Activities calendar

19 February 2016

21:32 - February 19, 2016

ఢిల్లీ : బిజెపి ప్రభుత్వం ప్రమాదకరమైన ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ ఎజెండాను అమలు చేస్తోందని వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రాజ్యాంగ హక్కులపై జరుగుతున్న దాడిపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాయి. దేశంలో పెరుగుతున్న మతతత్వ దాడులు, జెఎన్‌యు ఘటనపై ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని వామపక్షాలు నిర్ణయించాయి.

జెఎన్‌యు ఉదంతంపై ....

జెఎన్‌యు ఉదంతంపై వామపక్షాలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలుసుకున్నాయి. వామపక్షాలతో పాటు ఆర్జేడి, జెడియు, ఎన్‌సిపికి చెందిన ఎంపీలు కూడా రాష్ట్రపతిని కలిశారు. జెఎన్‌యు ఘటన, దేశంలో పెరిగిపోతున్న దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. జెఎన్‌యు ఘటనను రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించిన వామపక్షాలు- రాజ్యాంగ పరిరక్షకుడైన రాష్ట్రపతి దీనిపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జెఎన్‌యు విద్యార్థినేత కన్హయ్య కుమార్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

23 నుంచి 25 వరకు దేశవ్యాప్త ఆందోళనలు ....

ఆరు వామపక్షాల పార్టీల నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. జేఎన్‌యూ వ్యవహారం, తదితర అంశాలపై చర్చించారు. జేఎన్‌యూ వ్యవహారంపై ఈనెల 23 నుంచి 25 వరకు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. వామపక్ష పార్టీలకు జాతి వ్యతిరేక ముద్ర వేసే కుట్రకు బిజెపి తెర లేపిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. వామపక్షాలపై ఆరెస్సెస్‌, బిజెపి చేస్తున్న ఆరోపణల్లోని అసత్యాల్ని బట్టబయలు చేసేందుకే దేశ వ్యాప్త ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు.

జాతీయ జెండా ఎగురవేయాలన్న కేంద్రనిర్ణయంపై...

జాతీయవాదం వ్యాప్తికి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేయాలన్న కేంద్ర నిర్ణయంపై ఏచూరి స్పందించారు. అక్కడ ఎగరవేసే జెండాలకన్నా.. ఎన్నోరెట్లు పెద్దవైన త్రివర్ణ పతకాలు మా గుండెల్లోనే ఉన్నాయన్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సేను జాతి వీరుడిగా కీర్తించేవారు-... మమ్మల్ని దేశ వ్యతిరేకులని ఎలా అంటారని ప్రశ్నించారు. దీన్ని బట్టే... ఎవరు దేశహితులో, ఎవరు దేశ ద్రోహులో స్పష్టమవుతోందని ఏచూరి వ్యాఖ్యానించారు. కోర్టులో లాయర్లు దాడులకు పాల్పడడం తానెప్పుడూ చూడలేదని ఏచూరి అన్నారు. దాడులు చేసిన వారిపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని బట్టి చూస్తే పథకం ప్రకారమే ఇదంతా జరుగుతోందని ఆయన స్పష్టం

21:28 - February 19, 2016

హైదరాబాద్ : ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మూడు కేటగిరీలుగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ప్రభుత్వం విభజించగా 6వేల 700 వేతనం ఉన్న సిబ్బందికి 12 వేలకు పెంచుతూ ఆదేశించింది. ఇక 7వేల 960 వేతనం ఉన్న సిబ్బందికి 15 వేలు, 10వేల 900 పొందుతున్న సిబ్బంది వేతనం 17 వేల 500లకు పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో మొత్తం 45 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. 

21:26 - February 19, 2016

హైదరాబాద్ : ఏపీలో రాజ‌కీయాలు రోజురోజుకీ వెడెక్కుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం బలంగా ఉన్న రెండు పార్టీలూ ఎత్తులు పైఎత్తులతో కాకను పెంచుతున్నాయి. వైఎస్సార్సీపీ ఖాళీ అవ‌బోతోందంటూ టిడిపి ప్రచారం చేస్తుంటే.. ప్రతిపక్షమూ.. పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ దీటుగానే సమాధానం ఇస్తోంది. ఇంత‌కీ ఏపీలో ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ‌రితో ట‌చ్‌లో ఉన్నారు..? ఎవరెవరు జంపింగ్‌కు సిద్దపడుతున్నారు..? వాచ్ దిస్ స్టోరీ

రసవత్తరంగా మైండ్ గేమ్....

ఏపీలో పాలక టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్య మైండ్‌గేమ్‌ రసవత్తరంగా సాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారంటూ పాలకపక్షం నేతలు ప్రచారం చేస్తున్నారు. దీనికి దీటుగా.. టీడీపీ ఎమ్మెల్యేలే తమతో టచ్‌లో ఉన్నారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి మొన్న బాంబు పేల్చారు. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

జగన్‌ మాటలతో ఉలిక్కిపడ్డ టీడీపీ...

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రకటనతో తెలుగుదేశం వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ప్రత్యర్థి పార్టీతో టచ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరన్న అంశంపై ఆరా తీయడంతో పాలకపక్షానికి మైండ్‌ బ్లాంక్‌ అయ్యే సమాచారం అందినట్లు భోగట్టా. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడ్డ బడుగు, బలహీన వర్గాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ అధినేత దృష్టి సారించినట్లు టీడీపీ నాయకులు గుర్తించారని సమాచారం. ఇలాంటి వారిని వైసీపీలోకి చేర్చుకోవడం ద్వారా టీడీపీకి షాక్‌ ఇవ్వాలన్న జగన్‌ వ్యూహం వారికి లీక్‌ అయినట్లు తెలుస్తోంది. సీఎం సొంత జిల్లా చిత్తూరులోని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలోకి చేర్చుకోవడం ద్వారా వలసలకు శ్రీకారం చుట్టాలని.. తద్వారా తద్వారా టీడీపీని తల ఎత్తుకోలేని పరిస్థితిలోకి నెట్టాలన్నది జగన్‌ వ్యూహంగా టీడీపీ నాయకులు గుర్తించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్‌ నేత.. టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో తలమునకలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల గురించి తెలియడం వల్లే.. పాలక పక్షం అప్రమత్తమైందనిభావిస్తున్నారు.

అనంతపురం తప్ప మిగిలిన సీమ జిల్లాల్లో టీడీపీ బలహీనం....

వైసీపీ ఎత్తుగడలను ముందే పసిగట్టిన టీడీపీ రాయలసీమపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఎప్పటి నుంచో అనంతపురం తప్పిస్తే.. మిగిలిన జిల్లాల్లో టీడీపీ వీక్‌గా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి, తమకు మధ్య ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేకపోవడం టీడీపీని కలవరపరుస్తోంది. అందుకే.. భవిష్యత్తులో సీమ జిల్లాల్లోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా.. ఆపరేషన్‌ ఆకర్ష్‌ను అక్కడి నుంచే ప్రయోగించాలని టీడీపీ భావిస్తోందని సమాచారం. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు వైసీపీ కీలక నేత భూమానాగిరెడ్డిని టీడీపీ గూటికి చేరుస్తున్నట్లు తెలుస్తోంది. భూమా కుమార్తె అఖిలప్రియ సహా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలూ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

లోకేశ్‌ స్థాయిలో పూర్తయిన చర్చలు...

భూమా నాగిరెడ్డి మరో ముగ్గురు ఎమ్మెల్యేల చేరికపై లోకేశ్‌ స్థాయిలో చర్చలు ముగిసినట్లు చెబుతున్నారు. శనివారం సాయంత్రం విజయవాడలో చంద్రబాబును కలిసి భూమా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఇప్పటికే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని శనివారం సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకోవాల్సిందిగా సీఎంఓ సమాచారం పంపినట్లు ప్రచారం జరుగుతోంది. భూమా బృందం చేరిక పూర్తయ్యాక కడప జిల్లాపై దృష్టి సారిస్తారని టీడీపీ వర్గాల సమాచారం.

టీడీపీ గూటికి చేరిన ఆనం బ్రదర్స్‌....

ఇప్పటికే నెల్లూరు జిల్లాలో బలమైన ఆనం బ్రదర్స్‌ టీడీపీ గూటికి చేరారు. త్వరలోనే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతల రామకృష్ణా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి చంద్రబాబు ఆశీస్సులూ లభించాయి. కొణతలతో పాటు అరకు వైసీపీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇక కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చొప్పున వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు వైసీపీ ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. ఆపార్టీ నుంచి వలస వచ్చేందుకు ఆసక్తిని కనబరిచే ఎమ్మెల్యేల గురించి టీడీపీ ఆరా తీస్తోంది.

పాత వారిని బుజ్జగించే ప్రయత్నంలో టీడీపీ....

చేరికల విషయం ఎలా ఉన్నా పార్టీకి ఎప్పటినుంచో కష్టపడి పనిచేస్తున్న వారిని వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదు. అందుకే కొత్తవారిని ఆహ్వానించే సమయంలో పార్టీ కోసం పనిచేస్తున్న వారిని ఏదో ఒక పదవితో బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. పాతవారు.. కొత్తవారితో కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచిస్తున్నారు. వచ్చే నెలలో జరిగే బడ్జెట్‌ సమావేశాలకు ముందే పార్టీలోకి భారీగా చేరికలను ప్రోత్సహించాలని.. తద్వారా వైసీపీ వ్యూహానికి చెక్‌ పెట్టాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. అటు వైసీపీ కదలికలు కూడా టీడీపీలో డేంజర్‌ బెల్స్‌ను మోగిస్తున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న ఆపరేషన్‌ ఆకర్ష్‌ అస్త్ర ప్రయోగంలో ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి. 

21:22 - February 19, 2016

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న జగన్‌ వ్యాఖ్యలతో ఉలిక్కిపడ్డ పాలకపక్షం ఎత్తుకు పైఎత్తుకు స్కెచ్ సిద్ధం చేసింది. ఓవైపు జగన్‌తో టచ్‌లో ఉన్న నేతలపై ఆరా తీస్తునే... మరోవైపు కర్నూలు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలపై దృష్టి సారించింది. వైసీపీలో సీనియర్‌ నేత.. భూమా నాగిరెడ్డి.. అనుచరులతో సమావేశమై.. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమంటూ సంకేతాలిచ్చారు. రేపు ఆయన విజయవాడలో సీఎంను కలవనున్నారు.

వైసీపీకి భూమా నాగిరెడ్డి షాక్...

వైఎస్సార్‌సీపీకి గుడ్‌బై చెప్పి సైకిల్‌ ఎక్కేందుకు వైసిపి ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, ఆయన కుమార్తె ఎమ్మెల్యే అఖిలప్రియ సిద్ధమయ్యారు. భూమాతో పాటు మరో ఎమ్మెల్యే ఐజయ్య కూడా పార్టీ వీడనున్నారు. దీనిపై ఇప్పటికే భూమానాగిరెడ్డి కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన పీఏసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నారు. పార్టీ మారిన తరువాత భూమా కూతురు ఎమ్మెల్యే అఖిలప్రియకు మంత్రివర్గంలో స్థానం దక్కొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. భూమా నాగిరెడ్డి.. రేపు చంద్రబాబుతో భేటీ కానున్నారు.

టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమైన భూమా

ఆంధ్రప్రదేశ్‌ విపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఝలక్ ఇచ్చారు. వైసీపీని విడిచి టీడీపీ తీర్దం పుచ్చుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. జిల్లా వైసీపీలో కీలక నేతగా ఉన్న భూమానాగిరెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు అంటీ అంటనట్లుగా ఉంటున్నారు. మూడు రోజుల క్రితం వైఎస్ జగన్ జిల్లాకు వచ్చినప్పుడు కూడా భూమా కలవలేదు. ఈ క్రమంలోనే భూమా నాగిరెడ్డి నంద్యాలలోని తన ఇంట్లో అందుబాటులో ఉన్న అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నట్లు భూమా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

టీడీపీలో మంత్రి పదవి ఆఫర్ ?...

టీడీపీలో మంత్రి పదవి ఆఫర్ రావడం వల్లే భూమా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కూతురు ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు భూమా అఖిలప్రియ, మరికొందరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం తీర్దం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారు. భూమా వైసీపీని వీడుతున్నారనే ప్రచారం జరగడంతో వైఎస్ఆర్ పార్టీలో కలవరం నెలకొంది.

1996లో నంద్యాల పార్లమెంట్ ఉపఎన్నిక ద్వారా రాజకీయ అరంగ్రేటం

1996లో టీడీపీ అభ్యర్థిగా నంద్యాల పార్లమెంట్ ఉపఎన్నిక ద్వారా రాజకీయ ఆరంగ్రేటం చేశారు భూమా నాగిరెడ్డి. 1998, 1999 నంద్యాల పార్లమెంట్ స్దానానికి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత సినీనటుడు చిరంజీవి స్దాపించిన ప్రజారాజ్యంలో వెళ్లారు భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి శోభానాగిరెడ్డి. ఈ క్రమంలోనే భూమా దంపతులిద్దరూ పీఆర్పీని వీడి వైసీపీ గూటికి చేరారు. సతీమణి శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందినా...2014 ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించారు భూమా. జిల్లాలో 11 ఎమ్మెల్యేలు వైసీపీ దక్కడంలో ఆయన విశేషంగా కృషి చేశారు.

వైఎస్ జగన్‌తో కొంతకాలంగా విభేదాలు ...

అధికార తెలుగుదేశం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వైసీపీని గాడీలో పెట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మధ్య తలెత్తిన కొన్ని కారణాల వల్ల అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. భూమా నాగిరెడ్డి పార్టీ మారే సమాచారం తనకు తెలియదని ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. తాను మాత్రం వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

శనివారం చంద్రబాబుతో సమావేశం?

మొత్తానికి నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సొంతగూటికి వెళ్లేందుకు తీసుకున్న నిర్ణయం జిల్లాలో సంచలనం రేపుతోంది. శనివారం చంద్రబాబుతో సమావేశం కానున్న భూమా...ఆ వెంటనే పీఏసీ ఛైర్మన్‌ పదవికి కూడా రాజీనామా చేస్తారని తెలుస్తోంది. తన కూతురు అఖిలప్రియకు మంత్రివర్గంలో స్థానమిస్తారన్న హామి అధికార పార్టీ నుంచి వచ్చినట్టు సమాచారం. రేపో మాపో భూమా టీడీపీ అధినేత సమక్షంలో పసుపు కండువా కప్పుకునేందుకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది. భూమా బాటలోనే మరో వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య కూడా ఉన్నట్టు సమాచారం.

జీఎస్టీ బిల్లు ద్వారా రాష్ట్రాల హక్కులు హరించొద్దు: ఈటెల

హైదరాబాద్ : జీఎస్టీ బిల్లు ద్వారా రాష్ట్రాల హక్కులు హరించవద్దని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో జీఎస్టీ బిల్లుపై ఎంపవర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ బిల్లు వల్ల నష్టపోయే రాష్ట్రాలను ఆదుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారని అన్నారు. ఎఫ్ఆర్బీఎం పెంపు, జీఎస్టీ బకాయిల చెల్లింపుపై కేంద్రాన్ని కోరామని ఆయన చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లోగా జీఎస్టీ బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ఆయన, వచ్చే కేబినెట్ భేటీలో ఎఫ్ఆర్బీఎం పెంపు గురించి చర్చిస్తామని అన్నారని ఆయన వెల్లడించారు.

ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి కి అస్వస్థత

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ రోజు శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతుండడంతో సికింద్రాబాద్ లో ఉన్న కిమ్స్ ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

20:45 - February 19, 2016

హైదరాబాద్ : ఎక్సర్ సైజుతో రాటు తేలిన ఒళ్లు...నల్ల కోటు, కళ్లకు గగూల్స్... చురుగ్గా మూమెంట్స్, చక చకా జనాల్ని పక్కకు నెట్టేసుకుంటూ అలవోకగా దూసుకెళతారు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా తమ బాస్ ని కాపాడుకుంటారు. చీమ కూడా దగ్గరకు రాకుండా కాపలా కాస్తారు.. వారే బాడీగార్డ్స్. ఇపుడు ఓ సెలబ్రెటీ అడుగుదీసి అడుగు వేయాలంటే బాడీ గార్డ్స్ ఉండాల్సిందే. కోట్ల రూపాయల వ్యాపారంగా మారిన సెలబ్రెటీల సెక్యూరిటీ మాంచి ఊపందుకుంటుంది. ఛాలెంజింగ్ గా మారిని సెలబ్రెటీల సెక్యూరిటీ పై నేటి వైడాగింల్ లో విశ్లేషణ చేశారు. మరి ఆ విశ్లేషణను మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

రాష్ట్రపతిని కలిసిన లెఫ్ట్ నేతలు

ఢిల్లీ : రాష్ట్రపతిని వామపక్ష నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. రాజ్యాంగ హక్కులపై బిజెపి, ఆర్ ఎస్ ఎస్ చేస్తున్న దాడులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా స్పందించాలని రాష్ట్రపతిని కోరినట్లు పేర్కొన్నారు. మా ఫిర్యాదు పై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని తెలిపారు. యూనివర్శిటీల్లో బిజెపి రాజకీయాలు చేస్తోందని, గాంధీని చంపిన గాడ్సేను బిజెపి హీరో అంటోందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న మేము దేశద్రోహులమా అని ప్రశ్నించారు.

అరుణా చల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

హైదరాబాద్ : అరుణా చల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. రాత్రి 9 గంటలకు అరుణా చల్ సీఎంగా కలిఖో ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతూ ఉత్తర్వులు

హైదరాబాద్ : తెలంగాణ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజించి ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వివరాల ప్రకారం రూ. 6,700 వేతనం ఉన్న సిబ్బందికి రూ. 12వేలకు, రూ. 7,960 వేతనం వున్న వారికి రూ. 15వేలకు, రూ.10,900 వేతనం ఉన్న సిబ్బందికి రూ.17,500 లకు పెంచుతున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. పెరిగిన వేతనాలు జనవరి 1 నుండి అమలు కానున్నాయి.

రోహ్ తక్ లో కర్ఫ్యూ విధింపు

హర్యానా : రోహ్ తక్ లో కర్ఫ్యూ విధింపు విధించారు. జాట్ ల రిజర్వేసన్ల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో హార్యానాలోని 9 నగరాల్లో భారీగా అదనపు బలగాలు మోమరించాయి

20:16 - February 19, 2016

హైదరాబాద్ : మూడు రోజుల దీక్షకు కూర్చున్న వికలాంగులు... మద్దతిచ్చి మంచి చెడ్డలు అరుసుకున్న ఆర్.కృష్ణయ్య, కస్తూర్బా హాస్టల్ లో బొడబొడ కక్కిన ఆడపిల్లలు.. దావఖానాలో వేసి సూదులిచ్చి పరీక్షలు..డ్యూటీలో ఉండి మందు కొట్టిన పోలీసోళ్లు..పద్మవీర చక్ర అవార్డు ఇచ్చి సత్కరించాలని టాక్, పారా, గడ్డపారతో పాఠాలు నేర్పుతున్న పంతుళ్లు...ద్రోణాచారుడిని మించిన గొప్ప గురువు., కూకట్ పల్లిలో కుమిలి పోతున్నభ్రమరాంబ.. మనసు నిండా రంది పెట్టుకున్న మల్లన్న, పుస్తె కట్టే ఏలకు పెళ్లిళ్లు ఆపిన పోలీసోళ్లు...కన్నీరు పెట్టిన పిల్ల తల్లిదండ్రులు..ఇ త్యాది అంశాలపై 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న చెప్పిన ఘరం .. ఘరం మాటలు వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

20:01 - February 19, 2016

హైదరాబాద్ : హర్యానాలో రిజర్వేషన్లు కోరుతూ జాట్ వర్గం ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఆందోళనకారులు ఢిల్లీ-అంబాలా రైల్వే ట్రాక్‌ను స్తంభింపజేశారు. పలుచోట్ల వాహనాలను నిలిపివేసి రోడ్డుపై బైఠాయిచారు. రోహతక్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు 9 మంది గాయపడ్డారు. రోహతక్‌లో గురువారం ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, ఓ బైక్‌ను తగలబెట్టడం లాంటి ఘటనలకు పాల్పడడంతో ప్రభుత్వం పారమిలటరీ దళాలలను రంగంలోకి దింపింది. 144 సెక్షన్‌ విధించిన హర్యానా ప్రభుత్వం- జజ్జర్‌, రోహతక్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. రోహతక్‌ జజ్జర్‌ నుంచి సోనీపట్, భివాని, హిసార్, ఫతేహబాద్, జీంద్‌ జిల్లాలకు ఉద్యమం పాకింది. విద్యార్థులు, మహిళలుతో పాటు న్యాయవాదులు కూడా రిజర్వేషన్ల ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కావాలని జాట్లు డిమాండ్‌ చేస్తున్నారు. జాట్‌ వర్గం డిమాండ్లపై చర్చించేందుకు ఖట్టర్‌ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం జరపాలని నిర్ణయించింది.

