Activities calendar

18 February 2016

జగన్ కు ఈడీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు..

హైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఈడీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. మార్చి 28వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది. అరబిందో, హెటిరో పెట్టుబడులపై ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని జగన్ తో సహా 19 మందికి సమన్లు జారీ చేసింది. 

శుక్రవారం మేడారానికి కేసీఆర్..

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు మేడారం జాతరను సందర్శించనున్నారు.

 

శుక్రవారం కన్హయ్య బెయిల్ పిటిషన్ పై విచారణ..

ఢిల్లీ : జేఎన్ యూ నేత కన్హయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంలో శుక్రవారం విచారణ జరగనుంది. కన్హయ్య అరెస్టుపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్న సంగతి తెలిసిందే. 

గజ్వేల్ లో ఫుట్ పాత్ లపై ఆక్రమణల తొలగింపు..

మెదక్ : గజ్వేల్ ఫుట్ పాత్ లపై అధికారులు ఆక్రమణలను తొలగించారు. వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సుకుమా జిల్లాలో నలుగురు మావోల లొంగుబాటు..

ఛత్తీస్ గఢ్ : సుకుమా జిల్లాలో నలుగురు మావోలు లొంగిపోయారు. మహిళా మావోయిస్టుతో పాటు మరో నలుగురు పోలీసుల ఎదుట లొంగిపోయారు. రోడ్లు తవ్వి వాహనాలకు నిప్పు పెట్టిన కేసులో వీరు నిందితులని తెలుస్తోంది.

సిక్కోలు సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ సోదాలు..

శ్రీకాకుళం : సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. రిజిస్ట్రేషన్ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఈ తనిఖీలు నిర్వహించింది.

21:27 - February 18, 2016

వరంగల్ : మేడారం భక్తజన సంద్రమైంది. సమ్మక్క-సారలమ్మ కొలువుదీరే గద్దెల వద్ద గంటగంటకు భక్తుల రద్దీ పెరుగుతోంది. చిలకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క తల్లి గద్దెపైకి చేరింది. కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు గద్దెపైకి చేర్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే గద్దెపై కొలువైన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుణ్య స్నానాలతో జంపన్నవాగు కిటకిటలాడుతోంది. వణదేవతలందరూ గద్దెపైకి చేరుకోవడంతో మేడారం మహా జాతర ఊపందుకుంది. సమ్మక్కను గద్దెనెక్కిస్తున్న సమయంలో శివశక్తులు పూనకంతో ఊగిపోయారు. అంతకుముందు చిలకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్కకు గౌరవసూచికంగా జిల్లా ఎస్సీ గాల్లోకి ఐదు సార్లు ఏకె 47తో కాల్పులు జరిపి స్వాగతం పలికారు. 

21:25 - February 18, 2016

గుంటూరు : ఎన్ని సమస్యలు ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కలిసి శంకుస్థాపన చేశారు. త్వరలోనే ఏపీకి రైల్వే జోన్‌ వస్తుందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తెలిపారు.

బుల్లెట్ ల దూసుకెళుతా..
ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. కేంద్ర సహకారంతో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రూ. 450 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. సమస్యలు ఎన్ని ఎదురైనా భయపడేది లేదని గుండె ధైర్యంతో ముందుకు పోతామని చంద్రబాబు అన్నారు. ఎవరైనా సహకరిస్తే సహకారం తీసుకుంటామని, అడ్డుపడితే మాత్రం బుల్లెట్‌లా దూసుకుపోతామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఏపీకి కేంద్రం పెద్దపీఠ..
కేంద్ర పథకాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం పెద్దపీట వేస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్ఛ పల్లెల కల సాకారం అవుతోందని ఆయన అన్నారు. జిల్లాలో గుంటూరు తర్వాత చిలకలూరిపేటలోనే ఎక్కువగా ఇళ్లు మంజూరయ్యాయని వెంకయ్య పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని వెంకయ్యనాయుడు అన్నారు. గతాన్ని మర్చిపోయి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. గుంటూరులో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజికి రూ.500 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. త్వరలో ఏపీకి రైల్వే జోన్‌ వస్తుందని వెంకయ్యనాయుడు తెలిపారు. 

21:23 - February 18, 2016

హైదరాబాద్ : టీడీపీలో రాజ్యసభ సందడి ప్రారంభమైంది. ఎంపీ సీటు కోసం నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటి నుంచే ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. అటు ఏపీ నేతలతో పాటు ఇటు తెలంగాణ నేతలు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో రాజ్యసభ ఎంపీ సీటుకి పోటీ తీవ్రంగా పెరిగింది. ఏపీ కోటాలో ఎంపీ సీటును దక్కించుకునేందుకు తెలంగాణ నేతలు కూడా పోటీ పడుతున్నారు. తెలంగాణ నుంచి మోత్కుపల్లి రేసులో ముందున్నారు. బుధవారం విజయవాడలో చంద్రబాబుతో జరిగిన భేటీలో ఇదే అంశాన్ని మోత్కుపల్లి ప్రస్తావించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ సీటుపై గతంలో హామీ ఇచ్చారని...ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకోవాలని మోత్కుపల్లి చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది.

నాలుగు స్థానాలు ఖాళీ..
ఏపీ నుంచి మొత్తం 4 రాజ్యసభ ఎంపీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్‌, జేడీ శీలం, జైరాం రమేష్‌ కాల పరిమితి ముగుస్తోంది. వీటిలో మూడు అధికార పక్షానికి వస్తాయి. మరొక స్థానం ప్రతిపక్ష పార్టీకి వెళుతుంది. సుజనా చౌదరి, నిర్మాలా సీతారామన్‌ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. దీంతో వీరి ఎంపిక లాంఛనం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్‌ రావు కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు. ఇక ప్రకాశం జిల్లా నుంచి కరణం బలరాం ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ కూడా రాజ్యసభ సీటు కోరే అవకాశం కనిపిస్తోంది.

కన్నేసిన యనమల
ఇక బీసీ నేతయిన యనమల రామకృష్ణుడు కూడా రాజ్యసభ సీటుపై కన్నేశారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న యనమలకు చంద్రబాబు ఎంతవరకు ఛాన్స్‌ ఇస్తారనేది వేచి చూడాల్సిందే. నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌ రావు కూడా ఎంపీ సీటు ఆశిస్తున్నారని తెలుస్తోంది.  కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌ ఎన్నిక బాధ్యత టీడీపీపైనే ఉంది. మరో మంత్రి సుజనా చౌదరి స్థానం కూడా రెన్యూవల్‌ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక మిగిలిన ఒక్క స్థానానికీ చంద్రబాబు ఎవర్ని నామినేట్‌ చేస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. 

21:21 - February 18, 2016

ఢిల్లీ : రెండురోజుల పాటు జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో దేశంలో చోటు చేసుకున్న పలు అంశాలతో పాటు- త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యంగా పనిచేయాలని పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. బెంగాల్‌, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష, ప్రజాతంత్ర కూటములతో కలిసి పనిచేయాలని కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది. 

కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి..
ప్రధాని మోడీ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు బిజెపి కుట్రలకు తెర లేపుతోందని సిపిఎం విమర్శించింది. జెఎన్‌యు ఘటనను సాకుగా చూపి వామపక్షాలను బలహీనపరచేందుకు బిజెపి చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే కాషాయ మూకలు విజృంభిస్తున్నాయని, జెఎన్‌యు ఘటనలో కేంద్ర హోంశాఖ పాత్ర కూడా ఉందని సిపిఎం ఆరోపించింది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వమే ఈ తరహా ఘటనలను ప్రోత్సహిస్తోందని మండిపడింది. కేంద్ర ప్రభుత్వం ఆరెస్సెస్‌ ఎజెండాను ప్రజలపై రుద్దేందుకు న్యాయ, పోలీస్‌, పరిపాలన అన్ని రంగాలను తమ ఆధీనంలోకి తీసుకుంటోందని సిపిఎం ధ్వజమెత్తింది. దేశంలో జరిగిన ఘటనలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండు చేసింది. ఢిల్లీలోని ఐటీవో వద్ద హరికిషన్‌సింగ్‌ సుర్జీత్ భవన్‌కు సీతారాం ఏచూరి శంఖుస్థాపన చేశారు. జెఎన్‌యు ఘటనపై శుక్రవారం వామపక్షాలు సమావేశమవుతున్నాయి. ఈ సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను బిజెపి అమలు చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వామపక్షాలు కార్యాచరణను రూపొందించనున్నాయి. దేశవ్యాప్తంగా పోరాటాలకు వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. 

21:19 - February 18, 2016

ఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు రేపు విచారణ జరపనుంది. కేంద్రం కన్హయ్యపై దేశద్రోహం కేసును ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తోంది. నిఘావర్గాలు కేంద్రానికి సమర్పించిన నివేదికలో కన్హయ్య పేరు లేకపోవడం గమనార్హం. జెఎన్‌యు ఘటనపై రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. దేశద్రోహం కేసులో అరెస్టైన జేఎఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు కన్హయ్య కుమార్ తరపున వృందా గ్రోవర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విచారణ చేపడతామని జస్టిస్ జె. చలమేశ్వర్, జస్టిస్ అభయ మనోహర్ లతో కూడిన బెంచ్ పేర్కొంది. కాగా, కన్హయ్య కుమార్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తే తాము అడ్డుకోబోమని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం ప్రకటించారు.

రాష్ట్రపతిని కలిసిన రాహుల్..
మరోవైపు కేంద్రం కన్హయ్యపై దేశద్రోహం కేసును ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తోంది. కన్హయ్యపై బలమైన ఆధారాలు లభించలేదని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం సమర్పించిన నివేదికలో కన్హయ్య కుమార్ పేరు లేనే లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. జేఎన్‌యు ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో 17మంది పార్టీ నేతల బృందం రాష్ట్రపతిని కలిసింది. జేఎన్‌యూ అంశంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేసింది. వివిధ వర్శిటీల్లో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించింది. తమ దేశ భక్తిని శంకించాల్సిన అవసరం లేదని, తన రక్తంలోనే దేశ భక్తి నిండి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ దేశం కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని తమ కుటుంబాన్ని కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

కన్హయ్య బెయిల్ పిటిషన్..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ మరో ఆరుగురు మంత్రులు రాష్ట్రపతిని కలిశారు. పటియాల కోర్టులో లాయర్ల దాడి, జెఎన్‌యు అంశంపై ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై తమ మంత్రి కపిల్‌ శర్మకు కూడా బెదిరింపులు వచ్చాయని తెలిపారు. ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ బిజెపి ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని సిఎం విమర్శించారు. కన్హయ్య అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతుగా విద్యార్థులు, ప్రజాసంఘాలు జంతర్‌మంతర్‌ వద్ద భారీ ర్యాలీ నిర్వహించాయి. పాటియాలా హౌస్‌కోర్టులో జర్నలిస్టులపై దాడి కేసు విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ ఘటనపై న్యాయవాదుల బృందం, ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్‌ సుప్రీంకు నివేదికలు సమర్పించారు. ఢిల్లీ పోలీసు కమిషనర్‌ ఈ ఘటనపై శుక్రవారం నివేదిక సమర్పించనున్నారు. అన్ని నివేదికలు పరిశీలించిన తర్వాత ఈ కేసుపై విచారణ చేపడతామని పేర్కొంటూ సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. పాటియాలా హౌస్‌ కోర్టు ప్రాంగణంలో కన్హయ్య, జర్నలిస్టులపై జరిగిన దాడి ఘటనపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా విచారం వ్యక్తం చేసింది. కోర్టు ప్రాంగణంలోనే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వ్యాఖ్యానించింది.ఈ ఘటనపై ముగ్గురు సభ్యుల బృందం విచారణ చేపట్టిందని లాయర్ల తప్పు తేలితే వారి లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేసింది.

విద్యార్థి ఆత్మహత్యపై అమీన్ పూర్ లో విద్యార్థుల ఆందోళన..

మెదక్ : అమీన్ పూర్ చైతన్య జూనియర్ కళాశాల సూరజ్ అనే విద్యార్థి ఆత్మహత్యపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలో ఫర్నీచర్ ను విద్యార్థులు ధ్వంసం చేసి ఆందోళన నిర్వహించారు. 

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు..

విజయవాడ : డిపోలు, వర్క్ షాప్ ల వారీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్ఎంఈ, ఈయూ మధ్య పోటాపోటీ జరుగుతోంది. విజయవాడ -2, గవర్నర్ పేట డిపో, ఉయ్యూరులో ఈయూ, గన్నవరం, విద్యాధరపురం వర్క్ షాప్ లలో ఈయూ గెలుపొందింది. రాయచోటి, బద్వేల్, మైదుకూరు, పొదిరి, కనిగిరిలో ఎన్ ఎంయూ విజయం సాధించింది. 

20:37 - February 18, 2016

బండిపై వెళ్లి తనిఖీలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు..బీడీ కార్మికుల బాధలు...నెల్లూరు జిల్లాలో అధికారుల అరెస్టు..పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేసిన పోలీసోళ్లు..పైకం ఉంటే సర్కారీ నౌకరీ ఇచ్చినోళ్లను అరెస్టు..అదిలాబాద్ జిల్లాలో నీళ్ల కోసం గిరిజనుల ఏడుపు..ఏపీలో ఉపాధి హామీ వర్కర్ల బాధలు..నిజామాబాద్ జిల్లాలో కల్తీ నూనె తయారీ..చెప్పు కోసం తాగుబోతు విన్యాసాలు..ఆపదలో చిక్కుకున్న కుక్కపిల్లల కోసం సాహసం..ఇలాంటి అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో 'మల్లన్న' తనదైన శైలిలో ముచ్చట్లు పెట్టిండు. మరి ఆ ముచ్చట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయుండి. 

సైబరాబాద్ పోలీసులపై కాల్పులు..

హైదరాబాద్ : అసోం రాజధాని గౌహతిలో సైబరాబాద్ పోలీసుళపై ఆన్ లైన్ మోసగాళ్లు కాల్పులు జరిపారు. ఇద్దరిని పట్టుకుని రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఆన్ లైన్ మోసాలకు ముఠా పాల్పడుతోంది. ముఠాను పట్టుకొనేందుకు సైబర్ క్రైమ్ గౌహతికి వెళ్లింది. 

నార్సింగిలో భారీగా పేలుడు పదార్థాలు..

రాజేంద్రనగర్ : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ వోటీ పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 

ఔషధ నియంత్రణ శాఖ అధికారుల తనిఖీలు..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. నాసిరకం కేన్సర్ నిరోధక ఔషధాలు తయారు చేస్తున్నారన్న ఫిర్యాదుతో 12 ప్రముఖ ఔషధ ఉత్పత్తుల తయారీ సంస్థల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 

దహేజ్ పైప్ లైన్ ప్రాజెక్టు అనుమతులు..

న్యూఢిల్లీ : గుజరాత్ నుండి మహరాష్ట్ర వరకు 486 కి.మీ. మేర రిలయెన్స్ గ్యాస్ పైప్ లైన్ లిమిటెండ్ నిర్మిస్తున్న దహేజ్ పైప్ లైన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. రూ. 1,428 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 

ఢిల్లీ నూతన పోలీసు కమిషనర్ గా అలోక్ వర్మ..

ఢిల్లీ : నూతన పోలీసు కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ వర్మ నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్ గా ఉన్న బస్సీ ఈనెల 29వ తేదీన పదవీ విరమణ కానున్నారు. దీనితో అలోక్ వర్మను నూతన కమిషనర్ గా నియమిస్తున్నట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ వెల్లడించారు. 

20:11 - February 18, 2016

జేఎన్ యూ నేత కన్హయ్య అరెస్టుపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. దేశ రాజధానిలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు కన్హయ్య అరెస్ట్ వివాదంలో కేంద్రంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జేఎన్ యూ కు చెందిన ముగ్గురు ఏబీవీపీ నాయకులు రాహుల్ యాదవ్, అంకిత్ హన్స్, ప్రదీప్ నర్వాల్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మహేష్ (కాంగ్రెస్), అయ్యప్ప (ఏబీవీపీ), సాంబశివరావు (ఎస్ఎఫ్ఐ), శంకర్ (ఏఐఎస్ఎఫ్) పాల్గొని అభిప్రాయాలు తెలిపారు. హాట్ హాట్ గా సాగిన ఈ చర్చను మీరూ చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

ఓపీ శర్మ అరెస్టు..విడుదల..

ఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. వెనువెంటనే బెయిల్ పై విడుదలయ్యారు. పాటియాల కోర్టు వద్ద జేఎన్ యూ వద్ద విద్యార్థులు..జర్నలిస్టులపై ఓపీ శర్మ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. 

జగన్ కు మతిభ్రమించింది - మంత్రి ప్రత్తిపాటి..

విజయవాడ : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి జగన్ కు మతిభ్రమించినట్లుందని మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఎలా పడగొడుతారో జగన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజీనామా చేయాల్సిన అవసరం తమకు లేదని, రాజీనామా మళ్లీ గెలిపించాలని వైసీపీనుద్ధేశించి సవాల్ విసిరారు.

 

పోలీసు బలగాల పెంపు అంశంపై మాట్లాడం - ఏపీ డీజీపీ..

విశాఖపట్టణం : ఏపీలో పోలీసు బలగాల పెంపు అంశాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఏపీ డీజీపీ రాముడు వెల్లడించారు. మావోయిస్టుల పట్ల ప్రజలకు భయం తప్ప సానుభూతి లేదన్నారు. మావోయిస్టుల అణిచివేతకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 

ఏపీ అధికారులతో రాజ్ నాథ్ భేటీ..

విశాఖపట్టణం : ఏపీ అధికారులతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ జరిపిన భేటీ ముగిసింది. ఏవీఓబీలో మావోయిస్టుల కదలికలు, రాష్ట్ర భద్రతా అంశాలపై రాజ్ నాథ్ చర్చించారు. రాష్ట్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, దీని కోసం రాష్ట్రాల వారీగా సమీక్షలునిర్వహిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సలహాదారు విజయ్ కుమార్ పేర్కొన్నారు.

బయలుదేరిన సమ్మక్క..

వరంగల్ : చిలకలగుట్ట నుండి మేడారానికి సమ్మక్క బయలుదేరింది. సమ్మక్కకు కలెక్టర్, ఏస్పీ ఘన స్వాగతం పలికారు. మేడారం జాతర గౌరవార్థం సమ్మక్కకు ఎదురుగా వెళ్లిన ఎస్పీ కిషోర్ ఝూ గాల్లోకి పది రౌండ్ల కాల్పులు జరిపారు. 

సుర్జిత్ భవనానికి ఏచూరి శంకుస్థాపన..

ఢిల్లీ : ఐటీవీఓ వద్ద హరికిషన్ సింగ్ సుర్జిత్ భవన్ కు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి శంకుస్థాపన చేశారు. రెండు ఏళ్లలో భవనం పూర్తికానుంది. సీపీఎం శాశ్వత రాజకీయ పాఠశాలగా ఈ భవనం ఉండనుంది. 

