్ మూడు, ఆప్ఘనిస్థాన్ నాలుగు స్థానాలు సంపాదించాయి. మొత్తం 23 క్రీడల పురుషుల, మహిళల విభాగాలలో...8 దేశాలకు చెందిన 4వేలమంది అథ్లెట్లు పోటీపడిన సంగతి తెలిసిందే...

21:58 - February 16, 2016

చేపల చెరువులు పచ్చదనాన్ని మింగేస్తున్నాయి. పచ్చటి పంట పొలాల్లో అంతులేని విధ్వంసానికి తెరలేస్తోంది..ఏడాదికి రెండు పంటలతో, సహజ వనరులతో కళకళలాడే పశ్చమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. రైతులు, కూలీలు రోడ్డున పడుతున్నారు. పొలాలు అమ్ముకునే పరిస్థితిలో పడుతున్నారు. కార్పొరేట్ల కొమ్ము కాసే ప్రభుత్వం ఆక్వా జోన్ పేరుతో దారుణానికి తెగబడే ప్రయత్నాలు చేస్తోంది. పలితంగా లక్షలాది బతుకులు.. రోడ్డున పడుతున్న ప్రమాదం నెలకొంది. ఈ అంశంపై ప్రత్యేక కథనం..

పొలాలను నాశనం చేసే ప్రణాళికలు..
దేశానికి తిండి పెట్టే పంటపొలాల్లో చేపల చిచ్చు రేగింది. ఆక్వా జోన్ కుట్రలు పశ్చిమ డెల్టా బతుకులను రోడ్డున పడేస్తోంది. తిండిగింజలను వదలి కాదు.. చేపలు, రొయ్యలు పండిస్తామంటూ జూదమాడే సంస్కృతి ఈ ప్రాంతాన్ని నిండా ముంచుతోంది. ఎవరి కోసం ఈ ప్రణాళిక.. ఎవరి ప్రయోజనాలు నెరవేర్చటానికీ కుట్ర..70శాతం పొలాల్లో వరి సాగు చేస్తుంటే వాటిని చేపల చెరువులుగా ఎలా మారుస్తారు. రైతులు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. మా పొలాలను ఆగం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్వాజోన్ గా మార్చే కుట్రలు సాగనివ్వమంటున్నారు. ఇప్పటికే ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత ఏర్పడుతోంది. దిగుబడి తగ్గుతోందని అనేక సర్వేలు చెప్తున్నాయి. ఆహార పంటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, గిడ్డంగులు పెంచి నిల్వలు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ, ఏపీ సర్కారు మాత్రం దీనికి రివర్స్ లో చేస్తోంది. ఉన్న పొలాలను నాశనం చేసే ప్రణాళికలు రచిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రమాదంలో పర్యావరణం..
సారవంతమైన నేల..స్వచ్ఛమైన నీరు...చక్కటి దిగుబడి... ఇవి గోదావరి జిల్లా అంటే గుర్తొచ్చే విషయాలు. కానీ, ఇప్పుడక్కడ గ్రౌండ్ వాటర్ తాగే పరిస్థితి లేదు. చెరువుల్లో నీరు కనీసం ముట్టుకునే స్థితిలో కూడా లేవు. చిన్న చిన్న పల్లెల్లో కూడా వాటర్ కేన్ లే గతి.. దీనికి కారణం విచక్షణారహితంగా తవ్విన చేపల చెరువులే అని పరిశీలనలు చెప్తున్నాయి. ఈ కుట్ర ఇప్పటిది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే తంతు సాగుతోంది. గతంలో జీవో నంబర్ సెవెన్ కూడా చేపల చెరువులకే పట్టం కట్టింది. రైతుల వ్యతిరేకతతో సర్కారు కొత్త కుట్రలకు దిగి ఆక్వాజోన్ అంటోంది. రైతుల ప్రయోజనాలు విస్మరించి కొందరు బడాబాబులకోసం లక్షలాది ప్రజల బతుకులను, పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెడుతోంది.

పునరాలోచన చేయాలి..
బతుకులకు కనీస భద్రత ఉండాలి..సామాన్య ప్రజల సంక్షేమం ఎజెండా అవ్వాలి. కానీ, ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి వేరు. కోట్ల ఎగుమతులు, వాణిజ్య ప్రయోజనాలు తప్ప రైతులు, రైతు కూలీల ప్రయోజనాలు అవసరం లేని ప్రభుత్వం చేపలు, రొయ్యలు అంటోంది. ఈ కుట్రలను సహించేది లేదని ప్రజలు తేల్చి చెప్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించటం మంచిదని పరిశీలకులు సూచిస్తున్నారు. మరింత విశ్లేషణకు వీడియో చూడండి..

21:52 - February 16, 2016

ఢిల్లీ:  ఎనిమిది రాష్ట్రాల్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. త్రిపురలో సీపీఎం సత్తా చాటింది. అమర్‌పూర్‌ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి అఖండ విజయం సాధించారు. మొత్తం 12 స్థానాల్లో బీజేపీ దాని మిత్ర పక్షాలు ఆరు స్థానాల్లో విజయం సాధించాయి. ఈ ఉప ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి నిరాశే ఎదురైంది. మూడు స్థానాలకు గాను ఎస్పీ  ఒక స్థానంలో విజయంతోనే సరిపెట్టుకుంది. అటు కర్ణాటకలోనూ.. కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బే తగిలింది. ఈ రాష్ట్రంలోనూ.. మూడు స్థానాల్లో ఉప ఎన్నిక జరగగా.. రెండు స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. బీహార్‌లో జేడీయూతో కూటమిగా ఏర్పడి కాంగ్రెస్‌ కూడా ఆశించిన విజయాలే దక్కించుకుంది. అయితే హర్లాఖీ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. పంజాబ్‌లో శిరోమణి అకాళీదళ్‌  విజయం సాధించింది. 

21:50 - February 16, 2016

ఢిల్లీ : జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలపై సుప్రీంకోర్టు స్పందించింది. పటియాల కోర్టు వద్ద విద్యార్థులు, జర్నలిస్టులపై జరిగిన దాడిపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కోర్టు వద్ద లాయర్లు తమపై దాడి జరుపుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని కేంద్ర హోంమంత్రికి, సుప్రీంకోర్టుకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు.                                                                    
కపిల్‌ సిబాల్‌ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు 
జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యను సోమవారం పటియాల కోర్టులో హాజరు పరచిన సందర్భంగా విద్యార్థులు, జర్నలిస్టులపై జరిగిన దాడికి సంబంధించి సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు వేశారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసుల ప్రేక్షక పాత్ర వహించారని పేర్కొన్నారు. కన్నయ్యపై నమోదైన దేశ ద్రోహం కేసుపై తక్షణమే విచారణ జరపాలని నిర్ణయించింది. జెఎన్‌యు మాజీ విద్యార్థి జయప్రకాష్‌, లాయర్‌ దేవదత్‌ కామత్‌ కూడా ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 
జర్నలిస్టులు భారీ ర్యాలీ 
పటియాలా హౌజ్‌ కోర్టులో దాడికి నిరసనగా జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌ నుంచి సుప్రీంకోర్టు వరకు జర్నలిస్టులు ర్యాలీగా వెళ్లారు.తమపై లాయర్లు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులు సుప్రీంకోర్టుకు మెమొరాండం సమర్పించారు. దీనిపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరపనుంది. 
ఢిల్లీ పోలీసులు దర్యాప్తు
జెఎన్‌యు విద్యార్థుల వివాదంపై దాఖలైన దేశద్రోహం కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించాలంటూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని.. పిటిషన్‌ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. తాము రాజకీయ నాయకులం కాదని, తమ పరిధి దాటి ఎందులోనూ జోక్యం చేసుకోలేమని పేర్కొంది. 
దాడిని చిన్న ఘటనగా పేర్కొన్న ఢిల్లీ పోలీస్ చీఫ్
ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌ బిఎస్‌ బస్సీ పటియాల కోర్టులో జరిగిన దాడిని చిన్న ఘటనగా పేర్కొన్నారు. బిజెపి ఎమ్మెల్యే ఓపి శర్మ వామపక్ష కార్యకర్తను తోసివేయడంపై బస్సీ పెద్దగా స్పందించలేదు. వామపక్ష కార్యకర్తే ఎమ్మెల్యేపై ముందు చేయి చేసుకున్నారని తెలిపారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం వల్లే తాను కొట్టానని ఎమ్మెల్యే సమర్థించుకున్నారు.
విద్యార్థుల ఆందోళనకు లెక్చరర్లు మద్దతు
దేశద్రోహం కింద అరెస్ట్ చేసిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకు మద్దతుగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు లెక్చరర్లు కూడా మద్దతు తెలిపారు. విద్యార్థుల క్లాసుల బహిష్కరణలో తాము పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు అధ్యాపకులపై కూడా విచారణ జరుపుతోందని, వీసీ దీనిపై పెదవి విప్పడం లేదని వారు మండిపడ్డారు.

21:44 - February 16, 2016

ఖమ్మం జిల్లా మీద ముఖ్యమంత్రి వాన, మామకు ప్రేమతో అంటున్న ఫ్యాన్స్, పాలమూరు కాంగ్రెసు మీద కారు మన్సు,చ సద్వుబంజేస్తె సంఘ బహిష్కరణమే నట, దర్వాలలు ఇరగొట్టి.. బ్యాకుకు తొర్రవెట్టి ఈ అంశాలను మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం 

21:37 - February 16, 2016

ఢిల్లీ : జేఎన్‌యూలో విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఆరెస్సెస్, బీజేపీ, ఏబీవీపీ నేతలు ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. జేఎన్‌యూలో జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, పాకిస్తాన్‌ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు అరెస్టుకు ముందు కన్నయ్య ఏం మాట్లాడాడు...ఎలాంటి కామెంట్స్ చేశాడు...బీజేపీ, ఏబీవీపీ ఆరోపిస్తున్నట్టు అందులో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు ఉన్నాయా....అరెస్టుకు ముందు కన్నయ్య మాట్లాడిన వీడియో యూట్యూబ్‌లో ఉంది. ఆ స్పీచ్‌ ఒక్కసారి చూద్దాం...

వాళ్లు త్రివర్ణ పతాకాన్ని కాలబెట్టే వాళ్లు. బ్రిటిష్‌ వాళ్లను క్షమాభిక్ష వేడుకున్న సావర్కర్‌కు శిష్యులు వాళ్లు. ఇప్పుడు హర్యానాలో ఖట్టర్‌ ప్రభుత్వం వాళ్లదే. ఈ ప్రభుత్వం షహీద్‌ భగత్‌సింగ్‌ పేరుతో ఉన్న విమానాశ్రయానికి ఒక 'సంఘీయుడి' పేరు పెట్టింది. వీళ్లా మాకు దేశభక్తి గురించి పాఠాలు చెప్పేది? దేశం గురించి, దేశభక్తి గురించి ఆర్‌ఎస్‌ఎస్‌తో చెప్పించుకునే దుస్థితిలో మేం లేం.. మేము ఈ దేశానికి చెందిన వాళ్లం. ఈ మట్టిని మేం ప్రేమిస్తాం. ఈ దేశంలో ఉన్న 80 శాతం పేద ప్రజల కోసం మేం పోరాడుతాం. మా దష్టిలో దేశభక్తి అంటే ఇదే. మాకు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉంది. అంతే కాదు, ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానించే వాళ్లను మేం సహించబోమని కూడా స్పష్టం చేస్తున్నాం. 'సంఘీయులే' కానివ్వండి, లేదా మరెవరైనా సరే...

అయితే, 'ఝండేవాలా' (ఆర్‌ఎస్‌ఎస్‌ ఢిల్లీ కార్యాల యం)లో, 'నాగపూర్‌' (ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం)లో నిర్వచించే రాజ్యాంగంపై మాత్రం మాకెలాంటి విశ్వాసం లేదు! మాకు మనుస్మతిపై ఎలాంటి విశ్వాసం లేదు. ఈ దేశంలో వేళ్లూనుకున్న కులవ్యవస్థపై మాకు విశ్వాసం లేదు! అట్లాగే, ఇదే రాజ్యాంగంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 'రాజ్యాంగ పరిహారం' గురించి కూడా చెప్పారన్న విషయం మరచిపోవద్దు. మరణశిక్షను రద్దు చేయాలని కూడా అంబేద్కర్‌ అభిప్రాయపడ్డారన్న విషయం మర్చిపోవద్దు. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆయన సర్వోన్నత స్థానం ఇచ్చారన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ అంశాలన్నింటితో సహా, మన మౌలిక హక్కులను, రాజ్యాంగపరమైన హక్కులను నిలబెట్టుకోవాలని మేం ఆకాంక్షిస్తున్నాం.

మిత్రులారా! ఈ దేశంలో మౌలిక ప్రశ్నలపై చర్చ ప్రారంభిస్తే వీళ్ల ముసుగు తొలగిపోతుంది. మేం మౌలిక ప్రశ్నలు లేవనెత్తుతున్నందుకు గర్విస్తున్నాం. వాటిపై చర్చ చాలా అవసరం...జేఎన్‌యూలో జీహాదీలున్నారని సుబ్రమణ్యస్వామి అన్నాడు. జేఎన్‌యూ వాళ్లు హింసను వ్యాపింపజేస్తున్నారని అంటున్నారు. నేనీ జేఎన్‌యూ గడ్డ మీది నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్తలను సవాల్‌ చేస్తున్నాను. రండి, మాతో వాదించండి! మేమసలు 'హింస'కు సంబంధించిన మౌలిక అవగాహనపైనే చర్చ చేయాలనుకుంటున్నాం. 'ఖూన్‌ సే తిలక్‌ కరేంగే, గోలియోంసే ఆరతీ' అని ఏబీవీపీ వాళ్లు చేస్తున్న నినాదాల గురించి కూడా మాట్లాడుకుందాం రండి. ఈ దేశంలో మీరెవరెవరి రక్తం పారించాలనుకుంటున్నారో చెప్పండి. ఎవరిపై తూటాలు పేల్చాలను కుంటున్నారో చెప్పండి. అవును, మీరు తుపాకీ గుళ్లు కురిపించారు.  బ్రిటిష్‌ వాళ్లతో చేయి కలిపి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడే వాళ్లపై గుళ్లు కురిపించారు. దేశంలో పేదరికంతో, ఆకలితో పీడితులైన వాళ్లపై మీరు గుళ్లు కురిపించారు. మీరు ముస్లింలపై గుళ్లు కురిపించారు.

మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తే, 'ఐదు వేళ్లు సమానమవుతాయా' అని మీరంటారు. మహిళలు 'సీత' లాగా ఉండాలని, అగ్నిపరీక్షకు దిగాలని మీరంటారు. ఈ దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం కదా! ప్రజాస్వామ్యంలో అందరికీ సమానంగా జీవించే హక్కుండాలి కదా! విద్యార్థులైనా, ఉద్యోగులైనా, పేదలైనా, కార్మికులైనా, రైతులైనా... అంబానీ అయినా, అదానీలైనా అందరికీ హక్కులు సమానమే కదా! కానీ మహిళల సమాన హక్కుల గురించి మాట్లాడితే, భారతీయ సంస్క తిని నాశనం చేయాలనుకుంటున్నారని మీరు గొంతు చించుకుంటారు. నిజమే, మేం మీ దోపిడీ సంస్కతిని నిజంగానే నాశనం చేయాలనుకుంటున్నాం. మీ కులతత్వ సంస్కతిని నాశనం చేయాలనుకుంటున్నాం. మీ మనువాద సంస్కతిని నాశనం చేయాలనుకుంటున్నాం.

    అసలు సంస్కతికి నిర్వచనాన్నే మర్చాలని మేమంటున్నాం. అసలు వీళ్లకు సమస్య ఎక్కడొస్తోంది? మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వీరికి కడుపుమంటగా ఉంది. 'లాల్‌ సలాం'తో పాటు 'నీలా సలాం' అని మనం నినదిస్తే, మార్క్స్‌తో పాటు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ గురించి మనం మాట్లాడితే వీరికి మింగుడు పడకుండా ఉంది. కుట్ర వీళ్లదే. వీళ్లసలు బ్రిటిష్‌ వాళ్ల తొత్తులు! కావాలంటే నాపై పరువు నష్టం కేసు పెట్టుకోండి. ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రే బ్రిటిష్‌ వాళ్లతో కుమ్మక్కయిన చరిత్రని మళ్లీ మళ్లీ అంటాను! ఈ దేశద్రోహులు మనల్ని దేశభక్తి సర్టిఫికెట్‌ చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నా మొబైల్‌ను పరిశీలించండి మిత్రులారా! మా తల్లిని నానా రకాల బూతులు తిడుతూ మెసేజ్‌లు పెట్టారు. వీళ్లేనా భారతమాత గురించి మాట్లాడేది? ఒకవేళ మీరు చెప్పే 'భారతమాత'లో నా తల్లి భాగం కాకపోతే నేను 'భారతమాత' అనే మీ అవగాహనను నేనంగీకరించను. నా తల్లి అంగన్‌వాడీ సేవకురాలిగా పని చేస్తోంది. రూ. 3,000లతో మా కుటుంబం బతుకుతోంది. ఆమెను వీళ్లు బూతులు తిడుతున్నారు. వీళ్ల 'భారతమాత' నినాదానికి నేను సిగ్గుపడుతున్నాను. ఈ దేశంలో ఉన్న నిరుపేద, దళిత, రైతుకూలీల తల్లులెవరూ వీళ్ల 'భారతమాత' పరిధిలోకి రారు. 

బాబా సాహెబ్‌ 125వ జయంతి పేరుతో మీరాడిందంతా నాటకం! మీకు ధైర్యముంటే, బాబాసాహెబ్‌ చెప్పినట్టుగా ఈ దేశంలో కులవాదమే అతి పెద్ద సమస్య అని ఒప్పుకోండి. కులతత్వం గురించి మాట్లాడండి. రిజర్వేషన్లు అమలు చేయండి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ అమలు చేయండి. అప్పుడు నమ్ముతాం మీకు ఈ దేశంపై విశ్వాసం ఉందని. 

మేం ఈ దేశంతో పాటుగా సంపూర్ణంగా నిలబడి ఉన్నాం. భగత్‌ సింగ్‌, బాబాసాహెబ్‌ కన్న కలల కోసం నిలబడి ఉన్నాం. అందరికీ సమాన హక్కులుండాలన్న అవగాహనతో నిలబడ్డాం. అందరికీ జీవించే హక్కు ఉండాలి. అందరికీ తినే, మాట్లాడే, నివసించే హక్కుండాలి. ఈ స్వప్నంతోనే మేం నిలబడి ఉన్నాం. దీని కోసమే రోహిత్‌ ప్రాణత్యాగం చేశాడు. కానీ రోహిత్‌ విషయంలో జరిగిట్టు, జేఎన్‌యూలో మేం జరగనివ్వమని కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌ చేసి మరీ చెబుతున్నాం. మేం భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం నిలబడుతాం. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల విషయం వదిలెయ్యండి. ప్రపంచ పేదలంతా ఏకం కావాలని మేమంటున్నాం. 

     ఇక చివరి ప్రశ్న. కసబ్‌ ఎవరు? అఫ్జల్‌ గురు ఎవరు? శరీరాలపై బాంబులు కట్టుకొని హత్యలు చేయడానికి సిద్ధపడుతున్న ఆ పరిస్థితులేమిటి? ఈ ప్రశ్నను విశ్వ విద్యాలయాల్లో చర్చించకపోతే అవి ఉండీ ప్రయోజనం లేదని నా అభిప్రాయం. హింసను కూడా నిర్వచించుకుందాం. హింస అంటే ఏమిటి? తుపాకీ తీసుకొని ఒకరిని చంపడమే హింస కాదు. దళితులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్‌ ఇవ్వడానికి నిరాకరిస్తే అది కూడా హింసే అవుతుంది. ఇది వ్యవస్థీకృత హింస. న్యాయం అంటే ఏమిటి? దీనిని నిర్ణయించేదెవరు? బ్రాహ్మణవాద వ్యవస్థలో దళితులకు మందిరంలోకి ప్రవేశం లేదు. ఆనాడు అదే న్యాయం. బ్రిటిష్‌ కాలంలో కుక్కలకు, భారతీయులకు రెస్టారెంట్లలోకి ప్రవేశం లేదనేవారు. అప్పటికి అదే న్యాయం. కానీ ఈ న్యాయాన్ని అప్పుడూ సవాలు చేశారు. ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చెప్పే న్యాయాన్ని మేం సవాల్‌ చేస్తున్నాం. మీ న్యాయం మా న్యాయాన్ని ఇముడ్చుకోనప్పుడు మీ న్యాయాన్ని మేం ఒప్పుకోం. మీరు చెప్పే స్వాతంత్య్రాన్ని మేం ఒప్పుకోం. మనషులందరికీ వారి రాజ్యాంగ హక్కులు లభించిన రోజునే మేం స్వాతంత్య్రాన్ని గుర్తిస్తాం. ప్రతి మనిషికీ తన రాజ్యాంగ హక్కులతో పాటు దేశంలో సమాన హోదాను కల్పించినప్పుడే, ఆ రోజునే మేం ఇది న్యాయమని ఒప్పుకుం టాం. జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఏ రకమైన హింసనూ, ఏ ఉగ్రవాదినీ, ఏ ఉగ్రవాద సంఘటననూ, ఎలాంటి దేశ వ్యతిరేక చర్యనూ ఏ రకంగానూ సమర్థించదని నేను స్పష్టం చేస్తున్నాను. కొంత మంది... గుర్తు తెలియని వ్యక్తులు 'పాకిస్తాన్‌ జిందాబాద్‌' అని నినాదాలు చేశారు. దానిని జేఎన్‌యూ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తోంది.