19:59 - February 19, 2016

హైదరాబాద్ : బీజేపీ అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయాల్లో వాతావరణం చెడిపోయిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. కన్హయ్య కుమార్‌పై దేశ ద్రోహం కేసు పెట్టడాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తోందన్నారు. పటియాలా కోర్టు ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఉత్తమ్ తెలిపారు. 

19:57 - February 19, 2016

ఢిల్లీ : జెఎన్‌యు ఘటనలో తన కుమారుడు ఉమర్‌ ఖలీద్‌ను టార్గెట్‌ చేస్తున్నారని తండ్రి కాశీం రసూల్‌ ఇలియాస్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడు ఉమర్‌ ఖలీద్‌ ముస్లిం కావడం వల్లే టార్గెట్‌ చేశారన్నారు. తన కుమారుడి పేరు మీడియాలో రావడంపై రసూల్‌ ఆవేదన చెందారు. జెఎన్‌యు ఘటనలో ఉమర్‌ ఖలీద్‌పై కేసు నమోదు కావడంతో పరారీలో ఉన్నాడు. తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని, కోర్టులోనే దాడి జరుగుతుంటే ఎలా లొంగిపోతారని ప్రశ్నించారు. ఖలీద్‌కు ఏం జరగదని హోంమంత్రి హామీ ఇస్తే మరుసటి రోజే లొంగిపోతారని రసూల్‌ చెప్పారు. తన కుమారుడు ఎలాంటి దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఉమర్‌ ఖలీద్‌ తండ్రి కాశీం రసూల్‌ 30 ఏళ్ల క్రితం సిమి సభ్యుడిగా పనిచేశారు. సిమి సంస్థను ప్రభుత్వం బ్యాన్‌ చేయగానే తాను ఆ సంస్థను వదిలేశానని తెలిపారు. అప్పటికింకా తనకు కొడుకు కూడా పుట్టలేదన్నారు.

19:54 - February 19, 2016

వ‌రంగ‌ల్ : ఆత్మకూర్ మండలం అగ్రంప‌హ‌డ్ మిని మేడారంకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మిని మేడారంగా పేరుగాంచిన అగ్రంప‌హ‌డ్ జాత‌ర‌కు భ‌క్తులు వందలాదిగా తరలివచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఎడ్లబండ్లలో భ‌క్తులు అమ్మవారి సన్నిదికి చేరుకున్నారు. గ‌ద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను ద‌ర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. మేడారం వెళ్లలేకపోయినందుకు ఈ మిని మేడారంకు వెళ్తున్నామని వివ‌రించారు భక్తులు. 

ఫారెస్ట్‌ రేంజర్‌ రామేశ్వర్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడి

మహబూబ్‌నగర్‌: అచ్చంపేటలో ఫారెస్ట్‌ రేంజర్‌ రామేశ్వర్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. ఫారెస్ట్‌ అతిథిగృహం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముందే రామేశ్వర్‌పై దాడి చేశారు.

18:43 - February 19, 2016

హైదరాబాద్ : ఒకప్పటి రతనాల సీమ. నేడు కరువు, కాటకాలతో, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోంది. దశాబ్దాలుగా ప్రభుత్వాల చేత దగాపడ్డ రాయలసీమ అభివృద్ధి గొంతుకను వినిపించేందుకు, సీమ కష్టాలు ఏకరువు పెట్టేందుకు వామపక్షాలు నడుంబిగించాయి. సీమలో పీడిత ప్రజలకు అండగా ఉంటామంటూ భరోసా కల్పిస్తున్నాయి. సీమ సమస్యలు హస్తినకు వినిపించేలా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాయి.

ఎక్కడ చూసినా కరువు పరిస్థితులే..

ఎక్కడ చూసినా కరువు పరిస్థితులే..వందల అడుగులు తవ్వినా చుక్క నీరు పడని దుర్భర పరిస్థితులు..ఏళ్లకు ఏళ్లు నిర్మాణం పూర్తవకుండా సాగే ప్రాజెక్టులు.. రోజంతా కష్టపడ్డా పట్టెడన్నం తినలేని దయనీయ పరిస్థితులు.. ఇవన్నీ రాయలసీమ ప్రజల కష్టాలను ప్రతిబింబించే దృశ్యాలు. దశాబ్దాల తరబడి రాయలసీమ జిల్లాలు అభివృద్ధి నోచుకోకుండా ఇలా కాలం గడుపుతూ వచ్చాయి.

సీఎంల్లో ఎక్కువ మంది రాయలసీమవారే...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది ఈ రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. అయితే మాత్రం ఏం లాభం. లక్షలాది మంది అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య కాలం గడుపుతున్నారు. ఇటువంటి గడ్డు కాలంలో పీడిత ప్రజల పక్షాన పోరాడేందుకు సిపిఎం నడుం బిగించింది. పేదల గొంతుకగా మారి నిత్యం వారి సమస్యలపట్ల పోరాటం చేస్తున్న సిపిఎం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య మత్తు తొలగించేందుకు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

విభజనకు ముందు తర్వాత కూడా అన్యాయమే...

రాయలసీమకు రాష్ట్ర విభజనకు ముందు తర్వాత కూడా అన్యాయం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తిరుపతి మెడికల్ కళాశాలలో సీమ ప్రాంతాలనికి 85శాతం సీట్లు రావాల్సి ఉండగా సిఎం 125జీవో జారీ చేసి 19సీట్లు కూడా రాకుండా అడ్డుపడి రాయలసీమకు తీరని ద్రోహం జరిగింది. ఇక సీమకు వరప్రధాయినిగా ఉన్న హంద్రీనీవా, గాలేరునగరి ప్రాజెక్టులకు అవసరమైన నిధులు కేటాయింపు జరగలేదు. సీమలో పంటలసాగుకు క్రిష్ణాజలాలను తీసుకువస్తానని సిఎం ఇచ్చిన హామీ కూడా నోచుకోలేదు.

గత ప్రభుత్వం లేపాక్షిహబ్ ఏర్పాటు పేరుతో...

ఇదిలాఉంటే కేంద్రం రాయితీలు ప్రకటిస్తేనే సీమలో పరిశ్రమలు, వివిధసంస్థల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గత ప్రభుత్వం లేపాక్షిహబ్ ఏర్పాటు పేరుతో సేకరించిన రైతుల భూములు తిరిగి ఇచ్చేయాలని, లేదా పరిశ్రమలు స్థాపించి భాధితులకు నష్టపరిహారం చెల్లించాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

20 వ తేదీన తిరుపతిలో బస్సు యాత్ర ప్రారంభం...

తరాలుగా పట్టిపీడిస్తున్న సమస్యలపై సీమ ప్రజల తరపున ప్రభుత్వాలకు తమ వాణి వినిపించేందుకు సిపిఐతో కలిసి సిపిఎం బస్సు యాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. 20వ తేదీన తిరుపతిలో యాత్ర ప్రారంభమై మార్చి 5 వరకు సీమలోని నాలుగు జిల్లాల్లో కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో సిపిఎం, సిపిఐ నేతలు పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ఈ బస్సు యాత్ర 23వ తేదీన కడప జిల్లాలోకి ప్రవేశిస్తుంది. 26న కడపలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 27, 28, 29, మార్చి 1న అనంతపురం జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. మార్చి 2 నుంచి 5 వరకు కర్నూలు జిల్లాలో బస్‌ యాత్ర నిర్వహిస్తారు

మార్చి 11న చలో అసెంబ్లీ కార్యక్రమం...

ఇదే స్ఫూర్తితో మార్చి 11న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్ట్‌ల పూర్తి, కడపలో ఉక్కు కర్మాగారం తదితర హామీలు ఏమయ్యాయో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఆయా హామీలు ఎందుకు ముందుకు సాగడం లేదో వివరించనున్నారు. తిరుపతిలో ప్రారంభమయ్యే ఈ బస్సుయాత్రకు సిపిఎం జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్ హాజరుకానున్నారు. ఆయనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ నేత నారాయణ పాల్గొంటారు. 

పాక్ అదుపులో భారత మత్స్యకారులు..

అహ్మదాబాద్ : పాకిస్తాన్ మేరిటైం సెక్యూరిటీ ఏజెన్సీ 40మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. గుజరాత్ తీరప్రాంతంలోని జఖావ్ పోర్టుకు సమీపంలో మత్స్యకారులను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఏడు బోట్లను స్వాధీనం చేసుకున్నట్టు నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరమ్ వెల్లడించింది.

నోటా ఆప్షన్ చేరుస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ను చేరుస్తూ టి. సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

18:23 - February 19, 2016

కర్నూలు : ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి వైసీపీని వీడుతున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. ఆయన కర్నూల్లో 'టెన్ టివి'తో మాట్లాడుతూ.. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా జిల్లాలో ఏ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. మరో వైపు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె భూమా అఖిల ప్రియ పార్టీ మారుతున్న సమాచారం తెలియదని పేర్కొన్నారు. అయినా భూమా పిఏసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారని... ఆయనకు పార్టీ మారాల్సి అవసరం లేదని పేర్కొన్నారు. అయితే భూమా, ఆయన కుమార్తె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని తెలిపారు.

కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న వామపక్ష నేతలు

ఢిల్లీ : కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వామపక్ష నేతలు కలవనున్నారు. దేశంలో పెరుగుతున్న దాడులపై జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని వామపక్ష నేతలు కోరనున్నట్లు సమాచారం.

17:49 - February 19, 2016

వరంగల్‌ : మడికొండలోని ఐటీ సెజ్‌లో ఇన్ఫోటెక్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వరంగల్‌లో నూతనంగా నిర్మించిన ఐటీ ఇంక్యుబేటర్‌ టవర్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే రాజయ్య, సయేంట్‌ సంస్థ చైర్మన్‌ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌..వరంగల్‌ నగరాన్ని ఐటీ రంగంలో రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. 

17:47 - February 19, 2016

నల్గొండ: ఓ యువకుడు ప్రేమపెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. నల్గొండ జిల్లా చిలుకూరు గ్రామానికి చెందిన మండన లక్ష్మీ అనే యువతి నారాయణపురంకు చెందిన తిప్పన వినోద్‌ ఇద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకుంటానని నమ్మించి లక్ష్మీని లోబర్చుకున్న వినోద్‌ ఆ తర్వాత మొహం చాటేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మీ... ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో లక్ష్మీ తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. లక్ష్మీని పెళ్లిచేసుకోకుండా మోసం చేసిన వినోద్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..వినోద్ కోసం గాలిస్తున్నారు. 

17:45 - February 19, 2016

నిజామాబాద్ : జిల్లాలోని డిచ్‌పల్లి మండలంలో అనాధ పిల్లల ఆశ్రమ పాఠశాలను ప్రారంభించారు ఎంపీ కవిత. ఆశ్రమ ప్రాంగణంలో మొక్కను నాటిన కవిత...పిల్లలను ఆప్యాయంగా పలకరించి వారితో సరదాగా గడిపారు. అన్ని వేళలా వారికి తోడుగా ఉంటామని,వారికి ప్రభుత్వమే తల్లిదండ్రులుగా సేవలు అందిస్తుందని చెప్పారు. తెలంగాణా రాష్ట్రంలో అనాధ పిల్లలు అనకుండా వారిని తెలంగాణా బిడ్డలు అని పిలవాలని కోరారు. అనాధ పిల్లలకు కూడా విద్య,వైద్యం అందించడానికి రాష్ట్రంలో మొట్టమొదటి అనాధ ఆశ్రమ పాఠశాలను నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ప్రారంభించడం, కెసిఆర్ ఆశయాలను అందరికీ చేరేందుకు జిల్లా కలెక్టర్,ప్రజా ప్రతినిధులు కృషిచేయడం అభినందనీయన్నారు కవిత.

17:43 - February 19, 2016

హైదరాబాద్ : తెలంగాణలో టీడీపీ- బీజేపీ హ‌నీమూన్‌ ముగిసిన‌ట్టేనా, గ్రేట‌ర్ ఫ‌లితాల త‌రువాత బీజేపీ స్వరంలో మార్పు వ‌చ్చిందా? జిల్లా కార్యవ‌ర్గాల తీర్మాణాలను చూస్తే అవుననిపిస్తోంది. అంత‌గా బ‌లం, బ‌లగం లేక‌పోయినా బీజేపీ ఎందుకు ఒంట‌రిగా పోటీ చేయాల‌నుకుంటోంది. దీనికి టీడీపీ ఏం చెబుతోంది. అస‌లు ఇద్దరు మిత్రుల మ‌ధ్య ఈ గ్యాప్‌కు ఎందుకు వచ్చింది.?

స్వతంత్రంగా నిల‌దొక్కుకోవాల‌నుకుంటున్న బీజేపీ..

తెలంగాణ‌లో టీడీపీ- బీజేపీ మైత్రి క్రమంగా బ‌ల‌హీన‌ప‌డుతోంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌రువాత స్వతంత్రంగా నిల‌దొక్కుకోవాల‌నుకుంటున్న బీజేపీ.. టీడీపీని కాద‌ని ముందుకు వెళ్ళాల‌నుకుంటోంది. రానున్న వ‌రంగ‌ల్లు, ఖ‌మ్మం కార్పొరేష‌న్ ఎన్నికల్లోనూ, అటు సిద్దిపేట, అచ్చంపేట మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ఒంటరిగా బ‌రిలోకి దిగాల‌ని బీజేపీ జిల్లా కార్యవర్గాలు తీర్మానించాయి. మరోవైపు బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీటీడీపీ నేత‌లు ఈ విష‌యాన్ని అధినేత చంద్రబ‌ాబు దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో ఈ వ్యవ‌హ‌రంపై సొంతంగా నిర్ణయానికి రావ‌ద్దని.. బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వంతో చ‌ర్చించాలిని సూచించారు. ఈ ఎన్నిక‌ల్లో విడివిడిగా పోటీచేసినా 2019లో క‌లిసి పోటీ చేయాల్సి ఉంటుంద‌ని దీని ప్రభావం ఆ ఎన్నిక‌ల‌పైనా ప‌డుతుంద‌ని చంద్రబాబు అన్నట్టు తెలుస్తోంది. ప్రజ‌లు కూట‌మి ప‌ట్ల విశ్వాసం ఉండే విధంగా మిత్రులు వ్యవ‌హ‌రిచాలేకానీ దాన్ని దెబ్బతీయ‌కూడ‌ద‌ని చంద్రబాబు టీటీడీపీ నేత‌ల‌కు సూచించారు. అయితే టీడీపీ నేత‌లు మాత్రం ఈ వ్యవ‌హ‌రాన్ని సామ‌ర‌స్యంగానే ప‌రిష్కరించుకుంటామంటున్నారు.

బీజేపీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న టిడిపి...

ఇదిలా ఉంటే బీజేపీ స్థానిక నాయ‌క‌త్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ జీర్ణించుకోలేక పోతోంది. మార్చిలోనే కార్పొరేష‌న్‌, మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు ఉంటాయ‌ని వ‌స్తున్నవార్తల నేప‌థ్యంలో ఈ ప్రకట‌న టీటీడీపీకి ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉంటే అటు టీఆర్ఎస్‌ త‌రపున స్వయంగా ముఖ్యమంత్రే ఖ‌మ్మంలో ప‌ర్యటించి వరాల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ అక్కడి ఎన్నిక‌లకు స‌మాయ‌త్తం అవుతోంది. ఈ త‌రుణంలో టీడీపీ బీజేపీల మ‌ధ్య పొర‌పొచ్చాలు రావ‌డం వారికి ఇబ్బందిగా మారుతోంది. అయితే టీడీపీ నేత‌లు మాత్రం పొత్తు విష‌యంలో ఇబ్బందులు లేవంటున్నారు. ఇద్దరం క‌ల‌సి పోటీ చేసి కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్‌ ఎన్నిక‌ల్లో స‌త్తా నిరూపిస్తామంటున్నారు. తెలంగాణలో వ‌రుస ఓట‌ముల‌తో కుదేల‌వుతున్న టీడీపీ బీజేపీల మ‌ధ్య విభేదాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ స‌మ‌స్యను రాష్ట్రస్థాయిలో చ‌ర్చించి ప‌రిష్కరించుకుంటామని నేతలు చెబుతున్నారు. 

కోట్ల కు క్షమాపణలు చెప్పిన దిగ్విజయ్

విజయవాడ :ఇటీవల అనంతపురం జిల్లాలోని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభలో జరిగిన అవమానంపై కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ క్షమాపణ చెప్పారు. దీంతో ఆయన చల్లబడ్డారు. శుక్రవారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభమైంది. దిగ్విజయ్‌ సింగ్‌ దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, నాదేండ్ల మనోహర్‌, దేవినేని నెహ్రూ, కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు.

16:53 - February 19, 2016

హైదరాబాద్ : ప్రైవేటు స్కూళ్లలో విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలని హైదరాబాద్‌ స్కూల్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ విషయంలో ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నియమ నిబంధనలు లేకుండా ఇష్టారీతిగా స్కూలు ఫీజులను యాజమాన్యం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు స్కూలు ఫీజుల విషయంలో ప్రభుత్వం నియమించిన కమిటీ రిపోర్ట్‌ను వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాహక్కు చట్టంలోని ఏ ఒక్క నిబంధనను స్కూలు యాజమాన్యాలు పాటించడంలేదని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి జీవోఎంఎస్‌ 91,1, ,42లను అమలు చేయాలని పేరెంట్స్‌ కమిటీ డిమాండ్ చేసింది.

 

16:52 - February 19, 2016

వరంగల్: మేడారం జాతరను సందర్శించేందుకు వీఐపీలు క్యూ కడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసుధానాచారితో పాటు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించకున్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తొలి జాతర కావడంతో ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసిందని స్పీకర్‌ మధుసూధనాచారి తెలిపారు. 

16:50 - February 19, 2016

విజయవాడ: ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ ప్రతిపక్ష నేత జగన్‌ ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు ఐదేళ్లు పరిపాలించమని చంద్రబాబుకు అధికారం కట్టబెడితే..ప్రభుత్వాన్ని పడగొడతామంటూ జగన్‌ చేసే వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్దమన్నారు. 

16:48 - February 19, 2016

విజయవాడ : వైసిపి ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నానిలపై చర్యలు తీసుకోవాలని బుద్ద ప్రసాద్‌ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన ఘటనలపై కమిటీ ఇవాళ మరోసారి భేటీ అయింది. సమావేశాల్లో శృతిమించి మాట్లాడిన అధికార, విపక్ష సభ్యులను హెచ్చరికలతో వదిలేయాలని కమిటీ సూచించింది. ఈ నివేదికను మొదట ఎథిక్స్‌ కమిటీకి, ఆ తర్వాత ప్రివిలేజ్‌ కమిటీలకు అందచేయనుంది. కమిటీ సూచనల ప్రకారం అసెంబ్లీ స్పీకర్‌ చర్యలు తీసుకోనున్నారు. అయితే బుద్దప్రసాద్‌ కమిటీ నివేదిక అంతా తప్పుల తడక అని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. 

16:46 - February 19, 2016

రంగారెడ్డి : జిల్లా కలెక్టరేట్ దగ్గర జనం బారులు తీరారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను దరఖాస్తు చేసుకోడానికి వచ్చిన ప్రజలకు ఇక్కట్లు తప్పడంలేదు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన పేద ప్రజలను వ్యాపారస్తులు దోచుకుంటున్నారు. దరాకస్తు ఫారం కోసం, ఫారం ను నింపడానికి డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

హర్యానా లో జాట్ కులస్తుల ఆందోళన : ఒకరి మృతి

హర్యానా : రోహ్ తక్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రిజర్వేషన్ల కోసం జాట్ కులస్తులు ఉద్యమం చేపట్టారు. అందులో భాగంగా మంత్రి అభిమన్యు ఇంటి ముట్టడికి జాట్ నేతలు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందిన ట్లు సమాచారం.

16:17 - February 19, 2016

ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకుడి పని దర్శకుడు..నిర్మాత పని నిర్మాత చేయాలి...లొకేషన్లు, అక్కౌంట్స్, ఆర్టిస్టుల కోఆర్టినేషన్, ప్రొడక్షన్.. ఇలాంటి పనులు చేయాల్సిన నిర్మాత...కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వ శాఖల్లో అనవసర జోక్యం చేసుకుంటే...కాస్తో కూస్తే బెటర్ గా రావాల్సిన సినిమా అట్టర్ ఫ్లాప్ గా తయారవుతాయి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి...

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథ...