19:03 - February 18, 2016

ఢిల్లీ : రైతులపై, వారి స్థితిగతులపై నోరు పారేసుకోవడం అధికార పార్టీ నేతలకు అలవాటుగా మారింది. సాయం చేయడానికి చేతులు రావు గానీ.. చేతకానీ నిశాకార మాటలాడటంలో మన నేతలు ముందుంటున్నారు.. తాజాగా ఉత్తర ముంబై బిజెపి ఎంపీ గోపాల్ శెట్టి.. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించాడు.. ప్రభుత్వాలు పోటీ పడి పరిహారం ఇవ్వడం మానుకోవాలని సూచించాడు.. అంతటితో ఆగలేదు.. ఫ్యాషన్ కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ.. వారి ఆవేదనను చిన్నదిగా పనికిరానిదిగా చూపించే ప్రయత్నం చేశాడు. రైతులు పిరికివాళ్లు, నేరస్తులంటూ హర్యానా మంత్రి ధనకర్ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దూమారమే రేగింది. రైతులను ఆదుకోవాలంటూ మొసలి కన్నీరు కార్చే మోడీ సర్కార్. బిజెపికి చెందిన హర్యానా మంత్రిని కనీసం వివరణ అడగలేదు.

గతంలోనూ..
గతంలోనూ రైతులపై నేతలు మతి లేకుండా వ్యాఖ్యలు చేసిన సందర్బాలూ ఉన్నాయి. కాంగ్రెస్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో మిగతా పార్టీ నేతలేమీ ఈ విషయంలో తక్కువ తినలేదు. భారత్‌ వంటి దేశాలలో రైతుల ఆత్మహత్యలు సాధారణ విషయమే అని యూపీఏ ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ 2006 ఆగస్టు 5న ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. శరద్‌ పవార్‌ అల్లుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్‌ పవార్‌ ఆ రాష్ట్రంలో కరువుకు సంబంధించి 2013 ఏప్రిల్‌ 7న పూణేలో మాట్లాడుతూ డ్యాంలలో నీళ్లు లేకపోతే మేము మూత్రం పోయాలా అంటూ అత్యంత హీనంగా మాట్లాడారు. మరో బిజెపి సీనియర్‌ నేత మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్‌ కాద్సే 2014 నవంబర్‌ 25న ముంబాయిలో మాట్లాడుతూ మొబైల్‌ ఫోన్‌ బిల్లు ఛార్జీలను చెల్లించే రైతులు విద్యుత్‌ బిల్లులను ఎందుకు చెల్లించలేరని ఎద్దేవా చేశారు. మన తెలుగు నేతలేమీ చిన్న ఇంటి వాళ్లు కాదు. వాజ్ పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తిన్నది అరగక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ మాట్లాడారు.

ప్రధాని స్పందిస్తారా ? 
మహారాష్ట్రలోని సెహోర్లో ప్రధాని మోడీ నేడు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసారు. ఈ పథకానికి గత జనవరిలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతుల సంక్షేమం కోసమే జరగనున్న ప్రధాని పర్యటనకు ముందు రైతుల గురించే ఆ పార్టీకి చెందిన ఎంపీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది. మీడియాలో దుమారం రేపుతున్న గోపాల్ శెట్టి వ్యాఖ్యలపై ప్రధాని స్పందించాలని ఇప్పటికే మహారాష్ట్రలో ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మరి దేశానికి సంబంధించిన విషయాలపై ఆలస్యంగా స్పందించే ప్రధాని మరి ఈ ఘటనపై స్పందిస్తారో లేదో చూడాలి. 

19:00 - February 18, 2016

ఢిల్లీ : జెఎన్‌యు మాజీ ప్రొఫెసర్‌ గిలానీని పోలీసులు పటియాల కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు కోర్టు రెండు వారాల పాటు జుడీషియల్‌ కస్టడీ విధించింది. గిలానీ బెయిలు కోసం అప్పీలు చేసుకున్నారు. ఆయన బెయిలు పిటిషన్‌పై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది. ఫిబ్రవరి 10న పార్లమెంట్‌ దాడికేసులో ఉరిశిక్షకు గురైన అఫ్జల్‌ గురుకు మద్దతుగా గిలాని ప్రెస్‌క్లబ్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో పోలీసులు గిలానీని అరెస్ట్ చేసి, దేశ దోహ్రం కింద కేసు నమోదు చేశారు.

 

18:58 - February 18, 2016

ఢిల్లీ : ప్రధాని మోడీ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు బిజెపి కుట్రలకు తెర లేపుతోందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. జెఎన్‌యు ఘటనను సాకుగా చూపి వామపక్షాలను బలహీనపరచేందుకు బిజెపి యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం ప్రమాదకరమైన మతతత్వ ఎజెండాను అమలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. జెఎన్‌యు ఘటనపై రేపు వామపక్షాలు సమావేశమవుతున్నాయని ఏచూరి తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను బిజెపి అమలు చేస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తామని ఏచూరి ప్రకటించారు. ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిసాయి. బెంగాల్‌, కేరళలో వామపక్ష, ప్రజాతంత్ర కూటమితో కలిసి పనిచేస్తామని ఏచూరి తెలిపారు.

 

18:56 - February 18, 2016

ఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు రేపు విచారణ జరపనుంది. బెయిల్ కోసం కన్హయ్య సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కన్హయ్య బెయిల్ కోరితే తాము వ్యతిరేకించబోమని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే చెప్పారు. మరోవైపు కేంద్రం కన్హయ్యపై దేశద్రోహం కేసును ఉపసంహరించుకునే అవకాశం కనిపిస్తోంది. కన్హయ్యపై బలమైన ఆధారాలు లభించలేదని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. పోలీసుల దగ్గర ఉన్న వీడియో క్లిప్‌లలో ఆడియో సరిగా వినిపించడం లేదు. జేఎన్‌యూలో అఫ్జల్‌ గురుకు అనుకూలంగా జరిగిన కార్యక్రమంలో కొందరు జాతి వ్యతిరేక నినాదాలు చేశారు. తాను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని కన్హయ్య స్పష్టం చేశారు. 

18:54 - February 18, 2016

ఢిల్లీ : కన్హయ్య అరెస్ట్ వివాదంలో కేంద్రంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ జేఎన్ యూ కు చెందిన ముగ్గురు ఏబీవీపీ నాయకులు రాహుల్ యాదవ్, అంకిత్ హన్స్, ప్రదీప్ నర్వాల్ తమ పదవులకు రాజీనామా చేశారు. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూస్తూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా ఉండలేమంటూ వారు పేర్కొన్నారు. 'కన్హయ్య నిందితుడు. మీకు అతడికి జీవిత కారాగార శిక్ష విధించాలని ఉంటే విధించండి. కుమార్ తలరాత నిర్ణయించాల్సింది న్యాయస్థానం. మా విద్యార్థి సంస్కృతిని తాలిబన్ సంస్కృతిగా మార్చకండి' అని నర్వాల్ పేర్కొన్నారు. జేఎన్ యూలో కన్హయ్య కుమార్ అరెస్టు వివాదం, రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు, పోలీసుల స్పందన తమను కలిచి వేసిందని ఏబీవీపీకి చెందిన ముగ్గురు విద్యార్థి నేతలు తెలిపారు. జెఎన్‌యులో మెజారిటీ విద్యార్థులు, అధ్యాపకులు కన్హయ్య అరెస్టును వ్యతిరేకిస్తున్నారు.

18:52 - February 18, 2016

చెన్నై : ఐపిఎస్ అధికారి హరీష్‌ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది. 32 ఏళ్ల హరీష్ ఆఫీసర్స్ మెస్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎగ్మోర్‌లోని ఐపిఎస్‌ క్వార్టర్స్ లో హరీష్‌ ఉంటున్నారు. ఉదయం 10 గంటలైనా హరీష్‌ తలుపు తెరవకపోవడంతో సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి చూసే సరికి శవమై కనిపించాడు. 2009 కర్నాటక బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్‌ అధికారి హరీష్‌- తమిళనాడులోని విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్నారు. ఇటీవలే మధురైకి బదిలీ అయ్యాడు. ప్రమోషన్‌ రాలేదన్న కారణంతో హరీష్‌ డిప్రెషన్‌కు లోనయ్యారని సహోద్యుగులు చెబుతున్నారు. 

18:51 - February 18, 2016

నెల్లూరు : జిల్లా నాయుడు పేటలో నగల దోపిడీకి యత్నించిన మహిళను స్థానికులు చితకబాదారు. మత్తు మందు ఇచ్చి రత్నమ్మ అనే గృహిణి ఒంటిపై ఉన్న నగలను దొంగిలించేందుకు సుగుణమ్మ అనే మహిళ ప్రయత్నించగా, ఇది గమనించిన గృహిణి రత్నమ్మ గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడకు చేరుకొని సుగుణమ్మను బంధించి పోలీసులకు అప్పగించారు.

18:50 - February 18, 2016

రంగారెడ్డి : శామీర్‌పేట మండలం తూంకుంట గ్రామంలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. 1500 కిలోల డాల్డా, 3250 కేజీల పామాయిల్‌, 3000 కిలోల వెన్నను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బాల్లో నిల్వచేసిన నెయ్యిని సీజ్‌ చేశారు. ఇక్కడ గత కొన్ని ఏళ్లుగా కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారు. డాల్డా, పామాయిల్‌ నూనె, వెన్నను మరిగించి నెయ్యిగా మార్చి విక్రయిస్తున్నారు. 

18:49 - February 18, 2016

హైదరాబాద్ : మహిళల భద్రత కోసం నిర్వహిస్తున్న షీ షటిల్స్ కు మంచి ఆదరణ లభిస్తోందని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సివి ఆనంద్‌ అన్నారు. సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన మరో రెండు షీ షటిల్‌ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. షీ షటిల్స్ ను మరింత విస్తారమని ఆనంద్‌ అన్నారు. ప్రభుత్వం మరికొన్ని బస్సులకు అనుమతి ఇచ్చిందని, వాటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగినుల కోసం ఈ బస్సులను నడుపుతున్నారు. 

18:48 - February 18, 2016

హైదరాబాద్ : మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కేటీఆర్‌..100 రోజుల ప్రణాళికలకు విడుదల చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని దశలవారీగా పూర్తిచేస్తామని మంత్రి అన్నారు. నగరంలో కొత్త బిల్డింగులకు అనుమతిని పారదర్శకంగా ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తామన్నారు. 

 • జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో ఏకకాలంలో భవనాలకు అనుమతులు.
 • కేవలం 30 రోజుల్లో భవనాలకు అనుమతుల వివరాలు వెల్లడిస్తాం.
 • ఈ ఆఫీసు ద్వారా ఆన్ లైన్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం.
 • సలహాలు, ఫిర్యాదుల కోసం జీహెచ్ఎంసీ పోర్టల్ రూపొందిస్తాం.
 • రూ. 30 కోట్లతో నాలాల క్రమబద్ధీకరణ చేపడుతాం.
 • రూ. కోటి వ్యయంతో 10 శ్మశాన వాటికల నిర్మాణం చేపడుతాం.
 • మహిళా సంఘాలకు వంద రోజుల్లో రూ. 100 కోట్లు విడుదల చేస్తాం.
 • రూ. 40 కోట్లతో 32 వేల కొత్త కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యం.
 • రూ. 20 కోట్లతో లే అవుట్లకు ప్రహారీ గోడలు నిర్మాణం చేస్తాం.
 • రూ. 26 కోట్లతో 40 మోడల్ మార్కెట్లు నిర్మాణం.
 • నగరంలో చెత్త తరలింపునకు 2,500 స్వచ్ఛ ఆటోల ద్వార సేవలు.
 • సమస్యలపై ఫిర్యాదుల కోసం హెచ్ఎండీఏ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు.
 • వంద రోజుల్లో ఆన్ లైన్ అనుమతుల ప్రక్రియకు శ్రీకారం.
 • వార్డు కమిటీలు, ఏరియా కమిటీలలు ప్రారంభిస్తాం.

జూన్ 2 నాటికి వంద రోజుల ప్రణాళికపై సమీక్ష నిర్వహిస్తాం. 
 

18:43 - February 18, 2016

కడప : జిల్లా జమ్మలమడుగు వైసిపి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న నేపథ్యంలో జమ్మలమడుగు టీడీపీ వర్గంలో ముసలం మొదలైంది. ఆదినారాయణరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తాజాగా నియోజకవర్గ నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆదినారాయణరెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పానన్నారు. ఆదినారాయణరెడ్డి వల్ల నియోజకవర్గంలో అనేక మంది ప్రాణాలు, ఆస్తులను కోల్పోయారని అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకోవదని పేర్కొన్నారు. 

18:41 - February 18, 2016

రాజమండ్రి : నగర పాలక సంస్థ సమావేశంలో రసాభాస జరిగింది. గోదావరి పుష్కర పనుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ప్రతిపక్ష, అధికారపక్ష సభ్యులు వాదులాడుకున్నారు. సమావేశం ప్రారంభం నుంచే ప్రతిపక్ష వైసీపీ సభ్యులు పుష్కర పనుల సమాచారం సరిగ్గా లేదని పాలకపక్షాన్ని నిలదీసారు. చర్చ సందర్బంగా వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పుష్కర పనుల్లో అవకతవకలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ అవినీతిలో ఎవరి పాత్ర ఉన్న విడిచిపెట్టమన్నారు. వాగ్వాదం చోటుచేసుకోవడంతో వైసీపీ కార్పొరేటర్లు ఎజెండా ప్రతులను చించి నిరసన తెలిపారు. దీంతో మేయర్ పలువురు వైసీపీ కార్పొరేటర్లను సభ నుంచి సస్పెండ్ చేసారు.

18:29 - February 18, 2016

కళ‌కి మాటొస్తే...దొర‌కునా ఇటువంటి సేవా'..అంటూ ఆయ‌న పాదాల‌పై ప‌డి మూగ‌గా రోధిస్తుంది. నాట్యానికి న‌డ‌కొస్తే...'వే వేల గోపెమ్మ‌లా.. మువ్వా గోపాలుడే..'అంటూ ఆయ‌న చుట్టూ ప్ర‌ద‌క్షిణాలు చేస్తుంది!..సంగీతానికి శ్వాస‌నిస్తే... ఆయ‌న ఉచ్వాస నిఛ్వాస‌ల్లో వేణుగాన‌మై ప్ర‌భాశిస్తుంది!..సాహిత్యానికి ఓరూపం ల‌భిస్తే.. ఆయ‌న‌తో క‌ల‌సి స్నేహం చేయాల‌ని ఉవ్విళ్లూరుతుంది!..ఆయ‌నే. క‌ళాత‌ప‌స్వి కాశీనాథుని విశ్వ‌నాథ్. క‌ళ‌ల నాగ‌లితో వెండితెరపై వినోదాల వ్య‌వ‌సాయం చేశాడు. తెలుగు సినిమా పురోభివృద్ధికి సాయం ప‌ట్టాడు. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతవరకూ ఆయన పేరు ఉంటుంది. అలా సినిమాలతో తనదైన ముద్ర వేసిన కళాతపస్వి విశ్వనాధ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం..

కొత్త వెలుగు...
తెలుగు సినిమా మూస ధోర‌ణిలో కొట్టుకుపోతుంటే హీరోయిజం మ‌ధ్య న‌లిగిపోతుంటే తన సినిమాలతో మళ్లీ కొత్త వెలుగు తెచ్చాడు. తెలుగు సినిమా కీర్తిని నిల‌బెట్టాడు. తెలుగు సినిమా అర్థాన్ని మార్చి కొత్త‌దారిని చూపించి, క‌ళాత్మ‌క చిత్రాల వైపు వేలుపట్టుకొని న‌డిపించాడు. విలువ‌ల రుచి చూపించాడు. సంగీతం, సాహిత్యాల అర్థాలు వివ‌రించాడు. నాట్యం నేర్పించాడు. విశ్వ‌నాథ్ సినిమాలో క‌థ ఉంటుంది.. క‌ళ ఉంటుంది. నాట్యం, గానం, సంగీతం, చిత్ర‌లేఖ‌నం...ఈ విద్య‌ల‌తో వెండి తెర క‌ళ‌క‌ళ‌లాడిపోతుంటుంది. హీరో ధీరుడు కాడు.. క‌ళాకారుడు అంతే!..హీరోకి కండ‌లుండ‌వు... క‌ళ మాత్ర‌మే. రొమాన్స్ మాత్రం ఉంటుంది.. కానీ అదీ సంగీతం తోనే! ఒక్క మాట‌లో సినిమా అంతా..ఓ క‌ల‌లా ఉంటుంది. క‌ళ మాత్ర‌మే క‌నిపిస్తుంది.

ప్రయోగాలకు అంతే లేదు...
విశ్వనాథ్ ప్రయోగాలకు అంతే లేదు. నిజానికి ప్రతి సినిమా ప్రయోగమనే చెప్పాలి. ఓ అంధుడు.. ఓ మూగమ్మాయి ప్రేమలో పడితే.. వారు కళాకరులు అయితే.. వారి ప్రేమ ప్రకటన సిరివెన్నెలే అవుతుంది. ఆ సినిమా నిజానికి ఓ విజువల్ వండర్. సగటు ప్రేక్షకుడిని క్షణం కదలనీయకుండా కట్టిపడేసే అద్బతమైన దృశ్య కావ్యమే. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో విశ్వ‌నాథ్‌ది ఓ సువ‌ర్ణాధ్యాయం. తెలుగు సినిమా చ‌రిత్ర‌కు ఇన్ని మ‌రపురాణిమ‌ణిహారాల్ని,ఆణిముత్యాల్ని అందించిన విశ్వ‌నాథ్‌కి జేజేలు పలుకుతూ... ఆయ‌న క‌ళాదీక్ష‌కు జోహార్లు అర్పిస్తూ.. మరోసారి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకుంటోంది.

వ్యవసాయ శాఖపై కేసీఆర్ రివ్యూ...

హైదరాబాద్ : వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. తెలంగాణలో విద్యుత్, ఎరువుల కొరత లేకుండా చేసినట్లు తెలిపారు. కల్తీ విత్తనాల బెడదలేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ విస్తరణ బాగా జరగాలని, పురుగుల మందుల వాడకం తగ్గించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా, దేశీయంగా వస్తున్న మార్ఉపలకు అనుగుణంగా పంటలు పండించాలని, గిట్టుబాటు ధర వచ్చేలా మార్కెటింగ్ శాఖతో కలిసి పనిచేయాలన్నారు. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా పంట మార్పు జరగాలని సూచించారు. 

