Activities calendar

17 February 2016

కన్నయ్య తీహార్ జైలుకు తరలింపు...

ఢిల్లీ : దేశ ద్రోహం కింద అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ ను తీహార్ జైలుకు తరలించారు. కన్నయ్య కుమార్ ను ఈ రోజు పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా మార్చి 2 వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అనంతరం మూడు గంటలపాటు అతన్ని కోర్టు గదిలోనే ఉంచి.. సాయంత్రం తీహార్ జైలుకు తరలించారు. అంతకుముందు కన్నయ్యకుమార్ ను కోర్టులో హాజరుపరిచే సమయంలో న్యాయవాదులు అతనిపై దాడి చేశారు.

22:10 - February 17, 2016

దేశమంతా జేఎన్‌యూవైపే చూస్తోంది. అక్కడి ర్యాలీలు, నినాదాలే వింటోంది. న్యాయస్థానాల సాక్షిగా జరుగుతున్న అల్లరిని గమనిస్తోంది. కానీ జరుగుతున్నదంతా అంతా వారే  చేశారు. బట్టకాల్చి మీద విసిరాఏ ప్రయత్నం చేస్తున్నదీ వారే. జేఎన్‌యూలో దేశద్రోహ నినాదాలు చేసింది వారే. నిన్న జర్నలిస్టులపై దాడి చేసింది వారే. నేడు కోర్టులో కన్నయ్యను కొట్టింది వారే. దేశభక్తి పేరుతో డ్రామా నడిపిస్తున్న దేశముదుర్లు వారే. కథ,స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం అంతా వారే. ఇప్పటికే దేశమంతా వారెవరో తెలిసిపోయింది. అవును కమల సారథులేనన్నది వామపక్షాలే కాదు జనమంతా భావిస్తున్న మాట. ఇంతకీ వారు కథ ఎలా అల్లారు...స్క్రీన్ ప్లే ఎలా ప్లాన్ చేశారు...ఎలా అమలు చేశారు..
కన్నయ్యపై లాయర్లు దాడి
పటియాల కోర్టు వద్ద జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్యపై లాయర్లు దాడి చేశారు. ఢిల్లీ పోలీసులు కన్నయ్యను కోర్టులో ప్రవేశ పెట్టే సమయంలో దాడి జరిగింది. మొన్న జెఎన్‌యు విద్యార్థులు, జర్నలిస్టులపై దాడి చేసిన లాయర్లే ఇవాళ కన్నయ్యపై దాడి చేశారు. గూండాల్లా ప్రవర్తిస్తున్న లాయర్లకు పోలీసులు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు కూడా మండిపడింది. పటియాల హౌజ్‌ కోర్టు వద్ద లాయర్లు మళ్లీ రెచ్చిపోయారు. దేశ ద్రోహం కేసులో అరెస్ట్ అయిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌ను న్యాయస్థానంలో విచారణకు తీసుకొచ్చిన సందర్భంగా లాయర్లు ఒక్కసారిగా మూకుమ్మడి దాడికి దిగారు. పెద్ద సంఖ్యలో వచ్చిన లాయర్లు పోలీసుల సమక్షంలో ఉన్న కన్హయ్యపై దాడి చేశారు.  కాళ్లతో తన్నారు. జెఎన్‌యు విద్యార్థులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాయర్ల దాడి నుంచి అతికష్టం మీద పోలీసులు కన్హయ్యను కోర్టులోకి తీసుకెళ్లారు.
జర్నలిస్టులపై రాళ్లు రువ్విన లాయర్లు
ఇదే సమయంలో జర్నలిస్టులను కూడా వదలలేదు. వారిపై కూడా లాయర్లు రాళ్లు రువ్వి తమ ప్రతాపం చూపారు. కోర్టు వద్ద కూడా భద్రత లేకుండా పోయిందని జర్నలిస్టులు వాపోయారు. పటియాల దాడి ఘటనపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్ ఢిల్లీ పోలిస్‌ కమిషనర్‌ బిఎస్‌ బస్సీతో మాట్లాడారు.
పటియాలా కోర్టు ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్‌
పటియాలా కోర్టు ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. ఐదుగురు న్యాయవాదుల బృందాన్ని కోర్టుకు పంపింది. ఈ బృందంలో సీనియర్‌ న్యాయవాది, కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబ్బల్‌ కూడా ఉన్నారు. వారు అక్కడి పరిస్థితిని సుప్రీంకోర్టుకు వివరించారు. వెంటనే కేసు వాయిదా వేయమని సూచించింది. దీంతో పటియాల కోర్టు కన్హయ్యకు  మార్చి 2 వరకు రిమాండ్‌ పొడిగించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 24 వ తేదీకీ వాయిదా వేసింది. పటియాల కోర్టు పరిసరాల్లో 4 వందల మంది పోలీసులున్నప్పటికీ- లాయర్లు కన్హయ్యకుమార్‌పై దాడిగి దిగడం గమనార్హం. కన్హయ్య విచారణ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు పరిసరాల్లో 25 మంది జర్నలిస్టులు, కోర్టు లోపల ఐదుగురు జర్నలిస్టులకు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతించింది. విచారణ సందర్భంగా డిపెన్స్, ప్రాసిక్యూషన్ లాయర్లు తప్ప ఎవరిని కోర్టు గదిలోకి అనుమతించరాదని పేర్కొంది.
పోలీసుల పాత్రపై సుప్రీంకోర్టు సీరియస్‌
సోమవారం నాడు పటియాలా కోర్టులో జెఎన్‌యు విద్యార్థులు, జర్నలిస్టులపై దాడికి సంబంధించి విచారణ జరిపిన సుప్రీంకోర్టు పోలీసుల పాత్రపై సీరియస్‌ అయింది. అక్కడ తమ విధులు నిర్వహించకుండా పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించారని ప్రశ్నించింది.  కోర్టు ప్రాంగణంలో హింసాత్మక ఘటన జరుగుతుంటే పోలీసులు ఏం చేశారని నిలదీసింది. దీనిపై సమాధానం చెప్పాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. పటియాలా కోర్టులో భద్రతను పెంచామని, సోమవారం దాడి ఘటనపై విచారణ జరుపుతున్నామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.
సుప్రీంకోర్టులో 'వందేమాతరం' అంటూ బిగ్గరగా అరుపు 
విచారణ సందర్భంగా న్యాయవాది రాజీవ్‌ యాదవ్ సుప్రీంకోర్టు లోపల 'వందేమాతరం' అంటూ బిగ్గరగా అరవడంతో న్యాయమూర్తులు నిర్ఘాంతపోయారు. 'సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానంలోనే ఇలాంటి ఘటన జరిగితే ఇంకా మేం ఏం చెప్పగలం' అంటూ న్యాయమూర్తులు పేర్కొన్నారు. 'లాయర్‌గా నువ్వు  చేసిన ప్రమాణం గుర్తుందా? ఒక లాయర్‌గా ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చా? న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసముంది. దయచేసి ఈ వ్యవస్థ పరిరక్షణ కోసం పనిచేయ్. కొంచెం సభ్యత పాటించు' అని అతనిని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ సప్రే అన్నారు. వందేమాతరం నినాదం చేసిన ఆ న్యాయవాది తర్వాత క్షమాపణ చెప్పాడు.
పథకం ప్రకారమే లాయర్ల దాడి 
పటియాలా కోర్టులో లాయర్ల దాడి ఓ పథకం ప్రకారమే జరిగింది. సోమవారం నాడు పటియాలా కోర్టులో దాడికి పాల్పడ్డ లాయర్లు బుధవారం దాడి చేసిన లాయర్లు ఒక్కరే కావడం గమనార్హం. లాయర్లు గూండాల్లా ప్రవర్తించి దాడి చేస్తుంటే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. సోమవారం నాటి ఘటనతోనైనా పటియాలా కోర్టులో గట్టి భద్రతా చర్యలు చేపట్టడంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
జెఎన్‌యు ఘటనపై ఢిల్లీ పోలీసులు రిపోర్ట్ 
జెఎన్‌యు ఘటనపై ఢిల్లీ పోలీసులు పూర్తి వివరాలతో ఓ రిపోర్ట్ తయారు చేశారు. క్యాంపస్‌లో అఫ్జల్‌ గురుపై సమావేశం జరుగుతోందని, వామపక్ష విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారని నివేదికలో పేర్కొన్నారు. అక్కడ విద్యార్థి సంఘం అధ్యక్షుడు  కన్హయ్యకుమార్‌ కూడా ఉన్నట్టు సమాచారం.
అక్కడ అరాచకం చేస్తున్నదెవరు..?
జేఎన్‌యూ. ఇప్పుడు దేశమంతా ఇదే యూనివర్సిటీపై చర్చ. అక్కడ దేశ విద్రోహ శక్తులున్నాయని ఒకరంటే, పాకిస్తాన్‌ ఉగ్రవాదులతో లింకులున్నాయని మరొకరు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఇంకొకరు. బీజేపీ పాలకులు, ఏబీవీపీ నేతలు, ఆరెస్సెస్ నిర్దేశకులు ఇలా ఎందరో ఎన్నో మాటలు. కానీ జేఎన్‌యూలో ఆ రోజు జరిగిందేంటి...బయట జరుగుతున్నదేంటి...ఎవరు జాతిద్రోహం వ్యాఖ్యలు చేశారు...అక్కడ అరాచకం చేస్తున్నదెవరు..?
కుట్రలకు కేంద్రమవుతున్న జెఎన్ యూ 
జవహర్‌ నెహ్రూ యూనివర్సిటీ. దేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన విశ్వవిద్యాలయం. దేశానికి ఎందరో గొప్ప నాయకులను అందించిన విద్యా కేంద్రం. ఎమర్జన్సీ సమయంలోనూ ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి వేదికగా నిలిచిన చైతన్యక్షేత్రం. ఇప్పుడా యూనివర్సిటీ కేంద్రంగా రాజకీయ సాగుతోంది.... కుట్రలకు కేంద్రమవుతోంది.
జేఎన్‌యూలో వామపక్ష విద్యార్థి సంఘాలదే నాయకత్వం
జేఎన్‌యూలో విద్యార్థి సంఘాలు కొత్తేమీ కాదు. ఎన్నో స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ  అక్కడ మొదటి నుంచి వామపక్ష విద్యార్థి సంఘాలదే మొదటి నుంచి నాయకత్వం. మొన్న జరిగిన ఎన్నికల్లోనూ వామపక్ష విద్యార్థి సంఘం నేపథ్యమున్న కన్హయ్య కుమార్ జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆరెస్సెస్ నేపథ్యంలోని స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఓటమి పాలైంది. అప్పటి నుంచి జేన్‌యూ వేదికగా కాషాయదళం కుట్రలకు పదును పెట్టిందని వామపక్ష విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
రోహిత్ ఆత్మహత్యతో విద్యా సంస్థల్లో విద్యార్థి జ్వాల 
హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్యతో దేశంలోని అన్ని విద్యా సంస్థల్లోనూ విద్యార్థి జ్వాల ఎగసింది. యూనివర్సిటీల్లో దళితులను అణచివేస్తున్న అగ్రకుల శక్తులపై వామపక్ష విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. హెచ్‌సీయూతో పాటు అన్ని వర్సిటీల్లోనూ జేన్‌యూ విద్యార్థులు ముందుండి ఉద్యమం నడిపించారు. దీక్షలు, ధర్నాలు, యాత్రలతో దళిత అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పారు. పదం కదిపారు. బిజెపి కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ రాజీనామా చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. రాజకీయంగా రోహిత్‌ ఆత్మహత్యపై జరుగుతున్న ఆందోళనను వ్యతిరేకించి.. రకరకాల వాదనలతో బిజెపి అభాసుపాలైంది. దీంతో కాషాయదళం అదను కోసం వేచి చూస్తోంది. కాషాయ వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక పుంజుకుంటోందన్న అలజడి గుండెల్లో గునపంలా దిగబడింది.
వామపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా కుట్రలు 
యూనివర్సిటీల్లోనూ, బయటా వామపక్ష శక్తులు పుంజుకోవడాన్ని కాషాయ పాలకులు జీర్ణించుకోలేకపోయారు. వారిని అణచివేయడమే లక్ష్యంగా కుట్రలు అల్లారు. దానిలో భాగమే ప్రస్తుతం జేఎన్‌యూలో నడుస్తున్న ఎపిసోడ్‌ అని వామపక్షాలు విమర్శిస్తున్నాయి. జాతి వ్యతిరేక ర్యాలీలు జరిగాయని జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడి కన్హయ్యతో పాటు ఎందరో విద్యార్థులపై కేసులు...
అసలు దేశ వ్యతిరేక నినాదాలు ఎవరు చేశారు
అసలు దేశ వ్యతిరేక నినాదాలు ఎవరు చేశారు...జాతి విద్రోహ ర్యాలీలు ఎవరు తీశారు...కన్హయ్య కుమార్‌ను ఎందుకు అరెస్టు చేశారు..ఫిబ్రవరి 9న  జరిగిన ర్యాలీలో పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసింది ఎవరు....చివరికి ఆ నెపం ఎవరిపై మోపారు....
కన్హయ్య కుమార్‌పై  రాజద్రోహం కేసు 
ఇతను కన్హయ్య కుమార్. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు. ఇతనిపై రాజద్రోహం కేసు పెట్టారు ఢిల్లీ పోలీసులు..
అరెస్టుకు ముందు కన్హయ్య ఏం మాట్లాడారు? ఏయే అంశాలపై ప్రసంగించారు? పార్లమెంట్‌పై దాడి కేసులో దోషి అయిన అఫ్జల్‌ గురుకు మద్దతుగా కన్హయ్య మాట్లాడారన్నది పాలకులు చెబుతున్న మాట. అంతేకాదు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ, జాతి వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారన్నది కూడా వారి అభియోగం. అరెస్టుకు ముందు కన్హయ్య ఏం మాట్లాడాడో, ఏయే అంశాలపై ప్రసంగించారో యూట్యూబ్‌లో వీడియో ఉంది. టెన్‌ టీవీతో పాటు అనేక జాతీయ ఛానెల్స్ కూడా ఆ మొత్తం ప్రసంగాన్ని ప్రసారం చేశాయి. ఒక్కసారి కన్హయ్య మాటలు వినండి.
ఈ ప్రసంగంలో తప్పు పట్టే అంశాలేమున్నాయి?
అసలు ఈ ప్రసంగంలో తప్పు పట్టే అంశాలేమున్నాయి....జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేక మాటలేమున్నాయి...కన్హయ్య ఈ దేశంలోన తాడిత,పీడిత దళిత ప్రజల హక్కుల గురించి మాట్లాడారు. డాక్టర్ బీర్ అంబేదర్క్ ఆశయాలను గుర్తు చేశారు. కాషాయ కుట్రలపై మాట్లాడారు. మనువాదం, బ్రహ్మణవాదంతో దళితులు ఎలా అణగదొక్కబడ్డారో వివరించారు. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పాలకుల అరాచకాలను కుండబద్దలు కొట్టారు. అన్యాయాలపై ఎదురొడ్డే భావ ప్రకటనా స్వేచ్చను కాంక్షించారు. కానీ కాషాయ పాలకులకు ఇవే మాటలు తప్పయ్యాయి. దేశద్రోహమయ్యాయి. జాతి వ్యతిరేకమయ్యాయి. అధికారముంటే ఏం చేసినా చెల్లుతుందని బీజేపీ పాలకులు భావిస్తున్నారనడానికి ఇదే రజువని కమ్యూనిస్టు పార్టీలంటున్నాయి. హోంమంత్రి మాట్లాడిందంతా ఉత్తుదేనని తేలిపోయింది
వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులకూ, హఫీజ్ సయీద్‌కు లింకు
వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులకూ, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ అధిపతి హఫీజ్ సయీద్‌కు లింకుపెట్టారు  కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్. కానీ దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ హోంశాఖకు సమర్పించలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ చెప్పారు. హోంమంత్రి మాట్లాడిందంతా ఉత్తుదేనని తేలిపోయింది. అయినా కుట్రలు ఆగలేదు. జేఎన్‌యూలో ఎగసిన విద్యార్థి జ్వాలకు నాయకత్వం వహిస్తున్న కన్హయ్యను అరెస్టు చేశారు. అనేక సెక్షన్ల కింద కేసు పెట్టారు. 
కన్హయ్య అరెస్టుకు ముందు ఏం జరిగింది?
కానీ జేఎన్‌యూలో జాతి వ్యతిరేక నినాదాలు ఎవరు చేశారో దేశానికంతటికీ తెలుసు. అందుకు ఓ వీడియో కీలకమైంది.  కన్హయ్య అరెస్టుకు ముందు ఏం జరిగింది..ఎవరెవరు ర్యాలీలో పాల్గొన్నారు...ఏయే నినాదాలు చేశారు?
ఒక్కసారి ఈ స్లోగన్స్ వినండి.... మీరు విన్నది, చూసింది నిజమే. ఇవి పాకిస్తాన్‌ అనుకూల నినాదాలు..అది కూడా ఎక్కడో పాకిస్తాన్‌లో కాదు ఢిల్లీ జేఎన్‌యూ క్యాంపస్‌లో.
పాకిస్తాన్‌కు అనుకూలంగా ఏబీవీపీ నినాదాలు
వీరంతా ఎవరో తెలుసా ఏబీవీపీ కార్యకర్తలు. ఈ గుంపు నుంచే పాకిస్తాన్‌ జిందాబాద్ అంటూ నినాదాలు వస్తున్నాయి. వీటికి స్పందనగా ఏబీవీపీ కార్యకర్తలు కూడా జిందాబాద్ , జిందాబాద్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి సర్కిల్‌ చేసిన స్టూడెంట్‌ను చూడండి.. ఈ విద్యార్థిని ఏబీవీపీ కార్యకర్తేనని చెప్పడానికి రుజువు ఇది... పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న ఈ విద్యార్థి కూడా ఏబీవీపీ కార్యకర్తనే. సియాచిన్‌లో అమరుడైన హనుమంతప్పకు అనుకూలంగా నిర్వహించిన ర్యాలీలోనూ పాల్గొన్నాడు.
ఏబీవీపీ కార్యకర్తల నినాదాలు జాతి వ్యతిరేక చర్యలు కాదా?
ఏబీవీపీ కార్యకర్తలు పాకిస్తాన్‌ అనుకూల నినాదాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అఫ్జల్‌గురు ఉరిశిక్ష వ్యతిరేక ర్యాలీలో ఏబీవీపీ కార్యకర్తలు కూడా పాల్గొని, అందులో పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా స్లోగన్స్ చేస్తూ, చివరికి ఆ నెపాన్ని ఇతర విద్యార్థి సంఘాలపై నెట్టారని విపక్షాలు మండిపడుతున్నాయి. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని కన్హయ్య వంటి విద్యార్థి నేతలను అరెస్టు చేశారని విమర్శిస్తున్నాయి. ఇది కేవలం బీజేపీ , దాని అనుబంధ సంస్థ ఏబీవీపీ కుట్రేనని ఆరోపిస్తున్నాయి. 
అఫ్జల్‌గురు సంతాపసభలో ప్రసంగించిన కృష్ణయ్య
గడచిన వారం రోజులుగా.. కన్హయ్యకుమార్‌ పేరు దేశమంతటా మారుమోగుతోంది. జెఎన్‌యూ వివాదంలో కన్హయ్య దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ కన్హయ్య ఎవరు..? ఎక్కడి వాడు..? అతడి పూర్వాపరాలేంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ. 
ఏఐఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌
జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం ఏఐఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌.. దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాడు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడ్డ అఫ్జల్‌గురు తృతీయ సంతాపసభను జెఎన్‌యూ క్యాంపస్‌లో నిర్వహించినప్పుడు కన్హయ్య ప్రసంగించాడు. కన్హయ్య చర్య, ప్రసంగం దేశద్రోహమేనంటూ కేంద్ర ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఫిబ్రవరి 13న కన్హయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను జుడిషియరీ కస్టడీలో ఉన్నాడు. 
బీహార్‌లో జన్మించిన కన్హయ్య
కన్హయ్య బీహార్‌ రాష్ట్రానికి చెందిన వాడు. అక్కడి బేగుసారై జిల్లాలోని బీహాత్‌ అనే గ్రామంలో జన్మించాడు. అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించిన కన్హయ్య, బీహార్‌ పారిశ్రామిక పట్టణం బారౌనిలోని హైస్కూలులో చదివాడు. స్కూలు విద్య తర్వాత పట్నాలోని కాలేజీ ఆఫ్‌ కామర్స్‌లో చేరాడు. పీజీ అనంతరం.. ప్రస్తుతం జెఎన్‌యూలో ఆఫ్రికన్‌ స్టడీస్‌ అంశంపై పీహెచ్‌డీ చేస్తున్నాడు. 
2002లో ఏఐఎస్‌ఎఫ్‌లో చేరిన కన్హయ్య
స్కూలు రోజుల్లోనే కన్హయ్య పలు సామాజిక దృక్పథమున్న నాటికల్లో భాగస్వామిగా మారాడు. పట్నాలో చదువుకునేప్పుడు విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. 2002లో, కన్హయ్య ఏఐఎస్‌ఎఫ్‌లో చేరాడు. ఏడాది కాలంలోనే సంఘం డెలిగేట్‌గా ఎన్నికయ్యాడు. ఎన్‌ఎస్‌ఎస్‌లో కూడా చురుగ్గానే పాల్గొన్న కన్హయ్య.. తాను చదివే కాలేజీలోనూ, పట్నా యూనివర్సిటీలోనూ మార్క్సిస్టు కేంద్రాల పునరుద్ధరణకు కృషి చేశాడు. సమస్యలపై పోరాటంలోనే కాదు.. విద్యాభ్యాసంలోనూ కన్హయ్య చురుకైన వాడేనని సహచర విద్యార్థులు చెబుతారు.
అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న కన్హయ్య తల్లి మీనాదేవి
కన్హయ్య పుట్టి పెరిగిన బీహాత్‌ గ్రామం ముందునుంచీ వామపక్షాలకు పట్టుగొమ్మ. దీంతో ఇక్కడ రాజకీయ చైతన్యం అధికం. ఫలితంగా కన్హయ్యకు చిన్ననాటి నుంచే సమస్యలపై ప్రశ్నించే తత్త్వం అలవాటు పడింది. కన్హయ్య తండ్రి జైశంకర్‌ సింగ్‌ కొన్నేళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. తల్లి మీనాదేవి గ్రామంలో అంగన్‌వాడి కార్యకర్తగా పనిచేస్తున్నారు. కుటుంబ పోషణ భారాన్ని ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న కన్హయ్య పెద్ద సోదరుడే చూసుకుంటున్నాడు. ఈ కుటుంబం ముందునుంచీ సీపీఐ  మద్దతుదారులుగానే కొనసాగుతోంది. 