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథ, ఎన్ఆర్ఐ క్యారెక్టర్, కొంత కామెడీ టచ్...ఈ లైన్ తో కృష్ణాష్టమి సినిమాను తెరకెక్కికించాడు దర్శకుడు వాసువర్మ. కథలోకి వెళ్తే...రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు చేసే ఓ ఫ్యామిలీ అంటే అక్కడి జనాలకు హడలు. కళ్లముందే నేరాలు జరుగుతున్నా...ఎవరూ నోరెత్తరు. సాక్ష్యం కోసం చూస్తున్న పోలీసులకు సునీల్ భయం లేకుండా హంతకులను చూపిస్తాడు. సాక్ష్యం చెప్పిన సునీల్ ను చంపేందుకు ఆ హంతకులు వేట మొదలుపెడతారు. ఇదంతా చిన్నప్పటి స్టోరీ. రౌడీల బారి నుంచి కొడుకును తప్పించేందుకు బాల్యంలోనే అతన్ని అమెరికా పంపిస్తాడు సునీల్ బాబాయ్. పెద్దయ్యాక ఇండియా రాకుండా ఆపుతుంటాడు. ఐతే...సొంతూరును, ఇంట్లో వాళ్లను చూడాలనే కోరికతో బాబాయ్ కి చెప్పకుండా ఇండియా వస్తాడు సునీల్. నాటకీయంగా తాను చంపుదామని వెతుకుతున్న రౌడీ ఇంటికే చేరుతాడు. ఇక అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది క్లైమాక్స్...

హీరోకు సరిపోయే కథతో సినిమా చేయాలి గానీ.....

హీరోకు సరిపోయే కథతో సినిమా చేయాలి గానీ...అప్పటికే నలుగురు హీరోలకు చెప్పిన కథను...సునీల్ రెడీగా ఉన్నాడని అతనితో తీస్తే ఇలాగే ఉంటుంది సినిమా. వాస్తవానికి కృష్ణాష్టమి ఓ స్టైలిష్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాల్సిన సినిమా. సునీల్ ను హీరోగా పెట్టడంతో స్టైలిష్ అన్నదే లేకుండా పోయింది. ఇక యాక్షన్ సన్నివేశాలు ఉన్నా...మనోడి కామెడీ ఫేస్ కు అస్సలు సరిపోలేదు. కథలో అవకాశమున్న కామెడీని హీరోయిజం కోసం నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా కృష్ణాష్టమి ఎందుకు కొరగాని సినిమా అయ్యింది. బాగా ఉబ్బిపోయి పేషంట్ లా ఉన్నాడు సునీల్. సినిమాకు పెద్ద మైనస్ గా మారాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ టీవీ సీరియల్ లా ఉన్నాయి. ఖర్చు తగ్గించడం కోసం కొన్ని సీన్స్ విదేశాల్లో తీయకుండా గ్రాఫిక్స్ చేశారు. సునీల్ హీరో అని లైట్ తీసుకున్నారేమో నిర్మాతలు. ఇక పరమ రొటీన్ కామెడీ సినిమాకు మరో మైనస్ గా మారింది. ఆర్టిస్టులకు చెప్పించిన డబ్బింగ్ మొదలు...హీరోయిన్స్ నిక్కీ గల్రానీ, డింపుల్ చొపాడే ఓవరాక్షన్, కార్టూన్ క్యారెక్టర్లలా నటించే ముఖేష్ రుషి, అషుతోష్ రానా...సినిమా డ్యామేజీలో పార్ట్ అయ్యారు. డింపుల్ చొపాడే తో అసభ్యకరమైన సీన్స్ చేయించారు. ఈ సీన్స్ ఫ్యామిలీ ఆడియోన్స్ చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి....

బాగోలేని ట్యూన్స్.....

సంగీత దర్శకుడు దినేష్ ట్యూన్స్ ఒక్కటీ బాగా లేదు. ఇలాంటి సినిమాకు కనీసం పాటలన్నా బాగుండాలి. దర్శకుడిగా వాసు వర్మ మరోసారి తేలిపోయాడు. హీరోతో సహా ప్రధాన పాత్రలేవీ సహజంగా అనిపించవు. ఏదో సినిమా కోసం ప్రవర్తించినట్లు ఉంటాయి. కథను, కథనాన్ని ఆసక్తి కరంగా చెప్పకుండా...సాగదీశాడు. ఇంటర్వెల్ తర్వాత స్టోరీ పూర్తిగా అర్థమైపోతుంది. ఇక క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను ఎలా థియేటర్లో కూర్చోబెట్టాలో ఈ మేకర్స్ కు అర్థం కాలేదు. దాంతో అప్పుడెప్పుడో అమెరికాలో మర్చిపోయిన పోసాని క్యారెక్టర్ ను అల్లుడిగా దించారు. ఇలా కలగాపులగం స్క్రీన్ ప్లేతో క్లైమాక్స్ కు చేరుకుంటుంది కృష్ణాష్టమి. సునీల్ సినిమాల్లో కాస్త కామెడీ ఐనా చూడొచ్చు అనుకునే ఆడియెన్స్ ఈ సినిమాపై అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు....

ఫ్లస్ పాయింట్స్

ఏమీ లేవు

మైనస్ పాయింట్స్

సునీల్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

పాత కథ, బోరింగ్ స్క్రీన్ ప్లే

దర్శకత్వం

రొటీన్ కామెడీ సీన్స్

సంగీతం

ఐటీ ఇంక్యుబేషన్ టవర్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

వరంగల్ : జిల్లాలోని మడికొండలో ఐటీ ఇంక్యుబేషన్ టవర్లను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, అధికారులు ఉన్నారు. ఈ టవర్లను వరంగల్, హైదరాబాద్ 163వ జాతీయ రహదారిపై మడికొండ సెజ్‌లో రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ సెజ్‌లోనే ఐదెకరాల్లో సీయెంట్ కంపెనీ స్థాపిస్తున్నారు.

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెలంగాణ సీఎస్ లేఖ

హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రీషీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ లేఖ రాశారు. శాసనసభ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం స్థానాలు పెంచాలని వినతి చేశారు.

పాలకొండపల్లిలో తల్లీ కొడుకు మృతదేహాల వెలికితీత

కడప: భర్త చేతిలో దారుణ హత్యకు గురైన భార్య, కుమారుడి మృతదేహాలను పాలకొండల్లో పోలీసులు వెలికితీశారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం భర్త ప్రవీణ్ తన భార్య, కొడుకుకు బిర్యానీలో విషం కలిపి హత్య చేశాడు. ఆపై వారి మృతదేహాలను పాలకొండల్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే.

ఢిల్లీ హైకోర్టులో కన్హయ్య బెయిల్ పిటిషన్ దాఖలు

ఢిల్లీ : దేశద్రోహం కేసులో అరెస్టైన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఉదయం సుప్రీంకోర్టు అతని బెయిలు పిటిషన్ తిరస్కరించడం, హైకోర్టుకు వెళ్లాలని సూచించిన నేపథ్యంలో కన్నయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కోర్టు ప్రాంగణం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

15:40 - February 19, 2016

ఢిల్లీ : వామపక్ష పార్టీలకు జాతి వ్యతిరేక ముద్ర వేసే కుట్రకు బిజెపి తెర లేపిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాజ్యాంగ హక్కులు కాపాడాలని కోరుతూ ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని వామపక్షాలు నిర్ణయించినట్టు ఏచూరి చెప్పారు. ఢిల్లీలో జరిగిన 6 వామపక్ష పార్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిజెపి ప్రభుత్వం ప్రమాదకరమైన ఆర్‌ఎస్‌ఎస్‌ మతతత్వ ఎజెండాను అమలు చేస్తోందని వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో పెరుగుతున్న దాడులపై వామపక్షాలు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయనున్నాయి. వామపక్షాలతో పాటు ఆర్జేడి, జెడియు, ఎన్‌సిపికి చెందిన ఎంపీలు కూడా పాల్గోనున్నారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయనున్నట్టు ఏచూరి పేర్కొన్నారు.

15:39 - February 19, 2016

హైదరాబాద్ : కరువు మండలాల ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ సర్కారు కరువు మండలాల ప్రకటనలో తీవ్ర జాప్యం చేసిందని, ఇప్పుడు నిధుల విడుదలలోనూ జాప్యం చేస్తోందని జీవన్‌రెడ్డి విమర్శించారు. 

15:36 - February 19, 2016

విజయవాడ : రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయానికి పునాది రాయిపడటంతో ఉద్యోగుల్లో మరోసారి వాడివేడి చర్చలు ప్రారంభమయ్యాయి. తమ రాజధానికి తరలివెళ్లడం తమ బాధ్యత అంటూనే.. సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. ఈ విషయం పై సాధ్యమైనంతవరకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మన పాలన మన ప్రాంతం.. అనే నినాదంతో ...

మన పాలన మన ప్రాంతం.. అనే నినాదంతో తాత్కాలిక సచివాలయానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసి విజయవాడకు తరలిరావాలని పిలుపునివ్వడంపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వరాష్ర్ట పాలనలో తాము సైతం పాలు పంచుకుంటాం అంటూనే అక్కడకు వస్తే సదుపాయాల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు.

మల్కాపురం - మందడి గ్రామాల మద్య సెక్రటేరియట్ .....

మల్కాపురం - మందడి గ్రామాల మధ్య వెలగపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో 196 సర్వే నెంబర్ నుంచి 216 సర్వే నెంబర్ల లోని భూముల్లో తాత్కాలిక సచివాలయ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయిచింది. మొత్తం 45 ఎకరాల భూమిలో 28.4 ఎకరాల్లో భవన నిర్మాణాలు, 17 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. 197 సర్వే నెంబరు భూమిలో సీఎం శంకుస్థాపన చేశారు. సుమారు 5 వేల మంది ఉద్యోగులు ,అధికారులు పనిచేసే సామర్థ్యంతో నిర్మిస్తోంది ప్రభుత్వం. ఈ శంకుస్థాపన తరుణంలో బాబు ప్రజలకు ఇంటి అద్దెలు పెంచవద్దని విజ్ఞప్తి కూడా చేశారు. అయినా ప్రజలు అద్దెలను అమాంతం పెంచేశారు.

హైదరాబాద్ కు 20, 25 ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడ్డాం.....

ఏపీ తాత్కాలిక సచివాలయానికి పునాది పడడంతో ఉద్యోగ వర్గాల్లో కదలిక మొదలైంది. ఒక వైపు నాలుగు నెలల్లో పరిపాలన భవనం అందుబాటులోకి వస్తుందన్న ప్రభుత్వ ప్రకటన ఒకింత సంతోషంగా ఉన్నా .. మొదట్నుంచి తమ సమస్యలు పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై ఆందోళనతో ఉన్నారు. హైదరాబాద్ కు 20, 25 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడే బతుకుతున్నామని .. ఇప్పుడు రాజధానికి వెళ్లడానికి మేం సిద్దంగా ఉన్నామని కాని తమ పిల్లల భవిష్యత్ కు సంబంధించి స్థానికత అంశంపై క్లారిటీ ఇవ్వాలని అంటున్నారు. హైదరాబాద్ లో ఇస్తున్న 30శాతం హెచ్ ఆర్ ఏ ఇవ్వాలని కోరుతున్నారు. ఇంటి అద్దెలవిషయంలో కూడా రాజధాని ప్రాంత ప్రజలు తమకు సహకరించాలని కోరుతున్నారు.

ఉద్యోగ సంఘాలతో చర్చించాలని మంత్రులకు బాబు ఆదేశాలు...

పాలనలో కీలక పాత్ర పోషించే ఉద్యోగుల్లో భయాందోళనను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.తాత్కాలిక సెక్రటేరియట్ అయినా శాశ్వత కట్టడంగా నిర్మితమవుతున్న సచివాలయ ప్రణాళికపై ఉద్యోగ సంఘాలతో చర్చించాలని సీఎం మంత్రులను ఆదేశించారు. ఈనెల 25 ,26 న మంత్రులు యనమల, నారాయణలు ఉద్యోగులతో భేటీ అయ్యేందుకు సిద్దమైనట్లు సమాచారం. తాత్కాలిక సెక్రటేరియట్లో ఉద్యోగులు కొలువుదీరేందుకు సమస్యలు , శాఖల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఏఏ శాఖలు ఎక్కడుండాలన్న దానిపై హెచ్ ఓ డీలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉందనేది సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి తాత్కాలికరాజధాని మొదలు కాకముందే .. ఉద్యోగులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఇటు తాత్కాలిక సెక్రటేరియట్ సమస్యలతోనే తలమునకలౌతున్న ప్రభుత్వానికి.. ఉద్యోగుల సమస్యలు అదనపు తలనొప్పిగా మారుతున్నాయి.    

15:33 - February 19, 2016

హైదరాబాద్ : సేఫ్ తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు స్కెచ్ వేస్తోంది. ప్రధానంగా మార్చి ఒకటో తేదీ నుంచి హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయనుంది. స్పీడ్ నియంత్రణకూ ప్రణాళికలను సిద్ధం చేసింది తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం. ఏ మాత్రం గీసిన గీత దాటినా వాత పెట్టేందుకు కూడా వెనుకాడనంటోంది సర్కార్‌.

ప్రత్యేకదినాల్లో పెరుగుతోన్న ప్రమాదాల సంఖ్య ....

రహదారులు రక్తమోడని రోజు లేదు. ప్రత్యేకదినాల్లో అయితే ప్రమాదాల సంఖ్య మరింత పెరుగుతోంది. వీటిని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే హైపర్‌ కమిటీ సమావేశం నిర్వహించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అన్ని శాఖలను సమన్వయం చేస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా 82 లక్షల వాహనాలు......

తెలంగాణ వ్యాప్తంగా 82 లక్షల వాహనాలు ఉన్నాయి. ఎక్కువ ప్రమాదాలు ద్విచక్రవాహనాలు, లారీల వల్ల జరుగుతున్నాయి. ప్రధానంగా మద్యం తాగి వాహనాలు నడపటం, మితిమీరిన వేగం, హెల్మెట్‌ ధరించకపోవడం, సీట్ బెల్టులు లేకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలంగాణాలో ఏడాదికి సరాసరి ఎనిమిది వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. 30 వేల మంది క్షతగాత్రులవుతుండగా 20 వేల కేసులు నమోదవుతున్నాయి.

మార్చి 1 నుంచి హెల్మెట్‌ తప్పనిసరి.....

రోడ్డు ప్రమాదాలను నివారించి తెలంగాణాను సేఫ్‌ తెలంగాణాగా మార్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. యుద్ధప్రాతిపదికన మార్చి 1 నుంచి హెల్మెట్లు, సీట్ బెల్టులు తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాతో పాటు వాహనాలను సీజ్ చేయాలని యోచిస్తోంది. కార్లకు నల్లటి అద్దాలను తొలగించిన తీరుగానే ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించనుంది. జాతీయరహదారులపై ఉన్న మద్యం దుకాణాల నిర్వహణా తీరుపై కూడా దృష్టి సారించనున్నారు అధికారులు. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలను జరక్కుండా కఠిన వైఖరి అవలంభించడంతో పాటు జాతీయ రహదారులపై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ఎక్కువ సంఖ్యలో చేపట్టాలని డిసైడ్‌ అయింది.

శాఖలను సమన్వయంతో...

ఈ ప్రణాళికను అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేసేందుకు పోలీస్, ఆర్‌అండ్‌బి, ఎక్సైజ్‌, మెడికల్, రవాణా, విద్యాశాఖ, కమర్షియల్ ట్యాక్స్‌ వంటి శాఖలను సమన్వయం చేస్తోంది. అయితే గతుకుల రోడ్లు, అశాస్ర్తీయమైన ట్రాఫిక్‌ సిగ్నల్స్ వల్ల ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. 

15:19 - February 19, 2016

కృష్ణా - గుంటూరు : విజయవాడ దుర్గగుడి ఫైఓవర్ నిర్మాణంతో కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులకు తిప్పలు తప్పటం లేదు... ట్రాఫిక్ డైవర్షన్‌తో గమ్యస్థానం చేరుకునేందుకు గంటల సమయం పడుతుండటంతో రెండు జిల్లాల వాసులు నదీ ప్రయాణం వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో లాంచీ ప్రయాణానికి డిమాండ్ పెరిగింది.

కృష్ణానదిని లాంచీ ద్వారా దాటేందుకు మొగ్గు...

విజయవాడ దుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టడంతో, నదికి అటు ఇటు ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళాల్సిన ప్రయాణికులకు ట్రాఫిక్ మళ్ళింపు చికాకుగా మారింది. గంటల తరబడి ప్రయాణంతో విసుగుచెందాల్సిన పరిస్ధితి. వీటిని తప్పించుకునేందుకు చాలామంది కృష్ణానదిని లాంచీ ద్వారా దాటేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి గుంటూరు, రాయపూడి, మంగళగిరికి వేళ్లే వారంతా లాంచీ ద్వారా రాయపూడికి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

అవతల ఒడ్డునే రాజధాని...

కృష్ణానది అవతల ఒడ్డునే రాజధాని ఉండటంతో ఇబ్రహీంపట్నం నుంచి ప్రయాణికుల సంఖ్య అధికమైంది. గతంలో లాంచీ నిండటానికి ఎక్కువ సమయం పట్టేది. లాంచీ ఎక్కడం కంటే చుట్టూ తిరిగి వెళ్లడమే మేలు అని వాహనదారులు భావించేవారు. కానీ ఇప్పుడు దుర్గగుడి వద్ద ప్లైవోవర్‌ నిర్మిస్తుండటంతో పరిస్థితి మారింది. అటునుంచి ప్రయాణం ఆలస్యం అవుతుండటంతో లాంచీ ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు.

అమరావతి ,చెవిటికల్లు మధ్య రెండు లాంచీ సర్వీసులు....

గుంటూరు జిల్లా అమరావతి , కృష్ణా జిల్లా చెవిటికల్లు మధ్య రెండు లాంచీ సర్వీసులు గతంలో నడిపేవారు. అయితే అమరావతి వద్ద నదిలో నీరు లేకపోవటంతో లాంచీలను తిప్పటం కష్టంగా మారింది. ప్రస్తుతం ఫెర్రీ, రాయపూడిల మధ్య ఒకే లాంచీ నడుస్తుంది. ఒకప్పుడు 100 మందితో ప్రయాణించిన లాంచీలో ఇపుడు 400 మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఓవర్ లోడ్ కూడా అవుతోంది.

తమ ద్విచక్రవాహనాలను సైతం లాంచీలోనే దాటిస్తున్నారు. రాజధాని రావాలంటే రోడ్డు మార్గం 35 కిలోమీటర్లు అవుతుంది. అదే లాంచీలోనైతే రెండున్నర కిలోమీటర్లలో రాజధానికి చేరుకోవచ్చు. ఒకే లాంచీ కావటంతో కొంత ఇబ్బందికరంగా ఉందని, మరో లాంచీని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందంటున్నారు ప్రయాణికులు.

లాంచీ ప్రయాణానికి డిమాండ్ పెరగటంతో....

లాంచీ ప్రయాణానికి డిమాండ్ పెరగటంతో ఈ ఏడాది లాంచీ పాట ద్వారా ప్రభుత్వానికి మంచి అదాయం సమకూరింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే లాంచీ వేలం పాటలో గతంలో 10లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేది కాదు. కాని ఈ సారి రూ.35 లక్షలకు వెళ్లింది. అమరావతి రాజధాని కావటంతో ఇంత డిమాండ్‌ పెరిగిందన్న వాదన వినిపిస్తుంది. దీనికి తోడు దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణంతో లాంచీ నిర్వాహకుడికి కాసుల పంట ఖాయంగా కనిపిస్తోంది. నాలుగు చక్రాల వాహనాలు వెళ్లేవిధంగా బల్లకట్టు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు, ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

రైలుకింద పడి దంపతుల ఆత్మహత్య

రంగారెడ్డి : జిల్లాలోని నవాబ్‌పేట మండలం చిట్టిగడ్డ రైల్వేస్టేషన్ వద్ద విషాదం నెలకొంది. దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. దంపతుల మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వైసీపీని వీడనున్న భూమా, ఆయన కుమార్తె !

విజయవాడ: కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ తెలుగుదేశంలో చేరబోతున్నట్లు సమాచారం. వీరిలో ఒకరికి మంత్రిపదవి వస్తుందని కూడా తెలుస్తోంది. టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల కిందట వ్యాఖ్యలు చేయగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ, తమతో వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, సంప్రదింపులు కూడా జరుపుతున్నారని అన్నారు. ఇలా ప్రకటన చేసిన రెండో రోజే వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనుండటం గమనార్హం.

ఏపీ సచివాలయంలో సూట్ కేస్ కలకలం

హైదరాబాద్ : ఏపీ సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో సూట్‌కేస్ కలకలం సృష్టిస్తుంది. ఆరో అంతస్తులో ఉన్న ఎల్ బ్లాక్ వద్దకు బాంబ్, డాగ్ స్కాడ్ చేరుకుని తనిఖీలు చేపట్టింది. సూట్‌కేసును భద్రతా సిబ్బంది పరిశీలిస్తుంది. దీంతో ఉద్యోగులు ఎల్ బ్లాక్‌ను ఖాళీ చేశారు.