18:09 - February 18, 2016

విజయవాడ : కలలు కనవద్దని ఏపీ మంత్రి నారాయణ వైసీపీనుద్దేశించిన వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎక్కువ సమయం పట్టదని వైసీపీ అధినేత జగన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి కోసం గుంటకాడ నక్కలాగా కాచుకు కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించాలని తమకు..విపక్షంలో కూర్చొవాలని వైసీపీకి ప్రజలు తీర్పు చెప్పారని తెలిపారు. ప్రభుత్వం తప్పుడు పనులు చేస్తే ఎత్తిచూపాలని, అసెంబ్లీలో చూస్తే రచ్చలు చేస్తారని విమర్శించారు. ప్రతి దానిపై రచ్చ చేయడం తప్ప మంచి చేసే ఆలోచన వారికి లేదన్నారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని యోచనలో వైసీపీ ఉందని, మిత్రపక్షంతో కలిసి తమకు 108 సీట్లు ఉన్నాయని వారికి ఎన్ని ఉన్నాయని ప్రశ్నించారు. తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి వరకు సీఎం చంద్రబాబు పని చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. 

తప్పుడు పనులు చేస్తే ఎత్తి చూపాలి - నారాయణ...

విజయవాడ : ప్రభుత్వం తప్పుడు పనులు చేస్తే విపక్షాలు ఎత్తి చూపాలని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. కలలు కనవద్దని వైసీపీనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎక్కువ సమయం పట్టదని వైసీపీ అధినేత జగన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 

అభివృద్ధి పనులకు టి.ప్రభుత్వం పరిపాలన అనుమతులు..

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. సిద్ధిపేట ఎర్రచెరువుపై మినీ ట్యాక్ బండ్ నిర్మాణానికి రూ. 4.75 కోట్లు..నిజామాబాద్ మోర్తాడ్ వద్ద పెద్దవాగుపై చెక్ డ్యాంల నిర్మాణానికి రూ. 4.84 కోట్లు..ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతలకు రూ.7.926 కోట్లు..చింతల చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చేందుకు రూ.2.5 కోట్లు..మహబూబ్ నగర్ జిల్లాలో 76 చెరువుల పునరుద్ధరణకు రూ.21.33 కోట్లు విడుదలకు పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. డీపీఆర్ తయారీకి రూ.7.82 కోట్లు..ఈ బాధ్యతను వ్యాప్కోకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

కేంద్రీయ వర్సిటీల్లో జాతీయ జెండా ఎగురవేయాలి - స్మృతి..

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సూచించారు. వీసీల సమావేశంలో ఈ మేరకు స్మృతి ఇరానీ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి రోజు జెండా ఎగురవేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తొలి జెండాను జేఎన్ యూలోనే ఎగురవేయాలని సూచించారు. 

పాశం యాదగిరిపై దాడిని ఖండించిన సీపీఎం తెలంగాణ కమిటీ..

హైదరాబాద్ : మేడారం జాతరలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిపై పోలీసుల దాడిని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. పాశం యాదగిరిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

ముగిసిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు..

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈసమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడం జరిగిందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. బెంగాల్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని, బెంగాల్ లో వామపక్ష ప్రజాతంత్ర కూటమితో కలిసి పనిచేస్తామన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. మోడీ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు.

17:37 - February 18, 2016

నిజామాబాద్ : జిల్లా బోధన్‌ ఎక్సైజ్‌శాఖలో పోలీసులు పట్టపగలే మద్యం మత్తులో తూలుతున్నారు. డ్యూటీలో ఉన్న ఎక్సైజ్‌ ఎస్సైలు విజయ్‌, నాగభూషణం కలిసి బోదన్‌లోని ఫార్వర్డ్‌ రిక్రియేషన్‌ క్లబ్‌లో మద్యం తాగుతూ కెమెరా కంటికి చిక్కారు. వీరితో పాటు 10నెల్ల క్రితం సస్పెండ్ అయిన ఏడపల్లి ఎస్సై నర్సింగరావు కూడా మద్యం తాగుతూ కనిపించారు. అయితే సస్పెండ్‌ అయిన నర్సింగరావు..తనను మళ్లీ డ్యూటీలో చేర్చించేవిధంగా చేయాలని చర్చలు జరుపుతుండగా..మీడియా కంటపడ్డారు. అయితే ఇలాంటి అవినీతి అధికారులను సస్పెండ్‌ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.   

17:35 - February 18, 2016

హైదరాబాద్ : ప్రధాన మంత్రి మోడీకి బిన్ లాడెన్ పేరు పెడుతారా అని కాంగ్రెస్‌ ఎంపీ వీ హనుమంతరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డిని విమర్శించారు. రాహుల్‌ గాంధీ పేరును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. స్వాభిమాన్‌ యాత్ర పేరిట మత కల్లోలాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. 

17:33 - February 18, 2016

గుంటూరు : కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ రోజు పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాతసంత ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చిలకలూరిపేటలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అర్హులందరికీ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. స్వచ్ఛ నగరాల్లో విశాఖకు ఐదో స్థానం రావడం గర్వకారణమని చంద్రబాబు అన్నారు. 

ఆర్ఎస్ఎస్ వాళ్లే వీసీలు..

లక్నో : సెంట్రల్ యూనివర్సిటీ వీసీ లిస్టు చూడాలని, అందులో ఆర్ఎస్ఎస్ వారే ఉన్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మాయావతి దళితుల అభివృద్ధికి కృషి చేయలేదని, దళిత యువకులకు శక్తిని ఇచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. 

శ్రీలంక కెప్టెన్ గా మలింగా..

కొలంబో: వచ్చే నెలలో భారత్ లో జరిగే వరల్డ్ టీ 20లోడిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగే శ్రీలంక క్రికెట్ జట్టుకు లషిత్ మలింగా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
 

వేసవిలో నీటి ఎద్దడి రానివ్వం - మహేందర్ రెడ్డి..

రంగారెడ్డి : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై మంత్రి మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో నీటి ఎద్దడి రానివ్వమని చెప్పారు. 

17:06 - February 18, 2016

బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సరైనోడు టీజర్ విడుదలైంది. యాక్షన్ నేపథ్యంతో విడుదలైన ఈ టీజర్ అభిమానులను అలరిస్తోంది. 'ఎర్రతోలు కదా..స్టైల్ గా ఉంటాడని అనుకుంటున్నావోమో..కానీ మాస్..ఉర మాస్..' అంటూ అల్లు అర్జున్ పలికే డైలాగ్ ఈ టీజర్ లో ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సరైనోడు టీజర్ విడుదలైంది. యాక్షన్ నేపథ్యంతో విడుదలైన ఈ టీజర్ అభిమానులను అలరిస్తోంది. 'ఎర్రతోలు కదా..స్టైల్ గా ఉంటాడని అనుకుంటున్నావోమో..కానీ మాస్..ఉర మాస్..' అంటూ అల్లు అర్జున్ పలికే డైలాగ్ ఈ టీజర్ లో ఉంది. 

16:45 - February 18, 2016

ఢిల్లీ : జేఎన్ యూ నేత కన్హయ్య కుమార్ ను వెంటనే విడుదల చేయాని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా జేఎన్ యూలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోం మంత్రితో మాట్లాడారు. అనంతరం సురవరం టెన్ టివితో మాట్లాడారు. కన్హయ్య కుమార్ కు జైలులో సంపూర్ణమైన రక్షణ కల్పించాలని కోరడం జరిగిందన్నారు. ఏ రూంలో పెట్టారనేది ముఖ్య విషయం కాదని, కోర్టులో రక్షణ లేనిది జైలులో ఉంటుందా అని ప్రశ్నించారు. పోలీసు కమిషనర్ కక్ష కట్టినట్లుగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, జర్నలిస్టులు..విద్యార్థులపై దాడులు చేశారని కమిషనర్ పదవిలో కొనసాగడానికి అర్హత లేదని వెంటనే ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేశారు. నలుగురు ఏబీవీపీ విద్యార్థులు పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారనే అనే వీడియో ఒకటి బయటకొచ్చిందన్నారు. తప్పుడు పద్ధతుల్లో ఇవ్వని నినాదాలను వామపక్ష విద్యార్థుల నోట్లో పెట్టి జాతి వ్యతిరేక నినాదాలు చేశారని వీరిని శిక్షించాలని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫాసిస్టు వారు ఇలాంటి ఎత్తుగడలు పన్నుతున్నారని విమర్శించారు. ఇందులో పోలీసుల కమిషనర్, హోం శాఖ వైఫల్యం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని, రాష్ట్రపతి కలిసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని సురవరం వెల్లడించారు. 

16:40 - February 18, 2016

ఢిల్లీ : మేరే యార్ కన్హయ్య..ఢిల్లీ విత్ జేఎన్ యూ అంటూ విద్యార్థులు గళం విప్పారు. కన్హయ్యకు మద్దతుగా వేలాది మంది రోడ్డెక్కారు. గురువారం సాయంత్రం మండి హౌస్ నుండి పార్లమెంట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. రాజద్రేహం..ఇతరత్రా కేసుల్లో జేఎన్ యూ నేత కన్హయ్యను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. వెంటనే కన్హయ్యను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం కన్హయ్యను పాటియాల కోర్టులో హాజరు పరుస్తున్న సందర్భంలో కొందరు న్యాయవాదులు దాడి చేశారు. అంతకుముందు కూడా జర్నలిస్టులు..జేఎన్ యూ విద్యార్థులపై దాడికి తెగబడ్డారు. ఈఘటనలపై విద్యార్థులు..మేధావులు..ప్రజాతంత్ర వాదులు గర్హించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండను దుయ్యబట్టారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని, కన్హయ్యను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఢిల్లీలో మండి హౌస్ నుండి పార్లమెంట్ వరకు భారీ ప్రదర్శన నిర్శహించారు. ఈ నిరసన ప్రదర్శనలో విద్యార్థులు..మేధావులు..ప్రజాతంత్ర వాదులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈసందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హిందుత్వ ఏజెండాను యూనివర్సిటీల్లో అమలు పరిచేందుకు ఎన్డీయే ప్రయత్నిస్తోందని విద్యార్థులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. 

16:35 - February 18, 2016

గుంటూరు : ఏప్రిల్ 1వ తేదీ నుండి పంటల బీమా పథకం ప్రారంభమౌతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకయ్య నాయుడు ప్రసంగించారు. యూరియా అందుబాటులో ఉంచేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకొంటోందని తెలిపారు. పంటల సీజన్ వస్తే పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు..క్యూలు ఉండేవని తెలిపారు. యూరియా దొరికే కాదని, ఎక్కడ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు 31 రాష్ట్రాల్లో యూరియా కొరత రాకుండా ప్రధాని ముందు చర్యలు తీసుకున్నారని వెంకయ్య తెలిపారు. 

16:31 - February 18, 2016

గుంటూరు : భయం లేదు..ప్రజల ఆశీస్సులున్నాయి..గుండె ధైర్యంతో ముందుకెళుతా..అడ్డుపడితే బుల్లెట్ లాగా దూసుకెళుతానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చిలకూలూరి పేటలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయడితో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా పాతసంత ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో బాబు మాట్లాడారు. దేశాన్ని భ్రష్టు పటించిన వాళ్లు..అవినీతితో అతలాకుతలం చేసిన వారు కొత్త వేషాలతో ముందుకొస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలన్నారు. నష్టపోవడానికి కారణం ఈ దుర్మార్గులేనన్నారు. ఇందుకు ప్రజలు చైతన్యవంతులు కావాలని పేర్కొన్నారు. అమరావతి కోసం రైతులు 33వేల ఎకరాలు భూమి ఇచ్చారని, ఆ రైతులను మనస్పూర్తిగా అభినందించాలన్నారు. స్వరాజ్యం అనే మహిళ ఏకంగా రాజధాని కోసం రూ. కోటి ఇచ్చిందని గుర్తు చేశారు. ఎక్కడా అభివృద్ధి జరగాలన్నా అడ్డు పడుతున్నారని, విమానం..రాజధాని..ఇతరత్రా వాటి నిర్మాణం కావాలంటే అది భూమిపైనే సాధ్యమౌతుందని ఆకాశంలో సాధ్యం కాదన్నారు. అందుకు భూమి ఇవ్వాలంటే రైతులు ముందుకు రావాలని, రైతుకు అన్యాయం జరగదని, వారు ఎక్కువ ఆనందం పడాలన్నదే తన ఉద్ధేశ్యమని బాబు చెప్పుకొచ్చారు. 

ప్రారంభమైన విద్యార్థుల ర్యాలీ..

ఢిల్లీ : జేఎన్ యూ నేత కన్హయ్యకు మద్దతుగా విద్యార్థులు కదం తొక్కారు. మండి హౌస్ నుండి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

అమెరికాలో విజయవాడ వాసి అదృశ్యం..

విజయవాడ : అమెరికాలో విజయవాడకు చెందిన మాపర్తి ప్రసాద్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. 13వ తేదీన కూతురి పెళ్లి కోసం ప్రసాద్ శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లారు. ప్రసాద్ అదృశ్యంపై అమెరికా ఫిర్యాదును పట్టించుకోలేదు. మంత్రి కామినేనిని ప్రసాద్ కుటుంబసభ్యులు ఆశ్రయించారు. 

ముగిసిన తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ భేటీ..

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ భేటీ ముగిసింది. 29వ తేదీలోగా సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం, వరంగల్, సిద్ధిపేట, అచ్చంపేట మున్సిపాల్టీల ఎన్నికలపై చర్చించడం జరిగిందని ఎమ్మెల్సీ రామచంద్రారావు పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు వద్దంటూ రాష్ట్ర పార్టీకి అభిప్రాయాలు పంపారని, స్థానిక నేతలతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

మహిళకు దేహశుద్ధి చేసిన స్థానికులు..

నెల్లూరు : నాయుడుపేటలోని రాజగోపాలపురంలో సుగుణమ్మ అనే మహిళకు స్థానికులు దేహశుద్ధి చేశారు. తాంబూలం ఇస్తానని రత్నమ్మ అనే మహిళను ఇంటికి పిలిపించి భోజనంలో మత్తు మందు ఇచ్చి సుగుణమ్మ నగల దోపిడికి యత్నం చేసింది. బాధితురాలు కేకలు వేయడంతో సుగుణమ్మకు దేహశుద్ధి చేసిన పోలీసులు స్థానికులు అప్పగించారు. 

కన్హయ్య టీ షర్టులు..

ఢిల్లీ : జేఎన్ యూ నేత కన్హయ్య టీ షర్టులు జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి. రాజద్రోహం కేసు కింద కన్హయ్యను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. మండి హౌస్ నుండి జంతర్ మంతర్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించనున్నారు. 'మేరా యార్ కన్హయ్య' పేరిట రూపొందించిన టీ షర్టులు ధరించి విద్యార్థులు ర్యాలీలో పాల్గొంటున్నారు. ఒక్కో టీ షర్టు రూ. 150 ధరకు విక్రయిస్తున్నారు. 

15:55 - February 18, 2016

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగుతున్నాయి. దాదాపు ఒకటిన్నర లక్షల మంది ఈ పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు రాస్తున్న వారందరూ పరీక్ష హాల్స్ లోకి చేరుకున్నారు. విద్యార్థుల హాల్ టికెట్లను అధ్యాపకులు పరిశీలిస్తున్నారు. ఓ విద్యార్థి హాల్ టికెట్ ను చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ హాల్ టికెట్ పై 'మాస్టర్ బ్లాస్టర్' సచిన్ టెండూల్కర్ తనయుడు 'అర్జున్ సింగ్' ఫొటో ఉంది. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశారు. విద్యార్థుల వివరాలను సరిగ్గా పరిశీలించకుండా కళాశాల సిబ్బందిపై వాటిపై సంతకాలు చేశారనే విమర్శలున్నాయి. ఈ విషయంపై ప్రత్యేక కమిటీ దర్యాప్తు జరుపుతుందని తెలుస్తోంది. 

జదవ్ పూర్ వర్సిటీకి చేరుకున్న రూపా గంగూలి..

కోల్ కతా : బీజేపీ నేత రూపా గంగూలీ జదవ్ పూర్ యూనివర్సిటీకి చేరుకున్నారు. యూనివర్సిటీకి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన రూపా గంగూలిని పోలీసులు అడ్డుకున్నారు.

 

15:42 - February 18, 2016

గుంటూరు : కాల్ మనీ అంతటా ఉందని..ఇతరత్రా సమస్యల పరిష్కారం కోసం ప్రధాన మంత్రి రుణాలు మంజూరు చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో రూ. 450 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన చిలకూలలూరి పేట పాతసంత వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. చిలకూలలూరి పేటలో ఎంతో మంది వ్యాపారులు చేసుకుంటుంటారని, కొంతమంది వీరికి ఉదయం 90రోజులు ఇచ్చి సాయంత్రం రూ. 100తీసుకుంటారని తెలిపారు. కట్టలేకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి గుర్తించి
ముద్ర బ్యాంకు కింద రుణాలు తీసుకోవచ్చన్నారు. ఈ పథకం ప్రారంభించి కేవలం 8 నెలలైందని, బుధవారం సాయంత్రం మంత్రివర్గ సమావేశంలో దీనిపై సమీక్షించడ జరిగిందన్నారు. ఇప్పటి వరకు దేశంలో 99వేల 850 కోట్ల రూపాయలు రుణాలిచ్చామని పేర్కొన్నారు. అంతేగాకుండా కేంద్ర ప్రభుత్వం భేటీ బచావ్..భేటీ పడావో..పంటల భీమా..జన్ ధన్ యోజన..ఇతరత్రా రుణాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే గతంలో లక్షా ఇరవై వేల రూపాయలు ఇచ్చేవారని, దీనిని రూ. 4లక్షలకు పెంచాలని ప్రధాని మోడీ నిర్ణయించడం జరిగిందన్నారు. అలాగే పంట 50 శాతం నష్టపోతే నష్టపరిహారం ఇచ్చేవారని, ప్రస్తుతం 33 శాతం పంట నష్టపోయినా నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గతంలో కరెంటు కోతలు ఉండేవని, ఈ కాలంలో కరెంటు కోత పాతమాటగా మారిపోయిందన్నారు. ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంతో పోటీ పడుతున్నాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

గుంటూరులో బాబు..వెంకయ్య పర్యటన..

గుంటూరు : కేంద్ర పథకాల్లో ఏపీకి కేంద్రం పెద్దపీఠ వేస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. జిల్లాలో రూ. 450 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చిలకలూరి పేట పాత సంత వద్ద ఏర్పాటు చేసిన బహిరంగలో వెంకయ్య మాట్లాడారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో బాబు అభివృద్ధికి బాటలు వేస్తున్నారని కొనియాడారు. 

15:29 - February 18, 2016

అనంతపురం : బాగా చదివి ఉన్నతస్థానాలను అధిరోహిస్తారని..కుటుంబానికి ఆసరగా నిలుస్తారని తల్లిదండ్రుల కలలు మధ్యలో కల్లలవౌతున్నాయి. చదువుల వత్తిళ్లు..మందలించారని..ఏదో ఒక కారణంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అనంతపురంలో డిప్లామా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలో ఓ కాలేజీలో అరుణ్ కుమార్ డిప్లామా మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. గురువారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అరుణ్ కుమార్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాలేజీ అద్దాలు పగులగొట్టాడని ప్రిన్స్ పల్ మందలించడంతోనే అరుణ్ ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రిన్స్ పల్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. అరుణ్ కుమార్ ఆత్మహత్య వెనుక ప్రిన్స్ పల్ వత్తిళ్లు ఉన్నాయని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. లంచ్ అవర్ లో కళాశాల విండో అద్దం పగిలిన ఘటనలో ప్రిన్స్ పల్ అరుణ్ కుమార్ ను తన ఛాంబర్ కు పిలిపించుకున్నాడని స్నేహితులు పేర్కొంటున్నారు. అనంతరం ప్రిన్స్ పల్ లెటర్ రాయించుకుని బలవంతంగా అరుణ్ కుమార్ తో సంతకం చేయించుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం సరిగ్గా స్పందించడం లేదనే విమర్శలున్నాయి. 