నల్గొండలో ఉద్యోగాల పేరుతో మోసం

నల్గొండ : ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న 8 మందిని సభ్యుల ముఠాను పోలీసుల అరెస్టు చేశారు. యూనియన్‌ కోటాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరు మోసాలకు పాల్పడినట్లు సమాచారం. 

21:52 - February 17, 2016

నల్గొండ : ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న 8 మందిని సభ్యుల ముఠాను పోలీసుల అరెస్టు చేశారు. యూనియన్‌ కోటాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరు మోసాలకు పాల్పడినట్లు సమాచారం. ఎన్‌ఎంయూలో జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న సయ్యద్‌ మహ్మద్‌ దీని వెనుకున్న సూత్రధారిగా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే నల్గొండ, నిజామాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లో మాయమాటలు చెప్పిఒక్కొక్కరి నుంచి 3 నుంచి 5లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తన్నాయి. ఇదిలా ఉంటే పోలీసులు దాడి చేసి మొత్తం రూ. 2.5 కోట్లతో పాటు రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అపాయింట్‌మెంట్‌ పత్రాలు, సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు. 

 

21:49 - February 17, 2016

ఢిల్లీ : జేఎన్‌యూని మతతత్వ శక్తులనుంచి పరిరక్షించాలని సీపీఎం సెంట్రల్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. ఢిల్లీ కోర్టులో భద్రత గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించని ఢిల్లీ పోలీసుల తీరును సెంట్రల్‌ కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. పోలీసుల ఉదాసీన వైఖరి వల్ల.. కోర్టులో కన్హయ్యపైన, మీడియా ప్రతినిధులు, విద్యార్థులపైనా దాడి జరిగిందని.. అభిప్రాయపడింది. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ ఢిల్లీ కమిషనర్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. కన్హయ్యపై మోపిన దేశద్రోహ అభియోగం నిరాధారమని, జెఎన్‌యూపై బీజేపీ సర్కారు చేస్తోన్న అప్రజాస్వామిక దాడిని తీవ్రంగా పరిగణించాలని సీపీఎం సెంట్రల్‌ కమిటీ పిలుపునిచ్చింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని.. సెక్యులర్‌ శక్తులన్నీ ఈ చర్యలను సంఘటితంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. 

 

21:46 - February 17, 2016

చండీగఢ్ : మొన్న ఢిల్లీలోని సీపీఎం కేంద్రకార్యాలయంపై దాడికి తెగబడిన సంఘ్‌ పరివార్‌.. నేడు చండీగఢ్‌లోని పార్టీ కార్యాలయంపైనా దాడి చేశారు. విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో... చండీగఢ్‌ సెక్టార్‌ 30లోని సీపీఎం కార్యాలయంపైకి దూసుకు వచ్చారు. పార్టీ కార్యాలయంలోని వారిని అసహ్యపదజాలంతో తిడుతూ.. ఆఫీసుపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారుల వెంటే వచ్చిన పోలీసులు.. వారిని అదుపుచేయక పోగా.. సీపీఎం కార్యాలయంలోని వారిని దాక్కోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేయడం విశేషం. సంఘ్‌పరివార్‌ దాడులపట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

21:43 - February 17, 2016

నిన్నటికి నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన రేగింది. ఇప్పుడు జెఎన్ యూ వంతొచ్చింది. కోల్ కతా జాదవ్ పూర్ యూనివర్సిటీకి కూడా విస్తరించింది.  యూనివర్సిటీలు దేశ  రాజకీయ చిత్రంలో వస్తున్న మార్పును, జరుగుతున్న సంఘర్షణను ప్రతిఫలిస్తున్నాయా? 
కన్నయ్య కుమార్.. జెఎన్ యూ విద్యార్ధి నేత.
కన్నయ్య కుమార్, జెఎన్ యూ విద్యార్ధి నేత. పాతికేళ్లు సాధారణం జీవితం గడిపిన ఆయన ఒక్కరోజులో దేశద్రోహి ఎలా అయ్యాడు? ఏ చర్యల ద్వారా అతనిపై ఈ కేసులు పెట్టారు? కన్నయ్య వివాదాస్పద నినాదాలు చేశాడు.  అసలేం జరిగింది? జెఎన్ యూ లో గందరగోళానికి మూలాలెక్కడున్నాయి? ఆరోజు ఏం జరిగింది?
తప్పెవరిది? శిక్ష పడింది ఎవరికి? 
తప్పెవరిది? శిక్ష పడింది ఎవరికి? పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిందెవరు? 
దేశ వ్యతిరేక నినాదాలు చేసిందెవరు?  ఏ శక్తులు ఎవరికి కొమ్ము కాస్తున్నాయి? నినాదాలు ఎవరు చేసిందీ తేల్చకుండా కన్హయ్యను ఎందుకు అరెస్ట్ చేశారు?  ఏది దేశద్రోహం? ఏది దేశభక్తి? ఆర్‌యస్‌యస్‌ దేశభక్తి ఎంత? 
సమైక్యత కోసం వామపక్షాలు కృషి
దశాబ్దాలుగా దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం వామపక్షాలు కృషిచేస్తున్నాయి. వేర్పాటు వాద ఉద్యమాలను ఎదుర్కొని ఎన్నో బలిదానాలతో దేశాన్ని సమైక్యంగా కలిపి ఉంచే కృషి చేశాయి వామపక్షాలు . మరి ఇప్పు ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి. బట్టకాల్చి ముఖాన వేసినట్టు వామపక్షాలపై కుట్రలు చేస్తున్నారా? 
ఈ పరిణామాల వెనుక ఏ లక్ష్యాలున్నాయి?
ఈ పరిణామాల వెనుక ఏ లక్ష్యాలున్నాయి? కమల దళం రాజకీయ ప్రయోజనాల కోసం యూనివర్సిటీల  వివాదాలను  ఉపయోగించుకుంటున్నాయా? ప్రభుత్వంపై ఇతర విమర్శలు రాకుండా ఉండటానికి ప్రజల భావోద్వేగాలను చెర్చగోట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? ఎన్నడూ లేని గందరగోళం ఇప్పుడెందుకు వస్తోంది? 
కులం, మతం ఆధారంగా రాజీకాయలు నష్టదాయకం... 
యూనివర్సిటీలు ఆరోగ్యకర చర్చలకు అవకాశం కల్పించేవిగా ఉండాలి. సమాజాన్ని అర్ధం చేసుకుని, ప్రజల్లో మార్పుకు, సమాజ పురోగతికి ప్రయత్నించే విధంగా వివిధ రాజకీయ భావజాలాల మధ్య పోటీ ఉండాలి. ఆరోగ్య కర వాతావరణం ఉండాలి. అంతే కానీ, కులం మతం ఆధారంగా రాజీకాయలు చేసే విద్యార్ధి సంఘాలు యూనివర్సిటీకే కాదు.. దేశానికి నష్టదాయకమే.. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. 
పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

శాంతిభద్రతలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ హైకోర్టు

హైదరాబాద్: ఢిల్లీలో శాంతి భద్రతల అంశమై హైకోర్టు వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో ప్రజలందరూ చాలా సేఫ్‌గా ఉన్నారని...అక్కడ జరుగుతున్న నేరాలకు ప్రజలనే నిందించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం గాని, ఢిల్లీ పోలీసులు గానీ ప్రజల భద్రత అంశాన్ని పట్టించుకుపోవడంతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా చనిపోయినా, ఏదైనా నేరం జరిగినా దానికి పూర్తి బాధ్యత వాళ్లదేనని హైకోర్టు నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. బీడీ అహ్మద్‌, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

టీటీడీపీ నేతలతో ముగిసిన చంద్రబాబుతో సమావేశం

విజయవాడ : ఎపి సీఎం చంద్రబాబుతో టీటీడీపీ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఎన్నికల ఫలితాలపై ఆందోళన చెందవద్దని చంద్రబాబు తెలిపారు. 

కొనసాగుతున్న సీపీఎం కేంద్రకమిటీ సమావేశాలు...

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఢిల్లీలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చిస్తున్నారు. 

 

ఛండీఘర్ లో సీపీఎం కార్యాలయంపై బిజెపి, ఆర్ ఎస్ దాడులు

ఛండీఘర్ : ఛండీఘర్ లో సీపీఎం కార్యాలయంపై బిజెపి, ఆర్ ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. సీపీఎం కార్యాలయంపై బిజెపి, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. వారిని పోలీసులు అడ్డుకోలేదు. 

19:30 - February 17, 2016

హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పారావు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే దీనిపై న్యాయస్థానం గతంలోనే నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే పోలీసులు రికార్డులకు బదులు వాటి జిరాక్స్‌ కాపీలను ప్రవేశ పెట్టడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం కోర్టు విచారణనను వాయిదా వేసింది. 

ప్లాస్టిక్ బాటిళ్లలో నీటి అమ్మకంపై కేరళ హైకోర్టు నిషేధం

హైదరాబాద్‌ : ప్లాస్టిక్ బాటిళ్లలో నీటి అమ్మకంపై కేరళ హైకోర్టు నిషేధం విధించింది. ఎకో ఫ్రెండ్లీ వాతావరణం కల్పించడంలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ప్లాస్టిక్ బాటిళ్లలో ఎలాంటి పదార్థాలు అమ్మకూడదని కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం వాటర్ బాటిళ్లు కూడా అమ్మరాదని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటితో సహా ఎలాంటి పదార్థాలు అమ్మకూడదని తెలిపింది. దీంతో ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు క్యూ కట్టే శబరిమలలో మంచినీళ్ల బాటిళ్లు కూడా దొరికే అవకాశం లేదు. భక్తుకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసే అవకాశం కనబడుతోంది.

గుంతలోకి దూసుకెళ్లిన లారీ..

మెదక్‌ : జిల్లాలోని జోగిపేట మండలం ఆంధోల్‌ గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో డ్రైవర్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆంధోల్ శివారులో బాలికల పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన కంకర లోడ్ తో ఉదయం ఓ లారీ అక్కడికి చేరుకుంది. కంకరను కిందికి డంప్ చేసే క్రమంలో లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకుపోయింది. అప్రమత్తమైన లారీ డ్రైవర్ వెంటనే కిందికి దూకేశాడు. గుంతలో పడిన లారీ బాడీ అంతా ముక్కలు ముక్కలయింది. అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిపై పోలీసుల దాడి

వరంగల్ : మేడారం జాతరలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిపై పోలీసుల దాడికి పాల్పడ్డారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని పోలీసులను ప్రశ్నించినందుకు ఆయన కారును ముట్టడించి దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన యాదగిరి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా సీనియర్ జర్నలిస్టు పాశంపై దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. ఈ చర్యకు పాల్పడ్డ పోలీసులపై కేసు నమోదు చేయాలని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ డిమాండ్ చేసింది.

 

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌ ధర...

ఢిల్లీ: పెట్రోల్‌ ధర స్వల్పంగా తగ్గింది. పెట్రోల్‌ లీటర్‌కు 32 పైసలు తగ్గిస్తూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు డీజిల్‌ ధర స్వల్పంగా పెరిగింది. డీజిల్‌ ధర లీటరుకు 28 పైసలు పెంచారు. ఈ ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి.

19:08 - February 17, 2016

హైదరాబాద్ : ఈ నెల 25న ఏలూరులో కాపు రుణమేళాను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు రుణాలు పంపిణీ చేస్తారని చెప్పారు. మొదటి విడతలో భాగంగా 20 వేలమందికి 90 కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 

 

19:05 - February 17, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో చిన్న తరహా పరిశ్రమలను పోత్సహిస్తామని మంత్రి పల్లె రఘనాధ్‌రెడ్డి అన్నారు. ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు  చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. చిన్న పరిశ్రమలను స్థాపించే వారికీ ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 

 

19:02 - February 17, 2016

హైదరాబాద్ : చంద్రబాబు అన్ని హామీలు నెరవేర్చానంటూ చెప్పుకుంటున్నారని.. వాస్తవానికి ఏమీ అమలు కాలేదని జగన్‌ మండిపడ్డారు. గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన జగన్‌.. తుని ఘటనలో ప్రభుత్వ వైఫల్యం చెందిందంటూ వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని.. ఇప్పటికే కేసీఆర్‌ టెండర్లు పిలిచారని.. అయినా కేసులో ఇరుక్కున్న బాబు మాట్లాడటం లేదని జగన్‌ విమర్శించారు.

19:00 - February 17, 2016

అనంతపురం : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లారీ, స్కార్పియో ఢీ కొని ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. తాడిపత్రి గర్దావ్‌ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద ఈ ఘటన చోసుకున్నట్లు సమాచారం. చిన్నారుల మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

కన్హయ్యపై దాడిని ఖండించిన ఏచూరీ

ఢిల్లీ : కోర్టు ఆవరణలో కన్హయ్యపై జరిగిన దాడిని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ ఖండించారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు కనుమరుగవుతున్నాయి ఆందోళన చెందారు. కన్హయ్యకు భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు చెప్పినా... ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదన్నారు. న్యాయవాదుల ముసుగులో ఆర్ ఎస్ ఎస్ గూండాలు  దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కన్హయ్యకు భద్రత కల్పించలేని బస్సీకి ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా కొనసాగే అర్హత లేదన్నారు. 

పాటియాల కోర్టు వద్ద ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీ : పాటియాల కోర్టు వద్ద ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఐదుగురు సీనియర్ న్యాయవాదులను పాటియాల కోర్టుకు పంపింది. 

కన్హయ్యను వెంటనే విడుదల చేయాలి : విద్యార్థి సంఘాలు

హైదరాబాద్ : కన్హయ్యకుమార్ ను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. కన్హయ్యను విడుదల చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. 

18:24 - February 17, 2016

భార్య జీవించి ఉండగానే ఆమెకు విడాకులు ఇవ్వకుండానే భర్త వేరొక మహిళను వివాహం చేసుకోవడాన్ని బైగామి అంటారని లాయర్ పార్వతి తెలిపారు. మానవి మైరైట్ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. రెండో వివాహాన్ని కూడా సక్రమంగా చేసుకోవడం లేదన్నారు. ఇటీవల కాలంలో నేరాలు చాలా పెరిగాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

లారీ, స్కార్పియో ఢీ.... ఇద్దరు చిన్నారుల మృతి

అనంతపురం : జిల్లాలో దారుణం జరిగింది. లారీ, స్కార్పియో ఢీకొని ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో చిన్నారికి గాయాలు అయ్యాయి.