21:33 - February 16, 2016

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరుగుతోంది.  సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ప్రకాష్‌కారత్‌, బృందా కారత్‌, ఏకే పద్మనాభం, మాణిక్‌ సర్కార్‌, రాఘవులతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులందరూ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పొలిట్‌బ్యూరో భేటీలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. జేఎన్‌యూ, హెచ్‌సీయూ ఘటనలు, సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడి తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలపైనా పొలిట్‌బ్యూరో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 

 

21:31 - February 16, 2016

వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపాల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని మంత్రి కేటీఆర్‌ వరంగల్‌లో అన్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు. 58 డిజన్లలో టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడాలని ఆయన నేతలకు దిశనిర్ధేశం చేశారు. టీఆర్ఎస్ బి ఫాం దక్కితే గెలుపు ఖాయమన్న కేటీఆర్..టిక్కెట్ దక్కని వారు నిరాశ చెందకుండా పార్టీ గెలుపునకు సహకరించాలని సూచించారు. 

 

21:26 - February 16, 2016

హైదరాబాద్ : ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మిస్‌ఫైర్‌ ఘటనపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తోందని చెప్పారు. యాక్సిడెంటల్‌గానే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించామని తెలిపారు. 

 

21:23 - February 16, 2016

ఢిల్లీ : బ్యాంక్‌ ల్లో తీసుకున్న అప్పులు తీర్చకుండా మొండికేసిన ప్రముఖులకు ఇదొక షాకింగ్‌ న్యూస్‌. 500 కోట్ల రూపాయలకు పైగా బకాయిపడ్డ మొండిపద్దుల జాబితా ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆర్‌ బీఐని ఆదేశించింది. మొండిబకాయిలు ప్రభుత్వరంగ బ్యాంక్‌లను షేక్‌ చేస్తున్నాయి. ఈ మొండిపద్దులు ప్రభుత్వరంగ బ్యాంక్‌ల లాభదాయకతను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా నష్టాల బాట పట్టించే స్థితికి చేరుకున్నాయి. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తో పాటు మరికొన్ని బ్యాంక్‌లు ప్రకటించిన తాజా త్రైమాసిక ఫలితాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశాయి. పెరుగుతున్న మొండిబకాయిలపై రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ రఘురామ్‌రాజన్, ఆర్థిక శాఖా మంత్రి అరుణ్‌ జైట్లీ‌ కూడా అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో అటు సుప్రీంకోర్టు కూడా  మొండిబకాయిలపై దృష్టి సారించింది. 500 కోట్ల రూపాయలకు పైగా బకాయిపడ్డ మొండిపద్దుల జాబితా తమకు ఇవ్వాలంటూ ఆర్‌బీఐ గవర్నర్‌కి నోటీసులిచ్చింది. అయితే 2013 మార్చి 31 వరకు భారీ ఎత్తున బకాయిపడ్డవారి జాబితాను బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం గతంలోనే విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం 500 కోట్ల రూపాయలకు పైగా బకాయిపడ్డ సంస్థలు 30 దాకా వున్నాయి. మొండిబకాయిదారుల జాబితాలో రాజకీయ ప్రముఖుల సంస్థలూ వుండడం గమనార్హం. అత్యధికంగా బకాయిపడ్డ సంస్థల్లో స్టెరిలింగ్‌, విన్‌సమ్‌ డైమండ్‌ అండ్‌ జువెల్లర్స్, కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్, ఎలక్ట్రోథర్మ్‌ ఇండియా తొలి నాలుగు స్థానాల్లో వున్నాయి. ఈ నాలుగు సంస్థల బకాయిల మొత్తమే దాదాపు 12వేల కోట్ల రూపాయల దాకా వుంది.  స్టెరిలింగ్ సంస్థలు 3672 కోట్లు, విన్ సమ్ డైమండ్ అండ్ జువెల్లర్స్ కంపెనీ లిమిటెడ్ 3156 కోట్లు, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ 2673 కోట్లు, ఎలక్ర్టోథెర్మ్ ఇండియా 2211 కోట్లు చొప్పున బకాయి పడ్డాయి.
ఐదు సంస్థలు మొండి బకాయిలు
ఇక జూమ్ డెవలపర్స్, ఎస్ కుమార్ నేషన్ వైడ్ లిమిటెడ్, సూర్య వినాయక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కార్పొరేట్ ఇస్పాత్ అల్లాయ్ లిమిటెడ్ , వరుణ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ అయిదు సంస్థలు ఒక్కొక్కటి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బకాయిపడ్డ జాబితాలో వున్నాయి. ఈ అయిదు సంస్థల బకాయిల విలువ 7500 కోట్ల పై మాటే.  టాప్‌ టెన్‌ మొండిబకాయిల మొత్తం 20 వేలకోట్ల పై మాటే.  జూమ్ డెవలపర్స్ 1809 కోట్లు, ఎస్ కుమార్ నేషన్ వైడ్ లిమిటెడ్ 1758 కోట్లు, సూర్య వినాయక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1446 కోట్లు, కార్పొరేట్ ఇస్పాత్ అల్లాయ్ లిమిటెడ్ 1359 కోట్లు, వరుణ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1129 కోట్లు చొప్పున బకాయి పడ్డాయి. ఆర్కిడ్ కెమికల్స్ ఫార్మాస్యూటికల్స్ 938 కోట్లు, కెమ్రాక్ ఇండస్ట్రీస్ ఎక్స్ పోర్ట్ 929 కోట్లు చొప్పున బకాయి పడ్డాయి. మురళీ ఇండస్ట్రీస్ లిమిటెడ్  884 కోట్లు, నాఫెడ్ 862 కోట్లు , ఎస్ టీ సీ ఎల్  860 కోట్లు, ఫరెవర్ ప్రీసియస్ జువెల్లర్స్ లిమిటెడ్ 758 కోట్లు , సూర్య ఫార్మ్ లిమిటెడ్ 726  కోట్లు, జిలాగ్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ 715 కోట్లు చొప్పున బకాయిపడ్డాయి.
మొండిబకాయిదారుల వివరాలను ధృవీకరణ 
కెఎస్ ఆయిల్ 678 కోట్లు, ఐసీఎస్ఐ ఇండియా లిమిటెడ్ 646 కోట్లు, ఇండియన్ టెక్నోమాక్ కంపెనీ లిమిటెడ్  629 కోట్లు, సెంచరీ కమ్యూనికేషన్  624. 53 కోట్లు, మోసర్ బేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ కంపెనీస్ 581 కోట్లు, పీఎస్ఎల్ లిమిటెడ్ 577 కోట్లు, ల్యాంకో హోస్కోట్ హైవే లిమిటెడ్  533 కోట్లు, ఎంబీఎస్ జువెల్లర్స్ ప్రయివేట్ లిమిటెడ్ 524 కోట్లు, హౌసింగ్ డవలప్ మెంట్ ఇన్ ఫ్రా లిమిటెడ్ 526 కోట్లు , యూరోపియన్ ప్రాజెక్ట్స్ అండ్ ఏవియేషన్ 510 కోట్ల రూపాయల చొప్పున బకాయిపడ్డాయి. 2013 మార్చి 31 నాటికి బకాయిపడ్డ ఈ జాబితాను రెండేళ్ల క్రితమే  ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. సుప్రీంకోర్టుకి ఆర్‌బీఐ సమర్పించబోయే జాబితా మొండిబకాయిదారుల వివరాలను ధృవీకరించనుంది. 

కేసీఆర్ ను కలిసిన ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ను నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డిని సీఎం అభినందించారు. 

20:42 - February 16, 2016

వరంగల్ : తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు  ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, పార్కింగ్‌లపై ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు. భక్తులు ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగించవద్దని కోరుతున్నామన్నారు. 

 

20:35 - February 16, 2016

మెదక్‌ : జిల్లాలోని సిద్ధిపేట వన్‌టౌన్‌ ఎస్సై రెచ్చిపోయాడు. జిరాక్స్ సెంటర్‌ నడిపిస్తున్న నయ్యర్ అనే వ్యక్తిపై ఎస్సై శ్రీనివాసరెడ్డి తన లాఠీతో చితకబాదాడు. రాత్రి 10 అవుతున్నా షాపు ఎందుకు బంద్‌ చేయలేదని ప్రశ్నిస్తూ... కానిస్టేబుళ్లతో తనను కొట్టించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఎస్సై దాడిని నిరసిస్తూ..బాధితుడు నయ్యార్ ఆందోళన చేపట్టాడు. గాంధీ చౌక్ ప్రాంతంలోని వ్యాపారస్తులంతా షాపులు బంద్‌ చేసి పోలీసు వైఖరిని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. నయ్యర్‌పై దాడి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..డీఎస్పీ, ఆర్డీవోకు వినతి ప్రతాన్ని అందచేశారు. 

 

అగ్రిగోల్డు చైర్మన్, ఎండీ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన కోర్టు

పశ్చిమగోదావరి : అగ్రిగోల్డు చైర్మన్, ఎండీ వేసిన బెయిల్ పిటిషన్ ను ఏలూరు కోర్టు తిరస్కరించింది. చైర్మన్, ఎండీలను సీఐడీ కస్టడీకి అప్పగించారు. 10 రోజులపాటు కోర్టు సీఐడీ విచారణకు అనుమతించింది. అయితే న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని ఆదేశించింది. 

 

20:22 - February 16, 2016

పశ్చిమగోదావరి : అగ్రిగోల్డు చైర్మన్, ఎండీ వేసిన బెయిల్ పిటిషన్ ను ఏలూరు కోర్టు తిరస్కరించింది. చైర్మన్, ఎండీలను సీఐడీ కస్టడీకి అప్పగించారు. 10 రోజులపాటు కోర్టు సీఐడీ విచారణకు అనుమతించింది. అయితే న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని ఆదేశించింది. 

 

20:06 - February 16, 2016

గుంటూరు : దేవాదాయ శాఖ కౌలు రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు.. కరువుతో తాము కౌలు కట్టేలేమని తేల్చి చెబుతున్నారు.. కౌలు రద్దు చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.
కౌలు చేస్తూ జీవనం సాగిస్తున్న 35 వేల మంది రైతులు
ఆలయ భూముల్ని సాగుచేసుకొని బతికే అన్నదాతలకు ఈ ఏడాది కష్టాలే మిగిలాయి. గుంటూరు జిల్లాలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ క్రింద 70 వేల ఎకరాల భూములున్నాయి. దాదాపు 35 వేల మంది కౌలు రైతులు ఈ భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడేళ్ళుగా వాతావరణం అనుకూలించక ఈ అన్నదాతలు నష్టాల్లో మునిగిపోయారు. పెట్టుబడికోసం తెచ్చిన అప్పులు వడ్డీలతో మరింత పెరిగిపోయాయి. ఈసారైతే పరిస్థితి మరింత దయనీయంగా మారింది.. వర్షాలు లేక చాలాచోట్ల పంటలు వేయలేదు. సాగుచేసిన చోట సకాలంలో నీరందక ఎండిపోయాయి. ఇలా ఇబ్బందుల మధ్య ఉన్న రైతన్నల్ని కౌలు చెల్లించాలన్న దేవాదాయ శాఖ ఆదేశాలు మరింత కుంగదీస్తున్నాయి. పంటలే పండనప్పుడు కౌలు ఎక్కడినుంచి కట్టాలని ప్రశ్నిస్తున్నారు.
26 కరువు మండలాలు
మరోవైపు జిల్లాలోని 57 మండలాల్లో 26 ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించింది ప్రభుత్వం.. మిగిలిన 31 మండలాల్లోకూడా కరువు పరిస్థితులున్నాయి.. అయినా జాబితాలో వాటి పేరు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. అటు ఇలా జిల్లాలో కరవు తాండవిస్తుంటే అధికారులు మాత్రం కౌలు కట్టాల్సిందేనని రైతులపై ఒత్తిడి తెస్తున్నారు.. రైతులు మాత్రం తాము కౌలురద్దు చేయాలంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
కౌలు రైతుల ఉద్యమానికి ఏపీ కౌలు రైతు సంఘం మద్దతు
కౌలు రైతుల ఉద్యమానికి ఏపీ కౌలు రైతు సంఘం మద్దతు ప్రకటించింది.. దేవాదాయ శాఖ అధికారులకు సమస్యను వివరించారు సంఘం నేతలు.. కౌలు భూముల్లో సర్వేచేసి బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.. వచ్చే ఏడాదికూడా భూముల్ని ఈ రైతులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల్ని పరిష్కరించకపోతే మార్చి 21న అసెంబ్లీని ముట్టడిస్తామని రైతు సంఘం నేతలు హెచ్చరించారు.  

19:34 - February 16, 2016

విశాఖ : ఆంధ్ర యూనివర్శిటీలో నియామకాలపై మరో వివాదం ప్రారంభమైంది. అప్పటి వైస్‌ ఛాన్సలర్‌ జీఎస్ ఎన్ రాజు నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐతే ఈ ఆరోపణలను ఇటీవలే ఉద్యోగ విరమణ జీఎస్ ఎన్ రాజు ఖండిస్తున్నారు. తనపై వచ్చిన విమర్శలకు సీబీఐతోనైనా విచారణకు సిద్ధమన్నారు. తాను ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే నియామకాలు చేపట్టామని చెప్పారు. ఏ విచారణకైనా సిద్ధమే అని తెలిపారు. 

19:33 - February 16, 2016

కర్నూలు : సియాచిన్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ ముస్తాక్‌ అహ్మద్‌ అంత్యక్రియలు కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నెపల్లి గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి సైనిక వందనం సమర్పించారు. ముస్తాక్‌ అంత్యక్రియలకు రాజకీయ నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌... ముస్తాక్‌ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అంతకుముందు పార్నెపల్లిలో నిర్వహించిన ముస్తాక్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సాహస జవాన్ కు అశ్రునయనాలతో కడసారి వీడ్కోలు పలికారు.

 

19:01 - February 16, 2016

వరంగల్ : ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసీల సంబురం.. వరంగల్ జిల్లాలోని అడవిలో జరిగే అమ్మవార్ల ఉత్సవం.. గద్దె గద్దెకు బంగారంతో సింగారం.. అదే మేడారం. ఇదో చిన్న కోయగూడెం.. వందకు మించి ఉండని ఇళ్లు ఉండని మారుమూల ప్రాంతం. అయినా ఈ ప్రదేశంలో ఐఏఎస్ నుంచి అటెండర్ వరకు అమ్మవార్ల సేవలోనే తరిస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులు వనజాతరలో భక్తులకు సేవలు అందిస్తున్నారు.  
అమ్మల సేవలో 50 వేలమంది ఉద్యోగులు 
గిరిజనుల కొంగు బంగారం .. జాతి విముక్తి కోసం  కాకతీయులపై కాలుదువ్విన వీరనారులుగా పేరొంది. గిరిజనులకు అండదండగా నిలిచిన అమ్మవార్ల ఉత్పవమే మేడారం జాతర. ఈ జాతరకు అటెండర్  నుంచి కలెక్టర్ వరకు .. హోంగార్డు నుంచి ఎస్పీ వరకు విధి నిర్వహణలో నిమగ్నమయి ఉన్నారు. ఈ గిరిజన జాతరలో 50 వేల మంది ఉద్యోగులు భక్త కోటికి సేవలందిస్తున్నారు. ఉద్యోగులే కాకుండా సేవా దృక్పధంతో ఎన్ సీసీ , ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు మేము సైతం అంటూ ముందుకు వచ్చి తల్లుల సేవలో నిమగ్నమయి ఉన్నారు. 
అధికార యంత్రాంగం సమాయత్తం
అడవి బిడ్డల జాతరలో అధికార యంత్రాంగం సమాయత్తమయింది.  కోటి మందికి పైగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు.  రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల  మందికి పైగా ఉద్యోగులు తమ సేవలను వినియోగించేందుకు సిద్దం అయ్యారు.  భక్తులకు జాతరకు చేర్చడం మొదలుకుని అమ్మవార్ల దర్శించుకొని తిరిగి వెళ్లేవరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారుఅధికారులు. 
విధినిర్వహణలో 15 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు 
12 వేల  మంది పోలీసులు
15 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను వినియోగిస్తుంటే 12 వేల మంది పోలీస్ సిబ్బంది ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు రెవెన్యూ పంచాయతీ రాజ్ శాఖలతో వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది  2 వేల మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు.  వరంగల్ జిల్లా కలెక్టర్ సహా జాయింట్ కలెక్టర్ వరకు మేడారంలోనే మకాం వేశారు. వీరితో రెవెన్యూ డివిజనల్ అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారులు సైతం మేడారంలో సేవలు అందిస్తున్నారు. 
15 వేల మంది ఆర్టీసీ సిబ్బంది
ఆర్టీసీ సైతం జాతరకు భక్తులను తీసుకువచ్చేందుకు డ్రైవర్లను , కండర్లతో పాటు 15 వేల మంది సిబ్బందిని బస్సులను నడిపేందుకు సిద్దంచేశారు.  వరంగల్ ,ఖమ్మం , కరీంనగర్ , ఆదిలాబాద్ , నిజామాబాద్ జిల్లాల సీఐల నుంచి డిపో మేనేజర్ల వరకు  మేడారం జాతరపైనే దృష్టి సారించారు. 
1000 మంది విద్యుత్ ఉద్యోగుల సేవలు
జాతర విజయవంతం కావడానికి.. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు  విద్యుత్ , తాగు నీరు అందించేందుకు చర్యలు చేపట్టారు సంబంధిత అధికారులు.  పవర్ డిస్ట్రిబ్యూషన్ కు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీతో పాటు వరంగల్ సర్కిల్ పర్యవేక్షణకు  ఇంజనీర్ ,డీఈ ఈఈలతో పాటు 1000 మంది సేవలు అందిస్తున్నారు. 
3వేల మంది వైద్య సిబ్బంది సేవలు 
జాతరకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి దాదాపు 3వేల మంది వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వీరిలో 250 మంది డాక్టర్లు , 600 మంది పారా మెడికల్ సిబ్బంది, తమ సేవలుఅందస్తున్నారు. అత్యవసర సేవలకు గాను 108 104 వాహనాలను అందుబాటులో ఉంచారు. 
1000 మంది పారిశుద్ధ్య కార్మికుల సేవలు 
ఇదంతా ఒక ఎత్తయితే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఒకెత్తు . జాతరకు  ముందు నుంచే 1000 మంది సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. ఎన్ ఎస్ ఎస్ స్కౌట్స్ విద్యార్థులు  జంపన్న వాగులో సేవలందిస్తున్నారు. గతంలో పని చేసిన అనుభవం ఉన్న రిటైర్డ్  అధికారులను సైతం స్పెషల్ అలవెన్సు ద్వారా జాతరకు వాడుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు  ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు జాతరకు వచ్చే భక్త కోటికి ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా చూడాలనే లక్ష్యంతో అధికార యంత్రాంగం ప్రణాళికతో  ముందస్తు చర్యలు చేపడుతూ అధికారులు మందుకు సాగుతున్నారు.