15:18 - February 18, 2016

హైదరాబాద్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి బీజేపీకి లేదని, దేశంలో మత విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం పాలన ఉందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. జేఎన్ యూ ఘటనపై కాంగ్రెస్, బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సమగ్రత కోసం పాటుపడే కాంగ్రెస్ పై విమర్శలు చేయడం తగదని, రాహుల్ ను విమర్శించే స్థాయి బీజేపీ నేత కిషన్ రెడ్డికి లేదన్నారు. రాజకీయంగా లభ్ధి పొందాలన్నదే ఆశ తప్ప మరెలాంటి ఆలోచనలు లేదన్నారు. గాడ్సే వారసులుగా చెబుతున్న వీరు రాహుల్ ను విమర్శించే హక్కు లేదన్నారు. దేశం కోసం..సమగ్రత..భావ స్వేచ్చ కోసం రాజ్యాంగ ప్రకారంగా పాలన సాగాలన్నదే కాంగ్రెస్ ఆకాంక్ష అని తెలిపారు.

బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మపై చర్యలు తీసుకోవాలి - డి.రాజా..

ఢిల్లీ : పాటియాల కోర్టులో జేఎన్ యూ విద్యార్థులపై దాడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మపై చర్యలు తీసుకోవాలని డి.రాజా డిమాండ్ చేశారు. మీడియాపై దాడి చేసిన వారిని శిక్షించాలని, తమ డిమాండ్లపై హోం మంత్రి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కన్హయ్య తల్లి బాధను ప్రధాని అర్థం చేసుకోవాలని కోరారు. 

కన్హయ్యను వెంటనే విడుదల చేయాలి - సురవరం..

ఢిల్లీ : జేఎన్ యూ ఘటనలపై కేంద్ర హోం మంత్రిని సీపీఐ నేతలు సురవరం..డి.రాజాలు కలిశారు. కన్హయ్యను వెంటనే విడుదల చేయాలని నేతలు కోరారు. కన్హయ్యపై నమోదు చేసిన నేరారోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని సురవరం డిమాండ్ చేశారు. కన్హయ్యపై కేసు తప్పని తేలితే కేంద్ర హోం మంత్రి, ఢిల్లీ కమిషనర్ క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు. ఏబీవీపీ ముసుగులో కొందరు జాతి వ్యతిరేక నినాదాలు చేశారని పేర్కొన్నారు. ఢిల్లీ కోర్టులో దాడులకు పాల్పడిన లాయర్లను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని సురవరం పేర్కొన్నారు. 

బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కన్హయ్య..

ఢిల్లీ : బెయిక్ కోసం సుప్రీం కోర్టును జేఎన్ యూను కన్హయ్య ఆశ్రయించారు. విచారణనను సుప్రీం రేపటికి వాయిదా వేసింది. కన్హయ్యపై రాజద్రోహం..తదితర కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. 

పాటియాల ఘటన విచారణ వాయిదా..

ఢిల్లీ : పాటియాల హౌస్ కోర్టు వద్ద జరిగిన ఘటపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం మధ్యహ్నాం రెండు గంటలకు విచారణ జరపనుంది. విచారణనను సుప్రీం రేపటికి వాయిదా వేసింది. పాటియాల కోర్టు ఘటనలపై నివేదికలను సుప్రీం న్యాయవాదుల బృందం, ఢిల్లీ కోర్టు రిజిస్ట్రార్ సమర్పించింది.
జెఎన్ యూ విద్యార్థి కన్హయ్యపై దేశద్రోహం..ఇతర కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం పాటియాల కోర్టు వద్దకు పోలీసులు కన్హయ్యను హాజరు జరుపుతున్న సందర్భంలో కొందరు న్యాయవాదులు దాడులకు పాల్పడ్డారు. అలాగే జర్నలిస్టులపై కూడా దాడులు చేసిన సంగతి తెలిసిందే. 

14:58 - February 18, 2016

కొందరు దేవతలు కొందరి కలాల నుండి ఉద్భవిస్తారు..ఇంకొందరు పురాణ, ఇతిహాసాల్లో నిక్షిప్తమవుతారు..మరికొందరు జనం కోసం ప్రాణాలర్పిస్తారు..వీరులుగా, విజేతలుగా నిలుస్తారు..ప్రజలు కొలిచే ఇలవేల్పుగా మారతారు. అలా కొలవబడుతున్న వీరవనితలే సమ్మక, సారమ్మలు.. వందల సంవత్సరాలుగా ప్రజల నీరాజనాలందుకుంటున్న సమ్మక్క సారలమ్మ జాతరపై ప్రత్యేక కథనం..
మేడారమంటే అశేష భక్త జనసందోహంతో నిండిపోయే కుంభమేళా. కొండాకోనల మధ్య ప్రకృతి ఒడిలో కొలువయ్యే జన జాతర. పేదా, గొప్ప తేడాలేకుండా అందరినీ ఒక్కటి చేసే జన సమ్మేళనం. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న అద్వీతీయ సంగమం. జనం నీరాజనాలందుకున్న సమ్మక్కసారలమ్మలు శతాబ్దాలు గడిచినా, నేటికీ ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని ఉండడం.. జయ జయ ధ్వానాలు అందుకోవడం, ప్రతి రెండేళ్లకోసారి నీరాజనాలు అందుకోవడం ఆశ్చర్యమే.. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా ఈ స్థాయిలో గిరిజనుల జాతర జరగక పోవడం విశేషం.యుద్ధభూమిలో నేలకొరిగిన తమ జాతి బిడ్డలకు నివాళి అర్పించడానికి కోయ గిరిజనులు తమదైన సంప్రదాయం ప్రకారం మేడారం వచ్చి పూజలు చేసేవారు. కాలక్రమేణా అది అందరి దృష్టినీ ఆకర్షించింది. కోయ గిరిజనుల నివాళి కాస్త ఇప్పుడు కోట్లమంది భక్తుల పండుగగా మారింది. తమ జాతి ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ఆత్మబలిదానాలు చేసిన సమ్మక్క సారలమ్మలు రెండు ప్రతిమలు కాదు.. రెండు గద్దెలూ కాదు.. అనంతశక్తులు.. ఆదిమతెగల అతివల ధీరత్వానికి ప్రతీకలు.. మహిళా లోకానికి మార్గదర్శకులుగా నిలిచే ధీశాలులుగా కూడా నీరాజనాలు అందుకుంటున్నారు. 

14:56 - February 18, 2016

వరంగల్ : అమ్మల జాతరలో అద్భుతాలు దర్శనమిస్తున్నాయి.. సమ్మక్క దర్శనంకోసం చెట్లుకూడా ఎదురుచూస్తున్నాయి.. కొంగొత్త చిగుర్లతో పచ్చని హారంకట్టి అమ్మవారి కరుణకోసం తపిస్తున్నాయి. ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని గుర్తుచేస్తుంది మేడారం వనజాతర. వనంమధ్య ప్రయాణం భక్తులకు కొత్త అనుభూతి నింపుతుంది.. కాంక్రీట్‌ జంగిల్‌నుంచి కంకవనంలోకి ప్రయాణం మరచిపోలేని జ్ఞాపకాలను మిగులుస్తుంది.. ప్రకృతిని పూజించే సంస్కృతికి ఈ జాతర సాక్ష్యంగా నిలుస్తుంది.. ఈ ఉత్సవంలో అమ్మవార్లకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ చెట్లకుకూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు కోయలు.. సమ్మక్క, సారలమ్మ గద్దెలచుట్టూ ఉన్న చెట్లను అత్యంత పవిత్రంగా పూజిస్తారు భక్తులు.. ఈ చెట్లకు భవిష్యత్తు తెలుస్తుందని నమ్ముతారు.. ఇవి ఎండాయంటే చాలు.. అందరి మనసుల్లో ఒకరకమైన ఆందోళన మొదలవుతుంది.. పచ్చగా చిగురిస్తే మాత్రం ఎంతో సంతోష పడతారు.. ఈ కొత్త ఆకులు శుభసూచకమని... అంతా మంచే జరుగుతుందని సంబరపడతారు.

జంపన్న వాగు..
సమ్మక్క గద్దె దగ్గరున్న జువ్వి చెట్టుకు మహిమలున్నాయని నమ్ముతారు వడ్డె పూజారులు.. జాతర సమయంలో అమ్మవారు పామురూపంలో ఈ చెట్టుపైకి వస్తారని.. ఉత్సవాన్ని కళ్లారా చూస్తారని వీరి నమ్మకం. ఇందుకు నిదర్శనంగా మామూలు సమయాల్లో ఈ చెట్టు ఎండిపోయి కనిపిస్తుంది. ఉత్సవం వచ్చేసరికి మాత్రం చిగురేసి కొత్త ఆకులతో అందరికీ స్వాగతం పలుకుతుంది. ఇదంతా అమ్మవారి కృపకు సాక్ష్యమంటారు భక్తులు. జంపన్న వాగు దగ్గర కూడా అంతే. వాగు పక్కనున్న రాల, వేప చెట్లకు భక్తులు పూజలు చేస్తారు. జాతర ఏర్పాట్లలోభాగంగా ఇక్కడ కాంక్రీట్‌ దిమ్మలు వేయడంతో ఆకులన్నీ రాలిపోయాయి. జాతరకు కాస్తముందు కొత్త చిగుర్లు తొడిగాయి.

బయ్యక్కపేటలోని చెట్టుకు చరిత్ర..
ఇక మేడారానికి 18 కిలోమీటర్ల దూరంలోఉన్న బయ్యక్కపేటలోని చింత చెట్టుకు కూడా పురాతన చరిత్ర ఉంది.. ఈ ఊర్లోనే అమ్మవారు పుట్టిందని భావిస్తారు. ఈ చింతచెట్టు ఊరుకన్నా ముందు పుట్టిందట. ఈ చెట్టుకు ఊరికి విడదీయరాని సంబంధం ఉంది. ఎంతో మందికి ఈ వృక్షం నీడనిచ్చింది. ఎన్నో సమావేశాలకు సాక్ష్యంగా నిలిచింది. బయ్యక్కపేటకంటే చింతున్న ఊరంటేనే అందరూ గుర్తుపట్టేలా పెనవేసుకుపోయింది. ఈ చెట్టుకు ఎన్నో మహిమలున్నాయని భావిస్తారు స్థానికులు. ఈ చెట్టు పచ్చగా ఉంటే ఊరు పచ్చగా ఉంటుందని విశ్వసిస్తారు. అమ్మలకోసం భక్తులే కాదు. చెట్లూ తపిస్తాయి. రాలిన ఆకులతో కళతప్పిన వృక్షాలు. జాతర వస్తుందంటే చాలు కొత్త కళను సంతరించుకుంటాయి. లేలేత చిగుర్లేసి అమ్మల కరుణకోసం తపిస్తాయి.

14:40 - February 18, 2016

వరంగల్ : సారలమ్మ గద్దెపై దర్శనమిస్తోంది. ఇక రావల్సింది సమ్మక్క. ఆమె కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ రూపాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ జరగబోయే అద్భుత ఘట్టం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం సమ్మక్క గద్దె వద్దకు చేరుకోనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పూజారులు. 
మరోవైపు జాతర కోసం ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దీనితో మేడారం పరిసిర ప్రాంతాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. జంపన్నవాగులో స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. తాము ఇక్కడకు రావడం వల్ల చాలా సంతోషంగా ఉందని, అన్ని సదుపాయాలు బాగున్నాయని భక్తులు పేర్కొన్నారు. 

14:37 - February 18, 2016

హైదరాబాద్ : గ్రేటర్‌ అభివృద్ధికోసం వందరోజుల ప్లాన్‌ను అధికారులకు వివరించారు మంత్రి కేటీఆర్‌.. అవినీతిలేని పాలనే తమ ధ్యేయమని ప్రకటించారు.. 30రోజుల్లో ఇండ్ల నిర్మాణానికి అనుమతులిచ్చే విధానం తెస్తామని తెలిపారు.. వంద రోజుల్లో ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుందని, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో ఏకకాలంలో ఇళ్ల నిర్మాణాలను అనుమతినివ్వడం జరుగుతుందన్నారు. గ్రేటర్ లో 40 మోడల్ మార్కెట్లు, చెత్త సేకరణకు వాహనాలను కోనుగోలు చేయడం జరుగుతుందన్నారు. నగరంలో రూ. 200 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం, జీహెచ్ఎంసీ పోర్టల్, యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తామని కేటీఆర్ వెల్లడించారు. 20 కాలనీల్లో పార్కులు ఏర్పాటు చేస్తామని, 150 జిమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే క్రీడలను ప్రోత్సాహిస్తామని చెప్పారు. రూ. కోటి వ్యయంతో 10 శ్మశాన వాటికలను నిర్మాణం చేయడం జరుగుతుందని, దుర్గం చెరువును బాగు చేస్తామన్నారు. రూ. 30 కోట్లతో 69 బస్ బేల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 32వేల నల్లా కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, పెండింగ్ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అలాగే సాగర్ లో నీరు మురికి చేరకుండా చూస్తామని, హెచ్ఎండీఏకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. 

14:35 - February 18, 2016

ఢిల్లీ : జేఎన్ యూ వివాదంపై రాహుల్‌ బృందం రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసింది. యూనివర్సిటీ వ్యవహారంపై, సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యపై రాష్రపతికి ఫిర్యాదు చేసింది. అనంతరం రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు. తన దేశభక్తిని ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదన్నారు. ఢిల్లీలో న్యాయవ్యవస్థ తీర్పుపై రాష్ట్రపతితో చర్చించడం జరిగిందని రాహుల్ గాంధీ తెలిపారు. తన దేశభక్తిని ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదని, జేఎన్ యూ పరిణామాలపై రాష్ట్రపతితో చర్చించడం జరిగిందన్నారు. జేఎన్ యూ పరువును తీయొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జేఎన్‌యు వ్యవహారంలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

14:32 - February 18, 2016

ఢిల్లీ : పాటియాల హౌస్ కోర్టు వద్ద జరిగిన ఘటపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జెఎన్ యూ విద్యార్థి కన్హయ్యపై దేశద్రోహం..ఇతర కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం పాటియాల కోర్టు వద్దకు పోలీసులు కన్హయ్యను హాజరు జరుపుతున్న సందర్భంలో కొందరు న్యాయవాదులు దాడులకు పాల్పడ్డారు. అలాగే జర్నలిస్టులపై కూడా దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీం మధ్యహ్నాం రెండు గంటలకు విచారణ జరపనుంది. దాడుల ఘటనపై సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో నిందితులుగా తేలితే లాయర్ల లైసెన్సులు రద్దు చేస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది. మరోవైపు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. కోర్టు ప్రాంగణంలోనే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని బార్ కౌన్సిల్ ఛైర్మన్ పేర్కొన్నారు. 

పాటియాల ఘటనపై సుప్రీం ఆగ్రహం..

ఢిల్లీ : జేఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య, జర్నలిస్టులపై దాడిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడుల ఘటనపై సుప్రీం కోర్టులో త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. నిందితులుగా తేలితే లాయర్ల లైసెన్స్ లు రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. సుప్రీంకోర్టుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్షమాపణలు చెప్పింది. అలాగే బార్ కౌన్సిల్ ఛైర్మన్ క్షమాపణలు చెప్పింది. 

ఏసీబీకి చిక్కిన పెద్ద అంబర్ పేట ట్రాన్స్ కో ఆన్లైన్ అధికారి..

హైదరాబాద్ : రూ. 13 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పెద్ద అంబర్ పేట ట్రాన్స్ కో లైన్ ఇన్స్ పెక్టర్ ప్రభులాల్ చిక్కారు. 

పాటియాల ఘటన..ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్..

ఢిల్లీ : నిన్న పాటియాల కోర్టులో వద్ద జరిగిన ఘటనలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

చెన్నైలో ఐపీఎస్ అధికారి మృతదేహం లభ్యం..

తమిళనాడు : చెన్నైలో ఐపీఎస్ అధికారి మృతదేహం లభ్యమైంది. పోలీసు అధికారుల మెస్ లో మృతదేహం లభ్యమైంది. చెన్నై విజిలెన్స్ విభాగంలో ఏఎస్పీగా అధికారి పనిచేస్తున్నారు. 

కన్హయ్య, జర్నలిస్టులపై దాడిపై సుప్రీంలో విచారణ..

ఢిల్లీ : పాటియాల కోర్టు కన్హయ్య, జర్నలిస్టుల మీద దాడి ఘటనపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. నిన్న పాటియాల కోర్టులో ఉన్న పరిస్థితులపై సుప్రీంకు ఆరుగురు న్యాయవాదుల బృందం నివేదిక ఇచ్చింది. 

30 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతి - కేటీఆర్..

హైదరాబాద్ : 30 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతినివ్వడం జరుగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వంద రోజుల్లో ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుందని, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో ఏకకాలంలో ఇళ్ల నిర్మాణాలను అనుమతినివ్వడం జరుగుతుందన్నారు. గ్రేటర్ లో 40 మోడల్ మార్కెట్లు, చెత్త సేకరణకు వాహనాలను కోనుగోలు చేయడం జరుగుతుందన్నారు. నగరంలో రూ. 200 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణం, జీహెచ్ఎంసీ పోర్టల్, యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తామని కేటీఆర్ వెల్లడించారు. 20 కాలనీల్లో పార్కులు ఏర్పాటు చేస్తామని, 150 జిమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే క్రీడలను ప్రోత్సాహిస్తామని చెప్పారు. రూ.

రాష్ట్రపతితో ముగిసిన కాంగ్రెస్ నేతల భేటీ..

ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కాంగ్రెస్ నేతలు జరిపిన భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఢిల్లీలో న్యాయవ్యవస్థ తీర్పుపై రాష్ట్రపతితో చర్చించడం జరిగిందని రాహుల్ గాంధీ తెలిపారు. తన దేశభక్తిని ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదని, జేఎన్ యూ పరిణామాలపై రాష్ట్రపతితో చర్చించడం జరిగిందన్నారు. 

తెలంగాణకు 26,380 ఇళ్లు మంజూరు..

ఢిల్లీ : తెలంగాణలోని పట్టణ ప్రాంతాల పేదల కోసం 26,380 ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణానికి గాను రూ. 342 కోట్లను కేంద్రం ఇవ్వనుంది. గతంలో 57,664 ఇళ్లను కేంద్రం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ తరువాత అత్యధిక ఇళ్లను తెలంగాణ రాష్ట్రం పొందింది. 

పోలీసుల అదుపులో ఇద్దరు ఎన్ఎంయూ నేతలు..