17:51 - February 17, 2016

ఢిల్లీ : కోర్టు ఆవరణలోనే ఒక విద్యార్ధి సంఘం నేతను కొడుతుంటే పోలీసులు చోద్యం చూశారు. పోలీసుల రక్షణను కూడా చేధించుకుని లాయర్ల రూపంలో ఉన్న గూండాలు దాడి చేస్తుంటే.. ఎవరూ ఆపలేకపోయారు. పోలీసుల కస్టడీలోనే ఉన్న ఒక విద్యార్ధి సంఘం నేతపై దాడి చేయగలిగారంటే పోలీసుల మద్దతు లేకుండా చేయగలరా అనే ప్రశ్న వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే పోలీసు కమిషనర్‌ అవకాశం ఇవ్వకుండానే ఇదంతా జరిగిందా అనే ప్రశ్నను అందరూ సంధిస్తున్నారు. చాలా దారుణంగా వారు కొట్టడంతో కన్హయ్య తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అంటే ప్రభుత్వంతోను, అధికారంలో ఉన్న పార్టీతోను, ఆ పార్టీ విధానాలతో వ్యతిరేకిస్తే.. వారి ప్రాణాలకు రక్షణ ఉండదా?
ప్రసంగం చేసింది ఒకరు.... నినాదాలు చేసింది మరొకరు
ప్రసంగం చేసింది ఒకరు. నినాదాలు చేసింది మరొకరు. నినాదాలు చేసినవారి వీడియో దొరికినా.. వారు మాత్రం పోలీసులకు దొరకటం లేదు. ప్రసంగం చేసిన విద్యార్ధి నాయకుడు మాత్రం అరెస్టైపోయారు. అఫ్జల్‌గురు పేరుతో దేశభక్తి వ్యతిరేక భావాలు అంటూ కొందరు గొడవ మొదలెట్టారు. ఏకంగా యూనివర్శిటీలోనే అడ్వకేట్ల రూపంలో వచ్చిన కొందరు జర్నలిస్టులపై దాడి చేశారు. వామపక్ష విద్యార్ధి సంఘ నాయకులపైనా దాడి చేశారు. అంతటితో ఆగకుండా సీపీఎం ఆఫీసుపైనా అటాక్‌ చేశారు. పైగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి బెదిరింపు కాల్స్‌ కూడా చేశారు. ఎవరు చేస్తున్నారు ఇదంతా? మొన్న జర్నలిస్టులపై దాడి చేసినవారే .. నేడు కన్హయ్యపైనా దాడికి దిగారు. వీరంతా ఒకటేనని వీడియోలలో స్పష్టంగా కనపడుతోంది. కన్హయ్య ప్రసంగం చేస్తున్న సమయంలో జాతీయ వ్యతిరేక నినాదాలు ఇచ్చినవారు కూడా కాషాయదళానికి చెందిన విద్యార్ధి సంఘంవారేనని కూడా వీడియోల్లో కనపడుతోంది. అంటే ఇదంతా కాషాయదళం ప్లాన్‌ ప్రకారం పన్నిన పన్నాగమేనని విద్యార్ధి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

 

17:46 - February 17, 2016

వైజాగ్ : కృష్ణగాడి ప్రేమగాథ చిత్ర యూనిట్‌ వైజాగ్‌లో సందడి చేసింది. విశాఖలోని సంగం శరత్‌ థియేటర్లో అభిమానుల మధ్య హీరో నాని చిత్ర విశేషాలను పంచుకున్నారు. చిత్రం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నానితో పాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు. 

 

ప్రఖ్యాత మలయాళ నవలా రచయిత అక్బర్‌ కన్నుమూత

కేరళ : ప్రఖ్యాత మలయాళ నవలా రచయిత అక్బర్‌ కక్కట్టిల్‌ (62) ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా వూపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఏడాదిగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్బర్‌ మొత్తం 54 పుస్తకాలను ప్రచురించారు. వాటిలో నాలుగు నవలలు, 27 చిన్న కథలు, 6 వ్యాస సంపుటాలు, 7 నవలికలు ఉన్నాయి. కేరళ సాహిత్య అకాడమీకి ఉపాధ్యక్షుడిగానూ, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సలహా సంఘం సభ్యుడిగానూ ఆయన విధులు నిర్వహించారు.

17:34 - February 17, 2016

విశాఖ : గరం మూవీ విజయయాత్ర విశాఖలో జరిగింది. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా , అదాశర్మ హీరోయిన్ గా  నటించిన గరం సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోందని సాయికుమార్, ఆది తెలిపారు. విమాక్స్ ధియేటర్లో  ప్రేక్షకుల మధ్య సందడి చేసింది గరం సినిమా టీమ్. ఆదిని అందరూ ఆదరించాలని సాయికుమార్‌ కోరారు.

 

17:32 - February 17, 2016

కరీంనగర్ : బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తు, ఎక్స్‌పైరీ డేట్‌ ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది బీడీ కార్మికులు బీడీలు చుట్టి జీవనం సాగిస్తున్నారని కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్‌ రద్దు చేయాలంటూ కార్మిక సంఘం నేతలు కోరుతున్నారు. 

17:30 - February 17, 2016

అనంతపురం : జిల్లాలో కలకలం రేపిన అఫ్రిన్‌ ఆత్మహత్య కేసులో స్కూలు ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని అఫ్రిన్‌ కుటుంబ సభ్యులు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అఫ్రిన్‌ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రిన్సిపలే కూడా కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గౌతమ్‌ అనే విద్యార్థి రెండు నెలలుగా తమ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే  అఫ్రిన్‌ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

17:22 - February 17, 2016

ఢిల్లీ : జెఎన్ యూ అధ్యక్షుడు, ఎఐఎస్‌ఎఫ్‌ నేత కన్హయ్య కుమార్ కు మార్చి 2వరకు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అంతకముందు ఢిల్లీ పటియాల కోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది. కోర్టులో హాజరుపరిచిన కన్నయ్యకుమార్‌పై లాయర్లు కొందరు దాడికి దిగారు. అయితే వీరే జర్నలిస్టులపై దాడి చేసిన ఘటనలో ఉన్నట్లు దృశ్యాలను బట్టి తెలుస్తోంది. జెఎన్‌యు వివాదానికి సంబంధించి లాయర్లు రెండు వర్గాలు చీలిపోయారు. ఢిల్లీలో పటియాల కోర్టు వద్ద కొందరు లాయర్లు దాడికి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొందరు లాయర్లు జర్నలిస్టులపై మళ్లీ దాడి చేశారు. జర్నలిస్టులు ఫోన్లను లాక్కుని వీడియోలను డిలీట్‌ చేశారు. భారత్‌ మాతాకి జై అంటూ కొందరు, కన్నయ్యకు మద్దతుగా మరికొందరు లాయర్లు నినాదాలు చేశారు. 
కన్హయ్యపై దాడి దారుణం - ఏచూరి..
జెఎన్ యు ఎస్ యు అధ్యక్షుడు కన్హయ్యపై దాడికి పాల్పడడం దారుణమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి పేర్కొన్నారు. బుధవారం కన్హయ్యను పాటియాల కోర్టులో పోలీసులు హజరుపరిచారు. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు కన్హయ్యపై దాడి చేశారు. ఈ ఘటనపై ఏచూరి టెన్ టివితో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ను కూడా బిజెపి ప్రభుత్వం పాటించడం లేదని విమర్శించారు. ఢిల్లీలో లాండ్ ఆండ్ ఆర్డర్ ఉందా ? లేదా ? అనే అనుమానం కల్గుతోందన్నారు. దాడికి పాల్పడిన వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఢిల్లీ పోలీసు కమిషన్ ఉందన్నారు. 

16:52 - February 17, 2016

కరీంనగర్ : అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుల్లో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఏకంగా ప్రభుత్వ ఆదాయానికి కొంతమంది ఉపాధ్యాయులు గండికొట్టారు. తప్పుడు లెక్కలను చూపి జీతాలను సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఇందులో పదవి విరమణ చేసిన వారు కూడా ఇంకా ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్లు చూపారు. ఈ ఘటన వేములవాడలో చోటు చేసుకుంది. 
జిల్లాలోని వేములవాడలో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టారు ఉపాధ్యాయులు, అధికారులు. పదవీ విరమణ పొందిన ముగ్గురు టీచర్లను ఇంకా సర్వీసులోనే కొనసాగుతున్నట్టు లెక్కలు చూపి జీతాలను సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారు. ఎంఈవో శోభన రావు, ఉపాధ్యాయుడు కోరెపు శ్రీనివాస్ ఈ మోసానికి పథక రచన చేశారు. బ్యాంకు అధికారులతో కలిసి గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ తతంగం నడుపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 18 లక్షల రూపాయలను స్వాహా చేశారు. కొందరి ఫిర్యాదుదో ఈ కుంభకోణం బట్టబయలైంది. ప్రధాన సూత్రధారి కోరేపు శ్రీనివాస్‌తో సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయతే కోరెపు శ్రీనివాస్ పరారీలో ఉన్నారు.

16:09 - February 17, 2016

టాలీవుడ్ లో హీరో..హీరోయిన్లు పలు సినిమాల్లో పాటలు పాడుతున్న సంగతి తెలిసిందే. తామేమీ తక్కువ తినడం లేదంటూ కమెడియన్లు కూడా పాటలు పాడేస్తున్నారు. ఇటీవలే 'లచ్చిందేవి ఓ లెక్కుంది' సినిమా కోసం జయప్రకాష్ రెడ్డి పాట పాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కమెడియన్ ఆలీ కూడా చేరిపోయాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆలీ పాడడమే కాదు.. పాటను కూడా రాశాడు. అంతేకాదు చిందేశాడంట. అక్కినేని ఫిలిం స్కూల్ స్టూడెంట్ చునియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పడేశావే' కోసం ఆలీ పాట రాసి, పాడాడంట. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ఈ పాటను ఇప్పటికే రికార్డు చేశారు. 

16:00 - February 17, 2016

విజయవాడ : తెలుగుదేశం పార్టీ ఏపీ కార్యాలయం ఖరారైంది. విజయవాడలోని ఆటోనగర్‌ సమీపంలో ఉన్న కొత్త భవనంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు భవనాన్ని పరిశీలించిన అనంతరం.. కార్యాలయం ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. 

 

15:58 - February 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీల విడుదలకు రాష్ట్ర హోంశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. 2016 జనవరి 26 నాటికి 5 నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష పూర్తిచేసుకున్న మహిళా ఖైదీలకు,ఏడేళ్లు పూర్తి చేసుకున్న పురుష ఖైదీలకు ఇది వర్తిస్తుంది. మార్గదర్శకాల అమలుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేసింది. 

 

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

ఖమ్మం : జిల్లాలోని కూనవరం మండలం పైడిగూడెంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన చిన్నారులు చదల స్వాతి(5), వల్లా భూమిక(5) బుధవారం మధ్యాహ్నం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆడుకుంటూ నీటిలోకి దిగారు. సమీపంలోని ఉన్న వారెవరూ గమనించకపోవటంతో మునిగి మృతి చెందారు.

చంద్రబాబుతో టీటీడీపీ నేతల సమావేశం....

విజయవాడ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు విజయవాడలో చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎంతో భేటీ అయ్యేందుకు ఎల్ రమణ, మోత్కుపల్లి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు విజయవాడకు రాగా, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి చంద్రబాబు వారితో చర్చిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో, పార్టీ బలోపేతం తదితర అంశాలపై వీరి మధ్య చర్చలు సాగుతున్నట్టు సమాచారం. పార్టీని వీడుతున్న వారిని ఎందుకు అడ్డుకోలేకపోయారని చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

కన్హయ్యపై కొంతమంది లాయర్లు దాడి

ఢిల్లీ : ఏఐఎస్ ఎఫ్ నేత, జెఎన్ యూ అధ్యక్షుడు కన్హయ్యపై కొంతమంది లాయర్లు దాడికి పాల్పడ్డారు. కన్హయ్యను కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఈనేపథ్యంలో కన్హయ్య తరపు లాయర్లు, అతనికి వ్యతిరేకంగా ఉన్న లాయర్లు ఇరు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. అలాగే ఒక జర్నలిస్టుపై కూడా దాడి చేశారు. 

15:23 - February 17, 2016

ఏంటీ అమీర్ ఖాన్..హృతిక్ రోషన్ ఏడ్చారా ? ఏమయింది ? అని ఏదోదే ఊహించుకోకండి. వీరంతా ఓ సినిమాను చూసి కన్నీళ్లు కార్చారంట. మరి అంతగా ఏడిపించిన సినిమా ఏంటీ ? అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇది చదవండి.
బాలీవుడ్ లో ఇటీవలే 'నీరజ' చిత్రం రూపొందింది. కొన్ని సంవత్సరాల క్రితం పాన్ ఎమ్ 73 విమానాన్ని పాక్ ఉగ్రవాదులు కరాచీలో హైజాక్ చేసిన ఘటన ఆధారంగా రామ్ మాధవాని ఈ చిత్రాన్ని రూపొందించాడు. నీరజ అనే ఎయిర్ హోస్టెస్ విమానంలోని ప్రయాణీకులను ఎలా కాపాడింది ? ఎలాంటి ధైర్యం చూపించిందనదన్నదే కథ. నీరజ పాత్రలో 'సోనమ్'..ఆమె తల్లి పాత్రలో 'షబానా ఆజ్మీ' నటించారు. విడుదలకు ముందు ముంబైలో చిత్ర యూనిట్ ప్రీమియర్ షో ఏర్పాటు చేసింది. ఈ షో కు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా చూసి తాము ఉద్వేగానికి గురైనట్లు పలువురు ట్వీట్లు చేశారు. అలాగే సినిమా చూడటానికి వచ్చిన అమీర్ ఖాన్..హృతిక్ రోషన్ లు అయితే కన్నీళ్లు కార్చారంట. సోనమ్ అద్భుతంగా నటించిందని, చివరి ఎపిసోడ్ లో కళ్లవెంట నీళ్లు కూడా వచ్చేశాయని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. సోనమ్ అద్భుతంగా నటించిందని..క్లైమక్స్ లో ఏడుపు ఆపులేకపోయానని..అందరికీ అభినందనలు అని హృతిక్ ట్వీట్ చేశారు. మరి 'నీరజ' ఎలా ఉందో తెలుసుకోవాలంటే శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే. 

15:18 - February 17, 2016

ఢిల్లీ : ఏఐఎస్ ఎఫ్ నేత, జెఎన్ యూ అధ్యక్షుడు కన్హయ్యపై కొంతమంది లాయర్లు దాడికి పాల్పడ్డారు. కన్హయ్యను కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఈనేపథ్యంలో కన్హయ్య తరపు లాయర్లు, అతనికి వ్యతిరేకంగా ఉన్న లాయర్లు ఇరు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. అలాగే ఒక జర్నలిస్టుపై కూడా దాడి చేశారు. కొంతమంది లాయర్లు భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. కన్హయ్యకు అనుకూలంగా కొంతమంది లాయర్లు, కన్హయ్యకు వ్యతిరేకంగా మరికొంతమంది లాయర్లు నినాదాలు చేశారు. దీంతో పాటియాల కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కన్హయ్య తరపున ముగ్గురు లాయర్లు, ఎబివిపి, బిజెపి తరపున ముగ్గురు లాయర్లను కోర్టు హాల్ లోకి అనుమతించారు.
బాహా బాహీకీ దిగిని ఇరు వర్గాల లాయర్లు
జెఎన్‌యు వివాదానికి సంబంధించి లాయర్లు రెండు వర్గాలు చీలిపోయారు. ఢిల్లీలో పటియాల కోర్టు వద్ద ఇరు వర్గాల లాయర్లు బాహా బాహీకీ దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కొందరు లాయర్లు జర్నలిస్టులపై మళ్లీ దాడి చేశారు. జర్నలిస్టులు ఫోన్లను లాక్కుని వీడియోలను డిలీట్‌ చేశారు. భారత్‌ మాతాకి జై అంటూ కొందరు, కన్నయ్యకు మద్దతుగా మరికొందరు లాయర్లు నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే దేశద్రోహం కేసుకు సంబంధించి కన్నయ్య కుమార్‌ను పోలీసులు పటియాల కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన రిమాండ్‌పై కోర్టు చర్చించనుంది.
ఎఐఎస్ ఎఫ్ జాతీయ అధ్యక్షుడు 
'మేము రైతుల సంక్షేమం, ప్రజల సంక్షేమ కోసం పని చేస్తున్నాము. ఎబివిపి, బిజెపి నేతలే దేశ ద్రోహులు. వామపక్ష శక్తులే నిజమైన దేశభక్తులు. మేము దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదు. ఎబివిపి కార్యకర్తలే దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హెచ్ సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన,  జెఎన్ యూలో జరిగిన ఘటన, రైతుల సంక్షేమ, ప్రజా సమస్యలపై మాట్లాడితే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం అవుతుందా..? డుప్లికేట్ బిజెపి దేశభక్తి, డుప్లికేట్ ఆర్ ఎస్ ఎస్ దేశభక్తి మేము ఒప్పుకోమని... వామపక్షాలది నిజమైన దేశభక్తియని... మేమే దేశ ప్రజల సమస్యలపై పోరాడుతున్నాం. బిజెపి నేతృత్వంలోని ఎన్ డిఎ ప్రభుత్వం పీడీపీ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు. జెఎన్ యూ ఘటనపై జ్యుడిషియల్ విచారణ చేయాలి. ఈనెల 23 న చలో ఢిల్లీకి పిలుపునిచ్చాము. బిజెపి, ఎబివిసి, ఆర్ ఎస్ ఎస్ సంస్థల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నాకు ఫోన్లు చేసి... చంపుతామని బెదరిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా నన్ను బెదిరిస్తున్నారు. వారి బెదిరింపులకు భయపడను. వామపక్షాలు త్యాగాలకు మారుపేరు. సంఘంలోకి వచ్చినప్పుడే అన్నింటికీ తెగించి వచ్చాను. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. దేనికైనా సిద్ధమే. మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు.. వాటిని మానుకోవాలి' అని హితవు పలికారు. 