 

18:48 - February 16, 2016

వరంగల్ : జంపన్న వాగులో జల్లు స్నానాలతో మైమరచిపోతున్నారు భక్తులు... శివసత్తుల పూనకాలమధ్య భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు..  మేడారం భక్తులతో హోరెత్తిపోతోంది... అమ్మవార్లను స్మరించుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు ప్రజలు..
భక్తులు పుణ్యస్నానాలు
మేడారంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తూ పులకించిపోతున్నారు .. అమ్మవార్ల దర్శనానికి భారీగా క్యూ కడుతున్నారు.. భక్తుల స్నానాలకోసం జంపన్నవాగు ఒడ్డున దాదాపు 3 కిలోమీటర్లదూరానికిపైగా స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునేందుకు 100 గదులు సిద్ధంగా ఉన్నాయి.. తాత్కాలికంగా మరో 55 గదులు రెడీ చేశారు అధికారులు... స్నాన ఘట్టాలకు 340 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ బిగించారు.. ఇందులో 80 టాప్స్‌ను కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలనుంచి తెప్పించారు.. మిగిలినవాటిని గోదావరి పుష్కర ఘాట్లనుంచి ఇక్కడి తరలించారు.. 
800మీటర్ల దూరంలో 80 ట్యాప్స్
గతసారి సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవునా స్నాన ఘట్టాల నిర్మాణం జరిగింది.. ఈసారి మరో 800మీటర్ల దూరంలో 80 ట్యాప్స్ కొత్తగా వచ్చాయి.. స్నాన ఘట్టాలు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌కోసం 19 కోట్లు ఖర్చుపెట్టారు.. ఈసారి జాతరకుముందే పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవార్ల దర్శనం కోసం వస్తున్నారు.. దీంతో బ్యాటరీ ట్యాప్స్ నిరంతరం పనిచేస్తున్నాయి.. 
లక్నవరం చెరువు నుంచి నీటి విడుదల
అటు ఉత్సవానికి మూడురోజుల ముందుగా ఈ నెల 16న జంపన్న వాగులోకి నీరు విడుదలైంది.. గోవిందరావుపేట మండలం లక్నవరం చెరువునుంచి ఈ నీరు వస్తోంది.. ప్రస్తుతం ఈ చెరువులో 900 ఎంసీఎఫ్ టీ నీరుంది.. మేడారంకోసం 150నుంచి 300 ఎంసీఎఫ్ టీ నీటిని వినియోగించే అవకాశముంది.. నీటికి ఎలాంటి ఇబ్బందిరాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారు అధికారులు..  
జంపన్నవాగులో 28 ఇన్‌ఫిల్టరేషన్‌ వెల్స్
అటు జంపన్న వాగులో 28 ఇన్‌ఫిల్టరేషన్ వెల్స్ పనిచేస్తున్నాయి.. ఇందులో నిండిపోయిన ఇసుకను శుభ్రం చేశారు.. గతంలో ఉన్న 18 వెల్స్‌కుతోడు ఈసారి 19 కోట్లతో కొత్తగా మరో 10 వెల్స్ ఏర్పాటుచేశారు. ఈ నెల 17నుంచి ఈ ఉత్సవం ప్రారంభం కాబోతోంది.. 20వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పక్కాగా అన్నీ సిద్ధం చేశారు అధికారులు.. 

రెడ్డిగూడెం ఎమ్మార్వో కార్యాలయంలో ఎసిబి తనిఖీలు

కృష్ణా : రెడ్డిగూడెం ఎమ్మార్వో కార్యాలయంలో ఎసిబి తనిఖీలు నిర్వహించింది. రూ.10 వేల లంచం తీసుకుంటూ సీనయిర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం ఎసిబికి చిక్కాడు. 

రాజీవ్ శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రాన్ని కోరిన కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సీఎస్ రాజీవ్ శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.  

 

సీపీఎం కేంద్రకార్యాలయంలో పొలిట్ బ్యూరో భేటీ....

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశం అయింది. ప్రకాశ్ కరత్, బృందాకరత్, ఏకే పద్మనాభం, మాణిక్ సర్కార్, బివి.రాఘవులుతోపాటు ఇతర నేతలు హాజరయ్యారు. పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికలు, జేఎన్ యూ, హెచ్ సీయూ, సీపీఎం కేంద్ర కార్యాలయంపై దాడి తదితర అంశాలపై చర్చిస్తున్నారు. 

 

జెఎన్ యూ వీసీని నిలదీసిన టీచర్స్ అసోసియేషన్

ఢిల్లీ : జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని టీచర్స్ అసోసియేషన్‌ సభ్యులు వైస్‌ ఛాన్స్ లర్‌ జగదీశ్‌ కుమార్‌ని నిలదీశారు. క్యాంపస్‌లో పోలీసుల తనిఖీలకు అనుమతి ఎందుకిచ్చారని ఆయనను ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులకు క్యాంపస్‌లో తనిఖీలు చేయడానికి నలుగురు విద్యార్ధుల అరెస్టు చేయడానికి అనుమతి ఎందుకిచ్చారని టీచర్స్ అసోసియేషన్‌ సభ్యులు వీసీని నిలదీశారు. వీసీ మాత్రం తాను చేసిన పనిని సమర్ధించుకుంటున్నారు. చట్టం ప్రకారమే తాను నడుచుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

నిజామాబాద్ జిల్లాలో ఆర్ ఎస్ ఎస్, ఏబీవీపీ దిష్టిబొమ్మల దహనం...

నిజామాబాద్ : జిల్లాలోని వర్ని మండల కేంద్రంలో సీపీఎం కార్యకర్తలు మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఢిల్లీలో సీపీఎం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు రహదారి దిగ్బందనం చేశారు.

భారీగా రేషన్ బియ్యం పట్టివేత....

హైదరాబాద్: నగరంలోని మంగళ్‌హాట్ పరిధిలో గోదాములపై పోలీసులు దాడులు నిర్వహించారు. గోదాముల్లో భారీగా నిల్వ చేసిన పౌరసరఫరాల సరుకులను స్వాధీనం చేసుకున్నారు. 560 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 380 క్వింటాళ్ల గోధుమలు, 1,780 లీటర్ల నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడుల్లో భాగంగా 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

చెన్నైలో 4జి సేవలు ప్రారంభం...

చెన్నై: ఐడియా 4జీ సేవలు ప్రారంభం కానున్నాయి. గతంలో 4జీ సేవలను వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించిన ఐడియా, ఈ మేరకు చెన్నైలో తన సేవలు ప్రారంభించింది. చెన్నైతో పాటు తమిళనాడులోని 29 పట్టణాల్లో ఐడియా 4జీ సేవలు ప్రారంభించామని సంస్థ తెలిపింది. రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈ సేవలను విస్తరిస్తామని ఐడియా తెలిపింది. 3జీకి వర్తించిన ఛార్జీలే 4జీకి కూడా వర్తిస్తాయని ఆ సంస్థ ప్రకటించింది. 4జీకి సంబంధించిన సేవల రీఛార్జ్ కార్డులు 21 రూపాయల నుంచి ప్రారంభమవుతాయని, ఇవి అన్ని షోరూముల్లోను అందుబాటులో ఉంటాయని ఈ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

యూనివర్సిటీల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ వీసీలను నియమిస్తున్నారు: రాహుల్

హైదరాబాద్ : పాటియాల హౌస్‌ పరిసరాల్లో జర్నలిస్టులపై నిన్న జరిగిన దాడిని రాహుల్‌గాంధీ ఖండించారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ వీసీలను నియమిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం ఓ పొలిటికల్‌ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ విద్యార్ధుల గొంతునొక్కే పని కాంగ్రెస్‌ చేస్తోందని రాహుల్‌ మండిపడ్డారు. బీజేపీ చేష్టలను చూస్తూ కూర్చోమని ఆయన ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరు తమ తమ అభిప్రాయాలు కలిగి ఉండవచ్చని అయితే వాటిని ఇతరులపై రుద్దడం సమంజసం కాదని రాహుల్‌ పేర్కొన్నారు.

శంషాబాద్‌ మండలం దవ్వగూడలో దారుణం

హైదరాబాద్‌ : శంషాబాద్‌ మండలం దవ్వగూడలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులిద్దరూ ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్నట్లు సమాచారం.

 

యూపీ అసెంబ్లీని కుదిపేసిన గ్యాంగ్‌రేప్‌ అంశం...

లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఒక కాలేజీ విద్యార్ధిని గ్యాంగ్‌రేప్‌ అంశం శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర రాజధాని లక్నోలో జరిగిన ఈ దారుణంలో ఆ అమ్మాయి ప్రాణాలు కూడా కోల్పోయింది. అసెంబ్లీ ప్రారంభం కాగానే బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యులు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సభ్యులు పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని వారు ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా స్వరం కలిపారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి టీ.టీడీపీ అధ్యక్షులు ఎల్.రమణ లేఖ

హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ మంగళవారం లేఖ రాశారు. నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ పలు అక్రమాలకు పాల్పడిందని, అలాగే ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు.

17:50 - February 16, 2016

కులం, మతం, రాజ్యం, పితృస్వామ్యం మూకుమ్మడిగా దాడులు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ముఖ్యంగా మహిళల్ని, దళితుల్ని తమ కబంధహస్తాల్లో ఉంచుకునేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. కాకపోతే, ఆ దాడి  ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఈ స్థితిలో మహిళలు, రచయిత్రులు బలమైన గొంతుకగా మారాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక మహాసభలు జరుపుకుంది. ప్రరవే మహాసభలపై మానవి ప్రత్యేక కథనం. 
సహనంగా ఉండడం సానుకూల అంశమా? 
సహనంగా ఉండడం సానుకూల అంశమా? అసహనంగా ఉండడం ప్రతికూల అంశమా? ఇప్పుడు అనివార్యంగా చర్చించాల్సిన అంశమిది. సందర్భమిది. అసహన పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి? వాటి ప్రభావాలు ఎంత భయకరంగా ఉండబోతున్నాయి? వాటికి మూలాలెక్కడ ఉన్నాయి? ఆ పరిస్థితులకు ఎదురీదేందుకు ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి? ఎలా ఉమ్మడిగా అడుగులు ముందుకు వేయాలి? ఇదే అంశాన్ని మహాసభల ప్రధాన ఎజెండా అంశంగా ఎంచుకుంది ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. 
మహిళల కట్టూబొట్టూపై నియంత్రణ
ఒకవైపు సామ్రాజ్యవాదం అంతకంతకూ విస్తరిస్తోంది. బహుళజాతి సంస్థల పెట్టుబడులకు గేర్లు బార్లా తెరుచుకుంటున్నాయి. దాంతోపాటే  పాశ్చత్య సంస్కృతి విశృంఖలత్వాన్ని చూపిస్తోంది. 
మరోవైపు అణచివేత పెరుగుతోంది. మనువాద, పితృస్వామ్య భావజాలం బలంగా వేళ్లూనుకుంటోంది. సాహిత్యం రంగంపై దాడి జరుగుతోంది. మహిళల కట్టూబొట్టూపై నియంత్రణ పెరుగుతోంది. ఈ స్థితిని లోతుగా అర్థం చేసుకోవాల్సిందే అంటోంది  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక. 
సామాజిక సంక్షోభాలకు కారణాలు వెతకడం
సామాజిక సంక్షోభాలకు కారణాలు వెతకడం. సమాజాన్ని మరింత మానవీయం చేయడం. అందుకోసం మార్గాలను సూచించడం. సాహిత్య సామాజిక అధ్యయనాల ముఖ్య లక్షణం అంటున్న ప్రజాస్వామిక రచయిత్రుల వేదికతో ఆలోచనలతో మానవి ఏకీభవిస్తోంది. వారంతా తమ లక్ష్య సాధనాలలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తోంది.  మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

ఓజిలిలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం

నెల్లూరు : ఓజిలిలోని ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద దారుణం చోటుచేసుకుంది. కోతులను చంపేందుకు ఉంచిన విషం కలిపిన ఆహారాన్ని తిని...ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. 

17:32 - February 16, 2016

నెల్లూరు : ఓజిలిలోని ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద దారుణం చోటుచేసుకుంది. కోతులను చంపేందుకు ఉంచిన విషం కలిపిన ఆహారాన్ని తిని...ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. 

 

17:24 - February 16, 2016

ఖమ్మం : జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామంలో సీతారామ ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. 4లక్షల ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా సుమారు 8వేల కోట్లతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకయ్యే 8వేల కోట్లను వెంటనే మంజూరు చేస్తామని జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో గోదావరి పారుతుందని...దాన్ని ఒడిసి పట్టుకుంటే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. 60 ఏళ్లపాటు పాలించిన రెండు పార్టీలు..జిల్లాను ఎందుకు పట్టించుకోలేదని సీఎం కేసీఆర్‌ టిడిపి, కాంగ్రెస్‌లను ప్రశ్నించారు. 

 

5 కిలోల బంగారాన్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు పట్టివేత

విశాఖ : రాజమండ్రికి అక్రమంగా తరలిస్తున్న5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విశాఖ నుంచి రాజమండ్రికి... నీటిశుద్ధి యంత్రంలో తరలిస్తుండగా... తనిఖీల్లో దొరికిపోయారు. ఈ కేసులో అధికారులు ఒకరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

 

17:16 - February 16, 2016

విశాఖ : రాజమండ్రికి అక్రమంగా తరలిస్తున్న5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విశాఖ నుంచి రాజమండ్రికి... నీటిశుద్ధి యంత్రంలో తరలిస్తుండగా... తనిఖీల్లో దొరికిపోయారు. ఈ కేసులో అధికారులు ఒకరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

 

16:38 - February 16, 2016

గుంటూరు : ఎపి తాత్కాలిక సచివాలయం శంకుస్థానకు ముహూర్తం ఖరారు అయింది. రేపు ఉదయం 8.23 గంటలకు  సీఎం చంద్రబాబు సచివాలయానికి శంకుస్థాన చేయనున్నారు. తూల్లూరు మండలం వెలగపూడి మండలంలో 45 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక రాజధానిని నిర్మాణం చేపట్టనున్నారు. 27 ఎకరాల్లో....(6 లక్షల చదరుపు అడుగుల్లో) ఆరు భవనాలను నిర్మంచబోతున్నారు. మిగిలిన 18 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. రూ.201 కోట్లతో సచివాలయ నిర్మాణం చేపట్టనున్నారు. జూన్ 15 నాటికి సచివాలయ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. కాగా ఎల్ ఆండ్ టీ నాలుగు భవనాలు, మిగిలిన రెండు భవనాలను పల్లొంజీ సంస్థ నిర్మించనుంది. రేపటి శంకుస్థాన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారి తెలిపారు. 

 

రేపు ఎపి తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాన

గుంటూరు : ఎపి తాత్కాలిక సచివాలయం శంకుస్థానకు ముహూర్తం ఖరారు అయింది. రేపు ఉదయం 8.23 గంటలకు  సీఎం చంద్రబాబు సచివాలయానికి శంకుస్థాన చేయనున్నారు. తూల్లూరు మండలం వెలగపూడి మండలంలో 45 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక రాజధానిని నిర్మాణం చేపట్టనున్నారు. 

16:30 - February 16, 2016

వరంగల్ : జిల్లాలో జరుగుతున్న మేడారం జాతరలో అగ్నిప్రమాదం జరిగింది. వీఐపీ పార్కింగ్ స్థలంలో మంటలు ఎగిసిపడ్డాయి. మొదటగా గుడారాల్లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు అడవిని అంటుకోవడంతో పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. గుడారాలు వేసుకుని వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులను పోలీసులు ఖాళీ చేయించారు. దీంతో పోలీసులు, వ్యాపారస్తుల మధ్య కొంత వాగ్వాదం నెలకొంది.

 

16:08 - February 16, 2016

గత ఏడాది 'శ్రీమంతుడు' సినిమాతో విజయం చేజిక్కించుకున్న 'మహేష్' మరో భారీ హిట్ పై కన్నేశాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' చిత్రం షూటింగ్ జరుగుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను మహేష్ తన ఫేస్ బుక్ ద్వారా విడుదల చేశారు. ఈ ఫొటోలో నటి శరణ్యతో సరసన మహేష్..సమంతలు ఉన్నారు. మహష్ సరసన కాజల్, సమంత ప్రణీతలు నటిస్తున్న విషయం తెలిసిందే. 

మేడారం జాతరలో అగ్నిప్రమాదం

వరంగల్ : జిల్లాలో జరుగుతున్న మేడారం జాతరలో అగ్నిప్రమాదం జరిగింది. వీఐపీ పార్కింగ్ స్థలంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. 

15:53 - February 16, 2016

హైదరాబాద్ : తాత్కాలిక సచివాలయం పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తోందని వైసిపి అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈమేరకు ఆయన హైదరాబాల్ లో మీడియాతో మాట్లాడారు. 10ఏళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉండొచ్చని చట్టం అవకాశం కల్పిస్తున్నా.. ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుందని ప్రశ్నించారు. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి రెండు కంపెనీలే టెండర్లు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎక్కడ లేని విధంగా గజానికి 3350 రూపాయలు ఏ రకంగా ఖరారు చేశారో ప్రజలకు చెప్పాలన్నారు  

 

మొండి బకాయిలపై సుప్రీంకోర్టు సీరియస్

ఢిల్లీ : బ్యాంకుల్లో మొండి బకాయిలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. రూ.500 కోట్లకు పైగా ఎగ్గొట్టిన వారి జాబితా ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్‌కు సుప్రీంకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

15:49 - February 16, 2016

ఢిల్లీ : బ్యాంకుల్లో మొండి బకాయిలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. రూ.500 కోట్లకు పైగా ఎగ్గొట్టిన వారి జాబితా ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్‌కు సుప్రీంకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

15:46 - February 16, 2016

హైదరాబాద్ : ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే ఆలోచనతోనే నారాయణ్ ఖేడ్ లో సీఎం కేసీర్ అభ్యర్థిని ఉంచారని కాంగ్రెస్ నాయకురాలు డీకె అరుణ ఆరోపించారు. మంత్రులందరూ ఖేడ్ లో మోహరించారని, నేతలపై ఒత్తిడి తీసుకువచ్చి గెలిచారని.. ఇది వారి గెలుపు కాదన్నారు. నారాయణ్‌ ఖేడ్ లో యూనానిమస్ గా కిష్టారెడ్డి కుటుంబసభ్యులకు అప్పగిస్తుందని భావించామని.. కాని జిల్లాను చేజిక్కించుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారని విమర్శించారు. 
కేసీఆర్ దురాలోచనకు ఖేడ్ ఎన్నికలే నిదర్శమన్నారు. ఎన్నికలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. రాష్ట్ర పాలనపై దృష్టి సారిస్తే రాష్ట్రం బాగుపడేదని చెప్పారు. 

15:38 - February 16, 2016

హైదరాబాద్ : మొన్న నాన్నకు ప్రేమతో కేటీఆర్‌ గ్రేటర్‌ను ఇస్తే ఇవాళ మామకు ప్రేమతో నారాయణ్‌ఖేడ్‌ను హరీష్‌రావు.. కేసీఆర్‌ చేతిలో పెట్టాడు. కాంగ్రెస్‌ కోటను బద్దలుకొట్టిన గులాబీదళం దశాబ్ధాలుగా సాగుతున్న రెండు కుటుంబాల పాలనకు స్వస్తి పలికింది. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగించింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికలో గులాబీ విజయ పతాకం ఎగురవేసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం. భూపాల్‌రెడ్డి 53 వేల 625 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. భూపాల్‌రెడ్డికి మొత్తం 93 వేల 076 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్థి సంజీవరెడ్డికి 39 వేల 451 ఓట్లు, టీడీపీ అభ్యర్థి విజయపాల్‌రెడ్డికి 14 వేల 787 ఓట్లు పోల్‌ అయ్యాయి. కాంగ్రెస్‌ తంటాలు పడి డిపాజిట్‌ దక్కించుకోగా టీడీపీ డిపాజిట్‌ గల్లంతయ్యింది. టీఆర్ ఎస్ గెలుపుతో తెలంగాణభవన్‌లో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

15:29 - February 16, 2016

హైదరాబాద్ : హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సీహెచ్ మదన్‌రెడ్డి గన్‌మెన్ గన్‌ను... ఎమ్మెల్యే కారు డ్రైవర్ అక్బర్‌ తన చేతిలోకి తీసుకున్నాడు. ప్రమాదవశాత్తు గన్‌ మిస్‌ఫైర్ కావడంతో... అక్బర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ మండలం చౌదర్‌పల్లికి చెందిన అక్బర్ అనే వ్యక్తి గత పదిహేనేళ్లుగా మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సీహెచ్ మదన్‌రెడ్డి కారు డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఎమ్మెల్యే గన్ మెన్ రవీంద్ర గన్ ను అక్బర్ తీసుకుని పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్ తగిలి అక్బర్ మృతి చెందాడు. మదన్ రెడ్డి గన్ మెన్ రవీంద్రను పోలీసులు తీసుకెళ్లారు. బాధ్యతారాహిత్యంగా ఉన్నందున విచారించి.. అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. క్లూస్ టీం... ఆధారాలను సేకరిస్తున్నారని సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాత్రం మిస్ ఫైర్ అయిందని ప్రాథమికంగా చెబుతున్నారు. అయితే గన్ మెన్ చేతిలో గన్ మిస్ ఫైర్ అయిందా... లేదా డ్రైవర్ చేతిలో మిస్ ఫైర్ అయిందా అనే విషయం సందిగ్ధంగానే ఉంది. ఇదిలావుంటే అక్బర్ మృతిపై అనుమానాలున్నాయని అతని తల్లిదండ్రులు అంటున్నారు.
నా కొడుకు మృతిపై అనుమానాలున్నాయి... తల్లిదండ్రులు
'మీరు ముగ్గురే వచ్చి... మీ పిల్లగాన్ని తీసుకెళ్లండని చెప్పారు. '​నా కొడుకు మృతిపై అనుమానాలున్నాయి. మా పిల్లగాడు పిరికివాడు కాడు. నా ఎంబడి ఓ పిల్లగాడు పడ్డాడని అక్బర్ చెప్పాడు. 15 ఏండ్ల నుంచి ఎమ్మెల్యే దగ్గర పని  చేస్తున్నాడు. ఎన్నడూ జరగనిది ఈరోజు ఎందుకు జరిగింది. మా పిల్లవాడు మాకు కావాలి' అంటూ అక్బర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 

హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాల్పుల కలకలం..