అనంతపురం : హిందూపురంలో ఇద్దరు ఎన్ఎంయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిలంచారని మనోహర్ తో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఏపీలో మరో 1.75 లక్షల కొత్త ఫించన్లు

విజయవాడ : ఏపీలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద 1.75 లక్షల కొత్త ఫించన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల సమావేశం..

హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిపై పోలీసుల దాడికి నిరసనగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులు సమావేశమయ్యారు. ప్రెస్ క్లబ్ కు పోలీసులు రావడంపై జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 

మేడారంలో జర్నలిస్టుల ఆందోళన..

హైదరాబాద్ : మేడారాంలో జర్నలిస్టు పాశం యాదగిరిపై దాడి లో ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. 

13:45 - February 18, 2016

శ్రీనగర్ : జమ్ము-కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుపై పీడీపీ, బీజేపీల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీతో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ శ్రీనగర్‌లో భేటీ అయ్యారు. సర్కార్‌ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య అధికారికంగా చర్చలు జరగడం ఇదే మొదటిసారి. 
బీజేపీ-పీడీపీల మధ్య అధికార చర్చలు 
ముఖ్యమంత్రి ముప్తీ మహ్మద్‌ సయీద్‌ చనిపోయిన తర్వాత నెల రోజులకు పైగా రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ము-కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుపై రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది. బీజీపీ-పీడీపీ మధ్య అధికార చర్చలు ప్రారంభమయ్యాయి. కమలదళ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శ్రీనగర్‌ చేరుకుని, నేరుగా పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ నివాసానికి వెళ్లారు. మెహబూబా ముఫ్తీతో గంటకుపైగా భేటీ అయిన రామ్‌ మాధవ్‌... ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు జరిపారు. రామ్‌ మాధవ్‌ శ్రీనగర్‌ పర్యటన విషయం అటు పీడీపీ, ఇటు బీజేపీ నాయకులకు కూడా తెలియకుండా  అంత్యంత రహస్యంగా కొనసాగింది.
కనీస ఉమ్మడి కార్యక్రమానికి బీజేపీ కట్టుబడటంలేదు-మెహబూబా 
2014లో జరిగిన జమ్ము-కశ్మీర్‌ అసెంబ్లీ  ఎన్నికల తర్వాత పీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కార్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన రామ్‌ మాధవే మళ్లీ క్రియాశీల భాధ్యతలు తీసుకున్నారు. మెహబూబా ముఫ్తీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడకుండానే  రామ్‌ మాధవ్‌ ఢిల్లీ వెళ్లిపోయిన్నప్పటికీ... ఇద్దరి మధ్య చాలా అంశాలు చర్చకు వచ్చాయని  సమాచారం. గత నెల  8 నుంచి జమ్ము-కశ్మీర్‌లో అమలువుతున్న రాష్ట్రపతి పాలనను ఎంతోకాలం కొనసాగించడం మంచిదికాదని మెహబూబా ముఫ్తీకి... రామ్‌ మాధవ్‌ సూచించారు. ప్రభుత్వం ఏర్పాటుపై బెట్టు సడలించి, మెట్టు దిగొస్తే అన్ని అంశాలపై అరమరికలు లేకుండా చర్చించుకుందామన్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అయితే గతంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా కుదుర్చుకున్న కనీస ఉమ్మడి కార్యక్రమానికి బీజేపీ కట్డుబడలేదని మెహబూబా ముఫ్తీ దెప్పిపొడుపు మాటలు మాట్లాడినట్టు ప్రచారం జరుతుతోంది. సీఎంపీలోని రాజకీయ, ఆర్ధిక అంశాల అమలుపై కేంద్ర ప్రభుత్వం.... కనీసం నమ్మకం కలిగించే చర్యలు కూడా తీసుకోవడంలేదని.. మోదీ సర్కార్‌ను తప్పుపడుతూ, వేలెత్తి చూపే విధంగా మెహబూబా ముఫ్తీ వ్యవహరించారని సమాచారం. 
కశ్మీర్‌ వేర్పాటువాదులతో కేంద్రం చర్చలు జరపాలి 
జమ్ము-కశ్మీర్‌లో సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టం అమలును నిలిపివేయాలని పీడీపీ కోరుతోంది. అలాగే కశ్మీర్‌ వేర్పాటువాదులతో కేంద్రం చర్చలు జరపాలన్న డిమాండ్‌ చేస్తోంది. రెండు స్మార్ట్‌ సిటీలను ప్రకటించాలని కోరుతోంది. విద్యుత్‌ కేంద్రాలను  రాష్ట్రానికే తిరిగి అప్పగించాలని చెబుతూ వస్తోంది. మెహబూబా ముఫ్తీ మళ్లీ ఈ అంశాలను ప్రస్తావించినప్పటికీ......వీటిపై  రామ్‌ మాధవ్‌ సూటిగా సమాధానం చెప్పలేదని వినిపిస్తోంది.  ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే... ఆతర్వాత అన్ని విషయాలు చర్చించుకోవచ్చని ముఫ్తీని సముదాయించేందుకు రామ్‌ మాధవ్‌ ప్రయత్నించినా, ఆమె వినిపించుకోలేదని సమాచారం. మరోవైపు రామ్‌ మాధవ్‌ శ్రీనగర్‌ పర్యటనపై జమ్ము-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా  చెణుకులు విసిశారు. షెడ్యూలులో లేని విమానం శ్రీనగర్‌ వచ్చిందని ట్వీట్‌ చేశారు. పీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుపై బేరసారాలు సాగుతున్నాయంటూ... ఆరోపణాస్త్రాలు సంధించారు. 
 

13:40 - February 18, 2016

మహబూబ్‌నగర్‌ : నగరంలో చోరీ అయిన ప్రైవేటు బస్సు జడ్చర్ల మండలం పోలేపల్లి దగ్గర బోల్తా కొట్టింది... రాత్రి బస్టాండ్‌నుంచి బస్సును ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు.. వేగంగా నడుపుతూ వెళుతుండగా పోలేపల్లి సెజ్‌దగ్గర వాహనం అదుపు తప్పింది.. దీంతో భయపడ్డ దొంగ అక్కడినుంచి పారిపోయాడు... పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి..

 

అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు ముమ్మరం...

ఏలూరు : అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఐడీ అధికారులు మరో ముగ్గురు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. సదాశివవరప్రసాద్‌, శ్రీరామచంద్రరావు, అహ్మద్‌ఖాన్‌ను అరెస్ట్ చేసిన అధికారులు కాసేపట్లో వీరిని ఏలూరు కోర్టుకు తరలించనున్నారు. మరో వైపు  అగ్రీగోల్డ్ ఛైర్మన్‌, ఎండీలను సీఐడీ అధికారులు న్యాయవాదుల సమక్షంలో రెండో రోజు విచారిస్తున్నారు.

రాష్ర్టపతి ప్రణబ్‌ ను కలిసిన రాహుల్‌

ఢిల్లీ : రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కలిశారు. ఢిల్లీలో శాంతిభద్రతలు, జేఎన్‌యు ఘటన, పటియాలా కోర్టులో పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. మరోవైపు మధ్యాహ్నం రాష్ర్టపతిని కేజ్రీవాల్‌ బృందం, సాయంత్రం జర్నలిస్టు సంఘాలు కలిసి ఫిర్యాదు చేయనున్నాయి. అటు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌పై మోపిన దేశద్రోహం అభియోగాలను పోలీసులు ఎత్తివేసే అవకాశం కనిపిస్తోంది. 

13:31 - February 18, 2016

ఢిల్లీ : రాష్ర్టపతి ప్రణబ్‌ ముఖర్జీని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కలిశారు. ఢిల్లీలో శాంతిభద్రతలు, జేఎన్‌యు ఘటన, పటియాలా కోర్టులో పరిస్థితులపై ఫిర్యాదు చేశారు. మరోవైపు మధ్యాహ్నం రాష్ర్టపతిని కేజ్రీవాల్‌ బృందం, సాయంత్రం జర్నలిస్టు సంఘాలు కలిసి ఫిర్యాదు చేయనున్నాయి. అటు జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యకుమార్‌పై మోపిన దేశద్రోహం అభియోగాలను పోలీసులు ఎత్తివేసే అవకాశం కనిపిస్తోంది. ఆయనపై మోపిన దేశద్రోహం అభియోగాలకు మద్దతుగా ఇప్పటివరకు ఎలాంటి బలమైన ఆధారాలు లభించలేదని కేంద్ర హోంశాఖ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి కార్యాలయానికి జేఎన్‌యూ వ్యవహారంపై నివేదించారు. కన్హయ్య కుమార్‌కు ఇప్పటివరకు క్లీన్‌చిట్ ఇవ్వలేదని, ఆయనకు వ్యతిరేకంగా తమ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని బస్సీ మీడియాకు చెప్తున్నారు.జవహర్‌ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా జరిగిన కార్యక్రమంలో జాతివ్యతిరేక నినాదాలు చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే తాను ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని, అఫ్జల్ గురుకు ఎప్పుడూ మద్దతు తెలుపలేదని కన్హయ్యకుమార్ స్పష్టంచేశారు. భారత రాజ్యాంగంపై తనకు అపారమైన నమ్మకముందని, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. దేశద్రోహం కేసులో ఢిల్లీ కోర్టు ఆయనకు మార్చి 2వతేదీవరకు జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. 

 

13:25 - February 18, 2016

ఏలూరు : అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఐడీ అధికారులు మరో ముగ్గురు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. సదాశివవరప్రసాద్‌, శ్రీరామచంద్రరావు, అహ్మద్‌ఖాన్‌ను అరెస్ట్ చేసిన అధికారులు కాసేపట్లో వీరిని ఏలూరు కోర్టుకు తరలించనున్నారు. మరో వైపు  అగ్రీగోల్డ్ ఛైర్మన్‌, ఎండీలను సీఐడీ అధికారులు న్యాయవాదుల సమక్షంలో రెండో రోజు విచారిస్తున్నారు.

13:22 - February 18, 2016

న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ భారత మార్కెట్లోకి సరికొత్త కారును విడుదల చేసింది. '488జీటీబీ' పేరుతో దీనిని సంస్థ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. ఈ కారు ధర అక్షరాల రూ.3.88 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌, న్యూఢిల్లీ). స్థానిక పన్నులు కూడా కలుపుకుంటే ఇది దాదాపు రూ.4 కోట్లకు చేరవ కానుంది. ఈ కారు అత్యధిక స్పీడ్‌ గంటకు 325 కి.మీ. ఇప్పటి వరకు ప్రపంచంలో అందుబాటులో ఉన్న స్ట్రీట్‌లీగల్‌ కార్లలో 488జీబీటీ కారే వేగవంతమైన కారు. పెరారే స్టైలింగ్‌ సెంటర్‌లో రూపొందించిన ఈ కారు కేవలం మూడు సెకన్ల కాలంలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. 8.3 సెకన్లలో 200 కి.మీ. వేగంతో దూసుకుపోగలదని సంస్థ తెలిపింది. ఫెరారేకు భారత్‌ చాలా కీలక మార్కెట్‌ అనీ.. ఇక్కడ కంపెనీ కార్లకు మంచి అభిమానులు ఉన్నారనీ సంస్థ మధ్య ప్రాచ్యం ఈస్ట్‌ ఆఫ్రికా అమ్మకాల విభాగం సమన్వయకర్త అరైలీయన్‌ సౌవార్డ్‌ తెలిపారు. గత ఏడాది ఇదే కాలంలో ఫెరారీ సంస్థ రూ.3.45 కోట్ల (ఎక్స్‌షోరూమ్‌, న్యూఢిల్లీ) విలువైన 'పెరారీ -క్యాలిఫోర్నియా టి' మోడల్‌ కారును భారత మార్కెట్లోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

13:21 - February 18, 2016

ఢాకా: ఈ ఏడాది జరగబోయే ఆసియాకప్‌ భారత్‌లో జరగాల్సి ఉంది. కానీ ఐసీసీ వాల్డ్‌ టీ..20 కప్‌ నిర్వహించటంతో టోర్నమెంట్‌ కు బంగ్లాదేశ్‌ వేదికయ్యింది. మూడోసారి ఆసియా కప్‌ కగా..ఈ టోర్నమెటులో బంగ్లాదేశ్‌ ఆడబోతోంది. భవిష్యత్తులో టోర్నమెంట్‌లు వాల్డ్‌ కప్‌ను పరిగణనలోకి తీసుకోవాలని క్రికెట్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం ఆసియా కప్‌ తర్వాత ఒకవేళ టి..20 వాల్డ్‌ కప్‌ జరగాల్సి ఉంటే..ఆసియా కప్‌ లోనూ టీ..20 ఫార్మాట్‌ లోనే నిర్వహించనున్నారు. ఒకవేళ ఆసియా కప్‌ తర్వాత 50 ఓవర్ల వాల్డ్‌ కప్‌ జరగాల్సి ఉంటే..అప్పుడు ఈ టోర్నమెంట్‌ను కూడా 50..50 ఓవర్ల టోర్నమెంట్‌గా పరిగణలోకి తీసుకుంటారు.
డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌: ఐసీసీ వాల్డ్‌ కప్‌ టీ.20 కప్‌ గతేడాది శ్రీలంకకు దక్కింది. 2014లో బంగ్లాదేశ్‌లో జరిగిన టోర్నమెంట్‌లో శ్రీలంక ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఐదు వికెట్లతో ఓడించి ట్రోఫి కైవసం చేసుకుంది.
ఎక్కువసార్లు విజేత ఎవరంటే : భారత్‌,శ్రీలంక క్రికెట్‌ జట్లు చేరో ఐదుసార్లు ఆసియాకప్‌ ఛాంపియన్‌ రికార్డును సొంతం చేసుకున్నారు.1984లో జరిగిన తొలి ఆసియా కప్‌లో టీమ్‌ ఇండియా విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా.. 1988, 1990, 1991, 1995, 2010 ఛాంపియన్‌ అయ్యింది.ఆ తర్వాత మూడుసార్లు ఫైనల్‌ కు చేరినా..రన్నర్‌గా సరిపెట్టుకోకతప్పలేదు. ఇక శ్రీలంక 1986లో మొదటిసారి ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1997, 2004, 2008, 2014లో ఛాంపియన్స్‌ గా నిలిచింది. పాకిస్థాన్‌ కేవలం రెండు సార్లు (2000, 2012) ఛాంపియన్స్‌గా ట్రోఫిని దక్కించుకుంది.
ఐసీసీ అసోసియేషన్‌ టీం ఎలా ఏర్పడుతుంది : టోర్నమెంట్‌లో ఈసారి ఐసీసీ అసోసియేట్‌ టీమ్‌లు అఫ్ఘనిస్తాన్‌,యూఏఈ,ఓమన్‌, హాంగాకంగ్‌ టీములు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ ఫార్మాట్‌లో ఆడతాయి. వీటిలో టాప్‌గా నిలిచిన టీముల డ్రా నిర్వహిస్తారు.
ఈనెల 24న భారత్‌ తొలి మ్యాచ్‌ : టోర్నమెంట్‌లో భారత్‌ ఆడే తొలిమ్యాచ్‌ ఈనెల 24న జరగనున్నది.ఆతిథ్య దేశమైన బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌ ఆడనున్నది.ఈనెల 27న భారత జట్టు పాకిస్థాన్‌ టీమ్‌ను ఎదుర్కొనున్నది.ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ వార్‌ను తలపించటం ఖాయమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే పాక్‌, భారత్‌ క్రికెట్‌ జట్ల మధ్య చాలా ఏండ్ల నుంచి మ్యాచులు లేకపోవటమేనని క్రీడాభిమానులు చెబుతున్నారు. అలానే మార్చి 2న భారత్‌,శ్రీలంక జట్ల మధ్య జరిగే ఉత్కంఠ పోరు ను ఆసక్తిగా తిలకించేందుకు క్రీడాభిమానులు రెడీ అవుతున్నారు. మార్చి ఆరున ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించటానికి బంగ్లాదేశ్‌ సకల ఏర్పాట్లు చేస్తోంది.
ఆసియాకప్‌..2016 ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్నది. మార్చినెల ఆరో తేదివరకు జరుగుతాయి. ఈ మ్యాచుల్లో భారత్‌,పాకిస్థాన్‌, శ్రీలంక,బంగ్లాదేశ్‌ టీములు పాల్గొంటున్నాయి. క్వాలిఫై చేసిన టీములే చివరిదశలో ఫైనల్‌లో పోటీపడతాయి. బంగ్లాదేశ్‌లో జరిగే ఆసియా కప్‌ మ్యాచులు షేర్‌..ఎ.. బంగ్లా నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలోనూ, మీర్‌పూర్‌, ఢాకాలో నిర్వహించనున్నారు.

కన్హయ్యపై దేశద్రోహం కేసును ఉపసంహరించుకోవాలి: ఎంపీ వరప్రసాద్‌

ఢిల్లీ : కన్హయ్యకుమార్‌కు మద్దతు పెరుగుతోంది. కన్హయ్యకుమార్‌పై దేశద్రోహం కేసును ఉపసంహిరంచుకోవాలని వైసీపీ ఎంపి వరప్రసాద్‌ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన అడ్వకేట్స్ కన్హయ్యపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. పోలీసులు కూడా నిశ్చబ్ధంగా ఉండడం భావ్యం కాదన్నారు. న్యాయవాదులు అతన్ని కొడుతుంటే.. పోలీసులు ఏమీ చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని.. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలన్నారు. కన్హయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  

13:19 - February 18, 2016

ఢిల్లీ : కన్హయ్యకుమార్‌కు మద్దతు పెరుగుతోంది. కన్హయ్యకుమార్‌పై దేశద్రోహం కేసును ఉపసంహిరంచుకోవాలని వైసీపీ ఎంపి వరప్రసాద్‌ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన అడ్వకేట్స్ కన్హయ్యపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. పోలీసులు కూడా నిశ్చబ్ధంగా ఉండడం భావ్యం కాదన్నారు. న్యాయవాదులు అతన్ని కొడుతుంటే.. పోలీసులు ఏమీ చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని.. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలన్నారు. కన్హయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  

13:18 - February 18, 2016

వృద్ధుల కోసం 'సీనియర్‌ వరల్డ్‌ డాట్‌ కామ్‌' ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించింది. అందులో 'ఈజీ ఫోన్‌' ఒకటి. ఈ హ్యాండ్‌సెట్‌ వినియోగం చాలా సులభం. వినడం, టెక్ట్స్‌ చదవడం చాలా ఈజీ. సింగిల్‌ కీ ప్రెస్‌ చేస్తే చాలు.. ఫొటో డయలింగ్‌ అవుతుంది. క్రెడిల్‌ చార్జింగ్‌ మరో ప్రత్యేకత. చార్జర్లు మరిచిపోయినా టెన్షన్‌ లేదు. వైర్లు, ప్లగ్గులు, స్విచ్చుల జంజాటం లేదు. అచ్చం... అప్పట్లో కార్డ్‌ లెస్‌ ఫోన్లు వాడినట్టే. అవతలివాళ్లు మాట్లాడితే స్పష్టంగా వినిపిస్తుంది. పెద్ద స్క్రీన్‌, బ్యాగ్‌ లైటింగ్‌ కీస్‌, టాకింగ్‌ కీ ప్యాడ్‌, ఏ నంబర్‌ ప్రెస్‌ చేశామో తెలిసేటట్టు ఆడియో దీని ప్రత్యేకత. నంబర్‌ ప్రెస్‌ అయిందా లేదా అనే సందేహమే అక్కర్లేదు. కీస్‌ మధ్య కావాల్సినంత ఎడం. ఒకదాని బదులు ఒకటి నొక్కే ఆస్కారం లేదు. నంబర్లు వెతుక్కోవాల్సిన పనిలేదు. ప్రతి నంబర్‌ వెనకాల లైట్‌ బ్లింక్‌ అవుతుంది. స్క్రీన్‌ మీద కనిపించే ఫాంట్‌ సైజ్‌ కూడా పెద్దదే. అంతే కాదండోయ్... ఈ ఫోన్‌లో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ట్రిగర్‌ ఆఫ్‌లో ఉన్నా ఐదుగురికి ఫోన్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడున్నాం.. ఫోన్లో బ్యాటరీ పరిస్థితి ఏమిటి... దగ్గర్లో ఉన్న మెడికల్‌ సర్వీసులేమిటి? తదితర వివరాలు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంటాయి. ఒకవేళ ఫోన్‌ మోగినా లిఫ్ట్‌ చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఆటోమేటిగ్గా దానంతట అదే కాల్‌ లిఫ్ట్‌ అవుతుంది. లౌడ్‌ స్పీకర్‌ ఆన్‌ అవుతుంది. అవతలి వ్యక్తి గొంతు స్పష్టంగా వినిపిస్తుంది. కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న పేర్లను వెతుక్కోవాల్సిన పనిలేదు. సింగిల్‌ ప్రెస్‌తోనే ఫొటో కాంటాక్ట్‌ సిస్టం ద్వారా కాల్‌ వెళ్తుంది. 8 మంది ఇంపార్టెంట్‌ వ్యక్తుల ఫొటోలతో కూడిన కాల్‌ సెండింగ్‌ ఆప్షన్‌ ఈ ఫోన్‌లో ఉంది.