15:04 - February 19, 2016

28 నుండి బీబీనగర్ నిమ్స్ లో ఓపి సేవలు

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీబీ నగర్‌ నిమ్స్ ఆస్పత్రి ప్రారంభానికి మహూర్తం ఖరారైంది.. మరో వారంరోజుల్లో ఓపీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.. అటు హైదరాబాద్‌ శివార్లలో మరో మూడు పెద్దాస్పత్రుల నిర్మాణంకోసం ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు..

హైదరాబాద్ :తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్య సేవల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది టిఎస్ సర్కారు... బీబీ నగర్‌ ఆస్పత్రిలో ఈ నెల 28నుంచి ఓపి సేవలు ప్రారంభించబోతోంది.. ఈ ఆస్పత్రిలో 350 పడకలతోపాటు.. వైద్య పరికరాలు సిద్ధంగా ఉన్నాయి.. ఈ సౌకర్యాలతో ముందు ఓపీ విభాగాన్ని నడిపించాలని భావిస్తోంది.. ఆ తర్వాత మిగతా సేవల్నికూడా అందుబాటులోకి తేవాలని చూస్తోంది.. మరో రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికావొచ్చని అంచనావేస్తోంది.. ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది...

నగరానికి మూడువైపులా కొత్త ఆస్పత్రుల నిర్మాణం.....

తెలంగాణవ్యాప్తంగా రోగులకు ఎలాంటి సీరియస్‌ కండిషన్‌ ఎదురైనా స్థానికంగా వైద్యం అందించే పరిస్థితి లేదు.. దీంతో అన్ని జిల్లానుంచి హైదరాబాద్‌ ఆస్పత్రులకు వచ్చే పేషంట్ల సంఖ్య మరింత పెరిగిపోతోంది.. పెద్దసంఖ్యలో వస్తున్న రోగులు, వారి బంధువులతో గాంధీ, ఉస్మానియా లాంటి ఆస్పత్రులు నిండిపోతున్నాయి... ఆస్పత్రిలో బెడ్‌లు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది.. ఈ సమస్యపై దృష్టిపెట్టిన ప్రభుత్వం... నగరానికి మూడువైపులా కొత్త ఆస్పత్రుల నిర్మిస్తామని ప్రకటించింది.. పనిలోపనిగా నిమ్స్‌ ఆస్పత్రినికూడా ఉపయోగించుకోవాలని తీర్మానించింది..

చాంద్రాయణగుట్ట, ఎల్‌బినగర్‌, మియాపూర్‌లో స్థల పరిశీలన.....

కొత్తగా నిర్మించబోయే ఆస్పత్రులకోసం చాంద్రాయణగుట్ట, ఎల్‌బినగర్‌, మియాపూర్‌లో స్థలంకోసం చూస్తున్నారు అధికారులు.. స్థల సేకరణ పూర్తయితే వంద కోట్ల రూపాయలతో 500 పడకల ఆస్పత్రి నిర్మాణానికి సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. ఇలా మూడు ప్రాంతాల్లో దవాఖానాలు రాబోతున్నాయి.. ఈ ఆస్పత్రులకుతోడుగా జిల్లాల్లో కూడా కార్పొరేట్‌ స్థాయి దవాఖానాలు నిర్మిస్తామని సర్కారు ప్రకటించింది.. బీబీ నగర్‌ నిమ్స్‌కు వైఎస్‌ హయాంలో శంకుస్థాపన జరిగింది.. పనులు పూర్తయినా సేవలు మాత్రం మొదలుకాలేదు.. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగిణించిన ప్రభుత్వం... వెంటనే ఓపీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అయింది..

15:01 - February 19, 2016

విజయవాడ : భూమానాగిరెడ్డి, ఆయన కుమార్తె ఎమ్మెల్యే అఖిలప్రియ వైసీపీని వీడే యోచనలో ఉన్నారు. వీరు టీడీపీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై భూమానాగిరెడ్డి సాయంత్రం కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 

15:00 - February 19, 2016

తిరుమల : ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రతీచిత్రం షూటింగ్ ప్రారంభానికి ముందు శ్రీవారిని దర్శించుకుంటానని, ఈ నెల 22న జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పారు. చిత్రానికి సంబంధించి స్ర్కిప్ట్‌ను స్వామి వారి పాదాల ముందు ఉంచి పూజలు నిర్వహించినట్టు చెప్పారు.

14:57 - February 19, 2016

తిరుమల : రాష్ట్రంలో ప్రస్తుతం కాగ్రెస్ పరిస్థితి భాదాకరంగా ఉన్నా...నిస్సహాయంగా మాత్రం లేదన్నారు మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి. పార్టీ ఉనికి కాపాడడానికి లక్షలాదిమంది కార్యకర్తలు అండగా ఉన్నారని చెప్పారు. ఇవాళ ఉదయం ఆమె వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెరుగుట విరుగుట రాజకీయంలో సహజమేనని, భవిష్యత్‌లో ప్రజల ఆశీర్వాదం, వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పరిపాలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖ రైల్వే జోన్‌ను కేంద్రం ప్రకటించాలి : సీపీఎం

విశాఖ : రైల్వే జోన్‌ను విశాఖకు కేంద్రం ప్రకటించాలంటూ సీపీఎం ఆందోళనకు దిగింది. వాల్తేర్‌ రైల్వే డివిజనల్‌ ఆఫీస్‌ ముందు సీపీఎం కార్యక్తలు నిరసనకు దిగారు. రైల్వే బడ్జెట్‌లో విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నర్సింగరావు డిమాండ్‌ చేశారు. రోడ్డు, విమాన, రైలు మార్గాలకు విశాఖ అనుకూలంగా ఉంటుందని.. దీన్ని జోన్‌గా మార్చాలన్నారు.  

14:55 - February 19, 2016

కృష్ణా : విజయవాడలోని ఎల్వీ ప్రసాద్‌ హాస్పిటల్‌లో వరల్డ్ క్లాస్‌ ఐ ఇన్స్‌స్టిట్యూట్‌లను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఐ బ్యాంకింగ్ ఇన్‌స్టిట్యూట్, తేజ్‌ కోహ్లీ ఐ బ్యాంక్, ఐ కేర్ ఎడ్యుకేషన్‌ విభాగాలను లాంఛ్‌ చేశారు. ఈ సంస్థ స్థాపనకు విలువైన భూమినిచ్చిన కోడె సత్యనారాయణ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల నుంచి తిరిగివచ్చి స్వదేశంలో మళ్లీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న జీఎన్‌ రావుకు అభినందనలు తెలిపారు. అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు, వెంకయ్య అన్నారు.

14:53 - February 19, 2016

కర్నూలు : నంద్యాలలో విషాదం చోటుచేసుకుంది. హరిజనపేటలో గుడిసె కాలి ఓ బాలిక సజీవదహనమైంది. ఇంట్లో నిద్రిస్తుండగా.. విద్యుత్‌ షాక్‌తో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇంట్లోని వారంతా బయటకు పరుగులు తీశారు.. బాలికను మాత్రం గమనించలేదు. దీంతో ఆమె గుడిసెలోనే సజీవదహనమైంది.

14:51 - February 19, 2016

హైదరాబాద్ : వృథా అనుకున్న న్యూస్ పేపర్ ను ఉపయోగిస్తూ అందమైన వస్తువులను తయారు చేయొచ్చంటున్నారు మన గెస్ట్. ఆ వస్తువులేంటో, ఎలా తయారు చేయాలో ఇవాళ్టి 'సొగసు' అపర్ణ అందమైన వస్తువులను ఎలా తయారుచేయాలో చూపించారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:49 - February 19, 2016

వరంగల్ : మేడారంలో పోలీసులు ఓవర్‌యాక్షన్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న సీనియర్ జర్నలిస్ట్‌ పాశం యాదగిరిపై చేయిచేసుకున్న పోలీసులు నేడు క్యూలైన్ల వద్ద భక్తులను కొట్టారు.

14:47 - February 19, 2016

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసులో ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల అరెస్టులో జాప్యం చేయడమే కాకుండా వారికి అండగా ఉందని మండిపడింది. ఏడాది తరువాత అరెస్టులేంటని ప్రశ్నించింది. అయితే ప్రస్తుతం ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులు విలువైనవి కావని రవిప్రసాద్ కమిటీ హైకోర్టుకు నివేదిక ఇచ్చింది.

14:45 - February 19, 2016

హైదరాబాద్ : మహిళలు పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టటం అంటే అవమానంగా భావించే స్థితిలోనే ఇప్పటికీ మనం ఉన్నాం. అలాంటి స్థితికి మహారాష్ట్ర మహిళలు అతీతం అంటున్నాయి గణాంకాలు.

ఆడపిల్లల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు ....

హర్యానా రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం విభిన్న రీతులలో మహిళలను గౌరవించే పద్ధతులకు శ్రీకారం చుట్టారు.

స్త్రీ, పురుషుల సమానత్వంవైపు...

సమాజం స్త్రీ, పురుషుల సమానత్వంవైపు అడుగులేస్తుందని తేలుస్తోంది ఒక నివేదిక. అలాగే వివాహం విషయంలో అబ్బాయిల దృక్కోణంలో మార్పు కన్పిస్తోందంటోంది అదే అధ్యయనం.

బాల నేరస్థుల చట్టాలను అమలుచేయటంలో...

బాల నేరస్థుల చట్టాలను అమలుచేయటంలో రాష్ట్రాలు చూపుతున్న వైఖరిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తాము సూచించిన మార్గదర్శకాలను అమలుచేసేందుకు గడువు విధించింది.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న ఓల్గా...

ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి ఓల్గా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. మహిళల సమస్యలను, వారి పట్ల సమాజంలో వేళ్ళూనుకున్న వివక్షను, వారి ఆవేదనను తన రచనలలో ప్రతిబించించే ప్రత్యేకత ఆమె సొంతం.

మహిళా ఉపాధ్యాయురాలు అరుదైన ఘనత...

భారత మహిళా ఉపాధ్యాయురాలు అరుదైన ఘనత సాధించింది. నిత్యం అనేక సమస్యలతో సతమతమయ్యే ప్రదేశంలో టీచర్ గా పనిచేస్తూ ఎంతో మంది బాలికల జీవితాలలో అక్షర వెలుగులు నింపుతున్న ఆమెకు ఈ ఘనత లభించింది.

14:43 - February 19, 2016

హైదరాబాద్ : ఆడపిల్లలకు రక్షణ కరువైన ప్రస్తుత నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆత్మరక్షణా పద్ధతులపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. అలా సింపుల్ టెక్నిక్స్ తో ఆకతాయిల ఆటకట్టించే ఆత్మరక్షణా పద్ధతులేంటో ఇవాళ్టి నిర్భయలో తెలియజేశారు... వాటిని మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

14:34 - February 19, 2016

తూర్పుగోదావరి : జిల్లా తుని ఘటనలో కాపులపై పెట్టిన కేసులు అన్యాయమైనవని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఏపీ డీజీపీ రాముడుకు లేఖ రాశారు. సభ నిర్వహించింది తాను మాత్రమేనని ఉద్యమంలో తమ కులస్తులకు ఎలాంటి సంబంధంలేదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలు కావాలంటే తాను ఇస్తానని ముద్రగడ స్పష్టం చేశారు. లేఖ ప్రతిని సీఎం చంద్రబాబుకు కూడా పంపించారు. 

కాపులపై అక్రమ కేసుపెట్టడం సరికాదు : ముద్రగడ

తూ.గో: ఏపీ డీజీపీ రాముడుకు కాపు నేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం లేఖ రాశారు. తుని సభకు హాజరైన నేతలపై కేసులు సరికాదని లేఖలో పేర్కొన్నారు. సభ వరకు పూర్తి బాధ్యత తనదే అని తెలిపారు. అమాయకులపై కేసులు ఉండబోవన్న ప్రభుత్వ హామీని పోలీసులు అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం లేఖలో కోరారు.

అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ తీరుపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలను సీఐడీని కోర్టు అడిగింది. అగ్రిగోల్డ్‌కు చెందిన 22 ఖాతాల్లో రూ. 6 లక్షలు ఉన్నట్లు కోర్టుకు సీఐడీ తెలిపింది. రూ. 10 వేల కోట్లకు పైగా డిపాజిట్లలో రూ. 6 లక్షలే ఉన్నాయా అని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రెండేళ్లుగా అగ్రిగోల్డ్ ఖాతాల సొమ్ము మళ్లించినట్లు తెలుసుకోలేకపోయారు అని కోర్టు పేర్కొంది.  ఖాతాల నుంచి డ్రా చేసింది.. ఎటు మళ్లించింది తెలుసుకోలేకపోవడం దారుణమంది. కేవలం అరెస్టులతో బాధితులకు న్యాయం జరుగుతుందా అని కోర్టు ప్రశ్నించింది.

గాంధీ ఆసుపత్రిలో గవర్నర్ ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణ సహా పలు వార్డులు అపరిశుభ్రంగా ఉన్నాయని అధికారులపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సల్మాఖాన్ కు సుప్రీం నోటీసులు..

న్యూఢిల్లీ : హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ఖాన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సల్మాన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. సల్మాన్ నిర్దోషిత్వాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌కు విధించిన ఐదేళ్ల శిక్షను బాంబే హైకోర్టు రద్దు చేసిన విషయం విదితమే. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది.

13:55 - February 19, 2016

హైదరాబాద్ : దుబాయి వెళ్లే కార్మికులు దళారుల బారినపడి మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తరపున కామ్‌ కామ్‌ అనే కంపెనీని స్థాపించామని దీని ద్వారా దుబాయికి కూలీలను పంపుతామన్నారు. ఈ విధానంలో ఎలాంటి మోసం ఉండదన్నారు. ఈ మేరకు ఎంవోయూ కుదుర్చుకోవాడానికి నాయిని నేతృత్వంలో అధికారుల బృందం దుబాయి వెళ్లింది. నాలుగు రోజుల పాటు ఈ బృందం దుబాయిలో పర్యటించనుంది. 

13:52 - February 19, 2016

కడప : ఆరు గాలం కష్టపడ్డా అప్పులు తీరక రైతులు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు.. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట ఎగువపల్లెలో జయరామయ్యకు 40 సెంట్ల భూమి ఉంది.. మరికొంత భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.. ఈ సాగుకోసం దాదాపు 7లక్షల రూపాయలు అప్పు చేశాడు.. పంట పండక ఆర్థికంగా చితికిపోయాడు.. బతుకుతెరువుకోసం భార్యను కువైట్ పంపాడు.. ఆమె పంపిన డబ్బు వడ్డీలకే సరిపోలేదు... అప్పులిచ్చినవాళ్ల ఒత్తిడి పెరగడంతో మనస్తాపం చెందాడు.. పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. 

బుద్ధ ప్రసాద్ కమిటీ సమావేశం..

హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ కార్యాలయంలో మండలి బుద్ధ ప్రసాద్ కమిటీ సమావేశమైంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల ఘటనలు, రోజా సస్పెన్షన్ పై కమిటీ తుది నివేదిక తయారు చేసి స్పీకర్ కు అందచేయనుంది. 

డబుల్ బెడ్ రం ఇళ్ల దరకాస్తుల కోసం బారులు తీరిన జనాలు..

రంగారెడ్డి : డబుల్ బెడ్ రూం ఇళ్ల దరఖాస్తుల కోసం కలెక్టరేట్ వద్ద జనాలు బారులు తీరారు. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దరఖాస్తు నింపడానికి దళారులు రూ. 30 వసూలు చేస్తున్నారు. ఒక కాపీ జిరాక్స్ కు రూ. 10 దండుకుంటున్నారు.

తెలంగాణ పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్..

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో 332 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కమ్యూనిసకేషన్ విభాగంలో ఖాళీల భర్తీకి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈనెల 25వ తేదీ నుండి మార్చి 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

13:48 - February 19, 2016

విశాఖపట్టణం : భద్రత పేరిట కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివిధ రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా విశాఖపట్టణంలో రాజ్ నాథ్ సింగ్ సమావేశాలు నిర్వహించారు. ఈ పర్యటన వెనుక పెద్ద కుట్ర ఉందని సీపీఎం పేర్కొంటోంది. ఈ సందర్భంగా సీపీఎం నేత నర్సింగరావు టెన్ టివితో మాట్లాడారు. విశాఖపట్టణం పర్యటన వెనుక పెద్ద కుట్ర ఉందని, ఏజెన్సీలోని బాక్సైట్ ను దక్కించుకొనే కుట్ర జరుగుతోందన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు, సంఘాలు వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. దీనితో ఈ ప్రాంతంలో పారామిలటరీ సైన్యాన్ని దింపడానికి వ్యూహరచన చేశారని విమర్శించారు. ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో అలాంటి పరిస్థితి జరిగిందని, ప్రస్తుతం మైనింగ్ మొత్తం మాఫియా హస్తాల్లోకి వెళ్లిపోయిందన్నారు. 

13:45 - February 19, 2016

కర్నాటక : రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఐరన్ లోడ్ లారీ టాటా ఏస్ ను ఢీకొనడంతో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన చిత్రదుర్గ సమీపంలోని మందనాయకలహల్లిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి భారీ ఐరన్ లోడ్ తో బయలుదేరింది. మందనాయకలహల్లి వద్దకు చేరుకోగానే లారీని డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. ముందట వస్తున్న టాటాఎస్ పైకి లారీ దూసుకెళ్లింది. ఇసుప రాడ్లు దూసుకెళ్లడంతో 13 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ఒక మహిళ కూడా ఉంది. లారీని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితితోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మృతదేహాలతో ఈ ప్రాంతమంతా బీభత్సంగా తయారైంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 

13:41 - February 19, 2016

హైదరాబాద్ : జేఎన్ యూ నేత కన్హయ్యను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆందోళన చేపట్టింది. శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం జరిగింది. కన్హయ్యను విడుదల చేయాలని, కేసులు ఎత్తివేయాలని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఈ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అసలైన దేశద్రోహి బీజేపీయేనని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వర్సిటీల్లో రాజకీయ జోక్యం తగదని, యూనివర్సిటీలో మతోన్మాదాన్నీ బిజేపీ పెంచి పోషిస్తోందని చాడ తెలిపారు. 

సీపీఎం కేంద్ర కార్యాలయంలో వామపక్ష నేతల భేటీ..

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంలో వామపక్ష నేతలు భేటీ అయ్యారు. జేఎన్ యూ ఘటన, వామపక్షాలపై జరుగుతున్న దాడులు, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనపై చర్చిస్తున్నారు. సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ, సీపీఐ(ఎం)-ఎల్, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్యూసీఐ అగ్రనేతలు హాజరయ్యారు. 

సీపీఐ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి..

హైదరాబాద్ : సీపీఐ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం జరిగింది. కన్హయ్యను విడుదల చేయాలని, కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అసలైన దేశద్రోహి బీజేపీయేనని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వర్సిటీల్లో రాజకీయ జోక్యం తగదని పేర్కొన్నారు. 

క్షీణిస్తున్న హార్ధిక్ పటేల్ ఆరోగ్యం..

అలహాబాద్ : పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. మూడు రోజులుగా జైల్లో పటేల్ నిరాహార దీక్ష చేపట్టారు. దేశద్రోహం కేసులో హార్ధిక్ పటేల్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

లక్ష్మీ కాల్వ ఆధునీకరణ పనులకు హరీష్ శంకుస్థాప...

నిజామాబాద్ : బాల్కొండ మండలం వేంపల్లిలో లక్ష్మీ కాల్వ ఆధునీకరణ పనులకు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. రూ.1.70 కోట్లతో లక్ష్మీ కాల్వ ఆధునీకరణ పనులు జరగనున్నాయి.

 

'ప్రైవేటు స్కూళ్లో ఫీజుల నియంత్రణకు చర్యలు'

హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ పేర్కొంది. ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థలు 5 శాతం కంటే ఎక్కువ లాభాలు పొందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ పేర్కొంది. విద్యాచట్టాలను ప్రైవేటు స్కూల్స్ పాటించడం లేదని, ఫీజులపై ప్రభుత్వ నివేదిక బహిర్గతం చేయాలని, 91, 1, 42 జీవోలను అమలు పరచాలని డిమాండ్ చేసింది. 

ఆర్ అండ్ బి బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి తుమ్మల సమీక్ష..

హైదరాబాద్ : ఆర్ అండ్ బి బడ్జెట్ పై ప్రతిపాదనలపై మంత్రి తుమ్మల అధికారులతో సమావేశమయ్యారు. 