 

14:58 - February 17, 2016

ఢిల్లీ : కన్నయ్య కుమార్ నిరపరాధని, ఆయన అరెస్టు అక్రమమని ఏఐఎస్ఎఫ్‌ నాయకులు అన్నారు. ఆరెస్సెస్, బీజేపీ విశ్వవిద్యాలయాల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నిరపరాధులపై చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. దేశంలో ఎన్నో ప్రజా ఉద్యమాలకు జేఎన్‌యూ వేదికగా నిలిచిందని చెప్పారు. జాతి వ్యతిరేక నినాదాలు ఎవరు చేసినా ఖండిస్తున్నామన్నారు.

మరికాసేపట్లో ఢిల్లీ హౌజ్‌ కోర్టులో కన్హయ్య కేసుపై విచారణ

ఢిల్లీ : మరికాసేపట్లో ఢిల్లీ హౌజ్‌ కోర్టులో కన్హయ్య కేసు విచారణకు రానుంది. దీంతో ఢిల్లీ కోర్టు దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు హాలులోకి అనుమతిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఐదుగురు విలేకరులు, ఇద్దరు కన్హయ్య మద్దతుదారులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇరు పక్షాల న్యాయవాదులు తప్ప ఇతర లాయర్లు ఎవరినీ అనుమతించొద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు వద్ద వందేమాతరం అంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు.

14:50 - February 17, 2016

ఢిల్లీ : మరికాసేపట్లో ఢిల్లీ హౌజ్‌ కోర్టులో కన్హయ్య కేసు విచారణకు రానుంది. దీంతో ఢిల్లీ కోర్టు దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు హాలులోకి అనుమతిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఐదుగురు విలేకరులు, ఇద్దరు కన్హయ్య మద్దతుదారులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇరు పక్షాల న్యాయవాదులు తప్ప ఇతర లాయర్లు ఎవరినీ అనుమతించొద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు వద్ద వందేమాతరం అంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు. కోర్టు హాలులోకి మొత్తం 20 మందికే అనుమతి ఇచ్చింది. 20 మందికి తగినట్లుగానే కుర్చీలు ఏర్పాటు చేశారు. జెఎన్‌యూ వివాదం నేపథ్యంలో 13 మంది సీనియర్‌ ఢిల్లీ పోలీసులపై బదిలీ వేటు పడింది. కన్హయ్యపై దేశద్రోహం కేసు పెట్టే సాక్ష్యాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. 

 

ఖైదీలకు క్షమాభిక్ష కోసం మార్గదర్శకాలు

హైదరాబాద్: సత్ర్పవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష కోసం మార్గదర్శకాలను నిర్దేశించేందుకై తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించారు. మహిళా ఖైదీలకు వాస్తవశిక్ష, రిమాండ్‌తో కలిసి ఏడేళ్లు, పురుషులకు ఏడేళ్ల శిక్ష, రిమాండ్‌తో కలిపి పదేళ్లు శిక్ష పూర్తి అయిన వారికి, అలాగే మహిళలపై నేరాలకు పాల్పడిన ఖైదీలకు పదేళ్ల జైలుశిక్ష... రిమాండ్‌తో కలిపి 14 ఏళ్ల శిక్ష పూర్తైనవారికే క్షమాభిక్ష‌ పెట్టాలని నిర్ణయించారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన రద్దుకు కేంద్రం నిర్ణయం

ఇటానగర్ : అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన రద్దుకు సిఫారసు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. బుధవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర కేబినెట్‌ సమావేశం అయి సుదీర్ఘంగా చర్చింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్‌ చేయడంతో ఈ మేరకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

13:29 - February 17, 2016

వరంగల్ : మేడారం వెళ్లే భక్తులకోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది ఆర్టీసీ.. ఒకేరోజులో అమ్మవార్ల దర్శనం చేసుకొని తిరిగివచ్చేలా ఏర్పాట్లు చేసింది.. ఉదయం 7గంటలకు హైదరాబాద్‌నుంచి ఈ బస్సులు బయలుదేరతాయి.. సాయంత్రం 4గంటలకు మేడారంనుంచి తిరుగు ప్రయాణమవుతాయి.. ప్రయాణికులను రాత్రి 10గంటలకు భాగ్యనగరంలో దించేస్తాయి.. ఈ టూర్లో ఏసీ బస్సులకయితే పెద్దవారికి 1300 రూపాయలు, పిల్లలకు వెయ్యి నలభై రూపాయలు చార్జీగా నిర్ణయించారు.. నాన్‌ ఏసీ బస్సుల్లో పెద్దలకు వెయ్యి రూపాయలు... పిల్లలకు 800 రూపాయలు చార్జీలుగా వసూలు చేస్తారు.. అలాగే మేడారంకోసం ప్రత్యేక బస్సులు సిద్ధం చేశారు.. 

13:27 - February 17, 2016

వరంగల్ : సమ్మక్క,సారలమ్మల జాతరను జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ, ఐజీ నవీన్‌ చంద్‌, డీఐజీ మల్లారెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. జాతరకు భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించామని కలెక్టర్‌ వాకాటి కరుణ తెలిపారు. మొదటి రూపొందించిన ప్రకారమే జాతర నడుస్తుందని స్పష్టం చేశారు. 10వేల మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేసినట్లు డీఐజీ తెలిపారు. 

ఎర్రగుడి పంచాయతీ కార్యదర్శి ఇమ్మానియల్‌ దారుణ హత్య

కర్నూలు :కృష్ణగిరి మండలం ఎర్రగుడి పంచాయతీ కార్యదర్శి ఇమ్మానియల్‌ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన ఓర్వకల్లులో పున్నమి రెస్టారెంట్‌ దగ్గర చోటు చేసుకుంది. దుండగులు పెట్రోల్‌ పోసి మృతదేహాన్ని తగులబెట్టినుట్ల సమాచారం వివాహేతర సంబంధమే ఇమ్మానియల్ హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

13:20 - February 17, 2016

వరంగల్ : మేడారం జాతరలో హిజ్రాలు సందడి చేస్తున్నారు. అమ్మవారి సేవలో పులకించిపోయేందుకు హిజ్రాలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారికి బంగారం సమర్పించి నైవేద్యాన్ని పంచుతున్నారు. 

13:14 - February 17, 2016

మేడారం : సమ్మక్క సారలమ్మల జాతర ప్రాంగణాలు పూల సొగబులు అద్దుకున్నాయి. ఎన్నడూ లేనట్టుగా సుమారు 126 రకాల పుష్పాలతో అమ్మవారి గద్దెలను, ప్రాంగణాన్ని అలంకరించారు. రోజుకు మూడు టన్నుల పూలతో జాతర ప్రాంగాణాన్ని అలంకరిస్తారు. 

13:11 - February 17, 2016

హైదరాబాద్ : ఢిల్లీలోని పాటియాలా హౌజ్‌ కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జేఎన్‌యూ వివాదంలో దేశద్రోహం కేసులో అరెస్టయిన కన్నయ్యకుమార్‌ కేసు విచారణ సమయంలో ఐదుగురికే సుప్రీంకోర్టు అనుమతించింది. ప్రాసిక్యూషన్‌ న్యాయవాదులకు తప్ప మరెవరికి అనుమతి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకు ముందు ఈ కేసు విచారణ సమయంలో లాయర్లు వందేమాతరం అంటూ సుప్రీంకోర్టులో నినదించారు. మరోవైపు న్యాయవాదులు వందేమాతరం అంటూ నినాదాలు చేస్తున్నారు. 

అనురాగ్ శర్మను ప్రశంసించిన రాజనాథ్

హైదరాబాద్ : డీజీపీ అనురాగ్ శర్మను కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఒడిశాలో అరెస్టు చేసిన సిమి ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం ఇచ్చినందుకు అనురాగ్ శర్మను ఫోన్ లో రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.

పాటియాలా హౌజ్‌ కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం..

హైదరాబాద్ : దిల్లీలోని పాటియాలా హౌజ్‌ కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జేఎన్‌యూ వివాదంలో దేశద్రోహం కేసులో అరెస్టయిన కన్నయ్యకుమార్‌ కేసు విచారణ సమయంలో ఐదుగురికే సుప్రీంకోర్టు అనుమతించింది. ప్రాసిక్యూషన్‌ న్యాయవాదులకు తప్ప మరెవరికి అనుమతి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

12:44 - February 17, 2016

విశాఖ : పూడిమడక మెరైన్‌ సీఐ హుస్సేన్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.విశాఖ, శ్రీకాకుళం, బెంగళూరులోని హుస్సేన్‌ బంధువుల ఇళ్లలోను సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖ మూడు, నాల్గు, ఐదో టౌన్‌ సీఐగాను హుస్సేన్‌ పని చేశాడు.

12:43 - February 17, 2016

అమరావతి : ఏపీకి పూర్వ వైభవం తీసుకువస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. వెలగపూడిలో తాత్కాలిక రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్ర విభజనతో ఏపీ ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని.. దేశంలోనే మేటి రాజధానిగా నిలపాలని సంకల్పించా దానికి మీ అందరి సహకారం కావాలని కోరారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని.. ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. కష్టాలు తాత్కాలికమని వాటిని చూసి భయపడకూడదని అన్నారు బాబు. రాష్ట్రాన్ని విభజించిన వారు.. అసూయ పడేలా రాజధానిని నిర్మాస్తానన్నారు బాబు. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదని.. కాని మనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయన్నారుబాబు. వాటిని సద్వినియోగం చేసుకుంటే మనతో పాటు మన భవిష్యత్ కూడా బాగుంటుందన్నారు బాబు. 

12:40 - February 17, 2016

మహబూబ్‌ నగర్‌ :జిల్లాలో రోడ్డు ప్రమాదం నలుగురి ప్రాణాలు తీసింది.. చిత్తూరు జిల్లా రాయచోటినుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారు భూత్పూర్‌ దగ్గర డివైడర్‌ను ఢీకొట్టింది.. ఆ వెంటనే మరోలారీపైకి దూసుకెళ్లింది.. ఈ ఘటనలో ముగ్గురు అక్కడే ప్రాణాలు కోల్పోయారు.. మరొకరు ఆస్పత్రిలో మృతిచెందారు.. తీవ్ర గాయాలపాలైన మరో బాధితురాలికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. మృతుల్లో ఆరేళ్ల బాబుతోపాటు ఓ మహిళ ఉన్నారు..

12:37 - February 17, 2016

నల్గొండ : చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. తెల్లవారుజామున నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో ఓ భక్తురాలు పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. 

12:19 - February 17, 2016

తెలంగాణల లంచం ఎవ్వడన్న లంచం అడ్గితె.. 040-23454071 నంబర్కు పోన్ గొట్టుండ్రి అని కేసీఆర్ సారు సరిగ్గ పదమూడు నెల్లకింద వరంగల్లు జెప్పిండు. ఐతే.. సీఎం సారు మాకు గాదు వరంగల్లోల్లకు జెప్పిండు అన్కున్నరో ఏమో గని.. కరీంనగర్ జిల్లా ఎములాడలున్న కొందరు గవుర్మెంట్ అధికార్లు ఏం జేశిండ్రో జూడు నా సామిరంగ ఉండాలే భూమ్మీద ఇసొంటి సద్వుకున్న ఉద్దుండులు..సూడాలంటే వీడియో చూడుండి. 

12:13 - February 17, 2016

భాగ్య నగరాన్ని స్వచ్చ ఐద్రావాద్ జెయ్యాల్నని.. కేసీఆర్ సార్ కంకణం కట్టుకొని అకుంఠిత దీక్షతోని పురుడు పోశి.. భారసాల జేశ్న భాగ్యనగరం స్వచ్చతకు నోచుకోలేదట.. సంటర్ సర్కారోల్లు జేశ్న సర్వే తోని ఈ ముచ్చట ఎర్కైంది. మన పట్నం పేర్ను ఏన్నో దూరం పడేశిండ్రు.. సెత్త బుట్టలు పంచిపెట్టి.. సీఎం సారు గంత గానం కష్టవడే.. గట్లెందుకు ఎన్కవడ్డదో ఏమో తెలుస్తలేదు. ఎందుకో ఈ వీడియో క్లిక్ చేయుండ్రి..

తుళ్లూరు సీఆర్డీఏ వద్ద నిరుద్యోగుల ఆందోళన

విజయవాడ : తుళ్లూరు సీఆర్డీఏ వద్ద రాజధాని ప్రాంత నిరుద్యోగులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

12:11 - February 17, 2016

పెన్ను పేపర్ వట్కోని.. అఆలు దిద్దాలి.. అ.. ఆ.. ఇ.. ఈ.. అమ్మయ్య మొత్తం మీద నాల్గు అచ్చరాలు మాత్రం నేర్సుకున్నపో.. ఇన్నొద్దులు ఏంగాదు సద్వురాకున్నా అనుకున్నగని... అమ్మో ఇంతమోసమైతదని తెల్వకపాయే.. ఏంది మల్లన్నా.. ఏమో సద్వంటున్నవ్ మోసమంటున్నవ్ అనిపిస్తున్నదా..? అయ్యో మీరు గీ వీడియో సూడుండ్రి మీకే తెలుస్తది. 

12:00 - February 17, 2016

ఈ వేసవి వేడిగా ఉండబోతోంది. చెబుతోంది వేసవి ఎండల గురించి కాదు, టాలీవుడ్‌ సంధిస్తోన్న చిత్రాల గురించి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగొందల కోట్ల బిజినెస్‌ ఈ వేసవి సినిమాలపై ఆధారపడి ఉంది. అన్ని కోట్లంటేనే రాబోయేవి చిన్నా చితకా సినిమాలు కానే కాదని అర్థమయ్యే ఉంటుంది. అవును ... వాళ్లూ వీళ్లూ కాదు... ఈసారి వేసవిలో టాలీవుడ్‌ 'సూపర్‌' 'పవర్‌'లు బాక్సాఫీస్‌ని టేకోవర్‌ చేసుకోబోతున్నాయి. అంటే మిగతా వారి మాటెలా ఉన్నా తెలుగు సినిమా ప్రియులకి మాత్రం ఈ సమ్మర్‌ సమ్మగా ఉంటుంది. కనీసం రెండు వారాలకో పెద్ద సినిమా వచ్చి వెండితెరని అలంకరిస్తే సమ్మర్‌ హాలిడేస్‌లో అంతకుమించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏం కావాలి, దాన్ని కొట్టే ఎంజాయ్‌మెంట్‌ ఏముంటుంది? సో.. ఈ సమ్మర్ కి సమరానికి సై అంటున్న పెద్ద చిత్రాల బిజినెస్ పై కథనం. స్టార్ హీరోలంతా.. ఈ సమ్మర్ లోనే... తమ అస్త్రాలను సంధించబోతున్నారు. ఆ మూవీస్ అన్నీ ఆషా మాషీ మూవీస్ కాదు మరి. పవర్ స్టార్ , సూపర్ స్టార్ , స్టైలిష్ స్టార్ లు సైతం ఈ సమ్మర్ బరిలోకి దిగి .. హై బడ్జెట్ తో కాలు దువ్వుతున్నారు... వాళ్ళతో పాటు సీనియర్ హీరోలు కూడా సై అంటున్నారు.

పవర్ స్టార్..
సరిగ్గా నాలుగేళ్ల క్రితం వేసవిలోనే గబ్బర్‌సింగ్‌గా పవన్‌కళ్యాణ్‌ బాక్సాఫీస్‌ని ఊపేసి వదిలాడు. పదకొండేళ్ల పాటు తన పవర్‌ గురించి వినడమే తప్ప చూసి ఎరుగని వారికి తన సూపర్‌హిట్‌ సినిమా సత్తా ఏంటనేది చూపించాడు. గబ్బర్‌సింగ్‌ తిక్కకైనా లెక్కుంటుంది కానీ, అదే గబ్బర్‌సింగ్‌కి కొనసాగింపుగా 'సర్దార్‌' దిగుతుంటే అభిమానులకి అంచనాలకి మాత్రం లెక్కుండదు.

శ్రీమంతుడు...
శ్రీమంతుడు తో మహేష్ బాబు సూపర్ స్టార్ డమ్ ఎన్నో రెట్లు పెరిగింది. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ మూవీ పై ఉంటుంది. అందరూ ఊహిస్తున్నట్టుగానే... మహేష్ బాబు నెక్ట్స్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బ్రహ్మోత్సవం చిత్రానికి బయ్యర్స్ నుంచి పోటీ ఏర్పడింది. అందుకే బ్రహ్మోత్సవం కళ్ళు చెదిరే బిజినెస్ తో ఈ సమ్మర్ సమరానికి సిద్ధపడుతోంది.

బన్నీ..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... రేసు గుర్రంతో తన సత్తా చాటాడు. ఈ మూవీ అనూహ్యమైన వసూళ్ళు సాధించి... బన్నీ కెపాసిటీ ఏంటో తెలియచెప్పింది. తరువాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి కూడా గట్టి వసూళ్ళనే సాధించింది. అందుకే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ సరైనోడు ఈ సమ్మర్ కి సరైన పోటీ అనుకుంటున్నారు. . దిమ్మతిరిగే బిజినెస్ సరైనోడు సెట్ చేస్తున్నాడు.

మన్మథుడు..
సోగ్గాడే చిన్నినాయనతో సంక్రాంతి మొనగాడు అనిపించుకున్నాడు అక్కినేని నాగార్జున. కళ్ళు చెదిరే వసూళ్ళతో ఇంకా తన వాడి తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. దీని ఎఫెక్ట్ … తరువాత సినిమా ఊపిరి పైన కూడా పడింది. అందుకే ఈ మూవీ ఈ సమ్మర్ కి ముందుగా రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంది. నాగార్జున తన కెపాసిటీ కి తగ్గ బిజినెస్ తోనే రంగంలోకి దిగుతున్నాడు.

వెంకీ..
లాస్టియర్ వచ్చిన గోపాలా గోపాలా స్టార్ కాస్ట్ తో ఓ మోస్తరు సినిమా అనిపించుకుంది.. విక్టరీ వెంకీ... తన కెరీర్ లోనే ఓ మంచి సినిమా చేస్తానన్న సంతృప్తిని మిగుల్చుకున్నాడు. వసూళ్ళు కూడా పర్వాలేదనిపించుకున్నాయి. అందుకే ఈ సమ్మర్ లో వెంకీ... మారుతి తో కలిసి...ఓ కామెడీ ఎంటర్ టైనర్ సెట్ చేసుకున్నాడు. బిజినెస్ కూడా తనకు తగ్గ రేంజ్ లోనే ఉండబోతోంది.