హైదరాబాద్ : హైదరాబాద్ ఓల్డు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాల్పుల కలకలం రేగింది. గన్ మెన్ చేతిలోని గన్ మిస్ ఫైర్ అవ్వడంతో బుల్లెట్ తగిలి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కారు డ్రైవర్ అబ్బాస్ మృతి చెందారు.   

కన్హయ్య ఘటన స్థలంలో ఉన్నాడు - బాసి..

ఢిల్లీ : జేఎన్ యుఎస్ యు అధ్యక్షుడు కన్హయ్య ఘటనా స్థలంలో ఉన్నాడని, అందుకే అతడిని అరెస్టు చేయడం జరిగిందని రాష్ట్ర పోలీసు కమిషనర్ బాసి పేర్కొన్నారు. 

ఎస్ఆర్ నగర్ లో దారుణం..

హైదరాబాద్ : ఎస్ ఆర్ నగర్ లోని సాయిబాబా నగర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బు ఇవ్వలేదని శ్రీనివాస్ అనే వ్యక్తిపై వీధి రౌడీలు దాడికి పాల్పడ్డారు. అవమానంతో శ్రీనివాస్ నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

కరవు సాయంలో ఏపీ ప్రభుత్వం విఫలం - రఘువీరా...

హైదరాబాద్ : కేంద్రం నుండి కరవు సాయం పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు. 

ఏపీ రాజధాని పేరిట భూ దందా - బోత్స..

హైదరాబాద్ : ఏపీ రాజధాని పేరిట ఓ పక్క భూ దందా మరో పక్క అవినీతి జరుగుతోందని వైసీపీ నేత బోత్స సత్యనారాయణ విమర్శించారు. తాత్కాలిక రాజధాని పేరిట భారీ అవినీతి తెరలేపారని, పదేళ్లు హైదరాబాద్ నుండి పాలన చేసుకునే హక్కు ఉన్నా చంద్రబాబుకు తొందరెందుకని ప్రశ్నించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి రెండు కంపెనీలే టెండర్లు దాఖలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 

ఖమ్మంలో బ్యానర్ల వివాదం..

ఖమ్మం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు పర్యటనలో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. టేకులపల్లి మండలం రోళ్లపాడు సభాస్థలిలో కట్టిన బ్యానర్లపై మంత్రి తుమ్మల ఫొటో లేదని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమమది కొన్ని బ్యానర్లను చింపివేయడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

సాగు, తాగునీటికి రూ.లక్షా 25వేల కోట్లు - కేసీఆర్..

ఖమ్మం : రాబోయే నాలుగేళ్లలో సాగు, తాగునీటి రంగానికి రూ. లక్షా 25వేల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రెండో రోజు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన తిరుమలాయపాలెంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 2016 డిసెంబర్ లోపు మిషన్ భగీరథ లో భాగంగా పాలేరు రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు తాగునీరందిస్తామని హామీనిచ్చారు. 

13:57 - February 16, 2016

ఖమ్మం : తెలంగాణ లో కోటి ఎకరాలను సమస్యశ్యామలం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఖమ్మం జిల్లాలో రెండో పర్యటనలో భాగంగా తిరుమలాపాలం రామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ముందుగా టిఆర్ఎస్ ను గెలిపించిన నారాయణ ఖేడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అక్టోబర్ నాటికి పాలేరు కు సాగు, తాగునీరు అందిస్తానన్నారు. పేదలు ఆత్మగౌరవంలో బతకాలన్నారు. నీటి సమస్య, విద్యుత్ సమస్య, దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు బాగుపడ్డనాడే దేశం బాగు పడుతుందన్నారు. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. దొడ్డుదొరలు పరిపాలిచిన దొరలు హాస్టల్ పిల్లలకు దొడ్డు బియ్యం పెట్టారని... నేను సన్న దొరనని... హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పెడతామని పేర్కొన్నారు. పీడీఎస్ యూ కార్యకర్తలు నన్ను అడ్డుకోవడం సంస్కారమా అని ప్రశ్నించారు. తెలంగాణ అన్ని విధాలా బాగుపడాలన్నారు. రెండు సంవత్సరాల్లో ఒక్క అవినీతి లేకుండా పాలిస్తున్నాట్లు తెలిపారు. కరువు ఇబ్బందులను తొలగించేందుకు భగీరథ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. భగీరథ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల వారు కాపీకొడుతున్నారని తెలిపారు. తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయని తెలిపారు. రైతు రుణ మాఫీని భగవంతుడు దీవిస్తే రెండు విడతల మాఫీని ఒక్కసారే తీసేస్తామన్నారు. ఆరు నెలల తరువాత భక్త రామదాసు ఎత్తు పోతల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు.

13:51 - February 16, 2016

ఫిబ్రవరి 14...వాలంటైన్స్ డే..ప్రేమికులంతా ఏం చేస్తారు ? ప్రేమికుడు తన ప్రేయసికి.. ప్రేయసి తన ప్రియుడికి బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు కదా..భారతేదశంలో మాత్రం కొంతమంది ఈ ప్రేమికుల రోజున అడ్డుకుంటుంటారు. ఇదిలా ఉంటే అమెరికాలో మాత్రం వాలంటైన్స్ డే రోజు న ఓ యువకుడు చేసిన చేసిన నిర్వాకం చూసిన..విన్న వారు ముక్కు మీద వేలేసుకోవడం ఖాయం. అమెరికాకు చెందిన టీనేజీ కుర్రాడు హెడెన్ గాడ్ ఫ్రే ఉటా రాష్ట్రంలోని స్మిత్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న స్కై వ్యూ హై స్కూల్ లో విద్యనభ్యసిస్తున్నాడు. వాలంటైన్స్ డే రోజున ఏకంగా 834 మంది గర్ల్ ఫ్రెండ్స్ కు గులాబీలు ఇచ్చాడంట. ఏకంగా దీనికి రూ.30వేల రూపాయలు ఖర్చు అయ్యిందంట. మరి ఈ సొమ్మును ఎవరిచ్చారు ? అని అనుకుంటున్నారా ? దీని వెనుక హెడెన్ మూడేళ్ల శ్రమ దాగి ఉంది. అవును 14 ఏళ్లు ఉన్నప్పుడు హెడెన్ కు ఓ ఆలోచన వచ్చింది. అప్పటి నుండి ఏదో ఒక విధంగా కష్టపడి డబ్బు సంపాదించేవాడు. మెక్ డోనాల్డ్స్ లో వంట వాడిగా..మెక్సికన్ రెస్టారెంట్లో అంట్లు కడగడం..ఇలా ఎన్నో పనులు చేశాడు. ఇలా చేసిన పనికి వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేశాడు. ఇలా పొదుపు చేసిన డబ్బును ఈ సంవత్సరం వాలంటైన్స్ డేకు ఖర్చు చేశాడు. అదండి సంగతి..

13:44 - February 16, 2016

హైదరాబాద్ : మొన్న నాన్నకు ప్రేమతో కేటీఆర్‌ గ్రేటర్‌ను ఇస్తే ఇవాళ మామకు ప్రేమతో నారాయణ్‌ఖేడ్‌ను కేసీఆర్‌ చేతిలో పెట్టాడు హరీష్‌రావు. కాంగ్రెస్‌ కోటను బద్దలుకొట్టిన గులాబీదళం దశాబ్ధాలుగా సాగుతున్న రెండు కుటుంబాల పాలనకు స్వస్తి పలికింది. ఉప ఎన్నికలో విజయదుందుభి మోగించింది టీఆర్‌ఎస్‌.

అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా....

అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికలో గులాబీ విజయ పతాకం ఎగురవేసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎం. భూపాల్‌రెడ్డి 53 వేల 625 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. భూపాల్‌రెడ్డికి మొత్తం 93 వేల 076 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్థి సంజీవరెడ్డికి 39 వేల 451 ఓట్లు, టీడీపీ అభ్యర్థి విజయపాల్‌రెడ్డికి 14 వేల 787 ఓట్లు పోల్‌ అయ్యాయి. కాంగ్రెస్‌ తంటాలు పడి డిపాజిట్‌ దక్కించుకోగా టీడీపీ డిపాజిట్‌ గల్లంతయ్యింది.

మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ....

మొత్తం 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకూ అన్ని రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అన్ని రౌండ్లలోను స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ఏ దశలోను కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది.

మంత్రి హరీష్ రావుకు అభినందనలు...

మొదటి నుంచి నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికను భుజాన వేసుకొని పార్టీకి విజయాన్ని అందించిన హరీష్‌రావుకు అభినందనలు తెలిపారు మంత్రి

60 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోటగా....

60 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నారాయణ్‌ ఖేడ్ లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని అన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి . వరంగల్ , గ్రేటర్ ఎన్నికల్ల్లో ఏ విధమైన ఫలితాలు వచ్చాయో నారాయణ్‌ ఖేడ్ లో అదే జరిగిందన్నారు. ప్రజలు అభివృద్దిని కోరుతున్నారని.. గత ప్రభుత్వాల పాలనసరిగా లేకనే.. ప్రజలు టీఆర్ఎస్ ను కోరుకున్నారన్నారు. ఇన్నాళ్లు నిర్భందంగా ఓటును వేసిన ప్రజలు.. ఇన్నేళ్లకు స్వేచ్ఛను కోరుకున్నారన్నారు పద్మాదేవేందర్ రెడ్డి.ఇచ్చిన హామీలను ప్రభుత్వం చేసి తీరుతుందన్నారు.  

13:41 - February 16, 2016

విజయవాడ : అధికార పార్టీ టీడీపీ పాలన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. రైతులకు సమాన్య ప్రజల తాగునీటిని అందించలేనిస్థితిలోచంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. వ్యవసాయం గురించి ప్రభుత్వం మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. కేంద్రంతో ఫైట్ చేసి నిధులు తీసుకురావాలని లేనిపక్షంలో ప్రభుత్వం చేతకానితనంగా భావించాల్సి వస్తుందన్నారు. తుఫాన్ వచ్చిపోయిన తర్వాత కూడా నివేదికలు పంపాల్సిన ప్రభుత్వం తాపీగా పంపి నిర్వాసితులకు అన్యాయం చేసిందన్నారు రఘువీరా. తాత్కాలిక రాజధాని ఎందుకోసం చేపడుతున్నారని ప్రశ్నించారు. దీనికి అయ్యే ఖర్చుతో ఒక పర్మినెంట్ సెక్రటేరియట్ తయారవుతుందన్నారు రఘువీరా .  

13:40 - February 16, 2016

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఏపీనుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి పాల్గొన్నారు.. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారన్నారు మేకపాటి.. ఏపీ సమస్యలపైకూడా చర్చ జరపాలని కోరినట్లు చెప్పారు..

13:39 - February 16, 2016

కరీంనగర్: గంగను తలపై మోసే పరమ శివుడికి నీటి కష్టాలు వచ్చిపడ్డాయి. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడి సన్నిధానంలో పాపాలను పోగొట్టుకునేందుకు ధర్మగుండంలో స్నానాలు చేద్దామంటే నీళ్ళు లేక మన్నించు మహదేవా అని దేవున్ని వేడుకునే దుస్థితి. వేసవి రాకముందే వేములవాడ రాజన్న క్షేత్రంలో తాగునీటి సమస్య భక్తులను ఇబ్బందులు పెడుతోంది. కరీంనగర్ జిల్లా వేములవాడలో నీటి కష్టాలపై 10టీవీ ప్రత్యేక కథనం.

వేములవాడ రాజన్నకూ తప్పని నీటి కష్టాలు ...

ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్నకూ నీటి కష్టాలు తప్పడం లేదు. పుణ్యక్షేత్రంలో మొక్కులు చెల్లించుకునే భక్తులు ముందుగా పుణ్య స్నానం ఆచరించడానికి ధర్మ గుండంలో స్నానాలు చేస్తారు. సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో లక్షల మంది భక్తులు పుణ్యక్షేత్రం దారి పట్టారు. అయితే ధర్మగుండంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవడంతో మురుగు నీటిలోనే ముక్కు మూసుకుని మునకలు వేస్తున్నారు. అధికారులు ప్రత్యామ్నాయంగా షవర్లు ఏర్పాటు చేసినా వాటి కింద స్నానం చేయడానికి భక్తులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.

వేములవాడ క్షేత్రానికి ఏటా రూ.70 కోట్ల ఆదాయం......

ఏటా 70 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న వేములవాడ క్షేత్రానికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు, ప్రభుత్వం విఫలమవుతోంది. వేములవాడకు కరీంనగర్ ఎల్ఎండి జలాశయం నుంచి నీటిని అందించాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. ఆలయానికి వచ్చిన ఆదాయంలో నుంచి మూడు కోట్ల రూపాయలు దేవస్థానం కేటాయించగా ప్రభుత్వం తరపున 9.34 కోట్ల రూపాయలను వెచ్చించి 12.34 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలయ అధికారుల అలసత్వంతో ఎల్ఎండి నీళ్ళు వేములవాడకు తరలించే ప్రక్రియకు బ్రేక్ పడింది.

వేములవాడ ఆలయానికి ప్రతిరోజు 200 ట్యాంకర్ల నీరు....

భక్తులకు సరిపోయేంత నీటిని అందించలేక ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పంపుల్లో నింపుతూ ఆలయంలోనికి, వసతి గదుల్లోకి నీటిని సరఫరా చేస్తున్నారు. ట్రిప్పుకు మూడు వందల యాభై రూపాయలు చెల్లిస్తూ దాదాపు రోజుకు 200 ట్రిప్పుల నీటిని సంపుల్లో నింపుతున్నారు. దీంతో లక్షల రూపాయలను అధికారులు నీళ్ళ పాలు చేస్తూ కాంట్రాక్టర్లను లక్షాధికారులను చేస్తున్నారు.

వేములవాడలో కరువైన తాగునీరు.....

వేములవాడ క్షేత్రంతో పాటు పట్టణంలో దాదాపు యాభై వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరితో పాటు నిత్యం వేలాది భక్తులు దేవుడి దర్శనం కోసం వస్తూనే ఉంటారు. ఇలా లక్షలాదిమందికి తాగునీరు కరువైంది. మూలవాగులో గత మూడేళ్లుగా నీటి మట్టం లేక ఎండిపోవడంతో ప్రస్తుతం వాగులో బోర్లను వేసి నీటిని అందిస్తున్నారు. భూగర్భజలాలు 15 మీటర్ల లోతు వరకు పడిపోవడంతో గంగమ్మను పైకి తీసుకురావడానికి భగీరథ ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు భక్తుల నీటి కష్టాలు వాటర్ పాకెట్లు, బాటిల్స్ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. వేసవి రాకముందే అధికారులు పట్టణంలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తుండటంతో భవిష్యత్తును ఊహించుకొని స్థానికులు భయపడుతున్నారు.

ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకానికి ఇంకా జాప్యం....

వేములువాడకు మానేరు జలాశయం నుంచి నీటిని అందించాలని అధికారులు కార్యాచరణ చేసినా ప్రస్తుతం ఆ జలాశయంలో కూడా నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంది. దీంతో పాటు రామగుండం ఎల్లంపల్లి నుంచి నీరు అందించాలని చేపట్టిన ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకానికి ఇంకా జాప్యం జరిగే అవకాశం ఉంది. వేములవాడ రాజన్న సన్నిధిలోనే తన పెళ్ళి జరిగిందని...అయుత చండీయాగం తరువాత వేములవాడ రాజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం అంటే ఎంతో సెంటిమెంట్. యాదాద్రి తరహాలో వేములవాడ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ది చేస్తానంటున్న సీఎం ఏడాది వంద కోట్ల నిధులు కేటాయిస్తున్నామని హామీలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదని భక్తులు విమర్శిస్తున్నారు. వేసవికి ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న వేసవిలో భక్తుల రద్దీ ఇంకా పెరగడంతో పాటు శివరాత్రికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు. 

13:34 - February 16, 2016

హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ జోన్‌ ఆఫీసులో డిప్యూటీ మేయర్‌ ఫసీయుద్దీన్‌ ఆకస్మిక తనిఖీలు జరిపారు. జీహెచ్‌ఎంసీలో అవినీతి రహిత పాలన అందించేందుకు కృషిచేస్తాంమని ఫసియుద్దీన్ చెప్పారు. పెండింగ్‌ సమస్యలపై చర్యలు తీసుకుంటామని, తక్షణమే ప్రజాసమస్యలపై అధికారులు స్పందించాలని డిప్యూటీ మేయరు ఫసీయుద్దీన్‌ కోరారు. 

త్రిపురలో సీపీఎం అభ్యర్థి గెలుపు..

త్రిపుర : అమ్రాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో సీపీఎం విజయం సాధించింది. సమీప బీజేపీ ప్రత్యర్థిపై సీపీఎం అభ్యర్థి పరిమల్ దెబ్ నాథ్ 20,355 ఓట్లతో గెలుపొందారు. 

జేఎన్ యూలో అధ్యాపకుల సమ్మె..

ఢిల్లీ : జేఎన్ యూ అధ్యాపకులు సమ్మె చేపట్టారు. క్యాంపస్ లో జాతీయ వాదంపై ప్రతి రోజు క్లాసులు చెబుతామని అధ్యాపకులు ప్రకటించారు. 

12:57 - February 16, 2016

ఇంట్లో సతీమణి వంట సరిగ్గా చేయకపోతే ఏం చేస్తాం ? ఆ ఏం చేస్తాం..వండుకుంటాం లేదా..అదే తింటాం..హోటల్ నుండి తెచ్చుకుంటాం..లేదా కోప్పడుతాం..అంటారు అంతే కదా..కానీ ఓ వ్యక్తి మాత్రం తన భార్యపై విచిత్రంగా ఫిర్యాదు చేశాడు. 42 ఏళ్లు ఉన్న ఈ వ్యక్తి తన భార్య తనకు సరిగ్గా వంట చేయడం లేదని..ఇతరత్రా కారణాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటలీ..ఇటాలియన్ చట్టాల ప్రకారం కుటుంబ..గృహ వ్యవహారాల్లో విఫలం అయితే సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరే అవకాశం ఉంది. దక్షిణ రోమల్ లోని సోన్నినో లో 47 ఏళ్ల భర్త తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత రెండు సంవత్సరాలుగా తన భార్య ప్రవర్తన విచిత్రంగా ఉందని...ఇంటిని కూడా శ్రుభంగా ఉంచడం లేదని..తన బెడ్ రూం నుండి బయటకు గెంటేస్తోందని..ఇలా..కొన్ని కారణాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుకు సంబంధించిన విచారణ అక్టోబర్ 12న ప్రారంభమౌతుందని తెలుస్తోంది. 