భార్య..కొడుకు మృతదేహాలను తీస్తున్న పోలీసులు..

కడప : రిమ్స్ సమీపంలోని పాలకొండల్లో పూడ్చిపెట్టిన నాగేశ్వరీ, ప్రణీత్ ల మృతదేహాలను పోలీసులు వెలికి తీస్తున్నారు. రెండు నెలల క్రితం భార్య, కొడుకును హత్య చేసి ప్రవీణ్ పూడ్చి పెట్టిన సంగతి తెలిసిందే.

 

గాంధీలో గవర్నర్ నరసింహన్..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గాంధీ ఆసుపత్రిని అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రతి వార్డు తిరుగుతూ రోగులతో మాట్లాడారు. అక్కడున్న పారిశుధ్యంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

13:36 - February 19, 2016

వరంగల్ : గద్దెలపై ఆశీనులైన వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. గంటల తరబడి క్యూలైన్లలో అవస్థలు పడుతున్నారు. గర్భిణీలు, చంటి పిల్లల తల్లులకు, వృద్ధులకు స్పెషల్ క్యూ లైన్ లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. బస్సు ఛార్జీలు తగ్గించాలని పలువురు భక్తులు కోరారు. 

12:13 - February 19, 2016

ఢిల్లీ : జేఎన్ యూ నేత కన్హయ్య బెయిల్ వస్తుందా ? లేదా ? దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కాసేపటి క్రితం సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఐదో నెంబర్ కోర్టులో కిక్కిరిసిన మందిరంలో న్యాయవాదులు వాదనలు వినిపించారు. సుమారు గంట పాటు ఈ వాదనలు కొనసాగాయి. హైకోర్టుకు వెందుకు వెళ్లలేదని కన్హయ్య తరపు న్యాయవాదులను సుప్రీం ప్రశ్నించింది. కిందికోర్టులో కన్హయ్యకు, అతని తరపు న్యాయవాదులకు రక్షణ లేనందువల్లే సుప్రీంను ఆశ్రయించడం జరిగిందని కన్హయ్య తరపు న్యాయవాదులు వెల్లడించారు. కిందికోర్టులో విరోధులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ పై విచారించలేమని పేర్కొంది. బెయిల్ పై తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం సూచించింది. కన్హయ్యకు భద్రత కల్పిలంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో విచారణ ఆలస్యమౌతుందని కనుకే కింది కోర్టులో తేల్చుకోవాలని సుప్రీం తెలిపింది.

కొనసాగుతున్న నిరసనలు..
కన్హయ్య బెయిల్ ను తిరస్కరిస్తున్నట్లు తీర్పు చెప్పడంతో విద్యార్థులు..ఇతరులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. న్యాయస్థానాల ఎదుట దాడికి దిగిన బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మకు గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేశారని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కన్హయ్య అరెస్టుపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో వామపక్ష విద్యార్థి సంఘం నేతలు రైళ్లను ఆపివేసి తమ నిరసన తెలిపారు. మతతత్వవాదాన్నే కన్హయ్య వ్యతిరేకించారని తేలింది. దీంతో కన్హయను అక్రమంగా అరెస్టు చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి.

అసలేం ఏం జరిగింది ?

  • జేఎన్‌యూలో జరిగిన సమావేశంలో కన్హయ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారాన్న ఆరోపణలతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
  • అయితే కన్హయ మాట్లాడిన వీడియోలోని ఆడియో మార్చినట్టు వెల్లడయ్యింది. జాతి వ్యతిరేక వ్యాఖ్యలేవీ చేయలేదని తేలింది.
  • కన్హయ కుమార్‌ దేశద్రోహ వ్యాఖ్యలు చేశారంటూ... కొందరు కుట్రపూరితంగా ఆడియో లేయర్లు సృష్టించారని వెల్లడయ్యింది. కన్హయను తప్పుడు ఆధారాలతో అరెస్టు చేశారని స్పష్టమయ్యింది.
  • కన్హయ టేపుల్లోని ఆడియో లేయర్లు మార్చేందుకు రెండు రోజులు పట్టివుంటుందని భావిస్తున్నారు.
  • పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ అఫ్జల్‌ గురు సంస్మరణ సభ ఈనెల 9న జేఎన్‌యూలో జరిగింది.
  • డెమోక్రాటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నిర్వహించిన ఈ సభలో ఆ రోజు భారత్‌ వ్యతిరేక నినాదులు చేసిన ఉమర్‌ ఖలీద్‌ పక్కనే కన్హయ ఉన్నారు.
  • ఆ తర్వాత రెండు రోజులకు... అంటే ఈనెల 11న జేఎన్‌యూ నుంచి మరో వీడియో టేపు విడుదలయ్యింది.
  • కన్హయ కుమార్‌ భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు రెండో వీడియో టేపులో ఉన్నాయి.
  • దేశవ్యాప్తంగా టీవీ న్యూస్‌ చానల్స్‌తోపాటు, సోషల్‌ మీడియాలో ఈ టేపు హల్‌చల్‌ చేసింది.
  • ఇదే కన్హయ మెడకు చట్టుకుని అరెస్టుకు దారితీసింది. ఆ తర్వాత ఈ మొత్తం వ్యవహారం పెను రాజకీయ వివాదానికి కారణమయ్యింది. 
12:03 - February 19, 2016

నల్గొండ/రంగారెడ్డి : చదవాలనుకున్నా చదవలేరు. వారు చేయాలనుకున్నది చేయలేరు. కోరుకున్నవాడిని పెళ్లి చేసుకోలేరు. లక్ష్యం ఉంటుంది.. కాని సాధించలేరు. ఆర్ధిక భారాలు, పాత సంప్రదాయాలు, సమాజ పరిస్ధితులు ఇవన్నీ ఆడపిల్ల చదువుపై, జీవితంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. స్త్రీ జీవిత గమనాన్ని, గమ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ఇదంతా పాతరోజుల్లో అనుకుంటే పొరపాటే. ఆడపిల్ల అమెరికా వెళ్లి మరీ ఉద్యోగం చేస్తున్న ఈ రోజుల్లోనూ బాల్య వివాహమనే సాంఘిక దురాచారం ఇంకా వెంటాడుతూనే ఉంది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో జరిగిన ఘటనలే ఇందుకు సాక్ష్యాలు.

రంగారెడ్డి..
రంగారెడ్డి జిల్లా బషీరాబాద్‌ మండలం వాల్యా నాయక్‌ తండాకుచెందిన సూర్య నాయక్‌, శాంతిబాయిలకు ఐదుగురు ఆడపిల్లలున్నారు. మూడో కూతురు వయసు పదహారేళ్లు. ఈ బాలికకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. మధ్యప్రదేశ్‌ భోపాల్‌కుచెందిన ఓ యువకుడితో సంబంధం కుదిర్చారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘం సభ్యులు ఈ వయసులో పెళ్లి చేయడం సరికాదని సూచించారు. 18 ఏళ్లు నిండాకే ఈ కార్యక్రమం జరిపించాలని కోరారు. దీనికి సరే అన్న సూర్య నాయక్‌ ఎవ్వరికీ తెలియకుండా కూతురు పెళ్లికి ప్లాన్‌ చేశాడు. వివాహం పూర్తిచేసేందుకు కుటుంబాన్ని తీసుకొని రైలులో హైదరాబాద్ బయలుదేరాడు. వెంటనే మహిళా సంఘం సభ్యులు పోలీసులకు ఫోన్ చేశారు. ఆశా కార్యకర్త కూడా వీరికి సహకరించింది. సూర్యనాయక్‌ ఉన్న రైలు బోగీలో ఎక్కి వాళ్లను అనుసరించింది. ఎస్‌ ఐ అభినవ చతుర్వేది రైల్వే స్టేషన్‌కు వచ్చేలోగా రైలు బయలుదేరింది. వెంటనే తన బైక్‌పై 22 కిలోమీటర్లు ప్రయాణించిన ఎస్ఐ రైలుకన్నా ముందే రైల్వే స్టేషన్‌ చేరుకున్నాడు. ఆశా కార్యకర్త సహాయంతో బాలికతోపాటు కుటుంబసభ్యులను పట్టుకున్నారు. వీరికి పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

నల్గొండలో..
నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం పుల్లాయిగూడెంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.. 24ఏళ్ల యువకుడికి 16ఏళ్ల బాలికను ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈనెల 20 మహూర్తం పెట్టుకున్నారు.. బాలిక ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. కాలేజీలో ఈ బాలిక టాప్‌ ర్యాంకర్‌గా ఉంది. బాలిక వివాహం విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. శిశు సంక్షేమ అధికారులు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌, ఎన్జీవో ప్రతినిధులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రెండు కుటుంబాలకు నచ్చజెప్పి బాలికకు 18ఏళ్లు నిండాకే పెళ్లి చేయాలని సూచించారు. అమ్మాయిని బాగా చదివించాలని సూచించారు. దీనికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. మొత్తానికి అధికారుల చొరవతో రెండు బాల్య వివాహాలు ఆగిపోయాయి.

11:59 - February 19, 2016

విజయవాడ : ఈ ఏడాది బీసీసబ్ ప్లాన్ లేనట్లేనా.. గత ఏడాదిలాగే కొన్నిశాఖలకు నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటుందా.. పైకి బీసీ సబ్ ప్లాన్ అమలుకు కాస్త సమయం పడుతుందని ప్రభుత్వం బొంకుతున్నా..అసలు ముసాయిదానే తయారుకాలేదు. పైగా చట్టబద్దతలేని బీసీసబ్ ప్లాన్ బిల్లుకు ఇచ్చే నిధులు ఎలా ఖర్చుపెట్టాలనే దానిపై ప్రభుత్వం అధికారులతో చర్చలు జరుపుతోంది.
ఎన్నికల సమయంలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి బీసీల అభ్యున్నతికి కృషి చేస్తానని ప్రకటించి అధికారంలోకి వచ్చింది టీడీపీ. కాని ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు గడుస్తున్నా బీసీ సబ్ ప్లాన్ ముందుకు సాగడం లేదు. గత నెలలో సబ్ ప్లాన్ కు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ కేవలం రెండు సార్లు మాత్రమే ఇప్పటి వరకు సమావేశం అయింది. పైగా బీసీ కులాల జనాభాకు సంబంధించి వివరాలు కూడా ప్రభుత్వం వద్ద లేవు. దీంతో ఎంత వరకు నిధుల ఇవ్వాలన్న దానిపై అవగాహనే లేదు.

6వేల కోట్లు విడుదలంటూ ఆర్భాటం..
గత బడ్జెట్ లో బీసీ సబ్ ప్లాన్ క్రింద 6 వేల కోట్లు విడుదల చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించింది ప్రభుత్వం. ఈ సబ్ ప్లాన్ కింద ప్రభుత్వం కేటాయించిన నిధులు ఇతర శాఖలకు కేటాయించడం జరిగాయి. తమకు కేటాయించిన నిధులలో ఆ శాఖలు కేవలం 60 శాతం మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. దీంతో సంక్షేమశాఖ అధికారులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పశు సంవర్ధక పరిధిలో ఉన్న ఫిషరీస్, యానిమల్ హజ్బెండరీ లాంటి శాఖలను కూడా బీసీ వెల్ఫేర్ లో తీసుకురావాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇదే ఏడాది బీసీ కుల సంఘాల గణన కూడా చేపట్టే ఆలోచనలో ఉంది ఏపీసర్కార్.

కులాల గణన..
కులాల గణన చేయడంతో బీసీ లో ఉన్న జనాభా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని... దీని కారణంగా నిధుల కేటాయింపుపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందనేది ప్రభుత్వం ఆలోచన. సబ్ ప్లాన్ కు ముసాయిదా లేకపోవడంతో దీనికి చట్టబద్దత పై పలుసందేహాలు ఉన్నా.. ప్రభుత్వం మాత్రం సాధ్యమైనంత త్వరలో బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్దత కల్పించే విషయంలో కృషి చేస్తున్నామని చెప్పకొస్తోంది. దీనిని కవర్ చేసేందుకు బీసీలకు పథకాలు ప్రవేశపెడుతోంది. కుల వృత్తుల వారికి చేయూత నిచ్చేందుకు యంత్రాలు , బీసీ విద్యార్థుల విదేశీ చదువులకు 10 లక్షల వరకు ఖర్చుచేయనుంది ప్రభుత్వం. ఒక వైపు బీసీసబ్ ప్లాన్ కు సంబంధించి ముసాయిదా బిల్లును రూపొందించే పనిలో ఉంటూనే.. మరో వైపు బీసీల అభివృద్దికి పథకాలు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మొత్తంగా అసలు పక్కా ప్లాన్ లేని బీసీ సబ్ ప్లాన్ ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. 

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో శుక్రవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎల్ బ్లాక్ లోని రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పారు. 

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం 13 మంది మృతి..

కర్నాటక : రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్రదుర్గ సమీపంలోని మందనాయకలహళ్లిలో ఓ ట్రక్కు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టాటాఎస్ వాహనంపైకి దూసుకెళ్లడంతో 13 మంది మృతి చెందారు. 

రాంచీలో నలుగురు మావోయిస్టుల మృతి..

రాంచీ : జార్ఖండ్ రాజధాని రాంచీలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

కన్హయ్య బెయిల్ పిటిషన్ తిరస్కరణ..

ఢిల్లీ : జేఎన్ యూ నేత కన్హయ్య బెయిల్ పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. బెయిల్ పై తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. కన్హయ్యకు భద్రత కల్పిలంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టుకు వెందుకు వెళ్లలేదని కన్హయ్య తరపు న్యాయవాదులను సుప్రీం ప్రశ్నించింది. కిందికోర్టులో కన్హయ్యకు, అతని తరపు న్యాయవాదులకు రక్షణ లేనందువల్లే సుప్రీంను ఆశ్రయించడం జరిగిందని కన్హయ్య తరపు న్యాయవాదులు వెల్లడించారు. కిందికోర్టులో విరోధులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ పై విచారించలేమని పేర్కొంది.

బయటపడిన ఉమర్ ఫోన్ కాల్స్..

ఢిల్లీ : జేఎన్ యూ లో దేశ వ్యతిరేక నినాదాలపై విచారణ ముమ్మరంగా జరుగుతోంది. ఉమర్ ఖలీద్ రెండు నెలల ఫోన్ కాల్స్ లిస్టులు బయటపడ్డాయి. జమ్మూ కాశ్మీర్ కు 38 సార్లు ఉమర్ ఫోన్ చేసినట్లు, జమ్మూ కాశ్మీర్ నుండి 65 ఫోన్ కాల్స్ వచ్చినట్లు తేలింది. బంగ్లాదేశ్ తో పాటు సౌదీకి పలుసార్లు ఉమర్ కాల్స్ చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 3 నుండి 9 వరకు 800 సార్లు ఉమర్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. 

11:27 - February 19, 2016

విశాఖపట్టణం : కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈసారైనా పునర్ విభజన చట్టంలోని హామీలు నెరవేరుస్తారా ? అని విశాఖ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా రైల్వేజోన్ కేటాయింపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీపీఎం ఆందోళన చేపట్టింది. రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టెన్ టివితో సీపీఎం నేతలు మాట్లాడారు. విశాఖ నగరానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, విశాఖకు రైల్వే జోన్ ఏ ర్పాటు చేస్తామని హామీనిచ్చారని గుర్తు చేశారు. రెండు బడ్జెట్ లు అయిపోయినా ఇచ్చిన హామీ పూర్తి చేయలేదని విమర్శించారు. ఎంపీ హరిబాబు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు నోరు మెదపడం లేదని, మోడీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. రైల్వేపై జరుగుతున్న కుట్రలను ఎదుర్కొనడానికి పోరాటాలు చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని, రైల్వే జోన్ కావాలని కోరుతుంటే కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు.

11:22 - February 19, 2016

తూర్పుగోదావరి : చిన్నారి పూజిత తమ మధ్య లేదనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు..కూతురు ఇక కనబడదనే విషయాన్ని వారు ఓర్చుకోలేకపోతున్నారు. పూజిత కుటుంబసభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరిని ఓదార్చడం ఎవరీ తరం కావడం లేదు. పెద్దాపురం మండలం చెదలవాడలో రెండు రోజుల క్రితం ఏడేళ్ల చిన్నారి పూజిత అదృశ్యమైంది. అదృశ్యమైన చిన్నారి పూజిత శుక్రవారం విగతజీవిగా దర్శనమిచ్చింది. పూజిత మృతి చెందిందన్న వార్త తెలుసుకున్న కన్నతల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. రెండు రోజలు క్రితం ఓ షాపుకు వెళ్లిన పూజిత తిరిగి రాలేదు. దీనితో కుటుంబసభ్యులు ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రాంతాల్లో గాలింపులు చేపట్టారు. శుక్రవారం ఉదయం ఇంటికి సమీపంలోనే ఉన్న ఏలేరు కాల్వలో పూజిత మృతదేహం లభ్యమైంది. షాపు కు వెళ్లి తిరిగి వస్తుండగా కాల్వలో పడిపోయినట్లు తెలుస్తోంది. కాలు జారి పడిపోయిందా ? హత్య చేశారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

11:15 - February 19, 2016

వరంగల్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు మేడారం జాతరకు వచ్చారు. సతీసమేతంగా సమక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కలు చెల్లించారు. ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. గతంలో తాను అమ్మవార్లకు బంగారాన్ని పంపించే వాడినని, ఈసారి స్వయంగా రావడం జరిగిందన్నారు. ఉచిత విద్యను, హాస్టల్ లను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందని. ఆవిడ ఆశీస్సులు అందరిపై ఉండాలని, సమ్మక్క, సారలమ్మ త్యాగాన్ని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు దివంగత ఎన్టీఆర్ పనిచేశారని, ఎన్టీఆర్ ఆశలను ముందుకు తీసుకెళుతామన్నారు.

విశాఖ బీజేపీ నేతలతో రాజ్ నాథ్ సింగ్..

విశాఖపట్టణం : బీజేపీ కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, కార్యాచరణపై వారితో చర్చించారు. 

మేడారం జాతరలో బాలకృష్ణ దంపతులు..

వరంగల్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మేడారం సమక్మ, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సతీమణితో బాలకృష్ణ విచ్చేశారు. 

బీజేపీ ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్ నేతల దాడి..

జైపూర్ : రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ చౌదరీ నివాసంపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. ఆయన నివాసంపై నల్లరంగుతో అక్షరాలు రాశారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసినందుకు గాను కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ఘటనకు పూనుకున్నట్లు తెలుస్తోంది. 

నల్గొండలో తీవ్ర కరవు - ఎంపీ గుత్తా..

నల్గొండ : జిల్లాలో తీవ్ర కరవు నెలకొందని ఎంపీ గుత్తా సుఖేంద్ రెడ్డి పేర్కొన్నారు. తాగునీటి ఎద్దడితో పల్లెలు అలమటిస్తున్నాయని, తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రజలు మండల కార్యాలయాలను ముట్టడించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి ఎన్నికలు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం జిల్లాలో ఒక్క దరఖాస్తు లేదని ఎద్దేవా చేశారు. 

ఏపీ పీసీసీ కార్యాలయాన్ని ప్రారంభించిన దిగ్విజయ్ సింగ్..

విజయవాడ : నగరంలోని ఆంధ్రరత్న భవన్ రాష్ట్ర పీసీసీ కార్యాలయంగా మారింది. నేడు భవనాన్ని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ ప్రారంభించారు. 

సూసైడ్ నోట్ రాసి హాస్టల్ విద్యార్థి పరార్..

నల్గొండ : హుజూర్ నగర్ లోని ఓ హాస్టల్ లో 8వ తరగతి విద్యార్థి నాగార్జున రెడ్డి సూసైడ్ నోట్ రాసి పారిపోయాడు. రూ.500 చోరీ చేశాడని తోటి విద్యార్థులు ఆరోపించడమే దీనికి కారణమని తెలుస్తోంది. పీఎస్ లో హాస్టల్ సిబ్బంది, తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యార్థి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

10:40 - February 19, 2016

వరంగల్ : మేడారం..జాతర మూడో రోజుకు చేరుకుంది. గురువారం రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరడంతో మహాఘట్టం పూర్తయ్యింది. దీనితో భక్తులు భారీ సంఖ్యలో జాతరకు చేరుకుంటున్నారు. లక్షలాదిగా వస్తున్న ప్రజలతో మేడారం పులకించిపోతోంది. ఎక్కడ చూసినా జనమే కనబడుతున్నారు. సమ్మక్క, సారక్కలకు మొక్కలు చెల్లించుకుంటున్నారు. మేడారానికి వచ్చే భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సమ్మక్క, సారక్కలను దర్శించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మేడారానికి జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. గంట గంటకు రద్దీ పెరుగుతోంది. వివిధ రాష్ట్రాలు..జిల్లాల నుండి వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. మరోవైపు యాత్రపై పోలీసులు నిఘా పెట్టారు. పలు ప్రాంతాల నుండి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు టెన్ టివితో మాట్లాడారు. మేడారంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చక్కగా చేసిందని మెచ్చుకున్నారు. 