తివిక్రమ్..నితిన్..
సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ .. స్టార్ కాస్ట్ ను వదిలి పెట్టి... ఓ మెట్టు దిగి.. నితిన్ తో ఓ మూవీకి ఫిక్స్ అయ్యాడు. రొమాంటికి్ కామెడీ లు చేయడంలో చెయితిరిగిన త్రివిక్రమ్.. ఆ రూట్లోనే ట్రావెల్ చేస్తూ... అ ఆ అనే మూవీని ట్రాక్ లో పెడుతున్నాడు. ఈ సమ్మర్ బరిలోకి దిగుతున్న ఈ మూవీపై అందరిలోనూ మంచి హోప్స్ ఉన్నాయి. బిజినెస్ కూడా ఊహించని రేంజ్ లో జరుగుతోంది.

రూ.400 కోట్ల బిజినెస్..
స్టార్ హీరోలు, సీనియర్ హీరోలే కాదు ఇప్పుడిప్పుడే కెరీర్ కు పునాదులేసుకుంటున్న ఓ ఇద్దరు కుర్ర హీరోలు కూడా ఈ సమ్మర్ కి వేడి పుట్టించే పనిలో ఉన్నారు. మరికొన్ని చిత్రాలు కూడా లైన్ లో ఉన్నాయి. వాళ్ళ కెపాసిటీని బట్టి.. ఆ రేంజ్ బడ్జెట్ ను కూడా ముందుగానే సెట్ చేసుకున్నారు ఆ హీరోలు. సమ్మర్ సీజన్ ఏ సినిమాలకైనా సరైన టైమ్. అందుకే స్టార్ హీరోలు, సీనియర్ హీరోలతో కలిపి చిన్న చితకా హీరోలంతా సమ్మర్ సమరానికి శంఖం పూరిస్తున్నారు. మొత్తంమీద అన్ని చిత్రాలను కలుపుకుంటే ఈ సమ్మర్ కి టోటల్ గా ఓ 400 కోట్లు బిజినెస్ జరగుతుందని అంచనా. ఇప్పటికే కొన్ని చిత్రాలపై జనం హోప్స్ బాగా పెట్టుకున్నారు. మరి వాళ్లంతా అందరి అంచనాల్ని ఏ రేంజ్ లో అందుకుంటారో, ఆ రేంజ్ వసూళ్ళు సాధిస్తారో లేదో వెయిట్ అండ్ సీ.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 190 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడవుతుండగా, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది.

11:46 - February 17, 2016

ఢిల్లీ : సెక్యులర్ ఇండియాను నాశనం చేసేందుకు మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారని సీపీఎం తెలంగాణరాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఢిల్లీలో జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన తమ్మినేని 'టెన్ టివి'తో మాట్లాడుతూ...దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పై చర్చ జరగనుంది. మతోన్మాదం, తినే ఆహారం, చరిత్ర పై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని ఈ అంశాలపై కేంద్ర కమిటీ సమావేశాల్లో ప్రధాన చర్చ జరగనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం చర్చించే అవకావం ఉన్నట్లు తెలిపారు. మతోన్మాదులు రాజకీయ కుట్రలో భాగంగానే సీపీఎం ఆఫీసుపై దాడి జరిగిందన్నారు. బిజెపి, వీహెచ్ పీ, ఆర్ ఎస్ ఎస్ అగ్రనాయకత్వం ఆధ్వర్యంలోనే ఈ దాడులు చేస్తున్నారని విమర్శించారు. రోహిత్ వేముల ఆత్మహత్య, జేఎన్ యూ లో జరిగిన ఘటనలు ఒక్క యూనివర్శిటీలకు సంబంధించిన అంశం కాదని... ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో టార్గెట్ చేస్తూ కీలకమైన పోస్టుల్లో కాషాయ మద్దతు దారులను నియమించి దాడులు చేస్తున్నారని మండి పడ్డారు. వర్శిటీల్లో అభ్యుదయ భావాలు వున్న వారిపై దాడులు చేస్తున్నారు. మోడీ వ్యతిరేక విధానాలతో భారత ఆర్థికాభివృద్ధి, ఉత్పత్తి రంగం బాగా క్షీణిస్తోందన్నారు.

11:42 - February 17, 2016

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం ప్రారంభం అయ్యింది.ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఏపీ, తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మధు, తమ్మినేని హాజరయ్యారు.

11:41 - February 17, 2016

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం మంచి రేవులలో ఓ స్ర్కాప్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో జిలెటిన్ స్టిక్స్ పేలాయి. ఈ ప్రమాదంలో మీసాల కుమార్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

11:39 - February 17, 2016

పశ్చిమగోదావరి : ఏలూరులో సీఐడీ పోలీసులు బుధవారం అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ అవ్వా వెంకట రామారావు, ఎండీ శేషు నారాయణరావు అలియాస్ కుమార్‌లను సీఐడీ కస్టడీకి తీసుకున్నారు.అగ్రిగోల్డ్ కోట్లాది రూపాయలను ప్రజల నుంచి డిపాజిట్లుగా సేకరించి మోసం చేసిన కేసులో సీఐడీ పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండుకు పంపారు. ఈ కేసులో వారిని విచారించేందుకు వీలుగా కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వెంకట రామారావు, శేషు నారాయణలను విచారణ కోసం రాజమండ్రికి తరలించారు.

దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వారి కోసం సోదాలు

ఢిల్లీ : జేఎన్ యూ కేసుతో సంబంధం ఉన్న వారి కోసం పలు రాష్ట్రాల్లో పోలీసులు తనికీలు చేపట్టారు. ఢిల్లీ, బీహార్, యూపీ, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో జేఎన్ మూలో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వారి కోసంసోదాలు నిర్వహిస్తున్నారు. 

భార్య, కుమారిడి హత్య కేసులో భర్త అరెస్ట్

కడప : భార్య, కుమారిడి హత్య కేసులో భర్త ప్రవీన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతేదహాలను పాలకొండల్లో పూడ్చి పెట్టినట్లు కిరాతకుడు తెలిపాడు. రెండు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. పోలీసులు భర్తను విచారించడంతో నిజం బయటపడింది. మృతదేహాలను పూడ్చిపెట్టిన చోటుకు నిందితుడిని తీసుకెళ్లి మృతదేహాలను పోలీసులు వెలికితీస్తున్నారు.

జిలెటిన్ స్టిక్స్ పేలుడు.. ఒకరి మృతి

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం మంచి రేవులలో ఓ స్ర్కాప్ దుకాణంలో జిలెటిన్ స్టిక్స్ పేలాయి. మీసాల కుమార్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశం ప్రారంభం అయ్యింది.ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఏపీ, తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మధు, తమ్మినేని హాజరయ్యారు.

ప్రారంభమైన కేంద్ర కేబినెట్

ఢిల్లీ : కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ భేటీ లో బడ్జెట్ సమావేశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం.

గుంపుల గ్రామంలో వ్యక్తి దారుణ హత్య

నల్లగొండ: జిల్లాలోని చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో దారణ హత్య సంఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని బండరాయితో మోది హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.

మేడారంలో సమ్మక్క, సారలమ్మ పుస్తకావిష్కరణ

వరంగల్: జిల్లాలో సమ్మక్క, సారలమ్మ కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం మేడారంలో ఇవాళ సమ్మక్క, సారలమ్మ పుస్తకావిష్కరణ జరిగింది. కలెక్టర్ వాకాటి కరుణ, ప్రొఫెసర్ కోదండరాం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ప్రచురించింది.

పోలీసు కస్టడీలో అగ్రి గోల్డ్ నిందితులు...

పశ్చిమగోదావరి : ఏలూరులో సీఐడీ పోలీసులు బుధవారం అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ అవ్వా వెంకట రామారావు, ఎండీ శేషు నారాయణరావు అలియాస్ కుమార్‌లను కస్టడీకి తీసుకున్నారు.అగ్రిగోల్డ్ కోట్లాది రూపాయలను ప్రజల నుంచి డిపాజిట్లుగా సేకరించి మోసం చేసిన కేసులో సీఐడీ పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండుకు పంపారు. ఈ కేసులో వారిని విచారించేందుకు వీలుగా కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వెంకట రామారావు, శేషు నారాయణలను విచారణ కోసం రహస్య ప్రదేశానికి తరలించారు. 

నేడు రోజా సస్పెన్షన్ పిటిషన్ పై విచారణ..

హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం రాజ్యాంగ హక్కులను హరించడమేనని రోజా తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎలాంటి నిబంధనలైనా తయారు చేసుకునే వీలు అసెంబ్లీకి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా కోర్టులో బుధవారం కూడా రోజా పిటిషన్ పై విచారణ జరగనుంది. 

జేఎన్ యూ వివాదం..13 మంది పోలీసులు బదిలీ

ఢిల్లీ : జేఎన్‌యూ వివాదంలో నేపథ్యంలో ఇవాల 13మంది సీనియర్‌ దిల్లీ పోలీసులను బదిలీ చేశారు. పాటియాలా కోర్టు వద్ద విద్యార్థులు, అధ్యాపకులు, పాత్రికేయులపై న్యాయవాదులు దాడి చేస్తుంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఇటీవల దేశద్రోహం కేసులో అరెస్టయిన జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌ను పాటియాలా కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో అక్కడ ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. సోమవారం పాటియాలా కోర్టు వద్ద న్యాయవాదుల దాడికి సంబంధించిన అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో పోలీసుల బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.

10:32 - February 17, 2016

హైదరాబాద్ : ఒడిశాలోని రూర్కెలా పట్టణం, కురేచీలో  ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. రూర్కెలాలోని ఉగ్రవాద స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు సిమి ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి నాలుగు తుపాకులు, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ‌, ఒడిశా పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య మూడు గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి.  

10:31 - February 17, 2016

దేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను అందిపుచ్చుకొనేందుకు 'రింగింగ్‌ బెల్స్‌' సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆ సంస్థ రూ.500 లోపే స్మార్ట్‌ఫోన్‌ను దేశీయంగా వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. దేశంలో బాగా విస్తరిస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ల విపణిలో 'రింగింగ్‌ బెల్స్‌' చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్‌ రానుందని వినియోగదారులు ఆనందపడుతున్నప్పటికీ.. ప్రత్యర్థి కంపెనీల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. 'సమాజంలో అట్టడుగు వర్గం ప్రజలకు కూడా భారత వృద్ధి చేరేలా కృషి చేయాలి' అన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన మేరకు దీనిని మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నోయిడా కేంద్రంగా పని చేస్తున్న 'రింగింగ్‌ బెల్స్‌' సంస్థ 'ఫ్రీడమ్‌ 251' పేరుతో దీనిని మార్కెట్లోకి తేనున్నట్లు సమాచారం. రక్షణ మంత్రి మనోహర్‌ ఫారికర్‌ చేతుల మీదుగా ఈ చౌక స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ (17న) బుధవారం ఆవిష్కరించనుంది.
ప్రస్తుతం మార్కెట్లో రూ.1500ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. 'డాటా విండ్‌' సంస్థ ఇటీవలే అనిల్‌ అంబానీ సంస్థ ఆర్‌కామ్‌తో కలిసి రూ.999కే మార్కెట్లోకి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించన సంగతి తెలిసిందే. ఈ కొత్త ఫోన్‌ ఇంకా మార్కెట్లోకి రావాల్సి ఉండగానే.. రూ.500ల కంటే కూడా తక్కువకు 'రింగింగ్‌బెల్స్‌' చౌక స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేనుండడం విశేషం. కొత్త ఫోన్‌ విశేషాలేమీ సంస్థ వెల్లడించలేదు. మేటి స్మార్ట్‌ఫోన్లలో ఉండే దాదాపు అన్ని సుగుణాల మేళవింపుగా ఈ ఫోన్‌ను అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మార్కెట్లోకి ఏడాది క్రితమే కొత్తగా అడుగుపెట్టిన ఈ సంస్థ ఇప్పటికే రూ.2999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

10:30 - February 17, 2016

అమరావతి: తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి నిర్మిస్తున్న భవనాలు తాత్కాలిక భవనాలు లు కాదు... పర్మినెంట్ భవనాలేనని...పరిపాలన సౌలభ్యం కోసమే తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబుస్పష్టం చేశారు. తుళ్లూరు మండలం వెలగపూడిలో 45.129 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ...రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ కింద భూములు ఇవ్వాలని పిలుపునిస్తే ఎక్కడా లేని విధంగా స్వచ్ఛందంగా 33వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి కాకుండా ఇక్కణ్నుంచే పరిపాలన చేయాలని ఆలోచించినట్లు చెప్పారు. పారిపాలన సౌలభ్యం కోసమే తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఇవి తాత్కాలికమైన భవనాలు కావు... శాశ్వతమైనవని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తీరు చాలా ఆవేదన కలిగించిందన్నారు. రాష్ట్రాన్ని అనైతికంగా విభజన చేసిన వారు అసూయ పడేలా రాజధాని నిర్మాణం ఉండాలని ఆకాంక్షించారు. సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రపంచ రాజధానుల్లో టాప్ టెన్ లో ఒక రాజధానిగా ఉండాలని నేను సంకల్పించాను. మన మీద ఉండే నమ్మకంతో సింపూర్ కేబినెట్ నిర్ణయం చేసిన రాజధాని మాస్టర్ ప్లాన్ ఎంఓయూ ఇచ్చారని తెలిపారు. ఎన్జీఓలు ముందుండి విభజనకు వ్యతిరేకంగా పోరాడినా... రాజధాని మార్పుకు ఉద్యోగులు ముందుకు వచ్చారని.. వారికి అభినందనలు తెలిపారు. ఫైనాన్షియల్ వనరులన్నింటి చూసి 2019 వరకు లోటు బడ్జెట్ వుంటుందని తెలిపారు. హుదూద్ వల్ల దెబ్బతిన్న విశాఖకు అనేక కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే విధంగా తీర్చిదిద్దామన్నారు. భావితరాలు కూడా ఆశ్చర్య పోయేవిధంగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. కొంత మంది కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మన రాష్ట్రానికి విస్తారమైన సముద్ర తీరం వుందని.. అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. 2022 సంవత్సరానికి మూడు అగ్ర రాష్ట్ర రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉంటుందని చెప్పారు. 2050 ప్రపంచంలో అత్యున్నతమైన రాష్ట్రంగా చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. 

10:29 - February 17, 2016

అంగోలా: పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన లుకాపా మైనింగ్‌ కంపెనీ అంగోలాలో భారీ వజ్రాన్ని కనుగొన్నది. 404 క్యారెట్ల ఈ వజ్రం విలువ సుమారు రూ.95 కోట్లు ఉంటుందని అంచనా. సంస్థ ఛీప్‌ ఎగ్జిక్యూటివ్‌ వెతరల్‌ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది అంగోలా దేశంలో అతిపెద్ద వజ్రమంటూ సంతోషం వ్యక్తం చేశారు. లుకాపా సంస్థ విడుదల చేసిన ఛాయాచిత్రంలో ఈ వజ్రం పొడవు సుమారుగా ఏడు సెంటీమీటర్లుందని తెలిపారు. తమ అన్వేషణలో బయటపడిన ఈ డైమండ్‌ ప్రపంచంలో 28వ పెద్ద వజ్రమని ఆయన పేర్కొన్నారు. చాలా మారుమూల ప్రాంతంలోని ఏడువందల కిలోమీటర్ల లోతట్టు తీరం నుంచి దీన్ని వెలికితీశామని వెతరల్‌ చెప్పారు. ఈ ప్రకటన వెలువడగానే మార్కెట్‌లో లుకాపా కంపెనీ షేర్లు 29 శాతం లాభాలను నమోదు చేశాయన్నారు. కాగా 1893లో బ్రెజిల్‌లో కనుగొన్న 3,167 క్యారెట్ల వజ్రం ''సెర్గియో'' ప్రపంచంలో అతిపెద్దది.

10:22 - February 17, 2016

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఈ వయస్సులో డిగ్రీ పట్టా అందుకోవడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? దీని గురించి తెలుసుకోవాలంటే చదవండి...యశ్ రాజ్ ఫిల్మ్ 'ఫ్యాన్' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 'షారుఖ్' నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని ఒక పాటను 'హంస రాజ్' కాలేజీలో చిత్రీకరణలో పాల్గొనేందుకు షారుఖ్ ఢిల్లీకి వచ్చాడు. ఈ కాలేజీలోనే షారుఖ్ విద్యనభ్యసించాడు. 1985-88 బ్యాచ్ విద్యార్థి అయిన షారుఖ్ బీఏ (ఎకనామిక్స్) చదివాడు. డిగ్రీ పూర్తయిన తరువాత కాలేజీ గడప దొక్కలేదు. సందర్భం కలిసి రావడంతో 28 ఏళ్ల తరువాత తన డిగ్రీ పట్టాను కళాశాల ప్రిన్స్ పాల్ చేతుల మీదుగా షారుఖ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడారు. 1988 లో కాలేజీ నుండి వెళ్లిపోవడం జరిగిందని, డిగ్రీ పట్టా అందుకొనే సందర్భంలో తన పిల్లలు ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. 

10:16 - February 17, 2016

ఆసియా టీమ్‌ చాంపియన్‌ షిప్స్‌లో భారత్‌ నేడు బరిలోకి దిగనుంది. శ్రీకాంత్‌ సారథ్యంలో మెన్స్‌ జట్టు, జ్వాల నేతృత్వంలో వుమెన్స్‌ జట్టు సింగపూర్‌తో ఢకొీట్టనున్నాయి. ఉదయం సెషన్‌లో పురుషుల తలపడ నుండగా..సాయంత్రం మహిళల పోరు జరుగనుంది. మెన్స్‌ విభాగంలో మలేషి యా 4-1తో శ్రీలంకపై గెలు పొందగా.. నేపాల్‌పై జపాన్‌ 5-0 ఏకపక్ష విజయం సాధిం చింది. చైనీస్‌ తైపీ 5-0తో మాల్దీవులుపై, ఇండోనేషియా 4-1తో థాయ్ లాండ్‌పై గెలుపొందాయి. మహిళల విభాగం లో జపాన్‌.. సింగపూర్‌పై, దక్షిణ కొరియా.. మాల్దీవులుపై వరుసగా 5-0తో తిరుగులేని విజయం సాధించాయి. చైనీస్‌ తైపీ 4-1తో శ్రీలంకపై, మలేషియా 3-2తో హాంగ్‌కాంగ్‌పై గెలుపొందాయి.