డిప్యూటీ మేయర్‌ ఫసీయుద్దీన్‌ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ జోన్‌ ఆఫీసులో డిప్యూటీ మేయర్‌ ఫసీయుద్దీన్‌ ఆకస్మిక తనిఖీలు జరిపారు. జీహెచ్‌ఎంసీలో అవినీతి రహిత పాలన అందించేందుకు కృషిచేస్తాంమని ఫసియుద్దీన్ చెప్పారు. పెండింగ్‌ సమస్యలపై చర్యలు తీసుకుంటామని, తక్షణమే ప్రజాసమస్యలపై అధికారులు స్పందించాలని డిప్యూటీ మేయరు ఫసీయుద్దీన్‌ కోరారు. 

ఢిల్లీలో జర్నలిస్టులు మార్చ్ ఫాస్ట్..

ఢిల్లీ : పాటియాల కోర్టులో జరిగిన ఘటనను నిరసిస్తూ జర్నలిస్టులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నుండి సుప్రీంకోర్టు వరకు ఈ మార్చ్ ఫాస్ట్ కొనసాగనుంది. 

జెన్ యుఎస్ యు అధ్యక్షుడి వివాదంలో ఫ్రూప్ ఎక్కడ – ఆజాద్..

ఢిల్లీ : జాతి వ్యతిరేక నినాదాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. జెన్ యుఎస్ యు అధ్యక్షుడిపై దేశద్రోహం మోపిన కేసులో ఎలాంటి ఫ్రూప్ లేదని పేర్కొన్నారు. 

12:43 - February 16, 2016

హైదరాబాద్ : ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌ అంశంపై వైసీపీ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. తన సస్పెన్షన్‌పై రోజా ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోపక్క స్పీకర్‌ నియమించిన కమిటీపై ఆ పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. కమిటీతో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదంటోంది వైసీపీ.

స్పీకర్‌ ఏర్పాటుచేసిన కమిటీపై వైసీపీ అసంతృప్తి....

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సభలో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి స్పీకర్‌ ఏర్పాటుచేసిన కమిటీపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కమిటీలో ఉన్న నలుగురులో ముగ్గురు అధికార పార్టీకి చెందిన వారు కావడం వల్ల తమకు న్యాయం జరగదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో టీడీపీ, బీజేపీల నుంచి శ్రావణ కుమార్‌, విష్ణుకుమార్‌ రాజు, వైసీపీ నుంచి శ్రీకాంత్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

కమిటీలో ముగ్గురు అధికార పార్టీకి చెందిన వారే...

కమిటీలో ముగ్గురు అధికార పార్టీకి చెందిన వారు కావడం వల్ల చర్చ ఏకపక్షంగా జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. పారదర్శకంగా వ్యవహరించాల్సిన సభ్యులు అధికార పక్షానికే కొమ్ము కాస్తున్నారని మండిపడుతోంది. ఈ కమిటీతో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేక కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని.. కమిటీలో సభ్యుడైన వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు.

సస్పెన్షన్‌పై ఎమ్మెల్యే రోజా న్యాయ పోరాటం...

మరోపక్క తన సస్పెన్షన్‌పై ఎమ్మెల్యే రోజా న్యాయ పోరాటం చేస్తున్నారు. సస్పెన్షన్‌ వ్యవహారంలో స్పీకర్‌ తన పరిధికి మించి వ్యవహరించారని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే రెండు సార్లు విచారణకు వచ్చింది. సోమవారం కూడా విచారించిన హైకోర్టు.. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మొత్తానికి అసెంబ్లీ సబ్‌ కమిటీపై నమ్మకం లేదంటున్న వైసీపీ...కోర్టు తీర్పుపైనే ఆశలు పెట్టుకుంది. 

12:40 - February 16, 2016

హైదరాబాద్ : తెలంగాణలో తాగునీటి కొరత రాకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది ప్రభుత్వం.. కరువు మండలాల్లో ఈ సమస్యరాకుండా ప్రయత్నిస్తోంది.. ఈ మండలాల్లో తాగునీటి సరఫరాకోసం 55కోట్లు విడుదల చేసింది..

వ్యవసాయ బావులద్వారా తాగునీటి సరఫరా....

వేసవికిముందే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి.. కరువుతో ఈ ఇబ్బందులు మరింత పెరిగాయి.. తండాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.. ఈ సమస్యపై దృష్టిపెట్టిన టిఎస్ ప్రభుత్వం... ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది... వివిధ జిల్లాల్లో వ్యవసాయ బావులద్వారా తాగునీటి సరఫరాకు ప్లాన్ చేసింది.. ఇందుకోసం ఆయా బావుల యజమానులతో ఒప్పందంకూడా కుదుర్చుకుంది.. మిగతాప్రాంతాల్లోకూడా తాగునీటి కొరత రాకుండా ప్రయత్నాలు చేస్తోంది..

231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన సర్కారు

కరువు మండలాల్లోనూ తాగునీటికోసం చర్యలు చేపట్టింది.. 7 జిల్లాల్లోని 231 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది ప్రభుత్వం.. ఇక్కడ తాగునీటి సరఫరాకోసం 55కోట్లు విడుదల చేసింది.. మహబూబ్ నగర్ జిల్లాకు 15కోట్ల 70 లక్షలు, మెదక్ జిల్లాకోసం 10కోట్ల 82లక్షలు, నిజామాబాద్ జిల్లాకు 8కోట్ల 47లక్షలు, రంగారెడ్డి జిల్లాకు 7కోట్ల 77లక్షలు, నల్లగొండ జిల్లాకు 5కోట్ల 18లక్షలు, కరీంనగర్ జిల్లాకు 4కోట్ల 47 లక్షలు, వరంగల్‌ జిల్లాకు 2కోట్ల 59లక్షలు విడుదల చేసింది.. మంజూరుచేసిన నిధులతో తాగునీటి సరఫరాకోసం చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించింది ప్రభుత్వం..

గెలుపు కేసీఆర్ కు జన్మదిన కానుక - భూపాల్ రెడ్డి..

మెదక్ : నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ గెలుపు కేసీఆర్ కు జన్మదిన కానుక అని భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. హరీష్ రావు, డిప్యూటి స్పీకర్, నేతలు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలిపారు. సీఎం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు. 

ముస్తాక్ అంతిమ యాత్ర ప్రారంభం

కర్నూలు :బండిఆత్మకూరు మండలం పార్నెపల్లెలో అమరజవాన్ ముస్తాక్ అంతిమ యాత్ర ప్రారంభం అయ్యింది. కాసేపట్లో సైనిక లాంఛనాలతో ముస్తాక్ అంత్యక్రియులు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి వైసీపీ నేత జగన్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

12:15 - February 16, 2016

హైదరాబాద్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక లో టిఆర్ ఎస్ అభ్యర్థి గెలుపు మాపై మరింత బాధ్యత పెంచిందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. ఆమె తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలే గెలుపుకు ప్రధానకారణమని స్పష్టం చేశారు. గతంలో టిడిపి, కాంగ్రెస్ కంచుకోటగా ఉండే నియోజకవర్గంలో ప్రజలు భయంతోఓ టు వేశేవారని.. అలాంటి దానిలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని తెలిపారు. గతంలో గ్రేటర్ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని మేం చెప్పినట్లే ఖేడ్ ఉప ఎన్నిక రిజల్టు వచ్చిందన్నారు. ఇదే రిజల్టు ఖమ్మం, వరంగల్ లో కొనసాగుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి నిరోధకులుగా ప్రతిపక్షాలు మారవద్దని సూచించారు. ఖేడ్ నియోజకవర్గ ప్రజలకు ఆడబిడ్డలా నమస్కారాలు తెలిపారు. నీరు, రవాణా వ్యవస్థ, తండాల్లో విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని...వారి సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.  

వరంగల్ జిల్లా ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ..

హైదరాబాద్ : వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. మావోయిస్టులు విద్యాసాగర్ రెడ్డి, శృతి పోస్టుమార్టం నివేదికపై న్యాయవాది అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం నివేదికను ఢిల్లీ ఎయిమ్స్ కు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణనను మూడు వారాలకు వాయిదా వేసింది. 

ఎస్సీ వర్గీకరణ భూ స్థాపితమైంది - హర్షకుమార్...

రాజమండ్రి : ఎస్సీ వర్గీకరణ ఎప్పుడో భూ స్థాపితమైందని, కాపులను సీఎం చంద్రబాబు మభ్యపెడుతున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. కాపులను బీసీల్లో చేర్చే అధికారం చంద్రబాబుకు లేదని, కాపు కార్పొరేషన్ నిధులు ఎలా ఖర్చు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

శివసేన అభ్యర్థి విజయం..

మహరాష్ట్ర : పాల్ గర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో శివసేన అభ్యర్థి అమిత్ గోడా విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి రాజేంద్రపై 18,948వేల ఓట్లతో గెలుపొందారు. 

పాక్ జిందాబాద్ నినాదాలు చేశారు - ఓపీ శర్మ..

ఢిల్లీ : తాను కోర్టు నుండి బయటకు వచ్చినప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని, అతని పేరు కూడా తనకు తెలియదని బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ పేర్కొన్నారు. పాటియాల కోర్టు వద్ద జేఎన్ యూ విద్యార్థిపై ఓపీ శర్మ చేయి చేసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. పాక్ కు అనుకూలంగా నినాదాలు చేయడంతో తాను నివారించడం జరిగిందని, కానీ అతను వినిపించుకోలేదన్నారు. ఈ మధ్యలో ఘర్షణ తలెత్తిందని, ఆ తరువాత ఏమైందో అందరికీ తెలుసనేనన్నారు. తన తలకు గాయమైందని పేర్కొన్నారు. 

హరీష్ కు కేటీఆర్ అభినందనలు..

హైదరాబాద్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించడం పట్ల మంత్రి హరీష్ రావుకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 

11:50 - February 16, 2016

మెదక్ : నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయభేరి మోగించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే అధికారికాంగా ఇంకా ప్రకటించలేదు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ రెండో స్థానంలో, టిడిపికి డిపాజిట్ కూడా దక్కలేదు. టిఆర్ ఎస్ కు 93,076, కాంగ్రెస్ 39451, టిడిపి 14,787 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో టిఆర్ ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మంత్రి హరీష్ రావు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అభినందలు తెలియజేశారు. టిఆర్ ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 'టెన్ టివి'తో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలు, సంక్షేమపథకాలకు ఆకర్షితులైన ప్రజలు టిఆర్ ఎస్ ను గెలిపించారని తెలిపారు. అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి బంగారు నారాయణ ఖేడ్ సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాని నిలబెట్టేందుకు కృషి చేస్తానన్నారు. నియజకవర్గంలో వలసలు ఎక్కువగా ఉంటాయని... వాటి నివారణ కొరకు సాగునీటి కొరత, సింగూరు జలాలను తీసుకువచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి వలసలను నివారిస్తామన్నారు.

 

నారాయణ ఖేడ్ లో టిఆర్ ఎస్ గెలుపు

మెదక్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు సాధించింది. టిఆర్ ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 53,625 చిలుకు ఓట్లు సాధించి విజయం సాధించారు. అయితే అధికారికాంగా ఇంకా ప్రకటించలేదు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ రెండో స్థానంలో, టిడిపికి డిపాజిట్ కూడా దక్కలేదు. టిఆర్ ఎస్ కు 93,076, కాంగ్రెస్ 39451, టిడిపి 14,787 ఓట్లు వచ్చాయి.

ఖేడ్ ఉప ఎన్నిక..20వ రౌండ్..

మెదక్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 20వ రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి అధిక్యంలో కొనసాగుతున్నారు. 20వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 53,106 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. 

11:35 - February 16, 2016

హైదరాబాద్ : ఆధునిక క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ రాహుల్ ద్రావిడ్ ను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఓ ప్లేయర్ గా మాత్రమే కాదు...శిక్షకుడిగా సైతం...ప్రపంచకప్ అందుకోడంలో విఫలమయ్యాడు. అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమితో అభిమానులు మాత్రమే కాదు..కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం తీవ్రనిరాశకు గురయ్యాడు.....

ప్రతిభ వేరు... అదృష్టం వేరు...

ప్రతిభవేరు....అదృష్టం వేరు. ప్రతిభకు కొద్దిపాటి అదృష్టం తోడైతేనే ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది. అయితే ...క్రికెటర్ గా, కోచ్ గా అపారప్రతిభాపాటవాలున్న ...ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్ ను మాత్రం అదృష్టం వెక్కిరిస్తూనే ఉంది.

5 సంవత్సరాల పాటు...

భారత క్రికెట్ కు 15 సంవత్సరాలపాటు...టెస్ట్, వన్డే క్రికెట్ అన్నతేడా లేకుండా అపారసేవలు అందించిన మొనగాడు, 13వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించిన ఆల్ టైమ్ గ్రేట్ రాహుల్ ద్రావిడ్...రిటైర్మెంట్ తర్వాత కోచ్ అవతారం ఎత్తినా...ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షలానే మారింది. 2003 ప్రపంచకప్ టోర్నీలో రన్నరప్ గా నిలిచిన భారతజట్టులో సభ్యుడిగా ఉన్న రాహుల్ ద్రావిడ్...ఓ క్రికెటర్ గా ప్రపంచకప్ విజేత కాలేకపోయాడు. ప్రపంచకప్ ఆశ నెరవేరకుండానే ఆటనుంచి వీడ్కోలు తీసుకొన్నాడు.

రిటైర్మెంట్ తర్వాత...

రిటైర్మెంట్ తర్వాత...ఇండియా-ఏ, భారత అండర్ -19 జట్ల శిక్షకునిగా బాధ్యత తీసుకొన్నాడు. బంగ్లాదేశ్ వేదికగా ముగిసిన 2016 అండర్ -19 ప్రపంచకప్ లో పాల్గొన్న భారతజట్టుకు మూడుమాసాలపాటు...ద్రావిడ్ అత్యాధునిక శిక్షణ ఇచ్చాడు. ద్రావిడ్ శిక్షణలో రాటుదేలిన భారతజట్టు...ప్రపంచకప్ టైటిల్ వేటకు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. గ్రూప్ లీగ్ దశ నుంచి సెమీఫైనల్స్ వరకూ స్థాయికి తగ్గట్టుగా రాణించి ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

టైటిల్ సమరంలో ప్రత్యర్థి డార్క్ హార్స్ వెస్టిండీస్ కావడంతో...

టైటిల్ సమరంలో ప్రత్యర్థి డార్క్ హార్స్ వెస్టిండీస్ కావడంతో...భారతజట్టుకే టైటిల్ ఖాయమని అందరూ అనుకొన్నారు. అయితే..అసలుపోటీలో మాత్రం..భారత కుర్రాళ్ళు తేలిపోయారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో దెబ్బతిన్నారు. 50 ఓవర్లలో 250కి పైగా పరుగులు సాధించే సత్తా ఉన్న భారతజట్టు...కేవలం 145 పరుగులకే కుప్పకూలిపోయింది. 146 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన వెస్టిండీస్ కేవలం 5 వికెట్లు మాత్రమే నష్టపోయి..భారత్ పై సంచలన విజయం సాధించడంతో...కోచ్ గా ప్రపంచకప్ అందుకోవాలన్న రాహుల్ ద్రావిడ్ ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి.

2003 ప్రపంచకప్ ఫైనల్స్ లో రన్నరప్ గా...

2003 ప్రపంచకప్ ఫైనల్స్ లో రన్నరప్ గా నిలిచిన భారతజట్టులోసభ్యుడిగా ఉన్న ద్రావిడ్ కు.....2016 జూనియర్ ప్రపంచకప్ లో భారతజట్టు కోచ్ గానూ అదే అనుభవం ఎదురయ్యింది. అయితే..హుందాతనానికి మరోపేరైన ద్రావిడ్ మాత్రం...ఆటలో గెలుపు, ఓటమి సహజమని..స్థాయికి తగ్గట్టుగా ఆడామా? లేదా ? అన్నదే ప్రధానమని అంటున్నాడు. ఫైనల్లో ఓటమితో కుర్రాళ్ళు ఎంతబాధతో ఉంటారో తనకు తెలుసునని...వారిని ఓదార్చాలని తాను అనుకోవడం లేదని..అంతర్జాతీయస్థాయి క్రికెటర్లుగా ఎదగాలంటే ఇలాంటి అనుభవాలు ఉండితీరాలని చెప్పాడు. ఏదిఏమైనా...ప్రపంచకప్ కు అన్నివిధాల అర్హుడైన ద్రావిడ్...ఓ క్రికెటర్ గా మాత్రమే కాదు..భారతజట్టు కోచ్ గా సైతం ప్రపంచకప్ ను అందుకోలేకపోడాన్ని మించిన దురదృష్టం మరొకటి ఉండదు.

11:33 - February 16, 2016

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఐపీఎల్‌తో రంగప్రవేశం చేయనున్న రైజింగ్‌ పుణే సూపర్‌ జైయింట్స జట్టు జెర్సీని సోమవారం ఆష్కరించారు. ఈ కార్యక్రమంలో పుణే జట్టు యాజమాని సంజీవ్‌ గోయోంక, కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా కెప్టెన్‌గా ఉన్న చెన్నై జట్టు దూరంగా ఉండటంపై ఉద్వేగంగా స్పందించారు. చైన్నె ఆటగాళ్లు సురేష్‌రైనా, రవీంద్ర జడేజా, మెక్‌ కల్లమ్‌లకు దూరంగా ఉండటం బాధగా ఉందన్నారు. నిషేధం విధించిన చెన్నై, రాజస్థాన్‌ స్థానంలో పుణే, రాజ్‌కోట్‌ జట్లు ఐపీఎల్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. పుణే జట్టుకు స్టెఫెన్‌ ఫ్లెమింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో ధోనితో పాటు రవిచంద్రన్‌ అశ్విన్‌, అజింక్యా రహానే, స్టీవెన్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా), డు ఫ్లెసిస్‌ (దక్షిణాఫ్రికా) తదితర ఆటగాళ్లు ఉన్నారు.

ఓయూలో ఉద్రిక్తత..

హైదరాబాద్ : ఓయూలో మరోమారు టెన్షన్ వాతావరణం నెలకొంది. జేఎన్ యూలో నెలకొన్న తాజా పరిస్థితులకు నిరసనగా ఏబీవీపీ విద్యార్థి సంఘం ఓయూలో ఫ్లాగ్ మార్చ్ కు సిద్ధమైంది. దీనితో ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు. ఓయూకు వెళ్లే రెండూ గేట్లను మూసివేశారు. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఖేడ్ ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అధిక్యం..

మెదక్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 18వ రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి అధిక్యంలో కొనసాగుతున్నారు. 18వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 47,495 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. 

11:26 - February 16, 2016

రాజస్థాన్ కా షేర్ 'సర్ధార్' పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాతో సమ్మర్ లో విడుదలకు సిద్ధమైపోతున్నాడు. ఇప్పటికే విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ఈ సినిమా ఈసారి రికార్డ్స్ ని అందుకునే ఊపులో పరుగులు తీస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో 150 కోట్ల మార్కెట్ ను సంపాదించుకుంటుందని ట్రేడ్ యూనియన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి సంక్రాంతికి రిలీజ్ చేసిన టీజర్ వరకు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెస్పాన్స్ , పవన్ కళ్యాణ్ యాక్టింగ్, దేవి శ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ , రాజస్థాన్ రతన్ పూర్ లో యాక్షన్ సీన్స్ ఇలా సినిమాకి ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయని, ఖచ్చితంగా ఈ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా డైరెక్టర్ బాబీ పవన్ కళ్యాణ్ పై ప్రత్యేకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేశాడట. అటువంటి యాక్షన్ సీన్స్ ఇప్పటివరకూ వెండితెరపై చూడలేదంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. అంతేకాదు, ఈసారి పవన్ స్టైల్ చాలా కొత్తగా ఉంటుందని, ముఖ్యంగా విలన్ కి హిందీలో వార్నింగ్ ఇచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ అంటున్నారు. సినిమాలో ఒక ఫైట్ ని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇది సినిమాలో ప్రత్యేక ఆకర్షణ అవుతుందని సినిమా ఈ సమ్మర్ లో ఫ్యాన్స్ కి , ఆడియన్స్ కి కూడ మంచి కిక్ ఇస్తుందని చెబుతున్నారు.

11:22 - February 16, 2016

అల్లు అర్జున్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సరైనోడు'. బోయపాటి శ్రీను సినిమాలంటేనే పోరాట సన్నివేశాలకు కొదవుండదని ముందే అర్థం చేసుకోవాలి. అటువంటి దర్శకుడు, ఎనర్జీ ఉన్న హీరో బన్ని కలిస్తే ఎలా ఉంటుందో 'సరైనోడు'లో చూపించ బోతున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను గత నెల 26న విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఈనెల 18న ఈ చిత్రం టీజర్‌ను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా, కేథరిల్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఎస్‌ఎస్‌ తమన్‌ బాణీలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు.