10:32 - February 19, 2016

విజయవాడ : విశాఖ జిల్లా చిప్పాడ సమీపంలో 15 గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. దివీస్‌ ఫార్మా కంపెనీ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నామని స్థానికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫార్మా కంపెనీని మూసివేయాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే దీవిస్‌ కంపెనీ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఐతే ఆందోళన చేస్తున్న ప్రజలపై కంపెనీకి చెందిన కొంతమంది వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మూడో యూనిట్‌ నిర్మాణానికి అనుమతులు వచ్చేంత వరకు నిర్మాణాన్ని ఆపేస్తామని దివీస్‌ యాజమాన్యం హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం టెన్ టివితో మాట్లాడారు.
దివీస్ ఫార్మా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, భూగర్భజలాలు పూర్తిగా కలుషితమయ్యాయని తెలిపారు. కనీసం తాగడానికి, సాగు చేసుకోవడానికి పనికిరావని పేర్కొంటున్నారని, నీటిని ల్యాబరేటరీకి పంపించడం జరిగిందన్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన కంపెనీ పాతిక మందికి కూడా ఉద్యోగాలు కల్పించ లేదన్నారు. 400 ఎకరాల భూమి తీసుకున్న వీరు అభివృద్ది చేస్తామని చెప్పారని, కానీ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం వల్ల 500 మంది మత్స్యకార్మికులు..ఇతరులు వలసలు వెళ్లిపోయారని పేర్కొన్నారు. పరిశ్రమకు సర్పంచ్ లు..గ్రామ ప్రజల అనుమతి తప్పనిసరిగా ఉండాలని, కానీ దివీస్ పరిశ్రమపై ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. దేవాదాయ, వుడాలకు కొన్ని చట్టాలున్నాయని ఈ పరిశ్రమకు భూములు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. టిడిపి నేతలు వీరికి కొమ్ముకాస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. 

10:28 - February 19, 2016

హైదరాబాద్ : ఒకరికి చేయి లేదు..ఒకరికి కాలు లేదు..మరొకరికి కన్ను లేదు..ఇలా ఎంతో మంది వికలాంగులు బంజారాహిల్స్ ప్రాంతానికి చేరుకున్నారు. తమ సమస్యలు తీర్చాలని సర్కార్ కు విన్నవించుకున్నారు. కానీ పోలీసులు వీరి ఆందోళనను అడ్డుకున్నారు. తాము ఎన్నో కష్టాలకు గురౌతున్నామని, తమ బాధలు సర్కార్ కు చెప్పుకోవడానికి వచ్చామని చెప్పినా ఖాకీలు వినిపించుకోలేదు. బలవంతంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై వికలాంగులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశౄరు. బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ ను వికలాంగులు ముట్టడించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరుగుతుందని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. 3శాతం రిజర్వేషన్ ను వెంటనే అమలు పరిచి నోటిఫికేషన్లు విడుదల చేసిన ఉద్యోగాల్లో అవకాశం కలిపించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఓట్లు వేస్తేనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తమను వికలాంగులకు గుర్తించకపోతే ఎలా అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎక్కడకు వెళ్లి గోడును చెప్పుకోవాలని ప్రశ్నించారు. అనంతరం ఆందోళన చేస్తున్న వికలాంగులను బలవంతంగా అదుపులోకి తీసుకుని తరలించారు. 

నలుగురు రైల్వే ఉద్యోగుల మృతి..

మంబై : వాణిజ్య నగరంలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు గ్యాంగ్ మెన్ లపైకి సబర్బన్ రైలు దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడనే దుర్మరణం చెందారు. 

రైలును నిలిపివేసిన వామపక్ష మద్దతు విద్యార్థులు

ఢిల్లీ : కన్హయ్య విడుదల చేయాలంటూ వామపక్ష మద్దతు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఉదయం దర్భంగా - న్యూఢిల్లీ బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలును అడ్డుకుని నిలిపివేశారు. 

ఉమర్ ఖలీద్ ఎక్కడున్నాడో తెలియదు - ఖాసీం..

ఢిల్లీ : తన కుమారుడు ఉమర్ ఖలీద్ ఎక్కడున్నాడో తనకు తెలియదని తండ్రి ఖాసీం పేర్కొన్నారు. జేఎన్ యూలో ఉమర్ జాతి వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తండ్రి ఖాసీం ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. ఎక్కడున్నా లొంగిపోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఉమర్ ముస్లిం కాబట్టి టార్గెట్ చేశారని తెలిపారు. 

09:55 - February 19, 2016

వరంగల్ : మేడారాం జాతర నభూతో నభవిష్యత్ అనే విధంగా జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సభాపతి మధుసూధనాచారి పేర్కొన్నారు. మేడారం జాతరకు ప్రముఖులు పోటెత్తుతున్నారు. కోటి మందికిపైగా భక్తులు తరలివస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అదే విధంగా సమ్మక్క, సారక్కలను ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. గతంలో మేడారం జాతర ఇంత గొప్పగా జరగలేదన్నారు. మేడారం జాతరకు వెళ్లాలంటే ఎన్నో సమస్యలు ఉండేవన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పలు చర్యలు తీసుకోవడం జరిగిందని, ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌవడం కావడం లేదన్నారు. 

09:53 - February 19, 2016

తూర్పుగోదావరి : ఇక ఆ చిన్నారి నవ్వులు..ముద్దు..ముద్దు మాటలు..వినిపించవు. గత రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఆరేళ్ల చిన్నారి పూజిత విగతజీవిగా మారిపోయింది. దీనితో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెద్దాపురం మండలం చెదలవాడలో రెండు రోజుల క్రితం పూజిత అదృశ్యమైంది. దీనితో కుటుంబసభ్యులు పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం ఇంటికి సమీపంలోనే ఉన్న ఏలేరు కాల్వలో పూజిత మృతదేహం లభ్యమైంది. షాపు కు వెళ్లి తిరిగి వస్తుండగా కాల్వలో పడిపోయినట్లు తెలుస్తోంది. కాలు జారి పడిపోయిందా ? హత్య చేశారా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

అదృశ్యమైన పూజిత మృతదేహం లభ్యం..

తూర్పుగోదావరి : పెద్దాపురం మండలం చెదలవాడలో అదృశ్యమైన పూజిత మృతి చెందింది. తాడిపత్రి వద్ద ఏలూరు కాలువలో పూజిత మృతదేహం లభ్యమైంది. 

09:25 - February 19, 2016

హైదరాబాద్ : సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఎక్కువ మందికి జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నారు. అన్నదాతలను అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు కార్యాచరణ రూపొందించాలని వ్యవసాయ శాఖ బడ్జెట్‌పై నిర్వహించిన సమీక్షలో కేసీఆర్‌ అధికారులను కోరారు. తెలంగాణ సర్కార్‌ 2016-17 వార్షిక బడ్జెట్‌పై చేస్తున్న కసరత్తులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగంపై గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాభావం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో ఆటుపోట్లు ఎదుర్కొంటూ తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలను ఆదుకునేందుకు మేలైన సాగు విధానాలను సూచించాలని వ్యసాయశాఖ అధికారులను కోరారు. కష్టాల కడిలో కొట్టుమిట్టాడుతున్న రైతన్నను ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాలు సక్రమంగా అమయ్యేలా చూడాలని ఆదేశించారు. విద్యుత్‌, ఎవరువులు కొరతలేకుండా చూడాలని చెప్పారు.

కేసీఆర్ పలు సూచనలు..
వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల అమల్లో భాగంగా రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని కేసీఆర్‌ కోరారు. మార్కెట్‌ యార్డులకు తీసుకొచ్చే వ్యవసాయ ఉత్పత్తులు వర్షాలకు తడిసిపోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మార్కెటింగ్‌ శాఖ అధికారులపై ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు సమకూర్చాలని కోరారు. వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా రైతులను ప్రోత్సహించాని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. పందరి వ్యవసాయం, బందుసేద్యం పద్ధతులు అవలంభించేలా చూడాలని చెప్పారు. అదనపు ఆదాయం కోసం వ్యవసాయ అనుబంధరంగాలైన పాడి పరిశ్రమ, మేకలు, కోళ్లు, చేపల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. 

09:13 - February 19, 2016

విజయవాడ : కూతురు పెళ్లి..అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కుటుంబసమేతంగా ఓ వాహనంలో బయలుదేరారు. అంతలోనే విషాదం. ఓ లారీ రావడం..వీరి వాహనాన్ని ఢీకొట్టడం..వేగంగా జరిగిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన పడమట పరిధిలో చోటు చేసుకుంది. పడమట ప్రాంతానికి చెందిన సుమారు పాతిక మంది వాహనంలో బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లిన అనంతరం ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. వాహనంలో ఉన్న వారు చెల్లాచెదురుగా పడిపోయారు. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహనం క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదానికి లారీ, పెళ్లి బృందం వాహన డ్రైవర్ నిర్లక్ష్యమా అనేది తెలియరావడం లేదు. 

దుబాయ్ కి మంత్రి నాయినీ..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయినీ నర్సింహరెడ్డి దుబాయ్ పర్యటనకు వెళ్లారు. ఉపాధికి వెళ్లి మోసపోతున్న కార్మికుల సంక్షేమానికి దుబాయ్ లోని సంస్థలతో నాయినీ భేటీ కానున్నారు. 

మంత్రుల క్వార్టర్స్ ను ముట్టడించిన వికలాంగులు..

హైదరాబాద్: బంజరాహిల్స్ లోని తెలంగాణ మంత్రుల సముదాయాన్ని వికలాంగులు ముట్టడించారు. బ్యాక్ లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి టాస్క్ ఫోర్స్ కమిటీ వేయాలని, సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని వికలాంగులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వికలాంగులను అడ్డుకున్నారు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

08:34 - February 19, 2016

విజయవాడ : ఏపీ పీసీసీ కార్యకలపాలు ఇక నుండి విజయవాడ నుండి జరగనున్నాయి. నగరంలోని ఆంధ్రరత్న భవన్ రాష్ట్ర పీసీసీ కార్యాలయంగా మారబోతోంది. నేడు జరగబోయే ప్రారంభోత్సవానికి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ హాజరు కానున్నారు. ప్రస్తుతం ఆంధ్రరత్న భవన్ లో విజయవాడ నగర కాంగ్రెస్ కార్యాలయం ఉంది. 

08:19 - February 19, 2016

నల్గొండ : ఏఐసీసీ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సెక్యూర్టీ వాహనాన్ని ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది.ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కోదాడ సమీపంలో చోటు చేసుకుంది. ఏపీలో కాంగ్రెస్ కార్యాలయాన్ని దిగ్విజయ్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నగరానికి చేరుకున్నారు. నల్గొండ మీదుగా వెళుతుండగా కోదాడ వద్ద దిగ్విజయ్ సింగ్ ఎస్కార్ట్ వాహనాన్ని కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఢీకొంది.  ఆ వెంటనే మూడు వాహనాలు వెనుక నుండి ఢీకొన్నాయి. నాలుగు గంటల పాటు స్టేషన్ లో ఉంచుకున్న అనంతరం బస్సును, సెక్యూర్టీ కారును విడుదల చేశారు. 

08:15 - February 19, 2016

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్వరం సోకింది. దీనితో ఈ రోజు వరంగల్ పర్యటన రద్దయ్యింది. కొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ఉండడంతో గత రెండు రోజుల నుండి సీఎం కేసీఆర్ పలు శాఖల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం పలు శాఖలపై సమీక్షలు నిర్వహించారు. వత్తిళ్లకు గురి కావడంతో కేసీఆర్ అనారోగ్యానికి గురయ్యారు. విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచనల మేరకు పర్యటనలను రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకొని సమ్మక్క సారలమ్మలను దర్శనం..మధ్యాహ్నం రెండున్నర గంటలకు మడికొండలోని ఇంక్యుబేషన్ టవర్‌ ప్రారంభం..ఇన్ఫోటెక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌కు శంకుస్థాపన చేయాల్సి ఉంది. 

07:56 - February 19, 2016

ఇట్ల దాపురం అయ్యిండ్రేందమ్మా.. వాళ్ల నోట్లె పొక్కులు వొడ్వ.. వొక్క దెగ్గర అయిపోంగనే వొక్క దెగ్గర వొక్క దెగ్గర అయి పోంగనే వొక్క దెగ్గర సుర్వు జేస్తున్నరు అడ్డమైనోల్లు.. వాళ్లను మనుండంగనే కుత కుత ఉడ్కుతున్న నూనెలేశి గోలియ్య.. నిజాంబాద్ జిల్లా కామారెడ్డి కాడ కొందరు దేడ్ దిమాక్ గాళ్లు ఏం దంద జేస్తున్నరో సూడుండ్రి సూశినంక మీరు గుడ జాగ్రత్తగ వుండుండ్రి..

07:55 - February 19, 2016

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల కాడ కొంతమంది ప్రజలు రోజుకు ఎన్మిది గంటలు గాదు.. రోజుకు ఇర్వై నాల్గు గంటలు పనిజేస్తున్నరట.. నిద్రలేదు.. ఇళ్లు లేదు.. పెండ్లాం పిల్లలు.. అయ్య అవ్వలు ఎవ్వలు లేరు.. కష్టాన్నే నమ్ముకోని.. ముంగటికి వోతున్నరు.. ఆ కష్టపోతులకు పోలీసోళ్లు విముక్తి గల్పిచ్చిండ్రట.. మరి వాళ్ల కష్టమేంది..? పోలీసోళ్లు ఎందుకు వొయ్యిండ్రు అనేది తెలుసుకోవాలంటే వీడియో సూడుండ్రి.

07:53 - February 19, 2016

సర్కారు నౌకరంటె ఎట్లుంటది..? పొద్దుగాళ్ల పదిగొట్టంగొచ్చి.. పొద్దుందాముల ఆరుగంట్లకు ఇంటికి ఎల్లిపోవుడుగదా..? యాళ్ల గాకముందుకు సంచి సంకల వెట్కపోతె తప్పైతది.. కని ఆరుగంట్లకు అయిపోవాల్సిన నౌకరి రాత్రి తొమ్మిది పదిగొట్టెదాక పనిజేస్తుంటె వాళ్లను మెచ్చుకోవాల్నా..? అరెస్టు జేశి జైలుకు వంపాల్నా మీరే జెప్పుండ్రి.. శెబ్బాష్ అని.. మెచ్చుకోవాల్సింది ఇడ్సిపెట్టి..అరెస్టు జేశిండ్రు.. మరి ఈ కథ ఏందో సూడుండ్రి మీరే.

ఎస్ఆర్ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన ఎస్ఐ వాహనం..

కరీంనగర్ : సుల్తానాబాద్ (మం) నీరుకుళ్ల వద్ద రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్ఎస్పీ కాలువలో ఎస్ఐ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎస్ఐ ఇంద్రసేనారెడ్డితో పాటు డ్రైవర్ కు గాయాలయ్యాయి. వీరిని అపోలో ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈఘటన చోటు చేసుకుంది. 

మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు..

జార్ఖండ్ : రాంచీలోని ఓ ప్రాంతంలో జరిగిన మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. 

07:43 - February 19, 2016

ఏ రంగంలోకైనా కొత్తవారు వస్తూనే ఉంటారు. సినిమా రంగంలోకి కొత్త వారు ఎవరైనా వస్తే వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారనే దానిపై ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా చిత్రసీమకు పరిచయం కాబోతున్న వారు ఇప్పటికే నటుల కుటుంబాలకు చెందిన వారయితే మరింత క్రేజ్‌ ఉంటుంది. అలా పరిచయమై రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు కూడా కొందరు సినీ కుటుంబాలకు చెందిన వారు, మరికొందరు బాలనటులుగా చేసిన వారు కథానాయికలుగా, హీరోగాలు ఎంట్రీ ఇస్తున్నారు. వారెవరో ఏయే సినిమాల్లో నటిస్తున్నారో చూద్దాం.
జహ్నవి కపూర్‌ : అతిలోక సుందరి అంటే గుర్తొచ్చే పేరు శ్రీదేవి...ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేదు. తెలుగు చిత్రసీమతో ఆమెకున్న అనుబంధం అటువంటిది. ఈ కథానాయిక తనయ జహ్నవి కపూర్‌. ఈమెను శ్రీదేవి చిత్రసీమకు పరిచయం చేయబోతుంది. ప్రస్తుతం జహ్నవికి బాలీవుడ్‌లో ఆఫర్ల మీద ఆఫర్ల వస్తున్నాయి. కానీ మంచి సమయం కోసం ఎదురుచూస్తోందట. ఇప్పటికే కరన్‌ జోహర్‌, ఎస్‌రాజ్‌ వంటి దర్శకులు నాలుగైదు కథలు ఆమెకు విన్పించారట. అందులో ఇద్దరు దర్శకుల చిత్రాలకు చేయడానికి అంగీకరించిందట. కానీ డేట్స్ మాత్రం ఇవ్వలేదని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. సినిమాల్లో నటించడం కోసం జహ్నవి అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో లీ స్ట్రాబెర్గ్ అండ్‌ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠాలు అభ్యసించింది. త్వరలోనే ఈమెను కథనాయికగా చూడబోతున్నాం. తెలుగులో ఎన్టీఆర్‌తో జతకట్టబోతుందని ప్రచారం కూడా జరుగుతోంది.
అక్షర హాసన్‌ : కమల్‌, సారిక కూతురు అక్షర హాసన్‌. ఈమె అక్క శృతి హాసన్‌ ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తోంది. అక్షర చిత్రసీమలోకి ఎప్పుడు అడుగుపెడుతుందా? అనే ఆసక్తత ఉండేది. ఆది కాస్తా గత ఏడాది జరిగిపోయింది. అమితాబ్‌ బచ్చన్‌, ధనుష్‌ కలసి చేసిన 'షమితాబ్‌' చిత్రంలో నటించింది. వెంటనే మరొక బాలీవుడ్‌ చిత్రంలో చేసేందుకు అవకాశం దక్కింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో కూడా చేసేందుకు అవకాశాలు వస్తున్నాయి. తన చెల్లి చాలా టాలెంటెడ్‌ అని శృతి చెబుతూ ఉంటుంది. ఈమె తెలుగులో ఎవరితో జతకట్టనుందో చూడాలి.
నిహారిక : మెగాస్టార్‌ కుటుంబం నుంచి చిత్రసీమలోకి అడుగుపెట్టిన కథానాయిక నిహారిక. ఈమె నాగబాబు తనయురాలు. తెలుగు చిత్రసీమకు చెందిన హీరోల కుటుంబం నుంచి కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన రెండో వ్యక్తీమె. నిహారికకు ముందు అక్కినేని కుటుంబం నుంచి సుప్రియ కథానాయికగా చేసింది. ఈమె పవన్‌ కళ్యాణ్‌ మొదట చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'లో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తోంది. ఇప్పుడు నిహారిక వస్తోంది. నాగశౌర్య కథానాయకుడుగా చేస్తున్న 'ఒక మనసు' చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. నిహారిక టి.వి యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత ముద్దపప్పు ఆకారు అనే వెబ్‌ సీరియల్‌ను రూపొందించింది. మెగా కుటుంబం నుంచి వస్తున్న కథానాయిక కావడంతో ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి నెలకొంది.
రోషన్‌ : నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌. ఈ కుర్రాడు 'నిర్మలా కాన్వెంట్‌'లో మొదట పాఠం పూర్తి చేయబోతున్నాడు. నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోషన్‌ కథానాకుడుగా పరిచయమవు తున్నాడు. కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాగార్జున కూడా ఈ చిత్రంలో నటించాడు. ఈ కుర్రాడు నటన తననెంతో సంతోష పరిచిందని నాగార్జున కూడా కితాబిచ్చాడు.
నిత్యాశెట్టి : అంజి, దేవుళ్లు, హరివిల్లు వంటి చిత్రాల్లో బాలనటిగా చేసింది నిత్యాశెట్టి. ఇప్పుడు కథానాయికగా చేస్తోంది. 25 వరకు సినిమాల్లో ఇప్పటికే చేసిన ఈ అమ్మాయి 'పడేసావే' చిత్రంలో హీరోయిన్‌గా మారింది. ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఇది విడుదలైన వెంటనే రాహుల్‌ రవీంద్రన్‌తో 'శోభన్‌ బాబు' సినిమాలో నటించనుంది. తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నాయి.