 

10:15 - February 17, 2016

కాసేపు కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేస్తే చాలు.. ఆ ఒత్తిడి ప్రభావం కళ్లపై పడి లాగినట్లు అనిపిస్తాయి. ఇక, బయటికెళితే.. చెప్పక్కర్లేదనుకుంటా! దుమ్ము, ధూళి, ఎండ ప్రభావం ఎంతో ఇబ్బంది పెడతాయి. ఇలాంటి ఇబ్బందులకు దూరంగా.. కళ్లు తాజాగా మారాలంటే..
గులాబీ రేకుల్ని ముద్దగా చేసుకుని దానికి ఒక స్పూను పాలు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తమలపాకుపై ఉంచి కళ్లు మూసుకుని పావుగంట సేపు మూసి ఉన్న రెప్పలపై ఉంచాలి. ఇలా చేస్తే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కంటి అలసటా తగ్గుతుంది.
బయటి నుంచి ఇంటికి తిరిగిరాగానే గులాబీ నీళ్లను ఫ్రిజ్‌లో ఉంచి దానిలో ముంచిన దూదితో కంటి చుట్టూ తుడుచుకుంటే ఆ ప్రాంతంలోని చర్మం శుభ్రపడుతుంది. నలుపుదనం దూరమవుతుంది. ఎప్పటికప్పుడు చన్నీళ్లతో ముఖం కడుక్కోవడం తప్పనిసరి.
కళ్ల కింద నలుపు చాలా మందిని వేధించే సమస్య. దీన్ని తగ్గించుకోవడానికి బంగాళాదుంప రసంలో కాసిని పాలు కలిపి కంటి చుట్టూ రాసుకుంటే సరి.
బయట ఎక్కువసేపు తిరిగే వారి కళ్లు అలసిపోయి ఎర్రబారుతుంటాయి. అప్పుడప్పుడూ నీళ్లు కారుతుంటాయి. ఇలాంటప్పుడు కళ్లకు సాంత్వన కలిగించేందుకు కీరదోసను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చక్రాల్లా తరిగి కళ్లపై ఉంచుకుంటే.. హాయిగా ఉంటుంది.
ఒత్తిడి వల్ల కళ్లకింద ఉబ్బెత్తుగా మారుతుంది. ఇలాంటప్పుడు కనురెప్పలు మూసి గోరువెచ్చని టీ బ్యాగుల్ని కొన్ని క్షణాలు ఉంచితే ఇబ్బంది తగ్గుతుంది. కాలం ఏదైనా బయటికి వెళ్లేప్పుడు చలువ కళ్లద్దాలు ధరిస్తే మంచిది. ఇవి ఎండ, కాలుష్యం వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తాయి.

10:15 - February 17, 2016

అప్పుడే వేసవి కాలం ప్రారంభమైంది. కాసేపు ఆరుబయటకు వెళ్లితే చెమట రూపంలో శరీరంలోని నీరంతా ఆవిరై దాహమేస్తుంది. వెంటనే నీరు తాగాలనిపిస్తుంది. అయితే నోరు చేదుగా ఉండి నోరెండిపోవడం, తలనొప్పి, తల తిరగడం, చల్లని నీరు పదే పదే తాగాలనిపించే లక్షణాలు కనిపిస్తే కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి.

  • ఒక గ్లాసు చల్లని నీటిలో ఒక స్పూన్‌ నిమ్మరసం, నాలుగు చెంచాల పంచదార కలిపి తాగితే దాహం తగ్గుతుంది.
  • పలుచని మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే వేసవి దాహం తీరుతుంది.
  • ఒక టీస్పూన్‌ మంచి గంధం, రెండు టీస్పూన్ల ఉసిరి రసం, రెండు టీస్పూన్ల తేనె కలిపి తాగవచ్చు.
  • మిరియాలు, అల్లం, నిమ్మరసం కలిపిన చెరుకు రసం తాగితే త్వరగా దాహాన్ని తగ్గిస్తుంది.
  • దానిమ్మ పండ్ల రసంలో చక్కెర కలిపి లేత పాకంగా చేసుకోవాలి. రెండు టీస్పూన్ల మోతాదులో రోజూ మూడుసార్లు తాగితే దాహం తీరుతుంది.
  • ధనియాల కషాయంలో చక్కెర, తేనె కలిపి తాగినా ఎండవల్ల కలిగే దప్పిక తగ్గుతుంది.
  • పెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు కలిపి తింటే త్వరగా దాహం తీరడంతో పాటు వడదెబ్బ నుంచి కోలుకుంటారు. అరలీటర్‌ నీటిలో 50 గ్రాముల బెల్లం కలిపి లేత పాకం చేసుకోవాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగితే దాహం వెంటనే తగ్గుతుంది.
10:14 - February 17, 2016

వాతావరణంలో పెరిగిన కాలుష్యం.. స్వేదరంధ్రాలపై దుమ్ము, ధూళి అంటుకోవటంతో ముఖం జిడ్డుగా మారుతుంది. మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాలతో ఈ జిడ్డును తొలగించుకునే ప్రయత్నంలో అనేక సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తుంటాయి. వీటిని నివారించేలా ఇంటిలోనే సులభమైన చిట్కాలు పాటించవచ్చు.

  • రోజూ ఉదయాన్నే కలబంద గుజ్జును తీసి ముఖంపై పట్టించి రుద్దాలి. 20 నిమిషాల తర్వాత వేడి నీటి స్నానం చేస్తే జిడ్డు వదులుతుంది.
  • రోజ్‌వాటర్‌తో ముఖం తరచుగా శుభ్రపరచటం వల్ల చర్మంపై ఉండే సూక్ష్మరంధ్రాలు శుభ్రంగా తయారవుతాయి.
  • తేనె, నిమ్మరసం, కొద్దిగా చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఆ మిశ్రమం ఆరిపోయాక ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.
  • ఒక బౌల్‌లో టొమాటో రసం, నిమ్మరసం, పాలు, కొద్దిగా నూనె కలిపి ముఖానికి పట్టిస్తుంటే ముఖచర్మం అందంగా తయారవటమే కాదు మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
  • బాదం పప్పులను మెత్తగా నూరి ముఖానికి అంతా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి.
  • ముఖానికి పెరుగు పట్టిస్తే అందులో ఉండే లాక్టిక్‌ ఆసిడ్‌ చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. ఆయిల్‌ ఫేస్‌లో ఉండే జిడ్డును పెరుగు పోగొడుతుంది.
  • ముఖంపై తేనెను రాస్తే చక్కని ఫలితం ఉంటుంది. నీటిలో కీరదోస రసం గాని, ఆపిల్‌ రసం గాని, గ్రీన్‌ టీ గాని కలిపి ఫ్రిజ్‌లో ఐస్‌గా చేసి గుడ్డను మూటకట్టి ముఖంపైన కొద్దిసేపు ఉంచి కడిగేయాలి. ఇలా రెండు, మూడు సార్లు చేస్తే చర్మం అందంగా తయారవుతుంది.
10:12 - February 17, 2016

బాక్సింగ్‌ కోచ్‌గా మాధవన్‌ నటించిన 'ఇరుధి సుట్రు' చిత్రం ఇటీవల తమిళనాట విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో రియల్‌లైఫ్‌ బాక్సర్‌ రితికాసింగ్‌ కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. బాక్సర్‌ కోచ్‌గా ప్రేక్షకుల్ని అలరించిన మాధవన్‌ తాజాగా తన సతీమణి పుష్కరగాయత్రి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి 'విక్రమ్‌-వేద' అనే టైటిల్‌ని అనుకుంటున్నారని సమాచారం. వై నాట్‌ స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌.శశికాంత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

10:12 - February 17, 2016

రామ్‌ శంకర్‌, నికేష పటేల్‌ జంటగా వాసుదేవ్‌ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, సురేష్‌ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అరకు రోడ్‌లో..'. ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఆకాష్‌పూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆకాష్‌పూరి మాట్లాడుతూ, 'సినిమా టీజర్‌, పోస్టర్స్‌ కొత్తగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. టీమ్‌ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌' అని అన్నారు. 'దర్శకుడు వాసుదేవ్‌ నాకు మంచి స్నేహితుడు. మంచి సినిమా తీసే సత్తా గల దర్శకుడితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇదొక యాక్షన్‌ థ్రిల్లర్‌. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ని ప్రారంభించాం. మరో 20 రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది' అని హీరో రామ్‌శంకర్‌ చెప్పారు. 'నన్ను నమ్మి సపోర్ట్‌ చేస్తున్న నిర్మాతలకు కృతజ్ఞతలు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి మే నెలలో విడుదల చేసేందుకు సన్నా హాలు చేస్తున్నాం' అని దర్శకుడు అన్నారు.

10:11 - February 17, 2016

'ఇంకా తండ్రి పేరు చెప్పుకుని రాణించాలంటే భయంగా ఉంది. అందుకే నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాన'ని అంటోంది బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌ తనయగా బాలీవుడ్‌కి పరిచయమై విభిన్న పాత్రలతో రాణిస్తున్న సోనమ్‌కి కొన్ని సందర్భాల్లో భయమేస్తుందట. ఆ భయం గురించి మాట్లాడుతూ 'ఇంకా ఎంత కాలం మా నాన్న పేరు చెప్పుకుని జీవించాలనే భయం ఉంది. అందుకే నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ప్రతీ ఒక్కరూ నన్ను అనిల్‌ కపూర్‌ కూతురని గుర్తు చేస్తున్నారు. అది ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అనిల్‌ కపూర్‌ వారసురాలిననే పేరు కూడా నాకెంతో బలానిస్తుంది. తండ్రి గారాలపట్టిగా ఉండటమంటే చాలా ఇష్టం. మేం అడిగింది ఇవ్వాలని మా కోసం నాన్న ఎంతో కష్టపడ్డారు. ఎప్పుడు కుటుంబం కోసం శ్రమిస్తారు' అని చెప్పింది. ప్రస్తుతం నీరజ భానోత్‌ జీవితం ఆధారంగా రామ్‌ మద్వాని దర్శకత్వంలో రూపొందుతున్న 'నీరజ' చిత్రంలో సోనమ్‌ నటిస్తున్న విషయం విదితమే. ఈనెల 19న ఈ చిత్రం విడుదల కానుంది.

10:10 - February 17, 2016

'అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్రతో కలిసి పాటలు పాడాలని ఉంద'ని తన మనసులోని మాటని చెప్పారు అలనాటి డ్రీమ్‌గర్ల్‌ హేమామాలిని. ఆమె స్వయంగా పాటలు పాడి రూపొందించిన 'డ్రీమ్‌గర్ల్‌' పాటల ఆల్బమ్‌ విడుదల కార్యక్రమం మంగళవారం ముంబాయిలో అత్యంత వైభవంగా జరిగింది. అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర కలిసి ఈ ఆల్బమ్‌ని ఆవిష్కరించారు. గాయకుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో ఈ ఆల్బమ్‌కి సంగీతం సమకూర్చడం విశేషం. ఇందులో సుప్రియతో కలిసి హేమామాలిని కొన్ని పాటలు కూడా పాడటం మరో విశేషం. ఈ ఆవిష్కరణ వేడుకలో హేమామాలిని మాట్లాడుతూ, 'నాకు ఇష్టమైన నటుడు కిషోర్‌ కుమార్‌ కోసం ఈ పాటల ఆల్బమ్‌ తయారు చేశాను. అలాగే ధర్మేంద్ర, అమితాబ్‌ బచ్చన్‌లతో కలిసి పాటలు పాడాలని ఉంద'ని చెప్పారు. ఈ కార్యక్రమంలో 'షోలే' చిత్ర దర్శకుడు రమేష్‌ సిప్పి, జయాబచ్చన్‌ కూడా పాల్గొన్నారు. రమేష్‌ సిప్పి దర్శకత్వంలో ధర్మేంద్ర, అమితాబ్‌ బచ్చన్‌, హేమామాలిని, జయాబచ్చన్‌ కలిసి నటించిన 'షోలే' చిత్రం సంచలన విజయం సాధించి ఎవర్‌గ్రీన్‌ బాలీవుడ్‌ క్లాసిక్‌గా నిలిచిన సంగతి అందరికీ తెలిసింది.

పూడిమడక మెరైన్ సీఐ ఇంట్లో ఏసీబీ దాడులు..

విశాఖ : పూడిమడక మెరైన్ సీఐ హుస్సేన్ ఇంట్లో ఏసీబీ 16 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

తిరుపతిలో కాల్వలో పేలిన నాటుబాంబు

తిరుపతి : బైరాగపట్టెడ మున్సిపల్ పార్క్ వద్ద కాల్వలలో నాటు బాంబు పేలింది. దీంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. 

నలుగురు సిమి ఉగ్రవాదుల అరెస్ట్...

హైదరాబాద్ : ఒడిశాలోని రూర్కెలా పట్టణంలో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. రూర్కెలాలోని ఉగ్రవాద స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు సిమి ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి నాలుగు తుపాకులు, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ‌, ఒడిశా పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య మూడు గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి.  

నేటి నుంచి పాత యాదాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట : యాదాద్రికి అనుబంధ కొనసాగుతున్న పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏటా వారం రోజులపాటు శ్రీవారి ఉత్సవాల్లో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఉదయం 10గంటలకు స్వస్తీవాచనంతో ఉత్సవాలకు శ్రీకారం జరుగుతుంది. ఆలయాన్ని, పరిసరాలను శుద్ధి చేసే శుద్ధి పుణ్యాహావాచనం నిర్వహిస్తారు. ఉత్సవాల నిర్వహణకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

పెద్దమ్మతల్లి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా బుధవారం పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ భారీ విందు ఏర్పాటు చేశారు.పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని క్యాంప్‌ ఆఫీసులో కేసీఆర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

09:22 - February 17, 2016

హైదరాబాద్ : రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్, పాఠశాల, కమ్యూనిటీహాలు నిర్మాణంకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. శిథిలావస్థలో ఉన్న గృహాల స్థానంలో రూ.97.5 కోట్లతో నూతన గృహాలు, పాఠశాల, కమ్యూనిటీ నిర్మాణం చేపట్టనున్నారు. 185 మంది ఉద్యోగులకు ప్లాట్లు, 500 మంది విద్యార్థులకు పాఠశాల భవనం నిర్మించనున్నారు. 2017 అక్టోబర్ నాటికి నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు.

వైభవంగా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు

నల్లగొండ: జిల్లాలోని చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు అగ్ని గుండాలు నిర్వహించారు. గరుడవాహనంపై స్వామిఅమ్మవార్లు మంటపానికి విచ్చేశారు. అగ్నిగుండాల్లో నిప్పులపై నడిచేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. భక్తులతో చెరువుగట్టు పుణ్యక్షేత్రం జనసంద్రమైంది.

సారలమ్మ రాక కోసం కన్నెపెల్లిలో ఏర్పాట్లు...

మేడారం : సారలమ్మ రాకకోసం కన్నెపెల్లిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయలం శుద్ధి చేసి పూజారులు పూజలు నిర్వహిస్తున్నారు. జాతరకు భక్తులు పోటెత్తారు.

రాజ్ భవన్ క్వార్టర్స్ కు శంకుస్థాపన చేసిన కేసీఆర్

హైదరాబాద్ : రాజ్‌భవన్‌ ఉద్యోగులకు, అందులో పనిచేసే సిబ్బందికి కొత్తనివాస భవనాలు కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. నేడు సీఎం కేసీఆర్‌ ఈ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 100 కోట్ల రూపాయలతో రాజ్‌భవన్‌ వెనకవైపు ఐదంతుస్తులతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి హరీష్ రావు, మంత్రి ఈటెల రాజేందర్, అధికారులు పాల్గొన్నారు.

తాత్కాలిక సచివాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినచంద్రబాబు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామ పరిధిలో 45.129 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయ భవనం నిర్మించనున్నారు. 

08:30 - February 17, 2016

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామ పరిధిలో 45.129 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయ భవనం నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు, ప్రభుత్వఅధికారులు పాల్గొన్నారు. నూతన రాజధాని అమరావతిలో ఇదే తొలి ప్రభుత్వ భవనం కానుంది. ఎల్‌ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థలకు భవన నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. టెంపరరీ సెక్రటేరియట్‌కు ఈ నెల 12న శంకుస్థాపన చేయాలని తొలుత నిర్ణయించినా అప్పటికి టెండర్లు ఖరారు కాకపోవడంతో వాయిదా పడింది. సచివాలయ భవనాలను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 27 ఎకరాల్లో భవనాలు, 18 ఎకరాల్లో పార్కింగ్, ఇతరత్రా వసతులకు ఏర్పాట్లు చేస్తారు. జి+ వన్ విధానంలో మొత్తం ఆరు బ్లాకులు నిర్మిస్తారు. ఎల్‌ అండ్ టికి రెండు ప్యాకేజీలు, షాపూర్జీ పల్లోంజీకి ఒక ప్యాకేజీ పనులు అప్పగించారు. ఈ టెంపరరీ సెక్రటేరియట్ గుంటూరు నుంచి 40 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

కాసేపట్లో ఏపీ సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామ పరిధిలో 45.129 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయ భవనం నిర్మించనున్నారు.

లారీని ఢీకొన్న కారు : ముగ్గురి మృతి

మహబూబ్‌నగర్‌ : భూత్పూర్‌ వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. కడప జిల్లా రాయచోటి మండలం చిన్నమన్నెం గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హరికిరణ్‌ కారు నడుపుతూ నిద్రమత్తులో రోడ్డుకు అవతలివైపు వెళ్లి లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హరికిరణ్‌(40), జ్యోతి(38), ఆమె కుమారుడు సాయికిరణ్‌(4) మృతిచెందారు. హరికిరణ్‌ భార్య స్వప్న స్వల్పగాయాలతో బయటపడింది. జ్యోతి భర్త శ్రీధర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

07:35 - February 17, 2016

హైదరాబాద్ : మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ఉప ఎన్నికలో తెరాస అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. కారు జోరుకు తిరుగనేదే లేకుండా పోయింది. ఆపార్టీ తరఫున పోటీచేసిన మహారెడ్డి భూపాల్‌రెడ్డి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పట్లోళ్ల సంజీవరెడ్డిపై 53,625 ఓట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. బై ఎన్నికల పునాదుల మీదే టిఆర్ ఎస్ బుతుకుతోందా? కేసీఆర్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారా? ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. వాటి గురించి అడిగితే అసహనం ఎందుకు? కేంద్రంపై సీఎం కేసీఆర్ ధోరణికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారా? కేబినెట్ లో చేరేందుకే ప్రధాని మోదీ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారా? ఇత్యాది అంశాలపై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత విజయ్ కుమార్ , సీపీఎం నేత బి.వెంకట్, టిఆర్ ఎస్ నేత రాకేష్ పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలపై చర్చించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

07:27 - February 17, 2016

ఢిల్లీ : జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలపై సుప్రీంకోర్టు స్పందించింది. పటియాల కోర్టు వద్ద విద్యార్థులు, జర్నలిస్టులపై జరిగిన దాడిపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కోర్టు వద్ద లాయర్లు తమపై దాడి జరుపుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని కేంద్ర హోంమంత్రికి, సుప్రీంకోర్టుకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు.