13:10 - February 18, 2016

మాలీవుడ్‌లో విడుదలైన 'ప్రేమమ్‌' చిత్రంతో దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా మారిన అనుపమా పరమేశ్వరన్‌ తాజాగా ధనుష్‌తో నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. దురై సెంథిల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'కొడి' చిత్రంలో ధనుష్‌ సరసన హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ముందుగా ఈ చిత్రంలో ధనుష్‌ సరసన షామిలీని ఎంపిక చేశారు. పలు తమిళ ప్రాజెక్టుల్లో నటిస్తూ షామిలీ బిజీగా ఉండడం తో డేట్స్‌ సమస్య కారణంగా అనుపమా పరమేశ్వరన్‌ని తీసుకున్నారని సమాచారం. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తూ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్‌ తాజాగా తెలుగులో 'ప్రేమమ్‌' రీమేక్‌గా తెరకెక్కిస్తున్న 'మజ్ను'లో నాగచైతన్య సరసన నటిస్తోంది. అలాగే గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందనున్న 'ఎన్మెల్‌ పాయుమ్‌ తోట' చిత్రంతోపాటు 'ద ఫకీర్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తూ ధనుష్‌ బిజీగా ఉన్నారు.

13:10 - February 18, 2016

విజయవాడ : అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. వెయ్యిమంది నర్సులు, ఐదు వందల మంది డాక్టర్ల పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేస్తామని ప్రకటించారు. విజయవాడ ఎన్ టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ కార్యాలయాన్ని మంత్రి కామినేని ప్రారంభించారు.

 

13:09 - February 18, 2016

హాలీవుడ్‌లో ఆస్కార్‌ ఫీవర్‌ రోజు రోజుకి మరింత ఊపందుకుంటోంది. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం కోసం అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆస్కార్‌ నామినేషన్ల జాబితాని విశ్లేషించి ఏ సినిమా ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది, ఏఏ నటీనటులు ఉత్తమ నటీనటులుగా నిలుస్తారనే విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ఈ విశ్లేషణల్లో ఎక్కువ ఆస్కార్‌ అవార్డుల్ని కొల్లగొట్టే చిత్రంగా 'ద రెవెనెంట్‌' చిత్రం నిలిచింది. ఉత్తమ చిత్రంగానే కాకుండా ఇందులో నటించిన లియోనార్డో డికాప్రియోకు ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ వస్తుందని విశ్లేషణలు ఘంటాపదంగా చెబుతున్నారు.
'ఈసారి ఆస్కార్‌ అవార్డులలో అధిక భాగం ఆ 'దెయ్యాని'కే లభిస్తాయి. ఆ దెయ్యం పేరు 'ద రెవెనెంట్‌'. ఆ చిత్రంలో కథానాయకుడిగా నటించిన లియోనార్డోకు ఉత్తమ నటుడి అవార్డు లభించడం ఖాయం. 'ఉత్తమ నటుడిగా లియోనార్డోకి ఇచ్చి తీరాల్సిందే'నని ఆస్కార్‌ అవార్డ్స్‌ నిబంధనల్ని సైతం అతిక్రమిస్తూ ఫిల్మ్‌మేకర్‌ హార్వీ వీన్‌స్ట్రెన్‌ ఓ బహిరంగ వేదికలో ఇచ్చిన స్టేట్‌మెంటే ఇందుకు నిదర్శమంటున్నారు. ఆస్కార్‌ కమిటీలో ఓటు హక్కు ఉన్న ఎవ్వరూ ఇలా బహిరంగ ప్రకటనలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయినా వీన్‌స్ట్రెస్‌ ఆ నింబంధనని పట్టించుకోలేదు. పైగా 'అతని నటన బాగుంది. అందుకే అవార్డు ఇచ్చి తీరాలన్న నా అభిప్రాయం సరైనదే' అని కూడా ఆయన సమర్థించుకుంటున్నారు. ఆస్కార్‌ బరిలో 'ద రెవెనెంట్‌' చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్‌, ఉత్తమ మేకప్‌, ఉత్తమ కాస్ట్యూమ్స్‌, ఉత్తమ హెయిర్‌ స్టయిలింగ్‌, ఉత్తమ ప్రొడక్షన్‌, ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌ వంటి తదితర విభాగాల్లో ఇప్పటికే నామినేషన్లు పొంది ఆస్కార్‌ బరిలో అమీతుమి తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది.

13:08 - February 18, 2016

బాలీవుడ్‌లో నటీనటులు కేవలం నటనకే పరిమితం కాకుండా తమకున్న ప్రతిభతో వివిధ విభాగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కథానాయికల విషయానికొస్తే ప్రియాంక చోప్రా, అనుష్కశర్మ వంటి తదితర నాయికలు ఇప్పటికే నిర్మాణంలోకి అడుగిడి తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే మరికొంత మంది వివిధ వ్యాపారాల్ని ప్రారంభించి మరింత మంచి గుర్తింపు కోసం శతవిధాలా కృషి చేస్తున్నారు. వీరి బాటలోనే శ్రద్ధాకపూర్‌ కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. శ్రద్ధా మంచి నటే కాదు మంచి డాన్సర్‌ కూడా. ఈ రెండింటితోపాటు పాడటంలో కూడా ప్రావీణ్యం ఉంది. 'ఏక్‌ విలన్‌'లో ఓ పాట పాడి అందరి ప్రశంసల్ని పొందింది. ఇక పై కూడా సినిమాల్లో పాటలు పాడే విషయంపైనే ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తానని అంటోంది శ్రద్ధా. తాజాగా టైగర్‌ షరాఫ్‌తో నటిస్తున్న 'బాఘీ' చిత్రంలోనూ ఓ పాట పాడేందుకు దర్శక, నిర్మాతలు శ్రద్ధాకి ఇప్పటికే గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. వీరిచ్చిన ప్రోత్సాహంతో ఇకపై ప్రతి సినిమాలోనూ ఓ పాట పాడేందుకు ఫ్లాన్‌ చేసుకుంటానని శ్రద్ధా తెలిపింది.

13:08 - February 18, 2016

'ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి రోజులు కొనసాగుతున్నాయని అనిపిస్తోంది. ఈ కాలం ప్రేక్షకులు వాణిజ్య పరమైన చిత్రాలతోపాటు కళాత్మక చిత్రాలను కూడా చూసేందుకు ఇష్టపడుతున్నార'ని బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ పేర్కొన్నారు. 70,80 దశకాల్లో అగ్రకథానాయికగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన షబానా తాజాగా 'చాక్‌ అండ్‌ డస్టర్‌', 'నీరజ' చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,'ఈ మధ్య బాలీవుడ్‌లో అన్ని రకాల సినిమాలు తీస్తున్నారు. వీటితోపాటు పూర్తి మసాలా సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయి. అలాగే 'మసాన్‌', 'జిందగీ నా మిలేగి దొబారా' వంటి కళాత్మక చిత్రాలూ వచ్చాయి. వీటి ద్వారా ప్రేక్షకుడు తనకి నచ్చిన సినిమా చూసుకునే అవకాశాన్ని సినిమాలు కల్పిస్తున్నాయి' అని చెప్పారు.

13:07 - February 18, 2016

శివరాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన హర్రర్‌ థ్రిల్లర్‌ 'శివలింగ' ఇటీవల విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో సంచలన విజయం సాధించింది. పి.వాసు దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని తమిళంలో రజనీకాంత్‌, తెలుగులో నాగార్జున రీమేక్‌ చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారని సమాచారం. పి.వాసు దర్శకత్వంలో రూపొందిన 'ఆప్తమిత్ర', 'ఆప్తరక్షక', 'దృశ్య' వంటి తదితర చిత్రాలు అఖండ విజయాన్ని సాధించడమే కాకుండా పలు భాషల్లో రీమేక్‌గా తెరకెక్కి అక్కడ కూడా అదే స్థాయిలో విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఆయన గత చిత్రాలు సాధించిన విజయాలతోపాటు తాజా 'శివలింగ' సైతం అదే రీతిలో ప్రేక్షకాదరణ పొందడంతో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు రజనీ, నాగ్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, 'కబాలి' చిత్రం షూటింగ్‌లో రజనీ, 'ఊపిరి'చిత్రం షూటింగ్‌ నాగార్జున నటిస్తూ బిజీగా ఉన్నారు.

13:06 - February 18, 2016

హాయిగొలిపే పరిమళాలు మనసుని తేలికపరుస్తాయి. గాఢనిద్రను సొంతం చేస్తాయి సానుకూల ఆలోచనలకు కారణమవుతాయి. మరి అలాంటి సహజ పరిమళాలను ఎలా పొందవచ్చంటే..బత్తాయి, నారింజ ఫలాల తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి గాలిచొరబడని డబ్బాలో భద్రపరచాలి. దీన్ని నీళ్లలో కలిపి స్ప్రే చేసినా సాంబ్రాణి తరహాలో ధూపం వేసినా ఫలితం ఉంటుంది. అలాగే నిమ్మకాయను సగానికి కోసి దాన్ని సన్నని మంటపై ఉంచి కాల్చితే ఇల్లంతా ఆ సువాసన ఆవరిస్తుంది. గది మధ్యలో రాగి పాత్ర ఉంచి దానిలో సువాసననిచ్చే మల్లె, జాజి వంటి పూలను ఉంచితే అందంగా ఉండటమే కాదు... గదిలో పరిమళాలు వ్యాపిస్తాయి. రోజ్‌వాటర్‌, నిమ్మగడ్డి, నూనెలను కొద్దిగా నీటిలో కలిపి, దాంతో నేలను తుడవడమూ పాటించదగిన పద్ధతే. 

13:06 - February 18, 2016

హైదరాబాద్ : ఎట్టకేలకు తనపై వస్తున్న ఆరోపణలపై టిఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి స్పందించారు. తలారి సత్యం మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనతో తనకు ప్రమేయం ఉందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. రేవంత్‌రెడ్డి అసత్యప్రచారం చేస్తున్నారంటూ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

13:06 - February 18, 2016

కొందరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దీని వల్ల అలర్జీ లాంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇంట్లో దుమ్ము, ధూళి కొంచెం ఉన్నా కళ్లలో నీళ్లు కారడం, ముఖం ఎర్రబడటం, ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లు అవుతూ ఉంటుంది. దీని వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు అవి ఏయే సమయాల్లో వస్తున్నాయో పరిశీలించుకోవాలి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బెడ్‌షీట్లూ, తలగడలను వారానికొకసారి వేడినీళ్లలో ముంచి శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
మీకు తరచూ ఆలస్యంగా నిద్రపోయే అలవాటుంటే వెంటనే మానేయండి. ఇది మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తుంది. దీనివల్ల రక్తప్రసరణలో మార్పు వచ్చి కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. దీన్ని నివారించాలంటే.. ఎనిమిది గంటలు నిద్రపోవడం ఒక మార్గమైతే.. పడుకునేప్పుడు ఐప్యాడ్‌లు కళ్ల మీద ఉంచుకుని నిద్రపోవడం మరొకటి. ఇవి కళ్లకు చల్లదనాన్ని ఇచ్చి హాయిగా నిద్రపట్టేలా చేస్తాయి.
కొంతమందిని జిడ్డు వేధిస్తుంటుంది. దీనికోసం తరచూ సబ్బుతో ముఖం కడుక్కుంటూ ఉంటారు. దీనివల్ల చర్మం పొడిబారడమే కాక, నిర్జీవంగానూ మారుతుంది. అందుకే రోజుకు రెండుసార్లు మించి ముఖం కడగకూడదు. ఒకవేళ శుభ్రం చేసుకోవాలనిపిస్తే ఎలాంటి సబ్బులు, ఫేస్‌వాష్‌లు వాడకుండా నీళ్లతో కడగడం మంచిది.

గ్రేటర్ లో ఆన్ లైన్ విధానం అమలు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ పరిధిలో ఆన్ లైన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ లోని 150 పరిధిలో వార్డు కమిటీలు, ఏరియా కమిటీలను ఏర్పాటు చేయన్నట్లు పేర్కొన్నారు. టౌన్ హాల్ మీటింగ్ లకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

12:46 - February 18, 2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ పరిధిలో ఆన్ లైన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ లోని 150 పరిధిలో వార్డు కమిటీలు, ఏరియా కమిటీలను ఏర్పాటు చేయన్నట్లు పేర్కొన్నారు. టౌన్ హాల్ మీటింగ్ లకు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదర్ నగర్ నుంచి టౌన్ హాల్ మీటింగ్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రూ.200 కోట్లతో 569బీటీ రోడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. రూ. 30 కోట్లతో మేజర్ నాలాలను నిర్మించనున్నట్లుతెలిపారు. పది స్శశాన వాటికలు, రూ.150 కోట్లతో 50 బస్సు బేస్ లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.  

కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న రాహుల్ గాంధీ

ఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలు, జెఎన్ యూ ఘటన, పటియాల పరిస్థితులపై చర్చించనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్యాహ్నం రాష్ట్రపతిని కలవనున్నారు. సాయంత్రం జర్నలిస్టు సంఘాల నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. కన్హయ్యకుమార్ పై దేశద్రోహం కేసును ఉపసంహరించుకునే అవకాశం ఉంది. 

చిత్తూరులోని అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్

చిత్తూరు : జిల్లాలోని దేవరకొండ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 60 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు పరారీ కావడంతో పోలీసులు కూంబింగ్‌ కోనసాగిస్తున్నారు.

 

హైదరాబాద్ కొత్తపేట ప్రూట్‌ మార్కెట్‌పై అధికారులు దాడులు

హైదరాబాద్ : నగరంలోని కొత్తపేట ప్రూట్‌ మార్కెట్‌పై అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్నారు. 

 

12:27 - February 18, 2016

ఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలు, జెఎన్ యూ ఘటన, పటియాల పరిస్థితులపై చర్చించనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్యాహ్నం రాష్ట్రపతిని కలవనున్నారు. సాయంత్రం జర్నలిస్టు సంఘాల నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. కన్హయ్యకుమార్ పై దేశద్రోహం కేసును ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మరోవైపు యూనివర్సిటీల్లో దళితులపై దాడులు పెరుగుతున్నాయి. కన్హయ్య అరెస్టును, అతనిపై లాయర్లు దాడికి చేయడాన్ని జాతీయ నేతలు అందరూ ఖండిస్తూ... కన్హయ్యకు మద్దతు ఇస్తున్నారు. కన్హయ్యపై దేశద్రోహం కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కన్హయ్యపై దేశద్రోహం కేసు పెట్టడానికి ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడం గమనార్హం. 

 

భక్తులపైకి దూసుకెళ్లిన కారు...

చిత్తూరు : తిరుమల ఘాట్‌రోడ్‌లో కారు బీభత్సం సృష్టించింది. అలిపిరి నడకదారిలో ఓ కారు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

10:57 - February 18, 2016

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో ఆర్‌టీసీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. ఈ డిపోకు 4 వందల ఓట్లు ఉండటంతో పాటు ఏడు కార్మిక సంఘాలు బరిలో ఉన్నాయి. ఇప్పటి వరకు 20 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సాయంత్రానికి మరో 60 శాతం ఓట్లు నమోదయ్యే అవకాశముంది. అటు విజయవాడలోనూ ఆర్‌టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. 

 

10:52 - February 18, 2016

చిత్తూరు : తిరుమల ఘాట్‌రోడ్‌లో కారు బీభత్సం సృష్టించింది. అలిపిరి నడకదారిలో ఓ కారు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ఇద్దరు భక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

10:42 - February 18, 2016

హైదరాబాద్ : రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన దోషులను కాపాడేందుకు కుట్ర జరుగుతుందని మేధావులు అభిప్రాయపడ్డారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కొనసాగిన బస్సు యాత్ర బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో ముగిసింది. రోహిత్‌ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతుంటే.. దానిని దారి మళ్లించేందుకు కేంద్రం జెఎన్‌యూ ఘటనను తెరపైకి తెచ్చిందని పలువురు ఆరోపించారు. 
ఈనెల 6న మొదలైన యాత్ర 
హెచ్‌సీయూలో రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఐదు విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర విజయవంతంగా ముగిసింది. ఈనెల 6 నుంచి మొదలైన యాత్ర.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల మీదుగా కొనసాగి.. బుధవారం నాడు ఉస్మానియా వర్సిటీలో ముగిసింది. ఈ సందర్భంగా ఓయూలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్ధులతో పాటు.. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. 
దోషులను కాపాడేందుకు కుట్ర 
రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిని కాపాడేందుకు కుట్ర జరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను అరెస్ట్‌ చేయాలని.. వీసీ అప్పారావును వెంటనే తొలగించాలని పలువురు డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీల్లో దళిత విద్యార్ధులపై దాడులు జరగకుండా ఉండేందుకు.. రోహిత్‌ చట్టాన్ని ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. కుల వివక్షతపై జరుగుతున్న చర్చను, ఉద్యమాలను పక్కదారి పట్టించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని పలువురు ఆరోపించారు.
రోహిత్‌ చట్టం తెచ్చే వరకు ఉద్యమం ఆగదు : విద్యార్ధి సంఘాలు 
రోహిత్‌ చట్టం తీసుకువచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని విద్యార్ధి సంఘాలు స్పష్టం చేశాయి. ఇందుకోసం ఈనెల 23న నిర్వహించ తలపెట్టిన 'చలో ఢిల్లీ'కి విద్యార్ధులు భారీగా తరలి రావాలని విద్యార్ధి సంఘ నేతలు పిలుపునిచ్చారు. 