07:40 - February 19, 2016

శరీర అవయవాలతో పాటు పళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం వుందంటున్నారు డాక్టర్లు. పళ్ళను సరిగా శుభ్రం చేసుకోకపోతే వాటిపై మరకలు పేరుకు పోయి చివరికి దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి.
పళ్ళపై ఏర్పడ్డ మచ్చలు త్వరగా తొలగి దంతాలు మిలమిలాడాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
బేకింగ్‌ సోడా :పడుకునే ముందు టూత్‌ పేస్టుపై చిటికెడు బేకింగ్‌ సోడా చల్లి బ్రష్‌ చేయాలి. ఇలా బ్రష్‌ చేయడం వల్ల పళ్ళపై ఏర్పడిన మచ్చలు తొలగుతాయి. బేకింగ్‌ సోడా పళ్ళపై పేరుకున్న బ్యాక్టీరియాను తొలగించి దంతాలను మెరిసేలా చేస్తుంది.
స్ట్రాబెర్రీస్‌ : మార్కెట్‌లో లభించే స్ట్రాబెర్రీస్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నమిలి తినాలి. ఇలా కొద్దిరోజులు చేస్తే పళ్ళపై ఏర్పడ్డ మచ్చలు తొలగిపోయి దంతలు శుభ్రపడతాయి.

07:38 - February 19, 2016

టెలివిజన్‌ సిరీస్‌ 'క్వాంటికో'తో హాలీవుడ్‌లోకి అడుగిడిన బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా తాజాగా హాలీవుడ్‌ చిత్రం 'బేవాచ్‌'లో నటించే లక్కీ ఛాన్స్‌ని అందిపుచ్చుకుంది. కథానాయికగా బాలీవుడ్‌లో తానేమిటో నిరూపించు కున్న ప్రియాంక 'బేవాచ్‌'లో మాత్రం ప్రతినాయికగా నటిస్తోంది. 'బేవాచ్‌'లో ప్రియాంకతో నటిస్తున్న సహనటుడు జాన్సన్‌ ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో క్లిప్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రపంచంలోని గొప్ప నటీనటుల్లో ఒకరిగా ప్రియాంకని ఆయన అభివర్ణించారు. 1990లో టెలివిజన్‌ సిరీస్‌గా ప్రసారమై బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించిన 'బేవాచ్‌' సిరీస్‌ ఆధారంగా అదే పేరుతో ప్రస్తుతం సినిమాని రూపొందిస్తున్నారు. యాదృచ్ఛికమైనప్పటికీ ఇటు బాలీవుడ్‌లోను, అటు హాలీవుడ్‌లోనూ ప్రియాంక ఎంట్రీ మాత్రం విలన్‌గానే జరగటం విశేషం. ఇదే విషయంపై ప్రియాంక స్పందిస్తూ, '2015లో ఈ స్క్రిప్ట్‌ విషయమై దర్శకుడు నాతో సంప్రదించారు. ప్రముఖ హాలీవుడ్‌ నటుడి కోసం ఆయన విలన్‌ పాత్ర రాసుకున్నారు. అది కేవలం మగాళ్ళు మాత్రమే నటించే పాత్ర. స్క్రిప్ట్ విన్న తర్వాత ఇందులో ఓ మంచి పాత్ర కావాలని ఆడిగాను. ప్రతినాయకుడి పాత్రకి బదులు ప్రతినాయకిగా నేను నటిస్తే బాగుంటుందని దర్శకుడు చెప్పారు. ఆయన చెప్పిన ఐడియా నాకూ నచ్చింది. దీంతో విలన్‌గా నటించేందుకు గ్రీన్‌స్నిగల్‌ ఇచ్చాన'ని తెలిపింది.

07:35 - February 19, 2016

విభిన్న ప్రేమ కథా చిత్రాల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ తాజాగా 'అహం' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంతో హీరో రాజశేఖర్‌ విలన్‌గా మారబోతున్నారు. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్నేహితులతో పి.సత్యనారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు. 'అంకుశం', 'మగాడు', 'ఆగ్రహం', 'ఆహుతి', 'ఎవడైతే నాకేంటి' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించి టాలీవుడ్‌ యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న డా. రాజశేఖర్‌ ఈ చిత్రంలో విలన్‌గా సరికొత్త పాత్రలో నటిస్తుండడం విశేషం. ఆయన సరసన ఓ స్టార్‌ హీరోయిన్‌ నటించనుంది. ఈ చిత్రం ద్వారా ఓ నూతన నటుడిని హీరోగా పరిచయం చేస్తున్నాం. నారాయణ్‌ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్‌గా, రసూల్‌ ఎల్లోర్‌ కెమెరామెన్‌గా వర్క్‌ చేస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు' అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

07:34 - February 19, 2016

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించనున్న చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. రామ్‌చరణ్‌ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'రామ్‌చరణ్‌, అల్లు అరవింద్‌ కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ పై నిర్మితమైన 'మగధీర' సినిమా రికార్డులు సృష్టించింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత వీరి కాంబినేషన్‌లో తాజా సినిమా రూపొందుతోంది. గతేడాది తమిళనాట విడుదలై వంద కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన 'తని ఒరువన్‌'నికిది రీమేక్‌. విలన్‌ పాత్రలో నటించిన అరవింద్‌ స్వామి ఇందులో కూడా విలన్‌గా నటించడం విశేషం. గీతా ఆర్ట్స్ పై అల్లు అరవింద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రారంభానికి ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. గురు వారం అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 22 నుంచి జరుగుతుంది' అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

07:32 - February 19, 2016

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఎక్కువ సమయం పట్టదని, టిడిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి కౌంటర్ ఇస్తోంది. వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో కూడా టచ్ లో ఉన్నారని టిడిపి పేర్కొంటోంది. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో కరణం ధర్మశ్రీ (వైసీపీ), శ్రీరాములు (టిడిపి) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరి వారు ఎలాంటి అభిప్రాయాలు..విమర్శలు చేసుకున్నారో వీడియో క్లిక్ చేయండి. 

07:28 - February 19, 2016

జిడ్డు, అధిక వేడి, జుట్టు పోషణలో లోపాలు.. ఇవి చుండ్రు పెరగడానికి కారణాలు. మరి, ఈ సమస్యను అదుపులో పెట్టుకోవాలంటే.. కొన్ని చిట్కాలు తప్పనిసరి. అవేంటంటే..మందారం.. జట్టుని ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. మందారపూలను కొబ్బరినూనెలో వేసి మరిగించాలి. తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ పూలలోని సారమంతా దిగేలా గట్టిగా పిండేయాలి. ఈ నూనెని గాలిచొరని డబ్బాలో వేసి ఉంచి, తలకు రాసుకుంటే చుండ్రు అదుపులోకి వస్తుంది. జట్టు రాలడం తగ్గుతుంది. గుప్పెడు గులాబీరేకుల్ని తీసుకుని వేడి నీటిలో వేయాలి. పదినిమిషాలు ఉంచి వాటిని బయటకు తీసి పిండేసి ఆ నీటిని మాడుకు పట్టించాలి. ఆరగంటపాటు ఆరనిచ్చి ఆపై తలస్నానం చేస్తే జుట్టు శుభ్రపడుతుంది.
చుండ్రు సమస్య తరుచూ వేధిస్తుంటే.. ఆరు స్పూన్ల గోరింటాకు పొడి, ఆరు స్పూన్ల మందారాకుల పొడి, ఒక స్పూను యూకలిప్టస్‌ ఆయిల్‌, ఒక స్పూను నిమ్మరసం, కొద్దిగా కొబ్బరిపాలు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ముప్పావుగంటపాటు ఆరనిచ్చి ఆపై తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారైనా చేయగలిగితే చుండ్రు సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.

సీఎం కేసీఆర్ కు జ్వరం..

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జ్వరం రావడంతో వరంగల్, మేడారం పర్యటన రద్దయ్యింది. ఈ మేరకు సీఎం కార్యాలయం వెల్లడించింది. కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి మేడారంలోని సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవాల్సి ఉంది. 

నేడు ఏపీ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం..

హైదరాబాద్ : నేడు ఏపీ కాంగ్రెస్ కార్యాలయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రారంభించనున్నారు.

 

దుబాయ్ లో నాయినీ..నిజామాబాద్ లో హరీష్ పర్యటన..

హైదరాబాద్ : నేడు దుబాయ్ లో తెలంగాణ మంత్రి నాయినీ పర్యటించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కవిత పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

06:50 - February 19, 2016

ఆర్టీసీలో మరో కలకలం రేగుతోంది. పీఎఫ్ విషయంలో ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్న ప్రతిపాదనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆర్టీసీలో పనిచేసే కార్మికులు పీఎఫ్ నిధికి ఆర్టీసీ కార్మికులు 12శాతం చెల్లిస్తుండగా, అంతే మొత్తంలో అంటే మరో 12శాతం ఆర్టీసీ యాజమాన్యం జమ చేస్తోంది. అయితే, ఆర్టీసీ యాజమాన్యం తాను చెల్లిస్తున్న వాటాను కూడా కార్మికుల జీతాల నుంచే కట్ చేయాలన్న ప్రతిపాదన చేస్తోంది. దీనిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు జరగబోతున్న భారీ నష్టాన్ని తలచుకుని బాధపడుతున్నారు. పీఎఫ్ విధానంలో మార్పులు చేయడం వల్ల ఆర్టీసీ కార్మికులకు జరగబోతున్న నష్టమేమిటి? ఒక్కొక్క కార్మికుడు సగటున ఎంత నష్టపోయే అవకాశం వుంది? వ్రుత్తి నిర్వహణలో ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? సవాళ్లేమిటి? ఆర్టీసీ నష్టాలను పూడ్చుకోవాలంటే ఏం చేయాలి? ఈ అంశంపై టెన్ టివి జనపథంలో ఎస్డబ్ల్యుఎఫ్ నేత సుందరయ్య విశ్లేషించారు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:46 - February 19, 2016

సంస్కరణల విశ్వరూపం మొదలైంది. కార్మికుల, ఉద్యోగుల జేబుకు చిల్లు పడుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఆర్టీసీలో పీఎఫ్ వ్యవహారం. 7 ఏళ్ల సర్వీస్, 15330 బేసిక్ వున్న మెకానిక్ ఏడాదికి కోల్పోయేది రూ.5220. 8 ఏళ్ల సర్వీస్, 15660 బేసిక్ వున్న కండక్టర్ ఏడాదికి కోల్పోయేది రూ. 5800. 17ఏళ్ల సర్వీస్, 16330 బేసిక్ వున్న హెల్పర్ ఏడాదికి కోల్పోయేది రూ. 7000. 27ఏళ్ల సర్వీసున్న డ్రైవర్ ఏడాదికి కోల్పోయేది రూ. 30, 876. 

నష్టజాతక సంస్థగా ముద్ర..
ప్రగతి రథ చక్రాలు. ఇంతటి స్పూర్తివంతమైన, అర్ధవంతమైన నినాదాన్ని సొంతం చేసుకున్న ఆర్టీసీ ఇప్పుడు నష్టజాతక సంస్థగా ముద్ర వేయించుకుంటోంది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని సంరక్షించుకోవాలంటే సంస్కరణలు తప్పవన్న అభిప్రాయాన్ని ప్రభుత్వాధికారులు, మంత్రులు తరచూ వ్యక్తం చేస్తుంటారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవడం, లేదా అయినవాళ్లకు దీర్ఘకాలం పాటు లీజులకివ్వడం, అద్దె బస్సులను ప్రవేశపెట్టడం, ఒక్కొక్క విభాగాన్ని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించడం, కొన్ని రూట్లకు ప్రయివేట్ ఆపరేటర్లకు వదిలిపెట్టడం, డ్రైవర్ లతోనే కండక్టర్ డ్యూటీ కూడా చేయించడం, తగినంత మంది సిబ్బందిని నియమించకుండా పనిభారం పెంచడం ... ఇవీ ఇప్పటి దాకా ఆర్టీసీలో అమలు చేసిన, చేస్తున్న సంస్కరణలు. ఇలాంటి సంస్కరణలేవీ ఆర్టీసీని అప్పుల ఊబి నుంచి బయటపడేయలేకపోయాయి.

సరికొత్త ప్రతిపాదనలు..
ఆర్టీసీ పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ప్రయివేట్ ఆపరేటర్లను ముద్దు చేస్తున్న తీరు, ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు దానిని మరింత సంక్షోభంలోకి నెడతాయని వామపక్ష కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. ఆర్టీసీ సంస్థ అభివృద్ధినీ, ప్రజా శ్రేయస్సును కాంక్షించి కార్మిక సంఘాలు ఇచ్చిన సూచనలను ఏమాత్రం పట్టించుకోని యాజమాన్యం నష్టాలను తగ్గించుకునేందుకంటూ సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వీటిలో అత్యంత వివాదస్పదంగా మారింది పీఎఫ్ వ్యవహారం. ఇప్పటి వరకు ప్రావిడెంట్ ఫండ్ లేదా భవిష్య నిధికి తమ వేతనం నుంచి కార్మికులు 12శాతం ఇస్తుంటే, యాజమాన్యం మరో 12శాతం జమ చేస్తుంది.

పీఎఫ్ అన్నది సామాజిక భద్రతా పథకం..
పీఎఫ్ అన్నది సామాజిక భద్రతా పథకం. రిటైర్మెంట్ తర్వాత శేష జీవితాన్ని గడపడానికి సహాయపడాలన్నది పీఎఫ్ పథకం ఉద్దేశం. ఈ పథకాన్ని ప్రభుత్వ, ప్రయివేట్ అనే తేడా లేకుండా ప్రతి సంస్థ అమలు చేయాల్సి వుంటుంది. దానికి నిబంధనలున్నాయి. వాటిని ఉల్లంఘించడానికి వీలులేదు. కానీ, దురదృష్టవశాత్తు మనదేశంలో చాలా సంస్థల్లో పీఎఫ్ పథకం సక్రమంగా అమలుకావడం లేదు. అనేక ప్రయివేట్ సంస్థలు తమ అభివృద్ధికి రేయింబవళ్లు శ్రమిస్తున్న కార్మికులను, ఉద్యోగులను తొండి చేస్తున్నాయి. న్యాయంగా తాము చెల్లించాల్సిన వాటాను కూడా కార్మికుల, ఉద్యోగుల జీతాల నుంచే కట్ చేస్తున్నాయి. అలా కట్ చేసిన సొమ్మును కూడా సక్రమంగా జమచేయని సంస్థలెన్నో. ఇప్పుడు ఈ జాడ్యం ఆర్టీసీకి కూడా అంటుకుంటోంది. తాను చెల్లించాల్సిన 12శాతం సొమ్మును కార్మికుల జీతం నుంచే కట్ చేయాలన్నది ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన. అంటే ఆ మేరకు కార్మికుల జీతాలకు తొర్ర పడుతుంది. వాస్తవిక వేతనం తగ్గిపోతుంది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ఆర్టీసీ ఉద్యోగులు ఒక్కక్కరు ఏడాదికి 6 వేల నుంచి 30 వేల రూపాయల దాకా నష్టపోతారన్న అంచనాలున్నాయి.

ఆర్టీసీలో ఉద్యోగం అత్యంత కష్టమైంది..
ఆర్టీసీ కార్మికులంతా నష్టపోయే సొమ్ము విలువ ఏడాదికి 600 కోట్ల దాకా వుంటుంది. కార్మికుల జేబుకు చిల్లు పెట్టి, వారి పొట్టలు కొట్టి, మిగుల్చుకున్న డబ్బుతో నష్టాలు పూడ్చాలన్నది ఆర్టీసీ యాజమాన్యం తుంటరి ఐడియా. నిజానికి ఆర్టీసీలో ఉద్యోగం అత్యంత కష్టమైనది. ఎండనక వాననక, రాత్రనక పగలనక పనిచేయాలి. ఒక రోజు రాత్రంతా డ్యూటీ చేయాలి. మరో రోజు తెల్లారకముందే డ్యూటీ ఎక్కాలి. ఇంకో రోజు రెస్ట్ లేకుండా 14, 16 గంటలు ఏకబిగిన పనిచేయాలి. ఎక్కడెక్కడో తిరగాలి. ఎక్కడెక్కడో తినాలి. మరెక్కడో పడుకోవాలి. ఆర్టీసీలో ఉద్యోగమంటే ఒళ్లంతా హూనం చేసుకోవడమే. ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడమే. బస్సు ఆలస్యంగా వచ్చినా, తొందరగా వెళ్లిన ప్రయాణీకుల శాపనార్ధాలు తప్పవు. ఇంత చేసినా వారికి, ఇతర ఉద్యోగులతో పోల్చుకుంటే ఆర్టీసీ కార్మికులకు లభించే వేతనాలు తక్కువ. వృత్తిపరంగా తలెత్తే ఆరోగ్య సమస్యలు ఎక్కువ. నిజానికి వీరికి మరింత మెరుగైన సామాజిక భద్రతా పథకాలు, ఆరోగ్య పథకాలు అమలు చేయాలి. కానీ, ఇప్పుడు వున్న సౌకర్యాలూ, సదుపాయాలకే కత్తెర వేయాలనుకోవడం మంచిది కాదు. ఇవాళ ఆర్టీసీలో తెర మీదకు వస్తున్న విధానాలు అక్కడకే పరిమితం కావు. 

06:39 - February 19, 2016

ఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్హయ కుమార్‌ అరెస్టు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దేశద్రోహ నేరారోపణలపై అరెస్టైన కన్హయ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే కన్హయ వీడియో టేపుల్లోని ఆడియోను మార్చినట్టు ఓ మీడియా సంస్థ పరిశోధనలో వెల్లడయ్యింది. కన్హయ జాతివ్యతిరేక వ్యాఖ్యలేవీ చేయలేదని మతతత్వవాదాన్నే ఆయన వ్యతిరేకించారని తేలింది. దీంతో కన్హయను అక్రమంగా అరెస్టు చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి. జేఎన్‌యూలో జరిగిన సమావేశంలో కన్హయ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారాన్న ఆరోపణలతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే కన్హయ మాట్లాడిన వీడియోలోని ఆడియో మార్చినట్టు వెల్లడయ్యింది. జాతి వ్యతిరేక వ్యాఖ్యలేవీ చేయలేదని తేలింది. కన్హయ కుమార్‌ దేశద్రోహ వ్యాఖ్యలు చేశారంటూ... కొందరు కుట్రపూరితంగా ఆడియో లేయర్లు సృష్టించారని వెల్లడయ్యింది. కన్హయను తప్పుడు ఆధారాలతో అరెస్టు చేశారని స్పష్టమయ్యింది. కన్హయ టేపుల్లోని ఆడియో లేయర్లు మార్చేందుకు రెండు రోజులు పట్టివుంటుందని భావిస్తున్నారు.

ఈనెల 9న అఫ్జల్ గురు సంస్మరణ సభ..
పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ అఫ్జల్‌ గురు సంస్మరణ సభ ఈనెల 9న జేఎన్‌యూలో జరిగింది. డెమాక్రాటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నిర్వహించిన ఈ సభలో ఆ రోజు భారత్‌ వ్యతిరేక నినాదులు చేసిన ఉమర్‌ ఖలీద్‌ పక్కనే కన్హయ ఉన్నారు. ఆ తర్వాత రెండు రోజులకు... అంటే ఈనెల 11న జేఎన్‌యూ నుంచి మరో వీడియో టేపు విడుదలయ్యింది. కన్హయ కుమార్‌ భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు రెండో వీడియో టేపులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా టీవీ న్యూస్‌ చానల్స్‌తోపాటు, సోషల్‌ మీడియాలో ఈ టేపు హల్‌చల్‌ చేసింది. ఇదే కన్హయ మెడకు చట్టుకుని అరెస్టుకు దారితీసింది. ఆ తర్వాత ఈ మొత్తం వ్యవహారం పెను రాజకీయ వివాదానికి కారణమయ్యింది.

భిన్నంగా వీడియో టేపులు..
ఫిబ్రవరి 9 నాటి వీడియో టేపులో కొంతమంది విద్యార్ధులు ఆజాద్‌ కశ్మీర్ నినాదాలు చేస్తున్నట్టు ఉంది. దీనిని రాజకీయం చేయాలనుకున్న కొంతమంది ఈ వీడియో టేపులోని ఆడియోను మార్చేసి ఈనెల 11న విడుదల చేసినట్టు పరిశోధనలో తేలింది. ఫిబ్రవరి 9 నాటి టేపులో ఉన్న ఆడియోకు, 11 నాటి టేపులో ఉన్న ఆడియో పూర్తి భిన్నంగా ఉంది. కన్హయ దేశద్రోహ వ్యాఖ్యలు చేశారని చెప్పేందుకు కొందరు కుట్రపూరితంగా ఈ పని చేశారని అర్ధమవుతోంది. కన్హయ కుమార్‌ దేశద్రోహ నేరానికి పాల్పడ్డాడని కొందరు.... లేదని మరికొందరు రాజకీయనాయకులు వాదోపవాదాలు చేస్తున్న తరుణంలో.... న్యాయవ్యవస్థే ఈ వివాదాన్ని తేల్చాల్సివుంది.