కన్హయ్య ను పటియాల కోర్టులో ....

జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యను సోమవారం పటియాల కోర్టులో హాజరు పరచిన సందర్భంగా విద్యార్థులు, జర్నలిస్టులపై జరిగిన దాడికి సంబంధించి సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు వేశారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసుల ప్రేక్షక పాత్ర వహించారని పేర్కొన్నారు. కన్నయ్యపై నమోదైన దేశ ద్రోహం కేసుపై తక్షణమే విచారణ జరపాలని నిర్ణయించింది. జెఎన్‌యు మాజీ విద్యార్థి జయప్రకాష్‌, లాయర్‌ దేవదత్‌ కామత్‌ కూడా ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

జర్నలిస్టులు భారీ ర్యాలీ....

పటియాలా హౌజ్‌ కోర్టులో దాడికి నిరసనగా జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ ప్రెస్‌ క్లబ్‌ నుంచి సుప్రీంకోర్టు వరకు జర్నలిస్టులు ర్యాలీగా వెళ్లారు.తమపై లాయర్లు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులు సుప్రీంకోర్టుకు మెమొరాండం సమర్పించారు. దీనిపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరపనుంది.

దేశద్రోహం కేసు విచారణను ఎన్‌ఐఏకు ....

జెఎన్‌యు విద్యార్థుల వివాదంపై దాఖలైన దేశద్రోహం కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించాలంటూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని.. పిటిషన్‌ అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. తాము రాజకీయ నాయకులం కాదని, తమ పరిధి దాటి ఎందులోనూ జోక్యం చేసుకోలేమని పేర్కొంది.

దాడిని చిన్న ఘటనగా....

ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌ బిఎస్‌ బస్సీ పటియాల కోర్టులో జరిగిన దాడిని చిన్న ఘటనగా పేర్కొన్నారు. బిజెపి ఎమ్మెల్యే ఓపి శర్మ వామపక్ష కార్యకర్తను తోసివేయడంపై బస్సీ పెద్దగా స్పందించలేదు. వామపక్ష కార్యకర్తే ఎమ్మెల్యేపై ముందు చేయి చేసుకున్నారని తెలిపారు. పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం వల్లే తాను కొట్టానని ఎమ్మెల్యే సమర్థించుకున్నారు.

కన్నయ్యకు మద్దతుగా....

దేశద్రోహం కింద అరెస్ట్ చేసిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకు మద్దతుగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు లెక్చరర్లు కూడా మద్దతు తెలిపారు. విద్యార్థుల క్లాసుల బహిష్కరణలో తాము పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు అధ్యాపకులపై కూడా విచారణ జరుపుతోందని, వీసీ దీనిపై పెదవి విప్పడం లేదని వారు మండిపడ్డారు.

 

07:21 - February 17, 2016

హైదరాబాద్ : పథకాలు చూడబోతే అతిపెద్దవి. ఎంత కాదనుకున్నా వందలు వేల కోట్లు ఖర్చు చేయాలి. చూసీచూడనట్లు వదిలేస్తే అసలుకే మోసమొస్తుంది. ఇలాంటి నేపథ్యంలో వాటిని కాచుకుంటూ బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా తయారు చేయాలనే విషయమై టి మంత్రులు అధికారులతో మల్లగుల్లాలు పడుతున్నారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించుకునేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అయితే ఆ మేరకు బడ్జెట్‌ కేటాయింపులు జరుగుతాయో లేదో అన్నదే చర్చనీయాంశమవుతోంది.

బడ్జెట్ ప్రతిపాదనలపై తెలంగాణ మంత్రుల రివ్యూలు....

బడ్జెట్ ప్రతిపాదనలపై తెలంగాణ మంత్రుల రివ్యూలు వరసపెట్టున కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాలపై చర్చిస్తూ రానున్న బడ్జెట్ ఏ విధంగా ఉండేలానే దానిపై అధికారులకు మంత్రులు దిశా నిర్దేశం చేస్తున్నారు. సచివాలయంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష జరిపారు. హోంశాఖ పనితీరు మెరుగు పరిచేలా మరిన్ని ప్రణాళికలతో రావాలని సూచించారు. అదే సంద‌ర్భంలో కార్మికుల సంక్షేమం కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించాల్సి ఉంటుందన్నారు.

మున్సిపల్ శాఖ బడ్జెట్ అంచనాల మీద కేటీఆర్ సమీక్ష....

మ‌రోవైపు మున్సిపల్ శాఖ బడ్జెట్ అంచనాల మీద మంత్రి కె.తారకరామారావు సమీక్ష నిర్వహించారు. గత ఏడాది బడ్జెట్ కేటాయింపులను పరిశీలించి, నూతన బడ్జెట్ ప్రతిపాదనలకు రూపకల్పన చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. గతంలోకన్నా పట్టణ ప్రాంతాల్లో సంక్షేమ, అభివృద్ధి పనులు పెరిగినందున అమేరకు కేటాయింపులు పెరగాలని కెటిఆర్ సూచించారు. నూతన మార్కెట్ల నిర్మాణం, నగర పంచాయతీలకు భవన నిర్మాణం, శ్మశాన వాటికలు, స్వచ్ఛ వాహనాల కొనుగోలు వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

 

జలవనరుల శాఖ పై మంత్రి హరీష్ రావు సమీక్ష...

ఇక జలవనరుల శాఖ మంత్రి హరీష్‌రావు ఇప్పటికే తన శాఖకు సంబంధించిన అధికారులతో పలు దఫాలుగా సమీక్షలు జరిపారు. సి.ఇల వారిగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చించారు. తక్షణ నీటి అవసరాలు తీర్చగలిగే ప్రాజెక్ట్‌లను పూర్తిచేసేలా ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. సాగునీటి వనరులు అతితక్కువగా ఉండే జిల్లాల్లో ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించినారు. నాన్ ప్లాన్ బడ్జెట్ వ్యయాన్ని వీలైనంత తగ్గించుకోవాలని ఇంజనీర్లకు సూచించినారు. ఈ నెల 20న హరీష్‌రావు అధికారులతో మ‌రోసారి స‌మావేశ‌మై బ‌డ్జెట్‌ను ఫైనలైజ్ చేస్తారు.

డ‌బుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి ఎక్కువ నిధులు....

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డ‌బుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి ఎక్కువ నిధులు కేటాయించాలని గృహ నిర్మాణ శాఖ ఆర్థిక శాఖ‌ను కోర‌నుంది. ఆ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే సంవత్సరంలో డబుల్‌ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి మొత్తం 14 వేల 664 కోట్లు అవసరమవుతాయి. ఆ మేరకు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాలంటూ ఆర్థిక శాఖను కోరనున్నారు. జీహెచ్ ఎంసీ ప‌రిధిలో ల‌క్ష ఇళ్లను నిర్మించేందుకు 7,750 కోట్ల రూపాయాలు, నియోజ‌క వ‌ర్గాల పరిధిలో ఇళ్ల నిర్మాణానికి 6,194 కోట్లు కావాలి. స‌బ్సిడీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఐఏవై ప‌థ‌కం కింద నిర్మించే 55 వేల ఇళ్లకు 527కోట్లు, ప‌ట్టణ ప్రాంతాల్లో పీఎంఏవై ప‌థ‌కం క్రింద నిర్మించే 18 వేల 672 గృహాలకు 193 కోట్లు ఖర్చు చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మ‌రో వారంలో ఆయా ప్రభుత్వ శాఖలు తుది బడ్జెట్‌ ప్రతిపాద‌న‌లు సిద్ధం చేసి ఆర్థిక శాఖ‌కు పంప‌నున్నాయి. అయితే అన్ని శాఖ‌లూ భారీ మొత్తంలో మనీ కోరుతున్న నేప‌థ్యంలో ఫైనాన్స్ మినిస్ట్రీ ఎంత మేర నిధులు కేటాయిస్తుందో చూడాలి. 

07:15 - February 17, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ పదవీకాలం పొడిగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యలు చేపట్టారు. ఈ ఏడాది మే 31న ఉద్యోగ విరమణ చేయనున్న రాజీవ్‌ శర్మ సర్వీసును మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాసినట్టు సమాచారం                                                                                                                                                         .                                                                                                                       

ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర .....

రాజీవ్‌ శర్మ... తెలంగాణకు మొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలుస్తూ... ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణలో తనదైన శైలిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటువంటి రాజీవ్‌ శర్మ పదవీ కాలం వచ్చే మే 31తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రాజీవ్‌ శర్మ సర్వీసు పొడిగింపుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నాలు ప్రారంభించారు.

1982 ఐఏఎస్‌ బ్యాచ్‌, ఉమ్మడి ఏపీ కేడర్‌ .....

ప్రభుత్వ కార్యకలాపాల్లో ముఖ్యమంత్రి తర్వాత ప్రధాన కార్యదర్శిదే కీలక పాత్ర. అన్ని విషయాల్లో ఇద్దరూ క్రియాశీలకంగా పనిచేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. 1982 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన రాజీశ్‌ శర్మ ఉమ్మడి ఏపీలో వివిధ హోదాల్లో పని చేశారు. ఆ తర్వాత కేంద్ర సర్వీస్‌కు వెళ్లి, హోం శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం కీలకదశలో ఉన్న సమయంలోనే రాజీవ్‌శర్మకు, కేసీఆర్‌కు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి కోసం చాలా మంది సీరియర్‌ ఐఏఎస్‌ అధికారులు పోటీ పడ్డప్పటికీ.... కేసీఆర్... కేంద్ర సర్వీసులో ఉన్న రాజీవ్‌ శర్మతో మాట్లాడి.... రాష్ట్రానికి రప్పించి, ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. కేంద్ర సర్వీసులో పనిచేసిన అనుభవంతో రాజీవ్‌ శర్మ రాష్ట్రానికి అన్ని విధాల ఉపయోగపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమల్లో రాష్ట్రం ముందుకు దూసుకుపోయే విధంగా పనిచేస్తున్నారు. అటువంటి రాజీవ్‌ శర్మ సర్వీను మరో ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ... కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారని సమాచారం.

ఈ ఏడాది ఆగస్టు 31న రేమండ్‌ పీటర్‌ పదవీ విరమణ.....

రాజీవ్‌ శర్మ తర్వాత సీనియర్లైన భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ రేమండ్‌ పీటర్‌ ఈ ఏడాది ఆగస్టు 31న, ఆర్ధిక శాఖ ముఖ్యకాదర్శిగా పని చేస్తున్న ప్రదీప్‌చంద్ర డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేయనున్నారు. రాజీవ్‌శర్మ సర్వీసు పొడిగించేందుకు కేంద్రం అంగీకరిస్తే... వీరిద్దరికి సీఎస్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 

07:07 - February 17, 2016

హైదరాబాద్ : దశాబ్దాల తెలంగాణ ఉద్యమ స్వరూప స్వభావాలు మార్చిన పోరాట యోథుడాయన. మాటలను తూటాలుగా మార్చి వదలగలరు.. అవే మాటలతో జనాలను మంత్రముగ్ధులను చేయగలరు.. ఆయన ఆశయం బంగారు తెలంగాణ. లక్ష్యం ప్రత్యర్థుల నిర్మూలన. ఏ విషయంపైనైనా అలవోకగా మాట్లాడగలిగే ఆ ధీశాలి ఎవరో ఇప్పటికే మీ మదిలో మెదిలే ఉంటుంది. అవును మీరు ఊహించుకుంటున్న ఆ రాజకీయ పండితుని జన్మదినం ఈ రోజు. ఆ మహా మేధావి బర్త్‌డే సందర్భంగా టెన్‌ టివి అందిస్తున్న ప్రత్యేక కథనం. వాచిట్..

చింతమడకలో 1954 ఫిబ్రవరి 17 ....

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కెసిఆర్‌గా అందరికీ తెలిసిన వ్యక్తి. మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. వెంకటమ్మ, రాఘవరావు తల్లిదండ్రులు. కేసీఆర్‌కు ఒక అన్న, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లు. కుమారుడు కేటీఆర్ రాష్ట్ర కేబినెట్‌లో మంత్రిగా... కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా పనిచేన్నారు. ఇక మేనల్లుడు హరీష్‌రావు కూడా కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. చదువుల్లో చురుగ్గా ఉండే కేసీఆర్ ప్రాథమిక విద్యను చింతమడకలో... ఇంటర్‌ను సిద్దిపేటలో పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు లిటరేచర్‌లో పీజీ చేశారు.

కాంగ్రెస్ నుంచే కేసీఆర్ రాజకీయ ప్రస్థానం...

కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే మొదలైంది. మెదక్ జిల్లాలో చురుకైన నాయకుడుగా పనిచేశారు. అప్పట్లోనే... అంటే 1970లోనే సంజయ్ గాంధీ అనుచరుడుగా పేరొందారు. 1983లో టీడీపీలో చేరారు. అదే సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట నుంచి ఓటమి చవిచూసినా.. ఆ తర్వాత జరిగిన ఎన్నో ఎన్నికల్లో విజయబావుటా ఎగరేశారు. 1985 నుంచి ఇప్పటివరకు ఓటమి అనే పదాన్నే వినలేదు. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్‌గా ఎన్నో పదవులు చేపట్టి అపార అనుభవం సాధించారు. 2000వ సంవత్సరంలో అసెంబ్లీ డిప్యూటి స్పీకర్‌గా కూడా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం టీడీపీని వీడి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు.

1969 ఉద్యమ స్ఫూర్తితో ....

1969 ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ కోసం పోరాడారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ దగా పడుతోందని అభివృద్ధిలో ఆమడ దూరంలో నిలుస్తోందని ఉద్యమాలు జరిపారు. ప్రత్యేక తెలంగాణ నినాదంతో మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు.. ఎత్తుపల్లాలు చవిచూశారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక సభలు, సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించగలిగారు.

ఉద్యమాలు చేస్తూనే తెలంగాణ రాష్ట్ర సమితి....

ఉద్యమాలు చేస్తూనే తెలంగాణ రాష్ట్ర సమితిని ఎన్నికల బరిలో దించారు. గెలుపోటములను లెక్కచేయకుండా ఉద్యమ నాయకుడిగా కొనసాగారు. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్‌తో విడిపోయి 2006లో ఆ పార్టీ నేత ఎం.సత్యనారాయణరావు విసిరిన సవాలుకు ఆయనపైనే కరీంనగర్ పార్లమెంట్ ఉపఎన్నికలో పోటీ చేసి అఖండ మెజార్టీ సాధించారు. అదే తెలంగాణలో టీఆర్ఎస్ బలోపేతానికి కారణమైంది. ఆ తర్వాత 2008లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు రాజీనామాలు చేయగా అపుడు జరిగిన ఉపఎన్నికల్లో మాత్రం కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టింది. అనుకున్న స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థలు విజయం సాధించలేదు. ఇలా అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చినా ఉద్యమాన్ని మాత్రం వీడలేదు.

కెసిఆర్‌ పలుమార్లు ఎన్నికలకు వెళ్లిన చరిత్ర....

రాజకీయంగా ప్రత్యర్థులతో ఢీకొట్టడమే కాదు.. తనను తాను నిరూపించుకునేందుకు కెసిఆర్‌ పలుమార్లు ఎన్నికలకు వెళ్లిన చరిత్ర ఉంది. జయాపజయాలతో పనిలేకుండా ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు వేడెక్కిస్తూ ముందుకు నడిపించేవారు. అనూహ్యంగా కేంద్రంలోని కాంగ్రెస్‌ తెలంగాణను ప్రకటించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అదే హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బకొడుతూ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఒరవడి కొనసాగిస్తూ ప్రత్యర్థి పార్టీలకు షాకులిస్తూనే ఉన్నారు.

టిఆర్ఎస్‌.. పేరులోనే తెలంగాణ పదాన్ని జోడించి....

టిఆర్ఎస్‌.. పేరులోనే తెలంగాణ పదాన్ని జోడించుకుని తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూది రాష్ట్రాన్ని సాధించుకున్న ఏకైక పార్టీ. ఉద్యమ పార్టీగా టిఆర్‌ఎస్‌కు మొదట్లో మంచి పేరే ఉన్నా ఎన్నికల బరిలో అపజయాలు కూడా చవిచూసింది. అయినా అత్యంత తెలివిగా వ్యవహరిస్తూ కెసిఆర్ ప్రజల్లోకి చొచ్చుకుపోయేవారు.

2009లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో....

ఉద్యమం కొనసాగిస్తుండగానే 2009లో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో కెసిఆర్ మహాకూటమితో కలిసి పోటీ చేశారు. అయితే ఆశించిన ఫలితాలు రాలేదు. అపుడే 14 ఎఫ్‌ను తొలగించాలంటూ సిద్దిపేటలో దీక్షకు సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే గులాబీబాస్ కేసీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మంకు తరలించారు. అయితే నిరాహార దీక్షను మాత్రం వీడలేదు. బలవంతాన నిమ్స్‌కు తరలించారు. అప్పటినుంచి తెలంగాణ ఉద్యమం తీవ్రమైంది. ఓయూ రాజుకుంది. విద్యార్థిలోకం కేసీఆర్ పక్షాన చేరింది. కేంద్రంపై ఒత్తిడి మరింత పెరిగింది. ఫలితంగా 2009 డిసెంబరు 9న కేంద్రం తెలంగాణ ప్రకటన చేసింది.

తెలంగాణ ప్రకటన చేసిన కేంద్రం ....

తెలంగాణ ప్రకటన చేసిన కేంద్రం హఠాత్తుగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. దీంతో అన్ని పార్టీలతో కలిపి రాజకీయ జేఏసీని ఏర్పాటుచేసి కెసిఆర్ కేంద్రంపై పోరాటం ప్రారంభించారు. సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సాగరహారం... ఇలా అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చారు కేసీఆర్. అలా కేంద్రంపై ఒత్తిడి పెంచుతూనే మరోవైపు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టగలిగారు. తెలంగాణ మాండలికం, తెలంగాణ యాసతో సామెతలు, పిట్టకథలతో విపక్షాలపై పదునైన దూషణలు చేయడంలో కెసిఆర్ ముందుండేవారు. చివరకు 2014లో కోట్లాది ప్రజల ఆకాంక్షైన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఎన్నికల బరిలో దిగిన కెసిఆర్ కాంగ్రెస్ అంచనాలను చిత్తు చేస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

యజ్ఞయాగాదులు, దైవం, వాస్తును ఎక్కువగా .....