10:27 - February 18, 2016

టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ ఆరోపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్, వైసిపి అధికార ప్రతినిధి గౌతంరెడ్డి పాల్గొని, మాట్లాడారు. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తున్నారని విద్యాసాగర్  విమర్శించారు. ఎపి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దిగిజార్జేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని గౌతందరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

నేడు మంత్రాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ పర్యటన

హైదరాబాద్ : నేడు మంత్రాలయం నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు కేఈ కృష్ణమూర్తి శంకుస్థాపన చేయనున్నారు.

కనిగిరిలో రెండు బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు

ప్రకాశం : జిల్లాలోని కనిగిరిలో రెండు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు, తహశీల్దార్‌ వెంకటేశ్వర్లు పెళ్లి పెద్దలకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

 

09:38 - February 18, 2016

ప్రకాశం : జిల్లాలోని కనిగిరిలో రెండు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు, తహశీల్దార్‌ వెంకటేశ్వర్లు పెళ్లి పెద్దలకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

09:36 - February 18, 2016

నెల్లూరు : జిల్లాలోని రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రెండు లక్షలా 20 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. 13 మంది సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు.

 

09:29 - February 18, 2016

కుట్రపూరితంగానే జెఎన్ యూ అధ్యక్షుడు, ఏఐఎస్ ఎఫ్ నేత కన్హయ్య కుమార్ పై దేశద్రోహం కేసు పెట్టారని ఏఐఎస్ఎఫ్ నేత స్టాలిన్ పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాటారు. మోడీ హయాంలో కాషాయీకరణ చేయడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 'ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ  ప్రెసిడెంట్ కన్హయ్యపై దాడికి వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలు గళమెత్తుతున్నాయి. ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నెల 23న చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. అసలు జేఎన్ యు లో ఏం  జరిగింది? యూనివర్సిటీ నేతపై రాజద్రోహం నేరం కింద కేసు పెట్టడం ఎంత వరకు సమర్ధనీయం? ఈ తరహా కేసులు దేనికి సంకేతం?  ఈ కేసును వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాల భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? ఆందోళనలకు పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్స్ ఏమిటి'..? ఇలాంటి అంశాలపై 
స్టాలిన్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు బీభత్సం

చిత్తూరు : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. నడకదారి భక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో  పలువురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

08:47 - February 18, 2016

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రెసిడెంట్ కన్హయ్యపై పెట్టిన రాజద్రోహం కేసు తీవ్ర ప్రకంకపనలు సృష్టిస్తోంది. ఆయనను పాటియాల కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అక్కడ జరిగిన పరిణామాలను సుప్రీంకోర్టు కూడా సీరియస్ పరిగణించింది. 
అద్వానీ వ్యాఖ్యలు నిజమమ్యాయి...
దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితులున్నాయంటూ ఎల్ కె అద్వానీ వ్యాఖ్యానించి ఆరేడు నెలలు కూడా కాలేదు. అద్వానీ ఎమర్జెన్సీ కాలపు చీకటి రోజులను స్వయంగా చూసిన బీజేపీ సీనియర్ నాయకుడు. ఐదేళ్లపాటు ఉపప్రధానిగా పనిచేసిన  సీనియర్ నేత.  అలాంటి తలపండిన నాయకుడే కేంద్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో వుందన్న మొహమాటం కూడా లేకుండా    ఎమర్జెన్సీ భయాన్ని వ్యక్తం చేశారు.  అయితే, ప్రధాని నరేంద్ర మోడీ మీద వున్న అసంత్రుప్తితోనో, తన సీనియార్టీకి తగిన పదవీ,   గౌరవ మర్యాదలు దక్కడం లేదన్న దుగ్ధతోనో ఇలాంటి వ్యాఖ్యలు చేసివుంటారని కొంతమంది సర్ధిచెప్పుకున్నారు. కానీ,  దేశంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తనకున్న అపార రాజకీయ అనుభవంతో ముందస్తుగానే హెచ్చరించారేమోనన్న అభిప్రాయం కలుగుతోంది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నేత కన్హయ్య పై పెట్టిన రాజద్రోహం కేసు  ప్రజాస్వామిక సమాజంలో జరగకూడని పరిణామం. 
దేశ వ్యతిరేక నినాదాలు చేశారని కన్హయ్యపై అభియోగం 
జేఎన్ యూలో ఈ నెల 9వ తేదీన జరిగిన ఓ సమావేశంలో జాతి వ్యతిరేక, దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్నది కన్హయ్య పై మోపిన అభియోగం. ఆ సభలో పాల్గొన్న ఆయనతో పాటు మరికొందరిపై  124 ఏ, 120 బీ అంటే రాజద్రోహం కుట్ర కేసులు పెట్టారు.  కన్హయ్య నేపథ్యం తెలిసినవారెవ్వరూ, దేశం పట్ల, దేశప్రజల పట్ల ఆయనకున్న భావాలను అర్ధం చేసుకున్నవారెవ్వరూ ఇలాంటి కేసులు పెట్టడాన్ని ఏమాత్రం సమర్ధించలేరు. కన్హయ్య కన్నతల్లి ఓ  అంగన్ వాడీ వర్కర్.  అత్యంత సాధారణ కుటుంబంలో  పుట్టిన కన్హయ్య వామపక్ష భావజాలానికి ఆకర్షితుడైన విద్యార్థి.  జవహర్ లాల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో అత్యధికుల ఆదరాభిమానాలు చూరగొని, ప్రెసిడెంట్ గా ఎన్నికైన స్టూడెంట్  లీడర్‌.  ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యార్థి సంఘానికి విభిన్నరకాల తీవ్రవాదులతో వేర్పాటువాదులతో తలపడిన చరిత్రే వున్నది తప్ప విచ్ఛిన్నకర శక్తులకు వత్తాసుపలికిన చరిత్ర లేదన్నది దేశమంతా ఎరిగిన సత్యం. ఇలాంటి నేపథ్యం వున్నవారి మీద రాజద్రోహం , కుట్ర కేసులు పెట్టడమంటే ప్రజాస్వామిక విలువలనీ, ప్రజాస్వామిక భావజాలన్ని పరిహసించడమే.  రాజకీయ ప్రేరితమైన కుట్రగానే ఇలాంటి కేసులను పరిగణించాల్సి వుంటుంది. 
ఉద్దేశపూర్వకంగానే దాడులు
కన్హయ్యపై కుట్ర కేసులు బనాయించడం ఒక ఎత్తయితే, పటియాల కోర్టు ప్రాంగణంలో కొంతమంది సృష్టిస్తున్న అలజడి, ఉద్రిక్తతలు మరో ఎత్తు. కన్హయ్యను కోర్టులో ప్రవేశపెడుతున్న సందర్భంలో మొన్న సోమవారం నాడు, తాజాగా బుధవారంనాడు జరిగిన దాడులు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు దాడుల్లోనూ ఒకే వ్యక్తులు పాల్గొనడం అవి యాద్రుశ్చికం కాదనీ, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న దాడులన్న అనుమానం సహజంగానే కలుగుతోంది.  నిజానికి కన్హయ్య కేసులో  తీవ్ర ఉద్రిక్త వాతా వరణం స్రుష్టించి, అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఒక వర్గం లాయర్లకు ఎందుకు కలిగిందన్నది ఇప్పుడు నిగ్గుతేల్చాల్సిన విషయం.  అసలు వీరంతా  నిజంగానే లాయర్ లా? ఆ ముసుగులో  కోర్టు దగ్గరకు చేరిన అరాచకశక్తులా అంటూ వ్యక్తమవుతున్న అనుమానాలనూ తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. 
ప్రజాస్వామిక సమాజం అనుమతించకూడని పరిణామాలు
యూనివర్సిటీ నేత కన్హయ్య మీద రాజద్రోహం కేసులు పెట్టడం, ఆయన మీద కోర్టు ప్రాంగణంలో దాడులకు తెగబడడం ప్రజాస్వామిక సమాజం ఏమాత్రం అనుమతించకూడని పరిణామాలు. కొద్ది నెలల క్రితం అద్వానీ  చెప్పినట్టుగానే  ఈ దేశంలో ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు మళ్లీ వస్తున్నాయనడానికి  గత కొంతకాలంగా  పాలకపార్టీ, దాని మద్దతుదారులు  విభిన్న సమూహాలపై, విభిన్న భావాలపై, విభిన్న సందర్భాలలో ప్రదర్శిస్తున్న అసహనమే నిదర్శనం. 

 

08:37 - February 18, 2016

ఢిల్లీ : ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులను కోరారు. నిర్ధేశించిన సమయంలోగా ప్రాజెక్ట్‌లు  పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రచారం కల్పించడంలో వెనుకబడిపోయామని మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.                                                                                                        
ప్రజల మది నుంచి తొలగిపోని యూపీయే పథకాలు 
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగిన కేబినెట్‌ సమావేశాలో పలు అంశాలు చర్చించడంతోపాటు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూపీయే  అధికారం కోల్పోయి ఏడాదిన్నర గడిచిపోయినా... ప్రజలమది నుంచి   ఆ ప్రభుత్వ పథకాలు  ఇంకా  తొలగిపోలేదని కొందు మంత్రులు మోదీ దృష్టికి తెచ్చారు. యూపీయే పాలకులు ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించడంతో ప్రజలు ఇంకా వాటిని తలచుకుంటున్న విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ స్పందిస్తూ... వివిధ మంత్రిత్వ శాఖలు సాధించిన ఘన విజయాలపై స్పష్టమైన ప్రతిపాదనలు ఇస్తే ప్రచారం కల్పించొచ్చని చెప్పారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వరంగ సంస్థలు ఎంతో ప్రగతిపథంలో పయనిస్తున్నా ప్రచారం కల్పించుకోలేని దుస్థితిలో ఉన్నామని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్చ భారత్ అభియాన్‌ ద్వారా ఎంతో ప్రగతి  సాధించినా, ప్రజల్లోకి వెళ్లలేదని, ఈ లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించాలని కోరారు.
సాధించిన విజయాలేంటో ప్రధానిగా నాకే తెలియదు 
కేబినెట్‌లోని ఓ మంత్రి తమ శాఖ సాధించిన ఘన కార్యాలు గురించి ప్రస్తావించినప్పుడు.. మోదీ తీవ్రంగా స్పందించారు. మీ శాఖ సాధించిన విజయాలేంటో ప్రధానిగా నాకే తెలియకపోతే... ఇక సామాన్య మానవులుకు ఎలా తెలుస్తాయని వ్యాఖ్యానించడంతో ఆ మంత్రి అవాక్కయ్యారు. అన్ని విషయాల్లో   విశ్వవ్యాప్తంగా భారత్‌ ర్యాకింగ్‌ మెరుగుపడినా.... ప్రజలకు చెప్పుకోలేకపోతున్న విషయాన్ని ప్రధాని మోదీ కేబినెట్‌లో ప్రస్తావించారు. కేంద్ర నిధులతో అమలు చేస్తున్న పథకాలను కొన్ని రాష్ట్రాలు తమవిగా ప్రచారం చేసుకుంటున్న విషయాన్ని కొందరు మంత్రులు.... మోదీ దృష్టికి తెచ్చారు. దశాబద్ధలుగా విద్యుత్‌కు  నోచుకోని గ్రామాలకు ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్‌  సౌకర్యం కల్పించినా... ప్రచారం చేసుకోలేవకపోతున్న విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ఇటువంటి గ్రామాల్లో ఉర్జా దివస్‌ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రధాని కోరారు. 
ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై ఆరా 
1950 ప్రజా ప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లుకు ఆమోదం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్‌ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందం అమలుపై కేబినెట్‌ భేటీలో మోదీ సమీక్షించారు. వ్యవసాయం, ఇతర రంగాల్లో పలు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై కూడా మోదీ ఆరా తీశారు. పట్టణ ప్రణాళికల అమలు కోసం  సింగపూర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అమలుపై సమీక్షించారు. భారత్‌ -బంగ్లాదేశ్‌ మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లో విలీనమైన కాలనీపై కూడా కేబినెట్‌లో చర్చించారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భారత్‌లో కలిసిన కాలనీలను ఆయా నియోజకవర్గాల్లో విలీనంచేందుకు వీలుగా 2002 నియోజకవర్గాల పునర్విభన చట్టంతోపాటు, 1950 ప్రజా ప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లులకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. భాతీయ వైద్య విధానంతో పాటు మరికొన్ని  అంశాలపై కేబినెట్‌లో చర్చించారు. 
 

ఎపి ఎస్ ఆర్టీసీ గుర్తింపు యూనియన్‌ కు ఎన్నికలు ప్రారంభం

హైదరాబాద్ : ఎపి ఎస్ ఆర్టీసీ గుర్తింపు యూనియన్‌కు గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్‌ పూర్తైన వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు. రాత్రి 8 గంటలకు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు  అనుంబంధంగా ఉన్న యూనియన్లు ఎపి ఎస్ ఆర్టీసీ గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. 

08:24 - February 18, 2016

విజయవాడ : సీఆర్ డీఏ మరో భూ సమీకరణకు తెరలేపింది. ఈసారి అసైన్డ్‌ భూములతోపాటు, మాజీ సైనికోద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధుల భూముల తీసుకోనున్నారు. దీనికి అనుగుణంగా సీఆర్ డీఏ భూ సమీకరణ విధానంలో సవరణలు చేశారు. సమీకరించే భూములకు ఏ మేరకు నివాస, వాణిజ్య స్థలాలు ఇవ్వాలన్న అంశంపై అధికారులు స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఆర్ డీఏకి భూములు స్వాధీనం చేసేందుకు ఈనెల 28ని తుది గడువుగా నిర్ణయించారు. 
అసైన్డ్ భూముల సమీకరణపై దృష్టి 
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో మరో భూ సమీకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు మెట్ట, మాగాణికి సంబంధించిన పట్టా భూములు సేకరించిన సీఆర్‌డీఏ అధికారులు... ఇప్పుడు అసైన్డ్ భూముల సమీకరణపై దృష్టి పెట్టారు. అగాలే మాజీ సైనికోద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు భూములు సమీకరించేందుకు వీలుగా.. ఉత్తర్వులు జారీ చేశారు. 
ఎకరా అసైన్డ్ భూమికి 1000 గజాల నివాస స్థలం
కొత్తగా సమీకరించే భూములకు అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య స్థలాలు ఎంత ఇవ్వాలన్న అంశంపై సీఆర్‌డీఏ అధికారులు  స్పష్టత ఇచ్చారు.  అసైన్డ్‌ భూముల విషయంలో ఎకరా మెట్టభూమికైనా, జరీబు భూమికైనా... అభివృద్ధి చేసిన  వెయ్యి గజాల నివాస స్థలం ఇస్తారు. అలాగే ఎకరా మెట్టకు 200 గజాలు, జరీబు భూమికి 450 గజాల వాణిజ్య స్థలం అప్పగిస్తారు.  డీ రిజర్వ్‌ చేసిన అటవీ భూములకు మెట్టకైనా, మాగాణికైనా వెయ్యి గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు.  మెట్టకు 200 గజాలు, జరీబు భూమికి 459 గజాల  వాణిజ్య స్థలం ఇస్తారు. 
1954 తర్వాత అసైన్డ్ భూములకు 800 గజాలు 
1954 తర్వాత పంపిణీ చేసిన అసైన్డ్ భూముల సమీకరణకు అభివృద్ధి చేసిన స్థలాలు ఇచ్చే  విషయంలో   తేడావుంది. ఎకరా మెట్టకైనా, జరీబు  భూమికైనా  800 గజాల వంతున నివాస స్థలం ఇచ్చేందుకు అంగీకరిస్తూ సీఆర్‌డీఏ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వాణిజ్య ప్రాంతంలో మెట్టకు 100 గజాలు, జరీబుకు 200 గజాల స్థలం  ఇవ్వాలని నిర్ణయించారు. శివైజమాదార్స్‌ భూములకు మెట్టకైనా, మాగాణికైగా ఎకరాకు 500  గజాల వంతున నివాస స్థలం ఇస్తారు. అలాగే మెట్టకు 50 గజాలు, జరీబు భూములకు 100 గజాల వాణిజ్య స్థలం ఇస్తారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల విషయంలో ఏ రకమైన అభ్యంతరాలు లేకుండా ఉంటే  మెట్టకైనా, జరీబుకైనా 500 గజాల వంతున నివాస స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వాణిజ్య స్థలాన్ని  మెట్టకు 50 గజాలు, జరీపుకు 100 గజాలు ఇచ్చేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేశారు.  అభ్యంతరం ఉన్న రెండు రకాల భూములకు 250 గజాల వంతున స్థలం ఇస్తారు. 
సమీకరించే భూములకు 10 ఏళ్లపాటు ప్రోత్సాహకాలు 
సమీకరించే భూములు ఎకరా కంటే తక్కువగా ఉన్నా పదేళ్ల పాటు ప్రోత్సాహకం  చెల్లించాలని నిర్ణయించారు. మెట్టకు ఎకరా భూమికి ఏడాదికి 30 వేల రూపాయలు, జరీబు భూములకు 50 వేల రూయాలు ప్రోత్సాహకం ఇస్తారు.  అమరావతి పరిధిలోని అసైన్డ్‌, మాజీ సైనికోద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధుల భూములను ఈనెల 28 లోగా ప్రభుత్వానికి స్వాధీనం చేయాలన్న నిబంధన విధించారు.  అసైన్డ్‌, మాజీ సైనికోద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, డీ రిజర్వడ్‌ అటవీ భూములు, ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు సమీకరిస్తే రాజధాని అమరావతికి భూ సేకరణ పూర్తైనట్టేనని భావిస్తున్నారు. 

 

నేడు గుంటూరులో చంద్రబాబు, వెంకయ్యనాయుడు పర్యటన

గుంటూరు : ఎపి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఇరువురు పాల్గొననున్నారు. 