నేతల అభిప్రాయాలు..
కన్హయ కమార్‌ వీడియో టేపులోని ఆడియోను మార్చినట్టు పరిశోధనలో తేలడంతో రాజీయ పార్టీలు రకరాలుగా స్పందిస్తుస్తున్నాయి. తారుమారు చేసిన కల్పిత టేపుల ఆధారంతో కన్నయ్యను అరెస్టు చేశారని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో హోం మంత్రితోపాటు, ఢిల్లీ పోలీసుల చీఫ్‌ తప్పుచేశారని ఆమె విమర్శించారు. తప్పుడు ఆధారాలతో కన్నయ్యను అరెస్టు చేయడం తగదన్నారు. కన్హయ కుమార్‌ వీడియో కల్పితమన్న విషయం తనకు తెలియదని బీజేపీ అధికార ప్రతినిది సంబిత్‌ పాత్ర వ్యాఖ్యానించారు. కన్హయ అరెస్టుపై చాలా ప్రశ్నలకు బీజేపీ నేత సంబిత్‌ పాత్ర సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆప్‌ నేత అశుతోష్‌ అన్నారు. కన్హయ్య కుమార్‌ ఒరిజినల్‌ వీడియోలో దేశ వ్యతిరేక వ్యాఖ్యలు లేవన్నారు. కన్హయపై దేశద్రోహ నేరం మోపి తప్పుడు కేసు పెట్టారని కాంగ్రెస్‌ నేత సంజయ్‌ ఝా విమర్శించారు.

దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదన్న కన్హయ్య...
మరోవైపు పోలీసులు విచారణలో కన్హయ కమార్‌ కూడా వీడియో టేపుల్లోని వ్యాఖ్యలు తనవికావని చెప్పారు. తన ఆవేశపూరిత ప్రసంగంలో సంఘ్‌ పరివార్‌తోపాటు, మోదీ ప్రభుత్వాన్ని విమర్శించినా, దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదన్నారు. జేఎన్‌యూ విద్యార్ధి సంఘం అధ్యక్షుడి హోదాలోనే ఆ రోజు జరిగిన సమావేశాన్ని వెళ్లినట్టు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈనెల 9న జేఎన్‌యూలో డెమాక్రాటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నిర్వహించిన సభకు హాజరైన సభ్యులను గుర్తించేందుకు కన్హయ కుమార్‌ పోలీసులకు సహకరించారు. ఉమర్‌ ఖలీద్‌, అనిర్‌భాన్‌ భట్టాచార్య, రియాజుల్‌ హక్‌, రూబినా సైఫీ తదితరుల ఆధ్వర్యంలో ఆనాటి సభ జరిగిందని విచారణలో చెప్పారు. అఫ్జల్‌ గురు సంసర్మణ సభలో భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిలో జేఎన్‌యూ విద్యార్ధులులేరని, అంతా బయట వ్యక్తులేనని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఫిబ్రవరి 9 నాటి మీటింగ్‌కు హారవుతున్న వారి గుర్తింపు కార్డులను తాను తనిఖీ చేస్తున్నట్టు చూపించిన వీడియో కూడా ఆరోజుది కాదని, పాతదని కన్హయ కుమార్‌ పోలీసులకు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. 

06:35 - February 19, 2016

ఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్ధి సంఘ అధ్యక్షుడు కన్హయ కమార్‌పై పెట్టిన దేశద్రోహ నేరం కేసును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. హోం మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. కన్హయపై నమోదు చేసిన దేశద్రోహ నేరారోపణల కేసును రుజువు చేసేందుకు అవసరమైన ఆధారాలు లేవన్న నిర్ణయానికి కేంద్రం వచ్చిందని సమాచారం. పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్‌ గురుకు అనుకూలంగా ఈనెల 9 న జేఎన్‌యూలో సభ జరిగింది. ఈ కార్యక్రమంలో కన్హయ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఫిబ్రవరి 12న అరెస్టు చేశారు. వచ్చే నెల 2 వరకు కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించడంతో జైల్లో ఉన్నారు. 

06:31 - February 19, 2016

విజయవాడ : పథకాలు చూడబోతే వేల కోట్లు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి చూడబోతే అప్పులు, భారీ లోటుతో బేజారెత్తిస్తోంది. ఇప్పటికే పీకల్లోతు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో కూరుకుపోయిన చంద్రన్న సర్కార్ బేలగా కేంద్ర ప్రభుత్వంకేసి చూస్తోంది. గత బడ్జెట్‌లో ఎలాగూ కరుణించలేదు.. ఈసారైనా మమ్మల్ని ఆదుకుని ఒడ్డున పడేయాలంటూ దీనాతిదీనంగా ఫేస్ పెట్టి అభ్యర్థిస్తున్నారు. అయితే మోడీ కనీసం హామీ అయినా ఇచ్చినట్లు కనిపించట్లేదు. మరి బడ్జెట్‌లో కేంద్రం ఏపీకి ఏమైనా విదిలిస్తుందా.? లేక సారీ చెబుతుందా.? రాష్ట్ర విభజన తర్వాత మొదలైన ఆర్థిక కష్టాలు ఏపీని ఇంకా పీడకలల్లానే వేధిస్తున్నాయి. నాడు కేంద్రంలో అధికార పీఠంపై కూర్చున్న కాంగ్రెస్‌, ప్రతిపక్ష బిజెపి ఆడిన భయంకర ఆటతో ఏపీ దాదాపుగా నాశనమైపోయింది. విభజనప్పుడు అదిస్తాం ఇదిస్తామంటూ ఇచ్చిన హామీల్లో సరైనది ఏదీ ఇంతవరకు దక్కనే లేదు. కేంద్రంలో బిజెపి వచ్చాక ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు నిరాశే మిగిలింది.

15వేల కోట్ల రెవెన్యూ లోటు..
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 15వేల కోట్ల రెవెన్యూ లోటు ఉంటే కేంద్రం కేవలం 2,300 కోట్లు మాత్రమే ఇచ్చింది. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలకు 350 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లాకు 200 కోట్ల చొప్పున 7 జిల్లాలకు 4 ఏళ్లపాటు 5,600 కోట్లు ఇవ్వాలని కోరింది. ఇలా రావాల్సినది రాకపోగా ఏపీపై ప్రకృతి కూడా పగబట్టినట్లు అతివృష్టి అనావృష్టి సమస్యలతో అల్లల్లాడిస్తోంది. పుండుపై కారం జల్లినట్లు ప్రతిపక్ష వైఎస్సార్‌సిపి, కాంగ్రెస్‌లు నిధులు, ప్యాకేజీలు తెచ్చుకోలేని అసమర్థ ప్రభుత్వమంటూ హేళన చేస్తున్నాయి.

కేంద్రం మాటలకే పరిమితమవుతుందనే విమర్శలు..
ఇలాంటి సమయంలో కేంద్రం మాటలకే పరిమితమవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీకి కరువు సాయం ప్రకటనలోనూ కేంద్రం చిన్నచూపే చూసింది. తీవ్ర కరువుతో జిల్లాలకు జిల్లాలు అల్లాడుతుంటే మోడీ సర్కార్ ప్రకటించిన సాయం 713 కోట్లు మాత్రమే. ఏపీ ప్రభుత్వం కనీసం 2వేల కోట్లైనా ఇచ్చి ఆదుకోవాలని ఇంతకు ముందు కేంద్రాన్ని కోరింది. ఇక తుఫాన్లు, వరదల మూలంగా భారీగా నష్టపోయిన నేపథ్యంలో చంద్రబాబు కేంద్రాన్ని 3,760 కోట్ల రూపాయల సాయం కోరారు. అయితే ఈ విషయంలో కేంద్రం నుంచి కనీసం స్పందన లేకుండా పోయింది.

భారీగా ఆశలు..
ఏపీ మాత్రం ఈసారి బడ్జెట్‌లో కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తుందని భారీగా ఆశలు పెట్టుకుంది. రెవెన్యూ లోటు పూడ్చడం, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్, రాజధాని నిర్మాణానికి 4 వేల కోట్లు, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాకు ఒక్కోదానికి 200 కోట్లు ఇలా చాలా ప్రతిపాదనలనే కేంద్రం ముందుంచింది. మరి ఏపీ సర్కార్ సమస్యలు ఏమాత్రం తీరతాయో ఈ నెలాఖరులో వచ్చే కేంద్ర బడ్జెట్‌ ద్వారా తేలిపోతుంది. 

06:27 - February 19, 2016

వరంగల్ : వనం జనారణ్యమైంది. గద్దెలు జయజయ ధ్వానాలతో హోరెత్తుతున్నాయి. పంచభూతాలు భక్తి పరవశమవుతున్నాయి. అడుగులన్నీ అటువైపే పడుతున్నాయి. చూపులన్నీ అమ్మలు కొలువు తీరిన వైపే కేంద్రీకృతమవుతున్నాయి. గంటగంటకు పెరుగుతున్న భక్తులు... లక్షలాదిగా తరలివస్తున్న జనాలతో పుడమి పులకించి పోతోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర నేడు సర్వ జన జాతరై శోభిల్లుతోంది. సారలమ్మకు తోడుగా సమ్మక్క గద్దెపైకి చేరడంతో మహత్తర ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం రాత్రి సమ్మక్కను మేడారంలోని గద్దెపైకి తీసుకొచ్చారు. కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గిరిజన పూజారులు చిలకలగుట్ట నుంచి అంగరంగ వైభవంగా తీసుకొచ్చి గద్దెపైన ప్రతిష్ఠించారు. ఈ మహత్తర దృశ్యాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు గద్దె వద్దకు చేరుకున్నారు.

అమ్మవారి రాకకోసం భారీగా భక్తులు..
సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తెచ్చే క్రమంలో శివసత్తుల పూనకాలు, డోలు వాయిద్యాలు, కొమ్ము శబ్దాలతో గుట్ట ప్రాంతం మారుమోగిపోయింది. సమ్మక్కను గట్టు దించుతుండగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. అమ్మవారి రాకను చూసేందుకు వేలాది మంది దారి వెంట బారులు తీరారు. పూనకాలతో శివసత్తులు సమ్మక్కను చేరుకునేందుకు ప్రయత్నించినా వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ పోలీసులు జాగ్రత్తగా అమ్మవారిని గద్దెపైకి తెచ్చారు. ఇష్ట దైవాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే భక్తులతో మేడారం పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. గురువారం మధ్యాహ్నానికే సుమారు 20లక్షల మంది అమ్మవార్ల గద్దెలను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు శుక్రవారం మొక్కులు తీర్చుకునే దినం కావడంతో చెల్లింపుల కోసం వచ్చేవారే ఎక్కువ మంది ఉంటారు. శుక్రవారం సాయంత్రం నుంచి భక్తులు తిరుగు ప్రయాణమవుతారు.

కేసీఆర్ రాక..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి వరంగల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకొని సమ్మక్క- సారలమ్మను దర్శించుకుంటారు. సిఎం మేడారానికి రానున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక విఐపిలు, వివిఐపీలతోపాటు రాజకీయ ప్రముఖులు, అధికారులు కూడా సమ్మక్క సారలమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు తరలిరానున్నారు. 

06:25 - February 19, 2016

హైదరాబాద్ : ఆస్తుల కేసులో వైసీసీ అధినేత జగన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 28న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. జగన్‌కు చెందిన సంస్థల్లో అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్ కంపెనీల పెట్టుబడులపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన న్యాయస్థానం జగన్‌ సహా 19 మందికి సమన్లు జారీ చేసింది. జగన్‌ సంస్థలకు ఆడిటర్‌గా పనిచేసి, ప్రస్తుతం వైసీపీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డితోపాటు ఇప్పుడు తెలంగాణ కేడర్‌లో ఉన్న ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య కూడా సమన్యలు జారీ అయ్యాయి. అరబిందో చైర్మన్‌ రాంప్రసాద్‌రెడ్డి, ఎండీ నిత్యానందరెడ్డి, ఆయన భార్య రాజేశ్వరి, సోదరుడు ప్రసాద్‌రెడ్డికి సమన్లు పంపారు. హెటెరో డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ట్రైడెంట్‌ మాజీ ఎండీ శరత్‌చంద్రారెడ్డి, ఏపీఐఐసీ రిటైర్డ్ జనరల్‌ మేనేజర్‌ వైవీఎల్ ప్రసాద్‌, అరిబిందో మాజీ కంపెనీ సెక్రెటరీ చంద్రమౌళికి కూడా సమన్లు జారీ చేసింది. 

06:23 - February 19, 2016

చిత్తూరు : అది ఒకప్పుడు రతనాల సీమ. అభివృద్ధిలో అన్నిటికన్నా ముందుండే మహత్తర సీమ. నేడదే ప్రాంతం... కరువు, కక్షలు కార్పణ్యాలు, అన్నిటికి మించి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోంది. ఏళ్లకు ఏళ్లు ప్రభుత్వాల చేత దగాపడ్డ ఆ ప్రాంత అభివృద్ధికి కరువు సీమ కష్టాలు ఏకరువు పెట్టేందుకు వామపక్షాలు నడుంబిగించాయి. ఆకలేస్తే నేల వైపు దాహమేస్తే ఆకాశంవైపు చూసే అభాగ్యులకు అండగా ఉంటామంటూ భరోసా కల్పించబోతున్నారు. సీమ సమస్యలు హస్తినకు వినిపించేలా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు.

మరో ఉద్యమం..
ఎక్కడ చూసినా కరువు పరిస్థితులే..వందల అడుగులు తవ్వినా చుక్క నీరు పడని దుర్భర పరిస్థితులు..ఏళ్లకు ఏళ్లు నిర్మాణం పూర్తవకుండా సాగే ప్రాజెక్టులు..రోజంతా కష్టపడ్డా పట్టెడన్నం తినలేని దయనీయ పరిస్థితులు..ఇవన్నీ ఒకనాటి రతనాల సీమ ప్రస్తుత కరువుసీమ ప్రజల కష్టాలను ప్రతిబింబించే దృశ్యాలు. దశాబ్దాల తరబడి రాయలసీమ జిల్లాలు అభివృద్ధి నోచుకోకుండా ఇలా కాలం గడుపుతూ వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది ఈ రాయలసీమ ప్రాంతానికి చెందినవారే. అయితే మాత్రం ఏం లాభం. లక్షలాది మంది అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య కాలం గడుపుతున్నారు. ఇటువంటి గడ్డు కాలంలో పీడిత ప్రజల పక్షాన పోరాడేందుకు సిపిఎం నడుం బిగించింది. పేదల గొంతుకగా మారి నిత్యం వారి సమస్యలపట్ల పోరాటం చేస్తున్న సిపిఎం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్య మత్తు తొలగించేందుకు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

తిరుపతిలో యాత్ర ప్రారంభం..
సీమ ప్రజల తరపున కేంద్రానికి తమ వాణి వినిపించేందుకు సిపిఐతో కలిసి సిపిఎం బస్సు యాత్ర నిర్వహించేందుకు సిద్ధమైంది. నేడు తిరుపతిలో యాత్ర ప్రారంభమై మార్చి 5 వరకు సీమలోని నాలుగు జిల్లాల్లో కొనసాగుతుంది. నాలుగు జిల్లాల్లోనూ సిపిఎం, సిపిఐ నేతలు పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తారు. ఇదే స్ఫూర్తితో మార్చి 11న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్ట్‌ల పూర్తి, కడపలో ఉక్కు కర్మాగారం తదితర హామీలు ఏమయ్యాయో ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ఆయా హామీలు ఎందుకు ముందుకు సాగడం లేదో వివరించనున్నారు.

హాజరు కానున్న కరత్..
తిరుపతిలో ప్రారంభమయ్యే ఈ బస్సుయాత్రకు సిపిఎం జాతీయ మాజీ కార్యదర్శి ప్రకాశ్‌ కరత్ హాజరుకానున్నారు. ఆయనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ నేత నారాయణ పాల్గొంటారు. 20న ప్రారంభమయ్యే ఈ బస్సు యాత్ర 23వ తేదీన కడప జిల్లాలోకి ప్రవేశిస్తుంది. 26న కడపలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 27, 28, 29, మార్చి 1న అనంతపురం జిల్లాలో యాత్ర కొనసాగుతుంది. మార్చి 2 నుంచి 5 వరకు కర్నూలు జిల్లాలో బస్‌ యాత్ర నిర్వహిస్తారు

06:20 - February 19, 2016

హైదరాబాద్ : హోరాహోరీగా సాగిన ఎపీఎస్ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ స్వల్ప ఆధిక్యత సాధించింది. ఎంప్లాయీస్‌ యూనియన్‌పై ఎన్ఎంయూ కేవలం 173 ఓట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఎన్ఎంయూకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పోస్టల్‌ బ్యాలెట్లు కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓట్లు వెయ్యికిపైగా ఉన్నాయి. విధి నిర్వహణలో భాగంగా పోలింగ్‌ రోజు దూరప్రాంతాలకు వెళ్లిన కార్మికులకు పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. వీరంతా ఈనెల 23, 24 తేదీల్లో ఆయా జిల్లాల్లోని కార్మిక శాఖ కార్యాలయాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 24న తుది ఫలితం వెలువడుతుంది. స్వల్ప ఆధిక్యత సాధించిన ఎన్ఎంయూతోపాటు, రెండో స్థానంలో నిలిచిన ఎంప్లాయీస్‌ యూనియన్‌ కూడా పోస్టల్‌ బ్యాలెట్లపైనే ఆశలు పెట్టుకున్నాయి. గురువారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే చేపట్టిన ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. మొత్తం 56,437 ఓట్లకుగాను... 45,533 ఓట్లు పోలయ్యాయి. 

06:18 - February 19, 2016

హైదరాబాద్ : టి సిఎం కెసిఆర్ నేడు వరంగల్ జిల్లా పర్యటనలో బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి వరంగల్‌కు బయల్దేరి వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకొని సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు మడికొండలోని ఇంక్యుబేషన్ టవర్‌ ప్రారంభిస్తారు. అనంతరం ఇన్ఫోటెక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌కు శంకుస్థాపన చేస్తారు. 

నేడు జీఎస్టీ సాధికారిక కమిటీ ఛైర్మన్ ఎన్నిక..

న్యూఢిల్లీ : జీఎస్టీ (వస్తు సేవల పన్ను) సాధికారిక కమిటీ నూతన ఛైర్మన్ ను ఎన్నుకొనేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి రానున్నారు. 

టీఎస్ఆర్టీసీ యూనియన్ల సమావేశం వాయిదా..

హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వాహణ విషయమై రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కార్మిక శాఖ కమిషనర్ ఆర్టీసీ సంఘాలతో శుక్రవారం తలపెట్టిన సమావేశం కోర్టు జోక్యంతో వాయిదా పడింది. 

సుప్రీంలో కన్హయ్య పిటిషన్..నేడు విచారణ..

న్యూఢిల్లీ : పాటియాల హౌస్ కోర్టులో జరిగిన దాడి ఘటనల నేపథ్యంలో తనకు ప్రాణహాని పొంచి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని అక్రమ కేసులో అరెస్టయిన జేఎన్ యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం దీనిపై సుప్రీం విచారించనుంది.

దిగ్విజయ్ సెక్యూర్టీ వాహనానికి ప్రమాదం..

నల్గొండ : కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సెక్యూర్టీ వాహనాన్ని కావేరీ ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. సెక్యూర్టీ వాహనం, బస్సును పీఎస్ కు తరలించారు. దీనితో ప్రయాణీకులు రోడ్డుపై పడిగాపులు కాస్తున్నారు. 

నేడు మేడారానికి కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు మేడారం జాతరకు వెళ్లనున్నారు. అక్కడ సమ్మక్క - సారక్కలకు చీర, సారెలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం వరంగల్ లో ఐటీ ఇంకుబేషణ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. సియోట్ కాంప్లెక్సుకు శంకుస్థాపన నిర్వహించిన అనంతరం కేసీఆర్ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నిమిత్తం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 

కొబ్బరిసీమ పరిశ్రమ - ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు..

తూర్పుగోదావరి : నేడు సింగవరంలోని నాగరత్ననగర్ కాలనీలో కొబ్బరిసీమ పరిశ్రమ - ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు జరగనుంది.

 

అమలాపురంలో నేడు ఉచిత గుండె జబ్బుల వైద్య శిబిరం..

అమలాపురం : వాసవీ కళ్యాణ మండపంలో నేడు ఉచిత గుండె జబ్బుల వైద్య శిబిరం నిర్వహించనున్నారు.

 

చందలూరులో అహోబిలం నరసింహస్వామికి నేడు ప్రత్యేక పూజలు..

కర్నూలు : పార్వేట ఉత్సవాల్లో భాగంగా నేడు చందలూరులో అహోబిలం శ్రీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. 

Don't Miss