యజ్ఞయాగాదులు, దైవం, వాస్తును ఎక్కువగా నమ్ముతారు కేసీఆర్. చండీయాగం మొదలు ఆయుత చండీ యాగం వరకు అనేక యజ్ఞాలు నిర్వహించారు. వాస్తును ఎక్కువగా నమ్మే కేసీఆర్ సిఎం అయ్యాక క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషాలు సరిచేయించారు. ఆ తర్వాతే అందులోకి అడుగు పెట్టారు. దేవుళ్లు, వాస్తే కాదు సంఖ్యాశాస్త్రాన్ని కూడా బాగా నమ్ముతారు. ఆయన లక్కీ నెంబరు 6. అదే సంఖ్య వచ్చేలా వాహనం నెంబరు ఉంటుంది. 2014లో సార్వత్రిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనలోనూ 69 మందితో ఫస్ట్ లిస్ట్‌ ప్రకటించారు.

వ్యవసాయంపై కూడా ప్రత్యేక శ్రద్ధ....

కెసిఆర్‌ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా వ్యవసాయంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు. ఫాంహౌజ్‌లో ఉన్న సమయంలో విపక్షాలు ఆరోపణలు చేసిన వాటిని పట్టించుకునేవారు కాదు. ఇక ఆధునాతన పద్ధతులతో వ్యవసాయాన్ని చేసేందుకు ఇంట్రెస్ట్‌ చూపుతుంటారు.

14 ఏళ్ల పాటు ఉద్యమం....

మొక్కవోని ధైర్యంతో 14 ఏళ్ల పాటు ఉద్యమం చేయడమే కాదు.. తన చిరకాల స్వప్నం, లక్ష్యం అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కేసీఆర్. ప్రస్తుతం బంగారు తెలంగాణ సాధించి చూపుతానంటూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో మాదిరే వరంగల్ లోక్‌ సభ ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికలు, సొంత జిల్లాలోని నారాయణ్ ఖేడ్ ఉపఎన్నికలో పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించేలా చేశారు. ఒకవైపు నుంచి ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నా వాటికి తనదైన రీతిలో తిప్పికొడుతూ పాలన కొనసాగిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను పార్టీలో చేరేందుకు కృషి చేస్తూ తెలంగాణలో బలమైన పార్టీగా ఎదిగేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తుల వేయడంలోనే కాదు అనుకున్నది సాధించడంలోనూ ఈ రాజకీయ దురంధురుడు ఎప్పుడూ ముందుంటారు. ఇలాంటి జనం మెచ్చిన నేత 62వ పడిలో అడుగుపెట్టినత సందర్భంగా టెన్ టివి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతోంది. 

 

07:03 - February 17, 2016

హైదరాబాద్ : ఆస్తిపన్ను వసూలుపై జీహెచ్ ఎంసీ దృష్టి పెట్టింది. అధికారులకు రోజువారీ లక్ష్యాలు నిర్ణయించారు. టార్గెట్లకు చేరుకునేందుకు వీలుగా ఇళ్ల యజమానులపై బిల్లు కలెక్టర్లు ఒత్తిడి పెంచుతున్నారు. పాత బకాయిలతోపాటు ఆస్తిపన్ను వసూలు చేసేందుకు సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు.

ఆస్తి పన్నే ప్రధాన ఆదాయం

బల్దియా ఎన్నికల హడావుడి ముగియడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పుడు ఆస్తి పన్ను వసూలు మొదలు పెట్టారు. నగరపాలక సంస్థలకు ఆస్తి పన్నే ప్రధాన ఆదాయవనరు కావడంతో... ఈ పనిలో అధికారులు, సిబ్బంది బిజీ అయ్యారు. మెరుగైన పౌరసదుపాయాల కల్పనకు సకాలంలో ఆస్తిపన్ను చెల్లించాలంటూ ప్రజలకు కోరుతున్నారు.

గ్రేటర్‌లో పన్ను చెల్లింపుదారులు 14.10 లక్షల మంది .....

జీహెచ్‌ఎంసీ ఈసారి భారీగా ఆస్తిపన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. గ్రేటర్‌లో 14.10 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులున్నారు. వీరి నుంచి 11 వందల కోట్ల పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. టార్గెట్లకు చేరుకునేందుకు వీలుగా వసూళ్లను పర్యవేక్షించేందుకు సర్కిళ్లవారీగా ప్రత్యేక అధికారులను నియమించారు.

దీర్ఘకాల బకాయిదారులు 2,400 మంది .....

పన్ను బకాయిదారులను విడిచిపెట్టరాదని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. గ్రేటర్‌ పరిధిలో 1700 కోట్ల రూపాయల ఆస్తిపన్ను బకాయిలు ఉన్నాయి. దీర్ఘకాలంగా బకాయిలున్న 2,400 మంది జాబితా తయారు చేశారు. వీరి నుంచి 412 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది. నగరంలోని 24 సర్కిళ్లు ఉన్నాయి. ప్రతి సర్కిల్‌ పరిధిలో అత్యధిక మొత్తంలో పన్ను బకాయిపడ్డ వందమందిని గుర్తించారు. బకాయిల వసూలు కోసం ఆరుగురు పర్యవేక్షకులతో ప్రత్యేక బృందాన్ని నియించారు. ఆస్తిపన్ను వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందిస్తున్నారు. టీవీ, రేడియో, హోర్డింగ్స్‌ ద్వారా ప్రచారానికి సిద్ధమయ్యారు. ఆస్తిపన్ను వసూలు చేయడంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఏ మేరకు లక్ష్యాన్ని సాధిస్తారో చూడాలి. 

07:01 - February 17, 2016

హైదరాబాద్ : ఎస్‌ఇజడ్‌ల మాదిరే కేంద్రం కోస్తా ఆర్థికాభివృద్ధి మండళ్లను అభివృద్ధి చేయాలని ఏపీ సిఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ముంబయిలో జరుగుతున్న మేకిన్‌ ఇండియా వీక్‌లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, వివిధ కంపెనీల అధిపతులతో సమావేశమైన చంద్రబాబు.. సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో వకాశాలున్నాయని... వాటిని పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీకి 3.8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. ఏపీకి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆర్థిక వనరుగా మలుచుకోవాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పారిశ్రామిక అనుమతుల కోసం ఏర్పాటు చేసిన సింగిల్ డెస్క్‌కు గతేడాది ఐదున్నర వేల దరఖాస్తులు రాగా వాటిల్లో 91 శాతం దరఖాస్తులకు ఆమోద ముద్ర వేసినట్లు మేకిన్ ఇండియా వీక్‌లో చంద్రబాబు అన్నారు. 

06:59 - February 17, 2016

వరంగల్ : వన దేవతల జన జాతరకు సర్వం సిద్దమైంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహా కుంభమేలా నేడు అత్యంత వైభవంగా మొదలవబోతోంది. గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మల వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ, ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల దారులన్నీ మేడారానికే దారి తీస్తున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించామంటోంది ప్రభుత్వం.

మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి ....

తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభంగా మొదలవుతోంది. అత్యంత ఘనంగా మేడారం జాతరను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ప్రభుత్వం. తెలంగాణ ఖ్యాతి చాటేలా సకల వసతులు కల్పించామని చెబుతోంది.

2 కోట్ల మంది భక్తులు జాతరకు వస్తారని అంచనా....

దాదాపు 900 సంవత్సరాల క్రితం నుంచే జరుగుతున్న ఈ జాతరకు ఈసారి దాదాపు రెండు కోట్ల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో వరంగల్‌ జిల్లా మేడారం జనసంద్రమవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిషా, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

13వేలకు పైగా మరుగుదొడ్ల నిర్మాణాలు ....

విద్యుద్దీకరణ, తాగునీరు, శానిటేషన్, 13వేలకు పైగా మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. అలాగే జంపన్నవాగు ఒడ్డున స్నానఘట్టాలు, ప్రత్యేక క్యూలైన్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, తాగునీటి నల్లాలు, రోడ్లు ఇతర సౌకర్యాలను కల్పించారు. దాదాపు రూ.175 కోట్లకుపైగా ఖర్చుపెట్టి ఏర్పాట్లను చేపట్టామని చెబుతోంది ప్రభుత్వం. జాతరను 38 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టార్‌లో 137 మంది సిబ్బంది పనిచేసేలా నిర్ణయం తీసుకుంది సర్కారు. వివిధ శాఖల నుంచి సుమారు 30 వేల మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అలాగే 12 వేల మంది ఆర్టీసీ సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన అధికారులు 1200 మంది, 500 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, 5వేల మంది శానిటేషన్ సిబ్బంది భక్తులకు సేవలు అందించనున్నారు.

మేడారానికి 4,000కు పైగా ఆర్టీసీ బస్సులు.....

మేడారం జాతరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ. 4,000కు పైగా బస్సులను నడపాలని నిర్ణయించింది. మరో ఐదువందల బస్సులు నడపడానికి సిద్ధంగా ఉంచింది. భక్తుల కోసం హెలికాప్టర్ సౌకర్యం కూడా కల్పించారు. తక్కువ చార్జీతో వరంగల్ నుంచి సమ్మక్క-సారలమ్మ గద్దె వద్దకు తీసుకువెళ్లేలా రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచారు.

9600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత .....

జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. 9600 మంది పోలీసులు విధుల్లో నిమగ్నమయ్యారు. మేడారం ఉత్సవానికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అంబర్ కిషోర్ జా తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వరంగల్ పోలీసులు తయారు చేసిన మొబైల్ యాప్ యానిమేషన్‌ను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భద్రత కోసం జాతరలో పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వివరించారు. జాతరకు వచ్చే భక్తులకు సరిపడా పార్కింగ్ స్థలాలను గుర్తించామని, భక్తులు పోలీసుల సూచనలను పాటించాలని కోరారు.

ఫిబ్రవరి 19 మేడారం జాతరకు సీఎం కేసీఆర్ .....

ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతరలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. మొత్తానికి ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల కుంభమేలా అయిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతరను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

06:56 - February 17, 2016

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయానికి నేటి ఉదయం సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. నూతన రాజధాని అమరావతిలో ఇదే తొలి ప్రభుత్వ భవనం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనిమిదింటికి ప్రాంగణానికి చేరుకుని పూజలో పాల్గొంటారు. 8 గంటల 23 నిమిషాలకు శంకుస్థాపన చేస్తారు. అయితే ఈ కార్యక్రమం మొత్తాన్ని నిరాడంబరంగా జరపాలని నిర్ణయించారు. ప్రత్యేక సభా కార్యక్రమంటూ నిర్వహించట్లేదు. శంకుస్థాపన కార్యక్రమాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశముంది. ఈ కార్యక్రమంతో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం మొదలైనట్లవుతుంది. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామ పరిధిలోని 45 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించనున్నారు. ఎల్‌ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థలకు భవన నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. టెంపరరీ సెక్రటేరియట్‌కు ఈ నెల 12న శంకుస్థాపన చేయాలని తొలుత నిర్ణయించినా అప్పటికి టెండర్లు ఖరారు కాకపోవడంతో వాయిదా పడింది. సచివాలయ భవనాలను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 27 ఎకరాల్లో భవనాలు, 18 ఎకరాల్లో పార్కింగ్, ఇతరత్రా వసతులకు ఏర్పాట్లు చేస్తారు. జి+ వన్ విధానంలో మొత్తం ఆరు బ్లాకులు నిర్మిస్తారు. ఎల్‌ అండ్ టికి రెండు ప్యాకేజీలు, షాపూర్జీ పల్లోంజీకి ఒక ప్యాకేజీ పనులు అప్పగించారు. ఈ టెంపరరీ సెక్రటేరియట్ గుంటూరు నుంచి 40 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  

06:54 - February 17, 2016

హైదరాబాద్ : జియాగూడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. 10 మంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 450 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 

జియాగూడలో కార్డన్ సెర్చ్

హైదరాబాద్ : జియాగూడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. 10 మంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 26 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 450 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 

06:53 - February 17, 2016

హైదరాబాద్ :నిర్మాణరంగంలో అనిశ్చితి వీడలేదు. కొత్త ప్రాజెక్ట్‌ లు ప్రారంభంకావడం లేదు. నిర్మాణరంగ సంస్థల్లో జోష్‌ కనిపించడం లేదు. నిర్మాణరంగాన్ని నమ్ముకున్నవారికీ, దానితో అనుసంధానమైన విభిన్న వృత్తులవారికి చేతినిండా పనిదొరకడం లేదు. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? నిర్మాణరంగంలో ఇంత స్థబ్ధత ఎందుకు ఏర్పడింది?                                                                                                                        

దేశ జీడీపీలో నిర్మాణరంగం వాటా 10శాతం .....

మనదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికశాతం మందికి ఉపాధి చూపిస్తున్నది నిర్మాణరంగం. మనదేశ జీడీపీలో నిర్మాణరంగం వాటా పది శాతం పై మాటే. మనదేశంలో దాదాపు నాలుగు కోట్ల మందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి చూపిస్తున్న రంగమిది. మనదేశంలోని మొత్తం వర్కింగ్‌ ఫోర్స్‌లో 16శాతం మంది నిర్మాణరంగానికే చెందినవారే కావడం మరో విశేషం.

నిర్మాణరంగాన్ని ప్రధానంగా మూడు రకాలుగా....

నిర్మాణరంగాన్ని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకస్తారు. నివాస గృహాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, మల్లిప్లెక్స్‌లు, మాల్స్‌లాంటి నిర్మాణాలు రియల్‌ ఎస్టేట్ రంగంలోకి వస్తాయి. పోర్టులు, రైల్వేలు, రోడ్లు, ఇరిగేషన్‌, విద్యుత్‌ లాంటి రంగాలలో నిర్మాణాలు చేపట్టేవి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కిందకు వస్తాయి. ఇక ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ పైప్‌ లైన్లు రిఫైనరీలు లాంటి నిర్మాణాలు ఇండస్ట్రియల్‌ కన్‌స్ట్రక్చన్‌ రంగం పరిధిలోకి వస్తాయి. మనదేశంలో ఈ మూడు రకాల నిర్మాణరంగం ఇప్పుడు పడకేసింది. దీంతో దానిమీద ఆధారపడ్డవారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. నిర్మాణరంగం మందగించడంతో పారిశ్రామికాభివృద్ధి సైతం కుంటుపడుతోంది. గత నాలుగైదేళ్లుగా నిర్మాణరంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీని ప్రభావం బ్యాంకింగ్‌ వ్యవస్థ మీద కూడా పడుతోంది. నిర్మాణ రంగానికి ఇచ్చిన అప్పులు మొండిబాకీలై వెక్కిరిస్తున్నాయి.

1950 - 60 మధ్య కాలాన్ని....

1950 - 60 మధ్య కాలాన్ని మనదేశంలో నిర్మాణరంగానికి స్వర్ణయుగంగా చెబుతుంటారు. 1970ల దాకా దాని హవా కొనసాగింది. ఆ కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతనిచ్చాయి. 50శాతం నిధులు నిర్మాణరంగానికే కేటాయించాయి. ప్రభుత్వరంగంలోనే అనేక కార్పొరేషన్‌లు నెలకొల్పి, ప్రభుత్వరంగంలోనే అనేక ఇరిగేషన్‌, విద్యుత్‌ ప్రాజెక్టులు, పరిశ్రమలు స్థాపించారు. కానీ 1990ల నుంచి ప్రభుత్వ విధానాలు మారడంతో దాని ప్రభావం నిర్మాణరంగం మీదా పడింది. కొత్త పరిశ్రమలు నెలకొల్పకపోగా వున్నవాటినే అమ్ముకునే కార్యక్రమం మొదలైంది.

ఖర్చులు విపరీతంగా పెరగడంతో....

భూముల ధరలతో పాటు సిమెంట్, ఇసుక ధరలు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో నిర్మాణ వ్యయం తలకుమించిన భారంగా మారుతోంది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. సిమెంట్‌ కంపెనీల యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు నిర్మాణరంగాన్ని వదిలేసిన ప్రభుత్వాలు ప్రకృతి సిద్ధంగా దొరికే ఇసుకనూ అత్యంత ఖరీదైన సరుకుగా మార్చేశాయి. ఎక్కడికక్కడ ఇసుక మాఫియాను ప్రోత్సహించాయి. అధికార పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలూ, రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియాతో చేతులు కలపడంతో సామాన్యుడి ఒక తట్ట ఇసుక కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. ఇసుక విధానంలో మార్పులు తెచ్చామని ప్రభుత్వాలు చెప్పుకుంటున్న మాఫియా కనుసన్నల్లోనే తవ్వకాలు, రవాణా సాగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. అడ్డగోలుగా పెరిగిన సిమెంట్, ఇసుక ధరలు నిర్మాణరంగంలో అనిశ్చితికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్మాణరంగం బాగుంటేనే....

నిర్మాణరంగం బాగుంటేనే 36 వృత్తుల వారికి కాస్తంత కూడు దొరుకుతుంది. తాపీ పనిచేసే సుతారులతో పాటు ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఇంటీరియర్‌ డెకెరేటర్స్‌ లాంటి సమస్తవృత్తులవారు బతకడానికి కావాల్సిన పని దొరుకుతుందన్న వాస్తవాన్ని ఏ ప్రభుత్వమూ విస్మరించకూడదు. ఓ వైపు నిర్మాణరంగం మందగించడం మరోవైపు, బడా నిర్మాణ కంపెనీలు యంత్రాల వాడకాన్ని విపరీతంగా పెంచడం వల్ల కూడా నిర్మాణరంగ కార్మికులకు ఆశనిపాతంలా మారుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు వెంటనే ప్రయత్నించకపోతే నాలుగు కోట్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యే ప్రమాదం వుంది. 

06:50 - February 17, 2016

హైదరాబాద్ : మన దేశంలో నిర్మాణరంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అనేక కోట్లమందికి ఉపాధి చూపిస్తున్న ఈ ఇండస్ట్రీలో నిరాశజనక వాతావరణం కనిపిస్తోంది. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? నిర్మాణరంగంలో పనిచేసే వివిధ రకాల వృత్తులవారు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? వీరి సంక్షేమానికి బడ్జెట్‌ లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? గతంలో ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా అమలవుతు న్నాయి? ఇలాంటి అంశాలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేత వి. ఉమామహేశ్వరరావు విజయవాడ 10టీవీ స్టూడియో నుండి పాల్గొన్నారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Don't Miss