 

08:13 - February 18, 2016

హైదరాబాద్ : తెలంగాణ అధికార పార్టీ నేతల్లో మరోసారి నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది. త్వరలో పదవుల పందేరం ఉంటుందని సంకేతాలు వెలువడుతుండడంతో.. పదవులు దక్కించుకునేందుకు నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి నామినేటెడ్‌ పదవులన్నీ భర్తీ చేసేందుకు గులాబీ బాస్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు.                                                                                          
ఊపందుకున్న నామినేటెడ్‌ పదవుల వ్యవహారం
టీఆర్‌ఎస్‌లో మరోసారి నామినేటెడ్‌ పదవుల వ్యవహారం ఊపందుకుంది. ప్రభుత్వ ఏర్పాటు నుంచి అధికార పార్టీ నేతలను ఊరిస్తూ వస్తున్న ఈ పదవుల భర్తీ త్వరలోనే ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే దాదాపు 20 నెలలుగా నేతలు ఆశలు పెట్టుకున్నా.. వివిధ కారణాలతో పదవుల భర్తీలో జాప్యం జరుగుతూనే ఉంది. 
గ్రేటర్‌ ఎన్నికల పేరుతో జాప్యం
2015లో పార్టీ నిర్వహించిన ప్లీనరీ ద్వారానే పదవుల భర్తీ ఉంటుందని నేతలు భావించినా.. జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నికను మాత్రమే పూర్తి చేసింది. గ్రేటర్ ఎన్నికల బూచీతో  ఆ పదవుల భర్తీలో మరింత జాప్యం జరిగింది. గ్రేటర్ ఎన్నికలతో పాటు  రెండు పార్లమెంట్ స్థానాలు, ఓ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా పూర్తయింది. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలు  మార్చి మొదటి వారంలో  పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశం తెరపైకి వచ్చింది. 
శాసనసభ్యులకే కీలక పదవులు ? 
ఈ పరిస్థితుల్లో పార్టీ అగ్రనేతలు ఇస్తున్న సంకేతాలు చూస్తుంటే నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడం ఖాయమనిపిస్తోంది. సుమారు 4 వేల నుంచి 5 వేల పదవులు కార్యకర్తలకు దక్కే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా  ప్రకటించారు. రాష్ట్ర స్థాయి పదవులతో పాటు  గ్రామ స్థాయి వరకు ఈ పదవులు దక్కనున్నాయి. అయితే కీలక పదవులు మాత్రం శాసనసభ్యులకు దక్కే అవకాశం కనిపిస్తోంది. 
ఇతర పార్టీల నుంచి చేరినవారికి కార్పొరేషన్‌ పదవులు
ఇక గులాబీ గూటికి చేరుకున్న ఇతర పార్టీల నేతలకు కూడా పలు కార్పొరేషన్ల పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పదవుల పంపిణీ ఈ వారంలోనే మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. 

 

నేడు హైదరాబాద్ రానున్న దిగ్విజయ్ సింగ్

హైదరాబాద్  : కాంగ్రెస్ సీనినయర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. జీహెచ్ సెంసీ ఎన్నికలు, నారాయణఖేడ్ ఫలితాలపై టీపీసీసీ నేతలతో ఆయన చర్చించనున్నారు.

నెల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుపై ఏసీబీ దాడులు

నెల్లూరు : జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 1.92 లక్షలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు 13 మంది ప్రైవేట్‌ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

నేడు విశాఖలో జగన్ పర్యటన

విశాఖ : వైసిపి అధినేత జగన్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. స్వరూపానందస్వామి నిర్వహిస్తున్న మహాకుంభాషేకం కార్యక్రమంలో పాల్గాననున్నారు. 

08:00 - February 18, 2016

హైదరాబాద్ : చంద్రబాబుకు ధైర్యం ఉంటే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు సిద్ధపడాలని... వైసీపీ అధినేత జగన్‌ సవాల్‌ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళుతున్నారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలే తమతో టచ్‌లో ఉన్నారని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు.                                                                                          
ఏపీ, తెలంగాణ ప్రభుత్వ విధానాలపై గవర్నర్‌కు ఫిర్యాదు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కలిసి.. రాజభవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించనున్నారంటూ వస్తున్న వార్తలపై మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు తమకు మరో 21 మంది ఎమ్మెల్యేల బలం అవసరమని.. ఆ సంఖ్య తమకు సమకూరితే గంట కూడా ప్రభుత్వం ఉండబోదని చెప్పారు. చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలే తమతో టచ్‌లో ఉన్నారని.. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు వెల్లడిస్తానని అన్నారు. 
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ తో సీమకు సమస్య
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల రాయలసీమతో పాటు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతాంగానికి సమస్యలు వస్తాయని, శ్రీశైలం, సాగర్‌ జలాశయాలకు నీళ్లు రావని జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. 
ఓటుకి నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు.. ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టారని జగన్‌ ఆరోపించారు.
తుని ఘటనలో అమాయకులపై తప్పుడు కేసులు 
తునిలో కాపు గర్జన సందర్భంగా జరిగిన ఘటనలకు సంబంధించి ప్రభుత్వం అమాయకులపై తప్పుడు కేసులు పెడుతోందని జగన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సభకు అనుమతించిన ప్రభుత్వం.. భద్రత చర్యలు తీసుకోక పోవడం వల్లే ఆ ఘటన జరిగిందని ఆరోపించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీలపై గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని, ఇచ్చిన మాటను నిలుపుకోని చంద్రబాబుపై కేసు పెట్టి జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ట్రైబల్‌ అడ్వయిజరీ బోర్డు ఏర్పాటులో ప్రభుత్వ అలసత్వాన్ని గురించీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు జగన్‌ వెల్లడించారు. 

 

07:55 - February 18, 2016

నల్గొండ : నిరుద్యోగమే వారి ఉపాధి. అబద్ధాలే పెట్టుబడి. ఎదుటివారి అమాయకత్వం ఆర్థిక సమస్యలే వారికి అవకాశాలు. ఇన్నున్నాయి కాబట్టే కోట్లకు కోట్లు కొల్లగొట్టారు. మాయమాటలు చెప్పి ఎందరినో బురిడీ కొట్టించారు. పాపం ఏదో ఒకరోజున పండుతుంది కాబట్టి ఆర్టీసీలోని ఆ అవినీతి బాబుల బాగోతం వెలుగులోకి వచ్చింది.  ప్రస్తుతం కటకటాల వెనక్కి చేరిన ఆ మహామాయగాళ్ల ఉచ్చులో పడి ఎంతమంది మోసపోయారో తేలాల్సి ఉంది.
ఘరానా మోసగాళ్ల ముఠా గుట్టురట్టు
ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ నిరుద్యోగులను మోసం చేసిన ఘరానా మోసగాళ్ల ముఠా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు నాయకుడు మరెవరో కాదు.. ప్రముఖ నేషనల్ మజ్దూర్ యూనియన్‌లో కీలక నేత, చాలాకాలం ఆర్టీసీ పాలకమండలిలో సభ్యునిగా ఉన్న సయ్యద్ మహమూద్‌ కావడం అంతటా చర్చనీయాంశమవుతోంది. సయ్యద్‌ మహమూద్‌ కీలక సూత్రధారిగా ఉంటూ కార్యకలాపాలు నిర్వహించిన ఈ ముఠా పలు ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. మహమూద్‌తో పాటు కోదాడకు చెందిన కొండలరావు అనే వ్యక్తి ఈ రాకెట్‌ను నడిపినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరితో పాటు నిరుద్యోగులకు వలవేసి ఆకర్షించిన మరో ఆరుగురిని.. మొత్తంగా 8 మందిని నల్లగొండ జిల్లా ఎస్పీ బుధవారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. వివిధ జిల్లాలకు చెందిన వెంకటేశ్వర్లు, శివయ్య, కె.రమేష్‌, శేఖర్‌రెడ్డి, నాగరాజు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోపాల్‌ ముఠాలో కీలక సభ్యులుగా ఉన్నారు. 
పెద్ద మొత్తంలో డబ్బు వసూలు
నల్గొండ జిల్లాతోపాటు నిజమాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతను వీరు మోసం చేస్తూ వచ్చారు. ఆర్టీసీలో ఉద్యోగాలిప్పిస్తామని చెబుతూ పెద్ద మొత్తంలో డబ్బు గుంజారు. డ్రైవర్‌, కండక్టర్, ట్రాఫిక్‌ సూపర్ వైజర్‌ జాబులు ఇప్పిస్తామని చెబుతూ వచ్చారు. 
నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు
తెలంగాణ ఆర్టీసీ కార్పోరేషన్ పేరుతో వీరు నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లను కూడా సృష్టించారు. వాటిని యువతకు అందించి తాపీగా డబ్బు గుంజేవారు. ఇలా ఒక్కొక్కరి వద్ద 3 నుంచి 5 లక్షల వరకు.. మొత్తం 2.50 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఐదు జిల్లాల్లో కలిపి మొత్తం 80 మంది యువతను వీరు మోసం చేసినట్లు ఇప్పటివరకు దొరికిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. నల్లగొండ జిల్లా పరిధిలో వివిధ స్టేషన్లలో వీరిపై 12 కేసులు నమోదై ఉన్నాయని, బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్ తెలిపారు. కేసు విచారణ జరిగే క్రమంలో ఈ ముఠా ఇంకెన్ని అక్రమాలకు పాల్పడిందనేది వెల్లడయ్యే అవకాశముంది. మొత్తమ్మీద తెలంగాణ జిల్లాల్లో వీరి బాధితులు భారీ సంఖ్యలోనే ఉండొచ్చని తెలుస్తోంది. 

 

07:49 - February 18, 2016

హైదరాబాద్ : ఏ శాఖకు ఎంత మొత్తంలో నిధులు కేటాయించాలి.? శాఖలు కోరిన మేరకు బడ్జెట్ కేటాయించడం సాధ్యమవుతుందా.? ఇలాంటి ప్రశ్నల మధ్య తెలంగాణ బడ్జెట్ తయారీలో అధికారులు తలమునకలవుతున్నారు. నిన్నమొన్నటి వరకు అధికారులను పిలిపించుకుని మంత్రులు తమ శాఖలకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయించారు. ఇప్పుడు అవే శాఖలతో సిఎం కేసిఆర్ సమీక్షలు ప్రారంభించారు. బడ్జెట్‌కు సంబంధించి పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. 
బడ్జెట్‌ మూరెడు.. ప్రతిపాదనలు బారెడు
బడ్జెట్‌ మూరెడు ప్రతిపాదనలు బారెడు అన్నట్లుంది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పరిస్థితి. త్వరలో బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో మంత్రులు అధికారులతో కలిసి సమీక్షలు జరుపుతున్నారు. తమ శాఖలకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేసి ఫైనల్ చేయమంటున్నారు. అయితే మొత్తం భారం మంత్రులపై వేయకూడదనుకున్నారో లేక తాను రంగంలోకి దిగకపోతే ప్రయోజనం ఉండదనుకున్నారో సిఎం కెసిఆర్ కూడా సమీక్షల బాట పట్టారు. 
పలు శాఖలపై సీఎం కేసీఆర్ సమీక్షలు
కేసీఆర్ బుధవారం ఆర్‌అండ్‌బి, ఆర్టీసీ, పోలీస్‌, జైళ్ల శాఖలపై సమీక్షలు జరిపారు. ప్రజా అవసరాలు, రాష్ట్ర వనరులకు అనుగుణంగా బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఒక ఏడాది కోసం కేటాయించిన నిధులు అదే ఏడాదిలో ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్ అంటే కేవలం జమ, ఖర్చు పద్దులా ఉండకుండా అభివృద్ధి పథంలో తీసుకెళ్లే దిక్సూచిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల్లో అమలవుతున్న కార్యక్రమాలు, కొనసాగించాలా మార్పులు చేయాలా అన్న దిశగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.
అసెంబ్లీ నియోజకవర్గ యూనిట్‌గా నిధులు
రాష్ట్ర యూనిట్‌లాగాక జిల్లా యూనిట్‌గా అవసరమైతే అసెంబ్లీ నియోజకవర్గ యూనిట్‌గా నిధులు కేటాయించాలని సిఎం సూచించారు. ప్రతి శాఖా తనకున్న ఆదాయ వనరులను పెంచుకోవాలని నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ఎలా వినియోగమవుతుందో శాఖల నిధులు కూడా అదే విధంగా ఖర్చయ్యే విధానం ఉండాలని సూచించారు. 

07:44 - February 18, 2016

వరంగల్ : అన్ని దారులు మేడారం వైపే.. అన్ని అడుగులు ఇద్దరమ్మలను చూసేందుకే... గిరిజనకుంభమేలా మేడారం జాతర ఆరంభమైంది. పసుపు పారాణి అద్దుకున్నట్టుగా మేలిమిపసుపు ఛాయలో సమ్మక్క, సారలమ్మల గద్దెలు దర్శనమిస్తున్నాయి. జంపన్న వాగు  జనసంద్రమైంది. మేడారానికి వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. మేడారం జన సంద్రంగా మారింది. సమ్మక్క -సారలమ్మ తల్లుల గద్దెలను దర్శించుకునేందుకు అందరూ మేడారం బాట పట్టారు. తల్లిని దర్శించుకుని మొక్కులు సమర్పించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 
జాతరకు లక్షలాది మంది 
సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో రోజూ లక్షలాది మంది జాతరకు చేరుకుంటున్నారు. మేడారం, చుట్టుపక్కల గ్రామాల పరిధిలో గుడారాలు వేసుకొని విడిది చేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తున్న లక్షల మంది భక్తులతో జంపన్నవాగు జనసంద్రంగా మారుతోంది. భక్తులు వాగునీటిలో మునకలు వేసి గద్దెల దర్శనానికి వెళుతున్నారు. స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
శివసత్తుల పూనకాలు  
పూనకాలతో శివసత్తులు ఊగిపోతున్నారు. తల్లులకు మొక్కులు చెల్లించుకుంటూ భక్తులు తలనీలాలిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎత్తు బంగారం, కొబ్బరికాయ, పసుపు కుంకుమలు, చీరెసారెలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. 
బుధవారం ఉదయమే ప్రత్యేక పూజలు 
కన్నెపల్లిలో కొలువైన సారలమ్మ ఆలయంలో బుధవారం ఉదయమే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. పూజారులు ఆలయాన్ని శుద్ధిచేసి పూజలు చేశారు. అనంతరం సారలమ్మ గద్దెను అధిరోహించారు.  సమ్మక్క భర్త పగిడిద్దరాజు, సారలమ్మ భర్త గోవిందరాజులు కూడా గద్దెలపైకి చేరుకున్నారు. 
జాతర ప్రాంగణాలు... పూల సొగబులు
సమ్మక్క సారలమ్మల జాతర ప్రాంగణాలు పూల సొగబులు అద్దుకున్నాయి.  ఎన్నడూ లేనట్టుగా సుమారు 126 రకాల పుష్పాలతో  అమ్మవారి గద్దెలను, ప్రాంగణాన్ని అలంకరించారు. రోజుకు మూడు టన్నుల పూలతో జాతర  ప్రాంగాణాన్ని అలంకరిస్తున్నారు. 
10 వేల మంది పోలీసుల మోహరింపు 
జాతరలో 10 వేల మంది పోలీసులను మోహరించారు.  అడుగడుగునా గస్తీని ఏర్పాటుచేశారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా జాతర పరిసరాల్లో  ట్రాఫిక్‌ నిబంధనలను మారుస్తున్నారు. 

 

07:39 - February 18, 2016

హైదరాబాద్ : ఏపీఎస్‌ ఆర్టీసీ గుర్తింపు యూనియన్‌కు గురువారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్‌ పూర్తైన వెంటనే ఓట్ల లెక్కింపు చేపడతారు. రాత్రి 8 గంటలకు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు  అనుంబంధంగా ఉన్న యూనియన్లు ఏపీఎస్‌ ఆర్టీసీ గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. 
ఏపీఎస్‌ ఆర్టీసీలో 58 వేల మందికి ఓటు హక్కు 
రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఏపీఎస్‌ఆర్టీసీ గుర్తింపు యూనియన్‌ ఎన్నికలను కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విధులు నిర్వహించే కార్మికులు ముందుగానే ఓటు హక్కు వినియోగించేలా ఉదయం 5 గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 12 రీజియన్లలో ఉన్న 126 డిపోల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 58 వేల మంది కార్మికులు, సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 
నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ 
ఎంప్లాయీస్‌ యూనియన్‌కు గుర్తింపు 
ఏపీఎస్‌ఆర్టీసీలో ప్రస్తుతం ఎంప్లాయీస్‌ యూనియన్‌కు గుర్తింపు ఉంది. ఈయూతోపాటు, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, కార్మిక పరిషత్‌, వైఎస్‌ఆర్‌ మజ్దూర్‌ యూనియన్‌, బహుజన వర్కర్స్‌ యూనియన్‌, వర్కర్స్‌ యూనియన్‌ పోటీ చేస్తున్నాయి. కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్ధీకరణతోపాటు, వేతన సవరణలో  43 శాతం ఫిట్‌మెంట్‌ సాధించిన ఘనత తమదేనని ఈయూ నేతలు చెబుతున్నారు.  మళ్లీ గెలిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే ఎంప్లాయూస్‌ యూనియన్‌ వాదాన్ని టీడీపీ అనుబంధ కార్మిక పరిషత్‌ నేతలు తప్పుపడుతున్నారు. ఆర్టీసీ కార్మిక కుటుంబాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని... ఫిట్‌మెంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. 
గెలిచిన యూనియన్‌కు వచ్చే నెల 4న గుర్తింపు పత్రం 
ఈసారి ప్రధానంగా  నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ మధ్యే పోటీ  ఉందని విశ్లేషిస్తున్నారు.  టీడీపీ అనుబంధ కార్మిక పరిషత్‌ కూడా గట్టి పోటీ ఇస్తోంది. గెలుపొందిన యూనియన్‌కు వచ్చే నెల 4 కార్మిక శాఖ కమిషనర్‌ గుర్తింపు పత్రం అందచేస్తారు. గుర్తింపు యూనియన్‌ ఎన్నికల్లో ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులు ఏ కార్మిక సంఘానికి పట్టం కడతారో  ఇవాళ సాయంత్రానికి తేలుతుంది.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలోని కూకట్‌పల్లి మెట్రో రైల్వే గోడౌన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫంక్షన్ హాల్‌ వద్ద కొందరు బాణాసంచా కాల్చగా నిప్పురవ్వలు జనరేటర్‌పై పడి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జనరేటర్, పవర్ కేబుల్స్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. 11 లక్షల రూపాయల విలువైన సామగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చింది. 

 

07:23 - February 18, 2016

హైదరాబాద్‌ : నగరంలోని కూకట్‌పల్లి మెట్రో రైల్వే గోడౌన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫంక్షన్ హాల్‌ వద్ద కొందరు బాణాసంచా కాల్చగా నిప్పురవ్వలు జనరేటర్‌పై పడి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జనరేటర్, పవర్ కేబుల్స్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. 11 లక్షల రూపాయల విలువైన సామగ్రి దగ్ధమైంది. అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తెచ్చింది. 

హైదరాబాద్ నాచారంలో భారీ అగ్నిప్రమాదం....

హైదరాబాద్ : నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యాట్రీనా పరుపుల కంపెనీల షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ....

చిత్తూరు : తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ తగ్గింది. వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు 2 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చే భక్తులకు ఒక గంట సమయం పడుతుంది.

Don't Miss