11:20 - February 16, 2016

ప్రభాస్‌ ప్రస్తుతం 'బాహుబలి 2' ది కన్‌క్లూజన్‌ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత వెంటనే మరొక సినిమా చేయడానికి గ్రీన్‌సిగల్‌ ఇచ్చాడు. రన్‌ రాజా రన్‌ దర్శకుడు సుజీత్‌తో ఈ చిత్రం చేయడానికి సిద్ధమైపోయాడు. ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందన్న దానిపైనే ఇంకా స్పష్టత రాలేదు. దీనిలో భాగంగా ప్రభాస్‌ ఇచ్చే డేట్స్‌ కోసం దర్శకుడు ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఈ ఆగస్టులో చేపట్టనున్నారు. ప్రభాస్‌ ఫ్రెండ్స్‌ బ్యానర్‌లో యు.వి. క్రియేషన్స్‌ వారు నిర్మించనున్నారు. బాహుబలి 2 ఈ ఏడాది అక్టోబర్‌కి పూర్తి చేస్తామని రాజమౌళి వెల్లడించారు. దీని దృష్ట్యా ప్రభాస్‌ కొత్త డిసెంబర్‌లో ఉండొచ్చనని తెలుస్తోంది.

11:19 - February 16, 2016

ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' తర్వాత తీస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్‌'. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 22న నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుకోనుంది. మెకానికల్‌ షెడ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'ఇక్కడ అన్నీ రిపేర్లు చేయబడతాయి' అనేది ఉప శీర్షికను పెట్టారు. రివేంజ్‌ డ్రామాను కుటుంబ కథతో మిళితం చేసి తీయనున్నారు. మోహన్‌లాల్‌ ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు తండ్రిగా నటించనున్నట్టు సమాచారం. నిత్యా మీనన్‌, సమంత కథానాయికలుగా చేస్తున్నారు. దేవీశ్రీప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు. హైదరాబాద్‌ సిటీ పరిసరాలపైనే ఉండే ఈ కథా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ వారు నిర్మిస్తున్నారు.

నారాయణ ఖేడ్ 14వ రౌండ్..

మెదక్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంద.ఇ 14వ రౌండ్ లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ కు 38,664 ఓట్ల అధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ 65,177, కాంగ్రెస్ 26,513, టిడిపి 10,425 ఓట్లు పోలయ్యాయి. 

11:00 - February 16, 2016

ఎండలో తిరిగొచ్చేసరికి ముఖంపై టాన్‌ పట్టేస్తుంది. దీనివల్ల ముఖం కాంతి విహీనంగా కనిపిస్తుంది. కాబట్టి కనీసం రెండు రోజులకోసారైనా టాన్‌ని వదిలించుకుంటే మంచిది. దీనికి వంటింట్లో దొరికే పదార్థాలనే ఉపయోగించుకోవచ్చు.

  • టమాటా గుజ్జు చర్మంపై మంచి ప్రభావం చూపిస్తుంది. దీనిని ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత కడిగేసుకుంటే టాన్‌ పోవడంతో పాటు మంచి మెరుపు వస్తుంది. అలాగే కీరదోస రసానికి గ్లిజరిన్‌, గులాబీ నీరు కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోవడానికి ముందు ముఖానికి రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే టాన్‌ పోవడమే కాక.. చర్మం రంగు మెరుగవుతుంది కూడా.
  • చిటికెడు పసుపు, ఒక స్పూను పాల పొడి, రెండు స్పూన్ల తేనె, అర చెక్క నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఆరిపోయాక కడిగేసుకోవాలి.
  • ఓట్స్‌ని పొడి చేసుకుని అందులో కొంచెం మజ్జిగ వేసుకుని, మురికి పేరుకున్న చోట ఆ మిశ్రమంతో బాగా రుద్దితే టాన్‌ వదిలిపోతుంది.
  • మురికిని పోగొట్టుకోవడానికి మరో సులవైన పద్ధతి.. కొబ్బరి నీళ్లు. ముఖాన్నీ, చేతుల్నీ కొబ్బరినీళ్లతో కడుక్కుంటే నలుపుదనం పోతుంది. చర్మం మృదువుగా మారుతుంది.
10:58 - February 16, 2016

ఈ కాలంలో మార్కెట్‌లో ఎక్కడ చూసినా విరివిగా కనిపించేవి చిలగడ దుంపలు. మరి వాటిలో ఉండే పోషకాలేమిటో చూద్దామా!

  • చిలగడ దుంపల్లో విటమిన్‌ బి6 సమృద్ధిగా లభిస్తుంది. హృద్రోగాలనూ దూరంగా ఉంచుతుంది.
  • విటమిన్‌ సి కూడా దీన్లో ఎక్కువే. ఇది శరీరంలో హాని చేసే వైరస్‌లతో పోరాడుతుంది. ఎముకల్నీ, దంతాలను దృఢంగా ఉంచుతుంది.
  • తరచూ ఈ దుంపల్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.
  • ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎంతో మేలు చేస్తుంది ఈ దుంప. చిలగడ దుంపల్లో ఉండే పొటాషియం వాపులను త్వరగా తగ్గిస్తుంది. మూత్రపిండాలకు మేలు చేస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ ఓ ఉడికించిన దుంప తీసుకుంటే సరి.
  • దీనిలో కెరొటినాయిడ్లు, బీటా కెరొటిన్లు, విటమిన్‌ ఎ అధికంగా లభిస్తాయి. ఇవి కంటి సమస్యలను దూరం చేస్తాయి. అందుకే ప్రతి రోజూ కూరలు, పులుసు, సలాడ్లు.. ఇలా ఏదో ఒక రూపంలో వీటిని తీసుకోవడం ఉత్తమం. 

ఖేడ్..ఎన్నిక మూడో స్థానంలో టిడిపి

మెదక్ : జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జూకల్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతోంది. 13 రౌండ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 34,564 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. 

10:53 - February 16, 2016

'చిన్నప్పట్నుంచి నాగార్జున గారంటే చాలా ఇష్టం. నా అభిమాన నటుడు 'పడేసావే' చిత్రానికి అసోసియేట్‌ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది' అని అంటోంది హీరోయిన్‌ నిత్యా శెట్టి. తను హీరోయిన్‌గా పరిచయం అవుతూ నటించిన చిత్రం 'పడేసావే'. చునియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిత్యాశెట్టి సోమవారం మీడియాతో ముచ్చటిస్తూ, 'ఇదొక ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ. సింపుల్‌గా సాగే ప్రేమ కథ అయినప్పటికీ ఎన్నో కన్ఫ్యూజన్స్‌ ఉంటాయి. చాలా కొత్తగా ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుంది. ఇందులో నీహారిక పాత్రలో నటిస్తున్నాను. నా పాత్ర అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను. అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఒక్కో పాట ఒక్కో జోనర్‌లో ఉంటుంది. ఇటీవల విడుదలైన పాటలకు శ్రోతల నుంచి విశేష స్పందన వస్తోంది. ఆడియో లాగానే సినిమా పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను. దర్శకురాలు చునియా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తను నాకు మంచి ఫ్రెండ్‌. మంచి డెడికేషన్‌ పర్సన్‌. ఆమెతో వర్క్‌ చేస్తున్నంత సేపు చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యాను. క్వాలిటీ, పర్ఫెక్షన్‌ విషయంలో చునియా ఏమాత్రం రాజీపడరు. అందుకే సినిమా చాలా బాగా వచ్చింది. కోస్టార్‌ కార్తీక్‌ జోవియల్‌గా ఉంటారు. నాతోపాటు మరో లీడ్‌ రోల్‌ పోషించిన సమీరా బాగా సపోర్ట్‌ చేశారు. నాకు చిన్నప్పటి నుంచి నాగార్జునగారంటే ఇష్టం. ఆయన మా సినిమాకు అసోసియేట్‌ అవ్వడం నిజంగా చాలా ఆనందాన్నిచ్చింది. ప్రస్తుతం రాహుల్‌ రవీంద్రన్‌ హీరోగా నటిస్తున్న 'శోభన్‌ బాబు' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యాను. దీంతోపాటు ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాను' అని అన్నారు.

10:51 - February 16, 2016

'తానెప్పుడూ బాలీవుడ్‌ని వదిలి వెళ్ళలేదని, సినిమాల మధ్య గ్యాప్‌ వచ్చినంత మాత్రానా బాలీవుడ్‌కి దూరమైనట్టు కాదని' అంటోంది పరిణీతి చోప్రా. రెండేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పరిణీతి యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ తాజాగా నిర్మిస్తున్న 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ,'వెంట వెంటనే సినిమాలు చేయనంత మాత్రానా బాలీవుడ్‌కి దూరమైనట్లు కాదు. మంచి కథల కోసం ఎదురు చూసే క్రమంలో ఎవరికైనా సమయం పడుతుంది. సినిమా పరంగా బిజీగా లేకపోయినా ఈవెంట్స్‌, వ్యాపార ప్రకటనలతో చాలా బిజీగా ఉన్నాను. దీంతోపాటు ఫిట్‌నెస్‌పై ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నాను. 10 నుంచి 12 ఏళ్ళ వరకు ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలన్న లక్ష్యం నెరవేరడానికి అవసరమైన ప్రేరణ, సంకల్ప శక్తి ఇప్పటివరకు లభించలేదు. ఇప్పుడు టైం రావడంతో అది సాధ్యపడింది. గత రెండేళ్ళుగా బాగా వర్కవుట్స్‌ చేసి ఫిట్‌నెస్‌పై పట్టు సాధించాను. 'మేరీ ప్యారీ బిందు'లో ఔత్సాహిక గాయనిగా నటిస్తున్నాను' అని చెప్పింది.

టీఆర్ఎస్ లో చేరిన టిడిపి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ..

ఖమ్మం : జిల్లాకు చెందిన ఇద్దరు టిడిపి నేతలు టీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే యూనిస్ సుల్తాన్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు లు సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 

10:44 - February 16, 2016

వరంగల్ : మేడారం జాతర..మహాకుంభమేలా తరహాలో జరిగే జాతరగా విశేషాదరణ పొందింది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రఖ్యాతిగాంచింది. మేడారం జాతరలో ఇక భక్తజనం సందడి సరేసరి. సుమారు రెండు కోట్ల మంది పోటెత్తే జాతరలో ఊహకందని అమ్మకాలు జరుగుతుంటాయి. నిత్యం జాతరలో కోట్లాది రూపాయలు చేతులు మారుతుండడంతో..మేడారంలో వ్యాపారం మూడు పూవులు..ఆరుకోట్లుగా సాగుతోంది.

జాతరలో ఎక్కడ చూసినా జోరుగా వ్యాపారాలు ...

అమ్మల దర్శనానిక కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు నిల్చుండే జాగ నుంచి మొదలుకొని..తాగునీరు, తినే తిండి వరకు అన్నీ కరెన్సీ నోట్లతో కొనాల్సిందే. అంతేకాదు రవాణా, విడిదితో పాటు తల్లులకు సమర్పించే బంగారంగా పిల్చుకునే బెల్లం, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, కోళ్లు, గొర్రెలు, మేకలు, కోళ్లు, మద్యం అన్నీ పచ్చనోట్లతో కొనాల్సిందే. దీంతో జాతరలో నిత్యం వందల కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో మేడారంలో అడుగు తీసి అడుగు పెట్టాలంటే నోట్ల కట్ట బయటకు తీయాల్సిందే.

ఏది ముట్టుకున్నా..వందలు..వేలల్లోనే ...

కోట్లాది మంది భక్తులు తరలొచ్చే జాతరలో ఏది ముట్టుకున్నా..వందలు..వేలల్లోనే ఉంటాయి. జాతర సందర్భంగా వ్యాపారులు ఇదే సందనుకొని రేట్లను అమాంతం పెంచేశారు. దీంతో ఏది కొనాలన్నా,..ఏది తినాలన్నా 500నోటు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

అధికారికంగా ఇంకా మొదలుకాకముందే...

మేడారం జాతర అధికారికంగా ఇంకా మొదలుకాకముందే పరిస్థితి ఇలా ఉంటే..ఇక 17నుంచి 22 వరకు జరిగే జాతరలో ఇంకా రేట్లు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. జాతర నేపథ్యంలో వ్యాపారస్తులంతా ఇప్పటికే అక్కడ పాగావేశారు. పక్కరాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు ఇక్కడకొచ్చి తిష్టవేస్తుండడంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్రా, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్‌. గుజరాత్‌, రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో వ్యాపారస్తులు కూడా తమ తమ రాష్ట్రాల భక్తులను ఆకట్టుకునేందుకు స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల్ని ఖర్చు...

ఇప్పటికే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల్ని ఖర్చుచేస్తోంది. ఈ లెక్కన చూస్తే జాతర పూర్తయ్యేలోగా సుమారు 500 కోట్లకుపైనే లావాదేవీలు జరుగుతాయని అంచనా. సిబ్బంది అలవెన్సులు, భోజనాలుర, నిర్వహణ ఖర్చులు వీటికి అదనం అనే చెప్పాలి. మొత్తానికి మేడారం జాతర వ్యాపారస్తులకు కాసుల వర్షం కురిపించడం ఖాయంగా కన్పిస్తోంది. సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత అన్నట్లుగా జోరుగా వ్యాపారం సాగుతోంది. 

ఖేడ్ ఉప ఎన్నిక..13వ రౌండ్..

మెదక్ : నారాయణఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. 13వ రౌండ్ లో 34,564 ఓట్ల అధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి దూసుకపోతున్నారు. టీఆర్ఎస్ 59,506, కాంగ్రెస్ 24,942, టిడిపి 10,094 ఓట్లు పోలయ్యాయి. 

కేసీఆర్ పర్యటన..ఎస్ఎఫ్ఐ కార్యకర్తల అరెస్టు..

ఖమ్మం : జిల్లాలో సీఎం కేసీఆర్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. 

జవాన్ ముస్తాక్ కుటుంబాన్ని పరామర్శించిన కేఈ..

కర్నూలు : బండిఆత్మకూరు (మం) పార్నెపల్లెలో జవాన్ ముస్తాక్ కుటుంబాన్ని డిప్యూటి సీఎం కేఈ పరామర్శించారు. రూ.25 లక్షల చెక్కును కేఈ అందచేశారు.

 

10:38 - February 16, 2016

మంచు మనోజ్‌, రెజీనా జంటగా బేబీ త్రిష సమర్పణలో సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దశరథ్‌ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ఆడియో సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మంచు మనోజ్‌ మాట్లాడుతూ, 'ఆడియో పెద్ద సక్సెస్‌ సాధించింది. ట్రైలర్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. వేదా మంచి ట్యూన్లతోపాటు అలరించే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని కూడా అందించారు. త్వరలోనే ఆడియో ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుకని కూడా నిర్వహించనున్నాం. ఈ సినిమా ద్వారా నూతన గాయనీగాయకులను పరిచయం చేశాం. సినిమా నిర్మాణ విషయంలో నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మార్చి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో విడుదల చేస్తున్నాం' అని అన్నారు. 'దశరథ్‌ కాంపౌండ్‌ నుంచి పాట రాయమని ఫోన్‌ రాగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నాకు బాగా నచ్చిన దర్శకుడు దశరథ్‌. కుటుంబ బంధాలకు, విలువలకు మంచి ప్రాధాన్యత ఇస్తారు. ఆయన సినిమాలో మంచి పాటలు రాసే అవకాశం రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. వేదగారు సమకూర్చిన ట్యూన్లు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఈసినిమాలోని పాటలతో మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను' అని వరికుప్పుల యాదగిరి చెప్పారు. దర్శకుడు దశరథ్‌ మాట్లాడుతూ,'ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. వేద మంచి సంగీతాన్ని అందించారు. ఆడియో మాదిరిగానే సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను' అని అన్నారు. 'వేద దగ్గర్నుంచి మంచి ట్యూన్లు రాబట్టుకోవడం కోసం బాగా వేధించాం. మార్చి 4వ తేదీన గ్రాండ్‌గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం' అని నిర్మాత చెప్పారు. 'ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా ద్వారా కొత్త సింగర్స్‌ని పరిశ్రమకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడిగా మంచి పేరుని తీసు కొచ్చే చిత్రమిది' అని వేద తెలిపారు.

10:35 - February 16, 2016

కర్నూలు :   జవాన్ ముస్తాక్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి పరామర్శించి.. రూ.25 కోట్లు చెక్కును అందజేశారు. సియాచిన్ లో వీర మరణం పొందిన జవాన్ ముస్తాక్ అహ్మద్ అంతిమయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గతరాత్రి కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి ముస్తాక్ మృతదేహాన్ని తీసుకొచ్చారు. తొలుత ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఏయిర్ పోర్ట్ కు తీసుకొచ్చారు. అక్కడ ఆయనకు సైనిక లాంఛనాలతో త్రివిధ దళాలు శ్రద్ధాంజలి ఘటించాయి. అనంతరం ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్‌లో కర్నూలు జిల్లాలోని ఆయన స్వగ్రామానికి తరలించారు. పార్నెపల్లెలో అధికార లాంఛనాలతో ముస్తాక్‌కు అంత్యక్రియలు నిర్వహిస్తారు ముస్తాక్ అంత్యక్రియలకు వైసీపీ నేత జగన్ హాజరు కానున్నట్లు సమాచారం.

ప్రతిపక్ష నేతలతో కొనసాగుతున్న ప్రధాని సమావేశం..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేతలతో జరుపుతున్న సమావేశం కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రధాని చర్యలు చేపడుతున్నారు.

ఖేడ్ 11వ రౌండ్..

మెదక్ : నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. పదకొండు రౌండ్లు ముగిసేసరికి 27,893 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్‌ఎస్‌కు 49,075, కాంగ్రెస్‌కు 21,182, టీడీపీకి 9,044 ఓట్లు పోలయ్యాయి. మరో 11 రౌండ్లలో పూర్తి స్థాయి ఫలితం వెలువడనుంది

ఖేడ్..టెన్త్ రౌండ్..

మెదక్ : జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జూకల్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరుగుతోంది. పది రౌండ్లలో టిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి అధిక్యంలో కొనసాగుతున్నాయి. 13వ తేదీన నిర్వహించిన పోలింగ్ లో మొత్తం 1,88,373 ఓటర్లకు గాను 1,54,866 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పదో రౌండ్ : టిఆర్ఎస్ అభ్యర్థి 25,311 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇంకా ఆరు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. 

కాసేపట్లో ముస్తాక్ అంత్యక్రియలు

కర్నూలు : బండిఆత్మకూరు మండలం పార్నెపల్లెలో మరి కాసేపట్లో అమరజవాన్ ముస్తాక్ అంత్యక్రియులు జరగనున్నాయి. కొద్ది సేపటి క్రితం జవాన్ ముస్తాక్ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి పరామర్శించి.. రూ.25 కోట్లు చెక్కును అందజేశారు. ముస్తాక్ అంత్యక్రియలకు వైసీపీ నేత జగన్ హాజరు కానున్నట్లు సమాచారం.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

ముంబై : స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 76 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 26 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. 

నలుగురు టెర్రరిస్టుల ఎన్ కౌంటర్..

అస్సాం : అస్సాం - అరుణాచల్ సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. హతమైన వారిలో ఎన్ఎస్సీఎన్ కి చెందిన ముగ్గురు, ఒకరు ఉల్ఫాకు చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. ఒక ఎకే 56, 2 పిస్టల్స్ ను ఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు.

జవాన్ ఎలుమలైకి నివాళులు..

చెన్నై : జవాన్ ఎలుమలైకి ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. సియాచిన్‌ హిమనీనదంలో ఇటీవల జరిగిన హిమపాతంలో ఓ సైనికాధికారి సహా పది మంది గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఏలుమలై, ఎస్‌ కుమార్‌, గణేశన్‌, రామమూర్తి అనే నలుగురు జవాన్లు మృతిచెందారు. 

బీజేపీ అభ్యర్థుల ముందంజ..

కర్ణాటక : దేవదుర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. బీజేపీ అభ్యర్థి శివన గౌడ నాయక్ 4893 ఓట్లతో ముందంజలో ఉన్నారు. హెబ్బల్ నియోజకవర్గంలో వై.ఎ.నారాయణ స్వామి 12063 ఓట్లలతో ముందంజలో ఉన్నారు. 

ఆప్ నేతకు బెదిరింపు కాల్స్....

హైదరాబాద్ : ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న వివాదం రాజకీయ నేతల మెడకు చుట్టుకుంది. అప్పటిదాకా ఢిల్లీలో నిశ్చింతగా నిద్రపోయిన పలువురు నేతలకు ప్రస్తుతం కంటి మీద కునుకు పడటం లేదు. జేఎన్ యూ వివాదంపై స్పందించిన కారణంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇక సీపీఎం పార్టీ కార్యాలయంపై రాళ్ల వర్షం కూడా కురిసింది. ఈ నేపథ్యంలో ఏచూరికి భద్రతను పెంచిన ప్రభుత్వం, సీపీఎం కార్యాలయం వద్ద భారీగా బలగాలను మోహరించింది.

ప్రతిపక్ష నేతలతో ప్రధాని సమావేశం..

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రధాని చర్యలు చేపడుతున్నారు. 

10:08 - February 16, 2016

మెదక్ : నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్ లో కారు జోరు కొనసాగుతుంది. ప్రతి రౌండ్ లో నూ టిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యత కనబరుస్తున్నారు. మొత్తం 21 రౌండ్లకు గాను 14రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తియింది. ఈ సమయానికి టిఆర్ ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 38,664 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం లెక్కించిన ఓట్లలో ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌కు 65,177, కాంగ్రెస్‌కు 26,513, టీడీపీకీ 10,425 ఓట్లు వచ్చాయి. ఈనెల 13న నిర్వహించిన పోలింగ్‌లో నియోజకవర్గంలోని మొత్తం 1,88,373 ఓటర్లకు గాను 1,54,866 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 టేబుళ్లపై 21 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. మొత్తం 137 మంది సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

భూపాల్ రెడ్డి అధిక్యం..

మెదక్ : నారాయణఖేడ్ లో ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతున్నారు. 9వ రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ కు 39,509, కాంగ్రెస్ కు 16,979, టిడిపికి 7,758 ఓట్లు పోలయ్యాయి. 

17,366 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి

మెదక్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 7వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 17,366ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. లెక్కించిన ఓట్ల మొత్తంలో టిఆర్ఎస్ కు 30,217, కాంగ్రెస్ కు 12,851, టీడీపీ 6670 ఓట్ల వచ్చాయి.

09:47 - February 16, 2016

హైదరాబాద్ : ఢిల్లీ జేఎన్ యూ లో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. ఉగ్రవాది అఫ్జల్‌గురు ఉరితీతను నిరసిస్తూ ఓ వర్గం ర్యాలీ తీయడం, ర్యాలీని ఏబీవీపీ అడ్డుకోవడంతో రేగిన వివాదం చినికిచినికి గాలివానలా మారింది. ర్యాలీ నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు నిన్న కోర్టులో హాజరుపరిచారు. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ మాజీ లెక్చరర్‌ గిలానీని ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్‌ చేశారు. ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో అఫ్జల్‌గురుకు అనుకూలంగా నినాదాలు చేసిన కేసులో గిలానీని అరెస్ట్ చేసి రాజద్రోహం కేసు నమోదు చేశారు.

09:45 - February 16, 2016

వరంగల్ : మేడారం జాతర. దేశంలోనే గిరిజనుల పెద్ద పండుగ. తెలంగాణలోని వరంగల్‌ జిల్లా మేడారంలో జరుగుతున్న ఈ జాతరకు గిరిజనులే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు.

కోటి మందికి పైగా భక్తులు వస్తారని అంచనా....

మూడు రోజుల పాటు జరిగే జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ వినియోగం కూడా బాగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్లాస్టిక్‌ వ్యర్ధాలు గుట్టల్లా పేరుకుపోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలంటున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన జాతరకు కోటికి పైగా భక్తులు వచ్చారని.. వారు వదిలి వెళ్లిన ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఇరవై టన్నులకు పైగా ఉందంటున్నారు. ఈసారి అలా కాకుండా ప్లాస్టిక్‌ బ్యాగులు వాడకుండా భక్తులలో అవగాహన పెంచాల్సిన అవసరముందంటున్నారు.

పాస్టిక్‌ వ్యర్ధాలతో పశువుల ప్రాణాలకు ముప్పు......

జాతర జరిగే సమయంలో భక్తులు ఇక్కడ వదిలివెళ్లే ప్లాస్టిక్‌ వ్యర్ధాల వల్ల ఇక్కడ ఉండే పశుపక్ష్యాదుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యారీబ్యాగుల వల్ల పంటలు సైతం పండని పరిస్థితి నెలకొందంటున్నారు. అందుకే జాతరకు వచ్చే భక్తులు క్యారీ బ్యాగులు వాడకుండా.. పేపర్‌, జూట్‌ బ్యాగులు వాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముందంటున్నారు.

ప్లాస్టిక్‌ నివారణ కోసం ప్రత్యేక కమిటీ .....

గతంలో మాదిరిగా ప్లాస్టిక్‌ వల్ల ఇబ్బందులు రాకుండా గిరిజన సంఘాలతో ఒక ప్రత్యేక కమిటీని వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశీలిస్తూ ప్లాస్టిక్‌ను నివారించే విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. షాపులలో కూడా పర్యావరణానికి ముప్పు వాటిల్లే కవర్లు వాడకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇప్పటికే షాపు యజమానులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ నివారణ కోసం నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని పలువురు భావిస్తున్నారు. 

14,155 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి

మెదక్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 6వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 14,155 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. లెక్కించిన ఓట్ల మొత్తంలో టిఆర్ఎస్ కు 25,688, కాంగ్రెస్ కు 11,533, టీడీపీ 5,560 ఓట్ల వచ్చాయి.

11,565 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి

మెదక్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 5వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 11,565 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. లెక్కించిన ఓట్ల మొత్తంలో టిఆర్ఎస్ కు 21,664, కాంగ్రెస్ కు10,099, టీడీపీ 4896 ఓట్ల వచ్చాయి.

4 రౌండ్ లో 9,662 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

మెదక్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు లో 7302 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. మొత్తం లెక్కించిన ఓట్లలో టిఆర్ఎస్ కు 17,277, కాంగ్రెస్ కు 7615, టిడిపి కి 3853 ఓట్లు వచ్చాయి.

3 రౌండ్ లో7302 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

మెదక్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్ పూర్తయ్యింది. ఈ రౌండ్ లో 7302 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. 

2రౌండ్ లో3955 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

మెదక్ : నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ పూర్తయ్యింది. ఈ రౌండ్ లో 3955 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. టీఆర్ఎస్ 7,912, కాంగ్రెస్ 3957, టిడిపి 1533 ఓట్ల వచ్చినట్లు తెలుస్తోంది.

వీటీపీఎస్ లో సాంకేతిక లోపం

కృష్ణా : విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వీటీపీఎస్‌) 5వ యూనిట్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపంతో 210మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సమస్య పరిష్కారానికి 5రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

గిలాని అరెస్ట్... దేశద్రోహం కేసు నమోదు

హైదరాబాద్ : ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లో చేలరేగిన కల్లోలం మరింత విస్తరించేలానే ఉంది. భారత పార్లమెంటుపై దాడికి పథక రచన చేసిన అఫ్జల్ గురు ఉరి తీతను నిరసిస్తూ ఓ గ్రూపు ర్యాలీ తీయడం, ఏబీవీపీ విద్యార్థులు దానిని అడ్డుకున్న నేపథ్యంలో రాజుకున్న చిన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ర్యాలీ నిర్వహించిన విద్యార్థి సంఘం నేత కన్హయ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న కోర్టులో హాజరుపరిచారు. 

08:17 - February 16, 2016

మెదక్ : కొద్ది సేపటి క్రితం నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. ఈనెల 13న నిర్వహించిన పోలింగ్‌లో నియోజకవర్గంలోని మొత్తం 1,88,373 ఓటర్లకు గాను 1,54,866 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 టేబుళ్లపై 21 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. మొత్తం 137 మంది సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేశారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడే ఓట్ల లెక్కింపు కొనసాగనున్నది. ప్రతి టేబుల్ వద్ద నలుగురు గెజిటెడ్ అధికారులు పర్యవేక్షిస్తారు. రౌండ్లవారీగా ఫలితాలను మీడియాతోపాటు వెబ్‌సైట్లో ఎప్పటికప్పుడు పొందుపరుచనున్నారు. లెక్కింపు కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు.

ఖేడ్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం

మెదక్ : కొద్ది సేపటి క్రితం నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేశారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడే ఓట్ల లెక్కింపు కొనసాగనున్నది. కౌంటింగ్ కోసం ప్రధాన టేబుల్‌తో సహా 14 టేబుళ్లు ఏర్పాటు చేసి 21 రౌండ్లలో ఫలితాలు వెల్లడించనున్నారు. ప్రతి టేబుల్ వద్ద నలుగురు గెజిటెడ్ అధికారులు పర్యవేక్షిస్తారు. రౌండ్లవారీగా ఫలితాలను మీడియాతోపాటు వెబ్‌సైట్లో ఎప్పటికప్పుడు పొందుపరుచనున్నారు.

రేపు తాత్కాలిక సచివాలయానికి శంకుస్థాపన

గుంటూరు : తాత్కాలిక సచివాలయం నిర్మించే వెలగపూడి రెవెన్యూ ప్రదేశాన్ని ఎల్‌అండ్‌ టి కంపెనీ ప్రతినిధులు, షాపూంజీ కంపెనీ ప్రతినిధులు , సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ సోమవారం పరిశీలించారు. విజయవాడలో మంత్రుల క్యాబినెట్‌ మీటింగ్‌లో తాత్కాలిక సచివాలయం మీద చర్చ సమయంలో కంపెనీ ప్రతినిధులు ప్రదేశ పరిశీలనకు వచ్చారు. శంకుస్తాపన ముహుర్తం ఈనెల 17న ఖరారు చేస్తారనే సమాచారం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లు కోసం ప్రతినిధులు పరిశీలనకు వచ్చినట్టు తెలిసింది. సీఆర్‌డీఏ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ యం.

మేడారం జాతరకు ప్రత్యేక రైలు

హైదరాబాద్ : ఈ నెల 17,18,19,20 తేదీల్లో జరగనున్న సమ్మక్క జాతర సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు నడుపుతుంది. 18నుంచి 20వ తేదీ వరకు సిర్‌పూర్ కాగజ్‌నగర్-ఖమ్మం మధ్యన ప్రత్యేక రైలు నడవనుంది. కాగజ్‌నగర్ నుంచి ఈ రైలు ఉదయం బయలుదేరి కొలనూర్ స్టేషన్‌కు 7.45కు వస్తుంది. అలాగే కాజీపేట్ నుంచి సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌కు వెళ్లేప్పుడు కొలనూర్‌కు రాత్రి 8. 16గంటలకు వస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి. భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు.

నేడు అమరజవాన్ ముస్తాక్ అంత్యక్రియలు..

కర్నూలు : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో మంచుచరియలు విరిగి పడిన ప్రమాదంలో జవాన్‌ ముస్తాక్‌ అహ్మద్‌ మృతి చెందాడు. అహ్మద్‌ పార్థివదేహాన్ని అతని స్వస్థలమైన కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం పార్నపల్లె తరలించారు. ప్రజల సందర్శనార్థం ఉదయం 10గంటల వరకు అహ్మద్‌ పార్థివదేహాన్ని ఆయన నివాసంలోనే ఉంచుతారు. అహ్మద్‌ అంతిమయాత్రలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ప్రతిపక్షనేత జగన్‌ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ముందుగా సైనికలాంఛనాలతో, తర్వాత ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వర్తిస్తారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

తిరుమల: తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల, కాలినడకన వచ్చిన భక్తులకు 2గంటల సమయం పడుతోంది. 

07:30 - February 16, 2016

హైదరాబాద్ : యూనివర్శిటీల్లో జరుగుతున్న పరిణామాలు, పార్టీ కార్యాలయాలపై దాడులను పార్టీలకు అతీతంగా ఖండించాలని 'న్యూస్ మార్నింగ్' చర్చలో నేతలు అభిప్రాయాపడ్డారు. జెఎన్‌యూ ఘటనకు సంబంధించి మతతత్వ శక్తుల ఆగడాలు మితిమీరుతున్నాయి. నిన్న సిపిఎం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన గూండాలు...తాజాగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని చంపేస్తామంటూ బెదిరించారు. మరోవైపు జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్యకుమార్‌కు కోర్టు రెండు రోజుల కస్టడీని పొడిగించింది. కోర్టు వద్ద బిజెపి ఎమ్మెల్యే సాక్షిగా లాయర్లు విద్యార్థులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. విద్యార్థుల అరెస్ట్‌కు నిరసనగా మంగళవారం ఆందోళనకు జెఎన్‌యు అధ్యాపక బృందం పిలుపునిచ్చింది. మరో వైపు రాహుల్ గాంధీ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారా? స్టూడెంట్స్ యూనియన్స్ అవసరామా? యూనివర్శిటీలు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయా? చట్టాన్ని న్యాయవాదులు, ఎమ్మెల్యే తమ చేతుల్లోకి తీసుకోవడం కరెక్టేనా? ఇదే అంశాలపై 'న్యూస్ మార్నింగ్ ' లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్, కాంగ్రెస్ నేత తులసి రెడ్డి, బిజెపి నేత పాశం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

07:11 - February 16, 2016

బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వాల ప్రాధాన్యతలను చాటి చెబుతుంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాధాన్యతా పథకాలకు తగినన్ని నిధులు కేటాయించకపోతే, ఆయా పథకాలు ముందుకు సాగవు. అయితే, మనదేశంలో బడ్జెట్ కేటాయింపుల్లో స్త్రీ సంక్షేమానికి ఆది నుంచీ అన్యాయమే జరుగుతోంది. ఇదే అంశం పై జనపథం లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ఏపీ ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు.

ఆశ్చర్యకర ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న మహిళలెందరో....

అద్భుత విజయాలు, ఆశ్చర్యకర ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్న మహిళలెందరో మన చుట్టూ వున్నారు. ఆవకాయ పచ్చళ్ల తయారీ నుంచి అంతరిక్ష యానం వరకు మహిళలు తమ సత్తాచాటని రంగమంటూ లేదు. అవకాశం వస్తే తామేంటో నిరూపించుకోవడానికి ఈ దేశ మహిళలెప్పుడూ పోటీపడుతూనే వుంటారు. టెన్త్ , ఇంటర్మీడియట్, ఎంసెట్, ఎడ్ సెట్, ఈసెట్, ఐసెట్, లాసెట్, గ్రూప్స్, సివిల్స్ ఇలా ఏ పరీక్షలోనైనా టాపర్స్ గా నిలవడం నేటితరం అమ్మాయిలు ఆనవాయితీగా మార్చేశారు. ఇలా ఎన్ని రంగాలలో ఎన్నెన్ని విజయాలు సాధిస్తున్నా, ఇంటా బయటా దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు. అద్భుత విజయాలు సాధిస్తున్న ప్రతి మహిళ జీవితంలోనూ ఎన్నో వేదనలు. కన్నీళ్లు. ప్రతి పనిలోనూ ఎన్నో అవాంతరాలు. ఎన్నో అవహేళనలు. ఎన్నో వెక్కిరింతలు. మరెన్నో ప్రతిబంధకాలు. చదువుల్లోనూ కెరీర్ లోనూ ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఎన్నెన్ని బాధలు ఓర్చుకోవాలో.

ఆకాశంలో సగ భాగమంటూ....

ఆకాశంలో సగ భాగమంటూ పైకి ఎంత కీర్తిస్తున్నా అవకాశాల్లో ఇస్తున్నది అంతంతమాత్రపు స్థానమే. గర్భం మోసేది స్త్రీలు. కానీ, మన దేశంలో సగం మంది గర్భిణీలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పురుడు పోసుకోవాల్సి వస్తోంది. అభివ్రుద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో గర్భిణీల మరణాలు అధికం. డాక్టర్ల సమీక్షంలో పురుడు పోసుకుంటున్న మహిళల సంఖ్య అతి తక్కువ. రక్తహీనత మన దేశ మహాలక్ష్మిలను వెంటాడుతున్న మరో శాపం. మధ్యలోనే బడి మానేసివారి సంఖ్యా అమ్మాయిల్లోనే ఎక్కువ. కేవలం బడిలో టాయ్ లెట్స్ లేని కారణంగా చదువులు మానేస్తున్న చిట్టితల్లులెందరో. హైదరాబాద్; విజయవాడ, విశాఖ, తిరుపతి ఇలా ఏ నగరానికి వెళ్లినా, మహిళలకు పబ్లిక్ టాయ్ లెట్స్ కనిపించవు. మన ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు మహిళల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

స్త్రీల సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలి.....

అందుకే బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వాలు స్త్రీల సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యతనివ్వాలి. కానీ దురద్రుష్టవశాత్తు గత కేంద్ర బడ్జెట్ లో స్త్రీ శిశు సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపులు భారీగా తగ్గాయి. ఈ సారైనా అరుణ్ జైట్లీ ఆ లోపాన్ని సరిదిద్దాల్సి వుంటుంది. భేటీ బచావో, భేటీ పడావో లాంటి ఆకర్షణీయ నినాదాలిస్తున్నా అందుకు తగ్గ కేటాయింపులు కనిపించడం లేదు. ఐసీడీఎస్, మిడ్ డే మీల్స్ లాంటి పథకాలను పరిపుష్టం చేయకుండా, వాటికి కేటాయింపులు పెంచకుండా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సౌకర్యాలు మెరుగుపరచకుండా ఆడపిల్లల్లో విద్యాభివ్రుద్ధిని సాధించడం ఎలా సాధ్యమో అర్ధంకాదు. ఆడపిల్లల సంక్షేమాన్ని ద్రుష్టిలో పెట్టుకుని సుకన్య సమ్రుద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు, అత్యధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నట్టు గత బడ్జెట్ లో ప్రకటించారు. కానీ, ఈ పథకం వల్ల ఆడపిల్లలకు కానీ, వారి అమ్మానాన్నలకు కానీ ప్రత్యేకంగా ఒరగబెడుతున్నదేమీ లేదు. మిగులు ఆదాయం వున్నవారికి, 18ఏళ్ల పాటు ఆ ఖాతాలోని డబ్బులు ముట్టుకోవాల్సిన అవసరం కలగనివారికే మాత్రమే అది ఉపయుక్తం. కానీ, ఏ పూట రెక్కల కష్టంతో ఆ రోజు జీవితం వెళ్లబుచ్చేవారి సంఖ్యే 90శాతం వున్న మనదేశంలో ఇలాంటి పథకాలు ప్రచారానికి తప్ప, అసలు సిసలు స్త్రీ సంక్షేమానికి ఉపకరించవు. పథకాల రూపకల్పనలోనూ, బడ్జెట్ కేటాయింపుల్లోనూ వాస్తవిక ద్రుష్టిని ప్రదర్శించాలి. స్త్రీ శిశు సంక్షేమానికి సముచిత ప్రాధాన్యతనివ్వాలి. 

07:07 - February 16, 2016

ఢిల్లీ : ఈనెల 23 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బడ్జెట్‌ భేటీని సజావుగా నడిపించేందుకు కేంద ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పార్లమెంటు ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలతో సమావేశం కానున్నారు. ఢిల్లీలో జేఎన్ యూ వ్యవహారం రగులుతున్న నేపథ్యంలో మోదీ ఏర్పాటు చేసిన ఈ భేటీకి రాజకీయ ప్రధాన్యత సంతరించుకుంది.

ఉభయ సభల్లోని ప్రధాన పార్టీల నేతలతో సమావేశం ....

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు వచ్చే వారంలో ప్రాంరంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సెవెన్‌ రేస్‌ కోర్స్‌ రోడ్‌లోని ప్రధాని నివాసంలో జరిగే ఈ సమావేశానికి పార్లమెంటు ఉభయ సభల్లోని ప్రధాన పక్ష నేతలను ఆహ్వానించారు. మొదటి విడత బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 23 నుంచి మార్చి 16 వరకు కొనసాగుతాయి. రెండో దఫా సమావేశాలను ఏప్రిల్‌ 25 నుంచి మే 13 వరకు నిర్వహిస్తారు. తొలి రోజు పార్లమెంటు ఉయభ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగిస్తారు. ఈనెల 25న రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 29న 2016-17 వార్షిక బడ్జెట్‌ సమర్పిస్తారు.

బడ్జెట్‌ సమావేశాలకు ముందే రాజకీయ వివాదాలు .....

పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం అవసరం. అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ ఇదే అంశాన్ని చర్చిస్తారు. బడ్జెట్ భేటీ ప్రారంభానికి ముందే దేశంలో రాజకీయ వివాదాలు వేడెక్కాయి. 2001లో పార్లమెంటుపై దాడి చేసిన జైషే మహ్మద్‌ నేత అఫ్జల్‌ గురును 2013లో ఉరి తీశారు. ఈనెల 9 ఢిల్లీలోని జేఎన్‌యూలో నిర్వహించిన అఫ్జల్‌గురు సంస్మరణ సభపై తీవ్ర రగడ జరుగుతోంది. అఫ్జల్‌ గురు ఆశయసాధనకు కృషి చేయాలన్నకన్హయ కుమార్‌పై దేశ ద్రోహం కేసు పెట్టారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగే అవకాశంలేదని భావించిన ప్రధాని మోడీ... అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

జీఎస్‌టీ బిల్లు ఆమోదానికి మూడింట రెండొంతుల మెజార్టీ .....

రైల్వే, సాధారణ బడ్జెట్‌తోపాటు, జీఎస్‌టీ వంటి కీలక బిల్లులు పార్లమెంటు ఆమోదాం పొందాల్సి ఉన్న నేపథ్యంలో... ఉభయసభలు సజావుగా సాగేందుకు ప్రధాని మోదీ అఖిలపక్ష సహకారాన్ని అర్ధిస్తారు. ఈ బిల్లు ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజార్టీతో ఆమోదం పొందాల్సి ఉంది. కానీ రాజ్యసభలో ఎన్డీయేకి 63 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. మూడింట రెండొంతులు మెజార్టీతో బిల్లు ఆమోదం పొందాలంటే 163 మంది సభ్యులు మద్దతు కావాల్సి ఉంటుంది. ఇందుకు కాంగ్రెస్‌, వామపక్షాల సహకారం తప్పనిసరి అవుతుంది. మోదీ నిర్వహించే అఖిలపక్ష భేటీలో ఎటువంటి నిర్ణయం వెలవుడుతుందో చూడాలి. 

07:04 - February 16, 2016

హైదరాబాద్ : సియాచిన్ లో వీర మరణం పొందిన జవాన్ ముస్తాక్ అహ్మద్ స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి ముస్తాక్ మృతదేహాన్ని తీసుకొచ్చారు. తొలుత ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఏయిర్ పోర్ట్ కు తీసుకొచ్చారు. అక్కడ ఆయనకు సైనిక లాంఛనాలతో త్రివిధ దళాలు శ్రద్ధాంజలి ఘటించాయి. అనంతరం ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్‌లో కర్నూలు జిల్లాలోని ఆయన స్వగ్రామానికి తరలించారు. నేడు పార్నెపల్లెలో ముస్తాక్‌కు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ముస్తాక్ మృతి పట్ల ఏపీ కేబినెట్ శ్రద్ధాంజలి ఘటించింది.

07:02 - February 16, 2016

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా పది పరిశుభ్రమైన నగరాల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఈ టాప్ టెన్‌లో మైసూర్ మొదటి స్థానంలో ఉండగా, రెండోస్థానంలో చండీగఢ్, మూడోస్థానంలో తమిళనాడులోని తిరిచ్చిరాపల్లి, ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నం టాప్ టెన్ క్లీన్ సిటీస్‌లో ఐదో స్థానాన్ని దక్కించుకుని తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. ఆరవ స్థానంలో సూరత్, రాజ్‌కోట్‌కు ఏడవ స్థానం, 8వ స్థానంలో గ్యాంగ్‌టక్‌, 9 వ స్థానంలో పింప్రీ ఛింద్‌వాడ, పదో స్థానంలో గ్రేటర్‌ ముంబై నిలిచాయి. పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు, మౌలిక సదుపాయాల కల్పనలో నగరాల మధ్య పోటీతత్వం పెంచేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.

2014లో ఢిల్లో ప్రారంభం....

ప్రధాని నరేంద్ర మోది స్వచ్ఛ్‌భారత్‌ కార్యక్రమాన్ని 2014లో ఢిల్లీలో ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు. 2014 స్వచ్ఛసర్వేక్షణ్ లో భాగంగా 73 నగరాలు, పట్టణాల్లో కేంద్రం సర్వే నిర్వహించింది. 2016 సర్వేలో నాలుగు నగరాలు విశాఖ, సూరత్, రాజ్‌కోట్, గ్యాంగ్‌టక్‌ టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకోగా... నవీ ముంబై, చెన్నై, పుణె, నాసిక్‌లు టాప్‌టెన్‌లో నుంచి చోటు కోల్పోయాయి. కొత్త సర్వే ప్రకారం కనీసం 10 లక్షల జనాభా కలిగిన నగరాలకు పరిమితం చేసింది. మౌళిక సదుపాయాలు, శానిటేషన్, వ్యక్తిగత టాయ్‌లెట్స్, పబ్లిక్‌, కమ్యునిటీ టాయ్‌లెట్లు, చెత్తను రవాణా చేసే విధానం ఆధారంగా క్లీన్‌ సిటీలను ఎంపిక చేశారు.

టాప్‌ చెత్తనగరాల్లో జార్ఖండ్‌లోని ధన్‌బాద్ 73వ స్థానంలో...

టాప్‌ చెత్తనగరాల్లో జార్ఖండ్‌లోని ధన్‌బాద్ 73వ స్థానంలో నిలిచింది. పాట్నా, మీరట్, వారణాసి, జంషెడ్‌పూర్‌, రాయ్‌పూర్‌, ఈటానగర్‌ తదితర నగరాలు కూడా చెత్త నగరాల జాబితాలో చేరాయి. స్వచ్ఛ సర్వేక్షన్‌ జాబితాలో హైదరాబాద్‌ 19, విజయవాడ 23, వరంగల్‌ 32 వ స్థానాల్లో నిలిచాయి. 2019 నాటికి పూర్తి స్వచ్ఛ భారత్ సాధించాలన్నది ప్రధాని మోది లక్ష్యంగా పెట్టుకున్నారు.

07:00 - February 16, 2016

హైదరాబాద్ : రైతుల సమస్యలపై రాష్ట్ర స్థాయి కమిషన్ వేయాలని తెలుగు ప్రభుత్వాలకు హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యల పై వేసిన ప్రజాప్రయోజనాల వాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. గతంతో పోలిస్తే ఆత్మహత్యలు తగ్గాయని తెలంగాణ ప్రభుత్వం.. సూసైడ్స్ ను నివారించేందుకు రాధాకృష్ణ కమిషన్ కు నివేదికలు ఇచ్చామని ఏపి సర్కారు.. కోర్టుకు తెలిపాయి.

06:57 - February 16, 2016

హైదరాబాద్ : వచ్చే బడ్జెట్‌లో నీటి పారుదల రంగానికి టి సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. సిఎం కేసిఆరే స్వయంగా ఈ మాట అన్నారు. ఈ నేపథ్యంలో ఏ ప్రాజెక్ట్‌కు ఎంతమేర నిధులు కేటాయించాలో స్పష్టమైన ప్రణాళిక రూపొందించేందుకు ఇరిగేషన్ శాఖ కసరత్తు ప్రారంభించింది.

సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ప్లాన్....

బీడు భూములన్నీ పంట భూములవ్వాలి..అన్ని పొలాల్లోనూ సమృద్ధిగా సాగు నీరు పారాలి.. ఇదే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకు సంబంధించి బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని కెసిఆర్‌ సర్కార్ డిసైడైంది.

అవసరాలకు అనుగుణమైన ప్రాజెక్ట్‌లకే కేటాయింపులు.....

గత వారం రోజులుగా శాఖలవారీగా బడ్జెట్ కేటాయింపునకు సంబంధించి అధికారులు, మంత్రులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో మంత్రి హరీష్‌రావు బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి సమీక్ష జరిపారు. సి.ఇల వారీగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చించారు. అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్ట్‌లు ఉండాలని వాటికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి నీళ్ళు ఇవ్వగలిగే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు వాడాలని సంబంధిత చీఫ్ ఇంజనీర్లకు సూచించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.....

కొత్తగా నిర్మాణం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో డిండీ ఎత్తిపోతల పథకం, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం బ్యారేజీలకు, ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడి హట్టి, చనాక కొరాటా బ్యారేజీలకు, సదర్ మాట్ బ్యారేజీకి, బాసర చెక్ డ్యాం, కుప్టి ప్రాజెక్టు, మహబూబ్‌నగర్ జిల్లాలో తుమ్మిళ్ళ లిఫ్ట్ పథకానికి సంబంధించి మంత్రి సమీక్ష జరిపారు. వాటితోపాటు వివిధ జిల్లాల్లో ఐడిసి నిర్మించబోయె ఎత్తిపోతల పథకాలు, భూగర్భ జలాల అభివృద్ధికి సంబంధించిన పథకాలు వాటికి కేటాయించాల్సిన నిధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాన్ ప్లాన్ బడ్జెట్ వ్యయాన్ని వీలైనంత తగ్గించుకోవాలని ఇంజనీర్లకు సూచించారు. బడ్జెట్ ప్రతిపాదనలకు తుది రూపం ఇవ్వడానికి తిరిగి ఈ నెల 20న సమావేశం కావాలని మంత్రి హరీష్‌రావు నిర్ణయించినారు.

06:54 - February 16, 2016

విజయవాడ: ఏపీలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. వచ్చే జూన్‌లోపు సెక్రటేరియట్‌ పూర్తవుతుందని లెక్కలేసుకుంటున్నారు. అయితే ఉద్యోగుల తరలింపు సాధ్యమవుతుందా లేదా అన్నదానిపైనే ఇంకా క్లారిటీ రావట్లేదు. విజయవాడ నుంచే పూర్తిస్థాయిలో పాలన చేపట్టాలంటూ సిఎం చంద్రబాబు వ్యూహాలు రచిస్తుంటే ఎంప్లాయిస్‌ మాత్రం మౌనం వహిస్తున్నారు. అంతగా నోరు విప్పాల్సొస్తే తమ డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. ఇంతకి ఏపీలో జూన్‌ తర్వాత ఏం జరగబోతోంది.?

జూన్ 15లోపు నిర్మాణానికి అంగీకారం...

ఏపీ టెంపరరీ సెక్రటేరియట్‌కు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. వచ్చే జూన్ 15లోపు పూర్తి చేయడానికి నిర్మాణ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. నిన్నమొన్నటి వరకు టెండర్లు ఖరారు కాకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడినా ఇప్పుడవి తొలగిపోయాయి. అయితే బిల్డింగ్‌లు రెడీ అవుతున్నా జూన్ తర్వాత ఉద్యోగులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్తారా లేదా అన్నదే తేలట్లేదు.

సిఎంను కలిసిన ఉద్యోగ సంఘాలు ....

ఉద్యోగులు విజయవాడకు వెళ్లేందుకు ఇంకా రెడీ కావట్లేదని ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం ఉద్యోగుల తరలింపు తప్పదు అంటూ సిఎం చంద్రబాబు సీరియస్‌గా చెప్పారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు సిఎంను కలిసి హఠాత్తుగా విజయవాడ తరలివస్తే తమకు కొన్ని సమస్యలు ఎదురవుతాయని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఉద్యోగులతో ఒక కమిటీ, సిఎస్‌ నేతృత్వంలో మరో కమిటీ ఏర్పాటయ్యాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆ కమిటీ సమావేశం జరగలేదు. గత డిసెంబర్‌ నుంచి ఉద్యోగుల తరలింపు అంశంపై ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా పోయింది. వీటన్నిటి నేపథ్యంలో తాత్కాలిక సెక్రటేరియట్ రెడీ అవుతున్నా ఉద్యోగులు విజయవాడ వెళ్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విద్యార్థుల ఫీజులు మార్చి నెలలోనే చెల్లింపు....

ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కొన్ని సమస్యలను తెరపైకి తెస్తున్నాయి. పిల్లల చదువులకు సంబంధించి మార్చి నెలలోనే ఫీజులు చెల్లించాలంటున్నారు. ఇక జూన్ నెల అంటూ గడువు పెడితే అందుకు కేవలం నాలుగే నెలలు ఉంటాయని ఆ లోపు విజయవాడలో ఇళ్లు వెతుక్కోవడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఉద్యోగ సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. లేదంటే ఏపీ సర్కార్‌ మరో కొత్త సమస్యను తలకెత్తుకోవాల్సొస్తుంది. 

06:51 - February 16, 2016

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం ముహూర్తం ఖరారయ్యింది. బుధవారం ఉదయం 8 గంటల 23 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలగపూడిలో సచివాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపనం చేస్తారు. సోమవారం విజయవాడంలో జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతున్న పరిపాలనను వచ్చే జూన్‌ 15 నుంచి తప్పనిసరిగా అమరావతి నుంచి చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. నూతన ఇసుక విధానాన్ని ఏపీ కేబినెట్‌ ఖరారు చేసింది.

కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి ఎల్‌ అండ్‌ టీ, షాపూర్‌జీ పల్లొంజీ సంస్థలు దాఖలు చేసిన టెండర్లకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. చదరపు అడుగుకు 3,350 రూపాయల రేటు ఖరారు చేసింది. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి 201 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 45 ఎకరాల్లో నిర్మించే తాత్కాలిక సచివాలయానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కూడా లభించాయి. వచ్చే జూన్‌ 15 నాటికి ఏపీ నుంచి పాలన సాగించేలా భవన నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు కోరింది. ఆలోగా పూర్తి చేస్తే కాంట్రాక్ట్‌ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తారు. జాప్యం జరిగిగే పెనాల్టీ విధించే నిబంధనలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. సమయం నాలుగు నెలలే ఉన్నందుకు మూడు షిప్టుల్లో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. అయితే కాంట్రాక్ట్‌ సంస్థలు ఇందుకు అసక్తత వ్యక్తం చేశాయి. రాత్రుల్లో కూడా నిర్మాణాలు చేపడితే కార్మికులకు రెట్టింపు వేతనాలు ఇవ్వాల్సి వస్తుందని, రెండు షిప్టుల్లో పని చేసి నిర్నీత గడువులోగా భవన నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తామని కాంట్రాక్టు సంస్థలు చేసిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఓకే చేసింది.

వాణిజ్య సముదాయంగా....

శాశ్వత సచివాలయం నిర్మించిన తర్వాత తాత్కాలిక సచివాలయ భవనాలను వాణిజ్య సముదాయంగా ఉపయోగించుకుంటారు. ఇందుకు అనుణంగానే భవన నిర్మాణాలను డిజైన్‌ చేశారు. సీఆర్‌డీఏ కార్యాలయం కూడా ఈ భవన సముదయాంలోనే ఉంటుంది.

క్యూబిక్‌ మీటరు ఇసుక రూ.500 .....

ఇసుక విధానాన్ని ఏపీ కేబినెట్‌ ఖరారు చేసింది. క్యూబిక్‌ మీటరు ఇసుకకు 500 రూపాయలు రేటు నిర్ణయించారు. అంతకు మించిన రేటుకు దాఖలైన టెండర్లను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటు ఆస్పత్రులు రిజిస్ట్రేషన్‌ చట్టాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయిచింది. దీనివలన మావన అవయవాలు సేకరించి ఇతరుకు అమర్చడానికి వీలు అవుతుంది.

ఫెర్రో ఎల్లాయిస్‌ సంస్థలకు రూ. 1.50 యూనిట్‌ విద్యుత్‌ ......

ఖాయిలా పడిన ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమల పునరుద్ధరణకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సంస్థలకు యూనిట్‌ విద్యుత్‌ రూపాయినరకే సరఫరా చేస్తారు. పలు సాగునీటి ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయాలు పెంచాలన్న నీటిపారుదల శాఖ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. 

ముస్తాక్‌కు కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం...

సియాచిన్‌ మంచు తుపాన్‌లో చిక్కుకుని చనిపోయిన కర్నూలు జిల్లా పార్నెపల్లికి చెందిన వీర జవాన్‌ ముస్తాక్‌కు కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ముస్తాక్‌ కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. 

06:48 - February 16, 2016

ఖమ్మం : జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన పర్యటన.. కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో తప్పక జరగని పరిస్థితి. నగరంలో పర్యటించిన కేసీఆర్‌.. ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఇప్పటికే కేటాయించిన రెండు వేల డబుల్‌ బెడ్‌రూమ్‌లకు అదనంగా మరో మూడు వేల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

స్వాగతం పలికిని మంత్రి తుమ్మల, కలెక్టర్...

త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఖమ్మంలో పర్యటించారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో నగరానికి చేరుకున్న కేసీఆర్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నేతలు స్వాగతం పలికారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటన .....

రెండు రోజుల పర్యటనలో భాగంగా నగరానికి వచ్చిన సీఎం.. సోమవారం నాడు నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. నగరంలో నూతనంగా బస్టాండ్‌ నిర్మించనున్న ఎన్‌ఎస్పీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రమణగుట్ట ప్రాంతంలో మంచినీటి నల్లాను ప్రారంభించారు. ఆ తర్వాత రాపర్తినగర్‌ బీసీ కాలనీలో డంపింగ్‌ యార్డును పరిశీలించిన కేసీఆర్‌.. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించేందుకు స్థలం అనువుగా ఉందని.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

గోళ్లపాడు చానల్‌ను పరిశీలించిన కేసీఆర్‌......

బురదరాఘవాపురం నుంచి వెళ్తున్న గోళ్లపాడు చానల్‌ను సీఎం పరిశీలించారు. మురికి కూపంగా మారిన చానల్‌ను వెంటనే ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సుందరయ్యనగర్‌లోని మురికివాడలను పరిశీలించారు. అక్కడ ఉంటున్న స్థానికులు సీఎం వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించాలని కోరారు. దీంతో అర్హులను గుర్తించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

మైనారిటీల అభివృద్ధికి పాటు పడతాం -కేసీఆర్‌...

అనంతరం శ్రీనివాసనగర్‌లోని సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల ఎదురుగా ఉన్న దళితవాడలో కేసీఆర్‌ పాదయాత్ర చేశారు. అనంతరం ఖిల్లా బజారులోపర్యటించిన కేసీఆర్‌.. మైనారిటీల అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. త్వరలోనే మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.

మరో మూడు వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు -కేసీఆర్‌....

అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌.. ఖమ్మంలో కేటాయించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కంటే మరో మూడు వేల ఇళ్లు అదనంగా కేటాయిస్తామన్నారు. ముస్లింలకు రెండు కోట్లతో మరో షాదీఖానా ఏర్పాటు చేస్తామన్నారు. 14 కోట్లతో మోడల్‌ బస్టాండ్‌ను, ఆరు ప్రాంతాల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు, కార్పొరేషన్‌కు కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ......

పర్యటనలో భాగంగా నేడు కూడా పలు అభివృద్ధి పనులకు కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ముదిగొండ మండలంలోని ముత్తారం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తిరుమలాయపాలెం చేరుకుని భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి బహిరంగ సభలో పాల్గొంటారు ఆ తర్వాత.. టేకులపల్లి మండలం రోళ్లపాడులో శ్రీ సీతారామ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఖమ్మం జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ బయల్దేరుతారు. 

ఖమ్మం జిల్లాలో కొనసాగతున్న సీఎం కేసీఆర్ పర్యటన

ఖమ్మం : జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన పర్యటన.. కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో తప్పక జరగని పరిస్థితి. నగరంలో పర్యటించిన కేసీఆర్‌.. ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఇప్పటికే కేటాయించిన రెండు వేల డబుల్‌ బెడ్‌రూమ్‌లకు అదనంగా మరో మూడు వేల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 

06:44 - February 16, 2016

మెదక్ : నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ వీడనున్నది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం లోపు తేలిపోనున్నది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు. మధ్యాహ్నం 12 వరకు పూర్తి ఫలితాలు వెల్లడవనున్నాయి. ఖేడ్ మండలం జూకల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడే ఓట్ల లెక్కింపు కొనసాగనున్నది. కౌంటింగ్ కోసం ప్రధాన టేబుల్‌తో సహా 14 టేబుళ్లు ఏర్పాటు చేసి 21 రౌండ్లలో ఫలితాలు వెల్లడించనున్నారు. ప్రతి టేబుల్ వద్ద నలుగురు గెజిటెడ్ అధికారులు పర్యవేక్షిస్తారు. రౌండ్లవారీగా ఫలితాలను మీడియాతోపాటు వెబ్‌సైట్లో ఎప్పటికప్పుడు పొందుపరుచనున్నారు. లెక్కింపు కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు.

భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన..

ఖమ్మం : జిల్లాలోని తిరుమలాయపాలెంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ కె. కేశవరావు, వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

Don't Miss